Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Story matram keka
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Part - 77


శ్రీ అవస్థ చూసి విక్రమ్ నవ్వుకుంటూ ఉంటాడు.  చెవిలో  మెల్లిగా ఏంట్రా అంత తింగరి చూపులు చూస్తున్నావు అని అడిగితే... బావ అని పట్టుకుంటాడు.

ఒరేయ్ చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుంది. ఏమైంది ఇప్పుడు... నీకా బాధ అంటే... చూసావా.. పెళ్లి నెల రోజుల తర్వాత పెట్టారు.

దీని వెనక కుట్ర చేసిందంతా మా నాన్నే అని నాకు చాలా గట్టి నమ్మకం అంటూ వాసు గారి వైపు చూస్తాడు. వాసు గారు కొడుకుని చేసి ఏంట్రా అని కళ్ళు ఎగరేస్తారు.

మళ్ళీ చూడు ఏమీ తెలియనట్టుగా కళ్లు ఎగరేస్తున్నారు అంటే..  ఏడిశావులే ఎదవ. ఆయన కాబట్టి నెల రోజులకు తీసుకువచ్చారు.

అక్కడ మీ మామగారిని చూడు.  వదిలితే ఒక ఆరు నెలలకి పోస్ట్ పోన్ చేసేటట్టు ఉన్నారు అంటే..
అనుమానంగా శ్రీ,  శ్రీను గారి వైపు చూస్తాడు.

ఆయన ఇంకా ఏదో సందిగ్ధంలో ఉండడం చూసి నువ్వు
అన్నది నిజమే.  బాబోయ్...  మా మామగారిని వదిలితే ఎప్పుడో చేసేటట్టు ఉన్నారు.

అలా జరిగినవ్వకూడదు ఏం చేయాలి. నువ్వు మూసుకు కూర్చో.  అక్కడ అంకుల్ మాట్లాడుతున్నారు.  అయినా పెళ్ళికి ముందున్న రోజులు కూడా చాలా బాగుంటాయి రా..

నెలరోజులే కదా ఎంజాయ్ అంటాడు. ఎలా రా.. ఇది కూడా నేనే చెబితే రేపు పెళ్లయ్యాక నిన్ను నేహా ఆడేసుకుంటుంది రా అంటాడు.

అప్పుడు ఏం ఆడుకున్న ఇద్దరం కలిసి ఆడుకుంటాం కానీ... నీకోసం నేహాన్ని 15 రోజులు బెంగళూరులో ఉండేటట్టుగా చేస్తాను.

ఇంతకుమించి నేనేం చెప్పలేను రా అని వెళ్ళిపోతాడు. రాజ్ మాత్రం ఇవీ ఏమి పట్టించుకోకుండా నివి ఎటు వెళుతుంటే అటే కళ్ళని అప్పచెప్పేస్తాడు.

శ్రీ సీరియస్గా ఆలోచిస్తూ రాజ్ వైపు చూస్తాడు. రాజ్ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా... ఎటో చూస్తూ ఉంటే అనుమానం వచ్చి..

రాజ్ పక్కకు వచ్చి ఏరా ఏం చేస్తున్నావు. నా ముందు ఒక అపరంజి బొమ్మ తిరుగుతూ ఉంటే చూస్తున్నాను రా అని మైమరపుగా చెబుతాడు.

ఎవరో అపరంజి బొమ్మ. మాకు చూపిస్తే మేము తరిస్తాం కదా అనగానే....  ఈ లోకంలోకి వచ్చి ఏంట్రా ఏమంటున్నావు ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు


నీ ఓవరాక్షన్ ఆపి మేటర్ ఏంటో చెప్పు అంటాడు. నాకే ఇంకా సరిగ్గా తెలియదు. ఇంకా నీకేం చెబుతాను.  పూర్తిగా తెలిశాక ముందు చెప్పేది మీ ఇద్దరికే అంటాడు.

అబ్బో ఈ ఊర్లో ఎవర్రా.. నీ మనసును పరిగెత్తిస్తున్న వాళ్ళు అంటే..  ఎవరో ఒకరు ఉన్నారులే గాని.. నువ్వేంటి అమావాస్య చంద్రుడిలాగా మొహము అలా ఎలాడేసావు.

రాజ్ వైపు తిరిగి ఏరా అసలు నువ్వు ఈ ప్రపంచంలోనే లేవా అంటే...  ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని మేటర్ ఏంటో చెప్పరా బావ.

ఏముంది చెప్పడానికి అక్కడ వాళ్ళిద్దర్నీ చూడు అని తండ్రి మామగారు వైపు చూపిస్తాడు. ఏమైంది వాళ్లిద్దరికి అంటే...  పెళ్లెప్పుడు చేయాలని తెగ డిస్కస్ చేస్తున్నారు.

ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదా అంటే..  అదే తర్జన భర్జన పడుతున్నారు. డాడీ ఏమో నెలకే అంటున్నారు. మా మామగారు ఇంకెప్పుడో అని ఆలోచిస్తున్నారు.

తొందరగా ఏదో ఒకటి తేల్చమని రా..నేను వెళ్ళాలా లేదా ఇక్కడే ఉండి పోవాలా అన్నది చూసుకోవాలి కదా.. లేకపోతే టికెట్స్ వేస్ట్ అవుతాయి అంటాడు.

ఒరేయ్ నా పెళ్లి కన్నా నీకు టికెట్స్ ఇంపార్టెంట్ అంటే అలా కాదురా... ఉండిపోవాల్సి వస్తే ఉండిపోతాను. లేదు అంటే వెళ్ళు వస్తాను అంతే తేడా.

అయినా నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం నివిని చూస్తూ అక్కడున్న పూలు పీకుతూ ఉంటాడు. పూల మీదున్న రాజ్ చేతులను తీసి పక్కన పెడుతూ.. మనం ఇంకా ఇక్కడ నుండి వెళ్లలేదు.  నువ్వు ఆ పువ్వులు పీకకు.

ఛీ... నీకు కుళ్ళు రా నన్ను చూసి అంటాడు.  దేనికి అంటే నేను లవ్ లో పడుతున్నానని అంటే...  అబ్బో... యువ్వరం చాలా దూరం వచ్చినట్టే ఉంది.

అంత లేదురా.. ఫస్ట్ స్టెప్ దగ్గరే ఉన్నాను. పిల్ల ఏమో నా వైపు అసలు చూడడం లేదు. ఇంతకీ ఎవరురా అమ్మాయి అంటే...

అప్పుడే చెప్పను అన్నాను కదా... ముందు నేను లైన్లో పెట్టి ఓకే చేయించుకున్నాక. మీ ఇద్దరికే పరిచయం చేస్తాను. ఇంతకీ మాకు తెలిసిన అమ్మాయా లేక కొత్త అమ్మాయా..

ఒక్క నిమిషం ఆలోచించి తెలిసిన అమ్మాయే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.  ఈ ఊర్లో మాకు తెలిసిన అమ్మాయి ఎవరు అబ్బా అని థింక్ చేస్తూ ఉంటాడు.

ఎట్టకేలకు అందరూ నిర్ణయం మీద నెల రోజులకే ముహూర్తం ఫిక్స్ చేస్తారు.  శ్రీ హమ్మయ్య అనుకుంటు నేహా ని చూస్తాడు.

నేహ మాత్రం సైలెంట్ గా ఉంటుంది.  ఏంటి మా మేడం ఇంకా అలాగే ఉన్నారు.  నా మీద కోపమా లేక ఈ పెళ్లి ఇష్టం లేదా... ఎలాగైనా నేహాతో మాట్లాడాలి అని అవినికి సైగ చేస్తాడు.

ఆ సైగ లు చూసి ఏంటన్నయ్య అంటే..  ఒక్కసారి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు.  దగ్గరకు వచ్చి చెప్పు అన్నయ్య అంటే..  నేను ఒకసారి ఎలాగైనా సరే నేహాతో మాట్లాడాలి.

ప్లీజ్ ఏర్పాటు చేయవా అంటే.. అమ్మో ఇక్కడ అంటది. ప్లీజ్ అవని నువ్వు తప్ప నాకు ఇక్కడ ఇంకొక దారి లేదు. ఎందుకో మా మేడం ఫేస్ డల్ గా ఉంది అని చెబుతాడు.

అప్పుడు అవని నేహా ఫేస్ వంక చూస్తుంది. అది నిజంగానే డల్ గా కనిపిస్తుంది. ఒక్క ఐదు నిమిషాలు అని లక్ష్మి గారి దగ్గరికి వెళ్లి ఆంటీ అని పిలుస్తుంది.

చెప్పమ్మా ఏమైనా కావాలా అంటే... అది ఏమీ లేదు  నిశ్చితార్థం అయిపోయింది కదా...  ఒక్క అయిదు నిమిషాలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని ఒంటరిగా మాట్లాడుకునేస్తే బాగుంటుందేమో అంటుంది.

అది అని ఇబ్బందిగా చూస్తూ ఉంటే ప్లీజ్ ఆంటీ..  వాళ్లకు కూడా మనస్సు విప్పి మాట్లాడుకోవాలి అని ఉంటుంది కదా...

మీ అంకుల్ ఏమంటారో అని ఇబ్బందిగా చెబుతుంది. నేను అది చూసుకుంటాను అని విక్రమ్ దగ్గరికి వెళుతుంది. ఏవండీ అని పిలుస్తుంది.

అయినా వినిపించుకోన్నట్టుగా కూర్చుంటాడు. మిమ్మల్నే అని దగ్గరికి వెళుతుంది.  నన్నా అనే వేలు తన వైపు పెట్టుకొని చూపిస్తూ అడుగుతాడు.

మిమ్మల్ని కాపోతే ఇంకా ఎవరిని పిలుస్తాను అని అడుగుతుంది.  అంటే...  ఇందాక ఎవరో నాతో మాట్లాడను అన్నారు కదా..అందుకే నన్ను కాదు అనుకున్నానులే...

ఇంతకీ ఎందుకో అని రాగం తీస్తాడు.  ఎంత అలుసైపోయాను మీకు అని పళ్ళు నూరుతూ ఉంటుంది. ఇంత కూడ అలసుఅవ్వలేదులే గాని...

మేటర్ ఏంటి అని అడుగుతాడు.  శ్రీ ఇబ్బంది చెబుతుంది.  దానికి నవ్వుకుంటూ సరే నేను అరేంజ్ చేస్తాను.  వాళ్ళిద్దరికీ రూమ్ సెట్ చేయి అని చెప్పి శ్రీను గారితో మాట్లాడి ఇద్దరినీ ఒక గదిలోకి పంపిస్తారు.

గదిలోకి వెళ్లిన నేహ తలదించుకునే ఉంటుంది.  శ్రీ, నేహా దగ్గరకు వచ్చి నేహా అని గారంగా పిలుస్తాడు.  అయినా తలెత్తదు.

ఏంటి నా పైన కోపమా అని అడుగుతాడు. లేదు అన్నట్టుగా తలపుతుంది.  సిగ్గా అని అడుగుతాడు. కాదు అన్నట్టుగా ఊపుతుంది.

మరి ఇంకేంటి అని అడుగుతాడు. అయినా మౌనంగా ఉంటే.. ఎంతసేపు నిలబడతాం కానీ వచ్చి కూర్చో అని.. పక్కన కూర్చోబెట్టుకుని ఇప్పుడు చెప్పు.

నువ్వు ఏదైనా నోరు తెరిచి చెబితేనే కదా నాకు అర్థం అవుతుంది అని అడుగుతాడు. ఆ మాటకి శ్రీ వైపు చూస్తూ మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది.

ఆ మాటకి గుతుక్కుమంటాడు. అబ్బా ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుని.. మీ నాన్నగారు నీతో ఏమీ చెప్పలేదు అన్నావు కదా..  అందుకే నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు.

పైగా ఎంగేజ్మెంట్ రోజుని ఇలా చూస్తే నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అయ్యి..  హ్యాపీగా ఫీలవుతావు అనుకున్నాను కానీ ఇలా డల్ గా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని నీరసంగా చెబుతాడు.

నేను డల్ గా ఉంది అందుకు కాదు అంటుంది.  అంటే నన్ను చేసుకోవడం ఇష్టమేనా అని హ్యాపీగా అడుగుతాడు. ఇష్టమే అని తలుపుతుంది.

మరి ఇంకేంటి ప్రాబ్లం అని అడుగుతాడు.  ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ తల దించుకుంటుంది. గెడ్డం కింద వేలు పెట్టి పైకి లేపుతూ.. మీ పేరెంట్స్ గురించా అని అడుగుతాడు.

అవును అన్నట్టుగా తలూపుతుంది..  దానికి ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది.  ఉన్నది మనిద్దరం. మనకు ఉన్నది వాళ్ళ నలుగురు.

పెళ్లయ్యాక నువ్వు జాబ్ చేయడం చేయకపోవడం పూర్తిగా నీ ఇష్టం కాని..  వాళ్ళు బాధ్యత మాత్రం పూర్తిగా నాదే.

నీ శాలరీ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తానన్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.  నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా...  ఈ ఊర్లోనే డాడీ ల్యాండ్ కొంటున్నారు.

అది మొత్తం మీ నాన్నగారు కంట్రోల్లోనే ఉంటుంది అని చెబుతాడు. నిజంగానా అని ఆనందంగా అడుగుతుంది.  నా ప్రాణానికి నేను అబద్ధం చెబుతానా...

ఆ మాటకే నేహ సిగ్గుపడుతుంది.  హమ్మయ్య వచ్చినప్పటి నుంచి ఇప్పటికి నీ ఫేసులో ఒక ఫీలింగ్ చూడగలిగాను.

ఇప్పుడు దాకా చాలా టెన్షన్ వచ్చింది.  ఈ పెళ్లి నీకు ఇష్టమా కాదా అని. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అనుకో.. బట్ నిన్ను వదులుకోవడం అంతకన్నా ఇష్టం లేదు అని చెబుతాడు.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ ఈ పెళ్లి కుదురుతుందని మీకు ముందే తెలుసా అని అడుగుతుంది.  దానికి నవ్వుతూ ఎందుకు తెలియదు.

సెట్ చేసిందే మేము అయితే అంటాడు. అంటే..  నిన్ను ఎప్పుడో  ఇష్టపడ్డాను. అవని నువ్వు కలిసి ఉన్నప్పుడే మీ ఇద్దరి బాండింగ్ బాగా నచ్చింది.

అప్పుడు నుంచి నీ మీద ఇష్టం మొదలయింది. ఆ ఇష్టం ప్రేమగా మారి ఇక్కడ వరకు వచ్చింది.

ఇదంతా నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది. ఇది మరీ బాగుంది. నాకు నీ మీద ఇష్టం పెరుగుతూ ఉంటే నీకు ఎలా తెలుస్తుంది.

నీకు నామీద ఇష్టం పెరిగినప్పుడు అది నీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడైనా నీకు నామీద ఇష్టం కలిగిందా లేక మీ పెద్దవాళ్లు చూశారని ఒప్పుకుంటున్నావా అని అడుగుతాడు.
[+] 11 users Like SivaSai's post
Like Reply
Part - 78


నేహా సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.  ప్లీజ్ నేనంటే ఇష్టమని చెప్పు అని మనసులో పదే పదే దేవుని తలుచుకుంటూ ఉంటాడు.

నేహా మెల్లిగా నోరు విప్పుతుంది. మీతో నేను ట్రావెల్ చేసినప్పటి నుంచి మీ బిహేవియర్ నచ్చింది అని ఇబ్బందిగా చెబుతుంది.

కానీ ఇది ప్రేమ,  పెళ్లి అలాంటి ఆలోచన కాదు. ఒక వ్యక్తిగా మీరంటే చాలా గౌరవం. మీ ఆలోచనలు బాగున్నాయి. మీరు మీ లైఫ్ పార్టనర్ కి ఇచ్చే  ఇంపార్టెన్స్ కూడా బాగా నచ్చింది.

మీ మాటలను బట్టి నాకు అనిపించేది మీకు వచ్చే అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు అని అదృష్టవంతురాలు నేనే అవుతానని అనుకోలేదు అని చెబుతోంది.

ఆ మాటలు వినగానే శ్రీ మేఘాలలో తేలిపొమ్మన్నది అని సాంగ్ వేసుకుంటాడు. అంతా చెప్పి నేహా శ్రీ వైపు చూడగానే ఎక్కడో ఊహలోకంలో ఉంటాడు.

ఏంటి ఈయన ఏమి స్పందించడం లేదు. నేను చెప్పింది  అర్థం మయిందా లేదా అనుకొని కళ్ళ ముందు చేతులు ఊపుతూ నేను చెప్పింది వినిపించిందా...

హ.. వినిపించింది థాంక్యూ..  థాంక్యూ.. అని నేహా చేతులు పట్టుకుని ఊపేస్తాడు. డోర్ ఎవరో కొడతా ఉంటే గబగబా నేహా వెళ్లి తలుపు తీస్తుంది.

ఏమైంది అవిని అంటే.. మీరు గదిలోకి వచ్చే చాలాసేపు అయింది. బయట మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. వచ్చేస్తున్నామని శ్రీవైపు తిరిగి వెళదామా అంటుంది.

తప్పకుండా బంగారం అని నేహా వెనకాల కాలర్ ఎగరేస్తూ వస్తాడు. శ్రీ ని చూసినా విక్రమ్,  రాజ్ ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుని పెదవి విరస్తారు.

వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఏంట్రా నా వైపు అలా చూస్తున్నారు అని అడిగితే... నిన్ను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది రా... చెప్పనా అని రాజ్ అడుగుతాడు.

ఎందుకు ఆలస్యం చెప్పుకో పర్మిషన్ ఇచ్చాను అని వెలిగిపోతున్న ముఖంతో అంటాడు. నిన్ను చూస్తుంటే జాతరలో బలిచ్చే మేకపోతు ని రెడీ చేసినట్టుగా అనిపిస్తుంది అంటాడు.

ఆ మాటకి విక్రమ్ వస్తున్న నువ్వు ఆపుకుంటూఉంటాడు. శ్రీ..  రాజ్ వైపు తిరిగి చండాలంగా అదేం పోలికరా..  ఇంత హ్యాపీగా ఉంటే అంటే...

ఆ మేక కూడా అలాగే అనుకుంటుంది కదరా.. నన్ను ఇంత బాగా రెడీ చేశారు. నాకేమైన ఫంక్షన్ అని. తర్వాత గాని ఆ మేకకు అర్థం కాదు కదా అంటాడు.

అంటే ఏంట్రా నేను బలైపోతున్నానా అని అడుగుతాడు.  నేను అలా అనలేదు కదా.నాకు అది గుర్తొచ్చింది అని చెప్పాను అంతే. నీకు ఎలా కావాలంటే అలా తీసుకో అని విక్రమ్ వైపు తిరిగి కన్ను కొడతాడు.

విక్రమ్ వైపు చూస్తూ ఉంటే చాలా కష్టంగా నవ్వు ఆపుకుంటూ కనిపిస్తాడు..  ఆడికంటే పెళ్లి కాలేదు కాబట్టి ఏదో పిచ్చవాగుడు వాగుతున్నాడు.

నీకు పెళ్లి అయ్యింది కదా నువ్వేమైనా బలి అయ్యావా అంటే.. ఒరేయ్ నేను నీలాగా కాదురా బచ్చా అని బుగ్గ మీద తడతాడు.

ఇందాక నేను ఇదే డైలాగ్ అంటే అబ్బో అన్నారు అని ఉడుక్కుంటూ అంటాడు.  ఇప్పుడు కూడా అదే డైలాగు అంటున్నాము అని ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుని అబ్బో అంటారు.

మీరు ఇద్దరు కలిసి నన్ను బాగానే మోసేస్తున్నారు గాని ఇంకా ఆపండ్రా బాబు అని దండం పెడతాడు. అలారా దారికి అని.. అందరూ అక్కడ నుండి శ్రీను గారి ఫ్యామిలీకి వీడ్కోలు చెప్పి బయలుదేరతారు.

ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్లి పనులు అన్నీ మొదలవుతూ ఉంటాయి. షాపింగ్ కూడా అందరూ సరదాగా చేస్తూ ఉంటారు.

శ్రీ, నేహా ఇద్దరూ బెంగళూరు వెళ్ళిపోతారు. ఆ పదిహేను రోజులు శ్రీ నేహా కి ఇంకా దగ్గరవుతాడు.  ప్రతి ఎమోషన్ ఇద్దరూ షేర్ చేసుకుంటూ తర్వాత లైఫ్ ఎలా స్మూత్ గా వెళ్ళాలి అన్న దాని మీదే ఫోకస్ పెడతారు.

ఆరోజు ఆదివారం అందరూ ఇంట్లోనే ఉంటారు. సత్యవతి గారు ఇందిరాగారికి ఫోన్ చేస్తారు. ఏమిటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అనుకుని చెప్పండి అనగానే..

అందరూ ఇంట్లోనే ఉన్నారా వదినగారు అని అడుగుతుంది.  ఉన్నాము ఏమిటి ఏదైనా ఇంపార్టెంటా.. అంటే కొంచెం ముఖ్యమైన విషయమే.

మేము వస్తున్నాము అని చెప్పి.. ముఖ్యంగా అవని ఇంట్లో ఉండేటట్టుగా చూడండి అని చెబుతారు. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటారు.

అది చూసిన మాధవి ఏమైంది అమ్మ అని అడిగితే.
సత్యవతి గారు ఫోన్ చేశారు.  అందరూ వస్తున్నారంట. అవిని నీ కంపల్సరీగా ఉండమన్నారు. ఏమైవుంటుందా అని ఆలోచిస్తున్నాను అని చెబుతారు.

విక్రమ్ కి ఏమైనా తెలిసేమోనమ్మ అంటే.. ఒకసారి విక్రమ్ ని పిలువు అని చెబుతారు.  విక్రమ్ వచ్చి ఏమైంది నానమ్మ పిలిచావు అని అడిగితే.. జరిగిందంతా చెబుతారు.

ఆ విషయం వింటూ ఆలోచిస్తూ నాకు ఏమీ తెలియదు.  చూద్దాం.. ఎందుకు వస్తున్నారో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.  

సత్యవతి, శేషగిరి గారు, ధనుంజయ్ ముగ్గురు లోపలికి వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళు శత్రువు అయినా సరే గౌరవించాలి అనే ఉద్దేశంతో లోపలికి రండి అని పిలుస్తారు.

ముగ్గురు వచ్చి కూర్చుని నమస్కారం చేసి ఎలా ఉన్నారు. బాగున్నారా అని అడుగుతారు.  ధనుంజయ్ కళ్ళు మాత్రం అవిని కోసం వెతుకుతూ ఉంటాయి.

అది అర్థమైన విక్రమ్,  నివి ని పిలిచి మీ వదినని పిలువు అని చెబుతాడు. సరే అని నివి గదిలోకి వెళ్లి అన్నయ్య పిలుస్తున్నాడు అని చెబుతోంది.

సరే అని నివి వెనకాలే కిందకి వస్తుంది.  అక్కడ వీళ్ళ ముగ్గురిని చూస్తూ ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది.  విక్రమ్ వారగా అవని నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు.

అవని వచ్చే విక్రమ్ పక్కనే నిలబడి నానమ్మ తాతగారిని పలకరిస్తుంది బాగున్నారా ? బాగున్నాను తల్లి అని చెబుతారు.

ధనుంజయ్ కి ఒక్క నిమిషం బాధగా అనిపించేనా అది కనపడనివ్వకుండా బాగున్నావా అవని అని అడిగితే.. ఊ అని తల ఊపుతుంది.

ఇందిరా గారు అవని తో ఇంటికి వచ్చిన గెస్ట్ లకి ఇంటికోడలే మర్యాద చేయాలి అమ్మ. వెళ్లి జ్యూస్ తీసుకురా అని పంపిస్తారు.

అవని అలాగే అని చెప్పి కిచెన్ లోనికి వెళుతుంది. సర్వెంట్ సాయంతో ముగ్గురికి జ్యూస్ ప్రిపేర్ చేస్తుంది.
జ్యూస్ తీసుకొచ్చి ముగ్గురికి ఇస్తుంది.

అవిని చేతితో ఇచ్చిందని ఆనందంతో జ్యూస్ తీసుకుని తాగుతాడు.  ఎవరు ఏమీ మాట్లాడకుండా ఉండేటప్పటికీ  విక్రమ్ కి విసుగు వచ్చి ఏంటి తాతగారు ఏదైనా ముఖ్య విషయమా అని అడుగుతాడు.

శేషగిరి గారు కొడుకు వైపు చూస్తాడు. ఒక్క నిమిషం ధనుంజయ్ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి లేచి నిలబడి అవిని ముందుకు వచ్చి నుంచుంటాడు.

అవిని ధనుంజయ్ వైపు ఏమిటివి అన్నట్టుగా చూస్తుంది.  విక్రమ్ కి ఎందుకో అనుమానం వచ్చి అవని పక్కకి వచ్చి నిలబడతాడు.

వాటి గురించి తెలుసుకోవడం కోసం అయినా కూతురు మాట్లాడుతుందేమో అని చూసిన ధనుంజయ్ కి నిరాశ ఎదవుతుంది.

ఇంకా తప్పకే ధనుంజయ్ చెబుతాడు.  మనకి సంబంధించిన ఆస్తులు అన్నీ కూడా నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాను.

ఇకనుండి ఆ కంపెనీ మొత్తం నీ హ్యాండ్ఓవర్ లో లోనే ఉంటుంది అని చెబుతూ పేపర్లు ముందుకి పెడతాడు. ఎందుకు సార్ అని గొంతు తడారి పోతూ ఉంటే అడుగుతుంది.

అది నీ హక్కు కాబట్టి.  పుట్టింటి నుంచి నీకు రావలసినవి అని చెబుతాడు. ఆ మాటకి పేపర్స్ వైపు ధనుంజయ్ వైపు మార్చి మార్చి చూస్తూ గట్టిగా నవ్వుతుంది.

అవని నవ్వుకి అర్థం తెలియక ధనుంజయ్ కూతురు వైపే చూస్తూ ఉంటాడు. కుటుంబ సభ్యులకు కూడా అవని వైపే చూస్తూ ఉంటారు. 

సత్యవతి గారి ముందుకు వచ్చి ఎందుకు అవని అలా నవ్వుతున్నావు. నవ్వక ఏం చేయమంటావు నానమ్మ. పుట్టిల్లు అంట.  అసలు నాకు పుట్టిల్లు ఎక్కడ ఉంది.

అమ్మ అవని అని బాధగా అంటే... నిజమే కదా నానమ్మ. నేను ఆ ఇంట్లో పని చేశాను కాబట్టి నాకు షెల్టర్ ఇచ్చారు. అంతకుమించి ఏ విషయంలో నాకు పుట్టిల్లుగా నిలబడింది.

నా కష్టంలో అండగా ఉందా.. పోనీ నన్ను ముద్దు చేసిందా.. నా విజయంలో పాలుపంచుకుందా..  అవేమీ కాకుండా పైగా నన్ను ఒక నరకంలో తోయడానికి చూశారు. అది పుట్టిల్లు అవుతుందా అని అడుగుతుంది.

అవన్నీ మీ నాన్నకి తెలియకుండా జరిగిపోయినయి అని చెబుతూ ఉంటే చెయ్యి పెట్టి చూపిస్తూ ఇంకా ఆపండి అంటుంది.

మీరు చెప్పే కథలు వినే ఓపిక నాకు లేదు. అసలు నాకు తండ్రి అంటూ ఉంటేనే కదా.. ఏ రోజైతే నా తల్లి దూరమైందో ఆ రోజే ఆ బంధం కూడా పోయింది.

ఏ కన్నతండ్రి కూడా సార్ అని పిలవమని చెప్పరు. అలా చెప్పిన రోజునే ఆ బంధం విలువ పోయినట్టే. ఇంకా ఇప్పుడు కొత్తగా పుట్టిల్లు అని మాట్లాడుతుంటే నవ్వురాక ఏమి వస్తుంది.

అవని అలా అడుగుతూ ఉంటే... సత్యవతి గారికి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటారు.  ఎమోషనల్ అవుతుంది అని అర్థమై...విక్రమ్ భుజం చుట్టూ చేయవేసి దగ్గరికి లాక్కుంటాడు.

నేను బాగానే ఉన్నాను అండి అని చెప్పి ప్లీజ్ సార్ ఇప్పుడు లేనిపోని కొత్త బంధాలు కల్పించుకొని అనవసరంగా మీ  ఆవిడ, కూతురికి నా మీద ఇంకా కోపాన్ని పెంచకండి. దయచేసి తీసుకుని వెళ్ళండి అని చెబుతుంది.

ధనుంజయ్ పూడుకుపోయిన గొంతుతో ఒక్కసారి నేను చెప్పేది విను అవని.  నాకు వినే ఇంట్రెస్ట్ లేదు అని చెబుతుంది.

విక్రమ్ ధనుంజయ్ వైపు ఒక్కసారి చూసి..  ఒకసారి ఆయన చెప్పేది విను.  పక్కన నేను ఉన్నాను కదా అని చెప్పి.. అక్కడ సోఫాలో కూర్చోబెట్టి... అవిని పక్కనే కూర్చుంటాడు.

ధనుంజయ్ ను కూడా...మీరు కూర్చోండి అని చెప్పి మంచినీళ్లు తెప్పించి అవిని చేత తాగిస్తాడు.

ఇప్పుడు చెప్పండి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అని విక్రమ్ అడుగుతాడు.

ధనుంజయ్ ఏమని చెబుతాడు...

కథ కొనసాగుతుంది...
[+] 13 users Like SivaSai's post
Like Reply
Nivi .. Raj.. story start!!

annattu .. Dhanunjay story pakkana padinattundi!?!?!
Like Reply
Superb update
Like Reply
Part - 79


అవిని ముందే కింద మోకాళ్ళ మీద కూర్చుని చెయ్యి పట్టుకోబోతాడు.  వెంటనే చేతులు వెనక్కి తీసుకుంటుంది.

ధనుంజయ్ కూడా ఆ ప్రయత్నం ఆపేసి నేను చెప్పేది పూర్తిగా విను అవని అని. నీ విషయంలో జరిగింది ఏది కూడా నాకు తెలియదు.

నా కళ్ళకి నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాం అనే గుడ్డని కప్పి మాయ చేసారు. అదే నిజమని నమ్మి నిన్ను సరైన దారిలో పెడుతున్నారు అనుకున్నాను కానీ.. నువ్వు నాకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి వస్తుందని అనుకోలేదు.

నా కూతురు భవిష్యత్తు గొప్పగా ఉండాలి అని కలలు కన్నాను. అందుకే నా దగ్గర పెంకిగా ఉన్న పెళ్లయ్యాకైనా వీళ్ళందర్నీ చూసి బాగుంటావని...

ముందు విక్రమ్ సంబంధం నీకోసమే తెచ్చాను కానీ అందరి ముందు నువ్వు వద్దు అని చెప్పావు అనగానే.. చురుగ్గా చూస్తుంది. అదే చెప్పేలాగా చేశారు.

