Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 150

కళ్యాణ్ వినయ్ తల పైన కొట్టి గోళ్లుపోతే మళ్ళీ వస్తాయి లేరా..  కాలిష్యం ఉన్న ఫుడ్డు తిను.  ఆటోమేటిక్గా పెరిగిపోతాయి.

పూజిత అందరికీ స్వీట్ తీసుకువచ్చి ఇస్తూ...  మీ అబ్బాయికి బుర్ర పెరిగితే చాలు మావయ్య గారు అంటుంది అంటే ఏమిటి నీ ఉద్దేశం నాకు బుర్ర లేదనా...

ఆ మాట మళ్లీ స్పెషల్ గా చెప్పాలి ఏంట్రా... రాజ్ వినయ్ దగ్గరకు వచ్చి ఎందుకురా పెళ్ళాల్ని గోకుతావు.  నన్ను చూసి కూడా నేర్చుకోకపోతే నీ అంత డాష్ గాడు ఎవరూ ఉండరు రా..  బావమరిది.

  బావా  అని రాగం తీస్తే.. బావ అన్న.. నాన్న అన్న కొన్ని జీవిత సత్యాలు ఫాలో అవ్వాలి రా బామ్మర్ది. చూసైనా నేర్చుకోవాలి లేదా అనుభవంతో అయినా నేర్చుకోవాలి.

రెండు చెయ్యను అంటే ఇదిగో నీలాగానే పుష్పం అయిపోతారు. పుష్ప అయినా సరే తగ్గేది లేదు బావ.. జీవితంలో ఎవడు నిన్ను బాగు చేయలేడు.

ధనుంజయ్ స్వీట్ తీసుకుని తన చేతులతోనే కూతురికి తినిపించాలి అన్న ఆశతో స్వీట్ ని అవని నోటి దగ్గర పెడతాడు.

అవని ఒక్క నిమిషం ధనుంజయ్ వైపు చూసి నోరు తెరుస్తుంది. ధనుంజయ్ మోచేతితో కళ్ళు తుడుచుకుంటూ స్వీట్ తినిపిస్తాడు.

ఎన్ని సంవత్సరాలు పట్టింది రా నా చేత్తో తినిపించడానికి. మిమ్మల్ని ఒకటి అడుగుతాను కాదు అనరు కదా...ఇంకా మీరు అని మాట్లాడతావ్ ఏంట్రా..

ఇది నీ హక్కు. నువ్వు అడుగుతున్నది ఏదైనా సరే కాదనను.  అడుగు. శిల్ప ని ఇంటికి తీసుకురండి. అందరికీ శిల్ప కూడా మీ కూతురే అని పరిచయం చేయండి.

నీ విషయంలో అంత దారుణంగా ప్రవర్తించిన నువ్వు జాలి చూపిస్తున్నావా..  శిల్ప కావాలని చేయలేదు కదా.. ఇప్పుడు మారింది కదా.. మారినప్పుడు క్షమించాలి నీదంతా మీ అమ్మ గుణమే పిలిపిస్తాను.

లలిత సరే.. అందరూ భోజనానికి రండి సంతోషంతో ఎవరికీ ఆకలి గుర్తుకు రావడం లేదేమో... కానీ నా మనవడికి ఆకలేస్తూ ఉంటుంది అని అవనికి భోజనం తీసుకువస్తుంది.

ధనుంజయ్ ఆ ప్లేట్ తీసుకుంటూ నా కూతురికి నేను తినిపిస్తానమ్మా. దానికి పరిమిషన్ అడగాలా అన్నయ్య.. తినిపించండి అని ప్లేట్ ఇస్తుంది.

కూతురికి కొసరి కొసరి తినిపిస్తూ ఉంటే వద్దు అనకుండా అవని కూడా తింటూ ఉంటుంది.  నిద్రపోయేటప్పుడు అవని విక్రమ్ ని గట్టిగా పట్టుకొని పడుకుంటుంది.

ఏంటి భార్యామణి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు.  చాలా అంటే చాలా..
ఇదంతా మీ వల్లనే...

నేను చేసింది ఏముంది. మీరు నా జీవితం లోనికి రావడం వలనే కదా నాన్నకి నిజాలు తెలిసాయి. నా ఉనికికి ఒక గుర్తింపు వచ్చింది.

భగవంతుడు నాకు అన్నీ కష్టాలే ఇచ్చాడు అనుకున్న..  కానీ ప్రతి కష్టం వెనకాల ఒక సుఖం ఉంటుంది అని... అది మీ రూపంలో వస్తుంది అని ఊహించలేకపోయాను.

మన పెళ్లి జరిగిన తీరుకి మరొకరు అయితే ఆ స్థానంలో ఉన్న వాళ్లతో బంధాన్ని కొనసాగించేవారు. మీరు మీ మనసుతో నన్ను చూశారు కాబట్టే నన్ను వెతికి పట్టుకున్నారు.
మీరు కచ్చితంగా నా కోసం వస్తారు అన్న నా నమ్మకాన్ని నిలబెట్టారు.
ఇంత అందమైన కుటుంబాన్ని నాకోసం ఇచ్చారు. మీలాంటి వ్యక్తి నా భర్తగా రావడం నిజంగా నా అదృష్టమే కదా...

అవని చుట్టూ చేతులు వేసి దగ్గరకి లాక్కుంటూ.. నుదుటిన ముద్దు పెట్టుకుని.. ఒకరికి ఒకరు తెలియకపోయినా పెళ్లి బంధం మీద ఉన్న నమ్మకంతోనే ఒకటిగా కలిసిపోతారు.

అప్పటివరకు ఒకరి అభిరుచులు ఒకరికి తెలియవు.. మనస్తత్వాలు అర్థం కావు..  కానీ నీకోసం నేను ఉన్నాను అని భరోసా ఇచ్చేదే పెళ్లి.

నీ చేతిని పట్టుకొని పాణిగ్రహణం చేసినప్పుడే.... నా ప్రాణం అయిపోయావు. మనసా వాచా కర్మణా నీ మెడలో మూడు ముళ్ళు వేసిన క్షణమే నేనే నువ్వు..  నువ్వే నేను అయిపోయాము.

అలాంటప్పుడు నీ స్థానంలో మరొకరు వస్తే నా హృదయం గుర్తించదా...  

ఇంకా పడుకో..  ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈరోజు నువ్వు చాలా ఎమోషనల్ అయ్యావు. రెస్ట్ తీసుకో.

మనసు చాలా తేలికగా ఉంది.  సంతోషంగా అనిపిస్తుంది. నిద్ర రావడం లేదు.  ఐస్ క్రీమ్ తిందామా. టైం ఎంత అయిందో చూసావా..  అర్ధరాత్రి దాటింది.

ప్లీజ్ ప్లీజ్ శ్రీవారు. సరే తెస్తాను ఉండు. గదిలోనే ఉన్న మినీ ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీమ్ తీసి ఇస్తాడు. ఇది ఎప్పుడు పెట్టారు. ఈరోజు నువ్వు తింటావని నాకు తెలుసు.

సో స్వీట్. పొగిడింది చాల్లేగాని తిను. మీరు తినండి అని పెడుతూ ఉంటే వద్దు అంటాడు.  ఇంత ప్రేమతో పెడుతుంటే తినరే.

ప్రేమతో పెట్టేది ఇది కాదు బంగారం. ఇది అని లిప్స్ మీద వేలు పెట్టి చూపిస్తాడు.  ఆ మాటకి సిగ్గుపడుతూ ఆహా నేను ఇవ్వను అంటుంది.

ఉఫ్... రేపు మాపో డెలివరీ అవ్వబోతుంది ఇంకా సిగ్గుపడుతున్నావా...  సిగ్గుపడకుండా ఏం చేయాలంట అని మెల్లిగా ఐస్క్రీం తింటూ ఉంటుంది.

ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిన తర్వాత లిప్స్ తుడుచుకోబోతూ ఉంటే ఆ పెదవులు అందుకుంటాడు. ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంది భార్యామణి.

ఇలా ఎవరైనా తింటారా అని విక్రమ్ గుండెల్లో తలపెడుతుంది. నాకు ఇలా తింటేనే బాగుంటుంది. ఇంకా పడుకుంటావా.. హా అని  కళ్ళు మూసుకుంటుంది. అవనినీ జో కొడుతూ విక్రమ్ కూడా పడుకుంటాడు.

ఉదయం 4 గంటలకి అవని మెల్లిగా కదులుతూ ఉంటుంది. కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటే భర్తను పిలవలేక చేతులతో తడుతూఉంటుంది.
విక్రమ్ మగతగా కళ్ళు తెరిచి అవని వైపు చూస్తాడు. దేనికో ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించి గబగబా లేచి లైట్ వేస్తాడు.

ఒళ్లంతా చెమటలు పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే విక్రమ్ కంగారుగా ఏమైందిరా... పొట్టవైపు చూపిస్తూ కష్టపడుతూ ఉంటుంది.

నెప్పులు వస్తున్నాయా... హ అని తల ఊపుతుంది. ఒక్క నిమిషం అని వెంటనే లలిత గారికి ఫోన్ చేసి గబగబా రెండు చేతులతో ఎత్తుకొని తీసుకువెళతాడు.

మాన్షన్ మొత్తం లైట్లతో వెలిగిపోతుంది. అందరూ కంగారుగా బయటకి వస్తారు. సురభి కి కాల్ చేస్తే నేను వెంటనే హాస్పిటల్ కి వెళుతున్నాను.  అవనినీ తీసుకురండి.

అవనినీ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళేటప్పటికి ధనుంజయ్ ఫ్యామిలీ... శ్రీ ఫ్యామిలీ మొత్తం అందరూ అక్కడే ఉంటారు.

అవనినీ లేబర్ రూమ్ లోకి తీసుకువెళుతూ ఉంటే విక్రమ్ ని గట్టిగా పట్టుకుంటుంది. నేనిక్కడే ఉంటాను భయపడకు అన్న సరే విక్రమ్ చేతిని వదలదు.

నేను వస్తాను ఆంటీ..  రా అని డెలివరీ స్టార్ట్ చేస్తారు. అవని  నొప్పులు తట్టుకోలేక అరుస్తూ ఉంటే... ఇక్కడ విక్రమ్ గుండె వంద దాటేస్తుంది.

బయట ధనుంజయ్ కూడా టెన్షన్ గా తిరుగుతూ కుదురుగా ఉండలేకపోతాడు.

సూర్యుడు ఉదయిస్తున్న వేళ పక్షులు కువకువలాడుతూ... ఉదయించే రేపటి జై సింహా వారసుడికి స్వాగతం చెబుతాయి.

అవని అరుపుతో పాటు ఒక చంటి బిడ్డ ఏడుపు కూడా బయటకి వస్తుంది. సురభి ఆ బిడ్డని చేతిలోకి తీసుకొని విక్రమ్ చేతికి ఇస్తూ విక్కీ కొడుకు పుట్టాడు రా...

విక్రమ్ బాబుని చేతిలోకి తీసుకుంటాడు.
ఇంకా రక్తంతో ఉన్న బిడ్డని తాకగానే విక్రమ్ చేతులు వణుకుతాయి.

బిడ్డ నుదుటిన పెదవులు ఆన్చి ఒక్క నిమిషం ఆ మధురానుభూతిని అనుభవిస్తూ ఉండిపోతాడు.
విక్కి బాబుని ఇవ్వు. క్లీన్ చేసి ఇస్తాను. అవని ఎలా ఉంది ఆంటీ. ఇప్పుడేగా డెలివరీ అయింది.కొద్దిగా అలసటగా అనిపిస్తుంది.

ఒక్క నిమిషం అని బాబుని అవని దగ్గరికి తీసుకువెళ్లి ఓయ్ భార్యామణి... మగతగా పలుకుతుంది. ఎవరు పుట్టారో చూడు...

అవని చేతిని విక్రమ్ తీసుకుని బాబు పైన పెడతాడు. బాబు స్పర్శ తగిలేటప్పటికీ అవని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి.

థాంక్స్ రా భార్యామణి.. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు.
కన్నయ్యేనా అని మెల్లిగా అంటే..
నీ కన్నానే వచ్చాడు.

సురభి చేతికి బాబుని ఇస్తాడు. నర్స్ బయటకి వెళ్లి బాబు పుట్టాడు అని చెబుతుంది.  సురభినే దగ్గర ఉండి క్లీన్ చేసి బాబుని ఒక బ్లూ టవల్లో చుట్టి విక్రమ్ చేతికి ఇస్తుంది.

బాబు ని క్లీన్ చేసే టైంలో అవనినీ రూమ్ షిఫ్ట్ చేస్తారు. బాబుని తీసుకువెళ్లి ఇందిరా చేతిలో పెట్టి నానమ్మ ముని మనవడు. మరో తరాన్ని చూశాను అని మెడలో ఉన్న హారం తీసి బాబు మెడలో వేస్తుంది.

వినయ్ కంగారుగా వాడు ఇప్పుడే పుట్టాడు. అప్పుడే బరువులు వాడి మీద వేయకండి అని మెడలోది తీసి పట్టుకుని..  వాడు పెద్దయ్యకి ఇస్తానులే నానమ్మ.

ధనుంజయ్ కూతురిని ని చూడడానికి గదిలోనికి వెళతాడు.  ఎలా ఉందిరా తల్లి... పరవాలేదు అని మెల్లిగా చెబుతుంది.

నీరసంగా ఉన్నట్టున్నావు ఎంత కష్టపడ్డావో...  ఆ నొప్పులు ఎలా తట్టుకున్నావు అని కంటతడి పెట్టుకుంటాడు. బాబుని చూశారా నాన్న.

ఇంకా లేదు.  ముందు నిన్ను చూద్దామనే వచ్చాను. విక్రమ్ బాబుని తీసుకువచ్చి ధనుంజయ్ చేతికి ఇచ్చి ఎలా ఉన్నాడు బాబు.

అచ్చు నా కూతురు లాగానే ఉన్నాడు అని మురిసిపోతాడు. అవును..  మీ కూతురు మీ లాగా ఉంటుంది. బాబు మీ కూతురు లాగా ఉన్నాడు అంతే కదా.. అంతే... అంతే.. థాంక్స్ అల్లుడు గారు.

❤️❤️❤️❤️❤️❤️???

పాణిగ్రహణం సిరీస్ ని ఇంత బాగా ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలు.
[+] 13 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Excellent update is it ending?
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
enti Sivagaru.. end chestunnara?
Shilpa sangathi, etc.. inka chala kanipistundi story!!

But emotions baaga pandincharu
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
(15-03-2026, 10:02 AM)ash.enigma Wrote: enti Sivagaru.. end chestunnara?
Shilpa sangathi, etc.. inka chala kanipistundi story!!

But emotions baaga pandincharu

Next Season lo Rastanu
[+] 1 user Likes SivaSai's post
Like Reply
Repu Inko Kotha Story Tho Vasthanu 

Aa Story Complete Aeina Taruvaata paanigrahanam Season-2 Start Chestanu
[+] 3 users Like SivaSai's post
Like Reply
See bro neeku site details teleste velli chaduvuko anthe gani writer ni chetta dailogues kottaku nuvvu emi pay cheyyatla mind u r words...
Like Reply
Just checked. TRUE!!
Like Reply
Super story Siva garu..

Waiting for other story also..
Like Reply
Babu Writer Support Tho Nee E Site Post Cheyatam Jarugutundi Vallu Names Mention Cheya Vadhu Annaru.

Oka Vishayam Note Chesuko Prathilipi Site Lo Unna Stories Copy Cheyatam Kudardhu Okavela Copy Aethi Cheppu Ela Chesavoo

Writer Naku 3 Stories Send Chesaru Valla Permission Tho Ne Chestunna.
[+] 2 users Like SivaSai's post
Like Reply
Oka Mata Ani Mundu Konchem Alochinchuko Anavasaranga Problem Cheyavdhu

Season 3 Unte Nuvve Post Chesavu Gaa Writer Kanna Mundu.

Season-2 Is ending of Panigrahanam Series. Nuvvu Ekanga Season-3 Antunnav
[+] 2 users Like SivaSai's post
Like Reply
Nenu cheppdi site gurinchi dabbula gurinchi kaadu mana feelings valla eduta vallu bhadha padakudadu noru jarithe ilage problems vastai
[+] 1 user Likes Nivas348's post
Like Reply
పాణిగ్రహణం సిరీస్ కి **నాలో ఊపిరి ** సీక్వెల్.

ప్రతి భర్తలోనూ విక్రమ్ కి ఉండే క్వాలిటీస్ ఉండాలని..
ప్రతి భార్యలోనూ అవనిలో ఉండే క్వాలిటీస్ ఉండాలని.. మాధవి కళ్యాణ్ లాంటి అత్తమామలు..  నివిలాంటి ఆడపడుచు.. మాధవి లాంటి మేనత్త....
  ఇందిరా లాంటి ఇంటి పెద్ద....

ఉన్న ప్రతి కుటుంబం చక్కటి పొదిరిల్లు.

అలాంటి కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే..

ఆ అదృష్టం అందరికీ దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీక్వెల్స్ గా

**నాలో ఊపిరి** మొదలు పెడుతున్నాను.

ఈ సిరీస్ ని కూడా ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

సర్వేజనా సుఖినోభవంతు ??
[+] 4 users Like SivaSai's post
Like Reply
Part - 1

అవని బాబు ని చూసి మురిసిపోతూఉంటుంది.  అవని సంతోషాన్ని భర్త,  తండ్రి చూస్తూ ఉంటారు. థాంక్స్ అల్లుడు గారు అంటే...  ఇట్స్ ఓకే మామగారు..

అందరూ అవని దగ్గరికి వచ్చి ఎలా ఉందిరా అని అడిగితే..  బాగుంది అని తలుపుతుంది. బాబు అందరి చేతుల్లోకి మారుతూ ఉంటాడు.

సురభి వచ్చి అందరూ బయటకు వెళ్ళండి. అవనినీ చెక్ చేయాలి. సరే అని అందరూ వెళ్ళిపోతారు.  సురభి చెక్ చేసి ఫీడింగ్  ఎలా ఇవ్వాలి.. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి విక్రమ్ తో ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను.

నార్మల్ డెలివరీ కాబట్టి ప్రాబ్లం లేదు.  అలాగే ఒక నర్స్ ని అపాయింట్ చేస్తాను.  నేను డైలీ వచ్చి చెక్ చేస్తాను.   ఓకే అంటీ..

టేక్ రెస్ట్ అవ్ని అని సురభి వెళ్ళిపోతుంది. అవని డల్ గా కనిపిస్తే.. ఏమైందిరా.. ఏదైనా ఇబ్బందిగా ఉందా.  నాన్న ఇంటికి తీసుకువెళ్తాను అంటున్నారు.

ఓ.. దానికా తమరి ఫేసు డల్ అయింది.  నాకు మిమ్మల్ని విడిచి వెళ్లడం ఇష్టం లేదు. అలా అని నాన్నకి దూరంగా ఉండాలి అనిపించడం లేదు. ఏం చేయాలి అని బిక్క మొహం వేస్తుంది.

ఇద్దరూ ఒకే చోటు ఉండాలంటే కష్టం కదరా...  ప్లీజ్ మీరే అరేంజ్ చేయండి నాకు ఇద్దరు కావాలి. భార్య ముఖం చూసి నవ్వుతూ సరే నేను చూసుకుంటాను..

సాయంత్రం డిశ్చార్జ్ చేసే టైం కి అవని టెన్షన్ గా చూస్తూ ఉంటే ధనుంజయ్ దగ్గరకు వచ్చి ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు. నేను నీ దగ్గరే ఉంటాను.

సంతోషంగా భర్త వైపు చూస్తుంది.  ఏంటి మేడం ఇప్పుడే హ్యాపీయేనా..  చాలా థాంక్స్ శ్రీవారు.  అయ్యో మా భార్యమణి ఇచ్చిన గిఫ్ట్ ముందు మేము ఇచ్చేది చాలా చిన్న చిన్నవి.

  బాబుని తీసుకుని అందరూ ఇంటికి చేరుకుంటారు.  బాబుతో సహా అవని, విక్రమ్ ని గుమ్మం దగ్గరే ఆపి దిష్టి తీస్తారు.

లోపలికి వస్తూ ఉంటే వినయ్ ఆగండి ఆగండి అంటూ వస్తాడు. ఏమైందిరా.. అరే మన యువరాజు వస్తూ ఉంటే అంత సింపుల్ గా వెల్కమ్ చెప్పడమా...  మరి ఇంకా ఎలా చెప్పాలి...

నివి అని పిలిస్తే పసుపు ని ముద్దగా చేసి బాబు పాదాలకి రాసి దానితో  షీట్  మీద ప్రింట్ వేయిపిస్తారు. ఆ షీట్ ని నీట్ గా ఫ్రేమ్ చేయిపిస్తాను.

భరత్ వచ్చి పర్వాలేదు రా..  నీలో కూడా గుజ్జు ఉంది. పూజిత వచ్చి.. నన్ను పెళ్లి చేసుకున్నాక పెరిగిందిలే అన్నయ్య అంటుంది. ఏది జరిగిన మీ పెళ్ళాం ఎకౌంట్లో వేసుకోకపోతే మనశ్శాంతి ఉండదే..

పోనీ మీ అకౌంట్లోనే వేసుకోండి.  ఏమని..  నేను ఎంత అదృష్టవంతుడిని..  నాకు ఇంత తెలివైన పెళ్ళాం వచ్చిందా...   ఇది కూడా నీ అకౌంటే కదా...

అవని రాతల్లి... కాసేపు రెస్ట్ తీసుకుందాగాని..  బాబు ని చూసుకోవడానికి చాలామంది ఉన్నారు.  ఇప్పుడు నీకు సరైన రెస్టు కావాలి రా...

యువరాజు గారు మాత్రం కిందకి రాకుండా అందరి చేతుల్లోనే తిరుగుతూ పడుకుంటూ ఉంటాడు. నివి డల్ గా ఉండడం చూసి రాజ్ ఏమైంది నా పెళ్ళానికి..  అంత డల్ గా ఉంది.

పాప పుడుతుంది అనుకున్నానండి. ఎవరైతే ఏమయింది.. అబ్బా బాబు అయితే ఏముంటాయి అండి  బట్టలు.
చొక్కా, ప్యాంటు, షర్టు, షార్ట్ ఇందుకు మించి వేయడానికి ఏముంటుంది.

అదే పాప అయితే గంటకో మోడల్ వేయచ్చు.  రకరకాల ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు.  ఆ పట్టుపరికిణిలు  కుట్టించాలి. ఎన్ని ప్లాన్ చేసుకున్నాను.

రాజ్...  పెళ్ళాం చెప్పేదానికి నోరు వదిలేసి చూస్తూ నీ కోరికలు తీరడానికి పాప కావాలనుకున్నావా..  మాయమ్మే...
తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలు అనుకోవడం మానేసి పర్టికులర్ గా పాపే కావాలనుకున్నావా అని రాజ్ ఫ్యూచర్ ఊహించుకుంటాడు.

జడుసుకుని తన వీపు మీద తానే చరుచుకుంటాడు. వినయ్ పక్కన కూర్చుని ఏంటి బావ ఫ్యూచర్ కనపడిందా..

నిజంగా బామ్మర్ది. నాకు మాత్రం కొడుకే పుట్టాలి అని గట్టిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి నీకు పాపే... బావ.  ఒరేయ్ నేను మీకు ఏ ద్రోహం  చేసానురా... మీ కుటుంబం మొత్తం నామీద ఇలా పగబట్టేశారు..

అయ్యో బావ.  నీ మీద పగ పట్టలేదు. నువ్వంటే మా అందరికీ రెస్పెక్ట్. మాకు ఉన్న ఒక్కగానిఒక్క బావగారివి. అవును అవును.. మీ రెస్పెక్ట్ తట్టుకోలేకపోతున్నాను.

పార్ధు వచ్చి ఏంటి బావ బావమరుదుల సరసం..  ఈయనొక్కరు చాలు నా జీవితాన్ని రహదారి చేయడానికి..
ఏంటో నా కొడుకు తెగ పొగుడుతున్నాడు.  ఏం గుర్తొచ్చింది రా. రాజ్ తల పట్టుకుంటాడు.

ఏమీ లేదు మావయ్య.  బావకి ఆడపిల్లలే కావాలంట. అది కూడా అచ్చు మా నివిలాగానే... ఒరేయ్ అని ఏడుపు మొహంతో చూస్తాడు.

నా కోరిక కూడా అదే వినయ్.  నా కొడుకు అటు పెళ్ళాం ఇటు కూతురుతో షాపింగ్ చేస్తూ సాండ్విచ్ మధ్యలో వెజిటేబుల్ లాగా కుతుకుతా ఉడుకుతూ ఉంటే.. ఊహించుకుంటేనే  ఎంత అద్భుతంగా ఉంది.  చూస్తే ఉంటే ఇంకా ఎంత బాగుంటుందో..

భరత్ మాత్రం రాజ్ వంక జాలిగా చూస్తాడు.. ఏంటి బ్రో నన్ను చూస్తే జాలి వేస్తుందా..  కొన్ని కొన్ని నోటితో చెప్పలేము అనుభవించాల్సిందే ...

బాబు ఏడుపు మొదలు పెట్టడంతో... డిస్కషన్ ఆపి బాబుని ఊరుకోబేట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. లలిత వచ్చి బాబు ని ఇవ్వండి. ఆకలికి ఏడుస్తున్నాడు అవని దగ్గరికి తీసుకు వెళుతుంది.

అవని ధనుంజయ్ ని పిలుస్తుంది.  చెప్పమ్మా.  శిల్పని పిలిపించండి.  ఆల్రెడీ చెప్పాను బాబుని ఉయ్యాల్లో వేసే రోజున వస్తానంది.

ఆ సుముహూర్తం కూడా రానే వచ్చింది. 21 రోజున శుద్ధి స్నానం చేయించి ఉయ్యాల్లో వేస్తారు. ఆ రోజే బాబుకి నామకరణ చేయాలి అని బాబు జాతకాన్ని చూడమని బ్రాహ్మణులకి చెబుతారు.

బాబు జాతకం చూసినా పూజారి... ఇందిరాగారితో అమ్మ మీ మనవడు మహా జాతకుడు. ఆ సూర్యుడు లాగా వెలుగుతాడు. మీ వంశ కీర్తిప్రతిష్టలను మరో మెట్టు పైకెక్కిస్తాడు.

అపర చాణిక్య నీతి ఉంటుంది. తండ్రికి మించిన తనయుడు.  నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళతాడు.  తన ప్రేమ కోసం యుద్ధమే చేస్తాడు.

అది విని అందరూ చాలా సంతోషపడతారు. వినయ్ వెంటనే మా యువరాజు గారికి కూడా లవ్ స్టోరీ ఉంటుందన్నమాట..  పరవాలేదు రా నువ్వు మా పేరు ప్రతిష్టలు నిలబెడుతున్నావన్నమాట..  

బాబు పేరు ఏమి పెడదాం అని అందరూ ఆలోచిస్తూ ఉంటే... విక్రమ్ వెంటనే నేను చెబుతాను అని పళ్లెంలో పేరు రాస్తాడు.

అందరూ ఏమి రాసాడా అని తొంగి తొంగి చూస్తారు.
బియ్యంలో ఉన్న పేరు చూడగానే అందరూ వావ్ సూపర్ ఉంది.

నానమ్మ.. ముందుగా నువ్వే పిలువు అని విక్రమ్ అంటే... లేదురా ఫస్ట్ తల్లిదండ్రులే.. తర్వాతే ఎవరైనా..ముందు మీరిద్దరూ చెవిలో చెప్పండి.

అవని, విక్రమ్ బాబు చెవిలో చెబుతారు. వినయ్, నివి వచ్చి అన్నయ్య మీరు చెప్పడం అయిపోయింది కదా.. ఇంక మేము గట్టిగా అరిచి చెబుతున్నాము.

మీరు అందరూ వినడానికి సిద్ధంగా ఉండండి.

?? సూర్య దేవాన్ష్ జై సింహ ??

అందరూ బాబుని ఆశీర్వదిస్తారు. ఇందిరా గారు నవ్వుతూ ఇక మిగిలిన జంటలు కూడా శుభవార్తలు చెబితే ఇల్లు ఇంకా కళకళలాడుతుంది.

వినయ్ పక్కన కూర్చుని ఏంటి గ్రానీ మునిమానవళ్ళ ని అందరినీ వేసుకుని ఒక ఫోటో దిగాలని ఉందా... ఉండదా మరి ఫ్యూచర్లో వాళ్ళకి నేను తెలియాలి కదా..

శిల్ప,  ఉదయ్,  బిందు, సునీల్ నలుగురు వస్తారు.
అవని శిల్పని చూసి రా శిల్ప..  ఎలా ఉన్నావ్. బాగున్నాను అక్క. తేలికగా ఉందా.. బాగానే ఉంది. నువ్వు ఎలా ఉన్నావు.

అంతా బాగానే ఉందా.. చాలా సంతోషంగా ఉన్నాను.
ఏమి సంతోషంగా ఉన్నావు.  చూడు ఎలా చిక్కిపోయావో..  నాకు తెలిసిన శిల్పా ఇలా లేదు.

ఆ శిల్ప చచ్చిపోయి చాలా రోజులైంది అక్క..శిల్పా అని బాధగా అంటుంది.  ఇది బాధపడే సమయం కాదు. సంతోష పడే సమయం. 

ఆ శిల్ప చచ్చిపోయి కొత్త శిల్ప పుట్టింది. ఈ శిల్పకి జీవితం తెలుసు.  మనుషుల విలువ తెలుసు.  అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పు.

నీలో ఈ మార్పు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నాన్నకి చెప్పాను. మీరు ఇక్కడికి వచ్చేసేయండి.  అందరం కలిసి ఉందాం.

లేదు..  మాకు అక్కడే బాగుంది.  అక్కడ నుంచి ఎక్కడికి రాము.  అక్కడ ఫెసిలిటీస్ ఏమీ లేవు కదా..  ఇక్కడ చాలా ఫెసిలిటీస్ మధ్యన ఉన్నాను కానీ నా మనసు స్వచ్చంగా లేదు.

ఏ ఫెసిలిటీస్ లేని చోటే నా మనసు స్వచ్ఛంగా ఉంది.  ఆ వాతావరణం బాగుంది.  నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ప్లీజ్ అక్క..  ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయొద్దు.

మనం కలుస్తూ ఉందాం కానీ ఇక్కడ మాత్రం మేము ఉండము. ఉదయ్ నిర్ణయం కూడా అదే.. మరి మీ అత్తయ్య వాళ్ళు అంటే అందరికీ ఆ నిర్ణయమే నచ్చింది.


ధనుంజయ్ కూతుర్లు ఇద్దరు దగ్గరికి వచ్చి పక్కన కూర్చుని శిల్ప నిర్ణయం నాకు ముందే చెప్పింది.
అందుకే అక్కడ కావాల్సినవన్నీ అరేంజ్ చేశాను. ల్యాండ్ కొన్నాను.  ఇల్లు కూడా అక్కడ సపరేట్గా కట్టిస్తున్నాను.

  ఎందుకు నాన్న మాకు ఆ గుడిసె బాగుంది.   నీలో మార్పు రావాలి అని మాత్రమే అక్కడ ఉంచాను కానీ నా పిల్లల కష్టపడుతూ ఉంటే ఇంత సంపాదించి ఏమీ ఉపయోగం.

ముగ్గురిని అలా చూసినా సత్యవతి,  శేషగిరి కళ్ళు చెమర్చుతాయి. విక్రమ్ వైపు చూసి నమస్కారం చేస్తారు. విక్రమ్ ఆ చేతులను పట్టుకుని మీరు పెద్ద వాళ్లు.. ఆశీర్వదించాలి గాని ఇలా చేయకూడదు.

నువ్వు వయస్సులో చిన్నవాడివి కావచ్చు కానీ గుణంలో, సంస్కారంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. ఇప్పుడు నీ కొడుకు కూడా అంతకన్నా గొప్ప స్థానంలోనికి వెళతాడు. ఈ ఆశీర్వాదం మాకు చాలు.

సూర్య దేవాన్ష్ జై సింహ రాక...
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 2

సూర్య రాగాలతో అల్లరితో అందరికీ రోజులు తెలియకుండా ముందుకి పరిగెడుతూ ఉంటాయి. అన్నప్రాసన రోజున సూర్య ముందు రకరకాల వస్తువులు పేడతారు.

ఏమి పట్టుకుంటాడా అని చూస్తూ ఉంటే కష్టంగా పొట్ట మీద పాక్కుంటూ వెళ్లి డాల్ ని పట్టుకుంటాడు. తర్వాత పెన్ను, లాప్టాప్ పుచ్చుకుంటాడు.

అవి చూడగానే భరత్  బావ.. నీ కొడుకు నిన్ను మించిపోయేటట్టు ఉన్నాడు. నామకరణం రోజున పూజారి గారు చెప్పినట్టుగా వీడు గట్టిగానే ప్రేమ యుద్ధం చేస్తాడు అనుకుంటా..

అది ఒక్కటేనా తర్వాత పట్టుకున్నాయి కూడా చూడు బావ.. మా అన్నయ్య లాగా మంచి బిజినెస్ మాన్ అవుతాడు అని వినయ్ బాబుని ఎత్తుకొని సూర్య నేను చెప్పింది నిజమేనా...

బాబాయి ముఖం మీద చేతులతో కొడుతూ నవ్వుతూ ఉంటాడు.  ఒరేయ్ బాబాయ్ అంటే నీకు అంత ఇష్టమేంట్రా.. కార్టూన్స్ అంటే పిల్లలకి ఇష్టం కదండీ అని పూజిత అంటుంది.

వచ్చేసింది నా పెళ్ళాం అని గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి... తమరికేం ఇష్టం..  శాడిజమా అయ్యో మీ ఇష్టాలు కాదండి చెప్పాల్సింది.

నేను అడుగుతుంది కూడా తమరి ఇష్టాలేనండి.. అబ్బబ్బ మీ మొగుడు పెళ్ళాలు గొడవ ఆపండ్రా..
విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంటే వీళ్ళ గొడవల్ని చూసి నవ్వుతూ లిఫ్ట్ చేస్తాడు. అటుపక్క నుంచి శ్రీ వాయిస్ విని అవునా..  ఇప్పుడే వస్తున్నాము.

  నానమ్మ శ్రీకి బాబు పుట్టాడంట..  వావ్ సూపర్ గుడ్ న్యూస్ మళ్లీ ఈ జనరేషన్ లో వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారేమో...

రాజ్..  నా కొడుకు కూడా కలిసి ముగ్గురు అవుతారులే.. బావ నీకు కచ్చితంగా కూతురే.. ఫిక్స్ అయిపో.. ఒరేయ్ ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టం రా..

ఎప్పుడు అనుకునేవాడిని ఆడపిల్ల పుట్టాలి అని..  కానీ మీ చెల్లిని చూశాక ఆడపిల్ల అంటే భయమేస్తుంది రా.. ప్లీజ్ అన్నిసార్లు నువ్వు అనకు. తధాస్తు దేవతలు ఉంటారంట,..

మన గొడవ ఎప్పుడూ ఉండేది లేగాని లిటిల్ ఛాంప్ ని చూడ్డానికి వెళదాం పదండి అని ఫ్యామిలీ మొత్తం వెళతారు. 

హాస్పిటల్ కి వెళ్ళగానే విక్రమ్ బాబుని ఎత్తుకుంటాడు. వినయ్ చేతుల్లో ఉన్న సూర్య బాబు మీదకి దూకుతూ ఉంటే.. ఒరేయ్ నీ ఫ్రెండ్ ని అప్పుడే మచ్చిక చేసుకుంటున్నావా...

ఒక్క నిమిషం ఉండురా అని పక్కనే కూర్చోబేడతాడు.. సూర్య మెల్లిగా బాబు చేతిని పట్టుకుంటాడు.  బాబు కూడా సూర్యని చూస్తూ ఉంటాడు.

అది చూసి..  డౌటే లేదు. వీళ్ళిద్దరూ కూడా ఫ్యూచర్లో మంచి ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళ బాబులు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.. అమ్మలిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. ఇంక వీళ్లిద్దరు ఫ్రెండ్స్ అవ్వకుండా ఎలా ఉంటారు...

శ్రీ నేహా లు కొడుకు పేరు శ్రీకర్ అని నామకరణం చేస్తారు.

రోజులు ముందుకు వెళుతూ ఉంటే వరసగా అందరికీ కాన్పులు జరుగుతాయి.
వినయ్ పూజిత కి పుట్టిన బాబుకి వైభవ్ అని పేరు పెడతారు.

భరత్, విద్య కి పాప పుడుతుంది.  ఆ పాపకి సౌమ్య అని పెడతారు  ఈ తరంలో పుట్టిన మొట్టమొదటి ఆడపిల్ల.

నివి నొప్పులు పడుతుంటే హాస్పిటల్ లో ఎడ్మిట్ చేస్తారు. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈలోపు లోపల నుంచి నర్సు పరిగెత్తుకుంటు వచ్చి సార్ అని రాజ్ ని పిలుస్తుంది.

రాజ్ కంగారుగా ఏమైంది నర్స్ నా భార్య ఎలా ఉంది..
మీ వైఫ్ డెలివరీకి వచ్చే ముందు ఒక బ్యాగ్ ఇచ్చారంట.. అది తీసుకురమ్మన్నారు.

ఆ మాటకి రాజ్ అయోమయంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నారు సిస్టర్ మీరు. డెలివరీ అయ్యేటట్టు ఉంది.

వెంటనే ఆ బ్యాగ్ కావాలి. టెన్షన్ పడుతున్నారు. అది మంచిది కాదు. బ్యాగ్ అని తలగోక్కుంటూ ఉంటాడు. పూజిత వచ్చి ఇదిగో బ్యాగ్ తీసుకువెళ్లండి.

పూజిత వైపు చూసి అందులో ఏముంది పూజిత...
ఎవరు పుడతారో తెలియదు కదా... అవును కదా.. అందుకే బాబు పుడితే బ్లూ కలర్ సెట్ ని..  పాప పుడితే పింక్ కలర్ సెట్ రెడీ చేసి ఉంచింది.

అందులోనే పుట్టిన బేబీని ఉంచమంది. రాజ్ ఉలిక్కిపడి ఏమంటున్నావు. మీరు విన్నదే బావ అని వినయ్ వస్తాడు. ఒరేయ్ ఈ టైం లో కూడా మీ చెల్లి షాపింగ్ చేసింది.. అందులోనే బేబీ గురించి అంటే నాకు ఇప్పుడే నక్షత్ర మండలం కనబడుతుంది.

అప్పుడే అయితే ఎలా బావ.. ముందు ముందు మొత్తం యూనివర్స్నే చూపిస్తుంది. నర్స్ మళ్లీ బయటికి వస్తే రాజ్ భయంగా మళ్లీ ఏం గుర్తుకు వచ్చింది అంటాడు సార్ మీ గుడ్ న్యూస్ అంటుంది .

వినయ్..  పాప... రాజ్... బాబు అని ఒకేసారి అడుగుతారు. నర్సు వినయ్ వైపు చూసి మీరు మేనమామనుకుంటా.. అందుకే పాప కావాలని కోరుకుంటున్నారు.

  రాజ్ వైపు తిరిగి మీరు చాలా అదృష్టవంతులు సార్.. అయితే బాబే పుట్టాడు అని భుజం మీద చరుచుకుంటాడు.

కాదు సార్ అమ్మాయి పుట్టింది. అమ్మాయా అని అక్కడ కుర్చీలో కూలబడిపోతాడు. ఐ.... మాకు మేనకోడలు పుట్టింది అని వినియ్ డాన్స్ చేస్తూ ఉంటే..  పార్ధు కూడా వినయ్ తో కలిసి గంతులు వేస్తూ మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది.

దీన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆఫీసులో అందరికీ రెండు నెలలు ముందే బోనస్ ఇస్తాను. ఏమంటావు పుత్ర... అని గంతులు వేస్తూనే అడుగుతారు.

రాజ్.. తండ్రి బావమరిది వైపు చూసి నిజం చెప్పండి.
  మీరిద్దరూ పాప పుట్టింది అన్న సంతోషం కన్నా వీడికి బాగా దూల తీరబోతుంది అన్న సంతోషమే ఎక్కువ కదా..

పార్ధు.. ఒరేయ్ పుత్ర.. నువ్వు అలా అని నిజాలు అడగకూడదు రా..  కొన్ని కొన్ని నువ్వే అర్థం చేసుకోవాలి సో స్వీట్ అని చెప్పి హాస్పిటల్ మొత్తం స్వీట్స్ పంచి పెడతాడు.

రాజ్ ని కొంత మంది జాలీగా..  కొంతమంది సంతోషంగా చూస్తూ నివిని పాపని చూడడానికి వెళతారు.

రాజ్ కి కూతుర్ని చూసి  సంతోషం వస్తున్నా మనసులో గుబులు కూడా మొదలవుతుంది .

రాజ్ నివేదితల కూతురికి  చంద్రిక అని నామకరణం చేస్తారు.

పిల్లల అల్లరితో ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది.

సూర్య ఎనిమిదో పుట్టినరోజు వస్తుంది.
జై సింహ మాన్షన్ మొత్తం లైటింగ్ తో కళకళలాడిపోతూ ఉంటుంది.
సౌమ్య, చంద్రికని నివి రెడీ చేస్తూ ఉంటుంది. చంద్రిక రెడీ అయ్యి అద్దంలో చూసుకుని నాన్న అని గట్టిగా అరుస్తుంది.

చంద్రిక అరుపుకి అందరూ కంగారుగా వచ్చి ఏమైందిరా అని అడిగితే... మా నాన్న ఎక్కడ అంటుంది.  రాజ్ వెనకాలే వచ్చి ఇక్కడే ఉన్నాను బంగారం.

ఎందుకు అంత కోపంగా ఉన్నావు. చూడు నువ్వు తీసుకువచ్చింది ఎలా ఉందో అని హెయిర్ బ్యాండ్ చూపిస్తుంది.

బాగుంది కదా రా.. లేటెస్ట్ డిజైన్. డిజైన్ ఒకటి ఉంటే సరిపోతుందా... కలర్ మ్యాచ్ అవ్వద్దా  అనగానే... అందరూ ఒకరి ఫేసు ఒకరు చూసుకుంటారు.

విక్రమ్ ముందుకు వచ్చి.. నీ ఫ్రాక్ కి మ్యాచ్ అయింది కదా బంగారం. ఎక్కడ పెద్ద మామ..  చూడు నేను వేసుకున్న ఫ్రాక్ ప్యారేట్ గ్రీన్ అంటుంది.  అవును నీ హెయిర్ బ్యాండ్ కూడా గ్రీన్ ఏ కదా..

అయ్యో మామ నీకు కలర్ బ్లైండ్ వచ్చిందా... ఇది ప్యారేట్ గ్రీన్ అయితే ఇది డార్క్ గ్రీన్ రెండు ఎలా మ్యాచ్ అవుతాయి.

వినయ్ ముందుకు వచ్చి దూరానికి రెండు ఒకేలా కనబడుతున్నాయి చందు అంటాడు.  నీకు కూడా కలర్ బ్లైండ్ వచ్చింది చిన్న మామ...

ఎవరైనా దూరం నుంచి హాయ్ చెబుతారా... దగ్గరకొచ్చి హాయ్ చందు అంటారు.  అప్పుడు రెండు మ్యాచ్ అవ్వలేదు అని తెలియదా అని నడుం మీద చేతులు పెట్టుకుని అడుగుతుంది.

అందులోనూ సూర్యా బావ బర్త్డే. ఎంతమంది గెస్ట్ లు వస్తారు. బావ ఫ్రెండ్స్ వస్తారు.  వాళ్ళందరూ ముందు నేను ఇలా మ్యాచింగ్ లేకుండా వెళితే బాగుంటుందా..

నువ్వు చెప్పు చిన్న మామ. అందరూ వస్తున్న నవ్వును కష్టంగా ఆపుకుంటూ రాజ్ ని చూస్తారు. ఒరేయ్ నీ ఫ్రాక్ పట్టుకెళ్ళే చూశాను రా.. అంతకుమించి మ్యాచింగ్ లేదు.

అప్పుడు కష్టమైసిడ్ చేయించాలి నాన్న.  రాజ్.. నివి వైపు చూస్తూ ఇప్పటినుంచి ఏది కొన్నా సరే తలపై నుంచి కాళ్లు దాకా అన్ని కష్టమైసేడ్  చేయించు.

అంతేగాని నన్ను తిప్పకండి. సరే సర్లే ఊరుకోండి. షూస్ కష్టమైజ్డ్ కలర్ ఎలా చేయిపిస్తాము.  అందులో మోడల్స్ మారిపోతాయి కదా అంటుంది.

మోడల్స్ మారిపోతాయి అన్న బాధే కానీ మొగుడు కష్టం కనపడటం లేదా అని ఏడవలేక నవ్వలేక చూస్తాడు..విక్రమ్ చందు నెత్తుకుని అన్నిసార్లు సేమ్ మ్యాచింగ్ బాగోదు రా..

కొన్ని కొన్ని సార్లు కాంట్రాస్ట్ వేసిన అద్భుతంగా ఉంటుంది. ఆ హెయిర్ బ్యాండ్ తీసి దాని కాంట్రస్ట్ కలర్ పెట్టి ఇప్పుడు చూడు.. మా లిటిల్ డాల్ ఎంత ముద్దుగా ఉందో..

సరే మామ నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఈసారి నుంచి కరెక్ట్ గా సెలెక్ట్ చేసి తీసుకురండి లేదా నాకు సెలక్షన్ వదిలేయండి అర్థమైందా నాన్న అంటుంది.

అర్థమైంది అని నీరసంగా అంటే.. సౌమ్య మాత్రం కామ్ గా చూస్తూ ఉంటుంది. ఏరా సౌమ్య తల్లి నువ్వు మాత్రం కామ్ గా ఉన్నావు.

నీకు అవసరం లేదా... నాకు ఎలాగున్నా ఓకే బాబాయ్ అంటుంది. మా తల్లే.. . మా తల్లే ఎంత బాగా చెప్పావు అని మెటికలు విరుస్తాడు.

సూర్య పుట్టినరోజు వేడుకలు...

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply
Excellent start
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Sivs garu super update
Elage story ni pixki tisukuveltarani asistunanu
[+] 1 user Likes Ajayk's post
Like Reply
So far so good with the intro!
But conflict point emayi untundi ani alochistunna!

Avunu Shilpa ki kooda pillalu putti untaru kada?!?!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
nice start sir
[+] 1 user Likes shekhadu's post
Like Reply
Part - 3

సౌమ్య చెప్పినదానికి రాజ్ ఆనందపడిపోతూ బ్రో నువ్వు చాలా లక్కీ.  మీరు లక్కీ కాదా నాన్న అని చందు అంటుంది.

అలా అని నేను అనలేదు కదరా  సౌమ్య ఫాదర్ లక్కీ అంటే...  చందు ఫాదర్ ఆన్ లక్కీ అనే కదా...

చందు చెప్పినదానికి అందరికీ నవ్వ వస్తూఉంటే రాజ్ మాత్రం పెళ్ళాం వైపు చూస్తూ కడుపుతో ఉన్నప్పుడు ఏం ఆలోచించావు తల్లి నిన్ను మించిపోయింది అని..

రాని ఫోన్ని హలో హలో అనుకుంటూ బయటికి వెళ్లిపోతాడు.  అవని.. చందు ముందు కూర్చుని  ఈసారి కష్టమైడ్ చేపిద్దాం సరేనా...

బావ బర్త్డే టైం అవుతుంది కదా..  గెస్ట్లు అందరూ వచ్చేస్తారు బంగారం.   సరే అత్తయ్య నువ్వు చెప్పావు కాబట్టి కాంప్రమైజ్ అవుతున్నాను.

సూర్యదేవాన్స్  - 8 సంవత్సరాలు.
శ్రీకర్                       -7 సంవత్సరాలు
వైభవ్ -6 సంవత్సరాలు
సౌమ్య -5 సంవత్సరాలు
చంద్రిక-4 సంవత్సరాలు

సూర్య కేక్ కట్ చేసి ముందు ఇందిరా గారికి పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాడు..తరువాత జంటలుగా అందరికీ తినిపిస్తాడు.

కేక్ కిడ్స్ కి సర్వ్ చేస్తారు. చంద్రిక నివి దగ్గరికి వచ్చి నాకు బిగ్ పీస్ కావాలి. ఒక్క నిమిషం ఉండు చందు. అందరికీ పెట్టిన తర్వాత మళ్ళీ కట్ చేస్తాను అని నివి చెబుతూ అంటే నో మమ్మీ...

ఐ వాంట్ ఫస్ట్. సౌమ్య వచ్చి..  చందు నాది తీసుకో.. చందు ఆ కేక్ తీసుకుంటూ థాంక్యూ సౌమ్య..  ప్లేట్లో పెట్టుకుని స్పూన్ తో తింటూ ఉంటుంది.

శ్రీకర్ సౌమ్య దగ్గరకు వచ్చి సౌమ్య అని పిలుస్తాడు. ఏంటి శ్రీకర్ అని మెల్లిగా అడుగుతుంది.  నీ కేక్ చందు కి ఎందుకు ఇచ్చావు.

పిన్నిని విసగిస్తుంది కదా..  ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.  రేపు ఇంకా పెద్దది అడిగితే అప్పుడు ఏం చేస్తావు.

పెద్దదా అంటే... ఏదైనా సరే ముందు నీకు కావాల్సింది నువ్వు తీసుకుని మిగిలింది పక్కన వాళ్ళకి ఇవ్వు. అంతేగాని పెద్ద త్యాగమూర్తులాగా ముందుకు ముందు ఎవరికైనా ఇచ్చావని నాకు తెలిసిందనుకో అని నాలిక మడత పెడతాడు.

ఉహూ.. ఇవ్వను  కళ్ళల్లో నీళ్లు తిప్పుతూ భయంగా చెబుతోంది. సరే ఏడవకు ఇదిగో కేక్ అని ఇస్తాడు. ఆ కేక్ పీస్ చూడగానే సౌమ్య కళ్ళు మెరుస్తాయి. చూడగానే థాంక్యూ శ్రీకర్ అంటుంది.

ఆ ప్లేట్ తీసుకుని వెళుతూ ఉంటే  ఏయ్ అని పిలుస్తాడు. ఏమిటి అని మెల్లిగా అడుగుతుంది.  నా ముందే కూర్చుని తిను.

పట్టుకెళ్ళి ఎవరైనా అడిగితే ఇవ్వడానికా.. ఇక్కడే  కూర్చో అంటే సరే అని బొమ్మలాగా తలువుపి శ్రీకర్ తో కూర్చొని తింటుంది.

వైభవ్ కేక్ తింటూ యమ్మీ అనే గంతులు వేస్తూ ఉంటాడు. చందు..  బావ అంటుంది. ఏంటి చందు.. డీసెంట్గా ఒకచోట కూర్చుని నీటిగా తినలేవా..  ఎందుకు అలా గంతులు వేస్తావు.

కేక్ అంత నీ చేతికి, లిప్స్ కి అయింది. అయితే ఏమైంది.. వాష్ చేసుకుంటే అయిపోతుంది కదా...నో బావ నీటుగా తినాలి.. మన ఇంటికి ఎంతమంది గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళందరూ ముందు మనం ఎంత డీసెంట్ గా ఉండాలి. ఉండకపోతే...  బ్యాడ్ అంటారు .

అవునా అని ఒక్క నిమిషం ఆలోచించి దగ్గరికి వచ్చి చందు అంటాడు.  చెప్పు బావ అని  కేకు తింటూ ఉంటుంది. ఒకసారి నా వైపు చూడు. దేనికి బావ అని చూస్తే.. చేతిలో ఉన్న కేక్ చందు ఫేస్ కి రాస్తాడు.

ఇప్పుడు నువ్వు నాకన్నా ఎక్కువ డీసెంట్ గా ఉన్నావు హహహ అని నవ్వుతాడు.  వెంటనే చందు కేక్ పక్కన పడేసి అమ్మ అని రాగం అందుకుంటుంది.

గెస్ట్ లతో మాట్లాడుతున్న నివి పరిగెత్తుకొస్తే..  రాజ్ కి గుండెల్లో ఏదో బాంబు పేలిన ఫీలింగ్ వచ్చి పరిగెత్తుకుంటూ వస్తాడు.

కూతురు ఫేస్ చూసి అక్కడ వైభవ్ ని చూసి ఏరా నా కూతుర్ని ఏం చేసావురా.. ఏమీ లేదు మామయ్య డీసెంట్గా ఎలా ఉండాలో చెప్పింది. ఇలాగేనా అని ప్రాక్టికల్ గా చూపించాను అంతే చందు.

నో నాన్న...  బావ కావాలనే రాశాడు. నా ఫేస్ అంతా పాడైపోయింది.  నా మేకప్ పాడైపోయిందని ఏడవడం మొదలు పెడుతుంది.  రాజ్  తల పట్టుకుంటాడు.

వినయ్ వచ్చి ఏదో సరదాగా చేశాడు లేరా..  వెళ్లి ఫేస్ వాష్ చేసుకో..  ఫేస్ వాష్ చేసుకుంటే నా లిప్స్టిక్, క్రీమ్ అన్నీ పోతాయి మామయ్య.

ఓరిని...  మీ అమ్మ ఈ వయసు నుంచి నీకు మేకప్ మొదలుపెట్టిందా అని నివి వైపు చూస్తాడు.  ఏంట్రా అలా చూస్తున్నావు.  అందంగా రెడీ అవడం కూడా తప్పేనా..

నిన్ను ఎవ్వరం మార్చలేము. ముందు చందు ని తీసుకు వెళ్లి నచ్చజెప్పి వేరే ఫ్రాక్ వేయి. ఏరా ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తావు అని వైభవ్ చేయి పట్టుకుంటాడు.

ఎందుకో నాన్న అది అలా ఏడుస్తూ ఉంటే నాకు భలే సమ్మగా ఉంటది. అంతా నాన్న బుద్ధిలే అని పూజిత తల మీద కొడుతుంది.

ఏం నాన్న నువ్వు కూడా అమ్మని ఇలాగే ఏడిపించావా... ఒరేయ్ మీ అమ్మ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు రా... మీ అమ్మే నన్ను ఏడిపించింది.. ఆ మాట నేను అనాలి మీ అమ్మ బుద్ధిలే అని..

రాజ్ వైభవ్ వంక కోపంగా చూస్తూ ఉంటే.. ఏమైంది మామ అంతా ఆనందంగా చూస్తున్నావు.  నచ్చానా.. నువ్వు మీ నాన్న కన్నా శాడిస్ట్ లాగా ఉన్నావురా..

మీ నాన్న నన్ను ఆడుకుంటే..  నువ్వు నా కూతుర్ని ఆడుకుంటున్నావు. ఆడుకుంటే హెల్త్ కి మంచిది కదా మామ అని గంతులేసుకుంటూ వెళ్ళిపోతాడు.

వినయ్ రాజ్ చేయి పట్టుకుని చిన్న పిల్లలు బావ. వదిలేయ్..  వాళ్ళ ఆటలకి నాకు బాధ లేదురా.. నా కూతురు పెట్టే తిక్కలు తీర్చలేక నా బాధంతా...

అక్కడ సౌమ్య శ్రీకర్ని చూడు.. వాడేమో సౌమ్యను భయపెడుతున్నాడు. నీ కొడుకేమో నా కూతుర్ని ఏడిపిస్తున్నాడు.

ఏమిట్రా మీ డామినేషన్.  డామినేషన్ కాదు బావ కేరింగ్...  ఇదేం కేరింగ్ రా.. మీరు తీసుకునే కేరింగ్ కి వెనక బాబులకి వాచిపోతుంది.
  
ధనుంజయ్ మనవడి దగ్గరకు వచ్చి గిఫ్ట్ ఇస్తాడు. ఏమిటి తాత ఇది.  ఓపెన్ చేసి చూడు.  ఓకే అని ఓపెన్ చేస్తాడు.
హై లాప్టాప్..  నచ్చిందా అంటే సూపర్ ఉంది తాత.

అవని అది చూసి ఏంటి నాన్న వాడి వయసుకి లాప్టాప్ అవసరమా. నువ్వు నా మనవడిని తక్కువ అంచనా వేస్తున్నావు.

వాడిది సూపర్ బ్రెయిన్.  మీ ఆయన చేసేది కూడా ఇప్పుడే చేసేయగలడు. అబ్బో మనవడు గొప్పలు చాలా ఎక్కువైపోతున్నాయి.

ఏం చేశాడు మీ మనవడు అని విక్రమ్ వస్తాడు. ఏదైనా చేయగలడు అల్లుడుగారు. చూస్తూ ఉండండి మిమ్మల్ని అందరిని మించిపోతాడు.

శిల్ప ఉదయ్ కూతుర్ని తీసుకుని వస్తారు. అవని ఎదురు వెళ్లి రా.. శిల్ప ఇంత లేట్ అయ్యిందే..   పొలంలో చక్కబెట్టుకునేటప్పటికి ఆలస్యం అయ్యింది అక్క.

ఇంతకీ నా కొడుకు ఏడీ..  అదిగో అక్కడ నాన్నగారితో ఉన్నాడు.  శిల్ప కూతురు అయిన దివ్యని దగ్గరికి తీసుకుని ఎలా ఉన్నావు.

బాగున్నాను పెద్దమ్మ అంటుంది. దివ్య వైపు చూస్తుంది. పరికిణి జాకెట్ వేసుకుని..  మెడలో చైను, చేతికి గాజులు. అది చూసి చిన్నగా నవ్వుకుంటుంది.

ఏంటి అక్క నవ్వుతున్నావు. నాకు ఆడపిల్ల పుడితే ఎంత పద్ధతిగా రెడీ చేయాలనుకున్నానో..  అంత పద్ధతిగా దివ్య ఉంది.  అందుకనే ఆ నవ్వొచ్చింది.

చిన్నప్పటినుంచి ఇలా పద్ధతిగా పెంచితే పెద్దయ్యాక ఎటువంటి గాలి వేషాలు వేయకుండా ఉంటారు.  ఇప్పుడు నుంచి ట్రైనింగ్ ఇస్తున్నావా.. ఒక అమ్మగా నేను ఇవ్వాలి కదా...

సరే రండి ఇప్పటికే లేట్ అయిపోయింది  భోజనం చేద్దురు అని తీసుకువెళుతుంది. గెస్ట్ లందరూ వెళ్లిపోయిన తరువాత కుటుంబం మొత్తం కూర్చుని భోంచేస్తూ ఉంటారు.

సూర్య పిల్లలు బ్యాచ్ అందర్నీ ఒక చోట కూర్చోబెట్టి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన భరత్ చూసావా బావ..

నీ కొడుకు ఇప్పుడు నుంచే వాడి జనరేషన్ వాళ్ళని కంట్రోల్ లో పెడుతున్నాడు.  మంచిదే కదరా..  నాకైతే నా కూతురు గురించి కొంచెం కూడా టెన్షన్ లేదు.

అది కూల్..  రాజ్ వచ్చి నువ్వు లక్కీ బ్రో..  అటు విద్య కూల్. ఇటు సౌమ్య కూల్...

నా పరిస్థితి చూడు అటు సంకిని..  ఇటు డాకిని..  ఇద్దరి మధ్యన నేను పచ్చడి అవుతుంటే... మా నాన్న ఆరామంగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు.

పాపం మా అమ్మే నా బాధ చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంత కష్టమేమి వచ్చింది బ్రో.. కార్డు ఇచ్చేస్తావు కదా వాళ్ళు షాపింగ్ కి.

నువ్వేమీ అడ్డు చెప్పావు కదా.. అదంతా పెద్ద ప్రాబ్లం కాదు బ్రో. ఇందాక చూసావు కదా.. మ్యాచింగ్  కోసం. ముందు నివి  తిప్పేది.. ఇప్పుడు ఆ డ్యూటీ నా కూతురు తీసుకుంది.

నీకు అర్థం కావడం లేదు బావ. నా చెల్లి,మేనకోడలు నీతో ఫుల్ గా ఎక్సర్సైజ్ చేయిపిస్తున్నారు అని వినయ్ అంటాడు.

అవునురా అందరూ అదే అనుకుంటున్నారు..  నేను ఎక్సర్సైజ్ చేయకుండా బద్దకంగా ఉంటే...  వీళ్ళిద్దరూ పనిగట్టుకుని ఎక్సర్సైజులు చేయిపిస్తున్నారని..

పోరా ఏం చెబుతున్నావు. నీ కొడుకు ఎటువంటి టార్చర్ పెట్టక నీకు తెలియడం లేదు. ఆ మాటకి వాడి ఎందుకు పెట్టడం లేదు.

కాలేజ్ నుంచి ఎన్ని కంప్లైంట్ లు వస్తున్నాయో తెలుసా? ఎవరైనా నీట్ గా.. పద్ధతిగా కూర్చున్నారు అంటే వాళ్ళని ఏడిపించి హమ్మయ్య అనుకుంటున్నాడు.

ఏరా అంటే ఎందుకో వాళ్ళు ఏడిస్తే నాకు బాగుంటుంది నాన్న అని అంటున్నాడు.  నీ శాడిస్ట్ లక్షణాలు వచ్చాయి రా.. నన్ను అలాగే ఏడిపించకు తిన్నావు కదా..

వీళ్ళ సంభాషణకి విక్రమ్ నవ్వుతూ పిల్లలు అలా ఉండక మనలాగా నీటుగా డ్రెస్సు వేసుకుని డిస్కస్ చేసుకుంటారా...

నీకేం బాబు నువ్వు ఎన్నైనా చెబుతావు నీ కొడుకు ఫ్యూచర్ లయన్ కాబట్టి..  నీకు అంత ధైర్యం.  లయన్ కాబట్టే పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఎంత కష్టమో మీకేం తెలుసు...

సూర్య ట్రైనింగ్...
[+] 6 users Like SivaSai's post
Like Reply
Part - 4

సూర్య, శ్రీకర్ కి నెలల గ్యాపే ఉంటుంది. అందుకే ఇద్దరు ఒకే క్లాస్ చదువుతూ ఉంటారు.  డైలీ పిల్లలందరినీ కూడా కాలేజ్ బస్సులోనే పంపి వెనకాల సెక్యూరిటీ మాత్రం వెళుతూ ఉంటుంది.

కాలేజ్ లో ఎక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఐడెంటిటీ చెప్పనివ్వరు. అందరి పిల్లలతో ఈక్వల్ గానే ఉండేలాగా విక్రమ్ అరేంజ్ చేస్తాడు.

వైభవ్ అల్లరినీ ఇంటి వరకు సూర్య రానివ్వడు. కాలేజ్లోనే మొత్తం హ్యాండిల్ చేసి అక్కడే వైభవ్ కి చిన్న పనిష్మెంట్లు ఇచ్చి ఇంటికి తీసుకొస్తూఉంటాడు.

కాలేజ్లో యూనిఫామ్ ఉండడం వలన రాజ్ కొంతవరకు సేఫ్ జోన్ లో ఉంటాడు. నర్సరీకి యూనిఫామ్ ఎందుకు... యూనిఫాం లేని కాలేజ్లో జాయిన్ చేస్తాను అని నివి ఎంత గొడవ చేస్తున్నా సరే కుదరదంటే కుదరదు అని రాజ్ ఈసారి పంతం నెగ్గించుకుని మరి యూనిఫామ్ ఉన్న కాలేజ్లోనే జాయిన్ చేస్తాడు.

పిల్లలందరూ కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి పెద్ద వాళ్ళందరూ కూర్చుని సీరియస్ డిస్కషన్ లో ఉంటారు. సూర్య లలిత దగ్గరికి వెళ్లి ఏమైంది నానమ్మ.. చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నారు.

వచ్చారా కన్నా..  ముందు ఫ్రెష్ అయ్యి అండి. తర్వాత మాట్లాడుకుందాం.  పిల్లలందరినీ సర్వెంట్స్ తీసికువెళ్లి ఫ్రెష్ చేసి తీసుకొస్తారు.

పిల్లలందరు స్నాక్స్ తిన్న తర్వాత సూర్య ఇప్పుడు చెప్పండి నానమ్మ అని వస్తాడు. పక్కనే కూర్చోబెట్టుకుని ఏమి లేదు నాన్న...  జేజమ్మకి ఆరోగ్యం బాగుండడం లేదు కదా..

అందరం అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్లి వ్రతం చేసుకుందాం అంటున్నారు. ఈ టైంలో జేజమ్మని కదపడం కరెక్ట్ అవునా..  కాదా..  అర్థం కాక ఆలోచిస్తున్నాము.

ఎందుకు దీనికి ఇంత ఆలోచిస్తున్నారు. జేజమ్మ చెప్పారు అంటే అది కరెక్ట్ గానే ఉంటుంది.  మనం కంఫర్ట్ గా ఉండేటట్టుగా అందరం ఓకే క్యారీవాన్ లో వెళదాము. అందులో జేజమ్మకి కన్వీనెంట్గా సెట్ చేద్దాము.

సూర్య చెప్పిన దానికి కళ్యాణ్ మీసం మేలేస్తూ చెప్పానా..  నా మనవడు అచ్చు విక్కీ ఆలోచించినట్టే ఆలోచిస్తాడని... నాన్న ఆల్రెడీ చెప్పారా..

నువ్వు ఏది చెప్పావో సేమ్ అదే మీ నాన్న చెప్పారు. లేదు తాతయ్య నాన్న ఏది చెప్పారో అదే నేను చెప్పాను. రెండింటికి పెద్ద తేడా ఏముందిరా..  మీనింగ్ ఒకటే కదా..

అర్థము ఒకటే అయినా..  వెళ్ళే దారి వేరు కదా.. నాన్న బాటలో నేను నడిస్తే..  నేను నేర్చుకుంటాను. అదే నా బాటలో నాన్న నడుస్తున్నారు అంటే నాలో తెలియని గర్వం వస్తుంది.

సూర్య ఆలోచించే విధానానికి అందరికీ ముచ్చటేస్తుంది. మరో తరానికి సరైన మార్గదర్శి వచ్చాడు అని అందరూ సంతోషపడతారు.

మరి ఎప్పుడు ప్రయాణం అని నివి అడిగితే.. ఈ వీకెండ్ ప్లాన్ చేశాను.  కాలేజ్లో కూడా 2 డేస్ పర్మిషన్ తీసుకున్నాను అని విక్రమ్ చెబుతాడు.

ఆల్రెడీ అడ్వాన్స్డ్ గా ఉన్నావ్ అన్నయ్య అని వినయ్ వస్తే...  అందరూ మనలాగా స్లో నా ఏంటి అని పూజిత సెటైర్ వేస్తుంది.

వైభవ్ వెంటనే నీ సబ్బు స్లో నా ఏంటి బంటి.  ఒరేయ్ నువ్వు కాలేజ్లో ఏడిపిస్తున్నావు అంటే పోనీలే అని ఊరుకున్నాను.

అదే నా మీద సెటైర్లు వేశావు అనుకో తీసుకువెళ్లి మిలిటరీ కాలేజ్లో జాయిన్ చేస్తాను.  అప్పుడు నీకు ఉంటది. ప్లీజ్ నాన్న అంత పని మాత్రం చేయకండి.

మిలట్రీ కాలేజ్లో కలరింగ్ ఉండదు. ఈ వయసు నుంచి నీకు కలరింగ్ తో పని ఏంటి రా.. వయసుతో పనేముంది నాన్న అనుభవించి ఆనందించే మనసు ఉండాలి కానీ..

చంద్రిక వైపు చూస్తూ ఈ బుడ్డది చూడు...  ఈ ఏజ్ నుంచే ఎంత కలర్ ఫుల్ గా రెడీ అవుతుందో... ఇలాంటి కలర్ ఫుల్ గర్ల్స్ నా చుట్టూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా అని చేతులు రెండు పైకి పెట్టుకుని చెబుతూ ఉంటాడు.

కొడుకు చెబుతున్న విధానానికి వినయ్ గుండె పట్టుకుంటే పూజిత వీపు మీద ఒక్కటేస్తుంది.  అమ్మ ఎందుకు కొట్టావు అని వీపు రుద్దుకుంటూ అడుగుతాడు.

ఏరా ఈ వయసు నుంచి నీకు కలర్స్..  గర్ల్స్ కావాలా... ముందు నీ చదువు చూడు. అన్ని గుడ్డు సున్నాలు వస్తున్నాయి.

అన్నయ్య, శ్రీకర్, సౌమ్య చూడు ఎలా చదువుతున్నారు. అందరూ చదివేస్తే..  ఎంజాయ్ చేసేది ఎవరు ఉంటారు అమ్మ.  ఉత్తి టేస్ట్ లెస్ అయిపోయావు..

చూడు పెద్దమ్మ నన్ను అమ్మ కొడుతుంది అని అవని దగ్గరికి వెళ్లి గారాలుపోతూ ఉంటాడు. పోనీలే పూజిత చిన్నపిల్లోడు కదా.. తెలుసుకుంటాడు.

అక్క నువ్వు ఇలా గారం చేయబట్టే వాడు అసలు చదవడం లేదు.  ఏదైనా అంటే నాది ఇంకా చిన్న క్లాసే.. ఇప్పుడు కాకపోతే ఇంక ఎప్పుడు ఆడుకుంటాను. ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు.

సూర్య చూడు ఆటలకి ఆటలు ఆడతాడు. చదువులో ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు.  ఫస్ట్,  సెకండ్, థర్డ్ రాకపోయినా పర్వాలేదు. ఒక 80% అయినా ఉంటే బెటర్ కదా తర్వాత ఎలాగోలాగా ముందుకి తోయొచ్చు.

లేకపోతే వీళ్ళ నాన్న లాగా ఇదిగో అలాగే వెనకబడిపోయి ఉంటాడు.  ఏది జరిగిన వచ్చి నా దగ్గర ఆగకపోతే నీకు మనశ్శాంతి ఉండదే ...

పిల్లలు ఏ అల్లరి చేసినా అది నా వల్లే... ఎవరికీ హెల్త్ బాగోకపోయినా అది నా వల్లే... ఆఖరికి వీడు చదవకపోయినా నా వల్లేనా...

దీనిని నేను ఖండిస్తున్నాను.  రాజ్.. నువ్వు ఖండించిన ఖండించకపోయినా పెళ్ళాల మాట వినడం ఉత్తమం.  లేదు అంటే అనవసరంగా ఆయాసం వస్తుంది. తర్వాత నీరసం వస్తుంది.  అవసరమా..

బావ నీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా..  వస్తది బావమరిది.. రాకపోయినా మన పెళ్ళాలు రప్పిస్తారు. అక్కడ చూడు విద్య, అవని ట్రిపులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ఏమేమి కావాలా అని ఆలోచిస్తున్నారు.

ఇక్కడ నీ పెళ్ళం, నా పెళ్ళం చూడు జర్నీ దగ్గర నుంచి మళ్లీ రిటర్న్ ఇంటికి వచ్చేదాకా ఎప్పుడు ఏమి చీరలు కట్టాలా... పిల్లలకి ఎలాంటి డ్రెస్సులు వెయ్యాలా అని ఆలోచిస్తున్నారు.

ఇలాంటి అప్పుడు మనిద్దరం చేయవలసింది ఒక్కటే.. ఏమిటి బావ.. మౌనవ్రతం. అది ఆడవాళ్లు అనుకుంట చేసేది.

కొన్ని కొన్ని వ్రతాలు మగవాళ్ళ కోసం కూడా కనిపెట్టారు. చేసాము అనుకో మనకి మనశాంతి.  వాళ్లకి... హ..వాళ్లకి చెప్పు బావ వాళ్లకి అశాంతి అంటాడు.

బావ నువ్వు మరీ ఇంటెలిజెంట్ అయిపోయావని బుగ్గలు పట్టుకుని లాగుతాడు. లలిత విక్రమ్ ని పిలిచి శ్రీ వాళ్లకి కూడా చెప్పు. మొత్తం అందరం కలిసి వెళ్ళదాము.

ఆల్రెడీ ఇన్ఫామ్ చేశానమ్మ. ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు.


అన్నవరం వెళ్లే రోజు రానే వచ్చింది పిల్లలందరూ రెడీ అయ్యి బయటకు వచ్చేటప్పటికి రెండు క్యారీవాన్స్ రెడీగా ఉంటాయి.

వైభవ్ విక్రమ్ దగ్గరేకి పరిగెత్తుకుని వెళ్లి పెదనాన్న ఎందుకు రెండు అంటే..  మీ పిల్లల బ్యాచ్ కి ఒకటి.పెద్ద వాళ్ళకి ఒకటి.

థాంక్యూ పెదనాన్న.. ఎందుకురా.. అందరం కలిసి ఒకే దాంట్లో వెళతాము. నేను చేసే అల్లరికి మా అమ్మ ఇక్కడి నుంచి కారాలు నూరుతూ ఉంటుంది.

సైలెంట్ గా ఎలా కూర్చోవాలా అని టెన్షన్ పడ్డాను.  బట్ నువ్వు  సో స్వీట్ పెదనాన్న. ఐ లవ్ యు. సౌమ్య, చంద్రిక రెడీ అయి వస్తారు.

సౌమ్య నీటుగా టెడ్డీబేర్ పుచ్చుకుని బస్సు ఎక్కుతుంది. చంద్రిక ఒక టెడ్డీబేర్, మంకీబ్యాగ్, మాచింగ్ ఆక్సిరేస్ అన్ని పెట్టుకుని బస్ ఎక్కుతూ ఉంటుంది.

వైభవ్ చంద్రికనే చూస్తూ ఉంటే...  విక్రమ్ రేయ్ వైభవ్ అంటే.. చెప్పు పెదనాన్న. చందుని ఏడిపించావు అని నాకు తెలిసిందనుకో వెంటనే నీ బస్సు మార్పించేస్తాను.

మళ్ళీ మీ అమ్మ దగ్గరే కూర్చోబెడతాను.  ప్లీజ్ పెద్దనాన్న ఆ పని మాత్రం చేయకు. దాన్ని నేను ఏమీ ఏడిపించను. కాకపోతే ఇంత లాంగ్ జర్నీలో ఒక్కసారి కూడా అంటే కష్టం కదా...

కష్టమైన సరే.. చందు బాధ్యత పూర్తిగా నీదే. చందు ఏడవకుండా చూసుకో అర్థమయిందా. సరే పెదనాన్న ఈసారి కి నీకు మాట ఇచ్చి దాన్ని ఏమీ అనను.

పిల్లలందరూ ఒక బస్సులో ఎక్కుతారు.  సర్వ్ చేయడానికి ఇద్దరు సర్వెంట్స్, సెక్యూరిటీ కూడా ఆ బస్సులో ఉంటారు.
మరొక బస్సులో మిగిలిన ఫ్యామిలీ మొత్తం ఎక్కుతారు.

హైదరాబాదు నుంచి అన్నవరం ప్రయాణం మొదలవుతుంది. మధ్య మధ్యలో ఆపుతూ పిల్లలకి కావాల్సిన చూసుకుంటూ మెల్లిగా అన్నవరం చేరుకుంటారు.

అన్నవరం లో బస్సు ఆగగానే సూర్య,  శ్రీకర్ ముందు దిగుతారు. సూర్య దిగి ఒక బ్రైడ్స్ స్మైల్ తో చుట్టూ చూస్తూ ఉంటాడు.

శ్రీకర్ ఏమైంది బావ మంచి హ్యాపీ స్మైల్ ఇస్తున్నావు.  ఏమో తెలియదు .  ఇక్కడ దిగగానే చాలా ప్లసెంట్ గా అనిపించింది. ఏదో నాకు తెలియని ఒక ఫీల్ కలుగుతుంది.

మన సిటీ అంతా పొల్యూషన్ కదా.. ఇక్కడంతా నేచర్ ఎక్కువ ఉంది కదా..  మే బి..

రాజ్ కంగారుగా వచ్చి ఏరా చందు ఏది. వైభవ్తో ఉంది మావయ్య. వైభవ్తోనా..  అమ్మో వీడు నా  కూతురిని ఏం చేశాడో అని స్పీడ్ గా బస్సు దగ్గరికి వెళతాడు.

సౌమ్య మెల్లిగా బస్సు దిగుతుంది.
వెనకాలే చందుని పట్టుకుని వైభవ్ మెల్లిగా దిగుతాడు.
చందు ఫ్రెష్ ఫ్లవర్ లాగా ఉంటే... వైభవ్ వాడిపోయిన కాడలాగా ఉంటాడు.

రాజు స్పీడ్ గా వెళ్లి అమ్మ చందు ఎలా ఉన్నావు
నాకేం నాన్న..  ఐ ఎమ్ ఆల్ రైట్ అని హెయిర్ ని వెనక్కి వేసుకుంటూ చెబుతుంది.

ఏదో తేడా కొడుతుందే అని వైభవ్ వైపు చూస్తాడు. వైభవ్ మాత్రం అలసిపోయి కనపడితే.. అదేంట్రా నువ్వు ఇలాగ అయిపోయావు.

ఏమీ తినలేదా.. కోపంగా చూస్తూ నీ కూతురు నన్ను తింది ఇంక నేనేం తింటాను. ఇదే ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు.

ఎప్పుడు నువ్వే కదా చందు ని ఏడిపిస్తావు.  ఈసారి బస్సులో రివర్స్ జరిగిందా అని ఒక హ్యాపీ స్మైల్ తో అడుగుతాడు.

ఏంటి మావయ్య.. నీ కూతురు నాతో ఆడుకుంది అంటే నీకు మంచి సంతోషంగా ఉన్నట్టుంది.  అది కాదురా..  ఏం జరిగిందా అని అడుగుతున్నాను ఏమైందో చెప్పమ్మా.

పెదనాన్నకి మాట ఇచ్చాను. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని..  అందుకే ఇది ఎంత టార్చర్ పెట్టినా సరే ఓపికగా ఉన్నాను.  కానీ అన్నవరంలో..


సత్యనారాయణ స్వామి దర్శనానికి అందరూ ఆహ్వానితులే ???

కథ కొనసాగుతుంది..
[+] 8 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)