Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 113


ఎంగేజ్మెంట్ గురించి తెలిసి కూడా అడుగుతున్నారా.
అయ్యో బంగారం నాకు తెలియదు అని చెప్పలేదు కదా.. నీకేమి తెలుసు అని అడిగాను అంతే.

మాటలతో బురిడీ కొట్టించమంటే మీ తర్వాతే అని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. అవని ప్రశాంతంగా ఉంది అని అర్థమయ్యక విక్రమ్ అవని నుదుటన ముద్దు పెట్టుకుని భార్గవి కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలా అని ఆలోచిస్తాడు.

ఆలోచనలు అన్ని ఒక పాయింట్ దగ్గరికి వచ్చి చేరిన తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోతాడు.

అందరికీ ఉదయం చాలా ఫ్రెష్ గా ఎనర్జిటిక్ గా స్టార్ట్ అవుతే..  శిల్పకి మాత్రం బాధగా మొదలవుతుంది.

ఉదయమే నాలుగింటికి ఆ పెద్దవాళ్లు వచ్చి ఆ గుడిసె ముందు నిలబడి గట్టిగా పిలుస్తారు.  ఉదయ్ కి మెలుకువచ్చి లేచి వెళ్లి తలుపు తీసి రండి అమ్మ..

ఇంకా మీరు లెగలేదా అని అడుగుతారు.  ఆ మాటకి చిన్నగా నవ్వి... నాకు గత కొన్ని రోజులగా అలవాటయింది కాబట్టి నాకు మెలకువ వచ్చేసింది.  శిల్ప కి ఈరోజు మొదలు కదా మెల్లిగా అలవాటు అవుతుందిలే..

వెళ్లి నీ భార్యని లేపు అంటే మీరే లేపండి అమ్మ అని ఇంతకీ మీ ఇద్దరి పేర్లు తెలుసుకోవచ్చా...  నిన్నటి నుండి తెలియక ఏమని పిలవాలో అర్థం కావడం లేదు అంటాడు.

ఆ మాటకి నవ్వుతు ఆ పెద్దావిడ నా పేరు పంకజం అని చెబుతుంది.  మరి తాత గారి పేరు అంటే అయ్యో పెనిమిటి పేరు ఎవరైనా చెబుతారా అంటుంది.

ఆ మాటకి ఆ పెద్దాయన మీసం మేలేస్తూ నా భార్య రుసరుసలాడుతూ మాట్లాడుతుంది కానీ నా విషయం వచ్చేటప్పటికి చచ్చేంత సిగ్గు.

మీరే చెప్పండి తాతగారు.  నా పేరు కాంతారావు అంటాడు. కాంతారావు, పంకజం బానే ఉన్నాయి కానీ నేను మిమ్మల్ని బామ్మ,  తాతగారు అనే పిలుస్తాను.

నువ్వు ఎలా పిలిచినా పలుకుతామ్  అబ్బాయి...  పద ముందు నీ పెళ్ళాన్ని లేపాలి అని పంకజం ముందుకు కదులుతుంది.

రాత్రంతా నిద్ర లేక ఎప్పుడో పడుకున్న శిల్పకి ఇంత గొడవ ఉన్న సరే మెలకువ రాదు.  పంకజం దగ్గరికి వెళ్లి ఇదిగో అమ్మయ్ అని పిలుస్తుంది.

అయినా స్ప్రుహ లేకుండా పడుకుంటే ఇక లాభం లేదు అని వీపు మీద ఒక్క దరువు వేస్తుంది. ఆ దెబ్బకి బాబోయ్ అని అరుస్తూ ఉలిక్కిపడి లెగుస్తుంది.

లాంతరువేలుగు చాలా తక్కువగా ఉండి వీళ్ళ ముగ్గురు కదులుతూ ఉంటే నీడల్లాగా కనిపించి దయ్యం దయ్యం అని అరుస్తుంది.

ఎవరే దయ్యం అని పంకజం గట్టిగా అంటే... ఈ మాట ఎక్కడో విన్నట్టు ఉన్నానే అనుకుని కళ్ళ మీద నుంచి చేతులు తీసి ఎవరు అని మెల్లిగా అడుగుతుంది.

ఎవరు అంటావు ఏమిటి నిన్న వచ్చిన వాళ్ళమే ఇంకా నిద్రమత్తు వదలలేదా లెగు లెగు అని  గట్టిగా అంటారు.

చుట్టూ చూస్తూ చాలా చీకటిగా ఉంది ఇప్పుడు లేచి ఎక్కడికి వెళ్లాలి . చీకటి ఏంటి.. ఉదయం నాలుగు దాటితే. నాలుగింటికి లేచి ఏమి చేయాలి.

జైల్లో కూడా ఈ టైంకి లేపలేదు అంటుంది.  ఏంటి నువ్వు జైలుకు వెళ్లావా అని పంకజం బుగ్గలు నొక్కుకుంటుంది. శిల్ప తల కొట్టుకుంటూ అయ్యో వీళ్ళకి తెలియని విషయాలు అన్ని నేనే చెబుతున్నానా అని..

నా ఉద్దేశం జైల్లో కూడా ఈ టైంకి లేపరు అంటున్నాను అంతే అని లేచి నిలబడి ఇప్పుడు ఏం చేయాలి అంటుంది. వెళ్లి మొఖం కడుక్కుని రా అని బయటికి పంపిస్తుంది.

చాలా చీకటిగా ఉంది నాకు భయం వేస్తుంది. మీ ఆయన్ని తోడు తీసుకువెళ్ళు. ఇక తప్పక ఉదయ్ ని తీసుకుని వెళ్లి అక్కడ నిలబెట్టి ఫ్రెష్ అయి వస్తుంది.
 
ఇప్పుడేం చేయాలి. బయటికి రా అని వాకిలి వైపు తీసుకు వెళ్లి ఇదంతా ఊడ్చి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టు అని చెబుతారు.

అంత మట్టే కదా.. మట్టిలో ఏమి ఉడవాలి అంటే కర్మ రా బాబు అని ఇదిగో అమ్మాయి ఇలా పట్టుకొని ఊడువు అని నడుం మీద ఒక దెబ్బ వేసి ఒంగో పెడుతుంది.

నడుము మీద చేతతో రుద్దుకుంటూ ఊడ్చి విక్రమ్ ఇంట్లో ముగ్గుపెట్టిన అనుభవంతో తనకు వచ్చిన ముగ్గు ఏదో పెడుతుంది.

పరవాలేదు అమ్మాయ్ ముగ్గు బానే పెట్టావు అంటే...  ఏడవలేక నవ్వలేక ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి తర్వాత ఇంకేమీ చేయాలి.

పనులు చేయడానికి మంచి ఉత్సాహం చూపిస్తున్నావే పదా పదా అని తీసుకు వెళుతుంది.  కాంతారావు ఉదయ్ ని ఒక ఆవు దగ్గరకి తీసుకువెళ్ళి దాన్ని మొత్తం శుభ్రం చెయ్యాలి అని చెబుతాడు.

విక్రమ్ చేతిలో ఉన్నన్ని రోజులు ఉదయ్ అన్ని రకాల పనులు చేశాడు కానీ ఇలా ఆవుని శుభ్రం చేయడం అన్నది తెలియదు.

తాతగారు నాకు తెలియదు అంటే... తెలియకపోవడమేముంది అబ్బాయ్ నీళ్లు తీసుకువెళ్ళు. శుభ్రంగా కడుగు.

పొదుగు అంతా కడిగి పాలు పితుకు అంతే.  మీరు సింపుల్గా చెప్పేస్తున్నారు గాని నాకు ఆ పాలు తీయడం ఏమిటో కూడా  అర్థం కాలేదు.

ఇంకా ఏం తెలుసు అబ్బాయ్ .  నీళ్లు తీసుకుని ఆవుని శుభ్రంగా ఎలా కడగాలో చూపించి చేయిపిస్తాడు.  పాలు తీసేటప్పుడు మాత్రం భయపడుతూ ఉంటే ఎలా తీయాలో చూపించి రేపటి నుంచి మాత్రం నువ్వే తీసుకో అంటాడు. అలాగే తాతగారు అని పాలు తీసుకుని ఇద్దరు గుడిసె దగ్గరికి వెళతారు.

ఇదిగో అమ్మాయి అందరికీ పాలు కాచి కొంచెం బెల్లం వేసి ఇవ్వు.  తాగేస్తే పనుల్లోకి వెళ్లాలి. పనులా..  ఏం పనులు. ఎందుకమ్మాయ్..  కంగారు అన్ని చెబుతాము. చూపిస్తాము.

తొందరగా వెళ్లి చెప్పిన పని చెయ్ అని పంకజం ఆర్డర్ వేస్తుంది.  ఖర్మరా బాబు వీళ్ళతో చస్తున్నాను అని ఆ కట్టెల పోయ్యని కష్టంగా వెలిగించి...  చేతులు కాల్చుకుంటూ పాలు కాచి అందరికీ ఇస్తుంది.

పర్వాలేదు అమ్మాయి ఒక్కరోజులోనే పోయ్యి వెలిగించడం నేర్చుకున్నావు. ఈ అని పళ్ళు అన్ని బయటపెడుతుంది. ఎక్కువ బయట పెట్టకు అమ్మయ్.. ఏదన్న పురుగు వెళ్లిందనుకో కష్టం అని పాలు ఊదుకుంటూ తాగుతారు..

ఈ ముసలావిడకి వెటకారాలు చాలా ఎక్కువ అని మనసులో తిట్టుకుంటూ ఆ పాలు తాగుతుంది.

అవని ఉదయమే లేచి రెడీ అయ్యి కిందకి వెళుతుంది. మాధవి,లలిత దేవుడి గది శుభ్రం చేసి పూజ మొదలు పెడుతూఉంటారు.

అవిని కూడా వాళ్లతో జాయిన్ అవుతుంది. తర్వాత కిచెన్ లోకి వెళ్లి అందరికీ కాఫీ టీలు ప్రోటీన్ షెక్స్ రెడీ చేసి ఎవరి తాగేది వాళ్ళ దగ్గరికి పంపించి బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటారు.

అవని అని  లలిత పిలిస్తే చెప్పండి అత్తయ్య అంటుంది. వెళ్లి నివిని లేపమ్మా..  బ్రాహ్మణులు వచ్చే టైం కి రెడీ అవ్వకపోతే బాగోదు కదా. అలాగే అత్తయ్య అని నివి గదిలోకి వెళుతుంది.

నివి మత్తుగా నిద్రపోతూ ఉంటే వెళ్లి బలవంతంగా లేపి వాష్ రూమ్ లోనికి పంపిస్తుంది.  ఫ్రెష్ అయ్యి వచ్చి ఎందుకు వదిన నన్ను అప్పుడే నిద్ర లేపావు.

కాసేపు పడుకుందును కదా... అయ్యో నివి ఈరోజు మీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తున్నారు. కొంచెం కూడా ఎక్సైట్మెంట్ లేకుండా నిద్ర ఏమిటి.

అన్నయ్య అన్ని అరేంజ్ చేసేస్తాడు కదా..  ఆ టైం చెప్తే సరిపోతుంది అంటుంది.  అదేంటి నీకు షాపింగ్ చేయడానికి టైం సరిపోదు కదా..

ఎలాగా అన్నయ్య మినిమం 20 డేస్ టైం తీసుకుంటాడు. సో ఆ టైం నాకు సరిపోతుంది అని చెబుతోంది.  ఒకవేళ వారంలో కుదిరిపోతే. అప్పుడైనా నా ప్లాన్స్ నాకు ఉన్నాయి వదిన.

సరే ముందు రెడీ అయ్యి రా.. అత్తయ్య నీకోసం వెయిట్ చేస్తున్నారు.  మీ అత్తయ్య గారు కూడా ఉన్నారు కదా బాగోదు అని చెప్పి అవని వెళ్లిపోతుంది.

రాజ్ కి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసి బయటకి వస్తుంది. బ్రేక్ ఫాస్ట్ టైం కి అందరూ రెడీ అయ్యి వచ్చి టిఫిన్ కంప్లీట్ చేస్తారు.

ఈలోపు బ్రాహ్మలు కూడా వస్తే... ఇద్దరి జాతకాలు ఇచ్చి ముహూర్తాలు చూడమని చెబుతారు.  ఇద్దరు జాతకాలు బాగా పరిశీలించి అయ్యా..  పిల్లలు ఇద్దరు లైఫ్ చాలా బాగుంటుంది.

మీకు ఎన్ని రోజుల్లో ముహూర్తం కావాలి అని అడుగుతారు.  ముహూర్త బలం బాగున్నది చూసి చెప్పండి.

అది దగ్గరైనా, దూరమైన మేనేజ్ చేసుకోగలము. రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ కి చాలా బలమైన ముహూర్తం ఉంది. అది తప్పితే నెల రోజుల తర్వాత మాత్రమే ఉంది.

నివి నెల అనే లోపు రాజ్ వెంటనే లేచి నిలబడి రెండు రోజుల్లో ఉన్న ముహూర్తం ఖాయం చేయండి అని చెబుతాడు.

పార్ధుగారు వెంటనే ఒరేయ్ అంత ఆత్రం ఏంటి రా... పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాము కదా.. సైలెంట్ గా తండ్రి చెవి దగ్గరికి వెళ్లి ఏంటి మీరు మాట్లాడేది.

మీరు మీనవేషాలు లెక్కపెట్టేటప్పటికి అక్కడ మీ కోడలు నెల అని చెప్పుద్ది. ఇప్పుడు నెల తర్వాత అయితే ఏమైందిరా...

మీరు తిరగండి దానితో షాపింగ్ కి. వద్దులే రెండు రోజులకే ఖాయం చేయండి పంతులుగారు అని చెబుతారు.  ఏమైంది తండ్రి కొడుకులు ఇద్దరకి.

అంతసేపు డిస్కస్ చేసుకుని మరీ రెండు రోజులకే ఫిక్స్ చేశారు. ఎంత తొందరగా నిశ్చితార్థమవుతే అంత మంచిది అని ఇద్దరు కోరస్ గా చెబుతారు.

మరి నా షాపింగ్ అని నివి బిక్క మొహం వేసుకుని అడిగితే... విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ పరవాలేదు నివి అన్నీ నేను అరేంజ్ చేపిస్తాను.

నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెబుతాడు. రాజ్ థాంక్స్ బావ అన్నట్టుగా చూస్తే..  మై హోనా అన్నట్టుగా విక్రమ్ కళ్లుర్పుతాడు.

వచ్చే నెలలో ముహూర్తం పెళ్ళికి బాగుంది అది పెట్టమంటారా అని బ్రాహ్మలు అడిగితే..  నెల రోజులు అంటే మనకు సరిపోతాయా అని కళ్యాణ్, పార్ధు ఆలోచిస్తారు.

ఎన్ని రోజులు ఉన్నా సరే పనులు అలాగే జరుగుతూ ఉంటాయి కాబట్టి చేసేద్దామని ఫిక్స్ అయ్యి ఆ ముహూర్తం కూడా ఖాయం చేసుకుంటారు.

నిశ్చితార్థం వేడుకలు??
[+] 12 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Part - 114


రెండు రోజులే నిశ్చితార్దానికి టైం ఉంది కదా ఫంక్షన్ హాల్ బుక్ చేసేద్దామా అని పార్ధు అంటే... ఇందిరా గారు లేదు ఇంటికి ఈ తరంలో ఉన్న ఒకే ఒక ఆడపిల్ల.

ఈ ఇంటిలోనే జరగాలి అని చెబుతారు. ఇంత తొందరగా అన్ని పనులు అవుతాయా ? ఎందుకు అంకుల్ అంత కంగారు పడుతున్నారు.

ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్లకు అప్పజెప్పేద్దాము పైన మనం ఉంటాము కదా చూసుకోవచ్చు అని విక్రమ్ అంటాడు. సరే ఆ పనులు పురమాయించండి.

ఆల్రెడీ చెప్పడం అయిపోయింది. వాళ్ళు ఆన్ ద వే అని చెబుతాడు. నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావు.  ఇది నా చెల్లికి సంబంధించిన వేడుక. నేను ఎలాగా నెగ్లెట్ చేస్తాను అంటాడు.

అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజ్ మాత్రం పక్కకు వచ్చి కూర్చుని థాంక్స్ బావ నా కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోని నిశ్చితార్థాన్ని తొందరగా పెట్టించావు.

నీ కష్టాన్ని కాదురా..  నా చెల్లి షాపింగ్ అని ఎక్కడ అలసిపోతుందో అని ఇలా ప్లాన్ చేశాను.  ఆ బ్రాహ్మణులతో ఆల్రెడీ ముందే మాట్లాడేవా...

దానికి ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటాడు.  స్మార్ట్ బావ.. మీ చెల్లి అలసిపోతుందని ఆలోచించిన సరే నన్ను సేవ్ చేసావు అంటాడు.

నీకెందుకురా బాధ... ఆ షాపింగ్ కి.  తెలివిగా మీ ఇంట్లో ఉన్న జెంట్స్ అందరూ ఎస్కేప్ అయిపోయి నన్ను ఇరికించేస్తున్నారు.

అవును అనలేను కాదనలేను.  అవునంటే మా అమ్మతో కష్టం. కాదంటే మీ చెల్లి తో కష్టం.  పెళ్లికి ముందే కష్టాలు మొదలయ్యాయి నీకు అని శ్రీ వచ్చి అంటాడు.

నువ్వు ఎప్పుడు వచ్చావు రా... నీ నిశ్చితార్థం  వేడుకలు మొదలవుతున్నాయంటే రాకుండా ఉంటామా...

హెల్ప్ చేయడానికి వచ్చావా..  సెటైర్ వేయడానికి వచ్చావా... అయ్యో మామ అలా టెన్షన్ పడితే ఎలా.. ఏదైనా తిరిగి రిటన్ గిఫ్ట్ ఇచ్చేయాలి కదా అని అంటాడు.

నాకు తెలుసు రా నువ్వు సెటైర్ వేయడానికి వస్తావని. మేము ఎందుకు సెటైర్లు వేస్తాము.  నువ్వు చెప్పిన డైలాగ్ నీకు మేము గుర్తు చేస్తాము అంతే కదా విక్కీ అంటే.. అంతేగా అంటాడు.

సర్లే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరూ ఒక చోటకి చేరి నన్ను పక్కన పెట్టారా... వినయ్ వచ్చి ఎంత మాట అన్నారు బావగారు. మీరు మా ఇంటికి ఒక్కగాని ఒక్క అల్లుడు.

మర్యాదలను విషయంలో లోటు రానివ్వకుండా చక్కబెడతాము గాని సెటైర్లు ఎందుకు వేస్తాం చెప్పండి అంటాడు.  నువ్వు మరీ నక్క వినయం చూపించకురా చిన్న బామ్మర్ది .

భౌతిక్ నుంచి వచ్చిన సారీస్ ని లేడీస్ అందరూ చూస్తూ ఉంటారు. ఈ లోపు పి. ఎ. వచ్చి ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు.

బావగారు చెప్పండి మీకు ఎలాంటి డెకరేషన్ కావాలి అని వినయ్ వినయానికే వినయం వచ్చేటట్టుగా మాట్లాడుతాడు.

చూడు చిన్న బామ్మర్ది ఇందాకే చెప్పినట్టు ఉన్నాను నీకు. అయ్యో బావ గారు మర్యాద చేసినా ఫీలవుతున్నారు.. చెయ్యకపోయినా ఫీలవుతున్నారు.

ఇలాగైతే కష్టం అబ్బా రా బావ అని భరత్ తీసుకుని వెళ్ళిపోతాడు.  ఒరేయ్ వాడు ఇప్పుడు ఏం చేసినట్టు రా... ఏదైనా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు పుచ్చుకోవాలి.

వాడు అంత మర్యాదగా  రెస్పెక్ట్ ఇస్తే నువ్వు తీసుకోలేదు. వాడు హర్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు వెళ్లి బ్రతిమాలుకో అని శ్రీ అంటే..

నేను ఈ ఇంటికి కాబోయే అల్లుడిని రా అని బిక్క మొహం వేస్తాడు. మా చెల్లెలు మీ ఇంటికి కాబోయే ఓనర్ బే. ఎలాగైనా మీ అన్న చెల్లెలు పైన ఉంటున్నారా..

మాది ఎప్పుడూ పైనే... నువ్వు మీ చెల్లె అని విక్రమ్ అనేటప్పటికీ అవని అందరికీ జ్యూస్ తీసుకుని వచ్చి అన్నయ్య జ్యూస్ తీసుకోండి అని శ్రీ కి, రాజ్ కి ఇస్తుంది.

విక్రమ్ కి కూడా ఇచ్చి చాలా సేపటి నుంచి కూర్చునే ఉన్నారు జ్యూస్ తాగండి. థాంక్యూ భార్యామణి అని చెబుతాడు.

చిన్న స్మైల్ తో అక్కడి నుండి వెళ్ళిపోతుంది.నువ్వు చాలా లక్కీ బావ అని రాజ్ అంటే..  దేనికో.  మా చెల్లి లాంటి బంగారు కొండను కొట్టేసావు కదా అంటాడు.

నేను అనకొండ నా వాయిస్ వినిపించి...  ఇదేంట్రా నేను మా చెల్లి గురించి పొగుడుతూ ఉంటే మీ చెల్లి వాయిస్ వినపడుతుంది.

ముందు వెనక చూసుకుని మాట్లాడాలి అని శ్రీ తల వెనక్కి తిప్పుతాడు. అక్కడ నివి భద్రకాళి అవతారం ఎత్తడానికి సిద్ధంగా ఉంటుంది.

నువ్వు ఎప్పుడు వచ్చావు.  నేను ఎప్పుడొస్తే ఏమైంది లే కానీ నేను ఎవరో చెప్పు అంటుంది. నువ్వు అని ఆ కాసేపు ఆలోచించే హ..  డైమండ్ అంటాడు.

మా వదిన్ని పొగుడుతానికి మాత్రం ఒక్క సెకన్ ఆలోచించలేదు. నన్ను పొగడాలంటే మాత్రం టైం తీసుకున్నావా...

శ్రీ లేచి నుంచుని ఒరేయ్ విక్రమ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చినట్టున్నారుగా.. మనం డెకరేషన్ సంగతి చూద్దాం.

ఒరేయ్ మామ నువ్వు తొందరగా నీ పని చెక్కపెట్టుకొని వచ్చాయ్ రా..  విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు. మిత్రద్రోహుల్లారా నన్ను ఇలా బలి చేసి మీరు వెళ్ళిపోతున్నారా అని ఫ్లోలో టంగ్ స్లిప్ అవుతాడు.

నివి భద్రకాళి అవతారం ఎత్తి నువ్వు నాకు బలైపోతున్నావా అసలు బలవడం అంటే ఏమిటో నీకు తెలుసా అని కాలర్ పట్టుకుంటుంది.

బంగారం,  బుజ్జికొండ అందరూ మనల్ని చూస్తున్నారు. సరసమైన,విరహమైన మనిద్దరం ఉన్నప్పుడే చూసుకుందాం.

నా బుజ్జికొండవి కదా వదిలేయవే అని మెల్లిగా బ్రతమాలతు ఉంటాడు.  చుట్టూ చూస్తూ ఈ సారికి వదిలేస్తున్నాను కానీ దీనికి పనిష్మెంట్ ఉంది అంటుంది.

నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చిన నాకు ఓకే బంగారం కాకపోతే ఒకటే రిక్వెస్ట్ అంటాడు.  ఏమిటి.. షాపింగ్ కి మాత్రం నన్ను బుక్ చేయకు. కన్నింగ్ గా ఒక నవ్వి నవ్వి అమ్మ నన్ను రాజ్ గారు  షాపింగ్ కి తీసుకు వెళుతున్నారు.

మేము సాయంత్రం వస్తాము అని వెళదామా అన్నట్టుగా రాజ్ ని చూస్తుంది.  నా నోటి దూల ఎంతవరకు తీసుకువచ్చింది ఖర్మరా అనుకుని పదా అని నీరసంగా ముందుకు నడుస్తాడు.

వెళుతున్న ఇద్దరినీ చూసి అందరూ నవ్వుకుంటారు. కరుణ గారు పార్ధు గారిని చూస్తూ నా కోడలు చాలా నయం అంటుంది.

ఎందుకో.. మొగుడిని పెళ్లికి ముందే గ్రిప్ లో పెట్టుకుంది. నేను ఉన్నాను పెళ్లయి ఇన్ని సంవత్సరాలు అయినా మీ మాట నేను వినడమే గాని నా మాట మీరు ఎప్పుడైనా విన్నారా.

ఇది మరీ బాగుంది నీ కొడుకు చవటయితే దానికి నేనేం చేయాలి మనసులో అనుకుంటాడు.ఎందుకంటే పైకి అంటే కరుణ రియాక్షన్ ఇంకొకలాగా ఉంటుంది కాబట్టి సైలెంట్ గా చూస్తూ ఉంటాడు.

ఆర్గనైజేషన్ వాళ్లకు ఎలా చేయాలో చెప్పి విక్రమ్, శ్రీ వచ్చి మొత్తం అన్ని సెట్ చేసాం.  వినయ్ తో... నువ్వు ఈరోజు, రేపు ఇంటి దగ్గరే ఉండి వాళ్లకి హెల్ప్ చేయి.

ఎక్కడ ఎటువంటి లోటు రానివ్వద్దు. ఏమైనా సజెషన్స్ కావాలి అంటే అత్తయ్య వాళ్ళని అడిగి చేయించు అని చెబుతాడు.

సరే అన్నయ్య నేను చూసుకుంటాను కదా.. సరే నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని విక్రమ్ బయలుదేరుతాడు.

నవ్వుతూ బయటకు వెళ్లిన విక్రమ్ కారు ఎక్కగానే సీరియస్ మూడ్లోకి మారిపోతాడు.  వెంటనే ధనుంజయ్ కి కాల్ చేసి ఆఫీస్ కి రండి అని ఒక్క మాట చెప్పి పెట్టేస్తాడు.

ధనంజయ్ కు మాత్రం ఏమీ అర్థం కాదు. ఏమైంది అల్లుడు గారికి. అంత సీరియస్ గా మాట్లాడారు.  అవని కి ఏమైనా అయ్యిందా అని కంగారుగా విక్రమ్ వెళ్లేలోపే ధనుంజయ్ ఆఫీస్ గేట్ ముందు ఉంటాడు.

విక్రమ్ కారు వేళ్ళగానే ధనుంజయ్ స్పీడ్ గా లోపలికి వెళ్తాడు. కారు దిగిన విక్రమ్ ని అల్లుడుగారు అని పిలిస్తే చెయ్యి పెట్టే ఆపి కాల్ మీ విక్రమ్ గారు...

విక్రమ్ వాయిస్ లో వచ్చిన సీరియస్ నెస్ కి ధనుంజయ్ కి చాలా భయ మేస్తుంది. ఏమి జరిగి ఉంటుంది ఇంత కోపంగా ఉన్నాడు అనుకుంటూనే విక్రమ్ ని ఫాలో అవుతాడు.

పిఏని పిలిచి నేను చెప్పే వరకు ఎవరిని లోపలికి ఆలో చేయొద్దు అని క్యాబిన్ లాక్ చేస్తాడు. విక్రమ్ చైర్ లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు హ అని గట్టిగా అరుస్తాడు.

ఆ అరుపుకి ధనుంజయ్ ఒక్క అడుగు వెనక్కి వేసి మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు నీకు ఏమీ అర్థం కాదు నువ్వు ఒక దద్దివి.

దద్ది అన్నమాట వినగానే ధనుంజయ్ కి కోపము వచ్చి అల్లుడుగారు అంటే... ఇంక్కొక్కసారి అల్లుడు అని పిలిచావంటే నేలకేసి కొడతాను.

ఏమనుకుంటున్నావు నీ గురించి. ఏదో చిన్న చిన్న తప్పులు చేసి ఉంటారు.  నీకు తెలియకపోవచ్చులే... నిన్ను అవని నీ ఏదో ఒక రోజు కలపాలి అనుకున్నాను కానీ..

ఈ విషయం తెలిసిన తర్వాత నీలాంటి వాడు నా భార్య జీవితంలో ఉండకపోవడమే మంచిది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నిజంగా నాకు అర్థం కావడం లేదు.

ఓ అవునా? నా భార్యని.. నీ భార్య,  నీ ముద్దుల కూతురు తార్చాలి అని చూశారు అది కూడా నీకు తెలియదా అంటాడు.

ఆ మాటకి ధనుంజయ్ వణికిపోతాడు. ఏమంటున్నారు మీరు అని తడబడుతూ అడిగితే.. ఏమంటున్నానా ? రాత్రంతా కూతురు కనపడకపోతే.. ఏమయింది, ఎక్కడికి వెళ్ళింది ఏదైనా ప్రమాదం జరిగిందా అనే ఆలోచన లేకుండా ఇంటికి వచ్చిన కూతుర్ని ఎక్కడికి వెళ్లావు అని అడుగుతావా...

అసలు నువ్వు మనిషివేనా... ఈ విషయం ఎప్పుడు జరిగిందో తెలియక ధనుంజయ్ విక్రమ్ దగ్గరకు వెళ్లి మీరు నిజమే చెబుతున్నారా...

లేదు..  నేను చాలా ఖాళీగా ఉండి నీతో పరాచకాలు ఆడుతున్నాను.

విక్రమ్ బాబు ఎందుకు అంత కోపం ???

కథ కొనసాగుతుంది...
[+] 13 users Like SivaSai's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Though Vikram started the plan correctly, I feel it should also include Shilpa, as she was the original reason why Avini was sent into that room and without any remorse!!
Like Reply
Correct balance of emotions by Vikram.
Great job Siva garu, for penning such a great protagonist!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 115


విక్రమ్ పరాచకానికి ధనుంజయ్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉంటాడు.  ఏంటి నా మొఖంలో ఏమైనా కోతులు డాన్స్ చేస్తున్నాయా.. అలా చూస్తున్నావ్.

విక్రమ్ బాబు కొంచెం క్లియర్ గా చెప్పు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు.

నా కూతురిని వాళ్ళు అని..  ఆ మాట అనలేక కళ్ళు మూసుకుంటాడు. ఓ... చిన్న కూతురుకి సంబరాలు చేయడంలో మునిగిపోయి అసలు పెద్ద కూతురు తిందా.. మంచి బట్ట కట్టిందా..  ఎక్కడ చదువుకుంటుంది..

ఆఖరికి. ఇంట్లో తన పరిస్థితి ఏమిటో కూడా పట్టించుకోలేనంత బిజినెస్ మాన్వి కదా.. నాకు తెలియక అడుగుతాను ఇంత సంపాదించి ఏం చేద్దాం అని...

నీ ముద్దుల భార్యకి బంగారుపు తొడుగు చేయించి.. నీ ముద్దుల కూతురికి బంగారు సింహాసనం ఇద్దాం అనుకున్నావా...

ధనుంజయ్ మోకాళ్ళ మీద కిందకి జారి.. ప్లీజ్ మీ మాటలతో నన్ను కుళ్ళపోడవద్దు.  నిజంగా నాకు ఏమీ తెలియదు.  మీరు అన్నట్టుగానే నేను దద్దినే...

అసలు ఏం జరిగిందో చెప్పండి అని కాళ్లు పట్టుకున్నంత పని చేస్తాడు..  ధనుంజయ్ స్టెప్ తెలిసి విక్రమ్ వెనక్కి అడుగు వేసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసుకుంటాడు.

అవని చెప్పిందంతా పూర్తిగా చెప్పి మీ ఇంట్లో ఉన్న సర్వెంట్స్ కి కూడా అవని ఎలా బ్రతుకుతుందో తెలుసు. ఇంటి యజమానికి కూతురు అంటే పంచప్రాణాలు.

కానీ ఆ కూతురు ఎలా బ్రతుకుతుందో తెలియదు. నీలాంటి గొప్ప తండ్రి ప్రపంచంలో ఎవరికీ ఉండరు అనుకుంటా.. నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు.

ఏంటి అన్నట్టుగా చూస్తే... ఫ్యూచర్లో నా పిల్లల దగ్గరికి వచ్చి నేనే మీ తాతని.. మీ అమ్మంటే నాకు అంత ఇష్టం. ఇంత ఇష్టం అన్న పిచ్చ డైలాగ్ లు మాత్రం చెప్పకు అంటాడు.

ఆ మాటకి ప్రాణం చచ్చిపోయినట్టుగా అయిపోయి అలాగే కూలబడిపోతాడు.  ఏమయ్యింది మిస్టర్ ధనంజయ్... ఈ మాటకే నీకే ప్రాణం పోతున్నట్టు ఉందా..

మరి నువ్వు ఆరోజు అడిగిన దానికి నా భార్య పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది. తల్లి లేని ఆడపిల్లకి తండ్రి అన్ని అయి చూసుకోవాలి.

ఏ రోజైనా దగ్గరికి తీసుకున్నావా..  నీ ముద్దుల భార్య ఏది చెబితే అదే నిజమనుకొని దూరంగా నిలబడ్డావు. అదే దూరం ఇప్పుడు నా భార్య పెడుతూ ఉంటే మాత్రం నువ్వు తట్టుకోలేకపోతున్నావు.

ఇదే కర్మ అంటే...  మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది మిస్టర్. ధనుంజయ్ ఏమి మాట్లాడాలేక మౌనంగా ఉండిపోతాడు.

ఇద్దరి మధ్యన మౌనం చాలాసేపు రాజ్యమేలుతుంది. విక్రమ్ కి ధనంజయని చూడాలి అన్న చాలా చిరాకుగా అనిపిస్తుంది.

మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని పిలిపించాను అంటాడు.  మాటలు రాని ధనుంజయ్ మౌనంగా అల్లుడు వైపు చూస్తూ ఉంటే..

నీ భార్యని పూర్తిగా నా హ్యాండ్ఓవర్ చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు జైల్లో పెట్టి మెంటల్ టార్చర్ చేస్తే చాలు అని నా యాంగిల్ లో ట్రీట్మెంట్ ఇచ్చాను.

బట్ ఇప్పుడు అది సరిపోదు.  నేను ఇచ్చే ట్రీట్మెంట్ కి పిచ్చిదై రోడ్డు మీదకి రావాల్సిందే...చేసిన తప్పుకి అనుక్షణం కుంగికుశించి పోవాలి అంటాడు.

ధనుంజయ్ కళ్ళు తుడుచుకుని ఆ శ్రమ మీకెందుకు అల్లుడుగారు... సోరి విక్రమ్ బాబు..

దాని సంగతి పూర్తిగా నేను చూసుకుంటాను. మీరు నా కూతురిని జాగ్రత్తగా చూసుకోండి. తండ్రిగా నేను పూర్తిగా ఓడిపోయాను అని అర్థమవుతుంది.

భర్తగా మీరు ఎప్పుడూ గెలుస్తూనే ఉన్నారు. మీలాంటి వ్యక్తి నా కూతురు జీవితంలో ఉండడం నిజంగా నా అదృష్టం.

మీరు అవునన్నా కాదన్నా అవని ఎప్పటికీ నా బంగారు తల్లె.. మీరు నా అల్లుడే అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు.

  వెళ్ళిపోతున్న ధనుంజయ్ ని చూస్తూ.. సెక్యూరిటీకి కాల్ చేసి ఇద్దరు పర్సన్స్ ని ధనుంజయని ఫాలో అవమని చెబుతాడు.

ధనుంజయ్ మెల్లిగా బయటకు వచ్చి రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. డ్రైవర్ ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు.  ఎంత దూరం అని తెలియకుండా చాలా దూరం వెళ్ళిపోతాడు.

నడిచి... నడిచి  కాళ్లు లాగేటప్పటికీ దగ్గరలో ఉన్న బెంచ్ పైన కూర్చుని చూస్తూ ఉంటాడు. ఆకాశం మబ్బులు పట్టి ఉంటుంది.

వర్షం పడే సూచనలు కనిపిస్తూ ఉంటాయి. డ్రైవర్ కంగారుగా వచ్చి సార్ వర్షం పడేటట్టు ఉంది. హ అని మళ్ళీ చూస్తూనే ఉంటాడు.

వర్షం మొదలవుతుంది. చినుకు చినుకు పెరిగి పెద్దది అవుతూ ఉంటుంది.

ఒక తండ్రి బైక్ మీద తని ఇద్దరు పిల్లల్ని కూర్చోపెట్టుకొని వాళ్ళిద్దరూ తడవకుండా రైన్ కోట్ వేసి... తండ్రి తడుస్తున్న సరే మెల్లిగా తీసుకు వెళుతూ ఉంటాడు.

స్పీడుగా బైక్ నడిపితే ఎక్కడ బండి జారుతుందో..  పిల్లలు ఇబ్బంది పడతారేమో అని జాగ్రత్తగా తీసుకు వెళుతూ ఉంటాడు.

అది చూస్తున్న ధనుంజయ్ కి గుండె మెలిపెట్టినట్టు అవుతుంది.  ఏ రోజు కూడా అవని నీ బండిమీద కాదు కదా.. కారులో కూడా ఎక్కడికి తీసుకువెళ్ళలేదు.

తన చేతులతో ఒక చాక్లెట్ నోట్లో పెట్టలేదు.  ఆఖరికి సినిమాకి వెళ్లిన.. ట్రిప్ కి వెళ్ళినా.. ఎక్కడికి వెళ్లినా తన తల్లిదండ్రులను కూడా తీసుకు వెళ్ళాడు కానీ అవని నీ తీసుకువెళ్లలేదు.

రాను అంటే వదిలేశాడు కానీ...  బ్రతిమాలి....  ఎందుకు రాదు కనుక్కుని నచ్చజెప్పి ఏనాడు తీసుకు వెళ్ళలేదు.  ఈరోజు ఆ తప్పులే గుణపాలై గుండెల్లో దిగుతూ ఉంటే ఎవరికీ చెప్పుకోలేని బాధ.

ఈరోజు క్షమించు అని ఒక చిన్న మాట చెబితే అవని ఎలా క్షమిస్తుంది. ఏది చేసినా స్వార్థమే అనుకుంటుంది కదా..  అని ఏడుస్తూ ఉంటాడు.

ఆ వర్షంలోనే ధనుంజయ్ కన్నీళ్లు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. దారినపోయే వాళ్ళకి ధనుంజయ్ ని చూస్తూ ఉంటే ఒక పిచ్చివాడిలాగా ఉంటాడు.

డ్రైవర్ కి భయం వేసి ఇంటికి ఫోన్ చేసే విషయం చెబుతాడు. వెంటనే మరొక కారులో సత్యవతి, శేషగిరి గారు వచ్చి కొడుకుని అలా చూసి విలవిల్లాడిపోతారు.

శేషగిరి పరిగెత్తుకుంటూ వెళ్లి గొడుగు పట్టుకుని ఏంట్రా ఇది అని అడిగితే.. నాన్న అని చుట్టూ చేతులు వేసి బోరుమంటాడు.

  కొడుకు బాధ చూడలేక ముసలి ప్రాణాలు రెండు విలువల్లాడిపోతాయి.  సత్యవతి పేగు మెలిపడినట్టు అయ్యి..

ముందు ఇంటికి వెళదాం పద ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం అని కొడుకుని బలవంతంగా లేపి కారులో కూర్చోబెడతారు.

ధనుంజయ్  దుఃఖాన్ని ఆపకోలేకపోతుంటాడు. ఇది అని చెప్పలేక నలిగిపోతూ ఉంటాడు. టవలతో కొడుకు తల తుడుస్తూ ఏమైందిరా ఇంత వర్షం పడుతున్న సరే అలాగే ఉండిపోయావు.

చేసిన తప్పు ఇది అని తల్లికి చెప్పలేక ఒడిలో పడుకుని నాలాంటి తండ్రి ఎవరికి వద్దమ్మా అని మనసులోనే రోదిస్తూ ఉంటాడు.

ఇంటికి వెళ్లే దాకా మౌనంగానే ఉంటారు. కారు దిగి ఆ తడి బట్టలతోనే మెల్లిగా అడుగులు వేస్తూ లోపలికి వెళతాడు హాల్లో ఉన్న రజిత ఫోటో చూసి తప్పు చేసిన వాడిలాగా తలదించుకుంటాడు.

మెల్లిగా ఫోటో దగ్గరికి వెళ్లి తడుముతు నన్ను క్షమించు రజిత. నాలాంటి వాడు నీ జీవితంలోకి రాకపోయి ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండేదానివి.

ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండేదానివి. ప్రేమా ప్రేమా అని వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాను.

నిన్ను కాపాడుకోలేకపోయాను. మన ప్రేమకి గుర్తు అయిన మన బిడ్డ ఈ ఇంటిలోనే నరకం అనుభవిస్తూ ఉంటే తెలుసుకోలేని గుడ్డివాడినయ్యాను.

సత్యవతి కి  శేషగిరి కి కొడుకుని అలా చూసి చాలా భయంవేస్తుంది. వీడేమిటి ఏదేదో వాగుతున్నాడు. ఇలాగే ఉంటే కష్టమని దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసి ఏమైందిరా ఎందుకు ఇలాగ అయిపోతున్నావు.

తల్లి పాదాలు పట్టుకుని క్షమించలేని తప్పు చేశానమ్మ.. నా కూతురు  జీవితంలో నా మొఖం చూడదు అని విక్రమ్ మాటలు తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూఉంటాడు.

సత్యవతికి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. ఇలాగే ఉంటే కష్టమని మెల్లిగా లేపి గదిలోకి తీసుకువెళ్లి ముందు స్నానం చేసిరా.. బలవంతంగా వాష్ రూమ్ కి పంపిస్తుంది.

సర్వెంట్ ని పిలిచి వేడివేడిగా సూప్ చేయమని చెబుతుంది. స్నానం చేసి వచ్చి ప్రాణం లేని బొమ్మలాగా అలాగే కూర్చుండిపోతాడు. సర్వెంట్ తెచ్చిన సూప్ ని సత్యవతి మెల్లిగా తాగిస్తుంది .

సూప్ తాగి కొంచెం కుదుటపడ్డాడు అనుకున్నాక ఇప్పుడు చెప్పరా ఏమయింది అని అడుగుతుంది. ఏమని చెప్పాలి అమ్మ.

భార్గవి మాటలు విని అవని విషయంలో ఏ తండ్రి చేయకూడని తప్పే చేశాను అంటాడు. ఆ మాటకి భయంగా కొడుకు వైపు చూస్తూ.. ఏమంటున్నావురా అవనికి ఏమైంది..

జరిగింది మొత్తం చెబుతాడు. వినగానే సత్యవతి కూడా నోటి మాట రాకుండా అయిపోతుంది. నాకు కూడా ఈ విషయం తెలియదు రా..

అవని కూడా చెప్పలేదు.  ఏమని చెబుతుంది అమ్మ. నీ కొడుకు ఇంత నికృష్టుడు అని నీకు చెప్పగలుగుతుందా...  అది బంగారు తల్లి.

అందుకనే నీ కొడుకు ఎంత ఎదవైనా నీకు చెప్పలేక మౌనంగా తనలో తానే ఏడ్చింది. ఇందులో నీ తప్పేముంది రా...

నీకు తెలిసి జరగలేదు కదా..  తెలిస్తే నువ్వు ఒప్పుకుంటావా.. నీ ప్రాణాలు అడ్డుపెట్టి నీ కూతురిని కాపాడుకోవా..

విరక్తిగా నవ్వుతూ కాపాడుకోవడం.. ఏ రోజు కాపాడాను అమ్మ. ప్రతిసారి తనకోసం తనే ఫైట్ చేసింది. పెళ్లయ్యాక భర్తగా విక్రమ్ ఫైట్ చేశాడు.

తండ్రిగా ఏ రోజు నేను నిలబడ్డాను. రజిత దూరమైనప్పటినుంచి దిక్కులేని దానిలాగానే బ్రతికింది. ఇన్ని కోట్లు ఆస్తి ఉంది. ఎవరికోసం సంపాదించాను. దేనికోసం సంపాదించాను.

  బిజినెస్ చేస్తున్నారు.  ఎదుట ఉన్నవాళ్లు.. ఎలాంటి వాళ్ళు ఏమిటో అన్నది ఒక్క మాటలోనే తెలిసిపోతుంది కదా... అలాంటిది మీ ఇంటిలో జరిగేది మీకు తెలియదు అంటే నమ్మాలా అని ఆరోజు అడిగింది.

అవని విషయంలో నా తప్పేమీలేదు అని ప్రూఫ్ చేసి నా కూతురికి దగ్గర అవ్వాలి అనుకున్నాను.  ఈ నీచమైన పని ఆ రాక్షసి చేసి శాశ్వతంగా నా కూతురు దృష్టిలో నన్ను ఒక నీచుడి కింద నిలబెట్టింది.

ఈ తండ్రి బాధ తీరేనా ??
[+] 11 users Like SivaSai's post
Like Reply
Part - 116


ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ ధనుంజయ్.. భార్గవి కి సరైన గుణపాఠం చెబుతాను. నా ప్రాణాన్ని దూరం చేసి మొదటి తప్పు చేసింది.

నా పంచప్రాణాలు అనుకున్న నా బిడ్డని శాశ్వతంగా దూరం చేయడానికి చాలా నీచమైన పన్నాగాలు పన్నింది. అలాంటి దాన్ని ఊరికనే ఎందుకు వదిలేస్తాను.

విక్రమ్ చేతికి ఆ పాపం అంటకూడదు అనే భార్గవి విషయంలో నేనే నిర్ణయం తీసుకున్నాను స్థిరంగా చెబుతాడు.

ఏమి చేస్తావురా అంటే ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఆ నవ్వులో ఏం అర్థం వెతుక్కోవాలో తెలియక సత్యవతి మౌనంగా ఉండిపోతుంది. 

శిల్పా ఉదయ్ తో సాయంత్రం దాకా పొలం పనులు చేయిపిస్తారు. మిషన్స్ ఏమీ ఇవ్వకుండా అన్ని నాటు పద్ధతిలోనే చేయించుతారు.

ఉదయ్ తో నాగలి పట్టిస్తారు. శిల్ప చేతకి కొడవలి ఇచ్చి  కలుపు మొక్కలు తీయమని పురమాయించుతారు. సాయంత్రం దాకా వంచిన నడుముని పైకి ఎత్తనివ్వరు.

సూర్యాస్తమయం సమయానికి మేము వెళుతున్నాము అబ్బాయ్..  ఇంకా మీరిద్దరూ ఇంకా ఏమైనా పడండి అని పంకజం, కాంతారావు వెళ్ళిపోతారు.

వాళ్ళు వెళ్లిన వెంటనే మెల్లిగా శిల్ప పైకి లేచి అమ్మా.. నా నడుము పట్టేసింది అని నడుం మీద చేతులు వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది.

ఉదయ్ కూడా ఎద్దులు కట్టేసి నాగలి పక్కకు పెట్టి చెమటలు తుడుచుకుంటూ వచ్చి ఇంటికి వెళదామా అంటాడు.

ఆ వెళదాం. అది ఒక ఇల్లు.. మళ్ళీ అక్కడికి వెళ్లడం అని విసుకుంటూ వస్తుంది. మనకి ప్రస్తుతానికి అదైనా ఉంది. అందుకు సంతోషించు.

రోడ్డు మీద వదిలేసి ఉంటే ఏమి చేసేదానివి... వదిలి చూడాల్సింది శిల్ప అంటే ఏమిటో చూపించేదాన్ని... అసలు నా రేంజ్ ఏంటో అర్థం కాక తీసుకొచ్చి ఈ గుడిసెలోనూ ఈ మట్టిలోనూ వదిలేశారు అంటుంది.

ఆ మాటలకి..  శిల్ప వైపు చూసి నీ పొగరు తగ్గేదాకా మనుషులు కనిపించరు.. అనుకొని మాట్లాడకుండా ఇంటికి వెళతాడు.

గుడిసెకు వెళ్లగానే స్నానం చేస్తావా అని అడుగుతాడు. చాలా చిరాకుగా ఉంది. స్నానం చేద్దామంటే హీటర్ కూడా లేదు.

చన్నీళ్ళతో స్నానం చేయాలి అంటే వణుకు వచ్చేస్తుంది. సరే ఒక్క పది నిమిషాలు కూర్చో అని పోయ్యి రాజేసి వేడి నీళ్లు కాస్తాడు.

అవి స్నానాల గదిలో పెట్టి వెళ్లి స్నానం చేసి రా.. ఈ లోపు వంట చేస్తాను అంటాడు. ఆ మాటకి ఉదయ్ వైపు చూసి సరే అని స్నానం చేసి వస్తుంది.

శిల్ప స్నానం అయ్యాక ఉదయ్ కూడా స్నానం చేసి సిద్ధం చేసిన అన్నం కూరని వడ్డిస్తాడు. తినకుండా చూస్తున్న శిల్పతో తిను. ఎందుకు అలా చూస్తున్నావు.

ఏమీ మాట్లాడదు.  నా వంట మరీ అంత భయంకరంగా ఏమి ఉండదు. తినగలవు.  నా చెయ్యి బాగోలేదు. కొడవలి పట్టుకుని చెయ్యంతా రఫ్ అయిపోయింది అంటూ  చూపిస్తుంది.

సరే నేను తినిపిస్తాను రా అని అన్నం కలిపి తినిపిస్తాడు. ఆకలి మీద ఉందో.. ఉదయ్ చేతి వంట బాగుందో కానీ మాట్లాడకుండా శుభ్రంగా తినేస్తుంది.

భోజనం చేశాక నిద్ర దేవి కళ్ళ మీదకి వస్తూ ఉంటే నేనింకా పడుకుంటాను.  నావల్ల కాదు అంటుంది. సరే నువ్వు పడుకో.

ఇవన్నీ నేను కడిగేసి వస్తాను. మళ్ళీ పొద్దున్నే కష్టం కదా.. వెళ్లి ఆ గిన్నెలన్నీ కడిగి బోర్లించి వస్తాడు. ఉదయ్ పనుల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.

ఉదయ్ వచ్చి చాపపరుచుకుని మౌనంగా పడుకుంటే ఉదయ్ అని పిలుస్తుంది. చెప్పు అంటాడు. అసలు నువ్వేనా అంటుంది.

నీకు ఎందుకు అంత అనుమానం వచ్చింది. లేకపోతే ఒకప్పటి ఉదయ్ ఎలా ఉండేవాడు... పొగరుగా ఒక స్టైల్ మెయింటైన్ చేస్తూ రాయల్ గా ఉండేవాడివి.

ఇప్పుడేంటి ఇంత దారుణంగా అయిపోయావు.. ఆ మాటకి నవ్వుతూ ఆ పొగరు నాది కాదు... ఆ రాయాలిటీ నాది కాదు... ఒక రకంగా చెప్పాలి అంటే అది అవని బిక్ష అంటాడు.

అవని పేరు వినగానే శిల్పకి కోపం వచ్చేస్తుంది. ఎందుకు అవని పెట్టిన బిక్ష.. ఏముంది నీకు.. ఇవన్నీ ఇచ్చింది మా మమ్మీ.

మా మమ్మీ నీకు ప్రతి రూపాయి ఇచ్చి లగ్జరీ అలవాటు చేసింది.  అలాంటిది మా మమ్మీని పొగడకుండా ఆఫ్ట్రాల్ ఆ పనిమనిషిని పొగుడుతావా అంటుంది.

పడుకున్నావాడు లేచి కూర్చుని చూడు శిల్పా నువ్వు తెలిసి మాట్లాడతావో..  తెలియక మాట్లాడతావో అర్థం కావడం లేదు.

ఇప్పుడు నీ పొజిషన్ ఏంటో నీకు తెలుసా..  నువ్వు అన్నావే పనిమనిషి అని తను ధనుంజయ్ ముద్దుల కూతురు.. పంచప్రాణాలు.

లేదు లేదు మా డాడీకి నేనంటేనే ఎక్కువ ఇష్టం అంటుంది. నువ్వంటే ఎక్కువ ఇష్టం కాదు. మీ మమ్మీ అలా క్రియేట్ చేసింది.

ప్రతి నిమిషం మీ నాన్న అవని కోసమే ఆలోచించేవారు. అవనికి తెచ్చిన ప్రతిదీ మీ అమ్మ నీకు ఇచ్చి నిన్ను ప్రిన్సెస్ చేసింది.

అవని స్థానంలో ఒక్కసారి నిన్ను నువ్వు ఊహించుకో.  అలాంటి జీవితం లో ఒక్కరోజైనా ఉండగలవా.. అంతెందుకు జైలుకు వెళ్లావు.

ఆ మాట వినగానే శిల్ప కోపంగా చూస్తుంది.  నువ్వు ఎంత కోపంగా చూసినా అదే నిజం. జైలుకు వెళ్లి వచ్చావు అయినా నీలో మార్పు లేదు.

యాన్యువల్  డే రోజున మీ డాడీ తన అసలైన వారసురాలు ఎవరో ప్రపంచానికి తెలియజేసి నువ్వు జీరో అని నీకే చూపించారు. అది విన్నా సరే నీలో చలనం లేదు.

ఇంకా అవనినీ నాశనం చేయాలి అనే ఆలోచనలో ఉన్నావు. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి అనే బంధం లో ఇద్దరముఉన్నాము.

ఏ రోజు కష్టపడితే ఆ రోజుకి మాత్రమే ఇక్కడ మనకి భోజనం ఉంటుంది. అయినా సరే నువ్వు ఒక ప్రిన్సెస్ లాగా ఫీల్ అవుతూ అవని పనిమనిషి అని చెబుతున్నావు.

ఏమిటి ఉదయ్ అంత జ్ఞానోదయం అయ్యిందా అవనీ జపం పట్టిస్తున్నావు అంటే నిజమే జ్ఞానోదయం అయ్యింది .

నీకు కావాలంటే విక్రమ్ కి చెప్పు.  నాకన్నా బాగా జ్ఞానోదయం చేస్తాడు. ఆ మాటకి విక్రమ్ ని ఊహించుకోగానే చిన్నగా వణుకుతుంది.

ఏమైంది శిల్ప అంతలా వణుకుతున్నావు  విక్రమ్ పేరు వినగానే... ఏమీ లేదులే అని కామ్ గా ఉంటుంది.  నీ మంచి కోసమే చెబుతున్నాను .

అవని జోలికి వెళ్ళకు. ఇప్పటికే నువ్వు, మీ అమ్మ పాతాళని కన్నా ఇంకా అడ్డడుగుకి చేరిపోయారు. నీ సంగతేమో గాని మీ అమ్మ చేసిన ఆకృత్యానికి విక్రమ్ మామూలుగా వదలడు.

నేను చేయి వెయ్యబోయాను అని తెలిసే నాకు ఇంత నరకం చూపించాడు. అలాంటిది నువ్వు,మీ అమ్మ కలిసి చేసిన ఆ చండాలం సంగతి విక్రమ్ కి తెలిస్తే అంటాడు.

ఆ మాటకి గుండె దడ పెరిగిపోయి ఇంకా ఆపు ఉదయ్ అంటుంది. ఏమైంది శిల్పా... నాకు నిద్ర వస్తుంది అంటుంది .

విక్రమ్ ఇంటికి వెళ్ళేటప్పటికి... చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.  ఏమైంది అని చుట్టూ చూస్తూ ఉంటాడు.
ఎవరు కనిపించకపోతే సర్వెంట్స్ ని అడుగుతాడు.

ఎవరు లేరు... ఎక్కడికి వెళ్లారు..  షాపింగ్కి వెళ్లారు. అవని మేమ్ ఒకరే ఉన్నారు.  ఓకే అని... రూమ్ కి వెళతాడు.

రూమ్ ❤️❤️❤️

కథ కొనసాగుతుంది...
[+] 14 users Like SivaSai's post
Like Reply
sooper update Siva bhayya!!
emotions anni peak lo unnay!!!
Like Reply
Super update
Like Reply
Part - 117


గదిలోకి వచ్చిన విక్రమ్ నిలబడిపోతాడు. అప్పుడు దాకా... ఉన్న చిరాకు పోయి ముఖంలో చిరునవ్వు వస్తుంది.

భార్య గారి బంగిమ చూసి గుండె పైన చేయి వేసి రబ్ చేసుకుంటూ చంపేస్తున్నావే బాబు.. రోజు రోజుకి నీ పిచ్చిలో పడిపోతున్నాను. 

లాప్టాప్ బ్యాగ్ ని పక్కన పెట్టి కోట్ రిమూవ్ చేసి మెల్లిగా వెనకాల వెళ్లి చూస్తూ ఉంటాడు. మెత్తటి పలచటి చీరలో.. ఒక కాలు కుర్చీ మీద పెట్టి ఒక కాలు నేల మీద పెట్టి జుట్టు అంతా ముందుకు వేసుకుని టవల్తో తుడుస్తూఉంటుంది.

పైట మొత్తం ముందుకు పడి అందమైన నెలవంక కనువిందు చేస్తూఉంటుంది. బంగారు గనులు నింపుకున్న ఎద సంపదని పట్టి ఉంచిన రవిక .. ఆ తడికి కొద్దికొద్దిగా అక్కడక్కడ తడిచి విక్రమ్ ని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది.

ఇక నేను ఆగలేను అన్నట్టుగా మెల్లిగా చేతులు రెండు నెలవంక పైకి చేర్చి గట్టిగా పట్టుకుంటాడు. అవని ఉలిక్కిపడి అరవబోతుంటే నోటిమీద చెయ్యి వేస్తాడు.

జుట్టుని  వెనక్కి వేసి భర్త వైపు చూసి నోటిమీద చెయ్యి తీయండి అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంది. తీస్తాను కానీ అరవకు అని మెల్లిగా చేయి తీస్తాడు.

చెయ్యి తీసి రెండు చేతులతో గట్టిగా వెనక నుండి హత్తుకుని ఏమిటి మేడం గారు ఇంటికి వచ్చేటప్పటికి ఇలా టెంప్ట్ చేసే పొజిషన్లో ఉన్నారు అని మెడ పైన చిన్న పంటిగాటు ఇచ్చి లిక్ చేస్తూఉంటాడు.

విక్రమ్ పనులకి ఆ మాయలో పడిపోతు... విక్రమ్ చేతులు మీద చేతులు వేసి.. మెడని వెనక్కి  భుజం పైకి వాల్చి ఎంతసేపయింది వచ్చి అంటుంది.

జస్ట్ ఇప్పుడే ఎవరూ లేరేంటి ..  షాపింగ్ కి వెళ్లారు అంటుంది. మరి నువ్వు వెళ్లలేదే.. మీరు వచ్చే టైం అయింది కదా...

అందుకని ఎవరూ లేరు అని ఇలాంటి రొమాంటిక్ సీన్ క్రియేట్ చేసావా చేతులను మెల్లిగా పైకి తీసుకువెళుతూ అడుగుతాడు.

వెంటనే చేతులను గట్టిగా పట్టుకొని మీరు ఏదేదో ఊహించుకోకండి. కిచెన్లో పిండి మీద పడితే చిరాకుగా అనిపించి హెడ్ బాత్ చేశాను.

ఈ లోపు మీరు వచ్చారు అంతే అని భర్త వైపుకు తిరిగి మెడ చుట్టూ దండలాగా చేతులు వేసి ఏమిటి రాగానే మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు ఏమిటి సంగతి.

నిజం చెప్పనా... వచ్చేటప్పటికి చాలా చిరాకుగా ఉంది. కానీ నిన్నే ఇలా చూడగానే నా మూడ్ మొత్తం మారిపోయింది.

భార్య అలక ను భర్త బుజ్జగించడంలోనూ..  భర్త చిరాకుని భార్య కౌగిలిలో తీరిపోతుంది కదా...  అలాగే నా చిరాకు కూడా నిన్ను చూడగానే అలా గాలిలోకి వెళ్ళిపోతుంది అంటూ ఆ పెదవుల పైన చిన్నగా కిస్ చేస్తాడు.

అబ్బో మా వారు రొమాంటిక్ మూడ్లోనే కాదు మంచి కవిత్వం కూడా చెబుతున్నారే అని మీసాలు పట్టుకుని లాగుతుంది.

ఇదిగో ఇప్పుడు ఇలాంటి పనులు చేసావు అనుకో.
  నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాను. తర్వాత నా వల్ల కాదు.

అందరూ వచ్చే టైం అయ్యింది అన్నా సరే నేను వదలను అర్థమయిందా... వదలమని నేనేమీ అనలేదే అంటుంది.  ఓహో మేడం గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నమాట..

అయితే నేనెందుకు ఆగుతాను అని మంచం దగ్గరికి తీసుకువెళ్తాడు.  నేను ఏదో సరదాగా అన్నాను. ఇప్పుడు నా వల్ల కాదు అని జారిపోబోతుంది.

నీకు ఇంకా అంత ఛాన్స్ లేదు బంగారం. ఒక్కసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత  దానికి పూర్తిగా న్యాయం చేయాల్సిందే.. లేకపోతే నాకు మాట వచ్చేయదు అని అల్లుకుపోతాడు.

నో..  నో..  అంటూనే విక్రమ్ ప్రేమకి కరిగిపోతూ..  ప్రేమగా తనని తాను అర్పించుకుంటూ ఒకరిలో ఒకరు కరిగిపోతారు.

సరససృంగార సయ్యాటలాడి ... అలసి సేదతీరుతున్న దేవేరిని చూసి నవ్వుకుంటూ నుదుటన ముద్దు పెట్టి బంగారం అంటాడు.

చెప్పండి అంటే..  కలిసి జలకాలాడదామా అంటాడు. కళ్ళు మెల్లిగా పైకెత్తి ఇప్పుడు వరకు జరిగింది చాలదా... మళ్ళీ ఇప్పుడు ఇంకొక రొమాంటిక్ సీనా అంటుంది.

నీతో ఎన్ని సీన్స్ అయినా మళ్లీ కొత్త కొత్తగానే ఉంటుంది బంగారం అని వాష్ రూమ్ లోకి తీసుకువెళ్లి... తానే స్వయంగా స్నానం చేపించి విక్రమ్ కూడా స్నానం చేసి భార్యకి దగ్గరుండి చీర కడతాడు.

ఏమైంది ఈ రోజు మీకు..  ఏం అవ్వాలి.  భార్యకి సేవ చేయాలి అంటే ఏదైనా జరగాలా ఏమిటి.
చేయాలి అనిపించింది చేశాను అంతే.

అందరూ వచ్చే టైం అయింది కదా పద అని కిందకి తీసుకువెళతాడు.  అవని కిచెన్ లోనికి వెళ్లి డిన్నర్ ప్రిపరేషన్ చూస్తూ ఉంటే...

కావలసినవి అందిస్తూ కబుర్లు చెబుతూ ఒక అందమైన సంధ్యవేళ ని  అద్భుతంగా మార్చుతాడు. మెల్లిగా ఒక్కొక్కళ్ళు ఇంటికి చేరుతూ ఉంటారు.

లేడీస్ షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తారు.  లలిత కరుణతో ఇదేమిటి వీళ్ళు ఇంకా రాలేదు.  పొద్దున్న మనకన్నా ముందే వెళ్లారు కదా...

నా కొడుకుకి ఓపిక ఎక్కువలే వదిన. అందుకే నా కోడలు అడిగింది ఏది కాదనకుండా కొంటున్నాడు.  తిప్పుతున్నాడు.

మీ అన్నయ్య ఉన్నారే... ఒక్క రోజు కూడా షాపింగ్ కి తీసుకు వెళ్లలేదు.. ఏదైనా కావాల్సింది దగ్గరుండి కొనిపెట్టింది లేదు.

నా కొడుకు లాగా ప్రేమగా చూసుకోవాలి అంటే పెట్టి పుట్టు ఉండాలే అంటుంది. ఆ మాట విన్న పార్ధు కళ్యాణ్ తో ఈ ఆడవాళ్ళకి మనం ఎన్ని చేసినా సరే ఆఫ్ట్రాల్ రా...

అదే కొడుకు ఒక చాక్లెట్ తెచ్చి ఇవ్వమను..  ఆహా నా కొడుకు కాబట్టి తెచ్చాడు. వాడంతా సూపర్ ఎవరూ ఉండరు అన్నంత డబ్బా కొట్టుకుంటారు.

ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏమి కొనకుండా చూడకుండానే వీళ్ళకి అన్నీ అమీరాయ...  మరి ఆ మాటేదో చెల్లమ్మతో చెప్పొచ్చు కదా..

ఏరా నేనెలా ప్రశాంతంగా ఉంటే నీకు నచ్చలేదా అంటాడు.. ఏమైంది... నేను అలా చెప్పాను అనుకో ముక్కు చీదుతూ పెళ్ళానికి ఆ మాత్రం చేయలేరా..  నేను మీకు అంతా పనికి రాకుండాపోయానా అని ఏడుస్తూ....

అందులో కూడా కొడుకు గొప్పతనం చెప్పి... ఉన్న ఈ జుట్టును కూడా పీక కొడుకు చేతిలో పెడుతుంది. మనకు అవసరమా... ఊ అంటే పోయే అంటాడు.

ఆ మాటకి నవ్వుతూ అమ్మలు అందరూ అంతేనేమో... ఇది మాత్రం నిజం రా.. కొడుకు మాత్రం కృష్ణుడి లాగా అల్లరి చేస్తూ గంతులేస్తూ ఉండాలి.

అదే భర్త దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం శ్రీరామచంద్రుడి లాగా ఉండాలి అంటారు.  మనకు ఒక న్యాయం... కొడుకు కి ఒక న్యాయం. ఇది ఎక్కడి దారుణం రా ఈ ఆడవాళ్ళతో..

మరి ఏ న్యాయం కావాలి.. ఆ.. వచ్చేసిందిరా మనం ఎంత స్లోగా మాట్లాడుకున్న కొడుకు టాపిక్ వచ్చేటప్పటికి బెల్లం వాసన చీమలకు తెలిసినట్టుగా ఈ ఆడవాళ్లకు తెలిసిపోతుంది అనే స్లోగా అని... దేనికి కరుణా అంటాడు.

మీరేదో న్యాయం కావాలి.. దారుణం అని ఏవేవో పెద్దపెద్ద మాటలు అంటున్నారు కదా దాని గురించి అంటుంది.  అయ్యో వాటి మీనింగ్ కూడా నాకు తెలీదు ఏరా కళ్యాణ్.. నీకేమైనా తెలుసా....

కళ్యాణ్, రమేష్ వస్తున్న నవ్వని ఆపుకుంటూ నన్ను ఇన్వాల్వ్ చేయకండి మాస్టారు. నాకు ఏమీ తెలియదు అని కళ్యాణ్ ఎస్కైప్ అయిపోతాడు.

ఒరేయ్ నువ్వు, నీ కొడుకు కన్నా దారుణంగా ఉన్నావు రా...  నీ కొడుకు నా కొడుకుని బుక్ చేస్తే నువ్వు నన్ను బుక్ చేసేస్తున్నావు.

మేము పెళ్ళాలు వస్తుంటే పసిగట్టి సైలెంట్ అయిపోతాము. బాబు కొడుకులిద్దరూ అది పసికట్టకపోతే.. మాదా తప్పు అంటాడు.

ఎలా పసిగడతారురా.. ఆ విషయం తర్వాత చెబుతాను గాని ముందు మా చెల్లికి జవాబు చెప్పు.

అయ్యో కరుణ నిన్ను షాపింగ్ కి తీసుకువెళ్లాలి అనుకున్నాను...  ఆ విషయమే కళ్యాణ్ తో మాట్లాడుతున్నాను.

ఏరా అంటే.. అవునా అంటాడు.  ఒరేయ్ అని బిక్కమొహం వేస్తే సరే సరే అని.. అవును చెల్లమ్మ.  నీకు ఏదో డైమండ్ సెట్స్ తీసుకోవాలి అంట.

దాని గురించే..  షాప్స్ ఎక్కడ బాగుంటాయా అని అడుగుతుంటే నాకేం తెలుస్తది రా అది ఆడవాళ్ళకి అయితే బాగా తెలుస్తది అన్నాను అని కొన్ని కొడతాడు.

నిజమా అనే మెరిసే కళ్ళతో  అడిగితే...  కక్కలేక మింగలేక అవును బంగారం రేపు రెడీ అయిపో..
వెళదాము.

లలిత మాధవి మూతి తిప్పుతూ... మీరు ఉన్నారు... ఇండియాలోనే ఉండి కూడా ఎప్పుడైనా అలా తీసుకెళ్ళారా.. అన్నయ్యగారిని చూడండి అంటుంది.

పార్థు వెంటనే అదేంటి చెల్లెమ్మ...  కళ్యాణ్,  రమేష్ మీ ఇద్దరికీ ఏమి తీసుకోలేదా.. మరి నాతో ఏంటి మేము ఆల్రెడీ కొనేశాము అని చెప్పారే అని కళ్యాణ్ వైపు తిరిగి కన్ను కొడతాడు.

ఈసారి వీడు ఇరికించేసాడు కదా అని బావ వైపు  చూసి... పెళ్లాలతో ఒకేసారి  రేపు మేము ఎవ్వరం ఆఫీస్ కి వెళ్లడం లేదు.  ఓన్లీ పెళ్ళాల షాపింగ్ అని కోరసుగా అంటారు.

ఈ సౌండ్ బాగుంది అని ముగ్గురు వెళ్ళిపోతారు. మనలో మనకి యూనిటీ లేకపోతే ఈ ఆడవాళ్ళ ఆడేసుకుంటారు అని కళ్యాణ్ ఫీల్ అవుతాడు.

దీన్ని బట్టి ఏం అర్థమైందంటే మనలో మనం ఇరికించుకోకూడదు అని  అంటూ ఉండగానే రాజ్ వచ్చి పక్కన కూలబడి వాటర్ అంటాడు.

అవని వెంటనే జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. థాంక్యూ సిస్టర్ రాగానే చల్లటి జ్యూస్ ఇచ్చావు. జ్యూస్ తాగి హమ్మయ్య అనుకుంటాడు.

ఏరా మొఖం అలవాడిపోయింది. లంచ్ చేయలేదా... నీ కోడలు లంచ్ చేసే అంత టైం కూడా ఇచ్చిందా... నా నోటి దురదకి పొద్దున్నుంచి సాయంత్రం దాకా అన్ని షాపులు తిప్పి నాకు ఏమీ నచ్చలేదు అని ఇంటికి తీసుకు వచ్చింది అంటాడు.

మీ ముఖం ఏంటి నాన్న అలా వెలవెలబోతుంది. నా నోటి దూల కి రేపు మీ అమ్మ బిల్లు వేస్తుంది లే అంటాడు.  మీరేం వాగారు.

నిన్ను పొగిడాను అది మీ అమ్మకి నచ్చలేదు అని పిటింగ్ పెడతాడు.  నన్ను పొగిడితే ఎందుకు నచ్చలేదు.. కావలిస్తే వెళ్లి అడుగు...

రాజ్ బాబు నీకు అవసరమా ??
[+] 9 users Like SivaSai's post
Like Reply
Part - 118


నన్ను పొగిడితే అమ్మకి ఇష్టమే కదా.. ఏమోరా నిన్ను పొగిడాను అని అలిగి లోపలికి వెళ్ళిపోయింది.  నీకన్నా నా కోడలే బెటర్ అంట.

అవునా ఏ విషయంలో..  ఏమో వెళ్లి కనుక్కో అని పంపిస్తాడు.  అమ్మ అమ్మ అరుచుకుంటూ గదిలోకి వెళతాడు.

అక్కడ లేడీస్ బ్యాచ్ అంతా కూర్చుని  నివి షాపింగ్ చేసినవి చూస్తూ ఉంటారు.  ఏమైందిరా అలా కాకిలాగా అరుస్తున్నావు.

ఎందుకమ్మా నామీద నీకు అంత కోపం అని మేడచుట్టూ చేతులు వేసి ఉయ్యాలఊగుతూ ఉంటాడు. ఒరేయ్ నువ్వు ఏమన్నా చంటిబిడ్డవు అనుకుంటున్నావా..  ఉయ్యాల లాగా ఊగుతున్నావు.

నువ్వు ఎందుకు నా మీద కోపంగా ఉన్నావో అది చెప్పు. నేను నీ మీద కోపంగా ఉండటం ఏంట్రా..  ఎవరు అన్నారు..  ఎవరు అంటే ఏమిటి అది నిజం కదా...

అందుకే నేను వచ్చినప్పుడు నుంచి నువ్వు నా మీద చిరాకు పడుతున్నావు.  పచ్చకామెర్లోడికి ఊరంతా పచ్చగా ఉంది అని..

నువ్వు ఆ మూడ్ లో వచ్చి నేను కోపంగా ఉన్నాను అంటే నేనేం చెప్పగలను రా అంటుంది. లేదమ్మా ఎందుకు అలిగావో చెప్పు..  నా బంగారు తల్లివి కదా..  బుజ్జివి కదా అని బ్రతిమాలుతూ ఉంటే వెనక వచ్చిన జెంట్స్ బ్యాచ్ అది చూసి అబ్బో అనుకుంటారు.

పార్ధు కళ్యాణ్ వైపు చూసి కన్నుకొట్టి ఏమీ లేదురా..  రేపొద్దున్న లేడీస్ అందర్నీ తీసుకుని జెంట్స్ అందరూ జువెలరీ షాప్ కి వెళ్తున్నాము  కదా...

అక్కడ నువ్వు నివికి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటావా..  మీ అమ్మకు ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటావా అన్న డౌటు వచ్చింది.

నేను సింపుల్ గా ఎవరికైనా అమ్మ కన్నా పెళ్ళామే ఎక్కువ కదా... నివియే ఎక్కువ అన్నాను.  అందుకే మీ అమ్మ అలక.

ఇప్పుడు చెప్పరా ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటావో అని ఇరికించి...  అబ్బా? అనుకుంటాడు.
నివి, కరుణ ఇద్దరూ రాజ్ వైపు చూస్తారు.

ఈ షాపింగ్ ఏమీ తెలియని రాజ్ బుర్రగోక్కుంటూ మళ్లీ ఈ షాపింగ్ గొడవ ఎందుకు వచ్చింది.  ఈ రోజు నివి షాపింగ్ అయిపోయింది కదా..

వెంటనే నివి అయ్యో రాజ్ ఈరోజు ఓన్లీ చీరల షాపింగ్ మాత్రమే అయ్యింది. జువెలరీ అవ్వలేదు. అయితే నీ దగ్గర చాలా ఉంటాయి కదా..  అలాగే మమ్మీ దగ్గర కూడా ఉంటాయి కదా..

మళ్లీ కొత్తగా కొనుక్కోవడం దేనికి. కరుణ కోపంగా.. నివికి కొత్త బట్టలు ఏమీ లేక కొనుక్కుందా..  అయినా పెళ్ళాం వచ్చేటటికి తల్లి అల్లం అయిపోయినట్టుంది అని ముక్కు చీదుతుంది.

అమ్మ నువ్వు ఏదేదో కొత్త కొత్త డైలాగులు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు.  రేపు జ్యువెలరీ షాపింగ్ ఏ కదా దగ్గరుండి నేనే సెలెక్ట్ చేసి కొంటాను. సరేనా..

సరే అని కాంప్రమైజ్ అవుతుంటే..  ఒరేయ్ మీ అమ్మకి కొనడం కాదు  ఇక్కడ టాపిక్కు. వాళ్ళిద్దరిలో ఎవరికీ ఇంట్రెస్ట్ గా ఎక్కువ పెట్టి కొంటావు అనేదే టాపిక్ అంటారు.


ప్లీజ్ నాన్న..  మీరు ఎందుకు నన్ను ఇరికించే ప్రోగ్రాం పెట్టుకున్నారు. నాకెందుకొచ్చిన గొడవ ముందు జాగ్రత్తగా చెప్పాను.

ఒక్కసారి ఆ లేడీస్ ఇద్దరిని కాంప్రమైజ్ చేసి బయటికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు.  వెళుతున్న పార్ధుని చూసి కళ్యాణ్ నవ్వుకుంటూ వెళ్లి ఏరా ఎందుకు అంత దారుణంగా ఇరికించావు.

లేకపోతే నాకన్నా కొడుకే గ్రేట్ అంట..  సూపర్, కేక అని చెప్పింది కదా..  ఇప్పుడు కొడుకు తెలివి ఏ పాటిదో తెలుస్తుంది.

భోజనం చేయకపోయినా పరవాలేదు.  పొట్ట ఫుల్ గా ఉంది అంటాడు. నీలో చాలా శాడిజం ఉందిరా.. అప్పుడప్పుడు చూపించాలి రా..

లేకపోతే పెళ్ళాలకి మన విలువ తెలియదు కదా అని భుజం మీద చేయి వేసి విజిల్ వేసుకుంటూ తీసుకువెళ్తాడు.

ఇటు తల్లిని, అటు కాబోయే భార్యని కాంప్రమైజ్ చేసి నీరసంగా బయటకి వస్తాడు. నీరసంగా బయటికి వచ్చిన కొడుకుని చూసి ఏరా అప్పుడే అయిపోయిందా.

మీరు చాలా దుర్మార్గులు నాన్న అంటాడు.  దేనికో అంటూ బనానా తింటు.. తింటావా అని అడుగుతాడు. పెట్టాల్సిన మంట అంట పెట్టి తింటావా అని ఇప్పుడు అడుగుతున్నారా.

అలసిపోయి ఇంటికి వచ్చిన కొడుక్కి జ్యూస్ ఇవ్వడం మానేసి ఇంకా ఇరికించి మీరు పండగ చేసుకుంటున్నారా... అలాంటిదేమీ లేదు రా..

రేపు షాపింగ్ లో మేము ఒక్కళ్ళమే ఇరుక్కుంటే ఎలాగా అని నిన్ను ఇరికించాను అంతే అంటాడు. ఈరోజు నేను ఇరుక్కుంది చాల్లేదా..

మీ అమ్మ దృష్టిలో నువ్వు చాలా సూపర్ రా..  అందుకనే ఎలా మేనేజ్ చేస్తావో రేపు చూద్దాం అని. నాన్న అని గట్టిగా అరిస్తే...

డిన్నర్ చేద్దాం రా.. అని కొడుకుని తీసుకువెళ్లి దగ్గరుండి మరీ వడ్డిస్తాడు.  ఇరికించేది మీరే..  ప్యాంపెరింగ్ చూపించేది మీరేనా.. రేపటి నుంచి ఓదార్చేది కూడా నేనే రా సుపుత్ర.

విక్రమ్ కూడా రాజ్ పక్కన కూర్చుని ఓదార్పు యాత్రలు ఎక్కడ వరకు వచ్చాయి. ఇంకా మొదలవలేదులే.. ముందు ముందు మొదలవుతాయి అని పార్ధు అంటారు.

మీరిద్దరూ నా శ్రేయోభిలాషులు కాదు..  యమకింకరులు  అని ఆకలి మీద ఉండి గబగబా భోంచేసి గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు.

వెళుతున్న రాజ్ ని చూసి నవ్వుతూ మరీ ఎక్కువ ఏడిపిస్తున్నట్టున్నారు అంకుల్. ఇప్పుడు ఇలాగుంటేనే..  రేపు గుర్తొచ్చినప్పుడు సరదాగా ఉంటుంది.

బిజినెస్ బిజినెస్ అని పరుగులు పెట్టి వాడితో చాలా మిస్ అయిపోయాను.  ఇప్పుడైనా సరదాలు తీర్చుకోకపోతే ఎలా అని పడుకోవడానికి వెళతారు.

అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఎవరి గదిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు.

సూర్యోదయం మొదలవ్వగానే నిశ్చితార్థం ఏర్పాట్లు మొదలవుతాయి. డెకరేషన్స్ స్టార్ట్ చేస్తారు.  వినయ్ నీ దగ్గరుండి చూసుకోమని విక్రమ్, భరత్ ఆఫీస్ కి వెళ్ళిపోతారు.

మిగిలిన జెంట్స్ మొత్తం లేడీస్ షాపింగ్ కి ఇరుక్కుని తీసుకుని వెళతారు.  అవని  నాకు చాలా ఉన్నాయి.  వద్దు.  ఇంటి దగ్గర ఏదైనా అవసరం ఉంటే చూసుకుంటాను అని ఆగిపోతుంది.

ఈవెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడ ఏమి సర్దాలో అన్ని చూస్తూ ఉంటారు. వినయ్ వాళ్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు.

ఇందిరా అవని అవన్నీ చూస్తూ ఉంటారు. ఇందిరా గారు కాసేపు చూసి రెస్ట్ తీసుకుంటాను అని గదిలోనికి వెళ్ళిపోతే.. అవని విక్రమ్ ఫోన్ చేశాడు అని గదిలోనికి వెళుతుంది.

ఒక లేడీ వాయిస్ గట్టిగా వినపడుతూ ఉంటే ఆ వాయిస్ వచ్చిన వైపు వినయ్.. చెవులు పెడతాడు.  ఈ గొంతు ఎక్కడో విన్నట్టు ఉందే అనుకుంటూ మెల్లిగా ఆ గొంతు వినిపించిన వైపుకి అడుగులు వేస్తాడు.

చుడీదార్ వేసుకున్న ఒక అమ్మాయి..  ఒక అబ్బాయిని వంచి మరీ గుద్దుతూ ఉంటుంది. వెనక నుండి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.

ఈ స్ట్రక్చర్ చాలా దగ్గరగా చూసినట్టు గుర్తే...అనుకుంటు ఇంకా దగ్గరికి వెళతాడు. ఈ పూజిత తో పెట్టుకుంటే పూజకు పనికి రాకుండా అయిపోతావ్ రా ఇడియట్ అని పీకుతూ ఉంటుంది.

ఓర్నీ..  మొన్న రోడ్డు మీద కొట్టింది ఈ అమ్మాయి ఏ కదా.. హలో మిస్ ఎప్పుడు చూసినా ఎవరినో ఒకరిని కొడుతూనే ఉంటారా..

నేను ఎవరిని కొడితే నీకేంటి రా అని వెనక్కి తిరుగుతుంది. దెబ్బలు తింటున్న అబ్బాయి... హమ్మాయ్య అనుకుని ఎస్కేప్ అయిపోతాడు.

పారిపోతున్న వాడిని ఒరేయ్ అని పిలుస్తుంది. అక్కోయ్ తెస్తాను. లేట్ చేసావంటే తోలు తీస్తాను అంటుంది. నీకా ఛాన్స్ ఇవ్వనక్క అని పరుగందుకుంటాడు.

వినయ్ దగ్గరకొచ్చి మీ తమ్ముడా..  ఏమి తీసుకురావాలి.. తమ్ముడా ఏమన్నానా..  ఇక్కడ స్టాఫ్ అని..  ఇంతకీ నువ్వేంటి గన్నయ్య ఇక్కడున్నావు... 

ఇదిగో గన్నయ్య అని పిలిచావంటే ఊరుకోను. పోని అబ్బాయి అంటుంది. నా పేరు వినయ్ అని చెప్పాను కదా..

ఏదో ఒకటిలే గాని..  ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటుంది. ఇది.. అని చెప్పబోతుంటే... ఇక్కడ జాబ్ చేస్తున్నావా..

ఏం జాబ్ చేస్తున్నావు అని అడుగుతుంది.  అది... అనే లోపు.. ఈ ఇంటి దగ్గర అంత మెయింటైన్ చేస్తావా.. లైక్ సూపర్వైజర్ అంటుంది.

ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడవేంటి అబ్బాయి... నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని అంటాడు.

నేనెప్పుడో గ్యాప్ ఇచ్చాను నువ్వు సమాధానం చెప్పడంలో లేట్ చేస్తే నాదా తప్పు అంటుంది. తప్పంతా పక్కన వాళ్ళది. నువ్వు మాత్రం సత్య హరిశ్చంద్రుడికి ఓన్ సిస్టర్ కదా...

ఆ విషయం నీకు అర్థమైనట్టుగా ఇంకెవరికి అర్థం కావడం లేదు అబ్బాయ్.. ఇంతకీ ఏం చేస్తావో అంటే చెప్పడం లేదు అంటుంది. 

వినయ్ ఒక్క నిమిషం ఆలోచించి నువ్వు అనుకున్నదే అంటాడు.  సూపర్వైజర్ ఆ.. చూశావా.. నేను ఎంత తెలివైనదానినో...  నువ్వు చెప్పకుండానే నేను కనిపెట్టేసాను అంటుంది.

అవును.. మీలాంటి తెలివైన వాళ్ళ వల్లే మన దేశం ఇంత డెవలప్ అయ్యింది అంటాడు.  నీ ఉద్దేశం ఏమిటి అబ్బాయి...

అదే...  ప్రశ్న నువ్వే వేసి సమాధానం నువ్వే చెప్పేస్తున్నావు కదా..  దీనివల్ల పక్కన వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అవ్వదు. వాళ్ళు వేరే వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అన్నదే నా ఉద్దేశం అంటాడు.

పరవాలేదు అబ్బాయ్ కలిసింది రెండుసార్లు అయినా నా గురించి బాగానే అర్థం చేసుకున్న కీప్ ఇట్ అప్ అంటుంది. బాగానే కీప్ ఇట్ అప్ లే నేను..

ఇంతకీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు.  అయ్యో ఈవెంట్ ఆర్గనైజేషన్ మాదే అంటుంది. నువ్వు చూస్తే జస్ట్ ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయినట్టున్నావు.

ఈ ఆర్గనైజేషన్ ఎప్పటినుంచో ఉన్నట్టుంది. ఒరేయ్ మొద్దు ఇది మా నాన్నగారు రన్ చేస్తారు.  ఆయనకి కొంచెం హెల్త్ బాగోలేదని నేను వచ్చాను అంటుంది.

ముద్దా  అంటాడు.  ముద్దు కాదురా మొద్దు.. ఏమోలే నాకు ముద్దు అని వినిపించింది అంటాడు. వినిపిస్తుంది.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చక్కగా పని చేసుకో.

లేకపోతే  నీ మక్కీలు కూడా కైమా కింద విరగ్గొడతాను.  లేదు అంటే ఈ ఇంటి ఓనర్ కి చెబుతాను అంటుంది. చెబితే మాత్రం నాకేమన్నా భయమా అంటాడు.

వినయ్ ? పూజిత ...
[+] 13 users Like SivaSai's post
Like Reply
inko love story istart!!!
andari pelli cheddamani decide ayinattunnaru Sivagaru!!
Like Reply
Nice update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Part - 119


ఇంటి ఓనర్ కి చెప్తే నాకేమన్నా భయమా.. ఏంటి అబ్బాయి భయం లేదు అంటావు అంతేనా అంటుంది. అస్సలు లేదు నేను ఎంత చెబితే అంతే అంటాడు.

అబ్బో అంత పెద్ద ఉద్యోగం ఇక్కడెం వెలగ పెడుతున్నావు ఏంటి.. ఏదైనా వెలగబెడతాను నీకేంటి అమ్మాయి ఇబ్బంది అంటాడు.

నా పేరు అమ్మాయి కాదు పూజిత. నువ్వు మాత్రం నన్ను ఇష్టమొచ్చినట్టు పిలవవచ్చు గాని నిన్ను మాత్రం అమ్మాయి అనకూడదా?

ఎప్పుడైతే నువ్వు నన్ను చక్కగా పిలుస్తావో అప్పుడే నేను పిలుస్తాను అప్పుడు దాకా నువ్వు అమ్మాయివి అంతే.  నీతో ఈ వర్క్ అంత దగ్గరుండి చేయించమని విక్రమ్ సార్ మరీ మరీ చెప్పి వెళ్లారు.

కాబట్టి పదా అని లాక్కునివెళతాడు.  ఇదిగో అబ్బాయి నాకు తెలుసు ఎలా చేయాలో నువ్వు చెప్పనవసరం లేదు. అబ్బో నువ్వు అంత పుడింగివ... పుడింగ అంటే..అదే ఎవరు చెప్పకుండా నీ అంతటి నువ్వే చేసేస్తావా అంటాడు.

ఏం చూస్తావా... చూడాలనే కదా నా ఆత్రం కూడా అంటాడు.  ఏం చూడాలని అని వెనక్కి బెండై అడుగుతుంది.

నువ్వు ఏది చూపిస్తే అదే పాపా అని ముందుకు వస్తాడు.  ఇదిగో నిలబడి మాట్లాడు. నువ్వు వెనక్కి బెండ్ అయ్యావు కదా వినపడుతుందో లేదో అని నేను ముందుకు వచ్చాను అంటాడు.

అబ్బో నీ దగ్గర చాలా సేఖలు ఉన్నాయే..  ముందు ముందు ఇంకా చూపిస్తానులే గాని పద పద లేట్ అయింది అంటే విక్రమ్ సారు కోప్పడతారు అంటాడు.

పూజితతో దగ్గర ఉండి డెకరేట్ చేపిస్తూ ఉంటాడు. ఇదిగో అబ్బాయి ఇది మా స్టాఫ్ వచ్చి చేస్తారు.  నేనే చేయాల్సిన అవసరం లేదు. నేను ఆర్డర్ వేయ్యాలి. వాళ్ళు చేస్తారు అంటుంది.

అదే కదా పాప ఇప్పుడు నేను చేసేది కూడా..  నేను ఆర్డర్ వేస్తున్నాను.  నువ్వు చేస్తున్నావు. నేను నా కంపెనీ ఎండి ని.  నా కింద వర్కర్స్ ఉంటారు.

అంతేగాని నీ కింద నేను వర్కర్ ని కాదు అర్థమైందా అని కణతల మీద పెట్టి పొడిచి చూపిస్తుంది. ఆ వేలును పట్టుకుని అర్థమైంది కాబట్టే కదా దగ్గరుండి చేయిపిస్తున్నాను .

ఏం అర్థమైందిరా మగడ..  చెప్పిందే చెబుతున్నావ్ గాని నేను చెప్పింది అర్థం చేసుకోవడం లేదు.  ఇంత జిడ్డు లాగా తగిలావ్ ఏమిటి.

నేను జిడ్డు కాదు స్మార్ట్ అందుకే నీతో దగ్గరుండి చేయిపిస్తున్నాను.  అసలే మా నివి కి చాలా పర్టికులర్ గా ఉండాలి.

హలో నువ్వు ఇక్కడ సూపర్వైజర్ మాత్రమే. అయితే... మరి నివి అంటావేమిటి. నివేదిత మామ్ అనాలి అని నొక్కి చెబుతోంది.

మరి మిమ్మల్ని ఏమని పిలవాలో అంటాడు. కాల్ మీ పూజిత మేమ్ అంటుంది.  గాడిద గుడ్డేం కాదు అంటాడు. చూడు అమ్మాయి...

ఇక్కడ నువ్వు పని చేయడానికి వచ్చావు.  నేను పని చేయడానికి వచ్చాను.  మనిద్దరి మధ్య ఈ వాదన అవసరమా..

వినయ్ అని అవని పిలుచుకుంటూ వస్తుంది.  చెప్పు వదిన...  వర్క్ ఎంతవరకు వచ్చింది.  మీ అన్నయ్య ఇప్పుడే కాల్ చేశారు.

ఇదిగో దగ్గరుండి మరీ చేయిపిస్తున్నాను. సరే జ్యూస్ ఏమన్నా పంపించమంటావా..  వద్దు వదిన అంటాడు. సరే ఏదైనా అవసరమైతే పిలువు.

సరే అని అనగానే అవని వెళ్ళిపోతుంది.  పూజిత ఇద్దరి వంక ఆశ్చర్యంగా చూస్తూ.. నువ్వేంటి వదిన అన్నయ్య అంటున్నావు. అయ్యో తెలిసిపోయిందా అని నాలిక కరుచుకుని అంటే..  మేడంకి అందర్నీ మన అనుకుని కలుపుకుంటారు.

నన్ను సొంత మరదిలాగా చూసుకుంటారు. అందుకే అన్నయ్య అని చెబుతారు. ఓ అవునా కానీ నువ్వు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావే...

వదినతో మీరు అండి అని మాట్లాడతారా...  వదిన అంటే ఎవరు..  తల్లితో సమానం. ఇలాంటి చచ్చిపుచ్చు డౌట్లతోనే అందరిని చితక్కొట్టేస్తున్నావ్. కానీ...  కానీ అంటాడు.

నువ్వు మాత్రం నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంటుంది. కన్ఫ్యూజన్ లేదు. ఏమీ లేదు వర్క్ చేయడం రాకపోతే ఇలాగే మాటలతో గెంటేస్తారు అని రెచ్చగొడతాడు.

యు మిస్టర్..  నా వర్క్ కి ఇప్పటిదాకా పేరు పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు తెలుసా అంటుంది.  అందుకే కదా నేను పెడుతున్నాను.

నీకు ఒళ్లంతా గోరోజనమే అంటే..  కాదు వెటకారం అంటాడు. రెండిటికి పెద్ద తేడా లేదులే అని పళ్ళునురుతు డెకరేషన్ చేస్తూ ఉంటుంది.

వినయ్ కి పూజిత తో టైం స్పెండ్ చేస్తుంటే బాగా నచ్చుతుంది. ఏ అమ్మాయి  లో లేని సంథింగ్ టాలెంట్ పూజితలో కనిపిస్తూ ఉంటే అట్రాక్ట్ అవుతూ ఉంటాడు.

ఏడిపించి, విసిగించి  పూజిత కి హెల్ప్ చేస్తూ డెకరేషన్ చాలా వరకు ఫినిష్ చేస్తారు.  ఇదిగో అబ్బాయి చాలా వరకు అయిపోయింది.

చిన్న చిన్న టచ్చింగ్స్ మాత్రమే ఉన్నాయి. అవి రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తాము.  వీటిని మాత్రం నువ్వు చెడగొట్టనివ్వకుండా జాగ్రత్తగా చూడు.  లేకపోతే నాకు మాట వచ్చేస్తది అంటది.

నీకు మాట వస్తే నాకు వచ్చినట్టే కదా అమ్మాయి అంటాడు. నాకు వస్తే నీకెందుకు వస్తది అని కోపంగా అడుగుతుంది. అరె నీకు ముక్కు మీద కోపం ఉంటుందే అమ్మాయి.

నేను అన్నది ఇద్దరం కలిసి చేశాము కదా...అలాంటప్పుడు తేడా వస్తే ఇద్దరి పేర్లు వస్తాయి కదా అది చెబుతున్నాను. దీనికి కూడా కోపమేనా...

ఓకే ఓకే అలా చెబితే పరవాలేదు. మరి ఎలా అనుకున్నావ్ ఏమిటి అంటాడు. నేను ఎలాగా అనుకోలేదు కానీ మహాప్రభో...

నన్ను వదిలేస్తే నేను ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి మంచం ఎక్కేయాలి. ఇప్పటికే నా బుర్ర తినేసావు. హీటెక్కిపోయింది అంటుంది.

అవునా చల్లార్చడానికి ఐస్ ఏమైనా పెట్టమంటావా.. నువ్వు ఏమి పెట్టాల్సిన అవసరం లేదు కానీ నన్ను వదిలేస్తే ఇంటికి వెళ్లి వేడివేడిగా కాఫీ తాగుతాను అంటుంది.

కాఫీకి మీ ఇంటి వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది. మా ఇంట్లో తాగచ్చు అంటాడు. ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికి వెళతావా ఏమిటి...

నేను ఇక్కడే  ఉంటాను కాబట్టి ఇదే నా ఇల్లు అంటాడు. అబ్బో ఓనర్ అయినట్టే చెబుతున్నావు అంటుంది. ఒకరకంగా అలాగే అనుకో అని మెయిడ్ కి సైగ చేస్తాడు.

వెంటనే మెయిడ్ కాఫీ తేస్తుంది.  అదేంటి ఎప్పుడు చెప్పావు. ఎప్పుడు చెబితే ఏమిటి.. నీకు ఫ్రెష్ గా స్ట్రాంగ్ గా కాఫీ వచ్చింది కదా మంచి అరోమా వస్తుంది తాగేయ్ అంటాడు.

అబ్బో పర్వాలేదే... నీకు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది.  నీకు గుర్తించడానికి ఇంత టైం పట్టింది అంతే అంటాడు.

సరే సరే నేను బయలుదేరతాను అని కాఫీ కప్పు అక్కడ పెట్టి బయలుదేరుతుంది. ఇదిగో అమ్మాయి అంటాడు.  ఏంటి... రేపు వచ్చేటప్పుడు చక్కగా చీర కట్టుకుని రా అంటాడు.

ఇదిగో అబ్బాయి..  ఫంక్షన్ నాది కాదు.  ఇక్కడ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం అంతే అంటుంది. ఆర్గనైజ్ చేసిన సరే పెళ్లీడుకొచ్చిన పిల్లవు కదా...

చీర కట్టుకుని వచ్చావ్ అనుకో అందరికీ కన్నులు విందుగా ఉంటుంది. ఎవరికి కన్నులు విందుగా ఉండాలి. ఈ బొమ్మ ఎవరికీ నచ్చితే వాళ్లకే అంటాడు.

ఆ మాటకి నేను ఎవరికీ నచ్చాలో నాకు తెలుసులే గాని నువ్వు మూసుకో అబ్బాయి అని స్కూటీ స్టార్ట్ చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది.

వెళుతున్న పూజత ని చూస్తూ తల వెనకాల చేయవేసి రబ్ చేసుకుంటు..  ఒరేయ్ వినయ్ నువ్వు కూడా చెడిపోతున్నావురా.. నీకు పెళ్లిఈడు వచ్చేసింది అని మెలికలు తిరుగుతూ ఉంటాడు.

జైలు గదిలో ఉన్న భార్గవి దగ్గరికి కానిస్టేబుల్ వచ్చి జైలర్ పిలుస్తున్నారు అని తీసుకువెళుతుంది.  ఈ టైంలో ఏమిటా అని ఆలోచిస్తూ జైలర్ గదిలోకి వెళుతుంది.

అక్కడ జైలర్ తో పాటు ధనుంజయ్ కూడా ఉంటాడు. మళ్ళీ కూతురు వి ఏ గొప్పలు చెప్పడానికి వచ్చారు.  చ్చా నా జీవితం అనుకుంటూ వెళ్లి చెప్పండి అంటుంది.


చూడు భార్గవి నిన్ను బెయిల్ మీద బయటకు తీసుకు వెళ్ళడానికి ఈసార్ వచ్చారు.  ఆయనకి నాకు ఏమిటి సంబంధం అని తీసుకువెళుతున్నారు అని అడుగుతుంది.

ధనుంజయ్ సూటిగా భార్గవి వైపు చూస్తాడు. ఇప్పుడైనా నేను భార్య అని చెప్పాలి కదా.. చెప్పకుండా మీరు ఎలా తప్పించుకుంటారు మనసులో అనుకుంటూ నవ్వుతుంది.

భార్గవి ఆలోచన అర్ధమైన ధనుంజయ్ నవ్వుతూ మనిద్దరి మధ్యన ఉన్న సంబంధం చెప్పనా అంటాడు. చెప్పమనే కదా...  ఓనర్ కి పనిమనిషికి ఉన్న సంబంధం.

ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే నా శరీర అవసరాలు తీర్చిన ఒక ప్రాణం ఉన్న బొమ్మవి చాలా అంటాడు. ఆ మాటకి కోపంతో పాటు బాధ కూడా తన్నుకొస్తుంది.

ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఏడుపు గొంతుతో అడుగుతుంది.  నువ్వే కదా మనిద్దరి మధ్యన ఉన్న సంబంధం చెప్పమన్నావు.

నీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి భార్గవి అంటాడు. ఏమిటి నీ కూతురు నీళ్లు పోసుకుందా... నీ నోటి మాట వల్ల అదే జరిగితే అంతకన్నా మహాభాగ్యం ఏముంది.

అది నాకు గుడ్ న్యూస్ కానీ నీకు కాదు కదా..  నీకు మాత్రమే గుడ్ న్యూస్ అని చెబుతున్నాను.  ఇక్కడే చెప్పనా బెయిల్ వచ్చిన తర్వాత కారులో వెళుతూ చెప్పనా అంటాడు.

జైలర్ ముందు పరువు పోగొట్టుకోవడం ఎందుకులే అని బయటికి వెళ్లాక చెప్పండిలే అంటుంది.   భార్గవి భయానికి పొగరుగా నవ్వుకుంటూ సంతకం చేసి బయటికి తీసుకువెళతాడు.

కారు దగ్గరికి తీసుకెళ్లి ఎక్కుఅని...  కార్ ఎక్కిన తర్వాత స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి స్వీట్ ఇస్తాడు.  ఇప్పుడు ఈ స్వీట్ దేనికి...  నేను బయటకు వచ్చినందుకా..

కాదు ఇప్పుడు నేను చెప్పబోయే గుడ్ న్యూస్ కి.  స్వీట్ చేత్తో పట్టుకొని  ధనుంజయ్ వైపు చూస్తుంది. చేతితో ఎంతసేపని పట్టుకుంటావ్.

నోట్లో పెట్టుకో.  ముందా న్యూస్ ఏంటో చెప్పండి. అప్పుడు పెట్టుకోవాలో లేదో ఆలోచిస్తాను  అబ్బో భార్గవికి కూడా భయం మొదలయ్యిందే అంటాడు. ఇది భయం కాదు ముందు జాగ్రత్త అంటుంది.

సరే చెబుతాను చెవులు రెండు రెక్కరించి విను అని నీ కూతురికి పెళ్లి అయిపోయింది.

భార్గవి రియాక్షన్...
[+] 12 users Like SivaSai's post
Like Reply
Part - 120


శిల్ప పెళ్లయిపోయింది అన్న వార్త వినగానే భార్గవి బిగుసుకుపోతుంది.  చలనం లేని బొమ్మలాగా చూస్తూ ఉండిపోతుంది.  భార్గవి..  భార్గవి అని పిలిచిన పలకదు.

కళ్ళ ముందు చిటికెలు వేసిన  స్పృహలోకి రాదు. ధనుంజయ్ కి విసుగు వచ్చి వాటర్ బాటిల్ లోని  వాటర్ తీసుకొని తలపై నుంచి పోస్తాడు.

వర్షం..  వర్షం... అని అరుస్తుంది. ఇప్పుడు స్పృహలోకి వచ్చావా..  అది వర్షం కాదులే. ఎవరైనా నీళ్ళు ఇలా పోస్తారా అని కోపంగా అరుస్తుంది.

నా ముందు నోరు లేచింది అంటే మాట్లాడటానికి నాలిక లేకుండా కట్ చేసేస్తాను. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోతే నిన్ను ఇంకా ఎలా పిలవాలి.

చెయ్యి పట్టుకుని కదపవచ్చు. చి చి నీలాంటి ఆడదాన్ని తాకాలి అంటే  అసహ్యంగా ఉంటుంది.  ఇలాంటి ఆడదానితో ఎలా కాపురం చేసారో.. నువ్వు సూర్పణక అని తెలియక..

మిమ్మల్ని అంటే...  ఇంకా ఆపేయ్ నీతో మాట్లాడటమే ఇష్టం లేదు అంటే మళ్ళీ గొడవ పడడమా ఇంపాసిబుల్ అంటాడు.

శిల్ప కి ఎవరితో పెళ్లి అయిందో తెలుసుకోవా... గొడవలో నుంచి బయటకు వచ్చి ఎవరితో అన్ని టెన్షన్ గా అడుగుతుంది.

నీకు బాగా ఇష్టమైన వాళ్లతోనే. నాకు ఇష్టమైన వాళ్ళ అని ఆలోచిస్తుంది.  ఏంటి నీ పదునైన బుర్రకి తట్టలేదా...  నిజంగానే తట్టడం లేదండి. ఎవరు  చెప్పండి ప్లీజ్..

స్వీట్ తిను చెబుతాను. స్వీట్ తింటే గాని చెప్పాడు అని అర్థమయ్యి కష్టంగా స్వీటు తింటుంది.  ఇప్పుడు చెప్పండి అంటే వాటర్ తాగుతావా అంటాడు.

నాకు వాటర్ అవసరం లేదు చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తుంది.  ఇంకెవరు మీ ముద్దుల మేనల్లుడు ఉదయ్ తో అంటాడు.

ఉదయ్ తో అనగానే చాలా కోపం వచ్చేస్తుంది. మీకు అంతకన్నా గొప్పవాడు దొరకలేదా.. వాడే ఒక వేస్ట్ గాడు. అలాంటి వాడితో నా బంగారు తల్లి పెళ్లి చేస్తారా.

అసలు మీకు మనసు ఎలా వచ్చింది. కన్న తండ్రి అయ్యి మీరు అని చొక్కా పట్టుకోపోతుంది. ఏయ్ దూరంగా ఉండు నన్ను టచ్ చేసావంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదు.

ఇంకేం మర్యాద.  నన్ను జైల్లో పెట్టించారు.  నా కూతురి జీవితాన్ని నాశనం చేశారు. ఇంకా మీకు మర్యాద ఇవ్వాలా.. మరి నువ్వు అవని విషయంలో చేసింది ఏమిటి..

అవని అంటే నాకు సవతి కూతురు కాబట్టి నేను సాధించవచ్చు కానీ మీకు శిల్ప కన్న కూతురే కదా.. మీరు ఎలా చెయ్యగలిగారు.

సవతి కూతురు అని విరక్తిగా నవ్వి..  నీకు సవతి కూతురేమో గానీ నాకు కాదు కదా అంటాడు. అదే నేను చెబుతున్నాను.

ఇద్దరూ మీ కూతుర్లే కదా ఎందుకంత పక్షపాతం. పక్షపాతం చూపించింది నేను కాదు..  నువ్వు చూపించి నీ కూతురి జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు.

నేను సరైన దారిలో పెడుతున్నాను అంటాడు. ఏమిటి ఆ పోరంబోకుడికి ఇచ్చి పెళ్లి చేయడమా సరైన దారిలో పెట్టడం.

మరి నీ పెంపకంలో పెరిగిన నీ కూతురు ఏమిటి అది ఇంకా పెద్ద పోరంబోకు కాదా అంటాడు. ఏవండీ అని గట్టిగా అరుస్తుంది.

నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటాయి.  ఇంతకీ నీ బంగారు తల్లి సంసారాన్ని చూస్తావా అంటాడు.  ఆ మాటకి ఇంకా ఏమి చేశారు.

చూడు..  చూస్తే నీకే తెలుస్తుంది కదా అని ఫోన్లో వీడియో ఆన్ చేసి చూపిస్తాడు. అందులో పొద్దుటే లెగడం దగ్గర నుంచి పొలం పనులు చేయడం. చేతులు మంటపెట్టడం రుద్దుకోవడం.

ఉదయ్ దగ్గరుండి అన్నం తినిపించడం అన్ని చూసి కంటతడి పెట్టుకుంటుంది.  నా చిట్టి తల్లికి ఎన్ని కష్టాలు వచ్చాయి.

మీ వల్లనే అది జైలుకు వెళ్ళింది.  ఇప్పుడు ఆ ఎదమని పెళ్లి చేసుకుంది. మరి ఆ ఎదవకే నా బంగారు తల్లిని బలి చేయాలి అనుకున్నావు. అప్పుడు గుర్తుకు రాలేదా వాడొక పోరంబోకు.  వేస్ట్ గాడు అని.

అందుకని మీరు ఇప్పుడు శిల్ప జీవితంతో ఆడుకుంటున్నారా..  ఎవరు ఎవరితో ఆడుకున్నారు.  ఆ మాట అంటానికైనా కొంచెం అయినా మనస్సాక్షి అన్నది ఉండాలి.

నీ కూతురికి పెళ్లి అవుతుందనే నువ్వు అనుకుంటున్నావా... పోనీ భవిష్యత్తు అంటూ ఉందని అనుకుంటున్నావా..

మీరు శిల్పని జైల్లో పెట్టించకుండా..  విక్రమ్ కి దూరం చేయకుండా ఉండి ఉంటే అది మహారాణి లాగా ఉండేది. మీ కూతురు సంతోషం కోసం నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు.

నేను కాదే నువ్వే నాశనం చేసావు.  ఆరోజు పెళ్లి పెట్టుకుని కూడా అది బయటకు వెళితే కవర్ చేసావు కానీ ఇలా వెళ్ళింది అన్న ఒక్క మాట చెప్పావా.

చెప్పి ఉంటే ఏమో ఏమి జరిగేదో అంటాడు.  ఏం జరిగేది వెళ్లి దాన్ని తీసుకొద్దురా.. తీసుకువచ్చే వాడినేమో..  రెండు పీకి అయినా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టే వాడిని ఏమో...


తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించే వాడిని ఏమో అంటాడు.  తండ్రిగా అని వెటకారంగా నవ్వి.... ఎంత బాగా నిర్వర్తించావో చూస్తానే ఉన్నాను కదా..

అప్పుడు అవనినీ పట్టించుకోలేదు.  అల్లుడు డబ్బున్న వాడు.. సమాజంలో మంచి పలుకుబడి ఉన్నవాడు అని అర్థమై.. ఇప్పుడు అవని నా కూతురు..  నా ప్రాణం అని చెబుతున్నావు.

శిల్పాలో నీకు ఇప్పుడు తప్పు కనిపించేటప్పటికి.
  దగ్గరికి తీసుకుంటే అల్లుడు ఎక్కడ అసహ్యించుకుంటాడో..  నీ పరువు ఎక్కడ పోతుందో అని శిల్ప ని దూరం పెడుతున్నావు.

నీ గురించి నాకు తెలవదా అంటుంది. భార్గవి అన్నమాటకి ధనుంజయ్ కు ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది.  భార్గవి ఇలా మాట్లాడినప్పుడు అవని అనుకోవడంలో తప్పులేదు కదా అనుకుని...

అవునే నిజంగానే తండ్రిగా నా బాధ్యతని మరిచిపోయాను.  అవని విషయంలో నేను ఫెయిల్ అయ్యాను ఏమోగానీ శిల్ప విషయంలో ఫెయిల్ అవ్వను.

గట్టిగా నవ్వుతూ ఫెయిల్ అవ్వకపోవడం ఏంటి ఎప్పుడో ఫెయిల్ అయ్యారు కదా అని కళ్ళు మూతలుపడుతూ ఉంటాయి.

ఇదేమిటి మగతగా ఉంది అంటే..  ఆ మాటకి ధనుంజయ్ నవ్వుతూ శిల్ప పెళ్లి విషయం తెలియగానే స్పృహ తప్పి పడిపోతావ్ అనుకున్నాను. పరవాలేదు ఇంతసేపు ఆగావంటే గడ్డిప్రాణానివే పదా అని కార్ స్టార్ట్ చేస్తాడు. ఏం కలిపారు మీరు అని మాట్లాడుతూనే పడుకుండిపోతుంది.

ధనుంజయ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు గానీ భార్గవి అన్న మాటే మెదులుతూ ఉంటుంది. విక్రమ్ స్టేటస్ చూసి అవనినీ నా కూతురు అనుకుంటున్నాను అని అవిని ఆలోచిస్తే.. అన్న ఊహ రాగానే గుండెల్లో సన్నగా నెప్పి మొదలవుతుంది.

నేను ఎంత మూర్ఖుడిని. అందరికన్నా ఎక్కువ ప్రాణం పెట్టుకున్న భార్య ఎలా చనిపోయిందో తెలియదు. ఆ భార్య ప్రతిరూపమైన నా కూతురు ఎలాంటి కష్టాలు పడిందో తెలియదు.

సంపాదించి ఏం చేసినట్టు నేను.  పోనీ ఇది సరిగ్గా లేకపోయినా శిల్ప నడవడిక బాగున్న కొంతలో కొంతైనా మనశాంతి ఉండేది.

అది ఇంకా బరితెగించింది.  ఎవరికోసం నేను బతుకుతున్నానో నాకే తెలియకుండా చేశారు.  ఈ జన్మలో నాకు మనశ్శాంతి దొరుకుతుందా..

అవని నన్ను తండ్రిగా ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.  ఆ ఆలోచనలకి అంత ఉండదు. కారే కన్నీరుకి ఆవిరి ఉండదు.

జైసింహ మాన్షన్...

షాపింగ్ కి వెళ్ళిన బ్యాచ్ అంతా ఇంటికి చేరుతారు.  జెంట్స్ మొత్తం అలసిపోయి సోఫాలో కూలపడితే...  లేడీస్ మాత్రం బూస్ట్ తాగినంత ఎనర్జీతో చిందులు తొక్కుకుంటూ వస్తారు.

లేడీస్ మొఖాలు వెలిగిపోతూ ఉంటాయి. వాళ్ల అలసట చూసి అవని అందరికీ స్నాక్స్ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. అవి చూడగానే అందరూ థాంక్స్ బంగారం అంటే చిన్న చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

జెంట్స్ బ్యాచ్ ని హాల్లోనే వదిలేసి లేడీస్ బ్యాచ్ అంతా గదిలోకి వెళ్ళుతూ  అవనినీ లాక్కుని వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ కొన్నవన్నీ ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తూ పెట్టుకొని మరీ మురిసిపోతూ ఉంటారు.

విక్రమ్, భరత్ ఆఫీస్ నుంచి వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని అయిపోయిందా షాపింగ్. అయ్యిందిరా అని నీరసంగా అంటారు.

ఏమైంది అంత నీరసంగా ఉన్నారు. ఒక్క లేడీని తీసుకుని షాపింగ్ కి వెళితేనే గంటలు గంటలు పడుతుంది.  అలాంటిది వీళ్ళందర్నీ తీసుకునే వెళ్ళితే...

పాపం షాప్ అతని పరిస్థితి ఏమిటి..  ఏం జరిగిందేంటి అని విక్రమ్ నవ్వుతాడు. ఏం జరిగిందని అడుగుతావేంటి బావ. అసలు మీ చెల్లికి ఇంత షాపింగ్ పిచ్చేంటి..

ఆ డిజైన్ లో కూడా ఎన్ని వంకలు పెట్టిందో తెలుసా..  అయ్యబాబోయ్..  కష్టమైసేడ్  చేయించుకోవాలి. అది కూడా తన సెల్ఫ్  డ్రాయింగ్ వేసి .

విక్రమ్ వెంటనే అవునా..  మా చెల్లెలో అంత టాలెంట్ ఉందా... రేయ్.. భరత్..  రేపటి నుంచి నివితో జువెలరీ డిజైన్స్ డ్రా చేయించు.

మన జ్యువెలరీ మేకింగ్ దాంట్లో ఇంప్లిమెంట్ చేద్దాము.  అలాగే బావ అంటాడు.  ఒరేయ్ నేను ఇంత ఎమోషనల్ గా చెబితే అందులో మీ చెల్లి టాలెంట్ ని వెతుకుతున్నావా..

నువ్వే కదరా చెప్పింది... నా బాధ నీకు అర్థం కావడం లేదు కానీ నీ చెల్లి టాలెంట్ కి మురిసిపోతున్నావా..  దుర్మార్గుడా..  గట్టిగా నవ్వుతూ బాగా కాలినట్టు ఉంది కదా మా తమ్ముడికి అని భరత్ అంటాడు.

కాలడం కాదురా...  అసలు ముందు మా నాన్నని అనాలి అంటాడు. ఆ మాటకి స్నాక్స్ తింటున్న పార్ధు గారు నేనేం చేశాను రా...

చేసిందంతా చేసి ఏం చేశానని అడుగుతారా? నిన్న మీరు ఏసినా నిప్పు ఈరోజు మంటయి నన్ను ఎంత తగులుకుందో మీకేం తెలుసు అనే బేర్ మంటాడు.

ఒరేయ్ ఆడపిల్లలాగా ఏడుస్తావ్ ఎందుకు.. వాళ్లెక్కడ ఏడుస్తున్నారు.. మనతో ఏడిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది బావ అని వినయ్ వచ్చి పక్కన కూర్చుని అడుగుతాడు.

ఇంకా నువ్వు రాలేదేంట అనుకున్నాను చిన్న బామ్మర్ది వచ్చావా...

జువెలరీ షాప్ లో రాజ్ పడిన ఇబ్బందులు గుర్తొచ్చి మిగిలిన జెంట్స్ అందరూ పొట్ట పట్టుకుని మరి నవ్వుతారు.

ఎందుకు నాన్న మీరు అలా నవ్వుతున్నారు అని వినయ్ అడిగితే.. నేను చెప్పలేను రా అది తలుచుకుంటుంటే ఇప్పటికి నవ్వు ఆగడం లేదు. చూడు కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి.

అబ్బా మీరు చెప్పిన నవ్వండి లేదా నవ్వైనా చెప్పండి అంతేకానీ చెప్పలేము అంటారు..  చెప్పమని అంటారు. ఇలాగైతే మాకు ఎలా తెలుస్తుంది నాన్న.  అక్కడ ఏం జరిగిందో అని ఆత్రం ఆగలేక ముందుకు వంగుని మరి అడుగుతాడు.

రాజ్ పరిస్థితి??

కథ కొనసాగుతుంది...
[+] 11 users Like SivaSai's post
Like Reply
Super update
Like Reply
అవని లాంటి మంచి అమ్మాయికి, పూజిత లాంటి పెంకి పిల్ల తోడి కోడలిగా ఆ ఇంటికి వస్తె, అనే కాన్సెప్ట్, రైటర్ గారు కథను ఎల్ల తిప్పుతారో చూడాలి.
[+] 1 user Likes Sunny73's post
Like Reply
vinay poojitha episode chala baagundi.. interesting and different from the main episode!!
For a change.. aada pillani udikinchatam bagundi. different characterisation.

And Bhargavi.. Dhanunjay ki nijam nishturanga cheppatam bagundi.

Great going.. keep it up
Like Reply
(28-02-2026, 10:57 AM)Sunny73 Wrote: అవని లాంటి మంచి అమ్మాయికి, పూజిత లాంటి పెంకి పిల్ల తోడి కోడలిగా ఆ ఇంటికి వస్తె, అనే కాన్సెప్ట్,  రైటర్ గారు కథను ఎల్ల తిప్పుతారో చూడాలి.

yenakati gundamma sinima lo unnattu... savitri ki jamuna character toduga untundi!!
intiki nidutanam vastundi..  Heart Heart
Like Reply
Part - 121


కళ్యాణ్ నవ్వుతూ అసలు జువెలరీ షాప్ లో ఏం జరిగిందో తెలుసా అని వేలుతో తిప్పుతూ ఉంటారు.  ఏం చేస్తున్నారు.. ఫ్లాష్ ప్యాక్ ఓపెన్ చేస్తున్నాను.

అన్ని జంటలు సరదాగా షాప్ లోపలికి వెళ్తారు. వెళ్లే ముందే జెంట్స్ ఫిక్స్ అయిపోతారు. లేడీస్ ఏది అడిగినా సరే.. బాగుంది..  సూపర్ అని చెప్పాలి అని.

వెళ్లి కూర్చోగానే... జువెలరీ షాప్ ఓనర్స్ వచ్చారు కాబట్టి అన్ని లేటెస్ట్ డిజైన్స్...  కష్టమైస్ ఐటమ్స్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు.

మాధవి,  లలిత సెలక్షన్ తొందరగానే అయిపోతుంది.  ఇంకా కరుణ, నివి మాత్రమే మిగులుతారు. లలితా నివితో తొందరగా అవ్వని నివి.

ఎన్ని చూసిన నీ దగ్గర ఉన్న మోడల్స్ లాగానే కనిపిస్తాయి
ఏదో నిన్న సరదాగా ఏడిపించాము అని ఇంట్రెస్ట్ గా తీసుకువచ్చారు.

మరి బోర్ కొట్టించుకోకూడదు.  అమ్మ అలా ఎలా తీసుకుంటాము..  తీసుకునే ఐటమ్ లో ప్రతిదీ చెక్ చేయాలి కదా.

నీ దగ్గర ఏ ఐటం లేదు చెప్పు. అప్పుడు చూడొచ్చు అని రాజ్ అంటాడు.  అదే ఆలోచిస్తున్నాను రాజ్. ఏది చూసిన నా దగ్గర ఉన్నట్టే ఉంది.

ఈ మాత్రం దానికి షాపింగ్ ఎందుకు.. వెళ్ళిపోదామా.. లేదు... లేదు నువ్వు ఇంత ప్రేమగా కొంటాను అంటే వెళ్ళిపోతే ఫీలవుతావు అని రాజ్ ఎమోషన్స్ కూడా తనే చెప్పేస్తుంది.

నా ఫీలింగ్స్ కూడా నువ్వే చెప్పేస్తున్నావా అంటే.. నువ్వు నేను వేరు కాదు కదా.  అందుకే నీ మనసులో ఉన్నది నేను చెప్పేస్తున్నాను.

పార్ధు భార్యని ఉడికించాలని చూసావా కరుణ.. నా కోడలు అప్పుడే నా కొడుకుని ఎంత బాగా అర్థం చేసుకుందో...

వాడి ఫీలింగ్స్ కూడా నా కోడలే చెప్పేస్తుంది.  మన పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలైనా నీకు నా ఫీలింగ్స్ గాని.
నా కొడుకు ఫీలింగ్స్ కానీ తెలుసాయా...  అని మెల్లిగా మంట పెడతాడు.

అవునా..  ఇప్పుడు మీ బాబు కొడుకులి ఇద్దరు ఫీలింగ్స్ నేను బయట పెడతాను కదా అని ... లేటెస్ట్ మోడల్స్ ఇంకా చూపించమని అడుగుతుంది.

అనవసరంగా నా పెళ్ళాన్ని కదిపిన ఏమిటి అని డౌట్ గా.. కళ్యాణ్,  రమేష్ వైపు చూస్తాడు.  ఇద్దరు కొట్టేలాగా చూస్తారు.

బయట ఏం చెప్పుకున్నాము..  లోపలికి వచ్చాక ఏం చేస్తున్నావు అన్నట్టుగా కళ్ళతోనే ఉరుముతారు.  సోరి ఏదో నా కొడుకుని ఏడిపించుదాం అనుకున్నాను. ఏడ్చినట్టుంది...  నీ ఎదవ తెలివితేటలు.

నీతో పాటు అందరిని ఇరికించావు కదరా అని తల పట్టుకుంటారు. కరుణ  డిజైన్స్ చూస్తూ ఉంటే లేడీస్ మళ్లీ మొదటి నుంచి చూస్తూ ఉంటారు.

ఫైనల్ గా నాలుగు సెట్స్ ఓకే చేస్తారు. హమ్మయ్య అనుకుని టైం చూసేటప్పటికి లంచ్ టైం దాటిపోతుంది.  అయ్యబాబోయ్ మనం వచ్చి అప్పుడే నాలుగు గంటలు అయింది.

ఇంకా వీళ్ళది అవ్వలేదా అని..  లలిత ఇందాకే మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా మళ్ళీ ఏమి సెలెక్ట్ చేస్తున్నారు అని కళ్యాణ్ అడుగుతాడు.

అయ్యో ఇందాక చూసిందానికన్నా ఈ మోడల్స్ ఇంకా బాగున్నాయండి.  చూడండి మీరే..  ఏది పెట్టుకుంటే బాగుందో చెప్పండి అని పెట్టుకుని చూపిస్తుంది.

ఏది పెట్టుకున్నా నువ్వు చాలా అందంగా ఉన్నావు లలిత. ఆ సెట్ కే అందం వచ్చింది. అబ్బా...  ఎప్పుడూ చెప్పే డైలాగే కదా..  కొత్తగా ఏదైనా చెప్పండి అంటుంది. కొత్తగా నా అని బుగ్గ మీద వేలుతో ట్యాప్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు.

రమేష్ మాధవి తో అబ్బబ్బబ్బా ఈ సెట్టు పెట్టుకుంటే నీ అందం 10 సంవత్సరాలు కిందకి వెళ్ళిపోయింది లల్లి.  మళ్లీ మన పెళ్లి టైంలో ఉన్నా పెళ్లికూతురు లాగా కనిపిస్తున్నావు.

ఆ మాటకి మురిసిపోతూ..  చాల్లే అండి మీ సంబరం. ఎప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారు.  ఇంతకీ రెండిట్లో ఏది బాగుంది అని అడుగుతుంది.

రెండు సూపర్ ఉన్నాయి.  నీకు ఏది బాగుంది అంటే చెప్పలేకపోతున్నాను అంటాడు.  అవునా అయితే రెండు తీసేసుకుంటాను అని రెండిటిని కి ఆర్డర్ పెట్టేస్తుంది.

రమేష్ కక్కలేక మింగలేక.  సరే నీ ఇష్టం నీ కన్నా నా అని తల ఊపుతాడు.

పార్ధుకి ఇద్దరూ గట్టిగా వార్నింగ్ ఇస్తారు.  నీ కొడుకు ని కేలకకు.  అలాగే నీ భార్యని కేలకకు అని.  సరే రా నేను ఎందుకు కదుపుతాను. మౌనంగా ఉంటాను చూడండి అని నోటి మీద వేలు వేసుకుంటాడు.

కరుణ నాలుగు సెట్స్ సెలెక్ట్ చేసి ఏది బాగుంది అనగానే..  కళ్ళతో చెబుతూ ఉంటాడు. నోరు మాత్రం ఇప్పడు.  అరే అడుగుతుంటే మాట్లాడరేమిటి..

నేను ఏమి మాట్లాడదలచుకోలేదు కరుణ అని వెంటనే నోటి మీద వేలు వేసుకుంటాడు. ఏమైంది మీకు ఇప్పటిదాకా బానే ఉన్నారు కదా..

నాకన్నా బాగా నీ కొడుకు అయితే సెలెక్ట్ చేస్తాడని.. అక్కడ చూడు కోడలికి ఎంత బాగా సెలెక్ట్ చేస్తున్నాడు. వాడికున్న బుద్ధి మీకు లేదు.

చూడండి కాబోయే పెళ్ళానికి ఎంత బాగా చూస్తున్నాడో.. మీరు ఉన్నారు పెళ్లి ఇన్ని సంవత్సరాలైనా ఏమైనా సెలెక్ట్ చేశారా అంటుంది.

ఒసేయ్ పిచ్చి మాలోకమా.. మొగుడు ఎప్పుడైనా సెలెక్ట్ చేస్తాడు.  ఇక్కడ నీ కొడుకు నీకు సెలెక్ట్ చేయడంలోనే ఉంది అంటాడు.

ఏముంది.. నీకు ఎక్కువ రేటు పెట్టి సెలెక్ట్ చేస్తాడా.
  లేకపోతే పెళ్ళానికి ఎక్కువ రేటు పెట్టి సెలెక్ట్ చేస్తాడా..  అసలు ఇద్దరు డిజైన్లో ఎవరిది బ్రెస్ట్ డిజైన్ సెలెక్ట్ చేస్తాడు. అది ఇంపార్టెంట్.

అందులో ఏముంది ఎవరు ఏది తీసుకున్న ఇద్దరం మార్చుకుంటాం కదా.. మార్చుకోవడం వేరు.. ఇది నాది అనుకోవడం వేరు.

నాది ఎంత బాగుందో.. సెలెక్ట్ చేసింది నా కొడుకే అని నువ్వు చెప్పుకుంటే ఆ గర్వమే వేరు కదా అని అమాయకుడైన రాజ్ ని ఇరికించి మహదానంద పడిపోతాడు.

కళ్యాణ్, రమేష్ ఇద్దరూ ఉతికేసేలాగా చూస్తారు. పార్ధు వాళ్ళని చూసి నాలిక బయటపెట్టి మళ్లీ కామ్ గా
పెళ్ళాన్ని చూస్తాడు.

కరుణ ఆలోచిస్తుంటే..  ఏమిటే..  ఆలోచిస్తున్నావ్ వెళ్ళు అంటాడు. బాగోదు లేండి.  కొత్తజంట కదా.. వాళ్ళ ఎంజాయ్మెంట్ ని నేను ఎందుకు డిస్టర్బ్ చేయడం.

అయ్యో అందుకే నిన్ను పిచ్చమాలోకం అనేది. కొత్తజంట అంటే వాళ్ళిద్దరూ సపరేట్గా వచ్చినప్పుడు మాత్రమే. ఇప్పుడు వేరు.. వెళ్ళు వెళ్ళు అని పెళ్ళాన్ని రెచ్చగొట్టి పంపిస్తాడు.

కరుణ వెళ్ళగానే కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఒరేయ్ నువ్వు ఇంత శాడిస్ట్ అని అనుకోలేదురా..  ఎవరికైనా కోడలకి అత్తగారు సాధింపు ఉంటుంది.

కానీ నీకు కొడుకు పైన సాధించే జబ్బు ఏంట్రా.. అబ్బా అది సాధించడం కాదురా.. చిన్నప్పుడు నుంచి వీళ్ళు మనల్ని ఎంత టార్చర్ పెట్టి ఉంటారు.

కాలేజ్ కి వెళ్లడానికి... డ్రెస్సులు దగ్గర,  స్పోర్ట్స్ బైక్ అని కారు దగ్గర మామూలుగా చూపించలేదు కదా..  అవన్నీ నేను తీర్చుకోకుండా నా కోడలు చేతిలో ఎలా పెట్టగలను అంటాడు.

ఆ మాటకి రమేష్ అంటే నువ్వు టార్చర్ పెట్టి వదిలిన తర్వాత నివి టార్చర్ పెట్టాలన నీ ఉద్దేశం. కరెక్ట్ బ్రో బాగా గెస్ చేశావు అంటాడు.

ఇంత దారుణంగా తయారయ్యావ్ నువ్వు..  దారుణం కాదు.... ఇట్స్ ఫన్ ఎంజాయ్మెంట్. మీరు కూడా ఎంజాయ్ చేయండి.

నీ కొడుకు పెళ్లి అప్పుడు కూడా నువ్వు ఇలాగే చెయ్యి. ఆ ఎంజాయ్మెంట్ లో ఉన్న కిక్కే వేరబ్బా అంటాడు.  నీకు ఒక దండం రా స్వామి.. పాపం రాజ్ అని జాలిగా చూస్తారు.

ఇవేమీ తెలియని రాజ్..  నివి సెలెక్ట్ చేస్తూ ఉంటే... ఏది సెలెక్ట్ చేయాలా అర్థం కాక వాటి వైపు, నివి వైపు చూస్తూ ఉంటాడు.

రాజ్ అంటూ కరుణ రాగానే చెప్పమ్మా .. వీటిల్లో ఏది బాగుందో చూడరా అంటుంది.  అందులో రెండు చూసి ఇవి రెండూ నీకు చాలా బాగుంటాయి అంటాడు.

ఆ మాటకి నివి..  రాజ్ అని గట్టిగా అంటుంది.  ఏమైంది నివి... ఆంటీ చూపించగానే వెంటనే చెప్పేసావు. ఎప్పటినుంచో నేను అడుగుతుంటే..నాకు మాత్రం సెలెక్ట్ చేయడం లేదు.

నేను తీసుకోవడం నీకు ఇష్టం లేదా అని అలుగుతుంది. ఆ మాట నేనెప్పుడు అన్నాను.  అనక్కర్లేదు నీ చేతల్లోనే తెలుస్తుంది.

నాకేమీ అవసరం లేదు. వెళ్ళిపోదాం అంటుంది. అయ్యో నివి అలా ఫీల్ అవ్వకు.  నువ్వు సెలక్షన్ బాగా చేస్తావు కదా అందుకే నేను చూస్తూ ఉన్నాను అంటాడు.

అవునా అనగానే.. కరుణ కోపంగా అంటే ఏంట్రా... నాకు సెలక్షన్ రాదన నీ ఉద్దేశం అంటుంది. ఆ మాట నేను అనలేదు కదా...

ఇప్పుడు నువ్వు అన్న మాటకి అర్థం అదే కదా.. ఏమిటో మీ ఇద్దరికీ నేను మాట్లాడే మాటల్లో ఎన్నో అర్థాలు కనిపిస్తాయి. నాకే నేను మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా అర్థం కూడా కనపడడంలేదు అంటాడు.

రాజ్ ని మధ్యలో కూర్చోబెట్టి ఇటు తల్లి, అటు కాబోయే పెళ్ళాం కూర్చుని షాప్ లో ఉన్న డిజైన్స్ మొత్తం తీయించుతారు.

ఏది చూసినా రాజ్ బాగోలేదు అంటే ఛి ఛి నీకు అసలు టేస్ట్ తెలియడం లేదు అంటారు.  బాగుంది అని చెబితే అయ్యో రాజ్ నువ్వు ఓల్డ్ మోడల్ సెలెక్ట్ చేస్తున్నావ్ అంటున్నారు.

వీళ్ళతో ఎలారా దేవుడా అని తల పట్టుకుంటాడు.  ఫైనల్ గా ఒక పది పీసెస్ అక్కడ పెడతారు. వీటిల్లో వీళ్ళకి సెలెక్ట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అని గబగబా పైకి లేచి నుంచి నివి నీకు ఇది బాగుంది. అమ్మ నీకు ఇది బాగుందని రెండు సెట్స్ చేతుల్లో పెడతాడు.

అందులో నివి కి తీసుకుంది 50 లాక్స్ ఉంటే కరుణకి తీసుకుంది 48 లాక్స్ ఉంటుంది. ప్రైస్ ట్యాగ్ చూడగానే కరుణ కోపంగా ఏరా నీకు కాబోయే పెళ్ళానికి ఏమో 50 లక్షలు పెట్టి తీసుకున్నావా.. నాకేమో 48 లక్షలా...

అమ్మ డిజైన్ బాగుండడం ఇంపార్టెంట్.. 2 లక్షలు దగ్గర ఏముందమ్మా అని పోనీ ఇద్దరూ మార్చుకోండి అంటాడు.  నివి నోనో నాకిది చాలా బాగా నచ్చింది.

అందులో ఫస్ట్ టైం నువ్వు సెలెక్ట్ చేసావు. థాంక్యూ రాజ్.. ఆంటీ కన్నా నాకు ఎక్కువ ప్రైస్ పెట్టు మరీ తీసుకున్నావు అంటుంది.

ఆ మాటకి రాజ్ భయంగా తల్లి వైపు చూస్తాడు.  కరుణ ఏడుపు ముఖంతో అప్పుడే పెళ్ళాం పార్టీలోకి మారిపోయావ్ ఏంట్రా...

మీ నాన్న ఇప్పటికీ మా అమ్మ మా అమ్మ అంటారు.   నువ్వు ఇప్పటి నుంచే  మా ఆవిడ మా ఆవిడ అంటున్నావ్.

నేనేనా ఎవరికి అక్కర్లేనిది.  నాకేమీ అవసరం లేదు అని అక్కడ పెట్టేస్తుంది. అయ్యో అమ్మ అని చెప్పి నివి నీది కూడా అక్కడ పెట్టేసేయ్ అని చెప్పి...ఈ సారి వేరేవి సెలెక్ట్ చేస్తాడు.

అందులో కరుణ ది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. నివిది తక్కువ కాస్ట్ ఉంటుంది. అది చూడగానే కరుణ హ్యాపీగా ఫీల్ అవుతే నివి అదేంటి రాజ్..  నువ్వెలా చేస్తావని అనుకోలేదు.

ఇప్పుడు ఏం చేశాను అంటాడు.  ఆంటీ ని హ్యాపీగా ఉంచడం కోసం నాకు ఇలా చీప్ గా తీసుకుంటావని అనుకోలేదు.

ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్లి అయ్యాక ఇంకా ఎలా ఉంటావో అని ముక్కుచీదుతూ ఉంటుంది.
  ఈసారి జుట్టు పీక్కోవడం ఒకటే మిగులుతుంది.

రాజ్ బాబు పెళ్ళాం తల్లితో ఒకేసారి షాపింగా ???
[+] 8 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)