Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
Excellent update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
adiripoindi update
Like Reply
అద్భుతం అత్యద్భుతం మహాద్భుతం.....
అద్భుతమైన అప్డేట్ ఇచ్చారు...
ఎయిర్పోర్ట్ సీన్ అద్భుతంగా ఉంటుంది
Thanks for wonderful update
Like Reply
Sad 
Update bro
Sherlock holmes  cool2
Like Reply
Sad 
Update bro
Sherlock holmes  cool2
Like Reply
Ivvala update leda Siva garu?
Like Reply
(07-02-2026, 10:55 PM)ash.enigma Wrote: Ivvala update leda Siva garu?

Sorry For Delay Update

Update in 15 Minutes
[+] 2 users Like SivaSai's post
Like Reply
ఎపిసోడ్ 65


గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న ముకుల్ ఫ్యామిలీ మెంబర్స్ తో అభిజిత్ మాట్లాడుతూ ఉండగా అక్కడకు వచ్చి వరదరాజులు దగ్గరికి వెళ్లి సార్ మన డబ్బు పోయిన బ్యాగ్ పట్టుకుని నారప్ప అంట వచ్చాడు మిమ్మల్ని కలవాలి అంటున్నాడు అని చెప్పాడు సెక్యూరిటీ ఆఫీసర్.

*******************

సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పిన మాట విని "నారప్ప! ఎవడ్రా వాడు? ఆ పక్షి ఎత్తుకు వెళ్ళిన  బ్యాగ్ వాడి చేతిలోకి ఎలా వెళ్ళింది? లోపలికి తీసుకురా చూద్దాము." అని చెప్పాడు వరదరాజులు.

వీడియో కాల్ లో ఉండి ఆ మాట విని "వరద! ఒక్క నిమిషం ఉండు, అసలు అతను ఎవరో ముందు తెలుసుకోండి కంగారు పడి లోపలికి ఎవరిని రానివ్వకండి." అని చెప్పాడు ముకుల్.

"సరే అయ్యా!" అని మొబైల్ లో సీసీ కెమెరా ఆన్ చేసి గేటు దగ్గర ఉన్న నారప్పని చూసి "అయ్యా!  గట్టిగా కొడితే ఒక దెబ్బకు చచ్చేటట్లు ఉన్నాడు." అని చెప్పాడు వరదరాజులు.

మొబైల్ లో చూస్తూ "అవును సార్! వాడికి బ్యాగ్ ఎక్కడో దొరికినట్టు ఉంది. మనది అని తెలిసి భయపడి ఇవ్వడానికి తీసుకువచ్చాడు అనుకుంట!" అని చెప్పాడు తంబియార్.

"ఆ బ్యాగ్ మీదే అని అతనికి ఎలా తెలిసింది? ముందు ఆ విషయం తెలుసుకోండి." అని వీడియో కాల్ లో చూస్తూ చెప్పింది అర్ణ.

"సరే పాప! మీ భయం నాకు అర్థమైంది అని తన మనుషుల్ని పిలిచి ఒరేయ్ అందరూ ఇక్కడే ఉండండి లోపలికి వచ్చిన వాడు ఏమైనా ఎగస్ట్రాలు చేస్తే నరికి పారేయండి." అని చెప్పాడు వరదరాజులు.

"సరే అయ్యా!" అని పదిమంది కత్తులు పట్టుకుని రెడీగా నుంచొని ఉన్నారు వరదరాజులు మనుషులు.

సెక్యూరిటీ ఆఫీసర్ తో పాటు లోపలికి వస్తున్నా నారప్పని అతని చేతిలో ఉన్న బ్యాగ్ ని చూసి "సేమ్ బ్యాగ్ లోపల కాష్ ఉందో లేదో! అయినా వీడికి అది ఎక్కడ దొరికింది?" అని డౌట్ గా చూస్తూ అన్నాడు సుజిత్.

అక్కడికి వస్తు వీల్ చైర్ లో ఉన్న అభిజిత్ వైపు చూసి "బాగున్నారా? నన్ను చూస్తే మీకు ఎవరైనా గుర్తుకు వస్తున్నారా?" అని అడిగాడు  నారప్ప.

ఆ మాట విని దగ్గరికి వచ్చిన నారప్ప వైపు చూస్తూ "సహదేవుడు!" అని చెప్పాడు అభిజిత్.

"అవును మీరు చెప్పింది కరెక్టే! నేను సహదేవుడి తమ్ముడిని నా పేరు నారప్ప!" అని చెప్పాడు.

తన మనుషుల వైపు చూసి "గేట్స్ క్లోజ్ చేయండి." అని చెప్పి నారప్ప వైపు చూసి "నిన్ను అభీర్ ఇక్కడికి పంపించాడా?" అని అడిగాడు అభిజిత్

వీడియో కాల్ లో నారప్పని చూస్తూ "అతనితో మాటలు ఎందుకు చంపి అవతల పారేయండి." అని కోపంగా చూస్తూ చెప్పాడు ముకుల్.

అడ్డంగా ఉన్న సెక్యూరిటీ వాళ్ళని పక్కకు జరిపి ముందుకి వచ్చి "నువ్వు ఆ ఆడవి మనిషికి అభీర్ కి సంబంధించిన వాడివా? ఇక్కడికి ఒంటరిగా వచ్చావు, చావడానికి అంత తొందరగా ఉందా?" అని వెటకారంగా చూస్తూ అడిగాడు రఘురామ్.

ఆ మాట విని రఘురాం కళ్ళలోకి సూటిగా చూస్తూ "ఆవును! మా నాయకుడు ఆజ్ఞ ఇస్తే ఇక్కడే చచ్చిపోతాను." అని సీరియస్ గా చెప్పాడు నారప్ప.

"ఏంటి? మాకు వార్నింగ్ లెటర్ పంపించిన ఆ అభీర్ సేనకు  సంబంధించిన వాడివా?" అని నవ్వుతూ "మీ నాయకుడు నీలాంటి వాళ్ళని వెంటపెట్టుకుని నాకు వార్నింగ్ ఇచ్చాడా?" అని వెటకారంగా అడిగాడు వరదరాజులు.

"అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ముందు ఆ విషయం తెలుసుకోండి." అని వీడియో కాల్ లో చూస్తూ చెప్పింది అర్ణ.

నారప్ప వైపు చూస్తూ "అభీర్ నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు? ఇంతకీ మీ నాయకుడు ఎక్కడ దాక్కున్నాడు?" అని అడిగాడు నిర్మల్.

"మా నాయకుడిని చూడాలని ఉందా? నీ చావు దగ్గర పడినప్పుడు తప్పకుండా కనిపిస్తాడు." అని చెప్పాడు నారప్ప.

ఆ మాట విని కోపంగా చూస్తూ "మా ముందుకు ఒంటరిగా వచ్చి పొగరుగా మాట్లాడి చాలా తప్పు చేసావు." అని తన మనుషుల వైపు చూసి "ఒరేయ్ వీడిని తలకిందులుగా కట్టండి నిజం నోట్లో నుంచి ఆటోమెటిక్ గా వస్తుంది." అని చెప్పాడు నిర్మల్.

వీడియో కాల్ లొ చూస్తూ " అతని కళ్ళ ముందు  అంతమంది కత్తులతో ఉన్న భయం లేకుండా కళ్ళలో బెరుకు లేకుండా చూస్తున్నడు, ముందు వాడిలో ఉన్న ధైర్యాన్ని చంపేయండి." అని గట్టిగా అరిచింది అర్ణ.

తన మీదకి వస్తున్న మనుషుల్ని చూసి "ఒక్క నిమిషం!  టైమ్ ఎంత అయ్యిందో తెలుసుకోవచ్చా!" అని అడిగాడు నారప్ప.

ఆ మాట విని "ఆగండ్రా!" అని నారప్ప వైపు చూసి "చెప్పడానికి ఏదైనా ముహూర్తం ఉందా? టైం 11:35 అయింది. అయ్యితే ఏంటి?" అని చెప్పాడు తంబియార్.

"నేను ఇంకా ఇక్కడ ఐదు నిమిషాలు ఉంటాను తర్వాత మీరు ఉండమన్నా ఉండను నా పని చూసుకుని వెళ్ళిపోతాను." అని చెప్పాడు నారప్ప.

ఆ మాటకి కోపంగా మీదకి వెళుతున్న నిర్మల్, తంబియార్ లని ఆపి  నారప్ప దగ్గరికి వచ్చి "అభీర్ తో నేను ఒకసారి మాట్లాడాలి ఈ గొడవలన్నీ ఇక్కడితో ఆపేయాలి అనుకుంటున్నాను." అని అడిగాడు ముకుల్ రెండో కొడుకు ప్రవీణ్.

"ఒక్క నిమిషం!" అని మొబైల్ తీసి వీడియో కాల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూపించడు నారప్ప.

వీడియో కాల్ లో ఉన్న మనిషిని చూసి "అభీర్!" అని  చెప్పాడు అభిజిత్.

నారప్ప చేతిలో ఉన్న మొబైల్ దగ్గరికి వచ్చి "నువ్వే నా అభీర్? నేను ముకుల్ నంద గారి రెండో కొడుకుని నా పేరు ప్రవీణ్!

మా వాళ్ళు ఆ కొండలు కోసం నీ మనుషులను చంపారని  తెలిసింది. అంతేకాకుండా నిన్ను 12 ఏళ్ళు జైల్లో ఉంచారు అని కూడా కూడా తెలిసింది. అది విని నీ మీద  కొంచెం జాలి వేసింది. అందుకే  నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను.

నీకు ఎంత డబ్బు కావాలో అడుగు ఇస్తాను ఆ కొండలు మాకు హ్యాండ్ ఓవర్ చేసి నీ మనుషుల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో ప్రాణాలతో వదిలేస్తాము." అని చెప్పాడు ప్రవీణ్.

"నాకు ఏ డబ్బు అవసరం లేదు, ఆ కొండలు నీకు ఇస్తాను  నా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాను, కానీ నాకు నీ ఇద్దరి పిల్లల తలలు కావాలి." అని వీడియో కాల్ లొ కసిగా చూస్తూ చెప్పాడు  అభీర్.

ఆ మాట విని ఆవేశంతో ఊగిపోతూ "ఏంట్రా  వాగుతున్నావు? నీకు అంత మంచి ఆఫర్ ఇస్తే నా పిల్లల తలలు కావాలి అంటావా? నీ పొగరుకి బహుమానంగా ఇక్కడికి వచ్చిన నీ మనిషి తల పంపిస్తాను." అని కోపంగా చూస్తూ చెప్పాడు ప్రవీణ్.

"నీ పిల్లల తలలు ఇవ్వమంటేనే నీకు కోపం వచ్చింది. నా వాళ్ళని అంత మందిని చంపితే నాకు కోపం రాదా? నేను మీ నాన్నకి ఒక మాట ఇచ్చాను,  అతని వంశంలో ఎవరూ లేకుండా చేస్తాను అని, నేను మాట తప్పను నారప్ప ఇంకా రెండు నిమిషాలు మాత్రమే టైం ఉంది." అని చెప్పి ఫోన్ కట్ చేసాడు అభీర్.

వీడియో కాల్ లో అక్కడ జరిగేదంతా చూస్తూ "మనతో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళకి తెలియాలి, అక్కడికి వచ్చిన వాడి మనిషి తల నరికి ఆ బ్యాగ్ లొ పెట్టి పంపించండి." అని చెప్పింది అర్ణ.

అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూసి "మనవాళ్లు వీడిని నరికి చంపుతూ ఉంటారు సరదాగా చూసి ఎంజాయ్ చేయండి." అని తన మనుషుల వైపు చూసి "ఒరేయ్! వీడిని నరికి నరికి చంపండి." అని చెప్పాడు వరదరాజులు.

ఆ మాటకి నవ్వుతూ చేతిలో ఉన్న సూట్ కేస్ కింద పెట్టి "మా అభీర్ సేన బలం ఏమిటో నీకు చూపించమని మా నాయకుడు నన్ను ఇక్కడికి పంపించాడు. మీ అందరికీ మా బలంతో పాటు భయం కూడా చూపిస్తాను." అని చెప్పి మీదకి వస్తున్న వాడిని ఎగిరి తన్ని నేల మీద పడుకోపెట్టి కాలి బొటన వేలుతో గొంతు దగ్గర గట్టిగ నొక్కాడు నారప్ప.

అది చూసి భయంతో వెనక్కి వెళ్ళాడు రఘురామ్.

షాక్ అయ్యి చూస్తున్న అక్కడ ఉన్న వారి వైపు చూసి "అభీర్ సేనలో ఒక సైనికుడే ఇలా ఉంటే, ఇంక మా నాయకుడు ఎదురుపడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి." అని పరిగెత్తుకుంటూ వస్తున్న ఇద్దరి మీదకి దూకి మెడలు వెనక్కి విరిచి కింద పడేసాడు నారప్ప.

భయంగా చూస్తున్న సుజిత్ దగ్గరకు వెళ్లి "సార్! ఎందుకైనా మంచిది మీరు కొంచెం వెనక్కి రండి." అని చెప్పింది రియా.

"కరెక్ట్!" అని అక్కడి నుంచి వెనక్కి వెళ్లి "చూడడానికి సన్నగా పుల్లలాగా ఉన్నాడు ఎగిరి కొడితే ఒక దెబ్బకి మనిషి చచ్చిపోతున్నాడు." అని కంగారుగా చూస్తూ అన్నాడు సుజిత్.

వీడియో కాల్ చూస్తూ "వాడిని షూట్ చేసి పారేయండి." అని గట్టిగా అరిచాడు ముకుల్.

గన్ బయటికి తీసిన వరదరాజులు మనిషి మీదకు వెళ్లి ట్రిగ్గర్ నొక్కుతున్న వేలుని తన దగ్గర ఉన్న కత్తితో నరికి "మాకు దొంగ దెబ్బ తీయడం రాదు, శత్రువు  ఎంత బలవంతుడైన సరే  ఎదురెళ్లి పోరాడమే వచ్చు!" అని తన మీదకి కత్తులతో వస్తున్న ఇద్దరి వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి తన దగ్గర ఉన్న చిన్న కత్తితో చేతి నరాలు కట్ చేశాడు నారప్ప.

చేతి నరాలు కట్ అవ్వడంతో కత్తులు కింద పడేసి గట్టిగా అరుస్తూ ఉన్నారు ఇద్దరు.

అది చూసి కోపంతో ఊగిపోతు తన మనుషుల వైపు చూసి "అందరూ ఒక్కసారి చుట్టుముట్టండి ఎట్టి పరిస్థితుల్లో వాడు ఇక్కడి నుంచి పారిపోకూడదు." అని గట్టిగా అరిచాడు వరదరాజులు.

"ఏంటి? నేను వచ్చిన పని అవ్వకుండా పారిపోవడమా!" అని పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడ్డ రెండు కత్తులని చేతిలోకి తీసుకుని

"మా నాయకుడి నోటి నుంచి వచ్చిన సమయం వచ్చింది." అని వేగంగా పరిగెడుతూ గాలిలోకి ఎగిరి దూరంగా నుంచుని ఆశ్చర్యంగా చూస్తున్న ప్రవీణ్ తల నరికేశాడు నారప్ప.

అది చూసి ఒక్కసారి షాక్ అయ్యి "డాడ్!" అని గట్టిగా అరిచాడు విష్ణు.

తల పట్టుకుని సూట్ కేసులో పెట్టుకుని పరిగెడుతున్నా నారప్ప వైపు భయంగా చూస్తూ ఉండిపోయారు అక్కడ ఉన్న వారందరూ.
[+] 10 users Like SivaSai's post
Like Reply
ఎపిసోడ్ 66


గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి వరదరాజులు మనుషుల్ని కొట్టి ముకుల్ రెండో కొడుకు ప్రవీణ్ తలనరికి బ్యాగ్ లో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నారప్ప.

*****************

ప్రవీణ్ తల నరికి దర్జాగా సూట్ కేసులో పెట్టుకుని వెళ్ళిపోతున్న నారప్ప వైపు భయంగా చూస్తూ 'ఈ టైమ్ కి  వీళ్ళు ఇండియా రాకపోతే ఆ తల నాదై ఉండేదేమో!' అనుకున్నాడు సుజిత్.

"ఆ నారప్ప గాడు తల తీసుకుని అంత దర్జాగా వెళుతుంటే చూస్తూ నుంచున్నారేమిటిరా? వెళ్లి అడ్డంగా నరికేయండి." అని గట్టిగా అరిచాడు  అభిజిత్.

ఆ మాట విని గేట్ వైపు పరిగెత్తారు వరదరాజులు మనుషులు.

గేటు వైపు పరిగెత్తిన వాళ్ళ వెనకాలే వెళుతున్న నిర్మల్, మోహిత్, ప్రమోద్ వాళ్ళని వీడియో కాల్ లో చూస్తూ "అందరూ అక్కడే ఉండండి ఎవరు బయటకు వెళ్ళకండి  ఆ అభీర్ మనిషి ఒక్కడే రాడు మనలో మరొక ప్రాణం పోవడం నేను చూడలేను." అని గట్టిగా అరిచి ఏడుస్తూ ఉన్నాడు ముకుల్.

ఆ మాట విని అక్కడే ఆగి ప్రవీణ్ బాడీ దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉన్నారు అందరు.

"ఇండియా వెళ్ళద్దు అని తాతగారు ముందే చెప్పారు కానీ మనమే ఆయన మాట వినకుండా వచ్చేసాము." అని ఏడుస్తూ చెప్పింది ఆశ.

వీడియో కాల్ చూస్తూ "అభిజిత్! వాళ్ళని ఎలాగైనా సేఫ్గా లండన్ కి పంపించు." అని చెప్పాడు ముకుల్.

ఆ మాట విని కోపంగా చూస్తూ "మీ కొడుకుని చంపితే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు ఏమో! నా తండ్రిని చంపితే నేను చేతులు కట్టుకుని కూర్చోలేను, దీనికి కారణమైన వాళ్ళని చంపిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వస్తాను." అని ఏడుస్తూ చెప్పాడు విష్ణు.

"సరే! మేము వచ్చేవరకు ఎవరు ఆ గెస్ట్ హౌస్ వదిలి బయటకు వెళ్ళకండి. లోపలికి ఎవరని రానివ్వకండి ఇప్పుడే తాతగారు నేను ఇండియాకి బయలుదేరుతున్నాము." అని చెప్పి కాల్ కట్ చేసింది అర్ణ.

అంతలో అక్కడకి వచ్చి "సార్! వాడు ఎటు వెళ్లిపోయాడో తెలియదు ఎక్కడ కనపడలేదు." అని చెప్పాడు వరదరాజులు మనిషి.

ఆ మాట విని కోపంగా చూస్తూ "అయ్యగారికి ఇచ్చిన మాట  నిలబెట్టుకోలేకపోయాను, వాడు వాడి నాయకుడు నా నుంచి ఎలా తప్పించుకుంటారో చూస్తాను." అని కొడుకు వైపు చూసి "ఎస్పీ ప్రహ్లాద్ కి ఫోన్ చేసి రమ్మను." అని చెప్పాడు వరదరాజులు.

"ఆ ఎస్పి అంత గట్టోడా? అభీర్ ని వాడి మనుషులను పట్టుకుంటాడా?" అని అడిగాడు ముకుల్ చిన్న అల్లుడు రాజేష్.

"ఆ ఎస్పీ వాళ్ళని  పట్టుకోవడమే కాదు, ఒకొక్కడి పేగులు తీసి మెడలో వేసుకుంటాడు." అని చెప్పాడు తంబియార్.

"ఆ అభీర్ సేనని వేటాడడానికి సెక్యూరిటీ ఆఫీసర్లు ఒక్కరే సరిపోరు ప్రొఫెషనల్ కిల్లర్స్ ని కూడా దింపాలి రష్యన్ నుంచి నెల్సన్ గ్యాంగ్ ని పిలిపిస్తాను మనం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో వాడికి రోజు చూపిస్తాను." అని ఆవేశంగా చెప్పాడు మోహిత్.

"మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు నా ఆస్తి మొత్తం పోయిన పర్వాలేదు మా డాడ్ ని చంపిన వాళ్ళు మాత్రం బతికి ఉండకూడదు." అని చెప్పాడు విష్ణు.

చనిపోయిన ప్రవీణ్ వైపు చూసి బాధపడుతూ "నిర్మల్! అస్సాం కి ఫోన్ చేసి సాధు గ్యాంగ్ ని బయలుదేరి రమ్మను రమ్మను, మనం మెత్తగా ఉంటే వాళ్ళు నమన భుజాలు ఎక్కి కూర్చుంటారు. అలాగే సాయంత్రం జాకీ ఫ్లైట్ దిగుతాడు వాడిని సేఫ్గా గెస్ట్ హౌస్ కి తీసుకురండి." అని చెప్పాడు అభిజిత్.

అక్కడ ఉన్న అందరి మాటలు విని సుజిత్ దగ్గరికి వెళ్లి "సార్! నాకు చాలా భయంగా ఉంది నేను ఇంటికి వెళుతున్నాను." అని చెప్పింది రియా.

"సరే  జాగ్రత్తగా వెళ్ళు  నిన్ను డ్రాప్ చేయడానికి రాలేకపోతున్నాను." అని చెప్పాడు సుజిత్.

"నో ప్రాబ్లం సార్!" అని అక్కడి నుంచి బయటికి వచ్చింది రియా.

*****************

సూట్ కేస్ పట్టుకుని ఇంటి దగ్గరకి వచ్చిన నారప్పని చూసి సంతోషంగా దగ్గరికి వెళ్లి భుజం మీద చేతులు వేసి "సహదేవుడి  ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది వీడి తలని కూడా ఆ డబ్బుల కట్టలలో వేసి తగలబెట్టండి." అని చెప్పి ఫోన్ తీసి నీలమ్ కి కాల్ చేశాడు అభీర్.

ఆఫీసులో వర్క్ లో ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి 'అభీర్ కాల్ చేస్తున్నాడు.' అని సంతోషంగా లిఫ్ట్ చేసి "హయ్!" అని చెప్పింది నీలమ్.

"హయ్! నాకు హెల్ప్ చేస్తాను అన్నావు కదా! నేను చెప్పే విషయం న్యూస్ ఛానల్ లో ధైర్యంగా టెలికాస్ట్ చేయగలవా?" అని అడిగాడు అభీర్.

"ఆ లాయర్ హిరణ్య చచ్చిన తర్వాత మా ఎండీకి ధైర్యం వచ్చింది. నువ్వు ఏం చెప్తావో అది న్యూస్ లొ వస్తుంది." అని చెప్పింది నీలమ్.

"సరే! ముకుల్ రెండో కొడుకు నా మనిషి చేతిలో చనిపోయాడు ఈ చావులు వల్ల వాళ్ళ మీద ఎవరికి జాలి రాకూడదు అసలు నిజం అందరికీ తెలియాలి.

ఈరోజు నుంచి మీ ఛానల్ లొ మా జారువా తెగ స్టోరీ స్టార్ట్ చెయ్! మాకు జరిగిన అన్యాయం చూపించు, మీ ఛానల్ కి మీకు నేను అండగా ఉంటాను." అని చెప్పాడు అభీర్.

"నువ్వు మాట ఇచ్చావు అంటే చాలు ఇక నేను చూసుకుంటాను, ఈ రోజు సాయంత్రం నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది." అని సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేసింది నీలమ్.

ఫోన్ మాట్లాడుతున్న అభీర్ దగ్గరకి చాక్లెట్ తో కలిసి వచ్చి "అన్న!" నువ్వు చేసేది తప్పు అని నేను చెప్పను, కానీ ఏ తప్పు చేయని ఆ ఇంటి ఆడవాళ్ల పరిస్థితి ఏమిటి?" అని అడిగింది మిత్ర.

"ప్రజల శ్రేయస్సు కోసం ఆడది అయ్యినా రాక్షసి తాటకిని రాముడు శిక్షించాడు, అలాగే తన వంశాన్ని ప్రజలని రాజ్యాన్ని నాశనం అవ్వాలని శపించిన ధృతరాష్ట్రుడు భార్య గాంధారిని శ్రీకృష్ణుడు క్షమించాడు.

శిక్షా అనేది ఆడ మగ తేడా ఉండదు వారి ప్రవర్తనని బట్టి ఉంటుంది. ఆ ఇంటి ఆడవాళ్లు పాపబితి చెందితే బతుకుతారు లేకపోతే చనిపోతారు." అని చెప్పాడు అభీర్.

"నువ్వు చెప్పింది నిజమే అన్న! ధర్మం, న్యాయం అందరికీ సమానమే ఎవరి కోసం మారదు." అని సంతోషంగా చూస్తూ చెప్పింది మిత్ర.

"అక్క! రాజు ఫోన్ చేసాడు ఆ జాకీ దుబాయ్ నుంచి వస్తున్నాడు ఈరోజు సాయంత్రం ఎయిర్ పోర్ట్ లో దిగుతున్నాడు." అని చెప్పాడు చాక్లెట్.

"అవునా? ఆ జాకీ గాడి చావు నా చేతుల్లోనే ఉంది." అని ఆవేశంగా చెప్పింది మిత్ర.

ఆవేశం గా ఉన్న మిత్ర వైపు చూసి "ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ప్రశాంతంగా ఉండు, ముకుల్ కొడుకు చావుతో వాళ్లు కచ్చితంగా జాగ్రత్త పడతారు, ఈ సమయంలోనే మనం తెలివిగా ఉండాలి శత్రువు బలం తెలుసుకోకుండా మనం అడుగు ముందుకు వేయకూడదు." అని చెప్పాడు అభీర్.

అక్కడకి వస్తూ "అభీర్ చెప్పింది నిజం! వరదరాజులు ఎస్పీ ప్రహద్ ని రంగంలోకి దింపుతున్నాడు, సుభాష్ కొడుకు మోహిత్ రష్యా నుంచి ప్రొఫెషనల్ కిల్లర్ నెల్సన్ గ్యాంగ్ ని దింపుతున్నాడు, అభిజిత్ కొడుకు నిర్మల్ అస్సాం నుంచి సాధు గ్యాంగ్ ని దింపుతున్నాడు, అంతేకాదు అర్ణ మాకుల్  ఇండియాకి స్టార్ట్ అయ్యరు." అని చెప్పింది రియా.

తను చెప్పింది విని "బైరి వాళ్లకి హెల్ప్ చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి డీటెయిల్స్ నాకు కావాలి జాజి, నారప్ప తప్పితే అందరు రంగలోకి దిగండి." అని చెప్పాడు అభీర్.

"సరే నాయుకుడా!" అని తన వాళ్ళందరినీ పిలిచాడు బైరి.

"నేను కూడా వెళ్లి అర్ణని రిసీవ్ చేసుకుంటాను." అని చెప్పింది మిత్ర.

అక్కడికి వచ్చిన తన వాళ్ళ వైపు చూసి "మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి  మనలో ఒక్క ప్రాణం కూడా పోకూడదు వాళ్లలో ఒక్క ప్రాణం కూడా మిగలకూడదు, నేను చెప్పే వరకు ఎవరు ఆవేశపడకండి జై భవాని!" అని ఆవేశంగా చెప్పాడు అభీర్.

"జై భవాని, జై భవాని!" అని చెపుతూ అక్కడనుంచి బయలుదేరారు అభీర్ సేన.

"నాయకుడా ఇప్పుడు మన ప్లాన్ ఏమిటి?" అని అడిగాడు బైరి.

"మన పద్మవ్యూహం లోపలికి వాళ్ళని స్వేచ్ఛగా రానివ్వండి. అక్కడ నుంచి ఎవరు వెనక్కి వెళ్ళలేరు నేను చెప్పిన ప్లాన్ స్టార్ట్ చేయండి." అని చెప్పాడు అభీర్.

"సరే నాయకుడా!" అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు రాజన్ వాళ్ళ ఐదుగురు.

******************

లండన్ నుంచి ముకుల్, అర్ణ, టూర్ నుండి మహేష్ మిథున్, దుబాయ్ నుంచి జాకి  రావడంతో ఉదయం ప్రవీణ్ కి అంత్యక్రియలు చేసి "అంకుల్! మనం ఇంకా భయపడుతూ బ్రతకకూడదు మీలో నేను పాత ముకుల్ ని చూడాలి." అని చెప్పాడు అభిజిత్.

"నా ఫ్యామిలీలో ఎవరికి ఈ పరిస్థితి రాకూడదు అని దూరంగా పారిపోయాను కానీ ఆ అభీర్ నన్ను మళ్ళీ ఇక్కడికి వచ్చేటట్లు చేశాడు ఇన్ని రోజులు ఆ తెగ వాళ్ళ జోలికి వెళ్లి నిన్ను తప్పు చేశాను అనుకున్నాను.

కానీ వాడిని చంపకుండా జైల్లో పెట్టి ఇక్కడ నుంచి పారిపోయి తప్పు చేశాను అని ఇప్పుడే తెలుసుకున్నాను, ఇకనుంచి నేనేమిటో వాడికి చూపిస్తాను ఆ బేరా కొండల మీదే నా నంద సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను." అని ఆవేశంగా చెప్పాడు ముకుల్.

అక్కడ బాధపడుతున్నట్లు నటిస్తూ కొడుకుని తీసుకుని దూరంగా వెళ్లి "ఏంటి? ఈ ముక్కోడు చేసేది. వాళ్లలో ఒక బచ్చ గాడు వచ్చి అతమంది ముందు తల నరికి దర్జాగా వెళ్ళిపోయాడు.

అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఇంక వీడు పీకేది ఏముంది?" అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"నువ్వు చెప్పింది నిజమే డాడ్! వాళ్లు మామూలు వాళ్ళు కాదు, ఆ నారప్ప గాడే అలా ఉన్నాడు అంటే వాళ్ళ నాయకుడు అభీర్ ఎలా ఉంటాడో తలుచుకుంటూనే భయం వేస్తుంది." అని చెప్పాడు సుజిత్.

"మనం ఇకనుంచి ప్రేక్షకా పాత్ర వహిద్దాము వాళ్ళు వాళ్ళు కొట్టుకు చాస్తారు ఎవరు మిగిలితే వాళ్లవైపు వెళ్లి నుంచుందాము." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
[+] 11 users Like SivaSai's post
Like Reply
(07-02-2026, 11:27 PM)SivaSai Wrote: Sorry For Delay Update

Update in 15 Minutes

Nee dedication adurs Siva bro.
Story ni matram urakalu pettistunnav!!!
Jai Bhavani!!
Like Reply
Excellent update
Like Reply
ఎపిసోడ్ 67


మన పద్మవ్యూహంలోకి వాళ్ళని స్వేచ్ఛగా రానివ్వండి నేను చెప్పే వరకు ఎవరు ఆవేశపడకండి అని చెప్పి అక్కడి నుంచి తన వాళ్ళని పంపించాడు అభీర్.

ప్రవీణ్ కి అంత్యక్రియలు చేసి నేను ఇక్కడి నుంచి వెళ్లి తప్పు చేశాను నా పవర్ ఏమిటో చూపిస్తాను అని చెప్పాడు ముకుల్.

*****************

మరుసటి రోజు ఉదయం తన గెస్ట్ హౌస్ దగ్గర ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చున్న ముకుల్ దగ్గరికి వచ్చి "తాతయ్య! ఒక టీవీ ఛానల్ లో జారువా తెగ గురించి డాక్యుమెంటరీని డైలీ ఎపిసోడ్స్ గా రిలీజ్ చేస్తున్నారు." అని చెప్పింది అర్ణ.

"ఆ డాక్యుమెంటరీ పూర్తి అయింది అంటే అభీర్ కి ప్రజల మద్దతు పెరుగుతుంది. వాడు ఏది చేసినా కరెక్ట్ అంటారు  గవర్నమెంట్ కూడా మనకి రివర్స్ అవుతుంది." అని చెప్పాడు అభిజిత్.

"మనం ఆ డాక్యుమెంటరీని ఆపలేమా? అవసరమైతే ఆ ఛానల్ ని కొనేయండి." అని చెప్పాడు ముకుల్.

"మనం ఇప్పుడు ఆ చానల్ జోలికి వెళ్ళిన డాక్యుమెంటరీ తీసిన వాళ్ళ జోలికి వెళ్లిన రివర్స్ అవుతుంది. మనం చేయవలసింది ఏమిటంటే అది పూర్తయ్యలోపు ఈ జారువా తెగకి సంబంధించి ఒక్కడు కూడా బతికి ఉండకూడదు, ఆ బైరి కొండలు ఉండకూడదు అదంతా ఒక కథలానే మిగిలిపోవాలి." అని చెప్పాడు నిర్మల్.

"ఎస్! నిర్మల్ చెప్పింది కరెక్ట్! మనం ఆ కొండలు తవ్వడం మొదలుపెడితే ఆ తెగ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే బయటికి వస్తారు దొరికిన వాడిని  దొరికినట్టు అక్కడ పాతి పెట్టడమే!" అని చెప్పాడు తంబియార్.

"మీరు ఆ కొండలు తవ్వే పని చూడండి అక్కడికి వచ్చిన వాళ్ళని చంపే పని నేను చూసుకుంటాను." అని ఆవేశంగా అన్నాడు విష్ణు.

మహేష్ తో కలిసి అక్కడికి వస్తూ "ఏ పనైనా మన చేతికి మట్టి అంటకూడదు మన ఇంటి పేరు మీద మరక పడకూడదు." అని చెప్పాడు మిథున్.

"ఆ కొండల దగ్గర ఏదో శక్తి ఉంది నేను కళ్ళారా చూశాను మనం ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి ఈసారి ఒక్క ప్రాణం కూడా పోకూడదు." అని చెప్పాడు జాకీ.

అక్కడికి వస్తున్న వ్యక్తిని చూపించి "తాతయ్య! అతని పేరు నెల్సన్ రష్యా నుంచి వచ్చాడు వాళ్ళు మొత్తం పదిమంది ప్రొఫెషనల్ కిల్లర్స్, స్నైపర్ గన్స్ తో చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి టార్గెట్  మిస్ అవ్వకుండా షూట్ చేయడంలో ఎక్స్పర్ట్స్!

ఆ కొండల చుట్టూ వీళ్ళు ఉంటారు అక్కడికి ఆ తెగవాళ్లు ఎవ్వరు వచ్చిన సరే వాడి తలలో  బుల్లెట్ దిగుతుంది." అని చెప్పాడు మోహిత్.

"అయ్యా! అతను ఎస్పీ ప్రహ్లాద్ మనకు నమ్మిన బంటు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్! ఆ అభీర్  మనుషులు ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకుని చిత్రహింసలు చేసి మరీ చంపుతాడు మళ్లీ మన జోలికి రావాలి అంటే ఒక్కొక్కడికి గుండెలు అదిరిపోవాలి." అని చెప్పాడు వరదరాజులు.

"తాతగారు! అతని పేరు సాధు అస్సాం నుంచి వచ్చాడు వీళ్ళు డబ్బు కోసం ఏ పనైనా చేస్తారు మనుషుల్ని చంపడం అంటే వీళ్ళకి సరదా! వాళ్ల కంటికి ఒక మనిషిని చూపించాము అంటే అతనిని చంపే వరకు నిద్రపోరు." అని చెప్పాడు నిర్మల్.

"తాతయ్య! లండన్ నుంచి మిసైల్ తన మనుషులతో  వచ్చాడు, మన ఫ్యామిలీ ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళని దాటుకుని ఎవరు లోపలికి రాలేరు." అని చెప్పింది అర్ణ.

"మీరు తీసుకొచ్చిన మనుషులు పవర్ ఫుల్ గానే ఉన్నారు మీరు పవర్ఫుల్ గానే ఉన్నారు, కానీ అసలు ఆ అభీర్ సేన ఎక్కడ ఉంది? వాళ్ళు ఎలా ఉంటారు? ఎంతమంది ఉన్నారు? వీటిల్లో ఏ ఒక్క విషయమైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసా?" అని అందరి వైపు చూస్తూ అడిగాడు రఘురామ్.

"ఆ బైరి కొండలు తవ్వుతూ ఉంటే చావుని వెతుక్కుంటూ  వాళ్లే వస్తారు." అని చెప్పాడు నిర్మల్.

"నువ్వు చెప్పింది కరెక్టే! కానీ అక్కడికి వచ్చినవాడు ఆ అభీర్ సేనకి చెందిన వాడని నీకు తెలుసా? అక్కడికి పనివాళ్ళుగా అయినా రావచ్చు మన మనుషులుగా అయినా రావచ్చు ఎవరికి తెలుసు!

అసలు మీకు తెలిసినంతవరకు ఆ తెగలో ఆరోజు చనిపోయిన వాళ్ళు కాకుండా బతికి ఉన్న వాళ్ళు ఎంతమంది?" అని అడిగాడు రఘూరామ్.

"ఆ కొండల దగ్గర గెస్ట్ హౌస్ లో ఉన్న జేమ్స్ వాళ్ళని చంపినప్పుడు  అభీర్ తో పాటు మరొక ఐదుగురు వచ్చారు నాకు తెలిసి ఆ ఆరుగురు బతికి ఉన్నారు." అని చెప్పాడు జాకి.

"ఆ విషయంలోనే మీరు పప్పులో కాలు వేశారు, 12 సంవత్సరాల క్రితం మీరు వాళ్ళని చంపకముందు అక్కడ పనిచేసిన ఒక ఫారెస్ట్ గార్డ్ ని ఇక్కడికి పిలిపించాను అతను చెప్పింది పూర్తిగా వినండి తర్వాత మీ ప్లాన్ లు ఆలోచించండి." అని చెప్పాడు రఘురామ్.

అక్కడికి వస్తూ "నమస్తే సార్ నా పేరు హస్కర్! నేను ఆ ఏరియా ఫారెస్ట్ గార్డ్ గా పనిచేసేవాడిని 12 సంవత్సరాల క్రితం జాతర జరగకముందు ఆ తెగకు సంబంధించిన సుమారు 250 మంది దాకా అడవి వదిలి బయట ప్రపంచంలోకి వెళ్లి రహస్యంగా జీవించడం మొదలుపెట్టారు.

జాతర మూడో రోజు వాళ్లందరూ ఆ కొండ దగ్గరికి వెళ్లడానికి అభీర్ కోసం ఎదురుచూస్తున్నారు అప్పుడే నాకు కూడా తెలిసింది. ఒక ఐదుగురు వాళ్ళ దగ్గరకి వచ్చి కొండ దగ్గరికి వెళ్లకుండా వెనక్కి తీసుకు వెళ్లిపోయారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎలా ఉంటారో ఎవరికి తెలియదు." అని చెప్పాడు హస్కర్.

ఆ మాట విని "అంటే! ఆ తెగ వాళ్ళు ఇంకా 250 మంది బతికి ఉన్నారా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అభిజిత్.

"అవును సార్! ఆ తెగ వాళ్ళు చాలా పవర్ఫుల్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి." అని చెప్పి అక్కడినుంచి దూరంగా వెళ్లి నుంచున్నాడు హస్కర్.

అక్కడ ఉన్న వారి వైపు చూస్తూ "ఒక్కడు మన దగ్గరికి వచ్చి శివతాండవం చేసి ప్రవీణ్ తల తీసుకుని దర్జాగా వెళ్ళిపోయాడు, ఇప్పుడు అలాంటి వాళ్ళు 250 మంది ఉన్నారు వాళ్లందరికీ ఒక నాయకుడు ఉన్నాడు, అతను చాలా తెలివైన వాడిని మీరే చెబుతున్నారు  మీ ప్లాన్ లు ఇప్పుడు చెప్పండి." అని అడిగాడు రఘురామ్.

ఆ మాట విని అందరూ సైలెంట్ గా ఉండడం చూసి ముందుకు వచ్చి "ఆ జారువా తెగ వాళ్ళు కూడా మనుషులే కదా చంపితే చస్తారు కదా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు.

వాళ్లు అడవిలో పెరిగారు మామూలుగా అయితే వాళ్ళని పట్టుకోలేము అందుకే ఎర వేసి వల వేసి వేటాడుదాము నేను ప్లాన్ చెప్తాను అలా చేయండి." అని చెప్పింది అర్ణ.

"ఎస్! అర్ణ మైండ్ లోకి ప్లాన్ వచ్చింది అంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది అందరూ తనని ఫాలో అవ్వడం కరెక్ట్!" అని చెప్పాడు మిథున్.

ఆ మాట విని కోపంగా ముందుకు వెళుతున్న విష్ణు చేయ్యి పట్టుకుని ఆపి "కంగారు పడతవు ఎందుకు చూసుకుందాము." అని నెమ్మదిగా చెప్పాడు రఘురామ్.

"ప్రవీణ్ బాబాయ్ ది రేపు మూడో రోజు కార్యక్రమం అయ్యేలోపు ఆ డాక్యుమెంటరీ షూట్ చేసింది ఎవరో తెలుసుకోండి. వాళ్లకి కచ్చితంగా అభీర్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది తరువాత నా ప్లాన్ ఏమిటో చెబుతాను." అని చెప్పింది అర్ణ.

"సరే!" అని అక్కడ నుంచి అందరూ వెళ్లడంతో హస్కర్ దగ్గరికి వెళ్లి డబ్బులు ఇస్తూ "నువ్వు వెళ్ళు ఏదైనా అవసరం అయితే మళ్లీ పిలుస్తాను." అని చెప్పి ఫోన్ తీసి ఆగస్త్య కి కాల్ చేశాడు రఘురామ్.

ఫోన్ లిఫ్ట్ చేసి "గుడ్ మార్నింగ్ సార్! నేను పంపించిన హస్కర్ మీకు ఉపయోగపడ్డాడా?" అని అడిగాడు అగస్త్య.

"నువ్వు సూపర్ అయ్యా బాబు! అతని వల్ల అందరిలో నా ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. నేను ఇంత తెలివిగలవాడినా అని మా మామయ్య గారు కూడా ఆశ్చర్యపోయారు.

అలాగే ఆ అభీర్ వాడి మనుషులు ఎక్కడ ఉన్నారో తెలుసుకో నీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందిలే!" అని నవ్వుతూ చెప్పాడు రఘురామ్.

"ఓకే సార్! నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు అగస్త్య.

డల్ గా కూర్చున్న ప్రతాప్ మిశ్రా సుజిత్ మిశ్రాల దగ్గరికి వెళ్లి "సార్! సెక్యూరిటీగా ఉన్న నా మనుషులని పంపించేసారంట? ఇక్కడ మన వర్క్ కంప్లీట్ అయిపోయిందా?" అని అడిగాడు రాజన్.

ఆ మాటకి తల ఎత్తి డల్ గా చూస్తూ "మనమే అంటే మన కన్నా పెద్ద ముదర్లు ఉన్నారు ఇక్కడ! ఎవడి ప్లాన్లు వాడికి ఉన్నాయి, ఎవరి మనుషులు వాళ్ళకి ఉన్నారు, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.

"ఆ అభీర్ మనుషులలో ఒక్కడినైనా  మనం పట్టుకుంటే అర్ణ మన రూట్ కి వస్తుంది." అని చెప్పాడు సుజిత్.

"సార్! ఈరోజు నుంచి నా మనుషులు ఆ పనిలోనే ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే తెలుసుకుని మీకు చెబుతాను."అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళాడు రాజన్.

తండ్రి ఫోటో వైపు బాధగా చూస్తున్న విష్ణు, ఆశల దగ్గరికి వెళ్లి "సారీ! ఈ టైంలో ఈ విషయం గురించి మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ నీ బాధ చూసి చెప్పాలి అనిపిస్తుంది.

నాకు బైరి అని ఒక వ్యక్తి తెలుసు అతను RAW తో కలిసి వర్క్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ నెట్వర్క్ చాలా పెద్దది ఆ అభీర్ మనుషుల్ని ఈజీగా పట్టుకుంటాడు నువ్వు ఓకే అంటే ఒక్కసారి మీట్ అవుదాము." అని చెప్పింది రియా.

ఆ మాట విని "అవునా? అయితే వెంటనే మీటింగ్ అరేంజ్ చెయ్! వాళ్లలో ఒక్కడినైనా నా చేతులతో చంపాలి అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది." అని చెప్పాడు విష్ణు.

"సరే! ఈవినింగ్ మీ ఇద్దరికీ మీటింగ్ ఏర్పాటు చేస్తాను." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది రియా.
[+] 9 users Like SivaSai's post
Like Reply
ఎపిసోడ్ 68


అభీర్ గురించి తెలుసుకొమని ఆగస్త్యకి రఘురామ్ చెబితే, రాజన్ కి ప్రతాప్ మిశ్రా చెప్పాడు, బైరితో మీటింగ్ ఏర్పాటు చేస్తాను అని విష్ణుకి చెప్పింది రియా.

******************

నంద గెస్ట్ హౌస్ లోపలికి చాక్లేట్ తో కలిసి వచ్చి మిథున్ వైపు చూసి స్మైల్ ఇచ్చి "నమస్తే సార్!" అని చెప్పింది మిత్ర.

"హాయ్ మిత్ర!" అని అర్ణ నా దగ్గరికి తీసుకెళ్లి "మీరు ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ డైరెక్ట్ గా చూడలేదు కదా తనే మిత్ర!" అని పరిచయం చేశాడు మిథున్.

"అవునా?" అని మిత్ర, చాక్లెట్ వైపు చూసి "ఆ అభీర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమన్నారు కదా! ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడు ఏమైనా తెలిసిందా?" అని అడిగింది అర్ణ.

"మేడం! అభీర్ ఎవరిని చంపిన కేసులో అయితే జైల్లో ఉన్నాడో ఆ మురళీ జోషి కూతురు సుమతితో కలిసి ఏదో డాక్యుమెంటరీ తీస్తున్నాడు." అని చెప్పింది మిత్ర.

ఆ మాట విని "ఆ అభీర్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు ముకుల్.

"మేడం చెప్పిన దగ్గర నుంచి అభీర్ ని ఫాలో చేస్తూనే ఉన్నాను సార్! అతనితో పాటు ఇద్దరు ఉన్నారు  రాజస్థాన్ వైపు వెళ్లే దారిలో ఒక గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడు షూటింగ్ కూడా అక్కడే చేస్తున్నారు." అని చెప్పింది మిత్ర.

"ఆ డాక్యుమెంటరీ షూటింగ్ జరగకూడదు." అని కోపంగా చూస్తూ చెప్పాడు అభిజిత్.

"అలా అయితే మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఈ రెండు రోజుల్లోనే చేయాలి తరువాత బేరా కొండల దగ్గర షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు అందరూ అక్కడికి వెళ్లి పోతారు." అని చెప్పింది మిత్ర.

"ఆ మురళి జోషి భార్య కూతురు ఎక్కడ ఉంటున్నారో నీకు తెలుసా?" అని అడిగాడు జాకి.

"వన్ వీక్ బ్యాక్ వరకు లాయర్ వసుంధర ఇంటి దగ్గర ఉన్నారు తరువాత  ఇక్కడ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు ఇప్పుడు అక్కడే ఉంటున్నారు." అని చెప్పింది మిత్ర.

"మురళీ జోషి ఇల్లు నాకు తెలుసు! వాడి పెళ్ళాన్ని కూతుర్ని  ఇక్కడికి తీసుకొస్తాను వాళ్ల కోసం కచ్చితంగా అభీర్ వస్తాడు ఇక్కడికి వచ్చిన వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అలా ప్లాన్ చేయండి." అని చెప్పాడు జాకి.

"జాకీ! వాళ్లని తీసుకురావడానికి నువ్వు ఒక్కడివే వేళ్ళకు సాధు వెంట తీసుకువెళ్లు కచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి అభీర్ తోడుగా ఉంటాడు." అని చెప్పాడు అభిజిత్.

"సార్! మీ అందరి మాటలు వింటుంటే ఆ అభీర్ గురించి మీరు ఏదో కంగారుపడుతున్నట్లు ఉన్నారు అతనికి అంత సీన్ లేదు, ఆ గెస్ట్ హౌస్ దాటి అడుగు కుడా బయట పెట్టడం లేదు నాకెందుకో అతను ఎవరికో భయపడుతున్నట్లు అనిపిస్తుంది.

అలాగే ఆ కేస్ లొ సాక్ష్యం చెప్పిన తర్వాత మురళి జోషి ఫ్యామిలీ కి సెక్యూరిటీ అధికారి పోటాక్షన్ లొ ఉంది. మీరు వెళ్లి అక్కడ హడావిడి చేస్తే ఈ కేసులో మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉందని అందరికీ తెలిసిపోతుంది." అని చెప్పింది మిత్ర.

"ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమే!" అని చెప్పాడు ముకుల్.

"మరి అంత భయపడి దాక్కున అభీర్ ఈ డాక్యుమెంటరీ ఎందుకు తీస్తున్నట్లు?" అని డౌట్ గా అడిగాడు నిర్మల్.

"మన నుంచి తనను ప్రొటెక్షన్ చేసుకోవడానికి ప్రజల మద్దతు కోసం తీస్తున్నాడు మనకు ఇదే మంచి ఛాన్స్ ఆ అభీర్ ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టలి." అని చెప్పాడు మిథున్.

"భయపడుతున్న వాడిని భయపడుతున్నట్లు ఉండనివ్వండి మన పని మనం చేసుకుందాము టీమ్ మొత్తాన్ని బేరా కొండల దగ్గరికి పంపించి తవ్వకాలు మొదలు పెట్టండి." అని చెప్పి మిత్ర వైపు చూసి

"ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్యూ నీ పేమెంట్ అకౌంట్ లో పడుతుంది ఇంకా ఏదైనా తెలిస్తే వెంటనే కాల్ చెయ్!" అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం థాంక్యు!" అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్లి చాక్లెట్ వైపు చూసి "పని అయిపోయిందా?" అని అడిగింది మిత్ర.

"అక్క! ఇక్కడుంది ఎవరు చాక్లెట్! మంచినీళ్లు తీసుకున్నట్లు తీసుకుని మైక్రో డివైసర్ టేబుల్ కింద పెట్టేసాను ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడినా మనకి వినపడుతుంది." అని నవ్వుతూ చెప్పాడు చాక్లెట్.

"నువ్వు సూపర్ రా..! ఎక్కడ భయపడతావో అనుకున్నాను." అని తన దగ్గర ఉన్న డివైజ్ ఆన్ చేసి అర్ణ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంది మిత్ర.

"ఆ అభీర్ భయపడుతున్నాడని మిత్ర చెప్పింది కదా! మనం వాడి అడ్డు తొలగించుకున్న తర్వాతే ఆ కొండల దగ్గరికి వెళదాము." అని చెప్పాడు నిర్మల్.

"మనం బయట వ్యక్తుల మాటలు ఒక చెవితో వినాలి ఒక చెవితో వదిలేయాలి మన ప్లాన్ మాత్రమే అమలు చేయాలి, ఆ మిత్ర  మన దగ్గర డబ్బులు తీసుకుని అభీర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది.

అదేవిధంగా అభీర్ దగ్గర డబ్బులు తీసుకుని మన ఇన్ఫర్మేషన్ ఇవ్వదని గ్యారంటీ ఏమిటి, అందుకే ఇకనుంచి ఎవరి దగ్గర మన ప్లాన్స్ గురించి మాట్లాడకండి." అని చెప్పింది అర్ణ.

"బేబీ చెప్పింది కరెక్ట్!  అంతే కాదు ఆ అభీర్ భయపడే రకం కాదు భయపెట్టే రకం వాడిని తక్కువ అంచనా వేయకూడదు." అని చెప్పాడు ముకుల్.

"మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళండి ఆ అభీర్ కి హెల్ప్ చేసే వాళ్లకి చావు భయం రుచి చూపించండి." అని చెప్పింది అర్ణ.

డివైస్ లో వాళ్ళ మాటలు వింటూ "ఈ అర్ణ వాళ్ళ తాత నోట్లో నుంచి ఊడి పడింది." అని చెప్పింది మిత్ర

"అవును అక్క! ఆ ముక్కోడు కూడా మామూలు వాడు కాదు ఇప్పుడు ఎవరి మీద అటాక్ చేస్తారో కుడా తెలీదు ఈ విషయం వెంటనే అభీర్ భయ్యా కి కాల్ చేసి చెప్పాలి." అని కంగారుగా అన్నాడు చాక్లెట్.

"కరెక్ట్!" అని ఫోన్ తీసి అభీర్ కి కాల్ చేసింది మిత్ర.

ఫోన్ లిఫ్ట్ చేసి "మిత్ర! ఎక్కడ ఉన్నావు?" అని అడిగాడు అభీర్.

"నేను ఇప్పుడే గెస్ట్ హౌస్ లో ముకుల్ వాళ్ళని కలిసి వస్తున్నాను, నీకు హెల్ప్ చేసే వాళ్ళ మీద ఎటాక్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు." అని కంగారుగా చెప్పింది మిత్ర.

ఆ మాటకి నవ్వుతూ "పిరికివాడు మొదట చేసే పని అదే! నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు దాని గురించి నువ్వు ఏమి టెన్షన్ పడకు." అని చెప్పాడు అభీర్.

"సరే!" అని ఫోన్ పెట్టేసి చాక్లెట్ వైపు చూసి "ఏమి జరుగుతుందో అని మనం టెన్షన్ తో చచ్చిపోతుంటే  అంత కూల్ గా సమాధానం చెబుతాడు ఏమిటిరా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది మిత్ర.

"అక్క! నాకు తెలిసి అభీర్ భయ్యా వాళ్లతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఈ ఆటలో బలం ఉన్న వాడు కాదు తెలివి ఉన్న వాడు గెలుస్తాడు." అని చెప్పాడు చాక్లెట్.

"అవునా?" అయితే అర్ణ వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి? ఆ కొండల దగ్గరికి వెళతారా? డాక్యుమెంటరీ తీసే సుమతి వెనకాల పడతారా? అభీర్ ని చంపడానికి వెళ్తారా? గెస్ చెయ్!" అని అడిగింది మిత్ర.

"నాకు తెలిసి అభీర్ ని టెన్షన్ పెట్టడానికి ఒకేసారి మూడు వైపులా ఎటాక్ చేస్తారు." అని చెప్పాడు చాక్లేట్.

"అవునా? అలా అయితే మనకి అభీర్ ని కాపాడే అంత సీన్ లేదు, ఆ కొండల దగ్గరికి వాళ్ళని వెళ్లకుండా ఆపలేము కాబట్టి సుమతి, నీలమ్ లకి తోడుగా ఉందాము." అని బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా వెళ్ళింది మిత్ర.

********************

అర్ణ, మిథున్ మహేష్ తో మాట్లాడుతూ ఉండగా నిర్మల్ తో కలిసి గార్డెన్ దగ్గరికి వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని చూపించి "అతని పేరు అరుల్! పెద్దపెద్ద ప్రాపర్టీ డీల్స్ చేస్తూ ఉంటాడు.

ఇండియా లొ నీతో కాకుండా నేను అతనితో మాత్రమే టచ్ లో ఉన్నాను  బైరి దగ్గర ఉన్న వజ్రాల కొండల గురించి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా అతనే!" అని చెప్పాడు ప్రమోద్.

"అవునా?" అని అరుల్ వైపు చూసి "ఆ ప్లేస్ గురించి నీకు ఎలా తెలిసింది?" అని అనుమానంగా అడిగాడు నిర్మల్.

"ఆ కొండల దగ్గర చనిపోయిన మినిస్టర్ జావిద్ దగ్గర మా ఫాదర్ పీఏగా పనిచేసేవారు ఆరోజు జాకీ గారు చెప్పిందాన్ని బట్టి భయపడి అక్కడికి ఎవరూ వెళ్లలేదు.

మా నాన్నగారు చాలాసార్లు అక్కడికి వెళ్లారు కానీ ఆ స్టోన్స్ మార్కెటింగ్ చేయడం చాలా కష్టం, దానికి మీలాంటి పొలిటికల్ వాళ్ళ అండ ఉండాలి అందుకే ఆయనా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ప్రమోద్ గారు చెప్పిన తర్వాత మా ఫాదర్ దగ్గర డీటెయిల్స్ తీసుకుని ఆ కొండల దగ్గరకి టూ టైమ్స్ వెళ్లాను అక్కడ ఎటువంటి డేంజర్ లేదు.

ఆ కొండల దగ్గర జరిగే పని మీరు చూసుకుంటానని చెప్పండి వాటి వాల్యూ ఎవరికి తెలియదు మీరు ఎంత చెబితే అంత అందరూ నమ్ముతారు." అని తన దగ్గర ఉన్న రాళ్ళని చూపించాడు అరుల్.

"మనం ఇద్దరం ఆ కొండ దగ్గర పని చూసుకుందామని చెబుదాము, వచ్చే డబ్బుతో నీ చేతిలో నుంచి రూపాయి పెట్టుకుండా సీఎం అవుతావు, ఇండియాలొ నా న్యూ బిజినెస్ ఎక్స్ప్రెషన్ కి పెట్టుబడి దొరుకుతుంది." అని నవ్వుతూ చెప్పాడు ప్రమోద్.

"ఐడియా బాగుంది కానీ అర్ణ దీనికి ఒప్పుకుంటుందా?" అని డౌట్ గా అడిగాడు నిర్మల్.

"ఆ సంగతి నేను చూసుకుంటాను ఈ వర్క్ లోకి మిథున్ ఎంటర్ అవ్వకుండా నవ్వు చూసుకో చాలు, ఎందుకంటే మీ వాడితో మహేష్ క్లోజ్ గా ఉంటాడు వెంటనే అర్ణకి విషయం తెలిసిపోతుంది." అని చెప్పాడు ప్రమోద్.

"సరే! మిథున్ ని ఎలా ఎవాయిడ్ చేయాలో నాకు బాగా తెలుసు!" అని చెప్పాడు నిర్మల్.

"అంతేకాదు సార్! ఆ కొండల మీద వరదరాజుల కొడుకు తంబియార్ కన్ను కూడా పడింది." అని చెప్పాడు అరుల్.

"నా దారికి అడ్డొచ్చిన వాళ్ళని ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు!" అని దూరంగా ప్రతాప్ మిశ్రతో మాట్లాడుతున్న తంబియార్ ని చూస్తూ చెప్పాడు నిర్మల్.
[+] 12 users Like SivaSai's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
naa mind antha prastutaniki kalagapulagam la undi.
inni mind games ni artham cheskovalante.. next update varaku wait cheyalsinde!!!

Great going Siva bro!!!
Like Reply
ఎపిసోడ్ 69


ప్రమోద్ తనతో పాటు నిర్మల్ ని గార్డెన్ లోకి తీసుకువెళ్లి  ఆరుల్ ని పరిచయం చేయడంతో, ఇద్దరికి ఆ కొండల గురించి చెప్పి వాటి మీద వరదరాజుల కొడుకు తంబీయర్ కన్ను కూడా పడింది అని చెప్పాడు అరుల్.

****************

గెస్ట్ హౌస్ లో ఎవరి దారిన వాళ్ళు మాట్లాడుకోవడం చూసి అసహనంగా ఉన్నా ముకుల్ దగ్గరికి వెళ్లి "ఏమైంది తాతయ్య? అలా ఉన్నారు?" అని అడిగింది అర్ణ.

"ఆ అభీర్ సేన మనుషులు మన చుట్టూ ఉన్నారు అనిపిస్తుంది. ముందు మనవాళ్లలోనే ఒకరికి ఒకరికి అవగాహన లేదు, ఐక్యత లేదు. అయిన వాళ్ల కంటే బయట వ్యక్తులతో చనువుగా ఉంటున్నారు. ఎవరి వల్ల ఎప్పుడు ఏ ఆపద వస్తుందో కూడా అర్థం కావడం లేదు." అని అసహనంగా చెప్పాడు ముకుల్.

"మీరు చెప్పింది కరెక్ట్ తాతయ్య! ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో కూడా అర్థం కావడం లేదు, దీనికి ఏదైనా ఉపయోగం ఆలోచించాలి." అని మిస్సైల్ ని పిలిచి

"గెస్ట్ హౌస్ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంచండి నాకు తెలియకుండా కొత్త వ్యక్తులు ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు మనవాళ్ళు ఎవరు బయటికి వెళ్లడానికి వీల్లేదు ప్రతి ఒక్కరికి ఫోను టాపింగ్ లో పెట్టండి." అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం!" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు మిసైల్.

ప్రహ్లాద్ జాకి, సాధులని పిలిచి "మీకు చెప్పిన పని మొదలు పెట్టండి." అని చెప్పి నెల్సన్ వైపు చూసి "వీళ్ళ ముగ్గురికి ప్రొటెక్షన్ ఇవ్వండి. అనుమానం వస్తే ఎవరు అని చూడకుండా షూట్ చేయండి." అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం!" అని అక్కడి నుంచి బయలుదేరారు నలుగురు.

సుజిత్ తో కలిసి దూరం నుంచి వింటూ "ఇదేదో పెద్ద ప్లాన్ వేసింది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

****************

ఆఫీస్ లో ఉన్న నీలమ్, సుమతిల దగ్గరికి చాక్లెట్ తో కలిసి వెళ్లి "మీరిద్దరూ కేర్ఫుల్ గా ఉండాలి ఆ డాక్యుమెంటరీ విషయంలో ముకుల్ ఫ్యామిలీ చాలా సీరియస్ గా ఉంది." అని చెప్పింది మిత్ర.

"ఆ విషయం మాకు కూడా తెలుసు మమ్మల్ని టచ్ చేస్తే ఈ స్టోరీ రియల్ అని అందరూ నమ్ముతారు ఆ అర్ణ తెలివైనది అయ్యితే మా మీద ఈగ కూడా వాలానివ్వదు." అని చెప్పింది నీలమ్.

"కరెక్టే! కానీ తను ఏదో పెద్ద ప్లాన్ చేసింది ఏమిటో అర్థం కావడం లేదు ఆ జాకీ గాడు నా కళ్ళముందే ఉన్న ఏమి చేయలేకపోయాను." అని చెప్పింది మిత్ర.

జాజి, నారప్పతో కలిసి అక్కడికి వస్తూ "ప్రతీకారం నీ  గుండెల్లో రగులుతూ ఉంటే, అది న్యాయమే అయితే తప్పకుండా నెరవేరుతుంది." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూస్తూ "అభీర్! నువ్వు ఇక్కడ?" అని సంతోషంగా అడిగింది నీలమ్.

"నా అనుకునే వాళ్ళని కాపాడుకోవడానికి ఎక్కడికైనా ఎప్పుడైనా వస్తాను." అని వెనక్కి తిరిగి మల్లి అని పిలిచాడు అభీర్.

అక్కడికి వచ్చిన మల్లి వైపు చూసి "ఎవరి ఈ అమ్మాయి? మేము తీసే డాక్యుమెంటరీలో యాక్ట్ చేస్తుందా?" అని అడిగింది నీలమ్.

"కాదు ఈరోజు నుంచి మీ ఇద్దరితో ఉంటుంది మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది తనని దాటి మీ దగ్గరికి ఎవరు రాలేరు." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని మల్లి వైపు చూసి "ఏంటి? తను మమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలదా?"  అని అనుమానంగా అడిగింది సుమతి.

"ఆ అనుమానం మీకు అక్కర్లేదు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది." అని చెప్పాడు జాజి.

"సరే అయితే! మల్లి తో పాటు ముందు నీ వేషం కూడా మార్చాలి పదండి." అని చెప్పి ఆఫీస్ నుంచి ఒక పెద్ద షాపింగ్ మాల్ కి తీసుకు వెళ్ళింది నీలమ్.

లోపలికి వస్తున్న వాళ్ళని చూసి "గుడ్ ఈవెనింగ్ మేడం!" అని చెప్పాడు సేల్స్ మాన్.

అభిర్ ని చూపించి "మా సార్ ని తీసుకువెళ్లి హీరోలా తయారుచేసి తీసుకురావాలి మేము కూడా గుర్తుపట్టలేనంతగా..!" అని నవ్వుతూ చెప్పింది నీలమ్.

ఆ మాట విని "ఇప్పుడు ఏమీ వద్దు నాకు ఇలా ఉండడమే  ఇష్టం!" అని చెప్పాడు అభీర్.

"ఇలా ఉంటే నీకు ఇష్టమేమో కానీ, మాకు ఇష్టం లేదు మాట్లాడకుండా పద!" అని అభీర్ ని లోపలికి తోసింది నీలమ్

"వెల్కమ్ సార్!" అని లోపలికి తీసుకువెళ్లాడు సేల్స్ మెన్.

మల్లి ని తీసుకుని లేడీస్ కౌంటర్ వైపు వెళ్ళింది సుమతి.

నీలమ్ వైపు చూసి "మంచి పని చేశారు ఈ రోజుల్లో ఒంటి మీద బట్టలని చూసే మనిషికి గౌరవం! మా నాయకుడికి ఎన్నిసార్లు చెప్పినా మా మాట వినడం లేదు కానీ ఇప్పుడు మీ మాట కాదనలేకపోయాడు." అని సంతోషం గా చెప్పాడు నారప్ప.

"నేను తీసే డాక్యుమెంట్ హీరో అభీర్, బయట కూడా హీరోలానే ఉండాలి." అని చెప్పింది నీలమ్.

"అక్క! మరి హీరోయిన్ ఎవరు?" అని నవ్వుతూ అడిగాడు చాక్లెట్.

"ఆ విషయంలో అభీర్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు వచ్చాక కచ్చితంగా హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేస్తాను." అని చెప్పింది నీలమ్.

"అమ్మవారి పాదాల దగ్గర పంచరత్నాలు ప్రతిష్టించేటప్పుడు మా నాయకుడు జంటగా ఉండాలని మా అందరి కోరిక! తనకోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారు." అని చెప్పాడు జాజి.

అంతలో సుమతితో పాటు జీన్స్ ప్యాంట్ టీ షర్టు వేసుకుని బయటికి వస్తున్న మల్లి ని చూసి "ఇప్పుడు పర్ఫెక్ట్ రిపోర్టర్ లాగా ఉంది. మాతో పాటు తీసుకువెళ్లిన ఎవ్వరికి అనుమానం రాదు." అని చెప్పింది మిత్ర.

"అవును! ఒక్కటి తగ్గింది." అని తన మెడలో ఐడి కార్డు మల్లి మెడలో వేసింది సుమతి.

కాసేపటికి బ్లాక్ డ్రస్సులో బయటికి వస్తున్న అభీర్ వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తూ "నా హీరో అదిరిపోయాడు." అని చెప్పింది నీలమ్.

"ఏంటి? నీ హీరోనా..? నీ డాక్యుమెంటరీ లో హీరోనా..?" అని నవ్వుతూ భుజం మీద తన భుజంతో కొడుతూ అడిగింది మిత్ర.

ఆ మాటకి కంగారుపడుతూ "అదే అదే! నా డాక్యుమెంటరీలో హీరో!" అని అక్కడ ఉన్న బ్లాక్ స్పెట్స్ తీసి అభీర్ కి పెట్టి "సూపర్! చేతిలో ఒక గన్ ఉంటే అదిరిపోతుంది." అని చెప్పింది నీలమ్.

"అభీర్ భయ్యా! చేతిలో గన్ ఉంటే యుద్ధానికి వెళ్లే కామెండో లాగా ఉంటాడు." అని చెప్పాడు చాక్లెట్.

"యుద్ధానికి వెళ్లడం ఏమిటి ఆల్రెడీ యుద్ధం చేస్తున్నాడు." కదా అని చెప్పింది మిత్ర.

ఆ మాటకి నవ్వుతూ "నేను చేస్తుంది యుద్ధం కాదు, వేట! యుద్ధం లొ రెండు వైపులా చావులు ఉంటాయి, కానీ వేటలో ఒకవైపు మాత్రమే చావులు ఉంటాయి, ఇంకా వెళదామా?" అని జాజి వైపు చూసి "వీటీకి డబ్బులు కట్టు!" అని చెప్పాడు అభీర్.

"ఆగు ఆగు! నీ డబ్బులు నా దగ్గర ఉన్నాయి, ఆ షాప్ అతను నువ్వు ఇచ్చిన స్టోన్ కి మిగతా డబ్బులు కూడా ఇచ్చేశాడు." అని బ్యాగ్ లో నుంచి ప్యాకెట్ తీసి అభీర్ చేతికి ఇచ్చింది నీలమ్.

"మనం ఇచ్చిన ఒక్క రాయి కి ఇంత డబ్బు వచ్చిందా?" అని ఆశ్చర్యంగా చూస్తూ  "అందుకే ఆ కొండల మీద అందరూ అంతా ఆశ పడుతున్నారు." అని ప్యాకెట్ తీసుకుని జాజి చేతీలో పెట్టాడు అభీర్.

అక్కడి నుంచి వెళుతూ "కొండలంటే గుర్తొచ్చింది ఆ అర్ణ ఏదో పెద్ద ప్లాన్ చేస్తుంది. ఆ గెస్ట్ హౌస్ లొ అందరు నా కళ్ళ ముందే  తిరుగుతున్నారు కానీ నేనేమీ చేయలేకపోతున్నాను వాళ్ళని చూస్తుంటే మన పగ తీరుతుందా అనిపిస్తుంది." అని నిరాశగా చెప్పింది మిత్ర.

"పగ ప్రతీకారం ఎలా ఉంటుందో రియల్ గా జరిగిన ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా వినండి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి  తమ దగ్గర పని చేసే ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

ఆ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తమ్ముడు కోపంతో తన అక్క ప్రేమించిన వ్యక్తి మీద పగ పెంచుకుని తుపాకీ తీసుకువెళ్లి ఇంటి ముందు గార్డెన్ లో ఉన్న ఆ వ్యక్తిని చూసి కసితిరా మూడు సార్లు షూట్ చేశాడు.

రెండు బుల్లెట్లు అతని బాడీలోకి వెళ్లాయి ఒక బుల్లెట్ గురి తప్పి పక్కన ఉన్న చెట్టులో దిగింది. కింద పడ్డ వ్యక్తిని చూసి చనిపోయాడు అనుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్లి అక్క ఫోటో చూస్తూ కాల్చుకుని చనిపోయాడు.

కానీ రెండు బుల్లెట్లు తగిలిన ఆ వ్యక్తి ట్రీట్మెంట్ తో మళ్ళీ బతికాడు కానీ 10 సంవత్సరాల తర్వాత తన ఇంటి ముందు గార్డెన్లో ఎదిగిన చెట్లను నరికిస్తూ ఉండగా గురి తప్పి చెట్టులో దిగిన బులెట్ గొడ్డలి దెబ్బకి ఎగిరి వచ్చి దూరంగా నుంచున్న  ఆ మనిషి తలలో దిగి చనిపోయాడు.

మన ప్రతీకరం న్యాయమైంది అయితే మనం ఉన్న లేకపోయినా మన చేతులతో  జరిగి చర్యల వల్ల జరిగితీరుతుంది." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని సంతోషంగా చూస్తూ "నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది. నా ప్రతీకరం న్యాయమైంది అనుకుంటున్నాను తప్పకుండా జరిగి తీరుతుంది." అని చాక్లెట్ తో కలిసి బైక్ మీద వెళ్లిపోయింది మిత్ర.

మల్లి, సుమతితో కలిసి అక్కడినుంచి బయలుదేరుతూ అభీర్ వైపు చూసి "నువ్వు చాలా ప్రాక్టికల్ మనిషివి నీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను." అని నవ్వుతూ అక్కడినుంచి బైక్ మీద వెళ్లిపోయింది నీలమ్.

బైక్ మీద వెళ్లి సుమతి ఇంటి దగ్గర దిగుతూ నీలమ్ వైపు చూసి "నువ్వు మా నాయకుడిని ఇష్టపడుతున్నావా?" అని అడిగింది మల్లి.

అంతలో వేగంగా కారులో అక్కడికి వచ్చి కిందకు దిగి గన్ చూపించి బెదిరిస్తూ "మురళి జోషి కూతురు సుమతి ఎవరు?" అని అడుగుతూ మల్లి మేడలో ఐడీ కార్డు చూసి తల మీద గన్ పెట్టి "సైలంట్ గా కార్ లొ కూర్చో!" అని చెప్పాడు నలుగురులో ఒక వ్యక్తి.
[+] 9 users Like SivaSai's post
Like Reply
ఎపిసోడ్ 70


నీలమ్ వాళ్లు  షాపింగ్ కాంప్లెక్స్ నుంచి సుమతి ఇంటిదగ్గరకి రాగానే స్పీడ్ గా అక్కడికి వచ్చి మెడలో ఐడి కార్డ్ చూసి సుమతి అనుకుని మల్లిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయారు నలుగురు.

*******************
కార్ లొ వచ్చిన నలుగురు బలవంతంగా  మల్లి ని తీసుకుని వెళ్లడంతో వెనకాల స్కూటీ మీద సుమతి తో పాటు ఫాలో అవుతూ "డాక్యుమెంటరీ తీసే మనిద్దరిలో ఎవరినైనా కిడ్నాప్ చేయాలి, అంతేగాని మల్లి ని తీసుకువెళ్లారు ఏంటి?" అని అనుమానంగా అడిగింది నీలమ్.

"మల్లి మెడలో ఐడి కార్డు ఉంది అది చూసి  కిడ్నాప్ చేశారేమో! అభీర్ కి కాల్ చేయనా?" అని అడిగింది సుమతి.

"నో నో! అక్కడ సిచువేషన్ తెలియకుండా అభీర్ ని ఎంటర్ చేయకూడదు తనని డేంజర్ లోకి పంపినట్లు అవుతుంది." అని చెప్పి కారు అక్కడ ఉన్న ఒక ఫ్యాక్టరీ లోపలికి వెళ్లడం చూసి దూరంగా ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు కనిపించడంతో 

"మనం ఇద్దరమే లోపలికి వెళ్ళడం అంత సేఫ్ కాదు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ల హెల్ప్ అడుగుదాము." అని ఫాస్ట్గా వాళ్ళ దగ్గరకి వెళ్ళింది నీలమ్.

స్కూటీ మీద దగ్గరకి వచ్చిన నీలమ్ వాళ్ళని చూసి "మేడం బాగున్నారా? ఈ టైంలో ఇక్కడ ఉన్నారు ఏమిటి?" అని అనుమానంగా అడిగాడు శక్తి దాస్.

తెలిసిన ఆఫీసర్లు కనిపించడంతో ఊపిరి పీల్చుకుని "హమ్మయ్య టైం కి కనిపించారు మా కొలీగ్ ని ఎవరో కిడ్నాప్ చేసి కార్ లొ ఆ ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్లారు." అని కంగారుగా చెప్పింది నీలమ్.

"మేడం! మీరేమీ కంగారు పడకండి. మా సార్ పెట్రోలింగ్లో ఉండగా కిడ్నాప్ జరిగింది అంటే ఆయనకే అవమానం మీ కొలీగ్ ని సేఫ్ గా తీసుకువస్తారు." అని చెప్పాడు కుమార్.

"అవును మేడం! లోపలికి వెళ్దాం పదండీ మా కుమార్  ప్రాణాలు ఫణంగా పెట్టి అయ్యినా సరే మీ ఫ్రెండ్ ని కాపాడతాను." అని నీలమ్ వాళ్ళతో కలిసి ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాడు శక్తి దాస్.

ఫ్యాక్టరీ లోపలలికి వెళుతు "సార్! ఆ అమ్మాయి కోసం నా ప్రాణాలు పణంగా పెట్టడం ఎందుకు?" అని నెమ్మదిగా అడిగాడు కుమార్.

"మరి నేను పెట్రోలింగ్లో ఉండగా ఎవరైనా కిడ్నాప్ అయితే నాకు అవమానమా?" అని చెప్పి నీలమ్ వైపు చూసి "మేడం! మీరు ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నారా? లేకపోతే చానల్లో ఏదైనా న్యూస్ టెలికాస్ట్ చేశారా?" అవి డౌట్ గా అడిగాడు శక్తి దాస్.

"ఏమీ లేదు సార్! నంద ఫ్యామిలీ, అభిజిత్ ఫ్యామిలీ గురించి ఒక చిన్న డాక్యుమెంటరీ చేస్తున్నాము నాకు తెలిసి దానిని ఆపమని బెదిరించడానికి కిడ్నాప్ చేసి ఉంటారు." అని చెప్పి అభీర్ కి కాల్ చేసింది నీలమ్.

ఫోన్ లిఫ్ట్ చేసి "మేడం! నేను జాజిని మాట్లాడుతున్నాను చెప్పండి?" అని అడిగాడు

"మేము ఇంటికి వెళ్లేటప్పుడు ఎవరో కారులో వచ్చి మల్లిని కిడ్నాప్ చేసి ఒక ఫ్యాక్టరీ దగ్గర తీసుకొచ్చారు మేము కూడా అక్కడే ఉన్నాము లోపలికి వెళ్తున్న మీరు త్వరగా రండి." అని చెప్పింది నీలమ్.

"అవునా? మీరు ఏమి కంగారు పడకండి మల్లి చూసుకుంటుంది." అని చెప్పాడు జాజి.

"నేను చెప్పింది అర్థం కాలేదా? కిడ్నాప్ చేసిందే మల్లినే!" అని విసుగ్గా చెప్పింది నీలమ్.

జాజి దగ్గర ఫోన్ తీసుకుని "నాకు తెలిసి ఈ కిడ్నాప్ ప్లాన్ అర్ణ వాళ్ళది కాదు భయపడకుండా లోపలకు వెళ్లి అక్కడ ఎవరు ఉన్నారో చూడండి." అని చెప్పాడు అభీర్.

"సరే!" అని ఫోన్ పెట్టేసి అక్కడినుంచి నెమ్మదిగా ముందుకు వెళ్లి చైర్ లో మల్లి కట్టేసి ఉండడం చూసి "అక్కడ ఎవరూ లేరు ఏమిటి?" అని అనుమానంగా చూస్తూ చెప్పింది నీలమ్.

"మేడం! ఎవరు లేకపోతే హ్యాపీనే కదా! వెళ్లి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోదాము పదండి." అని పరిగెత్తుకుంటూ వెళ్లి మల్లి చేతి కట్లు విప్పుతూ ఉన్నారు దాస్, కుమార్ లు.

అక్కడికి వచ్చి "అసలు కిడ్నాప్ చేసిన వాళ్ళు మల్లిని కట్టేసి ఎందుకు వెళ్లిపోయారు? ఇక్కడ ఎవరూ లేరేమిటి?" అని చుట్టూ చూస్తూ ఉంది నీలమ్.

కంగారుగా చూస్తూ "ఎవరో డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మనం బయటికి వెళ్లలేము." అని చెప్పింది సుమతి.

"అవునా?" అని పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్స్ క్లోజ్ అవ్వడం చూసి "మనల్ని ఇక్కడ ఎందుకు బ్లాక్ చేశారు?" అని అనుమానంగా చూస్తూ అడిగింది నీలమ్.

"మేడం! ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు." అని కంగారుగా చెప్పాడు కుమార్.

"మనం కనిపించకుండా పోతే అది అర్ణ వాళ్లకే నష్టం! వాళ్లు నష్టపడితే లాభపడేది ఎవరో వాళ్లే మనల్ని కిడ్నాప్ చేశారు." అని చెప్పింది నీలమ్.

అక్కడికి వస్తూ "బానే కనిపెట్టారు మీరు చచ్చిపోతే మాకు ఇంకా లాభం!" అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర

"అవును! మిమ్మల్ని ఇక్కడ చంపేసి ఆ నంద ఫ్యామిలీ అభిజిత్ ఫ్యామిలీ ఇదంతా చేశారు అని పబ్లిక్ కి తెలిసేటట్లు చేస్తాము, ఆస్తులు వదిలేసి ఇక్కడి నుంచి పారిపోతారు మేము లాభపడతాము." అని నవ్వుతూ చెప్పాడు వరదరాజులు.

ఆ మాట విని "ఓర్నీ వాళ్లే పెద్ద వెధవలు అనుకుంటే మీరు ఇంకా పెద్ద వెధవల్లాగా ఉన్నారే! నమ్మిన వాళ్లకి వెన్నుపోటు పొడుస్తున్నారు." అని చెప్పింది నీలమ్.

"నమ్మిన వాళ్లకి వెన్నుపోటు పొడవు కదా! మా వెధవలు మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని తీసుకురమ్మంటే ఐడి కార్డు ఉందని ఆ పిల్లని తీసుకువచ్చారు అనవసరంగా ఇప్పుడు అది కూడా చస్తుంది." అని నవ్వుతూ చెప్పాడు తంబియార్.

"అంకుల్! త్వరగా వీళ్ళని చంపేసి న్యూస్ లో చూపిస్తే అర్ణ వేసిన ప్లాన్ ఆగిపోతుంది. అందరూ డైనమాలొ పడతారు  ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగుతారు మనం ఆ కొండల దగ్గరికి వెళ్లి మన పని మొదలు పెట్టొచ్చు!" అని చెప్పాడు సుజిత్.

వరదరాజులు వైపు చూస్తూ "ఆస్తికోసం ఆశపడి ముగ్గురు ఆడపిల్లలని చంపడం తప్పు సార్!" అని చెప్పాడు దాస్.

"అలా అయితే వీళ్ళ ముగ్గురితో పాటు మీ ఇద్దరినీ కూడా చంపేస్తాము అప్పుడు తప్పు ఉండదు." అని నవ్వుతూ చెప్పాడు తంబియార్.

"మీరు ఒక విషయం మర్చిపోయారు మాకు డాక్యుమెంటరీ తీయడానికి జరిగిన విషయము చెప్పిన అబీర్ మా సేఫ్టీ చూడకుండా ఉంటాడు అనుకున్నారా?" అని అడిగింది సుమతి.

శక్తి దాస్ దగ్గరికి వెళ్లి "సార్! మీ ఇద్దరి దగ్గర గన్స్ ఉన్నాయి కదా ఎదురుగా వాళ్ళు అలా మాట్లాడుతుంటే షూట్ చేయకుండా సైలెంట్ గా ఉన్నారు ఏమిటి? మీకు ధైర్యం లేకపోతే ఆ గన్ నాకు ఇవ్వండి." అని అడిగింది మల్లి.

ఆ మాట విని నవ్వుతూ "ఓ సెక్యూరిటీ ఆఫీసర్! ఆ అమ్మాయికి గన్ కావాలంట ఇవ్వు!" అని చెప్పాడు తంబియార్.

మల్లి వైపు చూసి "నువ్వు ఉండవమ్మా! వాళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నావు అసలు నీకు గన్ పట్టుకోవడం అయ్యినా వచ్చా!" అని వెటకారంగా చూస్తూ అడిగాడు కుమార్.

"ఒక్కసారి గన్ ఇవ్వండి పట్టుకోవడం వచ్చో లేదో చూపిస్తాను." అని కోపంగా చూస్తూ చెప్పింది మల్లి.

తన మనుషులు వైపు చూసి "ఒరేయ్! ఆ బక్కదానికి పొగరెక్కువగా ఉంది ముందు దాన్ని చంపేయండి." అని చెప్పాడు వరదరాజులు.

తన మీదకి వస్తున్న నలుగురిని చూసి కుమార్ చేతీలో ఉన్న గన్ తీసుకుని తల మీద షూట్ చేసింది మల్లి.

బుల్లెట్ తగిలి కింద పడ్డ నలుగురిని చూసి మల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తూ "నీకు గన్ షూటింగ్ వచ్చా కరెక్ట్ గా నలుగురి తల మీద గురి తప్పకుండా ఎలా కాల్చావు!" అని అనుమానంగా అడిగాడు దాస్.

చనిపోయిన తన మనుషులని చూసి "అది రిపోర్టర్ కాదు కచ్చితంగా అభీర్ మనిషి అయ్యి ఉంటుంది." అని కంగారుగా చెప్పాడు తంబియార్.

అక్కడికి వస్తూ "కరెక్ట్ గా కనిపెట్టారు సార్! కానీ మీరు మరొక విషయం కనిపెట్టలేకపోయారు." అని చెప్పాడు రాజన్.

"ఏమిటి ఆ విషయం?" అని కంగారుగా అడిగాడు ప్రతాప్ మిశ్రా.

"అభీర్ సేన దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ వచ్చినప్పుడే మీరు ఈ విషయం నుంచి దూరంగా ఉండాలి, ఆస్తి కోసం ఆశ పడితే పర్వాలేదు కానీ ఆ కొండల మీద ఆశపడ్డారు చూడండి అప్పుడే మీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు." అని చెప్పాడు రాజన్.

"అంటే! నువ్వు కూడా అభీర్ మనిషివేనా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సుజిత్.

"నేనొక్కడినే కాదు నంద ఫ్యామిలీ, అభిజిత్ ఫ్యామిలీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మా మనుషులే!" అని చెప్పాడు రాజన్.

"ఈ ఫ్యాక్టరీ చుట్టూ నా మనుషులు ఉన్నారు ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళలేరు." అని చెప్పాడు తంబియార్.

"మీరు ఒక విషయం మర్చిపోయారు ఆ మనుషుల్ని పెట్టిందే నేను ఇక్కడ జరిగింది మీరు మాట్లాడింది మొత్తం రికార్డు అయింది. ఇంక మిమ్మల్ని మేము చంపనవసరం లేదు ఈ వీడియో అర్ణకి పంపిస్తే తనే చూసుకుంటుంది." అని చెప్పాడు రాజన్.

ఆ మాట విని కంగారు పడుతూ "ఆ పని మాత్రం చేయకు ఏం కావాలో చెప్పండి మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాము." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

అంతలో అక్కడికి వస్తున్న కారు వైపు చూసి "మా నాయకుడు వస్తున్నాడు అతను చెప్పింది చేయండి." అని చెప్పాడు రాజన్.

కారు దిగి వరదరాజుల వైపు చూస్తూ "మీ నలుగురు ఎప్పటిలాగా వాళ్లతోనే ఉండండి కానీ మేము చెప్పిన పని మాత్రమే చేయాలి అప్పుడే మీరు ప్రాణాలతో ఉంటారు లేకపోతే వాళ్ల చేతిలోనైనా చస్తారు మా చేతిలోనైనా చస్తారు." అని చెప్పాడు అభీర్.

"సరే! నువ్వు చెప్పినట్లే చేస్తము కానీ మా నలుగురిని చంపను అని నువ్వు మాట ఇవ్వాలి." అని అడిగాడు వరదరాజులు.

"మా మాట విన్నంతవరకు మీరు ప్రాణాలతోనే ఉంటారు." అని చెప్పాడు అభీర్.

"సరే మేము  ఇంకా ఇక్కడి నుంచి వెళ్లొచ్చా!" అని అడిగాడు వరదరాజులు.

"హ్యాపీగా వెళ్ళండి కానీ చేయవలసిన పని ఒకటి ఉంది. ఇక్కడ జూలో ఉన్న జంతువులని బేరా అడవిలో వదలడానికి పర్మిషన్ తెప్పించాలి దాని వివరాలు మొత్తం రాజాన్ చెబుతాడు." అని చెప్పాడు అభీర్.

"సరే!" అని అక్కడ ఉన్న కార్ ఎక్కడు వరదరాజులు.
[+] 11 users Like SivaSai's post
Like Reply
phone tapping tho .. emi talanoppulu untayo Abhir ki!!!
Or logical ga solve chestada adi?
Like Reply
Excellent update
Like Reply
ఎపిసోడ్ 71


ఫ్యాక్టరీ దగ్గర నుంచి వెళ్లడానికి కార్ దగ్గరికి వెళ్లిన వరదరాజుల వైపు చూసి రేపు జూ లొ ఉన్న జంతువులు మొత్తం బేరా అడవికి పంపడానికి పర్మిషన్ తెప్పించాలి వివరాలు మొత్తం రాజన్ చెబుతాడు అని చెప్పాడు అభీర్.

*******************
అభీర్ చెప్పిన మాట విని "జూలో ఉన్న జంతువుల్ని అడవికి పంపించాలా? దానికి పర్మిషన్ నేను తీసుకొస్తే  ముకుల్ కి అనుమానం వస్తుంది." అని చెప్పాడు వరదరాజులు.

"నీ మీద ఎవరికీ అనుమానం రాకుండా ఏం చేయాలో రాజన్ చెప్తాడు." అని కారు దగ్గరికి వెళ్లి నలుగురు వైపు చూస్తూ 

"ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాము కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేశారో నా మనుషులు ప్రతి చోటా ఉంటారు తేడా జరుగుతుంది అని తెలిసిన మరుక్షణం మీ గొంతులో కత్తి దిగుతుంది. శాంపిల్ చూస్తారా?" అని చెప్పి చనిపోయిన ఎనిమిది మంది వైపు చూసి "ఇంకా లెగండి." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని కింద పడ్డవాళ్ళు పైకి లేచి నుంచోవడం చూసి "వీళ్ళు చనిపోలేదా?" అని కంగారుగా అడిగాడు ప్రతాప్ మిశ్రా.

"మీలాంటి అవకాశం వాదుల కోసం మా మనుషులు ఎందుకు పోతారు, నా మాట విని బుద్ధిగా ఉండండి ప్రాణాలతో ఉంటారు ఇంక వెళ్ళండి." అని చెప్పి డ్రైవింగ్ సీట్లో ఉన్న సుజిత్ వైపు చూసి "కార్ స్టార్ట్ చెయ్!" అన్నాడు అభీర్.

"సరే!" అని కారు స్టార్ట్ చేసి స్పీడ్ గా అక్కడి నుంచి బయటికి వెళ్లాడు సుజిత్.

అక్కడినుంచి కారు వెళ్లడంతో అభీర్ వాళ్ళ వైపు చూసి "ఇదంతా మీరు వేసిన ప్లాన్ ఆ..! ఒక్క క్షణం గుండె ఆగిపోయింది." అని టెన్షన్ గా చూస్తూ చెప్పింది నీలమ్.

"అందుకే కదా మీ ఇద్దరి బదులు మల్లి నీ కిడ్నాప్ చేసి తీసుకువచ్చారు." అని నవ్వుతూ చెప్పాడు అభీర్.

"అబ్బో.. నీకు నవ్వడం కూడా వచ్చా, నిజంగా వాళ్ల మనుషులే నన్ను కిడ్నాప్ చేస్తే కాపాడడానికి వచ్చేవాడివా?" అని అడిగింది నీలమ్.

"నా అనుకున్న వాళ్ళని వదిలి వెళ్లి ఒక్కసారి తప్పు చేశాను మళ్ళీ అటువంటి తప్పు చేయను." అని చెప్పాడు అభీర్.

"అవును! రియల్ గన్ తో షూట్ చేసిన మీ మనుషులు చావలేదేమిటి?" అని అనుమానంగా అడిగింది సుమతి.

"ఆ గన్ రియల్ కానీ బుల్లెట్స్ డమ్మీ! మల్లి గన్ హ్యాండిల్ చెయ్యడం లొ ఎక్స్పర్ట్, కుమార్ చేతిలో నుంచి గన్ తన చేతిలోకి తీసుకునేటప్పుడే మ్యాగజైన్ మార్చి తన దగ్గర ఉన్న మ్యాగజైన్ ఫిక్స్ చేసింది." అని చెప్పాడు జాజి.

"ఆ వరదరాజులు వాళ్ళ చుట్టు నిజంగా మీ మనుషులు ఉన్నారా?" అని డౌట్ గా అడిగింది సుమతి.

ఆ మాటకి నవ్వి "మల్లి! ఇద్దరిని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్లు నువ్వు సుమతీ దగ్గర ఉండు." అని చెప్పాడు అభీర్.

"మరి నా మీద ఎవరైనా అటాక్ చేస్తే!" అని అనుమానంగా అడిగింది నీలమ్.

"శంకర్ మీ ఇంటి దగ్గరే ఉంటున్నాడు నీకు ఎటువంటి భయం లేదులే!" అని చెప్పాడు అభీర్.

"సరే!" అని స్మైల్ ఇచ్చి స్కూటీ ఎక్కి స్టార్ట్ చేసి "రెండు రోజుల్లో అడవిలో షూటింగ్ స్టార్ట్ చేయాలి." అని చెప్పింది నీలమ్.

"సరే! దానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి జూలో ఉన్న జంతువులు అడవికి వెళ్లగానే మిమ్మల్ని పంపిస్తాను." అని చెప్పాడు అభీర్.

గన్ లొ ఒరిజినల్ మ్యాగజైన్ పెట్టి కుమార్ కి ఇచ్చి స్కూటీ ఎక్కింది మల్లి.

గన్ లోపల పెట్టుకుని "అభీర్ భయ్యా! వాళ్లు రాజకీయ నాయకులు మేము నార్మల్ సెక్యూరిటీ ఆఫీసర్లము మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా!" అని అడిగాడు కుమార్.

"మీ గురించి వాళ్లు ఆలోచిస్తే నేను వాళ్ల గురించి ఆలోచిస్తాను భయపడకుండా వెళ్లి మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి." అని చెప్పాడు  అభీర్.

అభీర్ దగ్గరికి వచ్చి "నిన్ను మళ్ళీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు మమ్మల్ని ఏమి చేయలేరు ఎందుకంటే నువ్వు మాకు అండగా ఉంటావు అని వాళ్ళకి తెలుసు!" అని చెప్పి కుమార్ తో కలిసి బయలుదేరడు శక్తి దాస్.

నారప్ప వాళ్ళతో కలిసి బయలుదేరుతూ "రాజన్! అడవి నుంచి వచ్చిన ప్రతి జంతువు మళ్ళీ అక్కడకు వెళ్ళిపోవాలి మళ్లీ అవి స్వేచ్ఛగా సంతోషంగా ఉండడం నేను చూడాలి." అని చెప్పాడు అభీర్.

"సరే నాయకుడా! నేను అదే పనిలో ఉంటాను మీరు బయలుదేరండి." అని చెప్పి తన మనుషుల వైపు చూసి "బళ్ళు తీయండి మనం కూడా బయలుదేరుదాము." అని చెప్పాడు రాజన్.

******************

ఫ్యాక్టరీ దగ్గర నుంచి వరదరాజుల ఇంటికి కారులో వెళుతూ "డాడ్! మనం ఆ అభీర్ గాడికి భయపడాలా?" అని కోపంగా అడిగాడు తంబియార్.

"మనం రాజకీయ నాయకులము అందితే జుట్టు అందకపోతే కాళ్లు మన పబ్బం గడుపుకోవడానికి ఏదైనా చేయాలి ప్రస్తుతానికి కాళ్లు పట్టుకున్నాము జుట్టు అందకుండా ఉంటుందా!

ప్రస్తుతం వాడి టైం నడుస్తుంది కాదు అంటే ఎవరో ఒకరి చేతిలో చావడం కన్ఫామ్! మన టైమ్ వచ్చేవరకు సైలెంట్ గా ఉండు." అని చెప్పాడు వరదరాజులు.

"బాబోయ్.. వాడి మనుషులు మామూలు వాళ్ళు కాదు ఆ రాజన్ గాడు నాకు ఆరు సంవత్సరాలుగా పరిచయం నా ప్రతి విషయం వాడికి తెలుసు ఇంత మోసం చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.

మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అభీర్ మనుషులు ఎక్కడైనా ఉండొచ్చు అంత ఎందుకు మీ ఇంట్లో వంటవాడు కూడా వాళ్ళ మనిషి అయి ఉండొచ్చు చెప్పలేము కదా!" అని కళ్ళు పెద్ద చేసుకుని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.

"ఆ రాజన్ మోసం చేశాడు అంటున్నావు మరి మనం చేసేది ఏంటి మోసం కాదా! ప్రస్తుతానికి వాళ్లకి హెల్ప్ చేయడమే మన దగ్గర ఉన్న మార్గం తరువాత ఏం చేయలో చూద్దాము ఆ అర్ణ కి అనుమానం రాకుండా ఉండండి."  అని చెప్పాడు వరదరాజులు.

కార్ డ్రైవ్ చేస్తూ "డాడ్! మన చుట్టూ అభీర్ మనుషులు ఉన్నారు అంటే, ఇంక నంద ఫ్యామిలీ అభిజిత్ ఫ్యామిలీ చుట్టూ కమ్మేసి ఉంటారు కదా!

వాళ్లు అది తెలియక పిచ్చిపిచ్చి ప్లాన్లు వేస్తున్నారు. నాకు తెలిసి అందర్నీ వాడు చంపేస్తాడు ఆస్తులు మొత్తం నా పేరు మీదే పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నాయి కాబట్టి మనం అభీర్ చెప్పినట్లు వినడం బెటర్ !" అని చెప్పాడు సుజిత్.

"అవును! మనం ఆబీర్ కి కాస్త సహాయం చేస్తే అందరినీ లేపేస్తాడు నాకు రాజకీయంగా అడ్డుపడే అభీజిత్ ఫ్యామిలీ కూడా ఉండదు." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు తంబియార్.

"సరే! ముందు ఆ జూలో జంతువుల్ని అడవిలోకి పంపించే  పర్మిషన్ ఏర్పాట్లు ఏమిటో చూడు లేకపోతే నలుగురిలో ఎవరో ఒకరి గొంతులో కత్తి దిగుతుంది." అని భయంగా చూస్తూ చెప్పాడు ప్రతాప్.

"ఆ పర్మిషన్ ఇప్పించడం ఈజీయె, కానీ అది చేస్తే మన మీద ఖచ్చితంగా ముకుల్ వాళ్లకి డౌట్ వస్తుంది దానికి రాజన్ ఏ ఐడియా ఇస్తాడో చూడాలి." అని చెప్పాడు వరదరాజులు.

*****************

ఉదయం ప్రహల్లాద్ కలిసి అర్ణ దగ్గరికి వచ్చి "మేడం! మీ అనుమానం నిజమే! ఆ మిత్ర ఎవరో కాదు శివమణి కూతురు తనని చిన్నప్పుడే అభీర్ అనాధ ఆశ్రమంలో జాయిన్ చేశాడు." అని చెప్పాడు జాకీ.

ఆ మాట విని షాక్ అయ్యి మిథున్ వైపు చూసి "నీకు మిత్ర ఎలా పరిచయం?" అని అడిగింది అర్ణ.

"తను ఐబి ఇన్ ఫార్మర్ గా వర్క్ చేసేది  నాకు రెండుసార్లు హెల్ప్ చేసింది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కదా అని నీకు పరిచయం చేశాను." అని చెప్పాడు మిథున్.

"నాకు తెలిసి ఆ మిత్ర మాత్రమే కాదు మన చుట్టూ చాలామంది ఉండి ఉంటారు, మనవాళ్లు ఇండియాలో ఎవరెవరితో టచ్ లో ఉన్నారో అందరి మీద ఎంక్వైరీ పెట్టండి." అని చెప్పాడు ముకుల్.

"మరి ఎప్పుడు ఆ మిత్రని ఏం చేద్దాము?" అని అడిగాడు జాకి.

"మిత్ర మన దగ్గరికి అభీర్ పంపితేనే వచ్చిందా లేక మామూలుగా వచ్చిందా ముందు అది తెలుసుకోవాలి." అని చెప్పింది అర్ణ.

"అలా అయితే తనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను అది బయటికి వెళ్లింది అంటే తను అభీర్ మనిషి అని కన్ఫామ్ అవుతుంది. అప్పుడు జాగ్రత్తగా ఏదైనా ప్లేస్ కి పిలిచి క్లోజ్ చేసేయండి." అని చెప్పి

తాగిన కప్పు టేబుల్ మీద పెడుతూ జారి కింద పడి తీయబోయి లైట్ వెలగడం చూసి 'సైలెంట్ గా ఉండండి.' అని సైగ చేసి అక్కడ ఉన్నా మైక్రో స్పీకర్ బయటకు తీసి కాలు కింద పెట్టి తొక్కి "కచ్చితంగా ఇక్కడ కూడా అభీర్ మనుషులు ఉన్నారు, ముందు వాళ్ళు ఎవరో తెలుసుకోండి." అని చెప్పాడు మిథున్.

"అంటే! ఇప్పుడు వరకు మనం మాట్లాడిన మాటలు వాళ్ళు వింటూ ఉన్నారా?" అని కంగారుగా అడిగింది అర్ణ.

"టెంక్షన్ పడకండి మేడం! ఇలాంటిది ఏదో జరుగుతుంది అని మార్నింగ్ జామర్స్ ఏర్పాటు చేయించారు ఇక్కడ ఎటువంటి ట్రాన్స్మిషన్స్ పనిచేయవు." అని చెప్పాడు మిస్సైల్.

"గుడ్! ఈ మైక్రో ట్రాన్స్ మిషన్ పెట్టింది ఎవరో కూడా తెలుసుకోండి. ఇకనుంచి ప్రతి ఒక్కరిని అనుమానంగా చూడండి. ముందు ఆ మిత్ర విషయం ఏమిటో తెలుసుకోండి." అని చెప్పింది అర్ణ.

"ఆ విషయం నేను చూసుకుంటాను." అని చెప్పి ఫోన్ తీసి మిత్రకి కాల్ చేశాడు మిథున్.

ఫోన్ లిఫ్ట్ చేసి"హాయ్ సార్!" అని చెప్పింది మిత్ర.

"హో.. సారీ జాకీ కి చేయబోయి నీ నెంబర్ టచ్ అయినట్టు ఉంది. అది సరే మురళి జోషి రెండో కూతురు, లాయర్ వసుంధర కూతురు ఏ కాలేజ్లో చదువుతున్నారో నీకేమైనా తెలుసా?" అని అడిగాడు మిథున్.

ఆ మాట విని "నాకు అంత ఐడియా లేదు సార్! తెలుసుకుని చెప్పమంటే చెబుతాను ఎందుకు సార్?" అని అనుమానంగా అడిగింది మిత్ర.

"ఎందుకు అంటావు ఏమిటి! కొన్నిసార్లు పని జరగాలంటే ఫ్యామిలీని టార్గెట్ చేయక తప్పదు సరే ఉంటాను మనవాళ్లే చూసుకుంటారులే!" అని చెప్పి ఫోన్ పెట్టేసి జాకి వైపు చూసి "ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసు కదా!' అని చెప్పాడు మిథున్.

"ఎస్! ఇంకా నేను చూసుకుంటాను." అని చెప్పి అక్కడినుంచి తన మనుషులతో  బయలుదేరాడు జాకీ.

ఫోన్ పెట్టేసి హడావుడిగా బైక్ స్టార్ట్ చేసి చాక్లెట్ ఎక్కించుకుని ఫాస్ట్ గా వెళ్ళింది మిత్ర.
[+] 7 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)