Posts: 538
Threads: 10
Likes Received: 4,324 in 486 posts
Likes Given: 1,167
Joined: Aug 2024
Reputation:
400
Part - 122
ఇద్దరికీ సర్ది చెప్పేటప్పటికి రాజ్ తలప్రాణం తోకకోస్తుంది. పార్ధు.. కొడుకు ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రాజ్ ఇంక లాభం లేదు అనుకుని మేనేజర్ దగ్గరికి వెళ్లి చేయవలసింది అంతా చెబుతాడు.
సార్ అంటే.. ప్లీజ్ అంటాడు. సరే అని చెప్పి ఒక ఫోర్ సెట్స్ తెచ్చే అన్ని ఈక్వల్ ప్రైస్ చెప్తాడు. అప్పుడు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయి చెరోఒకటి తీసుకుంటారు.
హమ్మయ్య అని గుండెల పైన చెయ్యి వేసుకుని బయటికి తీసుకు వస్తాడు. అదిరా జరిగింది. అదేంటి ఈక్వల్ ప్రైస్ సెట్స్ తొందరగా మ్యాచ్ అవ్వవు కదా...
అక్కడ అంత సీన్ లేదమ్మా.. ఏదైనా సరే ఆ ప్రైసే చెప్పమన్నాను మిగిలింది మనీ క్రెడిట్ చేస్తానని చెప్పాను. అప్పుడే ఎంత డెవలప్ అయిపోయావు అని రాజ్ భుజం పైన పార్ధు తడతాడు .
మీరు చెయ్యి తీయండి నాన్న. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. ఇది మరీ బాగుందిరా..ఇద్దరు ఆడవాళ్ళని హ్యాండిల్ చేయలేకపోతే ఎలా..
అవునా ఇప్పుడు దాకా మీరు హ్యాండిల్ చేశారు కదా అని ఏదేమైనా సరే విక్కీ నువ్వు మాత్రం చాలా లక్కీ అంటాడు. ఎందుకు అని నవ్వుతూ అడిగితే.. అసలు మా చెల్లి ఇది కావాలి అని ఇన్ని రోజుల్లో నిన్ను అడిగిందా..
అత్తయ్య ఏది ఇస్తే అదే నవ్వుతూ తీసుకుంటుంది. నువ్వు బలవంతంగా తీసుకెళ్లి షాపింగ్ చేస్తే అది కూడా నీకు నచ్చిందే తీసుకుంటుంది.
ఇంట్లో లేడీస్ ప్రెషర్ లేకపోతే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా.. అందుకే అంటున్నా నువ్వు చాలా లక్కీ అని. వినయ్ వెంటనే బావ నోరు కంట్రోల్లో పెట్టుకో.
చెల్లి బయటికి వచ్చింది అంటే మళ్ళీ నీ పని అవుట్. అది నిజమేలే.. నాకెందుకు వచ్చిన గొడవ. నేను వెళ్లి రెస్ట్ తీసుకోవాలి అని గదిలోకి పరిగెడతాడు.
వెళుతున్న రాజ్ ని చూసి నవ్వుకుంటు విక్రమ్ ఆలోచిస్తూ నిజంగా నేను చాలా లక్కీ.. అసలు ఏమీ అడగకుండా ఎలా ఉంటుంది నా పెళ్ళాం అనుకుని అవని కోసం వెతుకుతూ ఉంటాడు.
వదిన లేడీస్ బ్యాచ్ తో ఉంది అని వినయ్ అంటే.. నేను అడగలేదు కదా.. నువ్వు వెతుకుతున్నావు కదా... అలిసిపోతావేమో అని చెప్పాను అని అల్లరిగా అంటాడు.
నీకు అల్లరి ఎక్కువవుతుంది. వాటికి కళ్ళెం వేస్తాను.. అప్పుడే వద్దు అన్నయ్య. రాజ్ బావని చూసాక కూడా తొందర పడితే అంతకన్నా తప్పులేదు.
భార్గవి మెల్లిగా కళ్ళు తెరుస్తూమూస్తూ ఉంటుంది. మత్తుకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కష్టంగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది.
ఎక్కడున్నాను నేను అనే తల పట్టుకుని మెల్లిగా లేచి చూస్తూ ఉంటుంది. ఆ గది అంతా కొత్తగా ఉంటుంది. ఇది మా ఇల్లు కాదే.. నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు అని మెల్లిగా లేచి బయటకి వస్తుంది.
బయట ఇద్దరు ఆడవాళ్లు ఉంటారు. తలుపు చప్పుడికి వెనక్కి తిరిగి లేచావా అంటారు. ఎవరు మీరు.. నేను ఎక్కడ ఉన్నాను.
ఎక్కడ ఉన్నావో తెలియనంత మత్తులో ఉన్నావా.. అంత మత్తెక్కిచ్చారా అని ఎగతాళిగా మాట్లాడుతారు. ఆ మాటలు అర్థం కాక ఏం మాట్లాడుతున్నారు మీరు.
ఇప్పుడు నీతో మాట్లాడే అంత టైం లేదు. వాళ్ళు వచ్చే టైం అయ్యింది. వెళ్లి రెడీ అవ్వు అంటుంది. ఎవరు వస్తున్నారు.
ఎవరో చెబితే గాని రెడీ అవ్వవా.. నువ్వు ఇలా విసగిస్తే నాలుగు పీకైనా రెడీ చేయించమన్నారు. మా వారే చెప్పుంటారు.. ఎంతైనా నేనంటే ప్రేమే.
ఏదో కోపంలో అలా ప్రవర్తించారు కానీ నన్ను వదిలి ఆయన ఎక్కడ ఉండగలరు. సరే ఇప్పుడే రెడీ అవుతాను అని లోపలికి వెళుతుంటే... ఒక్క నిమిషం ఆగు అని కవర్ చేతికి ఇస్తారు.
ఏమిటిది.. రెడీ అవ్వడానికి చీర అవసరం లేదా.. ఆ చీర కవరు పట్టుకుని తన భర్తకి తన మీద ఎంత ప్రేమ అని మురిసిపోతూ స్నానానికి వెళుతుంది..
స్నానం చేసి వచ్చి కవర్లో చీర తీసి బిగుసుకుపోతుంది. ఆ చీర పట్టుకుని అలాగే నిలబడిపోతుంది. బయట నుంచి ఆడవాళ్ళు ఇద్దరు తలుపుకొడుతూ..
ఎంతసేపు.. తొందరగా రెడీ అవ్వు అంటే.. స్పృహలోకి వచ్చి వస్తున్న అని ఇప్పిన చీరనే ఒంటికి చుట్టుకుని మెల్లిగా తలుపు తీస్తుంది.
అదేమిటి ఇంకా ఈ బట్టల్లోనే ఉన్నావు. రెడీ అవ్వు అంటే.. నాకు ఆ చీర వద్దు. ఇంకొక చీర ఉంటే ఇస్తారా అంటుంది.
ఓహో మహారాణి గారు దిగి వచ్చారు అని షాప్ తెచ్చి ఇక్కడ పెడతాము. ఏమనుకుంటున్నావ్ నీ గురించి నువ్వు.
నీకు ఇచ్చిందే ఆ ఒక్క చీర అదే కట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఒంటి మీద ఉన్న చీర కూడా ఉండదు అని ఆ చీర పట్టుకుని లాగుతారు.
ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మాకు చెప్పిన పని చేయడం వరకే మా డ్యూటీ అని చెప్పి ఒంటి మీద ఉన్న చీరను లాగేస్తూ ఉంటే గబుక్కున తలుపువేస్తోంది.
కానీ చీర ఆడవాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. భార్గవి వెంటనే టవల్ కప్పుకుని ఆ చీర ను పట్టుకును చూస్తూ ఉంటుంది.
రాత్రి భోజనాలు అయిన తర్వాత విక్రమ్ గదిలోకి వెళ్లి అవని కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అందరికీ అన్ని చక్కబెట్టి పాల గ్లాసు తీసుకుని గదిలోకి వస్తుంది.
అయ్యాయా మేడంగారు పనులన్నీ.. ఎందుకో మావారు అలకపాన్పు ఎక్కారు అంటుంది. చెయ్య పట్టుకుని దగ్గరకి లాక్కుంటాడు. అయ్యో ఉండండి పాలు ఉన్నాయి.
భార్యగారి మురిపాల ముందు ఈ పాలు ఎంతలే అంటాడు. ఏమైందో మా శ్రీవారికి.. ఇలా రా కూర్చో అని పాల గ్లాసు చేతిలోంచి తీసుకుంటాడు. చెప్పండి అంటుంది.
అవని రెండు చేతులను తన చేతిలోకి తీసుకొని చేతిలో వైపు చూస్తాడు. చేతులకు బంగారం మట్టి గాజులు కలిపి వేసుకుంటుంది. నిండుగా కనపడతాయి.
ఆ చేతులు పైన ముద్దు పెడతాడు. నవ్వుతూ ఏమైందండీ అంటుంది. మెడ వైపు చూస్తాడు సూత్రాలు తాడు నల్లపూసలు తప్ప ఇంకే అలంకరణ ఉండదు.
భార్య ముఖం చూస్తూ ఉంటే ప్రపంచంలోనే సంతోషమంతా తన దగ్గరే ఉందా అనిపిస్తుంది. అవని అని ప్రేమగా పిలుస్తాడు.
చెప్పండి. నేనొక విషయం అడుగుతాను. సూటిగా సమాధానం చెబుతావా అంటాడు. మీరు అడగడం నేను చెప్పకపోవడం. అది ఎప్పుడైనా ఉందా.. ప్లీజ్ బంగారం అంటాడు సరే అడగండి అంటుంది.
ఈరోజు అందరూ షాపింగ్ కి వెళ్ళారు కదా నువ్వు ఎందుకు వెళ్ళలేదు . మీరు రాలేదుగా అంటుంది. నీకు నచ్చింది తీసుకోవడానికి ఏమైంది.
మీకు నచ్చంది ఏదైనా సరే నాకు నచ్చదు. ఇప్పటికే నేను పెట్టుకొని బంగారమే చాలా ఉంది. మరి చీరలైనా తీసుకోవచ్చు కదా..
ఒకసారి ఇలా రండి అని క్లోసట్ దగ్గరికి తీసుకు వెళ్లి ఓపెన్ చేస్తుంది. చూడండి ఎన్ని చీరలు ఉన్నాయో.. ఇవన్నీ కట్టేటప్పటికీ మన పిల్లలు పెళ్లికి కూడా వచ్చేస్తారు.
నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని ఏంటి అమ్మాయి గారికి పిల్లలు మీదకి మనసు మళ్ళింది. నేను మాట వరసకి చెప్పాను స్వామి.
దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవద్దు. అరే నేను అసలే పక్క బిజినెస్ మాన్ ని. ఎలాంటి పరిస్థితులను అయినా సరే నాకు అనుకూలంగా మార్చుకోవాలి. లేకపోతే నేను బిజినెస్ మాన్ ఎలా అవుతాను చెప్పు అని రెండు చేతులతో లిఫ్ట్ చేస్తాడు.
మెడ చుట్టూ చేతులు వేసి అంటే పిల్లల మీదకి మీకు గాలి మళ్లీందా.. ఏమో ఎవరికి తెలుసు అని మంచం మీద పడుకోబెడతాడు.
పక్కనే పడుకొని ముంగురులను సవరిస్తూ బాగా అలసిపోతున్నావు. సర్వెంట్స్ ఉన్నారు కదా కూర్చుని వాళ్లతో చేయిపించు.
మన వాళ్ళకే నా చేతులతో చేస్తేనే నాకు తృప్తి. చిన్నప్పటినుంచి నేను మిస్సయిన ప్రతి రిలేషన్ ని ఎమోషన్ ని ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాను.
ప్లీజ్ మీరు అడ్డుపడొద్దు. నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. కానీ ఈ మధ్యన కొద్దిగా అలసటగా కనిపిస్తున్నావు. వర్క్ తగ్గించుకో అంటాడు.
సరే సరే నివి పెళ్లి అయిన తర్వాత అంతా ఖాళీయే కదా.. అప్పుడు ఫుల్ గా రెస్ట్ తీసుకుంటాను అంటుంది. నివి పెళ్లయితే ఖాళీ ఎలా అవుతావు..
ఇంకా వినయ్ భరత్ లేరా.. అరే వాళ్ళిద్దరికీ సంబంధాలు చూసారా.. నాకు ఎవరూ చెప్పలేదే... హలో మేడం గారు ఉన్నారు అన్నాను.. చూశారు అని చెప్పలేదు కదా..
ఎవరి పెళ్లి భాజా ఎప్పుడు మోగుతుందో ఎవరికి తెలుసు.. వినయ్ పెళ్లి అయితే నాకు తోటి కోడలు వస్తుందన్నమాట.. భరత్ అన్నయ్యకి పెళ్లయితే మరదలు వస్తుంది.
మన ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది కదా అని సంబరంగా చెబుతుంది. అవని ఫేసు చూస్తూ ఉంటే కల్మషం లేని పసిపాప నవ్వులాగా ఉంటుంది.
అందరినీ తన వాళ్లే అనుకుంటుంది. ఇంత మంచి మనసున్న బంగారం.. భార్యగా రావడం నిజంగానే నేను చాలా లక్కీ అని పెదవులు అందుకుంటాడు.
భర్త ప్రేమలో ఆ రాత్రిని మరో మధురమైన రాత్రిగా మలుచుకుంటారు.
భార్గవి కి మరో దారి లేక ఆ చీర కట్టుకుంటుంది. బయట ఉన్న ఇద్దరు ఆడవాళ్లు అయ్యిందా అని అరుస్తారు. మెల్లిగా తలుపుతీస్తుంది.
పరవాలేదు ఈ వయసులో కూడా కత్తిలాగా ఉన్నావు. ఏమిటా మాటలు.. సరిగ్గా మాట్లాడండి అంటే అబ్బో నీలాంటి వాళ్లకు కూడానా...
అటు తిరుగు జడ వేస్తాము అని వాళ్లే జడ వేసి తల నిండా పువ్వులు పెడతారు. ఇప్పుడు ఇవన్నీ ఏమిటి అంటే ఏమీ తెలియనట్టే అడుగుతున్నావు.
ఇవన్నీ నీకు అలవాటే కదా మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నావ్ అని బుగ్గ మీద పొడుస్తారు. నాకు అలవాట అని భయంగా చూస్తోంది.
ఏమిటి ఆ చూపు.. ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో...
భార్గవి అద్దంలో చూసుకోని బిగుసకుపోతుంది. ఆ రూపం చూడగానే వెంటనే అవని గుర్తుకు వస్తుంది.
కర్మ....
కథ కొనసాగుతుంది..
The following 12 users Like SivaSai's post:12 users Like SivaSai's post
• aarya, ABC24, ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Nivas348, Pilla, rammahesh77, Sachin@10, Sunny73, yekalavyass
Posts: 4,629
Threads: 9
Likes Received: 2,960 in 2,281 posts
Likes Given: 10,826
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 538
Threads: 10
Likes Received: 4,324 in 486 posts
Likes Given: 1,167
Joined: Aug 2024
Reputation:
400
01-03-2026, 01:50 PM
(This post was last modified: 01-03-2026, 01:51 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Oka Thrilling Ghost Story Undi Readers Kavali Ante Post Chestanu
With Admin Permission
Ghost Stories Post Cheya Choo Ledo Naku Teliyadu Admin Permission isthe Compulsory Post Chestanu
Posts: 1,248
Threads: 2
Likes Received: 695 in 505 posts
Likes Given: 1,456
Joined: May 2019
Reputation:
7
(01-03-2026, 06:52 AM)SivaSai Wrote: Part - 122
...
మీరు చెయ్యి తీయండి నాన్న. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది...
....
...
భార్గవి అద్దంలో చూసుకోని బిగుసకుపోతుంది. ఆ రూపం చూడగానే వెంటనే అవని గుర్తుకు వస్తుంది.
కర్మ....
కథ కొనసాగుతుంది..
Raj episodes konchem lag laa anipistundi!! But comedy bagundi!!
Bhargavi ni direct ga .. experience cheyinchatam kante.. kanna kooturu experience avutunte.. inka daarunanga untundemo anipistundi.
All said n done.. Sivagaru.. mee story adaraho!!
•
Posts: 538
Threads: 10
Likes Received: 4,324 in 486 posts
Likes Given: 1,167
Joined: Aug 2024
Reputation:
400
Part - 123
భార్గవి తన రూపాన్ని చూసుకుని వణికిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళు ఇద్దరూ వచ్చి ఈ వయసులో కూడా ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావ్.. ఏమిటి నీ సీక్రెట్..
ప్లీజ్ మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు దయచేసి చెప్పండి అంటూ అడిగితే.. ఏమీ తెలియనట్టుగా భలే యాక్ట్ చేస్తున్నావే...
నీకు ఇవి అలవాటే కదా.. మీరు ఏం మాట్లాడుతున్నారు. ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు అని అలా జరగడానికి వీల్లేదని మనసులో అనుకుంటూ వాళ్ళ వైపు చూస్తుంది.
తెలియకపోవడానికి ఏముంది ఇప్పుడు నలుగురు కస్టమర్స్ వస్తారు. వాళ్లకి మందు సప్లై చేయాలి. తర్వాత చిందు, విందు అన్ని అంటే నేను అలాంటి దాన్ని కాదు.
అవన్నీ మాకు తెలియదు. మా వల్ల ధనుంజయ్ సార్ కి లాభం వచ్చింది. అందుకే నిన్ను మాకు అప్పచెప్పారు.. కాబట్టి నువ్వు మాకు నచ్చిన విధంగా ఉండాల్సిందే అని చెబుతారు. ఆ మాటలకి బుర్ర తిరుగుతూ ఉంటుంది.
తన అరేంజ్ చేసిన మనుషులతో ఆరోజు అవని కి కూడా ఈ విధంగానే చెప్పేస్తుంది. ఇదంతా విక్రమ్ పనా అని విక్రమ్ తలుచుకోగానే వణికి పోతుంది.
విక్రమ్ పనిష్మెంట్ ఇస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పటికి కొద్దిగా అవగాహన లోకి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి తలుచుకుంటే మాత్రం వెన్నుల్లో వణుకుపుడుతుంది.
మెల్లిగా వాళ్లని మీతో ఈ పని చేపిస్తుంది ఎవరు.. ఇంకెవరూ ధనుంజయ్ సారు అని చెబుతారు. ఏంటి మావారా.. ఆయన నీ భర్త.. ఏవమ్మో ఏం మాట్లాడుతున్నావు.
ఆయనకు ఉన్నది ఒకే భార్య. ఒకే కూతురు.. అవునవును ఆ భార్యను నేనే అని గుండెలపైన చేతులతో కొట్టుకుంటూ చెబుతుంది.
చాలు చాల్లే అమ్మ. నువ్వు నీ అవతారం చూసుకున్నావా.. ఆయన భార్య పేరు రజిత. కూతురి పేరు అవని. మాకు తెలియదు అనుకుంటున్నావా?
కస్టమర్స్ వచ్చే టైం అయింది పద పద అనే లాక్కునివెళుతూ ఉంటారు. ప్లీజ్ నేను అలాంటి దాన్ని కాదు. ఒక్కసారి మీరు ధనుంజయ్ గారితో మాట్లాడండి అంటే ఇక్కడే ఉన్నారు.
ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఇక్కడే ఉండి నేను బాధపడుతుంటే చూస్తున్నారా.. నువ్వు ఏమన్నా స్పెషల్ ఆ ఏమిటి అని వెటకారంగా మాట్లాడతారు.
ఒక్కసారి ధనుంజయ్ గారిని రమ్మను. నేనేంటో మీకే తెలుస్తుందని ఉక్రోషంగా ఉంటుంది. చింత చచ్చిన పులుపు చావలేదంటే ఇదేనేమో..
నీ జీవితం ఇక్కడికి వచ్చిన సరే ఇంకా ధనుంజయ్ గారితో మాట్లాడాలి అంటున్నావు. సరే నీ ముచ్చట ఎందుకు కాదంటాము. పిలుచుకోస్తాము అని వెళ్లి ధనుంజయ్ ని పిలుచుకొస్తారు.
ఏమిటీ ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావ్. స్పీడ్ గా భర్త దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి చెయ్యి పట్టుకోపోతుంది. వెంటనే ధనుంజయ్ ఒక అడుగు వెనక్కి వేసి ఎన్నిసార్లు చెప్పాను నన్ను ముట్టుకోవద్దని.
సరే సరే మిమ్మల్ని నేను ముట్టుకోను. కానీ ఏమిటి ఇదంతా.. నువ్వు చేసిందే. నీకు ఇలాంటివి ఇష్టం కదా. మాటలు మర్యాదగా రానివ్వండి.
ఏ ఆడదైనా ఇలాంటి నీచపు పనులకు ఒప్పుకుంటుందా.. ఓహో హంతకురాలమైన నువ్వే ఒప్పుకోలేవు.. అలాంటిది విలువైన వజ్రానికి పుట్టిన నా బంగారు తల్లి ఎలా ఒప్పుకుంటుంది.
ఆ నీచపు పని చేసిందే కాకుండా అది మళ్ళీ నేను చేయించాను అన్నట్టుగా నా కూతురు ముందు ఎందుకు ప్రవర్తించారు చెప్పు అని గట్టిగా అరుస్తాడు.
ఆ మాటకి భయంగా భర్త వైపు చూసి ఈ విషయం మీకు ఎలా తెలుసు. నాకు ఎలా తెలుసు అన్నది పక్కన పెట్టు. అసలు ఎలా చేయగలిగారు.
అప్పుడు నీ కూతురు కనపడలేదా... ఎన్ని కష్టాలు పెట్టావు అయినా ఓర్చుకుంది. అంతటితోనే మనసు శాంతించలేదా..
ఒక సర్వెంట్ కి ఉన్న జాలి దయ కూడా నీకు లేదు అంటే.. నీది ఎంత రాక్షసి జాతో అర్థమవుతుంది. రాక్షసులతో కూడా నిన్ను పోల్చకూడదు. అవి అయినా కొంచెమైనా విశ్వాసంతో ఉంటాయి.
నీది అంతకన్నా నీచాతి నీచమైన జన్మ. ఎందుకు పుట్టాను అని నువ్వు ఏడ్చేలాగా చెయ్యకపోతే నేను అవనికి తండ్రినే కాదు.
ఇదంతా అబద్ధం అండి. అవని తో నేను ఎందుకు అలా ప్రవర్తిస్తాను. మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ నీ తప్పును ఒప్పుకోలేకపోతున్నావు కదా..
పోనీ ఈ చీరైనా గుర్తుందా లేకపోతే అది కూడా గుర్తు లేనట్టుగా నటిస్తున్నావా అంటే... టెన్షన్ గా ఒక రకమైన భయంతో భర్తను చూస్తూ ఉంటుంది.
నీ జీవితం ఇంకా ఇక్కడే అనుభవించు అని చెప్పి ధనుంజయ్ వెళ్ళిపోతాడు. వెనకాల పరిగెడుతూ ప్లీజ్ అండి నేను చేసినది తప్పే.. ఒప్పుకుంటాను.
ఇంత భయంకరమైన శిక్ష నాకు వెయ్యొద్దు. మీ కాళ్లు పట్టుకుంటాను. నువ్వు కాళ్లు పట్టుకున్న ప్రాణాలు తీసుకుంటాను అన్నా కనికరించను.
నీ మీద జాలి చూపిస్తే విక్రమ్ ఎప్పటికీ నా కూతుర్ని కలవనివ్వడు. ఇదంతా విక్రమ్ చెబితే మీరు చేస్తున్నారా.. నిన్న గాక మొన్న వచ్చిన విక్రమ్ మాటకి ఇచ్చిన విలువ నాకు ఇవ్వరా..
విక్రమ్ కి విలువలు ఉన్నాయి. నీకేమన్నాయి హంతకురాలు అన్న బిరుదు తప్ప. జరిగిందేదో జరిగిపోయింది అండి.
అవని సంగతి వదిలేయండి. మీకు ఇంకొక కూతురు ఉంది నేను ఉన్నాను సరిపోతుంది కదా.. మనం సంతోషంగా ఉందామండి.
అవని సంగతి విక్రమ్ చూసుకుంటాడు కదా.. ఛీ... ఛీ.. ఇంత జరిగినా నువ్వు మారవు కదా అని ఆడవాళ్ళు ఇద్దరి వైపు చూసి దీని సంగతి ఇంక మీరు చూసుకోండి అని ఒక తోపు తోసి వెళ్ళిపోతాడు.
భర్త వెనకాల వెళ్లబోతుంటే ఆడవాళ్ళు ఇద్దరు వచ్చి చేరో పక్కన పట్టుకుని లోపలికి లాక్కుని వెళ్ళిపోతారు.
జై సింహ మాన్షన్ నిశ్చితార్థ వేడుకకి అందంగా అలంకరించబడుతుంది.
నివి బాపుబొమ్మ లాగా అందంగా ముస్తాబవుతుంది. వినయ్ మాత్రం గుమ్మం దగ్గరే నిలబడి బయటికి చూస్తూ ఉంటాడు.
ఈ పిల్ల ఏంటి ఇంకా రాలేదు. చీర కట్టుకుని వస్తుందా లేకపోతే నిన్నటిలాగ డ్రెస్ వేసుకుంటుందా. డ్రెస్ వేసుకున్న పరవాలేదు ఆ లౌడ్ స్పీకర్ జీన్స్ వేసుకోకుండా ఉంటే చాలు.
డెకరేట్ చేసిన వాళ్ల దగ్గరికి వెళ్లి మీ పూజిత మేడం ఇంకా రాలేదేంటి. మేడమ్ అవసరం ఇంకా లేదు కదా సార్ అందుకే రాలేదు అని చెబుతారు.
అవసరం లేదు ఏంటి ఏదైనా తేడా వస్తే ఎవరిది రెస్పాన్సిబులిటీ.. ఎక్కడ ఉన్నా రమ్మనండి అని కొంచెం కోపాన్ని నటిస్తూ చెబుతాడు.
సార్ ఏదైనా తేడాగా అనిపిస్తే మాకు చెప్పండి సార్. మేము సరిచేస్తాము. లేదు లేదు నిన్నంతా మీ పూజిత మేడమే కదా దగ్గరుండి మరీ చేపించారు.
మరి అలాంటప్పుడు ఇప్పుడు కూడా చూసుకోవాల్సింది ఆవిడే కదా.. ఇంత పెద్ద కాంట్రాక్ట్ ని అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ఎలా...
ప్లీజ్ సార్ మీరు కొంచెం కూల్ గా ఉండండి మేడంకి మేము కాల్ చేస్తాము అని చెప్పి పక్కకు వెళ్లి ఫోన్ చేస్తారు. ఇదంతా చూస్తున్న భరత్... ఒరేయ్ వినయ్ నిజం చెప్పరా...
ఈ డెకరేషన్ లో తేడానా లేకపోతే పిల్ల మీద బెంగన.. పిచ్చి బావ నేను రాజ్ బావ ని చూసాక కూడా అలాంటి పిచ్చి పనులు చేస్తానా ఏమిటి.
నిన్ను చూస్తుంటే మాత్రం నాకు అదే డౌట్ కొడుతుంది రా... అబ్బా అలాంటిదేమీ లేదు బావ. ఆ పూజిత నన్ను చాలా ఆడుకుంది..
అందుకనే నేను సీరియస్‌గా వార్నింగ్ ఇద్దామని. మనమేంటో చూపిద్దామని. నిజమా నమ్మాలంటావ్.. నమ్ము బావ నీ దగ్గర నేనెప్పుడైనా అబద్ధం చెప్పానా.. అవునవును ఈ మధ్యన కొంతమంది మరీ నిజాలు ఎక్కువ చెబుతున్నారు లే.. పదా అని తీసుకువెళ్తాడు.
అవని పట్టుచీర కట్టుకొని రెడీ అవుతుంది. అవనికి మ్యాచింగ్ గా విక్రమ్ కూడా రెడీ అవుతాడు. వెళుతున్న అవనినీ ఆపేస్తాడు.
ఏమైందండీ అని ఆడిగితే పైనుంచి కిందకి చూస్తాడు. చిలకాకుపచ్చ పట్టు చీర కట్టుకుని ఉంటుంది. దానికి రాణి పింక్ బోర్డర్ వస్తుంది. చీర పర్ఫెక్ట్ అంటాడు.
చిన్నగా నవ్వుతుంది. కానీ ఏదో లోటు బంగారం అంటాడు. ఏంటే చీర సరిగ్గా కట్టుకోలేదా అని అద్దం ముందు నుంచునిచూస్తూ ఉంటే..
చీర బాగానే కట్టుకున్నావు మరి ఆ చీరకు తగ్గట్టుగా మెడలో కూడా పెట్టుకోవాలి కదా.. అబ్బా నాకు అంత ఎక్కువ గోల్డ్ పెట్టుకుంటే ఏంటో ఇబ్బందిగా అనిపిస్తుంది.
మొదటి నుంచి నాకు అలవాటు లేదు కదా... పెళ్లికి ముందు నువ్వు ఏమిటి అన్నది నాకు అనవసరం. పెళ్లయిన తర్వాత నువ్వు మిస్సెస్ అవని విక్రమ్.
నీతోనే నా గౌరవం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా రెడీ అవ్వు. లేదుఅంటే అందరూ గ్రేట్ బిజినెస్‌మేన్ అయిన విక్రమ్ గారు వాళ్ళ ఆవిడకి కనీసం చిన్న నెక్లెస్ కూడా కొనలేదే అని నన్నే అనుకుంటారు.
అయ్యబాబోయ్ నేను గోల్డ్ పెట్టుకోకపోతే జనం ఇన్ని రకాలుగా మావారిని అనుకుంటారా.. చాలు చాల్లే అండి మీరు చెప్పేది అని చిన్నగా కసురుకుంటూ..
విక్రమ్ ఇచ్చిన సెట్ పెట్టుకుంటూ ఉంటుంది. వెయిట్ నేను పెడతాను ఉండు అని చెప్పి మెడలో పెట్టి... నడుముకి వడ్డాణం పెడతాడు.
ఏమండోయ్ పెళ్లికూతురు నివి. నేను కాదు. నా కళ్ళకి నువ్వు ఎప్పుడూ పెళ్ళికూతురు లాగానే కనిపిస్తావు అని కాటుక తీసి అరి పాదంలో దిష్టి చుక్క పెడతాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నావు.
పద వెళదామని చెయ్యి పట్టుకుని తీసుకువెళతాడు. అవని బయటకు వచ్చిన తర్వాత నివి దగ్గరికి వెళతాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది..
పరిగెడుతున్న భార్యని జాగ్రత్త అంటూనే ఉంటాడు ఈ లోపు నివి దగ్గరికి వెళ్ళిపోతుంది.
భార్య హడావిడికి నవ్వుకుంటూ ఫంక్షన్ దగ్గరికి వెళ్లి ఇంకా ఏమైనా తేడా ఉన్నాయా అని చెక్ చేస్తూ ఉంటాడు. ఎక్స్‌క్యూజ్‌మీ సార్ అన్న వాయిస్ వినపడి ఎస్ అని వెనక్కి తిరుగుతాడు.
ఐ యాం పూజిత. ఈ ఎంగేజ్మెంట్ డెకరేషన్ కాంట్రాక్ట్ మాదే సార్. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి సరిచేస్తాను. అదే అబ్జర్వ్ చేస్తున్నాను అని చూసి పర్ఫెక్ట్ అంటాడు.
పూజిత??
Posts: 538
Threads: 10
Likes Received: 4,324 in 486 posts
Likes Given: 1,167
Joined: Aug 2024
Reputation:
400
Part - 124
విక్రమ్ మెచ్చుకునేటప్పటికీ పూజిత ముఖం వెలిగిపోతుంది. థాంక్యూ సార్ మీకు నచ్చింది అంటే ఇంకా ఎవరికీ వంకలు దొరకవు అని వినయ్ ని చూస్తూ అంటుంది.
అమ్మని ఎంత మాట అన్నావే అని పైనుంచి కిందకి చూస్తూ ఉంటాడు. సింపుల్ గా ఉండే చీర కట్టుకొని తలలో ఒక రోజ్ పెట్టుకుంటుంది.
చేతికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంటుంది. మెడలో సింపుల్ గా ఉండే గోల్డ్ చైన్ పెట్టుకుంటుంది. పరవాలేదు పాపకి కొంచెం టేస్ట్ ఉంది అని దగ్గరికి వెళ్ళి గుడ్ అంటాడు.
థాంక్యూ సార్ అని సాగదీస్తుంది. డెకరేషన్‌కే కాదు చెప్పినట్టుగా పద్ధతిగా చీర కట్టుకొచ్చినందుకు. అయ్యో ఇది మీరు చెప్పారని కట్టుకోలేదు సార్.
పద్ధతులు కొన్ని ఫాలో అవ్వాలి కదా.. పరిస్థితులు బట్టి రెడీ అవుతాను అంటుంది. నేను కట్టుకోమంటే కట్టుకున్నావని నేనేమీ అనలేదే.. బాగున్నావు అని చెప్పాను.
ఏమిటి నేను కట్టుకోమంటే కట్టుకున్నందుకు థాంక్స్ చెప్తాను అని ఏమన్నా కలలు కంటున్నావా.. అయ్యో సార్ నాకు పగటి కలలు కనడం అస్సలు రాదు.
ఎందుకంటే నేను అసలు ఖాళీగానే ఉండను కదా..
అమ్మాయి గారు రాత్రులు ఖాళీగా ఉంటారు అన్నమాట.
ఏ టైం కి ఫ్రీనో...
ఏ టైం అంటే ఏం చెబుతాను సార్. రాత్రి 9:00 నుంచి ఖాళీ. ఆ టైంలో మేడం గారికి ఫోన్ చేస్తే మాట్లాడడానికి అవైలబుల్ గా ఉంటాను అని చెబుతున్నారా.
బిజినెస్ విషయాలన్నీ ఈవినింగ్ సిక్స్ కే క్లోజ్ చేసేస్తాను. నైన్ తర్వాత అంత నా పర్సనల్ అంటుంది. నేను అనేది కూడా అదే అమ్మాయి.
నీ పర్సనల్ 9 తర్వాత అయితే ఖాళీ అప్పుడే మాట్లాడతాను అంటున్నావ్ అంతే కదా.. ఇదిగో అబ్బాయి మర్యాదగా చెబుతున్నాను.. ఆ టైంలో ఏమైనా ఫోన్ చేసి విసిగిచ్చావు అనుకో..
నా సంగతి నీకు అస్సలు తెలీయదు. ఆ సంగతి చూడడానికైనా నేను ఫోన్ చేస్తాను అమ్మాయి. లిఫ్ట్ చేయలేదు అంటే డైరెక్ట్‌గా ఇంటికి వచ్చి మీ నాన్నతో మీటింగ్ పెడతాను.
మీ అమ్మాయి నన్ను ఇంటికి రమ్మంది అని చెబుతాను అర్థమైందా.. అవును నువ్వు చెప్పగానే మా నాన్న నమ్మేస్తారు.
మరి అక్కడ ఉంది ఎవరు అనుకుంటున్నావు మా నాన్న అని జడ తిప్పుతూఅంటుంది. అవునా సరే అయితే ఈరోజు సాయంత్రం డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాను. నమ్ముతారో లేదో చూద్దాం అని కళ్ళుఎగరేస్తాడు.
నువ్వు వచ్చినప్పుడు సంగతి కదా అని అంటుంది. చూద్దాం అది కూడా...
నిశ్చితార్థం దగ్గర అన్ని సిద్ధం చేసి నివి, రాజ్ ఇద్దర్నీ కూర్చోబెడతారు. పెద్దవాళ్లందరూ అక్షంతలు వేసిన తరువాత ఉంగరాలు మార్చుకుంటారు.
పూజిత నిశ్చితార్థాన్ని చూస్తూ ఉంటే వినయ్ పక్కన నిలబడి ఏంటమ్మాయ్ అలా చూస్తున్నావు.నీకు కూడా పెళ్లి మీదకి గాలి మళ్లీందా.
ఇదిగో అబ్బాయి చూసినంత మాత్రాన పెళ్లి మీదకు గాలి మళ్లీనట్టు కాదులే అంటుంది. అవునా తమరికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న అబ్బాయి కావాలో..
నీలాగా మాత్రం కాదు. ఏ నాకేం తక్కువ.. అన్ని ఎక్కువే అందుకే వద్దు అంటున్న. నీకు కొంచెం వెటకారం ఎక్కువ అంటే.. థాంక్యూ అంటుంది.
ఎందుకు.. నాలో ఉన్న క్వాలిటీ చెప్పినందుకు. నిన్ను చేసుకునేవాడు ఎవడో కానీ చుక్కలు కనపడతాయి. ఒక స్మైల్ ఇచ్చి థాంక్యూ అంటుంది.
ఖర్మరా బాబు అని తలకొట్టుకుంటాడు. మరి గట్టిగా కొట్టుకోకు బొప్పి కట్టిందనుకో ఎవరు కొట్టారా అని అందరూ నిన్నే చూస్తారు.
నన్ను ఎవరైనా అలా చూడడం నీకు ఇష్టం లేదా.. మధ్యలో నా ఇష్టంతో సంబంధం ఏముంది. మీ సార్ పిలిచారు అనుకో... ఆ బొప్పి కట్టిన తలతో వెలితే చండాలంగా ఉంటుంది.
మా సార్ కి తెలుసులే ఎప్పుడు నన్ను పిలవాలో అనేటప్పటికి.. విక్రం వినయ్ అని పిలుస్తాడు. వస్తున్న అన్నయ్య అని పరిగెడతాడు.
అదేంటి నలుగురిలో కూడా అన్నయ్యనే పిలుస్తున్నాడు. ఈ మనిషికి కొంచెం కూడా రెస్పెక్ట్ తెలియడం లేదు. రాజ్ ఉంగరం పెట్టిన తర్వాత ఏనుగు ఎక్కినట్టుగా సంబరపడిపోతాడు.
శ్రీ పక్కకు వచ్చి ఒరేయ్ ఎక్కువ సంబరపడిపోకు. ఇది ఆరంభం మాత్రమే అంటాడు. నేనేమి సంబర పడడం లేదు. నార్మల్‌గానే ఉన్నాను.
నీ ఫేస్ లో కనపడుతుంది రా.. కొంత మంది దాయాలి అనుకున్న దాయిలేరు. అది అంతే. అందులో నువ్వు ఫస్ట్ అంటాడు.
ఒరేయ్ మా నాన్న అయిపోయాడు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా. మేము ఎవ్వరం ఆడుకోవడం లేదురా.. నువ్విచ్చిన లూప్స్ తోనే దొరికిపోతున్నావు. నా కర్మ అంటాడు.
అరే అప్పుడే అనుకోకు ముందుంది అసలు పండగ. ప్లీజ్ రా కాసేపైనా నన్ను సంతోషంగా ఉండనివ్వండి. నువ్వు దిగితే మా నాన్న ఎక్కుతాడు. ఎందుకు చెప్పండి అంటే ఎంజాయ్ ఆల్ ద బెస్ట్ రా మామ అని చెప్పి నవ్వుతాడు.
ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. వచ్చిన గెస్ట్‌లందరూ భోంచేసిన తరువాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారి కూర్చుంటారు.
విక్రమ్ కూర్చుని అవని కోసం చూస్తూ ఉంటే.. ఏంటి బావ మా చెల్లి కోసమా అని భరత్ అడుగుతాడు. అవును రా ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది.
కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ వేరులే బావ. అవని ఇంట్లో తిరుగుతూ ఉంటే మంచి సందడిగా ఉంటుంది కదా.. అవును ఒక్క నిమిషం కనిపించకపోయినా ఎవరికి ఏమి తోయడం లేదు.
ఇది నిజమే బావ అంటాడు. అవని స్వీట్స్ పుచ్చుకొని వస్తూ ఉంటుంది అది చూసినా లలిత నువ్వెందుకు బంగారం తెస్తున్నావు. సర్వెంట్స్ ఉన్నారు కదా..
మన పని మనం చేసుకోవడంలో తప్పేముందిలే అత్తయ్య అని చెబుతూ.. ముందుకి తూలుతుంది..ఏ అవని జాగ్రత్త అని అందరూ ఒక్కసారిగా అరుస్తారు.
విక్రమ్ స్పీడ్ గా లేచి దగ్గరికి వెళతాడు. అవనినీ గట్టిగా పట్టుకొని ఏమైంది. ఏమీ లేదు కొంచెం అలసటగా ఉంది అంతే అంటుంది.
అందుకే చెప్పాను రెస్ట్ తీసుకో. ఇంతమంది సర్వెంట్స్ ఉన్న అన్ని నువ్వే చేయాలి అంటావు అని చేతిలో ఉన్న స్వీట్స్ తీసుకుంటాడు. వెంటనే ఒక సర్వెంట్ వచ్చే స్వీట్స్ ప్లేట్ తీసుకుంటుంది.
సరే పద అనగానే.. కళ్ళు తిరిగినట్టుగా అనిపించి విక్రమ్ మీద పడిపోతుంది. అవని ఏమైంది అని బుగ్గల మీద కంగారుగా తడుతూఉంటాడు.
నిశ్చితార్థానికి వచ్చిన ధనుంజయ్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. అవనికి ఏమైందా ఏమిటో.. లక్ష్మీదేవి లాగా కళకళలాడుతూ ఉంది.
ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో.. దిష్టి తగిలి ఉంటుంది నా చిట్టి తల్లికి అని కంగారు పడిపోతూ ఉంటాడు.
సురభి వెంటనే దగ్గరికి వచ్చి విక్రమ్ ముందు గదిలో పడుకోబెట్టు. సరే ఆంటీ రండి అని గబగబా గదిలోకి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెడతాడు.
అందరూ బయటికి వెళ్ళండి. నేను ఒకసారి చెక్ చేస్తాను. విక్రమ్ లేదు నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ ఆంటీ అంటాడు. ప్లీజ్ విక్రమ్ తనకి కొంచెం గాలి ఆడని. ఏమైందో నేను చూస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా..
సరే నేను కొంచెం దూరంలో నిలబడతాను అంటాడు. విక్రమ్.. అవనికి ఏమీ కాలేదు. నేనున్నాను కదా.. ప్లీజ్ బయటికి వెళ్ళు అని బలవంతంగా బయటకు పంపిస్తుంది.
అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. విక్రమ్ మాత్రం తలుపుకి జారాబడినట్టుగానే నిలబడతాడు. 15 నిమిషాలకి సురభి మెల్లిగా తలుపు తీసుకుని బయటకి వస్తుంది. అందరూ సురభి ఏమి చెబుతుందా అని చూస్తూ ఉంటారు.
సురభి విక్రమ్ ముందుకు వచ్చి విచారంగా ముఖంపెట్టి విక్రమ్ అంటుంది. చెప్పండి ఆంటీ ఏమైంది అని కంగారుగా అడిగితే.. నువ్వు ఇంత పని చేస్తావ్ అనుకోలేదు అని భుజం మీద చేయి వేస్తుంది.
ఆ మాటకి అందరూ ఆశ్చర్యపోతారు. విక్రమ్ కూడా ఆశ్చర్యంగా నేనేమి చేశాను ఆంటీ. నువ్వు చేయబట్టే కదా మా అమ్మాయి అలా పడిపోయింది ఇదంతా నీ తప్పే కదా..
ప్లీజ్ ఆంటీ సరిగ్గా చెప్పండి నాకు చాలా టెన్షన్ గా ఉంది అంటే అప్పుడే ఇంత టెన్షన్ పడితే ఎలా... ఇంకా ఎనిమిది నెలలు టెన్షన్ పడాలి కదా అంటుంది.
ఎనిమిది నెలలు టెన్షన్ పడడమేమిటి అని లలిత కి, మాధవికి స్ట్రైక్ అయి సురభి అని అరుస్తారు. అబ్బా అరవకండే బాబు.
నిజమా.. ఇంత గుడ్ న్యూస్ ని ఇలా భయపెట్టి చెప్పడం.. కాసేపైనా అల్లుడిని ఆడుకోవాలి కదా అంటుంది. జెంట్స్ మాత్రం తింగరి చూపులు చూస్తూ.. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు ఏమైనా వివరంగా చెప్పగలరా..
లలిత కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అయ్యో సార్ మీరు తాతయ్య అయిపోతున్నారు. అత్తయ్య గారు మీకు ముని మనవడో, మనవరాలో వచ్చేస్తుంది అని గట్టిగా అరుస్తుంది.
విక్రమ్ అది వినగానే ఒక నిమిషం ఏమీ మాట్లాడలేక పోతాడు. అందరూ విక్రమ్ ని చుట్టుముట్టి కంగ్రాట్స్ అని చెబుతూఉంటే ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది.
ఆంటీ అని పిలుస్తాడు. చెప్పు విక్రమ్.. అవని ఎలా ఉంది అని మాట కూడ తీసుకొని అడుగుతాడు.. ప్రస్తుతానికి బాగానే ఉంది.
రెండో నెలలోకి అడుగుపెట్టింది. రేపు హాస్పిటల్ కి తీసుకురా.. ప్రాపర్ గా అన్ని టెస్టులు చేసి మెడిసిన్స్ ఇస్తాను. అలాగే తనకి రెస్ట్ చాలా అవసరం.
లేత నెలలు కదా.. వెంటనే లలిత నా కోడల్ని కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది. మాధవి కూడా అవును మా అమ్మాయి కాలు కందనివ్వకుండా డెలివరీ చేస్తాను అంటుంది.
అది విన్న ధనుంజయ్ కు మాత్రం ఆనందంతో గుండె పొంగిపోతూఉంటుంది. నా చిట్టి తల్లి మరో బంగారు తల్లికి తల్లి కాబోతుందా..
ఎంత శుభవార్త కానీ దగ్గరికి తీసుకోలేకపోతున్నానే అని బాధపడతాడు. పోనీలే ఇప్పటికైనా నా బంగారు తల్లి జీవితంలోకి వెలుగులు వస్తున్నాయి అని సంబరంగా చూస్తూఉంటాడు.
పడుకుని ఉన్నా అవని నీ అందరూ ఒకసారి చూసి బయటికి వెళ్ళిపోతారు. విక్రమ్ మాత్రం అవని పక్కన పడుకుని పొట్ట మీద అంటి అంటకుండా చేతివేళ్ళను వేసి టచ్ చేస్తూ ఉంటాడు.
తల్లిదండ్రులుగా మారబోతున్న అవని, విక్రమ్ కి కంగ్రాట్స్ ??
కథ కొనసాగుతుంది...
The following 11 users Like SivaSai's post:11 users Like SivaSai's post
• ABC24, ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Nivas348, rammahesh77, Sachin@10, shekhadu, Sunny73, yekalavyass
Posts: 4,629
Threads: 9
Likes Received: 2,960 in 2,281 posts
Likes Given: 10,826
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,248
Threads: 2
Likes Received: 695 in 505 posts
Likes Given: 1,456
Joined: May 2019
Reputation:
7
Wowww!! That's great news to Avani and Vikram.
Sooper awesome update
intaki.. akkada Bhargavi sangathi ento?
Posts: 538
Threads: 10
Likes Received: 4,324 in 486 posts
Likes Given: 1,167
Joined: Aug 2024
Reputation:
400
Part - 125
విక్రమ్ అవనినీ చూస్తూ పొట్ట మీద చెయ్యి వేస్తూ అమ్మో మళ్లీ నా చెయ్యి బరువు పడిపోతుంది ఏమో అని తీసేస్తూ ఉంటాడు.
స్పృహలోకి రాని అవనినీ చూస్తూ అబ్బా ఎంతసేపు పడుకుంటావు బంగారం. ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి నీతో అని చూస్తూ ఉంటే.. మత్తుగా నిద్రపోతున్నావు.
ముందు ఒంటి మీద ఉన్న ఈ హెవీ ఐటమ్స్ అన్ని తీసేయాలి అని అవని డిస్టర్బ్ అవ్వకుండా మెడలోవి, నడుముకు పెట్టిన వడ్డానం తీసివేసి చీర కూడా మెల్లిగా తీసేస్తాడు. ఫ్రీగా ఉండే మ్యాక్సీ వేస్తాడు.
అయినా అవని స్పృహలోకి రాదు . నా బంగారం ఎప్పుడూ ఇంతసేపు పడుకుంది లేదు. ఈరోజు ఇంత హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలి అంటే మాత్రం మత్తుగా నిద్రపోతున్నావు.
ఇలాగైతే ఎలా అమ్మ.. వాట్ బేబీ అని తనలో తాను ఏదేదో మాట్లాడేసుకుంటూ ఉంటాడు. మెల్లిగా అవని కదులుతూ ఉంటుంది.
కనురెప్పలు తెరవడానికి అవస్తపడుతూ మెల్లిగా తెరుస్తుంది. ఏవండీ అని మెల్లిగా పిలుస్తూ ఉంటే.. నేను ఇక్కడే ఉన్నాను బంగారం అని పక్కన కూర్చుంటాడు.
ఏమయింది నాకు ఇంత నీరసంగా అనిపిస్తుంది.. ఉండదా మరి నీరసం. అసలు నువ్వు చేసిన పనికి నీకు గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలి.
నేనేం చేశాను అండి. చేసిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా.. లేచి సరిగా కూర్చో అని కూర్చోబెట్టి ముందు ఈ జ్యూస్ తాగు అని జ్యూస్ గ్లాస్ నోటి దగ్గర పెడతాడు.
ఎంత నీరసంగా ఉన్నావో.. ఇప్పటివరకు నీ ఒక్కదాని వరకే తిన్నావు, తాగావు. ఇప్పటినుంచి ఇద్దరు ఫుడ్డు తినాలి. అమ్మో అంత తింటే ఇంకా నా పొట్ట పట్టదండి.
పొట్ట పడుతుంది బంగారం. ఎందుకంటే ఇప్పుడు నీ పొట్టలో ఇంకొక బుజ్జి బేబీ ఉంది కాబట్టి.. బేబీ కోసం తినాలి అంటాడు.
ఏమిటి మీరు అనేది అని షాక్ అవుతుంది. నీ బాడీలో వచ్చిన చేంజెస్ కూడా పట్టించుకోనంత బిజీగా తిరుగుతున్నావు అమ్మ.
నుదుటిన ముద్దు పెట్టి కంగ్రాట్స్ అమ్మగా మారబోతున్న నా బంగారు భార్యామణికి అంటాడు. ఏం చెబుతున్నారండి అని కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటే భర్త చంపల మీద చేతులు వేసి అడుగుతుంది.
నువ్వు విన్నదే నేను చెప్పింది. మనమిద్దరం ప్రమోట్ అయ్యాము తల్లిదండ్రులుగా మారబోతున్నాము. థాంక్యూ థాంక్యూ మై డియర్ భార్యామణి.
ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. చెప్పు నీకు ఏం కావాలి అని విక్రమ్ కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు కారుతూ ఉంటే అవి తుడుచుకుంటూ అడుగుతాడు.
అవని తన నుదుటిని విక్రమ్ నుదుటికి జతచేసి ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఇంకా నా జీవితంలో ఏమంటుంది అండి. థాంక్యూ థాంక్యూ అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
హలో ఈ టైం లో నువ్వు ఇంత ఎమోషనల్ అవ్వకూడదు. టేక్ రెస్ట్. ఆంటీ మరీ మరీ చెప్పారు నీకు రెస్ట్ చాలా ఇంపార్టెంట్ అని.
లలితకి ఫోన్ చేసి అవనికి స్పృహ వచ్చింది అని చెబుతాడు. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వస్తారు.
లేడీస్ అందరూ అవని చుట్టూ చేరి బంగారం ఎంత గుడ్ న్యూస్ చెప్పావో తెలుసా..
మన జై సింహ ఫ్యామిలీ కి మరో తరం వారసుడు రాబోతున్నాడు.
ఇందిరా గారు అవని చుట్టూ మెటికలు విరిచి మెడలోని చంద్రహారం అవని మెడలో వేస్తారు. అమ్మమ్మ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు.
ఇది నా ముచ్చట. కాదనకు ముని మనవడిని చూసే భాగ్యాన్ని ఇస్తున్నావు. పక్కన ఉన్న నివి మనవడు అని ఫిక్స్ అయిపోయావా.. మనవరాలు అయితే..
ఆ మాటకి నవ్వుతూ మనవడైనా మనవరాలైనా ఎవరైనా సరే ఈ జై సింహ వారసులే. కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అల్లరి పిల్ల అంటారు.
అందరూ నవ్వుల మధ్యన అవని మొఖం వెలిగిపోతూ ఉంటుంది. అది చూసిన ధనుంజయ్ సంతోషంతో కళ్ళు నీళ్ళు తుడుచుకుంటాడు.
కళ్యాణ్.. అది చూసి ధనుంజయ్ దగ్గరికి వెళ్లి మీ అమ్మాయి దగ్గరికి ఇప్పటికి కూడా వెళ్లరా.. వెళ్లాలని ఉంది కానీ ధైర్యం సరిపోవడం లేదు.
నా చిట్టి తల్లి పడిన కష్టాలకి భగవంతుడికి జాలి కలిగినట్టుంది. అందుకే మీలాంటి గొప్ప మనసున్న ఇంటికి కోడలిగా కాదు కాదు కూతురిగా వచ్చింది.
ఆ మాటకి కళ్యాణ్ ధనుంజయ భుజం మీద తట్టి అంతా మంచే జరుగుతుంది. అవని తొందరలోనే మిమ్మల్ని ఒప్పుకుంటుంది.
ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను అని ఈ విషయం వెంటనే అమ్మానాన్నలకి చెప్పాలి నేను వెళ్లి వస్తాను అని సెలవు తీసుకుని ఇంటికి పరుగు పెడతాడు.
ధనుంజయ్ ఇంటికి స్పీడ్ గా వెళ్లి అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటాడు. ఏమైందిరా అంతలా అరుస్తున్నావు. నీ మొఖం ఏమిటి వెలిగిపోతుంది ఏం జరిగింది.
అవని అని ఆనందంతో మాటరానట్టుగా అయిపోతాడు. ఏమైందిరా అవని బానే ఉందా అంటే.. తల ఊపుతాడు. మరి ఏమిట్రా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు.
నిన్ను చూస్తే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. అవని నిన్ను తండ్రిగా ఒప్పుకుందా అని ఆనందంగా అడుగుతారు.
ఆ మాటకి కొంచెం నిరాశ వచ్చి అంత అదృష్టం ఈ పేద తండ్రికి లేదులే అమ్మ అని అంతకన్నా గొప్ప విషయం అవని తల్లి కాబోతుంది.
నా రజిత మళ్ళీ తిరిగి రాబోతుంది అని సంతోషంగా చెబుతాడు. ఎంత మంచి వార్త చెప్పావురా.. అవని తల్లి కాబోతుందా.. ఇంతకన్నా గొప్ప విషయం ఇంకా ఏముంటుంది.
వెంటనే వెళదాము. ఇప్పుడు నేను అక్కడి నుండే వస్తున్నానమ్మా. కొద్దిగా నీరసంగా ఉంది. డాక్టర్ రెస్ట్ తీసుకోవాలని మరీ మరీ చెప్పారు.
అవని అత్తింటివారైతే అవని కాలు కింద పెట్టనివ్వడం లేదు. నిజంగా నా కూతురు చాలా అదృష్టవంతురాలు అమ్మ. అలాంటి అత్తింటి వారు దొరికినందుకు.
రేపు అన్ని గుళ్లలో అవని,విక్రమ్ పేరు మీద అర్చన చేయిపించు. అష్టోత్తరం అన్నదానాలు ఏదైతే ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు చేయించు.
నా తల్లి క్షేమంగా ఉండేటట్టుగా హోమాలు చేయించు. ఇంకా అని ఆ కంగారు పడుతుంటే.. ఒరేయ్ అంత కంగారు పడకు.
ఇలా కూర్చో అని సర్వెంట్ తో వాటర్ తెప్పించి ముందు మంచినీళ్లు తాగు అని పట్టిస్తారు. నాకు ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని ఉంది అమ్మ.
ముఖ్యంగా అవనినీ దగ్గరికి తీసుకొని నా చేతులతో నోరు తీపిచేయాలని ఉంది కానీ ఈ అదృష్టం నాకు లేదు కదా అని బాధపడతాడు.
వెంటనే కళ్ళు తుడుచుకుని లేదు లేదు నేను ఇప్పుడు బాధపడకూడదు. సంతోషించాల్సిన విషయం. నేను తాతని కాబోతున్నాను.
అవనికి దూరం చేసిన ప్రతి అచ్చట ముచ్చట వచ్చే వారసులకి అందిస్తాను. రేపు గుడిలో పూజలు అయిన తర్వాత బంగారు షాప్ కి వెళదాం అమ్మ.
అన్ని రకాలు ఆర్డర్ ఇవ్వండి. నువ్వు ఇంత కంగారు పడకురా.. అమ్మాయి ఇంకా రెండో నెలలోనే ఉంది అన్నావు.
డెలివరీ అయ్యాక అప్పుడు తీసుకుందాము. ముందే అలా కొనకూడదు. అవునా నా కాళ్లు , చేయి ఆడడం లేదమ్మా..
ఏదైనా కన్నతల్లి ఉండి ఉంటే ఈ టైంలో వాళ్లు ప్రతి అవసరం చూస్తారు కదా.. తండ్రిగా ఉన్న నేను లేనట్టే. అవని ఎవరిని అడుగుతుంది అమ్మ.
ఆ మాటకి నవ్వుతూ అందరి ప్రేమలను కలిపి ఇవ్వగలిగే వాడే అవని భర్త. విక్రమ్ ఉండగా అవనికి ఆ లోటు ఉంటుందా...
లలితా మాధవి ఎంత అపురూపంగా అవనినీ చూసుకుంటున్నారు. మాధవి దత్తత తీసుకుంది అంటే మాట వరసకి కాదు కదా..
ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు. ఇంకా కూతురు విషయంలో అంత భయపడితే ఎలా.. తండ్రిని కదా.. పెళ్ళికి ముందు ఎలాగో పట్టించుకోలేకపోయాను.
ఇప్పుడైనా పట్టించుకుంటే వచ్చే జన్మలోనైనా నన్ను తండ్రిగా ఒప్పుకుంటుందేమో అన్న చిన్న ఆశ. లేదమ్మా.. నేను కొడుకుగా పుట్టే నా బంగారు తల్లి రుణం తీర్చుకుంటాను.
రజిత ఫోటో దగ్గరికి వెళ్లి వచ్చేస్తున్నావా రజిత నాకోసం. ఇంత మంచి విషయం విన్న దగ్గరి నుంచి ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వద్దామా.. నీకు ఈ విషయం చెబుదామా అని ఎదురు చూస్తున్నాను.
అసలు నేను ఏం మాట్లాడుతున్నానో.. ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. నా ప్రతి పనిలోనూ అండగా నిలబడు అని ఫోటోని తడుముతూ మాట్లాడుతూ ఉంటాడు.
కొడుకు ఎమోషన్స్ చూసిన పెద్దవాళ్ళిద్దరూ కంటతడి పెట్టుకుంటారు. ఎలా ఉండాల్సిన ఇల్లు ఎలా అయిపోయింది.
ఏది చేసినా అది ఒక ఇల్లాలు వల్లే అవుతుంది. ఇల్లు నిలబడాలి అన్న ఇల్లాలే.. ఇల్లు కూలబడాలి అన్న ఇల్లాలే కదా అని సత్యవతి గారు బాధపడతారు.
శేషగిరి.. సత్యవతి వైపు చూసి ఇప్పుడు బాధపడడం వలన ఉపయోగం ఏమీ లేదు. ముందు నుండే మనం భార్గవి మీద ఒక కన్ను వేసి ఉండి ఉంటే అవని విషయంలో వీడు దోషగా మిగిలేవాడు కాదు.
కొంత తప్పు మనది కూడా ఉంది. అవును మీరు అన్నది కూడా నిజమే. అయినా జరిగిపోయినవి తలుచుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నేను ఒక్కసారి లలితకి ఫోన్ చేసి వస్తాను అని గదిలోకి వెళతారు.
అవని జ్యూస్ తాగి గ్లాస్ పక్కన పెట్టడానికి కొద్దిగా ఒంగుంటుంది. వెంటనే విక్రమ్ అవని అని గట్టిగా అరుస్తాడు.
అవని ఉలిక్కిపడి ఏమైందండీ.. ఏం చేస్తున్నావ్ నువ్వు అని కంగారుగా దగ్గరికి వస్తాడు. నేనేం చేశాను అని చుట్టూ చూస్తూ ఉంటుంది.
ఏం చేశాను అంటావేమిటి అసలు కిందకి ఎందుకు బెండయ్యావు. ఇప్పుడు ఏమైంది. గ్లాస్ పెట్టడానికి కొద్దిగా బెండ్ అయ్యాను అంతే కదా..
గ్లాస్ పెట్టడానికైనా నువ్వు బెండ్ అవ్వకు. ఏం చేయను మరి.. ఈ గ్లాస్ నీ ఒలంపిక్ జ్యోతి లాగా పట్టుకొని కూర్చొనా..
అబ్బో మేడం గారి అమ్మ అవుతుంటే వెటకారాలు కూడా వచ్చేస్తున్నాయి.. ఇప్పుడు మీకు అలా అనిపించిందా...
విక్రమ్ ప్రేమ ❤️❤️
Posts: 538
Threads: 10
Likes Received: 4,324 in 486 posts
Likes Given: 1,167
Joined: Aug 2024
Reputation:
400
Part - 126
గ్లాస్ పెట్టడానికి ముందుకి వంగుంటున్న భార్యని ఆపి నేనున్నాను కదా భార్యామణి అని గ్లాస్ అందుకుంటాడు. సరే ఇప్పుడంటే మీరు ఉన్నారు తరవాత...
హలో మేడం మేమేమీ ఆలోచించకుండా ఉండం. ఆల్రెడీ ఇద్దరు సర్వెంట్స్ అండ్ ఒక నర్సు నీకోసం ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటారు.
బాబోయ్ అలా ఉంటే నాకు ఊపిరాడినట్టు ఉంటది అండి. నేను బాగానే ఉన్నాను కదా అని లేచి నుంచుంటుంది. అవని అని గట్టిగా అంటాడు.
ఉలుక్కుబడి ఏమైందండీ. ఎందుకు నువ్వు నిలబడ్డావు కూర్చో అని గబగబా కూర్చోబెడతాడు. ప్లీజ్ అండి మీరు అలా అరవొద్దు. నాకు టెన్షన్ వస్తుంది.
నేను అరవకూడదు అంటే నువ్వు కదలకూడదు అంటాడు. కదలకుండా ఎంతసేపని ఇలా కూర్చుంటాము. కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి. అప్పుడు పడుకో. పడుకొని స్ట్రెచబుల్ చేసుకో అంటాడు.
అవని మాట్లాడబోతుంటే ఇప్పటికే ఎక్కువ మాట్లాడేసావు మాట్లాడకు అని పడుకోబెట్టి కాళ్ళ కింద పిల్లో పెడతాడు. ఏం చేస్తున్నారు. నువ్వు ఈరోజు నుంచి ఇలాగే పడుకో.
కాళ్ళునొప్పులు ఏమైనా ఉన్నాయా.. తల తిరుగుతుందా.. భర్త ప్రేమకు ఏం మాట్లాడాలో కూడా అర్థంకాక చెయ్యి అందిస్తుంది.
ఏమైందిరా అని చెయ్యి పట్టుకుంటే కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టుకుని ఒళ్లో తల పెట్టుకుంటుంది. తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఏమైనా కావాలా.. మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే కావాలి.
పిచ్చిదానా నా ప్రేమ నీకు కాకపోతే ఇంకెవరికి.నువ్వు ఆరోగ్యంగా ఉంటే నాకు అంతే చాలు. మీరు నా పక్కన ఉండగా నాకు ఎటువంటి భయం లేదు.
మాధవి వచ్చి తలుపు కొడుతుంది. రా.. అత్త అంటే లోపలికి వచ్చి జ్యూస్ గ్లాస్ ఇస్తుంది. అమ్మ ఇప్పుడే ఒక జ్యూస్ తాగాను.
పరవాలేదు ఇది దానిమ్మ జ్యూస్. బ్లడ్ బాగా పడుతుంది. పుట్టే బేబీ ఆ పింక్ కలర్ లో పుడుతుంది తాగు అంటుంది. కష్టం అమ్మ అంటే...
విక్రమ్ మా గ్లాస్ అందుకుని నేను పట్టిస్తానులే అత్తయ్య. గ్లాస్ విక్రమ్ చేతికిస్తూ జ్యూస్ తాగిన తర్వాత నాకు మెసేజ్ చెయ్యి. సరే అత్తయ్య అనగానే మాధవి వెళ్ళిపోతుంది.
ప్లీజ్ అండి ఇప్పుడే కదా జ్యూస్ తాగాను.ఒక గంట కూడా అవ్వలేదు. జ్యూసే కదా.. ఎంతసేపు.. మెల్లిగా సిప్ చేసుకుంటూ తాగు. నేను కబుర్లు చెబుతూ ఉంటాను. ఇక ఏమీ చేయలేక మెల్లిగా జ్యూస్ తాగుతూ ఉంటుంది.
హమ్మయ్య అయిపోయింది అని గ్లాస్ ఇస్తుంది. గుడ్ గర్ల్ అని మూతి తుడుస్తాడు. మెల్లిగా లేచి నిలబడుతుంది. మళ్ళీ ఎక్కడికి.. వాష్ రూమ్ కి వెళ్ళాలి.
నేనున్నాను కదా.. తీసుకువెళతాను.. ఎన్నిసార్లు చెప్పాను కదలకు అని ఎత్తుకుంటాడు. నాలుగడుగులే నేను వేసేది. అయినా సరే అని తీసుకువెళ్లి వాష్ రూమ్ లో వదులుతాడు.
అవ్వగానే చెప్పు నేనే వచ్చి తీసుకువెళ్తాను. నువ్వు నడవద్దు అంటాడు. వాకింగ్ ఉంటే మంచిదండి. అది రేపు ఆంటీ చెప్పిన తర్వాత ఆలోచిద్దాం. ముందు రెస్ట్ తీసుకో.
ఇక ఎంత చెప్పినా విక్రమ్ వినడని ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. వెంటనే విక్రమ్ ఎత్తుకుని మంచం మీద పడుకోబెడతాడు.
ధనుంజయ్ ఇంటి నుంచి బయటకు బయలుదేరుతూ అమ్మ నేను వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. నా గురించి ఎదురు చూడొద్దు అని కార్ స్టార్ట్ చేస్తాడు.
ధనుంజయ్ భార్గవి ఉన్న ప్లేస్ కి వెళతాడు. లోపలికి వెళ్ళగానే ఇద్దరు ఆడవాళ్లు ఎదురు వచ్చి గుడ్ ఈవెనింగ్ సార్ అని చెబుతారు.
ఏం చేస్తుంది.. లోపల గదిలో ఒక మూలకి కూర్చునిఉంది. సరే అని లోపలికి వెళ్తాడు. భయంగా ఒక మూలకి కూర్చుని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంటుంది.
అక్కడ కుర్చీ లాక్కొని కూర్చుని ఏమైంది భార్గవి. అంతలా భయపడుతున్నావు. నిన్ను ఎవరేమన్నారు అంటాడు. ఏడుపు మొఖంతో ధనుంజయ్ ని చూస్తూ ఎందుకండి నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారు.
ఈ టార్చర్ కన్నా జైల్లో ఉండడమే బెటర్. నన్ను జైలుకు పంపించేయండి. ఎందుకు జైల్లో ఉంటే మూడు పూటల శుభ్రంగా భోంచేసి హాయిగా రెస్ట్ తీసుకుందామన..
జైల్లో రెస్టా అని విరక్తిగా నవ్వుతూ.. రెస్ట్ అనే పదం మర్చిపోయి చాలా రోజులైంది. కాకపోతే ఈ టార్చర్ మాత్రం నా వల్ల కాదు.
ప్రశాంతంగా తినలేకపోతున్నాను కంటి నిండా నిద్రపోలేక పోతున్నాను. నిద్ర వస్తున్న సరే కళ్ళు ముయ్యలేకపోతున్నాను. ఇంతకన్నా నాకు విషమిచ్చి చంపేయండి.
అలా చంపేస్తే ఈజీగా చిటుక్కున వెళ్ళిపోతావు కదా.. దాని వల్ల ఎవరికి ఉపయోగం చెప్పు. నువ్వు చేసిన పాపాలకి ఈ జన్మలోనే ఇక్కడే శిక్ష అనుభవించావు అనుకో..
మరుజన్మలో అయినా విశ్వాసం ఉన్న జంతువుగా అయినా పుడతావు. లేకపోతే చెట్టుకి, గాలికి సంబంధం లేకుండా ఎక్కడో ప్రేతాత్మ రూపంలో ఏలాడుతూ ఉంటావు.
నీకు అవసరమా అంటాడు. ప్లీజ్ అండి అంటే... నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు. నీ మీద ఎంతో ప్రేమతో నీ తప్పులను సరిజేయాలని నేను అనుకుంటే.. నువ్వేమో వద్దు అంటున్నావు. ఇలాగైతే ఎలా చెప్పు.
నిజంగా నా మీద ప్రేమ ఉంటే మీ ఎదురుగుండా ఉంచి ఎలాంటి పనిష్మెంట్ అయిన ఇవ్వండి. ఇలాంటి పనిష్మెంట్ మాత్రం వద్దు.
అరే నా ఇంటిలో అంతమంది ఉంటేనే నా కూతురికి ఇంతకన్నా భయంకరమైన నరకం చూపించావు కదా.. మరి నువ్వెందుకు భార్గవి అంత భయపడుతున్నావు.
ఏమీ మాట్లాడలేక చూస్తుంది. ఏమైంది భార్గవి ఏదో ఒకటి మాట్లాడు. నీ మాటలు వినాలనే వచ్చాను. నీ ఏడుపు చూడాలనే కదా లేట్ అయినా సరే ఇంత దూరం వచ్చింది.
నేను ఏడిస్తే మీకు ఆనందంగా ఉందా.. నా కూతురు ఏడుపు చూసి నువ్వు నీ కూతురు ఇంతకన్నా శునకానందం పొందారు కదా...
తలదించుకుని ఆ రోజు నేను చేసింది తప్పే ఒప్పుకుంటాను. చెంప మీద లాగిపెట్టు కొట్టి వయసుకు వచ్చిన ఆడపిల్లని నలుగురు పోరంబోకులు దగ్గరికి పంపిస్తావా..
వాళ్ళకి ముందుపోయి తరవాత సుఖపెట్టు అని చెబుతావా.. అసలు ఆడదానివేనా నువ్వు అని కళ్ళు ఎర్ర చేస్తాడు.
ధనుంజయ్ కోపానికి వణికిపోతు అప్పుడు నేను చేసింది తప్పైతే ఇప్పుడు మీరు చేసేది కూడా అదే కదా.. నేను ఎలా వచ్చిన వాళ్ళకి మందు పోస్తాను.
దీనినే కర్మ అంటారు. మనం ఏదైతే చేస్తామో తిరిగి 100 రెట్లు వెనక్కి వస్తుందంట. ఇప్పుడు నీ దగ్గరికి వస్తే మాత్రం తీసుకోలేకపోతున్నావు.
నీకు ఒక గుడ్ న్యూస్ చెబుదామని వచ్చాను. బట్ నువ్వు నన్ను మాత్రం డిసప్పాయింట్ చేసావు. నా జీవితానికి ఇంకా గుడ్ న్యూస్ లు కూడా ఉన్నాయా అంటుంది.
అరెరే ఎందుకులేవు. వెయిట్ అని చెప్పి వీడియో ఆన్ చేసి చూపిస్తాడు. శిల్ప వంట చేస్తూ.. గిన్నెలు కడుగుతూ ఉదయ్ కి వడ్డిస్తూ ఉంటుంది.
నాలుగు రోజుల్లోనే ఇంత మార్పా అంటుంది. మనిషి అన్నాక మార్పు సహజం అది ఇప్పుడిప్పుడే మనిషిలాగ మారుతుంది.
ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఇంకేమున్నాయి అన్నట్టుగా చూస్తే... ఈ గుడ్ న్యూస్ మాత్రం నీకు డైజెస్ట్ అవ్వదు. ఆకలేస్తుంది అంటున్నావు కదా నీ కడుపు నిండిపోతుంది. అవని తల్లి కాబోతుంది.
అవని తల్లి కాబోతుందా అని మెల్లిగా అంటుంది. నా బంగారు తల్లి ఇంకొక బుజ్జి పాపాయికి తల్లి కాబోతుంది. త్వరలో నా రజిని నా దగ్గరికి వచ్చేస్తుంది.
అందుకే నీకోసం స్పెషల్ స్వీట్స్ తెచ్చాను అని చెప్పి చిటిక వేస్తాడు. ఒక లేడీ స్పీడ్ బాక్స్ తీసుకుని వస్తుంది. నీకు ఎంతో ఇష్టమైన కాజు బర్ఫీ తిను అని ఓపెన్ చేస్తాడు.
మౌనంగా ఉన్న భార్గవి నోరు తెరిచి స్వీట్స్ ఒక దాని తర్వాత ఒకటి కుక్కుతాడు. అవి తినలేక ఉక్కరిబిక్కిరి అవుతుంది.
కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా కారిపోతాయి. అరే భార్గవి నీకు ఆనందభాష్పాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇది మీకు అలా కనిపించాయా.
మరి ఇంకా ఎలా కనిపించాలి. నువ్వు కూడా అవని విషయంలో ఇలాగే చేసేదానివి కదా.. నా బంగారు తల్లి బాధపడుతున్న సరే దానిని మార్చి చూపించేదానివి.
అచ్చు ఇలాగే చేసేదానివి కదా.. నీ లాగానే బాగా యాక్ట్ చేస్తున్నానా లేక ఇంకా కొంచెం నేను ట్రైనింగ్ అవ్వనా అంటాడు.
ధనుంజయ్ వెటకారాలకి కళ్ళు మూసుకుని మీరు చెప్పాల్సిన రెండు గుడ్ న్యూస్ లు అయిపోయినాయి కదా ఇంకా వెళ్ళండి .
ఇదేమన్నా నీ జైలు గది అనుకుంటున్నావా.. టైం అవ్వగానే వెళ్ళిపోవడానికి. ఇది నా ప్లేస్. నాకు నచ్చినంతసేపు ఉంటా..
నచ్చినంత సేపు నీకు సంతోషకరమైన విషయాలు చెబుతాను. అవి విని నీకు కళ్లనుంచి ఆనందభాష్పాలు కారుతూఉండాలి.
అది చూసి ఈరోజు నేను ప్రశాంతంగా పడుకోవాలి. మీరు ఇంత శాడిస్ట్ అవుతారని అనుకోలేదు. సహవాస దోషం ఏం చేస్తాం చెప్పు.
కడుపుతో ఉన్న అమ్మాయిలు ఏం తింటారు భార్గవి. గన్నేరుపప్పు అంటుంది. అది నీ కూతురికి ఇస్తాలే గాని...
రేపు నా చేతులతో నేనే స్వయంగా డ్రైఫ్రూట్ లడ్డుస్ చేసి పట్టుకెళ్తాను అని వెళ్ళిపోతాడు.
వెళుతున్న ధనుంజయ్ ని కోపంగా చూస్తూ నేలని కొడుతూఉంటుంది. నేను ఎలాంటి జీవితాన్ని ఊహించుకుంటే ఎక్కడికి వచ్చాను.
ఆ రజిత కూతుర్ని ఎక్కడ ఉంచాలి అంటే ఎక్కడ వెలుగుతుంది. అవనికి ఉన్న తెలివితేటల్లో సగం అయిన నా కూతురికి ఉండి ఉంటే... దాని భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉండేది.
ఒక్కరోజు అది చేసిన పని వల్ల ఈరోజు ఇద్దరం సఫర్ అవుతున్నాము అని తల పట్టుకుంటుంది.
వినయ్, భరత్, నివి ముగ్గురు షాపింగ్ చేసి వస్తారు. వీళ్ళు షాపింగ్ పూర్తి చేసుకునే వచ్చేటప్పటికి రాజ్ టీవీ చూస్తూ ఉంటాడు.
నివి కోపంగా వెళ్లి రాజ్ ఏం చేస్తున్నారు. నేనేం చేస్తున్నాను అంటాడు. మేమందరం అలిసిపోయి వస్తే మీరు కూల్ గా టీవీ చూస్తున్నారా.. మీరు అలిసిపోవడానికి నేను టీవీ చూడ్డానికి ఏమిటి సంబంధం అంటాడు.
రాజ్??
కథ కొనసాగుతుంది..
The following 12 users Like SivaSai's post:12 users Like SivaSai's post
• aarya, ABC24, ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Nivas348, Pilla, rammahesh77, Sachin@10, Sunny73, yekalavyass
Posts: 1,248
Threads: 2
Likes Received: 695 in 505 posts
Likes Given: 1,456
Joined: May 2019
Reputation:
7
Mallu Raj aa?
Koddi ga gear marchu bro. Vinay Poojitha emayyaru?
•
Posts: 4,629
Threads: 9
Likes Received: 2,960 in 2,281 posts
Likes Given: 10,826
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 538
Threads: 10
Likes Received: 4,324 in 486 posts
Likes Given: 1,167
Joined: Aug 2024
Reputation:
400
Part - 127
రాజ్ నివి వైపు చూస్తూ మీరు షాపింగ్ చేసి అలసిపోతే దానికి నేనేం చేయగలను. ఏమీ చేయలేరు ఇలా టీవీ చూడడం తప్ప.
నాకు తెలియక అడుగుతాను. ఈరోజు మార్నింగ్ మనకు ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆఫ్టర్నూన్ అవని గుడ్ న్యూస్ చెప్పింది.
మేము రెస్ట్ తీసుకున్నాము. జరిగింది మన ఫంక్షన్ ఏ కదా.. నువ్వెందుకు అలసిపోలేదు. షాపింగ్ కి ఎప్పుడు వెళ్ళిపోయావు.
షాపింగ్ అంటే ఎనర్జీ అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు షాపింగ్ చేయాల్సింది ఏమున్నాయి. మన ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా...
షాపింగ్ చేయాలి అంటే ఇంక మన పనేనా.. ఇంక దేని మీద వెళ్ళావు.. రాబోయే ఈ ఇంటి ప్రిన్స్ గురించి వెళ్లాను. ఆ మాటకి నోరు వదిలేసి చూస్తాడు.
ఏమైంది అంటే.. నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావడం లేదు నివి. దేనికి.. లేకపోతే ఏమనాలి. న్యూస్ తెలిసింది ఇప్పుడే.. ఇంకా హాస్పిటల్ కి వెళ్ళలేదు. చెకప్ అవ్వలేదు. ఎవరు పుడతారో తెలీదు.
ఇప్పుడు నుంచే షాపింగ్ చేస్తే వాళ్లు పుట్టేటప్పటికీ అవి పాతవి అయిపోతాయి కదా... ఆ మాటకి నవ్వుతూ అందుకే అన్ని ఆ టైంకి వచ్చేటట్టుగా కష్టమైజ్డ్ ఆర్డర్ ఇచ్చి వచ్చాను అంటుంది.
నివి చెప్పిన దానికి రాజ్ చూస్తూ ఉంటే.. భరత్ పక్కకు వచ్చి ఏంటి బ్రో ఫ్యూచర్ కనపడుతుందా.. బాగా అంటాడు. అప్పుడే ఏమైంది ముందుంది ఇంకా..
ఎలా బ్రో ఈ ఆడవాళ్లు ఇంత భయంకరంగా షాపింగ్ చేయగలుగుతారు. అది కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి...
అందుకే కదా మన జెంట్స్ షాప్స్ తక్కువ ఉంటే... లేడీస్ షాపులు ఎక్కువ ఉన్నాయి... ఏమో మీకు చిన్నప్పటినుంచి అలవాటైపోయి పెద్ద తేడాలు తెలియడం లేదు గానీ నాకు మాత్రం ప్రతి నిమిషం షాక్ ఇస్తూనే ఉంది.
అప్పుడే కంగారు పడకు రేపు హాస్పిటల్ పని అయిన తర్వాత మళ్ళీ మొదలు పెడుతుంది. అందుకే నాకు ఆఫీస్ వర్క్ ఉందని జంప్ అయిపోతున్నాను.
పెళ్లి రేపు అన్నవరకు నేను అసలు కనపడనుగా.. ఒక నవ్వు నవ్వుతాడు. ఏంటి బ్రో ఆ నవ్వుకి అర్థం.. ఏముంది బావ నువ్వు అనుకున్నది కాదు మా చెల్లి అనుకున్నదే జరుగుతుంది అని భరత్ బావ ఉద్దేశము అని వినయ్ అంటాడు.
ఒరేయ్ బామ్మర్ది... మీరు బామ్మర్దులు కాదురా పూర్వజన్మలో నేను మీకు రుణపడిపోయి ఉండుంటాను.. అందుకే ఈ జన్మలో ఇలా సాధించుకు తింటున్నారు. పో బావ నువ్వు ప్రెస్టేషన్లో అన్ని నిజాలే చెప్పేస్తున్నావు.
అవని డైట్ మొత్తం మార్చేస్తారు. మెలకువగా ఉన్నంత సేపు ఏదో ఒకటి పట్టిస్తూనే ఉంటారు. అవని పడుకోవడమే బెస్ట్ అనుకుని కళ్ళు మూసుకుని పడుకుంటుంది.
సూర్యోదయం అవ్వగానే విక్రమ్ అవనినీ లేపుతూఉంటాడు. ప్లీజ్ అండి కాసేపు పడుకుంటాను మగతగా అనిపిస్తుంది.
మెల్లిగా లేపి కొద్దిగా వాటర్ పట్టించి ఫ్రెష్ అయ్యిరా హాస్పిటల్ కి వెళ్ళాలి. టైం చూసి ఇప్పుడు ఇంకా ఆరే అయిందండి.
ఇంత పొద్దుటే హాస్పిటల్ అంటే కష్టమండి. ఆంటీ తో నేను ఆల్రెడీ మాట్లాడాను. తీసుకొచ్చేయమన్నారు. తల కొట్టుకుంటూ మరీ ఇంత కంగారు అయితే ఎలాగండి.
ఆ.. నీకు అలాగే ఉంటుంది. నిన్న కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నా గుండె ఆగినంత పని అయింది. నీ హెల్త్ విషయంలో నేను ఎటువంటి నిర్లక్ష్యం చెయ్యను.
పద పదా అని వాష్‌రూమ్ లోనికి తీసుకువెళ్తాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన తరువాత చీర కట్టుకుంటూ ఉంటే... ఎందుకు మ్యాక్సీ వేసుకో... కంఫర్ట్ గా ఉంటుంది.
ఆ మాటకి కోపంగా చూస్తూ నాకు చీర కూడా బానే ఉంటుంది. మ్యాక్సీ వేసుకుని ఎలా బయటకు వస్తాను. ఈ టైంలో ఆ ఫార్మాలిటీ అవసరం లేదు.
అప్పుడే అలాంటివి వేసుకోనక్కర్లేదండి. ఎప్పుడు వేసుకోవాలి నాకు తెలుసు కదా సరేనా బంగారం అంటుంది.
ఆ మాటకి కాంప్రమైజ్ అవుతూ.. సరే కాకపోతే బాగా లైట్ వెయిట్ ఉన్నాయి కట్టుకో. లేకపోతే లోపల బేబీ ఇబ్బంది పడిపోతుంది.
ఇప్పుడు వరకు మీరు చెప్పింది నా కోసం కాదా.. బేబీ కోసమా.. నీకోసమే కాకపోతే బేబీకి కూడా గాలి ఆడటం ఇంపార్టెంట్ కదా.
ఒక పని చేయండి ఒక ఫ్యాన్ తీసుకురండి. అది మింగుతాను. లోపల తిరుగుతూ ఉంటుంది గాలి బాగా వేస్తుంది.
చూసావా నా బేబీ పొట్టలోకి రాగానే నీకు కూడా తెలివితేటలు పెరిగిపోతున్నాయి. పొట్ట మీద చెయ్యి వేసి బేబీ నువ్వు చాలా గ్రేట్ బంగారం . మీ అమ్మ బుర్ర కూడా పెంచుతున్నావు అంటాడు.
విక్రమ్ అన్నదానికి కోపంగా చూస్తూ ఉంటే అరేయ్ ఎక్కువ కోపం తెచ్చుకోకు భార్యామణి..బేబీకి మంచిది కాదు అంటాడు.
నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా.. ఏం కావాలి అంటే.. హాస్పిటల్ పని అయిన తర్వాత మీరు ఆఫీస్ కి వెళ్ళిపోండి.
ఆ మాటకి నేనేం చేశాను. ఏం చేశారా నిన్నటి నుంచి నన్ను సతాయిస్తున్నారు. ఎక్కడ సతాయించాను. తిను.. జాగ్రత్తగా ఉండు.. కంఫర్ట్ గా ఉండే బట్టలు వేసుకో అని చెప్పడం కూడా నిన్ను సతాయించడమేనా..
అది మీకు తెలియడం లేదు. మీరు బేబీని మోయండి. అప్పుడు తెలుస్తుంది. ఆ మాటకి నవ్వుతూ భగవంతుడు ఆ వరం... ఆ అదృష్టం మీ ఆడవాళ్లకు మాత్రమే ఇచ్చాడు.
అందుకే ఆ ఫీల్ ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు ఎలాంటి ఇబ్బంది పడుతున్నావో తెలియక నేను కంగారు పడుతున్నాను అంటాడు.
ఆ మాటకి భర్త నడుం చుట్టూ చేతులు వేసి నేను బాగానే ఉన్నాను. ఏదైనా ఇబ్బంది ఉంటే అందరికన్నా ముందు మీకే చెబుతాను.
మీకన్నా నాకు ఎవరూ ముఖ్యం కాదు కదా అంటుంది. ఆ మాటకి నుదుటిన ముద్దు పెట్టుకుని గుడ్ అలా అన్నావు బాగుంది పద అంటాడు.
కిందకి రాగానే మాధవి, లలిత హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి డ్రైఫ్రూట్ మిల్క్ షేక్ రెడీగా పెడతారు. అవి రెండూ చూసి అత్తమ్మ అంటుంది.
తినాలి అమ్మ తప్పదురా అని కూర్చోబెట్టి తినిపించి మిల్క్ షేక్ తాగిస్తారు. హాస్పిటల్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే బ్యాగ్ లో నాలుగు రకాల జ్యూసులు ప్యాక్ చేసి పెట్టి విక్రమ్ చేతికి ఇస్తారు.
విక్రమ్ అవని నీ జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకువెళ్లి కారులో కూర్చోబెడతాడు. కార్ స్టార్ట్ చేసిన తర్వాత అవని కబుర్లు చెబుతూ ఉంటుంది.
చెబుతూ పక్కకి చూడగానే సైకిల్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆశ్చర్యంగా చూస్తూ ఏమండీ సైకిల్ లో ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా..
దేనికి.. కారు కన్నా సైకిలే స్పీడ్ గా వెళుతుందండి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. సైకిల్ స్పీడ్ గా వెళ్లడం కాదు. మనమే స్లోగా వెళుతున్నాము.
ఏమిటి అని స్పీడోమీటర్ చూసి మనం 30 లో వెళ్తున్నామండీ. అవును స్పీడుగా వెళితే నువ్వు, బేబీ ఇబ్బంది పడతారు.
ఆ మాటకి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మరీ ఇంత స్లోగా వెళ్ళినా మీ బేబీ అలిసిపోతుందండి. జర్నీ అంత సేపు చేయాలంటే కష్టం కదా..
ఇది నిజమే.. ఈసారి నుంచి వెళ్లాలి అంటే క్యారవాన్ తీసుకుని వెళ్దాము. అదైతే నువ్వు పడుకోవచ్చు బేబీ కూడా కంఫర్ట్ గా ఉంటుంది .
ఏమండీ కొంచెం స్పీడ్ గా వెళ్లరా వామిటింగ్ వచ్చేటట్టు ఉంది. వెంటనే కవర్స్ తీసి ఇస్తాడు. దేనికి అంటే వాంటింగ్ వస్తుంది అన్నావు కదా అని చేతికి ఇస్తాడు.
కారు స్మెల్ వస్తుందండి. స్మెల్ వస్తే ఇంకొక కారు వస్తుంది నువ్వు మాత్రం ఇబ్బంది పడకు అని కొద్దిగా స్పీడ్ పెంచుతాడు.
భర్త ప్రేమని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాక విక్రమ్ ని చూస్తూ ఉంటుంది. ఏమైందిరా అలా చూస్తున్నావు. మీరు ముందే నాకు ఎందుకు పరిచయం అవలేదా అని ఆలోచిస్తున్నాను.
నిజంగా మనకు పుట్టే బేబీ మాత్రం చాలా లక్కీ అని విక్రమ్ భుజం పైన తలవాల్చుతుంది. ఆ మాటకి బేబీ కాదు నేను లక్కీ.
నేను లక్కీ కాబట్టే నీలాంటి అపురూపమైన వజ్రం నా జీవితంలోనికి వచ్చింది. మరి ఆ వజ్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా..
మెల్లిగా కబుర్లు చెబుతూ అరగంటలో రావాల్సిన ప్లేస్ కి గంటలో వస్తారు. సురభి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరూ లోపలికి వెళ్ళగానే ఏంటి విక్రమ్ ఇంత లేటు అయ్యింది ఎప్పుడో బయలుదేరారు అన్నారు.
అలా అడగండి ఆంటీ.. కారు 30లో పెట్టి తీసుకువచ్చారు. ఏదైనా అంటే బేబీ ఇబ్బంది పడిపోతుంది అంటున్నారు అని కంప్లైంట్ చేస్తుంది.
ఆ మాటకి నవ్వుతూ విక్రమ్ ఇప్పుడినుంచి కేర్ తీసుకుంటున్నాడా.. ఇప్పటినుంచి ఏంటి... నిన్నటి నుంచి మొదలైంది.
అవని అలాగే చెబుతుంది. నిన్న మనం అందరం ఎంత భయపడ్డాము.. పడుకుంది ఏం తెలుసు తనకి మన టెన్షన్.
ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. సురభి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రేమకి నవ్వుకుంటూ సరే సరేలే విక్రమ్..
నువ్వు వెయిట్ చెయ్. అవనినీ టెస్ట్ చేస్తాను. నేను వస్తాను అంటాడు. విక్రమ్ నువ్వు ఇక్కడే ఉండు. ఇది ఆడవాళ్ళకి చేసేది.
నువ్వు ఉంటే నేను, నర్స్, అవని ముగ్గురం ఇబ్బంది పడాలి. నీ భార్యని జాగ్రత్తగా తీసుకొచ్చి నీకు అప్పచెబుతాను సరేనా..
రా అవని అని లోపలికి తీసుకువెళుతుంది. వెళ్తున్నా అవని వెనక్కి తిరిగి నాలుక బయటపెట్టి వెక్కిరిస్తుంది. అవనినీ చూస్తూ నవ్వుకుంటూ రా చూస్తాను అని కళ్ళతోనే చెబుతాడు.
సురభి చేయవలసిన అన్ని టెస్టులు చేసి తీసుకువస్తుంది. ఆ అరగంట విక్రమ్ కి యుగాలు గడిచినట్టుగా అనిపిస్తుంది.
రాగానే పట్టుకుని కుర్చీలో కూర్చోబెడతాడు. ఆంటీ ఎలా ఉంది. హెల్త్ అంతా ఓకే కదా.. ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు కదా అని అడుగుతాడు.
వెయిట్ విక్రమ్ ఎందుకంత కంగారు పడిపోతున్నావు. అన్ని టెస్టులు చేశాను. బాగుంది ఎగైన్ ఇద్దరికీ కంగ్రాట్స్.
కాకపోతే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.
ఏమిటా విషయం...
The following 11 users Like SivaSai's post:11 users Like SivaSai's post
• ABC24, ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Nivas348, Pilla, rammahesh77, Sachin@10, Sunny73, yekalavyass
Posts: 538
Threads: 10
Likes Received: 4,324 in 486 posts
Likes Given: 1,167
Joined: Aug 2024
Reputation:
400
Part - 128
అవని, లోపల బేబీ హెల్త్ అంతా బాగుంది. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏదైనా ప్రాబ్లమా అని కంగారు పడతాడు.
ప్రాబ్లం ఏమీ లేదు. లేత నెలలు కదా.. కొంచెం టెన్షన్ పడకుండా హెల్త్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టాలి. ప్రొపెర్ డైట్ తీసుకోవాలి.
అవని.. నువ్వు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉండు. వాకింగ్ కంపల్సరీ చేయి. అలాగే ఒక యోగా ట్రయనర్ ని అరేంజ్ చెయ్ విక్రమ్.
తనతో రోజు యోగా చేయిపిస్తే డెలివరీ టైం లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే థాంక్యూ ఆంటీ అంటాడు. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ.. విక్రమ్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.
చెప్పండి అంటీ.. నువ్వు ఎక్కువ కంగారు పడకు. నువ్వు కంగారుపడి అవని నీ టెన్షన్ పెట్టకు అర్థం అయిందా అంటుంది.
ఆంటీ అని చిరుకోపంగా పిలిస్తే...నిజమే చెబుతున్నాను విక్రమ్..ఆడవాళ్ళ బాడీలో జరిగే మార్పులు మీకు అర్థం కాక... నువ్వు కంగారు పడుతున్నావు.
బట్ అవని బాగుంది. ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఇంట్లో ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లు చూసుకుంటారు.
నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే.. అవని టైం టు టైం ప్రాపర్ డైట్ తీసుకోవడం ప్లస్ మార్నింగ్ యోగా చేయడం. ఇవి రెండు మాత్రం కంపల్సరీ చేపించు అర్థమైందా...
ఓకే థాంక్యూ అని చెప్పి వెళదామా అంటాడు.. సరే అని థాంక్స్ చెప్పి అవని కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు అర్థమైందా శ్రీవారు వాకింగ్ ఎంత ఇంపార్టెంటో..
ఆంటీ చెప్పాక నీకు ఛాన్స్ ఇస్తున్నాను లేకపోతే అసలు ఇచ్చేవాడిని కాదు. విక్రమ్ చేతిని తన చేతితో చుట్టేసి ఎందుకండీ అంత భయం.. నేను బాగానే ఉన్నాను.
ఏం బాగుండడమో ఏమో.. నిన్న ఎంత టెన్షన్ పడ్డామో.. ఇప్పటికి ఆ విషయం గుర్తుకు వస్తే చెమటలు పట్టేస్తున్నాయి.
ద గ్రేట్ బిజినెస్ టైకోన్ విక్రమ్ జై సింహ గారు ఇంత భయపడుతున్నారా... నేను ఎంత స్ట్రాంగ్ పర్సన్స్ అయినా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేటప్పటికి వీక్ అయిపోతాను. ముఖ్యంగా నీ విషయంలో...
విక్రమ్ ని డైవర్ట్ చేయడానికి పొట్ట మీద చేతులు వేసి ఆకలి అంటుంది..అవునా చాలాసేపు అయింది కదా బయలుదేరి రా అని కార్ లో కూర్చోబెట్టి లలిత ఇచ్చిన జ్యూస్ బాటిల్ ఇస్తాడు.
నాకు కారం కారంగా తినాలని ఉంది. నో ఫస్ట్ నువ్వు జ్యూస్ తాగు. ఇంటికి వెళ్ళాక చేయిపిస్తాను. అయ్యో శ్రీవారు మనం ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది కదా...
ఎందుకు... ఎందుకు అంటారు ఏమిటి.. మనం వెళ్ళేది 30 లో.. ఆ స్పీడ్ లో వెళ్ళేటప్పటికి లోపల బేబీ ఆకలితో కేర్ కేర్ అంటుందేమో...
బాగానే టీస్ చేస్తున్నావే.. ఆంటీ చెప్పారు కదా పరవాలేదు. ఎంతవరకు మాక్సిమం స్పీడ్ లో వెళ్ళాలో అంతవరకు వెళతాను అని కార్ స్టార్ చేస్తాడు.
ఇద్దరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. లోపలికి రాగానే అవనినీ చుట్టుముట్టి డాక్టర్ ఏమన్నారు అంతా బాగానే ఉందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూఉంటారు.
విక్రమ్ లోపలికి వచ్చి అరే ముందు కూర్చొనివ్వండి అని అందరినీ జరిపి సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు అడగండి. అవని విక్రమ్ ని చూస్తూ ఆంటీ ఏం చెప్పారో కూడా మీరే చెప్పండి.
అందరూ విక్రమ్ వైపు చూస్తే... సురభి చెప్పిన జాగ్రత్తలు అన్నీ చెబితే.. లలిత మాధవి ఇద్దరు భుజాల మీద వేసుకొని మేము చూసుకుంటాము.
నువ్వు టెన్షన్ పడకుండా ఆఫీసుకు వెళ్ళిపో.. ఎవ్రీ మినిట్ నీకు అప్డేట్స్ ఇస్తాము. లేదమ్మా ముఖ్యమైన వర్కు ఉన్నప్పుడు వెళతాను.
మీ ఇద్దరిని అవని మాయ చేసేస్తుంది. డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఆంటీ పర్వాలేదు అని చెప్పిన తర్వాత అప్పుడు వెళతాను.
విక్రమ్ ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే మార్చాడు అని అందరికీ తెలుసు. అందుకే అందరూ సరే నీ ఇష్టం అంటారు.
ధనుంజయ్ కూతురు కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. సత్యవతి వచ్చి ఒరేయ్ మేము చేస్తాము నువ్వు తప్పుకో అంటే లేదమ్మా నా కూతురు కోసం నేనే ప్రిపేర్ చేస్తాను అని మొత్తం అన్ని నీట్ గా చేసి ప్యాక్ చేస్తాడు.
అవనికి ఇంకా ఏమి ఇష్టము అని అడిగితే ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. ఆ నవ్వుకి అర్థం తెలిసిన ధనుంజయ్ ఒక నిమిషం సైలెంట్ అయిపోయి అప్పుడు తెలియకపోతే ఏమైంది లే అమ్మ.
ఇప్పుడు వెళతాము కదా అన్ని తెలుసుకుని చేసి పంపిద్దాము. నీ కూతురు తీసుకుంటుందనేనా.. నా ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత భగవంతుడు దయ అని మొత్తం చేసి బయలుదేరదామా అంటాడు.
ముందు నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యిరా.. ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అని రూమ్ కి వెళ్లి తొందరగా రెడీ అయి వస్తాడు.
వెళదామా అంటే శేషగిరి కొడుకుని చూసి నవ్వుతూ కూతురి దగ్గరికి వెళ్లడానికి ఎంత తొందరగా ఉన్నావు రా.. మరి ఉండదా ఏమిటి? అసలే కడుపుతో ఉంది.
ఈరోజు హాస్పిటల్ కి కూడా వెళ్లి ఉంటారు. డాక్టర్ ఏం చెప్పారు ఏమిటో తెలియదు కదా.. సరే సరే పదండి అని ముగ్గురు విక్రమ్ ఇంటికి వెళతారు.
వీళ్ళ ముగ్గురు వెళ్లేటప్పటికి అందరూ అవనినీ చుట్టుముట్టి హాస్పిటల్ విషయాలు అడుగుతూ ఉంటారు. విక్రమ్ చెప్పింది ప్రతిదీ ధనుంజయ్ వింటాడు.
వెంటనే బెస్ట్ యోగ ట్రైనర్ ఎవరున్నారో వెతకాలి అని పిఏ కి మెసేజ్ చేస్తాడు. సత్యవతి మనవరాల దగ్గరికి వచ్చి బాగున్నావా అమ్మ అంటుంది.
లలిత.. పెద్దమ్మ రండి అని లేచి అవని పక్కన ప్లేసు చూపిస్తారు. సత్యవతి కూర్చుని ఇందిరా గారికి నమస్కారం చేస్తారు.
ఇందిరా కూడా నమస్కారం చేసి చిన్న నవ్వు నవ్వుతారు. అందరి ముఖాలలో వెలుగు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది.
చెయ్యి పట్టుకుని డాక్టర్ ఏమన్నారమ్మా అంటే అంతా బాగుందన్నారు అని సింపుల్‌గా చెబుతుంది. కూతురు తన వైపు చూస్తుందేమో అన్న ఆశతో ధనుంజయ్ అవని వైపే చూస్తూ ఉంటాడు.
కళ్యాణ్ ధనుంజయ్ ని కదిపి ఇంకేంటి విశేషాలు అని అడిగితే.. ఏమన్నాయండి మామూలే అని బలవంతంగా నవ్వుతాడు.
సత్యవతి వెంటనే డ్రై ఫ్రూట్స్ బాక్స్ తీసుకుని నోరు తీపి చేసుకోమ్మ అని నోటి దగ్గర పెడుతుంది. ఇవి... అని సత్యవైపు వైపు చూస్తుంది.
ఇవా మీ నాన్న స్వయంగా తన చేతులతో చేశాడు. ఎప్పుడు కిచెన్ లోకి రాని నా కొడుకుకు తన కూతురు కడుపుతో ఉందని ఎంతో ప్రేమతో చేశాడు తినమ్మా అని నోటి దగ్గరకి పెడుతుంది.
అవని వెంటనే సత్యవతి గారి చేతిని పట్టుకొని ఆపేస్తుంది. ఏమైందమ్మా.. క్షమించండి నానమ్మ అని తలదించుకుంటుంది.
ఆ మాటకి ధనుంజయ్ కి నీరసం వస్తుంది. మనవరాలని ఎలాగైనా ఒప్పించాలని అదేంటమ్మా అలా అంటావు మొట్టమొదటిసారి పుట్టింటి నుంచి స్వీట్ తీసుకుని వస్తే తినకపోతే ఎలా..
మీకు అంతకు ముందు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. నాకు పుట్టిల్లు అంటూ ఏమీ లేదు. నాకు పుట్టినిల్లు అయినా మెట్టినిల్లు అయినా అంతా ఈ ఇల్లే..
సరే అలాగే.. నువ్వు అనుకున్నట్టుగానే.. ఏదో ఇంటికి వచ్చిన చుట్టాలు నీకోసం తెచ్చారు అనుకోని తిను తల్లి అంటుంది.
ఈ టైంలో బయట వాళ్ళని ఎవరిని నమ్మలేను . ఆ మాటకి సత్యవతి మాట తడబడుతూ ఏమంటున్నావు అవని.
మీరు నన్ను ఎలాగ అనుకున్నా పరవాలేదు. నాకు ఇప్పుడు నా కడుపులోని బిడ్డ చాలా ముఖ్యం. ఇందులో ఏమీ కలిపారో ఏమిటో తెలియదు కదా..
తిని బిడ్డకు ఏదైనా హాని జరిగితే.. సత్యవతి చేతిలో ఉన్న లడ్డు జారిపోతుంది. ధనుంజయ్ మాటరాని వాడిలాగా కూతురు వైపే చూస్తూ ఉంటాడు.
ఈ నిమిషమే ప్రాణం పోతే బాగుండును అనిపిస్తుంది. కన్నీళ్ళతో కూతురినే చూస్తూ ఉంటాడు. శేషగిరి కి కూడా బాధగా అనిపించి ఎందుకు అలా చేస్తాడమ్మా.
వాడు నీకు తండ్రి. తెలియక తప్పు చేశాడు. దానికి పశ్చాత్తాపంతో రోజు కుమిలిపోతున్నాడు. మీ అబ్బాయి కనుక ఏది జరిగిన కడుపులో పెట్టుకోగలుగుతున్నారు.
అలాగే రేపు పుట్టబోయే బిడ్డ గురించి కూడా నేను జాగ్రత్తగా ఉండాలి కదా అంతేగాని మిమ్మల్ని ఎవ్వరిని నేను తప్పు పట్టడం లేదు.
నీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి తాతయ్య అంటుంది ఆ మాటకి ఏమి మాట్లాడలేకపోతారు. ఆఖరి ప్రయత్నంగా సత్యవతి అది కాదమ్మా.. ఇవి ఆరోగ్యానికి మంచిది బలం.
పోనీ నేను తిని చూపించనా అని నోటి దగ్గర పెట్టుకుంటుంది. వెంటనే ఆ చేతిని పట్టుకుని ఆపేసి ప్లీజ్ నానమ్మ ఇలాంటి టైంలో ఎవరు ప్రయోగాలు చేయవద్దు.
మీకు ఏదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. నీకు ఎందుకు తల్లి అంత భయం. ఆ సార్, మేడం గురించి నాకు బాగా తెలుసు.
భార్య, కూతుర్ని రక్షించుకోవడానికి.. వాళ్ల కోసం ఎంతవరకు అయినా చేయగలరు. ఏమైనా చేస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకో నానమ్మ.
సత్యవతి కూడా ఇంకా కామ్ అయిపోతుంది. వాతావరణమంతా వేడివేడిగా ఉంది అని వినయ్ తేలిక చేయడానికి...
అమ్మ అని పిలుస్తాడు. ఏంట్రా అని విసుగ్గా అంటే.. మనకి వేడిగా అనిపిస్తే.. ఫ్యాన్స్ వేసుకుంటాం ఏసీలు వేసుకుంటాం.
మరి లోపల బేబీ ఏం చేస్తుందమ్మా వేడిగా అనిపిస్తే ఎలా..
ఆ మాటకి అందరూ వినయ్ వైపు చూస్తారు. అదేం ప్రశ్న రా అని కళ్యాణ్ అడిగితే..
ఏం నాన్న డౌట్లు రాకూడదా? చిన్నపిల్లోడిని అడుగుతున్నాను తీర్చాలి కదా... నివి వినయ్ దగ్గరకు వచ్చి ఒరేయ్ చిన్నన్నయ్య.. ఇలాంటి గొప్ప గొప్ప డౌట్ లన్ని రాజ్ కి రావాలి.
అలాంటిది నీకు వచ్చింది ఏంట్రా.. సావాస దోషమా.. రాజ్ కోపంగా ఏది జరిగిన వచ్చి నా దగ్గర ఆగితే గాని నీకు ప్రశాంతంగా ఉండదా.
అయ్యో ఇప్పుడు నేను ఏమన్నానండి. మీలాంటి మహానుభావులకే కదా ఇంత తెలివైన డౌట్స్ వస్తాయి. అలాంటిది అన్నయ్యకు వచ్చేటప్పటికి అడిగాను అది కూడా నా తప్ప అండి అని అమాయకంగా ఫేస్ పెడితే..
వెంటనే పార్ధు లేదమ్మా నీది అసలు తప్పే కాదు. అది అర్థం చేసుకోలేని నా కొడుకుది తప్పు.
ఏంటి రాజ్ నీ పరిస్థితి ??
కథ కొనసాగుతుంది...
The following 11 users Like SivaSai's post:11 users Like SivaSai's post
• ABC24, ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Nivas348, Pilla, rammahesh77, Sachin@10, Sunny73, yekalavyass
Posts: 4,629
Threads: 9
Likes Received: 2,960 in 2,281 posts
Likes Given: 10,826
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 538
Threads: 10
Likes Received: 4,324 in 486 posts
Likes Given: 1,167
Joined: Aug 2024
Reputation:
400
Part - 129
పార్ధు కౌంటర్ కి రాజ్ పళ్ళు నూరుతూఉంటే... కరుణ కోపంంగా ఏంటిండి మీరు... అస్తమాను నా కొడుకుని అనడం తప్ప ఇంకేమి రాదా...
ఆలా అడుగు మమ్మీ... ఏమిటోయ్ నీ కొడుకుని వేనేకేసుకుని వస్తున్నావు. మీరు మీ కోడలి సపోర్ట్ అయ్యేతే నేను నా కొడుకు పార్టీ..
వాతావరణం తేలిక అయ్యింది అని అర్ధం అయ్యాక... విక్రమ్ అవని రెస్ట్ తీసుకుంటుందని చెప్పి రూమ్ లోకి తీసుకువెళ్తాడు.
ఒక నిమిషం అందరూ సైలెంట్ గా ఉంటారు. లలిత భోజనానికి రండి పెద్దమ్మ గారు అని చెప్పి ముగ్గురిని పిలుస్తుంది.
వెంటనే ధనుంజయ్ నాకు కొంచెం పని ఉందమ్మా. మళ్లీ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాము అని తల్లిదండ్రులు వైపు చూస్తాడు.
వాళ్లు కూడా బయలుదేరుతామని ముగ్గురు బయటికి వెళ్లిపోతారు. వెళుతున్న వాళ్ళని చూస్తూ ఉండిపోతారు. ఆడపిల్లగా అవని బాధ అర్థం అవుతుంటే అవనికి చెప్పలేకపోతున్నాము.
ఇటు ధనుంజయ్ ని ఓదార్చలేక పోతున్నాము. అవని ఆవేదన తీరేది ఎప్పుడో.. ఈ తండ్రి బాధ తీరేది ఎప్పుడో అని కళ్యాణ్ అంటాడు.
ఆ మాటకి ఇందిరా గారు అవని... వాళ్ల మీద పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయింది. ఆ నమ్మకం తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ తనే తండ్రిని ఒప్పుకుంటుంది. అది వచ్చే వారసులైన చేయాలి అమ్మ... అంత మంచే జరగాలని కోరుకుందాం.
గదిలోకి వెళ్లిన అవని సైలెంట్ గా ఉంటే విక్రమ్ ఏమైంది భార్యామణికి అంత మౌనంగా ఉంది. ఏమీ లేదు అని తలుపుతుంది.
పక్కన కూర్చుని భుజం చుట్టూ చేయి వేసుకొని దగ్గరకి లాక్కుంటాడు అవని విక్రం గుండెలపై తలవాల్చి చుట్టూ చేతులు వేసి మౌనంగా కళ్ళు మూసుకుంటుంది.
అవని నీ డిస్ట్రబ్ చేయకుండా కాసేపు అలాగే ఉంచుతాడు. ఎంతసేపటికి అవని మౌనంలో మార్పు రాకపోతే మెల్లిగా అవని అని పిలుస్తాడు.
హ.. అని మాత్రమే ఉంటుంది. రేయ్.. ఇటు చూడు... అవని కళ్ళల్లో నుంచి నీళ్లు ఊబుకుతూ ఉంటాయి. అవి విక్రమ్ కి చూపించడం ఇష్టం లేక ఇంకా తలన కిందకి దించి గట్టిగా పట్టుకుంటుంది.
అవని పట్టులో ఉన్న తేడా అర్థమయ్యి మెల్లిగా చేతులు విడిపించి గెడ్డం కింద చెయ్యి పెట్టి పైకి లేపుతాడు. ఆ కళ్ళు సంద్రాన్ని మరిపిస్తూ ఉంటే చూడలేక వెంటనే గట్టిగా కౌగిలించుకుంటాడు .
భర్త కౌగిలిలో కాస్త ఓదార్పు పొందిన తరువాత మెల్లిగా సర్దుకుని నేను బాగానే ఉన్నాను అంటుంది. కానీ ఆ మాట జీరబోతూ ఉంటుంది.
ఒరేయ్ ఇటు చూడరా అని భార్య ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు ఎందుకు ఇంత బాధ.. ఎందుకు వాళ్ళు అస్తమాను వస్తారు.
నా ఆనందం రెట్టింపు అవుతుంది అన్న ప్రతిసారి వీళ్లు కనపడి బాధని గుర్తు చేస్తున్నారు. వీళ్ళకి నా పైన ఎందుకు అంత కక్ష.
నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను కదా.. వాళ్ళ విషయంలో కానీ.. వాళ్లకు సంబంధించిన ఆస్తులు విషయంలో కానీ నేను ఎటువంటి హక్కు కావాలి అని కూడా అడగడం లేదు కదా...
బలవంతంగా ఆ సారే కంపెనీ నాకు అప్పచెప్పారు. అది నాకు ఇష్టం లేకపోయినా ఎంప్లాయిస్ ఇబ్బంది పడకూడదు అని ఒప్పుకున్నాను.
అది ఒప్పుకున్నంత మాత్రాన ఆ మనిషిని ఒప్పుకుంటాననా.. ఎందుకు ఇలాంటి గేమ్స్ ప్లే చేస్తున్నారు అర్థం కావడం లేదు.
అవని కన్నీళ్లు తుడిచి ఆ మనిషి మారాడేమో.. మారినా సరే నాకు వద్దండి. జీవిత కాలానికి సరిపడే బాధని వాళ్లతో ఉన్నప్పుడు అనుభవించేసాను.
ఏ జన్మలోనో ఎంతో కొంత పుణ్యం చేసుకునే ఉండి ఉంటాను. అందుకే ఆ భగవంతుడు కరుణించి ఇలాంటి అందమైన కుటుంబాన్ని నాకు వరంగా ఇచ్చాడు.
ఈ కుటుంబం పైన గాని, రేపు వచ్చే వారసుల పైన గాని వాళ్ల నీడ పడడం కూడా నాకు ఇష్టం లేదు. దయచేసి వాళ్ళని మన ఇంటికి రానివ్వదు. ఒకవేళ వచ్చిన నాతో ఎటువంటి సంబంధం వద్దు.
సరే సరే అవన్నీ నేను చూసుకుంటాను.. నువ్వు ఎమోషనల్ అవ్వద్దు. అది నీకు, కడుపులో ఉన్న బేబీకి ఇద్దరికీ మంచిది కాదు. రెస్ట్ తీసుకో అని బలవంతంగా పడుకోబెట్టి జో కొడుతూ ఉంటాడు.
ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆఫీసు విషయమో.. మనీకి సంబంధించిందో ఇంకొకటి ఇంకొకటి అయితే చిటికి వేసిన విధంగా సాల్వ్ చేసేవాడు.
కానీ ఇది గాయపడిన మనసుకు సంబంధించిన విషయం. కూతురు విషయంలో ఒక తండ్రి నిర్లక్ష్యానికి సంబంధించినది.
ఎలా సరిదిద్ద కలడు. ఆ గాయపడిన మనసు కుదుటపడి పరిస్థితిని ఒప్పుకోవాలి కానీ ఇందులో బలవంతం చెయ్యలేము కదా ఎలా దీని పరిష్కరించాలి..
కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అంటారు. చూద్దాం ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో అని ఆలోచిస్తూ అవని నీ చూస్తాడు.
అవని నిద్రపోవడం చూసి మెల్లిగా లేచి దుప్పటి కప్పి ఏసి అడ్జస్ట్ చేసి హాల్లోకి వస్తాడు. విక్రమ్ ని చూసిన లలిత ఏరా అవని ఏం చేస్తుంది.
పడుకుంది అంటాడు. నువ్వేంటి రా అంత ముభావంగా ఉన్నావు. ఏమీ లేదు అమ్మ. ఏమీ లేకపోతేనే నీ ఫేస్ ఇలాగుందా.. ఏమైందిరా అని కళ్యాణ్ అడిగితే... ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావడం లేదు.
అవని వాళ్ళని ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇంటికే రానివ్వద్దు అంటుంది. ఆ ధనుంజయ్ ఏమో కూతురి కోసం అల్లాడిపోతున్నాడు.
రావద్దు అని చెప్పలేము. వస్తే అవని బాధ చూడలేకపోతున్నాను ఎలా అని కణతల మీద వేలుతో రుద్దుకుంటూ ఉంటాడు. నువ్వు ఎక్కువ ఆలోచించకు. కొన్ని సమస్యలను కాలానికి వదిలేయడమే మంచిది.
సరే ఇప్పటికే చాలా లేట్ అయింది. భోజనం చెయ్ విక్రమ్. ఆకలిగా లేదమ్మా అంటాడు. ఆకలి ఎందుకు వేయదు. నువ్వు తింటేనే అవనినీ ఓపిగ్గా హ్యాండిల్ చేయగలుగుతావు రా అని తీసుకువెళ్లి బలవంతంగా అన్నం తినిపిస్తారు.
భోంచేసిన తర్వాత నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. వెళ్లి అవని పక్కన పడుకుని బుగ్గ మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటాడు.
నీకు డెలివరీ అయ్యే వరకు ఎటువంటి బాధలు నీ దరిదాపుల్లోకి రానివ్వను. నువ్వు సెట్ అయ్యావు అనుకున్నాక ఆఫీస్ కి వెళదాం అనుకున్నాను.
ఈరోజు పరిస్థితిని చూస్తూ ఉంటే నీతోనే ఉండడం మంచిది అని అర్థమయింది. దానికి తగ్గట్టుగా నా వర్క్ ప్లాన్ చేసుకుంటాను అని ఫిక్స్ అవుతాడు.
సాయంత్రానికి మెల్లిగా కళ్ళు తెరిచిన అవని పక్కనే విక్రమ్ నిద్రపోతూ కనిపిస్తాడు. టైమ్ ఎంతయిందా అని చూసి అమ్మో ఇంతసేపు పడుకున్నానా అని ఉలిక్కిపడి లేస్తుంది.
అవని కదులుతున్నప్పుడే మెలుకు వచ్చిన విక్రమ్ ఏయ్ అవని ఏంటి ఆ కంగారు. ఎంతసేపు పడుకున్నానో చూశారా.. మీరైనా లేపచ్చు కదా.. కింద అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు.
అవును అమ్మ, నాన్నమ్మ నీ మీద చాలా కోపంగా ఉన్నారు. కంగారుపడుతూ ఏం చేశానని.. నావల్ల ఏమైనా తప్పు జరిగిందా..
చాలా పెద్ద తప్పే జరిగింది కదా.. సరిగ్గా చెప్పండి నాకు కంగారుగా ఉంది. నువ్వు ఉన్న కండిషన్ ఏమిటి.. నువ్వు చేస్తున్న పనులు ఏమిటి అంటాడు..
ఆ మాటకి అర్థం కాక చూస్తూ ఉంటే కడుపుతో ఉన్నావు కదా.. మరి అలా ఏడవచ్చా.. లేనిపోని ఎమోషన్స్ అన్నిటిని పోగేసుకుంటే బేబీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది నీకు అర్థమవుతుందా..
అందుకే అమ్మ నాన్నమ్మ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నిన్ను అడిగితే ఏమని చెబుతావు. అవని కొంచెం రిలాక్స్ అయ్యి మీరు అన్నది కూడా నిజమేనండి.
ఎవరి గురించో ఆలోచించి నేను డిస్టర్బ్ అయి బేబీని ఇబ్బంది పెడుతున్నాను. ఈ నిమిషం నుంచి వాళ్ల గురించి అసలు ఆలోచించను. బాధపడను.
నాకు నా బేబీయే ముఖ్యం. అత్తమ్మకి నేను చెబుతాను అని మంచం దిగుతుంది. విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ సరే పద కిందకి.
మేడం గారు భోజనం కూడా చేయకుండా నిద్రపోయారు. లోపల నా బేబీకి ఎంత ఆకలేస్తుందో ఏమిటో అంటాడు. అవునా.. మీ బేబీకి ఆకలేసి అమ్మ అమ్మ అని నన్ను లేపింది.
అవును నా బేబీ యాక్టివ్ గా ఉంటది కాబట్టి ఈ లేజీ మమ్మీ ని లేపింది. లేకపోతే ఇంకా పడుకునేదానివి. అంటే ఏమిటి నేను లేజీనా.. మరి కాదా అసలు ఎంత నిద్రపోతున్నావో చూసుకుంటున్నావా...
ఏమోనండీ ఊరికే నిద్ర వచ్చేస్తుంది. అలసటగా అనిపిస్తుంది. అందుకే మరి హెల్తీ డైట్ తీసుకోమనేది. నువ్వు కేవలం నీ హెల్త్ మీద బేబీ హెల్త్ మీద మాత్రమే ఫోకస్ పెట్టు. అర్థమైందా అని కిందికి తీసుకువెళతాడు.
అవని నీ చూసిన మాధవి లేచావా అని స్నాక్స్ చేసి తీసుకొచ్చి ఇస్తుంది. సారీ అమ్మ నిద్ర పట్టేసింది అంటే తల మీద చెయ్యి వేసి ఈ టైంలో అలాగే ఉంటుంది.
నువ్వు ప్రతి దానికి ఫీల్ అవ్వకు. అమ్మకు ఎవరైనా సోరి చెప్తారా. ముందు తిను తర్వాత జ్యూస్ తాగు. ఫ్రూట్స్ కూడా బాగా తిను.
ఇంకేమైనా తినాలి అనిపిస్తే చెప్పు. అమ్మ అని పిలుస్తుంది. ఏంట్రా అంటే.. ఇప్పుడు వాక్కాయలు దొరుకుతాయి కదా.. వాక్కాయలో ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటుంది కదా..
బాగుంటుంది కానీ.. ఈ టైంలో వద్దులేరా అంటుంది. ప్లీజ్ అమ్మ అంటే.. కొంచెం పులుపు ఉంటుంది కదా.. మళ్లీ అందులో ఉప్పు,కారం.
గ్యాస్ ఏమైనా ఫామ్ అయింది అనుకో విక్రమ్ మనిద్దరిని చంపేస్తాడు. కానీ నాకు తినాలని ఉందమ్మా అని గారాలు పోతుంది.
వీళ్లిద్దరి కాన్వర్జేషన్ అర్థం కాక దూరం నుంచి చూస్తున్న విక్రమ్ ఏం చేస్తున్నారు అని దగ్గరికి వచ్చి ఏమైంది అత్తయ్య..
ఏం కావాలి అంటే ఏమీ లేదురా.. ఆడవాళ్ళ విషయం పరవాలేదు చెప్పు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదే...
నా కూతురుకి ఏదో తినాలి అనిపిస్తుంది అంట. అది అడుగుతుంది అంటుంది. ఏం తినాలి అనిపిస్తుంది అవని..
మరి అడిగాక కోప్పడరు కదా.. నేను కోప్పడే అంత భయంకరమైన ఐటమా.. అబ్బా కాదండి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది అంటుంది. అవునా ఇంతకీ ఏమిటో.. ఏం తినాలి అనుకుంటుందో చెబుతుంది.
విక్రమ్ సమాధానం...
The following 11 users Like SivaSai's post:11 users Like SivaSai's post
• ABC24, ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Nivas348, Pilla, rammahesh77, Sachin@10, Sunny73, yekalavyass
Posts: 538
Threads: 10
Likes Received: 4,324 in 486 posts
Likes Given: 1,167
Joined: Aug 2024
Reputation:
400
Part - 130
విక్రమ్ అవని వైపు చూస్తూ ఏం తినాలి అనిపిస్తుంది. చెప్పాక మాత్రం కోప్పడకూడదు. సరేలే చెప్పు.
వాక్కాయలు కావాలి.
ఏం కాయలు అని కొంచెం సీరియస్‌గా అడుగుతాడు. వాక్కాయలు అండి అని ఏడుపు ముఖంతో అంటుంది. అవి ఎంత పుల్లగా వగరుగా ఉంటాయో తెలుసా.. తెలుసు నాకు అదే కావాలి అంటుంది.
ఒరేయ్ మనవడా ఈ టైంలో ఆడవాళ్ళకి ఇలాగే ఉంటుంది. తినాలనిపించింది కొంచెం అయినా సరే తినాలి లేకపోతే పుట్టబోయే బిడ్డ అలుగుతాడు.
ఏంటి నానమ్మ మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా ఆడదాన్నే కదా... అపర్ణ వాటి సంగతి ఏమిటో చూడు ఆల్రెడీ చెప్పడం అయిపోయింది అత్తయ్య. వచ్చేస్తున్నాయి అంటుంది.
ఎప్పుడు పురనాయించేసావమ్మా అంటే మాధవి తో చెబుతున్నప్పుడే ఉంటుంది. సర్వెంట్ బుట్టతో తెచ్చి అక్కడ పెట్టగానే అత్తయ్య ఇన్న అంటే...
నీకు ఎన్ని తినాలనిపిస్తే అన్ని తిను. మిగిలిన వాటితో ఏదో ఒకటి చేద్దాంలే అంటుంది. ఎక్కువ తినొద్దు ఒక నాలుగు కాయలు తిను చాలు అని విక్రమ్ అంటాడు.
నాలుగు కాయలు ఏమూలకి వస్తాయండి. ఒక్కొక్క పంటికి ఒక్కొక్క కాయ వేసుకున్న 32 కాయలు కావాలి అంటుంది.
మాధవి ఉప్పు కారం కలిపి ప్లేటు తెచ్చి పెడుతుంది. శుభ్రంగా కాయలన్నీ కడిగి ఇంకొక ప్లేట్లో పెడతారు. వాటిని చూడగానే అవనికి నోట్లో లాలాజలం ఊరిపోతూ ఉంటుంది.
గబగబా తీసుకొని తింటూ ఉంటుంది. ఒక పక్కన తింటూనే అబ్బా పుల్లగా ఉంది అని కళ్ళుమూస్తూ ఉంటుంది.
అవని తినే విధానం చూసే అందరూ టెంప్ట్ అయ్యి దగ్గరకు వచ్చి తీసుకుంటారు. విక్రమ్ ఒక కాయ నోట్లో వేసుకుని బాబోయ్ ఇంత పుల్లగా ఉంటే ఎలా తినగలుగుతున్నావు నీకు నోరుపులుపు రావడం లేదా...
లేదండి ఇలా తినండి ఇంకా బాగుంటది అంటే ఒక నమస్కారం చేసి నువ్వు తిను. నావల్ల కాదు కడుపుతో ఉంటే ఇన్ని వేరియేషన్సా..
అప్పుడే ఏం చూసావు.. ముందు ముందు ఇంకా ఉంటాయి అని కళ్యాణ్ అంటే.. ఎక్స్పీరియన్సా.. చాలా.
మీరు ముగ్గురు.. మా చెల్లికి ఒక్కడు.
మొత్తం నలుగురు. మేము ఎంత ఎంజాయ్ చేసాము అనుకుంటున్నావు. ఎందుకులే బావ విక్రమ్ కి చెప్పడం. మనం అంటే ఫుడీస్ కాబట్టి వాళ్లతో పాటు ఎంజాయ్ చేసాము.
మన విక్కీ బాబు డైట్ డైట్ అంటాడు కదా.. అని రమేష్ అనగానే.. మావయ్య అంటాడు. ప్రెగ్నెంట్ లేడీస్ ఫుడ్ బలే వెరైటీగా ఉంటుంది ఎంజాయ్ చేయి అని చెప్పి నవ్వుతారు.
అందరి నవ్వులు సరదాలు మధ్యన అవని తేలిక పడుతుంది. మరునాడు ఉదయం అవని నిద్రలేచేటప్పటికి యోగా ట్రైనర్ రెడీగా ఉంటుంది.
అప్పుడే అరేంజ్ చేసేసారా.. చెప్పాను కదా నీ విషయంలో ఏది లేట్ చెయ్యను అని.. మరీ ఇంత తొందరగానా నాకు బద్ధకంగా ఉంది.
ఆ బద్దకాన్ని వదిలించడానికే ఈ మేడం వచ్చారు వేకప్ అని చెబుతాడు. కష్టంగా లేచి బయటకి వస్తుంది.
అవని తో పాటు నివి కూడా స్టార్ట్ చేస్తుంది.
నీకెందుకు నివి అంటే ఫిట్నెస్ కోసం వదిన. పెళ్లి దగ్గరలో ఉంది కదా.. నివి నువ్వు చాలా గ్రేట్. ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉంటావు. థాంక్యూ.. థాంక్యూ.. వదిన.
ఇంతకీ మా అన్నయ్య ఎక్కడ.. హో రాజ్ గురించా.. ఆయనకు ఒళ్ళంతా బద్ధకమే. అప్పుడే ఎందుకు లెగుస్తారు.
అలా అనకు.. రాజ్ అన్నయ్య చాలా యాక్టివ్. నేను బెంగళూరులో ఉండగా చూశాను కదా.. అప్పుడు ఎంత డ్రామా ప్లే చేశారు అనుకుంటున్నావు.
నవ్వుతూ మేము అలా ప్లే చేసాం కాబట్టే నువ్వు ఓపెన్ అయ్యావు లేకపోతే ఇంకా సాగదిద్దువు కదా అని విక్రమ్ అంటాడు.
ఓ మీరు కూడా ఇక్కడే ఉన్నారా.. నీ వెనకాల లేకపోతే ఇలాగే కబుర్లు చెబుతూ టైంపాస్ చేస్తావు. అందుకే నేను నీ యోగ అయ్యేదాకా ఇక్కడే ఉంటాను.
ఇది చీటింగ్ నేనొప్పుకోను అంటుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పదు బంగారం కానీ కానీ అంటాడు. కష్టంగా యోగ మొదలు పెడుతుంది.
వన్ అవర్ చేయిపించిన తర్వాత ఈరోజుకి చాలు మేడం. రేపు ఇంకా కొన్ని యాడ్ చేద్దాం..వన్ అవర్ చాలా అని నోరు వదిలేస్తుంది.
హెల్త్ ఇంపార్టెంట్ కదా తప్పదు. ఈవినింగ్ వాకింగ్ చేయండి అని చెప్పి ట్రైనర్ వెళ్ళిపోతారు. ట్రైనర్ వెళ్లగానే హమ్మయ్య అనుకుని రిలాక్స్ అవుతుంది.
వెంటనే క్యారేట్, బీట్రూట్ జ్యూస్ రెడీ అవుతుంది. అది చూసి అత్తయ్య అని బిక్కమొహం వేస్తుంది. తప్పదు బంగారం తాగేసి వెళ్లి స్నానం చేసి రా..
అప్పుడు వేడివేడిగా బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తాము అని గ్లాస్ చేతిలో పెడుతుంది. నేను తాగుతాను మీరు వెళ్ళండి అత్తయ్య.
నీ హెల్త్ డైట్ విషయంలో ఎవ్వరం నెగ్లెట్ చేయము. నువ్వు తాగేసి గ్లాస్ ఇస్తే నేను వెళ్తాను అంటుంది. సర్వెంట్స్ ఉన్నారు కదా అత్తయ్య వాళ్ళకి ఇస్తాను.
నీ పనులు మొత్తం మేమే చేస్తాం తల్లి కానీ అంటుంది. ఆ జ్యూస్ తాగి ఇప్పుడు హ్యాపీ నా.. నువ్వు బంగారానివే అని చెప్పి మెటికలు విరిచి వెళతారు.
తాగితే బంగారం.. తాగకపోతే తాగేదాకా వదలరు. ఏమిటో అనుకుని రూమ్‌లోకి వెళుతుంది. రూమ్ చూసి ఏంటి ఇలా మారిపోయింది. నేను మా గదిలోకే వచ్చానా అని చుట్టూ చూస్తూ ఉంటుంది.
నచ్చిందా అని అడుగుతాడు. అదేంటి. కర్టన్ కలర్స్ అన్ని మార్చేశారు. రూమ్ లో కూడా డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఏం చేశారు.
కర్టెన్స్ అన్ని లైట్ కలర్స్ కి మార్చాను బంగారం. నీ కళ్ళకి ప్రజెంట్ గా కనపడాలి కదా.. అలాగే స్మెల్ కూడా బాగుంటే నువ్వు రిలాక్స్డ్ అవుతావని.
అత్తింటి వారు చూపిస్తున్న ప్రేమకి ఫిదా అవుతూ విక్రమ్ ని గట్టిగా కౌగిలించుకొని నా విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారండి.
ఇప్పుడే అత్తమ్మ జ్యూస్ ఇచ్చారు. మీరేమో నా మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలని ప్రతి నిమిషం ఆరాటపడుతున్నారు.
థాంక్యూ.. థాంక్యూ.. గట్టిగా ముద్దు పెడుతుంది. బంగారం నువ్వు ఇలా టెంప్ట్ చేసావంటే చాలా కష్టం.. అసలు నీకు లేత నెలలు.
ఆంటీ కొన్ని రోజులు దూరంగా ఉండమన్నారు. నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు అని చుట్టూ చేతులు వేస్తాడు. నవ్వుతూ అయితే మీకు ఇంకొక గట్టి పరీక్ష అంటుంది
నాకేనా నీకు కాదా అని ముక్కు పట్టుకుని లాగుతాడు. నవ్వుతూ నాదారి వేరులే.. ఏదైనా ఒకటే.. ఎవరి బాడీలో అయినా హార్మోన్స్ అలాగే మారుతూ ఉంటాయి.
కాకపోతే మగవాళ్ళం బయట పడతాము. మీ ఆడవాళ్లు బయటపడరు అంతే అంటాడు. అబ్బో మా ఆడవాళ్ళ గురించి బాగా రీసెర్చ్ చేసినట్టున్నారే..
బయట లేడీస్ మీద ఎందుకు... రీసెర్చ్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా.. నాకు తెలియదా ఏమిటి అంటాడు.
వెళ్లి స్నానం చేసిరా మళ్ళీ టిఫిన్ లేట్ అవుతుంది అని వాష్ రూమ్‌లోకి పంపిస్తాడు. నీళ్లు కూడా సెట్ చేస్తాడు. ఇంతకుమించి వేడి చేయకు. అలాగే చన్నీళ్లు చేయకు అని సెట్ చేసి వస్తాడు.
స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి లైట్ వెయిట్ సారీ తీసి ఉంచుతాడు. నేను తీసుకుంటాను కదా.. ఏంటి తీసుకునేది..
నువ్వు కట్టే చీరలు వెయిట్ ఎక్కువ అయిపోతున్నాయి. అందుకే ఈ లైట్ వెయిట్ సారీస్ కట్టుకో అంటాడు. ఇవి ఇప్పుడు తెప్పించారు.
నా దగ్గర లేవు కదా.. నీ మొగుడు సో స్మార్ట్ బంగారం. అందుకే అన్నీ తెప్పించి రెడీగా పెట్టాడు. అబ్బో అని చుట్టూ మెటికలు విరిచి అయితే రేపు ఎవరు పుడతారో వాళ్లకి కూడా ఇప్పుడు నుంచే తెచ్చి పెడతారా..
ఆ విషయంలో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. బేబీ రూమ్ కూడా రెడీ అయిపోతుంది. చీర కట్టుకుంటూనే అమ్మో బేబీ ని సెపరేట్ రూమ్ లోన..
నేను పడుకోబెట్టను. నా పక్కనే పడుకుంటుంది. అయ్యో ఇండివిడ్యువాలిటీ అలవాటు అవ్వాలి బంగారం. సెపరేట్ బెడ్ ఉండాలి.
ఏమో అవన్నీ నాకు తెలియదు. బేబీ ఎప్పుడు నాతోనే ఉండాలి. నేను మా అమ్మ దగ్గర మిస్ అయిన ప్రతి ఫీలింగ్ ని కూడా నేను నా బేబీకి ఇవ్వాలి.
సరే సరే నీకు ఎలా నచ్చితే అలా చేద్దాం సరేనా.. నువ్వు మాత్రం ఎమోషనల్ అవ్వకు. అవని చీర కట్టుకున్న తరువాత విక్రమ్ జడ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు.
అబ్బా జడ మీ వల్ల కాదండి. ట్రై చేస్తున్నాను కదా ఎలా వచ్చినా వెయ్యినివి. ఒక ఫోర్ డేస్ వేసాను అనుకో.. అప్పుడు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది.
ఇదేమన్నా నేర్చుకోలేనిదా.. ఎంతమంది హెయిర్ స్టైలిష్ లు అబ్బాయిలు ఉండడం లేదు అని కూర్చోబెట్టి మెల్లిగా చిక్కు తీసి వచ్చిన విధంగా జడ వేస్తాడు.
పాపిట్లో కుంకుమ పెట్టి పర్ఫెక్ట్ అంటాడు. సరే అని లేచి నిలబడుతుంటే.. వెయిట్ అని చెప్పి తలలో పువ్వులు కూడా పెడతాడు.
ఎందుకు నన్ను చీర లైట్ వెయిట్ కట్టుకోమన్నారు....
మీరు మాత్రం నన్ను హెవీగా రెడీ చేస్తున్నారు. నవ్వుతూ పువ్వులు ఎక్కువ కాదు బంగారం తక్కువే పెట్టుకో.
ఇలా రెడీ అవుతే కొంచెం ముద్దుగుమ్మ లాగా ఉంటావు. పద అని తీసుకువెళతాడు . అవని నార్మల్‌గా నడుస్తూ ఉంటే నువ్వు అంత స్పీడ్ గా ఎందుకు నడుస్తున్నావ్ మెల్లిగా నడువు అని కసురుకుంటాడు.
ఇప్పుడు నేను స్పీడ్ గా ఎక్కడ నడిచాను. రోజు నడిచినట్టే కదా.. ఆ స్పీడే తగ్గించమని.. ఆంటీ వాకింగ్ చేయమన్నారు గాని పరిగెత్తమనలేదు. స్లో అంటాడు.
విక్రమ్ ఏం చెప్పినా వినడు అని అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు.. మీరే కదా స్లోగా నడవమన్నారు.
ఇలా నడిస్తే సరిపోతుందా.. ఏమిటి వెటకారమా..కాదు మమకారం నచ్చిందా.. మరీ ఎక్కువ అవుతుంది కానీ కొంచెం స్పీడ్ పెంచు అని చెప్పి నాతోపాటు కలిసే అడుగులు వెయ్యి అని చేయి పట్టుకుంటాడు. సరే అని విక్రమ్ చేయి పట్టుకుని నడుస్తుంది.
విక్రమ్ ప్రేమ అవని పాట్లు??
కథ కొనసాగుతుంది...
The following 11 users Like SivaSai's post:11 users Like SivaSai's post
• ABC24, ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Nivas348, Pilla, rammahesh77, Sachin@10, Sunny73, yekalavyass
Posts: 4,629
Threads: 9
Likes Received: 2,960 in 2,281 posts
Likes Given: 10,826
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 1,248
Threads: 2
Likes Received: 695 in 505 posts
Likes Given: 1,456
Joined: May 2019
Reputation:
7
•
Posts: 538
Threads: 10
Likes Received: 4,324 in 486 posts
Likes Given: 1,167
Joined: Aug 2024
Reputation:
400
Part - 131
అవని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి బ్రేక్ ఫాస్ట్ పెడతారు. అత్తయ్య నాకు కారంగా కావాలి.మార్నింగ్ టైం కారం వద్దు. లంచ్ లోకి కారంగా చేసి పెడతాను.
చికెన్ చేయండి అత్తయ్య అంటుంది. ఏమిటి చికెన్ మీదకి లాగుతుందా.. హా తినాలి అనిపిస్తుంది. విక్రమ్.. వినయ్, భరత్ కి ఆఫీస్ వర్క్ అంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు
ఎమర్జెన్సీ అయితే మాత్రం చెప్పండి. వస్తాను. లేదంటే నేను ఇంటి దగ్గర నుంచి హ్యాండిల్ చేస్తాను. షూర్ అన్నయ్య మేము చూసుకుంటాం కదా అని ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళిపోతారు.
ఆఫీస్ కి వెళ్లి వర్క్ లో బిజీ అయిపోతారు. టు అవర్స్ వర్క్ చేసిన తర్వాత వినయ్ రిలాక్స్ అవుతూ ఉంటే పూజిత గుర్తొస్తుంది.
ఈ మేడమ్ ఏం చేస్తుంది. మళ్ళీ ఎవరినైనా రోడ్డుమీద పెట్టి కొడుతుందా.. ఫోన్ చేద్దాం. చేస్తే పోలా అనుకుని ఫోన్ చేస్తాడు.
అవతల నుంచి స్వీట్ వాయిస్ వినపడుతుంది. హలో సర్ వాట్ డు యు వాంట్ అడుగుతుంటే.. ఆ వాయిస్ కి మెల్ట్ అవుతూ మీరే కావాలి అంటాడు.
హలో మిస్టర్ ఎవరు మాట్లాడేది. ఎవరైతే ఏమిటి.. మీరు అడిగారు నేను సమాధానం చెప్పాను. ఇప్పుడు ఇలా అడిగితే ఎలా మిస్ అంటాడు.
నా ఎదురుగా వచ్చి అడుగు అప్పుడు చెబుతాను. ఆహా.. నేను మీ ఎదురుగుండా వస్తే నా మక్కెలు ఇరగదీయ్యడానికా...
పరవాలేదు నా గురించి బాగానే తెలుసుకున్నావు. తెలుసుకున్నాను కాబట్టే ఫోన్లో మాట్లాడుతున్నాను. మొన్న చీర కట్టుకున్నారు కదా కత్తి లాగా ఉన్నారు.
మిస్టర్ మాటలు సరిగ్గా రానివ్వి. నేను చీర కట్టుకుంటే నీకెందుకు.. అయినా ఏదో నీకోసం కట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నావు.
నాకోసమే కదా కట్టుకున్నావు అంటాడు. నువ్వు ఎవరో తెలియనప్పుడు నీకోసం ఎందుకు కట్టుకుంటాను మిస్టర్. ఇంతలోనే నన్ను మర్చిపోయా... టూ మచ్ బాడ్ అమ్మాయ్...
ఓ నువ్వా అబ్బాయ్.. ఏమిటి ఖాళీగా ఉన్నావా...
ఫోన్ చేసి మరీ సతాయిస్తున్నావు. నువ్వు ఖాళీగా ఉండి ఉంటావు కదా అని ఫోన్ చేశాను.
దానికి తగ్గట్టుగానే సమాధానం చెప్పావు కదా.. హలో ఇది నా బిజినెస్ వర్క్. ఎవరితో అయినా ఇలాగే మాట్లాడతాను.
నాతో మాట్లాడింది మిగిలిన వాళ్ళతో మాట్లాడింది ఒక్కటేనా.. నేను చెప్పింది కస్టమర్స్ గురించి అంటుంది. అయితే నేను కస్టమర్ ని కాదు కదా..
నాతో స్పెషల్ గా మాట్లాడతావా.. ఏముంది నీలో అంత స్పెషల్ మాట్లాడడానికి అని సాగదీస్తుంది. స్పెషల్ ఉంది కాబట్టే కదా కొట్టి మాట్లాడే అమ్మాయి... ఇంత స్మూత్ గా మాట్లాడుతుంది.
ఇప్పుడు దాకా నేను అబ్బాయిలాగా బిహేవ్ చేశానా.. కాదు రౌడీ పిల్లవి. ప్రస్తుత రోజుల్లో రౌడీలాగా ఉంటేనే మన జోలికి ఎవ్వరూ రారు అబ్బాయ్..
అవునవును నీ జోలికి రావాలి అంటే నేనే భయపడతా.. నీకు మిగిలిన వాళ్ళు ఒక లెక్క. నీలో ఏముంది స్పెషల్ అంటే మాత్రం చెప్పడం లేదు అంటుంది.
స్పెషల్ ఏమిటో నీ మనసుని అడుగు. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు. ఏ ఆఫీస్ లో వర్క్ లేదా.. మీ బాస్ ఏమీ అనడం లేదా...
మా బాస్ నాకు టైం ఇచ్చారులే నీతో మాట్లాడమని. ఓహో ఇది కూడా పర్మిషన్ అడిగి ఫోన్ చేసావా... ఏదైతే ఏమిటి నీతో ఫోన్ మాట్లాడుతున్నాను కదా..
అది ఎంజాయ్ చేయడం మానేసి... ఎలా చేసావ్.. పర్మిషన్ ఇచ్చారా.. ఎందుకు చేసావ్ ఇలాంటి అనవసరమైన విషయాలు ఎందుకు అమ్మాయ్...
నువ్వు ఖాళీగా ఉన్నావేమో గాని నేను ఖాళీగా లేను అబ్బాయ్.. బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ వైపు చూసి నవ్వుకుంటూ ఉంటాడు.
తన ముందు ఎవరో ఉన్నట్టు అనిపించి తల పైకెత్తి చూడగానే భరత్ కుర్చీలో కూర్చుని, ఒక చెయ్యి బుగ్గ కింద చెయ్యి పెట్టుకుని.. మరొక చేతితో టేబుల్ పైన దరువేస్తూ ఏంటి బావ సంగతి.
ఏముంది ఏమీ లేదు అనే దబాయిస్తాడు.. అబ్బో నీ మాటలోనే తెలుస్తుంది గాని ఎక్కడ వరకు వచ్చింది. నువ్వు అనుకున్నంత ఏమీ లేదు బావ.
జస్ట్ రౌడీ పిల్ల.. ఏదో ఆట పట్టిద్దామని కాల్ చేశాను అంతే అంటాడు. ఆట పట్టిద్దామనా లేకపోతే ఆడుకుందామన.. నేనేం ఆడుకుంటాను..
నేను ఏమైనా చిన్నపిల్లడినా.. చిన్నపిల్లల ఆడే ఆటల గురించి నేను ఎక్కడ అన్నాను బావ. ఆడుకోవడంలో చాలా రకాలు ఉంటాయి.
మన వయసులో అంటే రొమాన్స్ ఆట ఆడుకోవచ్చు.
ప్రేమ ఆట ఆడుకోవచ్చు ఇంకా ముందుకు వెళితే... సౌండ్ వచ్చేలాగా ఒక నమస్కారం పెట్టి తమరెందుకు వచ్చారో చెప్పలేదు అంటాడు.
ఎందుకు బావ అంత ఫ్రస్టేషన్.. నీకు హెల్ప్ చేద్దామని నేను చూస్తూ ఉంటే.. నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కానీ ముందు తమరి సంగతి చూసుకోండి.
ఇంతకీ మొన్న ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి జాయిన్ అయ్యిందా... భరత్ దిక్కులు చూస్తూ ఏ అమ్మాయి అంటాడు.
నువ్వు దిక్కులు చూస్తున్న అమ్మాయి.. తెలిసిపోయిందా.. నువ్వు నా దగ్గర సీక్రెట్ మైంటైన్ చేయలేవులే గాని... నువ్వే నా కన్నా స్పీడ్ గా ఉన్నావ్.
మాది ఇంకా చూపుల దగ్గరే ఆగిపోయింది. తను చూపుల దగ్గర ఆపేస్తే ఏమైంది నువ్వు ముందుకు తీసుకువెళ్ళు బావ..
ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావడం లేదు రా... ఆ అమ్మాయి మరీ కామ్ గా ఉంది. ఇంతకీ అమ్మాయి పేరు ఏమిటో.. విద్య.
నైస్ పేరుకు తగ్గా చదవన్నమాట. చదువు తప్ప ఇంకా బయట ప్రపంచంతో సంబంధం ఉండడం లేదు
ఎలా లైన్లో పెట్టాలో అర్థం కావడం లేదు అని తల పట్టుకుంటాడు.
వినయ్ కాల్ చేసే విద్యని పిలుస్తాడు. ఒరేయ్ ఇప్పుడు అమ్మాయిని ఎందుకురా.. ఒకసారి మా చెల్లి ఎలా ఉంటుందో చూడాలి బావ.
మీ చెల్లికే బానే ఉంటుంది కానీ నా తిప్పలే.. ఎక్స్‌క్యూజ్‌మీ అన్న స్వీట్ వాయిస్ వినపడుతుంది. ఎస్ కమిన్ అని వినయ్ గంభీరంగా అంటాడు.
భరత్.. నన్ను ఇరికించేస్తున్నావ్ కదరా అని ఏమీ తెలియనట్టుగా ఫోన్ చూస్తూ ఉంటాడు. లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ పిలిచారంట .
ఎస్ మిస్ విద్య. మీరు చేస్తున్న ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది దాని డీటెయిల్స్ ఏంటి అంటే... టక టక గ్యాప్ ఇవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
ఓకే నైస్ అని.. మిస్ విద్యా అంటే చెప్పండి సార్. ఏమీ లేదు ఇది లేడీస్ మ్యాటర్. జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటాడు.
నేనా అని భయంగా అంటే.. పరవాలేదు మీరు నాకు సిస్టర్ లాంటివారే.. అయితే అడగండి సార్. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ డ్రెస్సెస్ ఏం వచ్చాయి.
ఏమైనా ఐడియా ఉందా.. నేను ఒకరికి గిఫ్ట్ గా ఇవ్వాలి. అయ్యో నాకు తెలియదు సార్. అవన్నీ మా అమ్మే కొంటుంది. అవునా నైస్ వెళ్ళమ్మా అని పంపించి భరత్ వైపు చూస్తాడు. నేను చెప్పానా అంటాడు భరత్ .
నువ్వు చాలా కష్టపడాలి బావ మా చెల్లిని ట్రాక్ లోకి తీసుకు రావడానికి.. అదే కదా నా బాధ. ఎలా చెబుదామన్నా ఏమీ అర్థం కాదు.
ఒక్క స్టడీస్ ప్రాజెక్ట్ సంబంధించింది అయితే ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంతా విద్య బుర్రలోని ఉంటుంది. ఒక పని చెయ్ వాళ్ళ మదర్ ని లైన్లో పెట్టు..
ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా అంటే నేను అన్నది వాళ్ళ మదర్ సైడ్ నుంచి నరుక్కురా ఆవిడ ఒప్పుకుంటే ఆటోమేటిక్‌గా విద్య ఒప్పుకుంటుంది.
అప్పుడు అది పెద్దవాళ్ళు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది రా.. ఓహో తమరికి లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అన్న కోరిక ఉంది కదు.
ఇలాగైతే నా పెళ్లయిపోయి నా పిల్లలు కూడా పెళ్లికి వచ్చేస్తారేమో... ఏంట్రా సెటైరా.. కాదు ఫ్యాక్ట్. మీ ఇద్దరు విషయంలో రెండే ఆప్షన్లు.
ఒకటి నువ్వు వాళ్ళ మదర్‌తో మాట్లాడి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం. లేదు అంటే విద్యకు అర్థమయ్యే విధంగా నీ ప్రేమని చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకోవడం.
రెండిట్లో ఏది ఈజీనో అది ఫాలో అవ్వు. లేదు అంటే నీ వయసు మనసు రెండు వేస్ట్ అయిపోతాయి బావ.
భరత్ నిర్ణయం...
భరత్ ? విద్య...
|