Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
(02-02-2026, 12:37 PM)SivaSai Wrote:
Next Update Nuchi Abhir Dharma Uddam Starts 

Waiting for the climax to start..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(02-02-2026, 12:36 PM)SivaSai Wrote: Heroine Undi Adi Evaru Anedi Already Guess Chesaru

Thank You....................

UpComing Updates Lo Vastundi

I'm guessing Mithra.
Sumathi's life is given by Abheer, so can't think of that equation. 
Artha has to die as per what Abhir promised Mukul.

But let's see what the story reveals!!

This is getting pretty interesting!!
Like Reply
(02-02-2026, 12:36 PM)SivaSai Wrote: Heroine Undi Adi Evaru Anedi Already Guess Chesaru

Thank You....................

UpComing Updates Lo Vastundi

Neelam
Like Reply
ఎపిసోడ్ 57


ముకూల్ చెప్పిన గతం విని పంచరత్నాలు ఎలా స్వాధీనం చేసుకోవాలో అభీర్ ని ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పింది అర్ణ.

అభీర్ చెప్పినా గతం విని వాళ్లని అప్పుడే శిక్షించుకుండా 12 సంవత్సరాలు ఎందుకు ఆగావు నువ్వు శిక్ష ఎందుకు అనుభవించవు అని అడిగారు నీలమ్ వాళ్ళు.

**************

ఆ మాటకి "శత్రువు బలవంతుడైనప్పుడు తన సైన్యాన్ని కాపాడుకోవాలి సమయం చూసి దెబ్బ కొట్టాలి అది నాయకుడి లక్షణం.

అప్పుడు మాలో మిగిలిన వారిలో ఎక్కువ మంది 15 సంవత్సరాలు వాళ్లే, కానీ అటువైపు అధికార బలం ఆర్థిక బలం ఉన్న శత్రువులు ఉన్నారు ఆ సమయంలో నేను ఆవేశ పడితే నా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకునేవారు." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని "అవును! అదే నాయకుడి లక్షణం! శివాజీ మహారాజ్ కూడా యుద్ధంలో శత్రువు బలంగా ఉన్నాడు అంటే తన సైన్యాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు.

మళ్లీ సమయం చూసి తెలివిగా శత్రువు మీద దాడి చేసి విజయం సాధించేవారు, నాయకుడు అన్న వాడు విజయం సాధించడం మీద మాత్రమే దృష్టి కాదు, తన వాళ్ళని రక్షించుకోవడం మీద కూడా దృష్టి పెట్టాలి అప్పుడే  రాజ్యాధికారం చేజిక్కుతుంది." అని చెప్పింది బామ్మా.

"మీరు చెప్పింది కరెక్టే  బామ్మా గారు! కానీ ఇప్పుడు శత్రువుల బలం పెరిగిపోయింది. వాళ్లు మనకి అందనంత ఎత్తులో ఉన్నారు." అని చెప్పాడు శ్రీకర్.

"మనిషి ఎంత బలవంతుడైన తను చేసిన కర్మ అనుభవించక తప్పదు, ఇన్ని సంవత్సరాలుగా ముకుల్ తన వాళ్ళకోసం ప్రతిక్షణం చస్తూ బతికాడు. డబ్బు అధికారం ఉంటేనే ఆనందం కాదు మనశ్శాంతి కూడా ఉండాలి అప్పుడే మనిషి సుఖంగా జీవించగలడు." అని చెప్పాడు అభీర్.

"మరి ఇప్పుడు ముకుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇండియా రాకపోతే అమ్మవారు నీ ద్వారా తనకి ఇచ్చిన శాపం తప్పు అవుతుంది కదా!" అని అడిగింది సుమతి.

"మనిషి అహంకారం, అపేక్ష, అసూయా వదలనంతవరకూ  తను తీసుకున్న నిర్ణయం తప్పు అయ్యినా కరెక్ట్ అనిపిస్తుంది. మూర్ఖంగా అడుగు ముందుకు వేస్తాడు చేస్తుంది తప్పు అని తెలుసుకోలేడు.

అదేవిధంగా తన కుటుంబ సభ్యులు కూడా అలాగే ఆలోచిస్తారు తప్పకుండా నా ముందుకి వస్తారు." అని చెప్పాడు అభీర్.

"మరి అప్పుడు నిన్ను కలిసి వెళ్ళిన మీ వాళ్ళు ఐదుగురు ఏమైపోయారు? సింబా పిలుపు విని మళ్ళీ నీ దగ్గరకు వస్తారా? నీతో కలిసి ఉంటారా?" అని అనుమానంగా అడిగింది నీలమ్

"మేడం! నమ్మకద్రోహం చేయడం మా రక్తంలో లేదు, మేము మా పూర్వీకుల నుంచి గూడచారులము, అభీర్ సేన మొత్తం నంద ఫ్యామిలీని, అభిజిత్ ఫ్యామిలీని చుట్టుముట్టి వాళ్ల ప్రతి కదలిక గమనిస్తూ వాళ్లతో కలిసిపోయి ఉన్నారు. సేనలో ప్రతిఒక్కరు అభీర్ మాట కోసం ఎదురుచూస్తున్నారు." అని చెప్పాడు శంకర్.

"అభీర్! మీ వాళ్ళు గోకుల్ దగ్గర్నుంచి తీసుకుని నీకు ఇచ్చిన పంచరత్నాలు ఏమయ్యాయి? ఎక్కడ ఉన్నాయి? వాటిని మరి అమ్మవారి పాదాల దగ్గర ఎప్పుడు ప్రతిష్టిస్తావు?" అని  అడిగాడు సందీప్.

"ఆ పంచరత్నాలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి." అని రోషిని బొమ్మల్లో ఉన్న 5 ఉంగరాలు చూపించి "వీటిని అమ్మవారి పాదాల దగ్గర ప్రతిష్టించాలి అంటే, ముందు దుష్ట శిక్షణ జరగాలి అప్పుడే అమ్మ శాంతిస్తుంది." అని చెప్పాడు అభీర్.

"ఆరోజు కొండల దగ్గరికి వెళ్లిన అభిజిత్ వాళ్ళకి వినిపించిన అరుపులు ఎక్కడి నుంచి వచ్చేయ్? అక్కడ ఇంకా మీ తెగ వాళ్లు ఉన్నారా?" అని అడిగింది వసుంధర.

"ఆ కొండల దగ్గర సింబా సైన్యం తప్పితే ఎవ్వరూ లేరు, ఆరోజు వాళ్ళకి వినిపించినావి అరుపులు కాదు పంచభూతాల హెచ్చరికలు!" అని చెప్పాడు అభీర్.

"అభీర్ అన్న! చనిపోయిన మీ తల్లిదండ్రులు, మీ వాళ్లు, జంతువులు అక్కడ ప్రకృతిని, ధర్మాన్ని కాపాడడానికి రక్షణగా ఉన్నారు.

మరి వాళ్ళని అమ్మవారు ఎందుకు కాపాడలేదు? అక్కడికి అంత అన్యాయం చేయడానికి వచ్చిన ముకుల్ వాళ్ళని పంచభూతాలు ఎందుకు శిక్షించలేదు." అని అడిగింది సుమతి.

"రావణాసురుడు సీతమ్మవారిని అపహరించకుండా దైవశక్తి అడ్డుకుంటే రాక్షస వినాశనం జరిగేది కాదు, నిండు సభలో ద్రౌపతి మాతని అవమానించినప్పుడే కౌరవులని దైవం శిక్షించి ఉంటే, యుగ పరివర్తన కోసం కురుక్షేత్రం జరిగేది కాదు. ప్రతి సంఘటనకు కచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది.

గోకుల్ వాళ్లు మా ప్రదేశానికి వచ్చి ఆ విధంగా చేయకుండా ఉంటే వాళ్ళ కోరికలు, ఆశలు తీర్చుకోవడం కోసం ఇంకా ఎన్ని శక్తివంతమైన దేవాలయాలు నాశనం చేసేవారో ఎంతటీ ప్రకృతి సంపదను దోచుకునేవారో దానివల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయేవారో!" అని చెప్పాడు అభీర్.

"అవును! నువ్వు చెప్పింది అక్షరాల నిజం! వాళ్ళు అక్కడితోనే ఆగిపోయారు, లేకపోతే వాళ్ళ ఆకృత్యాలకు  అడ్డు ఉండేది కాదు." అని చెప్పింది బామ్మ.

"మరి శివమణి కూతురుని నువ్వు అనాధాశ్రమంలో జాయిన్ చేశావు కదా తను ఇప్పుడు ఎలా ఉంది? అసలు చంద్రశేఖర్ ఎవరు నీకు తెలుసా?" అని అడిగింది గీత.

"నేను ఇక్కడే ఉన్నావు." అని అభీర్ వైపు చూసి తన పక్కన ఉన్న మిత్ర ని చూపించి "నువ్వు చేరాతీసిన శివమణి కూతురు, నా శక్తి మేరకు పెంచి పెద్ద చేశాను." అని తనకి ఇచ్చిన రాయిని అభిర్ చేతిలో పెట్టి

"ఈ అనర్ధాలు జరగడానికి నేను కూడా బాధ్యుడనే, శివాజీ మహారాజ్ గారి చంద్ర హౌస్ గురించి రీసెర్చ్ చేస్తూ మీ తెగ గురించి తెలుసుకుని బైరా అడవిలో మీ తండ్రి గారిని కలిశాను.

ఆయన చెప్పిన విషయాలు అక్కడ ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా రీసెర్చ్ చేయకూడదు అనుకోని వచ్చి జరిగిన విషయం శివమణికి చెప్పాను, కానీ అతను నేను చెప్పింది విని మనసు మలినం చేసుకుని ఆశ పెంచుకున్నాడు దానికి శిక్ష అనుభవించాడు." అని చెప్పాడు చంద్రశేఖర్.

చంద్రశేఖర్ తో పాటు అక్కడికి వస్తూ "అవును నా తండ్రి లాంటి వాళ్లకి ఇలా ఇది ఒక గుణపాఠం! వాళ్ల తెలివితేటలు మంచికి ఉపయోగించాలి ఇటువంటి చెడు మార్గాల వైపు వెళ్ళకూడదు అని తెలుసుకుంటారు." అని చెప్పింది మిత్ర.

చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లి "మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వహించారు మీరు చేసిన దాంట్లో ఎటువంటి తప్పులేదు." అని చెప్పాడు అభీర్.

"నాయకుడా! ఈ రోజు నుంచి నేను కూడా అభీర్ సేనాలో  ఒక సైనికురాలని నా తండ్రి చావుకి కారణం అయిన వాళ్ళ చావు కేకలు నేను వినాలి." అని ఆవేశంగా చెప్పింది మిత్ర.

ఆ మాటవిని "ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు అది మనలో ఉన్న జ్ఞానాన్ని చంపేస్తుంది." అని చెప్పాడు అభీర్.

"నేను ఈ నిర్ణయం ఆవేశంలో తీసుకుంది కాదు బాగా ఆలోచించి తీసుకున్నను." అని చెప్పింది మిత్ర.

"నేను ఒక అధికారిగా మీరు చేసే పని సమర్ధించలేను, కానీ  నా అధికారంతో వాళ్ళని నేను ఏమీ చేయలేను. అందుకే ఒక మనిషిగా  మీకు సహాయం చేస్తాను." అని చెప్పాడు శ్రీకర్.

"అభీర్! ఇకనుంచి చేసే ప్రతి పని లీగల్ గా చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను." అని చెప్పింది వస్తుంది వసుంధర.

"మీకు తోడుగా నేను, సుమతి కూడా ఉంటాము మీడియానే ఆయుధంగా చేసుకుని వాళ్లతో యుద్ధం చేస్తాము." అని చెప్పింది నీలమ్.

"నాయకుడా! నందా గ్రూప్ లో ఒక ప్రాపర్టీ సెల్ కి పెట్టారు దానిని సెంట్రల్ మినిస్టర్ వరదరాజులు కొంటున్నాడు రెండు రోజుల్లో పెద్ద మొత్తం చేతులు మారబోతుంది. ఆ అగ్రిమెంట్ నిమిత్తం కచ్చితంగా వాళ్లలో ఎవరో ఒకరు ఇక్కడికి వస్తారు." అని చెప్పాడు శంకర్.

ఆ మాట విని "బైరిని ఇక్కడకు రమ్మని  కబురు పంపించు." అని చెప్పాడు అభీర్.

"సరే నాయకుడా!" అని చెప్పాడు శంకర్.

వసుంధర వైపు చూసి "మీరు చేసిన సహాయం నేను మర్చిపోలేను ఈరోజు నుంచి నేను ఇక్కడ ఉండను నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు." అని చెప్పాడు అభీర్.

"నువ్వు ఇక్కడే ఉండు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మేమందరం కూడా నీకు హెల్ప్ గా ఉంటాము." అని చెప్పింది వసుంధర.

"నేను మీ అందరి సహాయం తప్పకుండా తీసుకుంటాను కానీ నావల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, బైరి వచ్చిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నా మాట కాదనకండి." అని చెప్పాడు అభీర్.

"నీ మాట మేము కాదనలేము, కానీ నువ్వు నా కూతురికి ప్రాణం పోసిన దేవుడివి, నీ ప్రతి అడుగులో మా అడుగు కూడా ఉంటుంది." అని చెప్పాడు సందీప్.

"నాయకుడా! కాసేపట్లో బైరి ఇక్కడ ఉంటాడు మనం ప్రయాణానికి సిద్ధం అవ్వాలి." అని చెప్పాడు శంకర్.

"సరే!" అని చెప్పి గీత వైపు చూసి "మీ ఇంటికి వెళ్లి ధైర్యంగా ఉండండి ఇంక మీ జోలికి ఎవరు రారు ప్రశాంతంగా జీవించండి." అని చెప్పాడు అభీర్.

"అసలు మా ఇల్లు  ఉందో కూలిపోయిందో కూడా తెలియదు." అని చెప్పింది గీత.

"మీ ఇల్లు మా సహదేవుడు చనిపోయిన ప్రదేశం, ఆ రోజు నుంచి మా వాళ్ళు దానిని జాగ్రత్తగా కాపాడారు మీరు సంతోషంగా వెళ్లండి." అని చెప్పేడు శంకర్.

కాసేపటికి అక్కడికి కార్ లో తన మనుషులతో కలిసి వచ్చి అభీర్ ని చూసి సంతోషంగా దగ్గరికి వెళ్లి గట్టిగా పట్టుకుని "నాయకుడా!  నువ్వు చెప్పిన మాటతో  అక్కడి నుంచి వెళ్లిన తర్వాత కసితో ఎదిగాను మన సైన్యాన్ని బలంగా తయారు చేశాను నీ కనుసైగా చాలు యుద్ధం మొదలుపెడతారు." అని చెప్పాడు బైరి.

"అభీర్! మీ ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మళ్లీ మీరు నష్టపోవాల్సి ఉంటుంది." అని చెప్పింది వసుంధర.

"మేడం! ఇప్పుడు నేను చేయబోయే యుద్ధం ఎవరికి తెలియని ఎవరు చదవనటువంటి ఐదవ వేదం! దీంట్లో శత్రువు మీద దాడి ఎవరు ఊహించని విధంగా ఉంటుంది." అని చెప్పాడు అభీర్.
[+] 10 users Like SivaSai's post
Like Reply
ఎపిసోడ్ 58


ముకుల్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పిన వసుంధర వాళ్ళ వైపు చూసి "జరగబోయే యుద్ధం ఎవరికి తెలియనటువంటి ఎవరు చదవనటువంటి ఐదవ వేదం శత్రువులు మీద దాడి ఊహించని విధంగా ఉంటుంది." అని చెప్పాడు అభీర్.

*************

అభీర్ చెప్పింది విని ఆశ్చర్యంగా చూస్తూ 'ఆలా అయ్యితే వాళ్లకి మామూలుగా ఉండదు.' అని మనసులో అనుకుంది నీలమ్.

అందరికీ వీడ్కోలు చెప్పి అక్కడినుంచి బైరి, శంకర్ తో కలిసి కారులో వెళ్లిపోయాడు అభీర్.

అక్కడి నుంచి కార్లో వెళుతున్న వాళ్ళని చూసి "శ్రీకర్! ఆ బైరిని ఎక్కడో చూసినట్లు ఉంది?" అని డౌట్ గా అడిగాడు సందీప్.

"మీరు భైరవనాధ్ పేరు వినే ఉంటారు, ఆ బైరవనాదే ఈ బైరి! అతని మనుషులు మన ఇండియన్ RAW కి హెల్ప్ చేస్తూ ఉంటారు. శత్రువు ఏ దేశంలో ఉన్నా సరే అక్కడికి వెళ్లి అనుమానం రాకుండా చంపడంలో వీళ్ళకి సాటి ఎవరూ లేరు.

దీనిని బట్టి చూస్తే అభీర్ సేనలో ఒక్కొక్క మనిషి ఒకొక్క అభీర్! ఇప్పటివరకు ఆ నంద ఫ్యామిలీని అభిజిత్ ఫ్యామిలీని ఎదురుకోవడం వీళ్ళకి కష్టం అనుకున్నాను.

కానీ అభీర్ సేనని ఎదుర్కోవడం వాళ్ళ వల్ల కాదు, మనకి తెలిసిన ఒక వ్యక్తి ఇలా ఉంటే మిగతా వాళ్ళందరూ ఇంకా ఎలా ఉంటారో!" అని చెప్పాడు శ్రీకర్.

"మీరు అభీర్ సేనాని తక్కువ అంచనా వేశారు వాళ్ళు శివాజీ మహారాజ్ తో కలసి మొగలుల మీద వీర విహారం చేసిన వాళ్ళ పూర్వీకుల రక్తం పంచుకు పుట్టిన వారు, దేశం కోసం స్వఅభిమానం కోసం వీళ్ళు ఎక్కడిదాకైనా వెళతారు." అని చెప్పింది బామ్మ.

"మరి మిగతా నలుగురు ఎక్కడ ఉన్నారో? ఏం చేస్తున్నారో? వాళ్ళని కూడా ఒకసారి చూడాలని ఉంది." అని చెప్పింది వసుంధర.

***************

ఇంటి దగ్గరికి చేరుకుని అక్కడ ఉన్న మనుషులను చూపించి "నాయకుడా వీళ్ళందరూ మన సైన్యం! నీ రాక కోసం, నీ నోటి నుంచి వచ్చే మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

ఒకవేళ ముకుల్ ఫ్యామిలీ ఇక్కడకు రాకపోయినా మన నెట్వర్క్ తో వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడకి వెళ్లి చంపించొచ్చు!" అని చెప్పాడు బైరి.

"అతని కుటుంబంలో ప్రతి ఒక్కరు ఈ గడ్డమీదకు రావాల్సిందే, వస్తారు." అని చెప్పాడు అభీర్.

"నాయకుడా! మన వాళ్ళు ఇచ్చినా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియాలో ప్రాపర్టీస్ మొత్తం గోకుల్ కూతురు అర్ణ సేల్ చేయడానికి రెడీ అయింది. దానికోసం వాళ్ల కంపెనీలో డైరెక్టర్ అయిన ప్రతాప్ మిశ్రా కొడుకు సుజిత్ మిశ్రని ఇక్కడకు పంపించింది.

ప్రతాప్ మిశ్ర, సెంట్రల్ మినిస్టర్ వరదరాజులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందుకే ఒక ప్రాపర్టీ ని చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు, అ విషయం ముకుల్ పెద్ద అల్లుడు రఘురామ్ కి ఇష్టం లేదు ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళ మధ్య క్లాష్ వస్తుంది." అని చెప్పాడు బైరి.

"సరే! మన వాళ్ళందరినీ నేను ఒకసారి నేను కలవాలి." అని చెప్పాడు అభీర్.

"ఈరోజు రాత్రికి అందరూ ఇక్కడ ఉంటారు నాయకుడా!" అని చెప్పాడు బైరి.

************

ఢిల్లీ తన గెస్ట్ హౌస్ లో ఫోన్ రింగ్ అవుతుండగా లిఫ్ట్ చేసి "హాయ్ అర్ణ!" అని చెప్పాడు సుజిత్.

"ఆ మినిస్టర్ ప్రాపర్టీ అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకుందామని చెప్పాడు?" అవి అడిగింది అర్ణ.

"అన్ని విషయాలు మాట్లాడేసాను 2500 కోట్లకి డీల్ ఫైనల్ చేశాను వెయ్యి కోట్లు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు.

నువ్వు తాతయ్య గారితో మాట్లాడి ఫైనల్ చేయడమే లేట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం గురించి కూడా ఆయనతో చెప్పాను మనకు ఎవరు అడ్డం వచ్చినా సరే వాళ్ళే చూసుకుంటారు." అని చెప్పాడు సుజిత్.

"గుడ్! అగ్రిమెంట్ కి రెడీ చెయ్, రేపు ఫ్యామిలీ మెంబెర్స్ ఇక్కడికి వస్తున్నారు, మాట్లాడి రిజిస్ట్రేషన్ డేట్ కూడా ఫిక్స్ చేస్తాను." అని చెప్పింది అర్ణ.

"షూర్! నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే లేట్! మన ప్రాపర్టీస్ కోసం బయ్యర్స్ ఎగబడుతున్నారు వన్ మంత్ లో మనం అనుకున్నది జరిగిపోతుంది." అని చెప్పాడు సుజిత్.

ఆమాటకి "అప్పుడే మనం అనుకున్న పని పూర్తి అవ్వదు, ఇండియాలో నాకు కూడా తెలియని ఒక విలువైన ప్రాపర్టీ బయటపడింది. ఆ విషయంలో మినిస్టర్ వరదరాజులు హెల్ప్ మనకి చాలా అవసరం అవుతుంది." అని చెప్పింది అర్ణ.

"అవునా ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ నాకు పంపించు అంకుల్ తో మాట్లాడుతాను." అని చెప్పాడు సుజిత్.

"సరే!" అని చెప్పి ఫోన్ పెట్టేసింది అర్ణ.

ఫోన్ కట్ అవ్వడంతో "సరే అని చెప్పి పెట్టేసింది ఏమిటి? డాడ్ కూడా తెలియని ప్రాపర్టీ ఏమిటి?" అని డౌట్ గా తండ్రికి కాల్ చేశాడు సుజిత్.

లండన్ లో తన ఇంటి దగ్గర ఫోన్ రింగ్ అవ్వడం చూసి "వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు?" అని లిఫ్ట్ చేసి "సుజిత్ టెల్ మీ?" అని అడిగాడు ప్రతాప్ మిశ్రా.

"డాడ్! నంద ఫ్యామిలీకి ఇండియాలో మనకి కూడా తెలియని ప్రాపర్టీ ఒకటి  ఉంది. నాకు తెలిసి దాని గురించే ఆ జైల్లో ఉన్న వాడికి వీళ్ళకి గొడవ అనుకుంట!

ఆ ప్రాపర్టీ విషయంలో అర్ణ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. దానికి వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది. దాని విషయంలో మినిస్టర్ అంకుల్ హెల్ప్ కూడా కావాలి అని చెబుతుంది." అని చెప్పాడు సుజిత్.

"అవునా? అంత వాల్యుబుల్ ప్రాపర్టీ నాకు తెలియకుండా ఎక్కడ ఉంది." అని ఆలోచిస్తూ "సరే! రేపు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలుస్తున్నారు ఎలాగైనా నేను ఆ విషయం గురించి తెలుసుకుంటాను.

ఆ ప్రాపర్టీ విషయంలో మన హస్తం కచ్చితంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకి వరదరాజుల్ని డైరెక్ట్ చేయకూడదు, ప్రతి దానికి మనం మధ్యలో ఉండాలి మనం చెప్పినా వ్యాల్యూ ఫైనల్ అవ్వాలి."అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"ఓకే డాడ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న రియా వైపు చూసి "ఎక్కడికి ప్రిపేర్ అవుతున్నావు ఈరోజు మనం పబ్ కి వెళ్ళాలి అనుకున్నాము కదా!" అని అడిగాడు సుజిత్.

"మన ప్రోగ్రాం రేపటికి పోస్ట్ పోన్ చేద్దాము ఈరోజు నా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వస్తుంది చాలా సంవత్సరాల తర్వాత తనని కలుస్తున్నను." అని చెప్పింది రియా.

"అవునా? మరి నీ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా?" అని అడిగాడు సుజిత్.

ఆ మాటకి వెనక్కి తిరిగి "తప్పకుండా పరిచయం చేస్తాను తనకి మీ హెల్ప్ చాలా అవసరం అవుతుంది." అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరింది రియా.

*************

చంద్రశేఖర్ తో కలిసి తన ఇంటికి వచ్చి "అంకుల్! మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ విషయం గురించి నాకు ఎందుకు చెప్పలేదు?" అని అడిగింది మిత్ర.

"జరిగిన విషయం తెలిస్తే నువ్వు ఇంత ప్రశాంతంగా నవ్వుతూ ఉండే దానివి కాదు, నీ జీవితంలోకి ఆ పాత రోజులు మళ్లీ రాకూడదు అనుకున్నాను.

కానీ నీకు జీవితాన్ని ప్రసాదించిన అభీర్ కి సహాయంగా ఉండాలి అని ఆ దేవుడు తలచినట్లు ఉన్నాడు, అందుకే నిన్ను శత్రువుల ద్వారానే తన దగ్గరికి పంపించాడు." అని చెప్పాడు చంద్రశేఖర్.

"నా తండ్రి తప్పు చేశాడు అతని చావుకి నేను బాధపడను కానీ నా తల్లి తప్పు చేయకుండానే చనిపోయింది." అని బాధగా చెప్పింది మిత్ర.

"అక్క! వాళ్ళని నవ్వుతూనే దెబ్బ కొట్టాలి ఆవేశం పనికిరాదు వాళ్లకి మన స్టైల్ ఏ కరెక్ట్!" అని చెప్పాడు చాక్లెట్.

"అవునురా చాక్లెట్! నువ్వు చెప్పిందే కరెక్ట్! ఆ జాకీ గాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని వాడికి చావు రుచి చూపించాలి." అని ఫోన్ రింగ్ అవ్వడం చూసి

"ముకుల్ మనవరాలు అర్ణ కాల్ చేస్తుంది." అని చెప్పి లిఫ్ట్ చేసి "గుడ్ ఈవెనింగ్ మేడం! అభీర్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాను." అని జారువ తెగ గురించి బైరి అడవి గురించి అన్ని వివరాలు చెప్పి

"అతను అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడో కేస్ లో ఎలా ఇరుక్కున్నాడో మాత్రం తెలుసుకోలేకపోయాను." అని చెప్పింది మిత్ర.

ఫోన్లో మిత్ర చెప్పింది విని 'ఈ డిటెక్టివ్ స్పీడ్ గా తెలుసుకుంది.' అని మనసులో అనుకుని "ఆ విషయాలు ఏమి మనకి అవసరం లేదు, నాకు ఆ అభీర్ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడో అన్ని విషయాలు తెలియాలి నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి నీకు వచ్చే అమౌంట్ పెరుగుతూ ఉంటుంది." అని చెప్పింది అర్ణ.

"థాంక్యూ మేడం ఇకనుంచి నా వర్క్ అభీర్ ని ఫాలో అవడమే! అతని ప్రతి అడుగు మీకు తెలుస్తుంది." అని చెప్పింది మిత్ర.

"ఓకే బాయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసింది అర్ణ.

***************

అభీర్ ఉన్న ఇంటి దగ్గరికి రాజన్ వాళ్ళతో సహా జారువా తెగకు చెందిన వాళ్ళందరూ రావడంతో

అందరి వైపు చూస్తూ "ఇన్ని సంవత్సరాలు శత్రువు కంటి ముందు కనపడుతున్న పంటి బిగువున కోపాన్ని దాచుకుని కలిసి ఉన్నాము, ఇప్పుడు తిరిగి దెబ్బ కొట్టే సమయం వచ్చింది.

మన 12 ఏళ్ల పగ తీరబోతుంది మనవాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈరోజు నుంచి మన నాయకుడు అభీర్ మాట మనకి సిరోధార్యం జై భవాని!" అని చెప్పాడు బైరి.

"జై భవాని జై భవాని!" అని అరుస్తూ ఉన్నారు అక్కడ ఉన్న అభీర్ సేన.

"మనలో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఉంటున్నారు  ఇప్పటివరకు మన శత్రువుల జాడ గురించి ఏమేమి తెలుసుకున్నారు ప్రతి విషయం మన నాయకుడికి సమాచారం ఇవ్వండి. ఎవరు ఏ టైమ్ కి ఏం చేయాలో నాయకుడు చెప్పిన మాట మీకు చేరుతుంది." అని చెప్పాడు రాజన్.

అక్కడ ఉన్న తన వాళ్ళ వైపు చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ "ఇన్ని సంవత్సరాలుగా మీకు ఇష్టం లేని పని చేసి ఉంటారు, ఇక నుంచి ఆ పని మీకు ఇష్టంగా మారుతుంది ఇన్నాళ్లు ఎదురు చూసిన మన పగ తీరబోతుంది.

ఈ ధర్మ యుద్ధంలో మనలో ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు, మన మొదటి దాడి నంద గ్రూప్ చేతికి వెళ్లబోయే వెయ్యి కోట్లు!" అని చెప్పాడు అభీర్.
[+] 12 users Like SivaSai's post
Like Reply
Excellent update
Like Reply
Superb update
waiting for abheer sena yuddam
Like Reply
ఎపిసోడ్ 59


ఇంటి దగ్గరకి జారువా తెగకు సంబంధించిన అందరు రావడంతో వాళ్లతో మాట్లాడుతూ మనం ధర్మం కోసం యుద్ధం చేసే సమయం వచ్చింది మన మొదటి దాడి ఆ 1000 కోట్లు మీద అని చెప్పాడు అభీర్.

****************

అభీర్ చెప్పిన మాట విని "నాయకుడా! ఆ 1000 కోట్లు వరదరాజుల చేతిలో ఉన్నప్పుడు తీసుకుందామా? నంద ఫ్యామిలీ చేతికి వెళ్లిన తర్వాత తీసుకుందామా?" అని అడిగాడు అరుల్.

"ఎంతటి మిత్రులకైనా భేదాలు వచ్చేది డబ్బు దగ్గరే, ఇద్దరి మధ్యలో ఉండగా ఆ డబ్బు మాయం అవ్వాలి, దానికి నా దగ్గర ఉపాయం ఉంది నేను చెప్పినట్లు చేయండి." అని చెప్పాడు అభీర్.

"నాయకుడా! సుజిత్ కి ఈరోజు అర్ణ ఫోన్ చేసింది. కొత్త ప్రాపర్టీ గురించి తెలిసింది దానికి మినిస్టర్ హెల్ప్ అవసరమవుతుంది అని చెప్పింది. నాకు తెలిసి ఆ కొండల మీద తన కన్ను పడినట్లు ఉంది." అని చెప్పాడు అగస్త్య.

"అవును! ఆ విషయం గురించి తెలుసుకోవడానికి సుజిత్ తన తండ్రి కి ఫోన్ చేశాడు, ఈరోజు నంద ఫ్యామిలీ మొత్తం లండన్లో కలుసుకుంటున్నారంట అక్కడ విషయం తెలుసుకుని చెబుతానని చెప్పాడు." అని చెప్పింది రియా.

"మీరు ముకుల్ ఫ్యామిలీ మెంబర్స్ తో టచ్ లో ఉన్నారు కదా! మన నవగ్రహాల కొండల గురించి వాళ్ళకి తెలిసేలాగా చేసి ఆశ పుట్టించండి. వాటికోసం ఈ గడ్డమీదకి ప్రతి ఒక్కరూ అడుగు పెట్టాలి." అని చెప్పాడు అభీర్.

"నాయకుడా! ఆ అభిజిత్ వీల్ చైర్ లో కూర్చునే రాజకీయం చేస్తున్నాడు, వాడి పెద్ద కొడుకు మిధున్ వ్యాపారాలు చూసుకుంటున్నాడు, రెండో కొడుకు నిర్మల్ రాజకీయాలలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు.

వాళ్లు బయట వ్యక్తులను ఎవరిని దగ్గరికి రానివ్వరు అందువల్ల మన వాళ్ళు ఎంత ప్రయత్నించినా దగ్గర కాలేకపోయారు." అని చెప్పాడు బైరి.

"మరి అభిజిత్ తో పాటు ఉండే జాకీ ఎక్కడ ఉంటున్నాడు?" అని అడిగాడు అభీర్.

చాక్లెట్ తో కలిసి అక్కడికి వస్తూ "ఆ జాకి దుబాయ్ లో ఉంటున్నాడు వాడిని ఇక్కడికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు! మిథున్ తో కూడా నాకు పరిచయం ఉంది. అంతేకాదు అర్ణ కూడా నాకు టచ్ లోనే ఉంది." అని చెప్పింది మిత్ర.

అక్కడికి వచ్చిన మిత్ర వైపు చూసి "ఇకనుంచి తను కూడా మనలో ఒకరిగా ఉంటుంది. ఆ దేవుడు మన తెగకు ఇచ్చిన బిడ్డ అనుకోండి." అని చెప్పాడు అభీర్.

"నాయకుడా! నాకు తెలిసి ఈ పోరాటంలో ఆ రెండు కుటుంబాలకు సహాయం చేయడానికి చాలామంది వస్తారు." అని చెప్పాడు రాజన్.

"ఆ కుటుంబాలకు ఎవరు అండగా ఉన్న ముందు ఒక హెచ్చరిక ఇవ్వండి వింటే ప్రాణాలతో ఉంటారు." అని చెప్పాడు అభీర్.

"సరే నాయకుడా!" అని తన వాళ్ళ వైపు చూసి "ముందుగా మినిస్టర్ వరదరాజులు కుటుంబానికి అభీర్ సేన నాయకుడి ఆజ్ఞ! అని హెచ్చరిక పంపించండి." అని చెప్పాడు బైరి.

*****************

మరుసటి రోజు ఉదయం ఫ్యామిలీ మీటింగ్ కి అందరూ లండన్ చేరుకుని గెస్ట్ హౌస్ లో రెడీ అవుతూ ఉండగా ఫోన్ రింగ్ అవడంతో రూమ్ లోకి వెళ్లి లిఫ్ట్ చేసి "అగస్త్య! టెల్ మీ?" అని చెప్పాడు రఘురామ్.

"సార్! రాత్రి సుజిత్ కి అర్ణ మేడం కాల్ చేశారు, ఇండియాలో ఇప్పటివరకు తెలియని ఒక పెద్ద ప్రాపర్టీ గురించి తెలిసింది అని చెప్పారు.

ఆ ప్రాపర్టీ విషయంలో వరదరాజుల హెల్ప్ కావాలని కూడా అడిగారు, నాకు తెలిసి మినిస్టర్ హెల్ప్ కోసమే గూర్ గామ్ లో ఉన్న ప్రాపర్టీని అంత తక్కువకి ఇస్తున్నారు." అని చెప్పాడు అగస్త్య.

ఆ మాట విని "అవునా? ఈరోజు మా ఫ్యామిలీ మీటింగ్ జరుగుతుంది ఆ విషయం గురించి ప్రస్తావన వస్తే సరే లేకపోతే ఆ ప్రాపర్టీ డిటేల్స్ తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే!" అని చెప్పాడు రఘురామ్.

"ఓకే సార్ షూర్!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు అగస్త్య.

ఫోన్ పెట్టేసి హడావుడిగా రూమ్ లో నుంచి బయటికి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పిలిచి "ఇండియాలో ఇప్పటివరకు మనకి తెలియని ఒక పెద్ద ప్రాపర్టీ ఉంది.
దాని మీద అర్ణ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అని తెలిసింది.

నాకు తెలిసి అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఒక ఎత్తు, ఆ ప్రాపర్టీ ఒక ఎత్తు అయి ఉంటుంది. లేకపోతే అది అంత తొందరగా ఇంట్రెస్ట్ చూపించదు." అని చెప్పాడు రఘురామ్.

"అవునా? ఈరోజు జరిగే మన ఫ్యామిలీ మీటింగ్ లో ఆ విషయం గురించి ఏమైనా చెబుతుందేమో చూద్దాము లేకపోతే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము." అని చెప్పాడు విష్ణు.

"అది సరే! అసలు మనకి తెలియని అంత వాల్యూ ఉన్న  ప్రాపర్టీ ఇండియాలో ఏముంది?" అని అడిగాడు సుభాష్.

"అవును! మనకి తెలియని ప్రాపర్టీస్ ఏమున్నాయి?" అని అడిగింది నళిని.

"టెన్షన్ పడకండి ఇండియాలో నా మూడో కన్ను ఉంది. అతి త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి." అని చెప్పాడు రఘురామ్.

"సరే! ఇంకా తాతగారింటికి బయలుదేరుదామా?" అని చెప్పి అందరినీ పంపించి తండ్రి తల్లిదండ్రులతో కలిసి కార్ లో వెళుతూ రియాకి ఫోన్ చేశాడు విష్ణు.

ఉదయం గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "హాయ్ సార్!" అని చెప్పింది రియా.

"హాయ్ రియా! కొత్త న్యూస్ ఏమైనా ఉందా?" అని అడిగాడు విష్ణు.

"సార్! రేపు వరదరాజులతో అగ్రిమెంట్ జరుగుతుంది 1000 కోట్లు అడ్వాన్స్ ఇస్తున్నారు, అలాగే రాజస్థాన్ దగ్గర ఉన్న ఒక ప్రాపర్టీ గురించి డిస్కషన్ జరిగింది. నాకు ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు తెలుసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను." అని చెప్పింది రియా.

"సరే! ఆ ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకో!" అని చెప్పి ఫోన్ పెట్టేసి తండ్రి వైపు చూసి

"తాతయ్య మీకు కూడా తెలియకుండా రాజస్థాన్ దగ్గర ఉన్న ఒక పెద్ద ప్రాపర్టీని అర్ణకి ఇవ్వడానికి చూస్తున్నాడు నువ్వేమో ఇంకా మా నాన్న అంటూ ఎగరేసుకుంటూ తిరుగుతావు." అని కోపంగా చూస్తూ చెప్పాడు విష్ణు.

"అవునా? రాజస్థాన్ దగ్గర అంత పెద్ద ప్రాపర్టీ ఉందని ఇప్పటివరకు నాకు కూడా తెలియదు, సరే నువ్వేమీ కంగారు పడకు ఏది ఉన్న మన వాటా మనకు రావాల్సిందే!" అని చెప్పాడు నంద రెండో కొడుకు ప్రవీణ్.

వేరే కార్ లో వెళుతూ "ఎవరి ప్లాన్ లు వాళ్ళు వేసుకుంటున్నారు మనమే సైలెంట్ గా ఉండిపోయాము." అని భర్త వైపు కోపంగా చూస్తూ

"మీకు ఇండియాలో కాంటాక్ట్స్ బానే ఉన్నాయి కదా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి." అని చెప్పింది నళిని.

ఆ మాట విని "మమ్మీ! ఎందుకు టెన్షన్ పడతావు? సుజిత్ దగ్గరికి అరుల్ అని నా మనిషిని పంపించాను, ప్రతి విషయం నాకు చెబుతూనే ఉన్నాడు.

ఆల్రెడీ ఆ ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నాను రాజస్థాన్ దగ్గర బైరి అడవిలో ఉండే వజ్రాల కొండలు!" అని చెప్పాడు మోహిత్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "వజ్రాల కొండల?" అని అడిగాడు నళిని భర్త రాజేష్.

"ఎస్! ఆ కొండలలో మనకి వచ్చే షేర్ వ్యాల్యూ ఎంతో తెలుసా? మన వాటకి వచ్చే ఆస్తి మీద త్రిబుల్ ఉంటుంది." అని చెప్పాడు మోహిత్.

"మరి ఆ ఆస్తి గురించి నాన్నగారు ఇప్పటివరకు మనకి ఎందుకు చెప్పలేదు?" అని డౌట్ గా అడిగింది నళిని.

"నాకు తెలిసి ఈ ప్రాపర్టీ విషయం బయటకు రాకుండా అర్ణ చేసి ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ మీటింగ్లో అసలు విషయం తెలుస్తుంది కదా!" అని చెప్పాడు మోహిత్.

వేరే కారులో వెళుతూ సుభాష్ వైపు చూసి "డాడ్! గోకుల్ పెదనాన్నగారు పోయిన తర్వాత అన్ని విషయాలు నువ్వే చూసుకున్నావు కదా మరి ఆ ప్రాపర్టీ గురించి నీకు తెలియకపోవడం ఏమిటి?" అని డౌట్ గా అడిగాడు ప్రమోద్.

"నంద గ్రూప్ పేరు మీద ఉన్న ప్రతి ప్రాపర్టీ గురించి నాకు తెలుసు, గోకుల్ చనిపోక ముందు ఏదో కొత్త బిజినెస్ అని అన్నయ్య తో పాటు నాన్నగారు కూడా ఇండియాలో సంవత్సరం పాటు ఉన్నారు.

అక్కడ భారీగానే ఇన్వెస్ట్ చేశారు కానీ సడన్గా అన్నయ్య చనిపోయాడు నాన్నగారు లండన్ వచ్చేసారు, ఇండియాలో ఉన్న బిజినెస్ పార్ట్నర్ అభిజిత్ కూడా వీల్ చైర్ లో పడ్డాడు.

నాకు తెలిసి ఆ ప్రాపర్టీ విషయంలో ఏదో పెద్ద ప్రాబ్లం జరిగి ఉంటుంది. ఈ విషయంలో మనం ఆచితూచి అడుగు వేయాలి తొందరపడకూడదు మిగతా వాళ్ళు ఆవేశపడుతున్నారు కదా ఏం జరుగుతుందో చూద్దాము." అని చెప్పి కొడుకు వైపు చూసి

"అభిజిత్ చిన్న కొడుకు నిర్మల్ నీతో టచ్ లోనే ఉన్నాడు కదా!" అని అడిగాడు సుభాష్.

"ఎస్ డాడ్! నెక్స్ట్ సీఎం రేస్ లో వాడే ఉన్నాడు." అని చెప్పాడు ప్రమోద్.

"అవునా? మరి ఇంకేంటి మనల్ని దాటి ఏమి జరగదు నువ్వు ప్రశాంతంగా ఉండు." అని చెప్పాడు సుభాష్.

కాసేపటికి అందరూ ఇంటి దగ్గరికి చేరుకోవడంతో రూమ్ లో ఉన్న ముకుల్ దగ్గరికి వెళ్లి "తాతయ్య! ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చేసారు ఇండియా ప్రాపర్టీ విషయంలో మీ మాటే ఫైనల్ అవ్వాలి." అని చెప్పింది అర్ణ.

ఆ మాట విని "సరే!" అని బయటికి వస్తూ అక్కడ ఉన్న ప్రతాప్ మిశ్రా వైపు చూసి "ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ గురించి మొదట అడిగింది నువ్వే కదా!" అని అడిగాడు ముకుల్.

"ఎస్ సార్!" అని కంగారుగా చూస్తూ "నంద గ్రూప్ మంచి కోసమే నేను అలా చేశాను." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.

"అవునా?" అని అనుమానంగా చూస్తూ  "ఇండియాలో మినిస్టర్ వరదరాజులతో కాకుండా నువ్వు ఇంకా ఎవరితో టచ్ లో ఉన్నావు?" అని అడిగాడు ముకుల్.
[+] 8 users Like SivaSai's post
Like Reply
ఎపిసోడ్ 60


ముకుల్, అభిజిత్ ఫ్యామిలీలకు సహాయం చేసే వాళ్ళకి మొదటి హెచ్చరిక పంపించమని అభీర్ చెప్పడంతో వరదరాజులకి అభీర్ సేన నాయుకుడి ఆజ్ఞ అని హెచ్చరిక పంపించండి అని తన మనుషులకి చెప్పాడు బైరా.

ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడంతో రూమ్ లో నుంచి బయటకు వస్తూ ప్రతాప్ మిశ్రని చూసి నీకు ఇండియాలో వరదరాజులతో కాకుండా ఇంకా ఎవరు టచ్ లో ఉన్నావు అని అడిగాడు ముకుల్ నంద.

********************

ముకుల్ అడిగిన మాట విని కంగారుపడుతూ "మీరు చెప్పిన దగ్గర నుంచి ఇండియాలో పరిచయాలన్ని వదిలేసాను, వరదరాజులతో కూడా సుజిత్ ఇండియా వెళుతున్నాడని తెలిసిన తర్వాత మాట్లాడాను." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"సరే! నువ్వు చెప్పింది నిజం అయితే నీ కొడుకు క్షేమంగా లండన్ కి వస్తాడు, లేదు ఇంకా ఎవరితో అయినా పరిచయం ఉంది అంటే ముందే చెప్పు వాడు ప్రాణాలతో ఉండేలాగా నేను చూసుకుంటాను." అని చెప్పి అర్ణతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళాడు ముకుల్.

ఆ మాటకి టెన్షన్ గా చూస్తూ "ఈ ముక్కోడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు?' అనుకుంటూ వెనకాలే వెళ్ళాడు ప్రతాప్ మిశ్ర.

ముకుల్ తో పాటు వెళుతూ "తాతయ్య! సుజిత్ మనం చెప్పింది చెప్పినట్లు చేస్తాడు, ఎవరితో పరిచయాలు పెంచుకోడు వాడి గురించి నాకు బాగా తెలుసు!" అని చెప్పింది అర్ణ.

ఆ మాట విని "అవును సార్! సుజిత్ గురించి పాపకి బాగా తెలుసు! వాడికి మీరంటే అపారమైన గౌరవం! ఎటువంటి పరిస్థితుల్లో మీ మాట జవాడతాడు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూస్తూ "మహేష్ ఇక్కడకి రాలేదా?" అని డౌట్ గా అడిగాడు ముకుల్.

"మిథున్ తో కలిసి ఫ్యామిలీ టూర్ వెళ్ళాడు టుడేస్ లో వస్తాడు, అయినా నేను ఉండగా వాడు అవసరం లేదు." అని చెప్పింది అర్ణ.

"నువ్వు ఇండియాలో లాయర్ హిరణ్యతో కాకుండా ఇంకా ఎవరితోనైనా టచ్ లో ఉన్నావా?" అని అడిగాడు ముకుల్.

"నాకు ఇండియా కి సంబంధించిన అంతవరకు ఏ అవసరం ఉన్న మిథున్ చూసుకుంటాడు, లాయర్ హిరణ్యతో కూడా నేను డైరెక్ట్ గా మాట్లాడలేదు. నా గురించి మీకు బాగా తెలుసుగా తాతయ్య!

అయ్యినా! ఇండియాలో ఉన్న పరిచయాల గురించి ఇప్పుడు అడుగుతున్నారు ఎందుకు?" అని డౌట్ గా అడిగింది అర్ణ.

ఆ మాటకి సైలెంట్ గా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్లి ఒక్కొక్కరిని హాగ్ చేసుకుని " మిమ్మల్ని అందరిని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది." అని చెప్పాడు ముకుల్.

"డాడ్! ఇండియా ప్రాపర్టీ గురించి ఎవరు మాట్లాడద్దు అని చెప్పారు కదా, మళ్లీ ఆ విషయం గురించి ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేశారు?" అని డౌట్ గా అడిగాడు సుభాష్.

ఆ మాటకి ముకుల్ దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా చైర్లు కూర్చోబెట్టి  "ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం తాతయ్య గారు సేల్ చేయాలి అనుకుంటున్నారు. ఆ విషయం గురించి కూడా మనం కూడా ఒకసారి మాట్లాడుకున్నాము మర్చిపోయారా బాబాయ్?" అని అడిగింది అర్ణ.

ఆ విషయం గుర్తుంది. అప్పుడు తాత గారు ఇంకా డిసిషన్ తీసుకోలేదు, కానీ ఇప్పుడు తాతయ్య గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు  కాబట్టి అక్కడ ప్రాపర్టీ కూడా అందరికీ సమానంగా పంచితే అమ్మే వాళ్ళు అమ్ముకుంటారు ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు. " అని చెప్పాడు విష్ణు.

ఆ మాట విని భార్య వైపు చూసి రఘురామ్ సైగ చేయడంతో "అవును! విష్ణు చెప్పింది కూడా కరెక్టే! ఇప్పుడు ఆస్తులు అమ్ముకోవాల్సినంత అవసరం ఏమి వచ్చింది. ఎవరి వాటాలు వాళ్లకి పంచి పెడితే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు." అని చెప్పింది ఝాన్సీ.

"డాడీ! ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు! రాజస్థాన్లో ఉన్న ఏదో ఒక పెద్ద ప్రాపర్టీ నువ్వు అర్ణకి కి రాయాలని చూస్తున్నావు అని తెలిసింది.

నీ మాటకి ఎవరు ఎదురు చెప్పరు, అలా చేయడం కరెక్ట్ అనుకుంటే అలాగే చెయ్యి, మా మీద నీకు ప్రేమ లేదు  అనుకుంటాము." అని చెప్పింది నర్మదా.

ఆ మాట విని మనసులో సంతోషపడుతూ 'ఏదైనా ఇంట్లో చిన్నవాళ్ళు చిన్నవాళ్లే ఉన్నదేదో మొహనా అడిగేస్తారు.' అనుకున్నడు రఘురామ్.

"రాజస్థాన్లో పెద్ద ప్రాపర్టీ గురించి నేను ఎప్పుడు వినలేదే!' అని మనసులో అనుకున్నాడు ప్రతాప్ మిశ్రా.

ఫ్యామిలీ మెంబర్స్ మాటలు విని సీరియస్గా చూస్తూ "రాజస్థాన్ లో ప్రాపర్టీ ఉందని మీకు ఎవరు చెప్పారు? దాని గురించి మీకు ఏం తెలుసు?" అని అడిగాడు ముకుల్.

"ఎలా తెలిస్తే ఏముందిలే మావయ్య గారు! రాజస్థాన్లో బేరా అడవుల్లో వజ్రాల కొండలు ఉన్నాయని అవి మన ఆస్తి కన్నా మూడు రెట్లు విలువైనవని తెలిసింది. కానీ మాకు చూపించిన ఇండియా ఆస్తుల వివరాలలో వాటిని కనిపించకుండా చేశారు." అని అర్ణ వైపు చూస్తూ చెప్పాడు   రాజేష్.

"అవును! అక్కడ మైనింగ్ చేసే కాంట్రాక్ట్ కూడా గోకుల్ పెదనాన్న పేరుతో ఉన్న కంపెనీ పేరు మీద ఉంది." అని చెప్పాడు మోహిత్.

ఆ మాట విని షాక్ అయ్యి చూస్తూ "అంటే! మీరు నేను చెప్పిన మాట వినకుండా ఇండియాలో ఎవరితోనో టచ్ లో ఉన్నారు, ఎవరెవరు ఎవరితో టచ్ లో ఉన్నారో నాకు ఇపుడే తెలియాలి." అని ఆవేశంగా అడిగాడు ముకుల్.

"ఆ వజ్రాల కొండల గురించి ఇప్పటివరకు మాతో ఎందుకు చెప్పలేదో! ఆ విషయం కూడా చెప్పండి." అని దీర్ఘం తీస్తూ అడిగాడు రఘురామ్.

"అర్ణ! నువ్వు కూడా ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ గురించి చెప్పినప్పుడు ఆ వజ్రాల కొండల గురించి ఎందుకు చెప్పలేదు?" అని కోపంగా చూస్తూ అడిగింది ఝాన్సీ.

"అత్త! ఆ విషయం నాకు కూడా రెండు రోజుల క్రితమే తెలిసింది." అని చెప్పింది అర్ణ.

"నేను అడిగిన దానికి మీరు ఎవరు సమాధానం చెప్పలేదు, మీరు ఇండియాలో ఎవరెవరు ఎవరితో టచ్ లో ఉన్నారు? ఆ కొండల గురించి మీతో ఎవరు చెప్పారు?" అని గట్టిగా అడిగాడు ముకుల్.

"అంటే డాడ్! ఆ విషయం మాకు తెలియకూడదు అని మీరు అనుకున్నారా?" అని అడిగాడు ప్రవీణ్.

"అవును! ఆ విషయం మీకు తెలియకూడదు అనుకున్నాను, ఆ కొండల వల్లే మీ అన్నయ్య చనిపోయాడు. నేను కూడా 12 సంవత్సరాలుగా పుట్టిన దేశంలో ఆస్తులు వ్యాపారాలు వదిలేసి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను." అని బాధపడుతూ చెప్పాడు ముకుల్.

"మీరు గోకుల్ అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పారు, మళ్లీ ఇప్పుడు ఆ కొండల గురించి చనిపోయాడు అని చెప్తున్నారు, సరే ఆ విషయం వదిలేయండి. వాటి గురించి మీరు ఇండియా ఎందుకు వెళ్ళలేదు?"  అని అడిగింది నళిని.

ఆ మాటకి కోపంగా చూస్తూ "నా వంశాన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని బతికించుకోవడానికి!" అని జరిగిన విషయం మొత్తం వివరంగా చెప్పాడు ముకుల్.

జరిగింది మొత్తం విని నవ్వుతూ "తాతయ్య! నువ్వు ఇంత సిల్లిగా ఆలోచిస్తావు అనుకోలేదు. ఇటువంటి చిన్న విషయానికి భయపడి ఇండియా వెళ్లకుండా మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపేసావా? ఈ విషయం మాకు తెలిస్తే  ఆ జైల్లో ఉన్నవాడిని ఎప్పుడో క్లోజ్ చేసే వాళ్ళము." అని చెప్పాడు విష్ణు.

"తాతయ్య! మీరు భయపడి వెళ్లలేదు మరి అభిజిత్ అంకుల్ ఫ్యామిలీ అక్కడే ఉన్నారు కదా! ఆ అడవి మనుషులు వాళ్ళని ఏమి చేయలేదు.

వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు మనమే వాల్యుబుల్ ప్రాపర్టీస్ వదులుకొని బిజినెస్ లు వదులుకొని దూరంగా బతుకుతున్నాము." అని చెప్పాడు మోహిత్.

"మావయ్య గారు! మిమ్మల్ని భయపెట్టి అక్కడి నుంచి పంపించి ఆ అభిజిత్ ఫ్యామిలీ మన వ్యాపారాలు కూడా వాళ్లే చేసుకుంటూ మనకన్న ఎక్కువ సంపాదించారు.

అసలు ఇప్పుడు అక్కడ వజ్రాల కొండలు ఉన్నాయో ఉట్టి మట్టి మిగిల్చారో ముందు అది చూడండి." అని నవ్వుతూ చెప్పాడు రఘురామ్.

"మీరు అనుకున్నంత ఈజీ కాదు, అభిజిత్ ఫ్యామిలీ కూడా ఆ కొండల జోలికి వెళ్లలేదు. ఆ తెగ వాళ్ళు ఇప్పటివరకు ఆ ఫ్యామిలీని ఏమి చేయకుండా ఎందుకు ఉన్నారో నాకు తెలియదు. కానీ అభీర్ నోటి నుంచి వచ్చిన మాట తప్పకుండా జరుగుతుంది." అని చెప్పాడు ముకుల్.

"డాడ్! ఆ తెగ వాళ్ళు బతికున్నారో లేదో కూడా తెలియదు ఒక్కడు మనల్ని ఏమి చేయగలడు దాని గురించి మీరు పెద్దగా వర్రీ అవ్వకండి." అని చెప్పాడు సుభాష్.

"డాడ్! మీరు అన్ని కోట్లు ఖర్చుపెట్టి వాడిని 12 సంవత్సరాలు జైల్లోకి పెట్టి కడుపునిండా అన్నం పెట్టించారు, ఆ డబ్బు వేరే విధంగా ఖర్చుపెడితే వాళ్ల మనుషులతో పై లోకంలో హ్యాపీగా ఉండేవాడు." అని నవ్వుతూ చెప్పింది నళిని.

అక్కడ ఉన్న వారి మాటలు వింటూ 'వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అంతమందిని చంపేశారు పాపం అని కూడా చెప్పడం లేదు, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.' అని మనసులో అనుకున్నడు ప్రతాప్ మిశ్ర.

"సరే మావయ్య గారు! మీకు ఆ అభీర్ బతికి ఉంటేనే కదా ప్రాబ్లం! వాడు చనిపోతే మీరు హ్యాపీగా ఇండియాలో అడుగుపెడతారు కదా! ఆ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను." అని చెప్పాడు రఘురామ్.

"ఆ ప్రాబ్లం క్లియర్ చేశాను కదా అని ఆ కొండలలో వచ్చే లాభంలో ఎక్కువ కావాలి అంటే కుదరదు." అని చెప్పాడు చిన్నల్లుడు రాజేష్.

అందరి మాటలు విని "ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? ఆ ప్రాబ్లం లో మనం ఎంటర్ అవ్వడం తాత గారికి ఇష్టం లేదు, అందుకే మన ప్రాపర్టీ లో ఒకటి మినిష్టర్ వరదరాజులకి చాలా చీప్ గా ఇవ్వడానికి ఒప్పుకున్నాను.

ఇప్పుడు ఇండియాలో మనకి ఏ ప్రాబ్లం వచ్చిన ఆ మినిస్టర్ మనకి అండగా ఉంటాడు, అతని బలం బలగం పలుకుబడి నాకు బాగా తెలుసు! ఆ అభీర్ సంగతి కూడా అతనే చూసుకుంటాడు." అని చెప్పింది వర్ణ.

ఆ మాట విని షాక్ అయి చూస్తూ "అమ్మ దీనమ్మ! ఇంత ప్లాన్ వేసిందా? ఇంకా మన తెలివితేటలతో చీప్ గా కొట్టేసాము అనుకున్నను ఇది మామూలు కంచు కాదు." అని మనసు అని అనుకున్నాడు ప్రతాప్ మిశ్ర.
[+] 9 users Like SivaSai's post
Like Reply
(03-02-2026, 07:23 AM)SivaSai Wrote: ఎపిసోడ్ 57


...

...

"మేడం! ఇప్పుడు నేను చేయబోయే యుద్ధం ఎవరికి తెలియని ఎవరు చదవనటువంటి ఐదవ వేదం! దీంట్లో శత్రువు మీద దాడి ఎవరు ఊహించని విధంగా ఉంటుంది." అని చెప్పాడు అభీర్.
mahabharatanni aidava vedam antaru kada?
so, abheer sena with five people .. pandava sena with Krishna
atu vaipu.. vandala mandi.. kaurava sena!! Mukul .. bheeshma pitamahudu, last ki potadu!!

I guess this makes sense!!
Sivanna.. nuvvu keka!!

All said and done, nee writing style.. nee narration.. next level!!
Like Reply
Excellent update
Like Reply
(04-02-2026, 07:54 AM)ash.enigma Wrote: mahabharatanni aidava vedam antaru kada?
so, abheer sena with five people .. pandava sena with Krishna
atu vaipu.. vandala mandi.. kaurava sena!! Mukul .. bheeshma pitamahudu, last ki potadu!!

I guess this makes sense!!
Sivanna.. nuvvu keka!!

All said and done, nee writing style.. nee narration.. next level!!

Thank You For Supporting me
Like Reply
ఎపిసోడ్ 61


ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన మాటలు విని ఆ ప్రాబ్లంలో మనం తల దూర్చడం  తాత గారికి ఇష్టం లేదు అందుకనే మనం వెళ్లకుండా అక్కడ మనకి హెల్ప్ చేసే మనిషి కావాలని వరదరాజులకి ప్రాపర్టీ తక్కువ రేట్ కి ఇచ్చాను అని చెప్పింది అర్ణ.

*********************

అర్ణ చెప్పిన మాట విని "మనకు హెల్ప్ చేసినందుకు వరదరాజులకి గిఫ్ట్ గా 2500 కోట్ల? ఒక్కడిని మన దారిలోంచి తప్పించడానికి అంత ఖర్చు పెట్టాలా?" అని వెటకారంగా అడిగాడు రఘూరామ్.

ఆ మాటకి కోపంగా చూస్తూ "మన చేతికి మట్టి అంటకుండా ఉండాలి అంటే కొన్నిసార్లు ఖర్చు పెట్టాకా తప్పదు." అని చెప్పింది అర్ణ.

"తాతగారు చెప్పిందానికి నువ్వు భయపడితే చేతులు ముడుసుకుని ఇక్కడే ఉండు, ఇండియా విషయం క్లియర్ చేసి నీ వాట షేర్ నీకు పంపిస్తాను." అని చెప్పాడు విష్ణు.

"సరే అయితే! వరదరాజులు గారికి మాట ఇచ్చాను కాబట్టి ఆ ప్రాపర్టీ ఇవ్వక తప్పదు, వచ్చే నష్టాన్ని నా షేర్ లో నుంచి తీసేయండి. ఇప్పుడు ఇండియా వెళ్లి ఆ ప్రాబ్లం ని అక్కడ ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఎవరు డీల్ చేయగలరో చెప్పండి?" అని అడిగింది అర్ణ.

అంతలో హడావిడిగా అక్కడికి వస్తూ "డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. మా సుజిత్, వరదరాజులు గారి దగ్గర ఉన్నాడంట! అర్జెంటుగా అర్ణ తో మాట్లాడాలని కాల్ చేశాడు." అనిఫోన్ స్పీకర్ ఆన్ చేసి టేబుల్ మీద పెట్టాడు ప్రతాప్ మిశ్ర.

"హలో సుజీత్ నేను ముకుల్ ని మాట్లాడుతున్నాను ఏంటి విషయం?" అని అడిగాడు.

"నమస్తే సార్! మినిస్టర్ వరదరాజుల అంకుల్ కి మార్నింగ్ ఒక లెటర్ వచ్చింది దాంట్లో ప్రాణాలతో ఉండాలి అంటే నంద ఫ్యామిలీ ఆస్తులు కొనడానికి వెళ్ళకు ఇది అభీర్ సేన నాయకుడు ఆజ్ఞ, అని ఉంది. " అని చెప్పాడు సుజిత్.

"హ...! ఉంటే ఇప్పుడు దానికి భయపడి ఆ మినిష్టర్ ప్రాపర్టీ తీసుకోను అంటున్నాడా?" అని అడిగాడు ముకుల్.

"కాదు సర్! అతనితో లీగల్ గా ప్రాబ్లమా, లేక వేరే ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు. లీగల్ అయితే ప్రాపర్టీ తీసుకోను అని చెప్పారు, వేరే ప్రాబ్లం అయితే వాడి సంగతి వీళ్ళు చూసుకుంటారంట!" అని చెప్పాడు సుజిత్.

"అవునా? రేపు 1000 కోట్లు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోమను తర్వాత ఆ అభీర్ సేన నాయుకుడిని చంపి ఫోన్ చేయమను మిగిలిన అమౌంట్ కూడా అవసరం లేదు  నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాను." అని చెప్పాడు ముకుల్.

"ఓకే సార్! నేను మాట్లాడుతాను." అని  చెప్పి ఫోన్ పెట్టేసాడు సుజిత్.

ఫోన్లో చెప్పిన మాట విని "తాతగారు అది కాదు!" అని మాట్లాడబోతున్న విష్ణు వైపు చూసి

"ఒక్క క్షణం ఉండు." అని చెప్పి అర్ణ వైపు చూసి "లాయర్ హిరణ్యకి కాల్ చెయ్!" అని చెప్పాడు ముకుల్.

"సరే తాతయ్య!"అని ఫోన్ తీసుకుని హిరణ్య కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి టేబుల్ మీద పెట్టింది అర్ణ.

ఫోన్ లిఫ్ట్ చేసి "లాయర్ హిరణ్య స్పీకింగ్!" అని చెప్పాడు.

"నేను లండన్ నుంచి ముకుల్ నందని మాట్లాడుతున్నాను నిన్ను కోర్టుకి వెళ్ళొద్దని అభీర్ వార్నింగ్ ఇచ్చాడు కదా ఏమి డిసైడ్ అయ్యావు?" అని అడిగాడు ముకుల్.

"సార్! ఇటువంటి బెదిరింపులకు భయపడితే నేను ఈ లాయర్ వృత్తి చేయలేను రేపు ఉదయం కోర్టుకి వెళతాను వాడు ఏం చేస్తాడో చూస్తాను." అని చెప్పాడు హిరణ్య.

"గుడ్ డెసిషన్! రేపు నా మనిషి సూజిత్ అని కోర్టు దగ్గరికి వస్తాడు వాడు తీసుకొచ్చిన అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించు." అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కడ ఉన్న వారి వైపు చూసి

"రేపు ఉదయం 10:30 అభీర్ మాట కాదని రెండు విషయాలు జరుగుతున్నాయి, హిరణ్య కోర్టులో కాలు పెట్టిన, సుజిత్ చేతికి వెయ్యి కోట్ల వచ్చిన స్పెషల్ ఫ్లైట్లో అందరూ ఇండియా బయలుదేరి వెళ్ళండి మీరు అనుకున్నది చేయండి." అని చెప్పాడు ముకుల్.

ఆ మాట విని నవ్వుతూ "రెండు జరిగే పనులే రేపు ఇండియా ఎవరెవరు వస్తారో రెడీ అవ్వండి." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘురామ్.

అక్కడినుంచి అందరూ వెళ్లిపోవడంతో ముకుల్ దగ్గరికి వచ్చి "తాతయ్య! మామయ్య చెప్పినట్టు రెండు జరుగుతాయి అందరూ ఇండియా వెళ్లడం జరుగుతుంది." అని చెప్పింది అర్ణ.

"ఆవును! అభీర్ చెప్పిన మాట కచ్చితంగా జరుగుతుంది." అని తన రూమ్ లోకి వెళ్లిపోయాడు ముకుల్.

పక్కనే ఉన్న ప్రతాప్ మిశ్ర వైపు చూసి "అంకుల్! జరిగిందంతా విన్నారు కదా! మీకేమి అనిపిస్తుంది?" అని అడిగింది అర్ణ.

"బేబీ! 12 సంవత్సరాలుగా ఏమి చేయలేని వాడు ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడు, ఒకవేళ వాడు ఏదైనా చేయాలి అనుకున్న అక్కడుంది వరదరాజులు!" అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"మీ కాన్ఫిడెన్స్  నాకు నచ్చింది." అని అక్కడ ఉన్న వర్కర్ వైపు చూసి "రాము! ఈరోజు తాత గారికి ఇండియా వంటకాలు వండి పెట్టు!" అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం!" అని చెప్పాడు రాము.

అక్కడ నుంచి వెళుతున్న అర్ణ వైపు చూసి 'ఈ ఫ్యామిలీ మనుషులు ఎవరికీ అర్థం కారు, ఇప్పుడు ఆ ముసలోడికి ఇండియా తిండి ఎందుకు!

పాత విషయాలు గుర్తు చేయడానికా? లేక నువ్వు కూడా ఇండియా మాతోపాటు రాక తప్పదు అని సింబాలిక్ గా చెప్పడానికా?' అని మనసులో అనుకున్నాడు ప్రతాప్ మిశ్ర.

***************

మరుసటి రోజు ఉదయం కోర్టు దగ్గరికి వచ్చిన హిరణ్యని చూసి "భయపడి కోర్టుకు రారు అనుకున్నాను, ధైర్యం చేసి బానే వచ్చారు." అని నవ్వుతూ పలకరించింది వసుంధర.

"ఇలాంటి బెదిరింపులు నేను ఎన్ని చూడలేదు, అయినా వైఫై లాగ నా చూస్తూ ఏప్పుడు నా మనుషులు ఉంటారు." అని పక్కన ఉన్న మనిషిని చూపించి "వీడు నా రైట్ హ్యాండ్ జాజి, వీడిని దాటి ఎవరు నా దగ్గరికి రాలేరు.

మరొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ రోజే నంద గ్రూపు సంబంధించిన ప్రాపర్టీ అగ్రిమెంట్ కూడా జరుగుతుంది. వాళ్ళకి వరదరాజులు అని ఒక పెద్ద గోడ అడ్డంగా ఉంటుంది.

ఇంకా మీ అభీర్ బట్టలు సదురుకుని మళ్ళీ అడవికి వెళ్ళిపోవడమే!" అని నవ్వుతూ కోర్టు హాల్లోకి వెళ్ళాడు హిర్వాణి.

సుమతితో కలిసి అక్కడికి వచ్చి "వదిన! ఈ లాయర్ కోర్టుకు వచ్చాడు, ఆ నంద గ్రూప్ వాళ్ళు అగ్రిమెంట్ కి వస్తున్నారు, అభీర్ ఏంటి సైలెంట్ గా ఉన్నాడు?" అని డౌట్ గా అడిగింది నీలమ్.

"ఈరోజు గడవడానికి ఇంకా చాలా టైం ఉంది కదా చూద్దాము." అని కోర్ట్ లోపలికి వెళ్ళింది వసుంధర.

అక్కడికి చాక్లెట్ తో కలిసి వస్తున్న మిత్రని చూసి "ఏంటి? ఏం ప్లాన్ చేశారు?" అని నెమ్మదిగా అడిగింది నీలమ్.

"అక్క! ప్లాన్ ఏమి లేదు వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వండి. ఎవరు డిస్టర్బ్ చెయ్యొద్దు అని అభీర్ భయ్యా ఆర్డర్!" అని చెప్పాడు చాక్లెట్.

"అవునా? ఇక్కడ ఏదో పెద్ద ఫైటింగ్ సీన్ ఉంటుంది అనుకుని కెమెరాలు వేసుకుని వచ్చేసాము." అని డల్ గా చెప్పింది నీలమ్.

అంతలో కార్ దిగి అక్కడికి వస్తున్న ఇద్దరినీ చూపించి "లండన్ నుంచి నంద ఫ్యామిలీ ఆస్తులు అమ్మడానికి వచ్చింది అతనే సుజిత్, పక్కన ఉన్నవాడు మినిష్టర్ వరదరాజులు కొడుకు తంబీయర్ పెద్ద వెధవ!

లాయర్ హిరణ్యతో అగ్రిమెంట్ రాయించడానికి వస్తున్నారు ఇప్పుడు వెయ్యి కోట్లు అడ్వాన్స్ చేతులు మారుతుంది." అని చెప్పింది మిత్ర.

కాసేపటికి కోర్టు లోపలి నుంచి హిరణ్యతో కలిసి బయటకు వచ్చి అర్ణకి కి కాల్ చేశాడు సుజిత్.

లండన్ లో ఇంటిదగ్గర ఫ్యామిలి మెంబర్స్ తో కలిసి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా మొబైల్ రింగ్ అవ్వడంతో చూసి "సుజిత్ కాల్ చేసాడు." అని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి "సుజిత్ టెల్ మీ? అగ్రిమెంట్ అయిందా?" అని ఆత్రుతగా అడిగింది అర్ణ.

"ఎస్" ఇప్పుడే అగ్రిమెంట్ అయింది. ఇక్కడకు అభీర్ రాలేదు బుబ్బీర్ రాలేదు వరదరాజుల అంకుల్ పేరు వినేసరికి భయపడి పారిపోయి ఉంటాడు." అని చెప్పాడు సుజిత్.

ఫోన్లో ఆ మాట విని "నేను చెప్పానా! అక్కడికి ఎవడు రాడు ఫ్లైట్ రెడీగా ఉంది ఎవరెవరు వస్తున్నారో బయలుదేరండి." అని చెప్పాడు రఘురామ్.

ఫోన్ దగ్గరికి వచ్చి "అక్కడ అంతా బానే ఉందా?" అని అడిగాడు ముకుల్.

ఆ మాట విని ఫోన్ తీసుకుని "సార్! నేను కూడా కోర్టు దగ్గరే ఉన్నాను ఎవ్వరు రాలేదు." అని చెప్పాడు హిరణ్య.

"సరే!" అని ఫోన్ పెట్టేసాడు మూకుల్.

"తాతగారు మేమందరం ఇండియా బయలుదేరుతున్నాము." అని అర్ణ వైపు చూసి "తాతగారిని జాగ్రత్తగా చూసుకో!" అని  చెప్పాడు విష్ణు.

అక్కడ నుంచి అందరు ఎయిర్ పోర్ట్ కి బయలుదేరడంతో అర్ణ వైపు అసహనంగా చూస్తూ "ఇండియాలో మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది." అది టెన్షన్ గా చూస్తూ అన్నాడు ముకుల్.

*************

ఢిల్లీ ఇంటి దగ్గర పక్షులకి ఆహారం వేస్తూ ఉన్న అభీర్ దగ్గరికి వచ్చి "లండన్ నుంచి రాము ఫోన్ చేశాడు ముకుల్ ఫ్యామిలీ ఎక్కిన ఫ్లైట్ ఇండియాకి బయలుదేరింది." అని చెప్పాడు బైరి.

ఆ మాట విని "హిరణ్య కి సెక్యూరిటీగా ఉన్న జాజికి ఫోన్ చేసి వాడి తల తీసుకు రమ్మను." అని చెప్పాడు అభీర్.

"మరి సుజిత్ దగ్గరికి రాబోతున్న వెయ్యి కోట్లు!" అని అడిగాడు బైరి.

"ఆ విషయం సింబా చూసుకుంటాడు, ఈ గడ్డమీద అడుగుపెడుతున్న ముకుల్ ఫ్యామిలీకి ఘనంగా స్వాగతం పలకండి." అని చెప్పాడు అభీర్.

"సరే!" అని ఫోన్ చేసి "జాజి! లాయర్ హిరణ్య తల నాయకుడు చూడాలి అంటున్నాడు." అని చెప్పాడు బైరి.
[+] 9 users Like SivaSai's post
Like Reply
ఎపిసోడ్ 62


ముకుల్ ఫ్యామిలీ ఇండియా బయలుదేరారు అని చెప్పిన బైరి వైపు చూసి జాజి కి ఫోన్ చేసి హిరణ్య తల పట్టుకు రమ్మను, సుజిత్ దగ్గర డబ్బు సంగతి సింబా చూసుకుంటాడు మీరు ముకుల్ ఫ్యామిలీకి ఘన స్వాగతం పలకండి అని చెప్పాడు అభీర్.

***********************

అభీర్ చెప్పినా మాట విని "సరే నాయకుడా!" అని చెప్పి జాజి కి ఫోన్ చేసాడు బైరి.

కోర్టు దగ్గర హిరణ్య ఛాంబర్ లో నవ్వుతూ మాట్లాడుతున్న సుజిత్ వాళ్ళని చూసి "అభీర్ ఇలా సైలెంట్ అయిపోతాడని నేను అస్సలు ఊహించలేదు, వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఇరిటేషన్ గా ఉంది." అని చెప్పింది నీలమ్.

"ఈరోజు గడవడానికి చాలా టైం ఉంది అని వసుంధర అక్క చెప్పింది కానీ, ఇప్పుడు మధ్యాహ్నం ఒంటిగంట అయింది సగం రోజు గడిచిపోయింది." అని చెప్పింది సుమతి.

"అక్క! ఆ లాయర్ గాడి పక్కన  జాజి అంట ఎలా ఉన్నాడో చూడు చూస్తేనే భయం వేస్తుంది. ఇంక దగ్గరికి ఎవరు వెళతారు?" అని చెప్పాడు చాక్లెట్.

అంతలో అక్కడికి వచ్చిన కార్ లోనుంచి రెండు పెద్ద సూట్ కేసులు దింపడం చూసి "క్యాష్ కూడా వచ్చేసింది ఇంకేముంది హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు." అని చెప్పింది మిత్ర.

బయట కారు దగ్గర నుంచున్న తన మనుషులని చూసి "సుజిత్! క్యాష్ వచ్చింది వెళదామా?" అని అడిగాడు తంబియార్.

"సరే! అని హిరణ్య వైపు చూసి "లాయర్ గారు! మేము బయలుదేరుతున్నము సాయంత్రం గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేయండి మంచి పార్టీ అరేంజ్ చేశాను." అని చెప్పాడు సుజిత్.

"సరే సరే! అలాంటి పార్టీలు నేను అసలు మిస్ అవ్వను జాగ్రత్తగా వెళ్ళిరండి. అసలే వెయ్యి కోట్లు!" అని చెప్పాడు హిరణ్య.

ఆ మాటకి నవ్వుతూ "ఇదేం చూశారు ఇంక ముందు ముందు ఇలాంటి సూట్ కేసులు చాలా వస్తాయి, మీ చేతుల మీదగానే అగ్రిమెంట్లు కూడా అవుతూ ఉంటాయి." అని చెప్పి బయటికి వెళ్ళాడు సుజిత్.

'నా చేతుల మీదుగా అగ్రిమెంట్లు అయితే నాకు ఏంటి ఉపయోగం!' అని మనసులో అనుకుని జాజి వైపు చూసి "సూట్ కేస్ ఫైల్స్ తీసుకో వేరే కోర్టు దగ్గరికి వెళ్ళాలి." అని చెప్పాడు హిరణ్య.

"ఓకే సార్!" అని రూమ్ లోపలికి వచ్చాడు జాజి.

సుజిత్ తో కలిసి కారు దగ్గరికి వచ్చి "రెండు సూట్ కేసులు కలిపి 1000 కోట్లు మొత్తం 2000 నోట్లు!" అని చెప్పి ఆకాశంలో అరుపులు వినపడడంతో తలపైకి ఎత్తి "ఏంటి!ఇన్ని రాబందులు ఎగురుతున్నాయి?" అని విచిత్రంగా చూస్తూ చెప్పాడు తంబియార్.

ఆ మాట విని ఆకాశం వైపు చూస్తూ "ఆ పక్షి ఏంటి అంత పెద్దగా ఉంది?" అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు సుజిత్.

ఆకాశంలో వేగంగా ఎగురుకుంటూ వస్తున్న పక్షిని చూసి "అది మన అభీర్ ఫ్రెండ్ సింబా కదా!" అని డౌట్ గా అడిగింది నీలమ్.

అక్కడికి వస్తూ "అవును! సింబా వస్తున్నాడు అంటే అభీర్ వచ్చినట్లే!" అని సంతోషంగా చూస్తూ చెప్పింది వసుంధర.

"ఆ పక్షులు గోలా మనకెందుకు కానీ ఆ అగ్రిమెంట్ ఇచ్చి క్యాష్ తీసుకో!" అని సుజిత్ చేతిలో ఉన్న అగ్రిమెంట్ ని పట్టుకున్నాడు తంబియార్.

"సరే!"అని అగ్రిమెంట్ ఇచ్చి సూట్ కేసు మీద చెయ్యి వేసి  వేగంగా మీదకి వస్తున్నా పక్షిని చూసి భయంతో వెనక్కి వచ్చాడు సుజిత్.

సూట్ కేసుల మీద వాలి తన రెండు కాళ్లతో రెండు సూట్ కేసులు పట్టుకుని వేగంగా గాలిలోకి ఎగిరిపోయాడు సింబా.

సూట్ కేసులతో గాలిలో ఎగిరిపోతున్న సింబాని చూసి "1000 కోట్లు! 1000 కోట్లు!" అని అరుస్తూ వెనకాల పరిగెత్తాడు తంబియర్.

సింబా రెండు సూట్ కేసులు పట్టుకుని ఎగిరిపోవడం చూసి "పాపిష్టి డబ్బుకి రెక్కలు వస్తాయి అంటే ఇదేనేమో!" అని నవ్వుతూ చెప్పింది మిత్ర.

"పాపం హిరణ్య మంచి సీన్ మిస్ అయిపోయాడు." అని చాక్లెట్ వైపు చూసి "వెళ్లి లాయర్ గారిని బయటికి పిలుచుకు రా.!" అని చెప్పింది వసుంధర.

"సరే మేడం!" అని చెప్పి చాంబర్ దగ్గరికి వెళ్లి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి "మేడం! లాయర్ గారు బయటికి వచ్చిన చూడలేరు పాపం ఆయన తల ఎవరో పట్టుకు వెళ్ళిపోయారు." అని జాలిగా చూస్తూ చెప్పాడు చాక్లెట్.

ఆ మాట విని షాక్ అయ్యి ఛాంబర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి తల లేని హిరణ్య మొండెం చూసి "అందరం ఇక్కడే ఉన్నాము అంతలో ఎవరు వచ్చి వీడి తల పట్టుకెళ్ళిపోయారు?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది వసుంధర.

"నా రైట్ హ్యాండ్ జాజిని దాటి ఎవరు దగ్గరికి రాలేరు అన్నాడు కదా, అందుకునే అతనే  హిరణ్య తల పట్టుకెళ్ళి పోతున్నాడు." అని చూపించింది  మిత్ర.

తల లేని హిరణ్యని చూసి "నా కోపం ఇప్పుడు కొంచెం తగ్గింది." అని సంతోషంగా చూస్తూ చెప్పింది సుమతి.

"కొంచెం లేట్ అయ్యినా అభీర్ చెప్పింది చేసాడు." అని చెప్పింది నీలమ్.

"నాకు తెలిసి అభీర్ లేట్ చేయడానికి కూడా కారణం ఉండే ఉంటుంది." అని చెప్పింది వసుంధర.

అక్కడికి వస్తు "మీరు చెప్పింది కరెక్టే! లండన్ లో ముకుల్ ఫ్యామిలీ ఇండియాకి బయలుదేరేవరకు అభీర్ వెయిట్ చేశాడు. పులి మటువేసి వేటాడడం విన్నానే కానీ ఇప్పుడు చూస్తున్నను." అని చెప్పాడు శ్రీకర్.

"ఈ విషయం ముకుల్ నందకి తెలిస్తే, ఫ్యామిలీ మెంబర్స్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లొ దిగడం ఆలస్యం మళ్లీ అదే ఫ్లైట్లో వెనక్కి తీసుకు వెళ్తాడు." అని చెప్పింది వసుంధర.

"నాకు తెలిసి వాళ్ళు ఇక్కడికి అడుగు పెట్టడమే కానీ వెనక్కి తిరిగి వెళ్ళలేరు అభీర్ ఆ విషయం గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించే ఉంటాడు." అని చెప్పింది మిత్ర.

తన ఆఫీసర్స్ తో అక్కడికి వచ్చి శ్రీకర్ వైపు చూసి "సార్! ఇప్పుడు ఈ మర్డర్ కేస్, ఆ చోరీ కేస్ ఏమని ఫైల్ చేయాలి?" అని డౌట్ గా అడిగాడు దయా.

"హిరణ్య గారికి కి శత్రువులు తక్కువేమీ లేరు ఎవడో కడుపు మండి తల నరికేసాడు అని ఫైల్ చెయ్, ఇంకా చోరీ కేసు అంటావా! రాబందుల మీద పెట్టాలి.

ఆకాశంలో చాలా ఎగురుతున్నాయి బ్యాగ్ లు ఎత్తుకు వెళ్ళింది ఏ పక్షో  తంబియార్  గారు గుర్తుపడితే అరెస్ట్ చెయ్యొచ్చు!" అని నవ్వుతూ చెప్పాడు శ్రీకర్.

*******************

లండన్ ముకుల్ ఇంటి దగ్గర ఫోన్ రింగ్ అవడం చూసి "సార్! సుజిత్ కాల్ చేస్తున్నాడు 1000 కొట్టు చేతికి వచ్చాయి అనుకుంటా!" అని సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి "డబ్బు అందిందా? గెస్ట్ హౌస్ కి వచ్చేసావా?" అని అడిగాడు ప్రతాప్ మిశ్ర.

"డాడ్! ఇక్కడ అంతా అయోమయంగా ఉంది. 1000 కోట్లు ఉన్న రెండు సూట్ కేసులు ఒక పెద్ద పక్షి వచ్చి మా కళ్ళముందే  ఎత్తుకు వెళ్లిపోయింది. అప్పటీ వరకు మాతో మాట్లాడిన హిరణ్య తల ఎవరో తీసుకువెళ్లిపోయారు." అని టెన్షన్ గా చెప్పాడు సుజిత్.

ఆ మాట విని "పక్షి డబ్బులు ఎత్తుకు వెళ్లడం ఏమిటి రా..! అయినా మీరు అక్కడ ఉండగా ఆ లాయర్ తల ఎవరు తీసుకు వెళ్ళారు? అక్కడ తంబియర్ ఉన్నాడా?" అని కంగారుగా అడిగాడు ప్రతాప్ మిశ్ర.

"డాడ్! తంబియార్ ఆ పక్షి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, సెక్యూరిటీ ఆఫీసర్లు హిరణ్య తల కోసం వెతుకుతున్నారు నాకు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ లొ నీకు కాల్ చేశాను." అని చెప్పాడు సుజిత్.

ఫోన్లో సుజిత్ చెప్పిన మాట విని అర్ణ వైపు చూసి "అభీర్ ని తక్కువ అంచనా వేయొద్దు అని నేను చెప్పానా? ఇప్పుడు చూడు ఫ్యామిలీ మొత్తం ఇండియా వెళ్లారు." అని టెంక్షన్ గా చూస్తూ చెప్పాడు ముకుల్.

ప్రశాంత్ మిస్రా చేతిలో ఫోన్ తీసుకుని "సుజిత్ నేను చెప్పేది జాగ్రత్తగా విను, లండన్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇండియా బయలుదేరారు ఈవినింగ్ ఫైవ్ కి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది.

వాళ్లు కిందకి దిగకు ముందే ఫ్లైట్ ని తిరిగి లండన్ పంపించాలి నీ దగ్గర ఉన్న మనుషులందరిని తీసుకుని వేళ్ళు ఆ ఫ్లైట్ దగ్గరికి మనవాళ్ళు కాకుండా వేరే మనిషి రాకూడదు." అని చెప్పింది అర్ణ.

"సరే సరే! నేను చూసుకుంటాను." అని చెప్పి హడావుడిగా అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాడు సుజిత్.

ఫోన్ మాట్లాడుతున్న అర్ణ వైపు టెన్షన్ గా చూస్తూ "ఇది సుజిత్ ఒక్కడి వల్ల అవ్వదు వెంటనే మిథున్ కి కాల్ చెయ్! అవసరమైతే ఎయిర్ పోర్ట్ స్టాఫ్ మొత్తాన్ని కొనేస్తాడు మన వాళ్ళని సేఫ్గా లండన్ పంపిస్తాడు." అని చెప్పాడు ముకుల్.

"సరే తాతయ్య!" అని హడావిడిగా మిథున్ కి కాల్ చేసింది అర్ణ.

మహేష్ తో కలిసి బీచ్ లో నడుస్తూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి "అర్ణ కాల్ చేస్తుంది." అని లిఫ్ట్ చేసి "హాయ్ అర్ణ! హౌ ఆర్ యు?" అని అడిగాడు మిథున్.

"నేను చెప్పేది జాగ్రత్తగా విను వివరాలు చెప్పే అంత టైం లేదు, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లొ మా ఫ్యామిలీ వస్తున్న స్పెషల్ ఫ్లైట్ ఈవినింగ్ ఫైవ్ కి ల్యాండ్ అవుతుంది.

మా వాళ్ళని కిందకి కూడా దిగనివ్వకుండా ఆ ఫ్లైట్ ని వెంటనే లండన్ పంపించాలి, నీ ఇన్ ఫ్లన్స్ మొత్తం ఉపయోగించు, ఎయిర్ పోర్ట్ లోకి బయట మనిషి రాకూడదు సుజిత్ కూడా అక్కడే ఉంటాడు." అని టెన్షన్ గా చెప్పింది అర్ణ.

"కూల్ కూల్! నువ్వేమి టెన్షన్ పడకు అవసరమైతే ఆ టైమ్ కి ఉన్న ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేయిస్తాను, నా మనుషుల్ని దాటుకుని ఎవరు ఎయిర్ పోర్ట్ లోకి రాలేరు.

మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఫ్లైట్ సేఫ్ గా లండన్ చేరుకుంటుంది. కరెక్ట్ గా 30 మినిట్స్ లో  నా మనిషి రాహుల్ నీకు కాల్ చేస్తాడు అవసరమైతే నీకు ఎయిర్ పోర్ట్ నుంచి లైవ్ ఇస్తాడు." అని చెప్పాడు మిథున్.

"ఓకే థాంక్యూ!" అని ఊపిరి పీల్చుకుని ఫోన్ పెట్టేసి ముకుల్ వైపు చూసి "తాతయ్య మనవాళ్లు సేఫ్ గా లండన్ వస్తారు." అని చెప్పింది అర్ణ.
[+] 11 users Like SivaSai's post
Like Reply
Excellent update
Like Reply
nice trap and nice update
Like Reply
Naraalu tegentha tension ga undi.
Dilli airport lo emavutunda ani!!!!

Bhayya eesaari update late ayinda.. abhir sainyanni ni neemeedaki pampinchalsi untundi!!  
horseridehorseride
Like Reply
ఎపిసోడ్ 63


అర్ణ కాల్ చేయడంతో నువ్వేమి టెన్షన్ పడకు కాసేపట్లో నా మనిషి రాహుల్ నీకు కాల్ చేస్తాడు అవసరమైతే ఎయిర్ పోర్ట్ నుంచి లైవ్ ఇస్తాడు మీ ఫ్యామిలీ మెంబర్స్ సేఫ్ గా లండన్ చేరుకుంటారు అని చెప్పాడు మిథున్.

*******************

మిథున్ తో ఫోన్లో మాట్లాడి ముకుల్ వైపు చూసి "తాతయ్య! మనవాళ్ళు సేఫ్గా లండన్ కి వస్తారు." అని చెప్పింది అర్ణ.

"అభీర్ కి ఎటువైపు నుంచి ఛాన్స్ ఇవ్వకూడదు." అని ప్రతాప్ మిశ్ర వైపు చూసి "వరదరాజులకి కాల్ చెయ్!" అని చెప్పాడు ముకుల్.

"సరే సర్!" అని ఫోన్ తీసి కాల్ చేశాడు ప్రతాప్ మిశ్ర.

డబ్బులు మిస్ అయ్యాయని టెన్షన్ లో ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "ప్రతాప్! డబ్బులు సుజిత్ చేతిలో ఉండగానే మిస్ అయ్యాయి." అని చెప్పాడు వరదరాజులు.

"ఒక్క నిమిషం లైన్లో ఉండు నీతో ముకుల్ సార్ మాట్లాడుతారంట!" అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"అవునా? ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాము పెద్దాయనదాకా ఎందుకు?" అని కంగారుగా అన్నాడు వరదరాజులు.

ప్రతాప్ దగ్గర ఫోన్ తీసుకుని "వరద బాగున్నావా?" అని అడిగాడు ముకుల్.

"అయ్యా నమస్కారం! మీరు పెట్టిన బిక్ష వల్ల సంతోషంగానే ఉన్నాను, కానీ ఈరోజు డబ్బు పోయిన విషయం తలుచుకుంటేనే కాస్త బాధగా ఉంది." అని చెప్పాడు వరదరాజులు.

"ఆ డబ్బు గురించి మర్చిపో, ఈరోజు నుంచి ఆ ఆస్తి నీదే  నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా!" అని చెప్పాడు ముకుల్.

"అయ్యా! మీ నోటి నుంచి మాట వచ్చింది అంటే రిజిస్ట్రేషన్ అయిపోయినట్లే లెక్క!" అని సంతోషంగా చెప్పాడు వరదరాజులు.

"నాకు ఇప్పుడు ఒక పని చేసి పెట్టాలి." అని చెప్పాడు ముకుల్.

"నేనేం చేయాలో చెప్పండి చాలు మీ పని అయిపోయినట్లే!" అని చెప్పాడు వరదరాజులు.

"నా ఫ్యామిలీ మొత్తం స్పెషల్ ఫ్లైట్లో సాయంత్రం ఐదు గంటలకి ఢిల్లీలో ఉంటారు, వాళ్లు ఫ్లైట్ దిగకుండానే లండన్ రిటర్న్ అవుతారు ఆ టైం కి ఎయిర్ పోర్ట్ నా మనుషుల హ్యాండ్ ఓవర్ లొ ఉంటుంది.

నువ్వు చేయవలసింది ఏమిటంటే ఫ్లైట్ ఢిల్లీ లొ దిగి లండన్ రిటర్న్ అయ్యేంతవరకు ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల నా మనుషులు తప్పితే వేరే మనిషి ఎంటర్ అవ్వకూడదు.

ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా మా నా ఫ్యామిలీ అక్కడ ఉండి పోవాల్సి వస్తే వాళ్ల మీద ఈగ కూడా వాడకూడదు." అని చెప్పాడు ముకుల్.

"అయ్యా! మీరు టెన్షన్ పడకండి నేనే స్వయంగా ఎయిర్ పోర్ట్ దగ్గర ఉంటాను, ఆ ఫ్లైట్ లోనే మీ ఫ్యామిలీ మెంబర్స్ ని లండన్ పంపించే బాధ్యత నాది. తర్వాత ఈ విషయంలో మిమ్మల్ని టెన్షన్ పెట్టిన వాడిని చంపే బాధ్యత కూడా నాదే!" అని చెప్పాడు వరదరాజులు.

"సరే! నీకు మళ్ళీ 5:30 తర్వాత కాల్ చేస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముకుల్.

ఫోన్ తీసుకుంటూ "సార్! మీరేమీ కంగారు పడకండి అక్కడికి మన సుజిత్ వెళుతున్నాడు మిథున్ గారి మనుషులు వెళుతున్నారు వరదరాజులు వెళుతున్నాడు వీళ్ళందర్నీ దాటుకుని వాడు అక్కడికి రాలేడు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

అంతలో ఫోన్ రింగ్ అవడం చూసి "రాహుల్ కాల్ చేస్తున్నాడు." అని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి "నువ్వు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళావా?" అని అడిగింది అర్ణ.

"మేడం! నేను ఎయిర్ పోర్ట్ లోనే ఉన్నాను, ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ఉన్న ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేయించాను. 3:30 తర్వాత ఎయిర్ పోర్ట్ లో మనవాళ్లు తప్ప ఎవ్వరూ ఉండరు, సుజిత్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు." అని చెప్పాడు రాహుల్.

"సరే! నాకు ఎయిర్ పోర్ట్ సీసీ కెమెరాస్ ఆక్సిస్ కావాలి." అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం! మీ మొబైల్ కి ఇప్పుడే లింక్ సెండ్ చేస్తున్నాను." అని చెప్పాడు రాహుల్.

"ఓకే!" అని చెప్పి ఫోన్ పెట్టేసి మెయిల్లో వచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఎయిర్ పోర్ట్ ని లైవ్ లొ ముకుల్, ప్రతాప్ మిశ్ర లతో  కలిసి చూస్తూ ఉంది అర్ణ.

*****************

ఇంటి దగ్గర సింబా తీసుకొచ్చిన సూట్ కేసులో డబ్బుని చూస్తూ, జాజి తీసుకువచ్చిన హిరణ్య తల వైపు చూసి  రెండు చేతులతో డబ్బులు తీసుకుని "వీటి కోసమేకదా ఆరాటం! ఈ డబ్బుల కట్టలలోనే వాడి తలని తగలబెట్టండి." అని చేతిలో ఉన్న డబ్బుని కింద పోశాడు అభీర్.

"సరే నాయకుడా!" అని కింద పోసిన డబ్బుని అంటించి దాంట్లో తలని పడేసాడు జాజి.

అక్కడికి వచ్చి "నాయకుడా! కాసేపటిలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ని ఈ గడ్డమీద అడుగుపెట్టనివ్వకుండా ఉండడానికి రక్షణగా తన మనుషులతో ఒక గోడ కట్టాడు." అని లాప్టాప్ లొ లైవ్ వీడియో చూపించడు బైరి.

వీడియో వైపు చూసి "లైవ్ వస్తుంది అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు?" అని అడిగాడు అభీర్.

"రాజన్, రియాలు సుజిత్ తో పాటు ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లారు వాళ్లే ఈ లింకు పంపించారు, నాకు తెలిసి ముకుల్ ఫ్యామిలీ తిరిగి లండన్ వెళ్లిపోతారు ఇప్పుడు ఏం చేద్దాము?" అని అడిగాడు బైరి.

ఆ మాట విని కళ్ళు మూసుకుని "రేపు ఉదయం 11:40 నిమిషాలకి ముకుల్ రెండో కొడుకు ప్రవీణ్ చావు ముహూర్తం నిర్ణయించాను, అది తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "అంటే! ముకుల్ ఫ్యామిలీ ఈ గడ్డమీద అడుగు పెడతారా? ఇక్కడే ఉంటారా?" అని అడిగాడు బైరి.

"అవును!" అని రెండు సూట్ కేస్ ల వైపు చూపించి "ఈ డబ్బులోనే వాళ్ళ తలలు కూడా తగలబడతాయి." అని చెప్పాడు అభీర్.

"సరే నాయకుడా!" అని రెండు సూట్ కేసులు తీసుకుని రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న అగస్త్య వైపు చూసి

"నాకు తెలిసి ముకుల్ వాళ్ళని ఇక్కడ ఉండనివ్వడు ఏదో విధంగా ఫ్లైట్ లొ లండన్ తీసుకువెళతాడు, కానీ నాయకుడు రేపు చావుకి ముహూర్తం పెట్టాడు ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు." అని చెప్పాడు బైరి.

"నాయకుడు నోటి నుంచి మాట వచ్చింది అంటే జరిగి తీరుతుంది చూస్తూ ఉండు." అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అగస్త్య.

**********************

ఎయిర్ పోర్ట్ లొ కాసేపట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని అందరూ హడావుడిలొ ఉండగా రాజన్ దగ్గరికి వచ్చి "మన ప్లాన్ ఫెయిల్ అయ్యేటట్లు ఉంది. వాళ్ళని ఫ్లైట్లో నుంచి దిగనివ్వకుండానే లండన్ రిటన్ పంపించేస్తారు." అని డల్ గా చెప్పింది రియా.

"నాకు తెలిసి అభీర్ ఏదో ఒకటి చేస్తాడు వాళ్ళని ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో వేళ్ళనివ్వడు." అని చెప్పాడు రాజన్.

"ఒక్కసారి చుట్టూ చూడు ఎంతమంది ఉన్నారో మనవాళ్లు కనీసం ఎయిర్ పోర్ట్ దగ్గరికి కూడా ఎంటర్ అవ్వలేరు." అని చెప్పింది రియా.

"అభీర్ సంకల్ప బలం గొప్పది తప్పకుండా జరిగి తీరుతుంది. అది ఎలానో నాకు కూడా తెలియదు కానీ వాళ్ళు తిరిగి వెళ్ళలేరు." అని చెప్పాడు రాజన్.

కాసేపటికి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం చూసి సుజిత్ వెనకాల వెళ్లారు ఇద్దరు.

అక్కడినుంచి హడావుడిగా రాహుల్ తో కలిసి ఫ్లైట్ దగ్గరికి కారులో వెళ్ళాడు సుజిత్.

ఎయిర్ పోర్ట్ లో ఉన్న తన కొడుకు వైపు చూసి "తంబియార్! నేను పెద్దాయనకి మాట ఇచ్చాను ఇది డబ్బు సమస్య కాదు పరువు సమస్య! మన వాళ్ళందరినీ ఎలర్ట్ గా ఉంచు ఆ ఫ్లైట్ ని లండన్ పంపించాలి ఒకవేళ  కుదరకపోతే వాళ్ళని క్షేమంగా మన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లాలి." అని చెప్పాడు వరదరాజులు.

"సరే నాన్న!" అని తన మనుషుల్ని తీసుకుని వెళ్ళాడు తంబియార్.

రాహుల్ తో కలిసి ఫ్లైట్ లోపలకి వెళ్లి దిగడానికి రెడీ అవుతున్న విష్ణు వాళ్లని చూసి "వెయిట్! వెయిట్! ఎవరు కిందకి దిగకండి. మీతో తాతయ్య గారు మాట్లాడతారు." అని లాప్టాప్ లో వీడియో కాల్ లో ఉన్న ముకుల్ ని చూపించాడు సుజిత్.

వీడియో కాల్ లో ఉన్న ముకుల్ వైపు చూసి "వాట్ హప్పెండ్ తాతయ్య?" అని డౌట్ గా అడిగాడు విష్ణు.

వీడియో కాల్ లోకి వచ్చి "విష్ణు! మీరు స్టార్ట్ అయ్యినా ఆఫెన్ అవర్ కి  ఇండియాలో లాయర్ హిరణ్యని దారుణంగా చంపేశారు, అగ్రిమెంట్ కి ఇచ్చిన డబ్బులు పక్షులు తీసుకువెళ్లిపోయాయి, ఇటువంటి సిచువేషన్ లో మీరు అక్కడికి వెళ్లడం మంచిది కాదు అందుకే ఫ్లైట్ ని వెంటనే లండన్ కి రప్పిస్తున్నాము." అని చెప్పింది అర్ణ.

ఆ మాట విని వీడియో కాల్ దగ్గరికి వచ్చి నవ్వుతూ "ఏంటి? డబ్బులు పక్షులు ఎత్తుకు వెళ్ళిపోయాయా? ప్లాన్ చేసేటప్పుడు అయినా కరెక్ట్ గా చేయాలి కదా అర్ణ!" అని వెటకారంగా అడిగాడు రఘురామ్.

ఆ మాటకి కోపంగా చూస్తూ "మీకు చెబితే అర్థం కావడం లేదా? నా ఆస్తిలో వాట కావాలి అంటే వెనక్కి రండి. అవసరం లేదు అనుకుంటే కిందకి దిగి చావండి." అని చెప్పాడు ముకుల్.

"డాడ్! అంత కోపం ఎందుకు? మీ మాట ఎప్పుడైనా కాదన్నామా! సరే ఇప్పుడే రిటర్న్ అయిపోతాము." అని నిదానంగా చెప్పింది ఝాన్సీ.

వీడియో కాల్ చూస్తూ "సుజిత్ నువ్వు కూడా ఆ ఫ్లైట్లో లండన్ కి వచ్చేయ్!" అని కంగారుగా చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"ఓకే డాడ్!" అని రాహుల్ వైపు చూసి "మీరు వెళ్ళండి నేను కూడా వీళ్ళతో పాటు లండన్ వెళ్ళిపోతాను." అని చెప్పాడు సుజిత్.

"ఓకే!' అని అందరి వైపు చూసి "హ్యాపీ జర్నీ!" అని కిందకి దిగాడు రాహుల్.

ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రన్ వే మీద వెళ్లడం చూసి ఊపిరి పీల్చుకున్నారు ఎయిర్ పోర్ట్ లొ ఉన్నవాళ్లు వీడియో కాల్ లో ఉన్నవాళ్లు

అంతలో ఫ్లైట్ స్లో అవడం చూసి "వాట్ హప్పెండ్ రాహుల్"  ఫ్లైట్ ఎందుకు ఆగిపోయింది? " అని వీడియో కాల్ లొ చూస్తూ కంగారుగా అడిగింది అర్ణ.

"వన్ మినిట్!" అని ఫోన్ మాట్లాడి ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూస్తూ లాప్టాప్ లొ పైకి చూపించాడు రాహుల్.

ఫ్లైట్ ఎగరడానికి వీలు లేకుండా ఆకాశం కూడా కనబడనట్టు రాబందులు ఎగరడం చూస్తూ షాక్ అయ్యి "సింబా వచ్చాడు అంటే అభీర్ వచ్చినట్లే!" అని టెంక్షన్ గా చెప్పాడు ముకుల్.
[+] 9 users Like SivaSai's post
Like Reply
ఎపిసోడ్ 64


ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యినా వెంటనే ముకుల్ ఫోన్లో చెప్పడంతో లండన్ కి రిటన్ అయ్యినా ఫ్లైట్ ని వెళ్ళనివ్వకుండా ఆకాశంలో రాబందులు చుట్టుముట్టడంతో అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు.

*************

వీడియో కాల్ లో ఆకాశంలో ఉన్న రాబందులను చూసి "అక్కడకి సింబా వచ్చాడు అంటే అభీర్ వచ్చినట్లే! ఇంక మనవాళ్లు ఎయిర్ పోర్ట్ ఉండడం సేఫ్ కాదు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి." అని చెప్పాడు ముకుల్.

ఆ మాట విని "ఏంటి తాతయ్య? ఆ పక్షులకు కూడా భయపడాలా? ఒక్క నిమిషంలో ఆకాశంలో వాటిని లేకుండా చేయొచ్చు!" అని వీడియో కాల్ లో చూస్తూ "రాహుల్! ఏంటి నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు? సైరన్స్ ఆన్ చేసి ఫ్లై జోన్ క్లియర్ చేయమను." అని సీరియస్ గా చెప్పింది అర్ణ.

"ఓకే మేడం!" అని హడావుడిగా ఆఫీసర్స్ దగ్గరికి పరిగెత్తాడు రాహుల్.

తండ్రితో కలిసి అక్కడికి వచ్చి ఆకాశంలోకి ఆశ్చర్యంగా చూస్తూ "ఈ రాబందులు అన్ని ఏక్కడి నుంచి వచ్చాయి?" అని అక్కడికి వచ్చిన ఆఫీసర్ వైపు చూసి "వాటిని చెదరగొట్టండి లేకపోతే షూట్ చేయండి." అని చెప్పాడు తంబియార్.

"సార్! మనం ఇక్కడి నుంచి షూట్ చేసిన బుల్లెట్ అంత పైకి వెళ్ళదు, సైరన్స్ ఆన్ చేస్తున్నాము ఆవే పోతాయి." అని చెప్పి సిగ్నల్ ఇచ్చాడు ఆఫీసర్.

అంతలో సైరన్స్ ఆన్ అవడంతో అక్కడ ఉన్న వారంతా గట్టిగా చెవులు మూసుకుని ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు.

ఆకాశంలో ఉన్న రాబందులు కొంచెం పక్కకి జరగడం వీడియో లొ చూసి "తాతయ్య! టెన్షన్ పడకండి క్లియర్ అవుతుంది. మనవాళ్ళు బయలుదేరుతారు." అని సంతోషంగా చూస్తూ చెప్పింది అర్ణ.

సడన్గా ఆ రాబందుల మధ్యలో నుంచి వేగంగా అక్కడికి వచ్చి ఫ్లైట్ ముందు వాలేడు సింబా.

ఫ్లైట్ ముందు ఉన్న సింబాని చూసి "ఇంక ఫ్లైట్ ఇక్కడి నుంచి ఆగుళం కూడా కదలదు, లోపల ఉన్న వాళ్ళు  చచ్చినట్లు ఈ గడ్డమీద దిగి ఇక్కడ చావ్వాల్సిందే!" అని సంతోషంగా చూస్తూ చెప్పింది రియా.

సింబా అరుపు విని వేల సంఖ్యలో గబ్బిలాలు అక్కడకి వచ్చి ఫ్లైట్ మీద వాలి మూసేయడంతో వీడియో కాల్ లొ చూస్తూ 'ఏంటిది? అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? " అని కంగారుగా చూస్తూ

"రాహుల్ మనవాళ్ళని అర్జెంటుగా ఫ్లైట్ దింపి అక్కడి నుంచి సేఫ్ గా  తీసుకు వెళ్లిపోండి." అని చెప్పింది అర్ణ.

వీడియో కాల్ లో చూస్తూ "పాప! నువ్వు కంగారు పడకు మన వాళ్ళని సేఫ్ గా గెస్ట్ హౌస్ కి తీసుకు వెళ్తాను." అని చెప్పి తన మనుషులని ఫ్లైట్ దగ్గరికి పంపించాడు వరదరాజులు.

ఫ్లైట్ ని పట్టుకున్న గబ్బిలాలని ఆకాశంలో ఏగురుతున్న రాబందులని ఫ్లైట్ ముందు ఉన్న సింబాని చూసి "నంద కుటుంబం మీద ఈ పక్షులు ఏమైనా పగ పట్టాయా ఏంటి? అందుకే వీళ్ళు ఇండియా రావడం లేదా?" అని డౌట్ గా తండ్రిని అడిగాడు తంబియార్.

"నాకు కూడా తెలియదు ముందు వాళ్ళని దింపి మన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లే పని చూడు, తర్వాత ఈ గోలా ఏమిటో తెలుసుకుందాము." అని చెప్పాడు వరదరాజులు.

ఫ్లైట్ లో నుంచి కిందకు దిగుతూ అక్కడ ఉన్న పక్షుల్ని చూసి భయంతో పరిగెత్తుకుంటూ ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లి వీడియో కాల్ లో ఉన్న అర్ణ వైపు చూసి "ఏంటి ఇదంతా?" అని కంగారుగా అడిగాడు రఘురామ్.

"మావయ్య! అది నా ప్లాన్ కాదు మీరు జాగ్రత్తగా వరదరాజులు గారితో పాటు వెళ్ళండి. మిమ్మల్ని లండన్ ఎలా తీసుకురావాలో నేను ఆలోచిస్తాను." అని చెప్పింది అర్ణ.

"సరే!" అని అక్కడ రెడీగా ఉన్న కార్ లలో ఎక్కరు అందరు.

కార్ దగ్గరికి వెళ్లి విష్ణు వైపు చూసి "వెల్కం టు ఇండియా సార్!" అని నవ్వుతూ చెప్పింది రియా.

"ఏంటి? మా విష్ణు నీకు ముందే తెలుసా?" అని డౌట్ గా అడిగాడు సుజిత్.

"నో సార్! నేను అందరికీ చెప్తున్నాను విష్ణు గారు అంటే వీళ్ళలో ఎవరు?" అని అడిగింది రియా.

"సరే! ముందు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము నువ్వు కూడా ఏదో ఒక కార్ లొ వచ్చేయ్!" అని చెప్పాడు సుజిత్.

అక్కడికి వచ్చి "త్వరగా వెళ్ళండి ఆ పక్షులు ఇక్కడికి వచ్చి కార్ లు కూడా కదలకుండా చేస్తాయేమో!" అని కంగారుగా చూస్తూ చెప్పాడు రాహుల్.

అక్కడినుంచి కార్లు మొత్తం వరదరాజులు గెస్ట్ హౌస్ దగ్గరికి బయలుదేరడంతో  ఎయిర్ పోర్ట్ స్టాఫ్ వైపు చూసి గట్టిగా అరుస్తూ తన ముక్కుతో ఫ్లైట్ ని పొడిచి వార్నింగ్ ఇచ్చి ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాడు సింబా.

అక్కడ నుంచొని ఆశ్చర్యంగా చూస్తూ "ఆ పక్షి మనతో ఏదో చెప్పాలనుకుంటుంది." అన్నాడు స్టాప్ లో ఒకడు.

"ఈ ఫ్లైట్ ఇక్కడి నుంచి ఎగిరితే ముక్కుతో పొడిచి మరీ కులుస్తాను అని వార్నింగ్ ఇస్తుంది." అని చెప్పాడు రాజన్.

"అవునా?" అని ఆశ్చర్య చూస్తూ ఉన్నారు అక్కడ స్టాప్.

కాసేపటికి అక్కడికి వచ్చిన గబ్బిలలు, రాబందులు వెళ్లిపోవడంతో "ఈ పక్షులన్నీ కచ్చితంగా వీళ్ళ మీద పగబట్టాయి." అని చెప్పాడు తంబియార్.

"కరెక్టే సార్! నేను ఇప్పటి వరకు అంత పెద్ద పక్షిని  చూడలేదు, ఇంకా నయం వాళ్లకి హెల్ప్ చేసుకున్నందుకు మన మీద అటాక్ చేయలేదు." అని భయంగా చూస్తూ చెప్పాడు రాహుల్.

ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లిపోవడంతో వీడియో కాల్ కట్ చేసి "తాతయ్య! మనవాళ్ళు సేఫ్గా గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోతున్నారు ఫ్లైట్ అక్కడే ఉంచమన్నాను టైం చూసి వాళ్ళని వెనక్కి తీసుకోవద్దము." అని చెప్పింది అర్ణ.

"అభీర్ ఎవరిని అక్కడ నుంచి వెనక్కి రానివ్వడు, ఇప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకు రావడానికి చూడకూడదు అక్కడ వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి చూడాలి." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు ముకుల్.

ఆ మాట విని "అసలు అభీర్ ని లేకుండా చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా! ఇప్పటివరకు వాడి ఆట మనకి చూపించాడు ఇప్పుడు నా అట వాడికి చూపిస్తాను." అని సీరియస్ గా చెప్పింది అర్ణ.

****************

వసుంధర ఇంటి దగ్గరికి వచ్చి హాల్లో టీవీ చూస్తున్న వాళ్ళని చూసి "మేడం! ఒకసారి న్యూస్ చూడండి ఇండియాకి వచ్చి వెనక్కి పారిపోదాం అనుకున్నా నంద ఫ్యామిలీకి అభీర్ చుక్కలు చూపించాడు." అని నవ్వుతూ చెప్పింది మిత్ర.

ఆ మాట విని న్యూస్ ఛానల్ పెట్టి ఎయిర్ పోర్ట్ లొ జరిగింది చూస్తూ "ఆధర్మం మీద ధర్మం యుద్ధం మొదలుపెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుంది." అని చెప్పింది వసుంధర.

"వదిన! ఫ్యామిలీ అంటే మగాళ్ళే కాదు ఆడవాళ్లు కూడా ఉంటారు కదా వాళ్ళని కూడా అభీర్ చంపేస్తాడా?" అని అనుమానంగా అడిగింది నీలమ్.

"చట్టం ముందు ఆడ మగ తేడా లేదు, కానీ అభీర్ నమ్మే ధర్మం ఎలా ఉంటుందో నాకు తెలియదు." అని చెప్పింది వసుంధర.

ఆ మాట విని చాక్లెట్ తో కలిసి అభీర్ దగ్గరకి బయలుదేరింది మిత్ర.

*****************

ఇంటి దగ్గర బైరితో కలిసి షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అభీర్ దగ్గరికి వచ్చి "నాయకుడా! ముకుల్ నంద ఫ్యామిలీ ఈ గడ్డమీద అడుగుపెట్టింది." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు రాజన్.

అంతలో అక్కడికి వచ్చి తన ముందు వాలిన సింబా వైపు చూసి "నీ స్నేహితుల చావుకి కారణమైన వాళ్ల మీద పగ తీర్చుకునే సమయం వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్న క్షోబా ఇప్పుడు ముకుల్, అభిజిత్ లు అనుభవిస్తారు." అని చెప్పాడు అభీర్.

"నాయకుడా! ముకుల్ ఫ్యామిలీ మొత్తం వరదరాజులు గెస్ట్ హౌస్ లో ఉన్నారు." అని చెప్పాడు అరుల్.

"ఆ వరదరాజులకి అభీర్ సేన పవర్ ఏమిటో చూపించాలి." అని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న తన మనుషుల వైపు చూసి "సహదేవుడి తమ్ముడు నారప్పని ఉదయం గెస్ట్ హౌస్ కి పంపించండి."  అని చెప్పాడు అభీర్.

"సరే నాయకుడా!" అని ఆనందంగా చూస్తూ "నారప్ప!" అని గట్టిగా అరిచాడు బైరి.

*****************

ఉదయం గెస్ట్ హౌస్ లోపలకి కార్ లొ వచ్చి దిగి వీల్ చైర్ లో అభిజిత్ ని లోపలికి తీసుకు వస్తున్న నిర్మల్ ని చూసి దగ్గరకు వెళ్లి "హాయ్ రా..!" అని పలకరించాడు ఇచ్చాడు ప్రమోద్.

వీల్ చైర్ లో ఉన్న అభిజిత్ వైపు చూసి "ఎలా ఉన్నావు?" అని అడిగాడు సుభాష్.

ఆ మాటకి చిన్నగా నవ్వి "చూస్తున్నావు కదా ఇలా వీల్ చైర్ లో, అదే గోకుల్ గాడు బతికి ఉంటే లెచి నడిచేవాడినేమో!" అని బాధగా చెప్పాడు అభిజిత్.

"మేము వచ్చేసాము కదా అంకుల్! నేను నిర్మల్ కలిసి మిమ్మల్ని నడిపిస్తాము." అని చెప్పాడు ప్రమోద్.

అక్కడికి వస్తూ "నమస్కారం అభిజిత్ గారు! ఈ వంకనైన మా గెస్ట్ హౌస్ కి విచ్చేశారు చాలా సంతోషం!" అని చెప్పాడు వరదరాజులు.

"ఆ అభీర్ ఎవరు డాడ్? మనల్ని ఎదిరించి మన వాళ్ళని భయపెట్టే అంత ధైర్యం ఉందా?" అని అడిగాడు నిర్మల్.

"అవును సార్! అసలు అభీర్ ఎవరు? మాకు కూడా వార్నింగ్ లెటర్ పంపించాడు, వాడు కనిపిస్తే నేను ఏమిటో చూపించేవాడేని." అని కోపంగా చెప్పాడు తంబియార్.

"ఆ అభీర్ ఒక కొండ తెగ వాడు అని డాడ్ మాటలని బట్టి తెలిసింది. వాడి గురించి ఇంత భయపడడం అనవసరం!"  అని చెప్పాడు ప్రవీణ్.

"అవును! ఇక్కడ మనకి ఇంత అండ ఉండగా వాడికి భయపడడం ఏమిటి?" అని వేటకారంగా చూస్తూ చెప్పాడు రఘురామ్.

లాప్టాప్ తీసుకుని  అక్కడకి వస్తూ "తాతయ్య, అర్ణ వీడియో కాల్ లో ఉన్నారు." అని చూపించింది సుభాష్ కూతరు ఆశ.

వీడియో కాల్ లో చూస్తూ "అభిజిత్! నువ్వు అక్కడికి వచ్చేసరికి నాకు ధైర్యం వచ్చింది. ఆ అభీర్ కి సంబంధించిన మనుషులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వెరీ పారేయాలి." అని కోపంగా చెప్పాడు ముకుల్.

"సరే అంకుల్! జానీ కూడా దుబాయ్ నుంచి బయలుదేరాడు రేపు ఉదయానికి ఇక్కడే ఉంటాడు, ఇప్పుడు వరదరాజులు కూడా మనకి తోడు వచ్చాడు కదా, ఇంక ఆ అభీర్ ని వాడి మనుషుల్ని  వదిలి పెట్టే ప్రసక్తే లేదు." అని చెప్పాడు అభిజిత్.

అంతలో వరదరాజులు దగ్గరికి వచ్చి "సార్! బయట ఎవరో ఒక మనిషి మన డబ్బు పోయిన బ్యాగ్ పట్టుకొని వచ్చాడు, పేరు నారప్ప అంట మిమ్మల్ని కలవాలి అంటున్నాడు." అని చెప్పాడు సెక్యూరిటీ ఆఫీసర్.

ఆ మాట విని "అవునా? ఎవడ్రా నారప్ప? మన బ్యాగ్ వాడి చేతిలోకి ఎలా వెళ్ళింది? చూద్దాం లోపలకి తీసుకురా.!" అని చెప్పాడు వరదరాజులు.
[+] 11 users Like SivaSai's post
Like Reply
flight landing episode keka!!!!
Like Reply




Users browsing this thread: