Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Superb update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Hai sir new update pls
Like Reply
great update...
Like Reply
Update
Like Reply
Part - 63


శ్రీ నేహా ని తీసుకుని కారులో బయలుదేరుతాడు. హైవే మీద కారు మంచి స్పీడ్ గా వెళుతూ ఉంటుంది. పక్కన నచ్చిన చెలి, చల్లటి గాలి, సాయంత్రం వేళ ఆహా ఏమి బాగుంది వెధర్ అనుకుంటూ...

నేహా అని మెల్లిగా పిలుస్తాడు.  చెప్పండి సార్ అంటే.. అబ్బా ఇక్కడ కూడా సార్ ఏంటి నేహ. ఆఫీసులో ఉంటే పిలవచ్చు.

మనం ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం కదా అని అంటే.. దానికి నవ్వుతూ ఎలాగైనా మీరు నాకు బాస్ ఏ కాదు సార్ అంటుంది.

సరే ఇప్పుడు మాత్రం మనం ఫ్రెండ్లీ గానే మాట్లాడుకుందాం. అట్లీస్ట్ శ్రీ గారు అని అయినా పిలివు. ప్లీజ్ ఇలా సార్.. సార్ అంటూ ఉంటే నాకు డ్రైవింగ్ ఎంజాయ్మెంట్ రావడం లేదు అని రిక్వెస్ట్ చేస్తాడు.

నేహా ఒక నిమిషం తటపాయించి అలాగే శ్రీ గారు చెప్పండి అంటుంది. శ్రీ సంతోషముగా ఫీలవుతూ మీరు అవని ఎప్పటినుండి ఫ్రెండ్స్ అని అడుగుతాడు.

అవని మాకు జూనియర్.  జాయిన్ అయినప్పుడు చాలా బిడియంగా భయంగా ఉండేది కానీ ... ఎందుకో నాకు మొదటి సారి చూసినప్పుడే నచ్చింది.

తన గురించి అడిగితే అనాధని.  ఒక ఇంట్లో పని చేస్తూ వాళ్ళింట్లోనే ఉంటున్నాను అని చెప్పింది. పాపం అనిపించింది.

అందరూ ఉన్న ఆడపిల్లలకే సరిగ్గా రక్షణ లేదు..  అలాంటిది అనాధ అంటే ఎలాగా లైఫ్ ఉంటుందా అన్నది ఒక అంచనా వేయగలిగాను.

ఆ రోజు నుంచి మా బ్యాచ్ అందరూ కూడా అవినికి హెల్ప్ చేస్తూనే ఉన్నాము. ఒక్కొక్క రోజు క్యాంటీన్లో భోజనం చేసేది.

ఒక్కొక్క రోజు ట్యాప్ వాటర్ తాగేది.  మేము లంచ్ షేర్ చేస్తామన్నా సరే... అసలు ఒప్పుకునేది కాదు. ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపడం అంటే నా ఆత్మ అభిమానాన్ని వదులుకోవడమే ప్లీజ్ సీనియర్ అనేది.

దానితో మా అందరికీ అవిని మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. పార్ట్ టైం జాబ్ కోసం చూస్తూ ఉంటే.. ప్రిన్సిపల్ గారే ఆయనకు తెలిసిన చోట జాబ్ అరేంజ్ చేశారు.

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫుడ్ ఇంకా తక్కువ తీసుకునేది. అది మాత్రం చాలా కష్టంగా అనిపించేది కానీ...

అవని ఎవరి సహాయం తీసుకునేది కాదు. అందుకే సబ్జెక్టు విషయాల్లో మాత్రం మేము హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. ఉండగా.. ఉండగా.. నాకు అవినికి బాండింగ్ బాగా పెరిగింది .

నేను కాలేజ్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా చెప్పాను. ఏ అవసరం వచ్చిన ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకు ఒక కాల్ చేయి అని.

ఆరోజు రైల్వే స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఏడ్చినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది.  వెంటనే వచ్చేయమన్నాను.

ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లిగా మాటల్లో పెట్టి ఏం జరిగింది అని అడిగితే... అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు చేసిన అన్యాయం గురించి చెప్పి గుక్కపెట్టి ఏడ్చింది.

సవతి తల్లి కష్టాలు పెట్టడం అన్నది చూసాము గాని...కన్న తండ్రి కూడా పట్టించుకోలేదు అనేటప్పటికీ... ఆ వ్యక్తికి  ఎటువంటి గౌరవం ఇవ్వాలి అనిపించలేదు.

ఇంత జరిగిన తర్వాత నాకేమీ తెలీదు నన్ను క్షమించు అనగానే... ఏ ఆడపిల్ల అయినా ఎలా క్షమిస్తుంది.  అవని పడిన కష్టాల్లో ఒక్కవంతైనా సరే ఆ మనిషి అనుభవించి ఉండి ఉంటే... ఆ బాధ ఎలా ఉండి ఉంటదో అర్థమయ్యేది అని చెప్పి నిట్టూరుస్తుంది.

నేహా చెప్పిన మాటలు వింటూ శ్రీ అవిని ఎంత ఇబ్బంది పడి ఉండి ఉంటుందా అంచనా వేస్తూ ఉంటాడు.  నిజమే కదా మాటల్లో చెప్పుకోవడం వేరు. అనుభవంలోకి వచ్చింది వేరు.

అంత చిన్నతనం నుంచి అన్ని కష్టాలు పడుతూ ఆకలని తట్టుకుంటూ ఉండాలంటే... మాటలు కాదు కదా. ఇంత వయసు వచ్చిన మనమే ఆకలేస్తే.. గబగబా ఏదో ఒకటి తినేస్తాము.

అలాంటిది అంత చిన్న పిల్ల ఇంట్లో పని చేసి.. కాలేజ్లో వాళ్ళు పెట్టే భోజనం కోసం ఎదురు చూస్తూ ఉండడం అంటే.. ఎంత నరకం అనుభవించి ఉండి ఉంటుంది అని బాధపడతాడు .

ఏంటి శ్రీ గారు ఆలోచిస్తున్నారు అంటే...ఏమీ లేదు, నేహా అవిని గురించి ఆలోచిస్తున్నాను.  నిజంగా తనకున్న ఆత్మ అభిమానం, ఆత్మస్థైర్యం ముందు మనమందరం ఎంత అని అనిపిస్తుంది.

సరే నీ గురించి చెప్పు అని అంటాడు.  నా గురించి ఏమంటుంది శ్రీ గారు అంటే... నువ్వు ఎక్కడి నుండి వచ్చావు.  మీ ఫ్యామిలీ ఏంటి  అంటే...

నేను ఒక విలేజ్ నుంచి వచ్చాను. నేను ఒక్కదాన్నే కూతురిని. నాన్న గారిది వ్యవసాయం. అమ్మ ఇంట్లోనే ఉంటుంది.

మరి నా గురించి అడగవా అని అడుగుతాడు. చెప్పాలనిపిస్తే మీరే చెబుతారు కదా అంటే...ఇప్పుడు నీకు చెప్పాలనిపించే నాకు చెప్పావా అని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తాడు.

అలా అడిగితే ఏమని చెప్పగలను సార్.. ఇందులో అన్ని సీక్రెట్స్ ఏమీ లేవు కదా.. అందుకే క్యాజువల్ గా చెప్పాను అని సమాధానం చెబుతుంది.

సరే నా గురించి చెబుతాను విను.  నా పేరు శ్రీ. మా అమ్మ నాన్న ఇద్దరూ హైదరాబాదులోనే ఉంటారు. ఇద్దరూ డాక్టర్స్.

నేను, విక్రమ్, రాజ్ చిన్నప్పుడు నుంచి ఫ్రెండ్స్. సో మా ఫ్రెండ్స్షిప్ స్ట్రాంగ్ అయ్యి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము. బెంగళూరులో ఉన్న బ్రాంచ్ ని నేను హ్యాండిల్ చేస్తున్నాను అని చెబుతాడు. నైస్ సార్ అంటుంది.

మళ్లీ సార్ అనే పదంలోకి వచ్చేసావేంటి అని చిరు కోపం గా అడుగుతాడు.  ఏదో ఫ్లోలో వచ్చేసింది శ్రీ గారు. మీరు ప్రతిదానికి చిన్న పిల్లల్లాగా అలుగుతున్నారు తెలుసా అంటుంది.

అది అందరి దగ్గర రాదు. మన అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే వస్తుంది అని కళ్ళని ఓరగా తిప్పి చెబుతాడు..ఆ మాటలకి నేహా ఇబ్బందిగా నవ్వుతూ బయటికి చూస్తూ ఉంటుంది.  

ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని కాసేపు సైలెంట్ గా ఉంటాడు.  మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక.. నేహా ఈ వెదర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అని రొమాంటిక్గా అడుగుతాడు.

ఏముంది శ్రీ గారు ఒక దుప్పటి ఉంటే హాయిగా కప్పుకుని పడుకోవచ్చు అనిపిస్తుంది అని చెబుతుంది. ఏంటి అని గట్టిగా అరుస్తాడు.

ఏమైంది శ్రీ గారు..ఇప్పుడు నేను ఏమి తప్పుగా అన్నాను అని అమాయకంగా అడుగుతుంది. తప్పుకాక మరి ఏమిటీ...

వెదర్ ఇంత కూల్ గా రొమాంటిక్ గా ఉంటే ఎవరైనా పడుకుంటాను అంటారా అని కోపంగా అడుగుతాడు. ఇందులో మీరు కోప్పడడానికి ఏముంది.

రొమాంటిక్గా ఫీల్ అవ్వడానికి మనకి లవ్వరో,  భర్త, భార్య ఉంటే ఫీల్ అవుతాము.  అంతేగాని అందరూతో అలా ఫీల్ అవ్వలేము కదా శ్రీగారు.

మీరు ఎందుకు అంత కోప్పడుతున్నారు. ఏమీ లేదులే.. అవును లవర్ అంటున్నవు కొంపదీసి ఎవరినైనా లవ్ చేసావా అని అడుగుతాడు.

మనల్ని లవ్ చేసే వాళ్ళు ఎవరుంటారు శ్రీగారు. అందరూ పైపై మెరుగులు చూసి కావాలనుకున్న వాళ్లే గాని..మనం అలా మెయింటైన్ చేయలేము.

అయినా ఈ లవ్లవి మన వల్ల కాదు. ఏదైనా తేడా వస్తే తట్టుకోలేము.  మన మీదే ప్రాణాలు పెట్టుకున్న మన పేరెంట్స్ ఉన్నారు.

మనకి ఏం కావాలో వాళ్ళకే బాగా తెలుసు.  ఎలాంటి వాళ్ళు వస్తే మన లైఫ్ బాగుంటుందో కూడా వాళ్లకే తెలుసు. కాబట్టి లవ్,లు గివ్వులు నేను మాత్రం చెయ్యను అని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంది.

అందరూ అలాగే ఎందుకు ఉంటారు. మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మన చుట్టూ ఉండే ఉండొచ్చు కదా అని చెబుతాడు.

దానికి ఉంటే ఉండొచ్చు కానీ మన పేరెంట్స్ కంటే ఎక్కువ కాదు కదా.. ఫర్ సపోస్ ఇప్పుడు నేను ఎవరినైనా లవ్ చేసానే అనుకోండి.

అక్కడ మా నాన్నగారు నాకు తెలియకుండా ఇంకో సంబంధం కుదుర్చారు అనుకోండి.  లేకపోతే నేను లవ్ చేసిన అబ్బాయి మా నాన్నగారికి నచ్చలేదు అనుకోండి.

అప్పుడు నేను ఎటు అడుగు వేయాలి. ఇటు ప్రేమించిన వాడిని వదులుకోవాలా... లేకా అటు తల్లిదండ్రులను వదులుకోవాలా... ఎవరిని వదులుకోవాల్సి వచ్చినా మోసం చేసినట్టే కదా..


అందుకే నేను మాత్రం వీటికి దూరంగానే ఉంటాను. నిజంగా నన్ను ప్రేమించి,  నేనే కావాలి అనుకుంటే మాత్రం నన్ను అర్థం చేసుకుని వెళ్లి ముందు మా తల్లిదండ్రులతో మాట్లాడతారు. కాబట్టి ఈ టాపిక్ మనం ఇక్కడ ఆపేద్దాం అని చెబుతుంది.

నేహా చెప్పిన దానికి శ్రీ ఇంప్రెస్ అవుతూ... నచ్చేస్తున్నావే బంగారం. నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను.

రేపే అమ్మానాన్నకు ఫోన్ చేసి వెళ్లి మీ పేరెంట్స్ తో మాట్లాడమని చెబుతాను. వాళ్ళు మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే..

ఇంక నువ్వు నా నుంచి దూరంగా వెళ్లవు. పెళ్లిఅయ్యాక అయినా సరే నీతో నేను ప్రేమ పాటలు మొదలు పెడతాను అని నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

ఇద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ మిడ్ నైట్ కి బెంగళూరు చేరుకుంటారు. గుడ్ నైట్ శ్రీ గారు అని చెప్పి ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది.

గుడ్ నైట్ నేహా అని చెప్పి తన ఫ్లాట్ లోకి వెళ్లి డ్రైవింగ్ చేసిన అలసటతో మంచం మీద పడిపోతాడు.

ఉదయమే అవని రెడీ అయ్యి కిందకి వచ్చి వాళ్ళ అత్తగారికి హెల్ప్ చేస్తూ ఉంటుంది.  ఎందుకు అవిని అలసిపోతావు.  మళ్ళీ మీ ఫ్లైట్ టైం అవుతుంది కదా అంటే..

అన్ని ప్యాక్ చేసేసే ఉన్నాయి అత్తయ్యగారు. ఉన్న కాసేపైనా మీతో ఉంటే నాకు బాగుంటుంది అని చెప్పి మాధవికి, లలిత కి కబుర్లు చెబుతూ బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది.

విక్రమ్ రెడీ అవుతూ ఉంటే ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరా ఈ టైంలో ఫోన్ అనుకుని చూస్తే శ్రీ నుంచి వస్తూ ఉంటుంది.

ఏంటి ఈ టైం లో ఫోన్ అనుకుని లిఫ్ట్ చేయగానే..హలో బావ అని గట్టిగా అరుస్తాడు.  ఫోను దూరంగా జరిపి చెవులో వేలుతో రుద్దుకుని..మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని...

ఏమైంది రా.. రాత్రి ఏమైనా తాగి వచ్చావా ఏమిటి అంత గట్టిగా అరుస్తున్నావు అనగానే...  పో బావ నేను మంచి న్యూస్ చెబుదామనిఫోన్ చేస్తే నాకు గాలి అంతా తీసేసావు అని ఉసురుమంటాడు.
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 64


శ్రీ మొత్తం చెప్పిన తర్వాత విక్రమ్ మౌనంగా ఉంటాడు. ఏమైందిరా నేను ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే..నువ్వు అలా సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతాడు.



నేహా వాళ్ళ పేరెంట్స్ మనస్తత్వాన్ని అంచనా వేస్తున్నాను. మీరు వెళ్లి అడిగిన వెంటనే ఆయన ఒప్పుకుంటారా లేదా అన్నది ఆలోచిస్తున్నాను అని చెబుతాడు.



ఏమైంది రా నాకు. నాకేం తక్కువ అని అడిగితే.. అన్ని ఎక్కువే.అందుకే వాళ్ళు వద్దు అంటారేమో అని అనుకుంటున్నాను అంటాడు.



ఎందుకురా అంత బాంబు వేసావు నా  నెత్తి మీద అంటే.. నేను నిజమే చెబుతున్నాను.  నేహా చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి ఆత్మ అభిమానం చాలా ఎక్కువ.



అలాగే తహతకు మించిన సంబంధం చేస్తే.. రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని కూడా భయపడతారు.  ముందు వాళ్ళు భయాన్ని తీసివేసి, అప్పుడు నువ్వు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ తీసుకో అని చెబుతాడు.



థాంక్స్ బావ మంచి సలహా ఇచ్చావు. లేకపోతే డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడితే వాళ్లు నో అన్నారంటే... ఇంకా డాడీ ఒక్క అడుగు కూడ ముందుకు వేయరు.



వద్దన్నారు కదా ఇంకెందుకు వెళతాము అని ఈయన సైలెంట్ అయిపోతారు.  ముందు నా ప్రయత్నాలు నేను చేసి అప్పుడు అమ్మానాన్న దింపుతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.



విక్రమ్ నవ్వుకుంటూ రెడీ అయ్యి కిందకు వెళతాడు. అక్కడ అవని... లలిత, మాధవి లకు కబుర్లు చెబుతూనే ఉంటుంది.



అది చూసి విక్రమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పరవాలేదు బానే కలిసిపోతుంది. ఇలా ఉంటే తొందరగానే తనకున్న ఇన్ సెక్యూర్ ఫీలింగ్ అంతా పోతుంది అని అనుకుంటాడు.



సత్యవతి, శేషగిరి గారు అప్పుడే లోపలికి వస్తూ ఉంటారు.  రండి అని విక్రమ్ సాదరంగా ఆహ్వానిస్తాడు.



చల్లగా ఉండు నాయన ఆశీర్వదిస్తారు. బాగున్నారా అని అడుగుతాడు. పరవాలేదు అని చెప్పి అమ్మాయి ఏది అంటే...



కిచెన్ లో చూపిస్తాడు.  అలా చూడగానే అవని నవ్వుతూ మాట్లాడడం చూసి వాళ్లకి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది.



అవని పుట్టిన తర్వాత రజిని ఉన్నన్ని రోజులేనేమో అవని ముఖంలో చిరునవ్వు చూసింది. మళ్ళీ ఇన్ని రోజులకు చూస్తూ ఉంటే ఆ పెద్ద వాళ్ళిద్దరికీ కడుపు నిండిపోయినట్టు ఉంటుంది.

బాబు మాకు ఒక చిన్న సహాయం చేస్తావా అని అడుగుతారు.  చెప్పండి తాతగారు అంటే.. అవినిది ఇలా నవ్వుతూ ఉన్న ఒక ఫోటో తీసి నాకు పెట్టు బాబు చూసుకుంటాను అంటాడు.



సరే అని చెప్పి అవినికి  తెలియకుండా చాలా యాంగిల్స్ లో ఫొటోస్ తీసి శేషగిరి గారికి పంపిస్తాడు. అవి చూసుకుని పెద్దయినా కన్నీళ్లు పెట్టుకుంటారు.



ఎందుకు తాతగారు ఇప్పుడు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అంటే...మా ఇంటి మొదటి వారసరాలు బాబు.



వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఎప్పుడైతే భార్గవి వాడి జీవితంలోకి వచ్చిందో..అప్పటినుండి అల్లకల్లోలం అయిపోయింది.



ఒక మాయా ప్రపంచంలో నా కొడుకుని ఉంచి అదే జీవితం అని చూపించింది. కూతురు వాడికి వ్యతిరేకంగా పెరుగుతుందేమో అనుకుని బాధపడ్డాడు.



కానీ కూతురుతో కూర్చుని మాట్లాడి అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అని ఆలోచన వాడికి లేకుండా చేసింది. ఎప్పుడూ అవని తో మాట్లాడదామని వాడి ప్రయత్నించిన ఏదో ఒక మెలిక వేసి అవినికి దూరంగా ఉంచింది.



ఆ పిచ్చి తండ్రికి అది తెలియక కూతురు తప్పుడు దారిలో వెళుతుందేమో అనుకున్నాడు కానీ ఆ భార్గవి కూతురే తప్పుడు దారిలో వెళ్ళింది.



ఇప్పుడు చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. మీరు హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాడు.



ఏమి నిర్ణయం తాతగారు అంటే..నాకు సరిగ్గా తెలియదు కానీ..మాతోపాటు ఊరు వచ్చేసే ఆలోచనలో ఉన్నాడు. అది ఎంతవరకు కరెక్టో కూడా నాకు తెలియదు అని చెబుతారు. విక్రమ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు.



నా కొడుకు నమ్మకం అంతా మీరే బాబు అని చెబుతారు. దేనికి అన్నట్టుగా చూస్తే...భవిష్యత్తులో తన కూతుర్ని వాడి దగ్గరికి చేర్చేది మీరు మాత్రమే అని చాలా గట్టిగా నమ్ముతున్నాడు.



ఆ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో నాకైతే తెలియదు కానీ... అవని మాత్రం బాధపడకుండా ఉంటే చాలు.



ఇన్ని సంవత్సరాలు నా మనవరాలకి తెలియకుండానే బాధను ఇచ్చాడు. ఇప్పుడు ఆ బాధను వాడి తీసుకుంటున్నాడు.



అవని వీళ్ళని చూసి నానమ్మ తాతయ్య ఎంతసేపైంది మీరు వచ్చి అని పరిగెత్తుకుంటూ వస్తుంది. మెల్లిగా రా తల్లి.



ఇప్పుడే వచ్చాము అని చెబుతారు. మంచినీళ్లు తాగుతారా అంటే ఇప్పుడు ఏమీ వద్దు తల్లి కూర్చో మా పక్కన కాసేపు అని పక్కన కూర్చోపెట్టుకుంటారు.



అవని సంతోషాన్ని చూసి వాళ్ళిద్దరికీ మనసు సంతోషంతో నిండిపోతుంది. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి తల్లి అని నుదుటిన ముద్దు పెట్టుకుంటారు.



నా అత్తింటివారు నాతో ఉండగా నాకేంటి బాధ నానమ్మ అని చెబుతోంది.  ఎన్నింటికి మీ ప్రయాణం అని అడిగితే లంచ్ చేసిన తర్వాత అని చెబుతుంది.



ఇదిగో తల్లి అన్ని కార్డు చేతికిస్తుంది. ఏమిటి నాన్నమ్మ ఇది అంటే..అంత దూరం వెళుతున్నావు కదా.. నీకంటూ ఏదైనా అవసరాలు ఉంటాయి ఏమో అని.



అంటే మీ ఆయన ఇవ్వరని కాదు.. ఏదో పుట్టింటి తరుపున చిన్న కానుక తల్లి తీసుకో అని అంటారు.



ఆ మాటలకు అవిని నా పుట్టిల్లు కూడా ఇక్కడే ఉంది నానమ్మ అని కార్డు ఉన్న చేతిని వెనక్కి తోస్తుంది. అంటే మేము పరాయి వాళ్ళం అయిపోయామా అని బాధపడతారు.



మీరు ఇద్దరు ఎప్పటికీ నాకు పరాయి వాళ్ళు కాదు కానీ...ఆ ఇంటి నుంచి నేను ఏమి తీసుకోదల్చుకోలేదు. నాకు ఏదైనా అవసరమైతే ఇక్కడ చూసుకోవడానికి నా భర్త ఉన్నారు.



పుట్టింటి తరుపున కావాలి అంటే... ఇక్కడ నాకు ఒక తండ్రి, తల్లి,అన్నయ్య ఉన్నారు. ఇంతకు మించి నాకు అవసరం ఏమీ లేదు.  మీరు బాధపడి నన్ను బాధ పెట్టొద్దు అనే సున్నితంగా చెబుతుంది.



ఆ మాటలు విన్న మాధవికి మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము కూతురిగా పూర్తిగా స్వీకరించిన అవిని మమ్మల్ని స్వీకరించిందా లేదా అని ఎక్కడో చిన్న అనుమానం ఉండేది అది కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది.



బాధపడుతున్న పెద్ద వాళ్ళ దగ్గరికి మాధవి వచ్చి మీరు బాధపడకండి అత్తయ్య గారు.  అవినికి ఏ లోటు రాకుండా తల్లిగా చూసుకునే బాధ్యత నాది.



అవిని నా కడుపున పుట్టలేదు అన్న మాటే గాని మిగిలిన ఏ లోటు రాదు. అవును మాధవి నువ్వు చెప్పిందంతా నిజమే.



అవిని ఇక్కడికి వచ్చిన తర్వాతే సంతోషంగా నవ్వుతుంది. ఆ నవ్వు రజిత ఉన్నప్పుడే చూసాము. తల్లిగా నువ్వు ఉన్నావు కదా..  అందుకే మళ్ళీ ఆ స్వచ్చమైన నవ్వు తిరిగి వచ్చింది.



నీకు ఏమిచ్చి మా రుణం తీర్చుకోగలం అని నమస్కారం చేస్తారు.  అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అత్తయ్య గారు..



అవని ఎప్పటికీ నా కుతురే అని  అవని చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటారు.   లలిత వచ్చి పెద్ద వాళ్ళిద్దరినీ బలవంతంగా  బ్రేక్ ఫాస్ట్ కి రమ్మని తీసుకు వెళుతుంది.



బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకుని లంచ్ ప్రిపేర్ చేస్తారు. లంచ్ చేసి అవని, విక్రమ్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతారు.



ఎయిర్పోర్ట్ కి వెళ్లి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళని రెండు కళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి.



విక్రమ్ కి అనుమానం వచ్చి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఒక మూలన నిలబడి చూస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు.  తర్వాత చిన్నగా నవ్వుకుని అవని అతనికి కనపడేటట్టుగా కూర్చోబెడతాడు.



నవ్వుతూ ఉన్న అవిని చూసి ఆ వ్యక్తి సంబరపడిపోతాడు. నీ నవ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఆ నవ్వు శాశ్వతంగా ఉండడానికి నేనేమైనా చేస్తాను అని...



ఎంజాయ్ యువర్ హనీమూన్ అని వాళ్ళు వెళ్లేంతవరకు అక్కడే ఉండి అవని, విక్రమ్ వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేస్తాడు.



ఇంటికి వచ్చిన వ్యక్తిని చూసి ఎక్కడికి వెళ్లావు ధనుంజయ్ అని సత్యవతి గారు అడిగితే.. ఎయిర్పోర్టుకి అమ్మ అని చెబుతాడు.



ఎయిర్పోర్టుగా ఎందుకు అని అడిగితే... నా కూతురు సంతోషాన్ని చూడడానికి. ఎంత సంతోషంగా ఉందో తెలుసమ్మా..



నా రెండు కళ్ళే సరిపోలేదు భగవంతుడు ఇంకొక పది కళ్ళు ఇచ్చి ఉంటే బాగుండును అనిపించింది.  మన దగ్గర ఉన్నన్ని రోజుల్లో ఎప్పుడు అవని ఒక్కరోజు కూడా నవ్వినట్టు లేదు కదా అమ్మ.



కానీ పెళ్లయిన దగ్గర నుంచి అవని కళ్ళల్లో వచ్చే కన్నీళ్లు అన్నీ కూడా సంతోషంతోనే వస్తున్నాయి. నా అల్లుడు అంత బాగా చూసుకుంటున్నాడు అని చాలా గొప్పగా చెబుతారు.



కొడుకు సంతోషాన్ని రెట్టింపు చేయడానికి శేషగిరి గారు ఫోన్ ఇస్తారు. ఏమిటి నాన్న అంటే.. నువ్వే చూడు అని చెబుతారు.



అందులో అవని హార్ట్ ఫుల్ గా నవ్వుతూ లలిత మాధవి గారితో మాట్లాడుతూ ఉన్న ఫోటోలు. వాళ్ళిద్దరి మీద చేతులు వేసి, ఇద్దరు హగ్ చేసుకుని ఉన్న ఫోటోలు.



ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ధనుంజయ్ కళ్ళల్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. మసకబారపోతున్న కళ్ళు తుడుచుకుని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాడు.



నా కూతురు ఎంత సంతోషంగా ఉంది కదా నాన్న నా కూతురి మీద పాపిష్టి వాళ్ళ కళ్ళు ఎప్పటికీ పడనివ్వకూడదు.



నా కూతురు సంతోషాన్ని నాశనం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫోటోలు చూపిస్తాను. అవిని సంతోషం చూసి వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడవాలి.



నా కూతుర్ని నాకు దూరం చేసి దుఃఖాన్ని ఇచ్చారు. వాళ్ళకి అవిని సంతోషాన్ని చూపించి అదే దుఃఖాన్ని రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తాను.



తండ్రి ఫోన్ నుంచి ఆ ఫోటోలన్నీ తను ఫోన్ కి ఫార్వర్డ్ చేసుకుని ఆ ఫోటోలు చూసుకుంటూ గదిలోకి వెళ్ళిపోతాడు.



మొదటిసారి విమానం ఎక్కిన అవని భయంతో బిగుసుకుపోయి విక్రమ్ ని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది.



అవని భయాన్ని విక్రమ్ ఎలా పోగొడతాడు...


కథ కొనసాగుతుంది...
Like Reply
enti bro.. nee timing ippude choostunna.
You almost always post at midnight. Is it because nee daily works anni poorthi cheskuni, then you spend some time on this story?

Thanks a ton for burning midnight oil for us!!
Heart Heart Heart Heart Heart

And the story rocks.
The sweet little side story b/w Neha and Sri.. try to make it a little meatier!!
Neha though wants to not make her parents unhappy, she's still a girl with feelings!!
Try to explore that angle to come up with some romantic episodes b/w those love birds!!

All in all a wonderful story!!
Great guns!!
Like Reply
Great writing sir??
Like Reply
Superb update
Like Reply
(28-01-2026, 03:37 AM)ash.enigma Wrote: enti bro.. nee timing ippude choostunna.
You almost always post at midnight. Is it because nee daily works anni poorthi cheskuni, then you spend some time on this story?

Thanks a ton for burning midnight oil for us!!
Heart Heart Heart Heart Heart

And the story rocks.
The sweet little side story b/w Neha and Sri.. try to make it a little meatier!!
Neha though wants to not make her parents unhappy, she's still a girl with feelings!!
Try to explore that angle to come up with some romantic episodes b/w those love birds!!

All in all a wonderful story!!
Great guns!!

Yes Bro........   

E Hyderabad Traffic Nuchi Bayata Padatam Antha Easy Kaduu


Office Nuchi 7:30 P.M Ki Start Aethi Naa Room Ki Reach Ayyaedi 10:15 P.M Inka Freshup Food Complete Chesete AA Time Avtundi


Sri And Neha Love Part Undi Vastundi Next Updates Lo Untayi
Like Reply
Part - 65


భయంతో బిగుసుకుపోయినా అవిని నీ చూసి ఏమయింది అని అడుగుతాడు. ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ గా ఉంది అని చెబితే...

ఒక్క నిమిషం అని విండో వైపుకి కూర్చోబెడతాడు. ఫ్లైట్ పైకి వెళ్ళేటప్పుడు విండో లోంచి కిందికి చూడు. వ్యూ ఎంత బాగుంటుందో...

ఉహు..నాకు కళ్ళు తిరుగుతాయి అంటే...ప్రతిదానికి భయపడితే అడుగు ముందుకు వెయ్యలేవు. పక్కన నేను ఉంటే భయమే ఉండదు అని అంటావు కదా.. నీ పక్కన నేను ఉన్నప్పుడు కూడా భయపడితే అర్థం లేదు.

భయాన్ని వదిలేసి అడుగు ముందుకు వెయ్యి. ఆ విజయం ఎంత కిక్కిస్తుందో చూడు. మొదటి అడుగు వేసే ఎవరికైనా సరే భయం ఉంటుంది.

అంతెందుకు చిన్న బేబీస్ కూడా ఫస్ట్ అడిగేసినప్పుడు ముందుకు పడతారు. అలా అని వాళ్ళు అడుగులు వేయడం మానేస్తారా...

మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టే.. వాళ్ళ నడక నేర్చుకోగలుగుతారు. అలాగే ఏ పనైనా అంతే ఫస్ట్ భయమనిపిస్తుంది. ఆ భయాన్ని పక్కనపెట్టి ముందుకు చూడు.

    చెవుల్లో కాటన్ పెట్టి... ఇప్పుడు ప్రశాంతంగా వ్యూని చూస్తూ ఉండు అని చెబుతాడు. విక్రమ్ మాటలకు కొంచెం ధైర్యం తెచ్చుకుని..  విక్రమ్ చేతిని తన చేతి వేళ్ళతో బంధించి చూస్తూ ఉంటుంది.

ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు... కొంచెం ఆ సౌండ్స్ కి దడదడలాడుతూ ఉంటుంది కానీ....ఆకాశంలోకి ఎగిరేటప్పటికీ అవనిలో ఉన్న భయం కూడా పక్కకి వెళ్లిపోయి సంతోషంతో విక్రమ్ వైపు చూస్తూ చాలా బాగుంది అని చెబుతుంది.

ఆ మాటలకి నవ్వుతూ నేను చెప్పాను కదా....  ఫస్ట్ భయాన్ని వదిలేస్తే అంతా బాగుంటుందని అంటే..మీరు ఎప్పుడు బాగానే చెబుతారు కానీ.. అడుగు వేసేటప్పుడు నాకు కొద్దిగా భయం ఉంటుంది కదా అని వ్యూని చూస్తూ భర్త భుజం పైన తల పెట్టుకుంటుంది.

అవని తలపైన చేతితో నిమురుతూ జర్నీ అలసట తెలియకుండా కబుర్లు చెబుతూ ఉంటాడు. అవిని కూడా ఆ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తుంది.

తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇల్లు, చదువు తప్ప ప్రపంచం తెలియదు.  ఫస్ట్ టైం బెంగళూరు పెళ్లయిన తర్వాత వెళ్లడమే...

ఇప్పుడు భర్తతో కలిసి ఫ్లైట్లో వెళుతూ ఉంటే తన ఆనందానికి అవధులు లేకుండా ఉంటుంది. విండోలో నుంచి కిందకి చూస్తూ ఏమండీ...

అసలు ఏమీ కనపడటం లేదు.  అన్ని చాలా చిన్నచిన్నగా ఉన్నాయి అని ఆశ్చర్యంగా చూస్తూ చెబుతుంది. చిన్నపిల్లలాగా సంతోష పడుతున్న భార్య ఆనందాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు.

కొన్ని గంటలు జర్నీ తర్వాత స్విస్లో దిగుతారు. ఎయిర్పోర్ట్ బయటికి వచ్చి అబ్బా  ఈ చలి చాలా చలిగా ఉందండి అని  చేతులు రబ్ చేసుకుంటూ చెబుతోంది.

చలిగా ఉంటే భర్తను హత్తుకుపోవాలి గాని.. చేతులు రబ్ చేసుకుంటే ఎలా అని అడుగుతాడు.  అయ్యో మీరేం చేస్తున్నారు మనం బయట ఉన్నాము అని ఇబ్బందిగా చుట్టూ చూస్తూ చెబుతోంది.

ఇక్కడ ఇవన్నీ కామన్నే..  ప్రతిదానికి ఇబ్బందిపడకు. అయినా మనం ఎవరు అనేది ఇక్కడ ఎవ్వరికీ తెలియదు.

ఎంత తెలియకపోతే మాత్రం మరి ఇలాగా అని సిగ్గుపడుతుంది.  ఓయ్...  నేను ఏమీ చేయలేదు కదా.. అటు చూడు అని ఒక జంటను చూపిస్తాడు.

వాళ్ళిద్దరూ హగ్ చేసుకుని లిప్ కిస్ ఇచ్చుకుంటూ ఉంటే.. నోరు వదిలేసి చూస్తుంది. ఏమైంది బంగారం అలా చూస్తున్నావు.

మరీ పబ్లిక్ లో ఇలా ఎలా అంటే.. నువ్వు అసలు మూవీస్ చూడవా అంటే లేదుగా అనే పెదవి విరుస్తుంది.

మన తెలుగు మూవీస్ లో ఇంకా స్ట్రాంగ్ గా కిస్ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఇలాంటివి అన్ని మామూలే.

ఏంటి మన తెలుగు మూవీస్ లోనా...  అందరూ చూస్తారు కదండీ ఇబ్బందిగా అనిపించదా అని అమాయకంగా అడుగుతుంది.

అది ప్రొఫెషన్ అంతే..ఇంకా వాటి గురించి మాట్లాడకు. పద  నీకు చాలా మూవీస్ చూపించాలి. కొత్త కొత్త రుచులను అలవాటు చేయాలి కదా అని అక్కడ వాళ్ళ కోసం ఉన్న విల్లాకి తీసుకువెళ్లిపోతాడు.


ఆ విల్ల చూడగానే అవని ఆశ్చర్యపోతూ ఇక్కడ మనకి ఉందా అని అడుగుతుంది.  హ్మ్...అంటాడు.

చాలా బాగుందండి ప్లేస్ అని మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ముందు వెళ్లి ఫ్రెష్ అవ్వు. ఏమైనా తిన్నాక... నీకు అప్పటికి ఓపిక ఉంటే అన్నీ చూద్దువు గాని పద అని రూమ్ కి తీసుకువెళ్తాడు.

ఫ్రెష్ అయ్యి లైట్ ట్ ఫుడ్ తిని కాసేపు రెస్ట్ తీసుకుంటారు.
అవని చాలా మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. విక్రమ్ కి మెలకువ వచ్చినా సరే.. భార్య నిద్ర మొహాన్ని చూసి ఇంకా దగ్గరికి లాక్కుని హత్తుకుని పడుకుంటాడు.

ఎంతసేపైనా నిద్ర లేవడం లేదని విసుగు వచ్చి అవిని బుగ్గ పైన కొరుకుతాడు. చురుక్కుమనడంతో  స్... అంటూ బుగ్గ మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ మగతగా కళ్ళు విప్పుతూ ఏంటండీ ఇలాగా అని ముద్దు ముద్దుగా అడుగుతూ ఉంటుంది.

మనం వచ్చింది ఎందుకు నువ్వు ఇలా నిద్రపోవడానికా... అబ్బా జర్నీ వల్ల అలసటగా అనిపించి నిద్ర పట్టేసింది. ఆమాత్రం దానికే ఇలా చేస్తారా అని చిరుకోపంగా అడుగుతూ... గ్లాస్ విండో లో నుంచి బయటికి చూస్తూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తుంది.

ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగితే... ఎక్సైట్మెంట్గా మంచు కురుస్తుందండి.... భర్త కౌగిలిలో నుంచి విడిపించుకుని బయటకి పరిగెడుతుంది.

హేయ్... జాగ్రత్త నేను వస్తున్నాను ఆగు అని నవ్వుతూ అవని వెనకాలే వెళతాడు. ఆ మంచు నీ బాల్స్ లాగా చేసి, ఎగరవేస్తూ   ఆడుకుంటూ ఉంటుంది.

విక్రమ్ ని చూసి మీరు రండి ఆడుదురు గాని...నువ్వు ఆడు నేను చూస్తూ ఉంటాను అని చెబుతాడు.

దానికి అవని నడుం మీద చేతులు వేసుకొని ఇంత దూరం వచ్చింది  మీరు.... నేను ఆడుతూ ఉంటే మీరు చూస్తూ ఉండడానికా అని విక్రమ్ డైలాగులు విక్రమ్కే  అప్పజెప్పి చెయ్యి పట్టుకుని ముందుకు లాగుతుంది.

పర్వాలేదే... నా భార్యమణి కి కూడా సెటైర్స్  వేయడం వచ్చే అని అక్కడున్న ఐస్ ని బాల్ లాగా చేసి అవిని మీదకి విసురుతాడు.

ఆ బాల్ వచ్చి సూటుగా అవని గుండెలని తాకుతుంది. అబ్బా... అంటూ మీరు కావాలనే విసిరారుకదా చెబుతాను ఉండండి మీ పని అని....

తను కూడా ఐస్ ని బాల్ లాగా చేసి విక్రమ్ మీదకి విసురుతుంది. విక్రమ్ పక్కకి తప్పుకుంటూ నన్ను నువ్వు ఔట్ చేస్తే నువ్వు అడిగింది ఇస్తాను అవని అని మళ్ళీ ఐస్ బాల్ లాగా చేసి గురు చూసి అవని నడుం మీద కొడతాడు.

అవిని ఎన్నిసార్లు ట్రై చేసినా విక్రమ్ తప్పుకుంటూనే ఉంటాడు.  బిక్క మొహం వేసుకుని మీరు గురుచూసి కొడితే నేను అవుట్ అయిపోతున్నాను కానీ... నాకు మాత్రం మీరు దొరకడం లేదు.

ఒక్కసారి దొరికిపోవచ్చు కదా విక్రమ్ గారు అని గారంగా అడుగుతుంది. భార్య ముద్దు ముద్దు మాటలకి మెల్ట్ అవుతూనే...

అబ్బా అవని అలా దొరికితే ఇంక గేమ్ లో మజా ఏమంటుంది. ఏదైనా సాధించుకున్నప్పుడే ఆ గేమ్ లో ఒక ఆనందం ఉంటుంది.

ట్రై చెయ్.  అంతగా నీ వల్ల కాకపోతే నువ్వు ఓడిపోతున్నావు అనిపిస్తే... నేనే దొరుకుతాను అంటాడు. నో... నో...నేనేమీ అలసిపోవడం లేదని మళ్లీ ఐస్ తీసుకుని విసురుతూ ఉంటుంది.


అలా చాలాసేపు ఇద్దరు ఐస్ లో ఆడుతూఉంటారు.  అవని కి అలుపువస్తుంది అన్నప్పుడు... వెనకాల కి వచ్చి గట్టిగా హత్తుకొని...బాగుందా ఆట అని అడుగుతాడు.

చాలా బాగుంది ఫస్ట్ టైం తెలుసా..  ఇలా ఐస్ లో కూర్చుని ఆడుకోవడం. చిన్నప్పటి నుంచి నేను అసలు ఆడుకుందే లేదు.  పని.... పని అయిపోతే చదువుకోవడం అంతే...

కానీ ఈరోజు ఇంత ఐస్ లో ఆడుతూ ఉంటే చిన్నపిల్లని అయిపోయినట్టే అనిపిస్తుంది అని వెనక్కి తిరిగి గట్టిగా విక్రమ్ ని హత్తుకుంటుంది.

ఎమోషనల్ అవుతున్న అవనినీ గట్టిగా కౌగిలించుకొని డైవర్ట్ చేస్తూ ఓయ్ బంగారం....  ఈ మంచు లో ఆడి... ఆడి... చాలా చలిగా ఉంది. లోపలికి వెళ్తే హీటర్ పెట్టాలి అని చెవిలో హాస్కిగా అంటాడు.

ఆ మాటలకి అవిని సిగ్గుపడుతూ... మీకు అసలు సిగ్గే పెట్టలేదు దేవుడు అని... ఆ విక్రమ్ ని వదిలించుకొని లోపలికి పరుగుపెడుతుంది.

వెళుతున్నా అవినినీ చూసి నవ్వుకుంటూ నీ మనసులో ఎటువంటి బాధనిరానివ్వను. నీ చిన్నతనంలో నువ్వు మిస్ అయిపోయిన ప్రతిదీ నీ దగ్గరికి చేర్చుతాను.

నువ్వు బంగారమే నా భార్యమణి. నీ పెదవుల పైన చిరునవ్వు అలా మెరుస్తూ ఉంటే...ఎంతటి టెన్షన్ అయినా సరే గాలిలోకి ఎగిరిపోతోంది.

అవినినీ చూస్తూ విక్రమ్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. కిచెన్లో అవని ఫుడ్డు రీ హీట్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావ్ అని అడిగితే.....

ఫుడ్ వేడి చేస్తున్నాను. చాలాసేపు అయింది కదా...ఆకలి వేయడం లేదా అంటే... ఎందుకు వేయడం లేదు.. కానీ నా భార్యమని కోపరేట్ చేయడం లేదు అని అమాయకంగా అంటాడు.

వస్తున్న నవ్వని పెదవి కింద దాచి అబ్బో ఏం కోపరేట్ చేయడం లేదంట అని అడుగుతుంది. మరి నా ఆకలి తీర్చకుండా ఫుడ్ హీట్ చేస్తూ కూర్చుంటుంది.

కోపరేట్ చేయడం లేదనే కదా అర్థం...  హ్మ్... చాలా పెద్ద కష్టమే వచ్చింది మా ఆయనకి. ఇప్పుడు ఏం చేయాలి అదే అమాయకమైన ఫేస్తో అడుగుతుంది.

ఇప్పుడు మా ఆవిడ లైన్ లోకి వచ్చింది.  ముందు భర్త గారి వంటి ఆకలి తీర్చి.. అప్పుడు కడుపు ఆకలి గురించి ఆలోచించాలి అని దగ్గరికి లాక్కుని పెదవులు అందుకుంటాడు.

విక్రమ్ ఇస్తున్న ముద్దుకి.. భర్త మైకంలో పడిపోయి చేతులను విక్రమ్ తలలోనికి పోనిచ్చి ఆ ముద్దుకి సహకరిస్తూ ఉంటుంది.

ఈ చలిగాలికి... ఆ ముద్దు మైకానికి ఒంటిలో వేడి రాజుకుంటూ ఉంటుంటే... మెల్లిగా భార్యని ఎత్తుకొని ఆ ముద్దు నీ కంటిన్యూ చేస్తూనే బెడ్ రూమ్లోనికి తీసుకు వెళ్లిపోతాడు.

❤️❤️❤️❤️
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 66


గదిలోకి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టి ముద్దు మురిపాలలో భార్యని ఉయ్యాల ఊగించి సేదతీర్చుతాడు.

భర్త ప్రేమకి మురిసిపోతూ అతని చేతలకి సిగ్గులమొగ్గ అవుతుంది. తనివితీరని దాహానికి కాసేపు విశ్రాంతినిచ్చి.. భార్యా సమేతంగా సరిగంగా స్నానం చేసి..ఫుడ్డు తన చేతులతో తానే తినిపిస్తాడు.

అవనికి ఏ విషయంలో కూడ ఆలోచన రాకుండా తన ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాడు.

చుడీదార్స్, చీరలు మాత్రమే కట్టుకునే అవిని చేత జీన్స్ దగ్గర్నుంచి మినీ ఫ్రాక్స్ దాకా వేపిస్తాడు. ఆ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు మాత్రం అవని ఇబ్బందులు ఆ పరమాత్ముడికే ఎరుక...

జీన్స్ వేసుకున్నప్పుడైనా కష్టంగా నైనా సరే కొంచెం ముందుకు వస్తుంది కానీ..  ఫ్రాక్ వేసుకొన్నప్పుడు కాళ్లు కనపడకుండా టవల్ కట్టేస్తోంది.

అది చూసిన విక్రమ్ తల కొట్టుకుంటు వెళ్లి టవల్ తీసేసి అద్దం  ముందు నుంచి పెట్టి నేను చూడనిది ఏమైనా ఉందా ...

అది వేరు ఇది వేరే అండి అని మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఏం వేరు  భార్యమణి... అప్పుడైనా,ఇప్పుడైనా చూసేది నేనే కదా అని కొంటెగా అంటాడు.

ఈ గౌన్లో ఎలా ఉన్నావో తెలుసా? అచ్చు బుట్ట బొమ్మలాగా ఉన్నావు.  నాకు ఒక డ్రీమ్ ఉండేది . నా ప్రేయసి తో ఇలా పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలి అని...

బట్ పెళ్ళికి ముందు ఎవరూ నాకు నచ్చలేదు. పెళ్లయిన తర్వాత నా భార్య నా ప్రేయసి కదా... అంటే ఏమిటి మీ ఉద్దేశం.. ఇప్పుడు నన్ను మీరు ఇలా పబ్ కి తీసుకువెళతారా... అని కంగారుగా అడుగుతుంది.

అవని కంగారు చూసి నవ్వుకుంటూ... నీకు అంత సీన్ లేదు. మన పబ్ డాన్స్ మొత్తం ఇక్కడే చేస్తాము. నా భార్యామణిని ఇలాగ ఎవరికైనా చూపిస్తానా...

దిష్టి తగలదు అని నడుము మీద చేయి వేసి నొక్కుతాడు.
అబ్బా ఏంటండీ మీరు అని సిగ్గుపడుతూ తలదించుకుంటుంది.

హేయ్.. అవని నాకు చెర్రీస్  ఇష్టము అని నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు.  చెర్రీ సా..ఇప్పుడు వాటి విషయం ఎందుకు వచ్చిందండి.

ఫ్రిజ్లో ఉన్నయేమో చూసి వస్తాను అంటే...అయ్యో భార్యామణి అని నుదుటిమీద కొట్టి ఆ చెర్రీస్ నీ బుగ్గల్లోనే ఉన్నాయి. చూడు అంటూ అద్దం వైపుకి తిప్పుతాడు.

అవినికి అప్పటికే సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కిపోతాయి. చూసావా నాకు ఏది ఇష్టమో నీకే బాగా తెలుసు అని భార్యని టీజ్ చేస్తూ ఉంటాడు.

అవని ఇంకా సిగ్గుతో ముడిచుకుపోతుంది.  విక్రమ్ ని హత్తుకుంటుంది. రా.. అని చెప్పి తీసుకుని ఒక రూమ్ లోకి తీసుకువెళతాడు.

ఆ రూమ్ మొత్తం డిమ్ లైట్స్ పెట్టి ఉంటాయి. ఒక పక్కన వోడ్కా బాటిల్,  గ్లాసెస్, లైట్ మ్యూజిక్ అరేంజ్ చేస్తాడు.

అవి చూసి పబ్ అంటే ఇలాగే ఉంటుందా అని అడుగుతుంది.  అది ఇంకా గందరగోళంగా ఉంటుంది కానీ.. మనది రొమాన్స్ పబ్ అని చెప్పి మ్యూజిక్ తగ్గట్టుగా అవిని తో డాన్స్ చేపిస్తూ ఉంటాడు.    

ముందు బిడియంగా అనిపించినా.. తర్వాత మెల్లిగా విక్రమ్ తో అడుగులు కదుపుతుంది. ప్రతిధ్రిల్ ని భార్యకి పరిచయం చేస్తూ... లోకం ఎలా ఉంటుందో అన్నది మెల్లిగా చూపిస్తూ ఉంటాడు.

మనం ఒకసారి శ్రీ దగ్గరికి వెళ్దాం. రెండు వేరువేరే టైమింగ్స్ లో జరుగుతున్నదని గుర్తించగలరు.


నైట్ అంతా పడుకోకుండా ఆలోచించి పొద్దుటే వాళ్ళ మదర్ కి కాల్ చేస్తాడు.

శ్రీ నుంచి కాల్ చూసిన వాళ్ళ అమ్మగారు చెప్పరా అనగానే.. అమ్మ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు.  నేను ఒక అమ్మాయి డీటెయిల్స్ పంపిస్తున్నాను.

ఈ సంబంధం ఎలాగైనా కుదర్చాలి.ఎందుకంటే తనే మీకు కాబోయే కోడలు. ఇది మాత్రం ఫిక్స్.

ఒరేయ్ కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడరా.. అలా తల తోక లేకుండా చెబితే నాకేం అర్థం అవుతుంది అంటే.. నువ్వు అసలు డాక్టర్ ఎలా అయ్యావు అమ్మ.

ఇంత వివరంగా చెబుతున్నా సరే ఏమీ అర్థం కాలేదంటావు.
నేను ఎలాగోలాగా డాక్టర్ అయ్యాను కానీ.. సరిగ్గా చెప్పు అనగానే... అవని, నేహా ఫ్రెండ్షిప్ మొత్తం చెప్పి, నేహా తనతో అన్న విషయాలు మొత్తం చెబుతాడు. 

ఇప్పుడు అర్థమైంది కదా అనగానే... అర్థమైంది బాబు.. నేహ క్యారెక్టర్ మాకు నచ్చింది.  నేహా పేరెంట్స్ కూడా ఆత్మ అభిమానం ఎక్కువ అని అర్థమవుతుంది.

మీ డాడీ తో కలిసి టైం చూసుకుని వెళ్లి మాట్లాడివస్తాము సరేనా అంటే... మీరు ఎప్పుడో టైం చూసుకోవడం కాదు. ఈరోజే వెళ్లండి అంటే...

ఒరేయ్ మాకు కొన్ని ఆపరేషన్ ఉన్నాయి రా.. అప్పటికప్పుడు చెప్తే డాక్టర్స్ కి ఎలా కుదురుతుంది అనుకుంటున్నావురా...

అదంతా నాకు తెలియదు మమ్మీ. మీరిద్దరూ అర్జెంటుగా వెళ్లి మాట్లాడండి.  లేకపోతే ఏదైనా సంబంధం కుదిరింది అనుకో ఆయన మాట తప్పరు. నా పిల్ల నాకు దక్కదు.

ఇంతలో అక్కడికే శ్రీ నాన్నగారు వచ్చి.. ఏమైంది నీ కొడుకు ఏదో టెన్షన్ పెడుతున్నట్టు ఉన్నాడు అనగానే...
శ్రీ చెప్పిన మ్యాటర్ మొత్తం చెబుతారు.

నీ కొడుకుకి ఏదో వచ్చినా తట్టుకోవడం కష్టమే. ఫోన్ ఒకసారి ఇటుఇవ్వి అని ఒరేయ్ శ్రీ ఈరోజు మాకు ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి.

రేపు వెళ్లి మాట్లాడి ఫైనల్ చేసి నీకు కాల్ చేస్తాను సరేనా అని చెబుతారు.  ప్లీజ్ డాడీ... ఆయన మొహమాటానికి మీ సంబంధానికి మేము సరిపోము. వద్దు అని చెబితే.. అలాగే మీ ఇష్టం అని చెప్పి వచ్చేయకండి. ఎలాగోలాగా ఒప్పించండి .

ఒరేయ్ ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు.నువ్వు నోరు మూసుకొని ఫోన్ పెట్టేయ్.

కొడుకుని విసుక్కుంటూ ఫోన్ పెట్టేస్తారు. ఫోన్ పెట్టేసిన తర్వాత శ్రీ అమ్మగారు అయిన సురభి..ఎందుకండీ వాడితో అలా  మాట్లాడుతున్నారు.

రేపు మనం వెళుతున్న విషయం చెప్పచ్చు కదా అంటే.. నీ కొడుకు ఏమైనా ప్రేమించానని ముందే మనకి చెప్పాడా... విక్రమ్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాడు.

అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడి సెట్ చేసి ఉంచాడు. రేపు ఎదో ఫార్మాలిటీకి అంతే.. కాసేపైనా నీ కొడుకుని టెన్షన్ పడని పద హాస్పిటల్కి అని బయలుదేరుతారు.

ఒక నిమిషం వాసు అని భర్త వెనకాలే వెళుతుంది. చెప్పు అనగానే.. వాడంటే చిన్న పిల్లోడు.మీరు కూడా ఎందుకు వాడితో సరి సమానంగా గొడవ వేసుకుంటారు.

వాడు చిన్నపిల్లోడా ఈపాటికి పెళ్లి అయ్యి ఉంటే నలుగురు పిల్లలు వేసుకుని తిరిగేవాడు. పైగా నన్ను ఏమంటున్నాడు...

మాట్లాడడం రాదని వెక్కిరిస్తాడా.... అబ్బా వాడు అలా అనలేదండి. ఏదో టెన్షన్ తో అమ్మాయి ఎక్కడ తప్పిపోతుందా అన్న కంగారుతో ఏదో మాట్లాడేశాడు.

మీరు ఆ మాటలు పట్టించుకుంటే ఎలాగా అంటే..నువ్వు అలాగే వాడిని వెనకేసుకుని రా..వాడు నా మాట అసలు లెక్క చేయడంలేదు.

ఈ ఒక్క రోజుకి వాడికి తల్లిగా కాకుండా నా భార్యగా ఉండి నా గౌరవాన్ని కాపాడు. అర్థమైందా అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు.

మీ ఇద్దరి మధ్యన నేను నలిగిపోతున్నాను అని తల కొట్టుకుంటూ.. రేపు నాతోపాటు నా కోడలు కూడా జాయిన్ అవుతుందనుకుంటా నవ్వుతూ ఉంటుంది.

నా కోడలేమి నీలాగా కాదు. అప్పుడే నీ కొడుకుని కంట్రోల్ లో పెట్టేసుకుంది. పోనీలే ఇలాగైనా నిజాలు ఒప్పుకున్నారు అని అంటుంది.

ఏమి నిజాలు అంటే.. మీ భార్య అమాయకురాలు అని.. అబ్బో ఎటు వచ్చినా సరే నీకు అనుకూలంగా మార్చేసుకుంటావు అని నవ్వుతాడు.

ఆ నవ్వులతో శృతి కలిపి సురభి కూడ నవ్వుతూ హాస్పిటల్ కి రీచ్ అవుతారు .

శ్రీమాత్రం టెన్షన్..తో అసలు మా డాడీ వెళ్లి ఏం మాట్లాడతారు.  మాట్లాడటం వచ్చా...వెళ్లి మాట్లాడితే... ఏదో ఆపరేషన్ చేసినట్టుగా మాట్లాడతారా ఏమిటి అని టెన్షన్ తో గోళ్లు కొరికేసుకుంటూ ఉంటాడు...

ఇందులో కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తే ఎవరు అని వెళ్లి చూస్తాడు. అక్కడ నేహా రెడీ అయ్యి చేతుల్లో బౌల్స్ తో ఉంటుంది.

నేహాని అలా చూడగానే శ్రీ బాబు క్లౌడ్స్ మధ్యన విహరిస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచిన పలకడం లేదని... కళ్ళ ముందు చేతితో ఊపుతూ శ్రీ గారు అని గట్టిగా అరుస్తుంది.

నేహా చేతికి ఉన్న గాజులు సౌండ్ కి డిస్టర్బ్ అయ్యి హా.. చెప్పు అంటాడు.  ఎక్కడ ఉన్నారు సార్.  ఇందాకటి నుంచి పిలుస్తూ ఉంటే..

ఏదో పరిజ్ఞానంగా ఆలోచిస్తున్నారు.మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాను అని ఇబ్బందిగా చెబుతుంది. అయ్యో నేహా నువ్వు డిస్టర్బ్ చేయడమేంటి...

నీ గురించి ఆలోచిస్తుంటేను అని మాట జారి నాలిక కరుచుకుంటాడు. నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అయోమయంగా చూస్తూ అడుగుతుంది.

అదే నైట్ జర్నీ చేసి వచ్చాము కదా.. అలసటతో నిద్ర పట్టిందా లేదా అని ఆలోచిస్తున్నాను అంతే అని..
ఇంతకీ ఆ బౌల్స్ ఏంటి అని టాపిక్ చేంజ్ చేస్తాడు.

ఓ అదా.. మీకోసమని బ్రేక్ ఫాస్ట్ చేసి తీసుకు వచ్చాను. అలాగే మీకు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను సార్.బాక్స్ ఇదిగో అని చెప్పి ఇచ్చి నేను ఆఫీస్ కి బయలుదేరుతున్నాను అని చెబుతోంది  .

ఒక్క నిమిషం నేహా అని పిలుస్తాడు.  చెప్పండి సార్ అనగానే..ఆఫీస్ కి ఎలా వెళుతున్నావు అని అడుగుతాడు.

క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను అని చెబుతోంది.  నేను ఆఫీస్కే కదా వెళ్లేది. డ్రాప్ చేస్తాను అంటే... వద్దు సార్. ఎవరైనా చూస్తే బాగోదు అని ఇబ్బందిగా చెబుతుంది.

ఇందులో అంత ఇబ్బంది పడేది ఏముంది అంటే.. కొన్ని కొన్ని పరిచయాలు ఒకచోట ఉంటేనే బాగుంటాయి.  అది క్రాస్ చేస్తే అందరమూ ఇబ్బంది పడాల్సి వస్తుంది.

మీతో పాటు కారులో వస్తే ఎవరైనా నా గురించి తప్పుగా అనుకోని రూమర్స్ స్ప్రెడ్ చేస్తే చాలా కష్టం కదా..అది నాకు అసలు ఇష్టం లేదు.నన్ను ఇలాగే ఉండనివ్వండి సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది.

వెళుతున్న నేహాన్ని చూస్తూ గుండెలపై రబ్ చేసుకుంటూ నచ్చేస్తున్నావే పిల్ల అని నవ్వుకుంటాడు.

కథ కొనసాగుతుంది..
[+] 13 users Like SivaSai's post
Like Reply
Superb update
Like Reply
endi bhayya vulo unnaru
back to back updates icharu eroju
Like Reply
nice update
Like Reply
Good update Siva garu!!
Like Reply
Part - 67


ధనుంజయ్ జైలుకి వెళతాడు. ఒకసారి భార్గవిని కలిసి రావాలి అని. భర్త తన కోసం వచ్చాడని  ఆనందంతో మురిసి తబ్బెబ్బైపోతుంది.

నాకు తెలుసండి మీరు తప్పకుండా వస్తారు.ఏదో కోపంలో అనేశారు కానీ...నేను లేకుండా మీరు ఉండలేరు.  ఒక గర్వంతో కూడిన నవ్వు పెదాలపైకి వస్తుంది.

మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించి నేను, శిల్ప బయటికి వచ్చేస్తాము. అప్పుడు చూపిస్తాను నా హంగామా మళ్లీ.

విక్రమ్,  అవినిలని విడదీసి శాశ్వతంగా అవనినీ నా పనిమనిషిని చేసుకుంటాను అని పగటి కలలు కంటూ ముఖంలో బాధని చూపిస్తూ భర్త ముందుకు వెళుతుంది.

భార్గవినే చూస్తూన్న ధనుంజయ్ ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. అది చూసిన భార్గవి ఏంటి ఈయన గారి ముఖంలో ఎటువంటి ఫీలింగు కనపడటం లేదు.

ఏదైనా చూపిస్తే నేను లోకువగా తీసుకుంటానని ఆలోచిస్తున్నారా.. అందుకే వాటిని బయటికి కనపడనివ్వకుండా చేస్తున్నారా అని ఆలోచిస్తూ...

భర్త దగ్గరికి వెళుతుంది. ఏవండి ఎలా ఉన్నారండి అని కన్నీళ్ళతో అడుగుతుంది. అయినా ఏమీ మాట్లాడకుండా చూస్తూనే ఉంటాడు.

ఏమిటండి ఇలా చిక్కపోయారు. నా మీద బెంగ పెట్టుకున్నారా. నేను లేకపోతే మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారు అండి.

ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా.. నేను ఉంటేనే మీరు బాగుంటారు అని.  మీకోసమైనా సరే నన్ను, శిల్పని ఇంటికి తీసుకువెళ్ళండి.

ఈసారి చాలా బుద్ధిగా ఉంటాము. జాగ్రత్తగా, మీకు అనుకూలంగా నడుచుకుంటాను. అవిని నీ సొంత బిడ్డలాగా చూసుకుంటాను అని ముసలి కన్నీరు కారుస్తుంది.

ప్యాంటు జేబులో రెండు చేతులు పెట్టుకొని ఇంకా అని అడుగుతాడు. ఆ మాటకు అయోమయంగా చూస్తూ ఇంకా ఏమిటి అని అడుగుతుంది.

అదే ఏదో కథ చెబుతున్నావు కదా..తర్వాత ఏమిటి అని అడుగుతున్నాను. నేను కథ చెప్పడం ఏమిటండి.నిజమే చెబుతున్నాను అంటే...

ఆ మాటలకి గట్టిగా నవ్వుతూ నువ్వు నిజం చెబుతున్న అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే మిస్ భార్గవి అంటాడు.

మిస్ ఏంటండీ..నేను మిస్సెస్ ధనుంజయ్ అని కోపంగా అంటుంది. అది పోయి చాలా రోజులైంది..

ఆ మాటలకే కోపం వస్తున్నా సరే ఇప్పుడు అది సరైన సమయం కాదు అని.. కంట్రోల్ చేసుకుంటూ నేను మీ మిస్సెస్ ని కాకపోతే..మరి మా కోసం ఎందుకు వచ్చినట్టు అని అడుగుతుంది.

ఎందుకో వచ్చానో నీకు చెప్పాలి కదా...అసలు నన్ను చెప్పనివ్వకుండా వచ్చిన దగ్గరనుంచి నువ్వే మాట్లాడుతుంటే..  కథ బాగుంది అన్నట్టుగా విన్నాను  అంతే అని చెప్పి...

ఫోన్ ఓపెన్ చేసి చేతికి ఇస్తాడు. ఏమిటండి అంటే చూడు నీకే తెలుస్తుంది అని చెబుతాడు.  

ఏముంటుందా అన్న అనుమానంతో ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్న భార్గవికి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపిస్తుంది.

అందులో తన కూరిపోతే బాగున్నట్టుగా అనిపిస్తుంది. నో ఇలా జరగడానికి వీల్లేదు అని అరుస్తుంది.అదేంటి ఇప్పుడే అవిని నీ సొంత కూతురు లాగా చూసుకుంటాను అన్నావు.

మరి ఫొటోస్ చూడగానే ఎందుకు అలా పిచ్చదానిలాగా అరుస్తున్నావు అని వెటకారంగా అడుగుతాడు. వెంటనే తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ..

నేను అదే చెబుతున్నానండి అవిని నీ సొంత కూతురులాగానే చూసుకుంటాను అని. నా చేతులతో నేనే పంపించాలి అనుకున్నాను కానీ...

ముందే వెళ్ళేటప్పటికి అలా అరిచాను అంతే అని కవర్ చేసుకుంటూ ఉంటుంది.. ఆ మాటలకి ధనుంజయ్ నవ్వుతూ పరవాలేదు భార్గవి బాగానే కవర్ చేసుకుంటున్నావు.

నీకి ఫోటోలు ఎందుకు చూపించానో తెలుసా? నా కూతురు సంతోషాన్ని చిన్నప్పటినుంచి దూరం చేసి పైశాచిక ఆనందం పొందావు కదా...

అందుకే అసలు అయినా నా కూతురు సంతోషాన్ని చూపిస్తే ఆ నీ పైశాచికా ఆనందం డబల్ అవుతుందేమో అన్న ఆశతో వచ్చాను. అయిందని అనుకుంటున్నాను అని అంటాడు.

నేను ఎందుకండి పైశాచిక ఆనందం పొందుతాను అని ఎంతో బాధగా అడుగుతుంది.  ఏమి నటిస్తున్నావ్ భార్గవి.. ఇంత జరిగినా...నీ గురించి నాకు పూర్తిగా తెలిసినా సరే..
నువ్వు ఒక అమాయకురాలివి అన్నట్టుగా చూపిస్తావు చూడు.

అక్కడ మాత్రం నిన్ను మెచ్చుకోవాల్సిందే.... నా కూతురు నా అల్లుడుతో కలిసి హనీమూన్ కి వెళ్ళింది తెలుసా... మరి నీ కూతురే ఏం చేస్తుంది అని అడుగుతాడు.

నా...ని.....అని మాట్లాడుతారు ఏంటండీ. ఇద్దరూ మన అమ్మాయిలే అంటే... కాదు అవని ఎప్పటికీ నీ కూతురు కాదు.

అవని కేవలం రజిత ధనుంజయ్ కూతురు మాత్రమే. నీ కూతురు ఒక్క శిల్ప మాత్రమే.  నాకు ఒక డౌటు. శిల్ప నాకు పుట్టిందే నా...

లేకపోతే  డబ్బు మీద ఉన్న ఆశతో ఎవరికైనా కమిట్ అయ్యావా ? అది నా బిడ్డగా చూపిస్తున్నావా అని అడుగుతాడు.  ఆ మాటలు తట్టుకోలేక ఏవండి అని గట్టిగా అరుస్తుంది.

ష్... అరవకు అని నోటి మీద వేలు పెట్టి చూపిస్తాడు ఈసారి భార్గవికి నిజంగానే బాధ వస్తుంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతారా..

నేను ఎలాంటిదాన్నో మీకు తెలియదా అని అడుగుతుంది. ఎందుకు భార్గవి నీకు అంత బాధ. నువ్వు అలాంటి దానివి కాబట్టే కదా.. నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలి అనుకున్నావు.

ఏం చేసింది అవని. అంత పగ పెంచుకొని నాశనం చేయాలి అనుకున్నావు. ఏరోజైనా నీకు ఎదురు చెప్పిందా.. తండ్రి అన్న స్వేచ్ఛతో నా దగ్గరికి వచ్చిందా...

ప్రపంచానికి నాకు అవని అనే కూతురు ఉంది అని తెలియకుండా చేశాను అని ఆనందపడుతున్నావు కదా.. త్వరలోనే నీకు ఇంకొక కొత్త గిఫ్ట్ ఇవ్వబోతున్నాను.

వెయిట్ అండ్ వాచ్ అని చెబుతాడు.  ఏం చేయబోతున్నారు అండి అని భయంగా అడుగుతుంది .

అరే జీవితాల్ని నాశనం చేసే భార్గవి కూడా భయపడుతుందా అని వెటకారంగా అడుగుతారు. మిమ్మల్ని అడుగుతున్నాను ఏం చేయబోతున్నారు దయచేసి చెప్పండి అంటే...

చెప్పను చేసేటప్పుడు చూడు తెలుస్తుంది నీకే అని... హ...నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను.

మీ వదిన అదే బిందు కూడా ప్రస్తుతం నా దగ్గరే ఉంది. నా ఇంటి మనిషిగా కాదు.  సర్వెంట్ క్వార్టర్స్ లో ఉండి ఒక పూట ముద్ద పెడతారా అని ఎదురు చూస్తుంది.

బిందు నా ఇంటికి రావడం లోని హస్తమేమీ లేదు కదా అని  సూటిగా అడుగుతాడు. ఉన్న ఏమీ చేయలేరులే అందరూ కోరలు తీసిన పాములే.

వదిన మీ దగ్గర ఉండడం ఏమిటి.. అన్నయ్య, ఉదయ్ ఏమైపోయారు అని వాళ్ల గురించి తెలుసుకోవాలి. వాళ్ల ద్వారా అయినా బయటికి రావాలి అన్న ఆశతో అడుగుతుంది.

తెలిసి అడుగుతున్నావో.... తెలియక అడుగుతున్నావా భార్గవి అంటే...నిజంగానే నాకు తెలియక అడుగుతున్నాను.

వాళ్ళిద్దరూ ఉండగా వదిన మీ దగ్గరికి ఎందుకు చేరుతుంది అని అడుగుతుంది.  భార్గవి కళ్ళల్లో కనపడుతున్న అనుమానానికి...  ధనుంజయ్ కొంచెం ముందుకి వంగి..

మీ అన్నగాడు ఏమో.. ఇదే జైల్లో జెంట్స్ సెక్షన్లో ఉన్నాడు. ఇక నీ ముద్దుల మేనల్లుడు అంటావా.. నా అల్లుడు చేతిలో ఎక్కడో కైమా అవుతూ ఉన్నాడు.

వాడు ప్రాణాలతో ఉంటాడో లేదో కూడా డౌటే..ఒకవేళ ఉన్నా ఎందుకు బతికున్నానా అని వాడి చేతే అనిపిస్తాడు నా అల్లుడు అని గొప్పగా చెబుతారు.

అల్లుడు అని మురిసిపోతున్నారే కానీ.. అతను శిల్ప మొగుడు అంటుంది. ఎలా అయ్యాడు శిల్పకి మొగుడు...

జీలకర్ర బెల్లం పెట్టాడా? తాళి కట్టాడా... లేకపోతే చేతిలో చెయ్యవేసి పాణిగ్రహణం చేసుకున్నాడా ఎలా అయ్యాడు నీ అల్లుడు. నీ కూతురికి మొగుడు అని వెటకారంగా అడుగుతాడు. 

ఆ మాటలకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటుంది. చూసావా నీకే సమాధానం దొరకడం లేదు.

మొండిగా వాదించి నన్ను మభ్యపెట్టినంత ఈజీ కాదు.. విక్రమ్ తో ఆడుకోవడం అంటే.. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మారు.

ఆఖరి రోజుల్లో అయినా శిక్ష తగ్గి ప్రశాంతంగా చచ్చిపోగలుగుతావు అని చెప్పి బయలుదేరుతాడు.  వెళుతున్న ధనుంజయ్ ని చూసి శిల్పని చూడరా అని అడిగితే....

నీ కూతురుని చూడవలసిన అవసరం నాకు లేదు. ఎన్నిసార్లు చెప్పానండి మన కూతురు అంటుంటే.. నా కూతురు అయితే గనక అవిని లాగా ఎన్ని కష్టాలు పడినా సరే తన ఆత్మఅభిమానాన్ని వదులుకోదు.

అది నాకు పుట్టలేదు కాబట్టే..నీలాగా బరితెగించి ఎవరు పడితే వాళ్లతో తిరుగుతుంది అని అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతాడు.

ఆ మాటలు విన్న భార్గవి కృంగిపోతోంది. నేను ఎన్ని తప్పులు చేసినా సరే... తప్పుడు మనిషిని అవ్వలేదండి. మిమ్మల్ని తప్ప నేను ఎవరిని తాకలేదు.

అది మీకు తెలిసిన సరే...ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఎంతసేపు అవని, రజిత అంటున్నారే గాని..

నా ప్రేమ మీకు ఎందుకు కనిపించడం లేదు. ఈరోజుల్లో ఎంతమందితో రిలేషన్ మెయింటైన్ చేయడం లేదు. అలాంటి వాళ్ళందరినీ తమ పిల్లలు కాదు అనుకుంటున్నారా...

ఎందుకు మీరు శిల్పని అంత దారుణంగా అసహ్యించుకుంటున్నారు అని బాధపడుతూ వెళుతుంది. అంతేకానీ శిల్ప తప్పుడు మార్గంలోకి వెళ్ళింది. సరిదిద్దాలి అన్న ఆలోచన మాత్రం రావడం లేదు.

ధనుంజయ్ అటు నుంచి అటే ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. తను చేయాలనుకున్న పనులన్నింటినీ స్పీడ్ గా పూర్తి చేస్తూ ఉంటాడు.

సత్యవతి గారు బిందు దగ్గరికి వెళ్తారు. తలుపు కొట్టి లోపలికి రావచ్చా అని అడుగుతారు. రండి పెద్దమ్మ గారు అలా అడుగుతారు ఏంటి.. అని లేచి నుంచి ఉంటుంది.

ఏమో నువ్వు ఏ బిజీలో ఉన్నావు నాకేం తెలుసు అంటే.. ఇంకా ఎందుకు పెద్దమ్మ గారు చచ్చిన పాముని మీద దెబ్బలు కొడతారు.

ఆ మాటలకి నవ్వుతూ మీరందరూ ఒకే కోవకు చెందిన పక్షులు కదా..  భార్గవి బాగానే డైలాగ్స్ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంది అంటే...

ఏమని సమాధానం చెప్పాలో తెలియక బిందు తలవంచుకుంటుంది. ఇప్పుడు తలదించుకోవడం వల్ల ఉపయోగం ఏముందిలే కానీ నేను వచ్చిన విషయం చెబుతాను విను.

నువ్వు నిజంగా మారావో లేదో నాకు తెలియదు గానీ భార్గవి తో మాత్రం చేతులు కలిపి ఉంటే ఇప్పటికైనా బయటికి రా...

లేకపోతే మీ కొడుకుని ప్రాణాలతో కాదు కదా శవం కూడా చూడలేవు. నా మనవడు అలాగే చేసేస్తాడు తర్వాత నీ ఇష్టం అని అంటారు.
[+] 12 users Like SivaSai's post
Like Reply
Part - 68


సత్యవతి గారి మాటలకి బిందు కంగారుగా చూస్తూ.. లేదు పెద్దమ్మగారు నేను మారాను. మీకు ఎక్కడ సాక్ష్యం కావాలన్నా నేను చెబుతాను. నన్ను నమ్మండి అంటుంది.

నువ్వు చెప్పేది నిజమైతే.. అందరికీ మంచిది. ఎప్పుడో ఒకప్పుడు నీ కొడుకు మారితే నీ దగ్గరికి వస్తాడు.ఇక నేను వెళ్తాను అని చెప్పి బయటికి వస్తారు.

వెళుతూ ఉన్న సత్యవతిగారు ఆగి వెనక్కి తిరిగి నీకు ఏమి ఊసుపోకపోతే ఆ గార్డెన్ వర్క్ లాంటివైనా చేసుకోవచ్చు.

అది కూడా నీ ఇష్టం.  సుఖపడిన శరీరం, ప్రాణం ఒక్కసారిగా పని చేయాలంటే అలసటగానే అనిపిస్తుంది. కానీ పనిలో ఉంటేనే మన బుర్ర సరిగ్గా పనిచేస్తుంది.

మనసు ఆధీనంలో ఉంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను ఆ పైన నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోతున్న పెద్దావిడని చూస్తూ బిందు సైలెంట్ గా అక్కడ కూర్చుని ఆలోచిస్తూఉంటుంది.

కొంచెం సేపటికి లేచి వెళ్లి గార్డెన్లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చిన ధనుంజయ్ అది చూసి సైలెంట్ గా లోపలకి వెళ్ళిపోతాడు.

ఆ రోజంతా బిందు పనిచేస్తూనే ఉంటుంది. పనిలో పడి ఆలోచనను కూడా పక్కకి వెళ్ళిపోతాయి. మధ్యాహ్నం భోంచేసి పడుకోగానే నిద్ర పట్టేస్తుంది.

సాయంత్రం లేచిన తర్వాత చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అప్పుడే బిందుకి అర్థమవుతుంది.  పని విలువ, నిద్ర విలువ, భోజనం విలువ.

శ్రీ సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే వాళ్ళ అమ్మగారికి కాల్ చేస్తాడు. ఆ ఫోన్ చూసిన వాసు చూసావా నీ కొడుకు ఎప్పుడైనా మనకి ఫోన్ చేశాడా..

ఏదో వారానికి ఒక రోజు ఫోన్ చేసి..హౌ ఆర్ యు మామ్.. హౌ ఆర్ యు డాడ్.. బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు వాడికి అవసరమని ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు చూడు అని అంటారు.

అబ్బా ఏదో ఒకటి చేస్తున్నాడు కదా అని చెప్పి...లిఫ్ట్ చేసి చెప్పరా అంటే...ఎక్కడున్నారు మమ్మీ అని చాలా స్మూత్ గా అడుగుతాడు.

నీ వాయిస్ కి ఈ మాట తీరు ఏమి సెట్ అవ్వడం లేదు గాని మేటర్ లోకి రా అంటారు.  నువ్వు చాలా ఇంటలిజెంట్ మమ్మీ ఇట్టే కనిపెట్టేస్తావు అంటే...

పొద్దున్నే ఎవరో ఈ బుర్రతో డాక్టర్ ఎలా అయ్యావు అని అడిగారు అని అంటుంది.  అప్పుడు ఏదో అంటాము. అన్ని గుర్తుపెట్టుకుంటే ఎలా...

ఇంతకీ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతున్నాము. ఏదైనా చెప్పాలా అంటే...

ఏంటి మమ్మీ కొడుకు ఫోన్ చేస్తే ఏమైనా చెప్పాలా అని అడుగుతారా? ఏం చేస్తున్నావు, తిన్నావా ఇంకేంటి సంగతులు అని అడుగుతారు కానీ.... ఒరేయ్ మరి నీ యాక్షన్ ఓవర్గా లేదా...

మమ్మీ అంటూ గారాలుపోతాడు. ఈ వయసులో నువ్వు అలా గారాలు పోతే చూడ్డానికి చాలా చండాలంగా ఉంటుంది గానీ... మ్యాటర్ ఏంటో చెప్పరా బాబు..నిన్ను ఇంకా అడగలేక పోతున్నాను అని తల పట్టుకుంటారు.

రేపు ఎన్నింటికి బయలుదేరుతున్నారు. ఎక్కడికి రా అని తెలిసిన తెలియనట్టుగా అడిగితే... అదేంటి మమ్మీ రేపు మీరు నేహా వాళ్ళ ఊరు వెళ్లాలి కదా...

మర్చిపోయారా... అసలు ఎలా మర్చిపోయారు అని ఆవేశంగా అరుస్తూ ఉంటాడు. ఒరేయ్ ఇప్పుడు దాకా బాగానే మాట్లాడావు కదరా... ఇప్పుడు కాకి లాగా అరుస్తావ్ ఎందుకు...

వెంటనే శ్రీ కూల్ అయ్యి అది కాదు మమ్మీ మీరు హాస్పిటల్ పనిలో బిజీగా ఉంటారు కదా... ఆపరేషన్స్ చేసి, చేసి మీ బ్రెయిన్ అలసిపోయి ఉంటుంది కదా.. గుర్తుంటుందో లేదో అని గుర్తు చేయడానికి ఫోన్ చేశాను అని చెబుతాడు...

వెంటనే వాసు గారు మాకు గుర్తు ఉంది లేరా...నువ్వు బుక్ అయిపోతాను అని చెబుతుంటే నేను మాత్రం ఎందుకు ఆగుతాను..

రేపే వెళ్లి మాట్లాడదాము అని నవ్వుతూ చెబుతారు. డాడ్ అంటే మెలికలు తిరుగుతాడు. ఒరేయ్ నువ్వు అక్కడ మెలికలు తిరగకు.

నాకు సిగ్గుగా ఉంది అంటే.. నేను మెలికలు తిరుగుతున్నట్టు మీకు ఎలా తెలుసు. నేను నీ బాబుని రా...ఆ మాత్రం తెలియకుండానే నిన్ను పెంచాను అంటావా...

రేపు అక్కడికి వెళ్లాక నీకు వీడియో కాల్ చేసి మొత్తం లైవ్ చూపిస్తాను. సరేనా ప్రస్తుతానికి ఫోన్ పెట్టేయరా.. మా బుర్రలు తినకు అని చెప్పి బాయ్ అని ఫోన్ కట్ చేస్తారు.

సురభి నవ్వుతూ ఎందుకు వాసు వాడిని అలా టీస్ చేస్తున్నావు.  ఇప్పుడే కదా నీ కొడుకు దొరికేది.  తర్వాత ఎలాగూ మనకు దొరకడు.కోడలు చేతిలో ఎలాగ బుక్ అయిపోతాడు.

అంత నమ్మకం ఏంటో వచ్చే అమ్మాయి మీద అని అడిగితే.. వాసుగారు నవ్వుతూ నేహా అవినినీ ప్రొటెక్ట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది.

తనకి ఎంత అవకాశం ఉన్నా సరే తన పరిధిలోనే తను ఉన్నది చూడు అది ఇంకా బాగా నచ్చింది. నీ కొడుకు తింగరతనానికి ఆ అమ్మాయి నిదానమే కరెక్ట్.

పో వాసు... నా కొడుకు ఏమి తింగరోడు కాదు అంటే... ఓ... అవునా...ఆ మాట ఏదో నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు.

వాసు... అని చిరుకోపంగా చూస్తుంది. చూసావా నీకు కూడా తెలుసు కానీ.. తల్లి మనస్సు కదా ఒప్పుకోలేక పోతుంది.

రేపు అక్కడికి పట్టికెళ్లడానికి ఏమేమి కావాలో చెబితే వెళుతూనే షాపింగ్ చేసి వెళ్ళిపోదామని చెబుతాడు.  సరే అని చెప్పి మొత్తం లిస్ట్ అంతా భర్త చేతికి చేస్తుంది. అవి చూసి మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు.

శ్రీ కి ఆ రాత్రి నిద్ర పట్టక హాల్లోనే తిరుగుతూ ఉంటాడు. ఎంత క్లాక్ వైపు చూస్తున్న దాని టైం కి అది తిరుగుతూ ఉంటుంది.

ఇంక లాభం లేదు అనుకుని  వెళ్లి నేహా ఫ్లాట్ డోర్ కొడతాడు.  ఈ టైంలో ఎవరూ అనుకుంటు వచ్చి డోర్ తీస్తుంది.

ఏంటి సార్ ఈ టైం లో ఏదైనా అవసరమా అని అడిగితే.. ఏం చెప్పాలో తెలియక అది... అది... అంటుంటే పర్వాలేదు చెప్పండి సార్.

తప్పుగా అనుకోవు కదా అంటాడు.  లేదు సార్ అనుకోను చెప్పండి అంటుంది. నువ్వు మళ్ళీ నన్ను సార్ అని పిలుస్తున్నావు.

ఫ్లోలో వచ్చేసింది శ్రీ గారు చెప్పండి అంటే... విక్రమ్ కూడా లేడు కదా నాకు అసలు నిద్ర పట్టడం లేదు అని అంటాడు. ఆ మాటకి శ్రీని డౌట్ గా చూస్తుంటే....

ఏంటి అలా చూస్తున్నావు అని...తను ఏం మాట్లాడాడో అర్థం అయ్యి ఛీ.... ఛీ...ఒక్కడినే ఉంటే నిద్ర పట్టడం లేదు.
అదే నేను చెప్పింది అంటాడు.

ఓ అవునా అయితే ఏం చేయాలి అని అడుగుతుంది. నేహకి కూడా అలాగే ఉంటుంది. ఇన్ని రోజులు అవని తో ఉండి ఒక్కసారిగా ఒంటరిగా ఉండాలి అంటే బోర్ గా అనిపిస్తుంది. కానీ ఆడపిల్లగా తన బయటపడలేక పోతుంది.

అలా సరదాగా వాకింగ్ కి వెళదామా..వస్తావా అని అడుగుతాడు.  నేహకి కూడా అది బానే అనిపించే సరే పదండి శ్రీగారు అని ఫ్లాట్ కి లాక్ వేసి శ్రీ తో కలిసి అడుగులు వేస్తుంది.

శ్రీ నేహా పక్కనే నడుస్తూ రేపటితో మన మధ్యన ఉన్న దూరం అంతా తగ్గిపోతుంది. అప్పుడు ఇలా పక్క పక్కనే నడుస్తూ, నా చేతి వేళ్ళని నీ చేతి వేళ్ళతో పెనువేసి..

నువ్వు నా భుజంపై తల పెట్టుకుని కబుర్లు చెబుతూ నడుచుకుంటూ వెళుతూ ఉంటే అని ఊహాలోకంలోనికి వెళ్ళిపోతాడు.

లిఫ్ట్ ఓపెన్ అయిన శ్రీ లిఫ్ట్ ఎక్కకుండా అలా ఊహా లోకంలోనే ఉండిపోతాడు. శ్రీ గారు ఏమైంది మీకు అని నేహా గట్టిగా పిలుస్తుంది.

అప్పుడు మన లోకంలోనికి వచ్చి.. నాకేమవుతుంది.. ఏమీ అవలేదు అని గబగబా లిఫ్ట్ ఎక్కుతాడు. ఈ మధ్యన ఎందుకు మీరు చాలా పరధ్యానంగా ఉంటున్నారు.

ఒకసారి చెక్ చేపించుకుంటే మంచిదేమో..జస్ట్ ఒక ఫ్రెండ్ గా చెబుతున్నాను అంతే తప్పుగా అనుకోకండి అంటుంది.

అయ్యో నా బంగారం పెళ్లికి ముందే మొగుడి ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త. ఈ పరధ్యానం అంతా నీవల్లనే వచ్చింది.

ఇది ప్రేమ జబ్బు అంటారు.  నీకు అంటుకున్నాక అది నీకు కూడా తెలుస్తుంది బంగారం అనుకుని అలాగా... అలాగే..
అని చెబుతాడు.

లిఫ్ట్ దిగి ఇద్దరూ మెల్లిగా నడుచుకుంటూ వెళతారు.ఆ చల్లగాలికి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.  శ్రీకి మాత్రం నేహా నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని నడవాలని కోరిక గట్టిగాఉంటుంది.

ఒకసారి ఇమేజిన్ చేసుకుంటాడు.  నేహా నడుము చుట్టూ చెయ్యవేసి దగ్గరికి లాక్కోవడం...వెంటనే నేహ.. శ్రీ చెంప పైన చేతిముద్ర వేయడం కూడా...

వెంటనే మన లోకంలోకి వచ్చిపడి అమ్మో అప్పుడే ఇలా చేయకూడదు.  చేస్తే ఇంకా అంతే సంగతులు. నామీద బాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది.

నేహ అని పిలుస్తాడు. చెప్పండి శ్రీ గారు అంటే.. పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏమిటి అని అడుగుతాడు.  దేనికి శ్రీగారు అంటే..జస్ట్ ఏదో ఒకటి మాట్లాడాలి కదా..

అందుకే క్యాజువల్ గా అడిగాను. పెళ్లి చేసుకునే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ కావాలి నీకు అని అడుగుతాడు.

ఒక్క నిమిషం మౌనంగా ఉండి అప్పుడు చెబుతుంది. పెళ్లి అంటే నాకు అర్థమైనంత వరకు ఒకరి కోసం ఒకరి ఉండడం. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఒకరి చెయ్యి ఒకళ్ళు వదలకుండా ఉండడం.

మూడో వ్యక్తి అది ఎవరైనా సరే అబ్బాయి తల్లిదండ్రులైన, ఇటు నా తల్లిదండ్రులైనా సరే, ఇంకా ఎవరైనా సరే.. మా బంధం మధ్యలోకి రానివ్వకూడదు.

అంటే నా ఉద్దేశం తొందరగా చెప్పుడు మాటలు విని బంధాన్ని వీక్ చేసుకోకూడదు అని చెబుతుంది. 

మరి చేసుకునే అబ్బాయి విషయంలో...

ఇప్పుడు అది అవసరమా శ్రీ గారు అంటే...ప్లీజ్ నేహా చెప్పు. నేను ఎలాగో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకు కొన్ని తెలుసాయి అనుకో...నన్ను నేను మార్చుకునేది ఉంటే మార్చుకోవచ్చు కదా... చెప్పు ప్లీజ్.....ప్లీజ్...
అని అడుగుతాడు.

నేహా ఏమని చెబుతుంది...

కథ కొనసాగుతుంది...
Like Reply
Cute love story b/w Neha n Sri!!
Good going
Like Reply
Super update
Like Reply




Users browsing this thread: Ak0408, Jola, 4 Guest(s)