Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 52
జాకీ దొరికిపోయాడని అభిజిత్ కి ఫోన్ చేసిన జనార్ధన్ తో ముకుల్ మాట్లాడుతూ నువ్వు కాసేపు మంచి సెక్యూరిటీ అధికారి గా మారి అక్కడికి వేళ్ళు అని చెప్పాడు.
*****************
సుమతిని చేతుల్లోకి తీసుకుని గదిలోకి తీసుకు వెళుతున్న అభీర్ వైపు చూసి "ఏవండీ! పాపని ఆ అబ్బాయి తీసుకు వెళుతున్నాడు ఆపండి. తొందరగా హాస్పిటల్ కి తీసుకు వెళదాము." అని కంగారుగా చెప్పింది గీత.
ఆ మాట విని కళ్ళు తుడుచుకుని భార్యని పైకి లేపి "కంగారు పడకు సుమతికి ఏమీ అవ్వదు క్షేమంగా బయటికి వస్తుంది. నేను చాలా తప్పులు చేశాను కానీ ఆ దేవుడు నన్ను క్షమించాడు." అని ఫోన్ తీసి జనార్ధన కి కాల్ చేశాడు మురళీజోషి.
ఫోన్ రింగ్ అవడం చూసి 'జోషి సార్ కాల్ చేస్తున్నాడు ఏమిటి?' అని కంగారుగా లిఫ్ట్ చేసి "సార్ చెప్పండి." అని అడిగాడు జనార్ధన్.
"ఎక్కడ ఉన్నావ్?" అని అడిగాడు మురళి జోషి.
"సార్! నేను ఇంటి దగ్గరే ఉన్నాను." అని చెప్పాడు జనార్ధన్.
"సరే! అర్జెంటుగా మా ఇంటి దగ్గరికిరా..! మనం చేసిన తప్పులు సరిదిద్దుకుందాము, లేకపోతే శివమణికి పట్టిన గతే మనకి పడుతుంది." అని చెప్పాడు మురళి జోషి.
"ఓకే సర్! ఇప్పుడే బయలుదేరుతున్నాను." అని ఫోన్ పెట్టేసి వెంటనే ముకుల్ కి ఫోన్ చేశాడు జనార్ధన్.
ఫోన్ రింగ్ అవడం చూసి "వీడేంటి అప్పుడే వెళ్ళిపోయాడా?" అని లిఫ్ట్ చేసి "చెప్పు జనార్ధన్!" అని అడిగాడు ముకుల్.
"సార్! నాకు మురళి జోషి ఫోన్ చేశాడు సడన్‌గా అప్రూవల్ గా మారదాము అని చెబుతున్నాడు, అక్కడికి వెళ్లి మీకు కాల్ చేస్తాను ఈ లోపు ఏం ప్లాన్ చేస్తారో ఆలోచించుకోండి." అని చెప్పాడు జనార్ధన్.
"ఓకే!" అని ఫోన్ పెట్టి ఆలోచిస్తూ ఉన్నాడు ముకుల్.
జనార్దన్ తో ఫోన్లో మాట్లాడి ఆలోచిస్తున్న ముకూల్ వైపు చూసి "అంకుల్ మన మనుషులు తో కలిసి వెళ్లి అందర్నీ చంపి జాకిని తీసుకోవద్దము, ఒక దెబ్బతో పని అయిపోతుంది." అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని "జాకిని పట్టుకుంది అభీర్ కాదు, అంటే, అభీర్ మనుషులు ఇంకా మిగిలే ఉన్నారు, మనం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఈసారికి నేను చెప్పినట్లు చేయండి.
మురళి జోషి కూతురు చచ్చింది కాబట్టి, ఇంక వాడు మన మాట వినడు, అక్కడి జనర్దన్ నుంచి ఫోన్ రావడంతోనే ఇంక ఈ గొడవలన్నీ వదిలేస్తున్నాము జాకిని తీసుకుని వచ్చి పంచరత్నాలు తీసుకు వెళ్ళమని అభీర్ కి చెబుదాము." అని చెప్పాడు ముకుల్.
"డాడ్! వాడు గనక ఇక్కడికి వచ్చి నా చేతికి ఉన్నా పంచరత్నాలని చూసాడు అంటే, మనం ఆపలేము." అని కంగారుగా చెప్పాడు గోకుల్.
"ఆ విషయం నాకు కూడా తెలుసు! అందుకే జాకిని తీసుకుని అభీర్ అక్కడి నుంచి బయలుదేరగానే నువ్వు ఇక్కడి నుంచి మిచల్ తో కలిసి మురళి జోషి ఇంటికి వెళ్లి వాడి ఫ్యామిలీని అక్కడ ఉన్న వాడి మనుషులను లేపేయ్!" అని చెప్పాడు ముకుల్.
"మరి ఇక్కడికి వచ్చిన అభీర్ సంగతి!" అని కంగారుగా అడిగాడు అభిజిత్.
"ఆ అభీర్ తో ఎలా డీల్ చేయాలో, వాడిని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు! చట్టన్ని చంకలో పెట్టుకుని ఆడుకునే ఒక లాయర్ ఉన్నాడు, అతను వాడి సంగతి చూసుకుంటాడు." అని చెప్పి ఫోన్ తీసి కాల్ చేశాడు ముకుల్.
ఫోన్ లిఫ్ట్ చేసి "నమస్తే సార్! మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను, నన్ను ఎక్కడ కలవమంటారు?" అని వినయంగా అడిగాడు హిర్వాణి.
"నువ్వు నన్ను కలవవలసిన పనిలేదు, నీ ఫీజు నీ ఇంటి దగ్గర ఉంటుంది. నువ్వు చేయవలసింది ఏమిటి అంటే కాసేపట్లో ఎన్ఐఏ ఆఫీసర్ మురళి జోషి ని హత్య చేస్తున్నారు.
ఆ హంతకుడిని ఎక్కడ ఉన్నాడో ఆఫీసర్ జనార్ధన్ చూపిస్తాడు, వాడిని అరెస్టు చేసి జైల్లో పెట్టి బయటకు రాకుండా చేయాలి, వాడు ఎన్ని సంవత్సరాలు లోపల ఉంటే నువ్వు అన్ని కోట్లు నువ్వు సంపాదిస్తావు." అని చెప్పాడు ముకుల్.
"ఓకే సార్! నా టాలెంట్ ఏంటో మీకు చూపిస్తాను, మీ నుంచి ఫోన్ రావడంతోనే సెక్యూరిటీ ఆఫీసర్ల్ని అక్కడికి పంపిస్తాను వాడు బతికున్నంత కాలం జైల్లోనే ఉండే విధంగా చేస్తాను వాడి తరపున వాదించడానికి ఏ లాయర్ కూడా ముందుకు రాడు." అని చెప్పాడు హిర్వాణి.
"గుడ్! ఆ టాలెంట్ నీ దగ్గర ఉందని నాకు తెలిసి నీకు ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చాను." అని ఫోన్ పెట్టేసాడు ముకుల్.
"అంటే అంకుల్! ఇప్పుడు ఆ అభీర్ ని జైల్లో పెట్టేస్తారా? వాడికి 16 సంవత్సరాలు రెండేళ్లలో బయటకు వచ్చేస్తాడు." అని చెప్పాడు అభిజిత్.
"16 సంవత్సరాలు వాడిని 18 సంవత్సరాల కింద చూపించలేమా? నువ్వు ఆ మాత్రం మేనేజ్ చేయలేవా?" అని నవ్వుతూ అడిగాడు ముకుల్.
ఆ మాటకి నవ్వుతూ "అది చాలా ఈజీ అంకుల్! ఆ విషయం నేను చూసుకుంటాను." అని చెప్పాడు అభిజిత్.
**********************
కాసేపటికి గది తలుపులు తెరుచుకోవడంతో నవ్వుతూ బయటికి వచ్చిన సుమతిని చూసి సంతోషంగా వెళ్లి గట్టిగా పట్టుకుని ఒంటి మీద చూస్తూ "గాయం ఏమైపోయింది? నువ్వు బానే ఉన్నావు కదా!" అని కంగారుగా చూస్తూ అడిగింది గీత.
"నేను బానే ఉన్నాను మమ్మీ నాకు తగ్గిపోయింది." అని నవ్వుతూ చెప్పింది సుమతి.
దగ్గరికి వచ్చి కూతుర్ని, భార్యని గట్టిగా పట్టుకుని "నేను ముందే చెప్పా కదా! ఆ దేవుడు మనల్ని కరుణించాడు. మీరు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు నేను చేయవలసిన పని చాలా ఉంది." అని అభీర్ వైపు చూసి,
"నేను చేసిన పని క్షమించరానిది నాకు శిక్షపడేలోపు మీకు సహాయం చేస్తాను, నా అసిస్టెంట్ వస్తున్నాడు వాళ్ల మీద కేసు ఫైల్ చేస్తాను, జరిగిన విషయం ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను." అని చెప్పాడు మురళిజోషి.
"మీరు ఏదైనా చేయండి కానీ పంచరత్నాలు నా చేతికి వచ్చిన తర్వాత మాత్రమే!' అని చెప్పి బైరి వాళ్ళ వైపు చూసి "మీరు ఎవరికీ కనబడకూడదు కొంచెం దూరంలో ఉండండి." అని చెప్పాడు అభీర్.
"సరే!" అని నలుగురిని తీసుకుని అక్కడ నుంచి దూరంగా వెళ్ళాడు బైరి.
స్పృహ తప్పిన జాకిని మెడ పట్టుకుని పైకి లేపి "నాయకుడా! వీడిని చంపేస్తాను." అని కోపంగా చూస్తూ అడిగాడు సహదేవుడు.
"నేను ముందే చెప్పాను కదా! పంచరత్నాలు మన చేతికి రాకుండా వాళ్ళలో ఎవరు చావకూడదు." అని చెప్పాడు అభీర్.
అంతలో అక్కడికి హడావుడిగా వస్తున్న జనార్దన్ ని చూసి జాకిని ఒక గదిలో పెట్టి "నాయకుడా! వీడి మొహం చూస్తుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు." అని చెప్పాడు సహదేవుడు.
"ఈ పరిస్థితి అటువంటిది ఎవరిని చూసిన అలాగే అనిపిస్తుంది. కానీ నమ్మక తప్పదు!" అని చెప్పి జనార్ధన్ వైపు చూస్తూ ఉన్నాడు అభీర్.
అక్కడకు వచ్చి "సార్! చెప్పండి ఇప్పుడు మీరు ఏది చెబితే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను." అని చెప్పాడు జనర్ధన్.
"అభిజిత్ కి కాల్ చేసి పంచరత్నాలు తీసుకుని ఇక్కడ రమ్మను లేకపోతే జరిగింది మొత్తం మీడియాకి చెప్పి కేసు ఫైల్ చేద్దాము." అని చెప్పాడు మురళీజోషి.
"ఓకే సార్! మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నా మాట్లాడకుండా ఉన్నాను, ఇప్పుడు డిపార్ట్మెంట్ పవర్ ఏమిటో చూపిద్దాము." అని ఫోన్ తీసి ముకుల్ కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసాడు జనార్ధన్.
ఫోన్ లిఫ్ట్ చేసి "ఏంటి జనార్దన్? ఈ టైంలో కాల్ చేసావు?" అని అడిగాడు ముకూల్.
"మీ మనుషులు మా సార్ వాళ్ళ అమ్మాయిని చంపేశారు ఇకనుంచి మా తరఫున మీకు ఎటువంటి హెల్ప్ ఉండదు. మర్యాదగా అడవిలో తీసుకున్న వస్తువులు మొత్తం మాకు అప్పగించి లొంగిపొండి. లేకపోతే మేము ఏమి చేయాగాలమో మీకు బాగా తెలుసు!" అని చెప్పాడు జనార్ధన్.
"మీ దగ్గర జాకీ ఉన్నాడని నాకు తెలుసు! అతన్ని తీసుకుని అభీర్ నా గెస్ట్ హౌస్ కి రమ్మను, అతని వస్తువులు అతనికి ఇస్తాము, మేము కూడా లండన్ కి తిరిగి వెళ్ళిపోతాము, ఆ శివమణి వల్లే ఇదంతా జరిగింది." అని చెప్పాడు ముకుల్.
ఫోన్లో చెప్పింది విని మురళి జోషి వైపు చూశాడు జనార్ధన్.
"సరే! జాకీ ని తీసుకుని నేను అక్కడికి వెళ్తాను." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని "సరే! అభీర్, జాకీ తీసుకుని వస్తున్నాడు అతనికి కావలసినవి ఇచ్చి పంపించండి." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు జనర్దన్.
"నాయకుడా! వాళ్ళ మాటలు నమ్మకూడదు నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదం!" అని కంగారుగా చెప్పాడు సహదేవుడు.
"నాకు ఏమీ అవ్వదు." అని జాకీ మొహం మీద నీళ్లు కొట్టి నిద్రలేపి అక్కడ నుంచి గెస్ట్ హౌస్ కి బయలుదేరి దూరంగా ఉన్న తన వాళ్ళ వైపు చూసి "ఇక్కడే ఉండండి." అని సైగ చేసాడు అభీర్.
అక్కడినుంచి అభీర్ బయలుదేరగానే ముకుల్ కి మెసేజ్ చేశాడు జనార్ధన్.
మెసేజ్ చూసి "గోకుల్! మిచల్ ని తీసుకుని బయలుదేరు అక్కడ ఒక్కడు కూడా బతికి ఉండడానికి వీల్లేదు, మేము బేరా బయలుదేరుతాము నువ్వు త్వరగా పని ముగించుకుని అక్కడికి వచ్చేయ్!" అని చెప్పాడు ముకుల్.
"ఓకే డాడ్!" అని తన చేతి వేళ్ళకి ఉన్న పంచరత్నాల ఉంగరాలు చూసుకొని మిచల్ మనుషులతో కలిసి మురళి జోషి ఇంటికి బయలుదేరాడు గోకుల్.
అభిజిత్, సర్పరాజ్ లతో కలిసి అక్కడ నుంచి బైరాకి బయలుదేరి కార్ లో వెళుతూ జాకీ కి ఫోన్ చేశాడు ముకుల్.
ఫోన్ రింగ్ అవడం చూసి అభీర్ వైపు చూసి "ముకుల్ సర్ కాల్ చేస్తున్నారు." అని చెప్పాడు జాకి.
"సరే! మాట్లాడు అక్కడికే వస్తున్నాము అని చెప్పు!" అన్నాడు అభీర్.
లిప్ట్ చేసి "సార్! అభీర్ తో కలిసి నేను గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తున్నాను వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు." అని చెప్పాడు జాకీ.
"మీరు గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయండి. నేను ఆ పంచరత్వాలు, వస్తువులు తీసుకుని అక్కడికి వస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముకుల్.
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 451
Threads: 1
Likes Received: 643 in 302 posts
Likes Given: 94
Joined: Nov 2018
Reputation:
11
అద్భుతం అత్యద్భుతం మహాద్భుతం..... స్టోరీని చాలా అద్భుతంగా రాశారు....
ఒక్కొక్క అప్డేట్ ఒక్కొక్క ఆణిముత్యం లా ఉంది....
ఈ రచన శైలి కైతే ఫిదా అయిపోయా
•
Posts: 451
Threads: 1
Likes Received: 643 in 302 posts
Likes Given: 94
Joined: Nov 2018
Reputation:
11
(31-01-2026, 10:44 AM)SivaSai Wrote: Don't Worry Yesterday Begumpet Air Show Chusi Room Ki Vache Sareki Full Tired Ayyanuu So Update Ivvaledu
Ippudu Update Istunnaaaaaaaa...........
E Roju Kuda Air Show Undi Ani Talk Unte Compulsory Ga Veltanuu
లాస్ట్ రోజున సర్ బాగుంటది.... నేను కూడా ఇప్పుడే బయలుదేరాను సార్...
చూద్దాం ఒకసారి ఎన్ని ఫ్లైట్ గా ఉంటాయో....
•
Posts: 271
Threads: 0
Likes Received: 194 in 133 posts
Likes Given: 1,186
Joined: Mar 2022
Reputation:
5
why abhir is prison ani suspense antha reveal aindi.
•
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
(31-01-2026, 10:44 AM)SivaSai Wrote: Don't Worry Yesterday Begumpet Air Show Chusi Room Ki Vache Sareki Full Tired Ayyanuu So Update Ivvaledu
Ippudu Update Istunnaaaaaaaa...........
E Roju Kuda Air Show Undi Ani Talk Unte Compulsory Ga Veltanuu
Sorry and Thanks bro.
Maa kosam .. or ee story kosam nee dedication choostunte.. you are awesome Siva garu
Didn't know there is an airshow in Hyd. I'm not from there, so never knew it!!
Hope you had a great time at the air show.
Try posting some pics of the event!!
Just for a small difference!
•
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 53
జాకిని తీసుకుని గెస్ట్ హౌస్ దగ్గరికి బయలుదేరాడు అభీర్,
జనార్దన్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ చూసి మిచల్ గ్యాంగ్ తో కలిసి మురళి జోషి ఇంటికి బయలుదేరాడు గోకుల్.
*******************
మిచల్ మనుషులతో కలిసి జోషి ఇంటి దగ్గరకు వచ్చి జనార్దన్ కి ఫోన్ చేశాడు గోకుల్.
ఫోన్ రింగ్ అవడం చూసి లిఫ్ట్ చేసి మాట్లాడి మురళి జోషి వైపు చూసి "ఎందుకైనా మంచిది అని మన ఆఫీసర్స్ ని ఇక్కడికి రమ్మన్నాను, మీరు లోపలికి వెళ్ళండి వదిన బాగా భయపడినట్లు ఉంది." అని చెప్పాడు జనార్ధన్.
"సరే! అని లోపలికి వెళుతూ సహదేవుడి వైపు చూసి నువ్వు కూడా లోపలికి రా.!" అని చెప్పాడు మురళి జోషి.
"మీరు వెళ్ళండి ఆఫీసర్లు వచ్చిన తర్వాత లోపలికి వస్తాను." అని చెప్పి కార్ లో మిచల్ మనుషులు దిగడం చూసి "మీ ఆఫీసర్ లేనా?" అని జనర్దన్ ని అడిగాడు సహదేవుడు.
"అవును! నువ్వు కూడా లోపలికి వేళ్ళు కాస్త వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది." అని చెప్పాడు జనార్ధన్.
"సరే!" అని దూరంగా ఉన్న రాజన్ వాళ్ళ వైపు చూసి "మనవాళ్లే!" అని సైగ చేసి ఇంటి లోపలికి వెళ్ళాడు సహదేవుడు.
ఇద్దరి కూతుర్లను దగ్గరకి తీసుకుని భార్య వైపు చూసి "భయపడకండి ఆఫీసర్స్ వచ్చారు, సహదేవుడు కూడా ఇక్కడే ఉన్నాడు." అని చెప్పాడు మురళిజోషి.
కంగారు పడుతున్న గీత వాళ్ళ వైపు చూసి "మా నాయకుడు పోసిన ప్రాణం! ఏమీ అవ్వదు మీరు ప్రశాంతంగా ఉండండి." అని చెప్పాడు సహదేవుడు.
అంతలో గోకుల్ వస్తున్న కారు రావడం చూసి దగ్గరికి వెళ్లి "సార్! మురళి జోషి ఫ్యామిలీ, సహదేవుడు ఇంటి లోపలే ఉన్నారు మిస్ అయితే మన పని క్లోజ్!" అని చెప్పాడు జనర్దన్.
"నో ప్రాబ్లం!" అని మిచల్ వైపు చూసి "లోపలకి ఎంటర్ అవ్వడం తోనే సహదేవుడిని షూట్ చెయ్, మురళి జోషి దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందేమో చూసిన తర్వాత వాడి సంగతి చూద్దాము." అని చెప్పి జనర్దన్ తో కలిసి ఇంటి లోపలికి వెళ్ళాడు గోకుల్.
లోపలికి వస్తున్నా గోకుల్ వాళ్ళను చూసి "జనార్ధన్ నువ్వు మోసం చేస్తావని అనుకోలేదు." అని కంగారుగా భార్య పిల్లల్ని ఒక గదిలోకి పంపించాడు మురళి జోషి.
ఆ మాట విని కోపంతో మీదకి వస్తున్న సహదేవుడిని చూసి షూట్ చేశాడు మిచల్.
గన్ సౌండ్ సహదేవుడు అరుపువిని ఇంటి దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చారు రాజన్ వాళ్ళ ఐదుగురు.
బుల్లెట్స్ తగలడంతో కింద పడిపోయి రక్తం మడుగులో ఉన్న సహదేవుడు వైపు చూసి కంగారుగా గోకుల్ దగ్గరికి వెళ్లి "ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి ఫ్యామిలీతో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను." అని రిక్వెస్ట్ గా అడిగాడు మురళిజోషి.
"నా చేతికి ఇప్పుడే పంచరత్నాలు పెట్టుకున్నాను వీటికి రక్తాభిషేకం జరగాలి." అని జేబులో నుంచి కత్తి తీసి మురళి జోషి గుండెల్లో పొడిచాడు గోకుల్.
గుండెల్లో కత్తి దిగడంతో భార్య వైపు చూసి "పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి త్వరగా పారిపో!" అని గట్టిగా అరిచాడు మురళీజోషి.
ఇద్దరు పిల్లల్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉన్న గీత వైపు చూసి గన్ ఎయిమ్ చేసారు మిచల్, జనార్దన్ లు.
చనిపోయిన ఇద్దరి వైపు చూసి ఫోన్ తీసి ముకుల్ కి కాల్ చేసి "డాడ్! ఇక్కడ పని పూర్తి అయింది లాయర్ కి కాల్ చేసి చెప్పు, నేను కూడా బైరి బయలుదేరుతున్నాను." అని చెప్పాడు ముకుల్.
"గుడ్! త్వరగా బయలుదేరు." అని చెప్పి ఫోన్ పెట్టేసి పక్కన ఉన్న ఆబిజిత్ వైపు చూసి "జాకీ కి కాల్ చేసి జోషి ఇంటి దగ్గర గొడవ జరుగుతుంది అని చెప్పు, విషయం తెలిసిన వెంటనే అభీర్ అక్కడికి వెళతాడు." అని చెప్పి హిర్వాణి కి కాల్ చేసి పని పూర్తయింది సెక్యూరిటీ ఆఫీసర్లు పంపించండి." అని చెప్పాడు ముకుల్.
"ఓకే సార్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకుని మురళి జోషి ఇంటికి బయలుదేరాడు హిర్వాణి.
గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న జాకీ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు.
ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే "జాకీ! మురళి జోషి ఇంటి దగ్గర గొడవ జరుగుతుందంట మీరు గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేసారు కదా!" అని అడిగాడు అభిజిత్.
"అవును భయ్యా! మేము గెస్ట్ హౌస్ దగ్గరే ఉన్నాము." అని చెప్పాడు జాకి.
ఫోన్లో ఆ మాట విని హడావిడిగా అక్కడ నుంచి పరుగెత్తాడు అభీర్.
ఫోన్ లైన్ లో ఉన్న అభిజిత్ తో మాట్లాడుతూ "అన్న! అభీర్ హడావిడిగా వెళ్ళాడు మురళిజోషి ఇంటికి వెళుతున్నాడు అనుకుంటా!" అని చెప్పాడు జాకి.
"సరే! నువ్వు అక్కడి నుంచి బయలుదేరి బైరి వచ్చేసేయ్! మన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది." అని నవ్వుతూ చెప్పి ఫోన్ కట్ చేశాడు అభిజిత్.
**********
అంతలో బయట ఉన్న మిచల్ మనుషుల్ని కొట్టి ఇంటి లోపలికి వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న సహదేవుడిని చూసి కోపంతో మిచల్, జనార్దన్ లని రెండు చేతులతో ఎత్తి దూరంగా గిరాటు వేశాడు బైరి.
కిందపడి లెచి పరిగెడుతూ "సార్! అభీర్ మనుషులు ఇక్కడికి వచ్చినట్లు ఉన్నారు పారిపోదాం పదండి." అని కంగారు వెనుకా వైపు నుంచి బయటికి వెళ్ళాడు జనార్ధన్.
రియా లోపలికి రావడం చూసి భయంతో జనార్దన్ వెనకాలే పారిపోయాడు మిచల్.
సహదేవుడు రక్తపు మడుగులో ఉండడం చూసి కోపంతో గోకుల్ మీదకు ఎగిరి తన చేతిలో ఉన్న కత్తిని మేడలో దింపింది రియా.
అది చూసి భయంతో గట్టిగా అరిచిన గీత వైపు చూసి "మీ భర్తకు తగిన శాస్తి జరిగింది. పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి సుఖంగా బతకండి." అని సహదేవుడిని పట్టుకుని ఏడుస్తూ చెప్పాడు బైరి.
బయట ఉన్న మిచల్ మనుషులని కొట్టి లోపలికి వచ్చి చనిపోయిన మురళి జోషి సహదేవుడిని చూసి మెడ దగ్గర కత్తి దిగి బాధగా అరుస్తున్న గోకుల్ చేతి వేళ్ళకి పంచరత్నాలు కనపడడంతో దగ్గరకు వెళ్లి కత్తితో వేళ్ళు నరికి ఉంగరాలు తీసుకుని
బాధతో అరుస్తున్న గోకుల్ వైపు చూసి "వీడికి మామూలు చావు రాకూడదు ప్రాణం ఉండగానే ఒంటిలో నుంచి రక్తం మొత్తం బయటికి కారిపోవాలి ఆ విధంగా నరకండి." అని కసిగా చెప్పాడు రాజన్.
మిగతా నలుగురు గోకుల్ ని చంపకుండా నరాలు తెంపి సహదేవుడి వైపు చూసి ఏడుస్తూ ఉన్నారు.
అంతలో అక్కడికి వచ్చి చనిపోయిన సహదేవుడని చూసి దగ్గరికి వెళ్లి బాధపడుతూ "నీ మాట వినకుండా వెళ్లాను నిన్ను దూరం చేసుకున్నను." అని గుండెలకి హత్తుకుని ఏడుస్తూ ఉన్నాడు అభీర్.
అంతలో లోపలకి వచ్చి మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి." అని కంగారుగా చెప్పాడు శంకర్.
పంచరత్నాలు అభీర్ చేతిలో పెట్టి "నాయకుడా! మన కొండకి వెళ్దాము పద!" అని చెప్పాడు బైరి.
రక్తంతో తడిసి ఉన్న పంచరత్న ఉంగరాలని చూసి "నా వల్ల మనలో మరొకరి ప్రాణం పోయింది." అని బాధపడుతూ సహదేవుడి శరీరాన్ని భుజాన వేసుకుని అక్కడ్నుంచి తన వాళ్లతో కలిసి వెళ్ళాడు అభీర్.
అభీర్ వాళ్ళు వెళ్లడం దూరం నుంచి చూస్తూ "మిచల్! నువ్వు వాళ్ళకి కనపడకుండా వెనకాలే ఫాలో అవ్వు ఎక్కడికి వెళుతున్నారో మనకి తెలియాలి." అని చెప్పి ఇంట్లోకి వెళ్లి చనిపోయిన గోకుల్ ని చూసి షాక్ అయ్యి కంగారుగా ముకుల్ కి కాల్ చేశాడు జనార్ధన్.
ఫోన్ లిఫ్ట్ చేసి "జనార్ధన్! అక్కడికి అభీర్ వచ్చాడా? వాడిని సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ చేశారా? గోకుల్ బాబు అక్కడ నుంచి బయలుదేరి పోయాడా? " అని అడిగాడు ముకుల్.
"సార్! ఇక్కడ ఒక పొరపాటు జరిగింది. అభీర్ వాళ్ళ మనుషల చేతిలో మన గోకుల్ గారు చనిపోయారు." అని బాధగా చెప్పాడు జనార్ధన్.
"అవునా?" అని ఫోన్ కట్ చేసి హిర్వాణి కి కాల్ చేసాడు ముకుల్.
ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "సార్! టూ మినిట్స్ లో అక్కడ ఉంటాను మీరు టెన్షన్ పడకండి." అని చెప్పాడు హిర్వాణి.
"ఆ ఇంటి దగ్గర నా కొడుకు చనిపోయాడు ఈ కేసులో ఆ విషయం బయటికి రాకూడదు, ఆ బాడీని నా గెస్ట్ హౌస్ దగ్గరికి పంపించే ఏర్పాటు చేయించు." అని డల్ గా చెప్పాడు ముకుల్.
ఆ మాట విని "సారీ సార్! బాబు బాడీ మీ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది. సార్ అక్కడ చనిపోయినట్లు మూడో కంటికి తెలియదు." అని చెప్పాడు హిర్వాణి.
ఫోన్లో మాట్లాడుతున్న ముకుల్ వైపు చూసి "అంకుల్! నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను గోకుల్ ఒక్కడినే అక్కడికి పంపించకండి అని, మీరు నా మాట వినలేదు వెనక్కి వెళ్దాము పదండి." అని బాధపడుతూ చెప్పాడు అభిజిత్.
"నా కొడుకు ఆశ పడ్డ ప్రతిదీ వాడికి ఇస్తూ వస్తున్నాను వాడు చివరిసారిగా ఆశపడ్డా ఈ కొండలు కూడా నాకు కావాలి మీరు వెళ్ళండి. నేను వెనక్కి వెళ్తాను." అని జావీద్ తో పాటు అభిజిత్, సర్పరాజ్ లని పంపించి ఢిల్లీకి బయలుదేరాడు ముకుల్.
*************
మురళి జోషి ఇంటి దగ్గరికి హిర్వాణి సెక్యూరిటీ ఆఫీసర్లు తో రావడం చూసి మిచల్ కి కాల్ చేసి అభీర్ వాళ్ళు ఉన్న ప్లేస్ తెలుసుకుని తీసుకువెళ్లాడు జనార్ధన్
సహదేవుడికి దహన సంస్కారాలు చేయడానికి అభీర్ వాళ్ళు సిద్ధం చేస్తూ ఉండగా సెక్యూరిటీ అధికారి జీప్ లు రావడం చూసి "మనం ఇక్కడ నుంచి త్వరగా వెళ్లిపోవాలి సెక్యూరిటీ ఆఫీసర్లు వస్తున్నారు." అని చెప్పాడు శంకర్.
ఆ మాట విని ఐదుగురు వైపు చూసి "మీరు శంకర్ తో పాటు వెళ్లిపోండి. నేను సహదేవుడి దహన సంస్కారాలు చేసి వస్తాను." అని చెప్పాడు అభీర్.
"అలా అయితే మేము కూడా ఇక్కడే ఉంటాము." అని మొండిగా చెప్పింది రియా.
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 54
సహదేవుడి దహన సంస్కారాలు చేస్తూ ఉండగా అక్కడికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారని తెలిసి రాజన్ వాళ్ళ ఐదుగురుని శంకర్ తో పాటు వెళ్లిపోమని చెప్పాడు అభీర్.
**************
ఆ మాట విని "నాయకుడా! నీతో పాటే మేము ఎక్కడికి వెళ్ళాము." అని మొండిగా చెప్పింది రియా.
"అభీర్ సేన నాయకుడుగా నేను చెబుతున్నాను మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మళ్లీ నేను తిరిగి వస్తాను." అని చెప్పాడు అభీర్.
మాట జవదాట లేక శంకర్ తో కలిసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయారు ఐదుగురు.
అంతలో హిర్వాణి, సెక్యూరిటీ ఆఫీసర్లతో కలిసి అక్కడికి వచ్చి దూరంగా సహదేవుడు చీతి పేరుస్తున్న అభీర్ ని చూపించి "జోషి సార్ ని చంపింది అతనే వెంటనే అరెస్ట్ చేయండి.
తప్పించుకున్నాడు అంటే పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. " అని చెప్పి మిచల్ తో కలిసి మిగతా వాళ్ల కోసం చూస్తూ ఉన్నాడు జనార్ధన్.
అభీర్ ని చుట్టూ ముట్టి పట్టుకుని చేతికి సంకెళ్లు వేసి "ఆఫీసర్ ని చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాము." అని చెప్పాడు ఎస్సై నిరంజన్.
"ఆ ఆఫీసర్ గారిని చంపింది నేను కాదు, ఈ దహన సంస్కారాలు చేసిన తర్వాత మీతో పాటు వస్తాను కావాలంటే ఆయన భార్యని కూడా అడగండి." అని చెప్పాడు అభీర్.
చేతికి సంకెళ్లు ఉండడం చూసి దగ్గరకు వచ్చి ఫోన్ తీసి ముకుల్ కి కాల్ చేసాడు జనర్దన్.
ఫోన్ రింగ్ అవ్వడం చూసి హడావుడిగా లిఫ్ట్ చేసి "ఆ అభీర్ గాడు దొరికాడా?" అని అడిగాడు ముకుల్.
"సార్! దొరికాడు సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు కూడా చేశారు సహదేవుడు దహన సంస్కారాలు చేసి వస్తాను అని చెపుతున్నాడు." అని చెప్పాడు జనార్ధన్.
ఆ మాట విని "స్పీకర్ ఆన్ చెయ్!" అని చెప్పి "హిర్వాణి వాడిని వెంటనే అక్కడి నుంచి తీసుకువెళ్లండి. లేకపోతే తెలివిగా తప్పించుకుంటాడు. " అని చెప్పాడు ముకుల్.
ఫోన్లో ముకుల్ చెప్పిన మాట విని "ఓకే సార్!" అని సెక్యూరిటీ ఆఫీసర్లు వైపు చూసి 'తీసుకువెళ్లండి.' అని సైగ చేసాడు హిర్వాణి.
అభీర్ ని సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకువెళ్లడం చూసి కట్టెలు మీద ఉన్న సహదేవుడి బాడీని మిచల్ తో కలిసి కింద పడేసాడు జనార్ధన్.
కింద పడ్డ సహదేవుడి శరీరన్ని చూసి జనార్దన్ వైపు కోపంగా చూస్తూ "నేను బయటికి వచ్చిన తర్వాత మొదటగా చంపేది నిన్నే!" అని ఆవేశంగా జీపు ఎక్కాడు అభీర్.
ఆ మాట విని భయంగా చూస్తూ మిచల్ తో కలిసి వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు జనార్ధన్.
*************
ఉదయం గెస్ట్ హౌస్ కి చేరుకుని చనిపోయిన గోకుల్ బాడీ దగ్గర బాధ పడుతున్న ముకుల్ దగ్గరకు వెళ్లి "సార్! గోకుల్ గారు ఆక్సిడెంట్లు చనిపోయినట్లు క్రియేట్ చేయించాను.
మీరు ఓకే అంటే ఇప్పుడే ప్రెస్ కి రిలీజ్ చేస్తాను, అలాగే మీరు చెప్పిన ఆ కుర్రాడు నోయిడా స్టేషన్లో ఉన్నాడు మీరు చెప్పిన వెంటనే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయిస్తాను." అని చెప్పాడు హిర్వాణి.
ఎదురుగా ఉన్న జనార్ధన్ మిచల్ వైపు చూసి "నా కొడుకుని చంపిన వాళ్ళు దొరికారా?" అని కోపంగా చూస్తూ అడిగాడు ముకుల్.
"సార్! వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, అసలు ఎలా ఉంటారో కూడా తెలియదు." అని చెప్పాడు జనార్దన్.
"ఎక్కడకి పోతారు అభీర్ గాడి కోసం స్టేషన్ దగ్గరికి వస్తారు కదా!" అని చెప్పి హిర్వాణి వైపు చూసి "నంద వారసుడు యాక్సిడెంట్లు లో చనిపోయాడు అని ప్రెస్ రిలీజ్ చేయించండి." అని చెప్పాడు ముకుల్.
"ఓకే సార్!" అని అక్కడ నుంచి వెళ్ళాడు హిర్వాణి.
మిచల్ వైపు చూసి "స్టేషన్ దగ్గరకి నీ మనుషుల తో కలిసి వేళ్ళు, అభీర్ కోసం వాడి మనుషులు అక్కడకి రాగానే నరికి అవతల పారేయండి." అని చెప్పాడు ముకుల్.
"ఓకే సార్!" అని అక్కడ్నుంచి తన మనుషులని తీసుకుని వెళ్ళాడు మిచల్.
*******************
మినిస్టర్ జావిద్ తో పాటు బైరి అడవులలో ఉన్న కొండల దగ్గరికి చేరుకుని "సర్పరాజ్! తొమ్మిది కొండల శాంపిల్స్ తీసుకో, అలాగే ఒక ఫోటో కూడా తీసుకో కొన్ని రోజులకి ఇక్కడ కొండలు కనబడకుండా చేస్తాను నా ఫ్రెండ్ ఆత్మ శాంతించాలి." అని చెప్పాడు అభిజిత్.
"సరే! అని సంతోషంగా కొండల వైపు తిరిగి సెల్ఫీ తీసుకొని శాంపిల్ తీసుకురావడానికి కొండల దగ్గరికి వెళ్ళాడు సర్పరాజ్.
కొండల వైపు సంతోషంగా చూస్తూ "అభిజిత్! వీటిని తవ్వడం మొదలుపెడితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది." అని ఆశగా అడిగాడు జావిద్.
"ఒక్క కొండ తవ్వితే చాలు ఇప్పటివరకు మనం సంపాదించిన దానికి పది రెట్లు వస్తుంది. ఈ విషయాలు మీ మనుషుల దగ్గర మాట్లాడకండి. అందరి దృష్టిలో ఇవి విషపు కొండలు మాత్రమే! అంత సీక్రెట్ గా జరిగిపోవాలి." అని చెప్పాడు అభిజిత్.
"సరే!" అని వెనక్కి తిరిగి తన పీఏ వైపు చూసి "మీరు కారు దగ్గర ఉండండి." అని చెప్పి కొండల వైపు నుంచి గట్టిగా అరుపు వినపడడంతో పరుగులు వెళ్లి చూసి భయంగా వెనక్కి వస్తూ "సర్పరాజ్ కాలి బూడిద అయిపోయాడు." అని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళడు జావిద్.
"అవునా?" అని కొంచెం ముందుకు వెళ్లి కొండను పట్టుకుని ఎండు చెట్టు కాలినట్లు కాలుతున్న సర్పరాజ్ చూసి భయంతో చెమటలు తుడుచుకుని ఆకాశంలో రాబందుల అరుపులు విని "జాకీ! మనం ఇక్కడ ఉండకూడదు." అని కార్ దగ్గరకి వెళ్ళాడు అభిజిత్.
కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళుతు ఉండగా సడన్ గా చెట్టు అడ్డంగా పడడంతో కార్ దానిని గుద్దుకొని పల్టీలు కొట్టుకుంటూ వెళ్లింది.
చెట్టుకొమ్మ జావీద్ గుండెల్లో గుచ్చుకొని తన కళ్ళ ముందు చనిపోవడం ఒక పక్కన రక్తం మడుగులో ఒళ్ళంతా దెబ్బలతో రక్తం మాడుగులో ఉన్న అభిజిత్ ని చూసి కొండల వైపు నుంచి వస్తున్న బయకరమైన అరుపులు వినలేక చెవులు మూసుకుని భయంగా చూస్తూ ఉండిపోయడు జాకీ.
*****************
ఆదే సమయం లో గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న జనార్దన్ వైపు చూసి "మనం ఒకసారి స్టేషన్ కి వెళ్లి అభీర్ ని చూసి వద్దాము వాడి కళ్ళలో భయం నేను చూడాలి." అని చెప్పాడు ముకుల్.
అంతలో గెస్ట్ హౌస్ లోపలికి వచ్చి "సార్! మీరు చెప్పినట్లు గోకుల్ గారు యాక్సిడెంట్లు చనిపోయినట్లు అన్ని న్యూస్ ఛానల్స్ లో వస్తుంది. మనం ఇప్పుడు ఈ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి ఒక రిపోర్ట్ రాయించి మీడియా ముందు బయటకు తీసుకువచ్చి దహన సంస్కారాలు చేయించాలి అప్పుడు అన్ని మనం అనుకున్నట్లు జరుగుతాయి." అని చెప్పాడు హిరణ్య.
"ఆ విషయం మొత్తం నువ్వే దగ్గర ఉండి చూసుకో నాకు చిన్న పని ఉంది. నా కొడుకు శవం హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేలోపు నేను అక్కడ ఉంటాను." అని చెప్పి జనార్ధన్ తో కలిసి స్టేషన్ కి బయలుదేరాడు ముకుల్.
కాసేపటికి స్టేషన్ బయట కారు ఆగడం చూసి హడావిడిగా లోపలికి వెళ్లి "సార్! నంద గ్రూప్ చైర్మన్ ముకుల్ గారు మన స్టేషన్ కి వచ్చారు." అని కంగారుగా చెప్పాడు పాఠక్.
"అవునా?" అని హడావిడిగా బయటికి వచ్చి "నమస్తే సార్!" అని చెప్పి పక్కనే ఉన్న జనార్ధన చూసి "సార్! వాళ్ళ బాబు యాక్సిడెంట్ కేసు ఈ స్టేషన్ కాదు." అని స్లోగా చెప్పాడు ఎస్ఐ నిరంజన్.
"ఆ విషయం మాకు కూడా తెలుసు! మీము వచ్చింది జోషి సార్ కేసులో ఒక కుర్రాడిని అరెస్టు చేశారు కదా అతన్ని చూడడానికి!" అని చెప్పాడు జనార్ధన్.
"అవునా సార్!" అని లోపలికి తీసుకువెళ్లాడు నిరంజన్.
"ఆ సెల్ లో ఉన్న కుర్రాడిని చూడడానికి ఎవరైనా వచ్చారా?" అని అడిగాడు జనార్ధన్.
"నో సర్! ఎవరు రాలేదు. అతను కూడా స్టేషన్ కి వచ్చిన దగ్గరనుంచి సెల్లో కళ్ళు మూసుకొని ఏదో ధ్యానం చేస్తున్నట్లు కూర్చున్నాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు." అని చెప్పాడు నిరంజన్.
ఆ మాట విని సెల్ దగ్గరికి వెళ్లి "అభీర్!" అని పిలిచాడు ముకుల్.
ఆ పిలుపుకి కళ్ళు తెరిచి దగ్గరకు వచ్చి "నువ్వే కదా ముకుల్ నంద! ఈ అరాచకానికి కారణం కూడా నువ్వే కదా! నా వాళ్ళని చంపావు నీ వారసుడైన పోగొట్టుకున్నావు ఇప్పటికైనా తప్పు తెలుసుకో నా సహదేవుడికి అంత్యక్రియలు చేసి నీ పాపం కడిగేసుకో ప్రణభిక్ష పెడతాను." అని చెప్పాడు అభీర్.
ఆ మాటకి నవ్వుతూ "నాకు ఇంకా వారసులు ఉన్నారు నా కొడుకు చివరి కోరిక తీర్చకుండా మాత్రం ఉండను, మా వాళ్ళు నీ ప్రదేశం మొత్తం నాశనం చేస్తాను.
మీ జాతి ఆనమాలు లేకుండా నేను చేస్తాను, నీ సహదేవుడికి అంత్యక్రియలు కాదు వాడి శవాన్ని కుక్కలు పీకు తింటున్నాయి చూడు." అని వీడియో చూపించడు ముకుల్.
మొబైల్లో వీడియో చూస్తూ ఆవేశంగా ముకుల్ వైపు చూసి "ఈరోజుతో నీ పాపం పండింది. నువ్వు అక్కడ ఉన్న కొండలని ముట్టుకోను కూడా ముట్టుకోలేవు." అని ఎర్రటి కళ్ళతో కోపంగా చూస్తూ చెప్పాడు అభీర్.
"నా కళ్ళముందే నీ మనుషులు మొత్తం కుక్క చావు చచ్చారు, మిగతా వాళ్ళని కూడా అదే విధంగా చంపుతాను నువ్వు దేవుడులా కొలిచే ఆ కొండలను తొలిచి అక్కడ నాగళ్ళతో దున్నిస్తాను.
నువ్వు జైల్ నుంచి బయటకు రాకుండా లోపలే కుళ్ళి కుళ్ళి చచ్చేటట్లు చేస్తారు అప్పుడే నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది." అని చెప్పాడు ముకుల్.
ఆ మాటకి కళ్ళు మూసుకుని గంభీరమైన గొంతుతో "ముకుల్ నంద బయట ఉన్న నా సైన్యానికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా పారిపో,
నేను మళ్ళీ పుష్కర కాలం తర్వాత బయటికి వస్తాను. అప్పుడు నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను, నీకు సహాయం చేసిన వారిని సంహరిస్తాను, నీ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలిస్తాను, కానీ నిన్ను మాత్రం చంపను.
నువ్వు చేసిన పాపం గుర్తుకు తెచ్చుకుని కుళ్ళి కూసించి బతికి ఉండగానే నిన్ను రాబందులు పీక్కు తింటాయి అది నా కళ్ళలో చూస్తాను ఇది నా నోటి నుంచి వచ్చిన మాట కాదు భవాని మత నీకు ఇస్తున్న శాపం!" అని కళ్ళు తెరిచాడు అభీర్.
ఎదురుగా ఉన్న అభీర్ కళ్ళ వైపు చూసి భయంతో వెనక్కి వచ్చి గబగబా అక్కడ నుంచి వెళ్లి కార్ ఎక్కి చెమటలు తుడుచుకుంటూ వణుకుతూ ఉన్నాడు ముకుల్.
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 451
Threads: 1
Likes Received: 643 in 302 posts
Likes Given: 94
Joined: Nov 2018
Reputation:
11
అద్భుతమైన అప్డేట్...... చానా అద్భుతంగా రాశారు... ఒక పగా ...ప్రతీకారం... ఒక ఆశయం...
ఒక మంచి పగ కోసం ఎన్ని సంవత్సరాలైనా ఓపికగా ఉంటాడు...
•
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
Bhayya.. nuvvu ee story ni movie yeeyochu
•
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 55
జైల్లో ఉన్న అభీర్ మాటలు విని తన కళ్ళలోకి చూసి భయంతో వణుకుతూ కారులోకి వెళ్లి కూర్చున్నాడు ముకుల్.
***************
ముకూల్ స్టేషన్లో నుంచి బయటికి వెళ్లడం చూసి కంగారుగా కారు దగ్గరికి వచ్చి "సార్ ఏమైంది?" అని అనుమానంగా అడిగాడు జనార్దన్.
ఆ మాట విని తల పైకెత్తి చూసి చెమటలు తుడుచుకుని "మన వాళ్ళందరినీ ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపొమ్మను, హిర్వానికి ఫోన్ చేసి అర్జెంట్‌గా గెస్ట్ హౌస్ కి రమ్మను." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు ముకుల్.
"ఓకే సర్!" అని దూరంగా ఉన్న మిచల్ వాళ్ళ వైపు చూసి "అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి." అని చెప్పి కార్ లో అక్కడి నుంచి వెళుతూ "ఏమైంది సార్! మీరు ఎందుకు ఆదోలాగా ఉన్నారు." అని డౌట్ గా అడిగాడు జనార్ధన్.
"నాకు అభీర్ కళ్ళలో అమ్మవారి రూపం కనిపించింది. అతని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట తప్పకుండా జరిగి తీరుతుంది. అభిజిత్ కి ఫోన్ చెయ్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ కొండల దగ్గరికి వెళ్ళకూడదు." అని చెప్పాడు ముకుల్.
"సరే సార్!" అని అభిజిత్ ఫోన్ కలవకపోవడంతో జాకి కి కాల్ చేశాడు జనార్దన్.
హాస్పటల్లో అభిజిత్ కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "జనార్దన్! అభిజిత్ అన్న పరిస్థితి ఏమి బాలేదు నేను అర్జెంటుగా ముకుల్ సార్ తో మాట్లాడాలి." అని ఏడుస్తూ చెప్పాడు జాకి.
ఆ మాట విని "అభిజిత్ సార్ కి ఏమైంది?" అని కంగారుగా అడిగి "ముకుల్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు." అని చెప్పాడు జనార్ధన్.
బ్యాక్ సీట్ లో కూర్చుని జనార్ధన్ మాట విని "ఏమైంది? నా చేతులు వణుకుతున్నాయి ఫోన్ పట్టుకోలేను స్పీకర్ ఆన్ చెయ్!" అని చెప్పాడు ముకుల్.
"సరే సార్!" అని స్పీకర్ ఆన్ చేసి "ముకుల్ సార్ మాట్లాడుతున్నారు." అని చెప్పాడు జనర్దన్.
"సార్! మనం ఆ కొండల జోలికి వెళ్లి చాలా తప్పు చేశాము శాంపిల్ తీసుకురావడానికి వెళ్లిన సర్పరాజ్ అక్కడే మాడి మసైపోయాడు.
భయపడి మేము వెనక్కి వస్తూ ఉండగా ఎలా జరిగిందో తెలియదు కారు యాక్సిడెంట్ అయ్యి జావిద్ గారు చనిపోయారు, అభిజిత్ అన్న చావు బతుకుల్లో ఉన్నాడు." అని చెప్పాడు జాకి.
ఆ మాట విని టెన్షన్ గా చూస్తూ "అక్కడ ఎవరైనా అభీర్ మనుషులు ఉన్నారా?" అని అడిగాడు ముకుల్.
"అడవిలో ఒక అక్కడ మనిషి కాదు కదా జంతువు కూడా లేదు, కానీ ఆ కొండల లోపల నుంచి భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి, అవి మన చావు కేకలు లాగా ఉన్నాయి." అని భయం చెప్పాడు జాకి.
"సరే! నువ్వు అభిజిత్ ని తీసుకుని ఢిల్లీ వచ్చేయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి "నేను పాపం చేశాను.' అని మనసులో అనుకున్నాడు ముకుల్.
కాసేపటికి గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చిన ముకుల్ వాళ్ళని చూసి "సార్! గోకుల్ గారి బాడీ మార్చురీలో ఉంది. మీరు వస్తే దహన సంస్కరాలు పూర్తి చేద్దాము." అని చెప్పాడు హిరణ్య.
"ఆ సంగతి నేను చూసుకుంటాను నువ్వు స్టేషన్ దగ్గరికి వెళ్లి అభీర్ మీద ఏ కేసులు ఫైల్ చేపిస్తావో నాకు తెలీదు వాడు మాత్రం జీవితాంతం లోపలే ఉండాలి, అసలు వాడు ఎవరూ అని కూడా బయట ప్రపంచానికి తెలియకూడదు.
నేను రేపు ఉదయం లండన్ వెళ్ళిపోతున్నాను మళ్లీ నీకు కనిపించకపోవచ్చు ఏ విషయమైనా ఫోన్లోనే మాట్లాడుకుందాము నేను ఈ కేసులో నేను ఇన్వాల్వ్ అయినట్లు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు." అని చెప్పాడు ముకుల్.
"సరే సార్! ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, కానీ అభీర్ ని కోర్టు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కచ్చితంగా ఈ కేసు గురించి, ఆ అబ్భాయ్ గురించి బయటికి వస్తుంది." అని చెప్పాడు హిరణ్య.
"జైలుకు పంపించిన తరువాత వాడు ఎక్కడ ఉన్నాడో మూడో కంటి వాడికి తెలియకూడదు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్లందరు చనిపోవాలి నీకు మిచల్ తోడుగా ఉంటాడు." అని చెప్పాడు ముకుల్.
"సార్! ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ క్లోజ్ చేయాలి అంటే చాలా ఖర్చవుతుంది." అని చెప్పాడు హిరణ్య.
"డబ్బు గురించి ఆలోచించకు ఎంత కావాలో మాత్రమే అడుగు!" అని జనార్దన్ ని తీసుకుని గోకుల్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వెళ్ళాడు ముకుల్.
****************
సెక్యూరిటీ అధికారి స్టేషన్ దగ్గర ఎస్సై నిరంజన్ దగ్గరికి వచ్చి "సార్! ఈ కుర్రాడు అమాయకుడు లాగా ఉన్నాడు కావాలని ఈ కేసులో ఇరికించారు, మనం పూర్తిగా ఎంక్వయిరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రాద్దాము." అని చెప్పాడు పాఠక్.
ఆ మాట విని ఆలోచిస్తూ "సరే! రేపు ఉదయం దీని గురించి ఆలోచిద్దాము నేను ఇంటికి వెళుతున్నను జాగ్రత్తగా చూసుకో, ఆ అబ్బాయిని కలవడానికి ఎవరు వచ్చినా సరే నా పర్మిషన్ లేకుండా మాట్లాడించకు." అని చెప్పి అక్కడినుంచి వెళ్లాడు నిరంజన్.
"సరే సర్!" అని సెల్యూట్ చేసి ఎస్సై వెళ్లిన తర్వాత సెల్ లో ఉన్న అభీర్ దగ్గరికి వెళ్లి "అందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు పాఠక్.
"నేను సాటి మనిషిని నమ్మడం మానేశాను మిమ్మల్ని నమ్మి నా వాళ్లని బలి చేయలేను, ఒకవేళ మీరు నా మంచి కోసమే చెప్పిన నేను అర్థం చేసుకునే పరిస్థితిలో లేను క్షమించండి." అని చెప్పాడు అభీర్.
"నీ పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అలాగే మాట్లాడతారు." అని భోజనం తీసుకువచ్చి ఇచ్చి తన టేబుల్ దగ్గర కూర్చున్నాడు పాఠక్.
అంతలో జైలు దగ్గరికి వచ్చి పాఠక్ దగ్గరికి వెళ్లి "సార్! మీరు స్మశానం దగ్గర అరెస్ట్ చేసిన వ్యక్తితో నేను ఒకసారి మాట్లాడాలి." అని అడిగాడు శంకర్.
"నువ్వు అతనికి ఏమవుతావ్?" అని డౌట్ గా అడిగాడు పాఠక్.
"అతని మంచి కోరేవాడిని!" అని చెప్పాడు శంకర్.
"ఆ సెల్ లో ఉన్నాడు మాట్లాడి త్వరగా వెళ్లిపోండి ఈ విషయం ఎస్ఐ గారికి తెలిస్తే మీరు కూడా ఇబ్బంది పడతారు." అని చెప్పాడు పాఠక్.
"సరే!' అని బయట ఉన్న రాజన్ వాళ్ళ వైపు చూసి లోపలికి రమ్మని సైగ చేశాడు శంకర్.
లోపలికి వచ్చి సెల్ లో ఉన్న అభీర్ ని చూసి ఏడుస్తు "నాయకుడా! నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ గోడలు బద్దలు కొట్టింది నిన్ను తీసుకు వెళ్ళిపోతాము." అని చెప్పాడు బైరి.
"అవును నాయకుడా! మనం ఈ జనాలతో ఉండలేము మన కొండల దగ్గరికి వెళ్లి పోదాము అక్కడే సుఖంగా బతుకుదాము." అని చెప్పింది రియా.
"మన తెగకు అమ్మవారి దయ ఉందని చెబుతూ ఉంటారు కానీ మనకే ఎందుకు ఇన్ని కష్టాలు!" అని బాధగా అడిగాడు అగస్త్య
తన వాళ్ళ మాటలు విని "మానవరూపంలో భూమి మీదకు వచ్చిన దేవుడికే కష్టాలు తప్పలేదు మనమెంతా! కృష్ణ పరమాత్ముడు అండగా ఉన్న పాండవులు కూడా 14 సంవత్సరాలు వనవాసం చేశారు, కర్మ ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది.
మన పూర్వీకులు ఇచ్చిన ఫలాలను మనం అనుభవించినప్పుడు వారు చేసినా తప్పిదలకు శిక్ష కూడా మనం అనుభవించాలి ఇప్పుడు జరిగేది కూడా ఆదే,
మీరందరూ మీ స్థానాలకు వెళ్ళండి నేను తిరిగి వచ్చేవరకు మన కొండ దగ్గరికి ఎవరు వెళ్ళకండి దాని మీద శత్రువులు చెయ్యి కూడా వేయలేరు.
నేను 12 సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి వస్తాను అప్పటికి మీరు చేయవలసింది ఒక్కటే, మన పరిస్థితికి కారణమైన వారికి దగ్గర అవ్వండి వాళ్లు మనల్ని ఎలా మోసం చేశారో మనం కూడా అలాగే మోసం చేయాలి ధర్మాన్ని రక్షించడం కోసం మోసం చేసిన పర్వాలేదు అని మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు.
నేను బయటకి వచ్చిన తర్వాత సింబా ద్వారా మీకు సమాచారం పంపుతాను అప్పటివరకు మీరు జారువా తెగకి చెందిన వారని ఎక్కడ తెలియకూడదు." అని చెప్పాడు అభీర్.
ఆ మాటలు విని "సరే నాయకుడా! నువ్వు బయటకు వచ్చే వరకు జరిగిన విషయాలన్నీ మర్చిపోయి మొండిగా బతుకుతాము అభీర్ సేనాని యుద్ధానికి సిద్ధం చేస్తాము." అని శబదం చేసి అభీర్ చేతిలో చేయ్యి వేసి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు రాజన్ వాళ్ళ ఐదుగురు.
"శంకర్ నువ్వు కూడా వెళ్ళు త్వరలోనే నిన్ను కలుస్తాను." అని చెప్పాడు అభీర్.
"నాయకుడా! నేను తీహార్ జైల్లో సెంట్రి గా పనిచేస్తున్నాను నువ్వు బాలనేరస్తుల జైలుకు వెళతావు, నేను అక్కడికి వచ్చి కలుస్తాను నువ్వు రెండు సంవత్సరాల్లో బయటకు వచ్చేస్తావు." అని చెప్పాడు శంకర్.
ఆ మాటకి నవ్వుతూ "నేను 12 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ గోడల మధ్యలో నుంచి బయటికి వస్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపో తప్పకుండా నిన్ను కలుసుకుంటాను." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా!" అని కళ్ళు తుడుచుకుని పాఠక్ దగ్గరికి "వెళ్లి మేము ఇక్కడికి వచ్చాము అని ఎవరికి చెప్పకండి." అని టేబుల్ మీద డబ్బులు పెట్టాడు శంకర్.
ఆ డబ్బులు తీసే శంకర్ చేతిలో పెట్టి "నేను చాలా తప్పులు చేశాను కానీ ఈ తప్పు మాత్రం చేయాలి అనుకోవడం లేదు మీరు వెళ్లి రండి. ఈ విషయం నాకు తప్పితే ఎవరికి తెలియదు అభీర్ ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది." అని చెప్పాడు పాఠక్.
"మీరు చేస్తున్న సహాయం మనిషికి కాదు దేవుడికి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది." అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శంకర్.
*****************
గోకుల్ దహన సంస్కారాలు చేసి స్పెషల్ ఫ్లైట్‌లో లండన్ బయలుదేరుతూ జనార్దన్ చేతిలో ఒక కవర్ పెట్టి "నువ్వు మాల్దీవులకి వెళ్ళిపో అక్కడ నీకోసం అన్ని ఏర్పాట్లు చేశాను." అని చెప్పి జాకి వైపు చూసి
"అభిజిత్ కొడుకు మిథున్ కి ఈ విషయాలు ఏమి తెలియకూడదు జాగ్రత్తగా చూసుకో, అభిజిత్ కోమలో నుంచి బయటికి వస్తే నాకు వెంటనే కాల్ చెయ్!" అని చెప్పి లండన్ వెళ్లి పోయాడు ముకుల్.
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 56
జైల్లో తనని కలవడానికి వచ్చిన రాజన్ వాళ్లతో నేను మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత బయటికి వస్తాను అని చెప్పి పంపించాడు అభీర్.
అభిజిత్ కొడుకు మిథున్ ని జాగ్రత్తగా చూసుకోమని అభిజిత్ కోమాలో నుంచి బయటికి వస్తే తనకి కాల్ చేయమని లండన్ వెళ్లిపోయాడు ముకుల్.
**************
ఉదయం స్టేషన్ దగ్గర సెల్ లో ఉన్న అభీర్ దగ్గరికి వచ్చి "బాబు! నాకు ట్రాన్స్ఫర్ అయింది ఈ రోజే వెళ్లి జాయిన్ అవ్వాలి, నువ్వు ఈ కేసులో నుంచి బయట పడాలని దేవుడిని ప్రార్థించడం మినహా నేను కూడా ఏమి చేయలేని పరిస్థితి." అని చెప్పాడు పాఠక్.
"నా గురించి బాధపడకండి క్షేమంగా వెళ్లి రండి తప్పకుండా మళ్లీ కలుసుకుందాము." అని చెప్పాడు అభీర్.
"సరే!" అని ఎస్ఐ నిరంజన్ తో పాటు స్టేషన్ లోకి వస్తున్న లాయర్ హిరణ్యని చూస్తూ 'ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు.' అని మనసులో అనుకుంటు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పాఠక్.
స్టేషన్లోకి వెళ్లి సెల్లో ఉన్న అభీర్ వైపు చూసి నిరంజన్ దగ్గరకు వెళ్లి "ఏమయ్యా! ఆ అబ్బాయి దిట్టంగానే ఉన్నాడు కదా, 18 సంవత్సరాలు దాటాయి అంటే జడ్జి గారికి ఎటువంటి అనుమానం రాదు.
అయ్యినా డాక్టర్ సర్టిఫికెట్ కూడా తెప్పించాను నీకు ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదు నేను ఉన్నా కదా, ఎఫ్ఐఆర్ రాసి కోర్టుకి సబ్మిట్ చెయ్, అలాగే ఛార్జ్ షీట్ లో అతని ఊరు పేరు మెన్షన్ చేయకు.
అతను ఎవరో కూడా తెలియదు అసలు ఈ దేశానికి చెందిన వాడు కాదు, ఎంక్వైరీ లో కూడా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అని మెన్షన్ చెయ్!" అని చెప్పాడు హిరణ్య.
"సార్! మీరు చెప్పింది చెప్పినట్లురాస్తే నా ఉద్యోగం ఎగిరిపోతుంది. అయ్యినా ఈ కేసులో ఆ పిల్లాడిని ఎందుకు ఇరికించాలని చూస్తున్నారు?" అని అడిగాడు నిరంజన్.
"నీకు డబ్బు కావాలా నిజం కావాలా?" అని సీరియస్ గా అడిగాడు హిరణ్య.
ఆ మాట విని ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కానిస్టేబుల్ ని పిలిచి "సెల్ లో ఉన్న కుర్రాడిని సాయంత్రం కోర్టుకి హాజరు పరచాలి." అని చెప్పాడు నిరంజన్.
"ఓకే సార్!" అని చెప్పాడు కానిస్టేబుల్.
స్టేషన్ లోపలికి వస్తున్న అమ్మాయిని చూపించి "ఆవిడా మురళి జోషి భార్య గీత స్టేట్మెంట్ ఇస్తుంది రికార్డ్ చేసుకో!" అని చెప్పాడు హిరణ్య.
"సార్! ఆవిడ జోషి సార్ భార్య కాదు కదా!" అని డౌట్ గా అడిగాడు నిరంజన్.
"ఆ విషయం నీకు నాకు తెలుసు జడ్జి గారికి తెలియదు కదా! అయినా జోషి భార్య ఈవిడ కాదు అని కోర్ట్ లో ఎవరు చెబుతారు, నేను చెప్పింది చెయ్!" అని చెప్పాడు హిరణ్య.
"ఓకే సార్! ఇంక నేను చూసుకుంటాను చార్జెషీట్ రెండు రోజులలో కోర్టుకి సబ్మిట్ చేస్తాను." అని చెప్పాడు నిరంజన్.
*************
రెండు రోజుల తర్వాత కోర్టుకి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసి అభీర్ కి రిమాండ్ విందించి తీహార్ జైలుకి పంపించడంతో కోర్ట్ బయటికి వచ్చి మిచల్ కి కాల్ చేశాడు హిరణ్య.
ఫోన్ లిఫ్ట్ చేసి "లాయర్ గారు చెప్పండి?" అని అడిగాడు మిచల్.
"మళ్లీ నీతో పని పడింది ఒకసారి నా ఆఫీస్ కి రా..!" అని చెప్పాడు హిరణ్య.
"సరే సార్! అరగంటలో అక్కడే ఉంటాను." అని చెప్పి ఫోన్ పెట్టేసి కాసేపటికి హిరణ్య ఆఫీస్ దగ్గరికి వచ్చాడు మిచల్.
తన ఆఫీసులోకి వచ్చిన మిచల్ వైపు చూసి "ఈసారి నీకు చాలా పెద్ద పని పడింది. దానికి తగ్గట్టే అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది.
ఈ పని చేసిన తర్వాత నువ్వు బీహార్ వెళ్ళిపో అక్కడే ఉండు మళ్ళీ ఢిల్లీ వైపు రాకు ఏదైనా పని పడితే నేను కాల్ చేస్తాను." అని చెప్పాడు హిరణ్య.
"సరే సార్! పని ఏమిటో చెప్పండి?" అని అడిగాడు మిచల్.
ఫోటోలు చూపిస్తూ "ఇతని పేరు నిరంజన్ ఎస్సై, ఇతని పేరు అబ్రహం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్, ఈయన సుబ్రహ్మణ్య రావు జడ్జిగారు, వీళ్ళు కాకుండా మురళి జోషి భార్యని నువ్వు చూసావు కదా ఆవిడ ఫోటో నా దగ్గర లేదు ఈ నలుగురు వారం రోజుల్లో చనిపోవాలి యాక్సిడెంట్ జరిగింది అనుకోవాలి ఎవరికి అనుమానం రాకూడదు." అని చెప్పాడు హిరణ్య.
"సరే సార్!" అని ఫోటోలు తీసుకుంటూ "మురళి జోషి భార్యని చూశాను కానీ సరిగ్గా గుర్తులేదు ఎక్కడ ఉందో నేను కనిపెడతాను మళ్లీ పని అయిన తర్వాత మీకు కాల్ చేస్తాను." అని వెళ్ళిపోయాడు మిచల్.
అక్కడి నుంచి మిచల్ వెళ్లడంతో ఫోన్ తీసి ముకుల్ కి కాల్ చేశాడు హిరణ్య.
లండన్ తన ఇంట్లో కొడుకు ఫోటో ముందు కూర్చుని బాధపడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "లాయర్! మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగిందా?" అని అడిగాడు ముకుల్.
"సార్! నేను మీకు చెప్పింది చెప్పినట్లు చేశాను, ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఈ కేస్ బెంచ్ కి రాదు, ఆ అభీర్ బయటికి రాడు, ఒకవేళ ఎవరైనా ప్రయత్నించినా నేను చూసుకుంటాను." అని చెప్పాడు హిరణ్య.
"సరే! ఆ కుర్రాడు జైల్లో ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ కేస్ గురించి బయటికి వచ్చిన, నా పేరు కానీ అభిజిత్ పేరు కానీ బయటికి రాకూడదు." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముకుల్.
***************
ప్రజెంట్ లండన్ లో తన ఇంటి దగ్గర ముకుల్ చెప్పినా గతం విని "తాతయ్య! మీరు నాన్నగారు చనిపోయిన టెన్షన్లో ఉండి 16 ఏళ్ల కుర్రాడు జైల్లో కూర్చుని ఆవేశంలో చెప్పిన మాటలు విని భయపడిపోయారా?" అని అడిగింది అర్ణ.
"బేబీ! అభీర్ కళ్ళలోకి చూస్తే ఆ భయం ఏమిటో తెలుస్తుంది. అంతేకాకుండా అతను చెప్పినట్లు ఆ కొండలు దగ్గరికి వెళ్లిన వాళ్ళ పరిస్థితి చూసి నాకు భయం వేసింది.
అంతేకాదు గోకుల్ ని చంపినా ఐదుగురు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకోలేకపోయాను, ఆ తెగ వాళ్ళ శక్తి గురించి నాకు బాగా తెలుసు!
నా వారసులని కాపాడుకోవడానికి ఆ రోజు నుంచి నేను ఇండియాకి వెళ్ళలేదు, మన వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వలేదు." అని చెప్పాడు ముకుల్.
"మరి అభిజిత్ అంకుల్ కోమాలో నుంచి బయటికి వచ్చారా?" అని అడిగింది అర్ణ.
"ఎస్! 8 సంవత్సరాల తర్వాత అభిజిత్ కోమాలో నుంచి బయటికి వచ్చాడు కానీ వీల్ చైర్ కె పరిమితం అయిపోయాడు.
అభీర్ జైల్లో ఉన్నాడని తెలిసి నలుగురు మనుషుల్ని చంపడానికి పంపించాడు కానీ వాళ్లు ప్రాణాలతో బయటకి రాలేదు." అని చెప్పాడు ముకుల్.
"మరి బైరి అడవిలో ఉన్న కొండల దగ్గరికి అంకుల్ మళ్లీ మనుషుల్ని పంపించలేదా?" అని డౌట్ గా అడిగింది అర్ణ.
"ఆ కొండల జోలికి వెళ్ళకూడదు అని మేము నిర్ణయించుకున్నాము, అభీర్ చెప్పినట్టు కచ్చితంగా 12 సంవత్సరాల కి మళ్ళీ బయటికి వచ్చాడు అతను నోటి నుంచి వచ్చిన మాట ప్రతిదీ జరిగే తీరుతుంది." అని చెప్పాడు ముకుల్.
"మరి నాన్న ఆశపడ్డ పంచరత్నాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?" అని అడిగింది అర్ణ.
"అభీర్ జైలు నుంచి బయటికి వచ్చాడు కాబట్టి అతని దగ్గరే ఉంటాయి." అని చెప్పాడు ముకుల్.
"తాతయ్య! అభీర్ నోటి నుంచి వచ్చిన మాటలు ఫలించడానికి అతను ఏమైనా దేవుడా? మనలాగా మామూలు మనిషి!
అతనికి అంత శక్తి ఉంటే చనిపోయిన సహదేవుడిని ఎందుకు బ్రతికించుకోలేకపోయాడు 12 ఏళ్లు జైల్లో ఎందుకు ఉంటాడు,
ఆది కాకుండా అతని మనుషులు ఇంకా అతని మాట వింటారు అనుకుంటున్నావా? ఈ రోజుల్లో డబ్బుకి ఉన్న విలువ మనిషి మాటకి లేదు, వాళ్లు 12 సంవత్సరాలుగా ఈ సమాజంలో బతుకుతున్నారు నాకు తెలిసి పూర్తిగా మారిపోయి ఉంటారు.
నాన్న కలను నేను నెరవేరుస్తాను, పంచరత్నాలు నా చేతికి ఎలా తెచ్చుకోవాలో ఆ కొండలతో ఎలా బిజినెస్ చేయాలో అడ్డువచ్చిన అభీర్ ని ఎలా తొలగించాలో నాకు బాగా తెలుసు!" అని చెప్పింది అర్ణ.
"నీ మాటలు వింటుంటే నాకు కూడా ధైర్యం వస్తుంది. కానీ అభీర్ ని తక్కువ అంచనా వేయకూడదు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి మన వైపు ఒక్క ప్రాణం కూడా పోకూడదు." అని చెప్పాడు ముకుల్.
"ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను మీరు ప్రశాంతంగా ఉండండి ఇండియా ఎప్పుడు వెళ్లాలో నేను చెబుతాను." అని అక్కడి నుంచి బయటికి వచ్చింది అర్ణ.
****************
వసుంధర ఇంటి దగ్గర అభీర్ చెప్పింది విని "ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అసలు వాళ్ళు మనుషులు కాదు కచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే!" అని ఆవేశంగా చెప్పింది నీలమ్.
అభీర్ దగ్గరికి వచ్చి "అన్న! నా ప్రాణాలు కాపాడిన నువ్వు సహదేవుడిని ఎందుకు కాపాడలేదు?" అని ఏడుస్తూ అడిగింది సుమతి.
"నాకు ప్రాణదానం చేసే శక్తి ఆ దేవుడు ఇచ్చాడు కానీ ఎదుటి మనిషి కొనా ఊపిరితో ఉండనప్పుడే నేను ప్రాణదానం చేయగలను, ఆరోజు నేను అక్కడికి వచ్చేసరికి సహదేవుడు చనిపోయాడు." అని బాధగా చెప్పాడు అభీర్.
"మరి తప్పు చేసిన వాళ్ళని 12 సంవత్సరాలు ఎందుకు క్షమించవు? నువ్వు తలుచుకుంటే జైలు నుంచి బయటికి కూడా రాగలవు కదా, ఎందుకని రాలేదు?" అని అడిగాడు సందీప్ రావు.
"అవును అభీర్! నువ్వు అప్పుడే వాళ్ళని చంపేసి ఉండాల్సింది. ఇప్పుడు వాళ్లు నీకు అందనంత ఎత్తులో ఉన్నారు, నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ ఇండియాకి కూడా రాకపోవచ్చు, అసలు 12 సంవత్సరాలు వెయిట్ చేసావు? చేయని తప్పుకు ఎందుకు శిక్ష అనుభవించావు?" అని అడిగాడు శ్రీకర్.
ఆ మాటకి అక్కడ ఉన్న వారి వైపు చూస్తూ సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు అభీర్.
The following 12 users Like SivaSai's post:12 users Like SivaSai's post
• aarya, ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Mahesh12345, Naga67, Nivas348, Rajeev j, Sachin@10, shekhadu, vikas123
Posts: 271
Threads: 0
Likes Received: 194 in 133 posts
Likes Given: 1,186
Joined: Mar 2022
Reputation:
5
•
Posts: 48
Threads: 0
Likes Received: 17 in 16 posts
Likes Given: 6
Joined: Jun 2019
Reputation:
3
Story is awesome.. one curiosity or doubt andi..
Abhir ki heroine unda..unte evaru annadi inka clarity raledhu..
Initial gaa arna/mitra/nilam anipinchindhi.. but arna is not.
Thanks a lot for giving wonderful story.. story chaduvuthuntee. maro rajamouli cinema laa undi..
Waiting for next episodes
•
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
Excellent update and story
•
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
(02-02-2026, 09:08 AM)masalakiss Wrote: Story is awesome.. one curiosity or doubt andi..
Abhir ki heroine unda..unte evaru annadi inka clarity raledhu..
Initial gaa arna/mitra/nilam anipinchindhi.. but arna is not.
Thanks a lot for giving wonderful story.. story chaduvuthuntee. maro rajamouli cinema laa undi..
Waiting for next episodes
Heroine Undi Adi Evaru Anedi Already Guess Chesaru
Thank You....................
UpComing Updates Lo Vastundi
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
02-02-2026, 12:37 PM
(This post was last modified: 02-02-2026, 12:38 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Next Update Nuchi Abhir Dharma Uddam Starts
Posts: 705
Threads: 0
Likes Received: 400 in 313 posts
Likes Given: 694
Joined: May 2019
Reputation:
5
•
Posts: 451
Threads: 1
Likes Received: 643 in 302 posts
Likes Given: 94
Joined: Nov 2018
Reputation:
11
•
|