Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Super nice update sir lvl
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Chala manchi update icharu Siva garu!! Welcome back!
Like Reply
Part - 107


శిల్పకి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. ఇంక లాభం లేదు అనుకుని బిందు దగ్గరికి వెళ్లి ప్లీజ్ అత్తయ్య నాకు ఎలాగైనా డ్రెస్ అరేంజ్ చెయ్యి అని రిక్వెస్ట్ చేస్తుంది.

ముందే నువ్విలా మాట్లాడి ఉండి ఉంటే కాస్త అయినా పని అయ్యేది కదా.. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని సత్యవతి గారి దగ్గరికి వెళ్లి బయట నుంచే పిలుస్తుంది.

ఏంటి బిందు అని అడిగితే..  రోజువారి బట్టలు ఇవ్వండి. ఒంటి మీద ఉన్న డ్రెస్ తప్ప ఏమీ లేవు. ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి నాలుగు జతలు తీసుకొచ్చి ఇస్తుంది.

ఇవి చాలా జాగ్రత్తగా వాడుకోమని చెప్పు అని లోపలికి వెళ్ళిపోతారు. అవి తీసుకొచ్చి ఇవిగో అని ఇస్తుంది. గబగబా తీసుకొని చూసి ఏంటి... ఈ బట్టల నేను వేసుకోవాలా.. 

ఏ జైల్లో ఇంతకన్నా మంచివి వేసుకున్నావా..  అత్తయ్య ప్రతిదానికి నువ్వు జైలుతో లింకు పెట్టకు. కొన్ని కొన్ని నిజాలు చేదుగా ఉన్న ఒప్పుకోవాలి.

ఒప్పుకుంటేనే మన బ్రతకగలం.  అంటే...
రాజీపడమంటున్నావా. అలవాటు పడమంటున్నాను అని బిందు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది.

రేపు ఎలాగైనా నేను క్రిష్ ని కలవాలి అన్న ఊహల్లోనే ఉంటూ... ఒక డ్రెస్ తీసుకుంటుంది. ఆలోచనలతోనే ఆ రాత్రి గడిపేస్తుంది.

పొద్దుటే సర్వెంట్స్ వచ్చి పిలిస్తే వస్తున్న అని చెప్పి బిందుతోపాటు వెళుతుంది. ప్రోగ్రాం ఇప్పుడు కాదు కదా అని అడిగితే...  నువ్వేమైనా విఐపి అనుకుంటున్నావా ప్రోగ్రాం టైం కి వెళ్ళటానికి.

అక్కడ చాలా పనులు ఉన్నాయి పద పద అని చెప్పి ఒక వ్యాన్ లో ఎక్కిస్తారు. అక్కడ సర్వెంట్స్ తో పాటు కూర్చుని వెళుతుంటే చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. 

ఆడిటోరియం కి తీసుకుని వెళతారు. ఎలాగైనా క్రిష్ ని కలవాలి అన్న ఆలోచనతో ఉన్న శిల్ప వ్యాన్ దిగి చుట్టూ చూస్తూ ఉంటుంది.

ఎక్కడికి వచ్చాము. నీకు ప్రతిదీ బొట్టు పెట్టి చెప్పాలా
పద పద అని విసుక్కుంటారు.  ఆ ఆడిటోరియం చూసి ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఏం చేయాలి.

నువ్వు ఇదంతా క్లీన్ చేయి అని చెప్పి ఇంకొక ఇద్దరు సర్వెంట్స్ అక్కడ వదిలి వెళ్ళిపోతారు. వాట్ ఇదంతా క్లీన్ చేసేటప్పటికి నా నడుము పడిపోతుంది. నా అందం ఏమి కావాలి అనుకుంటుంది.

ఏమి చేయలేక మొత్తం అంతా క్లీన్ చేస్తుంది.  మధ్యాహ్నం ఫుడ్ వచ్చినప్పుడు తిని హమ్మయ్య కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకునేటప్పటికీ..  మరొక పని పురమాయించుతారు.

అలా సాయంత్రం దాకా చేపిస్తూనే ఉంటారు.  ఫంక్షన్ టైం కి వెళ్లి ఫ్రెష్  అయ్యి రా.. వెల్కం ఎంట్రన్స్ దగ్గర కూడా పని ఉంది.

శిల్ప భయపడుతుంది. నేను అక్కడికి రాను అంటుంది.  ఎందుకు రావు. వీళ్ళకి ఎలా చెప్పాలి.  నన్ను అక్కడ గుర్తుపడితే నా పోసిషన్ చూసి అందరూ నవ్వుకోరా...

నేను ఎన్నిసార్లు ఈ ఆఫీస్ కి వచ్చాను.  అలాంటిది నన్ను ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా అనుకుని... ప్లీజ్ వేరే పని ఏదైనా చెప్పండి కానీ అక్కడికి మాత్రం వద్దు.

నిన్ను అక్కడే ఉంచమని మాకు ఆర్డర్స్ వచ్చాయి అని చెబుతారు. ఇంక చేసేది ఏమీ లేక తప్పించుకోవడానికి అని నాకు వేరే డ్రెస్ లేదు.  ఇది స్మెల్ వచ్చేస్తుంది అని చెబుతుంది.

ఏం పర్వాలేదు నీ కోసం డ్రెస్ తెప్పించారు అని ఒక డ్రెస్ ఇస్తారు.  అది చూడగానే శిల్ప మొహం వెలవెల పోతుంది. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి రెడీ అవ్వు అని చెబుతారు.

ఇక తప్పక వెళ్లి రెడీ అయి వస్తుంది. మేకప్ వేసే వాళ్ళు లైట్గా మేకప్ వేసి ఇప్పుడు పర్ఫెక్ట్ అంటారు.  అద్దంలో తనను తను చూసుకుని ఉలిక్కి పడుతుంది.

  ఎవరైనా శిల్పని చూస్తే గుర్తు పట్టలేని విధంగా ఉంటుంది. ఎందుకంటే  బఫూన్ డ్రెస్ వేశారు. ఈ బఫూన్ డ్రెస్ తోనే అందరికీ వెల్కమ్ చెప్పాలి అంటారు. పోనీలే గుడ్డులో మెల్ల అనుకొని సరే అంటుంది.

వెల్కమ్ గేటు దగ్గర నిలబడి అందరికీ రోజస్ ఇస్తూ వెల్కమ్ వెల్కమ్ అని చెబుతూ ఉంటుంది. అంతకు ముందు తను ఎవరితో అయితే చీప్ గా ప్రవర్తించిందో వాళ్ళందరికీ కూడా రెస్పెక్ట్ గా ఉండి మరీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ హడావుడిలో ఉండగానే కలకలం మొదలవుతుంది.  ఏమైంది అని అందరూ చూస్తూ ఉంటే వరుసగా కార్లు వచ్చి ఆగుతాయి.

ధనుంజయ్ కూడా స్పీడ్గా కార్ల దగ్గరకు వెళుతూ ఉంటే.. ఓ నాన్నే ఇలా పరిగెడుతున్నారు అంటే చాలా వివిఐపీలని పిలిచి ఉంటారు.

ఎవరు అయ్యుంటారా నాకు ఏమన్నా ఉపయోగపడతారా అని ఆలోచిస్తూ ఉంటుంది.  ముందుగా కళ్యాణ్ దంపతులు దిగుతారు.

తర్వాత వరసగా జై సింహా ఫ్యామిలీ మొత్తం దిగుతూ ఉంటే.. అది చూసిన శిల్పకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది.

ఏంటి వీళ్ళ కోసమా నాన్న పరిగెత్తుకుంటూ వెళ్లారు.  ఇప్పుడు అని టెన్షన్ గా చూస్తూ ఉంటే విక్రమ్ దిగి నిలబడతాడు.

విక్రమ్ చూసిన అమ్మాయిలు సూపర్ ఉన్నాడే..  ఇలాంటి వాళ్ళు మనకు ఎక్కడ దొరకరేంటి అని  గుసగుసలాడుతూ ఉంటారు.

విక్రమ్ చిన్న స్మైల్ తో చెయ్యి ముందుకు చాపుతాడు. ఆ చేతిలో ఒక సుతిమెత్తని చెయ్యి జత కలుపుతుంది. మెల్లిగా అని చెప్పి పైన కూడా చేయి అడ్డు పెడతాడు.  దిగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ...

అవని కారులో నుంచి దిగి విక్రమ్ కి చిన్న స్మైల్ ఇస్తుంది. ఆర్ యు ఓకే అంటే..  ఇంత దూరంలోనే నాకు ఏమైపోతుంది అండి..

నువ్వు అలసిపోతే నాకే కష్టం కదా.. ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతుంది. అది చూస్తున్న శిల్ప మాత్రం రగిలిపోతూ ఉంటుంది.

ఇప్పుడు వీళ్ళు నన్ను గుర్తు పడతారా.. గుర్తుపట్టి నన్ను చూసి నవ్వుతుందా అని ఒక ఇమేజ్నరి వరల్డ్ లోకి వెళ్ళిపోతుంది.

అవిని తన ముందుకే వచ్చి   వేసుకున్న బఫూన్ డ్రెస్ అంత తీసేసి వెటకారంగా నవ్వుతున్నట్టుగా ఊహించుకుని గట్టిగా అరుస్తుంది. 

ఆ అరుపుకి  అంతా సైలెంట్ అయిపోయి శిల్ప వైపు చూస్తారు. ఆర్గనైజర్ కంగారుగా అందరికీ సోరి చెప్పి శిల్ప దగ్గరకు వచ్చి ఎందుకు అలా అరుస్తున్నావు.

గెస్ట్ లు అందరూ ఇటే చూస్తున్నారు . వెంటనే తేరుకుని సోరి.. సోరి అంటుంది.

విక్రమ్ మాత్రం కార్నర్స్ స్మైల్ ఇస్తాడు అవని ఏమైంది.. ఎందుకు ఆ అరుపులు.. నథింగ్... టెన్షన్ పడకు అని జాగ్రత్తగా తీసుకువస్తూ ఉంటాడు.

శిల్ప ముందుకు రాగానే ఒక్క నిమిషం విక్రమ్ ఆగుతాడు. అప్పటికే శిల్పకి లోపల తడిచిపోతూ ఉంటుంది.  ఇప్పుడు గుర్తుపట్టి పిలుస్తారా ఏమిటి అని తనలో తానే నలిగిపోతూ ఉంటుంది.

విక్రమ్ అక్కడికి వచ్చి నైస్ డ్రెస్.  ఈ డ్రెస్ నీకు బాగా సూట్ అయింది. ఇలాగే మెయింటైన్ చెయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు.

ఆ మాటకి వెళుతున్న విక్రమ్ ని చూస్తూ...  తెలిసి అన్నాడా... తెలియక అన్నాడా..  నన్ను గుర్తుపట్టాడా ఏమిటి అని పరధ్యానంగా ఉంటుంది.

అందరూ వెళ్లి ఆడిటోరియంలో కూర్చున్న తరువాత... శిల్ప ని రమ్మని అవని కి సర్వ్ చేపిస్తూ ఉంటారు.  డ్రింక్స్ అని..  తర్వాత స్నాక్స్ అని ఏదో ఒకటి ఇప్పిస్తూ ఉంటారు.

అవని స్మూత్ గా నాకు ఇప్పుడు ఏమీ వద్దు అని చెబుతూ ఉంటే..  రిక్వెస్ట్ చేయాలి అని గట్టిగా చెబుతారు. శిల్ప కి కష్టంగా ఉన్నా సరే తీసుకోండి మేడం అని రిక్వెస్ట్ చేస్తుంది.

ఆ వాయిస్ వినగానే అవని ఉలిక్కిపడి  శిల్ప వైపు చూస్తుంది.   గుర్తుపట్టలేనట్టుగా ఉన్న బఫూన్ రూపాన్ని చూస్తూ... నువ్వు అని వేలు పెట్టేటప్పటికి విక్రమ్ ఏమైంది అంటే నథింగ్ అని సైలెంట్ అవుతుంది.

ధనుంజయ్ ఇప్పుడు వరకు సాధించినవి అన్నీ కూడా అక్కడ స్క్రీన్ పెట్టి చూపిస్తూ ఉంటారు.  తన భార్యగా రజితని,  కూతురుగా అవని నీ మాత్రమే చూపిస్తారు.

  ధనుంజయ్ ఎంపైర్ మొత్తానికి ఏకైక వారసురాలు అవని అని... ఇప్పటినుండి అన్ని బిజినెస్లకి  చైర్మన్ అని అనౌన్స్ చేస్తారు.

అది వినగానే శిల్ప బొమ్మలాగా నిలబడిపోతుంది. అసలు ఏం జరుగుతుంది.  అమ్మ గురించి గానీ... నా గురించి గానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు.

మర్చిపోయారా...  వెంటనే నాన్నని అడగాలి అని చెప్పి ధనుంజయ్ దగ్గరికి వెళ్లడానికి ముందుకు అడుగులు వేస్తోంది.

వెంటనే అక్కడేకి ఒక నలుగురు వ్యక్తులు వచ్చి లాక్కొని వెళ్ళిపోతారు. హేయ్..  నన్ను వదలండి వదలండి అని అరుస్తున్న సరే అక్కడ ఉండనివ్వకుండా తీసుకువెళ్లి వ్యాన్ ఎక్కించేస్తారు.

అవనికి అన్ని బాధ్యతలు ధనుంజయ్ అప్పచెప్పి అవని తీసుకున్న నిర్ణయాలు కూడా అక్కడ అనౌన్స్ చేస్తారు. అందరూ అవిని నిర్ణయాన్ని మెచ్చుకుంటారు.

విక్రమ్ ఫ్యామిలీ మాత్రం అక్కడ ఏమీ తినరు.  తాగరు.  ఫంక్షన్ అయిన వెంటనే తిరిగి రిటన్ అవ్వుతారు.

మౌనంగా ఉన్న అవనినీ దగ్గరకి లాక్కొని చుట్టూ భుజం పైన చెయ్యి వేసి దగ్గరకి లాక్కుంటాడు. వీళ్లిద్దరూ మాత్రమే సెపరేట్గా ఒక కారులో వెళుతూ ఉంటారు.

అవని ఏమి పట్టించుకోకుండా మౌనంగా విక్రమ్ భుజం పైన తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది.

అవని ఫీలింగ్స్ ఏంటో అర్థం అయిన విక్రమ్ కూడా డిస్టర్బ్ చేయకుండా లాంగ్ డ్రైవ్ కి తీసుకువెళ్తాడు.  ఇంటికి రావడానికి లేట్ అవుతుంది అని మెసేజ్ చేస్తాడు.

కారు అలా వెళుతూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి ఇంకా ఇల్లు రాలేదా అని అడుగుతుంది.  నా భార్యామణి ఇప్పటికి స్పృహలోకి వచ్చింది అంటాడు.

నేను స్పృహలోకి రాకపోతే రప్పించడానికి మీరు ఉన్నారు కదా అంటుంది. ఆ మాటకి నవ్వుతూ కారుని లోన్లీ ప్లేస్ లో ఆపుతాడు.

కారు దిగు అని విక్రమ్ దిగి వచ్చి చేయి అందిస్తాడు. విక్రమ్ చేయి పట్టుకుని బయటకు వచ్చి ఆ ఫ్రెష్ ఎయిర్ కి కళ్ళు మూసుకుని తెరుస్తుంది.

రొమాంటిక్ టైం❤️❤️

కథ కొనసాగుతుంది..
[+] 11 users Like SivaSai's post
Like Reply
Part - 108


అవని కారు దిగి ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూఉంటుంది. విక్రమ్ అవిని దగ్గరికి వచ్చి కం అని చేయి అందిస్తాడు. చేతిలో చెయ్యవేసి ముందుకి నడుస్తుంది.

ఓపెన్ ఏరియా లాగా ఉన్న ప్లేస్ చూసి ఎక్కడికి వచ్చాము. చిన్న సర్ప్రైజ్ అని చిటిక వేస్తాడు.. మెల్లిగా ఒక్కొక్క లైట్ వెలుగుతూ ఉంటుంది.

చీకట్లు మధ్యలో వెన్నెల కురిసినట్టేగా ఆ ప్రదేశం అంతా లైట్లతో నిండిపోతుంది.  ఇద్దరి కోసము అక్కడ డిన్నర్ అరేంజ్ చేసి ఉంటుంది.

ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశారు. సర్ప్రైజ్ అన్నాను కదా..  ఫోన్ లో మ్యూజిక్ ఆన్ చేస్తాడు. అవని తన ముందుకు తిప్పుకొని మెల్లిగా స్టెప్స్ వేపిస్తూ ఉంటాడు.

ఆ చల్లటి గాలిలో మెల్లిగా వస్తున్న రొమాంటిక్ మ్యూజిక్ లో విక్రమ్ తో కలిసి డాన్స్ చేస్తూ ఉంటే తనని తాను మరిచిపోతుంది.

అవని మూడ్ పూర్తిగా మారింది అని అర్థమైన తర్వాత తీసుకువెళ్లి చైర్ లో కూర్చోబెట్టి తనే స్వయంగా తినిపిస్తాడు.

విక్రమ్ ప్రేమకి అవని ఎప్పుడూ కరిగిపోతూనే ఉంటుంది. ఫుడ్డు తినిపించిన తరువాత అక్కడ లాన్లోనే కింద కూర్చుంటారు.

అవని ఎమోషనల్ అవుతూ విక్రమ్ ఒడిలో కూర్చుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. భార్య చుట్టూ చేతులు వేసి దగ్గరగా హత్తుకుని ఏమైందిరా అంటాడు.

ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. కానీ ఆ కౌగిలి  నుంచి మాత్రం బయటికి రాదు. ఇంకా దగ్గరగా హత్తుకుని నాతో కూడా చెప్పవా.

మీకు కాక ఇంకెవరికి చెబుతాను అని విడి..  విక్రమ్ ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది. అబ్బో ఇప్పుడు మా శ్రీమతికి ఎందుకు ఇంత ప్రేమ పొంగి కొచ్చింది.

ఎంత పొంగి కొచ్చినా మా శ్రీవారి ప్రేమ ముందు అది చిన్నదే అంటుంది. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ నా శ్రీమతి ప్రేమకి కరిగిపోయాను కాబట్టే నా ప్రేమ నీకు కనిపిస్తుంది.

అవని కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీళ్లు తుడిచి ఇవి నీ కళ్ళల్లో నేను చూడలేను బంగారం. నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. ఆ విషయం నాకు తెలుసు అండి.

మీ భార్యగా మారిన తర్వాతే అదృష్టం కూడా నా వైపుకు వచ్చింది.  అప్పుడు దాకా నా జీవితం ఏమిటా అని ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉండేదాన్ని.

అలాంటిది ఈరోజు ఆ మనిషి తన వారసురాలుగా నన్ను ప్రకటించి నా ఉనికిని ప్రపంచానికి చూపించాడు. నన్ను అనాధ అని గెలిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు  నోరు మూసుకుంటారు.

ఎవరినైనా కామెంట్ చేయాలి అంటే ఆలోచిస్తారు.  ఇదంతా మీ వల్లే కదా... మీరు నా జీవితంలోనికి రాకపోయే ఉండి ఉంటే ఎప్పటికి నేను ఒక అనాధ లాగానే ఉండేదాన్నేమో..  లేకపోతే వాళ్ళ అరాచకాలకి బలైపోయి ఈ ప్రాణం ...

నెక్స్ట్ మాట వచ్చే లోపు విక్రమ్ అవని పెదాలు మూసేస్తాడు. ఆ ముద్దులో ప్రేమ కోపం బాధ అన్నీ కనపడుతూ ఉంటాయి.

అవని మాత్రం ఆపదు. వెచ్చటి కన్నీళ్లు బుగ్గ పైనుంచి కారుతూ విక్రమ్.. ని కూడా తడిపేస్తాయి.  ఆ కన్నీళ్ళకి కోపాన్ని వదిలి మెల్లిగా ముద్దు పెట్టి చూడు శ్రీమతి.. ఎప్పుడు నీ నోటి నుంచి ఆ మాట రానివ్వకు .


నీ ప్రాణం నా ప్రాణం వేరువేరు కాదు. ఎప్పుడైతే నీ చేతిని పట్టుకుని పాణిగ్రహణం చేశానో ఆ రోజే  రెండు శరీరాలు ఒకే ఆత్మగా మారిపోయాము.

ఈ జన్మకి కాదు. ఎన్ని జన్మలకైనా మన బంధం ఇదే.. నువ్వే నేను.  నేనే నువ్వు.  అర్థమయిందా అంటాడు. 

ఆ మాటకి నవ్వుతూ విక్రమ్ వైపు చూసి అర్థమయింది...  ఇంతకన్నా నాకు కావాల్సిందేముంది అంటుంది. అరే అలాంటి ఎలా కుదురుతుంది.

ఇంకా చాలా కావాలి కదా అంటాడు.. ఇంకేం కావాలి అంటే..  ఇంకేం కావాలా అసలు ఈ ప్రశ్న నువ్వెలా అడగగలుగుతున్నావ్ భార్యామణి అని నడుము పైన వేలుతో రాస్తూ ఉంటాడు.

ఆ చక్కెలగింతలకి నవ్వుతూ ఏం చేస్తున్నారు మీరు.. మరి ఇంకేం కావాలి అని అడుగుతున్నావు కదా..  తెలుసుకోవాలి కదా నువ్వు.

తెలుసుకుంటాను ప్లీజ్ ఆపండి. సరే తెలుసుకో అంటాడు. చెప్పండి.. మీకు ఇంకేం కావాలి అని గెడ్డం పట్టుకుని అడుగుతుంది.

ఇలా అడిగితే వర్కౌట్ అవ్వదు భార్యమణి అంటాడు.  మరి ఇంకా ఎలా అడిగితే వర్కౌట్ అవుతుందండి. భగవంతుడా నా పెళ్ళానికి అందమైన రూపం ఇచ్చావు గాని ఆ బుర్రలో కొంచెం గుజ్జు ఇచ్చి ఉంటే నేను ఎంత అదృష్టవంతుడిని అయ్యేవాడినో అంటాడు.

ఆ మాటకి కోపంగా చూస్తూ అంటే నా బుర్రలో గుజ్జు లేదా... గుజ్జు ఉంటే ఈపాటికి నీకు అర్థం కావాలి కదా...
ఇంకా ఏమై ఉంటుందా అని బుగ్గ పైన వేలు పెట్టి ఆలోచిస్తుంది.

అప్పుడు బల్బు వెలిగి సిగ్గుతో తలకిందకి దించేస్తుంది.  ఏదో మా మేడంకి బల్బ్ ఎలిగినట్టుందే అంటాడు. ఆ వెలిగితే మాత్రం చెబుతానా అంటుంది.

చెబితేనే కదా అది అవునా కాదా నేను చెప్పగలను. సమయం వచ్చినప్పుడు చెబుతానులే గాని ఇంకా ఇంటికి వెళదామా అంటుంది.

అవని నీ తన లోకంలోనికి తీసుకువచ్చి ఇంటికి తీసుకువెళతాడు.

శిల్ప ని ఇంటి దగ్గర వదిలేసి వ్యాన్ మళ్లీ వెనక్కి వెళ్ళిపోతుంది. శిల్ప కోపంగా చూస్తూ ఉంటే వాచ్మెన్ గేట్ తీసి లోపలికి వెళ్ళండి అని చెబుతాడు.

ఏమీ చేయలేక లోపలికి వెళ్లి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంటుంది. డాడీ రాగానే అడగాలి ఇలా ఎందుకు చేశారో కనుక్కోవాలి అని గుంజుకుంటూ ఉంటుంది.

ధనుంజయ్ వచ్చేలోపు ఆ మేకప్ అంతా తీసేసి ఒక డ్రెస్ వేసుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది. బిందు శిల్పను చూసి ఇక్కడే కూర్చున్నావ్ ఏంటి..  నిద్ర రావడం లేదా...

నేను డాడీతో మాట్లాడి వస్తాను. ఏమైంది అని అడిగితే.. ఈరోజు  ఫంక్షన్ లో ఏం జరిగిందో తెలుసా అత్తయ్య.. నేను రాలేదు కదా నాకు తెలియదు అంటుంది.

అయ్యో అత్తయ్య నువ్వు అంత విరక్తిగా మాట్లాడితే....
  ఇక్కడ నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ ఉంటారు.
సరే చెప్పు అంటుంది.

శిల్పను తీసుకువెళ్లిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా జరిగింది మొత్తం చెబుతుంది. అవునా అంటుంది. అదేంటి అత్తయ్య.. జరిగింది అంతా చెబితే నువ్వు అంత సింపుల్ గా అవునా అంటున్నావు.

ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది. అన్నయ్య ముందే చెప్పారు కదా నువ్వు ఎక్కడ నాన్న అని పిలవడానికి వీలు లేదు అని.

పిలవద్దు అంటే ఏదో కోపంలో అన్నారు అనుకున్నాను కానీ.. అసలు ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా చేశారు.

ఇలా అయితే మరి నేను ఎవరిని..  నా ఐడెంటిటీ ఏది అని కోపంగా అడుగుతుంది. మీ ఐడెంటిటీ మీ అమ్మని అడుగు అన్నా వాయిస్ వినపడుతుంది.

ఆ వాయిస్ విని భయంగా వెనక్కి తిరిగి డాడీ అంటుంది.  జస్ట్ షట్ అప్.  ఎన్నిసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దు అని..

మీరు చేసింది ఏమైనా బాగుందా డాడీ అని కన్నీళ్లతో అడుగుతుంది.  నాకు బాగుంది కాబట్టి చేశాను.
అవని నీ మీ కూతురుగా ఎనౌన్స్ చేశారు. అవని మదర్ మాత్రమే మీ వైఫ్ గా అందరికీ చెప్పారు. మరి నేనెవరిని.. మా మమ్మీ ఎవరు అని అడుగుతుంది.

ఆ మాటకి నవ్వుతూ అవని అంటున్నావు గాని అక్క అన్నమాట నీ నోటి నుంచి రావడం లేదు. ఏమన్నావు అవని మదర్ని మాత్రమే నా వైఫ్ గా చెప్పాను అనా,...

మరి మీ అమ్మ ఏం చేసేది. నువ్వేం చేసే దానివి.. ఆ మాటకి శిల్ప ఏమి మాట్లాడలేక మౌనంగా చూస్తుంది.  ఏం మాట్లాడవేమిటి శిల్ప.

ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మ ఒక్కతే నా భార్య.  నువ్వు ఒక్క దానివే నాకు కూతురు అని చెప్పేవారు  కదా.. అప్పుడు నీకు అవని గుర్తుకు రాలేదా...

అవని కూడా నా కూతురే కదా.. మీరిద్దరూ కలిసి పెరిగి ఉంటే నాకు ఇద్దరు కూతుళ్లు అని గర్వంగా చెప్పుకునేవాడిని కానీ అవకాశం ఇవ్వకుండా మీ అమ్మే చేసింది.

అమ్మ తప్పు చేస్తే శిక్ష నాకా అని అడుగుతుంది. ఇంకా ఆపు..  అసలు నువ్వు ఏమీ తప్పు చేయనట్టుగా మాట్లాడుతున్నావు.

ఈరోజు నీ పరిస్థితికి ముమ్మాటికి నువ్వే కారణం.  అవని ఎంతటి హీనస్థితిలో ఉన్న సరే తన వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు.  కానీ నువ్వేం చేసావు.

నువ్వు అనుకున్న గోల్ ని రీచ్ అవ్వడానికి కష్టపడడం మానేసి తప్పుడు దారి వెతుకున్నావు.  అంతే కాకుండా అక్క భర్తని అని కోపంగా కళ్ళు మూసుకుంటారు.

ధనుంజయ్ కోపం చూసి శిల్ప భయంగా బిందు చేతిని పట్టుకుంటుంది.  ఇంతకు మించి నీతో మాట్లాడడం నావల్ల కాదు.

బిందు వైపు చూసి రేపొద్దున్న ఇద్దరు రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు.  ధనుంజయ్ లోపలికి వెళ్ళగానే శిల్పా హమ్మయ్య అనే గుండెల పైన చేయి వేసుకుంటుంది.

ఎక్కడికి అత్తయ్య రేపు వెళ్ళేది. రేపు తెలుస్తుంది కదా..  ఇప్పుడు నుంచే తెలుసుకుని ఏమి చేస్తావు.. చెప్పొచ్చు కదా..

నాకు ఏమీ తెలియదు రెడీ అయి ఉండమన్నారు.  రెడీ అయి ఉండడమే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎలాగైనా క్రిష్ ని కలవాలి అనుకుంటే అవ్వలేదు.

రేపైనా ట్రై చేయాలి అని అప్పటివరకు తండ్రి తిట్టిన తిట్లు అన్ని గాలికి వదిలేసి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది.

అలసిపోయి ఉన్న దేహంతో మత్తుగా నిద్రపోతుంది. ఉదయమే బిందు కొట్టి... కొట్టి లేపుతుంది. ఎందుకు అత్తయ్య నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు.

ముందు లెగు. రెడీ అవ్వమన్నారు కదా. ఎక్కడికో చెప్పలేదు.  ఏం డ్రెస్ వేసుకోవాలి. అవును నువ్వు ఒక ఎలిజిబెత్ క్వీన్ అని నీకు డ్రెస్సులు ఆర్డర్ మీద తెప్పిస్తున్నారు అంటుంది.

ఈ అత్తయ్య కి ప్రతిదీ వెటకారమే... వెళ్ళి స్నానం చేసి వస్తుంది. డ్రెస్ వేసుకుంటూ ఉంటే ముందే చీర కట్టుకో అంటుంది.

చీర దేనికి అత్తయ్య... నాకు తెలియదు అని చెప్పాను కదా.. నాకు కట్టుకోవడం రాదు. నా కర్మ.. తప్పుతుందా అని ఆ చీర బిందునే కడుతుంది.

శిల్ప ప్రయాణం ??
కథ కొనసాగుతుంది..
[+] 16 users Like SivaSai's post
Like Reply
Nice story
Like Reply
Superb update
Like Reply
Superb
Like Reply
Siva garu,

Excellent story.. malli story mainroad meeda ndusthundhi.. service road loo sri neha frist night viseshalu pai no update andi.. just curious on it :)
[+] 1 user Likes masalakiss's post
Like Reply
Part - 109


శిల్ప కి చీర కట్టి మెడలో సింపుల్ గా ఉన్న ఒక చైన్ వేస్తుంది. అద్దం లేదా అత్తయ్య.. మనం ఉన్నది ఎక్కడ అని ఎటువంటి భావం లేకుండా అడుగుతుంది.

  ఏం మాట్లాడినా అత్తయ్య కౌంటర్స్ వేస్తుంది అని సైలెంట్ అయిపోతుంది. రెడీ చేసి పదా అని బయటికి తీసుకు వస్తుంది.

ఇప్పుడైనా చెప్పొచ్చు కదా.. ఎన్నిసార్లు అడుగుతావు శిల్ప. నాకు తెలియదు అని చెబుతున్నాను కదా.
ఒకసారి చెబితే అర్థం చేసుకోవడం నేర్చుకో అని విసుగ్గా అంటుంది.

మా మమ్మీ లేకపోయేటప్పటికి అందరికీ కొమ్ములు వస్తున్నాయి చ అని మనసులో అనుకుంటూ వెళ్లి గుమ్మం ముందు నిలబడుతుంది.

ఏమిటో నా ఇంట్లోకి నేను వెళ్లడానికి కూడా పర్మిషన్ కావాల్సి వస్తుంది. బిచ్చగత్తె లాగా నన్ను గుమ్మం ముందు నిలబెట్టారు.

ఇదంతా ఇడియట్ అవని వల్లే వచ్చింది అని కోపంగా పళ్ళు నూరుతూ ఉంటుంది.

ధనుంజయ్ తన తల్లిదండ్రులను తీసుకుని బయటకు వచ్చి వెళదామా అంటాడు.  అన్నయ్య ఒక్కసారి ఆలోచించొచ్చు కదా అని బిందు అంటే..

నీకు ఏమన్నా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పు నాకేమీ పర్వాలేదు. తర్వాత జరిగే వాటికి నాకు ఎటువంటి సంబంధం ఉండదు అని కోపంగా చెబుతారు.

ఆ మాటకి బిందు సైలెంట్ అయిపోతుంది. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక శిల్పా పిచ్చ చూపులు చూస్తూ ఉంటుంది.

ఇంకా వెళదామా అంటే హా సరే అని అందరూ ఒక్క కారులోనే బయలుదేరుతారు. శిల్ప ఇబ్బందిగా కూర్చుంటూ.  ఇంతమంది ఒక కారులో అంటే ఎలా కుదురుతుంది.

రెండు కార్లు తీసుకుంటే సరిపోతుంది కదా మనసులో అనుకుంటుంది కానీ ధైర్యంగా పైకి అనలేక ఎక్కడికి డాడీ అంటుంది.

ఇడియట్ నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను డాడీ అని పిలవద్దు అని...

ఆ మాటకి శిల్పా చిన్నబుచ్చుకొని తలదించుకుంటుంది.  బిందు మెల్లిగా చెవిలో నీకు ఎన్నిసార్లు చెప్పాను. మీ నాన్నని విసిగించొద్దు అని.

సైలెంట్ గా కూర్చోలేవా అని కసురుకుంటుంది. మీకు అందరికీ తెలుసు కదా మనం ఎక్కడికి వెళుతున్నామో.. హ తెలుసు అంటుంది.

మరి ఎందుకు చెప్పడంలేదు అంతే మెల్లిగా అడుగుతుంది. చెప్పినా నువ్వు ఏమీ చేయలేవు.  జరిగింది చూడడం తప్ప.

ఉన్నా ఈ కాస్త సంతోషాన్ని నీకు దూరం చేయడం నాకు ఇష్టం లేదు అంటుంది. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది అత్తయ్య అని భయంగా అడుగుతుంది.

నువ్వు ఎందుకు భయపడడం నేను కదా భయపడాలి అంటుంది.  అసలు ఏం మాట్లాడుతున్నావ్ అత్తయ్య.  మీరు మాట్లాడేది ఒక్కటి కూడా నాకు ఏమీ అర్థం కావడం లేదు.

ఏదో కొరియన్ మూవీ మలయాళీ టైటిల్స్ తో చూసినట్టు ఉంది. ప్రస్తుతానికి అలాగే అనుకో.   

కారు మాత్రం సిటీ అవుట్ కట్స్ దాటేస్తుంది. ఇంకా రెండు గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఒక మారుమూల గ్రామం వస్తుంది. ఒక గుడి ముందు కారు ఆపుతారు.

దిగండి అని  ధనుంజయ్ కారు దిగుతాడు.  అందరూ దిగి నిలబడతారు.  ఇదేంటి గుడికి వచ్చాము అని మనసులో అనుకుంటుంది.

వీళ్ళు వెళ్లేటప్పటికీ సునీల్, ఉదయ్ అక్కడే ఉంటారు. భర్తను చూడగానే ఏవండి అని పరిగెత్తుకుంటూ వెళ్లి భర్త చేతులు పట్టుకొని ఏడుస్తుంది.

ఇప్పుడు ఏడ్చి ఉపయోగం లేదు. నవ్వుతూ ఉండు. ఇంకా ఎక్కడ నవ్వండి.  ఆ రాక్షసి కి నా కొడుకుని బలి చేస్తుంటే.. పక్కనున్న ఉదయ్ పట్టుకుని ఎలా ఉన్నావురా అంటుంది.

విరక్తిగా నవ్వుతూ ఇలా ఉన్నాను అంటాడు.  కొడుకుని పైనుండి కిందకి చూస్తూ ఉంటే అసలు గుర్తుపట్టలేని విధంగా ఉంటాడు.

ఎప్పుడు దొరబాబు లాగా హీరోలాగా టిప్ టాప్ గా రెడీ అయ్యి కార్లలో తిరిగేవాడు.  అలాంటిది పుల్లకి బట్టలు వేసినట్టుగా ప్రాణం ఉండాలి కాబట్టి ఉంది అన్నట్టుగా ఉన్నాడు.

ఇలా అయిపోయావ్ ఏంట్రా అంటే మనం చేసిన పాపాలకి శిక్ష అమ్మ అంటాడు.. మమ్మల్ని క్షమించరా అని బాధపడుతుంది.

మిమ్మల్ని ఎందుకమ్మా క్షమించడం.  మీరు చెబితే గంగిరెద్దులాగా నేను కూడా అదే తప్పు చేయడానికి సిద్ధపడ్డాను.

నాలో కూడా ఉంది కదా అంటాడు.  ఈలోపు ధనుంజయ్ అక్కడికి వచ్చి మీ మాటలు అయిపోయాయా అంటాడు.  బాగున్నారా మావయ్య అని ఉదయ్ అడిగితే చాలా అసహ్యంగా చూసి పదండి అంటాడు.

ఆచూపు కి ఉదయ్ కి చాలా బాధగా అనిపిస్తుంది.  ఎప్పుడూ దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమగా మాట్లాడే మావయ్య ఈరోజు ఒక పురుగును చూసినట్టు చూస్తూ ఉంటే చాలా రంపపు కోతలాగా అనిపిస్తుంది.

వెనకాల వస్తున్న శిల్ప ని చూసి ఒక నిట్టూర్పు విడిచి చేసిన పాపాలకి కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలిలే అని ధనుంజయ్ వెనకాలే వెళతాడు.

ఇక శిల్ప ఆగలేక నానమ్మ మనము ఎక్కడికి వచ్చాము. దేనికోసం వచ్చాము. తినబోయే ముందు రుచి ఎందుకు చూడు.

ప్లీజ్ నానమ్మ ఇప్పటికే టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చెప్పండి. నీ పెళ్లి అని చెప్పి అడుగు ముందుకేస్తుంది.  వాట్ అని అరుస్తూ అక్కడే ఆగిపోతుంది.

ఎందుకు అరుస్తున్నావు. ఇది అన్యాయం నానమ్మ.  నా పెళ్ళి నాకు తెలియకుండా ఫిక్స్ చేయడమేమిటి. అసలు అబ్బాయి ఎవరో నాకు తెలియదు.

నా రేంజ్ కి సూట్ అవుతాడో లేదో చూసుకోవాలి కదా...
అయినా పెళ్ళంటే ఇలాంటి చోట చేసుకునేది. ఎవరూ లేని అనాధలు కూడా ఇలాగ చేసుకోరు.

అలాంటిది గ్రేట్ ధనుంజయ్ ముద్దుల కూతురు పెళ్లి అంటే ఇంకెలా ఉండాలి అంటుంది.. ఆ మాటకి శిల్పను చూస్తూ ఇంకా ఆపు అన్నట్టుగా చెయ్యి పెట్టి నువ్వు ఇంకా పగటి కలలు కంటూ ఉంటే ఎవరు ఏమీ చేయలేరు.

నువ్వు మైండ్ లో బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ధనుంజయ్ కూతురివి కాదు.  నిన్న అనౌన్స్ చేసిన సరే నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు.  అనాధ అంటున్నావు చూడు అంతకన్నా హీనం నువ్వు.

ఆ మాటకి శిల్ప ఆశ్చర్యంగా చూస్తూ నానమ్మ నువ్వేనా ఇలా అనేది. ఎప్పుడూ నన్ను ముద్దు చేస్తూ గారాబంగా చూసే నువ్వు ఈరోజు ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు.

మీ ప్రవర్తలను బట్టి. ఇన్ని రోజులు నా కొడుకే తన కూతురు విషయంలో సరిగ్గా లేడు అనుకుని బాధపడేదాన్ని.  కానీ నా కొడుకుని తప్పుదారి పట్టించి మీ అమ్మ కూతుళ్లు వేసిన వేషాలకి మీ మొఖాలు చూడాలి అన్నా కంపరంగా ఉంది .

ఏమి మాట్లాడలేక శిల్ప మౌనంగా నడుస్తుంది. ఈ పెళ్లి ఆపాలంటే ఒక్క నాన్న వల్ల అవుతుంది అని స్పీడ్ గా ధనుంజయ్ దగ్గరికి వెళ్లి ప్లీజ్ నాన్న నాకు ఈ పెళ్లి వద్దు అంటుంది.  ఎందుకు వద్దు అని అంతే కోపంగా అడుగుతారు.

పెళ్ళికొడుకు ఎవరో తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను అంటుంది. అవునా మరి అవనికి ఎలా చేశారు మీ అమ్మ కూతుళ్లు.

అమ్మ చేసినట్టుగా నాకు తెలియదు కదా నాన్న అని అమాయకంగా ముఖం పెడితే.. మీ ముసలి కన్నీళ్లు చూసి కరిగిపోవడానికి నేను ఒకప్పటి ధనుంజయ్ ని కాదు.  వెళ్లి పీటల మీద కూర్చో.

నాకు పెళ్లి కొడుకు ఎవరో తెలియదు కదా అని మళ్ళీ రెట్టిస్తుంది.  నీకు ఇప్పుడు పెళ్లి కొడుకు తెలియాలి అంతే కదా అని పెళ్ళికొడుకుని పీటల మీద కూర్చోబెట్టండి అని చెబుతాడు.

పీటల మీద కూర్చున్న వ్యక్తిని చూసి ఉదయ్ అని గట్టిగా అరుస్తుంది. ఉదయ్ తోనే నీ పెళ్లి. నాన్న మీకు కోపం ఉంటే ఇంకొకలాగా తీర్చుకోండి..

పైసా కి పనికిరాని వాడిని పెళ్లి చేసుకుని  నా లైఫ్ అంత నాశనం చేసుకోవాలా... బిందు కోపంగా ఎవరే పైసాకే పనికి రానివాడు.

నిన్ను చేసుకోవడం నా కొడుకు దౌర్భాగ్యం కానీ తప్పక తలవంచాల్సి వచ్చింది అంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అంత కష్టంగా ఎవరు తలవంచమన్నారు.  నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి చేసుకోను అంటుంది.

నీకు ఆప్షన్ లేదు శిల్పా అని ధనుంజయ్ అంటే.. నా పెళ్లి నా అంగీకారంతో జరగాలి అంతేగాని.. మీరందరూ బలవంతం చేస్తే చేసుకోవడానికి నేనేమి చిన్న పిల్లని కాదు. పైగా అవనినీ అంతకన్నా కాదు అంటుంది.

ఆ మాటకి నవ్వుతూ అవునా... ఈ పేపర్స్ చూసి కూడా ఆ మాట చెప్పు అని చేతికి ఇస్తాడు.  అందులో మ్యాటర్ చూసి.. లేదు ఈ సంతకం నేను చేయలేదు.

బాగా గుర్తు చేసుకో. అది నీ సంతకమే. జైలు నుంచి బయటికి తీసుకురావాలి అంటే సంతకం చేయమన్నాను కదా అప్పుడు చేసిందే.

మీరు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు డాడీ అంటుంది. జస్ట్ షట్ అప్..  మీ మోసాలతో పోల్చుకుంటే నేను చేసింది ఏమీ పెద్ద మోసమేమీ కాదు.

అయినా నీలాంటి దానికి ఉదయ్ యే ఎక్కువ. వెళ్లి కూర్చో అన్ని గట్టిగా చెబుతాడు. తనకి తెలియకుండానే తన పెళ్లి రిజిస్ట్రేషన్ అవ్వడం.  అందులో ఇద్దరి సంతకాలు ఉండడం చూసి డైజెస్ట్ చేసుకోలేకపోతుంది.

ఏమీ చేయలేక మౌనంగా వెళ్లి పీటల మీద కూర్చుంటుంది. పెళ్లి సింపుల్గా జరిపించి.. పదండి అని ముందుకి నడుస్తాడు.

శిల్ప.. నా చేతుల్లో నా జీవితం లేదా అని ఆలోచిస్తూ...  ఈ పెళ్లి బయట ఎవరికీ తెలియదు కదా...  మెల్లిగా వీళ్ళ నుంచి ఎస్కేపై వెళ్ళిపోతే సరిపోతుంది అని ఇంకా కుళ్ళి ప్లాన్లు వేస్తూనేఉంటుంది.

వీళ్ళని నలుగురుని సెపరేట్గా ఒక ఆటోలో ఎక్కమని ముందు కారులో ధనుంజయ్ తల్లిదండ్రులు తీసుకుని బయలుదేరుతాడు.

ఆటోలో కూర్చున్న శిల్ప ఎండ మండిపోతుంది అని విసుగ్గా అంటుంది. ఆ మాటకి బిందు సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. సునీల్ కూడా ఏమీ మాట్లాడడు.

పెళ్లి కొడుకు కళ లేని కొడుకుని చూస్తూ ఉంటే సునీల్ కి బిందుకి చాలా బాధగా అనిపిస్తుంది.

కారు ఆటో ఒక ఏరియా దగ్గర ఆగుతాయి. అందరూ దిగి చూస్తూ ఉంటే ఒక పెద్ద జంట అక్కడికి వచ్చి నమస్కారం అయ్యా అని చెబుతారు.

నమస్తే అన్ని ఏర్పాట్లు అయిపోయినాయా అంటే అన్ని అయిపోయినాయి అని తల ఊపుతారు. 

ఏర్పాట్లు???
[+] 11 users Like SivaSai's post
Like Reply
Great update Sivagaru
Like Reply
Part - 110


అన్ని ఏర్పాట్లు పూర్తయినయ్యా అని ధనుంజయ్ అడగగానే.. అయిపోయినాయి అయ్యగారు. ఉదయ్ అని గట్టిగా పిలుస్తే చెప్పండి మావయ్య అని దగ్గరికి వస్తాడు.

నువ్వు నీ భార్య ఇక్కడే ఉండాలి. దానికి తగ్గ ఏర్పాట్లు చేశాను. చుట్టూ చూస్తున్న శిల్ప  వాట్ అని గట్టిగా అరుస్తుంది.

ఎందుకు ప్రతిదానికి అలా అరుస్తావు అని సత్యవతి గారు విసుక్కుంటారు. లేకపోతే ఏమిటి నానమ్మ. ఇక్కడ అసలు ఏముంది. మట్టి తప్ప.

ఇక్కడ ఉండాలి అంట.   ఎలా కుదురుతుంది.. నువ్వే చెప్పు. ఇది ఏ ఊరు కూడా తెలియదు.

ఊరితో నీకేమిటి సంబంధం. మీ మొగుడు పెళ్ళాలకి బ్రతుకుతెరువు నా కొడుకు చూపించిన తర్వాత..

ఉఫ్... నానమ్మ నామీద కోపం ఉంటే ఇంకొకలాగా తీర్చుకోండి అంతేకానీ ఇలాంటి ప్లేసులో అది.. ఆ ఇడియట్ లో కలిసి ఎలా ఉండడం.

మాటలు మర్యాదగా రాని శిల్ప అని బిందు కోపంగా అంటుంది. ఇప్పుడు నేను ఏమన్నానని నీకు అంత కోపం వస్తుంది అత్తయ్య.

నీ కొడుకుని ఎవరు పెళ్లి చేసుకుంటారు. ఇన్ని రోజులు మా మీద పడి బ్రతికినవాడు. రూపాయి కావలసి వచ్చిన అమ్మ దగ్గర తీసుకుని ఎంజాయ్ చేశాడు.

అలాంటి వాడికి ఈ ధనుంజయ్ కూతురు కావాల్సి వచ్చిందా అని పొగరుగా అంటే... ఆ మాటకి బిందు నవ్వుతూ నిజమే...

నా కొడుకు ప్రతి రూపాయి మీ అమ్మ దగ్గరే చేయిచాపాడు.  కానీ వాడికి ఒక ఐడెంటిటీ ఉంది.. బిందు సునీల్ కొడుకు అని.

మరి నీకు ఎలాంటి ఐడెంటిటీ ఉంది. కేవలం భార్గవి కూతురు అని మాత్రమే.  తండ్రి ఎవరో ప్రపంచానికి తెలియనివ్వకుండా చేశారు. అలాగే నీ క్యారెక్టర్ ఏమిటో కూడా మా అందరికీ తెలుసు.

కోపంగా అత్తయ్య అంటుంది.  ఆరవకు ఇప్పటికే నిన్ను చూస్తుంటే కంపరంగా ఉంది. కానీ తప్పదు కాబట్టి భరించాల్సి వస్తుంది.

ఉదయ్ కూడా చుట్టూ చూస్తూ ఉంటాడు. ఏమిటి చూస్తున్నావు.  ఇక్కడ అని నాంచుతూ ఉంటే అవును ఇది మొత్తం 10 ఎకరాల భూమి.

మధ్యలో కనిపిస్తుంది కదా గుడిసె.  అందులోనే మీ భార్యాభర్తలిద్దరూ కాపురం చేయాల్సింది.  కొట్టుకుంటారో.. కలిసి ఉంటారో ఏదైనా మీ ఇష్టం. మీ కాపురం అక్కడే.

ఈ భూమి సాగు చేసుకుని వచ్చిన దానితోనే మీరిద్దరూ బ్రతకాలి. ఒక్క రూపాయి కూడా ఎవరి నుంచి మీరు తీసుకోవడానికి వీలు లేదు.  ఆఫ్కోర్స్ నేను రానివ్వను అనుకో ...

ఇక్కడి నుంచి పారిపోవాలని చూస్తే మాత్రం ఎక్కడ తేలుతారో తెలుసు కదా అనగానే..  ఉదయ్ కి విక్రమ్ గుర్తుకు వస్తాడు.

విక్రమ్ ఇచ్చిన పనిష్మెంట్స్ గుర్తుకురాగానే వణుకుపోతూ లేదు మావయ్య నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను.
శిల్ప ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను.

మిమ్మల్ని ప్రతి నిమిషం ఈ పెద్దవాళ్లు ఇద్దరూ కాపు కాస్తూనే ఉంటారు.  జాగ్రత్త అని చెప్పి..  సునీల్ వైపు తిరిగి మీ జంట ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయ్ ని కలవడానికి వీలు లేదు.

ఎక్కడికి వెళ్లి బ్రతుకుతారో మీ ఇష్టం. బిందు ధనుంజయ్ చేతులు పట్టుకుని ప్లీజ్ అన్నయ్య నా కొడుకుకి దూరంగా మమ్మల్ని ఉంచొద్దు.

ఇన్ని రోజులు వాడు ఎలా ఉన్నాడో తెలియక తల్లడిల్లిపోయాను.  వాడి అవతారం చూసావా.. ఏదో ప్రాణం ఉంది అన్నట్టు ఉన్నాడు గాని..  మనుషి లో జీవం లేదు.

నా బిడ్డని ఇంతకన్నా దారుణంగా చూశారు కదా బిందు. అప్పుడు తెలియలేదా మీకు ఈ బాధ...
గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఆ తప్పులు చేసాము. ఇప్పుడు పశ్చాతాపంతో కుంగిపోతున్నాము.  కరుణించు అన్నయ్య.

కరుణించాను కాబట్టే నీ మొగుడిని జైలు నుంచి బయటికి తీసుకువచ్చాను. లేదు అంటే నా రజిత ప్రాణాలు పోవడానికి సహాయం చేసిన నీ మొగుడు ప్రాణాలు తీసే వాడిని అని కళ్ళు ఎర్రచేస్తాడు.

ధనుంజయ్ కోపానికి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది.  సునీల్ బిందు చేతులు పట్టుకుని ఆపి నువ్వు చెప్పింది నిజమే బావ అనగానే.. కాల్ మీ ధనుంజయ్ గారు..  నాట్ బావ అంటాడు.

ఆ మాటకి సునీల్ మొఖం వాడిపోతుంది.  అలాగే ధనుంజయ్ గారు నా భార్య తెలియక ఏదో అడిగింది. మీరు అన్నట్టేగానే ఆ కొత్త జంటకు మేము దూరంగానే ఉంటాము.

మా వలన ఇంకా ఎవరికీ ఎటువంటి హాని జరగదు. మేము బయలుదేరతాము అని నమస్కారం చేస్తాడు. వెళ్ళండి అన్నట్టుగా ధనుంజయ్ చూస్తే... ఉదయ్ నాన్న అని వచ్చి కౌగిలించుకుంటాడు.

కొడుకు చుట్టూ చేతులు వేసి జాగ్రత్త... కొన్ని తప్పులుకి క్షమాపణ ఉండదు.  ప్రాయశ్చిత్తం చేసుకుందాము అన్న అవకాశం ఉండదు.

మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా ఉండు అని చెప్పి భార్య చేయి పట్టుకుని గమ్యం తెలియని ప్రయాణం వైపు అడుగులు వేస్తాడు.

శిల్ప వైపు తిరిగి చూడు నువ్వు ఒక ఆడపిల్లవి అన్న దయతోనే నిన్ను వదిలేస్తున్నాను.  బుద్ధిగా కాపురం చేసుకుంటే నీకే మంచిది.

ఈ పెళ్లి ఎవరికీ తెలియదు.  ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనుకుంటావేమో.. నీకు అంత ఛాన్స్ లేదు.  నీ మొగుడిని అడుగు నువ్వు ఎవరి కంట్రోల్లో ఉన్నావో అని. వెళ్దాం పదమ్మ అని తల్లిదండ్రులని తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోతాడు.

దుమ్మురేపుకుంటు వెళుతున్న కారును చూస్తూ ఉండిపోతుంది. మరో పక్క బిందు సునీల్ కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ ఉదయ్,  శిల్ప, పెద్ద వాళ్ళిద్దరూ మాత్రమే మిగులుతారు.

పెద్దావిడ శిల్ప వైపు చూసి ఎంతసేపు చూసినా కాలం ముందుకు వెళుతుంది గాని వెనక్కివెళ్ళదు పద అని.  బాబు అమ్మాయి చేయ పట్టుకుని నడవండి అని గుడిసె దగ్గరికి తీసుకు వెళుతుంది.

బొమ్మలాగా ఉదయం వెనకాలే వెళుతుంది.  కుడి కాలు పెట్టి లోపలికి వెళ్ళండి అని చెప్పి గుడిసె లోపలికి పంపిస్తుంది.

లోపలికి వెళ్లిన శిల్ప చుట్టూ చూస్తూ ఉంటుంది. ఒక పక్కన చిన్న కట్టెల పొయ్యి కనబడుతుంది.  నాలుగు గిన్నెలు ఉంటాయి.

మరొక పక్కన పడుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇది మనుషులు ఉండేదేనా.. ఇందులో ఎలా ఉండాలి.నా బెడ్ రూమ్ అంత లేదు. ఇందులోనే కిచెన్,  బెడ్ రూమ్ అన్ని వచ్చేసాయా..

ఇవే ఎలా ఉన్నాయంటే ఇంకా వాష్ రూమ్ ఎలా ఉంటుందో అని భయపడుతుంది.

శిల్ప భయాన్ని చూసి ఆ పెద్దావిడ ఏమైందమ్మా అంటే.. వాష్ రూమ్ కి వెళ్ళాలి అని మెల్లిగా చెబుతుంది. పద బయటికి తీసుకువెళ్తాను అని గుడిసె మరో పక్కకి తీసుకు వెళుతుంది.

అక్కడ స్నానానికి సపరేటుగా.. వాష్ రూమ్  సపరేటుగా ఉండి  బయట కుండి నిండా నీళ్లు ఉంటాయి. ఈ కుండీలో నీళ్లు పట్టుకుని ఆ వాష్ రూమ్ లోకి వెళ్ళు అని చూపిస్తుంది.

ఓ మై గాడ్ అనుకుంటూ... ఇక్కడ నా జీవితం జైలు జీవితం లాగానే ఉంది అనుకొని తప్పక..  కష్టంగా ఒక బకెట్ వాటర్ తీసుకుని వెళుతుంది.

బయటికి వచ్చిన శిల్ప తో ఆ పెద్దావిడ వంట ఎలా చేసుకోవాలో చూపిస్తాను రా అని తీసుకువెళ్లి.. ఈరోజుకి నేను చేసి పెడుతున్నాను.

రేపటి నుంచి మీ ఇద్దరి తిప్పలు మీరే పడండి. అలాగే ఏ రోజు మీరు పని చేస్తే ఆ రోజుకి సరిపడా సరుకులు మీకు అందుతాయి.

చీకటి పడింది అని  లాంతరు వెలిగిస్తారు.  ఈ లాంతరు వెలుగులోనే మేము ఉండాలా.. ఒక ఫ్యాను కూడా లేదు ఎలా ఉండాలి.  ఆ మాటకి పెద్ద వాళ్ళు ఇద్దరూ నవ్వుతారు .

శిల్పా చుట్టూ చూస్తూ ఇక్కడేం పని చేయాలి. ఆ మాటకి పెద్దాయన నవ్వుతూ.. చేయడానికి చాలా పని ఉందమ్మా. రేపటి నుంచి చూపిస్తాం కదా..

కోడి కూసే వేళ వచ్చి నిద్ర లేపుతాము. మాటల్లోనే వంట పూర్తి చేసి..  ఉదయ్,శిల్పాకి పెట్టి..  పెద్ద వాళ్ళు ఇద్దరు కూడా భోజనం చేస్తారు.

పొద్దున్నుంచి ఆకలితో ఉన్న శిల్ప ఆవురావు మంటూ తింటూ ఉంటుంది. ఉదయ్ మాత్రం కేలుకుతూ ఉంటే.. చూడు బాబు అన్నం పరబ్రహ్మ స్వరూపం.

ఇంతకుముందు నీ జీవితం ఏంటో మాకు తెలియదు. ఈ రోజు నుంచి నువ్వు తినే ప్రతి మెతుకు నీ కష్టార్జితం మాత్రమే.  అది గుర్తుపెట్టుకుని భోజనం పాడేయకుండా తిను అని చెబుతారు.

అందరూ భోంచేసిన తర్వాత ఇక మేము వెళతాము అని పెద్ద వాళ్ళిద్దరూ బయలుదేరితే.. మీరు ఎక్కడుంటారు అంటే... నవ్వుతూ మేము ఎక్కడ ఉన్నా సరే  మీ ఇద్దరినీ మేము చూస్తూనే ఉంటాము అని అక్కడ నుండి వెళ్లిపోతారు.

వెళుతున్న పెద్ద వాళ్ళిద్దర్నీ చూస్తూ చాలా సేపు శిల్ప నిలబడిపోతుంది. ఉదయ్ ఏమి మాట్లాడకుండా అక్కడ ఉన్న చాపను పరిచి శిల్ప అని పిలుస్తాడు.

ఏమిటి అని బయటికి చూస్తూనే అడుగుతుంది.  ఎంతసేపని అలా నిలబడతావు వచ్చి పడుకో. కోపంగా చూస్తూ నేను నీ పక్కన పడుకోవాలా..  ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు హా అని అరుస్తుంది.

ఇంకా ఆపు అన్నట్టుగా ఉదయ్ చేయి చూపించి నీలాంటి దాని పక్కన ఎవరూ పడుకోవాలి అని కోరుకోరు. కానీ నీ బాధ్యత నా మీద ఉంది.  అందుకే పట్టించుకుంటున్నాను.

  ఎంతసేపు నిలబడతావో నీ ఇష్టం.  పొద్దున్నే ఆ పెద్ద వాళ్ళు వచ్చి మనల్ని లేపి పనులు చేపిస్తారు.  అవి చేయడానికి అయినా ఓపిక ఉండాలి కదా...

నాలాంటి దాని పక్కన అంటే ఏమిటి నీ అర్థం ఉదయ్ అని దగ్గరకు వచ్చి అడుగుతుంది.  ఆ మాటకి నవ్వుతూ నీ క్యారెక్టర్ ఏమిటో నాకు తెలియదా..

అవకాశాలు కోసం నువ్వు ఎలా దిగజారిపోయావో నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు.  అఫ్కోర్స్ నేను ఏమి మంచివాడినే కాదనుకో.  నీ తిరుగుళ్ళు నీకుంటే నా తిరుగుళ్ళు నాకు ఉన్నాయి.

కానీ ఇప్పుడు వేరు. ఇప్పటి నుంచైనా నువ్వు పద్ధతిగా ఉంటే నీకే మంచిది. మీ నాన్న కాబట్టి కూతురు అన్న మమకారంతో ఇంతవరకే నీకు పనిష్మెంట్ ఇచ్చాడు.

అదే విక్రమ్ చేతిలోకి వెళ్లావు అంటే నా...  నరకం స్పెల్లింగ్ దగ్గరుండి మరీ రాయిపిస్తాడు.

కథ కొనసాగుతుంది..
[+] 13 users Like SivaSai's post
Like Reply
(23-02-2026, 10:12 AM)SivaSai Wrote: Part - 109


... 

ఏర్పాట్లు???

Shilpa ki Uday tho tholireyi ki erpatlu??
Like Reply
(23-02-2026, 10:19 AM)SivaSai Wrote: Part - 110


...

అదే విక్రమ్ చేతిలోకి వెళ్లావు అంటే నా...  నరకం స్పెల్లింగ్ దగ్గరుండి మరీ రాయిపిస్తాడు.

కథ కొనసాగుతుంది..

Wow!!
yerpatlu ante.. ilaa untundi ani .. konchem kooda oohinchaledu!!
Awesome update Sivagaru!! Beyond the expectations!! thanks thanks
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Nice update
Like Reply
Part - 111


విక్రమ్ గుర్తుకు రాగానే శిల్ప కి కూడా భయం మొదలవుతుంది.  అది ముఖంలో స్పష్టంగా కనపడుతుంటే.. ఉదయ్ నవ్వుతూ అర్థమయింది కదా..  ఇదే భయాన్ని మెయింటైన్ చేస్తే నీకే మంచిది.

వెళ్లి పడుకో అని ఉదయ్ పడుకుని కళ్ళు మూసుకుంటాడు. శిల్ప కొంచెం దూరంగా పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది.

విక్రమ్ గుండెల పై పడుకున్నా అవని డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఏమైందిరా అని జో కొడుతూ ఉంటాడు.  అయినా ఏదో కలవరపాటు.  ఉలిక్కిపడి లెగుస్తుంది.

భయంగా కంగారుగా చూస్తూ ఉంటే విక్రమ్ లైట్ వేసి వాటర్ చేతికిస్తాడు. అవని ఆ వాటర్ తీసుకోకుండా కంగారుగా చూస్తూ ఉంటే పక్కన కూర్చుని వాటర్ మెల్లిగా తాగిస్తాడు.

కొంచెం వాటర్ తాగిన తర్వాత మెల్లిగా సర్దుకుంటుంది. స్తిమిత పడింది అనుకున్నాక ఏమైందిరా అని అడుగుతాడు.

ఆ గొంతు అని వణుకుతూ అడుగుతుంది. విక్రమ్ అనుమానంగా ఏ గొంతు అని అడిగితే..  యాన్యువల్ డే రోజున నేను ఆ గొంతు విన్నాను అంటుంది.  ఏ గొంతు రా అని తన వైపుకు తిప్పుకొని అడుగుతాడు.

శిల్ప...

వాట్ శిల్పనా...  హా అవును.   నువ్వెక్కడ విన్నావు. అదే గుర్తుకు రావడం లేదు అని కణతల మీద   చేతితో రుద్దుకుంటూ కళ్ళు మూసుకుంటుంది.

ఎక్స్క్యూజ్మీ మామ్ తీసుకోండి అన్నమాట గుర్తొచ్చి.. హ వెరైటీ డ్రెస్ వేసుకొని మనకి సర్వ్ చేయడానికి వచ్చింది కదా తనే శిల్ప అంటుంది.

శిల్ప అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు.  ఎవరో మనకేం తెలుసు అని ఏ మార్చడానికి చూస్తాడు.  లేదండీ నేను ఆ గొంతు ఎక్కడ ఉన్న గుర్తుపట్టగలను.

ఆ తల్లి కూతుర్లు ఎలాంటి వాళ్ళో నాకన్న బాగా ఎవరికీ తెలియదు. శిల్ప అక్కడే ఉంది అంటే ఆ భార్గవి కూడా బయటే ఉండి ఉంటుంది.

ఆ మనిషి మనకి అబద్ధం చెప్పాడా..  ఇప్పటికీ నన్ను మోసం చేయడానికి చూస్తున్నాడా ఎమోషనల్ అయిపోతూఉంటుంది.

అవని కూల్..  వాళ్లు జైల్లోనే ఉన్నారు. లేదు....
  లేదు..  నేను ఆ గొంతు గుర్తుపట్టాను.  మీకు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు.

20 సంవత్సరాలుగా వాళ్లతోనే ఉన్నాను కదా... వాళ్ళ కృయాలిటీ కూడా నాకే బాగా తెలుసు. వాళ్లు స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారు.

పక్కనే భర్త ఉన్నా సరే అవని భయపడుతూ ఉంటే విక్రమ్ కి అనుమానం వచ్చి నిన్ను ఇంకా ఏమైనా చేశారా అని అడుగుతాడు.

హ.. అని భయంగా తలూపుతుంది. నాకు చెప్పురా అంటే ఇంకా సంఘటన గుర్తు వచ్చి వణుకుపోతూనే ఉంటుంది. అవని టెన్షన్ తగ్గించడానికి పెదవులు అందుకుంటాడు.

ఆ ముద్దు పెరుగుతున్న కొలది అవనిలో భయం తగ్గి మెల్లిగా కుదుటపడుతూ ఉంటుంది. పూర్తిగా కుదుటపడింది అన్నాక మెల్లిగా ఒళ్ళు కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పరా ఏమైంది.

అవిని చెప్పడం మొదలుపెడుతుంది.

గదిలో చదువుకుంటున్న అవిని దగ్గరకి భార్గవి వస్తుంది. ఏం చేస్తున్నావ్ అని అడిగితే.. చదువుకుంటున్నాను మేడం అంటుంది.

అవునా...  ఈరోజు శిల్ప బర్త్డే అంటుంది. ఓ అని సైలెంట్ గా నిలబడుతుంది. ఏంటి అలా నిలబడ్డావు. రెడీ అవ్వు గెస్ట్ లందరూ వస్తున్నారు.

భార్గవి మాటకి అవని ఆశ్చర్యంగా చూస్తుంది.   ఊహ తెలిసినప్పటి నుంచి ఏ రోజు ఏ పార్టీ లోను కలవనివ్వలేదు.

బంధువులు ముందుకి తీసుకువెళ్లలేదు.  అలాంటిది ఇప్పుడు పనిగట్టుకుని మరి పార్టీకి తీసుకు వెళుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

సోరి మేడం..  నాకు వర్క్ ఉంది. నీ వర్క్ ఎప్పుడు ఉండేదే... ఇది సార్ ఆర్డర్ అంటుంది. ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ పదండి మేడం అంటుంది.

ఏంటి ఈ డ్రెస్ తోనే వస్తావా? మన ఇంట్లో సర్వెంట్స్ కూడా ఇంతకన్నా మంచిదే వేసుకుంటున్నారు. వెళ్లి ఇంకో డ్రెస్ వేసుకో... నా దగ్గర ఇవే ఉన్నాయి మేడం.

ఒక్క నిమిషం ఉండు అని బయటికి వెళ్లి లోపలికి వస్తుంది.   శిల్పది  ఈ డ్రెస్సు. ఈ ఫ్రాక్ వేసుకుని రా అంటుంది.

వద్దు మేడం నావి నాకు చాలు.  వేరే వాళ్ళు వాడినవి వేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటుంది.  ఈ పొగరుకేమీ తక్కువ లేదు.

వేసుకోమన్నప్పుడు వేసుకో లేకపోతే తర్వాత నేను ఇచ్చే పనిష్మెంట్స్ నువ్వు తట్టుకోలేవు. ఆ మాటకి అవని మీరు ఎలాంటి పనిష్మెంట్స్ ఇచ్చానా నాకు పరవాలేదు కానీ..  ఒకరు వాడినవి నేను వాడను. నాకున్న నాలుగు జతలే నాకు చాలు అని కరాకండిగా చెప్పేస్తుంది.

నాకు ఎలా ఉన్నా నేనేమీ ఇబ్బంది పడను మేడం. పదండి.  నువ్వు ఇబ్బంది పడకపోవచ్చు కానీ నలుగురిలో మా పరువు ఏమి కావాలి.

పరువు అని నవ్వుతూ.. ఇప్పుడు మాత్రం మీరు నన్ను ఇంటి మనిషిగా పరిచయం చేస్తారు అని నేను అనుకోవడం లేదు అంటుంది.

గుడ్ బానే తెలుసుకున్నావే మీ నాన్న గురించి.  అవును.. నాకు గాని, మీ నాన్నకు గాని ఇష్టం లేదు. మరి ఇంకెందుకు మేడం కాస్ట్లీ బట్టలు వేసుకోవడం.

మా ఇంటి పనిమనిషి అని చెప్పుకోవడానికి అయినా రేంజ్ కావాలి కదా అంటుంది.  పనిమనిషి అని నవ్వుకొని..  అనాధ అని చెప్పండి. అప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు కదా...

ఏమి చెప్పాలో నాకు తెలుసు గానీ ఇప్పుడే వస్తాను అని వెళ్లి ఒక చీర తీసుకుని వస్తుంది.  ఇది కొత్త చీరే.. ఇది కట్టుకో అని ఇస్తుంది.

ఆ చీర వైపు,భార్గవి వైపు చూస్తూ ఉంటుంది. ఏమిటా చూపు. మీ ప్రవర్తన ఎందుకో చాలా తేడాగా ఉంది. నిన్ను నలుగురిలోకి తీసుకు వెళుతున్న నీకు అనుమానమేనా...

వెళ్లి రెడీ అవ్వు. పది నిమిషాల్లో వస్తాను. ఈలోపు ఆ చీర కట్టుకొని ఇదిగో ఈ పువ్వులు కూడా పెట్టుకొ... కవర్ అక్కడ పెడుతుంది.

చేసేదేమీ లేక అవని చీరకట్టుకుని పువ్వులు పెట్టకూని రెడీ అవుతుంది.  భార్గవి వచ్చి బానే ఉన్నావు.  నిన్ను ఎవరైనా చూస్తే ఎగరేసుకుపోతారు.

ఎవరితో పడితే వాళ్లతో వెళ్లి మా పరువు తీయకు పదా అని తీసుకు వెళుతుంది. ఏమిటో అన్ని వీళ్ళే అనేసుకొని..  మళ్లీ ఆ తప్పేదో నేను చేసేస్తున్నాను అన్నట్టుగా నన్ను తిడతారు.

ఫంక్షన్ జరిగే చోటకి వెళుతుంటే అటుక్కడికి అని భార్గవి ఆపేస్తుంది ఫంక్షన్ అక్కడే కదా.. నువ్వు వెళ్లాల్సింది  అటు కాదు.

నవ్వుతూ అనుకున్నాను. మీరు ఏంటా..  నన్ను ఫంక్షన్ దగ్గరికి తీసుకెళ్లడం ఏమిటా.. భార్గవి కోపంగానే.. ఏమిటే నోరు ఎక్కువ లెగుస్తుంది.

మా వారితో చెప్పి ఇంకా గట్టిగా పనిష్మెంట్ ఇప్పించాలా.. ఇంతకన్నా పనిష్మెంట్స్ ఏముంటాయిలేండి. సరే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను వెళ్ళండి.

ఇక్కడ కాదు అని పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ చూపించి మీ నాన్న, శిల్ప అక్కడే ఉన్నారు.  నిన్ను అక్కడికే రమ్మన్నారు వెళ్ళు అంటుంది.

అక్కడకా అని అనుమానంగా చూస్తుంది.  ఎందుకు అలా చూస్తున్నావు.  గెస్ట్ లందరు ఇక్కడే ఉన్నారు కదా..  అక్కడ చూస్తే లైటింగ్ కూడా ఉన్నట్టు లేదు అని అనుమానంగా అడుగుతుంది.

భార్గవి మాట్లాడేలోపు ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ కాల్ చూసి నవ్వుతూ ఇదిగో ఫోన్ చేసింది మీ నాన్నగారే అని చూపించి లిఫ్ట్ చేసి  పంపిస్తున్నాను అని చెబుతోంది.

ఇంకా వెళ్ళు అని చెబితే చేసేదేమీ లేక గెస్ట్ హౌస్ కి వెళుతుంది. అవని గెస్ట్ హౌస్ లోపలికి వెళ్లేటప్పుడు అక్కడ నలుగురు అబ్బాయిలు డ్రింక్ చేస్తూఉంటారు.

వాళ్ళని చూడగానే చాలా భయం వేస్తుంది. వెనక్కి వచ్చేయపోతే అవని ఆగు అంటారు.  మీకు నా పేరు ఎలా తెలుసు అని భయంగా అడుగుతుంది.

నీ గురించి మాకు అన్నీ తెలుసు వచ్చి డ్రింక్ సర్వ్ చెయ్ అని కమాండింగా చెబుతారు. ఏమిటి నేనా అని ఆశ్చర్యంగా అడిగితే...

నువ్వు వాళ్ళింట్లో పనిమనిషివే కదా.. సర్వే చేయడానికి ఏమిటి నీ బాధ అంటే...  మాటలు మర్యాదగా రానివ్వండి. ఈ విషయం సార్ కి తెలిస్తే... ఎవరు ధనుంజయ్ కా.. ఆయనే కదా నిన్ను ఇక్కడికి పంపించింది.

ఏం మాట్లాడుతున్నారు..  మాట్లాడడానికి  ఏముంది.  ఇప్పుడు మాకు డ్రింక్ సర్వ్ చేసిన తర్వాత... నువ్వే మమ్మల్ని ఖుషి చేస్తావు కదా అని వెకిలిగా నవ్వుతారు.

వాళ్ల ప్రవర్తనకి వణికిపోతూ నాన్న దిగజారి పోయారా అనుకుని నేను అలాంటి అమ్మాయిని కాదు అంటుంది. నువ్వు ఎలాంటి అమ్మాయివి అన్నది మాకు అనవసరం.

శిల్పకీ బెనిఫిట్ అయింది. నిన్ను మాకు గిఫ్ట్ కింద ఇచ్చారు కాబట్టి మూసుకొని చెప్పింది చెయ్యి అని ఒకడు చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు.

వాడి నుండి పక్కకి తప్పుకుని నన్ను టచ్ చేస్తే మీకు మర్యాదగా ఉండదు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. ఏంటే కోడి పిల్ల నువ్వే మాకు వార్నింగ్ ఇస్తున్నావా...

ఇక్కడ అరిచి గీ పెట్టిన కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. మర్యాదగా మాకు కోపరేట్ చెయ్. నువ్వు ఎంజాయ్ చెయ్. మమ్మల్ని సుఖపెట్టు.

చావనైనా చస్తాను గాని అలాంటి నీచపు  పనులు మాత్రంచేయను.  అవునా చచ్చేముందు అయినా సరే నీలాంటి ఫిగర్ ని ఒక్కసారి అయినా సొంతం చేసుకోవాలి.

అప్పుడే మా వయసుకి.. నీ అందానికి న్యాయం చేసిన వాళ్లమవుతాము...  నలుగురు నవ్వుతూ ముందుకు వస్తూ ఉంటారు.

తప్పించుకోవాలని చుట్టూ చూస్తుంది. అక్కడ ఒక ఫ్లవర్ వాస్ కనపడితే అది తీసుకొని దగ్గరికి వచ్చారంటే మాత్రం దీనితో మీ తలబద్దలు కొట్టేస్తాను అని భయపెడుతోంది.

ఏమిటే కోడిపిల్ల.. నువ్వు భయపెడితే మేము భయపడిపోతామా... ఇలాంటివి మేము ఎన్ని చూసి ఉంటాము అని ముందుకు వస్తుఉంటారు.

అవని బలమంతా ఉపయోగించి ఒకడిని గట్టిగా ఫ్లవర్ వాస్ తో కొడుతుంది.  వాడు తల మీద చెయ్యి వేసుకుని అబ్బా అని గట్టిగా అరుస్తాడు.

మిగిలిన ముగ్గురు వాడి దగ్గరికి వెళ్లి ఒరేయ్ ఏమైంది రా..  అది చంపేసింది రా.. వెళ్లి పట్టుకోండి ఈ రోజు దానికి నరకం చూపించాలి.

అవని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బయటికి పరుగుపడుతుంది..

అవని పరుగు...
[+] 11 users Like SivaSai's post
Like Reply
Part - 112


అవని బయటకు పరుగుపెడుతూ ఉంటే మిగిలిన ముగ్గురిలో ఒకడు పక్కనే పడిఉన్న ఫ్లవర్ వాస్ తో కొడతాడు.

అది తలకి తగిలి అమ్మ అని గట్టిగా అరుస్తుంది. ఒక్క నిమిషం తలంతా దిమ్మ తిరిగిపోయినట్టు ఉండి ఎటు కదలులేక పోతుంది.

వాళ్లు దగ్గరికి వస్తూ ఉంటే ఓపిక లేకపోయినా ముందుకు అడుగులు వేస్తూ ఉంటుంది.  దొరికిపోతానేమో అని భయపడుతూ ఉన్నప్పుడు ఒక చెయ్యి గట్టిగా పట్టుకుని పక్కకి లాగేస్తుంది.

అరవపోతుంటే నోరు మూసి అమ్మాయిగారు నేనే అని ఒక సర్వెంట్ చెబుతుంది. ఆ సర్వెంట్ ని  పట్టుకుని నాకు చాలా భయంగా ఉంది.

మీరు కంగారు పడకండి అని చెప్పి సర్వెంట్ క్వార్టర్స్ లో తన రూమ్ కి తీసుకువెళ్లి మీరు ఈ గదిలోనే ఉండండి బయటికి రావద్దు అని గదిలో పెట్టి బయట లాక్ చేసేసి వెళ్ళిపోతుంది.

లైట్ వేస్తే వాళ్ళకి ఎక్కడ తెలుస్తుందో అని ఏడుపు పైకి రానివ్వకుండా నోటికి చేతులు రెండు అడ్డుపెట్టుకొని ఒక మూలకి కూర్చుని బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉంటుంది.

వాళ్ల నలుగురు వెతికి మిస్ అయింది అని శిల్ప కి కాల్ చేసి చెబుతారు. పార్టీ అయ్యి అందరూ వెళ్లిపోయిన సరే అవని ఆ రూమ్ నుంచి బయటకు రాదు.

అందరూ పడుకున్నా తర్వాత సర్వెంట్ మెల్లిగా తలుపు తీసి అమ్మాయి గారు అని పిలుస్తుంది. వెంటనే ఆ సర్వెంట్ దగ్గరకు వెళ్లి వాళ్లు వెళ్లిపోయారా..

తెలియదమ్మా కానీ ఈ రాత్రికి మీరు ఇక్కడే సర్దుకోండి. పొద్దున్నే వెలుగు వస్తుంది కదా.. అప్పుడు భయం ఉండదు.

అలాగే అని ఒక పక్కకి కూర్చునిఉంటుంది. ఎంతసేపని అలా కూర్చుంటారు అమ్మాయిగారు.. ఇలా పడుకోండి. పరవాలేదు. పొద్దుటనుంచి నువ్వు అలిసిపోయినట్టు ఉన్నావు కదా..

నువ్వు పడుకో.  నాకు నిద్ర రావడం లేదు. నిద్ర రాకపోయినా సరే.. నడుము వాల్చండి. మనిద్దరం అడ్జస్ట్ అవుదాము అని ఇద్దరూ పడుకుంటారు.

పడుకుంటే ఎక్కడ వాళ్ళకి దొరికిపోతానేమో అన్న భయంతో అవని ఆ రాత్రి జాగారమే చేస్తుంది.  వెలుగు రేఖలు వచ్చిన తరువాత మెల్లిగా లేచి బయటకు వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది.

పార్టీ అయిపోయిన ఆనవాళ్లు కూడా లేకుండా రాత్రి మొత్తం అంతా క్లీన్ చేసేస్తారు.  సో అంత ఫ్రెష్ గానే కనిపిస్తుంది.  అయితే వీళ్ళు వెళ్ళిపోయిఉంటారు అన్న ధైర్యంతో ఇంట్లోకి వెళుతుంది.

ఆగు అన్నమాట గట్టిగా వినిపిస్తుంది ఆ మాట వినిపించిన వైపు కోపంగా చూస్తుంది. రాత్రంతా ఎక్కడికి వెళ్లావు అవని అని ధనుంజయ్ అడిగితే..

మీకు తెలియదా అని మొదటిసారి ఎదురు తిరిగి ప్రశ్నిస్తుంది. కూతురులో ఎప్పుడూ కనపడేనని తెగింపు చూస్తూ ఉంటే ధనుంజయ్ కి చాలా ఆశ్చర్యం వేస్తుంది.

అవని దగ్గరకి వచ్చి నువ్వెక్కడికెళ్లావో నాకెలా తెలుస్తుంది.  పార్టీకి అటెండ్ అవ్వమంటే అవ్వవు. ఇంట్లో ఉండకుండా అర్థరాత్రి బయటికి వెళ్లావు.

ఆడపిల్లలు అలా వెళితే ప్రస్తుత రోజుల్లో సేఫ్టీ ఉందా అని అడుగుతాడు.. ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ మీరు నా సేఫ్టీ గురించి కూడా ఆలోచిస్తున్నారా..  ఇది ఎప్పటి నుంచి.

అవని అని గట్టిగా అరుస్తారు ఎందుకు మీరు అరుస్తున్నారు. మీరు చేసిన చండాలం ఎక్కడ బయట పడుతుందో అని నామీద అరుస్తున్నారా..

మీకు నేను ఏం అన్యాయం చేసానని నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు. నేను ఆడుకోవడమేమిటి అని మొదటిసారి కూతురి చెయ్యి పట్టుకుని అడుగుతాడు.

అవని చెప్పేలోపు అమ్మ అన్న గట్టిగా సౌండ్ వినపడుతుంది. వెంటనే ధనుంజయ్ అవని చేతిని వదిలేసి ఆ సౌండ్ వచ్చిన దగ్గరికి పరుగు పెడతాడు.

సత్యవతి గారు పడిపోయిఉంటారు.  ఏమైందమ్మా... తెలియదు రా కాలు జారింది.  తల్లిని మెల్లిగా లేపి చూసుకోకుండా ఎలా  నడిచావు.

జాగ్రత్తగానే వచ్చాను. అక్కడే కొబ్బరినూనె ఎలాగ పడి ఉందో తెలియదు. ఇక్కడ కొబ్బరినూనె వలకడమేమిటి..  సర్వెంట్స్ ని పిలిచి కోప్పడి అదంతా క్లీన్ చేపిస్తాడు.  తల్లి గొడవలో పడి ఇంక అవిని సంగతి వదిలేస్తాడు.

శిల్ప అవని దగ్గరకు వచ్చి ఏంటి నువ్వు మా డాడీని ఎదురించి మాట్లాడే అంత గొప్ప దానివి అనుకుంటున్నావా..

మా డాడీకి తెలియదా నైట్ ఏం జరిగిందో... ఏమిటో.. ఇంకొకసారి నువ్వు ఇలా క్యూస్షన్ చేసినట్టు తెలిసిందనుకో ఫుల్లుగా డ్రగ్స్ ఇచ్చి నాకు తెలిసిన పబ్లో వదిలేస్తాను. తర్వాత నీ సంగతి మొత్తం అన్ని వెబ్సైట్లో వైరల్ అవుతుంది జాగ్రత్త.

నీకు నేను ఏమన్యాయం చేశాను శిల్ప. నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. నువ్వు నాకన్నా అందంగా ఉంటానన్న పొగరు ఉంది కదా...  అది నాకు నచ్చలేదు.

వాళ్ళు నా ఫ్రెండ్స్.  వాళ్లకి నువ్వు నచ్చావు.  నిన్ను వాళ్లకి ఇస్తే నాకు కావాల్సింది చేస్తాను అన్నారు.  సో నా బెనిఫిట్స్ నాకు ఇంపార్టెంట్ కదా అని పొగరుగా చెబుతుంది.

నీ బెనిఫిట్స్ కోసం నా జీవితాన్ని బలి చేయాలనుకున్నావా.. ఇందులో బలి చేయడమేముంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు.  నువ్వు ఎంజాయ్ చేస్తావు.

అందం ఉన్నది అనుభవించడానికి కానీ మడికట్టుకుని కూర్చోవడానికి కాదు కదా.. ఇంకా ఆపు శిల్ప. నువ్వు ఎలా తిరిగినా ఏం చేసుకున్నది పూర్తిగా నీ కుటుంబానికి సంబంధించిన విషయం.

ఇంకొకసారి నా విషయంలో కానీ..  నా జీవితానీకి సంబంధించిన గాని మీరు ఏమైనా ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇస్తాను.

తర్వాత పరువు పోయింది ఇంకొకటి ఇంకొకటి అన్న నాకు ఎటువంటి సంబంధం లేదు జాగ్రత్త అని వెళ్ళిపోతుంది.  ఎప్పుడు ఎదురు మాట్లాడని అవని నీ ఆశ్చర్యంగాచూస్తూ....

తల్లి దగ్గరికి వెళ్లి ఏంటమ్మా ఇంత పొగరుగా మాట్లాడుతుంది. మాట్లాడక ఏం చేస్తుంది. రాత్రి వాళ్ళకి పూర్తిగా సరెండర్ అయిపోయి ఉండి ఉంటే.. ఈపాటికి తప్పుడు తిరుగుడు తిరిగింది అని బయటికి గెంటేసేదాన్ని.

అ ఆవకాశం లేకుండా తప్పించుకుంది కదా అందుకనే మాట్లాడుతుంది.  ప్రస్తుతానికి ఈ విషయాలు ఏమీ నువ్వు మాట్లాడకు. రెట్టించకు.

మీ నాన్నగారు మళ్ళీ అవనితో మాట్లాడకుండా హ్యాండిల్ చేయి.  ప్రస్తుతానికి ఏదో మీ నానమ్మని పాడేసి మీ నాన్నగారిని డైవర్ట్ చేశాను.  అన్నిసార్లు అలా జరగదు కదా అంటుంది. ఓకే మామ్ అని చెప్పి రూమ్ కి వెళ్ళిపోతుంది.

( అవినికి తెలిసిన దానితోపాటు మన స్టోరీకి అవసరమైనది కూడా ఇక్కడ పొందపరచబడినది)

జరిగింది చెప్పి విక్రమ్ భుజం పైన తలవాల్చుతుంది. అది విన్న విక్రమ్  కోపం స్పీడోమీటర్ దాటేస్తుంది.  ప్రళయకాల రుద్రుడు వలె ఊగిపోతూ ఉంటాడు.

తన కోపం భార్య చూసింది అంటే తట్టుకోలేదు అని కంట్రోల్ చేసుకుంటూ తలపైన చేతితో సవరదీస్తూ..  ఏమి అవలేదు కదా నేను ఉన్నాను అంటాడు. 

వాళ్ల గురించి మీకు తెలియదండి.  వాళ్లు చాలా క్రూరులు. వాళ్ల స్వార్థం కోసం ఎంతకైనా దిగజారిపోతారు.  తన గొంతు విన్న దగ్గరి నుంచి నాలో ఏదో తెలియని భయం మొదలయ్యింది అని భర్త చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది.

శిల్ప గురించి నిజం తెలిస్తే కానీ అవనిలో భయం తగ్గదు అని నీకు ఒక విషయం చెప్పాలి బంగారం అంటాడు. ఏమిటండి .. శిల్ప కి పెళ్లి అయిపోయింది అంటాడు.

ఏమంటున్నారు మీరు అని  తల పైకెత్తి  అడుగుతుంది. అవును ఈరోజు పొద్దుటే ఉదయ్ తో పెళ్లి జరిగింది.  మీరేం చెబుతున్నారో నాకు ఏమీ అర్థం కావడం లేదు.

నీకు కొన్ని విషయాలు చెప్పాలి అని...  ఉదయ్ ని తను ఎలా హ్యాండిల్ చేశాడో... తర్వాత  శిల్ప ని జైలు నుంచి తీసుకువచ్చిన తరువాత యాన్యువల్ డే రోజున ఎలాంటి వర్క్ చేపించారో మొత్తం చెబుతాడు.

ఈరోజు ఉదయమే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారో కూడా చెబుతాడు. అవి వింటు ఆశ్చర్యపోతుంది. ఆ మనిషి నిజంగా ఇవన్నీ చేశాడా అని అడుగుతుంది.

హ్మ్... నీ విషయంలో జరిగిన దానికి ఆ ధనుంజయ్ చాలా కృంగిపోతున్నాడు. తనకి తెలియకుండా జరిగిన తప్పులను సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

నువ్వు అన్నా...  మీ అమ్మగారు అన్న ధనుంజయ్ కి చాలా ఇష్టం. కానీ... పరిస్థితుల మాయలో పడి ఇద్దరు దూరమయ్యారు అని చెబుతాడు.

ప్లీజ్ అండి ఆ మనిషి గురించి మాత్రం నా దగ్గర మాట్లాడవద్దు. మీరు ఎన్నైనా చెప్పండి కానీ నా మనసు అంగీకరించడం లేదు.

నిన్ను బలవంతం చెయ్యను అవని. ఎందుకంటే ఆ కష్టాలు పడింది నువ్వు..  బాధలు అనుభవించింది నువ్వు..

విన్నవాళ్ళకి, పడినవాళ్ళకి చాలా తేడా ఉంటుంది. విన్నవాళ్లు సింపుల్గా అంటారు...  జరిగిందేదో జరిగింది క్షమించేయ్..  క్షమాగుణం చాలా గొప్పది అని చెబుతారు.

కానీ పడినవాళ్లు ఎంత నరకాన్ని చూసి ఉంటారు.  ఆ నరకంలో నుంచి బయటికి రావడం అంటే మాటలు కాదు . ఆ బాధలో నుంచి బయటికి వచ్చి క్షమించాలి అంటే చాలా కష్టం.

అందుకే నిన్ను ఎప్పుడూ ఇబ్బందిపెట్టను. నువ్వు ఎప్పుడైతే ఆ మనిషిని క్షమించి తండ్రిగా ఒప్పుకుంటావో అప్పుడే నేను కూడా మావయ్య అని పిలుస్తాను.

నువ్వు ఈ జీవితంలో ఆ మనిషిని క్షమించలేకపోతే నాకు కూడా ఎటువంటి అవసరం లేదు. విక్రమ్ ఇచ్చే విలువకి అవని పొంగిపోతూ ఉంటుంది.

మీలాంటి బంగారం నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం అండి అని భర్తని గట్టిగా కౌగిలించుకుంటుంది. హలో భార్యామణి గారు.. మీరు ఇప్పుడు ఇలా పట్టుకుని నా హార్మోన్స్ ని డిస్టర్బ్ చేస్తే చాలా కష్టం.

ఇప్పటికే అర్ధరాత్రి దాటి చాలా టైం అయింది అని కింద పెదవిని రెండువేళ్ళ మధ్యలో పట్టుకుని లాగుతూ అంటాడు .

స్.. అనే సౌండ్ చేసి అబ్బా వదలండి పొద్దుటే చాలా పని ఉంది అంటుంది.  అవునా ఏం పని అని పడుకుని భార్యని గుండెల పైకి చేర్చుకుని జో కొడుతూ అడుగుతాడు.

రేపు నివి, రాజ్ అన్నయ్యకి ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేయాలి అన్నది డేట్ ఫిక్స్ చేస్తున్నారు.  మీకు తెలిసి కూడా నన్ను అడుగుతున్నారా...

విక్రమ్ సమాధానం...

కథ కొనసాగుతుంది...
[+] 14 users Like SivaSai's post
Like Reply
So, will the treatment change for Shilpa after this?
A similar treatment .. as planned by Shilpa.. to herself!
Like Reply
Nice update
Like Reply
(24-02-2026, 09:05 AM)ash.enigma Wrote: So, will the treatment change for Shilpa after this?
A similar treatment .. as planned by Shilpa.. to  herself!

Shilpa ki already treatment start ayendi 

Next treatment another person.
[+] 1 user Likes SivaSai's post
Like Reply
Nice update super
Like Reply




Users browsing this thread: 6 Guest(s)