Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 132


వినయ్ చెప్పిన విధానానికి భరత్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బావ తెగ చించుతున్నావు. నువ్వు చెప్పినదే ఆలోచిస్తున్నాను.

ఫస్ట్ నా ట్రైల్ నేను వేస్తాను. వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాంలే. నీ ఇష్టం.  చెప్పాల్సింది చెప్పాను. నువ్వేం చేస్తున్నావు ప్రొసీడ్ అవుతున్నావా.

నా రౌడీ పిల్లని కొన్ని రోజులు ఆడుకోవాలి బావ. ఎలాగైనా లైన్ లోకి వచ్చేస్తది. అది దేశముదురు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.

మనం పరవాలేదు. రాజ్ బావ గురించి ఆలోచిస్తే బాధేస్తుంది. నిజమే మరి ఇంత అమాయకుడు అనుకోలేదు.

యూఎస్ లో ఉన్నాడు. ఫాస్ట్ గా ఉంటాడు లేడీస్ ని ఒక రేంజ్ లో హ్యాండిల్ చేస్తాడు అనుకున్న.  కానీ మన నివి దగ్గర మాత్రం బొక్కబోర్లా పడుతున్నాడు.

అవును బావ బిజినెస్ లో అన్నయ్యతో సమానంగా వెళుతున్నాడు కానీ లేడీస్ ని హ్యాండిల్ చేయడం అస్సలు రావడం లేదు.

మనం చాలా బెటర్. ఏమో నా పరిస్థితి అయితే నాకు ఏమీ అర్థం కావడం లేదు వినయ్ . నీ పిల్ల ఏదో ఒకటి మాట్లాడుతుంది. నా పిల్ల ఏమీ మాట్లాడదు.

ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఐడియా..  నీ పిల్ల నెంబర్ ఇవ్వు బావ అంటాడు.  ఎందుకు. నాకు చాలా పని ఉంది అని నెంబర్ తీసుకుని వెళ్ళిపోతాడు.

ఒకసారి మనం శిల్ప,  ఉదయ్ దగ్గరికి వెళదాం రండి..

పనులు చేయడం మొదలుపెట్టి అప్పటికే 15 రోజులు దాటుతుంది. శిల్పకి ఆలోచించుకోనే టైం లేకుండా మెదడు శరీరం రెండు అలసిపోతూ ఉంటాయి.

పొద్దున్నే ఎప్పుడో లేచి రాత్రి చీకటి పడ్డాక పడుకోవడం. సోషల్ యాక్టివిటీస్ లో లేకపోవడం. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో ఒక రకమైన ప్రశాంతమైన జీవితంలో ఉంది.

మెల్లి మెల్లిగా ఆ పనులకి అలవాటు పడుతూ వచ్చిన రోజు చూపించిన పొగరు కూడా తగ్గి మనుషుల విలువ మెల్లిగా తెలుసుకుంటూ ఉంది.

పొలంలో  జల్లిన విత్తనాలు చిన్నగా మొలక వచ్చేటప్పటికి అవి చూసి ఆనందంతో ఉదయ్ అని పిలుస్తుంది. చెప్పు శిల్ప అంటే...

మనం వేసిన విత్తనాలు చూడు చిన్నగా మొలక వచ్చింది అని సంతోషంగా చెబుతుంది.  ఉదయ్ శిల్ప వైపు చూస్తాడు.  ఆ ముఖంలో ఎప్పుడూ కనపడిని సంతోషం కనబడుతూఉంటుంది.

అవును అంటాడు. అవును అని అంత సింపుల్ గా అంటావేమిటి. ఇది మన హార్డ్ వర్క్ అంటుంది. ఆ మాటకి నవ్వుతూ హార్డ్ వర్క్ విలువ నీకు తెలుస్తుందా...

ఇప్పుడిప్పుడే... చూస్తూ ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉందో తెలుసా.. డాడీ దగ్గర ఎంత మనీ తీసుకుని పార్టీస్ చేసుకున్న సరే ఈ ఆనందం ముందు అవన్నీ నథింగ్ అనిపిస్తున్నాయి.

అందుకేనేమో అవని ఎప్పుడూ చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉండేది. కష్టపడేది కదా అందుకే ఆ విలువ బాగా తెలిసేది. నువ్వు అవని గురించి ఆలోచిస్తున్నావా...

చెప్పాను కదా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఆ సంతోషం ముందు ఏది కనిపించడం లేదు.  అవని ఊహ తెలిసే వయసు నుంచి కష్టపడుతూనే ఉంది.

తన కష్టాన్ని చూసి మనం వెకిలిగా నవ్వుకునేవాళ్ళం.  ఎగతాళి చేసేవాళ్ళం.  ఆఖరికి మమ్మీ కడుపు నిండా ఫుడ్ కూడా పెట్టేది కాదు.

మనం ఎంత ఫుడ్ వేస్ట్ చేసేవాళ్ళం. ఆ వేస్ట్ చేసింది దాంట్లో సగం అవనికి పెట్టిన సరిపోయేది కానీ..  మమ్మీ అలాంటి మంచి పనులు చేయలేదు.

ఆవిడని చూస్తూ పెరిగిన మనకి ఎక్కడి నుండి వస్తాయి. నువ్వు అన్నది కూడా నిజమే శిల్ప. మన పేరెంట్స్ సరిగ్గా ఉండి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు.

మీ మమ్మీకి తోడు మా డాడీ, మా మమ్మీ. ముగ్గురికి ముగ్గురు తోడు దొంగలు లాగ మావయ్య ఆస్తినంతా కొట్టేసి...

అవనినీ రోడ్డు మీద నిలబెట్టి నిన్ను ప్రిన్స్ చేయాలి అనుకున్నారు. కానీ భగవంతుడు అనే వాడు చూస్తూ ఉంటాడు కదా...

అవని కష్టపడే తత్వానికి విక్రమ్ లాంటి వ్యక్తి భర్తగా వచ్చాడు. మన పరిస్థితి ఇలా ఉంది అంటాడు. అవును నువ్వు అన్నది కూడా నిజమే.

మమ్మీ ఫస్ట్ నుంచి మంచిగా ఉండి ఉంటే నేను కూడా అలాగే ఉండేదాన్నేమో. అట్లీస్ట్ అక్కచెల్లెలు లాగా అయినా పెరిగే వాళ్ళము కదా..

మంచి చెడు తెలుసుకునేదాన్ని. ఈరోజు నా జీవితం నేను కోరుకున్నట్టుగా మలుచుకునేదాన్ని ఉదయ్  అలా చూస్తూ ఉంటే తప్పుడు దారిలో కాదు సరైన దారిలో వెళ్లి అంటుంది.

ఇంకా మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే ఒక నవ్వు నవ్వి పద పనిచేసుకుందాం అంటుంది. ముందుకు వెళుతున్న శిల్ప ని చూస్తూ ఉంటాడు.

మా బంధం ఏమిటి..  ఈ పెళ్లిని ఒప్పుకోవాలా.
ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు అలా అని ద్వేషము లేదు. శిల్పా తప్పుడు దారిలోకి వెళ్ళింది అని తప్పుపట్టడానికి నేనేమీ శ్రీ రామచంద్రుడిని కాదు కదా..

నేను తిరగాల్సిన తిరుగళ్లన్నీ తిరిగాను. అలాంటప్పుడు శిల్ప పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకోవడం కూడా నా మూర్ఖత్వమే.

మెల్లిగా శిల్ప మనసు మార్చి ఇద్దరం భార్యాభర్తలుగా ప్రయాణం మొదలుపెట్టాలి. ఇప్పటినుంచి మాత్రం ఒకరినొకరి మోసం చేసుకోకుండా నిజాయితీగా ఉంటే చాలు అనుకుని శిల్ప వెనకాలే వెళతాడు.

రోజులు ముందుకు సాగుతూ ఉన్నాయి. కొంతమందికి సంతోషంతో.. కొంతమందిలో మార్పురావడంతో...రెండు జంటలు ప్రేమాయణంతో.  ఒక జంట పెళ్లి టైం దగ్గర పడడంతో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు.

అవనికి మూడో నెల వస్తుంది. డాక్టర్ చెక్ చేసి అంతా బానే ఉంది పరవాలేదు ఇలాగే డైట్ మెయింటైన్ చేయాలి అని సజెస్ట్ చేస్తారు.

ఓకే థాంక్యూ చెప్పి ఇంటికి తీసుకువస్తాడు. నేను బాగానే ఉన్నాను. బానే ఫుడ్ తీసుకుంటున్నాను. మీరు ఆఫీస్ కి వెళ్ళండి. లేదు నా బేబీని చూసిన తర్వాత అంటాడు.

అప్పుడు మాత్రం ఎందుకు.. మీ బేబీని ఎవరు ఆడిస్తారు డైపర్ ఎవరు మార్చుతారు.  అప్పుడు కూడా ఉండిపోండి.  గుడ్ ఐడియా.

నాకు ఇప్పుడు దాకా రాలేదు.  చూసావా ఎలాగైనా నా బేబీ చాలా గ్రేట్ అంటాడు. ఏదైనా సరే బేబీ అకౌంటు ఏనా... నాకు బుర్ర లేదా..

బుర్ర ఉంది కానీ వాడటం అన్నది నా బేబీ వచ్చిన తర్వాతే స్టార్ట్ అయింది. అందుకే నా బేబీ గ్రేట్. అబ్బో ఇప్పుడు నుంచే పుట్టబోయే బేబీ ని నెత్తిన పెట్టుకుంటే  వచ్చే బేబీ ఇంకా ఆడించేస్తుంది.

అప్పుడు గ్రేడ్ లయన్ విక్రమ్ జై సింహా గారు వాళ్ళ పిల్లలు చేతుల్లో డాల్ అంటారు.  ఆ మాటకి నవ్వుతూ అయ్యేది నా పిల్లలకే కదా...

అందులో ఉండే ఆనందమే వేరు. చిన్నప్పుడు నేను  చాలా అల్లరి చేసేవాడిని. ఆఫీస్ కి వెళ్ళిన  డాడీని, తాతయ్యని ఇంటికి వచ్చేదాకా బాగా పేజీ పెట్టేవాడిని.

ఒక్కోసారి ఇంపార్టెంట్ మీటింగ్లోనే వెనక్కి వచ్చేసేవాళ్ళు అంట. ఎప్పుడు నాన్న అంటారు నీకు ఇంతకుమించి ఏడిపించేవాడు పుట్టాలిరా..

అప్పుడే నా రివెంజ్ తీరుతుంది అని. నేను మాత్రం ఎంజాయ్ చేస్తాను పిల్లల్లో పిల్లలుగా కలిసిపోవాలి.
పెద్దవాళ్ళో పెద్దవాళ్లగా కలిసిపోవాలి.

అప్పుడే మన స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఎప్పటికీ యంగ్ గా కనిపిస్తాము. ఓహో తమరు అందం సీక్రెట్ ఇదా అంటుంది. నీకు కావాలా..

ఎందుకులే ఆ అందం మందం మాదిరిగా మీరే పెంచుకోండి అని మూతి తిప్పుతుంది. అరె.. నా భార్యామణికి కూడా జలస్ వస్తుందా...

నాకెందుకు.. చూసావా నీలో ఉన్న కొత్త వేరియేషన్ కూడా నా బేబీ వల్లే బయటకు వచ్చింది. మీకో నమస్కారం. మీ బేబీ కో నమస్కారం. నన్ను వదిలేయండి.

మీ బేబీ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను. అరే అలా ఎలా వదిలేస్తాను. ఎంజాయ్ చెయ్. ఇప్పుడు నుంచి నా బేబీ టాలెంట్ను గుర్తించావు అనుకో.. 

పుట్టిన తర్వాత ఎలా ఉండాలో..  ఇంకా ఎలా డెవలప్ అవ్వాలో తెలుస్తుంది అంటాడు.  ఇంకా అంటే ఇంకా నా ఆలోచించి చెబుతాను.

మీరు ఆలోచిస్తూ ఉండండి. నాకు పని ఉంది అంటుంది ఏం పని. అబ్బా ఏదో ఒకటి ఉంటుందిలే.  హ.. మర్చిపోయాను బంగారం అంటాడు.  మళ్ళీ ఏం గుర్తొచ్చింది  నీ కోసం జీకే బుక్స్ తెచ్చాను.

సీరియస్గా చూస్తూ ఏం తెచ్చారు అంటుంది. జనరల్ నాలెడ్జ్ బుక్స్. ఇప్పుడు నాకు అది ఏమైనా తక్కువ  ఉందా.

ఇప్పుడున్న దానికన్న ఇంకా పెంచుకొవడానికి.  నీ ఐక్యూ ఎంత బాగుంటే బేబీకి అంత మంచిది. ఇప్పటినుంచి ఆలోచిస్తూ ఉంటుంది. షార్ప్ గా ఉంటుంది.

తల కొట్టుకుంటూ ప్లీజ్ అండి కావాలి అంటే అమ్మమ్మ గారి దగ్గర కూర్చుని భగవద్గీత, రామాయణం వింటాను సరేనా. అవి విను.  ఇది చదువు.

రోజు నిన్ను నేను అడుగుతాను. ఆ కొషన్స్కి సమాధానం చెప్పాలి అంటే బిక్క మొహం వేసుకుని చూస్తుంది. ఏమైందిరా అంటాడు.  ఏం అవ్వాలా....

మన బేబీ పుట్టడంతోనే బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు ఏమో అని భయంగా ఉందండి.  అది ఇంకా మంచిది కదా..
హ్యాపీగా నేను రిలాక్స్ అయిపోయి మనం ట్రిప్స్ మీద ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అంటాడు.

నా బుర్ర ఇప్పటికే వేడెక్కిపోయింది. నేను అమ్మమ్మ గారి దగ్గరికి వెళుతున్నాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెళుతున్న అవనినీ చూసి నవ్వుకుంటూ నిన్ను ఎప్పుడూ ఇలాగే బిజీగా ఉంచాలి.

నీ బుర్రకి ఏది ఆలోచించుకునే టైము ఇవ్వకూడదు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను.

అవని ఇందిరాగారి దగ్గరికి వెళ్లి అమ్మమ్మ గారు అని పిలుస్తుంది. రా తల్లి అక్కడే ఆగిపోయావే.. లోపలికి వచ్చి ఏం చేస్తున్నారు.

ఇప్పుడే రామాయణం తీసి చదువుతున్నాను. నాకు వినాలని ఉంది. పైకి చదువుతారా.. అంతకన్నానా..  రా తల్లి అని కూర్చోబెట్టి రామాయణం చదువుతూ ఉంటారు.

అది వింటూనే అవని అక్కడే నిద్రపోతుంది.  పడుకున్నా అవనినీ జో కొడుతూ రామాయణం చదువుతూఉంటారు.

ఆనందనిలయం??

కథ కొనసాగుతుంది...
[+] 13 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Avunu.. Anandanilayame!!!
Wonderful update
Like Reply
Superb update
Like Reply
Part - 133


విక్రమ్ ఇందిర దగ్గరికి వస్తాడు.  పడుకుని ఉన్న అవనినీ చూసి నిద్రపోయిందా. ఆహా మగతగా ఉన్నట్టుంది. నువ్వు జో కొడుతున్నావా గ్రానీ.

తప్పేముందిరా.. ఈ టైం లో కడుపుతో ఉన్న ఆడవాళ్లు అంటే గర్భగుడిలోని అమ్మ వారితో సమానం. కడుపుతో ఉన్నవాళ్ళకి సేవ చేస్తే సాక్షాత్తు అమ్మవారికి సేవ చేసినట్టే. మరి ఆ భాగ్యాన్ని నేనెందుకు వదులుకుంటాను.

ఆ మాటకు విక్రమ్ ఇందిరాగారిని హగ్ చేసుకుని థాంక్స్ గ్రాని అంటాడు.  ఎందుకురా. అవనినీ  ఇంత బాగా అర్థం చేసుకుని సపోర్ట్ గా నిలబడ్డావు చూడు.  అందుకు.

ఒరేయ్..  పెళ్లికి ముందు ఎవరు ఏమిటి అన్నది మనకి అనవసరం. పెళ్లిళ్లు స్వర్గాన్ని నిర్ణయించబడతాయి అంటారు.

మీ ఇద్దరికీ ఎప్పుడో భగవంతుడు రాసి పెట్టాడు.  అందుకే భార్యాభర్తలు అయ్యారు.  మరి నీ భార్య మన కుటుంబంలో మనిషే కదా..

మన కుటుంబానికి సంబంధించిన వాళ్లని నేను ప్రేమగా చూసుకోకపోతే  ఎవరు చూసుకుంటారు. నేను ప్రవర్తించే విధానాన్ని బట్టి కదా నా తర్వాత తరం ఫాలో అవుతుంది.

ప్రతిదీ నోటితో చెప్పాల్సిన అవసరం లేదు విక్రమ్. మన చేతులతో కూడా కొన్ని కొన్ని నేర్పించవచ్చు. అవును గ్రానీ నువ్వు చెప్పింది అక్షర సత్యం.

మాధవి అవనినీ వెతుక్కుంటూ ఇందిరా గదిలోకి వచ్చి ఇక్కడ పడుకుందా అమ్మ. ఏమైంది తల్లి. ఎప్పుడో తింది. కాస్త ఫ్రూట్స్ తింటుంది కదా అని తీసుకువచ్చాను.

ఇందిర అమ్మ అవని లేగుమ్మా అని మెల్లిగా లేపుతారు. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఇది నా గది కాదే అనుకుంటూ ఇందిరాగారి వైపు చూస్తుంది.

చట్టుక్కున  లేస్తూఉంటే... మెల్లిగా అంటారు.  సోరి అమ్మమ్మగారు..  మీరు రామాయణం చదువుతూ ఉంటే తెలియకుండానే నిద్ర పట్టేసింది.

నువ్వు నిద్రపోతే ఏమైంది కడుపులో ఉన్న బిడ్డ వింటుంది కదా..  అది చాలు.  మేము చదువుతూ ఉంటాము.  నువ్వు నిద్ర పోయినా మాకు ఇబ్బంది లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు.

మాధవి ఇదిగో అని చేతికి ఇస్తుంది.  ఆకలిగా లేదు అమ్మ. ఆకలి ఉన్న లేకపోయినా కొంచెం కొంచెం తింటూ ఉండు అని మెల్లిగా తినిపిస్తూ ఉంటారు. 

నివి, లలిత కూడా అక్కడికి వస్తారు.  వదిన నువ్వు బాగానే ఉన్నావు కదా. హా బానే ఉన్నాను ఏమైంది నివి.. మనం షాపింగ్ కి వెళ్దాము.

లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి అంట. కాల్ చేశారు.  ఆఫ్టర్నూన్ నుంచి వెళదామా అనగానే.. అందరూ ఒకేసారి వద్దు అంటారు.

ఆ మాటకి ఏమైంది అంటే..  అవని బయట తిరగకూడదు. అందులోనే ముఖ్యంగా నీతో అని లలిత అంటుంది.

అమ్మ అంటే... అవును తల్లి తమ షాపింగ్ ఎలా ఉంటుందో మా అందరికీ ఎక్స్పీరియన్స్ ఏ కదా.. అసలే అవని కడుపుతో ఉంది.

నీతో పాటు తిరిగింది అంటే అలసిపోతుంది.  కావాలి అంటే ఆ షాప్ కి ఫోన్ చేసి ఆ డిజైన్స్ అన్ని ఇంటికి తేప్పించుకో లేదు అంటే ఎవరినైనా తోడు తీసుకువెళ్ళు.

రాజ్ లేరమ్మ. వర్క్ ఉంది అని చెప్పి కలవడం కష్టమన్నారు. ఆల్రెడీ రాజ్ కి కాల్ చేసావా.. ఉమ్..
  తల ఊపుతుంది.

అయితే మీ అన్నయ్యలనో,  బావనో తీసుకువెళ్ళు. వాళ్ళు రారమ్మా. ఎవరు వచ్చినా రాకపోయినా అవని మాత్రం రాదు.

సరే నేను నాన్నని, మావయ్యని తీసుకువెళ్తాను. హమ్మయ్య అని మాధవి అంటే..  ఏమైంది అత్తయ్య.. మమ్మల్ని ఎక్కడ రమ్మంటావా అని భయపడ్డాను.

థాంక్స్...  వాళ్ళిద్దర్నీ తీసుకువెళ్ళు.  అసలే ఈ మధ్యన మీ మావయ్యకి ఎక్సర్సైజ్ లేక ఒళ్ళు పెంచుతున్నారు. నాతో తిరిగితే ఎక్సర్సైజ్ఆ..  అత్తయ్య.

డౌటా...  ఎంత వాకింగ్ చేపిస్తావు నువ్వు? అట్లీస్ట్ ఒక కేజీ తగ్గిన తగ్గినట్టే కదా తీసుకువెళ్ళు.  థాంక్యూ అత్తయ్య. నీకోసం మావయ్యను తీసుకు వెళుతున్నాను అంటుంది.

అందరూ రమేష్,  కళ్యాణ్ ని ఊహించుకుని జాలి పడతారు. సాయంత్రం తొందరగా రండి అని నివి మెసేజ్ చేస్తుంది.

ఏమైంది అని కాల్ చేస్తే.. తొందరగా రండి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.  బావమరుదులిద్దరూ ఊపుకుంటూ సాయంత్రం తొందరగా వచ్చేస్తారు.

నివి రెడీ అయ్యి ఉంటుంది. వాళ్ళు లోపలికి వస్తూ ఏమైంది నివి తొందరగా రమ్మన్నావు. పదండి...  పదండి మళ్ళీ లేట్ అవుతే కష్టం.  ట్రాఫిక్ లో ఇరుకుంటాము.

  ఎక్కడికి వెళ్ళేది..  దేనికి అని ఇద్దరు అయోమయంగా చూస్తూ ఉంటే షాపింగ్ కి నాన్న అంటుంది. అంతే ఇద్దరూ మొఖాలు  వేలాడేసుకుని ఇప్పుడు షాపింగ్ ఏంట్రా  లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయంట.

అత్తయ్యతో అంటే మావయ్యని, నాన్నని తీసుకువెళ్ళు.  ఈ మధ్య ఎక్సర్సైజు లేక వెయిట్ పెరుగుతున్నారు.  హెల్త్ ఇబ్బంది అవుతుంది.

నీతో వస్తే కొంచెం ఎక్సర్సైజ్ అయినా చేసినట్టు ఉంటుంది అని చెప్పింది నాన్న. మీకోసం.. మీ ఆరోగ్యం కోసం అని నేను ఆగాను లేకపోతే ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని అంటుంది.

కళ్యాణ్ కూతురు తల మీద చెయ్యి వేసి..  నా ఆరోగ్యం పైన నీకు ఎంత శ్రద్ధ తల్లి. మా ఆరోగ్యాల కోసం నువ్వు షాపింగ్ కి వెళ్లకుండా త్యాగం చేసావా.

పోనీలే అమ్మ.  ఇంత త్యాగం చేసినందుకు నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని కార్డు ఇస్తారు.  దేనికి నాన్న... నీకు నచ్చనివి ఎంత కాస్ట్ అయినా సరే కొనుక్కో. సరేనా..

మేము ఇంటి దగ్గరే వాకింగ్ చేస్తాం కదా బావ. రమేష్ వెంటనే  అవును బావ అంటాడు. లేదు లేదు మీరిద్దరూ నాతో రావాల్సిందే లేకపోతే అత్తయ్య అమ్మ ఫీలవుతారు అని చెప్పి లాక్కెళ్ళిపోతుంది.

వెళ్తున్న వాళ్ళని చూసి చూసావా వదిన..  నీ కూతురు ఎంత ముదురో.. మనిద్దరం ఫీల్ అవుతాం అని తీసుకువెళ్లిందంట.. అంతేగాని దానికి అవసరమై కాదు.

బ్రతక నేర్చిన తెలివి ఉంటే చాలు...  ఎక్కడైనా కొట్టుకు వచ్చేస్తారు. మనకు అది లేకే కదా మన మొగుళ్ళతో ఇన్ని తంటాలు పడుతున్నాము అంటుంది.

సరిగ్గా చెప్పావు వదిన. ఎలాగైనా మనం నివి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. అది ట్రైనింగ్ తీసుకుంటే రాదు వదిన జన్మతా వచ్చేయాలి. మన తర్వాత అవని.  ముగ్గురికి ముగ్గురం సరిపోయాము.

ఇదంతా చూసిన విక్రమ్ నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి మీరిద్దరూ ఎక్కడికి వెళ్లాలో చెప్పండి.  నేను తీసుకువెళ్తాను. ప్రస్తుతం అవసరం లేదు రా..

  కరుణ ఆంటీ,పార్ధు అంకుల్ వస్తే అందరం కలిసి ఒకేసారి షాపింగ్ కి వెళ్దాము.  ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి అంటే కష్టం కదా అంటే గుడ్ డెసిషన్ అయితే అందరికీ కలిపి ప్లాన్ చేస్తాను.

ఆఫీస్ నుంచి వచ్చిన భరత్, వినయ్ దగ్గరికి వచ్చి ఏంటి ముగ్గురు గూడుబుఠాణి  చేస్తున్నారు.  ఎనీ సీరియస్ అంటే...  మాధవి అవున్రా ఇప్పుడు దాకా సీరియస్ డిస్కషన్ అయింది.

మీరు రావడమే ఆలస్యమైంది అని నీరసంగా చెబుతుంది. ఏమైంది అత్తయ్య అంత సీరియస్ డిస్కషన్ ఏం జరిగింది. మీ చెల్లి షాపింగ్ అంటుంది.

వెంటనే ఎక్కడ నివి అని కంగారుగా వెతుకుతాడు. ఆల్రెడీ మీ నాన్నని, మావయ్యని తీసుకుని వెళ్ళిపోయింది ఈసారి వాళ్ళిద్దరూ బుక్కయ్యారా.

లేకపోతే మేము బుక్ అయ్యేవాళ్ళం అంటుంది. ఎందుకు అత్తయ్య మావయ్య మీద పగపట్టేసావు. ఊరుకోరా నేనెందుకు పగ పడతాను.

కాస్త చేంజ్ ఉంటుందని వెళ్ళమన్నాను అంతే కదా వదినా...  అంతే. ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు. హాయిగా కూర్చుని కాలు మీద కాలేసుకుని.. ఉప్పరి మీటింగ్లే కదా..

అందుకనే షాపింగ్ కి వెళ్తే కాస్త లోకజ్ఞానం తెలుస్తుంది అని.. రా వదిన అని లలిత వెళ్ళిపోతుంది.  వెళుతున్న లలిత, మాధవిని చూసి నాన్నకి మావయ్యకి లోకజ్ఞానం కావాలంట.. మరి వీళ్ళకేం కావాలో అని వినయ్ భరత్ ఒకరినొకరు చూసుకుని పెదవి విరుస్తారు.

ధనుంజయ్ అవని దగ్గరికి రాకపోయినా ఎప్పటి విషయాలు అప్పుడు కళ్యాణ్ చెబుతూ ఉంటాడు.  అది విని కూతురు సంతోషంగానే ఉంది అని తృప్తిపడతాడు.

ఒకసారి భార్గవిని కలిసి వద్దాము అని భార్గవిని ఉంచిన  ప్లేస్ కి వెళతాడు. గదిలోకి వెళ్లి భార్గవి భార్గవి అని పిలుస్తూ ఉంటాడు.

మెల్లిగా తలెత్తి ఇక్కడ అంటుంది. అరే.. కనిపించలేదు.  ఇక్కడే ఉన్నావా... అదేంటి భార్గవి. ఇలా చిక్కిపోయావు.  నీకు ఇక్కడ సదుపాయాలు సరిగ్గా ఉండడం లేదా జైల్లో ఫుడ్డే బాగా పడినట్టుంది.

సరిగ్గా తినకపోతే ఎలా భార్గవి. ఎంత గ్లామర్ మెయింటైన్ చేసేదానివి. ఇప్పుడు చూడు 40 లో 60 లాగా కనిపిస్తున్నావు.

ఇలా ఉంటే నాకు ఎలా చూడాలనిపిస్తుంది ఎందుకండీ ఇంత టార్చర్ పెడుతున్నారు అని కన్నీళ్ళతో అడుగుతుంది.

టార్చర్ ఎక్కడ పెట్టాను. నేను కొట్టానా.. తిట్టానా.. ఆఖరికి నువ్వు ఉన్న దరిదాపుల్లో కూడా నేను ఉండటం లేదు కదా.
ఎలా టార్చర్ పెట్టగలను.

టైం కి ఫుడ్ పెడుతున్నాను. చల్లటి గాలి వస్తుందని కిటికీలు తెరిచి ఉంచుతున్నాను. నీకు ఇబ్బంది లేకుండా ఉండాలని ఫుల్ గా సెక్యూరిటీ పెట్టాను.

మనుషులని మాయ చేయడం ఈజీ కదా.. అందుకని కుక్కల్ని కాపలాగా పెట్టాను.  ఇంకా ఏమిటి నిన్ను టార్చర్ పెట్టింది.

మనిషిని కొట్టనవసరం లేదు...  తిట్టినవసరం లేదు..
సైలెంట్ గా చేసే పనిలో వల్ల కూడా టార్చర్ చేయవచ్చు అంటుంది.

ఓ...  ఎక్స్పీరియన్సా.... ఒక రకంగా అలాంటిదే.  ఫుడ్ పెడుతున్న పెడుతున్న అంటున్నారు. ఏం పెడుతున్నారు.. 
అలా అంటావ్ ఏంటి భార్గవి.

  స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్లాను కదా.. నీకు టైం కి ఫుడ్ పెట్టమని.  వెంటనే లేడీస్ ఇద్దరినీ పిలుస్తాడు. ఏంటి మీరు భార్గవి కి టైం కి భోజనం పెట్టడం లేదా...

చూడండి ఎలా చిక్కిపోయిందో.. అసలే భార్గవి అందం లేకపోతే ఉండలేదాయే...   అయ్యో సార్ మేము పెడుతున్నాము. మేడమ్ గారే అసలు తినడం లేదు.

కావాలంటే  మీ ముందే తెచ్చి పెడతాము చూడండి అని ప్లేట్ తీసుకువచ్చి భార్గవి ముందు పెడతారు. వెంటనే ధనుంజయ్,  మిగిలిన ఇద్దరు లేడీస్ మాస్క్ వేసుకుంటారు.

భార్గవి ముక్కుకి చీర కొంగు అడ్డుపెట్టుకొని ఇలాంటి భోజనం ఎవరు తినగలరండి. ఎంత పాచిపోయిన వాసన వస్తుంది. ఇది తింటే లోపల పేగులు మాడిపోతాయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటుంది.

ధనుంజయ్ సమాధానం...
[+] 10 users Like SivaSai's post
Like Reply
Part - 134


ఇలాంటి ఫుడ్ తింటే నేను ఇప్పుడే చచ్చిపోతాను. అదేంటి భార్గవి అలా అంటావు. గత కొన్ని సంవత్సరాలగా అవనికి ఇలాంటి ఫుడ్డేగా పెట్టేదానివి.

మరి నా కూతురు ప్రాణాలుతో ఉంది కదా.. ఓ..నా కూతురంటే దేవత కాబట్టి ప్రాణాలతో ఉంది. నువ్వు రాక్షసి కన్నా హీన జాతి కాబట్టి ప్రాణాలు పోతాయిఅంటున్నావ్ అంతే కదా...

నేను పెట్టిన అవని ఎప్పుడూ తినలేదు. మరి ఎలాగా తిండి తినకుండా ఉండేది అని పిడికిలి బిగించి కోపంగా అంటాడు.

ధనుంజయ్ కోపాన్ని చూసి భయపడుతూ ఎక్కువ మంచినీళ్లు తాగేది అని భయంగా చెబుతుంది. ఇంకా అంటాడు.

పార్ట్ టైం జాబ్ చేసుకునేది. వచ్చిన డబ్బులతోనే తన బుక్స్, బట్టలు, ఫుడ్డు అన్ని చూసుకునేది. మరి నువ్వేం చేసేదానివి..

నా కూతురు అంత కష్టపడుతుంటే ఎంజాయ్ చేసేదానివా..  నా కూతురు సొమ్ముతో నువ్వు సుఖపడుతూ నా కూతుర్ని కష్టాలు పాలుచేసావా...

ఛి ఛి నేను అవని డబ్బులు ముట్టుకోవడమేమిటి.. దానికి వచ్చే డబ్బులు నేను ఒక సర్వెంట్ కి ఇచ్చే అంత జీవితం ఉండదు.

ఆ మాటకి నవ్వుతూ అసలు ఇవ్వడానికి నువ్వెవరు..  ఈ ఆస్తి మొత్తం నా కూతురుది. అంటే నా కూతురి విసిరేసే ఎంగిలి మీద బతికినదానివి నువ్వు.

ఇన్ని కోట్ల ఆస్తికి వారసురాలు అయినా సరే తన ఆత్మ అభిమానం వదులుకోకుండా కష్టపడింది. అందుకే భగవంతుడు అంతమంచి జీవితాన్ని నా కూతురికి ఇచ్చాడు.

మరి నువ్వు,  నీ కూతురు పరిస్థితి ఏమిటి అంటాడు
  కోపంగా చూస్తూ ఆస్తి మొత్తం అవనిదే అయితే నేను, శిల్ప ఎవరు...

ఏమో ఎవరికీ తెలీసు.. ఆ మాటకి నవ్వుతూ ప్రపంచం మొత్తానికి తెలుసు నేను మాత్రమే మీ భార్యను అని. ఇంకా నువ్వు ఆ పిచ్చి భ్రమలోనే ఉన్నావా..

ఓ నీకు అసలు విషయం తెలియదు కదా.... చెబుతాను.. ఓ కాదు కాదు చూపిస్తాను. అని పిఏ కి కాల్ చేసి ఏమి చేయాలో చెబుతాడు.

ఏమి చేస్తున్నారు మీరు అంటే.. నీకు చూపించాలి కదా వెయిట్ అంటాడు.  ఈ లోపు పి ఎ పెన్ డ్రైవ్, లాప్టాప్ తీసుకునివస్తాడు.

ధనుంజయ్ వాటిని తీసుకుని కనెక్ట్ చేసి భార్గవి ముందు పెడతాడు. యాన్యువల్ డే రోజున జరిగిన ప్రోగ్రాం. పొద్దుటి నుంచి శిల్ప పనిచేస్తున్నది మొత్తం కనపడుతుంది.

అది చూడగానే భార్గవి నా కూతురు ఇలా ఉండడానికి వీలులేదు అని అరుస్తుంది. జస్ట్ వెయిట్... తర్వాత జోకర్ డ్రెస్ వేసుకుని అందరికీ వెల్కమ్ చెప్పడం అవని ఫ్యామిలీని రిసీవ్ చేసుకోవడం.

ధనుంజయ్ అందరూ ముందు రజిత ఒక్కతే భార్య,  అవని మాత్రమే వారసురాలు అని అనౌన్స్ చేయడం అన్నీ వస్తూఉంటాయి.  శిల్ప అందరికీ సర్వీస్ చేయడం చూసి నీరుగారిపోతుంది .

వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరివి అంటాడు. ఎందుకు చేశారు ఇలాగా.. నువ్వు చేసిన దానికి పనిష్మెంట్.

నువ్వు చేసిన తప్పులకి నీ ముద్దుల కూతురు అనుభవిస్తుంది. శిల్ప మీకు కూడా కూతురే ఆ విషయం మర్చిపోతున్నారు.

ఏ రోజో మర్చిపోయాను.  ఉంచుకున్నదానికి పుట్టిన దానిని వారసురాలు అని చెప్పుకోవడానికి నేనేమన్నా రోడ్డుమీద పోయేవాడిని అనుకుంటున్నావా... 

నాకంటూ సొసైటీలో ఒక పరువు ప్రెస్టేజ్ ఉన్నాయి. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా..  కట్టుకున్న భార్యని అలాంటి నీచపు మాటలు మాట్లాడడానికి మీకు మనసు ఎలా వచ్చింది..

సహవాసదోషం భార్గవి. నా కూతుర్ని కూతురు కాదు అని నువ్వు క్రియేట్ చేయలేదా.. ఇది కూడా అంతే. దీన్ని బట్టి ఏం అర్థమైంది నీకు.

ఏమి మాట్లాడలేక చూస్తే.. మనం ఏదైతే ఇస్తామో దానికి 100 రెట్లు వెనక్కి తిరిగి వస్తుంది అంటారు. అంటే నువ్వు మంచి చేశావు అనుకో ఆ మంచే నీకు శ్రీరామరక్షలాగా కాపు కాస్తుంది.

అదే ఎదుటివారిని నాశనం చేయాలి అనుకున్నావు అనుకో ఇదిగో నువ్వు ఉన్న పొజిషన్లో ఉంటారు. నీ కూతురు చేసిన దానికి  అక్కడ ఏ పూటకా ఆ పూట కష్టపడితేనే భోజనం దొరికే పరిస్థితుల్లో ఉంది అంటాడు.

కాపలాగా పెట్టిన లేడీస్ ఇద్దరినీ పిలిచి ఈరోజు నుంచి భార్గవి తో మొత్తం పనులన్నీ చేయించండి. ఇదే భోజనం పెట్టండి.

తింటే తింటుంది లేకపోతే చస్తే చస్తుంది. ఒకవేళ చచ్చిపోతే జస్ట్ నాకు మెసేజ్ చేసి డొనేషన్ కి ఇచ్చేయండి. మరి నేను వెళ్ళనా భార్గవి.

ఉండమంటే మాత్రం ఉంటారా .. నీలో నచ్చింది ఇదే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న సరే సెన్సాఫ్ హ్యూమన్ వదలవు కదా..

సరే సాయంత్రం అయిపోయింది కదా చల్లటి గాలి వస్తూ ఉంటుంది. కిటికీలు తెరిచి పెట్టండి అని చెబుతాడు.  కిటికీలు తెరవకపోయినా పరవాలేదు.

ఉక్కగా ఉన్న ఇబ్బందే లేదు.  ప్లీజ్ కిటికీలు తేరవద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది.  అదేమిటి భార్గవి గాలి లేకపోతే ఎలా ఉంటావు.

మీరు కిటికీలు తెరిస్తే దోమలు వచ్చి బాగా కుడుతున్నాయి నేను ఆ బాధ భరించలేకపోతున్నాను. ఊరుకో భార్గవి. ఏమిటా మాటలు ఆ ప్రాణి ఎంత ఉంటుంది.

చిన్నగా... మనం చూస్తేనే బెదిరిపోయి పారిపోయే అంత చిన్నగా ఉంటుంది. అంత చిన్నజీవి ఏదో తన ఆకలి కోసం నీ ఒంటిలో నుంచి ఒక చుక్క రక్తం తీసుకుంటే ఎందుకు అంత బాధ పడుతున్నావు.

ఇలా నువ్వు రక్తం దానం చేస్తూ ఉంటే కొన్ని కొన్ని పాపాలు పోతాయి భార్గవి. నేను నీ మంచి కోసం చేస్తూ ఉంటే నీకు అది అస్సలు అర్థం కావడం లేదు.

ఎప్పటికి నన్ను అర్థం చేసుకుంటావో ఏమిటో అంటూ వెళ్ళిపోతాడు. వెళుతున్న ధనుంజయ్ ని చూస్తూ.. ఈ నరకం కన్నా ఒక్కసారిగా చచ్చిపోవడమే మేలు అనుకుంటుంది.

ఆ చావడానికి కూడా తనకి అవకాశం ఉండదు. చావు కూడా ధనుంజయ్ కంట్రోల్లోనే ఉంటుంది. 

మాధవి, లలిత కంగారుగా చూస్తూ ఉంటారు. వినయ్ భరత్ వచ్చి ఏమైంది. మీరిద్దరూ కాలుకాలిన పిల్లిలాగా తిరుగుతున్నారు.

ఒరేయ్ మీ నాన్న, మావయ్యని తీసుకుని నివి వెళ్లి చాలాసేపయింది.  ఇంకా రాలేదు. సెక్యూరిటీని కూడా తీసుకుని వెళ్ళలేదు.

ఎక్కడ తిరుగుతున్నారో ఏమిటో... అయ్యో పిచ్చమ్మ మన నివి పాప షాపింగ్ అంటే అంత తొందరగా అవుతుందా.. షాప్ కట్టేసిన సరే మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఓపెన్ చేపిస్తుంది.

మరి ఇప్పుడు ఎలా రా.. వాళ్ళని పంపించక ముందు ఆలోచించాల్సింది..  ఏదో  అనేసాములే..
హ.. హ... షాపింగ్ విషయంలో మనం నివి  సీరియస్ గానే తీసుకుంటుంది.

ఆ విషయం ఎలా మర్చిపోయారు మీరు ఇద్దరు...ఆ నిమిషం మమ్మల్ని మేము సేవ్ చేసుకోవడం ఒక్కటే ఆలోచించాము రా..

అందుకని మమ్మల్ని బుక్ చేశారా అని నీరసంగా వచ్చి కూలబడతారు.  వచ్చేసారా అని గబగబా మంచినీళ్లు చేతికి ఇస్తారు.

ఆకలేస్తుంది అని ఇద్దరు పొట్ట పట్టుకుంటారు. నివి మాత్రం మంచి ఉత్సాహంగా వస్తుంది . డ్రైవర్ లగేజ్ మొత్తం లోపల పెట్టి వెళ్ళిపోతాడు.

అదేంటి  ఏమీ తినలేదా..  అయ్యో మమ్మీ అసలు టైం ఎక్కడుందని. నాన్న మావయ్య అలసిపోయారని వచ్చేసాను కానీ లేకపోతే ఇంకా నాలుగు షాపులు ఉన్నాయి.

వినయ్ భరత్ అమ్మలవైపు మేము చెప్పామా అన్నట్టుగా చూస్తారు. ఏం కొన్నావు నివి ఇంత లేట్ అయింది
రండమ్మా చూపిస్తాను అనగానే.. లలిత మాధవి అటు అడుగులు వేస్తూ ఉంటారు.

ముందు మాకు ఏదైనా పెట్టి అప్పుడు మీరు ఎంతసేపైనా చూసుకోండి. మీరు చూస్తూ ఉండండి అత్తయ్య నేను వడ్డిస్తాను అని వస్తుంది.

మాధవి లలిత నివి దగ్గర కూర్చుంటారు. అవని ఇద్దరికీ వడ్డిస్తూ ఉంటే... ఇద్దరూ భోజనం చేసి ఉత్సాహాన్ని తెచ్చుకుని హమ్మయ్య నీ చేతితో వడ్డిస్తే ఆకలి లేనివాళ్ళైనా సరే భోంచేయాల్సిందేనమ్మా అని కోడలని మెచ్చుకుని ఇద్దరు  ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లి మంచాలు ఎక్కేస్తారు.

అవని అత్తయ్య మీకేమైనా కావాలా.. ఏమీ వద్దు. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో. సరే అని పాలు పుచ్చుకొని గదిలోకి వెళ్ళిపోతుంది.

అవనినీ చూసిన విక్రమ్..  ఏంటి భార్యామణి పనులు చెక్కబెట్టేసావా మావయ్య వాళ్ళు ఇప్పుడే వచ్చారు వాళ్లకి భోజనం వడ్డించి మీకు పాలు తీసుకొని వచ్చాను.

  అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు.  నివి షాపింగ్ చేసి వచ్చింది కదా... చూస్తున్నారు.   ఆడవాళ్ళకి ఇంత షాపింగ్ పిచ్చి ఏమిటి..

ఎన్ని ఉన్నా ఇంకా అంటారు. ఎలా అంటాడు. ఏమో నాకేం తెలుసు.  అదే నాకు డౌట్..
  
దేనికి అంటే అసలు నువ్వు కొత్తవి కొనుక్కోవాలి..  అలా అలంకరించుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించవేంటి.. సింపుల్ గా ఉంటావు.

నేను ఏది తెస్తే అది బాగుంది అంటావు.  ఎలా అని చెయ్యి పట్టుకుని  దగ్గరికి లాక్కుంటాడు.  విక్రమ్ మెడ చుట్టూ చేతిలో వేసి నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి ఉన్నదాంట్లోనే అడ్జస్ట్ అవ్వడం అలవాటైపోయింది.

అందుకే ఏది కొత్తవి చూసిన ఆశ కలగదు.  ఎప్పుడూ నేను కడుపునిండా తిని ఒంటినిండా బట్ట ఉంటే చాలు అనుకునేదాన్ని.

అందుకే మిగిలిన విషయాల మీద అంత ఆసక్తి ఎప్పుడూ లేదు అంటుంది.  అవని నుదుటిన ముద్దు పెట్టి ఎలా భరించావే ఆ  వయస్సులో..
వింటూ ఉంటే నాకు ప్రాణం తరుక్కుపోతుంది. భగవంతుడికి కూడా నా కష్టాలు చూసి జాలి వేసి ఉంటుంది.

మిమ్మల్ని  భర్తగా ఇచ్చాడు.  ఇప్పుడు బంగారం లాంటి వరాన్ని ఇచ్చాడు అని పొట్ట మీద చేయి వేసుకుంటుంది. ఒక మాట చెప్పనా అవని..  నీలాంటి భార్య దొరికితే ఏ మగాడి లైఫ్ అయినా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది.

వాడంత అదృష్టవంతుడు ఈ భూమి మీదే ఉండడు. అబ్బో ఏమిటో మావారు నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నారు. నిజాలు చెప్పినప్పుడు ఒప్పుకోవాలి..

పొగిడినప్పుడు ఆ పొగడ్తలని ఎంజాయ్ చేయాలి అని పాలు తాగు అంటాడు. అబ్బా వద్దండి. ఇప్పటికే చాలా అనీజీగా అనిపిస్తుంది.

డాక్టర్ దగ్గరికి వెళదామా అని కంగారుపడతాడు. అంత అవసరం లేదు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.  సరే రా.. పడుకో..

మధురం మధురం ప్రణయం మధురం ❤️❤️

కథ కొనసాగుతుంది...
[+] 13 users Like SivaSai's post
Like Reply
Super update
Like Reply
Very nice update. Lovely
Like Reply
Part - 135

అవని మంచం దగ్గరికి వెళ్ళుతూ ఒక్క నిమిషం అని వెనక్కి వచ్చి పాల గ్లాస్ తీసుకుని విక్రమ్ కి ఇచ్చి తాగండి అంటుంది.

హలో మేడం నీరసంగా ఉంది నువ్వు..  నేను కాదు..అబ్బా మీరు తాగితే నాకు బలం వచ్చేస్తుంది తాగండి అంటుంది.

నవ్వుకుంటూ పాలు తాగి  ఇప్పుడు హ్యాపీనా..చాలా.. సరే.. రా..   విక్రమ్ గుండెల పైన పడుకోబెట్టుకుని మెల్లిగా జో కొడుతూ ఉంటాడు.

విక్రమ్ నడుం చుట్టూ చేతులు వేసి గుండెల పైన పడుకుని ప్రపంచంలో ఇంతకన్నా సెక్యూర్డ్  ప్లేస్ ఇంకేం ఉంటుంది అని ప్రశాంతంగా నిద్రపోతుంది.

నిద్రపోతున్న అవనినీ చూసి ఎన్ని కష్టాలు అనుభవించావే..  కానీ ఆ కష్టాలు తాలూకు బాధ ఎక్కడా కనపడనివ్వవు.

పెదవుల పైన ఎప్పుడు చెరగని చిరునవ్వే ఉంటుంది.  ఏ జన్మలోనో నేను గట్టిగానే పుణ్యం చేసుకునేఉంటాను..  అందుకే  చెరగని ఈ దరహాసం నా సొంతమైంది. నుదుటిని ముద్దు పెట్టుకుని మెల్లిగా కళ్ళు మూసుకుంటాడు.

వినయ్ పడుకోవడానికి వెళ్లి ఇంతకీ నా రౌడి బేబీ ఏం చేస్తుంది అనుకుంటూ ఫోన్ చేస్తాడు. అటు పక్కనుంచి మత్తుగా హలో అంటే..  ఏంటి రౌడీ బేబీ అప్పుడే పడుకున్నావా..

ఒరేయ్ ఇప్పుడు టైం ఎంత అయింది రా. జస్ట్ 10:30 ఏ కదా.. ఈ టైంకి మనిషి అన్న వాడు ఎవడైనా పడుకుంటాడు.

ఎవరో అన్నట్టున్నారు తొమ్మిది తర్వాత పర్సనల్ కాల్ సే మాట్లాడతాను అని.  అందుకే చేశాను రౌడీ బేబీ అంటాడు.  ఇంకొకసారి నన్ను రౌడీ బేబీ అన్నావ్ అనుకో..

మరి ఏమనాల అమ్మాయ్..   ఇదిగో అబ్బాయ్ ముందు నీ అడ్రస్ చెప్పు. అక్కడ పంచాయతీ పెడతాను. ఏమని పెడతావ్ పంచాయితీ.

మీ అబ్బాయి నాకు రోజు ఫోన్ చేసి విసిగిస్తున్నాడనా.. విసిగించడం గురించి ఎవరైనా పంచాయతీ పెడతారా.. మరి ఇంకేమని చెబుతావు.

మీ అబ్బాయి నాకు కడుపు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు అని చెబుతాను. ఆ మాటకి గట్టిగా పులమారుతుంది. 

ఏయ్.. రౌడీ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. ఇంకొకసారి నన్ను అలా పిలిచేవనుకో నీ అడ్రస్ కనుక్కొని వచ్చి మరి పంచాయతీ పెడతాను.

అప్పుడు మీ వాళ్లకు నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.  ఏమంటావ్. అమ్మ తల్లి నీకు ఒక దండం. నువ్వు ఆ పని మాత్రం చేయకు.

ఎవరి నుంచైనా ఎస్కేప్ అవ్వగలును గాని..  మా గ్రానీ, మా అన్నయ్య ఫుట్బాల్ ఆడేసుకుంటారు. అబ్బో అబ్బాయికి చాలా భయముందే ..

నేను గుడ్ బాయ్ కదా..  పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. మరి నాకు ఇవ్వవే.. నువ్వు నా కన్నా చిన్నదానివి. పైగా నా లవర్ వి కదా..

ఆ మాటకి పూజిత బ్లష్ అవుతూ నీ లవర్నని ఎప్పుడు చెప్పాను. నువ్వు నాకు ఏమి ప్రపోజ్ చేయలేదు. నేను ఒప్పుకోలేదే.. ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు అమ్మాయ్.

ఒక అబ్బాయి ఈ టైంలో ఫోన్ చేసి విసగిస్తున్న.. ఒకపక్క విసుక్కుంటూ   స్మూత్ గా జవాబులు చెబుతున్నారంటే అర్థం ఏమిటి అంటాడు.

ఏమో అబ్బా ఇలాంటి క్యూస్షన్స్ కి నేను ఎప్పుడూ ఆన్సర్స్ రాయలేదు అంటుంది. అందుకే ఇప్పుడు రాయి.. డిస్టెన్స్ లో పాస్ అవుతావు.

ప్రెసెంట్ డేస్ లో డిస్టెన్షన్ ఏ మూలకి రావడం లేదు కదా.. పోనీ 100% తెచ్చుకో. నేను కోపరేట్ చేస్తాను కదా.. చేస్తావు..  చేస్తావు.. ముందు మీ ఇంట్లో చెప్పు.

అప్పుడు వాళ్ళు చేప్తే  మనం తెచ్చుకుందాం. నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని పెట్టేస్తుంది . పూజిత ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నందుకు వినయ్ గదిలోనే డాన్స్ చేస్తూ ఉంటాడు.

వావ్ రౌడీ బేబీ..  నాకు తెలుసు ఎప్పుడో నువ్వు లైన్ లోకి వచ్చేసావు అని.. ఇప్పుడు దాకా బెట్టు చేసావు కదా.. ఎంతైనా మీ ఆడవాళ్లు మహా ముదురులే అని పిల్లోని పట్టుకుని దొర్లుతూ ఉంటాడు.

భరత్ విద్య కి ఫోన్ చేస్తాడు. విద్య కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటుంది.  అబ్బా విద్య ఇది ఆఫీస్ కాదు.

కానీ మీరు నాకు బాస్ కదా. ఉఫ్.. ఈ టైం లో ఎందుకు ఫోన్ చేశానో చెప్పుకో అంటాడు.

ఆలోచించి.. హ సార్ మీరు ప్రాజెక్టు డీటెయిల్స్ గురించి కదా..  ఒక్క నిమిషం సార్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాను. విద్య అంటాడు.  ఏమైంది సార్..

చదువు,జాబ్, శాలరీ ఇది కాకుండా ఒక మనిషికి మాట్లాడుకోవడానికి ఏమీ ఉండవా అంటే ఇంకేముంటాయి సార్.

నీ ఏజ్ ఎంత. 23 అంటే... ఈ వయసులో అమ్మాయిలు ఏం ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు సార్ అంటే. నా పిల్లకి నివితో ట్రైనింగ్ ఇప్పించాలి.  అప్పుడుగాని లైన్లోకి రాదు.

అదే కాకుండా లైఫ్ లో చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, లవర్, లవ్ చేసుకోవడం డేటింగ్.. ఎక్సట్రా.. ఎక్సట్రా.. అయ్యో లవ్వా అంటుంది..

అదేదో భూతమా.. అన్నంత షాకింగ్ అడిగావ్ ఏమిటి. మేము అలా చేయకూడదు కదండీ. ఎందుకని.. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలండి.

అలా లవ్ గివ్వు అని తిరిగితే కెరియర్ తో పాటు జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఇలా అని ఎవరు చెప్పారు. మా అమ్మ అంటుంది.

మా అత్తగారు బానే ట్రైనింగ్ ఇచ్చారు అనుకుని అది ఎవరైనా అబ్బాయిలు చీట్ చేస్తారేమో అని అమ్మ భయంతో చెప్పింది.

అవునా..  లవ్ చేయడం తప్పు కాదా.. తప్పే కాదు అంటాడు.  ఇంతకీ లవ్ చేసి ఏం చేయాలండి.. లవ్ చేసి ఏం చేయాలా...  అదేం ప్రశ్న...

ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాం అనుకోండి.  క్యూస్షన్స్ కి ఆన్సర్స్ రాస్తాము. తెలియకపోతే ఎలా తెలుసుకోవాలి ఆలోచిస్తాం కదా..

అలాగే లవ్ చేశాక ఏం చేయాలి అంటున్నా అంటుంది. అలాంటిదే మాటల్లో చెప్పరు. చేతల్లోనే చూపించాలి. అవునా సరే అయితే నేను ఇది ఎలా చూపిస్తారో మా అమ్మని అడుగుతాను.

అది అమ్మని అడిగేది కాదు. ఎవరిని అడగాలి. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తే వాళ్ళని ఓపిగ్గా చెబుతాడు. అయ్యో సార్ నేను ఎవరిని లవ్ చేయలేదు కదా.

ఇప్పుడు చెయ్యి. ఎవరిని చేయాలి సార్. ఫోన్ ని తలకేసి కొట్టుకుంటూ ఎవరినో అయితే నీకెందుకు చెబుతాను విద్య నన్నే అంటాడు.

అమ్మో మీరు నా బాస్ కదా.. బాస్ ని లవ్ చేయొచ్చా.
నువ్వు ఈ మధ్యన వెబ్ సిరీస్ ఏమి చూడడం లేదు అనుకుంటా..

ఎక్కువ బాస్లు ఎంప్లాయిస్ కే పడుతున్నారు.  సెలబ్రిటీస్ కూడా అంతే అంటాడు. ఏమో సరే అలాంటివి నాకు పెద్ద తెలియదు.

అందుకే చదువుతో పాటు ప్రపంచాన్ని కూడా చూడు.  నీకు కొన్ని లింక్స్ పెడతాను. అది చూడు కొంచెం లోకజ్ఞానం తెలుస్తుంది.  అమ్మో అమ్మ కోప్పడుతుంది నేను చూడను.

ఇది బాసుగా నా ఆర్డర్. చూసి రేపు దాని రివ్యూ చెప్పు.  ఇలాంటివి ఎవరైనా చెబుతారా. నేను చెబుతున్నాను కదా చూడు అని కమాండ్ గా చెబుతాడు.

సరే సార్ అని ఏడుపు వాయిస్ తో చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.  అమ్మ... నీతో ఇలా ఉండకపోతే నువ్వు దారిలోకి వస్తావా.. ఇలా ఏమీ తెలియని దాని పెళ్లి చేసుకుంటే రేపు శోభనం దగ్గర కూడా ఎలిమెంటరీ క్లాస్ నుంచి మొదలు పెట్టాలి.

అమ్మో ఇప్పటికే వయసు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది.

ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అవనికి కడుపులో తిప్పినట్టు అయ్యి స్పీడ్ గా లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి వాంటింగ్ చేసుకుంటుంది.

విక్రమ్ కంగారుగా వచ్చి ఏమైంది అని  చెవులు మూస్తాడు. లలిత మాధవి వచ్చి విక్రమ్ ను పక్కకులాగి... చెరో వైపున పట్టుకుంటారు.

వామిటింగ్ అయ్యిన తర్వాత ముఖం కడిగి ఎలా ఉందిరా అంటే కొంచెం నీరసంగా ఉంది అత్తయ్య. ఇటు రా అని మెల్లిగా తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి వేడిగా పాలు తెమ్మని చెబుతారు.

విక్రమ్ కంగారుగా హాస్పిటల్ కి వెళదామా అమ్మ. ఈ టైం లో ఇలాగే ఉంటుందిరా..  ఏంటి వామిటింగ్స్ చేసుకోవడమా..

కళ్యాణ్ నవ్వుతూ ఒరేయ్ ఇంకా చాలా ఉంటాయి. నువ్వు ఇలా బెంబేలు పడిపోతే చాలా కష్టం. అమ్మ,  అత్తయ్య కూడా ఇలాగే సఫర్ అయ్యారా.. 

ఏ ఆడవాళ్ళైనా ఇలాగే సఫర్ అవుతారు.  ఏరా ఏదైనా స్మెల్ పడలేదా..  అవును మామయ్యగారు..  బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఏదో అర్థం కాలేదు.

సరే అన్ని చెక్ చేద్దాము. టేబుల్ మొత్తం ఒకసారి క్లీన్ చేసేయండి. ఏమి ఉంచకండి. మాధవి...  నేను చెక్ చేసి క్లీన్ చేయిస్తాను అన్నయ్య అని వెళ్లి ఒక్కొక్క ఐటమ్ చెక్ చేస్తూ ఉంటుంది.

పాలు తాగి ఇప్పుడు కొంచెం పర్వాలేదు అత్తయ్య.  గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకోమ్మా అని విక్రమ్ పైకి తీసుకువెళ్ళు అని పంపిస్తుంది.

మెల్లిగా నడుస్తూ ఉంటే ఒక్క నిమిషం అని ఎత్తుకుంటాడు.  అయ్యో అందరూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఏమీ అనుకోరు కానీ నువ్వు మూసుకొ... అని గదిలోకి తీసుకువెళ్తాడు .

నివి పెళ్లి పనులు దగ్గరైతే వచ్చేసాయి. అవని ఇబ్బంది పడకుండా చూసుకోండి అని ఇందిరాగారు గట్టిగా చెప్తారు. మనం ఎంత చెప్పినా అవని పని చేయకుండా ఉండదమ్మా.

నువ్వే గట్టిగా చెప్పు.  నీ దగ్గర కట్టేసుకో అని మాధవి అంటే.. ఆ మాటకి నవ్వుతూ అవని రెస్ట్ తీసుకునేటట్టుగా నేను చూసుకుంటాను కదా..

అయినా విక్రమ్ ఏమీ వదలడు.  అది నిజమేలే భార్యని చంటిబిడ్డలాగా చూస్తున్నాడు.  ఇక రేపు పుట్టబోయే బిడ్డను ఇంకా ఎంత అపురూపంగా పెంచుకుంటాడో..   వాడిది అంతా వాళ్ళ తాతవరస వచ్చిందిలే అని ముసిముసిగా నవ్వుకుంటారు.

మనవళ్ళు ముగ్గురు ఇందిరాగారి చుట్టూ చేరి ఏంటి గ్రాని తాత గుర్తొచ్చారా.. ఆనాటి రొమాన్స్ గుర్తొచ్చిందా అని ఏడిపిస్తూ ఉంటారు.

వాళ్ళ అల్లరికీ  అందరు నవ్వుకుంటారు.   విక్రమ్ కిందకి వచ్చి గుడ్ న్యూస్ అంటాడు.  ఏంట్రా అంటే...  నేహా కన్సీవ్ అయిందంట...  ఇప్పుడే శ్రీ కాల్ చేసి చెప్పాడు.

కుటుంబం రియాక్షన్??
[+] 9 users Like SivaSai's post
Like Reply
Part - 136

నేహా కన్సివ్ అయిందంట..  శ్రీ ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు అని విక్రమ్ చెప్పగానే.. కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకేసారి తండ్రులు అవుతున్నారు. మీలాగానే వాళ్లు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారేమో...
అంతకన్నా కావాల్సింది ఏముంటుంది గ్రానీ..

నివి పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది కదా.. పనులు ఎంతవరకు వచ్చాయి విక్రమ్.. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోతున్నాయి. ఇక వీళ్ళ షాపింగ్ ఒక్కటే మిగిలింది.

జెంట్స్ అందరు ఒక్కసారిగా మాకు ఆఫీసులో వర్క్ ఉంది. డ్రైవర్స్ ని సెక్యూరిటీని ఇస్తాము వెళ్ళండి అని టక్కున చెబుతారు.

ఆ మాటకి లలిత అదేంటి మీరు దగ్గరుండి నాకు సెలెక్ట్ చేయరా.. ఇన్ని సంవత్సరాల నుంచి సెలెక్ట్ చేస్తున్నాను కదా.. ఈ ఒక్కసారి కి మీరు మీరు సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ లల్లి. సరేలే అని మూతి తిప్పుతుంది.

మాధవి చూస్తూ ఉంటే రమేష్ సేమ్ నాది కూడా అదే డైలాగ్ అర్థం చేసుకో.. నివితో మా వల్ల కాదు. మీ వల్ల ఏదీకాదు.

వీళ్ళతో మనకెందుకు వదిన..  మనమే వెళదాము. ఎందుకు అమ్మ మొత్తం డిజైనర్స్ ని అందరినీ ఇంటికి పిలిపిస్తున్నాను.  చూసి సెలెక్ట్ చేసుకోండి.

అప్పటికి నచ్చకపోతే షాపింగ్ కి వెళ్లొచ్చు.  మా మంచి విక్రమ్..  మీరు ఉన్నారు... కొడుకుని చూసి నేర్చుకోండి ఎప్పుడు ఏం చేయాలో వాడికి బాగా తెలుసు.

వాడంతా మా నాన్నగారే.  మరి మీరు..  మా కథలు ఎందుకులే.. సరే బాయ్ అని ఆఫీస్ కి వెళ్ళిపోతారు.
భరత్ ఆఫీస్ కి వెళ్ళగానే విద్యని పిలుస్తాడు.

విద్య భయంగా లోపలికి వచ్చి సార్ అంటే.. సిస్టం లో వర్క్ చేస్తూనే నిన్ను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అంటాడు.

ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే విద్యా అంటాడు. చెప్పండి సార్ అని బిక్కమొహం వేస్తోంది.  నేను ప్రాజెక్టు గురించి అడగడం లేదు.

నిన్న నైట్ నీకు ఇచ్చిన వెబ్ సిరీస్ చూసావా.. లేదు అని తల ఊపుతుంది. ఎందుకు చూడలేదు.. అమ్మ నేను కలిసే పడుకుంటాము.

ఎలా చూస్తాను. ఓ నీకు ఆ ప్రాబ్లం ఉందా సరే అయితే నీ లాప్టాప్ తెచ్చుకుని ఇక్కడ సోఫాలో కూర్చుని చూడు. సార్ అని ఏడుపు గొంతుతో పిలుస్తుంది.

నువ్వు ఎలా పిలిచినా తప్పదు. ఆఫీసులో అందరూ తప్పుగా అనుకుంటారు.. ఓ.. నీకు అలాంటి ప్రాబ్లం ఉందా..

విద్య వర్క్ చేస్తున్న టీం మొత్తానికి స్పెషల్ వర్క్ ఇచ్చి మేనేజర్స్ కి అప్పచెబుతాడు.  ఇప్పుడు నీకు ప్రాబ్లం లేదనుకుంటా..

గో అండ్ టేక్ యువర్ లాప్టాప్. ఏడుపు ముఖంతోనే వెళ్లి లాప్టాప్ తెచ్చుకుని అక్కడ సోఫాలో కూర్చుంటుంది.  ఓపెన్ చెయ్ అది కూడా చెప్పాలా..

అలాంటిది నాకు అలవాటు లేదు.  ఇప్పుడు అలవాటు చేసుకో అని అలాగే సాగదీస్తూ చెబుతాడు.  తప్పదా సార్.. ఇలా చేస్తే ఆఫీస్ టైం ఎంత వేస్ట్ అవుతుంది. కంపెనీకి ఎంత లాస్.

ఆ లాస్ ఏదో నేను భరిస్తాను గాని ముందు నువ్వు చూడు. భరత్ ని తిట్టుకుంటూ వెబ్ సిరీస్ ఓపెన్ చేస్తుంది. ముందు చిరాకుగా చూడడం మొదలుపెట్టి తర్వాత కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చేతులు వేసుకుంటుంది.

ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ మార్చుతూ ఉంటే భరత్ కి క్యూట్ గా కనబడుతుంది.  ఆఫ్ సిరీస్ అయ్యేటప్పటికి ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటుంది.

భరత్ మెల్లిగా వచ్చి విద్య పక్కన కూర్చుంటాడు.  విద్య ఏమి పట్టించుకోకుండా బిజీ బిజీగా చూస్తూ ఉంటుంది.

సీరీస్ అంతా అయిన తర్వాత ఇప్పుడు నీకేం అర్థమైంది. లవ్ చాలా బాగుంటుంది అని పక్కకు తిరిగి మీరు ఎప్పుడు వచ్చారు.

నువ్వు లీనమైపోయినప్పుడే వచ్చి కూర్చున్నాను. విద్య కంగారుగా నుంచబోతుంటే  చెయ్యి పట్టుకుని ఆపి నా దగ్గర నువ్వు ఫార్మాలిటీస్ మైంటైన్ చేయాల్సిన అవసరం లేదు.

భరత్ చేయి పట్టుకున్నప్పుడే బిగుసుకుపోతుంది. ఏమైంది అంటే ఏమి మాట్లాడదు. చెయ్యి వదిలి చిటిక వేస్తాడు.

అప్పుడు ఏదో ఊపిరి తీసుకున్నట్టుగా ఫీల్ అయ్యి వాటర్ అని సైగ చేస్తుంది.  బాటిల్ ఇవ్వగానే గబగబా తాగి కోపంగా భరత్ వైపు చూస్తూ అలా చేయి పట్టుకోవడమేనా అంటుంది.

ఏంటి నేను చెయ్యి పట్టుకున్నందుకు నువ్వు అలాగ అయిపోయావా.. నన్ను ఇప్పుడు దాకా ఏ అబ్బాయి టచ్ చేయలేదు.

ఆ మాటకి ఓ ఫస్ట్ అబ్బాయిని నేనేనా. నేను చాలా లక్కీ అన్నమాట.  ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకుందాం. పెళ్ళా అంటే... మరి లవ్ చేసుకుంది ఎందుకు.. పెళ్లి చేసుకోవడానికే కదా..

మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. మీ మాటలు అర్థం అయ్యి అవ్వకుండా ఉన్నాయి. నాకు చాలా భయంగా ఉంది.

భయం ఎందుకురా నేనున్నాను కదా.. మన లవ్ మేటర్ మన ఇంట్లో చెప్పేస్తాను.  వచ్చి మీ ఇంట్లో మాట్లాడతారు. అసలు నాకైతే లవ్ చేసుకుని హ్యాపీగా బైక్ మీద ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ.  వీకెండ్స్ డేటింగ్ కి వెళుతూ....
సార్ అంటుంది.

ఇవన్నీ నీవల్ల అవ్వదు అని అర్థమైంది.  ఇవన్నీ నీకు ట్రైనింగ్ ఇవ్వాలి అంటే నేను ముసలోడిని అయిపోతాను. అందుకే పెళ్లి చేసుకున్నాక నీకు ఇవన్నీ నేర్పిస్తాను సరేనా అని బుగ్గ పట్టుకోపోతాడు.

వెంటనే వెనక్కి జరుగుతుంది. సరే సరే పెళ్లయ్యాకే టచ్ చేస్తాను. చెప్పు ఎప్పుడు రమ్మంటావు. నాకు తెలియదు అంటుంది. నువ్వు అలాగే ఉండు..

నివి పెళ్లయిన వెంటనే మన పెళ్లి అని చెబుతాడు. ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది. చూడు బంగారం మరి ఎక్కువ సిగ్గుపడకు.

ఇప్పటికే నీ భయం సిగ్గుతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను.  ఇంకా ఎక్కువ సిగ్గు పడ్డావు అనుకో చాలా కష్టం అంటాడు.

పొండి సార్ మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏదోలాగా ఉంది. మాటలకే అలాగుంటే ఇంక చేతలకు ఏమైపోతావో. సరే నెక్స్ట్ సీరీస్ కూడా చూడు.

సార్ రోజుకి ఒకటి చాలు. వర్క్ చూసుకుంటాను.  ఇంత వర్క్ హాలిక్ అయితే ఎలా... టైం పాస్ చేస్తూ జీతం తీసుకోలేను కదా అనగానే...నచ్చావు పిల్ల కంటిన్యూ చేసేయ్.  సంతోషంగా వర్క్ స్టార్ట్ చేస్తుంది.

విక్రమ్ చెప్పిన డిజైనర్లు అందరూ ఇంటికి వస్తారు. ఒక్కొక్క డిజైన్ నివి సెలెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు నోట్ చేసుకుంటారు.

సురభి, కరుణ కూడా వస్తారు. సురభి రాగానే లలిత కంగ్రాట్స్... నానమ్మ అయిపోతున్నావు. చాలా హ్యాపీగా ఉంది.

చాలా రోజుల తర్వాత మా ఇంట్లో చిన్న పిల్లలు సందడి మొదలవుతుంది. నేహా ఎలా ఉంది. బాగుంది. నా దగ్గరే ఉంచేసుకుంటాను అంటే శ్రీ గొడవ చేస్తున్నాడు.

ఒక పని చేద్దాం ఆంటీ.. శ్రీ ని కూడా  ఇక్కడికే షిఫ్ట్ చేద్దాము.  మరి అక్కడ బ్రాంచ్ ఏం చేద్దామని... ఎక్స్ట్రా మేనేజర్స్ ని పెడదాము.

ఫ్యామిలీ కన్నా బిజినెస్ ఎక్కువ కాదు కదా. నువ్వు అన్నది కూడా నిజమే కానీ కంపెనీకి మావల్ల ఇబ్బంది అవ్వకూడదు కదా..

ఆంటీ నేనేమీ ఆలోచించకుండానే ఉంటానా..  శ్రీ ఎప్పుడైతే నాకు విషయం చెప్పాడో..  అప్పుడే నేను అన్ని ప్లాన్ చేసేసాను.

మాధవి.. మా విక్రమ్ ఏదైనా ఫ్యామిలీ విషయంలో చాలా స్పీడ్ గా ఉంటాడు.  సో శ్రీ... షిఫ్ట్ అయిపోవడం కన్ఫామ్. అందరం ఒకే చోటు ఉంటే భలే ఉంటుంది.

మెల్లిగా అవని కిందకి వస్తుంది.  సురభి కరుణని చూసి వెళ్లి పలకరిస్తుంది.  ఎలా ఉన్నావురా.. బాగున్నాను.  మీరు చెప్పినదానికన్నా మావారు ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు.

ఇలాంటి హస్బెండ్ దొరకాలంటే లక్ ఉండాలి రా.. ఆ మాటకి విక్రమ్ వైపు చూస్తూ అవును అంటీ.. చాలా లక్కుంటేనే ఇలాంటి బంగారం లాంటి మొగుడు వస్తాడు.

నివి  కరుణవైపు చూసి ఆంటీ..  రాజ్ రాలేదా..వాళ్లకి వర్క్ ఉందంట.  మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇలాంటి అప్పుడు కూడా వర్క్ అంటే ఎలాగ..

కొన్ని కొన్ని సార్లు వాళ్లు వదిలేయాలి లేకపోతే మనకి మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు దొరకరు. మీరు అన్నది కూడా నిజమేలే అని పెళ్లికి కావలసిన మొత్తం సెలెక్ట్ చేస్తారు.

డిజైనర్స్ కి అలా సెట్ చేయమని చెప్పి పంపిస్తారు.  పెళ్లికి ఏమేం చేయాలో అన్ని అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు.  పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది వరుసగా అన్ని ప్రోగ్రామ్స్ మొదలవుతాయి.

నివి పెళ్ళికి కావాల్సిన డెకరేషన్ మొత్తం పూజిత నే చూస్తూ ఉంటుంది. వినయ్ అక్కడికి వచ్చి అమ్మాయ్ ఏం చేస్తున్నావ్..

కనపడడం లేదా అబ్బాయ్ అంటుంది.  ఎప్పుడు ఆ డెకరేషన్నేనా.. నా వైపు కూడా ఒకసారి చూడొచ్చు కదా అంటూ అక్కడ పువ్వులు సర్దుతూ ఉంటాడు.

చూసి ఏం చేయాలి అబ్బాయ్..  వర్క్ ఉన్నప్పుడు వర్క్ మీదే ఫోకస్ ఉండాలి. నువ్వు ఇలా ఖాళీగా తిరుగుతూ ఉంటే మీ సార్ నిన్ను ఏమీ అనరా..

నేనిక్కడ ఎంత చెబితే అంత అంటాడు.  అబ్బో..  ఏంటి నా మాట మీద నమ్మకం లేదా. నమ్మానులే.. లేకపోతే ఇలా గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే ఏ ఓనర్ అయినా ఊరుకుంటారా.

హలో బేబీ నేను ఏమి గాలి తిరుగుడు తిరగట్లేదు. నేను చాలా సిన్సియర్ వర్కర్ ని.. ఏమో నేను ఎప్పుడు చూసినా సోది వేయడం తప్ప వర్క్ చేస్తున్నట్టే కనపడవు.

మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అమ్మాయ్ అంటాడు. ఏంటి అబ్బాయి గారికి పెళ్లి మీదకి గాలి మళ్ళీనట్టు ఉంది. మరి మళ్లదా.....

వయసు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది. అసలే అబ్బాయిలకి కరెక్ట్ వయసులో పెళ్లిళ్లు అవ్వకపోతే చాలా కష్టం.

ఈరోజుల్లో అమ్మాయే దొరకడం లేదు. ఓహో ఇప్పుడు అమ్మాయి ఎదురుగా ఉందని పెళ్లి కావాలి అంటున్నావా.. అలాగే అనుకో అంటాడు.

చూద్దాంలే.. చూద్దాం కాదు నివి పెళ్లయిన తర్వాత మనం కూడా పెళ్లి చేసేసుకుందాము..  అరే సెటిల్ అవ్వద్దా అంటే..  ఎంత సంపాదించిన సెటిల్ అవలేదు అన్నమాట వస్తుంది.

నివి పెళ్లయిన వెంటనే నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను అంటాడు. ఏమిటది అంటే సర్ప్రైజ్...

సర్ప్రైజ్ ??

కథ కొనసాగుతుంది...
[+] 12 users Like SivaSai's post
Like Reply
Superb update
Like Reply
Excellent update.. all awesome threads going in parallel!!
Like Reply
Part - 137

పూజిత వినయ్ వైపు తిరిగి సర్ప్రైజా ఏమిటి అబ్బాయ్..  సర్ప్రైజ్ అంటేనే ముందు చెప్పరు అమ్మాయ్..  ఎంత పెద్ద దానివైనా ఇంత చిన్న విషయం తెలియదు. మూతి తిప్పుతూ..  అవునవును నీ దగ్గరే ట్రైనింగ్ తీసుకోవాలి మరి.

వెళ్ళు..  వెళ్ళు..  నాకు చాలా పని ఉంది. కళ్యాణ్ రావడం చూసి వినయ్ మెల్లిగా వెళ్ళిపోతాడు. పూజత వర్క్ లో బిజీ అయిపోతుంది.

శ్రీ నేహా హైదరాబాదు వచ్చేస్తారు.  రాగానే ఇద్దరూ విక్రమ్, అవని నీ చూడడానికి వస్తారు.  అవని వెళ్లి నేహాని కౌగిలించుకొని ఎలా ఉన్నావు సీనియర్.

నాకే చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు. బాగున్నాను అంటుంది. పొట్ట మీద చెయ్యి వేసి హెల్త్ అంతా బానే ఉందా. చాలా అని ఫ్రెండ్స్ ఇద్దరు ఒక గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.

చెప్పు అవని ఇంకేంటి సంగతులు. ఏముంటాయి.. ప్రతిరోజు సంతోషమే.  విక్రమ్ గారు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంత అందంగా ఉంటుంది అని తెలిసింది అని సంతోషంగా చెబుతుంది.

అవని మొఖంలో కనబడుతున్న సంతోషాన్ని చూసి నేహా.. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటాను.

ఎందుకో తెలుసా..  బంగారం లాంటి భర్త. అందమైన పొదిరిల్ల లాంటి కుటుంబం ఉంది. చిన్నప్పటినుంచి నేను ఏమైతే మిస్సయ్యానో..  ప్రతిదీ ఇక్కడ దొరికింది.

అమ్మ ప్రేమ,  తండ్రి లాలాన దొరికింది. ఇంతకు మించి ఏమి కావాలి అనిపిస్తుంది. హలో జూనియర్ అలా ఫిక్స్ అవ్వకు.

రేపు మన పిల్లలు పుట్టాలి. వాళ్లు కూడా మన జంటల్లాగానే మంచి ఫ్రెండ్స్ అవ్వాలి.  మళ్లీ వాళ్ళందరికీ పెళ్లిళ్లు చేయాలి. అబ్బో చాలా ఉన్నాయి.

అవన్నీ కావాలా వద్దా అంటే నవ్వుతూ అవన్నీ పర్ఫెక్ట్ గా చూడడానికి విక్రమ్ గారు ఉన్నారు లే అంటుంది. మీవారి మీద చాలా నమ్మకమే.  అందరికన్నా ఎక్కువ.

అందరూ సాయంత్రందాకా సరదాగా గడుపుతారు.  రాజ్ ని మాత్రం అడ్డదిడ్డంగా బుక్ చేస్తూఉంటారు. అవని నేహా విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు.

వాళ్లకి సపరేట్గా ఒక్క కేర్ టేకర్ ని పెట్టి టైం టు టైం ఫుడ్ వెళ్ళేటట్టుగా చూస్తూ ఉంటారు. రాజ్,నివికి ఒకే చోట మంగళ స్నానాలు చేపించి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని చేస్తారు.

భరత్ విద్యకి సంగీత్ కి రమ్మని మరీ మరీ చెబుతాడు. అమ్మో నాకు భయం. ఈసారి భయం అన్నావు అంటే డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తా..  నీ బెడ్ రూమ్ లోకి వస్తా అని చెబుతూ ఉంటే..

ఈ డైలాగులన్నీ ఏదో మూవీలో విన్నాను సార్. మూవీ డైలాగులే అనుకోకు. మన లైఫ్ లో కూడా జరుగుతాయి అర్థమైందా అని కోపంగా అంటాడు.

అర్థమైంది సార్..  ఎందుకు మీరు ప్రతి దానికి కోప్పడతారు అని భయంగా చూస్తూ అంటుంది.  నిన్ను ఇలా భయపెట్టకపోతే పనులు అవడం లేదు. అందుకు..

వచ్చేటప్పుడు ఇలా ఆఫీసుకు వచ్చినట్టుగా డ్రెస్ లో కాకుండా అందంగా లంగా వోణి వేసుకుని రా.. లేదా చీర కట్టుకుని రా అర్థమైందా..  అమ్మని అడుగుతాను.

నువ్వు గనుక డ్రెస్ వేసుకొచ్చావే అనుకో నేను చీర కడతాను.  నాతో కట్టించుకోవాలని ఉంటే నువ్వు ఎలాగైనా రెడీ అవచ్చు ఏంటి అని కన్ను కొడతాడు.

వద్దు సార్ నేను చీర కట్టుకునే వస్తాను. ఇంతకీ మా మేడం దగ్గర చీరలు ఉన్నాయా.. తెలీదు సార్ అమ్మని అడగాలి. ఇప్పటిదాకా కట్టుకోలేదు.

నాకు తెలిసే..  తమరి టాలెంట్ ఏంటో అని కవర్ ఇస్తాడు.  ఏమిటిది అంటే చీర అంటాడు. అమ్మో చాలా కాస్ట్ ఉంటుంది ఏమో.

లేదు జస్ట్ 500.. అవునా అని తీసుకుంటుంది. చాలా బాగుంది సార్ చీర. నా ఫస్ట్ సెలక్షన్ నచ్చిందా.. చాలా అని మెరిసే కళ్ళతో  అంటుంది.

విద్య కళ్ళల్లో కనపడుతున్న మెరుపు చూసి భరత్ కి కూడా హ్యాపీగా అనిపిస్తుంది.

వినయ్ పూజితని వెతుక్కుంటూ వెళతాడు. పూజిత
వర్కర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే.. హలో అమ్మాయ్ అంటాడు. ఏంటి అబ్బాయ్ అని విసుగ్గా అంటుంది.

రేపు సంగీత్.. తెలుసు మేమే కదా అరేంజ్మెంట్స్ చేస్తుంది. సంగీత్ కి చీర కట్టుకుని రా అమ్మాయ్. ఇంకా.. పట్టు టైప్ లో వద్దు సిల్క్ టైపులో కట్టుకో. ఇంకా...

ఇంకా  అని ఆలోచిస్తూ ఆ పువ్వులు కూడా పెట్టుకో. చాలా..  లేకపోతే చేతిలో పాల గ్లాసు,  బొడ్డు కిందకి చీర  అంటే ఇప్పుడు వద్దులేరా బంగారం.

మన ఫస్ట్ నైట్ కి చూసుకుందాంలే.. నిన్ను అని పిడికిలి బుగ్గ వరకు తీసుకువెళ్లి వద్దులే కొట్టేనంటే బుగ్గ వాచిపోతుంది.

అసలే రేపు సంగీత్ లో ఏమైంది ఏమైంది అని అందరూ అడిగితే ఇబ్బంది పడతావు. పరవాలేదు కాబోయే మొగుడు మీద చాలా ప్రేమ ఉంది.

ఇదిగో అబ్బాయ్ ముందు మీ పేరెంట్స్ కి చెప్పు. ఒప్పుకుంటే అప్పుడు నాతో చెప్పు. ఆల్రెడీ నేను చెప్పేసాను.

నివి పెళ్లయిన వెంటనే కలుస్తారు. ఏంటి అని గట్టిగా అరుస్తుంది. ఎందుకమ్మాయ్ అంతలా అరిచావు. నిజంగానే మీ పేరెంట్స్ తో మాట్లాడావా.

ఏ.. అందులో నీకు వచ్చిన అనుమానం ఏమిటి. నువ్వు చెప్పగానే ఎలా ఒప్పుకున్నారు అంటుంది. మనమంటే నమ్మకంలే.

మరి నీకు మీ గ్రానీ,  మీ అన్నయ్య అంటే భయమన్నావు కదా.. మా అన్నయ్య ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వినయ్ అంత కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటే పూజిత ఏమి మాట్లాడలేకపోతుంది.

రేపు చీరలో రావే.. చూసి చాలా రోజులైంది అని గారాలు పోతూఉంటాడు. ఇదిగో నువ్వు గారాలు తగ్గించు. చూడలేకపోతున్నాను.

ఓ నలుగురిలో చూడలేకపోతున్నావా మనిద్దరం పర్సనల్ గా ఉంటే ఓకేనా అని కన్ను కొడతాడు. వినయ్ చేసిన దానికి ఉలిక్కిపడి చుట్టుపక్కల చూస్తుంది.

హమ్మయ్య ఎవరు చూడలేదు అనుకుని వినయ్ వైపు కోపంగా చూశాను అనుకుంటూ ఏంటి నువ్వు చేసింది అని అడుగుతుంది.

కాని..  సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కిపోతాయి. అరే రౌడీ నీకు సిగ్గుపడడం కూడా వచ్చా అంటాడు. అంటే నేను ఆడపిల్లను కాదా...

ఏమో ఇప్పుడు దాకా ఒక రౌడీబేబీ లాగానే తెలుసు కదా...
  సడన్గా ఆడపిల్లలా కనిపించేటప్పటికీ నేను మగాడిని అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది. నిన్ను...  అని ఈసారి ఒకటి పీకుతుంది.

సంగీత్ కి అవనీ విక్రమ్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ వేసుకుంటారు.  శ్రీ, నేహా కూడా మ్యాచింగ్ లో వస్తారు. ప్రతి జంట మ్యాచింగ్ లోనే ఉంటారు.

భరత్ విద్య  కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నా పిల్ల వస్తుందా.. లేదా.. చీర కట్టుకుంటుందా లేదని టెన్షన్ పడుతూ ఉంటే.. వినయ్ వచ్చి ఏమైంది బావ ఇందాకటించి గోళ్ళు తెగ కొరికేస్తున్నావు.

విద్య కోసం వెయిటింగ్ రా అంటాడు.  ఏంటి బావ అప్పుడే.. ఇంటికి తీసుకువచ్చేదాకా వచ్చేసావా.. నువ్వు లవ్ చేయడం..  తను ఒప్పుకోవడం..  మీరు హ్యాపీగా తిరగడం...

ఒరేయ్ నువ్వు మరీ అంత దూరం వెళ్ళకు. నా పిల్లకి అంత సీన్ లేదు. అందుకే పెళ్లి అయ్యాక చేద్దామని ఫిక్స్ అయిపోయాను.

ఇప్పుడు చేయాలి అంటే కచ్చితంగా నేను ముసలోడిని అయిపోతాను లేదా మా అత్తగారు ఇంకో పెళ్లి చేసి పంపించేస్తారు అంటాడు.  

రెండు ఆటోలు ఒకేసారి ఆగుతాయి.  మొదటి ఆటోలో నుంచి విద్య.  రెండో ఆటోలో నుంచి పూజిత దిగుతారు.  ఇద్దరినీ అలా చూడగానే బాబులిద్దరికీ గుండె స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంటుంది.

అరెరే గుండెజారి గల్లంతయ్యిందే ❤️❤️
[+] 11 users Like SivaSai's post
Like Reply
Part - 138

విద్య భయంగా భరత్ దగ్గరకు వచ్చే సార్ అంటుంది. హ అని ట్రాన్సలోనే విద్యకి సమాధానం చెబుతాడు.  ఎలా ఉన్నారు సార్. బాబు బొమ్మ స్వర్గం నుంచి నాకోసం నడిచినట్టుగా ఉంది అంత అద్భుతంగా ఉన్నావు.

భరత్ ఇచ్చిన కాంప్లిమెంట్ కి సిగ్గుపడుతూ థాంక్యూ సార్ అంటుంది.  ఏంటి నీకు సిగ్గుపడడం అనే  ఎమోషన్ కూడా ఉందా.. సార్ అంటుంది.

సరే సరే అని లోపలకి తీసుకువెళుతూ వెయిట్ అని వినయ్ వైపుచూస్తాడు. వినయ్ సొల్లు కార్చుతూ ఉంటాడు.

ఇదేంటి మరి ఇంత దారుణంగా ఉన్నాడు అని చూస్తూ ఉంటే.. పూజిత తిప్పుకుంటూ వచ్చి ఎలా ఉన్నాను అబ్బాయ్.

ఎలా ఉన్నావంటే ఏం చెప్పాలి అమ్మాయ్..  ఇప్పుడే ఇక్కడే తాళి కట్టి ఇలాగే ఫస్ట్ నైట్ చేసేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది.

అనిపిస్తుంది అనిపిస్తుంది ముందు ఆ నోరుముయ్యి. ఈగలు దూరాయి అనుకో చికెన్ అనుకుని తినేస్తావు. నిన్ను తింటున్నాను కదా ఇంక ఏది తినబుద్ది అవ్వద్దు అమ్మాయ్..

దగ్గరగా జరిగే అంత తినేసేటట్టుగా ఉన్నానా అబ్బాయ్.. చేతల్లో చూపించమంటావా.. వద్దులే చీర నలిగిపోతుంది. నలగకుండా చూపిస్తాను.  కొంచెం కోపరేట్ చేయవే.. పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను.

భరత్.. వినయ్ కి వినబడేటట్టుగా దగ్గుతాడు. వినయ్ తేరుకని ఏమిటిక్కడే నిలబడ్డావు. లోపలికి పదా.. ఒరేయ్ నీ ఓవరాక్షన్ ఆపు.

హాయ్ పూజిత అంటే హాయ్ సార్ అంటుంది.  చిన్నగా నవ్వుతు.. మీరందరూ వినయ్ కి చాలా ఫ్రీడం ఇచ్చేశారు.

ఎందుకనిపించింది... లేకపోతే మీ దగ్గర వర్క్ చేసేవాడు మిమ్మల్ని అందరిని రిలేషన్స్ తో పిలుస్తున్నాడు అంటే మీరు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిండాలి.

ఆ మాటకి భరత్ వినయ్ వైపు చూస్తే వినయ్ కన్ను కొడతాడు. అవునవునమ్మా చాలా ఫ్రీడమ్ ఇచ్చేసాము.  అందుకే నిన్ను ఇచ్చి పెళ్లి చేసి ఆ ఫ్రీడమ్ నీ చేతిలో  పెడదాం అనుకుంటున్నాము.  తప్పకుండా సార్.

సార్ వద్దమ్మా.. అన్నయ్య అని పిలువు. నేనా అంటే... పర్వాలేదు.  వీడు బావ అని పిలిచినప్పుడు నీకు నేను అన్నయ్యనే అవుతాను కదా.

విద్య,  పూజిత కి ఒకరిని ఒకరు పరిచయం చేసి మీరిద్దరూ కలిసి లోపలికి వెళ్ళండి. వెనకాలే వస్తాము అని పంపిస్తారు.

వాళ్ళిద్దరూ వెళ్లిన తరువాత భరత్, వినయ్ ని వెనక్కి లాగి ఒరేయ్ ఏం చెప్పావురా.. నా రౌడీ బేబీకి నేను ఇక్కడ ఎంప్లాయ్ అని చెప్పాను. అందుకే అది ఇలా ఫిక్స్ అయిపోయింది.

మరి నిజం తెలిస్తే నిన్ను కుమ్మేస్తదేమో.. అంత సీన్ లేదులే గాని పద బావ. మళ్ళీ అన్నయ్య చూసాడు అంటే మనిద్దరిని కలిపి కుమ్ముతాడు.

సంగీత్ మొదలవుతుంది.  జంటలు అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. అవని ఇబ్బంది  పడకుండా ఎంజాయ్ చేసేటట్టుగా విక్రమ్ చిన్న చిన్న స్టెప్స్ వేపిస్తూ ఉంటాడు.

అవని డాన్స్ చేస్తూ నా వల్ల మీరు స్లో అయిపోయారు కదా.. ఎందుకు అనిపిస్తుంది అని ముంగురులు సవరిస్తూ అడుగుతాడు.

మెల్లిగా కాళ్లు కదుపుతూనే నేను ప్రెగ్నెంట్ అవ్వడం వల్లే కదా మీరు స్లోగా డాన్స్ చేస్తున్నారు.  లేదు అంటే అందరికీ మంచి పోటీ ఇచ్చేవారు.

ఆ మాటకి నవ్వుతూ స్పీడ్ గా డాన్స్ చేయడం చెయ్యకపోవడం ఇంపార్టెంట్ కాదు బంగారం. మన లైఫ్ పార్ట్నర్ తో కలిసి ఎంత ఎంజాయ్ చేస్తున్నామన్నదే ఇంపార్టెంట్.

నేనయితే నా భార్య నా బేబీ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కాబట్టి నువ్వు ఫీల్ అవ్వకు..ఎంజాయ్ దిస్ మూమెంట్ అంటాడు.

ఆ మాటకి నవ్వుతూ మీరు బంగారం అండి . అందుకే కదా ఎప్పుడూ నీ ఒంటి మీద ఉంటాను అంటున్న.  బట్ నువ్వే వినిపించుకోవడం లేదు.

అబ్బో చాలా కోరిక ఉంది అయ్యగారికి.  చాలా చాలా ఉన్నాయి కానీ మా మేడం కానికరించడం లేదు.  కనికరిస్తే ఏం చేస్తారు ఏమిటి.

ఇంకా దగ్గరికి లాక్కుని మళ్ళీ ఫస్ట్ నైట్ చేసుకుందామాని..  అవ్వ సిగ్గు లేకపోతే సరి.. ఇందులో సిగ్గు ఏముంది. మనకు పెళ్లయి ఏమన్నా సంవత్సరాలు అయ్యిందా ఏమిటి? ఇంకా ఫస్ట్ యానివర్సరీనే రాలేదు.

ఇంకెంత రెండు నెలల్లో వచ్చేస్తుంది కదా..  మన యానివర్సరీ కి నీకు సర్ప్రైజ్. ఏమిటో చెప్పొచ్చు కదా.. చెప్పను. చూపిస్తా..

సరే మీ ఇష్టం. నవ్వుతూ డాన్స్ చేస్తున్న ఇద్దరినీ దూరం నుంచి చూస్తున్న ధనుంజయ్ కళ్ళు ఆనందంతో మెరిసిపోతూ ఉంటాయి.

కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఏమిటి ధనుంజయ్ గారు మంచి ఆనందంగా ఉన్నట్టున్నారు.  నా కూతురు సంతోషం చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది.

ఇదంతా మీ వల్లే అని నమస్కారం చేస్తాడు.  ఆ చేతుల మీద కళ్యాణ్ చేతులు వేసి ఏమిటి మీరు చేస్తుంది.  అవని నా కూతురే.

అవును మీ కూతురులాగానే చూసుకుంటున్నారు. నేనే అని బాధపడతాడు.  జరిగిపోయిన వాటి గురించి ఎందుకండీ..

జరగాల్సింది ఆలోచించండి.  ఏం చేయాలో కూడా అర్థం కావడం  లేదు. ఆస్తులు పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించవచ్చు కానీ నమ్మకం పోతే సంపాదించడం చాలా కష్టం కదా..

నా కూతురు పైన నాకు కొండంత ప్రేమ ఉంది కాని చూపించలేకపోతున్నాను.  చూపించిన అదంతా నటనే అని నా కూతురు అనుకుంటుంది.

ఇలాంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదు కదా.  బాధపడకండి. పశ్చాతాపనికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. తప్పకుండా అవని అర్థం చేసుకుంటుంది.

ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను.  భగవంతుడు నన్ను తీసుకు వెళ్లే ఒక్క నిమిషం ముందు అయినా సరే అవని నన్ను తండ్రిగా ఒప్పుకుని..  నాన్న అని పిలిస్తే చాలు.

తప్పకుండా జరుగుతుంది.  వచ్చే మన వారసులే అది నిలబెడతారు. మీ నోటివాక్కు అలాగే జరగాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

భరత్ విద్యని మాధవికి, లలితకి పరిచయం చేస్తాడు.  మాధవి ఏంట్రా అన్నట్టు చుస్తే.. రిక్వెస్టింగ్ గా చూస్తాడు. పోరా అంటే.. ప్లీజ్ అని బ్రతిమాలుతూ ఉంటాడు.

విద్యకి ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటే లలిత చిన్నగా నవ్వుకుంటూ రామ్మా అని పక్కన కూర్చోబెట్టుకుంటుంది.  మేడం నేను మీ పక్కన...

ఇదేమన్నా ఆఫీసా..  నువ్వు ఎంప్లాయి.. నేను మేడం అనుకోవడానికి.  ఇది మన ఫ్యామిలీ ఫంక్షన్. ఎంజాయ్ చెయ్యి.

ఆ మాటకి నవ్వుతూ మీరు చాలా మంచివాళ్ళు మేడం. అందరూ మంచివాళ్లే. పరిస్థితులను బట్టి మనుషులు మారుతూఉంటారు.

భరత్ అమ్మ ఇంకా నువ్వు ఒప్పుకోకపోతే అని గట్టిగా అంటే..  ఆ ఒప్పుకోకపోతే... నీ కాళ్లు పట్టుకుంటానమ్మ. ప్లీజ్ ఒప్పుకోవే.

రమేష్ అది చూసి ఏంట్రా మీ అమ్మని తెగ కాక పడుతున్నావు. మీకు నేను పెద్ద శ్రమ తగ్గిస్తే అమ్మ అర్థం చేసుకోకుండా నామీద అలుగుతుంది.

ఎంతవరకు న్యాయం నాన్న. మాకు శ్రమ తగ్గించావా... ఏ విషయంలో రా.. చాలా పెద్ద విషయంలో నాన్న లేకపోతే మీరు ఎంత కష్టపడేవారో..

అవునా అంతా పెద్ద కష్టం ఏం తప్పించావు రా... మీకు కోడలు వెతికే పని మీ సుపుత్రుడు తగ్గించాడు అంటుంది
అవునా ఎక్కడ రా నా కోడలు పిల్ల..

అదిగో అక్కడ అత్తయ్య పక్కన కూర్చుందే ఆ అమ్మాయి. లక్షణంగా ఉందిరా.. అచ్చు మీ అమ్మలాగానే కుదురు అయినది అంటాడు.

ఆ మాటకి మాధవి ముఖం వెలిగిపోతుంది.  రమేష్ కొడుకు భుజాన్ని మెల్లిగా తడుతూ క్యారీ ఆన్ అంటాడు. అవును నాన్న...

అందుకే అమ్మాయి నచ్చింది. అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు అమ్మే గుర్తుకు వస్తుంది. అందుకనే మీకు అందరికీ పరిచయం చేసి మీ ఆశీర్వాదం తీసుకుందామని నా తాపత్రయం అంతా.. అమ్మేమో అర్థం చేసుకోవడం లేదు. 

మాధవి పైట సరి చేసుకుంటు సర్లే ఇంక నువ్వు ప్రేమించాను అన్నాక మేమేం మాత్రం  కాదంటామా.. వెళ్లి అమ్మ ఆశీర్వాదం తీసుకోండి.

నువ్వు ఒప్పుకున్నట్టే కదా..  నీకోసం ఒప్పుకోక ఏం చేస్తానులే అని విద్య దగ్గరికి వెళుతుంది.  థాంక్స్ నాన్న..  లేడీస్ ని హ్యాండిల్ చేయడం కూడా రావాలి రా ప్రేమించాను అంటే సరిపోదు.

ఇప్పటినుంచి మిమ్మల్ని ఫాలో అవుతాను.  తధాస్తు  బ్లెస్ చేస్తున్న ఫోజ్ పెడతారు.  ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు మంచి హుషారు మీద ఉన్నారు అని కళ్యాణ్ అడిగితే...

నా కొడుకు నన్ను ఒక పెద్ద గండం నుంచి తప్పించాడు బావ. ఏమిటో ఆ గండం..  కోడలు పిల్లని వెతికే పని.. అవునా నా కూతుర్ని చూసేసావా ఎక్కడరా..

మావయ్య చూడకుండానే అలా ఎలా ఫిక్స్ అయిపోతున్నారు. అమ్మాయి నీకు నచ్చాలి కదా... నీకు నచ్చింది కదరా...

పెళ్లి చేసుకునేది మీరు..  కలిసి జీవితాంతం ఉండాల్సింది మీరు. కానీ మన కుటుంబంలోకి వచ్చే అమ్మాయి అందరికీ నచ్చాలి కదా.

తప్పకుండా నచ్చుతుంది ఇంతకీ ఎక్కడ.  అదుగో అమ్మ అత్తయ్య మధ్యన కూర్చుంది. ఆల్రెడీ వాళ్ళిద్దరూ మీటింగ్ వేసేసారా అయితే నీ పెళ్లి ఖాయం అయిపోయినట్టే.

వినయ్ కి, నీకు ఒకేసారి చేసేద్దాం ఏమంటావు బావ.  తప్పకుండా వాడు కూడా సెట్ చేసుకున్నాడు కదా...

ఏదైనా అవని వచ్చిన వేళ్ళ విశేషం.. మన ఇంట్లో ఒక సంతోషం వెనకాల మరొక సంతోషం వస్తుంది.  అందరి గురించే బానేఉంది కానీ పాపం రాజ్ ని తలుచుకుంటేనే జాలేస్తుంది బావ.

  నా ఫీలింగ్ కూడా అదే.  మరీ కూతురు గురించే చెప్పలేను కదా.  అది నిజమే.. 

పెళ్లి జంట ఏం చేస్తున్నారో.. పదండి వెళదామని భార్యల దగ్గరికి వెళ్లి.. జంట ఏరి అంటే... అక్కడ అని చూపిస్తారు.  అక్కడ నివి అలిగి ఉంటే రాజ్ బ్రతిమాలతూఉంటాడు.

ఏమైంది వీళ్లిద్దరికి.. దగ్గరికి వెళ్లి ఏమైందిరా.. చూడండి మావయ్య.  ఇందాక నుంచి బ్రతిమాలుతున్నాను. అయినా అలాగే కూర్చుంది .

ఏమైంది నీకు  అంటే చూడండి నాన్న.  డాన్స్ వేయమంటే ఇక నావల్ల కాదు అంటున్నారు.  ఇది ఎవరి సంగీత్..  మాదే కదా..

మేము ఎంజాయ్ చేయకపోతే ఎలా. డాన్స్ చాలా వరకు చేశాను. నావల్ల అవ్వదు అంటే వినాలి కదా.. కళ్యాణ్ నవ్వుతూ నివి  పక్కన కూర్చుని..

ప్రతిసారి మనదే నెగ్గాలి అని ఉండకూడదు.  నీకోసం రాజ్ తనకి కుదిరినంత వరకు ట్రై చేశాడు. అది అప్రిషియేట్ చెయ్.

అంతేగాని ఇంకా కావాలి ఇంకా కావాలి అని అలిగావు అనుకో...  విసుగువచ్చి మొదటికే మోసం వస్తుంది.  ఇది మీ పెళ్లి. మీ సంగీత్.

ఇద్దరు నవ్వుతూ ఉంటే మా అందరికీ బాగుంటుంది.  చూసేవాళ్ళు ముందు నువ్వు ఇలా అలిగి.. రాజ్ బ్రతిమాలుతూ ఉంటే అసలు బాగోదు.

రాజ్ పేరెంట్స్ కి కూడా కష్టంగానే ఉంటుంది. గదిలో మీరిద్దరూ ఎలా ఉన్నా పరవాలేదు కానీ బయటకి వచ్చేటప్పుడు భర్త మాట పైన ఉంటే చూడడానికి అందంగా ఉంటుంది.

అర్థమైంది అనుకుంటా.. హా అన్న అని సారీ రాజ్ అంటుంది. ఆ మాటకి రాజు కళ్ళు మెరుస్తూ థాంక్స్ మామయ్య..  నేను వినలేను అనుకున్నా మాట మీ వల్ల విన్నాను.

రాజు ఎందుకు నీకు అంత నోటి దురద ?‍♀️?‍♀️

కథ కొనసాగుతుంది...
[+] 13 users Like SivaSai's post
Like Reply
Super update
Like Reply
Raj Nivi story kooda resolve cheyandi.. chakkaga intundi!!
Nice ipdate
Like Reply
Part - 139

ఎప్పటికీ వినలేను అనుకున్నా మాట మీ వల్ల విన్నాను మావయ్య. నాకు చాలా సంతోషంగా ఉంది. కళ్యాణ్, రమేష్ తల పట్టుకుంటారు.

నివి కోపంగా ఏమిటి నీ ఉద్దేశం.. నేను గయ్యాళిని. తప్పు చేసిన నాదే పైన ఉండాలి అనే మెంటాలిటీ నా..అలా నేను ఎప్పుడు అన్నాను తల గోక్కుంటాడు.

ఇప్పుడు నువ్వు అన్న మాటకు అర్థం అదే.. చూసారా నాన్న నేను రియలైజ్ అయ్యి  సోరి చెప్తే రాజ్ ఎలా ఫీలవుతున్నాడో.

అందుకే సోరి చెప్పను.  ఇప్పుడిప్పుడే కదమ్మా అనుభవం లోకి వస్తున్నాడు. మెల్లిగా అర్థం చేసుకుంటాడులే...
అందరి సరదాలు నవ్వుల మధ్యన కళ్యాణ ఘడియలు దగ్గరకి వస్తాయి. నివి అంగీకారంతో  రాజ్ పాణిగ్రహణం చేసి మెడలో తాళి కడతాడు.

పెళ్లి సందడి ముగిసి అప్పగింతలప్పుడు కళ్యాణ్ రాజ్ చేతులు పట్టుకుని అల్లుడు జాగ్రత్త.  మీరు టెన్షన్ పడకండి మావయ్య.  నివిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.

  వినయ్ వెంటనే నాన్న చెప్పింది నివి గురించి కాదు బావ.  నీ గురించి. పార్ధు నివి పక్కన నిలబడి నా కోడలు అమాయకరాలు. నోట్లో నాలుక లేదు.

వేలు పెట్టిన కొరకలేదని చెప్పండి మీ కోడలు అని రాజ్ పళ్ళు నూరుతాడు. ఒరేయ్ ఎక్కువగా నూరకరా... పళ్ళు పౌడర్ అయిపోయినాయి అనుకో రేపటి నుంచి ఏ అరటిపండో తినిపించాల్సి వస్తుంది.

ఎందుకు చెప్పు నీకు.  మీరు నాకు తండ్రా లేకపోతే ఎనిమి నా అంటే నీకు బెస్ట్ ఫ్రెండ్ అని రా. ఫ్రెండ్ లాగా లేరు శాడిస్ట్ లాగా ఉన్నారు.

నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి అని ప్రతిసారి నిన్ను మోటివేట్ చేస్తున్నాను.  అది నీకు అర్థం కావడం లేదు. చూడమ్మా నీవల్ల నాన్న ఇబ్బంది పడుతున్నారంట.

వింటున్నా వింటున్న ఇంటికి వెళ్ళాక చెబుతాను. జస్ట్ జోక్ చేశాను కరుణ. నీ పేరులో ఉన్న కరుణ రసం అంత నీలోనే ఉంటుంది కదా...

అది వాడికి అర్థం కాక ఏదో మాట్లాడుతున్నాడు. సరే రా అందరూ పొద్దున్నే తొందరగా వచ్చేయండి.  నోములు ఉన్నాయి కదా అని చెప్పి కొత్తజంటని తీసుకుని పార్ధు జంట బయలుదేరుతారు.

మెల్లిగా నెలలు ముందుకి జరుగుతూ ఉంటాయి. విద్యలో భయం తగ్గి భరత్ కి  కొద్దిగా దగ్గరవుతూ ఉంటుంది. అల్లరి జంట ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకుంటూ  ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు.

  ఆదివారం ఉదయం పూజిత బద్ధకంగా లేచి హాల్లో కూర్చుని అమ్మా.. ఈ రోజు చికెన్ బిర్యాని చేసి మటన్ కర్రీ చేయమ్మా.. తిని చాలా రోజులైంది.

పూజిత మదర్ కోపంగా ఆడపిల్లలాగా ఉంటున్నావా రౌడీ లాగా తిరుగుతున్నావు.  అమ్మ ఏదైనా అను..  ఆ రౌడీ అన్నమాట అంటే ఊరుకోను.

అట్లకాడ తీసుకుని వచ్చి రౌడీ కాక ఇంకా ఏమిటి.. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి... అమ్మ అని గారాలు పోతూ ఉంటే కాలింగ్ బెల్ సౌండ్ వినపడుతుంది.

ఇంత పొద్దుట ఎవరు అని వెళ్లి తలుపు తీయగానే గుమ్మం ముందు కళ్యాణ్ రమేష్ జంటలు  ఉంటారు.  మీరు...

నా పేరు కళ్యాణ్ అండి.   నా భార్య లలిత.  మా బావ రమేష్ చెల్లెలు మాధవి అని పరిచయం చేస్తే నమస్తే రండి అని లోపలకి తీసుకువెళ్తారు.

పూజిత గబగబా లేచి సార్ మీరు ఇక్కడ..  మీ నాన్నగారు లేరమ్మా... ఒక్క నిమిషం అని వెళ్లి పూజిత వాళ్ళ నాన్నగారిని తీసుకుని వస్తుంది.

పూజిత ఫాదర్ కంగారుపడుతూ మీలాంటి పెద్ద వాళ్ళు మా ఇంటికి వచ్చారు అంటే కంగారుగా ఉంది.  ఏదైనా విషయం ఉంటే కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా..

మీరంతా కంగారు పడవలసినది ఏమీ లేదు. పెళ్లి మాటలు మాట్లాడదామని వచ్చాము. పెళ్లి అని అయోమయంగా చూస్తూ ఉంటారు.

అవునండి మీ అమ్మాయిని మా అబ్బాయికి అడుగుదామని వచ్చాము.  అంత పెద్ద వాళ్ళు తన కూతురు కోసం వచ్చారు అనేటప్పటికీ  నోటిమాట రాకుండా టెన్షన్ గా చూస్తూ ఉంటారు.

పూజిత మదర్ తెరుకొని ఒక్క నిమిషం అండి అని పూజితని లోపలికి తీసుకువెళ్ళి తొందరగా స్నానం చేశారా..

అమ్మ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం.  అంతటి పెద్దవాళ్లు మన ఇంటికి వచ్చినప్పుడు మనం కొంచెం పద్ధతిగా ఉండాలి.

కంగారు పెట్టి స్నానం చేపించి చీర కట్టి బయటికి తీసుకు వస్తారు. అయ్యో అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టారు ఎలా ఉన్నా మహాలక్ష్మి లాగానే ఉంటుంది రామ్మా అని లలిత గారు అంటారు.

మౌనంగా వెళ్లి లలిత మాధవి దగ్గర కూర్చుంటుంది.  నువ్వు ఇలా సైలెంట్ గా ఉండే దానికన్నా అల్లరి పిల్లలాగా ఉంటేనే బాగుంటావు.

మా అబ్బాయికి కూడా నీలో నచ్చింది ఆ అల్లరే.  ఏం మాట్లాడాలేక కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది .
మీరు మా అబ్బాయిని చూశారు అనుకుంటా కదా..

మీ అందరికీ అంగీకారం అయితే ముహూర్తాలు పెట్టేసుకుందామని లలిత చెబుతూ ఉంటే క్షమించండి మేడం  అంటుంది.

దేనికమ్మ..  నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.  ఆ మాటకి పూజిత పేరెంట్స్ భయంగా చూస్తే..  ఈ రెండు జంటలు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఎందుకు ఇష్టం లేదు.

మా అబ్బాయి లో ఏమైనా లోపమా. క్షమించండి. మీ అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటి అన్నది నాకు అనవసరం. నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని ప్రేమించాను.

పూజిత మదర్ కంగారుగా  ఏమిటే నువ్వు అనేది. అవును అమ్మ. సమయం చూసి చెబుదామనుకున్నాను కానీ ఇంతలోనే...

సరేలే అమ్మ. నువ్వు ఎవరిని ప్రేమిస్తే ఏమయింది. ఆ అబ్బాయిని ప్రేమించు. మా అబ్బాయిని పెళ్లి చేసుకో  మేడం మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా..

ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడమేమిటి. ఎవరిని ప్రేమించావు. మా అబ్బాయి కన్నా అన్ని విధాల గొప్పవాడా అని కొంచెం కోపంగా నటిస్తూ అడుగుతారు.

అవన్నీ నాకు తెలియదు.  నాకు అతను నచ్చాడు. ఇద్దరం ప్రేమించుకున్నాము. ఇంతకీ ఎవరో తెలుసుకోవచ్చా.. మీ దగ్గరే జాబ్ చేస్తున్నాడు.

వాట్ మా దగ్గర వర్క్ చేసే వాడి కోసం మా ఇంటికోడలు అవ్వడాన్ని వదిలేసుకుంటున్నావా...

హోదా కన్నా మనసు ముఖ్యం. మనసు లేని మనువు నరకంతో సమానం మేడం.  వినయ్ లోపలికి వచ్చి మా అన్ని అయిపోయినాయా  అంటూ ఉండగానే..

గబగబా పూజిత దగ్గరికి వెళ్లి నేను ప్రేమిస్తుంది ఈ అబ్బాయినే అంటుంది. పూజిత ఫాదర్ కి అర్థం కాకుండా ఉంటుంది.

ఈ అబ్బాయి నా అని మాధవి లలిత ఒకేసారి అంటారు. అవును మేడం.. ఏరా నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావా..

అది అమ్మ అంటుంటే.. ఎందుకు వినయ్ అంత భయపడుతున్నావు. నిజం చెప్పు. అవును మా అంటాడు.
మేము వద్దంటే అనే కోపంగా అడుగుతారు.

మీరు అవునన్నా కాదన్నా నా రౌడీ బేబీ చెయ్యి వదలను. అందరూ నవ్వుతారు. ఎందుకు మీరు నవ్వుతున్నారు అని పూజిత అడిగితే...

వినయ్ భయంగా పూజిత వైపు చూస్తాడు.  నువ్వు ప్రేమలో నెగ్గవు.  అలాగే మా టెస్టులో కూడా..

టెస్ట్ ఏంటి మేడం.. మేడం కాదు అత్తయ్య.. వీడెవడో కాదు. మా అబ్బాయి. అది మీరిస్తున్న ఫ్రీడమ్ మేడం. ఫ్రీడమా.. ఇంకేమన్నానా...

వాడు మా చిన్నోడు. విక్రమ్ తర్వాత వీడు.  నిన్ను ఏదో సరదాగా ఏడిపించినట్టు ఉన్నాడు.  కోపంగా చూస్తుంది.  ప్లీజ్ ఎక్స్క్యూజ్ అన్నట్టుగా చూస్తే...

పూజిత గదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మ మీరు పెళ్లి మాటలు మాట్లాడుకోండి.  నా రౌడీ బేబీ ని కూల్ చేసి వస్తాను అని పూజిత వెనకాల లోపలకి వెళతాడు.

గదిలోకి వెళ్లి బేబీ రౌడీ అని పిలుస్తూ ఉంటే ఎక్కడా కనిపించదు. అమ్మాయ్ అనుకుంటు ఇంకా ముందుకు వెళతాడు.

వెనక గాజుల శబ్దం వినపడి నా రౌడీ బేబీ వెనకాల నిలబడిందా అని వెనక్కి తిరుగుతాడు.  అక్కడ కర్ర పట్టుకుని నిలబడి ఉన్నా పూజితను చూసి చూడు బేబీ ఏదైనా మాటలతో ఉండాలి గాని చేతల్లోకి వెళ్ళకూడదు.


వెళితే వేరేలాగా వెళ్లాలి.  ఏంట్రా వెళ్ళేది. నేను వాళ్ళ అబ్బాయిని చేసుకుంటాను లేదా అని టెస్ట్ చేశారా..  నా క్యారెక్టర్ ని డిసైడ్ చేయడానికి వచ్చారా మీరు.

  ఛి ఛి బంగారం అలాంటిదేమీ లేదు రా..  మరి ఏమనుకోవాలి.. వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ పక్కకి తిరుగుతుంది.

వినయ్ కి కూడా కొంచెం గిల్టీ గా అనిపించి పూజితన్ని కూర్చోబెట్టి కింద కూర్చుంటాడు.  పూజిత మోకాళ్ళ మీద చేతులు పెట్టి ఏదో సరదాగా ఏడిపిద్దాం అనుకున్నాను కానీ నువ్వు ఇంత ఫీల్ అవుతావని అనుకోలేదు.

ప్రామిస్ ఇప్పుడు నుంచి ఎప్పుడు ఇలాంటి ఫ్రాంక్స్ చేయను.  నన్ను నమ్ము.  ప్లీజ్ బంగారం. నీ అలక పోవాలంటే ఏం చేయాలో చెప్పు.

పెళ్లి అయ్యాక ఆరు నెలలు నీకు అన్నీ కట్ చేస్తాను. బేబీ ఆ పని మాత్రం చేయకే...  ఇప్పటికే వయసు వచ్చి అల్లాడిపోతున్నాను.

అల్లాడిపో నాకేంటి నువ్వు చేసిన దానికి ఇంతకి ఇంత పనిష్మెంట్ ఇవ్వకపోతే...  నా రౌడీ బేబీ కాదు అంతే కదా అని నీరసంగా అంటాడు. అంతే కదా అని బయటికి నడుస్తుంది.

వినయ్ జంటకి,  భరత్ జంటకి ఒకే మండపంలో పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయిపోతారు.  మాధవి వెళుతూ పూజిత దగ్గరికి వచ్చి నా కొడుకుకి నువ్వంటే చాలా ఇష్టం.

అల్లరి చేస్తాడు కానీ బాధ్యత కూడా ఉంది.  అర్థం చేసుకో అమ్మ.  ఒక చిన్న నవ్వు నవ్వుతుంది.  ఈ నవ్వు చాలు వెన్నెల కురిసినట్టుగాఉంది.

నా కోడళ్లు ఇద్దరు బంగారాలు.

ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి విషయాలు అన్నీ చెబుతారు. వినయ్,  భరత్ మొఖాలు వెలుగిపోతూ ఉంటే...  రాజ్.. ఎందుకురా నన్ను చూసి కూడా మీరు పెళ్లి చేసుకుంటున్నారు.. సుఖపడాలని లేదా..

మేము నీలాగా కాదు పెళ్ళాల్ని మస్తు కంట్రోల్ లో పెడతాం అని సినిమా డైలాగ్ రేంజ్ లో చెబితే రాజ్ వెంటనే నవ్వుతాడు.

ఎందుకు బావ నవ్వుతున్నావ్ అని వినయ్ అడిగితే... సేమ్ ఇలాంటి డైలాగే శ్రీ ఎంగేజ్మెంట్ అప్పుడు నేను చెప్పాను అది గుర్తొచ్చిందిలే...

వినయ్, భరత్ ??
[+] 12 users Like SivaSai's post
Like Reply
Part - 140

రాజ్ చెప్పిన దానికి భరత్ నవ్వుతూ నా పిల్లతో నాకు ఎటువంటి భయం లేదు. నేను గట్టిగా మాట్లాడితేనే భయపడిపోతుంది.

అవనియే చాలా బెటర్. కాబట్టి నేను టెన్షన్ ఫ్రీ అంటాడు. వినయ్ మాత్రం ఆలోచిస్తూ బావ అని రాగం అందుకుంటాడు.  ఏంట్రా బామ్మర్ది ఫ్యూచర్ కనపడిందా..

బాగా... నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావు కదా..  టిప్స్ చెప్పవా.. ఇందులో టిప్స్ చెప్పడం ఏమి ఉండదు రా అలా వెళ్ళిపోవడం అంతే.

వీళ్ళ ముగ్గురు సంభాషణకి అందరూ నవ్వుతూ ఉంటారు. విక్రమ్ వాళ్ళతో పెళ్లి అంటేనే ఒక నమ్మకం.ఆ నమ్మకాన్ని మీరు బలంగా ఇచ్చారు అంటే ఎటువంటి ప్రాబ్లం రాదు రా.


నీకేం బాబు బానే చెబుతావు. మా చెల్లి ఉత్తిఅమాయకరాలు కాబట్టి నువ్వు ఆడింది అట.. పాడింది పాట.  మా పరిస్థితి అలా కాదు కదా..

ఎందుకు బావ నీకు ఇంత నోటి దురద.  నివి ఇంట్లోనే ఉంది కదా... ఏమోరా బామ్మర్ది ఎంత ట్రై చేస్తున్నా సరే నోటి దురద మాత్రం తగ్గడం లేదు. ఏదైనా దీనికి టిప్ ఉంటే చెప్పండి రా అంటాడు..

ఒక్కటే ఐడియా బావ. నువ్వు ఇంట్లో తక్కువ.ఆఫీసులో ఎక్కువగా ఉండు. సరిపోతుంది. అలా కూడా ట్రై చేశాను రా..  బట్ నివికి దొరికిపోతూనే ఉన్నాను.

ఇంక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అని దాని అర్థం. ఎంజాయ్. రేయ్ వినయ్ నీకు కూడా నా పరిస్థితి రావాలి. ఒక భార్యా బాధితుడిగా నిన్ను బ్లెస్ చేస్తున్నాను.

బావ ఇది అన్యాయం. లేకపోతే నా బాధ నీకు కామెడీ అయిపోయింది కదా.. రేపటి నుంచి నువ్వు కూడా ఇలాగే బాధలుపడుతూ ఉండు.

ఇందిరా గారు నవ్వుతూ సరే ఇంకా ఆపండి మీ గోల.  విక్రమ్ అవనికి శ్రీమంతం చేయాలి. హ.. గ్రానీ... అమ్మ చెప్పింది.

ప్లాన్ చేస్తున్నాను. ఈ విషయం అవనికి తెలియనివ్వద్దు.  సర్ప్రైజా బావ అని రాజ్ అంటే.. ఒక రకంగా అలాంటిదే..

అవని లైఫ్ లో ఇప్పటిదాకా ఏది సంతోషంగా జరగలేదు. అందుకే ఇది చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాను. భరత్, రాజ్ వెంటనే పుట్టింటి తరుపు నుంచి అన్నీ మేము చేస్తాము.

ఏమేం కావాలో చెప్పండి అంటే..  మాధవి ఒరేయ్ అవన్నీ ఆల్రెడీ మేము ప్లాన్ చేసేసాము.  నేను,కరుణ, సురభి ముగ్గురం కలిసి పుట్టింటి సారే తీసుకొస్తున్నాము.

అమ్మ నువ్వు మరీ ఫాస్ట్ గా ఉన్నావు.  మీ ముందు జనరేషన్ కదరా..  మీలాగా స్లో కాదు.  ఛాన్స్ దొరికితే వదలరే....  కౌంటర్ వేయడానికి రెడీగా ఉంటారు.

ఏదైనా చాన్స్ వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి కదరా..

విక్రమ్ అవని దగ్గరికి వెళతాడు. ప్రశాంతంగా నిద్రపోతూఉంటుంది.  నెలలు నిండుతున్నందుకు గుర్తుగా పొట్ట కొద్దిగా పైకి వస్తుంది. మనిషి కూడా కొద్దిగా ఒళ్ళు చేసి నిండుగా కనిపిస్తూ ఉంటుంది.

అవని కి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లిగా పక్కన కూర్చుని పొట్ట మీద చేయి వేసి నాన్న రెస్ట్ తీసుకో. ఎక్కువగా అల్లరి చెయ్యకు.

అమ్మ ఇబ్బంది పడుతుంది. నీకు ఏమైనా కావాలి అంటే నాకు చెప్పు అని కడుపులో ఉన్న బేబీ తో కబుర్లు చెబుతూ ఉంటాడు.

విక్రమ్ పక్కన కూర్చున్నప్పుడే మెలకువ వచ్చిన అవని విక్రమ్ చెప్పే విధానానికి నవ్వుతూ.. అవును కన్నా నువ్వు పొట్టలో నుంచే నాన్నతో మాట్లాడేసియ్.

పుట్టగానే పరుగులు కూడా పెట్టేయొచ్చు కదా శ్రీవారు.. నీకు ఈ మధ్యన వెటకారాలు ఎక్కువైపోయాయి. కాదు మీకు కేరింగ్ ఎక్కువ అయిపోయింది.

లేకపోతే పొట్టలో ఉన్న బేబీ ఎలా మాట్లాడుతారు అండి. అదంతా నీకెందుకు.. మా ఇద్దరికీ ఒక సీక్రెట్ లాంగ్వేజ్ ఉందిలే అంటాడు. అబ్బో సీక్రెట్ లాంగ్వేజ్ అప్పుడే..

కావాలంటే చూస్తావా .. సరే చూపించండి. సరే నువ్వు సైలెంట్ గా కళ్ళు మూసుకుని పడుకో.. అవని నీ సరిగ్గా పడుకోబెట్టి పొట్ట దగ్గర తప్పిస్తాడు.

ఏం చేస్తున్నారు అని కంగారుపడుతుంది. సైలెంట్ గా ఉండమన్నానా అని పొట్ట మీద మెల్లిగా చేయి వేసి.. సాపు చేస్తూ..

కన్నా..  బంగారం..  ఏం చేస్తున్నావ్ అమ్మ... బొజ్జున్నావా? ఏమన్నా కావాల..  బొమ్మలు కొన్న..  ఆమ్ తింటావా అని మాట్లాడుతూ ఉంటే లోపల బేబీ మెల్లిగా కదులుతూ ఉంటుంది.

బేబీ కదిలికకి విక్రమ్ చెయ్యి మెల్లిగా వణుకుతుంది. అవని బాడీలో జరిగిన మార్పుకి  ఒళ్ళు జలదరించినట్టుగా కళ్ళు తెరుస్తుంది.

ఇద్దరూ  ఒకేసారి బేబీ కదిలింది అని అంటారు. ఒక్క నిమిషం ఇద్దరికీ ఆనందం.  ఆ ఫీల్ ని ఎంజాయ్ చేస్తూ విక్రమ్ ని గట్టిగా పట్టుకుని బేబీ కదులుతున్నాడు.

నువ్వు ఇప్పుడే అబ్సర్వ్ చేసావేమో నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మరి నాకు చెప్పలేదు అంటుంది.

అప్పుడు నువ్వు నిద్రలో ఉంటున్నావు.  ఆ టైంలో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం లే అంటాడు. నాకు మెల్లిగా తెలుస్తుంది కానీ ఈసారి బాగా తెలిసిందండి.

ఇప్పుడు నుంచే వాడు నాన్న కుచీ అయిపోతే మరి నేను అని బిక్కమొహం వేస్తుంది. నువ్వా అని ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి మా ఇద్దరికీ బుల్లి కూచివి అంటాడు.

నేనేమీ చిన్నపిల్లనే కాదు కదా..  వాడు అమ్మతోనే ఉండాలి కదా. ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్  అర్థమయ్యి ఫస్ట్ నీతోనే ఉంటాడు. అన్ని నీకే చెబుతాడు. నీ తర్వాతే నేను.

అలాగ వద్దు.  ఇద్దరమూ సమానమే.  ఇద్దరితోనూ ఉండాలి. అమ్మగా నేను గారం చేసిన తండ్రిగా మీరు గైడెన్స్ ఇవ్వాలి .

పుట్టేవాడు మరో విక్రమ్ లాగా ఉండాలి.  అబ్బో నీ మొగుడు ఏమన్నా సూపరా.. సూపర్ కాదు బంగారం వజ్రం అని మెటికలు విరుస్తుంది.

భార్య ప్రేమకు నవ్వుకుంటూ... ఇప్పుడు అలాగే అంటావు గాని రేపు బేబీ వచ్చాక నన్ను పక్కన పెట్టేస్తావు చూస్తూ ఉండు.

అలా ఎప్పటికీ కాదు మీ తర్వాతే నాకు ఎవరైనా అని ఏడుపు ముఖంతో చెబుతుంది.  సరే..  సరే..నా తర్వాత ఎవరైనా..

నువ్వు డల్ అవ్వద్దు. నుదుట్టిన ముద్దు పెట్టుకొని బయటకి వస్తావా. కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది.  పదండి అని మంచం దిగుతుంది.

మెల్లిగా నడిపిస్తూ కిందకి తీసుకు వస్తాడు.  అవనినీ చూసి లలిత ఏరా కిందకి వచ్చావు. ఏమైనా కావాలా.. గదిలో ఉండి ఉండి విసుగు వస్తుంది అత్తయ్య.

సరే కూర్చో..  తాగడానికి ఏమైనా తెస్తాను. ఇప్పుడు ఏమీ వద్దు. అత్తయ్య అంటే.. ఏంట్రా... సరదాగా బయటికి వెళదామా... ఇంట్లో ఉండి ఉండి విసుగు వస్తుంది.

బయటకా..  విక్రమ్ ఏమంటాడో..  ప్లీజ్ అత్తయ్య మీరు ఒప్పించండి. ఒక్క నిమిషం అని రేయ్ విక్రమ్.. చెప్పమ్మా.. షాపింగ్ కి వెళ్దామా అంటుంది.

ఇప్పుడు షాపింగ్ ఏమిటి..  ఏమైనా కావాలంటే చెప్పండి. ఇంటికే వస్తాయి. అబ్బా అలా కాదురా..  అవనికి ఇంట్లో బోర్ కొడుతుంది.  కాస్త బయటకు వెళితే బాగుంటుంది రా అర్థం చేసుకో. సరే నేను ప్లాన్ చేస్తాను.

అందరూ రెడీఅయ్యి బయటికి బయలుదేరుతారు.  ఇందిర నేను రాలేను.  మీరు వెళ్ళండి అని ఇంట్లోనే ఉండి పోతారు.  నివి అవనితో ఈరోజు నీతో బెస్ట్ షాపింగ్ చేయిపిస్తాను.

ఎందుకు నివి..  అవని అసలే అలసిపోతోంది.  ఇప్పుడు నీతో షాపింగ్ అంటే లోపల ఉన్న నీ మేనల్లుడు కూడా కంగారుపడతాడు. వాడు కంగారుపడతాడా లేక మీరు కంగారుపడుతున్నారా..

అయినా మీరేంటి మేనల్లుడు అని ఫిక్స్ అయిపోయారు. అమ్మాయి పుడితే..  ఎందుకు నివి.. నీలాంటి  అద్భుతాలు కుటుంబానికి ఒక్కళ్ళే ఉండాలి.

ఎక్కువ అద్భుతాలు ఉన్నాయనుకో చూడడానికి మాకు రెండు కళ్ళు కాదు కదా 10 ఉన్నా సరిపోవు. ఇప్పుడు మీరు పొగిడారా లేక... నిన్ను పొగిడాను బంగారం.అంతకు మించి నేను ఏమైనా చేయగలనా..

సరే పదండి అని ముందుకి నడుస్తుంది. హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకుని.  మావయ్య నాకు పెళ్ళాన్ని పొగుడడం వచ్చేసింది.

ఎక్స్పీరియన్స్ ఏదైనా నేర్పిస్తుంది అల్లుడు. ఇంకా నేర్చుకుంటావు.

అందరూ మాల్ కి వెళతారు. మాల్  మొత్తం ఖాళీగా ఉంటుంది. ఎవరూ లేరు అని అవని అడిగితే... మాల్ మొత్తం ఈరోజు మనకే బుక్ చేశాను అంటాడు.

అలా ఎందుకు వాళ్లకి లాస్ వస్తుంది కదా. ఈ మాల్ మనదే కాబట్టి ప్రాబ్లం ఏమి లేదు. మనదైన  సరే లాస్ ఏ కదా...
నీకన్న ఏది ఎక్కువ కాదు అని ఎన్నిసార్లు చెప్పాలి. అందరితో ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది.

నీకు ఫ్రెష్ ఎయిర్ ఉండాలి కదా... పంజరంలో చిలకని చేసేస్తున్నారు.  ఈ బంగారు బొమ్మపై ఎవరి కళ్ళు పడనివ్వకుండా చూసుకుంటున్న.

ఏదేమైనా మీ మాటే పైనుంటుంది కదా..  నా నోరు ఎలాగైనా మూయిస్తారు అని లోపలికి వెళుతుంది.  ఇప్పుడు నా భార్యమణి అలిగిందా అని వెనకాలే వెళతాడు.  అలిగితే మాత్రం ఏమైనా ఉపయోగం ఉందా...

ఎలాంటి ఉపయోగం కావాలో చెప్పు.. చెప్పిన ఉపయోగం ఉండదు లేండి. అరే చెబితేనే కదా ఉపయోగం ఉంటుందో లేదో తెలుస్తుంది.

మరి చెప్పాక కాదనకూడదు. ముందరకాళ్ళకి బంధం వేస్తున్నావా...   నా చిన్న కోరిక తీర్చమంటున్న... ఇన్ని రోజులకి అడిగావు.

కాదని ఎలా అంటాను. సరే అయితే.. నైట్ కి మనిద్దరమే బైక్ మీద రైడింగ్ కి వెళదాం. ఏమిటి అని కొంచెం గట్టిగా అంటాడు.

లలిత వెనక్కి తిరిగి ఏమైందిరా...  ఏమీ లేదు అమ్మ.. మీరు పదండి. స్లోగా అదేం కోరికే అంటాడు. ప్లీజ్ ప్లీజ్ లోపల ఉన్న మీ కన్నా కి నాన్నతో బైక్ రైడింగ్ కి వెళ్లాలని ఉందంట..

అందుకనే నన్ను చెప్పమంటున్నాడు..  వాడు ఇప్పుడు అమ్మ కూచినా.. కాదు మీ ఇద్దరికీ నేను కదా బుల్లి కూచిని.

ప్లీజ్ అని బ్రతిమాలుతూ ఉంటే... సరే నా బుల్లికూచి కోసం ఒప్పుకుంటున్నాను.  థాంక్యూ అని ఎగరబోతుఉంటే..

హలో మేడం  ఏమిటా గంతులు లోపల నాకన్నా ఏమైపోవాలి. సోరి.. సోరి..   మీరు బయటికి తీసుకువెళ్తాను అంటే ఆనందంలో ఏం చేస్తున్నానో తెలియడం లేదు.

సరే పద దగ్గరుండి షాపింగ్ చేయిస్తాడు.

బైక్ రైడింగ్ కి అందరూ రెడీనా ???‍♀️

కథ కొనసాగుతుంది..
[+] 11 users Like SivaSai's post
Like Reply
(10-03-2026, 06:44 AM)SivaSai Wrote:
Part - 140

...

సరే పద దగ్గరుండి షాపింగ్ చేయిస్తాడు.

బైక్ రైడింగ్ కి అందరూ రెడీనా ???‍♀️

కథ కొనసాగుతుంది..

Born ready Siva bhai!! Neede late
Like Reply
Super update
Like Reply
Part - 141


షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళుతూ శ్రీ దగ్గరికి వెళతారు. నేహా ని కూడా చూసి ఇంటికి బయలుదేరుతారు.

వెళ్లే ముందు అవని, నేహా సైగ చేసుకుంటూ ఉంటే శ్రీ చూసి..  ఏంట్రా వీళ్ళిద్దరూ తెగ సైగ చేసుకుంటున్నారు. ఏమో మనకేం తెలుసు.

నా పెళ్ళాం గురించి నాకు తెలియకపోయినా మా చెల్లెమ్మ గురించి నీకు బాగానే తెలుసు కదా. చిన్నగా నవ్వుతూ ఎంత తెలిసిన ఆడవాళ్ళు విషయాల్లో వేలు పెట్టకూడదు రా..  తర్వాత మనమే ఇబ్బంది పడతాము.

నువ్వు మా చెల్లి విషయంలో ఏది వదలవు కదరా.. ఇప్పుడు ఇంత హితబోధ చేస్తున్నావు. నువ్వు అన్నది నిజమే.

అవని విషయంలో ఏది వదలను. అలాగని తన ఫ్రీడమ్ ని  డిస్టర్బ్ చేయను.. వాళ్ళకంటూ చిన్న చిన్న ఇష్టాలు ఉంటాయి. ఆలోచనలు ఉంటాయి.

వాటికి మనం గౌరవం ఇవ్వాలి. అప్పుడే బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. శ్రీ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు.

ఏమీ లేదు విక్కి..  నీతో భార్యాభర్తల మధ్యన సంబంధం ఎలా ఉండాలి..  ఫ్యామిలీతో ఎలా ఉండాలి అని ఒక డాక్యుమెంటరీ తీస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.

డిప్ప మీద ఒకటి పీకి ఇది అందరికీ తెలిసిన విషయమే.  కాకపోతే కొంతమంది ట్రాన్స్పరెంట్ గా ఫాలో అవుతారు. కొంతమంది ఆహన్ని చూపిస్తూ ఫాలో అవుతారు అంతే తేడా అని కార్ స్టార్ట్ చేస్తాడు.

ఇంటికి వచ్చిన తర్వాత అవని మొఖం వాడిపోయి ఉంటే ముందు రెస్ట్ తీసుకో అని అవనినీ  గదిలోకి పంపించి జ్యూస్ చేసి లలిత ఇస్తుంది.

మీరు ఎందుకు అత్తయ్య ఇన్నిసార్లు తిరుగుతున్నారు. సర్వంట్స్ ఉన్నారు కదా.. పుట్టబోయే మన వారసులకి చేసుకోవడంలో తప్పేమీ లేదు.

నీకు ఇలా చేయడం కూడా నాకు సంతోషమే. మా అత్తగారు కూడా నా విషయంలో ఇలాగే చేసేవారు. నేను ఏది నేర్చుకున్నా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను.  మరి నా కోడలని కూడా నేను అలాగే చూసుకోవాలి కదా.

రేపు భవిష్యత్తులో నా కోడల్ని నేను అలాగే చేసుకుంటాను అత్తయ్య. అయిపోయిందా అత్తా కోడల్లా అనుబంధాలు అని విక్రమ్ వస్తాడు.

రా.. రా ఇంకా ఏంటా మీ డైలాగ్ పడలేదు అనుకున్నాను. సో స్వీట్ అమ్మ అంటాడు. ఎందుకో ఇప్పుడు మా అబ్బాయి గారికి ఇంత ప్రేమ వచ్చింది.

ఎప్పుడు మీ మీద ప్రేమ ఉంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తే ఇలాగ అంటున్నావా... నేను అలిగాను. కడుపుతో ఉంది మీ ఆవిడ అయితే అలకలు నీకు వచ్చాయా..

మూడ్ స్వింగ్స్ నీలో కనపడుతున్నాయి ఏంటి.  ఇలాగైతే కష్టం రా పుత్ర. లలిత చెప్పిన విధానానికి అవని గట్టిగా నవ్వుతుంది.

అవని నవ్వు చూసి లలిత, విక్రమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లలితా అవని చంప మీద చెయ్యి రేయ్ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండరా..

ఎంత కళగా ఉన్నావో తెలుసా అని నుదుటిన ముద్దు పెట్టుకుని రెస్ట్ తీసుకో అని బయటికి వెళ్ళిపోతుంది. వెళుతున్న లలితను చూస్తూ అత్తయ్య గారు నిజంగానే సో స్వీట్. ఇలాంటి అత్తమ్మ దొరకాలి అంటే ఆ కోడలికి చాలా లక్కు ఉండాలి.

హలో అమ్మే కాదు నేను కూడా స్వీటే..  కాదు.  మీరు హాట్. గరం గరం అంటుంది.  ఏ విషయంలో మేడంకి అనిపించిందో అని మీదకి వస్తుంటాడు.

విక్రమ్ కొంటే చూపుకి, మాటలో వచ్చిన తేడాకి అవని బుగ్గలు కందిపోతూ ఉంటాయి. బంగారం.. బుజ్జి అంటే.. హా అంటుంది.

ఇంత సిగ్గుపడుతూ ఎంత టెంప్ట్ చేస్తున్నావో తెలుసా? ఆగలేక పోతున్నాను అని పెదవులు అందుకుంటాడు. అవనికి ఇబ్బంది లేకుండా ప్రేమరసాన్ని మొదలుపెట్టి ముగిస్తాడు.

అలసిన అవని విక్రమ్ నీ పట్టుకుని మత్తుగా నిద్ర పోతుంది. నిద్రపోతున్న అవనికి బెడ్ షీట్ కప్పి మెల్లిగా లేచి పిల్లోస్ అడ్జస్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు.

చాలా సేపు పడుకున్నా అవనినీ మెల్లిగా లేపి... ఓయ్ భార్యామణి ఏమిటా నిద్ర. అంతసేపు పడుకుంటే ఎలా. అబ్బా ప్లీజ్ అండి బాగా నిద్ర వస్తుంది. చాలా అలసిపోయాను.

అయితే రాత్రికి బైక్ రైడింగ్ వద్దా..  కావాలి అని స్పీడ్ గా లెగుస్తుంది. మెల్లిగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చిరు కోపాన్ని చూపిస్తాడు.

మీరు నా మీద కోప్పడ్డారు. నీలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్ని చూపిచ్చేస్తున్నావు. మీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర చూపిస్తానండి అని బుగ్గల లాగుతుంది.

ఈ మాటలకు ఏమీ తక్కువ లేదు. ఫ్రెష్ అయ్యి రా.. భోజనం చేయాలి. ఆకలి వేయడం లేదు.  ఎంత ఆకలేస్తే అంతే తిను. అసలు తినకుండా మాత్రం తీసుకువెళ్లను.

మీరు కనపడరు. పెద్ద దొంగ. ప్రతిదానికి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.  రేపు కన్నా వచ్చిన తర్వాత అప్పుడు చెబుతాను మీ పని... విసవిసా వాష్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది.

వెళుతున్నా అవనినీ చూసి నవ్వుకుంటాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి బుంగమూతి పెట్టుకుని వెళదామా అంటుంది. సరే రా అని కిందకి తీసుకువెళతాడు.  ఒక్క నిమిషం కూడా అవనికి దూరంగా ఉండడు.

లైట్ గా తిని కాసేపు వాకింగ్ చేసి అందరితో సరదాగా కబుర్లు చెప్పి నిద్ర వచ్చే టైం కి రూమ్ కి వస్తుంది. అందరూ పడుకున్నా తర్వాత   వెళదామా అంటే..

నేను రెడీ అంటుంది. ఏమిటి ఇలాగే వస్తావా.. చీర బాగోలేదా..  ఇంకొకటి కట్టుకొన.. వెయిట్ అని చెప్పి కవర్ ఇస్తాడు.

ఇది ఫ్రాక్ అంటుంది.  వేసుకో.. తప్పదా.
  రావాలి అంటే తప్పదు. సరే అని వెళ్లి వేసుకుని వస్తుంది. ఆ ఫ్రాక్ లో  బందరు లడ్డు లాగా కనిపిస్తుంది.

పొట్ట ఎత్తు రావడం వలన ఫ్రాక్ కొద్దిగా పైకి లేచి... ఉంటుంది.  వెయిట్ అని  సాక్స్ వేస్తాడు. మనం వెళ్ళేది బైక్ రైడింగ్ కి.  మంచులోకి వెళ్లడం లేదు.

నాకు తెలుసు కానీ నువ్వు మూసుకొ. చేతికి గ్లౌజ్ వేసి తలకి మంకీ క్యాప్ పెడతాడు. మెడలో స్కార్ఫ్ వేస్తాడు ఇప్పుడు పర్ఫెక్ట్ అంటాడు.

ఎందుకు కళ్ళ కి స్పెట్స్ పెట్టి ముక్కులోకి గాలి వెళ్లకుండా మాస్క్ కూడా పెట్టండి.  గుడ్ ఐడియా.. ఇది దారుణం. చిన్న పిల్లలకు కూడా ఇంత దారుణంగా బట్టలు వేయరు తెలుసా...

ఫుల్ గా ప్యాక్ చేసేసారు. నిన్ను బైక్ రైడింగ్ తీసుకెళ్లమని అడిగావు.  సో అది ఒక్కటే నీకు ఇంపార్టెంట్. నేను ఎలా రెడీ చేస్తే అలాగే రా..

మళ్లీ బయట గాలికి  జలుబు చేస్తే..  ఆ తుమ్ములకి పొట్ట అదిరితే... నీకు పొట్ట నొప్పి వస్తుంది.  లోపల కన్నా భయపడతాడు.

  గుర్రుగా చూస్తుంది నువ్వు ఎలా చూసినా సరే నాకు భయమేమీ లేదు కానీ... వస్తావా రావా...  నాకన్నా మీరు వేసిన ఈ బట్టలే బరువు ఎక్కువ ఉన్నాయి.

సో రేపటి నుంచి నువ్వు డబల్ ఫుడ్ తీసుకో. మీకు అలా అర్థమైందా.. నాకు ఎలా కావాలో అలాగే అర్థం చేసుకుంటాను గాని రా భార్యామణి అని కిందకి తీసుకు వెళ్తాడు.

బైక్ చూడగానే అవని కళ్ళు మెరిసిపోతాయి. విక్రమ్ బైక్ స్టార్ట్ చేసి మెల్లిగా ఎక్కు అని చేయి అందిస్తాడు.   భర్త సపోర్టు తీసుకొని  సైడుకి కూర్చుంటుంది.

అదేంటి ఇటు..  బ్యాక్ సపోర్ట్ కూడా ఉంది. అది టూ సైడ్స్ కూర్చున్న వాళ్ళకి వస్తుంది కదా.. నీకోసం స్పెషల్ గా డిజైన్ చేయిపించాను.

పొద్దున్నే కదా మనం అనుకున్నది.. ఎందుకో చేయాలనిపించిది.  నువ్వు కన్సీవ్  అయినప్పుడే చేయిపించాను. ఇప్పుడు ఉపయోగపడింది.

మా ఆయన సో స్మార్ట్ అంటే...  ఆ మాటకి నవ్వుతూ జాగ్రత్త ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు అని మెల్లిగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

కొంచెం స్పీడ్ ప్లీజ్. సరే సరే అని మీడియం స్పీడ్ లో తీసుకువెళుతూ ఉంటాడు.  అది అర్ధరాత్రి అవడం.. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

చల్లటి గాలి వస్తూ ఉంటే అవని సంతోషం పట్టలేకపోతుంది.. ఎంత బాగుందండి.  చల్లగాలిలో మీతో ఇలాగా బైక్ రైడింగ్..

లోపల కన్నా కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో..  ఆ కన్నాని మోసే అమ్మ.. ఎలా ఎంజాయ్ చేస్తుంది.  సూపర్.  మాటల్లో కాదు చేతుల్లో చూపించాలి.

ఇలాంటి అప్పుడు కూడా మాటలతో కాలాన్ని గెంటేస్తే ఎలా..  అ ఓహో అయ్యగారికి ఇప్పుడు చేతలు కావాలా..   కొద్దిగా ముందుకి వస్తుంది. అవని మూమెంట్ చూసి బైక్ ని స్లో చేస్తాడు.

మెల్లిగా విక్రమ్ బుగ్గ పైన ముద్దు పెడుతుంది. ఇంతేనా...  అవ్వ..  మనం రోడ్డు మీద ఉన్నాము. ఇది చేయడానికి నాకు నేను చాలా ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంతకు మించి అడగొద్దు.

సరేలే ఏం చేస్తాము.  దేవి ఇచ్చిందే ప్రసాదం అనుకుని తృప్తిపడాలి. ఓపెన్ ప్లేస్ దగ్గర బైక్ ఆపుతాడు..ఇక్కడ ఆపేరేంటి.

మేడంగారు ఐస్క్రీం తినరా. వావ్... అడుగుదామనుకున్నాను. మీరు ఎక్కడ తిడతారో అని మాట్లాడలేదు.

మావారు ఐస్ క్రీమ్ కన్నా చల్లగా ఉంటారు. నాకు ఐస్క్రీమ్  వేసింది చాలు కానీ కూర్చో అని అక్కడ బెంచ్ పైన కూర్చోబెట్టి ఐస్క్రీమ్  తెచ్చి ఇస్తాడు.

టేస్ట్ చూసి ఇదేంటి ఈ ఐస్ క్రీమ్ మన ఇంట్లో ఐస్క్రీం లాగానే ఉంది.  లాగాకాదు అదే అంటాడు.  మీరు ఆల్రెడీ తీసుకువచ్చారా..

ఒక్కొక్కసారి బుర్ర ఎక్కడ పెట్టుకుని మాట్లాడతావు. మనం వచ్చింది బైక్ మీద. ఐస్ క్రీమ్ ఇంత దూరం తీసుకోవస్తే కరిగిపోదా.

మరి ఎలా వచ్చింది. హౌ అంటుంది. అదిగో అటు చూడు అని చూపిస్తాడు. అక్కడే ఇంటి దగ్గర చేసే చెఫ్ ఐస్క్రీమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు.

ఇతనకి నైట్ టైం బిజినెసా..  కాదు తల్లి.. తమరి కోసమే ఎలాగో ఐస్క్రీమ్ అడుగుతావు.  బయట ఫ్లావోర్స్ ఎందుకని అరేంజ్ చేశాను.

హాయ్ అన్న వాయిస్ వినపడుతుంది. ఎవరు అని ఇద్దరు అట తిరిగి చూస్తారు.

వచ్చింది ఎవరు...

విక్కీ నువ్వు రోజు రోజుకి స్వీట్ అయిపోతున్నావు అబ్బా ??
[+] 8 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)