చాలా రోజులు బాధపడ్డాను.  ఎందుకు అవిని ఇలా ప్రవర్తిస్తుందా అని. నేను చేసిన తప్పు నీ దగ్గర కూర్చుని నీతో మనస్పూర్తిగా మాట్లాడకపోవడం.

పెళ్లిరోజున కూడా నీకోసం మొత్తం వెతికాను. ఎక్కడా కనపడలేదు అడిగితే..  అలిగింది రాను అని కరాఖండిగా చెప్పేసింది అని చెప్పారు.

ఇలాగైనా రెడీ అయి నలుగురిలోకి వస్తే నీకు నచ్చిన వాడు కనిపిస్తాడు కదా అని ఆలోచించాను. కానీ అది కూడా నీవల్ల జరగలేదు అన్న కోపం బాగా అన్నీ వచ్చాయి.

తర్వాత పెళ్లి పనుల్లోపడి నీ గురించి ఆలోచించలేదు. అది నిజంగా ముమ్మాటికీ నా తప్పే. నువ్వు ప్రేమించిన వాడితో వెళ్ళిపోయావు అని చెప్పినప్పుడు నిజంగా నాకు నమ్మాలని అనిపించలేదు.

అవని ఎప్పటికీ అలాగా చెయ్యొదు.  అప్పుడే పెళ్లి చేసుకోను అని నాతో ధైర్యంగా మాట్లాడింది. ఎందుకు ఈ విషయంలో ఇలాగా చేస్తోంది అని ఆలోచించాను.

కానీ అక్కడ ఉదయ్ దెబ్బలతో కనపడి.. సర్వెంట్స్ కూడా నిజమే అన్నట్టుగా మాట్లాడితే నమ్మక తప్పలేదు అని కూతురు వైపు చూస్తాడు.

అవని కన్నీళ్ళతో చూస్తూ ఉంటే ఇబ్బందిగా తలదించుకుంటాడు. ఆ నిమిషం నిజంగానే కృంగిపోయాను.

మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రేమకి ప్రతిరూపమైన నువ్వు నాకు దూరంగా వెళ్లిపోయినట్టుగా అనిపించింది.

నానమ్మ తాతయ్య కూడా ఇంకెక్కడు ఉండలేము అని ఊరు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత ఎందుకో ఒకరోజు భార్గవి..

అత్తయ్య మావయ్య గారిని తీసుకుని రండి.  పెద్ద వాళ్లు ఇంట్లో లేకపోతే బాగోలేదు అని బ్రతిమాలితే నిజంగానే.. నువ్వు లేక అమ్మానాన్న లేక ఇల్లంతా ఏదో వెలితిగానే అనిపించింది.

ఇంకా నేనే ఆగలేక అమ్మ వాళ్ళని తీసుకొద్దామని వెళ్లాను. అవని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మనస్ఫూర్తిగా మాట్లాడు అని అంటే...

అవని గురించి తెలుసుకోవలసింది ఏముంది అని అనుకున్నాను.  కానీ ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటే నా కూతురు తన ఇంట్లోనే ఒక పరాయిదాన్నిలాగా బ్రతికింది అని అర్థం అవ్వగానే... నా గుండెని ఎవరో గుణపంతో పొడిచిన అంత బాధ వచ్చింది.

ప్రతిరోజు మీ అమ్మ నన్ను కన్నీళ్ళతో అడుగుతున్నట్టుగానే అనిపించింది. అవనికి అన్యాయం చేస్తారా...

నీ గురించి అన్ని నిజాలు తెలిసిన తర్వాత. మీ అమ్మ చావుకి కారణమైన వాళ్ళని ఇన్నాళ్లు నెత్తిన పెట్టుకున్నాను అని అర్థం అయిన తర్వాత నేను బ్రతికున్న అనవసరం అనిపించింది అని చెప్పి అవిని వైపు చూస్తాడు.

అయినా అవనిలో ఎటువంటి స్పందన ఉండదు . ధనుంజయ్ వైపు అలాగే చూస్తుంది.  కూతురులో ఎటువంటి స్పందన లేకుంటే చాలా బాధగా అనిపిస్తుంది.

తన చేసిన పనులు వల్లే నమ్మడం లేదు అని కూడా అర్థం అవుతుంది. మన జీవితాలుతో ఆడుకున్న వాళ్ళని జైల్లో పెట్టించాను.

ఈ ఆస్తికి అసలైన హక్కుదారువి నువ్వే. అందుకే మొత్తం ప్రాపర్టీస్ అన్నీ నీ పేరు మీదకి మార్చి.. కంపెనీ కూడా నీకు హ్యాండ్ఓవర్ చేసి  నానమ్మ తాతయ్యని తీసుకుని ఊరు వెళ్లిపోతున్నారు అని చెబుతాడు.

అందరికీ అది విని చాలా బాధగా అనిపిస్తుంది.  విక్రమ్ మాత్రం అవిని నే చూస్తూ ఉంటాడు. అవనిలో ఎటువంటి స్పందన ఉండదు.

ధనుంజయ్ మొత్తం చెప్పే తీసుకో అవని..  పేపర్స్ అని ముందుకు పెడతాడు.  అయినా సరే అవని కదలదు.. సత్యవతి గారు ముందుకు వచ్చి మీ నాన్న అంతలా చెబుతున్న మాట్లాడవేంటి.

ఆవిడ వైపు చూసి కథ బాగుంది అందుకే వింటున్నాను అంటుంది. ఒక్క నిమిషం ధనుంజయ్ ఏమి విన్నాడో అర్థం కాకుండా ఉంటుంది. కథ ఏమిటి అవిని. నేను నిజమే చెబుతున్నాను అని తడబడుతూ అంటాడు.

ఏది నిజం సార్...  ఇంట్లోనే ఉన్నారంట...కానీ ఏం జరుగుతుందో తెలియదంట.. నాతో కూర్చుని మాట్లాడడానికి అసలు టైమే లేదంట...

అసలు విషయం ఏంటో నేను చెప్పనా అనగానే.. అందరూ అవని ఏం చెబుతుందా అని చూస్తారు.  విక్రమ్ మాత్రం అవని మనస్థితిని అంచనా వేస్తూ ఉంటాడు.

ఈయన గారి భార్య కూతురు జైల్లో ఉన్నారు. చేసిన తప్పులకి నా భర్త జైల్లో పెట్టించాడు కానీ అది కూడా ఈయనగారి అకౌంట్ లో వేసుకున్నారు.

వాళ్ళిద్దరూ జైల్లో ఉండడం వల్ల కంపెనీ రేపిటేషన్ ఏదో దెబ్బతిని ఉంటుంది లేదా షేర్స్ అన్ని పడిపోయి ఉండాలి.
వాటిని మళ్లీ నిలబెట్టుకొని భార్యని,కూతురిని జైలు నుంచి విడిపించుకోవడానికి నా భర్త అండ కావాలి.

దానికి  సాకు ఇది అంతా... కంపెనీ నాకు అప్పచెపితే అది నా భర్త ఎలాగు హ్యాండిల్ చేస్తారు కాబట్టి.. మళ్లీ పూర్వ వైభవం వస్తుంది.

తర్వాత మెల్లిగా నన్ను తప్పించి ఆయన కూతురిని అందలం ఎక్కించాలి అని తాపత్రయపడుతున్నారు. అంతే కదా సార్ అని అడుగుతుంది.

అవని చెప్పిన విధానానికి అందరూ షాక్ తో బిగుసుకుపోతారు. సత్యవతి గారి ఇంకా తట్టుకోలేక ఏం మాట్లాడుతున్నావ్ అవని నీకైనా అర్థమవుతుందా...

నాకు బాగానే అర్థం అవుతుంది నానమ్మ. మీరు ఆయన ట్రాప్ లో పడొచ్చు గానీ... నేను పడను.  ఎందుకంటే అనుభవించింది నేను కాబట్టి..

భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళో నాకు పూర్తిగా తెలుసు . మీ కొడుకు పైన మీకు నమ్మకం ఉంది అది పూర్తిగా మీ వ్యక్తిగతం కానీ నన్ను నమ్మమని మాత్రం అడగద్దు అంటుంది.

అవని అలా చెబుతూ ఉంటే ధనుంజయ్ తట్టుకోలేక పోతాడు.  మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ నేను నిజమే చెబుతున్నాను. నన్ను నమ్ము అనే అడుగుతాడు.

అవని నమ్మే పరిస్థితుల్లో కాదు కదా... అసలు ధనుంజయ్ వైపు చూడడానికి కూడా ఇష్టపడదు. ఎంత చెప్పినా కూతురు నమ్మడం లేదు అని...

ఆ పేపర్స్ అక్కడ టేబుల్ మీద పెట్టి ఈ ఆస్తి పూర్తి హక్కుదారులువి నువ్వే.  ఈ కంపెనీని ఏమి చేస్తావో అన్నది పూర్తిగా నీ ఇష్టం.

నువ్వు హ్యాండిల్ చేస్తే కంపెనీలో ఉన్న ఉద్యోగస్తులు రోడ్డున పడకుండా ఉంటారు.  లేదు అంటావా పూర్తిగా నీ ఇష్టం అని చెప్పి వెనక్కి తిరుగుతాడు.

వెళుతూ ఒక విషయం అవని.. నీ విషయంలో నేను సరిదిద్దుకోలేను తప్పే చేశాను. నువ్వు నన్ను నమ్మవని కూడా తెలుసు కానీ...

ఎప్పటికైనా నా కూతురు నన్ను నమ్ముతుంది. నాన్న అని ప్రేమగా పిలుస్తుంది అని మాత్రం ఎదురు చూస్తూ ఉంటాను.

రెండు అడుగులు వేయగానే ఆగండి అన్న పిలుపు వినబడుతుంది. ఆ గొంతు వినిపించిన వైపు తిరగగానే విక్రమ్ నిలబడి రెండు చేతులను ప్యాంటు పాకెట్లో పెట్టుకుని చూస్తూ ఉంటాడు.

చెప్పండి అల్లుడుగారు అనగానే...  కాల్ మీ విక్రమ్. ఆ పేపర్స్ చేతిలోకి తీసుకొని మీరు ఈ పేపర్స్ ద్వారా ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మిస్టర్ ధనుంజయ్ అని అడుగుతాడు.

నాకున్నది ఒకే వారసురాలు. అది అవని అని చెప్పడానికి అని సూటిగా బదులుచెబుతాడు. మీరు ఇలా చేస్తే మీ భార్య ఇంకో కూతురు వల్ల ప్రాబ్లం వస్తుంది కదా...

వాళ్లకి, ఆస్తికి ఎటువంటి సంబంధం లేదు.అన్ని విధాలుగా  డాక్యుమెంట్స్ చేపించాను.  ఎట్టి పరిస్థితుల్లోనూ అవనినీ వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం లేదు అని చెబుతాడు.

అయితే ఈ పేపర్స్లో ఒక చిన్న మార్పు చేయండి అని చెబుతాడు. చెప్పండి ఏం చేయమన్నా చేస్తాను అవని ఒప్పుకుంటే చాలు అంటాడు.

హ్మ్.. అని అందరి వైపు చూస్తాడు. అవిని ఫేసులో అసహనం కనిపిస్తూ ఉన్న మౌనంగా ఉంటుంది. అది విక్రమ్ కి ఇచ్చే విలువ అని అందరికీ తెలుసు.

విక్రమ్ అవినినీ చూస్తూ నేను ఏ నిర్ణయం తీసుకున్న నీకు సమ్మతమేనా అని అడుగుతాడు. మీరు ఏది తీసుకున్నా అది మన మంచికే అని నాకు తెలుసు.

మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెబుతుంది. ఆ మాటలకు విక్రమ్ కి గర్వంతో కూడిన నువ్వు వస్తుంది. తన భార్యకి తన పైన ఉన్న నమ్మకానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది.

ధనుంజయ్ వైపు తిరిగి మీరు కంపెనీ యానివర్స్ డే కి ఫంక్షన్ ఏర్పాటు చేసి ఈ ఆస్తికి, కంపెనీకి అన్నింటికీ సర్వహక్కుదారురాలు అవని అని అనౌన్స్ చేయండి.

అలాగే కంపెనీలో వచ్చే ప్రాఫిట్ మొత్తం లో నుంచి 50% తల్లిదండ్రులు ఆదరణ కోల్పోయి స్వశక్తితో ఎదుగుతున్న పిల్లలకు సపోర్ట్ చేసే విధంగాను,శరణాలయాలకి వెళ్లే విధంగా ప్రిపేర్ చేయించండి.

అలాగే మిగిలిన ప్రాఫిట్ కంపెనీలో ఎప్పటినుంచో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ల జీతాలు పరంగా షేర్స్ అందేటట్టుగా అరేంజ్ చేయండి.

సింగిల్ మదర్స్ ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలకు సపోర్టుగా వెళ్లేటట్టుగా చూడండి. నామమాత్రంగానే అవని అక్కడ సీఈవోగా తన బాధ్యతలు తీసుకుంటుంది.

ఆ కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా అవని జీతం గా తీసుకోదు. ఇదంతా మీకు సమ్మతమైతే ఆ పేపర్స్ ని ఆ విధంగా చేయించి అందరి ముందు ఆరోజు అవనికి అందజేయండి అని చెప్పి అవిని వైపు చూస్తాడు.

అవని సమ్మతమే అని కన్నీళ్ళతో విక్రమ్ వైపు చూస్తుంది.
విక్రమ్ చిన్న నవ్వు నవ్వి ధనుంజయ్ వైపు తిరిగి ఆ రోజు జరిగే ప్రతి విషయం కూడా మీ భార్య,కూతురికి తెలిసేటట్టుగా అరేంజ్ చేయండి.  ఇక్కడ జరిగేది ప్రతిదీ వాళ్ళు చూడాలి అని చెబుతాడు.

ధనుంజయ్ సంతోషంగా తప్పకుండా అని చెప్పి అందరికీ నమస్కారం చేసి తల్లిదండ్రులు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
[+] 12 users Like SivaSai's post
Like Reply
Part - 80


అవని ఎవరితోను మాట్లాడకుండా గదిలోనికి వెళ్ళిపోతుంది.  అక్కడ బాల్కనీలో నిలబడి బయటికి చూస్తూ ఉంటుంది.

విక్రమ్ నేను చూసుకుంటాను అని చెప్పి  గదిలోకి వచ్చి అవనినీ వెతుకుతూ ఉంటాడు.  బాల్కనీలో నిలబడిన భార్య దగ్గరకి వెళ్లి వెనక నుండి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని ఎంటి భార్యమణి ఆలోచిస్తున్నావు.

ఆలోచనలేవో నాకు చెబితే నేను షేర్ చేసుకుంటాను కదా అంటాడు. అయినా మౌనంగానే ఉంటుంది. తన వైపుకు తిప్పుకొని నీ పర్మిషన్ లేకుండా  నీ సమాధానం  కూడ నేనే చెప్పాను అని అలక.

వెంటనే అవని విక్రమ్ నోటి మీద చేయి వేసి ఏం మాట్లాడుతున్నారు మీరు. మీరు చెబితే ఒకటి. నేను చెబితే ఒకటా అని అడుగుతుంది.

మరి ఎందుకు ఈ మౌనం. విక్రమ్ గుండెల పైన తలవాల్చి అదే తెలియడం లేదు. నాకెందుకో ఇది నచ్చడం లేదు. ఆ సార్ ఎందుకు నా జీవితంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు.

నేను సంతోషంగా  ఉన్నాను అని ఆ జంటకి అర్థం అయినట్టు ఉంది. దాన్ని ఎలా చెడగొడదామా అని ప్లాన్లు వేస్తున్నట్టు ఉన్నారు.

