Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అమ్మమ్మ కోరిక
#61
అమ్మమ్మ కథలు : - 2
2. అవివేకం : కథ

అందరూ రెడీనా?

     పిల్లలూ! అన్నాలు తినడం అయ్యింది కదా!
విఘ్నేశ్వర స్తుతి చెప్పండి. అని అమ్మమ్మ అనగానే...

తొండమనేక దంతము తోరపు బొజ్జయు,
వామ హస్తమున్, మెండుగ మ్రోయు గజ్జెలు
చల్లని చూపులు మందహాసమున్,  కొండక గుజ్జు రూపమున
కోరిన విద్యాలకెల్ల నొజ్జవై వుండెడు పార్వతీ తనయా! ... ఓ గణాధిపా! నీకు మ్రొక్కెదన్" అని గణేశుని స్తుతించాము.

అప్పుడు అమ్మమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది.

2. అవివేకం : - కథ

      భగవంతుడే వచ్చి వరాలిచ్చినా అవివేకంతో ఆ వరాలను నిరుపయోగం చేసుకున్న ఒక కుటుంబం కథ.

    ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. తనకు వచ్చే సంభావనలతో ఎలాగో నెట్టుకొస్తున్నాడు. ఒక్కడే కొడుకు. భార్య  ధన సంపాదన లేదు, చాతకానివాడు అని ఎప్పుడూ భర్తను తిడుతూ ఉండేది.

    ఒక రోజు ప్రదోష వేళలో పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు భూలోకంలో సంచరించాలని వస్తూ, ఈ బ్రాహ్మణ గృహం పరిసరాల నుండి వెళుతున్నాడు.
   అప్పుడు చిక్కి శల్యమైన అతడు బాధ పడుతూ అరుగు పైన కూర్చుండడం పార్వతీ దేవి కంట పడింది.
అమ్మ కదా ఆ బ్రాహ్మణుడి పై జాలిపడి..
      "ఈశ్వరా! పాపం ఇతన్ని చూస్తే జాలి కలుగుతోంది. ధనం ఇచ్చి అతన్ని అనుగ్రహించండి! కష్టాలు పోయి సుఖంగా ఉంటాడు!" అని పతిని అడిగింది

  "పార్వతీ! ఈ బ్రాహ్మణుడు మూర్ఖుడు. మూర్ఖులకు ఇచ్చినా వ్యర్థం! తమ అవివేకంతో ఏమీ పొందలేరు" అన్నాడు గౌరీపతి
    "ఈ ఒక్క సారికి కరుణించండి!" అని అమ్మ మళ్లీ అడిగింది. సరేనని అన్నాడు ఆ జగత్ పిత. ఇద్దరూ ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షం అయ్యారు. 

     "ఏవైనా వరం కోరుకో నాయనా! "

     "ఏమి కోరాలి" అని బుర్రగోక్కుంటూ ఆ బ్రాహ్మణుడు చూస్తుంటే..

స్వామి దయతో..
   " నీకు మూడు వరాలు ఇస్తున్నాను. రేపు పొద్దున లేచినప్పటి నుంచి, మీ ఇంట్లో వాళ్ళు ఏది కోరుకున్నా మూడు సార్లు తీరుస్తాను. ఆలోచించుకుని ఆ మూడు కోరుకోండి రేపు!"  అని చెప్పి, పార్వతీ సహితంగా అంతర్ధానం అయ్యాడు.

                      ***

   ఆ బ్రాహ్మణుడు వెంటనే లోపలికి వెళ్ళి, భార్యతో సంబరంగా విషయం చెప్పాడు.
    "మనం రేపు ఏమి కోరుకుందాం? మంచి తిండి,బట్టలు, మంచి ఇల్లు అడుగుతాను" అన్నాడు
అది విని ఆమె...
    "నాకెప్పటినుంచో చాలా నగలు వేసుకోవాలని కోరిక! అవి అడుగుతాను నేను" అన్నదామె
     ఒకరి అభిప్రాయంతో మరొకరు విభేదించారు. మాటా మాటా పెరిగింది. చివరికి 'లేదు నేనన్నదే కోరుకోవాలి అంటే నేనన్నదే!' అని పెద్ద గొడవ పెట్టుకున్నారు. అలాగే వీళ్ళ గొడవలు తీరకముందే తెల్లవారిపోయింది. వీరి గొడవ మాత్రం ఇంకా ఆగలేదు.

    వాళ్ళను చూస్తూ ఉన్న వాళ్ళ కొడుకు చాలా చిన్నవాడు.  అలా కూర్చుని చూస్తూ ఉన్నాడు భయంగా.

ఇంతలో భర్త కోపంగా...
     "నా మాట వినకుండా ఇంత సతాయిస్తున్నావు కదా నన్ను, నువ్వు వెంటనే కోతిగా మారిపో! " అన్నాడు

  అదే సమయంలో అతను పూర్తిగా అనే లోపే భార్య కూడా కోపంగా..
    "నువ్వే కోతిగా మారు!" అంది.

అలా ఇద్దరూ కోతులుగా మారిపోయారు. అలా రెండు వరాలు అయిపోయాయి.

      తల్లిదండ్రులు కోతులుగా మారిపోవడం చూసిన కొడుకు బాధపడ్డాడు.
వెంటనే మూడవ వరం కోరాడు.
   "మా అమ్మానాన్నలు మళ్ళీ మాములుగా మారాలి!" అని శివపార్వతులను స్మరించి, నమస్కారం చేశాడు.
   ఆ బ్రాహ్మణ దంపతులు మళ్ళీ మాములుగా మారిపోయారు.

    ఇంకేముంది మళ్ళీ అదే స్థితిలో వుంటారు.  అలా మూడు వరాలు పొంది కూడా తమ అవివేకంతో వాటిని ఉపయోగించుకోలేక పోయారు.

    "అందుకే  గొడవలు పెట్టుకోకూడదు! అనవసర పంతాల వల్ల ఎంత నష్టమో తెలిసింది కదా!" అంది అమ్మమ్మ.
అవునని బుర్ర వూపాము.

ఇప్పుడు మళ్లీ నేను చెప్పింది చదివి బుద్ధిగా పడుకోండి అని చెప్పింది.

నందగోపకుమార, నవనీత చోరా.... అని మళ్లీ నిన్న చెప్పిన కృష్ణ స్తుతి చదివి, పడుకున్నాం!

మరి మీరూ...
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
అమ్మమ్మ కథలు - 3
తొందరపాటు

రచన : సుధావిశ్వం

 
అందరూ చిరంజీవి టైం మిషన్ తో కనెక్ట్ అయ్యారుగా..

  
అమ్మమ్మా! కథ చెప్పు మేము రెడీ అంటూ మా చిన్న చెల్లి వచ్చి అమ్మమ్మ వొళ్ళో పడుకుంది.

   "
సరే విఘ్నేశ్వర ప్రార్ధన చెబుతారా మరి" అంది అమ్మమ్మ.
వెంటనే గబగబా చెప్పేసి కూర్చున్నాం కథ వినడానికి ఆతృతగా...

                ### 3 ###

తొందరపాటు : కథ

  
అమ్మమ్మ కథ మొదలు పెట్టింది. 
         "
ఎవరో ఏదో చెప్పగానే, ఏమీ ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంతో అనర్ధం జరుగుతుంది. ఆ తర్వాత తప్పు చేశామని బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ఆ తప్పును సరిదిద్దలేము. అందుకే ఏదో ఒకటి చూడగానే , ఎవరో చెబితే వినగానే ఒక నిర్ధారణకు రాకూడదు అని తెలిపే కథ ఇది. వినండి మరి!"

    
ఒక ఊరిలో ఒక రైతు వున్నాడు. అతనికి లేక లేక ఒక కొడుకు ఎన్నో ఏళ్లకు పుట్టాడు. ఎంతో అపురూపంగా పెంచు కుంటున్నాడు.
  
ఆ ఊరికి పక్కనే ఒక పెద్ద అడవి ఉండేది. అందువల్ల ఆ ఊళ్ళోకి పాములు ఎక్కువగా వచ్చేవి. తను ఇంట్లో లేనప్పుడు పాములు వస్తే బాబును కరుస్తాయి అని ఆలోచించి, ఒక ముంగిసను తెచ్చి పెంచుకో సాగాడు. దానికి బలం కోసం కావాల్సిన తిండి పెట్టేవాడు. అంతా బాగానే వుంది.

  
ఒకరోజు అతను పొలానికి వెళ్ళాడు. అతని భార్య బయట ఏదో పనిలో ఉంది. ఆ సమయంలో ఒక నల్ల త్రాచు ఇంటిలోకి ప్రవేశించింది. నెమ్మదిగా బాబు ఉన్న ఉయ్యాల పైకి పాకబోతోంది. అప్పుడు ముంగిస ఆ పామును చూసింది.
  
వెంటనే ముంగిస పాము పైకి దూకి లాగింది. పాము , ముంగిసల మధ్య భీకర పోరాటం జరిగింది. చివరికి ముంగిస పామును కొరికి చంపేసింది.  దాని నోరంతా రక్తసిక్తం అయ్యింది.

  
అదే సమయంలో పొలం నుంచి  రైతు రాగా ముంగిస ఎదురు వెళ్లి ఏదో చెప్పడానికి శబ్దం చేసింది. అది చూసిన రైతు ముంగిస తన కుమారుని పొట్టన బెట్టుకుంది అనే నిర్ణయానికి వచ్చాడు.
"
నీకు తిండి పెట్టి ప్రేమగా పెంచితే, నా కొడుకునే చంపుతావా?" అంటూ ఆగ్రహంతో పెద్ద దుడ్డు కర్ర తీసుకుని ముంగిసను చావబాదుతాడు.
  
దానికి విషయం వివరించి చెప్పడానికి నోరు లేదు. పాపం అది మరణిస్తుంది. తర్వాత లోపలికి వెళ్ళి చూస్తాడు రైతు. అక్కడ తన పిల్లవాడు హాయిగా వున్నాడు ఉయ్యాలలో. పక్కన పాము ముక్కలై పడి ఉంది.
    
అది చూసి 'ముంగిసను తప్పుగా అనుకున్నాను. అది నా బాబును కాపాడితే, నేను దాన్ని చావగొట్టి, చంపాను!" అని కన్నీరుమున్నీరుగా విలపిస్తాడు.

   "
ఎంత ఏడిస్తే ఏమి ప్రయోజనం? దాని ప్రాణాలు తేలేడుగా! ముందుగా ఒకసారి లోపలికి వచ్చి, చూసి ఉంటే బావుండేది. అలా ఏమీ ఆలోచించకుండా ఇలా నిర్ణయం తీసుకున్నాడు.  అందుకే తొందరపాటు పనికి రాదు. అర్ధమయ్యిందా పిల్లలూ!" అంది అమ్మమ్మ.

   
మాకైతే ఆ ముంగిస చనిపోయి నందుకు ఏడుపు వచ్చేసింది. ఏడుస్తుంటే అమ్మమ్మ
"
అలా ఏడువకూడదు. మనం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే, ఏమీ కాదు. ఈ కథ లోని నీతి తెలుసుకుని జీవితంలో అలా నడుచుకోవాలి!" అని వివరించింది.

  "
ఇక ఆలస్యం అయ్యింది పడుకోండి. రేపు మరో మంచి కథ చెప్పుకుందాం" అంటూ

"
రామా లాలి, మేఘశ్యామా లాలి, తామారాసా నయన దశరథ తనయ లాలి" అంటూ పాట పాడింది మేము పడుకోడానికి.

అలా నిద్రలోకి జారుకున్నాం...

కృష్ణార్పణమస్తు
?????
సుధావిశ్వం
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#63
నేను నా అమ్మమ్మ....
హాయ్ అండి...
           ప్రతిలిపి ఒక అద్భుతమైన గ్రంథాలయం లో చాలా కథలు చదివాక నాకు కూడా ఒక అందమైన కథ రాయాలి అనిపించింది....
  
