Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 93
ఇది శకుని పాచికల ప్లాన్ మీకు అర్థం కాదు లాయర్ వసుంధర కి శాంతి సందేశం పంపించండి అని అర్ణ కి చెప్పాడు ముకుల్.
అడవిలో ఉన్న నిర్మల్ తో మాట్లాడి నిధికి మార్గం దొరికింది అని చెప్పడంతో నవగ్రహాల కొండల దగ్గరికి బయలుదేరారు తల్వార్ వాళ్ళు.
******************
అడవిలో తల్వార్ వాళ్లతో వెళుతూ "దొర! ఆ నవగ్రహాల కొండల దగ్గర ఏమీ ఉండదు ఇప్పటివరకు చాలామంది వెళ్లి చూశారు." అని చెప్పాడు కేశవ.
"ఇప్పటివరకు వెళ్లిన వారిది ఒక లెక్క మనం వెళ్ళింది ఒక లెక్క! ఖచ్చితంగా ఆ నిధిని నేను సొంతం చేసుకుంటాను." అని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు తల్వార్.
"సరే దొర! అక్కడికి చేరుకున్న వాళ్ళు ఎలా చేరుకున్నారో ఏమో ఆ దారి మొత్తం క్రూర మృగాలు ఉంటాయి." అంటూ తన మనుషుల వైపు చూసి "త్వరగా వెళ్ళండి చీకటి పడే సమయం అయింది." అని చెప్పాడు కేశవ.
అడవిలో వెళుతూ దారిలో పంజా గుర్తులు కనిపించి "కేశవ చెప్పింది నిజమే" మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దారిలో పెద్ద పులులు ఉన్నాయి." అని చెప్పింది వాసుకి.
"అవునా?" అని తన మనుషుల వైపు చూసి "జంతువులని బెదరగొట్టడానికి సౌండ్స్ పెట్టండి." అని చెప్పి "ఇంతకన్నా పెద్ద పెద్ద అడవుల్లోనే ట్రెజర్ హంటర్ చేశాను పులులకి పిల్లి లకి భయపడితే ముందుకు వెళ్లలేము." అని చెప్పాడు తల్వర్.
కాసేపటికి కొండల దగ్గరికి చేరుకుని "దొర! అవే నవగ్రహాల కొండలు ఇక్కడ ఎవరో ఇద్దరు చచ్చి పడి ఉన్నారు." అని చెప్పాడు కేశవ.
ఆ మాట విని ముందుకి వెళ్లి చనిపోయిన చీలి వాళ్ళని చూసి "జంతువు వేటాడినట్టు లేదు ఎవరో కొట్టి చంపారు మనం కాకుండా నిధి కోసం వేరే గ్రూప్ కూడా వచ్చినట్లు ఉంది అందరూ ఎలర్ట్ గా ఉండండి." అని చెప్పాడు గఫర్ ఖాన్.
కొండల వెనకాల దాక్కుని సౌండ్స్ విని "మనవాళ్లు వచ్చినట్లు ఉన్నారు." అని చెప్పాడు ప్రమోద్.
"ఒకవేళ వచ్చింది అభీర్ సేన అయితే!" అని భయంగా చూస్తూ చెప్పాడు ఫరూక్.
రెండు శవాలని చూస్తూ వీళ్ళు మనవాళ్లు కాదు అని "నిర్మల్!" అని గట్టిగా అరిచింది వాసుకి.
ఆ మాట విని కొండల దగ్గర నుంచి బయటికి వచ్చి "హమ్మయ్య వచ్చారా?" అని సంతోషంగా చెప్పాడు నిర్మల్.
"అది సరే కానీ మీరు ముగ్గురే ఉన్నారు మీతో పాటు వచ్చిన మనుషులందరూ ఏమైపోయారు?" అని డౌట్ గా అడిగింది వాసుకి.
"ఆ స్టోరీ చెప్పడానికి చాలా సమయం పడుతుంది ముందు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి ప్రాణాలు పోయేటట్లు ఉన్నాయి." అని అడిగాడు ఫరూక్.
ఆ మాట విని తన మనిషి వైపు చూసి సైగ చేసాడు తల్వర్.
బ్యాగ్ లోనుంచి ఫుడ్ పాకెట్స్ వాటర్ బాటిల్స్ తీసి ఇవ్వడంతో ఆత్రంగా తింటున్న వాళ్ళని చూసి "ఇంతకీ నిధికి వెళ్లే రూట్ ఎక్కడ కనిపించింది." అని అడిగింది వాసుకి.
ఏమీ మాట్లాడకుండా తింటున్న ముగ్గురుని చూసి "పాపం తిండి లేక పేగులు మాడిపోయినట్లు ఉన్నాయి ముందు జాగ్రత్త లేకుండా అడవిలోకి ఎందుకు వచ్చారు దొర!" అని అడిగాడు కేశవ.
"మేము బానే వచ్చాము ఆ లింగు గాడు మా ఫుడ్ మొత్తం కోతులకి పెట్టాడు, మా మనుషులని పులులకు మోసళ్లకు పెట్టాడు, మమ్మల్ని మాత్రం చంపకుండా వదిలేసాడు." అని చెప్పాడు ఫరూక్.
"లింగు అంటే కళ్ళు లేని వాడే కదా! చంద్రశేఖర్ ని తప్పించి మహేష్ ని చంపడానికి వచ్చింది వాడే, మళ్లీ ఇక్కడికి కూడా వచ్చాడా?" అని కంగారుగా అడిగింది వాసుకి.
"అవునా?" అని మంచి నీళ్లు తాగుతూ "కనబడదు కనపడదు అంటాడు కానీ మమ్మల్ని మొత్తం నాకిచ్చేసాడు." అని చెప్పాడు నిర్మల్.
"సరేగాని" ఇంతకీ నిధికి వెళ్ళే మార్గం మీరు ఎక్కడ చూశారు? " అని అడిగాడు గఫార్ ఖాన్.
"ఆ కొండల లోపలికి వెళ్ళాలి ఇప్పుడు చీకటి పడింది కదా కనపడదు ఉదయం వెళదాము." అని చెప్పాడు ప్రమోద్.
"దొర! వీళ్ళ దారి చూస్తుంటే తిండి కోసం ఫోన్ చేసినట్లు ఉన్నారు ఇక్కడ రాళ్లు రప్పలు తప్పితే ఏమీ ఉండవు." అని చెప్పాడు కేశవ.
ఆ మాట విని "ఇక్కడ ఉన్నవి రాళ్లు కాదు రత్నాలు!" అని చెప్పి నిర్మల్ దగ్గర ఫోన్ తీసుకుని పక్కకి వెళ్లి అర్ణకి కాల్ చేశాడు ప్రమోద్.
మిథున్ డెడ్ బాడీ దగ్గర బాధగా కూర్చుని ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "హలో ఎవరు?" అని అడిగింది అర్ణ.
"నేను ప్రమోద్ ని మాట్లాడుతున్నాను మమ్మల్ని అభీర్ సేన మోసం చేశారు మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు ఇప్పుడే వాసుకి వాళ్ళు కలిశారు." అని చెప్పాడు ప్రమోద్.
"మీరు సేఫ్ గా ఉన్నారు కదా! ఇక్కడ మిధున్ ని చంపేశారు." అని బాధగా చెప్పింది అర్ణ.
"మిధున్ ని చంపేశారా..?" అని గట్టిగా నిర్మల్ వైపు చూసి చెప్పాడు ప్రమోద్.
ఆ మాట విని ఫోన్ తీసుకుని "మిథున్ ని చంపింది ఎవరు?" అని అడిగాడు నిర్మల్.
"అభీర్ మనిషి చంపేడు ఈ విషయంలో టెన్షన్ పడి వెనక్కి రాకండి. మేమే అక్కడికే వస్తాము అన్ని విషయాలు సెటిల్ అయిపోతున్నాయి." అని చెప్పింది అర్ణ.
"నా తమ్ముడిని ఆఖరి చూపు చూడాలి ఫోటో తీసి ఉంచండి." అని చెప్పాడు నిర్మల్.
"నువ్వు ఆఖరి చూపు చూడడం కుదరదు మిధున్ తల పట్టుకు వెళ్ళిపోయారు ఆ కోపన్ని కొన్ని రోజులు అలాగే ఉంచు సమయం వచ్చినప్పుడు బయటకు తీయాల్సి ఉంటుంది." అని చెప్పింది అర్ణ.
"నాకు ఏం చెప్పినా బుర్రలోకి వెళ్లడం లేదు అక్కడికి వచ్చి మరణ హోమం సృష్టించాలని ఉంది." అని ఆవేశంగా చెప్పాడు నిర్మల్.
"కంగారుపడి బయటికి మాట్లాడకు అభీర్ మనుషులు మీ ముందే ఉండి ఉంటారు ఈ సమయంలో ఆవేశం కాదు ఆలోచన చాలా ముఖ్యం!" అని చెప్పింది అర్ణ.
ఆ మాటకి లింగు ని గుర్తు చేసుకుని "నువ్వు చెప్పింది నిజమే! మేమే మూర్ఖంగా ముందుకు వెళ్లాము." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నిర్మల్.
ఫోన్ పెట్టేసిన నిర్మల్ వైపు చూసి "ఏమైంది?" అని కంగారుగా అడిగాడు ప్రమోద్.
కళ్ళు తుడుచుకుంటూ "ఏమీ లేదు అభీర్ తో అన్ని విషయాలు సెటిల్ అయిపోతున్నాయి మనకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు." అని అక్కడ ఉన్న కేశవ్ వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ చెప్పాడు నిర్మల్.
ఆ మాట విని "ఆ అభీర్ తో మీరు సెటిల్ చేసుకుంటారు ఏమో నేను సెటిల్ చేసుకోవాల్సిన లెక్క చాలా ఉంది." అని చెప్పి కొండల దగ్గరికి వెళ్లి నిధి దారి కోసం వెతుకుతూ ఉన్నాడు గఫర్ ఖాన్.
"దొర! ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయమంటారా? ఇంకా ముందుకు వెళ్లాలా?" అని అడిగాడు కేశవ.
"మనం ఇక్కడే ఉంటున్నాము ఏర్పాట్లు చేయండి. సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి." అని చెప్పాడు నిర్మల్.
"సరే దొర!" అని చెప్పి ఉండడానికి టెంట్స్ వేశారు కేశవ్ మనుషులు.
************
వరదరాజులు గెస్ట్ హౌస్ దగ్గరికి తన మనుషులతో వచ్చిన బైరి వైపు చూసి "మీ కోసమే వెయిట్ చేస్తున్నాము." అని వినయంగా చెప్పాడు ప్రతాప్ మిశ్రా.
ఆ మాటకి సీరియస్‌గా చూస్తూ "నా దగ్గర వినయం నటించకండి." అని చెప్పాడు బైరి.
"నువ్వు ఆయన గురించి పట్టించుకోకు లోపలికి వెళదాము." అని తీసుకువెళ్లాడు వరదరాజులు.
అక్కడ ఉన్న చైర్ లో కూర్చుంటూ "మీ ప్రపోజల్ ఏంమీతో చెప్పండి." అని అడిగాడు బైరి.
"మా ప్రపోజల్ చాలా సింపుల్! మేము అభీర్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడితే అన్ని విషయాలు చెబుదాము అనుకున్నాము కానీ మీరు వచ్చారు ఆయన చెప్పాల్సింది చెబుతున్నాము.
ఈ గొడవలు ఇక్కడితో ఆగిపోవాలి మా ఫ్యామిలీ ప్రశాంతంగా లండన్ వెళ్లిపోవాలి కావాలి అంటే ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం మీరే తీసుకోండి." అని చెప్పాడు మోహిత్.
"అవును! మా ప్రపోజల్ ఇదే దీని కోసం ఏమి చేయమంటే అది చేస్తాము." అని చెప్పాడు రఘురామ్.
ఆ మాటకి షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు వరదరాజులు వాళ్ళు.
"నిజంగా ఈ విషయం మాట్లాడడానికి మా నాయుకుడిని కలవాలి అనుకున్నారా..?" అని అడిగాడు బైరి.
"అవును! అంతకుమించి మా వైపు నుంచి ఏమీ లేదు అంతేకదా వరదరాజులు!" అని అడిగాడు రఘురామ్.
ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్న వరదరాజులు వైపు చూసి "సరే మీకు ఉదయం కాల్ వస్తుంది." అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు బైరి.
అక్కడి నుంచి బైరి వెళ్లిపోవడంతో రఘురామ్ వాళ్ళ వైపు చూసి "మనం అనుకున్న డీల్ ఏమిటి! మీరు మాట్లాడింది ఏమిటి!" అని అయోమయంగా చూస్తూ అడిగాడు ప్రతాప్ మిశ్రా.
"అర్ణ కాల్ చేసింది గెస్ట్ హౌస్ కి వెళ్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి వెళదామా?" అని అడిగాడు మోహిత్.
"సరే! తంబియర్, సుజిత్ డాక్యుమెంట్స్ తీసుకురావడానికి బయటకు వెళ్లారు రానివ్వండి బయలుదేరుదాము." అని చికాకుగా చెప్పాడు వరదరాజులు.
"మనం ఇక్కడ ఎంత సేపు ఉన్న వాళ్ళరారు ఎందుకంటే ఆ ఇద్దరు నంద గెస్ట్ హౌస్ లో ఉన్నారు." అని చెప్పాడు రఘురామ్.
ఆ మాటకి షాక్ అయి చూస్తూ "ఇద్దరు మళ్ళి అక్కడికి ఎందుకు వెళ్లారు?" అని డౌట్ గా అడిగాడు ప్రతాప్ మిశ్రా.
"నీకు విషయం ఇంకా అర్థం కాలేదా? వాళ్లు వెళ్లలేదు తీసుకువెళ్లారు." అని చెప్పాడు వరదరాజులు.
"కరెక్ట్ పదండి వెళదాం." అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళాడు మోహిత్
***********
ఉదయం మిథున్ దహన సంస్కారాలు చేసి బాధపడుతున్న అభిజిత్ వైపు చూసి "కన్న కొడుకు దూరమైతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు ఇంకా ఇదే చివరి చావు అవ్వాలి." అని అర్ణ వైపు చూసాడు ముకుల్.
"సరే తాతయ్య!' అని చెప్పి విష్ణు,ఆశతో కలిసి వసుంధరని కలవడానికి కార్ లో బయలుదేరింది అర్ణ.
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 94
అడవి నుంచి అర్ణతో ఫోన్లో మాట్లాడి ఇక్కడే టెంట్స్ వేయండి తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అని సీరియస్‌గా చెప్పాడు నిర్మల్.
మిధున్ దాన సంస్కారాలు అయినా తర్వాత విష్ణు, ఆశతో కలిసి వసుంధర దగ్గరికి బయలుదేరింది అర్ణ.
**************
ఉదయం వసుంధర ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్న అభీర్ వైపు చూసి "నందా ఫ్యామిలీ మెంబెర్స్ మాట్లాడడానికి వస్తున్నారు ఈ టైంలో నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా!" అని అడిగింది వసుంధర.
"మేడం! నిజంగా వాళ్ళు పశ్చాత్తాప పడి క్షమించమని అడగడానికి వచ్చిన నా మనసులో ఉన్న ప్రతికరం దానికి ఒప్పుకోదు. కానీ తప్పు తెలుసుకున్న వాడిని చంపకూడదు అని ధర్మం చెబుతుంది కానీ క్షమించడానికి నేను దేవుడిని కాదు మనిషిని!
నా వాళ్ళ చావు చూసి మనసు విరిగిపోయింది నేను అప్పుడే చచ్చిపోయాను కాబట్టి వాళ్ళు ఏమి మాట్లాడినా నేను అర్థం చేసుకోలేను అందుకే ఆ బాధ్యత మంచి చెడు తెలిసిన మీ చేతుల్లో పెట్టాను." అని చెప్పాడు అభీర్.
"నేను ఒక లాయర్ ని తప్పు చేసిన వ్యక్తి క్షమించమని అడిగితే వదిలేయమని చట్టం కుడా చెప్పదు తప్పకుండా శిక్ష పడాల్సిందే, కానీ అతని కుటుంబ సభ్యులు ఆ శిక్షకి అనర్హులు, నాకు తెలిసింది అదే కాబట్టి నేను కూడా అదే విధంగా మాట్లాడుతాను." అని చెప్పింది వసుంధర.
"మీరు చెప్పింది నిజమే మేడం! అతని కుటుంబ సభ్యులు చేసిన తప్పుకి పశ్చాత్తాప పడితే శిక్షకి అనర్హులు, కానీ ఆ తప్పు మళ్ళీ చేయాలని చుస్తే శిక్షకి అర్హులు!" అని చెప్పాడు అభీర్.
"నేను కూడా ఆలోచించేది ఒక్కటే ఈ గొడవలన్నీ ముగిసిపోయి నువ్వు నీ వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను." అని చెప్పింది వసుంధర.
"నేను కూడా అదే జరగాలని ఆశిస్తున్నాను, నా మనుషులు ఇక్కడే ఉంటారు నాకు మంచి చేయాలి అనుకున్న వాళ్ళకి ఎప్పుడు హాని జరగనివ్వను." అని చెప్పి బైరి తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభీర్.
వసుంధర వైపు చూసి "వదిన! వాళ్ళు నిజంగానే తప్పు తెలుసుకుని ఇక్కడికి వస్తున్నారు అనుకుంటున్నావా?" అని అడిగింది నీలమ్.
"నాకు తెలిసి ఇక్కడ దాకా వస్తున్నారు అంటే తప్పు తెలుసుకున్నారు అనే అనుకుంటున్నాను." అని చెప్పింది వసుంధర.
"మేడం! నిజంగా ఇది తప్పు అని తెలుసుకున్న వాళ్ళు అయితే మొదటిలోనే ఆగిపోయేవారు ఇక్కడ దాకా వచ్చేవరకు కాదు." అని చెప్పాడు శంకర్.
"మనిషి మొత్తం కోల్పోయిన తర్వాతే అతను చేసింది తప్పు అని తెలుస్తుంది. అలాగే వాళ్ళకి ఇప్పుడు తెలిసింది అనుకుంటున్నాను ఒక్కసారి మాట్లాడి చూద్దాము వాళ్ళ మనసులో ఏముందో కూడా అర్థం అవుతుంది కదా!" అని చెప్పింది వసుంధర.
"మీరు ఎవరు నమ్మిన ఆ నంద ఫ్యామిలీని నేను మాత్రం నమ్మను." అని చాక్లెట్ తో కలిసి వెళ్ళిపోయింది మిత్ర.
కాసేపటికి కారులో అర్ణ వాళ్ళు అక్కడకి రావడంతో శంకర్ వైపు చూసి "వాళ్ళని లోపలికి తీసుకురా..!" అని చెప్పింది వసుంధర.
"సరే మేడం!" అని కారు దగ్గరికి వెళ్లి అర్ణ వైపు చూసి "ఇటు వైపు రండి." అని లోపలికి తీసుకువెళ్లాడు శంకర్.
ఇంటి లోపలికి వెళ్లి వసుంధర వైపు చూసి "బయట చాలా రకాల పక్షులు ఉన్నాయి మీరు బర్డ్ లవర్స్ ఆ..?" అని అడిగింది అర్ణ.
"ఆ పక్షులు మొత్తం అభీర్ కోసం వచ్చాయి రండి కూర్చోండి." అని చెప్పింది నీలమ్.
"అవునా? మా ఫ్యామిలీ మీద తీస్తున్న డాక్యుమెంటరీ కంప్లీట్ అయిందా?" అని అడిగింది అర్ణ.
"ఇంకా క్లైమాక్స్ మిగిలి ఉంది దాని గురించి అభీర్ ఇంకా ఏమీ చెప్పలేదు." అని చెప్పింది నీలమ్.
"మీ ఫ్యామిలీ అభీర్ కి బాగా దగ్గరైనట్లు ఉన్నారు." అని అడిగాడు విష్ణు.
"అవును! నేను అభీర్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను తన అంగీకరం కోసం వెయిట్ చేస్తున్నాను." అని చెప్పింది నీలమ్.
"మీరు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అతను చేసిన నేరాలకి శిక్ష కూడా పడవచ్చు!" అని చెప్పింది అర్ణ.
"అభీర్ శిక్ష అనుభవించిన తర్వాతే నేరం చేస్తున్నాడు అంతేగాని తప్పుచేసి దేశం వదిలి పారిపోలేదు." అని వెటకారంగా చూస్తూ చెప్పింది నీలమ్.
"అయ్యినా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేసింది మా నాయకుడు కాదు మేము!" అని వసుంధరతో పాటు అక్కడికి వచ్చారు నారప్ప, మల్లీ.
నారప్ప ని చూసి కోపంతో ఊగిపోతున్న విష్ణు చెయ్యి పట్టుకుని సైలెంట్ గా ఉండమని కళ్ళతో సైగ చేసింది అర్ణ.
అక్కడికి వచ్చి ఎదురుగా ఉన్న చైల్డ్ లో కూర్చుని "ఇటువంటి సిచువేషన్ లో ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు కోపం రావడం సహజం! మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి?" అని అడిగింది వసుంధర.
"మేడం! మేము ఈ గొడవలను ఇక్కడితో ఆపేయాలి అనుకుంటున్నాము." అని చెప్పింది ఆశ.
"మాటలతో ఆగిపోవడానికి ఇవేమీ ఆస్తి గొడవలు కాదు, ఒక చారిత్రాత్మకమైన వరసత్వం కలిగిన ఒక జాతిని అంతం చేసి వాళ్లు దైవంగా భావించే వాటిని దోచుకోవాలని చూసిన మీ వాళ్ళ అత్యాశ వల్ల ఏర్పడిన మరణ హోమం!" ఇది అని చెప్పింది వసుంధర.
"మరి మీ మరణ హోమం ఆగడానికి పరిష్కారం..?" అని అడిగింది అర్ణ.
"ముకుల్ గారు అభిజిత్ గారు ఈ తప్పుని ఒప్పుకుని చట్టం ముందు లొంగిపోవడమే దీనికి పరిష్కారం!" అని చెప్పింది వసుంధర.
"అలా చేయడం కుదరదు జరిగిన దానికి నష్టపరిహారంగా ఏమి కావాలో అడగమనండి." అని చెప్పింది అర్ణ.
"అంటే! నువ్వు ప్రాణాలను డబ్బుతో లెక్క కడుతున్నావా..?" అని అడిగింది వసుంధర.
"అవును! ఆ డబ్బే కదా అన్నిటికీ కారణం!" అని చెప్పింది అర్ణ.
"అవునా? అలా అయితే అడవిలో కొండా మీద ఉన్న అమ్మవారి ముందు మీ తాతని నీ చేతులతో సజీవ దహనం చెయ్! నీకు ఎంత డబ్బు కావాలో అడుగు." అని చెప్పింది వసుంధర.
ఆ మాటకి షాక్ అయ్యి చూస్తూ "చావు ఒకటే పరిష్కారం అనుకుంటే ఇక్కడదాకా వచ్చే వాళ్ళము కాదు." అని చెప్పింది అర్ణ.
"మరి మీ దగ్గర ఉన్న పరిష్కార మార్గం ఏమిటో చెప్పండి నేను అభీర్ కి చెబుతాను దానికి ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం తన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది." అని చెప్పింది వసుంధర.
"మా తాతగారు వాళ్ళు చేసిన తప్పుకి ఇండియాలో ఉన్న మా ఆస్తి మొత్తం ఆ తెగ కి ఇచ్చేస్తాను ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడే వాళ్ళకి క్షమాపణ చెబుతాము మేము మళ్ళీ ఈ దేశంలో అడుగుపెట్టము." అని చెప్పింది అర్ణ.
"సరే! ఈ విషయం అభీర్ కి చెబుతాను." అని చెప్పింది వసుంధర.
"అభీర్ ఈ డీల్ కి ఒప్పుకున్నాడో లేదో మాకు ఎలా తెలుస్తుంది?" అని అడిగాడు విష్ణు.
"అడవిలోకి వెళ్లిన వాళ్ళు రేపటి వరకు క్షేమంగా ఉంటే అభీర్ ఈ డిల్ కి ఒప్పుకున్నట్లే అని అర్థం చేసుకోండి." అని చెప్పింది వసుంధర.
"ఓకే థాంక్యూ!' అని చెప్పి రెండు స్వ్వీట్ పాకెట్స్ అక్కడ పెట్టి ఒకటి అభీర్ కి కూడా పంపించండి." అని చెప్పి విష్ణు వాళ్ళతో కలిసి అక్కడి నుంచి బయలుదేరింది అర్ణ.
అక్కడి నుంచి అర్ణ వాళ్ళు వెళ్లిన తర్వాత వసుంధర వైపు చూసి "వదినా! నువ్వు మెత్తగా మాట్లాడతావేమో అని డౌట్ పడ్డాను కానీ నీ మాటలు వాళ్లకి తూటాలు లాగా తగిలాయి." అని సంతోషంగా చెప్పింది నీలమ్.
ఆ మాటకి నవ్వుతూ "అది నా గొప్పతనం కాదు న్యాయానికి ఉన్న పొగరు! ఆ స్వీట్ ప్యాకెట్స్ పక్కన పెట్టండి అభీర్ దీనికి ఒప్పుకుంటే అప్పుడు నోరు తీపి చేసుకుందాము." అని చెప్పింది వసుంధర.
**************
కార్ లో వెళుతూ అర్ణ వైపు చూసి "అభీర్ ఒప్పుకుంటాడంటావా?" అని డౌట్ గా అడిగింది ఆశ.
"తాతయ్య చెప్పినట్లు అభీర్ కి మంచితనం అనే ఒక జబ్బు ఉంది. అది ఉన్న మనిషిని ఎవ్వడు బాగు చేయలేడు, డబ్బు మీద ఆశ లేని వాడు సంపాదించలేడు." అని చెప్పింది అర్ణ.
"నెక్స్ట్ మన స్టెప్ ఏమిటి?" అని అడిగాడు విష్ణు.
"అడవిలోకి వెళ్లిన మన మనుషులు ఎవరు చావకుండా ఉండాలని కోరుకోవడమే!" అని చెప్పింది అర్ణ.
కాసేపటికి గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకొని ముకుల్, అభిజిత్ వైపు చూసి "మనం అనుకున్న మాట అక్కడ చెప్పాను చేయవలసిన పని చేశాను." అని అహంకారంగా చూస్తూ ఒక నవ్వు నవ్వింది అర్ణ.
"నాకు తెలిసి ఈ డిల్ కి కచ్చితంగా అభీర్ ఒప్పుకుంటాడు మనం అడవికి వెళ్లడానికి ప్రిపేర్ అవడం బెటర్!" అని చెప్పింది ఆశ.
కోపంగా అక్కడికి వస్తూ "ఏంటి మీరు చేసినా డీల్? నాన్నగారు వాడికి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలా? దాని కంటే అందరం చావడం బెటర్!" అని ఆవేశంగా చెప్పింది ఝన్సీ.
"అవును! మేము కరెక్ట్ గా డీల్ చేసుకునే టైం లో ఫోన్ చేసి ఆపారు, ఇప్పుడు మీరు వెళ్లి చేసింది ఇదా! అడవికి వెళ్లి వాడి కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పిన తర్వాత మనం తిరిగి ఏ మొహం పెట్టుకుని లండన్ వెళతాము." అని అడిగాడు రఘురామ్.
అక్కడ దూరంగా నుంచున్న ఇద్దరు వైపు చూసి "వాళ్ళు ఎవరో మీకు తెలుసా?" అని అడిగాడు ముకుల్.
"ఆ రాము గాడు ఇక్కడి నుంచి పోయిన తర్వాత వంట చేయడానికి వచ్చారు, ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది?" అని విసుగ్గా చూస్తూ చెప్పింది నళిని.
"మీకు అక్కడ వరకే తెలుసు వాళ్లలో ఒకడి పేరు నాదేల్ మిచల్ కొడుకు, మరొకడు జనార్ధన్ కొడుకు ధీరాజ్ ఇద్దరు అభీర్ ని చంపాలి అనే కసిమిదే ఇక్కడికి వచ్చారు, మన పని మనం చేస్తే వాళ్ల పని వాళ్లు చేశారు." అని నవ్వుతూ చెప్పాడు ముకుల్.
"తాతయ్య! మళ్ళీ ఎటు వంటి పిచ్చి పని చేయలేదు కదా!" అని కంగారుగా అడిగింది ఆశ.
The following 11 users Like SivaSai's post:11 users Like SivaSai's post
• aarya, ABC24, ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Mahesh12345, Nivas348, Sachin@10, shekhadu, vikas123
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
అందుకే అంటారు ..
అధికారం ఆరుపాళ్ళు .. అహంకారం అరవై పాళ్ళు .. అని
•
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 95
క్షమాపణలు చెప్పాలన్న విషయంలో బాధపడుతున్న తన కూతుర్లను చూసి అక్కడ ఉన్న నాదల్, ధిరాజ్ లను చూపించి అభీర్ ని చంపాలన కసితో ఉన్న వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మన పని మనం చేస్తాము అని చెప్పాడు ముకుల్.
***************
ఆ మాట విని కంగారుగా చూస్తూ "తాతయ్య! మళ్ళీ ఏదైనా తప్పు చేస్తున్నారా?" అని అడిగింది ఆశ.
"మనం ఎటువంటి తప్పు చేయడం లేదు అంత కరెక్ట్ గానే చేస్తున్నాము అన్నమాట ప్రకారం అడవికి వెళ్లి అభీర్ కి వాడి మనుషులకి క్షమాపణ చెప్పి లండన్ వెళ్లిపోదము." అని చెప్పింది అర్ణ.
"సరే! మళ్లీ మీరు ఏదైనా తప్పు చేస్తే క్షమాపణ అడిగే అర్హత కూడా మనకి ఉండదు." అని చెప్పి లోపలకి వెళ్ళింది ఆశ.
ముకుల్ దగ్గరకు వెళ్లి "అయ్యా! ఇంక మేము బయలుదేరాతాము." అని అడిగాడు వరదరాజులు.
"మాతోపాటు అడవికి రండి మేము లండన్ వెళ్ళిన తర్వాత అభీర్ తో డీల్ చేసుకోండి." అని చెప్పాడు ముకుల్.
"నేను ఏదో చిల్లర రాజకీయాలు చేసుకునేవాడిని ఈ వ్యవహారం చాలా పెద్దగా ఉంది సైలెంట్ గా ఉండడం మంచిది అనిపిస్తుంది." అని చెప్పాడు వరదరాజులు.
"ఒక్కసారి తల దూర్చిన తర్వాత బయటికి వెళ్ళాలి అంటే తల ఉండదు మా వెనకాల నడవడమే లేకపోతే భవిష్యత్తు ఉండదు." అని చెప్పాడు అభిజిత్.
"సార్" ఈ విషయం బయటికి తెలిసింది అంటే డబ్బు మాట పక్కన పెట్టండి ప్రాణాలు కూడా మిగలవు." అని చెప్పాడు తంబీయర్.
ప్రవీణ్ మిశ్ర వైపు చూసి "మీరిద్దరూ నా ఆస్తి అమ్మితే వచ్చే కమిషన్ కోసం కక్కుర్తి పడ్డారు అని నాకు తెలుసు! ఈ విషయంలో నేను చెప్పినట్లు చేయండి ఇండియాలో ఉన్న ఆస్తి మొత్తం మీ ఇద్దరి పేరు మీద రాసి ఇస్తాను బాగా ఆలోచించుకోండి." అని చెప్పాడు ముకుల్.
ఆ మాటకి ఆశగా చూస్తున్న వాళ్ళ వైపు చూసి "ఈ అవకాశం మళ్ళీ రాదు మీరు చేయవలసింది ఒక చిన్న సహాయం మాత్రమే!" అని చెప్పింది అర్ణ.
నలుగురు పక్కకి వెళ్లి కాసేపు మాట్లాడుకుని వచ్చి "ఈ పని చేయడానికి మేము రెడీ." అని చెప్పాడు వరదరాజులు.
ఆ మాటకి నవ్వుతూ "అభిజిత్ చూసావా డబ్బు ఎటువంటి పని అయినా చేయిస్తుంది." అని చెప్పాడు ముకుల్.
అర్ణ దగ్గర కాగితాలు తీసుకుని అక్కడినుంచి బయటికి వెళుతూ రఘురామ్ వైపు చూసి "నువ్వు సడన్‌గా ప్లేట్ మార్చడం మాకు మంచిదే అయింది." అని చెప్పాడు వరదరాజులు.
రఘురామ్ వైపు చూసి "బాబాయ్ నువ్వు చెప్పావని నేను కూడా ప్లేట్ మార్చాను సడన్ గా నీకు ఏమైంది?" అని అడిగాడు మోహిత్.
"మీ తాత ముక్కోడే గాని మహానుభావుడు తేడా వస్తే అల్లుడు అని కూడా చూడని నీచుడు అని తెలుసు, కానీ పరమరీచుడు అని ఇప్పుడే అర్థమైంది. కాసేపు వెయిట్ చెయ్ అన్ని విషయాలు తెలుస్తాయి." అని చెప్పాడు రఘురామ్.
గేట్ బయటకు వెళుతున్న వరదరాజులు వాళ్ళ కారు వైపు చూసి "ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడికి రండి." అని పిలిచాడు ముకుల్.
ఆ మాట విని ఆశ ని కూడా పిలిచి "మీ తాతయ్య అందరకి ఏదో గీతోఉపదేశం చేస్తున్నాడు విందాము పద!" అని చెప్పాడు రఘురామ్.
అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూసి "నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మనం అందరం ఇప్పుడు రాజస్థాన్ లో ఉన్న బేరా అడవికి బయలుదేరుతున్నము." అని చెప్పాడు ముకుల్.
"మన ప్రపోజల్ ఒప్పుకున్నట్టు అటువైపు నుంచి ఏ కాల్ రాలేదు కదా!" అని అడిగింది ఆశ.
"మనం ముందుగానే అడవికి వెళ్లేది అభీర్ కి క్షమాపణలు చెప్పడానికి కాదు ఇండియా నుంచి వెళ్లిపోవడానికి!" అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని "ఇండియా నుంచి వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి కానీ అడవికి వెళ్లడం ఎందుకు?" అని డౌట్ గా అడిగాడు రఘురామ్.
"నేను అభీర్ ఒక అడవి మనిషి తన వాళ్ళ చావుకి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు ఆవేశంలో ఎక్కడో ఒకచోట మనకి దొరుకుతాడు అనుకుని చాలా తక్కువ అంచనా వేశాను.
కానీ వాడు మనఫ్యామిలీ మీద మాత్రమే కాకుండా మన ఆస్తుల మీద కూడా గురి పెట్టాడు రెండు రోజులు క్రితం మీరు డిల్ మాట్లాడాలి అనుకున్న బైరితో కలసి వసుంధర సెంట్రల్ హోమ్ మినిస్టర్ ని కలిసింది." అని చెప్పాడు ముకుల్.
"కలిస్తే కలవనివ్వండి దానికి మనం భయపడాల్సిన అవసరం ఏముంది. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏ మనల్ని సేఫ్‌గా ఇక్కడ నుంచి పంపుతుంది." అని చెప్పింది ఆశ.
"అభీర్ మన ఆస్తులు మీద గురీ పెట్టడమే కాకుండా నంద గ్రూప్ పునాదులు ఎలా నిర్మించామో కూడా తెలుసుకున్నాడు." అని చెప్పాడు ముకుల్.
"మీరు చెప్పింది ఏమిటో నాకు అర్థం కాలేదు." అని డౌట్ గా అడిగాడు విష్ణు.
"నాకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు అభిజిత్ తండ్రి తో కలిసి ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసి వ్యాపారం మొదలు పెట్టాను కానీ దాంట్లో మేము నష్టాలు చవిచూసాము అప్పుడే మాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యి ఒక ఆఫర్ ఇచ్చాడు.
టెర్రరిస్టులకి సపోర్ట్ గా ఉండే దేశాలు, కొంతమంది వ్యక్తులు మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఆ డబ్బు ప్రపంచంలో ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కి అవసరమైన మన కంపెనీ నుంచి వెళుతుంది.
మన ఎకౌంట్లో పడిన డబ్బులో 30% మనకి వస్తుంది దానికోసం అన్ని దేశాలలో మన వ్యాపారాలు మొదలుపెట్టాము రాజకీయ అండ కోసం ఒక పార్టీ పెట్టి అభిజిత్ తండ్రిని ఒక నాయకుడుగా నిలబెట్టాను.
ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ బిజినెస్ మానేయాలి అనుకున్నాము కానీ ఈ ఊబిలోకి ఒక్కసారి వెళ్లడమే కానీ బయటికి రావడం ఉండదు అందుకే ఆ బిజినెస్ ఇప్పటికే నేనే చూసుకుంటూ మిమ్మల్ని దూరంగా ఉంచాను.
ఈ విషయం అభీర్ కనిపెట్టి వసుంధరని హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపించాడు ఇప్పుడు వాళ్లు పక్క ఆధారాలతో రెండు రోజుల్లో మళ్ళీ హోమ్ మినిస్టర్ ని కలవబోతున్నారు." అని చెప్పాడు ముకుల్.
"ఈ వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది అంటే మన పాస్‌పోర్ట్ బ్లాక్ చేసి కస్టడీలోకి తీసుకుని విదేశాలలో ఉన్న మన ఆస్తులు మొత్తం సీజ్ చేయిస్తారు అప్పుడు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేము." అని చెప్పాడు అభిజిత్.
"అవునా? ఇప్పుడు అ ప్రూవ్స్ అభీర్ చేతికి వెళ్ళయా?" అని కంగారుగా అడిగాడు రఘూరామ్.
"దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు వసుంధర దగ్గర ఉన్నాయని తెలిసింది అవి ఇండియన్ గవర్నమెంట్ చేతికి వెళ్లకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి." అని చెప్పాడు ముకుల్.
"బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరూ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకున్నాను కానీ ఈ విషయం మాకే తెలియదు వాళ్ళు ఎలా కనిపెట్టారు?" అని డౌట్ గా అడిగాడు మోహిత్.
"అసలు" ఈ విషయం అభీర్ కి ఎలా తెలిసింది? వాళ్లు ఆధారాలు సేకరిస్తున్నారని మీకు ఎవరు చెప్పారు? " అని అనుమానంగా అడిగింది అర్ణ
"ఈ విషయం గురించి వివరంగా నాదల్, ధీరజ్ లు చెబుతారు వినండి." అని ఇద్దరి వైపు చూశాడు ముకుల్.
"ఈ బిజినెస్ కి సంబంధించి అన్ని లావాదేవీలు మిథున్ గారితో కలిసి మేమే చూసుకుంటున్నాము మన కంపెనీకి ఎవరు పండింగ్ ఇస్తారు ఆ డబ్బు ఎవరికి వెళ్ళాలి అనేది మాకు మాత్రమే తెలుస్తుంది. అదంతా ఇండియాలో ఉన్న కంపెనీ పేరు మీదే లావాదేవీలు జరుగుతాయి అందుకే నంద గ్రూపులో అన్ని దేశాల కన్నా ఇండియాలో ఉన్న కంపెనీకి లాభాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
అభీర్ జైల్లో ఉన్న తన మనుషుల ఐదుగురికి ఎప్పుడు టచ్ లోనే ఉన్నాడు మీ గురించి పూర్తి వివరాలు కోసం రాము అనే ఒక వంటవాడని మీ దగ్గరికి చేర్చరు అతని ద్వారా మీ ఫ్యామిలీ మెంబెర్స్ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ల మనుషులు టచ్ లోకి వెళ్లడం మొదలుపెట్టారు.
ఐదుగురులో రాజన్ అనే ఒక వ్యక్తి ప్రతాప్ మిశ్రా గారికి పరిచయం అయ్యి ఇండియాలో ఉన్న మీ ఆస్తులు మీద ఆశ పుట్టించాడు. ప్రతాప్ మిశ్రా గారు అర్ణ మేడంకి ఈ విషయం చెప్పి ఆవిడ పర్మిషన్ తోనే ఇండియాలో ఉన్న మీ ఆస్తుల చిట్టా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బయటకు తీసి లాయర్ హిరణ్య కి, మిచల్ కి డబ్బులు వెళుతున్న విషయం చెప్పారు.
అప్పుడు అర్ణ మేడం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోమని ఆ డబ్బులు ఎందుకు వెళ్ళయో ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏమిటో తెలుసుకోమని చెప్పారు.
అప్పుడే రాజన్ చేతికి ఇండియాలో ఉన్న ఆస్తుల వివరాలు బ్యాంక్ డీటెయిల్స్ వచ్చాయి మిమ్మల్ని ఫైనాన్సియల్ గా దెబ్బతీయడం కోసం రాజన్ దగ్గర ఉన్న డీటెయిల్స్ తెప్పించుకుని అభీర్ చూడడం మొదలుపెట్టాడు.
వేరువేరు దేశాల నుంచి మీకు ఫండింగ్ వస్తున్న విషయం మీ బ్యాంక్ అకౌంట్ లో భారీ మొత్తంలో డబ్బు పడ్డ పది రోజులు తర్వాత ఫండింగ్ చేసినా దేశంలో అల్లర్లు జరగడం బ్లాస్ట్ లు జరగడం తెలుసుకున్నాడు.
అదే విషయాన్ని వసుంధర ద్వారా హోమ్ మినిస్టర్ గారికి తెలియజేశారు ఇండియాలో ఉన్న మీ కంపెనీలోకి ఎక్కడెక్కడ నుంచి డబ్బు వచ్చింది ఆ డబ్బు ఎక్కడకి వెళ్ళింది అనే విషయం మీద ఇండియన్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది.
ఆ విషయం తెలుసుకున్న మిథున్ గారు మమ్మల్ని ఎలర్ట్ చేశారు అన్ని వివరాలు ఒక బ్యాగ్ లో పెట్టి ఇక్కడికి పంపించాము ఆరోజు ఇక్కడికి వచ్చిన వీరభద్రం ఆయన తలతో పాటు ఎవిడెన్స్ ఉన్న బ్యాగ్ కూడా తీసుకువెళ్లిపోయాడు.
ఆ బ్యాగ్ ఇప్పుడు వసుంధర దగ్గర ఉంది. మన కంపెనీలో ఏ దేశాల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది. మిగిలిన డబ్బు నంద గ్రూపులో ఉన్న ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి." అని చెప్పాడు నాదేల్.
ఆ మాట విని షాక్ అయి చూస్తూ ఆ వీరభద్రం గాడు "మిధున్ తల పట్టుకుపోయాడు అనుకున్నాను దాంతో పాటు మన తలలు కూడా తీసుకువెళ్లిపోయాడా?" అని కంగారుగా చెప్పాడు రఘురామ్.
"అంటే! మన సీక్రెట్ మన చేతుల మీదగానే వాడి చేతిలో పెట్టామా?" అని టెన్షన్ గా చూస్తూ చెప్పింది అర్ణ.
"మరి ఇప్పుడు మనం ఇండియా వదిలి పారిపోయిన ఎవిడెన్స్ లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా అవి కచ్చితంగా గవర్నమెంట్ కి చేరుతాయి మనం ఎక్కడ ఉన్నా సరే వదిలిపెట్టరు." అని భయంగా చూస్తూ చెప్పాడు విష్ణు.
"అందుకే కదా అభీర్ తో రాజి ప్రపోజల్ పెట్టి మీతో వసుంధర ఇంటికి స్వీట్ ప్యాకెట్స్ పంపించను, ఆ విషయంలో మన మీద అనుమానం రాకూడదు అని ఇండియాలో ఉన్న ఆస్తి ఆశ చూపి వరదరాజులు వాళ్ళని కూడా అక్కడికే పంపించాను." అని చెప్పాడు ముకుల్.
"అవునా?" ఇప్పుడు వసుంధర ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? " అని అనుమానంగా అడిగింది ఆశ.
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 96
తన ఫ్యామిలీ మెంబర్స్ కి నంద గ్రూప్ పునాదులు ఎలా ఏర్పరిచానో ఆ విషయలు అభీర్ ఎలా కనిపెట్టాడో వివరంగా చెప్పి ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మీతో వసుంధర దగ్గరికి రాజీ ప్రపోజల్ పెట్టి స్వీట్ బాక్స్ లు పంపించాను అది మన మీదకు రాకుండా ఉండడానికి ఇండియా ఆస్తి ఆశ చూపి వరదరాజులు వాళ్ళని పంపించాను అని చెప్పాడు ముకుల్.
****************
ఆ మాట విని "అయితే ఇప్పుడు వసుందర గారి ఇంటి దగ్గర ఏం జరుగుతుంది?" అని కంగారుగా చూస్తూ అడిగింది ఆశ.
"ఆ విషయాలు తెలుసుకుంటూ ఇక్కడ కూర్చుంటే మనం మిగలము వెళ్లడానికి బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ రెడీగా ఉంది. దీంట్లో వెళితే మన సిగ్నల్ కూడా ఎవరు ట్రేస్ చేయలేరు మిగతా విషయాలు దారిలో మాట్లాడుకుందామా? " అని చెప్పాడు ముకుల్.
ఆశ దగ్గరికి వెళ్లి "ముందు పద ఈ దేశం నుంచి బయట పడ్డ తర్వాత తీరికగా ఆలోచించొచ్చు!" అని చెప్పాడు రఘురామ్.
ఆ మాట విని అక్కడికి వచ్చిన బస్సు ఎక్కి "మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ అడవిలోకి వెళ్లడం ఎందుకు?" అని డౌట్ గా అడిగింది ఆశ.
"ముందు లోపలికి వెళ్లి కూర్చో నీకు అన్ని వివరంగా చెబుతాను." అని చెప్పి అక్కడ ఉన్న సాధు వైపు చూసి "నీకు నీ గ్యాంగ్ కి ఎప్పుడు చూడనంత డబ్బు ట్రాన్స్ఫర్ చేశాను మీరు చేయవలసిన పని గుర్తుంది కదా!" అని చెప్పాడు ముకుల్.
"ఎస్ సార్! మీరు క్షేమంగా వెళ్ళండి ఇక్కడ అంతా మీరు చెప్పినట్లు జరుగుతుంది." అని చెప్పాడు సాధు.
ముందు వెహికల్స్ లో మిసైల్, నెల్సన్ మనుషులు స్టార్ట్ అవ్వగానే వెనకాలే బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ లో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి బయలుదేరడు ముకుల్.
"మావయ్య గారు ఇప్పుడు మనం మళ్లీ అడవికి ఎందుకు?" అని నెమ్మదిగా అడిగాడు రఘురామ్.
"మనం అడవి నుంచి బోర్డర్ దాటి పాకిస్తాన్ వైపు వెళ్ళిపోతున్నాము మనల్ని క్షేమంగా తీసుకురావడానికి రెండు టెర్రరిస్టు గ్రూపులో ఆల్రెడీ అక్కడికి ఎంటర్ అవుతున్నాయి." అని చెప్పాడు ముకుల్.
"అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కనబడితే మిలటరీ రంగంలోకి దిగుతుంది." అని కంగారుగా చెప్పాడు మోహిత్.
"ఆ అడవి ప్రాంతంలో ఉన్న కొండలు మొత్తం అరవాళి పర్వతాలు వాటిలో కొంత భాగం పాకిస్తాన్ లో ఉంటుంది కొంత భాగం ఇండియాలో ఉంటుంది ఆ కొండల్లో రెండు దేశాలను కలిపే సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి.
అక్కడ దొరికిన నిధిని అడవి బయటకు తీసుకురాకుండా అటు నుంచి అటే తీసుకు వెళ్లడానికి తల్వార్ ఒక రూట్ తెలుసుకున్నాడు ఇప్పుడు అటువైపు నుంచి టెర్రరిస్టులు వస్తున్నారు.
మనం కూడా అటువైపు నుంచి వెళ్ళిపోతున్నాము, ఈ విషయం మిలటరీ తెలుసుకునేలోపు మన దేశం దాటిపోతాము." అని చెప్పింది అర్ణ.
ఆ మాట విని "నువ్వు, మిథున్, వాసుకి గదిలో కూర్చుని మ్యాప్ లో చూసి మాట్లాడుకుంటుంది ఈ రూట్ గురించేనా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రఘురామ్.
"ఎస్! అప్పుడు నిధిని అభీర్ సేన కంటపడకుండా తీసుకువెళ్లడానికి చూశాము కానీ ఇప్పుడు అది మనం వెళ్లడానికి ఉపయోగపడుతుంది." అని చెప్పింది అర్ణ.
"ఒకవేళ అప్పటికీ ఆర్మీ ఎంటర్ అయితే మనల్ని సేవ్ చేసుకోవడానికి రాజస్థాన్ మినిస్టర్ ఫారుక్ ని ఉపయోగించుకుంటాము, వాడి ప్రాణాలు కాపాడడం కోసం మిలిటరీ ఆలోచించే లోపు మనం ఎస్కేప్ అయిపోతాము అప్పుడు ఇదంతా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనుకుంటారు మన మీదే ఎవరికి డౌట్ రాదు." అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "మీరు టెర్రరిస్టులు కన్నా ప్రమాదకరంగా ఉన్నారు ఏదో విధంగా ప్రాణాలతో బయటపడేయండి." అని చెప్పాడు రఘురామ్.
"ఓకే మీ ప్లాన్ బానే ఉంది." అని బ్యాగ్ లో నుంచి వాచెస్ తీసి "ఇవి అందరూ పెట్టుకోండి మనతో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వండి." అని చెప్పింది ఆశ.
"వాచ్ వైపు చూస్తూ ఎందుకు ఇది?" అని డౌట్ గా అడిగింది అర్ణ.
"అభీర్ తో డీల్ కుదిరితే కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు జంతువులు బారిన పడకుండా ఉండడం కోసం తెప్పించాను, వీటిని అమెజాన్ ఫారెస్ట్ రైడింగ్ కి వెళ్లే వాళ్ళు సేఫ్టీ కోసం పెట్టుకుంటారు.
మనిషి చూసినట్లు జంతువు చూడలేదు వాటికీ ఏ వస్తువైనా మనిషి అయిన ఎక్స్ రే తీసినప్పుడు ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా కనబడుతుంది. కాబట్టి అవి వాసన చూసి ఎదుట ఉన్నది మనిషా, జంతువా, చెట్ట అనేది తెలుసుకుంటాయి.
ఈ వాచ్ లో ఉన్న టెక్నాలజీ వల్ల ఏ జంతువు మన స్మెల్ కనిపెట్టలేదు ఒక చెట్టు పుట్ట అనుకుంటుంది కాబట్టి ఎటాక్ చెయ్యవు." అని చెప్పింది ఆశ.
ఆ వాచ్ తీసుకుని పెట్టుకుంటూ "నా మనవరాలివి అనిపించవు శభాష్!" అని సంతోషంగా చెప్పాడు ముకుల్.
'బ్లడ్ అదే కదా చావు తెలివితేటలు ఎక్కడికి పోతాయి మనమే పిచ్చోళ్ళము.' అనుకున్నడు రఘురామ్.
అర్ణ వైపు చూస్తూ "అక్కడ ఫారెస్ట్ లో ఉన్న మన వాళ్ళ పొజిషన్ ఏమిటి? నిర్మల్ ఏమైనా కాల్ చేశాడా?" అని అడిగాడు ముకుల్.
"తాతయ్య! నిర్మల్ కి విషయం అర్థమైయేటట్లు మెసేజ్ పంపించాను మనం వెళ్లే వరకు అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా తను మేనేజ్ చేస్తాడు." అని చెప్పింది అర్ణ.
***************
అడవిలో టెంట్ లో ఉన్న బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ టెన్షన్ గా ఉన్న ప్రమోద్ వైపు చూసి "మనవాళ్ళందరూ ఇక్కడికి వస్తారు రిలాక్స్ గా ఉండు." అని చెప్పాడు నిర్మల్.
"నా టెన్షన్ అందుకు కాదు వాసుకి వాళ్ళు నిధి కోసం వెతుకుతున్నారు ఇప్పటివరకు ఏమీ దొరకలేదు, ఆ ఫారుక్ తన మనుషులతో కలిసి దొరికిన రాళ్లు దొరికినట్లు సంచులు నింపుతున్నాడు మనమే ఖాళీగా చూస్తూ కూర్చున్నాము." అని చెప్పాడు ప్రమోద్.
"నీకు ఒక విషయం చెప్పనా? ఇటువంటి పనులు చేసేటప్పుడు కష్టపడిన వాడికి ఎప్పుడు సుఖం దక్కదు బుర్రతో ఆలోచించిన వాడికి సుఖం దక్కుతుంది.
అక్కడ వాళ్లు కష్టపడుతున్నారు కదా మనం సుఖపడదాము." అని నవ్వుతూ అక్కడ ఉన్న కేశవ్ మనుషుల వైపు చూసి "నాకు వాళ్ల మీద డౌట్ గా ఉంది ఒక కంట కనిపెడుతూ ఉండు." అని చెప్పాడు నిర్మల్.
"అది సరే! మనవాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు?" అని డౌట్ గా అడిగాడు ప్రమోద్.
ఆ మాటకి కేశవ్ వాళ్ళకి వినపడేటట్లు మాట్లాడుతూ "అభీర్ తో డీల్ ఓకే అయింది తప్పు జరిగిన ప్లేస్ లోనే క్షమాపణలు చెప్పడానికి ఇక్కడకి వస్తున్నారు ఇంకా ఈ గొడవలు మొత్తం క్లోజ్ అవుతాయి." అని చెప్పాడు నిర్మల్.
ఆ మాట వినపడిన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అక్కడ జరిగే పని వైపు చూస్తూ ఉన్నాడు కేశవ్.
*************
సాయంత్రం కోర్టు దగ్గరనుంచి ఇంటికి బయలుదేరుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "అర్ణ టెల్ మీ?" అని అడిగింది వసుంధర.
"మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాము మేము చెప్పిన విషయం గురించి అభీర్ ఏమన్నాడు?" అని అడిగింది అర్ణ.
"నువ్వు చెప్పిన ప్రపోజల్ అభీర్ కి చెప్పాను తన వాళ్ళ అందరితో మాట్లాడి ఏ విషయం చెబుతాను అన్నాడు నాకు ఇంకా కాల్ రాలేదు రాగానే నీకు కాల్ చేస్తాను." అని చెప్పింది వసుంధర.
"అభీర్ డిసిషన్ ఏదైనా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము." అని చెప్పింది అర్ణ.
"మీరు అభీర్ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు తను కరెక్ట్ డిసిషన్ తీసుకుంటాడు నేను ఇంటికి వెళుతున్నాను ఒకసారి మాట్లాడి నీకు కాల్ చేస్తాను." అని చెప్పింది వసుంధర.
"ఓకే మేడం!' అని ఫోన్ పెట్టేసి వెంటనే నాదల్ కి కాల్ చేసి "వసుంధర ఇంటికి బయలుదేరింది మీరు రెడీ అవ్వండి గెస్ట్ హౌస్ లో మేము లేని విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటికి తెలియకూడదు." అని చెప్పింది అర్ణ.
"ఓకే మేడం!" అని ఫోన్ పెట్టేసి ధీరజ్, సాదువైపు చూసి "రెడీ అవ్వండి." అని చేప్పి వరదరాజులకి కాల్ చేశాడు నాదేల్.
*************
ఇంటిదగ్గర తన వాళ్లతో అర్ణ చెప్పిన ప్రపోజల్ గురించి మాట్లాడుతూ ఉన్న అభీర్ దగ్గరికి వచ్చి "వసుంధర మేడం కాల్ చేస్తున్నారు." అని ఫోన్ ఇచ్చింది మిత్ర.
ఫోన్ తీసుకుని "నమస్తే మేడం చెప్పండి?" అని అడిగాడు అభీర్.
"ప్రపోజల్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి అర్ణ కాల్ చేసింది. ఇంకా లేట్ చేయకుండా మన దగ్గర ఉన్న సాక్షాదారాలు హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళని చట్టపరంగానే శిక్షిద్దాము వాళ్లు చేసిన తప్పు మళ్ళీ మీరు చేయకండి." అని చెప్పింది వసుంధర.
"సరే మేడం! కాసేపట్లో మేము కూడా అక్కడే ఉంటాము అందరం కలిసి హోం మినిస్టర్ గారి దగ్గరికి వెళదాము." అని చెప్పాడు అభీర్.
"సరే! నేను ఇపుడే ఇంటికి వచ్చాను త్వరగా రండి." అని చెప్పి ఫోన్ పెట్టేసింది వసుంధర.
ఫోన్ పెట్టేసి రాజన్, బైరి వైపు చూసి "మనవాళ్లందరినీ అడవికి బయలుదేరమనండి హోమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత మనం కూడా అడవికి వెళ్లి పంచరత్నాలు అమ్మవారి పాదాల దగ్గర ప్రతిష్టిద్దాము." అని చెప్పాడు అభీర్.
"పుష్కరకాలం తర్వాత జరుగుతున్న అమ్మవారి జాతర చాలా ఘనంగా చేయాలి." అని చెప్పింది రియా.
"మనం చేసిన పనికి పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయో లేదో నాకు తెలియదు కానీ తప్పు చేసినా వాళ్ళ మనసులో పశ్చాతాపాన్ని తీసుకువచ్చి శిక్షపడేటట్లు చేయబోతున్నాము ఇంక మనవాళ్ళ అందరి గుండెల్లో భారం దిగి ప్రశాంతంగా జీవిస్తారు." అని చెప్పాడు అభీర్.
అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "వరదరాజులు కాల్ చేస్తున్నాడు." అని చెప్పాడు బైరి.
ఫోన్ తీసుకునే లిఫ్ట్ చేసి "చెప్పు వరదరాజులు?" అని అడిగాడు అభీర్.
"నంద గెస్ట్ హౌస్ దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చారు వాళ్ళని చూస్తే ఈ దేశం వాళ్ళ లాగా లేరు ఏవో పేపర్స్ కావాలని గట్టిగా అడుగుతున్నారు, మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు ఈ విషయం నీకు చెప్పాలి అనిపించింది కాల్ చేశాను." అని చెప్పాడు వరదరాజులు.
"సరే!" అని ఫోన్ పెట్టేసి కాసేపు ఆలోచించి బైరి వాళ్ళ వైపు చూసి "మనం అర్జెంటుగా వెళ్లాలి పదండి." అని హడావుడిగా కారులో వెళుతూ నారప్ప కి కాల్ చేశాడు అభీర్.
ఫోన్ లిఫ్ట్ చేసి "నాయకుడా చెప్పండి?" అని అడిగాడు నారప్ప.
"ఆ ఇంటి దగ్గర ఎవరు ఉండకూడదు అందరిని సేఫ్‌గా ఏక్కడికైనా తీసుకువేళ్ళు మేము దారిలో ఉన్నాము కాసేపట్లో అక్కడే ఉంటాము." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా?" అని చెప్పి ఫోన్ పెట్టేసి అప్పుడే ఇంటికి వచ్చిన వసుంధర వైపు చూసి "మేడం! మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్లాలి." అని చెప్పాడు నారప్ప.
"ఏమైంది? అంత కంగారు పడుతున్నావు ఎందుకు?" అని అనుమానంగా అడిగింది వసుంధర.
"వదిన! అర్ణ ఇచ్చిన స్వీట్ బాక్స్ లో నుంచి పొగ వస్తుంది." అని చెప్పి స్పృహ తప్పి పడిపోయింది నీలమ్.
ఆ మాట చెప్పి స్పృహ తప్పిన నీలమ్ ని చూసి పరుగున వస్తున్న జాజి తలలో బుల్లెట్ దిగడంతో షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయింది వసుంధర.
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
Excellent update eagerly waiting for next update
•
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
Bullet fired on Jaji.. that is the final nail in the coffin!!
Posts: 67
Threads: 0
Likes Received: 23 in 18 posts
Likes Given: 3
Joined: Apr 2021
Reputation:
0
Super ga rasutunnaru. Suspence maintain chestunnaru. Story chala bagundi.
•
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
Now that there is a loss of life on Abhir's side, for some reason, I guess Arna is the next wicket to be fall.
Time is ripe for a big wicket now!!
She has absolutely no remorse for others' life, nor has any fear of retribution.. just plain arrogance from her family fortune!!
But let's see, what happens. Siva garu (Abhir) ela decide chestaro?
•
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 97
అభీర్ ఫోన్లో చెప్పింది విని వసుంధర దగ్గరికి వచ్చి మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్లాలి మేడం అని చెప్పేలోపు వదిన అర్ణ ఇచ్చిన స్వీట్ బాక్స్ లో నుంచి పొగ వస్తుంది అని స్పృహ తప్పి పడిపోయింది నీలమ్ అంతలో బుల్లెట్ వచ్చి పక్కనే ఉన్న జాజి తలలో దిగడంతో షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయింది వసుంధర.
**************
జాజి తలలో బుల్లెట్ దిగడం చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచింది వసుంధర.
బాక్స్ లో నుంచి వస్తున్న పొగకి సందీప్ రావు, రోషిని స్పృహ తప్పి పడిపోవడం చూసి "మేడం! మనం మోసపోయాము." అని చెప్పి గ్యాస్ మాస్కులు పెట్టుకుని లోపలకి వస్తున్న మనుషులను చూసి వసుంధర కి ఎదురుగా వెళ్లి నిలబడింది మల్లి.
స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని చూసి "నారప్ప! ఆ పొగ పిల్చకూడదు." అని అక్కడ ఉన్న టవల్ మొహానికి కట్టుకున్నాడు శంకర్.
లోపలికి వచ్చిన మనుషులు రాముని షూట్ చేయడంతో టవల్ మొహానికి కట్టుకుని వాళ్ళకి మీదకి వెళ్లారు శంకర్ నారప్పలు.
ఆ పొగలో "నాదల్ ఎవిడెన్స్ బ్యాగ్ ఎక్కడ ఉందో చూడు." అని మాట వినిపించడంతో రూమ్ లో ఉన్న ఎవిడెన్స్ బ్యాగ్ తీసుకుని డాబా మీదకి వెళ్లి వాటర్ ట్యాంక్ లో దూకేడు చాక్లెట్.
అప్పటికే పొగ పిల్చడంతో మత్తులో ఉన్న నారప్ప, శంకర్, మల్లి లను చంపి వసుంధర ఫ్యామిలీని టేబుల్ మీద ఉన్న స్వీట్ ప్యాకెట్స్ ని తీసుకుని అక్కడి నుంచి కార్ లో వెళ్లిపోయారు మాస్క్ వేసుకున్న మనుషులు.
***********
కాసేపటికి అక్కడికి చేరుకుని ఇంటి లోపలకు వెళ్లి నారప్ప వాళ్ళు చనిపోయి ఉండడం చూసి బాధపడుతూ ఉన్నారు రాజన్ వాళ్ళు.
చనిపోయిన నారప్ప శంకర్ ల వైపు చూస్తూ "వీళ్ళు మొహానికి టవల్స్ ఎందుకు కట్టుకున్నారు?" అని అడిగింది మిత్ర.
చనిపోయిన నలుగురు వైపు చూస్తూ "ఇక్కడ మత్తు మందు ప్రయోగించి ఎటాక్ చేశారు లేకపోతే వీళ్ళ నలుగురిని ఎవరు అంత తేలికగా పడగొట్టలేరు, పిరికినా కొడుకులు దొంగ దెబ్బ తీసి చంపారు." అని బాధగా చెప్పాడు బైరి.
ఇంటి లోపల మొత్తం చూసి వచ్చి "నాయుకుడా! వసుంధర మేడం ఫ్యామిలీలో ఎవరు కనిపించడం లేదు." అని కంగారుగా చెప్పింది రియా.
తన వాళ్ళ వైపు బాధగా చూస్తూ ఆవేశంతో ఇల్లు దద్దరిల్లిపోయేలాగా గట్టిగా అరిచాడు అభీర్.
"ఈ పని కచ్చితంగా తెలిసిన వాళ్ళు చేసారు వసుంధర మేడం ఫ్యామిలీని కిడ్నాప్ చేసి మన వాళ్ళందరిని చంపేశారు." అని బాధపడుతూ చెప్పాడు రాజన్.
"మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ కోసమే ఇదంతా చేశారు." అని చెప్పాడు అగస్త్య.
ఆ మాట విని "చాక్లెట్ కూడా ఇక్కడే ఉన్నాడు ఎవిడెన్స్ లు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లే వరకు ఆ బ్యాగ్ కి నేను బామ్మా గారు కాపలాగా ఉంటాము అన్నాడు." అని కంగారు గదిలోకి వెళ్లి మంచం మీద చనిపోయి ఉన్న బామ్మ ని చూసి "ఇక్కడ ఎవిడెన్స్ బ్యాగ్ లేదు." అని చెప్పింది మిత్ర.
మంచం మీద ఉన్న బామ్మ శరీరం దగ్గరికి వెళ్లి బాధగా చూస్తూ నోటి నుంచి నురగ రావడం చూసి "మత్తు మందు వల్లే ఈవిడ చనిపోయారు." అని చెప్పాడు అభీర్.
అంతలో అక్కడికి వచ్చి చనిపోయిన వాళ్ళ వైపు చూసి ఫోన్ తీసి దయా కి కాల్ చేసి "ఐదు నిమిషాల్లో ఇక్కడ డాగ్ స్క్వాడ్ ఉండాలి." అని చెప్పాడు శ్రీకర్.
బైరి వాళ్ళ వైపు చూసి "నంద గెస్ట్ హౌస్ దగ్గరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు అని వరదరాజులు ఫోన్ చేసి చెప్పాడు, నాకు తెలిసి వాళ్లే ఎవిడెన్స్ ల కోసం ఇక్కడికి వచ్చి ఉంటారు, ఆ గెస్ట్ హౌస్ నుంచి ఒక్కడు కూడా బయటికి వెళ్ళకూడదు." అని ఆవేశం గా చెప్పాడు అభీర్.
"ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవిడెన్స్ లు దొరికితే వసుంధర మేడం వాళ్ళని కిడ్నాప్ చేయరు చంపేసేవారు ఖచ్చితంగా వాళ్ల చేతికి ఎవిడెన్స్ లు వెళ్లలేదు.
ఈ టైంలో ఆవేశపడితే వాళ్ల ప్రాణాలకి కుడా ప్రమాదం నంద గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లి చెక్ చేసి రమ్మని ఆఫీసర్స్ ని పంపిస్తాను." అని చెప్పాడు శ్రీకర్.
"మీరు చెప్పింది కూడా నిజమే ఎవిడెన్స్ లు వాళ్ళ చేతికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాయి." అని ఇంటి లోపల వెతుకుతూ ఉన్నారు అభీర్ వాళ్ళు.
అంతలో డాగ్ స్క్వేడ్ తో దయ అక్కడికి రావడంతో ఇల్లు మొత్తం వాసన చూసి డాబా మీదకి పరిగెత్తాయి కుక్కలు.
***************
ఆదే సమయం లో నందా గెస్ట్ హౌస్ దగ్గరికి స్పృహలో లేని వసుంధర వాళ్ళని తీసుకుని వరదరాజుల వాళ్ళతో పాటు వచ్చి "ఇకనుంచి వీళ్ళ బాధ్యత మాది అభీర్ కి మీ మీద ఎటువంటి అనుమానం రాదు, ఈ గెస్ట్ హౌస్ కూడా మీదే అని ముకుల్ గారు చెప్పమన్నారు." అని కీస్ ఇచ్చాడు నాదల్.
ఆ మాటకి సంతోషంగా తాళాలు తీసుకుని తన మనుషులతో కలిసి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిన వరదరాజులు వాళ్ళని చూసి "సాధు! మనం ఇంకా ఇక్కడ ఉండకూడదు." అని చెప్పాడు ధీరాజ్.
అక్కడ నుంచి కార్లు వెళ్లిపోవడం చూసి "అసలు ఈ గోలకి మనకి ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ ఇక్కడికి అభీర్ వస్తే మనం ఫోన్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి.
ఇక్కడికి వచ్చిన గుర్తు తెలియని మనుషులు నంద ఫ్యామిలీని అభిజిత్ ని తీసుకు వెళ్లిపోయారు అని చెప్పండి. ఈరోజు నుంచి ఇండియాలో ఉన్న ఇద్దరి ఆస్తులు మనమే!" అని సంతోషంగా చెప్పాడు వరదరాజులు.
"డాడ్! ఆస్తులు మాత్రమే కాదు రాజకీయాలలో కూడా ఇంక మనకి ఎదురు లేదు." అని చెప్పాడు తంబియార్.
"అది సరే! నందా ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్లినట్లు అసలు మనతో ఇదంతా ఎందుకు చేయించారు? నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది." అని కంగారుగా చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
"ఎటువంటి డౌటు లేదు మనం అనుకున్నదే జరిగింది వాళ్లు వాళ్లు కొట్టుకు చస్తారు మనం హ్యాపీగా ఉందాము." అని చెప్పాడు వరదరాజులు.
"మీరు ఒక్క విషయం ఆలోచించడం లేదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నందని బెదిరిస్తున్నారు అంటే అభీర్ ఎందుకు అలెర్ట్ అవుతాడు ఆది కాకుండా వసుంధర ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆ నాదెల్ గాడు ధీరజ్ గాడు దేనికోసమో వెతికారు.
ఏంటి అని అడిగితే ఏమీ లేదు ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూస్తున్నాము అని చెప్పాడు నాకెందుకో కావాలని మనల్ని ఇరికించినట్లు అనిపిస్తుంది." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
"డాడ్! నువ్వేమీ కంగారు పడకు అటువంటిదేమీ ఉండదు." అని చెప్పాడు సుజిత్.
అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "ముకుల్ ఫోన్ చేస్తున్నాడు." అని లిఫ్ట్ చేసి "అయ్యా! మీరు చెప్పింది చెప్పినట్లు చేశాము వసుంధర ఫ్యామిలీని మీ వాళ్ళకి అప్ప చెప్పాము మీరు సేఫ్ గా లండన్ బయలుదేరారు కదా!" అని అడిగాడు వరదరాజులు.
"ఎస్! మేము సేఫ్ గా బయలుదేరాము మీరు ఎలాగైనా ఇది సాధించి గెస్ట్ హౌస్ కి వస్తారని నాకు తెలుసు అందుకే మీ కోసం ఫ్రిజ్‌లో ఓల్డ్ వైన్ బాటిల్ ఉంచాను నా ఆస్తితో పాటు దానిని కూడా తీసుకుని ఎంజాయ్ చేయండి." అని చెప్పాడు ముకుల్.
"సరే అయ్యా!" అని సంతోషంగా వెళ్లి ఫ్రీజ్ డోర్ తీశాడు వరదరాజులు.
వ్యాన్ లో వెళుతూ ఫోన్ కట్ అవడంతో అర్ణ వైపు చూసి నవ్వుతూ "వరదరాజులు గిఫ్ట్ తీసుకున్నాడు." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఈ ముక్కోడు వరదరాజులు వాళ్లకి ఏం గిఫ్ట్ ఇచ్చాడబ్బా..?" అని ఆలోచిస్తూ ఉన్నాడు రఘురామ్.
"తాతయ్య! అడవిలో ఆల్రెడీ అభీర్ మనుషులు ఉన్నారు మనం వెళ్లగానే ఈ విషయం వాడికి తెలిసిపోతుంది." అని చెప్పాడు విష్ణు.
"ఆ విషయం నాకు తెలుసు అడవికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో కూడా తెలుసు! అక్కడికి వీళ్ళతో సమఉజ్జీలు అయిన వాళ్లే వస్తున్నారు." అని చెప్పాడు ముకుల్.
***********
ఇంటి పైకి వెళ్ళిన డాగ్స్ ని చూసి వాటి వెనకాలే పైకి వెళ్లి వాటర్ ట్యాంక్ లో చెయ్యి కనపడడంతో అభీర్ గట్టిగా అరిచింది మిత్ర.
ఆ అరుపు విని ఇంటి పైకి వెళ్లి ట్యాంక్ లో నుంచి చాక్లెట్ ని బ్యాగ్ ని తీస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్లను చూస్తూ ఉండిపోయాడు అభీర్.
దగ్గరికి వెళ్లి చాక్లెట్ గట్టిగా పట్టుకుని "ఎవిడెన్స్ లకి కాపలా ఉంటాను అని చెప్పిన మాటకి ప్రాణాలు వదిలేసావా?" అని ఏడుస్తూ ఉంది మిత్ర.
అంతలో ఇంటి పైకి వచ్చి "అభీర్! నంద గెస్ట్ హౌస్ బ్లాస్ట్ అయింది లోపల ఉన్న వాళ్ళు ఎవరు బతికే ఛాన్స్ లేదు అక్కడికి వెళ్లిన ఆఫీసర్స్ కాల్ చేశారు." అని చెప్పాడు శ్రీకర్.
అక్కడికి వస్తు "సార్! మురళి జోషి ఫ్యామిలీ సేఫ్ గా ఉన్నారు దీనిని బట్టి ఈ ఎటాక్ చేసింది నంద ఫ్యామిలీ కాదు." అని చెప్పాడు దయ.
ఆ మాట విని ఫోన్లు తీసి నంద ఫ్యామిలీ మెంబర్స్ కి వరదరాజులకి కాల్ చేస్తూ అభీర్ వైపు చూసి "ఎవ్వరి ఫోన్స్ పనిచేయడం లేదు." అని టెన్షన్ గా చెప్పాడు బైరి.
ఆ మాట విని ఆకాశం వైపు చూస్తూ "భగవంతుడా! నా వాళ్ళు ఎవరు చనిపోకూడదు అనుకుని నా గుండెల్లో అగ్నిపర్వతంలా పేలుతున్న పగని కూడా చంపేశాను, కానీ మళ్ళీ నాకు పరీక్ష పెట్టావు ఇదంతా చేస్తుంది ఎవరు?" అని గట్టిగా అరిచాడు అభీర్.
అంతలో చాక్లెట్ చెయ్యి కదలడం చూసి "అభీర్! చాక్లెట్ కి ఇంకా ఊపిరి ఉంది." అని ఏడుస్తూ చెప్పింది మిత్ర.
ఆ మాట విని "ఆఫీసర్స్! బాబుని హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలి కార్ తీయండి." అని గట్టిగా అరిచాడు శ్రీకర్.
"ఆ భగవంతుడు నా పిలుపు విన్నాడు." అని చాక్లెట్ ని తన చేతుల్లోకి తీసుకొని ఆకాశం వైపు చూపిస్తూ కళ్ళు మూసుకున్నాడు అభీర్.
అది చూసి అభీర్ దగ్గరికి వెళ్లి "ఈ సమయంలో ఇటువంటివి పనికిరావు ఈ ఇన్సిడెంట్ మొత్తానికి ఎవిడెన్స్ చాక్లెట్ మాత్రమే! తనని ఎలాగైనా బతికించాలి నా మాట విని హాస్పిటల్ కి తీసుకువెళదాంము." అని చెప్పాడు శ్రీకర్.
ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా కళ్ళు మూసుకున్న అభీర్ ని చూసి ఏమి జరుగుతుందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న వారందరూ.
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 98
బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్ లో అవిడెన్స్ బ్యాగ్ తో పాటు దొరికిన చాక్లెట్ కి ప్రాణం ఉందని మిత్ర చెప్పడంతో తన చేతుల్లోకి తీసుకొని శ్రీకర్ చెప్పేది వినకుండా ఆకాశం వైపు చూపించి కళ్ళు మూసుకున్నాడు అభీర్.
************
చాక్లెట్ ని తన చేతుల్లోకి తీసుకున్న అభీర్ వైపు చూస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి పక్కకు వెళ్లి లిఫ్ట్ చేసి "హలో ఎవరు మాట్లాడేది?" అని అడిగాడు శ్రీకర్.
"హలో ఆఫీసర్ నా పేరు ముజాఫిర్! మీరు చనిపోయిన వాళ్ళ గురించి బాధపడడమే తప్ప బతికి ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలో ఆలోచించరా..?" అని నవ్వుతూ అడిగాడు.
ఆ మాట విని "ముజాఫిర్ నువ్వు ఏ గ్రూప్ కి చెందిన వాడివి? నీకు ఏం కావాలి?" అని అడిగాడు శ్రీకర్.
"సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ గా అడిగావు, తీహార్ జైల్లో ఉన్న మా 12 మంది తీవ్రవాదుల్ని రిలీజ్ చేసి అభీర్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ లు వాళ్లకి ఇచ్చి పంపించాలి.
మీకు కరెక్ట్ గా ఆఫెన్ అవర్ టైమ్, మీ డిసిషన్ చెప్పకపోతే సిన్సియర్ జైలర్ ఫ్యామిలీ మీకు కనిపిస్తారు కానీ తలలు మా దగ్గరే ఉంటాయి, నేను మళ్ళీ కాల్ చేస్తాను ఈ లోపు మీరు ట్రైనింగ్ లో నేర్చుకున్నది మాకు చూపించడానికి ట్రై చేయకండి." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముజాఫిర్.
అతను చెప్పింది విని మాట్లాడడానికి "హలో హలో!" అంటూ ఫోన్ కట్ అవ్వడంతో దయ వైపు చూసి "కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రైస్ చేయండి." అని చెప్పి బైరి వైపు చూసి "ముజాఫిర్ అంట కాల్ చేసాడు తెలుసా?" అని అడిగాడు శ్రీకర్.
"ముజాఫిర్ పంజాబ్ బేస్ గా యాక్టివిటీస్ చేసేవాడు త్రీ మంత్స్ బ్యాక్ చనిపోయాడు మళ్లీ తిరిగి ఎలా వచ్చాడు?" అని డౌట్ గా అడిగాడు బైరి.
"మేడం వాళ్ళు అతని కస్టడీలోనే ఉన్నారు తీహార్ జైల్లో ఉన్న 12 మంది టెర్రరిస్టులు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ లు కావాలి అని అడుగుతున్నాడు లేకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు." అని చెప్పాడు శ్రీకర్.
"అవునా?" అని అభీర్ చేతిలో ఉన్న చాక్లెట్ కదలడం సంతోషంగా చూస్తూ అటువైపు తిరిగాడు బైరి.
చాక్లెట్ కళ్ళు తెరవడంతో కింద నుంచో పెట్టి "ఇప్పుడు ఎలా ఉంది?" అని అడిగాడు అభీర్.
ఆ మాట విని చుట్టూ చూస్తూ "నేను నీళ్లలో ఉండాలి కదా నా చేతిలో ఎవిడెన్స్ బ్యాగ్ ఏమైపోయింది?" అని కంగారుగా అడిగాడు చాక్లెట్.
"ఆ బ్యాగ్ మా దగ్గర సేఫ్ గానే ఉంది అసలు ఏం జరిగింది? ఇక్కడికి వచ్చింది ఎవరు?" అని అడిగాడు అభీర్.
"నేను బామ్మ గారితో పాటు గదిలో ఉన్నాను అరుపులు వినిపించి బయటకు వెళ్లాను అక్కడ జాజి అంకుల్ బుల్లెట్ తగిలి కింద పడిపోయి ఉన్నాడు హాల్ మొత్తం పొగతో నిండిపోయింది.
చాలామంది గ్యాస్ మాస్కులు పెట్టుకుని గన్స్ తో లోపలికి వచ్చారు వాళ్లలో ఒకడు నాదల్ ఎవిడెన్స్ బ్యాగ్ ఎక్కడ ఉందో చూడు అని చెప్పాడు, ఆ మాట వినిపించి బ్యాగ్ తో పైకి వెళ్లి వాటర్ ట్యాంక్ లో దూకేశాను." అని చెప్పాడు చాక్లెట్.
ఆ మాట విని బైరి వైపు చూసి "నాదేల్ ఎవరు? అని అడిగాడు అభీర్.
"సందీప్ సార్ వాళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్లలో ఒకడై ఉంటాడు ఇప్పుడే మూజాఫిర్ అనే తీవ్రవాది కాల్ చేశాడు తీహార్ జైల్లో ఉన్న 12 మంది తీవ్రవాదులు ఎవిడెన్స్ బ్యాగ్ అరగంటలో పంపించాలి లేకపోతే తన దగ్గర ఉన్న అందర్నీ చంపేస్తాను అని బెదిరించుతున్నాడు." అని చెప్పాడు శ్రీకర్.
చాక్లెట్ వైపు చూస్తూ "నువ్వు ఆ ఒక్క మాట విన్నావా? ఇంకా ఏమైనా వినిపించాయా?" అని అడిగాడు అభీర్.
"నేను ఆ ఒక్క మాట మాత్రమే విన్నాను తర్వాత బామ్మ గారి రూమ్ తలుపులు దగ్గరికి వేసి పైకి వెళ్ళిపోయాను తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియదు." అని చెప్పాడు చాక్లెట్.
అక్కడికి వచ్చి "సార్! మీ మొబైల్ కి వచ్చిన కాల్ ట్రేస్ అవడం లేదు , ఆది కాకుండా ఇక్కడ స్పోక్ బాంబు యూస్ చేసినట్లు కనిపించడం లేదు." అని చెప్పాడు దయా.
ఆ మాట విని ఆలోచిస్తున్న అభీర్ దగ్గరికి వెళ్లి "నాయకుడా! మన లెక్కలో ముజాఫిర్ చనిపోయాడు కానీ మళ్ళీ బతికి వచ్చాడు నాకెందుకో అనుమానంగా ఉంది." అని చెప్పాడు బైరి.
"గెస్ట్ హౌస్ బ్లాస్ట్ అయిందని చెప్పారు కదా లోపల చనిపోయిన వాళ్ల గురించి ఏమైనా తెలిసిందా?" అని అడిగాడు అభీర్.
"చాలామంది చనిపోయారు గుర్తుపట్టలేనంతగా బాడీస్ పీస్ పీస్ అయిపోయాయి." అని చెప్పాడు దయ.
శ్రీకర్ మొబైల్ కి వచ్చిన కాల్ రికార్డింగ్ వింటూ "కన్ఫర్మ్ గా ఇది ముజాఫిర్ వాయిస్ కాదు." అని చెప్పాడు ఆగస్త్య.
"అవునా? మరి చనిపోయిన వ్యక్తి పేరు మీద మనల్ని ట్రాప్ ఎందుకు చేస్తున్నారు." అని డౌట్ గా అడిగాడు శ్రీకర్.
"మనల్ని రాంగ్ ట్రాక్ పట్టించడానికి!" అని రియావైపు చూసి " అడవిలో ఉన్న అరుల్ కి మెసేజ్ పంపించు." అని చెప్పాడు అభీర్.
"ఓకే!" అని ఫోన్ తీసి అరుల్ కి మెసేజ్ పంపించింది రియా.
అంతలో అక్కడకు వచ్చి చనిపోయిన వాళ్ళని చూసి ఏడుస్తూ "ఆఫీస్ కి వెళ్లడానికి పికప్ చేసుకోవడానికి వస్తున్నానని నీలమ్ కాల్ చేసింది నేను వెయిట్ చేస్తూ ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది." అని చెప్పింది సుమతి.
ఆ మాట విని నీలమ్ రూమ్ లోకి వెళ్లి చూసి "అభీర్! ఇక్కడ నీలమ్ కంపెనీ ఐడి టాగ్ లేదు అది తన మెడలోనే ఉండి ఉంటుంది. వీళ్ళ సేఫ్టీ కోసం నేను దాంట్లో ట్రాకర్ ఫిక్స్ చేశాను." అని చెప్పింది మిత్ర.
ఆ మాట విని దయ వైపు చూసి "క్విక్ ఐడి కార్డులో ఉన్న ట్రాకర్ ని ట్రేస్ చేయండి." అని చెప్పాడు శ్రీకర్.
"సార్! అలాగే మిథున్ పిఏ రాహుల్ నెంబర్ కూడా ట్రేస్ చేయండి." అని చెప్పాడు అభీర్.
అంతలో ఫోన్ రింగ్ అవడంతో చూసి "అరుణ్ కాల్ చేస్తున్నాడు." అని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి "నాయకుడు మాట్లాడుతున్నాడు." అని చెప్పింది రియా.
ఆ మాట విని "జై భవాని!" అని చెప్పాడు అరుల్.
"జై భవాని అరుల్! అక్కడ పరిస్థితి ఏమిటి?" అని అడిగాడు అభీర్.
రాతి కొండమీద నుంచొని సింబా తో కలిసి కిందకి చూస్తూ "నాయకుడా! ఇక్కడ అంతా ప్రశాంతంగానే ఉంది. వాసుకి వాళ్ళ నిధికి వెళ్లే దారి కోసం వెతుకుతున్నారు, నంద ఫ్యామిలీ మనకి క్షమాపణలు చెప్పడానికి ఇక్కడికి వస్తారు అని నిర్మల్ అంటున్నాడు." అని చెప్పాడు అరుల్.
"అక్కడ అనుమానంగా ఏమైనా జరిగిందా?" అని అడిగాడు అభీర్.
"పశ్చిమం వైపు ఉన్న కొండల దగ్గర పేలుడు శబ్దాలు వినిపించాయి ఏం జరిగిందో చూడడానికి మన వాళ్ళు కొంతమంది వెళ్లారు." అని చెప్పాడు అభీర్.
"పశ్చిమ వైపు ఆ..!" అని కాసేపు ఆలోచించి "పశ్చిమం వైపు వెళ్లిన మనవాళ్ళని వెనక్కి రప్పించి, సింబా ని నా దగ్గరికి పంపించు, అలాగే వాసుకి వాళ్ళకి నిధికి వెళ్లే మార్గం చూపించండి." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని "నాయకుడా నిధికి వెళ్లే మార్గం వాళ్ళకి మనమే చూపిద్దామా?" అని డౌట్ గా అడిగాడు అరుల్.
"నేను చెప్పినట్లు చెయ్! అక్కడ ఏం జరిగినా సరే బైరి వాళ్ళు అక్కడకి వచ్చే వరకు ఎదురు దాడి చేయకండి. ఒకవేళ ముకుల్ ఫ్యామిలీ వచ్చారు అంటే నాకు తెలియాలి." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా?" అని ఫోన్ పెట్టేసి సింబా వైపు చూసి "పశ్చిమానికి వెళ్ళిన సోము వాళ్ళని వెనక్కి పంపించి నువ్వు నాయకుడి దగ్గరికి వేళ్ళు!" అని చెప్పి కొండ దిగి నిర్మల్ వాళ్ళ దగ్గరికి బయలుదేరాడు అరుల్.
"ఫోన్ మాట్లాడి పెట్టేసిన అభీర్ వైపు చూసి "నాయకుడా! ఏం జరుగుతుంది? వాళ్ళకి నిధికి దారి చూపించడం ఎందుకు?" అని కంగారుగా అడిగింది రియా.
"ఒక జంతువు మన దగ్గర నుంచి కదలకుండా ఉండాలి అంటే తిండి పెట్టి మచ్చిక చేసుకోవాలి, ఆదే మనిషి కదలకుండా ఉండాలి అంటే ఆశ చూపించాలి తను ఉన్న చోట తనకి బలం ఉంది అనిపించేలాగా చేయాలి." అని చెప్పి శ్రీకర్ వైపు చూసి
"ముజాఫిర్ కాల్ చేస్తే మరొక అరగంట టైం పడుతుంది 12 మందిని రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది వాళ్లతో పాటు ఆ బ్యాగ్ ఇచ్చి పంపిస్తాము ఎక్కడికి రావాలో అడగండి." అని చెప్పాడు అభీర్.
"ఈ విషయంలో ఇంకా గవర్నమెంట్ తో ఏమి మాట్లాడలేదు అయినా 12 మందిని రిలీజ్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అరగంటలో అవ్వదు." అని చెప్పాడు శ్రీకర్.
"నాకు అరగంట చాలు ఆఫీసర్!" అని చెప్పి బైరి వైపు చూసి "మీరు చనిపోయిన మన వాళ్ళని తీసుకుని అడవికి బయలుదేరండి. అక్కడికి చేరుకున్న మన వాళ్ళతో కలిసి సిద్ధంగా ఉండండి ఐదవ వేదంలో ఆఖరి పేజీ చదివే సమయం వచ్చింది." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని కసిగా చూస్తూ "జై భవాని!" అని చెప్పి రియా, రాజన్ వాళ్ళతో కలిసి చనిపోయిన వాళ్ళ శరీరాలు తీసుకుని అక్కడి నుంచి కార్ లో అడవికి బయలుదేరాడు బైరి.
అంతలో అక్కడికి వచ్చి "సార్! లొకేషన్ ట్రేస్ అయింది. ఐడి లొకేషన్ తో పాటు రాహుల్ ఫోన్ లొకేషన్ కూడా అక్కడే ఉంది. కానీ ఆ ఏరియాకి వెళ్లడం చాలా డేంజర్!
అక్కడ అంతా కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉంటారు డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనకడరు మనం ఫోర్సుని తీసుకుని వెళ్లడం బెటర్!" అని చెప్పాడు దయా.
"ఆ లొకేషన్ డీటెయిల్స్ ఇవ్వండి నేను వెళతాను మీరు వెనకాల ఫోర్సును తీసుకుని రండి." అని చెప్పాడు అభీర్.
"నో అభీర్! ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు ఆ ఏరియాలోకి సింగిల్ గా వెళ్లడం చాలా డేంజర్!" అని చెప్పాడు దయా.
"లొకేషన్ డీటెయిల్స్!" అని గంభీరమైన గొంతుతో అడిగిన అభీర్ ని చూసి "దయా! నేను కుడా వెళుతున్నాను ఫోర్స్ తీసుకుని త్వరగా రండి." అని చెప్పి వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు శ్రీకర్.
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
(26-02-2026, 07:44 AM)SivaSai Wrote: ఎపిసోడ్ 98
... మన వాళ్ళతో కలిసి సిద్ధంగా ఉండండి ఐదవ వేదంలో ఆఖరి పేజీ చదివే సమయం వచ్చింది." అని చెప్పాడు అభీర్.
...
Atlast.. the climax we've been waiting for!!
One a side note.. Abheer, chanipoyina vallani batikinchagaladu kada?
•
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
(26-02-2026, 08:07 AM)ash.enigma Wrote: Atlast.. the climax we've been waiting for!!
One a side note.. Abheer, chanipoyina vallani batikinchagaladu kada?

Chanipoyina vallani kadhu
Kona oopiri unna vallani batikinchagaladu
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
Akari uddaniki siddam kandi
Jai Bhavani
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 99
నీలమ్ కంపెనీ ట్యాగ్ ట్రాకింగ్ రాహుల్ మొబైల్ సిగ్నల్ ఓకే చోట ఉందని ఆ ఏరియా కి వెళ్లడం డేంజర్ అక్కడ అంత కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉంటారు అని దయా చెప్పడంతో, ఫోర్స్ తీసుకుని రండి నేను అభీర్ తో పాటు వెళుతున్నాము అని కార్ దగ్గరికి వెళ్ళాడు శ్రీకర్.
***************
అభీర్ తో ఫోన్లో మాట్లాడి కొండ దిగి టెంట్స్ దగ్గరికి వస్తున్న అరుల్ ని చూసి "నువ్వు బతికే ఉన్నావా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ప్రమోద్.
అరుల్ వైపు అనుమానంగా చూస్తూ " అవును! ఇప్పటీ దాకా ఎక్కడికి వెళ్ళిపోయావు?" అని అడిగాడు నిర్మల్.
"రాత్రి చీలి వాళ్ళు వేసిన చలిమంటలో ఏవో వేర్లు పడినట్లు ఉన్నాయి దానివల్ల మత్తు గా పడుకున్నాను.ఉదయం లేచి చూసేసరికి ఆ కనిపించే కొండ దగ్గర ఉన్నాను ఏ జంతువుల లాక్కెళ్ళినట్లు ఉంది దారి వెతుక్కుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది." అని చెప్పాడు అరుల్.
"అవునా? నువ్వు చెప్పేది కాస్త తేడాగా ఉంది అందరూ చనిపోతే నువ్వు ఎలా బతికున్నావు?" అని రాళ్ల ముఠా పట్టుకుని వస్తూ అడిగాడు ఫరూక్.
"నేను మాత్రమేనా మీరు బతికే ఉన్నారు కదా! నాకు ఆ కొండ కింద ఏదో రూట్ ఉన్నట్టు అనిపించింది. వాసుకి చెప్పినట్లు నిజంగానే ఆ నిధి అమ్మవారి పాదాల కింద ఉందేమో!" అని డౌట్ గా చెప్పాడు అరుణ్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు నిజంగానే చెబుతున్నావా?" అని అడిగాడు నిర్మల్.
"ఎస్! కావాలంటే నాతో రండి చూపిస్తాను." అని కేశవ్ వైపు చూసి సైగ చేశాడు అరుల్.
"ఆవును దొర! అమ్మవారికి పాదాల కింద ఉన్న కొండ లోపల నిధి ఉంది అంటారు కానీ మనవాళ్ళు నా మాట వినడం లేదు ఇక్కడే వెతుకుతున్నారు." అని చెప్పాడు కేశవ.
ఆ మాట విని కొండల దగ్గర మిషన్స్ తో వెతుకుతున్న వాసుకి వాళ్ళ వైపు చూసి "ఇటు రండి నిధికి దారి దొరికింది." అని గట్టిగా అరిచాడు నిర్మల్.
అంతలో సోము వాళ్ళ చేతులు తాళ్లతో కట్టేసి చేతిలో గన్స్ పట్టుకుని అక్కడికి వస్తున్న టెర్రరిస్టులను చూసి "ఎవరు వాళ్ళు?" అని డౌట్ గా అడిగాడు ఫరూక్.
"మన ఫ్రెండ్స్ ఏ కంగారు పడకు." అని నవ్వుతూ దగ్గరికి వెళ్లి "సల్మాన్ బాయ్!" అని కౌగిలించుకున్నాడు నిర్మల్.
"మాకు ఈ కొండలలో నుంచి రూటు ఉంది అని తెలిస్తే ఈపాటికి భారత్ లో తీష్ట వేసేవాళ్ళము." అని నవ్వుతూ చెప్పాడు సల్మాన్.
చేతులు కట్టేసి ఉన్న సోము వాళ్ళ వైపు చూసి "ఇంతకీ వీళ్ళు ఎవరు?" అని డౌట్ గా అడిగాడు ప్రమోద్.
"మేము వచ్చే రూట్ ని రాళ్లతో మూసేయడానికి చూస్తున్నారు అడవిలో ఉండే గిరిజనులు అనుకుంటా మిలటరీ వస్తే తప్పించుకోడానికి ఉంటారులే అని నా తమ్ముడు ఖాదిర్ వాళ్ళని చంపకుండా బంధించాడు." అని చెప్పాడు సల్మాన్.
"అవునా? చాలా మంచి పని చేశారు ఇంతకీ మీరు ఎంతమంది వచ్చారు?" అని అడిగాడు నిర్మల్.
ఆ మాటకి నవ్వుతూ "వస్తూనే ఉంటారు మిమ్మల్ని ఇక్కడి సేఫ్ గా పంపిస్తాము కానీ మా వాళ్ళు ఇక్కడే ఉంటారు." అని చెప్పాడు ఖాదిర్.
కేశవ్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకుంటూ "ఎవరు ఎదురు తిరగకండి నాయకుడి ఆజ్ఞ!" అని నెమ్మదిగా చెప్పి "మరి ఇంకా నిధి దగ్గరికి వెళదామా?" అని అడిగాడు అరుల్.
ఆ మాట విని "ఏంటి? మాకు ఉండడానికి స్థలంతో పాటు నిధి కూడా ఉంచినట్లు ఉన్నారు?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సల్మాన్.
"సరే కానీ నీ మనుషుల్ని ఎలర్ట్ గా ఉండమను ఇక్కడ జంతువులతో పాటు మనుషులు కూడా ప్రమాదమే!" అని సోము వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ చెప్పాడు నిర్మల్.
"బాయ్! నా మనుషుల చేతిలో గన్స్ చూసావా ఒక్క రౌండ్ కి 100 బుల్లెట్లు బయటికి వస్తాయి వీటి దాటికి ఎవ్వడు ఆగలేడు." అని చెప్పాడు సల్మాన్.
"సరే!" అని అక్కడ నుంచి తల్వార్ వాళ్లతో కలిసి అరుణ్ చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్ళాడు నిర్మల్.
*************
బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ లో అడవి దగ్గరికి చేరుకుని రాహుల్ కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి "ఎంతవరకు వచ్చింది?" అని అడిగాడు అభిజిత్.
"సార్! నేను కూడా నాదల్ వాళ్లతో పాటే ఉన్నాను వీళ్ళు వసుంధర ఫ్యామిలీ ని కిడ్నాప్ చేశారు కానీ ఎవిడెన్స్ బ్యాగ్ దొరకలేదు అందుకే మన ప్లాన్ ప్రకారం జైల్లో ఉన్న తీవ్రవాదులతో పాటు ఎవిడెన్స్ బ్యాగ్ పంపించమని బ్లాక్ మెయిల్ చేశాము.
మా డిమాండ్స్ కి గవర్నమెంట్ ఒప్పుకుంది కచ్చితంగా అరగంటలో బ్యాగ్ మా చేతికి వస్తుంది రాగానే వీళ్ళని చంపేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాము." అని చెప్పాడు రాహుల్.
ఫోన్లో రాహుల్ చెప్పింది విని కాసేపు ఆలోచించి "గవర్నమెంట్ అంత స్పీడుగా డెసిషన్ తీసుకోదు అభీర్ ఎంటర్ అయ్యి ఉంటాడు ఒకవేళ నువ్వు అక్కడ కనపడితే కచ్చితంగా మన మీద అనుమానం వస్తుంది.
వసుంధర కూతురిని, నీలమ్ ని తీసుకుని మా దగ్గరికి వచ్చాయ్! ఒకసారి నాదల్ కి ఫోన్ ఇవ్వు!" అని చెప్పింది అర్ణ.
ఫోన్ తీసుకుని "గుడ్ ఈవెనింగ్ మేడం! ఇక్కడ అంతా బానే ఉంది ఈ ఏరియాలోకి ఎవరు ఎంటర్ అవ్వలేరు ఒకవేళ వచ్చిన ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు." అని చెప్పాడు నాదేల్.
"గుడ్! ఎవిడెన్స్ బ్యాగ్ తీసుకుని కచ్చితంగా అభీర్ అక్కడికి వస్తాడు నేను చెప్పిన ప్లాన్ రెడీ చేశారు కదా!" అని అడిగింది అర్ణ.
"ఎస్ మేడం! అంతా మీరు చెప్పినట్లే జరుగుతుంది." అని చెప్పాడు నాదేల్.
"ఓకే! రాహుల్ ని అక్కడి నుంచి త్వరగా పంపించండి." అని చెప్పి ఫోన్ పెట్టేసి ముకుల్ వైపు చూసి "తాతయ్య! నేను అనుకున్న ప్లాన్ కరెక్ట్ గా జరుగుతుంది." అని స్మైల్ ఇచ్చింది అర్ణ.
నీలమ్, రోషినిల కాళ్లు చేతులు కట్టేసి కారులో ఎక్కించి ఒక మనిషిని తోడుగా తీసుకుని అక్కడనుంచి బయలుదేరాడు రాహుల్
వ్యాన్‌లో ఉన్న ఆర్మ దగ్గరికి వస్తూ "అంతా ఓకే కాని మళ్లీ ఆ ఇద్దరిని తీసుకుని రాహుల్ ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు?" అని డౌట్ గా అడిగాడు విష్ణు.
"నలుగురిని కిడ్నాప్ చేసి జైలు నుంచి తీవ్రవాదులు విడిచిపెట్టమంటే ఇండియన్ గవర్నమెంట్ చూస్తూ కూర్చోదు కాసేపటికైనా బోర్డర్ దాటి టెర్రరిస్టులు అడవిలోకి ఎంటర్ అయ్యారని తెలుసుకుంటుంది.
లేదా నువ్వే చెప్పావు కదా అడవిలో అభీర్ మనుషులు ఉన్నారని వాళ్లైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కచ్చితంగా ఇక్కడికి మిలిటరీ వస్తుంది. ఒకవేళ ప్రాణాలతో బయటపడితే అభీర్ కూడా వస్తాడు మనం సేఫ్ గా ఉండాలి అంటే వాళ్లు మన దగ్గర ఉండాలి." అని చెప్పింది అర్ణ.
"ఒకవేళ ఎవ్వరు రాకపోయినా అభీర్ మనుషులు ఎలా ఉన్నారో చూసావు కదా వాళ్ళ నుంచి మనం సేఫ్ గా బయటపడాలి అన్న మన చేతిలో ఏదో ఒక ఆయుధం ఉండాలి." అని చెప్పాడు ముకుల్.
అంతలో వ్యాన్ దగ్గరికి వచ్చి "సార్! ఫారెస్ట్ లోపలికి వచ్చాము ఇక్కడి నుంచి మనం నడిచి వెళ్ళాలి." అని చెప్పాడు మిస్సైల్.
"ఓకే!" అని వ్యాన్ దిగి చుట్టూ గన్స్ తో మిసైల్, నెల్సన్ మనుషులు ఉండగా మధ్యలో ఉండి నడుచుకుంటూ లోపలికి బయలుదేరారు అందరు.
**************
కారులో అభీర్, మిత్ర, చాక్లెట్ లని లోకేషన్ లో ఉన్న ఏరియా దగ్గరికి తీసుకువచ్చాడు శ్రీకర్.
కార్ దిగుతున్న అభీర్ వైపు చూసి "ఈ ఏరియాలో అందరూ నాకు పరిచయమే ఇన్ఫర్మేషన్ కోసం చాక్లెట్ నేను చాలా సార్లు వచ్చము లోపలికి వెళ్లడానికి ఈ రూట్ కాకుండా వేరే రూటు ఉంది నువ్వు శ్రీకర్ గారు అటువైపు నుంచి రండి మేము ఈ దారి నుంచి లోపలికి వెళ్ళతాము." అని చెప్పింది మిత్ర.
"సరే!" అని శ్రీకర్ తో కలిసి మిత్ర చూపించిన వేరే రూట్ నుంచి లోపలికి బయలుదేరాడు అభీర్.
కారు దిగి చాక్లెట్ తో కలిసి లోపలికి వెళ్ళిన మిత్ర ని అపి "నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే రేపు రా.. ఈ రోజు లోపలికి ఎంట్రన్స్ లేదు." అని చెప్పాడు ఒక వ్యక్తి.
"నేను ఇన్ఫర్మేషన్ కోసం రాలేదు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను నన్ను నజీర్ దగ్గరికి తీసుకువెళ్తే చెబుతాను మీరందరూ ప్రాణాలతో ఉంటారు." అని చెప్పింది మిత్ర.
ఆ మాటకి కాసేపు ఆలోచించి "ఒక్క నిమిషం ఉండు." అని ఫోన్ తీసి మాట్లాడి ఇద్దరిని చెక్ చేసి "నా వెనకాల రండి." అని చెప్పాడు ఆ వ్యక్తి.
మిత్రతో కలిసి లోపలికి వెళుతూ అక్కడ ఉన్న మనుషుల్ని చూసి "అక్క! ఎప్పుడు ఇక్కడికి వచ్చిన భయం వేయలేదు ఈసారి ఏంటి కాస్త భయంగా ఉంది." అని అడిగాడు చాక్లెట్.
"ఒరేయ్! నువ్వు చచ్చి బతికిన వాడివి నీకు భయమేంటి ధైర్యంగా ఉండు." అని చెప్పిన మిత్ర.
కాసేపటికి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి "సలాం మలేకుం నజీర్ బాయ్! ఎప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కదా ఆ అభిమానంతో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను." అని చెప్పింది మిత్ర.
"అవునా? ఏంటి ఆ ఇన్ఫర్మేషన్?" అని నవ్వుతూ అడిగాడు నజీర్.
"జైలర్ ఫ్యామిలీ ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చి దాచారు అని తెలిసింది వెంటనే వాళ్ళని వదిలేయండి లేకపోతే అందరు చచ్చిపోతారు." అని చెప్పింది మిత్ర.
ఆ మాట విని షాక్ అయ్యి చూస్తూ "ఇక్కడ ఉన్న విషయం నీకు ఎలా తెలిసింది? అయ్యినా ఇక్కడికి రావడానికి ఏ పోలీసోడికి ధైర్యం ఉంది." అని అడిగాడు నజీర్.
అంతలో అక్కడికి వస్తున్న అభీర్ చూపించి "సెక్యూరిటీ ఆఫీసర్లకి కాదు వాడికి ధైర్యం ఉంది." అని చెప్పింది మిత్ర.
అంతలో అక్కడికి వచ్చి చేతిలో ఉన్న బ్యాగు కింద పెట్టి "నాదల్!" అని గట్టిగా అరిచాడు అభీర్.
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 100
వసుంధర వాళ్ళ లొకేషన్ ఉన్న ప్లేస్ కి శ్రీకర్ తో కలిసి వెళ్లి చేతులు ఉన్న బ్యాగ్ కింద పెట్టి నాదల్ అని గట్టిగా అరిచాడు అభీర్
*****************
ఆ అరుపు విని పైనుంచి చూస్తూ "అభీర్ వచ్చాడు వీడికి నా పేరు ఎలా తెలిసింది?" అని కంగారుగా ధీరాజ్ వైపు చూసి అడిగాడు నాదేల్.
ఆ మాట విని కిందకి చూస్తూ "టెన్షన్ ఎందుకు వాడి చేతిలో చూడు ఎవిడెన్స్ బ్యాగ్ ఉంది మనకి కావలసింది అదే కదా!" అని చెప్పాడు ధీరాజ్.
"కరెక్టే కానీ నంద ఫ్యామిలీ మీద అనుమానం రాకుండా ఉండాలి అంటే తీవ్రవాదులను కూడా రిలీజ్ చేయమని అడగాలి." అని చెప్పాడు నాదల్.
"ఆ అభీర్ ఆలోచన లేకుండా ఆవేశంలో ఇక్కడికి వచ్చాడు ముందు ఎవిడెన్స్ బ్యాగ్ తీసుకుందాము తర్వాత మిగతా సంగతి ఆలోచిద్దాము." అని చెప్పి కిందకి వచ్చాడు ధీరజ్.
మిత్ర చూపించడంతో దూరంగా ఉన్న అభీర్ ని చూసి "ఒరేయ్ వెళ్లి ఆ బ్యాగ్ తీసుకోండి." అని తన పక్కన ఉన్న మనిషికి చెప్పాడు నజీర్.
"సరే బాయ్!" అని కత్తి తీసుకుని అభీర్ దగ్గరకి వెళ్లి బ్యాగ్ తీసుకోవడానికి వంగున్నాడు ఆ మనిషి.
బ్యాగ్ మీద చెయ్యి పెట్టే లోపు ఆ మనిషి వీపు మీద బలంగా ఒక్క గుద్దు గుద్దడు అభీర్.
ఆ దెబ్బకి కిందపడి కదలకుండా ఉన్న తన మనిషిని వైపు కంగారుగా చూస్తున్న నజీర్ దగ్గరికి వెళ్లి "వాడు చచ్చాడు కావాలంటే వెళ్లి టెస్ట్ చేసుకో!" అని చెప్పింది మిత్ర.
అంతలో కిందకు వచ్చి "బ్యాగ్ తీసుకువస్తే సరిపోదు 12 మంది ఎక్కడ జైలర్ ఫ్యామిలీ ప్రాణాలతో ఉండడం నీకు ఇష్టం లేదా?" అని కోపంగా చూస్తూ అడిగాడు ధీరాజ్.
ఆ మాట విని "అభీర్ అన్న! ఇంటి దగ్గర బ్యాగ్ కోసం వెతకమని చెప్పింది వీడే!" అని గట్టిగా అరిచాడు చాక్లెట్.
ఆ అరుపు విని కంగారుగా తన చేతిలో ఉన్న గన్ తో అభీర్ ని షూట్ చేశాడు ధీరాజ్.
కింద చచ్చి పడి ఉన్న వాడి చేతిలో కత్తి తీసుకుని మీదకి వస్తున్న బుల్లెట్ కి అడ్డం పెట్టి ఎదురుగా ఉన్న ధీరజ్ కాలు మీదకి విసిరాడు అభీర్.
ఆ కత్తి వచ్చి కాలులో దిగడంతో గట్టిగా అరుస్తూ అక్కడినుంచి పారిపోవడానికి వెనక్కి తిరిగాడు ధీరజ్.
ఒక్క పరుగున వెళ్లి ధీరాజ్ పీక పట్టుకుని "నాదల్ ఎక్కడ? మిమ్మల్ని ఎవరు పంపించారు? వసుంధర మేడం వాళ్ళు ఎక్కడ ఉన్నారు?" అని అడిగాడు అభీర్.
అది చూసి "వాడిని షూట్ చేయండి." అని గట్టిగా అరిచాడు నజీర్.
వెంటనే నజీర్ పీకకి కత్తి పెట్టి "ఒక్క బుల్లెట్ పేలింది అంటే వీడి గొంతులో దిగిపోతుంది." అని చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూస్తూ చెప్పింది మిత్ర.
అక్కడినుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్న నాదల్ జుట్టు పట్టుకుని వెన్నకి లాగి మరొక చేతిలో ఉన్న ధీరజ్ గొంతుని బలంగా నొక్కాడు అభీర్.
"నన్ను చంపకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తాను." అని భయంగా చూస్తూ చెప్పాడు ధీరాజ్.
చేతిలో ఉన్న ధీరజ్ ని కింద పడేసి తన మీదకు పరిగెత్తుకుంటూ వస్తున్న మనుషుల్ని చూసి మరొక చేతిలో ఉన్న నాదల్ చెయ్యి పట్టుకుని కోపంగా అరుస్తూ బాడీలోంచి వేరుచేసి గిరాటు వేసి ధీరాజ్ కాలిలో ఉన్న కత్తి తీసి మీదకు వచ్చిన వాడి తల నరికేశాడు అభీర్.
తల, చేయ్యి ఎగిరి ముందుకు వచ్చి పడడంతో పరిగెడుతూ వస్తున్నా వాళ్ళు ఆగి భయంగా చూస్తూ ఉండి పోయారు.
మొబైల్లో చూస్తూ "అభీర్! మేడం వాళ్ళు ఉన్న లొకేషన్ మారిపోయింది ఇక్కడ చూపించడం లేదు." అని కంగారుగా చెప్పాడు శ్రీకర్.
మొహం నిండా రక్తంతో చేతిలో కత్తి పట్టుకుని "రెండు నిమిషాల్లో నా మనుషులు కనిపించకపోతే ఇక్కడ ఉన్న అందరి తలలు తెగి కింద పడతాయి." అని ఆకాశం దద్దరిల్లిపోయేటట్లు గట్టిగా అరిచాడు అభీర్.
తన చేతి వైపు చూసుకుని ఏడుస్తూ "ఆ గదిలో ఉన్నారు నన్ను చంపకు!" అని చెప్పాడు నాదేల్.
ఆ మాట విని చాక్లెట్ వైపు చూసి "సౌండ్ వస్తున్న మిషన్స్ ఆపు!" అని చెప్పాడు అభీర్.
"సరే!" అని పరిగెత్తుకుంటూ వెళ్లి మిషన్స్ ఆఫ్ చేసిన కొద్దిసేపటికి ఆకాశంలో సౌండ్ రావడం విని ఏమి జరుగుతుందో అర్థం కాక పైకి చూస్తు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ.
అంతలో గుంపులు గుంపులుగా పక్షులు అక్కడికి రావడం చూసి "మా అభీర్ స్పై కెమెరాస్ వచ్చేసాయి ఇంకా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీరు చెప్పకపోయినా తెలిసిపోతుంది." అని చెప్పింది మిత్ర.
ఆ మాటకు విచిత్రంగా చూస్తూ ఉన్నాడు నజీర్.
నాదల్ చెప్పిన రూమ్ దగ్గర పక్షులు వాలడం చూసి డోర్ ఓపెన్ చేయడానికి దగ్గరికి వెళ్ళాడు శ్రీకర్.
అక్కడ ఉన్న పక్షులు వైపు చూసి "ఆఫీసర్! ఒక్క నిమిషం ఉండండి." అని చెప్పి అక్కడ ఉన్న నాదల్, ధీరజ్ వైపు చూసి "డోర్ ఓపెన్ చేసి వాళ్ళని బయటికి తీసుకురండి." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని "అభీర్ అన్న మళ్ళీ వాళ్ళని ఎందుకు పంపుతున్నాడు?" అని ఆలోచిస్తూ ఉన్నాడు చాక్లెట్.
అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి "నీ వాళ్లు దొరికిన ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు." అని వార్నింగ్ ఇస్తూ చెప్పాడు సాధు.
"హే... సాధు! మీ గొడవ ఏదైనా ఉంటే బయటికి వెళ్లి చూసుకోండి. ఇప్పటికే నా మనుషులు ఇద్దరు చచ్చిపోయారు." అని తన వాళ్ళ వైపు చూసి
"ఒరేయ్! మీరందరూ వెనక్కి పోండి ముందుకు వచ్చారో అతను చేతీలో చచ్చిపోతారు." అని చెప్పాడు నజీర్.
ఆ మాట విని నజీర్ మనుషులు మొత్తం వెనక్కి వెళ్లడంతో "డబ్బు తీసుకుని మమ్మల్ని మోసం చేస్తావా?" అని కోపంగా చూస్తూ అడిగాడు ధీరాజ్.
"ఓరి నీ యబ్బ! మోసం గురించి మనం మనం మాట్లాడుకోకూడదు డబ్బు కన్నా ఇప్పుడు ప్రాణాలు ముఖ్యం! ఆ మనిషి తల్వార్ పట్టుకున్న ఓడుపు చూడు రంగంలోకి దిగి నరుకుడు మొదలుపెడితే అందరి తలలు ఎగిరిపోతాయి, నీ బద్మాష్ మాటలు ఆపి అతని మనుషుల్ని అప్పజెప్పి ప్రాణాలు కాపాడుకో!" అని చెప్పాడు నజీర్.
ఆ మాట విని కోపంగా అభీర్ మీదకి పరిగెత్తుకుంటూ వచ్చారు సాధు మనుషులు.
మిషన్స్ దగ్గర ఉన్న చాక్లెట్ వైపుకి పరిగెత్తాడు సాధు.
అది చూసి కోపంతో పరిగెడుతూ పైకి ఎగిరి తన మీదకి వసున్న మనిషి తల మీద కాలు పెట్టి అదిమి ముందుకు దూకి పరిగెడుతున్న సాధు తల నరికేశాడు అభీర్.
వెనక్కి తిరిగి తల లేని సాధు నడుచుకుంటూ ముందుకు పడిపోవడం చూస్తూ, అభీర్ కాలు పెట్టిన మనిషి మెడ విరిగి కింద పడిపోవడం చూసి భయంతో అక్కడ ఉన్న నజీర్ మనుషుల్లో కలిసిపోయారు సాధు మనుషులు.
తన మీదకి వస్తున్న సాధు తల ఎగిరి అవతల పడడంతో సంతోషంగా చూస్తూ ఉన్నాడు చాక్లెట్.
"నేను చెబుతూనే ఉన్నాను కదరా వాడు షేర్! ఎదురు వచ్చిన వాడు ఎవడైనా చావక తప్పదు." అని చెప్పాడు నజీర్.
నాదల్ వాళ్ళ దగ్గరికి వెళ్లి "డోర్స్ ఓపెన్ చేయండి." అని చెప్పాడు శ్రీకర్.
"ఒక్క నిమిషం ఆ డోర్స్ ఓపెన్ చేస్తే బాంబు బ్లాస్ట్ అవుతుంది." అని వెళ్లి వైర్ కలెక్షన్ తీసి డోర్స్ ఓపెన్ చేసి లోపల కట్టేసి ఉన్న వసుంధర, సందీప్ లను బయటికి తీసుకువచ్చాడు ధీరజ్.
బయటకు వచ్చి రక్తంతో తడిసిన అభీర్ ని చూసి "అభీర్!నువ్వు వెళ్లే రూట్ కరెక్ట్! వీళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు, అర్ణ ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ నుంచే గ్యాస్ బయటికి వచ్చింది కావాలనే నమ్మించి మోసం చేశారు." అని కోపంగా అరుస్తూ చెప్పింది వసుంధర.
ధీరజ్ వైపు చూసి "పాప, నీలమ్ ఎక్కడ?" అని అడిగాడు శ్రీకర్.
"ఆ ఇద్దరిని తీసుకుని రాహుల్ అడవికి వెళ్ళాడు." అని చెప్పి కోపంగా దగ్గరికి వస్తున్న అభీర్ వైపు చూసి "మమ్మల్ని అరెస్టు చేయండి." అని అడిగాడు ధీరాజ్.
"అడవికి ఎందుకు వెళ్లారు అక్కడ ఏం చేస్తున్నారు?" అని అడిగాడు అభీర్.
ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వచ్చి "అభీర్! బోర్డర్ దాటి టెర్రరిస్టులు అడవిలోకి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చిందంట బైరి కాల్ చేశాడు." అని ఫోన్ ఇచ్చింది మిత్ర.
ఫోన్ తీసుకుని ఆకాశంలో వేగంగా వస్తున్న సింబా వైపు చూసి "బైరి! నేను వస్తున్నాను మనలో ఒక్క ప్రాణం కూడా పోకూడదు, అడవిలో ఉన్న ఎవరు బతకకూడదు క్షమాపణ అనే మాట మరిచిపోండి." అని ఆవేశంగా చెప్పాడు అభీర్.
"సరే నాయక! అభీర్ సేన దెబ్బ ఎలా ఉంటుందో చూపిద్దాము, వాళ్ళ రక్తంతో పూర్వీకుల ఆత్మకు శాంతి చేద్దాము." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు బైరి.
వసుంధర వాళ్ల వైపు చూసి "మేడం! నేను వచ్చినా రాకపోయినా నీలమ్ ని పాపని క్షేమంగా పంపిస్తాను." అని వేగంగా వస్తున్న సింబా కాళ్లు పట్టుకుని గాలిలో ఏగురుతు వెళ్ళిపోయాడు అభీర్.
శ్రీకర్ తో మాట్లాడి తన తల్లి చనిపోయిన విషయం తెలుసుకొని గన్ తీసి నాదల్, ధీరాజ్ లని షూట్ చేసి వసుంధర వైపు చూసి "నాకు అభీర్ కి ఉన్నంత సహనం లేదు." అని బాధపడుతూ చెప్పాడు సందీప్ రావు.
శ్రీకర్ దగ్గరికి వచ్చి "సార్! నేను చాక్లెట్ అడవికి బయలుదేరుతున్నాము మీరు కూడా వస్తారా?" అని అడిగింది మిత్ర.
"పదండి వెళదాం ఆల్రెడీ ఈ విషయం ఇన్ఫామ్ చేశాను కాసేపట్లో అక్కడికి మిలిటరీ కూడా వస్తుంది." అని చెప్పి అక్కడికి ఫోర్స్ తో పాటు వచ్చిన దయ వైపు చూసి
"మేడం వాళ్ళని జాగ్రత్తగా తీసుకు వెళ్ళండి." అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళాడు శ్రీకర్.
*********
ఆకాశం లో వేగంగా ఏగురుతు కింద వెళుతున్న కార్ లో రాహుల్ ని చూసి కార్ కి అడ్డంగా అభీర్ ని నిలబెట్టాడు సింబా.
***********
గొర్వర్ లో వెయిట్ చేస్తున్న వాళ్ళ మనుషుల్ని కలుసుకొని అడవి లోపలకి బయలుదేరారు బైరి వాళ్ళు
The following 11 users Like SivaSai's post:11 users Like SivaSai's post
• aarya, ABC24, ash.enigma, Chiru. 06, gora, k3vv3, karthikkumar27111, Mahesh12345, Nivas348, Sachin@10, vikas123
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 101
వసుంధర వాళ్ళని కాపాడిన అభీర్ ని తన కాళ్లతో పట్టుకుని అడవి దగ్గరికి తీసుకు వెళుతూ కింద కార్లో రాహుల్ కనిపించడంతో కారు ఎదురుగా అభీర్ ని నిలబెట్టాడు సింబా.
************
కార్ లో ఫాస్ట్‌గా వెళుతూ ఎదురుగా రక్తంతో తడిసి కత్తి పట్టుకుని నుంచున్న అభీర్ కనిపించడంతో సడన్ బ్రేక్ వేసి కంగారుగా చూస్తూ తన పక్కన ఉన్న మనిషిని వైపు చూసి "వాడిని చంపేయ్!" అని చెప్పాడు రాహుల్.
ఆ మాట విని కారు దిగి కత్తి పట్టుకుని అభీర్ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ వ్యక్తి.
రాహుల్ వైపు కోపంగా చూస్తూ తన మీదకు వస్తున్న వాడిని ఒక్క చేత్తో ఎత్తి నేలకేసి కొట్టి దూరంగా గిరాటు వేసి ఒక్క అడుగు ముందుకు వేశాడు అభీర్.
అది చూసి భయంతో కారు దిగి బ్యాక్ సీట్ లో ఉన్న నీలమ్, రోషిణి కట్లు విప్పి అభీర్ వైపు చూసి "నన్ను వదిలేయ్ కనిపించకుండా పారిపోతాను." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు రాహుల్.
కార్ దిగి ఎదురుగా అభీర్ కనిపించడంతో రోషిణి ని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా పట్టుకుని "అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు?" అని ఏడుస్తూ అడిగింది నీలమ్.
నీలమ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి "ఏడవకు అందరూ బానే ఉన్నారు . పాపని ఒకసారి అటువైపు తిప్పు!" అని చెప్పి అక్కడి నుంచి పరుగెడుతున్న రాహుల్ ని చూసి పరుగున వెళ్లి తల నరికేశాడు అభీర్.
రాహుల్ తల ఎగిరి వచ్చి తన కాళ్ల దగ్గర పడడంతో ఆవేశంగా చూస్తూ కన్నీళ్లు తుడుచుకుని వెళ్లి కార్ లో కూర్చుంది నీలమ్.
కార్ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లోకి ఎక్కుతూ సింబా వైపు చూసి "అడవిలో ప్రతి జీవిని యుద్ధానికి సిద్ధం చెయ్ 12 ఏళ్ల పగ తీరబోతుంది." అని చెప్పి కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా వెళ్ళాడు అభీర్.
*************
అడవిలో సెక్యూరిటీతో వస్తున్న ముకుల్ వాళ్ళని చూసి "తాతయ్య వాళ్ళు వచ్చేసారు." అని సంతోషంగా దగ్గరికి వెళ్లాడు ప్రమోద్.
తన కొడుకుని చూసి "బానే ఉన్నావు కదా!" అని ఊపిరి పీల్చుకున్నాడు సుభాష్.
అక్కడికి వస్తు అడవిలో "జంతువుల్ని దాటుకుని స్పీడ్ గానే వచ్చేసారు." అని అడిగాడు నిర్మల్.
"మీరు కూడా ఈ వాచెస్ పెట్టుకోండి జంతువులు మీ దగ్గరికి కూడా రావు." అని చెప్పింది అర్ణ.
"అవును! ఈ టెక్నిక్ నా కూతురే కనిపెట్టింది. మేము నడిచి వస్తుంటే పెద్దపులి కనిపించింది. కానీ దాని దారిన అది పోయింది మా దగ్గరికి రాలేదు." అని సంతోషంగా చెప్పాడు రఘురామ్.
"సరే! ఇప్పుడు మాట్లాడుకునే టైం కాదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి." అని కంగారుగా చుట్టూ చూస్తూ చెప్పాడు మోహిత్.
"టెన్షన్ పడకు అభీర్ మనుషులు మన హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారు." అని కట్టేసి ఉన్న సోము వాళ్ళని చూపించాడు నిర్మల్.
"ఇక్కడ గట్టిగా ఉంటే పదిమంది లేరు. నేను చూసినప్పుడు ఆ గుహలో నుంచి చాలామంది అడివిలోకి వచ్చారు." అని చెప్పాడు విష్ణు.
లగేజ్ దగ్గర ఉన్న కేశవ్ వాళ్ళని చూసి "ఈ అడవి లోపల దారి తెలిసిన ప్రతి ఒక్కడు అభీర్ మనిషే. మనవాళ్లని తప్పితే ఎవరిని నమ్మకూడదు." అని చెప్పాడు అభిజిత్.
"మీరు టెన్షన్ పడకండి సాబ్!" అని తన మనుషులని పిలిచి కేశవ్ వాళ్ళ వైపు చూపించి "వాళ్ళని కుడా కాళ్ళు, చేతులు కూడా కట్టి ఒక పక్కన పడేయండి ఎగస్ట్రాలు చేస్తే కాల్చిపడేయండి." అని చెప్పాడు సలీమ్.
కోపంగా చూస్తున్న కేశవ్ వైపు చూసి 'సైలెంట్ గా ఉండండి.' అని సైగ చేశాడు అరుల్.
అక్కడ ఉన్న వాళ్ళందరినీ కట్టిన తర్వాత తన చేతిలో ఉన్న గన్ ని గాలిలోకి షూట్ చేస్తూ "అభీర్ మనుషులు ఎవరు ఉన్నారో రెండు నిమిషాలలో రావాలి లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు." అని చెప్పాడు ఖాదీర్.
అంతలో ఆకాశంలో సింబా అరుపు వినిపించి గుడ్డు తో కలిసి అక్కడికి వస్తూ "తొందరపడకండి దొర జంతువులు బెదిరిపోతాయి." అని చెప్పాడు లింగు.
"ఓరి బాబోయ్.. వీడు మళ్ళీ వచ్చాడు." అని కంగారుగా చూస్తూ చెప్పాడు ఫరూక్.
అక్కడికి వస్తూ "మేము అడవిలో బతికే వాళ్ళుము దొర! ఈ గొడవలు గురించి తెలియదు. టీవీ వాళ్ళు వచ్చి నన్ను పట్నానికి తీసుకు పోయారు మళ్ళీ తీసుకొచ్చి ఈడ దిగబెట్టారు దానికే మావాళ్ళని చంపుతానంటే ఎట్టాగా..?" అని చెప్పాడు లింగు.
"ఆ గుడ్డి వాడి మాటలు నమ్మకండి ముందు వాడిని చంపేయండి." అని కోపంగా చూస్తూ చెప్పాడు నిర్మల్.
"ఎందుకు దొర మిమ్మల్ని క్షేమంగా నవగ్రహాల కొండల దగ్గరికి తీసుకొచ్చినందుకా? మీ మీద కోపం ఉంటే ఎప్పుడో చంపేసే వాడిని కదా! మీకు నా మీద నమ్మకం రావాలి అంటే ఏం చేయాలో చెప్పండి." అని అడిగాడు లింగు.
"అభీర్ పూర్వీకులు దాచిన నిధి ఎక్కడ ఉందో మాకు చూపించు మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాము." అని చెప్పాడు నిర్మల్.
"మనకిప్పుడు ఆ నిధి అవసరమా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము." అని చెప్పాడు సుభాష్.
"ఇక్కడ మనకి సెక్యూరిటీగా చాలామంది ఉన్నారు. నేను వేసిన ప్లాన్ కి అభీర్ చచ్చిపోయే ఉంటాడు వాడి మనుషులు కూడా మన దగ్గర బందీగా ఉన్నారు మిగతా వాళ్ళు వస్తే ఇక్కడ చస్తారు నాన్న చివరి కోరిక కూడా తీర్చుదాము." అని చెప్పింది అర్ణ.
"అవును! ఎలాగూ కాసేపట్లో ఇక్కడి నుంచి వెళ్లిపోతాము ఆ నిధి ఎక్కడ ఉందో చూపిస్తాను అని చెప్తున్నాడు కదా దాన్ని కుడా తీసుకుని పోదాము." అని ఆశగా చూస్తూ చెప్పాడు రఘురామ్.
"సాబ్! మీరు భయపడకండి మనవాళ్ళు ఇంకా ఇక్కడికి వస్తూన్నారు. మిలిటరీ వచ్చిన ఏమీ చేయలేరు మిమ్మల్ని క్షేమంగా బోర్డర్ దాటించి పంపించే బాధ్యత మాది." అని చెప్పాడు సలీమ్.
"సార్! ఇక్కడ కచ్చితంగా నిధి ఉంది. మనకి సిగ్నల్ కూడా చూపిస్తుంది అది ఎక్కడ ఉందో చూపించే మనిషి కూడా ఉన్నాడు నా అంచనా ప్రకారం దాని విలువ మీ ఆస్తి కంటే 10 రెట్లు ఉంటుంది." అని చెప్పింది వాసుకి.
"సరే! రెండు గంటలు టైమ్. ఈ లోపు నిధికి మార్గం దొరికిందా సరే లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని సంతోషంగా చూస్తూ లింగు దగ్గరికి వెళ్లి "త్వరగా పదరా.. ఆ నిధికి వెళ్లే రూట్ ఎక్కడ ఉందో చూపించు." అని ఆత్రుతగా అడిగాడు రఘురామ్.
"కంగారు పడకండి దొర నాకు కనపడదు నా తమ్ముడికి గుడ్డుకి వినపడదు నా వెనకాలే రండి." అని చెప్పాడు లింగు.
"నిర్మల్! వీడు మళ్ళీ సేమ్ డైలాగ్ వాడుతున్నాడు నాకెందుకో డౌట్ గా ఉంది." అని కంగారుగా చూస్తూ చెప్పాడు ఫరూక్.
"వాచ్ పెట్టుకున్నావు కదా నీ దగ్గరికి ఇంకా ఏ జంతువురాదు మన చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంది వీళ్ళని దాటి ఎవడు టచ్ కూడా చేయలేడు." అని చెప్పాడు నిర్మల్.
"సరే! అని తన మనుషుల వైపు చూసి ఒరేయ్ మీరు ఆ రాళ్ల దగ్గరే ఉండండి నిధి దొరికితే సరి లేకపోతే వాటినైనా అమ్ముకోవచ్చు!" అని చెప్పి నిర్మల్ వెనకాలే వెళ్ళాడు ఫరూక్.
పాట పాడుకుంటూ తాపీగా నడుచుకుంటూ వెళుతున్న లింగు తలకి గన్ పెట్టి "ఇంకా ఎంత దూరం వెళ్లాలి రా..!" అని కోపంగా అడిగాడు సలీమ్.
"వచ్చేసాము దొర! అక్కడ కొండ కనిపిస్తుంది కదా దానిని తవ్వండి లోపలికి వెళ్లే మార్గం ఉంటుంది." అని చెప్పాడు లింగు.
లింగు చూపించిన ప్లేసులో తవ్వడం మొదలుపెట్టారు టెర్రరిస్టులు.
"ఈ ప్లేస్ ని చూస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి ఆ కొండ మీదే చాలామంది చచ్చిపోయారు. ఇక్కడే జంతువుల్ని సరదాగా హంటింగ్ చేస్తూ చంపాము." అని చెప్పాడు ముకుల్.
అర్ణ దగ్గరకు వెళ్లి "నిధి ని తవ్వుతున్న సరే అభీర్ మనుషుల మొహంలో కూడా కసి కోపం లేవు, ఒక్క జంతువు కూడా ఎటాక్ చేయడానికి ట్రై చేయడం లేదు మనల్ని కావాలని ట్రాప్ చేస్తున్నారని అనిపిస్తుంది ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు." అని కంగారుగా చెప్పింది ఆశ.
"నాకు ఇంకొక విధంగా అనిపిస్తుంది. అక్కడ అభీర్ చచ్చి ఉంటాడు ఆ న్యూస్ వీళ్ళకి వచ్చి ఉంటుంది అందుకే కుక్కిన పేనులు లాగా పడి ఉన్నారు, నువ్వేం కంగారు పడకు ఈసారి టైం మనవైపు ఉంది." అని కాన్ఫిడెంట్‌గా చెప్పింది అర్ణ.
అంతలో అక్కడికి వస్తున్న టెర్రరిస్ట్ లని చూసి "మేడం! మా బ్యాచ్ ఇంకొకటి వచ్చింది కాసేపట్లో ఇంకొక రెండు బ్యాచ్ లు వస్తాయి." అని చెప్పాడు సలీమ్.
ఆ మాటకి సంతోషంగా చూస్తూ "ఆశ! నువ్వు :కాసేపు సైలెంట్ గా ఉండు. ఎవరు వచ్చిన ఇప్పుడు మనల్ని ఏమీ చేయలేరు అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి." అని చెప్పింది ఝాన్సీ.
అంతలో కొండ దగ్గర రాయి జరగడం సంతోషంగా చూస్తు "నిధికి మార్గం బయటపడింది." అని గట్టిగా అరిచాడు గఫర్ ఖాన్.
ఆ మాటకి సంతోషంగా చూస్తూ "అడ్డంగా ఉన్న రాళ్ళని బాంబులతో బ్లాస్ట్ చేయండి ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు!" అని చెప్పాడు రఘురామ్.
"ఆ బాంబులు దాటికి కొండ చేరియాలు విరిగిపడ్డాయి అంటే మనమందరం ఇక్కడ చస్తాము అడ్డంగా ఉన్న రాయిని జాగ్రత్తగా బయటకి తీయండి." అని చెప్పాడు అరుల్.
"అవును అతను చెప్పింది నిజమే! నిధి తలుపులు తెరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి తప్పు చేయకూడదు ఈ నిధిని దాచింది సిలేదార్ లు చాలా భద్రంగా ఉంచుతారు." అని చెప్పాడు గఫర్ ఖాన్.
తన వాళ్ళ వైపు చూసి "అందరూ వెళ్ళండి ఆ రాయిని బలంగా పక్కకు జరుపండి." అని చెప్పాడు సలీమ్.
లింగు దగ్గరికి వెళ్లి "ఆ రాయిని జరిపితే నిధి దగ్గరికి వెళ్లి పోతామా.?" అని ఆశగా అడిగాడు రఘురామ్.
"ఏమో దొర నాకు కనపడదు." అని చెప్పాడు లింగు.
ఆ మాట విని "ఏంటి? వీడు తేడాగా ఉన్నాడు." అనుకున్నాడు రఘూరామ్.
***************
గొర్వర్ లో వెయిట్ చేస్తున్న వాళ్ళ మనుషుల దగ్గరికి చేరుకుని "మన వాళ్ళ చావుకి ప్రతికరం తీర్చుకునే రోజు వచ్చింది దేశానికి సహాయంచేసే అవకాశం కూడా దక్కింది అందరూ సిద్ధం అవ్వండి." అని చెప్పాడు బైరి.
ఆ మాట విని కసిగా చూస్తు "నాయకుడు ఎక్కడ?" అని అడిగాడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక వ్యక్తి.
"కాసేపటిలో మన దగ్గరికి చేరుకుంటాడు ఈరోజు మనం చేయబోయే యుద్ధం ఎలా ఉండాలి అంటే ఈ నేల మీద అడుగు పెట్టడానికి పరాయి దేశం వాడు భయపడాలి." అని చెప్పాడు రాజన్.
మ్యాప్ తీసి అక్కడ ఉన్న వాళ్ళకి చూపిస్తూ "ఈ గుహల నుంచే టెర్రరిస్టు అడవి లోకి వచ్చారు మనలో కొంతమంది అక్కడికి వెళ్లి ఆ రూట్ ని క్లోజ్ చేయాలి." అని చెప్పాడు ఆగస్త్య.
అంతలో అక్కడికి మిలటరీ వ్యాన్ రావడం చూసి దగ్గరకు వెళ్లి లోపల ఉన్న మేజర్ ని చూసి సెల్యూట్ చేసి "సార్ ఏజెంట్ కోడ్ అభీర్ సేన!" అని చెప్పాడు బైరి.
ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూసి "అభీర్ సేన గురించి విన్నాను. కానీ ఇంతమంది ఉంటారు అనుకోలేదు బోర్డర్ దాటి సుమారు 600 మంది టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ఇది చాలా పెద్ద రిస్క్యూ ఆపరేషన్ తొందరపడి లోపలికి వెళ్ళకూడదు అది కాకుండా వాళ్ళ చేతిలో హోస్టేజ్స్ గా గిరిజనులు ఉన్నారని తెలిసింది." అని చెప్పాడు మేజర్.
"అక్కడ హోస్టేజ్ గా ఉన్న వాళ్ళందరూ మా వాళ్లే సార్!" అని చెప్పాడు బైరి.
"అవునా? నాతో పాటు 30 మంది ఆఫీసర్స్ మాత్రమే వచ్చారు ఉదయానికి నాలుగు బెటాలియన్స్ వస్తాయి అప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాము." అని చెప్పాడు మేజర్.
కారు దిగి అక్కడికి వస్తూ "అక్కడ 600 మంది టెర్రరిస్టులతో పాటు 100 మంది దేశద్రోహులు కూడా ఉన్నారు ఈ ఆపరేషన్ ఇప్పుడే మొదలు పెట్టాలి లేకపోతే దేశం దాటి వెళ్ళిపోతారు." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని అభీర్ వైపు డౌట్ గా చూస్తు "ఎవరు మీరు?" అని అడిగాడు మేజర్.
"మా అభీర్ సేన నాయకుడు ఆయన పిలుపు చాలు ఈ అడవిలో ఉన్న ప్రతి జీవి యుద్ధానికి సిద్ధమవుతుంది." అని చెప్పాడు బైరి.
"మీరు చెప్పేది కరెక్టే అవ్వచ్చు కానీ టెర్రరిస్టు దగ్గర లేటెస్ట్ వెపన్స్ ఉన్నాయి మీ వాళ్ళ దగ్గర వేపన్స్ కుడా లేవు అనవసరంగా అందరూ ప్రాణాలు కోల్పోతారు." అని చెప్పాడు మేజర్.
"మేజర్ గారు! మా చేతులే మా వెపన్స్! ఈ అడవిలో పుట్టి అడవిలో పెరిగాము. ఇక్కడ గాలి కూడా మా మాట వింటుంది. ఇంకా వాళ్ళ చేతిలో ఉన్న వెపన్స్ అంటారా వాళ్ళు వాటిని ఉపయోగించే లోపు మేము వాళ్ళని చంపేస్తాము.
ఒకవేళ మీరు చెప్పినట్లు ఈ ఆపరేషన్ లో మేము చనిపోతే ఒక్క సెల్యూట్ కొట్టండి చాలు!" అని తన మనుషుల వైపు చూసి "అందరూ సిద్ధంగా ఉన్నారా..?" అని అడిగాడు అభీర్.
"సిద్ధం నాయకుడా..!" అని గట్టిగా అరిచారు అందరూ.
"ఇక్కడ ఉన్న 200 మంది నాలుగు గ్రూపులుగా విడిపోయి అడవిలోకి నాలుగు వైపుల నుంచి ఎంటర్ అవ్వండి. పశ్చిమదిశగా వెళ్లిన వాళ్ళు ఆ కొండ దగ్గర ఉన్న మార్గాన్ని మూసేయండి.
మిగిలిన మూడు మార్గాలలో వెళ్లే వారు శత్రువులకు అనుమానం రాకుండా అడవిలో ఉన్న చెట్లలో కలిసిపోండి వాళ్ళ కంటికి ఒక్క మనిషి కూడా కనిపించకూడదు.
నా పిలుపు వినిపించాగానే మూడు వైపుల నుంచి ఒకేసారి దాడి చేయండి. గన్ పట్టుకునే అవకాశం లేకుండా చేతులు నరికేయండి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతోనే వాళ్లని చంపండి." అని చెప్పాడు అభీర్.
అక్కడికి వచ్చి "మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మీతో పాటు మేము కూడా నాలుగు గ్రూపులుగా విడిపోయి లోపలికి వస్తాము అవసరమైతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాము." అని చెప్పాడు మేజర్.
"ఒక్క ప్రాణం కూడా పోనివ్వను." అని నీలమ్ వైపు చూసి "వీరభద్రం నిన్ను సేఫ్ ఇంటికి చేరుస్తాడు. యుద్ధం మనం అనుకున్నట్లు జరగదు ఒకవేళ నేను తిరిగి రాకపోతే నువ్వు ఎప్పటిలాగా సంతోషంగా ఉండాలి." అని చెప్పాడు అభీర్.
"నువ్వు పద్మవ్యూహంలోకి వెళుతున్న అభిమన్యుడువి కాదు అర్జునుడివి నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను." అని చెప్పింది నీలమ్.
ఆ మాట విని సంతోషంగా తన వాళ్ళ వైపు చూసి కత్తిని పైకి ఎత్తి "పార్వతీ పతయే హర హర హర మహాదేవ!" అని అడవి దద్దరిల్లిపోయేటట్లు గట్టిగా చెప్పాడు అభీర్.
"హర హర మహాదేవ!" అనుకుంటూ నాలుగు గ్రూపులుగా విడిపోయి అడవిలోకి పరిగెత్తారు అభీర్ సేన.
|