అవని పడిన బాధలకి ధనుంజయ్ ఏమి చేసినా తప్పుగానే ఆలోచిస్తుందని అర్థమయ్యి ఇలా రా అని అక్కడ ఉన్న ఉయ్యాలో కూర్చోబెట్టి...

పక్కన కూర్చుని  అతను నీ జీవితంలోకి రావడం నీకు ఇష్టమేనా... అని అడుగుతాడు. అసలు ఇష్టం లేదు అని చెబుతుంది.

నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అవని అంటాడు. చెప్పండి అన్నట్టుగా చూస్తే...  ధనుంజయ్ వాళ్ళ ఆవిడకి విడాకులు ఇచ్చేసాడు.

తనతో గాని తనకు సంబంధించిన ఎటువంటి వ్యవహారంతో గాని సంబంధం లేదు అని పక్క డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేపించి ఆ తల్లి కూతురు ఇద్దరు దగ్గర సంతకాలు తీసుకున్నాడు.

ఆ మాటలు నిజమని మీరు నమ్ముతున్నారా అని అడుగుతుంది. నువ్వెందుకు నమ్మడం లేదు.  అవని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు ముగ్గురిని పూర్తిగా చదివాను కాబట్టి. వాళ్లకి ఏదో అవసరం ఉంది ఈ డ్రామా ఆడుతున్నారు అంతే అంటుంది.

ఇంకా ఈ విషయం పొడుగించడం మంచిది కాదు అని విక్రమ్ టాపిక్ కట్ చేస్తూ.... ఇంతకి మీ షాపింగ్ అయిపోయిందా అని అడుగుతాడు.

హ..  అని కొంచెం ముభావంగానే చెబుతుంది. ఓయ్ నేనేమి అడుగుతున్నాను నువ్వేం సమాధానం చెబుతున్నావు.

షాపింగ్ ఎంతవరకు అయింది.  మేడంగారి సారీస్ డిజైన్స్, బోటిక్ పనులు ఉంటాయి కదా... అవి అన్ని అయిపోయినాయా ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా అని అడుగుతాడు.

దానికి అవని నవ్వుతూ అమ్మ,  అత్తయ్య గారు అసలు ఊరుకోవడం లేదు.  నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి అని చెప్పినా సరే... పెళ్లి కదా ఉండాలి అని చెప్పి మళ్ళీ మొత్తం డిజైన్ చేపిస్తున్నారు.

ఏం చేసుకుంటాను అన్ని చీరలుని. అక్కడ పెళ్లి జరుగుతుంది బయట వాళ్ళకి కాదు.  మీ అన్నయ్య కం నా బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతాడు.

అలాగే నీ బెస్ట్ సీనియర్ అయినా నేహా కి. అవును అనుకో కానీ ఒక్కసారి ఇన్ని చీరలు అంటే..  నాకే కన్ఫ్యూషన్ గా ఉంది.

ఎప్పుడు ఏం కట్టుకోవాలా అని. నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు.  గైడ్ చేయడానికి నేనున్నాను కదా అంటాడు.

మీకు ఇవి కూడా తెలుసా అంటే.. నా భార్య కోసం నేను అన్ని తెలుసుకున్నాను.  నీ సారి మీదకి మ్యాచింగ్ జువెలరీ దగ్గర నుంచి అన్ని సెట్ చేసే బాధ్యత నాది సరేనా అంటాడు.

ఆ మాటలకి నవ్వుతూ సరే అని విక్రమ్ ని హగ్ చేసుకుంటుంది.  అవని పూర్తిగా డైవర్ట్ అయిందని అర్థం అయ్యాక కాసేపు పిచ్చపాటి మాట్లాడి కిందకి తీసుకు వస్తాడు.

అవనినీ చూసి అందరూ హమ్మయ్య అనుకుంటారు. విక్రమ్ నివిని చూసి నీ షాపింగ్ ఎంతవరకు అయ్యింది. ఆల్మోస్ట్ అయిపోయిందన్నయ్య.

చిన్న చిన్న పనులు ఉన్నాయి. చిన్న అన్నయిని  తీసుకెళ్లమంటే బెట్టు చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇస్తుంది.

దానికి వినయ్ అమ్మో నా వల్ల కాదు. ఆడవాళ్లు షాపింగ్ అంటే ఎంత కష్టమో తెలుసా అన్నయ్య.  చున్ని మ్యాచింగ్ కోసం కూడా ఎన్ని షాపులు తిప్పుతారో.

కలర్ కూడా కొంచెం తేడా రాకూడదు.  డిజైన్ లో చిన్న మార్పు రాకూడదు.   మనం ఎంత కాంప్రమైజ్ అయిపోతాము.

వీళ్ళు చిన్న దాంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఈ లేడీస్ ని దృష్టిలో పెట్టుకొని ఆ డిజైనర్స్ ఎన్ని డిజైన్స్ అని చేయగలుగుతారు.  నాకైతే తలపోటు వచ్చేస్తుంది.

నాకైతే ఒక డౌట్ అన్నయ్య అంటాడు. ఏంట్రా అంటే.. ఈ లేడీస్ అందరూ ఉన్న బట్టలతో అడ్జస్ట్ అయ్యి షాపింగ్ మానేస్తే...

మొత్తం షాపింగ్ మాల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయేమో. డిజైనర్స్ కి అందరికీ వర్క్ లేకుండా అయిపోతుందేమో కదా అనగానే...

లేడీస్ అందరూ ఒక్కసారి హేయ్.. అంటారు.  చూసావా అన్నయ్య నేను ఒక్క మాటంటేనే ఎలా పడిపోతున్నారో.. ఒక్కసారి వీళ్ళ షెల్ఫ్ లన్ని ఓపెన్ చేసి చూడాలి.

నాకు తెలిసి కట్టనివే చాలా ఉంటాయి అంతేనా నివి. ఇప్పుడు నీకు అవన్నీ అవసరమా అని లలితగారు కోప్పడతారు.

ఇప్పుడు నేను ఏమన్నాను అమ్మ... నేనైతే తీసుకువెళ్లను. నావల్ల కాదు అని చేతులు ఎత్తేస్తాడు.  బావా నువ్వు తీసుకువెళ్లవా అని అడిగితే..

నాకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది నివి అని ఎస్కేప్ అవ్వడానికి చూస్తాడు.  మరి ఇప్పుడు ఎలా అని విక్రమ్ వైపు చూస్తుంది.

నివి చూపులు అర్థం అయ్యి నేను ఎవరో ఒకరిని సెట్ చేస్తాను అని చెబుతాడు. ఎవరన్నయ్య బకరా అనగానే..  ఎవరో ఒక్కడిలే అని మెసేజ్ చేస్తూ ఉంటాడు.

ఆ మెసేజ్ వెళ్లిన  పది నిమిషాలకి హాయ్ అన్న వాయిస్ వినపడుతుంది.  ఎవరా అని చూస్తే అక్కడ రాజ్ ఉంటాడు.

భరత్, వినయ్ ఒకరి ముఖాల్లు ఒకరు చూసుకుని బకరా వీడేనా ఇప్పుడు అనుకుంటారు. రాజ్ విక్రమ్ దగ్గరకు వచ్చి ఏంట్రా అర్జెంటు పని ఉంది రమ్మని మెసేజ్ చేసావు అని అడుగుతాడు.  కానీ చూపులు మొత్తం నివి పైన పెడతాడు.

నువ్వు ఫ్రీ గానే ఉన్నావా అంటే.. అబ్బో లేదు బావ.  చాలా హెవీ వర్క్ ఉంది అని చెబుతాడు.  అవునా...  నువ్వు ఖాళీగా ఉంటే నివికి షాపింగ్ పని ఉందంట.

నిన్ను తోడిచ్చి పంపిద్దామని మెసేజ్ చేశాను.  సరేలే ఇంకో అరేంజ్మెంట్ ఏదైనా చేస్తాను అని అంటాడు.  విక్రమ్ కౌంట్ చేస్తూ ఉంటాడు. 

వన్, టూ, అని ఈ లోపు రాజ్... బావ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? నివి కన్నా ఏది ఎక్కువ కాదు. మన ఇంటి అమ్మాయిని ఎవరితో పడితేవాళ్లతో ఎలా పంపిస్తాము.

నివి కోసం పనులన్నీ పక్కన పెట్టుకొని నేను తీసుకువెళ్తాను కదా అని ఆవేశంగా అంటాడు.  విక్రమ్ వస్తున్న నవ్విన ఆపుకుంటూ ఉంటాడు.


లలిత మాధవి కొడుకులు వైపు తిరిగి చూడండి అన్నట్టుగా చూస్తారు.  వినయ్ కి, భరత్ కి ఎక్కడో కొడుతూ ఉంటుంది.

వీడేంటి ఇంత ఆవేశపడుతున్నాడు. ఏదో తేడాగా ఉంది అనుకుంటూ... నివి మాత్రం చాలా థాంక్స్ రాజ్ అంటుంది..

అయ్యో నివి మనలో మనకు థాంక్స్ ఎందుకు.  ఎప్పుడు బయలుదేరుదాము. ఫైవ్ మినిట్స్...  ఫ్రెష్ అయ్యి వస్తాను అని గబగబా రూంలోనికి వెళుతుంది.

రాజ్ మాత్రం తెగ మెలికలు తిరుగుతూ ఉంటాడు. ఎవరు చూపులో తనకి తగులుతున్నట్టుగా అనిపించి తల పైకి ఎత్తి చూస్తాడు..

అక్కడ భరత్, వినయ్ తననే సీరియస్గా చూస్తూ ఉంటే...  ఏంట్రా మీరిద్దరూ అలా చూస్తున్నారు.  చూపులతోనే నన్ను భస్మం చేస్తారా ఏంటి.

నిన్ను చూస్తుంటే మాకు ఏదో డౌట్ కొడుతుంది. అది ఏమిటా అని చూస్తున్నాము అంతే అంటారు. ఏ డౌటు...  డౌటు లేదు.  ఏమీ లేదు.

మీ ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి.  ఆఫీస్ కి వెళ్ళారా...  వర్క్ ఏదో ఉంది అన్నారుగా పొండి.ఇంట్లో ఆడపిల్లల్ని వదిలేసి ఆఫీస్ అని కంగారు పడుతున్నారు గా వెళ్ళండి..  వెళ్ళండి అని కసురుకున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు.

రాజ్ మాటలకే లలిత గారు పొంగిపోయి.. మా బాబే... ఆడపిల్ల విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నావు. నువ్వు అమెరికాలో ఉంటున్న సరే...  విక్రమ్ లాగానే ఆలోచిస్తున్నావు.

ఎంతైనా మీరందరూ మంచి ఫ్రెండ్స్ కదా అంటే... మన అనుకున్న వాళ్లు విషయంలో ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి కదా అని లలిత గారికి కూడా సోప్ వేస్తూ  ఉంటాడు.

విక్రమ్ మాత్రం అబ్బో వీడి దగ్గర చాలా కళలే ఉన్నాయే...
భరత్, వినయ్ మెల్లిగా విక్రమ్ పక్కకు చేరి...  బావ వీడేంటి తెగ బిల్డప్ ఇస్తున్నాడు.

అత్తయ్య దగ్గర కూడా మార్కులు కొట్టేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. ఏంటి కథ అని భరత్ అడుగుతాడు.

ఆ మాటకి నవ్వుతూ ఏమీ లేదు వాడు నివికి లైన్ వేస్తున్నాడు అని కూల్ గా చెబుతాడు.  నీకు ఈ విషయం ముందే తెలుసా...

మన శ్రీ ఎంగేజ్మెంట్ అప్పటినుంచి ట్రైల్స్ లో ఉన్నాడు.  కానీ మన నివికి అది అర్థం కాలేదు అంతే అంటాడు.

అమ్మ ని ఎంత పని చేస్తున్నాడో...  వీడు నివిని లైన్లో పెట్టడానికి అని.. అమ్మతో మనల్ని తిట్టిస్తున్నాడా అని వినయ్ కోపంగా చూస్తాడు.

వీళ్ళ ముగ్గురు గుసగుసలు అర్థం కాక ఏంటి అన్నట్టు కళ్లు ఎగరేస్తాడు.  అబ్బే ఏమీ లేదు. నిన్ను ఏమని పిలవాలా అని ఆలోచిస్తున్నానని వినయ్ అంటాడు.

కొత్తగా పిలవడానికి ఏముంది..  ఎప్పుడు పిలిచినట్టే రాజ్ అను.  రాజ్ అంటే చాలా...  ఇంకేమైనా తోకలు ఆడ్ చేయాలా అంటే.. ప్రస్తుతానికైతే చాల్లే.

వీళ్ళు పిలుపులు మాటలు ఏంటి చాలా తేడాగా ఉన్నాయి అనుకొని నివి కోసం చూస్తూ ఉంటాడు. నివి రెడీ అయి వచ్చి వెళదామా అని అడుగుతుంది..  అలా చూస్తూ ఉండిపోతాడు.

రాజ్ బాబు అక్కడ మీ బావలు నిన్నే చూస్తున్నారు జాగ్రత్త ...???

కథ కొనసాగుతుంది....
[+] 14 users Like SivaSai's post
Like Reply
Super update
Like Reply
Sentiments ni.. emotions ni.. chala baaga kallaki kattinattu raastunnaru
Great job Siva garu
Like Reply
Nak Vikram character ardam kaledh .dhanunjay avani ni kalapali ante vikram ki pedha vishayam kadh bcz edo okarakam ga avani nammela nijaalani chupincha galadu for example Bhargavi jail ki vellina roju vikram intlo thanu aavesham ga matlaadi thanu avani ni torcher chesa and dhanunjay ki emi telikundaa manage chesa ani or oka dialogue nak inka gurthu ne kuuthuru nv cheppina nammadu ala brain wash chesa thanani ani chpthundi idi antha record aindi aa video tanaki chupinchi avani ni namminchochu ledha inka vere ways kuda unnay kani vikram kanisam try cheyatldh kalapalani okay ila anukundham avani thana antha thane realize nammali nen involve kani ani vikram anukunnadu kavochu bt thana antha thane ela realize avtadi edo oka initiate kani inkedina jaraganidi .avani father tho kalavodhu anukuntunnaa
Like Reply
Part - 81


నివి ని చూస్తూ ఉన్న రాజ్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. తను ప్రపంచం మొత్తం స్తంభించిపోయిందా..  మేమిద్దరమే ఇక్కడ ఉన్నాము అన్న ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

ఎంతసేపు అయినా రాజ్ లో  కదలికఉండదు.  నివి రాజ్ని ఒకసారి చూసి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది.

షాపింగ్ అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో అన్నీ చెబుతూ ఉంటుంది.  అయినా రాజ్ లో ఎటువంటి స్పందన ఉండదు.

ఏంటి రాజ్ ఏమి పిలవడం లేదు అని ఒకసారి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ అది అర్థం చేసుకుని దగ్గరికెళ్ళి రాజ్ వీపు మీద ఒకటి చరుస్తాడు.

ఏమైంది అంటూ చుట్టూ చూసి.. ఎందుకు కొట్టావు బావ అంటే... ఎందుకు కొట్టానో నీకు అర్థం కాలేదా.. ఏం చూస్తున్నావ్ నువ్వు ఇక్కడ అంటాడు.

అప్పుడు తేరుకొని అందరూ నన్నే చూస్తున్నారా అనుకుని...  అంటే ఇంటీరియర్ బాగుందని చూస్తున్నాను బావ.