            ప్రేమ ఒక మధురమైన అనుభూతి....ఒక మధురమైన కావ్యం.....కానీ ప్రేమ అంటే కేవలం ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కి మధ్య ఉంటుందా?!
స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం అమ్మ,
కొండంత ధైర్యాన్నిచ్చే ప్రేమకు నిర్వచనం నాన్న,
అమ్మ లోని ప్రేమ ని నాన్న లోని ధైర్యాన్ని పంచే ప్రేమ అన్నయ్య ది,
అమ్మ లాగా చూసుకునే ప్రేమ అక్కయ్య....
        నా ఈ కథలో నా ప్రేమ ఉండే ది అమ్మమ్మ తో.....
అవును....
   ఈ కథ పేరు "నేను నా అమ్మమ్మ"......
ఇది promo మీకు నచ్చని కథలో కి వెళ్దాం నిజం చెప్పాలి అంటే ఇది నా జీవిత చరిత్ర.
నేను నేను అమ్మమ్మ తో కలిసి చేసిన అల్లరే నా ఈ చిలిపి కథ....
నా బాధ అ నా సంతోషం నా ప్రేమ నా కోపం అన్ని చూసి మురిసిపోయిన నా అమ్మమ్మ కథ....
మా ఇద్దరి మధ్య ఉన్న ఈ అపురూపమైన ప్రేమ కావ్య మే "నేను నా అమ్మమ్మ"....
ఇందులో ముఖ్యమైన వాళ్ళు నేను నా అమ్మమ్మ మాత్రమే...
అమ్మమ్మ: పేరు "లక్ష్మి" నేను ముద్దుగా పిలుచుకునే పేరు "లక్కీ"....
తాతయ్య: పేరు "కిషన్ రావు" (మై స్వీటు)(బంగారం కూడా )....
నాన్న: నా మొదటి ప్రేమ అ నా ప్రాణం బ్రహ్మానందం గారు .... బ్యాంకు లో పని చేస్తారు లేం డి....
అమ్మ: నా ఫైర్ బ్రాండ్ అమ్మో టైగర్ నాకు చాలా భయం ఇంకా చాలా గౌరవం నిజం చెప్పాలి అంటే భక్తి తో కూడిన గౌరవం వల్ల వచ్చిన భయం అన్నమాట.... పేరు narmada....
పిన్ని 1:  అందరికీ బంగారం మా ఇంటి దీపం పేరు "నలిని".... నేను మాత్రం "చిట్టి పిన్ని" అంట....
పిన్ని 2: అమ్మో రాక్షసి కానీ మా అందరికీ డార్లింగ్ కానీ నేను మాత్రం డార్లింగ్ పిన్ని  అని  పిలుస్తా పేరు "శాంత"....
కీర్తి: చిట్టి పిన్ని కూతురు నా బెస్ట్ శత్రువు కూడా అక్క చెల్లెలి మధ్య లో కామన్ గా ఉన్న దే అది మా అనుబంధం కూడా ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ ఎప్పుడూ బయట పడడం సుమీ....
సిద్దు: మా ముద్దుల తమ్ముడు ఇంకా నా చెల్లెలు కి అన్నయ్య చిట్టి పిన్ని కొడుకు కొద్దిగా కోపం ఎక్కువ కొద్దిగా కాదండి చాలానే కానీ నీ ప్రాణం వాడు అన్ని వాడికే చెప్పుకుంటాం....
నిషా: నా చెల్లి రాక్షసి ఇంకా మా అమ్మ లాగే ఫైర్ బ్రాండ్ కూడా....
జ్వాల: మా అందరి చిట్టి చెల్లెలు మా అమాయక పు చిట్టి చెల్లి "అమ్ములు"....
బంటి: లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా ఆశ మా కోసం వచ్చిన తమ్ముడు రాక్ బ్యాండ్ అది ఏదో యాడ్ లో ఏరా బంటీ నీ సబ్బు స్లో నా ఏంటి అన్నట్టు మా తమ్ముడు మాత్రం స్లో కాదు వీడు ఆల్వేస్ ఫాస్ట్ అదే కొన్నిసార్లు మా కొంపలు ముంచుతోంది.... వీడికి మాకు చాలా ఏజ్ గ్యాప్ వచ్చే సరికి మా ప్రాణం పోతుంది వీడితో....
ఇదండీ నా కథ లో కారెక్టర్ ల పేర్లు ఏంటి పిల్ల అందరి పేర్లు చెప్పింది తన పేరు చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారా చెప్పాను కదా నా పేరు ముందు ముందు మీకే తెలుస్తుంది మా అమ్మమ్మ మీకు నా పేరు చెబుతుంది అప్పటి వరకు వెయి ట్ అండ్ వాచ్....
         
      ఇంకా ఉంది.....


 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#64
ఏరి కోరి సమకూర్చుకున్న కథలు చాలా డిలీట్ అయిపోయాయి

మళ్ళీ కొంత సమయం పట్టవచ్చు కొత్త పోస్టు పెట్టడానికి
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#65
పోయింది అనుకున్న ఫైలు దిరికింది

కొత్త అప్డేట్ ఇస్తున్నాను
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#66
నేను నా అమ్మమ్మ
మరుపు:
ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం,కానీ అది అందరికీ అందని ద్రాక్ష ఫలమే.అందరికీ అని మరిచిపోయే విలే ఉంటే మనిషికి బాధ అనేదే లేకుండా పోతోంది అని కావచ్చు "మరుపు" అనేది చాలా తక్కువ మోతాదులో ఇచ్చాడు ఆ దేవుడు....
 
ఇపుడు ఈ సోది అంతా ఎందుకు అనుకుంటున్నారా?.... ఎమ్ చేద్దాం మన హీరోయిన్ కల గురించి మరిచిపోలేక,అలా అని దానిని గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలేక  తనని తాను కష్ట పెట్టుకొంటూ నరకం చూస్తుంది.
ఇంకా స్టోరీ లోకి పోదాం పదండి పదండి?‍♂️?‍♂️?‍♂️.... అసలు కల రావడానికి సంవత్సరం ముందుర తనకు వచ్చిన ఫోన్ కాల్ సంభాషణ గురించి తెలుసుకుందాం(ఇది ఎందుకు అంటే కల గురించి తను అంతగా ఆలోచించడానికి కారణం ఫోన్ కాల్ కాబట్టి).
 
             *******************************
ఇపుడు ఇక్కడ తన అంతరాత్మతో  తన సంఘర్షణ చూద్దాం
అంతరాత్మ :అసలు ఏంటే నువ్వు ఇంకా ఎంతసేపు  అదే పట్టుకొని కూర్చుంటావు.ఇంకా ఆ ఆలోచనలు కట్టిపెట్టు baby నేను ఇంకా అలసిపోయిన నీ ఆలోచనలకు.ఎందుకు అంత ఒత్తిడికి లోను అవుతున్నావు.
తను:నీకు తెలీదు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను అని. భయం భయంగా ఉందే.అసలు ఆలోచనలు ఆగట్లేదు.
అంతరాత్మ:నువ్వు ఎవరి కోసం ఇంత ఆలోచిస్తున్నావు ఒకసారి వల తో మాట్లాడు నీ మనసుకు(అంటే నాకూ) ప్రశాంతత దొరుకుతుంది కదా.
తను: అంతే అంటావా.
అంతరాత్మ:ఎస్ నువ్వు ప్రొసీడ్ అయిపో చెప్తా.
తను: సరే అయితే నువ్వు పో.
అంతరాత్మ: హమ్మయ్య! బ్రతికించేవే బాబు నేను పోతున్న నువ్వు నీ సోది కానీ నేను కొంచం మా ఆయన  తో ఒక సాంగ్ వేసుకుంటా.
తను:చంపుతా ఆయన మా ఆయన??
అంతరాత్మ:ఓసీ పిచ్చిదానా నువ్వు నేను ఒకటే కదానే ....?
తను: ఆయన విషయంలో కాదు ఆయన మీద ఎవరికి రైట్ లేదు నాకూ తాప. నీకు అయినా సరే. అర్థం అయిందా.
అంతరాత్మ: ఓరి దీని యేశాలో ?‍♀️ వీటికి ఎమ్ తక్కువ లేదు పో పోయి మాట్లాడు పో ముందు.
తను:సరే లే ?
    
నిజంగా ఒకసారి "అమ్మ" తో  మాట్లాడితే నా మనసు స్థిమిత పడుతుందేమో( అంతరాత్మ: నేను చెప్పేది అదే కదా నే  తింగరబుచ్చి?)
ఇంకా అలా ఉండ లేక తను మాట్లాడాలని అనుకున్న వ్యక్తి కి  ఫోన్ చేసింది...అవతల వాళ్లు ఇంకా ఫోన్ కట్ అవుతుంది అనగా లిఫ్ట్ చేస్తారు....
తను: హలో
అవతల వాళ్లు:హలో  ఎవరూ?
తను:తాతయ్య ,నేను.
తాతయ్య:చేపు భేటీ...
తను:ఒకసారి ఫోన్ "అమ్మ " కీ  ఇస్తారా.
తాతయ్య:హ ఇదిగో ఇస్తున్నా(ఎమ్ అమ్మ నీకు ఫోన్ హైదరాబాద్ నుంచి ఇదిగో తీస్కో)
అమ్మ: హలో!ఎవరు?
తనుbananaఅమ్మ మాట వినగానే కళ్లలో తిరిగినా అతి కష్టం మీద ఆపుకొని.తన శక్తి ని  అంతా కూడా గొంతులో కి తీసుకొని)చాలా  కష్టంగా అమ్మ అంది.
అమ్మమ్మ : (గొంతు గుర్తుపట్టి) (చాలా ప్రేమగా, సంతోషంగా) హర్షఅమ్మ అని పిలిచింది.
తను:హా నేనే ని హర్షుఅమ్మ ఇంకా మా స్వీటు కి చిన్మయి ని.
అమ్మమ్మ: మేము నిన్ను ఎలా పిలుచుకున్నా మీ నాన్న నీకు పెట్టుకున్న పేరు ఒకటి ఉంది అది మర్చిపోకు.
తను: ఓయ్ లక్కీ నేను నీ కూతుర్ని అది మరిచిపోకు. ఈ "హర్షిత" ఎప్పటికీ హర్షిత లక్ష్మి కిషన్ రావు మాత్రమే.
అమ్మమ్మ: చాల్లే నీ అల్లరి.... ఎపుడు వస్తున్నావు ఇక్కడికి.
హర్షిత:ఆయనకు ఆఫీసులో సెలవు దొరకలేదు అమ్మ ?.
అమ్మమ్మ:అవునా ? సరే తీ బిడ.... ఎలా ఉన్నారు ఇద్దరు అంతా బాగుందా.
హర్షిత:హా అమ్మ మేము చాలా బాగున్నాము.మీరు ఏలా ఉన్నారు ఇద్దరు.
అమ్మమ్మ:మేము బాగున్నాం తల్లి. ఇంకా ఏంటి విశేషాలు. ఏమైనా విశేషమా.
హర్షితbanana??‍♀️) మా ఎపుడు అదే topic ఆ ఇంకా ఎమ్ గుర్తు రావా నీకు.
అమ్మమ్మ: ఈ వయసులో మాకు ఇది తప్ప ఇంకో టాపిక్ ఎందుకు ఉంటుందే పిచ్చి మొహం.
హర్షిత:  ఎప్పుడు అదే ఆలోచన నువ్వు అదే మాట్లాడతా అంటే, బై .
అమ్మమ్మ:అబ్బా!రాక్షసి ఎందుకు అంత కోపం సరే లే మాట్లాడను.
హర్షిత:నువ్వు చాలా గుర్తు వస్తున్నావు అమ్మ.
అమ్మమ్మ: నాకూ కూడా తల్లి.  ఒకసారి వచ్చి వెళ్ళకూడదు.
హర్షిత:సరే అమ్మ ఆయన తో మాట్లాడి చెప్తా. ఇంకా.....
అలా ఒక గంట దాకా సాగిన సంభాషణ తర్వాత ఇంకా ఉంటా అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసి అప్పటి వరకు ఆపిన కన్నీరు కు విడుదల ఇచ్చింది. తన గుండెల్లో ఉన్న భారం మొత్తం దిగే వరకు ఏడ్చే. ఇంత బాధ కి కారణం అయిన ఆ కల రావడానికి కారణం అయిన వాళ్ళ పిన్ని తో తనకు జరిగిన సంభాషణ గుర్తు చేసుకుంటుంది.

సంవత్సరం ముందు
 
ఎప్పటి లనే  ఊరికే పిన్ని తో మాట్లాడదాం అని తన పిన్ని కి ఫోన్ చేసింది(పిన్ని 2). తను ఫోన్ లిఫ్ట్ చేయగానే
హర్షిత:hi డార్లింగ్ ఎలా ఉన్నారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటుంది.

డార్లింగ్ పిన్ని: నేను బాగున్నా బిడ్డా నువ్వు ఎలా ఉన్నావు.
హర్షిత: ఏంటి పిన్ని నీ వాయిస్ అలా లా ఉంది ఒంట్లో బాలేదా.
డార్లింగ్ పిన్ని: లేదురా అంతా బాగానే ఉంది నువ్వు అనవసరంగా కంగారు పడకు.
హర్షిత:అబ్బా చేపు డార్లింగ్ ఎమ్ అయింది.... వెయిట్ వెయిట్ ఇది అమ్మమ్మ రిపోర్ట్ గురించి అయితే కాదు కదా.
డార్లింగ్ పిన్ని:హా అదే  అమ్మ వి lungs లో ప్రాబ్లెమ్ ఉంది అని నీకు తెలుసు కదా.
హర్షిత:ఎమ్ అంటున్నావ్ పిన్ని నాకేం అర్థం అవ్వట్లేదు అమ్మ కి లంగ్స్ ప్రాబ్లం ఉండటం ఏంటి.
డార్లింగ్ పిన్ని: నీకు ఏం తెలియకూడదు అనుకున్నాం కానీ చెప్పక తప్పట్లేదు అమ్మకి ఇప్పుడు లంచ్ 75% డామేజ్ అయిపోయాయి.
అంతే ఆ ఒక్క మాటతో  తన చేతిలో ఉన్న ఫోన్ నెల జారీ పోయింది....
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#67
అమ్మోరు
నా చిన్నతనంలో ఎప్పుడో విన్న అమ్మవారి కథలలో ఈ కథ ఒకటి అండి. నాకు మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి రచయిత ఎవరు ప్రాంతం ఏదో కూడా సరిగా తెలియలేదు. నేను విన్న కథకు కొద్దిగా నా ఊహను జోడించి ఇక్కడ రాయడం జరుగుతోంది. ఇక ఇప్పుడు కథలోకి వెళదాము.

అది ఒక మారుమూల పల్లె. ఆ పల్లెలోని ఎక్కువమంది జీవనాధారం దుంగలు కొట్టి అమ్మడం. అలా వాళ్లు కొట్టి అమ్మిన దుంగలకు ఒక విశిష్టత ఉంటుంది. వాళ్ళు పెద్దపెద్ద దేవదారు మొదలైన శ్రేష్టమైన చెట్లను నరికి నదిలో 15 రోజులు పాటు నానబెట్టి బయటకు తీసిన తర్వాత కలపగా ఉపయోగించుకునే రకంగా దుంగలను నరికి అమ్ముతూ ఉంటారు. అలా 15 రోజులు పాటు నీళ్లలో నానబెట్టడం వల్ల ఆ చెక్కలో పట్టుత్వం వస్తుంది అని వాళ్ళ నమ్మకం. అలా చెట్లను నీళ్లలో నానబెట్టి బయటకు తీసి చెట్టు మొద్దులను నరుకుతూ ఉంటే ఒక చెట్టు మూడు భాగాలుగా చేసిన తర్వాత దాంట్లో భూమి నుంచి పైకి ఉన్న ఒక భాగం మాత్రం చెక్కుచెదరకుండా అలానే ఉంది. దానిని ముక్కలుగా నరకాలనుకున్నా కూడా బెరడు కి కూడా ఏమీ కాలేదు. ఇక చేసేదేమీ లేక ఆ దుంగను అలానే పక్కన పెట్టారు. మధ్యాహ్న సమయం అవ్వడంతో ఆ కూలీలందరూ కూడా తెచ్చుకున్న సద్ది మూటను విప్పి ఆ దుంగలకు ఎదురుగా కూర్చుని తింటూ ఉన్నారు. అంతలో అందులో ఒక వ్యక్తికి ఆ దుంగ బెరడు రెండు కళ్ళ ఆకారంలో కనిపించింది. వెంటనే అతను తన పక్కన ఉన్న మరికొందరికి " అదిగో చూడండి రా. దుంగ కళ్ళు తెరిచి మనల్ని చూస్తోంది." అన్నాడు.

అందరూ కూడా ఆ దుంగ వైపు చూసి " నిజమేరా కళ్ళు ఉన్నట్లుగా ఉన్నాయి." అన్నారు. ఆ తర్వాత ఆ దుంగని ఏం చేద్దాం అన్నా కూడా వాళ్ల వల్ల కాలేదు. ఇది ఏదో మహత్యం ఉన్న దుంగ లాగా ఉందని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని ఆ దుంగని ఒక పక్కగా పెట్టి దండం పెట్టుకుని ఆ రోజుకి అక్కడినుంచి వెళ్ళిపోయారు.

మర్నాడు ఆ దుంగ దగ్గరకు వచ్చి " అమ్మ ఈరోజు మా పని సవ్యంగా జరగాలి. మమ్మల్ని ఆశీర్వదించు తల్లి." అని చెప్పుకుని అక్కడి నుంచి తమ పని లోపలికి వెళ్లిపోయారు. నిజంగానే ఆరోజు రోజు కంటే కూడా ఎక్కువ దుంగల్ని నరకగలిగారు.

వాళ్లంతా తిరిగి వెళుతూ " అమ్మోరు నీ దయవల్ల మాకు ఎక్కువ దుంగలు నరికి ఆదాయం ఎక్కువ వచ్చిందని దండం పెట్టుకొని వెళ్లారు."

అలా వాళ్ళు దండం పెట్టుకుని వెళుతూ ఉండటం చూసిన ఒక గొర్రెల కాపరి " ఏంటయ్యా తుంగకు దండం పెడుతున్నారు?" అని వాళ్ళని అడిగాడు.

అందులో ఒకతను " ఆ దుంగ మామూలు దుంగ కాదయ్యా? దొంగ అనకండి. అమ్మోరు తల్లి. నువ్వు దగ్గరకు వెళ్లి చూడు రెండు కళ్ళు కూడా కనబడతాయి. మేము ఇవాళ ఉదయం అమ్మోరు తల్లి దగ్గరకు వెళ్లి మా పని మంచిగా జరగాలి అని అందరం దండం పెట్టుకుని వెళ్ళాము. ఎప్పుడూ రోజంతా కష్టపడి నరికే దుంగలు ఈరోజు దాని కంటే ఇంకా ఎక్కువ దుంగలే ఎక్కువ శ్రమ లేకుండా నరికాము. బాగా దయగల తల్లి అమ్మోరు తల్లి." అని చెప్పి వెళ్ళిపోయారు.

ఆ మాట విన్న ఆ గొర్రెల కాపరి ఇంటికి వెళ్లి మర్నాడు ఉదయమే అటు నుంచి వెళుతూ " అమ్మ నా గొర్రెలను ఏ క్రూర జంతువు పాలిట పడకుండా కాపాడు. వాటికి చక్కటి మేత దొరకాలి." అని దండం పెట్టుకొని వెళ్ళాడు. ఎప్పుడూ అడవిలోకి వెళ్లినా ఏదో ఒక జంతువు మీద పడి రెండు మూడు గొర్రెలను తినటము, అతను బాధతో తిరిగి రావడం జరిగేది. కానీ ఈరోజు అలా జరగలేదు. అతను ఎంతో సంతోషంగా తిరిగి వెళుతూ " అమ్మోరు తల్లి నువ్వు నిజంగానే దయగల దానివి. నా గొర్రెలన్నిటినీ కాపాడి ఇంటికి చేర్చావు." అని దండం పెట్టుకుని వెళ్ళాడు.

అలా అలా అమ్మవారి గురించి ఊర్లో అందరికీ తెలిసింది. అందరూ అటువైపు వెళుతూ కూలి పనులకు, తమ రోజువారి ఈ పనులకు వెళుతూ  " మమ్మల్ని కాపాడు తల్లి." అనో " మా కష్టాలు ఇవి. మా కష్టాలు తీర్చు." అనో ఏదో ఒకటి ఆమె దగ్గర మొక్కి దండం పెట్టుకుని వెళుతూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. వారిలో భక్తి పెరిగి పోయింది.

అప్పటినుంచి తమ దొడ్లో పూచిన పువ్వులను తమ దొడ్లో కాచిన కాయలను, కూరగాయలను ఏవి ఉంటే అది ముందుగా అమ్మోరు తల్లికి నివేదించి ఆ తర్వాత ఆ పంటను కోసి అమ్ముకోవడం మొదలుపెట్టారు. అలా వాళ్ళు సంతోషంగా ఎటువంటి చీకు చింతా లేకుండా బతుకుతూ ఉన్నారు. కొంతకాలానికి వాళ్ళకి ఏమనిపించిందో ఏమో ఆ దుంగకి చుట్టూ చిన్న పాకలాగా వేసి పైన కప్పుని ఏర్పరిచారు. బయట నుంచి చూస్తే చక్కగా అమ్మోరు కనిపిస్తూ ఉంటుంది.

ఊరిలోని వారంతా ఆ ఊరి పంతులు గారిని బతిమాలి " అయ్యా మాకు పూజలు చేయడం రాదు. కానీ మా అమ్మోరు తల్లి చాలా చలవగల తల్లి. మీ చేత్తో ఒక దీపం పెట్టి అమ్మోరికి పూజ చేయండి. అయ్యా మాకు తోచింది ఇచ్చుకుంటాము." అన్నారు.

ఆ పూజారి కూడా దేవీ భక్తుడు అవ్వటం మూలంగా నడివయసు దాటినవాడైనప్పటికీ కూడా ఉదయాన్నే వచ్చి అమ్మవారి దగ్గర దీపం పెట్టి తనకి తెలిసినట్లుగా నాలుగు మంత్రాలు చదివి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతను పూజకు వచ్చే సమయానికి ఊర్లోని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి కాయో కమ్మో తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టమని పూజారికి ఇచ్చి వెళ్తూ తమ తమ కష్టాలు అమ్మవారికి చెప్పుకుని తీర్చమని వేడుకుని వెళుతూ ఉంటారు. అది క్రమంగా వాళ్లకు రోజువారి అలవాటు లాగా ఏర్పడిపోయింది. ఎంతో శ్రద్ధతో పూజ చేస్తూ ఉన్న పూజారికి ఎంతో కొంత ఇచ్చుకోవాలి అని అతనికి నెలకి సరిపడా సరుకులు ఏదో ఒక రూపంలో వస్తూ ఉన్నాయి. అతని జీవనాధారానికి ఎటువంటి లోటు లేకుండా అయిపోయింది.

అలా కాలం సుఖంగా కాలం జరుగుతూ ఉంది. ఇంతలో ఒక సంవత్సరం వానాకాలం వచ్చింది. దుంగలు నరికే కూలివాళ్లకు కూడా పని లేకుండా పోయింది. కానీ అమ్మవారి దయవల్ల పని లేకపోయినా వాళ్లంతా ఆ కాలాన్ని హాయిగా ఇళ్లలో గడిపే విధంగా ఏర్పాటు జరిగిపోయింది. వాళ్ళందరూ కూడా పెద్దపెద్ద చెట్లను నరికి వాన నీటికి నదిలో నానబెట్టడానికి కట్టి ప్రశాంతంగా ఇళ్లలో ఉన్నారు.

అయితే ప్రతిరోజూ వాననకుండా వరదనకుండా పూజారి వచ్చి పూజ చేసుకొని వెళుతూనే ఉన్నాడు. ఒకరోజు అతను వచ్చేసరికి ఆ చీకటిలో ఎవరో ఒకతను అమ్మవారి మీద గొడ్డలి ఎత్తాడు. పూజారి ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చూస్తే మాసిన బట్టలతో మురికి దుమ్ము కొట్టుకుపోయి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంతలో దుంగలో నుంచి ఒక నడివయసు చామన చాయతో ఉన్న స్త్రీ బయటకు వచ్చింది. ఆమెను చూస్తూ ఉంటే చేతుల నిండా ఎర్రటి గాజులు, నుదుటిన రూపాయి కాసంత బొట్టు, తలలో పువ్వులు ఉన్నాయి. చూడగానే నమస్కరించాలి అనేటువంటి ఆహార్యం.

ఆమె బయటకు వచ్చి ఆ వ్యక్తితో " నాయన నువ్వు ఈ దుంగను కొట్టకు. ఇది ఇక్కడి వాళ్లకి దేవతా స్వరూపం. నీ కళ్ళముందే నేను దుంగలో నుంచి వచ్చాను కదా. వదిలిపెట్టి వెళ్ళు." అన్నది.

అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ " అమ్మ నేను ఒక దోపిడీ దొంగని. అయినప్పటికీ ఎప్పుడన్నా దారి కాచి దోపిడీ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకనే జీవనాధారాన్ని మార్చుకోవాలని కొన్నాళ్లుగా కట్టెలు కొట్టి తీసుకోళ్లి అమ్ముకునే జీవిస్తూ ఉన్నాను. ప్రస్తుతం వానాకాలం రావటము, కట్టెలు ఎక్కడా కనిపించలేదు. ఇంటికి తీసుకు వెళ్లడానికి నయా పైసా లేదు. నువ్వు డబ్బులు ఇచ్చావు అంటే నేను ఈ దుంగను కొట్టకుండా వెళ్ళిపోతాను." అన్నాడు.

ఆమె వెంటనే తన బొడ్డులో దోపుకున్న చిన్న సంచిని ఒక దాన్ని తీసి అతని చేతికి ఇస్తూ " ఇదిగో నాయనా, ఈ దొంగ జోలికి ఇక ఎప్పటికీ రాకు. నువ్వు మంచి ప్రవర్తనతో జీవించు. కష్టపడి నీ జీవితాన్ని కొనసాగించు. ఇక ఇకపై దొంగతనాల జోలికి వెళ్ళకు." అన్నది.

అప్పుడు ఆ వ్యక్తి " అమ్మ నా ఇంట్లో ముసలి తల్లి, కడుపుతో ఉన్న భార్య ఉన్నారు. అందుకనే డబ్బుల కోసం అనే ఇక్కడ పెట్టి ఉన్న ఈ దుంగను కొట్టాలి అనుకున్నాను. కానీ మరొకరి వస్తువుని దొంగతనం చేయకూడదు అనుకున్న తర్వాత ఇంత భద్రంగా పెట్టిన దుంగను నేను మాత్రం ఎందుకు కొడతాను. వేరే దారి లేక ఎండిపోయి చక్కగా పొడిగా ఉన్నది. కొట్టి అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయి కదా అని వచ్చాను. సరే తల్లి ఇక మీదట నేను దొంగతనం చేయను. ఇది నేను నీకు ఇస్తున్న ప్రమాణం." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

దూరం నుంచి పూజారి అదంతా చూస్తూనే ఉన్నాడు. అతనికి డబ్బులు ఇచ్చిన తర్వాత అతను తిరిగి వెళ్ళిన తర్వాత ఆ నడివయసు ఆడమనిషి ఎటు వెళ్లిందో అతనికి కనిపించలేదు. అతను వెంటనే " ఔరా 10 ఏళ్ల బట్టి ఎంతో భక్తితో నేను అమ్మవారిని పూజిస్తూ ఉన్నాను. ఇవాళ ఈ వ్యక్తి వచ్చి అమ్మవారి మీద గొడ్డలి ఎత్తటం తోటే అమ్మవారే స్వయంగా వచ్చి అతనికి కాసుల సంచిని ఇచ్చారు. మరి ఇన్నేళ్లు పూజిస్తున్న నన్ను మాత్రం ఎందుకు ఉపేక్షించారు?" అనుకున్నాడు. అతనికి ధనాస పెరిగింది. అందువల్ల అతని విచక్షణ నశించింది. అతను వెంటనే " అంటే అమ్మవారి దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకోవాలి అంటే గొడ్డలి ఎత్తాలి అనమాట. ఇదా కిట్టుకు. సరే చెప్తాను." అంటూ ఆరోజు పూజ చేయకుండా వెనుతిరిగి ఇంటికి వెళ్లి ఇంటి నుంచి గొడ్డలి తీసుకుని వచ్చాడు.

&&&&&&&&&&&&&&&&&&&
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#68
అమ్మోరు -2
ఆ పూజారి అమ్మవారిగా అనుకుంటూ ఉన్న ఆ దుంగ దగ్గరకు వచ్చి చేతులు జోడించి నమస్కరించి గొడ్డలి ఎత్తి దుంగని కొట్టబోయాడు. ఇంతలో కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతితో వెలుగు వెలువడింది. ఆ వెలుతురు మూలకంగా పూజారి కళ్ళు పోయాయి. అతనికి ఏమీ కనిపించడం లేదు. అతను లబోదిబోమని ఏడుస్తూ చేతిలో ఉన్న గొడ్డలి పక్కన పడేసి చేతులు జోడించి " అమ్మ, అమ్మోరు తల్లి నీకు ఇది ఏమైనా న్యాయంగా ఉందా? ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి నిన్ను గొడ్డలితో నరక బోతే అతనికి సాక్షాత్కరించి అతనిని బతిమాలి మరి చేతికి కాసుల మూట ఇచ్చి పంపించావు. అదే పని చేయబోయిన నన్నేమో కళ్ళు పోగొట్టేలా చేశావు. ఇది ఎక్కడ న్యాయం అమ్మ? 10, 12 ఏళ్ల బట్టి నిన్ను ఎంతో భక్తితో పూజిస్తూ ఉన్నాను కదా. నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా?" అన్నాడు.

అప్పుడు అతనికి అమ్మవారి మాట వినపడింది. " ఓరి మూర్ఖుడా. నువ్వు చేసిన పనికి అతను చేసిన పనికి సారూప్యత ఏమైనా ఉన్నదా? అతనికి నేనెవరో తెలియదు. అతని ఇల్లు కడటానికి అతనికి డబ్బులు కావాలి. నేనిప్పుడు వద్దన్నా ఇప్పుడు పోయి మళ్ళా తన డబ్బులు అవసరం వచ్చినప్పుడు వచ్చి నన్ను దుంగ అనుకునే ముక్కలు చేసి తీసుకెళ్తాడు. అందుకనే అతనికి డబ్బులు ఇచ్చి పంపించి వేశాను. కానీ నువ్వు నాలో అమ్మోరుని చూస్తూ ఉన్నావు. అలాంటి నువ్వు పూజ చేయడం వల్లే చుట్టూతా ఉన్న వాళ్ళందరూ నాలో దేవతను చూస్తూ ఉన్నారు. ఇంతమందికి దేవతగా కనిపించిన దానికి కారణం నువ్వు. అలాంటి నువ్వు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నావే. నువ్వు నా మీద గొడ్డలి ఎత్తటం తగునా? అసలు ఇల్లు కదలకుండానే నీ కుటుంబానికి అంతటికి ఆహారం ఎలా వచ్చింది అనుకున్నావు? నా దయ వల్లే వచ్చింది. అది నీకు తెలియదా? అటువంటిప్పుడు నువ్వు డబ్బులుకు ఆశపడి నామీద గొడ్డలి ఎత్తడం తప్పా కాదా? నిన్ను చంపాలా లేక కళ్ళు పోయేలాగా చేయాలా? నీ భక్తి మూలకంగా నిన్ను చంపకుండా వదిలేసాను. సంతోషించు. నీకు ధనమే కావాలంటే చెప్పు. అతనికి నూరు బంగారు కాసులు ఇచ్చాను. నీకు కూడా నూరు బంగారు కాసులు ఇస్తాను. కానీ నీకు ప్రాణం కావాలా ధనం కావాలా?" అన్నది.

అప్పుడు ఆ పూజారి ఎంతో దుఃఖిస్తూ " అయ్యో తల్లి, నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. నాకు ఇంతలా సాయం చేస్తూ ఉన్న నిన్ను ధనం మీద అత్యాశతో నరక బోయాను. నా పాపానికి నిష్కృతి లేదు. నన్ను క్షమించు తల్లి. ఒక్కసారి నీ నిజరూప దర్శనం కలిగించమ్మా." అని కన్నీటితో వేడుకున్నాడు.

కరుణామూర్తి అయిన అమ్మోరు అతని కన్నీటికి కరిగిపోయి అతనికి కంటి చూపును ఇచ్చి అంతర్థానమై పోయింది. అతనికి చూపైతే వచ్చింది కానీ అమ్మవారి దర్శనం కాలేదు. అతను తను చేసిన తప్పుకి పరిపరి విధాల బాధపడుతూనే ఉన్నాడు. అమ్మవారి ముందు మోకరిల్లి " అమ్మ నీ నిజరూప దర్శనం ఇవ్వమ్మా. మీ రూపాన్ని ఎక్కడో దూరం నుంచి చూసాను. మరొక్కసారి నా కళ్ళ ముందు కనిపించు తల్లి. నన్ను కరుణించు తల్లి." అని వేడుకున్నాడు.

కానీ అతనికి మళ్ళా అమ్మవారి మాట వినిపించటం కానీ, ఆమె నిజరూప దర్శనం కానీ లభించలేదు. అతను తను చేసిన ఆ పాపానికి నిష్కృత లేదు అనే బాధపడుతూ ఉన్నాడు. ఇక ఆ రోజు నుంచి అత్యంత భక్తితో ఆమెను పూజించసాగాడు. ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎంతో భక్తితో ఆమెను పూజించుకుంటూ ఉన్నారు. అక్కడి ప్రజలు ఆ రోజు నుంచి ఏమి కోరుకుంటే అది వాళ్లకు తీరుతూనే ఉంది. అలా వాళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉన్నారు.

ఒకసారి అడవికి వేటకు వచ్చిన మహారాజు గారు అక్కడికి వచ్చి అమ్మవారిని చూసి " ఇదేమిటి ఇక్కడ దుంగని పూజిస్తున్నారు?" అని హేళనగా మాట్లాడాడు.

అప్పుడు ఆ పూజారి " అయ్యా అలా అనకండి అయ్యా. ఆమె స్వయంగా వెలిసిన అమ్మవారు. ఎవరు ఏది కావాలి అంటే అది ఇచ్చి కోరిక తీరుస్తూ ఉంటుంది." అన్నాడు.

అప్పుడు ఆ రాజుగారు " మాకు ఎప్పటినుంచో సంతానం లేదు. నువ్వు చెప్పినదే జరిగి నాకు గనుక మగ బిడ్డ పుడితే, ఇక్కడ అమ్మవారికి గుడి కట్టిస్తాను." అన్నాడు. ఆ మహారాజు అలా కోరుకుని అక్కడినుంచి వేట పూర్తి చేసుకుని తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత మూడు నెలలకి రాజు గారి భార్య గర్భవతి అయింది. ఎన్ని పూజలు చేసినా ఎంతమంది బ్రాహ్మణులను పిలిచి యాగాలు చేయించినా కూడా ఫలితం లేని రాజుగారు తన భార్య అడవిలో ఉన్న ఆ దుంగ తల్లికి మొక్కి వచ్చిన తర్వాత గర్భవతి అయింది అని తెలుసుకుని సంతోషించాడు. వెంటనే భార్యా సమేతుడై అడవికి వెళ్లి అమ్మవారికి మంచి మంచి కానుకలు ఇచ్చి ఆ రోజు నుంచి అక్కడ గుడి కట్టించడం ప్రారంభించమని పురోహితులకు చెప్పారు.

అప్పుడు పురోహితులు " అయ్యా భార్య గర్భవతి అయి ఉన్నప్పుడు నిర్మాణాలు అవి చేపట్టకూడదు. కనుక మహారాణి ప్రసవం అయిన తర్వాత వచ్చి గుడి కట్టిద్దాము." అన్నాడు.

మహారాజు మంత్రిగారి మాటకి ఎదురు చెప్పలేక అయినా తాను మొక్కిన మొక్కు తనకు మగ బిడ్డ పుట్టిన తర్వాతే గుడి కట్టిస్తాను అన్న విషయం గుర్తుకు వచ్చి " ఆహా తల్లి ఎంతటి శక్తిమంతురాలు. నా మాటని అలానే నిలుపుకోవాలని ఇంత చేసింది అన్నమాట." అనుకుని ఆమెకు భక్తితో మొక్కి పూజారికి ఈరోజు నుంచి ఆమెకు అన్ని రకాల పూజలు శాస్త్రోక్తం గా జరిపించండి అని అతనికి ఆ దగ్గరలో కొంత ప్రాంతాన్ని దానంగా  ఇచ్చారు. గుడికి అగ్రహారాలను గుడి మాన్యం కింద రాసి ఇచ్చాడు. ఆ రోజు నుంచి పూజారి జీవితానికి ఎటువంటి లోటు లేకుండా ఏర్పాటు జరిగింది. ఇదంతా కూడా అమ్మవారు తనని కరుణించడంతోనే జరిగింది అని ఆ పూజారి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయసాగాడు.

అమ్మవారి పూజకు గానీ, ఆమె అలంకారానికి కానీ మహారాజు గారు రాసిచ్చిన మాన్యం మూలకంగా అతనికి ఎటువంటి లోటు లేకుండా ఏర్పాటు జరిగిపోయింది. యధావిధిగా ఊళ్ళోని వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి మొక్కుకుని వెళుతూ ఉన్నారు. చూస్తూ ఉండగానే ఆరు నెలల కాలం కాలగర్భంలో కలిసిపోయింది. మహారాజు గారికి పండంటి మగ బిడ్డ పుట్టాడు. మహారాజు కొడుకు పుట్టిన ఆ సంతోషంలో రాజ్యం అంతా పండుగ చేయించి అమ్మవారికి గుడి కట్టిస్తాను అన్న విషయం మర్చిపోయాడు. అలా మరొక ఆరు నెలల కాలం గడిచిపోయింది.

ఇంతలో వేగుల ద్వారా మహారాజుకి తమ రాజ్యం మీదకి పొరుగు రాజులు, శత్రు రాజులు దండెత్తి రావడానికి సిద్ధపడ్డారు అనే విషయం తెలిసింది. అప్పుడు కానీ మహారాజుకి తాను చేసిన తప్పేంటో గుర్తుకు రాలేదు. వెంటనే పరుగు పరుగున అమ్మోరు తల్లి గుడికి వెళ్లి చేతులు జోడించి మొక్కుతూ " అమ్మ నేను ఏదో సంతోషంతో కన్ను మిన్ను కానక నీకు మొక్కుకున్న సంగతి మర్చిపోయాను. తల్లి నన్ను క్షమించు. ఈ గండం గడిచి నా రాజ్యం, నా ప్రజలు సురక్షితంగా ఉంటే నేను వచ్చి వెంటనే నీ మొక్కు తీర్చుకుంటానమ్మా." అని మొక్కుకుని తిరిగి వెళ్ళాడు.

ఆ శత్రు రాజు కలలో అమ్మోరు గుడి కనిపించింది. అమ్మోరు అతనికి ఈ రాజు నా భక్తుడు. ఇతని జోలికి రావద్దు అని చెప్పి చెప్పినదట. ఆ శత్రు రాజు కొద్దిమంది పరివారంతో రాజు దగ్గరకు వచ్చి " మహారాజా మీరు పూజించుకుంటూ ఉన్న అమ్మోరు తల్లి గుడికి నన్ను తీసుకు వెళ్ళండి. నిన్న రాత్రి ఆ అమ్మోరు తల్లి నా కలలో కనిపించి నువ్వు నా భక్తుడి మీద దండంత వద్దు. ఇదే నీకు నా హెచ్చరిక అని నాకు చెప్పింది .ఒక్కసారి అమ్మోరు తల్లి దగ్గరకు తీసుకెళ్ళు మహారాజా. ఈరోజు నుంచి నేను నీకు స్నేహితుడిగా నడుచుకుంటాను. నీకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా నేను సాయం చేస్తాను." అన్నాడు.

అది విన్న రాజుగారు ఎంతో సంతోషంగా ఆ శత్రు రాజుని తీసుకుని అమ్మోరు తల్లి గుడికి తీసుకువెళ్లి చూపించాడు. అక్కడ దుంగ రూపంలో ఉన్న అమ్మోరును చూసి ఆ శత్రు రాజు వెంటనే మట్టిలో సాష్టాంగ ప్రణామం చేసి " అమ్మ నాకు కలలో కనిపించినట్లుగానే ఇక్కడ కూడా ఉన్నావు. నేను కూడా నీ గుడి నిర్మాణానికి కొంత ధన సహాయం చేస్తాను. నన్ను కూడా ఈ రోజు నుంచి నీ భక్తుడు గానే స్వీకరించు తల్లి." అని నమస్కరించాడు. ఆ తర్వాత అతను లేచి మహారాజుతో " రాజా నేను కూడా ఈ గుడి నిర్మాణానికి కొంత ధనం సాయం చేయాలి అనుకున్నాను. అయినా ఆ ధనం కన్నా కూడా అమ్మవారికి మణిహారాలు, నగలు చేయించి ఇస్తాను. మీరు గుడి నిర్మాణం చేయించండి." అన్నాడు.

ఆ రోజు నుంచి అమ్మవారి గుడి నిర్మాణం అంగరంగ వైభవంగా మొదలైంది. అక్కడ ఉన్న దుంగ అమ్మోరు ని అలానే ప్రతిష్టించి, ప్రతిరూపంగా చక్కనైన అందమైన అమ్మవారి విగ్రహాన్ని మరొక దానిని చెక్కించి దుంగ అమ్మవారి ముందు ప్రతిష్టించారు. ప్రజలంతా తరలివచ్చి ఆ అమ్మవారి వైభవాన్ని కళ్ళతో చూస్తూ అక్కడ అమ్మవారి గురించి భక్తుల నోటి నుంచి ఈ విన్న కథలను ఎవరికి ఎలా మొక్కుకుంటే ఎలాంటి కోరికలు తీరాయి. ఎవరింట బిడ్డ పుట్టాడు. ఎవరి సమస్య తీరింది. ఎవరికి ఎలాంటి ఉపకారం జరిగింది అనేది ఒకరి నోటు నుంచి మరొకరు చెప్పుకుంటూ ఆమె గొప్పతనాన్ని వేనోళ్ళ పొగుడుతూ ఉన్నారు. గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత మహారాజు, మహారాణి చంటి బిడ్డతో కూర్చుని రుత్వికులందరినీ పిలిపించి పెద్ద యాగం ఒకటి పూర్తి చేసారు. ప్రజలందరికీ బంతి భోజనం పెట్టించాడు. ఆ రోజు నుంచి అమ్మవారి భక్తి దేశ దేశాలకు పాకిపోయింది. ఎందరో భక్తులు అక్కడికి వచ్చి అమ్మవారిని పూజించుకుని సేవించుకుని వెళుతూ ఉన్నారు. కానీ అప్పటికీ కూడా ఆ బ్రాహ్మడికి అమ్మవారి నిజరూప దర్శనం కలగలేదు. అతను ప్రతిరోజు ఈ రోజన్నా అమ్మవారి నిజరూప దర్శనం అవుతుందేమో అని అనుకుంటూ పూజ మొదలుపెట్టి తిరిగి గుడి తలుపులు మూసి వెళుతూ కూడా అదే ఆశతో మరొక్కసారి అమ్మవారిని వెనుతిరిగి చూసి గుడి తలుపులు వేసి వెళ్తూ ఉంటాడు. అతను చేసిన తప్పుకి అమ్మవారు విధించిన శిక్ష అదే అతనికి మాత్రం తన నిజరూప దర్శనం ఇవ్వలేదు.

&&&&&&&&&&&&&&&&&&&
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#69
అమ్మమ్మ కోరిక
#అమ్మమ్మకోరిక#

ఆపీసు నుండి ఇంటికి వచ్చాను.ఇంటి డోరు ముందు నిలబడి తలుపు తట్టాను.తలుపు తీసిన వ్యక్తిని చూసి నాకళ్ళను నేనే నమ్మలేకపోయాను.ఎదురుగా అమ్మమ్మ.నా కు ఎంతో ప్రియాతి ప్రియమైన అమ్మమ్మ..ఒక్కసారిగా సంభ్రమాశ్చార్యంలో మునిగి పోయాను.

"
అమ్మమ్మా! నువ్వెప్పుడొచ్చావు ..ఆత్రంగా  అమ్మ మ్మని చుట్టే‌స్తూ అడిగాను

"
అబ్ఫా ! వచ్చి గంటే అయ్యిందిలేవే..ముందు నువ్వు బట్టలవీ మార్చుకుని ఫ్రష్షై రా..అంటోంది అమ్మ..అమ్మమ్మకూడా ..నానుదుటిన ముద్దుపెట్టుకొని ..అమ్మలూ ..పొద్దునెప్పుడో వెళ్ళావు .వెళ్ళు మొహం కడుక్కొని బట్టలు మార్చుకొని రా అంది ఆప్యాయంగా.ఇదిగో చిటికెలో వచ్చేస్తాను అంటూ బాత్రూంలోకి దూరాను నేను.
                                         ******

నేను ఫ్రష్షై వచ్చేసరికి అమ్మా , అమ్మ మ్మా టేబిల్ దగ్గర కూర్చొని ఉన్నారు.టేబిల్ పైన ప్లేట్లల్లో నాకిష్టమైన వేడి వేడి మిర్చి బజ్జీలున్నాయి. వచ్చి గబగబా ఒక మిర్చిబజ్జీని కొరుకుతూ .

"
ఆ..ఇప్పుడు చెప్పు అమ్మమ్మా. ....ఎన్నాళ్ళైంది..! నువ్వొచ్చి ....ఎప్పుడూ మీ ఊరికి మేము రావటమే కాని నువ్వెప్పుడూ రావుగా..ఎప్పుడో నేను పెద్దమనిషినైనప్పుడు వచ్చి నా బలవంతం మీద ఓ పదిరోజులున్నావు మళ్ళీ ఎవరి పెళ్ళిళ్ళకన్నా వచ్చినా ఇలా వచ్చికనబడి మళ్ళీ పెళ్ళివారితోనే ఊరెళ్ళిపోయేదానివి..చాలా రోజులకు వచ్చావు..ఈసారి నువ్విక్కడ  ఓ పది రోజులు ఉండాల్సిందే ..లేకపోతే నేనొప్పుకోను..అంతే అన్నా ...ముగ్గురం తినగా మిగిలిన చివరి బజ్జీని తింటూ.

"
చాల్లేవే మా అమ్మ మీద నీ దబాయింపు ఏవిటే..అమ్మ మ్మ తాతయ్య గారి స్నేహితుడైన శేషగిరి బాబాయి  మనవరాలి  పెళ్ళికని  పెద్ద మావయ్య వాళ్ళతో కలిసి వచ్చింది. తాతయ్యేమో  నాట్లు వేసే సమయమని  చాలా పన్లు ఉన్నాయని పెళ్ళికి ఎవరో ఒకరు వెళ్ళకపోతే బాగుండదని అమ్మ మ్మను వెళ్ళమంటే పె ళ్ళవగానే  పెద్దమావయ్యతో నిన్ను చూడాలని ఉందని చెప్పిందట. అందుకే ఇక్కడ దించి వెళ్ళాడు.నేనూ ఉండమనే అన్నాను ఓ పది రోజులు..అక్కడ ఊర్లో మీ తాతయ్య ఒక్కరూ ఉన్నారుగా..ఎంత మా మేనత్త ఉన్నప్పటికీ ఆవిడకు  డెభ్భై ఏళ్ళు.ఆవిడ నాన్నకు వండి పెట్టలేదు .కాస్త తనొచ్చేంతవరకూ వంటావిడకి  ఇద్దరికీ వండి పెట్టమని చెప్పి వచ్చిందట.."!


అమ్మ ఇలా చెబుతుంటే ఊరు నుండి నాకోసం చేసి తీసుకొచ్చిన అరిసెలు, జంతికలు, సున్నిండల డబ్బాలను అమ్ములూ ఇంద అంటూ నా చేతికిచ్చింది అమ్మమ్మ..సంతోషంగా తీసుకున్నాను చిన్నపిల్లలా మురిసిపోతూ ..
అమ్మ మ్మ వచ్చింది కాబట్టి రెండు రోజులు ఆఫీసుకు సెలవ పెట్టేస్తాను తరువాత ఎలాగూ శని ఆదివారాలు నాకు సెలవేకాబట్టి నాల్రోజులు అమ్మ మ్మతో హ్యాపీ గా ఉండొచ్చు అని అమ్మతో చెప్పేశాను.  నాన్న గారు ఆఫీసు పని మీద క్యాంప్ కు వెళ్ళారు ఆయన వారం రోజుల వరకూ రారు. నేనూ, అమ్మ , అమ్మమ్మ ముగ్గురమే ఉన్నాం  కాబట్టి ఎంచక్కా కబుర్లెన్నో చెప్పుకోవచ్చు .రేపు అమ్మ మ్మను ఎక్కడకన్నా తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. ఇంతలోఅమ్మ చక్కని ఫిల్టర్ కాఫీ పట్టుకొచ్చింది ముగ్గురికి. కాఫీ తాగుతూ అమ్మ  ఎన్నో ఆరాలను అడుగుతోంది అమ్మమ్మని .ఇద్దరూ అలా మాట్లా డుకుంటూ ఉంటే చాలా ముచ్చటేసింది నాకు.తరువాత రాత్రి భోజనాలైన తరువాత ఊరి ప్రయాణ బడలిక వలన అమ్మ‌మ్మ తొందరగా నిద్రపోయింది. .ప్రశాంత వదనంతో నిద్ర బోతున్న అమ్మమ్మను చూస్తూ  అమ్మ ఇటీవల అమ్మ మ్మ గురించి చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ నేను ఆలోచిస్తూ పడుకున్నాను.
                                      *******

అమ్మమ్మకు తన పదిహేనో యేటే పెండ్లైయింది.వెంటనే కాపరానికి వచ్చిన ఆమెకు అత్తగారు, మావగారు, పెళ్ళై మొగుడు పోయిన తన భర్త అక్కగారు, పెళ్లి కాని ఆడపడుచు  ఇద్దరు మరుదులు, వీళ్ళందరికీ వండి పెట్టడం చాకిరీతోనే జీవితంమొదలైందామెకు..అమ్మమ్మ చాలా మెతక మనిషి. అందరూ చెప్పిన పనులన్నీ ఎంతో ఓపిగ్గా చేసేది.ఎవరన్నా విసుక్కున్నా , తిట్టినా తలవంచుకు నిలబడేదే కాని పల్లెత్తు మాట కూడా అనేది కాదట..ఆడ పడుచు, పెళ్ళి మరుదుల చదువులు , పెళ్ళిళ్ళు, ఆ తరువాత అత్తగారు, మావగారు కాలం చేయటం. జరిగాయి. అమ్మమ్మకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. అమ్మమ్మ ఏనాడూ నోరెత్తి నాకు ఇది కావారని అడలేదు తాతయ్యని.సగటు ఇల్లాలుగా తన బాధ్యతలన్నీ నెరవేర్చింది..

.
తాతయ్య అక్క మొగుడు.పెళ్ళైన రెండు నెలలకే   పోవడంతో, ఆచారం ప్రకారం ఆమెకు జుట్టు తీసి , తెల్లచీరకట్టించారు, అప్పట్లో.కాపరానికి వచ్చిన అమ్మమ్మను చూస్తే ఆవిడ కు చాలా అసూయ గా ఉండేది. ఆవిడకంటే అమ్మ మ్మ  వయసులో ఐదేళ్ళే చిన్నది.  ఇంచు మించు ఇద్దరూ ఒకే వయసు వారిలా ఉండేవాళ్ళు.ఆవిడ   అమ్మమ్మను ఎప్పుడూ ఆడిపోసుకునేదట.కాళ్ళకు మెట్టెలతో పారాణి పాదాలకు పట్టీలు పెట్టుకుని పచ్చగా కాళ్ళకు పసుపు రాసుకుని చక్కగా  లక్ష్మీ దేవిలా అమ్మ మ్మ తిరుగుతుంటే చూసి ఓర్వ  లేకపోయేదట.ముఖ్యంగా ఘల్లు ఘల్లు మని పట్టీల మ్రోగుతుంటే అస్సలు సహించలేకపోయేదట..


ఒక రోజు పెద్ద గొడవ జరిగిందట ..ఆ రోజు ఇంటికెవరో దూరపు బంధువులు వచ్చారట.అందులో ఒకతను  అమ్మ మ్మ అటూ ఇటూ తిరుగుతూ కాఫీలు అవీ ఇవీ అందిస్తుంటే ఆమె పట్టీలవంకే  చూస్తూ ఉన్నాడట..వాళ్ళు వెళ్ళిపోగానే పెద్దాడబడుచు రయ్ మని లేచిందిట... ..

"
ఇదేం ఇల్లనుకున్నావా , సానికొంప అనుకున్నావా" ...


నువ్వలా గజ్జెలు పెట్టుకుని వయ్యారంగా ఘల్లు ఘల్లుమని నడిస్తే మగ వెధవలు అందరూ నిన్నే చూస్తారు .

హవ్వ..సంసారుల లక్షణం ఇదేనా .ఘల్లు ఘల్లు  మని చప్పుడుతో పరాయి మగాడిని  ఆకర్షించాలా. మా ఇంటా వంటా లేదమ్మా..నడిస్తే గాజుల చప్పుడు కూడా రాకుండా జాగ్రత్తగా ఉంటారందరూ...

ఏరా తమ్ముడూ ..నీ పెళ్ళాం ఇలా  పట్టీలు పెట్టుకుని తిరిగిందంటే మన  సంప్రదాయం మంటకలుస్తుంది..నలుగురూ వచ్చి పోయే ఇల్లు..వచ్చి పోయే వారందరూ  దీన్నే చూస్తారు. నువ్వు కనక దాని చేత పట్టీలను  తీయించకపోతే  ఇహ  నేను ఒక్కక్షణం కూడా ఇంట్లో ఉండను.ఏ గోదాట్లోనో దూకుతాను....అంటూ బుడిబుడి రాగాలన దీస్తూ తెగేసి చెప్పిందట..అమ్మ మ్మ అత్తగారు, మావగారు కూడా తలచెడిన కూతురి మనస్తత్వం గ్రహించి  ఆమె మాట కాదంటే ఏ అఘాయిత్యం చేస్తుందో నని పట్టీలను తీసేయమని చెప్పారు.పట్టీలంటే ఎంతో ఇష్టం ఉన్న అమ్మ మ్మ తాతయ్య వంక చూసిందట ఏమంటారని.ఆయన మరేమీ మాట్లాడకుండా అమ్మ, అక్క చెప్పినట్టు చేయి అన్నట్టు చూపులతోనే సైగ చేసి చెప్పారట..ఎంతో బాధ పడుతూ గజ్జెలను తీసేసిందట అమ్మ మ్మ..పట్టీలను తీసేసి అమ్మ మ్మ బోసి కాళ్ళతో నడుస్తుంటే ఒక విధమైన పైశాచికానందం పొందిందట ఆడపడుచు..మొత్తానికి ఆవిడ అమ్మ మ్మ పట్టీలను తీయించే వరకూ నిద్రపోలేదట..ఇక్కడ చిత్రం ఏమిటంటే పెళ్ళి కాని చిన్నాడపడుచు అమ్మ మ్మ పట్టీలను పెట్టుకుని ఘల్లు ఘల్లుమని తిరిగేదట.అమ్మ మ్మ బాధనంతా గుండెల్లో దిగమింగుకొని మళ్ళీ ఏనాడూ పట్టీలను పెట్టుకోలేదట.కానీ పట్టీలు పెట్టుకున్న వాళ్ళను ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ కాళ్ళ వంక నిర్లిప్తంగా చూస్తూ  మనసులో బాధ పడుతూ ఉండిపోయేదట అమ్మమ్మ. !!!
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#70
ఇంతలో గడియారం రెండు గంటలు కొట్టింది ఆలోచనలలో ఉన్న నేను ఇక నిద్రకుపక్రమించాను.
                                           ********

మర్నాడు కొంచెం లేటుగా ఎనిమిదింటికి  లేచాను ఆసరికే అమ్మ, అమ్మ మ్మ లేచి స్నానాలను చేసి పూజ ముగించుకుని కాఫీ తాగుతున్నారు. నేను లేచి ఇద్దరికి గుడ్మానింగ్ చెప్పి మొహం కడుక్కుని స్నానం చేసి వచ్చేసరికి వేడి వేడి ఇడ్లీల టిఫెన్ రడీ గా ఉంది టిఫెన్ తింటుంటే ..అమ్ములూ...ఎల్లుండి అమ్మ మ్మ పుట్టినరోజే ..అని చెప్పింది   అమ్మ..అవునా..సరే అయితే ఇంకో గంటలో మనం బయటకు వెళుతున్నాం ..వంట గింటా పెట్టుకోకు అమ్మా ..అని చెప్పాను..

"
ఎక్కడికే ?..అనడిగింది అమ్మ సాలోచనగా


ముందు మీ రిద్దరూ రెడీ అవ్వండీ...అని తొందర చేశాను.

ఎందుకే అమ్ములూ ఇప్పుడు ...రేపు నేను ఊరెళ్ళిపోతాను అంది అమ్మ మ్మ.

అదేం కుదరదు.. మీరు తొందరగా తెమలండీ అంటూ నేను డ్రస్ వేసుకుని బిర్లా మందిర్ కి క్యాబ్ బుక్ చేశాను ..

అమ్మా అమ్మ మ్మ రడీ అయ్యారు..ఆరు గజాల జరీ అంచున్న ఆకుపచ్చ కలనేత 
చీర లో పావలా కాసంత బొట్టుతో జట్టుముడి పెట్టుకున్న కొప్పులో పూల చెండుతో మోముపై చెదరని చిరునవ్వుతో ప్రశాంత వదనంతో అమ్మ మ్మ సాక్షాత్తు ఆ జగన్మాతలా చూడగానే చేతులెత్తి నమస్కరించే అమ్మవారిలా ఉంది.

మెరూన్ కలర్ బెనారస్ సిల్క్ చీరలో లూజుగా వేసుకున్న జడలో పూలచెండు తురుముకొని గలగలా నవ్వుతూ అమ్మ లక్ష్మీ దేవిలా ఉంది ఇద్దరూ లక్ష్మీ పార్వతుల లాగా నడచుకుంటూ వచ్చి క్యాబ్ ఎక్కారు.క్యాబ్ ఎక్కాక అమ్మ అమ్మ మ్మ ఊరి విషయాలను గలగలా  మాట్లాడుకోవడం మొదలు పెట్టారు
                                            ******

అమ్మకు తాతయ్య పోలిక వచ్చింది..తెల్లగా ఉంటుంది. అమ్మమ్మది ఛామన ఛాయ. నేనూ ఛామన ఛాయే..నాకు మాత్రం అమ్మ మ్మ పోలిక వచ్చిందంటారు అమ్మా నాన్న..చిన్నప్పుడు అమ్మ మ్మ ఎలా ఉండేదో నేనూ అలాగే ఉన్నానని అమ్మ మ్మ అంటూ ఉండేది.ఎప్పుడూ ఇంటెడు చాకీరీ వచ్చిపోయే వాళ్ళకు వంటలు, వడ్డనలు, ఇంట్లో అత్తా, ఆడపడుచుల సూటీపోటీ మాటలుపండుగలకు, పబ్బాలకు , పిండివంటలు, చేయడం, అందరికీ అన్నీ అందింపులు,అమర్చి పెట్టడం తరువాత చిన్నాడబడుచు, మరుదుల పెళ్ళిళ్ళు, తరువాత తన పిల్లల చదువులు పెళ్ళిళ్ళు , అత్తగారి , మావగారి సేవలు , ఇలా గడిచిపోయింది కాలమంతా ఆవిడకు. అత్తగారు, మావగారు కాలం చేశాక  ఇక అప్పుడప్పుడు ఊళ్ళో పొరుగూళ్ళో పెళ్ళిళ్ళకు తప్ప దాదాపు ఎక్కడకూ కదిలేది కాదు. అమ్మా , మామయ్యలు పెద్ద వాళ్ళై వాళ్ళ పెళ్ళిళ్ళైయ్యాక  మావయ్యల తో , అమ్మ గురించి అప్పుడప్పుడూ ఆవిడకు ఈ భాగ్య నగరానికి వచ్చేది .అదీ వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు..

అందరికీ అన్నీ అమర్చి పెట్టే అమ్మ మ్మ కు ఆవిడ ఇష్టాఇష్టాలను గురించి  పట్టించుకునే వాళ్ళు లేరు అడిగే వాళ్ళు లేరు. తీర్ఛే వాళ్ళు లేరు..

పెద్ద మావయ్యకూ చిన్న మావయ్యకూ ఇద్దరికీ ఇద్దరిద్దరు అబ్బాయిలే..అమ్మకు మాత్రం నేనొక్కదాన్నే ఆడపిల్లను. అందుకే ఒక్క మనవరాలినని అమ్మ మ్మ కు  నేనంటే ప్రాణం ..నాక్కూడా అమ్మ మ్మంటే ప్రాణం.అప్పడప్పుడూ అమ్మ మామూలుగా మాట్లాడుతూ అమ్మ మ్మ గురించి చెప్పిన విషయాల వలన నాకీ విషయాలన్నీ తెలిశాయి...తాతయ్యకూ ఒక్క మనవరాలినని నేనంటే చాలా ప్రేమ . చిత్రంగా తాతయ్యా వాళ్ళ అక్కకూ నేనంటే ఎందుకో అమిత మైన ప్రేమ .నేను అమమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా ఆవిడకు కావలసిన కొన్ని ఫ్రూట్ జ్యూసులను, బిస్కెట్లు, చప్పరింతల బిళ్ళలను ఇలా తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని.ఒకసారి ఆవిడ కళ్ళజోడు విరిగిపోతే గోల్డ్ ఫ్రేమున్న ఖరీదైన కళ్ళజోడును కొనిచ్చాను ఇంకా చేతి కర్ర, కొనిచ్చాను. పైగా వెళ్ళినప్పుడల్లా మామ్మా , మామ్మా అంటూ , నీ ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరించేదాన్ని దానికే ఆవిడ ఎంతో  పొంగిపోయేది.ఏదో అలా ఉన్నానే అమ్ములూ, ఆ దేవుడి పిలుపింకా రాలేదు నా మీదింకా   ఆయనకు దయ రాలేదు అనేది.

నిజానికి ఆవిడకు అన్నేళ్ళు వచ్చినా షుగరు బీపీ ఏవీ లేవు.పెద్దతనం వలన వచ్చిన బలహీనత తోనే .ఆవిడ బాధ పడేది ఎప్పుడన్నా .ఆవిడ కంటి చూపు బాగానే ఉందిఈ వయసులో కూడా. రామాయణ , భాగవతాలను చదువుతూ ఉంటుంది రోజూ కాసేపైనా . మొత్తానికి వాళ్ళ తమ్ముడు అంటే మా తాతయ్య తరువాత ఆవిడకు నచ్చిన ఒకే ఒక ప్రాణిని నేనే...
                                            ********

ఇలా నేను ఆలోచనలో ఉండగానే బిర్లా మందిర్ దగ్గర దింపేసింది క్యాబ్..ముగ్గురం వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని కాసేపు కూర్చున్నాం తరువాత తిన్నగ అక్కడ నుండి బయలు దేరి కళామందిర్ కు వెళ్ళాము అక్కడ అమ్మ మ్మకు నచ్చిన పట్టుచీరను  అమ్మను చూడమన్నా   ఇప్పుడెందుకే అనవసరంగా డబ్బులు దండగని.అమ్మ మ్మ  సణుగుతుంటే..


అమ్మ మ్మా...నేను ఇప్పుడే మీకు ఇంత ఫ్రీగా కొనిపెట్టగలను .అమ్మా నాన్న చక్కగా ఇంజనీరింగ్ చదివించారు.చదవగానే క్యాంపస్ సెలక్షన్లో మంచి జాబ్ వచ్చింది నాకు ఒక సంవత్సరం చేశాక శాలరీ ఇంకా పెరిగింది.ఇంకా రెండు సంవత్సరాలు జాబ్ చేసి అమ్మా నాన్నతో మీ అందరితో హ్యాపీ గా ఉండాలని నిర్ణయించుకున్నాను.పెళ్ళైయ్యాక నేను  స్వంతంగా సంపాదిస్తున్నా ఖర్చు  పెట్టేడబ్బు గురించి నా భర్త ఆరా అడగవచ్చు అడగగపోనూ వచ్చు. అది చెప్పలేము.కనుక నీ పుట్టినరోజు సందర్భంగా నీకు నచ్చిన పట్టుచీర తీసుకోమని చెప్పాను. అమమ్మ తనకు నచ్చిన మావిడి చిగురు రంగు పట్టుచీర తీసుకుంది.నేను అమ్మతో తాతయ్యకు , మామ్మ కు కూడా బట్టలు తీయమని చెప్పి ఇప్పుడే వస్తానని పక్కకు వెళ్ళి నేననుకున్న పని ముగించుకుని వచ్చాను .ఇంతలోగా అమ్మనే చెప్పిన బట్టలు తీసింది
అమ్మను కూడా చీర కొనుక్కోమంటే మొన్ననేగా  పండు క్కి నాకు కొన్నావుగా అని, సోఫా కవర్స్ తీసుకుందామే మనం అంటూ చక్కని సోఫా కవర్స్ తీసింది .బిల్ పే చేసి సంచులతో ముగ్గురం స్వాగత్ గ్రాండ్ కి వెళ్ళి చక్కగా లంచ్ చేసి ఇంటికొచ్చే సరికి నాలుగైంది .ఇక అలసి పోయిన ముగ్గురం హాయిగా ఓ కునుకు తీశాం.
                                           *****

ఆ సాయంత్రం నిద్ర లేచాక అమ్మా అమ మ్మా కాఫీ తాగుగుంటే నేను నా కాఫీ కప్పు పట్టుకుని పైకి వచ్చాను..కాఫీ తాగాక తాతయ్యకు ఫోను చేసి ఓ గంట సేపు మాట్లాడాను.కిందకు దిగి వచ్చి నేను తాతయ్యతో మాట్లాడానని రేపు పొద్దున్నే బయలు దేరి అమ్మ మ్మా వాళ్ళింటికి వెళుతున్నామని చెప్పాను .

ఇంక అమ్మ అమ్మమ్మ హడావిడి మొదలైంది .అమ్మమ్మ చేత, కారంపొడి , అల్లంచట్నీ చేయించుకుంది అమ్మ.అమ్మమ్మ వేయించి ఇస్తే అమ్మ మిక్సీ వేసింది.తరువాత ఇద్దరూ కలిసి  కబుర్లు చెప్పుకుంటూ రాత్రి వంట పనిలో పడ్డారు. నేను తన పుట్టినరోజు కు  పట్టుచీర కొన్నానని నా మనవరాలు అమ్ములు బంగారు తల్లి అని అమ్మమ్మ మురిసిపోతూ అమ్మతో అంటోంది.ఇప్పుడే వస్తానని చెప్పి .నేను బయటకు వెళ్ళి అమ్మ మ్మకు ఇష్టమైన పుల్లా రెడ్డి స్వీట్స్, హాటు, తాతయ్యకు ఇష్టమైన కాజుబర్ఫీ , మామ్మకు మాదీఫల రసాయనం, హాజ్మోలా ,చప్పరింతల పనసతొనలు కొనుక్కొచ్చాను. వచ్చేసరికి రాత్రి తొమ్మిదైంది.ఇలోగా వంట రెడీ ఆలుగడ్డ వేపుడు, ములక్కాయ చారు, ఆవకాయ, పెరుగు తో భోజనం చేశాము .చేశాక అమ్మ మ్మ బ్యాగు సర్దుకుంది .అమ్మ కూడా తనవో రెండు చీరలు నావో రెండు డ్రసెలను పెట్టి బ్యాగును సర్దింది మరో బ్యాగులో స్వీట్లు పళ్ళు, ఏవో చెట్నీలు, ఇంకా ఏవో కావల్సినవి సర్దింది..ఇంక ముగ్గురం పొద్దుట నుండీ అలసి పోయి ఉన్నా వేమో .పడుకోగానే వెంటనే నిద్ర పట్టేసింది.
                                            ********

ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#71
మర్నాడు పొద్దున్నే లేచి బయలు దేరాం అమ్మ మ్మా వాళ్ళ ఊరికి. తాతయ్యా వాళ్ళ యింటికి చేరేసరికి  మధ్యాహ్నం ఒంటి గంటైంది.ముందుగానే మేం వస్తున్నట్టు తెలుసు గాబట్టి తాతయ్య వంటావిడ చేత వంట చేయించనట్టు ఉన్నారు. వెళ్ళగానే చక్కగా అరిటాకూల్లో వంటావిడే అందరికీ భోజనాలను వడ్డించింది..నేనేదో మాట్లాడ బోతుంటే  ముందు భోజనాలు కానీద్దాం రా అమ్ములూ అన్నాడు.తాతయ్య మామ్మ కూడా మాతోనే భోజనాలకు కూర్చున్నారు. మామిడి కాయ పప్పు, ఊర మిరపకాయలు, గుత్తివంకాయ కూర, పనసపొట్టు కూర దోసకాయ పచ్చడి, పులుసు  కేసరి , పెరుగుతో నాకు పెళ్ళి భోజనంలా అనిపించింది.భోజనం చేయగానే అందరూ  ఓ కునుకు తీశారు.నాకైతే నిద్రపట్టలేదు. ఆ సాయంత్రం తోట నుండి మల్లెపూలను తెప్పించాడు తాతయ్య.అమ్మ ,అమ్మ మ్మ కడుతుంటే మల్లెల పరిమళం ఇల్లంతా వ్యాపించింది.

నేను మామ్మకు నే తెచ్చిన వన్నీ ఇచ్చాను .నా బంగారు తల్లే అంటూ కావలించుకుని ముద్దు పెట్టుకుంది.ఆవిడ. కబుర్లతో  సందడి సందడిగా గడిచిపోయింది ఆ సాయంత్రం. ఆ రాత్రి శనివారం సాయంత్రం కావడం వలన అందరికీ ఇడ్లీలను పెట్టింది అమ్మమ్మ.
                                     *********

మర్నాడు నే లేచేసరికి అందరూ లేచి కాఫీలను తాగుతున్నారు..నేను లేచి దేవుడికి దణ్ణం పెట్టుకుని అమ్మ మ్మకు బర్తడే విషెష్ చెప్పాను.. కాసేపటికల్లా అమ్మమ్మ చక్కగా తలంటుకుని దేవుడి గదిలో  పూజ చేసుకుంటోంది.ఈ లోపల మే మందరం స్నానాలను చేశాం..తాతయ్య వంటావిడను రమ్మన్నాడేమో అమ్మ మ్మ పుట్టీన రోజని వంటావిడ వచ్చేసింది.వస్తూనే మా అందరి కి టిఫెన్ గా పెసరట్టు ఉప్మా చేసి పెట్టింది అందరికీ మరోమారు కాఫీలను ఇచ్చి తాను కాఫీ మాత్రమే తాగి వంటకుపక్రమించింది .అమ్మ అమ్మ మ్మ నడుగుతూ ఆవిడకు కావాల్సినవి అందిస్తూ సాయం చేస్ పుట్టినరోజు సందర్భంగా పులిహోర , బొబ్బట్లు , గారెలు, పాయసం, చేయిస్తోంది.


తాతయ్య స్నానం జపం అన్నీ  పూర్తి చేసుకుని అమ్మ అందరినీ హాల్లోకి రమ్మని పిలిచారు  . అక్కడ వరుసగా అందరూ కూర్చోటానికి వీలుగా కుర్చీలు వేసి ఉన్నాయి..

అందరూ వచ్చాక తాతయ్య  అమ్మ మ్మను చూస్తూ ..

"
అదేంటి మామూలు చీరలో ఉన్నావు..అమ్ములు కొనిచ్చిన  పట్టుచీర కట్టుకుని , పూలు పెట్టుకొని రా .." అని అన్నాడు..ఆశ్చర్యంగా తాతయ్య వంక చూసింది అమ్మమ్మ. నేను నవ్వు కున్నాను..ఎందుకంటే ఆవిడ పెళ్ళైన ఇన్నేళ్ళలో ఆవిడను ఫలానా చీరను కట్టుకోమని ఎప్పుడూ తాతయ్య అనే వారు కాదట ..


అదేంటే . ఇంకా అలా నిలబడ్డావు . వెళ్ళుకొత్త చీర కట్టుకుని రా అంటూ ....పుట్టినరోజు రోజు పాపాయికి అర్థం కాలేదేమోరా అమ్ములూ...అన్నాడు  నవ్వుతూ..
తాతయ్యలా అంటుంటే అమ్మ మ్మ బోలెడు సిగ్గుపడి పోయి ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో లోపలికి వెళ్ళిపోయింది .వెను కనే అమ్మ కూడా వెళ్ళింది.కాసేపట్లో మామిడి చిగురు రంగు పట్టుచీర కట్టుకుని కొప్పులో మల్లె పూలతో వచ్చింది అమ్మ మ్మ..

ఈ చీర నీకు బాగా నప్పిందోయ్...అమ్మమ్మను ఉద్దేశిస్తూ తాతయ్య అంటే సిగ్గుల మొగ్గైంది అమ్మమ్మ.నేను వెంటనే ఫోన్ తో ఫోటోలు తీశాను .అందరం  అమ్మ.మ్మకు స్వీటు తినిపించాం

ఇంతలో మామ్మ అమ్మ మ్మని దగ్గరకు రమ్మని పిలిచింది.ఏవిటని దగ్గరకెళ్ళిన అమ్మ మ్మ  చూస్తూ...

"
నేను నీకేనాడు పుట్టినరోజు రోజు కానుక ఈయలేదు. అసలు నాకు  నీ పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు.నిజానికి నిన్నెప్పుడూ ఆడిపోసుకుంటూనే ఉన్నాను..నీవేనాడూ నాకు ఎదురు చెప్పలేదు .దానిని నీ మంచితనంగా భావించక నా స్థితికి జాలి పడుతున్నావని ఇంకా కోపంతో రగిలిపోయేదాన్ని. కాని క్రమేణా నీ మంచితనంతో నా కోపం మంచులా కరిగింది. ఆనాడు నేనెందుకలా  మూర్ఖంలా ప్రవర్తించానో నాకే తెలియదు.నన్ను మన్నించు ..ఇంద ఇది తీసుకో. .మనస్ఫూర్తిగా ఇస్తున్నాను చూడు...అంటూచేతితో ఒక కవరు పెట్టింది. కలలా అయోమయంలా అనిపిస్తుంటే  అమ్మ మ్మ కవరు విప్పి చూసేసరికి లోపల తళతళలాడే వెండి పట్టీలు, అమ్మ మ్మ కిష్టమైన చిన్న చిన్న మామిడి పిఃదెలతో పెట్టుకునే చోట మూడు చిన్న మువ్వలున్న అందమైన వెండి పట్టీలు.


అమ్మమ్మ కళ్ళు ఆనందంతో ఒక్కసారిగ మెరిశాయి.మామ్మ సైగ చేయగా అమ్మ అమ్మమ్మ పాదాలకు పట్టీలను పెట్టింది

చాలా ఏళ్ళ తరువాత తన పచ్చని పాదాలకు  పట్టీలు..!!   తన కళ్ళను తానే నమ్మలేకపోతోంది అమ్మ మ్మ..ఇన్నాళ్లూ గుండెల్లో దాచుకున్న వేదనో, పట్టీలు పెట్టుకున్న ఆనందమో కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలై  జల జలా రాలుతుంటే అటూ ఇటూ అడుగులేస్తోంది చంటి పిల్లలా అమ్మమ్మ.. లక్ష్మీ దేవే చిరుమువ్వల సవ్వడితో తిరుగుతున్నట్టు ఉందంటూ అటూ ఇటూ తిరుగుతున్న అమ్మ మ్మని  చూసి మురిసిపోయింది మామ్మ..అమ్మైతే అనందగా ఆశ్చర్యంగా నాకేసి ప్రశంసా పూర్వకంగా  చూస్తోంది.

ఇంతలో..తాతయ్య అమ్మమ్మతో ..ఇలా అన్నాడు..

నా జీవిత సహధర్మచారిణిగా నీవు  ఈ ఇంట్లో అడుగుపెట్టావు. బాధ్యతలు , బంధాలు, అప్పులు, కష్టాలు , సుఖాలు ..అన్నీ కలిసే పంచుకున్నాం .కాకపోతేఎవరి వంతు బాధ్యతను వారు నిర్వర్తించాం . ఆచార వ్యవహారాలు  సంప్రదాయాలను మరవకుండ పెద్దలు చెప్పినవన్నీ పాటించాం.మనకంటూ చూసుకునే సరికి మనం ముసలితనానికి వచ్చేశాం. నాకు కావలసింది అమర్చటంలో నీవే నాడూ లోటు చేయలేదు. నాకే కాదూ నా తల్లిదండ్రులను , నా తోబుట్టువులకు , నాతమ్ముళ్ళకు కూడా ఎప్పుడూ ఏ లోటూ రాకుండా చూసుకున్నావు.అడక్కుండానే అన్ని అమర్చి పెట్టే దానివి. నీవు నాకు ఇల్లాలు కావడం నేను ఏనాడో చేసుకున్న అదృష్టం. ఈ మాటలు నాకు మనసులో ఎప్పుడూ మెదలుతూనే ఉంటాయి .కానీ ఎప్పుడూ నేను నీతో అనలేదు.
నేను నీకు తిండికి బట్టకు లోటు లేకుండా చూసుకున్నానే కానీ ఎనాడూ నీ మనసెరిగి ప్రవర్తించలేదు.నీ చిన్ని చి చిన్ని కోరికలను గాని నీ ఇష్టాలను పట్టించుకోలేదు.నూటికి తొంభై శాతం  కుటుంబాలలోని మగవాళ్ళలాగానే నేనూ  ఉన్నాను.

"
బంగారం కొనిబడితే భార్య సంతోషిస్తుందనుకుంటారు మగవాళ్ళు. కానీ భర్త  పది రూపాయలతో కొని తెచ్చే ఒక మూర మల్లెపూలకు ఎంతో సంతోషిస్తుందని తెలుసుకోరు."

"
భార్యని మేడల్లో ఉంచామా , మిద్దెల్లో ఉంచామా అనే చూస్తారు గానీ తన మనసులో ఉంచాలనే భావన ఉండదు.చాలా మంది మగవాళ్ళకి . అందరినీ వదిలేసి  కాపరానికి వచ్చిన భార్యను  పనిచేసే , పిల్లల్ని  కనే  యంత్రం లా చూస్తాము కాని మనసున్న మనిషిగా చూడరెవరు .దీనికి నేనేమీ అతీతుడను కాను..."


ఇవన్నీ నేను ఈ రోజు నేను ఎందుకు చెబుతున్నానంటే ..కారణం నా మనవరాలు బంగారు తల్లి అమ్ములు..తన అమ్మమ్మ కోరిక గ్రహించి ఆవిడ తన తల్లి తోమనసు విప్పి  చెప్పే మాటల ద్వారా ఆవిడ మనసులో పట్టీలంటే ఉన్న ఇష్టాన్ని అవి పెట్టుకోలేని  ఆవిడ పరిస్థితి తెలుసుకొని నాకు అర్థం అయ్యేటట్లు చేసి   నేనే కొంటానన్నా  తానే పట్టీలను కొని తెస్తాననీ మామ్మను కన్విన్స్ చేయమని  ఆ పట్టీలను మామ్మ చేతే అమ్మమ్మకు ఇప్పిస్తే  బాగుంటుందని  నాకు చెప్పింది. నా కూతురు కూడా ఏనాడూ నాతో చెప్పలేదు వాళ్ళమ్మకు సంబంధించిన దేదీ . వాళ్ళ అమ్మ మ్మ కోరిక తీర్చాలని  ఎంత తపన పడ్డది అమ్ములు ..నిజానికి ఆ విషయం నేనప్పుడు చాలా తేలికగా తీసుకున్నాను.తరువాత మర్చిపోయాను.

"
ఆడవాళ్ళ మనసు చాలా సున్నితం .వాళ్ళ మనసు నెరిగి వాళ్ళ చిన్న చిన్న ముచ్చట్లను తీరిస్తే చాలా సంతోషిస్తారు"


ఈ విషయాన్ని ఇక మరచి పోనమ్మా బంగారు తల్లి . సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని  చేస్తున్నా  సంప్రదాయం, బంధాలను , విలువలను మరిచి పోని నీకు తాతయ్యనై నందుకు నేను గర్విస్తున్నాను. అంటూ నా భుజం తట్టారు తాతయ్య.

నేను అమ్మ మ్మ వంక చూశాను. ఒక్కసారిగా నన్ను కౌగిలించుకుంది అమ్మమ్మ.

మితంగా మాట్లాడే అమ్మ మ్మ ఒకే ఒక మాటంది ...

"
నువ్వు నా మనవరాలి రూపంలో ఉన్న మా అమ్మవి అంది గద్గద స్వరంతో "
                                   ************

మనసు పొరల్లో ఎక్కడో మడతపడి   పోయిన చిన్ని చిన్ని కోరికలు తీరని మలి వయసు వారిని  మురిపించాలంటే పెద్దగా డబ్బులేం ఖర్చుపెట్టక్కర్లేదు .

మనసుంటే చాలు .....!!!!!
                   ‌‌‌‌‌‌‌‌                  ####
శుభం###

కధా రచన

@
హంసగీతి
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: 1 Guest(s)