08-02-2026, 12:33 AM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
|
పాణిగ్రహణం
|
|
08-02-2026, 08:05 AM
Super update
09-02-2026, 06:17 AM
(This post was last modified: 09-02-2026, 06:18 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 85
నివితో కలిసి రాజ్ ట్రావెలింగ్ మొదలు పెడతాడు. ఇంట్లో అందరికీ ఆ విషయం అర్థం అవుతుంది. కానీ నీవి ఒప్పుకుంటేనే ముందుకు వెళ్లాలి అని అందరూ మౌనంగా ఉంటారు.
రాజ్ నివి తో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నివి అర్ యు కంఫర్ట్ అని అడుగుతాడు. కొంచెం అనిజీ గా ఉంది. ఈ ఆర్నమెంట్స్ అన్ని తీసేసి డ్రస్ చేంజ్ చేసుకుంటే గాని ఫ్రీగా ఉండదు అని చెబుతోంది. ఏదైనా ఎక్స్ట్రా పెయిర్ ఉందా అని అడిగితే..ఆహా నా బ్యాగ్ ఈ కారులోనే ఉంది అని చెబుతుంది. జస్ట్ వెయిట్ అని చెప్పి... కొంచెం లోన్లీ గా ఉన్న ప్లేస్ దగ్గర ఆపి డిక్కీలో ఉన్న తన బ్యాగు తీసి... నివి చేతికి ఇచ్చి బ్యాక్ సీట్లోకి వెళ్లి డ్రస్ చేంజ్ చేసుకో.. నేను బయట వెయిట్ చేస్తాను అని చెబుతాడు. కానీ కనిపిస్తానేమో కదా అంటే.. డోంట్ వర్రీ ఈ గ్లాసెస్ లో నుంచి బయటికి అసలు ఎక్కడ ఏమి కనిపించదు. కావాల్సితే చెక్ చేసుకో అని అంటాడు. పరవాలేదు.. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిలే అని చెప్పి బ్యాక్ సీట్ లోకి వెళుతుంది. రాజ్ కారు దిగి లాక్ చేసి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక 10 మినిట్స్ కి డ్రెస్ చేంజ్ చేసుకుని నివి కారు దిగుతుంది. రాజ్ వెళ్దామా అని అడుగుతుంది. ఆర్ యు ఫీల్ ఫ్రీ అని అడిగితే.. ఇప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంది అని చెబుతుంది. సరే రా అని చెప్పి డ్రైవింగ్ ప్లేస్ లో కూర్చుంటాడు. పక్కన ప్యాసింజర్ సీట్లు నివి కూర్చుంటుంది. నివి తో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ నివి వైపు చూస్తాడు. చాలా అలసటగా కనిపిస్తుంది. ఇప్పుడు వద్దులే అనుకుని నివి రేపు నువ్వు ఫ్రీ యేనా అని అడిగితే.. హ.. రేపు శ్రీ వాళ్ళ ఇంట్లో నోములు ఉన్నాయి కదా.. అయిపోయిన తర్వాత ఫ్రీనే అని చెబుతుంది. రేపు నైట్ నాతో కలిసి బయటికి వస్తావా అని అడుగుతాడు. దేనికి అని అడిగితే జస్ట్ టు అవర్స్. ఇంటిదగ్గర మళ్ళీ నేనే డ్రాప్ చేస్తాను విత్ యువర్ బ్రదర్ పర్మిషన్ అని చెబుతాడు. దానికి నవ్వుతూ నీ మీద మా ఇంట్లో అందరికీ నమ్మకం ఉందిలే రాజ్ అంటుంది. అందరికీ కాదు నీకుందా లేదా అని అడుగుతాడు. ఉండబట్టే కదా.. ఇప్పుడు ధైర్యంగా నీతో కలిసి వస్తున్నాను అని చెబుతోంది. థాంక్యూ బట్.. రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నేను పికప్ చేసుకుంటాను అని చెబుతాడు. ఒకే అని చెబుతోంది. రొమాంటిక్ సాంగ్స్ పెట్టి మెల్లిగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ సాంగ్స్ వింటూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది తనకి తెలియకుండానే రాజ్ భుజం పైన తలపెట్టి నిద్రపోతుంది. అది చూసుకుని రాజ్ నవ్వుకుంటూ లైఫ్ లాంగ్ నీతో ఇలా కలిసి ట్రావెల్ చేయాలని ఉంది నివి. రేపు నా మనసులో మాట నీకు చెప్పేస్తాను. నువ్వు ఏమంటావో అన్న ఒకపక్క టెన్షన్ ఉన్నా సరే ఒప్పుకుంటావని మరొక పక్కన నమ్మకంగా ఉంది కానీ.. నీ నిర్ణయం ఏదైనా సరే నాకు సమ్మతమే. శ్రీ కారు కూడా ఇంటికి చేరుకుంటుంది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని గుమ్మం దగ్గరే నిలబెట్టి అవని దిష్టి తీస్తుంది. ముందు ఇద్దరు ఒకరు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని లోపలికి రండి అని గుమ్మం దగ్గరే ఆపేస్తుంది. శ్రీ మంచి ఉత్సాహంగా నా భార్య అయిన నేహాతో కలిసి శ్రీ అయిన నేను వచ్చాను అని చెబుతాడు. నేహా వైపు తిరిగి ఇప్పుడు నువ్వు చెప్పు సీనియర్ అనగానే.. నేహా సిగ్గుపడుతూ ఉంటుంది. అబ్బో ఈ సిగ్గులన్నీ తర్వాత మీ ఆయన దగ్గర చూపిద్దువు గాని.. ముందు పేరు చెప్పి లోపలికి రావాలి అని గట్టిగా పట్టుపడుతుంది. నేహ కి ఆ వాతావరణం అంతా చాలా కొత్తగా ఉంటుంది. అందులోనూ తను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది. ఇక్కడ అంతా కూడా హైఫేగా కనపడుతుంటే..ఒకపక్క భయంగా కూడా అనిపిస్తుంది. బిత్తరి చూపులు చూస్తూ ఉంటే.. విక్రమ్ నేహా పక్కకి వచ్చి నిలబడి భుజం చుట్టూ చేయి వేసి ఎందుకు భయపడుతున్నావు. నీకు సపోర్ట్ గా ఈ అన్నయ్య ఉన్నాడు కదా.... ఈ అన్న చెల్లెలు నిన్ను ఏమి పీకలేరు గాని ధైర్యంగా శ్రీ పేరు చెప్పి కుడికాలు లోపలికి పెట్టు అని చెబుతాడు. ఆ మాటకి నేహ ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంది. ఆఫీసులో ఎంత సీరియస్గా ఉంటారు.. అలాంటిది కుటుంబం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంత రెస్పాన్సిబిలిటా అని ఆశ్చర్యపోతోంది. శ్రీ కూడా తొందరగా చెప్పు నేహ.. ఇప్పటికే కాళ్లు లాగేస్తున్నాయి అంటే.. శ్రీ వైపు చూసి చిన్నగా సిగ్గుపడుతూ.... నేహా అనే నేను నా భర్త అయిన శ్రీ గారితో కలిసి మా అత్తారింటికి వచ్చాను అని చెబుతోంది. అందరు హే అని అరుస్తూ క్లాప్స్ కొడతారు. ఇప్పుడైనా లోపలికి రానిస్తావా అడిగితే... ఆడపడుచు కట్నం ఇవ్వకుండా ఎలాగ అన్నయ్య అని అడ్డుగా నిలబడుతుంది. అది ఒకటి ఉంది కదా కానీ ఏమీ తేలేదే అన్నట్టుగా చూస్తాడు. విక్రమ్ మెల్లిగా శ్రీ చేతిలో ఒక బాక్స్ పెడుతాడు. అది చూసి బతికించావురా.. లేకపోతే మా నాన్న ఇది కూడా నీకు తెలవదా అని నేహా ముందే తిట్లు దండకం మొదలుపెడతాడు అని చెప్పి ఆ బాక్స్ అవినికి ఇస్తాడు. థాంక్స్ అన్నయ్య అని చెప్పి నేహాన్ని కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెబుతుంది. లోపలికి వచ్చిన దంపతుల్ని దేవుడి గది ముందుకు తీసుకువెళ్లి నేహా నీ దీపం వెలిగించమంటారు. నేహా కి సపోర్టుగా శ్రీ ని నిలబడమని చెబుతారు. భార్యాభర్తలతో దీపం వెలిగించిన తర్వాత నేహా కి ఒక రూమ్ చూపించి ఫ్రెష్ అవ్వమని.. తనకు ఏదైనా అవసరం అవుతుందేమో అని అవని నీ తోడు ఇచ్చి గదిలోనికి పంపిస్తారు. వెళుతున్న భార్యలు వైపు శ్రీ, విక్రమ్ అలాగే చూస్తూ ఉంటారు. అది చూసిన వాసు గారు మీరు ఎలా చూసిన.. ఈ రోజు మీ భార్యలు ఇద్దరు కనపడరు. విక్రమ్... నువ్వు శ్రీ తో ఉండు అని చెబుతారు. సరే అంకుల్ అంటే.... ఎందుకు డాడీ.. విక్కీ రెస్ట్ తీసుకుంటాడు కదా అవిని నీ తీసుకుని నువ్వు బయలుదేరురా అని చెబుతాడు. ఆ మాటకి వాసుగారు నాకు తెలుసు రా నీ వేషాలు.. అందుకే కదా నీకు తోడుగా విక్రమ్ ను ఉంచింది. రేపు నోములయ్యి.. కార్యం ముహూర్తం వచ్చేదాకా భార్యాభర్తలిద్దరూ ఒక చోట ఉండకూడదు. నువ్వు ఎలాంటి వాడివో తెలిసే నా జాగ్రత్తలు నేను తీసుకుంది అని చెప్పి విక్రమ్ వైపు చూసి వాడిని ఒక కంట కనబడుతూ ఉండు. కొంచెం మేము రెస్ట్ తీసుకుంటామని గదిలోకి వెళతారు. శ్రీ వాళ్ళ నాన్న వైపు కొరకురా చూస్తూ ఉంటే... విక్రమ్ భుజం మీద చేయి వేసి... చూసింది చాలుగాని పదా అంటాడు. ఏంటి బావ ఈ పెద్దోళ్లుకి అసలు ఏమీ అర్థం కాదు. పిల్లలే.. వాళ్లకి చిన్న చిన్న సరదాలు ఉంటాయి. మనం అడ్డుపడకూడదు అని ఆలోచించొద్దా... వాళ్లు ఆలోచించారు కాబట్టి నన్ను ఉంచారు నీతో. పద... నేను చెబుతాను కదా అని రూమ్ కి తీసుకు వెళ్తాడు. ముందు ఫ్రెష్ అవ్వని చెప్పి శ్రీని వాష్ రూమ్ లోకి తోస్తాడు. విక్రమ్ అవినికి మెసేజ్ చేస్తాడు. ఏం చేస్తున్నావు అని. అది చూసి నేను నేను సీనియర్ కి హెల్ప్ చేస్తున్నాను అని రిప్లే ఇస్తుంది. ఇంకా సీనియర్ ఏంటి వదిన అని పిలువు అంటే. అలవాటు చేసుకోవాలి అని రిప్లై ఇస్తుంది. ఈ లోపు ఫ్రెష్ అయ్యి వచ్చిన శ్రీ విక్రమ్ పక్కన కూర్చుంటాడు. విక్రమ్ అది చూసుకోకుండా మెసేజ్ చేస్తూ ఉంటాడు. శ్రీ ని ఎంతసేపైనా విక్రమ్ చూసుకోకపోతే.. విసుగు వచ్చి ఒరేయ్ ఆ మెసేజ్ స్ ఆపి నువ్వు కూడా ప్రెస్ అయ్యి రా నాకు నిద్ర వస్తుంది అంటాడు. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది రా అంటే నేను వచ్చి చాలాసేపు అయింది గాని.. ఇప్పుడు కూడా మా చెల్లిని వదలవా... మీ చెల్లి పక్కన లేకపోతే నిద్ర రాదు రా అంటాడు. అయితే ఒక పని చేద్దామా బావ అని మంచం మీదే మోకాళ్ళ మీద కూర్చుని అడుగుతాడు. ఏం పనిరా అంటే.. మా చెల్లిని పైకి రమ్మని చెప్పు. నేను మీ చెల్లి దగ్గరికి వెళతాను. అప్పుడు నువ్వు అవని రూమ్ లో ఉండొచ్చు అంటాడు. అప్పుడు విక్రమ్ పైనుంచి కిందకి చూస్తూ ఉంటే.. నీకోసమే బావ నేను చెప్పింది. నువ్వు ప్రశాంతంగా నిద్ర పోవాలని నా తాపత్రయం అంతా... నా నిద్ర ఎలా పోవాలో నాకు తెలుసుగాని..నువ్వు మూసుకొని పడుకో అని చెప్పి అవినికి గుడ్ నైట్ అని మెసేజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఛి.. ఛి...వీడు కూడా మా నాన్న లాగానే తయారయ్యాడు. అస్సలు నన్ను వదలడం లేదు కదా అనుకుని దుప్పటి ముసుగేస్తాడు. విక్రమ్ ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి శ్రీ ముసుగేసుకుని కనపడతాడు. చిన్నగా నవ్వుకుంటూ పక్కన పడుకుని కొన్ని కొన్ని విషయాలకి ఆత్రం ఆపుకోవాలి రా.. లేకపోతే అంతే సంగతులు. దుప్పటి ముసుకి తీసి అంటే ఏంటి బావ అని అడిగితే.. ఒరేయ్ బామ్మర్ది నీకు చాలా విషయాలు తెలియాలి రా.. ప్రతిదీ కూడా పెళ్ళాల ముందు బయట పడకూడదు. వాళ్లకి అన్ని మన విషయాలు అర్థమైపోయింది అనుకో.. ప్రతిదానికి మనల్ని ఆడేసుకుంటారు అర్థమవుతుందా అని భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు జ్ఞానోదయం చేసినట్టుగా జ్ఞానోదయం చేస్తాడు. అర్థమైంది బావ అంటాడు. ఏం అర్థమైందిరా అంటే.. మనకి ఏం కావాలో అన్నది వాళ్ల నోటితోనే చెప్పించాలి అంతే కదా... పర్వాలేదు కొంచెం డెవలప్ అవుతుంది. కానీ ఇది మైంటైన్ చేయలేదు అనుకో.. నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. లైఫ్ లాంగ్ అంకుల్ నిన్ను ఆడేసుకుంటారు.
09-02-2026, 06:19 AM
Part - 86
శ్రీ విక్రమ్ వైపు చూస్తూ నువ్వు అన్నది కూడా నిజమే బావ. మా నాన్నకి ఏ వంక దొరుకుతుందా నన్ను ఆడుకుందామా అని చూస్తూ ఉంటారు.
ఇప్పుడు నుంచి చూసుకో మా నాన్నకి నేను అస్సలు దొరకను అని చెబుతాడు. ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు. నీ నవ్వుకి అర్థం ఏంటి బావ అంటే నీకు ఏమీ అర్థం కావాలి అంటే ఆ అర్థం తీసుకోరా... ప్రస్తుతానికి అలిసిపోయాను నన్ను పడుకోనివ్వు అని విక్రమ్ కూడా పడుకుండిపోతాడు. నేహా ని తలుచుకుంటూ మురిసిపోతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. పొద్దున్నే బద్దకంగా లేచే శ్రీ ఆరోజు విక్రమ్ కంటే ముందే లేచి.. బావ లేగు అని లేపుతాడు. ఒరేయ్ ఇంకా తెల్లారు లేదురా అంటే... అప్పుడే తెల్లారకపోవడం ఏంటి బావ. ఆరైపోతుంటే.. మగతగా కళ్ళు తెరిచి కళ్ళు మండుతున్నాయి రా.. కాసేపు పడుకోనివ్వు. ఇంకా పడుకుంటే ఎలా బావ.. నోములుగా టైం అయిపోతుంది కదా.. అని కంగారు పడతాడు. విక్రమ్ విసుగ్గా దుప్పటి ముసుగు తీసి.. నిన్ను ఈ ఆత్రమే తగ్గించుకోమని చెప్పింది. రాత్రంతా చిలక్కి చెప్పినట్టు చెబితే మళ్ళీ ఉదయం అవ్వగానే మొదలు పెట్టేసావు ఎదవ అని లేచి బాల్కనీలోకి వెళ్తాడు. చిరాకుగా బాల్కనీలోకి వెళ్లిన విక్రమ్ కి వెంటనే ముఖం ప్రశాంతంగా మారిపోతుంది. పెదవులపై చిరునవ్వు చేరుతుంది. కిందకి అలానే చూస్తూ ఉంటాడు. అక్కడ సురభి గారు, అవని ఇద్దరూ నోములు కావలసినవి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. తులసి కోట దగ్గర అవని ముగ్గు పెడుతూ ఉంటే... సురభి గారు ఇంకా ఏదో చెబుతూ ఉంటారు. అవి వింటూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ పనిచేస్తూ ఉంటుంది. అది చూస్తున్న విక్రమ్ కి మనస హాయిగా అయిపోతుంది. గుండెలపైన చేయి వేసుకుని రబ్ చేసుకుంటూ.. ఉదయమే నిన్ను ఇలా చూస్తే చాలే భార్యామణి. ఆ రోజంతా కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. మాట్లాడుతున్న అవని ఒక్కసారిగా మాట్లాడడం ఆపేసి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఏమైంది అని సురభి గారు అడుగుతుంటే.. ఏమీ లేదు పెద్దమ్మ అంటూ చుట్టూ చూస్తూ పైకి చూస్తుంది. అక్కడి నుండి వేడిగా, వాడిగా తగులుతున్న భర్త చూపులను తట్టుకోలేక.. కళ్ళు వాల్చేస్తుంది. ఏమైంది అంటే.. ఇప్పుడే వస్తాను పెద్దమ్మ అని చెప్పి గబగబా లోపలికి పరుగు పెడుతుంది. అవని పరుగు చూసి నవ్వుకుంటూ వెనక్కి తిరుగుతాడు. అక్కడే శ్రీ నిలబడి కోపంగా చూస్తూ ఉంటాడు. ఏమైందిరా అలా చూస్తున్నావు అంటే.. నాకు ఏదో ఉపదేశాలు ఉపదేశించి నువ్వు ఇక్కడ చేస్తున్నది ఏంట్రా... నేనేం చేశాను రా అని ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు. నేను మొత్తం చూశాను. నువ్వు నా చెల్లికి ఓపెన్ సైట్ కొడుతున్నావా లేదా అంటే.. కొడుతున్నాను అయితే ఏంటి అని అడుగుతాడు. నువ్వు చేస్తే లేని తప్పు నేను చేస్తే వచ్చిందా అని ఈసారి కొంచెం కోపంగానే అడుగుతాడు. కచ్చితంగా వచ్చిందే అంటాడు. అదే ఎలాగా అంటే ఒరేయ్... నేను ఏం చేసినా నా పెళ్ళానికి తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ.. తమరు ఏం చేసినా సరే చిరిగి చాట అంతా అయినట్టు ఊళ్లో వాళ్ళందరికీ తెలుస్తోంది. రెండింటికి తేడా లేదేంటిరా... అంటాడు. నేను నేహా కి సైట్ కొడితే అందరికీ తెలుస్తుందా... డౌటా అని అడుగుతాడు. మరి నువ్వు అవనికి సైట్ కొడుతుంటే పక్కన అమ్మ ఉంది కదరా... ఆంటీకి తెలిసేమో ఒక్కసారి కిందకి చూడు అని చెబుతాడు. బాల్కనీలో నుంచి కిందికి చూస్తున్న శ్రీ సురభి పిలుస్తున్న సరే వినిపించుకోకుండా అవని లోపలికి పరుగు పెట్టడం కనపడుతుంది. అది చూసి శ్రీ ఎలా రా... అదే అర్థం చేసుకోవాలి అంటే నీకు ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి రా బామ్మర్ది అని చెప్పి లోపలికి వస్తాడు. అప్పుడే అవని కాఫీ కప్పు పుచ్చుకొని రూమ్ లోనికి వస్తుంది. గుడ్ మార్నింగ్ భార్యామణి అని కప్ అందుకుంటాడు. గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే లేచారా..తొందరగా రెడీ అయి కిందకి వచ్చేయండి. చాలా పని ఉంది అని చెప్పి.. అన్నయ్య మీరు నోములయ్యేదాకా ఏమీ తినకూడదు తాగకూడదు అని చెబుతోంది. సరే బంగారం అని చెప్పి.. అమ్మ అవని అని పిలుస్తాడు. చెప్పు అన్నయ్య అంటే.. అది.. అది.. నాంచుతుంటే... నేహా లేచింది రెడీ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. నేను ఇంకా ఏమీ అడగలేదు కదరా అంటే... నువ్వు నాంచడంలోనే అర్థమవుతుంది కానీ.. రెడీ అవ్వని చెప్పి బాత్రూంలోకి తోస్తాడు. ఇద్దరూ రెడీ అయ్యి కిందకి వెళ్తారు. హాల్లోకి వెళ్లి ఇద్దరూ సోఫాలో కూర్చుని మొత్తం చూస్తూ ఉంటారు . శ్రీ మాత్రం నేహా రూమ్ వైపే తొంగి చూస్తూ ఉంటే.. వాసు గారు అక్కడే కూర్చుని పేపర్ చూస్తూ మరీ ఎక్కువగా తిప్పకు. మెడ పట్టేసింది అనుకో.. అలానే పూజలో కూర్చుంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దాని గురించి అడుగుతూ ఉంటే.... నేనేం చెప్పాలో అర్థం కాక నాకు ఇబ్బందిగా ఉంటుంది అంటారు. ఆ మాటకి వస్తున్న నవ్వుని విక్రమ్ కష్టంగా ఆపుకుంటాడు. శ్రీ మాత్రం నాన్న అని కోపంగా అంటాడు. ఇప్పుడు నేను ఏమన్నాను రా అని అంత కోపం. నీ మంచి కోసమే చెబితే అంటే.. నా మంచి కోసం చెప్పడం అంటారా.. వెటకారం అంటారా అంటే..నీకు ఎలా కావాలంటే అలా తీసుకోరా... నేనైతే నిజమే చెప్పాను. ఏరా విక్రమ్ అంతేనా అంటే..నిజమే అంకుల్ అని నవ్వుతాడు. విక్కీ నువ్వు కూడా నా అంటే నీకు ముందే చెప్పాను కదరా అన్నట్టు చూస్తాడు. సర్లే... అని. రాజ్ రాలేదేంటి అని వాసు గారు అడుగుతారు. చెల్లి వాళ్ళని తీసుకుని వస్తున్నాడు అంకుల్ అని చెప్తాడు. అవునా... నివి కి రాజ్ కి ఇచ్చి చేస్తారా అని అడిగితే.... అది పూర్తిగా వాళ్ళిద్దరూ ఇష్టం. వాళ్ళిద్దరికీ ఓకే అయితే మాకు ఎవ్వరికి అభ్యంతరం లేదు అని చెబుతాడు. అది నిజమేలే పిల్లలు ఇష్టపడితే చాలు అయినా రాజ్ కి ఏంటి వాడు బంగారం అంటే... మరి నేను అనగానే... అది సేపెరేట్ గా చెప్పాలా... వద్దు. మీరేం చెబుతారో నాకు తెలుసు అని మూతిముడుచుకుని కూర్చుంటాడు. కొడుకు అలకలు చూసి వాసు గారు తల.. కొట్టుకుంటూ.. ఎలరా మీరు భరిస్తున్నారు అని అడిగితే అలవాటైపోయింది అంకుల్. మీరందరూ నన్ను భరిస్తున్నారు అంటే... మాదేముందు లేరా... కన్నందుకు మేము... ఫ్రెండ్షిప్ చేసినందుకు వీళ్ళు ఏదో పాతికేళ్ళు గెంటేసాము. కానీ మిగిలిన జీవితం అంత పాపం నా బంగారు తల్లి.. నా పిచ్చి తల్లి... నా కోడలు పిల్ల నిన్ను భరించాలి కదా అని బాధగా అంటారు. మీ కోడలు బంగారం... పిచ్చి తల్లి నా... నేనేమో అని మూతి ముడుచుకుంటాడు. ఈ మూతీ ముడుపులే తగ్గించరా బాబు అని.. పంతులుగారు ఇంకా రాలేదేంటి సురభి అని అడుగుతారు. వచ్చేస్తున్నారండి అని చెప్పి గుమ్మం వైపు చూస్తూ ఉంటే పంతులుగారు వస్తూ ఉంటారు. పంతులుగారు వెనకాలే విక్రమ్ ఫ్యామిలీ మొత్తం వస్తూ ఉంటారు. ఎదురు వెళ్లి ఇంత లేట్ అయింది ఏమిటి కళ్యాణ్ అని అడిగితే... మా బాధలు ఏమని చెబుతాములే...ఈ ఆడవాళ్లు లేచి రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారో తెలుసా... మనం వెళ్లే టప్పటికి నోమ్ అయిపోతుంది అని కంగారు పెడితే ఇదిగో ఈ టైంకి బయలుదేరారు అని వాపోతారు. ఆ మాటకి లలిత కోపంగా చూస్తూ ఎవరు ఎవరిని కంగారుపెట్టారు అని అడుగుతుంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే గాని పదండి పదండి అని లోపలికి తీసుకువెళతారు. మా చెల్లెమ్మకు నువ్వు బాగా భయపడతావ్ అనుకుంటా అంటే.. నలుగురిలో ఆ మాత్రం నటించలేదు అనుకో ఇంటికి వెళ్ళాక మనకి అన్ని పస్తులే.. అవసరమా చెప్పు అని చెప్పి నవ్వుతూ లోపలికి వస్తారు. అసలు నువ్వు ఏమి మారలేదు కదా అని రమేష్ ని, కళ్యాణ్ ని లోపలికి తీసుకువెళ్తారు. వెనకాలే లలిత మాధవి కూడా వస్తారు. వినయ్, భరత్ కారు దిగి ఇద్దరు క్యాజువల్ గా వచ్చేస్తూ ఉంటే... రాజ్ మాత్రం కనబడడు. శ్రీ విక్రమ్ తో వీడేంట్రా కొత్త పెళ్ళికొడుకు కన్నా దారుణంగా ఉన్నాడు. ఒక సామెత ఉంది కదా రా...కొత్త పిచ్చోడు పొద్దెరగడని అని. ఇప్పుడు చూస్తూ ఉండు వాడి ఏ రేంజ్ లో వస్తూ ఉంటాడో.. ఎలా వస్తూ ఉంటాడు అని గుమ్మం దగ్గరకు వెళ్లి ఆత్రంగా చూస్తూ ఉంటాడు. అక్కడ రాజ్ కారు దిగుతాడు. హమ్మయ్య ప్రస్తుతానికి కారు దిగాడు అనగానే... నివి ఉన్న వైపుకు వెళ్ళి కార్ డోర్ తెరుస్తాడు. నివి మెల్లిగా దిగుతుంటే జాగ్రత్త అని రాజే ముందు కంగారు పడిపోతూ ఉంటాడు. కిందకి దిగే హమ్మయ్య అని... ఈ హాఫ్ సారీ క్యారీ చేయడం చాలా కష్టం తెలుసా రాజ్ అంటుంది. ఫంక్షన్ అప్పుడు ఇలాగే రెడీ అవ్వాలి కదా.. లేకపోతే బాగోదు కదా నివి అని మెల్లిగా చెబుతూ ఉంటాడు. శ్రీ నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటాడు. విక్రమ్ డిప్ప మీద ఒకటి పీకి నోరు ముయ్యి. లేకపోతే ఈగలు దోమలు లోపలికి వెళతాయి అంటాడు. ఏంట్రా నేను చూసేది మన రాజ్ నేనా అంటే.. నీకెందుకు వచ్చింది అంత డౌటా అంటాడు. నా ఎంగేజ్మెంట్ రోజున మనిద్దరం బెండ్ అయిపోతున్నాము. అసలు మీరేనా అని చాలా మాట్లాడాడు కదరా... వీడు ఏంట్రా.. నువ్వు పెళ్లి అయ్యేదాకా ఆగవు. నేను ఎంగేజ్మెంట్ వరకు ఆగాను. వీడు అసలు ప్రపోజ్ చేయకముందే బెండ్ అయిపోయాడు కదా అంటాడు. ఎంతవారు అయినా కాంత దాసులే కదా అన్న సాంగ్ రింగ్టోన్ పక్కనుండి వినపడుతూ ఉంటుంది. ఆ రింగ్టోన్ విని విక్రమ్, శ్రీ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటు...ఈ కవి ఎవరో గాని నిజమే చెప్పారు కదా అన్నట్టుగా రాజ్ వైపుకి లుక్కు మార్చుతారు. రాజ్ పరిస్థితి ఏమిటంటారు???
09-02-2026, 10:38 AM
Super update
09-02-2026, 12:52 PM
Nee regular updates ki joharlu Siva bro!!!
intha regular ga raastunnaa... story lo pattu matram vadalatledu. Great going bro!
10-02-2026, 07:39 AM
Part - 87
నివి కారు దిగి లెహంగా ని రెండు పక్కల చేతితో కొంచెం పైకి పట్టుకుని మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉంటుంది.
నేనేమైనా హెల్ప్ చేయనా.. ఇబ్బంది పడుతున్నావా అని కన్సర్న్ చూపిస్తూ ఉంటాడు. పరవాలేదు రాజ్.. మెల్లిగా నడు. ఇక్కడ అడుగు వెయ్యి.. అక్కడ కొంచెం డస్ట్ ఉంది అని చెబుతూ మెల్లిగా నడిపిస్తూ ఉంటాడు. ఇద్దరు గుమ్మం దగ్గరకు వచ్చేటప్పటికి విక్రమ్, శ్రీ చేతులు కట్టుకుని చూస్తూ ఉంటారు. నివి ఇద్దరిని చూస్తూ హాయ్ అన్నయ్య అని విక్రమ్ ని హగ్ చేసుకుని... ఏంటండీ కొత్త పెళ్ళికొడుకు గారు.. లోపల ఉండకుండా ఇలా బయట ఎండలో నిలబడ్డావు అంటే.. కొన్ని కొన్ని వింతలు చూడాలంటే ఎండలో ఏంటి.. ఎక్కడైనా నిలబడవచ్చు అంతేనా రాజ్ అంటాడు. రాజ్ కి పరిస్థితి అర్థం అయ్యి ఏమో నాకేం తెలుస్తుంది. ఆ వింతల గురించి అని... నువ్వు లోపలికి వెళ్ళి నివి అని చెప్పి పంపించి... ఏంట్రా ఇద్దరు నా వైపు అలా చూస్తున్నారు అంటే.. సూటిగా చూస్తూ ఉంటారు. ఆ చూపులో ఎటువంటి మార్పు ఉండదు సరే.. సరే... మీ చూపుల్లో బావమెంటో అర్థమైంది. ఎన్నో అనుకుంటాము అన్ని అవ్వాలని లేదు కదా అని ఎటో చూస్తూ చెబుతాడు. అయినా ఇద్దరూ కదలకుండా చూస్తూ ఉంటారు. ఇంకా లాభం లేదు అనుకోని రెండు చేతులతో నమస్కారం చేసి బెండ్ అయ్యి ముజే మాఫ్ కరో అంటాడు అంతే... ఇద్దరూ ఒకరినొకరు చూసికుని వీపు మీద గుద్దిన గుద్దకుండా గుద్దుతారు. అబ్బ వదలండి రా..... మీకు దండం పెడతాను. మరి ఇంత కోపం చూపిస్తున్నారు ఏంట్రా అని బ్రతిమాలతూ ఉంటే... మాది కోపం కాదు రా ఆవేదన అంటాడు. విక్రమ్ వియర్ట్ గా చూస్తూ ఇవేం కొత్త పదాలు రా అంటే... ఏదో బాగుంది కదా అని వాడేసాను. సూట్ అవ్వలేదా అని అడుగుతాడు. కర్మ రా బాబు... ఎప్పుడు ఏం మాట్లాడతావో ఇప్పటికి వైనం లేదు. అయితే ఇక్కడ డైలాగ్ ఏంటో నువ్వే చెప్పు నేను సైలెంట్ గా ఉంటాను అని శ్రీ నోటి మీద చేయి వేసుకుంటాడు. ఏరా నా ముందు నా చెల్లికి సైట్ కొడుతున్నావా అని చెయ్యి మెలిపెడుతూ ఉంటే.. ఒరేయ్ సైట్ కొట్టడం లేదు రా.. లవ్ లో దింపుతున్నాను. అయినా నీకు ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతావేంటి.. నీకు మొదటి రోజు నుంచి అన్ని అర్థమే కదా... ఆహ... నాకు అర్థమైతే...నా ముందే రెచ్చిపోతున్నావా.. పోనిలే ఫ్రెండ్ అని ఊరుకుంటుంటే అని కొంచెం గట్టిగా పట్టుకుంటాడు. అబ్బా ప్లీజ్ రా చెయ్ వదులురా... చేతికి ఏదైనా అయ్యితే.. సాయంత్రం నివిని డేట్ కి తీసుకెళ్లడం కుదరదు అంటాడు. ఆ మాటకి శ్రీ.. రాజ్ ముందుకు వచ్చి అప్పుడే డేట్ దాకా వెళ్ళావా... ఏదో మా ప్రయత్నాలు మావి... నువ్వే బెటర్ రా...పెళ్లి కుదిరిన సరే.. నా పెళ్ళాన్ని డేట్ కి తీసుకు వెళ్లలేకపోయాను అని వాపోతాడు. ఆ మాటకి విక్రమ్ రాజ్ చేయి వదిలేసి ఏంట్రా మీ ఇద్దరికీ 15 డేస్ ఒకే చోట కలిసి ఉండే టైం ఇచ్చాను కదా... అయినా వెళ్లలేదా అని ఆశ్చర్యపోవడం విక్రమ్ వంతు అవుతుంది. రాజ్ కూడా అదే ఎక్స్ప్రెషన్ తో శ్రీ వైపు చూస్తాడు. ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటాడు.. ఈసారి శ్రీ ఇద్దరి మధ్యన ఇరుక్కుంటాడు. ఏం చేసావురా 15 రోజులు అని ఇద్దరూ చెరో వైపు పట్టుకుని మెలిపెడుతారు. అబ్బా వదలండి రా... ఇప్పుడు అసలే పూజ దగ్గర కూర్చోవాలి. మళ్లీ నా చేతికి ఏదైనా అయితే మా నాన్న సెటైర్లు భరించలేను. ఏం చేసావో చెప్పురా వదిలేస్తాము అని కొంచెం గట్టిగా లాగుతారు. ఏదో.. అది మా ఇద్దరి పర్సనల్ మ్యాటర్ నేను చెప్పను. మళ్ళీ సజెషన్స్ కి మా దగ్గరకు రా.. అప్పుడు చెబుతాం నీ పని అని ఇద్దరు ఒకేసారి చేతులు వదులుతారు. వెంటనే ఇద్దరి చేతిలో పట్టుకుని మీరిద్దరూ అలా అంటే నేను ఏమైపోవాలి రా... చిన్న ప్రాణాన్ని అంటే.. ఎక్కువ అవ్వడం లేదు. ఏం చేసావో చెప్పు. అప్పుడు నెక్స్ట్ టైం ఏమైనా సలహా ఇవ్వాలా లేదా అన్నది మేము ఆలోచిస్తాము అని రాజ్ విక్రమ్ వైపు తిరిగి అంతే కదరా అంటాడు. అంతే.. అంతే.. చెప్పు చెప్పు అని ఈసారి మేడ మీద చేతులు వేస్తాడు. హె... హే... ఆపండ్రా మీ గోల. నేహా ఏమి... నిధి అంత ఫస్ట్ కాదు. అసలు కారులో ఆఫీస్ కి తీసుకువెళ్తాను అంటేనే... వద్దు.. ఎవరైనా మనిద్దరి గురించి రాంగా అనుకుంటారు అని ఆలోచించే మనస్తత్వం. ఇంకా డేట్ కి ఏమొస్తుంది చెప్పు. అందుకే రోజు మార్నింగ్ నేనే డోర్ దగ్గరికి వెళ్లి నాక్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పి రోజ్ ఇచ్చేవాడిని అని మెలికలు తిరుగుతూ చెబుతాడు. తర్వాత అంటే.. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అక్కడే వాకింగ్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకునే వాళ్ళము అని మెమరీస్ తలుచుకొని మురిసిపోతూ ఉంటాడు . విక్రమ్ శ్రీ ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని ఇది డేట్ కన్నా బాగుంది కదరా అంటే...నిజంగానా అని మెరిసే కళ్ళతో అడుగుతాడు. ఒరేయ్ ఇందాక అంకుల్ అన్నారని కాదు గాని... నిజంగా మా చెల్లి నిన్ను మిగిలిన లైఫ్ అంతా భరించడం చాలా కష్టం రా అని విక్రమ్ వాపోతాడు. నువ్వు మరీ అంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాతో మీ చెల్లి హ్యాపీగానే ఉంటుంది అని ఉడుక్కుంటాడు. విక్రమ్ నవ్వుతూ హ్యాపీగా ఉండదని నేను చెప్పలేదే అంటే.. మరి నువ్వు అన్నదానికి అర్థం ఏంటి... పోను... పోను.. నీకే అర్థమవుతుంది కానీ పద అందరూ చూస్తూ ఉంటారు అని లోపలికి వెళతారు. నవ్వుతూ వస్తున్న ముగ్గురి స్నేహితులులను చూసి వాసు గారు ఏంట్రా ఇంత లేట్ అయ్యింది. పూజకి టైం అవుతుంది కదా .. వస్తున్నాము అంకుల్ అని దగ్గరికి వెళతారు.. ఇంతలో నేహాను కూడా తీసుకొని అక్కడికి వస్తారు. శ్రీ, నేహా ని పూజ దగ్గర కూర్చోబెట్టి వ్రతం మొదలుపెడతారు. వ్రతం అయ్యేలోపే రాజ్ నివి కి తెగ సైటు కొడుతూ ఉంటాడు. వినయ్, భరత్ ఇద్దరూ కామ్ గా రాజ్ పక్కన వచ్చి కూర్చుని.. రాజ్ ని నివి ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రాజ్ అలుపన్నది లేని సైనికుడు లాగా నివి వైపే చూస్తూ ఉంటే.. నివి మాత్రం అక్కడున్న లేడీస్ తో ముచ్చట్లో పడుతుంది. ఎంతసేపైనా ఆ సీను మారకపోయేటప్పటికి వినయ్ కి విసుగు వచ్చి బావ అని వీపు మీద ఒకటి పీకుతాడు. రాజ్ ఉలిక్కిపడి చూసి.. మీరు వచ్చి ఎంతసేపు అయింది రా... మేము వచ్చి.. నీ పక్కన కూర్చొని.. నిన్ను నివి ని అబ్జర్వ్ చేస్తున్న కూడా నీకు తెలియడం లేదు అంటే.. మా చెల్లి తో నువ్వు ఎంత పీకల్లోతూ ప్రేమలో పడిపోయావో అర్థమవుతుంది. హ్మ్... నా ప్రేమ అందరికీ అర్థం అవుతుంది కానీ అర్థం అవ్వాల్సిన వాళ్లకే అర్థం కావడం లేదు అని ఫీల్ అవుతాడు. అసలు దానికి అర్థమయ్యే విధంగా నువ్వు చెప్పావా అంటే.. అందుకే కదా ఈరోజు సాయంత్రం డేట్ కి తీసుకు వెళుతున్నాను అని ఉత్సాహంగా చెబుతాడు. ఏంటి మా చెల్లిని డేట్ కి తీసుకువెళుతూ అది మళ్ళీ మాకే చెబుతున్నావా అని వినయ్ కోపంగా అడిగితే.. ఎందుకు బావ అంత కోపం. తీసుకువెళ్తేనే కదా నేను ప్రపోజ్ చేయగలుగుతాను. చెప్పకుండా తీసుకువెళ్తే నువ్వు ఫీల్ అవ్వాలి గాని... చెప్పి తీసుకెళ్తుంటే ఎందుకు ఫీల్ అవుతున్నావు. ఇది అన్నయ్యకి తెలుసా అంటే.. హా. ఇందాకే చెప్పాను అంటాడు. ఓకే అన్నయ్య ఒప్పుకుంటే మాకేమి ఇబ్బంది లేదులే అంటాడు. భరత్ మాత్రం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. రాజ్ కు ఒక చిన్న అనుమానం వస్తుంది. భరత్ ఏమైనా నివి నీ ఇష్టపడుతున్నాడా అని. అది కూడా క్లారిటీ తెచ్చుకుంటే... రేపు అన్న రోజున ఇబ్బంది ఉండదు కదా అని భరత్ అని పిలుస్తాడు. నిన్ను ఒక విషయం అడుగుతాను ఇబ్బంది పడకుండా నిజమే చెబుతావా.. ఇప్పుడు నీకు కొత్త అనుమానం ఏమొచ్చింది అని అడుగుతాడు. అనుమానం కాదు రేపు అన్నా రోజున ఇబ్బంది లేకుండా ఉండటానికి. సరే అడుక్కో అంటాడు. నేను ఇంత మర్యాదగా అడుగుతుంటే నువ్వు అలా అంటున్నావ్ ఏంటి ఉక్రోషంగా అడుగుతాడు. ఎంతైనా పిల్లనిచ్చే వాళ్ళము. ఆ మాత్రం బెట్టు చేయకపోతే ఎలాగా అంటాడు. అంటే నీకు నివి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా అని అడుగుతాడు. నీ ఉద్దేశం ఏమిటి రాజ్ అని సీరియస్ గానే అడుగుతాడు. నువ్వు సీరియస్ అవ్వద్దు. చిన్నప్పటినుంచి ఒకే చోటు ఉన్నారు కదా... పైగా బావ మరదళ్లు.. అయితే... నీకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయేమో అని నసుగుతూ ఉంటాడు. నాకు ఫీలింగ్స్ ఉన్నాయి అంటే.. వదిలేస్తావా.. అలా ఎలా వదిలేస్తాను. మరి ఎందుకు పిచ్చ డౌట్లు అన్ని పెట్టుకుంటావు. నివి అంటే ఇష్టమే కానీ.. నువ్వు అనుకున్న టైపు కాదు. మేమందరం ఒకే చోట పెరిగాము. నేను, విక్రమ్, వినయ్ ముగ్గురు ఒకేలాగా చూస్తాము. దాన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో. ఇంకొకసారి ఇలాంటి పిచ్చిపిచ్చి అనుమానాలు మాత్రం పెట్టుకున్నావు అనుకో.. విక్రమ్ కాదు.. నేనే పెళ్లి జరగనివ్వను అని సీరియస్గా చెబుతాడు. ఈ మాత్రం దానికి నువ్వు అంత సీరియస్ అయిపోవాలా. ఏదో నా వల్ల నువ్వు బాధపడకూడదు అన్న చిన్న తాపత్రయం అంతే. కొంచెంకూల్ అవ్వు బ్రదర్ అంటాడు. ఒక్క లుక్ ఇచ్చి సైలెంట్ అవుతాడు. మరి ఎందుకు అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అంటే.. నిజం చెబితే నువ్వేమైపోతావో అని నా ఆలోచిస్తున్నాను అంతే అంటాడు. ఏమిటా నిజం...
10-02-2026, 07:41 AM
Part - 88
భరత్ ఏం చెబుతాడా అని రాజ్ కంగారుగా చూస్తూ ఉంటాడు. వినయ్ మాత్రం వస్తున్న నవ్వుని ని ఆపుకుంటూ రాజ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటాడు.
భరత్ ఇంకా సైలెంట్ గా ఉంటే రాజ్ టెన్షన్ గా అర్జెంటుగా చెప్పు బ్రో.. నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అని చెయ్యపట్టుకుంటాడు. ఇప్పుడే ఇంత టెన్షన్ పడితే చెప్పిన తర్వాత ఏమైపోతావో బ్రో బాధగా కళ్ళు మూసుకుని తెరుస్తాడు. హె.. హే.. ముందు చెప్పు అసలే చచ్చిపోతుంటే.. నీ యదవ ఎక్స్ప్లనేషన్లు ఒకటి. రాజ్ ని చూస్తూ వస్తున్న నవ్వుని అపుకుంటూ నివి కి షాపింగ్ పిచ్చి ఎక్కువ బ్రో. అది అర్థం అవుతుంది కదా... నువ్వు చూసింది1% బ్రో అంటే... ఏమిటి అని భయంగా అడుగుతాడు. అవును బ్రో నువ్వు చూసింది 1%. లేటెస్ట్ డిజైన్స్ లోనే కొద్దిగా మిక్సింగ్ చేసి వెరైటీ డిజైన్స్ ని బోతిక్ లో చేపిస్తుంది అని చెబుతాడు. సాటి మగాడిగా నీ మీద జాలిపడి చెబుతున్నాను. దానితో ట్రావెలింగ్ అంటే షాపింగ్ తో ఈక్వల్ గా ట్రావెలింగ్ చేయడమే.. అన్నీ ఆలోచించకుని అడుగు ముందుకు వెయ్యి. తర్వాత నాకెందుకు చెప్పలేదు బ్రో అని అడిగితే.. మేము ఏమీ చేయలేము అని వినయ్ వైపు తిరిగి కన్ను కొడతాడు. రాజ్ నివి వైపు చూస్తాడు. చాలా అమాయకంగా కనపడుతుంది. అందరితో హార్ట్ ఫుల్ గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. లేదు.. లేదు.. వీళ్ళు కావాలని నన్ను భయపెడుతున్నారు. భరత్ వైపు తిరిగి నివి ఎలా ఉన్నా నాకు ఓకే అని చెబుతాడు. పక్కన అంటే పక్కా అని కాన్ఫిడెంట్గా చెబుతాడు. ఇదే కాన్ఫ్రెండ్ ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రో అంటాడు. ఎక్కడో బెల్ కొడుతున్న సరే... ఆ లైట్లే అనుకుంటాడు. వ్రతం పూర్తయిన తర్వాత.. కొత్త దంపతులకు అవని విక్రమ్ బట్టలు పెడతారు. ఒక డైమండ్ సెట్ కూడా గిఫ్ట్ కింద పెడుతుంది. అది చూసి నేహా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవని అంటే... నువ్వు నా అన్న భార్యవి. ఈ మాత్రం కూడా నేను పెట్టకపోతే ఎలా... బొట్టు పెట్టి చేతిలో పెడుతుంది. అయినా నేహా ఇబ్బంది పడుతుంటే.. ఇది అమ్మమ్మ గారి ఆర్డర్ తీసుకో అని నొక్కి చెబుతుంది. ఇంక నేహ ఏమీ అనలేక తీసుకుంటుంది. వ్రతం పూర్తయిన తర్వాత దంపతులిద్దరికీ ఒకే ఆకులో భోజనం పెడతారు. అందరూ సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. వాసు గారు... కళ్యాణ్ గారిని అడుగుతారు రాజ్ కి నివిని చేయడం మీకు ఓకేనా అని... రాజ్ కేమిటి బంగారం. నివి కూడా సుఖపడుతుంది అని చెబుతారు. రాజు పేరెంట్స్ తో కూడా మాట్లాడాను మంచి రోజు చూసుకుని వాళ్ళు ఇండియా వస్తున్నారు. చిన్నప్పటినుండి రాజ్ ఇక్కడే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగడం వలన వాల్యూస్ కూడా బాగానే తెలుసు. విక్రమ్ కి మంచి ఫ్రెండ్ ఇంతకన్నా క్వాలిటీస్ ఏమి కావాలి. అది నిజమేలే ప్రస్తుతపు రోజుల్లో తెలిసిన అబ్బాయి అయితేనే బెటర్ అని అంటారు. అందరూ ఆ మాటలని అంగీకరిస్తారు. ఈరోజే వ్రతం పూర్తయింది కాబట్టి రేపు సాయంత్రం కార్యానికి ముహూర్తం పెడతారు. అది వినగానే శ్రీ ముఖం వాడిపోతుంది. విక్రమ్, రాజ్ చెరో పక్కన కూర్చుని ఫీలింగ్స్ మార్చు లేకపోతే అందరికి అడ్డంగా దొరికిపోతావు అని మెల్లిగా చెబుతారు. వెంటనే నార్మల్ అయిపోయి సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. కానీ ఎవరి కళ్ళల్లో అయితే పడకూడదో వాళ్ల కళ్ళలోనే పడతాడు. అబ్బా అని తల కొట్టుకుంటాడు. ఏమైందిరా అంటే నా ఫీలింగ్స్ని మా నాన్న అబ్సర్వ్ చేసేసారు రా అని దీనంగా చెబుతాడు. ఆ మాటకి నీకు అంతేకే ముందే చెప్పాను. తమరు ఏది ఫాలో అవ్వరు కదా అనుభవించు.. నీ కర్మ అని రాజ్ వైపు తిరిగి ఎన్నింటికి వెళుతున్నారు అని అడుగుతారు. సాయంత్రం 5:00 కి తీసుకెళ్తాను బావ. మళ్ళీ ఎర్లీగానే తీసుకువచ్చేస్తాను అని చెబితే.... జాగ్రత్త. నివి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మన స్నేహం మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అది మాత్రం దృష్టిలో పెట్టుకొని ఏ డెసిషన్ అయినా తీసుకో అని సుతిమెత్తగా చెబుతాడు. థాంక్స్ బావ అని శ్రీ వైపు చూస్తూ ఇంక మేము బయలుదేరుతాం. ఎక్కడికి రాజ్.. ఆల్రెడీ మూడు అయిపోయింది బాబు. నా అరేంజ్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా.. అక్కడ నుండి స్పీడ్ గా బయటకు వెళ్ళిపోతాడు. కొత్త దంపతులని ఊరు తీసుకువెళ్తామని శ్రీను గారు అడిగితే.. మీరు అలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోకండి. మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. కూతురైన కోడలు అయిన నేహా నే కదా... మాకు చిన్న చిన్న సరదాలు ఉంటాయి. ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తారు. ఇంకా శ్రీనుగారు కూడా గట్టిగా కాదనలేక అక్కడే ఆగిపోతారు. విక్రమ్ ఫ్యామిలీ కూడా అందరికీ బాయ్ చెప్పి వాళ్ళ మాన్షన్ కి వెళ్ళిపోతారు. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి.. శ్రీ ఈరోజు రాత్రి ఎలాగైనా నేహాతో టైం స్పెండ్ చేయాలి అని ఏవేవో ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. కొడుకుని ఒక కంట అబ్జర్వ్ చేస్తున్న వాసు గారు మాత్రం శ్రీకి కళ్ళతోనే వార్నింగ్ ఇస్తూ ఉంటారు. రాత్రి భోజనాలు అయిన తర్వాత వాసు శ్రీ తో పడుకుంటాను అని.. కోడలు దగ్గర నవ్వు ఉండు సురభి అని చెబుతారు. శ్రీను గారి జంటకి గెస్ట్ రూమ్ చూపించి రెస్ట్ తీసుకోమని చెబుతారు. ఇక శ్రీ కక్కలేక మింగలేక చూస్తూ ఉంటాడు. చూసింది చాల్లే గాని పద అని కొడుకు చేయ పట్టుకుని గదిలోకి తీసుకువెళ్తారు. గది లోనికి వెళ్ళిన తర్వాత నాన్న అని గట్టిగా అరుస్తాడు. ఎందుకురా అలా అరుస్తావు అంటే... మీరు చేసింది నాకు ఏమీ నచ్చలేదు అంటాడు. నేనేం చేశాను అంటే... మీరు నా గదిలోకి వచ్చి పడుకోవడం. మరి ఎక్కడ పడుకోవాలి అంట అని వెటకారంగా అడుగుతారు. మీరు మీ గది లో పడుకుంటే నేను నా గదిలో పడుకుంటాను అని చెబుతాడు. అప్పుడు మేము అందరం పడుకున్నాక నువ్వు వెళ్లి కోడలు పిల్లను గోకడానికా.. నాన్న అని గారంగా పిలుస్తాడు. మరి అలా పిలవకురా బాబు అని ఇలా రా అని పక్కన కూర్చో పెట్టుకుంటారు. ఏంటి మా నాన్న ఎప్పుడూ లేనిది ఇంత మర్యాదగా పిలిచి కూర్చోబెట్టుకుంటున్నాడు అనుకుంటూనే వెళ్లి కూర్చుని చెప్పండి అని అడుగుతాడు. ఏం ప్లాన్ చేసుకున్నావు అని అడుగుతారు. దేని గురించి అని అడిగితే మీ ఫ్యూచర్ గురించి అని డిప్ప మీద ఒకటి పీకుతారు. అందరూ నా డిప్ప మీద కొట్టే వాళ్లే అంటే.. మరి చెప్పింది అర్థం చేసుకోకపోతే కొట్టక ఏం చేస్తారు రా.. ఎవరు కొట్టిన నీ మంచి గురించే... కవరింగ్ మాత్రం బాగా చేస్తారు. నీకు తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా చెబుతున్నాను అని భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని కూర్చుని చెబుతూఉంటారు. ఈరోజు తండ్రీలో కొత్త యాంగిల్ కనపడుతూ ఉంటే తండ్రి ముఖం చూస్తూ శ్రద్ధగా వింటూ ఉంటాడు. వాసు గారు ఏం చెబుతారు...
10-02-2026, 09:27 AM
Last line nachindi.. new angle of father/son conversation.
Great going Siva garu! avunu .. enti timing marcharu. late night ninchi early morning ki vachesaru? Evening job gattiga kodutunnattundi!! :) All the best bro!
10-02-2026, 10:10 AM
Super update and thanks for daily updates
10-02-2026, 05:13 PM
(10-02-2026, 09:27 AM)ash.enigma Wrote: Last line nachindi.. new angle of father/son conversation. Ledu Ala Em Ledu Late Ga Room Ki Vastunna Full Tired So Laptop Open Cheyataledu Early Morning Office Ki Velle Mundhu Istunnaa...........
11-02-2026, 12:14 AM
11-02-2026, 08:00 AM
(This post was last modified: 11-02-2026, 08:02 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 89
సురభి నేహా ఒక గదిలో పడుకోవడానికి వెళ్తారు. నేహా శారీ మార్చుకుని వచ్చి అత్తగారి ముందు నుంచుంటుంది ఎందుకలా నిలబడ్డావు వచ్చి పడుకో. పొద్దుట నుండి నుంచి రెస్ట్ లేకుండా ఉన్నావు కదా...
నేహ మాట్లాడే లోపు తలుపు చప్పుడు అవుతుంది. ఈ టైం లో ఎవరా అనుకుంటూ వెళ్లి సురభి తలుపు తీస్తుంది. అక్కడ లక్ష్మి గారు నిలబడి ఉంటారు. ఏమైంది వదిన.. ఏమైనా కావాలా... అది ఏమీ లేదు అమ్మాయి ఫ్రీగా ఉంటే వాళ్ల నాన్నగారు మాట్లాడతారంట. ఒకసారి పిలవమన్నారు.మళ్ళీ ఏమనుకుంటారో అని ఇబ్బందిగా చెబుతారు. దానికి సురభి నవ్వుతూ దీనికి కూడా మీరు ఇంతే ఇదిగా ఇబ్బంది పడాలా వదిన అని. నేహా మీ నాన్నగారు పిలుస్తున్నారంట వెళ్ళు అని చెబుతారు. సరే అత్తయ్యగారు అని వాళ్ళ అమ్మ వెనకాలే వస్తుంది. ఎక్కడ అమ్మ..నాన్నగారు అంటే... బయట గార్డెన్ లో కూర్చున్నారు. నిన్ను రమ్మన్నారు అని చెబుతోంది. సరే అని వెళుతూ ఉంటే.. అమ్మ నేహా అని పిలుస్తారు ఏమిటి అన్నట్టు చుస్తే... నాన్నగారు ఏది చెప్పినా నీ మంచి కోసమే. అది దృష్టిలో పెట్టుకొని చెప్పేదంతా విను అని చెబుతారు. సరే అమ్మ అని చెప్పి శ్రీను గారి దగ్గరికి వెళ్లి పిలిచారు అంట అంటుంది. రా నేహా అని తన పక్కన ప్లేస్ చూపిస్తారు. నీ మ్యారేజ్ లైఫ్ గురించి ఏం ఆలోచిస్తున్నావు నేహా అని అడుగుతారు. మీరు అడుగుతుంది నాకు అర్థం కావడం లేదు నాన్నగారు అంటుంది. దానికి నవ్వుతూ పెళ్లి అయిపోయింది కదా.. నీ భర్తతో నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు అని అడుగుతున్నాను. వాసు గారు కూడా శ్రీ ని అదే ప్రశ్న అడుగుతారు. నీ భార్యతో నీ జీవితం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నావు అని అడుగుతారు. ఏమీ అర్థం కాకుండా చూస్తూఉంటే.. సరే అయితే నేను ఒక విషయం అడుగుతాను. క్లియర్ గా చెప్పు. నీకు ఆడపిల్ల పుట్టింది అనుకో.. ఎలా పెంచుకోవాలి అనుకుంటున్నావు. ఆ మాటకి శ్రీ నవ్వుతూ నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం నాన్న. అమ్మాయి పుడితే ఒక యువరాణి లాగా పెంచుతాను. తను అడగకముందే అన్ని నా కూతురు పాదాల దగ్గర ఉంచుతాను. ఏ సమస్య వచ్చినా సరే నీ పక్కన నేను ఉన్నాను అన్న ధైర్యాన్ని నింపుతాను. ఒక ఫ్రెండ్ గా తనకి ఎప్పుడూ గైడ్ చేస్తాను అని చాలా హ్యాపీగా చెబుతాడు. ఆ మాటలకు వాసుగారు నవ్వుతూ అబ్బో నా కొడుకులో చాలా కళలున్నాయే అంటే... పొండి నాన్న. అడిగింది మీరే... చెబితే మళ్ళీ టీస్ చేసేది మీరే అంటే... గట్టిగా నవ్వెస్తారు. శ్రీను గారు నేహాన్ని అదే ప్రశ్న అడుగుతారు. నీకు కొడుకు పుడితే ఎలా పెంచుతావు అమ్ములు. ఆ మాటకి ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తే.. చెప్పు అమ్ములు ఎలా పెంచుతావు. నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది నాన్న. నాకు ఒక అన్నయ్యగాని, తమ్ముడు గాని ఉంటే బాగుండేది అని. అందుకే నాకు కనుక కొడుకు పుడితే వాడితో నేను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను. ప్రతి విషయంలో ఎలా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి అన్నది నేర్పిస్తాను. ఒక యువరాజు లాగా పెంచుతాను అని మెరిసే కళ్ళతో చెబుతుంది. యువరాణి లాగా పెంచుతాను అంటున్నావు అంటే ఎవరి లాగా అని అడుగుతారు. కాసేపు ఆలోచించి అమ్మలాగా అని చెబుతాడు. మీ అమ్మ యువరాణి నా... అంటే కాదు మహారాణి. అమ్మ ఎంత అపురూపంగా అమ్మమ్మ వాళ్ళింట్లో పెరిగిందో నాకు అమ్మమ్మ చెబుతూ ఉండేది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగే ప్రిన్సెస్ లాగానే ఉంది అని చెబుతాడు. హీరో అంటే ఎలా నేహా... హీరో అంటే నా అని ఆలోచిస్తూ... మీలాగా నాన్నగారండి అంటుంది. నాలాగానా... నాలో ఏమి చూసావు అని అడుగుతారు. ఆ మాటకి నవ్వుతూ చిన్నప్పటినుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను కదా... ఎవరికి సహాయం అవసరం అన్న చేస్తున్నారు. వ్యవసాయం చేస్తారు. నలుగురికి ఆదర్శంగా ఉంటారు. నాకు ఏది మంచో.. ఏదో చెడో వివరంగా చెబుతారు. ఇంతకుమించి హీరోకి కావలిసింది ఏముంది అడుగుతుంది. మీ అమ్మ మహారాణి. నీకు పుట్టే కూతురు యువరాణి. మరి ఇద్దరి మధ్యలో ఉన్న నీ భార్య?? నీ కొడుకు నీ తండ్రి ఇద్దరు హీరోలే. మరి నీ భర్త?? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డాడ్ అని శ్రీ అడుగుతాడు. ఆ మాటకి నవ్వుతూ నీ భార్య కూడా తన పుట్టింట్లో యువరాణి లాగానే పెరుగుంటుంది కదా... అక్కడ తన కూడా అపురూపమే కదా... అంత అపురూపమైన వజ్రం నీ జీవితంలోనికి వచ్చింది. అంటే నువ్వు ఇంకా అంత అపరూపంగా చూసుకోవాలి. మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు నాన్నగారండి అని అడుగుతుంది. సింపుల్ తల్లి. నీ కొడుకు, నీ తండ్రి హీరోలే. నువ్వు నీ తండ్రి కష్టాన్ని వ్యక్తిత్వాన్ని చూస్తూ పెరిగావు. ఆ వ్యక్తిత్వాన్ని నీ కొడుకుకి ఇచ్చి హీరోని చెయ్యాలి అనుకుంటున్నాను. అలాగే నీ భర్త కూడా ఈ ఇంటి హీరోనే కదా... వాసుగారు కొడుకుకి చెబుతూ ఉంటారు. పెళ్లయిన కొత్తలో అన్ని బాగుంటాయి. ఎవరు ఏది చేసినా అందులో ఒప్పే కనిపిస్తుంది. కానీ వెళ్ళగా వెళ్ళగా అందులో తప్పులు వెతుకుతూ ఉంటాము. మనకున్న ప్రెస్టేషన్, ప్రెషర్ అన్ని తీసుకొచ్చి ఇంట్లో భార్య మీద చూపిస్తాము. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చెబుతున్నారో కూడా వినము. ఇద్దరూ వర్క్ చేసుకుంటున్నాప్పుడు ఇంటి పనులు అన్ని ఇద్దరూ చేసుకోవడంలో తప్పులేదు కదా... ఎంత అనుకున్నా... కొన్ని పనులు ఆడవాళ్లు మాత్రమే చేయగలుగుతారు. కొన్ని మగవాళ్ళు చేయగలుగుతారు. నేను ఇది చేశాను కాబట్టి నువ్వు అది చెయ్యి ఆర్డర్ ఇద్దరి మధ్యన ఉండకూడదు. నీ కూతురుగాని, మీ అమ్మగాని నీమీద అలిగితే వాళ్లే వచ్చి సారీ చెప్పేదాకా మాట్లాడను అని భీష్ముంచుకోని కూర్చోవు కదా... అలాగే రేపు నీ భార్య విషయంలోనైనా సరే అదే ఫార్ములా ఫాలో అవ్వు. చేసే ఏ పనైనా బాధ్యత అని కాకుండా ప్రేమతో అని చెయ్యి. ఆ పని లో అలసట ఉండదు. బాధ్యత అని ఆలోచిస్తే ఆ పని ముందుకు వెళ్ళదు. కొన్ని రోజులకే బోర్ కొట్టేస్తుంది. ఆ బాధ్యతలో ప్రేమని మిక్స్ చేయి ఎప్పటికీ ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో నలుగురు ఉన్నా సరే ఒకరి ఆలోచన ఒకరికి నచ్చదు. కోపం, ద్వేషం, అసూయతో ఉంటారు. ఎందుకో తెలుసా అని కొడుకుని అడుగుతారు. చెప్పండి డాడ్ అన్నట్టు చూస్తే... మనుషులు మాత్రమే దగ్గరగా ఉంటున్నారు కానీ మనసులు దగ్గరగా ఉండడం లేదు. ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎంత అంటే నువ్వెంత అని అరుచుకోకుండా... ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఉంటే మూడు వంతుల సమస్య సాల్వ్ అయిపోతుంది. ఏంటి నేహా అలా చూస్తున్నావు నేను చెప్పింది తప్ప అని అడుగుతారు. లేదు నాన్నగారు అండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా అని ఆలోచిస్తున్నాను. దానికి నవ్వుతూ నీ తండ్రి ని ఎవరైనా ఒక మాట అంటే నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతారు. ఎందుకు ఒప్పుకుంటాను అసలు ఊరుకోను. నీకు మేము ఎలాగో... నీ భర్తకి తన తల్లిదండ్రులు కూడా అంతే. రేపు ఏ విషయానికైనా సరే... మీ అమ్మగారు, మీ నాన్నగారు అని కాకుండా.. మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అని మాట్లాడి చూడు. ఆ మాటల్లో ఉన్న పవర్ ఏంటో అర్థం అవుతుంది. ప్రస్తుతపు రోజుల్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. నీతో పాటు నేను సంపాదిస్తున్నాను.. నీ మాట నేను వినేది ఏంటి అని ప్రవర్తిస్తే ఏ బంధము నిలబడదు. మంచి చెబుతున్నప్పుడు అది భర్త అయినా భార్య అయినా సరే తగ్గి వినడంలో తప్పులేదు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు విడాకులు కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి తెలుసా అమ్ములు... ఫైనాన్షియల్ ఫ్రీడం. అర్థం కాకుండా చూస్తుంటే.. ఏంటి నేను చెప్పింది నీకు అర్థం కాలేదా.. లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. మా టైంలో డబ్బు సంపాదించే మార్గాలు తక్కువ ఉండేవి. కష్టపడడము ఎక్కువగా ఉండేది. వ్యవసాయమైన, జాబ్ అన్నా, డాక్టర్ ఏదైనా సరే కొంత లిమిట్ అనేది మాకు తెలుసు. మనది వ్యవసాయ కుటుంబం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని నేను చెబుతున్నాను. నేను బయట పనులు చేస్తూ ఉంటే.. మీ అమ్మ ఇల్లు చెక్కబెట్టేది. ఇంటిలో ఏమి జరిగిన సరే నా వరకు రానిచ్చేది కాదు. మీ అందరికీ ఆస్తమాను చెబుతూ ఉంటుంది కదా.. ఈ వస్తవు నాన్నగారు చేపించారు. ఇది నీకోసం కొన్నారు.. కానీ అందులో మూడు వంతులు అంత మీ అమ్మే చక్కబెట్టి నా పేరు వాడేది. దాని అర్థం నన్ను ముందు నుంచో పెట్టి తను వెనకాల నిలబడేది. నేను అనుకోకుండా ఎవరినైనా అతిధుల్ని ఇంటికి తీసుకువచ్చిన సరే నవ్వుతూ వాళ్లకి వండి పెట్టేదే కానీ ఏ రోజు విసుక్కునేది కాదు. ఆ చిరునవ్వుకి నేను దాసోహం అయిపోయాను. కానీ ప్రస్తుతపు రోజుల్లో డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి..ఇది కాకపోతే మరొకటి... నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా మాటే నెగ్గాలి ఈ పంతాలు చాలా ఎక్కువైపోతున్నాయి. మా కాలంలో సైక్రియాటిస్ట్ అన్న డాక్టర్ వాడుకం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఆ డాక్టర్ వాడకం ఎక్కువగా ఉంది. ప్రస్తుత అమ్మాయిలు ఆలోచన ఎలా ఉంది అంటే... పెళ్లయింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నేనే అవ్వాలి... ఏ విషయమైనా ముందు నాకే చెప్పాలి. నేను ఓకే అంటేనే వాళ్ల పేరెంట్స్ కి చెప్పాలి. ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నారు. భార్య కన్నా ముందే తన తల్లిదండ్రుల అబ్బాయి జీవితంలో ఉన్నారు కదా.. అమ్మాయి ప్రతి విషయం తన తల్లిదండ్రులకు చెబుతున్నప్పుడు అబ్బాయి చెబుతుంటే తప్పేంటి... కానీ నాన్న...
11-02-2026, 08:03 AM
Part - 90
చెప్పు నేహా ఏదో అనుమానం పడుతున్నట్టున్నావు. ఆడపిల్ల అంటే అమ్మని అడిగి సలహాలు తీసుకొని ముందుకు ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తుంది. అబ్బాయి పేరెంట్స్ అలాగాఉండరు కదా.
ఎందుకు ఉండరు.. ఉండరు అని ఎవరు చెప్పారు నీకు. మన ఊరిలోనే ఒక అమ్మాయి పెళ్లి అయిన తర్వాత పుట్టింటికి వచ్చేసింది కదా తను అన్నది. ఒకవైపునే విని అదే నిజమని అనుకోకూడదు అమ్ములు. నీకు ఒక ఉదాహరణ చెప్పనా.. మా పెళ్లయిన కొత్తలో నానమ్మ తెలిసిన పెళ్లి అని వెళ్ళింది. వచ్చిన నాలుగు రోజుల వరుకు అమ్మ మీద రుసరసలాడుతూ ఉంది. ఏమైందో మాకు ఎవరికీ అర్థం కాలేదు. మీ అమ్మకంతా కొత్త కదా ఎందుకు మీ నానమ్మ అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాక భయం భయంగా ఉండేది. ఇక ఒక రోజు నాకే విసుగు వచ్చి.. ఏమైందమ్మా.. ఎందుకలాఉన్నావు. పెళ్లికి వెళ్లి వచ్చినప్పుడు నువ్వు అలా చిరాకుగా ఉన్నావు అని అడిగితే...మా అమ్మ చెప్పింది విని నేను ఆశ్చర్యపోయాను. ఏం చెప్పి ఉంటుందో గెస్ చేయగలవా అని అడుగుతారు. తెలియదు అంటే.. ఇప్పటికి మీ అమ్మ నీకు ఆ విషయం చెప్పలేదు కదా అని. మీ నానమ్మ ఒక పెళ్ళికి వెళ్ళింది కదా...ఆ పెళ్ళికూతురు కట్నం ఎక్కువ తెచ్చుకుంది అంట. ఘనంగా సారేతో వచ్చిందంట. అది మీ అమ్మతో కంపేర్ చేసుకుని.. నా కొడుకుకి కొన్ని రోజులు ఆగి ఉంటే ఇంకా మంచి సంబంధం వచ్చేది కదా.. తొందరపడి ఈ పెళ్లి చేసాను అని మాట్లాడింది.. ఆ మాటలు విని మీ అమ్మ చిన్నబుచ్చుకుంది. బాధపడింది. కోపం కూడా వచ్చింది కానీ ఎవరి మీద చూపించాలో తెలియక తనమీద తానే చూపించింది. అన్ని పనులు చేసేది కానీ ఏమీ తినేది కాదు. నేను ఎంత నచ్చజెప్పినా సరే తినాలనిపించడం లేదు అని ఏదో ఒక పనిలో పడిపోయేది. మా అమ్మ కూడా ఆకలేస్తే అదే తింటుందిలే అన్న నిర్లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు ఉన్నంత స్వేచ్ఛ అప్పుడు భార్యాభర్తలకి ఉండేది కాదు కదా.. అందుకే మా అమ్మ ముందు నా భార్యకి ఏమీ చేయలేకపోయావాడిని. చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కూడా నాకు అర్థం అయ్యేది కాదు. అలా మూడు రోజులు గడిచిపోయాయి. సడన్గా ఊరి నుంచి మీ అమ్మమ్మ తాతయ్య వచ్చారు. కూతుర్ని అలా చూసిన మీ అమ్మమ్మ చాలా కంగారు పడిపోయింది. ఏమైందమ్మా ముఖమంత ఇలా పీక్కుపోయింది అని కంగారుగా అడిగితే..నాకు చాలా టెన్షన్ వచ్చింది. మొదటిసారి మా అమ్మ కూడా ఇబ్బంది పడింది. నిజంగానే మూడు రోజుల నుంచి పట్టించుకోలేదు అని తనను తానే తిట్టుకుంది . ఇప్పుడు కోడలు జరిగిందంతా చెబితే వియ్యంకులు ముందు తన పరువు పోతుంది. రేపటి నుంచి తనని ఎలా చూస్తారు అని మా అమ్మ కొంచెం గిల్టీగా చూస్తుంది. మీ అమ్మ ఏం చెప్పిందో తెలుసా... జ్వరం వచ్చి లంకణాలు చేశాను. అంత మా అత్తగారే పని చేసుకుంటున్నారు. నాకు ఆర.. ఆర....గా జావలు కాచి కూడా ఇస్తున్నారు అమ్మ అని చెప్పింది. ఆ మాటకి నా మనసు నిండిపోయింది. మా అమ్మ చేసిన తప్పేంటో తనకి అర్థమయింది. మీ అమ్మమ్మ.. మీ నానమ్మ చేతులు పట్టుకొని మీలాంటి అత్తగారు దొరుకడం నా కూతురు అదృష్టం వదినగారు అని కంటతడి పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఎప్పుడు మీ నానమ్మకి, మీ అమ్మకి మధ్యనా మనస్పర్ధలు రాలేదు. చిన్న చిన్నవి వచ్చిన సరే వెంటనే సర్దుకునేవారు. కానీ ప్రస్తుతపు రోజుల్లో ఎలా ఉన్నారు. ఒక చిన్న తుమ్ము తుమ్మినా సరే... వెంటనే ఫోన్ చేసి అమ్మ... మా ఆయన ఇలాగ అన్నారు. మా అత్తగారు నా చీరకి వంక పెట్టారు లేకపోతే ఇంకోటి ఇంకొకటి అని చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా కూతురు నిజంగానే అక్కడ కష్టపడిపోతుందేమో అనుకుని.. నువ్వు ఏమీ లెక్క చేయనవసరం లేదు. నీకేమి తక్కువ. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. సంపాదిస్తున్నావు. నువ్వు అన్నది ఒప్పుకోకపోతే గొడవ పెట్టుకుని వచ్చేసేయ్. వెనకాల మేము ఉన్నాము కదా అని రెచ్చగొడుతున్నారు. కానీ ఏం జరిగిందమ్మా.. అసలు ఏమైంది అని నెమ్మదిగా మాట్లాడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. ఒకప్పుడు అత్త కోడళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు అత్తా కోడళ్ల మధ్యన అన్ని గొడవలు ఉండడం లేదు. భార్యాభర్తల మధ్యనైనా సరే.. కానీ ప్రతి చిన్నదాన్ని ఇప్పుడు భూతద్దంలో చూస్తున్నారు. అప్పుడు ఎంత పెద్ద విషయమైనా సరే గడప దాటనిచ్చేవారు కాదు. అందుకే ఆ రోజుల్లో కుటుంబాలు నిలబడ్డాయి. ఈరోజుల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో అమ్ములు.. నేను మాత్రమే గెలవాలి అనుకుంటే.. అందులో ఉండే సంతోషము తక్కవే.. ఉండేది నువ్వు ఒక్కదానివే. అదే నువ్వు గెలుస్తూ నీ భర్తను కూడా గెలిపిస్తున్నావు అనుకో... అందులో సంతోషం ఎక్కువే... కుటుంబం కూడ ఉంటుంది అని చెబుతారు. ఎలా అనే నేహా చూస్తూ ఉంటే... అర్థం కాలేదు కదా నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఉండు అని చుట్టూ చూస్తూ ఉంటారు. శ్రీను గారికి పారిజాతం చెట్టు కనబడుతుంది. అమ్ములు నువ్వు వెళ్లి అక్కడ ఉన్న ఆ పువ్వులని ఒక్క చేత్తోనే తీసుకో. రెండో చేయి ఎట్టు పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దు అని చెబుతారు. సరే అని వెళ్లి ఒక చేతికి ఎన్ని పువ్వులు అయితే దొరుకుతున్నాయో అన్ని పట్టుకుని వచ్చి చూపిస్తుంది. ఎన్ని ఉన్నాయి నేహా అని అడిగితే.. చాలా తక్కువ వచ్చాయి అని చెబుతుంది. సరే ఈ పువ్వులు ఇక్కడ పెట్టి మళ్ళీ వెళ్ళి నీ రెండు చేతులతో నువ్వు ఎన్ని తీసుకురాగలవో అని తీసుకురా అని చెబుతారు. ఈసారి రెండు చేతుల నిండా తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే.. ఇందాకటి కన్నా ఎక్కువ ఉన్నాయి అని చెబుతోంది. సరే అని ఆ పువ్వులు కూడా అక్కడ పెట్టమని చెబుతారు. ఇప్పుడు నీ చున్నీలో ఎన్ని తీసుకురాగలవో అన్ని తీసుకురా అని చెబుతారు. ఈసారి ఆ చెట్టు కింద ఉన్న పువ్వులే కాకుండా పక్క చెట్టు దగ్గర ఉన్న పువ్వులు కూడా వేసుకుని తెస్తుంది. అది చూసి శ్రీను గారు నవ్వుతూ అదేంటి అమ్ములు.. నిన్ను ఈ చెట్టు కిందే కదా తెమ్మన్నాను. మరి ఆ చెట్టు కింద కూడా ఎందుకు తెచ్చావు అని అడుగుతారు. చున్నీలో ఈ పువ్వులు వేసిన తర్వాత చాలా ఖాళీ ఉంది. అందుకే ఆ చెట్టు కింద ఉన్న పువ్వులు కూడా ఇందులో వేశాను అని చెబుతుంది. అవి కూడా ఈ పక్కన పెట్టు అని చెబుతారు. ఇప్పుడు చెప్పు ఎక్కడ ఎక్కువ పువ్వులు ఉన్నాయి అని అడిగితే చున్నీలో తెచ్చిన పువ్వులను చూపిస్తుంది ఇప్పుడు అర్థమైందా.. మొదటి తెచ్చిన పువ్వులు నేను మాత్రమే గెలవాలి అనుకున్నది. రెండోసారి తెచ్చిన పువ్వులు నువ్వు నీ భర్త కలిసి గెలవాలి అనుకున్నది. మూడోసారి తెచ్చిన పువ్వులు నీ కుటుంబం మొత్తం గెలవాలి అని ఉన్నది. ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఏమిటంటే.. ఈ మూడిట్లో కూడా నువ్వు ఉన్నావు. నువ్వు లేకుండా ఈ మూడు లేవు. ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఇందులో నేను ఎక్కడ ఉన్నాను అంతా నా భర్త, నా కుటుంబమే కదా ఉన్నారు. కానీ మీకు తెలియకుండానే మీరు వాడే పదం... నా... అన్న పదం. ఆ పదంలోనే మీరు ఉన్నారు అని మీరు గుర్తించగలిగితే చాలు. మన శరీరంలో కూడా మన వెన్నుముక కనిపించదు. కానీ వెన్నెముకకి ఏదైనా జరిగితే అన్ని అవయవాలు సరిగా పనిచేసిన సరే ఆ మనిషి సరిగ్గా నిలబడలేడు. అలాగే ఇంటి ఇల్లాలు బాధ్యత కూడా వెన్నుముక లాంటిదే. నువ్వు జాబ్ చేస్తున్నావు కదా.. మీ ఆఫీస్ లో కూడా టీం వర్క్ చేస్తూ ఉంటారు కదా.. ఎందుకని అని అడుగుతారు. టీం వర్క్ చేస్తే ప్రాజెక్ట్స్ తొందరగా అవుతాయి. అలాగే ప్రాబ్లంస్ కూడా తొందరగా సాల్వ్ చేస్తాము. నాలెడ్జ్ పెరుగుతుంది అని చెబుతుంది. మీరు సరిగ్గా వర్క్ చేయకపోతే... మీ బాస్ తిడతారు కదా అప్పుడు ఎలా ఫీలవుతారు. కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఇంత హార్డ్ వర్క్ చేసిన మిస్టేక్స్ వస్తున్నాయి అని ఫీల్ అవుతాము. అది ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఆలోచిస్తాము అంటుంది. అంతేగాని మీరు జాబ్ మానేయరు కదా అని అడుగుతారు. అలా మానేస్తాము నాన్నగారు. మరి మీ బాస్ తిడితే మానేయాలి కదా.. చిన్నప్పటినుంచి కష్టపడి చదువుకున్నాము. మంచి శాలరీ తో జాబ్ చేస్తూ. లైఫ్ లో సెటిల్ అవ్వాలి అన్న గోల్ తో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకుంటే ముందుకు ఎలా వెళ్ళగలుగుతాము . మీ బాస్ ఒక మాట అన్నా సరే నెల అయ్యేటప్పటికి వచ్చే జీతం చూసుకునేటప్పుడు... ఇది మీ ఇద్దరి జీవితం. మరి మీ ఇద్దరూ ఎలా ఉండాలి. నువ్వే ఆలోచించుకో అని చెబుతారు. నేహా... వాళ్ళ నాన్నగారు వైపు చూస్తూ.. మీరు చెప్పే ప్రతి మాట చాలా వాల్యుబులే కాదని అనను. కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అటు నుంచి... సరైన రెస్పాండ్ లేకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడే ఏమి చేయాలి అని అడుగుతుంది. మంచి ప్రశ్న వేశావు నేహ.. నేను వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు మనపొలం అంతా కూడా సాగులో లేదు. కొంత పొలం దిబ్బలతోనూ, కంచెలతోను ఉండేది. అది బాగు చేసేటప్పుడు నా చేతికి చాలా గాయాలు అయ్యాయి. ఒక్కొక్కసారి ముళ్ళు కూడా గుచ్చుకునేవి. తినడానికి కూడా చేతులు సహకరించేది కాదు. అయినా ఇది నా పొలం. నేను కష్టపడితేనే నా పొలం ఇంకా బాగుంటుంది అని శ్రమ అనుకోకుండా నా పొలాన్ని బాగు చేసుకున్నాను. ఈ రోజు అదే పొలం బంగారాన్ని పండిస్తుంది. ప్రతి చోట సమస్యలు ఉంటాయి. దాన్ని మనం ఎంత చాకచక్యంగా సాల్వ్ చేసాము అన్నదాని మీదే... మన నేర్పరితనం ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేయి. అది నీవల్ల కానప్పుడు ఖచ్చితంగా నీ వెంట ఎప్పుడూ మేమందరము ఉంటాము అని చెబుతారు. థాంక్స్ నాన్న.. కచ్చితంగా మీరు చెప్పినట్టుగానే నేను నడుచుకుంటాను. ❤️❤️❤️❤️❤️
11-02-2026, 08:20 AM
నాకూ ఈ రెండు భాగాలు బాగా నచ్చాయి.
అమ్మాయి, అబ్బాయిలిద్దరికీ వారి తల్లితండ్రులు వివాహ వ్యవస్థ, అరమరికలు లేకుండా కలవడం, సర్దుకు పోవడం వగైరాలు ఇవి అందరు తల్లితండ్రులు పాటిస్తే మన వవాహ వ్యవస్థ పట్తిష్టంగా ఉంటుంది.
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం (https://xossipy.com/thread-71346.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
11-02-2026, 08:54 AM
Nicely put Siva garu.
As a side note, this is the reason most "well-settled" couples are getting divorced compared to "not-so-well-settled" couples.. "naakenti.. nenenti.." ane feeling tho enno pellillu petakulavutunnay. Seeing them so very often. Higher the financial status, higher the probability of a divorce. And this is said again n again in so many scientific studies!! I remember saying this a long time ago with a friend of mine, that the responsibility is always with the parents of the newly weds to make them put their egos aside!! But who's actually doing it like what is said here!! Great job Sivagaru!!
11-02-2026, 09:12 AM
really superb sir
andaru parents ila educate cheste chala baguntundi
11-02-2026, 09:18 AM
Superb update, excellent narration and present generation ki manchi points chepparu.
Yesterday, 08:00 AM
(This post was last modified: Yesterday, 08:02 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part -91
సరే ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది వెళ్లి పడుకో అని కూతుర్ని పంపించి వెనకాల శ్రీనుగారు కూడ లోపలికి వెళ్ళిపోతారు.
శ్రీ వాసుగారి వైపు చూస్తూ మీరు చెప్పేదంతా బాగానే ఉంది డాడ్. కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది అంతే కదా.. అంతే కాదురా సుపుత్ర. కొన్ని కొన్ని సార్లు కూర్చుని మాట్లాడుకున్న సాల్వ్ అవ్వలేనివి ఉంటాయి. అలాంటప్పుడు మౌనాన్ని ఆశ్రయించు. ఆ మౌనం అంత పెద్ద ఆయుధం ఇంకొకటి ఉండదు. మగవాడికి బయట ప్రపంచం చాలా పెద్దది ఉంటుంది. కానీ ఆడవాళ్ళ ప్రపంచం చాలా చిన్నది. ఇల్లు, పిల్లలు, భర్త మహా అయితే ఆఫీస్. మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పక్కన పెట్టేస్తారు. కానీ మనం అలా కాదు వీటితో పాటు ఫ్రెండ్స్, సోషల్ ఆక్టివిటీస్ అని బయట తిరుగుతూ ఉంటాము. భార్యాభర్తల మధ్యన ఏదైనా గొడవ అయిందనుకో మగవాడు ఏం చేస్తాడు. ఈసురుగా బయటికి వెళ్లిపోతాడు. ఫ్రెండ్స్ దగ్గరికి కానీ లేకపోతే పబ్బకో, మూవీ అని ఏదో ఒకటి డైవర్ట్ చేసుకుని రిలాక్స్ అయి వస్తాడు. కానీ ఆడవాళ్లు ఆ నాలుగు గోడల మధ్యనే ఉంటారు. అక్కడే ఉండి మనకోసం ఎదురు చూస్తారు తప్ప బయటికి వెళ్లరు. అదే మనకి వాళ్ళకి ఉన్న తేడా. అది అర్థం చేసుకొని మసులుకో చాలు అని చెబుతారు థాంక్స్ నాన్న చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఉందిరోయ్.. నాకు మా అమ్మ, నా భార్య ఇద్దరు సమానమే అనుకుని ఇద్దరినీ కూర్చోబెట్టి అన్న విషయాలు చెప్పేవు అనుకో నీ లైఫ్ బస్టాండ్ అయిపోతుంది అని నవ్వుతారు. అంటే అని అయోమయంగా అడిగితే.. తల్లికి చెప్పేవి కొన్ని ఉంటాయి. భార్యకి చెప్పేవి కొన్ని ఉంటాయి. కొన్ని దాచుకోవాల్సిన ఉంటాయి. కొన్ని చెప్పాల్సిన ఉంటాయి. ఆ క్లారిటీతో మసులుకోలేదనుకో నువ్వు పచ్చడి అవ్వడమే కాదు వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు తీసుకువచ్చిన వాడివి అవుతావు. సో అది కూడా జాగ్రత్తగా ఉండు అంటే.. అది ఎలా నాన్న అంటే.. ఒక ఇది కూడా చెప్పాలా. ఫర్ సపోస్.. ఇప్పుడు దాకా నీ చేతితో మీ అమ్మకు ఒక చీర కూడా కొనలేదు కదా.. రేపు మీ ఆవిడకి ఒక చీర కొనాలి అనిపిస్తుంది. వెంటనే వెళ్లి నీ భార్య కి ఒక చీర తెచ్చావు అనుకో.. అది ఎగరేసుకుంటూ మీ అమ్మకి చెప్పావనుకో.. అంతే అప్పుడు దాకా కొడుకు కోడలు మీద ఉన్న ప్రేమ ఎగిరిపోయి కోపం ముందుకు వచ్చేస్తుంది. చూశారా వాడు నాకెప్పుడు ఏమీ తేలేదు. కానీ పెళ్ళాం వచ్చి ఎన్ని రోజులు అయింది. అప్పుడే తనకోసం చీరలు కొనడం మొదలుపెట్టాడు అని మొదలు మొదలుపెడతారు. ఏంటి ఆడవాళ్లు ఇలా కూడా ఆలోచిస్తారా ఆశ్చర్యంగా అడిగితే... వాళ్ళు ఎలాగైనా ఆలోచించగలరు లేని ఐడియాస్ అన్ని తెచ్చుకొని మన బుర్ర ని బేజు ఫ్రై కూడా చేయగల క్యాపబిలిటీ ఉన్నవాళ్లు ఈ ఆడవాళ్లు అంటారు. మీకు బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టుందిగా.. ఒక నాలుగు ఐదు సార్లు జరిగింది. ఇంక తర్వాత అర్థమయ్యి ఎవరికి ఏది కావాలో అలా చేసేవాడిని. తర్వాత వాళ్ళు ఏమీ అనలేదా అని ఉత్సాహంగా అడిగితే.. వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు కదా వెంటనే ఇద్దరు క్యాచ్ చేసేసి ఒకే మాట మీదకు వచ్చేసారు. అయినా మా అమ్మ వేరులే అని వాసు గారు వాళ్ళ అమ్మగారిని తలుచుకొని మురిసిపోతూ ఉంటారు. అబ్బో మీ అమ్మే కాదు మా అమ్మ కూడా సూపరే అంటాడు. ఆ సూపర్ ఏంటో నీకు ముందు ముందు తెలుస్తుంది కానీ... జాగ్రత్త అమ్మాయిని ఏ విషయంలో కూడా బాధ పెట్టకుండా చూసుకో. ఈ ఆడవాళ్లు పైకి నోరు వేసికుని పడిపోతారు గాని చాలా సున్నితం. భార్యలు ఎప్పుడూ మన అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు. అందుకే నువ్వు ఎంత అలసిపోయి వచ్చినా అలసటని గుమ్మం బయటే వదిలేసి రా.. ఆఫీసులో ఉన్న టెన్షన్స్ అయితే ఆఫీసులోనే మడత పెట్టేసేయ్. ? భార్య అలిగింది అంటే నువ్వు బుజ్జగించాలి అని చిన్నఆశ. ఏడుస్తుంది అంటే నువ్వు మాత్రమే తన కన్నీళ్లు తుడవగలువు అనే నమ్మకం. నీతో గొడవ పడుతుంది అంటే తనకి సమయం ఇవ్వడం లేదు అన్న బాధ . నీ భార్య మాత్రమే నీకు వడ్డించాలి అనుకుంది అంటే తన ప్రేమ మొత్తం నీకు తెలపాలి అన్న కోరిక. నీ కష్టాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అంటే నీ భార్యే నీకు మంచి స్నేహితురాలి అని తెలపాలి అన్న ఆరాటం. ? మొత్తానికి నీ భార్యని... మీ అమ్మలాగా చూసుకో. కూతురిలాగా ప్రేమించు. ప్రేయసిలాగా లాలించు నీ జీవితమే స్వర్గం అని చెబుతారు. అవి వినగానే శ్రీ గట్టిగా వాసు గారిని హత్తుకుంటాడు. ఏమైందిరా అంటే... చాలా థాంక్స్ నాన్న. ఎమోషన్లు అవుతున్న కొడుకుని మెల్లిగా ఓదార్చి సరే.. సరేలే..ఇంక ఎమోషనల్ అయింది చాలుగాని వెళ్లి పడుకో. ఇప్పుడు నుంచి పడుకుంటే రేపు సాయంత్రానికి ఫ్రెష్ గా ఉంటావు అని మళ్ళీ టీజింగ్ మూడ్లోకి వస్తారు. నాన్న మీరు అసలు మరి యూత్ అయిపోతున్నారు తెలుసా అని నవ్వుకుంటూ మంచం ఎక్కేస్తాడు. వాసు గారు కూడా హ్యాపీగా కొడుకు పక్కన పడుకుని నిద్రపోతారు.
Yesterday, 08:01 AM
(This post was last modified: Yesterday, 08:02 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 92
రాజ్ దగ్గరికి వచ్చేద్దాం మనం..
శ్రీ, నేహా నోములు అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం అందరు పర్మిషన్తో రాజ్, నివిని తీసుకుని బయటకు వెళతాడు. కారులో కూర్చున్న నివి సైలెంట్ గా ఉంటే రాజ్ టెన్షన్ గా ఉంటాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండానే మౌనంగానే ట్రావెల్ చేస్తూ ఉంటారు. కొంచెం సేపటికి నివి కి విసుగు వచ్చి ఏంటి రాజ్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నావు. నువ్వు ఇలా డ్రైవ్ చేసుకోవాలనుకుంటే పక్కన ఇంకా నేనెందుకు. నువ్వు ఒక్కడివే వెళ్లొచ్చు కదా.. అయ్యో నివి నీకు కోపం వచ్చిందా.. సోరి.. సోరి.. ఏం మాట్లాడాలి అర్థం కాక సైలెంట్ గా ఉన్నాను. అదేంటి రోజు బానే మాట్లాడుతావు కదా.. ఈ రోజు మాట్లాడడానికి ఏమైంది అని అడుగుతుంది రోజు వేరు.. ఈరోజు వేరు. ఏంటో ఈరోజు మాట్లాడాలి అంటే టెన్షన్ వస్తుంది అంటాడు. ఎందుకు ఆ టెన్షన్ అని అడుగుతుంది . ప్లీజ్ నివి కాసేపు నన్నేమీ మాట్లాడించకు. చాలా టెన్షన్ గా ఉన్నాను. సరే సాంగ్స్ అయినా పెట్టు అని మ్యూజిక్ ఆన్ చేస్తుంది. అన్ని కూడా రొమాంటిక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. రాజ్ నీకు చాలా మంచి టేస్ట్ ఉంది. థాంక్యూ... థాంక్యూ.. అని మురిసిపోతుంటాడు. దీనికే నువ్వు ఇంత హ్యాపీగా ఉంటే... నేను ఇచ్చే సర్ప్రైజ్ కి ఇంకేమంటావో అనుకుంటూ ఫ్లయింగ్ చేస్తూ ఉంటాడు. ఏమైంది రాజ్ నీలో నువ్వే నువ్వేసుకుంటున్నావు. నాకు చెబితే నేను నవ్వుతాను కదా.. అబ్బా.. ఏమీ లేదు అంటాడు. ఇంకా ఎంత దూరము వెళ్ళాలి అంటే.. దగ్గర్లోకి వచ్చేసాము. చీకటి కూడా పడుతుంది. ఆ వాతావరణం చాలా బాగుంటుంది. పూర్తిగా సూర్యుడు అస్తమించకుండా.. అలాగే వెన్నెల కూడా పూర్తిగా రాకుండా.. ఆ నేచర్లో పక్షులు గూటికి చేరుతూ ఉంటే... ఆ టైంలో... ట్రాఫిక్ లేని రోడ్లో.. ఎవరూ లేని ఏకాంతంలో.. తనకి నచ్చిన నేచ్చెలి తో వెళితూఉంటే... ఆ ఫీల్ ని ఎంత వర్ణించి చెప్పినా తక్కువే కదా.. నివి వైపు చూస్తాడు. రాజ్ చెప్తున్నంత సేపు కూడా కల్లార్పకుండా అలానే చూస్తూ ఉంటుంది. నివి చూపులకి ఇబ్బందిగా ఏంటి నివి అలా చూస్తున్నావ్.. రాజ్ నీలో మంచి కవి ఉన్నాడు తెలుసా.. అసలు ఎంత బాగా చెప్పావు. నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇదే ఫీల్ తో మంచి కవిత చెప్పు. ఆ అమ్మాయి ఎవరైనా సరే... క్లీన్ బౌల్ అంటుంది. అంత బాగా చెప్పానా అని మెరిసే కళ్ళతో అడుగుతాడు. నీకు ఇంకా అంత డౌటే ఎందుకు... నేనే కితాబు ఇచ్చాక అని డ్రామాటిక్కా చెబుతోంది. ఆ మాటలకి నవ్వుకుంటాడు. సూర్యుడు పూర్తిగా వెళ్ళిపోయాడు అన్న సమయానికి రాజ్ తన అనుకున్న ప్లేస్ కి తీసుకు వస్తాడు. ఎక్కడికి వచ్చాము అని అడిగితే మన గెస్ట్ హౌస్ కి అని చెబుతాడు. సెక్యూరిటీ గేట్స్ తీయగానే కార్ లోపలికి తీసుకువెళ్లి ఒకచోట పార్క్ చేసి కం నివి అని వచ్చి డోర్ తీస్తాడు. డోర్ తీసి తన చెయ్యి అందిస్తాడు. నివి ఒకసారి రాజ్ వైపు చూసి ఆ చేతిలో చెయ్యవేసి కాళ్లు కింద పెట్టబోతోంది. వన్ మినిట్ నివి అనగానే.. ఏమైంది నువ్వు చెప్పులు కారులోనే వదిలేసి దిగుఅని చెబుతాడు. ఎందుకు...ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే అని తను శాండిల్స్ కారులోనే వదిలేసి పాదాలు కింద పెడుతుంది. పాదాలు నేలకి చేరకుండా మధ్యలో మెత్తని ఒక స్పర్శ అడ్డుపడుతూ ఉంటుంది. ఆ స్పర్శకి తనవు మనసు కూడా పులకించిపోతుంది. ఆ స్పర్శను చూడాలి అన్న ఆతృతతో నివి తన కళ్ళను కిందకి దించుతుంది. అక్కడ నాలుగు అడుగుల మందులతో మెత్తటి పువ్వులు పరిచి ఉంటాయి. దారి అంతా కూడా కేవలం గులాబీ రేకులు మాత్రమే ఉంటాయి. ఆశ్చర్యంగా రాజ్ వైపు చూస్తే. రేకులైతే నీకు ఏమి ఇబ్బందిగా ఉండదు అని ఇలా ఏర్పాటు చేశాను. పదా అని చేయి పట్టుకుని తీసుకువెళ్తాడు. మంత్రం వేసినట్టుగా ఒక తన్మయత్వంలో రాజ్ వెనకాలే వెళుతూ ఉంటుంది. మెల్లిగా చీకట్లు ముసురుతో ఉంటే.. చుట్టూ ఉన్న చెట్లు చల్లటి పవనాలను విసురుతూ ఉంటే.. నివి ప్రతి అడుగుకి.. సూర్యుని వెలుగుకి పోటీ వచ్చే విధంగా లైట్స్ వెలుగుతూ.. నివిని ఒక అద్భుత లోకంలోనికి తీసుకు వెళ్ళిపోతాడు. లోపలకి తీసుకువెళ్లి ఒక గది ముందు నుంచోపెట్టి ఓపెన్ ద డోర్ నివి అంటాడు. రాజ్ పనులకి ఎప్పుడో రాజ్ కంట్రోల్ లోకి వెళ్లిపోయిన నివి.. తను చేతలతో తనకే సంబంధం లేనట్టుగా తలుపులు తెరుస్తుంది. ఆ తలుపులు తెరిచిన వెంటనే హార్ట్ షేప్ లో ఉన్న రెడ్ బెలూన్స్ అన్ని ఎగురుతూ నివి మీద నుంచి ఆకాశంలోనికి వెళుతూ ఉంటాయి. ఆ దృశ్యం చూడగానే నివి ఫ్రీజ్ అయిపోతుంది. ఒక అడుగు ముందుకు వేసేటప్పటికి 100 బెలూన్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఆశ్చర్యంగా రాజ్ వైపు చూస్తూ ఉంటే నివి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఏదో మాట్లాడాలి అనుకున్న నివి ఏమీ మాట్లాడలేక ఏమిటిది అన్నట్టుగా కళ్ళతోనే అడుగుతుంది. రాజ్ కళ్ళతోనే నీకోసమే అన్నట్టుగా సమాధానం చెబుతూ... ఆ చేతిని పట్టుకుని ముందుకి అడుగు వేస్తాడు. ఒకరి చెయ్యి ఒకరి పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గది మధ్యలోకి తీసుకువెళతాడు. బెలూన్స్ అన్ని ఆకాశంలోనికి ఎగిరిపోయిన తర్వాత కొన్ని బెలూన్స్ మాత్రం గదిలో వేలాడుతూ ఉంటాయి. ప్రతి బెలూన్ మీద ఐ లవ్ యు నివి అని రాసి ఉంటుంది. నివి మీద ఫీలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కలెక్ట్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా పిన్ చేసి హ్యాంగ్ చేస్తాడు. అవి చూసి మరింత ఆశ్చర్యపోతూ ఇవన్నీ ఎప్పుడు కలెక్ట్ చేశావు అని అడుగుతుంది. జస్ట్ లైక్ దట్ అన్నట్టుగా భుజాలు ఎగరేస్తాడు. నివికి అవి చాలా బాగా నచ్చుతాయి. సంతోషంతో ముందుకు వెళ్లి ప్రతి ఫోటోని, ఆ బెలూన్స్ ని తాకి మరీ చూస్తుంది. నివి అలా చూస్తూ ఉండగానే... రాజ్ వెనకాల నుంచి నివి అని పిలుస్తాడు. హ.. అని వెనక్కి తిరుగుతుంది. అక్కడ రాజ్ ఒక మోకాళ్ళ మీద బెండ్ అయ్యి కూర్చుని... కుడి చేతితో ఉంగరం పట్టుకుని నివి వైపు చూస్తూ ఐ లవ్ యు నివి. ఎంత అని అడిగితే నేను చెప్పలేను.. కానీ మా అమ్మ తర్వాత నేను ప్రేమించిన మరొక అమ్మాయివి నువ్వే. నా జీవితకాలం మొత్తం నిన్ను మాత్రమే ప్రేమిస్తాను. ఎందుకు అని మాత్రం అడగవద్దు. నువ్వు ఎప్పుడు నా మనసులోకి వచ్చావో నాకే తెలియదు. వచ్చిన నిమిషం నుంచి నా మాట... నా చూపు.. నా గమనం అన్ని నీ వైపుకే తిరుగుతున్నాయి. నువ్వు నో అంటే బ్రతకలేను అని పెద్ద పెద్ద మాటలు చెప్పను కానీ.. మరొక అమ్మాయిని మాత్రం నా జీవితంలోనికి రానివ్వను. నువ్వు అవునన్నా.. కాదన్నా... నా జీవితంలో ఉండే ఒకే ఒక అమ్మాయివి నువ్వు.... నన్ను పెళ్లి చేసుకుంటావా.. నీ జీవితంలోకి నన్ను రానిస్తావ.. నీ కాలు కందనివ్వను. నీకంట కన్నీరు రానివ్వను. నీ మనసులో ఉన్నది నీ కన్నా ముందే నేనే కనిపెట్టి చేస్తాను. నిన్ను ఒక మహారాణి లాగా చూసుకుంటాను. ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ నేను చెప్పను. నీ ప్రతి కష్టంలోనూ నీకు తోడుగా నిలబడతాను. నీ ప్రతి విజయానికి నేను ఆయువు పోస్తాను. నీ, నా అనే భావం కాకుండా మన అన్న భావాన్ని నీకు నేను కలగచేస్తాను. ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయను.. ఆర్డర్ అని డిమాండ్ చేయను. నా ప్రేమలోని నిజాయితీ నిన్ను తాకితే... రాజ్ మాట మాటలో ఉండగానే నివి తన చేతిని ముందుకు చాపుతుంది. అది చూసి సంతోషంతో వేలికి ఉంగరం పడతాడు. పైకి లేచి నుంచుని నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని అనుకోలేదు నివి. ఇంకా నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలో అనుకున్నాను అని హగ్ చేసుకుంటాడు. నివి కూడా రాజ్ చుట్టూ చేతులు వేసి నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావా అని నేను చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. ఆఖరికి ఇప్పటికి ఓపెన్ అయ్యావు అంటుంది. నేను ప్రపోజ్ చేయకపోతే నువ్వు చేయొచ్చు కదా అని కౌగిలి నుంచి దూరం జరిపి అడుగుతాడు. అబ్బా మేము ఎలా ప్రపోజ్ చెస్తాము. మీరు మా వెనకాల పడాలి. మెప్పించాలి. ప్రపోజ్ చేయాలి. అవన్నీ మాకు ఓకే అయితే ఎస్ అని చెప్పాలి అని చేతులు కట్టుకుని చెబుతుంది. అంటే నీకు ఎప్పుడో అర్థమయ్యే కావాలని అర్థం కానట్టుగా ఉన్నావా అని బ్లాంక్ ఫేస్ తో అడుగుతాడు. దానికి నవ్వుతూ అది ఇప్పటికి అర్థమైందా.. శ్రీ పెళ్లి రోజున వినయ్ అన్న మాటలు గుర్తుకు వస్తాయి.. నువ్వు చెబితే గాని అది ఓపెన్ అవ్వద్దు అన్నమాటలు గుర్తుకు వచ్చి ఈ విషయం మీ ఇంట్లో అందరికీ తెలుసా అని గుర్రుగా చూస్తూ అడుగుతాడు. ఆఫ్కోర్స్ భుజాలు ఎగరేస్తూ రెండు చేతుల్ని ఓపెన్ చేసి చెబుతుంది. గోవిందుడు బుక్కయ్యాడు అన్నట్టుగా మా రాజ్ బాబు బుక్కయ్యాడు ??? కథ కొనసాగుతుంది... |
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: Ak0408, Jola, 2 Guest(s)


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)