ఓ...  ఇదే కదా నువ్వు మొదటిసారి వచ్చింది.  ఎవరికి చెప్తున్నావు. వినయ్,  భరత్ పక్కకు వచ్చి షాపింగ్ కి తీసుకు వెళ్తానని మంచి ఊపులో ఉన్నట్టున్నావ్.

  మీకేంటి ఇబ్బంది అని అడుగుతాడు.  మాకు ఏమి ఇబ్బంది లేదు.  వచ్చేటప్పటికి ఎలా ఉంటావో..  ఏమిటో.. ఒక పిక్ తీసుకుంటాము.

మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపించడం లేదా..  లేదు మేము చాలా తక్కువ చేస్తున్నాము. షాపింగ్ అంటే ఏదో అనుకుని పరిగెడుతున్నావు కదా..  అందుకే పిక్ తీసుకునేది.

షాపింగ్ అంటే ఏముంది..  మాల్ కి వెళ్తాం.  తనకు నచ్చిన సారీస్ తీసుకుంటది. దానిమీద మ్యాచింగ్ యాక్సెసరీస్ తీసుకుంటుంది.  అంతే కదా...

ఓహో.. లేడీస్ షాపింగ్ అంటే అంత సింపుల్ అనుకుంటున్నావా..  ఇప్పుడు దాకా ఎవరిని తీసుకొని వెళ్ళలేదా.

లైక్ ఆంటీని కూడా అంటే..  అబ్బే మా అమ్మ మాతో రాదులే షాపింగ్ కి.  అందుకే నీకు అర్థం కావట్లేదు.  వెళ్ళు...  వెళ్ళు...  వెళితే గాని నీకు అర్థం కాదు.ఎంజాయ్ యువర్ షాపింగ్ ట్రిప్ అని బుగ్గ మీద తడతారు.

ఏమిటి వీళ్ళు ఇలా భయపెడుతున్నారు అని ఒక్క నిమిషం భయపడిన...  నివి వైపు చూసి నా బంగారానికి అంత సీన్ లేదులే. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టదు అని తనకు అనే ధైర్యం చెప్పుకుంటాడు.

విక్రమ్ ఇంకా బయలుదేరండి.  లేట్ అవుతుందని ఇద్దరిని పంపిస్తూ... నివి జాగ్రత్త అని చెబుతాడు. నేనున్నాను కదా బావ. డోంట్ వర్రీ అని చెప్పి విజిలెసుకుంటూ వెళతాడు.

వెళుతున్న రాజ్ ని చూసి నవ్వుకుంటాడు. వినయ్ భరత్ మాత్రం చాలా జాలిగా చూస్తూ ఉంటారు. ఏంట్రా మీ ఇద్దరు చూపులు...

పాపం వీడికి అర్థం కావట్లేదు.  నివి తో షాపింగ్ అంటే ఏదో మంచినీళ్లు తాగినట్టు అనుకుంటున్నాడు.  అది చూపించే చుక్కలకి ఏమైపోతాడో...

అలవాటు పడిని అంటే..  అంతేనంటావా... అంతే కదా... పెళ్లికి ముందు మంచి ఇంట్రెస్ట్ మీద ఉంటారు. ఆ మోజులో వాళ్ళు ఎలా అడిగినా షాపింగ్ కి ఫుల్ గా తిప్పేస్తారు.

చచ్చినట్టు పెళ్లయిన తర్వాత కూడా అలాగే తిప్పకపోతే చుక్కలు చూపిస్తారు. కాబట్టి వాడికి తెలియకుండా వాడే బెండ్ అయిపోతున్నాడు అని నవ్వుతాడు.

వీళ్ళ నవ్వుల మధ్యనుండగానే...  శ్రీ ఫోన్ చేస్తాడు. మధ్యలో వీడు గోల ఏంటి అని.. లిఫ్ట్ చేసి చెప్పరా.. ఏం చేస్తున్నారు రా..

ఇక్కడ పనులు ఉంటే మీరు తాతీయగా కూర్చున్నారా.. రాజ్ కూడా కనపడటం లేదు.  ఏమైపోయాడు.  అయ్యో నీకు తెలియదా...

రాజ్ నివిని  తీసుకొని షాపింగ్ కి వెళ్ళాడు అని చెబుతాడు. ఏంటి అప్పుడే వీడు ఈ పనులు కూడా మొదలుపెట్టాడా... నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అని బుసలు కొడుతూఉంటాడు.

ఎందుకురా అంత కోపం అంటే..  నా పెళ్లి పనులు ఆపేసి నివిని షాపింగ్ తీసుకెళ్ళాడు.  కోపం రాదా... ఒరేయ్ నువ్వు నేహా ని షాపింగ్ కి తీసుకెళ్తే మేము ఏమైనా అంటామా..

అదే ఇది ఒకటే అలా అవుతుంది. అయినా వాడికి తెలియదా  నివి తో షాపింగ్ అంటే ఎలా ఉంటుందో.. ఇంకా వాడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా..

ఈ రోజు చేస్తాడులే అంటారు. మంచి హుషారుగా వెళ్లినట్టు ఉన్నాడు అంటే... బాగా....

పాపం బిడ్డ. విక్రమ్ ఫోను స్పీకర్లో పెట్టే మాట్లాడుతూ ఉంటాడు.  వినయ్ కూడా మేము ఎన్ని రకాలుగా హింట్ ఇచ్చిన ఎక్కడ ఆగడం లేదు.

అవునులే... ఆ వేడిలో ఉన్నప్పుడు అసలు ఏమీ అర్థం కాదులే. అయినా బావ నా ఎంగేజ్మెంట్ రోజున ఏమన్నాడు...

వచ్చే అమ్మాయిని తన కంట్రోల్లో పెట్టుకుంటానని ఎన్ని ప్రగల్బాలు పలికాడు. అసలు ప్రపోజ్ చేయకముందే బెండ్ అయిపోయాడు.

వాడు బెండయ్యాడో,  బెండు తీస్తాడో ఎవరికి తెలుసురా అని విక్రమ్ అంటాడు.  అంత లేదులే బావ.  చూస్తూ ఉండు..

సాయంత్రం వచ్చేటప్పటికిఎలా ఉంటాడో..  రాగానే మాత్రం ఒక పిక్ తీసి, నాకు వీడియో కాల్ చేయండి.. చూడాల్సిందే అంటాడు.

ఎందుకురా నీకు అంత ఉత్సాహం అంటే..  అది అంతే బావ. అవని నీ తీసుకు వస్తున్నావా అని అడుగుతాడు. నేను ఆఫీస్ కి వెళుతూ దింపేసి వెళతాను. సరే అని ఫోన్ పెట్టేస్తాడు.

అవిని నీ పిలిచి రెడీ అవ్వు.  నిన్ను శ్రీ వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేయాలి. ఆంటీకి ఏదో పని ఉందంట అని చెబుతాడు. సరే అని ఇందిరాగారికి,  లలిత గారరికి  చెప్పి విక్రమ్ తో కలిసి బయలుదేరి వెళుతుంది.

రాజ్ మాత్రం మంచి హుషారుగా తీసుకు వెళుతూ ఉంటాడు. ఎక్కడికి వెళదాం నివి అంటే ఫస్ట్... బంజారాహిల్స్  వెళ్ళనివ్వండి.

అబ్బో నా బంగారానికి మర్యాదలు ఎక్కువే తెలిసే అనుకుని మురిసిపోతూ ఉంటాడు. అక్కడ ఒక ఫేమస్ మాల్ కి తీసుకువెళ్లి సారీస్ చూస్తూ ఉంటుంది.

ఎన్ని చూసినా ఏదీ నచ్చదు.  ఏమైంది నివి...ఏమీ నచ్చడం లేదు.  కలెక్షన్ బానే ఉంది కదా అంటే.. ఇక్కడ ఉన్న కలర్స్ నా దగ్గర చాలా ఉన్నాయి అని చెబుతుంది.

ఒక సారి తీసి నీకు చాలా బాగుంటుంది అంటే.. ఆల్రెడీ కలర్ ఉంది అంటుంది.  ఇంకొకటి తీస్తే ఇది లైట్ అయింది అని చెబుతోంది. ఇంకొక సారి తీస్తే ఇందులో ఉన్న కలరు నాకున్న చీరల్లో మిక్స్ అయింది అని చెబుతుంది.

ఎన్ని చూపించిన ప్రతి దానికి ఏదో ఒక రీసన్ చెపుతూ ఉంటే.. రాజ్ కి అప్పటికే నీరసం వచ్చేస్తుంది. వచ్చి రెండు గంటలు అయింది.

నువ్వు ఒక్క చీర కూడా సెలెక్ట్ చేయలేదు అంటే... అసలు డిజైనర్స్ కి డిజైన్ చేయడమే రావడం లేదండి.  అన్ని రెగ్యులర్ కలర్స్ తో డిజైన్ చేస్తే ఎలాగా అని అడుగుతుంది.

ఆ మాటకి కన్ఫ్యూజ్ అవుతూ ఎక్కడ డిజైన్ చేశారు. అయ్యో ఈ సారి లో ఉన్న ఈ షేడ్ తో నా దగ్గర టాప్ ఉంది అని చెబుతుంది.

టాప్ కి చీర కు సంబంధం ఏముంది అని అర్థం కాకుండా అడిగితే... టాప్స్ వేసుకున్న చీర కట్టుకున్న నేనే కదా మరి. అలాగా వాడిని కలర్ ని ఎలా వాడుతానండి అని అడుగుతుంది.

అంతే ఆ మాటకి రాజ్ కి ఫ్యూస్లు ఎగిరిపోతాయి.. బొమ్మ తిరిగి సినిమా కనపడుతుంది.  వచ్చే ముందు వినయ్, భరత్ తను వంక ఎందుకు అంత జాలిగా చూసారో ఇప్పుడు అర్థమవుతుంది.

పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిప్పి తిప్పి ఒక చీర సెలెక్ట్ చేస్తుంది.  అలాగే ఇంకొక డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తుంది కానీ దాని మీద చున్ని నచ్చలేదు అంటుంది. ఇప్పుడు చున్నీ కోసం ఎక్కడిక తిప్పుతుందో అని వణికిచస్తాడు.

రాజ్ ముఖం చూసి అయ్యో రాజ్ గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నట్టున్నాను. సారీ అండి.. మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు వెళ్లిపోండి.

మిగిలిన షాపింగ్ నేను కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను అంటుంది.  ఆ మాటకి... అయ్యో నివి అలా అంటావేంటి.. మధ్యలో నేను ఎలా వదిలేస్తాను.

నీతో కలిసి షాపింగ్ చేస్తూ ఉంటే నాకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది అని..  కొంచెం ఏదైనా తాగి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. సరే అని చెప్పగానే జ్యూస్ సెంటర్ దగ్గర ఆపుతాడు.

జ్యూస్ తాగి ఆ చున్ని మ్యాచింగ్ కూడా తీసుకున్నాక ఇంకా అయిపోయిందా అని అడుగుతాడు.  ఎక్కడ అయిపోయింది...

ఈ సారీ కి మ్యాచ్ అయ్యే విధంగా బ్యాంగిల్స్ తీసుకోవాలి అంటుంది. సరే ఎక్కడ షాప్ అంటే.. ఇక్కడ కాదు బేగంబజార్ అంటుంది.

అంతే కారు సడన్ బ్రేక్ వేసి ఏంటి గాజుల కోసం బేగంబజార్ వెళతావా..  అవేవో ఇక్కడే తీసేసుకోవచ్చు కదా...

అయ్యో రాజ్  గారు మీకు అసలు ఏమీ తెలియడం లేదు. అక్కడ మ్యాచింగ్ చాలా బాగుంటాయి.  అలాగే కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది.

ఇంత టైం వేస్ట్ అవుతుంటే కాస్ట్ గురించి ఆలోచిస్తుందేంటి..  సరదాగా షాపింగ్ అయిన వెంటనే ఎక్కడికైనా సరదాగా తీసుకువెళదాం అనుకుంటే..

మొత్తం అంతా నన్ను ఈ షాపింగ్ మాల్స్ లోనే కూర్చోబెడుతుంది అని తల పట్టుకుంటాడు. ఏమైందండీ తలనొప్పి వస్తుందా... లేదండి..  తలనొప్పి కాదు...  మీకు ఎంత ఓపిక ఇచ్చాడు అని భగవంతుని తలుచుకుంటున్నాను.

మీరు మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు అండి..  మీకు ఇలాగ అర్థమైందా అండి.. పదండి అని చెప్పి కార్  స్టార్ట్ చేస్తాడు..

బేగంబజార్ దగ్గరికి వెళ్ళాక కార్ ఎక్కడ పార్క్ చేయాలో అర్థం కాక చుట్టూ చూస్తూ ఉంటాడు.  ఏమైందండీ అంటే.. కార్ ఎక్కడ పెట్టాలో చూస్తున్నాను.

మీ షాపింగ్ ఇలా ఉంది అనుకుంటే... బైక్ వేసుకోవచ్చే వాళ్ళము. అమ్మో ఎండలో టాన్ అయిపోము అంటుంది. ఒక్కసారి నివి వైపు చూసి ఉఫ్..  అనుకుని రేపు నా ఫ్యూచర్ ఏమిటి అనుకుంటాడు.

తనికి ఎక్కడి నుంచో  మే.. మే..  సౌండ్ వినపడుతూ ఉంటుంది. నో అని గట్టిగా అరుస్తాడు. ఏమైందండీ ఎందుకలా అరిచారు.

అబ్బే ఏమీ లేదు జస్ట్ కార్ పార్క్ చేయడం గురించి ఆలోచిస్తున్నాను అంతే అని కవర్ చేసుకొని.. అక్కడ కొంచెం ప్లేస్ కనిపిస్తే కార్ పార్కింగ్ చేసే వెళదామా అని తీసుకెళ్తాడు.

అయ్యో బిడ్డ... ఎంజాయ్ చేద్దాం అని వచ్చి  షాపింగ్ లో ఇరుక్కుపోయాడు ???
[+] 11 users Like SivaSai's post
Like Reply
Part - 82


కార్ పార్క్ చేసి రాజ్, నివి గాజులు కొనడానికి  బేగం బజార్లో షాప్స్ అన్ని తిరుగుతూ ఉంటారు. ఒక నాలుగు గంటలు తిప్పి రెండు గాజులు సెట్స్ తీసుకొని ఇంకా వెళదామా అని అడుగుతుంది.

అప్పుడే అయిపోయిందా అని చాలా ఆనందంగా అడుగుతాడు. మీ గురించి అని తొందరగా అవ్వగొట్టేసాను లేకపోతే నా...

ఏంటి ఇది తొందరగా అవడంమా అని ఆశ్చర్యంగా చూస్తాడు.  ఏమైందండీ అలా చూస్తున్నారు.ఇంత తొందరగా ఎలా షాపింగ్ చేయగలిగావా అని ఆలోచిస్తున్నాను అంతే అంటాడు.

చెప్పాను కదా... మీ గురించి తొందరగా వచ్చేసాను. లేకపోతే టైం పట్టేది నాకు. మా అమ్మే... ఫ్యూచర్లో నా పరిస్థితి ఏమిటంటావ్  అనుకుంటాడు.

ఇప్పుడంటే తీసుకెళ్ళాను కానీ..పెళ్లి అయ్యాక ఇలా చేస్తే తాటతీసేయను. నీకు అంత సీను ఉందా అని ఇన్నర్ వాయిస్ వినపడుతుంది.

ఈ విషయం బయటికి వచ్చింది  అంటే..  విక్రమ్, శ్రీ నన్ను ఒక రేంజ్ లో ఆడుకుంటారు.  వాళ్ళకి తెలియకుండా పైకి గంభీరంగా ఉండాలి లేకపోతే అటు ఫ్రెండ్స్ దగ్గర పరువు పోయే ఇటు ప్రేమించిన అమ్మాయి కి లోకవాయే అన్నట్టు ఉంటుంది నా పని అనుకుంటూ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు.

ఇద్దరూ ఇంటికి వచ్చేటప్పటికి నైట్ చాలా టైం అయిపోతుంది. కార్ పార్క్ చేసిన తర్వాత... నివి కారు దిగుతూ.. చాలా థాంక్స్ రాజ్ గారు.  ఈరోజు మీ  టైమంతా నాకోసమే స్పెండ్ చేశారు.

ఖచ్చితంగా మనం ఫ్రీ అయిన తర్వాత మీకు ఒక మంచి ట్రీట్ ఇస్తాను అని అంటుంది. ట్రీట్ అన్న మాట వినగానే అప్పుడు వరకు ఉన్న నీరసమంత ఎగిరిపోయి హుషారు వస్తుంది.

సూర్ నివి తప్పకుండా అని హుషారుగా విజిల్ వేసుకుంటూ కారు దిగుతాడు. ఇద్దరు లోపలికి వచ్చేటప్పటికి విక్రమ్,  శ్రీ, వినయ్, భరత్ నలుగురు హాల్లోనే ఉంటారు.

వాళ్ళని చూసి ఏంటన్నయ్య మీరు ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. లేదమ్మా నువ్వు  ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తున్నాము.

రాజ్ గారికి చాలా ఓపిక అన్నయ్య. ఎక్కడ విసుక్కోకుండా ఎంత ఓపిక తిప్పారు అనుకుంటున్నావు.  అదే వినయ్ అన్నయ్య గాని, బావని గాని తీసుకువెళ్లమంటే నన్ను అసలు  షాపింగ్ కూడా చేసుకొనీఇచ్చేవారు కాదు.

రాజ్ గారికి చాలా ఓపిక. నా షాపింగ్ అంత అయ్యేవరకు వెయిట్ చేశారు. ఎక్కడ కూడ చిన్న మాట కూడా విసుక్కోలేదు.   థాంక్యూ రాజ్ అని చెప్పి రూమ్ లోకి వెళ్లిపోతుంది.

నివి వెళ్లే దాకా అందరూ కామ్ గా ఉండి నివి వెళ్ళాక రాజ్ వైపు తిరుగుతారు. అప్పుడు దాకా నవ్వుతూ ఉన్న రాజ్ ఒక్కసారిగా సోఫాలో కులబడిపోయి కాళ్లు చేతులు వదిలేస్తాడు.

శ్రీ ఒక్క ఉదిటిన రాజ్ మీద కెళ్ళి ఏరా నా పెళ్లి పనులు అంటే..  నేను చేయలేను.  ఎవరు తిరుగుతారు...  అది... ఇది... అనుకుంటు గొంతులు వేశావు.

ఇక్కడ మాత్రం నివి షాపింగ్ కి రోజంతా టైం ఇచ్చావు.  ఇంతకీ షాపింగ్ లో ఆ మహాతల్లి కొనిఉంటే ఒకటి లేక రెండు డ్రెస్సులు ఉంటాయి అంతే కదా అంటాడు.


ఆ విషయం నీకు ఎలా తెలుసురా అని ఆశ్చర్యంగా అడిగితే..  మాకందరికి అది ఎప్పుడో ఎక్స్పీరియన్స్. నువ్వు కొత్త కదా.. నీకు లేటుగా అయింది అంతే అని వెటకారంగా అంటాడు.

ఈ విషయంలో ముందే చెప్పాలి కదా... నువ్వు వెళ్తున్న విషయం నాకు ఏమైనా చెప్పావ.. చెప్పడానికి...

అంతే కోపం గా వినయ్ భరత్ వైపు చూస్తాడు.  నీకు మేము ముందే హింట్ ఇచ్చాము.  నువ్వే పట్టించుకోలేదు. అప్పటికి పిక్ తీసుకుంటాము.  షాపింగ్ నుంచి వచ్చేటప్పటికి ఎలా ఉంటావో...

ఆంటీతో ఎప్పుడైనా వెళ్ళావా అని చాలా రకాలుగా అడిగాము కానీ మేము ఇచ్చిన హింట్స్ పట్టించుకోకుండా నువ్వు క్లౌడ్స్ మధ్యనే ఎగిరి మమ్మల్ని అంటే మేమేం చేస్తాము అని ఇద్దరు భుజాలు ఎగురవేస్తారు.

ఎవరైనా వీటిని హింట్స్ అంటరా... మేమంతే...  మేమంతే...  అంటారు.   నోరు మూయండిరా...  షాపింగ్ కి వెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పాలి.

అంతేగాని ఇలాగ చెబుతారా...   అందరి ముందు ఎలా చెబుతాము. పైగా నివి ముందు.  నువ్వే అర్థం చేసుకోవాలి బావా అని వినయ్ రాగం తీస్తాడు.

శ్రీ నువ్వు కూడా నా.... నా చెల్లి షాపింగ్ అవ్వడం ముఖ్యం రా నాకు. మిత్ర ద్రోహి అందుకని  నన్ను బుక్ చేసేసావా. అదేదో నువ్వే వెళ్లాల్సింది కదా..

ఏరా...  నీకు నేను మంచి టైం ఇచ్చాను.  మీ ఇద్దరి మాత్రమే ఉండేటట్టుగా అరేంజ్ చేశాను.  నీ తెలివితేటలతో నివితో షాపింగ్ కంప్లీట్ చేయించడం మానేసి...

నివి వెనకాల బ్యాగులు పుచ్చుకొని తిరిగితే నేనేం చేస్తాను. అయినా శ్రీ ఎంగేజ్మెంట్లో ఏదో అన్నట్టున్నావు  అని శ్రీ వైపు తిరిగి కళ్ళు ఎగరేస్తాడు.

అవున్రా...  నిజమే..  ఏంట్రా అన్నావు...  లైఫ్ పార్ట్నర్ కంట్రోల్ అని...  ఇంకా ఏదేదో అన్నావు ఒకసారి మళ్ళీ చెప్పరా...

ఇప్పుడు అవన్నీ అవసరమా.  నా కాళ్ళు లాగుతున్నాయి..  చిందులు తొక్కుతూ గెస్ట్ రూమ్ కి వెళ్ళిపోతాడు.

వెళుతున్న రాజ్ ను చూసి అందరూ నవ్వుకుంటారు. శ్రీ కూడా రాత్రికి అక్కడే ఉండిపోతాడు. రూమ్ లోకి వెళ్ళినా విక్రమ్ అవినికి డిస్టబెన్స్ అవ్వకుండా మెల్లగా పక్కనచేరి పడుకుంటాడు.

అయిపోయినయా మీ ఫ్రెండ్స్ తో చిట్ చాట్ అని అడుగుతుంది. నువ్వు ఇంకా పడుకోలేదా అంటే... అలవాటైపోయింది అండి.

మీ చెయ్యి తగిలకపోతే నిద్ర రావడం లేదు అని విక్రమ్ వైపు తిరిగే చుట్టూ చేతులు వేసిన కళ్ళు మూసుకుంటుంది.

నీకే కాదు బంగారం నాకు నిద్ర రావడం లేదు.  నీ ప్రెసెన్స్ లేకపోతే అని నుదుటిని ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు.

వీళ్ళందరూ ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే.. అక్కడ గాలి కూడా సరిగ్గా తగలకుండా... ఉక్కపుతకి తన పైట చెంగుతో విసురుకుంటూ.. గది మొత్తం అంటించిన అవని ఫోటోలు చూస్తూ రగిలిపోతూఉంటుంది.

భార్గవి గది మొత్తం అవిని ఫొటోలతో నిండిపోయి ఉంటుంది.  ఆ ఫోటోలు తీయడానికి కుదరకుండా సెట్ చేస్తారు.

వాటిని చింపడానికి రావు... పగలకొట్టడానికి రావు.  ఆ ఫొటోస్ చూస్తూ ఉంటే నిజంగా భార్గవికి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. 

అవని ప్రతి ఫోటోలోనూ నవ్వుతూ, లగ్జరీస్ లైఫ్ కనపడుతూ ఉంటుంది. అవని నవ్వు చూస్తూ ఉంటే కడుపులో రగిలిపోతూ ఉంటుంది.  కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి .

ఆ స్థానంలో నా కూతురు ఉండాలి.  శిల్పకి ఉన్న పిచ్చితో... ఆ రోజు చేసిన పిచ్చి పనితో ఉచలు లెక్కపెడుతుంది.

దానితోపాటు నన్ను ఇరికించింది. ఇక్కడ మేము ఏం చేస్తున్నా సరే ఆ విక్రమ్ కి ధనుంజయ్ కి ఇద్దరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది.

ఎవరి సహాయం తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదు అని పరిపరివిధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది.తనకి తెలియకుండానే ఒక డిప్రెషన్ మూడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది.

శిల్ప కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా నన్ను నేను సేవ్ చేసుకోవాలి.  ఇంత జరిగిన మోడల్ పిచ్చి మాత్రం వదలడం లేదు.

ఏ ఫీల్డ్ అయినా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ సాధిస్తామని విషయం మర్చిపోయి అడ్డదారులోనైన సరే వెళ్ళాలి అని ఇక్కడ దాకా వచ్చాను ఆలోచన వదిలేసి ఎలాగైనా మోడల్ అవ్వాలి అన్న పిచ్చ ఆలోచనలతోనే ఉంటుంది..

నాకు ఎవరి హెల్ప్ చేస్తారని ఆలోచిస్తూ ఉంటుంది.  ఒక్కటే దారి నేను మారినట్టుగా నాన్న ముందు యాక్ట్ చేయాలి. నాన్న నమ్మితే చాలు నేను బయటికి  వెళ్ళిపోతాను.

తర్వాత కొన్ని రోజులు నార్మల్ గా ఉండి అప్పుడు మళ్ళీ నా ప్రయత్నాలు నేను చెయ్యాలి. తర్వాత విక్రమ్ ని నా వైపు తిప్పుకోవాలి అని ఆలోచిస్తుంది.

ఈ ఐడియా బాగుంది. రేపే నాన్నకి ఒకసారి కబురు పంపించాలి.  ఉడుకులో చేతితో  విసురుకుంటూ ఇంటిదగ్గర ఉంటే తెలియలేదు గాని..

ఇంత ఉడుకులో చాలా కష్టం . నా వల్ల అసలు కావడం లేదు. ఈ దోమలు, ఉడుకుల మధ్యన ఉండటం చాలా కష్టం.

అవిని ఇంటి చాకిరి అంతా చేస్తూ... ముందురోజు  ఫుడ్డు తింటూ అసలు మినిమం ఫెసిలిటీస్ తో  ఎలా ఉండేది. ఏసీ కూడా ఉండేది కాదు కదా అని అని ఫస్ట్ టైం ఆలోచిస్తుంది.

వెంటనే మళ్ళీ తన మనస్తత్వంలోనికి వచ్చేసి  అది ఎలా పోతే నాకెందుకులే...  ముందు నేను బయటపడాలి. మోడల్ అవ్వాలి అంతే అనుకుని ధనుంజయ్ ని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉంటు..  కలత నిద్రపోతూ... ఉదయం టైం కి కష్టంగా లెగుస్తారు. ఎక్సర్సైజులు చేసేటప్పుడు కూతుర్ని చూసి.. నా కూతురు ఎలా అయిపోయింది అని భార్గవి బాధపడుతూ శిల్పని పిలుస్తుంది.

ఆ పిలుపు విని తల్లి వైపు చూస్తుంది. ఇలా రా శిల్పా అని బాధగా పిలుస్తుంది.  ఒక్క నిమిషం ఆలోచించి వెంటనే ఒక కన్నింగ్ ఐడియాతో వెళ్లి చెప్పు మామ్ ని కోపంగా అడుగుతుంది.

ఎందుకు శిల్ప నాపై ఇంత కోపంగా ఉన్నావు. చూడు ఎలా చిక్కిపోయావో అని తన తల్లి ప్రేమను అంతా చూపిస్తుంది.

స్టాప్ ఇట్ మామ్.  నీవల్ల కాదా ఇదంతా అని కోపంగా అడుగుతుంది. నేనేం చేశాను శిల్ప.  చేసిందంతా నువ్వు కాదా..

నీ వల్లే ఈరోజు మన ఇద్దరికీ ఇలాంటి పరిస్థితి వచ్చింది.  ఇంకా నీలో మార్పు రాలేదు కదా ఏడుస్తూ అడుగుతుంది.  ఎందుకు శిల్ప అంతల బాధపడుతున్నావు.

నా వల్ల నీకు ఏమి అన్యాయం జరిగింది. నిన్ను అపురూపంగా పెంచుకున్నాను.  అందలం ఎక్కించాను.  దీన్ని అందలం అంటారా మామ్.

శిల్ప అని బాధగా పిలుస్తుంది.  నిజమే కదా మామ్.  నన్ను,  అవని నీ ఒకేలాగా పెంచి ఉండి ఉంటే...ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు కదా...

అవని వాళ్ళ మమ్మీ నీ ఎందుకు చంపేసావు. దానివల్లే కదా డాడ్ నాతో కూడా మాట్లాడటం మానేశారు.  నీకు కాకుండా అవని వాళ్ళ మమ్మీకి పుట్టి ఉంటే అవని లాగా పెరిగేదాన్నేమో కదా...

ఆ మాటలు వినగానే భార్గవికి ఏం మాట్లాడాలో అర్థంకాక... కూతురు ప్రవర్తల్లో వచ్చిన మార్పు ని చూస్తూ ఉండిపోతుంది.

శిల్ప ప్లాన్ ఏమిటి...

కథ కొనసాగుతుంది...
[+] 13 users Like SivaSai's post
Like Reply
Nice update
Like Reply
Good update Sivagaru
Like Reply
Update bro
Sherlock holmes  cool2
Like Reply
Ivvala update laeda Siva bhayya??!!

Busy with work!!
Like Reply
రెగ్యులర్ అప్డేట్స్ కి అలవాటుపడ్డాం.. కదా... అందుకే చాలా సార్లు అప్డేట్ కోసం చెక్ చేశాం
[+] 1 user Likes kkkhot86's post
Like Reply
(07-02-2026, 10:54 PM)ash.enigma Wrote: Ivvala update laeda Siva bhayya??!!

Busy with work!!

Sorry For Delay Update

Update in 15 Minutes
[+] 1 user Likes SivaSai's post
Like Reply
Part - 83


శిల్ప అలా మాట్లాడుతూ ఉంటే భార్గవి బాధగా కూతురివైపు చూస్తూ నువ్వేం మాట్లాడుతున్నావో ఏమైనా అర్థమవుతుందా...

నేను నిజాలే మాట్లాడుతున్నాను.  అవి నిజాలు కాబట్టి నీకు నచ్చడం లేదు.  ఓకే అవని మామ్ మీద కోపంతో ఆవిడని ఏదో చేసావు అనుకోవచ్చు.

అవిని ఏం చేసింది.  మా ఇద్దరినీ  ఒకేలాగా ట్రీట్ చేసి ఉంటే.. నువ్వు వాళ్ళ మమ్మీకి హాని తలపెట్టిన..అది డాడీకి తెలిసేది కాదు కదా..

ఈరోజు చూడు నీ కూతురుగా పుట్టినందుకు నీలాగానే బ్యాడ్గా బిహేవ్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఒక అక్క ఉన్నా సరే ఆ రిలేషన్ ని ఎంజాయ్ చేయలేకపోయాను.

ఇదంతా నీ వల్లే కదా..  ఐ హేట్ యు మామ్.. ఐ హేట్ యు అనుకుంటు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెళుతున్న కూతురిని చూస్తూ నిశ్శబ్దంగా మారిపోతుంది.

అంతా శూన్యంగా కనిపిస్తుంది. తను, తన కూతురు ఇద్దరు గొప్పగా బతకాలి అని.. ప్రపంచానికి శిల్ప ఒక్కతే ధనుంజయ్ కూతురు.

ధనుంజయ్ ఎంపైర్ కి తనే యువరాణి అని నలుగురు అనుకోవాలి అని ఎంతో తాపత్రయపడింది. దాని కోసం ఎన్నో చేసింది. అవని నీ చాలా రకాలుగా హింసించింది.

రజిత మీద ఉన్న కోపాన్ని అంతా అవిని మీద చూపించింది. ఆఖరికి అవిని మెడలో తాళి లాగేసుకుంది. తన మేనల్లుడుతో అవిని జీవితాన్ని నాశనం చేయించడానికి కూడా వెనకడుగు వేయలేదు.

ఇన్ని నీచాలు పాపాలు చేసింది దేనికోసం. తన కూతురు గొప్పగా బతకాలి. భార్గవి మాత్రమే ధనుంజయ్ భార్య అని నలుగురు అనుకోవాలి అని.  కానీ ఈరోజు ఏమయింది అని అక్కడే నిలబడి పోతుంది.   

అక్కడే ఉన్న మరొక ఖైదీ కదిపే వరకు అలాగే నిలబడిపోతుంది. తర్వాత మెల్లిగా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది కానీ శిల్ప అన్న మాటలు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

భార్గవి మౌనాన్ని చూసి పక్కన ఉన్న ఖైదీ  కదుపుతుంది. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి చాలా సైలెంట్ గా ఉన్నావు. ఈరోజు మాత్రం నీలో బాధ కనిపిస్తుంది.

అది ఏమిటో షేర్ చేసుకో..  కొంచమైనా తగ్గుతుంది. షేర్ చేసుకోవాలా అన్నట్టుగా చూస్తుంది.  ఏమిటి అలా చూస్తున్నావు.

ఒక ఖైదీ తో ఏంటి షేర్ చేసుకునేది అని ఆలోచిస్తున్నావా..  నువ్వు కూడా ఒక హంతకురాలివే కదా..  పరవాలేదు చెప్పు అంటుంది.

హంతకురాలిన అని తనలో తానే అనుకుంటుంది. నీలో నువ్వే ఏదో గోనుక్కుంటున్నట్టు ఉన్నావు. నీ గురించి మాకు ఇక్కడ ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా..

ఆరోజు నువ్వు మాట్లాడింది అంతా కూడా టీవీలో వచ్చింది కదా.. మేమందరం ఇక్కడ న్యూస్ చూసేటప్పుడు చూసాము అని చెబుతుంది.

అప్పటిదాకా భార్గవికి అసలు ఐడియానే ఉండదు. ఆరోజు జరిగిందంతా టీవీలో వచ్చింది అని...  సెక్యూరిటీ ఆఫీసర్లకి లైవ్ ఇచ్చారు అనుకుంది కానీ...

అది అంత టీవీలో న్యూస్ వచ్చేలాగా ప్లాన్ చేశారు అని అర్థమయ్యేటప్పటికి ఇంకా బిగుసుకుపోతుంది.  ఇక తన జీవితం అంతా జైల్లోనే అని అర్థమయిపోతుంది.

పొరపాటున బయటికి వెళ్లిన జనం అందరూ కూడా తనని అదే దృష్టిలో చూస్తారు.  ఇన్ని రోజులు ధనుంజయ్ భార్యగా సొసైటీలో తనకంటూ ఒక హోదా ఉంది.

కానీ ఆ సొసైటీయే ఇప్పుడు తను చాలా అసహ్యంగా చీప్ గా చూస్తుంది  అని అర్థమవుతుంది.  ఇలా ప్లాన్ చేసిన విక్రమ్ మీద కోపం వస్తుంది.

ధనుంజయ్ మీద కూడా కోపం పెరుగుతుంది.. కానీ ఏమీ చేయలేకపోతోంది.  ఎంతసేపు మొదటి భార్య రజిత... రజిత..  అంటాడు కానీ....

తనతో కలిసి ఉన్నది గట్టిగా మూడు సంవత్సరాలు ఏమో..  మిగిలిన జీవితమంతా నాతోనే ఉన్నారు కదా.. నా ప్రేమ  అర్థం కాలేదా..

ఏ రోజైనా ఆయనకి లోటు చేశానా అని తనలో తాను గొనుక్కుంటూ పనిచేసుకుంటూ ఉంటుంది.   కూతురి ప్రవర్తన భర్త నిరాధారణ భార్గవిని బాగా కృంగదీస్తాయి.

అవని జీవితంతో ఆడుకున్న దానికి మాత్రం రియులైజ్ అవ్వదు.

శిల్పా పైకి బాధగా ఉన్న లోపల మాత్రం నవ్వుకుంటూ అమ్మతో ఇలా మాట్లాడింది మొత్తం కచ్చితంగా ఇటు నాన్నకు గాని..  అటు విక్రమ్ గాని తెలుస్తుంది.

వాళ్లు నన్ను పూర్తిగా నమ్ముతారు.  నేను మారాను అనుకుంటారు.  ఇంకొక రెండు మూడు సార్లు అమ్మతో ఇలా ప్రవర్తించి..

అప్పుడు నాన్నకు కబురు పంపిస్తాను. నన్ను అర్థం చేసుకుని ఇంటికి తీసుకు వెళ్ళిపోతారు.  అప్పుడు మళ్లీ నా పాత లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు అనుకుంటూ ఎంతో బాధగా కళ్ళు నీళ్లు రాకపోయినా తుడుచుకుంటూ పనిచేసుకుంటూ ఉంటుంది.

శిల్ప కి తెలియని విషయమేమిటంటే తను నటిస్తూ కార్చిన కన్నీళ్లే తర్వాత గిఫ్ట్ గా తీసుకుంటుంది అని...

బిందు ధనుంజయ్ సహాయంతో సునీల్ ని కలుస్తుంది. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటారని ధనుంజయ్ అక్కడ నుండి వెళ్లిపోతాడు.

జైల్లో చిక్కుపోయి ఉన్న భర్తను చూసి కన్నీళ్ళతో ఎలా ఉన్నారండి అని అడుగుతుంది.  చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నాను అని తలదించుకొని చెబుతాడు.

ఉదయ్ గురించి ఏమైనా తెలిసిందా అని ఆత్రంగా అడుగుతాడు.  ఏమీ తెలియలేదండి ఒకసారి విక్రమ్ ని కూడా కలిసి కనుక్కోవాలి.

మీరు చేసిన దానికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో అర్థం కావడం లేదు అండి అని భయంగా భర్త చేతులు పట్టుకొవడానికి చూస్తుంది.

కానీ ఇద్దరి మధ్య ఉన్న  గ్రిల్స్ ఆ అవకాశాన్ని ఇవ్వదు. దానితో బాధగా చూస్తూ మనం చేసిన పాపాలు వల్ల ఒకరికొకరు ఎదురుగా ఉన్న ఓదార్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము.

నాకు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిన పరవాలేదు. కోర్టులో నేను నిజమే చెబుతాను.  కుదిరితే అవినికి నా తరపున క్షమాపణలు చెప్పు.

మన స్వార్థం కోసం రజిత ప్రాణాలు పోతున్న కళ్ళు వదిలిపెట్టి చూశాను. అదే స్వార్థంతో నా కొడుకు చేతులో అవని జీవితం నాశనం అవ్వబోతుంటే  కూడా సంతోషపడ్డాను.

ఆ పాపమే శాపమై తగిలి ముగ్గురుము చేట్టుకొకళ్ళం పుట్టకోకళ్ళం అయినట్టు అయిపోయాము అని బాధపడతాడు.

బాధపడకండి అని చెబితే..  బాధపడకుండా ఎలా ఉంటాను బిందు. ఈ వయసులో అండగా నిలబడాల్సిన కొడుకు ఏమైపోయాడో తెలియదు.

భార్యని పరాయి వాళ్ళు చెంతన ఉంచాల్సి వచ్చింది ఇంతకంటే దౌర్భాగ్యం ఏమంటుంది అని బాధపడతాడు.
టైం అయిపోయింది అని కానిస్టేబుల్ చెప్పగానే ఇంకా వెళతానండి అని బయటికి వస్తుంది.

ధనుంజయ్ దగ్గరికి వెళ్లి అన్నయ్యగారు ఇంకొక చిన్న సహాయం చేస్తారా అని అడుగుతుంది. నావల్ల అయ్యేది అయితే చేస్తాను చెప్పు అని ఎటో చూస్తూ చెబుతాడు.

మీకు నా మొఖం చూడడం కూడా ఇష్టం లేదని అర్థమవుతుంది అని బాధగా అనుకొని..  ఒకసారి నన్ను విక్రమ్ దగ్గరికి తీసుకువెళ్తారా అని అడుగుతుంది.

ఎందుకు అని అనుమానంగా అడిగితే..  నా కొడుకు గురించి తెలుసుకోవడానికి. వాడు ఎక్కడున్నాడో తెలిస్తే నేను కూడా అక్కడే ఉండి పనిచేసుకుంటాను.

లేదు అంటే నా కొడుకుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెబుతుంది. ఆ మాటలకు ఒకసారి బిందువైపు చూస్తాడు.

బిందులో పశ్చాత్తాపం కనబడుతూ ఉంటుంది.  కానీ తను ఏమీ చెయ్యలేడు.  ఎందుకంటే విక్రమ్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే..

ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో అన్నది తనని మామగారు అని పిలవనప్పుడే అర్థమైంది. ఏంటన్నయ్య గారు ఏమి మాట్లాడకుండా చూస్తున్నారు.

నేను మారలేదు.  ఇంకా నటిస్తున్నాను అనుకుంటున్నారా అని బాధగా అడుగుతుంది. నువ్వు నటిస్తున్నావా లేదా అని నేను ఆలోచించడం లేదు.

విక్రమ్ ఇప్పుడు అప్పుడే నీ కొడుకుని నీకు చూపించడు. ఇది మాత్రం నిజం.  వెళ్లి అడిగి అవమానపాలు అవ్వడం తప్ప ఉపయోగం లేదు.

నిన్ను ఆ ఇంటి గేటు కూడా దాటనివ్వరు. సమయం వచ్చినప్పుడు నేనే తీసుకువెళతాను అని చెప్పి పదా అని కారు దగ్గరికి వస్తాడు. ధనుంజయ్ ని అనుసరిస్తూ బిందు కూడా వెళుతుంది.

రాజ్ మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉంటాడు. టైమెంతయింది అనుకుంటు మొబైల్ తీసి చూసి అదేంటి ఇంత టైం అయ్యేదాకా పడుకున్నాను అని గబగబా మంచం మీద నుంచి లేస్తాడు.

కాళ్లు ఒకటే నొప్పులు. ఒళ్లంతా పులుసు పోయి ఉంటుంది.  అబ్బా ఈ నొప్పులు ఏమిట్రా దేవుడా అనుకు..ని నిన్న షాపింగ్ ఎఫెక్ట్ అనుకుంటా..

అయినా ఈ ఆడవాళ్ళు ఇంత ఓపిగ్గా ఎలా షాపింగ్ చేస్తారు.  వీళ్ళకి అసలు నొప్పులు ఉండవా అనుకుంటూ మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు.

రాజ్ ని చూసిన లలిత గారు లేచావమ్మా కాఫీ తీసుకురానా అని చెప్పి వెళ్లి స్ట్రాంగ్ కాఫీ కలుపుకొని ఇచ్చి..  చాలా థాంక్స్ రాజ్.

నివి చెపుతుంది నువ్వు బాగా ఓపిగ్గా తిప్పావు. నీకు ఓపిక ఎక్కువ అని మెచ్చుకుంటుంది అని గొప్పగా చెబుతారు. ఆ మాటలు వింటూ ఒకసారి నివి వైపు చూస్తాడు.

అప్పుడే విరిసిన ఫ్రెష్ గులాబీ లాగా ఉంటుంది.  ఇంకా షాపింగ్ ఎక్కడ చేయాలో అన్నది అవినితో డిస్కస్ చేస్తూ ఉంటుంది.


ఈ లేడీస్ కి  ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది.  నిన్న ఇద్దరం కలిసే కదా తిరిగాము. నేను ఇంతలా అలసిపోయి పడుకుంటే...

ఈ మేడమ్ ఎప్పుడు లేచింది. మళ్ళీ షాపింగ్ డిస్కషన్ పెట్టింది. వీళ్ళకి నొప్పులు ఉంటావా..  ఉన్నా సరే షాపింగ్ పిచ్చలో వదిలేస్తారా అని ఆలోచిస్తూ వాళ్ళిద్దరు వైపే చూస్తూ ఉంటాడు. 

ఏమిటి రాజ్ ఆలోచిస్తున్నావు అని లలిత గారు కదిపితే.. ఆహా ఏమీ లేదు.  నిన్న ఇద్దరము కలిసే కదా తిరిగాము. నేను ఇంత టైడ్ అయిపోయిఉంటే...

నివి ఎలా ఫ్రెష్ గా ఉందా అని ఆలోచిస్తున్నాను అంతే అంటాడు. దానికి నివి నవ్వుతూ ఇందులో అంత ఆలోచించాల్సిందే ఏముంది.

నాకు షాపింగ్ ఇష్టం.  పనులు ఉన్నాయి కాబట్టి ఎలా ఉన్నా సరే నేను అడ్జస్ట్ అయిపోతాను అని చెబుతోంది. అవునా అనుకొని... ఆంటీ శ్రీ, విక్రమ్ ఎక్కడ కనపడటం లేదు ఏంటి...

వాళ్ళు పొద్దుటే ఆఫీస్ కి వెళ్ళిపోయారు.  ఈ రోజుకి రెస్ట్ తీసుకోమన్నారు.  సాయంత్రం వచ్చిన తర్వాత ఏదో పని ఉందంట.

ఓ మై గాడ్ మల్లి షాపింగా... ఈసారి గుండెజారి కడుపులోకి వస్తుంది. ఇంకొక్క నాలుగు రోజులు నన్ను ఇలా తిప్పారు అంటే....

పెళ్లి సంగతి ఏమోగానీ హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయం అనుకొని.. సరే అంటి నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటాను అని అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటాడు.

టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో అంటే ఇప్పుడు టిఫిన్ ఏమి వద్దు అంటి...  డైరెక్ట్ గా లంచ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధానం..

ఎవరి ఆలోచన ఎటు మలుపు తిప్పుతుంది...
[+] 9 users Like SivaSai's post
Like Reply
Part - 84


నివి షాపింగ్ కి బయటికి వెళ్లాలని ఏది చెప్పినా సరే రాజ్ నే అందరూ కలిసి బుక్ చేసేస్తుఉంటారు. ఇక ఏమీ అనలేక నివి కోసం అని షాపింగ్ కి వెళుతూ ఉంటాడు.

శ్రీ, నేహాల పెళ్లిరోజు దగ్గరికి వచ్చేస్తుంది. పెళ్లి పనులు కూడా జోరందుకుంటాయి. శ్రీ ఇంటి ఆడపడుచుగా అవని చేతే అన్ని పనులు చేయిపిస్తారు.

అది చూసిన ధనుంజయ్ కి అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులకైనా అవినికి మంచి రోజులు వచ్చాయని సత్యవతి గారి జంట కూడా సంతోషపడతారు.

పెళ్లి నేహా వాళ్ళ ఊరిలోనే కాబట్టి అందరూ పెళ్లికూతురు ఊరు బయలుదేరుతారు. వెళ్లే ముందు అవని పెళ్ళికొడుకు కార్ కి ఎదురు వచ్చి  ఆడపడుచు హోదాలో శ్రీ తోనే ఆ కారులోనే బయలుదేరి వెళుతుంది.

పెళ్లిల్లంతా కోలాహాలంగా హడావిడిగా ఉంటుంది. శ్రీవాళ్లు అక్కడికి వెళ్ళగానే బావమరిది వరుస అబ్బాయి వచ్చి కాళ్లు కడిగి నోరు తీపి చేస్తాడు.

పానకాలు కావిడితో విడిది ఇంటికి వెళ్లి అందరి నోరు తీపి చేసి భోజనానికి రమ్మని అందర్నీ సాదరంగా ఆహ్వానిస్తారు.
పల్లెటూరు హడావిడి చూసి అవినికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది.

ఎప్పుడు పల్లెటూర్లో పెళ్లి చూడని అవనికి ఈ హడావిడి అంత చాలా కొత్తగా వింతగా అనిపిస్తుంది. భార్య మొహం లో కనపడుతున్న వింత వింత ఎక్స్ప్రెషన్స్ కి అప్పటికప్పుడు మారిపోతున్న ఫీలింగ్స్ చూసి విక్రమ్ నవ్వుకుంటూ...

పక్కకు వెళ్లి ఏమైంది భార్యామణి గారికి అంతలాగా అబ్సర్వ్ చేస్తున్నావు అని అడుగుతాడు. పెళ్లంటే ఇంత హడావుడిగా ఉంటుందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది.

ఆ మాటకి ఒకసారి అవని వైపు చూస్తాడు. నిజమే కదా వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది ఇద్దరికీ తెలుసు.  కాకపోతే సాంప్రదాయబద్దంగా విక్రమ్ కి అన్నీ జరిగాయి.

అసలు ఏమి జరుగుతుందో కూడా తెలియకుండా పెళ్లికూతురు ముస్తాబులో అవని ఉంది అంతే. అనుమానంగా చూస్తూ  నువ్వు అసలు ఎవరు పెళ్లికి వెళ్లలేదా అంటే... లేదుగా అని పెదవి విరుస్తుంది.

ఆ మాటకే విక్రమ్ కి మనసు చివుక్కుమంటుంది.  ధనంజయ్ మీదే కాదు ఈసారి పెద్దవాళ్ళైనా సత్యవతి, శేషగిరి గారి మీద కూడా కోపం వస్తుంది.

వెంటనే కాస్త తమాయించుకుని అసలు పెళ్లంటే ఏం చేస్తారు. ఎలా మొదలుపెడతారు అన్ని విషయాలు చెబుతూ ఉంటాడు.

అది వింటూ అవునా అనుకోని తన పెళ్లి గుర్తొచ్చి ఒక నిమిషం బాధగా అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే సర్దుకుని ఏదైతే ఏమైంది బంగారం లాంటి భర్త వచ్చాడు అదే చాలు అనుకుని తనకు తానే సర్ది చెప్పుకుంటుంది.

అవిని ఫేస్ లో కనపడుతున్న భావాలను అర్థం చేసుకుంటూ ఏం ఆలోచిస్తుందో అర్థమవుతుంది. కానీ అయిపోయిన పెళ్లిని అయితే తిరిగి తీసుకురాలేడు కదా..

అందుకే ఇకనుండి అవినికి సంబంధించి ఏది జరిగినా సరే తనకు ప్రతిదీ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలి అని నిర్ణయించుకుంటాడు.

పెళ్లి కూతురుకి సంబంధించిన ప్రతిఘట్టం  చూస్తూ ఉంటే ఆరోజు అన్నీ తండ్రి చేతుల మీద గానే జరిగాయి కానీ... అది తనకి కాదు. శిల్పకి అనుకుని చేశారు.

నాకైతే చేసేవారు కాదేమో..  ఎలా వదిలించుకోవాలనే కదా మొదట నుండి చూశారు.  ఇలాంటి తండ్రి ఎవరికైనా ఉంటారా అని ఆలోచిస్తూ మళ్ళీ వెంటనే ఆ ఫ్యామిలీ గురించి అసలు ఆలోచించకూడదు.

మనసుని కష్టంగా పెళ్లి వైపుకు తిప్పి ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ మాత్రం అవనినీ వదలకుండా అంటిపెట్టుకునే ఉంటాడు.

నేను బాగానే ఉన్నానండి అన్నా సరే..  ఇట్స్ ఓకే.. నేను మాత్రం చేసేది ఏముంది అని పక్కనే కూర్చుని అవని డైవర్ట్ అవ్వకుండా... డిస్టర్బ్ అయినప్పుడల్లా తన మాటలతో మాయచేస్తూ పెళ్లిని ఎంజాయ్ చేసేటట్టుగా చేస్తాడు. 

పెళ్లయిన తర్వాత అప్పగింతల అప్పుడు నేహా తల్లిదండ్రులను పట్టుకుని బాగా ఏడుస్తుంది. అది చూసి ఆరోజు భార్గవి వాళ్ళు తనతో ప్రవర్తించింది గుర్తుకు వస్తుంది.

అసలు తండ్రిని ముట్టుకోనివ్వకుండా అప్పగింతలు లేకుండా మెల్లిగా పంపించేయడం అన్నీ గుర్తుకు వస్తాయి. ఎందుకు మనుషులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారు.ఆస్తి కోసమా అనుకుని వాళ్ల మీద ఇంకా  అసహ్యాన్ని పెంచుకుంటుంది.

  తన చేతితో భర్త చేతిని చుట్టుకుని భుజం పైన తలవాల్సి చూస్తుంది. విక్రమ్ తన తలతో అవిని తలని మెల్లిగా ఢీ కొట్టి ఏమైందిరా అని అడుగుతాడు.

ఏమీ లేదు అని మెల్లిగా చెబుతుంది కానీ ఆ మాట ఎక్కడో నూతిలో నుంచి వస్తుంది. అవని బాధ  అర్థమవుతూ ఉంటే... ఇంక అక్కడే ఉంటే ఎక్కువ బాధ పడుతుంది  అని అందరికీ మేము బయలుదేరుతున్నాం అని మెసేజ్ చేసి అవిని నీ తీసుకుని బయలుదేరుతాడు.

అదేంటి మనం కూడా వాళ్లతో కలిసి వచ్చే వాళ్ళము కదా అంటే...  అబ్బా ఆ పనులన్నీ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ముందు మనం వెళదాం పద..అక్కడ మళ్ళీ నువ్వే హారతి పట్టి లోపలికి పిలవాలి కదా...

ఓ.. మర్చిపోయాను నిజమే అని గబగబా కారు దగ్గరికి వెళుతుంది. మెల్లిగా డైవర్ట్ అవుతుంది అని అర్థమయ్యి విక్రమ్ హమ్మయ్య అనుకుంటాడు.

ఆ రాత్రి ఇద్దరూ కారులో ఇంటికి వెళుతూ ఉంటారు.  లాంగ్ డ్రైవ్..  చలిచలిగా ఉంది.  పక్కన మనసుకు నచ్చిన నెచ్చలి. ఇంతకన్నా ఇంకేం కావాలి అని అనుకుంటు స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

ఏంటండీ ఇంత స్లోగా వెళుతున్నారు. పెళ్లి వాళ్లు  వచ్చేటప్పటికి వెళ్ళాలి కదా... వాళ్ళు వచ్చేటప్పటికి నిన్ను తీసుకు వెళ్లే బాధ్యత నాది సరేనా అని మధ్యలో ఐస్ క్రీమ్ కనిపిస్తే.....

అవినికి నచ్చిన ఫ్లేవర్ తీసుకొనివస్తాడు. అదేంటి మీరు ఒకటే తెచ్చారు..  ఒకటి చాల్లే అని ఇచ్చి కార్ ఎక్కుతాడు.

అవని ఐస్ క్రీమ్ పట్టుకుని అలాగే ఉంటుంది. తిను అది కరిగిపోతోంది.  మీరు తినకుండా నేను ఎలా తింటానండి. ఇంకోటి తీసుకుంటే ఏమయ్యింది.

నాకు అలా తినడం ఇష్టం లేదు అని చెబుతాడు.  ఈ వెదర్ లోనా అని అడిగితే...  కణతల మీద వేలుతో పొడిచి అలా కాదు ఇలా తిను అని ఐస్ క్రీమ్ అవిని పెదాల దగ్గర పెట్టి తన పెదాలతో ముస్తాడు.

ఒక్క నిమిషం అవని కళ్ళు మూసుకుంటుంది. ఆ ఐస్క్రీం ఫ్లేవర్ తో పాటు అవని పెదాల తీపి తగిలి విక్రమ్ కి ఇంకా రుచిగా అనిపించి...

అవిని నీ ఇంకా తన వైపుకు అదుముకుని ఆ పెదాలపై ఇంకా కొంచెం ప్రెజర్ ఇస్తాడు. స్.. అన్న చిన్న సౌండ్ తో రెస్పాండ్ అవుతుంది.

అవిని లో వచ్చిన మార్పు కి మెల్లిగా ఓళ్ళోకి లాక్కుని  ఐస్ క్రీమ్ అయ్యేదాకా పెదాలను చప్పరిస్తూ ఉంటాడు. ఆ ఐస్క్రీమ్ అయ్యేటప్పటికీ అవని కళ్ళు భారంగా మూతలు పడుతూ ఉంటాయి.

ఐస్క్రీం అయిన తర్వాత మెల్లిగా విక్రమ్ తన పెదాలను దూరం చేస్తాడు. ఇద్దరు మూతులు నుంచి బుగ్గలు దాకా ఐస్ క్రీమ్ అయిపోయి జిగురుగా ఉంటుంది.

అవని మాత్రం కళ్ళు తెరవదు.  ఆ ఐస్ క్రీమ్ జిగురుకి తోడు సిగ్గుతో  బుగ్గలు కూడా కెంపువర్ణంలోకి మారి ఇంకా షైనింగ్ గా కనిపిస్తూ ఉంటాయి.

ఓయ్ భార్యామణి అని పిలుస్తాడు.  కానీ కళ్ళు తెరవకుండానే హ్మ్... అని మాత్రమే ఉంటుంది. ఎలా ఉంది ఐస్ క్రీమ్.

ఇంకొకటి ట్రై చేద్దామా అని హస్కీగా అడుగుతూ..  బుగ్గ పైన వేలుతో రాస్తూ ఉంటాడు.  అప్పటికే సిగ్గుతో ముడుచుకపోయినా అవని ఏమిటి ఇంకొకటా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది.

ఏమైంది భార్యామణి అని అడిగితే... అసలు మీకు సిగ్గు ఉందా అని అడుగుతూ కళ్ళు వాల్చేస్తుంది. ఇప్పుడు సిగ్గుతో నీకేం పని అని అడిగితే...

మనం రోడ్డు మీద ఉన్నాము.  లేదు కారులో ఉన్నా ము. ఎవరైనా చూస్తే... ఎవరికి కనపడడం అంటాడు. వెయిట్.. వెయిట్.. ఎవరూ చూడకపోతే ఓకే నా...

థాంక్యూ భార్యామణి ఇప్పుడే వెళ్లి  ఇంకొక నాలుగు ఐస్ క్రీములు తెస్తాను అంటాడు. కంగారుగా వెంటనే విక్రమ్ చేయి పట్టుకుని ఏంటి మీరు చేసేది అని అడుగుతుంది.

ఏముంది నువ్వే కదా అన్నావు.. ఎవరూ చూడకపోతే ఓకే అని.  అందుగురించి నా ప్రయత్నం అంత.  ఇంత మంచి ఆపర్చునిటీ నేను ఎలా వదిలేసుకుంటాను అని నడుం మీద వేలుతో రాస్తూ ఉంటాడు.

అబ్బా ప్లీజ్ అండి.  మీ అల్లరి ఆపండి.  లేట్ అవుతే బాగోదు అని బ్రతిమాలుతుంది. సరే అయితే బయలుదేరాలి అంటే నాకు ఒక గిఫ్ట్ ఇచ్చేయ్ వెళ్ళిపోదామని అంటాడు.

ఇప్పటికిప్పుడు గిఫ్ట్ నేను ఎక్కడి నుంచి తేవాలి అని అడుగుతుంది. మొగుడికి పెళ్ళాం ఇచ్చే గిఫ్ట్ స్పెషల్ గా ఎక్కడినుంచి తీసుకురారు.

  ఊరిస్తున్న పెదవులు అందుకని ముద్దులతో కాసేపు సయ్యాటలాడి వదిలి గిఫ్ట్ అంటే ఇలా ఇవ్వాలి భార్యామణి.

అంతేగాని ఏమి ఇవ్వాలా అని వెతుక్కోకూడదు అంటాడు. ఆ మాటకే చిరుకోపంగా చూస్తుంది ... చూశాను అనుకుంటుంది  కానీ ఆ చిరుకోపంలో కూడా సిగ్గే కనబడుతుంది.

ఆ సిగ్గుని చూసి విక్రమ్ హాయిగా నవ్వేస్తాడు. కార్ డోర్ ఓపెన్ చేసి  వాటర్ తీసుకుని  అవిని ఫేస్ నీ వాష్ చేసి తను కూడా వాష్ చేసుకుని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాడు.

దారి మొత్తం అవినికి బోర్ కొట్టకుండా.. నిద్ర రాకుండా కబుర్లు చెబుతూనే ఉంటాడు. పెళ్లి దగ్గర అవని పడిన డిస్టర్బెన్స్ అంతా ఎటో ఎగిరిపోతుంది.

మళ్లీ ఎప్పటిలాగానే ప్రశాంతమైన అవని రూపం కనపడుతుంది. పెళ్లి వాళ్లు వచ్చేటప్పటికి అవని, విక్రమ్ ఇద్దరూ శ్రీ ఇంటికి చేరుకుంటారు. అవని లోపలికి వెళ్లి వాళ్లకి స్వాగతం పలకడానికి దిష్టి తీయడానికి  అన్ని సిద్ధం చేసుకుంటుంది.

నేహా ఇంటి దగ్గర పెళ్లి వాళ్ళందరూ బయలుదేరుతూఉంటే.. వినయ్, భరత్ కావాలని నివి ని రాజ్ తో కలిపి ఒకే కారులో పంపిస్తారు.

కార్ స్టార్ట్ చేస్తున్న రాజ్ దగ్గరికి వినయ్ వచ్చి మీరిద్దరే ఉన్నారు. ఇప్పుడైనా నీ ఫీలింగ్స్ ఏంటో మా చెల్లికి చెప్పు బావ.

మీ అందరికీ అర్థమైందా అంటే.. డే వన్ నుంచి అంటాడు.  నా పిల్లకేనా  అర్థం కానిది అంటే..  వాళ్లకు అర్థమైన...  అర్థం కానట్టుగా బిల్డ్అప్ ఇస్తారు.

నువ్వు ఓపెన్ అయ్యి చెప్పు.  అప్పుడు కానీ నా చెల్లి బయటపడదు అంటాడు. అంటే నివి కి కూడా ఇష్టమేనా అని ఉత్సాహంగా అడుగుతాడు.  ఏమో ఎవరికి తెలుసు అని భుజాలు ఎగరేసి వెళ్లిపోతాడు.

రాజ్ తన మనసులో ఫీలింగ్స్ చెబుతాడా ???

కథ కొనసాగుతుంది...
[+] 11 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: