Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పుణ్యం కోసం
అత్త కూడా అమ్మ లాంటిదే
రచన: L. V. జయ



"అమ్మా, " నొప్పి భరించలేక అరిచింది లత. లతకి తొమ్మిది నెలలు నిండాయి. ఈ రోజో, రేపో డెలివరీ అన్నటుగా వుంది. 



కూతురి అరుపు విన్న సౌభాగ్యమ్మ, మంచం మీద నుండి లేచి, కర్ర సాయంతో నడుస్తూ, 
"జానకీ, మీ వదిన పిలుస్తోంది. చూడు ఒకసారి. " అంటూ కోడల్ని పిలిచారు. "ఆ అత్తా. వస్తున్నాను" అని వంటని మధ్యలోనే ఆపి, పరిగెత్తుకుంటూ వెళ్ళింది జానకి. జానకి, సౌభాగ్యమ్మ అన్న కూతురు. లత, జానకి ఒకే వయసు వాళ్ళు. చిన్నప్పటి నుండి స్నేహితులు. 



"ఏమయ్యింది లతా? నొప్పులు వస్తున్నాయా?" అని అడిగింది జానకి, లతని. 



"అవును. భరించలేకపోతున్నాను. " అంది లత. 



"జానకీ, తొందరగా వెళ్లి, రిక్షా ని పిలువు. హాస్పటిల్ కి తీసుకుని వెళ్ళాలి ఇంక. " అన్నారు సౌభాగ్యమ్మ జానకి తో. రిక్షా ని పిలిచి, లతని రిక్షా ఎక్కించి, తానూ ఎక్కి కూర్చుంది జానకి. 



సౌభాగ్యమ్మగారు జానకి తో, "జానకీ, లత తో నువ్వు ముందు వెళ్ళు. నేను వెనకాలే ఎవరినైనా పంపిస్తాను. లత ని జాగ్రత్తగా చూస్కో" అని చెప్పి, లత తో "లతా, జాగ్రత్త అమ్మా. దేవుడికి దణ్ణం పెట్టుకుని బయలుదేరు. పండంటి బిడ్డ తో రా" అని దీవించి పంపారు. 



జానకి కి భయంగా వుంది. 'సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. అత్త బయటకి రాలేదు. ఇప్పుడు ఈ భాద్యత నాది. ఎలాగో ఏమిటో. దేవుడా, నీ మీదే వేస్తున్నాను ఈ భారమంతా ' అని మనసులోనే దేవుడికి దణ్ణం పెట్టుకుంది. 



లత కి నొప్పులు ఎక్కువ అయ్యాయి. లత భాదని చూస్తూ, తట్టుకోలేక, "తొందరగా పోనియ్యి బాబూ హాస్పటిల్ కి. " అని కంగారు పెట్టింది జానకి రిక్షా లాగుతున్న అతన్ని. 



హాస్పిటల్ కి చేరాక, నర్స్ వచ్చి చూసి "ఇంక డెలివరీ టైం దగ్గరపడింది" అని డెలివరీ రూమ్ కి తీసుకు వెళ్ళింది లత ని. వెనకనే వెళ్ళింది జానకి. ఇద్దరినీ ఒక చోట కూర్చోమని చెప్పి, అక్కడ వున్న నర్స్ తో, "తొందరగా బెడ్ రెడీ చెయ్యి. నేను ఇప్పుడే డాక్టర్ గారికి చెప్పి వస్తాను" అని చెప్పి వెళ్ళింది. 



బెడ్ రెడీ చేసిన నర్స్, లత, జానకి మొహాల్లోని భయం చూసి, "డాక్టర్ గారు వేరే పేషెంట్ ని చూస్తున్నారు. ఇంక వచ్చేస్తారు, భయపడకండి" అని చెప్పి బయటకి వెళ్ళింది. 
 
జానకి ని పట్టుకుని కూర్చుంది లత. నొప్పులు ఎక్కువ అయ్యి, లత కూర్చోలేకపోవడం చూసి, "డాక్టర్, నర్స్" అంటూ అరిచి పిలిచింది జానకి. ఎవరూ రాలేదు. బయటకి వచ్చి వెతికింది చూసింది ఎవరైనా కనపడతారేమో అని. 



ఈలోగానే, "అమ్మా" అంటూ లత అరుపు వినపడి, పరిగెత్తుకుంటూ లోపలకి వచ్చి చూసింది జానకి. అప్పటికే ప్రసవం అయిపొయింది లత కి. ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో, రెండు చేతులతో బిడ్డని పట్టుకుంది జానకి. లత కళ్ళు తేలవేసింది. భయపడిపోయింది జానకి. "డాక్టర్, నర్స్, తొందరగా రండి. " అంటూ గట్టిగా అరిచింది జానకి. 



కొంత సేపటికి వచ్చారు డాక్టర్, నర్సులు. "డాక్టర్, మా లత కళ్ళు తెరవటం లేదు. " అని ఏడుస్తూ చెప్పింది డాక్టర్ కి. 



"ఏం పర్వాలేదు. భయపడద్దు. నేను చూస్తాను" అని జానకి కి చెప్పి, తల్లి ని, బిడ్డ ని చెక్ చేసారు డాక్టర్. "పాప, జ్వరం తో పుట్టింది. తగ్గిపోతుంది. పర్వాలేదు. తల్లి కొంచెం సేపట్లో లేస్తారు. భయపడద్దు" అని చెప్పి వెళ్లారు డాక్టర్. 



కొంతసేపటి తరువాత కళ్ళు తెరిచి, కూతుర్ని దగ్గరికి తీసుకుంది లత. అందంగా, ముద్దుగా వున్న తన కూతుర్ని చూసి మురిసిపోయింది. అమ్మతనాన్ని మొదటి సారిగా అనుభవిస్తూ, ఆనందంతో కంట తడి పెట్టుకుంది లత. ఇదంతా చూస్తూ, జానకి చాలా మురిసిపోయింది. 



నర్సులు వచ్చి అప్పటి వరకు జరిగిందంతా చెప్పారు లత కి. కృతజ్ఞతతో కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి లత కి. "ఒక దేవుతలా కనిపిస్తున్నావు జానకి నువ్వు నాకు" అంది జానకి చూస్తూ. 



"మేము వచ్చేంత వరకు బిడ్డని చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు. మీకు ఎంత మంది పిల్లలు?" అని అడిగారు నర్సులు జానకి ని. ఇంకా ఎవరూ లేరని చెప్పడం తో ఆశ్చర్యపోయారు. 



లత తన బిడ్డని చూసి నవ్వుతూ, " అత్త చేతిలో పుట్టేసావే నువ్వు. అత్తది చాలా మంచి మనసు. అత్త కూడా నీకు అమ్మా లాంటిదే. సరేనా" అని పాప నుదిటి మీద ముద్దు పెట్టింది. 



జానకి కూడా చాలా సంతోషంగా బిడ్డని ఎత్తుకుని " నా బంగారు తల్లి" అంటూ మురిసిపోయింది. 



***సమాప్తం***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
శ్వేతపత్రం
[Image: Swetha-patram-scaled.jpg]

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన
-పి. చంద్రశేఖర అజాద్

నిరంజన్‌ ‌ముఖం సీరియస్‌గా వుంది. ఎదురుగా కూతురు రంజిత ఉంది. ఆమె తండ్రినే చూస్తోంది. అప్పటి దాకా ఆలోచిస్తున్న అతను  రంజిత కళ్లల్లోకి సూటిగా చూస్తూ… ‘‘శ్రీరామ్‌ని నువ్వు ప్రేమించావన్నావు. మేం కలిసి బతకాలనుకుంటున్నాం అన్నావు. అతని గురించి నీకెంత వరకు తెలుసు అన్నాను. మేం డేటింగ్‌ ‌చేశాము అన్నావు. మా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి తెలుసు అన్నావు. డేటింగ్‌తో పాటు సహజీవనం చేశావా? అని నిన్ను అడగలేదు. ఎందుకో తెలుసా?’’ రంజిత మాట్లాడకుండా చూస్తోంది.
‘‘చిన్నప్పటి నుంచి నీకు స్వేచ్ఛనిచ్చాను. నువ్వు అడిగింది ఏదీ కాదనలేదు. నా కూతురికి ఓ మంచి మిత్రుడిగా ఉండాలనుకున్నాను. కొన్ని విషయాల మీద నా అభిప్రాయాలు చెప్పాను తప్ప నా భావాలను ఎప్పుడూ నీ మీద రుద్దలేదు. ఎవరి జీవితాలను వారు దిద్దుకోవాలి. మనం అవసరం అనుకున్నప్పుడు ఓ సలహా ఇవ్వాలి. అంతేగాని ఎదుటివారి అభిరు చులను, అనుభవాలను, అవగాహనను తక్కువగా చూడకూడదు. మనం అంగీకరించినా, అంగీకరించక• పోయినా వారిని గౌరవించాలి అని నమ్మే నేను ఎప్పుడన్నా ఇలానే చేయమని నిన్ను శాసించానా?’’ అన్నాడు.
రంజితకు తన బాల్యం, యవ్వనం గుర్తు వచ్చింది.
ఠాగూర్‌ని చదివింది. శరత్‌ ‌చంద్రుడ్ని చదివింది. అలాంటి స్త్రీ పాత్రలను ఊహించుకుంది. మైదానాల్లోకి పరుగులు తీసుకుంటూ పోయి, అక్కడి చెట్లు తలలూపి ఆహ్వానిస్తుంటే, తను వాటిని ఎక్కేది. కొమ్మల మధ్యకు చేరిపోయేది. చల్లటి గాలిని, ఆకాశంలో తేలిపోతున్న మబ్బుల్ని పలకరిస్తూ ఎందాకా మీ పయనం? మీ ఇల్లు ఎక్కడ? మీది ఏ దేశం? ఎప్పుడు వర్షిస్తారు? ఎప్పుడు తేలిపోతారు. కొన్ని నెలలూ, సంవత్సరాలు మీరు ఎందుకురారు? మీకు పిల్లలు ఉంటారా? మళ్లీ మళ్ళీ మీరు పుడుతుంటారా? పువ్వుల్లా కొన్ని గంటలు, కొన్ని రోజులు మాత్రమే అలరించి అంతరిస్తుంటారా?
ఇవే ప్రశ్నలు నిరంజన్‌ని అడుగుతుంటే హాయిగా నవ్వేవాడు.
‘‘తల్లీ… నేను కూడా చిన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడిని. గాలిలో, నీడలో, వానలో, చలిలో, ఎండలో మొత్తంగా ప్రకృతిలో నాకు స్త్రీ మూర్తులే కనిపిస్తున్నారు. నేను మగవాడిని అయినందుకా? ఆడపిల్లలు కూడా అంతేనా? ప్రకృతిలో పురుషుడ్ని చూసుకుంటారా? వెన్నెల్లో ఆడుకునే మగపిల్లల్ని ఊహించుకుంటారా అనిపించేది.’’
‘‘మీరు ఏ ఆడపిల్లలనూ ఈ ప్రశ్నలు అడగలేదా?’’
‘‘లేదు. బిడియం. అది జయించటానికి చాలా సంవత్సరాలు, దశాబ్దాలు పట్టాయి. ఎవరి ప్రశ్నలకు వారు సమాధానాలు వెతుక్కోవడంలో ఆనందం ఉంటుంది రంజితా!’’
అదో ఫేజ్‌. ‌తర్వాత రంజని చదివే పుస్తకాలు మారాయి. చదువుల కోసం అమ్మానాన్నలకు దూరంగా రకరకాల నగరాలు వెళ్లింది. అప్పటి వరకూ ఉన్న తన భావాలు వేగంగా మారుతూ వచ్చాయి.
‘‘నువ్వు సైలెంట్‌గా ఉంటే కాదు. మాట్లాడు’’ అన్నాడు నిరంజన్‌.
ఉలిక్కిపడింది.
‘‘లేదు’’ అంది.
‘‘శ్రీరామ్‌తోనీ పెళ్లిని నేను కాదన లేదు. మీ అమ్మకు అసంతృప్తి ఉన్నా నీ సంతోషాన్ని కాదనటం ఎందుకని సరిపెట్టుకుంది. మీ పెళ్లి జరిగి ఎన్ని నెలలు అయింది. ఇప్పుడు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు?’’
‘‘శ్రీరామ్‌తో నేను కొన్ని విషయాల్లో డిఫర్‌ అవుతున్నాను.’’
‘‘నాతో, మీ అమ్మతో నూరుశాతం ఏకీభవిస్తు న్నావా? అందుకని మాతో కూడా విడిపోదలుచు కున్నావా? అమ్మానాన్నల బంధాన్ని తెంచేసు కుంటున్నావా?’’
నిశ్శబ్దం.
‘‘అవున్లే. ఆడపిల్లలకు పెళ్లి అయ్యేంత వరకు మాత్రమే కదా పుట్టింటితో అనుబంధం. ఆ రోజు నిన్ను అడిగాను. శ్రీరామ్‌ ‌గురించి నీకు ఎంత వరకు తెలుసు అన్నాను. ఇద్దరికీ ఒకరి గురించి ఇంకొకరికి తెలుసు అన్నావు. ఇదేనా తెలియటం. నువ్వు కూడా వయసు తాలూకు మోహానికి లోనయ్యావా?’’
‘‘నాన్నా… నేను పొరపాటుపడ్డాను అని తెలిసి నప్పుడు ఆ బంధాన్ని కొనసాగించాలా?’’
‘‘అవసరం లేదు. నువ్వు పొరపాటు అనుకున్నది పొరపాటేనా! అనేది కూడా తెలియాలి.
ఇంకా ఈ విషయం గురించి నేను మాట్లాడను. మేం కూడా పొరపాటు పడ్డాం. మా అమ్మాయితో మేం పరిమితులకు మించి ప్రవర్తించాం. అది కేవలం ఆదర్శం అనుకున్నాం. ఇప్పటి నుండి నీ జీవితం నీది. నీ నిర్ణయాలు నీవి. మనం లా ప్రకారంగా విడిపోకపోవచ్చు. బంధం పరంగా విడిపోతున్నాం. చివరిసారిగా చెబుతున్నాను. నీకు మేం జన్మనిచ్చాం. కొంతవరకు నీ బాగోగులు చూశాం. ఇప్పుడు నువ్వు సర్వస్వతంత్రురాలివి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకు సంతోషం ఇవ్వాలి. అప్పుడు ఈ ప్రపంచాని పట్టించుకోనవసరం లేదు.’’
రంజిత తండ్రికేసి కొద్ది క్షణాలు చూసి అతని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు అతని భార్య వసుంధర అతని దగ్గరకు వచ్చింది.
‘‘మొదటి నుంచి మనం ఇలా ఉంటే బాగుండేదా?’’ అంది మెల్లగా.
‘‘ప్రతి అయిదు సంవత్సరాలకూ కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి వసూ… ప్రతి పదానికి, ప్రతి ఆచారానికీ, పద్ధతికీ అర్థాలు మారుతున్నాయి. ఇవన్నీ వ్యక్తులకు చెందినవి. వారి పరిణతిని బట్టి నిర్ణయాలు ఉంటాయి. అవి వారి బతుకుల్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పటి వరకు రంజిత మన కూతురు. ఇప్పుడు అలాంటి తరంలో ప్రయోగం చేస్తున్న ఓ అమ్మాయి’’ అన్నాడు.
                                                                                               *          *          *
సరిత రంజితను కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఆహ్వానించింది.
‘‘ఏంటోయ్‌… ‌సూట్‌ ‌కేసుతో వచ్చేశావు. డివోర్స్ అయ్యేంత వరకు కూడా శ్రీరామ్‌తో కలిసి ఉండలేక పోయావా’’ అంది.
‘‘అవి రావటానికి సమయం పడుతుంది. అయినా ఓసారి మనం కాదనుకున్నాక అయిదు నిమిషాలు కూడా అయిదు యుగాల్లా అనిపిస్తాయి.’’
‘‘అవును రంజితా! అయినా అత్తవారింటికి కాకపోతే అమ్మ వారింటికి దారి ఉంది కదా! అందు లోనూ మీ నాన్న పోగ్రెసివ్‌ ‌కదా!’’
‘‘ఛాదస్తంలోనా! ఎంత బాగా కబుర్లు చెప్పే వారయినా ఆడవాళ్ల విషయంలో ఇలానే వుంటారు. శ్రీరామ్‌ని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అన్నారు. ప్రేమ చచ్చేంత వరకూ ఉండాలని వారు అనుకుంటారు. ప్రేమ వేరు. డిఫరెన్సెస్‌ ‌వేరు అనుకోరు. అయినా నేను ఎవరి మీదా ఆధారపడి బతకటం లేదు కదా!’’
‘‘అవును. మగవాళ్లలోనే కాదు. ఆడవారిలోనూ ఇలాంటి వారున్నారు. ఇప్పుడు మనం అలాంటి ఓ మహిళను కలుస్తున్నాం. ఆమె పేరు శ్వేతాదేవి. వయసు తొంభై సంవత్సరాలు. మాకు దూరపు బంధువు.’’
‘‘అవసరమా వారిని కలవటం?’’
‘‘నాకూ ఇంట్లో సమస్యలు ఉన్నాయి రంజితా. మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. మా అమ్మ ఓసారి ‘ఆమెని కలువు. తర్వాత నువ్వు విడిగా ఉంటావో, ఏం చేస్తావో నీ ఇష్టం అంది’. ఆమె గురించి వినటం తప్ప నేను ఇంత వరకు కలవలేదు. క్లాసులు వాళ్లే కాదు. మనమూ తీసుకోవాలి’’ అంది సరిత.
                                                                                                            *          *          *
ఇద్దరూ శ్వేతాదేవిని కలిశారు. రంజితకు ఆమెను చూడగానే టైటానిక్‌ ‌సినిమా హీరోయిన్‌ ‌గుర్తు వచ్చింది. సినిమా ప్రారంభంలో, ముగింపులో అత్యంత వృద్ధురాలిగా కనిపిస్తుంది. ఆమె ముఖంలో అన్నీ ముడతలుంటాయి. అయినా ఓ అందం. అక్కడ నుండి దర్శకుడు ప్రేక్షకుల చేతిని అందుకుని ఓ మహాస్వప్న లోకంలోకి తీసుకు వెళ్తాడు. అప్పుడు యవ్వనంలో ఉన్న కథానాయికను పరిచయం చేస్తాడు.
శ్వేతాదేవి ముఖంలో అలాంటి ముడతలు లేవు. ఆమె దేహచ్ఛాయను చూసి ఆ పేరు పెట్టారా అనిపించింది. ఆమెలో అలనాటి నటీమణులు వైజయంతిమాల, నర్గీస్‌, ‌పద్మిని, సావిత్రి ఇంకా ఎందరెందరో కనిపిస్తున్నారు. ఆమె కంఠస్వరంలో లతా మంగేష్కర్‌ ‌వినిపించింది.
రంజిత రవివర్మ బొమ్మలను చిన్నప్పుడు చూసింది. అప్పటి భావోద్వేగాలు గుర్తులేవు. ఆ బొమ్మల్లో ఏదో దివ్యత్వం ఉంది. అర్థం కాకపోయినా! ఆమె ఇంటిని చూశారు. గోడల మీద చిత్రాలు చూస్తుంటే నాలుగయిదు తరాల చరిత్రను చూస్తున్నట్లు ఉంది. ఎంత వద్దనుకున్నా రంజితకు ఒకప్పటి బ్రిటిష్‌ ‌యువరాణి ‘డయానా’ గుర్తు వచ్చింది.
ఆమెతో పాటు పెద్ద కుటుంబం ఉంటుందను కున్నారు. ఓ సహాయకురాలు ఉంది. తను ఒంటరిగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అంటే ఈమె వెనుకాల ఏదో కథ ఉంది. సరిత అమ్మ ఇక్కడికి పంపటం వెనుక ఈ విషాదాన్ని చూస్తే నీకు కొన్ని విషయాలు అర్థం అవుతాయి అనుకునుంటుంది.
ఇంటి ముందు అందమైన తోట ఉంది. ముగ్గురూ నడుస్తున్నారు. అక్కడ ఎన్నెన్నో రకాల పూలమొక్కలు. అప్పుడే వికశిస్తున్నవి, రాలిపోతున్నవి. రాలి పోయినవి. రంగులు మారుతున్న ఆకులు. మొక్కలు, చెట్లు రాలిన వాటిని చూసి కన్నీరు పెడుతున్నాయా అనిపిస్తోంది. అక్కడున్న కుర్చీల్లో కూర్చొన్నారు.
‘‘మీరు ఒంటరిగా ఉంటున్నారు. ఇది మీకు…’’ అంటుంటే,
‘‘నేనే కాదు. మనుషులందరూ ఒంటరిగానే వస్తారు. ఒక్కోసారి కవలలు, ఇంకొంతమంది. ఒకరి తర్వాత ఒకరు వస్తారు. అలాగే ముందుగానో, వెనకాలో అందరూ వెళ్లిపోతారు. ఇది సహజం. సమూహంలో ఉన్నా ఒంటరితనంలో మనుషుల మనసులు వుంటాయి.’’
‘‘ఇది మనుషుల జీవితంలో విషాదం అంటారా?’’
‘‘ఎందుకు అనాలి! మొదట్లో ఓ స్త్రీ-ఓ పురుషుడు, ప్రకృతి మాత్రమేగా. అసలు ప్రకృతి ఉన్నంత కాలం ఎవరయినా ఒంటరివారెలా అవుతారు. బతకటం ఓ కళ. కలిసి బతకటం, ఒంటరిగా ఉండటమూ అంతే. అందుకే అనేక మంది పది మందితో ఉన్నా, ఒక్కరే ఉన్నా విషాదంతో ఉంటారు. అయినా నన్ను చూడటానికి నాలుగు తరాల వారు వస్తుంటారు. మీ గురించి చెప్పండి’’ అంది శ్వేతాదేవి.
ఇద్దరూ తమ భర్తలతో గల విభేదాల గురించి చెప్పారు. అప్పుడు నవ్వింది. ‘‘ఎందుకు నవ్వు తున్నారు’’ అన్నారిద్దరు.
‘‘ఇవన్నీ ఇప్పుడు మీ ఇద్దరే అనుభవిస్తున్నారా?’’
‘‘నిన్నటి తరాలు వేరు బామ్మగారూ… వారు బానిసలుగా బతికారు. రాజీ పడి బతికారు. వారు స్వేచ్ఛ గురించి ఆలోచించలేదు. అలా పుట్టి, ఏ మాత్రం గుర్తింపు లేకుండా, ఏ మాత్రం స్వతంత్రత లేకుండా కాలగర్భంలో కలిసిపోయారు.’’
‘‘స్వేచ్ఛ అంటే ఏమిటి?’’ అందామె సూటిగా.
‘‘మీరు రాజీపడటం లేదా? మీరు ఎవరికీ బానిసలు కాదా? ప్రేమ గురించి మీ అభిప్రాయాలు ఏమిటి? మీ చిన్న అనుభవంతో మీరు పరిపూర్ణత సాధించాం అనుకుంటున్నారా?’’ అని ఆగింది.
‘‘ఏ సంఘర్షణా లేకపోతే అది కుటుంబం ఎలా అవుతుంది? మనుషులంతా ఒకే రకంగా ఉండరు. ఒకే రకంగా ఆలోచించరు. పాతతరం వారిని బానిసలు అంటున్నారు. స్వేచ్ఛ, బానిసత్వాలకు కూడా లెక్కలున్నాయి. అప్పట్లో కుటుంబాల కోసం వారు రాజీపడకపోతే ఈ సమాజం ఇలా ఉండేదా? మీరు కేవలం పురుష అహంకారం గురించే మాట్లాడ తారా? అహంకారం స్త్రీలలో లేదా? మీరు కుటుం బాన్ని, మీరు పని చేస్తున్న సంస్థలని విడిగా ఎందుకు చూస్తున్నారు. కేవలం స్త్రీలు మాత్రమే యజమానులుగా ఉన్నా ఇవే పరిస్థితులు’’ అంది.
సహాయకురాలు జ్యూస్‌లు తీసుకుని వచ్చింది.
శ్వేతాదేవి అమ్మా నాన్నల గురించి, తన అన్న దమ్ముల గురించి, అక్కా చెల్లెళ్ల గురించి, అత్తవారింటి గురించి, తర్వాత తరాల గురించి చెప్పింది. నేను చిన్న చిన్న విషయాలకు ఇలా ఆలోచించుకుంటూ బయటకు పోవాలనుకుంటే ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవాలి. ఎంతమందితో సహ జీవనం చేయాలో అంటూ నవ్వింది.
‘‘అంటే అసలు ఏ పోరాటాలు వద్దు అంటారు. ఈ రోజుల్లో అది కుదురుతుందా?’’ అంది సరిత.
‘‘నేను వద్దు అనటం లేదు. గత కాలం వారు ఏ పోరాటాలూ చేయకుండానే ఇన్ని ఆలోచనలు వచ్చాయా? ఇన్ని మార్పులు వచ్చాయా? పోరాటాలు కుటుంబాల్లోనేనా? వ్యక్తుల మధ్యనేనా? చివరికి ప్రకృతితో మనం అనుభూతి చెందుతూనే మనకు తగిన రీతిలో మార్చుకుంటున్నాం. వద్దన్నా ఏ పోరాటం ఆగదు తల్లులూ… నేను నచ్చనివారు చాలా మందున్నారు. నా కుటుంబంలో అనేక రకాల వారున్నారు. అందరికీ ఒకటే చెబుతాను. మీ పోరాటాలు మీవి మాత్రం కాదు. పక్కవారితో ముడిపడుంటాయి. ఇప్పుడు మీ ఇద్దరూ మీ భర్తలతో విడిపోవాలనుకుంటున్నారు. మంచిదే. సర్దుకుపోయే దారులు మూసుకుపోతే ఎవరూ కలిసి ఉండరు. చివరిగా ఓ విషయం చెబుతాను. ప్రపంచమంతా అంగీకరించేది అంటూ ఏదీ వుండదు. మీకు తృప్తి కలిగించే నిర్ణయాలు తీసుకోండి.’’
                                                                                                            *          *          *
సరిత, రంజితలు గదిలో వున్నారు.
‘‘ప్రేమంటే ఏమిటి? స్వేచ్ఛ అంటే ఏమిటి? ఇవన్నీ ఎందుకు?’’ అంది సరిత.
‘‘అన్వేషిద్దాం.’’ ‘‘ఒంటరిగానా? సామాజికం గానా? కుటుంబ పరంగానా?’’
‘‘ఆలోచిద్దాం. శ్వేతాదేవి గారు చెప్పారు కదా. ఇక్కడ కంప్లీట్‌ ‌మాన్‌లూ, ఉమన్లూ ఉండరని. అదే నిజం అనిపిస్తోంది. ఇప్పుడు అమ్మా నాన్నలను చూడాలి. తర్వాత శ్రీరామ్‌ ‌దగ్గరకు వెళ్తాను. మనసు విప్పి మాట్లాడతాను.’’
‘మీటూ’ అంటూ, ‘మా వారితో మరోసారి శ్వేతాదేవి గారిని కలుస్తాను’ అంది సరిత.
-----జాగృతి వారపత్రికలో కథ
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Bro.. Vasantotsavam update pettu bro..
Like Reply
that thread author has to approve my request

else it will be intrusion, I dont want to do that
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
సుజన ధైర్యం
రచననీరజ హరి ప్రభల 



అమ్మా! నా కాలేజి బస్సుకు టైమవుతోంది. బాక్స్ రెడీనా! అడిగింది సుజన తన తల్లిని.



ఇదిగో బాక్స్. వచ్చి తీసుకో. ఈ పాలు త్రాగి వెళ్లు వంటింట్లో నుంచి పెద్దగా కేకేసింది వైదేహి.
సరే! అని వంటింట్లోకి వెళ్లి పాలుత్రాగి బాక్స్ ని తీసుకుని హడావిడిగా బస్సు కోసం పరిగెత్తింది సుజన. 
తనువెళ్లినవైపే చూస్తూండిపోయిన వైదేహికి కూతురి గురించిన ఆలోచనలు చుట్టుముట్టాయి.



 చిన్నప్పటి నుంచి సుజన చాలా ఉత్సాహంగా గెంతులువేస్తూ ఎంతో సంతోషంగా ఉండేది. తను ఎక్కడ ఉంటే అక్కడ సందడి నెలకొనేది. గలగలలాడే సుజన కబుర్లు వింటుంటే తనకు, తన భర్త ఆనంద్ కు చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఒక్కగానొక్క కూతురు సుజనని కంటికి రెప్పలాగా చూసుకుంటూ, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు వైదేహి దంపతులు. 



 సుజన చక్కగా పెరుగుతూ తన ముద్దు ముచ్చట్లు, ఆటపాటలతో అందరినీ చక్కగా అలరించేది. పెద్ద కంపెనీలో ఇంజనీరుగా పనిచేసే ఆనంద్ తనకు పెద్దలిచ్చిన ఇంట్లో భార్య వైదేహి, కూతురు సుజనతో చాలా సంతోషంగా ఉంటున్నారు. చిన్నదైన కుటుంబం, చింతలేని కుటుంబం అని వైదేహి మనసులో ఎప్పుడూ అనుకుని సంతోషపడుతూ ఉండేది. కాలక్రమేణా సుజన చక్కగా పెరుగుతూ కాలేజీలో చేరింది. చక్కగా చదువుతూ ఉండే సుజన అంటే తోటి విద్యార్థులకు, టీచర్లకు చాలా ఇష్టం. కాలేజీలో ఆటపాటలు, వక్తృత్వం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో సుజనే ముందంజలో ఉండి ప్రధమ బహుమతులను గెల్చుకునేది. 



 వారాంతంలో సుజనని తీసుకుని సినిమాలు, రెస్టారెంట్ లలో హాయిగా గడిపి ఇంటికి వచ్చేవాళ్లు ఆనంద్ దంపతులు. కాలం సాఫీగా గడిచిపోతోంది. సుజన పదవ తరగతి చదువుతుండగా ఒక సంఘటన జరిగింది. ఒక రోజు సుజన కాలేజీ నుంచి ఇంటికి వచ్చి ఏడుస్తూ తల్లిని హత్తుకుంది. వైదేహి ఏం జరిగిందో అని చాలా భయపడిపోయి కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని అనునయించింది. 



సుజన కాసేపు స్ధిమితపడ్డాక అమ్మా ! ఈరోజు క్లాసులో మా వెంకట్ మాస్టారు చాలా వెకిలిగా ప్రవర్తించారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. తన క్లాసు అయిపోతుండగానే సుజనా ! నిన్నటి పాఠంలో నీకు ఏదో సందేహం ఉందన్నావు కదా! క్లాసు అయిపోయినాక ఉండు. నీకు సమాధానాలు చెపుతాను అన్నారు క్లాసులో అందరిముందూ. 



నాకు చాలా ఆశ్చర్యం వేసి లేచి నుంచుని నేను అడగలేదు మాస్టారు. నాకే సందేహాలు లేవు అన్నాను. 
 
అప్పుడే నీవు మర్చిపోతే ఎలా ? గుర్తుపెట్టుకోవాలి. అన్నారు ఆయన.



 క్లాసు అవగానే నేను, నా స్నేహితురాలు నందిని కలిసి బయటికి వెళ్లబోతుండగా ఆయన నందినితో నందినీ! నీవు వెళ్లి పో! సుజనకి పాఠంలో ఏవో సందేహాలున్నాయంది. అవి చెపుతాను అనగానే నందిని వెళ్లిపోయింది. 



మాస్టారు నా దగ్గరికి వచ్చి నా మీద చెయ్యి వేసి నా భుజాలు గట్టిగా పట్టుకున్నారు. నాకు చాలా భయం వేసి ఆయన్ని గట్టిగా విదిలించుకొని లాగి ఆయన చెంప ఛెళ్లుమనిపించి బయటికి పరుగులు తీశాను. నేనలా చేస్తానని ఆయన ఊహించి ఉండరు. ఆయన నన్ను వెంబడించారు. నేను వేగంగా పరిగెత్తి బయటికి రాగా, అదృష్టవశాత్తూ సమీపంలోనే మా కాలేజీ బస్సు ఉంది. ఆయాసపడుతూ అందులోకి ఎక్కి కూర్చొని ఇంటికి వచ్చాను. నేనింక ఆ కాలేజీకు వెళ్లనమ్మా!. ఆయన్ని చూస్తే నాకు చాలా భయం వేస్తోంది. అంది వెక్కివెక్కి ఏడుస్తూ సుజన. 



 కూతురి పరిస్ధితి వైదేహికి అర్ధమైంది. తమ కాలంలో ఉపాధ్యాయులు ఎంత చక్కగా విలువలతో కూడిన విద్యని బోధిస్తూ, నీతి - నిజాయితీలను బోధిస్తూ తమకు పాఠాలను చెప్పేవారు. చక్కటి క్రమశిక్షణను నేర్పి తండ్రి లాగా భయభక్తులను అలవాటు చేసేవారు.



 “గురుర్బ్రహ్మః, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః అని ప్రతిరోజూ విద్యార్థులందరిచేత ప్రార్ధన చేయించి క్లాసు మొదలుపెట్టేవారు. గురుపూజోత్సవం రోజున మేము ఇప్పటికీ ఆ గురువులను కలుసుకుని పాదాభివందనం చేసొస్తాము.ఇప్పటికీ వాళ్లు పితృ వాత్సల్యంతో మమ్మల్ని ఆదరిస్తున్నారే!. సుజనకి ఇదేంటి ఈ విపత్కర పరిస్థితి? కలికాలం కాకపోతేను? అనుకుంది మనసులో వైదేహి. 
 
ముందు తను అననుయంగా కూతురికి ధైర్యం చెప్పి ఆమెని ఓదార్చాలని నిర్ణయించుకుంది. 



 “చూడు సుజనా! ముందు నీవు ఏడుపాపి నేను చెప్పేది శ్రధ్ధగా విను. అని తన పైట చెంగుతో కూతురి కళ్లు తుడిచింది. 
 
సుజనా! మనం ఏడిస్తే చూసి సంతోషించేవాళ్లే ఎక్కువ ఈ సమాజంలో. మా కాలం వేరు. మీ కాలం వేరు. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి. మా కాలంలో ఆడపిలలకు బేలతనం, అమాయకత్వం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీరు అలాకాదు. ఎప్పుడూ ధైర్యం నీ వెన్నంటే ఉండాలి. కడదాకా నీవు మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఎవరినీ నమ్మకూడదు. నీ జాగ్రత్తలో నీవుండాలి. ఆయనొక చీడపురుగు అనుకుని జరిగింది మర్చిపో. ఇలాంటి చీడపురుగులు ప్రతిచోటా మనకు తారసపడుతూనే ఉంటారు. 
ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారనుకొని భ్రమపడద్దు. మనల్ని మనమే రక్షించుకోవాలి. ధైర్యమే నీ ఆయుధం. నీవు ధైర్యంగా ప్రతిఘటించి ఆయన చెంప ఛెళ్లుమనిపించి తగిన బుధ్ధి చెప్పావు. నాన్న రాగానే ఆయనకు చెప్పి మనం మంచి నిర్ణయం తీసుకుందాము. మనం రేపు ఆ కాలేజీకు వెళ్లి హెడ్మాస్టారుకు జరిగింది చెప్పి ఆ మాస్టార్ని ఉద్యోగం లోంచి తీసేయమని హెచ్చరిద్దాము. 



దీనికి మిగిలిన పిల్లలు, వాళ్ల తల్లి తండ్రుల మద్దత్తుని కూడ గట్టుకుందాము. భవిష్యత్తులో ఇంక ఏ మాస్టార్లు నీచంగా ప్రవర్తించకుండా మనం బుధ్ధి చెపుదాం. నీవు నీ గదిలోకి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకో. నేను వేడివేడిగా పాలు తీసుకొస్తా. త్రాగి హాయిగా పడుకో. ఏదీ గుర్తుచేసుకోవద్దు. అని కూతురికి ముద్దిచ్చింది వైదేహి. 



 సుజన తన గదిలోకి వెళ్లింది. కాసేపటికి వైదేహి తెచ్చిన వేడిపాలను త్రాగి పడుకుంది సుజన.
 
తర్వాత ఎప్పటిలానే ఆఫీసునుంచి వచ్చిన భర్తకు వేడిగా కాఫీ ఇచ్చి ఆయన కాసేపు సేద తీరాక సుజనకు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది వైదేహి. అంతా విన్న ఆనంద్ కోపోద్రిక్తుడై నేను ఇప్పుడే వెళ్లి వాడి పని చెపుతాను. వాడింటి అడ్రసు తెలుసుకోవడం కష్టమేంకాదు. హెడ్మాస్టారు నడిగితే చెబుతారు. వాడికి జీవితంలో బుద్ది వచ్చేట్టు చేస్తాను అంటూ ఇంతెత్తున ఆవేశంగా లేచాడు. 






ముందు మీరు కోపాన్ని నిగ్రహించుకుని శాంతంగా ఉండండి. కోపం కాదు ఇప్పుడు కావలసింది ఆలోచన. ముందు మీరు సుజన వద్దకెళ్లి తనకు ధైర్యం చెప్పి అనునయించండి. రేపు మనం కాలేజీకు వెళ్లి హెడ్మాస్టారిని కలిసి ఆ నీచుడి విషయాన్ని చెప్పి వాడి ఉద్యోగం పీకేయమని హెచ్చరిద్దాం. అందుకు అవసరమైతే మనం మిగిలిన విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల మద్దతు తీసుకుందాం అంది వైదేహి.



సరే! అని ఆనంద్ సుజన గదిలోకి వెళ్లాడు. అప్పుడే నిద్రలేచిన సుజన తండ్రిని చూసి హత్తుకుని బావురుమంది. ఆనంద్ కూతురి కన్నీళ్లను తుడిచి చూడు సుజనా! నీకేం కాలేదు. ఇకముందు కూడా ఏంకాదు. ధైర్యంగా ఉండు. ఆ నీచుడి చెంప ఛెళ్లుమనిపించి మంచి పని చేశావు. ఎప్పుడూ మేమంతా నీకు అండగా ఉంటాం. అమ్మ నీకు అంతా చెప్పే ఉంటుంది కదా! మనం రేపే మీ కాలేజీకు వెళ్లి ఆ నీచుడికి తగిన గుణపాఠం చెబుదాం అన్నాడు ఆనంద్.



కమాన్ బేబీ! ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్లి వచ్చేదారిలో మంచి రెస్టారెంట్ కెళ్లొద్దాం. పది నిమిషాలలో రెడీ అవ్వాలి. ఏదీ నవ్వు అని అన్నతండ్రి మాటలకు జతకలుపుతూ కిలకిలా నవ్వింది సుజన.



కాసేపటికి ముగ్గురూ సరదాగా సినిమా చూసి, మంచి రెస్టారెంట్ లో విందు చేసి ఇంటికొచ్చి విశ్రమించారు. 
మరునాడు ఆనంద్ దంపతులు సుజనతో వాళ్ల కాలేజీకు వెళ్లారు. అక్కడి హెడ్మాస్టరి ఆఫీసుకు కు వెళ్లి నిన్న జరిగిందంతా వివరించి ఆ మాస్టర్ ని పిలవమన్నాడు ఆనంద్. ఆయన వెంకట్ మాస్టర్ ని పిలిచాడు. వెంకట్ వీళ్లను చూడగానే భయంతో వణికిపోయాడు. కోపం పట్టలేక పోయిన ఆనంద్ ఆ నీచుడి చెంప ఛెళ్లుమనిపించాడు. హెడ్మాస్టారు ఆనంద్ ని వారించి కూర్చోబెట్టి సముదాయించాడు. 



 హెడ్మాస్టారు వెంకట్ ని నిలదీశారు. జరిగింది ఒప్పుకుని క్షమించమని హెడ్మాస్టారు కాళ్లు పట్టుకున్నాడు. ఆనంద్ కాళ్లు పట్టుకుని నాకు భార్యా, పిల్లలు ఉన్నారు. ఈ విషయం ఎక్కడా చెప్పద్దు. నేనీ రోజే నా ఉద్యోగానికి రాజీనామా చేసి వేరే ఊరికెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ నా భార్యాబిడ్డలతో బ్రతుకుతాను. ఇంకెప్పుడూ ఎవరితోను అమర్యాదగా ప్రవర్తించను. దయచేసి సెక్యూరిటీ ఆఫీసర్లు, కేసులు పెట్టద్దు. నా బ్రతుకు రోడ్డు పాలవుతుంది. నన్ను క్షమించండి. సుజనా! నన్ను క్షమించమ్మా అన్నాడు వెంకట్. 



వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ కాగితాన్ని హెడ్మాస్టారుకి అందించాడు వెంకట్. వెంకట్ భార్యాబిడ్డలను దృష్టిలో ఉంచుకుని దయార్ధ హృదయులై పెద్దమనసుతో అతడిని క్షమించి వదిలేశారు ఆనంద్ దంపతులు. 



ముఖాన నెత్తురు చుక్క లేనట్లుగా తల వంచుకుని వెంకట్ వెళ్లిపోయాడు.



హెడ్మాస్టారు ఆనంద్ దంపతులకు క్షమాపణ చెప్పారు. జరిగింది నాకు చాలా బాధగా ఉంది. ఇకమీదట పిల్లలకు ఏం జరుగకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. అమ్మా! సుజనా! నీవు ఇదేమీ మనసులో పెట్టుకోకుండా హాయిగా చదువుకో. మంచి మార్కులు తెచ్చుకుని మన కాలేజ్ ఫస్టు రావాలి. సరేనా! అన్నారు హెడ్మాస్టారు. 



ఆయన వద్ద శెలవు తీసుకుని ఆనంద్ దంపతులు, సుజన తమ ఇంటికి వచ్చారు. అన్నట్లుగానే వెంకట్ తన భార్యాబిడ్డలతో వేరే ఊరు వెళ్లి అక్కడ మరో కాలేజీలో బుధ్ధిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు.
 
కాలం గడిచిపోతోంది. సుజన కష్టపడి చదివి మంచి మార్కులతో పాసయి కాలేజ్ ఫస్ట్. వచ్చింది. ఆనంద్ దంపతుల ఆనందానికి అవధులు లేవు. హెడ్మాస్టారు తమ కాలేజీలో అభినందన సభని ఏర్పాటు చేసి సుజనని ఘనంగా అభినందించారు. 



సుజన కాలేజీలో చేరి చక్కగా చదువుకుంటూ స్కాలర్షిప్ ని కూడా తెచ్చుకుంటోంది. సుజనని చూసి ఆనంద్ దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఏదో చప్పుడైతే కూతురి గురించిన ఆలోచనలనుంచి తెప్పరిల్లి మరలా మిగిలిన పనిలో పడింది వైదేహి. 



సమాప్తం.
 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
తిక్క తీరిందా.. తింగరోడా!
[Image: t.jpg]
నల్లబాటిరాఘవేంద్రరావు
 
 
భలేభలేరావు ఆ టౌన్లో రోడ్డుమీద పరుగు పెడుతున్నాడు. పరుగు పెట్టలేక అతనికి ఆయాసం వస్తుంది. దారిలో కనిపించిన తన మిత్రుడు అప్పారావుని సైకిల్ అడగాలని ఆపుచేసి కాళ్లు పట్టుకోవడానికి అహం అడ్డువచ్చి చేతులు పట్టుకొని బ్రతిమలాడినప్పటికీ అతను సైకిల్ ఇవ్వకపోగా అతని దగ్గర సైకిల్ బలవంతంగా లాక్కొని చాలా వేగంగా తొక్కుతున్నాడు భలేభలేరావు.



రిక్షాలో వెళుతున్న ఆ అమ్మాయిని రక్షించాలి. ఆమెతో పాటు ఆమె కట్టుకున్న బంగారపురంగు శారీని కూడా రక్షించాలి. జరగబోయే ప్రమాదం తప్పించాలి. ప్రతి సంవత్సరం ఆ టౌన్లో ఉన్న "సాహసం సేయరా డింభకా" అనే స్వచ్ఛంద సేవాసంస్థ సాహసాలు ప్రదర్శించిన యువకులకు 'సాహసయువత' అవార్డుతో పాటు లక్ష రూపాయలు బహుమతి ఇస్తుంటారు. అదిగో అది పట్టేయాలని భలేభలేరావు ప్రయత్నం అన్నమాట. రెండు సంవత్సరాల నుండి అదీ అతని తపన.



ఆ టౌన్లో చాలామందికి అతని గురించి తెలుసు కనుక భలేభలేరావు రోడ్డుమీద ఎన్ని సాహస ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా వాళ్లెవరూ అంతగా పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఎవరు తనను పట్టించుకోకపోయినా తను మాత్రం వాళ్ళందరినీ పట్టించుకుంటూనే ప్రయత్నం చేస్తున్నాడు.



ఆరు నెలల క్రితం వాటర్ ట్యాంకు పైకి ఎక్కేసిన అబ్బాయి క్రిందకు దూకేయకుండా రక్షించాలని జేబులో ఉన్న బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకుని గబగబా 500 మెట్లు ఉన్న వాటర్ ట్యాంకు చాలా కష్టపడి, ప్రయాసపడి ఎక్కాడు. తీరా పైకి ఎక్కాక అతను వాటర్ ట్యాంకు రిపేరు చేస్తున్న అబ్బాయి అని తెలుసుకుని నీరసపడిపోయాడు.



'''అయ్యో నీకేం కష్టాలు లేవా? దూకడానికి ప్రయత్నించడం లేదా? కిందపడి చావాలని నిర్ణయించుకో లేదా? అట్టాకాదు కానీ.. గతంలో సమస్యలు ఏమైనా ఉన్నాయేమో గుర్తుకు తెచ్చుకుని కొంచెం ప్రయత్నించవయ్యా బాబు." అంటూ క్రిందకు వంగి ఆ అబ్బాయి కాళ్లు పట్టుకుని బ్రతిమలాడి అడిగేశాడు.



'అసలు వీడు ఎవడ్రా బాబు.' అన్నట్టు పిచ్చివాడిని చూసినట్టు చూశాడు ఆ ట్యాంకు రిపేరు చేసే అబ్బాయి భలేభలేరావు వైపు.



"ఇదిగో అబ్బాయి నువ్వెవరో నాకు తెలియదు తెలియవలసిన అవసరం కూడా లేదు. అలాగే నేనెవరో నీకు తెలియదు నీకు తెలియవలసిన అవసరం కూడా నీకు అసలు లేదు. ఏతావాతా.. కత్తిపీట కందదుంప.. కరివేపాకు కాకరకాయ.. ఈ చెత్తాచెదారం మాటలు మనకెందుకు కానీ నేను చెప్పినట్టు ఇప్పుడు నువ్వు చేశావ్ అనుకో ఫిఫ్టీ ఫిఫ్టీ" అన్నాడు భలేభలేరావు.



''ఇదేదో బాగుందండి. ఎవరైనా మిమ్మల్ని చితకగొడితే అందులోనూ కూడా నాకు ఫిఫ్టీ ఫిఫ్టీయా?'' ఓ తలతిక్క ఫోజుతో అడిగాడు ఆ అబ్బాయి



''ఈ శుభసమయంలో కామెడీ వద్దు గానీ ఇదిగో నిజంగా చావవద్దు కానీ నువ్వు పైనుంచి దూకేస్తున్నట్టు నటించు. నేను నిన్ను రక్షిస్తానన్నమాట. అవార్డు రివార్డు ఇద్దరం చెరి సగం.''\n\n



''అదా విషయం. కూసంత అర్థమైందండి ఇప్పుడు.\n\nఈ టౌన్లో అందరూ విచిత్రంగా చెప్పుకునేది మీ గురించే అన్నమాట. ఒకవేళ మీ ప్రయత్నం మిస్ అయి నేను కిందపడి రెండు కాళ్లు విరిగిపోతే అప్పుడు మీది ఒక కాలు నేను ఇరగగొట్టవచ్చా? ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు కదా." గుర్రం ఇకిలించినట్టు ఇకిలిస్తూ అడిగాడు ఆ అబ్బాయి.



''అదెలా కుదురుద్ది. ఇదిగో నా మీద నమ్మకం లేకపోతే ముందు బయనాగా ఈ ఐదు రూపాయలు ఉంచు. నేను చెప్పినట్టు చెయ్యి.'' బ్రతిమలాడాడు భలేభలేరావు ఆ అబ్బాయిని.



ఆ అబ్బాయి ఒప్పుకోకపోవడంతో కోపం వచ్చి ఆ అబ్బాయి వీపు మీద రెండు పెసరట్లు వేసి పరిగెత్తుకొని వాటర్ ట్యాంకు మెట్లు క్రిందకు దిగుతూ దిగుతూ కాలు జారిపడ్డాడు. రెండు కుట్లు పడ్డాయి.



గతం గతః
మూడు నెలల క్రితం ఒక పాత పెంకుటిల్లుకి నిప్పు అంటుకుంటే అందులో ఉన్న వాళ్ళని రక్షించి బయటకు తీసుకురావాలని జనం అందరూ చూస్తుండగా ధైర్యసాహసాలతో లోపలకు ప్రవేశించాడు. కాలిపోతున్న గదులు అన్ని తిరిగి తిరిగి చూశాడు. ఎవరైనా తన సాహస కార్యక్రమం బయటనుండి సెల్ కెమెరాలో వీడియో తీస్తున్నారేమోనని దాన్ని పేపరు వార్తల్లో, టీవీలో ఉపయోగించుకోవచ్చునని కిటికీలోంచి తొంగి తొంగి చూశాడు. అబ్బేఅబ్బే ఆ ప్రయత్నం ఆవకాయ బద్ద అంత కూడా జరగడం లేదని గ్రహించాడు భలేభలేరావు.



అది పక్కన పెడితే అసలు బూడిదగుమ్మడికాయలో బూడిద లేనట్లు, దానిమ్మపండులో నిమ్మకాయ లేనట్లు, వెంకటేశ్వరుడిలో ఈశ్వరుడు లేనట్లు ఆ ఇంట్లో మనుషులే కాదు పిచ్చుకలు, బల్లులు, తేళ్లు, జెర్రులు కూడా లేవు. అందులో ఎవరూ కాపురం ఉండడం లేదని తెలుసుకుని ఒళ్ళంతా కాల్చుకొని బయటకు వచ్చాడు. ఎవరు కూడా అయ్యోపాపం అని అనలేదు కానీ పకపక, కిలకిల, గలగల నవ్వుకుంటూ వెళ్లిపోయారు తనను చూసి. హాస్పిటల్ ఖర్చు ఆరువేలుతో ఆ కథ పరిసమాప్తం అయింది.



ఈ గతం కూడా గతః



అయితే ఈరోజు ఈసారి మాత్రం తను చేసేది రాంగ్ ప్రయత్నం కాదు అని భలేభలేరావు నిశ్చయించుకుని తన ముందు తనకు కొంచెం దూరంలో రిక్షా ద్వారా జరగబోయే అతిపెద్ద ప్రమాదం, భయంకరమైన పెను ప్రమాదాన్నించి అందులో ప్రయాణిస్తున్న యువతిని రక్షించి రేపటి వార్తల్లో తను సాహస యువకుడిగా గుర్తింపు పొందెయ్యాలనేది భలేభలేరావు ప్రస్తుత సాహసప్రయత్నం.



సరే అప్రస్తుతంలో నుండి ప్రస్తుతంలోకి వచ్చేసాం కదా. ఇక ఇప్పుడు కథ మొదలవుతుంది అన్నమాట.



ఈరోజు ఐదు నిమిషాల ముందు ఆ టౌన్లో పాన్ షాప్ దగ్గర భలేభలేరావు నిలబడినప్పుడు.. ఎర్రచీర కట్టుకున్న ఆ అందమైన అమ్మాయి రిక్షాలో కూర్చుని వెళ్లడం చూశాడు భలేభలేరావు. కానీ ఆమె కట్టుకున్న చీర పైటచెంగు రిక్షా పక్కకు పడిపోయి రిక్షా చక్రంలో చుట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు పాపం ఆ అందమైన అమ్మాయి గుర్తించడం లేదు అన్న విషయం గుర్తించాడు భలేభలేరావు.



ఆ టౌన్ నిండా ఆటోలు బోల్డన్ని. ఆటోలో వెళ్లవచ్చు కదా ఆ అందమైన అమ్మాయి. ఈ రిక్షాలో వెళ్లడం దేనికి అని అతను ఏ మాత్రం అనుకోలేదు.. భలేభలే చౌక బేరం.. అనుకుంటూ క్రిందకు జారుతున్న తన ప్యాంటు గబగబా పైకి లాక్కొని జరగబోయే ప్రమాదం ఊహించి భలేభలేరావు కంగారుపడి ఆమెను రక్షించాలని రిక్షా వెనుక చాలాదూరం పరుగు పెట్టి ఇక పరుగుపెట్టలేక దారిలో తన మిత్రుడు అప్పారావు దగ్గర సైకిల్ బ్రతిమలాడి లాక్కొని ఇప్పుడు ఆ రిక్షాను సమీపించడానికి సైకిల్ వేగంగా తొక్కుతున్నాడన్నమాట. అయినా అందుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ రిక్షావాలా చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు.



''అమ్మో.. ఆ అందమైన అమ్మాయి ఎర్రచీర పైటచెంగు రిక్షాచక్రంలో అలా అలా గుండ్రంగా చుట్టుకుపోతే.. ఆమె క్రిందకు పడిపోతే.. ఇలా ఎన్నిచోట్ల జరగలేదు. ఆ తర్వాత ఆమె మీద రిక్షా పడిపోతే.. ఆ రిక్షా వెనుక వేగంగా వస్తున్న మోటార్ సైకిలిస్ట్‌లు వీళ్ళ మీద పడిపోతే.. ఆ వెనక మహావేగంగా వస్తున్న సిటీబస్సు వీళ్ళ అందరి మీదనుండి వెళ్ళిపోతే అమ్మో.. వామ్మో.. ఐబాబోయ్.. ప్రళయ భయంకర బీభత్సం! జరగబోయే ఆ జుగుప్సాకరకరకరమైన ప్రమాదం తను ఆపగలిగితే చాలు తన జన్మ ధన్యం.'' అనుకుంటున్నాడు మనసులో భలేభలేరావు. అందుకనే కసికసిగా తను సైకిల్ తొక్కుతున్నాడు ఆ రిక్షాను ఆపాలని.



ఎలాగైతేనే తన గుర్రం గెలిచింది. రిక్షా కన్నా తన సైకిల్ ముందుకు వెళ్ళింది. వెంటనే భలేభలేరావు సైకిల్ క్రిందకి దిగి దాన్ని రోడ్డు పక్కకు తోసేసి చేతులు అడ్డుపెట్టి రిక్షాను ఆపుచేశాడు. పరుగున రిక్షా దగ్గరగా సమీపించి అతి కష్టం మీద చక్రంలో పడడానికి సిద్ధంగా ఉన్న ఆ అందమైన అమ్మాయి ఎర్రచీర పైటచెంగును ఒడిసి పట్టుకొని రిక్షాలో కూర్చున్న ఆమె వైపు విజయగర్వంతో చూస్తూ.. ''మేడం ప్రమాదం తప్పింది. మీరు ఏ మాత్రం భయపడకండి. ఈ భలేభలేరావు మీకు అండగా ఉన్నాడు. ఇదిగో మీ ఎర్రచీర పైటచెంగు చక్రంలో పడకుండా తప్పించాను'' అంటూ ఆమెకు అందించాడు.



అప్పటికే బిలబిలమంటూ వందలాది జనం, వాహనాలు తిరునాళ్లతీర్థంలా ఆ చుట్టూ మూగిపోయాయి.



భలేభలేరావు మహా ఆనందంగా ప్రజలు అందరి వైపు తిరిగి గాలిలో చెయ్యి పైకి ఎత్తి సాహస యువకుడిగా విజయచిహ్నం చూపించాడు అందరికీ.



మరుక్షణం.. ఆ అమ్మాయి రిక్షా నుండి వేగంగా క్రిందకు దిగి భలేభలేరావు చెంపలు పగులకొట్టింది. అతని రెండు చెంపలు ఎర్రగా కమిలిపోయాయి.



సెల్ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది ఆ అమ్మాయి.



దగ్గరలో ఉన్న ఆ టౌన్ అధ్యక్షురాలు ఆండాళమ్మ గారు గబగబా మరో 10 మందితో అక్కడ ప్రవేశించింది.



"ఒక అందమైన అమ్మాయి ఎర్రచీర, ఒక పరాయి మగవాడు పట్టుకుని లాగడమా? హిస్సి.. ఇది సెక్యూరిటీ అధికారి స్టేషన్లోనూ, కోర్టులోనూ తేల్చుకోవలసిన సమస్య కాదు. ఈ క్షణమే ఇదే జనం ముందు దీని రిజల్ట్ తేలిపోవాలి." అనుకుని వచ్చిన మహిళామణులు అందరూ కలిసి భలేభలేరావు భరతం పట్టేసారు.



"అది కాదు మేడం గారు.. రిక్షా చక్రంలో ఆ అమ్మాయి ఎర్రచీర... " అంటూ తన సాహస ప్రయత్నం చెప్పడానికి ఆవగింజంత అవకాశం కూడా లేకుండా పోయింది భలేభలేరావుకు. చుట్టూ చూశాడు. ఒకటి కాదు రెండు కాదు వందలాది సెల్ కెమెరాలు తననే గురిపెట్టి చూస్తున్నాయి... భలే మంచి చౌకబేరము అన్నట్టుగా. కలలో కూడా పగవాడికి కూడా ఇటువంటి అవమాన భారం జరగకూడదు దేవుడా అనుకుంటూ క్లోజప్ ఫోటో కోసం అడిగిన వాళ్లకు కూడా అవకాశం ఇచ్చాడు భలేభలేరావు.. తప్పించుకోలేని తప్పని పరిస్థితులలో.



ఆ అమ్మాయి తనకోసం వచ్చిన మహిళామణులందరికీ అభినందనలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి
హగ్ చేసుకుని, ముద్దాడింది. ఆమె కోసం వచ్చిన మహిళామణులు కళకళ తళతళ మిలమిల మెరిసిపోతూ గుంపుగా వెళ్లిపోయారు



ఆ అమ్మాయి మళ్ళీ రిక్షా ఎక్కి యధావిధిగా తన పైటచెంగును రిక్షాచక్రంలో పడేటట్టుగా అలా అలా జారవదిలింది. రిక్షా రివ్వున ముందుకు దూసుకుపోయింది.



భలేభలేరావుని తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు పళ్ళు ఎదుటివారికి కనపడకుండా తమలో తామే నవ్వేసుకుంటూ.. కనీసం అతడిని పైకి లెగదీసే ప్రయత్నం కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారు.



''మోటార్ బండి మీద కూర్చున్నప్పుడు అలా పైటచెంగు గాలిలో ఎగిరేలా వదిలేయడం.. రిక్షాలో ప్రయాణిస్తున్నప్పుడు పైటచెంగు రిక్షాచక్రంలో పడేటట్టుగా అలా అలా జారవదలడం.. అందమైన కొందరు అమ్మాయిలకు ఇప్పుడు అదో ట్రెండు, ఫ్యాషన్!...



అనవసరంగా ఆ మేడం గారి చేత చెంపలు వాయగొట్టించుకున్నాడు గురుడు.'' అంటూ ఒకరు.



''మొత్తానికి ఈ శతాబ్దంలో గొప్ప అత్యద్భుత హాస్య సంఘటన ఇదే అనుకుంటాను గురు." అనుకుంటూ మరొకరు.



''రేపటి యూట్యూబ్ షార్ట్‌కి భలే ఐటమ్ దొరికింది.'' అనుకుంటూ ఇంకొకరు.



అలా అలా వెకిలిగా నవ్వుకుంటూ వెళ్తున్న జనం మాటలు భలేభలేరావు రెండు చెవి కర్ణభేరీలలో.. భేరీనాట్యం చేస్తున్నాయి.
**
 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
మతిమరుపు మాధవయ్య - అన్నీ మర్చిపోతేనే అదృష్టం
[Image: MM.jpg]

 
**రచన: వస కన్న (Vasa Kanna)**
**పరిచయం:**
మాధవయ్య అనే ఒక మధ్యతరగతి వ్యక్తికి ఉన్న ఒకే ఒక వీక్నెస్ 'మతిమరుపు'. అది ఏ రేంజ్‌లో ఉంటుందంటే, తను స్నానం చేసి వచ్చాక కూడా "నేను స్నానం చేశానా లేదా?" అని డౌట్ వచ్చి, తల తడి చూసుకుని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఒకసారి అయితే తన పాత స్నేహితుడు కనిపిస్తే, పేరు గుర్తురాక "నువ్వు ఎవరివో నాకు గుర్తులేదు కానీ, ఆరోజు నువ్వు తిన్న ఐస్క్రీమ్ డబ్బులు నేనే కట్టాను కదా!" అని అడిగాడు. ఇలాంటి మతిమరుపు వల్ల మాధవయ్య జీవితం చాలా గందరగోళంగా ఉండేది. కానీ, ఆ వింత అలవాటే అతన్ని కోటీశ్వరుడిని చేస్తుందని ఎవరూ ఊహించలేదు.
### **సీన్ 1: ఇంటర్వ్యూలో వింత మలుపు**
మాధవయ్య చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు ఒక మల్టీనేషనల్ కంపెనీలో అకౌంటెంట్ ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. కరెక్ట్‌గా ఆఫీస్ టైమ్‌కి బయల్దేరాడు కానీ, మధ్యలో బస్సు దిగగానే అసలు ఏ కంపెనీకి వెళ్లాలో, ఆ అడ్రస్ ఏంటో మర్చిపోయాడు. తన చేతిలో ఉన్న ఫైల్ చూసుకుందాం అంటే, అది ఇంట్లోనే మర్చిపోయి వచ్చాడు.
దిక్కుతోచక దారిలో ఉన్న ఒక పెద్దాయనను అడిగాడు, "అయ్యా! ఇక్కడ ఒక పెద్దాయన ఇంటర్వ్యూ చేస్తా అన్నారు, అది ఎక్కడో మీకు తెలుసా?" అని. ఆ పెద్దాయన నవ్వి, "రా బాబు, నేను అక్కడికే వెళ్తున్నాను" అని తన లగ్జరీ కార్లో ఎక్కించుకున్నాడు. ఆఫీస్ వెళ్ళాక తెలిసింది, ఆయన ఆ కంపెనీ ఓనర్ అని! ఇంటర్వ్యూలో మాధవయ్యని ఒక ప్రశ్న అడిగారు—"నీ బలహీనత ఏంటి?". మాధవయ్య నిజాయితీగా, "సార్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో కూడా మర్చిపోతాను, కానీ ఏ పని చేసినా చాలా పద్ధతిగా చేస్తాను" అన్నాడు. ఆ ఓనర్ ముచ్చటపడి, "నీకు అబద్ధం ఆడటం అసలు రాదు, నీలాంటి వాడే మాకు కావాలి" అని వెంటనే అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చేశాడు.
### **సీన్ 2: పాస్‌వర్డ్ సెక్యూరిటీ - హ్యాకర్లకే చుక్కలు!**
ఉద్యోగంలో చేరాక మాధవయ్య తన కంప్యూటర్ పాస్‌వర్డ్‌ని రోజుకోసారి మారుస్తుండేవాడు. మార్చిన మరుక్షణమే మర్చిపోయేవాడు. ఒకసారి కంపెనీ మీద పెద్ద సైబర్ దాడి జరిగింది. ప్రొఫెషనల్ హ్యాకర్లు కంపెనీ సర్వర్లన్నీ హ్యాక్ చేశారు కానీ, మాధవయ్య సిస్టమ్ దగ్గర ఆగిపోయారు. వాడు పెట్టిన పాస్‌వర్డ్ ఏంటో వాడికే తెలియదు, ఇక హ్యాకర్లకి ఎలా తెలుస్తుంది?
"వరుసగా మూడు సార్లు తప్పు పాస్‌వర్డ్ కొట్టడం వల్ల" సిస్టమ్ లాక్ అయిపోయి, అందులో ఉన్న కోట్లాది రూపాయల 'గోప్యమైన డేటా' హ్యాకర్ల చేతికి చిక్కకుండా సేఫ్ అయిపోయింది. ఆ కంపెనీకి జరగాల్సిన 100 కోట్ల నష్టం తప్పింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ షాక్ అయ్యి, "నీ సెక్యూరిటీ ఐడియా అద్భుతం!" అని మాధవయ్యకి 25 లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించారు. మాధవయ్య మాత్రం మనసులో "పాస్‌వర్డ్ ఏంటో గుర్తురాక నేను పడ్డ తిప్పలు నాకు తెలుసు" అని నవ్వుకున్నాడు.
### **సీన్ 3: పెళ్లి రోజు - అపార్థం నుంచి అదృష్టం వైపు!**
జనవరి 29.. మాధవయ్య పెళ్లి రోజు. భార్య పార్వతి ఉదయం నుంచి రకరకాల హింట్స్ ఇస్తోంది. "ఈరోజు నా కోరిక తీరుస్తారా?" అని అడిగితే, మాధవయ్య మర్చిపోయి "రేపు చేద్దాంలే" అన్నాడు. పార్వతి కోపంతో ఊగిపోయింది. ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు, ఏ గిఫ్ట్ కొనాలో గుర్తురాక ఒక లాటరీ షాప్ ముందు ఆగాడు. ఎవరో చెబితే ఒక టికెట్ కొని, దాన్ని ఒక పూల బొకేలో పెట్టి భార్యకి ఇచ్చాడు.
ఆ మరుసటి రోజు ఉదయం టీవీలో వార్తలు వస్తున్నాయి. మాధవయ్య కొన్న లాటరీ టికెట్‌కి ఏకంగా 10 కోట్ల రూపాయల బంపర్ ప్రైజ్ తగిలింది! పార్వతి ఆనందంతో గెంతుతూ, "మీకు నా మీద ఎంత ప్రేమో! పెళ్లి రోజుకి ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు!" అని మురిసిపోయింది. మాధవయ్యకి అప్పుడు గుర్తుకొచ్చింది—అసలు ఆరోజు తన పెళ్లి రోజని! ఆ ఒక్క మతిమరుపు అతన్ని రాత్రికి రాత్రే ఊహించని ధనవంతుడిని చేసింది.
### **సీన్ 4: స్థలాల కొనుగోలు - పొరపాటులో లాభం!**
ఒకసారి మాధవయ్య ఒక ఇంటి స్థలం కొందామని వెళ్లి, అడ్రస్ మర్చిపోయి ఊరి చివరన ఉన్న ఒక బీడు భూమికి అడ్వాన్స్ ఇచ్చేశాడు. అందరూ "అక్కడ నీళ్లు రావు, అడవి అది, ఎందుకు కొన్నావు?" అని వెక్కిరించారు. కానీ సరిగ్గా రెండు నెలల తర్వాత, గవర్నమెంట్ ఆ బీడు భూమి మధ్యలోనే ఒక పెద్ద నేషనల్ హైవే మరియు ఎయిర్‌పోర్ట్ కడతామని ప్రకటించింది. ఆ భూమి రేటు రాత్రికి రాత్రే వంద రెట్లు పెరిగింది!
**ముగింపు:**
ఈరోజు మాధవయ్య ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యానికి అధిపతి. ఇప్పుడు వాడు ఏది మర్చిపోయినా, అది ఒక కొత్త వ్యాపారానికి దారి తీస్తోంది. జనం ఇప్పుడు మతిమరుపుని ఒక లోపంగా చూడటం మానేశారు. "మాధవయ్యలా అన్నీ మర్చిపోతేనే అదృష్టం తలుపు తడుతుంది" అని అందరూ అనుకుంటున్నారు.
**నీతి:** కొన్నిసార్లు మన బలహీనతలే మన విజయానికి పునాదులు వేస్తాయి, అయితే ఆ మతిమరుపులో కూడా ఒక స్వచ్ఛమైన మనసు ఉండాలి!
---
**ముగిసింది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
సుజన ధైర్యం
రచననీరజ హరి ప్రభల 



అమ్మా! నా కాలేజి బస్సుకు టైమవుతోంది. బాక్స్ రెడీనా! అడిగింది సుజన తన తల్లిని.



ఇదిగో బాక్స్. వచ్చి తీసుకో. ఈ పాలు త్రాగి వెళ్లు వంటింట్లో నుంచి పెద్దగా కేకేసింది వైదేహి.
సరే! అని వంటింట్లోకి వెళ్లి పాలుత్రాగి బాక్స్ ని తీసుకుని హడావిడిగా బస్సు కోసం పరిగెత్తింది సుజన. 
తనువెళ్లినవైపే చూస్తూండిపోయిన వైదేహికి కూతురి గురించిన ఆలోచనలు చుట్టుముట్టాయి.



 చిన్నప్పటి నుంచి సుజన చాలా ఉత్సాహంగా గెంతులువేస్తూ ఎంతో సంతోషంగా ఉండేది. తను ఎక్కడ ఉంటే అక్కడ సందడి నెలకొనేది. గలగలలాడే సుజన కబుర్లు వింటుంటే తనకు, తన భర్త ఆనంద్ కు చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఒక్కగానొక్క కూతురు సుజనని కంటికి రెప్పలాగా చూసుకుంటూ, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు వైదేహి దంపతులు. 



 సుజన చక్కగా పెరుగుతూ తన ముద్దు ముచ్చట్లు, ఆటపాటలతో అందరినీ చక్కగా అలరించేది. పెద్ద కంపెనీలో ఇంజనీరుగా పనిచేసే ఆనంద్ తనకు పెద్దలిచ్చిన ఇంట్లో భార్య వైదేహి, కూతురు సుజనతో చాలా సంతోషంగా ఉంటున్నారు. చిన్నదైన కుటుంబం, చింతలేని కుటుంబం అని వైదేహి మనసులో ఎప్పుడూ అనుకుని సంతోషపడుతూ ఉండేది. కాలక్రమేణా సుజన చక్కగా పెరుగుతూ కాలేజీలో చేరింది. చక్కగా చదువుతూ ఉండే సుజన అంటే తోటి విద్యార్థులకు, టీచర్లకు చాలా ఇష్టం. కాలేజీలో ఆటపాటలు, వక్తృత్వం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో సుజనే ముందంజలో ఉండి ప్రధమ బహుమతులను గెల్చుకునేది. 



 వారాంతంలో సుజనని తీసుకుని సినిమాలు, రెస్టారెంట్ లలో హాయిగా గడిపి ఇంటికి వచ్చేవాళ్లు ఆనంద్ దంపతులు. కాలం సాఫీగా గడిచిపోతోంది. సుజన పదవ తరగతి చదువుతుండగా ఒక సంఘటన జరిగింది. ఒక రోజు సుజన కాలేజీ నుంచి ఇంటికి వచ్చి ఏడుస్తూ తల్లిని హత్తుకుంది. వైదేహి ఏం జరిగిందో అని చాలా భయపడిపోయి కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని అనునయించింది. 



సుజన కాసేపు స్ధిమితపడ్డాక అమ్మా ! ఈరోజు క్లాసులో మా వెంకట్ మాస్టారు చాలా వెకిలిగా ప్రవర్తించారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. తన క్లాసు అయిపోతుండగానే సుజనా ! నిన్నటి పాఠంలో నీకు ఏదో సందేహం ఉందన్నావు కదా! క్లాసు అయిపోయినాక ఉండు. నీకు సమాధానాలు చెపుతాను అన్నారు క్లాసులో అందరిముందూ. 



నాకు చాలా ఆశ్చర్యం వేసి లేచి నుంచుని నేను అడగలేదు మాస్టారు. నాకే సందేహాలు లేవు అన్నాను. 
 
అప్పుడే నీవు మర్చిపోతే ఎలా ? గుర్తుపెట్టుకోవాలి. అన్నారు ఆయన.



 క్లాసు అవగానే నేను, నా స్నేహితురాలు నందిని కలిసి బయటికి వెళ్లబోతుండగా ఆయన నందినితో నందినీ! నీవు వెళ్లి పో! సుజనకి పాఠంలో ఏవో సందేహాలున్నాయంది. అవి చెపుతాను అనగానే నందిని వెళ్లిపోయింది. 



మాస్టారు నా దగ్గరికి వచ్చి నా మీద చెయ్యి వేసి నా భుజాలు గట్టిగా పట్టుకున్నారు. నాకు చాలా భయం వేసి ఆయన్ని గట్టిగా విదిలించుకొని లాగి ఆయన చెంప ఛెళ్లుమనిపించి బయటికి పరుగులు తీశాను. నేనలా చేస్తానని ఆయన ఊహించి ఉండరు. ఆయన నన్ను వెంబడించారు. నేను వేగంగా పరిగెత్తి బయటికి రాగా, అదృష్టవశాత్తూ సమీపంలోనే మా కాలేజీ బస్సు ఉంది. ఆయాసపడుతూ అందులోకి ఎక్కి కూర్చొని ఇంటికి వచ్చాను. నేనింక ఆ కాలేజీకు వెళ్లనమ్మా!. ఆయన్ని చూస్తే నాకు చాలా భయం వేస్తోంది. అంది వెక్కివెక్కి ఏడుస్తూ సుజన. 



 కూతురి పరిస్ధితి వైదేహికి అర్ధమైంది. తమ కాలంలో ఉపాధ్యాయులు ఎంత చక్కగా విలువలతో కూడిన విద్యని బోధిస్తూ, నీతి - నిజాయితీలను బోధిస్తూ తమకు పాఠాలను చెప్పేవారు. చక్కటి క్రమశిక్షణను నేర్పి తండ్రి లాగా భయభక్తులను అలవాటు చేసేవారు.



 “గురుర్బ్రహ్మః, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః అని ప్రతిరోజూ విద్యార్థులందరిచేత ప్రార్ధన చేయించి క్లాసు మొదలుపెట్టేవారు. గురుపూజోత్సవం రోజున మేము ఇప్పటికీ ఆ గురువులను కలుసుకుని పాదాభివందనం చేసొస్తాము.ఇప్పటికీ వాళ్లు పితృ వాత్సల్యంతో మమ్మల్ని ఆదరిస్తున్నారే!. సుజనకి ఇదేంటి ఈ విపత్కర పరిస్థితి? కలికాలం కాకపోతేను? అనుకుంది మనసులో వైదేహి. 
 
ముందు తను అననుయంగా కూతురికి ధైర్యం చెప్పి ఆమెని ఓదార్చాలని నిర్ణయించుకుంది. 



 “చూడు సుజనా! ముందు నీవు ఏడుపాపి నేను చెప్పేది శ్రధ్ధగా విను. అని తన పైట చెంగుతో కూతురి కళ్లు తుడిచింది. 
 
సుజనా! మనం ఏడిస్తే చూసి సంతోషించేవాళ్లే ఎక్కువ ఈ సమాజంలో. మా కాలం వేరు. మీ కాలం వేరు. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి. మా కాలంలో ఆడపిలలకు బేలతనం, అమాయకత్వం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీరు అలాకాదు. ఎప్పుడూ ధైర్యం నీ వెన్నంటే ఉండాలి. కడదాకా నీవు మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఎవరినీ నమ్మకూడదు. నీ జాగ్రత్తలో నీవుండాలి. ఆయనొక చీడపురుగు అనుకుని జరిగింది మర్చిపో. ఇలాంటి చీడపురుగులు ప్రతిచోటా మనకు తారసపడుతూనే ఉంటారు. 
ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారనుకొని భ్రమపడద్దు. మనల్ని మనమే రక్షించుకోవాలి. ధైర్యమే నీ ఆయుధం. నీవు ధైర్యంగా ప్రతిఘటించి ఆయన చెంప ఛెళ్లుమనిపించి తగిన బుధ్ధి చెప్పావు. నాన్న రాగానే ఆయనకు చెప్పి మనం మంచి నిర్ణయం తీసుకుందాము. మనం రేపు ఆ కాలేజీకు వెళ్లి హెడ్మాస్టారుకు జరిగింది చెప్పి ఆ మాస్టార్ని ఉద్యోగం లోంచి తీసేయమని హెచ్చరిద్దాము. 



దీనికి మిగిలిన పిల్లలు, వాళ్ల తల్లి తండ్రుల మద్దత్తుని కూడ గట్టుకుందాము. భవిష్యత్తులో ఇంక ఏ మాస్టార్లు నీచంగా ప్రవర్తించకుండా మనం బుధ్ధి చెపుదాం. నీవు నీ గదిలోకి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకో. నేను వేడివేడిగా పాలు తీసుకొస్తా. త్రాగి హాయిగా పడుకో. ఏదీ గుర్తుచేసుకోవద్దు. అని కూతురికి ముద్దిచ్చింది వైదేహి. 



 సుజన తన గదిలోకి వెళ్లింది. కాసేపటికి వైదేహి తెచ్చిన వేడిపాలను త్రాగి పడుకుంది సుజన.
 
తర్వాత ఎప్పటిలానే ఆఫీసునుంచి వచ్చిన భర్తకు వేడిగా కాఫీ ఇచ్చి ఆయన కాసేపు సేద తీరాక సుజనకు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది వైదేహి. అంతా విన్న ఆనంద్ కోపోద్రిక్తుడై నేను ఇప్పుడే వెళ్లి వాడి పని చెపుతాను. వాడింటి అడ్రసు తెలుసుకోవడం కష్టమేంకాదు. హెడ్మాస్టారు నడిగితే చెబుతారు. వాడికి జీవితంలో బుద్ది వచ్చేట్టు చేస్తాను అంటూ ఇంతెత్తున ఆవేశంగా లేచాడు. 






ముందు మీరు కోపాన్ని నిగ్రహించుకుని శాంతంగా ఉండండి. కోపం కాదు ఇప్పుడు కావలసింది ఆలోచన. ముందు మీరు సుజన వద్దకెళ్లి తనకు ధైర్యం చెప్పి అనునయించండి. రేపు మనం కాలేజీకు వెళ్లి హెడ్మాస్టారిని కలిసి ఆ నీచుడి విషయాన్ని చెప్పి వాడి ఉద్యోగం పీకేయమని హెచ్చరిద్దాం. అందుకు అవసరమైతే మనం మిగిలిన విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల మద్దతు తీసుకుందాం అంది వైదేహి.



సరే! అని ఆనంద్ సుజన గదిలోకి వెళ్లాడు. అప్పుడే నిద్రలేచిన సుజన తండ్రిని చూసి హత్తుకుని బావురుమంది. ఆనంద్ కూతురి కన్నీళ్లను తుడిచి చూడు సుజనా! నీకేం కాలేదు. ఇకముందు కూడా ఏంకాదు. ధైర్యంగా ఉండు. ఆ నీచుడి చెంప ఛెళ్లుమనిపించి మంచి పని చేశావు. ఎప్పుడూ మేమంతా నీకు అండగా ఉంటాం. అమ్మ నీకు అంతా చెప్పే ఉంటుంది కదా! మనం రేపే మీ కాలేజీకు వెళ్లి ఆ నీచుడికి తగిన గుణపాఠం చెబుదాం అన్నాడు ఆనంద్.



కమాన్ బేబీ! ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్లి వచ్చేదారిలో మంచి రెస్టారెంట్ కెళ్లొద్దాం. పది నిమిషాలలో రెడీ అవ్వాలి. ఏదీ నవ్వు అని అన్నతండ్రి మాటలకు జతకలుపుతూ కిలకిలా నవ్వింది సుజన.



కాసేపటికి ముగ్గురూ సరదాగా సినిమా చూసి, మంచి రెస్టారెంట్ లో విందు చేసి ఇంటికొచ్చి విశ్రమించారు. 
మరునాడు ఆనంద్ దంపతులు సుజనతో వాళ్ల కాలేజీకు వెళ్లారు. అక్కడి హెడ్మాస్టరి ఆఫీసుకు కు వెళ్లి నిన్న జరిగిందంతా వివరించి ఆ మాస్టర్ ని పిలవమన్నాడు ఆనంద్. ఆయన వెంకట్ మాస్టర్ ని పిలిచాడు. వెంకట్ వీళ్లను చూడగానే భయంతో వణికిపోయాడు. కోపం పట్టలేక పోయిన ఆనంద్ ఆ నీచుడి చెంప ఛెళ్లుమనిపించాడు. హెడ్మాస్టారు ఆనంద్ ని వారించి కూర్చోబెట్టి సముదాయించాడు. 



 హెడ్మాస్టారు వెంకట్ ని నిలదీశారు. జరిగింది ఒప్పుకుని క్షమించమని హెడ్మాస్టారు కాళ్లు పట్టుకున్నాడు. ఆనంద్ కాళ్లు పట్టుకుని నాకు భార్యా, పిల్లలు ఉన్నారు. ఈ విషయం ఎక్కడా చెప్పద్దు. నేనీ రోజే నా ఉద్యోగానికి రాజీనామా చేసి వేరే ఊరికెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ నా భార్యాబిడ్డలతో బ్రతుకుతాను. ఇంకెప్పుడూ ఎవరితోను అమర్యాదగా ప్రవర్తించను. దయచేసి సెక్యూరిటీ ఆఫీసర్లు, కేసులు పెట్టద్దు. నా బ్రతుకు రోడ్డు పాలవుతుంది. నన్ను క్షమించండి. సుజనా! నన్ను క్షమించమ్మా అన్నాడు వెంకట్. 



వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ కాగితాన్ని హెడ్మాస్టారుకి అందించాడు వెంకట్. వెంకట్ భార్యాబిడ్డలను దృష్టిలో ఉంచుకుని దయార్ధ హృదయులై పెద్దమనసుతో అతడిని క్షమించి వదిలేశారు ఆనంద్ దంపతులు. 



ముఖాన నెత్తురు చుక్క లేనట్లుగా తల వంచుకుని వెంకట్ వెళ్లిపోయాడు.



హెడ్మాస్టారు ఆనంద్ దంపతులకు క్షమాపణ చెప్పారు. జరిగింది నాకు చాలా బాధగా ఉంది. ఇకమీదట పిల్లలకు ఏం జరుగకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. అమ్మా! సుజనా! నీవు ఇదేమీ మనసులో పెట్టుకోకుండా హాయిగా చదువుకో. మంచి మార్కులు తెచ్చుకుని మన కాలేజ్ ఫస్టు రావాలి. సరేనా! అన్నారు హెడ్మాస్టారు. 



ఆయన వద్ద శెలవు తీసుకుని ఆనంద్ దంపతులు, సుజన తమ ఇంటికి వచ్చారు. అన్నట్లుగానే వెంకట్ తన భార్యాబిడ్డలతో వేరే ఊరు వెళ్లి అక్కడ మరో కాలేజీలో బుధ్ధిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు.
 
కాలం గడిచిపోతోంది. సుజన కష్టపడి చదివి మంచి మార్కులతో పాసయి కాలేజ్ ఫస్ట్. వచ్చింది. ఆనంద్ దంపతుల ఆనందానికి అవధులు లేవు. హెడ్మాస్టారు తమ కాలేజీలో అభినందన సభని ఏర్పాటు చేసి సుజనని ఘనంగా అభినందించారు. 



సుజన కాలేజీలో చేరి చక్కగా చదువుకుంటూ స్కాలర్షిప్ ని కూడా తెచ్చుకుంటోంది. సుజనని చూసి ఆనంద్ దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఏదో చప్పుడైతే కూతురి గురించిన ఆలోచనలనుంచి తెప్పరిల్లి మరలా మిగిలిన పనిలో పడింది వైదేహి. 



సమాప్తం.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
తిరప్తి
[Image: acb93b_1e70adeee97748efac2319a80b1d12b6~mv2.jpg]



రచన: ఎం. కె. కుమార్




సాయంత్రం ఐదు గంటలు. తిరుపతి రైల్వే స్టేషన్‌లో రైలు ఆగింది. బోగీ నుండి దిగిన రఘురామ్ పాదాలు ఆ నేల మీద పడగానే, శరీరం మొత్తం ఒక తెలియని విద్యుత్ ప్రవహించినట్లయింది.



ముప్పై ఐదు సంవత్సరాలు... సరిగ్గా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి సొంత గడ్డ మీద కాలు మోపుతున్నాడు.



అమెరికాలోని డాలస్ నగరంలో గడిపిన యాంత్రిక జీవితం, ఏసీ గదుల చల్లదనం, వీకెండ్ పార్టీల హడావిడి ఏదీ ఇప్పుడు అతని మనసులో లేదు. కేవలం ఒకే ఒక ఆలోచన…



"నా ఊరు... నా తిరుపతి."



స్టేషన్ బయటకు వచ్చాడు. ఒకప్పుడు ఇక్కడ కనిపించే నిదానమైన వాతావరణం లేదు. ఆటోల రణగొణధ్వనులు, మైకుల్లో అనౌన్స్‌మెంట్లు, జనసందోహం.



ఏదో జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా అనిపించింది రఘురామ్‌కి. ఒక టాక్సీని పిలిచాడు.



"సార్, ఎక్కడికి వెళ్ళాలి?" డ్రైవర్ అడిగాడు.



"ఊరంతా..." అన్నాడు రఘురామ్ చిన్నగా నవ్వుతూ.



డ్రైవర్ అర్థం కానట్లు చూశాడు.



"సరే, ముందు గాంధీ రోడ్ వైపు పోనీ..." అని చెప్పాడు.



కారు కదులుతుంటే, రఘురామ్ మనసు కాలంలో వెనక్కి ప్రయాణించడం మొదలుపెట్టింది. అద్దం లోంచి బయటకి చూస్తున్నాడు కానీ, అతని కళ్ళకు కనిపిస్తున్నది వేరు.



కారు టౌన్ క్లబ్ మీదుగా వెళ్తుంటే, రఘురామ్ కళ్ళు ఆత్రంగా వెదికాయి. ఒక పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ అక్కడ ఠీవిగా నిలబడి ఉంది.



రఘురామ్ గుండెలో ఒక సన్నని ముల్లు గుచ్చుకున్నట్లయింది.



అది రామకృష్ణ థియేటర్.



అది కేవలం ఒక థియేటర్ కాదు, అదొక దేవాలయం. రఘురామ్ కళ్ళు చెమ్మగిల్లాయి.



శంకరాభరణం సినిమా విడుదలైన రోజు గుర్తొచ్చింది.



అదొక పండగ. ఆ హాల్లో ఎస్.పి.బాలు గొంతు నుండి "శంకరా... నాదశరీరాపరా..." అని పాట వస్తుంటే, రోమాలు నిక్కబొడుచుకునేవి.



జనం ఊపిరి బిగబట్టి వినేవారు. సినిమా అయిపోయాక కూడా ఆ మత్తులో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిన రోజులు అవి.



ఇప్పుడు? ఆ సంగీతం లేదు, ఆ కళ లేదు. అక్కడ నివసించే వారికి తెలుసా, తాము నిలబడ్డ నేల మీద ఒకప్పుడు ఒక అద్భుతమైన కళాఖండం ప్రదర్శించబడిందని?



కాస్త ముందుకు వెళ్తే ఐ.ఏస్.మహల్. ఒకప్పుడు ఇంగ్లీషు సినిమాలు చూడాలంటే తిరుపతి కుర్రాళ్ళకి అదొక స్వర్గధామం.



బాండ్ సినిమాలు, కౌబాయ్ సినిమాలు అక్కడ చూసి, కాలర్ ఎగరేసుకుని తిరిగిన రోజులు.



ఇప్పుడు ఆ మహల్ మూగబోయింది. రంగు వెలిసిపోయి, ఏకాకిగా నిలబడి, గతం తాలూకు వైభవాన్ని తలచుకుని రోదిస్తున్న వృద్ధురాలిలా ఉంది.



మరింత ముందుకు వెళ్తే, అప్పట్లో తక్కువ స్థలంలోనే ఒక ఆర్కిటెక్చర్ అద్భుతంలా కట్టిన శ్రీనివాస మహల్.



ఆ మెట్లు, ఆ బాల్కనీ డిజైన్ చూసి ముచ్చటపడేవారు.



కానీ నేడు? అక్కడొక పెద్ద 'సౌత్ ఇండియా షాపింగ్ మాల్' వెలిసింది. కళాస్వప్నాలు కాల్సిన చోట, ఇప్పుడు పట్టుచీరల వ్యాపారం నడుస్తోంది.



ఆప్యాయతల స్థానంలో అమ్మకాల వ్యవహారాలు చేరాయి. టికెట్ కోసం క్యూలో నిలబడ్డ స్నేహం, ఇప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గర నిలబడ్డ సహనంగా మారిపోయింది.



కారు వెస్ట్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ వైపు మలుపు తిరిగింది. రఘురామ్ చిన్నప్పుడు ఆ ఏరియా వైపు రావాలంటేనే భయపడేవాడు.



అదొక 'భూత్ బంగాళా'లా ఉండేది. పాతకాలపు రాతి కట్టడం, చుట్టూ భయం గొలిపే చెట్లు. కానీ ఇప్పుడు అక్కడ కార్పొరేట్ లుక్ వచ్చింది.



భయం పోయింది కానీ, ఆ గంభీరత్వం కూడా పోయింది.



రఘురామ్ డ్రైవర్ ని ఆపి, నడవడం మొదలుపెట్టాడు. పర్సాల వీధి లోకి అడుగుపెట్టాడు.



అక్కడ అడుగువేయగానే అతని నాసికాపుటాలకు ఏదో వాసన తగలాలి: అగరుబత్తుల వాసన, పసుపు కుంకుమల వాసన.



కానీ ఇప్పుడు డ్రైనేజీ వాసన, వాహనాల పొగ వాసన. ఒకప్పుడు ఈ వీధిలో యాత్రీకుల జోరు తిరునాళ్ళను తలపించేది.



ప్రతి ఇంటి అరుగు మీద అమ్మమ్మలు కూర్చుని కాశీదారాలు (నల్ల దారాలు) అల్లేవారు. అది కేవలం దారం కాదు, భక్తితో ముడివేసిన నమ్మకం.



ప్రతి ఇల్లు ఒక చిన్నపాటి కుటీర పరిశ్రమలా ఉండేది. దారాలు అల్లుతూనే, ఊరి సంగతులు, మంచి చెడ్డలు మాట్లాడుకునేవారు.



ఆ అమ్మమ్మల ముడతలు పడ్డ చేతుల్లో ఎంత ప్రేమ ఉండేది! ఇప్పుడు అరుగులు లేవు, గ్రిల్స్ పెట్టిన గేట్లు మూసుకుని ఉన్నాయి. మనుషులు లోపల ఉన్నారు, కానీ మనసులు ఎక్కడున్నాయో?



నడుచుకుంటూ గాలి వీధి వైపు వచ్చాడు. అక్కడ ఒకప్పుడు వినిపించే సంగీతం వేరు. ఉదయాన్నే ఆడవాళ్లు ఇత్తడి బిందెలు చంకన పెట్టుకుని, నీళ్ల కోసం వెళ్తుంటే వచ్చే ఆ 'గలగల' శబ్దం..



అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలంత శ్రావ్యంగా ఉండేది. ఆ బిందెల శబ్దం, పట్టీల శబ్దం, పరస్పరం పలకరించుకునే నవ్వుల శబ్దం... అదొక సామూహిక జీవన రాగం.



రఘురామ్‌కి దాహం వేసింది. చుట్టూ చూశాడు. ఎక్కడా చేదబావులు కనిపించలేదు.



చిన్నప్పుడు దాహం వేస్తే, ఏ ఇంటి ముందర ఆగి, బావిలో చేద వేసి, గలగలా నీళ్లు తోడుకుని, దోసిలి నిండా తాగుతుంటే... ఆ అమృతంలాంటి నీటి రుచి ఇంకా నాలుక మీద గుర్తుంది.



ఆ బావులను ఎప్పుడో బోర్లు మింగేశాయి. పోనీ బోర్లు ఉన్నాయా అంటే... ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు దాహం తీర్చిన ఆ ఇనుప బోర్లు కూడా కనుమరుగైపోయాయి.



ఇప్పుడు దాహం వేస్తే జేబులో డబ్బులుండాలి, షాపులో ప్లాస్టిక్ బాటిల్ కొనాలి. గంగమ్మ తల్లి కూడా వ్యాపార వస్తువు అయిపోయింది.



నడుస్తుంటే మహావీర్ టాకీసు గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ 'శ్రీదేవి కాంప్లెక్స్' నిలబడి ఉంది.



సినిమా ఇంటర్వెల్‌లో బయటకు వచ్చి, పక్కనే ఉన్న బండి మీద జాలీ ఐస్ కొనుక్కుని తినడం... ఆ చల్లదనం, ఆ తీపి... ఇప్పుడు ఏ బ్రాండెడ్ ఐస్ క్రీమ్‌లోనూ దొరకదు.



సాయంత్రం అయితే చాలు రోస్ మిల్క్ కోసం స్నేహితులతో పోటీ పడేవాళ్ళు. ఆ రంగు, ఆ సువాసన... అదొక ఎమోషన్.



ఊరు చివరన ఉండే ఊర్వశి హోటల్. అక్కడ దొరికే దోశ, సాంబార్ రుచి... అమృతంతో సమానం. ఇప్పుడు ఆ హోటల్ లేదు, ఆ రుచి లేదు. అంతా ఫాస్ట్ ఫుడ్ మయం. నిలబడి తినే తొందర, పరిగెత్తే జీవితం.



రఘురామ్ కాళ్ళు బరువుగా కదులుతున్నాయి. మనసులో ఒకటే ఆవేదన. తన బాల్యాన్ని వెతుక్కుంటూ ఎస్వీ హైకాలేజ్ ఉన్న వైపు వెళ్ళాడు.



లక్షలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిన సరస్వతీ ఆలయం అది. కానీ అక్కడ... శూన్యం. కాలేజ్ లేదు. పిల్లల అల్లరి లేదు, మాస్టర్ల పాఠాలు లేవు.



"నిక్కరు సెక్యూరిటీ ఆఫీసర్" అని భయపెట్టే డ్రిల్ మాస్టర్, చేతిలో బెత్తం పట్టుకుని తిరిగే హెడ్ మాస్టర్... ఎక్కడికి పోయారు? ఆ బెంచీల మీద పేర్లు చెక్కుకున్న జ్ఞాపకాలు ఏమైపోయాయి?



వేలాడుతూ బడికెళ్ళిన ఒంటెద్దు బండ్లు లేవు. అప్పట్లో కాలేజ్ కి వెళ్లడమే ఒక సాహస యాత్ర.



రిక్షాల చప్పుడు, చిత్తానూరు పంచమికి వెళ్లే గుఱ్ఱపు బండ్ల టకటకలు... అన్నీ నిశ్శబ్దమైపోయాయి.



రఘురామ్‌కి సంక్రాంతి రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు ఊరంతా ముగ్గులతో నిండిపోయేది.



సన్నాయి రాగాలు గాలిలో తేలియాడేవి. వీధి వీధిన గొబ్బెమ్మలు కనువిందు చేసేవి. ఇప్పుడు అపార్ట్‌మెంట్ కారిడార్లలో స్టిక్కర్ ముగ్గులు.



గొబ్బెమ్మలు కరువు. మట్టి వాసన తెలియని తరానికి గొబ్బెమ్మల గొప్పతనం ఏం తెలుస్తుంది?



గంగ జాతర వస్తే చాలు... గంగ వేషాలకు కూర్చే దండకాయల హడావిడి ఉండేది. పూల వేషాలు చూస్తుంటే కళ్ళు మిరుమిట్లు గొలిపేవి.



తప్పేట పలకల మోత గుండెను తాకేది. పులి వేషాలు వేసే పొగరుబోతులు వీధుల్లో తిరుగుతుంటే, పిల్లలు భయంతోనూ, ఆశ్చర్యంతోనూ చూసేవారు.



ఇప్పుడు ఆ వేషాలు తగ్గాయి, ఆ ఆవేశం తగ్గింది. అంతా డీజే పాటల హోరు. సంప్రదాయం డిజిటల్ తెర వెనుక దాక్కుంది.



వీధి చివర, ఒకప్పుడు సోది చెబుతాననే సోదక్క కూర్చునేది. ఆమె మాటల్లో ఏదో నమ్మకం ఉండేది.



వేకువ జామున "బుడుబుడుక్కు... బుడుబుడుక్కు" అంటూ శబ్దం చేస్తూ లేపే బుడబుడక్కలోడు లేడు.



వాళ్ళంతా ఏమైపోయారు? ఈ నగర నాగరికత వాళ్ళను ఏ మూలకు నెట్టేసింది? కొర్లగుంట చివరిలో విజయా టెంట్ లేదు, పద్మావతి పురం వద్ద మరో టెంట్ లేదు.



పాత తిరుమల బస్ స్టాండ్ వద్ద ఇండియా కాఫీ షాప్‌లో కూర్చుని, గంటల తరబడి లోకాభిరామాయణం మాట్లాడిన రోజులు... ఆ కాఫీ సువాసనలో కలిసిపోయాయి.



ఇసుక వీధిలో ఇసుక లేదు, కర్నాల వీధి కురచైపోయింది. కొత్తగా కనిపించే కొత్తిండ్లు లేవు, అన్నీ ఒకేలా ఉన్న అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్‌మెంట్లు.



నరకమవుతున్న నగరం



రఘురామ్ గోవిందరాజస్వామి గుడి వైపు నడిచాడు. చిన్నప్పుడు తలెత్తి చూస్తే ఆకాశాన్ని తాకుతున్నట్టుండే ఆ గాలిగోపురం...



ఇప్పుడు చుట్టూ పెరిగిన బహుళ అంతస్తుల భవనాల మధ్య ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్టు, చిన్నగా అయిపోయినట్టు అనిపించింది. ఊరంతా ఎవరెస్టులా నిలిచిన గోపురం... ఇప్పుడు కనబడనంత చిన్నదైపోయింది.



ఉల్లిపట్టెడ... ఒకప్పుడు ఊరికి దూరంగా, ప్రశాంతంగా విసిరేసినట్టుండేది. ఇప్పుడు అది కూడా సిటీ ట్రాఫిక్‌లో ఒక భాగం. ముక్కు టెంపోలు, మూతి బస్సులు... ఆ విచిత్రమైన వాహనాలు ఇప్పుడు లేవు. అంతా హైటెక్ కార్లు, బైకులు.



"ఎదరా... మేలా..." అంటూ పిల్లలు గోలీలాటలు ఆడే దృశ్యం కోసం రఘురామ్ కళ్ళు వెతికాయి.



కానీ ఒక్క పిల్లాడు కూడా వీధిలో లేడు. అందరూ నాలుగు గోడల మధ్య, సెల్ ఫోన్ల వెలుగులో బందీలు. బొంగరాలై తిరిగిన బాల్యం లేదు. పిల్లల అల్లరి లేని వీధులు శ్మశానాల్లా ఉన్నాయి.



ఊరు మారిపోయింది. తిరుపతి నగరమైంది... కానీ నెమ్మదిగా నరకమైపోతోందా? పెరిగిపోయిన ఊరు ప్లై ఓవర్ల మయం. ఆకాశం ఎత్తుండే భవనాలు వెలిశాయి. కానీ తరిగిపోతున్న మానవతా విలువలను ఎవరు గమనిస్తున్నారు?



ఒకప్పటి ఊరు "అమ్మ"లా ఆదరించేది. ఎవరు వచ్చినా గుండెలకు హత్తుకునేది. కానీ ఇప్పుడు ఊరు "అనాథ"ను చేసేస్తోంది. పక్క ఇంట్లో ఎవరున్నారో తెలియని స్థితి.



రఘురామ్ గుండె బరువెక్కింది. కోనేటి కట్ట మీద కూర్చున్నాడు. కళ్ళ ముందు నీళ్లు మసకబారుతున్నాయి.



"నా తిరుపతి నాకు కావాలి... నా చిన్ననాటి స్నేహితులు, ఆ స్వచ్ఛమైన గాలి, ఆ మనుషులు... అంతా ఎక్కడికి పోయారు?" అని మనసులోనే రోదించాడు.



"ఏమయ్యా... కొత్తగా వచ్చావా? అలా చూస్తున్నావ్?" అని ఒక గొంతు వినిపించింది.



రఘురామ్ తలతిప్పి చూశాడు. ఒక వృద్ధుడు. చేతిలో సంచి, ముఖం మీద చిరునవ్వు, నుదిటిన నామం.



"నేను ఇక్కడే పుట్టాను... కానీ ఇప్పుడు పరాయివాడిలా ఉన్నాను," అన్నాడు రఘురామ్ నిరాశగా.



ఆ వృద్ధుడు నవ్వాడు. ఆ నవ్వులో ఏదో పరిచయం.



"రఘూ... నువ్వేనా?" ఆశ్చర్యంగా అడిగాడు ఆ వృద్ధుడు.



రఘురామ్ నిశితంగా చూశాడు. ఆ కళ్ళు... ఆ నవ్వు...



"శీను గాడివా?" రఘురామ్ గొంతులో వణుకు.



అంతే. ఇద్దరూ చిన్నపిల్లల్లా కౌగిలించుకున్నారు. ముప్పై ఏళ్ల దూరం ఆ ఒక్క కౌగిలింతలో కరిగిపోయింది.



శీను చేతులు రఘు భుజాల మీద ఆసరాలా నిలిచాయి.



"ఊరు మారిపోయిందని బాధపడుతున్నావా రఘూ?" శీను అడిగాడు, రఘు కళ్ళలోని ఆవేదనను చదివినట్టు.



"అవును శీను. రాముడి గుడి తేరు లాగినప్పుడు కాలేజ్‌కు సెలవు వచ్చేది కదా... ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు తేరు ఉంది, కానీ ఆ ఉత్సాహం లేదు. ఇడియాప్పం లేదు, ఉప్పు బస్తాలు తిరిగి అమ్మేవారు లేరు... నా ఊరు తప్పిపోయింది శీను," అన్నాడు రఘురామ్.



శీను చిరునవ్వుతో రఘు చేతిని పట్టుకుని, గోవిందరాజస్వామి గోపురం వైపు చూపించాడు.



"నిజమే రఘూ. రాళ్లు మారాయి, రంగులు మారాయి. ప్లై ఓవర్లు వచ్చాయి, చెట్లు పోయాయి. కానీ... ఇక్కడ చూడు..." అంటూ తన గుండె మీద చేయి వేసుకున్నాడు.



"తిరుపతి ప్రాణం భవనాల్లో లేదు రఘూ. అది ఇంకా ఇక్కడి మనుషుల గుండెల్లోనే ఉంది. నువ్వు చూసే కోణం మార్చు. ఆకాశహర్మ్యాల వెనుక దాక్కున్న వెంకన్న ఇంకా అలాగే ఉన్నాడు. మనిషి వేషధారణ మారింది కానీ, పిలుపులో ఆర్తి మారలేదు."



శీను, రఘుని తీసుకుని దగ్గర్లోని ఒక చిన్న టీ కొట్టుకు తీసుకెళ్లాడు. అక్కడ నలుగురు స్నేహితులు చేరారు. పాత జోకులు, చిన్ననాటి జ్ఞాపకాలు,



'నిక్కరు సెక్యూరిటీ ఆఫీసర్' మాస్టర్ గురించి వెటకారాలు... అరగంటలో రఘురామ్ ముఖంలో మళ్ళీ పాత వెలుగు వచ్చింది.



అప్పుడు అర్థమైంది రఘురామ్‌కి.



కనిపించే భవనాలు, రోడ్లు మాయమవ్వచ్చు. కానీ, కనిపించే స్నేహితుల చిరునవ్వులో వెతుక్కుంటే... ఆనాటి మా ఊరు టక్కున జ్ఞాపకమై మెరుస్తోంది.



ఆ అపార్ట్‌మెంట్ వెనుక రామకృష్ణ థియేటర్ జ్ఞాపకం ఇంకా బ్రతికే ఉంది.



ఆ షాపింగ్ మాల్ వెనుక శ్రీనివాస మహల్ దర్పం స్నేహితుల మాటల్లో ఇంకా వినిపిస్తోంది.



రఘురామ్ లేచి, తిరుమల కొండల వైపు చూశాడు.



ఊరు మారిపోవచ్చు. నాగరికత అనే ముసుగులో నరకంలా అనిపించవచ్చు. కానీ, ఎక్కడో ఒక మూల, ఒక స్నేహితుడి పలకరింపులో, ఒక గుడి గంట శబ్దంలో, ఇంకా మిగిలి ఉన్న ఆ మానవత్వంలో...



మన తిరుపతి ఎప్పటికీ ఒక భూతల స్వర్గమే.



ఆ సాయంత్రం, రఘురామ్ మళ్ళీ తన ఊరిని ప్రేమించడం మొదలుపెట్టాడు. అది అమ్మ లాంటి ఊరు. అమ్మ ముసలిదైపోవచ్చు, రూపురేఖలు మారిపోవచ్చు... కానీ అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు కదా.



సమాప్తం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
అపార్థం 
గోపాలకృష్ణ ఎస్ తంగిరాల 
[Image: 4.%20Asaamaanyudu..jpg]




"హలో సుకన్యా.. రిపోర్ట్ వచ్చిందా?"
"ఊఁ..."
"ఏమని వచ్చింది రిపోర్ట్ లో..?
".........."
"పోజిటివేనా?"
"ఊ..."
"డాక్టర్ కి చూపించావా?"
"ఊఁ..."
"ఏమన్నారు?"
"-----"
"ఎన్ని నెలలు"
"మూడు..."
"మూడు.... హ్మ్..."
"భయం వేస్తోంది"
"భయపడకు... మనం అనుకున్నదేగా
.. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ శారదకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి"
"ఇది దాస్తే దాగేదా నవీన్... రోజు రోజుకు వచ్చే తేడా తెలిసిపోదా?"
"కరెక్టే...కానీ ఇప్పుడే తెలిస్తే ఏడుపులు, పెడబొబ్బలు... నేను చెయ్యాల్సిన పనులు ఏవీఁకావు"
"-----"
"ముందు లాయర్ ని కలిసి లీగల్ పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత ఇంట్లో తెలిసినా...ఎంత గొడవలయినా చేసేదేమీ ఉండదు.."
"తప్పు చేస్తున్నానేమో... విషయం ఇంతవరకు వచ్చినా మీ ఆవిడకి తెలియకుండా ఉంచటం తప్పు కదా"
"చూడు సుకన్యా... తప్పొప్పులు అనేవి మన ప్రయోజనాలు, పరిస్థితులు బట్టి మారుతూంటాయి. అన్నీ నాకొదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు"
"సరే... జాగ్రత్త. లీగల్ పనులన్నీ సాధ్యమైనంత తొందరగా పూర్తి చెయ్యి. మీ ఆవిడ ఎదురుపడి అడిగితే నేను తట్టుకోలేను"
"నన్ను అర్థం చేసుకున్నందుకు, నాపై నమ్మకం ఉన్నందుకు చాలా థాంక్స్ సుకన్యా. ఉంటాను...బై"
***
తన భర్తకు, తన స్నేహితురాలు సుకన్యకు మధ్య జరిగిన ఛాటింగ్ చూసి నిర్ఘాంతపోయింది శారద. ఛాటింగ్ జరిగిన తేదీ పరిశీలించింది. దాదాపు ఐదారు వారాల క్రితం జరిగిన ఛాటింగ్ అది. నమ్మలేనట్టు కొద్దిసేపు తన భర్త మొబైల్ చాటింగ్ చూస్తూ స్తబ్దురాలై ఉండి పోయింది.
 
బాత్రూం తలుపు చప్పుడు విని ఈ లోకంలోకి వచ్చిన శారద చప్పున మొబైల్ మూసేసి ఏమీ తెలియనట్టే వంటింట్లోకి వెళ్ళిపోయింది. స్నానం చేసి బయటకొచ్చిన నవీన్ తల తుడుచుకుంటూ ఉండగా భార్య కాఫీ పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టింది.
"ఏవండీ... ఈ మధ్య సుకన్య కనపడటం లేదు. నాలుగైదు నెలలయింది తనని కలిసి.  మీకేమైనా ఫోన్ చేసిందా?" అని శారద అడిగిన ప్రశ్నకు నవీన్ తల దువ్వుకుంటూ "లేదు శారదా... తను బిజీగా ఉన్నట్టుంది. ఇండో అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ లో చేరిందిగా... కొన్నాళ్ళైన తరువాత ఇంటికి పిలుద్దాం " అంటూ కాఫీ తాగేసి బై చెప్పి వెళ్ళిపోయాడు నవీన్. 'ఎంత సులభంగా అబద్ధం చెప్పాడు తన భర్త' అనుకుంటూ భర్త వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది శారద.
 
శారద, నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి చేసుకోవటం మూలాన బంధుత్వాలు తెగిపోయాయి. అయినా వాళ్ళిద్దరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగింది. తన తల్లిదండ్రులు, బంధువులు దూరమైనా ఎప్పుడూ ఆ లోటు రాకుండా చూసుకున్నాడని ఎప్పుడూ పొంగిపోయేది శారద. పెళ్ళై ఏడేళ్ళయినా ఇంకా పిల్లలు కలగలేదు. శారదలో చిన్న లోపం ఉందని,మందులు వాడితే సరిపోతుందని డాక్టర్లు చెప్పటంతో త్వరలోనే పిల్లలు పుడతారనే ధీమాతో ఉంది తను ఇన్నాళ్ళూ...
 
ఇప్పుడు అకస్మాత్తుగా... తన భర్తకు సుకన్యకు మధ్య నడుస్తున్న వ్యవహారం బయట పడడంతో శారదకు ఏం చెయ్యాలో పాలుపోక విల విల లాడింది.
'....సుకన్యకు అప్పుడు మూడో నెలంటే ఇప్పుడు ఐదో నెలా? పెరిగిన కడుపు కనపడుతుందని కలవటానికి రావటం లేదా తను? లీగల్ పనులంటాడేమిటీ తన భర్త?  విడాకులిస్తున్నాడా? పిల్లలు కలగటం లేదనే పాయింట్ మీద విడాకులు సులభంగానే ఇచ్చేస్తారేమో. ఎలా? ఏంచేయాలిప్పుడూ?' శారదకు ఏం చేయాలో పాలుపోలేదు. కోపం దుఃఖం తన్నుకు రాసాగాయి.  ఏమీ తినకుండా ఏడుస్తూ మంచం మీద వాలిపోయిన శారద అలాగే నిద్ర పోయి సాయంత్రం నాలుగింటికి లేచింది.
 
మొహం కడుక్కొని అద్దంలో చూసుకుంటూ జుట్టు సరిచేసుకుంటూ "... ఎందుకు ఈయన దాని వెంట పడుతున్నారు? నేను నచ్చటం లేదా? అయినా ఆ సుకన్య ఇంత నీచానికి ఎలా పాల్పడింది... ఇలా పరి పరి విధాల ఆలోచిస్తున్న శారద తన భర్త స్నేహితుడైన ధర్మారెడ్డికి ఫోన్ చేసింది.
"హలో అన్నయ్య గారూ.. మీతో అర్జంటుగా మాట్లాడాలి. ఇప్పుడే. నేనొస్తున్నాను.... అన్నట్టు ఆయన ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పకండి" అని ఫోన్ పెట్టేసి తన భర్త ఆప్తమిత్రుడు ధర్మారెడ్డిని కలవటానికి బయలుదేరింది శారద.
****
ఫోన్ పెట్టేసిన ధర్మారెడ్డి ఆలోచనలో పడ్డాడు.  శారద తనను కలవటానికి రావడం కొత్తేమీ కాదు. ఎన్నోసార్లు తనకిష్టమైన వంటకం చేసినప్పుడల్లా తను ఊళ్ళో ఉంటే పట్టుకొచ్చి ఇస్తుంది. కొన్నిసార్లు భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి బలవంతంగా భోజనానికి లాక్కెళ్తారు.
కానీ... మొదటి సారి శారద తనను కలవడానికి వస్తూ తన భర్తకు తెలియకూడదు అనటం.
 
ధర్మారెడ్డి మొదటినుంచి నవీన్ కుటుంబంలో ఒకడిగా ఉన్న వ్యక్తి. ఆ మాటకొస్తే వాళ్ళ పెళ్ళి దగ్గరుండి చేసింది ధర్మారెడ్డే....
ఈ మధ్య వ్యాపారంలో తలమునకలైపోవటం వల్ల తన మిత్రుడైన నవీన్ ని కలవలేకపోతున్నాడు. కాలింగ్ బెల్ చప్పుడుకి ఈ లోకం లోకి వచ్చిన ధర్మారెడ్డి లేచి మెయిన్ డోర్ తెరిస్తే ఎదురుగా శారద... ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బి మొహం పీక్కు పోయి...
 
ఆమెనలా చూడగానే ధర్మారెడ్డి కంగారు పడ్డాడు. "ఏమైంది శారదా...? ఏమిటలా అయిపోయావు. ఏం జరిగింది" అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అతని మాటలు పట్టించుకోకుండా తల వంచుకుని లోపలి కొచ్చి కుర్చీలో కూలబడింది శారద.
 
కదిలిపోయిన ధర్మారెడ్డి ఆమె తల మీద చెయ్యి వేసి లాలనగా, "ఏమైందమ్మా" అనగానే... అంతవరకు ఉగ్గబట్టుకున్న దుఃఖం జలపాతంలా ఉబికింది శారదకు.
 
"అన్నయ్య గారూ.. మీ ఫ్రెండ్ నాకు ఇంత ద్రోహం చేస్తారనుకోలేదు" ఆపుకోలేని ఉక్రోషంతో వెక్కి వెక్కి ఏడుస్తున్న శారదను ఆపడం ధర్మారెడ్డి వల్ల కాలేదు. శారద శిరస్సు మీద చేయుంచి కాస్సేపు మౌనంగా ఉండిపోయాడు.
కాస్సేపటికి తేరుకున్న శారద చెప్పిన విషయం విని విస్తుపోయిన ధర్మారెడ్డి తల అడ్డంగా ఊపుతూ "నువ్వు పొరబడుతున్నావమ్మా శారదా. నవీన్ అలాంటి పని ఎప్పటికీ చేయడు" లాలనగానే స్ఫుటంగా ఒక్కొక్క మాట వత్తి పలుకుతూ అన్నాడు ధర్మారెడ్డి.
"నేను ఆయనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యను అన్నయ్యా... నాకు నామీద కన్నా ఆయన మీదే నమ్మకం ఎక్కువ. నా అంతట నేను స్వయంగా ఆయన ఫోన్లో వాళ్ళిద్దరి ఛాటింగ్ చూడకపోయి ఉంటే, ఈ విషయం స్వయంగా మీరే చెప్పినా నమ్మేదాన్ని కాదు. ఆ విషయం మీకు తెలియనది కాదు" ధర్మారెడ్డి కన్నా ప్రస్ఫుటంగా స్థిరంగా చెప్పింది శారద.‌
ఆ మాట నిజమే. భర్త మీద శారదకి ఉన్న నమ్మకం ధర్మారెడ్డికి తెలియనిది కాదు.
తల పట్టుకుని ఆలోచనలో పడిపోయాడు ధర్మారెడ్డి.
"ఆయన లేని జీవితం నాకు వద్దు అన్నయ్య గారూ. అలా అని ఆయన ఆ దొంగ ముండతో అక్రమ సంబంధం కొనసాగిస్తే సరేలే అని సహజీవనం చేయలేను. అందుకే...."  అని ఊపిరి పీల్చుకుని "నేను చచ్చిపోతాను" స్థిరంగా అంది శారద. 
చలించిపోయాడు ధర్మారెడ్డి. "తొందర పడకు శారదా. నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా ఏ నిర్ణయానికీ రాకూడదు. నేను కనుక్కుంటాను అసలు సంగతి" అని అంటూ చెయ్యి సాచి శారద అరచేయి తన తల మీద పెట్టుకుని "అంతవరకు నువ్వు ఏ అఘాయిత్యం చేయనని మాట ఇయ్యి శారదా" అన్నాడు. 
కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు శారద. ధర్మారెడ్డి కూడా తలమీద నించి చెయ్యి తియ్యలేదు. శారద కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉండిపోయాడు. మాటలే కరవయ్యాయి. సమయం భారంగా గడిచింది.
ఒక నిర్ణయానికి వచ్చినట్లు కళ్ళు తుడుచుకుంటూ విరక్తిగా నవ్వి "అలాగే అన్నయ్య గారూ" అన్నది శారద.
ఊపిరి పీల్చుకున్నాడు ధర్మారెడ్డి.
****
ముందు ధర్మారెడ్డి నవీన్ పనిచేసే ఆఫీస్ కి వెళ్ళాడు. నాలుగైదు రోజులుగా ఆఫీస్ కి రావటం లేదనడంతో నవీన్ మొబైల్ కి ఫోన్ చేశాడు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా నవీన్ ఆన్సర్ చేయలేదు. దాంతో ధర్మారెడ్డిలో మొదటిసారిగా అనుమానం మొదలైంది. శారద అనుమానం నిజమేనా? నవీన్ కూడా ఎంతవాడైనా కాంతాదాసుడేనా? ఇలా పరి పరి విధాల ఆలోచనలు చుట్టుముట్టాయి. చాలా సేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తల విదిలించి సుకన్య నివాసానికి బయలుదేరాడు.
 
సుకన్య తాను పనిచేసే హాస్పిటల్ లో ఉన్న హాస్టల్ లోనే ఉంటుంది. ఒకటి రెండు సార్లు ధర్మారెడ్డి సుకన్యను హాస్టల్ లో డ్రాప్ చేశాడు కూడా. అక్కడి స్టాఫ్ కి తన రూం మేట్స్ కి ధర్మారెడ్డిని తన అన్నయ్యగా పరిచయం చేసి ఉన్నది సుకన్య.
 
ధర్మారెడ్డి హాస్టల్ కి వెళ్ళే సమయానికి ఎక్కడికో వెళ్ళటానికి కాబోలు సుకన్య ఆటో ఎక్కుతున్నది. ధర్మారెడ్డిని చూసి "అన్నయ్యా..." అంటూ ఎదురొచ్చి చేతులు పట్టుకుంది. సీరియస్ గా ఉన్న ధర్మారెడ్డి సుతారంగా సుకన్య చేతులు విడిపించుకున్నాడు. సుకన్య ధర్మారెడ్డి మొహం కేసి చూసి "రండి అన్నయ్యా.. నేను మీ దగ్గరకే బయలుదేరాను" అని చెప్పి ఆటోవాడితో వెళ్ళిపొమ్మని ధర్మారెడ్డిని హాస్టల్ విజిటింగ్ హాల్ కి తీసుకెళ్ళింది.
ఇదేంటి సుకన్య నా దగ్గరకి బయలుదేరాను అంటుంది అని అయోమయంగా ఉన్న ధర్మారెడ్డి హాల్ లోకి వెళ్ళగానే "ఏమిటి సంగతి?" అని అడిగాడు.
ఎన్నాళ్ళ నుండో ఉగ్గబట్టుకున్నట్టు ధర్మారెడ్డి గుండెల్లో తల దాచుకుని భోరున ఏడవసాగింది సుకన్య. 
మరింత అయోమయానికి గురయ్యాడు ధర్మారెడ్డి. సుకన్య పట్ల పెంచుకున్న అనుమానం, కోపం తనలోనే అణగదొక్కుకుని అసంకల్పితంగానే సుకన్య వీపు లాలనగా నిమురుతూ "ఏమైంది సుకన్యా?" అన్నాడు.
కొద్ది సేపటి దాకా సుకన్య ఏడుపు ఆపుకోలేక పోయింది. తరువాత మెల్లగా ధర్మారెడ్డి నించి దూరం జరిగి కళ్ళు తుడుచుకుంటూ "సారీ అన్నయ్యా" అన్నది. 
"ఏమైంది సుకన్యా?" అనునయంగా అడిగాడు ధర్మారెడ్డి. "మీకు... మీకు... నవీన్ బావ ఏమీ చెప్పలేదా?' అడిగింది సుకన్య. మౌనంగా లేదన్నట్టు తలూపాడు ధర్మారెడ్డి. 
ఊపిరి పీల్చుకుని చెప్పటం ప్రారంభించింది సుకన్య.
****
 
సుకన్య చెప్పటం ముగించే సరికి తెల్లగా పాలిపోయింది ధర్మారెడ్డి ముఖం. కళ్ళు కన్నీటి సరస్సులే అయ్యాయి. వణుకుతున్న పెదవులతో ఏదో అనాలని ప్రయత్నించాడు. కానీ మాట రాలేదు. సోఫాలోంచి అతి కష్టం మీద లేవబోయిన ధర్మారెడ్డి పట్టుతప్పి నేలమీద కూలబడ్డాడు.
 
అప్పుడొచ్చింది అతనికి... సన్నగా గుండె నొప్పి. శ్వాస బలంగా తీయటం ప్రారంభించాడు. చూస్తుండగానే అతని ముఖం వివర్ణమవడం మొదలు పెట్టింది.
సుకన్యకు తెలుసు ఆ కండిషన్ ఏమిటో. 
సైనోసిస్...
చూస్తుండగానే ధర్మారెడ్డి శరీరం బిగుసుకుపోనారంభించింది... నుదుటి నుండి ధారాపాతంగా చెమట. 
మాసివ్ హార్ట్ ఎటాక్..
అప్పుడర్ధమయింది ఆమెకు...తాను చేసిన తప్పు ఏమిటో... ధర్మారెడ్డికి చెప్పొద్దని నవీన్ ఎందుకన్నాడో...
అవన్నీ ఆలోచించేంత టైం ఇప్పుడు లేదు సుకన్యకి. తను చేయాల్సిన పని తక్షణమే మొదలుపెట్టింది.
ఇప్పుడామె సుకన్య కాదు. ధర్మారెడ్డికి స్నేహితురాలు కాదు. ఒక ప్రొఫెషనల్. 
ఎదురుగా ఉన్నది తన మిత్రుడు కాదు. ఒక పేషెంట్. అంతే
సుకన్య ఒక్క స్విఫ్ట్ మూమెంట్ లో ధర్మారెడ్డి షర్ట్ బటన్స్ ఊడదీసి అతనికి సి. పి. ఆర్ ఇవ్వడం మొదలు పెట్టింది. ధర్మారెడ్డి గుండె మీద తన ఎడమ అరచేయిని, దానిపై తన కుడిచేయిని ఆన్చి జంటిల్ గా ఫర్మ్ గా హార్ట్ మసాజ్ స్ట్రోక్స్ ఇవ్వడం ప్రారంభించింది.
ఒకటి... రెండు... మూడు... 
అలా మసాజ్ చేస్తూనే ధర్మారెడ్డి ముఖం పరిశీలనగా చూసింది. ఊపిరి ఆడటం లేదు.
మరింకేమీ ఆలోచించ లేదు. ఒక చేతితో అతని ముక్కు మూసి, మరో చెయ్యి అతని తల వెనుక పెట్టి వెనక్కు వంచి నోటిలో నోరు పెట్టి గాలి బలంగా ఊదింది. అతని ఛాతీ పైకి పొంగింది.
మళ్ళీ మసాజ్... ఒకటి.. రెండు...
ఇంత హడావుడిలోనూ తను చేయాల్సిన మరో ముఖ్యమైన పని విస్మరించలేదామె. తన ఫోన్ నుంచి హాస్పిటల్ కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిచింది.
మళ్ళీ మసాజ్... ఒకటి.. రెండు...
మళ్ళీ గాలి ఊదటం....
కొద్దిసేపు కాలంతో పోరాటం చేసిందామె.
ఆమె కష్టం ఫలించింది. ధర్మారెడ్డి మొహం మామూలు రంగుకి తిరిగింది. మెల్లగా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాడు.
కొద్ది నిమిషాల్లోనే శరవేగంతో అక్కడికి వచ్చింది అంబులెన్స్. వచ్చిన టీం లో తనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు. అతని కేసి చూసి తలూపుతూ "ఇప్పుడే రివైవ్ అయ్యింది" అంది సుకన్య. 
క్షణాల్లో ధర్మారెడ్డిని అంబులెన్స్ లో పడుకోబెట్టి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. అంబులెన్స్ లో డ్యూటీ డాక్టర్ సుకన్య కేసి చూసి మరేం ఫర్వాలేదు అన్నట్లు తల ఊపాడు. సుకన్య గాఢంగా ఊపిరి పీల్చుకుంది.
*****
తన దగ్గర మాట తీసుకున్న రెండు రోజులైనా ధర్మారెడ్డి జాడ లేకపోవటంతో శారద ధర్మారెడ్డికి ఫోన్ చేసింది. కానీ ఫోన్ ఎత్తకపోవడంతో ఏం చెయ్యాలో అర్ధం కాలేదు శారదకి.
నవీన్ కూడా క్యాంపుకెళ్తున్నా అంటూ రెండు రోజుల క్రితమే వెళ్ళిపోవడంతో శారద బతుకు భారమైపోయింది. ఒంటరిగా ఉండటంతో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. కొన్నిసార్లు ఏడుస్తుంది. ఏ పని చేయాలన్నా నిరాసక్తత. భోజనం సహించేది కాదు. 
సుకన్యని నిలదీసి అడగాలని, ఛెడామడా తిట్టాలని ఆవేశం ఊపేసేది శారదని. కానీ సుకన్య ముఖం కూడా చూడాలనిపించ లేదు.
ఇంక ఉండబట్టలేక ధర్మారెడ్డి ఇంటికి వెళ్ళిన శారదకు తాళం పెట్టిన తలుపులు దర్శనమిచ్చాయి. నిరాశతో నిస్పృహగా వెనుదిరిగిన శారదకు పక్కింటి కాంపౌండ్ లో ఒక పెద్దావిడ కనపడింది శారదకు. "ధర్మారెడ్డి ఎక్కడున్నాడో ఏమైనా తెలుసాండి" అని అడిగిన శారదను ఎగాదిగా చూసి "నువ్వెవరమ్మాయీ? నీకు అతనేమౌతాడు?" అని అడిగిందా పెద్దావిడ మొక్కజొన్న పొత్తు నించి గింజలు కొరికి తింటూ. "ధర్మారెడ్డి మా అన్నయ్యండీ" అన్నది శారద, మా ఆయన ఫ్రెండ్ అంటే ఏం ఆరాలు తీస్తుందో ఈ పెద్దావిడ అనుకుంటూ.
"చెల్లెల్నంటున్నావు. నీకు తెలీదా? ధర్మారెడ్డికి హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటల్లో పడి ఉన్నాడు. బతకటం కష్టవేఁట" మొక్క జొన్న పొత్తు నించి తన వళ్ళో పడిన గింజల్ని ఏరుకుని తన నోట్లో వేసుకుంటూ తను కనుక్కున్న గొప్ప విషయం ఏదో ప్రపంచానికి తెలియజేస్తున్నట్లు గర్వం ఫీలౌతూ చెప్పిందా పెద్దావిడ. బతకటం కష్టం అన్నది ఆమె సృష్టి. ఆ మాత్రం మసాలా లేకుండా అలాంటి వాళ్ళు మాట్లాడరు. అలా కల్పించి చెప్పడంలో ఒక రకమైన తృప్తి చెందుతారు.
"ఎ...ఎప్పుడు జరిగింది ఇది?" నోరు పిడచ కట్టుకుపోతుండగా కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా బేలగా అడిగింది శారద. శారద మొహంలో షాక్ కనపడటం పట్టరాని సంతోషాన్నిచ్చింది ఆ పెద్దావిడకు. తిండి కన్నా శారద భావోద్వేగం అమితాసక్తిగా ఉండి మొక్క జొన్న పొత్తును కొరుక్కు తినటానికి తాత్కాలిక విరామం ఇచ్చిందావిడ.
"మూడు రోజులయిందమ్మా... అదేదో అమెరికా అంకమ్మాజీ ఆసుపత్రిలో పెట్టారు అతగాడిని. అయినా అతను ఉన్నా పోయినా పట్టించుకునే వాళ్ళేరీ..‌.. నిన్ను కూడా ఎప్పుడూ చూడలేదమ్మాయ్... నీకూ మీ అన్నయ్యకు కూడా పడదా ఏవిటి?" అడిగిందా పెద్దావిడ, ఏమైనా స్టోరీ చెప్పకపోతుందా అన్న గంపెడాశతో.
ఆ పెద్దావిడ వాగ్ధాటి ఆపేసమయానికి కాస్త తేరుకుంది శారద. అంత దుఃఖంలోను కొద్దిగా నవ్వొచ్చింది శారదకు, ఆంకాలజీ ని అంకమ్మాలజీ అన్నప్పుడు. రెండు చేతులు జోడించి "వస్తానండీ. హాస్పిటల్ కి వెళ్ళాలి" అంటూ వెనుదిరిగి వడి వడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది శారద.
శారద ఏమైనా తన అన్నతో ఉన్న గొడవలు, తగవులు చెప్తుందేమో అని ఆశించిన పెద్దావిడ నిరాశ చెంది నిట్టూరుస్తూ మళ్ళీ మొక్కజొన్న పొత్తు తీసుకుని కొరకడం మొదలెట్టింది.
****
శారద అమెరికన్ ఆంకాలజీ ఆసుపత్రి చేరుకుని సుకన్య గురించి వాకబు చేసింది. కనిపిస్తే కొట్టేసేదేమో.‌ కానీ సుకన్య అక్కడ లేదు. సెలవు పెట్టి ఎక్కడికో వెళ్ళిందట. 
కార్డియాలజీ ఐ.సి.యు కి వెళ్ళిన శారదని లోపలికి వెళ్ళనివ్వ లేదు అక్కడి స్టాఫ్. గ్లాస్ విండోనించే చూసింది ధర్మారెడ్డిని. వెంటిలేటర్ మీద ఉన్నాడతను. కోలుకుంటున్నాడని, వెంటిలేటర్ ద్వారా శ్వాసను అందిస్తున్నారని, రెండు మూడు రోజులు ఇంకా ఐ.సి.యు లోనే ఉండాలని చెప్పారు అక్కడి స్టాఫ్.
బయటకొచ్చిన శారదకు అంతా గందరగోళంగా ఉంది.
సిటీలో ఎన్నో గుండె ఆసుపత్రులు ఉండగా ఇక్కడెందుకు చేర్చారు ధర్మారెడ్డిని? ఇక్కడైతే సుకన్య సహాయం చేస్తుందనా? అయినా అంతలా మాసివ్ హార్ట్ ఎటాక్ ఎలా వచ్చింది? హార్ట్ ఎటాక్ కి, మా సమస్యలకు ఏమైనా సంబంధం ఉందా? సుకన్య సెలవు పెట్టి ఎక్కడికెళ్ళింది? ఒక వేళ సుకన్య, తన భర్తా కలిసే ఎక్కడికైనా వెళ్ళారా? ఎలా తెలుస్తుంది?
ఇలా పరి పరి విధాల ఆలోచిస్తున్న శారదకు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారనే అనుమానం బలపడసాగింది.
తనిప్పుడు ఏం చేయాలి? రైలు కింద తల పెట్టి చచ్చిపోతే? ఇంటికెళ్ళి ఫ్యాన్ కి ఉరేసుకుంటే? చెరువులోనో, నదిలోనో దూకేస్తే? వీటన్నింటి కన్నా నిద్ర మాత్రలు మింగెయ్యడం మేలు. కానీ నిద్ర మాత్రలు మెడికల్ షాపుల్లో ఇవ్వరు. ఎలా? 
ఇలా ఆలోచిస్తూ, నడుస్తూ తనకు తెలియకుండానే చాలా దూరం వచ్చేసింది శారద. చుట్టూ చూసిన శారదకు దగ్గరలోని బస్టాండ్ లో విజయవాడ వెళ్ళే బస్సు కనపడింది. అప్పటికప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినదానిలా ఆ బస్సు ఎక్కి విజయవాడకు టికెట్ తీసుకొని కూర్చుంది.
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply

విజయవాడలో శారద బాల్య స్నేహితురాలు శివాని ఉంటుంది. ఆమె ఒక లాయర్. శారదను చూడగానే ఎగిరి గంతేసినంత పని చేసిందామె. ఫోన్ చేయగానే బస్టాండ్ కి వచ్చి శారదను తన ఇంటికి తీసుకెళ్ళింది. దారిలో తానడిగిన ప్రశ్నలకు అరకొరగా అన్యమనస్కంగా సమాధానాలు చెబుతున్న శారదను పరీక్షగా చూసిన శివాని నిస్తేజంగా పాలిపోయినట్టున్న మొహం, రాత్రంతా బస్సులో ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు చూసి జరుగరానిదేదో జరిగిందని అర్ధం చేసుకుని మరింక మాట్లాడలేదు.
 
 
పదిహేను నిమిషాలు కార్లో ప్రయాణించి ఇంటికి చేరాక కట్టుకోవడానికి బట్టలిచ్చి స్నానం చేసి రమ్మని శారదను బాత్రూం లోకి పంపింది శివాని. దాదాపు అరగంట స్నానం తరవాత కాస్త రిలీఫ్ అనిపించింది శారదకు. బయటకొచ్చేసరికి జీడిపప్పు ఉప్మా వేడి వేడిగా చేతికందించింది శివాని. ఆమెకు తెలుసు శారదకు ఉప్మా అంటే ఇష్టమని. శివాని మొహంలో శారద పట్ల గల ప్రేమ అభిమానం తొణకిసలాడుతున్నది. ఎన్నో రోజులు తరువాత మనస్ఫూర్తిగా ఆహారం తిన్నది శారద. వేడి వేడి కాఫీ కూడా తాగాక శారద మొహంలో కళ వచ్చి చేరింది. అలసటగా కన్నులు మూసుకున్న శారద కొద్ది నిమిషాల్లోనే నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది.
అలా ఎంత సేపు పడుకుందో తెలియదు కానీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా టీపాయ్ మీద కనపడిందొక కాగితం. 
"ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకోవే శారదా. నేను కోర్టుకెళ్ళి మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాను. కలిసి భోజనం చేద్దాం. ఈలోపులో ఆకలేస్తే డైనింగ్ టేబుల్ మీద అన్నీ రెడీగా ఉన్నాయి. తినేసెయ్యి - నీ శివాని" ముత్యాల్లాంటి అక్షరాలకేసి చూస్తూ మళ్ళీ నిద్రలోకి జారుకుంది శారద. 
అందానికి, ఆత్మాభిమానానికి మారుపేరు శివాని. అందుకేనేమో, ఆమె జీవితాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. జీవితం లో ఏ విషయంలోను కాంప్రమైజ్ కాలేని వాళ్ళు ఎవరితోనూ కలిసి జీవించలేరు.
 
ఎవరో తట్టి లేపినట్లు లేచి కూర్చుని చుట్టూ చూసిన శారదకు వంటింట్లోంచి ఆహార పదార్థాలు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతున్న శివాని కనిపించింది.
"లేచావా తల్లీ. తొందరగా రావే, ఆకలి దంచేస్తోంది నాకు" అన్నది శివాని నవ్వుతూ. బలహీనంగా నవ్వి "లేపొచ్చు కదే" డైనింగ్ ఛైర్లో కూర్చుంటూ అన్నది శారద.
ఇద్దరూ మాట్లాడుకుంటూ భోజనం ముగించారు. తరవాత సోఫాలో కూర్చుని చెప్పడం ప్రారంభించింది శారద. అంతా చెప్పి వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది.
కొద్దిసేపు ఆమెను ఏడవనిచ్చి "మీ ఆయనతో ఒక్కసారి మాట్లాడి ఉండవలసిందే శారదా" అన్నది శివాని‌ సాలోచనగా. నవీన్, సుకన్యల ఛాటింగ్, సుకన్యతో మాట్లాడనే లేదని నవీన్ చెప్పిన అబద్ధం, ఉన్నట్లుండి సుకన్య మొహం చాటేయడం ఇవన్నీ చూస్తుంటే శారద అనుమానం నిజమే అనిపించినా శారద తన భర్తతో మాట్లాడి ఉంటే మరింత స్పష్టత, ఆధారాలు దొరికుండేవి అనిపించింది శివాని లాయర్ బుర్రకి.
నిర్వికారంగా చూసింది శారద తన స్నేహితురాలికేసి. స్నేహితురాలికి ఏదో చెప్పాలని ప్రయత్నించి అలసటగా కళ్ళు మూసుకుంది.‌ అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు.
 
కళ్ళు తెరిచేసరికి ఎదురుగా నవ్వుతూ శివాని కనపడింది.‌ అయోమయంగా చుట్టూ చూసిన శారద తానొక ఆసుపత్రి బెడ్ మీద ఉన్నట్లు గ్రహించి, ఏం జరిగిదన్నట్లు శివానికేసి చూసింది.
ఉబికి వస్తున్న ఆనందాన్ని ఆపుకుంటూ శివాని "కంగ్రాచ్యులేషన్సే" అంది మెరుస్తున్న కళ్ళతో. మరింత అయోమయానికి గురైన శారద ఏదో చెప్పాలని నోరు తెరిచేలోపు "నువ్వు తల్లివి కాబోతున్నావే" అంది శివాని.
ఒక్క క్షణం శారదకు అర్ధం కాలేదు, తన స్నేహితురాలు మాట్లాడేది ఏమిటో. అర్ధం అయ్యాక సంభ్రమాశ్చర్యాలతో కళ్ళ వెంట నీళ్ళు కారుతుండగా శివాని చేతులు పట్టుకుని "థాంక్యూ శివానీ" అన్నది.
ఇంకా ఏదో మాట్లాడబోతున్న శివాని తన మొబైల్ మోగడంతో ఆగు అన్నట్లుగా శారదకు సైగ చేసి ఫోన్ లో హలో అన్నది. అవతల వ్యక్తి మాట్లాడిన మాటలు వినబడటంలేదు, కానీ శివాని మాటలు వినపడుతున్నాయి.
శివాని: అవును. నేనే శివాని. చెప్పండి 
అవతల వ్యక్తి: --------
శివాని: ఏం, ఇప్పటికి గుర్తొచ్చిందా మీ భార్య? 
అవతల వ్యక్తి: --------
శివాని: తన ఏ పరిస్థితుల్లో ఉందో తెలిస్తే మీరిలా మాట్లాడరు 
అవతల వ్యక్తి: --------
శివాని: ఆసలేమనుకుంటున్నారండీ మీరు? తనకు ఎవరూ లేరనుకుంటున్నారా? ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా?
అవతల వ్యక్తి: ---------
శివాని: లుక్ మిస్టర్.‌ డోంట్ థింక్ యు కెన్ గో స్కాట్ ఫ్రీ. ఐ విల్ నాట్ లెట్ యు. వెయిట్ ఫర్ ద కాన్సీక్వెన్సెస్ మీ...
ఆ మాటలు వింటుండగానే శారదకు అర్ధం అయిపోయింది అవతల వ్యక్తి తన భర్తే అని. తను గర్భం దాల్చిన సంతోషం క్షణం కూడా నిలవకుండా చేసిన భర్త పట్ల వళ్ళు తెలియని ఆగ్రహం ఆవహించింది.
ఆవేశంతో ఊగిపోతూ "ఛీ... ఉచ్ఛం నీచం లేని వాడితో మాటలేంటే? పెట్టెయ్. ఇంకెప్పుడూ ఫోన్ చెయ్యొద్దని చెప్పు..."  అని అరవసాగింది.
శివాని ఫోన్ లో కోపంగా "ఐ విల్ టాక్ టు యు లేటర్" అని ఫోన్ కట్ చేసి, శారద పక్కన కూర్చుని 'కూల్ డౌన్ శారదా కూల్ డౌన్. నువ్వు ఆవేశ పడకు' ఆన్నది లాలనగా.
*****
రోజులు, వారాలు గడుస్తున్నాయి.‌ స్నేహితురాలిని అపురూపంగా చూసుకుంటోంది శివాని.‌ శారద మెల్లగా మామూలు మనిషి అయ్యింది.‌ శివాని ఎంత చెప్పినా వినకుండా ఇంటి పని, వంట పని తానే చేయసాగింది. వంటల్లో శారదది అమృత హస్తం.‌ అద్భుతమైన వంటలు అలవోకగా చేసేది.‌ వాటిని ఆస్వాదిస్తూ "నాకు జీవితం ఇప్పుడే మొదలైంది అనిపిస్తోందే శారదా" అన్నది శివాని.
 
ఒకరోజు ఉదయం శారదను రొటీన్ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లడానికి రెడీ అవుతుండగా శివానికి ఫోన్ వచ్చింది.
శివాని హలో అనగానే "నేను హైదరాబాద్ నించి ధర్మారెడ్డిని మాట్లాడుతున్నాను.... అని కొద్ది సేపు మాట్లాడాడు. అది విన్న శివాని మొహం చుక్క రక్తం లేనట్లుగా పాలిపోయింది. అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసి మెల్లగా నడుచుకుంటూ హాల్లోకి వెళ్ళి శారదకేసి తదేకంగా చూసింది. శారద నవ్వుతూ "ఏమిటే, అలా చూస్తున్నావు?" అన్నది. శివాని తల అడ్డంగా ఊపుతూ నిట్టూర్చి"మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకు, ఏమిటి అని అడక్కు. పద " అన్నది.
***
ఇండో అమెరికన్ ఆంకాలజీ గేటు లోపలకు దూసుకు వచ్చి ఆగిన కారులోంచి శారద చేయి పట్టుకొని "మెల్లగా దిగు" అన్నది శివాని.
కారులోంచి దిగి చుట్టూ చూసిన శారద అయోమయంగా "ఇక్కడకు తీసుకొచ్చావెందుకే" అడిగింది. 
శివాని స్నేహితురాలి కేసి చూస్తూ"ఇప్పుడు ఇక చెప్పాలి. తప్పదు" అనుకుంటూ చెప్పింది మెల్లగా, స్పష్టంగా....
"చూడు శారదా... నువ్వు నేను కూడా మీ ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నాం. మీ ఆయన నీకు ఏ అన్యాయం తలపెట్టలేదు. నీకు న్యాయం చేయటానికే తాపత్రయ పడ్డాడు. సుకన్య దుర్మార్గురాలు కాదు. నీకు నీ కుటుంబానికి సహాయం చేయడానికే ప్రయత్నించింది" అంటూ ఆగింది.
శారద కళ్ళలోకి చూస్తూ "నువ్వు కడుపుతో ఉన్నావు.‌ ఆవేశ పడకు. నేను చెప్పేది శాంతంగా విని దృఢంగా ఉండు" అన్నది.
శారద మనసు కీడు శంకించ సాగింది. తనకు తెలియకుండా ఏదో దారుణం జరుగుతోంది అనిపించింది. అధికమవుతున్న ఆందోళనను అదుపులో పెట్టుకుంటూ అదురుతున్న గుండెలను చిక్కబట్టుకుని "ఏమైందే" అన్నది బేలగా 
శివాని మెల్లగా "మనం విజయవాడలో బయలుదేరేముందు మీ ఆయన ఫ్రెండ్ ధర్మారెడ్డి ఫోన్ చేశాడు. మీ ఆయనకి.. " అని ఒక్క క్షణం ఆగి శారదకేసే చూస్తూ "బ్లడ్ కేన్సర్" అన్నది.
మెదడులో ఏదో విస్ఫోటనం చెందినట్లు, వందల మెరుపులు ఒక్కసారిగా వెలిగి ఆరిపోయినట్లు... శారద మ్రాన్పడి నిలిచిపోయింది. 
శివాని శారద భుజం పట్టుకుని అనునయంగా తట్టుతూ... "ఆరోజు మీ ఆయన ఫోన్ లో నువ్వు చూసిన ఛాటింగ్  కేన్సర్ గురించే. ఊళ్ళో తన పేరున ఉన్న పొలం నీ పేరున మార్పించటానికి మీ ఆయన ఇన్నాళ్ళూ వాళ్ళ ఊరు చుట్టూ,  కోర్టు చుట్టూ తిరిగాడు. తాను పోయాక నీకు జీవితం భారం కాకూడదని తన కుటుంబ సభ్యులతో తగవులాడి తన పేరున ఉన్న ఆస్థి నీ పేరున మార్పించేందుకు ఎంతో శ్రమించాడు. లీగల్ పనులు అంటే అవే. నువ్వనుకున్నట్లు విడాకులు కాదు. ముందే తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, తాను చేయాల్సిన పనులు చేయలేనమో అని నీకు చెప్పకుండా సుకన్యను ఆపాడు" అని చెప్పి ఊపిరి పీల్చుకుంది శివాని. "సుకన్యను కలిసి విషయం కనుక్కుందామని వెళ్ళిన ధర్మారెడ్డికి సుకన్య నీ భర్త కేన్సర్ గురించిన వార్త చెప్పడంతో గుండెపోటు రావడంతో సుకన్య ఇదే హాస్పిటల్ లో చేర్పించింది” కొనసాగించింది శివాని.
 
“అనుమానం అనేది రంగుల కళ్ళద్దాల లాంటిది శారదా. ఒక్కసారి అది కళ్ళమీదకొచ్చాక ప్రపంచాన్ని మనం చూసే తీరే మారిపోతుంది. అందుకే ‘ఎన్ని నెలలు’ అనే పదం నీకు ‘ఎన్నో నెల’గా కనపడింది" కంట్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా చెప్పింది శివాని.
 
ప్రపంచం మొత్తం ఒక్కసారిగా గిర్రున తిరిగినట్లనిపించింది శారదకు. తూలి పడబోతున్న శారదను పట్టుకుని "నీ భర్త చివరి క్షణాల్లో ఉన్నాడు. వెళ్ళు. వెళ్ళి నీలో పెరుగుతున్న తన అంశను గురించి చెప్పు" అంటూ నవీన్ ఉన్న రూంలోకి తీసుకెళ్ళింది శివాని.
 
కాలం ఎటువంటి గాయాన్నైనా మాన్పుతుంది. తన కడుపులో పెరుగుతున్న పసి పాప కోసమైనా శారద పరిస్థితులతో పోరాడుతుందని శివానికి తెలుసు.
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
కృతజ్ఞత
[Image: k.jpg]

స్వాతి సూర్యదేవర
 
"మీరు తినేదాంట్లోనే ఒక ముద్ద పెట్టండమ్మ చాలు" అన్నది రంగి.
"అధికాదే రంగి ,ఇప్పడు నాకే కటకటగా ఉంది ఇక నిన్నెం పోషించగలను . జీతం ఎం ఇవ్వగలను నువ్వే చెప్పు" అని వాపోయారు డెబ్భై ఐదేళ్ల సావిత్రమ్మ.
"మీరు అనేది సబబే అమ్మ.కానీ నాకు మిమ్మల్ని వదిలి వెళ్లడం ఇష్టం లేదు అమ్మ."
"ఇష్టం లేదంటే ఎలాగే!పాపం వాడు గంట నుండి నీకోసం ఎదురుచూస్తున్నాడు.పట్నానికి బస్ కి కూడా యేళవుతుంది వేళ్ళు నువ్వు ముందు."
"మీరేన్నయిన సెప్పండి అమ్మగారు.నేను వెల్లనంటే వెళ్ళను" అని మొండికేసింది రంగి
"అక్కడ నీ కొడుకు నీకు రోజు పంచభక్ష్య పరమన్నాలు పెడతా అంటుంటే నాతో పాటు గంజితాగుతా అంటావెంటే" అని ఒక రకమైన భాధ విసుగు కలిపి అన్నారు సావిత్రమ్మ.
"ఆడు ఏట్టే పరమాన్నాలు నాకొద్దు ఇక మీరేం మాట్లాడకండి నేను ఇక్కడే ఉంటా పిలగాన్ని ఎల్లమని సెప్పోత్త ఆగండి " అని ఇంటికి వెళ్లాడానికని వెనక్కి తిరిగింది.
"రంగి ఆగు..నీకు నా మాటంటే లెక్క లేదా ఏమే!?" అని కోపంగా అరిచారు సావిత్రమ్మ.
మాటకి వెనక్కితిరిగి కళ్ళెంట నీళ్లు తిప్పుకొని "నేను పుస్తె కట్టించుకొని ఊరికోచ్చినకాన్నుంచి నాకు అమ్మైనారు.పేరుకి పనిదాన్నే అయిన సొంతబిడ్డ మాదిరి సేరదీసినారు.తాగుబోతు మొగుడితో పడలేక సావబోతున్న నన్ను కాపాడి నా బిడ్డకి సధువు సెప్పించారు.కట్టం అన్న పేతిసారి నేనున్నా అన్నారు.నా మొగుడికి బుద్ధి సెప్పి నా కాపురం సక్కబెట్టారు.ఇయ్యాల నా బిడ్డ పట్నంలో అంత పెద్ద ఉద్యోగం సేత్తన్నడన్నా,ఇయ్యాల నన్ను సూసుకుంటాను అంటన్న అదంతా మీ సలవే అమ్మా.. మరి నాకింత సేసిన మీ మాట కాక ఇంకెవరు మాట ఇంటా అమ్మ" అని కన్నీరు పెట్టుకుంది రంగి.
కర్రపోటుతో రెండడుగులు ముందుకేసి "నేనేం చేసిన అది సాయం మాత్రమే నే రంగి, కానీ ఇలా నీకు అడ్డంకి కావడానికి కాదు" అని కన్నీరు పెట్టుకున్నారు సావిత్రమ్మ. రంగి కూడా ఏడుస్తూ సావిత్రమ్మ ని కావాటేసుకొని "మీ కన్నీళ్లు నేను సూడలేను అమ్మగారు. అలా అని వయసులో మిమ్మల్ని ఇట్టా అనాధలా వదిలేసి వెళ్లలేను నా మాట ఇనండి అమ్మా." అని బతిమిలాడింది
రంగిని వదిలి నువ్వు "ఉన్న లేకున్నా నేను అనాథనేనే రంగి.కట్టుకున్న వాడు అర్ధాంతరంగా వదిలేసిపోయిన, కన్నబిడ్డల కోసం కడుపు కట్టుకొని , సంసారాన్ని లాక్కొచ్చాను.వాళ్ళకి సధువులు చెప్పించి, పెళ్లిళ్లు చేసాను.రెక్కలొచ్చాయి, ఎగిరిపోయారు.వాళ్ళ బిడ్డల చదువులు,పెళ్లిళ్లు ,మనవళ్ళు అని వ్యాపాకంలో పడిపోయారు. ఇక్కడ ఒక అమ్మ ఉన్నదన్న సంగతే మర్చిపోయారు.కాలు, చెయ్యి కాస్తా ఆడుతుంది కాబట్టి వచ్చే పింఛను డబ్బులతో వెళ్ళదీస్తున్నాను.రెణ్ణెళ్ల నుండి అయ్యి కూడా లేవు.నాకే రేపటి రోజు ఎట్టా అని గుబులుగా ఉంది.ఇక నీకేం పెట్టేదే!? అందుకే నిన్ను పంపడం ఇష్టం లేకపోయినా వెల్లంటున్నాను" అని కళ్లు వత్తుకున్నారు సావిత్రమ్మ.
"అధికాదమ్మగారు..." అని ఏదో సెప్పబోయిన రంగి మాట మొదలవ్వకుండానే "అమ్మా" అన్న పిలుపు వినపడి గుమ్మం వైపు చూసారు.ఇద్దరూ...
లోపలికి వస్తున్న రంగి కొడుకుని చూసి ఆశ్చర్యపోయారు.వీల్లదగ్గరికి వచ్చిన రంగి కొడుకు,సావిత్రమ్మ కాళ్ళకి దండం పెట్టాడు. తల నిమురుతూ "చల్లగా వుండరా బుల్లబ్బాయి" అని దీవించింది సంతోషంగా.
పైకి లేచి నవ్వుతూ..."నా పేరు సూర్య పెద్దామే!...మర్చిపోఇనావా ఏంది?" అని పరిహాసం ఆడాడు సూర్య.
చిన్నగా తలపై మోడుతూ "మర్చిపోలేదులేరా బడుద్దాయి" అని నవ్వింది.ఎప్పుడు బుల్లాబ్బాయి అని పిలిచిన ఇలాగే అనే సూర్య మాట గుర్తుతెచ్చుకొని.
"ఏంది సూర్యం ఇట్టా వచ్చావు.నేనే వస్తా అన్నాను గా" అని కంగారుపడుతూ అన్నది రంగి.ఎక్కడ సావిత్రమ్మ గారిని వదిలి రమ్మంటాడో అన్న భయంతో.
"ఎం లేదులే అమ్మ..నాకు బస్ కి టైం అవుతుంది నేను ఇక బయలుదేరతాను అదే మీకు చెప్దామని" అంటూ తన చేతిలో ఉన్న ట్రంకు పెట్టే తల్లి చేతికి అందించాడు.
అది తీసుకుంటూ..వెళ్ళడానికి మనసొప్పక భాధగా ఉంటే అంతలోనే తను ఒక్కడే వెళ్ళాలి అనడం గుర్తొచ్చి టక్కున కొడుకుకేసి కళ్ళనిండా మెరుపుతో,అంతకంటే ఎక్కువ ఆనందం తో చూసింది.
తల్లి ఉద్దేశ్యం అర్ధమై అవును అన్నట్టు కళ్లార్పి, వాళ్లనే అయోమయంగా చూస్తున్న సావిత్రమ్మ వైపు తిరిగి,"ఇగో పెద్దామే! మా అమ్మని నీకు అప్పచెప్తున్న జాగ్రత్త.నేను మీ ఇద్దరిని చూడడానికి నెలకోసారి వస్తూనే ఉంటాను.జాగ్రత్త" అని చెప్పాడు.
ఆశ్చర్యంగా "అదేందిరా అలా అంటావు.మీ అమ్మని కూడా తీసుకుపోతా అన్నావుగా!? "
"ఇప్పుడు కాదులే పెద్దమే! ,మా అమ్మ బాధ్యత ఇక్కడ ఇంకా ఉంది అది నేనే గుర్తించలేదు" అని నొచ్చుకున్నాడు.
"మీ అమ్మ బాధ్యత! అదేంటి రా...!? మీ నాయనా లేడు,నీకా ఒక కుటుంభం చూపించింది ఇంకేం బాధ్యత ఉంది!?."
సావిత్రమ్మ భుజాలపై చేతులు వేసి "తన బాధ్యత ఇంకా ఉంది బామ్మ.అది ఇదిగో.." అంటూ కళ్ళతోనే నువ్వే అన్నట్టు సావిత్రమ్మ కి సైగ చేసాడు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
కళ్ళలో నీరు చేరగా "సూర్యం" అంటూ ఇంకా మాట్లాడలేక ముగబోయింది సావిత్రమ్మ.
కన్నీరు తుడిచి, "బామ్మ ఎందుకు కన్నీళ్లు . నీకు ఎవరు లేరని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు.నీకు నీ బిడ్డ లాంటి మా అమ్మ,నేను ఉన్నాం ఒకప్పుడు నువ్వు మమ్మల్ని ఆదుకున్నావు.ఇప్పుడు నీ పరిస్తితి బాగలేకపోతే మేము నిన్ను చూస్కోలేమా. నువ్వు మా అమ్మకి జీతాలు ఇవ్వనక్కర్లేదు.నీకు ఇష్టం ఉండదని ఇన్నాళ్లు తీసుకుంది కానీ,తనకి నీ దగ్గర రూపాయి తీసుకోవడం కూడా ఇష్టం లేదు. మా అమ్మ నీ దగ్గరనుండి తీసుకున్న ప్రతి రూపాయి మా దేవుడి మందిరంలో శ్రీనివాసుడు పాదాల దగ్గర భద్రంగా ఉంది."అని తనతో తెచ్చిన డబ్బుని తీసి రంగి చేతికి ఇచ్చాడు. డబ్బుని తీసుకొని కళ్ళకి అద్దుకుంది రంగి.
"బామ్మ నువ్వు ఎలాంటి మోహమాటనికి పోకు. మా అమ్మని నా బిడ్డ అనుకుంటా అని నాతో చాలాసార్లు అన్నావు గుర్తుందా!?" అవునన్నట్టు తెలుపిన సావిత్రమ్మ ని చూసి నవ్వి..
"హుమ్.. అందుకే నీ బిడ్డ, నీకు ముదిమి వయసులో నీకు సాయంగా వచ్చింది.కాదనకు.మా అమ్మ అవసరం నీకు ఇప్పుడే కావాలి. ఇలాంటి స్థితిలో నిన్ను వదిలి వెళితే మాకంటే స్వార్ధపరులు లోకంలోనే వుండరు.మా అమ్మ ఇక ఇక్కడే ఉంటుంది. ఇంట్లోనే ఉంటుంది.నీకు ఇష్టం లేకపోయినా సరే " అన్నాడు.
అతని మాటలకి ఇంకా ఆలోచనతోనే ఉన్న సావిత్రమ్మ ని చూసి,"మా అమ్మని నువ్వేం ఊరికే ఉంచుకోవద్దులే పెద్దామే!" అని నవ్వి తన జేబులో నుండి ఒక కాగితం తీసి సావిత్రమ్మ చేతిలో పెట్టి "ఇది నీ పెన్షన్ కాగితం బామ్మ రేపు పంచాయితీ గుమ్మస్థ వస్తాడు ఇవ్వు. రేపు నెల నుండి నీకు పేన్షన్ వస్తుంది అప్పటిదాక డబ్బు వాడుకోండి.మీకు సమయంలో అవసరం వచ్చిన నాకు ఒక్క ఫోన్ చెయ్యండి నేను మీకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను".అని చెప్పాడు.
చేతిలో ఉన్న కాగితాన్ని చూసుకుంటూ...ఎప్పుడో చేసిన మాట సాయానికి ఇంత మూల్యమా!! అని ఇద్దరి వైపు ఆరాధనగా చూసింది సావిత్రమ్మ ఏమి మాట్లాడలేక,మాటలు కూడా రాక.
"సరే బామ్మ,అమ్మ నేను వెళ్ళొస్తాను నాకు బస్ టైం అయింది."
ప్రేమగా సూర్యం తల నిమిరి "మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీ కడుపునే పుడతానురా సూర్యం" అని ప్రేమగా సూర్యాన్ని హత్తుకుంది.ఆవిడ చుట్టూ చేతులేస్తూ.."సూర్యం కాదు పెద్దామే బుల్లబ్బాయి." అని జీరాబోయిన గొంతుతో అన్నాడు సూర్యం.
వాళ్ళిద్దరిని కళ్ళార్పకుండా చూస్తూనే, కొడుకు మంచి మనసుకి మనసులోనే మురిసిపోయింది రంగి.
సావిత్రమ్మ ని వదిలి "ఇంకోవారం లో నీ బిడ్డలు,మనవళ్ళు,మునివనవళ్ళు అంతా నీ ముందు వుంటారు.ఇక దిగులు పెట్టుకోకు "
"వద్దురా...నా కోసం వాళ్ళ దగ్గర నువ్వు తగ్గడం నాకు ఇష్టం లేదు సూర్యం.నాకు మీరు ,మీ ఆత్మేయత చాలు.పేరుకు తగ్గట్టు పది మందికి ఇలానే మంచి చేస్తూ వుండు నాన్న. మంచే నిన్ను చల్లగా ఉండేలా చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా.."అని చెప్పింది.
సరే అని తలుపి తల్లికి కూడా చెప్పి వెళ్ళిపోయాడు సూర్యం. కొడుకు వెళ్లిన వైపే చూస్తూ నిలబడ్డ రంగి ని చూసి "ఏంటే రంగి తుమ్మమొద్దులా అలా నిలబడ్డావు వెళ్లి పెరట్లో చెట్లకి నీళ్లు పొయ్యి పో" అని గేదిమింది సావిత్రమ్మ.
సావిత్రమ్మ మాటకి వెనక్కి తిరిగి "ఇదిగో పెద్దమ్మ గారో ఏంటి నోరు పెంచుతున్నారు..ఇలా అంటే నేను పని మానేసి పోత ఏమనుకున్నారో" అని ఇంకా గట్టిగా రెట్టించింది రంగి.
"ఏంటే నన్నే బెదిరిస్తున్నావు నా మనవడికి ఒక్క ఫోన్ చేసాను అంటే నీ ఉద్యోగం ఉడిపోద్ది ఏమనుకున్నావో" అని ఇంకా గట్టిగా అరిచింది సావిత్రమ్మ.
"ఏది చెయ్యండి నేను చూస్తా..." అంటూ మీదకి పోతున్న రంగి, "ఏమే మీ గోల ఎన్నాళ్ళకి అగుద్ది రోజున ఇదే తగువు నలభై ఏళ్ల నుండి చూసి చూసి విసుగుపుడుతుంది" అని గోడ దగ్గర నిలబడి అరుస్తున్న పక్కింటి కాంతమ్మ మాటలకి ఆగి "మధ్యలో మీకేం నొప్పి అమ్మ మాకు మాకు వందుంటాయి మీకెందుకు? మీరెల్లి పక్కింటి కామాక్షి అమ్మతో ముచ్చట్లు పెట్టుకో పొండి" అని అరిచి చెప్పి కోపంగా తన వైపే చూస్తున్న సావిత్రమ్మ ని చూసి..చెవి వెనుక గీక్కుంటు హీ..హీ..హీ...అంటూ పిచ్చి నవ్వు నవ్వింది రంగి.
రంగి హావభావాలు చూసి కోపం నటించలేక పెద్దగా నవ్వింది సావిత్రమ్మ.ఆమె నవ్వుని చూసి ,తన నవ్వుని కూడా జత కలిపింది రంగి.
ఎంత సాయం అన్నది కాదు, మంచి మనసు ముఖ్యం దేనికైనా!.
                        ★★★★★★
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
బతుకు భయం



రచన : సుస్మితా రమణ మూర్తి
[font=var(--ricos-font-family,unset)] [/font]



ఏఁవండీ!...వచ్చే వారం మావయ్య గారు మీ చెల్లెలి దగ్గరకు వెళ్తున్నారా?



వెళ్తున్నారు. రిజర్వేషన్ చేయించాను



నాలుగైదు నెలలు అక్కడే ఉంటారుగా?... పోర్షన్ అద్దెకు ఇస్తే, నెల తిరిగే సరికి పది వేలు వస్తాయిగా?...పిల్లకు చిన్న వస్తువు కొనుక్కోవచ్చు” 



వారు తిరిగి వచ్చినప్పుడు అధ్దెకున్నవారు వెంటనే ఖాలీ చేయక పోతేనో?...



విషయం అప్పుడు చూసుకోవచ్చు. తెలిసిన వారికి చెప్పండి. అద్దెకు ఇచ్చేద్దాం!” 



భార్య మాటలు ఇష్టం లేకున్నా ఆనంద్ కాదనలేదు.
 ***** 
గోపాల్రావు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. రెండు పోర్షన్ల ఇల్లు కట్టుకున్నాడు. భార్య కాలం చేయడంతో తనుంటున్న పోర్షన్ లో ఒంటరి వాడైపోయాడు. రెండో పోర్షన్లో కొడుకు ఆనంద్, కోడలు, మనవడు, మనవరాలు ఉంటున్నారు. అప్పుడప్పుడు చెన్నైలో ఉంటున్న కూతుర్ని చూడ్డానికి వెళ్తుంటాడు. కొడుకు అతికష్టం మీద డిగ్రీ పూర్తి చేసాడు. ప్రయివేటు కంపెనీలో చిరుద్యోగం చేస్తున్నాడు. తను మంచి వాడే కాని, భార్యా విధేయుడు. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేడు.
 ***** 
అయిదు నెలల తర్వాత తిరిగి వచ్చిన గోపాల్రావు తన పోర్షన్ లో ఎవరో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తండ్రికి విషయం చెప్పటానికి ధైర్యం చాలలేదు కొడుకుకి. 
 “ఎవరు వాళ్ళు? గద్దించి అడిగాడు. 



వారు మీ అబ్బాయి ఆఫీసులోని వారే మావయ్య గారూ! అద్దెకు ఇల్లు దొరక్క బాధ పడుతుంటే, మీరు వచ్చేదాకా ఉండమన్నాం కోడలు ధైర్యంగా చెప్పింది. 



అంటే అద్దెకు ఇచ్చారన్న మాట!?...



గోపాల్రావు కోపంగా అడిగేసరికి కొడుకు తల దించుకున్నాడు. 
నెలకు పదివేలు వస్తాయని ఇచ్చాం. మీరు ఒంటరిగా ఉండటం దేనికి?... మాతో కలసి ఉండొచ్చు. మీ సామాన్లు హాలులో జాహగ్రత్తగా ఉంచాం కోడలు తడబడుతూ చెప్పింది. విషయం అర్థం అయింది గోపాల్రావుకి. తనింట్లోనే వారితో కలసి ఉండొచ్చన్న కోడలు మాటలకు విస్తుపోయాడు. బాధపడుతూ మౌనంగా ఇంట్లోకి వెళ్ళాడు. హాలులో ఓమూల చిందరవందరగా పడివున్న తన సామాను వేపు చూసాడు. కొడుకు, కోడలు వేపు కోపంగా చూస్తూ, మిత్రుడు రాజారావుకి ఫోన్లో విషయం టూకిగా చెప్పాడు. అరగంటలో రాజారావు మినీ వేన్తో వచ్చి, గోపాల్రావు సామాన్లు తీసుకు పోయాడు. 



వాళ్ళు ఖాలీ చేసేదాకా మా రాజారావు ఇంట్లో అద్దెకు ఉంటాను కొడుకు, కోడలుకి చెప్పి స్కూటరు తీసుకుని తను వెళ్ళిపోయాడు. 
 *****
డాడీ ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలను కాలేజీకి తీసుకు వెళ్ళేవారు. తీసుకు వచ్చేవారు. ఇప్పుడు ఆటోవాలాకి నెలకు అయిదు వేలు ఖర్చు. పాఠాలు చెప్పేవారు. ట్యూషను ఖర్చు మరో అయిదు వేలు. నెలాఖర్లో కావాల్సిన సరుకులు చెప్పకుండానే తెచ్చేవారు. కరెంటు బిల్లు వారే కట్టేవారు. నెలలోనే ఇంటి పన్ను కట్టాలి. అవసరం వచ్చినా ఆదుకునే వారు. అద్దె డబ్బులకు ఆశపడి చాలా పెద్ద పొరపాటు చేసాం కదా?...



భర్త మాటలకు భార్య బదులు చెప్పలెక పోయింది. మావయ్య గారు బాధ పడినట్లు ఆమె గ్రహించింది.
 **** 
నా పేరు. రాజారావు. మీ డాడీ మా ఇంట్లోనే ఉంటున్నారు. త్వరలో ఇల్లు అమ్మేయాలని అనుకుంటున్నారు రాజారావు మాటలకు ఆనంద్ నిర్ఘాంత పోయాడు. 



ఇంటికి వారసుడు మావారు. వీరికి చెప్పకుండా, వీరి సంతకం లేకుండా మా మావయ్య గారు ఇల్లు ఎలా అమ్మేస్తారు!?... ఎవరైనా ఎలా కొనగలరు? ఆనంద్ భార్య కోపంతో రెచ్చిపోతూ అడిగింది. 
నిజమే! వారసుడు మీవారే!... ఇల్లు మీ మావయ్య గారి స్వార్జితం కనుక, ఏమైనా చేసుకునే హక్కు, అధికారం వారికి ఉన్నాయి



ఏఁవిటి!?...పెద్ద లాయర్లా, లా పాయింట్లు తీస్తున్నారు!?...



అవును! నేను లాయర్ నే!” 



ఆమె మరోమాట అనలేక పోయింది. తండ్రి తనతో చెప్పకుండా ఇల్లు అమ్మేస్తున్నందుకు ఆనంద్ బాధ పడ్డాడు. 



నాకు ఇల్లు కొనే ఆలోచన ఉంది. అప్పుడు మీరు అద్దె పదిహేను వేలు ఇవ్వాల్సి ఉంటుంది
రాజారావు మాటలకు రావు గారి కొడుకు, కోడలు నివ్వెరపోయారు. 



తన పాతిక వేల జీతం ఇంటి అద్దెకు, పిల్లల ట్యూషనుకి, ఆటోకి సరిపోతుంది. ఇక నలుగురం బతకడం ఎలా?...డాడీ ఇక్కడ ఉన్నప్పుడు వారి విలువ మంచితనం తెలుసుకోలేక పోయాం స్వగతంలా అనుకుంటూ బాధ పడ్డాడు ఆనంద్. మొదటి సారిగా భార్యాభర్తలకు బతుకంటే భయం వేసింది. 



 ‘అద్దె డబ్బులకు ఆశించి, మావయ్య గారిని బాధపెట్టాను. తప్పు చేసాను!....’ 



భార్య బాధ పడటం చూసి-- పద!...డాడీని క్షమించమని అడుగుదాం ఆనంద్ అన్నాడు.



 “మీ తప్పేమీ లేదండీ! మావయ్య గారికి నావల్లే ఇల్లు అమ్మేసే ఆలోచన వచ్చింది “ 



ఇకమీదటనుంచైనా మన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నడచుకోవడం మంచిది “ 
భర్త మాటలకు ఆమె తలూపింది. 
 **** 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఆనంద్ భార్యతో కలసి తండ్రికి క్షమాపణ చెప్పడానికి రాజారావు ఇంటికి వెళ్ళాడు. సమయంలో గోపాల్రావు పూజ గదిలో ఉన్నాడు. 



మా గోపాల్ ఇల్లు అమ్మే ఆలోచన ప్రస్తుతానికి విరమించు కున్నాడు. మీరు గాభరా పడకండి. తన పోర్షన్ ఖాలీ అయింది కాబట్టి, మీ దగ్గరకు వచ్చేద్దామన్న ఆలోచనలో ఉన్నాడు



రాజారావు మాటలకు భార్యాభర్తల ముఖాల్లో ఆనందం చోటు చేసుకుంది. పూజ ముగించి బయటకు వచ్చిన గోపాల్రావు కోడలు, కొడుకుని చూసి ఆశ్చర్య పోయాడు. 
నన్ను క్షమించండి డాడీ!- అంటూ కొడుకు, నా తప్పు మన్నించండి మావయ్యా! మీ ఇంటికి వచ్చేయండి! అంటూ కోడలు చేతులు జోడించి అన్నారు.



 “నేను అక్కడ లేకపోవడంతో పిల్లలు ఎంత బాధ పడుతున్నారో చూడరా రాజూ! అన్న రావు గారి మాటలకు రాజారావు మందహాసం చేసాడు. 



గోపాల్! నీవు చెప్పినట్లుగా అబ్బాయి ఉంటున్న పోర్షను తన పేరు మీద, నీవు ఉంటున్న పోర్షను నీ తదనంతరం అమ్మాయి పేరు మీద వీలునామా తయారు చేసాను.చదివి సంతకం చేయి అంటూ ఒక ఫైలు రావు గారికి ఇచ్చాడు రాజారావు. 



రాజారావు మాటలు విన్న కొడుకు, కోడలు రావు గారి కాళ్ళపై పడి మరోసారి - మన్నించమని వేడుకున్నారు. తను ఆనందంతో పొంగిపోయాడు.



ఇల్లు అమ్మేయబోతున్నారంటూ రాజారావు, గోపాల్రావు కొడుకుకి, కోడలుకి అబద్ధం చెప్పాడని, వారి సహాయం లేకుండా బతకడంలోని సాధక బాధకాలు, వాస్తవ పరిస్థితులు ఆలోచించేలా చేసాడని గోపాల్రావుకి తెలియని విషయం. 



 / సమాప్తం /
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
కలుపుకుంటే కలదు సుఖం!

రచన: విజయా సుందర్



పచ్చగా పేడతో అలికిన వాకిట్లో ముత్యాల ముగ్గులు, దారికిరువైపులా స్వాగతం చెప్తూ పచ్చని బంతిపూలు విరగబూసి ఉన్నాయి. మిరపమందార, ముద్దామందార, గరుడవవర్ధని, నందివర్ధని, మెట్టతామర పూలతో కలకళలాడుతూ, కల్మషమెరుగని కన్నెపిల్లలా సోయగాలు విరజిమ్ముతున్నది లోగిలి! 



గడప గౌరి పసుపు కుంకుమలతో నిండి, వాకిలి కి కట్టిన పచ్చని మామిడి ఆకులు, బంతిపూల తోరణంతో పండు ముత్తయిదువులా పకపకలాడుతున్నది లోగిలి!



జడగంటలు ఊపుకుంటూ, పచ్చని లంగా, ఎర్రని జరీ అంచు జాకెట్టు, ఎర్రని ఓణీలతో, నిండు యవ్వనం తొణికిసలాడే పడుచు పిల్ల పకపకలాడుతూ, ఎదురు వచ్చింది, అప్పుడే గడపలో కాలు పెడుతున్న ఇంటి ఆడబడుచు నీలవేణికి. వెనకాలే టాక్సీకి డబ్బులు ఇచ్చి వస్తున్నాడు ఇంటి అల్లుడు, నీలవేణి భర్త శ్యాంసుందర్. 



"అమ్మా! అత్తయ్యా మామయ్య వచ్చారే" అత్త చేతిలో బాగ్ అందుకుంటూ లోపలికి కేక వేస్తున్న మేనకోడలిని మురిపెంగా చూస్తూ నీలవేణి, "ఎంత పొడుగయ్యావే?" అంటూ బుగ్గలు పుణికింది. 
"అంతా నీ పోలికే అంటారు అత్తా" అంటూ అత్తని ఇష్టంగా చూస్తూ అన్నది స్నిగ్ధ. 



పెద్ద వదినగారు సుమిత్ర చెంగుకి చేతులు తుడుచుకుంటూ ఆడబడుచుని అక్కున చేర్చుకుని, కొంగు కప్పుకుంటూ, ఇంటి అల్లుడి యోగక్షేమాలనడిగింది. 



మెల్లిగా తల్లి రాజేశ్వరి, తండ్రి రామారావు, పెద్దఆన్నగారు శేషాద్రి, చిన్న అన్న సాకేత్, చిన్న వదిన రమ్య, వాళ్ళ అబ్బాయి రవి, కూతురు లాస్య, పెద్దన్నగారి కొడుకు పార్థు... అంతా బిలల్లాడుతూ వచ్చారు. 



ఉగాది పండుగ అంతా వాళ్ళింట్లోనే ఉన్నదా అన్నట్లు అందరూ హాసపరిహాసాలతో, తలా ఒక పని చేసుకుంటూ, తోటి కోడళ్లద్దరూ మడి కట్టుకుని అత్తగారు చెప్పినట్లు చేస్తూ, అరమరికలు లేకుండా నవకాయ పిండివంటల్తో వంటలు చేశారు. మగవాళ్ళు, అత్తగారు, పిల్లలకి తీరుగా అరిటాకులు వేసి వడ్డించి వాళ్లంతా తిని లేచాక, తోటికోడళ్లు, ఆడబడుచు కూర్చున్నారు భోజనాలకి. 



"నువ్వు కూడా వాళ్ళందరితో కూర్చుని తినవమ్మా అంటే తిన్నావు కాదు. చూడు రెండు దాటిపోయింది. " పెద్ద వదిన సుమిత్ర మరదలిని చిన్నగా మందలిస్తూ అన్నది. 



" అమ్మా! అక్కచెల్లెలిద్దరూ మాకు వేయకుండా ఏమి దాచిపెట్టి వేసుకుంటున్నారో చూడద్దూ!" నీలవేణి మేలమాడింది. 
పెద్ద వదిన తల మీద చిన్నగా మొట్టి, " మేమేం తింటున్నామో చూస్తావు కదూ... ఇదిగో.. పెద్ద బొబ్బట్టు నీకోసం ప్రత్యేకంగా చేసా. ఆపకుండా తినాలి" సుమిత్ర కూడా మరదలిని ఆట పట్టించడం మొదలెట్టింది. 



చిన్న వదిన రమ్య, "పిల్లల్ని ఎప్పుడూ తేవేమిటి నీలా?" అన్నది. 



"మహేష్ ఇప్పుడు జాబ్ మారాడు. కొత్తది కదా సెలవు పెట్టే వీలు లేదని వాడు రాలేదు. ఇంక సుస్మితకి ఫైనల్ పరీక్షలు బాగా దగ్గరకొచ్చాయి అని, అది రాలేదు... అంటే వదినా". 
"సుస్మిత ఏమి చదువుతున్నదే"? అక్కడే ముక్కాలి పీట మీద కూర్చుని వత్తులు చేసుకుంటూ, వీళ్ల మాటల్లో అప్పుడప్పుడు మాట కలుపుతున్న తల్లి ఆడిగిందానికి, "నువ్వెప్పుడూ మర్చిపోతూనే ఉంటావు మనవరాలి చదువు. అదిప్పుడు ఎం. టెక్ చేస్తున్నది. " అన్నది. 



సరదాగా వదినా మరదళ్ళు ఛలోక్తులతో భోజనాలు చేసారు. 
***



రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా, అల్పాహారాలు తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లల పెళ్లిళ్ల మీదకి పోయింది సంభాషణ. 



పెద్ద అన్నయ్య శేషాద్రి, " అమ్మాయ్ నీలా! ఏడాది ఆడపిల్లలు లాస్య, స్నిగ్ధ ఇద్దరికీ పెళ్లిళ్లు చెయ్యాలని నాన్నగారు తీర్మానించారు.... అని మాట్లాడబోతుంటే రామారావుగారు అందుకుని, "చెప్పవే అమ్మడూ! నీ కొడుక్కి మేనగోడల్ని చేసుకుంటావో?" అన్నారు. 



ఇంత సడన్ గా, ఇంత సూటిగా తండ్రి ప్రశ్నిస్తుంటే నీలవేణి ఖంగుతిన్నది. ఒక్క నిమిషం తమాయించుకుని, "నన్ను అడుగుతారేమిటి నాన్నగారు? మీ అల్లుడు పక్కనే ఉన్నారుగా... ఆయన్ని అడగండి " అన్నది. 



బాధ్యత అంతా తన మీదకి నెట్టేసి తప్పించుకున్న భార్యని కొరకొరా చూసి, సమాధానం కోసం చూస్తున్న మావగారితో, "ఇంకా ఇప్పుడే అనుకోవడం లేదండీ. అయినా ఎప్పుడయినా వాడి ఇష్టమే" అంటూ ఆయనా తప్పించుకున్నాడు. 






ఇంతలో లాస్య చేతిలో సెల్ మోగింది. 
మహేష్ ఫోన్ చేసాడు... లాస్య అవతలి రూమ్ లోకి వెళ్లి మాట్లాడుతుంటే, రమ్య కూడా లేచి వెళ్ళింది... 



 ఇటీవల లాస్య అర్థరాత్రి దాకా ఫోన్ మాట్లాడుతుండటం గమనించిన రమ్య ఆమె సెల్ ఫోన్ లో హిస్టరీ అంతా చూసింది. మహేష్ దగ్గర నుండి రోజూ కాల్స్ ఉండటం చూసింది. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా దిశగా మాట్లాడుతున్నారు... అసలు సంగతి తెలుసుకుందామని లేచింది. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
మహేష్ తో మాట్లాడుతున్న లాస్య తల్లి రావటం చూసి ఖంగారేమీ పడలేదు. రమ్య చేతికి ఫోన్ ఇచ్చింది. మహేష్, "హాయ్ చిన్నత్తా! ఫోన్ తీసుకుని నువ్వు పెద్దవాళ్ళ దగ్గరకు రా" అన్నాడు. మహేష్ వీడియో కాల్ లో మాట్లడటం అందరికీ కనపడేటట్లు గా అక్కడ టేబిల్ మీద పెట్టింది రమ్య. 



అందరూ ఆశ్చర్యంగా, సందేహంగా రకరకాల ఆలోచనలతో వింటున్నారు. 



పండగ పలకరింపులు అయ్యాక మహేష్ చాలా కూల్ గా తాతయ్య రామారావు గారిని, అందర్నీ ఉద్దేశించి, 
అసలు మేనరికాల వలన జరిగే ఎన్నో జెనిటికల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పి, చిన్నప్పట్నుంచీ ఒక్క చోట చాలా రోజులు కలిసి ఆడుకున్న తమ పిల్లలందరి మధ్యనా స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పాడు ముందుగా. తరవాత అదే స్నేహం లాస్యకి, తనకీ చాలా ఎక్కువ అని చెప్తూ, లాస్య తనతో పంచుకున్న తన ప్రేమ కథ గురించి చెప్పాడు. వింటున్న వాళ్ళు విస్తుపోయారు! 



పండగ వాతావరణం చాలా సీరియస్ గా అయిపోయింది. అసలు తమకు చెప్పకుండా మహేష్ కి చెప్పడం ఏమిటి, అని ముందుగా గింజుకున్నారు. మహేష్ ఓపికగా నచ్చచెప్పాడు, లాస్య అన్నలు రవి, పార్థులకు కూడా తెలుసని, వాళ్ళు తన లాగా ధైర్యం చెయ్యలేకపోతున్నారనీ చెప్పి, అసలు లాస్య, అబ్బాయి పరస్పరం ఇష్టపడిన వెంటనే తమ ముగ్గురికీ చెప్పారని, అప్పట్నుంచీ తాము వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నామని, ముఖ్యంగా ఆబ్బాయి గురించి అన్ని విషయాలు విచారించామని. ఇంతకీ అబ్బాయి పెద్ద వాళ్లకు తెలియని వాడు ఏమీ కాదంటూ, ఎవరో చెప్పారు. రామారావు గారు సంబంధం వివరాలు వింటూనే తాడెత్తున లేచారు!
***



చిన్నప్పట్నుంచీ ఒక కంచం, ఒక మంచంగా పెరిగి, అక్కచెల్లెళ్ళని పెళ్లి చేసుకున్న స్నేహితులు, తోడల్లుళ్లు రామారావు, పరాందామయ్య. ఒకానొక భూమి విషయంలో వచ్చిన స్పర్థల వలన ఈనాటికి గర్భ శత్రువులయ్యారు!



పరందామయ్య కూతురు అనుపమ కొడుకు మురళి, లాస్య కాలేజీలో స్నేహితులయ్యారు, సన్నిహితులేనని తెలుసుకున్నారు. కాలక్రమంలో ప్రేమ అంకురించింది వాళ్ళ మధ్యన. కానీ కుటుంబాల పాత పగలు తమ ప్రేమకి అవరోధమవుతాయని, ముందుగానే అన్నలకి, చిన్ననాటి చెలికాడికి చెప్పి లాస్య, మురళిని కూడా కలిపించింది. ఇపుడు లాస్య, మురళి ఎంబీఏ చేసి ఒకటే కంపెనీలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళకి చెప్పాలంటే భయపడి ఇంక ఇప్పుడు తెరతీశారు. రవి, పార్థు కూడా తాతయ్య, తల్లిదండ్రులతో ఎదురు కుండా నిలబడి అన్ని విషయాలూ పూస గ్రుచ్చినట్లు చెప్పారు. 



కోపంతో మండి పడుతున్న రామారావుగారిని, నీలవేణి, శేషాద్రి శాంతపరిచారు. నీలవేణి, "నాన్నగారూ! ఎప్పుడో మీకు, పరం బాబాయికి వచ్చిన గొడవలు వలన, లాస్యని బాధ పెడతారా?" అంటుంటే, శేషాద్రి, "అది అయోగ్యుణ్ణి ప్రేమించలేదు. మన మధ్యలో పెరిగిన మన కుటుంబాల్లో పిల్లవాణ్ణి ఎంచుకున్నది. నాన్నగారూ! మీరు ఎన్నిసార్లు పరం బాబాయితో ఉన్న ఫోటోలు చూసుకుంటూ బాధపడటం నేను చూశానో. ఇంక ఇలా కలుపుకోవటంతో మీ పగలకి తెర వేసేయండి నాన్నగారు. " అని ఎన్నో విధాలా చెప్పారు. ఎన్నడూ దేనికీ మాట్లాడని భార్య రాజేశ్వరి కూడా, "అనుని నేనే పెంచానండీ. అది పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గిర పాలు లేకపోతే నేనిచ్చాను. అప్పుడు శేషు పసివాడు. వద్దండీ ఇంక గొడవలు" అని బ్రతిమాలింది. అందరి వేడికోళ్లకి కరిగిపోయారు రామారావుగారు. 



అంత తొందరగా అహం వదులుకోలేని రామారావుగారు, " వాడు ఎన్నేసి మాటలన్నాడురా, వెధవ భూమి కోసం!"
శేషాద్రి నవ్వుకున్నాడు, 'ఈయన తక్కువ మాటలన్నాడా?' అని. 



"కోపం అంటూ వచ్చాక ఎవరేమి మాట్లాడుతున్నారో ఎవరు మాత్రం గ్రహించుకుని మాట్లాడతారు నాన్నగారూ?
అన్యాపదేశంగా కొడుకు ఎత్తి చూపుతున్నది తననే అని అర్థమయింది ఆయనకి. 
ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు. 



రాజేశ్వరి ఊరుకోలేక, " ఇలాగే మీరిద్దరూ పంతాలు పట్టి కూర్చోండి. పిల్లలు చెప్పా పెట్టకుండా దండలతో వాకిట్లో నిలబడతారు. అప్పుడు ఇద్దరు పెద్దమనుషుల పరువు గంగలో కలుస్తుందో ఆలోచించుకోండి. మంచి పిల్లలు కనక, పెద్దవాళ్లకి గౌరవం ఇచ్చి ఇలా ముందుగానే చెప్తున్నారు" గట్టిగా నాలుగూ ఝాడించింది. 



నీలవేణి, " అవునండీ నాన్నగారూ! ఎన్ని రకాలు వింటున్నాము పిల్లలు ప్రేమ పేరుతో చేసే పైశాచికమైన పనులు... నా మాట విని మీరు పెద్ద మనసు చేసుకుని బాబాయికి ఫోన్ చెయ్యండి. ఆయన కాదంటే అప్పుడే చూడచ్చు" అన్నది. 



" నామాట కాదంటాడూ... " అంటూనే, ఊళ్ళోనే ఉంటున్న స్నేహితుడికి ఫోన్ చేశారు రామారావుగారు. అంతా నీలవేణిని ప్రశంసాత్మకంగా చూసారు. 



 అక్కడ పరందామయ్యగారి ఇంట్లో కూడా ఇదే ప్రహసనం నడిచింది. మురళి తండ్రి రఘు, అనుపమ తండ్రికి నచ్చచెప్పారు. 



వాళ్ల కుటుంబమంతా తమ తోటలో కాసినవి, పూసినవీ తీసుకుని రామారావు కుటుంబాన్ని కలవడానికొచ్చారు. 



రామారావు చాపిన కౌగిట్లోకి పరందామయ్య ఒదిగిపోయాడు!
ఉగాది సంబరాలు అంబరానంటాయి ఇంట... పిల్లలు విజ్ఞతతో చెప్పిన తీర్పుతో!
***
 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Meeraina Vasantotsavam upload cheyandi guruvu Gaaru... Please..
Like Reply
షడ్రుచుల సమ్మేళనంలా మీ జీవితం తీపి, వగరు, చేదుల కలయికతో సాఫీగా సాగాలని..
ఈ ఉగాది మీకు సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఇల్లాలే దేవత - డా:సి.హెచ్.ప్రతాప్

[Image: Illale%20Devatha-Story%20picture_1773552191.jpg]అభిషేక్ ఒక ప్రముఖ అంతర్జాతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలో సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. అతను తన వృత్తిలో ఎంతో వేగంగా ఎదిగిన అత్యంత అగ్రెసివ్ ప్రొఫెషనల్. కార్యాలయంలో క్లిష్టమైన టెక్నికల్ సమస్యలను పరిష్కరించడంలో అతనికి ఉన్న నైపుణ్యం చూసి కొలీగ్స్ అందరూ ఆశ్చర్యపోయేవారు. అయితే, అతని పర్సనల్ లైఫ్ అతని ప్రొఫెషనల్ సక్సెస్‌కు పూర్తిగా భిన్నంగా ఉండేది.
అభిషేక్‌కు రెండేళ్ల క్రితం లలితతో వివాహమైంది. లలిత ఒక పచ్చని పల్లెటూరి వాతావరణం నుండి వచ్చిన నిరాడంబరమైన యువతి. ఆమె డిగ్రీ వరకు చదువుకున్నా, తన ఇంటిని, భర్తను ప్రేమతో చూసుకోవడమే జీవితంగా భావించే ప్రశాంత స్వభావం కలిగిన హౌస్ వైఫ్. "భార్యాభర్తల బంధం అంటే కేవలం కలిసి జీవించడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకోవడం" అన్న సత్యాన్ని ఆమె నమ్మింది.
అయితే ఈ వివాహం అభిషేక్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. కేవలం తన వృద్ధ తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక, వారి సంతోషం కోసం లలితను పెళ్లి చేసుకున్నాడు. అభిషేక్ తనకు సమానంగా ఇంగ్లీష్ మాట్లాడే, మోడరన్ భావాలు గల కార్పొరేట్ భార్య కావాలని ఆశించేవాడు, కానీ లలిత ట్రెడిషనల్ పద్ధతులు అతనికి ఎప్పుడూ ఇరిటేషన్ కలిగించేవి. ఆమె పల్లెటూరి యాసలో మాట్లాడటం, సాధారణ కాటన్ చీరలు కట్టుకోవడం వంటివి అతని అహంకారాన్ని దెబ్బతీసేవి. తన సోషల్ సర్కిల్‌లో లలితను పరిచయం చేయడానికి అతను సిగ్గుపడేవాడు. ఆఫీసులో హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తూ, ఇంట్లో ఒక పల్లెటూరి అమ్మాయితో జీవితాన్ని పంచుకోవడం తన గ్రేడ్‌కు తక్కువ అని అతను బలంగా నమ్మాడు.
ఆమె అమాయకత్వాన్ని చేతకానితనంగా భావించి, ప్రతి చిన్న విషయానికి విమర్శిస్తూ ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవాడు. ఆమె చేసే ప్రతీ పనిలో తప్పులు వెతకడం అతనికి అలవాటుగా మారింది. లలిత తనను ఒక పార్ట్‌నర్‌గా కాకుండా తన సేవలు చేసే ఒక అసిస్టెంట్‌గా చూడాలని అతను ఆశించేవాడు. ఈ అసమానతల వల్ల వారి మధ్య మానసిక దూరం రోజురోజుకూ పెరిగిపోసాగింది.
పెళ్లయిన మొదటి రోజు నుండే అభిషేక్ లలితను ప్రతి విషయంలోనూ కించపరచడం మొదలుపెట్టాడు. ఆమె కట్టుకునే చీరలు, ఆమె మాట్లాడే యాస, ఆమె చేసే వంటలు ప్రతిదీ అతనికి నాసిరకంగా కనిపించేవి. ఆఫీసులో ఉండే ఒత్తిడిని, కోపాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆమెపై అరిచేవాడు. "నీకు లోకం తెలియదు, నువ్వు అసలు నా స్థాయికి తగవు" అని ముఖం మీదే అవమానించేవాడు. ఆఫీసు పార్టీలకు లేదా మిత్రుల గెట్-టు-గెదర్ ప్రోగ్రామ్స్‌కు ఆమెను తీసుకెళ్లడానికి ఇష్టపడేవాడు కాదు.
పొరపాటున ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే, ఆమెను లోపలి గదిలో ఉండమని ఆజ్ఞాపించేవాడు. లలిత ఎంత ఓపికగా ఉన్నా, అతని అగ్రెసివ్ మనస్తత్వం వల్ల ఆ ఇల్లు ఆమెకు ఒక బందీఖానాలా మారింది. అభిషేక్ మాటలతో చేసే మానసిక గాయాలు ఆమెను నిలువునా దహించేవి.
ఒకరోజు అభిషేక్ కోపంలో లలితను "నీలాంటి గొర్రెతో నా జీవితం వృధా అయిపోతోంది, నీకంటే ఆఫీసులో పనిచేసే నా జూనియర్సే ఎంతో నయం" అని అతి దారుణంగా దూషించాడు. ఈ అవమానాలు కేవలం మాటలకే పరిమితం కాలేదు; ఆమె చేసే ప్రతి చిన్న పొరపాటును భూతద్దంలో చూపిస్తూ అందరిముందు చిన్నబుచ్చేవాడు.
ఒకసారి ఆమె వంటలో ఉప్పు తక్కువైందని డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ విసిరికొట్టి, ఆమె సంస్కారాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. అదనంగా, తన ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ భార్యలతో ఆమెను పోలుస్తూ, ఆమె అలంకరణ పట్ల అసభ్యకరమైన కామెంట్స్ చేసేవాడు. ఆమె చదువుకున్న విద్యాసంస్థల గురించి, ఆమె పెరిగిన వాతావరణం గురించి హేళన చేస్తూ మానసిక దాడి చేసేవాడు. తన మనసు పడుతున్న వేదనను చెప్పుకోవడానికి ప్రయత్నించినా, అతను నోరు మూయించి ఆమె ఉనికినే అవమానించేవాడు.
చివరకు అతని నిరంతర చిత్రహింసలను, క్రూరమైన అవమానాలను భరించలేక, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి లలిత ఎవరికీ చెప్పకుండా, తన కళ్లలో నీళ్లతో పుట్టింటికి వెళ్లిపోయింది.
లలిత వెళ్ళిపోయిన తర్వాత అభిషేక్ మొదట ఎంతో సంతోషించాడు. తనకు ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ లభించిందని, ఇంట్లో తనను అడిగేవాడు లేడని విర్రవీగాడు. ఆమెకు త్వరలోనే విడాకులు ఇచ్చి, తన స్థాయికి తగ్గ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు.
కానీ విధి అతని పట్ల మరోలా ఉంది. అభిషేక్ తన ఆఫీసులో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ సక్సెస్ మీట్ నిర్వహించాడు. ఆ వేడుకలో మద్యం మత్తులో తన సహచరులతో మాట్లాడుతూ, తన భార్యను ఎంత నీచంగా చూసేవాడో, ఆమెను ఎలా భయపెట్టేవాడో, ఇప్పుడు ఆమెను వదిలించుకుని ఎంత సంతోషంగా ఉన్నాడో గర్వంగా చెప్పుకున్నాడు. అతని ప్రగల్భాలు విన్న తోటి ఉద్యోగులు విస్తుపోయారు.
ముఖ్యంగా అతని కింద పనిచేసే మహిళా ఉద్యోగులు అతని పట్ల తీవ్ర అసహ్యం వ్యక్తం చేశారు. సమాజంలో గొప్ప స్థాయి ఉన్న వ్యక్తి, ఇంట్లో ఒక మహిళ పట్ల ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తాడో అని అందరూ అతడిని అసహ్యించుకున్నారు. అతను తన భార్యను అవమానించిన తీరును ఒక విజయంగా అభివర్ణించడం చూసి అందరూ షాక్ తిన్నారు.
అతని మాటల్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోగా, ఒక అమాయకపు ప్రాణాన్ని మానసిక హింసకు గురిచేసినందుకు అతను గర్వపడటం ఆఫీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. అతని అహంకారం ఎంత స్థాయికి చేరిందంటే, తన వ్యక్తిగత వైఫల్యాలను కూడా గొప్పగా ప్రదర్శించుకున్నాడు. ఆఫీసులో ఎంతో గౌరవంగా చూసే సీనియర్ మేనేజర్ కూడా అతని నీచమైన మనస్తత్వాన్ని చూసి అసహ్యించుకున్నారు.
అభిషేక్ తన మాటల ద్వారా తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నాడని అక్కడి వారు గుసగుసలాడుకున్నారు. ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించినా, మనిషిగా అతను ఎంత దిగజారిపోయాడో ఆ రాత్రి అందరికీ అర్థమైంది. అతడి ప్రవర్తన వల్ల ఆఫీస్ వాతావరణమే కలుషితమైందని భావించిన తోటి ఉద్యోగులు, అతడిని ఒక సామాజిక వెలివేతకు గురిచేయడం ప్రారంభించారు.
ఆఫీసులో ఈ వార్త దావానంలా వ్యాపించింది. అభిషేక్‌ను ఒక మిస్‌బిహేవియర్ మరియు ఉమెన్ హేటర్‌గా ముద్ర వేశారు. అతని ప్రొఫెషనలిజం వెనుక ఉన్న అసలు రంగు బయటపడటంతో అభిషేక్ ఒంటరివాడయ్యాడు. మేనేజ్‌మెంట్ కూడా అతని ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి, ఒక సున్నితమైన ప్రాజెక్ట్ నుండి అతడిని తొలగించింది.
ఎవరూ అతనితో మాట్లాడటానికి గానీ, లంచ్ చేయడానికి గానీ ఇష్టపడేవారు కాదు. ఆఫీసులో ప్రతి ఒక్కరూ అతడిని చూసి తల తిప్పుకోవడం చూసి అభిషేక్‌కు తన తప్పు అర్థం కావడం మొదలైంది. కేవలం ఆఫీసులోనే కాకుండా, సమాజంలో కూడా అతడి పట్ల ధోరణి పూర్తిగా మారిపోయింది.
అపార్ట్‌మెంట్ వాసులు అతడిని ఒక అహంకారిగా చూస్తూ పలకరించడం మానేశారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, తన కోసం లలితను కోడలిగా తెచ్చుకున్న అతని తల్లిదండ్రులు కూడా అభిషేక్ ప్రవర్తన తెలుసుకుని తీవ్రంగా కలత చెందారు. మంచి మనసున్న అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు, నీలాంటి సంస్కారం లేని కొడుకు మాకు వద్దు అని తెగేసి చెప్పి, అతనితో మాట్లాడటం పూర్తిగా మానేశారు. కన్నవారు కూడా తనను ఛీత్కరించుకోవడంతో అభిషేక్ మానసికంగా కుంగిపోయాడు. తన అహంకారం తనను అందరికీ దూరం చేసిందని, తన చుట్టూ ఉన్న ప్రపంచం అతడిని ఒక దోషిలా చూస్తోందని గ్రహించాడు.
సామాజిక గౌరవం మరియు కుటుంబ బంధం రెండింటినీ కోల్పోయిన అతనికి, తన తప్పు ఎంత హిమాలయమంతటో అర్థమైంది. తను సాధించిన ఈ కెరీర్, హోదా, డబ్బు ఏవీ తనకి మనశ్శాంతిని ఇవ్వలేదని గ్రహించాడు. ఒకప్పుడు అందరూ తన టెక్నికల్ స్కిల్స్ చూసి గౌరవించేవారని, కానీ ఇప్పుడు తన వ్యక్తిత్వం వల్ల ఛీత్కరించుకుంటున్నారని తెలిసినప్పుడు అతని అహంకారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రేమ లేని గృహం కేవలం నాలుగు గోడల కట్టడం మాత్రమే అన్న మాట అతనికి గుర్తుకు వచ్చింది.
సాటి మనిషిని, అందునా తనను నమ్మి వచ్చిన భార్యను గౌరవించని వాడికి సమాజంలో ఎటువంటి స్థానం ఉండదని అతనికి అర్థమైంది. ఇంటికి వెళ్లినా అక్కడ లలిత నవ్వులు లేని శూన్యం అతడిని భయపెట్టింది. నిశ్శబ్దంగా ఉన్న ఆ నాలుగు గోడల మధ్య తన గతం అతడిని వేటాడింది. లలిత పల్లెటూరి పద్ధతులే తన ఇంటికి వెలుగునిచ్చాయని, తను చేసిన అవమానాలు ఎంతటి క్రూరమైనవో తలుచుకుని అభిషేక్ తనలో తాను కుమిలిపోయాడు.
తన కొలీగ్స్ వద్ద మర్యాద కోల్పోవడం కంటే, లలిత వంటి స్వచ్ఛమైన మనసున్న వ్యక్తిని కోల్పోవడం అతిపెద్ద నష్టమని అతనికి స్పష్టమైంది. తన జీవితంలోని అసలైన సంతోషం ల్యాప్‌టాప్ స్క్రీన్‌లలోనో లేదా విదేశీ ప్రాజెక్టులలోనో లేదని, అది తన భార్య ప్రేమలో ఉందని అతను మొదటిసారిగా గుర్తించాడు.
తాను ఒక్కడైపోయిన తర్వాత లలిత చేసిన సేవలు, ఆమె చూపించిన నిస్వార్థమైన ప్రేమ ఒక్కొక్కటిగా అభిషేక్‌కు గుర్తుకు వచ్చాయి. తను ఆఫీసు నుండి అలసిపోయి వస్తే ఆమె ఎంత ఆర్తిగా పలకరించేదో, తను ఎంత అరిచినా ఆమె ఎదురు సమాధానం చెప్పకుండా ఎంత బాధను దిగమింగుకుందో గుర్తు చేసుకుని అభిషేక్ కుమిలిపోయాడు. తన అహంకారం తన కళ్లను కప్పేసిందని, మనిషికి కావాల్సింది హృదయం తప్ప కేవలం హోదా కాదని అతను అర్థం చేసుకున్నాడు. "భార్య భర్తల అనుబంధం ఒకరి లోపాలను మరొకరు సరిదిద్దుకుంటూ సాగే నిరంతర ప్రయాణం" అని గ్రహించాడు.
తన తప్పును సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్న అభిషేక్, నేరుగా లలిత ఉన్న గ్రామానికి వెళ్లాడు. అక్కడ లలిత కళ్ళలో తన కోసం ఇంకా ఉన్న ప్రేమని చూసి అతని అహంకారం నీరైపోయింది. ఆమె కాళ్ల దగ్గర కూర్చుని కన్నీళ్లతో క్షమాపణ కోరాడు. ఒకప్పుడు తను హేళన చేసిన ఆమె పల్లెటూరి ఇల్లు ఇప్పుడు అతనికి ప్రశాంతతను ఇచ్చే దేవాలయంలా కనిపించింది.
ఆమె రూపంలోని స్వచ్ఛత, తన రాక కోసం ఆమె కళ్లలో మెరిసిన ఆశ అతడి హృదయాన్ని ద్రవింపజేశాయి. తాను చేసిన ప్రతి గాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, ఆమెను మళ్ళీ గౌరవప్రదంగా ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. లలిత తండ్రి ముందు తల వంచుకుని, తన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నానని ఒప్పుకున్నాడు. కేవలం భార్యగానే కాకుండా, ఒక మనిషిగా ఆమెకు ఇవ్వాల్సిన కనీస మర్యాదను విస్మరించినందుకు తనను తాను నిందించుకున్నాడు. ఆమె లేని తన జీవితం అర్థరహితమని, తన సంతోషం ఆమె చిరునవ్వులోనే ఉందని గ్రహించి, ఆమెను తన జీవితంలోకి మళ్ళీ ఆహ్వానించాడు.
లలిత తిరిగి వచ్చాక తన ఆఫీస్ కొలీగ్స్ అందరికీ ఇంట్లో ఒక మంచి డిన్నర్ ఏర్పాటు చేసాడు. ఆ సందర్భంలో తన సహచరులతో తన మనసులోని భావాలను ఎంతో హృద్యంగా పంచుకున్నాడు.
"వృత్తిలో మనం సాధించే విజయాలు మనకు కేవలం డబ్బును ఇస్తాయి, కానీ ఇంట్లో మనం మన భార్యకు ఇచ్చే గౌరవమే మన అసలైన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. లలిత చదువు నాకంటే తక్కువ కావచ్చు, కానీ ఆమె సంస్కారం నా అహంకారం కంటే ఎంతో గొప్పది. భార్యను అవమానించేవాడు ఎప్పటికీ గొప్ప ప్రొఫెషనల్ కాలేడు. మనిషికి వినయం, ఎదుటివారిని గౌరవించే గుణం లేకపోతే ఆ జీవితం శూన్యం. భార్యాభర్తల సంబంధం ఒక పవిత్రమైన యజ్ఞం వంటిది, దాన్ని పరస్పర విశ్వాసం మరియు గౌరవంతో కాపాడుకోవాలి. ఇకపై నా జీవితంలో నా భార్య గౌరవమే నా మొదటి ప్రాధాన్యత. మన ప్రొఫెషనల్ హోదా మన ఇంటి గడప వరకే, లోపల మనం కేవలం ఒకరికొకరం తోడుగా ఉండే మనుషులం మాత్రమేనని నేను ఆలస్యంగానైనా తెలుసుకున్నాను. ఆ మాటలు విన్న అందరూ ఎంతో సంతోషంగా చప్పట్లు కొట్టి భార్యాభర్తల నోట్లో బలవంతంగా స్వీట్స్ కుక్కారు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: