Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మరణ శాసనం
#21
Excellent update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Part - 10

శ్రీను భయంతో సత్యాన్ని గట్టిగా పిలవసాగాడు....

అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఆ స్త్రీ ఏడ్పు ఆగిపోయింది..


కానీ...!!


శ్రీను పక్క నుంచి భయంకరంగా
ఒక మూలుగు వినిపించసాగింది...



ఆ మూలుగు విన్న శ్రీను భయంతో అరవడం ఆపేశాడు...


భయం భయంగా మెల్లగా పక్కకి తిరిగి చూసాడు..

చీకటిగా వుండడం వల్ల ఎవరూ కనిపించటం లేదు....

కానీ ఆ మూలుగు మాత్రం భయంకరంగా వినిపించసాగింది..

ఆ మూలుగు విన్న శ్రీను భయంతో వణిికిపోసాగాడు...

అక్కడినుంచి వెళ్ళిపోదామని పైకి లేచి నుంచోవటానికి ప్రయత్నించాడు.

కానీ కాలికి దెబ్బ గట్టిగా తగలడం వల్ల, అతనికి సాధ్యపడలేదు..

ఆ మూలుగు చెట్టు పక్కన చీకటిగా ఉన్న ప్రదేశం నుంచి మరింత పెద్దదిగా వినిపించసాగింది...

శ్రీను నడిచే శక్తి లేక భయంతో ఆ ప్రదేశం నుంచి మెల్లగా దూరంగా పాకడం మొదలు పెట్టాడు...

ఆ చెట్టు నుంచి కొద్ది దూరం వెనక్కి
వెళ్ళగానే...

ఆ చీకటి ప్రదేశం నుండి ఒక భయంకరమైన ఆకారం బయటకు వచ్చింది...

అది భయంకరమైన రాకాసి....

దానిని చూసిన శ్రీను భయంతో గట్టిగా అరవసాగాడు....

అది దాని భయంకరమైన నోరు తెరిచి
ఒక్కసారిగా శ్రీను మీదకి దూకింది......


మరోపక్క....


పైడిరాజు రాకపోవడంతో అంజయ్య ఒక్కడే
ఆదిత్య ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాడు..

వర్షం ఆగకుండా పడుతూనే ఉంది...

అంజయ్య లోయ లోపలికి వెళ్ళాడు..

టార్చ్ లైట్ వెలుగులో చుట్టూ చూడసాగాడు...

కానీ తీవ్రమైన వర్షం కారణంగా ఏమీ కనిపించడం లేదు.

వర్షం కారణంగా నేలంతా బురదమయంగా మారి పోయింది..

"ఆదిత్య సార్...!! ఎక్కడున్నారు..?" అని అంజయ్య గట్టిగా అరుస్తూ లోయ లోపలికి దిగసాగాడు.

మరోపక్క పైడి రాజు రోడ్డు మీద ఒంటరిగా ఉండి పోయాడు..

అంజయ్యని ఒంటరిగా
పంపించి ఉండకూడదని తను కూడా అంజయ్య వెళ్ళిన వైపే బయలుదేరాడు..

అంజయ్య కొంత దూరం దిగగానే లోయ పై నుంచి ఎవరో దిగుతున్న శబ్దం వచ్చింది....

ఆ శబ్దం వచ్చిన వైపు చూసాడు అంజయ్య

ముఖం స్పష్టంగా కనిపించడం లేదు..

ఎవరో లోయ దిగుతున్నారు...

అది చూసిన అంజయ్య మనసులో నవ్వుకున్నాడు..

"ఈ పిరిగొడ్డు గాడికి భయమేసినట్టుండాది.. ఈడికి కాపడకుండా దాక్కుందాం..!!"అని మనసులో అనుకుంటూ, ఒక చెట్టు పక్కన దాక్కున్నాడు....

ఆ వ్యక్తి మెల్లగా అంజయ్య దరిదాపులకు ప్రవేశించాడు..

అంజయ్య మెల్లగా నవ్వుకోసాగాడు...

అలా నవ్వుకుంటున్న అంజయ్య వాకి టాకీ ఒక్కసారిగా మోగింది...

"హలో ఎవరు..??" అని అడిగాడు అంజయ్య...

"అన్నా...!!నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను..!! మన శ్రీను కి దెబ్బలు గట్టిగా తగిలాయి. మీరు ఎక్కడున్నా వెంటనే రండి." అన్నాడు.

"ఆ తమ్ముడు...!! నేను పైడిరాజు ఇక్కడే ఉన్నాం.. వెంటనే వస్తున్నాం.." అంటూ కాల్ కట్ చేశాడు....

మళ్ళీ వెంటనే వాకి టాకీ మోగింది..

సత్యం లైన్ లో ఉన్నాడు...

"హలో సత్యం చెప్పు..!"అన్నాడు అంజయ్య

"అన్నా నీ పక్కన ఎవరు ఉన్నారు..??"అని అనుమానంగా అడిగాడు సత్యం..

" పైడ్రాజు ఉన్నాడు"అని చెప్పాడు అంజయ్య...

"ఏం మాట్లాడుతున్నావ్.. అన్నా..??
పైడిరాజు అన్న ఇక్కడే నా పక్కనే ఉన్నాడు.. ఇదిగో మాట్లాడు "అంటూ వాకి టాకీ పైడిరాజు కి ఇచ్చాడు సత్యం..


"హలో..!! ఒరేయ్ అంజయ్య..!! ఎక్కడున్నావ్ రా...??" అంటూ వాకి టాకీ లో పైడిరాజు అరవసాగాడు..

ఆ మాటలు విన్న అంజయ్య కి మతిపోయింది....

పైడి రాజు కి ఏం సమాధానం ఇవ్వకుండా
తనకి ఆకారం కనిపించిన వైపుకి వెంటనే వెళ్లి చూడగానే....

అక్కడ కోరలు తెరిచి ఒక భయంకర రాకాసి అంజయ్య వంక కోపంగా చూస్తూ ఉంది...

దాన్ని చూసిన అంజయ్య భయంతో చేతిలో ఉన్న వాకి టాకీ వదిలేశాడు.....

వాకి టాకీ లో పైడిరాజు అరుస్తూనే ఉన్నాడు

అంజయ్య దాన్ని చూస్తూ భయంగా వెనకకు  నడవ సాగాడు...

ఒక్కసారిగా ఆ భయంకర రాకాసి అంజయ్య మీదకి దూకింది....


మరోపక్క......!!


పైడిరాజు ఎంత అరుస్తున్నా..అంజయ్య నుంచి ఎటువంటి సమాధానం రాలేదు..!!

పైడిరాజు కంగారు పడుతూ.." నేను వద్దురా అని చెప్పా. కానీ వెళ్ళాడు.. ఆడ ఏం జరిగినాదో తెలిట్లేదు.. సమాధానం లేదు... పదరా సత్యం. ఆడు యాడున్నాడో ఎతుకుదాం.." అని అన్నాడు పైడిరాజు..

" అన్నా ...! అక్కడ శ్రీను గాడి పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆడికి దెబ్బలు గట్టిగా తగిలాయి. వాడిని తీసుకొచ్చి అంబులెన్స్ లో పెట్టిన తర్వాత అంజయ్య గురించి వెళదాం..!! అని అన్నాడు సత్యం..

పైడిరాజు కూడా సరేనని బయలు దేరాడు..

అంబులెన్స్ డ్రైవర్ ని, జాగ్రత్తగా ఉండమని చెప్పి, ఆ ఇద్దరు కుర్రాళ్లు ని కూడా తమతో పాటు తోడు తీసుకెళ్లారు..

నలుగురు ఒక స్ట్రక్చర్ తీసుకొని, వేగంగా నడవసాగారు.....

సత్యం వెళ్లిన చోట జరిగిన భయంకర పరిస్థితులేమి ఇద్దరు కుర్రాళ్ళు కి గాని,
పైడి రాజు గాని తెలియదు...

భయపడతారని తను కూడా వాళ్లకి చెప్పలేదు...

కొంత దూరం నడిచిన తరువాత...!!

శ్రీను ని ఉంచిన చోటికి ఆ నలుగురు చేరుకున్నారు.....!!

కానీ చెట్టు దగ్గర శ్రీను కనిపించలేదు...

సత్యం శ్రీనుకి ఏమైందోనని కంగారు పడసాగాడు...

నలుగురు టార్చ్ లైట్లతో చుట్టుపక్కల శ్రీను కోసం వెతక సాగారు...

అలా చాలా సేపు వెతికిన తర్వాత కూడా శ్రీను కనిపించలేదు..

అందరూ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నారు..

వర్షం ఎక్కువగా పడుతుండడంతో..
చెట్టు కింద కి చేరుకున్నారు...

" యాడికి పోయాడు ఈడు..??
ఆడిని ఈడనే వదిలుండావా..??లేక వేరే చోటా...??" అని అడిగాడు పైడిరాజు

"లేదన్నా...!! వాడిని ఇక్కడే కూర్చోబెట్టా..!
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు.
అని తల పట్టుకున్నాడు సత్యం..

పక్కన నుంచున్న ఇద్దరు కుర్రాళ్ళు లో ఒకడు.
శ్రీను కోసం  టార్చ్ లైట్ తో మెల్లగా నడుస్తూ చుట్టూ చూడసాగాడు...

నేలంతా బురదగా ఉండటంతో కాలుజారి వెల్లకిలా పడిపోయాడు..

అతని పక్కనే ఉన్న మరో కుర్రవాడు అతన్ని చెయ్యి పట్టుకుని పైకి లేవదీస్తూ ఉండగా
కింద పడిపోయిన వాడు ఒక చేతిని ఆ కుర్రాడికి ఇచ్చి, మరో చేత్తో టార్చ్ లైట్ పట్టుకొని, పైకి లేవబోతు ఉండగా..

అతని చేతిలో ఉన్న టార్చ్ లైట్ వెలుగు సత్యం పైన పడింది....

అలా పడగానే ఆ యువకుడు భయంతో గట్టిగా అరవసాగాడు.....

ఆ కుర్రోడు అలా అరవడంతో.. కంగారుగా అతని దగ్గరికి సత్యం పైడిరాజు వచ్చారు.

కింద పడి ఉన్న కుర్రాడిని పట్టుకొని పైకి లేపి
"ఏమైంది.?? ఎందుకు అలా అరుస్తున్నావ్.?". అని అడిగారు..

దానికి ఆ కుర్రవాడు సమాధానంగా తన చేతిని వెనక ఉన్న చెట్టు పైకి చూపించాడు...

అతను వేలు చూపించిన వైపు నలుగురు చూశారు..

అప్పుడు ఒక్కసారిగా ఆకాశం మెరిసింది..

ఆ వెలుగులో కాళ్లు లేకుండా కేవలం
తల, చేతులు, మొండెం మాత్రమే ఉన్న శ్రీను శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది.

అంత భయంకరంగా ఉన్న ఆ శవాన్ని చూసి
నలుగురు భయంతో బిగుసుకుపోయారు..

ఇక అక్కడ ఉండడం ప్రమాదం అని గ్రహించి వెంటనే నలుగురు లోయ పైకి పరుగు అందుకున్నారు...

ఒకరి కోసం ఒకరు ఆలోచించకుండా నలుగురు ప్రాణభయంతో వేగంగా పరిగెత్తసాగారు....

అకస్మాత్తుగా వారి వెనక ఏదో తరుముకుంటూ రాసాగింది....

అందరికీ భయం మరింతగా పెరిగిపోయింది.

అలా వేగంగా పరిగెడుతూ ఉండగా..
సత్యం కాలుజారి పడిపోయాడు...

పడిపోయిన వాడు అలా జారుకుంటూ లోయలోకి వెళ్ళిపోసాగాడు..

మిగిలిన వారు అదేమీ పట్టించుకోకుండా లోయ పైకి పరుగులు తీశారు...

అలా జారుకుంటూ వెళ్ళిన సత్యం..

ఒక పొదలో చిక్కుకుపోయాడు..
మెల్లగా పైకి లేచాడు..

కటిక చీకటి ఏమీ కనిపించటం లేదు..

ఆకాశంలో విపరీతంగా మెరుస్తున్న మెరుపుల వెలుగు వల్ల, అప్పుడప్పుడు
ఆ ప్రాంతం కనిపించసాగింది..

సత్యానికి భయం విపరీతంగా పెరిగిపోయింది..

ఎలాగైనా అక్కడ నుండి బయట పడాలని పైకి లేచి ఆ మెరుపు వెలుగులో దారిని గమనించుకుంటూ మెల్లగా ముందుకు నడవడం ప్రారంభించాడు...

మెల్లగా లోయ పైకి ఎక్కసాగాడు...

దారి చాలా అధ్వానంగా ఉంది...

లోయ పైకి ఎక్కుతున్నప్పుడు మధ్య మధ్యలో ఎవరైనా తన వెనుక ఉన్నారేమో అని భయపడుతూ చూసుకోసాగాడు..

కొంత దూరం ముందుకు వెళ్ళాక...
వెనక నుండి ఏదో శబ్దం అవ్వసాగింది...

సత్యం గుండెలు అదిరాయి...

భయపడుతూ వెనక్కి తిరిగి చూశాడు..

మెరుపుల వెలుగులో ఏమీ కనిపించలేదు..

పెద్ద పెద్ద రాళ్ళు, ముళ్ళతో దారి అంతా అస్తవ్యస్తంగా ఉంది...

అయినా సరే మెల్లగా ముందుకి నడవసాగాడు..

అలా చీకట్లో మెల్లగా నడుస్తూ ఉండగా అతని దారికి పెద్ద పొద అడ్డం వచ్చింది...

దాన్ని తప్పించుకొని ముందుకు వెళ్లబోతుండగా అప్పుడే మెరిసిన మెరుపు వల్ల ఆ పొద పూర్తిగా కనిపించింది..

అది పొద కాదు...

భయంకర రాకాసి....

భయంకరమైన రూపంతో దారికి అడ్డంగా నుంచుని ఉంది...

దాన్ని చూడగానే సత్యం భయంతో గట్టిగా అరుస్తూ వెనక్కి పడిపోయాడు...

అలా పడిపోయినవాడు....దొర్లుకుంటూ.. దొర్లుకుంటూ.. లోయలోకి వెళ్ళిపోయాడు...


కొద్దిసేపటి తర్వాత.....!!




వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టింది...!!

అయినా పెద్ద పెద్ద జల్లుగా పడుతూనే ఉంది..

సత్యం అలా దొర్లుకుంటూ లోయ లోపలికి చాలా దూరం వెళ్ళి పోయాడు...

అలా దొర్లుకుంటూ రావడం వల్ల,
శరీరం నిండా రాళ్ల వల్ల,ముళ్ళ వల్ల, గాయాలై, శరీరమంతా రక్త సిక్తం అయ్యింది.

తలకి కూడా దెబ్బ తగిలి రక్తం కారసాగింది.

సత్యం మెల్లగా పైకి లేచాడు..

కానీ ఓపిక లేక నేలపై కూలబడిపోయాడు..

పక్కనే ఉన్న ఒక బండరాయిని ఆసరాగా చేసుకొని దాని పై వాలి కూర్చున్నాడు..

హఠాత్తుగా ఆ ప్రాంతంలో ఒక పెద్ద పిడుగు పడింది...

ఆ పిడుగు దాడికి సత్యానికి కొద్ది దూరంలో ఉన్న ఒక చెట్టు తగలబడిపోసాగింది...!!

ఆ మంటల వెలుగులో ఆ ప్రాంతమంతా కనిపించసాగింది..!!

అప్పుడు ప్రత్యక్షమయింది..
ఆ భయంకర రాకాసి.....!!

తన భయంకరమైన కొరలన్ని బయటపెట్టి
సత్యం వైపు వస్తోంది....

సత్యం భయంతో ఏడుస్తూ.. పరిగెత్త లేక అలాగే వెనుకకు జరగసాగాడు..!!

అది సత్యం దగ్గరగా వచ్చేసింది....!!

అతని మీదకి దూకబోతుండగా....

సత్యం ఒక్కసారిగా దాని దాడి నుండి తప్పించుకొని దూరంగా జరిగిపోయాడు...

కోపంతో ఆ రాకాసి భయంకరంగా అరిచింది...!!






ఇంకా ఉంది......!!!
[+] 8 users Like SivaSai's post
Like Reply
#23
Part - 11

సత్యం తనంతట తాను పక్కకి జరగలేదు.

చీకట్లో ఏదో తనని పట్టుకుని పక్కకు లాగింది..

అది ఏమిటా అని వెనక్కి తిరిగి చూశాడు.

వెనుక చీకట్లో ఒక ఆకారం మెల్లగా అతని దగ్గరకు సమీపించసాగింది..

దాన్ని చూసిన సత్యానికి పై ప్రాణాలు పైనే పోయాయి..

ముందుకు వెళదాం అంటే ఆ రాకాసి ఉంది.
వెనుక ఇంకొకటి..

ఇక తన ప్రాణం మీద ఆశ వదిలేసుకున్నాడు..

ఇక కళ్ళు మూసుకుని దేవుడిని తనను కాపాడమని ప్రార్థించసాగాడు...

సత్యం వెనకాల అడుగుల చప్పుడు క్రమంగా అతని దగ్గరకి సమీపించసాగింది.


ముందున్న ఆ భయంకర రాకాసి కోపంగా సత్యం వైపు చూస్తూ అతని ఒక్కసారిగా దూకబోతుండగా......


సత్యం వెనకాల ఉన్న ఆకారం అతనికి అడ్డు గా నిలిచింది.

సత్యం ఆశ్చర్యపోయాడు....

ఆకారం ఎవరో కాదు .. ఆదిత్య.....

రాకాసి కి, సత్యానికి మధ్యగా ఆదిత్య నుంచున్నాడు.

తనకి అడ్డంగా నిల్చున్న ఆదిత్య కాళ్ళు పట్టుకొని "నన్ను కాపాడండి. సార్..!!" అంటూ ఏడవసాగాడు...

దానికి సమాధానంగా "నువ్వేమి భయపడకు...!
నేను నీకు సాయం గా ఉన్నంతసేపు అది నిన్ను ఏమి చేయలేదు...!!" అని అన్నాడు

ఆ మాటలకి సత్యానికి కొండంత ధైర్యం వచ్చింది..

చిన్న పిల్లాడిలా రాకాసి కంటపడకుండా ఆదిత్య వెనకాల దాక్కున్నాడు.

రాకాసి తనకు అడ్డం వచ్చినందుకు ఆదిత్య మీద విపరీతమైన కోపం వచ్చింది.

కానీ ఆదిత్య మెడలో ఉన్న రుద్రాక్ష మాల శక్తి వల్ల, అతన్ని ఏమీ చేయలేకపోయింది.

కానీ సత్యాన్ని చంపుతామని వారి చుట్టూ తిరుగుతూ విఫలయత్నం చేయసాగింది...

కానీ ఆదిత్య అడ్డు పడుతూనే ఉన్నాడు..


అలా చాలా సేపు ప్రయత్నించి విసుగొచ్చి ఆదిత్య వైపు కోపంగా చూసి, గట్టిగా అరుస్తూ అక్కడ నుంచి మాయమైపోయింది..

అది వెళ్లి పోయినా సరే సత్యం భయంతో ఆదిత్య కాళ్ళని వద్ద లేదు...

ఆదిత్య కి సత్యం పరిస్థితి చూసి జాలేసింది.

తన కాళ్ళనుండి సత్యాన్ని విడిపించి,
అతని పక్కనే కూర్చున్నాడు..

సత్యం భయంతో ఏడుస్తూనే ఉన్నాడు..

అతన్ని ఊరుకోబెట్టి,"నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు..?"అని అడిగాడు..

" నేనొక్కడినే కాదు సార్..! మన టీం కూడా వచ్చింది. మీరు పంపించిన కుర్రాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు. సీఐ సుందరయ్య సార్ డ్యూటీ లో ఉన్నారు.."

"సార్ చెప్తేనే..సుధాకర్ ని ఒక్కడినే స్టేషన్ లో ఉంచి,నేను,శ్రీను, అంజయ్య, పైడిరాజు నలుగురం వచ్చాము. ఏదైనా అవసరమైతే తనకి ఇన్ఫామ్ చేయమన్నారు.."

"మీకు దెబ్బలు తగిలాయని చెప్తే అంబులెన్స్ కూడా తీసుకు వచ్చాము. కానీ మీ కోసం వెతుకుతుంటే ఈ భయంకర రాక్షసి మా వెంట పడింది. మన శ్రీను చనిపోయాడు."

"అంజయ్య కు ఏం జరిగిందో తెలియటం లేదు..?
పైడి రాజు, ఆ ఇద్దరు కుర్రాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు.మీరు కనుక సమయానికి రాకపోయి ఉంటే నన్ను కూడా చంపేసేది."అంటూ ఏడవసాగాడు..

తనని కాపాడడానికి వచ్చి, ఇంత మంది ఇబ్బందుల్లో పడ్డారు.. ఒకరు చనిపోయారు. మరొకరికి ఏమైందో కూడా తెలియటం లేదు."అంటూ మనసులో
బాధపడసాగాడు ఆదిత్య.

సత్యాన్ని ఇంక ఏమీ అడగలేదు..

కొంత సేపటికి తిరిగి సత్యం మాట్లాడుతూ
" అయినా మీరు అర్జంటుగా ఎక్కడికో వెళ్తాను అని మాతో చెప్పారు..!! కానీ ఇక్కడికి ఎలా వచ్చారు.. అది.. మీ ఒకరిని వదిలేసి, ఎందుకు మా వెంట పడింది.?? అసలు ఇంతకీ అది ఎక్కడి నుంచి వచ్చింది..సార్...??"అని అడిగాడు.

ఆ మాటలకి ఆదిత్య నవ్వుతూ...!

" మీకు ఎవరికీ చెప్పలేదు. నాకు ఒక తాతగారు ఉన్న అదే మా నాన్న గారి తండ్రిగారు. విజయవాడ లో ఉంటున్నారు.ఆయన పెద్ద సిద్ధాంతి. కానీ ఆయనకు ఆరోగ్యం బాగాలేదనీ, ఆయనను చూడడం కోసం నేను అర్జంటుగా విజయవాడ వెళ్ళవలసి వచ్చింది. కానీ నేను తిరిగి వచ్చేటప్పుడు ఆ రాకాసివల్లే, నా బండికి యాక్సిడెంట్ అయింది."

"అయినా అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా పూర్తిగా తెలియదు.కానీ దానికి ఈ ప్రదేశానికి ఏదో సంబంధం ఉందని అనిపిస్తోంది.. అయినా నన్ను ఎక్కడ వదిలింది..??"తన శరీరంపై గాయాలు చూపిస్తూ." ఇవన్నీ అది కొట్టిన దెబ్బలే....!!"

" కానీ....!! నేను తిరిగి వచ్చేటప్పుడు
మా తాతగారు ఈ రుద్రాక్షమాల ఇచ్చారు. దీని శక్తి వల్లే మనం ఇప్పుడు ప్రాణాలతో
బయటపడగలిగాము.. "అని తన మెడలో ఉన్న రుద్రాక్ష మాల చూపించాడు..

సత్యం అప్రయత్నంగానే దానికి నమస్కారం చేశాడు.

ఇలా ఆదిత్య సత్యం మాట్లాడుకుంటున్నారు...

వాళ్ళిద్దరి మధ్య ఒక అడుగు దూరం మాత్రమే ఉంది..

ఇంతలో ఒక్కసారిగా ఆదిత్య సత్యం చెయ్యి గట్టిగా పట్టుకుని తనవైపుకు లాగి రుద్రాక్ష మాల పై ఉంచాడు...

అలా సత్యం చెయ్యి రుద్రాక్ష మాల మీద పెట్టగానే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని...

ఒక్కసారిగా ఆ రాకాసి సత్యం మీద పడబోయింది..

కానీ ఆ రుద్రాక్షమాల నుంచి వెలుగులు పుట్టుకొచ్చాయి. ఆ వెలుగులకు రాకాసి శరీరమంతా చిటపటలాడుతూ, మంటలు పుట్టి, అది గట్టిగా అరుస్తూ మాయమైపోయింది..

ఆ సంఘటన చూసిన సత్యం బెదిరిపోయాడు....

"సార్..!! మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి.. లేకపోతే అది మనల్ని చంపేస్తుంది." అంటూ భయపడసాగాడు.

"దానికి కూడా కావలసింది అదే.. మనం వెళ్లేటప్పుడు దారిలో ఆటంకాలు ఏర్పరుస్తుంది.
మనం విడిపోయినప్పుడు నిన్ను ఒక్కడినే చేసి చంపేస్తుంది.. తెల్లవారడానికి ఇంకా కొద్ది గంటలే సమయం ఉంది. తెల్లవారితే అది మనల్ని ఏమీ చేయలేదు.అందువల్ల తెల్లారే వరకు ఇక్కడే ఉండి తీరాలి.."అని ఆదిత్య చెప్పాడు.

ఆదిత్య చెప్పిన మాటలు విన్న సత్యం బెదిరిపోయాడు.

ఆదిత్య ని గట్టిగా పట్టుకొని,రుద్రాక్ష మాల నుంచి చెయ్యి తియ్యకుండానే, భయపడుతూ పడుకుండిపోయాడు..

ఆదిత్య కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు...

మరోవైపు..

ఆ వర్షంలో వేగంగా పరిగెడుతూ
పైడిరాజు తో సహా ఇద్దరు కుర్రాళ్ళు అంబులెన్స్ దగ్గరికి చేరుకున్నారు..

పైడి రాజు తన పక్కన ఉన్న కుర్రాడి వైపు చూస్తూ ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి.. వెళ్లి బండి తీసేయమని డ్రైవర్ కి చెప్పు అన్నాడు..

ఆ కుర్రాడు అంబులెన్స్ దగ్గరికి వెళ్ళాడు.

డ్రైవర్ స్టీరింగ్ పై తల పెట్టుకొని నిద్రపోతున్నాడు..

ఆ కుర్రోడు కంగారుగా డోర్ కొడుతున్నా సరే
నిద్ర లేవడం లేదు..

"ఏమైంది..??" అని గట్టిగా అరిచాడు పైడిరాజు.

ఇక వెంటనే ఆ కుర్రాడు అంబులెన్స్ డోర్ ఓపెన్ చేసాడు..

డోర్ తీయగానే ఆ డ్రైవర్ నేల పై పడిపోయాడు..

"సార్...!!" అంటూ గట్టిగా అరిచాడు ఆ కుర్రాడు.

డ్రైవర్ కింద పడిపోవడం చూసిన పైడిరాజు మరో కుర్రాడు వేగంగా అంబులెన్సు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు..

పైడి రాజు ఆ అంబులెన్స్ డ్రైవర్ కి ఏమైందొనని
చెక్ చేయగా అతను చనిపోయి ఉన్నాడు.

అతని మెడపై ఎదొ కొరికేసినట్టు, పెద్ద గాయం ఉంది.

దాని కారణంగానే చనిపోయాడు.

పైడిరాజు కి వెన్నులో వణుకు మొదలైంది.

ఇలా చూస్తూ ఉండగానే వేగంగా అక్కడికి ఏదో వచ్చి, వెనుక నుంచి ఆ ఇద్దరి కుర్రాళ్ళని లోయలోకి  లాక్కెళ్ళిపోయింది..

వాళ్ళిద్దరినీ ఏది లాక్కుని వెళ్ళిందో
పైడి రాజు కి అర్థం కాలేదు..

అక్కడ ఉండకూడదని,అంబులెన్స్ ఎక్కి స్టార్ట్ చేసాడు.

బండిని వేగంగా డ్రైవ్ చేయసాగాడు.

వేగంగా వెళుతున్న ఆ బండికి ఆకస్మాత్తుగా అడ్డంగా ఆ రాకాసి వచ్చింది.


దాన్ని తప్పించబోయి, బండికి సడన్ బ్రేక్ వేశాడు. వర్షం పడుతున్న కారణంగా బండి పల్టీలు కొట్టింది.

కొద్దిసేపటి తర్వాత........


పల్టీలు కొట్టిన బండి నుంచి ఎలాగోలా పైడిరాజు బయటపడ్డాడు.

బండి పూర్తిగా డ్యామేజ్ అయ్యింది...

శరీరానికి చాలా చోట్ల దెబ్బలు తగిలాయి..

భయంతో చుట్టూ చూశాడు..

చుట్టూ పెద్ద పెద్ద చినుకులతో వర్షం పడుతోంది.

కానీ ఆ రాకాసి ఎక్కడా కనిపించలేదు..

మెల్లగా ముందుకు నడవసాగాడు..

కొద్ది దూరం ముందుకు వెళ్ళగానే..

అతని వెనకాల ఎవరో వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు అయ్యింది..

పైడిరాజు వెన్నులో వణుకు పుట్టింది...

భయంతో వెనక్కి తిరిగి చూశాడు..
ఎవరూ కనిపించలేదు..

ఇంతలో అకస్మాత్తుగా పక్కనుంచి ఆ రాకాసి దూసుకువచ్చి, పైడి రాజు ని లోయలోకి లాకెళ్ళిపోయింది..


మెల్లగా తెల్లవారింది....


సమయం ఉదయం 10:00 అవుతోంది....

ఆదిత్య నిద్రలేచాడు. పక్కనే ఉన్న సత్యాన్ని చూశాడు. సత్యం ఇంకా పడుకొనే ఉన్నాడు.

" సత్యం నిద్రలే..!!" అని బుగ్గలపై తడుతుండగా..

అతని శరీరం వెచ్చగా తగిలింది.. నుదుటి పై చేయి వేశాడు.

నిప్పులా కాలిపోతుంది..

ఎలాగైనా హాస్పిటల్ లో జాయిన్ చేయాలి.

లేకపోతే చాలా ప్రమాదం అనుకుంటుండగా

దూరం నుంచి " ఆదిత్య.. సత్యం.. పైడిరాజు.. అంజయ్య.." అంటూ తనకి కొద్ది సమీపంలోనే  అరుపులు వినిపించసాగాయి...

ఏసీపీ కరుణాకర్, సిఐ సుందరయ్య,
పెద్ద బెటాలియన్ తీసుకొచ్చి, ఆ ప్రాంతమంతా సెర్చ్ చేస్తూ, అక్కడికి వచ్చారు...

ఆదిత్య వెంటనే "నేను ఇక్కడే ఉన్నాను....
త్వరగా రండి...." అని అరిచాడు...

వేగంగా వారి వద్దకి అందరూ వచ్చారు...

వారితో పాటు సెక్యూరిటీ అధికారి కుక్కలు కూడా ఉన్నాయి....

ఆదిత్యని, సత్యం ని, గాయాలతో అలా చూసేసరికి.. ఏసీపీ కరుణాకర్, సుందరయ్య కంగారుపడ్డారు..

"వాట్ హప్పెన్ ఆదిత్య...?? ఏమైంది
మీ ఇద్దరికీ...?"అని అడిగాడు కరుణాకర్.

"సార్..! ఇప్పుడు మాట్లాడే టైం లేదు. సత్యం ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదు. వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలి.."అని చెప్పాడు.

వెంటనే అక్కడికి స్త్రెచ్చర్ తీసుకు వచ్చి,
సత్యాన్ని, ఆదిత్యని, అక్కడినుంచి హాస్పిటల్కి తీసుకు వెళ్లారు...


మిగిలిన వారికోసం చుట్టూ వెతకసాగారు.



ఇంకా ఉంది....!!
[+] 8 users Like SivaSai's post
Like Reply
#24
Excellent update
Like Reply
#25
Part - 12

వారం రోజుల తర్వాత...

గాయాల నుంచి ఆదిత్య మెల్లగా కోలుకున్నాడు..

సత్యం కి అయితే పది రోజులు పైనే పట్టింది..

ఆదిత్య ప్రస్తుతం లీవ్ లో ఉన్నాడు..

ఒకరోజు ఆదిత్య ఇంట్లో రెస్టు తీసుకుంటూ ఉండగా ఏసీపీ కరుణాకర్ ఆదిత్య దగ్గరికి వచ్చాడు..

ఆదిత్య కరుణాకర్ ను చూసి సెల్యూట్ చేశాడు..

ఇద్దరూ హాలులో కూర్చున్నారు....

"ఇప్పుడు ఎలా ఉంది ఆదిత్య నీకు..??"

"ఫైన్ సర్..!! ఇప్పుడు బాగానే ఉన్నాను..!
టు డేస్ లో డ్యూటీలో జాయిన్ అవుతాను"

" గుడ్..!! టుడేస్ కాకపోయినా ఒక ఫోర్ డేస్ రెస్ట్ తీసుకున్న ప్రాబ్లం లేదు.."

"పర్వాలేదు సార్..!! ఇప్పుడు బాగానే ఉన్నాను. టుడేస్ లో జాయిన్ అవుతాను ప్రజెంట్ ఎంతవరకు వచ్చింది సార్..??"

"అసలు ఆ విషయం గురించి నీతో మాట్లాడదామని వచ్చాను."అని అంటూ ఆదిత్య ముందు ఒక ఫైల్ ఉంచి,
"ఇది ఈ కేసుకు సంబంధించిన ఫైల్, కొంతవరకు నీకు తెలుసు ఆ రోజు ఏం జరిగిందో మీరు ఇందులో మాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంచాము. కానీ ఆ రోజు పూర్తిగా ఏం జరిగిందో తెలిసింది నీకు సత్యం కి మాత్రమే..?? అసలు ఆరోజు అక్కడ ఏం జరిగిందో మీరిద్దరే చెప్పాలి..??"

"మేము ఇద్దరమే కాదు కదా సార్..!!
ఆ రోజు సత్యం తో పాటు శ్రీను చనిపోగా ఇంకా ఇద్దరు కానిస్టేబుళ్లు ఇద్దరూ బయట వాళ్ళు ఉన్నారు కదా సార్..!! వాళ్ళు ఏమీ చెప్పలేదా మీకు..??"

" ఆరోజు అక్కడ ఏం జరిగిందో నీకు పూర్తిగా తెలియదు..!! ఆ సంఘటనలో బ్రతికింది మీ ఇద్దరు మాత్రమే..!! మిగిలిన వాళ్ళందరూ దారుణంగా చనిపోయారు..!! ఒకసారి ఆ ఫైల్స్ లో ఉన్న ఫోటోలు చూడు..!!"అని చెప్పగానే..

ఆదిత్య కంగారుగా ఫైల్ ఓపెన్ చేసి చూడ సాగాడు..

అందులో మిగిలిన వాళ్ళ అందరి శవాల ఫోటోలు ఉన్నాయి..

ఆ శవాలను చూడగానే ఆదిత్య వెన్నులోంచి వణుకు పుట్టింది.. అంత భయంకరంగా ఉన్నాయి ఆ శవాలు..!

అంత దారుణంగా చంపింది ఏవరో.. ఆదిత్య కి తెలుసు.. ఆ మాటను బయట పెట్టకుండా ఒక్కొక్క ఫోటో ని పరిశీలించసాగాడు...

తనని కాపాడడం కోసం వచ్చి, వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుసు..
ఆదిత్య మనసు విలవిలలాడి పోయింది.
అప్రయత్నంగానే అతని కళ్ళ నుంచి కన్నీళ్లు జాలువారాయి..

అది గమనించిన కరుణాకర్ ఆదిత్య భుజం తడుతూ  " రిలాక్స్ ఆదిత్య..! కంట్రోల్ యువర్ సెల్ఫ్.." అని అనగానే..

" సారీ సర్..!!"అంటూ  ఎఫ్ ఐ ఆర్ ఫైల్ లో మిగిలిన వివరాలు పరిశీలించ సాగాడు..

ఆ ఫైల్ ని మొత్తం పరిశీలించిన తర్వాత అర్థమైనది ఏమిటంటే.. వారంతా క్రూరమృగాల దాడిలో చనిపోయారని ఎఫ్ఐఆర్లో ఉంది..

ఎఫ్ఐఆర్ ను పూర్తిగా చదివిన తర్వాత ఆదిత్య
ఫైల్ ని తన ముందున్న టీపాయ్ మీద పెట్టి,
ఏదో ఆలోచించసాగాడు..

"ఏం ఆలోచిస్తున్నావ్ ఆదిత్య..?? అసలు ఆ రోజు ఏం జరిగిందో నువ్వైనా చెప్పు..!!"

" సత్యం మీకు ఏమీ చెప్పలేదా సార్..??"అని తల వంచుకుని కరుణాకర్ వైపు చూడకుండా అడిగాడు.

" చెప్పాడు కానీ.....!! తన చెప్పిన మాటలు అస్సలు నమ్మబుద్ధి కావడంలేదు. అందుకని నీ దగ్గరికి వచ్చాను.."

" సత్యం మీకు ఏది చెప్పాడో..!! అదే నిజం.!
మా అందరి పైన దాడి చేసింది ఒక భయంకర రాకాసి..!!"

ఆ మాటలు విన్న కరుణాకర్ కి కోపం వచ్చింది..

" చిన్నపిల్లాడిలా మాట్లాడకు ఆదిత్య..!!
ఈ జనరేషన్లో కూడా దయ్యాలు భూతాలు అసలు ఉన్నాయంటే నన్ను నమ్మమంటావా..!! అడవిలో
మీ మీద దాడి జరిగింది నిజం..!! దాన్ని గుర్తించలేక రాకాసి వచ్చింది.. దయ్యం వచ్చింది అంటే ఎలా నమ్మమంటావ్.!!"

" సార్..!! దానిని నా కళ్ళతో 2, 3సార్లు చూశాను.. మొదట నేను నమ్మలేదు..!!
కానీ ఆ రోజు రాత్రి దాని దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాను అంటే అంతా ఆ దేవుడి దయ..!! మీరు నమ్మినా నమ్మక పోయినా అదే నిజం సార్..!!" అంటూ చెప్పడం ముగించాడు.

" చూడు ఆదిత్య..! ఒక సెక్యూరిటీ అధికారి గా
నీకు తెలుసు...!! ఇలాంటి కథలు ఎవరూ నమ్మరు అని..!! కాబట్టి ఈ కేసును క్రూర మృగాల దాడి వల్ల జరిగింది అని క్లోజ్ చేస్తున్నాం..!! ఆ ప్రాంతాన్ని డేంజర్ జోన్ గా ప్రకటిస్తున్నాము...!! ఇక్కడితో ఈ కేసు అయిపోయింది.. ఇక ఈ విషయం గురించి నువ్వు మర్చిపోతే మంచిది..!!"అని చెప్పి ఆదిత్య సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడ నుంచి ఏసీపీ కరుణాకర్ వెళ్ళిపోయాడు..

జరిగిన దాన్ని తలుచుకుంటూ ఆదిత్య బాధపడుతూ కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి జారబడి కూర్చున్నాడు...

" ఆదిత్య..!!" అంటూ అతనికి పిలుపు వినిపించింది..

ఉలిక్కిపడి కళ్ళుతెరచి చూశాడు..

ఎదురుగుండా నవ్వుతూ
తన తాతగారు, బాబాయి ఉన్నారు..

వాళ్ళని చూడగానే ఆదిత్య కి ప్రాణం లేచి వచ్చింది..

వెంటనే లేచి వెళ్లి వాళ్ళ పాదాలకి నమస్కారం చేశాడు..

వారిని కూర్చోబెట్టి...!!
" ఎలా ఉన్నారు తాతగారు..!! మీరు కూడా ఎలా ఉన్నారు బాబాయ్..!!" అంటూ కుశల ప్రశ్నలు వేశారు..

"బాగున్నాం..!! నీ ఆరోగ్యం ఎలా ఉంది..!!?"
అంటూ అడిగారు ఇద్దరు

ఆదిత్య ఆ మాట కి నీళ్ళు నిండిన కళ్ళతో తన మెడలో ఉన్న రుద్రాక్షమాలను చూపిస్తూ..." తాతగారు..!! ఆ రోజు మీరు కనుక రుద్రాక్షమాలను ఇవ్వకుండా ఉంటే..ఈరోజు నేను ఇలా బ్రతికి ఉండే వాడిని కాదు.. దీనివల్ల ఇద్దరి ప్రాణాలు నిలిచాయి.."అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

సత్యనారాయణ రావు ఆదిత్యని ఊరడిస్తూ...
" బాధపడకు.. ఆదిత్య..!! నీకు దైవానుగ్రహం ఉంది కాబట్టే ఆ రోజున ఈ రుద్రాక్ష మాల నీ మెడకు చేరింది..అంతా ఈశ్వర కటాక్షం.."

" అయినా ఇలా సడన్ గా వచ్చారే బాబాయ్...!?"

" నువ్వు వెళ్లిన రోజు రాత్రి తాతగారు నీకు ఏదో ఆపద ఉందని భయపడ్డారు. ఆ రోజు అర్థరాత్రి నీకోసం ఒక చిన్న యాగం చేసాము.. ఆ తర్వాత రోజు నుంచి తాతయ్య గారు ఆరోగ్యం పాడయ్యింది..
రెండు రోజుల క్రితమే కోలుకున్నారు..
నిన్ను చూడాలని అంటే నేనే తీసుకు వచ్చాను.."
అని సత్యనారాయణ రావు ఆదిత్య తో చెప్పాడు..

అప్పుడు ఆదిత్య కి అర్థం అయింది.

ఆ రోజు రాత్రి తను పోగొట్టుకున్న రుద్రాక్ష మాల తిరిగి తన వద్దకు రావడానికి,ఆ భయంకరమైన రాకాసి తననేమీ చేయలేకపోవడానికి, తన తాతగారు చేసిన యాగమే అని అర్థమయింది..!!

ఒక్కసారిగా తాతగారి చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకోసాగాడు..

గోవింద రావు ఆదిత్యని ఊరుకోబెట్టారు..!!

కొద్దిసేపటికి ఆదిత్య మామూలు స్థితికి వచ్చాడు..

ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా..

అక్కడికి సత్యం వచ్చాడు...

సత్యం ని చూడగానే ఆదిత్య ఆనందంగా అతని దగ్గరకు వెళ్ళాడు..

" ఎలా ఉన్నావ్ సత్యం..??"

" అంతా మీ దయ సార్..!! ఇప్పుడు బాగానే ఉన్నాను..!!"అంటూ కన్నీళ్లు పెట్టుకొసాగాడు.

" ఛా..!!ఊరుకో..!! అన్నట్టు కరెక్ట్ టైం కి వచ్చావ్..!! అదిగో మా తాతగారు ఆయనే..!!"అంటూ గోవింద రావు అని చూపించిన మరుక్షణం..సత్యం వేగంగా వెళ్లి ఆయన పాదాలపై పడి భోరున ఏడవ సాగాడు...

ఆ హఠాత్పరిణామానికి గోవింద రావు, సత్యనారాయణ రావు, ఆదిత్య బిత్తరపోయారు..

"అయ్యో ఏంటిది సత్యం పైకి లే..??" అంటూ ఆదిత్య పైకి లేపుతున్నా సరే సత్యం పైకి లేవటం లేదు....

అప్పుడు ఆదిత్య కి అర్థం అయింది..

తనను కాపాడినందుకు దానికి కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియక అలా కాళ్ళమీద పడ్డాడు అని....!!!

గోవింద రావు నవ్వుతూ...!!
" ఊరుకో నాయనా..!! ఏడవకు..! పైకి లే..!" అనగానే

సత్యం పైకి లేచి కళ్ళు తుడుచుకుని,
ఆయనకు చేతులు జోడించి..
" ఆరోజు మీరిచ్చిన రుద్రాక్ష మాల లేకపోయి ఉంటే నేను, ఆదిత్య గారు బతికే వాళ్ళం కాదు స్వామి..!! నాకు తండ్రి లేరు. తల్లి మాత్రమే ఉంది. నన్ను చూసుకొని ఆమె బ్రతుకుతుంది. నేనే గనుక లేకపోయి ఉంటే నా తల్లి ఏమైపోయేదో అన్న ఆలోచనే
నేను తట్టుకోలేకపోతున్నాను.. కానీ మీరు చేసిన సహాయం జన్మ జన్మలకి మర్చిపోలేను స్వామి..!!" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.


" బాధపడకు నాయనా..!! మీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చెయ్యడు..!! ధైర్యంగా ఉండు..!!"అంటూ ఆశీర్వదించారు..

ఇంతలో పని మనిషి వచ్చింది "భోజనం సిద్ధం అయింది..!!" అని చెప్పగానే అందరూ భోజనానికి లేచారు..

భోజనాలు పూర్తయిన తర్వాత...

గోవింద రావు కి మరోసారి కృతజ్ఞతలు చెప్పి,
సత్యం అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

సత్యనారాయణ రావు భోజనప్రియుడు..

శుభ్రంగా తిని, తన గదికి వెళ్లి పడుకుండి పోయాడు..

ఆదిత్య, గోవింద రావు మరోసారి ఇదే విషయం గురించి మాట్లాడుకోసాగారు..

" అసలు అది నా వెంట ఎందుకు పడుతుంది.? నన్ను చంపాలని ప్రయత్నిస్తోంది..! నా తోటి మందిని చంపేసింది.! అసలు దాని ఉద్దేశం ఏంటో నాకు అర్ధం కావట్లేదు తాతయ్య..??"

" కారణం లేకుండా ఏదీ జరగదు ఆదిత్య..!
అది నీ వెంట ఉండడానికి ఖచ్చితంగా
ఒక కారణం ఉంటుంది.. నీ వాళ్ళని చంపడానికి కూడా ఒక కారణం ఉండే ఉంటుంది.. అసలు దీని వెంట ఎప్పుడు నుంచి పడుతుందో నాకు చెప్పగలవా..??"

ఆ ప్రశ్నకి ఆదిత్య కొంతసేపు ఆలోచించి..
" ఆ..!! ఫ్యామిలీ ని ఎవరో తుమ్మలబైలు అనే ఊరి దగ్గర చాలా దారుణంగా చంపేశారు.. నీకేసి ఇన్వెస్టిగేషన్ చేద్దామని అక్కడికి వెళ్లాను.. అప్పుడు నాకు
ఆ రాకాసి అక్కడ కనిపించింది.. మొదట్లో అంతా
నా భ్రమ అనుకున్నాను.. కానీ అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత నుంచే అది నా వెంట పడుతుంది..." అని చెప్పాడు ఆదిత్య..


ఆదిత్య చెప్పిన సమాధానానికి తాతగారు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచించి మెల్లగా కళ్ళు తెరిచారు..

ఆయన ఏం చెప్తారొనని ఆదిత్య ఆసక్తిగా ఎదురు చూడసాగాడు..

"చూడు ఆదిత్య...!! ఈ భూమి మీద  కొన్ని నిషేధించబడిన స్థలాలు ఉంటాయి.. ఆ ప్రదేశాలలో దుష్టశక్తి స్వైర విహారం చేస్తూ ఉంటుంది.. అటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు మనం కూడా శాపగ్రస్తమవుతాము.. నువ్వు చెప్పినవి విన్న తర్వాత నువ్వు వెళ్లిన ప్రదేశం కూడా అటువంటిదే అయి ఉంటుంది.. నేను ఒకసారి ఆ ప్రదేశానికి వెళ్లి వస్తాను.. అప్పుడు నాకు పూర్తిగా వివరాలు తెలుస్తాయి.. నేను సత్యనారాయణ రావుతో కలిసి ఒకసారి ఆ ప్రదేశానికి రేపు తెల్లవారుజామున వెళ్లి వస్తాను.." అని అన్నారు..

ఆదిత్య అడ్డు చెప్పబోయాడు.. కానీ తాతగారి శక్తిపై తనకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన అక్కడికి వెళితేనే కానీ ఈ సమస్యకు పరిష్కారం జరగదు అని మనసులో అనుకున్నాడు.. అందుకని ఆదిత్య కూడా ఒప్పుకున్నాడు.


ఆ మరుసటి రోజు.....!!

ఆ ప్రదేశానికి వెళ్లడానికి గోవింద రావు కి సత్యనారాయణ రావుకి తోడుగా సత్యం ని పిలిపించాడు ఆదిత్య..

ఆ ప్రదేశానికి వెళ్ళటానికి సత్యం మొదట భయపడినా గోవింద రావు గారు ఉన్నారనే ధైర్యంతో ఒప్పుకున్నాడు...

తెల్లవారుజామున 5 గంటలకు ఆదిత్య ఇంటి నుంచి ముగ్గురు కార్ లో బయలుదేరారు..

ఆ తర్వాత ఆదిత్య స్టేషన్కి ఫోన్ చేసి,
తుమ్మలబైలు చుట్టుపక్కల అంతకుముందు అలాంటి హత్యలు గాని యాక్సిడెంట్ గాని ఏమైనా జరిగినా ఏమోనని వివరాలు సేకరించసాగాడు....

కొంతసేపటికి ప్రయాణం తర్వాత తుమ్మలబైలు కి ముగ్గురు కారులో చేరుకున్నారు..

కార్ ని మొదట వాళ్ళు లోయలోకి దిగిన
వైపు ఆపాడు..

కార్ దిగిన సత్యం లోయ లోపలికి వెళ్లబోతుంటే "ఆగు సత్యం..!"గోవింద రావు ఆపేశారు...

ఏమైంది అన్నట్టు ఆయన వైపు ఆశ్చర్యంగా చూశాడు సత్యం..

ఇది సూర్యోదయ సమయం...!!

ఈ సమయంలో  దుష్ట శక్తుల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.. కానీ ఇటువంటి శాపగ్రస్త ప్రదేశాలలోకి ఎవరైనా వస్తే వాళ్లను చంపేంత వరకు అవి ఇటు వంటి ప్రదేశాలలో పగటి పూట వాటి శక్తి ఎక్కువగా కాకపోయినా కొంత మేర ఉంటుంది. అంటే మన మీద దాడి చేయలేవు గాని, దాడి చేసే సమయం కోసం ఎదురు చూస్తూ మన వెంటే ఉంటాయి.
ఒకవేళ ఇక్కడ వాటికి దాడి చేయడానికి అవకాశం లేకపోతే మనతోపాటు మన వెంటే వచ్చేస్తాయి.. ఒకవేళ అనుకోకుండా ఈ ప్రదేశం దగ్గరికి మనం వస్తే మనల్ని చంపి అప్పుడే అవి శాంతిస్తాయి..

ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రదేశం లో ఎండ కాస్తుంది.. ఒకవేళ పగటిపూట అయినా.. ఆకాశం పూర్తిగా మబ్బులు పట్టి, ఈ ప్రదేశం అంతా చీకటిగా ఉంటే వాటి శక్తి అమాంతం పెరిగిపోతుంది.. అందుకని మనం పగటిపూట అయినా సరే అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి.." అని అంటూ సత్యం చేతికి ఒక రక్ష లాంటిది కట్టారు.. ఆ రక్ష కట్టిన తర్వాత సత్యం కి తన శరీరం ఏదో కొత్త శక్తీ పుంజుకున్నట్లు అనిపించింది..


గోవింద రావు ఆ రక్ష ని చూపిస్తూ..
" ఈ రక్ష నీకు కట్టడానికి ముఖ్య కారణం. నువ్వు ఆదిత్య ఈ స్థలం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆ దుష్ట శక్తి మీ రాక కోసం మీ వెంటే ఉన్నది.. అందుకనే నీ మనసు కూడా మాతో పాటు ఇక్కడికి రావడానికి ఉసిగొల్పింది.. ఈ రక్ష ఇక్కడ కట్టడానికి కారణం.. ఆ దుష్ట శక్తి ప్రభావం ఇప్పటి వరకు నీ మీద ఉంది. కాని ఇప్పుడు తొలగిపోయింది. దాని ప్రభావం నుంచి నిన్ను కాపాడాలని నువ్వు మాతో రావడానికి ఒప్పుకున్నాను.. ఇక్కడ నుంచి నువ్వు మాతో రావలసిన అవసరం లేదు. కార్ లోనే ఉండిపో..!!"అని చెప్పారు గోవింద రావు..

ఆ మాటలకి సత్యం ఒప్పుకోలేదు..
" అలా అనకండి స్వామి..!! నా ప్రాణాలను కాపాడిన మిమ్మల్ని వదిలేసి నేను ఇక్కడే ఉండలేను.. ఇంతకు మునుపు నాకు భయం ఉండేది.. కానీ ఇప్పుడు లేదు.. నేను కూడా మీతో పాటు వస్తాను.. మీరు చెప్పినట్టే జాగ్రత్తగా నడుచుకుంటాను.."అని అన్నాడు..

ఆ మాటలకు గోవింద రావు నవ్వి.....
" సరే నాయనా..! నీ ఇష్టం. కానీ ఎట్టి పరిస్థితులలో మమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళకు..!! సరేనా..!
ఇక బయల్దేరండి.."అంటూ ముగ్గురు ముందుకు కదిలారు..

వారికి మెల్లగా దారి చూపిస్తూ సత్యం ముందుగా నడుస్తున్నాడు.. అతని వెనుక గోవింద రావు, సత్యనారాయణ రావు వస్తున్నారు..


మరోపక్క.....!!

ఆదిత్య ఇంటికి తుమ్మలబైలు కి సంబంధించిన ఫైల్స్ ఒక కానిస్టేబుల్ తీసుకువచ్చాడు.

అవి తీసుకుని ఒక్కొక్క ఫైల్ని పరిశీలించ సాగాడు..

ఆ కేసుల్లో యాక్సిడెంట్, మిస్సింగ్ కేస్ లు ఎక్కువగా ఉన్నాయి..

అందులో ఒక యాక్సిడెంట్ కేసు పరిశీలిస్తే.
అందులో ప్రత్యక్షసాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం..
ఇద్దరు స్నేహితులు కలిసి కారులో శ్రీశైలం వెళ్తున్నారు.. దారిలో తుమ్మలబైలు దగ్గర కార్ కి సడన్ గా ఎవరో అడ్డు రావడం వల్ల,
కార్ యాక్సిడెంట్ కి గురి అయిందని అందులో తన స్నేహితుడికి గాయాలయ్యాయని, సహాయం కోసం అతనొక్కడే శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చేసరికి స్నేహితుడి శవం పక్కనే ఉన్న పొదలో దొరికిందని ఉంది..
ఆ కేసులో పోస్టుమార్టం రిపోర్టులో కూడా ఏదో
క్రూర మృగం దాడి చేయడం వల్ల అతను చనిపోయాడు అని ఉంది..

మరొక మిస్సింగ్ కేసులో ఒక డబ్బున్న కుర్రాడు
ఆ లోయలో జంతువులను వేటాడతానని తన స్నేహితులకి చెప్పి, వెళ్లినవాడు తిరిగి రాలేదు.. అతని బాడీ కూడా ఎక్కడా దొరకలేదు..

ఇలాంటి కేసులు ఒక నాలుగైదు ఉన్నాయి.

అన్ని కేసులకి ఒకటే సంబంధం కనిపిస్తుంది..

అన్ని కేసులలో చనిపోయిన వారు కనిపించకుండా పోయిన వారు మగవారు ఎక్కువమంది ఉన్నారు..

కానీ ఒకరితో ఒకరికి ఎటువంటి సంబంధం లేదు..

కానీ అన్ని కేసులలో ఉన్న ప్రదేశం ఒకటే..

అదే తుమ్మలబైలు.....!!

ఇంకేం ఆ వివరాలు దొరుకుతాయేమోనని వాళ్ళ బ్యాక్ గ్రౌండ్  కూడా చెక్ చేయించాడు.

కానీ ఏమీ దొరకలేదు..



మరోపక్క...!!

సత్యం తో కలిసి, గోవింద రావు, సత్యనారాయణ రావు ఆ లోయ లోకి ప్రవేశించారు..

వాళ్ళు ఆ ప్రాంతం లోకి ప్రవేశించగానే..
అప్పటిదాకా నిర్మలంగా ఉన్న ఆకాశం మొత్తం కారు మబ్బులతో నిండి పోయింది..

గాలి విపరీతంగా వీచడం మొదలయ్యింది...

చూస్తూ ఉండగానే ఆ ప్రదేశం మొత్తం చీకటి పడిపోయింది...

అది చూసిన సత్యం ఆశ్చర్యంగా గోవింద రావు వైపు చూశాడు.. ఆ ప్రదేశానికి రాకముందు ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి...

సత్యం వైపు చూసి గోవింద రావు చిరునవ్వు నవ్వాడు..

ఇక సత్యనారాయణ రావు ఆలస్యం చేయకుండా రుద్రాక్ష మాల తీసి చేతికి చుట్టుకొని మంత్రోచ్ఛారణ చేయసాగాడు..

గోవింద రావు తన దగ్గర ఉన్న సంచిలో నుంచి కొంత విభూతి తీసి ముగ్గురు పైన చల్లారు..

"ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి..!!
ఎట్టి పరిస్థితులలోనూ ముగ్గురు వేరు పడకూడదు..!! నేను చెప్పిన మాట మాత్రమే వినండి.." ముందుకు కదిలారు..

సత్యనారాయణ రావు, సత్యం,ఆయనను అనుసరించారు..

ఎందుకైనా మంచిదని సత్యం తన బ్యాగ్లో టార్చ్ లైట్ తెచ్చుకున్నాడు..

అది అనుకోకుండా ఈ సమయంలో ఉపయోగపడింది..

గోవింద రావు నడుస్తున్న వైపు సత్యం తన టార్చ్ లైట్ తో దారి చూపించసాగాడు..

అలా ముగ్గురు ఒకరి వెనుక ఒకరు నడుస్తూ ఉండగా.. వారు నడుస్తున్న పక్కనే కొద్దిదూరంలో ఎవరో వాళ్ళని అనుసరిస్తున్నట్లు అడుగుల శబ్దాలు వినిపించసాగాయి...

అది విన్న సత్యం గుండెలు భయంతో కొట్టుకోసాగాయి..

అప్పుడు దాకా నడుస్తున్న గోవింద రావు ఒక్కసారిగా
"ఒక్క క్షణం ఆగండి" అనగానే
వెనకాల ఇద్దరూ ఒక్కసారిగా ఆగిపోయారు..

సత్యనారాయణ రావు మాత్రం మంత్రోచ్చారణ చేస్తూనే ఉన్నాడు..

"ఏమైంది స్వామి..??"  అని భయపడుతూ అడిగాడు సత్యం..

" ఇది నీకే చెప్తున్నాను నాయనా..!!
మనసులో పెట్టుకో... ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి గా, చుట్టుపక్కల గాని చూడకు.. ఎటువంటి భయంకర పరిస్థితులు ఎదురైనా సరే...
మమ్మల్ని విడిచి వెళ్ళకు.. నా పైన పూర్తి నమ్మకం ఉంచు.. అది నీకే మంచిది.. నీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్ధించుకుంటూ ఉండు.." అని సత్యంతో చెప్పి

" ఇక ముందు పదండి.." అని అంటూ ముందుకు కదిలారు..

సత్యం ఆయన చెప్పినట్టుగానే దేవుడిని ప్రార్ధించుకుంటూ ఆయన వెంట నడవసాగాడు...

అలా నడుస్తూ ఉండగా సత్యం పక్కన విచిత్రమైన అరుపులు వినిపించసాగాయి..

ఎవరో పిలుస్తున్నట్టు, ఎవరో తన మీదకి వేగంగా దూసుకువస్తున్నట్టు  అనిపించసాగింది..

" ఏం జరిగినా చుట్టుపక్కల చూడకూడదు" అని మనసులో గట్టిగా అనుకున్నాడు...

అలా కొద్ది సేపు నడిచిన తరువాత మొదట హత్యలు జరిగిన గుహ దగ్గర ముగ్గురు ఆగారు..



వారు ఆ గుహ దగ్గరకు వచ్చిన వెంటనే
గాలి మరింతగా వీచడం మొదలైంది.

ఆకాశంలో మెరుపులు మెరిసాయి..



ఆ స్థలం గురించి సత్యం కి తెలుసు...

అదే విషయాన్ని  గోవింద రావు కి చెప్పాడు..

అక్కడ జరిగిన హత్య గురించి చిన్న పిల్లలు కూడా చనిపోయారని మొత్తం చెప్పాడు..

సత్యం చెప్పినదంతా విన్న గోవింద రావు..
సరే అన్నట్టుగా తలూపారు..

మొదట తన సంచి లో నుంచి ఒక చిన్న పాత్ర లాంటిది తీసి బయటకు తీసి, అందులో పసుపు కుంకుమ విభూతి కలిపి,
దానికి నీళ్లు కలిపి, ఒక ద్రవాన్ని తయారు చేశారు..

మొదట ఆ ద్రవాన్ని గుహ ముందు చల్లారు..

ఆ తర్వాత గుహ ముందు సత్యనారాయణ రావు అక్కడ పడి ఉన్న ఒక కట్టే తీసుకొని,
దానికి ఒక గుడ్డను చుట్టి, దాని తైలంతో తడిపి, గుహ ముందు ఉంచారు..

సత్యం వాళ్ళు చేస్తున్నదంతా ఆశ్చర్యంతో గమనించసాగాడు....

ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత..

సత్యనారాయణ రావు, గోవింద రావు,
ఇద్దరు కలిసి మంత్రాలు బిగ్గరగా పఠించడం  మొదలుపెట్టారు..

వారు మంత్రాలు మొదలు పెట్టిన,.. కొద్ది క్షణాల లోనే ఆ ప్రాంతం అంతా గాలి ప్రచ్ఛన్నంగా వీచడం మొదలైంది...

చుట్టూ వికృతమైన అరుపులు వినిపించసాగాయి..

ఆ అరుపులు విన్న సత్యం భయంతో అప్పటిదాకా వారిద్దరికీ దూరంగా నుంచొని ఉన్నవాడు కాస్తా..!! పరిగెత్తుకొని వెళ్లి వారి దగ్గర నుంచోని, అక్కడ జరిగే తతంగం అంతా గమనించసాగాడు.

అలా వాళ్ళ మంత్ర పఠనం జరుగుతూ ఉండగా..

కొంతసేపటికి....

భయంకరంగా వీస్తున్న గాలులు కాస్తా,
వీచడం ఆగిపోయాయి..

ఆ వికృత శబ్దాలు కూడా ఆగిపోయాయి..



ఇంతలో......!!!!!

గుహ ముందు వెలుగుతున్న కాగడా మంట అకస్మాత్తుగా భయంకరమైన మంటలు వెదజల్లడం ప్రారంభించింది...

ఆ గుహలో నుండి భయంకరమైన ఒక్క పెద్ద మూలుగు వినిపించ సాగింది....

అది విన్న ఇద్దరు ఒక్కసారిగా మంత్ర పఠనం  ఆపేశారు..

ఆ మూలుగు విన్న సత్యం గుండె ఒక్కసారిగా ఝల్లుమంది..

తను కూడా ఆ గుహ వైపు రెప్ప వాల్చకుండా చూడసాగాడు..

ఆ గుహలో నుండి పెద్ద పెద్ద అడుగుల చప్పుడు వినిపించసాగింది..

అందరూ చూస్తూ ఉండగానే భయంకరమైన ఆకారంతో పెద్ద రాకాసి గుహ లోని చీకట్ల నుండి బయటకు వచ్చింది..

ఆ ఆకారాన్ని చూసిన సత్యం భయంతో వణికిపోతున్నాడు..

ఎందుకంటే...!!

తన మీద అంతకుముందు దాడి చేసింది అదే....!!

గోవింద రావు చెప్పారు కాబట్టి ఆగాడు కానీ...

లేకపోతే...!! దాన్ని చూసిన వెంటనే అక్కడ నుండి పారిపోయే వాడే...!!

దాన్ని చూసిన గోవింద రావు లేచి నుంచున్నారు.. చేతిలో కొన్ని నీళ్ళు తీసుకొని, వాటిని నోటి దగ్గర తీసుకొని, ఏవేవో మంత్రాలు చదువుతూ ఆ నీటిని
ఆ రాకాసి మీద చల్లారు...

ఆ నీళ్లు దాని శరీరం పై పడగానే చిటపటలాడుతూ నిప్పురవ్వలు లేచాయి..

ఆ మంటను తట్టుకోలేక గట్టిగా అరుస్తూ వారి మీదికి రావడానికి ప్రయత్నించింది..

కానీ గుహ ముందు గోవింద రావు చల్లిన ద్రవం నుండి పెద్దగా మంటలు లేచాయి..

అందువల్ల అది గుహ ను దాటి బయటకు రాలేకపోయింది...

అది గుహ బయటకు రాలేకపోవడం చూసిన గోవింద రావు నేల పై కూర్చుని, సత్యనారాయణ రావు వైపు చూసారు..

తనకి అర్థం అయింది అన్నట్టుగా తల ఊపి,
ఆయన ముందు పసుపు, కుంకుమ, విభూతి, తో మూడు వలయాలను ఒకదానిలో ఒకటి గీశాడు..

చివరిగా వలయాల మధ్యలో ఒక చిన్న రాక్షసి బొమ్మ ఉంచాడు..

అది గోవింద రావు ఆ రాకాసిని బంధించడానికి చేస్తున్న ప్రక్రియ..

ఈసారి గోవింద రావు మూడు పెద్ద పెద్ద మేకుల ని తీసుకొని, ఆ వలయాల కి కొంచెం దూరంలో నాటి, మంత్రాలు చదువుతూ ఒక పసుపు దారాన్ని ఆ మెకులకు చుడుతూ, ఆ వలయం చుట్టూ ఒక త్రిభుజాకారం ని ఏర్పాటు చేసాడు..

త్రిభుజాకారం పూర్తయిన తర్వాత..

వలయం మధ్యలో ఉన్న బొమ్మపై పసుపు కుంకుమ చల్లుతూ, ఆ రాకాసిని
ఆ బొమ్మలో బంధించడానికి ప్రక్రియ మొదలు పెట్టారు..

ఆ ప్రక్రియ మొదలు పెట్టగానే ఆ రాకాసి ఆ గుహ నుండి బయటపడదామని ప్రయత్నించసాగింది.. కానీ దాని వల్ల కాలేదు..

అలా ఒక గంట సేపు ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.. కానీ రాకాసి మాత్రం లోంగటం లేదు..

ఈసారి గోవింద రావు చేతిలోకి మండుతున్న ఒక కాగడా తీసుకొని, దానికుండే మంటలను ఆ బొమ్మకేసి చూపించసాగారు.

ఆయన అలా చెయ్యడంతో గుహ ముందు  వెలుగుతున్న కాగడా నుండి మంటలు ఎగసి చుట్టూ ముట్టాయి..

ఆ మంటలు అలా చుట్టుముట్టడంతో దానికి పట్టరాని కోపం వచ్చింది..

ఉన్నట్టుండి అది విచిత్రంగా ఒక అరుపు అరిచింది..

అది అలా అరిచిన మరుక్షణం ఉన్నట్టుండి గోవింద రావు కూర్చున్న ప్రదేశం దడదడ లాడింది..

గోవింద రావు వెంటనే తను కూర్చున్న ప్రదేశం నుంచి లేచిపోయారు..

అందరూ చూస్తూ ఉండగానే ఆ వలయాల నుంచి మంటలు లేచాయి. త్రిభుజాకారంలో ఉన్న పసుపు దారాలు కాలిపోసాగాయి..

అందరూ చూస్తూ ఉండగానే....

వలయాల మధ్యలో ఉన్న రాకాసి బొమ్మ
గాల్లోకి లేచి గుహా దగ్గరగా ఎగురుకుంటూ వెళ్లి మాయమై పోయింది...

గుహ లోపల ఆ రాకాసి శరీరాన్ని చుట్టుముట్టిన మంటలు కూడా మాయమైపోయాయి...

ఒక్కసారిగా వారు ఉన్న ప్రదేశంలో పిచ్చిపిచ్చిగా అరుపులు కేకలు వినిపించసాగాయి

అంతా గమనిస్తున్న గోవింద రావు గుహలో ఉన్న రాకాసి వైపు చూస్తూ ఉన్నారు..

అది గుహ నుండి బయట పడడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది..

ఇక అక్కడ ఉండడం ప్రమాదమని గ్రహించిన గోవింద రావు తన వాళ్ళ వైపు చూసి " త్వరగా బయలుదేరండి.. ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం మన ప్రాణానికే ప్రమాదం.."అని చెప్పి వేగంగా నడవసాగారు..

ఆయన వెంట సత్యం, సత్యనారాయణ రావు వెళ్ళసాగారు..

ఏమైంది స్వామి అని అడిగాడు సత్యం కంగారుపడుతూ..

ఇప్పుడు మాట్లాడే సమయం లేదు నాయన
కారులో వెళ్లేటప్పుడు చెప్తాను...అంటూ వేగంగా నడవసాగారు..

ఇక మారు మాట్లాడకుండా సత్యం ఆయన వెంట నడవసాగాడు..

సత్యనారాయణ రావు మాత్రం చివరిగా నడుస్తూ మంత్రాలు పఠించడం సాగాడు..

ఒక అరగంట వేగంగా నడిచిన తర్వాత
తమ కారుని చేరుకున్నారు..

సత్యం కారు డోర్ తీసి ఎక్కండి స్వామి అని అనగా మొదట మీరు కూర్చునే చివరిగా నేను కారు ఎక్కుతాను అని సమాధానం ఇచ్చారు..

డ్రైవర్ సీట్లో సత్యం కూర్చున్నాడు.

ముందు సీట్లో సత్యనారాయణ రావు కూర్చున్నాడు..

చివరిగా గోవింద రావు చేతిలో నీళ్ళు తీసుకుని, ఆ నీళ్లను నోటిదగ్గర తీసుకొచ్చి,
ఏవేవో మంత్రాలు చదివి, ఆ నీళ్లను కారుపై చల్లాడు..

అలా చల్లగానే, అక్కడ గుహ ముందు
ఆ రాకాసి కోసం వేసిన బంధాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి.

ఆ రాకాసి గుహ బయటకు వచ్చి గట్టిగా అరిచింది..

ఆ అరుపు విన్న గోవింద రావు వెంటనే కారు ఎక్కి, "సత్యం..!! మనం త్వరగా ఆదిత్య దగ్గరికి వెళ్ళాలి."అని చెప్పగానే..

" అలాగే స్వామీ " అంటూ కార్ స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనిచ్చాడు..



ఇంకా ఉంది......!!!!
[+] 10 users Like SivaSai's post
Like Reply
#26
Excellent update
Like Reply
#27
After a lot of intro violence.. now got into the story!!
Great going Sivagaru
Like Reply
#28
Part - 13

సత్యం కారు ని స్టార్ట్ చేసిన మరుక్షణం పెద్దగా వర్షం మొదలయింది..

ఆ వర్షంలో కారుని వేగంగా డ్రైవ్ చేయసాగాడు...

సత్యనారాయణ రావు మౌనంగా కార్ లో కూర్చున్నాడు..

గోవింద రావు కళ్ళు మూసుకుని ఏవేవో మంత్రాలు శబ్దం రాకుండా చదవసాగారు..


ఒక పది నిమిషాల తర్వాత....


గోవింద రావు కళ్ళు తెరవకుండానే...!

" నాయనా సత్యం.. కొద్ది దూరం వెళ్లగానే కుడిచేతి పక్కగా కాళికామాత ఆలయం వస్తుంది.. బండి ని అక్కడ ఆపు...!!"అని అన్నారు...

అలాగే స్వామి అంటూ సత్యం ముందుకు పోనిచ్చాడు..

గోవింద రావు చెప్పినట్టుగానే కాళికామాత ఆలయం వచ్చింది..

సత్యం కారుని ఆ గుడి దగ్గర ఆపాడు.

అప్పటి దాకా కురుస్తున్న వర్షం ఉన్నటుంది  పూర్తిగా తగ్గిపోయింది...!!

కారును ఆపిన వెంటనే మొదటగా
గోవింద రావు వేగంగా ఆలయం లోపలికి వెళ్ళిపోయారు..

ఆయన వెనుకనే సత్యనారాయణ రావు వెళ్ళాడు..

సత్యం కారుని లాక్ చేసి, ఆలయం లోపలికి ప్రవేశించాడు..

అది పురాతన కాళికా మాత ఆలయం.

గుడి మొత్తం ఖాళీ గా ఉంది..
కానీ గర్భగుడి మొత్తం దీపాలతో దేదీప్యమానంగా వెలిగి పోతోంది...

ఆ ఆలయం యొక్క బాగోగులు ఎవరో చూస్తూ ఉన్నందువలన ఆ గుడి అందంగా, కళకళలాడుతూ ఉంది..

ఆలయ ప్రాంగణంలో గోవింద రావు కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో ఉన్నారు.

సత్యనారాయణ రావు ఆయన దగ్గరే ఉన్నాడు.

వారిని చూసిన సత్యం నేరుగా గర్భ గుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నాడు..

అమ్మవారు గంభీరమైన రూపంతో ఉన్నారు.

సత్యం మనస్పూర్తిగా అమ్మవారిని దర్శించుకుని, గోవింద రావు కి కొంచెం దూరంలో కూర్చున్నాడు.

ఒక పావుగంట తర్వాత గోవింద రావు కళ్ళు తెరిచారు..

"ఆయన ఏం చెప్తారు.?" అని ఇద్దరు ఆసక్తిగా ఎదురు చూడసాగారు...

గోవింద రావు కొంత సేపు అలాగే గర్భగుడిలో ఉన్న అమ్మవారి వైపు చూస్తూ ఉన్నారు..

ఎంతసేపటికీ ఆయన కదలకపోవడంతో..

"స్వామి..!" అని మెల్లగా పిలిచాడు సత్యం..

సత్యం వైపు చూశారు గోవింద రావు..

"అక్కడ జరిగినదెంటో చెప్పగలరా స్వామి..? నాకు ఏమీ అర్థం కావట్లేదు..??" అని మెల్లగా అడిగాడు..


అన్న మాటలకి గోవింద రావు చిన్న చిరునవ్వు నవ్వి...

" చూడు సత్యం...!! అది మామూలు రాక్షసి కాదు..!! ఒక భయంకరమైన దుష్టశక్తి..!!
దానిని ఎవరో ఆ ప్రదేశంలో ఆవాహన చేశారు..!!! దాని శక్తి చాలా ఎక్కువగా ఉంది..!! మనం దానిని బంధించడానికి ప్రయత్నించడంతో ఇంకా కోపంతో రగిలిపోతుంది..!!"అని చెప్పారు.

"అంత భయంకరమైన దుష్టశక్తిని ఎవరు నిద్రలేపి ఉంటారు చిన్నాన్న..??
నిజంగా దాని శక్తి ప్రచండంగా ఉంది..!! మనం బంధించి ఉంచిన తర్వాత కూడా దాని శక్తులు ఎలా పనిచేసాయో నాకు అస్సలు అర్థం కావడం లేదు..??"

"మన మీద దాడి చేయడానికి ప్రయత్నించింది.. ఆ దుష్టశక్తి కాదు...!!
దాని కావలి శక్తులు...!!"

" కావలి శక్తులా...??"అని ఇద్దరూ ఒకేసారి ఆశ్చర్యంగా అడిగాడు..

"అవును....!! దీనికి ఉన్న శక్తులను చూస్తుంటే ఇది దుష్టశక్తులలో ప్రముఖమైనదని నాకనిపిస్తోంది..!! ఇంతకుముందు నేను ఎప్పుడు ఇటువంటి శక్తిని ఎదుర్కోలేదు..!! దానికి కావలి శక్తులు ఉండవనుకుని తక్కువ అంచనావేసి ప్రమాదపు అంచుల దాకా వెళ్లి వచ్చాము..!! ఇప్పుడు ఆ దుష్ట శక్తి ఏంటో తెలిస్తేనే కానీ మనం ఏమి చేయలేము...??"

"అసలు కావలి శక్తి అంటే ఏమిటి స్వామి..?" అని అడిగాడు సత్యం..

"కావలి శక్తి అంటే కాపలాగా ఉండే ఒక శక్తి..
ఈ కావలి శక్తులను చాలా రకాలుగా ఉపయోగిస్తారు.. పూర్వం రాజులు, గొప్ప గొప్ప ధనవంతులు, యుద్ధ సమయాలలో, అత్యవసర పరిస్థితులలో  తమ సంపదనంతా నిధులుగా దాచి పెట్టేటప్పుడు, వాళ్లకి తప్ప అవి వేరే వాళ్ల పరం కాకుండా గొప్ప గొప్ప మంత్రగాళ్ళ సహాయంతో వాటిమీద కావలి శక్తులను
ప్రయోగిస్తారు...ఒకసారి వాటిని ప్రయోగించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినా సరే...అవి వాటికి కాపలాగా ఉంటాయి..!!"

"పొరపాటున గురించి తెలియని ఎవరైనా ఆ సంపదని దొంగిలించాలని కానీ, తమ సొంతం చేసుకోవాలని చూస్తే..!!అవి వాళ్ళని దారుణంగా చంపేస్తాయి...!!
వాళ్ల చావు చాలా భయంకరంగా ఉంటుంది."

ఇటువంటి కావలి శక్తులని, తాంత్రిక పూజలు, జంతు బలులు జరిపించిన తరువాత మాత్రమే అవి వెళ్లిపోతాయి.. అప్పుడు కూడా వాటిని ప్రారద్రొలగలం తప్ప, అంతం చేయలేము..! ఇప్పుడు అటువంటి శక్తులే ఆ దుష్ట శక్తికి కాపలా కాస్తున్నాయి....!!
ఆ కాపలా శక్తులని అడ్డు తప్పించెంతవరకు
ఆ దుష్ట శక్తిని బంధించడం అసాధ్యం"

"చిన్నాన్న నాకో సందేహం...!! అంతా భయంకరమైన దుష్ట శక్తిని ప్రయోగించి కూడా దానికి కావలి శక్తులను ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమిటి..??"

" నాకు తెలిసి దీనిని ఆవాహన చేసింది. సాధారణ మంత్రవాది కాదు..."

ఎందుకంటే.....!!

" ఒక దుష్ట శక్తికి కావలి శక్తులను ఏర్పాటు చేశాడంటే....అతను సాధారణ మంత్రవాది కాదు..!! నేననుకోవడం ఆ దుష్ట శక్తినీ ఎవరి కోసం అయితే ఆవాహన చేశారో...!! అతను కూడా సాధారణమైన వ్యక్తి కాదని నా గట్టి నమ్మకం...!!"

" అదెలా..?? నాకు అర్థం కాలేదు స్వామి...??" అని అడిగాడు సత్యం.

"ఎందుకంటే..!! సాధారణ మానవులు పై
ఇటువంటి శక్తివంతమైన దుష్టశక్తిని ప్రయోగిస్తే అతని మరణం తధ్యం. ఎంతో దైవానుగ్రహం ఉంటే తప్ప తప్పించుకోలేడు.. ఎందుకంటే అంత భయంకరమైన శక్తి గలది ఈ దుష్ట శక్తి..! అంత శక్తివంతమైన దుష్ట శక్తికి కూడా కావలి శక్తులు ఏర్పాటు చేశాడంటే..!!
ఈ దుష్ట శక్తి ప్రయోగింపబడిన మనిషి ఖచ్చితంగా  దానిని ఎదుర్కోగల శక్తిమంతుడు అయి ఉండాలి..!!"

" అంటే ఆ మనిషి ఆ దుష్ట శక్తిని ఎదుర్కోకుండా ఉండడానికి ఈ కావలి శక్తులను దానికి ఏర్పాటు చేశారా..??"అని అడిగాడు సత్యం..

ఆ మాటకి గోవింద రావు చిరునవ్వుతో..
"అవును.. అదే నిజం..!!"అన్నారు.

"మరి ఇప్పుడు దానిని బంధించడం ఎలా చిన్నాన్న..??"

"ఇటువంటి దుష్టశక్తులను బంధించడానికి
తాంత్రిక విద్యలు తెలిసిన ఒక మంత్రవాది కావాలి.. తాంత్రికులు చేసే ప్రక్రియలు చాలా భయంకరమైనవి ప్రమాదకరమైనవి కూడా.. ఇటువంటి విద్య తెలిసినవారు కూడా చాలా అరుదుగా దొరుకుతారు..."

" మరి ఇప్పుడు అలాంటివారు ఎవరైనా ఉన్నారా స్వామి..??" సత్యం అడగగానే.

" చాలా కాలం క్రితం అంటే దగ్గరగా 30 సంవత్సరాల క్రితం విజయవాడ నగర శివారులలో ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతని పేరు శివుడు.. తాంత్రికుడు అయినా ఎవరికీ చెడు చేసేవాడు కాదు.. చాలా మంచివాడు..ఎవరి మీదనైనా చేతబడి జరిగినా, దుష్ట శక్తి ప్రయోగం జరిగినా, అతని దగ్గరికి వెళ్లేవారు.."

మీకు ఉదాహరణకి ఒక సంఘటన చెబుతాను వినండి...

ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన....

" ఒక రోజు తెల్లవారుజామున నా దగ్గరికి ఇద్దరు దంపతులు వచ్చారు.. వాళ్ల బాబు  ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, ఎంత మంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేదని చెప్పి, కాపాడమని నా కాళ్లు పట్టుకున్నారు... నేను కూడా కాపాడతాను అని చెప్పి వాళ్లతో పాటు ఆ ఇంటికి వెళ్ళాను.."

" నేను ఇంటికి వెళ్లి ఆ బాబు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది..  బక్క చిక్కి పోయి,మంచానికి కట్టేసి ఉన్నాడు.. కానీ నిన్ను చూసిన తర్వాత కోపంతో గింజుకోవడం మొదలుపెట్టాడు..
ఆ బాబు గింజుకుంటుంటే,మంచం ఎగిరిపడసాగింది.. ఆ బాబు పరిస్థితి చూసి నేను ఆశ్చర్యపోయాను.. అతని దగ్గరికి వెళ్లడానికి నేను ప్రయత్నిస్తుంటే..
ఏదో తెలియని శక్తి నన్ను దూరంగా నెట్టి పడేస్తోంది... నాకు ఏం చేయాలో ఆ క్షణం అర్థం కాలేదు..
అప్పటికి  నేను శివుడు గురించి విన్నాను..
నేను ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే శివుడికి కబురంపాను.. అప్పటి వరకు మేము ఒకరి ముఖం మరొకరు చూసుకోలేదు.."

"కొద్దిసేపటికి శివుడు వచ్చాడు.. నల్లని వస్త్రాలు ధరించి, భుజాన గుడ్డతో చేసిన నల్లటి సంచితో, నుదుట మీద నల్లని కాటుక బొట్టు పెట్టుకొని, మెడలో ఎర్రని పూసల దండలు ధరించి, గంభీరంగా ఉన్నాడు."

నన్ను చూడగానే నా పాదాలకు నమస్కరించాడు...!!

" మీ గురించి విన్నాను తప్ప.. మిమ్మల్ని కలుసుకోవడం ఇదే మొదటిసారి స్వామి..!
మిమ్మల్ని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు.."

నేను కూడా అతనితో "నాకు కూడా నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది శివుడు.." అని అన్నాను

"నన్ను పిలిపించడానికి కారణం ఏంటి స్వామి..??" అని అడిగాడు..

నేను ఆ బాబు తల్లిదండ్రులని చూపిస్తూ.. "వీళ్ళ బాబు మీద ఎవరో దుష్టశక్తి ప్రయోగించారు.. దాని బారి నుంచి నువ్వే కాపాడాలి.." అని నేను చెప్పగా శివుడు చిన్నగా నవ్వాడు..

" స్వామి..!! మీరు చూడని దుష్టశక్తి కూడా ఉందా..!! తమరు సర్వం తెలిసినవారు..! మీకు లొంగని దుష్ట శక్తి కూడా ఉందా..!!??"అని అనగా

ఆ మాటకి నేను కూడా చిన్నగా నవ్వి..
" దానిని వదిలించే సమయం నాకు లేదు. పైగా అది ఆ బాలుడి శరీరాన్ని పూర్తిగా లొంగదీసుకుంది. చివరి దశలో ఉన్నాడు.. నాకు కాపాడే అంత సమయం లేదు. నువ్వు ఒక్కడివే నీ తాంత్రిక విద్య తో
ఆ బాబుని కాపాడగలవు..!!" అనే నేను చెప్పగానే మారు మాట్లాడకుండా ఆ బాలుడు గదిలోకి వెళ్ళాడు..

శివుడిని చూడగానే ఆ బాలుడు గట్టిగా కోపంగా అరిచాడు..

శివుడు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన సంచిలో నుండి ఒక చిన్న కర్ర లాంటిది
బయటకు తీశాడు.

ఆ కర్రను ఎడం చేత్తో పట్టుకుని, గట్టిగా మంత్రాలు చదువుతూ ఆ బాబు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దాకా అరిచి గోల చేసిన ఆ బాబు భయంగా శివుడి వైపు చూడసాగాడు.. మెల్లగా ఆ బాబు దగ్గరికి వెళ్లాడు శివుడు..ఆ బాబు తలపై చేయి వేసి మంత్రాలు చదివి, కళ్ళు మూసుకున్నాడు..

శివుడు కళ్ళు మూసుకున్న వెంటనే అతన్ని మనో నేత్రానికి, ఆ బాబు వెనక ఒక భయంకరమైన రాక్షసి నుంచుని కనిపించింది.

శివుడు చూస్తూ ఉండగానే.....!!!

అది ఆ బాబు గదిని విడిచి, ఆ ఇంటి బయటకి వెళ్లి, ఒక ఎండిపోయిన చెట్టు దగ్గరకు వెళ్లి మాయమైపోయింది..


ఏం జరిగిందో మొత్తం శివుడికి అర్థం అయింది..


వెంటనే గది బయటకు వెళ్ళాడు..

"స్వామి తమరు నాతోపాటు రండి.
మీకు ఒకటి చూపిస్తాను..!!" అని వేగంగా ఇంటి బయటకు నడిచాడు..

నేను కూడా అతడిని అనుసరించాను..

ఆ ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఎండిపోయిన చెట్టు దగ్గరికి వెళ్ళాడు..

వెంటనే పక్కనే పడి ఉన్న ఒక ఎండిపోయిన కొమ్మను తీసుకుని, దానితో నేలంతా తవ్వడం మొదలుపెట్టాడు..

అలా తవ్వుతుండగా గుడ్డతో చేసిన ఒక బొమ్మ బయటపడింది..

ఆ బొమ్మ రక్తంతో తడిసి పోయి ఉంది..

శివుడు ఆ బొమ్మని ఆ బాబు తల్లితండ్రులకు చూపిస్తూ.....!!

"ఇది ఇక్కడ ఎవరైనా పాతిపెట్టడం మీలో ఎవరైనా చూశారా...??"అని అడిగాడు..

తమకు తెలియదని చెప్పారు దంపతులు..


దానిని తీసుకుని,అక్కడ ఉన్న నా దగ్గరకు వచ్చి, ఆ బొమ్మని చూపిస్తూ..

" స్వామి..!!బాబు మీద ఎవరో ఒక ప్రేత శక్తిని ప్రయోగించారు..అది బాబుని అంటిపెట్టుకుని ఉండి, రోజు రోజుకి అతనిలోని జీవశక్తిని పీల్చేస్తుంది..
ఆ బాబు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాడు..
రేపు తెల్లవారుజాములోగా దాన్ని వెళ్లగొట్టకపోతే.. బాబు బ్రతకడం చాలా కష్టం. కానీ ఆ పని నేను ఒక్కడినే చేయలేను..దాన్ని వెళ్ళగొట్టాలి అంటే దానికి తమరి సహాయం కూడా నాకు కావాలి స్వామి...!!" అన్నాడు..

నేనుకూడ సరేనన్నాను...!!

శివుడు ఆ రోజు రాత్రి ఇంటి బయట శక్తిని ఆవాహన చేయడానికి తాంత్రిక పూజ మొదలు పెట్టాడు..

నేను ఇంటి లోపల బాబు శరీరం నుంచి దాన్ని బయటకు రప్పించడానికి హోమం ప్రారంభించాను..

ఇలా ఇద్దరం ఏకకాలంలో శక్తి పూజ మొదలు పెట్టాము...

ఆ ప్రేతశక్తి చాలా బలమైనది...!! సాధారణంగా లొంగేది కాదు..!! కానీ ఒకేసారి ఇద్దరం ప్రక్రియ మొదలు పెట్టేసరికి, దానికి వేరే దారిలేక,
బాబు శరీరాన్ని వదిలి శివుడి దగ్గరకు చేరుకుంది.. నేను వెంటనే బాబు చుట్టూ ఒక రక్షణ వలయం గీసి,తిరిగి అది ఆ బాబు శరీరంలోకి ప్రవేశించకుండా ఆపాను.."

"కానీ అంతటితో దాని ప్రమాదం తప్పి పోలేదు.. అది శివుడి దగ్గరకు చేరుకుని అతను చేస్తున్న ప్రక్రియ నాశనం చేయాలని చూసింది..దాని దుష్టశక్తిని శివుడు పై ప్రయోగించింది.. కానీ శివుడు ఏ మాత్రం చెక్కు చెదరకుండా దానిని ఆపాలని చూస్తున్నాడు..
కానీ అది అక్కడ నుంచి వెళ్లడం లేదు..

ఎందుకంటే.....!!

అది ఎవరినో ఒకరిని బలి తీసుకుంటే కానీ, శాంతించదు..నేను శివుడి దగ్గరకు చేరుకున్నాను..

నాకు పరిస్థితి మొత్తం అర్థమైంది..

దాని శక్తి చూసిన నాకు చాలా కోపం వచ్చింది...

ఇటువంటి ప్రేతాత్మ ని,చిన్న బాలుడు పైన ప్రయోగించిన వాడిపై కూడా చాలా కోపం వచ్చింది.

నేను వెంటనే శివుడితో..." శివుడు..!! దీనిని ఆ బాబు పై ఎవడు ప్రయోగించాడో...!! వాడి మీద తిప్పి కొట్టు..!!" అన్నాను..

ఆ మాటలు విన్న శివుడు మంత్రాలు ఆపకుండా
నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు..

చేయాల్సినదెంటో శివుడికి అర్థం అయింది..

వెంటనే ఆ శక్తిని దాని ప్రయోగించినవాడు మీదకి తిప్పికొట్టాడు..శివుడు అలా తిప్పి కొట్టగానే....

ఆ ఇంటికి కొద్దిదూరంలో ఒక పెద్ద ఖాళీ ప్రదేశంలో పిచ్చి పిచ్చి చెట్లు తుప్పలు ఉన్నాయి..
అక్కడి నుంచి పెద్ద కేక వినిపించింది... ఆ తర్వాత నేను శివుడు ఆ కేక వినిపించిన వైపు వెళ్లాము....

అక్కడ ఒకడు రక్తం కక్కుకుని చనిపోయి ఉన్నాడు.. వాడి ముందు చిత్రవిచిత్రమైన ముగ్గులు వేసి ఉన్నాయి..

అతన్ని చూసిన ఆ బాబు తల్లి ఆ వ్యక్తి అక్కడే తిరిగే వాడని.. రెండు మూడు సార్లు తనను మంచినీళ్లు కూడా అడిగాడని, అలాంటివాడు తమకు బాబు కి ఎందుకు అపాయం తలపెట్టాడని బాధపడింది...

ఆ మాటలకు శివుడు "చూడండమ్మా..!!
ఇతను తాంత్రిక విద్యలు అభ్యసిస్తున్నాడు..
ఇతనికి మీ కుటుంబం పై ప్రత్యేకమైన
పగ ఏమీ లేదు.. కేవలం తన శక్తులని పరీక్షించడానికి మీ బాబు పై ఈ దుష్ట శక్తి ప్రయోగం చేశాడు..మీ ఇంట్లో బాబు ఉండడం చూసి, అతనికి సంబంధించిన వస్తువులు సేకరించి,ఈ దారుణానికి పాల్పడ్డాడు.. ఇకనైనా బాబు విషయంలో జాగ్రత్తగా ఉండండి..!!" అని అక్కడ నుంచి వెళ్లబోతుంటే ఆ బాబు తండ్రి అతనికి డబ్బు ఇచ్చి సాగనంపాడు..

వాళ్లు నాకు ఇచ్చిన డబ్బులు కూడా నేను సమయానికి ఆ బాబు ప్రాణాలు కాపాడినందుకు శివుడికి  ఇచ్చేశాను...!!"ఆ తరువాత ఒక ఐదు సంవత్సరాల పాటు నాకు అందుబాటులోనే ఉన్నాడు..ఆ తర్వాత ఏమైపోయడో నాకు తెలియదు..! అతన్ని పట్టుకుంటే ఈ దుష్ట శక్తి గురించి మనకు పూర్తిగా తెలుస్తుంది..!!" అని చెప్పాడు గోవింద రావు....!!

"అయితే మనం వెంటనే విజయవాడ బయలుదేరితే మంచిది చిన్నాన్న...!!"

" సరే రేపు ఉదయమే బయలుదేరుదాం..!"
అని ముగ్గురు ఆ గుడి నుంచి ఆదిత్య దగ్గరికి బయలుదేరారు.

అప్పటికే సాయంత్రం అయింది....

చలికాలం కావడం చేత, చాలా తొందరగా చీకటి పడిపోయింది....!!

అక్కడ ఆదిత్య ఇంట్లో.....!!

ఫైల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత, అలసట అనిపించడంతో ఆదిత్య తన గదిలో పడుకున్నాడు..

పనిమనిషి రత్నం కిచెన్ లో వంట చేస్తోంది..

బయట వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.. గాలి కూడా గట్టిగా వీస్తోంది...

ఇంతలో హటాత్తుగా కరెంటు పోయింది...!!

రత్నం తిట్టుకుంటూ క్యాండిల్స్ వెలిగించి, ఒకటి హాల్ లో పెట్టి, మరొకటి ఆదిత్య గదిలోకి తీసుకెళ్ళింది..

ఆదిత్య ఇంటి ముందు సత్యం కారు ఆగింది..

అందులోంచి సత్యనారాయణ రావు, గోవింద రావు దిగారు...!!

సత్యం కూడా కారు దిగబోతుండగా....!!

గోవింద రావు " వద్దు నాయనా.!!
ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వర్షం కూడా వచ్చేటట్లుంది..! ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో...!!" అని చెప్పారు.

సత్యం కూడా కారులో నుంచి నవ్వుతూ "ఉంటాను స్వామి...!! పొద్దున నేను వచ్చి మిమ్మల్ని బస్టాండ్లో దిగపెడతాను."
అని చెప్పి కార్ స్టార్ట్ చేయబోతుండగా...!

ఆదిత్య ఇంట్లో నుంచి రత్నం కేకలు వినిపించాయి.

ఏమైందో అని ఖంగారు పడుతూ,
గోవింద రావు,సత్యనారాయణ రావు ఇంట్లోకి పరిగెట్టారు..

రత్నం అరుపులు విన్న,సత్యం కూడా ఏమైందో అని ఖంగారు పడుతూ వెంటనే కారు దిగి,వారితో పాటు ఇంట్లోకి పరుగు పెట్టాడు...

వారి లోపలికి వెళ్లగానే గది చీకటిగా ఉంది..

సత్యం వెంటనే తన సెల్ ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేసాడు.. సత్యనారాయణ రావు కూడా తన ఫోన్ తీసి టార్చ్ లైట్ ఆన్ చేశాడు.

ఆ లైట్ల వెలుగులో చుట్టూ చూడసాగారు..

ఎవరూ కనిపించడం లేదు..

సత్యం అలా వెతుకుతూ రెండు అడుగులు వేయగానే, తన కాలికి ఏదో గట్టిగా తగిలి ముందుకి పడబోయాడు...

అలా పడిపోతున్న సత్యాన్ని సత్యనారాయణ రావు గట్టిగా పట్టుకున్నాడు..

సత్యం, సత్యనారాయణ రావుకు థాంక్స్ చెప్పి, తన కాలికి తగిలింది ఏమిటోనని సెల్ఫోన్ టార్చ్ వేసి కిందకి చూసి ఆశ్చర్యపోయాడు...

ఎందుకంటే.....

అక్కడ తన కాళ్ళకి అడ్డుగా తగిలింది
పని మనిషి రత్నం...!!

రత్నం నోటిలోనుండి నురగలు కుక్కుకుంటూ, ఫిట్స్ వచ్చిన దానిలా నేలపై కొట్టుకోసాగింది...

సత్యం ఆమెకు ఏమైందో చూడు అన్నారు గోవింద రావు..

సత్యం వెంటనే ఆమె బుగ్గలపై తడుతూ రత్నం "ఏమైంది లే లే...!!" అంటూ పిలవసాగాడు....

కానీ రత్నం మూర్ఛ తో కొట్టుకుంటూనే ఉంది..

ముఖంపై నీళ్లు చల్లడానికి సత్యనారాయణ రావు నీళ్లు తేవడానికి పరిగెత్తాడు...!!

గోవింద రావు ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతులు పట్టుకుని, సత్యం వైపు చూసి..
"అసలు ఆదిత్య ఎక్కడ ఉన్నాడో చూడు..!"
అని అన్నారు..

సత్యం ఆదిత్య కోసం అతని గదిలోకి వెళ్ళాడు......!!!

అలా గదిలోకి వెళ్ళిన వాడు గట్టిగా అరుస్తూ, వెల్లకిలా పడిపోయి, దెక్కుంటు గది బయటికి వచ్చేశాడు....

అతని అరుపులు విన్న సత్యనారాయణ రావు కిందపడిపోయిన సత్యం దగ్గరికి వచ్చి,
"ఏమైంది సత్యం..? ఏం జరిగింది...!!"అని కంగారుగా అడిగాడు...

సత్యం విపరీతమైన భయం తో తడబడుతూ.." స్వామి..!! గదిలో...!! గదిలో..! ఒకసారి చూడండి...!!"అంటూ వణికి పోసాగాడు...

సత్యనారాయణ రావు గోవింద రావు ఆదిత్య గది ముందుకు వచ్చి లోపలికి చూసారు...


అంతే........!!!!!




ఇంకా ఉంది.....!!
[+] 9 users Like SivaSai's post
Like Reply
#29
Excellent update
Like Reply
#30
Sioper excellent update
Like Reply
#31
Part - 14




ఆదిత్య గదిలోకి ఇద్దరు టార్చ్ లైట్ ల వెలుగులో చూశారు....

ఆదిత్య తన బెడ్ పై మనశాంతిగా నిద్ర పోతున్నాడు..

కానీ సత్యం చెప్పినట్టు భయపడడానికి లోపల ఏమీ లేదు..

" లోపల ఏమీ లేదు కదా సత్యం..! ఎందుకు అంతలా భయపడుతున్నావ్..??"తన వెనకవున్న సత్యాన్ని అడిగాడు..

సత్యం సమాధానం చెప్పే ముందే,
"సత్యం భయపడడంలో తప్పు లేదు రావు..!!
ఒకసారి సీలింగ్ పైకి చూడు..!!"గోవింద రావు చెప్పగానే సత్యనారాయణ రావు పైకి చూశాడు..

గదిలో సీలింగ్ పై భాగంలో నల్లటి ఆకారం లో రెండు పిశాచాలు గాలిలో తిరుగుతున్నాయి.. అవి బెడ్ పై ఉన్న ఆదిత్య వైపు కోపంగా చూస్తూ అటు ఇటూ తిరుగుతున్నాయి..

ఇంతలో బయట ఉరుములు,మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది...!!

గోవింద రావు రత్నంని, పక్క గదిలో
పడుకో పెట్టమన్నారు..

సత్యం, రావు ఇద్దరూ కలిసి ఆమెని పక్కగదిలో పడుకోబెట్టారు..

ఇద్దరూ తిరిగి ఆదిత్య గది దగ్గరకు వచ్చారు..

సత్యనారాయణ రావు ఆదిత్యని ఎలాగైనా కాపాడడానికి మెల్లగా గదిలోకి అడుగుపెట్టబోతుండగా,

హఠాత్తుగా బెడ్ పైన పడుకుని ఉన్న ఆదిత్య ఒక్కసారిగా లేచి నుంచున్నాడు..

సత్యనారాయణ రావు లోపలికి వెళ్లబోతుంటే  ఆదిత్య అలా లేచే సరికి, భయపడి రెండడుగులు వెనక్కి వేశాడు..

అలా నుంచున్న ఆదిత్య... చలనం లేనట్టుగా వారి వైపే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు..

అదంతా చూస్తున్న సత్యం భయంతో ఎండుకపోయిన గొంతుతో ఆదిత్య వైపు చేతులు ఆడిస్తూ.."ఇలా వచ్చేయండి సార్...!" అంటూ మెల్లగా అరవసాగాడు..

అయినా ఆదిత్య అలా చలనం లేనట్టుగా వారి వైపే చూస్తూ ఉండసాగాడు..

అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు...

అలా కదలకుండా నుంచున్న ఆదిత్య చుట్టూ... ఆ గాలిలో తిరుగుతున్న వికృత పిశాచాలు ఈసారి ఆదిత్య చుట్టూ తిరగసాగాయి..

అలా అవి ఆదిత్య చుట్టూ తిరుగుతుండగా ఆదిత్య మెల్లగా తన మెడలో ఉన్న రుద్రాక్షమాలను తీసివేయసాగాడు..

అది చూసిన గోవింద రావు, సత్యం,
"వద్దు....! తీయొద్దు...!" అని వారిస్తున్నా సరే...!! వారి మాటల్ని పట్టించుకోకుండా  రుద్రాక్ష మాలనీ తీసివేయిసాగాడు.

సత్యనారాయణ రావు మాత్రం ఎలాగైనా ఆదిత్యని ఆపాలని వేగంగా గదిలోకి చేరుకున్నాడు...

ఆదిత్య సమీపించబోతుండగా..
ఆ పిశాచాలలో ఒకటి సత్యనారాయణ రావు ని అడ్డుకుంది.. ఒక చిన్న ఈదురుగాలీ సృష్టించి, రావును బయటికి విసిరి వేసింది.

ఆ దాటికి గది బయటికి వెళ్లి పడ్డాడు...

ఇక గదిలో ఉన్న ఆదిత్య తన రుద్రాక్ష మాలను తీసి బెడ్ మీద పడేసాడు...

ఆదిత్య ఆ మాలని బెడ్ పైన పడేసిన మరుక్షణం....!!!

ఆదిత్య శరీరం చుట్టూ తిరుగుతున్న పిశాచాలు ఒక్కసారిగా నల్లటి మేఘంలా మారిపోయి,ఆదిత్య నోటి ద్వారా అతని శరీరం లోపలికి ప్రవేశించాయి....

అవి ఆదిత్య శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మెల్లగా అతని శరీరం గాల్లోకి లేచింది..

ఆదిత్య తన తల పైకి తిప్పి, చెవులు చిల్లు పడిపోయేలా గట్టిగా అరిచాడు...


ఆ శబ్దాన్ని వినలేక ముగ్గురు చెవులు మూసుకున్నారు.. కానీ ఆ శబ్దం దాటికి గదిలో ఉన్న గాజు సామానులు, బల్బులు,అద్దాలు పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయాయి...

గాల్లో తేలుతున్న ఆదిత్య మెల్లగా తల దించి, కోపంగా ఎర్రగా వెలుగుతున్న తన కళ్ళతో గోవింద రావు వైపు చూశాడు...

దాడి చేయడానికి వేగంగా ఆయన మీదకు వస్తుండగా, సత్యనారాయణ రావు అడ్డుపడ్డాడు...

ఆదిత్య,సత్యనారాయణ రావు
పీక పుచ్చుకొని గాలిలోకి లేపి దూరంగా విసిరేశాడు.

ఆ విసిరిన ధాటికి గోడకి గుద్దుకొని కిందపడ్డాడు సత్యనారాయణ రావు...

ఆ తరువాత మెల్లగా నేలపై దిగి,సత్యం ముందు నిల్చున్నాడు ఆదిత్య..

సత్యం ఆదిత్యని చూసి వణికిపోతున్నాడు.

ఆదిత్య వికృతంగా నవ్వుతూ,తన నోరు పెద్దగా రాక్షసుడి లాగా తెరిచాడు..

అలా సత్యం మీద దాడి చేయబోతుండగా..

వెనుక ఉన్న గోవింద రావు వేగంగా ముందుకు వచ్చి,ఆదిత్య పీక పుచ్చుకుని, వెనక్కు నెట్టాడు...

ఆ నెట్టిన వేగానికి ఆదిత్య వెనకకి పడ్డాడు..

దేవుడిలా తనను కాపాడినందుకు గోవింద రావు వైపే సత్యం చూస్తూ ఉండిపోయాడు..

తనవైపు చూస్తున్న సత్యంని దగ్గరకు పిలిచి, చెవిలో మెల్లగా ఎదో చెప్పారు గోవింద రావు.....

అది విన్న వెంటనే సత్యం పక్కగదిలోకి పరిగెట్టాడు...

పారిపోతున్న సత్యం వైపు వెళ్ళబోయాడు ఆదిత్య..

సత్యం వైపు వెళ్తున్న ఆదిత్య మీద, చేతిలో నీళ్లు తీసుకుని, మంత్రాలు జపిస్తూ అతనిపై
చల్లసాగారు....

అవి ఆదిత్య ఒంటి మీద పడగానే,వొళ్ళంతా మంటలు లేచాయి...

ఆదిత్య కోపంగా గోవింద రావు వైపు చూస్తూ  వేగంగా వెళ్లి ఆయన మెడ పుచ్చుకుని,
ఇంటి బయటకు విసిరేశాడు...

అలా విసిరేయగానే బయట పడబోతున్న గోవింద రావు ని, సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం వెనుకగా వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు. గోవింద రావు, సత్యం పట్టుకోవడం వల్ల, దెబ్బలు తగలకుండా ప్రాణాలతో బయటపడ్డారు.. సత్యం కనక పట్టుకోకపోయి ఉంటే గట్టి దెబ్బే తగిలేది.

గోవింద రావు ని దొరకబుచ్చుకున్న, సత్యానికి మాత్రం చేతులకు చిన్నచిన్న దెబ్బలు తగిలాయి.

కింద పడిపోయిన సత్యాన్ని గోవింద రావు మెల్లగా పైకి లేపాడు... సత్యం చేతిలో ఒక సంచి ఉంది.. ఆ సంచిని గోవింద రావు చేతికి ఇచ్చాడు... అప్పుడే సరిగ్గా ఆదిత్య వేగంగా వారిపైకి వస్తుండగా..

గోవింద రావు సంచి నుంచి ఒక చీర ను బయటకు తీసీ,ఆ చీరను తన మీదకు వస్తున్న ఆదిత్య మీదకి విసిరాడు...

ఆ చీర గాలిలో విచ్చుకుని, ఆదిత్య మీద పడగానే, అది ఆదిత్యను ఏదో చాప చుట్టేసినట్టు, అతని శరీరాన్ని చుట్టేయసాగింది...

అప్పుడు దాకా గాలిలో ఎగురుతున్న ఆదిత్య, ఆ చీర దెబ్బకి దబ్బున నేల మీద పడి, గిలగిలా కొట్టుకోసాగాడు....!!

సత్యం అదంతా చూసి ఆశ్చర్యపోయాడు..

సరిగ్గా అక్కడికి సత్యనారాయణ రావు కూడా వచ్చాడు. ఆదిత్య విసిరేయడంతో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి..!!

అలా కొంత సేపు గింజుకొన్న తర్వాత.. ఆదిత్య చలనం లేనట్టుగా ఉండిపోయాడు.

అలా ఆదిత్య కదలకుండా ఉండిపోవడంతో, సత్యం అతని దగ్గరికి వెళ్లబోతుండగా.. గోవింద రావు వద్దని వారించాడు..

అక్కడే ఉన్న సత్యనారాయణ రావు వైపు చూసి
"రావుా...!! నువ్వు వెళ్లి బిందెడు పసుపు నీళ్లు తీసుకురా...!! ప్రక్షాళన చేయాలి..!!"అని చెప్పగానే అవి తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు...

కొద్దిసేపటికి పసుపు నీళ్ల బిందెతో తిరిగి వచ్చాడు..

ఆదిత్య శరీరం మొత్తం చీరతో చుట్టి వేయబడి ఉంది... ఎక్కడ కొంచెం కూడా అతని శరీరం కనిపించడం లేదు..

గోవింద రావు సత్యం వైపు చూసి...
"మెల్లగా ఆదిత్య ముఖం పై ఉన్న చీరను కొద్దిగా తప్పించు...!!"అని చెప్పారు.

సత్యం ఆయన చెప్పినట్టు ఆదిత్య ముఖంపై కొద్దిగా చీరను తొలగించగానే..

ఆదిత్య సత్యం వైపు చూసి కోపంగా అరిచి, గింజుకోసాగాడు...

అలా అరవడంతో బెదిరిపోయిన సత్యం,
ఆదిత్య కి దూరంగా వచ్చి, గోవింద రావు వెనక్కి పరిగెట్టాడు..

ఆ తర్వాత గోవింద రావు పసుపు నీళ్ల బిందెలు అందుకొని మంత్రాలు చదువుతూ ఆదిత్య మీద పోయసాగారు..

పసుపు నీళ్ళు మీద పడగానే ఆదిత్య మరింతగా అరుస్తూ గింజుకోసాగాడు....

అలా కొంత సేపు గింజుకోని, చలనం లేనట్లుగా ఉండిపోయాడు...

అలా ఆదిత్య శరీరంలో చలనం ఆగిపోయిన వెంటనే....

అతని నోటినుండి నల్లని పొగ బయటకు వచ్చి, రెండుగా విడిపోయి, గాలిలో కలిసిపోయాయి...

గోవింద రావు గదిలోకి వెళ్లి ఆదిత్య మంచం పై ఉన్న అతని రుద్రాక్ష మాలను తిరిగి తీసుకు వచ్చి, అతని మెడలో వేశాడు...

"ఇప్పుడు తన ఒంటి మీద ఉన్న చీరని తీసేయండి...!!"అని అక్కడ ఉన్న ఇద్దరితో చెప్పాడు..

వాళ్లు ఆదిత్య శరీరానికి ఉన్న చీరని తీసేసారు...

ఆదిత్య స్పృహలో లేడు..!!

సత్యనారాయణ రావు, సత్యం సహాయంతో ఆదిత్య బట్టలు మార్చి, అతని మంచం పైన పడుకోబెట్టాడు...

బయట వాతావరణం కూడా వర్షం పూర్తిగా తగ్గి ప్రశాంతంగా ఉంది..

కరెంట్ కూడా వచ్చింది...

"రత్నం పరిస్థితి ఎలా ఉంది...!!??" అని అడిగాడు గోవింద రావు...

"తనకు వచ్చింది మామూలు మూర్ఛ అంతే..!! ఇప్పుడు బాగానే ఉంది చిన్నాన్న...!! గదిలో నిద్రపోతోంది...!!"

" మంచిది. సత్యం నువ్వు ఆమె నిద్రలేచిన తర్వాత జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపెయ్.. ఇక్కడ జరిగే దాని గురించి ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పు..!!"

" తను చెప్పదు స్వామి..!! కానీ ఇంట్లో ఇంత జరిగిన గొడవ గురించి చుట్టుపక్కల వాళ్ళకి తెలియకుండా ఉంటుందంటారా..??" అన్నాడు సత్యం..

ఆ మాటలకు గోవింద రావు చిన్నగా నవ్వి..
"సత్యం నువ్వు గమనించావా..!!?? ఇప్పటివరకు ఉరుములు,మెరుపులతో పెద్ద వర్షం కురిసింది.. కానీ ఇంతకుముందే తగ్గుముఖం పట్టింది.. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకి ఇక్కడ జరిగే విషయం తెలిసే అవకాశం లేదు.."అని చెప్పగానే అవునన్నట్లు ఇద్దరు తలూపారు..

వీరి సంభాషణ ఇలా జరుగుతుండగా...
భయంతో నిండిన కళ్ళతో, బిత్తర చూపుల తో పనిమనిషి రత్నం నీరసంతో నడుచుకుంటూ గది నుండి బయటకు వచ్చింది..

అక్కడ కూర్చున్న గోవింద రావుతో భయంతో కంగారుగా ఏదో చెప్పబోతూ ముందుకు తూలి పడబోయింది..

పడిపోబోతున్న ఆమె భుజాలు పట్టుకున్నాడు సత్యం..!!

సత్యం ఆమెతో " నీ ఆరోగ్యం సరిగా లేదు.
జరిగింది ఏంటో మాకు తెలుసు..!! నువ్వు కంగారు పడొద్దు..!! పదా..!! నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను..!"అన్నాడు.

అక్కడ పరిస్థితి మెల్లగా ఆమెకు అర్ధం అయింది..

"ఉంటానయ్యా..!"అని గోవింద రావు తో చెప్పగానే...!!

" మంచిది వెళ్లి రా...!! సత్యం నువ్వు కూడా రేపు పొద్దున్నే రా..!!"అని అన్నారు గోవింద రావు.

"స్వామి...! మరి..??" అని ఏదో చెప్పబోతుండగా..

"ప్రస్తుతం భయపడవలసిన అవసరం ఏమీ లేదు..!! నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు..!!"
అని చెప్పగానే "సరే స్వామి..!!" అంటూ రత్నంని తీసుకుని వెళ్ళిపోయాడు...

" రావుా...!! తలపోటుగా ఉంది కొంచెం కాఫీ ఇవ్వగలవా..??"

" సరే చిన్నాన్న..!! ఒక ఐదు నిమిషాలు..!" అని చెప్పి వంట గదిలోకి వెళ్ళాడు..

సత్యనారాయణ రావు వంట గదిలోకి వెళ్లగానే.. గోవింద రావు బుర్ర మొత్తం ఆలోచనలతో వేడెక్కిపోయింది..

ఒక ఐదు నిమిషాలు తర్వాత రెండు కాఫీ కప్పులతో సత్యనారాయణ రావు వచ్చాడు.

ఒకటి ఆయన ముందు పెట్టి, మరొకటి తాను తీసుకున్నాడు...

కాఫీ తెచ్చిన పట్టించుకోకుండా గోవింద రావు ఆలోచిస్తూనే ఉన్నాడు.

అది గమనించి " చిన్నాన్న..!!" అని పిలిచాడు..

ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు..

"ఏమైంది..??" అన్నట్టుగా సత్యనారాయణ రావు వైపు చూశాడు..

" ఏంటి చిన్నాన్న.? అంతలా ఆలోచిస్తున్నారు..? ఆదిత్య గురించేనా..??"

" అవున్రా..!! వాడిని పట్టిపీడిస్తున్న శక్తి ఏంటో తెలియడం లేదు.. కానీ ఒక్కటి మాత్రం నిజం..దాని శక్తి మాత్రం చాలా ఎక్కువ..! ఇంతకుముందు నేను చూసిన దుష్టశక్తి లాంటిది మాత్రం ఇది కాదు..!! ఇంతకుముందు ఇలాంటి శక్తి నేను ఎక్కడ చూసి ఉండలేదు.విన్నది లేదు..!!" అంటూ బాధపడసాగాడు..

"అదేంటి చిన్నాన్న..!! అలాగ అంటారే...??
ఇప్పుడు కూడా మీ వల్లే కదా..!!అది వాడిని విడిచిపెట్టి పారిపోయింది..!! మరి దాని శక్తి ఎక్కువ అంటున్నారెందుకు?"

" ఇప్పుడు వచ్చింది అది కాదు..!! దాని కావలి శక్తులు..వాటిని వీడి మీదకి పంపించింది."

ఆ మాటలు విన్న సత్యనారాయణ రావు
"నిజమా..! చిన్నాన్న" అంటూ నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోయాడు..

ఆ మాటలకి గోవింద రావు దీర్ఘంగా నిట్టూర్చి
"రావుా....!! నువ్వు నాతో పాటు ఎన్నిసార్లు  ఇటువంటి దుష్ట ఆత్మలను వదిలించడానికి వచ్చుంటావ్..??"

ఆ మాటలకి సత్యనారాయణ రావు కొద్దిగా ఆలోచించి.." చాలా కాలంగా మీతోనే ఉన్నాను కదా చిన్నాన్న..!! మా నాన్న చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో మీతో పాటు ఉన్నాను కదా..!! అంటే దగ్గరగా ఒక 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను..!!"

" బాగా చెప్పావ్..!! ఒక్క విషయం ఆలోచించి చెప్పు..!! నేను ఆదిత్య మెడలో వేసిన రుద్రాక్ష మాల ఎక్కడిది..??"

" అది కాశీలో విశ్వేశ్వరస్వామీ సమక్షంలో వారం రోజులు పూజలు జరిపించి తెచ్చుకున్నారు కదా...!!"

" సరిగ్గా చెప్పావ్...!! మరి అటువంటి శక్తివంతమైన మాలని దుష్ట శక్తి పట్టిన వాడు ఎవడైనా తనంతట తానుగా మెడలో నుంచి తీయగలడా...??"

"లేదు...!!"
[+] 8 users Like SivaSai's post
Like Reply
#32
సరే..!! మనం అడవిలో పూజ జరిపించిన చోట చూసిన దుష్టశక్తి ఇదెనా...??"అని అడిగాడు గోవింద రావు..


అప్పటికీ సత్యనారాయణ రావు కి గోవింద రావు చెప్పుతున్నది ఎంటో అర్థమైంది..!!

"మీరు చెప్పింది నిజమే చిన్నాన్న..!!
నేను అంత దూరం ఆలోచించలేదు..!!"

" నేను అదేరా చెప్తుంది..!! కేవలం అది పంపించిన కావలి శక్తులలో రెండే ఇంత బీభత్సం సృష్టించాయి అంటే..!! అసలైన దుష్ట శక్తి బలం ఇంకెంత ఉంటుందో అని నేను ఆలోచిస్తున్నా...!!??"

" సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం చిన్నాన్న...??"

" మనం వీలైనంత తొందరగా విజయవాడ బయలుదేరి వెళ్ళాలి.. శివుడిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి..!!"

" మరి ఆదిత్య ని ఈ పరిస్థితుల్లో వదిలేసి
వెళ్లడం ఎలా చిన్నాన్న..?? మనం ఉంటేనే పరిస్థితి ఇలా ఉంది.. మనం లేకపోతే వాడి ప్రాణానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది."

" వాడిని ఇక్కడ క్షేమంగా చూసుకునే ఏర్పాట్లు చేసి, మనం బయలుదేరాలి ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో అమావాస్య వస్తుంది..!! ఆలోగా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి..!! లేదంటే మన వాడి ప్రాణానికే ప్రమాదం..!!"

" సరే మరి ఏం చేద్దాం చిన్నాన్న..!!" అని మాట్లాడుకుంటూ ఉండగా సత్యం అక్కడికి వచ్చాడు...

సత్యాన్ని చూసిన గోవింద రావు " అదేమిటి సత్యం..?? నిన్ను ఇంటికి వెళ్ళిపోమన్నాను కదా..!!? మళ్లీ వచ్చావే..??' అని అడిగారు.

"సార్ కి ఎలా ఉందో చూద్దామని,మనసు ఉండబట్టలేక వచ్చేసాను స్వామి..!!
సార్ కి ఇప్పుడు ఎలా ఉంది..!!??"

"వాడు బాగానే ఉన్నాడు..! నువ్వుకూర్చో....!! సమయానికి వచ్చావు..! నాకు ఒక విషయం చెప్పు..! ఈ శ్రీశైలంలో నిత్యం దైవీక కార్యక్రమాలు జరిగే ప్రదేశం గుడి కాకుండా.. మరేదైనా పవిత్ర స్థలం ఉందా..??" అని అడిగాడు గోవింద రావు..

సత్యం కొద్దిసేపు ఆలోచించి ఎదొ గుర్తు వచ్చినవాడిలాగా ముఖం పెట్టీ
" ఒకటీ ఉంది స్వామి..!!" అని చెప్పగానే..

సత్యనారాయణ రావు కుతూహలంగా
"ఎక్కడా..??" అని అడిగాడు..

" మంజునాథ రావు గారి ఇల్లు " అని చెప్పాడు.

"ఆయన గురించి చెప్పు సత్యం..!!"అని అడిగాడు గోవింద రావు..

"ఆయన చాలా పెద్ద పండితుడు..!! తన ఇంటిలోనే చిన్న వేద పాఠశాల నడుపుతూ ఉన్నారు. శ్రీశైలదేవస్థానం కి సంబంధించిన ప్రతి పూజా కార్యక్రమాలలో ఆయన కచ్చితంగా పాల్గొంటారు...
చాలా మంచివారు.. ఊర్లో కూడా ఆయన తెలీని వాడంటూ ఎవరూ లేరు.. మన ఆదిత్య సార్ కి కూడా బాగా పరిచయం ఉంది.." అంటూ చెప్పుకొచ్చాడు..!!

" ఎలా పరిచయం..??" అని అడిగాడు సత్యనారాయణ రావు..

"ఆ రావు గారికి ఒకత్తే కూతురు... ఆమె పేరు భువనేశ్వరి. ఆమెకి పెళ్లి చేసిన తర్వాత ఒక మనవరాలు పుట్టింది. ఆ పాప పేరు భానుమతి.కూతురు, అల్లుడు, మనవరాలు పుట్టిన సంవత్సరానికి
ఒక లారీ యాక్సిడెంట్లో చనిపోయారు.
ఆ తర్వాత భాను తాత గారి దగ్గరే పెరిగింది.. ఇక్కడ కాలేజీలోనే చదువుకుంటోంది..

" ఒకసారి మంజునాథ రావు గారికి భాను విషయంలో ఒక సమస్య వచ్చింది.."

" ఆ సమస్య ఏంటంటే....
ఆ అమ్మాయిని, అదే కాలేజీలో చదివే ప్రిన్సిపాల్ కొడుకు ఏడుస్తున్నాడని మాకు కంప్లైంట్ చేశారు.. కంప్లైంట్ తీసుకోవడానికి మా వాళ్ళు కొంచెం భయపడ్డారు.. ఎందుకంటే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కి ఎమ్మెల్యేకి కలెక్షన్స్ ఉన్నాయి..
కానీ ఆదిత్య సార్ భయపడకుండా
ఈవ్ టీజింగ్ కేసు కాకుండా వాడిని
ఒక గంజాయి కేసుల్లో ఇరికించి,
స్టేషన్ లో పెట్టి మక్కెలు ఇరగదీసారు..
ఆ తర్వాత వాళ్ళ నాన్న వచ్చి స్టేషన్ లో గొడవ పెట్టాడు."

కానీ ఆదిత్య సార్ మాత్రం ఏమాత్రం బెదరకుండా " నీ కొడుకు పైన గంజాయి కేసు పెట్టాను. ఇంకొకసారి ఆ అమ్మాయి జోలికి వెళ్తే, ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేస్తాను. నీ పరువు మొత్తం ఏమవుతుందో ఆలోచించుకో..!! నోరు మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు."అంటూ వార్నింగ్ ఇచ్చారు..

ఆ దెబ్బకి వాడు, వాడి కొడుకు బెదిరిపోయి, ఆ అమ్మాయి జోలికి వెళ్లడం మానేసాడు...

ఆ తర్వాత మంజునాథ రావుగారు వాళ్ళ భానుతో స్టేషన్కి వచ్చి, ఆదిత్య సార్ కి థాంక్స్ కూడా చెప్పారు.." అని జరిగినదంతా చెప్పాడు..

ఆ మాటలు విన్న సత్యనారాయణ రావు గోవింద రావు వైపు చూసి నవ్వుతూ..
" మనోడు గట్టోడే చిన్నాన్న..!! అయితే వీడిని ఆయనకు అప్పగిస్తే మంచిది..!!"
అని అన్నాడు..

"సరిగ్గా చెప్పావురా రావు..!! రేపొద్దున ఆయన ఇంటి దగ్గరికి వెళ్లి కలుద్దాం..!! సత్యం రేపొద్దున్న మమ్మల్ని ఆ ఇంటికి తీసుకు వెళ్ళు..!" అని చెప్పారు గోవింద రావు..

"సరే స్వామి...!! నేను బయలుదేరుతాను.! పొద్దున్నే 7:00 కు వచ్చి మమ్మల్ని తీసుకువెళతాను.."అని చెప్పి అక్కడ నుంచి బయల్దేరిపోయాడు..

ఆ తర్వాత గోవింద రావు ఆదిత్య గదికి వెళ్లి చూశారు.. ఆదిత్య నిద్రపోతూ ఉన్నాడు.

గోవింద రావు మనశ్శాంతిగా ఊపిరి పీల్చుకొని, తలుపు దగ్గరగా వేసి వచ్చేశారు.

ఆ తర్వాత సత్యనారాయణ రావు,
గోవింద రావు ఇద్దరూ భోజనం చేసి, పడుకున్నారు.

మరుసటి రోజు తెల్లవారుజామున సమయం 5:00.....

గోవింద రావు, సత్యనారాయణ రావు
ఒకే గదిలో పడుకున్నారు.

వారి గది తలుపులు ఎవరో కొట్టడంతో ఇద్దరికి మెలుకువ వచ్చింది..

సత్యనారాయణ రావు వెళ్లి తలుపు తీశాడు.

ఎదురుగా ఆదిత్య....!!!

ఒక్క క్షణం జడుచుకున్నాడు సత్యనారాయణ రావు.

సత్యనారాయణ రావు అలా భయపడేసరికి
ఆదిత్య నవ్వుతూ...!!"ఏమైంది బాబాయ్ అంతలా భయపడ్డావ్..!!" అన్నాడు..

సత్యనారాయణ రావు ఏదో చెప్పబోతూ ఉండగా వెనుక గోవింద రావు వచ్చి,
"పొద్దున్నే నువ్వు అలా తలుపు కొట్టడంతో భయపడ్డాడు అంతే..!! నువ్వు ఎప్పుడు లేచావ్ నాన్నా..??"

" ఇప్పుడే తాతయ్య..!! రాత్రి బాగా నిద్ర పట్టింది..!! నాకు మెలకువ రాలేదు..
మీరు ఎప్పుడు వచ్చారు..??"అని అడిగాడు.

"మేము వచ్చేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది.. అప్పటికే నువ్వు మంచి నిద్రలో ఉన్నావ్.. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని నిద్ర లేపలేదు.. మేము భోంచేసి పడుకున్నాము"

"సరేగాని..!! ఇంతకి వెళ్లిన పని ఏమైంది తాతయ్య..?? దాని గురించి ఏమైనా తెలిసిందా..??"

" ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకురా..?
నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో..!! ఈరోజు గుడికి వెళ్లి నీ పేరును పూజలు చేయిస్తున్నా..!!
మిగిలిన విషయాలు వచ్చాక మాట్లాడుకుందాం..!!"

" సరే తాతయ్య..!! "అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోయాడు..

ఆదిత్య వెళ్లిపోయాక గది తలుపు మూసాడు గోవింద రావు..

ఆయన వెనకే ఉన్న సత్యనారాయణ రావు గోవింద రావు తో "అదేంటి చిన్నాన్న..??
నిన్న జరిగింది వాడికి ఎందుకు చెప్పలేదు?'

"వద్దురా రావు..?? నిన్న అడవిలో జరిగింది వాడికి తెలిస్తే, మనకేదైనా చెడు జరుగుతుందేమోనని మనల్ని ఊరికి పంపించేస్తాడు.. వాడు ఇంత ప్రమాదంలో ఉన్నాడని తెలిస్తే వాడు కూడా మనశ్శాంతిగా బ్రతకలేడు....

నా విష్ణురావు ని, వీడిలో చూసుకుని బ్రతుకుతున్నాను.. వీడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. కొన్ని విషయాలు వీడికి తెలియక పోవడమే మంచిది.. సరే నువ్వు త్వరగా రెడీ అవ్వు,మనం బయలుదేరాలి." అని చెప్పాడు గోవింద రావు..

కానీ గోవింద రావుకి తెలియని విషయం ఏమిటంటే....!! వీరిద్దరి సంభాషణ మొత్తం గది బయట నుంచొని ఆదిత్య వింటున్నాడు....

తాత గారి మాటలు విన్న ఆదిత్య...

ఆయనకి తన మీద ఉన్న ప్రేమ అర్థమై కళ్ళ వెంట నీళ్ళు కారాయి..

అసలు ఆదిత్య కి ఉదయం నాలుగు గంటలకే మెలకువ వచ్చింది..
తన గదిలో చెల్లాచెదురుగా పడివున్న సామాను, గాజు ముక్కలు చూసి అనుమానం వచ్చింది.. వంటగదిలోకి వచ్చి గిన్నెలను చూసాడు.. గిన్నెలలో చేసిన వంటలు అలాగే ఉన్నాయి... తన ఒంటిపై బట్టలు చూసుకున్నాడు.. రాత్రి తన పడుకున్నప్పుడు ఆ బట్టలు వేసుకోలేదు..
పైగా ఆ బట్టలకి అక్కడక్కడ పసుపు అంటుకుని ఉంది.. రాత్రి ఏదో జరిగిందని ఆదిత్య అనుమానం వచ్చింది.. అందుకనే తనకు ఏమీ తెలియనట్టు ఉదయం తాతగారిని అడిగాడు..

అసలు రాత్రి ఏమైందో తెలుసుకోవాలని సత్యం కి ఫోన్ చేశాడు..

రెండు సార్లు చేసిన తర్వాత సత్యం ఫోన్ లిఫ్ట్ చేసాడు..

చేసిన వెంటనే ఆదిత్య మాట్లాడే లోపే
" సార్ ఎలా ఉన్నారు సార్...?? ఇప్పుడు బాగానే ఉన్నారు కదా..!!? ప్రమాదం ఏమీ లేదు కదా..!!?"అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు...

"అసలు ఏమైంది సత్యం నాకు..?? రాత్రి అసలు ఏం జరిగింది..??"అని అడగగానే సత్యం మొత్తం జరిగిందంతా చెప్పేసాడు..

జరిగింది విన్న ఆదిత్య కి మొత్తం అర్థమైంది.

"సరే నువ్వు నాకు ఏమీ చెప్పలేదు అన్నట్లుగానే ఉండు..!! ఈ విషయం తాతగారికి తెలియకూడదు సరేనా...!!"

" ఓకే సార్..!! నేను ఏమి చెప్పను..!!" అంటూ ఫోన్ పెట్టేసాడు..

ఆదిత్య తిరిగి తన బెడ్ మీదకు వెళ్లి పడుకున్నాడు.. వెంటనే నిద్ర పట్టేసింది..

సమయం ఉదయం 9:00...

ఆదిత్య ఇంటి తలుపు ఎవరో కొడుతున్నారు...

ఆదిత్య మెలుకువ వచ్చింది..

గది బయటకు వచ్చాడు..

ఇంట్లో ఎవరూ లేరు...

ఎవరా..!! అని తలుపు తీసి చూశాడు..

ఎదురుగుండా భాను నవ్వుతూ కనిపించింది..

కొత్త బట్టలలో మెరిసిపోతూ దేవకన్యలా ఉంది....

ఆదిత్య ఆశ్చర్యపోయి " ఏయ్ భాను..!!
నువ్వేంటి ఇక్కడ..!?" అని అడిగాడు..

" లోపలికి రావచ్చా సార్...!! బయటే ఉండిపొమ్మంటారా...!??" అని నవ్వుతూ అడిగింది...

ఆదిత్య కూడా ఆ మాటలకి నవ్వుతూ..
" సోరీ..!రా లోపలికి..." అంటూ లోపలికి పిలిచాడు....

"ఇలా కూర్చో..!!" అని చెప్పి సోఫా ని చూపించి తను కూడా కూర్చున్నాడు.

"ఏంటి ఇలా వచ్చావ్..? మళ్లీ వాడితో ఏమైనా ప్రాబ్లమా...?"అని అనుమానంగా అడిగాడు..

ఆ మాటలు విన్న భాను
"ఏం సార్..!! ప్రాబ్లం ఉంటేనే కానీ
మీ ఇంటికి రాకూడదా...!!? స్టేషన్ కి మీకోసం వెళ్లాను. మీకు హెల్త్ బాలేదు..
లీవ్ లో ఉన్నారు". అని చెప్తే ఇక్కడికి వచ్చాను.."

ఆదిత్య చిన్న నవ్వు నవ్వి " సారీ..!
ఇల్లు వెతుక్కుంటూ వస్తే...!! ఏదైనా ప్రాబ్లం ఏమో అనుకున్నాను..!!"

ఈసారి భానుకి ఒళ్ళు మండింది..
అందుకనే ఆదిత్య తో వెటకారంగా
"అవును సార్..! చాలా పెద్ద ప్రాబ్లం ఉంది..!
ఈరోజు నా బర్త్ డే.. సెలబ్రేషన్ కి సెక్యూరిటీ కావాలని మీ ఇంటికి వచ్చాను..!!"
అని అంది..

ఆ మాటలకి ఆదిత్య పగలబడి నవ్వాడు.
నవ్వు ఆపుకుంటూ.."సోరీ.. సోరీ..
హ్యాపీ బర్త్డే టూ యు.." అంటూ
షేక్ హ్యాండ్ ఇచ్చాడు..."

"థాంక్యూ...! సాయంత్రం మా ఫ్రెండ్స్ అందరికీ మా ఇంట్లో చిన్న ట్రీట్ ఇస్తున్నాను..దానికి మీరు తప్పకుండా రావాలి.."

" మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్..!!
మధ్యలో నేనెందుకు..?? "

"మిమ్మల్ని యుద్ధానికి పిలవటం లేదు కదా సార్.!! పార్టీ కోసమే కదా..! పిలుస్తోంది...!!సాయంత్రం మీరు వస్తున్నారు అంతే..!! " అంటూ సోఫాలో నుంచి లేచింది.

"సరే తప్పకుండా వస్తాను..!!" అంటూ నవ్వాడు ఆదిత్య..

భాను వెళ్ళిపోతూ.." బాయ్ సార్..!! ఈవినింగ్ తప్పకుండా రావాలి.."అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది..

ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య.. జేబులోని ఫోన్ మోగడంతో
ఈ లోకంలోకి వచ్చాడు...

మరోపక్క....!!

మంజునాథ రావు గారి ఇంటికి ముగ్గురు వెళ్ళారు.

లోపలికి వెళ్ళగానే ఒక పనివాడు వాళ్లకి ఎదురొచ్చి,గోవింద రావు వైపు చూసి,
చేతులు కట్టుకుని,"ఎవరు కావాలి అయ్యా.?" అని అడిగాడు..

"మంజునాథ రావు గారు కావాలి..!" అని చెప్పాడు సత్యం..

" అయ్యగారు పూజలో ఉన్నారు అండి..!!
తమరెవరు..??"

"నా పేరు గోవింద రావు.. విజయవాడ నుంచి వచ్చానని చెప్పు..!!"

"సరే మీరు కూర్చోండి..! పది నిమిషాల్లో వస్తారు..!"అని చెప్పిన పని వాడు వెళ్ళిపోతుండగా..

" ఎస్సై ఆదిత్య గారు పంపించారని చెప్పు.."
అని అన్నాడు సత్యం...

ముగ్గురు కూర్చున్నారు..

పనివాడు టీ తీసుకొచ్చి ఇచ్చాడు...

టీ తాగడం పూర్తయిన తర్వాత గోవింద రావు లేచి నుంచుని ఇంటిని పరిశీలించ సాగాడు..

అది రెండు అంతస్తుల పురాతన భవనం..

చాలా కాలం క్రితం కట్టినది..
ఆ ఇల్లు గోవింద రావు కి బాగా నచ్చింది..

ఆ ఇంటి గోడలపై ఉన్న ఫోటోలు ఒక్కొక్కటిగా పరిశీలించసాగాడు..

పరిశీలిస్తున్న వాడు కాస్త ఒక ఫోటో దగ్గరకు వచ్చి ఆగిపోయాడు...

ఫోటో చూస్తూ ఉండగానే....!!!

"ఏరా..! ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా...??"
అన్న పిలుపు వెనక నుంచి వినిపించింది.

గోవింద రావు కూడా నవ్వుతూ వెనక్కి తిరిగాడు...!!

ఎదురుగుండా తన చిన్ననాటి స్నేహితుడు మంజునాథ రావు నుంచుని ఉన్నాడు..

మంజునాథ రావు, ఆనందంతో గోవింద రావు వాటేసుకున్నాడు...

వాళ్ళిద్దరినీ అలా చూసి సత్యనారాయణ రావు, సత్యం ఇద్దరు ఆశ్చర్యపోయారు..

మంజునాథ రావు గోవింద రావు ని కుర్చీలో కూర్చోబెట్టి "ఎన్నాళ్ళయింది రా..!!
నిన్ను చూసి....!! మళ్లీ ఇప్పుడే చూడడం..!! అయినా వచ్చిన వాడివి పేరు చెప్పడం ఎందుకు రా..?? మళ్లీ ఎస్సై రికమండేషన్ ఒకటి..! నేరుగా నా దగ్గరకు రావచ్చు కదా..!!" అని అడిగాడు.

"నువ్వు అని, నాకు తెలియదు రా..!!
పనిమీద మీ ఊర్లో ఉండే ఒక పెద్ద పండితుడు దగ్గరికి తీసుకు వెళ్ళమంటే, మా సత్యం మీ దగ్గరకు తీసుకొచ్చాడు.. లోపలికి వచ్చాక గోడమీద ఫోటోను చూసిన తర్వాత నాకు అర్థం అయింది. అది నువ్వేనని..!!"అని చెప్పాడు..

సత్యనారాయణ రావు మధ్యలో కల్పించుకొని.."చిన్నాన్న..!! ఈయన ఎవరో తెలుసుకోవచ్చా..??"అని అడిగాడు..

" వీడు నేను చిన్ననాటి స్నేహితులం.
ఒకే వేద పాఠశాలలో కలిసి చదువుకున్నాం.. మీ నాన్నకి బాగా తెలుసు.. మా ఇళ్లు కూడా పక్క పక్కనే ఉండేవి.. మాకు పెళ్లయి పిల్లలు పుట్టెంత వరకు కూడా కలిసే ఉన్నాం.
ఆ తర్వాత వీడికి శ్రీకాళహస్తి దేవస్థానం లో పురోహితుడిగా అవకాశం వచ్చిందని వెళ్ళాడు.. కొంతకాలం ఉత్తరాలు రాశాడు.
ఆ తర్వాత నుంచి అది కూడా లేదు.
మళ్లీ ఇప్పుడే చూడడం..!!" అని మంజునాథ రావు గురించి చెప్పాడు గోవింద రావు.

మంజునాథ రావు వైపు చూసి..
"నువ్వు ఉత్తరాలు రాయడం మానేసిన తర్వాత ఏమైందోనని నిన్ను చూడడానికి నేను శ్రీకాళహస్తి వచ్చాను. కానీ నువ్వు అక్కడ లేవు. నీ భార్య జయలక్ష్మి చనిపోయిందని విన్నాను. అసలు ఏం జరిగింది రా..??"అని అడిగాడు.

మంజునాథ రావు మాట్లాడుతూ.....!!
"శ్రీకాళహస్తి వచ్చిన తర్వాత నాకు క్షణం తీరిక లేకుండా పనులు ఉండేవి. ఒకరోజు జయలక్ష్మి ఆరోగ్యం పాడైంది. తనకి విషజ్వరం సోకింది. తనకి మందులు ఇచ్చి, జాగ్రత్తగా చూసుకోమని పని వాళ్లకి చెప్పాను. ఆరోజు గుడిలో పనులు ముగించుకొని, నేను ఇంటికి వచ్చేసరికి తన జ్వరం మరింతగా పెరిగిపోయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించాము. కానీ ఫలితం లేక పోయింది.. నాలుగు సంవత్సరాల వయసున్న నా కూతురు భువనేశ్వరిని,
నా చేతుల్లో పెట్టి కన్నుమూసింది.. తను చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో నేను ఉండలేకపోయాను. ఇక్కడ విషయాలు నీతో చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక,
నేను ఈ శ్రీశైలం దేవస్థానంలో పురోహితుడిగా స్థిరపడిపోయాను..
అలా సంవత్సరాలు గడిచాయి.. కూతురిని గారాబంగా పెంచాను.. పెళ్లి వయసు వచ్చాక అమెరికాలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఇచ్చి పెళ్లి చేసి, అమెరికా పంపించాను.. వాళ్లకి ఒక పాప పుట్టింది.. ఒకసారి నన్ను చూడడానికి ఇండియాకి వచ్చారు..ఆ రోజు నా కూతురు పుట్టిన రోజు..నా మనవరాలు కి జ్వరంగా ఉండడంతో పాపని ఇంట్లో పెట్టి వాళ్లు గుడికి వెళ్లి వస్తుండగా లారీ యాక్సిడెంట్ లో ఇద్దరు చనిపోయారు.ఆ తర్వాత నా మనవరాలనీ చూసుకుంటూ ఇలా బ్రతుకుతున్నాను.." అంటూ కంటతడి పెట్టుకున్నాడు..

మంజునాథ రావు చెప్పింది విన్న అందరికీ
బాధతో గుండెలు బరువెక్కాయి..

ఇంటికి వచ్చిన వాళ్ళు అలా బాధ పడడం చూసి, మంజునాథ రావు మనసులో బాధ పడ్డాడు.. ఆ వాతావరణాన్ని తేలిక పరచాలని, కళ్ళు తుడుచుకుని "నా గొడవ ఎందుకు కానీ..? ముఖ్యమైన పని మీద వచ్చాను అని చెప్పావ్..!! ఏం పని రా అది...?" అని అడిగాడు..

"నీకు ఎస్సై ఆదిత్య తెలుసా...!!"అని అడిగాడు గోవింద రావు..

" తెలియకపోవడం ఏమిటి..?
నా మనవరాలు విషయంలో నాకు చాలా సహాయం చేశాడు.. చాలా మంచి వ్యక్తి..
అయినా అతని గురించి అడుగుతున్నావు ఏదైనా పని ఉందా..!!??"అని అడిగాడు మంజునాథ రావు..

ఆ మాటలకి ముగ్గురు నవ్వారు....

ఎందుకు నవ్వుతున్నారో అర్థంకాక అయోమయంగా ముఖం పెట్టాడు మంజునాథ రావు..

" ఇప్పుడు నేను అడిగిన దాంట్లో
అంత నవ్వు దేనికి వచ్చింది రా...!! "

" ఎందుకంటే ఆదిత్య ఎవరో కాదు రా..!!
నా మనవడు ఆదిత్య రావు...!!"

ఆ మాట విని మంజునాథ రావు ఆశ్చర్యపోయాడు..

" ఏంట్రా నువ్వు అనేది..!? ఆదిత్య
మన విష్ణురావు కొడుకా...?? మరి వాడు ఎప్పుడు నాకు ఊర్లో కనిపించలేదు.. వాడిని ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు.."అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు..

ఆ మాటలు విన్న గోవింద రావు సమాధానం చెప్పకుండా కొంచెంసేపు మౌనం వహించారు..

గోవింద రావు మౌనం వహించేసరికి..
సత్యనారాయణ రావు మాట్లాడుతూ..
" తమ్ముడు చిన్నాన్న కి ఇష్టం లేని ప్రేమపెళ్లి చేసుకున్నాడు. దాంతో ఆయనకు కోపం వచ్చి,ఇంటి నుంచి బయటకు పంపేశారు.
ఆయనకి కోపం తగ్గి, తిరిగి తమ్ముడి కొసం వచ్చేసరికి తమ్ముడు చనిపోయాడు.."
అని చెప్పడం ముగించాడు..

మొత్తం విన్న మంజునాథ రావు, గోవింద రావు భుజంపై తడుతూ..." జీవితం అంటే ఇంతేరా రావు..!! చూశావా రా...!!
నీకు చివరికి మనవడు మిగిలాడు. నాకు మనవరాలు మిగిలింది. పోయిన వాళ్ళ గురించి బాధ పడకుండా ఉన్న వాళ్ళని చూసుకుంటూ బతకాలిరా..!!
అదే జీవితం..!!"అని అన్నాడు..

అప్పటికి సమయం ఉదయం 9.00 గంటలయింది..

అలా మాట్లాడుకుంటూ ఉండగా పనివాడు వచ్చి " అయ్యగారు.. టిఫిన్ సిద్ధంగా ఉందండీ..!!"అని చెప్పాడు.

" హా.. వస్తున్నా..!!"అని పనివాడితో చెప్పి,
"అందరం టిఫిన్ చేద్దాం రండి."అన్నాడు.

"అది కాదురా చెప్పాను కదా..!! ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనీ..!!"
అని గోవింద రావు ఏదో చెప్పబోతూ ఉండగా..

" ఒరేయ్ రావు..!! నా సంగతి తెలుసుకదా..
ఆత్మారాముడు శాంతిస్తేనే కానీ...
నేను ఏమి వినలేను..!! ఏ పని చేయలేను..
కాబట్టి ఇంకేం మాట్లాడకుండా టిఫిన్ చేద్దాం పద..!!' అంటూ గోవింద రావు భుజాన్ని పట్టుకుని పైకి లేపి, టిఫిన్ చేయడానికి వెళ్లారు..

కొంతసేపటికి అందరూ టిఫిన్లు పూర్తయ్యాయి..

పనివాడు వచ్చి అందరికీ టీలు అందించాడు..

మంజునాథ రావు కుర్చీలో గోవింద రావు పక్కన కూర్చుని.." ఇప్పుడు చెప్పరా రావు..!
ఆ ముఖ్యమైన పని ఏంటో...??" అని అడిగాడు..

"నా మనవడి పరిస్థితి ఏమీ బాగోలేదు రా.?
ఏదో తెలియని దుష్ట శక్తి వాడిని పట్టిపీడిస్తోంది...!! దానిని వదిలించడానికి నాకు నీ సహాయం కావాలి..!!" అని అడిగాడు..

గోవింద రావు చెప్పింది మంజునాథ రావు కి పూర్తిగా అర్థం కాలేదు..

"అసలు ఏం జరిగింది పూర్తిగా చెప్పరా..??"
అని అడగగా సత్యం మధ్యలో కల్పించుకొని.. " స్వామి నేను చెప్పొచ్చా..??' అని గోవింద రావు అని అడిగాడు.

"చెప్పు సత్యం" అని అన్నాడు..

సత్యం కేసు విషయమై ఆదిత్య అడవికి వెళ్లడం దగ్గర నుంచి, అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత, జరిగిన పరిస్థితుల గురించి పూర్తిగా వివరించాడు..

గోవింద రావు కూడా మొదటిసారి ఆదిత్య తన ఇంటికి వచ్చినప్పుడు జరిగిన విషయాన్ని, ఆ తర్వాత అది ఏమిటో తెలుసుకోవడానికి అడవికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలని, ముందురోజు రాత్రి జరిగిన సంఘటన గురించి కూడా చెప్పాడు.

జరిగిందంతా విన్నాడు మంజునాథ రావు..

" ఇదిరా జరిగింది..!! దాని నుంచి ఆదిత్యని ఎలాగైనా కాపాదామని విజయవాడ వెళ్తున్నాను. కానీ ఆదిత్యని ఒంటరిగా ఇంట్లో ఉంచడం మంచిది కాదు.. అందుకని నేను వచ్చేంతవరకు వాడిని మీ ఇంట్లో ఉంచుదామని అడగడానికి వచ్చాను."

"అదేం మాట రా..!! నువ్వు వచ్చేంతవరకు వాడిని క్షేమంగా చూసుకునే బాధ్యత నాది.
నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా...!!"

" సరే రా...!! వాడిని సాయంత్రంలోగా
మీ ఇంటికి పంపిస్తాను..!!" అని బయలుదేరుతుండగా..

సరిగ్గా అప్పుడే భాను లోపలికి వచ్చింది..

భాను లోపలికి రావడం చూసిన మంజునాథ రావు " అదిగోరా
నా మనవరాలు భానుమతి.."అంటూ పరిచయం చేశాడు..

భానుమతి మంజునాథ రావు తల్లి గారి పేరు.. విషయం గుర్తొచ్చి గోవింద రావు మనసులో నవ్వుకుని " అమ్మ పేరే పెట్టావ్.."
అని అన్నాడు..

గోవింద రావు వంక విచిత్రంగా చూసి " ఎవరు తాతగారు..మన బంధువులా..??" అని అమాయకంగా అడిగింది.

గోవింద రావు ని చూపిస్తూ..!" వీడు నా చిన్ననాటి స్నేహితుడు గోవింద రావు. అతను అతని అన్న గారి అబ్బాయి సత్యనారాయణ రావు..!! ఆ పక్కన ఉన్న తన గురించి నీకు తెలుసు కానిస్టేబుల్ సత్యం.."పరిచయం చేశాడు..

" అవునా..!!" అంటూ గోవింద రావు పాదాలకు నమస్కరించింది..

" దీర్ఘాయుష్మాన్ భవ.." అని దీవించాడు..

"ఇదిగో భాను నీకో విషయం తెలుసా..!!
నీకు ఎస్సై ఆదిత్య తెలుసు కదా..!! అతను ఎవరో కాదు..!! నా స్నేహితుని మనవడు.!!
మరొక విషయం ఒక పది పదిహేను రోజులపాటు ఆదిత్య మనం ఇంట్లోనే ఉంటాడు సిద్ధం చేయించు" అని చెప్పాడు

ఆ మాటలు విని ఆశ్చర్య పోయింది..

" అంటే..! ఆదిత్య గారు మన ఇంట్లోనే ఉంటారా. తాతయ్య...!!??"

" అవునమ్మా...!! ముందు పైగది శుభ్రం చేయించు..!!"అని చెప్పగానే ఆదిత్య ఇంటికి వస్తున్నాడు అన్న ఆనందంతో మేడపైకి పరిగెట్టింది..

గోవింద రావు,భానుని చూస్తూ మహాలక్ష్మిలా ఉంది. అనుకోకుండా ఉండలేక పోయాడు..

ఇక మంజునాథ రావు వైపు చూసి..!!
"సరేరా..! నేను బయలుదేరుతాను..! ఆదిత్య సాయంత్రం కల్లా మీ ఇంట్లో ఉంటాడు.." అని చెప్పి ముగ్గురు అక్కడ నుంచి బయలుదేరారు...


ఇంకా ఉంది.....!!!
[+] 9 users Like SivaSai's post
Like Reply
#33
Naralu tegi pothunna feeling vsthundi siva garu mee ee story chaduvuthuntee.. but horror also too extreme.. antha bhayamkaramga rayakandi.. konchem horror dose tagginchandi ..:)

Hats off to your story andi..

khaidi no 402 ni minchi undi ee story ..
[+] 1 user Likes masalakiss's post
Like Reply
#34
Konchem relief entante.. story lo oka soft thread start ayindi!!
Like Reply
#35
Excellent update
Like Reply
#36
(10-03-2026, 08:48 AM)masalakiss Wrote: Naralu tegi pothunna feeling vsthundi siva garu mee ee story chaduvuthuntee.. but horror also too extreme.. antha bhayamkaramga rayakandi.. konchem horror dose tagginchandi ..:)

Hats off to your story andi..

khaidi no 402 ni minchi undi ee story ..

Inka Chala Undi


Anyone Guess E Story Lo Heroine Undi Ani Evarina Anukuntunaraa


Twaralo Inko Person Vastadu E Story Ni Dummu Leputadu
[+] 1 user Likes SivaSai's post
Like Reply
#37
(10-03-2026, 08:57 PM)SivaSai Wrote: Inka Chala Undi


Anyone Guess E Story Lo Heroine Undi Ani Evarina Anukuntunaraa


Twaralo Inko Person Vastadu E Story Ni Dummu Leputadu

Bhanu tho soft thread start chesaru. Heroine anukoledu gani.. intha horror tarvatha, tolakari laa.. haayiga anipinchindi!!
Like Reply
#38
(10-03-2026, 11:20 PM)ash.enigma Wrote: Bhanu tho soft thread start chesaru. Heroine anukoledu gani.. intha horror tarvatha, tolakari laa.. haayiga anipinchindi!!

Initially, i didn't expect any heroine but once bhanu entered and in the next episode their grand paa s are close friends. then I think Bhanu is the heroine for this story. 

Sai garu,

this is horror story kada..shall we expect some more romantic track in this story?

Keep Rocking andi
[+] 1 user Likes masalakiss's post
Like Reply
#39
Sorry Friends Today Update Is Delayed 

Update With In Afternoon 3:00 P.M
[+] 2 users Like SivaSai's post
Like Reply
#40
Part - 15



తనని ఆయన ఇంటికి ఎందుకు పంపిస్తున్నారు అని అడిగితే తన పేరున హోమం జరిపిస్తున్నామని, దాని కోసం పది రోజుల పాటు అక్కడే ఉండాల్సి వస్తుందని, ఆదిత్యతో చెప్పారు..

ఆదిత్య కూడా సరేనని మారు మాట్లాడకుండా  ఒప్పుకున్నాడు..

ఆ రోజు సాయంత్రం మంజునాథ రావుకి చెప్పినట్టుగానే ఆదిత్యని అతని ఇంటికి పంపించాడు..

అదే రోజు సాయంత్రం శివుడికోసం, గోవింద రావు, సత్యనారాయణ రావు, విజయవాడ బయలుదేరారు..

ఆదిత్య విషయాలు తమకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండమని, సత్యంతో చెప్పి వాళ్లు బయలుదేరారు..

కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే మంజునాథ రావు గారి ఇంట్లో జరిగినదంతా
సత్యం ఆదిత్య కి పూసగుచ్చినట్లు చెప్పేసాడు...

మరుసటి రోజు మధ్యాన్నం కి విజయవాడ చేరుకున్నారు.. అక్కడనుంచి ఇంటికి చేరుకున్న తర్వాత ప్రయాణ బడలిక వల్ల, విశ్రాంతి తీసుకున్నారు..

మరుసటి రోజు ఉదయం శివుడి కోసం ఇద్దరు అప్పుడు అతనుండే అతని ఇంటికి వెళ్లారు.. కానీ వెళ్లిన చోట ఇల్లు పూర్తిగా పాడు పడిపోయి ఉంది..

చుట్టుపక్కల ఇళ్లు కూడా ఏమీ లేకపోవడంతో, వారి గురించి వాకబు చేయలేకపోయారు..

శివుడు అక్కడ లేడనే ఆలోచన,
గోవింద రావుని, నిలువునా కుంగదీసింది..

చేసేదేమీ లేక అక్కడ నుంచి కొద్దిగా ముందుకు రాగానే.. గోవింద రావు కళ్ళు తిరిగి పడిపోబోయాడు...

సత్యనారాయణ రావు వెంటనే గట్టిగా పట్టుకొని, అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఆలయానికి గోవింద రావు ని తీసుకు వెళ్ళాడు..


అది దుర్గా దేవి ఆలయం...!!


దాన్ని చూస్తుంటే ఈ మధ్యనే కట్టినట్టు ఉన్నారు...

సత్యనారాయణ రావు, ఆయనను ఆలయంలో కూర్చోబెట్టి, అక్కడ ఉన్న మంచినీరు తీసుకువచ్చి, గోవింద రావు చేత తాగించాడు.

కొంతసేపటికి గోవింద రావు కోలుకున్నాడు..

ఆ రోజు శుక్రవారం...!!

అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంది..

శివుడు అక్కడ లేకపోవడంతో, ఏం చేయాలో తోచక సత్యనారాయణ రావు మౌనంగా గోవింద రావు పక్కన కూర్చున్నాడు..

గోవింద రావు మాత్రం గర్భగుడిలో ఉన్న అమ్మవారి వైపు చూస్తూ.. కళ్ళు మూసుకొని ప్రార్థించసాగాడు.. సత్యనారాయణ రావు కూడా కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించసాగాడు

అలా బాధ తో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నా గోవింద రావు కి "తాతయ్య..!!" అని పిలుపు వినిపించింది..

అలా పిలుపు వినిపించడం తో కళ్ళు తెరిచి చూసాడు గోవింద రావు, ఆయన పక్కనే ఉన్న సత్యనారాయణ రావు కూడా ఆశ్చర్యంగా కళ్ళుతెరచి చూశాడు..

ఎదురుగుండా ఒక చిన్న పాప తెల్లటి పట్టు గౌను ధరించి, ఒంటినిండా నగలు ధరించి, పాలవంటి తెల్లని నవ్వుతో గోవింద రావు ముందు నుంచుని ఉంది..

అలా నవ్వుతూ ఉన్న ఆ పాప ని చూసేసరికి గోవింద రావు మనసులో అప్పటిదాకా ఉన్న దిగులంతా ఒక్కసారిగా పోయింది.. తనకి కూడా తెలియకుండానే తన ముఖంపై చిరునవ్వు వెలిసింది.

సత్యనారాయణ రావు కి కూడా ఆ పాప ని చూస్తే ముచ్చటేసింది....

ఆ పాప వయసు మహా అయితే
ఒక 3 సంవత్సరాలకి మించి ఉండదు..

తన వైపు నవ్వుతూ ఉన్న పాప ని చూసి గోవింద రావు నవ్వుతూ.." ఏం కావాలి అమ్మ..??" అని ప్రేమగా అడిగాడు..

నవ్వుతూ తన చేతులని గోవింద రావు ముందు చాపింది... అందులో కాగితంతో చేసిన ఒక గిన్నెలో ప్రసాదం ఉంది..

దాన్ని గోవింద రావు చూపిస్తూ..
" ప్రసాదం తీసుకోండి తాతయ్య...!!" అని అంది..

గోవింద రావు ఆ పాప చేతినుండి ప్రసాదం తీసుకుంటూ.."నీ పేరేమిటి తల్లి..?" అని అడిగారు..

"కాత్యాయని..!!" అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా..

ఆ పాప కొద్ది దూరం వెళ్ళగానే, ఆమెను వెతుక్కుంటూ ఆ పాప తల్లిదండ్రులు వచ్చారు..

ఆ పాపను చూసిన వెంటనే ఆ పాప తల్లి
తనని ఎత్తుకొని," ఎక్కడికి వెళ్ళిపోయావు..!!??
నీ గురించి గుడి అంతా వెతుకుతున్నాము...!!"
అంటూ ప్రేమగా కోప్పడింది..

అక్కడికి కొంచెం దూరంగా వెతుకుతున్న ఆమె భర్తను పిలుస్తూ.." ఏవండీ..!! పాప ఇక్కడే ఉంది..!!"అని పిలవడంతో ఆమె భర్త కూడా అక్కడికి వచ్చాడు..

తన భార్య దగ్గర నుంచి పాపని ఎత్తుకొని..
" ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి..??"అని ప్రేమగా అడిగాడు..

ఆ ప్రశ్నకు సమాధానంగా " అదిగో ఆ తాతయ్యకి ప్రసాదం ఇద్దామని వచ్చాను." అని గోవింద రావు వైపు చూపించింది..

పాప తండ్రి గోవింద రావు వైపు చూశాడు..!!

కొంతసేపు పరీక్షగా చూసి.. వెంటనే అక్కడి నుంచి వేగంగా అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటున్న
వృద్ధ దంపతుల దగ్గరకు వెళ్లి, అక్కడున్న వాళ్ళ చెవిలో ఏదో చెప్పి, గోవింద రావు వైపు చూపించాడు..

దంపతులిద్దరి ని చూస్తే బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు..

గోవింద రావు ని చూసిన వెంటనే
ఆ దంపతులిద్దరూ వేగంగా ఆయన దగ్గరకు వచ్చారు..

గోవింద రావు కి, సత్యనారాయణ రావు కి, అసలేం జరుగుతుందో, ఏమీ అర్థం కావడం లేదు..

వాళ్ళు వేగంగా రావడం చూసిన వెంటనే వీళ్లు కూడా లేచి నుంచున్నారు...

వెంటనే ఆ దంపతులిద్దరూ గోవింద రావు పాదాలపై పడ్డారు..

వాళ్లతో పాటు పాప తల్లిదండ్రులు కూడా ఆయన పాదాలకు నమస్కరించారు..

తన పాదాలపై అందరూ అలా అకస్మాత్తుగా పడడంతో..

గోవింద రావు "దీర్ఘాయుష్మాన్ భవ" అంటూ దీవించారు..

"దయచేసి పైకి లేవండి...?? ఎవరు మీరు..??" అని అడిగాడు..

ఆ వృద్ధ దంపతులలో భర్త మాట్లాడుతూ.
" స్వామి..!!తమరు గోవింద రావు గారే కదా.!?" అని అడిగాడు..

"అవునండి.." అని సమాధానమిచ్చారు..

" మమ్మల్ని గుర్తు పట్టలేదా స్వామి..?? 30 సంవత్సరాల క్రితం మా బాబుని మీరు, శివుడు గారు కలిసి కాపాడారు కదా..?? గుర్తుపట్టలేదా..!!" అని అడిగాడు..

కొద్దిరోజుల క్రితమే ఆ కథ గురించి గుర్తు చేసుకోవడం వల్ల, గోవింద రావు కి వెంటనే గుర్తొచ్చింది..

వెంటనే గోవింద రావు " ఓహో.. మీరా బాగున్నారా..?? మీ బాబు ఎలా ఉన్నాడు..? అని అడిగాడు..

ఆ మాటలకి ఆ దంపతులిద్దరూ నవ్వుతూ
"వీడే స్వామి..!! మీరు కాపాడిన
మా అబ్బాయి..!! కిషోర్..!! " అని పక్కనే ఉన్న ఆ పాప తండ్రిని చూపించారు..

అతన్ని చూడగానే గోవింద రావు చాలా సంతోషించాడు..

తన పక్కనే ఉన్న తన భార్య ని చూపించి
" ఈమె నా భార్య స్వామి..! పేరు నందిని.!"
పరిచయం చేశాడు..

ఆమె గోవింద రావు వైపు చూసి నమస్కరించింది..

ఆ వృద్ధ దంపతులలో భార్య మాట్లాడుతూ
" దయచేసి మా ఇంటికి రండి స్వామి..!!"అంటూ బ్రతిమాలింది..

ఆమెతో పాటు మిగిలిన వారు కూడా ఇంటికి రమ్మని బ్రతిమాలసాగారు

"దయచేసి ఇప్పుడు నన్ను బలవంతం పెట్టకండి..నాకు ఒక ముఖ్యమైన పని ఉంది.
మరోసారి తప్పకుండా వస్తాను..." అంటుండగా

అక్కడే తల్లి పక్కనే నుంచుని ఉన్న పాప
గోవింద రావు చెయ్యి పుచ్చుకుని..
" తాతయ్య..! మా ఇంటికి రావా ప్లీజ్..!!"
ప్రేమగా బ్రతిమలాడి ఉంది..

ఆ పాప అలా ముద్దుగా అనేసరికి గోవింద రావు మనసు కరిగిపోయింది..

పాపని ఎత్తుకొని, ఆమె బుగ్గకు ముద్దు పెట్టి,
"సరే పదండి వస్తాను..!!" అంటూ సత్యనారాయణ రావుతో కలిసి వారితో కారులో బయలుదేరారు..

కారు విజయవాడ వైపు బయలుదేరింది..

ఆ ముసలి దంపతులిద్దరి పేర్లు రఘునాథరెడ్డి, జానకి.

కొద్ది సేపు ప్రయాణం తర్వాత ఒక పెద్ద అధునాతనమైన భవంతి ముందు ఆ కారు ఆగింది..

కారులో నుంచి దిగగానే ఇంట్లోకి గోవింద రావు ని, సత్యనారాయణ రావు ని, సాదరంగా ఆహ్వానించారు...

అప్పటికే మధ్యాహ్నం వేళ అయింది..

గోవింద రావు ని సత్యనారాయణ స్వామి రఘునాథ రెడ్డి భోజనానికి పిలిచాడు..

అతని భార్య జానకి దగ్గరుండి వారికి భోజన ఏర్పాట్లు చూసుకుంది.

వారి భోజనాలు పూర్తయిన తర్వాత..

రఘునాథ రెడ్డి వారిద్దరిని విశ్రాంతి తీసుకోమని చెప్పి, గోవింద రావు కి సత్యనారాయణ రావు కి ఒక గదిని కేటాయించారు..

గోవింద రావు నిద్ర పోయారు..

సత్యనారాయణ రావు కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని.. సాయంత్రం అవుతుండగా..
ఇంటి వెనుక అనుకుని ఉన్న తోట లోకి వెళ్లి,చుట్టూ చూస్తూ ఉన్నారు..

సత్యనారాయణ రావు ని అక్కడ చూసిన రఘునాథరెడ్డి ఆయన దగ్గరకు వచ్చి..
"మీరు విశ్రాంతి తీసుకోలేదా స్వామి..!"
అని వినయంగా అడిగాడు..

సత్యనారాయణ రావు నవ్వుతూ..
" ఇప్పటి వరకు నిద్రపోయే ఉన్నానండి..!
ఇప్పుడే బయటకు వచ్చాను..!"అని అనగానే..

అక్కడ ఉన్న కుర్చీలను చూపిస్తూ
"ఇలా కూర్చోండి స్వామి..!!" అని అన్నాడు రఘునాథరెడ్డి.

ఇద్దరు కూర్చున్నారు..

ఒక పనివాడు వచ్చి వారిద్దరికీ
టీ అందించాడు.

" మీరు గోవింద రావు గారి అబ్బాయా..??"
అని అడిగాడు రఘునాథరెడ్డి.

" లేదండి..! వారి అన్న గారి అబ్బాయినీ..! ఆయన నాకు చిన్నాన్న అవుతారు..!!"

" అవునా..!! అయితే స్వామి గారి పిల్లలు ఏం చేస్తూ ఉంటారు..!??"

"ఆయనకు ఓకే ఒక్క కొడుకు.. ఆయన చనిపోయాడు.. మనవడు మాత్రమే ఉన్నాడు..!!" అని చెప్పగానే రఘునాథరెడ్డి బాధగా నిట్టూర్చాడు...

" స్వామి వారిని చూసి చాలా సంవత్సరాలయింది...!! ఆయన కలుద్దామని చాలా సార్లు ప్రయత్నించాను. కానీ కుదరలేదు..అసలు మీరు ఆ గుడికి రావడం మాకు ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది."

" ఒక ముఖ్యమైన పనిమీద అక్కడికి వచ్చాము..
కానీ పని జరగలేదు..! ఇంతలో ఆయనకి కళ్ళు తిరగడంతో గుడి లోకి తీసుకు రావాల్సి వచ్చింది..!!" అంటూ నిరాసగా నిట్టూర్చాడు.. సత్యనారాయణ రావు..

" ఏమిటది.? చెప్పండి స్వామి..!!?
నేను చేయగలిగిన సహాయం అయితే తప్పకుండా చేస్తాను..!!" అని ఆతృతగా అడిగాడు రఘునాథరెడ్డి..

" మీకు శివుడు గారు తెలుసు కదా..!!??"

" శివుడు అంటే..? స్వామితో కలిసి
మా అబ్బాయిని కాపాడిన ఆయనే కదా..!!"అని అనుమానంగా అడిగాడు రఘునాథ రెడ్డి..

" అవునండి..?! ఆయన గురించి మేము వెతుక్కుంటూ వచ్చాము.. కానీ అతని గురించి తెలియలేదు.. మీకేమైనా తెలుసా..?"అని అడిగాడు

ఆ మాటలు విన్న రఘునాథరెడ్డి బాధగా నిట్టూరుస్తూ..!! " ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయింది స్వామి..!!"అని చెప్పాడు..

ఆ మాటలు విన్న సత్యనారాయణ రావు ఒక నిమిషం పాటు షాక్ లో ఉండిపోయాడు..

సత్యనారాయణ రావు అలా షాక్ లో ఉండటం చూసి
" ఏమైంది స్వామి..? అలా ఉన్నారు...? " అని అడిగాడు రఘునాథరెడ్డి

సత్యనారాయణ రావు మెల్లగా తేరుకొని...
ఆదిత్య ప్రమాదంలో ఉన్నాడన్న సంగతి.. అతనిని కాపాడే విషయంలో శివుడు సహాయం కోసం విజయవాడ వచ్చాము. అన్న విషయం పూర్తిగా చెప్పాడు..

ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా..
అక్కడికి గోవింద రావు వచ్చారు.

గోవింద రావు ని చూసి ఇద్దరు లేచి నుంచున్నారు..

గోవింద రావు ని కుర్చీలో కూర్చోబెట్టి, తాను మరొక చైర్ లో కూర్చున్నాడు రఘునాథ రెడ్డి .

"ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు..?"అని నవ్వుతూ అడిగారు గోవింద రావు..

" అదేం లేదు చిన్నాన్న.. శివుడు గారి గురించి నేను నీ దగ్గర ఏమైనా సమాచారం దొరుకుతుందేమో అని తెలుసుకున్నాను."

" మీకు ఏమైనా తెలుసా..!?"అని ఆతృతగా అడిగారు గోవింద రావు..

ఆయన ప్రశ్నకు సమాధానంగా మౌనం వహించాడు రఘునాథరెడ్డి..

"ఆయన చనిపోయాడంట చిన్నాన్న.."అని బాధగా చెప్పాడు సత్యనారాయణ రావు..

బాధతో నోట మాట రాలేదు గోవింద రావు కి.

" ఏం పరీక్షరా మనకిది..!? నాకంటూ మిగిలిన మనవడిని కాపాడుకోలేక పోతున్నాను.."అంటూ బాధపడసాగారు..

వాళ్ళిద్దరూ అలా బాధ పడడం చూసి..
" శివుడు లేకపోయినా అలాంటి వ్యక్తి నాకు తెలుసు స్వామి..!!"అని అన్నాడు రఘురాం రెడ్డి.

ఆశ్చర్యంతో గోవింద రావు తలెత్తి చూశాడు.

"ఎవరండీ..!!ఆయనా ..!!"అని ఆశ్చర్యంగా అడిగాడు సత్యనారాయణ రావు..

ఎవరో కాదు స్వామి..! శివుడి గారి కొడుకే..!! పేరు రుద్ర...!!"

"మరి ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు.?"

ప్రస్తుతం అతను మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఫారెస్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు..

అతని గురించి పూర్తిగా చెప్పు నాయనా అని అడిగాడు గోవింద రావు..

రఘునాథ రెడ్డి రుద్ర గురించి పూర్తిగా చెప్పడం మొదలుపెట్టాడు..

" స్వామి..!! నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని..! నా బిడ్డను కాపాడిన తర్వాత
శివుడు గారి దగ్గర నాకు పరిచయం బాగా పెరిగింది.. నేను చేసే వ్యాపారం లో ఏవైనా ఇబ్బందులు వస్తే దోష నివారణ పూజలు చేసి, శాంతులు జరిపించే వారు.. క్రమక్రమంగా నా వ్యాపారం పుంజుకుంది.. నా బిడ్డను కాపాడినందుకు కృతజ్ఞతగా నేను వారి బిడ్డను కూడా నా బిడ్డ తో పాటు చదివించాను.. మా అబ్బాయి తను మంచి స్నేహితులు..!! "

" మరి ఆ అబ్బాయికి తాంత్రిక విద్యలు వచ్చని మీకు ఎలా తెలుసు..??"అని మధ్యలో అడిగాడు సత్యనారాయణ రావు.

"ఒక రోజు మా ఇంట్లో పూజ జరిపించడానికి శివుడు వచ్చాడు. మాటల క్రమంలో సరదాగా అడిగాను " ఈ విద్యలు రుద్రకి కూడా తెలుసా అని.."

ఆ మాటలకి శివుడు నవ్వుతూ...!!
" చూడండి రెడ్డి గారు..!! ఈ తాంత్రిక సాధన సముద్రం మధ్యలో ఈత లాంటిది..
అభ్యసించక పోతే ఎటువంటి ప్రమాదం ఉండదు.. కానీ ఒకసారి అభ్యసించి దుష్ట శక్తుల మీద ఈ విద్యను ప్రయోగించిన తర్వాత సాధన ఆపకూడదు. ఒకవేళ ఆపితే అలాంటి వాడి చావు చాలా భయంకరంగా ఉంటుంది.. ఎందుకంటే దుష్టశక్తుల ప్రమాదకరమైన నీడ మా మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మా తాంత్రిక సాధన ద్వారా వాటి నుండి మేము ఎప్పుడు రక్షించుకుంటూ ఉంటాము.. వాడికి ఆసక్తి కొద్దీ అభ్యసించాడు. వాడి పరిస్థితి కూడా అంతే.. సాధన మానడానికి లేదు.." అని చెప్పాడు..

రఘునాథ రెడ్డి చెప్పింది విన్న తర్వాత గోవింద రావు ఎలాగైనా రుద్ర ని కలవాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు..

రఘునాథ రెడ్డి చెప్పింది విన్న తర్వాత సత్యనారాయణ రావు, గోవింద రావు తో..
" అయితే చిన్నాన్న..!! మనం వెంటనే మారేడుమిల్లి బయలుదేరాలి.. ఎలాగైనా రుద్ర ని వెతికి పట్టుకోవాలి.." అని అన్నాడు.

" అయితే ఆలస్యమెందుకు రేపే బయలు దేరదాం.." అన్నాడు గోవింద రావు.

వీరి సంభాషణ వింటున్న రఘునాథరెడ్డి..
వారి మాటలకి అడ్డొస్తూ..!! " మీ మాటలకి అడ్డువస్తున్నందుకు క్షమించండి స్వామి.
మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి."
అని అన్నాడు.

" ఏమైంది రెడ్డి గారు..??" అని అడిగాడు సత్యనారాయణ రావు..

" మీరు ఊహిస్తున్నట్టు రుద్ర మీకు సహాయపడకపోవచ్చు..!!"

ఆ మాటకి అనుమానంగా చూశాడు గోవింద రావు..

" అదేంటి..? అలా అన్నారు..?? మాకు ఎందుకు సాయం చేయ్యడు..??" అని ఆశ్చర్యంగా అడిగాడు సత్యనారాయణ రావు.

" దాని వెనకాల పెద్ద కారణం ఉంది. స్వామి..!!"

" ఏంటా కారణం..??" అని అడిగాడు గోవింద రావు

రఘునాథ రెడ్డి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు..

" సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం..!!

రుద్రకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది..!!
అందువల్ల తల్లిదండ్రులను వదిలి దూరంగా మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఉంటున్నాడు..
ఒకరోజు శివుడు గారి దగ్గరికి దెయ్యం పట్టిందని ఒక ముసలావిడిని తీసుకువచ్చారు. కానీ అప్పుడు శివుడు గారు జ్వరంతో బాధపడుతున్నాడు. ఆమెకు వైద్యం చేయడం కుదరదని ఆయన భార్య చెప్పిన సరే, వాళ్ళు బ్రతిమాలడంతో
తన భార్య వద్దన్నా వినకుండా ఆమెకు నయం చేయడానికి పూనుకున్నారు..
కానీ ఆమెకు నయం చేస్తూ ఉండగా మధ్యలోనే హఠాత్తుగా శివుడు గారు చనిపోయారు. అక్కడే చూస్తూ ఉన్న ఆమె భార్య ఒక్కసారిగా పక్షవాతం వచ్చినట్లుగా నేలపై పడిపోయింది... ఆ విషయాన్ని నాకు అక్కడ ఉన్న వారు చెప్పగా వెంటనే నేను ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశాను..
రుద్ర వచ్చిన తరువాత శివుడు గారి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించాను..
అలా తన తండ్రి చనిపోవడం, తన తల్లి అనారోగ్యంతో మంచానపడడంతో రుద్ర బాగా కుంగిపోయాడు.. అప్పుడు నేను ఓదారుస్తూ " బాధపడకు రుద్రా..!! మీ అమ్మగారికి ఏమీ కాదు..! మేము అందరం ఉన్నాం కదా..!! నువ్వేమి భయపడకు..!!" అని అంటుండగా..!

రుద్ర ఆవేశంతో.." నా తండ్రి ఏ నేరం చేసాడు అంకుల్..?? ఎవరికైనా సాయం చేయడమే తప్పా .?? అలా సాయం చేసినందుకు ఆయన చనిపోయాడు.
నా తల్లి మంచాన పడింది.. ఈ రోజున చెప్తున్నాను అంకుల్.. ఈరోజు నుంచి ఈ విద్యని నేను ఉపయోగించను.." అని కోపంగా చెప్పి ఆ తర్వాత అతని తల్లిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు..
ఆ తర్వాత నాకు ఫోన్ కూడా చేయలేదు..
ఇప్పుడు ఎలా ఉన్నాడో కూడా పూర్తిగా తెలియదు.."అంటూ చెప్పడం పూర్తి చేశాడు.

రఘునాథ రెడ్డి చెప్పింది ఇద్దరు పూర్తిగా విన్నారు..

సత్యనారాయణ రావు అసహనంతో గోవింద రావు వైపు చూస్తూ " ఏం చేద్దాం చిన్నాన్న..?"
అని అడిగాడు.

గోవింద రావు మాత్రం " మనం రేపు పొద్దున్నే మారేడుమిల్లి బయలుదేరుతున్నాం..!!" అంటూ స్థిరంగా చెప్పాడు.

" కానీ చిన్నాన్నా..??" అంటూ సత్యనారాయణ రావు ఏదో చెప్పబోతుండగా
అతని వైపు మాట్లాడవద్దు అన్నట్లుగా చెయ్యి చూపించారు..

" చూడు రావు..!! మానవ ప్రయత్నం మనం చేయాలి.. ముందు రుద్ర ని ఎలాగైనా కలవాలి. అతను ఒప్పుకుంటాడో.? లేదో.? అది తర్వాత విషయం, కానీ ప్రస్తుతం మనం ఉన్న ఈ పరిస్థితుల్లో అతను తప్ప మనకి వేరే దారి లేదు. కాబట్టి అతన్ని ఎలాగైనా మనం కలిసి తీరాలి..!!" అంటూ దృఢంగా తన నిర్ణయాన్ని వెలిబుచ్చాడు.

సత్యనారాయణ రావు కూడా సరైన అన్నట్లుగా తల ఊపాడు..

గోవింద రావు రఘునాథరెడ్డి వైపు చూసి..
" రెడ్డి గారు..! రుద్ర ని కలవడానికి మాకు మీ సహాయం కావాలి...?"అని అడగగానే

" అది నా భాగ్యం స్వామి..!! మా డ్రైవర్ పురుషోత్తం కి రుద్ర బాగా తెలుసు..! రేపు దగ్గరుండి నా కారులో అతడు మిమ్మల్ని అతని దగ్గరకు తీసుకు వెళతాడు. రుద్ర తో మీ పని పూర్తయ్యేంతవరకు అతను మీతో పాటే ఉంటాడు.." అంటూ ఎంతో మర్యాదగా చెప్పాడు..

" నువ్వు మాకు చేస్తున్న సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.." అని గోవింద రావు చెప్పగా..

" నా బిడ్డను కాపాడిన రోజున నేను డబ్బులు ఇచ్చినా సరే..మీరు తీసుకోలేదు.
శివుడు గారికి ఇచ్చేశారు.. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. ఈ విధంగానైనా మీరు చేసిన ఉపకారానికి కొంత బదులు తీర్చుకున్న వాడిని అవుతాను.."అంటూ గోవింద రావు కి నమస్కరించాడు..

" మంచిది..!! అయితే రేపు పొద్దున్నే సూర్యోదయానికి ముందరే మేము బయలుదేరుతున్నాము.."అని గోవింద రావు చెప్పగా

" రేపు ఉదయానికి మీరు బయల్దేరడానికి కావలసిన ఏర్పాట్లు అన్ని నేను చూసుకుంటాను స్వామి..!!"అని చెప్పాడు రఘునాథరెడ్డి.




ఇంకా ఉంది.....!!!
[+] 8 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: