25-01-2026, 11:07 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
|
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
|
|
26-01-2026, 12:00 AM
ఎపిసోడ్ 43
అడవిలోకి వచ్చిన మంద గ్యాంగ్ ని చంపి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ వస్తువులు తీసుకుని తగలబెట్టమని తన వాళ్లకి చెప్పాడు అభీర్.
వీడియోలో జరిగేదంతా చూస్తూ అభీర్ చాలా తెలివైనవాడు అని చెప్పాడు ముకుల్. ************************ అభీర్ చాలా తెలివైనవాడు అని చెప్పిన ముకుల్ దగ్గరికి వచ్చి "అంకుల్! మనం అడివిలోకి వెళ్లి వాళ్ళని ఒకసారి కలిసి వద్దామా?" అని అడిగాడు అభిజిత్. "నో! ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళితే కచ్చితంగా మనమీద అనుమానం వస్తుంది. మనం హెల్ప్ చేశామని వాళ్లే మన దగ్గరికి రావాలి, అప్పటివరకు ఎవరు అటువైపు వెళ్ళకండి. ఆ అభీర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి." అని చెప్పాడు ముకుల్. "డాడ్! మరి మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి?" అని అడిగాడు గోకుల్. "మన ప్లేస్ కి వెళ్లి మాట్లాడుకుందాము ఇక్కడ మన మాటలు పక్షి విన్నాసరే వాళ్ళకి చేరిపోతుంది. లెట్స్ గో!" అని చెప్పాడు ముకుల్. "సరే!" అని చెప్పి అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు అందరు. ******************* మరుసటి రోజు బేర అడివిలో కొండమీద అక్కడ ఉన్న జనాలు అందరిని పిలిచి సమావేశం ఏర్పరిచి, "ఈరోజు నుంచి మాన తెగకు నాయకుడు, అమ్మవారు సూచించిన మన అభీర్! మనలో కొంతమంది ఈ ప్రదేశం వదిలి బయటకు వెళ్ళవలసి వచ్చిన సమయం వచ్చింది. దాని విషయమై మనం నాయకుడు మాట్లాడతాడు." అని చెప్పాడు శంభు. అక్కడ ఉన్న అందరి ముందుకు వచ్చినా అభీర్ మాట్లాడుతూ "మనం బయట ప్రపంచంతో సంబంధాలు లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాము ఎవరు ఏది చెప్పినా నమ్మవలసిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మన మీద జరిగిన దాడి ఎవరు చేశారో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము, ఇలానే ఉంటే మన తెగ అంతరించిపోతుంది. మన పూర్వీకులు ధర్మం కోసం నిలబడతాము అని దైవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతాము. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మన తెగలో 14 సంవత్సరాలు నిండిన యువకులను ఐదు శాఖలుగా విడదీస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్లి అక్కడ ఉన్న ప్రజలతో కలిసి జీవిస్తూ వారి జీవన విధానాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరకి మనం కలుసుకుందాము, మన జాతి మనుగాడా కొనసాగాలి అంటే మనం దూరం అవ్వక తప్పదు, అలాగే మన భూమిని కాపాడుకోవాలి అన్న మనం పోరాటం చేయక తప్పదు." అని చెప్పాడు అభీర్. "నాయకుడా! నువ్వు ఏది చెబితే అది మాకు వేదవాక్కు! నీ మాటకి ఇక్కడ ఉన్న వారందరూ కట్టుబడి ఉంటారు." అని చెప్పాడు అక్కడ ఉన్న ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి. ఆ మాటకి సంతోషంగా చూస్తూ "నేను ఐదుగురు పేర్లు చెప్తాను ఒక్కొక్కరితో 50మంది చొప్పున ఒకో ప్రదేశానికి బయలుదేరి వెళ్లాలి." అని చెప్పి అమ్మవారి పాదాల ముందు చీటీలు తీశాడు అభీర్. ఆ చీటీలో ఎవరి పేర్లు వస్తాయా అని టెంక్షన్ గా చూస్తూ ఉన్నారు అందరూ చీటీలు తీసి పేర్లు చదువుతూ "రాజన్, అగస్త్య, అరుల్, రియా, బైరి వారితో పాటు ఎవరిని తీసుకువెళ్లాలో వారే నిర్ణయించుకుంటారు. అలాగే ఈ 250 మంది మన ప్రాతం చుట్టూ ఉన్న ఐదు ప్రాంతాలకు వెళ్లి అభీర్ సేన అని తెలియకుండా రహస్యంగా జీవిస్తారు ఎటువంటి వార్త ఉన్నా సరే వెంటనే నాకు చేరవేస్తారు. కలికాలంలో ధర్మం రక్షించబడడానికి మనం ఈ త్యాగం చేయక తప్పదు, ఇది ఆ అమ్మ ఆజ్ఞ అనుకోండి." అని చెప్పాడు అభీర్. "నాయకుడా! నీ ముందు మాట్లాడుతున్నందుకు క్షమించు మన ప్రదేశం మీద దాడి జరగడం ఇది మొదటిసారి కాదు, కానీ ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? మన గుండె బలం, ఖండ బలంతో ధర్మాన్ని నిలబెడుతున్న ఈ దేవా భూమిని కాపాడుకోలేమా?" అని అడిగాడు బైరి. "అవును! నాయకుడా మేము ఒక్కొక్కరం 100 మందిని ఎదుర్కోగలము, మనకి అడవిలో ఉన్న జంతువులు కూడా సహాయం చేస్తాయి, మనల్ని దాటి ఈ ప్రదేశానికి ఎవరు రాగలరు?" అని అడిగాడు ఆగస్త్య. "మేమందరం మా ప్రాణాలకి తెగించి ఈ ప్రదేశానికి అడ్డుగోడగా నిలబడతాము అంతేగాని నిన్ను చూడకుండా మాత్రం ఉండలేము." అని చెప్పాడు రాజన్. అంతలో పైకి లెచి "నాయకుడు చెప్పాడు అంటే అది అమ్మవారి నోటి నుంచి వచ్చిన వాక్కు దానికి కచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది." అని చెప్పింది రియా. "అవును! మన మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు మనల్ని అంతం చేయడానికి మాత్రమే కాదు, ఈ ప్రదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోవాలని చూస్తున్నారు అని నాకు అనిపించింది." అని చెప్పాడు అరుల్. వాళ్ళ మాటలు విని "ఇప్పటివరకు మీకు చెప్పని ఒక రహస్యం చెబుతాను, నా నామకరణం జరిగిన రోజు వేదాలు పట్టిస్తూ ఉండగా అమ్మవారి పాదాల దగ్గర మరొక గ్రంథం కనిపించింది." అని చెప్పాడు అభీర్. ఆ మాట విని "అవునా బిడ్డ! ఆ గ్రంథంలో ఏముంది?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు శంభు. "ఆ గ్రంథంలో శ్రీకృష్ణుల వారు మన పూర్వీకులకు చెప్పిన మాటలు వ్రాసి ఉంచారు. చేతి మీద మన తెగ పచ్చబొట్టు ఉన్న వ్యక్తి మూడోసారి జన్మించినప్పుడు ఈ ప్రదేశానికి ఆపద వస్తుంది. అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాల కోసం ధర్మ యుద్ధం చేయవలసి ఉంటుంది. దాంట్లో రాసిన దాని బట్టి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలు దొంగలించబడతాయి, మన ప్రదేశానికి ఆపద వస్తుంది. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకొని పక్షంలో ఈ ప్రదేశం నశిస్తుంది అప్పుడు ధర్మం కూడా నశిస్తుంది." అని చెప్పాడు అభీర్. ఆ మాట విని "అయ్యో మహా పాపం చేయబోతున్నారు, ఆ దుర్మార్గులు ఎవరో కాని వారి వంశం మొత్తం నశిస్తుంది." అని బాధపడుతూ చెప్పింది అభీర్ తల్లి. "అమ్మవారి దగ్గర నిజంగా ఆ పాపం ఎవరైనా చేస్తే నువ్వు అన్నమాట కచ్చితంగా జరిగి తీరుతుంది." అని చెప్పాడు అభీర్. "మన నాయకుడు చెప్పినట్లు రేపే మీ ప్రయాణం, ఇక్కడి నుంచి బయలుదేరుతున్న విషయం కూడా ఎవరికీ తెలియకూడదు. ధర్మం నిలబడాలి అంటే మన జాతి ఈ ప్రదేశం రెండు నిలబడాలి." అని చెప్పాడు శంభు. "మన మీద దాడి చేయడానికి వచ్చిన వారి దగ్గర చాలా సొమ్ము దొరికింది దానిని అందరూ సమానంగా తీసుకుని బయలుదేరండి." అని చెప్పాడు అభీర్. "సరే నాయకుడా! మా బుద్ధి బలంతో ఒక శక్తిగా ఎదుగుతాము అభీర్ సైన్యం అడవిలోనే కాదు, పట్టణంలో కూడా చెట్లు వేరు పాకినట్లు పాకుతాము ధర్మానికి రక్షణగా ఉంటాము." అని చెప్పారు ఐదుగురు. ******************* వారం రోజుల తర్వాత ఢిల్లీ తన గెస్ట్ హౌస్ లో కంపెనీ ఫైల్స్ చూస్తూ ఉన్న ముకుల్ దగ్గరికి అభిజిత్ తో కలిసి వచ్చి "డాడ్! బేరా అడవి నుంచి అభిజిత్ దగ్గరికి మనిషి వచ్చాడు, మనం సరైన సమయంలో వాళ్ళకి సమాచారం అందించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నామని అభీర్ ఒక లేఖ రాసి బహుమతిగా ఈ రాయిని పంపించాడు." అని చూపించాడు గోకుల్. "అంకుల్! మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే! మనం ఆరోజు వెళ్ళినట్లయితే బుక్ అయిపోయే వాళ్ళము, ఇప్పుడు మన మీద వాళ్ళు ఫేవర్ గా ఉన్నారు మనం ఏది చెప్పిన నమ్ముతారు ఇంక మీ ప్లాన్ బి బయటకు తీయండి." అని చెప్పాడు అభిజిత్. ఇద్దరికి వైపు చూసి నవ్వుతూ "ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. మనం తొందరపడ్డామో చాలా కోల్పోవాల్సి ఉంటుంది. అ ఆఫీసర్స్ ని, శివమణిని పిలిపించండి. నా ప్లాన్ ఏమిటో ఎలా అమలు చేయాలో చెబుతాను." అని చెప్పి గోకుల్ వైపు చూసి "ఇక్కడ మినిస్టర్ తో పరిచయమైంది కదా! మన మీటింగ్ కి అతన్ని కూడా తీసుకురండి." అని చెప్పాడు ముకుల్. "సరే డాడ్! టుడేస్ లో మీటింగ్ అరేంజ్ చేస్తాను." అని చెప్పి అభిజిత్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళాడు గోకుల్. **************** రెండు రోజుల తర్వాత ఆఫీసులో మీటింగ్ కి తనతో పాటు మినిస్టర్ ని తీసుకువచ్చి తండ్రి దగ్గరికి తీసుకెళ్లి "డాడ్! ఆయన పేరు జావీద్ గనుల శాఖ మంత్రి!" అని పరిచయం చేశాడు గోకుల్. "హాయ్ ప్లీజ్ సిట్ డౌన్! మాతో చెయ్యి కలిపారు ఇంక మీ ఫ్యూచర్ మారిపోతుంది. సెంటర్లో అభిజిత్, స్టేట్ లో మీరు చక్రం తిప్పుతారు." అని చెప్పాడు ముకుల్. "థాంక్యూ సో మచ్ సార్! మీలాంటి వారితో పరిచయం అవ్వడమే ఎక్కువ, పాట్నర్ షిప్ అంటే నా ఫ్యూచర్ నాకు అర్థం అవుతుంది." అని సంతోషంగా చెప్పాడు జావిద్. అంతలో అక్కడికి శివమణి, మురళీ జోషి, జనార్ధన్ సర్ఫరాజ్, అభిజిత్ తో కలిసి రావడంతో "డాడీ! ఇంకా స్టార్ట్ చేద్దామా? మనవాళ్ళందరూ వచ్చేసారు." అని చెప్పాడు గోకుల్. "ఎస్!" అని తన పక్కన ఉన్న వ్యక్తిని అక్కడ ఉన్న వారికీ పరిచయం చేస్తూ "అతని పేరు జేమ్స్ రాథోడ్! బ్రిటిష్ ఆర్మీలో మేజర్ గా వర్క్ చేశాడు, వార్ స్టాటజీలో తలపండిన వ్యక్తి, ఇప్పుడు మన ప్లానింగ్ ఏమిటో అతను వివరంగా చెప్తాడు." అని చెప్పాడు ముకుల్. "హాయ్ ఫ్రెండ్స్! నేను శివమణి గారు, సర్పరాజ్ గారు ఆ తెగ గురించి రీసెర్చ్ చేసిన రిపోర్ట్ మొత్తం చదివాను, ఆ తెగ వాళ్ళ వార్ స్టేటజి వీడియోలో డైరెక్ట్ గా చూశాను. యుద్ధంలో అయితే ఎయిర్ ఫోర్స్ తో మొత్తం క్లోజ్ చేయొచ్చు, కానీ ఇది యుద్ధం కాదు ప్రైవేట్ ఆక్రమణ మనకి ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, కాబట్టి మనం ఆ ప్లేస్ ఆక్రమించుకోవాలని అంటే మనం ఒకే దెబ్బలో అక్కడ ఉన్న వారందరినీ చంపగలగాలి." అని చెప్పాడు జేమ్స్. ఆ మాట విని "ఇంపాజిబుల్! అది అయ్యే పని కాదు." అని చెప్పాడు శివమణి. "ఎస్! అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది వాళ్ళని సైక్లాజికల్ గా దెబ్బ కొట్టాలి." అని చెప్పాడు జేమ్స్. "సైక్లాజికల్ గా దెబ్బ కొట్టాలంటే, అక్కడ మనం ఏం చేయాలి?" అని అడిగాడు అభిజిత్. "ఆ తెగ వాళ్ళు అమితంగా ప్రేమించి కుటుంబంతో సమానంగా చూసుకునేది అక్కడ ఉన్న జంతువులని, ఫస్ట్ ఎటాక్ మనం వాటి మీద చెయ్యాలి, అప్పుడు వాళ్లు మానసికంగా కృంగిపోతారు." అని చెప్పాడు జేమ్స్. "అంటే! మనుషుల్ని పంపించి అడవిలో ఉన్న జంతువుల్ని వేటాడి చంపేయాలా?" అని అడిగాడు మురళి జోషి. ఆ మాటకి నవ్వుతూ "అలా చేయడం కూడా సాధ్యం కాదు, ఆ జంతువుల్ని మనం చంపము, అవే చనిపోతూ ఉంటాయి." అని ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశాడు జేమ్స్.
26-01-2026, 12:01 AM
ఎపిసోడ్ 44
ఆ ప్లేస్ ని వాళ్ళ తెగని క్షేమంగా ఉంచడం కోసం వాళ్లలో ఐదుగురితో పాటు కొంతమందిని చుట్టుపక్కల ప్రాంతాలకు రహస్యంగా వెళ్లి ఉండమని పంపించాడు అభీర్.
ముకుల్ తీసుకువచ్చిన బ్రిటిష్ మిలటరీ మేజర్ జేమ్స్ ఆ తెగ వాళ్ళని సైకలాజికల్ గా దెబ్బ కొట్టాలి అంటే అక్కడ ఉన్న జంతువుల్ని చంపాలి అని చెప్పాడు. **************** "ఆ అడవిలో ఉన్న జంతువుల్ని చంపాలి అంటే, మనం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి, ఆ తెగ వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా మనలో ఎవరు ప్రాణాలతో ఉండరు, వాళ్ల ప్రేమ ఎలా ఉంటుందో ప్రతీకారం కూడా అలాగే ఉంటుంది." అని హెచ్చరించాడు శివమణి. "ఆ విషయాల గురించి జేమ్స్ కి బాగా తెలుసు! బ్రేజిల్ లో ఒక క్వారీ దగ్గర ఉండే తెగని వెంటాడి వేటాడి చంపాడు." అని చెప్పాడు ముకుల్. "సార్! నేను ఎన్నో తెగల మీద రీసెర్చ్ చేశాను, అభీర్ సేన చాలా తెలివైనవాళ్లు, అంతే ప్రమాదకరమైన వాళ్ళు కూడా మనం ఈ విషయంలో చాలా కేర్‌ఫుల్ గా ఉండాలి ఏ రాంగ్ స్టెప్ వేసిన శివమణి చెప్పినట్లు మన జీవితాలు ఇక్కడితో ఆగిపోతాయి." అని చెప్పాడు సర్ఫరాజ్. "ముందు జేమ్స్ ప్లాన్ మొత్తం వినండి తర్వాత మీరు అనుకునేది చెప్పండి." అని చెప్పాడు ముకుల్. "జేమ్స్! కంటిన్యూ యువర్ స్టేటజీ!" అని చెప్పాడు గోకుల్. "మీరు చెప్పినట్లు నిజంగానే ఆ తెగ వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు, అందుకనే జంతువుల్ని చంపడానికి మన మనుషులు ఎవరూ ఆ అడవిలోకి వెళ్ళనవసరం లేదు." అని చెప్పాడు జేమ్స్. ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "మనుషులు ఎవరు వెళ్లకుండా జంతువుల్ని ఎలా చంపుతారు?" అని డౌట్ గా అడిగాడు జాకి. ఆ మాటకి నవ్వుతూ బ్యాగ్ లో నుంచి ఒక పక్షిని బయటకి తీసి అక్కడ ఉన్నవారికి చూపిస్తూ "ఇది ఏమిటో తెలుసా?" అని అడిగాడు జేమ్స్. "అది పావురం లాగా ఉంది. అయ్యినా ఇప్పటివరకు బ్యాగ్ లో ఉంచారు చచ్చిపోదు." అని అడిగాడు మురళి జోషి. ఆ పావురాన్ని టేబుల్ మీద వదిలి "దీనిని చూసి ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పగలరా?" అని అడిగాడు జేమ్స్. "ఆ పక్షిని చూసి చెప్పడానికి ఏముంది. ఆది వెళ్లి అక్కడ ఉన్న జంతువుల్ని చంపుతుందా?" అని వెటకారంగా అడిగాడు అభిజిత్. "ఎస్! ఈ పక్షి వెళ్లి అడవిలో ఉన్న జంతువులని చంపుతుంది." అని చెప్పాడు జేమ్స్. ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి మీరు చెప్పేది? ఒక పావురం వెళ్లి అక్కడ ఉన్న పెద్ద పులిని చంపుతుందా?" అని అనుమానం గా అడిగాడు జనార్ధన్. "ఇది బయటికి పావురం లాగా కనిపిస్తుంది. కానీ ఇది ఒక రోబోట్, దీనిని అమెజాన్ అడవుల్లో ఒక ప్రాంతంలో ఉన్న జంతువులకి కొత్త రకం వైరస్ సోకడంతో అక్కడికి సిబ్బందిని పంపించడానికి వీలు లేక ఈ రోబోట్ ని కనిపెట్టారు." అని చెప్పాడు జేమ్స్. ఆ మాట విని "ఏంటి? ఇది పక్షి కాదా రోబోట్ ఆ..!" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అభిజిత్. "ఎస్! దీనిని అడవిలోకి వదిలి ఒక చెట్ల మీద ఉండేటట్లు ఫిక్స్ చేస్తాము, దీని కళ్ళలో ఉన్న కెమెరా ద్వారా అక్కడ ఉన్న జంతువుల్ని మనం లైవ్ లో ఈ రూమ్ లో కూర్చొని స్క్రీన్ మీద చూడచ్చు!" అని చెప్పాడు జేమ్స్. "మనం స్క్రీన్ లో చూస్తే సరిపోతుందా! వాటిని ఎలా చంపుతాము." అని డౌట్ గా అడిగాడు జాకి. "అక్కడికే వస్తున్నాను, దీని బాడీలో ఫిక్స్ చేసిన మైక్రో ఇంజక్షన్స్ ని మనం ఇక్కడనుంచే కనిపించే జంతువు మీద షూట్ చేయొచ్చు,ఆ మైక్రో ఇంజక్షన్ ఆ జంతువు బాడీలోకి వెళ్ళి కరిగిపోతుంది. మనం ఇప్పుడు ఆ మైక్రో ఇంజక్షన్స్ లో మెడిసిన్ బదులు డేంజరస్ పాయిస్ అని ఫీల్ చేస్తున్నాము." అని చెప్పాడు జేమ్స్. ఆ మాట విని షాక్ అయ్యి చప్పట్లు కొడుతూ "సూపర్! సూపర్!" అని సంతోషం గా చెప్పాడు శివమణి. "థాంక్యూ! ఇలాంటి పది పక్షుల్ని మనం అడవిలోకి వదిలితే అక్కడ ఉన్న జంతువుల్ని ఎవరికి అనుమానం రాకుండా క్లోజ్ చేయొచ్చు, ఎలా చనిపోయాయో కూడా ఎవరు తెలుసుకోలేరు." అని చెప్పాడు జేమ్స్. "కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళ నాయకుడు అభీర్ కి ప్రాణం పోసే శక్తి ఉంది మేము కళ్ళారా చూశాము." అని చెప్పాడు గోకుల్. ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఇంపాజిబుల్! మీరు ఏదో తేడాగా చూసినట్లు ఉన్నారు, ప్రాణం పోయడం అనేది ఎవరికి సాధ్యం కాదు." అని చెప్పాడు జేమ్స్. "గోకుల్ చెప్పింది నిజమే! ఒక జింకపిల్లకి ప్రాణం పోయడం మేము కళ్ళారా చూశాము." అని చెప్పాడు అభిజిత్. "అవునా? ఈ విషయం గురించి నాకు తెలియదు, అయ్యినా ఏమి ప్రాబ్లం ఉండదు మనం ఇచ్చే పాయిజన్ వల్ల జంతువు చనిపోయిన రెండు గంటలలో బాడీ స్పాయిల్ అవుతుంది. అప్పుడు దానిని బతికించడం సాధ్యం కాదు." అని చెప్పాడు జేమ్స్. "జేమ్స్ ఇచ్చిన ప్లాన్ లో ఇంక మీకు డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు." అని చెప్పాడు ముకుల్. "నో డౌట్స్ సార్! నెక్స్ట్ ప్లాన్ చెప్పండి." అని అడిగాడు శివమణి. మురళి జోషి వైపు చూసి "మీ ఆఫీసర్స్ ఇద్దరు చేయవలసిన పని ఏమిటంటే, బోర్డర్ నుండి టెర్రరిస్టులు ఇండియాలోకి బేరా అడవి లో నుంచి ఎంటర్ అవుతున్నారని గవర్నమెంట్ నమ్మించాలి, కొంతమందిని చంపాము అని మంద గ్యాంగ్ మనుషులు పేర్లు లిస్టులో చేర్చండి." అని చెప్పాడు జేమ్స్. "మీరు చెప్పినట్లు చేస్తే ఆ ఏరియా సెక్యూరిటీ జోన్ అవుతుంది. అప్పుడు మనం ఎంటర్ అవ్వడం కూడా కష్టమవుతుంది కదా!" అని డౌట్ గా అడిగాడు సర్పరాజ్. "మనం అలా చేయగలిగితేనే ఆ తెగ వాళ్ళు చచ్చిన ఎవడు పట్టించుకోడు టెర్రరిస్టుల లెక్కలోకి వెళ్ళిపోతారు." అని చెప్పాడు జేమ్స్. "గుడ్ ఐడియా!" అని నవ్వుతూ చెప్పాడు ముకుల్. "నెక్స్ట్! మన మినిస్టర్ గారు చేయవలసిన పని ఏమిటి అంటే, అక్కడ ఉన్న కొండల అడుగున ఉన్న విష పదార్థాలు రిలీజ్ అయ్యి అడవిలో ఉన్న జంతువులు చనిపోతున్నాయి అని ఒక రిపోర్ట్ తయారు చేయించి ఆ కొండలను అక్కడ నుంచి తొలగించే కాంట్రాక్టు మన గోకుల్ గారి కంపెనీకి ఇప్పించాలి." అని చెప్పాడు జేమ్స్ "ఆ పని చేయడానికి నేను రెడీ, అడవిలో జంతువులు చనిపోవడం స్టార్ట్ అయితే ఇమీడియట్ గా రిపోర్ట్ తెప్పిస్తాను అదంతా మన చేతిలో పనే!" అని నవ్వుతూ చెప్పాడు జావీద్. "మీరు ఎన్ని పర్మిషన్స్ తెప్పించినా ఆ కొండలు తవ్వడానికి అక్కడ ఉన్న తెగ వాళ్ళు ఒప్పుకోరు తప్పకుండా ఎదురు తిరుగుతారు." అని చెప్పాడుశివమణి. "దానికి నా దగ్గర ఒక ప్లాన్ రెడీగా ఉంది. ముందు ఇవన్నీ అయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాము." అని చెప్పాడు జేమ్స్. "మన ప్లాన్ అందరికీ ఓకే కదా!" అని అడిగాడు ముకుల్. "ఎస్! ఎస్! " అని చెప్పారు అందరు. "ఈ ప్రాజెక్టులో వచ్చే ప్రాఫిట్ ఇక్కడ ఉన్న వారందరూ సమానంగా పంచుకుంటారు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని ఉండదు, కానీ అక్కడ ఉన్న పంచరత్నాలు మాత్రం మాట ఇచ్చిన ప్రకారం శివమణి గారికి ఇస్తున్నాము." అని చెప్పాడు ముకుల్. ఆ మాట విని సంతోషంగా చూస్తూ "ఈ ప్రాజెక్టులో మమ్మల్ని కూడా కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది సార్! " అని చెప్పాడు మురళి జోషి. "ఆల్ రైట్! టుడేస్ లో వర్క్ స్టార్ట్ చేద్దాము పది పక్షుల్ని అడవిలోకి పంపిద్దాము, నాకు ఆ అడవికి సంబంధించిన మ్యాప్ మొత్తం కావాలి." అని చెప్పాడు జేమ్స్. "ఆ ఫారెస్ట్ లొకేషన్ మ్యాప్ రేపు ఉదయానికి మీ టేబుల్ మీద ఉంటుంది." అని చెప్పాడు జావిద్. "గుడ్!" అని అభిజిత్ వైపు చూసి "మీరు ఆ తెగ వాళ్ళ గూడెంలో జరిగే జాతర సంబరాలు స్పాన్సర్ చేయడానికి ఇప్పటినుంచి ప్రిపేర్ లో ఉండండి." అని చెప్పాడు జేమ్స్. "అంటే! ఆ జాతర సమయంలో ఆ తెగ వాళ్ళందర్నీ క్లోజ్ చేద్దామా?" అని అడిగాడు అభిజిత్. "ఆ విషయం చెప్పడానికి ఇంకా చాలా టైం ఉంది కంగారు పడకండి. మీరు ఆ ప్రిపరేషన్ లో ఉండి ఆ తెగ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి." అని చెప్పాడు జేమ్స్. ముకుల్ వైపు చూసి "అంకుల్! ఈ మనిషి మీకు ఎక్కడ దొరికాడో కానీ, ఇతనితో ఒక గూడెం ఏమిటి ఒక దేశాన్ని నాశనం చేయొచ్చు!" అని గొప్పగా చెప్పాడు అభిజిత్. ఆ మాటకి నవ్వుతూ "ముందు ముందు జేమ్స్ పనితీరు, అతని ఐడియాలజీ చూసి మీరు ఆశ్చర్యపోతారు." అని చెప్పాడు ముకుల్. సోఫాలో నుంచి లేచి, "నేను ఇంక సెలవు తీసుకుంటాను ఒక అర్జంట్ మీటింగ్ ఉంది. మీకు ఆ ఏరియాలో ఏ హెల్ప్ కావాలి అన్న చెప్పండి వెంటనే అయిపోతుంది. " అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జావిద్. "సార్! మరి మేము కూడా బయలుదేరుతాము మా పనిలో మేము ఉంటాము." అని చెప్పాడు మురళి జోషి. ఇద్దరి ఆఫీసర్ల వైపు చూస్తూ, "అక్కడ టెర్రరిస్ట్ కదలికలు ఉన్నాయి అని మీరు పర్ఫెక్ట్ గా రెడీ చేయాలి గుర్తుంచుకోండి." అని చెప్పాడు జేమ్స్. "ఓకే సార్! ఆ విషయం గురించి మీరు మర్చిపోండి." అని చెప్పి జనార్ధన్ తో కలిసి అక్కడి నుంచి బయలుదేరాడు మురళి జోషి. శివమణి, సర్ఫరాజ్ కూడా అక్కడి నుంచి వెళ్లడంతో "అంకుల్! మీరేంటి ప్రాఫిట్స్ అందరికీ పంచి పెడతాను అని చెబుతున్నారు." అని అడిగాడు అభిజిత్. ఆ మాటకి నవ్వుతూ జేమ్స్ వైపు చూశాడు ముకుల్. "అభిజిత్ గారు! తాజ్ మహల్ వెనుక ఉన్న రక్త చరిత్ర గురించి మీకు తెలుసా?" అని అడిగాడు జేమ్స్. "తాజ్ మహల్ కి రక్త చరిత్ర ఏముంది అది ప్రేమకు చిహ్నం కదా!" అని అడిగాడు అభిజిత్. "తాజ్ మహల్ ని కట్టించిన షాజహాన్, నిర్మాణం పూర్తి అయిన తర్వాత దానికి కట్టుబడి లో పనిచేసిన కూలీలని చంపేశాడు, ఎందుకంటే అటువంటిది మరొకటి ఉండకూడదు అని, అలాగే మనం కూడా ఈ ప్రాజెక్టులో పనిచేసిన కూలీలని!" అని వికృతంగా నవ్వుతూ చెప్పాడు జేమ్స్. ఆ మాట విని "అంకుల్! ఆ లిస్ట్ లో నన్ను జాయిన్ చేయకండి." అని కంగారుగా చెప్పాడు అభిజిత్. ఆ మాటకి నవ్వుతూ అభిజిత్ భుజం మీద చేయ్యి వేసి "నువ్వు నా ఫ్రెండ్ రా..!" అని చెప్పాడు గోకుల్. "హమ్మయ్య!" అని ఊపిరి పీల్చుకొని స్మైల్ ఇచ్చాడు అభిజిత్.
26-01-2026, 04:10 AM
26-01-2026, 08:38 AM
Excellent update
27-01-2026, 11:10 PM
ఎపిసోడ్ 45
గెస్ట్ హౌస్ కి వచ్చిన శివమణి వాళ్ళతో జంతువుల్ని చంపడానికి తను తెచ్చిన పక్షి లాగ ఉండే రోబోట్ ని చూపించి ఎలా పనిచేస్తుందో చెప్పి తన ప్లాన్ మొత్తం వివరంగా చెప్పాడు.జేమ్స్.
**************** ఒకరోజు ఉదయం మురళీ జోషి వాళ్లతో పాటు బేరా అడివిలోకి వెళ్ళాడు జాకి. అడవిలో కొంతమందితో కలిసి నడుచుకుంటూ వస్తున్న జాకిని చూసి "ఏంటి దొర ఇటు వచ్చావు?" అని అడిగాడు సహదేవుడు. "ఒక్కసారి మీ శంభు దొరని తో కలవాలి, మొన్న మీ మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ల గురించి మాట్లాడడానికి ఆఫీసర్స్ వచ్చారు." అని మురళి జోషి వాళ్ళని చూపించాడు జాకి. "సరే! మీరు ఆ కొండ కింద సేద తిరండి. నేను వెళ్లి మా దొరని తీసుకొస్తాను." అని అక్కడి నుంచి వేగంగా వెళ్ళాడు సహదేవుడు. అక్కడ ఉన్న కొండ కింద కూర్చుని బ్యాగ్ లో ఉన్న రోబోట్ పావురాలని బయటకు తీస్తూ జనార్దన్ వైపు చూసి "నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని వదిలిపెట్టండి." అని చెప్పాడు జాకి. బ్యాగ్ లో ఉన్న పావురాలని వదిలిపెట్టి సాటిలైట్ ఫోన్ ఆన్ చేసి జేమ్స్ కి సిగ్నల్ ఇచ్చాడు మురళి జోషి. ముకుల్ గెస్ట్ హౌస్ లో లాప్టాప్ లో అడవిలో వదిలిన 10 పావురాలని యాక్టివేట్ చేసి ఆపరేట్ చేస్తూ చుట్టూ ఉన్న చెట్లు మీద అరేంజ్ చేసాడు జేమ్స్. అంతలో అభీర్, శంభు లతో కలిసి అక్కడికి వస్తు ఎగురుతున్న పావురాలను చూసి "దొర! మన అడవిలోకి కొత్త పక్షులు వస్తున్నాయి." అని సంతోషంగా చెప్పాడు సహదేవుడు. ఆ మాట విని టెన్షన్ గా చూస్తూ ఉన్నారు ముగ్గురు. "శీతాకాలం వస్తుంది కదా కొత్త కొత్త పక్షులు వలస వస్తూ ఉంటాయి." అని చెప్పాడు శంభు. "అవును దొర! కాని ఇవి పావురాలు లాగా ఉన్నాయి ఎప్పుడు అడవిలోకి రాలేదు." అని చెప్పాడు సహదేవుడు. "కొత్త కొత్త మనుషులే అడవిలోకి వస్తున్నారు అవి రావడానికి ఏముంది." అని జాకీ వైపు చూసి "నాయకుడిని కలవాలి అని చెప్పారు అంట!" అని అడిగి వెనక ఉన్న మురళీ జోషి వాళ్ళ వైపు చూసి "ఎవరు వీళ్లంతా?" అని అనుమానంగా అడిగాడు అభీర్. "మీ మీద దాడి జరిగింది కదా ఆ వివరాలు తెలుసుకోవడానికి వచ్చిన ఆఫీసర్లు!" అని చెప్పాడు జాకి. "మీకేమి వివరాలు కావాలో చెప్పండి ఇక్కడకు వచ్చిన వాళ్లయితే బతికి లేరు." అని చెప్పాడు అభీర్. అక్కడ ఉన్న బూడిదను కాలితో తంతు "వాళ్ళు చనిపోయారు అని మాకు అర్ధం అయ్యింది. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలి అంటే వాళ్ల దగ్గర ఉన్న తుపాకులు, వస్తువులు మాకు కావాలి, వాటిని బట్టి వాళ్ళు ఏ దేశంలో నుంచి ఇక్కడ వచ్చారో తెలుస్తుంది." అని చెప్పాడు మురళి జోషి. "ఆ మనుషులు ఏ దేశం నుంచో రాలేదు ఇక్కడి నుంచే వచ్చారు, వాళ్ల వస్తువులు కావాలి అంటే నిరభ్యంతరంగా తీసుకు వెళ్ళవచ్చు!" అని సహదేవుడి వైపు చూశాడు అభీర్. "మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు, మీరు ఒప్పుకుంటే కొంతమంది ఆఫీసర్స్ ని ఇక్కడ సెక్యూరిటీగా పెడతాము." అని చెప్పాడు జనార్ధన్. "ఏమీ అవసరం లేదు దొర! వాళ్ళని మేము ఎదుర్కోగలము, ఈ ప్రదేశం నాశనం చేయడానికి ఎంతమంది వచ్చినా సరే మమ్మల్ని దాటి తిరిగి వెళ్ళలేరు." అని చెప్పాడు శంభు. "అవును! వాళ్లు ఈ దేశం వాళ్లేనని మీకు ఎలా తెలిసింది?" అని డౌట్ గా అడిగాడు జాకి. "ఆ మనుషుల దగ్గర దొరికిన సొమ్ము మన దేశానిదే!" అంటూ ఏనుగు మీద వస్తువులు తీసుకు వస్తున్న సహదేవుడు వైపు చూసి "మీకు కావలసినవి తీసుకోండి." అని చెప్పాడు అభీర్. ఆ వస్తువులు ఉన్న ముట తీసుకొని "మీకు ఎటువంటి సహాయం కావాలన్నా అభిజిత్ గారికి ఒక మాట చెప్పండి చాలు మేమందరం ఇక్కడే ఉంటాము." అని చెప్పాడు మురళి జోషి. "సరే దొర! ధన్యవాదాలు ఇంకా జాగ్రత్తగా వెళ్ళిరండి." అని చెప్పాడు శంభు. అక్కడినుంచి జాకీ తో కలిసి వెళుతూ "వీళ్ళతో పాటు జంతువులు కనపడతాయి అని చెప్పావు,ఆ ఏనుగు తప్పితే ఏమీ కనపడలేదు." అని అడిగాడు మురళి జోషి. "నీ టైం బాగుంది త్వరగా పద లేకపోతే ఏ పెద్ద పులో వెంటపడుతుంది." అని చెప్పాడు జాకీ. వెనకాల వేగంగా నడుస్తూ "సార్! వీళ్ళని మోసం చేయడం చాలా ఈజీ ఇంత ప్లానింగ్ అవసరం లేదు." అని చెప్పాడు జనార్ధన్. "సరేగాని! మనం వదిలిన పావురాలు మొత్తం జాగ్రత్తగా ఎగిరిపోయాయి కదా!" అని అడిగాడు జాకీ "జాగ్రత్తగా ఎగిరి చెట్ల మీద కూర్చున్నాయి." అని చెప్పాడు జనార్దన్. "సరే! నువ్వు ఈ తుపాకులు వస్తువులు తీసుకువెళ్లి రోజుకు ఒకడిని ఎన్కౌంటర్ చేసినట్లు రాసుకో!" అని చెప్పాడు జాకీ. "అలాగే!" అని వాళ్ళు వచ్చిన కారు డిక్కీ ఓపెన్ చేసి గన్స్ లోపల పెట్టి అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోయారు ముగ్గురు. గెస్ట్ హౌస్ దగ్గర వీడియోలో చూస్తూ "సార్! గేమ్స్ స్టార్ట్ చేద్దామా?" అని ముకుల్ ని అడిగాడు జేమ్స్. "నో! అక్కడికి వెళ్ళిన మనుషులని రానివ్వు, లేకపోతే మన మీద అనుమానం వస్తుంది." అని చెప్పాడు ముకుల్. "ఓకే సార్!" అని 10 పావురాల కళ్ళల్లో ఉన్న కెమెరాలు నుంచి అన్ని యాంగిల్స్ లో అడవి మొత్తాన్ని చూస్తూ ఉన్నాడు జేమ్స్. ***************** అక్కడి నుంచి శంభుతో కలిసి గూడెం దగ్గరికి వెళుతూ "అయ్యా! నాకు ఏదో కీడు శంకిస్తుంది. ఈ అడవికి ఆపద రాబోతున్నట్లు అనిపిస్తుంది." అని దిగాలుగా చెప్పాడు అభీర్. "మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర్నుంచి అదే ఆలోచనలో ఉన్నావు, అందుకే నీ మనసుకి అలా అనిపిస్తుంది అంతా బానే ఉంది అవసరమైతే అభిజిత్ గారికి చెబుదాము." అని చెప్పాడు శంభు. "అయ్యా! అయన మనం మేలుకోరేవాడే అంటావా?" అని అనుమానం గా అడిగాడు అభీర్. "మేలు కోరే వారు కాబట్టే మనకి సమాచారం ఇచ్చారు ఇప్పుడు ఆఫీసర్లు పంపించారు అలాగే మన నుంచి ఏమీ ఆశించలేదు." అని చెప్పాడు శంభు. "సరే!" అని గూడెం లోపలికి వెళ్లి అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం వైపు చూస్తూ 'నా జాతిని, ఈ అడవిని కాపాడే శక్తిని ఇవ్వు తల్లి!' అని మనసులో అనుకున్నాడు అభీర్. ************ రెండు రోజుల తర్వాత వీడియోలో చూస్తూ అటువైపు వచ్చిన జంతువులకి పాయిజన్ ఇంజక్షన్ షూట్ చేస్తూ ఉన్నడు జేమ్స్. బోర్డర్ నుంచి బేరా అడవిలోకి టెర్రరిస్టులు ఎంటర్ అవుతున్నారు అని రిపోర్టు రాసి మంద గ్యాంగ్ లో కొంతమందిని ఎన్కౌంటర్ చేసినట్టు పై ఆఫీసర్స్ కి వేపన్స్ సబ్మిట్ చేశాడు మురళి జోషి. ******************* ఒకరోజు అడవిలో ఎగురుతూ జంతువులు చనిపోయి ఉండడం చూసి వేగంగా అభీర్ దగ్గరికి వచ్చి భయంకరంగా అరుస్తూ ఉన్నాడు సింబా. ఆది విని "అక్కడకి తీసుకువెళ్ళు!" అని చెప్పాడు అభీర్. సింబా వెనకాల వేగంగా కొంతమంది కలిసి చనిపోయిన జంతువులు దగ్గరికి వెళ్లి కళేబరాలుగా మారడం చూసి షాక్ అయ్యి "అసలు ఇలా ఎందుకు జరుగుతుంది?" అని టెన్షన్ గా చూస్తూ అన్నాడు అభీర్. "అయ్యో! కన్న బిడ్డల లాగా చూసుకున్నాము ఇలా చనిపోతున్నాయి ఏమిటి? ఇక్కడ ఏదో ఆపచారం జరిగింది." అని ఏడుస్తూ ఉన్నారు గూడెం ప్రజలు. చనిపోయిన జంతు కళేబరా దగ్గరకు వెళ్లి ముట్టుకుని వాసన చూసి "విష ప్రయోగం వల్ల చనిపోయాయి." అని చెప్పాడు శంభు. ఆ మాట విని "ఎవరో కావాలని చేస్తున్నారు ఇక్కడ ఉన్న జంతువులన్నీ మనకు గూడానికి తోలుకు వెళ్ళండి. కొన్ని రోజుల వరకు అడవిలోకి రాకూడదు." అని చెప్పాడు అభీర్. ఆ మాట విని వేగంగా ఆకాశంలోకి ఎగిరి అడవి మొత్తం తిరుగుతూ జంతువులకు సిగ్నల్ ఇచ్చింది సింబా. చనిపోయిన జంతువులను పూడ్చిపెట్టి ఏడుస్తూ వాళ్ల గూడానికి వెళ్లారు అందరూ. వీడియోలో అక్కడ జరిగేదంతా చూస్తూ "జేమ్స్! ఆడియో కూడా అవైలబుల్ గా ఉంటే బాగుండేది." అని నవ్వుతూ చెప్పాడు ముకుల్. "అంకుల్! జంతువులు మొత్తం అడవిలో నుంచి ఎక్కడికో వేగంగా వెళుతున్నాయి వాళ్లకి ఏదో అనుమానం వచ్చినట్లు ఉంది." అని చెప్పాడు అభిజిత్. వీడియోలో చూస్తూ "జంతువులు మొత్తం కొండమీదికి వెళుతున్నాయి, మన రోబోట్స్ ని కూడా వెనకాలే పంపించండి." అని చెప్పాడు గోకుల్. "ఇప్పుడు వెళ్లాల్సింది రోబోట్స్ కాదు నాలుగు రోజుల తరువాత మనం అక్కడకి వెళ్ళాలి." అని చెప్పాడు జేమ్స్. "మనం అక్కడికి వెళ్లి ఇప్పుడేం చేస్తాము." అని కంగారుగా అడిగాడు శివమణి. "ఆ జంతువుల కళేబరాలు ముట్టుకున్న గూడెం మనుషులకి వైరస్ ఎటాక్ అయ్యి మంచాన పడతారు మనం వెళ్లి యాంటీ డోస్ ఇచ్చి రికవరీ చేద్దాము." అని చెప్పాడు జేమ్స్. "మనం వెళ్లి రికవరీ చేయడం ఎందుకు చస్తే కొంతమంది తగ్గుతారు కదా!" అని చెప్పాడు గోకుల్. "నో నో! వాళ్ళకి మన మీద పూర్తి నమ్మకం రావాలి అప్పుడే మా ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది." అని చెప్పాడు జేమ్స్. "అక్కడ వాళ్లకి జబ్బు చేసిందని వాళ్ళు చెప్పకుండా మనం వెళితే అనుమానం వస్తుంది కదా!" అని అడిగాడు సర్పరాజ్. "నాకు తెలిసి ఖచ్చితంగా అభిజిత్ కి కబురు వస్తుంది వెళ్లడానికి రెడీగా ఉండండి." అని చెప్పాడు జేమ్స్. ******************* జంతు కళేబారాల నుంచి వచ్చిన వైరస్ వల్ల గూడెంలో శంభు తో సహా కొంత మందికి జబ్బు చేయడంతో "అభీర్ దగ్గరికి వచ్చి వాళ్ళని నువ్వే నయం చేయాలి నాయకుడా? నీకు ప్రాణం పోసే శక్తి ఉంది కదా!" అని అడిగాడు సహదేవుడు. "నాకు ప్రాణం పోసే శక్తి ఉంది కానీ వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు, జబ్బు ఏమిటో తెలుసుకుని మందు వేయాలి అప్పుడే తగ్గుతుంది." అని చెప్పాడు అభీర్. "ఈ విషయం అభిజిత్ గారికి తెలిపితే ఏదైనా సహాయం చేస్తారేమో!" అని చెప్పాడు సహదేవుడు. "అవును బిడ్డ! అభిజిత్ గారికి వెంటనే ఈ విషయం గురించి కబురు పంపించు తప్పకుండా సహాయం చేస్తారు." అని చెప్పాడు శంభు.
27-01-2026, 11:11 PM
ఎపిసోడ్ 46
అడవిలో జంతువులు చనిపోయి వాటి వల్ల వచ్చిన వైరస్ కి జబ్బు పడటంతో ఏం చేయాలో తెలీక అభిజిత్ సహాయం అడగమని చెప్పాడు శంభు.
తండ్రి మాట కాదనలేక అభిజిత్ దగ్గరికి ఒక మనిషిని పంపించాడు అభీర్. **************** నాలుగు రోజుల తర్వాత జేమ్స్ టీమ్ తో కలిసి బేర అడవి దగ్గరికి వచ్చి అభీర్ ని కలిసి "విదేశీయులు ప్రత్యక్ష యుద్ధం చేయలేక ఇటువంటి వైరస్ లతో దాడి చేస్తున్నారు, నువ్వు ముందుగానే నాకు విషయం చెప్పి మంచి పని చేశావు లేకపోతే మీరు చాలా నష్టపోవాల్సి వచ్చేది." అని తన పక్కన ఉన్న జేమ్స్ ని పరిచయం చేస్తూ "ఆయన పెద్ద డాక్టర్! మీ వాళ్ళందరికీ తగ్గేవరకూ వాళ్ళ స్టాఫ్ మొత్తం ఇక్కడే ఉంటారు." అని చెప్పాడు అభిజిత్. ఆ మాట విని "మీరు చేస్తున్న సహాయం మర్చిపోలేము, మీ వాళ్ళందరూ ఉండడానికి తగిన ఏర్పాట్లు చేయిస్తాను." అని కొండ దగ్గరే గుడారాలు ఏర్పాటు చేయించాడు అభీర్. వైరస్ బారిన పడిన ఆ గూడెం ప్రజల బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేసి యాంటీడోస్ ఇస్తు ఉన్నారు జేమ్స్ మనుషులు. అంతలో అక్కడికి శివమణి, ముకుల్ వాళ్ళతో కలిసి అక్కడకి వచ్చాడు గోకుల్. అక్కడికి వస్తున్న వాళ్లను చూసి "ఆయనా గోకుల్ తండ్రి ముకుల్ నంద గారు! చాలా దేశాలలో వ్యాపారాలు ఉన్నాయి అక్కడ కూడా మీలాగా కొండలలో ఉండే తెగ వారికి వైద్య సహాయం చేస్తూ ఉంటారు మీ గురించి తెలిసి చూడడానికి వచ్చారు." అని చెప్పాడు అభిజిత్. "అవునా?" అని ముకుల్ దగ్గరికి వెళ్లి " మీలాంటి వారు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకోండి. " అని తీసుకువెళ్ళాడు అభీర్. అమ్మవారి దర్శనం చేసుకుంటూ పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలు, చుట్టూ ఉన్న కొండలు చూసి "మీ ప్రదేశం చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉంది. మీరు ఇక్కడ ఉన్న మూగజీవాలతో కలిసి జీవించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది." అని చెప్పాడు ముకుల్. అక్కడికి వస్తూ "ఇటువంటి వ్యాధి మా గూడానికి ఎప్పుడు రాలేదు ఇదే మొదటిసారి దొర! మా అభీర్ అనుమానం ఏమిటంటే ఎవరో కావాలని ఈ వ్యాధి వచ్చేటట్టు చేశారు అని అంటున్నాడు." అని చెప్పాడు శంభు. "మీ అబ్బాయికి వచ్చినా అనుమానం నిజమే! ఇటువంటి వ్యాధులు చాలా దేశాల్లో వస్తున్నాయి అందులోను మీది అడవి ప్రాంతం కాబట్టి జంతువుల ద్వారా సోకే ప్రమాదం ఉంది. ఇప్పుడు మా డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ తో మీ వాళ్ళు పూర్తిగా జబ్బు నుంచి బయట పడతారు, మీరు అనుమతిస్తే జంతువులకి కూడా టీకాలు వేయిస్తాను అప్పుడు మళ్లీ ఇటువంటి జబ్బులు ఈ గూడెం పరిసరాలలోకి రాకుండా ఉంటాయి." అని చెప్పాడు ముకుల్. ఆ మాట విని అభీర్ వైపు చూసాడు శంభు. "మాతో పాటు ఇక్కడ ఉన్న జంతువులు కూడా క్షేమంగా ఉండాలి ఈ మందు వాటికి కూడా ఇవ్వండి." అని చెప్పాడు అభీర్. "సరే!" అని చెప్పి "అవును! ఇటువంటి జబ్బులు చేసినప్పుడు మీ గూడాలలో ఏదో జాతర ఆచారాలు ఉంటాయి కదా అది ఒకసారి జరిపించకపోయారా అమ్మవారు కూడా శాంతిస్తుంది." అని చెప్పాడు ముకుల్. "తప్పకుండా జరిపిస్తాము దొర! మీ అందరికీ కూడా ఆహ్వానం పంపుతాము." అని చెప్పాడు శంభు. "మీకు అభ్యంతరం లేకపోతే ఈసారి జాతర ఏర్పాటు ఘనంగా నేను ఏర్పాటు చేస్తాను ఆ అమ్మవారి దయ మాకు కూడా కలుగుతుంది." అని చెప్పాడు అభిజిత్. "సరే దొర! జాతర ఏర్పాటు చేయగానే మీకు కబురు పంపుతాము." అని చెప్పాడు శంభు. అక్కడికి వచ్చి "సార్! ఇక్కడ జబ్బు చేసిన వాళ్లందరికీ మెడిసిన్ ఇచ్చేసాము ఇంకా వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ గాలిలో వైరస్ స్ప్రెడ్ అయింది మీరు ఓకే అంటే కొండ ప్రాంతాలు మొత్తం శానిటైజ్ చేసి క్లీన్ చేస్తాము." అని చెప్పాడు జేమ్స్. ఆ మాట విని "ఈ గూడెం నాయకుడి అనుమతి తీసుకోవాలి కదా!" అని అభీర్ వైపు చూశాడు గోకుల్. "అంటే! ఈ కొండ ప్రాంతం మొత్తం ముందు జల్లుతారా?" అని అడిగాడు అభీర్. ఆ మాటకి నవ్వుతూ "నువ్వు బానే కనిపెట్టావు చాలా తెలివైన వాడివి, అలా జల్లడం వల్ల ఆ వ్యాధి మళ్లీ మీ దగ్గరికి కూడా రాదు." అని చెప్పాడు ముకుల్. "సరే! మీకు తోడుగా మా మనుషులను కూడా పంపిస్తాను." అని చెప్పాడు అభీర్. "ఓకే సార్! త్రీ డేస్ పడుతుంది.మేము వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తాము." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జేమ్స్. అక్కడ నుంచి బయలుదేరూతు శంభు, అబీర్ వైపు చూసి "ఏ ఇబ్బంది ఉన్న వెంటనే మాకు ఒక్క మాట చెప్పండి చాలు ఇక్కడ వాలిపోతాము." అని చెప్పాడు గోకుల్. "సరే దొర! మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేము ఈ గూడెం ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు." అని చెప్పేడు శంభు. ముకుల్ తో పాటు అక్కడి నుంచి బయలుదేరి దూరంగా ఉన్న కార్లు ఎక్కి వెళ్లిపోయారు అందరూ. మూడు రోజులు పాటు ఆ కొండ ప్రాంతం అంత శానిటైజింగ్ చేసి ఆ గూడెం ప్రజలతోనే జంతువులన్నిటికీ మెడిసిన్ ఇప్పించి అభీర్ దగ్గరకు వచ్చి "మేము బయలుదేరుతున్నాము ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు." అని చెప్పాడు జేమ్స్. "సరే!" అని జేమ్స్ వాళ్ళని అడవి చివరి వరకు సాగనంపి సహదేవుడితో కలిసి వస్తూ "వీళ్లు ఏమి ఆశించకుండా మనకి ఎందుకు సహాయం చేస్తున్నారు?" అని అనుమానంగా అడిగాడు అభీర్. "నాకు కూడా అదే అనుమానం వచ్చింది నాయకుడా! కానీ వాళ్ళు ఇచ్చిన మందుల వల్ల మన వాళ్ళందరూ మళ్లీ మామూలు మనుషులు అయ్యారు నాలుగు రోజులు ఒక్క జంతువు కూడా చనిపోలేదు." అని చెప్పాడు సహదేవుడు. అక్కడికి వస్తున్న అభీర్ వైపు చూసి "నువ్వు ప్రతి దానికి అనుమానం పడకు బిడ్డ! ఆ దైవమే మనల్ని కాపాడడానికి వీరిని పంపించిందేమో!" అని చెప్పాడు శంభు. "సరే అయ్యా! నేనే తప్పుగా ఆలోచిస్తున్నాను ఏమో అమ్మవారికి జాతర ఏర్పాటు చేయాలి చుట్టూ ఉన్న వాళ్ళని ఇక్కడకు రమ్మని కబురు పంపించాలి." అని చెప్పాడు అభీర్. "నీకు నామకరణం జరిగిన తర్వాత జరిగే మొదటి జాతర నువ్వు ఈ గూడెం వదిలి వెళ్ళిన వాళ్లతో కలిసి శివాజీ మహారాజ్ పూజించిన భవాని మతని దర్శనం చేసుకుని అక్కడ మూడు రాత్రులు నిద్ర చేసి జాతర చివరి రోజుకి ఇక్కడికి చేరుకోవాలి." అని చెప్పాడు శంభు. "సరే అయ్యా! నువ్వు ఇక్కడ జరిగే జాతర రోజు నిర్ణయించగానే నేను మనవాళ్ళకి సమాచారం ఇచ్చి అమ్మ దగ్గరికి బయలుదేరుతాను." అని చెప్పాడు అభీర్. ******************* మరుసటి రోజు డిల్లీ లో ఉన్న గెస్ట్ హౌస్ కి జేమ్స్ వాళ్ళు రావడంతో "మన మీద వాళ్ళకి పూర్తి నమ్మకం కుదిరింది కదా!" అని అడిగాడు ముకుల్. "ఎస్ సార్! ఇప్పుడు మనం ఏం చేసిన వాళ్ళు నమ్ముతారు." అని చెప్పాడు జేమ్స్. "సార్! మీ ప్లాన్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు, వాళ్లకి మన మీద ఎంత నమ్మకం కుదిరిన సరే అక్కడ ఉన్న ఒక్క రాయి కూడా ముట్టుకొనివ్వరు." అని చెప్పాడు శివమణి. "ఆ విషయం నాకు కూడా తెలుసు! జేమ్స్ మనుషులు అక్కడ ఉన్న కొండల చుట్టూ తిరుగుతూ మూడు రోజుల శానిటైజింగ్ చేస్తూ కూర్చున్నారు అనుకుంటున్నావా?" అని అడిగాడు ముకుల్. ఆ మాట విని "కాదా సార్! మరి వాళ్ళు ఏం చేశారు?" అని డౌట్ గా అడిగాడు మురళి జోషి. "ఆ ప్రదేశం చుట్టూ పాయిజన్ బాంబ్స్ ఉంచాము, అక్కడ జరిగే జాతర సమయంలో వాళ్లలో ప్రతి ఒక్కరు ఆ కొండమీదికి చేరుకుంటారు మన మనుషులు కూడా వాళ్లతో పాటు అక్కడే ఉంటారు. టైం చూసి ఆ బాంబ్స్ బ్లాస్ట్ చేస్తాము విషవాయువు మొత్తం ఆ కొండ మీదకు చేరుకుంటుంది అక్కడ ఉన్నవాడు ఎవడు బతికి ఉండడు." అని చెప్పాడు జేమ్స్. "అదే జరిగితే అక్కడ ఉన్న గవర్నమెంట్ కి కచ్చితంగా డౌటు వస్తుంది." అని చెప్పాడు అభిజిత్. "అందుకే కదా! కొండలలో నుంచి విష వాయువులు వస్తున్నాయని మన మినిస్టర్ రిపోర్ట్ రెడీ చేయిస్తున్నాడు, మన ఆఫీసర్స్ కూడా టెర్రరిస్టులు రసాయనిక దాడి చేశారు అని రిపోర్ట్ రెడీ చేస్తారు. అక్కడ ఉన్న కొండలు వల్లే ఇలా జరిగింది అని వాటిని తొలగించమని మన మినిస్టర్ ఆర్డర్ పాస్ చేస్తాడు మనం వాటిని తవ్వి ఆ ఏరియా ని సేఫ్ జోన్ గా చేస్తాము." అని నవ్వుతూ చెప్పాడు ముకుల్. "అలాంటప్పుడు మళ్ళీ మరి మనం జాతర ఏర్పాటు చేయడం ఎందుకు?" అని డౌట్ గా అడిగాడు శివమణి. "ఆ విష వాయువులు రావడంతోనే వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు అలా వెళ్లకుండా ఉండడానికి వాళ్ళు తినే ఫుడ్ లో మత్తు ముందు కలిపి పంపిస్తాము ఇంక ఆ కొండ మీద జంతువు కాదు కదా మనిషి కూడా బతికి ఉండడు." అని చెప్పాడు ముకుల్. "గుడ్ ఐడియా డాడ్! ఒక్క దెబ్బకి అక్కడ ఎవరూ లేకుండా పోతారు ఒకవేళ బయట ఎవరైనా ఉన్నా జాతర సమయానికి అక్కడికి చేరుకుంటారు కాబట్టి, వాళ్లు కూడా మిగలరు ఇంకా ప్లేస్ గురించి మనల్ని అడిగేవాడు కూడా ఉండడు." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు గోకుల్. "మరి ఆ విషవాయువులు చుట్టుపక్కలకు స్ప్రెడ్ అయితే చాలా చికాకు అవుతుంది. గవర్నమెంట్ రంగంలోకి దిగుతుంది. అక్కడ ఉన్న మన వాళ్ళు కూడా చనిపోతారు కదా!" అని డౌట్ గా అడిగాడు సర్పరాజ్. ఆ విష వాయువుల వల్ల ఎవరికి ప్రమాదం ఉండదు "మనం ఇచ్చిన మెడిసిన్ బాడీ లోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ప్రమాదం! అసలు వాళ్ళు ఎలా చనిపోయారో కూడా ఎవరో తెలుసుకోలేరు." అని చెప్పాడు జేమ్స్. "మరి ఇదంతా జరిగేది ఎప్పుడూ అంకుల్!" అని అడిగాడు అభిజిత్. "వాళ్లు జాతర డేట్ అనౌన్స్ చేయడంతోనే నీకు కబురు అందుతుంది. అప్పుడు మన వర్క్ స్టార్ట్ అవుతుంది అప్పటివరకు అందరూ సైలెంట్ గా ఉండండి. మన రోబోట్స్ ని కూడా చెట్ల మీద నిద్ర పోనివ్వండి వాళ్ళని సంతోషంగా చావనివ్వండి." అని చెప్పాడు ముకుల్.
28-01-2026, 03:52 AM
Siva garu.. meeku chinnappati ninchi emaina detective novels chadive alavaatu unda?
Crime ni intha detailed ga raastunnaru. I get it this is fiction, but your writing style has a certain aura!! Wonderful
28-01-2026, 09:57 AM
Excellent update
28-01-2026, 07:04 PM
ఎపిసోడ్ 47
జారువ తెగ వాళ్ళకి వచ్చిన జబ్బుకి టీకాలు వేయించి ఢిల్లీ చేరుకుని అక్కడ జరిగే జాతర సమయంలో విషవాయులతో అందరినీ ఎలా చంపుతామో వివరంగా చెప్పాడు జేమ్స్.
******************** మూడు నెలల తర్వాత జాతర తేదీ ఖరారు చేసి అభిజిత్ కి కబురు పంపించి మూడు రోజులు నిద్ర చేయడానికి భవాని మాత ఆలయం దగ్గరికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు అభీర్. "బిడ్డ! ఆ మాతని మన తెగ చల్లగా ఉండాలని, ఈ ప్రదేశాన్ని కాపాడే శక్తి నీకు ఇవ్వాలని మనసారా వేడుకో!" అని చెప్పాడు శంభు. "సరే అయ్యా!" అని సింబా వైపు చూసి మన వాళ్ళ ఐదుగురికి నేను అమ్మవారి గుడి దగ్గరికి బయలుదేరారని సమాచారం ఇవ్వు!" అని చెప్పాడు అభీర్. ఆ మాట విని వేగంగా అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయాడు సింబా. "నాయకుడా! నీకు తోడు గా నేను కూడా వస్తాను." అని అడిగాడు సహదేవుడు. "ఈ బేర అడవికి నువ్వే కాపరివి నువ్వు లేకపోతే ఎలా? నేను వెళ్లి జాతర ముగింపు సమయానికి ఇక్కడే ఉంటాను నువ్వు మనవాళ్లందరినీ క్షేమంగా చూసుకో!" అని నవ్వుతూ అక్కడ నుంచి బయలుదేరాడు అభీర్. ******************** శంభు దగ్గర నుంచి జాతర కబురు రావడంతో వచ్చిన మనిషి వైపు సంతోషంగా చూస్తూ "మా వాళ్ళ అందరితో కలిసి వస్తాను ఘనంగా ఏర్పాటు చేస్తాను." అని చెప్పి ఆ మనిషిని అక్కడి నుంచి పంపించి గోకుల్ కి కాల్ చేశాడు అభిజిత్. ఫోన్ లిఫ్ట్ చేసి "టెల్ మీ అభిజిత్!" అని అడిగాడు గోకుల్. "జాతర కబురు అందింది మన వాళ్ళని రెడీ చెయ్ బయలుదేరుదాము." అని చెప్పాడు అభిజిత్. రెండు రోజుల తర్వాత గొర్వర్ గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకొని "జేమ్స్! మీరందరూ కొండ కింద ఉండండి పాయిజన్ వల్ల మతి చెడి కిందకి వచ్చే జంతువులని అక్కడే చంపేయండి." అని చెప్పడు ముకుల్. "ఓకే సార్! ఆ కొండ మీద నుంచి ఒక్క జంతువు కూడా బయటికి వెళ్లలేదు." అని చెప్పాడు జేమ్స్. "ఈ విషయం బయటకి తెలియకూడదని నేను కూడా అనధికారికంగా ఒక్కడినే వచ్చాను నాతో పాటు గన్ మెన్ ని కూడా తీసుకురాలేదు." అని అని చెప్పాడు జావీద్. "మంచి పని చేశారు ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు." అని చెప్పాడు అభిజిత్. "సార్! మనం పెట్టిన పాయిజన్ కరెక్ట్ గా పని చేస్తుంది కదా లేకపోతే మన పని అవుట్!" అని అడిగాడు శివమణి. "ఆ అడవిలో సాక్ష్యం చెప్పడానికి మనిషి కాదు కదా ఒక జంతువు కూడా బతకదు." అని చెప్పాడు జేమ్స్. "మనం ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడే మాట్లాడుకుందాం ఆ కొండ మీద ఒక్క మాట కూడా మాట్లాడకూడదు." అని చెప్పాడు సర్పరాజ్. "అందరూ జాగ్రత్తగా వినండి. మనం తీసుకువెళ్లే ప్రసాదంలో మత్తుమందు కలిపాము జాతర పూర్తయిన తర్వాత ప్రసాదాలు పంచిపెట్టి మనం కొండ కిందకి వచ్చిన వెంటనే జేమ్స్ వాళ్ళు పాయిజన్ బాంబ్స్ బ్లాస్ట్ చేస్తారు." అని చెప్పాడు గోకుల్. "సరే!" అని అక్కడి నుంచి బేర అడవికి చేరుకుని శంభుని కలసి "మా మనుషులు అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేశారా? ఏదైనా లోటు ఉంటే చెప్పండి?" అని అడిగాడు అభిజిత్. "ఎటువంటి లోటు లేదు దొర! అన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేశారు." అని సంతోషంగా చెప్పాడు శంభు. "ఈ రోజు ప్రసాదం మా దగ్గర మా ఇంటి నుంచి వస్తుంది దానికి మీరు అభ్యంతరం చెప్పకూడదు." అని అడిగాడు ముకుల్. "సరే దొర! ఈ జాతర మొత్తం మీ చలవా వల్లే జరుగుతుంది ఆ అమ్మకి ప్రసాదం కూడా మీరే పెట్టండి." అని చెప్పాడు శంభు. అమ్మవారి దగ్గర జాతర ప్రారంభానికి దీపం వెలిగిస్తూ వెలగకపోవడంతో ఆశ్చర్యంగా చూస్తూ "ఏదో అపచారం జరిగినట్లు ఉంది. దీపం వెలగడం లేదు." అని కంగారుగా చెప్పింది శంభు భార్య. ఆ మాట విని ముందుకు వెళ్లి "మీరు సరిగ్గా వెలిగించినట్లు లేరు." అని అక్కడ ఉన్న దీపాన్ని తన జేబులో నుంచి అగ్గిపెట్టి తీసి వెలిగించాడు అభిజిత్. "దొర! జాతర మొత్తం మీ చేతుల మీదుగానే జరుగుతుంది కదా, అందుకనే ఆ దీపం అమ్మ మిమ్మల్ని పెట్టమన్నట్టుంది." అని సంతోషంగా చెప్పాడు శంభు. దీపం వెలగడంతో జాతర ప్రారంభించి అందరూ సంబరాలు మునిగితేలుతూ ఉన్నారు. ********************* ఐదుగురు భవాని మాత దేవాలయం దగ్గరికి చేరుకుని అభీర్ ని కలిసి "ఈ జాతరతో మన సమస్యలు మొత్తం తీరిపోతాయి అనుకుంటున్నాను." అని చెప్పాడు రాజన్. "నేను కూడా అదే అనుకుంటున్నాను మనవాళ్ళందరూ ఎలా ఉన్నారు? జాతర చివరి రోజుకి అక్కడికి చేరుకోమని చెప్పారా?" అని అడిగాడు అభీర్. "నాయకుడా? జాతర చివరి రోజు మన అభీర్ సేన మొత్తం అక్కడే ఉంటుంది." అని చెప్పాడు అగస్త్య. "మనం ఎలాగో జాతర చూడకుండా గుడి దగ్గర నిద్ర చేస్తున్నాము మన వాళ్ళని వెళ్ళమని చెబితే సరిపోయేది సరదాగా చూసేవారు." అని చెప్పింది రియా. "అభీర్ సేన లో ఉన్న ప్రతి ఒక్కరు నాయకుడు వెనకాలే జాతరకు వెళ్లాలి." అని చెప్పాడు బైరి. "మన గూడెం నుంచి బయటకు వెళ్లిన అందరినీ ఈ గుడికి రమ్మని నిద్ర చేసి జాతరకు తీసుకువెళ్లాలి అనుకున్నాను కానీ మన గురించి బయటకు తెలియకూడదు అని వాళ్ళని ఆగిపొమ్మని మీ ఐదుగురిని మాత్రమే రమ్మని చెప్పాను." అని చెప్పాడు అభీర్. "సరే! పదండి అమ్మవారి దర్శనం చేసుకుందాము." అని చెప్పాడు అరుల్. ************ అదే సమయంలో శంభు దగ్గరికి వెళ్లి "అభీర్ కనబడడం లేదు ఏమిటి?" అని అనుమానంగా అడిగాడు శివమణి. ఆ మాట విని "దొర! నా బిడ్డ అమ్మవారి దర్శనానికి వెళ్ళాడు జాతర చివరి రోజు ఇక్కడికి చేరుకుంటాడు." అని చెప్పాడు శంభు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయ్యి ముకుల్ వాళ్ళ దగ్గరికి వచ్చి "సార్! అభీర్ ఇక్కడ లేడు, జాతర చివరి రోజు వస్తాడంట!" అని కంగారుగా చెప్పాడు శివమణి. "అవునా? అది కూడా మన మంచికే, వాడు ఇక్కడికి వచ్చేసరికి ఎవ్వరు ప్రాణాలతో ఉండరు అది చూసి నేను బతకడం ఎందుకు అనుకుంటాడు. మీరు వాడి గురించి ఎక్కువగా ఆలోచించకండి మొదటిరోజు జాతర పూర్తి అవుతుంది జాకీ ని పంపించి ప్రసాదాలు తెప్పించండి. అలాగే జేమ్స్ ని కూడా రెడీగా ఉండమని చెప్పమను." అని చెప్పాడు ముకుల్. "ఓకే డాడ్!" అని జేమ్స్ కి విషయం చెప్పి ప్రసాదాలు తీసుకురమ్మని జాకిని పంపించాడు గోకుల్. కొండ కిందకి వెళుతున్న జాకిని చూసి "ఈ మనిషి ఏంటి? జాతర జరిగే సమయంలో కిందకి వెళుతున్నాడు." అని వెనకాలే వెళ్ళాడు సహదేవుడు. అది చూసి సహదేవుడు వెనకాలే రెండు పులి పిల్లలు ఏనుగు పిల్ల కూడా బయలుదేరి వెళ్లాయి. అడవి చివరికి వెళ్లి జేమ్స్ తో మాట్లాడుతున్న జాకిని చూసి 'వీళ్లు డాక్టర్లు కదా! చేతిలో తుపాకులు ఉన్నాయి ఎందుకు?' అని అనుమానంగా వెనకాల వస్తున్న పులి పిల్లల్ని ఏనుగుపిల్లని తీసుకొని ఎవరకి కనపడకుండా కొండ కిందకి తీసుకువెళ్లి చూస్తూ ఉన్నాడు సహదేవుడు. కాసేపటికి నలుగురు మనుషులతో కలిసి ప్రసాదాలు తీసుకుని కొండమీదకి వెళ్ళాడు జాకి. అది చూసి 'ప్రసాదాలు తీసుకు వెళుతున్నాడు సరే! వీళ్ళు ఎందుకు తుపాకులు పట్టుకుని కొండ మీదకు రాకుండా అక్కడ ఉన్నారు.' అనుకుంటూ జేమ్స్ వాళ్ళని చూడడానికి అక్కడ ఉన్న చెట్టు ఎక్కి పావురాన్ని చూసి 'ఇదేంటి కదలడం లేదు.' అని చేత్తో పట్టుకుని గట్టిగా ఉండడంతో రెండు ముక్కలు చేసి లోపల సూదులు ఉండటం చూసి 'వీళ్ళు ఏదో మోసం చేస్తున్నారు, ఆరోజు ఆఫీసర్లు వచ్చినప్పుడే ఈ పక్షులు కూడా వచ్చాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది.' అని ఆలోచిస్తూ ఉన్నాడు సహదేవుడు. అంతలో కొండమీదకి జాకీ తెచ్చిన ప్రసాదాలని అమ్మవారి దగ్గర పెట్టి అందరికీ పంచి పెట్టమని శంభుకి చెప్పాడు గోకుల్. "సరే దొర!" అని అమ్మవారికి నైవేద్యం పెట్టి అక్కడ ఉన్న వారందరికీ ప్రసాదాలు పంచి పెడుతూ ఉన్నాడు శంభు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదాలు పంచి పెట్టడంతో తింటూ ఉండడం చూసి "మేము వెళ్లి ఉదయం వస్తాము." అని శంభుకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు ముకుల్ వాళ్ళు. "సరే దొర! తోడుగా ఎవరినైనా పంపించమంటారా?" అని అడిగాడు శంభు. "అవసరంలేదు మీరందరూ ప్రశాంతంగా ఈ కొండ మీదే ఉండండి." అని చెప్పి ముకుల్ వాళ్లతో కలిసి కిందకు బయలుదేరాడు అభిజిత్. చెట్టు మీదే ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ముకుల్ వాళ్ళని చూసి 'వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, ఆ తుపాకులతో ఉన్న వాళ్ళు వెళ్లడం లేదు ఏమిటి?' అని అనుమానం వచ్చి చెట్టు దిగకుండా అక్కడే ఉన్నాడు సహదేవుడు. ముకుల్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికి కొండ చుట్టూ ఉన్న పాయిజన్ బాంబ్స్ బ్లాస్ట్ చేసాడు జేమ్స్. చెట్టు మీద నుండి కొండ చుట్టూ ఆకుపచ్చ రంగు పొగ రావడం చూసి 'ఇది ఎక్కడి నుంచి వస్తుంది.' అనుకుని చెట్ల మీద నుంచి పాకుతూ పొగ వచ్చే కొండల వైపుకు వెళ్ళాడు సహదేవుడు. అంతలో కొండ మీద నుంచి అరుస్తూ జంతువులు కిందకి రావడం చూసి వాటిని షూట్ చేస్తూ ఉన్నారు జేమ్స్ మనుషులు. కొండ కింద దాచిన ఏనుగు పిల్ల వైపు చూసి 'అక్కడే ఉండండి బయటికి రావద్దు.' అని శబ్దం చేస్తూ సిగ్నల్ ఇచ్చి ఏమి జరుగుతుందో అర్థం కాక చనిపోతున్న జంతువుల్ని చూస్తూ ఏడుస్తూ 'కొండమీద ఉన్న మన వాళ్ళు ఎవరు కిందకి దిగడం లేదు, అరుపులు వినిపించడం లేదు, ఈ ఆకుపచ్చ పొగ వల్ల వాళ్లకి ఏదైనా జరిగిందా? ఎలాగైనా వాళ్ళని కాపాడాలి.' అనుకుని కిందకి దిగబోయి మళ్లీ ఆగి 'జరిగిన విషయం నాయకుడికి చెప్పడానికి ఒక్కరైనా మిగిలి ఉండాలి కదా!" అని చెట్టు కొమ్మ పట్టుకుని అక్కడే ఉండిపోయాడు సహదేవుడు.
28-01-2026, 07:09 PM
ఎపిసోడ్ 48
జాకీ వెనకాల కొండ మీద నుంచి కిందకి వచ్చి జేమ్స్ వాళ్ళు జంతువుల్ని చంపడం చూసి ఇక్కడ జరిగింది నాయకుడికి చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి అని చెట్టు దిగకుండా అలాగే ఉండిపోయాడు సహదేవుడు.
****************** ఉదయం కొండ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న జేమ్స్ వైపు చూసి "ఇంకా ఎవరైనా మిగిలారా?" అని అడిగాడు ముకుల్. "సార్! ఇక్కడ ఒక మనిషి కాదు కదా జంతువు కూడా బతికి లేదు, మనం పెట్టిన పాయిజన్ వల్ల కొండ మీద ఉన్న ప్రతి ఒక్కడు రక్తం కక్కుకొని చచ్చారు మీరు కూడా వెళ్లి ఒక్కసారి చూడండి." అని నవ్వుతూ చెప్పాడు జేమ్స్. "వెరీ గుడ్!" అని గోకుల్ వాళ్ళతో కలిసి కొండమీదకి వెళ్లి అక్కడ చనిపోయిన వాళ్ళని చూస్తూ "వైలెంట్ లేకుండా మనుషుల్ని చంపడం చాలా చికాకుగా ఉంది." అని చెప్పాడు ముకుల్. "సార్! మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలి మళ్లీ అభీర్ వచ్చాడు అంటే చాలా డేంజర్!" అని చెప్పాడు సర్పరాజ్. ఆ మాట విని అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్లి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలు తన దగ్గర ఉన్న కత్తితో బయటకు తీసి శివమణి చేతిలో పెట్టి "నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను." అని చెప్పాడు గోకుల్. తన చేతిలో ఉన్న పంచరత్నల వైపు చూసి "నా ఆశ నెరవేరింది. ఇక ఈ జీవితానికి ఇది చాలు!" అని సంతోషంగా చెప్పాడు శివమణి. "మీరు హ్యాపీ కదా! వాటిని భద్రంగా ఉంచుకుని ఈ దేశం వదిలి వెళ్లిపోండి. ఒకవేళ అభీర్ మన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటే వాటి కోసం వస్తాడు అవి ఎక్కడ ఉన్నాయో తెలియకూడదు." అని చెప్పాడు ముకుల్. "ఓకే సార్!" అని చెప్పి పంచరత్నాలని జేబులో వేసుకున్నాడు శివమణి. అమ్మవారి దగ్గర ఉన్న కొన్ని రాళ్ళని, వేదాలని, వస్తువులని తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుని "సార్! మనం వెళదామా?" అని అడిగాడు సర్పరాజ్. "ఓకే!" అని జేమ్స్ వైపు చూసి అక్కడ మిగిలిన ప్రసాదాలను తీసేయండి. వీళ్లు టెర్రరిస్టుల రసాయనిక దాడి వల్లే చనిపోయారు అని అనుకోవాలి. " అని చెప్పాడు ముకుల్. "ఇక్కడ అంతా క్లియర్ చేసిన తర్వాత మీరు వెళ్లి గెస్ట్ హౌస్ లో ఉండండి. అభీర్ ఇక్కడకి రావడానికి ఇంకా వన్డే డే టైం ఉంది." అని చెప్పాడు గోకుల్. అమ్మవారి ముందు ఉన్న దీపాన్ని ఆర్పుతున్న అభిజిత్ వైపు చూసి "దానిని అలా ఉంచు నువ్వు వెలిగించిందే కదా!" అని చెప్పాడు ముకూల్. "ఓకే అంకుల్!" అని గోకుల్ వాళ్ళతో కలిసి కొండ కిందకి వచ్చాడు అభిజిత్. అక్కడి నుంచి వెళుతూ జేమ్స్ వైపు చూసి "మీరు అభీర్ ని క్లోజ్ చేసిన తర్వాత వచ్చి నాకు కలవండి." అని చెప్పాడు ముకుల్. అక్కడ నుంచి వెళుతూ "సార్! మరి ఈ కొండలు ఎప్పుడు తవ్వడం స్టార్ట్ చేద్దాము." అని ఆశగా అడిగాడు జావిద్. "మినిస్టర్ గారు కంగారు పడకండి ఇంకా చేయవలసిన పని చాలా ఉంది." అని నవ్వుతూ చెప్పిడు గోకుల్. "సరే! మీరు ఎలా చెబితే అలాగా!" అని అక్కడ ఉన్న కార్ ఎక్కి కూర్చున్నాడు జావిద్. అక్కడి నుంచి ముకూల్ వాళ్ళు వెళ్లిపోవడం చూసి తన మనుషులు వైపు తిరిగి "అందరూ వచ్చి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోండి . రేపు సాయంత్రం వరకు మీకు హాలిడే, తర్వాత ఒక పెద్ద పులిని వేటాడాలి." అని చెప్పాడు జేమ్స్. అందరూ వెళ్లిపోవడం చూసి నిదానంగా చెట్టు దిగి కొండా కింద ఉంచిన పులి పిల్లల్ని చేతిలో తీసుకుని ఏనుగు పిల్లతో సహా కొండమీదకి వెళ్లి చనిపోయిన తన వాళ్ళందరిని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నాడు సహదేవుడు. *********** అదే సమయంలో అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి రాజన్ వాళ్ళ వైపు చూసి "ఎందుకో నా మనసు కీడు శంకిస్తుంది. మనం వెంటనే బేరా కి బయలుదేరాలి." అని చెప్పాడు అభీర్. ఆ మాట విని "ఇక్కడ మూడు రాత్రులు నిద్ర చేయాలి లేకపోతే ఆపచారం!" అని చెప్పాడు బైరి. "నాకు అమ్మే అక్కడికి వెళ్ళమని చెబుతున్నట్లు ఉంది." అని చెప్పి సింబా వైపు చూసి "నేను వస్తున్నానని జాతరలో ఉన్న మనవాళ్ళకి సమాచారం ఇవ్వు!" అని చెప్పాడు అభీర్. ఆ మాట విని వేగంగా అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరేడు సింబా. "సరే! నాయకుడు ఎలా చెబితే అలాగా, నీ వెంటే మేము!" అని చెప్పి అభీర్ తో పాటు బయలుదేరారు ఐదుగురు. ********** మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుని కొండమీద సహదేవుడు ఏడుస్తూ ఉండడం చూసి తన ముందు వాలేడు సింబా. ఎదురుగా ఉన్న సింబవైపు చూసి ఏడుస్తూ "నాయకుడిని తీసుకురా.!" అని గట్టిగా అరుస్తూ చెప్పాడు సహదేవుడు. ఆ మాట విని అక్కడి నుంచి వేగంగా వెళ్లి ఆకాశంలో నుంచి అభీర్ వాళ్ళని చూసి భయంకరంగా అరిచాడు సింబా. ఆ అరుపు విని ఓళ్లు జలదరించినట్లు అయ్యి ఆకాశం వైపు చూసి "అక్కడ మన వాళ్లకు ఏదో ఆపద జరిగింది." అని కళ్ళ వెంట వస్తున్న నీళ్ళు ఆపుకుని "నన్ను అక్కడికి తీసుకువెళ్ళు!" అని గట్టిగా అరిచాడు అభీర్. ఆ మాట విని వేగంగా వచ్చి రెండు కాళ్ళతో అభీర్ ని పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు సింబా. శంభు దొర ముందు కూర్చుని ఏడుస్తూ ఆకాశంలో సింబా అరుపు విని "నాయకుడా! ఇక్కడ అంతా అయిపోయింది." అని ఏడుస్తూ చెప్పాడు సహదేవుడు. సింబా రెండు కాళ్ళని వదిలి కిందకి దూకి చనిపోయిన తన వాళ్ళందరినీ చూసి "ఎలా జరిగింది?" అని అడిగాడు అభీర్. "నాయకుడా! నమ్మిన వాళ్లు వెన్నుపోటు పొడిచారు మన జంతువులు చనిపోయింది కూడా వాళ్ల వల్లే!" అని తన చేతిలో ఉన్న పావురాన్ని చూపించాడు సహదేవుడు. "అసలు ఇదంతా ఎందుకు చేశారు? ఇప్పుడు వాళ్లంతా ఎక్కడ ఉన్నారు?" అని కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ అడిగాడు అభీర్. అమ్మవారి పాదాల వైపు చూపిస్తూ "పంచరత్నాలను ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు, ఈ కొండలను కూడా తొలిచి వేస్తారు అంట! నీతో ఈ విషయం చెప్పడానికే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. నేను ఒక్కరిని కూడా కాపాడలేకపోయాను, వాళ్లు నిన్ను చంపడానికి అక్కడ ఉండే ఇళ్లలోనే ఉన్నారు." అని ఏడుస్తూ చెప్పాడు సహదేవుడు. ఆ మాట విని అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్లి చూసి పట్టుకుని బాధపడుతూ ఉన్నాడు అభీర్. "నాయకుడా! శంభు దొరకి నాడి ఇంకా ఆడుతుంది." అని కంగారుగా చూస్తూ చెప్పాడు సహదేవుడు. ఆ మాట విని తండ్రి దగ్గరికి వచ్చి తన శక్తితో ప్రాణాన్ని నిలబెట్టి "అయ్యా!" అని గట్టిగా కౌగిలించుకున్నాడు అభీర్. "బిడ్డ! నువ్వు చెప్పిన మాట నేను వినవలసింది. నాయకుడు చెప్పిన మాట వినకుండా అపచారం చేశాను అందుకే ఇలా జరిగింది. ఇంత అపచారం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించి తీరాల్సిందే, మన జాతికి ఈ ప్రదేశానికి ఇక నువ్వే రక్ష, ధర్మన్ని కాపాడు." అని భార్య దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని గుండెల్లో పొడుసుకుని "మళ్లీ నాకు ప్రాణం పోయేకు నాకు తగిన శిక్ష పడింది." అని చనిపోయాడు శంభు. తండ్రి పట్టుకుని ఏడుస్తూ అక్కడ చనిపోయిన వాళ్ళందర్నీ సహదేవుడి తో కలిసి ఒకచోటకు చేరుస్తూ ఉన్నాడు అభీర్. అంతలో అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి చనిపోయిన వాళ్ళని చూస్తూ "నాయకుడా! వాళ్లు చేసిన పాపానికి శిక్ష చావు ఒక్కటే అవ్వకూడదు." అని ఏడుస్తూ చెప్పాడు అరుల్. సహదేవుడి వైపు చూసి వీళ్ళ దహన సంస్కారాలకి ఏర్పాటు చేయ్యి, ఒకవైపు వేరే చితిని కూడా ఏర్పాటు చేయ్యి!" అని చెప్పి ఐదుగురు వైపు చూసి "వాళ్ళ దగ్గరకి వెళదాము పదండీ అమ్మవారి రౌద్ర రూపం ఎలా ఉంటుందో చూపిస్తాను." అని గెస్ట్ హౌస్ దగ్గరికి బయలుదేరాడు అభీర్. అభీర్ వెనకాలే అక్కడ ఉన్న కత్తులు తీసుకుని బయలుదేరారు ఐదుగురు. గెస్ట్ హౌస్ దగ్గర కూర్చుని తన వాళ్లతో కలిసి మందు తాగుతూ నడుచుకుంటూ వస్తున్న అభీర్ వాళ్ళని చూసి "ఒరేయ్! వీళ్ళు చావడానికి ఒకరోజు ముందే వచ్చేసారు." అని వెటకారంగా చూస్తూ నవ్వుతూ చెప్పాడు జేమ్స్. ఆ మాట విని గన్స్ తీసుకుని అభీర్ వాళ్ల వైపు ఎయిమ్ చేశారు జేమ్స్ మనుషులు. "మీరు మా వాళ్ళకి ప్రాణాలు పోయడానికి వచ్చారు అనుకున్నాను, కానీ తీయడానికి వచ్చారని ఇప్పుడే అర్థమైంది." అని వేగంగా వస్తున్న సింబా కాళ్లు పట్టుకుని ఎగిరి వెళ్లి జేమ్స్ గుండెల మీద తన్నాడు అభీర్. అది చూసి షూట్ చేస్తూ ఉన్నారు జేమ్స్ మనుషులు. మీదకు వస్తున్న బుల్లెట్స్ ని కత్తులతో కొడుతూ దొరికిన వాళ్ళని దొరికినట్లు నరుకుతూ ఉన్నారు ఐదుగురు. తన మనుషులందరూ దారుణంగా చనిపోవడం చూసి భయంతో అక్కడ నుంచి పారిపోవడానికి పరిగెత్తాడు జేమ్స్. అది చూసి "సింబా!" అని గట్టిగా అరిచాడు అభీర్. ఆ మాట విని తన రెండు కాళ్లతో జేమ్స్ ని పట్టుకొని కొండమీదకి తీసుకువెళ్లి అమ్మవారి పాదాల ముందు పడేసాడు సింబా. అక్కడ ఉన్న మనుషులందరినీ చంపి చెట్లు వేర్లతో కట్టి అడవిలోకి లాక్కు వెళ్లి అమ్మవారి పాదాల ముందు కాళ్లు చేతులు వీరిగి పడి ఉన్న జేమ్స్ దగ్గరకు వచ్చి "ఎవరు చేశారు? ఎందుకు చేశారో చెప్పు, నిన్ను నా చేతులతో చంపను." అని గుండెల మీద కాలు వేసి అడిగాడు అభీర్. ఆ మాట విని "జరిగిందంతా చెబుతాను." అని భయంగా చూస్తూ ముకుల్ వాళ్ళ అందరి గురించి చెప్పాడు జేమ్స్. "అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయి?" అని అడిగాడు అభీర్. "ఆ రాళ్లు శివమణి దగ్గర ఉన్నాయి, కానీ అతని ఫ్యామిలీని చంపి వాటిని గోకుల్ తీసుకువెళ్లిపోతాడు, నువ్వు అడిగినదానికి సమాధానం చెప్పాను నన్ను ప్రాణాలతో ఉంచు నేను నా దేశం వెళ్ళిపోతాను." అని భయంగా చూస్తూ అడిగాడు జేమ్స్. "నేను ఇచ్చిన మాట తప్పను నా చేతులతో నిన్ను చంపను." అని సహదేవుడు వైపు చూశాడు అభీర్.
28-01-2026, 07:50 PM
Excellent update
28-01-2026, 08:56 PM
first time miru ichina update chinnaga anipinchindi
28-01-2026, 10:58 PM
manchi rasapattulo undi story
29-01-2026, 10:52 PM
ఎపిసోడ్ 49
బేరా అడవిలో కొండా మీద ఉన్న గుడానికి వచ్చి తన వాళ్ళు అందరు చనిపోయి ఉండడం చూసి కోపంతో ఐదుగురుతో కలిసి వెళ్లి గెస్ట్ హౌస్ లో ఉన్న జేమ్స్ మనుషుల్ని చంపి జేమ్స్ ద్వారా జరిగిన విషయం మొత్తం తెలుసుకుని అతన్ని సహదేవుడికి అప్పగించాడు అభీర్. ***************** అమ్మవారి పాదాల దగ్గర ఉన్న జేమ్స్ వైపు చూసి "నేను ఇచ్చిన మాట తప్పను, నా చేతులతో నిన్ను చంపను." అని సహదేవుడి వైపు చూశాడు అభీర్. ఆ మాట విని కోపంతో వెళ్లి జేమ్స్ తలని తన రెండు చేతులతో మొండెం నుంచి వేరు చేసి దూరంగా గిరాటు వేసి ఏడుస్తూ ఆవేశంతో గట్టిగా అరిచాడు సహదేవుడు. తన తల్లిదండ్రులకి చనిపోయిన తన వాళ్ళకి జంతువులకి దహన సంస్కారాలు చేసాడు అభీర్. "నాయకుడా! మరి ఈ దుర్మార్గుల శరీరాలని ఏం చేద్దాము?" అని అడిగింది రియా. "సింబా! నీ సైన్యాన్ని తీసుకురా..! వీళ్ళ శరీరంలో ఒక్క ఎముక కూడా కనపడకూడదు." అని ఆవేశం గా చెప్పాడు అభీర్. ఆ మాట విని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరి కాసేపటిలో తన సైన్యంతో అక్కడ వాలి జేమ్స్ మనుషులందరిని ఎముక కూడా మిగల్చకుండా తిన్నాయి రాబందులు. ఐదుగురి వైపు చూసి "ఇక్కడికి వస్తున్న మనవాళ్ళని తీసుకుని మీరు వెనక్కి వెళ్లిపోండి నా దగ్గర నుంచి పిలుపు వచ్చేంతవరకు వేచివుండండి." అని చెప్పాడు అభీర్. "నాయకుడా! ఇక్కడికి వస్తున్న మనవాళ్ళతో కలిసి యుద్ధం ప్రకటిద్దాము ఎవరిని వదలకూడదు." అని కోపంగా చూస్తూ చెప్పాడు బైరి. "ఆలోచన లేకుండా ఆవేశంగా యుద్ధానికి వెళితే మన వాళ్ళందరినీ నష్టపోతాము, ఇకనుంచి మన తెగలో ఒక్క ప్రాణం పోవడం కూడా నాకు ఇష్టం లేదు. నేను సహదేవుడితో కలిసి వెళ్లి ఆ పంచరత్నాలు స్వాధీనం చేసుకున్న తరువాత సింబా ద్వారా మీకు కబురు పంపుతాను అప్పుడు నా దగ్గరకు రండి. అప్పటివరకు ఎప్పటిలాగే మీ ప్రదేశాలలో ఉండండి." అని చెప్పాడు అభీర్. "మరి ఈ లోపు ఈ ప్రదేశాన్ని వాళ్ళు ఏదైనా చేస్తే మన పూర్వీకులు దైవానికి ఇచ్చిన మాట ఏమవుతుంది?" అని అడిగాడు అగస్త్యా. "ఈ ప్రదేశంలో ఒక్క రాయిని కూడా ఎవరు ముట్టుకోలేరు నేను మాట ఇస్తున్నాను. మీరు వెళ్లి రండి." అని చెప్పాడు అభీర్. "సరే నాయకుడా! నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాము." అని అక్కడి నుంచి బయలుదేరారు ఐదుగురు. సహదేవుడి చేతిలో ఉన్న రెండు పులి పిల్లలని పక్కనే ఉన్న ఏనుగు పిల్లని చూసి "ఇవి మనతో ఉండడం క్షేమం కాదు వీటిని క్షేమంగా చూసుకునే వారి దగ్గర వదిలి వెళదాము." అని చెప్పాడు అభీర్. "సరే నాయకుడా!" అని అడివి వైపు బాధగా చూస్తూ అభీర్ వెనకాల నడిచాడు సహదేవుడు. పులి పిల్లలని ఏనుగు ని అటవీ సంక్షేమ కేంద్రంలో ఉంచి "జాగ్రత్తగా చూసుకోండి." అని చెప్పి వాటికి కన్నీటితో వీడ్కోలు చెప్పి సహదేవుడితో కలిసి ఢిల్లీ బయలుదేరాడు అభీర్. *********** మరుసటి రోజు జేమ్స్ ఫోన్ కలవకపోవడంతో ముకుల్ దగ్గరకి వచ్చి "సార్! అభీర్ మనవాళ్ళని ఏదో చేసి ఉంటాడు వాడిని మనం తక్కువ అంచనా వేస్తున్నాము." అని చెప్పాడు శివమణి. "అంకుల్! ఒక్కసారి మినిస్టర్ జావిద్ కి కాల్ చేసి అడవిలో ఏమి జరుగుతుందో తెలుసుకోమని చెప్పండి." అని చెప్పాడు అభిజిత్. అంతలో ఫోన్ రింగ్ అవడం చూసి "జావీద్ గారు కాల్ చేస్తున్నారు." అని నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి "హలో మినిష్టర్ గారు చెప్పండి?" అన్నాడు గోకుల్. "అడవి దగ్గర మీ వాళ్ళు ఎవరు అడ్రస్ లేరు మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి." అని చెప్పాడు జావిద్. ఆ మాట విని ఫోన్ పెట్టేసి "అడవి దగ్గర మనవాళ్ళు ఎవరు కనిపించడం లేదంట!" అని చెప్పాడు గోకుల్. "అంటే!కచ్చితంగా అభీర్ అక్కడికి వచ్చి ఉంటాడు నాకు తెలిసి మనవాళ్ళు ఎవరు బ్రతికి ఉండరు, వాడు కచ్చితంగా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు." అని కంగారుగా చెప్పాడు అభిజిత్. "కూల్! ఎవరు కంగారు పడకండి. నీ ఇంటి దగ్గర మిచల్ గ్యాంగ్ ని కాపలాగా పెడతాను నువ్వు చెప్పినట్లు అక్కడికి వస్తే వాడు చచ్చినట్లే!" అని చెప్పాడు ముకుల్. "ఆ అభీర్ చాలా తెలివైనవాడు మన ఆలోచనలకి అందడు." అని చెప్పాడు సర్ఫరాజ్. ఆ మాట విని మురళి జోషి వైపు చూసి "మీ వాళ్ళని రంగంలోకి దింపు వాడు ఢిల్లీలోకి ఎంటర్ అయితే జాగ్రత్తగా వాచ్ చేసి ఏం చేస్తున్నాడో చూడమను." అని చెప్పాడు ముకుల్. "ఓకే సార్!" అని జనార్ధన్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళాడు మురళి జోషి. "సార్! నేను ఈరోజు నైట్ కి ఫ్యామిలీతో మీరు చెప్పినట్లు ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాను." అని చెప్పాడు శివమణి. ఆ మాట విని "బెస్ట్ ఆఫ్ లక్! జాగ్రత్తగా వెళ్ళండి." అని చెప్పాడు గోకుల్. అక్కడి నుంచి వెళుతున్న శివమణి వైపు చూసి "జాకీ! మన వాళ్ళని తీసుకువెళ్లి వాడి దగ్గర ఉన్న రాళ్లు తీసుకురా.! ఫ్యామిలీ మొత్తం క్లోజ్ అయిపోవాలి." అని చెప్పాడు అభిజిత్. "సరే అన్న!" అని చెప్పి తన మనుషులు తో కలిసి శివమణి వెనకాలే వెళ్ళాడు జాకీ. "ఆ అభిర్ సంగతి త్వరగా చూస్తే, మనం ఆ కొండల పని చూసుకోవచ్చు దీనికి మంచి ప్లాన్ కావాలి." అని మందు తాగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు ముకుల్. **************** గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఇంటికి వచ్చి భార్య వైపు చూస్తూ "మిత్ర ఎక్కడ?" అని అడిగాడు శివమణి. "ఇంకా కాలేజ్ నుంచి రాలేదు 15 నిమిషాల్లో వచ్చేస్తుంది." అని చెప్పింది ఝన్సీ. "సరే! త్వరగా లగేజ్ మొత్తం ప్యాక్ చెయ్! మనం ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నము." అని చెప్పాడు శివమణి. ఆ మాట విని కంగారుగా చూస్తూ "ఏమైంది? ఆ మినిష్టర్ వాళ్లతో కలిసి ఏదైనా తప్పు చేశారా?" అని నిలదీసి అడిగింది ఝన్సీ. "నేను ఎటువంటి తప్పు చేయలేదు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పంచరత్నాలని సంపాదించాను." అని జేబులోని ఉన్న రాళ్ళని తీసి చూపించాడు శివమణి. భర్త చేతిలో ఉన్న రాళ్ళను చూసి "ఆ రక్తం ఏమిటి? అసలు మీరు వాటిని ఎక్కడినుంచి తీసుకువచ్చారు?" అని టెన్షన్ గా చూస్తూ అడిగింది ఝాన్సీ. రక్తంతో తడిసిన పంచరత్నాలని చూసి కంగారుగా కిందపడేసి టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు శివమణి. అంతలో అక్కడికి వచ్చి "సార్! మీకు నేను చెబుతూనే ఉన్నాను ఆ పంచరత్నాలు అమ్మవారి పాదాలతో సమానము వాటి గురించి మీరు ఆలోచించకండి అని, కానీ మీరు నా మాట వినలేదు ఇప్పుడు చూశారా అమ్మవారి రక్తం మీ చేతికి అంటుకుంది." అని చెప్పాడు చంద్రశేఖర్. ఆ మాట విని "ఈ పాపం నాకు నా కూతురికి అంటకూడదు." అని వెళ్లిపోవడానికి బ్యాగ్ సదురుకుంటూ ఉంది ఝాన్సీ. అంతలో ఇంటి బయట కారు ఆగిన సౌండ్ వినిపించి కిటికీలోనుంచి చూస్తూ జాకి మనుషులతో రావడం చూసి 'వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?' అనుకుని కింద పడిన రాళ్ళని జేబులో వేసుకుని బయటకు వెళ్లాడు శివమణి. గొడవపడుతున్న మాటలు వినిపించి బయటకు వెళ్లి శివమణిని వచ్చిన మనుషులు కత్తితో పొడవడం చూసి "సిస్టర్! త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపోండి." అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు చంద్రశేఖర్. రక్తపు మడుగులో ఉన్న భర్తను చూసి కంగారుగా బయటికి వస్తున్న ఝాన్సీ ని కూడా చంపి శివమణి జేబులో ఉన్న రాళ్లు తీసుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు జాకి. చనిపోయిన భార్య దగ్గరికి వెళ్లి చూసి ఏడుస్తూ "నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా బిడ్డ అనాధ అయిపోయింది." అని ఫోన్ చేసి మురళి జోషికి కాల్ చేసి విషయం చెప్పి "నాకు పట్టిన గతే నీకు పడుతుంది జాగ్రత్తగా ఉండు." అని చనిపోయాడు శివమణి. ఫోన్లో శివమణి చెప్పింది విని ఆలోచిస్తూ ఉండగా సహదేవుడితో కలిసి అభీర్ ట్రైన్ దిగడం చూసి "జనార్ధన్ వాచ్ చేస్తూ ఉండు ఇపుడే వస్తాను." అని చెప్పి హడావిడిగా ఇంటికి బయలుదేరాడు మురళి జోషి. వేగంగా వెళుతున్న మురళి జోషిని చూసి "నాయకుడా! మన అడవికి వచ్చిన ఆఫీసర్ అక్కడ ఉన్నాడు." అని చూపించాడు సహదేవుడు. "అవునా?" అని మురళి జోషి వెనకాలే సహదేవుడితో కలిసి వేగంగా వెళ్ళాడు అభీర్. అది చూసి ఇద్దరినీ వాచ్ చేస్తూ వెనకాలే వెళ్ళాడుజనార్ధన్. **************** గెస్ట్ హౌస్ దగ్గరికి జాకి తీసుకువచ్చిన పంచరత్నాలని చూసి "ఏంటి? ఇవి రక్తంతో ఉన్నాయి?" అని డౌట్ గా అడిగాడు గోకుల్. "శివమణి గాడి రక్తం అయి ఉంటుందిలే, అంతగా ఆశ పడ్డావు ఇప్పుడు వాటితో ఏం చేస్తావు?" అని అడిగాడు అభిజిత్. "ఈ ఐదు రాళ్ళని ఉంగరాలుగా చేయించి నా ఐదు వేళ్ళకి పెట్టుకుంటాను, అప్పుడు నాకు ఇంకా తిరుగు ఉండదు." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు గోకుల్. "అవునా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే పంపించి ఉంగరాలు చేయించుకో, ఇక మనకు ఏ ఆటంకాలు ఉండవు." అని నవ్వుతూ చెప్పేడు ముకుల్. అంతలో ఫోన్ రింగ్ అవడం చూసి "జనార్ధన్ కాల్ చేస్తున్నాడు." అని చెప్పి లిఫ్ట్ చేసి "ఏంటి విషయం?" అని అడిగాడు అభిజిత్. "సార్! ఆ సహదేవుడితో కలిసి అభీర్ ఢిల్లీలో దిగాడు మురళి జోషి ని చూసి వెనకాల వెళుతున్నాడు నేను వాళ్ళ వెనకాలే వాచ్ చేస్తూ వెళుతున్నాను." అని చెప్పాడు జనార్ధన్. "అవునా? అయితే టైం చూసి ఇద్దరిని చంపేయండి." అని చెప్పి ఫోన్ పెట్టేసి మూకుల్ వైపు చూసి "అభీర్ ఢిల్లీలో దిగాడు మురళి జోషిని చూసి వెంటాడుతున్నాడంట జనార్ధన్ వాడి వెనకాలే వెళుతున్నాడు చంపేయమని చెప్పాను." అని చెప్పాడు అభిజిత్. ఆ మాట విని "అభీర్ ని చంపడం ఆ ఇద్దరి వల్ల అవుతుందా?" అని డౌట్ గా అడిగాడు సర్ఫరాజ్. "నలుగురులో ఇద్దరు కచ్చితంగా చస్తారు, ఏదైనా మనకు లాభమే! ఏం జరుగుతుందో చూద్దాము." అని చెప్పాడు ముకుల్.
29-01-2026, 10:54 PM
ఎపిసోడ్ 50
ఫోన్ చేసిన జనార్ధన్ తో ఎలాగైనా అభీర్ వాళ్ళని చంపేయమని చెప్పాడు అభిజిత్. అభీర్ ని ఆ ఇద్దరు ఆఫీసర్లు కలిసి చంపగలరా అని డౌట్ గా చెప్పాడు సర్ఫరాజ్ ***************** "అంకుల్! ఆ ఆఫీసర్లకి మనం కొంచెం హెల్ప్ చేస్తే అభీర్ గోల లేకుండా పోతుంది. మీరు ఓకే అంటే జాకీ తోపాటు నా మనుషుల్ని పంపుతాను." అని చెప్పాడు అభిజిత్. "ఆ పని చేసి వాళ్ళిద్దర్నీ ఇక్కడ లాక్ చేస్తే, మనం ఆ కొండల దగ్గరికి వెళ్లి శాంపిల్స్ తీసుకుని పైకి పంపించి వర్క్ స్టార్ట్ చేయొచ్చు!" అని సంతోషం గా చూస్తూ చెప్పాడు సర్పరాజ్. "ఈ ఐడియా బాగుంది డాడ్! ఆ అభీర్ ఇక్కడ ఉంటాడు మనం వాడి ప్లేస్ లో ఉంటాము మినిస్టర్ కూడా పర్మిషన్స్ వచ్చాయని అన్నాడు." అని చెప్పాడు గోకుల్. "సరే!" అని అభిజిత్ వైపు చూసి "జాకిని పంపించు." అని చెప్పాడు ముకుల్. "ఓకే అంకుల్!" అని ఫోన్ తీసి జాకీ కి కాల్ చేసాడు అభిజిత్. ఫోన్ లిఫ్ట్ చేసి "అన్న! ఇంటి దగ్గరే ఉన్నాము ఇక్కడికి ఎవరు రాలేదు." అని చెప్పాడు జాకి. "ఆ విషయం నాకు తెలుసు నువ్వు వెంటనే జనార్ధనకి కాల్ చేసి మన మనుషులతో కలిసి వేళ్ళు వాడు అభీర్ ని ఫాలో అవుతున్నాడు. మేము బేరా కొండల దగ్గరికి వెళుతున్నాము అక్కడ పని మొదలుపెట్టే లోపల ఇక్కడ వీళ్ళ పని అయిపోవాలి." అని చెప్పాడు అభిజిత్. "సరే అన్న! ఆ ఇద్దరూ ఢిల్లీ నుంచి బయటకు వెళ్లలేరు." అని చెప్పి ఫోన్ పెట్టి తన మనుషులతో బయలుదేరాడు జాకి. ఫోన్ పెట్టేసి ముకుల్ వైపు చూసి "అంకుల్! ఇంకా వాళ్ళు మా జాకీ చేతిలో ఇక్కడే క్లోజ్ అయిపోతారు, మనం బేరా బయలుదేరుదాము మినిస్టర్ కి కాల్ చెయ్యండి." అని చెప్పాడు అభిజిత్. "వెయిట్! ఉదయం నా పంచరత్న ఉంగరాలు వస్తాయి అవి పెట్టుకుని స్టార్ట్ అవుదాము." అని చెప్పాడు గోకుల్. "కరెక్ట్! అప్పుడు మన పనికి ఆటంకాలు ఉండవు." అని నవ్వుతూ చెప్పాడు ముకుల్. ******************* మురళి జోషి వెనకాలే వెళుతూ "నాయకుడా! అడవికి వచ్చిన ఇంకో ఆఫీసర్ మన వెనకాల వస్తున్నాడు నువ్వు సరే అంటే వాడి పీక మీద కాలు వేసి తొక్కుతాను." అని కోపంగా అడిగాడు సహదేవుడు. "పంచరత్నాలు మన చేతికి వచ్చేవరకు ఎవరిని చంపకూడదు." అని చెప్పాడు అబీర్ "సరే నాయకుడా!' అని కోపం అణుచుకుని అభీర్ తో పాటు వెళ్ళాడు సహదేవుడు. అంతలో సుమతిని కాలేజ్ నుంచి తీసుకువస్తూ వేగంగా వెళుతున్న మురళి జోషిని చూసి "ఊర్లోకి వచ్చి ఇంటికి కూడా రాలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు." అని "ఏవండీ ఏవండీ." అని గట్టిగా అరిచింది గీత. "డాడీ డాడీ!" అని గట్టిగా పిలిచింది సుమతి. ఇద్దరినీ చూసి చూడనట్లు వేగంగా వెళ్ళిపోతున్న మురళి జోషిని చూసి సహదేవుడు చెయ్యి పట్టుకుని ఆపి "ఇంకా మనకు వాడి వెనకాల వెళ్ళవలసిన అవసరం లేదు." అని చెప్పాడు అభీర్. "అలా అయితే మన వెనకాల వచ్చేవాడి సంగతి చూద్దామా?" అని అడిగాడు సహదేవుడు. "మనం ఇంకా వాళ్ళ వెనకాల వెళ్ళవలసిన పనిలేదు వాళ్లే మన వెనకాల వస్తారు." అని చెప్పి గీతని గమనిస్తూ వెనకాలే వెళ్లాడు అభీర్. ఆగిపోయిన అభీర్ వాళ్ళని చూసి "వీళ్లు ఇప్పటివరకు జోషి సార్ ని ఫాలో అవ్వలేదా?" అనుకుని ఫోన్ తీసి మురళి జోషికి కాల్ చేసాడు జనర్దన్. ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "జనార్ధన్ ఎక్కడ ఉన్నవు?" అని కంగారుగా అడిగాడు మురళి జోషి. "సార్! నేను మీ వెనకాల వస్తున్నాను టెన్షన్ పడకండి వాళ్లు మిమల్ని ఫాలో అవ్వడం లేదు నార్మల్ గా వస్తున్నారు ఇద్దరు వేరే రూట్లో వెళ్లిపోయారు." అని చెప్పాడు జనార్ధన్. "అవునా? నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా ఇంటికి వెళ్ళు మార్నింగ్ కలుద్దాము, ఆ అభీర్ ని చూస్తేనే చమటలు పట్టేస్తున్నాయి త్వరగా వాడిని ఏదో ఒకటి చేయాలి." అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంటికి బయలుదేరాడు మురళి జోషి. ఫోన్ కట్ అవడంతో మళ్లీ రింగ్ అవడం చూసి 'జాకీ కాల్ చేస్తున్నాడు ఏంటి?' అని లిఫ్ట్ చేసి "భయ్యా! చెప్పండి?" అని అడిగాడు జనార్ధన్. "ఎక్కడ ఉన్నావో చెప్పు మేము కూడా వస్తున్నాము ఈరోజు వాడి సంగతి చూద్దాము." అని చెప్పాడు జాకీ. "రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి కాల్ చేయండి. నేను అక్కడే ఉన్నాను అభీర్ వాళ్లు కూడా నా ముందే ఉన్నారు." అని చెప్పాడు జనార్ధన్. "సరే! వచ్చేస్తున్నాను నువ్వు వాళ్ళని గమనిస్తూ ఉండు." అని చెప్పాడు జాకి. "సరే భయ్యా! తొందరగా రండి నేను వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను." అని ఫోన్ పెట్టేసి అభీర్ వాళ్ళ కోసం చూస్తూ "సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయారు?" అని వెతుకుతూ ఉన్నాడు జనార్ధన్. ************** గీత వెనకాల వెళ్లి మురళి జోషి ఇల్లు చూసి "ఇంక ఆ ఆఫీసర్ ఎక్కడికి తప్పించుకోలేడు." అని చెప్పాడు అభీర్. ఆ మాట విని "ఎవరు నాయకుడా వాళ్ళిద్దరూ?" అని అడిగాడు సహదేవుడు. "ఆ ఆఫీసర్ భార్య పిల్లలు!" అని చెప్పి దూరంగా సహదేవుడితో కలిసి కూర్చుని చూస్తూ ఇంటికి వస్తున్న మురళి జోషిని చూసి "ఆ ఆఫీసర్ ని నా దగ్గరికి తీసుకురా.!" అని చెప్పాడు అభీర్. "సరే నాయకుడా!" అని వెళ్లి ఇంటి దగ్గరికి వస్తున్నా మురళి జోషి ఎదురుగా వెళ్ళాడు సహదేవుడు. ఎదురుగా వచ్చిన సహదేవుడిని చూసి ఒక్కసారి షాక్ అయ్యి "నేను సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ మనిషిని నన్ను ఏమైనా చేస్తే మీరే ఇబ్బంది పడతారు." అని కంగారుగా చెప్పాడు మురళి జోషి. "మీ ఆఫీసర్లు మమ్మల్ని ఏమైనా చేయడానికి అసలు నీ శవం దొరకాలి కదా!" అని కోపంగా చూస్తూ చెప్పాడు సహదేవుడు. ఆ మాట విని భయంగా చూస్తూ "నన్ను చంపకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను, నాకు భార్య పిల్లలు ఉన్నారు." అని రిక్వెస్ట్ గా అడిగాడు మురళి జోషి. "సరే! మా నాయకుడు రమ్మంటున్నాడు పద!" అని దూరంగా ఉన్న అభీర్ ని చూపించాడు సహదేవుడు. అభీర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి "నన్ను క్షమించు మినిస్టర్ చెప్పినట్లు చేయకపోతే నా ఉద్యోగం ఉండదు నేను వీధిన పడతాను. అందుకే వాళ్ళు చెప్పినట్లు చేయవలసి వచ్చింది. నేను మీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాను." అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్పాడు మురళి జోషి. "సరే! ఈ పాపం చేసిన వాళ్ల ప్రతి ఒక్కరి వివరాలు నాకు కావాలి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు నీ కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది. ముందు నన్ను శివమణి దగ్గరకు తీసుకువెళ్లు ఏదైనా తేడా చేస్తే నీ కుటుంబం దిక్కులేని వాళ్ళు అవుతారు." అని వార్నింగ్ ఇచ్చాడు అభీర్. "సరే! ఒక్క క్షణం!" అని ఇంట్లోకి వెళ్లి కారు తాళాలు తీసుకు వెళుతున్న భర్తను చూసి "ఏంటండీ? పిలుస్తున్న సరే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు, ఇప్పుడే వచ్చారు మళ్ళీ ఎక్కడికి వెళుతున్నారు?" అని అనుమానంగా అడిగింది గీత. "ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళుతున్నాను ఇప్పుడే వస్తాను." అని చెప్పి హడావుడిగా కార్ స్టార్ట్ చేసి అభీర్ దగ్గరికి వెళ్లాడు మురళి జోషి. కార్ ఎక్కుతూ సహదేవుడు వైపు చూసి "నేను వచ్చేవరకు ఈ ఇంటికి కాపలాగా ఉండు." అని చెప్పాడు అభీర్. "సరే!" అని చెప్పి అక్కడే కూర్చున్నాడు సహదేవుడు. కార్ లో వెళ్ళుతు అభీర్ వైపు చూసి "మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళినా ఉపయోగం ఉండదు, అతని ఫ్యామిలీని చంపేసి పంచరత్నాలు అభిజిత్ మనిషి జాకి తీసుకు వెళ్లిపోయాడు." అని చెప్పాడు మురళి జోషి. "అవునా? అయితే మిమ్మల్ని నేను చంపాల్సిన అవసరం లేదు మీలో మీరే చంపుకుంటారు, ఆయన పర్వాలేదు ఒక్కసారి ఆ ఇంటికి వేళ్ళు!" అని చెప్పాడు అభీర్. "సరే!" అని ఫాస్ట్ గా శివమణి ఇంటి దగ్గరికి అభీర్ ని తీసుకువెళ్లాడు మురళి జోషి. ఇంటి దగ్గర కారు దిగి లోపలకి వెళ్లి చనిపోయిన తల్లిదండ్రులు ముందు కూర్చుని ఏడుస్తున్న మిత్ర చూసి దగ్గరికి తీసుకుని రక్తపు మడుగులో ఉన్న శివమణిని చూసి "నువ్వు చేసిన పాపం నీ కూతురికి శాపం అయ్యి అనాధ అయిపోయింది." అని తనతో పాటు కారు దగ్గరికి తీసుకువెళ్లాడు అభీర్. కారు ఎక్కుతున్న అభీర్ ని చూసి "ఇప్పుడు ఈ పాపని మా ఇంటికి తీసుకువెళ్లాల?" అని డౌట్ గా అడిగాడు మురళి జోషి. "ఈ పాప మీలాంటి దుర్మార్గుల చెంత పెరగకూడదు అనాధాశ్రమం దగ్గరికి తీసుకువెళ్లు అక్కడ ప్రశాంతంగా పెరుగుతుంది." అని చెప్పాడు అభీర్. "సరే!" అని కార్ స్టార్ట్ అక్కడి నుంచి బయలుదేరాడు మురళి జోషి. మిత్రని కారులో తీసుకువెళ్లడం చూసి వెనకాలే వెళ్ళాడు చంద్రశేఖర్. అనాధ శరణాలయం దగ్గర కార్ స్లో చేసి "నేను లోపలికి రాలేను." అని చెప్పాడు మురళి జోషి. ఆ మాటకి ఒక చిన్న నవ్వు నవ్వి "మీరు మంచి పని చేయడానికి భయపడతారు." అని చెప్పి లోపలికి వెళ్లి శరణాలయంలో చేర్చి "ఈ పాపని జాగ్రత్తగా చూసుకోండి త్వరలోనే నేను వచ్చి తీసుకు వెళ్ళను." అని చెప్పాడు అభీర్. అక్కడకి వచ్చి అభీర్ వైపు చూసి "మీ గురించి నాకు తెలుసు! నేను ఆ పాపని పెంచలేను కానీ జాగ్రత్తగా చూసుకుంటాను." అని చెప్పాడు చంద్రశేఖర్. "సరే!" అని తన సంచిలో నుంచి ఒక రాయి తీసి చంద్రశేఖర్ చేతిలో పెట్టి అక్కడి నుంచి కార్ లో వెళ్లిపోయాడు అభీర్. అనాధ శరణాలయంలో గార్డియన్ తన పేరు రాయించి "ఏది అవసరమైనా నాకు కాల్ చేయండి." అని చెప్పాడు చంద్రశేఖర్. ************** కార్ లో వెళుతూ డ్రైవింగ్ చేస్తున్న మురళి జోషి వైపు చూసి "పంచరత్నాలు తీసువెళ్లినా జాకీ దగ్గరకు వెళ్ళాలి." అని చెప్పాడు అభీర్. ఆ మాట విని కంగారుగా చూస్తూ "వాళ్ళని ఎదిరించడం నీ ఒక్కడి వల్ల అవ్వదు, వాళ్ళు చాలా పలుకుబాడీ డబ్బు ఉన్న వ్యక్తులు ఏమైనా చేయగలరు. ఈ విషయంలో నేను ఎంటర్ అయితే శివమణి పరిస్థితి ఏమైందో చూసావు కదా!" అని భయంగా చూస్తూ చెప్పాడు మురళి జోషి. "నాకు ఆ పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయో తెలియాలి నువ్వు నాకు సహాయం చేస్తేనే నీకు ఇచ్చిన మాట మీద నిలబడతాను." అని చెప్పాడు అభీర్. "సరే! ఆ పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని చెబుతాను." అని భయంగా చూస్తూ చెప్పాడు మురళి జోషి.
30-01-2026, 07:30 AM
Excellent update
31-01-2026, 07:42 AM
(This post was last modified: 31-01-2026, 07:42 AM by ash.enigma. Edited 1 time in total. Edited 1 time in total.)
Regular updates ki alavatu ayindi bro.
weekend full on party aa? No update yet!
31-01-2026, 10:44 AM
(31-01-2026, 07:42 AM)ash.enigma Wrote: Regular updates ki alavatu ayindi bro. Don't Worry Yesterday Begumpet Air Show Chusi Room Ki Vache Sareki Full Tired Ayyanuu So Update Ivvaledu Ippudu Update Istunnaaaaaaaa........... E Roju Kuda Air Show Undi Ani Talk Unte Compulsory Ga Veltanuu
31-01-2026, 10:52 AM
ఎపిసోడ్ 51
అభీర్ ఢిల్లీ వచ్చాడని తెలిసి బేరా అడవికి వెళ్లడానికి డిసైడ్ అయ్యారు ముకుల్ వాళ్ళు.
మురళి జోషితో కలిసి శివమణి ఇంటికి వెళ్లి మిత్రని అనాధ ఆశ్రమంలో జాయిన్ చేసి నాకు పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయో తెలియాలి అని చెప్పాడు అభీర్. ****************** అబీర్ తో పాటు కార్ లో వెళుతూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి "జనార్ధన్ కాల్ చేస్తున్నాడు, జాకీ ఎక్కడ ఉన్నాడో వీడికి కచ్చితంగా తెలుస్తుంది." అని చెప్పాడు మురళి జోషి. "సరే! మాట్లాడు నేను నీతో పాటు ఉన్న విషయం వాళ్లకి తెలియకూడదు." అని చెప్పాడు అభీర్. "సరే!" అని ఫోన్ లిఫ్ట్ చేసి "జనార్ధన్ ఇంటికి వెళ్ళిపోయావా?" అని అడిగాడు మురళి జోషి. "సార్! నేను ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నాను, అభీర్ ని క్లోజ్ చెయ్యడానికి అభిజిత్ సార్ జాకీ అన్నని పంపించారు కరెక్ట్ టైంకి వీడు ఎక్కడ ఉన్నాడో కనబడడం లేదు, మీకు కనిపించాడేమోనని కాల్ చేశాను." అని చెప్పాడు జనార్ధన్. "సరే!" మీరు అక్కడే ఉండండి నేను వస్తున్నాను." అని చెప్పి ఫోన్ పెట్టేసి అభీర్ వైపు చుసి "జాకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడు." అని చెప్పాడు మురళి జోషి. "సరే! అక్కడికి వెళ్లి వాళ్లకి మనం కనిపించకుండా కారు దూరంగా ఉంచు." అని చెప్పాడు అభీర్. "సరే!" అని రైల్వే స్టేషన్ దగ్గరికి ఫాస్ట్ గా వెళ్లి దూరం నుంచి జనార్ధన్ వాళ్ళని చూసి కార్ ఆపి "వాళ్ళు అక్కడే ఉన్నారు." అని చూపించడు మురళీజోషి. కారులో నుంచి జాకీ వైపు చూసి వెనకాల రియా కనపడటంతో 'తను ఇక్కడికి వచ్చింది ఏంటి?' అనుకుని మురళి జోషి వైపు చూసి "నువ్వు వెళ్లి జాకీ తో మాట్లాడి పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకో అప్పటి వరకు నేను మీ ఇంటి దగ్గరే ఉంటాను." అని చెప్పి కారు దిగాడు అభీర్. "ఓకే!" అని కార్ స్టార్ట్ చేసుకుని జాకీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మురళి జోషి. అక్కడి నుంచి కొంచెం పక్కకు వెళ్లి రియా వైపు చూసి పక్షి లాగా అరిచి సిగ్నల్ ఇచ్చాడు అభీర్. ఆ రూపు విని దూరంగా ఉన్నారు రాజాన్ వాళ్ళని పిలిచి "అభీర్ ఇక్కడే ఉన్నాడు." అని అరుపు వచ్చిన వైపుకు తీసుకు వెళ్లింది రియా. జాకీ వాళ్ళ దగ్గరకు వెళ్లి "మనం అర్జెంట్‌గా గెస్ట్ హౌస్ కి వెళ్లి అభిజిత్ గారితో మాట్లాడాలి నా ఫ్యామిలీ డేంజర్ లో ఉంది." అని చెప్పాడు మురళి జోషి. "సరే!" అని కార్ లో అక్కడినుంచి గెస్ట్ హౌస్ కి బయలుదేరారు అందరూ అక్కడినుంచి జాకీవాళ్ళు వెళ్లిపోవడంతో రియకి ఎదురుగా వెళ్లి "మిమ్మల్ని రావద్దు అని చెప్పా కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు?" అని అడిగాడు అభీర్. "నిన్ను ఒంటరిగా వదిలి ఉండలేకపోయాము, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు, పంచరత్నాలు నీ చేతికి వచ్చేవరకు తోడుగా ఉందామని వచ్చేసాము." అని చెప్పాడు బైరి. "సరే! ఇక్కడినుంచి త్వరగా పదండి." అని చెప్పి సహదేవుడి దగ్గరికి తీసుకువెళ్లాడు అభీర్. అక్కడికి అభీర్ తో పాటు ఐదుగురు రావడం చూసి సంతోషంగా వెళ్లి అందరిని గట్టిగా పట్టుకొని "నాయకుడికి తోడు ఎవరూ లేరు అనుకున్నాను ఇంక నాకు ఎటువంటి భయం లేదు." అని చెప్పాడు సహదేవుడు. "మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎటువంటి బాధ లేదు కానీ ఈ గొడవలో ఏ ఒక్కరి ప్రాణం పోయినా నేను భరించలేను." అని చెప్పాడు అభీర్. "నాయకుడా! మన వాళ్ళతో పాటు మా ప్రాణాలు అప్పుడే పోయాయి, ఇంత అన్యాయం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకొని, నువ్వు పంచరత్నాలు తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర మళ్లీ ప్రతిష్టించడం చూసిన తర్వాతే మళ్ళీ మా ప్రాణాలు తిరిగి వస్తాయి." అని చెప్పాడు బైరి. ఆ మాట విని ఐదుగురు వైపు చూసి "ఆ ఆఫీసర్ మనకి సహాయం చేస్తాను అని మాట ఇచ్చాడు, ఆ పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని ఇక్కడికి వస్తాడు." అని చెప్పాడు అభీర్. "నాయుకుడా! వీళ్ళని నమ్మడానికి లేదు వెన్నుపోటు పొడవడానికి చూస్తారు అందరూ స్వార్థపరులే!" అని చెప్పాడు సహదేవుడు. ఆ మాట విని "నమ్మకం పోగొట్టుకుంటే ప్రాణాలు పోగొట్టుకుంటాడు, ఇక్కడ అందరూ ఉండకూడదు మనం ఉండడానికి ఏదైనా స్థలం చూడండి." అని చెప్పాడు అభీర్. "మన శంకర్ ఇక్కడే ఉంటున్నాడు అతని ఇంటికి వెళ్లండి ఇక్కడ నేను సహదేవుడు ఉంటాము." అని చెప్పాడు బైరి. "సరే! ఆ పంచరత్నాలు మన చేతికి వచ్చేవరకు ఏమాత్రం తొందరపడకండి." అని చెప్పి రాజన్ వాళ్ళతో కలిసి శంకర్ ఇంటికి వెళ్ళాడు అభీర్. **************** జాకీ వాళ్ళని కలిసి అక్కడి నుంచి గెస్ట్ హౌస్ లో ఉన్న గోకుల్ వాళ్ళ దగ్గరకు వెళ్లి "సార్! అభీర్, సహదేవుడు నా దగ్గరికి వచ్చారు ఆ పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయో చెప్పమని అడుగుతున్నారు లేకపోతే నా ఫ్యామిలీని చంపేస్తామని బెదిరిస్తున్నారు మీరే కాపాడాలి." అని కంగారుగా చెప్పాడు మురళి జోషి. ఆ మాట విని "అభీర్ ని ట్రాప్ లో పెట్టి లేపేయాడానికి మనకి మంచి ఛాన్స్ వచ్చింది." అని జాకీ వైపు చూసి "మిచల్ ని నీతో పాటు తీసుకువెళ్లి దూరంగా ఉండి మురళీజోషి ని ఇంటికి పంపించండి. మిచల్ స్నైపర్ గన్ తో రెడీగా ఉంటాడు అభీర్ వాళ్ళు మురళీజోషి దగ్గరికి రాగానే షూట్ చేస్తాడు." అని చెప్పాడు గోకుల్. "గుడ్ ఐడియా! అక్కడ ఎటువంటి మిస్టేక్ జరగకూడదు." అని చెప్పాడు ముకుల్. ఆ మాట విని "సార్! ఈ టైంలో వెళితే నా భార్య పిల్లలకి విషయం తెలిసిపోతుంది. ఉదయం వెళతాను జనం హడావిడిలో బుల్లెట్ సౌండ్ కూడా వినపడదు. తరువాత టెర్రరిస్టులు ఎటాక్ చేయడానికి వచ్చారు షూట్ అవుట్ జరిగింది అని నేను మేనేజ్ చేస్తాను." అని చెప్పాడు మురళి జోషి. "సరే! అయ్యితే రాత్రి కి మందు తాగి ఎంజాయ్ చేసి ఉదయం బయలుదేరి వెళ్ళండి. మేము కూడా ఉదయం వెళ్లి ఆ పంచరత్నాలు ఉంగరాలు తీసుకుని, మీ పని అయింది అన్న తర్వాత అడవికి బయలుదేరుతాము." అని చెప్పాడు అభిజిత్. "సరే సార్!" అని ఇంటి దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి కట్ చేసి జాకీ వాళ్ళతో కలిసి మందు తాగుతూ కూర్చున్నాడు మురళి జోషి. ****************** ఉదయం గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి మురళి జోషి ని ఇంటికి పంపించి మిచల్ వైపు చూసి "తనతో ఇద్దరు వస్తారు గురి తప్పకూడదు." అని చెప్పాడు జాకి. "ఓకే బాయ్! నా గురి ఎప్పుడైనా తప్పిందా?" అని గన్ తీసి మురళి జోషిని చూస్తూ ఉన్నాడు మిచల్. ఇంటి దగ్గరికి వస్తున్న మురళి జోషిని చూసి బైరి తో కలిసి వెళ్ళాడు సహదేవుడు. ఇంటి దగ్గర నిద్రపోకుండా తండ్రి కోసం ఎదురు చూస్తూ మురళి జోషి కనపడడంతో "డాడీ!" అని పరిగెత్తుకుంటూ వచ్చింది సుమతి. దూరం నుంచి చూస్తూ మురళీ జోషి దగ్గరికి ఇద్దరు రావడంతో షూట్ చేశాడు మిచల్. ఆ సౌండ్ విని సహదేవుడని పక్కకు తోసి వెనక్కి తిరిగి దూరంగా ఉన్న జాకి వాళ్ళని చూసి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు బైరి. బుల్లెట్ సహదేవుడు తల పక్క నుంచి వెళ్లి పరిగెత్తుకుంటూ వస్తున్న సుమతికి తగలడంతో ఎగిరి అవతల పడింది. అది చూసి కంగారుగా అక్కడి నుంచి మిచల్ తో కలిసి పారిపోయాడు జనార్ధన్. పారిపోవడానికి కారు స్టార్ట్ చేస్తున్న జాకీని పట్టుకుని భుజానా వేసుకుని మురళి జోషి ఇంటి దగ్గరికి వచ్చాడు బైరి. బుల్లెట్ తగిలి చావు బతుకుల్లో ఉన్న కూతుర్ని పట్టుకుని ఏడుస్తున్న మురళి జోషిని, గీతని చూసి, "బైరి! నువ్వు వెళ్లి నాయకుడిని తీసుకురా..! వీడి సంగతి నేను చూసుకుంటాను." అని జాకిని పట్టుకున్నాడు సహదేవుడు. కూతురుని పట్టుకుని ఏడుస్తూ "మీ వల్లే సుమతి చనిపోయింది." అని కోపంగా చూస్తూ అంది గీత. "అవును! నేను చేసిన తప్పు వల్లే నాకు కూతురు చనిపోయింది." అని ఏడుస్తూ బైరితో పాటు అక్కడికి వచ్చినా అభీర్ ని చూసి కాళ్లు పట్టుకుని "నా కూతుర్ని ఎలాగైనా బతికించు ఇంక నేను ఈ జన్మలో తప్పు చేయను." అని ఏడుస్తూ అడిగాడు మురళి జోషి. ఆ మాట విని ఏడుస్తున్న గీత వైపు చూసి సుమతిని తన చేతుల్లోకి తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు అభీర్. ******************** మిచల్ తో కలిసి అక్కడ నుంచి పారిపోయి అభిజిత్ కి కాల్ చేశాడు జనార్ధన్. గెస్ట్ హౌస్ దగ్గర పంచరత్నాలతో చేసిన ఉంగరాలు పెట్టుకున్న గోకుల్ తో కలిసి డాన్స్ చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి "జనార్ధన్ కాల్ చేస్తున్నాడు పని అయిపోయినట్లు ఉంది." అని సంతోషంగా లిఫ్ట్ చేసి "అభీర్ గాడు క్లోజ్ అయిపోయాడా?" అని అడిగాడు అభిజిత్. "సార్! బుల్లెట్ మురళీజోషి కూతురికి తగిలి చచ్చిపోయింది అక్కడ అభీర్ లేడు సహదేవుడుతో పాటు వేరే మనిషి ఉన్నాడు, మన జాకిని పట్టుకున్నాడు చంపేస్తారు ఏమో అని భయంగా ఉంది." అని చెప్పాడు జనార్ధన్. "అవునా? ఒక్క నిమిషం లైన్లో ఉండు." అని డాన్స్ చేస్తున్న గోకుల్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు అభిజిత్. ఆ మాట విని ఫోన్ తీసుకుని "జనార్ధన్ నువ్వు మురళి జోషి ఇంటికి వెళ్లి నాకు కాల్ చెయ్!" అని చెప్పాడు ముకుల్. "సార్ నేను ఇప్పుడు అక్కడికి వెళితే నన్ను చంపేస్తారు." అని భయంగా చెప్పాడు జనార్ధన్. "పంచరత్నాలు మన దగ్గర ఉన్నంతసేపు అభీర్ ఎవర్ని చంపడు నువ్వు కాసేపు గుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ అవ్వు, తరువాత నీ లైఫ్ సెటిల్ అయిపోయా ఆఫర్ ఇస్తాను." అని చెప్పాడు ముకుల్. "సరే సర్! అక్కడికి వెళ్లి మీకు ఫోన్ చేస్తాను." అని చెప్పి మిచల్ ని గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళమని చెప్పి మురళిజోషి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు జనార్ధన్. |
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread:


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)
