Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 142

హాయ్ అన్న వాయిస్ కి విక్రమ్ తలతిప్పి మీరేంటి ఇక్కడ.. మేడం గారు కోరిక.  మిడ్ నైట్ ఐస్ క్రీమ్ తినాలనిపించింది అంట రోడ్ ఎక్కించింది.

శ్రీ చెప్పినదానికి నేహ మూతి ముడిస్తే అవని నవ్వుతుంది. విక్రమ్ ఐస్క్రీం తెచ్చి అందరికీ ఇస్తాడు. థాంక్స్ అన్నయ్య అని తీసుకుని అన్నయ్యని చూసి నేర్చుకోండి.

మా అవనినీ చూడండి ఎంత జాగ్రత్తగా తీసుకువచ్చారు. మీరు ఉన్నారు..  ఎప్పటి నుంచి అడిగితే ఇప్పటికి కదిలేరు. హలో ఎక్కువ చేయకు.

మీరిద్దరూ ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నారని మాకు తెలుసు అంటాడు.  ఆ మాటకి అవని,  నేహా ఒకరినొకరు చూసుకుని మీకు ఎలా తెలుసు..సాయంత్రం ఇద్దరు గుసగుసలాడినప్పుడే డౌట్ కొట్టింది.

ఇక్కడ చూసిన తర్వాత కన్ఫర్మ్ అయ్యింది.  మీ ఇద్దరి ఎక్స్ప్రెషన్ కి ఫిక్స్ అయ్యా. అబ్బో తెలివితేటలు ఎక్కువైపోయినయిలే మా వారికి.

ఎప్పుడు నేను తెలివైనవాడినే.. అందుకే కదా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఏమంటావ్ అన్నయ్య అని విక్రమ్ ని అడుగుతుంది.

ఆ మాటకి నవ్వుతూ అది నిజమేరా వాడు తెలివైనవాడే..  అందుకే నువ్వు,  నేను దొరికాము.  మరి నేను అని అవని అంటే..  నువ్వు ఇంకా బీభత్సమైన  తెలివితేటలు ఉన్న దానివి అందుకే నాకు దొరికావు.

ఒక్క నిమిషం అని..  మా అన్నయ్య తెలివైనవాడు కాబట్టి మీరిద్దరూ దొరికారు.. నేను తెలివైన దాని కాబట్టి మీకు దొరికాను.

ఏది జరిగినా సరే మీకు అనుకూలంగా మాట్లాడేస్తారా..  అంతే కదా ఏమంటావు అని నేహాన్ని అడిగితే.
  మీరు చెప్పింది నిజం అన్నయ్య.

అవని తెలివితేటలు..  అబ్బో చూశాను కదా మామూలుగా ఉండదు అని ఏడిపిస్తూ ఉంటారు.  ఆ మాటకి అవని మూతి ముడుచుకుని చూశారా అన్నయ్య.. వీళ్ళిద్దరూ కలిసి మనిద్దరిని ఎలా ఏడిపిస్తున్నారో.. గట్టిగా రివెంజ్ తీర్చుకోవాలి.

ఎందుకులే ఇద్దరికి ఇద్దరు ముదుర్లు.  మన రివెంజ్ ప్రోగ్రాం పెట్టామంటే వాళ్లే తిరిగి మనమీద రివెంజ్ తీర్చుకుంటారు మనకు అవసరమా...

సరదాగా మాట్లాడుకుని  అవని నేహా నిద్ర ఫేసులు చూసి బయలుదేరతారు.  వెళ్ళేటప్పుడు మాత్రం విక్రమ్ కారులోనే ఇంటికి తీసుకువెళతాడు.  కారు ఎక్కగానే విక్రమ్ భుజం మీద పడుకుండిపోతుంది.

ఇంటిదగ్గర కారు ఆపి..  అవని నీ చూడగానే చాలా డీప్ స్లీప్ లో ఉంటుంది.  అవని డిస్టర్బ్ అవ్వకుండా మెల్లిగా రెండు చేతులతో ఎత్తుకొని తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పుతాడు.

అవని పక్కన పడుకుని... ముంగురులు సవరిస్తూ నన్ను కంప్లీట్ ఫ్యామిలీ మెన్ చేసేస్తున్నావు. నాలో ఇలాంటి యాంగిల్ ఉంటుందని నాకే పరిచయం చేస్తున్నావు.

నీలాంటి భార్య ఉంటే ఏమగాడైనా ఇలాగే ఉంటాడేమో అనుకుని..  అమ్మో వద్దు..  నీలాంటి భార్య నాకొక్కడికే చాలు ఇంకా ఎవరికీ వద్దు అని గట్టిగా పట్టుకుని పడుకుంటాడు.

రాత్రి ఆలస్యంగా పడుకున్నందుకు అవని చాలా లేటుగా నిద్ర లేస్తుంది.  లేచేటప్పటికీ విక్రమ్ కనిపించడు.  ఏమిటి అప్పుడే ఈయన లేచారా.. నన్ను లేపలేదు ఏంటి...

నన్ను లేపి యోగాకు తీసుకువెళతారే... ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చేటప్పటికి విక్రమ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి డ్రై ఫ్రూట్స్ పాలు ఇస్తాడు.

అబ్బా పొద్దున్నే ఇది తినాలంటే చికాకుగా ఉంటుందండి. కారంగా పెట్టొచ్చు కదా... మూతి మీద ఒకటి వేసి నైట్ ఐస్ క్రీమ్ తిన్నావు సరిపోలేదా..

పొద్దున్నే కారం అంటున్నావు.  పొద్దున్నే కారం తింటే గ్యాస్ ఫార్మ్ అవుతుంది అని స్టార్ట్ చేయగానే...  ఇలా ఇవ్వండి అని చేయి చాపుతుంది.

నవ్వుతూ చేతికి ఇస్తాడు. తిని పాలు తాగి ఇప్పుడు ఓకేనా అంటే గుడ్ గర్ల్ అయిపోతున్నావు..సరే నీకు నేనే దగ్గర ఉండి స్నానం చేయిస్తాను.

నేనేమన్నా చిన్న బేబీని అనుకుంటున్నారా..  నా స్నానం నేనే చేస్తాను. అంత లేదమ్మా...  ఈరోజు అన్ని పనులు నేనే చేయాలి.. పదా పదా అనే స్నానానికి తీసుకు వెళ్లి నలుగు పెడతాడు.

అదేంటి నలుగు పెడుతున్నారు. నా కన్నాకి నలుగు కావాలంట... ఎప్పుడు చెప్పాడో అంటే రాత్రి కలలోకి వచ్చి చెప్పాడు.. మూసుకుని కూర్చో అంటాడు.

మీరు ఇలా నలుగు పెడుతుంటే నాకు ఇబ్బందిగా ఉందండి. నేను చూడందేమైనా ఉందా ఏమిటి ఇబ్బంది పడడానికి..

బాబు మీ మాటలు వినలేకపోతున్నాను అని తల కిందకి దించుతుంది.  దించిన తలను పైకెత్తి ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి.  సిగ్గుపడుతూ ఉంటే ఎలా..  ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కదా...

నలుగు పెట్టి స్నానం చేయించి.. తల స్నానం చేయించి మ్యాక్సీ వేస్తాడు.  అదేంటి అంటే జస్ట్ వెయిట్ మా అని బయటికి తీసుకువచ్చేటప్పటికి సాంబ్రాణి ధూపం రెడీగా ఉంటుంది.

అరే ఇది కూడా రెడీ చేశారా హా అని జుట్టుకి మొత్తం ధూపం వేస్తాడు. మెల్లిగా చిక్కు తీసి జడ వేస్తాడు ఇప్పుడు ఓకేనా అంటే వెయిట్ అని కాల్ చేసి బ్రేక్ ఫాస్ట్ తెప్పిస్తాడు.

కిందకి వెళ్లే వాళ్ళము కదా.. నిన్ను మాట్లాడొద్దన్నానా.. టిఫిన్ తినిపించి జ్యూస్ తాగుతావా...ఇప్పుడు ఏమీ వద్దు.

సరే అని పదా.. డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకువెళ్లి  నేను చెప్పే వరకు కళ్ళు తెరవొద్దు అంటాడు.. ఏ అంటే చెప్పింది చేస్తావా లేదా.. సరే అని కళ్ళు మూసుకుంటుంది.

అస్సలు తెరవకూడదు..  అవని మాట అంటే మాటే.  అబ్బో అని మ్యాక్సీ తీసి  చీర కడతాడు. ఇప్పుడు మీరు చీర కట్టారు అంటుంది.

ఆహా ఇంకా...  నెక్స్ట్ అని జడవేశారు.  తర్వాత ఏం చేస్తున్నాను. మెడలో ఏదో పెడుతున్నారు ఇంకా చేతినిండా గాజులు వేస్తున్నారు ఏమిటి అంటుంది.

మాట్లాడకన్ననా అని రోజు పెట్టుకునే సన్న పట్టీలు తీసి కొత్త పట్టీలు పెడతాడు.  అరే..ఈ పట్టీలు కొత్తగా ఉన్నట్టు ఉన్నాయే...

సైలెంట్ గా ఉండు భార్యామణి అని ఓపికగా మొత్తం రెడీ చేసి అక్కడే కూర్చోబెట్టి నేను చెప్పే వరకు కళ్ళు తెరవొద్దు అని విక్రమ్ స్నానానికి వెళతాడు.

ఎంతసేపు శ్రీవారు.. వచ్చేస్తున్నా అని విక్రమ్ రెడీ అయి వస్తాడు. భర్త రాకను గమనించి ఇప్పుడు తెరవనా.. ఒక్క నిమిషం అని అద్దం ముందు నిలబెట్టి ఇప్పుడు ఓపెన్ చెయ్ అంటాడు.  మెల్లిగా కళ్ళు తెరుస్తుంది .

అవని తన  రూపం చూసుకుని ఆశ్చర్యపోతుంది. అద్దాన్ని  టచ్ చేస్తూ ఏమిటి ఇదంతా... ఎలా ఉన్నావు ముందు అది చెప్పు. ఇంత కష్టపడి రెడీ చేస్తే అది చెప్పడం లేదు నువ్వు అని పొట్ట చుట్టూ చేతులు వేస్తాడు.

ఎందుకు నన్ను ఇలా రెడీ చేశారు. మీరు కూడా మ్యాచింగ్ వేసుకున్నారు. అడిగినదానికి చెప్పు బంగారం.. ఒకసారి అద్దంలో చూసుకుంటుంది.

తల నిండా పువ్వులు, పట్టుచీర..  ఒంటినిండా నగలు దిష్టి చుక్క కొత్త పెళ్లి కూతురు రూపంలో కనిపిస్తూ ఉంటే కన్నీళ్ళతో నేనేమన్నా పెళ్లికూతురునా...

ఒక రకంగా అలాంటిదే..  రా అని కిందకి తీసుకువెళతాడు. వీళ్ళు వెళ్ళేటప్పటికి హాలు మొత్తం పువ్వులతో డెకరేట్ చేసి ఉంటుంది.  స్టేజ్ వేసి ఉంటుంది.

అంతా చూస్తూ ఉంటే తీసుకువెళ్లి స్టేజ్ మీద ఉన్న కుర్చీలో కూర్చోబెడతాడు. అవని కి ఏం మాట్లాడాలో అర్థంకాక భర్తనే చూస్తూ ఉంటుంది.

మాధవి లలిత వచ్చి మాకన్నా బాగా రెడీ చేశావురా అని మెటికలు విరుస్తారు. అవని వాళ్ళ వైపు చూడగానే..ఏంట్రా అలా చూస్తున్నావు.  సర్ప్రైజ్ నచ్చిందా..

ఇదంతా ఎప్పుడు చేశారు అత్తయ్య.. మాదేమీ లేదమ్మా.
అంతా మీ ఆయనగారి ప్లానింగ్. నీకు సర్ప్రైజ్ గా సీమంతం చేయాలి అనుకున్నాడు.

అందుకే ఈ అరేంజ్మెంట్స్..  నచ్చాయా అంటే చాలా అని ఎమోషనల్ అవుతూ లేచి లలితని హగ్ చేసుకుంటుంది. విక్రమ్ అది చూసి కష్టపడి చేసిందంతా నేనైతే..  హగ్గులు మా అమ్మకా..

ఆ మాటకి మాధవి ఒరేయ్ మీ హగ్గులు కిస్సులు మీ గదిలో.. అందరిలోనూ ఇవ్వలేదు కదా.  అందుకే మాకు ఇస్తుంది. ఆ మాటకి అందరూ నవ్వుతారు.  అవని సిగ్గుపడుతుంది.

ముందుగా విక్రమ్ బొట్టు పెట్టి గంధం రాసి గాజులు వేస్తాడు. అక్షంతలు వేసి నువ్వు ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలి అని నుదుటిన ముద్దుపెట్టుకుంటాడు.

కుర్ర బ్యాచ్ అంత ఓ..అని అరుస్తారు. జంటలుగా అందరూ అక్షంతలు వేసి తెచ్చిన కానుకలు అవనికి ఇస్తారు.

ఇందిరా గారిని అక్షింతలు  వెయ్యమంటే.. నేను వద్దు. రాను అంటే విక్రమ్ బలవంతంగా తీసుకువెళ్లి అక్షింతలు వేయిపించి.

నువ్వు మన ఇంటికి దిక్సూచిలాంటి దానివి. నీ ఆశీర్వాదం ఎప్పుడు మంచిదే.  పుట్టింటి సారేగా మాధవి, కరుణ సురభి సూడుదులు తీసుకువచ్చి ఇస్తారు.

సత్యవతి శేషగిరి గారు కూడా ఆశీర్వదిస్తారు. వాళ్ళు ఏమిచ్చినా అవని తీసుకోదు అని చల్లగా ఉండు తల్లి అని ఆశీర్వదిస్తారు.

అందరి సంతోషాల మధ్యన బంగారు తల్లికి సీమంతం జరుగుతుంది.  అవని ఎప్పుడూ చూడని సంతోషాన్ని చూస్తుంది.

కుటుంబం ఉంటే ఇంత బాగుంటుందా..  ఇంతమంది నా మేలుకోరే వాళ్ళు ఉన్నారా..  నాకోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని ఎమోషనల్ అవుతుంది.

విక్రమ్ అది చూసి అరే ఏమైంది నా భార్యామణికి. భర్తని గట్టిగా కౌగిలించుకొని మీలాంటి వాళ్లు చాలా అరుదు.  అపురూపమండి మీరు.

నా కోసం ఇంత చేస్తున్నారు.  నేను అడగకముందే నాకేం కావాలో తెలుసుకుంటున్నారు. మీ వలన నాకు ఇంతటి చక్కటి కుటుంబం ఏర్పడింది.  ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను.  నేను మీకు ఏమి ఇవ్వగలను.

అవని ఎమోషనల్ అవుతుఉంటే కుటుంబం మొత్తం చుట్టూ చేరి ఏంట్రా ఇది.  ఈ టైంలో ఇలా కంటతటి పెట్టవచ్చా..

నువ్వు కంటతడి పెడితే లోపల ఉన్న బుజ్జి బేబీ కూడా ఏడుస్తుంది. కన్నీళ్లు తుడిచి నుదుటిని ముద్దు పెట్టుకుని నువ్వు మా ఇంటి అదృష్ట దేవతవి. గృహలక్ష్మి వి.

నువ్వు సెపరేట్గా ఏమి ఇవ్వాలి.  రుణం తీర్చుకోవడం లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.  ఇది మన కోసం మనం చేసుకుంటున్నా ఒక వేడుక అని లలిత కన్నీళ్లు తుడుస్తుంది.

ఇందిరాగారు దగ్గరకు వచ్చి బంగారం నువ్వు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో నేను చెప్పనా అంటే హ..అమ్మమ్మ గారు చెప్పండి.

ఇందిరా ఏమి చెబుతుంది...

కథ కొనసాగుతుంది...
[+] 12 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Superb update
Like Reply
Sooper emotional update!!
Like Reply
Part - 143

ఇందిరా గారు అవని దగ్గరికి వచ్చి ఎప్పుడు ఏడవకూడదు. నవ్వుతూ ఉండాలి. మీ ఆయనకి వెన్నుముకలాగా ఉండి ధైర్యాన్ని ఇవ్వాలి.  అంతే నువ్వు చేయాల్సింది.

తప్పకుండా చేస్తా అమ్మమ్మ గారు అని కౌగిలించుకుంటుంది. అంతా ఎమోషనల్ గా ఉండేటప్పటికీ వినయ్ వచ్చి అబ్బబ్బ ఎమోషనల్ ఎక్కువైపోయింది గాని కొంచెం ఫన్ లోకి వద్దామా..

పార్ధు  వెంటనే ఆ ఫన్ క్రియేట్ చేయాలి అంటే మీ ముద్దుల బావగారే ఉండాలి.  ఐస్ క్రీమ్ తింటున్నా రాజ్ ఏమిటి నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు..

పార్ధు వెంటనే చెప్పనా...  మీ బావ ఎక్కడున్నా ఫన్ క్రియేట్ చేస్తాడు అని అంటే..  ఫన్ నేను క్రియేట్ చేయడం ఏంటి..

ఏమీ లేదు రాజ్ మీరు అయితే ఇంకా బాగా సర్ప్రైజ్ చేస్తారు అని మావయ్య గారు చెబుతున్నారు. దేనికి సర్ప్రైజ్.

ఇప్పటికిస్తున్న సర్ప్రైజ్ లకే నా తల మీద జుట్టు ఊడిపోతుంది. మళ్ళీ కొత్త సర్ప్రైజ్లు నావల్ల కాదు. అలా అంటే ఎలా రా..

నీ ఫ్రెండ్ చూడు భార్యకు ఎలాంటి సర్ప్రైజ్లు ఇచ్చాడో.. వాడు విక్రమ్.. నువ్వు రాజ్ వి కదా... బాబు నన్ను వదిలేయండి.

మీ మామ కోడలు ఇద్దరు ఒక చోట చేరితే నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. చూడు నివి సర్ప్రైజ్లు ఇవ్వలేను గాని నీకు ఎలా కావాలో ముందే చెప్పు. ప్లాన్ చేస్తాను.

ఈమాత్రం దానికి మీరే చేయాలా అని మూతి తిప్పుతుంది. అందరూ సరదాగా నవ్వుకుంటూ భోజనాలు చేస్తారు. అవనికి మాత్రం విక్రమ్ తినిపిస్తాడు.

అందరూ చూస్తున్నారని ఇబ్బంది పడుతుఉంటే... సరే ఒక్క నిమిషం ఉండు అని హాలో జెంట్స్ అని పిలుస్తాడు. ఏంటి విక్కి..  ఈరోజు సరదాగా చిన్న పని చేద్దాము.

ఏంట్రా.. ఈరోజు లేడీస్ అందరూ వరుసగా కూర్చుంటారు. ఎవరి పార్టనర్ కి వాళ్లే కలిపి తినిపించండి. మరి పార్ట్నర్స్ పక్కనలేని వాళ్ళు.. మీ భోజనం మీరే తినాలి అని అర్థం.

ఓకే మేము తర్వాత తింటాము. మీరు తినిపిస్తూ ఉండండి. మేము వడ్డిస్తూ ఉంటాము అని  సర్వెంట్స్ అక్కడ నుంచి పంపించేసి వినయ్ భరత్ బౌల్స్ తీసుకుంటారు.

విక్రమ్.. అవనినీ చూసి ఇప్పుడు హ్యాపీ నా అంటే చిన్నగా నవ్వుతుంది.  ఈ నవ్వు చాలు లైఫ్ అంత హ్యాపీగా గెంటేయడానికే అని తినిపిస్తూ ఉంటాడు.

ఆ ప్లేట్లోనే కలిపి విక్రమ్ కి ముద్ద పెడుతుంది. అది చూసి మిగిలిన ఆడవాళ్లు కూడా అలాగే తినిపిస్తూ ఉంటారు. ఇందిరాగారు సంతోషంగా కుటుంబాన్ని చూస్తూ ఉంటారు.

సత్యవతి గారు దగ్గరికి వచ్చి మీరు చాలా అదృష్టవంతులండి.  చక్కటి కుటుంబం ఏర్పడింది. అంత మన చేతుల్లోనే ఉంటుంది.

పెద్దవాళ్లగా మనం ఎలా నడిస్తే మన పిల్లలు అలాగే నడుస్తారు. అది మాత్రం నిజం. కానీ ఏం చేస్తాము మా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

బాధపడకండి వదిన..  తప్పకుండా మీ పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఏది ఎలా ఉన్నా సరే ధనుంజయ్, అవని కలిస్తే చాలు.

ఎప్పుడు అవని నాన్న అని పిలుస్తుందా అని నా కొడుకు చకోరి పక్షిలాగా ఎదురు చూస్తున్నాడు. కాలమే కొన్ని సమస్యలకు సమాధానం చెబుతుంది.

ఇప్పుడిప్పుడే కదా అవని సంతోషంగా ఉంటుంది.  కచ్చితంగా ఒప్పుకుంటుంది. మీరు బాధపడకండి. ఆ రోజు కోసమే చూస్తూ ఉన్నాము వదినగారు. ఇంక మేము బయలుదేరతాము సెలవు అని ఇంటికి వెళ్ళిపోతారు.

సత్యవతి శేషగిరి ఇంటికి వెళ్లేటప్పటికీ ధనుంజయ్ అవని సీమంతాన్ని చూస్తూ ఉంటాడు.  పక్కన కూర్చుని ఏరా నీ కూతుర్ని చూసుకుంటున్నావా..

రజితని చూసినట్టే ఉంది అమ్మ. అవునురా నాకు అలాగే అనిపించింది. ఎంత కన్నుల పండుగగా జరిగిందనుకుంటున్నావు.

అసలు నీ అల్లుడే దగ్గరుండి మరీ రెడీ చేశాడు. కాలు కందనివ్వడం లేదనుకో.. ఇక ఇంట్లో వాళ్లయితే కన్నీరు రెప్పని దాటనివ్వడం లేదు.

అంత అపురూపంగా చూసుకుంటున్నారు. నిజమేనమ్మా.. నా కూతురు అదృష్టవంతురాలు... కానీ నేనే దురదృష్టవంతుణ్ణి.

ఏంట్రా మాటలు అవును అమ్మ..  నాన్న అన్న పిలుపుకు దూరంగా ఉంటున్నాను అంటే నా అంత దురదృష్టవంతుడు ఎవరు ఉంటారు.

రేపు మనవళ్ళు వచ్చే టైం కైనా సరే నన్ను అవని నాన్న అని పిలుస్తుందా... పుట్టేవాళ్ళతో తాత అని పిలవనిస్తుందా..

తప్పకుండా అన్ని పనులు జరుగుతాయి రా.. నువ్వు బాధపడకు. అలసిపోయి ఉంటారు వెళ్లి రెస్ట్ తీసుకోండి నాకు కొంచెం పని ఉంది అని బయటికి వెళతాడు. 

ధనుంజయ్ సరాసరి భార్గవి దగ్గరికి వెళతాడు. భార్గవి భార్గవి అని సంతోషంగా పిలుస్తూ ఉంటే... ఎక్కడో నూతిలో నుంచి వాయిస్ వినపడుతూ ఉంటుంది.

దగ్గరికి వెళ్లి ఏంటి భార్గవి ఇలా చిక్కిపోయావు. అసలు ఎముకలగూడికి బట్టలు వేసినట్టుగా ఉన్నావు. ఇలా ఉంటే ఎలాగ...

మాట కూడా రావడం లేదు సరిగ్గా తినడం లేదా.. మీరు నాకు వేసిన శిక్ష చాలు.  నన్ను క్షమించండి నేను ఇలా ఉండలేకపోతున్నాను..

అయ్యో భార్గవి ఎంత సంతోషకరమైన విషయం చెబుదామని వస్తే నువ్వు ఇలాగ కన్నీళ్లతో ఎదురువస్తే ఎలా చెప్పు...

అవని విషయమా అని నీరసంగా అంటుంది. అరే ఎలా కనిపెట్టేసావు.. అందుకే భార్గవి ఎంత తెలివి అయిందో అంటాను.

ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ.. మీ జీవితంలో సంతోషకరమైన విషయం అంటే అది అవనికి సంబంధించిందే కదా..

అందుకే భార్గవి నువ్వంటే నాకు అంత...  అంతా అని జీవం లేని కళ్ళల్లోకి మెరుపు తెచ్చుకుని అడుగుతుంది. అంత రెస్పెక్ట్ అని చెబుతున్న.

ఆ మాటకి ఇది రెస్పెక్ట్ ఆ... ఈ విధమైన ట్రీట్మెంట్ ని ఎవరైనా రెస్పెక్ట్ అంటారా.. అయ్యో మా ఊళ్లో ఇలాగే రెస్పెక్ట్ ఇస్తారు.

మీ ఊళ్లో తప్పు చేసిన వాళ్ళకి ఇంకొకలాగా ఇస్తారా..  ఎలా ఇస్తారో చెప్పు అదే ఫాలో అవుతాను. అవసరం లేదులే గాని ఏదో గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చారు కదా... చెప్పి బయలుదేరండి.

అదేంటి భార్గవి అలా అంటావు.. అంతకుముందు ఉండండి ఉండండి నా దగ్గర అనేదానివి కదా... ఇప్పుడు మాత్రం వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు.

నువ్వు ఇలా మాట్లాడితే నేను అలుగుతాను. హర్ట్ అవుతాను అబ్బా అంటాడు.  ధనుంజయ్ లో కనబడుతున్న కొత్త వేరియేషన్ కి భార్గవి కి నిజంగా భయం మొదలవుతుంది. 

మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నాకు భయంగా ఉంది. అయ్యో భార్గవి నిన్ను అసలు ఏమీ చేయను.నీకు ఒక విషయం చెప్పి స్వీట్ తినిపించాలని వచ్చాను.

అది కూడా నీకు ఇష్టమైన కాజు బర్ఫీ తెచ్చాను తిను అని ఇస్తాడు. ఆ స్వీట్ బాక్స్ వంక, ధనుంజయ్ వైపు చూస్తూ ఉంటుంది.

ఎందుకంత భయపడుతున్నావు ఇందులో ఏమైనా కలిపాను అనా..  నాది మరీ అంత కృయల్ మైండ్ కాదు. నేను చాలా మంచి వాడిని .

అవును మీ మంచి ఏమిటో ఈమధ్య కాలంలో నాకు బాగా తెలుస్తుంది లేండి. చూసావా నీకు కూడా తెలిసిపోయింది. తిను భార్గవి.

ముందు విషయం చెప్పండి అంటుంది. చెప్పడం ఎందుకు చూపిస్తాను అని అవని సీమంత వేడుకలు మొత్తం చూపిస్తూ భార్గవిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు.

భార్గవి ఫేసులో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు.  ఎలా ఉంది నా కూతురు. రజిత గుర్తుకు వస్తుంది అని ఫ్లోలో అంటుంది.

ఆ మాటకి ధనుంజయ్ నువ్వు చేసిన పాపం కూడా కనపడుతుందా... తలదించుకుంటుంది. అరే నువ్వు తలదించుకోవడమేమిటి..

నువ్వు ఏది చేసినా కరెక్టే కదా.. ఇప్పటికే చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను.  ఇంకా నన్ను బాధ పెట్టకండి. నిన్ను ఎవరు పనగట్టుకుని బాధ పెట్టడంలేదు.నువ్వు చేసిన తప్పులే శాపాలై నిన్ను చుట్టుకున్నాయి.

అది అర్థమవుతుంది.  నన్ను క్షమించండి. అవని పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ..  క్షమాపణ అడుగుతావా...

ఏమని అడుగుతావు.  మీ అమ్మని చంపేశాను. మీ నాన్నకి పెళ్ళాం ముసుగులో కీప్ గా ఉన్నాను.  నిన్ను రాచి రంపాన పెట్టాను.

కడుపునిండా తిండి పెట్టలేదు.  ఆఖరికి నా మేనల్లుడికి బలి చెయ్యాలి అనుకున్నాను. నా కూతురు సంతోషం కోసం నీ జీవితం సర్వనాశనమైనా పరవాలేదు అనుకుని నిన్ను పావుగా వాడాను. నన్ను క్షమించు అని చెబుతావా...

చేసిన తప్పులన్నీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే భార్గవి కళ్ళు మూసుకుంటుంది.  ఏమైంది భార్గవి అంతా బాధపడుతున్నావు.

నిజంగా నేను చాలా పాపిష్టిదానిని. నాది కానీ దాని కోసం పాకులాడి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాను. ఆడపిల్ల అని కూడా చూడకుండా అవనినీ అష్ట కష్టాలు పాలు చేశాను.

తండ్రి ప్రేమకి దూరం చేశాను. తన ఉనికినే ప్రపంచానికి తెలియనివ్వకూడదు అనుకున్నాను.  అందుకే భగవంతుడు ఆ శిక్ష మొత్తం నాకు వేశాడు.

నా ఉనికి ఏమిటి అన్నది ప్రపంచం లో ప్రశ్నర్ధకంగా మారింది. శిల్ప జీవితం అంతకన్నా దారుణంగా ఉంది. ఇప్పుడు నీలో వచ్చిన మార్పు మీ ఇద్దరి జీవితాల గురించా..

కాదు..  ఒంటరిగా కూర్చుని ఉంటే నా జీవితం మొత్తం కనపడుతుంది.  అందులో నేను చేసిన పాపాలే ఎక్కువగా ఉన్నాయి.

  అలసిపోయినా శరీరమైన సరే ప్రశాంతంగా పడుకోలేక పోతున్నాను. ఎంత ఆకలి వేసిన తినలేకపోతున్నాను. నిత్యం నరకం కనబడుతుంది.

చేసిన పాపాలకి ఎక్కడో శిక్షలు పడతాయి అంటారు కానీ బ్రతికి ఉండగానే శిక్షలు అనుభవిస్తామని తెలుసుకోలేకపోయాను.

నాకు ఒక చిన్న సహాయం చేస్తారా.. ఏమిటది.. ఒక్కసారి అవని తో మాట్లాడనిస్తారా... అవనినీ క్షమాపణ అడిగి ఆమె పాదాలు దగ్గర నా ప్రాణాలు విడుస్తాను.

నీ ప్రాణాలకు ఒక విలువ ఉందా నా కూతురి పాదాల మీద విడవడానికి.. ప్లీజ్ అండి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. నా పరిస్థితి నాకు అర్థం అవుతుంది.

నేను ఎక్కువ రోజులు బ్రతకలేను.  ఏం.. బానే ఉన్నావుగా మానసిక బాధ పైకి కనపడకుండా లోపల తినేస్తుంది. ఇప్పుడు నేను ఆ బాధనే అనుభవిస్తున్నాను.

నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు అని నాకు తెలుసు కానీ అవని మనసు బంగారం.  ఒక్కసారి క్షమించాను అంటే నాకు అంతకు మించిన మోక్షం లేదు.

ధనుంజయ్ ఒప్పుకుంటాడా....
[+] 10 users Like SivaSai's post
Like Reply
Part - 144

భార్గవి చెప్పిన దానికి ధనుంజయ్ నవ్వుతూ ఏమిటి నా కూతురు కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతావా.. నా కూతురి మనసు బంగారం కాబట్టి నువ్వు చేసిన తప్పులన్నిటిని క్షమించేస్తుంది. ఎంత పగటి కలలు కంటున్నావు.

ఇప్పటికి నా కూతురు క్షమాపణ దొరకక నేను అల్లాడిపోతూ ఉంటే ఇన్ని ఘోరాలు చేసిన నీకు మాత్రం వెంటనే క్షమాభిక్ష దొరుకుతుందనుకుంటున్నావా?

నా కూతురు ముందుకు అప్పుడే ఎందుకు తీసుకువెళ్తాను. నీ జీవితం మీద నీకు పూర్తి అసహ్యం రావాలి.అప్పుడు దగ్గర ఉండి మరి నేను తీసుకువెళతాను. ఛీ అని చెప్పి వెళ్ళిపోతాడు.

వెళుతున్న ధనుంజయ్ ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నన్ను క్షమించు రజిత.  నీ విషయంలో చెయ్యకూడని  పాపాన్నే చేశాను. అందుకు ఇంకా శిక్ష అనుభవించాలి.

శిల్ప రాత్రి భోజనాలు అయిన తరువాత ఆరుబయట కూర్చుని ఉంటుంది. ఉదయ్ వచ్చి ఏమి ఆలోచిస్తున్నావు శిల్ప.

ఏమీ లేదు అని  తల ఊపుతుంది.  ఎందుకు ఈ మధ్యన నువ్వు చాలా మౌనంగా ఉంటున్నావు.  ఒకప్పటి శిల్ప కనపడడం లేదు.

ఆ శిల్ప చచ్చిపోయి చాలా రోజులు అయింది. ఏమంటున్నావ్ శిల్ప. అవును ఈ జీవితం ఎంత ప్రశాంతంగా ఉంది.

ఎటువంటి ఆర్టిఫిషియల్ లైఫ్ మన చుట్టూ లేదు. రంగుల మయం లేదు. మన కోసం స్వచ్ఛంగా నవ్వే పువ్వులు. ప్రేమగా మాట్లాడే ఆ పెద్దవాళ్లు..

అభిమానంగా పలకరించే ఈ జంతువులు... ఉదయం మనం లేచి చూడగానే రోజురోజుకి మార్పు వచ్చే పంట.. ఆ పంట అంతా మన చేతుల్లోనే పెరిగింది అనేటప్పటికి ఒక రకమైన తృప్తి.

ఇది చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజులు ఫాల్స్ ప్రెస్టేజ్ లో కొట్టుకుపోయి చాలా మిస్ అయిపోయాను. 

అవును శిల్ప నువ్వు చెప్పిందంతా నిజమే. నిజంగా ఈ జీవితం ఎంత ప్రశాంతంగా ఉంది. ఎటువంటి చెడు ఆలోచనలు రావడం లేదు.

పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నాము. ఒళ్ళు అలిసిపోయి నిద్రపోతున్నాము.  పొద్దున్నే ఈ ఆవులతో ఆడుతూ  పనిచేస్తూ ఉంటే... రోజు ఎలా గడిచి పోతుందో కూడా తెలియడం లేదు.

ఒకసారి అమ్మానాన్నని కలిస్తే బాగుండును అని అనిపిస్తుంది కానీ ఎక్కడ ఉన్నారో తెలియలేదు. మనలాంటి పిల్లల్ని కన్నందుకు వాళ్లకి కూడా శిక్ష పడాలి కదా..

నాకు ఒకసారి అమ్మని కలవాలని ఉంది ఉదయ్. అత్తయ్యన..  ఎందుకు. ఒక్కసారి కలిసి మాట్లాడాలి.  ఆవిడతో నేను తేల్చుకోవలసిన లెక్కలు కొన్ని ఉన్నాయి.

వీలు కుదిరితే ఒకసారి సార్ తో మాట్లాడతావా. సార్... ఈ కొత్తగా ఈసార్ ఎవరు. ఇంకెవరు ధనుంజయ్ సార్. శిల్పా అని ఆశ్చర్యంగా చూస్తాడు.

ఏమైంది ఉదయ్.. మీ నాన్నని పట్టుకుని సార్ అంటున్నావా... ఆ మాటకి విరక్తిగా నవ్వుతు... నాన్న అని పిలవద్దని చెప్పారు.

అయినా అహంతో పిలుస్తూనే ఉన్నాను.  ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను. సార్ కి మా మీద ఎంత అసహ్యం ఉందో..

అవని కోసం ఎంత తాపత్రయపడుతున్నారో  అర్థమైన తరువాత కూడా ఇంకా నాన్న నాన్న అని పరుగులు పెట్టలేను కదా..

బాధగా లేదా శిల్ప.  బాధెందుకు ఉదయ్... ప్రాయశ్చిత్తం ఇది. అవనినీ ఏరోజైనా నాన్న అని పిలవనిచ్చామా..  ఊహ తెలిసినప్పటి నుంచి సార్ అనే కదా పిలిచింది.

అలాంటప్పుడు నేనెందుకు బాధపడడం. మనము ఏది ఇస్తే అదే కదా తిరిగి వస్తుంది.  సరే నేను ప్రయత్నిస్తాను మాట్లాడడానికి అంటాడు.

నేను  పడుకుంటాను. నిద్ర వస్తుందని లేచి వెళుతూ ఉంటే శిల్ప అంటాడు. ఏంటి ఉదయ్..  నిన్ను ఒక్క విషయం అడుగుతాను.  సమాధానం చెబుతావా..

నాకు తెలిసింది అయితే చెబుతాను. నాతో జీవితాన్ని మొదలుపెడతావా... ఇద్దరం ఒకరి కోసం ఒకరిని ఉందాము.

వెళ్లేది ఆగిపోయి నిలబడిపోతుంది. ఏంటి శిల్ప ఆలోచిస్తున్నావు. నీకు నేను సరిపోను అనా.. నేనే నీకు సరిపోను ఉదయ్.

నా జీవితం ఏంటో నీకు తెలుసు. నేను మాత్రం తప్పులు చేయలేదా..  ఇద్దరము తప్పులు చేసాము. ఆ తప్పులు నుంచి ప్రస్తుతం బయటికి వచ్చాము కదా..

మన కోసం మనం బ్రతుకుదాము. ఎటువంటి తప్పుడు దారుల్లోకి వెళ్ళకుండా.. మోసం చేసుకోకుండా అసలైన భార్యాభర్తలుగా జీవితం మొదలుపెడతాము. ఏమంటావు..

నాకు కొంచెం టైం కావాలి.  సరే నీ ఇష్టం.. నీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదాకా ఎదురు చూస్తాను పదా అని పడుకోవడానికి వెళ్తారు.

రోజులు ముందుకు గడుస్తూఉన్నాయి. వినయ్, భరత్ పెళ్లి వేడుకలు కూడా దగ్గరికి వచ్చాయి.  అవని డెలివరీ లోపే పెళ్లిళ్లు చేసేయాలి అని ఫిక్స్ అవుతారు.

శిల్ప లో మార్పు చూసి ధనుంజయ్ కూడా  సంతోషిస్తాడు. ఉదయ్ పెద్దవాళ్ల ద్వారా ధనుంజయకి శిల్ప ఏమనుకుంటుందో ఆ విషయం చెబుతాడు.

ధనుంజయ్ సరే వస్తాను అని శిల్ప దగ్గరికి వస్తాడు.  ఎలా ఉన్నావు శిల్ప..  బాగున్నాను సార్. సార్ అని ఒకసారి శిల్ప వైపు చూస్తాడు.

నేను వద్దన్నాను సరే నాన్న అని పిలిచేదానివి. ఇప్పుడు ఏంటి కొత్తగా... ఆ పిలుపుకి నాకు అర్హత లేదు అని అర్థం అయింది.

అది కేవలం మీ కూతురు మాత్రమే పిలవాలి. మరి నువ్వు ఎవరివి... ఒక మోసగత్తేకి పుట్టినదానిని. అందుకే ఏ ఐడెంటిటీ లేనిదానిని.

ఆ మాటకి ధనుంజయ్ కి బాధగా అనిపిస్తుంది.  ఇనుము కాలినప్పుడే వంచాలి అని..  సరే తెలుసుకున్నందుకు మంచిది.

ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావు. ఒకసారి నేను అమ్మని కలవాలి. మోసగత్తే అంటున్నావు. అమ్మ అని పిలుస్తున్నావు. ఏమిటి సంగతి.

ఎంత మోసగత్తే అయినా సరే కన్నది కదా... ఆ పేగు బంధానికైనా విలువ ఇవ్వాలి కదా.. అబ్బో ఇది నిజంగా మార్పే..

మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు వచ్చే నష్టమేమీ లేదు సార్. సరే..  సరే కలిసి ఏం మాట్లాడాలి. మీరు కూడా అక్కడే ఉంటారు కదా అప్పుడే చెబుతాను.

ఇప్పుడు చీకటి పడిపోయింది కదా రేపు ఉదయమే వెళదాము రెడీగా ఉండండి. తీసుకువెళతాను అని బయలుదేరుతుంటే...

ఎక్స్క్యూజ్ మీ సార్.. చెప్పు... భోజనం వేళకి వచ్చారు. భోంచేసి వెళ్ళండి. ఆశ్చర్యంగా శిల్ప వైపు చూస్తాడు. క్షమించండి..  మీలాంటి గొప్ప వాళ్ళకి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టలేకపోవచ్చు.

ఒక కూరతో అయినా పెడతాను. ఆ మాటకి సంతోషంగా సరే భోంచేసి వెళతాను. ధనుంజయ్ ఒప్పుకోగానే శిల్ప ఆనందంతో కాళ్లు చేతులు కడుక్కుని రండి.

ఈలోపు భోజనం రెడీ చేస్తాను అని పోయ్యి దగ్గరికి వెళుతుంది. ఉదయ్ రండి సార్ అని తీసుకువెళ్లి నీళ్లు చేతికి ఇస్తాడు.

కడుక్కుని ఆరుబయట ఉన్నా చాప మీద కూర్చుంటాడు. ఆ గాలి ఎంతో హాయినిస్తుంది.  నిండు వెన్నెల చల్లదనాన్ని ఇస్తూఉంటుంది.

కళ్ళు మూసుకుని ఆ వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సార్ అన్న పిలుపుకి హ అని తేరుకుంటే.. అన్ని అక్కడ సర్ది అరిటాకు వేస్తుంది.

ఒక కూర, పచ్చడి వేసి అన్నం వడ్డిస్తుంది.  మీరు భోజనం చేయండి. అతిధిదేవోభవ అన్నారు కదా.... ముందు మీరు భోజనం చేయండి.

ఇన్ని విషయాలు ఎప్పుడూ తెలుసాయి. నేల మీద నడవడం మొదలు పెట్టినప్పటి నుంచి... మొదటిసారి శిల్ప చేతి వంట తింటూ సంతోషపడతాడు.

ఆ వంటలోనే తెలుస్తూ ఉంటుంది శిల్పలోని మార్పు.  ధనుంజయ్ భోజనం అయిన తరువాత శిల్ప ఉదయ్  భోజనం చేస్తారు.

వాళ్ళిద్దర్నీ కూడా సైలెంట్ గా అబ్సార్బ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోవడం చూసి వీళ్లిద్దరిలో నిజంగానే మార్పు వచ్చింది.

అయినా సరే ఇక్కడే ఉంచాలి అనుకొని..  సరే అయితే నేను బయలుదేరూతాను.  ఈ టైంలో మీరు వెళ్లి ఏమి వస్తారు. మీకు ఇబ్బంది లేదు అంటే మీకు ఇక్కడే పడక సర్దుతాను.

పడుకోండి.  ఉదయం బయలుదేరొచ్చు . ఇక్కడ  ఎలా పడుకోవాలి.    నాకు మంచం లేదు.  ఏసీ లేదు.  సరైన దుప్పటి లేదు.

ఎలా పడుకోవాలి అని శిల్పని టెస్ట్ చేస్తాడు. మీరు అన్నదంతా నిజమే.  ఇక్కడ ఏసీ లేకపోయినా సరే ప్రకృతి నుంచి వచ్చే చల్లటిగాలి ఉంది.

మంచం లేదు కానీ మెత్తగా ఉండేటట్టుగా బొంత వేస్తాను. మా స్తోమత ఇంతే.. అర్థం చేసుకోండి.  సరే సరే ఏదో చెబుతున్నావు కదా అడ్జస్ట్ అవుతానులే.

ఎక్కడ పడుకోవాలి. అక్కడ చాప మీద  బొంత వేసి దుప్పటి ఇస్తుంది.  పురుగులు ఏమి రాకుండా దూరంగా నాలుగు పక్కల నిప్పు మెల్లిగా పెడుతుంది.

అవన్నీ చూసి పరవాలేదు శిల్పలో చాలా మార్పు వచ్చింది.  నేను కోరుకుంటున్నా మార్పు వస్తున్నందుకు సంతోషమే అనుకుని ఆ చల్లటి గాలిని ఆశీర్వదిస్తూ కళ్ళు మూసుకుంటాడు.

ధనుంజయ్ పడుకున్న తర్వాత మెల్లిగా కాళ్లు నొక్కుతూ ఉంటుంది.  ఆ స్పర్శ అర్ధమవుతున్న సరే కళ్ళు తెరవడు. ఉదయ్ వచ్చి ఏం చేస్తున్నావు శిల్ప..

ఈ విధంగానైనా సార్ రుణాన్ని తీర్చుకోనివ్వు.  నేను చేసిన పాపాలు నికృష్టాలు ఏమి చిన్నవి కావు.  తండ్రిగా అవన్నీ భరించి నాకు  చిన్న శిక్ష వేశారు.

ఉదయ్ కూడా ఏమీ మాట్లాడడు.  కాసేపు నొక్కిన తర్వాత శిల్ప పడుకుంటుంది. శిల్ప నిద్రపోయిందన్నాకా ధనుంజయ్ కళ్ళు తెరిచి చూస్తాడు.

నీలో మార్పు నిజమే అయితే కొన్ని రోజులకి నిన్ను మన ఇంటికి తీసుకు వెళతాను. కానీ మీ అమ్మలాగా నటిస్తున్నావని అర్థం అవుతే ఇంతకన్నా దారుణమైన జీవితానికి వెళతావు అనుకొని కళ్ళు మూసుకుంటాడు.

ప్రశాంతంగా నిద్రపోతాడు. ధనుంజయ్ లేచేటప్పటికీ శిల్ప లేచి వాకిలి ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గులు పెడుతుంది.  ఉదయ్ ఆవులను,గేదెలను శుభ్రం చేసి పాలు తీస్తాడు.

ధనుంజయ్ ని చూసి వేపపుల్ల తెచ్చి బ్రష్ చేసుకోండి. వేడిగా కాఫీ కలిపి తీసుకు వస్తుంది.  కాఫీ తాగి ఇంకా వెళదామా.. ఆ సార్ అని బయలుదేరుతారు .

ధనుంజయ్ కారు భార్గవి ఉన్న ప్లేస్ లో ఆగుతుంది.  దిగు.. ధనుంజయ్  కారు దిగగానే శిల్ప కారు దిగి చుట్టూ చూస్తోంది.

చాలా పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది.  మధ్యలో ఒక చిన్న ఇల్లు. బయటికి వచ్చిన ఎటు పారిపోలేని విధంగా కుక్కలు ఉంటాయి. చుట్టూ చెట్లు ఎక్కువగా ఉంటాయి. అన్ని చూస్తూనే భార్గవి నుంచిన ఇంటిలోనికి వెళుతుంది.

భార్గవి రియాక్షన్...

కథ కొనసాగుతుంది....
[+] 12 users Like SivaSai's post
Like Reply
Good change in Shilpa
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Nice update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
I don't know why I'm so much addicted to this story
I don't like non erotic stories till date but I'm totally addicted to ur story & screenplay of writing
Im waiting for update like a suspense thriller awesome ? writing siva garu thanks for daily updates god will bless u to create more stories like this I became fan ❤️ of your writing thank you siva
[+] 3 users Like Rangudabba456's post
Like Reply
Part - 145

భార్గవి ఉన్న గదిలోనికి వెళ్లి శిల్ప అమ్మ అని పిలుస్తుంది. ఆ పిలుపుకి భార్గవి తలెత్తి చూస్తుంది. ఎదురుగా కూతురు తక్కువరకం చీరలో..  మెడలో పసుపుతాడు చేతికి మట్టి గాజులతో కనపడుతుంది.

అలా చూడగానే భార్గవికి ఏడుపు తన్నుకొస్తుంది. అమ్మ శిల్ప ఏంటే ఇలాగున్నావు అని వచ్చి పట్టుకోపోతుంటే దూరంగా జరుగుతుంది.

ఏమైందే దూరం జరుగుతున్నావు..నువ్వు నన్ను తాకడం నాకిష్టం లేదు.  ఏం మాట్లాడుతున్నావ్ శిల్పా నువ్వు. నిజమే చెబుతున్నాను.

నీలాంటి వాళ్ళ నీడ నామీద పడడం నాకు ఇష్టం లేదు. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి..నీ వైభోగం ఎలా ఉందో చూపించడానికి.. నేనెంత వైభోగం అనుభవిస్తున్నాను చూడడానికా...

అవును నా వైభోగం చూపించి నీ వైభోగాన్ని చూడడానికే వచ్చాను. ఎలా ఉన్నావు. చూస్తున్నావు కదా ఇలా ఉన్నాను.

చేసుకున్నదానికి అనుభవించాలి కదా.. నువ్వు కూడా మీ నాన్న లాగానే మాట్లాడుతున్నావా... క్షమించు... నాకు నాన్న లేరు.

శిల్ప అని ఒక అడుగు వెనక్కివేస్తుంది.  నిజమే చెబుతున్నాను.  నాకు తండ్రి లేరు. పిచ్చిపిచ్చిగా వాగుతున్నావా..

తండ్రి లేకుండా ఎలా పుడతావు. అది నీకే తెలియాలి. నువ్వు నా వ్యక్తిత్వాన్ని అవమానిస్తున్నావు. నీకు ఒక వ్యక్తిత్వం ఉంది అని నువ్వు అనుకుంటున్నావా...

నువ్వేనా శిల్పా ఇలా మాట్లాడేది.  అసలు ఏమైందే నీకు.  మెడలో ఈ పలుపుతాడు కట్టి ఆ పొలాల్లో వదిలేసేటప్పటికీ దయ్యం ఏమైనా పట్టిందా.... పైత్యపు వాగుడు వాగుతున్నావు.

ఇన్ని రోజులు పట్టిన దయ్యం వదిలేసింది. అందుకే నా మాటలు నీకు నచ్చడంలేదు.  ఇది పలుపుతాడు కాదు పసుపుతాడు.

నా జీవితానికి సరైన దారి చూపించే తాడు.  మరి నీ మెడలో ఉన్న తాళికి అర్థం ఏమిటి...  నేను నలుగురిలో ధైర్యంగా నా భర్త ని చూపించగలను.  నువ్వు చూపించగలవా...

శిల్ప మాట్లాడుతున్న విధానానికి భార్గవికి తల తిరిగిపోతూఉంటుంది.  తల పట్టుకుని అసలు ఏం మాట్లాడుతున్నావు శిల్ప..

నాకూతురివేనా నువ్వు.. అదే నా దౌర్భాగ్యం.  నీ కడుపున పుట్టకపోయి ఉండి ఉంటే.. నేను కూడా ఒక మంచి జీవితాన్ని మొదలుపెట్టేదాన్ని.

అవనిలాగ సంతోషంగా ఉండేదాన్ని.. ఇప్పడుకూడా సంతోషంగా ఉన్నాను అనుకో.. అవని..  అవని అని ఎందుకు జపం చేస్తున్నావు.

మీ నాన్న అంటే కన్న కూతురు కాబట్టి ఉంటుంది. మరి నీకేమయింది.. నాకు అక్క కదా ... నువ్వు సరిగ్గా ఉండి ఉంటే మేము అక్కచెల్లెళ్ళాగ పెరిగేవాళ్ళము.

మంచి చెడు విచక్షణ అక్క నాకు చెప్పేది. కానీ నువ్వు చేసిన పాపాలు నా మెడకి చుట్టుకున్నాయి.  నేను ఇక్కడికి వచ్చిన విషయం చెబుతాను జాగ్రత్తగా విను. దయచేసి నేను నీ కూతురిని అని ఎక్కడా చెప్పద్దు.

సమాజంలో నాకంటూ ఒక గౌరవం ఏర్పడింది. నీ కూతురిని అని తెలిస్తే ఆ గౌరవం పోతుంది. ఆఖరికి నీకు తులసినీళ్లు పోసే టైం లో కూడా నన్ను చూడాలి... కలవాలి అని మాత్రం అడగద్దు.

ఇది నా రిక్వెస్ట్ అనుకో... ఈ విషయం చెబుదామనే సార్ ని  బ్రతిమాలి ఇక్కడికి వచ్చాను. నేను వెళుతున్న అని వెనక్కి తిరుగుతుంది.

శిల్పా అంటే..  చెప్పమ్మా.. అమ్మ అని విరక్తిగా నవ్వుతూ అమ్మ అని పిలుస్తున్నావు కానీ వద్దు అంటున్నావు.  ఇంత కఠిన హృదయం ఎలా వచ్చిందే..

ఎంతైనా నీ కన్నకూతురిని కదా.. నీ హృదయమే నాకు వచ్చింది. మరి నీ కలలు... వాటిని వదిలేస్తున్నావా... కలలు....

అవి కావాలి అని కోరుకోవడం కోరిక కానీ ప్రయత్నించే విధానం సరిగ్గా లేనప్పుడు అత్యాశ అవుతుంది.  నేను సరిగ్గా ప్రయత్నించలేదు.  తల్లిగా సరైన దారి నువ్వు చూపించలేదు.

కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవడం అన్నది అనవసరం.  ఇప్పుడు నేను బ్రతుకుతున్న జీవితం ఉంది చూడు.. చాలా ప్రశాంతంగా ఉంది.

ఎటువంటి మోసాలు,  ఆర్టిఫిషియల్ జీవితం అక్కడ లేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాను.  నీలో నిజంగా మార్పు వచ్చి ఆఖరి రోజుల్లో మనిషిగా బ్రతకాలి అని అనిపిస్తే...

నా దగ్గరికి రా.  నేను తినే దాంట్లోనే నీకు కొద్దిగా పెడతాను. లేదు ఇలాగే కుళ్ళు కుతంత్రాలతో బ్రతుకుతాను అంటే నీకు ఒక కూతురు ఉందన్న సంగతి పూర్తిగా మర్చిపో... చెప్పాల్సింది చెప్పి శిల్ప అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

వెళ్ళిపోతున్న కూతుర్ని చూస్తూ మొదలకి నరికిన చెట్టులాగా కూలబడిపోతుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా రావడం లేదు. ఒక శూన్యం కనపడుతూఉంటుంది.

మాట రాకుండా..  చుట్టూ తెలియని నిశ్శబ్దం ఆవహించినట్టుగా ఒక భయంలోనికి వెళ్ళిపోతుంది. ధనుంజయ్ అది చూసి ఏమైంది భార్గవి..

ఏదో ఊహించుకుని ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావు.. చివరికి ఏ కూతురునైతే రాణిని చెయ్యాలి అనుకున్నావో..  ఆ కూతురే నిన్ను ఛీ కొట్టింది. ఇది నీ జీవితం .

ఉదయ్ మాత్రం ఆశ్చర్యంగా శిల్పని చూస్తూఉంటాడు.  ఇంత మార్పా..  మనిషిని ఒంటరిగా వదిలేస్తే అవుతే మహాత్ముడు అవుతాడు లేదా సైకో అవుతాడు అంటారు.

మనిషిగా మారింది ఇది చాలు అనుకుని ఉదయ్ కూడా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు.  ఒంటరిగా గదిలో భార్గవి మిగిలిపోతుంది.

పిచ్చెక్కినట్టుగా ఉంటుంది.  ఎవరుతోను ఏమీ మాట్లాడకుండా ఒక మూలకి కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉండిపోతుంది.

ధనుంజయ్ కి మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది.. శిల్పలో ఏ మార్పు అయితే తండ్రిగా కోరుకున్నాడో ఆ మార్పు కనిపిస్తూ ఉంటుంది.

వినయ్,  భరత్ ల కళ్యాణ ఘడియలు కూడా దగ్గరికి వచ్చేస్తాయి. నేహా, అవని కూర్చునే పనులు పురమాయిస్తూ ఉంటారు.

నివి షాపింగ్ కి తిరుగుతూ కొత్త కొత్త కలెక్షన్ అన్ని తీస్తూ ఉంటుంది.  రాజ్ నివికి దొరకకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ అది సాధ్యమయ్యే పని కాదు అని పనులన్నీ పూర్తయ్యేటప్పటికి అర్థమవుతుంది.

ఓకే మండపంలో రెండు పెళ్లిళ్లకి ముహూర్తం ఖాయమవుతుంది.  మేలు ముసుగులో వచ్చిన అమ్మాయిలు ఇద్దరు పెళ్లి కొడుకుల పక్కన కూర్చుని వివాహ వేడుకని మొదలుపెడతారు.

అంగరంగ వైభవంగా కళ్యాణాలు జరుగుతాయి. రెండు జంటలని కుడికాలు లోపలపెట్టి రమ్మని చెబుతారు. నివి గా స్పీడ్ గా వచ్చి ఆగండి ఆగండి ముందు పేర్లు చెప్పి ఆడపడుచు కట్నం ఇచ్చి అప్పుడు రండి.

వదిన మీరు రండి.  మీ అన్నయ్యకి హారతి పళ్లెం నువ్వే పట్టాలి. వస్తున్న అని నిండు గర్భిణీగా  ఉన్న అవని ముందుకు వస్తుంది.

పక్కనే లలిత,మాధవి సాయం చేస్తూ ఉంటే హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలకి రండి అన్నయ్య. అదేంటి వదిన గిఫ్ట్ తీసుకోవా..

అందరికీ నీలాగా గిఫ్ట్ లు ఇంట్రెస్ట్ ఉండదు కదా నివి.. మీరు ఆపుతారా... లేదు లేదు వదిన నువ్వు గిఫ్ట్ తీసుకోవాలి.

సరే నేను మా అన్నయ్యని అడుగుతాను అని భరత్ ని చూస్తుంది.  చెప్పరా నీకు ఏం కావాలి. ఏదైనా సరే ఇస్తాను. మనిద్దరి మధ్య ఎటువంటి రక్తసంబంధం లేకపోయినా జీవితాంతం నాకు పుట్టిల్లుగా నిలబడతావా...

రేపు నాకు పుట్టబోయే బిడ్డకు మేనమామ వరసలన్నీ చేస్తావా అన్నయ్య. ఆ మాటకి అందరి కళ్ళు చెమ్మర్చుతాయి.

భరత్ వెంటనే నువ్వు అవునన్నా కాదన్నా ఎప్పటికీ నువ్వు నాకు చెల్లివే. రమేష్ మాధవి ఇద్దరూ అవని చుట్టూ చేతులు వేసి నిన్ను దత్తత తీసుకుంది రక్త సంబంధంగా మారడానికి.

మన మధ్యన బ్లడ్ రిలేషన్ లేకపోవచ్చు.. నువ్వు బయాలజికల్ గా నా కూతురువి కాకపోవచ్చు కానీ ఎప్పటికీ నువ్వు భగవంతుడిచ్చిన బంగారు తల్లివి.

రేపు నీకు మీ అన్నయ్య కి మధ్యన ఏదైనా విషయం వస్తే నీ వైపే నిలబడతాము. నాన్న నేను కూడా నా చెల్లి వైపే.. ఏం విద్యా. అవును వదిన గారు అంటుంది.

వదిన గారు అవసరం లేదు విద్య..  వదినా  చాలు. సరే అని భయంగా తల ఊపుతుంది. ఉఫ్.. నా పెళ్ళానికి భయం పోయేటప్పటికి నేను ముసలివాడిని అయిపోతానేమో అనుకుంటాడు.

విక్రమ్ వచ్చి తల మీద కొట్టి మనసులో అనుకున్నది చాలు. నా చెల్లెలు బంగారం. శ్రీ  వచ్చి అవునవును నీ చెల్లెళ్లు ముగ్గురు బంగారాలు.

మేమే ఇత్తడి,రాగి అంతే కదా... అవునా రాజ్ అంటే నన్ను ఇన్వాల్వ్ చేయకు బ్రో..  నా పెళ్ళాం ఇక్కడే ఉంది. ఆ మాటకి అందరూ గట్టిగా నవ్వితే..

ఇందిరగారు వచ్చి ఎంత బంగారం అయినా సరే రాగి కలపకపోతే వస్తువు తయారవ్వదు. భార్యాభర్తలయినా అంతే.

ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. రెండు కలిస్తేనే అందమైన వస్తువు ఏర్పడినట్టుగా భార్యా భర్తల అన్యోన్యతే చక్కటి కుటుంబం ఏర్పడుతుంది.

కరెక్ట్ చెప్పావు నానమ్మ అని విక్రమ్ ఇందిర గారిని హగ్ చేసుకుంటాడు.  వినయ్...  నాకు కాళ్లు లాగుతున్నాయి మేమింకా ఎంతసేపు..

ఒరేయ్ నీ సంగతి మర్చిపోయామురా లోపలికి రండి.. హమ్మయ్య అంటాడు. వెంటనే నివి పేర్లు చెప్పి రండి..

వినయ్ అనే నేను నా రౌడీ బేబీ తో కలిసి వచ్చాను అంటాడు.  వెంటనే అందరూ అదేం చెప్పడం రా.. చిరాగ్గా.
పూజిత అని బంగారం లాంటి పేరు ఉంటే..

ఏ పేరైనా సరే ఇది ఎప్పటికీ నాకు రౌడీ బేబీ నే అంటాడు.  ఆ మాటకి కోపంగా వినయ్ వైపు చూస్తే పెద్ద వాళ్ళందరూ చూస్తున్నారని సిగ్గుపడుతూ తల దించేసుకుంటుంది.

నివి పూజిత దగ్గరికి వచ్చి నువ్వు అసలు ఏమీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనమందరం ఒకటే పార్టీ. అవునమ్మా నా భార్యతో కలిసావు అంటే...
వినయ్ కూడా నా పక్కనే వచ్చే కూర్చుంటాడు. నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది.

బావ అని వినయ్ రాగం తీస్తే... తప్పదు రా బామ్మర్ది. నువ్వు కూడా భార్య బాధితుల సంఘం లో చేరాల్సిందే... అప్పుడే కదా నాకు మనశ్శాంతి.

అందరూ వీళ్ళ మాటలకి నవ్వుకుంటూ సరే రండి లోపలికి... విద్య,  పూజిత ని తీసుకువెళ్లి దేవుడి గదిలో  దీపం పెట్టేస్తారు.

అందరూ రెస్ట్ తీసుకోండి అని విక్రమ్ అవనినీ గదిలోకి తీసుకువెళతాడు.  బరువుగా ఉన్న చీర నగలు అన్ని తీసి అలసిపోయావా... కొంచెం అలసటగానే ఉంది.

ఫ్రీగా ఉండే మాక్సి వేసి టబ్లో సాల్ట్ వాటర్ కలిపి తెచ్చి కాళ్లు పెట్టుకో అంటాడు.  ఇప్పుడు నాకు ఓపిక లేదు. కూర్చో అని చెప్పి సోఫాలో కూర్చోబెట్టి.. కాళ్ళు వాటర్లో పెడతాడు.

కాసేపటికి చాలా రిలాక్స్డ్ గా ఉంది అండి అంటుంది. అందుకే బద్దకంగా ఉన్న కొన్ని కొన్ని పనులు చేసుకోవాలి. నువ్వే ఇంత బద్ధకంగా ఉంటే.. రేపు నాకన్నా ఎలా ఎక్టివ్ గా ఉంటాడు.

అవని??
[+] 10 users Like SivaSai's post
Like Reply
Part - 146


విక్రమ్ చెప్పిన దానికి అవని కోపంగా చూస్తూ ఉంటుంది. ఏమిటా కోపం. ఈ మధ్యన నీ కోపం ఎక్కువైపోయింది. ఆ కోపం నాది కాదులెండి.  మీ కన్నాది.

మధ్యలో నాకన్నా ఏం చేశాడు. నేను బద్దకంగా ఉంటే అది కన్నా కి ఎలా వస్తుందో ఇది అలాగే అంటుంది.  అబ్బో మా ఆవిడాగారికి ఆలక బాగా ఎక్కువైంది.

వాటర్ చల్లబడిన తర్వాత కాళ్లు తీసి పొడి క్లాత్ తో తుడిచి ఆయిల్ మసాజ్ చేసి ఎత్తుకొని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాడు.

  అక్కడ అంతా క్లీన్ చేసి వచ్చి విక్రమ్ కూడా నడుము వాల్చుతాడు.  ఆ పనులన్నీ మీకు ఎందుకండి. సర్వెంట్స్ ఉన్నారు కదా...  పిలిస్తే అయిపోతుంది కదా...

నా పనులన్నీ నువ్వు చేస్తే నీకు ఎంత సంతోషమో... నీ పనులు చేయడం కూడా నాకు అంతే ఆనందం. పడుకో.. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది.

పొద్దున్నే తొందరగా లెగాలి అని అరాటపడకు అర్థమయిందా అని జో కొడతాడు. వినయ్ భరత్ లను ఒక గదిలో వదిలేసి వాళ్లకు కాపలాగా రాజ్ ని ఉంచి కోడళ్లు ఇద్దరినీ వేరే గదిలోకి తీసుకువెళతారు.

ఇదిగో అమ్మాయిలు మీరిద్దరూ రేపు కార్యం అయ్యేవరకు ముసగులు తీయకూడదు అర్థమైందా...  విద్య భయంగా తల ఊపుతుంది.

ఈ పిల్ల ఏమిటి మరీ ఇంత భయస్తురాల్లాగా ఉంది.  ఇలా ఉంటే మన భరత్ ఒక ఆట ఆడుకుంటాడు కదా అని మాధవి లలితతో అంటే... వాళ్ళిద్దరికీ అన్ని తెలిసే ప్రేమించుకున్నారు కానీ నువ్వు సైలెంట్ గా ఉండు.

జాగ్రత్త అమ్మ. మీ ఇద్దరి దగ్గర నివి ఉంటుంది.  ఏదైనా అవసరమైతే నివికి చెప్పండి అని ఇద్దరు వెళ్ళిపోతారు.
నివి ఇద్దరి దగ్గరికి వచ్చి ఏమైనా కావాలా అని అడిగితే... విద్య భయంగా వద్దు అని తల ఊపుతుంది.

ఎందుకు విద్య భయపడుతున్నావు. నేనేమన్నా అంత భయంకరంగా కనిపిస్తున్నానా.. అయ్యో నేనెందుకు అలా అనుకుంటాను అండి అని చీరకొంగుని నలిపేస్తూ ఉంటుంది.

నువ్వు ఇలా ఉంటే మా బావ తెగ ఆడేసుకుంటాడు. పూజిత ని చూడు.  కంటి చూపుతో మా అన్నయ్యని ఆపుతుంది.

నివి అంటుంది. చెప్పు పూజిత.. మేము ముసుగులో ఉన్నాము కదా.. కోపంగా చూశాను సిగ్గుపడ్డాను అని ఎలా తెలిసింది.

ఎక్స్పీరియన్స్. మిమ్మల్ని దాటి నేను వచ్చాను కదా..
అలా తెలిసిపోతుందిలే..
  ఇప్పటికే బాగా లేట్ అయింది పడుకోండి.
మళ్లీ రేపు వ్రతం ఉంది కదా అని ముగ్గురు పడుకుంటారు.

వినయ్ రాజ్ దగ్గరికి వచ్చి బావ అని పిలుస్తాడు.  చెప్పరా చిన్న బామ్మర్ది..  నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటే.. ఆ మూసుకుంటే...

ఒక్కసారి నా పెళ్ళాం దగ్గరికి వెళ్లి వస్తాను.  ఇంత ఆత్రం ఉంది అనుకో పెళ్ళాలు మామూలుగా ఆడుకోరు. అందులో నీ పెళ్ళాం... నా పెళ్ళం కంచులకే కంచులు.

అక్కడ మీ బావను చూడు.. ఆరమంగా కాలు ఒప్పుకుంటూ పడుకున్నాడు.. నువ్వు కూడా అలాగే సైలెంట్ గా పడుకో.

భరత్ తో ఏరా బావ నీకు విద్యను చూడాలని లేదా.. రేపటి నుంచి నాతోనే ఉంటుంది కదా..  ఇప్పుడు వెళ్లి చూసి ఏం చేయాలి.

అదేంటి బావ అలా అంటున్నావు.. ఒరేయ్ నా పెళ్ళానికి భయమెక్కువ.  నువ్వు అన్నట్టుగానే వెళ్ళానే అనుకో..
  అది గట్టిగా అరిచి అమ్మని,  అమ్మమ్మని అందరిని పిలుస్తుంది.

విక్కీ బావకి తెలిసిందనుకో తాటతీస్తాడు.  ఇప్పుడు అవసరమా... రాజ్ నవ్వుతూ పాపం పిల్లోడికి ఆత్రం ఎక్కువగా ఉందిలే భరత్.

అందుకే ఎగిరిఎగిరి పడుతున్నాడు. అసలు మేటర్ తెలియడం లేదు. రేపటినుండి పెళ్ళాం దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో అని ఆరాటపడతాడు.

పో బావ నా పెళ్ళామేమి నివి అంతా షాపింగ్ పిచ్చది కాదు. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ లేడీస్ ని తక్కువ అంచనా వేయకు.

చూస్తూ ఉండు..  రేపటి నుండి నివి,  పూజిత ఇద్దరూ ఎలా షాపింగ్ మీద పడతారో..  నువ్వు ఎలా తిప్పుతావో.. ఆ ఊహే.. నాలుగు బీర్ బాటిల్స్ వేసిన కిక్ ఇస్తుందబ్బా...  

ముగ్గురు ఒకరి మీద ఒకరు పంచ్లు వేసుకొని పడుకుంటారు.  ఉదయమే లలిత వచ్చి అందర్నీ లేపి రెడీ అవ్వమని చెబుతారు.

జంటలుగా వ్రతం మొదలు పెడతారు. అవని సింపుల్ గా ఉండే చీర కట్టుకుంటుంది. మెల్లిగా వస్తూఉంటే ఇందిరా ఇటురా తల్లి అని పక్కన కూర్చోబెట్టుకుని...

తెలిగ్గాగానే ఉందా.. పర్వాలేదు అమ్మమ్మ గారు.  కొంచెం అలసటగా అనిపిస్తుంది. సురభి ని పిలుస్తారు. ఇప్పుడు ఆంటీ ఎందుకు..  ఒక్క నిమిషం ఆగు.

సురభి దగ్గరకు వచ్చి ఏంటి పెద్దమ్మగారు..   ఒకసారి అవనినీ చెక్ చేయి అలసటగా అనిపిస్తుంది అంట..

రా అవని అని గదిలోకి తీసుకువెళుతుంది. నేను బానే ఉన్నాను అమ్మ.   పెళ్లి పనులు కదా.. ఒకసారి చెక్ చేస్తే ఏమవుతుంది.  మనమే కదా అని గదిలోకి తీసుకు వెళుతుంది.

అది చూసిన విక్రమ్ కంగారుగా వచ్చి ఏమయింది నానమ్మ.  ఏమీ లేదురా జనరల్ చెకప్ అంతే. సరే అని గది బయట వెయిట్ చేస్తూ ఉంటాడు.

సురభి బయటకు వచ్చి విక్రమ్ నువ్వేంటి .. అవనికి ఎలా ఉంది ఆంటీ. బానే ఉంది. డేట్ టైము దగ్గరకు వచ్చింది కదా... అందుకే నీరసం.

కొంచెం జాగ్రత్తగా చూసుకో.. ఏ టైంలో అయినా సరే అవసరం రావచ్చు. ఇప్పుడే హాస్పిటల్ లో అడ్మిట్ చేసేద్దామా.

అంత అవసరం లేదు ఉంటే నేనే చెబుతాను కదా... నర్స్ ని అపాయింట్ చేస్తాను. 

ధనుంజయ్ కి విషయం తెలిసి కంగారుపడుతూ ఉంటాడు. తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ అని పిలుస్తాడు. ఏంట్రా.. డెలివరీ టైం లో ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా..

ఇప్పుడు నీకెందుకు ఆ అనుమానం వచ్చింది. అవనికి డేట్ దగ్గరికి వచ్చిందంట.. నీరసంగా ఉందని బావగారు చెప్పారు.

ఈ టైం లో అలాగే ఉంటుంది.  అయినా అక్కడ చాలామంది ఉన్నారు చూసుకుంటారు.  నువ్వు టెన్షన్ పడకు.

ఈ టైంలో అయినా నా కూతురు దగ్గర ఉండాలనిపిస్తుంది అమ్మ అని తల్లిఒళ్ళో పడుకుంటాడు.
సత్యవతి కొడుకుని మెల్లగా జో కొడుతూ ఎక్కువగా ఆలోచించకు. అన్ని సక్రమంగానే జరుగుతాయి అని చెబుతూఉంటారు.

వ్రతం పూర్తయి ఆ రోజుకి విశ్రాంతినిస్తారు. మర్నాడు రాత్రికి కార్యం ముహూర్తం పెడతారు.

ముహూర్తం టైం రానే వస్తుంది. రెండు జంటలకి జాగ్రత్తలు చెప్పి గదిలో వదులుతారు.

విద్యా భయంగా నిలబడితే భరత్ ఒళ్ళు విరుచుకుంటూ వచ్చి ఏమైంది విద్య అక్కడే నిలబడిపోయావు రా.. సార్ అని ఏడుపు గొంతుతో పిలుస్తుంది.

శోభనపు గదిలో మొగుడిని ఎవరైనా సార్ అని పిలుస్తారా అని గట్టిగా అంటాడు.  మరి ఏమని పిలవాలి. చెబుతాను కదా రా అని మంచం మీద కూర్చోబెట్టి....మెల్లిగా ముసుగు తీస్తాడు.

బెదురుకళ్ళతో భయం భయంగా చూస్తున్న విద్య ముఖాన్ని చూసి అబ్బా నా పెళ్ళాం ఎంత ముద్దుగా ఉన్నావు.

ఇదే బెదురూ,  భయం జీవితాంతం మెయింటైన్ చేసేయ్.. అప్పుడు చాలా ప్రశాంతంగా మన ఇద్దరి లైఫ్ వెళ్ళిపోతుంది అర్థమవుతుందా.. అర్థమయింది అని తల ఊపుతుంది.

ఇప్పుడు ఏం చేయాలి విద్య  నాకు తెలియదు సార్. మీరు ఏది చెబితే అది ఫాలో అవుతాను.  గుడ్ అలా ఫాలో అయిపో.  నీకు చాలా లెసన్స్ నేర్పించాలి అని మెల్లిగా పెదవులు అందుకుంటాడు.

వినయ్ పూజిత కోసం చూస్తూ ఉంటే లోపలికి వచ్చే బోల్ట్ పెట్టి పాల గ్లాసు టేబుల్ మీద పెట్టి మంచం ఎక్కి కూర్చుంటుంది.

ఏంటి అలా చూస్తున్నావ్..  ఎంతసేపని మూసుగుతో ఉండాలి. రెండు రోజుల నుంచి ఉండి ఉండి విసుగు వస్తుంది. తొందరగా వచ్చి ముసుగు తీసేయ్.

ఓయ్ ఏంటా ఆత్రం. శోభనపు పెళ్ళికూతురు అంటే ఎంత ఒద్దికగా ఉండాలి. నీకు ఎలా తెలుసు. ఎలా తెలుసు అని.. అదేం ప్రశ్న అని తింగరి చూపులు చూస్తూ అడుగుతాడు.

నాకంటే ఇదే ఫస్ట్ కాబట్టి..  ఇలా రావాలి అలా రావాలి అని నాకు తెలియదు.  నీకు కూడా ఫస్టే కదా... అయినా సరే తెలిసిందంటే ఏంటి సంగతి అంటుంది.

ఆ మాటకి నోరు వదిలేసి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా చూస్తూ ఉంటాడు.  చూసింది చాలు గానీ నువ్వు వచ్చి తీస్తావా లేకపోతే నేనే తీసి పక్కన పెట్టేనా అంటుంది.

వద్దు వద్దు నేనే తీస్తాను. ఈ అవకాశం మళ్ళీ నాకు రాదు కదా... కొంచెమైనా సిగ్గుపడవే... ఈ ఫీల్ ని జీవితాంతం తలుచుకుంటూ ఉంటే నాకు కొద్దిగా గర్వంగా అనిపిస్తుంది.

సిగ్గుపడాల ఎలా సిగ్గుపడాలి.. కర్మ రా అని తల కొట్టుకుంటూ... వద్దులే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని ముసుగుతీస్తాడు.

ముసుగు తీయగానే పూజిత కన్ను కొడుతుంది.  దానికి అదిరిపడి వెనక్కి జరుగుతాడు.  ఏమైంది.  ముసుగు తీయగానే కళ్ళు కిందకి వాల్చి...  చిన్న చిరునవ్వు పెదవులపై వస్తుందేమో అనుకున్నాను.

కానీ రివర్స్లో కన్ను కొట్టి  నా రౌడీ బేబీ అనిపించుకున్నావు అని చేతులు రబ్ చేసుకుంటూ మొదలు పెడదామా అంటాడు.

ఏంటి మొదలు పెట్టేది పెళ్లికి ముందు ఏం చెప్పాను. పెళ్లికి ముందు చాలా చెప్పుకుంటాము.  ఈ టైంలో అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా అని అల్లుకుపోతాడు.

అరే నేను చెప్పేది వినవా.. ఇప్పుడు ఓన్లీ యాక్షన్ మాత్రమే అని లైట్ ఆఫ్ చేసి సంసార జీవితం మొదలు పెడతాడు.

భార్గవి శూన్యంలోనికి చూస్తూ మాటరాని బొమ్మలాగా ఉండిపోతుంది. శిల్ప మాట్లాడిన మాటలకి శరీరం, మెదడు రెండు మొద్దు బారిపోయి ఏమీ ఆలోచించలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది.

సర్వెంట్స్ చూసేటప్పటికి ఒక పక్కకి పడిపోయి ఉంటుంది. కంగారుగా ధనుంజయ్ కి ఫోన్ చేసి విషయం చెబుతారు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లండి నేను వస్తున్నాను అని వెనకాలే వెళతాడు.

భార్గవిని ఐసియూ లో జాయిన్ చేస్తారు. డాక్టర్స్ చెక్ చేసి బయటకి రాగానే ధనుంజయ్ కూల్గానే ఎలా ఉంది ఇంకా ఎంత టైం బ్రతుకుతుంది అని అడుగుతాడు.

డాక్టర్స్ సమాధానం...

కథ కొనసాగుతుంది...
[+] 10 users Like SivaSai's post
Like Reply
Super update
Like Reply
Didn't expect that last question.. "entha time batukutundi"..!!!

aithe.. inkaa undi!!
Just hope Bhargavi realises good from bad!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
(12-03-2026, 07:54 PM)Rangudabba456 Wrote: I don't know why I'm so much addicted to this story
I don't like non erotic stories till date but I'm totally addicted to ur story & screenplay of writing
Im waiting for update  like a suspense thriller awesome ? writing siva garu thanks for daily updates god will  bless u to create  more stories like this I  became fan ❤️  of your writing thank you siva

Ditto here.
Never read a single novel in any language.
But this one .. dunno how it started.. and now has become a ritual!!

Only look at Sivagaru's updates here!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 147

ఇంకా ఎంత టైము బ్రతుకుతుంది అని కూల్ గా అడుగుతాడు. డాక్టర్ ధనుంజయ్ వైపు చూస్తూ చాలా తక్కువ టైం ఉంది. ఎవరినో కలవరిస్తున్నారు.

ఈ రాక్షసి కలవరించే మనిషి రావడం కష్టమే. ఊపిరి ఆగిపోతే ఆ బాడీని మీ హాస్పిటల్ కి డొనేట్ చేస్తున్నాను. మీ ల్యాబ్ టెస్ట్ లకి, ప్రాక్టికల్స్ కి యూస్ చేసుకోండి. థాంక్యూ.

బట్ ఎవరైనా చనిపోయే ముందు ఆఖరి కోరిక తీర్చాలి అంటారు కదా.. దాని చావు నిజమే అవ్వచ్చు కానీ అది కార్చే ముసలకన్నీరు మాత్రం నిజం కాదు.

ఏదైనా అవనివ్వండి. ఇన్ని రోజులు మీ దగ్గరే ఉన్నారు కదా.. చావు పుట్టుకలు మన చేతుల్లో లేనిది. ఆవిడ ఏం తప్పులు చేశారో నాకు తెలియదు.

ఆఖరి నిమిషంలో ఆవిడ కోరిక తీర్చకపోతే జీవితాంతం మీకు గిల్టీగా అనిపిస్తుంది..దాని విషయంలో ఏది ఉండదు డాక్టర్.

ఇప్పుడు ఆవేశంలో ఉన్నారు. ఆవేశం తగ్గిన రోజున అయ్యో చేసి ఉంటే అయిపోయేది కదా అనిపిస్తుంది. వెళ్ళిపోయిన రోజు తిరిగిరాదు కదా...  అర్థం చేసుకోండి.

మీరు చెప్పింది కూడా నిజమే అని లోపలికి వెళతాడు
అవని అవని అని కలవరిస్తూ ఉంటుంది. ధనుంజయ్ దగ్గరకు వెళ్లి ఏంటి భార్గవి ఆఖరి నిమిషంలో కూడా నటిస్తున్నావా..

భర్త మాట విని మెల్లిగా కళ్ళు తెరిచి ఒక్కసారి అవనితో మాట్లాడాలి ప్లీజ్. నా చిట్టి తల్లి మీద నీ నీడ పడడం కూడా నాకు ఇష్టం లేదు.  ఏం మాట్లాడాలి చెప్పు.

మౌనంగా చూస్తూ ఉంటుంది. పోనీ నీ కూతుర్ని పిలిపించమంటావా.. నాకు ఎవ్వరూ లేరు. నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం లేదు అని కూడా తెలుసు.

ఒక్కసారి అవనినీ క్షమించమని అడగాలి. అవనీ క్షమిస్తే నరకానికి వెళ్లే దారి అయినా కనపడుతుందేమో అని మాటలు కూడదీసుకుని అడుగుతుంది.

ఏమిటి నువ్వు నరకానికి వెళ్లే సుఖపడదామనే..  నీలాంటి వాళ్ళు నరకానికి వెళ్లి అక్కడ ఉన్న పాపుల్ని కూడా పొల్యూట్ చేస్తారు.

భార్గవి మాట్లాడలేక శ్వాస కష్టంగా తీసుకుంటూ ఉంటే విసురుగా ధనుంజయ్ బయటికి వచ్చేస్తాడు. ఉదయ్ దగ్గర ఉన్న పెద్దవాళ్లకి ఫోన్ చేసి శిల్పని, ఉదయ్ ని రమ్మని చెబుతాడు.  సునీల్ ని కూడా రమ్మని ఫోన్ చేస్తాడు.

సత్యవతికి శేషగిరి కి కూడా చెబితే ఆఖరి నిమిషంలో ఉంది కదా వస్తాములే అని సత్యవతి వస్తుంది. భార్గవి ఎలా ఉందిరా..

ఏ నిమిషమైనా పోవచ్చు. ఏంట్రా ఆ మాటలు..చనిపోయే వాళ్లకు కాస్త గౌరవం ఇవ్వు. ఇప్పటికిచ్చింది చాలులే... సరే నేను లోపలికి వెళ్లి చూసి వస్తాను అని భార్గవిని ఉంచిన గదిలోనికి వెళుతుంది.

హాస్పిటల్ బెడ్ మీద ఏ నిమిషం ప్రాణం పోతుందో తెలియని పరిస్థితుల్లో శ్వాస గట్టిగా తీసుకుంటూ ఇబ్బంది పడుతూఉంటుంది.

సత్యవతికి జాలి వేస్తుంది.  ఎలా బతికింది ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చింది.  అందుకే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటారేమో.. 

దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకుని భార్గవి అని పిలుస్తుంది. ఆ పిలుపుకి మెల్లిగా కళ్ళు తెరిచి అత్తయ్య అంటే.. ఎలా ఉందమ్మా.

ఈ పాపాత్మురాలి మీద ఇంకా జాలి చూపిస్తున్నారా... నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా... ఇప్పుడు ఏమీ ఆలోచించకు.

ఈ నిమిషం అయినా నేను ఆలోచించకపోతే ఆఖరికి జంతువు అశుద్ధంలో కూడా పుట్టను. భార్గవి అని బాధగా పిలుస్తారు. అవును అత్తయ్య.

భగవంతుడు నాకు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు.  అత్యాశకి పోయి పక్కవాళ్ళది లాక్కుంటే... ఇదిగో ఇలాంటి చావే వస్తుంది .

నాకన్న కూతురే నా మొహం చూడను అని చెప్పింది.  నా అత్యాశతో శిల్ప జీవితాన్ని కూడా నాశనం చేశాను. అవనికి తీరని అన్యాయం చేశాను.

అత్తయ్య అని కష్టంగా పిలుస్తుంది. చెప్పమ్మా..  ఒకే ఒక్కసారి నేను అవని తో మాట్లాడాలి.   ఇప్పుడా.. అవును
అత్తయ్య. నాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టండి.

భార్గవి బాధ చూడలేక ఒక్కసారి నేను విక్రమ్ తో మాట్లాడతాను అని బయటకు వచ్చి రేయ్ ధనుంజయ్... ఏంటమ్మా..

భార్గవి బాధ చూడలేకపోతున్నాను రా.. అందుకని నా కూతుర్ని ఇబ్బంది పెడతావా... అది కాదురా ఒకసారి విక్రమ్ తో మాట్లాడు.

విక్రమ్ ఏం చెబుతాడో విను. తర్వాత నిర్ణయం తీసుకో.. చనిపోయే ముందు వాళ్ళ ఆఖరి కోరిక తీర్చాలిరా.. అది కూతుర్ని చూడాలి అనుకోవడం లేదు.

ఇన్ని సంవత్సరాలు తనతో కలిసి పాపాలు చేసిన అన్న, వదినల్ని చూడాలి అనుకోవడం లేదు. తన వల్ల కష్టాలు పడ్డ అవని క్షమాపణ కోరుకుంటుంది.

ఒకసారి విక్రమ్ కి ఫోన్ చేసి విషయం చెప్పు రా... నా మాట విను. సరే నీకోసం ఫోన్ చేస్తున్నాను అని విక్రమ్ కి ఫోన్ కలుపుతాడు.

విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి.  బాబు అది అని ఎలా చెప్పాలో అర్థం కాక తల్లి వైపు చూస్తాడు. మీరు ఖాళీగా ఉన్నారేమో నేను లేను. విషయం ఏంటో సూటిగా చెప్పండి.

సత్యవతి ఫోన్ తీసుకుని బాబు అంటుంది. ఏంటి మామ్మగారు ఏమైంది.  భార్గవి హాస్పిటల్ లో ఉంది.
దానికి నేనేం చేయాలి  ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విను.

భార్గవి ఆఖరి నిమిషంలో ఉంది. అవనినీ కలవరిస్తుంది.  దేనికంట... క్షమాపణ అడగడానికి... ఏమిటి ఈ వింత.
చనిపోయే ముందు తన తప్పు తెలుసుకుంది.  చాలా బ్రతిమాలుతుంది.

ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను.  ఈ టైంలో అవనినీ అక్కడికి తీసుకు రావడం కరెక్టేనా మామ్మగారు.  అదే నాకు అర్థం కావడం లేదు.

చనిపోయే వాళ్ళ ఆఖరి కోరిక తీర్చాలి అంటారు. నా మనవరాలు చూస్తే రేపో మాపో పురుడికి సిద్ధంగా ఉంది. విక్రమ్ ఒక్క నిమిషం ఆలోచించి నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను.

ఇందిరాగారి  దగ్గరకు వెళతాడు. ఏమైంది  విక్కీ...  భార్గవి సంగతి చెబుతాడు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నానమ్మ. ఇది చిక్కు సమస్యే.

వెళితే అవనికి ప్రమాదం.  వెళ్లకపోతే భార్గవి ఆత్మకి శ్శాంతి ఉండదు.   మనకి గిల్టీగా అనిపిస్తుంది.
ఒకసారి సురభి కి ఫోన్ కలుపు.

సరే అన్ని సురభి కి ఫోన్ చేసి ఆంటీ..  నానమ్మ మాట్లాడుతుంది అని ఫోన్ ఇందిరాకి తీస్తాడు.  చెప్పండి పెద్దమ్మ..

జరిగింది మొత్తం చెప్పి ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది.  అవని చాలా సెన్సిటివ్. ఎమోషనల్ అవుతుంది..

ఈ టైంలో అది కరెక్ట్ కాదు. ఒక పని చేయండి  అవనినీ హాస్పిటల్ కి తీసుకువచ్చేయండి.  ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి.  పైగా నేను ఇక్కడే ఉంటాను.

వీడియో కాల్ లో మాట్లాడిద్దాము. ఏదైనా అవసరమైతే నేను ఉంటాను కాబట్టి భయం లేదు. మంచి సలహా అని లలిత మాధవి ని పిలిచి అవనినీ తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళండి అని జరిగిందంతా చెబుతారు.

సరే అని అందరూ హాస్పిటల్ కి బయలుదేరతారు. అవని అప్పుడే హాస్పిటల్కి ఎందుకు. నాకు బానే ఉంది కదా.. ఏం బాగున్నావు..  పెళ్లి పనులతో చాలా అలసిపోయి అలసటగా కనిపిస్తున్నావు.

ఒక రెండు రోజులు హాస్పిటల్ లో ఉంటే మంచిది. బాబోయ్ హాస్పిటల్కి కంపు నేను భరించలేను. ప్లీజ్ ప్లీజ్ ఆ రెస్టు ఏదో గదిలో కూర్చుని తీసుకుంటాను.

అవని చెప్పింది విను.  హాస్పిటల్లో ఉంటే నీకు మంచిది. నీకు తెలియడం లేదేమో గాని నీ మొఖం చాలా అలసటగా కనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉంది.

ప్లీజ్ బంగారం నా మాట విను. సరే మీకోసం వస్తున్న...  కానీ ఒకటే కండిషన్. నాకు అంత బానే ఉంది అని ఆంటీ చెబితే వెంటనే ఇంటికి తీసుకువచ్చేయాలి.

సరే నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా... ఆ మాటలతో బానే మాయ చేస్తారు. అవని రెడీ అయి వచ్చేటప్పటికి ఫ్యామిలీ మొత్తం కూడా రెడీగా ఉంటారు.

అదేంటి అందరూ వస్తున్నారు. ఎందుకో అవని నిన్ను ఒక్కదాన్నే ఈసారి పంపించడం మాకు ఎవరికీ ఇష్టం లేదు. అందుకే అందరము వెళదాము.

విద్య, పూజిత కూడా ఎందుకు అత్తయ్య.  కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు. పూజిత దగ్గరకి వచ్చి అక్క మాకు నీతో ఉంటే చాలా సంతోషం. కాబట్టి నువ్వు వద్దు అన్నా సరే మేము వస్తాము.

ఏమంటావు విద్య .. అవును వదిన..  పూజిత చెప్పింది నిజమే. సరే పదండి రాహుకాలం వచ్చేస్తుంది అని ఇందిరా గారు కూడా బయలుదేరుతారు.

అవని నీ మెల్లిగా కారులో కూర్చోబెట్టి చెరో పక్కన మాధవి లలిత కూర్చుంటారు.  విక్రమ్ డ్రైవింగ్ చేస్తూ అవనినీ చూస్తూ ఉంటాడు.

అవని మాత్రం ఎందుకో ఆందోళనగా కనిపిస్తూఉంటుంది. ఏమైందిరా ఆందోళనగా ఉన్నావు. ఏమో తెలియదు అత్తయ్య. ఎందుకో డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది.

పొట్ట మీద చేయి వేసుకుని లోపల ఉన్న కన్నా బానే ఉన్నాడు కదా అని ఆ విక్రమ్ వైపు చూస్తూ అడుగుతుంది. వాడు నా కొడుకు.  ఎప్పుడు బానే ఉంటాడు.

ఏంట్రా కొడుకు అని ఫిక్స్ అయిపోయావా.. నేను కాదు అత్తయ్య..  నీ కూతురే కొడుకు అని ఫిక్స్ అయిపోయింది. లేదమ్మా..

మొదటినుంచి ఆయనే నాకు అలవాటు చేసేసారు. ఇప్పుడేమో మొత్తం నా మీదకు గెంటేస్తున్నారు అని డైవర్ట్ అవుతుంది.

అవని డైవర్ట్ అయ్యేటప్పటికీ ముగ్గురు హమ్మయ్య అని ఊపిరి తీసుకుంటారు. 

అవని గురించి ఒక ఫ్లోర్ మొత్తం ఖాళీ చేసేస్తారు.   విక్రమ్ ఫ్యామిలీ మొత్తం వస్తున్నారని ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు.

అవని కారు దిగేటప్పుటకి అక్కడ శ్రీ, నేహా కూడా ఉంటారు.  మీరు ఏంట్రా ఇక్కడ అంటే సైగ చేస్తాడు.  ఓకే అని విక్రమ్ సైలెంట్ అవుతాడు.

నేహా దగ్గరకు వచ్చి ఏంటి సీనియర్ మీరు చెకప్ కి వచ్చారా. ఆ అవును నువ్వు ఏమిటి చెకప్పా..  ఇదిగో మీ అన్నయ్య ఉన్నారే.. మనకన్నా ఎక్కువ భయపడిపోతున్నారు.

నా మొఖం ఏదో అలసటగా కనిపిస్తుంది అంట.. అందుకనే ఇప్పుడే హాస్పిటల్ కి తీసుకువచ్చి అడ్మిట్ చేసేస్తున్నారు.

నేహా సమాధానం...
[+] 11 users Like SivaSai's post
Like Reply
Part - 148

నువ్వు అంటే అన్నయ్యకి అంత ప్రేమ. సరిగ్గా చెప్పావు. మీ ఫ్రెండ్ కే  నా ప్రేమ అర్ధం కావడం లేదు. సురభి వచ్చి అరే అమ్మాయిని ఇక్కడే నిలబట్టే మాట్లాడుతున్నారు.

రా.. రా.. తల్లి.  లోపలికి తీసుకువెళ్లి బీపీ చెక్ చేస్తుంది. ఒకసారి బేబీ మూమెంట్ చూద్దామా అని అడిగితే.... అవని మెరిసే కళ్ళతో  చూద్దాం అమ్మ అంటుంది.

రా విక్రమ్ ఒకసారి బేబీ మూమెంట్స్ చూడు అని తీసుకు వెళ్లి స్కాన్ తీస్తారు. బేబీ కదలికలు చాలా స్పీడ్ గా ఉంటాయి.

అవని కడుపులో ఉన్న బేబీ విక్రమ్ కన్నా స్పీడ్ గా ఉన్నాడు అని మోటివేట్ చేస్తూ ఉంటుంది. బేబీ కదిలికలు చూస్తూ అన్ని మరిచిపోయి.. అది మాత్రమే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

విక్రమ్ సురభి వైపు చూస్తే కళ్లు అర్పి నర్స్ ని హెల్ప్ చేయమని... విక్రమ్ పదా.. అని తీసుకువెళుతుంది. ఎలా ఉంది ఆంటీ.. అంతా బాగుంది. డెలివరీ టైం కూడా దగ్గరకి వచ్చేసింది.

జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే అని..  అవని వస్తే కూర్చోబెడతారు.  ఎలా ఉంది అమ్మ.. పర్ఫెక్ట్ లీ అల్ రైట్.
చూశారా.. అమ్మ కూడా చెప్పింది.

ఇంకా ఇంటికి వెళ్ళిపోదామా.. అవని ఇంకొన్ని టెస్టులు ఉన్నాయి. ఇంకా టెస్టులు ఏమిటమ్మా.. అదే డెలివరీ టైం దగ్గరికి వచ్చేసింది కదా..

అందుకే నీకు రూమ్ అలవాటు చేయాలి అని ఏదో చెబుతూ ఉంటుంది. రూమ్ అలవాటు చేయడం ఏమిటమ్మా..

అబ్బా ప్రతిదీ ప్రశ్నలతో విసగిస్తావెందుకు.  కాసేపు వచ్చి పడుకో అని విక్రమ్ తీసుకువెళతాడు. అవని అయోమయంగా చూస్తూనే విక్రమ్ వెనకాల వెళుతుంది.

సురభి ఉఫ్... అనుకుని చెమటలు తుడుచుకుంటుంది. వాసు వచ్చి ఏంటి సురభి అబద్దం చెప్పడం కష్టంగా ఉందా...

చాలా..  అందులో అవనికి.  ఇప్పుడు ఇంకా విక్రమ్ చేతిలోనే ఉంది. ఆపరేషన్ థియేటర్ అన్నీ రెడీచేసి ఉంచారా వాసు.

అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. నువ్వు టెన్షన్ తీసుకోకు. ఏమో అవనినీ చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఆ భార్గవి ఏం వాగుతుందో..  నిజంగా రియలైజ్ అయిందో..  లేదో ఏమి అర్థం కావడంలేదు.

అవనినీ మంచం మీద పడుకోబెట్టి విక్రమ్ పక్కనే కూర్చుని చేతిని పట్టుకుంటాడు.  ఏమైందండీ... అందరూ చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నారు.

నిజం చెప్పండి. చెప్పేది జాగ్రత్తగా విను. టెన్షన్ తీసుకోకు. మీరు చెబుతుంటేనే టెన్షన్ వస్తుంది. అందుకే చెప్తున్నాను.  టెన్షన్ పడకు.

నీ పక్కన ఎప్పుడూ నేను ఉన్నాను. మన కుటుంబం అంతా నీతో ఉంది. నువ్వు టెన్షన్ పడితే లోపల ఉన్న మన కన్నా కి మంచిది కాదు.

సరే ఇంతకీ విషయం ఏమిటి.. ఒక్క నిమిషం గట్టిగా శ్వాస తీసుకుని వదిలి భార్గవి హాస్పిటల్ లో ఉంది. అవని విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది.

నీకు చాలా విషయాలు తెలియాలి అని ధనుంజయ్ భార్గవి శిల్ప విషయంలో చేసింది మొత్తము చెబుతాడు. భార్గవిని శిల్ప కూడా ఛీ కొట్టింది అని తెలిసి ఆశ్చర్యపోతుంది.

భార్గవి ఆఖరి నిమిషంలో ఉంది. నీతో మాట్లాడాలి అని కలవరిస్తుంది . నాతోనా స్లోగా ఉంటుంది. హ.. నీతోనే మాట్లాడాలిఅంట.

మాకు ఎవరికీ ఇష్టం లేదు కానీ ఆఖరి శ్వాసలో ఉన్న మనిషి కోరిక తీర్చడం కనీస ధర్మం అని ఒప్పుకున్నాను .
అందుకేనా హాస్పిటల్ కి తీసుకువచ్చింది.

అవును..  నువ్వు ఏదన్నా ఎమోషనల్ అవుతావేమో అని భయం వేసింది. అందుకే అందరం వచ్చాము. ఒక నిమిషం కళ్ళు మూసుకుని తెరిచి సరే మాట్లాడతాను అంటుంది.

నువ్వు టెన్షన్ పడవు కదా..  భయపడవుకదా అని ఒకటికి పది సార్లు అడుగుతాడు.  బయట వాళ్ల గురించి నేను ఎందుకు  టెన్షన్ పడడం.

అదే మాట మీద ఉండు. నువ్వు ధైర్యంగా ఉంటే నాకు కొండంత బలం అని వీడియో కాల్ చేస్తాడు.  ఈ హాస్పిటల్ కాదా..  కాదు.

విక్రమ్ నుంచి వస్తున్న కాల్ చూసి ధనుంజయ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.  పక్కనే నిండుగా కనిపిస్తున్న కూతురుని తనివితీరా చూసుకుంటాడు.

అవని మాత్రం ఒక్కసారి ధనుంజయ్ ని చూసి తల పక్కకి తిప్పేసుకుంటుంది. ఆమాత్రమైన చూసింది అని తృప్తి పడతాడు.

చెప్పండి అల్లుడుగారు.. కాల్ మీ విక్రమ్.. ఒకసారి ఆ మనిషి దగ్గరికి ఫోన్ తీసుకు వెళ్ళండి. అవని మాట్లాడతానందా.. అవును.

శిల్పా పరిగెత్తుకుంటూ వచ్చి సార్ అని పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే అవని ఫోన్ వైపు చూస్తుంది. అమ్మకి ఎలా ఉంది.

ఇంకా హోప్స్ వదిలేసుకోవడమే. ఒకసారి చూడొచ్చా.. రా అని భార్గవి ఉన్న రూముల్లోకి తీసుకువెళ్తాడు. ఫోన్ ఎదురకుండా పెట్టి... నా కూతురు లైన్ లో ఉంది.

ఏదో మాట్లాడతాను అన్నావు కదా మాట్లాడు.. కష్టంగా మాట్లాడుతూ క్షమించు అవని. నేను చేసిన  పాపాలకి క్షమాపణ ఉండదు అని నాకు తెలుసు.

మనిషి అత్యాశపరుడు కదా..  నువ్వు క్షమిస్తే నరకానికి దారి దొరుకుతుందేమో అని చిన్న ఆశ.   

ఇప్పుడు అంత పెద్ద మాటలు ఎందుకులెండి. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. నాకు తెలుసు నువ్వు క్షమించలేవు అని.

ఈ పరిస్థితుల్లో కూడా నీ సంస్కారాన్ని వదల్లేదు. మీ నాన్నది ఎటువంటి తప్పు లేదు. ప్రతి నిమిషం నీ గురించే ఆలోచించేవారు.

నేనే లేనిపోనివన్నీ చెప్పి మీ ఇద్దరి మధ్య దూరం పెంచాను. నీ దగ్గరికి రావాలి... నీతో మాట్లాడాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకాన్ని కలిపించేదాన్ని.

నేను చేసిన పాపాలకి శిక్ష నా కూతురు అనుభవిస్తుంది. ఎలా అయితే నీకు గుర్తింపు లేకుండా చేయాలి అనుకున్నానో.. అదే పరిస్థితిలో ఇప్పుడు శిల్ప ఉంది.

మాటలు రాక ఆయాస పడుతూ ఉంటుంది. అవని కంగారుగా మీరు ఎక్కువ మాట్లాడకండి. ఆయాసం వస్తుంది.

ఒకే ఒక్క మాట చెప్పు అవని.  క్షమించాను అని. ఆఖరి నిమిషంలో కాస్త తృప్తిగా ఉంటుంది.

ఆ భగవంతుడిని ఒకటే కోరుకుంటున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దరిదాపుల్లో పుట్టించవద్దు అని.

అవని సమాధానం కోసం ఆశగా చూస్తుంది. విక్రమ్ అవని చేతిని నొక్కుతాడు. అవని విక్రమ్ వైపు చూస్తే తల ఊపుతాడు.

అవని ఫోన్ వైపు చూసి క్షమించాను అంటుంది. ఈ మాట చాలు అని రెండు చేతులతో నమస్కారం చేయడానికి ప్రయత్నించి అది వీలుకాక అలాగే ప్రాణం విడుస్తుంది.  అది చూసి అవనీ కళ్ళు మూసుకుంటుంది.

శిల్పా అమ్మ అని గట్టిగా అరుస్తూ  భార్గవి మీద పడుతుంది. వెంటనే విక్రమ్ ఫోన్ ఆఫ్ చేసేస్తాడు .
అవని  ఏమి మాట్లాడకుండా మౌనంగా కళ్ళు మూసుకుని పడుకునిఉంటుంది.

విక్రమ్ కూడా ఏమీ మాట్లాడాడు. కొంచెం సేపటికి సర్దుకుని కళ్ళు తెరిచి వెళదామా అంటుంది.  నువ్వు బాగానే ఉన్నావా అని అనుమానంగా అడుగుతాడు.

చూస్తుంటే తెలియడం లేదా.. ఎవరి గురించో ఆలోచించి నాకన్నాని ఇబ్బంది పెట్టలేను.  మిమ్మల్ని భయపెట్టలేను.  నా గురించి నా కుటుంబం ఉంది.

ఇంతమంది నా గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు ఎటువంటి సంబంధం లేని మనిషి గురించి నేను ఎందుకు టెన్షన్ తీసుకుంటాను.

అవని అంత ధైర్యంగా ఉండేటప్పటికీ విక్రమ్ చాలా సంతోషపడతాడు. రా అని బయటికి తీసుకువెళతాడు. అవనీ విక్రమ్ ల గురించి ఫ్యామిలీ మొత్తం టెన్షన్ గా చూస్తూ ఉంటే...

అవని ఇందిరాగారి దగ్గరికి వెళ్లి అమ్మమ్మ నేను బాగానే ఉన్నాను. మీరు టెన్షన్ పడకండి. ఇందిర విక్రమ్ వైపు చూస్తే అంతా ఓకే అని వేలు పైకి పెట్టి చూపిస్తాడు.

భార్గవి బాడీని హాస్పిటల్ కి డొనేట్ చేసి ధనుంజయ్ బయటికి వస్తాడు.  శిల్ప  ఏడుస్తూ ఉంటే ఉదయ్ వెనకాలే వచ్చి మావయ్య మేము బయలుదేరుతున్నాము. సరే అని చెబుతాడు.

సునీల్ ధనుంజయ్ దగ్గరకు వచ్చి బావ అని పిలిస్తే..  చురుగ్గా చూస్తే..  సోరి..  సార్ మీకు అభ్యంతరం లేకపోతే మేము మా కొడుకు దగ్గర ఉండవచ్చా..

సరే అని చెప్పి ధనుంజయ్ తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళిపోతాడు. కొడుకు కోడలతో బిందు సునీల్  గ్రామానికి చేరుకుంటారు.

కొన్ని రోజులకి అంతా నార్మల్ అవుతుంది.  అవని మాత్రం సైలెంట్ గా ఉండిపోతుంది. విక్రమ్ అవనినీ అబ్జర్వ్ చేస్తూ తన పని చేసుకుంటూ ఉంటాడు.

ఎవరూ వదలకుండా ఎప్పుడు ఎంగేజ్ చేస్తూ ఉంటారు.  ఒకరోజు అవని విక్రమ్ తో ఒక్కసారి నేను ఆ సార్ తో మాట్లాడాలి. ఇంటికి పిలిపించండి.

ఎందుకు.. పిలిపించండి. మీ ముందే మాట్లాడుతాను సరే అని ధనుంజయ్ కి కాల్ చేసి చెబుతాడు.  కూతురు మాట్లాడాలి అన్న విషయం తెలియగానే ధనుంజయ్  ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు.

తల్లితండ్రులకి విషయం చెప్పి కూతురు కోసం రకరకాల స్వీట్స్, ఫ్రూట్స్ కొని తీసుకుని వెళ్తాడు. ధనుంజయ్ వెళ్లేటప్పటికి అవని హాల్లో కూర్చొని ఉంటుంది.

లలిత తినిపిస్తూ ఉంటే ఇంకా చాలా అత్తయ్య.  నావల్ల కాదు. కొద్దిగా తిను బంగారం. తర్వాత పత్యం ఉంటుంది. అప్పుడు కష్టం అని చెప్పి మెల్లిగా తినిపిస్తూ ఉంటారు.  కాళ్ళు నీరు పట్టి ఉబ్బిపోయి ఉంటాయి.

కాళ్ళు టేబుల్ పై పెట్టి పూజిత కాళ్ళకి నూనెతో మర్దన చేస్తూ ఉంటుంది. ఆ దృశ్యం చూడగానే ధనుంజయ్ కళ్ళు చెమర్చుతాయి.

కూతురు అత్తారింట్లో ఎలా ఉండాలి అనుకున్నాడో ఆ విధంగా కనిపిస్తూ ఉంటే ఒక తండ్రి గుండె ఆనందంతో కొట్టుకుంటూ ఉంటుంది.

ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉంటే కళ్యాణ్ వచ్చి రండి ధనుంజయ్. హా బావగారు అని వస్తాడు.

అవని ఏం మాట్లాడబోతుంది...
కథ కొనసాగుతుంది...
[+] 12 users Like SivaSai's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Wonderful update.
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
For some reason reading the last episode again now. Too good!!
Trying to find what Avani will say to her "Sir". Emotions are at their peak.

This is fantabulous Sivgaru.
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
(14-03-2026, 07:26 PM)ash.enigma Wrote: For some reason reading the last episode again now. Too good!!
Trying to find what Avani will say to her "Sir". Emotions are at their peak.

This is fantabulous Sivgaru.

Thank you 
[+] 1 user Likes SivaSai's post
Like Reply
Part - 149

ధనుంజయ్, కళ్యాణ్ ఇద్దరు సోఫాలో కూర్చుంటారు. విద్య కాఫీ తీసుకువచ్చేస్తుంది. థాంక్స్ అమ్మ అంటే ఒక చిన్న స్మైల్ ఇస్తుంది.

అవని మాత్రం మౌనంగా తలదించుకునే ఉంటుంది.  విక్రమ్ వచ్చి అవని పక్కనే కూర్చుంటాడు. ఎలా ఉన్నావు అవని.

బాగున్నాను  అని తల ఊపుతుంది.  ఆమాత్రం అయినా స్పందించింది అని సంబరపడిపోతాడు. కుటుంబం మొత్తం అక్కడే ఉంటుంది.

అవని ఎంతసేపు ఉన్న మాట్లాడలేకపోతే ధనుంజయ్ కూతురు మాటలు వినాలని.. ఏదో మాట్లాడాలి అన్నావ్ అమ్మా.. ఏం చెప్పాలి తండ్రితో. విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది.

టెన్షన్ పడకు. నేనున్నాను కదా అని మెల్లిగా చెబుతాడు. మీ అమ్మాయిని ఎందుకు దూరంగా ఉంచుతున్నారు. నేను ఉంచలేదు. నా కూతురే నాకు దూరం అయిపోయింది.

నేను మాట్లాడుతుంది మీ ముద్దుల కూతురు గురించి. నేను చెబుతుంది కూడా నా ముద్దుల కూతురు గురించే..
మీ భార్య డెడ్ బాడీని హాస్పిటల్ కి ఎందుకు డొనేట్ చేశారు.

నా భార్యకి నా చేతులతోనే దహన సంస్కారాలు చేశాను.. అది ఇప్పుడు కాదు.  20 సంవత్సరాల క్రితమే జరిగింది.
అవునా మరి నాతో హాస్పిటల్లో మాట్లాడించిన వ్యక్తి మీకు ఏమవుతుంది.

ఒక్క నిమిషం ధనుంజయ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. కుటుంబం మొత్తం కూడా ధనుంజయ్ ఏం చెబుతాడా అని చూస్తూఉంటారు.

ధనుంజయ్ కళ్ళు తెరిచి నాకు ఏమీ కాదు.  ఏమీ కాకుండానే ఇన్ని సంవత్సరాలు మీతో ఉందా... బయట ప్రపంచానికి మీ భార్యగా చలామణి అయ్యిందా...
మీకు ఏమీ కాకుండానే మీ బిడ్డకు తల్లి అయ్యిందా..

నా ప్రాణం అనుకున్న నా ముద్దుల కూతురికి తల్లిగా మారుతాను అని ఇంటికి వచ్చింది. ఆమెకి ఒక గౌరవం ఇవ్వాలి అని ఒక స్థానాన్ని ఇచ్చాను.

ఆ స్థానం ఇచ్చినప్పుడు మీతో ఒక బంధం ఉన్నట్టే కదా... నా ప్రాణం అనుకున్న నా కూతురుతో నాకు బంధం మిగిలిందా...

అది మీరు వద్దనుకున్న బంధం. అది నా ప్రాణం అనుకున్న బంధం.  ఆ బంధమే లేకపోతే ఈ ధనుంజయ్ ఏనాడో భార్య దగ్గరికి వెళ్లి పోయేవాడు.

ఆ మాటకి అవని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది.  మీతో ఒక విషయం మాట్లాడాలి అని రమ్మన్నాను. వినాలని ఒక తండ్రిగా నేను ఇక్కడికి వచ్చాను.

వినయ్ భరత్ చెయ్యి పట్టుకుని ఏంటి బావ ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. వింటూ ఉంటే ఈ వయసకే నాకు బీపీ, షుగర్ వచ్చేసేటట్టు ఉన్నాయి. మూసుకుని చూడు.

ఈరోజుతో అవని మనసులో ఉన్న బాధ పూర్తిగా పోవాలి. నువ్వు అన్నది కూడా నిజమేలే బావ అని..  టెన్షన్ గా ఇద్దరినీ చూస్తూ ఉంటాడు.

శిల్పతో ఎందుకు మీరు సార్ అని పిలిపించుకుంటున్నారు. ఆ విషయం నీకెలా తెలుసు.  ఆ మనిషి చనిపోయినప్పుడు విన్నాను.

నీకు లేని పిలుపు... వినే అర్హత నాకు లేదు.
నాది జరిగిపోయిన గతం.
భవిష్యత్తులో ఆ పిలుపు వినాలని తండ్రిగా కోరిక నాది.

అది జరుగుతుంది అనుకుంటున్నారా..  నా ఆఖరి శ్వాస వరకు... నా కూతురి క్షమాపణ కోసం ఆ పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

ఎప్పటికీ ఆ క్షమాపణ దొరకకపోతే...
మరో జన్మలోనైనా నా కూతురికి బిడ్డగా పుట్టి నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను.

మౌనంగా తలదించుకున్న అవని...  కూతురి చూపు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న ధనుంజయ్...

అవని కండిషన్ ని ఏమిటో అని విక్రమ్ గుండే స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంటుంది. అవని చేతిని గట్టిగా పట్టుకుని కూల్ కూల్ అంటూనే ఉంటాడు.

తలదించుకున్న అవని కళ్ళు వర్షిస్తూఉంటాయి. ధనుంజయ్ మెల్లిగా లేచి వచ్చి.. కూతురి కాళ్ల దగ్గర మోకాళ్ళ మీద కూర్చుంటాడు.

అమ్మ అని ప్రేమగా వస్తున్న ఏడుపును ఆపుకుంటూ పిలుస్తాడు. అయినా అవని తలెత్తదు. ఇప్పుడు కూడా నువ్వు శిల్ప గురించే ఆలోచిస్తున్నావా...
ఈ తండ్రి గురించి ఆలోచించలేకపోతున్నావా ...

నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాకు ఆడపిల్ల కావాలి..  ఆడపిల్ల పుడుతుంది అని గట్టిగా అనేవాడిని.  ఆ మాటకి మీ అమ్మ ఆడపిల్ల ఎందుకు అని అడిగితే...

ఆడపిల్ల అయితే నాకు అమ్మ అవుతుంది. నన్ను సరైన దారిలో నిలబెడుతుంది.  అదే కొడుకైతే వాడికి నేను నేర్పించాలి.

రేపు పెళ్లి అయిన తర్వాత భార్యతో ఎలా ఉంటాడో.. జీవితంలో ఎలా స్థిరపడతాడో అని టెన్షన్ పడాలి. అందుకే నాకు అమ్మలాంటి కూతురు కావాలి అనేవాడిని.

నువ్వు పుట్టగానే మొదటిసారి నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఈ రెండు చేతులు వణికాయి అని అరచేతులు చూపిస్తూ చెబుతాడు.

పాలుగారే చెక్కెళ్ళతో.. ఒత్తయిన జుట్టుతో..  చక్రాలాంటి కళ్ళతో చేతుల్లోకి తీసుకోగానే నా వేలుని గట్టిగా పట్టుకున్నావు.

నువ్వు పట్టుకోగానే నాకు ఈ ప్రపంచాన్నే జయించేనంత సంతోషం. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నా కూతురికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి.

ఏ నిమిషం తనకి ఏది అవసరమైన అడగకముందే అన్నీ ఇవ్వాలి.  ప్రపంచంలోనే నా కూతురిని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాలి అని కలలు కన్నాను. 

నిన్ను మీ అమ్మ చేతికి కూడా ఇచ్చేవాడిని కాదు. నా చేతుల్లోనే ఉండేదానివి.  స్నానం చేయిపించడం దగ్గర నుంచి పడుకోబెట్టడం వరకు అన్ని నేనే చేసేవాడిని. ఆఖరికి ఈ చేతులతోనే నీకు తినిపించేవాడిని.

మీ అమ్మ మరణం తరువాత మన జీవితాలే మారిపోయాయి. నా భార్య చావు నన్ను బాగా కుంగదీసింది.

ఆ సమయంలోనే ఆ మనిషి మన ఇంటికి వచ్చి నిన్ను జాగ్రత్తగా చూసుకునేది. నీ నవ్వులతో మెల్లిమెల్లిగా మళ్లీ కోలుకున్నాను.

ఆడపిల్లని తండ్రి ఎంత బాగా చూసుకున్నా... తల్లి అవసరం ఉంటుంది అని బలవంతం చేసి మళ్ళీ పెళ్లి చేశారు.

నీ మీద ఆ మనిషి చూపిస్తున్న కపట ప్రేమ నిజమే అనుకొని.. నా కూతురికి ఎటువంటి లోటు రానివ్వకూడదు.  వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలి అని బిజినెస్ మీద ఫోకస్ పెట్టాను. అదే నేను సరిదిద్దుకోలేని తప్పు అని తర్వాత అర్థమయింది .

తరవాత శిల్ప పుట్టడం. నేను చూసినప్పుడల్లా నువ్వు శిల్పతో ఉండడం చూసి ఇద్దరు బాగానే ఉన్నారు అనుకున్నాను.

ఎప్పుడు నీతో మాట్లాడాలి..  నీతో టైం స్పెండ్ చేయాలి అనుకున్న ఏదో ఒక డిస్టర్బెన్స్. నీకోసం సర్ప్రైజ్ గా గిఫ్ట్స్ తెచ్చినప్పుడు.. బయటకు తీసుకువెళ్లాలి అనుకున్నప్పుడు..

నువ్వు అలిగావు. మొండిపట్టుదలతో ఉన్నావు. నన్ను చూడడం కూడా ఇష్టం లేదు. ఎవరైనా వస్తే నిన్ను నువ్వు గాయపరచుకుంటాను అని బెదిరించావు..  ఆఖరికి చేయి కూడ కోసుకున్నావు చెబుతూ ఉంటే ఈ తండ్రి ప్రాణం విలవిల్లాడిపోయింది.

అమ్మ వాళ్ళ ముందు కూడా మాతో రావడం ఇష్టం లేదు. నీ దగ్గరికి వస్తే ఏదైనా చేసుకుంటాను అని చెబుతూ ఉంటే...  నా కూతురికి ఎలా దగ్గర అవ్వాలా అని నీ గురించే ఆలోచించేవాడిని.

నిజంగా నువ్వు ఏమైనా చేసుకుంటావేమో అన్న భయంతో రాత్రులు అందరూ పడుకున్నా తర్వాత నీ గది దగ్గరే పడుకునేవాడిని..

ఎప్పుడైనా పిలుస్తావేమో ఏదైనా అవసరం అవుతుంది ఏమో అని.. అప్పుడైనా ఈ తండ్రి కనిపిస్తాడేమో అని చిన్న ఆశతో ఉదయం వరకు గుమ్మం ముందే కాపలా కాసే వాడిని. 

నా దురదృష్టం నా ప్రేమ నా కూతురికి చేరలేదు ఏ కూతురి కోసం అయితే ఇంత సంపాదించానో...  ఏ కూతురికి సర్వ సౌఖ్యాలు ఇవ్వాలి అనుకున్నానో... ఆ కూతురికే పెట్టడన్నం పెట్టలేకపోయాను.

ఇలాంటి దౌర్భాగ్యం ఏ తండ్రికి వద్దు. మొదటిసారిగా నా చేతుల్లోకి తీసుకున్న నా బిడ్డ కి ఇప్పటికే నేను తండ్రిని కాలేకపోయాను.

ఆ బిడ్డ మరో బిడ్డకి తల్లి అవుతున్న సరే నాన్న అన్న పిలుపుకి నోచుకోలేకపోయాను. నేను ఏమి చేస్తే నా బిడ్డ క్షమాపణ దొరుకుతుంది. నన్ను నాన్న అని పిలుస్తుంది అని తలని దోసెట్లోకి పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తాడు.

ధనుంజయ్ బాధ విన్న అందరికీ గుండె తరుక్కుపోతుంది. లలిత, మాధవి పైట చెంగు నోటికి అడ్డుపెట్టుకొని... వెక్కివెక్కి ఏడుస్తూ ఉంటారు.

అందరూ మనసులో ఒకటే కోరుకుంటూ ఉంటారు. భగవంతుడా అవని మనసులోనే భారం పోయి..  ఆ తండ్రిని క్షమించి నాన్న అని పిలిస్తే బాగుండును.

విక్రమ్ కి ధనుంజయ్ బాధ అర్థం అవుతూఉంటుంది. అలాగే అవని లో వస్తున్న మార్పు అర్థమవుతూ ఉంటే భయంగా అనిపిస్తూ అవని  భుజం చుట్టూ చేతులు వేస్తాడు.

అప్పటిదాకా లోపల లోపల ఏడుస్తున్న అవని..  బయటకి గట్టిగ ఏడుస్తూ నాన్న అని పిలుస్తుంది.

ఆ పిలుపు కోసమే బతుకుతున్న ధనుంజయ్..  వెంటనే తల పైకెత్తి కూతురి కాళ్ళ మీద చేతులు వేసి ఏమన్నావు బంగారు తల్లి.

ఈ నాన్నని క్షమించావా..  నాన్న అని పిలిచావా...  ఒక్కసారి మళ్ళీ పిలవవా అని బేలగా అడుగుతాడు. అవని వెంటనే ధనుంజయ్ చేతులు పట్టుకొని నాన్న అని పిలుస్తుంది.

ధనుంజయ్ ఏడుస్తూ కూతురిని గట్టిగా పట్టుకుని ఇన్ని సంవత్సరాలకి  నాన్నగా మళ్లీ పుట్టానా..

అందరి వైపు చూస్తూ నా కూతురు నన్ను క్షమించింది. నాన్న అని పిలుస్తుంది. విక్రమ్ కి కూడా తండ్రీ కూతుర్లు ఎమోషన్ చూసి... వస్తున్నా కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ నిలబడతాడు.

అందరూ కూడా సంతోషంగా అవని, ధనుంజయ్ నే చూస్తూ ఉంటారు. 

చిన్నతనంలో ఫీలయిన తండ్రి స్పర్శని మళ్లీ ఇన్ని సంవత్సరాలకి దొరికేటప్పటికీ అవని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది.

తన ప్రాణం, తన ప్రపంచమే అనుకున్న కూతురు స్పర్శ తగిలేటప్పటికీ అది మళ్ళీ ఎక్కడ దూరం అవుతుందేమో అన్న భయంతో ధనుంజయ్ పోదవి పట్టుకుంటాడు.

వాతావరణం తేలిక చేయడానికి విక్రమ్ వెంటనే హలో మావయ్య గారు ఎమోషనల్ అయింది చాలు. మీరిద్దరూ ఎమోషనల్ అయ్యి ఏడిస్తే లోపల ఉన్న నాకన్నా ఇబ్బంది పడతాడు.

ఆ మాటకి అందరూ నవ్వుతారు.  వినయ్ స్పీడ్ గా వాళ్ళ ముందుకు వచ్చి హమ్మయ్య ఇప్పటికి నా టెన్షన్ తగ్గింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదలైనప్పటి నుంచి చూడు నా గోళ్ళని పూర్తిగా అయిపోయాయి.

వినయ్ గోల ??
[+] 10 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: Mahesh5432, Skv89, 3 Guest(s)