Posts: 889
Threads: 2
Likes Received: 525 in 362 posts
Likes Given: 938
Joined: May 2019
Reputation:
6
31-01-2026, 07:40 AM
(This post was last modified: 31-01-2026, 07:41 AM by ash.enigma. Edited 1 time in total. Edited 1 time in total.)
em bhayya.. weekend vachindi kada.. full on party aa?
Update ledu ivvala!!
•
Posts: 40
Threads: 0
Likes Received: 11 in 10 posts
Likes Given: 3
Joined: Jun 2019
Reputation:
2
Super Story Sivasai garu.. thank you very much for sharing excellent story.
Story chala chala baghundhi.. Romance perspective, at least swathi sarasamaina kadhalo laga ippudu unna daniki konchem dose penchi rayandi.. adhee romantic gaanee.. story ippudu top loo undhi.. appudu peaks loo untundhi...
•
Posts: 319
Threads: 8
Likes Received: 2,473 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
271
Don't Worry Yesterday Begumpet Air Show Chusi Room Ki Vache Sareki Full Tired Ayyanuu So Update Ivvaledu
Ippudu Update Istunnaaaaaaaa
E Roju Kuda Air Show Undi Ani Talk Unte Compulsory Ga Velthanuu..........................
•
Posts: 319
Threads: 8
Likes Received: 2,473 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
271
31-01-2026, 10:47 AM
(This post was last modified: 31-01-2026, 10:48 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 69
నేహ ఏమి చెబుతుందా అని శ్రీ చాలా అత్రంగా ఎదురు చూస్తూఉంటాడు. నేహ ఇబ్బందిగా ఏమి చెప్పాలా అని దిక్కులు చూస్తూ ఉంటే....
ప్లీజ్ నేహ ఒక ఫ్రెండ్ గా అనుకుని చెప్పు. రేపు వచ్చే అమ్మాయి లైఫ్ నాతో హ్యాపీగా ఉండాలి కదా.. అందుకే నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను.
చెప్పు...చెప్పు... ప్లీజ్... ప్లీజ్... అని అడుగుతాడు. మీరు మరీ అంత ఎక్కువ రిక్వెస్ట్ చేయకండి శ్రీగారు చెబుతాను.
ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించి కళ్ళు తెరిచి శ్రీ వైపు చూస్తూ ఇది పూర్తిగా నా వైపు నుంచే చెబుతున్నాను.
అందరి అమ్మాయిలు ఇలాగే ఆలోచించాలి అని ఎక్కడా లేదు. పర్వాలేదు నీ వైపు నుంచి చెప్పు. మిగిలింది నేను అర్థం చేసుకుంటాను అంటాడు.
ఆ మాటకి నవ్వుతూ చూస్తూ మీరు చాలా తెలివైన వాళ్ళు అండి. థాంక్యూ.. థాంక్యూ.. అని ఉబ్బి తబ్బుబ్బి అయిపోతాడు.
మన టాపిక్ ఏటో వెళ్ళిపోతుంది అనుకుంటా అని అంటుంది. ఓకే.. ఓకే... నేనే వెనక్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు చెప్పు ఎలాగా ఉండాలి చేసుకునే వ్యక్తి అని అంటే...
అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే.... ముందు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
అప్పటివరకు ఇద్దరూ రెండు భిన్న వాతావరణంలో పెరిగి వస్తారు. చిన్నప్పటినుండి కలిసి ఉన్న అమ్మానాన్నలు, సిబ్లింగ్స్ తోనే డిస్టబెన్స్ లు వస్తూ ఉంటాయి.
అలాంటిది విభిన్న వాతావరణంలో పెరిగి ఒకే చోటు ఉండేవాళ్ళ మధ్యన కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సహనంగా ఉండి సొల్యూషన్ వైపు అడుగువేయాలి గాని..
నువ్వెంత అంటే నువ్వు ఎంత అని అనుకోకూడదు. అది నేనైనా.. నన్ను చేసుకునే వ్యక్తి అయినా సరే అని చెబుతుంది.
ఇంకా అని అడుగుతాడు. ఇంకా అంటే.. ఎంత బిజీగా ఉన్నా సరే... ఒకసారి ఫోన్ చేసి తిన్నావా.. ఏం చేస్తున్నావ్ అని అడిగితే చాలు.
గొడవ జరిగినప్పుడు నువ్వే ముందు సారీ చెప్పాలి అన్న ఇగో కి వెళ్ళకూడదు. భార్యాభర్తలు గా ఇద్దరూ కాదు ఒక్కటే అయినప్పుడు...
అటు పేరెంట్స్, ఇటు పేరెంట్స్ ని కూడా ఈక్వల్ గానే చూడాలి. అప్పుడే కదా భార్యాభర్తల బంధం ఇంకా బలపడుతుంది అంటుంది.
అది ఎలా అంటే... ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు అనుకోండి. రేపు మీరు చేసుకున్న అమ్మాయి పేరెంట్స్ ని కూడా మీ పేరెంట్స్ లాగా ట్రీట్ చేశారు అనుకోండి.
ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా.. తను కూడా మీ పేరెంట్స్ అలాగే చూస్తుంది కదా.. అప్పుడు మూడు వంతులు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి.
ఫర్ సపోస్ నేను అలాగే ట్రీట్ చేసేను అనుకో.... ఆ అమ్మాయి దాన్ని అలుసుగా తీసుకుంటే అని అనుమానం రైస్ చేస్తాడు.
ఆ మాటకి నవ్వుతూ ఆడవాళ్లకి అనుమానాలు ఎక్కువ అంటారు గాని.. మమ్మల్ని మించిపోయారు మీరు అంటుంది.
అలా కాదు నేహా.. రేపు పెళ్లయ్యాక సంసారం అందంగా సాగిపోవాలి కదా..అందుకే చిన్న చిన్న డిస్టర్బెన్స్ లకి ముందే సొల్యూషన్ దొరికింది అనుకో.. క్లియర్ చేసేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అంటాడు. బిజినెస్ మాన్ అనిపించుకున్నారు.
అందరి అమ్మాయిలు గురించి నాకు తెలియదు గానీ నాలాంటి అమ్మాయి అయితే మాత్రం.. మీ ప్రేమను గాని మీరు ఆ అమ్మాయి తల్లిదండ్రులు విషయంలో తీసుకునే శ్రద్ధని అలుసుగా తీసుకోదు.
ఇంకా అని అడుగుతాడు ఇంకా ఏముంటాయి శ్రీగారు అంటే... అదే మీ లేడీస్ కి షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా..
రోజు షాపింగ్ కి తీసుకువెళ్లాలా.. అకేషన్ వైస్ గాన.. అని అడుగుతాడు లేదా కార్డు ఇస్తే సరిపోతుందా...
మీరు కార్డు ఇచ్చి కొనుక్కోఅన్న.. అది ఎన్ని లక్షల పెట్టి కొన్నా సరే.. మీరు తెచ్చే రెండు రూపాయల గులాబీకే విలువ ఎక్కువ ఉంటుంది.
మీ చేతితో ఒక గులాబీ. ఒక ఐస్ క్రీము లేదో తనకి ఇష్టమైన చిన్న చిన్న సరదాలు సరే...వంద రూపాయల చీర అయినా సరే..
అది మీ చేతితో తెచ్చిన రోజున ఉన్న సంతోషం తన చేతులతో ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా సరే ఉండదు. ఇది మాత్రం నేను పక్కా చెప్పగలను. అది ఎలాంటి అమ్మాయి అయినా సరే అంటుంది.
ఇప్పటికి చాలు కదా ఈ ఇన్ఫర్మేషన్. రూమ్ కి వెళదామా అంటుంది. సరే పద.. చాలా లేట్ అయిపోయింది. ఫ్లాట్ వరకు వచ్చి దింపి తన ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు.
ఫ్లాట్లోకి వచ్చిన శ్రీ నేహా చెప్పిన దానికి మురిసిపోతూ నువ్వు ఎంత బంగారమే... చాలా సింపుల్ సింపుల్ గా ఉన్నాయే చెబుతున్నావు.
నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు చెప్పినట్టే గానే మీ పేరెంట్స్ ని, మా పేరెంట్స్ ని ఈక్వల్ గానే చూస్తాను. ఎందుకో తెలుసా బంగారం నీ మనసు అంత స్వచ్ఛమైనది. ఇక నా పేరెంట్స్ విషయంలో కూడా నాకు ఎటువంటి బెంగా లేదు.
టైమెంతయింది అని చూస్తాడు. అది ఇంకా పదే చూపిస్తూ ఉంటుంది. అబ్బా ఈ గడియారం కూడా ఈరోజు ముందుకి కదలడంలేదు.
కష్టమైనా సరే నిద్రపోవాలి అని అలారం సెట్ చేసుకుని మంచం ఎక్కుతాడు. నేహ ఊహల్లో తేలుతూ ఎప్పటికో నిద్రపోతాడు.
పొద్దున్నే నాలుగింటికి ఫోన్ మోగుతుంటే వాసు చిరాగ్గా ఈ టైంలో ఎవరు సురభి చూడు అని అంటారు. ఏదైనా ఎమర్జెన్సీ కాల్ ఏమో చూస్తాను అని ఆవిడ కంగారుగా మంచం దిగి ఫోన్ లిఫ్ట్ చేసి..
నిద్రమత్తులోనే హలో అంటారు. హలో మమ్మీ అనగానే.. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఫోన్ వైపు చూసుకొని శ్రీ అంటారు. అంతే వాసుగారి నిద్రమత్తు కూడా ఎగిరిపోయి..
శ్రీ ఏంటి ఈ టైంలో..బాగానే ఉన్నాడా అని కంగారుగా మంచం దిగి స్పీకర్ ఆన్ చెయ్ అంటారు.. మమ్మీ నాకేమైంది. నేను బాగానే ఉన్నాను అని చెబుతాడు.
మరి ఈ టైం లో ఫోన్ ఏంట్రా అంటే... ఈ టైం లో అంటావేంటి మమ్మీ తెల్లారిపోయింది అంటాడు. సురభి గారు టైం చూసి ఇంక నాలుగే అయింది కదా అంటే...
అదే నెక్స్ట్ డే వచ్చేసింది కదా.. మీరు ఇంకా లేచి ఉండరని లేపుదామని కాల్ చేశాను అని చెబుతాడు. ఆ మాటలకు వాసుగారు పళ్ళునూరుతూ..
ఒరేయ్ ఎదవ... మంచి నిద్ర పాడుచేశావు కదరా... నీ పెళ్లి నా చావుకి వచ్చేటట్టు ఉంది. వెళతామని చెప్పాను కదా అంటే...
మీకు లేట్ అవుతుందేమో అని లేపాను అంతే డాడీ.గుడ్ మార్నింగ్. ఎలాగా లేచారు కదా.. రెడీ అయి బయలుదేరిపోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
వీడిని ఏ టైం లో కన్నావే బాబు. నా ప్రాణం తోడేస్తున్నాడు అంటే...నవ్వుకుంటూ పెళ్ళికి ముందు మీరేం చేసారో మరి అంటుంది.
ఆ మాటకి వాసు గారు సిగ్గుపడుతూ...ఆ రోజులే వేరు అంటాడు. కదా..మీకు ఎలాగో మీ అబ్బాయి కూడా అంతే. అదంతా వయసు ప్రభావం అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి అని బాత్రూంలోకి దూరతారు.
వాసుగారు కూడా శ్రీ ఆత్రానికి నవ్వుకుంటూ... పిచ్చఎదవ పెళ్లి అవుతేగానీ వీడికి తెలుసురాదు. హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా పెళ్లి పెళ్లి అని ఎగురుతున్నాడు.
సురభి రెడీ అయిన తర్వాత వాసు కూడా రెడీ అయ్యి దేవుడి గదిలో దీపం వెలిగించి..అన్నీ సర్దుకుని బయటికి వస్తారు.
వాసు మరీ బొత్తిగా ఆరే అయ్యింది. ఇక్కడ నుంచి ఒక గంటలో వెళ్ళిపోతాము. మరీ ఏడింటికే వెళితే బాగోదేమో అంటే...
ఆ మాటకి కోపంగా చూస్తూ... ఆ ముక్క నాకు కాదు. నీ కొడుక్కి చెప్పు అంటున్నంతలోనే. మళ్లీ ఫోన్ రింగ్ అవుతుంది.
మళ్లీ ఎవరు అనుకుంటూనే ఫోన్ చూస్తారు. ఇంకెవరు నీ కొడుకే అయి ఉంటాడు అనగానే.. నిజమే వాసు నీకు ఎలా తెలిసింది.
వాడు ఆత్రం అర్ధం కావడం లేదా..లిఫ్ట్ చెయ్ లేకపోతే అక్కడ ఎదవకి టెన్షన్ తో మోషన్స్ అవుతాయి అంటారు.
అబ్బా వాసు మరీ అంత ప్రెస్టేట్ అవ్వకు అని చెప్పి.. లిఫ్ట్ చేసి చెప్పరా అంటే.. మమ్మీ బయలుదేరారా అంటే.. ఒరేయ్ ఇంకా ఆరే అయింది రా.
ఏడు అయ్యేటప్పటికీ వెళ్ళిపోతాము. మరీ అంత పొద్దునే వెళ్తే బాగోదు రా అంటే.. వాళ్ళు అలాగే ఏమీ అనుకోరు మమ్మీ.
అయినా పల్లెటూరు అంటే అందరూ ఎర్లీగా లేచిపోతారు కదా.... ఎంత లేచినా సరే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటాయి కదరా..
చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే బాగోదు రా.. నా మాట విన రా.. ఏమీ అనుకోరు కానీ మీరు బయలుదేరండి కంగారుపెట్టి కార్ ఎక్కిస్తాడు.
కారు ఎక్కిన వాసు గారు డ్రైవర్ తో నన్ను ఆ ఊరు వెళ్లాక లేపు. అప్పుడు దాకా అసలు లేపొద్దు అని భార్య వైపు తిరిగి.. ఫోన్స్ రెండు సైలెంట్ లో పెట్టి నువ్వు కూడా పడుకో.
లేకపోతే ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటాడు అని. ఇద్దరి ఫోన్లు తీసికుని సైలెంట్ లో పెట్టేసి పడుకుంటారు.
Posts: 319
Threads: 8
Likes Received: 2,473 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
271
Part - 70
సురభి వాసు 7 అయ్యేటప్పటికల్లా నేహా వాళ్ళ ఊరు చేరుకుంటారు. అక్కడ నేహా నాన్నగారైన శ్రీను గారి అడ్రస్ కనుక్కొని వెళతారు.
వీళ్ళు ఇంటికి వెళ్లేటప్పటికీ నేహా వాళ్ళ అమ్మగారు అయిన లక్ష్మి గారు ఇల్లంతా శుభ్రం చేయించేసి ముగ్గులతో ముందు అలంకరిస్తారు.
గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు కడతారు. నలుగురు ముత్తయిదువుల్ని పిలిచి ఇల్లంతా హడావుడి చేస్తూ ఉంటారు.
అది చూసిన సురభి గారికి చాలా బాగా అనిపిస్తుంది. ఇల్లంతా ఇలాగా శుభ్రంగా ఉంచారు అంటే... నేహ కూడా ఇంటిని ఇలాగే ఉంచుతుంది అనుకుంటారు.
వాసుగారికి కూడా ఆ ఎన్విరాన్మెంట్ బాగా నచ్చుతుంది. రోజు హాస్పిటల్సు, మెడిసిన్స్ వాసన మధ్యన ఉన్న వాసు గారికి చాలా ప్లసెంట్ గా అనిపిస్తుంది.
లక్ష్మీగారు కంగారుపడుతూ ఉంటే...సురభిగారు ఆవిడ చేయిపట్టుకుని ఎందుకు మీరు కంగారు పడుతున్నారు. మనం అన్ని ముందే మాట్లాడుకున్నాం కదా... టెన్షన్ పడకండి.
ఎంతైనా మగ పెళ్లి వారు కదా...అందులోనూ మీరు చాలా పెద్ద వాళ్ళు అంటే...పెద్ద చిన్న అని ఏమి తేడా ఉండదండి.
మన మనస్తత్వాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. మాకు అలాంటి పట్టింపులు ఏమీలేవు. అయినా రేపు మీ అమ్మాయి మా ఇంటికి వచ్చేస్తే అది కూడా మీది కాదా... అందరూ సమానమేనండి అని చెబుతారు.
సురభి మాట తీరు లక్ష్మీ గారికి బాగా నచ్చుతుంది. ఆవిడ మంచితనం ఏంటో కూడా అర్థం అవుతుంది. తన కూతురి అత్తగారిల్లు చాలా గొప్ప మనసు కలది అని ఆవిడ సంతోషపడతారు.
శ్రీను, వాసు గారు కబుర్లో పడతారు..ఇద్దరూ కూడా చాలా ఫ్రీగా కలిసిపోతారు. వాసుగారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే.. అబ్బా అని తల పట్టుకుంటారు.
ఏమైందండి..ఏదైనా ఎమర్జెన్సీ కాలా అని శ్రీను గారు అడిగితే.. అవునండి చాలా ఎమర్జెన్సీ కాల్. మీ అల్లుడు నుంచే ఈ ఫోను అని చెప్పి..
లిఫ్ట్ చేసి చెప్పరా బాబు అంటే.. నాన్న ఏం చేస్తున్నారు. మాటలు అయిపోయయా... పెళ్లికాయం చేసేసారా అని అడుగుతాడు.
ఒరేయ్ నీ ఆత్రం తగలెయ్య వచ్చి ఎంతసేపు అయింది రా... ఒక్కొక్క పని అవ్వాలి కదా... నీకు నేను అప్డేట్స్ ఇస్తానని చెప్పాను కదా...
ఇంకొకసారి ఫోన్ చేసావు అనుకో.. మొత్తం అన్ని క్యాన్సిల్ చేసేసి.. నీకు పెళ్లి అనే చాప్టర్ లేకుండా క్లోజ్ చేసేస్తాను అర్థం అవుతుందా.. పెట్రా ఫోను అని పెట్టి పెట్టేస్తారు.
శ్రీ ఫోన్ వైపు చూస్తూ నా కంగారు మీకు ఏమి అర్థం కావడం లేదు. ఏంటో అసలు మీరు మా డాడీ ఏనా అనుకుంటూ... ఫోన్నే తదేకంగా చూస్తూ ఉంటాడు.
టైం పాస్ ఎలా చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. వర్క్ చేద్దాము అని లాప్టాప్ ఓపెన్ చేస్తాడు. వర్క్ చేయబుద్ది అవదు.
రాజ్ కి కాల్ చేస్తే అని... రాజ్ నెంబర్ ట్రై చేస్తాడు. అమ్మో వద్దులే... వీడికి తెలిసింది అంటే గనక... నన్ను ఒక రేంజ్ లో ఆడుకుంటాడు.
ఇప్పుడు ఏం చేయాలి.. విక్రమ్ కి కాల్ చేయనా అని ఆలోచిస్తాడు. అసలే హనీమూన్ మూడ్ లో ఉన్నాడు. చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఒక తన్ను తన్నుతాడు.
ఎవరో ఒకరితో మాట్లాడకపోతే నాకు ఈ టెన్షన్ తగ్గదే ఏం చేయాలబ్బా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు.
నేహా ఫ్లాట్ కి వెళితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాడు. మరి ఓవర్గా ఉండదా అని థింక్ చేస్తూ ఉంటాడు. ఒక పని చేద్దాం...
బయటకి వెళ్లి నేహా కోసం తనకి ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ అండ్ రోజెస్ తీసుకువస్తాను. నేహ కి మెసేజ్ చేస్తాడు. మీరు ఏమి బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేయొద్దు నేను తీసుకొస్తాను.
ఇంతకీ నేహా కి ఏమి ఇష్టమో అడిగితే బాగుంటుందా.. వద్దులే..నాలుగైదు రకాలు తీసుకువస్తే తనకు నచ్చింది ఏదో ఒకటి తింటుంది అని.. ప్లాట్ లాక్ చేసుకుని బయటికి వెళ్తాడు. నేహా పెట్టిన మెసేజ్ కూడా చూడడు.
కిందకి వెళ్లి ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియక..లేడీస్ ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇష్టపడతారు అనుకుంటా కదా.... బోండా, పూరి, మసాలాదోస ఎందుకైనా మంచిది ఇడ్లీ కూడా ప్యాక్ చేపిస్తాడు.
పక్కనే రోజస్ కనపడితే అందులో నుంచి..ఫస్ట్ రెడ్ రోజ్ తీస్తాడు. అమ్మో ముందే ఇది ఇచ్చాము అంటే... సీన్ సితార అయిందనుకో వద్దు కష్టం అనుకొని...
ఎల్లో రోజ్ తీసుకుంటాడు. ఇదైతే ఫ్రెండ్షిప్ కి సింబల్ కాబట్టి తను ఏమీ ఫీల్ అవ్వదు అనుకుని అవన్నీ పుచ్చుకొని వెళ్లి నేహా ఫ్లాట్ డోర్ నాక్ చేస్తాడు.
డోర్ తీసిన నేహ ను చూసి శ్రీ కళ్ళు నోరు వదిలేస్తాడు. ఏమైంది శ్రీ గారు అని అడిగితే.. ఆహా ఏమీ లేదు ఈరోజు ఏమిటో చాలా కొత్తగా కనిపిస్తున్నావు అని తదేకంగా చూస్తూ ఉంటాడు.
లోపలికి రండి అని...ఈరోజు ఎందుకో తెలియదు అమ్మ చీర కట్టుకోమంది. అందుకే కట్టుకున్నాను బాగుందా అని అడుగుతుంది.
చాలా ము... అనబోయి ఆ మాట మింగేసి బాగున్నావు అని చెబుతాడు. థాంక్యూ శ్రీ గారు...
ఈ చీరకి ఈ పువ్వు పెట్టుకుంటే ఇంకా బాగుంటావు అని ఆ రోజ్ ఇస్తాడు. థాంక్యూ... నాకు ఎల్లో అంటే చాలా ఇష్టం అని ఆ పువ్వు తలలో పెట్టుకుంటుంది.
తను ఇచ్చిన పువ్వు నేహా అలా పెట్టుకోగానే క్లౌడ్స్ మధ్యలోనే ఉంటాడు. గుండె పైన చెయ్యి వేసి రబ్ చేసుకుంటూ...కూల్ శ్రీ కూల్.
ఇంకా ముందు ముందు చాలా ఉంది అనుకుంటూ డైవర్ట్ అవ్వడానికి... ఇదిగో బ్రేక్ ఫాస్ట్ అని ఇస్తాడు. ఎందుకు శ్రీ గారు ఇన్ని వెరైటీస్ తెచ్చారు.
నేనే ప్రిపేర్ చేసే దాన్ని కదా అంటే... రోజు నువ్వే కదా చేస్తున్నావు. జస్ట్ ఫర్ చేంజ్ అంతే అని ఇస్తాడు. అవన్నీ ఓపెన్ చేసి ఇన్ని రకాలు ఎందుకు.
ఏదో ఒకటి తెస్తే సరిపోతుంది కదా...నీకు ఏమి ఇష్టమో నాకు తెలియదు కదా.. నేను తెచ్చింది నచ్చిన, నచ్చకపోయినా నువ్వు అలా తినడం నాకు ఇష్టం లేదు.
నీకు ఏది ఇష్టమో అదే తిను అని చెబుతాడు. ఒక్క నిమిషం ఆలోచించి రెండు ప్లేట్స్ తీసుకుని అన్ని టిఫిన్స్ ని రెండు ప్లేట్స్ లోనే సర్ది ఒక ప్లేటు శ్రీకి ఇస్తుంది.
నేహ చేసినదాన్ని చూస్తూ ఉంటాడు. ఏమైంది శ్రీ గారు అంటే... ఏమీ లేదు ఏదో ఒకటి తింటావు. మిగిలినవి అన్ని వేస్ట్ అవుతాయి అనుకున్నాను.
బట్ నువ్వు ఏది వేస్ట్ అవ్వకుండా నీటుగా సర్దేవ్ కదా... చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపడడానికి ఏముంది.
మా నాన్నగారి వ్యవసాయం చేస్తారు కాబట్టి నాకు ఫుడ్ వాల్యూ బాగా తెలుసు అని చెబుతుంది. ఓ...ఏం మాట్లాడాలో తెలియక అవిని ఏమైనా ఫోన్ చేసిందా అని అడుగుతాడు.
వాళ్లు వెళ్ళింది హనీమూన్ కి సార్... ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తూ ఉంటారా అని నవ్వుతుంది. ఆ నవ్వుతో జత కలిపి అది నాకు తెలుసు కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంతే అని బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు.
నేహా కాఫీ కలిపి చేతికి ఇస్తుంది. థాంక్యూ అని చెప్పి కాఫీ తాగుతూ ఉంటాడు. నీకు ఒక విషయం చెప్పనా అంటాడు.
చెప్పండి. నీ చేతి కాఫీ తాగుతూ లైఫ్ లాంగ్ బ్రతికేయొచ్చు తెలుసా.. అంత టేస్టీగా ఉంటుంది అని చెబుతాడు.ఏదో మీ అభిమానం శ్రీ గారు.
లంచ్ మాత్రం నేనే ప్రిపేర్ చేస్తాను. మీరు మాత్రం ఏమీ ఆర్డర్ పెట్టొద్దు అని చెప్పి కిచెన్లోనికి వెళ్ళిపోతుంది. నేహా కిచెన్లో లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే...
అక్కడ గోడకి నిలబడి నేహా కి కబుర్లు చెబుతూ ఉంటాడు. ఆ కబుర్లకి నేహా నవ్వుతూ గబగబా లంచ్ ప్రిపేర్ చేసి ఇద్దరికీ బాక్సులు ప్యాక్ చేసేస్తుంది.
ఆ బాక్స్ శ్రీ చేతికి ఇచ్చి నేను ఇంకా బయలుదేరుతాను అని చెబుతుంది. ఒకే ఆఫీసులో కలుద్దాము అని శ్రీ కూడా బయటకు వస్తూ ఉంటే..
నేహా ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ చూసి అమ్మ ఏమిటీ ఈ టైంలో ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అంతే శ్రీ అడుగుల ఆగిపోయి చెవులు రెక్కరించి మరీ వింటూ ఉంటాడు.
శ్రీ కి ఏమి వినిపించదు. కానీ నేహా ఫేసులో రంగులు మారుతూ ఉంటాయి. అది చూసి శ్రీ గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది.
ఏమై ఉంటుందా అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ఫోన్ పెట్టేసి శ్రీవైపు తిరిగి ఇంకా మీరు వెళ్లలేదా అని అడుగుతుంది. వెళుతున్న..
ఏమైంది నీ ఫేస్ ఏదో లాగా ఉంది అని ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతాడు.
నేహా ఏమి చెబుతుంది...
కథ కొనసాగుతుంది...
The following 13 users Like SivaSai's post:13 users Like SivaSai's post
• aarya, ash.enigma, gora, karthikkumar27111, Mahesh12345, Nivas348, Sachin@10, shekhadu, Sun217, Sunny73, The Prince, vikas123, yekalavyass
Posts: 4,455
Threads: 9
Likes Received: 2,832 in 2,177 posts
Likes Given: 10,425
Joined: Sep 2019
Reputation:
30
•
Posts: 889
Threads: 2
Likes Received: 525 in 362 posts
Likes Given: 938
Joined: May 2019
Reputation:
6
I'm liking this cute innocent love story between Neha n Sri!!!
Awesome narration Siva garu
•
Posts: 319
Threads: 8
Likes Received: 2,473 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
271
01-02-2026, 08:44 AM
(This post was last modified: 01-02-2026, 08:44 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 71
నేహా ఏమి చెబుతుందో అని చూస్తూ ఉంటాడు. ఏమీ లేదు శ్రీ గారు అంటే.. పర్వాలేదు చెప్పు అని చేయి పట్టుకుంటాడు.
అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని పెళ్లి కుదిరింది అని చెబుతుంది. దీనికి ఎందుకు అంత ముభావంగా ఉన్నావు. నీకే పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతాడు కానీ..ఎక్కడ ఇష్టం లేదని చెబుతుందో.... అని గుండె టక్ టక్ అని కొట్టుకుంటూఉంటుంది.
నేహా మౌనాన్ని చూస్తుంటే తన గుండె శబ్దం తనకే వినపడుతున్నట్టు ఉంటుంది. చెమటలు పడుతూ ఉంటాయి.
ప్లీజ్ నేహ... నువ్వు అలా సైలెంట్ గా ఉంటే నాకు టెన్షన్గా ఉంది. ప్లీజ్ చెప్పు అని గెడ్డం పట్టుకుని అడుగుతాడు .
నేను కొన్ని రోజులైనా జాబ్ చేసి మా నాన్నగారికి అండగా నిలబడాలి అనుకున్నాను కానీ. ఇలా పెళ్లి కుదిరితే నేను ఎలా నిలబడగలుగుతాను.
ఎంత చెప్పుకున్నా.. ఈ రోజుల్లో అమ్మాయి, అబ్బాయి సమానమే అని చెబుతారు కానీ..పెళ్లయిన తర్వాత అబ్బాయి తన తల్లిదండ్రులకు ఖర్చు పెట్టినంత ఈజీగా ఆడపిల్ల ఖర్చు పెట్టలేదు.
పెళ్లి అయినా కూతురి దగ్గర తీసుకోవాలి అంటే తల్లిదండ్రులకు అభిమానం అడ్డువస్తుంది. ఏదో ఒక టైంలో అల్లుడుగాని, అత్తింటివారు దెబ్బుతారు అన్న భయం అన్నది ఉంటుంది.
ఒక్కొక్కసారి మన పద్ధతులను చూస్తూ ఉంటే కోపమే వస్తుంది. చిన్నప్పటినుండి అబ్బాయిని ఎలా చదివిస్తారో అమ్మాయిని అలాగే చదివిస్తారు.
పైగా ఎక్స్ట్రా బంగారం, పెళ్లి కోసం కట్నం అన్నీ రెడీ చేస్తారు. ఎంత చదువుకున్నా సరే ఈ కట్నాలు ఇవ్వడం అన్నది పోదు కదా..
మాకు అమ్మాయి చాలు కట్నం ఏమీ వద్దు అంటారు కానీ... ఏమీ పట్టుకెళ్ళకుండా వెళితే ఏదో ఒక టైం లో మాట వస్తుంది కదా...
అందరూ అలా ఉంటారని అనను కానీ... ఇలా కొంతమంది అయినా ఉంటారు కదా... ఆ కొందరులో నాకు వచ్చిన పెళ్ళికొడుకు ఫ్యామిలీ ఉంటే...
నేను ఎలాగా మా వాళ్లకు అండగా నిలబడగలను. అలా అని మా నాన్నగారికి ఎదురు చెప్పలేను. అదే నాకు బాధగా ఉంది అని చెబుతుంది.
నేహా కి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమను చూసి శ్రీ అబ్బురపడతాడు. ఎంత ప్రేమ మీ తల్లిదండ్రులు మీద అని మురిసిపోతాడు.
అలా ఎందుకు ఆలోచిస్తున్నావు నిన్ను నిన్నుగా అర్థం చేసుకుని మీ తల్లిదండ్రులను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు వస్తాడేమో...
ఆ మాటలకి నవ్వుతూ అవి చెప్పుకోవడానికి బాగుంటాయి. ఏ కథలోనే, సినిమాలోనే జరుగుతాయి. చాలా తక్కువ.
నువ్వు ఉన్నావేమో అంటాడు. అంత అదృష్టం కూడానా... ఏమో ఎవరో చెప్పగలం. ఈ మాత్రం దానికి ఇంత డల్ అయిపోతావా.
చీరప్ అని చెప్పి.. ఈరోజు నేను డ్రాప్ చేస్తాను పదా అని.. నేహా చెప్పేది కూడా వినిపించుకోకుండా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్లి కార్ ఎక్కిస్తాడు.
కార్ లో మోనంగా కూర్చున్న నేహాని డైవర్ట్ చేయడానికి..
పెళ్ళికొడుకు పేరు ఏమిటి... తెలియదు శ్రీ గారు... అదేంటి.. ఏమి తెలుసుకోకుండానే పెళ్లికి ఒప్పుకున్నావా...
నాన్నగారికి తెలుసు కదా... నాకు ఎలాంటి వాడు వస్తే నేను సంతోషంగా ఉంటాను అన్నది. ఇంకా పనిగట్టుకుని ఏమి అడుగుతాము.
ఆ మాటలికి ఆశ్చర్యముగా చూస్తూ నీ నాలాంటి అమ్మాయి ఈ రోజుల్లో ఉండరు. అందరూ అబ్బాయి ఎత్తు నుంచి కలర్ వరుకు, ఫైనాన్సియల్ స్టేటస్ ఇంకా ఫ్రీడమ్ వరుకు అన్ని ఒకే అయ్యితేనే రెడీ అంటున్నారు.
నువ్వు ఏమిటీ అంటే అంత మా నాన్నగారి ఇష్టం అంటున్నావు. నువ్వు సొమెథింగ్ స్పెషల్ అంటూ...
ఆఫీస్ ముందు ఉన్న బస్టాప్ దగ్గర కార్ ఆపుతాడు.
కార్ దిగి థాంక్స్ చెప్పి ఆఫీసుకి వెళ్ళిపోతుంది. వెళుతున్న నేహాని చూసి నవ్వుకుంటూ వాసుగారికి కాల్ చేస్తాడు.
చెప్పారా సూపుత్ర అనగానే... డాడ్ అంటాడు. ఇప్పుడే అంటున్నాను.. నీ కొడుకు ఇంకా ఫోన్ చేయలేదు ఏమిటా అని... తెలిసిందిలే...
ఎవరు చెప్పారు.. మా కోడలు పిల్ల... హ.. అవును.
నా పేరు కూడ చెప్పకుండా పెళ్లి కుదిరిచేసారా అని అలకగా అంటాడు.
ఒరేయ్ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పకపోతే నేనేం చేస్తానురా... ఇంతకి కోడలు పిల్ల ఏం చెప్పింది అని అడుగుతారు.
వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెబుతాడు. నా కోడలు పిల్ల చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తుంది రా.. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
ఈ ఊరిలోనే ఒక 50 ఎకరాలు బిట్ కొని శ్రీను గారికి కౌవులికి ఇద్దాం అనుకుంటున్నాను. యువర్ అమేజింగ్ డాడ్ అని అంటాడు.
మరి ఎక్కువ పొగడకు రా... నీకు తిక్కరేగిందంటే ఆ పొగడ్తల్లోనే ముంచేస్తావు. ఇంతకీ నీకు ఎంగేజ్మెంట్ కావాలా లేదా డైరెక్ట్ గా పెళ్లి చేసేయ్మంటావా అంటే..
నో.. నో.. నాకన్ని పద్ధతి ప్రకారం జరగాల్సిందే.. అది విక్రమ్ వచ్చిన తర్వాత పెట్టుకుందాం అని చెబుతాడు. సరే ఏదైనా మీ ఇష్టం అని ఫోన్ పెట్టేస్తారు.
తనకి కేబిన్ కి వెళ్ళిన తర్వాత ఈ ఆనందాన్ని ఎవరో ఒకరితో షేర్ చేసుకుంటే కానీ తన గ్యాస్ తగ్గదు అని రాజ్ కి ఫోన్ చేస్తాడు.
పడుకున్న రాజ్ నిద్ర మత్తులో హలో అంటే... ఏరా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఎదవ...
పడుకున్నావాడికి ఫోన్ చేసి ఏమి చేస్తున్నావు అని అడుగుతావా... అరుస్తూఉంటే... అబ్బా... నీకో గుడ్ న్యూస్ చెబుదాము అని ఫోన్ చేసాను అని ఉత్సాహంగా
చెబుతాడు.
ఏంట్రోయ్ గుడ్ న్యూస్...కొంపతీసి నీకు పెళ్లి కుదిరిందా ఏమిటి అంటే... అరే.. అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసావు అని అడుగుతాడు.
నీ ఆత్రం చూస్తుంటేనే అర్థం అవుతుంది. పడుకున్నావాడ్ని లేపి మరీ చెబుతుంటే... మా టైమింగ్స్ తెలిసి కూడా చేసావు చూడు..
అక్కడే క్లియర్గా అర్థమైందిలే. ఇంతకీ నేహా ఒప్పుకుందా అని అడిగితే..లేదురా అంటాడు. మరి ఎలాగా సెట్ చేసావు అంటే..
ఇటు నుంచి అవ్వదని అర్థమయ్యే అటునుంచి నరుక్కువచ్చాను అంటాడు. ఎటు నుంచి నరుక్కువచ్చావు అంటే...జరిగింది మొత్తం చెబుతాడు.
దానికి నవ్వుతూ బానే సెట్ చేసావు లే.. పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు అంటే.. నువ్వు, విక్కీ ఎప్పుడైతే ఉంటారో అప్పుడే పెళ్లి.
విక్కీ కూడా ఫోన్ చేయాలి నువ్వు ఫోన్ పెట్టేయ్. ఒరేయ్ వాడు హనీమూన్ మూడ్ లో ఉన్నాడు. అనవసరంగా డిస్టర్బ్ చేయకు అని రాజ్ అరుస్తూ ఉండగానే ఫోన్ పెట్టేస్తాడు.
ఎదవ ఫోన్ పెట్టేసాడు. వీడికి మరి ఆత్రం ఎక్కువవుతుంది. విక్కీ చేతులో ఏదో ఒకటి వీడికి మూడిందిలే అనుకుంటు నా పెళ్ళాం ఎక్కడుందో అనుకుంటూ తలగడ పట్టుకుని పడుకుంటాడు.
ఫోన్ రింగ్ అవుతుంటే విక్రమ్ నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పరా పెళ్ళికొడకా అంటాడు. అరే అప్పుడే నీకు ఎలా తెలిసింది అంటే..మాకు అన్నీ అలా తెలిసిపోతాయిలే.. కానీ ఏంటి సంగతులు అంటాడు. పెళ్లి కుదిరింది మామ అని గొప్పగా చెబుతాడు.
ఆ విషయం మాకు తెలుసు గాని... నేహా కి తెలుసా అంటే లేదురా అని డల్ గా చెప్పాడు. మా మామగారు పెళ్లి కుదిరింది అని చెప్పారు కానీ పెళ్లి కొడుకు పేరు చెప్పలేదు నీరసంగా చెబుతాడు.
హ.. హ... నవ్వుతూ నీ ఆత్రానికి, మీ మామగారు నిదానానికి సరిపోయింది. హ్మ్.. అవున్రా ఎంగేజ్మెంట్ రోజునే రివిల్ చేసేటట్టు ఉన్నారు అని వాపోతాడు.
ఈ పాటికి తెలిసి ఉంటే అందరికి ఒక పెద్ద ట్రీట్ ఇచ్చేసేవాడిని. నేహా అడిగితే ఏం చెబుతావు రా అంటే... దేని గురించి బావ.
నాకంటే తెలియదు. మీకు తెలుసు కదా.. ఎందుకు చెప్పలేదు అన్నదే అనుకో ఏమని చెబుతావు...
నీకు తెలిసేమో అనుకున్నాను అని అంటాను.
దానికి ఒరేయ్ మట్టి బుర్ర.. ఆల్రెడీ జరిగిందంతా నీకు చెప్పే ఉంటుంది కదా.. తనకు ఏమీ తెలీదు అని నీకు తెలుసు కదా...
మళ్లీ నీకు తెలిసేమో అనుకున్నాను అంటే.. నమ్ముతుందా నిన్ను ఎలా చూస్తుంది. మరి ఇప్పుడు ఏం చెప్పాలి బావా అంటే.. అది కూడా మేమే చెబితే ఎలా రా...కొంచెం ఆలోచించు.
పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టారు అంటే...ఏదైనా మీరు వచ్చిన తర్వాతే అని చెబుతారు. మేము రావడానికి ఇంకొక వారం పడుతుంది రా...
మీరు వచ్చే టైమ్ కి ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాము. ఒకే బై అని ఫోన్ పెట్టేసి భార్యని అల్లుకుపోతాడు.
ఇక్కడ శ్రీ మాత్రం నేహా తో లైఫ్ ఊహించుకుంటూ లైఫ్ అనే డ్రీమ్స్ క్లౌడ్ లో ఎగురుతూ ఉంటాడు.
ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది...
The following 12 users Like SivaSai's post:12 users Like SivaSai's post
• ash.enigma, gora, k3vv3, karthikkumar27111, Mahesh12345, Nivas348, Sachin@10, shekhadu, Sunny73, The Prince, vikas123, yekalavyass
Posts: 319
Threads: 8
Likes Received: 2,473 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
271
Part - 72
విక్రమ్, అవని హనీమూన్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసారు. అవని మొహం కొత్త కళతో మెరిసిపోతూ ఉంటుంది. అది చాటు నుంచి చూసిన ధనుంజయ్ ముఖం వెలిగిపోతూ ఉంటుంది.
కూతురి ఆనందం చూసి గుడికి వెళ్లి కూతురు, అల్లుడు మీద అర్చన చేపించి అన్నదానాలు చేపిస్తాడు తనకు తెలిసిన అన్ని అనాధశరణాలయాలకి, వృద్ధాశ్రమాలకి భారీ మొత్తంలో విరాళాలు ఇస్తాడు.
అది చూసిన సత్యవతి గారు ఒక పక్కన ఆనందపడిన, మరో పక్క బాధపడుతూ నువ్వు ముందే తెలుసుకొని ఉండి ఉంటే మీ మధ్యన ఇంత దూరం వచ్చి ఉండేది కాదు కదా అని బాధపడతారు.
ఇంటికి వచ్చిన అవని నీ లేడీస్ అందరూ చుట్టేస్తారు. నివి లోపలికి తీసుకెళ్లి వదిన మీ హనీమూన్ ముచ్చట్లు చెప్పు అని టీస్ చేస్తూ ఉంటుంది.
ఆ మాటలకు అవిని సిగ్గుపడుతూ ప్లీజ్ నివి అంటుంది. ఎందుకు వదిన అంత సిగ్గు. మా అన్నయ్య మరి అంతలా చేసుకున్నాడా అని కన్ను కొడుతుంది..
ఆ మాటలకి అవిని నోరుతెరిచి చూస్తుంది. బాబోయ్ మీ అన్న చెల్లెలు ఉన్నారే... తక్కువ వాళ్ళు కాదు. అయినా రేపు నీకు పెళ్లి అయితే నీకే తెలుస్తుందిలే.
ముందే రుచి చూస్తే అప్పుడు టేస్ట్ నీకు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి తుర్రుమంటుంది. వెళుతున్న అవని నీ చూసి నివి నవ్వుకుంటూ...
నీ సంతోషం ఎప్పుడూ ఇలాగే ఉండాలి వదిన అనుకుని అవని వెనకాలే బయటకు వెళుతుంది. నివి చేయి పట్టుకుని మాధవి లాగి... అవని ఏం చెప్పింది సంతోషంగానే ఉందా...
అత్త నీ కూతురు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు టెన్షన్ పడకు అని చెబుతుంది. ఆ మాటలకి... నాకు తెలుసు నా కూతురు సంతోషంగానే ఉంటుందని.
ఎందుకంటే అక్కడ ఉన్నది నా అల్లుడు కదా అంటుంది. అబ్బో మరి ఎందుకు అడిగినట్టు అని సాగదీస్తుంది. తల్లిగా ఆత్రం నాది అంతే... నా అల్లుడు అనుమానించి కాదు అని తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది.
నివి విక్రమ్ దగ్గరికి వెళ్లి డోర్ నాక్ చేస్తుంది. అది చూసి నీకు పర్మిషన్ కావాలా... లోపలికి రా.... వచ్చి వాళ్ళ అన్నయ్యని గట్టిగా హగ్ చేసుకుని... థాంక్స్ అన్నయ్య అంటుంది.
తల మీద చెయ్యి వేసి దేనికి రా... వదిన చాలా సంతోషంగా ఉంది. వదిన లాంటి అమ్మాయిని తీసుకువచ్చినందుకు నీకు థాంక్స్ చెబుతున్నాను.
మన ఇల్లు ఎప్పుడు ఇలా సంతోషంతో ఉంటే అదే చాలు అంటుంది. తప్పకుండా ఉంటుందిరా.. ఉండేటట్టుగా నేను చూసుకుంటాను కదా..
ఏం చేశారు ఈ పది రోజులు అందరూ అని కబుర్లలో పడతారు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా...
హ... మర్చిపోయాను.. మన శ్రీకి పెళ్లి కుదిరింది అంటాడు. ఓ... ఎవరా లక్కీ గర్ల్...నేహా అని చెబుతాడు. వదిన ఫ్రెండ్ నేహా నా... వెరీ నైస్ పెయిర్ అన్నయ్య.
ఇది ఎప్పుడు జరిగింది...బెంగళూరులో ఉన్నప్పుడు నుంచి సైట్ కొడుతున్నాడు. వాడికి వార్నింగ్ ఇచ్చి నేను ఫ్లైట్ ఎక్కాను. వచ్చేటప్పటికి సెట్ అయింది అని చెబుతాడు.
ఇది ఎప్పుడు జరిగింది నాకు తెలియలేదే అని అవని అంటే... నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేసావని. నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా నువ్వు చూసుకోవు.
నీ లోకంలో నువ్వు ఉంటావు. ఇంకా పక్కన వాళ్ళ గురించి నీకేం అర్థం అవుతుంది. వెంటనే నేను సీనియర్ కి కాల్ చేయాలి అని ఫోన్ కోసం చూస్తూ ఉంటుంది.
హలో మేడం కాస్త తట్టుకో అంటాడు. దేనికి.... మీ సీనియర్ కి విషయాలు ఏమీ తెలియవు. పెద్దలకు తెచ్చిన పెళ్లి గానే ప్రస్తుతానికి నేహా ముందుకు వెళుతుంది.
అదేంటి... నేహా కి పెళ్ళికి ముందు ప్రేమ ఇలాంటివన్నీటికి చాలా దూరం అని చెప్పింది. అందుకే వాడు అటు నుంచి నరుక్కువచ్చాడు అని చెబుతాడు.
ఆ మాటలకి కళ్యాణ్ గారు నవ్వుతూ చాలా కష్టాలు పడుతున్నట్టు ఉన్నాడు బిడ్డ... పెళ్లి కోసము...
అవునవును వాడు పడడమేకాదు. మమ్మల్ని పరిగెత్తిస్తున్నాడు అన్న మాట వినిపిస్తుంది. ఎవరు అని చూసేటప్పటికి....
అక్కడ సురభి, వాసు గారు కనిపిస్తారు. అరే వాసు రండి అని కళ్యాణ్ ఎదురు వెళ్లి హగ్ చేసుకుంటాడు. ఎలా ఉన్నావ్ వాసు. రామ్మా సురభి అని పిలుస్తారు.
లలిత ఎదురు వెళ్లి చేయి పట్టుకుని తీసుకోవస్తుంది. ఇందిరా గారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి బాగున్నారా పెద్దమ్మ గారు అని అడుగుతుంది..
నేను చాలా బాగున్నాను తల్లి..ఎలా ఉన్నావు... మేము చాలా బాగున్నాము అని చెబుతోంది. మరి వాసు ఏంటి చాలా టెన్షన్ పడుతున్నాడు.
ఆయన అన్ని అలాగే చెబుతారులే పెద్దమ్మ అంటుంది. కొడుకు ఏం చేశానా ఈవిడకి బాగానే ఉంటుంది. ఏమైందిరా... అసలు మమ్మల్ని పడుకోనివ్వడు.. నుంచోనివ్వడు.
ఆపరేషన్ అంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అది కూడా వాడే లాగేసుకుంటున్నాడు... ఎదవ అని చిరుకోపంగా చెబుతారు.
ఆ మాటలకు సురభి ఏంటండీ మీరు... వాడు చిన్న పిల్లోడు అంటే.. వాడిని ఇంకొకసారి చిన్న పిల్లోడు అని వెనకేసుకొచ్చావ్ అనుకో.. నీకు అసలు మర్యాదగా ఉండదు అని ప్రెస్టేట్ అవుతాడు.
ఆ మాటలకి నవ్వుతూ ఏమయింది వాసు.. మరీ అంత ప్రెస్టేట్ అవుతున్నావు అంటే... వాడికి ఆ టైము, ఈ టైం అని ఏమీ ఉండడం లేదు.
ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఫోన్ చేసి నా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి... మీరు ఏం కొన్నారు..ఏం చేశారు? ఎన్నింటికి అని పిచ్చి ప్రశ్నలు వేస్తూ టార్చర్ పెడుతున్నాడు రా అని..
నేహా వాళ్ళ ఊరు వెళ్లే ముందు రోజు ఎన్నింటికి లేపాడో చెబుతాడు. ఆ మాటలకు అందరూ నవ్వుకుంటూ మన పెద్దలు ఊరికే చెప్పలేదు కదా...
కొత్త పిచ్చోడు పొద్దెరగడు అని అంటే.. ఇది నిజమే అని వాసుగారు కూడా వంతు పాడుతారు. ఈ శుక్రవారం నిశ్చితార్థం వచ్చింది. వచ్చే వారమే పెళ్లి అని చెబుతారు.
అదేంట్రా అంత తొందరగా పెట్టిసావు అంటే... నా కొడుకు టార్చర్ కన్నా...ఒక పది రోజులు పడుకోకుండా పెళ్లి పనులు చూసుకోవడం చాలా బెటర్ కళ్యాణ్... నీకు అర్థం కావడం లేదు.
ఆ మాటలకు విక్రమ్ నవ్వుతూ... మీరు ఏం టెన్షన్ పడకండి అంకుల్. మేమన్నాము కదా మేము చూసుకుంటాము అని చెబుతాడు.
మీరందరూ ఉన్నారనే నా ధైర్యం కూడా..ఇంతకీ రాజ్ ఎప్పుడు వస్తున్నాడు. మే బి ఈరోజు గాని, రేపు గాని వచ్చేయొచ్చు అని చెబుతాడు.
మీరిద్దరూ ఉంటే వాడిని కాస్త కంట్రోల్లో పెట్టగలుగుతారు. లేకపోతే నాకున్న ఈ కాస్త జుట్టు కూడా వాడే పీకేసేటట్టున్నాడు అని తల మీద చెయ్యి పెట్టుకుని చెబుతారు. ఆ మాటకి అందరూ చాలా గట్టిగా నవ్వుతారు.
సురభి చిరుకోపంగా చాల్లే వాసు మరి ఎక్కువ ఆటపట్టిస్తున్నావు. అవని వైపు తిరిగి అమ్మ అవని..మాకు ఉన్నది ఒక్కడే కొడుకు.
వాడికి చెప్పుకోవడానికి అక్కాచెల్లెళ్ళు ఎవరూ లేరు. నీకు ఇబ్బంది లేదు అనుకుంటే.... మా ఇంటి ఆడపడుచుగా వాడి పెళ్లి అయ్యేవరకు అన్ని పనులు ఆడపడుచు హోదాలో చెయ్యమ్మా అని అడుగుతారు.
ఆ మాటలకు ఒకసారి విక్రమ్ వైపు, ఇందిరాగారి వైపు చూస్తోంది. ఇద్దరు ప్రశాంతంగా నవ్వుతూ చూస్తూ ఉంటే.. తప్పకుండా పెద్దమ్మ గారు నేను ముందే వచ్చేస్తాను.
16 రోజుల పండగ అయ్యేదాకా అన్ని దగ్గరుండి చూసుకుంటాను సరేనా అని చెబుతోంది. తప్పకుండా.. అన్ని నీ చేతుల మీదుగా జరిగితే అంతకన్నా సంతోషమా అని అందరికీ మరీ మరీ చెప్పి వెళ్ళిపోతారు.
అందరి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోగా... అవని మిర్రర్ ముందు నిలబడి మెడలో ఉన్న జ్యువలరీ అన్నీ తీసి పక్కన పెట్టి, సారీ మార్చుకోవడానికి అని భుజం మీద పిన్ని తీయడానికి చేయి వేస్తుంది.
ఇంతలో నడుం మీద చల్లగా విక్రమ్ చేతులు తగులుతాయి. ఆ స్పర్శకి ఒక్కసారి ఉలిక్కిపడి తల వెనక్కి తెప్పి ఏంటో శ్రీవారు అని అంటుంది.
భుజం మీద చిన్నగా పంటిగాటు పెట్టి.. ఏంటి మేడం ముందే శ్రీ వాళ్ళ ఇంటికి వెళ్లి పోతావా.. 16 రోజుల పండగ అయ్యేవరకు రావా... అక్కడే ఉండిపోతే నా పరిస్థితి ఏంటి అని అడుగుతు నడుం మీద గట్టిగా నొక్కుతాడు.
స్... అబ్బా... నొప్పిగా ఉంది. చెప్పేముందు మీవైపే చూశాను కదా.. ఇప్పుడు మళ్ళీ నన్ను అంటున్నారు ఏంటి పెదాలు ముడిచి అలకగా అంటుంది. ముడిచిన పెదాలపై చిన్నగా పెక్ ఇచ్చి...
ప్రతిరోజు పొద్దుట నేనే డ్రాప్ చేస్తాను. నైట్ నిన్ను తీసుకువచ్చేస్తాను అని చెబుతాడు. రోజు తిరుగుతారా అంటే... మనం ఉన్నచోటుకి అది ఏమన్నా దూరమా...
ఆఫీస్ కి వెళ్లే దారిలోనే... రోజు నేను ఎలాగ వచ్చి చూడాల్సిందే కాబట్టి...నిన్ను దింపేసి నేను అలా ఆఫీస్ కి వెళ్ళిపోతాను.
రోజు నైట్ అలా వస్తే బాగోదేమోనండి అని ఇబ్బందిగా అంటే.. అలవాటైపోయావే భార్యామణి. పక్కన లేకపోతే అస్సలు నిద్ర పట్టడంలేదు అని నడుం మీద వేళ్ళతో నాట్యం చేస్తూఉంటాడు.
ఆ నాట్యానికి చెక్కిలిగింతలు పుట్టి.. ప్లీజ్ అండి... మెలికల తిరుగుతూ నవ్వుతుంది. ఈ నవ్వు చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా అని ఎత్తుకుని మంచం మీద వదులుతాడు.
పెళ్లి పనులు మొదలవుతున్నాయి..
కథ కొనసాగుతుంది...
The following 14 users Like SivaSai's post:14 users Like SivaSai's post
• ash.enigma, gora, Jola, k3vv3, karthikkumar27111, Mahesh12345, Nivas348, Reddy 211993, Sachin@10, shekhadu, Sunny73, The Prince, vikas123, yekalavyass
Posts: 4,455
Threads: 9
Likes Received: 2,832 in 2,177 posts
Likes Given: 10,425
Joined: Sep 2019
Reputation:
30
•
Posts: 262
Threads: 0
Likes Received: 193 in 132 posts
Likes Given: 1,123
Joined: Mar 2022
Reputation:
5
•
Posts: 889
Threads: 2
Likes Received: 525 in 362 posts
Likes Given: 938
Joined: May 2019
Reputation:
6
•
Posts: 319
Threads: 8
Likes Received: 2,473 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
271
Part - 73
శ్రీ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేస్తాడు. రాజ్ కూడా హైదరాబాద్ చేరుకుంటాడు. నేహా 2 డేస్ ముందే లీవ్ పెడుతుంది.
అవిని నేహ కి ఫోన్ చేస్తుంది. హలో సీనియర్ అని పిలుస్తుంది. హాయ్ అవని ఎప్పుడొచ్చారు. టుడేస్ అయింది అని చెబుతోంది.
ఇంకేంటి సీనియర్ సంగతులు అంటే... నాకు పెళ్లి కుదిరింది అని చెబుతోంది. ఓ... కంగ్రాట్స్... అబ్బాయి ఎవరు?? పెళ్లి ఎప్పుడు??
ఎంగేజ్మెంట్ ఈ ఫ్రైడే కానీ...అబ్బాయి గురించి నాకు ఇంకా ఏమీ తెలియదు అని డల్ గా చెబుతుంది. అదేంటి అంకుల్ చెప్పలేదా... లేదు అంత ఎంగేజ్మెంట్ రోజే అని చెప్పారు.
కానీ నాకు ఒకసారి మాట్లాడాలి అనిపిస్తుంది అనగానే.. పక్కనే ఉన్న మాధవి గారు ఫోన్ నుంచి శ్రీ కి కాల్ కలుపుతోంది.
ఈ టైంలో మాధవి ఆంటీ ఏమిటి అనుకుని.. లిఫ్ట్ చేసి హలో అనేలోపు నేహా వాయిస్ వినపడుతూ ఉంటుంది. సైలెంట్ అయిపోయి వింటూ ఉంటాడు.
అవని ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాధవి ఫోన్ ని ఈ ఫోన్ దగ్గరగా పెడుతుంది. నేహా మాట శ్రీ వినేటట్టుగా సెట్ చేస్తోంది.
ఎందుకు సీనియర్ అంత డల్ గా మాట్లాడుతున్నారు. పోనీ అబ్బాయి నెంబరు అడగకపోయావా అంటే.. అమ్మో నాన్నగారిని అడగడమేనా అంటుంది .
నువ్వు అవునన్నా, కాదన్నా అంకుల్ ఓకే చేసేస్తారు కదా.. మరి ఇంకా స్పెషల్ గా ఏం మాట్లాడాలి. ఎంగేజ్మెంట్ రోజున మాట్లాడితే సరిపోతుంది కదా అని... నేహా మనసులో ఏముందో తెలుసుకోవాలని అడుగుతుంది.
నేహా సైలెంట్ అయిపోతుంది. ఇక్కడ శ్రీ కి టెన్షన్ తో బీపీ పెరిగిపోతూ ఉంటుంది. స్పీక్ అవుట్ నేహా అని మనసులోనే చెబుతూ ఉంటాడు.
అవని కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. నేహా ఏం చెబుతుందో అని... కాసేపటికి మౌనం వదిలి అలా కాదు అవని.
ఇప్పుడు వరకు నాన్నగారు కష్టపడి నన్ను చదివించారు. నీకు తెలుసు కదా మా పరిస్థితులు ఎలాంటివో. అలాంటిది జాబు వచ్చినా కొన్ని రోజులకే నేను పెళ్లి చేసుకుంటే ఎలాగా..
వెంటనే అవని... అందుకని అబ్బాయితో ఇప్పుడు పెళ్లొద్దని చెబుతారా ఏంటి అని అడుగుతుంది. ఆ మాట వినగానే శ్రీ గుండే ఆగినంత పని అవుతుంది.
అబ్బా అవని పూర్తిగా చెప్పేది విను. అబ్బాయితో మాట్లాడి నా శాలరీలో 50% నాన్నగారికి ఇచ్చేటట్టుగా ఒప్పించాలి. ముందే మాట్లాడితే మంచిది కదా...
తర్వాత నా సాలరీ మీద కూడా అతని హోప్ పెట్టుకుని ఉంటే ఇబ్బంది కదా అని అంటుంది. ఆ మాటకి అవని నీ జీతం.. నీ ఇష్టం.
దానికి అబ్బాయి పర్మిషన్ ఎందుకు... అబ్బాయిలు ఏమన్నా అమ్మాయి పర్మిషన్ అడుగుతున్నారా... ఏమో అవన్నీ నాకు తెలియదు.
ముందే క్లియర్ చేసేసుకుంటే ఇబ్బంది ఉండదు. మాటలు అనుకున్నంత ఈజీ కాదు. చేతల్లోకి వచ్చేటప్పటికి అమ్మాయి పరిస్థితి.
కొంచెం మనం ఆలోచించుకోవాలి అని చెబుతుంది. నువ్వు అన్నది కూడా నిజమేలే... సరే ఏం చేస్తాం. ఎంగేజ్మెంట్ వరకు ఆగుదాం.
లేదుఅంటే ఈ లోపు నేనేమైనా ట్రై చేయనా.. అబ్బాయి నెంబరు అంటుంది. నీకు ఎలా తెలుస్తుంది అంటే..అంకుల్ తో మాట్లాడి తీసుకుంటాను అని అంటుంది.
అమ్మో వద్దు అది నేను అడిగించాను అని నాన్నగారు కోప్పడతారు. నేను ఏమి అడుగుతానో కూడా నాన్నగారికి తెలుసు.
అందుకే ఎంగేజ్మెంట్ దాకా నాకు అబ్బాయి విషయాలు తెలియనివ్వడం లేదు అని చెబుతుంది. ఆ మాటలకు అవని నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది.
నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని నీకు తోడు నిలబడే వాడే వస్తాడు. టెన్షన్ పడకు అని చెప్పి సరే ఉంటాను సీనియర్ అని ఫోన్ పెట్టేస్తోంది.
మాధవి ఫోన్ తీసుకొని విన్నారు కదా అన్నయ్య అంటుంది. హా విన్నాను. మరి ఏ నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతుంది..
నేను ఆల్రెడీ ఎప్పుడో తీసేసుకున్నాను అని వాసుగారికి, శ్రీ కి మధ్య జరిగిన డిస్కషన్ అంతా చెబుతాడు. ఆ మాటలు వినగానే అవని సంతోషపడుతూ చాలా మంచి నిర్ణయం అన్నయ్య అని ఫోన్ పెట్టేస్తుంది.
ఏమైంది అని మాధవి అడిగితే జరిగిందంతా చెబుతుంది. నేహకి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం అనుకుంటా.. ఎక్కువ కంగారు పడుతుంది అని మాధవి అంటే...
ఎందుకు ఉండదు అమ్మ. చిన్నప్పటి నుంచి ప్రతి దానికి కంటి రెప్పలాగా కాచుకున్నారు. తనకి కావాల్సింది ఏదైనా సరే... ఎంత కష్టమైనా సరే తీసుకొచ్చి అందించేవారు.
తండ్రిగా తన అవసరం ఉన్న ప్రతి చోట నిలబడ్డారు. ఇప్పటికీ నిలబడుతున్నారు. కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేయరు అంతే.. అందరికీ ఆ అదృష్టం ఉండదు.
ఆ మాట చెబుతూ అవని గొంతు జీరబోతుంది. అవని బాధ అర్థం అయిన మాధవి అవని భుజం చుట్టూ చెయ్యి వేసి చిన్నగా నొక్కుతారు.
వెంటనే అవని తేరుకొని నేను బాగానే ఉన్నాను అమ్మ అని చెప్పి ఇప్పుడే వస్తాను అనే రూంలోకి వెళుతుంది. అవని బాధ అర్థం అయినా మాధవి కూడా కొంచెం టైం ఇస్తే సరిపోతుంది సైలెంట్ అవుతుంది.
రూమ్ లోనికి వచ్చిన అవని సోఫాలో కూర్చుని కాళ్లు రెండు పైకి పెట్టుకుని కాళ్లు చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుని తల మోకాళ్ళ మీద వాల్చి కూర్చుంటుంది.
తనికి చిన్నప్పటినుండి దక్కని తండ్రి ప్రేమ గుర్తుకు వచ్చి బాధపడుతుంది. ఎందుకు మీరు ఇలా చేశారు. అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట కదా..
అంత ప్రేమేంచి పెళ్లి చేసుకున్న మీరు కూతురు బాగోగులు పట్టనట్టుగా ఎలా ఉన్నారు. మనిషికి తన సుఖాలే ముఖ్యమా అని బాధపడుతూ ఉంటుంది.
ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఏమైంది మా భార్యామణికి అని అటు నుంచి వాయిస్ వినపడుతుంది.
అప్పుడు ఫోన్ చూసి మీరా... మీరు ఈ టైం లో ఏమీటి అడుగుతుంది. ఎందుకో నీతో మాట్లాడాలనిపించి చేశాను. వద్దు అంటే చెప్పు పెట్టేస్తాను అని అంటాడు.
అబ్బా నేను అలా అనలేదండి. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఆ... ఏమిటి అని అడిగాను అంతే. నా భార్యతో మాట్లాడుకోవడానికి కూడా టైం చూడాలా...
నాకు మాట్లాడాలనిపించింది. చేశాను ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏమీ లేదు ఖాళీయే. ఒక్కదానివి రూమ్ లో ఉండిపోకపోతే... అమ్మ వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు కదా అని అడుగుతాడు.
ఇప్పుడే పైకి వచ్చాను. ఇప్పుడు దాకా అమ్మ, అత్తయ్య దగ్గరే ఉన్నాను అని చెబుతుంది. ఏమైందిరా అని లాలనగా అడుగుతాడు.
ఎందుకో తెలియని బెంగగా అనిపిస్తుంది అని వెక్కుతూ చెబుతుంది. ఎవరేమన్నారు మా బంగారాన్ని, బుజ్జిని అని ట్యూన్ చేస్తూ ఉంటాడు.
నన్ను ఎవరూ ఏమీ అనలేదు కానీ.. ఏడుపు వస్తుంది అని చెబుతూ కళ్ళు తుడుచుకుంటుంది. రేయ్ బంగారం అని పిలుస్తాడు. ఆ చెప్పండి అని వెక్కుతూ అంటుంది .
వెంటనే వీడియో కాల్ చేస్తాడు. కాల్ ఆన్ చేసి భర్తవైపు చూస్తూ ఉంటుంది. ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయినా అవని ముఖాన్ని చూసి ఏమైందమ్మా..
నాతో చెప్పు నేను చూసుకుంటాను కదా అంటే...ఏమీ లేదు ఎందుకో ఏడుపు వస్తుంది అంతే. నేహాతో మాట్లాడావా అని అడుగుతాడు.
అవును అంటుంది. ఏం మాట్లాడావు... నేహా వాళ్ళ నాన్నగారి గురించి చెప్పిందంతా చెప్పి... నేను ఎందుకు తండ్రి ప్రేమకి నోచుకోలేదు.
నేనేమీ పాపం చేశాను అండి అని ఏడుస్తుంది. విక్రమ్ కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఏమని చెప్పి ఊరుకో బెట్టగలడు.
తన చేతుల్లో ఉన్నదైతే... కాలాన్ని వెనక్కి తిప్పి భార్య పడిన కష్టాన్ని మొత్తం చిటికె వేసిన ఈజీగా తీసివేసేవాడు.
ఉఫ్... అనుకుని రేయ్ బంగారం నన్ను చూడు. నా వైపే చూడు అంటాడు. దేనికి అని చూస్తుంది. నా కళ్ళు ఏమి చెబుతున్నాయి అని అడుగుతాడు..
ఆ కళ్ళ వైపే చూస్తూ ఉంటే.. అనంతమైన ప్రేమని నాపైన ఉంది అని చెబుతున్నాయి అని ఒక ట్రాన్సలో చెబుతుంది. ఆ మాటకి నవ్వుకుంటూ కదా...
భగవంతుడు ఒకటి తీసుకుంటే దానికి పదింతలు విలువైంది ఇస్తాడంట.. నీ గతంలో జరిగిన గాయాలు తీయలేకపోవచ్చు కానీ..
ఆ గాయాలు గుర్తుకు రానంత అనంతమైన ప్రేమని నేను ఇవ్వగలను అర్థమవుతుందా అని చెబుతూ ఉంటే... కళ్ళు తుడుచుకొని అర్థమవుతుంది.
నిజంగా నేను చాలా పిచ్చిదాన్ని. నిలువెత్తు ప్రేమ రూపమైన నా భర్త ఎదురుగుండా ఉంటే... నువ్వు అవసరం లేదు అన్న మనుషుల గురించి ఆలోచించి..
నేను బాధపడి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. ఇంకెప్పుడు నేను బాధపడను అని కళ్ళు తుడుచుకుంటుంది.
సాయంత్రం త్వరగా వస్తాను. శ్రీ వాళ్ళ ఇంటికి వెళదాము రెడీ అయి ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు .
అప్పుడే అక్కడికి వచ్చిన భరత్... ఏమైంది బావ అని అడిగితే... అవని, ధనుంజయ్ గురించి ఆలోచిస్తున్నాను అని చెబుతాడు. అంత ఆలోచించవలసిన అవసరం ఏముంది అంటే...
భర్తగా నేను ఎంత ప్రేమ చూపించినా.. మనం ఎంత అపురూపంగా చూసుకున్న... ఆడపిల్లకి పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది కదా...
అదే ఈరోజు అవనికి గుర్తొచ్చి బాధపడుతుంది. ధనుంజయ్ తెలియకుండా చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తపడి... సరిదిద్దుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడు.
కానీ అవని మాత్రం అతనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడం లేదు. రేపు అన్న రోజున వీళ్ళిద్దరి మధ్యన ఏమి జరుగుతుంది అన్నది అర్థం కావడం లేదు.
విక్రమ్ మాటలకి భరత్ ఎక్కువ ఆలోచించకు బావ. ప్రస్తుతం అవని సంతోషంగా ఉంచడం ఒక్కటే మనం చేయవలసింది.
శ్రీ పెళ్ళిలో అవని మిస్ అయిన చిన్నచిన్న ఆనందాలు అన్ని మనం తిరిగి తీసుకోవద్దామని చెబుతాడు. నేను అదే ప్లాన్ చేస్తున్నాను.
శ్రీ కంగారికి అవనిలో ఉన్న బెంగ అంతా పోవడం ఖాయం అని నవ్వుతాడు. విక్రమ్ నవ్వులో భరత్ కూడా శృతి కలిపి మెయిన్ సగం టెన్షన్ తీరిపోయినట్టే కదా అంటాడు.
Posts: 319
Threads: 8
Likes Received: 2,473 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
271
Part - 74
విక్రమ్ ఇంటికి వచ్చేటప్పటికి అవని రెడీ అయ్యి ఉంటుంది. వెళదామా అని అడిగితే.. ముందు మీరు ఫ్రెష్ అవ్వండి. కిచెన్లోకి వెళ్లి స్నాక్స్ జ్యూస్ తీసుకుని పైకి వస్తుంది.
స్నాక్స్ తింటూ జ్యూస్ అవిని నోటి దగ్గర పెడతాడు. నాకు ఇప్పుడు ఏమీ వద్దండి. నేను ఆల్రెడీ తిన్నాను అంటే.. నాకోసం తాగు అని పీక్కుపోయి ఉన్నా మొఖం చూస్తూ పట్టిస్తాడు.
ఇంకేమీ మాట్లాడకుండా జ్యూస్ సగం తాగి. ఇంక చాలు అంటుంది. మిగిలిన జ్యూస్ విక్రమ్ తాగి పద అని చెప్పి తీసుకువెళతాడు.
కిందికి వచ్చిన జంటను చూసి ఇందిరా గారు జాగ్రత్తగా వెళ్లి రండి అని చెప్పి పంపిస్తారు. ఇద్దరూ శ్రీ ఇంటికి చేరుకుంటారు. అవని మొదటిసారిగా శ్రీ ఇంటికి వస్తుంది.
గుమ్మం దగ్గరే ఇద్దరినీ ఆపేసి సురభి గారు దిష్టి తీసి కుడి కాలు లోపలి పెట్టి రామ్మా అని చెబుతారు. అవని నవ్వుకుంటూ లోపలికి వచ్చి..
దిష్టి మాకు కాదు పెద్దమ్మ. అన్నయ్యకు తీయాలి. మీ అన్నగారికి ఎటువంటి దిష్టి ఉండదమ్మా.. తీయాల్సిన అవసరం ఉండదు .
నువ్వు బంగారు బొమ్మవి నీకు తీయాలి అంటారు వాసు గారు. డాడీ అని గట్టిగా అరుస్తాడు. ఏంట్రా నేను ఏమన్నా తప్పు అన్నానా అని ఐబ్రో రైస్ చేస్తారు.
ఆ మాటకి పళ్ళునూరుతూ చూస్తూ... బాల్ మీ కోర్టులో ఉంది అని రెచ్చిపోతున్నారు. తర్వాత నాకు టైం వచ్చినప్పుడు చెబుతాను.
వెళ్ళు వెళ్ళవోయ్ అని చెప్పి రా తల్లి అని సురభికి వాసుకి మధ్యలో అవిని నీ కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూ ఉంటారు.
పొద్దున్నుంచి ఉన్న దిగినంత వాళ్ల నవ్వుల మధ్యన ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంతలో సర్వెంట్స్ జ్యూస్ తీసుకువచ్చి ఇస్తారు.
అమ్మో ఇప్పుడు ఏమీ వద్దు అంటే.. సురభి ఆ గ్లాస్ తీసుకొని... వచ్చి ఇంత సేపు అయింది. తాగకపోతే ఎలాగా....
పెద్దమ్మ వచ్చే ముందే తాగాను. మళ్ళీ అంటే నా పొట్ట పట్టదు అని పొట్ట మీద చేతులు వేసుకుంటుంది. పడుతుందో లేదో డాక్టర్ గా నాకు తెలుసు గానీ.. అమ్మగా ఇస్తున్నాను తాగు అని నోరు దగ్గర పెడతారు.
ఆ మాటకి అవనికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చిన్నప్పటినుండి కావాలనుకున్న ప్రేమ విక్రమ్ చెయ్యి పట్టుకున్న దగ్గరనుంచి దొరుకుతున్నాయి.
గ్లాస్ తీసుకుని జ్యూస్ తాగుతూ వాళ్లందర్నీ చూస్తూ ఉంటుంది. అవిని ఎదురుగుండా ఒక గది తలుపు కొద్దిగా తెరిచి ఉంటుంది.
అందులో నుండి ఒక వ్యక్తి అవనినే చూస్తూ ఉంటాడు. అవని నవ్వులు చూసి ఆ వ్యక్తి సంతోషంతో గాలిలో ఎగురుతూ ఉంటాడు.
రాజ్ ఇంకా రాలేదేంటి అని వాసు గారు అడిగితే... వాడు ఆల్రెడీ హైదరాబాదులో ల్యాండ్ అయిపోయాడే.. ఇంకా రాకపోవడం ఏంటి అని విక్రమ్ అనుమానంగా అంటాడు.
ఆ మాటకి శ్రీ ఉడుక్కుంటూ నాకేం తెలుసు. వాడు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఎన్ని ఫోన్లు చేస్తున్న రెస్పాండ్ అవ్వడం లేదు.
నీకే తెలుసు అంటాడు. నిజంగా నాకు తెలియదు రా బాబు. హైదరాబాద్ చేరిపోయాను అని చెప్పాడు.ఇంకా రాకపోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా...
గట్టిగ సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. ఏంటా ఈ సౌండ్స్ అని చూస్తూ ఉంటే... బాజాలు వాయించుకుంటూ నలుగురు వస్తూ ఉంటారు.
సురభి వైపు చూస్తూ ఇప్పుడు ఇవి అవసరమా... అవి పెళ్లికి వాయించుతారు. నీ కొడుక్కి పెళ్లి కుదిరింది కదా అని.. ఎంగేజ్మెంట్ ముందు నుంచి వాయించుకోరు.
అబ్బా వాసు నేను ఎందుకు అరేంజ్ చేస్తాను. నాకు తెలియదా.. ఎప్పుడు ఏం చేయాలో. మరి ఇది ఎవరు చేసారు అని...
శ్రీ వైపు తిరిగి... ఒరేయ్.. నీ పెళ్ళికి నువ్వే వాయింపుడు మొదలు పెట్టావా అంటే.. అబ్బా నాన్న మీరు అసలే ఆవేశంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు.
వీటి గురించి నాకు ఏమీ తెలియదు అంటాడు. మరి ఇది ఎవరు అరేంజ్మెంట్స్ అని చూస్తూ ఉండగా.. వాళ్ళ నలుగురు మధ్యలో నుంచి రాజ్ బయటకు వస్తాడు.
రాజ్ నువ్వా అంటే... ఎస్ అంకుల్ నేనే అంటాడు. ఏంట్రా ఈ హడావిడి... మన శ్రీ కి పెళ్లి కుదిరింది కదా... ఈ మాత్రం ధూంధాం లేకపోతే ఎలాగా అంటాడు.
శ్రీ వెళ్లి రాజ్ ని కౌగిలించుకొని ఇంతసేపు పట్టిందా ఇంటికి రావడానికి. వీళ్ళందర్నీ అరేంజ్ చేసి వచ్చేదానికి టైం పట్టింది అయినా పెళ్ళికొడుకు మొహం వాడిపోయి ఉంది.
ఏమైంది అంటే.. సురభి గారు ఏముంది వాసు తిట్లుతో వాడికి చెవులు వాచిపోయి తలనొప్పి వస్తుంది. పాపం బిడ్డ వచ్చినప్పటి నుంచి ఈయన గొడవే సరిపోతుంది అని వాపోతోంది.
వాసు గారు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ... నిజం చెప్పు సురభి.. నా గోల కి వాడికి తలనొప్పి వస్తుందా... వాడి గోల కి నాకు తలనొప్పి వస్తుందా...
వీడి పెళ్లి అన్నప్పటి నుంచి నన్ను ప్రశాంతంగా ఒక్క పూటైనా పడుకోనిఇచ్చాడా... వాడికి నిద్ర పట్టడం లేదు అని ఎన్ని నిద్రలేని రాత్రులు నాతో చేపించాడు.
నాన్న అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు నేను ఏమన్నాను అంటే.. మీరు మాట్లాడే మాట వేరే లాగా ఉంది. నీకు ఎలా అర్థమవుతే అలా తీసుకో.
రాజ్ వైపు తిరిగి వీడు టార్చర్ ఎంత దారుణంగా ఉందో తెలుసా... అని పెళ్లి అన్న దగ్గరనుంచి నిన్నటిదాకా జరిగినవన్ని వన్ బై వన్ చెబుతూ ఉంటారు.
అది విన్న అందరూ పగలబడి నవ్వుతూ ఉంటే శ్రీ మొఖం ముడుచుకుంటాడు.. సురభి ఇంకా ఆపండి. అబ్బాయి మీద ఎందుకని చాడీలు చెబుతారు.
కొత్త పెళ్ళికొడుకు మొహం వెలిగిపోతూ ఉండాలి. మీ వల్ల కరెంటు లేని బల్బులా గా ఉంది అంటుంది. అదేం పోలికే దరిద్రంగా అని...
కొడుకును అనేటప్పటికి మాత్రం ముందుకు ముందుకు వచ్చేస్తావు. ఒక కూతురిని కని ఉండుంటే నా వైపు మాట్లాడేది.
ఇప్పుడైనా నాకేమీ ప్రాబ్లం లేదు అని అవిని చుట్టూ చేతులు వేసి నా కూతురు నాకు ఉంది. ఏరా ఈ నాన్నకి నువ్వు సపోర్టు కదా అని అంటారు.
నాన్న అనే మాట వినగానే అవని వాసు గారి వైపు చూస్తుంది. ఏంట్రా అలా చూస్తున్నావు. నువ్వు నా వైపే ఉండాలి.
ఈ నాన్నతోనే ఉంటావు కదా అని అంటారు. హ.. అని తలుపుతుంది. చూసావా నా వైపు నా కూతురు ఉంది. కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు.
నువ్వు నీ కొడుకు ఏం చేసుకుంటారో చేసుకోండి. పద బంగారం మీ వదినకి సెలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్ని నేనే చూపిస్తాను అని లోపలికి తీసుకు వెళ్ళిపోతాడు.
వెళుతున్న వాసు అవిని నీ చూసి మిగిలిన వాళ్ళు నవ్వుకుంటారు. వాళ్ళిద్దరూ వెళ్లిన తర్వాత థాంక్స్ ఆంటీ అంటాడు.
దేనికి విక్రమ్... అవని బాధని తీర్చినందుకు... ఆ మాటకి చిరుగోపంగా చూస్తూ.. నువ్వు చెప్పావని కాదు. నాకు అవనినీ చూసినప్పటి నుంచి అనిపిస్తుంది.
నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుంటుంది అని. మేము ఎప్పుడో మా కూతుర్ని చేసేసుకున్నాము. మా కూతురు గురించి మేము కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు అని అంటుంది.
ఆ మాటికి రాజ్ వెంటనే హోల్డన్...ఈ మాట మాధవి ఆంటీ వింటే మీ మీద ఫైటింగ్ కి వస్తారు అంటాడు. ఏమి ఫైటింగ్ కి రాదు.
ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు ఉన్నట్టు లెక్క. ఆ బంగారు తల్లిని దూరం చేసుకోవడానికి మేము ఎవరు సిద్ధంగా లేము అని చెబుతారు.
అప్పటివరకు గదిలో ఉన్న వ్యక్తి బయటకి వస్తాడు. ఆ వ్యక్తిని చూడగానే విక్రమ్ సైలెంట్ అయిపోతాడు. రాజ్ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు.
ఆ వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చే చేతులెత్తి నమస్కరిస్తాడు. వెంటనే పైకి లేచి ప్లీజ్ మీరు ఇలా చేయకండి అంటే..లేదు సురభి గారు...
అవని పుట్టినప్పటినుంచి నేను ఇవ్వలేని సంతోషాలు, ధైర్యాన్ని మీరందరూ ఇస్తున్నారు. ఏమిచ్చినా మీ ఎవ్వరి రుణం నేను తీర్చుకోలేను.
విక్రమ్ వైపు తిరిగి మీకు ఎలా థాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అల్లుడుగారు... అవని ప్రతి సంతోషాన్ని నాకు చూపిస్తున్నారు.
చేతిలోకి నమస్కారం చేయడం తప్ప ఏమీ చేయలేను అని చెప్పి అక్కడ నుండి వడివడిగా వెళ్లిపోతాడు.
ఒక్క నిమిషం అక్కడంతా మౌనం ఆవహిస్తుంది. శ్రీ... ఇలాగ ఉంటే లాభం లేదు అనుకుని... వీళ్ళిద్దరూ గదిలోకి వెళ్లి ఏం చేస్తున్నారు అని అడుగుతాడు.
ఆ మాటకి రాజ్... తండ్రీ కూతుర్లు ఇద్దరు గదిలోకి వెళ్లి ఏం చేస్తే నీకు ఏంట్రా అంటే.. అక్కడికి వెళ్లి చూస్తూ ఉన్నాయని నా పెళ్ళానికి సంబంధించినవి.
కాబట్టి నాకంగారు అంతా.. ఈయన ఏం మెలికలు వేస్తున్నాడో ఏంటో అని ఆ గదిలోకి వెళతాడు. వెళుతున్న శ్రీని చూస్తూ పాపం నేహా అంటాడు.
దేనికి రా పాపం అంటే వీడు ఆత్రానికి నేహా ఏమైపోతుందో అన్న జాలి నాది అంటాడు.. ఆ మాటకి నెత్తి మీద ఒకటి పీకి అలాంటిదేమీ ఉండదు.
వీడి కంగారుకి, నేహా నిదానానికి సరిపోతుంది. ఇంక తమరే మిగిలారు అంటే.. మనకి అప్పుడే పెళ్లేంటి రా బావ అంటే..
మనకి కాదు. నీకు.. ఆల్రెడీ మాకు అయిపోయినాయి. మా లైఫ్ లో మేము ఎంజాయ్ చేస్తున్నాము. నువ్వే ఒంటికాయి సొంటి కొమ్ములాగా వేలాడుతున్నావు అంటే ..
హ... నువ్వు ఎన్ని అయినా చెబుతావు. అవని లాంటి మెతగగా ఉన్న అమ్మాయి వచ్చింది కాబట్టి.. నీ ఆటలు సాగుతున్నాయి.
ప్రస్తుత కాలంలో అలాంటి అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు. ఏరా అంటే పోరా అనే టైపులో ఉన్నారు అని చెబుతాడు.
ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా అంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని చూస్తున్నాను కదా... చాలా దారుణంగా ఉన్నారు రా బాబు ఇలా సింగిల్ గా ఉండడమే సుఖము అంటాడు.
నీకు కరెక్ట్ సోల్మెట్ తగిలే దాకా అలాగే అనిపిస్తుంది. సోల్ మేట ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు.
రాజ్ సోల్మెట్ ఎవరయి ఉంటారు....
కథ కొనసాగుతుంది...
The following 14 users Like SivaSai's post:14 users Like SivaSai's post
• aarya, ash.enigma, k3vv3, karthikkumar27111, Mahesh12345, masalakiss, Nivas348, rammahesh77, Sachin@10, shekhadu, Sunny73, The Prince, vikas123, vupputuri
Posts: 4,455
Threads: 9
Likes Received: 2,832 in 2,177 posts
Likes Given: 10,425
Joined: Sep 2019
Reputation:
30
•
Posts: 889
Threads: 2
Likes Received: 525 in 362 posts
Likes Given: 938
Joined: May 2019
Reputation:
6
Inkoka love story start avutunda?
Very nice.
This is getting addictive now
•
Posts: 319
Threads: 8
Likes Received: 2,473 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
271
03-02-2026, 07:31 AM
(This post was last modified: 03-02-2026, 07:32 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 75
ఎవరి ఆలోచనలో వాళ్ళు, సంతోషాల మధ్యన ఉండగానే శ్రీ ఎంగేజ్మెంట్ రోజు వచ్చేసింది. నేహా అవినికి ఫోన్ చేసి ముందే వచ్చేయమని మరీ మరీ చెప్పింది.
ఎంగేజ్మెంట్ శ్రీ తో అని చెప్పకుండా ఆ రోజు పెళ్లి కొడుకు కంటే ముందు మేమే ఉంటాము సరేనా అని నచ్చజెప్పింది. అవని విక్రమ్ తో.. నేహా నా మీద కోప్పడుతుందేమో...
తెలిసి కూడా నేను చెప్పలేదని. అది నువ్వు, మీ అన్నగాడు తేల్చుకోండి. నాకు ఎటువంటి సంబంధం లేదు అని మంచం మీద పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ చెబుతాడు.
ఆ మాటలకి కోపం వచ్చి నడుం మీద చేతులు వేసుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు... ఆ రోజే నేను చెబుతాను అంటే... వద్దు చెప్పకు సర్ప్రైజ్.... తొక్క, తోలు అని ఆపేశారు.
ఈరోజు ఏమో నీ తిప్పలు నువ్వు పడు. నాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. అలా ఎలా మాట్లాడుతారు మీరు.
వెంటనే విక్రమ్ ఒక పక్కకు తిరిగి చెయ్యి సపోర్టు మీద తలని అరచేతిలో పెట్టుకొని... ఎంటి బంగారం... నామీద అరుస్తున్నావు.
దీన్ని అరవడం అంటారా అరిస్తే ఎలా ఉంటుందో తెలుసా అని అడుగుతుంది. ఏంటి ఇది అరవడం కాదా... దీనికే నా చెవుల్లో ఉన్న తుప్పంతా ఊడి బయటకొచ్చేసింది.
ఇంకా నువ్వు అనుకున్న రేంజ్ లో అరిస్తే ఇంట్లో ఉన్న డస్ట్ అంత రోడ్డుమీద ఉంటుందేమో. అలా ఉంటే చాలా బెటర్ కదా అంటాడు.
అంటే ఏంటి మీ ఉద్దేశం నేను అరిస్తే డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుందా అని ఉక్రోషంగా అడుగుతుంది. అదే కదా నేను చెబుతుంది.
అలా వారానికి ఒకసారి నువ్వు ఇలాగే అరుస్తూ ఉండు. డస్ట్ అంత క్లీన్ అయిపోయి... సర్వెంట్స్ వర్క్ కూడా తగ్గుతుంది.
వావ్ ఎంతైనా నువ్వు సూపర్ పెళ్ళానివే అంటాడు. దేనికి అంటే... మీ ఆయనకి ఖర్చులు కలిసొచ్చే విధంగా చేస్తున్నందుకు అంటాడు.
అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అయినా అర్థమవుతుందా అని అడుగుతుంది. ఎందుకు అర్థం అవ్వడం లేదు బంగారం.
ఇలా రా అని కూర్చుని అవని నీ ఒళ్ళు కూర్చోబెట్టుకుని రోజు మన ఇల్లు క్లీన్ చేయడానికి సర్వెంట్స్ కి ఎంత టైం పడుతుంది. ఒకసారి ఎక్స్ట్రా సర్వంట్స్ ని కూడా అరేంజ్ చేయాలి.
అదే నువ్వు వారానికి ఒకసారి అరుస్తున్నావ్ అనుకో..
మొత్తం అన్ని క్లీన్ అయిపోతాయి. అప్పుడు ఎగస్ట్రా సర్వెంట్స్ పెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉండదు.
అప్పుడు ఆ మనీ అంత సేవింగ్ ఏ కదా అని చెబుతాడు. తల తోక లేకుండా మాట్లాడుతున్న విక్రమ్ మాటలకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక...
తింగరి చూపులు చూస్తూఉంటుంది. ఏంటి బంగారం అలా చూస్తున్నావ్ అంటే... మీరు ఏం మాట్లాడుతున్నారు మీకైనా తెలుస్తుందా అని అడుగుతుంది.
ఓ మై గాడ్ నాకు తెలియదు అనుకుంటున్నావా.. ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియకపోతే.. ఇంత బిజినెస్ ని ఎలా రన్ చేస్తాను అంటావు అని బుగ్గలు లాగుతాడు.
అవనికి వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు అయినా నేను ఏం మాట్లాడటం మొదలెడితే మీరు ఏం టాపిక్ తీసుకువచ్చారు.
రేపు నేను సీనియర్ కి ఏం చెప్పాలా అని అడిగితే అది వదిలేసి దానికి సంబంధంలేని తిక్క వాగడంతా వాగుతున్నారా...
అసలు మిమ్మల్ని అని విక్రమ్ వైపు తిరిగి మెడ పట్టుకుంటుంది. వెంటనే అవని నడుము మీద చేతులు వేసి దగ్గరికి లాక్కుని పెదాలు అందుకుంటాడు.
కాసేపు గింజుకున్నా కోపం అంతా ఎగిరిపోయి భర్తకి సరెండర్ అయిపోతుంది. అలసిపోయి పడుకున్నా అవని నీ గుండెల పైకి చేర్చుకుని నవ్వుకుంటాడు.
నీకు అసలు దెబ్బలాడడం కూడా రాదు. నేను ఏదో చెబుతూ ఉంటే నిజమే కదా... నిజమే కదా... అని... నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నావు.
ఇలా అయితే నిన్ను మాయ చేయడం నాకు చాలా ఈజీ. కానీ నాకు అలా వద్దు. నువ్వు నాతో దెబ్బలాడాలి. ఆర్గ్యు చెయ్యాలి.
నీకు ఏం సమాధానం చెప్పాలా అని నేను ఆలోచించాలి. అలా ఉంటేనే నాకు బాగుంటుంది. ట్రైన్ చేస్తాను నిన్ను అనుకుంటాడు.
తెల్లారికి ముందే అవని లేచి గబగబా రెడీ అవుతుంది. విక్రమ్ ని కూడా తొందర పెడుతుంది. ఇద్దరూ రెడీ అయ్యి కిందకి వస్తారు.
లలిత గారి దగ్గరికి వెళ్లి అత్తయ్య గారు మీరు ఇటు వచ్చేసేయండి. నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి అటు నుంచి శ్రీ అన్నయ్యతో కలిసి వస్తాము అని చెబుతుంది.
సరే తొందరగా వెళ్ళండి అని చెప్పి లలిత గారి వాళ్ళు కూడా రెడీ అయ్యి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి పెట్టవలసిన గిఫ్ట్స్ అన్ని కూడా జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు.
నివి రెడీ అయ్యావా అని లలిత గారు అరుస్తారు. అబ్బా వస్తున్నాను అమ్మ..ఎందుకు అలా అరుస్తావు అని చెప్పి బయటికి వస్తుంది.
నివి ని అలా చూడగానే అందరికీ చాలా తృప్తిగా..కన్నులు పండుగగా అనిపిస్తుంది. మాధవి గారు వెళ్లి చెవి వెనకాల దిష్టి చుక్క పెట్టి.. చాలా బాగున్నావే లంగా వోనిలో అని అంటుంది.
థాంక్స్ అత్తయ్య అని ఇందిరా గారి దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నాను గ్రానీ అని అడుగుతుంది. పైనుండి కింద వరకు చూస్తారు.
ఎక్కడ స్కిన్ షో చేయకుండా కంచి పట్టు లంగా వోని వేసుకుని... సింపుల్గా మెడలో ఒక చిన్న నెక్లెస్ పెట్టుకుంటుంది. నడుముకు వడ్డాణం పెట్టుకుని చెవులకి మీడియం సైజ్ బుట్టలు పెట్టుకుంటుంది.
మనవరాల చుట్టూ మెటికలు విరిచేసి సింపుల్గా మోడర్న్ మహాలక్ష్మి లాగా ఉన్నావు అనే చెబుతారు. దానికి నివి థాంక్యూ గ్రాని అని బెండై మరీ చెబుతుంది.
నివి చేసిన విధానానికి అందరూ నవ్వుకుని సరే పదండి లేట్ అయిందంటే శ్రీ అలుగుతాడు. వీడి అలకలు తీర్చలేక మళ్ళీ తల ప్రాణం తోకకు వస్తుంది. పదండి అని చెప్పి అందరూ మూడు కారులో బయలుదేరి వెళతారు.
అవని విక్రమ్ శ్రీ ఇంటికి చేరుకుంటారు. శ్రీ, రాజ్, అవని విక్రమ్ నలుగురు ఒక కారులో బయలుదేరుతారు. సురభి వాసు మరొక కారులో వస్తారు.
ఇంపార్టెంట్ చుట్టాలు అందరికీ బస్ ఎరేంజ్ చేస్తారు. అందరూ వెళుతూ ఉంటారు కానీ...
శ్రీకి, అవినికి మాత్రం చాలా టెన్షన్ గా ఉంటుంది. ఒకరికి చెమటలు పడుతూ ఉంటే... ఇంకొకళ్ళు గోళ్ళు కొరికేస్తూ ఉంటారు.
వాళ్ళిద్దరిని అలా చూసిన విక్రమ్ మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు. విక్రమ్ నవ్వు చూసిన అవని కి కోపం బస్సున వస్తుంది.
ఎందుకు నవ్వుతున్నారు మీరు అని కోపంగా అడుగుతుంది. డ్రైవ్ చేస్తున్న రాజ్ వెనక్కితిరిగి ఏమైందిరా అని అడిగితే..
ఒకసారి ఈ అన్నా చెల్లెలు ఇద్దరి మొఖాలు చూడు అని అంటాడు. రాజ్ పక్కన కూర్చున్న శ్రీ టెన్షన్ గా కనిపిస్తాడు. అవని కూడా టెన్షన్ గా ఉంటుంది.
ఏమైంది మీ ఇద్దరికీ.. ఏదైనా ప్రాబ్లం మా అని కొంచెం అనుమానంగా అడుగుతాడు. ప్రాబ్లం ఏంటి అన్నయ్య.. చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది.
ఏంటా ప్రాబ్లం అంటే.. నాకంటే టెన్షన్ ఉంది శ్రీ అన్నయ్య మీరు కూడా నా అంటే... హ... అవిని... నాక్కూడా చాలా టెన్షన్ గా ఉంది.
నేహా ఎలా రియాక్ట్ అవుతుందో అని అంటాడు. నాది కూడా సేమ్ ప్రాబ్లం అన్నయ్య అని తల పట్టుకుంటుంది.
అసలు మీరిద్దరూ దేని గురించి మాట్లాడుతున్నారో కొంచెం క్లియర్ గా చెబుతారా....
ఏదో మలయాళీ సినిమా చూస్తున్నట్టుగా ఉంది నాకు అని రాజ్ ప్రెస్టేట్ అవుతాడు. వాళ్ల ముగ్గురిని చూసి విక్రమ్ ముసిముసిగా నవ్వుతూ ఉంటే..మీ ఫ్రెండ్ ని అడగండి అన్నయ్య ఏం చేశారో...
ఏం చేసావురా నువ్వైనా చెప్పు అని రాజ్ అడుగుతాడు. నేనైతే ఏమీ చేయలేదు అని భుజాలు ఎగరేస్తాడు. మీరు ఏమి చేయలేదా అని మీద మీదికి వెళుతూ ఉంటుంది .
అబ్బా ఆగవే రాక్షసి. నేను వద్దంటే మాత్రం నువ్వు మానేయాల. నువ్వు చెప్పచ్చు కదా అంటాడు. మీరు నా భర్త. మీ మాటకి విలువ ఇచ్చి నేను చెప్పలేదు అంటుంది.
అక్కడ నీ ఫ్రెండ్ కదా అది ఎందుకు ఆలోచించలేదు. ఏమో అదంతా నాకు తెలియదు. ఏదైనా మీ తర్వాతే అని చెప్పి బయటకు చూస్తూ ఉంటుంది.
రాజ్ గట్టిగా హ... అరుస్తూ ఒరేయ్ అసలు మేటర్ ఏంటో చెబుతారా... కార్ ఇక్కడే ఆపేయనా... కారుని స్లో చేస్తూ ఉంటాడు.
దానికి వద్దు అని అవని, శ్రీ ఒకేసారి అరుస్తారు. వాళ్ళిద్దరిని చూసి విక్రమ్ గట్టిగా నవ్వుతూ.. నువ్వు కారుని పోనిస్తూ ఉండు. వాళ్ళిద్దరే చెబుతారు.
శ్రీవైపు తిరిగి నువ్వు చెప్పరా ముందు అంటాడు. దానికి శ్రీ నిట్టూరుస్తూ.. నేనే పెళ్లి కొడుకుని అన్న విషయం నేహా కి తెలియదు రా అంటాడు.
ఏమిటి అని గట్టిగా ఈసారి రాజ్ అరుస్తాడు. నేను నిజమే చెబుతున్నాను. అది ఎలా రా అంటే.. వాళ్ళ నాన్నగారు ఎంగేజ్మెంట్ రోజునే చెబుతాను అన్నారంట.
పోని నువ్వైనా చెప్పొచ్చు కదా అంటే... ఆ సర్ప్రైజ్ని నేను ఎందుకు మిస్ చేయడం అని చెప్పలేదు అంటాడు. ఓకే సర్ప్రైజ్ బానే ఉంది.
దానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. మీకు తెలిసిన నాకు చెప్పలేదు కదా... ఇంకా ఎన్ని నిజాలు దాస్తారు నా దగ్గర అని నామీద కోప్పడుతుందేమో అని భయంగా ఉంది అంటాడు.
ఆ మాటకి పైనుంచి కిందకి చూస్తూ నీకు ఇంకా పెళ్లి అవలేదు కదరా... అప్పుడే పెళ్ళాంమంటే ఇంత భయమా అని అడుగుతాడు.
అది భయం కాదురా ప్రేమ అంటాడు. ఏంటో ఈ తొక్కలో ప్రేమ అనుకుని.. సిస్టర్ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే నాది కూడా సేమ్ ప్రాబ్లం అన్నయ్య.
తెలిసి కూడా నేను చెప్పలేదని నా పైన అలుగుతుందేమో అని అంటుంది. విక్రమ్ వైపుకు తిరిగి వీళ్ళిద్దరినీ ఏ గ్రహాంతర నుంచి తీసుకొచ్చావురా...
ఇంత చిన్నదాని కూడా తెగ టెన్షన్ పడుతున్నారు అని తల కొట్టుకుంటాడు. నీకు ఇప్పుడు ఏమీ తెలియదు..రేపు నీ సోల్మెట్ తగిలిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నా బాధ అని శ్రీ అంటాడు.
అబ్బా సోల్మెట్.. సోల్మేట్... అంటున్నారు. రానీ... ఎలా వచ్చినా సరే నా కంట్రోల్లోనే ఉంటుంది. అబ్బా... ఛా... అని విక్రమ్, శ్రీ ఒకేసారి అంటారు. ఈ సౌండ్ ఏంటో చాలా తేడాగా ఉందే...
The following 11 users Like SivaSai's post:11 users Like SivaSai's post
• aarya, ash.enigma, gora, karthikkumar27111, Mahesh12345, Nivas348, rammahesh77, Sachin@10, shekhadu, Sunny73, yekalavyass
Posts: 319
Threads: 8
Likes Received: 2,473 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
271
03-02-2026, 07:32 AM
(This post was last modified: 03-02-2026, 07:33 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 76
సరదాగా మాట్లాడుకుంటూ అందరూ నేహా ఊరికి వచ్చేస్తారు. వెనకాలే విక్రమ్ ఫ్యామిలీ కార్లు కూడా వచ్చేస్తాయి. ఒక కారుని భరత్ డ్రైవ్ చేస్తే.. ఇంకో కారుని వినయ్ డ్రైవ్ చేస్తాడు. ఇంకొక కార్ కి డ్రైవర్ వస్తాడు.
అవని కారు దిగి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసిన విక్రమ్... మొగుడు దిగాడో లేదో.. వస్తాడో లేదో అని కూడా లేదు.
చూడు ఎలా వెళ్ళిపోతుందో మీ చెల్లి అంటాడు. నువ్వు ఆగరా బావ.. మా చెల్లి వెళితే వెళ్ళింది. అక్కడ నీచెల్లి ఆలకి ఎలా ఉందో తెలియదు. నాకు అసలే టెన్షన్ గా ఉంది. నువ్వు సైలెంట్ గా ఉండు అంటాడు.
రాజ్ మాత్రం ఇద్దర్నీ చూస్తూ సరిపోయింది. మీ ఇద్దరి గొడవ. ఒకళ్ళేమో పెళ్ళాం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని అలక. ఇంకొకళ్ళు కాబోయే పెళ్ళాం ఎక్కడ అలుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు.
ఏదేమైనా సరే మీరిద్దరూ చాలా వీక్ రా అంటాడు. ఇద్దరూ రాజ్ వైపు చూస్తూ.. దేంట్లో... పెళ్ళాన్ని కంట్రోల్ చేయడంలో అంటాడు.
ఒరేయ్ నీకు ఇంకా పెళ్లి కుదరలేదు. పిల్ల దొరకలేదు. అప్పుడే పెళ్ళాం కంట్రోల్ చేయడం గురించి మాట్లాడుతున్నావా...
పెళ్లి ఎప్పుడు కుదురుతుందా.. పిల్ల ఎప్పుడు దొరుకుతుందా అన్నది మెయిన్ పాయింట్ కాదు బావ. వచ్చేవాళ్లని ఎలాగైనా సరే మన కంట్రోల్ లో పెట్టుకోవడం.
అది ఇంపార్టెంట్. ఆ విషయంలో నేను మీ ఇద్దరం అంత వీక్ కాదు అంటాడు. అబ్బో చూద్దాం అది కూడా... నీ డైలాగ్ లు వింటూ ఉంటే ఏదో సినిమాలో విన్నట్టు ఉంది రా.. తర్వాత నిన్ను ఊహించుకోడానికి కూడా మాకు జాలి వేస్తుంది అంటే అంత సీన్ ఏమి లేదు.
సురభి, వాసు వీళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి మీ ముగ్గురు డిస్కషన్. లోపలికి రారా అంటే... అదే చూస్తున్నాం ఆంటీ...
ఎవరూ వచ్చి పిలవలేదు అని. ఇంతలో శ్రీను గారు కంగారుగా వచ్చి క్షమించండి చూసుకోలేదు రండి.. బావగారు రండి... చెల్లెమ్మ రండి.. అల్లుడుగారు లోపలికి రండి అని పిలుస్తారు.
ఎందుకు బావగారు అంత కంగారు పడుతున్నారు. మనలో మనకి అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేదు అని భుజం మీద చేయి వేసి పదండి అని రాజ్ వైపు తిరిగి...
రాజ్ నువ్వు ఇక్కడే ఉండి కళ్యాణ్ వాళ్ళు వస్తారు కదా.
వాళ్ళు లోపలకి తీసుకురా... ఈ ప్లేస్ కొత్త ..
మళ్లీ ఇబ్బంది పడతారు.
షుర్ అంకుల్... అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజ్ వెయిట్ చేస్తూ ఉండగానే మూడు కార్లు వచ్చి ఆగుతాయి.
ఒక్కొక్క కారులో నుంచి అందరూ దిగుతూ ఉంటారు. రాజ్ ఎదురు వెళ్లి లోపలికి రండి అంకుల్ అని చెప్పి తీసుకువెళుతూ ఉంటాడు.
లలిత గారు కారువైపు తిరిగి నివి... కారు దిగేటప్పుడు ఆ గిఫ్ట్స్ కూడా తీసుకుని లోపలికి రా అని చెప్పి వెళ్ళిపోతారు.
నివి కారు దిగి... గిఫ్ట్స్ తీస్తూ ఉంటే ఇబ్బందిపడుతూ ఉంటుంది. ఒక పక్కన లంగా వోని క్యారీ చేయడం. ఇంకొక పక్కనే గిఫ్ట్స్ కష్టంగా అనిపిస్తూ డ్రైవర్ని పిలుస్తుంది.
డ్రైవర్ వచ్చి ఆ గిఫ్ట్స్ తీసుకుంటాడు. హమ్మయ్య అనుకుని తను సెట్ చేసుకుని... ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకుంటుంది.
నేను లోపలికి తీసుకువస్తాను మేడం అంటే.... పర్వాలేదు మన ఇంట్లో పనే కదా అని చెప్పి.... ఆ గిఫ్ట్స్ పట్టుకుని నడుస్తూ ఉంటే...
రాజ్ ఎప్పటినుంచి చూస్తున్నాడో తెలియదు కానీ స్టాట్యూలాగా అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఎప్పుడు దీన్ని ఇంత పద్ధతిగా చూడక.. లేక నాలో ఏమన్నా హార్మోన్స్ మారుతున్నాయా..
నాకళ్లకి ఏంటి ఇంత అందంగా కనపడుతుంది. ఎప్పుడు చూసినా జీన్స్, స్కట్స్ వేసుకుని కనపడుతుంది. ఈరోజు ఇంత పద్ధతిగా కనపడుతూ ఉంటే ఆ పిల్ల ఈ పిల్లేనా అనిపిస్తుంది.
నివి క్రాస్ చేసుకుని వెళ్ళిపోయినా సరే అలాగే చూస్తూ ఉంటాడు. వినయ్ అక్కడికి వచ్చి ఏంట్రా ఇక్కడే నిలబడి పోయావు.
ఇంకా ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలా అని కదుపుతాడు. తర్వాత ఈ లోకంలోకి వచ్చి ఏం అడిగావు అని అడుగుతాడు. ఎక్కడ ఆలోచిస్తున్నావు నువ్వు.
ఇందాకటి నుంచి నేను మాట్లాడుతూనే ఉంటే ఏదో ఊహాలోకంలో తేలుతున్నావు. నిజంగానే ఊహా లోకంలో తేలుతూనే ఉన్నాను..
అనవసరంగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. పైనుంచి కిందకి చూస్తూ ఈ ఊరు రాగానే ఏదైనా గాలి సోకిందా ఏంటి. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు.
నేనేమీ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం లేదు బామ్మర్ది అని బుగ్గ పైన తట్టి లోపలికి వెళతాడు. వెళుతున్న రాజ్ని చూస్తూ బాబోయ్ వీడు ఏంటో... వీడే గోల ఏంటో అనుకుని లోపలికి వెళతాడు.
అవని నేహాని బుజ్జగించి సర్థిచెప్పి హమ్మయ్య అని హాల్లోనికి వస్తుంది. భార్యని చూసి ఏంటి అని కళ్ళు ఎగరేస్తాడు.
మూతి తిప్పుకుంటూ మీతో మాట్లాడను. ఖచ్చి అని లిటిల్ ఫింగర్ చూపిస్తుంది. అబ్బో ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను అని కళ్ళతోనే అడుగుతాడు.
అవిని మూతి తిప్పి ఫంక్షన్ దగ్గర ఏమి కావాలో అవి అన్ని సర్దుతూఉంటుంది. నివి కూడా వచ్చి అవినికి హెల్ప్ చేస్తూ ఉంటుంది.
రాజ్ విక్రమ్ పక్కకి వచ్చి నిలబడి విక్రమ్ భుజం మీద చేయి వేసి మెలికలు తిరుగుతూ నివినే చూస్తూ ఉంటాడు.
అక్కడ నివి అవిని చెప్పినట్టుగా చేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ సర్దుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ఫ్యాన్ గాలికి ముంగురులు ఎగిరి డిస్టర్బ్ చేస్తూ ఉంటే....
వాటిని సున్నితంగా ముని వేళ్ళతో చెవి వెనకాల కి సర్దుకుంటూ... చెదురుతున్న ఓనీని సర్దుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది.
నివి ని అలా చూసిన రాజ్ గుండె స్కిప్ అయ్యి కింద పడిపోతుంది ఏమో అన్నంతగా కంగారు పడిపోతూ ఉంటాడు.
ఎవరి భుజం మీద చెయ్యి వేసాడో కూడా చూడకుండా.. నివి ని చూస్తూ ఇక్కడ తన చొక్కాఅంచుని తానే నలిపేసుకుంటూ ఉంటాడు.
ఎంతసేపైనా రాజ్ ఏం మాట్లాడడం లేదు ఏంటి అని చూసిన విక్రమ్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఏంటి వీడు తెగ మెలికలు తిరుగుతున్నాడు.
ఏమయిందా అని... ఏరా ఏదైనా చీమ దూరిందా ఏంటి ఇందాక నుంచి తెగ డాన్స్ చేస్తున్నావు అంటే... అవును బావ ఇప్పుడే ప్రేమ చీమ కుట్టి కుట్టనట్టుగా వెళ్ళిపోయింది.
ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అంటే... అసలు విక్రమ్ మాటలు వినపడితేనే కదా.. ఏంటి బావా నీ గోల అని మళ్లీ నివి మీదే ఫోకస్ పెడతాడు.
ఏంటి... వీడిని ఎంత కదిపినా ఎక్కడో చూస్తున్నాడు అని రాజ్ చూస్తున్నా వైపుకే వారగా చూస్తాడు. అక్కడ అవని, నివి ఉంటారు.
ఏంటి వీడు వాళ్ళిద్దర్నీ చూస్తున్నాడు. కొంపతీసి వీడు, నివికి ఏమైనా సైట్ కొడుతున్నాడా అని డౌట్ వచ్చి డిప్ప మీద పీకి.. ఏం చేస్తున్నావ్ రా అని అడుగుతాడు.
అప్పుడు స్పృహ లోకి వచ్చి ఎక్కడున్నాం రా మనం అంటాడు. ఒరేయ్ ఎక్కడున్నావో కూడా తెలియని అంత ఇదిగా మునిగిపోయావా.... నేనేం మునిగిపోలేదు అని ఓ... ఇది శ్రీ ఎంగేజ్మెంట్ ప్లేస్ కదా సారీ బావా అని ఒక తింగరినవ్వు నవ్వుతాడు.
నవ్వింది చాలుగాని ఏం చేస్తున్నావ్ ఇప్పుడు దాకా అంటే బావ అని గోకుతాడు. నువ్వు అలా గోక్కు చూసే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది.
చి... చి... నేను ఆ టైపు కాదు అని చెప్పి మళ్లీ కళ్ళని ఆటోమెటిగ్గా నివికి రాసిచ్చేస్తాడు. అది చూసి విక్రమ్ నవ్వుకుంటూ చూద్దాం ఏం చేస్తారో అని పెళ్ళాన్ని చూస్తూ ఉంటాడు.
అమ్మాయిని తీసుకురండి అని చెప్పగానే... శ్రీ టెన్షన్ తో నేహా గది వైపే చూస్తూ ఉంటాడు. రాజ్ ఇంకా శ్రీ గురించి పట్టించుకోవడం మానేసి నివి పైనే ఫోకస్ పెడతాడు.
ఇక విక్రమ్ నాకు తప్పదు కదా అని వెళ్లి శ్రీ పక్కన కూర్చుని ఎందుకురా అంత టెన్షన్ పడతావు. మీ చెల్లి ఎలా రియాక్ట్ అవుతుందో అని..
అంత లేదక్కడ... ఆల్రెడీ మీ చెల్లి కూల్ చేసి వచ్చింది అని చెబుతాడు. నిజమా బావ అంత గుడ్ న్యూస్ ఇంత స్లోగా నా చెప్పేది.
నేను అలిగాను. ఐ హర్ట్ అంటాడు. నువ్వు అలిగిన, హర్ట్ అయినా ఇక్కడ ఎవరూ ఏమీ పట్టించుకోరు కానీ నేహా వస్తుంది చూసుకో అంటాడు.
గులాబీ రంగు పట్టు చీర కట్టుకొని ... తల నిండా పూలు పెట్టుకుని తలదించుకునే వస్తున్న నేహా న్ని చూసి ఒక్క క్షణం తన కళ్ళని తన మనసుని నేహా కి రాసి ఇచ్చేస్తాడు.
ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి పూజ చేపించి పెద్దవాళ్లు తాంబూలాలు మార్చుకుని ఉంగరాలు మార్చుకోమని ఇద్దరి ముందు పెడతారు.
నేహా ఎంతసేపైనా తలెత్తదు. శ్రీకి నేహా ఫేస్ చూడాలి అని ఆరాటం ఎక్కువవుతుంది. ఎలా పిలవాలో అర్థం కాక ఉంగరం పెడుతున్నప్పుడు ఎవరూ చూడకుండా మెల్లిగా అరచేతిలో గోకుతాడు.
ఆ గోకుడికి నేహా కళ్ళు పైకెత్తి చూస్తుంది. ఆ సోయగాల చిన్నదాని చేప కళ్ళలో చిక్కి శ్రీ విలవిల్లాడిపోతూ ఉంటాడు.
నేహా కూడా శ్రీకి ఉంగరం తొడిగి మళ్ళీ కళ్ళను దించేస్తుంది.
తాంబూలాలు అయిపోయిన తర్వాత.. పెళ్లికి కూడా ముహూర్తం పెట్టేస్తారు. ఒక నెలలో దివ్యమైన ముహూర్తం ఉంది అని చెబుతారు.
ఒక నెల అంటే సరిపోతుంది బావగారు అని శ్రీను గారు మొహమాటంగా అడిగితే.. ఎందుకు సరిపోదండి ఈ రోజుల్లో అన్ని రెడీమేడ్ గా దొరికేస్తున్నాయి.
పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రెడీగా ఉంటే చాలు అని వాసుగారు చెబుతారు. వీళ్ళ మాటలు వింటున్న శ్రీ నెలరోజులు సరిపోతుందా అని అడుగుతున్నారా మామయ్య గారు.
నెల రోజులంటే ఇక్కడ ఎంత కష్టమో మీకు ఏమైనా అర్థమవుతుందా అని మనసులోనే అనుకుంటాడు. పైకి అంటే అందరూ తనని తుక్కురేగ్గగొడతారు. ఆ ప్లేస్ లో ముందు వాసు గారే ఉంటారని తెలిసి సైలెంట్ గా చూస్తూ ఉంటాడు.
పాపం మా శ్రీ కష్టాలు ఎవరికీ రాకూడదబ్బా....
కథ కొనసాగుతుంది....
The following 16 users Like SivaSai's post:16 users Like SivaSai's post
• ABC24, ash.enigma, gora, k3vv3, Mahesh12345, masalakiss, Nivas348, rammahesh77, Reddy 211993, Sachin@10, shekhadu, Sun217, Sunny73, The Prince, vikas123, yekalavyass
Posts: 40
Threads: 0
Likes Received: 11 in 10 posts
Likes Given: 3
Joined: Jun 2019
Reputation:
2
Super Story andi..keep going
•
Posts: 4,455
Threads: 9
Likes Received: 2,832 in 2,177 posts
Likes Given: 10,425
Joined: Sep 2019
Reputation:
30
•
|