Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Nice update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Part - 101


అవని ఎమోషనల్ గా విక్రమ్ మొహం అంతా తెగ ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది.  అవని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు.

హలో భార్యామణి కొంచెం తట్టుకో తల్లి. నేను ఆగలేక పోతున్నాను అంటూ కొంచెం కంట్రోల్ చేస్తాడు. నా వల్ల అవ్వడం లేదు అండి అని చెప్పి గట్టిగా హగ్ చేసుకుని అలాగే ఉండిపోతుంది.

అవని వెన్ను నిమురుతూ ఉంటాడు. కాసేపటికి మెల్లిగా సెట్ అవుతుంది. అవని కొంచెం సేపటికే సర్దుకున్నాక మెల్లగా అక్కడే గోడకి జారబడి ఇద్దరు కూర్చుంటారు.

విక్రమ్ భుజం పైన తలవాల్చి విక్రమ్ ఎడమ చేతిలో తన కుడి చేతి వేళ్ళని గట్టిగా పెనవేసి కళ్ళు మూసుకుని ఆ నిశ్శబ్ధాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

విక్రమ్ కూడా డిస్టర్బ్ చేయకుండా ఆ మౌనాన్ని ఆస్వాదిస్తూఉంటాడు. కొంచెం సేపటికి అవని శ్వాసలో తేడా గమనించి మెల్లిగా ఎత్తుకొని గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెడతాడు .

పక్కనే పడుకుని నుదుటిని ముద్దు పెట్టుకుని ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో చేసుకోవాలి బంగారం అని నుదుటన కిస్ చేసి తన హృదయం పైకి చేర్చుకుని జో కొడుతూ మెల్లిగా విక్రమ్ కూడా నిద్రలోకి జారుకుంటాడు.

పక్షులు కుహకుహలాడుతూన్న వేళ లేలేత కిరణాలు లోపలికి ప్రసరిస్తున్న వేళ మెల్లిగా ఫోన్ రింగ్ అవుతుంది. అవని మత్తుగా కదులుతూ ఉంటే విక్రమ్ నిద్ర కళ్ళతోనే ఫోన్ ని వెతుకుతూ లిఫ్ట్ చేసి హలో అంటాడు.

అటు పక్కన వాళ్ళు చెప్పింది విని సరే ఇప్పుడే బయలుదేరుతున్నాము అని చెప్పి ఫోన్ పెట్టేసి అవిని నీ మెల్లిగా లేపుతూ ఉంటాడు. అబ్బా కొంచెం సేపు అండి అని ఇంకా దగ్గరగా హత్తుకుంటుంది.

ఓయ్ భార్యామణి తేల్లారిపోయింది. నువ్వు ఇలా పట్టుకుంటే మనం ఇంకా లేచినట్టే చెవిలో గుసగుసగా చెబుతూ ఉంటాడు.

ఆ మాటలకు ఉలిక్కిపడి లేచి చుట్టూ చూస్తుంది. రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చి అవని మొహం వెయ్యి దీపాల వెలుగు కంటే ఎక్కువ ప్రకాశంవంతంగా వెలిగిపోతూ ఉంటుంది.

వెలగిపోతున్న అవని మొఖాన్ని తృప్తిగా చూస్తూ నుదుటిన కిస్ చేసి ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో జరుపుకోవాలని బంగారం అని హార్ట్ ఫుల్  గా విష్ చేస్తాడు.

మీరు నా పక్కన ఉంటే నా ప్రతి పుట్టినరోజు ఒక వసంతమేనండి. ఎప్పుడో అమ్మ ఉన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు జరిగింది ఒక్కసారే.

అందుకే నా పుట్టినరోజు అన్నది ఒకటి ఉన్నది అని నేను ఎప్పుడో మర్చిపోయాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మన కుటుంబం నాకు గుర్తు చేసింది అని ఎమోషనల్ అవుతూ ఉంటే..

అవని ఎమోషనల్ కంట్రోల్ చేస్తూ హలో భార్యామణి ఇప్పుడే ఎమోషనల్ అవుతూ ఉంటే టైం సరిపోదు. తొందరగా రెడీ అవ్వు అని చెప్పి ఇంకో కవర్ చేతికి ఇస్తాడు.

ఇదేమిటి... ఇప్పుడు కట్టుకోవాల్సిన చీర. ఎన్ని చీరలు తీసుకున్నారు ఏంటి..  గంటకొకటిస్తున్నారు. నా దేవేరికి ఎన్ని కొన్నా నాకు తృప్తి అనిపించదు.

వెళ్లి రెడీ  అవ్వు లేకపోతే నేనే రెడీ చేస్తాను. అమ్మో వద్దు. మీరు రెడీ చేయడం మొదలు పెడితే ఇప్పుడు అప్పుడే అవ్వదు అని చెప్పి గబగబా వాష్ రూమ్ లోనికి దూరుతుంది.

వెళుతున్న అవిని నీ చూసి నవ్వుకుంటూ విక్రమ్ కూడా వేరే రూమ్ లో ఫ్రెష్ అయ్యి వస్తాడు.  అవని రెడీనా అని అరుస్తాడు. అయిపోయింది అని తలుపు తెరుస్తుంది.

మ్యాంగో ఎల్లో కాంజీవరం పట్టుచీర కట్టుకుని ఉంటుంది. మెడలో సూత్రాలు నల్లపూసలు సింపుల్ గా ఒక డైమండ్ సైట్ పెట్టుకొని తలలో జాజులు పెట్టుకుని ఉంటుంది. మ్యాచింగ్ గాజులు వేసుకుంటుంది.

మైమరపూగా భార్యని చూస్తూ ఉంటాడు.ఏంటండీ అలా చూస్తున్నారు.  ఏమైనా తక్కువ అయిందా అని అడుగుతుంది.

హ.. ఒక్కటే తక్కువ అయింది అని అంటాడు.  ఏమి తక్కువ అయింది అని చెక్ చేసుకుంటూ ఉంటే దగ్గరకు వచ్చే కళ్ళకి ఉన్న కాటుక తీసి అరిపాదంలో  పెడతాడు.

భర్త ప్రేమకు మురిసిపోతుంది.  తనంత అదృష్టవంతురాలి ప్రపంచ లేరు అని ఆనందపడిపోతుంది.

ఇంకా వెళదామా అని అడిగితే పదండి అని చేయ్యి పట్టుకుని ముందుకి నడుస్తుంది.

కారు గమ్యం వైపు పరుగులు పెడుతూ ఉంటుంది. ఆ రూట్ చూస్తూ ఇది మన ఇంటికి వెళ్లే రూట్ కాదే.. భలే కనిపెట్టేసావు అంటాడు.

ఎక్కడికి అంటే సస్పెన్స్ అని చెప్పి తీసుకువెళుతూ ఉంటాడు.  ఇప్పుడైనా చెప్పొచ్చు కదా అంటే సస్పెన్స్ అంటే వెయిట్ చేయాలి అని అర్థం బంగారం.

ఎంత అడిగినా ఇంకా చెప్పడు అని సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. కారు తీసుకువెళ్లి వెంకటేశ్వర స్వామి గుడి ముందు ఆపుతాడు.

పద లోపలికి అన్ని గుడి లోపలికి తీసుకు వెళ్తాడు. కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటారు.  మీరందరూ వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగితే..

  మా ఇంటి మహాలక్ష్మి పుట్టినరోజు వేడుక చేయొద్దా అని లలిత అంటుంది. వినయ్ భరత్ అన్నదనానికి సంబంధించినవి అన్నీ చూస్తూ ఉంటారు.

ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే సస్టెన్స్ అని చెప్పాము కదా..  మాధవి లలిత ఇద్దరు అవని నీ  ఒక ప్లేస్ దగ్గరగా తీసుకువెళ్తారు.

ఇదేమిటి ఇక్కడికి తీసుకోవచ్చారు అంటే నీకు తులాభారం వెయ్యడానికి అని చెబుతారు.  ఆ మాటకి ఏంటి అని గట్టిగా అరుస్తుంది.

ఇద్దరూ చెవులు మూసుకుని అబ్బా... ఎందుకు అంత గట్టిగా అరుస్తావు. లేకపోతే ఏమిటమ్మా తులాభారం చిన్నపిల్లలకి వేస్తారు. నాకు కాదు.

నువ్వు మా దృష్టిలో చిన్న పిల్లవే.. నీకు ఊహ తెలుసా ఇదే కదా మొదటి పుట్టినరోజు. అందుకే మా దృష్టిలో చిన్నపిల్లవే...

పంతులుగారు అన్నీ సిద్ధమేనా అని అడిగితే... అన్ని సిద్ధంగా ఉన్నాయమ్మా.  అమ్మాయి రావడమే ఆలస్యమని చెబుతారు.

అత్తయ్య మీరైనా చెప్పండి అందరూ ఇటే చూస్తున్నారు.. నవ్వుతారు. ఎవరిది నవ్వేది...  నా ముందుకు రమ్మను.  నా బంగారు తల్లికి మేము తులాభారం వేస్తే నవ్వేది ఎవ్వరు...

విక్రమ్ మాత్రమే కాపాడగలడు అనుకుని భర్త కోసం చూస్తూ ఉంటుంది. ఏంటి ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉన్నట్టున్నావు అని అడుగుతారు.

ఆహా..  అలా ఏమీ లేదు అత్తయ్య.  మీ ఆయన గురించి ఏమో... ఈ ప్లాన్ మొత్తం మీ ఆయన దే అని చెబుతారు.

ఈసారి కళ్ళు రెండు బయటికి పొడుచుకువస్తాయి.  అసలు ఈయన ఏమనుకుంటున్నారు నేనేమన్నా పసిపాపనా...

అవును పసిపాపవే అని చెవి దగ్గర మెల్లగా వినపడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే విక్రమ్ నవ్వుతూ కనిపిస్తాడు.

మీరు ఇలా రండి అని చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కు వెళుతుంది. హేయ్.. అందరూ చూస్తున్నారు ఇలా పక్కకు వస్తే బాగోదేమో భార్యామణి.

ముందు మీరు మాట్లాడకండి అసలు ఏం చేస్తున్నారు మీరు అని కోపంగా అడుగుతుంది.  నేనేం చేశాను అని అమాయకంగా అడిగితే ... నైట్ చేసిందంతా బాగుంది. ఇలా చేస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. అర్థం చేసుకోండి.

ఒక నిమిషం ఆలోచించి అయితే ఒక పని చేద్దాం అంటాడు.  అనుమానంగా చూస్తుంది. ఎందుకే అంత అనుమానంగా చూస్తున్నావు. 

మీరేదో ఒక పిటింగ్ పెడతారు అందుకనే అంటే లేదులే... రా అని చెప్పి తీసుకువెళ్తాడు. విక్రమ్ వెళ్లి లలిత గారి చెవులో ఏదో చెబుతాడు.

అది విని ఆవిడ నవ్వుతూ మీ సరదాని. మేము ఎందుకు కాదంటము కానీ అని ఎంకరేజ్ చేస్తారు.  అత్తగారి నవ్వు, భర్త గారి చిలిపి చూపులు ఏదో తేడా కొడుతూ ఉంటే... మెల్లిగా అత్తగారు దగ్గరికి వెళ్లి ఏం చెప్పారు అత్తయ్య అని అడుగుతుంది.

దానికి కోడలి గెడ్డం పట్టుకుని నువ్వు చాలా ఎదగాలే  పిచ్చితల్లి. లేకపోతే నా కొడుకు భయంకరంగా ఆడేసుకుంటాడు.

ఎప్పటికి ఎదుగుతావో ఏంటో అని జాలిగా చూస్తారు. మీరు మాట్లాడేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు అత్తయ్య.  కొన్ని కొన్ని అర్థం కాకపోవడమే మంచిది. నా కొడుకుని ఫాలో అయిపో అదే నీకు  బెటర్ అని చెబుతారు.

పెళ్లయిన దగ్గర్నుంచి నేను చేస్తుంది అదే కదా అత్తయ్య.  అందుకే చెబుతున్నాను.  సొంత బుర్ర మానేసి నా కొడుకుని ఫాలో అయిపో అంటారు.

పంతులు గారి పిలుస్తూ ఉంటే లేట్ అయిపోతుంది పదా అని అవని చేయి పట్టుకుంటారు.   ఈ ప్రోగ్రాం మానలేదా అనే ఏడుపు మొఖంతో అడుగుతుంది.

చిన్న చిన్న మార్పులు జరిగాయి అని చెబుతుంది. ఏం మార్పులు అని అనుమానంగా అడిగితే.. ఇంత అనుమానం ఏంటే నీకు పద పదా అని లాక్కువెళతారు.

అక్కడికి వెళ్లి చూసి కళ్ళు నోరు వదిలేసి చూస్తోంది. కుటుంబ సభ్యులందరూ అక్కడ నవ్వుతూ అవని కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

అవని ఇబ్బందిగా చూస్తూ ఉంటే వినయ్ వచ్చి వదిన నువ్వు అసలు ఎక్కడా తగ్గడానికి వీలు లేదు.రా అని తీసుకువెళతాడు.

ఇప్పుడు ఇదంతా అవసరమా అంటే అబ్బా కొన్ని ఎంజాయ్ చేయాలి వదిన రా అని తీసుకెళ్తాడు. మాధవి లలిత సహాయము చేయగా అవని మెల్లిగా విక్రమ్ ఒడిలో కూర్చుంటుంది.

ఇప్పుడు ఓకేనా భార్యామణి అని అడిగితే...విక్రమ్ కి మాత్రమే వినబడేటట్టుగా నాకు ఇబ్బందిగా ఉంది ఈ ప్రోగ్రాం ఆపించండి అంటే మీరు ఇలా ప్లాన్ చేశారా అని అడుగుతుంది.
 
నువ్వు నా త్యాగాన్ని గుర్తించకుండా కోప్పడుతున్నావ్ భార్యామణి. ఇప్పుడు నేనేం కోప్పడ్డాను. మీరేం త్యాగం చేశారు అని అడిగితే..

నువ్వు ఒక్కదానివే తులాభారంలో కూర్చోవాలి అంటే ఇబ్బంది పడతావనే కదా..  నీకు సహాయంగా వచ్చాను. అందరికీ ఇప్పుడు నా వెయిట్ కూడా తెలిసిపోతుంది.


అయినా నీకోసం నేను త్యాగం చేయలేదా అంటాడు. అవునవును మీరు ఆడపిల్ల కదా మీ వెయిట్ తెలుస్తానికి అని రుసరుసలాడుతుంది.

అవని కోపాన్ని చూసి నవ్వుకుంటూ కోపాన్ని పక్కనపెట్టి ఈ సెలబ్రేషన్ ని ఎంజాయ్ చెయ్.  మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు అని చెప్పి మూడ్ మార్చుతాడు.

భర్త మాటలకి కాంప్రమైజ్ అయ్యి అవని కూడా తులాభారానికి సిద్ధమవుతోంది.
[+] 11 users Like SivaSai's post
Like Reply
Part - 102


విక్రమ్ ఒడిలో కూర్చునే తులాభారానికి సిద్ధం అవుతుంది. అవని పడిపోకుండా ఒక చేతులేని నడుము చుట్టూ వేసి ఒక చేతితో తుల భారం తాడును గట్టిగా పట్టుకుంటాడు.

మొదటిగా పువ్వులు మొదలు పెడతారు. గులాబీలతో మొదలుపెట్టి అన్ని పువ్వులతో ముందు తులాభారం వేస్తారు. అవన్నీ చూస్తూ అవని కళ్ళు నోరు వదిలేసి మైమరిచిపోయి చూస్తూ ఉంటుంది .

తరవాత పళ్లుతో వేస్తారు. అవని ఇంకా తట్టుకోలేక విక్రమ్ చెవులో ఇన్ని రకాల పండ్లు పువ్వులు ఎక్కడ దొరికాయి అంటే నా భార్య కోసం ఎక్కడి నుంచి అయినా తెప్పిస్తాను గాని మూసుకుని కూర్చో అంటాడు.  పళ్ళు తర్వాత స్వీట్స్ కూరగాయలు...

నిత్యావసర సరుకులు అన్న ప్రతి దానితోనూ తులాభారం వేస్తారు.  ఇక చివరిగా నాణాలు, వెండి బంగారం కూడా తులాభారానికి వాడితే అవి చూసిన  అవని కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి.

తులాభారం వేసిన వస్తువులతోనే ఆలయ ప్రాంగణం అంతా నిండిపోతుంది. మెల్లిగా అవిని నీ ఒడిలో నుంచి దింపి విక్రమ్ కూడా లేచి బాడీని స్ట్రెచ్ చేస్తాడు.

అవని అవేమీ పట్టించుకునే పొజిషన్లో ఉండదు. ఒక రకమైన డీప్ షాక్ లో ఉండిపోతుంది. లలిత అవిని దగ్గరకు వచ్చే లోపలికి వెళదాం రా అనగానే.. అత్తగారి వైపు చూసి ఏమిటిది అత్తయ్య అని అడుగుతుంది.

ఆ మాటకి ఏమైంది రా అని అడిగితే... ఏమీ లేదు అని తల ఊపుతుంది.  చెప్పరా మనసులో ఏదైనా బాధ ఉంటే ఇక్కడే తీర్చేసుకో...  అది మళ్ళీ మళ్ళీ మొయ్యొద్దు.

అత్తయ్య గారి చేతులు పట్టుకుని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆకలికి అలమటిస్తూనే ఉన్నాను. మంచి భోజనం ఒక పూట దొరికినా. ఆ రోజు నాకు పండగ లాగానే ఉండేది.

కాలేజ్ కి సెలవు వస్తే మంచినీళ్లు తాగేదాన్ని. అలాంటిది ఈరోజు నా పేరు మీద ఇన్ని రకాలు ఇస్తూ ఉంటే... మాట తడబడుతూ ఉక్కిరిబిక్కిరి అవుతూఉంటుంది.

అవిని పరిస్థితి అర్థమవుతూ ఉంటే అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. లలితగారు గట్టిగా హత్తుకుని పిచ్చి పిల్ల జరిగిపోయిన దాన్ని తలుచుకుని ఇప్పుడు బాధపడతావు ఎందుకు...

చెడు జరిగింది అంటే అంతకన్నా మంచి మన కోసం ఎదురు చూస్తుందని అర్థం. నీ జీవితంలో ఉన్న చెడు అంతా అయిపోయింది.

నీ ముందు ఉన్నది అంతా కూడా మంచి రోజులే అని కన్నీళ్లు తుడిచి పద తల్లి అని గుడి లోపలికి తీసుకువెళతారు. విక్రమ్ కూడా మౌనంగా అవిని తో లోపలికి వెళ్తాడు.

అవిని పేరు మీద అన్ని రకాల పూజలు చేపిస్తారు. అన్నదానం ఏర్పాటు చేస్తారు. ప్రతి ట్రస్ట్ లో కూడా భారీగా విరాళాలు డొనేట్ చేస్తారు .

అన్నదానంలో అవిని చేతే వడ్డన చేపిస్తారు. అది అవినికి చాలా తృప్తిగా అనిపిస్తుంది. భోజనాలు అయిపోయిన తర్వాత వచ్చిన దారిలోనే అందరూ వెళ్ళిపోతారు.

వెళుతున్న కళ్యాణ్ మాత్రం వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ధనుంజయ్ చేతులెత్తి నమస్కారం చేస్తాడు.
చిన్నగా తలువుపి కళ్యాణ్ వెళ్లిపోతాడు.

ధనుంజయ్ కళ్ళు తుడుచుకుని ఇంటికి వెళ్లి తల్లి ఒడిలో పడుకుంటాడు.  సత్యవతి గారు తల నిమురుతు.. అవని ఎలాగుంది... సంతోషంగా ఉందా అని అడుగుతారు.

రజిత చేసిన పుణ్యం నా కూతురిని కాచింది. అందుకే బంగారం లాంటి భర్త... తల్లి లాగా చూసుకునే అత్తింటి వారు దొరికారు అమ్మ.

ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో తెలుసా... గుడిలో జరిగింది ప్రతిదీ చెబుతాడు. మేము కూడా వచ్చేవాళ్ళం కదరా...

మనల్ని చూస్తే తన సంతోషం ఆవిరి అయిపోతుంది. నువ్వు నీ కూతురికి ఎదురు పడలేదా అంటే లేదు అని బాధగా కళ్ళు మూసుకుంటాడు.

మరి తులాభారానికి కావలసినవి అన్నీ నువ్వే సిద్ధం చేశావు కదరా... అది ఇన్ని సంవత్సరాలు నా కూతురుని పస్తులు ఉంచిన దానికి చిన్న ప్రాయశ్చిత్తం అమ్మ..

అది కూడా బావగారిని, విక్రమ్ ని చాలా కష్టంగా ఒప్పించవలసి వచ్చింది. విక్రమ్ అయితే అసలు ఒప్పుకోలేదు.

నా భార్యకు అన్ని నేనే చూసుకోగలను. మధ్యలో మీరు ఎవరని నా మీద చాలా కోప్పడ్డాడు. బావ గారే కష్టంగా విక్రమ్ ని ఒప్పించారు.

విక్రమ్ చాలా అఇష్టంగానే ఒప్పుకున్నాడు అని బాధగా చెబుతారు.  అమ్మ నీకు ఒక విషయం చెప్పనా అని  ఒడిలో నుంచి లేచి అంటారు.

ఏంట్రా అని చంపపైన చెయ్యవేసి అడిగితే..  ఈరోజు నా కూతురి చేతితో అన్నం తిన్నాను అమ్మ.  చాలా రోజుల తర్వాత తృప్తిగా భోంచేసాను.

నువ్వు అనేది ఏంట్రా.. అన్నదానంలో నువ్వు కూడా కూర్చున్నావా అని బాధగా అడుగుతారు. తప్పేముందమ్మ నా కూతురి చేతితో అన్నం తినాలి అంటే కూడా అదృష్టం ఉండాలి.

ఆ అదృష్టం కల్పించిన ఆ కుటుంబానికి ఎప్పటికి నేను రుణపడే ఉంటాను. అవని తులాభారం వేసిన తర్వాత నా కూతురు వాళ్ల అత్తగారిని పట్టుకుని ఎలా ఏడ్చిందో తెలుసా అమ్మ.

ఆకలికి ఎలా అలమటించిందో చెబుతూ ఉంటే నా ప్రాణం తరుక్కుపోయిందమ్మ. అసలు నేను ఇంత కసాయిగా ఎలా ఉండగలిగాను.

కూతురి ఆకలిని కూడా గుర్తించలేనంత మాయలో పడిపోయానా..  ఎందుకమ్మా ఇంత ఐశ్వర్యం సంపాదించాను.

ఆ డబ్బు సంపాదించడం, భార్గవి చూసుకుంటుంది అన్న గుడ్డి నమ్మకంలో పడిపోయి అవినికి దూరమైపోయాను. ప్రతిరోజు ఒక్క ఐదు నిమిషాలు అవిని తో కూర్చుని ఉండి ఉంటే ఈ రోజు నా కూతురు నాకు దూరమయ్యేది కాదు కదా...

నా కూతురు ప్రతి సంతోషంలో నేను ఉండేవాడిని. ఎప్పటికైనా నా కూతురు నన్ను క్షమిస్తుందంటావా అని బేలగా అడుగుతాడు.

ఆ మాటకి సత్యవతి గారికి కూడా ఏడుపు వస్తుంది. కాలమే ప్రతి సమస్యకి పరిష్కారం చెబుతుంది రా.. నువ్వు తెలుసుకోలేద నీ కూతురు ఎలాంటి ఇబ్బంది  పడిందో..  రజిత ఎలా చనిపోయిందో..

అలాగే అవిని కూడా నిన్ను అర్థం చేసుకుంటుంది అని ఓదారుస్తారు. ధనుంజయ్ ఇంకా ఏమీ మాట్లాడకుండా మౌనంగా లేచి ఆఫీసు రూంలోకి వెళ్తాడు.

అక్కడ నిలువెత్తు రూపంలో నవ్వుతూ కనిపిస్తున్న రజిత ఫోటోని చూస్తూ ఈరోజు అవని ఎంత సంతోషంగా ఉందో తెలుసా..

మన అల్లుడు బంగారం. ఎంత ముందు చూపు ఉన్నవాడో తెలుసా.. నాలాంటి వాడు కాదు.  భార్య మీద ప్రేమ ఉంటే సరిపోదు.  వచ్చే ప్రమాదాలను కూడా అరికట్టాలి అన్న ముందు జాగ్రత్త ఉన్నవాడు.

అవని మనసులోనికి ఆలోచన కూడా రాకముందే అన్నీ చేసేస్తున్నాడు. నువ్వు చేసుకున్న పుణ్యమే ఈరోజు మన బిడ్డని కాస్తుంది రజిత అని ఫోటోని తడుముతూ రాత్రంతా అక్కడే పడుకుండిపోతాడు.

కొడుకు బాధ అర్థమవుతున్న సరే పెద్దవాళ్ళిద్దరూ ఏమీ చేయలేక చూస్తూ ఉంటారు.  కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చెప్పాలి.

శరీరానికి తగిలిన గాయం అయితే మానిపోతుంది అని సర్ది చెప్పుకోవచ్చు కానీ.. మనసుకు తగిలిన గాయం అంత తొందరగా మానేది కాదు.

పక్కన ఉన్న వాళ్ళు ఎన్నైనా చెప్పవచ్చు కానీ తగిలిన దెబ్బకి బాధ అనుభవించేది కూడా గాయపడిన వాళ్లే కాబట్టి...

పక్కన ఉన్న వాళ్ళు చెప్పగలరు గాని ఆ బాధను తీసుకోలేరు.  అందుకే అటు అవనికి చెప్పలేక ఇటు ధనుంజయ్ బాధ తీర్చలేక పెద్ద వాళ్ళు ఇద్దరు కూడా నలిగిపోతున్నారు.

ధనుంజయ్ ఉదయమే తొందరగా లేచి మంచి ఉషారుగా రెడీ అవుతాడు.  అమ్మ ఆకలేస్తుంది అని హడావుడి చేస్తాడు.

కొడుకులోని నూతన ఉత్సాహాన్ని చూసి సత్యవతి, శేషగిరి ఆశ్చర్యపోతారు.  సర్వెంట్స్ ని కంగారు పెట్టి టిఫిన్ రెడీ చేయించి వడ్డిస్తారు.

రోజు తినేదానికన్నా ఆ రోజు ఎక్కువగా తింటాడు. ఏమైందిరా ఇంత సంతోషంగా ఉన్నావు. నేను తీసుకున్న నిర్ణయం అమల్లో పెట్టే రోజు దగ్గరకు వచ్చింది.

అలాగే ఆ రాక్షసిని కూడా కలవడానికి వెళుతున్నాను అని చెబుతాడు. ఇప్పుడు అవసరమా అంటే చాలా అవసరం అని చెప్పి బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేసి బయటికి వెళ్ళిపోతాడు.

జైలుకు వెళ్లి జైలర్ పర్మిషన్ తో భార్గవిని కలుస్తాడు. భార్గవి భర్త ముందుకు వచ్చి నిలబడుతుంది. భార్గవిని చూస్తూ ఉంటాడు.

  మేకప్ తో మెరుగులు  దిద్దిన అందం కనపడటం లేదు. కళ్ళ కింద నల్లటి చారలు వచ్చి బక్క చిక్కుపోయి ఉంది.

అయినా ధనుంజయ్ కి ఎటువంటి జాలి కలగడం లేదు. రెండు చేతులు ప్యాంట్ ప్యాకెట్ లో పెట్టుకుని ఎలా ఉన్నావ్ భార్గవి అని అడుగుతాడు.

భర్త వైపు కోపంగా చూస్తుంది. ఆ చూపుకి నవ్వుతూ ఏంటి చాలా కోపంగా ఉన్నట్టున్నావు .  నేనయితే చాలా సంతోషంగా ఉన్నాను.

ఎందుకో తెలుసా నా ముద్దుల కూతురు... ఎంతో అపురూపంగా అత్తోరింట్లో ఉంది. అలాగే నా సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణి అవబోతుంది అని పొగరుగా చెబుతాడు.

ఆ మాటలు వినగానే భార్గవి కోపంతో పిడికిలి బిగిస్తుంది. కానీ ఏమీ చేయలేదు కదా..  అందుకే చూస్తూ ఉండిపోతుంది.

ఏమిటి భార్గవి ఇవి వింటూ ఉంటే కోపం వస్తుందా..  నన్ను నా కూతుర్ని చంపేయాలి అన్నంత కసి పెరుగుతుందా అని అడుగుతాడు...

మెల్లిగా నోరు విప్పుతుంది. తప్పు చేసింది నేను. నన్ను శిక్షించండి. శిల్ప మీ కూతురే కదా.. శిల్పకి ఎలా అన్యాయం చేయగలుగుతున్నారు అని లేని ప్రేమని మళ్లీ చూపించడం మొదలు పెడుతుంది.

ఆ మాటకి నవ్వుతూ ఇంకా నీ యాక్టింగ్ మొదలు పెట్టలేదు ఏంటా అనుకున్నాను. పర్వాలేదు స్టార్ట్ చేశావు అంటాడు.
కన్నీళ్లు కారుస్తూ నేను మారానండి.

మారాను అని చెప్పిన మీరు ఎందుకు నమ్మడం లేదు. పాము మారింది అని చెబితే ఎవరైనా నమ్ముతారా..  నమ్మి పాము పక్కన కోడి పిల్లని పడుకోబెడతారా చెప్పు అంటాడు.

నేను పాము నా అని ఈసారి గట్టిగానే అడుగుతుంది. అంతకన్నా ప్రమాదకరం. నీ కడుపున పుట్టిన అది కూడా అలాగే తయారైంది కదా...

దాన్ని నా కూతురు అని చెప్పుకోవాలి అంటే నాకే అవమానం అని ఛీత్కరంగా అంటాడు.

భార్గవి రియాక్షన్ ఏమిటి...

కథ కొనసాగుతుంది...
[+] 13 users Like SivaSai's post
Like Reply
Superb update
Like Reply
Inka Dhanunjay side story start aa?
So far chala bagundi
Like Reply
I expected dhanunjay arrange it. nice update
Like Reply
Nice update
Like Reply
no update today yet!!! Busy aa Sivagaru?
Like Reply
Heart 
(17-02-2026, 09:03 AM)SivaSai Wrote: Part - 102
Abbabbba.. emi story andi.. super .. awesome and matallevu siva garu..
Super excellent extraordinary story andi.. birthday twist is very good and after that father sentiment emotional part is awesome ..
[+] 1 user Likes masalakiss's post
Like Reply
Part - 103


ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నారండి. నువ్వు చేసిన దారుణాలతో పోలిస్తే నేను మాట్లాడేది చాలా తక్కువ భార్గవి.

ఇంతకీ నేను వచ్చిన విషయం నీకు చెప్పలేదు కదా.. నీకు ఒక సంతోషకరమైన వార్త చూపించాలని వచ్చాను అంటాడు.

నేను సంతోషపడేదా అని అడుగుతుంది. నువ్వు ఎప్పుడు అంటావు కదా.. మీ ఆనందమే నేను కోరుకునేదండి అని. నేను ఎంత ఆనందపడితే నువ్వు కూడా అంత ఎక్కువ ఆనంద పడతావు కదా రా కూర్చో.

తన తెచ్చిన పెన్ డ్రైవ్  లాప్టాప్ కి కనెక్ట్ చేసి చూపిస్తాడు. ముందుగా ఏదో దేవాలయం ఫోటో కనపడుతుంది. అది చూసి ధనుంజయ్ వైపు చూస్తుంది.

అప్పుడే కంగారెందుకు చూస్తూ ఉండు అనగానే వీడియో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక కారు వచ్చి ఆగుతుంది.  అందులో నుంచి మొదట విక్రమ్ దిగుతాడు.

పక్క సీటు వైపు వచ్చి డోర్ తీసి చెయ్యందిస్తాడు. ఆ చెయ్యి పట్టుకుని అవని కారు దిగుతుంది. పట్టు చీరలో మహాలక్ష్మి లాగా కలకల్లాడుతున్న అవని నీ చూడగానే భార్గవి ముఖం మాడిపోతుంది.

విక్రమ్ అంతా అపురూపంగా లోపలికి తీసుకు వెళుతూ అంటే తట్టుకోలేక పోతుంది. వెంటనే లాప్టాప్ క్లోజ్ చేయబోతుంటే అప్పుడే అంత కంగారు ఎందుకు భార్గవి.. ఇంకా ఉంది చూడు.

మీరెందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు అని ఈసారి ఏడుపు గొంతుతో అడుగుతుంది.  అయ్యో భార్గవి నిన్ను ఎక్కడ నేను టార్చర్ చేశాను.

నువ్వు చేసిన పనులకి ప్రతిఫలం చూపిస్తున్నాను అంతే.. ఇంకా చూడు అని చూపిస్తాడు. లోపల కి వెళ్ళాక తులాభారం వెయ్యడం.  లలిత ముద్దు చేయడం. అన్నదానం చేయడం అన్నీ చూస్తూ ఉంటే తన కడుపులో పేగులు కేకలు పెడుతూ ఉంటాయి. 

అంతా చూసిన తరువాత భార్గవి ఏమి మాట్లాడాలేక కళ్ళల్లోంచి దుఃఖం తన్నుకొస్తూ ఉంటే కష్టంగా ఆపుకుంటూ చూస్తోంది.

ఏమైంది భార్గవి..  ఈ కన్నీళ్లు ఏంటి.. ఆనందంతో వస్తున్నాయా అని జాలిగా అడుగుతాడు. ఎందుకు వస్తున్నాయో మీకు తెలియదా...

ఎందుకు తెలియదు భార్గవి.  ఒక స్వార్థపరురాలి దొంగ కన్నీళ్లు అంతే కదా అంటాడు...

నాది దొంగ కన్నీళ్ళ అని కోపంగా అడుగుతుంది. మరి ఏమనాలి నా కూతురు సంతోషం చూసి ఓర్వలేక పోతున్నావు.

నిన్ను నమ్మి నా బంగారు తల్లిని నీ చేతిలో పెడితే దాని కడుపు మాడ్చావు.  చిన్న పిల్ల ఎంత తింటుంది.  గుప్పెడు మెతుకులు..

కానీ రాక్షసంగా ప్రవర్తించి..  నా కూతురు ఆకలితో బాధపడుతూ ఉంటే..  నువ్వు నీ కూతురుతో కలిసి పంచభక్ష పరమాన్నాలు తిన్నారు. నువ్వు తినడమే కాకుండా నన్ను మాయ చేసి నాతో కూడా తినిపించావు. 

నా కూతురు కన్నీళ్లు నాతో తాగించావు. దీనివల్ల నీకు ఏమొచ్చింది భార్గవి అని కోపంగా అడుగుతాడు. ఎన్నిసార్లు భార్గవిని తిట్టినా.. అసహ్యించుకుంటున్న తన బాధ తీరడం లేదు.

ఏమి చేస్తే అవని దగ్గరవుతుందో  అర్థం కాక ధనుంజయ్ విలవిల్లాడిపోతున్నాడు. నీ ధనదాహం గురించి నా భార్యకి చెప్పు ఉంటే ఎంతోకంత నీకు ముష్టివేసి నీ లైఫ్ సెట్ చేసేది.

ఇప్పుడు ఏమైందో చూసుకుంటున్నావా...  తింటానికి శుభ్రమైన తిండి లేక.. ఏసీ గదులు లేక..  పట్టుపరుపులు లేక.. మనసు విప్పి మాట్లాడే మనిషి లేక అంటే ఇంకా ఆపండి అని చెవులు మూసుకుంటుంది.

ఏమైంది భార్గవి అని అమాయకంగా అడుగుతాడు. మీరు నన్ను టార్చర్ చేయాలని వచ్చారని నాకు అర్థమైంది. చేసింది చాలు ఇంక బయలుదేరండి అని చేతులు రెండు జోడించి అంటుంది.

అయ్యో నిన్ను ఎక్కడ టార్చర్ చేస్తున్నాను. నువ్వు చేసినవి నీకు చెబుతున్నాను.  ఒకప్పుడు అన్యాయంగా లాక్కుని అనుభవించిందంతా ఇప్పుడు ఏమైందో చూసుకోమని చెబుతున్నాను.

ఇంతకీ నీ గదిలో పెట్టించిన ఫొటోస్ ఎలా ఉన్నాయి అని అడుగుతాడు. మీలో ఇంత క్రూరత్వం ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు అంటుంది.  ఏం చేస్తాం సహవాస దోషం.

నా కూతురు సంతోషాన్ని చూస్తూ క్షణక్షణం నువ్వు నరకం అనుభవించాలి అదే నీకు నేను వేస్తున్న శిక్ష అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఈసారి శిల్ప ని కలుస్తాడు. డాడీ అంటూ ఏడుస్తుంది. ఎంత కాదనుకున్నా కన్న కూతురు కదా... ఆ మమకారం లాగుతూనే ఉంటుంది.

అందుకే బాధగా అనిపిస్తున్న కొంచెం కఠినంగానే.. ఏమైంది శిల్పా అని అడుగుతాడు.  నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను.

ఇదంతా మమ్మీ వల్లే వచ్చింది. మమ్మీ మాట విని అక్క విషయంలో అలా బిహేవ్ చేశాను..ఇంకెప్పుడూ అలా ప్రవర్తించాను. ఎప్పుడూ మమ్మీ మాట వినను.

ప్లీజ్ డాడీ తీసుకు వెళ్ళండి అని ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు వింటూ ప్రయత్నిస్తాను అని బయటికి వచ్చేస్తాడు.

ధనుంజయ్ వెళ్ళగానే హమ్మయ్య డాడీ ప్రయత్నిస్తాను అన్నారు అంటే ఒక మెట్టు కరిగారు అని అర్థము. ఇంక నా లైఫ్ సెట్ అయిపోతుంది.

ఇక మమ్మీ ఏమైపోయినా నాకు అనవసరం అనుకుని రాని కన్నీళ్లు తుడుచుకుంటూ తనకిచ్చిన రూమ్ లోనికి వెళ్ళిపోతుంది.

బయటకు వచ్చినా ధనుంజయ్ కారులో కూర్చుని చాలాసేపు ఆలోచిస్తాడు.  ఒక నిర్ణయానికి వచ్చి విక్రమ్ కి కలవాలి అని మెసేజ్ చేస్తాడు.

ఆ మెసేజ్ చూసి విక్రమ్ కి నచ్చకపోయినా టైమ్ ఇస్తాడు.
సాయంత్రం ఆఫీసు వర్క్ అయిపోయిన తర్వాత ధనుంజయ్ విక్రమ్ క్యాబిన్ దగ్గరకి వస్తాడు.

లోపలికి వెళ్ళిన ధనుంజయ్ కి సీట్ ఆఫర్ చేసి చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారు అని సూటిగా అడుగుతాడు.
విక్రమ్ నుంచి అంతకుమించి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే.. అది ధనుంజయ్ కి తెలుసు.

అందుకే తన వచ్చిన విషయం డైరెక్ట్ గా మాట్లాడడానికి సిద్ధపడతాడు.  శిల్ప, ఉదయ్ గురించి మాట్లాడదామని వచ్చాను అని చెబుతాడు.

ఆ మాటకి ఏం మాట్లాడాలి అని కొంచెం కోపంగానే అడుగుతాడు. ప్లీజ్ విక్రమ్ పూర్తిగా నేను చెప్పేది విను. విన్న తర్వాత నీ డెసిషన్ చెప్పు.

అసహనంగానే చెప్పండి అంటాడు. తను ఏమైతే అనుకున్నాడో అది అంతా పూర్తిగా చెబుతాడు. అది వినగానే విక్రమ్ ఫేస్ లో ఒక ఈవిల్ స్మైల్ వస్తుంది.

విక్రమ్ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక ధనుంజయ్ చూస్తూ ఉంటే అందులో కొన్ని మార్పులు చేసి,
వాళ్ళిద్దరూ నా కంట్రోల్ లో ఉండాలి అని చెబుతాడు.  మీ ఇష్టం.

ఎల్లుండి ఆఫీస్ లో అనౌన్స్ చేస్తున్నాను. ఆరోజు మీరు అవనితో పాటు కుటుంబం మొత్తం రావాలి అని చెబుతాడు.

ఇంటికి వెళ్ళిన ధనుంజయ్ బిందు కి కబురు పంపిస్తాడు. సర్వెంట్ క్వార్టర్స్ నుంచి వచ్చిన బిందుని చూస్తూ ఉంటే.. ఒకప్పుడు బిందుకి.. ఇప్పుడు బిందుకి ఎంత తేడా ఉందో అర్ధం అవుతూనే ఉంటుంది.

ఒకప్పుడు బిందు అయితే పొగరుగా మాట్లాడుతూ సర్వెంట్స్ ని చాలా చీప్ గా చూసేది. ఇప్పుడు తనే ఒక పని అమ్మాయిలాగా ఉంది.

చెప్పండి అన్నయ్య గారు పిలిపించారు అంటే.. ఉదయ్ గురించి మాట్లాడాలి అంటాడు.  ఏమైనా తెలిసిందా.. విక్రమ్ వదులుతాను అన్నాడా అని ఆశగా అడుగుతుంది.  

ఉదయ్ ని వదలాలి అంటే అది పూర్తిగా మీ భార్య భర్తల అంగీకారం మీద ఆధారపడి ఉంది. చెప్పండి ఏదైనా మేము అంగీకరిస్తాము అంటే విక్రమ్ పెట్టిన ప్రపోజల్ చెబుతాడు.

దానికి బిందు అసహ్యంగా ఫేస్ పెడుతుంది. అది చూసిన ధనుంజయ్ కి కోపంతో పిడికిలి బిగిస్తాడు. వెంటనే బిందు నార్మల్గా వచ్చి..  శిల్ప దీనికి అంగీకరించాలి కదా... అని మాట దాటేస్తుంది.

ఏదైనా మీ ఇష్టం. నీ కొడుకు కావాలి అనుకుంటే దీనికి అంగీకరించక తప్పదు. వద్దు అనుకుంటే ఎప్పటికీ చూడలేవు.

మీరు మారారేమో... కొడుకు మీద ప్రేమ ఉందేమో అనుకొని విక్రమ్ చెప్పిన ప్రపోజల్ ని మీకు చెప్పాను. ఏదైనా సరే మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆలోచించుకోండి.

జైలుకెళ్ళి కలిసే ఏర్పాట్లు చేస్తాను అని చెబుతాడు. ఇంకా బిందు ఏమి మాట్లాడలేక అక్కడనుండి వెళ్ళిపోతుంది.
గదిలోకి వెళ్లిన బిందుకి  చాలా అసహనంగా ఉంటుంది.

ఉదయ్ వస్తే చాలు.  ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుదాము అనుకుంది. దీనికి ఒప్పుకుంటే జీవితాంతం వీళ్ళ కంట్రోల్ లోనే ఉండాలి.

నా కొడుకుని రాజా లాగా చూడాలి అనుకున్నాను కానీ పరిస్థితులు అన్నీ తలకిందులు అయిపోయాయి. ఒప్పుకున్న..  ఒప్పుకోకపోయిన విక్రమ్ కంట్రోల్ లోనే ఉంటాడు.

ఒప్పుకుంటే నా కొడుకుని చూసుకోవడానికి అయినా దారి ఉంటుంది. ఏమి చేయాలి అని తలపట్టుకు కూర్చుంటుంది.

ఒక సర్వెంట్ వచ్చే బిందుని పిలుస్తుంది.  మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. జైలుకు వెళ్లి మీ ఆయన్ని కలవాలంట కదా అని కొంచెం వెటకారంగానే చెబుతుంది.

ఆ మాటకి బిందు కోపంగా చూస్తుంది. నువ్వు ఎలా చూసిన నాకేమీ లెక్కలేదు అన్నట్టుగా ఆ సర్వెంట్ వెళ్ళిపోతుంది.

అవునులే ఒకప్పుడు వీళ్ళందర్నీ నేను ఇంతకన్నా దారుణంగా చూశాను. ఇప్పుడు వీళ్ళు చూడడంలో ఆశ్చర్యం ఏముంది అని ఒక నిట్టూర్పు విడిచి..  ధనుంజయ్ దగ్గరకు వెళుతుంది.

కారు రెడీగా ఉంది వెళ్ళి మీ ఆయన్ని కలువు అని చెబుతాడు. ఏం జరుగుతుందో బిందుకి తెలుసు.. కానీ ఏమీ చేయలేదు.

భర్తతో మాట్లాడితే కొంచమైనా ఓదార్పు దొరుకుతుందని జైలుకు వెళ్లి సునీల్ ని కలుస్తుంది. ముభావంగా ఉన్న బిందుని చూసి ఏమయింది అలా ఉన్నావు అని అడుగుతాడు. ధనుంజయ్ చెప్పిందంతా పూర్తిగా చెబుతుంది.

సునీల్ కి కూడా అది నచ్చడం లేదు.  కానీ వేరే దారి ఏమీ కనపడటం లేదు.. మనమేమీ చేయలేము బిందు. దీనికి ఒప్పుకోవడం ఒక్కటే పరిష్కారం.

ఒప్పుకుంటే ఉదయ్ జీవితం... విరక్తిగా నవ్వుతూ ఇంకా వాడికి భవిష్యత్తు ఉందని నువ్వు అనుకుంటున్నావా... ఎప్పుడైతే పరాయి స్త్రీని చెరపట్టాలి అనుకున్నాడో అప్పుడే వాడి పతనానికి అడుగులు పడ్డాయి.

అది మనకి తెలిసి ఎంకరేజ్ చేసామో.. అప్పుడే నిర్ణయం తీసుకునే అధికారాన్ని కోల్పోయాము. మన కొడుకుని ప్రాణాలతో మనం చూడాలి అనుకుంటే దీనికి ఒప్పుకోవడం ఒక్కటే పరిష్కారం అని చెబుతాడు.   

విక్రమ్ ఏం చేయనున్నాడు...
[+] 10 users Like SivaSai's post
Like Reply
Part - 104


బిందుకి ఏం చేయాలో తెలియక ధనుంజయ్ దగ్గరకు వచ్చి మాకు సమ్మతమే అని చెబుతుంది.  మంచిది. బిందు ఇంకా తనకిచ్చిన రూమ్ కి వెళ్ళిపోయి పడుకుంటుంది.

చేసుకున్న వారికి చేసుకున్నంత అంటే ఇదేనేమో.. ఆరోజు పై... పై.. మెరుగులు చూసి,  కాసులు కోసం కష్టపడడం మానేసి అన్యాయానికి కొమ్ముకాసం.

ఈరోజు  ఆ అన్యాయమే పాములాగా మెడకి చుట్టుకుని ఊపిరాడనివ్వడం లేదు.

విక్రమ్ ఇంటికి వచ్చిన తర్వాత ధనుంజయ్ తో జరిగిన విషయం మొత్తం చెబుతాడు.  అది విన్న ఇందిరా గారు ఈ విధంగా అయినా సరే వాళ్లు మారితే అదే చాలు అంటారు.

నేను అదే అనుకుంటున్నాను గ్రానీ..  ఇంతకీ అవిని ఎక్కడ అంటే.. ఇంకా అక్కడ ఉంటుంది. కొత్త పెళ్ళికూతురు తన ఎంగేజ్మెంట్ కి తీసుకున్న చీరలన్నీ చూపిస్తుంది.

వాటిని సద్దే పనిలో ఉంది. ఆ మాటకి నవ్వుతూ ఉంటే.. రాజ్ పక్కన వచ్చు కూర్చుని మేము బిజినెస్ యూఎస్ నుంచి ఇండియా షిఫ్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను రా అంటాడు.

ఎందుకు అని అడిగితే... ఆ మాట ఎలా అడగగలుగుతున్నారా..  మిత్ర ద్రోహి.  నీ చెల్లి షాపింగ్ పిచ్చి చూస్తూ ఉంటే నేను సంపాదించింది అంతా కూడా ఫ్లైట్ లకే సరిపోతుంది.

మా అమ్మా ఏదో ఆన్లైన్ షాపింగ్.. అక్కడ బిజినెస్ చేసే లేడీస్  తెచ్చిన వాటిలో ఏదో నచ్చింది తీసుకునేది.. అంతేగాని ఏ రోజు మమ్మల్ని తీసుకుని వెళ్ళమనలేదు. అందుకే లేడీస్ షాపింగ్ నాకు అసలు ఐడియా లేదు.

కానీ ఇక్కడ మీ చెల్లి అలా కాదురా.. తనకి నచ్చిన డిజైన్ కూడా దగ్గరుండి మరి డిజైన్ చేపించుకుంటుంది. కలర్ కూడా కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు.

ఎలా  రా..  దాన్నే టాలెంట్ అంటారు రా అంటాడు.ఆ టాలెంట్ పిచ్చి మా అమ్మకి కూడా అంట గడుతుంది. ఇద్దరూ కలిసి షాపింగ్ అని తిరిగితే నేను మా నాన్న ఏమైపోవాలి.

ఏదో మా నాన్న కోడలు వస్తుందని ఆనందంలో ఇప్పుడు తెలియడం లేదు గాని.. తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయో నాకు ఈ నెల రోజుల్లోనే బాగా తెలిసింది.

రేపు కూతురు పుట్టింది అనుకో వీళ్ళ ముగ్గురిని అమెరికా నుంచి ఇండియా..  ఇండియాలో మూల మూలకి  ఉన్న షాపులకి తిప్పలేను.

అందుకే నేనే కాంప్రమైజ్ అయ్యి ఇండియా షిఫ్ట్ అయిపోతాను. వీడికి అంత సీన్ లేదు అని పార్ధుగారు వస్తారు.

అబ్బా ఈయన ఒక్కడు నా ప్రాణానికి.  ఏ క్రెడిట్ ని నా ఎకౌంట్లో వేసుకోనివ్వరు కదా అని వాళ్ళ నాన్న వైపే చూస్తాడు .

ఏంట్రా ఆ చూపు అంటే చూడడం తప్ప ఇంక మేము ఏం చేయగలం లే అంటాడు. ఇది మాత్రం కరెక్ట్ రా ఇన్నాళ్ళకి నిజాలు ఒప్పుకున్నావు. అందరూ నవ్వుతూ ఉంటారు.

నాన్న నేను ఈ ఇంటికి కాబోయే అల్లుడ్ని.  అత్తారింట్లో కొడుకు ని అలా అనకూడదు అంటాడు. సర్లే ఇంక సంబడాలు మనకి అని.  ఏమీ లేదు విక్రమ్..  నాన్నగారు వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు.

వీడికి ఇక్కడే అలవాటైపోయింది. మేమొ ఒక్కళమే అక్కడ ఉండి ఏం చేస్తాము.  అందరం ఒకే చోటు ఉంటే బాగుంటుంది అని ఆలోచించాము.

అందుకే అక్కడ బ్రాంచ్ రన్ చేస్తూ మెయిన్ వర్క్ అంతా ఇండియా షిఫ్ట్ చేసేస్తున్నాను అని చెబుతారు. మంచి డెసిషన్ అంకుల్.

మేము కూడా నివి  దూరంగా వెళుతుందేమో అని కొంచెం బాధగా అనిపించింది కానీ..  మీరు తీసుకున్న నిర్ణయంతో మా బాధంతా కూడా తీరిపోయింది అని సంతోషంగా చెబుతాడు.

ఇందిరా గారు కూడా చాలా సంతోషంగా ఉంది పార్ధు నీ నిర్ణయం అని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. అవని, నివి అన్నీ సర్థి నవ్వుతూ బయటకు వస్తూ ఉంటారు.

రాజ్ మాత్రం భయంగా చూస్తూ ఉంటాడు. పార్ధు కొడుకువైపు చూసి ఏమైందిరా అంత భయపడుతున్నావు. నీ కోడలు మళ్ళీ ఏ షాపింగా అంటుందో అని తడిసిపోతుంది నాన్న నాకు.

నీకు సీక్రెట్ చెప్పనా అంటారు. చెప్పండి నాన్న.. కోడల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీ అమ్మ కూడా మొదలుపెట్టింది రా..

ఏదైనా అంటే నా కొడుకు చూడండి. ఎంత బాగా తీసుకువెళుతున్నాడు. మీరు ఉన్నారు ఎప్పుడైనా తీసుకు వెళ్లారా అని రాగం అందుకుంటుంది.

తండ్రి వైపు చూసి మీదాకా పాకిందా... నువ్వు బయటపడుతున్నావు. నేను బయటపడటం లేదు అంతే. నిజం చెప్పండి నాన్న..

మీరు బిజినెస్ ఇండియా షిఫ్ట్ చేసేయాలి అనుకున్నది దీనికే కదా అంటే.. ఇది కూడా ఒక కారణం రా.. నేను మాత్రం ఒకటి డిసైడ్ అయ్యాను. అమ్మాయి పుట్టింది అనుకో మన కంట్రోల్ లోనే పెట్టి పెంచుకుందాము.

తండ్రి వైపు చూసి విరక్తిగా నవ్వుతూ మనం ఎన్ని ప్లాన్లు చేసుకున్నా వాళ్ళ ముందు జూజిబిఏ అంటాడు. అంతేనంటావా అంటే..  మీకు ఏమన్నా డౌటా..

శ్రీ గాడి ఎంగేజ్మెంట్ అప్పుడు నేను ఇచ్చిన బిల్డ్ అప్ కి ఇప్పటికీ వీళ్లిద్దరూ నన్ను ఆడేసుకుంటున్నారు. వాళ్ల అమాయకమైన ముఖాలు చూసి మనమే మోసపోతాము.

ఇప్పటికీ అదే ఇన్నోసెంట్ తో వచ్చి మన ముందు నిలబడి మరి లొంగ తీసేసుకుంటారు. అందుకే నాకు మీ కోడల్ని చూస్తుంటే భయమేస్తుంది.

గొడవ పడినా.. ఏడ్చిన ఇది ఇంతే అనుకోవచ్చు.  తిట్టినా..  నోరు ఇంతే అని భరించవచ్చు.  కానీ అలాంటివి ఏమీ చేయకుండా.. ఇన్నోసెంట్ లుక్స్ తో ఎదురుగుండా వచ్చి మీకు అభ్యంతరం లేకపోతే అని మొదలు పెడతారు.

ఇంకెక్కడి నుంచి అభ్యంతరం వస్తుంది నాన్న. అంత రెస్పెక్ట్ గా మాట్లాడుతుంటే.. అలాగే బెండు తీసేసింది. ఒరేయ్ పెళ్లికి ముందే బెండ్ అయిపోతే.. పెళ్లి అయ్యాక ఏంట్రా నీ పరిస్థితి.

కొన్ని కొన్ని అడక్కూడదు నాన్న చూసి చూడనట్టుగా వెళ్లిపోవాలి. నా కొడుకుకి అప్పుడే ఎంత జ్ఞానోదయం అయింది. అయాం ప్రౌడ్ అఫ్ మై సన్ అంటారు .

మీరు నన్ను పొగిడినా తిట్టినా ఏదైనా ఒకేలాగా తీసుకుంటున్నాను నాన్న.  దానినే పెళ్లయ్యాక వచ్చే స్థితిప్రజ్ఞత అంటారు.

రాత్రి పడుకునే ముందు పాల గ్లాసుతో గదిలోకి వచ్చిన అవని కి విక్రమ్ ఎక్కడా కనిపించడు.  ఏమైపోయారు ఈయన అని చుట్టూ చూస్తూ బాల్కనీలోకి వెళుతుంది.

అక్కడ చేతులు కట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు.  ఏమైందండీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని భుజం మీద చెయ్యి వేసి అడుగుతుంది.

అప్పటి వరకు ఉన్న ఆలోచనలు పక్కన పెట్టేసి భార్య వైపు నవ్వుతూ చూసి.  వచ్చావా అని అక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు.

ఒడిలో కూర్చుని భర్త మొఖం చూస్తూ ఏమాలోచిస్తున్నారండి... ఏమీ లేదు చిన్న ఆఫీస్ టెన్షన్ అంతే అంటారు.

మీకు అబద్ధం చెప్పడం కూడా రాదు అంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు. మీరు ఇంటికి వచ్చాక ఎప్పుడు ఆఫీస్ వర్క్ గురించి ఆలోచించరు.

అది మన ప్రైవేట్ ప్లేస్ లో అయితే అసలు ఆలోచించరు అంటుంది.   ఆ మాటకి నవ్వుతూ అబ్బో మా భార్యామణికి అన్ని విషయాలు తెలిసే..

నాకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు కానీ మీ గురించి తెలుసు అంటుంది. ఏం జరిగిందో చెప్పండి అని చెంపపైనా చెయ్యవేసి అడుగుతుంది.

అవని కళ్ళల్లోకి చూస్తూ.. నేను చెప్పేది జాగ్రత్తగా విను ఎమోషనల్ అవ్వద్దు అంటాడు.  ముందే భయపెడుతున్నారు. లేదు జాగ్రత్త పడుతున్నాను.

సరే చెప్పండి వింటాను. ఈరోజు ఆ మనిషి నన్ను కలిశారు అని చెప్పి అవని వైపు చూస్తాడు.  అప్పటికే అవని ఫేస్ లో రంగులు మారుతూ ఉంటాయి.అందుకే చెప్పాను ఎమోషనల్ అవ్వద్దు అంటే.. ఏమీ లేదు చెప్పండి.

ఎల్లుండి వాళ్ళ కంపెనీ యాన్యువల్ డే. ఆరోజు అన్ని డాక్యుమెంట్స్ అందరి ముందు నీకు ఇవ్వాలి అని చెప్పడానికి వచ్చారు అని చెబుతాడు.

అవని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కొంచెంసేపు అవని కి టైం ఇవ్వాలి అని ఏమీ మాట్లాడకుండా విక్రమ్ కూడా సైలెంట్ గా ఉంటాడు.

అంతా నా పేరు మీదే రాసేస్తే.. మరి ఆయన కూతురు సంగతి ఏమిటి అని అడుగుతుంది. ఆ మాటకి నవ్వుతూ అందుకేనే నిన్ను బంగారం అనేది.

ఒక్క చిల్లి గవ్వ కూడా నీకు అందకూడదు. నీకు ఆ వారసత్వంతో ఎటువంటి సంబంధం లేకుండా చూడాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచే జరగాలి అనుకుంటున్నావు చూడు.. అక్కడ ఇంకో మెట్టు ఎక్కేసావు అని గట్టిగా హగ్ చేసుకుంటాడు.

కాసేపటికి వదిలి అవన్నీ.. ఆ మనిషి ఆలోచించకుండా ఉండడు కదా.. చూద్దాం ఏం చేస్తారో అన్నది. కాకపోతే ఆరోజు నువ్వు వచ్చి ఆ డాక్యుమెంట్స్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్.

నువ్వు కచ్చితంగా వెళ్ళాలి అంటే మీరు ఉంటారు కదా అంటే..  మన కుటుంబం మొత్తం ఉంటుంది అని చెబుతాడు.

అలాగైతే ఓకే... ఒక్క విషయం.  నేను మాత్రం అక్కడ ఏమీ తాగను. తినను.  ఆ విషయంలో నన్ను ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అని చెబుతుంది.

నీకు ఎలా కావాలంటే అలా చేద్దాం బంగారం.  పొద్దుటి నుంచి నువ్వు, నివి శారీస్ బిజీలోనే ఉన్నట్టున్నారు అంటూ డైవర్ట్ చేస్తాడు. అవునండి... నివి దగ్గర చాలా కలెక్షన్ ఉంది.

ఆ టెస్ట్ ని కూడా మెచ్చుకోవాలండి. ఆ కాంబినేషన్ సెట్ చేయడం అంటే మాటలు కాదు కదా..  మంచి డిజైనర్ ఉంది తనలో.  అటువైపు ఎందుకు తను ట్రై చేయడం లేదు.

ఫ్యూచర్లో ట్రై చేస్తుంది ఏమో అంటాడు. యూఎస్ వెళ్ళిపోతారు కదా. లేదు ఫ్యామిలీ మొత్తం ఇండియా షిఫ్ట్ అయిపోతున్నారు అని చెబుతాడు.

ఎంత మంచి వార్త చెప్పారండి. ఇలాగైతే మావి శారీస్ గాని ఏమైనా కావాలి అంటే నివితోనే డిజైన్ చేపించుకుంటాను అని ఉత్సాహంగా చెబుతుంది.

నవ్వుతూ మాట్లాడుతున్న అవని మొఖాన్ని చూస్తూ మొఖంపై పడుతున్న ముంగురులను చెవి వెనక్కి సర్దుతూ చెప్పేవి అన్నీ వింటూ ఉంటాడు.

యాన్యువల్ డే ??
కథ కొనసాగుతుంది..
[+] 12 users Like SivaSai's post
Like Reply
Superb update
Like Reply
Sorry For Inconvenience 


Urgent Ga Ma Village Ki Veltunna 


Next Update In Saturday or Sunday Afternoon 
[+] 1 user Likes SivaSai's post
Like Reply
(18-02-2026, 11:22 AM)SivaSai Wrote: Part - 104


...

ఒడిలో కూర్చుని భర్త మొఖం చూస్తూ ఏమాలోచిస్తున్నారండి... ఏమీ లేదు చిన్న ఆఫీస్ టెన్షన్ అంతే అంటారు.

మీకు అబద్ధం చెప్పడం కూడా రాదు అంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు. మీరు ఇంటికి వచ్చాక ఎప్పుడు ఆఫీస్ వర్క్ గురించి ఆలోచించరు.

అది మన ప్రైవేట్ ప్లేస్ లో అయితే అసలు ఆలోచించరు అంటుంది.   ఆ మాటకి నవ్వుతూ అబ్బో మా భార్యామణికి అన్ని విషయాలు తెలిసే..

నాకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు కానీ మీ గురించి తెలుసు అంటుంది. ఏం జరిగిందో చెప్పండి అని చెంపపైనా చెయ్యవేసి అడుగుతుంది.

...

నవ్వుతూ మాట్లాడుతున్న అవని మొఖాన్ని చూస్తూ మొఖంపై పడుతున్న ముంగురులను చెవి వెనక్కి సర్దుతూ చెప్పేవి అన్నీ వింటూ ఉంటాడు.

యాన్యువల్ డే ??
కథ కొనసాగుతుంది..

I like the way you are making Avani get into normalcy!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
(18-02-2026, 12:32 PM)SivaSai Wrote:
Sorry For Inconvenience 


Urgent Ga Ma Village Ki Veltunna 


Next Update In Saturday or Sunday Afternoon 

eduru choostu untam brother!! Have a safe n nice trip!
Like Reply
Update is Coming At Evening
[+] 2 users Like SivaSai's post
Like Reply
(21-02-2026, 01:24 PM)SivaSai Wrote:
Update is Coming At Evening

Welcome back Sivagaru.
Hope you had a wonderful trip to your village!!
Like Reply
Part - 105


అవని మాటలతో విక్రమ్ కి టైమే తెలియకుండా గడిచిపోతూఉంటుంది.  విక్రమ్ ప్రేమలో అవని కి ప్రపంచమే కనపడకుండా ఉంటుంది.

మరో ఉదయం ప్రారంభమైంది. ధనుంజయ్ జైలుకు వెళ్లి శిల్పని కలుస్తాడు. ధనుంజయ్ ని చూడగానే శిల్ప మనసులో ఎగిరి గంతేస్తుంది.

నా ప్లాన్  బానే వర్క్ అవుట్ అయింది.  డాడీ నమ్మారు సో ఇంక నేను బయటికి వెళ్ళిపోవచ్చు అని కాలర్ ఎగరేస్తుంది.

తండ్రి ముందు అమాయకంగా నిలబడి చెప్పండి డాడీ అని నీరసంగా మాట్లాడుతుంది. శిల్ప వైపు సూటిగా చూస్తూ నిన్ను బయటకు తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నాను.

ఆ మాటకి మీరు నన్ను నమ్మారు నాకు అంతే చాలు డాడీ అని దొంగ కన్నీళ్లు కారుస్తుంది. చూడు శిల్ప నిన్ను బయటకు తీసుకు వెళ్లాలి అంటే.. ఈ పేపర్స్ మీద సంతకాలు చేయాలి అని చెబుతాడు.

ఏం పేపర్స్ డాడీ అవి అని అడిగితే...  నువ్వు మారాను అంటున్నావు కదా.. నాపైన నమ్మకం ఉంటే సంతకం చెయ్యి.. లేదు అంటే నీ ఇష్టం అని పేపర్స్ మళ్లీ వెనక్కి తీసుకుంటాడు.

అమ్మో ఇప్పుడు ఎందుకులే గొడవ.  ముందు సంతకం చేస్తే బయటకు వెళ్లాక... తర్వాత సంగతి ఆలోచించవచ్చు. మిమ్మల్ని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను డాడీ అంటూ ఆ పేపర్స్ మీద సంతకం చేస్తుంది.

గుడ్ రెడీగా ఉండు తీసుకువెళ్తాను..  అక్కడ నుండి జైలర్ దగ్గరికి వెళతాడు. కాసేపు జైలర్ తో మాట్లాడిన తర్వాత భార్గవి దగ్గరికి వెళతాడు.

ఏంటి భార్గవి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు ఎగతాళిగా అడిగితే.. మళ్లీ ఎందుకు వచ్చారు అని కోపంగా అడుగుతుంది.

నీకు గుడ్ న్యూస్ చెబుదామని అంటాడు. మళ్ళీ ఏం వార్త ఏంటి అని కోపంగానే మాట్లాడుతుంది. ఈ పేపర్స్ చూసావా..  నీ ముద్దుల కూతురు నేను అడిగిన చోటల్లా సంతకాలు చేసింది అని చూపిస్తాడు.

ఏమిటి అవి వేలు పెట్టి చూపిస్తూ వణుకుతూ అడుగుతుంది.  పరవాలేదు నీ ఒంట్లో కూడా భయం అనే ఒక పదార్థం ఉంది.

చూస్తావా అని ఈ పేపర్స్ చేతికి ఇస్తాడు. అవి చదివి.. నో ఇలా జరగడానికి వీలు లేదు.  అయినా అది ఎలా సంతకం చేసింది.

బయటికి తీసుకువెళ్తాను అంటే దేనికైనా సిద్ధంగానే ఉంది.  దీనికి నేను ఒప్పుకోను.  ఆ పేపర్స్ని చింపేసి గట్టిగా నవ్వుతూ ఇప్పుడేం చేస్తారు అని పొగరుగా అడుగుతుంది. ఒక్కసారి సీరియస్ గా చూసి వెంటనే గట్టిగా నవ్వుతాడు.

ఎందుకు నవ్వుతున్నారు అని ఏమీ అర్థం కాకుండా అడుగుతుంది.  ఒసేయ్ పిచ్చిదానా నువ్వు ఎలాంటి దానివో తెలిసి కూడా.. నీ చేతికి ఒరిజినల్ ఇస్తాను అనుకున్నావా..

   నువ్వు చింపింది  జిరాక్స్ కాపీ.  ఒరిజినల్స్ నా దగ్గరే ఉన్నాయి. ఇంకా నీ డ్రామాలు ఎక్కడ ఎలా వేసుకుంటావో వేసుకో బాయ్ అని చెప్పి వెళ్లి... శిల్ప కి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి బయటికి తీసుకువెళ్తాడు.

ఇక భార్గవి నేనేమీ చేయలేనా  అని అవని నవ్వుతూ ఉన్న ఫోటో చూస్తూ పిచ్చెక్కిన దానిలాగా అరుస్తూ ఉంటుంది.
పక్క గదిలో ఉన్న మిగిలిన ఖైదీలు అబ్బా.. ఈ పిచ్చిది వచ్చినప్పటి నుంచి మన చెవులు చిల్లులు పడిపోతున్నాయి.

జైలర్ గారికి చెప్పి ఈ అమ్మాయి గది మార్పించమనాలి లేకపోతే మనకి పిచ్చెక్కేటట్టు ఉంది అనుకుంటారు. ఆ మాటలు విన్న భార్గవి ఇంకా రగిలిపోతూ ఉంటుంది. అవని నిన్ను వదలను. ఎప్పటికైనా నీ అంతం నా చేతిలోనే అని అరుస్తూఉంటుంది.

ఇంటికి వెళ్ళగానే శిల్ప హమ్మయ్య... మా ఇంటికి వచ్చేసాను.  రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఏసీ వేసుకుని పడుకోవాలి.  గ్రానీకి చెప్పి మంచి నాన్ వెజ్ ఐటమ్స్ చేపించుకొని తినాలి.

చాలా రోజులైపోయింది మంచి ఫుడ్ తిని అనుకుంటూ కారు దిగుతుంది.  లోపలికి వెళ్ళబోతుంటే ఆగు అన్న మాట గట్టిగా వినపడుతుంది.

ఆ వాయిస్ కి ఉలిక్కిబడి వెనక్కి తిరిగి చూస్తుంది.  అక్కడ ధనుంజయ్ సూటిగా కూతురు వైపే చూస్తూ ఉంటారు. ఏమైంది డాడీ ఎందుకు అంత గట్టిగా అరిచారు అని అడిగితే...

నువ్వు వెళ్లాల్సిందే అటు కాదు అని చెబుతాడు. మరి ఎటు అంటే..  ఒక సర్వంట్ ని పిలిచి బిందు ఉన్నచోటికి తీసుకువెళ్ళమని చెబుతాడు.

ఆ సర్వెంట్ వచ్చి రండి అమ్మ అనగానే.. ఎక్కడికి డాడీ అంటే..  మీ అత్తయ్య ఉన్న చోటకి అన్ని చెబుతాడు. అత్తయ్య ఎక్కడ ఉంది..  సర్వెంట్ తో వెళ్ళు నీకే తెలుస్తుంది.

సరే అని తల ఊపి సర్వెంట్ తో వెళుతూ ఉంటుంది. ఇదేంటి అత్తయ్య దగ్గరికి అని సర్వెంట్ క్వార్టర్స్ వైపుకు తీసుకు వెళుతున్నారు అని ఆలోచిస్తూ వెనకాలే వెళుతుంది.

అక్కడ ఒక గది ముందుకు వెళ్లి ఈ గదిలోనే ఉన్నారు వెళ్ళండి మేడం అని చెప్పి ఆ సర్వెంట్ వెళ్ళిపోతుంది. అనుమానంగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళితే అక్కడ కింద చాప మీద బిందు కూర్చుని ఉంటుంది.

అత్తయ్య అని పిలిస్తే శిల్ప వైపు చూసి చిరాకుగా మొఖం పక్కకు తిప్పేసుకుంటుంది.  ఏమైందత్తయ్య.. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని అడుగుతుంది.

ఇలా కాకుండా ఇంకా ఎలా ఉంటాము మీ అమ్మ చేసిన దానికి అంటే.. ఇది మరీ బాగుంది. మీ స్వార్థానికి మీరు మా అమ్మతో చేతులు కలిపారు.  దానికి మా అమ్మ ఏం చేస్తుంది.

నిజమేలే మీ అమ్మ ఏం చేస్తుంది. ఇది అంతా మా కర్మ అని తల కొట్టుకుంటుంది. ఇప్పుడు ఏమైందని అంత బాధ పడుతున్నావు.

నేను వచ్చేసాను కదా..  మెల్లిగా అమ్మను కూడా బయటికి తీసుకువస్తాను. అప్పుడు మనదే మళ్లీ రాజ్యం అవుతుంది.

ఆ మాటకి శిల్ప వైపు జాలిగా చూస్తూ నీకు ఇంకా అలాంటి ఆశలు ఉన్నాయా అని అడుగుతుంది.  ఈ శిల్ప తలుచుకుంటే ఏమైనా చేయగలదు.

ఇప్పుడు చూడు మా నాన్నని నమ్మించి నేను బయటికి రాలేదా.. అలాగే మా అమ్మను కూడా తీసుకువస్తాను. మళ్ళీ చక్రం తిప్పుతాను.

నేను కోరుకున్న ఫ్యాషన్ ఫీల్డ్ లోకి వెళతాను.  ఆ అవని జీవితాన్ని అంతం చేస్తాను అని పిడికిలి బిగిస్తుంది.  అవని జీవితం సంగతి తర్వాత.. ముందు నీ జీవితం గురించి ఆలోచించు అని హెచ్చరిస్తుంది.

నా జీవితానికి ఏమైంది బిందాస్.. అయినా ఇక్కడ ఎలా ఉంటున్నావు. ఉడుగ్గా లేదు...  మన ఇంటికి వెళదాము..  ఎక్కడికి వెళ్ళేది.. ఇక్కడే మనిద్దరం ఉండాల్సింది అని చెబుతుంది.

ఏమిటి నువ్వు అనేది అత్తయ్య అని ఆశ్చర్యంగా అడిగితే..  ఇంక నీకు సినిమా అర్థం కావడం లేదు అనుకుంటా.. నువ్వు మారాను అని మీ నాన్నని నమ్మించి ఈజీగా బయటకు వచ్చాను అనుకుంటున్నావు.

కానీ నిన్ను ఏమీ నమ్మలేదు. ఆయన ఎందుకు బయటకు తీసుకోవచ్చారో ముందు ముందు నీకే అర్థమవుతుంది కానీ సైలెంట్ గా నా పక్కన వచ్చి కూర్చో.

వాళ్ళు టైంకి వచ్చి ఇంత ఫుడ్ పెడతారు తిను.  ఏదో ఒక పని చెబుతారు చేసుకో.   అంతకుమించి ఎగస్ట్రాలు మాట్లాడితే నిన్ను మళ్ళీ తీసుకెళ్లి ఆ జైల్లోనే కూర్చోబెడతారు అంటుంది.

అసలు ఏం జరుగుతుంది అత్తయ్య వెళ్లి బిందు పక్కన కూర్చుని అడుగుతుంది.  నేను చెప్పలేను చెప్పిన నీ బుర్రకి అర్థం కాదు.

అలసిపోయి ఉంటే మూసుకుని పడుకో అంటుంది. నువ్వు ఏది క్లియర్గా చెప్పడం లేదు అంటుంది. ఇప్పుడు నేనేమీ చెప్పలేను అంటున్నాను కదా.. నన్ను విసిగించకు శిల్ప అని కళ్ళు మూసుకుంటుంది.

అసలు ఏం జరుగుతుంది ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ ఉంటే ఏదైనా సలహా ఇచ్చేది.
ఎలాగైనా అమ్మను కూడా బయటకు తీసుకురావాలి.

ఈ విషయం గురించి నాన్నతో మాట్లాడాలి. నాన్న హెల్ప్ చేస్తారా అని మళ్లీ ఆలోచిస్తుంది. సర్వెంట్ వచ్చే డోర్ కొడుతుంది.

బిందు కళ్ళు మూసుకుని వెళ్లి తలుపు తియ్యి.. అక్కడ ఫుడ్డు తెచ్చి ఉంటారు. శిల్ప మౌనంగా వెళ్లి తలుపుతీస్తుంది.

మీ ఇద్దరికీ భోజనం అని ఆ సర్వెంట్ మర్యాద లేకుండా మాట్లాడుతుంది. సర్వెంట్ మాట్లాడిన విధానానికి శిల్పకి చాలా కోపం వస్తుంది.

ఇప్పుడు కోపం చూపిస్తే తను వేసుకున్న ప్లాన్స్ అన్ని అట్టర్ ప్లాప్ అవుతాయి అని సైలెంట్ గా తీసుకుని వెళ్లి బిందు ముందు పెడుతుంది.

చాలా రోజులైంది ఇంటి భోజనం తిని.  గ్రానీ ఏం చేపిచ్చిందో ఏంటో అని ఓపెన్ చేసి చూస్తుంది. అది చూడగానే అత్తయ్య అని గట్టిగా పిలుస్తుంది.

ఏమైంది అని కళ్ళు మూసుకుని అడిగితే..  ఈ భోజనం ఏమిటి.. ఇలాంటి ఫుడ్  నువ్వు తింటున్నావా..   మరి మనం ఎవరిమని మనకు రాజభోగాలతో భోజనం పెట్టడానికి అని అడుగుతుంది.

అలా అంటావ్ ఏంటి అత్తయ్య.. నేను ధనుంజయ్ కూతుర్ని.  అలాంటి నాకు ఇలాంటి భోజనం అంటుంది. పిచ్చిదానా ఇంకా నువ్వు ఆ ఊహల్లోనే ఉన్నావా...

ఇక్కడ మనం ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళము కాదు. అలాగని పనివాళ్ళము కాదు. అందుకే టైం కి ఇంత ముద్ద తెచ్చి పెడుతున్నారు.  అది కూడా ఇలా సర్వెంట్స్ తినేదే అని చెబుతుంది.

నాన్నతో నేను మాట్లాడతాను.  గ్రానీ ఎందుకిలా పంపించిందో అని కోపంగా ఉంటుంది. ఇలా పంపిస్తుందే మీ డాడీ.  మీ గ్రాని కి దీనితో ఎటువంటి సంబంధం లేదు.

ఇంకా ఎక్కువ చేసావు అనుకో అవని కి ఎలాంటి భోజనం అయితే మీ అమ్మ పెట్టేదో అదే భోజనం నీకు పెడతారు అర్థం అయిందా అంటుంది.

ఏమిటి అత్తయ్య.. అంత తారుమారు అయ్యింది అంటే..  చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత మహదేవ అని ఊరికనే అనలేదు కదా..

ఆ రోజు మీ అమ్మ స్వార్థంతో చేస్తే.. మా స్వార్థంతో మేము చేతులు కలిపాము. అందుకు శిక్ష అనుభవిస్తున్నాను.  మీ అమ్మ కి పుట్టినందుకు నువ్వు అనుభవిస్తున్నావు అంతే అని చెప్పి ఆ భోజనం దగ్గరికి తీసుకుని తింటూ ఉంటుంది.

శిల్ప ఆలోచన ఏమిటి..
[+] 13 users Like SivaSai's post
Like Reply
Part - 106


బిందు భోంచేస్తుంటే శిల్ప మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు. ఆకలి వేయడం లేదా.. ఇలాంటి భోజనం తినాలి అంటే ఆకలి ఎలా వేస్తుంది అత్తయ్య.

ఇది కాకపోతే ఇంకా ఏం దొరుకుతుంది అనుకుంటున్నావు.  మళ్ళీ జైలు కూడా... అత్తయ్య అని కోపంగా ఉంటుంది. నువ్వు కోపంగా అరిచినా మెల్లిగా చెప్పిన నేను చెప్పేది నిజం.

మూసుకుని తింటే ఇదైనా ఉంటుంది లేకపోతే ఇది కూడా ఉండదు. ఈ ఫుడ్డే నువ్వు రోజు తింటున్నావా..  ఇదైనా దొరుకుతున్నందుకు సంతోషిస్తున్నాను .

భోజనం చెయ్ అని చెబుతోంది. మెల్లిగా ప్లేట్ దగ్గరికి లాక్కొని భోంచేస్తూ ఆలోచిస్తుంది.  ఏం జరుగుతుంది నేను ఏం చేయాలి.

మళ్ళీ ఒకసారి క్రిష్ ని కాంటాక్ట్ చేస్తే అనుకుంటుంది కానీ ఎలా..  నా దగ్గర ఫోన్ కూడా లేదు.  ఉదయ్ ఉండి ఉంటే ఎలాగోలాగా ట్రై చేద్దును.

సడన్గా గుర్తొచ్చి అత్త ఉదయ్ ఎక్కడున్నాడు. తినేది ఆగి శిల్ప వైపు చూసి ఇప్పుడు నా కొడుకు ఎందుకు గుర్తొచ్చాడు అని అడుగుతుంది.

అబ్బా దేనికో దానికి గుర్తొచ్చాడులే గాని ఎక్కడున్నాడు అంటే నాకు తెలియదు అంటుంది. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అత్తయ్య.

అన్ని నీకు, మావయ్యకి చెప్పి చేస్తాడు కదా..  అవును అవును అని చెప్పే చేస్తాడు. అందుకే ఎక్కడున్నాడు ఇప్పుడు తెలియదు అంటున్నాను.

మౌనంగా భోజనం చేస్తుంది కానీ కడుపులోనుంచి బాధ తన్నుకోస్తూ ఉంటుంది.  బయటికి చెప్పలేక ముద్ద గొంతులోకి దిగలేక నానా అవస్థ పడుతూ ఉంటుంది.

ఏంటో అత్తయ్య నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు.  నాకు ఒక్కటి కూడా అర్థం కావడం లేదు.  కంగారు ఎందుకు మెల్లిగా అన్ని అర్థమవుతాయిలే అంటుంది.

శిల్ప కష్టంగా భోజనం తిని నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. రూమ్ లో ఏసీ లేదా...  సర్వెంట్ క్వార్టర్స్ లో కూడా ఏసీ ఉంటుందా అని వెటకారంగా అంటుంది.

నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ప్రతిదానికి వెటకారం ఆడుతున్నావు.  నేను నిజాలు చెబుతూ ఉంటే నీకు అలా అనిపిస్తుంది.  ఏమీ చేయలేను నేను అని అక్కడ చాప పైన ఒక పక్కకి పడుకుంటుంది.

శిల్ప కూడా చాప పైన పడుకొని ఎలా నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూనే మత్తుగా నిద్రపోతుంది.

సాయంత్రం సర్వెంట్ వచ్చి పిలిచేదాక మత్తు నిద్రలో ఉంటుంది. మెల్లిగా కళ్ళు తెరిచి అత్తయ్య ఎవరో చూడు.  వాళ్ళు వచ్చింది నీకోసమే.

అబ్బా నా కోసమైతే ఏమైంది... తలుపు తీయొచ్చు కదా...  నువ్వే వెళ్లి తీసుకో.   మెల్లిగా లేచి వెళ్లి తలుపుతీస్తుంది.

ఇదిగో శిల్ప పడుకుంది చాలుగాని అయ్యగారు పిలుస్తున్నారు అని చెబుతుంది. నేను ఎవరో తెలుసా..  నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావా...

నువ్వు ఎవరివైనా సరే ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ ని బట్టి పేరు పెట్టే పిలుస్తాను.  రా.. రా సార్ కి చాలా పనులు ఉంటాయి అని చెప్పి వెళ్ళిపోతుంది. 

ఎవరత్తయ్య ఈ కొత్త సర్వెంట్.  నేనెవరో తెలియదా.. ఎంత పొగరు. మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది.ఇప్పుడు నుంచి అయినా ఆలోచించి మాట్లాడడం నేర్చుకో శిల్ప.

నువ్వు ఇలాంటి సూక్తులు ఎప్పటినుంచి మొదలు పెట్టావు అని అడుగుతుంది.  ఎదురు దెబ్బ తగిలితే ఎవరైనా మాట్లాడతారు.

వెళ్ళు వెళ్ళు ఎందుకు పిలిచారో మీ నాన్న. సర్లే అని అమాయకంగా ముఖం పెట్టుకొని మరీ వెళ్లి పిలిచారు అంట నాన్న అంటుంది.

గార్డెన్ లో ధనుంజయ్ కుర్చీలో కూర్చుని ఉంటాడు చుట్టూ చూస్తూ ఉంటుంది. అక్కడ ధనుంజయ్ కుర్చీ తప్ప ఇంకా ఏమీ ఉండదు.

ఏంటి శిల్ప చుట్టూ చూస్తున్నావు. నీకు కుర్చీ వేయలేదేమిట అని అడిగితే..  అయ్యో అదేమీ లేదు నాన్న. మీ ముందు కింద కూర్చుంటే మాత్రం తప్పేముంది అని అక్కడే గడ్డిలో కూర్చుంటుంది.

మనసులో మాత్రం కుతుకుతా ఉడుకుపోతూ ఉంటుంది.  నిన్ను ఎందుకు పిలిపించానో తెలుసా అంటే తెలియదు అని తలూపుతుంది.

రేపు నా కంపెనీ యాన్యువల్ డే అని చెబుతాడు. అవునా..  ఈ వంకన బయటికి వెళ్ళితే ఏదో విధంగా క్రిష్ ని కలవచ్చు అని మనసులోనే ప్లాన్స్ వేసుకుంటూఉంటుంది. 


నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని పిలిచాను. ఏమిటి నాన్న. ఫస్ట్ నువ్వు నన్ను నాన్న అని పిలవడం మానేయాలి అంటాడు.

ఈసారి గట్టిగా షాక్ తగులుతుంది.  ఏమంటున్నారు అంటే నేను ఒక్కసారి చెబుతాను. ఆల్రెడీ నేను నీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టు నాకు గుర్తు.

నలుగురిలో ఎక్కడా కూడా నువ్వు నా కూతురు అన్న విషయం తెలియడానికి వీలు లేదు.  రేపు యాన్యువల్ డే కి మన సర్వెంట్స్ తో పాటు కలిపే నువ్వు రావాలి.

వచ్చి అక్కడ జరిగే ప్రోగ్రామ్ అంతా చూడాలి గానీ ఎక్కడ నీ నోరు పైకి లేగడానికి వీలు లేదు.  ఒకవేళ పైకి లేచిందే అనుకో తర్వాత జరిగే పరిణామాలకి నేను ఎటువంటి బాధ్యత వహించను.

శిల్ప ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటి నాన్న అంత మాట అనేసారు. నేను ధనుంజయ్ కూతురిని తెలిస్తేనే కదా నాకు ఆఫర్స్ బాగా వస్తాయి.

సర్లే ఇప్పుడు ఊ కొట్టి రేపు బయటికి వెళ్లాక..అక్కడ ప్రోగ్రాం జరిగేటప్పుడు పిలుస్తాను.  తర్వాత మర్చిపోయాను క్షమించండి అని ఏదో ఒక మాయ చేయొచ్చులే అనుకొని..  సరే నాన్న మీ ఇష్టం అంటుంది.

ఇదిగో ఇప్పటినుండి ఆ పిలుపు మానేయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. వెళుతున్న తండ్రిని చూస్తూ ఉంటుంది.

బిందు అక్కడికి వచ్చి ఏంటి అలా చూస్తున్నావు.  అసలు ఏం జరుగుతుంది అత్తయ్య. నన్ను నాన్న అని పిలవద్దంటారేంటి. పిలవకుండా ఎలా కుదురుతుంది.

ఎందుకు కుదరదు.  అవని విషయంలో నువ్వు,  మీ అమ్మ అలాగే చేశారు కదా.  అది నేను ఒకటేనా..  ఎట్టి పరిస్థితిలోనూ ఒకటి కాదు.

ఇద్దరూ సముద్ర గర్భం నుంచి వచ్చిన అది ముత్యం. మరి నేను..  మళ్ళీ పనిగట్టుకుని చెప్పాలా ఎందుకు పనికిరాని పిచ్చి మొక్కవి అని వెళ్ళిపోతుంది.

మీకు అందరికీ ఎంత పొగరు పెరిగిపోయింది. నేను జైలుకు వెళితే మాత్రం ఈ శిల్ప రేంజ్ తగ్గిపోతుందా.. నేనేంటో అందరికీ చూపిస్తాను.

అప్పుడు మీరందరూ నా కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడతారు. శిల్ప మా అమ్మాయి... నా మేనకోడలు అని మీరే గొప్పలు చెప్పుకుంటారు అని పొగరుగా చూస్తూ ఉంటుంది.

రేపు వేసుకోవడానికి డ్రెస్సులు ఏమీ లేవే..  ఎలాగైనా నా డ్రెస్సు తెప్పించుకోవాలి అని ఆలోచిస్తూ..  అటుగా వెళుతున్న సర్వెంట్ ని పిలిచి లోపలికి వెళ్లి మా గ్రానీని పిలువు అని చెబుతుంది.

పైనుండికెందుకు చూస్తూ మీ గ్రానీ ఎవరు అని అడుగుతుంది. యు..  ఇడియట్.  నువ్వు కొత్తగా వచ్చిన పనిమనిషి వా..

నీ కన్నా ముందు వచ్చానులే గాని విషయం ఏంటో చెప్పు.  ఇక లాభం లేదు అనుకుని..  లోపల ఒక పెద్ద ఆవిడ ఉంటారు కదా సత్యవతి గారు అని అంటుంది.

మా మేడం.  హ..  ఆవిడని ఒక్కసారి శిల్ప రమ్మంటుంది అని చెప్పు.  చెబితే.. చెప్పి చూడు నీకే తెలుస్తుంది. నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని ధనుంజయ్ కూర్చున్న కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటుంది.

ఏ అమ్మాయి నీకు ఎంత పొగరు. మా అయ్యగారు కుర్చీలోనే కూర్చుంటున్నావు. నువ్వు లోపలికి వెళ్లి మీ పెద్ద మేడంని పిలుచుకునిరా.

అప్పుడు నేను ఎవరో నీకే తెలుస్తుంది. వెళ్ళు వెళ్ళు అని అదే పొగరుతో చెబుతుంది. ఆ సర్వెంట్ లోపలికి వెళ్లి సత్యవతి గారికి చెబుతుంది.

నేను వస్తున్నాను పదా అని బయటకు వచ్చి చూస్తారు.  అక్కడ శిల్ప కాలు మీద కాలు వేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది.

హేయ్.. శిల్ప అనే గట్టిగా అరుస్తారు.  ఆ పిలుపుకు ఉలిక్కిపడి ఏంటి మా గ్రానీ ఇంత గట్టిగా అరుస్తుంది.  గ్రానీ అని పరిగెత్తుకుంటూ వెళ్లి చేతులు పట్టుకుని ఎన్ని రోజులైపోయింది గ్రానీ నిన్ను చూసి.

నీ మీద నేను చాలా బెంగ పెట్టుకున్నాను. నన్ను నాన్న ఇంట్లో కూడా రానివ్వలేదు. పైగా నన్ను నాన్న అని పిలవద్దంటున్నారు.

ఈ సర్వెంట్ కి చెప్పు నేను ఎవరో.. ఏమిటో..  ఆ సర్వెంట్ క్వార్టర్స్ లో ఉండలేకపోతున్నాను. చాలా వేడిగా ఉంది.  అట్లీస్ట్ అక్కడ ఒక ఏసీ అయినా పెట్టించవచ్చు కదా..

రేపు యాన్యువల్ డే ఉంది అంట కదా..  నాకు డ్రెస్ కావాలి గ్రానీ.  నా రూమ్ లో పారిస్ నుంచి తెప్పించుకున్న డ్రస్సు ఉంది కదా..  అది పంపించు అని తన ఫ్లో లో చెప్పుకుంటే వెళుతుంటే.. ఎవరే నీకు గ్రానీ అని కోపంగా అంటారు.

అంతే అప్పుడు దాకా గట్టు తెగిన గోదావరి లాగా లోడలోడా వాగుతున్న శిల్ప ఆశ్చర్యంగా సత్యవతి వైపు తిరిగి గ్రానీ నువ్వు ఏమంటున్నావు.

నేను నీ ముద్దుల మనవరాలని అంటుంది. ఇంకా ఆపు. నాకు ఉన్నది ఒకే ఒక మనవరాలు.  అది అవని మాత్రమే. ఏదో పిచ్చివాగుడు వాగుతున్నావు అని ఈ అమ్మాయి చెబితే...

నీకు వార్నింగ్ ఇద్దామని వచ్చాను. ఇంకొకసారి నన్ను గ్రానీ అని పిలిచావు అంటే మర్యాదగా ఉండదు. ప్యారిస్ నుంచి డ్రెస్ అంట..

నీ మొహం చూడు ఎలా ఉందో..  నీకు కావాలి అంటే ఒక పాత డ్రెస్ ఇస్తాను వేసుకో..  అంతేగాని లేనిపోని బిల్డప్పులు ఇవ్వకు అని కోపంగా లోపలికి వెళ్ళిపోతారు.

సర్వెంట్ పూసుక్కున నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు. ఇందాకటి నుంచి నువ్వు ఇచ్చే బిల్డప్ కి నువ్వు ఎవరో ఏంటో అనుకున్నాను.

తీరా చూస్తే నువ్వు మాకన్నా దారుణంగా ఉన్నావే.. పని తప్పించుకోవడానికి లేనిపోని రిలేషన్స్ చెబుతున్నావా... డ్రస్సు లేదు అంటే నేనే నా బట్టల్లో ఏదో ఒక డ్రెస్ తీసి ఇద్దును కదా అంటుంది.

ఇడియట్ నేను పని వాళ్ళ బట్టలు వేసుకునే దానిలాగా కనిపిస్తున్నానా.. ఇదిగో ఇందాకటి నుంచి చూస్తున్నాను.  పనమ్మాయి... పని అమ్మాయి..  అంటున్నావ్.

ఇంతకీ నువ్వు ఏమిటి పని అమ్మాయివి కాదా..  ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప ఇంకా ఏమీ లేవు నీ దగ్గర. అయినా పొగరు చూపిస్తున్నావు.

పోనీలే అని జాలి పడితే నా మీదే అరుస్తున్నావు.  నీ కర్మ. నేనే కాదు మన సర్వంట్ బ్యాచ్ లో ఎవరూ కూడా నీకు బట్టలు ఇవ్వరు. ఏం వేసుకుని  వస్తావో రా అని అమ్మాయి వెళ్ళిపోతుంది.

శిల్ప నోటి దూల ???

కథ కొనసాగుతుంది...
[+] 14 users Like SivaSai's post
Like Reply
Superb update
Like Reply




Users browsing this thread: Mahesh5432, 6 Guest(s)