14-02-2026, 09:33 AM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
|
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
|
|
15-02-2026, 08:50 AM
ఎపిసోడ్ 79
మిథున్ చెప్పడంతో రైల్వేస్టేషన్లో మల్లి, లింగు లను దాస్ కుమార్ హెల్ప్ తో కార్లో ఎక్కించుకొని గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు ప్రహల్లాద్.
********* కార్ దిగుతున్నప్రహల్లాద్ వైపు చూసి "సార్! నందా గారి గెస్ట్ హౌస్ కి తీసుకువచ్చారు ఈ విషయం అభీర్ కి తెలిసింది అంటే ఇంకేమైనా ఉందా?" అని కంగారుగా అడిగాడు దాస్. "మీ ఇద్దరి గురించి మాట బయటికి రాదు వీళ్లని దింపిన తర్వాత నేను చెప్తాను అప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోండి." అని చెప్పి కార్ దిగి వెళ్ళాడు ప్రహ్లాద్. మల్లి వైపు కంగారుగా చూస్తూ "నేను అక్కడే చెప్పాను కదా పారిపోకుండా మాతో పాటు ఎందుకు వచ్చారు?" అని అడిగాడు దాస్. "నేను పారిపోతాను పాపం లింగుకి కళ్ళు లేవు అతను ఎలా తప్పించుకుంటాడు అయ్యినా స్టేషన్ కి తీసుకు వెళ్తాడు అనుకున్నాను ఇక్కడికి తీసుకు వస్తాడు అనుకోలేదు." అని కళ్లకు కట్టిన గంతలు తీసి డ్రైవర్ వైపు చూసి సైగ చేసింది మల్లి. సైగ చేయడం చూసి 'ఓహో ఏదో ప్లాన్ లోనే వచ్చారు.' అని మనసులో అనుకున్నాడు దాస్. మిథున్ దగ్గరికి వెళ్లి "సార్! మీరు చెప్పినట్లు ఆ ఇద్దరిని తీసుకొచ్చాను కార్ లొ ఉన్నారు ఇక్కడకి తీసుకురమంటారా..?" అని అడిగాడు ప్రహల్లాద్. సాదు వైపు చూసి "ఇద్దరి చేతులు కట్టేసి ఇక్కడికి తీసుకురా..!" అని చెప్పాడు మిథున్. కారులో నుంచి దింపి చేతులు కట్టి తీసుకు వస్తున్న ఇద్దరినీ చూసి "అతనికి కళ్ళకి గంతలు ఎందుకు కట్టలేదు?" అని డౌట్ గా అడిగింది అర్ణ. "మేడం! అతని కళ్ళు కనిపించవు అందుకే కట్టలేదు." అని చెప్పాడు ప్రహల్లాద్. అక్కడికి వచ్చిన లింగు దగ్గరకి వెళ్లి "కళ్ళు లేకుండా అభీర్ సేనలొ ఉండి నువ్వేం చేస్తావు?" అని నవ్వుతూ అడిగాడు మహేష్. "మరి ఈ కళ్ళు లేనోడు ఏం చేస్తాడని భయపడి చేతులు కట్టేసి ఇక్కడికి తీసుకొచ్చారు?" అని అడిగాడు లింగు. ఆ మాటకి కోపంగా చూస్తూ "అతని చేతి కట్లు విప్పండి." అని చెప్పి మల్లి దగ్గరికి వెళ్లి "మా గురించి డాక్యుమెంటరీ తీయడంలో బాగా హెల్ప్ చేస్తున్నవు అని తెలిసింది నీకు అన్ని విషయాలు తెలుసా?" అని కళ్ల గంతలు తీస్తూ అడిగింది అర్ణ. అక్కడికి వస్తూ "నువ్వు అభీర్ సేన మనిషిని రిసీవ్ చేసుకున్నావు అంటే మిగతా వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారో తెలిసే ఉంటుంది వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే నిన్ను చంపకుండా వదిలేస్తాము." అని చెప్పాడు ముకుల్. ఆ మాటకి నవ్వుతూ "అభీర్ సేన సంగతి పక్కన పెట్టు ముందు నీ మనవడు విష్ణు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నావా?" అని అడిగింది మల్లి. "అంటే! మా విష్ణు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు కదా మర్యాదగా చెబుతావా లేదా?" అని మల్లి పీక పట్టుకున్నాడు మోహిత్. అది చూసి కోపంగా అక్కడకి వచ్చి మోహిత్ చెయ్యి పట్టుకుని లాగి "నీకు సిగ్గు లేదా చేతులు కట్టేసి ఉన్న ఒక అమ్మాయి పీక పట్టుకున్నావు?" అని కోపంగా అంది ఆశ. మళ్లీ తో పాటు లింగు రావడం చూసి 'ఇక్కడ చీకటి యుద్ధం జరుగుతుంది.' అనుకుని లోపలికి వెళ్ళాడు రాము. "మీ మనుషుల్లో ఒకరు చనిపోయి ఒకరు కనపడకుండా పోతేనే ఇంత ఆవేశ పడిపోతున్నారు మావాళ్ళని అంత మందిని మత్తు మందు పెట్టి దారుణంగా చంపేశారు నోరులేని మూగజీవాలను క్రూరంగా చంపారు మరి మాకు ఎంత కోపం రావాలి?" అని కసిగా చూస్తూ చెప్పింది మల్లి. "అంటే! నువ్వు కూడా అభీర్ సేన మనిషివే కదా!" అని అనుమానంగా చూస్తూ అడిగింది వాసుకి. "అవును! మీరు మా బతుకులు చీకటి చేశారు మీకు చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను." అని "జై భవాని!" అని గట్టిగా అరిచింది మల్లి. ఆ అరుపు విని జనరేటర్ వైర్లు కట్ చేసి కరెంట్ ఫీజులు పీకి దూరంగా పడేసి రూమ్ లో ఉన్న చంద్రశేఖర్, ప్రీతి లను బయటికి తీసుకువచ్చి "వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండండి." అని చెప్పాడు రాము. లైట్స్ ఆఫ్ అయ్యి అంత చీకటిగా మారడంతో "జనరేటర్ ఆన్ చేయండి రా..!" అని గట్టిగా అరిచాడు మహేష్. "చీకటి ఇంత భయంకరంగా ఉంటుందా...? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు." అని కంగారుగా చెప్పాడు వరదరాజులు. "అవును!" అని వరదరాజుల వచ్చి పట్టుకుని "ఇక్కడే ఉండు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర. చీకటిలో రాము చేస్తున్న సౌండ్ విని వేగంగా అక్కడికి వెళ్లి "చంద్రశేఖర్ గారు మీరిద్దరూ నన్ను పట్టుకోండి కళ్ళు మూసుకుని భయం లేకుండా వేగంగా నాతో పాటు రండి." అని చెప్పాడు లింగు. "భయం లేదు వెళ్ళండి మా మనిషే మిమ్మల్ని సేఫ్ గా ఇక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడు." అని చెప్పాడు రాము. "సరే!" అని కూతురు చేయి పట్టుకుని లింగు భుజం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు చంద్రశేఖర్. ఇద్దరినీ అక్కడ నుంచి తీసుకు వెళుతూ "నేను చెప్పే వరకు నా చెయ్యి వదలకండి." అని చెప్పి వేగంగా గేటు దగ్గరికి వెళ్లి ఓపెన్ చేసి అక్కడ కాపలాగా ఉన్నాయి ఇద్దరినీ తన చేతులతో గట్టిగా పట్టుకుని "మీరు వెళ్లిపోండి." అని చెప్పాడు లింగు. అంతలో సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి మల్లి ఒక్కతే ఉండడం చూసి "ఆ కళ్ళు లేని అతను పారిపోయాడు." అని గట్టిగా అరిచింది అర్ణ. ఫీజులు పెట్టి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తు "మేడం! ఎవరో కావాలని కరెంటు తీశారు వీళ్ళిద్దరూ కాకుండా ఇక్కడ ఎవరో అభీర్ మనిషి ఉన్నాడు." అని చెప్పాడు మిసైల్. అంతలో నళిని పీక మీద కత్తి పెట్టి బయటికి వస్తున్న రాముని ఆశ్చర్యంగా చూస్తూ 'వీడు కూడా వాళ్ళ మనిషేనా? ఇక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారు రా..!" అని భయంగా చూస్తూ అనుకున్నాడు ప్రతాప్ మిశ్రా. మల్లి దగ్గరికి వచ్చి చేతికట్లు విప్పి ఒక కత్తి ఇచ్చి మరొకటి గేటు దగ్గర ఉన్న లింగు వైపు విసిరి "ఆ ఇద్దరు సేఫ్ ఏ కదా!" అని అడిగాడు రాము. తన రెండు చేతులలో ఉన్న ఇద్దరిని పక్కకి విసిరి గాలిలో వస్తున్న కత్తి సౌండ్ విని పట్టుకుని "ఇద్దరూ సేఫ్!" అని చెప్పి కత్తిని బొంగరంలా తిప్పుతూ "నాకు కళ్ళు లేవు సేన లొ ఉండి ఏం చేస్తావు అన్నారు కదా! నేను చేయవలసింది నేను చేశాను." అని చెప్పాడు లింగు. నళిని పీకి మీద ఉన్న కత్తి తీసి "మీరు వెళ్ళండి మేము ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని పారిపోము." అని చెప్పాడు రాము. ముగ్గురికి వైపు కోపంగా చూస్తూ "వీళ్ళని కాల్చి పారేయండి." అని గట్టిగా అరిచాడు ముకుల్. ఆ మాట విని కోపంతో తన దగ్గర ఉన్న గన్ తీసి లింగు వైపు షూట్ చేశాడు మహేష్. మీదికి వస్తున్న బుల్లెట్ కి కత్తి అడ్డంగా పెట్టి "దేవుడు ఒకటి తీసుకుంటే మరొకటి ఇస్తాడు, నాకు నీ ఊపిరి కూడా వినపడుతుంది." అని చెప్పాడు లింగు. "షూట్ చేయకండి వీళ్ళ ముగ్గురిని ప్రాణాలతో పట్టుకోండి." అని చెప్పింది అర్ణ. "ఆ ఇద్దరు ఎంతో దూరం పారిపోయి ఉండరు పట్టుకోండి." అని చెప్పింది వాసుకి. ఆ మాట విని బయటికి వెళ్లడానికి గేటు దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తున్న ఇద్దరి అడుగులు చప్పుడు విని రెండు కాళ్ళు నరికేశాడు లింగు. "మా లింగు అక్కడ ఉండగా ఎవరు బయటికి వెళ్ళలేరు, మా నాయకుడు అర్ణకి బాధ, వాసుకి భయం చూపించమన్నాడు." అని చెప్పి గాలిలోకి ఎగిరి కత్తి దుస్తు వాసుకి మీదకి దూకింది మల్లి. తన మీదకి వసున్న కత్తి వెంట్రుక వాసిలో పీక పక్క నుంచి వెళ్లడం చూసి భయంతో గట్టిగా అరిచింది వాసుకి. "ముగ్గురుని చుట్టుముట్టండి." అని సాధు వైపు చూసి చెప్పాడు మిథున్. మీదకి వస్తున్న వాళ్ళని చూసి చేతిలో ఉన్న కత్తిని వేగంగా తిప్పుతూ ఇద్దరి చేతులు నరికి "డబ్బు కోసం వికలాంగులు అవ్వకండి." అని చెప్పాడు రాము. మల్లి చెప్పిన మాట మైండ్‌లో మెదులుతూ "మనవాళ్ళందరూ లోపలికి వెళ్ళండి." అని చెప్పింది అర్ణ. "మనకి వీళ్ళు ప్రాణాలతో అవసరమా?" అని గన్ లోడ్ చేసి షూట్ చేయడానికి ఎయిమ్ చేశాడు మహేష్. నవ్వుతున్న మల్లి వైపు చూసి "మహేష్ అక్కడి నుంచి పారిపో!" అని గట్టిగా అరిచింది అర్ణ. అంతలో గెస్ట్ హౌస్ బయట కార్ హారన్ సౌండ్ వినపడడంతో "వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోతున్నారు షూట్ చేయండి." అని చెప్పింది వాసుకి. అంతలో బయట నుంచి నాలుగు బాంబుల లోపల పడి మొత్తం పొగ కమ్ముకోవడంతో గన్ ఎత్తిన మహేష్ తల నరికి చేత్తో పట్టుకుని "లింగు పదం వెళదాము." అని చెప్పింది మల్లి. హారన్ సౌండ్ వింటు తన చెయ్యి పట్టుకున్నా రాము, మల్లి లని వేగంగా అక్కడి నుంచి కార్ దగ్గరకు తీసుకువెళ్లి పోయాడు లింగు. గెస్ట్ హౌస్ మొత్తం పోగా కమ్మేయడంతో "ఒరేయ్! ఎవరు షూట్ చేయకండి." అని కంగారుగా అరుస్తూ చెప్పాడు మిథున్. కాసేపటికి పొగ తగ్గడంతో తల లేని మహేష్ ని చూసి ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా పక్కన కూర్చుంది అర్ణ. గన్ తీసుకుని సాధు, మిసైల్ తో కలిసి గెస్ట్ హౌస్ బయటకి పరిగెత్తి అక్కడ ఎవరు లేకపోవడంతో "త్వరగా వెళ్ళండి వాళ్ళు ఎంతో దూరం వెళ్లారు." అని చెప్పాడు మిథున్. తల లేని మహేష్ బాడీని చూసి కంగారుగా కారు దగ్గరికి వెళ్లి దాస్ వాళ్ళ వైపు చూస్తూ "పదండి త్వరగా వెళ్ళిపోదాము వాళ్ళని తీసుకు వచ్చినందుకు కోపంతో మనల్ని చంపిన చంపేస్తారు." అని కంగారుగా చెప్పాడు ప్రహల్లాద్. మహేష్ బాడీని చూస్తూ "అయ్యో" నా వారసులని ఏ పరిస్థితిలో అయితే చూడకూడదు అనుకున్నానో అలాగే చూస్తున్నాను." అని ఏడుస్తూ చెప్పాడు ముకుల్. అక్కడికి వచ్చి ఏడుస్తూ "తాతయ్య! మీరు చేసిన పాపం మమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకోండి మిగిలిన వాళ్లు అయిన ప్రాణాలతో ఉంటారు." అని చెప్పింది ఆశ. ఆ మాట విని అక్కడ ఉన్న గన్ తీసి ఆశ తల మీద పెట్టి "చచ్చిపోయింది మా నాన్న, నా అన్న ఆ బాధ ఏమిటో నీకెలా తెలుస్తుంది." అని కసిగా అభీర్ అని అరుస్తూ గాల్లోకి షూట్ చేసింది అర్ణ.
15-02-2026, 08:52 AM
ఎపిసోడ్ 80
గెస్ట్ హౌస్ కి తీసుకువచ్చిన మల్లి వాళ్ళు, చంద్రశేఖర్ వాళ్ళని విడిపించుకుని మహేష్ ని చంపి వెళ్లిపోవడంతో తల లేని బాడీ దగ్గర బాధపడుతూన్న వాళ్ళని చూసి ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి అని చెప్పినా ఆశ నుదుటిమీద తుపాకీ పెట్టి, చనిపోయింది నా తండ్రి, నా అన్న ఆ బాధ నీకు ఎలా తెలుస్తుంది అని కోపంతో అభీర్ అని గట్టిగా అరిచింది అర్ణ.
************* నంద గెస్ట్ హౌస్ నుంచి దాస్ వాళ్లతో కార్ లొ వెళ్ళుతు డ్రైవర్ వైపు చూసి "ఫాస్ట్ గా వెళ్ళారా బాబు! రెండు సింహాల మధ్య పడ్డ జింక పిల్ల లాగా అయిపోయింది నా పరిస్థితి, అర్జెంటుగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోవాలి." అని కంగారుగా చూస్తూ "ఏమయ్యా దాసు! ఆ అమ్మాయి ఏంటి వాడి తలని అలా నరికేసింది. ఆ కళ్ళు లేని వాడిని చూసి పాపం అనుకున్నాను కానీ వాడు మీదకి వచ్చే బులెట్ ని కత్తితో ఆపేడు ముందుకు వచ్చిన మనుషుల్ని కనికరం లేకుండా నరికేశాడు. వీళ్ళు నన్నేమీ చేయకుండా సైలెంట్ గా నాతో అక్కడకి వచ్చినప్పుడే డౌట్ వచ్చి ఉండాలి, నేనే తీసుకువెళ్లి నంద గారి మనవడు ప్రాణాలు తీయించినట్లు ఉంది." అని కార్ నుంచి బయటికి చూస్తూ "ఎవరని చూసిన నా మీద ఎటాక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కాస్త ఇంటి వరకు తోడు రండి." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు ప్రహల్లాద్. "సార్! టెన్షన్ పడకండి మీరు ఆ నంద ఫ్యామిలీ చెప్పినట్లు చేశారు, ఇటు అభీర్ కి కూడా హెల్ప్ చేశారు కాబట్టి మీరు రెండు వైపుల నుంచి సేఫ్ గా ఉంటారు." అని చెప్పాడు దాస్. "అంతే అంటావా!" అని చెప్పి ఇల్లు రావడంతో కార్ దిగి వేగంగా లోపలకి వెళ్ళిపోయాడు ప్రహల్లాద్. అక్కడి నుంచి వెళుతూ దాస్ వైపు చూసి "సార్! ఆయన పేరే ఎన్కౌంటర్ ప్రహ్లాద్ కదా మరి ఎందుకు అంత భయపడుతున్నారు?" అని డౌట్ గా అడిగాడు కుమార్. "ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? నీకు దేవుడంటే భయం ఉందా? భక్తి ఉందా?" అని అడిగాడు దాస్. "దేవుడు అంటే భయం ఎందుకు ఉంటుంది సార్! భక్తి ఉంటుంది." అని చెప్పాడు కుమార్. "కరెక్ట్! పాపం చేసిన వాడికి దేవుడిని చూస్తే భయమేస్తుంది. అందుకే మన ఎస్పీ సార్ కి అభీర్ పేరు చెబితేనే భయం వేస్తుంది." అని చెప్పాడు దాస్. "అంటే! మన ఎస్పీ సర్ పెద్ద పాపాత్ముడు అన్నమాట! ఇప్పుడు నాకు అర్థమైంది." అని నవ్వుతూ చెప్పాడు కుమార్. ************** ప్రమోద్ తో కలిసి రాజస్థాన్ వెళ్లి ఫారుక్ ని కలుసుకుని xఅడవిలో విష్ణు జడ ఏమైనా తెలిసిందా?" అని అడిగాడు నిర్మల్. "ఆ అడవిలో ఉన్న ఆ కొండల మీద చనిపోయిన ఆ తెగ వాళ్ళ ఆత్మలు తిరుగుతున్నాయంట! ఆఫీసర్లు కానీ ఇక్కడ ఉండే మనుషులు గాని వెళ్లడానికి భయపడుతున్నారు, అందుకే గొర్వర్ ప్రాంతంలో ఉండే కొంతమంది గిరిజనల్ని పంపించను ఎలాగైనా విష్ణు ని వెతికి పట్టుకు వస్తారు." అని చెప్పాడు ఫరూక్. ఆ మాటకి నవ్వుతూ "దెయ్యాలు లేవు భూతాలు లేవు, ఆ కొండల దగ్గర విలువ కట్టలేని సంపద ఉంది అందుకే ఈ పుకార్లు పుట్టించి ఉంటారు, ఆ అడవిని ఎలాగైనా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, ఉదయానికి నాగాలాండ్, బీహార్ నుంచి నా మనుషులు ఇక్కడ దిగుతారు వాళ్ళని చూస్తే భూతాలు కూడా భయపడతాయి." అని చెప్పాడు నిర్మల్. "సరే! లోపలికి వెళ్లడానికి సేఫ్టీ వాన్స్ ఏర్పాటు చేస్తాను ఎందుకంటే అక్కడ చాలా జంతువులు ఉంటాయి 12 సంవత్సరాలుగా మనవాళ్ళు ఎవరు లోపలకి వెళ్లలేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి." అని చెప్పాడు ఫరూక్. "ఆ అభీర్ మనుషుల అలజడి ఇక్కడ ఏమైనా ఉందా?" అని అడిగాడు ప్రమోద్. "అసలు వాడి పేరే ఇక్కడ ఎవరకి తెలియదు ఇక్కడకి వచ్చి ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే చూసుకోవడానికి మా మనుషులు ఉన్నారు శవం కూడా దొరకదు." అని కత్తులతో ఉన్న తన మనుషుల్ని చూపించాడు ఫరూక్. "ఆ కొండల దగ్గర ఏదో భారీ నిధి ఉంది అంటున్నారు దాని గురించి నీకేమైనా తెలుసా?" అని అడిగాడు నిర్మాల్. "ఆ మాట నేను కూడా విన్నాను నాలుగు సంవత్సరాల క్రితం వియత్నం నుంచి ఒక టీమ్ ఫుల్ ఎక్విప్మెంట్ తో వచ్చారు రెండు నెలలు వెతికారు సగం మంది చచ్చారు మిగతా వాళ్ళు ప్రాణాలకు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు." అని చెప్పాడు ఫరూక్. "అంటే వాసుకి చెప్పింది నిజమే! అక్కడ ఏదో ఉండే ఉంటుంది." అని చెప్పి ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి నిర్మల్ వైపు కంగారుగా చూస్తూ "మహేష్ ని అభీర్ సేన మనుషులు చంపేశారు." అని చెప్పాడు ప్రమోద్. "అవునా?" అని ఆశ్చర్యంగా చూస్తూ "ఇప్పుడు అర్ణ ని ఆపడం కష్టమే!" అని చెప్పాడు నిర్మల్. ************* ఉదయం మహేష్ దహన సంస్కరాలు చేసి గెస్ట్ హౌస్ కి వచ్చి బాధగా కూర్చున్న ముకుల్ దగ్గరికి వెళ్లి "తాతయ్య ఇప్పుడు ఏం చేద్దాము అనుకుంటున్నారు?" అని అడిగింది ఆశ. ఆవేశంగా అక్కడికి వస్తూ "ఏం చేయడమేమిటి! ఆ అభీర్ సేన లొ ఒక్కరు కూడా మిగలడానికి వీల్లేదు మన దగ్గర డబ్బు పలుకుబడి రెండు ఉన్నాయి వీటిని ఉపయోగించి వాళ్ల అంతు చూస్తాను." అని కోపంగా చూస్తూ చెప్పింది అర్ణ. "అవును! మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ తప్పు చేశాము అన్న పశ్చాత్తాపం మాత్రం లేదు, మనవాళ్లు ముగ్గురు చనిపోతేనే నీకు అంత ఆవేశం వచ్చింది. మరి వాళ్ళ మనుషుల్ని ఎంతమందిని వీళ్ళు చంపారు అలాంటప్పుడు వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంటారా..?" అని చెప్పింది ఆశ. "12 సంవత్సరాలుగా మూసుకుని కూర్చున్నారు కదా అలాగే ఇప్పుడు కూడా కూర్చుంటారు." అని చెప్పాడు అభిజిత్. "మనల్ని ఇన్ని సంవత్సరాలు ఏమీ చేయకుండా సైలంట్ గా ఉండడానికి ఆ అభీర్ పిరికివాడు కాదు చాలా ముందు ఆలోచన ఉన్నవాడు అందుకే వాళ్ళ బలం పెరిగే అంతవరకు ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టాడు కనీసం మనం ఈ దేశం వదిలి పారిపోయా అవకాశం లేకుండా చేశాడు, నాకు తెలిసి అతను తలుచుకుంటే మనల్ని అందరిని ఒక్కసారి చంపేయగలడు కానీ ఎందుకు చంపడం లేదో తెలుసా? తాతయ్య మనవాళ్లలొ ఒక్కొక్కరు చనిపోవడం చూసి నేను ఈ తప్పు ఎందుకు చేశానా అని కుమిలి కుమిలి ఏడవలి అందుకే ఆయన కళ్ళముందే ఒక్కొక్కరిని చంపుతున్నాడు విష్ణుని కూడా అడవిలో చంపాడు మన ముందుకు తీసుకువచ్చే చంపుతాడు." అని చెప్పింది ఆశ. "నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? నీకేం తెలుసు అని అంత పెద్ద పాటలు మాట్లాడుతున్నావు?" అని కోపంగా చెప్పాడు రఘురామ్. అక్కడికి వస్తూ "ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ సార్!" అని చెప్పాడు శ్రీకర్. ఆ మాట విని తల పక్కకి తిప్పి చూసి "ఎవరు నువ్వు? లోపలికి ఎవరు రానిచ్చారు?" అని సీరియస్ గా అడిగాడు ముకుల్. "మేము సిబిఐ ఎక్కడికైనా వస్తాము మమ్మల్ని ఎవరు ఆపలేరు అని చెప్పాడు శ్రీకర్. "ఏంటి? మురళి జోషి కేసు గురించి విచారించడానికి వచ్చావా?" అని అడిగాడు ముకుల్. "మీరు 12 సంవత్సరాల క్రితం చేసిన దారుణం మొత్తం నాకు తెలుసు కానీ ఆధారాలు లేకుండా నేను మిమ్మల్ని ఏమి చేయలేను." అని చెప్పి అక్కడ ఉన్న వరదరాజులు, అభిజిత్ వైపు చూస్తూ "మీకు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ అండ ఉంది కాబట్టి ఆల్రెడీ మీలో ముగ్గురు చచ్చారు కాబట్టి సెక్యూరిటీ కూడా ఇస్తాను కానీ ఆ అభీర్ సేన మిమ్మల్ని ఏమీ చేయకుండా మాత్రం ఆపలేను." అని చెప్పాడు శ్రీకర్. "ఎందుకు వాళ్ళు అంత మొనగాళ్ల?" అని అడిగాడు అభిజిత్. "అవును! అభీర్ ని మీరు జైలుకు పంపించిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో ఏమైపోయారో ఎవరికీ తెలీదు కానీ వాళ్లకి మీలో ప్రతి ఒక్కరి గురించి తెలుసు!" అని చెప్పాడు శ్రీకర్. "నా ఫ్యామిలీ ఈ 12 సంవత్సరాలొ ఒక్కసారి కుడా ఇండియాకి రాలేదు మరి నా వాళ్ళ గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది?" అని అనుమానంగా అడిగాడు ముకుల్. "అక్కడికే వస్తున్నాను వాళ్లలో చాలామంది RAW లొ వర్క్ చేసారు వాళ్ళ ఒరిజినల్ ఐడెంటిటీ ఏమిటో ఎవరికి తెలియదు అందరూ ఫుల్ ట్రైన్డ్ ఎట్టి పరిస్థితుల్లోనైనా శత్రువుతో యుద్ధం చేయగలరు, ఒకవేళ వాళ్ళని మీరు పట్టుకుని చంపుదాము అని ఆలోచించే లోపు మిమల్ని చంపేసి వెళ్ళిపోతారు ఇలాంటి సైన్యానికి ఒక సమర్ధుడైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి." అని చెప్పాడు శ్రీకర్. " మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? ఆ నాయకుడిని చంపేస్తే ఆ సైన్యం చెల్లాచెదురు అవుతుంది." అని కసిగా చూస్తూ చెప్పింది అర్ణ. ఆ మాటకి నవ్వుతూ "మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది ఎంత చెప్పినా మీ బుర్రకి ఎక్కలేదు అంటే ఇంక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు, ఆఖరిగా ఒక విషయం చెప్పి వెళ్ళిపోతాను." అని అక్కడ ఉన్న వాసుకి వైపు చూసి "నీకు అభీర్ సేన గురించి తెలిసిన చరిత్ర ఏమిటి?" అని అడిగాడు శ్రీకర్. ఆ మాటకి కంగారుగా అర్ణ వైపు చూసింది వాసుకి. "పర్వాలేదు చెప్పు వీళ్ళు మనల్ని ఏమి చేయలేరు." అని చెప్పింది అర్ణ. "ఆ అభీర్ సేన జారువా తేగకు సంబంధించిన వారు చత్రపతి శివాజీ మహారాజ్ సైన్యంలో సీక్రెట్ గా ఉండి ప్రతి యుద్ధంలో సహాయం చేసేవారు. శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత అమ్మవారు ప్రసాదించిన చంద్రహాస్ ఖడ్గన్ని తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయారు వాళ్ల ఉనికి గురించి ఔరంగజేబు వెతుకుతున్నాడని తెలిసి బామ్రఘడ్ అడవుల నుంచి రాజస్థాన్‌లో ఉన్న బేర అడవులకు వెళ్లిపోయారు." అని చెప్పింది వాసుకి. "మన వీరుల చరిత్ర గురించి మనల్ని బానిసలుగా పరిపాలించిన వాళ్ళు చెప్పిందే నిజం అనుకుని ఇప్పటికీ నమ్ముతున్నాము, మీకు తెలిసింది చరిత్రని వక్రీకరించి చెప్పిన కథ అసలు వాస్తవం నేను చెప్తాను వినండి. తర్వాత కూడా వాళ్ల జోలికి వెళతాను అంటే మీ ఇష్టం!" అని చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకర్.
15-02-2026, 10:01 AM
(15-02-2026, 08:52 AM)SivaSai Wrote: ఎపిసోడ్ 80 ఇదీ మన దౌర్భాగ్యం!!! Sivagaru.. మీ రచనా శైలిలో .. ఒక ఆర్ద్రత కనిపిస్తోంది. Somehow i feel you are more than what you write!!
15-02-2026, 10:46 AM
no words bro
15-02-2026, 11:23 AM
Excellent update
16-02-2026, 10:29 AM
ఎపిసోడ్ 81
నంద గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి అర్ణ వాళ్ళని అభీర్ సేన గురించి హెచ్చరించి చరిత్ర దాచిన నిజాన్ని మీకు చెబుతాను తర్వాత కూడా మీరు వాళ్ళ జోలికి వెళ్లాలి అనుకుంటే మీ ఇష్టం అని చెప్పడం మొదలు పెట్టాడు శ్రీకర్.
*************** "మీలో ప్రతి ఒక్కరికి శివాజీ మహారాజ్ పోరాటం గురించి మాత్రమే తెలుసు అయన మరణం తర్వాత హిందూ ధర్మం కోసం పోరాడిన వీరుల గురించి ఔరంగజేబు పతనం గురించి తెలీదు ఎందుకంటే తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కొంత మంది మన వీరుల చరిత్రను దాచిపెట్టారు. శివాజీ మహారాజ్ మరణం తరువాత ఆ సింహాసనాన్ని ఆయన పెద్ద కొడుకు శంబాజీ మహారాజ్ ఆదిష్టించారు ఆయనను 'చావా' అని పిలిచేవారు అంటే పులిబిడ్డ మరాఠ సామ్రాజ్యాన్ని 9 సంవత్సరాలు పరిపాలించాడు దాంట్లో ఐదు సంవత్సరాలు యుద్ధంలోనే ఉన్నారు. శివాజీ మహారాజ్ తో అంతమైపోయింది అనుకుని సంతోషం పడుతున్న మొగలాలుకి, శంభాజీ మహారాజ్ గుండెల్లో బాకు లాగా తయారయ్యాడు, అతన్ని ప్రత్యక్ష యుద్ధంలో ఓడించలేమని తెలిసి కుట్రపన్ని తన పక్కన ఉన్న వాళ్ళ సహాయంతో వెన్నుపోటు పొడిచి బంధించారు 42 రోజులు చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపారు కానీ ఒక్కసారి కూడా క్షమించమని ఆయన నోట మాట రాలేదు హిందూ ధర్మాన్ని వీడలేదు. శంభాజీ మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం మొత్తం చీకటి కమ్ముకుంది అయన తమ్ముడైన 19ఏళ్ల ఛత్రపతి రాజారామ్ మహారాజ్ సింహాసనం అధిష్టించాడు. ఇదే అదునుగా ఆక్రమించడానికి ఔరంగజేబు సుమారు తొమ్మిది లక్షల మంది సైన్యంతో బయలుదేరేడు. ఇంక మరాఠా సామ్రాజ్యం అంతం అయిపోయింది అని అందరూ అనుకున్నారు అప్పుడే మహావీరులైన శాంతాజి, ధనాజీలు, రాజారాం మహారాజ్ కి అండగా వచ్చారు అప్పుడు వారి దగ్గర ఉన్న సైన్యం 20 వేల మంది మాత్రమే శివాజీ మహారాజ్ మరణం తరువాత బేరా అడవికి వెళ్ళిపోయిన అభీర్ సేనకి సమాచారం అందించారు విషయం తెలుసుకుని ప్రతీకారంతో రగిలిపోయారు. ఔరంగజేబు తన సైన్యంతో తులాపూర్ దగ్గర ఉన్నాడని సమాచారం తెలుసుకున్న అభీర్ 500 మందితో సేనతో రెండు వేల మంది మరాఠీ సేనతో దానజీ అక్కడికి చేరుకున్నారు. అప్పుడు జరిగిన యుద్ధంలో మొగులుల సైన్యన్ని ఊచ కోత కోశారు ఔరంగజేబు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయాడు చనిపోయిన తన సైన్యాన్ని చూసి ఎందుకు మరాఠా సామ్రాజ్యం తో పెట్టుకున్నానా అనుకున్నాడు. శంభాజీని వెన్నుపోటు పొడిచిన ఎవ్వరిని వదల్లేడు అందరిని అత్యంత దారుణంగా చంపేసారు మొగలలు అధీనం లొ ఉన్న ప్రతి కోట మీద దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఔరంగజేబు వీళ్ళకి బయపడి తప్పించుకుని పారిపోతూ ఉండేవాడు కానీ 27 సంవత్సరాల వరకు ఢిల్లీ వెళ్ళనివ్వలేదు ఆఖరికి చనిపోయి మహారాష్ట్ర మట్టిలోనే కలిసిపోయాడు మొగులుల సామ్రాజ్యం అంతమైంది. అప్పుడు తన సైన్యాన్ని తీసుకుని బేరా అడవులకు వెళ్లిపోయడు అభీర్ సేన ప్రతీకారం అలా ఉంటుంది. అప్పుడు ఉన్న అభీర్ అయ్యినా ఇప్పుడు ఉన్న అభీర్ అయ్యినా వాళ్ళ రక్తం ఒకటే పౌరుషం ఒక్కటే మిమ్మల్ని ఈ గడ్డమీద నుంచి బయటకు వెళ్ళనివ్వడు ఈ మట్టిలో కలిసి పోవాల్సిందే కాబట్టి క్షమించమని వేడుకోండి ప్రాణాలతో మిగులుతారు." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీకర్. *********** ఆ మాటలు విని అక్కడి నుంచి వరదరాజులతో కలిసి పక్కకు వెళ్లి "ఆ ఆఫీసర్ ఏమిటి వెన్నుపోటు అన్నప్పుడల్లా మన వైపు చూస్తున్నాడు?" అని కంగారుగా అడిగాడు ప్రతాప్ మిశ్రా. "ఆరోజు అభిర్ మనకు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఈ ఆఫీసర్ కూడా ఉన్నాడు కదా మర్చిపోయావా? సైలెంట్ గా ఉండు ఇప్పుడు ఈ ముకుల్ ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటో చూడాలి." అని చెప్పాడు వరదరాజులు. "ముకుల్ దగ్గరికి వెళ్లి తాతయ్య చరిత్రను ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మార్చి చెప్పొచ్చు ఆ ఆఫీసర్ చెప్పింది నిజమే అయ్యుండొచ్చు, కానీ అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు డబ్బు ఉన్న వాడిదే అధికారం, మన నంద ఫ్యామిలీ వ్యాపారంలో ముందుకు వెళ్లాలంటే తలవంచ కూడదు వంచితే మునిగిపోతాము." అని చెప్పింది అర్ణ. "అవును తాతయ్య! మనం వాళ్ళని క్షమించమని అడిగాము అంటే ఇంక మార్కెట్లో మన మాటకి విలువే ఉండదు బతికి ఉన్న చచ్చినట్లే!" అని చెప్పాడు మోహిత్. "అంకుల్! మనల్ని భయపెట్టడానికి వంద మంది వంద రకాలుగా చెబుతారు మీరు ఎవరి మాటలు నమ్మకండి ఆ అభీర్ ని ఎలా దారిలోకి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు!" అని చెప్పాడు అభిజిత్. అక్కడికి వస్తువు "అవును మావయ్య గారు! మీరు ఆశ మాటలు ఏమీ పట్టించుకోకండి. అది చిన్న పిల్ల దానికి ఈ విషయాలన్నీ సరిగ్గా తెలీదు." అని చెప్పాడు రఘురామ్. ఆ మాటలకి ఆలోచిస్తూ "ఆ అభీర్ సేన శక్తి మొత్తం వాసుకి చెప్పినట్లు ఆ కొండల దగ్గరే ఉంది నువ్వు చెప్పిన తల్వార్ ఎప్పుడు వస్తున్నాడు." అని అడిగాడు ముకుల్. "ఆన్ ద వే సార్! కాసేపట్లో ఇక్కడే ఉంటాడు." అని చెప్పింది వాసుకి. "సరే!" ఇక మీదట నేను చెప్పినట్లు వినండి. మనలో ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు, రాజస్థాన్ వెళ్ళిన ప్రమోద్ వాళ్లకి కూడా కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పండి తల్వార్ రావడంతోనే నా దగ్గరకు తీసుకురండి." అని అక్కడ ఉన్నవారు వైపు చూస్తూ "మీరు చెప్పింది నిజమే! పరపతి పోయిన తర్వాత బ్రతికి ఉన్న ఒకటే చచ్చిన ఒకటే!" అని లోపలికి వెళ్ళిపోయాడు ముకుల్. ఆ మాట విని "హమ్మయ్య! వీళ్ళు స్టాండ్ మీదే ఉన్నారు ఎక్కడ మారిపోతారో మనకి పనే లేకుండా పోతుంది అనుకున్నాను." అని నెమ్మదిగా వాసుకి దగ్గరికి వెళ్లి xనువ్వు బానే ఉన్నావు కదా!" అని అడిగాడు ప్రతాప్ మిశ్ర. ఆ మాటకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి "మీరా కంగారు పడ్డాను నేను బానే ఉన్నాను." అని చెప్పింది వాసుకి. "ఆ అభీర్ మనుషులు నీకు బానే భయం చూపించినట్లు ఉన్నారు, సీక్రెట్స్ ఏమైనా ఉంటే మాతో కూడా పంచుకో హెల్ప్ చేస్తాము." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర. "సరే!" అని కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది వాసుకి. అర్ణ దగ్గరికి వెళ్లి "నువ్వు బాధపడి ప్రయోజనం లేదు ఏం చేయాలో ఆలోచించు, నువ్వు చెప్పినట్లు మనం మార్కెట్లో నిలబడాలి అంటే ఈ విషయంలో గట్టిగా నిలబడాలి. ఆ అభీర్ మీద పగతో కాకుండా బిజినెస్ లో ఎదుటి వాళ్ళని దెబ్బ కొడతాం కదా అలాగా ఆలోచించు అప్పుడు నీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది." అని చెప్పాడు మిథున్. "సరే!" అని మహేష్ ఫోటో వైపు చూస్తూ ఊపిరి పీల్చుకుని లోపలికి వెళ్ళింది అర్ణ. ప్రతాప్ మిశ్ర, వరదరాజులు వైపు చూసి "మీరు భయపడితే మాకు దూరంగా వెళ్లిపోండి." అని చెప్పాడు అభిజిత్. "అలాంటిదేమీ లేదు మేము ధైర్యంగానే ఉన్నాము మీకు ఎప్పుడు తోడుగానే ఉంటాము, ఇటువంటి విషయాలు మన పొలిటీషియన్స్ కి అలవాటే కదా!" అని లేని నవ్వు మోహన తెచ్చుకుని చెప్పాడు వరదరాజులు. "సరే! మనకి ఉపయోగపడతాడు అనుకున్న ప్రతి ఒక్కరిని పిలిపించండి ఎంత డబ్బు కావాలన్నా ఇద్దాము." అని చెప్పి నిజం తో కలిసి వీల్ చైర్ లొ లోపలికి వెళ్ళాడు అభిజిత్. తంబియార్, సుజిత్ లో వైపు చూసి "మీ ఇద్దరి పని ఈరోజు నుంచి ఏమిటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో అభీర్ మనుషులు ఎవరో తెలుసుకోవడమే, వాళ్లతోనే వాడికి కన్ను పొడిపించాలి." అని చెప్పాడు వరదరాజులు. "ఓకే డాడ్!" అని చెప్పాడు తంబియార్. ************* మల్లి తెచ్చిన మహేష్ తలని డబ్బులలో తగలబెడుతున్న అభీర్ దగ్గరికి వచ్చి "చంద్రశేఖర్ గారిని సేఫ్ ప్లేస్ కి పంపించాము వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరు తెలుసుకోలేరు." అని చెప్పాడు బైరి. "రాజస్థాన్ నుంచి అరుల్ కాల్ చేశాడు అడవిలో విష్ణు కోసం వెతుకుతున్నారంట, అలాగే నాగాలాండ్ నుంచి బీహార్ నుంచి మనుషుల్ని రప్పించి అడవిలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు." అని చెప్పాడు రాజన్. "అంతేకాదు బేరా లొ ఉన్న నిధిని వెతకడం కోసం తల్వార్ అనే ట్రెజర్ హంటర్ ని పిలిపించింది వాసుకి, అతను ఈరోజు సాయంత్రం ఇక్కడికి వస్తున్నాడు." అని చెప్పాడు రాము. "ఇప్పటినుంచి వాళ్లు చాలా జాగ్రత్త పడతారు ఆవేశంతో అడుగు ముందుకు వెయ్యరు, వాళ్లు ఏ డబ్బు ఆపేక్షతో కొండల దగ్గరికి వెళుతున్నారో ఆ డబ్బుని వాళ్ళకి దూరం చేయాలి. నంద, అభిజిత్ వ్యాపారలా గురించి అన్ని విషయాలు తెలుసుకోండి వాళ్ళ మూలాల మీద దెబ్బ కొట్టాలి, ఆ దెబ్బ ఎలా ఉండాలి అంటే వాళ్లు ఆలోచించడానికి కూడా టైమ్ దొరకకూడదు." అని చెప్పాడు అభీర్. చాక్లెట్, నీలమ్ వాళ్లతో కలిసి అక్కడికి వస్తూ "బాగు చేయడం కష్టం కానీ నాశనం చేయడం చాలా ఈజీ! ఆ విషయంలో మేము చాలా స్పీడ్ గా ఉంటాము ఏం చేయాలో చెప్పండి దూసుకు వెళ్ళిపోతాము." అని చెప్పింది మిత్ర. "ఆ నంద ఫ్యామిలీ బిజినెస్ మేటర్స్ అయితే నాకు సరిగ్గా తెలియదు కానీ అభిజిత్ గురించి అయితే ఫుల్ డిటేల్స్ తెలుసు!" అని చెప్పింది నీలమ్. "మరి అడవిలోకి వెళుతున్న వాళ్ళ సంగతి!" అని అడిగాడు బైరి. "అవును! అక్కడ మనం లేకపోతే ఆ కొండల దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపలేము, ఇప్పుడు అడవిలోకి మన వాళ్ళని పంపించడానికి కూడా మార్గం లేదు ప్రతి దారిలో ఆ ఫరూక్ తన మనుషుల్ని ఆఫీసర్స్ ని ఉంచాడు." అని చెప్పాడు రాజన్. "అడవిలోకి వెళ్లడానికి మన వాళ్ళని 50 మందిని సిద్ధం చేయండి ఎవరికంట కనపడకుండా మన పూర్వీకులు బామ్రఘడ్ నుంచి బేరా చేరుకున్న మార్గం నాకు తెలుసు వాళ్ళని సేఫ్ గా మన లింగు తీసుకువెళతాడు." అని చెప్పాడు అభీర్. "అక్కడ ఉన్న లింగు వైపు చూసి ఏంటి కళ్ళు కనపడని ఇతను సేఫ్‌గా 50 మందిని తీసుకువెళతాడా? ఎలాగా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీలమ్.
16-02-2026, 10:35 AM
ఎపిసోడ్ 82
మనవాళ్ళని 50 మందిని సిద్ధం చేయండి వాళ్ళని లింగు క్షేమంగా అడవిలోకి తీసుకువెళతాడు అని బైరితో చెప్పాడు అభీర్.
ఆ మాట విని అక్కడ ఉన్న లింగు వైపు చూసి కళ్ళు లేని అతను 50 మందిని క్షేమంగా ఎలా తీసుకువెళతాడు అని డౌట్ గా అడిగింది నీలమ్. ***************** నీలమ్ మాట విని "చీకటి దారిలో తీసుకువెళతారు బామ్రఘడ్ అడవులలో ఉన్న గుహల నుంచి బేరి అడవులలొ ఉన్న కొండలలోకి రహస్య మార్గం ఉంది. ఆ గుహలలో ప్రయాణించేటప్పుడు వెలుతురు పడితే వాటి లోపల గోడలకి అమర్చిన రాళ్లలోనుంచి విషపదార్థాలు బయటకు వస్తాయి లోపల ఉన్న మనిషి నిమిషంలో చనిపోతాడు. లింగుకి వెలుతురు అవసరం లేదు కాబట్టి ఆ లోపల ఉన్న చిన్న చిన్న జంతువులు, పాములు చేసే శబ్దలు విని క్షేమంగా వీళ్లని గమ్యానికి చేరుస్తాడు." అని చెప్పాడు అభీర్. ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఏమిటి? బామ్రఘడ్ అడవులలో ఉన్న గుహల నుంచి మీ ప్లేస్ కి రూటు ఉందా?" అని అడిగింది నీలమ్. "అవును! ఆ దారి మా పూర్వీకుల నుంచే ఉంది దాని గురించి తెలిసిన లోపలికి వెళ్లి బ్రతికి బయటపడిన వాళ్ళు ఎవరూ లేరు." అని చెప్పాడు అభీర్. "ఆ వాసుకి ట్రెజర్ హంటర్ ని పిలిపిస్తుంది అని చెబుతున్నారు నిజంగా అక్కడ నిధి ఉందా? దానికి మీరు రక్షణగా ఉన్నారా? ఈ విషయాలు చంద్రశేఖర్ గారికి ఎలా తెలుసు?" అని డౌట్ గా అడిగింది మిత్ర. "చత్రపతి శివాజీ మహారాజ్ గారి సైన్యం లో ఉండే సిలెధర్ వంశానికి చెందినవారు చంద్రశేఖర్ గారు! ఆయన పూర్వీకుల నుంచి వస్తున్న కొన్ని ఆధారాలు ద్వారా ఒకరోజు బేరా కొండల దగ్గరికి వచ్చి మా తండ్రి గారిని కలుసుకుని ఆయన కర్తవ్యం తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయారు అందుకే శివమణి నుంచి దూరంగా వెళ్లిపోయారు." అని చెప్పాడు అభీర్. "అంటే! శంభాజీ మహారాజ్ చనిపోయినప్పుడు రాయగడ్ కోట నుంచి సిలేధర్ లు శివాజీ మహారాజ్ గారి సింహాసనంతో పాటు నిధిని తీసుకువెళ్లి జాగ్రత్త చేశారు అని చెబుతూ ఉంటారు అది నిజమేనా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీలమ్. "మన చరిత్ర చెప్పే నిజాలు కొంతమందిలో స్ఫూర్తిని నింపితే, కొంతమందిలో ఆశలను పెంచుతుంది. అసలు విషయాలు తెలియ వలసిన రోజు కచ్చితంగా తెలుస్తాయి అప్పటివరకు ఆ దైవం మాకు అప్పచెప్పిన పని చేయడమే మా కర్తవ్యం!" అని బైరి వైపు చూసి "మనవాళ్లు ఉదయానికి బేరా కొండల దగ్గర ఉండాలి." అని చెప్పాడు అభీర్. "మరి మనం అడవికి వెళ్లి షూటింగ్ చేయాలి అనుకున్నాము కదా ఎప్పుడు వెళదాము?" అని అడిగింది నీలమ్. "ఒక్క సింహం ధర్మం కోసం వదిలిన ఆహారన్ని దోచుకోవడానికి నక్కలు వస్తున్నాయి వాటికి గుణపాఠం చెప్పడానికి తప్పకుండా వెళ్లాలి, అప్పుడు నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకు వెళ్తాను." అని చెప్పి కొండల దగ్గరికి వెళ్లే వాళ్లతో మాట్లాడడానికి వెళ్ళాడు అభీర్. ఆ మాట విని "సింహం అంటే చత్రపతి శివాజీ మహారాజ్! ఆయన ధర్మం కోసం వదిలినా ఆహారం అంటే నిధి! దాన్ని దోచుకోవడానికి వెళ్లే నక్కలు అంటే ముకుల్ వాళ్ళు!" అని చెప్పింది మిత్ర. "అక్క! అభీర్ అన్న చెప్పినా కోడ్ ని భలే ఢీకొడ్ చేశావు." అని చెప్పాడు చాక్లెట్. "మనం అంతవరకే చేయగలం అంతకు మించి ముందుకు వెళ్లాలి అంటే అభీర్ అడుగులలొ అడుగు వేయాలి." అని చెప్పింది నీలమ్. "అభీర్ అడుగులో అడుగు వేయడమంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు ఆ కష్టాలు బరిస్తేనే ధర్మం వెలుగు చూడగలము, మీరు ఆ కష్టాలు భరించడానికి సిద్ధమైతేనే ఫాలో అవ్వండి." అని చెప్పింది మల్లి. అక్కడికి వస్తూ "మల్లి చెప్పింది నిజం! ధర్మం కోసం నిలబడ్డప్పుడు కష్టాలు తప్పవు వాటిని స్వీకరించడానికి సిద్ధపడితేనే అడుగు ముందుకు వేయాలి." అని చెప్పి అభీర్ దగ్గరకు మాట్లాడ్డానికి వెళ్ళింది వసుంధర. తనతో పాటు వచ్చిన శంకర్ వైపు చూస్తూ "ఏంటి! వదిన ఇక్కడికి సడన్ ఎంట్రీ ఇచ్చింది?" అని డౌట్ గా అడిగింది నీలమ్. "అభీర్ మాట్లాడాలి అంటే నేనే తీసుకు వచ్చాను." అని చెప్పాడు శంకర్. "అవునా?" అని వసుంధరతో మాట్లాడుతున్న అభీర్ ని చూసి "ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడు." అని చెప్పింది మిత్ర. "అభీర్ ముందే చెప్పాడు కదా! ఇది ఐదవ వేదం ప్రకారం జరుగుతున్న యుద్ధం అని, దీంట్లో అన్ని శాస్త్రాలు ఉపయోగిస్తారు." అని చెప్పాడు శంకర్. ****************** నంద గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చిన అగస్త్యని తన రూమ్ కి తీసుకువెళ్లి "ఏమయ్యా! రెండు రోజులుగా ఏమైపోయావు? మంచి ప్లాన్ ఇచ్చావు జంతువులు మొత్తం అడవికి వెళ్ళాయి. అడవి మన వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వచ్చింది. కానీ ఈ ప్లాన్ మాకు కాకుండా ఆ నిర్మల్ వాళ్లకి వర్కౌట్ అయింది. మనం వెళ్లేసరికి కొండలు దగ్గర మట్టి మిగులుతుందేమో!" అని కంగారుగా చెప్పాడు రఘురామ్. "మీరు దాని గురించి కంగారు పడకండి సార్! ఆ కొండలు తవ్వడం అంత తేలికైన పని కాదు ఒకవేళ ఈజీగా అయిపోయేటట్లయితే మీ పెద్ద బామ్మర్ది వదిలిపెడతాడా? లేక ఇన్ని సంవత్సరాలు అభిజిత్ గారు చేతులు ముడుచుకుని కూర్చుంటారా?" అని అడిగాడు అగస్త్య. "అది కూడా కరెక్టే! నీ దగ్గర ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది కదా తొందరగా చెప్పు!" అని అడుగుతు కిటికీలోనుంచి కారు దిగుతున్న మనుషుల్ని చూసి "వీడేనా ఆ ట్రెజర్ హంటర్ తల్వార్!" అని చూస్తూ ఉన్నాడు రఘురామ్. "సార్! నాకు తెలిసి అక్కడ నిధి లాంటిది ఏమీ లేదు ఒట్టి పుకార్లు మాత్రమే, చాలామంది వెతికి వెతికి చేతులు కాల్చుకుని ఏమి దొరక్క వెళ్లిపోయారు. మీరు ఓకే అంటే అక్కడ ఉన్న తొమ్మిది కొండలలో ఒక్కదాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు డైరెక్టర్ అభీర్ తోనే డీల్ మాట్లాడదాము కానీ చాలా డిమాండ్ చేస్తాడు." అని చెప్పాడు అగస్త్య. "ఏంటి నువ్వు చెప్పేది డైరెక్ట్ అభీర్ తోనే డీల్ మాట్లాడదామా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రఘురామ్. "ఎస్! ఆ తెగ వాళ్ళు చెప్పిన పేమెంట్ కి మీరు ఓకే అంటే దానికి వంద రెట్లు సంపాదించవచ్చు!" అని చెప్పాడు అగస్త్య. "ఈ డిల్ కి అభీర్ ఒప్పుకుంటాడా?" అని డౌట్ గా అడిగాడు రఘురామ్. అక్కడికి వస్తూ "డబ్బు మీద ఆశ ఎవరికి ఉండదు పెద్ద నాన్న! ఆ తెగ వాళ్ళు కూడా చాలా సంవత్సరాలుగా అడవి వదిలి మార్కెట్లో ఉంటున్నారు కదా వాళ్లకి మాత్రం సంపాదించుకోవాలని ఉండదా?" అని చెప్పాడు మోహిత్. "అలా అయితే ఒక కొండకి ఎంత అమౌంట్ డిమాండ్ చేస్తారు? ఒకవేళ మనం అమౌంట్ ఇచ్చిన ఆ కొండ అంత విలువ చేస్తుంది అంటావా?" అని డౌట్ గా అడిగాడు రఘురామ్. "అంత విలువ చేయకుండానే అందరూ వాటీ వెనకాల పడుతున్నారా? శాంపిల్ చూసుకున్న తర్వాతే డబ్బు ఇద్దాము." అని చెప్పాడు అగస్త్య. "గుడ్! వెంటనే ఒక మీటింగ్ ఏర్పాటు చెయ్!" అని చెప్పాడు మోహిత్. "సరే! నువ్వు ఆ పనిలో ఉండు ఎవడో దిక్కుమాలిన వాడు వచ్చాడు కదా అక్కడ లేకపోతే మా మీద డౌట్ వస్తుంది." అని మోహిత్ తో కలిసి కిందకి వెళ్ళాడు రఘురామ్. "ఓకే సార్!" అని అక్కడి నుంచి వెళుతూ వాళ్ల మాటలు వింటున్న సుజిత్, తంబియార్ లను చూసి చూడనట్లు వెళ్లిపోయాడు అగస్త్య. ************** తన మనుషులతో కలిసి వచ్చిన తల్వర్ ని తీసుకొని అర్ణ మిథున్ లతో కలిసి ముకుల్ దగ్గరికి వెళ్ళి "సార్! నేను చెప్పిన ట్రెజర్ హంటర్ ఇతనే!" అని చూపించింది వాసుకి. ఎదురుగా ఉన్న తల్వార్ వైపు చూస్తూ "మీ గురించి వాసుకి చాలా విషయాలు చెప్పింది. ఎప్పుడైనా బేరా కొండల గురించి విన్నారా? తను చెప్పినట్లు నిజంగా అక్కడ నిధి ఉందా? దాని గురించి మీకేమైనా తెలుసా?" అని అడిగాడు ముకుల్. "సాబ్! నా దగ్గరికి ఒక విషయం వచ్చింది అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకుని అక్కడ ఏదైనా ఉంది అంటేనే నేను బయలుదేరి వస్తాను." అని చెప్పి తన పక్కన కూర్చున్న వ్యక్తిని చూపిస్తూ "ఇతని పేరు గఫర్ ఖాన్! ఔరంగజేబు దగ్గర సైన్యాధిపతిగా చేసిన మూక్రత్ ఖాన్ వారసుడు, నిధి గురించి చాలా సమాచారం ఇతని దగ్గర నాకు దొరికింది. దానిని మనం సంపాదించగలిగితే ప్రపంచంలోనే కుబేరులం అయిపోతాము." అని చెప్పాడు తల్వర్. "అవును! అంత భారీ నిధి మరాఠా సామ్రాజ్యానికి ఎక్కడిది?" అని డౌట్ గా అడిగింది అర్ణ. "అక్కడ ఉన్న నిధి మరాఠా సామ్రాజ్యాన్నిధి మాత్రమే కాదు, ఔరంగజేబు అఖండ భారతాన్ని కైవసం చేసుకోవడానికి ప్రతి రాజ్యం మీద యుద్ధం చేసేవాడు మొగలుల నుండి వాళ్ల సంపదను కాపాడి హిందూ ధర్మన్ని నిలబెట్టడం కోసం రాజపుత్రుల దగ్గర నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు భారీ నిధిని సమకూర్చి దానిని కాపాడే వీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే అని అందరూ నిర్ణయించుకుని రాయగడ్ కోటకి తరలించారు. శంభాజీ మహారాజ్ చనిపోయాడని వార్త తెలిసిన వెంటనే నమ్మకస్తులైన కొంతమంది సీలేదర్ ల నాయకత్వంలో ఆ నిధిని అభీర్ సేన దగ్గరికి చేర్చారు అప్పట్నుంచి వారు రక్షణగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఎవరు లేరు కాబట్టి మనం ఈజీగా దానిని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, దానిని ఎక్కడ దాచి పెట్టారో తెలుసుకోవడమే మన ముందు ఉన్న సవాల్!" అని చెప్పాడు గఫర్ ఖాన్. "నువ్వు చెప్పిందాన్ని బట్టి అక్కడ భారీ నిధి ఉండి ఉంటుంది. నాకు తెలిసి దానికి మార్గం ఆ అమ్మవారి విగ్రహం కింద నుంచి ఉండొచ్చు!" అని చెప్పాడు అభిజిత్. "ఐదు సంవత్సరాల క్రితం వియత్నం టీం తో నేను ఆ కొండల దగ్గరికి వెళ్లాను కానీ అక్కడ మా వాళ్ళు జంతువులకు బలయ్యారు తప్పితే ఎక్కడ నిధి జాడ దొరకలేదు. కానీ ఇప్పుడు గఫర్ ఖాన్ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయి నాకు తెలిసి దానిని అంత సులభంగా చేరుకోలేము ఈసారి నా సొంతమంది మంది మార్బలంతో వచ్చాను దానిని సాధించిన తర్వాతే తిరిగి వెళతాను." అని చెప్పాడు తల్వర్. "ఈ విషయంలో మనం ముందుగానే షేర్ మాట్లాడుకుంటే ఎవరికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది." అని చెప్పింది అర్ణ. "మీరు నిధి మొత్తం తీసుకోండి. కానీ అక్కడ ఉన్న రెండు వస్తువులు నాకు కావాలి." అని చెప్పాడు గఫర్ ఖాన్.
16-02-2026, 11:25 AM
shivaji maharaj anni stories ila interesting gane untai
16-02-2026, 12:19 PM
Excellent update
17-02-2026, 08:56 AM
ఎపిసోడ్ 83
తల్వార్ తో కలిసి నందా గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి నిధి గురించి చెప్పి మొత్తం మీరే తీసుకోండి కానీ దాంట్లో రెండు వస్తువులు నాకు కావాలి అని అడిగాడు గఫర్ ఖాన్.
**************** నాకు ఆ నిధి లొ రెండు వస్తువులు కావాలి అని అడిగిన గఫార్ ఖాన్ వైపు అనుమానంగా చూస్తు "పంచరత్నాలు ఇవ్వడం కుదరదు." అని చెప్పింది అర్ణ. "ఆ పంచరత్నాలు మీరే ఉంచుకోండి అవి నాకు అవసరం లేదు." అని చెప్పాడు గఫర్ ఖాన్. "మరి ఆ నిధిలో ఏ వస్తువులు నీకు కావాలి?" అని అడిగాడు అభిజిత్. "చత్రపతి శివాజీ మహారాజ్ కి అమ్మవారు ప్రసాదించిన ఖడ్గం ఆయన ఆదిష్టించిన సింహాసనం!" అని చెప్పాడు గఫార్ ఖాన్. "చంద్రహాస్ ఖడ్గం గురించి విన్నాను కానీ సింహాసనం గురించి వినలేదు దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి?" అని అడిగాడు మిథున్. ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసుకొని "వజ్ర వైడూర్యాలు పొదిగి బంగారంతో తయారు చేసిన ఆ సింహాసనం కోసం బ్రిటిష్ వాళ్ళతో సహా చాలామంది వెతికారు, కానీ అది ఎక్కడ ఉందో కనిపెట్టడం ఎవరి వల్ల అవ్వలేదు, నా అంచనా ప్రకారం కచ్చితంగా అది బేరా కొండల దగ్గర ఉన్న నిధి దగ్గరే ఉంటుంది. శివాజీ మహారాజ్ ప్రతిష్టిగా భావించే ఆ సింహాసనం మా పూర్వీకులు రక్తంతో తడిచిన ఆ కత్తి ఎలాగైనా నేను కైవసం చేసు కోవాలి." అని చెప్పాడు గఫర్ ఖాన్. "సరే! ఆ నిధి దొరికిన తర్వాత దాంట్లో వెతుక్కుని నీ రెండు వస్తువులు నువ్వు తీసుకో! మరి నీ పరిస్థితి ఏమిటి?" అని తల్వార్ వైపు చూశాడు ముకుల్. "అక్కడ దొరికిన నిధిలో 30% నా ప్లేస్ కి చేర్చవలసిన బాధ్యత మీది, దానిని కనిపెట్టి మీకు హ్యాండ్ అవుర్ చేసే బాధ్యత నాది." అని చెప్పాడు తల్వార్. "ఏంటి? నీ ప్లేస్ కి చేర్చాలా?" అని అడుగుతున్నా మిధున్ ని ఆపి "ఈ డీల్ నాకు ఓకే! ఇంక మీరు వర్క్ లొ మూవ్ అవ్వండి. ఏ హెల్ప్ కావాలన్నా అడగండి క్షణాలలొ జరిగిపోతుంది." అని చెప్పింది అర్ణ. "మాకు కావలసిన వస్తువులు వెపన్స్ లిస్ట్ వాసుకి ఇచ్చాను అవి అరేంజ్ చేస్తే మేము అడవికి స్టార్ట్ అవుతాము." అని చెప్పాడు తల్వర్. "సరే! మీరు వెళ్లి ఆ అవుట్ హౌస్ లో రెస్ట్ తీసుకోండి ఈవినింగ్ మీకు కావాల్సినవన్నీ రెడీ అవుతాయి." అని చెప్పింది అర్ణ. అక్కడి నుంచి వాసుకి తో కలిసి తల్వార్ వెళ్లడంతో "నిధి లొ 30% వాడు చెప్పిన చోటికి చేర్చడానికి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? ఏదైనా రిస్క్ అయితే మనం ఇరుక్కుంటాంము." అని చెప్పాడు మిథున్. "అసలు వాడిని ఆ నిధి ని బయటకు తీయని తర్వాత సంగతి చూద్దాము, దానికి రక్షణగా ఉంది అభీర్ సేన, అంత తేలిక పని జరుగుతుంది అనుకోను వాళ్లు ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుతారు. ఈ తల్వార్కి, గఫర్ ఖాన్ కి మనం కాస్త మనం చెయ్యి అందిస్తే ఆ నిధిని కాపాడడం కోసం అభీర్ సేన లొ ఉన్న వాళ్ళు మొత్తం బయటికి వస్తారు, వాళ్లు వాళ్లు కొట్టుకు చచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళని మనం చంపుదాము." అని చెప్పింది అర్ణ. ఆ మాటకి నవ్వుతూ "ఇప్పుడు నా మనవరాలు అనిపించావు కరెక్ట్ గా ఆలోచిస్తున్నావు, నా వంశంలో ఎవరు మిగలకపోవడం కాదు ఆ జారువా తెగలొ ఎవరు మిగలకూడదు." అని చెప్పాడు ముకుల్. అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "రాజస్థాన్ నుంచి నిర్మల్ కాల్ చేస్తున్నాడు." అని లిఫ్ట్ చేసి "ఏమైంది? విష్ణు జాడ దొరికిందా?" అని అడిగింది అర్ణ. "నేను ప్రమోద్ మాట్లాడుతున్నాను, విష్ణుని ఫరూక్ మనుషులు అడవి నుంచి బయటకు తీసుకువచ్చారు ప్రాణాలకి ఎటువంటి ముప్పు లేదు, కానీ ఫుడ్ లేకపోవడం వల్ల బాగా నీరస పడిపోయాడు, హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది రెండు రోజులలొ అక్కడకి పంపిస్తాను." అని చెప్పాడు. "సరే! అడవిలో ఆ అభీర్ సేన మనుషుల జాడ ఏమైనా తెలిసిందా?" అని అడిగింది అర్ణ. "ఈ అడవిలో పురుగు పుట్రా తప్పితే మనిషి అన్న వాడు లేడు, మేము ఉదయం లో ఆ కొండల దగ్గరికి వెళుతున్నము." అని చెప్పాడు ప్రమోద్. "గుడ్! త్వరగా స్టార్ట్ చేయండి. ఆ కొండలని బ్లాస్ట్ చేసేటప్పుడు వీడియో తీయండి. మనం మీద డాక్యుమెంటరీ తీసే వాళ్ళకి పంపిద్దాము. రెండు రోజులలొ అక్కడికి వాసుకి తో పాటు కొంతమంది వస్తారు వాళ్ల పని వాళ్ళని చేసుకునివ్వండి. ఏదైనా హెల్ప్ కావాలి అంటే చేయండి." అని చెప్పి ఫోన్ పెట్టేసి ముకుల్ వైపు చూసి "విష్ణు దొరికాడు హాస్పిటల్ లో ఉన్నాడు రెండు రోజుల్లో ఇక్కడికి వస్తాడు ఎటువంటి ప్రమాదం లేదు, రేపటి నుంచి ఆ కొండలు తవడం మొదలు పెడుతున్నారు." అని కసిగా చూస్తూ చెప్పింది అర్ణ. ఆ మాట విని "మనవాళ్లు సాధించారు ఇంక మన పని మనం చేయాలి, ఇప్పుడు అభీర్ కచ్చితంగా అడవికి వెళ్లడానికి ట్రై చేస్తాడు వాడిని ఢిల్లీ నుంచి కదలనివ్వకూడదు." అని చెప్పాడు అభిజిత్. "ఆ సంగతి నేను చూసుకుంటాను ప్లాన్ ప్రకారం దెబ్బ కొట్టడం వాడికే కాదు నాకు తెలుసు!" అని చెప్పాడు మిథున్. వాళ్ళ మాటలు వింటూ మోహిత్ దగ్గరికి వెళ్లి "ఆ కొండల దగ్గర నిర్మల్ వాళ్ళు ఏం చేస్తారో చూసినా తరువాత అభీర్ తో డిల్ లొ కూర్చోవాలి అప్పటివరకు తొందరపడకూడదు." అని నెమ్మదిగా చెప్పాడు రఘురామ్. వరదరాజులు దగ్గరికి వెళ్లి "మనం కూడా ఏదైనా ఆలోచించాలి లేకపోతే కొండలు కింద ఉన్న మట్టిని, నిధి ఖాళీ అయిన తర్వాత అక్కడ ఉన్న చక్క పెట్టెలని చూస్తూ కూర్చోవాలి." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర. అక్కడి నుంచి లోపలికి వెళుతూ "నువ్వేం కంగారు పడకు బయటి నుంచి వచ్చి వాళ్ళు చేయగలేనిది ఇక్కడ ఉన్నవాడిని నేను చేయలేనా? గవర్నమెంట్ ఏ నా చేతిలో ఉంది." అని చెప్పాడు వరదరాజులు. ******************* మరుసటి రోజు ఉదయానికి బేర కొండల దగ్గరకి తన వాళ్ళని తీసుకుని క్షేమంగా చేరుకుని అమ్మవారి విగ్రహం దగ్గరికి వచ్చి నమస్కరించి "సోము, కేశవ! నాయకుడి ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చేవరకు మీ అందరికీ నేను సారధిని, ఇకనుంచి ఇక్కడ ఉన్న దళానికి మీరే సారధులు ముందుకు నడిపించండి. మనం క్షేమంగా చేరుకున్నామని సింబా ద్వారా నాయకుడికి సమాచారం పంపించండి." అని చెప్పాడు లింగు. "సరే!" అని తనతో పాటు వచ్చిన వాళ్ళని చూసి ఈ ప్రదేశం అంత శుభ్రం చేయండి, అమ్మ వారి దగ్గర దీపం పెట్టండి. మన నాయకుడు ఇక్కడ అడుగు పెట్టే వరకు అమ్మవారికి శాంతి జరిపించాలి. " అని రాతి కొండ వైపు చూసి వింత శబ్దం చేసాడు కేశవ. ఆ అరుపు విని వేగంగా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూసి సంతోషంతో అరుస్తూ ఉన్నాడు సింబా. "మేము క్షేమంగా చేరుకున్నామని నాయకుడికి సమాచారం ఇవ్వు!" అని చెప్పాడు సోము. ఆ మాట విని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వేగంగా ఎగిరిపోయాడు సింబా. ఆ అరుపు విని "లింగు! సింబ మనకి ఏదో చెప్పాడు నీకు అర్థమైందా?" అని అడిగాడు కేశవా. "నాకు అర్థమైంది మీరు సిద్ధం అవ్వండి. నేను నా తమ్ముడు వెళ్లి బలికి మేకల్ని పంపుతాము." అని చెప్పి "గుడ్డు వెళదామా?" అని అడిగాడు లింగు. "అన్న!" అని చేయి పట్టుకుని కొండ కిందకి బయలుదేరాడు గుడ్డు. ********* గొర్వర్ గెస్ట్ హౌస్ దగ్గరకి చేరుకుని "ఈ అడవి చుట్టూ నా మనుషులు ఉన్నారు వాళ్ళని దాటి ఒక్కడు కూడా లోపలికి రాలేడు." అని చెప్పాడు ఫరూక్. అక్కడికి వచ్చిన తను మనుషుల్ని చూపించి "ఇతని పేరు 'చిలి' నాగాలాండ్ నుంచి వచ్చాడు అడవిలో ఏ జంతువైనా కనిపిస్తే దానిమీద ఎటాక్ చేసి పచ్చి మాంసాన్ని తినేస్తారు, వీళ్ళ గ్యాంగ్ దెబ్బకి నాగాలాండ్ లొ కుక్కలు మొత్తం మాయమైపోయాయి." అని నవ్వుతూ చెప్పాడు నిర్మల్. "అతను బిహార్ నుంచి వచ్చాడు పేరు 'ధన' ఈ గ్యాంగ్ కోడి తల నరకడం మనిషి తల నరకడం ఒకటే అనుకుంటారు వీళ్లని బీహార్ లో అందరు నరరూప రాక్షసులు అని ముద్దుగా పిలుస్తారు." అని చెప్పాడు ప్రమోద్. ఆ ఇద్దరిని వెనకాల ఉన్న మనుషుల్ని చూస్తూ "మీరు చెప్పిందానికి వీళ్ళ కటౌట్ కి కరెక్ట్ గా సరిపోయింది. మనకి కావలసింది కూడా ఇలాంటి వాళ్లే!" అని చెప్పాడు ఫరూక్. చిలి,ధన లా వైపు చూసి తన పక్కన ఉన్న మనిషిని చూపించి "ఇతని పేరు ముత్యం! ఈ అడవిలో ఉండే గిరిజనులకి నాయకుడు వీళ్ళ మనుషులు మిమ్మల్ని ఆ కొండల దగ్గరికి తీసుకువెళతారు మీరు రూట్ మొత్తం క్లియర్ చేసి ఇన్ఫామ్ చేస్తే మేము బయలుదేరి వస్తాము." అని చెప్పాడు నిర్మల్. "అక్కడ మీకు జంతువు కానీ మనిషి కానీ ఏది కనిపించినా నిర్దాక్షిణ్యంగా చంపేయండి మిమ్మల్ని అడిగేవాడు ఎవ్వరు ఉండరు." అని చెప్పాడు ఫరూక్. "అర్ణ తో మాట్లాడినప్పుడు ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం గాని వాసుకి తో కలిసి కొంతమంది ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి అని చెప్పింది. ఎందుకు వస్తున్నారో నీకేమైనా ఐడియా ఉందా?" అని అడిగాడు ప్రమోద్. "ఇంక దేనికి అక్కడ ఏదో నిధి ఉంది అని ఆ వాసుకి చెప్పింది కదా దానిని వెతకడానికి వస్తున్నారేమో! అని చెప్పాడు అరుల్. "వాళ్ల పని వాళ్ళది మన పని మనది దాని గురించి పెద్దగా ఆలోచించాకు." అని చెప్పి చీలి వాళ్ళ వైపు చూసి "మీరు బయలుదేరండి." అని చెప్పాడు నిర్మల్. "ఓకే సార్!" అని చెప్పి వాళ్ళ మనుషుల్ని తీసుకుని అడవిలోకి బయలుదేరారు చిలి, ధన.
17-02-2026, 08:57 AM
ఎపిసోడ్ 84
గొర్వర్ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి చిలి, ధన లకి అక్కడ అడవిలో ఉండే గిరిజన నాయకుడు ముత్యంని పరిచయం చేసి వాళ్లతో పాటు అడవిలోకి వెళ్లి రూట్ క్లియర్ చేసి ఇన్ఫామ్ చేయమని పంపించాడు నిర్మల్.
*************** ఉదయం నంద గెస్ట్ హౌస్ దగ్గర తల్వార్ చెప్పిన ఎక్విప్మెంట్ మొత్తం రావడంతో బయలుదేరుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి "వాసుకి బేరా కొండల దగ్గర జరిగే ప్రతి మూమెంట్ నాకు ఎప్పటికప్పుడు తెలియాలి, మీరు ఆ అడవినుంచి నుంచి నిధితోనే బయటకు రావాలి." అని చెప్పింది అర్ణ. "సరే మేడం! మీరు చేయవలసింది ఒక్కటే! మా పని అయ్యేంతవరకు అభీర్ ని అడవిలోకి రాకుండా చూసుకోండి." అని చెప్పి వ్యాన్ ఎక్కింది వాసుకి. అక్కడినుంచి వ్యాన్ బయలుదేరగానే ఫోన్ తీసి నిర్మల్ కి కాల్ చేసింది అర్ణ. చిలి వాళ్ళని అడవిలోకి పంపించి ఫరూక్ తో మాట్లాడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "హలో అర్ణ! నా మనుషులు ఇప్పుడే అడవిలోకి ఎంటర్ అయ్యారు." అని చెప్పాడు నిర్మల్. "వాసుకి ఆ ట్రెజర్ హంటర్ ని తీసుకుని అక్కడికి స్టార్ట్ అయింది. వాళ్ల మీద ఒక కన్ను వేసి ఉంచండి." అని చెప్పింది అర్ణ. "ఈ అడవి చుట్టూ మన మనుషులే ఉన్నారు మనల్ని దాటీ ఎక్కడికి వెళ్లారు." అని చెప్పాడు నిర్మల్. ఆర్ల దగ్గర ఫోన్ తీసుకుని "నిర్మల్! మీరు అడవిలో ఎంతైనా తిరగండి. కానీ అక్కడ అమ్మవారి విగ్రహం ఉన్న కొండ మీదకి మాత్రం వెళ్ళకండి." అని చెప్పాడు అభిజిత్. "ఎందుకు డాడ్! అక్కడ ఏమైనా దయ్యాలు ఉన్నాయా?" అని నవ్వుతూ "సరే మీరు చెప్పారు కదా! అక్కడికి వెళ్దాము." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నిర్మల్. ఫోన్ ఇస్తున్న అభిజిత్ వైపు చూసి "అంకుల్! ఆ కొండ మీదకి ఎందుకు వెళ్ళద్దు అంటున్నారు? మీరు దేని గురించి భయపడుతున్నారు?" అని అడిగింది అర్ణ. "ఆ కొండమీద అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలని నేనే కత్తితో పెకిలించి తీశాను, ఇప్పటికీ నాకు నిద్రలో ఆ పంచరత్నాల నుంచి రక్తం కారుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కచ్చితంగా అక్కడ ఏదో శక్తీ ఉంది దానికి మనం కొంచెం దూరంగా ఉండటమే మంచిది." అని చెప్పాడు అభిజిత్. ఆ మాటకి నవ్వుతూ "అడవిలో మీకు జరిగిన ఆక్సిడెంట్ వల్ల ఆ ఫీలింగ్ లో ఉండిపోయారు అందుకే అలా అనిపిస్తుంది అక్కడ ఏమీ లేదు, ఏదో ఉంది అన్నట్లు మనల్ని భయపెట్టడానికి ఆ అభీర్ సేన కొంచెం ఎక్స్ట్రా డైలాగులు చెబుతున్నారు దాని గురించి మీరు ఓర్రి అవ్వకండి." అని కొట్టి పారేసింది అర్ణ. అక్కడికి వస్తు "ఆ అభీర్ ఒక వారం రోజులు పాటు ఢిల్లీ నుంచి కదలకుండా ఉండేలాగ ప్లాన్ చేశాను ఈ లోపు అడవిలో మన పని కంప్లీట్ అవుతుంది." అని నవ్వుతూ చెప్పాడు మిథున్. "అవునా? అభీర్ ని ఇక్కడే కట్టిపడేసే అంత ప్లాన్ ఏముంది?" అని డౌట్ గా అడిగాడు ముకుల్. "తనకి సహాయం చేసిన వాళ్ళని తనని నమ్ముకున్న వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళలేడు కదా అందుకే ఆ సెంటిమెంట్ మీదే దెబ్బ కొట్టాను కాసేపట్లో న్యూస్ లో వస్తుంది చూడండి." అని చెప్పాడు మిథున్. **************** అదే సమయంలో వసుంధర ఇంటి దగ్గరికి వస్తున్న అభీర్ ని చూసి "హాయ్ అభీర్! హౌ ఆర్ యు? ఏంటి మేడం తో ఏమైనా పని ఉందా?" అని అడిగాడు సందీప్ రావు. "అన్నయ్య! అభీర్ నాకోసమే వచ్చాడు, ఈరోజు డాక్యుమెంటరీ షూటింగ్ తీహార్ జైల్ లొ అని చెప్పా కదా పర్మిషన్ కూడా ఇప్పించావు మర్చిపోయావా?" అని అడిగింది నీలమ్. "హౌ మర్చిపోయిన అవును కదా! ఏంటి అభీర్ క్యారెక్టర్ కి ఆర్టిస్టులు పెట్టకుండా డైరెక్టర్ గా తననే పెట్టేసావా ఏంటి?" అని నవ్వుతూ అడిగాడు సందీప్. "నేను అంత డేర్ చేయలేను ఆ క్యారెక్టర్ కి వేరే మనిషి ఉన్నాడు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది ఒకసారి చూడడానికి రమ్మంటే వచ్చాడు." అని చెప్పింది నీలమ్. "సరే! నేను జైల్ కి వెళుతున్నాను ఈరోజు టెర్రరిస్ట్ ఖైదీలు వస్తున్నారు మీరు షూటింగ్ కి వచ్చే టైంకి వాళ్ళని వెనకాల బారికేడ్స్ కి పంపిస్తాను, లోపలికి వచ్చేటప్పుడు కాల్ చేసి రావడం మర్చిపోకండి." అని చెప్పి శంకర్ తో కలిసి అక్కడి నుంచి కార్లో బయలుదేరడు సందీప్ రావు. తన దగ్గరికి వచ్చిన బామ్మా తో మాట్లాడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి "బామ్మ గారు ఒక్క నిమిషం!" అని పక్కకు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి "చెప్పు వరదరాజులు నాకు ఎందుకు ఫోన్ చేయలి అనిపించింది?" అని అనుమానంగా అడిగాడు అభీర్. "ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్! మిథున్ ఏదో ప్లాన్ చేశాడు నీ మీద మాత్రం అటాక్ చేయడానికి కాదు, నీకు సహాయం చేసిన వాళ్ళు నిన్ను నమ్ముకున్న వాళ్ళు అని ఏదో అంటున్నాడు నీకు చెప్పాలి అనిపించింది చెప్పాను." అని ఫోన్ పెట్టేసాడు వరదరాజులు. ఫోన్లో చెప్పింది విని కాసేపు ఆలోచించి బైరికి కాల్ చేసి "ఈరోజు తీహార్ జైలుకి టెర్రరిస్టులు వస్తున్నారు అని తెలిసింది వాళ్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకో నాకెందుకో అనుమానంగా ఉంది." అని చెప్పాడు అభీర్. "సరే నాయకుడా! ఐదు నిమిషాల్లో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని నీకు కాల్ చేస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు బైరి. ఫోన్ పెట్టేసి జాజి, నారప్పలా వైపు చూసి "ఒకరు వసుంధర మేడం తో పాటు కోర్టుకు వెళ్ళండి. ఒకరు మురళి జోషి ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉండండి. మల్లి నువ్వు కాలేజ్ దగ్గరికి వేళ్ళు, రాము నువ్వు ఇక్కడే ఉండు."అని చెప్పి నీలమ్ వైపు చూసి "మీ స్టాఫ్ ని ఇక్కడే ఉంచు ఈరోజు కొత్త స్టాఫ్ తో వెళదాము." అని అక్కడ ఉన్న మిత్ర వైపు చూశాడు అభీర్. "ఓకే బాస్! కెమెరామెన్ చాక్లెట్ తో డైరెక్టర్ మిత్ర రెడీ." అని చెప్పింది. "అభీర్! మళ్లీ మనకి పర్మిషన్ రావాలి అంటే చాలా రోజులు పడుతుంది షూటింగ్ లేట్ అయిపోతుంది." అని కంగారుగా అడిగింది నీలమ్. "నేను అనుకున్నది కరెక్టే అయితే నీకు లైవ్ ప్రోగ్రాం దొరుకుతుంది. వెళదామా?" అని స్మైల్ ఇచ్చాడు అభీర్. ************ ఫోన్ మాట్లాడి టెన్షన్ తో మందు తాగుతున్న వరదరాజు దగ్గరికి వచ్చి "ఏంట్రా! ఈ విషయం అభీర్ కి ఎందుకు చెప్పావు?" అని ముందు గ్లాస్ తీసుకుంటూ అడిగాడు ప్రతాప్ మిశ్ర. "మనం నంద, అభిజిత్ ల దగ్గర ఎంత మంచిగా ఉన్నా పక్కనే పెడుతున్నారు ఒక్క విషయం కూడా చెప్పడం లేదు కాపలా కుక్కలాగా చూస్తున్నరు, అభీర్ కి కాస్త సహాయం చేసామనుకో మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ పోయి కాస్త గుడ్ ఇంప్రెషన్ వస్తుంది." అని చెప్పాడు వరదరాజులు. "అసలు! ఆ మిథున్ గాడి ప్లాన్ ఏమిటో అర్థం కాలేదు." అని చెప్పాడు తంబియార్. "ఆ ప్లాన్ గురించి మనం తలలు పగలగొట్టుకోవడం ఎందుకు అభీర్ కి హింట్ ఇచ్చాము కదా వాడే చూసుకుంటాడు ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి." అని చెప్పాడు వరదరాజులు. "ఆ నంద ఫ్యామిలీలో ఒక గుంట నక్క ఉంది అని తెలుసుకున్నము దానిని మన గుంపులోకి రమ్మంటే సరిపోతుంది." అని చెప్పాడు సుజిత్. "నువ్వు ఆ రఘురామ్ గురించి మాట్లాడుతున్నావా? వాడు పెద్ద వెధవ మనల్ని కూడా ముంచేస్తాడు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా. "మనం ఏమన్నా మహానుభావులమా? వెధవలు వెధవలు ఒకటి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఆ రఘురామ్ ప్లాన్ ఏమిటి?" అని అడిగాడు వరదరాజులు. "ఆ కొండల గురించి డైరెక్ట్‌గా అభీర్ తో డీల్ మాట్లాడడానికి చూస్తున్నడు." అని చెప్పాడు తంబియార్. "అవునా? అయితే రఘురామ్ ని లంచ్ కి తీసుకురండి సరదాగా మాట్లాడదాము, ఇప్పుడు మనం ఆబీర్ కి హెల్ప్ చేసాము కచ్చితంగా మనకి ఫేవర్ గా ఉంటాడు ఏదైనా డీల్ చేసుకుంటే మనతోనే చేసుకుంటాడు." అని చెప్పాడు వరదరాజులు. ******************** నీలమ్ వాళ్లతో కలిసి షూటింగ్ పర్మిషన్ చూపించి తీహార్ జైల్ లోపలికి వెళ్ళాడు అభీర్. అక్కడికి వచ్చిన అభీర్ ని ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని డౌట్ గా అడిగాడు శంకర్. "సందీప్ గారు ఎక్కడ ఉన్నారు." అని అడిగాడు అభీర్. "ఈరోజు కొత్త ఖైదీలు వచ్చారు ఆ పనిలో బిజీ గా ఉన్నారు మీరు షూటింగ్ చేసుకోవడానికి అటువైపు బారికేడ్స్ ఖాళీ చేయించారు." అని చెప్పాడు శంకర్. "సరే! నేను ఇక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు మిథున్ ఏదో ప్లాన్ చేశాడు అని తెలిసింది ఇక్కడే ఏదో జరుగుతుందని డౌట్ గా ఉంది నేను ఒకసారి సబ్ జైలర్ నితీష్ ని కలవాలి." అని చెప్పాడు అభీర్. "మీరు షూటింగ్ జరిగే ప్లేస్‌లో ఉండండి నేను నితీష్ గారిని తీసుకువస్తాను." అని చెప్పాడు శంకర్. ****************** బేరా అడవిలోకి వెళ్లి నిర్మల్ వాళ్లు రావడానికి దారి క్లియర్ చేస్తూ జంతువులు దూరంగా పారిపోవడానికి బాంబులు విసురుతూ ముందుకు వెళుతూ ఉండగా ఒక చేత్తో కర్ర పట్టుకుని ఒక చేత్తో గుడ్డుని పట్టుకుని పాట పాడుకుంటూ నెమ్మదిగా వస్తున్న లింగు ని చూసి "వీడెవడురా అడవిలో పాట పాడు కుంటూ తిరుగుతున్నాడు?" అని అడిగాడు ధన. ఆ మాట విని లింగు వాళ్ళ వైపు చూస్తూ "దొర వీళ్ళని ఈ అడవిలో నేనెప్పుడూ చూడలేదు." అని చెప్పాడు ముత్యం. తన మనుషుల వైపు చూసి "వాళ్ళిద్దర్నీ ఇక్కడికి తీసుకురండి గట్టిగా అరవకండి బెదిరి చచ్చిపోతారు." అని నవ్వుతూ చెప్పాడు చీలి. "ఆ ఇద్దరిని ఇక్కడికి తీసుకు రావడం ఎందుకు? చంపేస్తే సరిపోతుంది కదా!" అని చికాకుగా చూస్తూ చెప్పాడు ధన. ఆ మాట విని "వాడిని చూడు కళ్ళు లేవు కర్ర పట్టుకుని నడుస్తున్నాడు, ఆ పక్కన ఉన్న వాడి సహాయం లేకపోతే ఎటు వెళ్లలేడు నాకు తెలిసి దారి తప్పి ఇక్కడికి వచ్చినట్లు ఉన్నారు రానివ్వు కాసేపు సరదాగా ఆడుకోవచ్చు!" అని చెప్పాడు చిలి. "అలా అంటావా! అయితే సరే వెళ్లి తీసుకురండి కాసేపు ఆడించి చంపితే మజా ఉంటుంది." అని వికృతంగా చూస్తూ చెప్పాడు ధన.
17-02-2026, 11:41 AM
Chaala vivarinchi raastunnaru.. edo novel laga!!
Wonderful update
17-02-2026, 11:46 AM
Excellent update
17-02-2026, 03:01 PM
Nice update..
Waiting for wonderful action
17-02-2026, 06:46 PM
Good story. Very gripping narration
18-02-2026, 11:25 AM
ఎపిసోడ్ 85
నీలమ్, మిత్ర వాళ్లతో కలిసి తీహార్ జైల్ లోపలికి షూటింగ్ కోసం వెళ్లి సబ్ జైలర్ నితీష్ ని తన దగ్గరికి తీసుకు రమ్మని శంకర్ తో చెప్పాడు అభీర్.
అభీర్ తో డీల్ చేసుకోవడానికి చూస్తున్నాడు అని తెలిసి రఘురామ్ ని లంచ్ కి పిలవమని తంబియార్ తో చెప్పాడు వరదరాజులు. అడవిలో నడుచుకుంటూ వస్తున్న లింగు, గుడ్డులను చూసి సరదాగా కాసేపు ఆడుకుందాము ఇక్కడికి తీసుకురండి అని తన మనుషులతో చెప్పాడు చీలి. ******************** బేరా అడవిలో తన దగ్గరికి వచ్చిన లింగు వైపు చూసి "ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని గంభీరమైన గొంతుతో అడిగాడు చీలి. "నా పేరు లింగు దొర, వీడు నా తమ్ముడు గుడ్డు!' అని చెప్పి తన భుజం మీద ఉన్న కోతిని చూపిస్తూ "వీడి పేరు శివుడు, అడవిలోకి తేనె పట్టు కోసం వచ్చాము." అని చెప్పాడు లింగు. ఆ మాటకి అనుమానంగా చూస్తూ "మిమ్మల్ని ఈ చుట్టుపక్కల ఎప్పుడు చూడలేదే ఎక్కడి నుంచి వస్తున్నారు?" అని అడిగాడు ముత్యం. "మాది ఆ కొండ పక్కన ఉన్న అడవి అందుకే మీరు నన్ను చూసి ఉండరు, కానీ మా శివుడు ఈ అడవిలో తిరుగుతూనే ఉంటాడు వీడిని ఎప్పుడైనా చూశారా?" అని అడిగాడు లింగు. ఆ మాటకి విచిత్రంగా చూస్తూ "ఒకవేళ చూసిన కోతిని ఎలా గుర్తుపడతారు? ఈ అడవిలో పెద్దపులులు, సింహాలు తిరుగుతూ ఉంటాయి తెలియదా?" అని అడిగాడు ధన. "ఏమో దొర నాకు కళ్ళు కనపడవు, ఏ జంతువు అరుపు అయ్యినా ఒకేలాగా ఉంటుంది అందుకే పెద్దగా పట్టించుకోను." అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పాడు లింగు. "అవునా? మరి నీ పక్కన ఉన్న నీ తమ్ముడుకి కనపడుతుంది కదా వాడు చెప్పడా?" అని గన్ బయటికి తీశాడు చీలి. "నా తమ్ముడు గుడ్డుకి వినపడదు దొర, మా శివుడికి ఏమో నోరు లేదు మాట్లాడలేడు." అని చెప్పాడు లింగు. "నీకు కనపడదు వాడికి వినపడదు దీనికి నోరు లేదు మరి ధైర్యంగా ఈ అడవిలోకి ఎందుకు వచ్చారురా..?" అని వెనకాల ఉన్న తన మనిషి వైపు చూసి సైగ చేశాడు ధన. సైగ చేయడం గమనించి గుడ్డు మీదకి కత్తిని విసిరాడు ధన మనిషి. వేగంగా గుడ్డు మీదకి వస్తున్న కత్తిని తన చేతిలో ఉన్న కర్రతో పక్కకు కొట్టి "నాకు కనపడదు కానీ వినపడుతుంది దొర!" అని చెప్పాడు లింగు. ఆ మాటకి షాక్ అయ్యి చూస్తూ లింగు తల మీద గన్ పెట్టి "ఇప్పుడు వినపడుతుందా?" అని అడిగాడు చీలి. వేగంగా ముందుకు వచ్చి చీలి చేతిలో గన్ లాక్కుని అటు ఇటు తిప్పి చూస్తూ "నాకు కనపడుతుంది దొర!" అని చెప్పాడు గుడ్డు. ఆ మాటకి కోపంగా చూస్తూ "ఏంట్రా? మేము పిచ్చివాళ్ళ లాగా కనపడుతున్నామా? వేషాలు వేస్తున్నారా?" అని ఆవేశంతో గట్టిగా అరిచేడు ధన. ఆ మాటకి తల అటు ఇటు ఊపుతూ "ఏమో దొర! నాకు కనపడదు, మీరు మాట్లాడిన మాట నా తమ్ముడికి వినపడదు, ఒకవేళ మా శివుడికి వినపడిన కనపడిన మాట్లాడలేడు. అయ్యినా ఎందుకు అరుస్తున్నారు? మీ రోగానికి నా దగ్గర మందు ఉంది ఇమ్మంటారా?" అని అడిగాడు లింగు. "కాసేపు ఆడుకుందామని వీళ్ళని పిలిస్తే వీళ్ళు మనల్ని ఆడుకుంటున్నారు, ఈ కళ్ళు లేనోడి మాటలు వింటుంటేనే ఇరిటేషన్ వస్తుంది." అని చీలి వైపు చూసి "నువ్వు చంపుతావా?" నన్ను చంపమంటావా?" అని కోపంగా అడిగాడు ధన. తన మనిషి వైపు చూసి "ఒరేయ్! వీళ్లిద్దరి కాళ్లు చేతులు కట్టేసి ఆ కోతిని చంపి సూప్ చేయండి. అప్పుడు దాని కేకలు వీడికి వినపడుతాయి, వాడికి కనపడుతాయి మనతో పాటు విళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు." అని నవ్వుతూ చెప్పాడు చీలి. "సరే బాయ్!" అని ముందుకు వస్తున్న వాడి వైపు తిరిగి గుడ్డు చేతిలో ఉన్న గన్ తీసుకొని షూట్ చేసి "తప్పు దొర! మూగజీవాన్ని చంపకూడదు." అని చెప్పాడు లింగు. తన మనిషికి కరెక్ట్ గా నుదుటి మీద బుల్లెట్టు దిగడం చూసి లింగు వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఒరేయ్! నీకు నిజంగా కళ్ళు కనపడవా?" అని దగ్గరికి వస్తూ డౌట్ గా అడిగాడు చీలి. బులెట్ తగిలి కింద పడ్డ మనిషిని చూసి కోపంతో లింగు మీదకి దూకాడు ధన మనిషి. అది చూసి లింగు బొడ్డులో ఉన్న కత్తి తీసి మీదకు వస్తున్న వాడి గొంతులో దింపి "మా అన్న మీ దొరతో మాట్లాడుతున్నాడు కదా! మధ్యలో రాకూడదని తెలియదా?" అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పాడు గుడ్డు. పక్కనే ఉన్న తన మనిషి గొంతులో కత్తి దిగడం చూసి భయంతో రెండు అడుగులు వెనక్కి వేసి "చీలి! వీళ్లిద్దరూ మామూలు వాళ్ళు కాదు నాకు తెలిసి ఆ అభీర్ సేన మనుషులు అయ్యుంటారు వెంటనే వీళ్ళని చంపేయాలి." అని కంగారుగా చెప్పాడు ధన. ఆ మాట విని "దొర! కంగారు పడకండి మాకు ఈ అడవి మొత్తం కొట్టిన పిండి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాము ఎక్కడికి తీసుకు వెళ్ళమన్న తీసుకువెళతము." అని చెప్పాడు లింగు. ఆవేశపడుతున్న ధనని ఆపి "మీకు నవగ్రహాల కొండలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?" అని అడిగాడు చీలి. "తెలుసు దొర! కానీ వాటి జోలికి వెళ్లడం అంత మంచిది కాదు అనవసరంగా ప్రాణాలు మీ దగ్గర తెచ్చుకోకండి." అని చెప్పాడు లింగు. "ఆ విషయం మాకు తెలుసులే కానీ ఆ కొండలు ఎక్కడ ఉన్నాయో మాకు చూపించండి మిమ్మల్ని చంపకుండా డబ్బులు ఇచ్చి పంపిస్తాను." అని చెప్పాడు చీలి. "సరే దొర! రావలసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరూ మా వెనకాల వచ్చేయండి. ఆ కొండలు దగ్గరికి వెళ్లిన తర్వాత మళ్లీ ఈ దారిలో రావలసిన పని ఉండదు అక్కడ నుంచి వేరే దారి ఉంది తేలికగా అడవి బయటకు వెళ్ళిపోవచ్చు!" అని చెప్పాడు లింగు. "అతను చెప్పింది నిజమే దొర! ఆ కొండల దగ్గర నుంచి వేరే మార్గం ఉంది అంటారు." అని చెప్పాడు ముత్యం. "అవునా? అయితే బాస్ వాళ్ళను కూడా పిలుద్దామా?" అని అడిగాడు ధన. "సరే!" అని ఫోన్ తీసి నిర్మల్ కి కాల్ చేసాడు చీలి. ఫోన్ రింగ్ అవడం చూస "ఆ కొండల దగ్గరికి వెళ్లినట్లు ఉన్నారు." అని సంతోషంగా లిఫ్ట్ చేసి "మేము స్టార్ట్ అవ్వొచ్చా?" అని అడిగాడు నిర్మల్. "ఎస్ సార్! ఆ కొండల దగ్గర నుంచి అడవి బయటికి వెళ్లడానికి వేరే రూటు ఉంది మీరు త్వరగా వచ్చేయండి." అని చెప్పాడు చీలి. "అవునా? ఇప్పుడే స్టార్ట్ అవుతాము." అని చెప్పి ఫోన్ పెట్టేసి ఫరూక్ వైపు చూసి "మళ్లీ మనం ఈ రూట్లో బయటికి రానవసరం లేదు మీ వాళ్ళకి కాల్ చేసి వాసుకి వస్తే లోపలికి పంపించమను." అని చెప్పాడు నిర్మల్. "ఓకే!" అని కార్ ఎక్కి ఫోన్ తీసి కాల్ చేసి "కబీర్! నీ మొబైల్ కి ఒక ఫోటో సెండ్ చేశాను ఆ అమ్మాయి తో పాటు కొంతమంది మనుషులు వస్తారు వాళ్ళని అడవిలోకి పంపించు నా పర్మిషన్ లేనిదే వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళకూడదు." అని చెప్పాడు ఫరూక్. "సరే బాయ్!" అని చెప్పాడు కబీర్. "నేను అడవిలోకి వెళ్తున్నాను ఫోన్ రీచ్ అవ్వకపోతే కంగారు పడకండి నా పర్మిషన్ లేనిదే ఎవరు లోపలికి రాకూడదు ఎవరు బయటికి వెళ్ళకూడదు." అని చెప్పి ఫోన్ పెట్టేసి నిర్మల్ వైపు చూసి "బయలుదేరుదామా?" అని చెప్పాడు ఫరూక్. కార్ లొ బయలుదేరి "ఆ కొండల్లో చూడాలని చాలా ఆశగా ఉంది." అని చెప్పాడు ప్రమోద్. డ్రైవింగ్ చేస్తూ "ఆ కొండలని చూసిన తర్వాత మీ కళ్ళలో ఆనందం చూడాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది." అని చెప్పాడు అరుల్. **************** అదే సమయంలో తీహార్ జైల్లో సబ్ జైలర్ నితీష్ దగ్గరికి వెళ్లి "సార్! ఛానల్ వాళ్ళు షూటింగ్ చేసుకోవడానికి వచ్చారు మీరు ఒక్కసారి వచ్చి చూసి ఓకే అంటే వాళ్ళని లోపలికి పంపుతాను." అని చెప్పాడు శంకర్. "సరే పద!" అని చెప్పి అక్కడికి వచ్చి నీలమ్ దగ్గర పర్మిషన్ కాగితాలు తీసుకుని చూస్తూ "మీరు ఈ ప్లేస్ లో మాత్రమే షూటింగ్ చేయాలి, కానీ మీరు మా జైలర్ వారి సిస్టర్ కాబట్టి మీకు లోపల షూటింగ్ చేసుకోడానికి కూడా నేను పర్మిషన్ ఇస్తాను." అని నవ్వుతూ చెప్పాడు నితీష్. ఆ మాట విని ముందుకి వస్తూ "నితీష్ గారు బాగున్నారా? నేను పెంచిన చెట్లకి నీళ్లు పోస్తున్నారా?" అని అడిగాడు అభీర్. ఆ మాట విని కంగారుగా చూస్తూ "అభీర్! నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నీ చెట్లకి రోజు నేనే దగ్గర ఉండి నీళ్లు పోయిస్తున్నాను." అని టెన్షన్ చెప్పాడు నితీష్. "చాలా థాంక్స్! ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా?" అని అడిగాడు అభీర్. "నేను కొంచెం అర్జెంటుగా బయటకు వెళ్లాలి శంకర్ ఫోన్ లో నుంచి చేసుకో!" అని అక్కడి నుంచి వెళ్లడానికి వెనక్కి తిరిగాడు నితీష్. "మిథున్ ప్లాన్ ఏమిటో చెబితే ఇక్కడ జరిగే గొడవలో నువ్వు ప్రాణాలతో ఉంటావు." అని చెప్పాడు అభీర్. ఆ మాటకి వెనక్కి తిరిగి టెన్షన్ గా చూస్తూ "నాకు ప్లాన్ గురించి ఏమి తెలియదు ఇక్కడకి ఖైదీలుగా వచ్చిన టెర్రరిస్టుల్ని సెల్ లో పెట్టి లాక్ చేయకుండా వదిలేసి నన్ను బయటికి వెళ్లిపోమన్నాడు." అని చెప్పాడు నితీష్. "అవునా?" మరి షూటింగ్ కి వచ్చిన వీళ్ళని కూడా పర్మిషన్ లేకుండా లోపలికి పంపించమని చెప్పాడా? " అని అడిగాడు అభీర్. అంతలో సైరన్ మోగడంతో "అభీర్! లోపల ఏదో గొడవ జరుగుతుంది సందీప్ గారు అక్కడే ఉన్నారు." అని కంగారుగా చెప్పాడు శంకర్. సైరాన్ విని శంకర్ వైపు చూసి "డోర్స్ మొత్తం లాక్ చెయ్! నేను లోపలికి వెళుతున్నాను ఇక్కడి నుంచి ఎవరు తప్పించుకోకూడదు." అని నితీష్ దగ్గర ఉన్న గన్ తీసుకుని లోపలికి వెళ్ళాడు అభీర్.
18-02-2026, 11:28 AM
ఎపిసోడ్ 86
చిలి ఫోన్ చేయడంతో అక్కడి నుంచి కారులో నిర్మల్ వాళ్లతో బయలుదేరి తన మనిషి కమల్ కి ఫోన్ చేసి అడవిలోకి రావడానికి వెళ్లడానికి నా పర్మిషన్ కావాలి అని చెప్పాడు ఫరూక్.
తీహార్ జైల్లో సైరన్ మోగడంతో లోపల ఏదో గొడవ జరుగుతుంది సందీప్ గారు అక్కడే ఉన్నారు అని శంకర్ చెప్పడంతో నితీష్ దగ్గర గన్ తీసుకుని డోర్స్ క్లోజ్ చేయమని లోపలికి వెళ్ళాడు అభీర్. ****************** జైల్ లోపలికి వెళుతున్న అభీర్ ని చూసి కెమెరా ఆన్ చేసి "చాక్లెట్! ఏ సీన్ మిస్ అవ్వకూడదు జాగ్రత్తగా షూట్ చెయ్!" అని చెప్పింది నీలమ్. "సరే అక్క! ఏ సీన్ మిస్ అవ్వదు అభీర్ అన్న ఎలివేషన్ అదిరిపోతుంది చూస్తూ ఉండు." అని చెప్పాడు చాక్లెట్. "ఒరేయ్ చాక్లెట్! నువ్వు కొంచెం పిలుపు మార్చాలి వినడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. అభీర్ ని అన్న అని పిలుస్తున్నావు కాబట్టి నన్ను వదినా అని పిలువు కరెక్ట్ గా సరిపోతుంది." అని స్మైల్ ఇస్తూ చెప్పింది నీలమ్. "కొన్ని రోజులుగా నీ దగ్గర లవ్ స్మెల్ వస్తుందేమిటబ్బా అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది." అని కెమెరాతో షూట్ చేస్తూ ఉన్నాడు చాక్లెట్. నీలమ్ వైపు చూసి "జాగ్రత్త! అక్కడ ఫైటింగ్ తప్పితే ఎమోషన్స్ ఉండవు." అని చెప్పి పక్కన టెన్షన్ గా ఉన్న నితీష్ వైపు చూసి "ఇలాంటి వాళ్ళకి డబ్బుఎవ తప్పితే మానవత్వం ఉండదు వీళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి." అని చెప్పింది మిత్ర. బయటికి వెళ్లే డోర్స్ మొత్తం లాక్ చేసి తాళాలు జేబులో వేసుకుని నితీష్ వైపు చూసి "మీరు తప్పు చేశారు సార్! కానీ దానిని మా నాయకుడు ఇప్పుడు సరి చేస్తాడు." అని చెప్పి లోపలికి వెళ్ళాడు శంకర్. ఖైదీలు సెల్లో నుంచి బయటికి వచ్చి గాడ్స్ కొడుతూ ఉండడం చూసి టెన్షన్ గా ఉన్న సందీప్ రావు దగ్గరికి వెళ్లి "ఏమైంది సార్! అసలు ఇక్కడ ఏం జరుగుతుంది?" అని అడిగాడు అభీర్. ఆ మాట విని పక్కకు చూసి "అభీర్ నువ్వు ఇక్కడ?" అని ఆశ్చర్యంగా చూస్తూ "ఈరోజు వచ్చిన టెర్రరిస్ట్ ఖైదీలు సెల్లోనుంచి బయటికి వచ్చి రిస్ట్ క్టెడ్ ఏరియాలో ఉన్న ఖైదీల సెల్ డోర్స్ ఓపెన్ చేశారు. వాళ్ళు విఐపి జోన్ వైపు వెళ్లడానికి ట్రై చేస్తున్నారు అక్కడ చాలామంది రాజకీయ నాయకులు బిజినెస్‌మేన్ ఉన్నారు వాళ్ళని బందీలుగా చేసుకొని ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేసినట్లు ఉన్నారు. ఇది చూసి మిగతా ఖైదీలు కూడా బయటకు వచ్చి గాడ్స్ ని కొట్టి తప్పించుకోడానికి ట్రై చేస్తున్నారు." అని చెప్పాడు సందీప్ రావు. ఆ మాట విని కాసేపు ఆలోచించి "టెర్రరిస్ట్ ఖైదీల ప్లాన్ ఇక్కడి నుంచి తప్పించుకోవడం మాత్రమే కాదు ఈ గొడవలో మిమ్మల్ని చంపాలని కూడా చూస్తున్నారు." అని శంకర్ వైపు చూసి "సార్ ని రూమ్ లోకి తీసుకువెళ్లు నిన్ను దాటి అక్కడికి ఎవరు రాకూడదు." అని చెప్పాడు అభీర్. "సరే!" అని సందీప్ వైపు చూసి "మీరు రండి సార్! ఇక్కడి నుంచి ఒక్కడు కూడా తప్పించుకోలేడు కాసేపట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది అంత అభీర్ చూసుకుంటాడు." అని చెప్పాడు శంకర్. ఆ మాట విని అభీర్ వైపు చూసి "ఎట్టి పరిస్థితుల్లో ప్రాణానష్టం జరగకూడదు ఒక్క ఖైదీ కూడా తప్పించుకోకూడదు." అని చెప్పాడు సందీప్. "సరే సార్!" అని తన చేతిలో ఉన్న గన్ తో గాల్లో షూట్ చేసి శంకర్ చేతిలో పెట్టాడు అభీర్. గన్ సౌండ్ వచ్చిన వైపు చూసి "అభీర్ వచ్చాడు." అని గట్టిగా అరిచాడు ఒక ఖైదీ. తన మీదకి వస్తున్న ఒక ఖైదీని రెండు చేతులతో ఎత్తి దూరంగా గిరాటు వేసి కోపంగా చూస్తూ "గాడ్స్ ఒంటి మీద చేయి పడిందో నా సంగతి తెలుసు కదా! ఇక్కడి నుంచి రిలీజ్ అయ్యి బయటికి వెళ్లిన సరే ఏ పని చేసుకోలేరు జీవితాంతం మంచం మీద బతకాల్సి ఉంటుంది." అని వార్నింగ్ ఇచ్చాడు అభీర్. ఆ మాట విని సైలెంట్ అయిన ఖైదీలను చూసి లోపలి నుంచి అక్కడికి వచ్చి "ఆ రోజు మమ్మల్ని కొట్టింది వీడే ఈరోజు వీడిని చంపి ఇక్కడి నుంచి బయటికి వెళ్లి పోదాము." అని తనతో ఉన్న వాళ్లకి చెప్పాడు టెర్రరిస్ట్ ఖైదీ. "మనం పారిపోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు జైలర్ ని చంపి వెళ్లిపోమన్నారు వీడు అడ్డం వస్తే మనం మాత్రం ఏం చేస్తాం చంపేద్దాము." అని చెప్పాడు అక్కడ ఉన్న మరొక టెర్రరిస్ట్ ఖైదీ. "మీరు ఇక్కడి నుంచి తప్పించుకుని ఇర్ఫాన్ ని కలవడానికే కదా వెళ్ళేది మీకు అంత శ్రమ అవసరంలేదు ఆల్రెడీ వాడిని పట్టుకున్నారు రేపు ఉదయానికి ఇక్కడ ఉంటాడు ఎంతసేపు కావాలి అంటే అంతసేపు మాట్లాడుకోవచ్చు లోపలికి వెళ్ళండి." అని చెప్పాడు అభీర్. ఆ మాటకి కోపంగా మీదకు వచ్చిన ఒక టెర్రరిస్ట్ ఖైదీని పట్టుకుని లేపి తన మోకాలికితో గుద్ది వెన్నుపూస విరగొట్టి కింద పడేసి "వీడిలా కాకుండా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళందరూ బారికేడ్స్ లోపలికి వెళ్ళండి." అని అక్కడ ఉన్న మిగతా ఖైదీల వైపు చూసి కోపంతో గట్టిగా అరిచాడు అభీర్. అది చూసి టెర్రరిస్ట్ ఖైదీలు తప్పితే మిగతా వాళ్ళందరూ లోపలికి పరిగెత్తడంతో డోర్స్ క్లోజ్ చేసి లాక్ చేస్తూ ఉన్నారు గాడ్స్. అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఖైదీల వైపు చూసి "ఈ రోజు నుంచి మీరు గన్ పట్టుకోడానికి చేతులు పనిచేయవు, జిహాద్ అని అరవడానికి గొంతు రాదు." అని తన మీదకి వస్తున్న ఇద్దరు చేతులు విరగొట్టి గొంతులొ బలంగా తన అర చేతితో కొట్టెడు అభీర్. కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న తన వాళ్ళని చూసి "ఆ జైలర్ ని ఎలాగైనా మన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకోండి లేకపోతే వీడిని ఆపడం కష్టం!" అని గట్టిగా అరిచాడు ఒక టెర్రరిస్ట్ ఖైదీ. ఆ మాట విని సందీప్ రావు ఉన్న రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న టెర్రరిస్ట్ ఖైదీ పిక పట్టుకుని పైకి లేపి గట్టిగా నొక్కి "మా నాయకుడు చెప్పిన మాట జరిగి తీరుతుంది. ఈరోజు నుంచి నీ గొంతు పని చేయదు, గన్ పట్టుకోవడానికి చెయ్యి పైకి లెగదు." అని కసిగా చూస్తూ చేతిని వెనక్కి విరిచాడు శంకర్. దూరంగా ఉండి కెమెరా లో షూట్ చేస్తూ "వదిన! నువ్వు ఎడిటింగ్ కూడా చేయనవసరం లేదు చేతులు విరిగిన సౌండ్ కూడా రికార్డు అవుతుంది." అని చెప్పాడు చాక్లెట్. అంతలో అక్కడ ఉన్న గాడ్స్ వచ్చి టెర్రరిస్ట్ ఖైదీ లని చుట్టూ ముట్టడంతో వాళ్ల దగ్గరికి వెళ్లి "మీతో ఈ పని చేయమని చెప్పింది ఎవరు? నిజం చెబితే తినడానికి చెయ్యి, మాట్లాడడానికి గొంతు ఉంటుంది." అని ఎర్రటి కళ్ళతో కోపంగా చూస్తూ చెప్పాడు అభీర్. "బాయ్! మా లీడర్ ఇర్ఫాన్ నుంచి ఆర్డర్ వచ్చింది తప్పించుకోడానికి సెల్ ఓపెన్ చేసి ఉంటుంది బయటకు వచ్చి మిగతా ఖైదీలను విడిపించి జైలర్ ని చంపి నలుగురు వీఐపీ ఖైదీలను హోస్టేజ్ గా తీసుకుని ఇక్కడి నుంచి తప్పించుకోండి. పంజాబ్ బోర్డర్ దగ్గర వ్యాన్ రెడీగా ఉంటుంది అక్కడి నుంచి బోర్డర్ దాటిస్తామని చెప్పాడు, అతనికి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో మాకు తెలియదు." అని చెప్పాడు అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఖైదీ. "మీ ఇర్ఫాన్ ఈరోజు చనిపోతున్నాడు మీరు బతికి ఉండాలంటే జైల్లోనే ఉండండి బయటికి వస్తే చంపేస్తాను, నేను చెప్పాను అంటే జరిగి తీరుతుంది." అని గాడ్స్ వైపు చూసి "రేపు ఇర్ఫాన్ చచ్చిన వీడియో వీళ్ళకి చూపించండి తర్వాత వీళ్ళు ఉన్న సెల్ కి తాళం వేయకపోయినా పర్వాలేదు ఇక్కడే ఉంటారు." అని చెప్పి అక్కడ నుంచి సందీప్ రావు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు అభీర్. ************** అదే సమయంలో బేర అడవిలో చీలి వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న లింగు వాళ్ళ వైపు చూసి "ఎవర్రా వీళ్ళు? కోతులు ఆడించే వాళ్ళ ఇక్కడ ఎందుకు ఉన్నారు?" అని చనిపోయిన ఇద్దరిని చూసి "వీళ్ళని ఎవరు చంపారు?" అని డౌట్ గా అడిగాడు నిర్మల్. "దొర! వాళ్ళని చంపింది మేమే! నా పేరు లింగు నాకు కనబడదు, వీడు నా తమ్ముడు గుడ్డు వీడికి వినపడదు వీడి పేరు శివుడు వీడికి నోరు లేదు." అని చెప్పాడు లింగు. ఆ మాట విని "వీళ్లని ఇంకా చంపకుండా ఏం చేస్తున్నారు మేము వచ్చేదాకా వెయిట్ చేయాలి అనుకున్నారా..?" అని కోపంగా అడిగాడు ప్రమోద్. "కాదు సార్! చంపేద్దాము అనుకున్నాను కానీ వీళ్ళకి నవగ్రహాల కొండలు ఎక్కడ ఉన్నాయో తెలుసు అని చెప్పారు, అవి నిజంగా చూపిస్తే బతుకుతారు లేకపోతే అప్పుడే చంపేద్దాము." అని చెప్పాడు చీలి. "సరే పదండి. చూపించక పోయిన చస్తారు, చూపించిన చస్తారు." అని కోపంగా చూస్తూ నెమ్మదిగా చెప్పాడు ఫరూక్. "దొర! మీరు నెమ్మదిగా మాట్లాడిన నాకు వినపడుతుంది ఆ కొండలు చూసినా ఆనందంలో మీరు నన్ను చంపరులే కానీ ఇక్కడినుంచి నడుస్తూనే వెళ్లాలి కారు వెళ్ళదు నా వెనకాలే రండి." అని చెప్పాడు లింగు. కాసేపటికి వెనకాల వెళుతూ చెమటలకు కక్కుతూ ఆయాసపడుతూ "ఇంకా ఎంత దూరం వెళ్లాలిరా..?" అని అడిగాడు నిర్మల్. ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా నడుచుకుంటూ వెళుతున్న లింగు వైపు చూసి "అడిగితే సమాధానం చెప్పవేమిటి?" అని కోపంగా అడిగాడు ఫరూక్. "మా తమ్ముడికి వినపడదు దొర!" అని చెప్పాడు లింగు. "నీకు వినపడుతుంది కదా నువ్వు చెప్పొచ్చుగా..!" అని అడిగాడు ప్రమోద్. "నాకు కనపడదుగా దొర! ఎవరిని అడిగారో ఎలా తెలుస్తుంది." అని వెరైటీగా ఫేస్ పెట్టి చెప్పాడు లింగు. ఆ మాటకి "ఒరేయ్!" అని అరుస్తూ ఆవేశంగా లింగు మీదకి వస్తున్న ఫారుక్ మనిషిని వేగంగా వచ్చిన నోటితో పట్టుకుని వెళ్లిపోయింది ఒక పెద్ద పులి. అది చూసి షాక్ లొ ఉన్న వాళ్ళ వైపు తిరిగి "ఈ అడవిలో గట్టిగా అరవకూడదు దొర, అరిస్తే ఇలాగే జరుగుతుంది మాట్లాడకుండా నా వెనకాలే రండి." అని చెప్పాడు లింగు. "ఇప్పుడు నా మనిషి మీద దాడి చేసింది ఏ జంతువు?" అని కంగారుగా చూస్తూ అడిగాడు ఫరూక్. "నాకెలా తెలుస్తుంది దొర! నాకు కనపడదు కదా!" అని ముందుకు నడుస్తూ చెప్పాడు లింగు. ఆ మాటకి ఆవేశంగా అరవబోయి ఒక చేత్తో నోరు మూసుకుని ఇంకొక చేత్తో తల కొట్టుకుంటూ భయంతో అటు ఇటు చూస్తూ వెనకాలే వెళ్ళాడు ఫరూక్.
18-02-2026, 11:55 AM
Excellent update
|
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread:


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)
