Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 72
మిత్ర, శివమణి కూతురు అని తెలియడంతో కాల్ చేసి మురళి జోషి చిన్న కూతురు, వసుంధర కూతురు చదివే కాలేజ్ తెలుసా అని అడిగి ట్రాప్ లో పెట్టి జాకిని పంపించాడు మిథున్.
**************
మిధున్ తో ఫోన్లో మాట్లాడి హడావుడిగా చాక్లెట్ ని తీసుకుని బైక్ మీద వెళుతూ "కాలేజ్ నుంచి రోషిని, ప్రణతి లని కిడ్నాప్ చేయడానికి చూస్తున్నారు నీలమ్,సుమతి లకి ఫోన్ ట్రై చెయ్ ఎలాగైనా వాళ్ళని కాపాడాలి." అని కంగారుగా చెప్పింది మిత్ర.
"సరే అక్క!" అని బండి వెనకాల కూర్చుని ఫోన్ ట్రై చేస్తూ "ఇద్దరి నెంబర్లు బిజీ వస్తున్నాయి." అని చెప్పాడు చాక్లెట్.
బైక్ మీద ఫాస్ట్‌గా వెళుతూ ఆ మాట విని "అయితే! లాయర్.మేడం అని ఉంటుంది దానికి డయల్ చెయ్!" అని చెప్పింది మిత్ర.
"సరే అక్క!" అని ఫోన్ లొ నెంబర్ చూసే లోపు రింగ్ అవ్వడం చూసి "అక్క! అర్ణ ఫోన్ చేస్తుంది." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు చాక్లేట్.
"అవునా?" అని బైక్ స్లో చేసి ఫోన్ తీసుకుని అనుమానంగా చూస్తూ లిఫ్ట్ చేసి "గుడ్ మార్నింగ్ మేడం!" అని చెప్పింది మిత్ర.
"హలో మిత్ర! ఎక్కడ ఉన్నావుm నీతో ఒక అర్జెంట్ పని పడింది." అని చెప్పింది అర్ణ.
"నేను ఇంటి దగ్గర ఉన్నను మేడం చెప్పండి?" అని అడిగింది మిత్ర.
"సరే! అక్కడే ఉండు అభీర్ ని అరెస్ట్ చేయడానకి ఒక ఛాన్స్ దొరికింది కాసేపట్లో నీకు ఒక లొకేషన్ పంపుతాను అక్కడికి వెళ్లి ప్రహ్లాద్ వాళ్లకి కాస్త హెల్ప్ గా ఉండు." అని చెప్పింది అర్ణ.
"ఓకే మేడం! మీరు లొకేషన్ పంపగానే బయలుదేరుతాను." అని చెప్పి ఫోన్ పెట్టి "అభీర్ ని అరెస్టు చేసే అంత ప్రహల్లాద్ కి ఏమి దొరికి ఉంటుంది?" అని ఆలోచిస్తూ శ్రీకర్ కి కాల్ చేసింది మిత్ర.
తన ఆఫీసులో దయాతో మాట్లాడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "మిత్ర! టెల్ మీ?" అని అడిగాడు శ్రీకర్.
"సార్! ఎస్పీ ప్రహల్లాద్, అభీర్ మీద ఏదో కేసు ఫైల్ చేస్తున్నాడని తెలిసింది నిజమేనా?" అని అడిగింది మిత్ర.
"ఎస్! తీహార్ జైల్ లొ అభీర్ చేతిలో చనిపోయిన నలుగురి ఫ్యామిలీ మెంబర్స్ తో కేసు ఫైల్ చేయించారు నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయం అప్పుడే నీకు ఎలా తెలిసింది?" అని డౌట్ గా అడిగాడు శ్రీకర్.
"నాకు అర్ణ కాల్ చేసి చెప్పింది. అంతే కాదు వాళ్ళు రోషిని, ప్రణతి కిడ్నాప్ చేయబోతున్నారు." అని చెప్పింది మిత్ర.
"అవునా? అలా అయితే వాళ్ల కోసం కచ్చితంగా అభీర్ వస్తాడు అప్పుడు అరెస్ట్ చేయాలని ప్లాన్ చేసి ఉంటారు, ఆ ప్రహ్లాద్ అరెస్ట్ చేసి ఊరుకొడు కచ్చితంగా ముకుల్ వాళ్ల కోసం ఎన్కౌంటర్ చేయడానికి చూస్తాడు.
ఎలాగైనా ఆ ఇద్దరిని కిడ్నాప్ అవ్వకుండా చూడాలి నువ్వు వెంటనే కాలేజ్ దగ్గరికి వేళ్ళు నేను కూడా దయాతో కలిసి బయలుదేరుతాను." అని చెప్పాడు శ్రీకర్.
"ఓకే సార్! " అని చెప్పి ఫోన్ పెట్టేసి బైక్ మీద ఫాస్ట్ గా వెళ్ళింది మిత్ర.
**************
గెస్ట్ హౌస్ దగ్గర గార్డెన్ లొ మిథున్ వాళ్ళతో మాట్లాడుతున్న అర్ణ దగ్గరికి వచ్చి "మేడం! మీరు చెప్పినట్లు అందరి ఫోన్స్ టాపింగ్ లో పెట్టాము ఇప్పుడే మిత్ర సిబిఐ ఆఫీసర్ శ్రీకర్ కి కాల్ చేసింది.
అభీర్ మీద ప్రహ్లాద్ ఫైల్ చేసినా కేసు గురించి కన్ఫామ్ చేసుకుని మనం పిల్లలిద్దరిని కిడ్నాప్ చేస్తున్న విషయం చెప్పింది ఇప్పుడు వాళ్ళందరూ కాలేజ్ దగ్గరికి బయలుదేరుతున్నారు." అని చెప్పాడు మిస్సైల్.
ఆ మాట విని కోపంగా చూస్తూ "మిత్ర! మమ్మల్నే మోసం చేయాలని చూస్తావా? నీ తండ్రికి పట్టిన గతే నీకు పడుతుంది." అని ప్రహ్లాద్ వైపు చూసి
"ఈ విషయం ఖచ్చితంగా అభీర్ కి తెలుస్తుంది ఆ పిల్లల్ని కాపాడడానికి తప్పకుండా వస్తాడు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని జాకి మన బఫర్ గోడౌన్స్ దగ్గరికి వస్తాడు మీరు కూడా అక్కడికి వెళ్లి రెడీగా ఉండండి. వచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళకూడదు." అని చెప్పి ఫోన్ తీసి జాకి కి కాల్ చేసింది అర్ణ.
కాలేజ్ దగ్గర కారులో వెయిట్ చేస్తూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "మేడం! చెప్పండి?" అని అడిగాడు జాకి.
"ఆ పిల్లలిద్దరూ కాలేజ్ దగ్గరికి వచ్చారా?" అని అడిగింది అర్ణ.
"ఎస్ మేడం! క్లాసులో ఉన్నారు నేను బయట వెయిట్ చేస్తున్నాను కాసేపట్లో లిజర్ కి గ్రౌండ్ లొకి వస్తారు." అని చెప్పాడు జాకీ.
"గుడ్! నీకు వచ్చిన డౌట్ కరెక్టే! మిత్ర అ అభీర్ మనిషి, ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడడానికి సిబిఐ ఆఫీసర్ ని వెంట పెట్టుకుని అక్కడికి వస్తుంది. వాళ్ల కళ్ళముందే ఇద్దరినీ కిడ్నాప్ చేసి మన బఫర్ గోడౌన్స్ తీసుకురా..! అక్కడ ప్రహ్లాద్ రెడీగా ఉంటారు ఎవరు తిరిగి బయటికి వెళ్ళకూడదు." అని చెప్పింది అర్ణ.
ఫోన్లో తను చెప్పింది విని "సూపర్ ప్లాన్ మేడం! ఒక్క దెబ్బకు అన్ని పిట్టలు ఎగిరిపోతాయి." అని నవ్వుతూ ఫోన్ పెట్టేసి తన మనుషులతో కలిసి కాలేజ్‌లోకి వెళ్ళాడు జాకి.
గెస్ట్ హౌస్ దగ్గర్నుంచి ప్రహల్లాద్ వెళ్లడంతో జాకీ తో ఫోన్ మాట్లాడి పెట్టేసి నెల్సన్ వైపు చూసి " మీరు కూడా బఫర్ గోడౌన్స్ దగ్గరికి వెళ్లి రౌండప్ వేయండి. మీ పని ఏమిటంటే మన వాళ్ళని సేఫ్ గా ఉంచడం.
మీరు అక్కడ ఉన్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు వాళ్లలో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే బుల్లెట్ దింపండి." అని చెప్పింది అర్ణ.
"ఓకే మేడం!" అని తన మనుషులతో కలిసి స్నైపర్ గన్స్ తీసుకుని గోడౌన్స్ దగ్గరికి బయలుదేరాడు నెల్సన్.
ముకుల్ వైపు చూసి "తాతయ్య! ఈరోజుతో ఆ అభీర్ సేన పని క్లోజ్! నాయకుడు లేకపోతే అందరు చిన్న భిన్నమవుతారు, ఆవేశంలో ప్రతి ఒక్కరు వచ్చి మనవాళ్ళ చేతిలో చస్తూ ఉంటారు." అని మిస్సైల్ వైపు చూసి
"ఈ రోజు ఆ పని పూర్తి అయ్యే వరకు ఈ గెస్ట్ హౌస్ లో నుంచి ఎవరు బయటికి వెళ్లడానికి వీల్లేదు ఎవరికి ఫోన్లు పని చేయకూడదు." అని ఆర్డర్ వేసింది అర్ణ.
"ఓకే మేడం!" అని గెస్ట్ హౌస్ లో ఫిక్స్ చేసిన జామర్స్ ఆన్ చేశాడు మిస్సైల్.
"మన ఫోన్స్ పని చేయకపోతే జాకీ వాళ్లు ఏదైనా మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది?" అని డౌట్ గా అడిగాడు మిథున్.
"నో ప్రాబ్లెమ్ సార్! మేడం ఫోన్ పని చేస్తుంది." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు మిస్సైల్.
వీల్ చైర్ లో సంతోషంతో ఊగిపోతూ "నీ గురించి మా మిథున్ చెబుతుంటే ఏమో అనుకున్నాను, నీ తెలివి ముందు ఎవడైనా దాసోహం అనాల్సిందే!
ఈ నందా గ్రూప్ సింహాసనానికి నువ్వే కరెక్ట్ గా సరిపోతావు 12 సంవత్సరాల క్రితమే నువ్వు ఉండి ఉంటే గోకుల్ బతికేవాడు ఆ కొండలు మన చేతిలో ఉండేవి." అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని లేని నవ్వు మొహం మీదకి తెచ్చుకుని "అభిజిత్ గారు కరెక్ట్ గా చెప్పారు." అని వరదరాజులతో పాటు అక్కడి నుంచి లోపలికి వెళుతూ "ఇప్పుడు మనం ఏమీ చేద్దాము. కచ్చితంగా మన ఫోన్స్ కూడా టపింగ్ లో పెట్టి ఉంటుంది. " అని కంగారుగా చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
"ఇది మామూలు ఆడది కాదు ఆవిలిస్తే పేగులు లెక్కపెడుతుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్లు కూడా పనిచేయడం లేదు ప్లాన్ సక్సెస్ అయితే మనకి అభీర్ గోల వదిలిపోతుంది." అని చెప్పాడు వరదరాజులు.
"ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయితే అభీర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకు ఏదైనా చేస్తాడు." అని చెప్పాడు సుజిత్.
"నాకు తెలిసి ఇక్కడ అభీర్ మనుషులు ఎవరో ఒకరు ఇక్కడ ఉండే ఉంటారు జరిగిందంతా వాళ్ళకి కూడా తెలుసు కదా! ఫోన్లు పని చేయకపోతే మనం మాత్రం ఏం చేస్తాము కనీసం బయటికి వెళ్లడానికి కూడా లేదు." అని చెప్పాడు తంబియార్.
"మనల్ని రాజన్ ట్రాప్ చేశాడు, అర్ణని మిత్ర ట్రాప్ చేసింది మరి మిగతా వాళ్ళని కూడ ఖచ్చితంగా ఎవరో ఒకరు ట్రాప్ చేసే ఉంటారు వాళ్ల గురించి తెలుసుకోవాలి." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
ఆ మాట విని "తెలుసుకుని ఏం చేస్తావు ఏంటి?" అని డౌట్ గా అడిగాడు వరదరాజులు.
"మనల్ని ఆ అభీర్ గాడే బ్లాక్ మెయిల్ చేస్తాడా! మనం వాడిని బ్లాక్మెయిల్ చేయలేమా? ఛాన్స్ దొరికినప్పుడు వాడు మన మాట వినాలి అంటే వీళ్ళు మన చేతిలో ఉండాలి." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.
"డాడ్! నాకు రియా మీద డౌట్ గా ఉంది." అని చెప్పాడు సుజిత్.
"అవునా? ఆలా అయ్యితే దాని మీద ఒక కన్ను వేసి ఉంచుదాము." అని చెప్పాడు తంబీయర్.
అంతలో అక్కడికి వచ్చి "సార్! కాఫీ తీసుకోండి. ముకుల్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు." అని చెప్పాడు వంట మనిషి రాము.
కాఫీ తీసుకుంటూ "నువ్వు వంట చేయడంలో అంత పోటుగాడివా? లండన్ నుంచి తీసుకువచ్చారు." అని వెటకారంగా చూస్తూ అడిగాడు వరదరాజులు.
ఆ మాటకి నవ్వుతూ "ఎస్ సార్! నా చేతివాటం ఎలా ఉంటుందో త్వరలోనే మీరు టేస్ట్ చేస్తారు, కాఫీ ఎలా ఉంది సార్?" అని అడిగాడు రాము.
"హ..బాగుంది కొంచెం షుగర్ వేస్తే ఇంకా బాగుండేది." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
"మీ జీవితాలలో నుంచి దూరమయ్యే దానిని ఎక్కువగా తీసుకోకూడదు అందుకే తీపి తక్కువగా వేసాను." అని సీరియస్ గా చూస్తూ చెప్పి
"అదే సార్! షుగర్ జబ్బు వస్తుంది." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి గార్డెన్ లో ఉన్న పక్షులకి గింజలు వేస్తూ వింత శబ్దం చేస్తూ ఉన్నాడు రాము.
కాఫీ తాగుతూ "ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు వెరైటీ క్యాండిడేట్స్ లాగ ఉన్నారు, ఆ వంటవాడు పక్షులకి తిండివేస్తూ ఎలా అరుస్తున్నాడో చుడండి." అని చికాకుగా చూస్తూ చెప్పాడు వరదరాజులు.
The following 12 users Like SivaSai's post:12 users Like SivaSai's post
• aarya, ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Mahesh12345, Naga67, Nivas348, Reddy 211993, Sachin@10, shekhadu, vikas123
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
(11-02-2026, 08:09 AM)SivaSai Wrote: ఎపిసోడ్ 72
...
కాఫీ తాగుతూ "ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు వెరైటీ క్యాండిడేట్స్ లాగ ఉన్నారు, ఆ వంటవాడు పక్షులకి తిండివేస్తూ ఎలా అరుస్తున్నాడో చుడండి." అని చికాకుగా చూస్తూ చెప్పాడు వరదరాజులు.
Technology entha vaadina.. prakruthi ni nammukunte.. evvaru emi cheyaleu!!
idi karma siddhantham!!
•
Posts: 271
Threads: 0
Likes Received: 194 in 133 posts
Likes Given: 1,186
Joined: Mar 2022
Reputation:
5
wow malli andaru oka daggariki vacharu
lets see how jakie escape
•
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 73
మనం అనుకున్న ప్లాన్ కరెక్ట్ గా జరిగే వరకు గెస్ట్ హౌస్ లో నుంచి ఫోన్స్ గాని మనుషులు గాని బయటకు వెళ్లకూడదు ఆర్డర్ వేసింది అర్ణ.
అది విని పక్కకి మాట్లాడుకుంటున్న వరదరాజులు వాళ్ళకి కాఫీ ఇచ్చి అక్కడ ఉన్న పక్షులకి గింజలు వేస్తూ వింత శబ్దం చేసాడు రాము.
******************
పక్షులకి ఆహారం వేస్తూన్న రాముని చూసి "వాడు చూడు ఎలా అరుస్తున్నాడో, వెరైటీ క్యాండిడేట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు." అని సుజిత్ వైపు చూసి "నువ్వు చెప్పిన అమ్మాయి ఎక్కడ ఉంది." అని అడిగాడు వరదరాజులు.
"ఆ విష్ణు గాడికి ఏవో కబుర్లు చెబుతూ వాడి రూమ్‌లోనే ఉంటుంది." అని కోపంగా చూస్తూ చెప్పాడు సుజిత్.
"అవునా? పద దాని సంగతి ఏంటో చూద్దాము." అని చెప్పాడు తబియర్.
"అక్కడ విష్ణు ఉంటాడు కదా!" అని అడిగాడు సుజిత్.
"ఆ విష్ణు గాడిని అక్కడ నుంచి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు పదండి." అని చెప్పి లిఫ్ట్ లొ ఫిఫ్త్ ఫ్లోర్ కి వెళ్లి సోఫాలో దర్జాగా కూర్చున్న రియాని చూసి "ఇది ఇక్కడే ఉంది." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
లోపలికి వెళుతూ "విష్ణు! నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? అక్కడ అర్ణ మంచి ప్లాన్ వేసింది. ఈ దెబ్బతో అభీర్, వాడి మనుషుల పని క్లోజ్! నువ్వు కూడా వెళ్లావు అనుకున్నాను." అని చెప్పాడు సుజిత్.
"గెస్ట్ హౌస్ లో నుంచి ఎవరిని బయటికి వెళ్ళకూడదు అని అర్ణ ఆర్డర్ వేసింది కదా ఎలా వెళ్ళతాడు? పాపం వెళితే తన పగ కొంచెం చల్లరుతుంది అనుకున్నను." అని వ్యగ్యం గా చూస్తూ చెప్పాడు తంబియార్.
ఆ మాట విని "నేను ఇప్పుడే అక్కడికి వెళతాను వాళ్ళ చావు నా కళ్ళారా చూడాలి, ఎవరు ఆపుతారో చూస్తాను." అని కోపంగా కిందకి వెళ్ళాడు విష్ణు.
'హమ్మయ్య...మన ప్లాన్ పనిచేసింది. వస్తే వాళ్లతో పాటు తిరిగి వస్తాడు లేకపోతే వీడు కూడా పోతాడు.' అని మనసులో అనుకున్నాడు ప్రతాప్ మిశ్రా.
కిటికీ లోనుంచి చూస్తూ "డాడ్! విష్ణు ఎవరి మట వినకుండా కారులొ ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు ఇంక మన పని స్టార్ట్ చేయొచ్చు!" అని చెప్పాడు తంబియార్.
సోఫాలో కూర్చున్న రియా దగ్గరికి వెళ్లి "నువ్వు విష్ణు పంపితే నా దగ్గరికి వచ్చావా? లేక అభీర్ పంపితే వచ్చేవా?" అని కోపంగా చూస్తూ అడిగాడు సుజిత్.
ఆ మాటకి టీవీ ఆఫ్ చేసి తల పైకెత్తి చూసి "విష్ణు పంపితే వచ్చాను, అయినా అభీర్ నాతో ఎందుకు మాట్లాడతాడు?" అని అడిగింది రియా.
"మా వాడిని వలలో వేసుకున్నట్లే విష్ణుని కూడా వలలో వేసుకున్నావు కాదు, నువ్వు అభీర్ మనిషివే అని మాకు తెలుసు ఇక్కడ నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు?" అని కోపంగా చూస్తూ అడిగాడు ప్రతాప్ మిశ్ర.
"నిజం చెబితే ప్రాణాలతో బయటకు వెళతావు లేకపోతే ఈ గెస్ట్ హౌస్ లో చంపి పాతి పెడతాము." అని తంబియార్ వైపు చూసి "తలుపులు మూసేయ్ ఈరోజు దీని నోట్లో నుంచి నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు!" అని గన్ బయటికి తీసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు వరదరాజులు.
డోర్స్ క్లోజ్ చేసి రియా దగ్గరకి వచ్చి సీరియస్ గా చూస్తూ "అందరూ మంచి బిజీగా ఉన్నారు ఇప్పుడు నిన్ను ఇక్కడ చంపేసినా ఎవరు పట్టించుకోరు, నీతో పాటు ఇంకా ఎవరు ఎవరు ఇక్కడ ఉన్నారో చెప్పి హ్యాపీగా ఈ దేశం వదిలి పారిపో కావలసినంత డబ్బు ఇస్తాను." అని చెప్పాడు తంబీయర్.
ఆ మాట విని సోఫాలో నుంచి లేచి భయంగా చూస్తూ "ప్లీజ్! నన్ను ఏమి చేయకండి. మీకు అన్ని విషయాలు చెబుతాను." అని పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళింది రియా.
"నాకు తెలిసు నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావని లాక్ చేశాను." అని చేతిలో ఉన్న కీ చూపించి వెటకారంగా నవ్వాడు తంబియార్.
"అవునా? నేను పారిపోవడానికి డోర్ దగ్గరికి వెళ్ళలేదు లాక్ కరెక్ట్ చేసావా లేదా అని చూడడానికి వచ్చాను." అని దగ్గరికి వచ్చి రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసి సౌండ్ పెంచి సుజిత్ రెండు కళ్ళ మధ్యలో ఒక తన్ను తన్ని
"ఏరా! అమ్మాయిని చూస్తే చాలు సొల్లు కార్చుకుంటూ వెంటపడడమేనా అసలు తను ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా!" అని మీదకి వస్తున్న తంబీయర్ ని ఎత్తి సోఫాలో పడేసి గుండెల మీద కాలు వేసి
"ఆడది అంటే అంత లోకువా నీకు డోర్ లాక్ చేసి తాళం జేబులో వేసుకున్నావు, ఒక్క తొక్కు తొక్కాను అంటే నీ గుండె కాయ నోట్లో నుంచి బయటికి వస్తుంది." అని కళ్ళు పెద్దవి చేసి ఉరుముతూ చూసింది రియ.
"వరదరాజులు! చూస్తూ కూర్చున్నావు ఏమిటి! దానిని షూట్ చెయ్!" అని గట్టిగా అరిచాడు ప్రతాప్ మిశ్రా.
ఆ మాట విని వేగంగా వెనక్కి తిరిగి వరదరాజుల చేతిలో గన్ తీసుకొని "మోసలు చేసే నా కొడకల్లారా..! మా నాయకుడు మంచోడు కాబట్టి ఫ్యాక్టరీలో మీరు దొరికిన ఒక ఛాన్స్ ఇచ్చి వదిలేసాడు, నేను అలా కాదు నలుగురిని ఇక్కడే చంపేసి దర్జాగా వెళ్ళిపోతాను." అని చెప్పింది రియా.
ఆ మాట విని భయంగా చూస్తూ "ప్లీజ్ మమ్మల్ని వదిలియ్! గన్ లోపల పెట్టు పేలుతుంది. మేము మీ నాయకుడు చెప్పినట్లయితే చేస్తున్నాము, నువ్వు నిజాయితీగా ఉన్నవో లేదో అని టెస్ట్ చేశాము." అని తంబియార్ జేబులో ఉన్న కీ తీసి ఇచ్చాడు వరదరాజులు.
"మా నాయకుడు తన పర్మిషన్ లేకుండా ఎవరిని చంపకూడదని మాట తీసుకున్నాడు కాబట్టి మీరు బతికిపోయారు, మళ్లి పిచ్చిపిచ్చి వేషాలు వేశారు అంటే తోలు వలిచేస్తాను." అని వరదరాజులు చేతిలో కీ తీసుకుని బుల్లెట్స్ తీసి జేబులో వేసుకుని గన్ అక్కడ పడేసి బయటకు వెళ్లింది రియా.
బయటికి వెళుతున్న రియా వైపు భయంగా చూస్తూ "అక్కడ అభీర్ ని చంపడానికి ప్లాన్ చేశారు విషయం ఎలా చెప్పాలో మాకు తెలియడం లేదు." అని చెప్పాడు వరదరాజులు.
"అవునా?" అని ఒక స్మైల్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయింది రియా.
"హమ్మయ్య.. బతికిపోయాము లేకపోతే మన నలుగురిని ఇక్కడే చంపేసేది." అని ఊపిరి పీల్చుకున్నాడు ప్రతాప్ మిశ్ర.
తంబియార్ ల వైపు చూసి "అడ్డ గాడిద లాగా ఉన్నావు ఒక్క ఆడదాన్ని ఏమి చేయలేకపోయావా? " అని కోపంగా చూస్తూ అడిగాడు వరదరాజులు.
"ఏంటి చేసేది! ఒక్క దెబ్బతో నన్ను పైకి ఎత్తి సోఫాలో పడేసింది. అది మామూలు ఆడది కాదు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు గొంతులో కత్తి దింపుతుంది." అని సోఫాలో నుంచి నెమ్మదిగా పైకి లేచాడు తంబియార్.
కిందపడి గిల గిల కొట్టుకున్న సుజిత్ వైపు చూసి "వెంటనే డాక్టర్ని పిలిపించాలి ఇప్పుడు వీడు పెళ్లికి పనికి వస్తాడో లేదో!" అని కంగారుగా చూస్తూ అన్నాడు ప్రతాప్ మిశ్ర.
******************
కాలేజ్ దగ్గరికి బైక్ మీద మిత్ర, కారులో శ్రీకర్, దయా రావడం చూసి రోషిని, ప్రణతి లని కారులో ఎక్కించుకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న తన మనిషి వైపు చూసి
"ఫాస్ట్ గా గోడౌన్స్ దగ్గరకి వేళ్ళు వాళ్లు మన వెనకాలే రావాలి." అని గ్లాస్ దింపి మిత్ర వాళ్ళ వైపు చూసి నవ్వుతూ చేయ్యి ఉపాడు జాకి.
కార్ లొ ఫాస్ట్‌గా దగ్గరికి వచ్చి "జాకీ! ఆ పిల్లల్ని వదిలియ్ వాళ్లకి ఏమైనా జరిగితే నిన్ను మాత్రం వదిలిపెట్టను." అని కోపంగా చూస్తూ చెప్పాడు శ్రీకర్.
బైక్ మీద ఫాస్ట్‌గా కార్ ని చాజ్ చేస్తూ "అభీర్ కి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని వదిలి పెట్టడు." అని ఆవేశంగా చెప్పింది మిత్ర.
"అవునా? మేము బఫర్ గోడౌన్స్ దగ్గరికి వెళుతున్నము ఆ అభీర్ గాడికి ఫోన్ చేసి దమ్ముంటే అక్కడికి రమ్మను." అని చెప్పి గ్లాస్ క్లోజ్ చేసాడు జాకీ.
బైక్ స్లో చేసి కాల్ చేయడానికి ఫోన్ తీస్తున్న మిత్ర వైపు చూసి "వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు అభీర్ అక్కడికి రాకూడదు మనం వెళదాం పదండి." అని చెప్పాడు శ్రీకర్.
"సరే!" అని ఫోన్ పెట్టి బైక్ అక్కడ పార్క్ చేసి శ్రీకర్ వాళ్ళ కారులో ఎక్కరు చాక్లెట్, మిత్రలు.
**************
కార్ లొ రోషిని, ప్రణతి లని తీసుకుని ఫాస్ట్ గా గోడౌన్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ప్రహల్లాద్ వైపు చూసి "వస్తున్నారు వస్తున్నారు మన వాళ్ళని రెడీగా ఉండమను." అని కారు దిగి డోర్ ఓపెన్ చేసి "ఈ ఇద్దరిని తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి ఒక రూమ్ లో పడేయండి." అని చెప్పాడు జాకి.
అంతలో కార్ లొ ఫాస్ట్ గా వస్తున్న విష్ణుని చూసి "సడన్‌గా ఈయన ఎందుకు వస్తున్నాడు?" అని డౌట్ గా అడిగాడు ప్రహల్లాద్.
అంతలో తన చేతిలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "అర్ణ మేడం ఫోన్ చేస్తున్నారు." అని చెప్పి లిఫ్ట్ చేసి
"మేడం! ఇద్దరిని తీసుకుని గోడౌన్ దగ్గరికి వచ్చేసాను మిత్రతో పాటు ఆ సిబిఐ ఆఫీసర్, సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ దయ కూడా వస్తున్నారు, నాకు తెలిసి విషయం అభీర్ కి చెప్పే ఉంటారు కచ్చితంగా ఇక్కడికి వస్తాడు ఈరోజుతో అందరి పని క్లోజ్!" అని సంతోషంగా చెప్పాడు జాకి.
"గుడ్! అభీర్ అక్కడికి వచ్చేసరికి మిత్ర బతికి ఉండకూడదు ఆఫీసర్స్ మనం మాట వింటే ఉంచండి లేకపోతే వాళ్ళని కూడా లేపేయండి. అక్కడికి విష్ణు వచ్చాడు వాడిని జాగ్రత్తగా చూసుకోండి." అని చెప్పింది అర్ణ.
"ఓకే మేడం! ఆ ఇద్దరు పిల్లల్ని కూడ చంపేయమంటారా?" అని అడిగాడు జాకి.
అర్ణ దగ్గర ఫోన్ తీసుకుని "అప్పుడే కాదు అభీర్ ని చంపిన తర్వాత చంపండి లేకపోతే వాడిని మీరు ఆపలేరు." అని చెప్పాడు అభిజిత్.
"సరే సార్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి కారు దిగి ఆవేశంగా వస్తున్న విష్ణు వైపు చూసి "కూల్ సార్ కూల్! ఇంకా అభీర్ రాలేదు రాగానే మీ చేతులతోనే చంపించమని మేడం కాల్ చేసి చెప్పారు." అని నవ్వుతూ చెప్పాడు జాకీ.
అంతలో గోడౌన్స్ దగ్గరికి వచ్చి కారు దిగి బాడీ మీద గ్రీన్ లైట్ డాట్స్ పడడం చూసి "చుట్టూ స్మైపర్స్ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి." అని చెప్పాడు శ్రీకర్.
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 74
మిత్ర వాళ్ళతో పాటు కార్ లొ గోడౌన్స్ దగ్గరికి చేరుకుని కిందకు దిగి ఒంటిమీద గ్రీన్ లైట్ డాట్స్ పడడం చూసి చుట్టూ స్నైపర్స్ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు శ్రీకర్.
***************
శ్రీకర్ చెప్పిన మాట విని కారు దిగి చుట్టూ చూస్తూ ఉంది మిత్ర.
కారు దిగిన మిత్ర వైపు చూసి "ఓహో.. శివమణి కూతురా బాగున్నావా? మీ నాన్న అమ్మని చంపినప్పుడు నీ సంగతి మర్చిపోయాను, లేకపోతే ఇక్కడ దాక వచ్చే దానివి కాదు అయిన పర్వాలేదు మళ్లీ నా చేతిలోనే చావడానికి వచ్చావు." అని నవ్వుతూ చెప్పాడు జాకి.
అక్కడ ఉన్న ప్రహల్లాద్ వైపు చూసి "నువ్వు ఎస్పీ అయ్యి ఉండి క్రిమినల్స్ కి సహాయం చేస్తున్నావా? నీ మీద సుపీరియర్స్ కి కంప్లైంట్ చేస్తాను." అని చెప్పాడు శ్రీకర్.
"మీ సిబిఐ వాళ్ళతో వచ్చిన చిక్కే ఇది జీవితతం కంప్లైంట్ లు చేసుకుంటూనే బతుకుతారు కానీ ఈసారి కంప్లైంట్ ఇవ్వడానికి కుదరదు ఎందుకంటే మిమ్మలిని అభీర్ మనుషులు ఇక్కడ చంపేస్తారు కదా!" అని వెటకారంగా చూస్తూ చెప్పాడు ప్రహ్లాద్.
డ్రైవింగ్ సీట్లో ఉండి "సార్! మీరు కార్ ఎక్కండి ఇకనుంచి వెళ్ళిపోదాము ఫోర్సును తీసుకుని వద్దాము." అని చెప్పి కార్ స్టార్ట్ చేసాడు దయా.
కార్ స్టార్ట్ అయిన వెంటనే నాలుగు టైర్లలో బుల్లెట్లు దిగడంతో కిందకి దిగి రెండు చేతులు పైకి ఎత్తాడు దయ.
"ఇక్కడికి ఎంటర్ అయిన వాళ్ళు మా పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళలేరు పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్ గా ఉండు." అని చెప్పాడు ప్రహల్లాద్.
మిత్ర వైపు కోపంగా చూస్తూ "ఇది మనల్ని మోసం చేసింది ఇంకా మాటలు ఏంటి కాల్చి అవతల పారేయకుండా!" అని ప్రహ్లాద్ వైపు చూసి "గన్ ఇవ్వు!" అడిగాడు విష్ణు.
"మీకెందుకు సార్ శ్రమ చూస్తూ ఎంజాయ్ చేయండి." అని మిత్ర పక్కనే ఉన్న చాక్లెట్ వైపు చూసి "వీడు నీకు దేవుడు ఇచ్చిన తమ్ముడు కదా ఇద్దరు కలిసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళండి." అని గన్ ఎయిమ్ చేసి లాక్ తీసాడు జాకి.
"మోసం చేసింది నేనే కదా కావాలంటే నన్ను చంపండి వాడిని వదిలేయండి." అని చాక్లెట్ ని తన వెనక్కి తీసుకిని కళ్ళు మూసుకుంది మిత్ర.
అంతలో అక్కడికి హారన్ కొట్టుకుంటూ ఫాస్ట్ గా కారు రావడం చూసి "అక్క! కళ్ళు తెరువు అభీర్ అన్న వచ్చేసాడు." అని సంతోషంగా చూస్తూ చెప్పుడు చాక్లెట్.
ప్రహ్లాద్ దగ్గర వాకి టాకీ తీసుకుని "నెల్సన్! కారులో నుంచి అభీర్ కిందకి దిగిన వెంటనే షూట్ చేయండి." అని చెప్పాడు జాకీ.
"ఓకే!" అని ఫాస్ట్ గా వస్తున్న కారు వైపు స్నైపర్ గన్స్ లో నుంచి చూస్తూ ఉన్నారు నెల్సన్ మనుషులు.
ఒక చిన్న పక్షి గాలిలో వేగంగా ఎగురుకుంటూ వచ్చి నెల్సన్ చేతిలో ఉన్న స్నైపర్ గన్ మీద వాలి టార్గెట్ చూస్తున్న గ్లాస్ మీద ముక్కుతో పొడుస్తూ ఉంది.
స్నైపర్ గన్ గ్లాస్ లో నుంచి అభీర్ వచ్చే కారు కనిపించకుండా పక్షి మొహం కనిపించడంతో తల పైకి ఎత్తి "ష్ ష్..!" అని అరుస్తూ తన మనుషులు కూడా పక్షులని తోలడం చూసి
"ఈ పక్షులు అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని పక్కకి తోలి టార్గెట్ ని చూడండి మిస్ అవ్వకూడదు." అని చెప్పాడు నెల్సన్.
"బాస్! వీటిని ఎంత తోలిన పక్కకి వెళ్లడం లేదు టార్గెట్ గ్లాస్ కి అడ్డంగా వస్తున్నాయి అక్కడ ఏం జరుగుతుందో కనిపించడం లేదు." అని చెప్పాడు నెల్సన్ మనుషుల్లో ఒకడు.
అంతలో అక్కడికి గుంపులు గుంపులుగా చిన్న పక్షులు రావడం చూసి పక్కకి తోలుతూ కూర్చున్నారు నెల్సన్ మనుషులు.
కారు ఆగడంతో దిగి అభీర్ కూర్చున్న వైపు డోర్ తీస్తున్న నారప్ప ని చూసి "వీడే కదా మా నాన్నని చంపింది." అని ఆవేశంగా జాకీ చేతిలో గన్ తీసుకుని షూట్ చేయడానికి రెడీ అయ్యాడు విష్ణు.
అంతలో భయంకరంగా అరుస్తూ వేగంగా అక్కడికి వచ్చి విష్ణుని రెండు కాళ్ళతో పట్టుకుని పైకి ఎగిరిపోయాడు సింబా.
అది చూసి కంగారుగా వాకి టాకీ తీసుకుని "నెల్సన్! ఆ పక్షిని షూట్ చేయండి." అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు ప్రహ్లాద్.
అంతలొ అక్కడి నుంచి సింబా వెళ్లిపోవడంతో "స్నైపర్స్ అందరూ ఎక్కడ చచ్చారు." అని కోపంగా అరుస్తూ ఉన్నాడు జాకి.
బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని స్టైల్ గా కారు దిగి బానేట్ మీద గన్ పట్టుకుని కూర్చుని "టెన్షన్ పడకు వాడికి ఇంకా టైం ఉంది అప్పుడే చంపాను, ఇంక మీ స్నైపర్స్ అంటావా పక్షులను తోలుకుంటున్నారు." అని చెప్పాడు అభీర్.
ఆ మాటకి కోపంగా చూస్తూ "నిన్ను ఇక్కడే ఎన్కౌంటర్ చేస్తాను." ఆని తన స్టాప్ వైపు చూసి "షూట్ హిమ్!" అని చెప్పాడు ప్రహల్లాద్.
అంతలో అందరి మొబైల్స్ లో మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసుకొని "సార్! మా ఇళ్ల దగ్గర వీళ్ళ మనుషులు ఉన్నారు ఇక్కడ ఏదైనా జరిగితే వాళ్ళని చంపేస్తారు." అని భయంగా చూస్తూ చెప్పారు ఆఫీసర్స్.
"మాకు సెక్యూరిటీ ఆఫీసర్లు అంటే గౌరవం ఉంది. మీకోసం ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ ఎదురుచూస్తున్నారు వెళ్ళండి. ప్రాణాలతో ఉండాలి అంటే మళ్లీ ఇలాంటి పనులు చేయకండి." అని చెప్పాడు అభీర్.
"థాంక్యూ సర్!" అని అక్కడి నుంచి బయటికి పరుగు తీశారు ప్రహల్లాద్ తో పాటు వచ్చిన ఆఫీసర్స్.
కంగారుగా చూస్తున్న ప్రహల్లాద్ వైపు చూసి "నువ్వు ఆ గెస్ట్ హౌస్ లో అడుగు పెట్టగానే నీ గురించి నీతో పాటు ఉన్న వాళ్ల ప్రతి ఒక్కరి గురించి తెలుసుకున్నాను, ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఇంటికి వెళ్లి నీ కూతురుతో ఆడుకోవాలి అంటే ఒక పని చేయాలి." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని షాక్ అయ్యి చూస్తూ "నా కూతుర్ని ఏం చేసావు?" అని టెన్షన్ గా చూస్తూ అడిగాడు ప్రహల్లాద్.
"టెన్షన్ పడకు నీ భార్య మంచి చేఫ్ కదా తన ఫుడ్ టెస్ట్ చేయడానికి నా మనుషులు మీ ఇంటి దగ్గర ఉన్నారు వాళ్లతో ఆడుకుంటుంది." అని చెప్పాడు అభీర్.
"ప్లీజ్ వాళ్ళని ఏమి చేయకు నేనేం చేయాలో చెప్పు చేస్తాను." అని కంగారుగా చూస్తూ చెప్పాడు ప్రహల్లాద్.
"నువ్వేమి చేయనవసరం లేదు చేసేదంతా మా వాళ్ళు చేస్తారు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే లాయర్ వసుంధర గారి అమ్మాయిని, చనిపోయిన మురళి జోషి గారి కూతుర్ని ఒక ముఠా కిడ్నాప్ చేసారు.
ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో షూట్ అవుట్ జరిగింది ముఠా సభ్యులందరూ చనిపోయారు పిల్లలు సేఫ్ గా ఉన్నారు అని నీ స్టైల్ లో మీడియాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వు సరిపోతుంది." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని జాకి వాళ్ళ వైపు టెన్షన్ గా చూసాడు ప్రహల్లాద్.
"అంటే! ఇప్పుడు నన్ను ఇక్కడ చంపుతావా? నీకు ఒక విషయం చెప్పనా? ఆ పిల్లలిద్దరూ ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారు నేను చస్తే వాళ్లు కూడా చస్తారు." అని పొగరుగా చెప్పాడు జాకి.
"అవునా?" అని పక్కనే ఉన్న దయా వైపు చూసి "మీరు ప్రహ్లాద్ తో పాటు వెళ్లి పిల్లల్ని తీసుకురండి." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని మీదకి వస్తున్న జాకీ మనుషులని ఎత్తి గిరాటు వేశారు నారప్ప, జాజిలు.
అక్కడి నుంచి ప్రహల్లాద్ ని తీసుకుని గోడౌన్స్ లోపలికి వెళ్ళాడు దయ.
తన మనుషుల్ని చావా కొట్టడం చూసి "నాకేదైనా జరిగితే మా అభిజిత్ అన్న చూస్తూ ఊరుకోడు మీ సంగతి చూస్తాడు." అని కంగారుగా చూస్తూ చెప్పాడు జాకీ.
అంతలో దయాతో పాటు ప్రణతి, జాహ్నవిలు రావడం చూసి "హాయ్! మీరు శ్రీకర్ అంకుల్ తో ఇంటికి వెళ్ళండి నేను ఈ అంకుల్ వాళ్ళతో మాట్లాడి వస్తాను." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని ఇద్దరినీ కారులో ఎక్కించుకుని దయాతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీకర్.
తన చేతిలో ఉన్న గన్ మిత్రకి ఇచ్చి "ఇప్పుడు నీ వంతు వచ్చింది." అని చెప్పాడు అభీర్.
గన్ తీసుకుని కోపంగా చూస్తున్నా మిత్ర వైపు చూసి "అక్క! వాడి బాడీలో మ్యాగజైన్ మొత్తం దిగిపోవాలి." అని కసిగా చెప్పాడు చాక్లెట్.
షూట్ చేసి కింద పడ్డ జాకీ దగ్గరికి వెళ్లి కాలితో తంతు "మా అమ్మని ఎందుకు చంపావురా..!" అని ఏడుస్తూ కసిగా గన్ లో ఉన్న బుల్లెట్స్ మొత్తం తలలో దింపేసింది మిత్ర.
దగ్గరికి వెళ్లి ఏడుస్తున్న మిత్ర తల మీద చేయి వేసి చేతిలో గన్ తీసుకుని "వెళ్లి కారులో కూర్చో!" అని చెప్పాడు అభీర్.
ప్రహల్లాద్ దగ్గర గన్ తీసుకొని దెబ్బల తో పడి ఉన్న జాకి మనుషుల్ని షూట్ చేసి "మా నాయకుడు చెప్పినట్లు చేసి ఇంటికి వెళ్ళు మళ్ళీ మాతో పెట్టుకోకు." అని వార్నింగ్ ఇచ్చాడు నారప్ప.
అక్కడి నుంచి మిత్ర వాళ్లతో కారులో కలిసి వెళుతూ ఆకాశం వైపు చూసి వింతగా అరుస్తూ సిగ్నల్ ఇచ్చాడు అభీర్.
ఆ సిగ్నల్ విని నెల్సన్ వాళ్ళ మీద పడిన పక్షులు మొత్తం అక్కడి నుంచి వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి.
కార్ లొ వెళుతూ అభీర్ వైపు చూసి "ఇంతకీ విష్ణుని సింబా ఎక్కడికి తీసుకు వెళ్లాడు?" అని డౌట్ గా అడిగింది మిత్ర.
"కొండలు కావాలని ఆశపడ్డాడు కదా చూపించడానికి తీసుకువెళ్ళింది." అని స్మైల్ ఇచ్చాడు అభీర్.
"మేము ఇక్కడ ఉన్న విషయం ఎవరు చెప్పారు?" అని డౌట్ గా అడిగింది మిత్ర.
గాలిలో ఎగురుతున్న పక్షులని చూపించి "అవి నంద గెస్ట్ హౌస్ లో ఆడుకుంటూ ఉంటాయి, నువ్వు వాళ్ళ మాటలు వినడానికి పెట్టిన మిషన్ ఎక్కడ ఉందో కనిపెట్టగలరు కానీ వీటిని కనిపెట్టడం ఎవరి వల్ల కాదు." అని చెప్పాడు అభీర్.
"అవునా?" అని ఆకాశంలో ఎగురుతున్న పక్షుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు మిత్ర, చాక్లెట్.
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 271
Threads: 0
Likes Received: 194 in 133 posts
Likes Given: 1,186
Joined: Mar 2022
Reputation:
5
one more wicket down.
I expected prahlad kuda abhir manishi
•
Posts: 48
Threads: 0
Likes Received: 17 in 16 posts
Likes Given: 6
Joined: Jun 2019
Reputation:
3
12-02-2026, 09:47 AM
(This post was last modified: 12-02-2026, 09:49 AM by masalakiss. Edited 1 time in total. Edited 1 time in total.)
emi rastunnarandi sai garu.. Hats off. nijam gaa idhi cinema gaa teeyagalige kadha.. Hats off to you andi.. keep going and waiting for next episode.
•
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
•
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 75
జాకీ చనిపోయిన ప్లేస్ నుంచి కార్లో వెళుతూ మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలిసింది అని అభీర్ ని అడిగింది మిత్ర.
ఆ గెస్ట్ హౌస్ దగ్గర నువ్వు పెట్టిన మిషన్ ని వాళ్ళు కనిపెట్టవచ్చు ఏమో కానీ అక్కడ ఆడుకుంటున్న ఆ పక్షులను ఎవరు కనిపెట్టలేరు అని ఆకాశంలో ఎగురుతున్న వాటిని చూపించాడు అభీర్.
******************
ఆకాశంలో ఎగురుతున్న పక్షుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఇప్పుడు సింబా తీసుకువెళ్లినా విష్ణు పరిస్థితి ఏమిటి? ఆ కొండలు చూపించి తీసుకువస్తాడా? లేక అక్కడే వదిలేస్తాడా?" అని డౌట్ గా అడిగాడు చాక్లెట్.
"అడవిలో మా సింబా ఆడుకునే రాతికొండా ఒకటి ఉంది అక్కడికి ఏదైనా తీసుకు వెళ్తే తిరిగి వెనక్కి పంపించాడు. అయినా విష్ణు కి అడవిలో బోర్ కొట్టదులే ఎందుకంటే ఈరోజు జూలో ఉన్న జంతువుల్ని మొత్తం రాజన్ అక్కడికి పంపిస్తాడు." అని నవ్వుతూ చెప్పాడు నారప్ప.
కాసేపాటికి వసుంధర ఇంటి దగ్గర కార్ దిగి లోపలికి వస్తున్న అభీర్ ని చూసి "చాలా థాంక్స్! కరెక్ట్ టైం కి వచ్చావు లేకపోతే ఎవరు ప్రాణాలతో ఉండే వాళ్ళు కాదు." అని చెప్పేడు శ్రీకర్.
అభీర్ ని చూసి తండ్రి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ "హాయ్ అంకుల్!" అని వచ్చింది రోషిని.
ప్రణతి, రోషిణిల వైపు చూసి "అవును! మిమ్మల్ని కిడ్నాప్ చేసి రూమ్ లో ఉంచారు కదా భయం వేయలేదా? ఏడవకుండా బానే ఉన్నారు." అని డౌట్ గా అడిగింది మిత్ర.
"భయం ఎందుకు? మమ్మల్ని ఉంచిన రూమ్ కిటికీ దగ్గరకి సెక్యూరిటీగా ఈ ఇంటి దగ్గర ఉండే పక్షులు వచ్చాయిగా..!" అని చెప్పింది ప్రణతి.
"అవును! ఆరోజు పక్షులు నాతో కూడా మాట్లాడతాయని అంకుల్ చెప్పారు కదా! అందుకే వాటితో అభీర్ అంకుల్ ని తీసుకు రమ్మని చెప్పాను అవి వెళ్లి తీసుకువచ్చాయి." అని క్యూట్ గా చెప్పింది రోషిని.
అంతలో స్కూటీ మీద మల్లితో కలిసి అక్కడికి వచ్చి "అందరూ ఇక్కడే ఉన్నారా?" అని అభీర్ వైపు చూసి "ఇక్కడ ఇంత జరుగుతుంటే మమల్ని ప్రహల్లాద్ భార్యతో వంట ప్రోగ్రాం షూట్ చేయమని పంపించావు ఎందుకు?" అని డౌట్ గా అడిగింది నీలమ్.
"మాకే కాదు మీకు కూడా ఫ్యామిలి ఉంది అని వాళ్ళకి గుర్తు చేశాను, ఇంకా ఎవరు ఎవరి ఫ్యామిలీ జోలికి వెళ్లారు." అని చెప్పాడు అభీర్.
అక్కడికి వచ్చి అభీర్ దగ్గర ఉన్న రోషిని తీసుకుని "పిల్లల్ని నువ్వు ఎలాగైనా కాపాడుతావని ధైర్యంతోనే ఉన్నాను, అయ్యినా ఆ నంద ఫ్యామిలీ, అభిజిత్ ఫ్యామిలీ మొత్తం గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు.
నువ్వు తలుచుకుంటే చంపాలి అనుకున్న వాళ్ళను అందరిని ఒకేసారి చంపేయొచ్చు ఎందుకు వెయిట్ చేస్తున్నావు?" అని డౌట్ గా అడిగింది వసుంధర.
"మేడం! శ్రీకృష్ణుడు 18 సార్లు జలాసందురుడి తో యుద్ధం చేశాడు ప్రతిసారి శ్రీకృష్ణుడు విజయం సాధించాడు, అవకాశం వచ్చిన ఆ రాక్షసుడిని చంపకుండా వదిలేసేవాడు ఎందుకో తెలుసా?" అని అడిగాడు అభీర్.
"అవును! ఎందుకు? ఆ అనుమానం నాకు కూడా ఉంది." అని ఆత్రుతగా అడిగాడు సందీప్.
"యుద్ధానికి వచ్చిన ప్రతిసారి తనికి సహాయం చేసే రాజ్యలా నుండి రాజులు తీసుకుని వచ్చేవాడు ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు వాళ్ళని అంతం చేసేవారు.
ప్రాణాలతో వెనక్కి వెళ్లి కసితో మళ్ళీ కొత్తవారిని తీసుకువచ్చేవాడు, అలా రాక్షసుడికి సహాయం చేసే వాళ్ళు అందరూ అంతమైయినా తర్వాత జలసందురిడి వంతు వచ్చింది.
అలాగే ఆధర్మం వైపు ఉండి ముకుల్ వాళ్లకి సహాయం చేసే వాళ్ళందరూ ముందుకు వస్తారు అందరూ మరణిస్తారు ఆదే పంచమ వేదం లో ఉన్న యుద్ధ నీతి!" అని చెప్పాడు అభీర్.
ఆ మాటలు ఇంట్రెస్ట్ గా వింటూ ఉన్నారు అందరు.
***************
నంద గెస్ట్ హౌస్ దగ్గర టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ "ఎవరి ఫోన్లు కలవడం లేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు." అని ముకుల్ వైపు చూసి "తాతయ్య! మనవాళ్ళు ఆ అభీర్ ని, మిత్రని చంపేసి ఉంటారా?" అని ఆత్రుతగా అడిగింది అర్ణ.
"నీ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది కచ్చితంగా ఈ రోజు అక్కడ ఎవరో ఒకరు చాస్తారు, ఎందుకంటే చుట్టూ ఉన్న స్నైపర్స్ ని ఎవరు కనిపెట్టలేరు, ఆవేశపడి అడుగు ముందుకు వేస్తే బుల్లెట్ తలలొ దిగుతుంది." అని చెప్పాడు మోహిత్.
అక్కడికి వస్తు "ఒకసారి టీవీ చూడండి. ఆ ప్రహ్లాద్ గాడు న్యూస్ లొ పురాణం చెబుతున్నాడు." అని వెటకారంగా అన్నాడు రఘూరామ్.
"అవునా?" అని లాప్టాప్ లొ న్యూస్ ఆన్ చేసింది అర్ణ.
మీడియాతో మాట్లాడుతూ "చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని పట్టుకునే క్రమంలో షూట్ అవుట్ జరిగింది.
ఆ ముఠా లొ అందరూ చనిపోయారు పిల్లలు సేఫ్ గా ఉన్నారు వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము." అని చెప్పాడు ప్రహ్లాద్.
"ఏంటి? వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నాడు?" అని కోపంగా అడిగాడు అభిజిత్.
గెస్ట్ హౌస్ లోకి వచ్చి కారు దిగి వస్తున్నా నెల్సన్ వాళ్ళని చూసి "అసలు అక్కడ ఏం జరిగింది? విష్ణు, జాకీ ఎక్కడ?" అని అడిగాడు ముకుల్.
"సార్! అక్కడికి అభీర్ తన మనుషులతో వచ్చాడు మేము షూట్ చేద్దాము అనుకునే లోపు పక్షుల గుంపు మా మీద పడింది. ఒక పెద్ద పక్షి వచ్చి విష్ణు సార్ ని కాళ్లతో ఎత్తుకు వెళ్ళిపోయింది. మిత్ర చేతులతో జాకిని చంపించేసాడు." అని చెప్పాడు నెల్సన్.
"మరి ప్రహల్లాద్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీడియాతో అలా ఎందుకు మాట్లాడుతున్నాడు?" అని కోపంగా చూస్తూ అడిగింది అర్ణ.
"ప్రహల్లాద్ తో పాటు మిగిలిన ఆఫీసర్స్ ఫ్యామిలీస్ ని ఆ అభీర్ తన గ్రిప్ లొ ఉంచుకున్నాడు, అందుకే తను ఏమీ చేయలేకపోయాడు. మీరు వేసిన ప్లాన్ మొత్తం వాళ్లకి తెలిసిపోయింది. కచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అభీర్ కి చెప్పి ఉంటారు." అని అనుమానంగా చెప్పాడు నెల్సన్.
"అవునా?" అని అక్కడ ఉన్న వారి వైపు చూస్తూ "నో! ఈ ప్లాన్ గురించి ఎవరికీ తెలీదు. అయ్యినా ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ చేయడానికి ఫోన్ లు పని చేయడం లేదు ఎవరు బయటకు వెళ్ళలేదు మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది?" అని అడిగింది అర్ణ.
"మరిఆ పక్షి విష్ణుని ఎటు తీసుకొని వెళ్లిందో కనిపించలేదా?" అని కంగారుగా అడిగాడు ముకుల్.
"నో సార్! అది ఎటు వెళ్లిందో అర్థం కాలేదు చాలా వేగంగా వెళ్ళిపోయింది." అని తలదించుకుని చెప్పాడు నెల్సన్.
"నాకు తెలిసి ఆ పక్షి సింబా అయ్యి ఉంటుంది. విష్ణుని కచ్చితంగా ఆ కొండల దగ్గరికి తీసుకు వెళుతుంది." అని చెప్పేడు అభిజిత్.
"మనం విష్ణు ని ఎలాగైనా కాపాడాలి." అని టెన్షన్ గా చూస్తూ చెప్పింది అర్ణ.
"మీ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి నేను చెప్పిన ప్లాన్ కాస్తా వింటారా..? మనం విష్ణు ని సేవ్ చేయొచ్చు, ఆ కొండలని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, అభీర్ ని గట్టి దెబ్బ కొట్టొచ్చు!" అని చెప్పాడు రఘూరామ్.
"ఆ ప్లాన్ ఏమిటో చెప్పండి? మనం ఎలాగైనా విష్ణు ని కాపాడాలి." అని అడిగాడు ముకుల్.
"అడవి మొత్తం మన హ్యాండ్ ఓవర్ లొ ఉండాలి అంటే అక్కడి నుంచి తీసుకువచ్చి జూలో పెట్టిన జంతువులు మొత్తాన్ని తీసుకువెళ్లి అక్కడ వదిలి, దానిని సంరక్షణ కేంద్రంగా మార్చి మన హ్యాండ్ ఓవర్ లో ఉంచుకోవాలి.
అప్పుడు ఆ అడవిలో ఉండేది మన మనుషులే కాబట్టి ఆ కొండల పని ఈజీ అవుతుంది. ఒకవేళ విష్ణు అక్కడే ఉంటే మనకు ఈజీగా దొరుకుతాడు, ఆ అభీర్ కుడా మన చేతికి దొరుకుతాడు." అని చెప్పాడు రఘురామ్.
"ఆ అడవిని సంరక్షణ కేంద్రంగా మార్చి జంతువుల్ని అక్కడికి పంపించడం అంత ఈజీగా అయిపోతుందా?" అని డౌట్ గా అడిగాడు సుభాష్.
"ఆ పని నేను చూసుకుంటాను ఎందుకంటే ఆ మినిస్ట్రీ నా చేతిలోనే ఉంది." అని చెప్పి రఘురామ్ వైపు సంతోషంగా చూస్తు 'నా నెత్తిన పాలు పోసాడు.' అని మనసులో అనుకున్నాడు వరదరాజులు.
"అయ్యినా సరే! ఆ సంరక్షణ కేంద్రంలో మన మనుషులు ఉండాలి అంటే అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోవాలి కదా!" అని అనుమానంగా అడిగాడు మోహిత్.
"ఆ సంగతి నేను చూసుకుంటాను 12 సంవత్సరాల క్రితం గోకుల్ అంకుల్ తో పాటు చనిపోయిన జావిద్ కొడుకు ఫారుక్ ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ మినిస్టర్! తన తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని అతనికి మాత్రం ఉండదా..!" అని చెప్పాడు నిర్మల్.
"మంచి ప్లాన్! ఆ అభీర్ గాడు వాడి మనుషులు ఆ అడవిలోకి రావాలి అంటే మనల్ని దాటుకుని రావాలి వచ్చినవాడిని వచ్చినట్లు అక్కడే పాతి పెడితే సరిపోతుంది." అని కోపంగా చెప్పాడు అభిజిత్.
వరదరాజులు వైపు చూసి "అంకుల్! మీరు వెంటనే పర్మిషన్ తెప్పించండి. ఫారుక్ ని కలిసి అడవి సంగతి, ఆ కొండల సంగతి నేను నిర్మల్ చూసుకుంటాము." అని చెప్పాడు ప్రమోద్.
"నా ఐడియా ఎలా ఉంది? అప్పుడప్పుడు నేను కూడా విజిట్ చేస్తూ ఉంటాను." అని ప్రమోద్ వైపు వెటకారంగా చూస్తూ నవ్వాడు రఘురామ్.
"సరే!" అని వరదరాజుల వైపు చూసి "ఆ పర్మిషన్స్ స్పీడ్ గా అయ్యాటట్లు చూడు." అని చెప్పాడు ముఖేష్.
ఆ మాట విని "సరే అయ్యా! వెంటనే ఆ పని అయ్యేటట్లు చేస్తాను." అని ప్రతాప్ మిశ్రతో కలిసి అక్కడి నుంచి వెళుతూ "మనం ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాము, వాళ్ళ నోటితోనే జూలొ జంతువుల్ని అడవికి పంపించమని చెప్పారు." అని సంతోషంగా చెప్పాడు వరదరాజులు.
తమ వైపు కోపంగా చూస్తున్న రియాని చూసి వరదరాజులు వెనకాలే వెళ్లారు తంబీయర్, సుజిత్ లు.
రఘురామ్ దగ్గరకి వచ్చి "ఈ ప్లాన్ నిజంగా మీదేనా? లేక ఎవరైనా చెప్పారా?" అని డౌట్ గా అడిగింది అర్ణ.
"నాకు ఎవరైనా ప్లాన్ చెప్పగలరా?" అని స్మైల్ ఇచ్చాడు రఘురామ్.
"ఏంటే! మీ మామయ్య ఎలా కనపడుతున్నాడు? మీ నాన్న పోయిన తర్వాత నంద బిజినెస్ లు మొత్తం ఒంటి చేత్తో నడిపారు." అని గొప్పగా చెప్పింది ఝాన్సీ.
"అవునవును అప్పుడు జరిగిన పెంట ఇంకా ఉంది." అని చీప్ గా చూస్తూ చెప్పింది అర్ణ.
"ఈ టైమ్ లో మనలో మనం నిందించుకోవడం కాదు, ఆ అభీర్ సేన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి మనకి ఒకరు కావాలి. " అని చెప్పాడు ముకుల్.
అంతలో అక్కడికి కార్ లొ వచ్చి మిథున్ తో పాటు బ్యాగ్ పట్టుకుని లోపలకి వస్తున్న అమ్మాయిని చూసి "మహేష్ ఎవరు ఆ అమ్మాయి?" అని అడిగింది అర్ణ.
"ఆ అభీర్ సేన గురించి పూర్తిగా తెలిసిన మనిషి కావాలి అన్నారు కదా, తన తండ్రి చనిపోయిన దగ్గర్నుంచి ఆ తెగ వాళ్ళ మీద ఆ కొండల మీద రీసెర్చ్ చేస్తూ పగతో బతుకుతుంది. సర్పరాజ్ కూతురు 'వాసుకి' ఇప్పుడు మనకి హెల్ప్ చేయడానికి వచ్చింది." అని చెప్పాడు మహేష్.
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 76
మిధున్ తో పాటు వచ్చిన అమ్మాయిని పరిచయం చేస్తూ తను సర్పరాజ్ కూతురు వాసుకి అభీర్ సేన గురించి ఆ కొండల గురించి రీసెర్చ్ చేస్తూ పగతో పెరిగింది అని చెప్పాడు మహేష్.
****************
మహేష్ చెప్పింది విని వాసుకి వైపు చూసి "మీ నాన్నగారు చనిపోయిన తర్వాత లండన్ లో నీకోసం చాలా సంవత్సరాలు వెతికాను కానీ నీ గురించి తెలియలేదు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు?" అని అడిగాడు ముకుల్.
"మా నాన్నగారితో పాటు గోకుల్ అంకుల్ కూడా చనిపోయారని తెలిసి నేను ఇండియా బయలుదేరి వచ్చాను అప్పటికే మీరు లండన్ వెళ్లిపోయారు, ఆ అభీర్ జైల్లో ఉన్నాడు అతని సైన్యం ఇంకా బతికే ఉంది అని తెలుసుకుని వాళ్ళ గురించి వెతకడం మొదలుపెట్టాను.
అంతేకాదు నా తండ్రి చావుకి కారణమైన కొండల గురించి తెలుసుకోవడానికి శివమణి రీసెర్చ్ చేసిన ఫైల్స్ మొత్తం తన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేశాను మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు టైం వచ్చిందని తెలిసి మహేష్ కి కాల్ చేసాను." అని చెప్పింది వాసుకి.
ఆ మాటలు విని వాసుకిని చూస్తూ "పేరుకు తగ్గట్టే దీని ఒళ్లంతా విషమే అనుకుంటా!" అని మనసులో అనుకున్నాడు ప్రతాప్ మిశ్రా.
వాసుకి దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి "నువ్వు మా నాన్నగారి స్నేహితుడి కూతురివి అంటే మా కుటుంబంలో ఒకరితో సమానమే! నా తండ్రి నీ తండ్రి చావుకి కారణం ఒక్కరే మనం కలిసి వాళ్ళని అంతం చేద్దాము." అని చెప్పింది అర్ణ.
"మనకి ఇప్పుడు అభీర్ గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి కావాలి అతను మన మాట వినాలి అలా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు అభిజిత్.
"మీ కుటుంబ సభ్యులు తప్పితే మిగతా వాళ్ళందరిని ఇక్కడి నుంచి పంపించండి మనం మాట్లాడుకుందాము." అని చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ చెప్పింది వాసుకి.
ఆ మాట విని "సరే మేడం! నేను వెళుతున్నాను విష్ణు కోసం ఎవరైనా వెళితే నేను కూడా వెళతాను." అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది రియా.
"అయ్యా" నేను కూడా వెళ్లి ఆ జూ పని చూస్తాను మీకు శ్రేయోభిలాషులమె కాని కుటుంబ సభ్యులను కాదు కదా!" అని ప్రతాప్ మిశ్రని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు వరదరాజులు.
అక్కడ ఉన్న వర్కర్స్ వైపు చూసి "మీరు కూడా లోపలికి వెళ్లి పని చూసుకోండి." అని చెప్పింది అర్ణ.
"నువ్వు చెప్పాల్సింది ఇంకా చెప్పొచ్చు! ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళు ఎవరూ లేరు." అని చెప్పాడు ముకుల్.
తన బ్యాగ్ లో నుంచి ఒక బాక్స్ తీసి ఆన్ చేసి సౌండ్ పెంచింది వాసుకి.
ఆ మిషన్ నుంచి వచ్చే సౌండ్ కి అక్కడ ఉన్న పక్షులు మొత్తం ఎగిరిపోవడం చూసి నవ్వుతున్న వాసుకి ని చూసి "ఆ సౌండ్ ఏంటి? చాలా భయంకరంగా ఉంది ఎందుకు పెట్టావు?" అని అడిగాడు మిథున్.
"ఆ అభీర్ సేన గురించి మీకు సరిగ్గా తెలీదు ఆ పక్షులు కూడా వాళ్ళకి గుడాచారులుగా పని చేస్తాయి." అని చెప్పింది వాసుకి.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది. ఆ పక్షులే నా ప్లాన్ మొత్తం పాడుచేసాయి." అని చెప్పింది అర్ణ.
"ఆ జారువా తెగ గురించి మొదట తెలుసుకుంది శివమణి కాదు అతని అసిస్టెంట్ చంద్రశేఖర్! అతను రీసెర్చ్ చేసి దాని గురించి శివమణికి చెబితే తను మీతో చేతులు కలిపాడు.
ఆ శివమణికి కూడా తెలియని చాలా విషయాలు చంద్రశేఖర్ కి తెలుసు అతని గురించి ప్రతి విషయం నాకు తెలుసు మీ వాళ్ళని పంపించి చంద్రశేఖర్ ని ఇక్కడికి తీసుకు రమ్మనండి." అని చెప్పింది వాసుకి.
"ఒకవేళ అతన్ని ఇక్కడికి తీసుకొచ్చిన మనకు హెల్ప్ చేస్తాడని గ్యారెంటీ ఏమిటి?" అని అడిగాడు రఘురామ్.
"ఆ చంద్రశేఖర్ మనకి కచ్చితంగా హెల్ప్ చేయడు, కానీ చేసేటట్లు మనం చేసుకోవాలి అతని కూతురు, ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలిసే ఉంటుంది.
రెండు పనులు ఒకేసారి జరిగిపోవాలి లేకపోతే అభీర్ ఎంటర్ అవుతాడు అప్పుడు మన ప్లాన్ మొత్తం పాడవుతుంది." అని చెప్పింది వాసుకి.
"ఆ విషయం నేను చూసుకుంటాను." అని సాధు వైపు చూసి "మేడం చెప్పిన ఆ ఇద్దరు గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ ఉండాలి." అని చెప్పాడు అభిజిత్.
"సరే సార్!" అని వాసుకి దగ్గర అడ్రస్ తీసుకుని తన మనుషులతో కలిసి బయలుదేరాడు సాధు.
"ఆ జారువా తెగ వాళ్ళు ఇంకా 250 మంది దాకా బతికి ఉన్నారని తెలిసింది నిజమేనా?" అని అడిగాడు ముకుల్.
" నా రీసెర్చ్ ప్రకారం అడవి నుంచి ఆ తెగకి సంబంధించిన వారు 250 మంది మీరు వెళ్ళకముందే అక్కడి నుంచి వెళ్లి వివిధ ప్రాంతాల్లో బతుకుతున్నారు.
అభీర్ ప్రతి 50 మందికి ఒక నాయకుడిని నియమించడు అతనికి మాత్రమే ఆ యాభై మంది ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అనే విషయం తెలుస్తుంది.
మనం ఆ ఐదుగురిని పట్టుకుంటే మిగతా వారి గురించి తెలుస్తుంది. వాళ్ళని అభీర్ కి దూరం చెయ్యచ్చు!" అని చెప్పింది వాసుకి.
"మరి ఆ ఐదుగురిని పట్టుకోవడం ఎలా వాళ్ల గురించి నీకు తెలుసా?" అని అడిగింది అర్ణ.
"నాకు తెలిసి ఆ ఐదుగురు మీతో కలిసి మీతో మాట్లాడుతూ మీతో పని చేస్తూ మీతో నమ్మకంగా ఉంటారు వాళ్ళని కనిపెట్టే మార్గం నా దగ్గర ఉంది ముందు చంద్రశేఖర్ ని ఇక్కడకు రానివ్వండి." అని చెప్పింది వాసుకి.
ఆ మాట విని ముకుల్ వైపు చూసి "తాతయ్య! నువ్వు మన చుట్టూ అభీర్ మనుషులు ఉన్నట్లు ఉంది అన్నావు అయితే అది నిజమే! వాళ్ల గురించి తెలిసిన రోజున చావు భయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను." అని కోపంగా చూస్తూ చెప్పింది అర్ణ.
"వాసుకి నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో మనవాళ్లు చంద్రశేఖర్ ని తీసుకు వచ్చిన తర్వాత నిన్ను పిలుస్తాను." అని చెప్పాడు ముకుల్.
"సరే!" అని మహేష్, మిథున్ లతో కలిసి లోపలికి వెళ్ళింది వాసుకి.
రూమ్‌లోకి తీసుకువెళ్లి "ఆ కొండల మీద చాలామంది కన్ను ఉంది అవి అంత విలువైనవా?" అని అడిగాడు మిథున్.
"ఆ కొండల కన్నా విలువైనది అక్కడ ఉంది. దానికోసమే మా నాన్నగారు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇప్పుడు నేను అది స్తాదిస్తాను, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చంద్రశేఖర్ కి తెలుసు అతని నోటి నుంచి మనం ఎలాగైనా రాబట్టాలి." అని చెప్పింది వాసుకి.
"అంత విలువైనది అక్కడ ఏముంది?" అని ఆత్రుతగా అడిగాడు మహేష్.
ఆ మాటకి సీరియస్‌గా చూస్తూ "తొందరెందుకు గోడలకి కూడా చెవులు ఉంటాయి నేను మీతో పాటే ఉంటాను కదా అన్ని విషయాలు చెబుతాను." అని చెప్పింది వాసుకి.
"సరే! నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో!" అని చెప్పి మహేష్ తో కలిసి బయటకు వచ్చి హడావిడిగా వెళుతున్న రఘురామ్ ని చూసి "వాసుకి చెప్పింది నిజమే!" అని చెప్పాడు మిథున్.
****************
సాయంత్రం చంద్రశేఖర్ ని తన కూతురుని సాధు తీసుకురావడంతో నవ్వుతూ దగ్గరికి వెళ్లి "మనం కలుసుకోకుండా ఎలా ఉన్నామో అర్థం కాలేదు, నువ్వు శివమణికి శిష్యుడివి అయినా గురువుతో సమానం అని ఇప్పుడే తెలిసింది." అని చెప్పాడు ముకుల్.
"సార్! మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను ఆయన దగ్గర కొన్ని రోజులు అసిస్టెంట్ గా పని చేశాను ఆర్కియాలజీ గురించి నాకు అర్థం కాకపోవడంతో మానేశాను." అని చెప్పాడు చంద్రశేఖర్.
"అవునా?" అని చంద్ర శేఖర్ పక్కన ఉన్న అమ్మాయి వైపు చూసి "తను నీ కూతురు ప్రియా కాదు కాలేజ్‌లో టీచరుగా పనిచేస్తుంది. పెళ్లి చేసి అత్తారింటికి పంపిచి సుఖంగా ఉండడం నీకు చూడాలని లేదా?" అని అడిగాడు ముకుల్.
అంతలో మిథున్ వాళ్లతో కలిసి అక్కడికి వచ్చి "ఆ జారువా తెగ గురించి రీసెర్చ్ చేసింది మీరే అని నాకు తెలుసు!" అని తన చేతిలో ఉన్న డైరీ ఫైల్స్ చూపించింది వాసుకి.
ఆ మాట విని చంద్రశేఖర్ ఫేసులో ఫీలింగ్స్ మారడం గమనించి మిస్సైల్ వైపు చూసి సైగ చేసింది అర్ణ.
సైగలు గమనించి ప్రియాని అక్కడినుంచి బలవంతంగా గెస్ట్ హౌస్ లోపలికి తీసుకువెళ్లాడు మిసైల్.
"నా కూతుర్ని ఏమి చేయకండి మీకేం కావాలో చెప్పండి." అని కంగారుగా అడిగాడు చంద్రశేఖర్.
"ఆ అభీర్ సేన గురించి, ఆ కొండ దగ్గర ఉన్న అమోఘమైన నిధి గురించి నీకు తెలుసు, కానీ శివమణికి అన్ని విషయాలు చెప్పకుండా దాచావు ఇప్పుడు నీ కూతురి కోసం ఆ విషయాలు బయటపెట్టు!" అని అడిగింది వాసుకి.
"జారువా తెగ నుంచి ఏర్పడ్డ అభీర్ సేన గురించి నేను మొదటే శివమణిని హెచ్చరించాను నా మాట వినలేదు ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను వాళ్ల జోలికి వెళ్ళకండి. మీరు చేసిన తప్పులకు క్షమించామని అభీర్ ని వేడుకోండి మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాడు." అని చెప్పాడు చంద్రశేఖర్.
"ఆ అభీర్ సేన అంత గొప్పదా శివాజీ మహారాజ్ దగ్గర సైన్యంలో వీళ్ళ పూర్వీకులు పని చేశారు ఆ విషయం మాకు కూడా తెలుసు!" అని వెటకారంగా చెప్పింది అర్ణ.
"శివాజీ మహారాజ్ దగ్గర పని చేసిన సైన్యం అంత గొప్పదా?" అని అడిగాడు మహేష్.
ఆ మాటకి కోపంగా చూస్తూ "ఎవరైతే 70 కిలోల కత్తి డాలు పట్టుకుని యుద్ధం చేయగలుగుతారో ఆయనే యాసచి,
రెండు వేల మంది శత్రు సైన్యం ఎదురుగా ఉన్న ఒంటరిగా ఎదురోడ్డి పోరాడగలడో ఆయనే బాజీ.
ఎవరైతే చెయ్యి తెగిపడిన ఒంటి చేత్తో యుద్ధం చేయగలరో ఆయనే తానాజీ.
ఎవరైతే ఢిల్లీ నుంచి పూణే వరకు తన గుర్రం మీద ఎనిమిది గంటల్లో ప్రయాణించగలరో ఆయనే సంతాజీ.
కేవలం 700 మంది మరాఠీ యోధులను తీసుకువెళ్లి 30 వేల మంది మొగలూల సైన్యాన్ని తిప్పికొట్టినవాడు రాంజీ.
మొగల్స్ ఇంట్లో దూరి మాయ చేసి పిచ్చి వాళ్లని చేసిన వాడే బహిర్జీ.
అఫ్జల్ ఖాన్ రక్షకుడు ఎత్తిన చేతిని నిండు సభలో నరికిన వాడే జోహిజీ.
అఫ్జల్ ఖాన్ తలని నరికి తీసుకు వచ్చిన వారి పేరే సాంబాజి.
ఘోరమైన సింహంతో పోరాడి చీల్చి చెండాడిన వాడే చత్రపతి శంభాజీ.
ఇంతమంది వీరులతో రాజ్యాన్ని నిర్వహించిన వారే చత్రపతి శివాజీ.
ఈ వీరులకి సహాయం చేస్తూ చత్రపతి శివాజీ మహారాజ్ కి వెన్నంటి ఉండవని అమ్మవారి శక్తీ తో వచ్చినవారే అభీర్ సేన!
ఆ అమ్మవారి ఆశీస్సులు ఉన్న వారి వారసులతో మీరు ఢీకొట్టపోతున్నారు ఒక్కసారి బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి." అని ఆవేశంగా చెప్పాడు చంద్రశేఖర్.
The following 11 users Like SivaSai's post:11 users Like SivaSai's post
• aarya, ABC24, ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Mahesh12345, Nivas348, Sachin@10, shekhadu, vikas123
Posts: 271
Threads: 0
Likes Received: 194 in 133 posts
Likes Given: 1,186
Joined: Mar 2022
Reputation:
5
•
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
Wow!! Chatrapati Shivaji gurinchi bhale chepparu..
Recent ga edo movie lo SriKrishnudi gurinchi .. vonti meeda romalu nilchune la cheppinattu chepparu.
But all said n done, you have a veru good grip on story telling!!
That is something you need to seriously give some thought about!!
Waiting for next.
•
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 77
శివాజీ మహారాజ్ కి వెన్నంటి ఉండవని అమ్మవారి శక్తీ తో వచ్చినవారే అభీర్ సేన వారి వారసులతో మీరు ఢీకొట్టపోతున్నారు ఒక్కసారి బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి అని చెప్పాడు చంద్రశేఖర్.
****************
చంద్రశేఖర్ చెప్పింది విని కంగారుగా చూస్తూ చెమటలు తుడుచుకుని "పురాణ గాథలు వినడానిని బానే ఉంటాయి, కానీ ఇప్పుడు వాళ్లు లేరు కదా ఒకవేళ అంత శక్తి ఉంటే మా చేతిలో చనిపోయే వారే కాదు." అని చెప్పాడు ముకుల్.
"అవును! తాతగారు చెప్పింది కరెక్ట్! మాకు ఆ ఐదుగురు ఎక్కడ ఉన్నారో తెలియాలి అప్పుడే నీ కూతురు హ్యాపీగా ఇంటికి వెళుతుంది." అని చెప్పింది అర్ణ.
"చంద్రశేఖర్ గారు చెప్పిందంతా నిజమే ఆ అభీర్ సేనకు అంత శక్తి ఉంది. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు! ఆ కొండ దగ్గర విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయో మాకు చెప్పండి మీరు హ్యాపీగా ఉండొచ్చు!" అని చెప్పింది వాసుకి.
"ఆ కొండలు ఒక మహాశక్తి వాటి దగ్గరికి మీరు వెళితే బూడిద అయిపోతారు, అయినా సరే శక్తివంతమైన వస్తువులు అక్కడ ఉన్నాయి అన్నది ఒక ఊహ మాత్రమే అటువంటి ఏమీ లేవు, ఆ విషయం మీద మీ నాన్న రీసెర్చ్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇప్పుడు నువ్వు కుడా అటువంటి తప్పు చేయకు." అని చెప్పాడు చంద్రశేఖర్.
"అది ఊహ కాదు నిజమే! లేకపోతే అభీర్ కి ప్రాణదానం చేసే శక్తి ఎలా వస్తుంది? మురళి జోషి కూతుర్ని బ్రతికించడం నాకు తెలుసు." అని చెప్పింది వాసుకి.
"అవును! అభీర్ కొండ దగ్గర ఒక జంతువుకి ప్రాణం పోయడం నేను కుడా చూశాను, కచ్చితంగా అక్కడ ఏదో ఒక శక్తివంతమైన వస్తువు ఉండే ఉంటుంది గోకుల్ కూడా దానికోసం చాలా ఆశపడ్డాడు." అని చెప్పాడు అభిజిత్.
"అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలు కత్తితో తీసావు కదా దానివల్ల ఎంత నష్టం జరిగిందో మర్చిపోయావా? మళ్ళీ ఆ కొండల గురించి ఆలోచిస్తున్నావు." అని చెప్పాడు చంద్రశేఖర్.
"నీ నోటి నుంచి నిజం ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు!" అని మిసైల్ వైపు చూసి "తన కూతురు ఉన్న గదిలో కాకుండా వేరే గదిలో ఉంచండి." అని చెప్పింది అర్ణ.
"సరే మేడం!" అని చంద్రశేఖర్ ని గెస్ట్ హౌస్ లోపలికి తీసుకు వెళ్ళాడు మిస్సైల్.
చంద్రశేఖర్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాసుకి వైపు చూసి "మేము ఆ కొండల దగ్గర ఒక రోజు మొత్తం ఉన్నాము ఆ ప్లేస్ మొత్తం చూసాము అక్కడ పంచరత్నాలు తప్పితే ఇంకా ఏమి కనిపించలేదు, నిజంగా అది ఊహ అనుకుంటా!" అని చెప్పాడు ముకుల్.
"అది ఊహ కాదు నిజమే! దానిని నేను ఎలాగైనా కనిపెట్టి మీకు చూపిస్తాను." అని ఆవేశంగా లోపలికి వెళ్ళింది వాసుకి.
*******************
ప్రెస్ మీట్ కంప్లీట్ చేసుకుని హడావిడిగా ఇంటికి వెళ్లి టీవీ చూస్తున్న భార్య కూతురు వైపు చూసి "ఎవరు వస్తే వాళ్ళకి వంటలు చేసి చూపిస్తావా?" అని కోపంగా అడిగాడు ప్రహ్లాద్.
"ఏమైంది ఇప్పుడు? ఒక్కసారి నా ప్రోగ్రాం టీవీలో వచ్చేటట్లు చేయమని ఎన్నిసార్లు అడిగాను పట్టించుకున్నారా? నా టాలెంట్ తెలిసి ఛానల్ వాళ్లే ఇంటికి వచ్చారు దానికి ఎందుకు అంత అరుస్తావు?" అని కోపంగా అడిగింది భార్య.
"ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిన్ను బేబీని వీడియోలొ చూపించి బెదిరించి నాతో ఐదుగురిని చంపించారు ఇప్పుడు చచ్చిన వాళ్ల మనుషులు వచ్చి నా ప్రాణాలు తీస్తారు." అని టెన్షన్ గా చూస్తూ
"పద మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మళ్లీ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నన్ను బెదిరిస్తారు." అని కంగారుగా చెప్పాడు ప్రహ్లాద్.
అంతలో ఇంట్లోకి వస్తూ "నువ్వు చేయవలసింది ఇంకా చాలా ఉంది ఎక్కడికి వెళ్లి పోతావు.?" అని అడిగాడు తంబియార్.
ఆ మాట విని వెనక్కి తిరిగి చూసి "సార్! నన్ను వదిలేయండి ఆ అభీర్ మనుషులు చాలా డేంజరస్ గా ఉన్నారు." అని చెప్పాడు ప్రహ్లాద్.
"అంటే! మేము డేంజరస్ కదా!" అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు తంబియార్.
"సార్! ఇప్పటీ వరకు మీరు చెప్పిన ప్రతి పని చేశాను కానీ మనం వాళ్ళ జోలికి వెళ్లకపోవడమే మంచిది నాకున్న అనుభవంతో చెబుతున్నాను." అని చెప్పాడు ప్రహ్లాద్.
"నువ్వు ఏమి చేయనవసరం లేదు ప్రశాంతంగా నీ ఉద్యోగం చేసుకో, కానీ ఆ అభీర్ మనుషుల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వు చాలు!" అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
"సరే! ఆ అభీజిత్ గారి మనుషులు నా మీదకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే!" అని సిసి ఫుటేజ్ లో తన ఇంటికి వచ్చిన నీలమ్ వాళ్ళ ముగ్గురి వీడియో చూపించి "దీనిని మిథున్ గారికి చూపించండి నేను చెప్పింది నిజం అని నమ్ముతారు." అని చెప్పాడు ప్రహల్లాద్.
"సరే!" ఆ విషయం మేము చూసుకుంటాము." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తంబియర్ వాళ్ళు.
**************
నంద గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి "అయ్యా! మీరు చెప్పినట్లు పర్మిషన్ తెప్పించాను ఈరోజు సాయంత్రం జంతువులు మొత్తం అడవి దగ్గరికి బయలుదేరుతున్నాయి ఇంక మీ పని మొదలు పెట్టండి." అని చెప్పాడు వరదరాజులు.
"సరే!" అని నిర్మల్ వైపు చూసి "జావిద్ కొడుకుతో మాట్లాడి అడవిలో మన మనుషులు ఉండేటట్లు చూడండి. వాళ్ళని దాటి అక్కడికి బయటి వ్యక్తి ఎవరు రాకూడదు." అని చెప్పాడు ముకుల్.
"సరే సార్! ఆల్రెడీ ఫరూక్ తో అన్ని విషయాలు మాట్లాడను అడవిలో విష్ణు కోసం కుడా వెతుకుతున్నారు, నేను ప్రమోద్ ఉదయం రాజస్థాన్ బయలుదేరి వెళతాము ఆ కొండల సంగతేమిటో చూస్తాము." అని చెప్పాడు నిర్మల్.
"అక్కడ అంతా సెట్ అయిన తర్వాత కాల్ చేయండి చంద్రశేఖర్ ని తీసుకుని మేము కూడా వస్తాము." అని చెప్పి రాము వైపు చూసి "ఆ రూమ్స్ లో ఉన్న ఇద్దరికి ఫుడ్ తీసుకువెళ్ళు వాళ్లతో నువ్వేమి మాట్లాడకు." అని చెప్పింది అర్ణ.
"సరే మేడం!" అని చెప్పి లోపలికి వెళ్ళాడు రాము.
మిథున్ కి పెన్ డ్రైవ్ ఇచ్చి "ప్రహ్లాద్ తప్పు ఏమీ లేదు ఫ్యామిలీ అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేశారు." అని చెప్పాడు తంబియార్.
"సరే!" అని పెన్ డ్రైవ్ తీసుకుని లాప్టాప్ పెట్టి నీలమ్ వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఉన్నాడు మిథున్.
********************
మరుసటి రోజు ఉదయం అభీర్ దగ్గరికి వచ్చి "నాయకుడా! జూ లో ఉన్న జంతువులు మొత్తం అడవికి చేరుకున్నాయి జావిద్ కొడుకు ఫరూక్ సహాయంతో అడవిలో మొత్తం వాళ్ళ మనుషులు ఉండేటట్లు చేసుకున్నారు." అని చెప్పాడు రాజన్.
"అడవి దగ్గరకి నిర్మల్, ప్రమోద్ బయలుదేరి వెళుతున్నారు." అని చెప్పాడు అరుల్.
"గెస్ట్ హౌస్ దగ్గరికి సర్పరాజ్ కూతురు వాసుకి వచ్చింది అక్కడినుంచి మమ్మల్ని పంపించి పక్షుల్ని కూడా చెదరగొట్టి వాళ్ళతో ఏదో మాట్లాడింది." అని చెప్పింది రియా.
అక్కడికి చాక్లెట్ తో కలిసి వచ్చి "అభీర్! చంద్రశేఖర్ గారిని అయన కూతుర్ని అభిజిత్ మనుషులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు వాళ్లతో ఏమి పని ఉందో అర్థం కాలేదు." అని డౌట్ గా చూస్తూ చెప్పింది మిత్ర.
"నేను అనుకున్నది జరుగుతుంది వాళ్లకి సహాయం చేసే వాళ్ళు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు." అంటూ బైరి వైపు చూసి
"చంద్రశేఖర్ గారు ఆయన కూతురు వాళ్ళ దగ్గర ఉండకూడదు అక్కడ ఉన్న మన రాముకి సహాయం గా మల్లి, లింగు లని పంపించు ఈరోజు రాత్రికి అర్ణకి బాధ, వాసుకి కి భయం ఎలా ఉంటాయో చూపించాలి." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా!" అని చెప్పి మల్లి వైపు చూసి "ప్లాన్ గుర్తు ఉంది కదా!" అని చెప్పాడు బైరి.
"సరే!" అని లింగు తో కలిసి అక్కడి నుంచి బయలుదేరింది మల్లి.
"అరుల్! నువ్వు కూడా నిర్మల్ వాళ్లతో పాటు అడవికి బయలుదేరు." అని చెప్పి ఆగస్త్య వైపు చూసి "నువ్వు ఇచ్చిన ప్లాన్ రఘురామ్ బానే అమలు చేశాడు మన జంతువులు మొత్తం ఆడవి చేరుకున్నాయి మిగతా ఐడియాలు కూడా ఇవ్వు!" అని నవ్వుతూ చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా! అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అరుల్, ఆగస్త్యలు.
బైరి దగ్గర ఫోన్ తీసుకుని శంకర్ కి కాల్ చేసాడు అభీర్.
తీహార్ జైల్ లొ డ్యూటీలో ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "జై భవాని!" అని చెప్పాడు శంకర్.
"మల్లి, లింగిలు బయలుదేరారు ఏమి చేయాలో తెలుసు కదా!" అని చెప్పాడు అభీర్.
"సరే నాయుకుడా అర్థం అయింది." అని చెప్పి ఫోన్ పెట్టేసి సబ్ జైలార్ నితీష్ దగ్గరికి వెళ్లి "నమస్తే సార్! అభీర్ ఫోన్ చేశాడు మీరు చేసిన తప్పు సరిదిద్దుకునే టైమ్ వచ్చింది." అని చెప్పాడు శంకర్.
"సరే! నువ్వు చెప్పినట్లు చేస్తాను ఇంక నేను సేఫ్ ఏ కదా!" అని అడిగాడు నితీష్.
"అభీర్ మాట ఇస్తే ఎలా ఉంటుందో మీకు కూడా బాగా తెలుసు కదా!" అని చెప్పాడు శంకర్.
"ఎస్ ఎస్!" అని ఫోన్ తీసుకుని బయటికి వెళ్లి మిథున్ కి కాల్ చేశాడు నితీష్.
గెస్ట్ హౌస్ తో మహేష్, వాసుకి లతో మాట్లాడుతూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి "ఈ జైలర్ గాడు ఇప్పుడు కాల్ చేస్తున్నాడు ఎందుకు?" అని లిఫ్ట్ చేసి "నితీష్ ఏమైనా డబ్బులు కావాలా?" అని అడిగాడు మిథున్.
"నో సార్! చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది మీకు ఉపయోగపడుతుందని కాల్ చేశాను." అని చెప్పాడు నితీష్.
"మీకు సంబంధించిన డాక్యుమెంటరీ తీసేది మా జైలర్ గారి సిస్టర్ ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. తన దగ్గర పనిచేసే మల్లి అనే ఒక అమ్మాయి ఈరోజు సాయంత్రం రైల్వే స్టేషన్ లో అభీర్ సేనలొ ఒక మనిషిని పికప్ చేసుకోబోతుంది." అని చెప్పాడు నితీష్.
"అవునా? కరెక్ట్ టైం కి మంచి న్యూస్ చెప్పావు?" అని సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేసి ప్రహల్లాద్ కి కాల్ చేసాడు మిథున్.
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 78
నితీష్ కాల్ చేసి మా జైలర్ గారి సిస్టర్ దగ్గర పనిచేసే మల్లి ఈరోజు సాయంత్రం రైల్వే స్టేషన్ లో అభీర్ సేన మనిషిని కలుస్తుంది అని మిథున్ కి చెప్పాడు.
*********************
ఫోన్లో చెప్పింది విని కాల్ కట్ చేసి వెంటనే ప్రహ్లాద్ కి కాల్ చేశాడు మిథున్.
తన ఆఫీసులో ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "నమస్తే సార్! నాకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు రాగానే ఫస్ట్ మీకే చెప్తాను." అని చెప్పాడు ప్రహ్లాద్.
"నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇంటికి ఇంటర్వ్యూ కు వచ్చిన జైలర్ గాడి మరదలు దగ్గర మల్లి అని ఒక అమ్మాయి పని చేస్తుంది.
తను ఈరోజు సాయంత్రం రైల్వే స్టేషన్ దగ్గర అభీర్ సేన మనిషిని కలవబోతోంది నువ్వు ఎలాగైనా ఇద్దరిని తీసుకుని గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకురా..! ఈ దెబ్బతో నీ కోపం కూడా తీరుతుంది." అని చెప్పాడు మిథున్.
ఆ మాట విని "ఒకే సార్! ఇక నేను చూసుకుంటాను." అని సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేసాడు ప్రహల్లాద్.
ఫోన్ మాట్లాడి పెట్టేసిన మిథున్ వైపు చూసి "మనకి ఆ సేనలో ఒక్క మనిషి దొరికిన చాలు వాళ్ల గుట్టు మొత్తం తెలుసుకోవచ్చు!" అని ఆశ గా చెప్పింది వాసుకి.
అక్కడికి వస్తూ "ఈ పని చేయడం ప్రహల్లాద్ వల్ల అవుతుంది అంటావా? లేక మిసైల్ ని పంపుదామా?" అని అడిగింది అర్ణ.
"నో నో! అక్కడ హడావిడి చేయకూడదు సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేసినట్లు జాగ్రత్తగా వాడే ఇక్కడికి తీసుకు వస్తాడు." అని చెప్పాడు మిథున్.
"నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా!" అని డౌట్ గా అడిగాడు మహేష్.
"100% కరెక్ట్!" అని చెప్పాడు మిథున్.
టేబుల్ మీద ఉన్న మ్యాప్ ని చూసి "ఏంటి? ఏదైనా నిధి కోసం వెతుకుతున్నారా?" అని అడిగింది అర్ణ.
"అవును! ఇది బేర దగ్గర ఉన్న కొండలకు సంబంధించిన మ్యాప్ చాలా పాతకాలం నాటిది శివమణి ఇంటి దగ్గర దొరికింది. కచ్చితంగా ఈ ప్లేస్ లోనే ఆ తెగ వాళ్ళ పూర్వీకులు దాచిన కొన్ని మహిమగల వస్తువులు ఒక భారీ నిధి ఉన్న ప్లేస్ ఉంది." అని చెప్పింది వాసుకి.
"అసలు! ఆ తెగ వాళ్ళకి ఆ మహిమ గల వస్తువులు, నిధి ఎక్కడి నుంచి వస్తాయి?" అని అనుమానంగా అడిగింది అర్ణ.
నవ్వుతూ "అందరూ అలా ఆలోచించే అక్కడితో ఆగిపోతారు, కానీ నేను మరో రకంగా ఆలోచించాను అందుకే నాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి." అని చెప్పింది వాసుకి.
"ఏంటి? ఆ ఆశ్చర్యకర విషయం!" అని ఆత్రుతగా అడిగారు మిథున్.
"ఈ కొండల దగ్గర ఒక రహస్య గుహ ఉంది దాంట్లో ద్వాపరయుగం నాటి కొన్ని మహిమ గల వస్తువులు శ్రీకృష్ణుడు భద్రపరిచి ఈ తెగను కాపలాగా ఉంచాడు అని చెబుతారు.
అలాగే శివాజీ మహారాజ్ హిందూ ధర్మన్ని కాపాడడం కోసం ఒక భారీ నిధిని కుడా అక్కడే ఉంచారు అని తెలుసుకున్నాను." అని చెప్పింది వాసుకి.
"అంటే! మీ నాన్నగారు మా నాన్నగారు దానికోసమే వెతికారా?" అని అడిగింది అర్ణ.
"ఎస్! ఈ నిధి గురించి మా నాన్నగారు నాకు చాలాసార్లు చెప్పారు దీని కోసమే మొగలలు కూడా ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు అంట!" అని చెప్పింది వాసుకి.
"ఆ విషయం నీకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసు?" అని అడిగాడు మిథున్.
తన బ్యాగ్ లో నుంచి ఒక పాత బుక్ బయటకి తీసి చూపిస్తూ "ఇది ఔరంగజేబు తన స్వహస్తాలతో రాసుకున్న డైరీ, శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు అయిన శంభాజీ మహారాజ్ ని బంధించినప్పుడు ఆ నిధి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
శంభాజీ ని ఎన్ని చిత్రహింసలు పెట్టిన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు కానీ నోరు విప్పలేదు. తరువాత కొన్ని సంవత్సరాలకి మొగలుల పరిపాలన అంతమైపోయింది ఆ తరువాత ఆ నిధి గురించి ఎవరు పట్టించుకోలేదు." అని చెప్పింది వాసుకి.
"ఆ నిధి ఎక్కడ ఉందో చంద్రశేఖర్ కనిపెట్టాడంటావా?" అని అడిగింది అర్ణ.
"నాకు తెలిసి చంద్రశేఖర్ కి కొంత తెలుసు అతను నోరు విప్పితే ఆ విషయాలతో నా బుర్రకి పదును పెట్టి నేను కనిపెడతాను, మనకి హెల్ప్ చేయడానికి బెస్ట్ ట్రెజర్ హంటర్ అయ్యినా 'తల్వార్' ఈజిప్ట్ నుంచి రేపు ఇక్కడికి వస్తున్నాడు." అని చెప్పింది వాసుకి.
"ఈ తల్వార్ ఎవరు?" అని డౌట్ గా అడిగింది అర్ణ.
"ఐదు సంవత్సరాలలో ఈజిప్టు భూగర్భంలో ఉన్న 36 రహస్య ప్రదేశాలను కనుగొన్నాడు ఎంత కష్టమైన నిధి మార్గాన్ని అయ్యినా ఓపెన్ చేయగలడు, అంతే కాదు ఎటువంటి మంత్ర, తంత్రాలానైనా ఎదుర్కోగలడు." అని చెప్పింది వాసుకి.
ఆ మాట విని సంతోషంగా చూస్తూ ఉన్నారు అర్ణ వాళ్ళు
************
రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో భోజనం పట్టుకొస్తున్న రాముని చూసి "నా కూతురిని చూస్తేనే కానీ పచ్చి మంచినీళ్లు ముట్టుకోను." అని కోపంగా చెప్పాడు చంద్రశేఖర్.
భోజనం అక్కడ పెట్టి "ధైర్యంగా ఉండండి మీ అమ్మాయి క్షేమంగా ఉంది ఇప్పుడే భోజనం ఇచ్చి వస్తున్నాను, అభీర్ సేన నుంచి ఇద్దరు వీరులు ఇక్కడికి వస్తున్నారు మిమ్మల్ని సేఫ్ గా తీసుకువెళ్తారు." అని చెప్పాడు రాము.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తు "ఆంటే! నువ్వు.." అని అనుమానంగా చూశాడు చంద్రశేఖర్.
"మీరు ఆలోచిస్తున్నది నిజమే!" అని చెప్పాడు రాము.
"ఇక్కడ పక్షులు రాకుండా మిషన్స్ ఏర్పాటు చేశారు మరి నీకు సమాచారం ఎలా అందింది?" అని డౌట్ గా అడిగాడు చంద్రశేఖర్.
"మిథున్ ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను సేనలొ ఉన్న వాళ్ళ గురించి అంత తేలిక బయటికి రాదు, విషయం లీక్ అయింది అంటే ఇక్కడికి రావడానికి కావాలని ప్లాన్ చేశారు అని అర్ధం, భోజనం చేసి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాము.
ఆ మాట విని సంతోషంగా చూస్తూ భోజనం చేశాడు చంద్రశేఖర్.
**************
తన ఛాంబర్ లో కూర్చుని బయట ఉన్న ఆఫీసర్స్ వైపు చూసి "వీళ్లని ఎవరిని తీసుకువెళ్లిన అభీర్ మీద భయంతో వెనక్కి వెళ్ళిపోతారు." అని ఆలోచిస్తూ శక్తి దాస్, కుమార్ లు వెళ్లడం చూసి లోపలికి పిలిచాడు ప్రహ్లాద్.
ఛాంబర్ లోకి వచ్చి సెల్యూట్ చేసి "జైహింద్ సర్!" అని చెప్పాడు దాస్.
"ఏమయ్యా! మీరు ఆ సి బి ఐ ఆఫీసర్ తో కలిసి అభీర్ కి హెల్ప్ గా ఉంటున్నారని అభిజిత్ గారు మీ మీద చాలా కోపంగా ఉన్నారు, ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు జాగ్రత్తగా ఉండండి." అని చెప్పాడు ప్రహ్లాద్.
"సార్!+మా డ్యూటీ మేము చేస్తున్నము మేము ఎవరి వైపు లేము ఆ విషయం మీకు కూడా తెలుసు మీరే మమ్మల్ని సేవ్ చేయాలి." అని కంగారుగా చెప్పాడు దాస్.
"సరే! నాతో పాటు వచ్చి ఒక చిన్న పని చేయండి. అప్పుడు అభిజిత్ గారికి మీ మీద ఉన్న కోపం కొంచెం తగ్గుతుంది." అని చెప్పాడు ప్రహ్లాద్.
ఆ మాట విని కాసేపు ఆలోచించి "సరే సార్! మాతో పాటు మీరు కూడా ఉంటారు కదా!" అని అడిగాడు దాస్.
"నేను కూడా ఉంటాను అయ్యా! మీకు ఎటువంటి భయం ఉండదు పదండి." అని కార్ లొ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉన్నాడు ప్రహ్లాద్.
కార్ లొ ఫ్రంట్ సీట్లో ఉన్న ప్రహ్లాద్ వైపు చూసి "సార్! బంధువులు ఎవరైనా వస్తున్నారా?" అని అడిగాడు కుమార్.
"అవును! మేడమ్ వంట కార్యక్రమం షూట్ చేయడానికి ఒక రిపోర్టర్ వస్తుంది. పికప్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్లాలి." అని పళ్ళు కొరుకుతూ చెప్పాడు ప్రహ్లాద్.
"సార్! మొన్న మేడం గారి ప్రోగ్రాం టీవీలో వచ్చింది. అది చూసి సేమ్ వంటకం మా ఇంట్లో చేశారు అంత బాలేదు ఈసారి మంచిది చేయమనండి." అని నవ్వుతూ చెప్పాడు దాస్.
"సరే సరే!" అని మల్లి వచ్చే స్టేషన్ దగ్గర వెయిట్ చేయడం చూసి "అదిగో రిపోర్టర్ వచ్చింది కెమెరామెన్ కూడా వస్తాడు వెళ్లి ఇద్దర్ని తీసుకొచ్చి కార్లో ఎక్కించండి." అని చెప్పాడు ప్రహ్లాద్.
కారులో నుంచి చూస్తూ "సరే సార్!" అని కార్ దిగి మల్లి దగ్గరికి "మమ్మల్ని పక్కకి తోసి ఇక్కడి నుంచి పారిపో నిన్ను తీసుకు వెళ్ళడానికి ఎస్పీ గారు వచ్చారు." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు దాస్.
"ఆ విషయం నాకు తెలుసు! మా ఇద్దరిని తీసుకువెళ్లండి నేను ఏమి మాట్లాడినా మీరు సైలెంట్ గా ఉండండి." అని చెప్పింది మల్లి.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "అభీర్ ఏదో పెద్ద ప్లానే వేశాడు సరే పదండి." అని ఇద్దర్నీ తీసుకుని కారు దగ్గరికి వెళ్లి "సార్! వీళ్ళు ఏ వంట ప్రోగ్రామ్ షూట్ చేయడానికి రాలేదంట!" అని చెప్పాడు దాస్.
"నాకు తెలుసు!" అని గన్ తీసి చూపించి "మర్యాదగా లోపల కూర్చోండి." అని కోపంగా చూస్తూ చెప్పాడు ప్రహ్లాద్.
"ఈ విషయం అభీర్ కి తెలిసిందో నీ పని అవుట్!" అని చెప్పింది మల్లి.
"నోరు మూసుకుని కూర్చోండి." అని రెండు బ్లాక్ క్లాత్ లు ఇచ్చి "వాళ్ళ కళ్ళకి కట్టండి." అని చెప్పాడు ప్రహ్లాద్.
"సరే సార్!" అని కంగారుగా చూస్తూ మల్లి కళ్ళకి కట్టి "సార్! ఇతను బ్లైండ్!" అని చెప్పాడు కుమార్.
"అవునా?" అని వెన్నక్కి తిరిగి చూసి "అయ్యితే అవసరం లేదు ఆలా ఉండనివండి." అని చెప్పి డ్రైవర్ వైపు చూసి "నంద గారి గెస్ట్ హౌస్ కి ఫాస్ట్ గా వేళ్ళు ఎవ్వరు ఆపిన ఆపాకు!" అని చెప్పాడు ప్రహ్లాద్.
"ఓకే సార్!" అని ఫాస్ట్ గా వెళ్ళాడు డ్రైవర్.
ఏం జరుగుతుందో అని కంగారుగా చూస్తూ ఉన్నారు దాస్, కుమార్ లు.
The following 11 users Like SivaSai's post:11 users Like SivaSai's post
• aarya, ABC24, ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Mahesh12345, Naga67, Sachin@10, shekhadu, vikas123
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
Something with blind fellow.. wow!!
Chala rasavattaranaga saagutundi story
•
Posts: 271
Threads: 0
Likes Received: 194 in 133 posts
Likes Given: 1,186
Joined: Mar 2022
Reputation:
5
arre appude aipoinda?
next episode malli oka blast untadi
•
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
|