Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Superb update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Mottaniki moodu jantalu okatayyay!!
Inka Bhargavi migilindi!!
Like Reply
Part - 93


అందరికీ తెలిసే నాతో ఆడుకున్నారా ఉక్రోషంగా అడిగితే.. అది నువ్వు గ్రహించకపోతే నేనేమీ చేయాలి బాబు. మరి మీ అన్నయ్య ఎందుకంత భారీ డైలాగులు కొట్టాడు. మా అన్నయ్య నీకు ఏం చెప్పాడో నాకు ఏం తెలుసు?

ఇది తొండి నేను ఒప్పుకోను అని చిందులు తొక్కతాడు.. రాజ్ చిందులు చూసి నవ్వుకుంటూ నీలో చిన్నపిల్లల టాలెంట్ కూడా ఉందా అని ఇంకా ఉడికిస్తుంది.

రాజ్ కొంచెంసేపు ఉడుక్కుని,  కాసేపు నవ్వుకుని సరదాగా ఇద్దరు టైమ్ పాస్ చేస్తారు.  ఇప్పటికే చాలా టైం అయింది. పద ఇంటికి వెళదాము.

ఆంటీ అంకుల్ కూడా వచ్చేసి ఉంటారు.  ఏ ఆంటీ..  అంకుల్ అని అడుగుతాడు. నా కాబోయే అత్తగారు,  మామగారు అంటుంది.

ఈ కొత్త క్యారెక్టర్స్ ఎవరు. నాతో పెళ్లికి ఒప్పుకున్నాక.. వేరే ఇంకొకళ్ళు ఎవరో రావడం ఏంటి అని కోపంగా అడుగుతాడు.

ఆ మాటలకి రాజ్ ని పైనుంచి కిందకి చూస్తూ  ఇంకొంచెం సేపు ఏడిపించాలి అని..  నేను ఒప్పుకుంది నీ లవ్❤️ ప్రపోజల్ మాత్రమే. 

మ్యారేజ్ ప్రపోజల్ నువ్వు ఇంకా చేయలేదు కదా.. చేసినప్పుడు కదా..  ఓకే చేసేది.  ఈ లోపు వచ్చిన ఈ కొత్త రిలేషన్ వాళ్ళని ఎందుకు వదులుకోవడం చెప్పు అని నవ్వుకుంటూ ముందుకు వెళుతుంది.

నివి అని కోపంగా అరుస్తాడు.  వెనక్కి తిరిగి ఏమైంది అని అడుగుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా..  ప్రేమ నాతో పెళ్లి ఇంకొకరు తో నా..

నేను అలా అన్నానా? నీకు అలాగ అర్థం అయ్యిందా అంటుంది.  నువ్వు అన్నది నాకు అర్థం అయింది. ఏంటి నీ ఉద్దేశం అని చేతులు కట్టుకుని సీరియస్ గా అడుగుతుంది.

ఇదేంటి ఉన్నట్టుండి ఇంత సీరియస్ అయిపోయింది. నేను అంత తప్పుగా ఏమన్నాను అబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు.  రాజ్ ఆలోచిస్తూ ఉంటే నవ్వుకుంటూ పైకి కోపాన్ని చూపిస్తూ  ముందుకు వెళ్ళిపోతుంది.

నివి అన్నదే కదా నేను తిరిగా అడిగాను.  మళ్ళీ అదే సీరియస్ అయిపోతే ఏంటి దాని ఉద్దేశం. ఇప్పుడు నేను కదా అలగాల్సింది.

అది కదా బుజ్జగించాల్సింది. అంటే వాళ్లే మనల్ని అనేసి...  వాళ్లే అలిగితే..  మళ్ళీ మనం  వెనకాల వెళ్లి బ్రతిమాలాల...

ఏంటమ్మా రాజ్ నీ పరిస్థితి..  మొదటి రోజే ఇలాగ అయిపోయిందని తన మీద తనే జాలి పడుతు.. నివి అనుకుంటూ వెనకాలే వెళతాడు .

నన్ను ఇంటిదగ్గర డ్రాప్ చేయి అని కోపంగా అంటుంది. నా ఉద్దేశ్యం అది కాదు.  వాళ్ళు ఎవరో తెలుసుకుందామని.. ఇక ఆపు అన్నట్టుగా చేయి చూపి వెళదామా అంటుంది.

సరే ఇంటికి వెళ్ళితే వాళ్ళు ఎవరో తెలుస్తుంది కదా. అప్పుడు మెల్లిగా నివితో మాట్లాడాలి.  ముందు విక్రమ్ తో మాట్లాడి కొత్తగా వచ్చిన వాళ్ళని బయటకి గెంటేయాలి.

  ఒక్క నిమిషం అని గబగబా విక్రమ్ కి ఫోన్ చేస్తూ పక్కకి వెళ్తాడు. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటే... ఏంటి చెప్పేది అని కోపంగా అంటాడు.

ఏమైందిరా నివి ఒప్పుకోలేదా.. ఒప్పుకుంది అంటాడు.  మరి ఒప్పుకుంటే హ్యాపీగా మాట్లాడటం మానేసి.. ఆ కోపమేంట్రా...

నాకు నీ మీద కోపం వస్తుంది అంటాడు. విషయం ఏంటో చెప్పరా అని విసుక్కుంటాడు. అన్నీ తెలిసే అడుగుతున్నావా బావ అని బేర్ మంటాడు.

అసలు ఏం జరిగిందో చెప్పు చావు అంటే.. నివి నా లవ్ కి ఓకే చెప్పింది.  ఇంక నేను మ్యారేజ్ ప్రొపోజ్ చేయలేదంట... అయితే..

అందుకని ఎవరో కొత్త రిలేషన్ వాళ్ళు ఎవరో ఇంటికొస్తున్నారు అంట కదా..  నాకు కాబోయే అత్తగారు మామగారు అని చెబుతుంది.

ఆ మాటకి నివి ఏం చెప్పి ఉంటుందో అర్థమయ్యి నవ్వుకుంటూ ఆల్రెడీ వచ్చేసారు కదా అంటాడు.  అంటే నువ్వు కూడా దానికి ఒప్పుకున్నావా.

నువ్వే చెప్పిందన్నావు కదరా.. లవ్ ప్రపోజల్ మాత్రమే చేశావు. మ్యారేజ్ ప్రపోస్ చేయలేదు అని.  అది కూడా చేసేయ్ అప్పుడు ఒప్పుకుంటే ఇంకా గొడవేముంటుంది.

రెంటికీ తేడా ఏముందిరా అంటాడు.  ఏమో ఈ ఆడవాళ్ళకి ఏం తేడా ఉందో నాకేం తెలుసు. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమి అవ్వలేదు కదా..

నువ్వు లక్కీ ఫెలోవురా.. అందుకే దేవత లాంటి మా చెల్లి వచ్చింది. మా చెల్లిని దెయ్యం అంటున్నావా.. అంతకన్నా ఎక్కువే.

ఒక్కసారి వెనక్కి తిరిగా ఆ మాట చెప్పరా అంటాడు. ఎందుకురా అని వెనక్కి తిరిగితే... అక్కడ నివి నడుం మీద రెండు చేతులు పెట్టుకొని...  కోపంగా బుసలు కోడుతూ ఉంటుంది.

ఒరేయ్ నివి ఇక్కడకి వచ్చిన విషయం ఎలా తెలిసింది రా...  నువ్వు ఏమన్నా స్లోగా మాట్లాడుతున్నావా.. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ ఫోన్ కూడా అవసరం లేనంత చిన్నగా మాట్లాడుతున్నావు అని నవ్వుతూ ఎంజాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు.

నివి అని స్వీట్ గా పిలుస్తాడు. ఆపు అన్నట్టుగా చేయి చూపించి నేను నీకు దయ్యాన్నా..  ప్రపోజ్ చేసుకుని కొన్ని గంటలు కూడా అవ్వలేదు.

అప్పుడే నన్ను దెయ్యంతో పోల్చావా..  ఇక్కడే అర్థమవుతుంది నీ ప్రేమ ఏమిటో.  నేను మా కాబోయే అత్త గారికి నీ సంగతి చెబుతాను  అని ఏడుస్తూ కారు ఎక్కుతుంది. 

ఓరి భగవంతుడా..  ఇప్పుడు నేను ఏమన్నాను.అప్పుడే ఇంత సీన్ క్రియేట్ చేస్తుంది.  ముందు అసలు ఆ కాబోయే అత్తగారు..  మామగారు..  ఎవరో చూడాలి.

అప్పుడు.. అప్పుడు..  నేనంటే ఏమిటో చూపిస్తాను. రాజ్ డ్రైవింగ్ ప్లేస్లోకి వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. దెయ్యం అంటే నువ్వు నా అల్లరి దెయ్యం.  అందమైన దెయ్యం అని అర్థం. నువ్వు ఎంత స్వీట్ గా ఉంటావో.. నిన్ను అంత భయంకరంగా ఎందుకు చెబుతాను చెప్పు అని కూల్ చేయడానికి చూస్తాడు.

నిజంగానా అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది.  నిజంగా..  ప్రామిస్ నీకు కాబోయే అత్తగారి మీద ఒట్టు అని వాళ్ళు ఎవరో గాని అనుకుంటూ పళ్ళు నూరుకుంటూ ఉంటాడు. సరే సరే కొంచెం కూల్ అవుతున్నాను.

నివి అని మళ్ళీ గారంగా పిలుస్తూ ఉంటే...  ఇంతలో నివి ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు అన్నట్టుగా రాజ్ చూస్తే...  ఫోన్ లిఫ్ట్ చేసి ఐ.. నాకు కాబోయే అత్తయ్యగారు.

లిఫ్ట్ చేసి..  చెప్పండి అత్తయ్య గారు అని నవ్వుతూ మాట్లాడుతుంది.  అబ్బా..  మధ్యలో వీళ్ళు ఎవరో గాని నాకు టెన్షన్ పెంచేస్తున్నారు.

ఎక్కడ ఆపకుండా స్పీడ్ గా ఇంటికి వెళ్లిపోవాలి. ముందు వాళ్ళిద్దరు ఎవరో చూసి బయటకు గెంటేయాలి అని కార్ స్పీడ్ పెంచుతాడు.  స్లోగా వెళ్ళు అంటుంది.

ఆ మాటకి రాజ్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ..  ఫోన్లో ఉన్న మీ కాబోయే అత్తగారు ఫీలవుతారు ఏమో.. నా పేరు చెబుతుంటే..

అబ్బే..  మా అత్తగారిది చాలా బ్రాడ్ మైండెడ్. అన్ని తెలుసు అని చెబుతుంది.  నేను ప్రొపోజ్ చేస్తున్న విషయం కూడా తెలుసా..

ఎప్పుడో తెలుసు.  నువ్వు చెప్పేదాకా నన్ను ఓపెన్ అవ్వదు అని సలహా ఇచ్చిందే మా అత్తగారు అంటుంది. ఇలాంటి వెరైటీ క్యాండిడేట్ ని నేను ఎక్కడా చూడలేదు.

నేను లవ్ ప్రపోజ్ చేస్తే..  వాళ్ళ అబ్బాయితో నీకు మ్యారేజ్ ప్రపోజల్ ఎలా తీసుకు వచ్చింది ఆవిడ అని అడుగుతాడు.

చెప్పాను కదా మా అత్తగారిది చాలా బ్రాడ్ మైండ్ ని.. చూస్తే నీకే అర్థమవుతుంది. కొంచెం స్లోగా వెళ్లు.పరవాలేదు అని మళ్లీ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది.

రాజ్ కి తిక్క రేగి కార్ ఇంకా స్పీడ్ పెంచుతారు. నివి ఫోన్ పెట్టేసి రాజ్ వైపు తిరిగి నాకు చాలా ఆకలేస్తుంది. పొట్ట మీద చేతులు పెట్టుకుని చూపిస్తుంది.

రాజ్ కొంచెం ఇబ్బంది పడి.. సోరి నివి. నీ ఆకలి సంగతి మర్చిపోయాను.  అసలు నీకు ప్రపోజ్ చేసిన తర్వాత డిన్నర్ కి తీసుకువెళదామని ప్లాన్ చేసుకున్నాను.

మధ్యలో నీ కాబోయే అత్తగారు వచ్చి నా ప్లాన్ అంత స్పాయిల్ చేసి. మూడు డిస్టర్బ్ చేసింది.  సోరి... సోరి అని ఏం తింటావు అని అడుగుతాడు.

ఏదైనా పర్వాలేదు. లైట్ ఫుడ్ చాలు. ఓకే అని రెస్టారెంట్ కి వెళదామా అంటే..  వద్దొద్దు రోడ్ సైడ్ ఫుడ్ బాగుంటుంది. పదా అని చెప్పి మధ్యలో ఒకచోట ఆగి తనకి కావలసినవి ఆర్డర్ ఇస్తుంది.

రాజ్ మాత్రము ఇవేమీ గమనించే స్థితిలో ఉండడు  ఫుడ్ వచ్చిన తర్వాత నివి ఆ ప్లేట్ తీసుకొని రాజ్ దగ్గరికి కి వచ్చి ఆ పట్టు అని నోటు దగ్గర పెడుతుంది.

నీకు ఆకలేస్తుంది అన్నావు కదా..  నువ్వు తిను. నాతో పాటు నీకు ఆకలేస్తుంది కదా..  నీ ఆకలి నువ్వు గుర్తించడం లేదు.

ఏదో పరధ్యానంలో ఉన్నావు.  పట్టు అని తినిపిస్తుంది. రాజ్ కి తినిపిస్తే తను తింటుంది. అది చూసి రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.

మనసులో నా మీద చాలా ప్రేమ ఉంది. వాళ్ళు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చిన ఎట్టి పరిస్థితిలోను నివి ఒప్పుకోదు. అప్పుడు ప్రసన్న వదనంతో నివి ప్రేమను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

బిల్ పే చేస్తే ఇంకా వెళదామా అంటే అయ్యో డెసర్ట్ లేకపోతే ఎలాగా వన్ ఐస్ క్రీమ్ అంటుంది. సరే అని చెప్పి నివికి ఇష్టమైన ఆల్మండ్ ఫ్లెవోర్ ఐస్క్రీమ్ తీసుకువచ్చి ఇస్తాడు.

ఇంకా వెళదామా అంటే.. ఒక్క నిమిషం మా అత్తగారికి మా మామగారికి కూడా ఐస్ క్రీమ్స్ తీసుకో అంటుంది. ఆ మాటకి అప్పటిదాకా కూల్ గా ఉన్న రాజ్ మళ్ళీ బుసబుసలు ఆడుతూ..  ఇంట్లో ఉండవా.

ఉండవు అని కాదు. ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా ఏదో కాబోయే కోడలుగా నా మర్యాద.  ఉండు నేను తీసుకువస్తాను అని చెప్పి..  ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తీసుకొని ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చేసేయ్ అంటుంది.

వాళ్ళు ఎవరికో నువ్వు తీసుకుంటే నేను డబ్బులు పే చెయ్యాలా అంటే..  అదేంటి ప్రేమించిన అమ్మాయి కోసం ఆ మాత్రం చేయలేవా...
[+] 11 users Like SivaSai's post
Like Reply
Part - 94


పే చెయ్ తొందరగా ఇంటికివెళదాం అంటుంది.ఇంకేమీ చేయలేక సరే సరే ఇస్తున్నాను ఉండు అని మనీ పే చేస్తాడు.  ఇంకా వెళదామా అంటే పద అని కారెక్కుతుంది.

దారి పొడుగు అంత మా అత్తగారు అలాగా... మా మామగారు ఇలాగని వాయించేస్తూ ఉంటుంది. బాబు మాత్రం మంట లేకుండానే మాడిమసైపోతున్నాడు.

కారు సడన్ బ్రేక్ వేస్తాడు. ఏమైంది అని అడిగితే... ఇల్లు వచ్చేసింది అంటాడు.  అప్పుడే వచ్చేసిందా..  నీతో జర్నీ చేస్తూ ఉంటే..  అసలు ఏమీ తెలియడం లేదు రాజ్.
భుజం మీద కొడుతుంది..

నాతో జర్నీ చేసి కాదు.  మీ అత్తగారు మామగారు గురించి చెప్పి చెప్పి నీకు ఏమి టైం తెలియడం లేదు అని కొరకరా చూస్తూ చెబుతాడు.

అది నిజమేలే..   సరే పద లోపలికి వెళ్దాం. నీకు పరిచయం చేయాలి కదా అని చేయి పట్టుకుని లాకెళ్తూ ఉంటుంది.

ఆగు వస్తున్నాను కదా... ఎందుకంత కంగారు... అబ్బా... రాజ్..  కొత్తవాళ్లని పరిచయం చేస్తున్నామంటే ఎంతో హుషారుగా రావాలి.

నువ్వేంటి వస్తున్నాను...  చేస్తున్నాను...  అని ముసలోళ్ళు లాగా సాగదీస్తున్నావు.  అదే మా మామగారు అయితే ఎంత హుషారుగా ఉంటారో తెలుసా అని మల్లి మొదలు పెడుతుంటే...

రెండు చేతులతో దండం పెట్టి..  ఇక వాళ్ల భజన ఆపు. నేను వస్తాను పద అని నివి వెనకాల లోపలికి వెళ్తాడు. రాజ్  ఫ్రస్టేషన్ చూసి నవ్వుకుంటూ లోపలికి వెళుతుంది.

ఇద్దరూ లోపలకి రాగానే.  అవని పరిగెత్తుకుంటూ వచ్చి నివిని హగ్ చేసుకుంటుంది.  కంగ్రాట్స్ మీ ఇద్దరికీ అని చెబుతుంది.

థాంక్యూ వదిన..  అన్నయ్య మీరు నాకు చాలా పెద్ద పార్టీ ఇవ్వాలి.  మీ లవ్ ఓకే అయినందుకు. నవ్వాలో... ఏడవాలో అర్థం కాని పరిస్థితి నాది అనుకుని ఒక నవ్వు నవ్వుతాడు.

ఏంటి అన్నయ్య నేను అడుగుతుంటే.. మీరు సైలెంట్ గా నవ్వుతున్నారు.  మీకు నాకు పార్టీ ఇవ్వడం ఇష్టం లేదు కదా అంటుంది.

అయ్యో అవని అలా లేదమ్మా నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాకుండా ఉందంటే.. మీకేమైంది..  వెంటనే నివి వదిన అత్తయ్య మావయ్య వచ్చారు కదా.. ఏం చేస్తున్నారు.

చెప్పడం మర్చిపోయా... అత్తయ్యవాళ్ళతో కబుర్లు చెబుతున్నారు.  అసలు మీ అత్తయ్య గారు ఎంత స్వీటో తెలుసా? సో క్యూట్. ఎంత యాక్టివ్ గా ఉన్నారో..

అసలు మీ మామయ్య గారి గురించి అయితే చెప్పనవసరం లేదు.  వాళ్ళందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు.

తొందరగా రండి అని నివి చేయబట్టుకుని లాక్కువెళుతూ ఉంటుంది.  వెళుతున్న ఇద్దరినీ చూస్తూ.. అసలు ఈ ఫ్యామిలీ మొత్తం నా గురించి ఏమనుకుంటున్నారు.

ఇప్పుడు అవిని కూడా అందులో జాయిన్ అయిపోయింది...  వాళ్ళు వెనకాల వెళతాడు.  రాజ్ వెనకనుంచి చూస్తూ ఉంటాడు.

నివి వాళ్ళిద్దరి మధ్యకూర్చుని కబుర్లు చెబుతూ ఉంటుంది.  అసలు రాజ్ అనేవాడు ఒకడు ఉన్నాడు అన్న సంగతి కూడా పట్టించుకోరు.

అవిని అందరికీ సర్వ్ చేస్తూ  హడావుడిగా ఉంటుంది. మాధవి, లలిత నివి అత్తయ్యగారితో కబుర్లో పడిపోతారు. మిగిలిన జెంట్స్ అందరూ మంచి బిజీగా ఉంటారు.

రాజ్ నిలబడే బుసబుసలు కొడుతూఉంటాడు.   విక్రమ్ పైకి చూడకుండానే ఏమైందిరా అంత ప్రెస్టేట్ అవుతున్నావు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని గట్టిగా అరుస్తాడు.

ఏం జరుగుతుందో నీకు తెలియదా అని కళ్యాణ్ గారు అనుమానంగా అడిగితే.. మీకు తెలుసా అంకుల్. నాకేంటి రా అందరికీ తెలుసు.

అయినా ఇందులో అంత నువ్వు కోప్పడేది ఏముంది. వచ్చి ఇలా కూర్చో చల్లబడతావు.  అమ్మ అవని రాజ్ కి జ్యూస్ తీసుకురా...

అంకుల్ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు మీకైనా తెలుస్తుందా అంటాడు.  ఏం మాట్లాడతాము.  మేము అందరము పెళ్లి మాటలు మాట్లాడుతున్నాము.

అదే ఎవరితో మాట్లాడుతున్నారు.. ఇంకెవరితో మాట్లాడుతాము. అదిగో వచ్చారు కదా వాళ్లతోనే అంటారు.

నేను అడుగుతుంది అదే వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు అని. వాళ్లతో కాక ఇంకెవరితో మాట్లాడాలి.

ఇదేం ప్రశ్న అంకుల్. మీరు మాట్లాడవలసిన పర్సన్స్ వాళ్ళు కాదు అని కోపంగా అంటాడు.  వచ్చేదారిలో ఏమైనా తొక్కివచ్చావా ఏంటి.

వచ్చిన దగ్గర నుంచి ఏదేదో మాట్లాడుతున్నావు.నేను కాదు అంకుల్ మీరందరూ మాట్లాడుతున్నారు. అసలు నివి అనేటప్పటికి...


కూర్చున్న నివి మావయ్య గారు పైకి లేచి ఇప్పుడు ఎవరితో మాట్లాడాలని నీ బాధంతా అని రాజ్ వైపుకు తిరుగుతారు.  అంతే అప్పుడు దాకా కాకిలాగా ఫ్రెస్టేట్ అయిన రాజ్ ఒక్కసారి నోరు కళ్ళు వదిలేసి నాన్న అని గట్టిగా అరుస్తాడు.

హ నాన్ననే.. ఇందాకటి నుంచి చూస్తున్నాను.  ఏంట్రా నీ గొడవ అని అడుగుతారు.  ఆ మాటకి ఒక్కసారిగా నివి వైపు,  విక్రమ్ వైపుకి చూస్తాడు.

వాళ్ళిద్దరూ వచ్చే నవ్వులు చాలా కష్టంగా ఆపుకుంటూ ఉంటారు.  బలవంతంగా ఆపుకుంటున్నా నవ్వుకి  బుగ్గలు బూరుల్లాగా ఉబ్బి  రెండు కోతుల్లాగా కనబడతారు.

వినయ్ భరత్ కూడా సేమ్ అదే పోసిషన్ ల్లో  ఉంటారు. అంటే తెలిసే మీరందరూ నాతో ఆడుకున్నారా అని విక్రమ్ వైపు చూస్తే ఎస్ అన్నట్టుగా కళ్ళార్పుతాడు. 

ఏరా నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వు విక్రమ్ వైపు చూస్తున్నావు. మీరు వస్తున్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని ఉక్రోషంగా అడుగుతాడు.

అవును మరి మేము ఏమి చెప్పడం లేదు. ఇక్కడ నువ్వు చేసే రాజకీయాలు ఏమైనా మాకు చెబుతున్నావా అని తిరిగి కౌంటర్ వేస్తారు.

ఇక్కడ నేను ఏమి రాజకీయాలు చేశాను. నేను ఏమి చేయలేదు. నువ్వు అసలు వచ్చిన పని ఏంటి చేస్తున్న పని ఏంటి...

మళ్లీ అదే ప్రశ్న... ఏం చేశాను నేను. నువ్వు శ్రీ పెళ్లి కి వచ్చి మాకు కోడల్ని తెచ్చే పని పెట్టుకున్నావా?  మేము తీసుకురాలేమా కోడలని.

అన్ని నువ్వే చేసేసుకొగలను అన్న ధీమానా అని అడుగుతారు. అబ్బా సారథి  ఏంటి అబ్బాయితో నువ్వు మాట్లాడేది అని కరుణ అక్కడికి వచ్చి...

నీ సెలక్షన్ సూపర్ రాజ్ అని హగ్ చేసుకుంటారు.  థాంక్స్ అమ్మ. అయినా ఏంటమ్మా నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వకుండా... అప్పుడే నివికి సపోర్ట్ ఇస్తున్నావు.

నేను ప్రపోజ్ చేసేదాకా ఓపెన్ అవ్వద్దు అని చెప్పావు అంట. తల మీద ఒకటి పీకి..  కొన్ని కొన్ని మెమోరీస్ ఉండాలి రా....

ఏమీ లేకపోతే లైఫ్ చప్పడిగా ఉంటుంది అని చెబుతారు. నన్ను కొడుతున్నావ్ మామ్  అంటే కొట్టడం లేదు రా.
చెబుతున్నాను అని గడ్డం పట్టుకుని చెబుతూ ఉంటారు.

ఎందుకు ఒడిలో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తూ చెప్పవే అని సారథిగారు వెటకారంగా అంటారు.

అబ్బా మీరు ఊరుకోండి సారథి. ఎప్పుడు అబ్బాయిని ఆటపట్టించడమే అని పక్కన కూర్చోబెట్టుకుని ఇంకేంట్రా..  వచ్చి ఇన్ని రోజులైంది.  ఎలా ఉన్నావు ఏమిటి అని అడుగుతారు.

సారధి కళ్యాణ్ వైపు  తిరిగి అమ్మలకి కొడుకులు ఉంటే ఇంకా ఏ ప్రపంచం అక్కర్లేదు.  కొడుకులు ఎంతఎదగిన ఇంకా పక్కన కూర్చోబెట్టుకుని బేబీ కబుర్లు చెప్పినట్టే చెబుతారు అంటారు.

ఆ మాటకి కళ్యాణ్ నవ్వుతూ ఎంత ఎదిగిన కొడుకు అమ్మలకి చంటిబిడ్డే.  నా కొడుక్కి అసలు ఏమీ తెలియదు. ఉత్తిఅమాయకుడు అనుకుంటారు కదా అని కన్ను కొడతారు. అవును ఈ విషయం మాత్రం నిజమే.

అందరూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని రెస్ట్ తీసుకోవడానికి ఎవరి గదులలోకి  వాళ్ళు వెళ్ళిపోతారు. వెళుతున్న నివి చేయిపట్టుకుని రాజ్ గార్డెన్లోనికి తీసుకువెళ్తాడు.

నివి కంగారుగా ఏమిటి రాజ్ నువ్వు చేసేది. ఎవరైనా చూస్తే అని చుట్టూ చూస్తూ ఉంటుంది.  అబ్బా ఎవరూ చూడడం లేదు అని గార్డెన్లోకి తీసుకువెళ్లి..

అక్కడ ఉయ్యాల్లో కూర్చొని వోళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడు ఏంటో అబ్బాయిగారికి ఇంత ప్రేమ వచ్చింది అని అడుగుతుంది.  ప్రేమ కాదు కోపం వస్తుంది అంటాడు.

ఎందుకు... నన్ను ఇంత దారుణంగా ఏడిపిస్తారా...ఎవరు ఏడిపించారు.  నీకు అర్థం కాకపోతే నాదా తప్పు. నేను ఏమని చెప్పాను.

మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అని చెప్పాను. ఇంకెవరిని పిలుస్తాను అలాగ...  నువ్వు బుర్ర వాడకపోతే నాదా తప్పు అని కళ్ళు టపటప కొడుతుంది.

నీకన్నీ మీ అన్న తెలివితేటలే వచ్చాయి. అన్నీ చెప్పినట్టే చెబుతారు కానీ తిన్నగా ఒక్కటి చెప్పరు. ఇందాక నువ్వు రాజ్... మీ అమ్మానాన్న వచ్చారు ఇంటికి వెళదామా అంటే నాకు అర్థం అయ్యేది కదా.....

ఆ ఫీల్ ఎంత బాగా ఎంజాయ్ చేసేవాడిని. కానీ నువ్వు తిరగేసి చెప్పేటప్పటికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటే... నా మీద నీకు నమ్మకం లేదా అని కోపం గా అడుగుతుంది.

నేను ఆ మాట ఎప్పుడన్నాను అని అయోమయంగా చూస్తాడు.  ఇప్పుడు నువ్వు అన్నదానికి అర్థం అదే కదా.. నిన్ను ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాననే కదా నువ్వు మాట్లాడింది.

రాజ్ ఒడిలో నుంచే స్పీడ్ గా లేచి..  నువ్వు అసలు నాతో మాట్లాడకు. నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పి గబగబా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది.


ఓరి దేవుడా వీళ్ళతో ఎలా మాట్లాడినా తిప్పలు మనకేనా.. అసలు మగ జాతికి మాట్లాడే అవకాశం ఇవ్వరా...

నివి గది బయటే నిలబడిన రాజ్ ని చూసి వినయ్,  భరత్ ఇద్దరూ నవ్వుతారు.  వాళ్ళిద్దరిని చూసి ఏంట్రా నవ్వుతున్నారు.

నీకు ముందే హింట్ ఇచ్చాము..  అన్ని ఆలోచించుకో తర్వాత బుక్ అయిపోతే ఎవరు ఏమీ చేయలేము అంటే... నివి గుడ్ గర్ల్. అమాయకరాలు అన్నావు.  ఇప్పుడు దూల తీరిందా అని అడుగుతారు.

రాజ్ సీరియస్గా వాళ్ళని చూస్తూ నాకు ఒక్కటి అర్థమైంది రా అంటాడు. ఏంట్రా అంటే మీ ఫ్యామిలీలో కొంచెం గోరోజనం ఎక్కువ కదా...

ఇంత లేటుగా నువ్వు తెలుసుకుంది అని వినయ్, భరత్ ఇద్దరు ఒకరికి ఒకరు హైపె ఇచ్చుకుంటారు.

మీరిద్దరి ఇంతకీ ఇంత అనుభవిస్తారు ఇదే నా శాపం అంటే...  ఇంటి అల్లుడు శాపాలు పనిచేయవు అంట బావ అని వినయ్ ఇంకా ఏడిపిస్తాడు.

ఒక్కసారి మనం విక్రమ్ అవిని దగ్గరికి వెళదామా...

కథ కొనసాగుతుంది...
[+] 11 users Like SivaSai's post
Like Reply
Superb update
Like Reply
Chala cute ga raasaru emotions.. especially Nivi Raj ni edipinchatam..
Like Reply
Kv garu mamulu story kadu anthaku minchi
Like Reply




Users browsing this thread: Sachin@10, Sun217, 4 Guest(s)