11-03-2026, 02:20 PM
Excellent update
|
Thriller మరణ శాసనం
|
|
11-03-2026, 02:20 PM
Excellent update
11-03-2026, 08:51 PM
Wonderful update. Story sooper tight ga nadipistunnaru
12-03-2026, 07:05 AM
Part - 16
ఆ మరుసటి రోజు ఉదయం 10.00 గంటలకు గోవింద రావు సత్యనారాయణ రావు ఇద్దరు రఘునాధ రెడ్డి నుండి డ్రైవర్ పురుషోత్తంతో కలిసి మారేడుమిల్లి కి బయలుదేరారు..
దాదాపు ఏడు గంటల ప్రయాణం తరువాత మారేడుమిల్లి చేరుకున్నారు. అప్పటికి సమయం సాయంత్రం ఐదు గంటలయింది.. అది ఒక టూరిస్ట్ ప్లేస్ కావడం చేత, రఘునాథరెడ్డి ముందుగానే వారికి అక్కడ ఒక రూం బుక్ చేయించాడు.. డ్రైవర్ కి కూడా మరొక రూమ్ బుక్ చేశాడు. డ్రైవర్ పురుషోత్తం రుద్ర గురించి తెలుసుకోవడానికి అక్కడ దగ్గరలో ఉన్న ఫారెస్ట్ ఆఫీస్ కి వెళ్ళాడు ఒక అరగంట తర్వాత గోవింద రావు ఉంటున్న గదికి వచ్చాడు. అప్పటికి గదిలో గోవింద రావు సత్యనారాయణ రావు మాట్లాడుకుంటూ ఉన్నారు. గది లోపలికి వచ్చిన పురుషోత్తంతో గోవింద రావు " రుద్ర గురించి ఏమైనా తెలిసిందా.? " అని అడిగారు.. " తెలిసింది స్వామి..! ప్రస్తుతం వారు ఒక పులిని పట్టుకోవడానికి టైగర్ జోన్ లో ఉన్నారంట..!! ఫారెస్ట్ లో ఉండే ఆయన ఆఫీసులో దొరుకుతారని చెప్పారు..!!"అని చెప్పాడు.. " సరే అయితే నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో నాయనా..!! రేపు ఉదయాన్నే కలిసి వెళ్దాం." అని పురుషోత్తం తో చెప్పారు.. సరేనంటూ పురుషోత్తం వెళ్ళిపోయాడు.. మళ్లీ ఇద్దరూ మాటల్లో పడ్డారు... ఆ మరుసటి రోజు ఉదయం...!! సమయం 7:00... పురుషోత్తం గోవింద రావు సత్యనారాయణ రావు ముగ్గురు రుద్ర ని కలవడానికి బయలుదేరారు.. ముగ్గురు ఒక జీపులో బయలుదేరారు.. వారితో పాటు ఒక గైడ్ కూడా ఉన్నాడు.. అతని పేరు రవి.. మారేడుమిల్లి ఫారెస్ట్ అంతా అతనికి బాగా తెలుసు.. జీపు బయలుదేరింది... సత్యనారాయణ రావు మాట్లాడుతూ... " మనం ఇప్పుడు జీపులో వెళ్ళవలసిన అవసరం ఏముంది. పురుషోత్తం..?? మన కారు ఉంది కదా..!!" అని అడగగా.. ఆ మాటలకి పురుషోత్తం సమాధానం చెప్పబోతుండగా మధ్యలో రవి మాట్లాడుతూ..! " ఇక్కడ నుంచి రోడ్డు కొంత వరకు బాగానే ఉంటుంది సార్..!! కానీ మనం వెళ్ళేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రుద్ర గారిని కలవడానికి..!! ఆయన ఆఫీసు ప్రస్తుతం అడవి మధ్యలో ఉంది..! మనం వెళ్ళాలి అంటే కచ్చితంగా ఈ దారి లో వెళ్లాలి ఈ దారికి కార్లు పనిచేయవు. జీపులో మాత్రమే వెళ్లగలం. ఎందుకంటే రోడ్లు అస్సలు బాగోవు..." అని చెప్పాడు.. " అయినా ఆ అబ్బాయి ఆఫీసు అడవి మధ్యలో ఎందుకు ఉంది..?" అని గోవింద రావు రవిని అడిగారు.. "ఇది వరకు ఉండే ఆఫీసర్ అందరిలాగే అడవి బయటే ఉండేవారు. పెద్దగా ఎవరినీ పట్టించుకునేవారు కాదు. ఇక్కడ పులుల సంచారం కూడా ఎక్కువ. వాటి బారిన పడి చాలా మంది చని పోతూ ఉండేవారు. అడవిలో బ్రతికే వారే కాకుండా టూరిస్టులు వచ్చే వారు కూడా చని పోతూ ఉండేవారు. కానీ రుద్ర సార్ వచ్చిన తరువాత వాటి సంచారం బాగా తగ్గింది.. పులి బారినపడి ఎవరూ చనిపోకుండా అందరి మంచి కోసం తన ఆఫీస్ ని అడవి మధ్యలో మార్పించుకున్నారు.." " అంటే పులులు కనిపిస్తే చంపేస్తారా..??"అని ఆశ్చర్యంగా అడిగాడు పురుషోత్తం.. " లేదు సార్...!! అలా చంపరు...!! చంపకూడదు కూడా...!! ఎందుకంటే ఈ అడవి అందరిదీ..! ఒకవేళ వాటివల్ల ప్రమాదం ఏర్పడితే బోను పెట్టి వాటిని బంధించి, అడవికి దూరంగా మనుషుల సంచారం లేని చోట వదిలేస్తారు.. ఇప్పుడు కూడా మొన్న గిరిజనుల జాతర ఒకటి అడవిలో జరిగింది. మామూలుగా అటువంటి జాతర జరిగితే ఫారెస్ట్ ఆఫీసర్ కి ముందస్తు సమాచారం ఇవ్వాలి. కానీ ఆ గిరిజనులు మాటలు లక్ష్యపెట్టలేదు. నిన్న రాత్రి ఆ జాతర జరుగుతున్నప్పుడు ఒక పులి జాతర పై దాడి చేసింది. ఇప్పుడు దాన్ని పట్టుకునే పనిలో ఆయన ఉన్నారు.. మీరు చాలా దూరం నుంచి వస్తున్నారని మిమ్మల్ని కలుస్తున్నారు.."అని చెప్పాడు. రవి చెప్పింది పూర్తిగా విన్న తర్వాత ఎవరు ఇంకా ఏమీ మాట్లాడలేదు.. జీపు అడవిలో నెమ్మదిగా కదులుతోంది.. అప్పటికి సమయం ఉదయం 10 గంటలు దాటింది.. సూర్యుడి నేలమీద పడకుండా చెట్లు చాలా దట్టంగా ఉన్నాయి.. అలా బయలు దేరుతున్న జీపు ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్దగా కుదుపులకు లోనై ఆగిపోయింది... అందరూ జీపు నుంచి కిందకు దిగారు.. జీప్ వెనకాల చక్రం చిన్న గోతిలో దిగిపోయింది.. అందరూ కలిసి జీపును ముందుకు తోసారు కానీ ఎంత ప్రయత్నించినా చక్రం గోతిలో నుండి బయటకు రాలేదు.. "ఇప్పుడెలా బాబు..?" అని రవిని అడిగాడు గోవింద రావు.. "మన వల్ల అవ్వట్లేదు సార్...!! ఇంకొంతమంది తోడు కావాలి.. సార్ ఆఫీస్ కి ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళాలి.. అక్కడికి వెళితే అక్కడ ఉండే వాళ్ళ సాయం తీసుకుని మనం తిరిగి వెళ్ళిపోవచ్చు .."అని చెప్పాడు.. ఇక అందరూ సరేనని నడక మొదలు పెట్టారు... రవి దారి చూపిస్తూ అందరికంటే ముందుగా నడుస్తున్నాడు.. అతని వెనకాలే పురుషోత్తం కూడా వస్తున్నాడు.. సత్యనారాయణ రావు గోవింద రావు వాళ్ళకి అడవిలో నడక అలవాటు లేక మెల్లగా నడుస్తూ వస్తున్నారు.. కొంత దూరం వెళ్ళిన తరువాత రవి నడుస్తున్న వాడు ఒక్కసారిగా ఆగిపోయాడు.. పురుషోత్తం రవి అలా సడన్గా ఆగి పోయే సరికి "ఏమైంది రవి అలా ఆగిపోయావ్..??" అని అనుమానంగా అడిగాడు... రవి చుట్టూ చూస్తూ " సార్..!! అందరూ ఒకసారి ఆగండి." అని తన వెనకాల వాళ్లతో అన్నాడు.. గోవింద రావు, సత్యనారాయణ రావు ఇద్దరు ఆగిపోయారు.. "ఏమైంది రవి..??" అని మళ్ళీ కంగారుపడుతూ అడిగాడు పురుషోత్తం.. గోవింద రావు సత్యనారాయణ రావు కూడా కంగారు పడుతూ రవి దగ్గరకు వచ్చారు... రవి దూరంగా ఒక చెట్టు వైపు చూపించాడు. అక్కడ ఒక మేక కట్టివేయబడి ఉంది. అలా రవి మేకని చూపించేసరికి అందులో ప్రమాదం ఏముంది అన్నట్టుగా ముగ్గురు అతని వైపు చూశారు.. "చూడండి సార్...!! ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పులి కోసం ఇక్కడ ఎరను పెట్టారు. దానికోసమే ఆ మేక ని ఇక్కడ కట్టేశారు. ఒకసారి పైకి చూడండి..!!" అని ఆ మేకను కట్టేసి ఉన్న చెట్టు పైకి చూపించాడు. అక్కడ ఒక వల కనిపిస్తోంది."ఆ వలని చూశారు కదా..! ఆ మేక కోసం ఆ పులి వచ్చిన మరుక్షణం ఆ వలలో చిక్కుకుపోతుంది.. కాబట్టి వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి..!!" అని అంటూ వెనక్కి జరగబోతుండగా వారికి పెద్దగా పులి గాండ్రింపు వినిపించింది... అందరూ అరుపు వినగానే ఒక్కసారిగా ఆగిపోయారు.. అందరూ భయంతో చుట్టూ చూసారు.. వారికి ఎక్కడా పులి కనిపించలేదు.. అలా చుట్టూ చూస్తున్న వారి ముందు కి దూరంగా ఒక పెద్ద చెట్టు చాటు నుండి ఒక పులి వారి ముందుకు నడుచుకుంటూ వచ్చింది. అది పెద్ద పులి...!! దాన్ని చూడగానే అందరూ భయంతో బిగుసుకుపోయారు.. పరిగెడదాం అని బుర్ర చెబుతున్నా..!! కాళ్లు సహకరించడం లేదు...!! ఆ పెద్దపులి గట్టిగా వారిని చూస్తూ గాండ్రించింది..!! అప్పుడు వచ్చింది అందరి శరీరాల్లోకి చలనం .. భయంతో ఒక్కసారిగా పరుగు అందుకున్నారు.. గోవింద రావు తప్ప మిగిలిన ముగ్గురు వేగంగా పరిగెత్తసాగారు.. పెద్దపులి వారిని వెంబడించసాగింది.. ఇంతలో గోవింద రావు కాలికి రాయి తగలడం వల్ల కిందపడిపోయారు.. ఆ పులి వేగంగా గోవింద రావు వైపు రాసాగింది.. గోవింద రావు పడిపోవడం చూసి ముగ్గురు ఆగిపోయి కంగారుగా ఆయనవైపు రాబోయారు... కానీ ఆ పులిని చూసి భయపడి ఆగిపోయారు.. అది వేగంగా ఆయన వైపు వస్తోంది.. గోవింద రావు ఆ కనక దుర్గ దేవి ని కాపాడమని ప్రార్థించ సాగారు.. వేగంగా వస్తున్న ఆ పులి ఒక్కసారిగా తన వేగాన్ని తగ్గించింది... అప్పటివరకు పరిగెత్తుకుని వస్తున్నది కాస్తా ఉన్నట్టుండి మెల్లగా నడుచుకుంటూ రావడం మొదలు పెట్టింది. గోవింద రావు కి మిగిలిన వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. అలా మెల్లగా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి గోవింద రావు దగ్గర కుప్పకూలిపోయింది.. గోవింద రావు మిగిలిన వారు ఆశ్చర్యపోయారు.. ఏం జరిగిందని ముగ్గురు గోవింద రావు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి ఆయనను పైకి లేపారు.. నలుగురు ఆ పులి దగ్గరకు వచ్చి చూశారు. దాని నడుం పై రెండు సూదులు గుచ్చుకుని ఉన్నాయి.. వాటిని చూసిన రవి నవ్వుతూ ఇది రుద్ర సార్ పని అని చుట్టూ చూడసాగాడు.. దూరంగా ఒక గుట్టపై గన్ పట్టుకొని నుంచుని ఉన్న రుద్ర అతనికి కనిపించాడు. ఆయన్ని చూసి నవ్వుతూ అదిగో సార్ అక్కడే ఉన్నారు.. అని అన్నాడు.. అందరూ ఆ వైపు చూశారు.. చేతిలో ఒక గన్ పట్టుకొని నవ్వుతూ వారి వైపు వస్తున్నాడు రుద్ర... వారు కూడా అతని వైపు వెళ్ళసాగారు.. అతని వెనక కొంత మంది కొండ జాతి వారు కూడా ఉన్నారు.. వారు వేగంగా వచ్చి పులి ని ఎత్తుకొని వెళ్ళి, అక్కడ ఉన్న బోను లో పెట్టారు.. రవిని చూసి పలకరింపుగా నవ్వాడు రుద్ర. గుడ్ మార్నింగ్ సార్..!! మీ గురించి విజయవాడ నుంచి వచ్చారు." అని వాళ్ళను పరిచయం చేశాడు.. రుద్ర వైపు చూసి " నమస్తే..!! నాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది. మా డ్రైవర్ మిమ్మల్ని మా క్వార్టర్స్ దగ్గర దిగపెడతాడు. అక్కడ మీరు కొంత సేపు వేచి ఉండండి. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను.."చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.. యూనిఫాం లో ఉన్న ఒక డ్రైవర్ ఒక జీపుని తీసుకువచ్చి వాళ్ళందర్నీ నన్ను ఎక్కించుకుని రుద్ర ఉండే క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళాడు. అడవిలో ఒక అరగంట ప్రయాణం తర్వాత అతని ఇంటికి చేరుకున్నారు.. అది అడవిలో ఉండే ఒక చెక్క గృహం.. ఒక చిన్న భవంతిలా ఉంది.. అటువంటి గృహాలు ఫారెస్ట్ లో పనిచేసే ఆఫీసర్లకు ఇస్తారు. ఆ డ్రైవర్ వాళ్లందరినీ ఆ ఇంటికి దగ్గర దించి వెళ్ళిపోయాడు.. లోపలి నుంచి పని వాడు వచ్చి వారందరిని లోపలికి తీసుకువెళ్లాడు.. వాళ్లందరినీ హాల్లో కూర్చో పెట్టి లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఆ పనివాడు వాళ్లందరికీ టీ తీసుకొని వచ్చాడు.. అందరూ మా ఇంటికి గమనించసాగారు.. చెక్కతో చేసినదైనా చాలా అద్భుతంగా ఉంది.. ఎటు చూసిన అందమైన కళాకృతులు ఆ ఇంటి నిండా ఉన్నాయి.. పనివాడు ఇచ్చిన టీ తాగుతూ నలుగురు మాట్లాడుకుంటున్నారు.. అలా మాట్లాడుకుంటూ ఉండగా రుద్ర వచ్చాడు.. యూనిఫామ్ లో ఉన్నాడు. అతన్ని చూడగానే అందరూ లేచి నుంచున్నారు.. వారిని చూసిన రుద్ర "దయచేసి కూర్చోండి ఒక పది నిమిషాల్లో వస్తాను..!" అంటూ పై అంతస్తుకు వెళ్ళాడు.. అందరూ కూర్చున్నారు చెప్పినట్లుగానే పదినిమిషాల్లో ఫార్మల్ డ్రెస్లో తిరిగి వచ్చాడు రుద్ర.. మనిషి ఆరడుగుల పైనే ఉంటాడు. నలుపు రంగు అయినా సరే ముఖంలో తేజస్సు వెలిగిపోతూ ఉంది. కిందికి రాగానే నేరుగా వచ్చి గోవింద రావు పాదాలకు నమస్కరించాడు.. గోవింద రావు వెంటనే లేచి నుంచుని "దీర్ఘాయుష్మాన్ భవ..!" అని దీవించి రుద్ర ని పైకి లేపారు... సార్ ఈయన పేరు రవి చెప్పబోతుండగా . " గోవింద రావు గారు " అని రుద్ర చెప్పాడు రుద్ర అలా చెప్పగానే గోవింద రావు తో సహా అందరూ ఆశ్చర్యపోయారు.. "ఈయన గోవింద రావు గారిని మీకెలా తెలుసు..?" అని అడిగాడు సత్యనారాయణ రావు.. "నాన్నగారు నా చిన్నతనంలో ఆయన గురించి చెప్పారు..ఈయనను పాతకాలం నాటి ఒక ఫోటోలో నేను చూశాను. అందువల్ల పోల్చుకోగలిగాను."అని చిరునవ్వుతో చెప్పాడు రుద్ర. "అందరూ నుంచొని ఉన్నారు. కూర్చోండి.." అని ఆన్నాడు రుద్ర.. అందరూ కూర్చున్నారు.. రుద్ర గోవింద రావు వైపు చూసి "నాన్నగారు నా చిన్నతనంలో మీ గురించి చాలా చెప్పారు. మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోసం వెతుక్కుంటూ రావడం కూడా ఆశ్చర్యంగా ఉంది.. మీకేం అభ్యంతరం లేకపోతే మీరు వచ్చిన కారణం ఏమిటో తెలుసుకోవచ్చా..??" అని అడిగాడు. " బాబు నీకు ఏమీ అభ్యంతరం లేకపోతే మనం కాస్త ఒంటరిగా మాట్లాడుకోవచ్చా..?" అని అడిగారు గోవింద రావు.. " అయ్యో తప్పకుండా సార్..!! నాతోపాటు రండి.." అంటూ ఇంటి బయటకు తీసుకు వెళ్ళాడు... అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది.. కింద ఒక బల్ల ఉంది. దాని మీద ఇద్దరు కూర్చున్నారు.. "చెప్పండి రావు గారు..!! మీరు నా కోసం వెతుక్కుంటూ రావడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా..??" అని అడిగాడు రుద్ర. "నువ్వు మాత్రమే చేయగలిగే సాయం ఉంది నువ్వు నాకు సహాయం చేయగలవా..??" అని అడిగాడు గోవింద రావు.. "నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను. అదేమిటో చెప్పండి." అని అడిగాడు రుద్ర.. గోవింద రావు ఆదిత్య గురించి పూర్తిగా చెప్పాడు. ప్రస్తుతం అతను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి కూడా పూర్తిగా చెప్పాడు... ఆదిత్య గురించి పూర్తిగా వివరించేసరికి దాదాపుగా అరగంట పైనే పట్టింది గోవింద రావు కి.. చెప్పింది అంతా నిశ్శబ్దంగా ఓపిగ్గా విన్నాడు రుద్ర.. గోవింద రావు ఆదిత్య గురించి చెప్పడం పూర్తి చేశారు.." ఇది బాబు జరిగింది.. ఇప్పుడు ఆదిత్యను కాపాడడానికి నాకున్న ఏకైక మార్గం నువ్వు మాత్రమే.. దయచేసి నాకు సహాయం చేయి.." అని అడిగారు గోవింద రావు.. ఆయన చెప్పడం పూర్తి చేసిన తర్వాత లేచి నుంచున్నాడు రుద్ర.. ఏమైందోనని గోవింద రావు కూడా లేచి నుంచుని " ఏమైంది బాబు.?" అని అడిగారు. " నన్ను క్షమించండి నేను మీకు ఈ సహాయం చెయ్యలేను..! ఈ పని కోసమే నా కోసం ఇంత దూరం వస్తే నన్ను క్షమించండి దయచేసి తిరిగి వెళ్ళిపొండి." అని అక్కడనుంచి విసురుగా లేచి తన ఇంట్లోకి వెళ్లి పోయాడు... గోవింద రావు కూడా మౌనంగా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు.. రుద్ర లోపలికి వెళ్ళిన మరుక్షణం మిగిలిన వాళ్ళు బయటికి వచ్చేశారు.. చెట్టుకింద నిలబడి ఉన్న గోవింద రావు దగ్గరకు వచ్చి "ఏమైంది చిన్నాన్న..?" అని అడిగాడు సత్యనారాయణ రావు.. "మనకు సహాయం చేయలేనని చెప్పి వెళ్ళిపోయాడురా రావు..! నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచటంలేదు.." అంటూ బాధపడ్డారు గోవింద రావు.. ఆ మాటలకి సత్యనారాయణ రావు పురుషోత్తం ఇద్దరు బాధపడ్డారు. "సరే చిన్నాన్న..! ఇంకా ఎందుకు ఇక్కడ ఉండడం..? వెళ్ళిపోదాం రండి..!"అంటూ బయలుదేరుచుండగా... హటాత్తుగా ఆ ఇంట్లో నుంచి ఎవరో ఒక స్త్రీ గట్టిగా అరుస్తున్న అరుపులు వినిపించాయి.. ఒక్క గోవింద రావు తప్ప మిగిలిన ముగ్గురు వేగంగా ఆ ఇంటిలోకి పరుగులు తీశారు.. అరుపులు మొదటి అంతస్తు నుండి వినిపించసాగాయి.. ముగ్గురూ వేగంగా పైకి వెళ్లారు... లోపల ఎవరో ఒక స్త్రీ మంచం మీద ఉంది. చేతులు కాళ్లు వంకర్లు తిరిగి ఉన్నాయి.. రుద్ర దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఆమె విదిలించి కొడుతోంది.. ఆమె చుట్టూ ఇద్దరు ఆడ పనివాళ్ళు ఉన్నారు.. వాళ్ళు ఆమె చేతులు కాళ్ళు గట్టిగా పుచ్చుకున్నారు.. రుద్ర ఆ పరిస్థితులలో ఆమెను చూడలేక కళ్ళు తుడుచుకుంటూ గది బయటకు వచ్చాడు. ఎవరండీ అని పురుషోత్తం రుద్ర అని అడిగాడు.. ఆ ప్రశ్నకు రుద్ర సమాధానం చెప్పకుండా మౌనంగా కింద ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే గోవింద రావు మెల్లగా ఆ ఇంటి లోపలికి వచ్చారు.. ముగ్గురు మేడపైన ఉండడం చూసిన గోవింద రావు మెల్లగా పైకి వెళ్లారు.. అప్పటికే ఆ స్త్రీ అరవడం మానేసి నిద్ర పోతోంది.. గోవింద రావు పైకి వచ్చారు.. గదిలో ఉన్న స్త్రీ వైపు చూడసాగారు.. ఇంతకీ ఆవిడ ఎవరు అని పక్కన ఉన్న రవిని అడిగాడు పురుషోత్తం... రుద్ర సార్ వాళ్ళ అమ్మగారు.. అని చెప్పాడు రవి.. అందరూ ఆశ్చర్యపోయారు... ఆవిడ శరీరం కుచించుకుపోయి ఉంది.. ఆమె బెడ్ దగ్గర సాయంగా ఉన్న ఆడవాళ్ళు ఆమెకు సపర్యలు చేయసాగారు... ఇంకా అక్కడ ఉండడం బాగోదు అనిపించి ముగ్గురు కిందికి వచ్చేసారు.... గోవింద రావు మాత్రం ఆమె వైపు తీక్షణంగా చూడసాగాడు.... ఇది గమనించిన సత్యనారాయణ రావు ఆయన దగ్గరకు వచ్చి "ఏమైంది చిన్నాన్న.?" అని అడిగాడు. " ఏమీ లేదు..!!" అని కిందికి వచ్చేశారు... గోవింద రావు నేరుగా రుద్ర గదివైపు వెళ్ళారు. మిగిలిన వారిని బయటకు కూర్చోమని చెప్పారు. రుద్ర గదిలోకి వెళ్లారు. గోవింద రావు.. లోపల కుర్చీలో కూర్చొని బాధ పడుతున్నాడు రుద్ర.. గోవింద రావు రావడంతో లేచినుంచున్నాడు.. "బాధపడకు బాబు..!" అన్నారు గోవింద రావు. "బాధ పడకుండా ఎలా ఉండమంటారు సార్..??. తండ్రి చనిపోయారు. అమ్మ పరిస్థితి ఇలాగ అయిపోయింది. మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మని బాగా చూసుకుందామని అనుకున్నాను. నాకు అంత అదృష్టం లేదు.." అంటూ బాధపడ సాగాడు. "మరి మీ అమ్మగారి ఆరోగ్యం బాగు చేయాలని నువ్వు ప్రయత్నించలేదా...??" " ఎందుకు ప్రయత్నించ లేదు సార్...!! అన్ని రకాల వైద్యాలు చేయించాను . ఇంగ్లీష్ మందులు వాడినా, ఆయుర్వేద వైద్యం చేయించినా, ఈ అడవిలో చేసే నాటు వైద్యం కూడా ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకపోయింది.. పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించిన కూడా ఆమెకు ఉన్న జబ్బు ఏంటో తెలుసుకోలేకపోయారు.." "నిన్ను ఒక మాట అడగవచ్చా..??" " ఏమిటండి అది..??" " నీ తండ్రి నీకు నేర్పించిన తాంత్రిక విద్యలు నీకు గుర్తున్నాయా..??" గోవింద రావు తిరిగి తన విద్యల గురించి అడిగేసరికి రుద్ర కి చాలా కోపం వచ్చింది.. తన తల్లి పరిస్థితి గురించి మాట్లాడుతున్నప్పుడు తన విద్య గురించి అడగడం చాలా కోపం తెప్పించింది.. వెంటనే కోపంతో " మీరేందుకు అడుగుతున్నారో నాకు అర్థమయ్యింది..!! మీరు ఎన్నిసార్లు అడిగినా సరే నేను సహాయం చేయను. ఈ విద్యలు ఉపయోగించే నలుగురు మంచి కోరుకునే నా తండ్రి చనిపోయాడు. చీమకు కూడా అపకారం చేయని నా తల్లి ఈ విధంగా బాధపడుతుంది... దయచేసి మీరు వెళ్లిపోండి.." అన్నాడు. ఆ మాటలకి గోవింద రావు ఏమి కోపం తెచ్చుకోలేదు. " రుద్ర ఒకసారి నాతో పాటు రా...!!" అంటూ అతని చెయ్యి పుచ్చుకుని వేగంగా ఆ గది బయటకు వచ్చాడు.. అలా గోవింద రావు రుద్ర చెయ్యి పుచ్చుకుని బయటకు రావడంతో ఏమైందోనని కంగారుపడ్డాడు సత్యనారాయణ రావు... " ఏమైంది చిన్నాన్న..??" అంటూ అడగ బోతుండగా కూర్చో మంటూ చేతితో సైగ చేశాడు గోవింద రావు.. ఆయన మాత్రం ఆగకుండా రుద్ర చేయి పట్టుకొని వేగంగా మేడ పైన ఉన్న అతని తల్లి గది వద్దకు తీసుకువెళ్ళాడు.. అతని తల్లి గది ముందు నిలుచుని పెట్టాడు గోవింద రావు.. లోపల ఇద్దరు ఆడవాళ్ళు ఆమెకు సపర్యలు చేస్తున్నారు.. గోవింద రావు వాళ్ళ వైపు చూసి "అమ్మా..ఒక్క పదినిమిషాలు బయటకు వెళ్ళండి."అనగానే వెంటనే వాళ్ళు ఆ గది నుండి బయటకు వచ్చి కిందకి వెళ్లిపోయారు... గోవింద రావు కింద ఉన్న వాళ్ళ వైపు చూసి "మీరందరూ ఒక్క పదినిమిషాలు బయటికి వెళ్లిపోండి..." అనగానే మారు మాట్లాడకుండా అందరూ బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నది గోవింద రావు, రుద్ర, వాళ్ళమ్మగారు మాత్రమే... గోవింద రావు రుద్ర తో మాట్లాడుతూ...!! "ఒకసారి నీ తల్లి వైపు చూడు..!! ఆమె పరిస్థితి నీకు ఎలా అనిపిస్తుంది..??" అని గోవింద రావు అడగగానే విచిత్రంగా ఆయన వైపు చూసి ఆయన చెప్పినట్టుగానే తన తల్లి వైపు చూశారు... ఆమె మెడ ఒక పక్కకి తిరిగి పోయి ఉంది. చేతులు కాళ్లు మెలి పెట్టినట్టు పక్కకి తిరిగి ఉన్నాయి.. రుద్ర తన తల్లిని ఎప్పుడు ఎలా చూస్తాడో.. ఆమె అలాగే ఉంది.. తనకి కొత్తగా ఏమీ అర్థం అవ్వలేదు.. అదే విషయాన్ని గోవింద రావు తో చెప్పాడు.. "సరే నాకు ఒక విషయాన్ని చెప్పు నీ తండ్రి నేర్పిన విద్యలు ఇప్పటికీ సాధన చేస్తున్నావా?? లేదా...??"అని అడిగాడు గోవింద రావు.. " లేదు సార్..!! మానేసాను.!!"అని చెప్పాడు రుద్ర.. " సరే నేను నిన్ను నా మనవడికి సహాయం చేయమని అడగను.. నాకోసం ఒక్కసారి మీ తండ్రి నీకు నేర్పిన శక్తి కవచ విద్య ఇప్పుడు ఉపయోగించగలవా..??"అని అడిగాడు గోవింద రావు.. " ఉపయోగించగలను. కానీ ఎందుకు..?" " చూడు రుద్ర..!! నేను నిన్ను ఈ ఒక్క విద్య ఉపయోగించమని అడుగుతున్నాను. ఒక్కసారి ఈ విద్యను ఉపయోగించు.. చూసిన తర్వాత నేను వెళ్ళిపోతాను..!!" అని గోవింద రావు అడగడంతో తనకు ఇష్టం లేకపోయినా ఆ విద్యను ఉపయోగించడానికి పూనుకున్నాడు... ఈ శక్తి కవచ విద్య తాంత్రికులకు ముఖ్యమైనది.. తాము ఎదుర్కొనే దుష్ట శక్తుల బారినుండి తమని తమ కుటుంబాన్ని కాపాడతాయి... ఈ విద్యని రోజుకి ఒక్కసారైనా కచ్చితంగా ఆచరించి తీరాలి. లేకపోతే తాంత్రికుడు చుట్టూ ఉండే శక్తి కవచం బలహీనపడి అతని మీద దుష్ట శక్తుల దాడి జరిగే అవకాశం ఉంది.. గోవింద రావు చెప్పినట్టు చేయసాగాడు రుద్ర.. శుభ్రంగా స్నానం చేసి, తన తండ్రి ధరించినటువంటి నల్లటి వస్త్రాలు ధరించాడు. మెడలో రుద్రాక్ష మాలలు వేసుకొని, గోవింద రావు దగ్గరకు వచ్చాడు.. రుద్ర ని అలా చూసినా రవి, పురుషోత్తం, సత్యనారాయణ రావు ఆశ్చర్యపోయారు. గోవింద రావు రుద్రని చూస్తూ " ఇప్పుడు శక్తి కవచ విద్యని ఇక్కడ ఉపయోగించు.." అని చెప్పారు.. రుద్ర నేలపై పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు.. కళ్ళు మూసుకొని మంత్రాలు పఠించసాగాడు.. ఒక 10 నిమిషాలు పూర్తయిన తర్వాత లేచి నుంచున్నాడు.. గోవింద రావు వైపు చూసి " మీరు చెప్పినట్టే చేశాను సార్..!! ఇప్పుడు చెప్పండి దేనికి నన్ను ఈ విద్యను ఇప్పుడు ఉపయోగించమన్నారు..? " అని రుద్ర అడిగితే " ఒకసారి మీ తల్లి గారి గదిలోకి వెళ్ళిరా..!" ఆశ్చర్యంగా గోవింద రావు వైపు చూస్తూ ఆమె తల్లి గదిలోకి అడుగుపెట్టాడు.. ఆమె తల్లి వైపు చూశాడు... "అమ్మా......!!!" అని గట్టిగా అరుస్తూ ఆశ్చర్యంతో వెనక్కి రెండు అడుగులు వేసి గది బయటకు వచ్చేసాడు రుద్ర...... ఇంకా ఉంది.....!!!
13-03-2026, 07:14 AM
Part - 17
ఆలా తల్లి వైపు చూస్తూ రుద్ర భయంతో వణికిపోసాగాడు.. రుద్ర అరిచిన అరుపుకి బయట ఉన్న అందరూ వేగంగా పరిగెత్తుకుంటూ మేడపైకి వచ్చేసారు.. అతని పరిస్థితి గమనించిన గోవింద రావు రుద్ర భుజం పై చేయి వేశాడు.. ఒక్కసారిగా ఉలిక్కిపడి, గోవింద రావు వైపు చూసాడు రుద్ర.. "ఇప్పటికైనా అర్థం అయ్యిందా..? ఈ విద్య నిన్ను ఎందుకు ఉపయోగించమన్నానో..!!" అన్నారు గోవింద రావు... కన్నీళ్లతో తల్లి వైపు చూస్తున్న రుద్ర ని చూసి అందరూ కంగారు పడసాగారు. "ఏమైంది చిన్నాన్న..?" అని ఆందోళనగా అడిగాడు సత్యనారాయణ రావు.. మిగిలిన వారు కూడా అదే సందేహంతో గోవింద రావు వైపు రుద్ర వైపు చూడసాగారు.. రుద్ర తల్లికి సపర్యలు చేసే పని వాళ్లు కూడా ఏమైందొనని కంగారుగా బిత్తర చూపులు చూడసాగారు.. గోవింద రావు వాళ్ళవైపు చూసి.." ఈరోజుకి మీ పని ఇక్కడ ఏమీ లేదు. బయలుదేరండి.." అని వాళ్ళతో చెప్పి పంపించి వేశారు.... బాధతో తన తల్లి వంకే చూస్తూ ఉన్న రుద్ర ని అక్కడ నుంచి కిందకు తీసుకువచ్చాడు గోవింద రావు.. అందరూ కింద ఉన్న సోఫాలో కూర్చున్నారు.. రుద్ర మాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా కన్నీళ్లతో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు.. "ఏమయి ఉంటుంది సార్..!!" అని మెల్లగా అడిగాడు పురుషోత్తం, సత్యనారాయణ రావు తో "నాకు అదే అర్థం కావటంలేదు..?అడిగి చూస్తా..!" అని అంటూ.. "అసలు ఏమైంది చిన్నాన్న..!?? రుద్ర ఎందుకలా బాధపడుతున్నాడు..? అతని తల్లి గారికి ఏమైంది...??"అని అడిగాడు సత్యనారాయణ రావు.. " రుద్ర తల్లి గారు.. రెండు భయంకరమైన ప్రేతాత్మలు చేత బంధింపబడి ఉన్నారు.. మెల్లగా ఆమె జీవశక్తిని పీల్చేస్తూ ఉన్నాయి. ఒక విధంగా ఆవిడ ఇన్ని సంవత్సరాలుగా బ్రతికి ఉందంటే ఆమె దృఢమైన మనోనిబ్బరం కానీ కొడుకు మీద ఉన్న అమితమైన ప్రేమ కానీ కారణం కావచ్చు.. తనని అదృష్ట శక్తుల బారి నుంచి విడిపించే వారి కోసం ఇన్నాళ్ళు ఎదురు చూస్తోంది.." అని ఆమె పరిస్థితి వాళ్ళందరికీ వివరించాడు.. " మరి రుద్ర కి తాంత్రిక విద్యలు తెలుసు కదా..!! మరి ఇప్పటి వరకు ఎలా తెలుసుకోలేకపోయాడు..??"మరి సందేహాన్ని వెలిబుచ్చాడు సత్యనారాయణ రావు.. " నువ్వు చెప్పేది నిజమే రావు..!! రుద్ర ఒక శక్తివంతమైన తాంత్రికుడు..!! కానీ...!! తన తండ్రి చనిపోవడం తన తల్లికి ఇలా జరగడం వల్ల, ఆవేశంలో తన శక్తులను ఉపయోగించలేదు..!! ఆనాడే కొంత సహనం వహించి, దీనికి కారణం తెలుసుకోగలిగి ఉంటే ఆమె ఆ ప్రేతాత్మల నుండి ఎప్పుడో విముక్తి కలిగేది..!!"అంటూ వివరించాడు.. ఆ మాటలు మౌనంగా వింటున్న రుద్ర కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి.. " మరి ఇప్పుడు ఆవిడని కాపాడడం ఎలాగ సార్..??"అని అడిగాడు రవి.. " అదే ఆలోచిస్తున్నాను..!! ఆవిడ పరిస్థితి ప్రస్తుతం అసలు బాగాలేదు..!! ఇప్పుడు ప్రేతాత్మలు నుంచి విడిపించడం నావల్ల అవుతుందో లేదో కూడా తెలియటం లేదు..!"అని చెప్పి మౌనం వహించారు గోవింద రావు... అప్పటి వరకు ఆయన పక్కన కూర్చుని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్న రుద్ర ఒక్కసారిగా ఆయన కాళ్ళ మీద పడి ఏడవసాగాడు... " స్వామి దయచేసి నా తల్లిని కాపాడండి..! ఆవేశంలో నేను తీసుకున్న నిర్ణయం వల్ల, ఈరోజు నా తల్లి నరకం అనుభవిస్తుంది.. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నా తల్లిని ఆ ప్రేతాత్మల నుంచి కాపాడండి.." అంటూ కన్నీళ్లతో ఆయన కాళ్లు కడగసాగాడు... గోవింద రావు చిరునవ్వు నవ్వుతూ, రుద్ర ని పైకి లేపి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు.. తన తలపై నిమురుతూ... "చూడు నాయనా..!! బాధపడకు, ధైర్యంగా ఉండు.. నీ తల్లిని కాపాడడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను.. కానీ ఆమెను పూర్తిస్థాయిలో వాటి నుంచి కాపాడగలిగేది నువ్వు మాత్రమే.... నువ్వు తలుచుకుంటే కచ్చితంగా కాపాడగలవు.. నీకు అన్ని విధాలా నా సహాయం ఉంటుంది ఈరోజు రాత్రికి మనం పూజ ప్రారంభిద్దాం..!!" అంటూ రుద్రని ఓదార్చారు.. ఆ మాటలకి రుద్ర ఆనందంతో " థాంక్యూ స్వామి.. ఈరోజు రాత్రికి మనం దుష్టశక్తి అవాహనం చేద్దాం.." "మంచిది..! ఈరోజు రాత్రి జరగవలసిన పూజకి కావలసిన ఏర్పాట్లు అవి మీరిద్దరూ చూసుకోండి.." అంటూ పురుషోత్తం రవి లకి అప్పజెప్పారు.. ఇద్దరు సరే అని అన్నారు... గోవింద రావు రుద్ర వైపు చూసి "రాత్రికి చేయవలసిన దుష్టశక్తి ఆవాహన ప్రక్రియ ఒకసారి నెమరు వేసుకొ..! ఎందుకంటే ఇటువంటి ప్రక్రియలో పొరపాట్లు ఎట్టి పరిస్థితులలోనూ జరగకూడదు.."అని హెచ్చరించే సరికి "సరే స్వామి..!!" అంటూ రుద్ర తన గదిలోకి వెళ్ళిపోయాడు.. పురుషోత్తం రవి ఇద్దరూ మిగిలిన పనులు చూసుకోవటానికి బయటికి వెళ్లారు.. హాలులో గోవింద రావు, సత్యనారాయణ రావు మాత్రమే మిగిలారు.. సత్యనారాయణ రావు గోవింద రావు పక్కకు వచ్చి మెల్లగా అసలు ఆమెకు ఏమైంది చిన్నాన్న..?? నాకు ఏమీ అర్థం కావడం లేదు..??" అని అడిగాడు.. ఆ మాటకు సమాధానంగా గోవింద రావు "నాతో పాటు పైకి రా..!" అని రుద్రతల్లి ఉన్న గది వైపు తీసుకు వెళ్లారు.. ఇద్దరూ మేడపైన ఆమె వద్దకు చేరుకున్నారు.. ఆమె గది ముందు నుంచుని ఉన్నారు.. " ఇప్పుడు ఆవిడ గదిలో నీకేం కనిపిస్తోంది..??" అని సత్యనారాయణ రావు అని అడిగారు గోవింద రావు.. ఆ మాటకు సమాధానంగా ఆ గది లోపల చుట్టూ చూశాడు సత్యనారాయణ రావు. " నాకు ఏమి కనిపించట్లేదు చిన్నాన్న..??" "సరే నీకు ఒక మంత్రాన్ని చెప్తాను.. అది జపిస్తూ ఆ గదిలోకి అడుగుపెట్టు.."అని సత్యనారాయణ రావు చెవిలో ఒక మంత్రాన్ని చెప్పారు... గోవింద రావు ఆ మంత్రాన్ని జపిస్తూ మరల తల్లి గదిలోకి అడుగుపెట్టి ఆమె వైపు చూశాడు... అలా అడుగు పెట్టిన మరుక్షణం ఆమె వైపు చూసి సత్యనారాయణ రావు కళ్ళు ఆశ్చర్యంతో, భయంతో పెద్దవయ్యాయి.. ఎందుకంటే....!! ఆమె శరీరాన్ని చుట్టుకుని రెండు ప్రేతాత్మలు ఉన్నాయి... అవి చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి.. ఎర్రటి కళ్ళతో వికృతంగా.. సామాన్యులు ఎవరైనా సరే.. చూస్తే జడుచుకునే విధంగా ఉన్నాయి.. అవి ఆమె శరీరాన్ని కదలనివ్వకుండా బంధించి,ఆమె జీవశక్తిని పీల్చేస్తున్నాయి. ఆ పరిస్థితులలో ఆమెను చూసిన సత్యనారాయణ రావుకి శరీరమంతా చెమటలు పట్టేసాయి..వెంటనే గది నుండి బయటకు వచ్చేసాడు.. ఆ కంగారులో కిందకి తూలి పడిపోబోయాడు.. అక్కడే ఉన్న గోవింద రావు అతన్ని పడిపోకుండా పట్టుకొన్నారు... సత్యనారాయణ రావు కంగారుపడుతూ.. " ఏంటిది చిన్నాన్న..!!?? ఒక శరీరాన్ని చుట్టుకుని రెండు ప్రేతాత్మల ని చూడటం ఇదే మొదటిసారి..!! మీరు చెప్పింది నిజమే. ఇన్ని సంవత్సరాలుగా వీటి నుంచి ప్రాణం పోకుండా ఉండాలంటే చాలా దృఢమైన సంకల్పం మనోనిబ్బరం ఉండాలి.."అని అన్నాడు.. " ఆవిడ గొప్ప సాద్వి..!! మహా భక్తురాలు..!! ఆమె చేసుకున్న పూజాఫలమే..!! ఇన్నాళ్ళు ఆవిడకి రక్షగా ప్రాణం పోకుండా నిలిపింది. మనం ఇక్కడికి రావడం కూడా అంతా దైవేచ్ఛ..!! మనం ఎలాగైనా ఆవిడని కాపాడి తీరాలి..!!" " కానీ చిన్నాన్న...!!మీరు తలుచుకుంటే ఆవిడని మీరొక్కరే కాపాడగలరు.. కానీ ఈ పనిని రుద్రకి ఎందుకు అప్పచెబుతున్నారు..??" " చూడు రావు..!! నువ్వు అనుకున్నట్లు ఇది మామూలు క్రతువు కాదు.. ఇటువంటి క్రతువు తాంత్రిక విద్య తెలిసిన వారు మాత్రమే జరిపించగలరు..మామూలుగా నెల రోజులు, రెండు నెలలుగా ఒక శరీరాన్ని ప్రేతాత్మ ఆవహిస్తే దాన్ని వదిలించడానికి చాలా సమయం పడుతుంది.. అటువంటిది కొన్ని సంవత్సరాలుగా రెండు ప్రేతాత్మలు ఒకే శరీరాన్ని అంటిపెట్టుకునే ఉన్నాయి.. వాటిని ఆ శరీరం నుంచి వేరు చేయాలంటే దాదాపు అసాధ్యం..!! అలా ప్రేతాత్మలను బంధించే సమయంలో అవి ఆవహించిన మనిషి చనిపోవచ్చు..!! కాబట్టి మనం ఎలాగైనా రుద్ర కి సహాయం చేసే తీరాలి...!!"అదే చెప్పారు గోవింద రావు... వీళ్లిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో చేతిలో కొన్ని తాళపత్రాలు పట్టుకొని రుద్ర అక్కడికి వచ్చాడు.. వాటిని గోవింద రావు ఇస్తూ..!! " స్వామి నేను ఇప్పుడు పూర్తిగా దుష్టశక్తి ఆవాహన క్రతువు కి సిద్ధంగా ఉన్నాను..! ఇది ఆ క్రతువుకి సంబంధించిన తాళపత్రం. రాత్రి క్రతువులో మీరు కూడా ఉంటారు కాబట్టి...మీకు ఉపయోగపడుతుందని తీసుకు వచ్చాను..."అని అన్నాడు.. గోవింద రావు వాటిని తీసుకుని " మంచిది రుద్ర.. ఈ రోజు రాత్రి సరిగ్గా 11 గంటల 30 నిమిషాలకి ముహూర్తం ఉంది.. అర్ధరాత్రి 12గంటలు దాటే లోపు క్రతువు పూర్తి అయిపోవాలి.. లేదంటే శుభ ఘడియలు పోయి, అశుభ ఘడియలు మొదలవుతాయి. అది చాలా ప్రమాదకరం. మనకున్నది కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే.. ఆలోపు ఆ ప్రేతాత్మలని బంధించి తీరాలి...!" హెచ్చరికగా చెప్పారు... ఆయన చెప్పిందంతా జాగ్రత్తగా విన్నాడు రుద్ర.. " సరే స్వామి...!! మీరు చెప్పినట్టుగా నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను..!"అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.. సత్యనారాయణ రావు కూడా చిన్న పని చూసుకోని వస్తానని బయటికి వెళ్లాడు.. గోవింద రావు మాత్రం నేలపై పద్మాసనం వేసుకుని కూర్చుని, ఆ తాళపత్రాలను నిశితంగా పరిశీలించ సాగారు.. ఆ రోజు రాత్రి.... సమయం 11 గంటల ఇరవై నిమిషాలు.. రుద్ర ఇంటి వెనుక భాగంలో క్రతువుకి సంబంధించిన ఏర్పాట్లు చేయబడ్డాయి.. రుద్ర అక్కడికి వచ్చాడు.. మెడలో రుద్రాక్షమాలలతో, నల్లని వస్త్రములు ధరించి, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, చేతిలో దండం వంటి ఒక కర్ర పట్టుకొని చూడడానికి భీతి గొలిపేలా ఉన్నాడు 10 నిమిషాలలో పూజ మొదలు అవుతుంది అనగా రుద్రని తన వద్దకి పిలిచారు గోవింద రావు.. గోవింద రావు రుద్ర తో మాట్లాడుతూ...!! " చూడు నాయనా..!! నేను చదివిన దాని ప్రకారం ఈ క్రతువు చాలా ప్రమాదకరమైనది.. ఎందుకంటే మనం బంధించబోయేది ఒక ప్రేతాత్మ ని కాదు రెండిటిని పైగా అవి చాలా సంవత్సరాలుగా నీ తల్లి జీవశక్తి తీసుకోవడం వలన చాలా దృఢంగా ఉన్నాయి.. వాటి శక్తిని తక్కువగా అంచనా వేస్తే మనలో ఎవరు కూడా ప్రాణాలతో మిగలమూ.. అంత శక్తి వాటికి ఉంది.. కాబట్టి నువ్వు ఇప్పుడు జరిపించే క్రతువులో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా ధైర్యం కోల్పోకుండా ఉండాలి.. అప్పుడే మన ప్రయత్నం విజయవంతమై మీ తల్లి గారి ని కాపాడగలము.."అంటూ జాగ్రత్తలు చెప్పారు.. ఇదిగో ఇవి తీసుకో అంటూ రెండు చెక్క బొమ్మలు చేతిలో పెట్టారు.. " మారేడు చెక్కతో చేసిన నేను మంత్రించిన బొమ్మలు..! ఆ దుష్టశక్తులను బంధించడానికి ఇవే సరైనవి..!!" " తమరి ఆజ్ఞ స్వామి..! మీరు చెప్పినట్టే వింటాను.." అంటూ ఆయన కాళ్ళకు నమస్కరించాడు.. రుద్ర తల్లి గారిని ఒక స్ట్రెచర్ పై క్రతువు జరుగుతున్న చోటికి తీసుకువచ్చారు.. క్రతువులో మొదటిగా చేయవలసిన పని. ఆమె శరీరం నుంచి ప్రేతాత్మలను దూరం చేయాలి.. తరువాత వాటిని ఆ మంత్రించిన చెక్కతో చేసిన బొమ్మలలో బంధించి భూస్థాపితం చేయాలి... ఆ ప్రేతాత్మలని రుద్ర ఆవాహన చేస్తాడు.. అవి దూరం అయిన మరుక్షణం రుద్ర తల్లికి రక్షణ ఏర్పాట్లు గోవింద రావు చేస్తారు.... క్రతువు మొదలైంది....!! మొదట రుద్ర దుష్టశక్తి ఆవాహన ప్రక్రియని ప్రారంభించాడు... పెద్ద వలయం గీసి, అందులో ఒక హోమ గుండాన్ని వెలిగించారు... రుద్ర అందులో సమిధలు వేస్తూ మంత్రోచ్ఛారణ చేయసాగాడు.. ఆ హోమగుండం ముందు కుంకుమ తో ముగ్గు వేసి అందులో గోవింద రావు ఇచ్చిన బొమ్మలు ఉంచాడు... వాటిపై కుంకుమ జల్లుతూ మంత్ర పఠనం చేస్తూ ఉండగా... అక్కడ స్ట్రెచర్ పై ఉన్న రుద్ర తల్లి శరీరం గిలగిలా కొట్టుకోసాగింది.. కొంతసేపటికి అలా గిలగిలా కొట్టుకుంటూ ఆమె ఆగిపోయింది.. ఆమె కొట్టుకోవడం ఆగిపోయిన వెంటనే రుద్ర ముందు పడుకొబెట్టి ఉన్న రెండు బొమ్మలు లేచి నుంచున్నాయి.. అది గమనించిన గోవింద రావు మరుక్షణం భద్ర తల్లి చుట్టూ ఒక వలయం గీసి, దాని లోపలకి ఏ దుష్ట శక్తి వెళ్లకుండా, శక్తి ఆవాహన ప్రక్రియను మొదలుపెట్టారు.. అటువైపు రుద్ర ఆ ప్రేతాత్మ లను ఆ బొమ్మలలో బంధించడానికి తన మంత్ర శక్తితో శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.. కానీ అవి ఏ మాత్రం తగ్గటం లేదు.... సమయం గడిచిపోతోంది... క్రతువు పూర్తి అవుతుంది అనగా ఆ సమయంలో ఒక్కసారిగా రుద్ర కూర్చున్న వలయంలో గాలి బలంగా వీచింది.. అతని ముందు ఉన్న బొమ్మలు దూరంగా ఎగిరి పడ్డాయి.. ఆ బొమ్మలు ఎగిరిపడ్డగానే అవి రుద్ర ని దూరంగా విసిరి కొట్టాయ్.. వలయం నుంచి ఎగిరి పడ్డాడు రుద్ర.. రుద్ర గీసిన వలయం నుంచి అవి బయటకు వేగంగా రుద్ర తల్లి వైపు వెళ్ళసాగాయి.. అవి వేగంగా రుద్ర తల్లి మీదకి వెళ్ళగా.. ఆమె చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ కవచం వాటిని అడ్డుకుంది... కానీ అవి వదలకుండా రక్షణ కవచం మీద దాడి చేయసాగాయి.. ఆ రక్షణ కవచం గోవింద రావు ఏర్పాటు చేసినది.. అక్కడ కూర్చుని శక్తి కవచాన్ని ఏర్పాటు చేశారు.. నిరంతరం మంత్ర పఠనం వల్ల దానికి శక్తి చేకూరుతుంది.. అవి ఆ విషయం గ్రహించి నేరుగా అక్కడ పూజలో కూర్చున్న గోవింద రావు పై దాడి చేయడం మొదలు పెట్టాయి... అవి దాడి చేయడం వల్ల గోవింద రావు శరీరం కంపించసాగింది.. మెల్లగా ఆయన ముక్కు నుంచి రక్తం రావడం ప్రారంభమైంది.. దూరంగా గమనించిన రుద్ర వేగంగా ఆయనవైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా.... రుద్ర ని సత్యనారాయణ రావు పట్టుకుని ఆపేశాడు... " నన్ను ఆపకండి.. ఆయన చాలా ప్రమాదం లో ఉన్నారు. నా సాయం అవసరం.."అని రుద్ర అంటుండగా... " ఇదంతా ముందుగానే గురువు గారికి తెలుసు..! ఈ పరిస్థితి వచ్చిన వెంటనే నాకు ఏం చెయ్యాలో ముందుగానే చెప్పారు..! వెంటనే ఆ బొమ్మలను వెతికి క్రతువు ప్రారంభించాలి.. లేకపోతే అందరి ప్రాణాలకి చాలా ప్రమాదం..!! గురువుగారి చెప్పినట్టు ఇక మనకి పది నిమిషాలు మాత్రమే ఉంది." అంటూ సత్యనారాయణ రావు చెప్పగానే.. రుద్ర వెంటనే ఆ బొమ్మలని వెతకసాగాడు.. ఒక 5 నిమిషాల తరువాత అతని ప్రయత్నం ఫలించి, ఆ రెండు బొమ్మలు దొరికాయి... రుద్ర ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిరిగి హోమగుండం దగ్గర పూజ ప్రారంభించాడు.. మరోవైపు ఆ ప్రేతాత్మల దాడి వల్ల గోవింద రావు శరీరం చిగురుటాకులాగా వణికిపోతోంది.. ముక్కు నుండి రక్తం కారుతూనే వుంది.. ఇంకొక్క నిమిషంలో పూజ ముగుస్తుంది అనగా తన ముందు ఉన్న రెండు బొమ్మలని తీసి గోవింద రావు వైపు విసిరి వేసాడు..రుద్ర. ఆ బొమ్మలు రెండు ఎగురుకుంటూ వెళ్లి, గోవింద రావు ముందు పడ్డాయి.. అలా పడిన వెంటనే వాటి నుంచి ప్రకాశవంతమైన వెలుగులు పుట్టి, ఆ రెండు ప్రేతాత్మలు ఆ బొమ్మల లోపలికి వెళ్ళి పోయాయి.. అవి వెళ్ళిపోయిన మరుక్షణం అప్పటివరకు కళ్ళు మూసుకొని మంత్రాలు జపిస్తున్న గోవింద రావు ఉన్నట్టుండి ఓ పక్కకి ఒరిగి పడిపోయారు... ముక్కునుంచి నిరంతరంగా రక్తం కారడం వల్ల, ఆయన ఛాతి భాగం మొత్తం రక్తంతో తడిసిపోయింది... మిగిలిన వారు వెంటనే అక్కడి నుంచి గోవింద రావుని, రుద్ర తల్లిని హాస్పిటల్ కి తరలించారు.... ఇంకా ఉంది....!!!
13-03-2026, 07:55 AM
Hats off andi Siva garu.. asalu story mamulu gaa ledhandi..
Keep going.. mimmalni pogadadaniki inka naa daggara padalu levandi SUPER.. EXCELLENT.. AWESOME..MARVEVLLOUS
13-03-2026, 08:44 AM
Baboi.. someone really knows inside details of black magic!!
Black magic ani simple ga anestam kaani.. it is too complex to even comprehend!! Great going siva garu
14-03-2026, 06:44 AM
Part - 18
గోవింద రావు కి, రుద్ర తల్లి కి, మారేడుమిల్లి లో ఉన్న మెడికల్ క్యాంపు లో ప్రథమ చికిత్స చేసి, అక్కడినుంచి అంబులెన్స్లో రాజమండ్రి లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.. మారేడుమిల్లి లో బయలుదేరుతుండగానే పురుషోత్తం, రఘునాథ రెడ్డి కి ఫోన్ లో జరిగినదంతా చెప్పాడు. ఆయన వెంటనే వాళ్లు రాజమండ్రి చేరుకునేసరికి అన్ని ఏర్పాట్లు చేశారు.. గోవింద రావు ని, రుద్ర తల్లిని వెంటనే ఐసీయూలో పెట్టి చికిత్స చేయడం ప్రారంభించారు.. ప్రత్యేకమైన కేర్ తీసుకోవడం వల్ల, గోవింద రావు మూడు రోజులకే ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.... కానీ బాగా బలహీనంగా ఉండడం వల్ల, రుద్ర తల్లి కి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది.. గోవింద రావు సృహ లోకి వచ్చాక, రఘునాథ రెడ్డి ఆయనను హాస్పిటల్లో కలుసుకున్నాడు.. "బాగున్నారా స్వామి..? ఇప్పుడు తమరికి ఎలా ఉంది?" "అంతా ఆ దుర్గ మాత దయ..!! ఇప్పుడు బాగానే ఉన్నాను..!! మీరు ఎప్పుడు వచ్చారు..?" " తమరికి సృహా వచ్చిందని తెలిసి, ఈరోజు ఉదయాన్నే వచ్చాను.." " అన్నట్లు అడగడం మర్చిపోయాను..? రుద్ర తల్లి గారికి ఎలా ఉంది.?" "ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. కానీ బాగా బలహీనంగా ఉండటం వల్ల, కోలుకోవడానికి ఇంకో వారం పది రోజులు పడుతుందని చెప్పారు.." "మంచిది..!! ఆ దేవుడి దయ వల్ల ఆమె పరిస్థితి ఇప్పుడు బాగుపడింది." " నిజంగా ఆ గొప్పతనం అంతా తమరిదే స్వామి..! ఆమె ఈ రోజున ఇలా ఉన్నదంటే తమరు చేసిన సాయమే...!!" ఇలా మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ గారు పిలుస్తున్నారు అని నర్స్ చెప్పగా రఘునాథరెడ్డి బయటకు వెళ్లాడు.. ఇంతలో కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తున్న గోవింద రావు కి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చి "రావు...!"అని గట్టిగా పిలిచారు.. ఆ పిలుపుకి బయట నుంచొని పురుషోత్తం తో మాట్లాడుతున్న సత్యనారాయణ రావు వేగంగా ఆ గదిలోకి వచ్చాడు... " ఏమైంది చిన్నాన్న.? ఏదైనా సమస్య..!!??" "అమావాస్యకి ఇంకా ఎన్నిరోజులు ఉంది..?" " ఈరోజు అష్టమి చిన్నాన్న..!! ఇంకా ఆరు రోజులు ఉంది..!!" గోవింద రావు ఆందోళనగా...!! " మనం వెంటనే శ్రీశైలం బయలుదేరాలి.. అమావాస్య ఘడియలు దగ్గర పడ్డాయి.. ఈ సమయంలో ఆదిత్య కి దగ్గరగా ఉండాలి.. లేదంటే వాడి ప్రాణానికే ప్రమాదం..!" " కానీ చిన్నాన్న..!! ఇంకా మీరు పూర్తిగా కోలుకోలేదు..!" " రేయ్ రావు...! వాడి పరిస్థితి తెలిసుండి, నువ్వే ఇలా మాట్లాడగలుగుతున్నావా..!? అసలు మనం ఇక్కడికి వచ్చింది వాడి ప్రాణాలు కాపాడటం కోసమే కదా..!! కానీ ఇప్పుడు నా ప్రాణాలు కోసం నేను పాకులాడలేను..!! వెంటనే బయలుదేరి వెళ్దాం పద..!! రుద్ర ని కూడా మనతో వస్తాడేమో అడుగు.. రాలేకపోయినా పర్వాలేదు..!! ఎందుకంటే అతని తల్లి ఆరోగ్య పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మనం బలవంత పెట్టడం సమంజసం కాదు..!! వెంటనే రెడీ అవ్వు..!?" అంటూ మంచం మీద నుంచి లేవబోతు ఉండగా తొలి ముందుకి పడిపోబోయారు గోవింద రావు.. "చిన్నాన్న...!!??" అంటూ గోవింద రావు ని పట్టుకున్నాడు సత్యనారాయణ రావు.. అరుపు విని అక్కడే బయట మాట్లాడుకుంటున్న డాక్టర్, రఘునాథరెడ్డి ఇద్దరు వేగంగా లోపలికి వచ్చారు.. గోవింద రావు నీ మంచం మీద పడుకోబెట్టడానికి రఘునాథరెడ్డి కూడా సహాయం చేశారు.. " ఏమైంది...? ఎందుకు ఇలా పడిపోయారు..??"అని డాక్టర్ అడుగగా.. జరిగినదంతా వివరించాడు సత్యనారాయణ రావు... ఆ మాటలకి డాక్టర్ చిన్నగా గోవింద రావు గారి మీద కోప్పడుతూ... " చూడండి సార్..!! మీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు.. మీ శరీరం నుంచి రక్తం చాలా పోయింది.. మీరు బాగా నీరసంగా ఉన్నారు.. కనీసం ఐదు రోజులైనా సరే మీరు మంచం దిగకూడదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలే సమస్య లేదు.."అని చెప్పి బయటకు వెళ్లిపోయారు... అక్కడే ఉన్న రఘునాథరెడ్డి కూడా డాక్టర్ ని సపోర్ట్ చేస్తూ...!! " స్వామి..!! దయచేసి ఈ ఒక్క అయిదు రోజుల పాటు మంచం దిగకుండా ఉంటే మీరు కోలుకుంటారు.. మీరు కోలుకున్న వెంటనే శ్రీశైలం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను... దయచేసి అర్థం చేసుకోండి." అని గోవింద రావు తో చెప్పి, "ఏదైనా అవసరం ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి.." అని సత్యనారాయణ రావు తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు.. రఘునాథ రెడ్డి వెళ్ళిపోయిన కొద్ది నిమిషాల పాటు, గోవింద రావు ఏమీ చేయలేక మౌనంగా ఆలోచిస్తూ ఉండి పోయారు.. ఆలోచిస్తు ఏదో గుర్తొచ్చి, సత్యనారాయణ రావు తో " ఆదిత్య ఏమైనా ఫోన్ చేశాడా...?? " అని అడిగారు. "మనం రుద్ర ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేశాడు.. తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదు.. నేను కూడా ఏమి పట్టించుకోలేదు... నీకు ఇలా ఉందని తెలిస్తే వాడి బాధ పడతాడని నేను కూడా వాడికి ఫోన్ చేయలేదు.." "సరే...!! ఒకసారి వాడికి ఫోన్ చెయ్ మాట్లాడాలని ఉంది.."అని చెప్పగానే సత్యనారాయణ రావు ఆదిత్య కి ఫోన్ చేసి గోవింద రావు కి ఇచ్చాడు. ఫోన్ ఎత్తగానే "ఆదిత్య ఎలా ఉన్నావు రా.?" అని అడిగాడు గోవింద రావు... "ఆ తాతగారు నేనండీ భానుని..!! ఎలా ఉన్నారు..? బాగున్నారా..?? ఆదిత్య గారు ఫోను మర్చిపోయి బయటికి వెళ్లారు..!ఏదైనాఅర్జెంట్ ఆ...?? వచ్చాక చెప్పమంటారా..??"అంటూ భాను మాట్లాడింది.. " ఆ వద్దులే తల్లి..!! మామూలుగా కాల్ చేశాను..! వాడు ఎలా ఉన్నాడు..? బాగానే ఉన్నాడా..అమ్మా..?" " ఆ బాగానే ఉన్నారు. తాతగారు...!!" " మంచిది తల్లి..! వస్తే అడిగానని చెప్పు..!! వీలుంటే ఫోన్ చేయమని చెప్పు..!! ఉంటాను.." " అలాగే తాతగారు చెప్తాను.."అంటు ఫోన్ కట్ చేసింది... "ఏమైంది చిన్నాన్న..? ఎలా ఉన్నాడు వాడు..?" " ప్రస్తుతానికి వాడు బాగానే ఉన్నాడు రా...!! కానీ అమావాస్య ఘడియలు దగ్గర పడుతున్నాయి.. నేను కోలుకున్న వెంటనే వీలైనంత తొందరగా మనం శ్రీశైలం చేరుకోవాలి.." " అలాగే చిన్నాన్న..!! మీరు రెస్ట్ తీసుకోండి నేను బయటికి వెళ్లి చిన్న పని చూసుకుని వస్తాను..." అంటూ హాస్పిటల్ గది నుంచి బయటకు వచ్చాడు... వేగంగా అక్కడినుంచి హాస్పిటల్ బయటకు వచ్చి హాస్పిటల్ వెనక ఉన్న ఒక చెట్టు కింద కుర్చీలో కూర్చున్నాడు... కంగారుగా తన జేబులో ఉన్న మొబైల్ తీసి, ఫోన్ చేశాడు... ఆ ఫోన్ ఎవరితో కాదు ఆదిత్య కి.... రింగ్ అయిన మొదటి క్షణాల్లోనే అవతలివైపు ఫోన్ ఎత్తారు... అవతల మాట్లాడేది భాను... " అమ్మ భాను..!! ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉందమ్మా..??" అంటూ కంగారుగా అడిగాడు.. " పరిస్థితి ఏమీ బాగోలేదు అంకుల్..!! మీరిద్దరూ వెంటనే వస్తే మంచిదని తాతగారు అంటున్నారు.. ఆయన పరిస్థితి చూస్తే నాకు చాలా భయంగా ఉంది.."అంటూ ఏడవసాగింది. " భయపడకు బాను.. ఇక్కడ చిన్నాన్న పరిస్థితి కూడా అస్సలు బాగోలేదు.. ఈ పరిస్థితుల్లో ఆదిత్య గురించి తెలిస్తే ఆయన ఆరోగ్యం మరింతగా పాడవుతుంది.. మేము ఇంకో నాలుగు ఐదు రోజుల్లో అక్కడికి వచ్చేస్తాము.. అప్పటివరకు వాడిని జాగ్రత్తగా చూసుకోండి.." " అలాగే అంకుల్..!! తాతయ్యగారు జాగ్రత్త...!" అంటూ ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది.. " ఆదిత్య గారికి ఏమైంది సార్...??" అన్న పిలుపుకి సత్యనారాయణ రావు ఉలిక్కిపడ్డాడు.. వెనక్కి తిరిగి చూడగా అతని వెనకాల పురుషోత్తం ఉన్నాడు... "ఏమైంది సార్ ఆదిత్య గారికి...?" అని మళ్లీ అడిగాడు పురుషోత్తం.. ఏమి సమాధానం చెప్పకుండా తన పక్కన ఉన్న కూర్చుని చూపిస్తూ కూర్చోమన్నట్టు సైగ చేసాడు సత్యనారాయణ రావు... కూర్చున్న తర్వాత పురుషోత్తం మళ్ళీ అడిగాడు "చెప్పండి సార్ అసలు ఏమైంది..??" " ఆదిత్య పరిస్థితి అసలు బాగాలేదు పురుషోత్తం..!" " సార్....! దయచేసి పూర్తిగా చెప్పండి. నేను టెన్షన్ తట్టుకోలేక పోతున్నాను.." " నీకు గుర్తుంది కదా మనం విజయవాడ నుంచి మారేడుమిల్లి ఉదయం బయలుదేరే ముందు భాను నుంచి గోవింద రావు గారికి ఫోన్ వచ్చింది..!!" " ఏమని వచ్చింది సార్...??" " అప్పుడు చిన్నాన్న స్నానం చేస్తూ ఉన్నారు.. ఫోన్ నేను ఎత్తి మాట్లాడాను..!" "ఆ తర్వాత ఏమని చెప్పారు సార్...!!" జరిగిందంతా చెప్తాను విను... భాను : అంకుల్ నేను తాతగారితో అర్జెంటుగా మాట్లాడాలి..( కంగారు పడుతూ.) సత్యనారాయణ రావు: ఏమైందమ్మా..? తాతగారు స్నానం చేస్తూ ఉన్నారు. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే చెప్పు....!! నేను ఆయనతో చెప్తాను.. భాను ఏడుస్తూ: ఇక్కడ ఆదిత్య గారి పరిస్థితి అస్సలు బాలేదు. అంకుల్... తాతయ్య గారు కంగారుపడుతున్నారు. నిన్నటి నుంచి మీ ఫోన్ కోసం ప్రయత్నిస్తున్నాను.. కానీ ఇప్పటికీ కలిసింది.. సత్యనారాయణ రావు కంగారు పడుతూ: అసలు ఏమైంది అమ్మ..? నాతో చెప్పు!! భాను: ఆ రోజు మీరు ఊరికి బయలుదేరేటప్పుడు సాయంత్రం నా పుట్టినరోజు పార్టీ జరిగింది.. ఆ రోజు రాత్రి పార్టీ అయిపోయిన తర్వాత నేను ఆదిత్య గారి కోసం ఆయన గదికి పాలు తీసుకు వెళ్ళాను.. కానీ ఆయన గదిలో లేరు. నేను మొత్తం వెతికి చూడగా మేడపైన ఒంటరిగా కూర్చుని ఉన్నారు.. " ఏంటి సార్..! ఒంటరిగా మేడపైన ఏం చేస్తున్నారు.? అని అడిగాను.కానీ ఆయన సమాధానం చెప్పకుండా రోడ్డు వైపు చూడసాగారు.. ఆయన అలా పలకక పోయేసరికి, నేను ఆయన పక్కగా వెళ్లి "ఏంటి సార్...? అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు..?" అని అడిగాను.. అయినా సరే ఆయన మాట్లాడకుండా అటు వైపే చూడసాగారు.. "అసలు అక్కడ ఏముంది..?" అని నేను ఆయన చూస్తున్న వైపు చూశాను.. అక్కడ..?? అక్కడ...??" అంటూ చెప్పడం ఆపేసింది... సత్యనారాయణ రావు:"అక్కడ ఏముంది..? చెప్పమ్మా భాను...??" భాను: అంకుల్...!! చెప్తే నమ్మరు...! అక్కడ ఒక పెద్ద నల్లటి ఆకారంలో ఒక పిశాచి వంటిది. మా ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ కనిపించింది.. అది ఎటువైపు తిరుగుతుంటే ఆదిత్య గారు అటువైపే చూడసాగారు.. నాకు మాత్రం భయంతో ఒళ్ళంతా చమటలు పట్టేసాయి.. నేను భయంతో అక్కడ నుంచి వేగంగా పరుగెత్తుకొని వెళ్లి, మా తాతయ్య గారిని తీసుకు వచ్చాను. ఆయన కూడా ఆ ఆకారాన్ని చూశారు.. తాతయ్య గారు వెంటనే ఆదిత్య గారిని గది లోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా ఆయన అక్కడ నుంచి కదలడం లేదు. దాని వైపే చూస్తూ ఉన్నారు... ఇంకా తాతగారు చేసేదేమీ లేక, వెంటనే పూజ గది లోకి వెళ్లి, ఒక మంత్రించిన రక్ష తీసుకువచ్చి, ఆయన చేతికి కట్టారు... అది కట్టిన వెంటనే మొదలు నరికిన చెట్టులాగా ఆదిత్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు.. మేము వెంటనే ఆయన్ని గదిలోకి పడుకోబెట్టి, వచ్చేసాము.. ఆ తర్వాత రోజు నుంచి ఆయన అసలు మంచం మీద నుంచి లేవలేదు.. ఏమీ తినలేదు,తాగలేదు. ఒక రోజు రాత్రి మేమందరం పడుకుని ఉండగా అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళి పోతూ ఉండగా.. మా పని వాళ్ళు ఆయనని అడ్డగించి ఆపారు... లేకపోతే బయటికి వెళ్లి పోయే వారే..!! ఇప్పుడు అయితే పరిస్థితి మరీ ఘోరంగా మారింది...నిన్నటి నుంచి " నన్ను ఎవరో పిలుస్తున్నారు.. నన్ను వదలండి..! నన్ను ఆపడానికి మీరెవ్వరూ....??" అంటూ గొడవ చేస్తున్నారు.. ఆయన పరిస్థితి చూస్తుంటే చాలా బెంగగా ఉంది అంటూ ఏడవసాగింది... సత్యనారాయణ రావు : చూడు తల్లి...! వాడి పరిస్థితి తెలిసే మీ ఇంట్లో ఉంచడం జరిగింది. వాడు కనుక మీ ఇంట్లో లేకపోతే వాడి ప్రాణానికి చాలా ప్రమాదం. దయచేసి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కదలకుండా చూడండి.. మేము రుద్ర ని కలవడానికి వెళ్తున్నాము.. తాతయ్య గారి పరిస్థితి కూడా బాలేదు.. ఇప్పుడు ఈ విషయం తెలిసింది అంటే రుద్రని వెతకడం మానేసి వెంటనే అక్కడికి వచ్చేస్తారు.. అదే కనుక జరిగితే ఆదిత్య ని కాపాడే ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.. కాబట్టి మీరే ఏదో విధంగా మేము వచ్చేవరకు వాడిని కాపాడండి. వచ్చే అమావాస్య లోగా శ్రీశైలం వచ్చేస్తాము... భాను : అలాగే అంకుల్..! ఈ విషయాన్ని నేను తాతయ్య గారి తో చెప్తాను.. మీరు వీలైనంత త్వరగా వచ్చేయండి... అంటూ ఫోన్ పెట్టేసింది.. ఇది జరిగింది పురుషోత్తం.." అంటూ సత్యనారాయణ రావు జరిగిందంతా చెప్పాడు... " మరి ఇప్పుడు ఎలాగా సార్..? ఇక్కడ తాతయ్య గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. అక్కడ ఆదిత్య గారి పరిస్థితి బాలేదు. రుద్ర గారు కూడా తల్లిని వదిలేసి వచ్చే పరిస్థితుల్లో లేరు."అంటూ బాధపడసాగాడు.. " నాకు అదే అర్థం కావట్లేదు పురుషోత్తం..!! ఆ దేవుడే మాకు ఒక దారి చూపాలి..!" అంటూ బాధపడసాగాడు సత్యనారాయణ రావు.. " సార్..!! గోవింద రావు గారికి చెప్పకుండా, రుద్ర గారికి ఆదిత్య గారి పరిస్థితి గురించి చెప్పి ఊరు తీసుకు వెళ్తే మంచిదేమో అని నాకనిపిస్తోంది..!!" " వద్దు పురుషోత్తం..!! రుద్ర తల్లి గారికి ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకోలేదు.. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు.. చిన్నాన్న గారి ని వదిలి వెళ్ళడం కూడా కుదరదు.. ఎందుకంటే ఆయన లేకుండా రుద్ర ఒక్కడే ఆదిత్యని కాపాడగలడు అని నేను అనుకోవడం లేదు..!! ఇక ఏది జరిగితే అదే జరుగుతుంది..!! చిన్నాన్నగారు లేకుండా నేనొక్కడినే శ్రీశైలం వెళ్లడం జరగదు.." ఆ మాటలు విన్న పురుషోత్తంకి కూడా సత్యనారాయణ చెప్పిందే సమంజసమని అనిపించింది..!! అలా ఒక నాలుగు రోజులు గడిచాయి....!! అనగా అమావాస్య కి రెండు రోజులు ముందు..! హాస్పిటల్లో...!! గోవింద రావు గారి గది లో....! డాక్టర్ గారు గోవింద రావు గారిని పరీక్షిస్తున్నారు.. కొంతసేపటికి పరీక్షలన్నీ పూర్తయ్యాయి.. "గోవింద రావు గారు రేపు సాయంత్రం మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాను.. ఇప్పుడు మీరు పూర్తిగా కోలుకున్నారు..." " డాక్టర్ గారు నాకు అర్జెంటు పని ఉంది. నేను ఈ రోజు సాయంత్రానికి బయలుదేరాలి అనుకుంటున్నాను.." " అయ్యో..!! ఇంకొక టెస్ట్ మిగిలిపోయి ఉంది అదొక్కటి చేసిన తర్వాత కావాలంటే రేపు మధ్యాహ్నం నుంచి బయలుదేరవచ్చు.."అని చెప్పి డాక్టర్ అక్కడనుంచి వెళ్ళిపోయాడు.. ఇప్పుడు గదిలో సత్యనారాయణ రావు గోవింద రావు మాత్రమే ఉన్నారు... "ఇప్పుడే వస్తాను చిన్నాన్న...!" అంటూ సత్యనారాయణ రావు బయటికి వెళ్లాడు. సత్యనారాయణ రావు అలా వెళ్లడంతో.. మంచం మీద కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉండగా.. టేబుల్ పైన ఫోన్ మోగింది.. అది సత్యనారాయణ రావు ది...!! మరిచిపోయి బయటకు వెళ్లిపోయారు...!! ఎవరా అని చెప్పి ఫోను స్క్రీన్ మీద పేరు చూడగా ఆదిత్య అని వచ్చింది... ఆనందంతో ఫోన్ ఎత్తారు గోవింద రావు.. హలో అంటూ అనబోయి లోపు.. అటువైపు నుంచి భాను ఏడుపు వినిపించసాగింది... " హలో అంకుల్..!! ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అంకుల్ మీరు రావడానికి...?? త్వరగా వచ్చేయండి.. ఇక్కడ ఆదిత్య గారి పరిస్థితి అస్సలు బాగోలేదు.. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.. ఎలాగైనా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు.. అందుకని వేరే దారిలేక అయినను మంచానికి కట్టివేసాం.... దయచేసి మీరు వెంటనే బయలుదేరండి.." అంటూ మాట్లాడుతూ ఉండగా వెనకనుంచి ఏవో అరుపులు వినిపించసాగాయి.." అంకుల్..! నేను మీకు మళ్ళీ చేస్తాను...!!" అంటూ కంగారుగా ఫోన్ పెట్టేసింది.. గోవింద రావు గారికి ఒక క్షణం మతి పోయింది... అప్పుడే సత్యనారాయణ రావు గది లోపలికి వచ్చారు... " రేయ్ రావు...!! ఆదిత్య ఏమైనా ఫోన్ చేశాడా..?" అని సత్యనారాయణ రావు అని అడిగారు.. సత్యనారాయణ రావు కొద్దిగా తడబడుతూ.. " హా.. చేశాడు చిన్నాన్న.. ఇవాళ పొద్దున్నే చేశాడు.. మీ గురించి అడిగాడు. నేను పని మీద బయటకు వచ్చాను అని చెప్పడంతో తర్వాత చేస్తాను అని చెప్పాడు.." ఆ మాటలు విన్న గోవింద రావు కి కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి.. " ఏరా రావు..!! నువ్వు కూడా నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావా..??" అని అడగడంతో సత్యనారాయణ రావు కి ఒక్కసారిగా దడ మొదలైంది.. " అదేంటి చిన్నాన్న..!! ఇప్పుడు ఏమైందని..??" " ఇప్పుడే భాను ఫోన్ చేసింది రా...!! నువ్వు అనుకుని అక్కడ ఆదిత్య పరిస్థితి గురించి నాతో పూర్తిగా చెప్పింది..!!" సత్యనారాయణ రావు గబగబా గోవింద రావు దగ్గరకు వచ్చి ఆయన చేతులు పట్టుకొని " నన్ను క్షమించు చిన్నాన్న..!! వాడి గురించి తెలిస్తే నువ్వు ఏమైపోతానో అని భయపడి చెప్పలేదు.ఎలాగైనా రుద్ర సహాయం తీసుకుని వాడిని కాపాడదామని అనుకున్నాను.." " నీ గురించి నాకు తెలుసు రా..!! కానీ ఇప్పుడు వాడు పరిస్థితులు బాగో లేదని ఆ పిల్ల ఏడుస్తూ చెబుతోంది.. ఇక మనం ఎట్టి పరిస్థితులలోనూ ఆగడానికి వీలులేదు.. వెంటనే బయలుదేరాలి." అంటూ చాలా దృఢంగా చెప్పారు.. సత్యనారాయణ రావుకు తన చిన్నాన్న గురించి తెలుసు.. ఏదైనా దృఢంగా అనుకున్నారంటే ఎట్టిపరిస్థితులలోనూ ఆగరు.. అందుకనే తన కూడా ఏమీ అడ్డుచెప్పకుండా వెంటనే అక్కడి నుంచి బయల్దేరడానికి ఏర్పాట్లు చేయసాగారు... రఘునాథ రెడ్డి కి ఫోన్ లో జరిగిందంతా చెప్పాడు సత్యనారాయణ రావు.. ఆయన కూడా సరేనని ఇప్పుడు బస్సులో వెళితే మీద త్వరగా చేరుకోలేరని, అందుకే పురుషోత్తముని కార్లో తీసుకెళ్ళమని చెప్పారు.. ఆరోజు మధ్యాహ్నమే పురుషోత్తం తో కలిసి ముగ్గురు శ్రీశైలం బయలుదేరారు....
14-03-2026, 09:57 PM
Yesterday, 06:44 AM
Part - 19
మధ్యాహ్నం రెండు గంటలకి వారి ప్రయాణం మొదలైంది...
ఆదిత్య పరిస్థితి బాగోలేదనే కంగారులో రుద్ర కి చెప్పకుండానే బయలుదేరారు... "పురుషోత్తం..! మనం ఎంత సేపట్లో శ్రీశైలం చేరుకోగలం...?"అని అడిగారు గోవింద రావు. "స్వామి..! ఇక్కడ నుంచి శ్రీశైలం నాలుగు వందల కిలోమీటర్ల పైనే ఉంది.. మనం ఎంత వేగంగా వెళ్ళిన, రోడ్డు బాగుంటే 9 గంటల పైనే ప్రయాణం ఉంటుంది.." అలా పురుషోత్తం సమాధానం చెప్పగానే ఇంకేమీ మాట్లాడలేదు గోవింద రావు... అలా ఒక 5 గంటల ప్రయాణం తరువాత వినుకొండ చేరుకున్నారు.... భోజనం చేయకుండానే బయలుదేరిన అందువల్ల ప్రయాణ అలసట తీర్చుకోవడానికి అక్కడ భోజనం చేసి ఒక గంట సేపు ఆగారు.. తిరిగి ప్రయాణం మొదలు పెట్టే సరికి రాత్రి 8 గంటలు దాటింది.... అలా బయలుదేరిన మరో మూడు గంటల తర్వాత........!!! కారు శ్రీశైలం వైపు వేగంగా పరుగులు తీస్తోంది.. కారు లో గోవింద రావు, సత్యనారాయణ రావు నిద్రపోతున్నారు... పురుషోత్తం మాత్రం అలా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు... అమావాస్య ముందు రోజులు కావడంచేత రోడ్డు అంతా చీకటిగా ఉంది... ఎప్పుడో కానీ ఒక వాహనం రోడ్డుమీద కనిపించడం లేదు.... రోడ్డు కి రెండువైపులా లైట్ పోల్స్ ఉండడం వల్ల రోడ్డు క్లియర్ గా కనిపిస్తోంది... అలా కారు వెళుతూ ఉండగా.... కార్లో పడుకొని ఉన్న గోవింద రావు గారు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచి, డ్రైవింగ్ చేస్తున్న పురుషోత్తం భుజంపై చేయి వేసి కారు ఆపు అని అరిచారు.... గోవింద రావు గారు చెయ్యి వేసినప్పుడే పురుషోత్తం ఉలిక్కిపడ్డాడు ఆయన అరిచేసరికి సడన్ బ్రేక్ తో రోడ్డు పక్కకి కార్ ని ఆపేశాడు... కారు అలా సడన్గా ఆగడంతో పడుకుని ఉన్న సత్యనారాయణ రావు ఒక్కసారిగా ముందుకి పడిపోయాడు.... అలా పడిపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి "ఏమైంది పురుషోత్తం....??" అంటూ అరిచాడు... " నేను కావాలని ఆపలేదు సార్..! స్వామి ఆపమన్నారు....." పక్కనే రోడ్డు వైపు చూస్తూ మాట్లాడకుండా ఉన్న గోవింద రావు తో "ఏమైంది చిన్నాన్న..?" అని అడిగాడు.. గోవింద రావు మాత్రం ఏమీ మాట్లాడకుండా కారు దిగారు.. ఆయనతో పాటే ఇద్దరూ కార్ నుంచి దిగారు. సత్యనారాయణ రావు గోవింద రావు పక్కకు వచ్చి కంగారుగా "ఏమైంది చిన్నాన్న..? ఏమి మాట్లాడరే..? ఏదైనా సమస్య..??" అని అడిగాడు. " అది మన కోసం ఎదురుచూస్తోంది..! " " అది అంటే..? ఏది చిన్నాన్న..??" " అదే...! ఆదిత్యని పట్టి పీడిస్తున్న రాకాసి. మనం వస్తున్నామని మన కోసం ఎదురుచూస్తోంది" ఆ మాటల విన్న పురుషోత్తం కి, సత్యనారాయణ రావు కి, బుర్ర తిరిగినంత పనయ్యింది.. "పక్కనే ఉన్న తుమ్మలబైలు మూడు కిలోమీటర్లు అన్న సైన్ బోర్డు సత్యనారాయణ రావుకి కనిపించింది.." " నువ్వు చెప్పింది నిజమే చిన్నాన్న.. మనం ఆ ప్రదేశానికి దగ్గరలోనే ఉన్నాము. ఇప్పుడు ఎలా మనం దానిని దాటుకుని వెళ్ళేది..??" " పురుషోత్తం టైమ్ ఎంత అవుతుంది..??" పురుషోత్తం తన తన సెల్ఫోన్లో చూసి, "11.45 అయ్యింది స్వామి..!!" " సరే.....!! మనం ఎలాగైనా ఆదిత్యని చేరుకోవాలి. పురుషోత్తం నేను చెప్పినట్టు విను..!!" " చెప్పండి స్వామి..!!" "ఎలాగైనా 15 నిమిషాలు లోపు మనం తుమ్మలబైలు దాటాలి.. ఎందుకంటే అమావాస్య ఘడియలు దగ్గర పడే కొద్దీ దాని శక్తి పెరిగి పోతూనే ఉంటుంది.. కాబట్టి మనం ఈ ప్రదేశాన్ని ఆ సమయంలో లోపే దాటాలి. కారు కూడా వేగంగా నడపొద్దు.. అలాగని ఏది అడ్డు వచ్చినా, ఏం జరిగినా సరే కారు ఆపొద్దు.. చుట్టుపక్కల ఏమి కనిపించినా సరే భయపడకు...! సరేనా...!" నా మాటలు విన్న పురుషోత్తం భయంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.. " ఏం పురుషోత్తం మాట్లాడవే...??" " ఏమీ లేదు స్వామి.. కొంచెం భయంగా ఉంది.." ఆ మాటలకి గోవింద రావు చిన్న చిరునవ్వు నవ్వి.."నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. అది నిన్ను ఏమీ చేయలేదు. కేవలం భయపెడుతుంది. అంతే...!!" ఆ మాటలకి కొంత ధైర్యం తెచ్చుకున్నాడు పురుషోత్తం.."సరే స్వామీ...మీరు చెప్పినట్లే వింటాను. ఇక బయలుదేరుదాం." అంటూ కార్ ఎక్కాడు... మొదట గోవింద రావు కారు ఎక్కారు. ఆ తర్వాత సత్యనారాయణ రావు కార్ ఎక్కాడు... కార్ బయలుదేరింది.. గోవింద రావు చెప్పిన మాటలు మనసులో ఉంచుకున్నాడు పురుషోత్తం.. కార్ ని మాత్రం స్పీడ్ గా తోలటం లేదు.. కారు రోడ్డుపై మెల్లగా వెళ్తోంది.... కారు బయలుదేరిన పదినిమిషాల తర్వాత తుమ్మలబైలు ప్రాంతానికి కారు చేరుకుంది.. ఉన్నట్టుండి హఠాత్తుగా పెద్దగా వాన మొదలైంది.... ఉన్నట్టుండి వర్షం ఏంటో పురుషోత్తం కి అర్థం కాలేదు.. కానీ ఇది దాని పనేనని అంతకుముందు అనుభవం వల్ల గోవింద రావు కి, సత్యనారాయణ రావుకు అర్థం అయింది.. అలా కారులో వెళుతుండగా ఒక్కసారిగా రోడ్డు కి రెండువైపులా దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్ పోల్స్ హఠాత్తుగా ఆరిపోయాయి.... ఉన్నట్టుండి వర్షం కూడా పెద్దగా పెరిగిపోయింది.... అంత పెద్ద వర్షం వల్ల రోడ్డు కూడా సరిగా కనిపించడం లేదు... సడన్ గా కారు ఆపాడు పురుషోత్తం.... "పురుషోత్తం జాగ్రత్త..!" అని అతని భుజంపై చేయివేసి అన్నాడు సత్యనారాయణ రావు.. " పరవాలేదు సార్..!!" అంటూ చిన్నగా నవ్వి, స్టీరింగ్ పక్కనే ఉన్న ఒక స్విచ్ ఆన్ చేశాడు.. ఒక్కసారిగా కారు ముందున్న లైట్లు మరింత ప్రకాశవంతంగా వెలిగాయి... అలా లైట్లు ప్రకాశవంతంగా వెళ్లడంతో రోడ్డు మొత్తం చాలా దూరం వరకు స్పష్టంగా కనిపించసాగింది.. అది చూసిన సత్యనారాయణ రావు నవ్వి, " మరి ఇందాక నుంచి ఎందుకు లైట్లు ఆన్ చేయలేదు..?" " ఇవి ఎమర్జెన్సీ లైట్లు సార్...!! రఘునాథ రెడ్డి సార్ స్పెషల్ గా డిజైన్ చేయించారు. ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాల్సి వస్తే, రాత్రులు కారు స్పీడ్ గా వెళ్లేటప్పుడు, రోడ్డు క్లియర్ గా కనిపించడం కోసం,ఈ హైఫోకస్ ఎల్ఈడి లైట్లు వేయించాము."అని చెప్పాడు.. " మంచిది నాయన..!! జాగ్రత్తగా పోనీ...!" అన్నారు వెనక కూర్చొని ఉన్న గోవింద రావు.. "అలాగే స్వామి..!!" అంటూ కార్ ని ముందుకి పోనిచ్చాడు. వర్షం మరింత జోరుగా కురవసాగింది... పురుషోత్తం కారుని డ్రైవ్ చేస్తూనే, రోడ్డుమీద జాగ్రత్తగా పరిశీలించసాగాడు.. అలా డ్రైవ్ చేస్తూనే " స్వామి...!!" అంటూ అరిచి కార్ ఒక్కసారిగా ఆపేశాడు... ఏమైందని అడిగాడు అతని పక్కనే కూర్చుని ఉన్న సత్యనారాయణ రావు.. మాట్లాడకుండా రోడ్డు వైపు చెయ్యి చూపించాడు.. అక్కడ రోడ్డుకి అడ్డంగా నల్లటీ భారీ శరీరంతో, మర్రి ఊడల లాంటి తెల్లని జుట్టు గల ఒక ఆకారం రోడ్డు మధ్యగా నిల్చుని ఉంది... దాన్ని చూసిన ముగ్గురు ఆశ్చర్యపోయారు.. కారు లైట్ల కాంతిలో దాని ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది... అలా ఒక్క నిమిషం పాటు దానివైపే చూస్తూ ఉండిపోయారు.. కొద్దిసేపటికి అది మెల్లగా కార్ వైపు కదలసాగింది.. దాన్ని అలా చూసిన పురుషోత్తం కి, కాలు చేయి ఆడటం లేదు.. శరీరమంతా భయంతో చెమటతో తడిసిపోయింది... " వెంటనే కారు పోనీ పురుషోత్తం....!!"అని చెప్పారు గోవింద రావు కానీ దాన్ని చూసిన షాక్ లో పురుషోత్తం కి ఏమీ వినిపించటం లేదు. అతని పరిస్థితి గమనించిన సత్యనారాయణ రావు పురుషోత్తం భుజాన్ని పట్టుకుని గట్టిగా కుదిపాడు... వెంటనే సృహ లోకి వచ్చాడు పురుషోత్తం.. " వెంటనే కారు పోనీ..!"అంటూ అరిచాడు సత్యనారాయణ రావు.. ఇక క్షణం ఆలస్యం చేయకుండా కార్ ని ముందుకు పోనిచ్చాడు పురుషోత్తం.. అయినా సరే అది కారు మీదకి వస్తూనే ఉంది.. "ఏం జరిగినా సరే...! కారు ఆపకు నాయనా..! అది మనల్ని ఏమీ చేయలేదు..." అంటూ వెనకాల నుంచి గోవింద రావు ధైర్యం చెప్పసాగారు.. అలా గోవింద రావు చెప్పడంతో, కార్ ని ధైర్యంగా దాని మీదికి పోనిచ్చాడు.. కారు సరిగ్గా దానిమీద కి వెళ్ళగానే అది మాయమైపోయింది... అది అలా మాయమైపోగానే అది ఏమైపోయిందో నని వెనక్కి తిరిగి చూడబోతున్న పురుషోత్తంని వద్దని గోవింద రావు వారించారు.. అలా తన ప్రయత్నం కూడా మానుకున్నాడు పురుషోత్తం.. అలా కారు వర్షంలో ముందుకు వెళుతూనే ఉంది.. కార్ డ్రైవింగ్ చేస్తున్న పురుషోత్తం కి ఉన్నట్టుండి వెకిలి నవ్వులు వినిపించసాగాయి.. ఆ నవ్వులు ఏంటని తల అటూ ఇటూ తిప్పి చూడసాగాడు.. అలా అటూ ఇటూ చూస్తున్న పురుషోత్తం ని ఏమైందని అడిగాడు సత్యనారాయణ రావు.. "నాకు ఏవో నవ్వులు వినిపిస్తున్నాయి సార్.." అంటూ అటూ ఇటూ చూడసాగాడు.. ఇంతలో రోడ్డు మీద అడ్డంగా పడి ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ అడ్డు వచ్చింది.. ఇంతలో అది చూసిన సత్యనారాయణ రావు " ఏయ్ చూసుకో...!!" గట్టిగా అరుస్తూ స్టీరింగ్ పట్టుకొని కుడి వైపు తిప్పాడు... ఒక్కసారిగా కారు ఆ చెట్టు కొమ్మకి తప్పించబడి పక్కకి వెళ్ళింది.. సత్యనారాయణ రావు కల్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.. " జాగ్రత్త నాయనా..!!" అంటూ అన్నారు వెనకాలనుంచి గోవింద రావు " నీకు చిన్నాన్న ముందుగానే చెప్తున్నారు.. అయినా సరే నువ్వు జాగ్రత్త గా ఉండటం లేదు. ఇప్పటికైనా జాగ్రత్తగా డ్రైవ్ చెయ్..!!"అంటూ కోప్పడ్డాడు సత్యనారాయణ రావు.. " క్షమించండి సార్..!" అని అన్నాడు పురుషోత్తం. " అలా కోప్పడకు రావు..!! అతనికి ఇటువంటి పరిస్థితులు పూర్తిగా కొత్త..! మనమే అతనికి సహాయం చేయాలి.." అని గోవింద రావు చెప్పగానే "సరే చిన్నాన్న..! క్షమించండి..!" అన్నాడు సత్యనారాయణ రావు.. సమయం రాత్రి 12 గంటలు దాటింది.. అలా కొద్దిసేపటి ప్రయాణం తర్వాత తుమ్మలబైలు ప్రాంతాన్ని దాటిపోయారు.. వారు ఆ ప్రదేశాన్ని దాటిపోయారు అనడానికి సూచనగా అప్పటిదాకా భీకరంగా కురుస్తున్న వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది.. ఇక ప్రదేశాన్ని దాటిపోయారు అని గ్రహించిన గోవింద రావు " ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆ ప్రదేశాన్ని దాటిపోయాము.. కారు ని వేగంగా పోనీయ్ పురుషోత్తం.." అని గోవింద రావు చెప్పగానే... కారుని వేగంగా ముందుకి పోనిచ్చాడు పురుషోత్తం... కార్ శ్రీశైలం వైపు వేగంగా పరుగులు తీస్తోంది... కొద్ది నిమిషాలు గడిచిన తర్వాత... ఇంతలో అకస్మాత్తుగా మళ్లీ పెద్ద వర్షం మొదలైంది.. చాలా పెద్దగా వర్షం మొదలవడంతో సత్యనారాయణ రావు అనుమానంగా వెనక ఉన్న గోవింద రావు వైపు అనుమానంగా చూశాడు.. గోవింద రావు ముఖంలో కూడా ఏదో అనుమానం పొడచూపింది.. ఇదేమీ పట్టించుకోని పురుషోత్తం కారుని వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు.. ఇంతలో.....!! అలా వేగంగా వెళుతున్న కారు టైర్ అకస్మాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయి, కారు అదుపు తప్పింది.. పురుషోత్తం ఎంత ప్రయత్నించినా సరే, దానిని అదుపు చేయలేకపోయాడు.. ఆ కారు పల్టీలు కొట్టి,వేగంగా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని ఢీకొట్టింది.. ఆ బండరాయి ఢీకొట్టిన కొద్ది నిమిషాలకి సత్యనారాయణ రావు కి తెలివి వచ్చింది.. కళ్ళు తెరిచి చూశాడు.. తన పక్కనే పురుషోత్తం తలకి గాయం తో స్టీరింగ్ మీద పడి ఉన్నాడు.. వెనకకు చూసాడు.. సత్యనారాయణ రావు. గోవింద రావు కూడా గాయాలతో సీటులో పడి ఉన్నాడు... తనకి కూడా శరీరం మీద గాయాలు తగిలాయి.. కళ్ళు కూడా తిరుగుతున్నాయి... ఇక వెంటనే ఫోన్ తీసి సత్యం కి ఫోన్ చేశాడు.. చేసిన వెంటనే ఫోన్ ఎత్తాడు సత్యం... "సార్...!! ఎక్కడ ఉన్నారు సార్...!?? ఇక్కడ ఆదిత్య సార్ పరిస్థితి..!!" అని ఏదో చెప్పబోతూ ఉండగా " సత్యం, మా కార్ కి యాక్సిడెంట్ అయింది నువ్వు వెంటనే రా..!!" అని చెప్పి అతను ఏదో చెప్తున్నా వినకుండా ఫోన్ కట్ చేశాడు.. తనకి కూడా కళ్ళు తిరిగి తెలివి తప్పిపోతుండగా... అప్పుడు ప్రత్యక్షమయింది అతని కారు ముందు.. ఆ తెల్లని జుట్టు కల రాకాసి.... దాన్ని చూడగానే సత్యనారాయణ రావు కి మతిపోయింది...!! ఏం చేయాలో అర్థం కాలేదు...!!! ఇంకా ఉంది......!!!!
Yesterday, 06:55 AM
Nice update
Yesterday, 09:49 AM
Ashtadigbadhanam la undi story!!
|
|
« Next Oldest | Next Newest »
|