Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 102 సమాప్తం


తన వాళ్ళ వైపు చూసి హర హర మహాదేవ అనుకుంటూ అడవిలోకి బయలుదేరాడు అభీర్

*********************
అభీర్ గొంతు విని అడవిలో అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న జంతువులు భయంకరంగా  అరవడం మొదలుపెట్టాయి.

ఆరుపులు విని "ఈ జంతువులకు ఏమైంది? ఇప్పటివరకు సైలెంట్ గానే ఉన్నాయి కదా!" అని కంగారుగా చూస్తూ అడిగాడు రఘూరామ్.

"ఆ జంతువుల మనసులో కసిని రగిల్చే గొంతు ఏదో వినిపించి ఉంటుంది. అందుకే ఉత్సాహంతో పరుగులు పెడుతున్నాయి." అని చెప్పాడు అరుల్.

అంతలో కొండ దగ్గర ఉన్నా రాయి పక్కకి జరగడంతో సంతోషంగా చూస్తూ "మనం సాధించాము." అని గట్టిగా అరిచాడు తల్వార్.

ఆ మాట విని సంతోషంగా చూస్తూ "త్వరగా లోపలికి వెళ్ళండి అక్కడ ఉన్న నిధిని మొత్తం బయటికి తీసుకురండి." అని చెప్పింది అర్ణ.

"చీకటి పడుతుంది వెలుతురు లేదు లోపల చాలా పెద్ద గుహలాగా ఉంది వెళ్లడం చాలా డేంజర్!" అని చెప్పింది వాసుకి.

"నాకు కళ్ళు లేవు కదా దొర వెలుతురైన చీకటైనా ఒకటే నేను వెళతాను నా వెనకాల ఎవరైనా రండి." అని చెప్పాడు లింగు.

"కరెక్ట్ ఫస్ట్ వీడిని పంపించండి వెనకాల మీరు వెళ్ళండి." అని చెప్పాడు నిర్మల్.

మిసైల్ వైపు చూసి "జంతువుల అరుస్తున్నాయి అభీర్ మనుషులు వస్తున్నారని అనుమానంగా ఉంది అందరూ ఎలర్ట్ గా ఉండండి." అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం!" అని చెప్పి తన మనుషులు వైపు చూసి "ఫోకస్ లైట్ ఆన్ చేయండి ఎక్కడైనా చెట్టు కదిలితే షూట్ చేయండి." అని చెప్పాడు మిసైల్.

"మన వాళ్ళందరూ స్నైపర్ గన్స్ తో చెట్ల మీదకు వెళ్లి రెడీగా ఉండండి మన వైపు జంతువు వచ్చిన మనిషి వచ్చిన సరే షూట్ చేయండి." అని చెప్పాడు నెల్సన్.

"ఖాదర్! మన వాళ్ళని నాలుగు వైపులా సెక్యూరిటీగా ఉంచు  వీళ్ళని దాటి ఒక్క చీమ కూడా లోపలికి రాకూడదు." అని చెప్పాడు సలీమ్.

చెట్టు మీదకి ఎక్కి లైటింగ్ పడ్డ వైపు స్నైపర్ గన్ లో చూస్తూ "బాస్! ఒక్క మనిషి కూడా లేడు జంతువులే అటు ఇటు పరిగెడుతున్నాయి వాటిని షూట్ చేస్తే బెదిరి మన మీదకే వస్తాయి." అని చెప్పాడు నెల్సన్ మనిషి.

"చీకటి పడుతుంది కదా అవి వాటి ప్లేస్ లోకి వెళుతున్నట్లు ఉన్నాయి తొందరపడి వాడిని షూట్ చేసి రెచ్చగొట్టకండి." అని చెప్పాడు నెల్సన్.

అంతలో లింగు తో లోపలికి వెళుతున్న తల్వార్, వాసుకి వాళ్ళని చూసి వెనకాల వెళ్లాడు అరుల్.

కాసేపటికి లోపల నుంచి బయటికి వచ్చి "అక్కడ చాలా బాక్సులు ఉన్నాయి ఇంకా కొంతమంది రండి బయటికి తీసుకు వద్దాము." అని సంతోషంగా చూస్తూ చెప్పింది వాసుకి.

ఆ మాట విని లోపలికి వెళ్లి అక్కడ ఉన్న బాక్సులు మొత్తం బయటకి తీసుకువచ్చి పెట్టడంతో వాటిని చూస్తూ "వీటినిండా వజ్రాలు బంగారం ఉండి ఉంటాయి." అని ఆశగా అన్నాడు రఘురామ్.

"ఒక బాక్స్ తెరిచి చూడండి నిధి ఉంటే వాటిని తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరుదాము." అని చెప్పాడు ముకుల్.

"సరే!"అని బాక్స్ ని షూట్ చేసి ఓపెన్ చేసి ఆశ్చర్యంగా చూస్తూ "సార్! దీంట్లో బంగారం వజ్రాలు కాదు ఆయుధాలు ఉన్నాయి." అని చెప్పాడు మిసైల్.

"అవునా?" అని దగ్గరికి వచ్చి చూసి "కత్తులు డాలలు తప్పితే  ఏమీ లేవు అంత భద్రంగా లోపల దాచారు ఎందుకు?" అని వేటకారంగా చూస్తూ అడిగాడు రఘురామ్.

గుహలో నుంచి బయటికి వస్తూ "దొర! వీరుడికి ఆయుధమే పెద్ద నిధి!" అని చెప్పాడు లింగు.

ఆ మాటకి కోపంగా చూస్తూ "మిగతా బాక్సులు కూడా పగలగొట్టండి." అని చెప్పింది అర్ణ.

మిగతా బాక్సులు పగలగొడుతూ ఉండగా చెట్లు కదలడం చూసి "బాస్! జంతువుల మనుషుల అర్థం కావడం లేదు షూట్ చేయమంటారా..?" అని అడిగాడు నెల్సన్ మనిషి.

"దొర! బుల్లెట్ వేస్ట్ చేయడం ఎందుకు." అని చెప్పి ఆయుధాలు ఉన్న పెట్టిని పట్టుకొని ఎత్తి పైకి గిరాటు వేసి "సోము, కేశవ పట్టుకోండి రా.. నాయకుడి గుండె చప్పుడు నాకు వినిపించింది." అని సంతోషంగా అరుస్తూ చెప్పాడు లింగు.

ఆ మాట విని చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు తెంపుకొని గాలిలో ఎగిరి ఆయుధాలను పట్టుకుని చెట్ల మీద కాపలాగా ఉన్న ఇద్దరిని నరికేశారు సోము, కేశవ.

అది చూసి షాక్ అయ్యి "ఈ గుడ్డోడిని నమ్మొద్దు అని నేను చెబుతూనే ఉన్నాను." అంటూ కోపంగా లింగు మీదకి  వెళ్ళాడు ఫరూక్.

గుహలో నుంచి బయటికి వస్తూ "లింగు!" అని తన చేతిలో ఉన్న కత్తిని విసిరేడు అరుల్.

ఆ మాట విని అరుల్ విసిరిన కత్తి పట్టుకుని మీదకు వస్తున్న ఫరూక్ తల నరికేసి దొర నాకు కనపడదు చనిపోయింది ఎవరో చెప్పండి." అని అడిగాడు లింగు.

ఫరూక్ చనిపోవడం చూసి లింగుని షూట్ చేయడానికి గన్స్ ఎయిమ్ చేశారు అతని మనుషులు.

అంతలో "హర హర మహాదేవ!" అని గట్టిగా అరుస్తూ గాలిలో ఎగిరి అక్కడికి దూకి గన్స్ పట్టుకున్న ఇద్దరి చేతులు నరికేసాడు అభీర్.

ఆరుపు విని  మూడు వైపుల నుంచి ఒక్కసారి దాడి చేసి టెర్రరిస్టుల చేతులు నరికి గన్స్ తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళని షూట్ చేస్తూ ఉన్నారు అభీర్ సేన.

అది చూసి ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ అయ్యి చూస్తూ "మిస్సైల్ బాంబ్స్ వేయండి." అని గట్టిగా అరిచింది అర్ణ.

ఆ మాట విని బ్యాగ్ లో ఉన్న బాంబ్ తీయడానికి రెడీ అవుతూ ఉండగ  గట్టిగా అరుస్తూ  వచ్చి మిసైల్ గుండెల మీద గుద్ది బాంబు నోట్లో పెట్టి అక్కడ ఉన్న టెర్రరిస్టుల  మీదకి గిరాటు వేశాడు అభీర్.

బాంబు బ్లాస్టింగ్ లో మిస్సైల్ ముక్కలు ముక్కలు అవడంతో ఆ వెలుగులో సింహల నుంచున్న అభీర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ముకుల్.

తన మీదకి వస్తున్న నిర్మల్ తలలో కత్తి గుచ్చి పైకి లేపి భయంకరంగా ఒక అరుపు అరిచాడు అభీర్.

ఆ అరుపుకి సమానంగా గర్జిస్తూ పెద్ద పులులు రాజు, షేర్ లు అక్కడ ఉన్న టెర్రరిస్టుల మీదకి దూకాయి.

అది చూసి "అందర్నీ షూట్ చేసి పారేయండి." అని ఆవేశంగా అరుస్తూ అన్నాడు ముకుల్.

"ఏంటి షూట్ చేసేది బుల్లెట్ కన్నా స్పీడ్ గా వస్తున్నారు గొంతులో కత్తి దింపి వెళ్ళిపోతున్నారు." అని చుట్టూ భయంగా చూస్తూ చెప్పింది ఆశ.

ఆ మాట విని తన వాళ్ళ వైపు చూసి "భయపడకండి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే నుంచుని వాళ్ళని షూట్ చేయండి." అని అరుస్తూ చెప్పాడు సలీమ్.

ఆ మాట విని ఎగిరి సలీమ్ భుజాల మీద కూర్చుని తలలో కత్తిని దింపాడు గుడ్డు.

అది చూసి "భయ్యా!" అని అరుస్తూ అక్కడకి వస్తున్న  ఖాదర్ రెండు కాళ్ళు నరికేశాడు రాజన్.

టెర్రరిస్టుల తలలు, కాళ్లు, చేతులు తెగి పడటం చూసి "బాయ్స్! మీరు రిలాక్స్ అవ్వండి ఇన్ని సంవత్సరాలుగా ఈ అడవి వైపు నుంచి  టెర్రరిస్టులు ఎందుకు రావడం లేదో ఇప్పుడు అర్థమైంది." అని చెప్పాడు మేజర్.

అక్కడ ఉన్న అభీర్ సేన మీద రాకెట్ లాంచర్ వేయడానికి రెడీ అవుతున్న నెల్సన్ ని చూసి వరిగెత్తుకుంటు వెళ్లి "ఇటువంటి ఆయుధాలు మా దగ్గర పని చేయవు." అని బలంగా తన తల వైపుకు తిప్పి ట్రిగర్ నొక్కింది రియా.

రాకెట్ తో పాటు నెల్సన్ తల ఎగిరిపోవడం చూసి "మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి." అని భయంగా చూస్తూ చెప్పింది అర్ణ.

అక్కడికి వచ్చి ముకుల్ ఫ్యామిలీ చుట్టూ గీత గీసి "ఇది అభీర్ రేఖ దాటి బయటకు వస్తే మీ తల ఎగిరిపోతుంది." అని అటువైపు వస్తున్న టెర్రరిస్టులను చూసి గాలిలో వేగంగా వస్తున్న సింబా కాలు పట్టుకుని వాళ్ల మీదకి దూకి దొరికిన వాళ్ళని దొరికినట్లు నరుకుతు ఉన్నాడు అభీర్

అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న టెర్రరిస్టులను చూసి "అభీర్ గర్జనకి భయంతో షూట్ చేయడం కూడా మరిచిపోయారు." అని చెప్పాడు మేజర్.

అక్కడికి వస్తున్న ఆగస్త్య వైపు చూసి దగ్గరకు వెళ్లి "మీకు క్షమాపణలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాము మమ్మల్ని వదిలేయండి." అని చెప్పాడు రఘురామ్.

"అవునా? మా నాయకుడు గీత దాటితే తల ఉండదు అని చెప్పాడు కదా మర్చిపోయావా? " అని తన దగ్గర ఉన్న కత్తిని రఘురామ్ గొంతులో పొడిచాడు అగస్త్య.

రఘురామ్ ని చూసి ఏడుస్తున్న ఝాన్సీ, ఆశ వైపు చూసి "మేము కుడా గుండెలు బాదుకుని ఏడ్చాము మా వాళ్ళు ఎటువంటి తప్పు చేయకుండా అన్యాయంగా చనిపోయారు." అని తన మీదకు కత్తి తీసుకుని వస్తున్న మోహిత్ గుండెల్లో పొడిచింది రియా.

రక్తంతో తడిసిపోయి భయంకరంగా అరుస్తూ తనకి ఎదురు వచ్చిన వారి చంపుతూ ఉన్న అభీర్ ని చూసి టెన్షన్తో మూతి వంకర తిరిగి కింద పడిపోయింది ఝన్సీ.

భయంతో అక్కడి నుంచి ప్రమోద్, నళిని తో కలిసి అక్కడి నుంచి పరిగెత్తింది ఆశ.

చీకట్లోకి పరిగెత్తిన ఆశ వాళ్ళని తొండంతో ఎత్తుకుని తీసుకువచ్చి ముకుల్ ముందు కింద పడేసి కాళ్లతో తొక్కి చంపేశాయి రెండు ఏనుగులు.

"ఆ ఏనుగులు సహదేవుడు కాపాడి పెంచినవి ఈ అడవిలో ఉన్న ప్రతి జీవి నీ మీద పగతో రగిలిపోతున్నాయి మీరు అంత దారుణం చేసారు. ఈ నేల మీ రక్తంతో తడిస్తేనే మళ్లీ ప్రశాంతంగా ఉంటుంది." అని చెప్పాడు అభీర్.

"అది చూడడానికి నిన్ను లేకుండా చేస్తాను." గన్ తీసి అభీర్ ని షూట్ చేసింది అర్ణ.

మీదకి వసున్న బుల్లెట్స్ నుంచి తప్పుకుని "నా చావు నీ చేతిలో రాసిపెట్టి లేదు." అని తన మీదికి వస్తున్న విష్ణు తల పట్టుకుని వెనక్కి తిప్పేడు అభీర్.

"ఈ దారుణం చూడకూడదని నేను ఇండియా వద్దు అన్నాను నా మాట వినకుండా అందరిని తీసుకొచ్చి చంపింది నువ్వే!" అని ఏడుస్తూ చెప్పాడు ముకుల్.

ఆ మాట విని ఉక్రోషంతో తన చేతిలో ఉన్న గన్ నోట్లో పెట్టుకుని కాల్చుకుని చనిపోయింది అర్ణ.

"ఆ నిధి కోసం వచ్చిన వాళ్ళని ఇటు తీసుకురండి." అని చెప్పి వాసుకి గఫర్ ఖాన్ తల్వర్ కాళ్లు చేతులు కట్టి గుహలో పడేసి "నాయకుడా లోపలకి పంపించేవారు ఇంకా ఎవరైనా ఉన్నారా..?" అని అడిగాడు లింగు.

ఆ మాట విని అభిజిత్ వైపు చూసి "అంగవైకల్యం ఉన్నవాడిని వీరులెవరు చంపరు ఆయనని కూడా అక్కడికి పంపించు." అని చెప్పాడు అభీర్.

"నన్ను కుడా చంపేయండి. నేను ఆ గుహలో ఉండలేను." అని వీల్ చైర్ లో కూర్చుని అటు ఇటు ఊగుతూ చెప్పాడు అభిజిత్.

అభిజిత్ ని అక్కడి నుంచి తీసుకు వెళుతూ మూకుల్ పక్కన ఉన్న సుభాష్, ప్రవీణ్ ల వైపు చూశాడు బైరి.

భయపడి అక్కడి నుంచి పారిపోతూన్న ఇద్దరి గుండెల్లో పొడిచి "నాయకుడు గీత దాటకూడదు అని చెప్పాడు కదా!"  అంటూ అభీర్ వైపు చూసి "నాయకుడా దారి మూసేశాము ఇంకా అటువైపు నుంచి ఎవరు రాలేరు." అని చెప్పాడు రాజన్.

"ఆ దారికి అడ్డుగా టెర్రరిస్టుల శవాలను గుట్టగా వేయండి ఎవరికైనా రావాలి అనిపిస్తే వీళ్లని చూసి వెనక్కి వెళతారు." అని చెప్పాడు అభీర్.

అక్కడినుంచి చచ్చిన టెర్రరిస్టులు తీసుకు వెళుతూ "మేజర్ గారు వీళ్ళని ఇక్కడ జంతువులు కూడా ముట్టుకోవు ఎన్ని సంవత్సరాలైనా ఆస్తిపంజరాలు కుడా అలానే ఉంటాయి." అని చెప్పాడు బైరి.

తన వాళ్ళందరూ చనిపోవడంతో 'తల కొరివి పెట్టడానికి కూడా ఎవ్వరూ ఉండరు, బాధతో కుమిలి కుమిలి చచ్చేలాగా చేస్తాను. " అని అభీర్ చేసిన శబదం గుర్తుకు వచ్చి రెండు చేతులు ఎత్తి "క్షమించు." అని చెప్పి అభిజిత్ వెనకాలే గుహ లోపలికి వెళ్ళిపోయాడు ముకుల్.

వాసుకి వైపు చూసి "లోపల నుంచి నిధికి వెళ్లే మార్గం ఉంది నాకు కనపడదు కదా నువ్వు చూడు దొరికిన బంగారం వజ్రాలు కడుపునిండా తిను!" అని చెప్పి బయటకు వచ్చి "రాయిని జరపండి." అని చెప్పాడు లింగు.

ఉదయం వర్షం పడుతూ ఉండగా శ్రీకర్ వాళ్ళతో కలిసి అడవి లోపలికి వచ్చి నారప్ప వాళ్ళ దహన సంస్కారాలు చేస్తున్న అభీర్ ని చూసి సంతోషంగా దగ్గరికి వెళ్ళింది నీలమ్.

"అభీర్! ఈ వర్షంతో తడిసి పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితంలోకి ప్రవేశించండి." అని చెప్పింది వసుంధర.

అందరితో కలిసి కొండమీదకి వెళ్లి అమ్మవారి పాదాల దగ్గర పంచరత్నాలు ప్రతిష్టించి సాష్టాంగ నమస్కారం చేశాడు అభీర్.

తన చేతి మీద ఉన్న ముద్ర అమ్మవారిలో ఐక్యమైపోవడం చూసి "ఇకనుంచి మా నాయకుడి పేరు అభీర్ కాదు కృష్ణ మళ్లీ ఈ పుడమికి మా జాతి అవసరం వచ్చినప్పుడు అభీర్ పుడతాడు." అని చెప్పాడు రాజన్.

"మరి ఇప్పుడు కృష్ణని నీలమ్ పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండాలా..?" అని డౌట్ గా అడిగింది మిత్ర.

"మేము కూడా మామూలు ప్రజలు లాగా జీవితం గడపాలని నా తండ్రి ఆశ, అది నెరవేర్చడానికి నా తెగ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాను ఇకనుంచి మేము కూడా అడవి బయట బతుకుతాము. అక్కడ ఉంటేనే అన్యాయం ఎక్కడ జరుగుతుందో తెలుస్తుంది అక్కడకు ఈ అభీర్ సేన వెళుతుంది." అని చెప్పాడు అభీర్.

"గుడ్ డెసిషన్! ఈ ఏరియా మొత్తం గవర్నమెంట్ మిలిటరీ జోన్ గా అనౌన్స్ చేసింది. మీ ఆచారాలు పద్ధతులు పాడవకుండా మేము జాగ్రత్తగా చూసుకుంటాము, ఇక్కడ ఉన్న జంతువులకి కూడా హాని లేకుండా వాటిని ఒక సెపరేట్ జోన్ లో ఉంచుతాము మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు!" అని చెప్పాడు మేజర్.

ఆరోజు జాతరలో నీలమ్ ని పెళ్లి చేసుకుని దేశం కోసం RAW ఏజెంట్ గా మారాడు మన అభీర్.

సమాప్తం!  "జై భవాని"
[+] 10 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Star 
Thriller movie kanna super vundhi. I loved this story
Like Reply
jai bhavani
Like Reply
Super
Like Reply
Excellent update and story
Like Reply
(28-02-2026, 07:58 AM)SivaSai Wrote: ఎపిసోడ్ 102 సమాప్తం
Super awsome story.. nijam gaa pogadataniki inka matalu levandi siva garu.. Hats off to you for the excellent story.
Like Reply
పాఠకులకు ఓ మంచి కథను అందించారు.

ఇటువంటి కథలు ఇంకా ఎవైనా మీకు అందుబాటులో ఉంటే అవి కూడా మాకు ఇవ్వగలరు
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Repeated post deleted
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ayipoyinda?
ee emotion konchem ibbandi ga undi Siva garu!!

We all know.. all good things end!! But feeling sad, repati ninchi ikkada update undadu ani!!

Good luck Sivagaru.
And we hope you can come up with another insanely awesome new story!!
Like Reply
Fantastic story
Like Reply
Oka Thrilling Ghost Story Undi Readers Kavali Ante Post Chestanu

With Admin Permission 

Ghost Stories Post Cheyava Choo Ledo Naku Teliyadu Admin Permission isthe Compulsory Post Chestanu
[+] 4 users Like SivaSai's post
Like Reply
(28-02-2026, 10:46 PM)SivaSai Wrote:
Oka Thrilling Ghost Story Undi Readers Kavali Ante Post Chestanu

With Admin Permission 

Ghost Stories Post Cheyava Choo Ledo Naku Teliyadu Admin Permission isthe Compulsory Post Chestanu

nee ninchi story ante.. next level lo untadi.
boledanni dayyala stories unnay ee site ninduga.

so go on Siva bro. 
If it was for me.. I wouldn't wait!!
Like Reply
(01-03-2026, 03:07 PM)ash.enigma Wrote: nee ninchi story ante.. next level lo untadi.
boledanni dayyala stories unnay ee site ninduga.

so go on Siva bro. 
If it was for me.. I wouldn't wait!!

Okay Thanks for your convenience
Like Reply




Users browsing this thread: