నేను నేల మీద కూర్చుని ఉన్నాను. నా మోకాళ్ళకి నొప్పి పుట్టకుండా వాటి కింద దూది లాంటి ఒక పిల్లో ఉంది. నా కళ్ళు కనపడకుండా నల్లని క్లాత్ తో నా కళ్ళ చుట్టూ కట్టేసి ఉంది. క్షణ క్షణానికి నా గుండె వేగం అంతకంతకీ పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఏం జరగబోతుంటే తలుచుకుంటేనే వెన్నులో నుండి వణుకు పుడుతుంది. నా చెవులకి ఆ రూమ్ లో ఉన్న ఎయిర్ కండిషనర్ చప్పుడు కూడా చాలా క్లియర్ గా వినపడుతూ ఉంది. నిముషాలు కూడా క్షణాల్లా గడిచిపోతున్నాయి అన్నట్టు ఉంది. ఇంతలో రూమ్ డోర్ ఓపెన్ అయినట్టు చప్పుడు వినిపించింది. నేను డోర్ కి వీపు చూపిస్తూ కూర్చుని ఉండటం వల్ల లోపలికి వస్తున్న వ్యక్తి బూట్ స్టెప్ చప్పుడు మెల్ల మెల్లగా దగ్గర అవుతున్నట్టు అనిపించింది. నా పక్క నుండి అతను ముందుకు వెళ్లినట్టు చిన్న గాలి వీచింది. అనుకున్నది నిజమే సరిగ్గా అతను నా ఎదురుకి వచ్చాడు. నేను తెలియకుండానే గుటకలు మింగుతూ ఉన్నాను. ఏమన్నా కనపడుతుందేమోనని మెల్లగా తల పైకి లేపాను కానీ ఏం కనపడట్లేదు. ఇంతలో జిప్ ఓపెన్ చేస్తున్న చప్పుడు నా చెవులని తాకింది.
నాలుగు నెలల క్రితం:
నేను ఒక పబ్ లో కూర్చుని ఆపకుండా వోడ్కా షాట్స్ తాగుతూనే ఉన్నాను. అందుకు కారణం ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్. లోపలికి వెళ్లిన వోడ్కా మెల్లగా నాకు మత్తు ఎక్కిస్తూ ఉంది. అలా అని పూర్తిగా తూలిపోయే స్థితిలో అయితే లేను. తాగినప్పుడు లైఫ్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని చెప్తారు. కానీ ఈ నిర్ణయం నేను ఇప్పుడు తీసుకున్నది కాదు. ఎప్పటి నుండో అనుకుంటున్నదే, కాకపోతే చెప్పటానికి మాత్రం ధైర్యం రావట్లేదు. ఆ ధైర్యం కోసమే ఇలా తాగుతూ ఉన్నాను.
గత రెండు సంవత్సరాలుగా నన్ను వేదిస్తున్న బాధని ఈ రోజుతో వదిలించుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. ఆ బాధ మరేదో కాదు, నా లవ్, అమర్.
అమర్ ని నా కాలేజీ డేస్ లో కలిసాను. అప్పటికే నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది. దానికి కారణం అంతకుముందే నాకు ఒక లవ్ స్టోరీ ఉండటం, వాడి పేరు చెప్పాలన్న నాకు చిరాకుగా ఉంది. అన్నీ వాడే అనుకుని నా సర్వస్వం వాడికి అప్పగించాను. వాడు కూడా దానిని అలుసుగా తీసుకొని నా కన్యత్వాన్ని దోచుకున్నాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు అంతలో సడెన్ గా తన రెలెటివ్స్ అమ్మాయితో లేచిపోయాడు. వాడు చేసిన మోసాన్ని లైఫ్ లో మర్చిపోలేను. ప్రతీ రోజు వాడు చేసిన మోసాన్ని తలుచుకుంటూ బాధ పడుతూనే ఉన్నాను. అలాంటి పరిస్థితి లో అమర్ నా లైఫ్ లోకి వచ్చాడు. చాలా సైలెంట్ గా, చూడటానికి క్యూట్ గా ఉంటాడు. ఎందుకో మెల్లగా అతను నా పక్కన ఉంటే బాగుంది అనిపించటం మొదలుపెట్టింది. దాంతో నేనే అమర్ చుట్టూ తిరిగాను, వాడు నా ప్రేమలో పడేలా చేసుకున్నాను. నేను లైఫ్ లో ఎలాంటి వాడు కావాలి అనుకున్నానో అలాంటి వాడే వచ్చాడు. నా ఇష్టాలని, కోరికలని తీర్చటమే వాడి పనిగా పెట్టుకున్నాడు. నన్ను ఒక దేవతలా చూసుకున్నాడు.
ఇద్దరం కలిసే ఉండాలని ఒక డెసిషన్ తీసుకున్నాం, దాంతో నేను కాలేజి హాస్టల్ నుండి బయటకి వచ్చాను. అటు అమర్ కూడా హాస్టల్ నుండి వచ్చేసాడు. ఇద్దరం కలిసి ఒక చిన్న ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాం. నేనేం చేసినా కాదు అనేవాడు. దానికి కారణం నేను కోప్పడతాననేమో లేక నేను దూరం అవుతాను అన్న భయంతోనే మాత్రం నాకు తెలియదు. మెల్లగా ఇద్దరి చదువు పూర్తి చేసుకున్నాం. అతనితో కలిసి ఉంటున్న కొన్ని నెలలకే అమర్ గురించి అసలు నిజాలు తెలుస్తూ వచ్చాయి.
లైఫ్ అంతా అతనితోనే ఉండాలని ఎన్నో కలలు కన్నాను కానీ మెల్లగా ఆ కలలకి బీటలు పడుతూ వచ్చాయి. దానికి కారణం అమర్. రోజులు గడుస్తున్న కొద్దీ అతని ప్రవర్తన మారుతూ వస్తుంది. నేను జాబ్స్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ అమర్ మాత్రం లైఫ్ గురించి ఎలాంటి కంగారు లేకుండా ఉండేవాడు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం అసలు ఉండవు. నేను ఇంట్లో ఇబ్బంది అవుతుందని బలవంతపెడితే అతి కష్టం మీద ఉద్యోగం చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది. నాతో మంచి కంపెనీ లో ఉద్యోగం అని చెప్పి ఒక ఫుడ్ డెలివరీ కంపెనీలో పని చేస్తూ, దానికి కూడా సరిగ్గా వెళ్లకుండా డుమ్మా కొడుతున్నాడని. అయినా కూడా అన్నీ సహిస్తూ వచ్చాను. కాలేజీ రోజుల్లో నన్ను అలా చూసుకుంటా, ఇలా చూసుకుంటా అని మాటలు చెప్పాడు. ఇప్పుడు అసలు జాబ్ కి వెళ్ళటమే కష్టం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు.
అప్పటి వరకు తనకి లవర్ లా ఉన్న నేను, మెల్లగా తనని ఒక తల్లిగా చూసుకోవాల్సి వచ్చింది. రోజు రోజుకి అమర్ లో బద్ధకం పెరుగుతూ వస్తుంది. స్నానం చేయమని కూడా నేనే చెప్పాల్సి వచ్చేది. ప్రతీ రోజు అది చేస్తా, ఇది చేస్తా అంటూ ఏవేవో చెప్తాడు కానీ ప్రాక్టికల్ గా ఒక్కటీ కూడా చెయ్యట్లేదు. అన్నిటికన్నా తాను చేస్తున్న ఉద్యోగం నా దగ్గర దాచిపెట్టటం. నేను కూడా అడగదల్చుకోలేదు. ప్రతీ నెల ఇంట్లో ఇబ్బందిగానే ఉండేది. నా దగ్గర ఉన్న సేవింగ్స్ నుండి లేదా, ఇంట్లో నుండి అడిగి డబ్బులు తీసుకుని మా ఇల్లు జరిపేదాన్ని. ఇంట్లో చిన్న వస్తువు దగ్గర నుండి అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది. అమర్ తెచ్చే డబ్బు ఇల్లు రెంట్ కట్టటానికి కూడా సరిపోయేది కాదు. లైఫ్ అంతా సంతోషగా ఉంటుంది అనుకుంటే ఇలా ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ ఉండాలా అని మనసులో ఒక అలజడి మొదలైంది. తెలియకుండానే నాలో అసహనం, కోపం పెరుగుతూ వచ్చాయి.
గత సంవత్సరం నుండి అమర్ ని భరించటం నా వల్ల కావట్లేదు. నా అంతరాత్మ తప్పు చేస్తున్నావ్ అంటూ నన్ను ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది కానీ నేనే అంతగా పట్టించుకోలేదు. కానీ ఇక భరించటం నా వల్ల కాలేదు. ఇక ధైర్యం వచ్చింది అన్న తర్వాత బార్ లో నుండి బయటకు వచ్చాను. ఎదురుగా వస్తున్న టాక్సీ ఆపి ఎక్కాను. కాసేపటికి అది మా ఇంటి దగ్గర ఆగింది.
ఇంట్లోకి వెళ్తున్న ఒక్కో క్షణం నా గుండె వేగం పెరుగుతూ ఉంది. అయినా కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుని లోపలికి అడుగుపెట్టాను. అమర్ బెడ్ మీద కూర్చుని ఉన్నాడు. నేను చుట్టూ చూసాను, కూర్చోటానికి ఇంట్లో కుర్చీ కూడా లేదు అన్న సంగతి అప్పుడు గుర్తోచ్చింది. ఇప్పుడు బెడ్ మీద కూర్చుంటే నేను తీసుకున్న డెసిషన్ అమర్ కి చెప్పగలనా అనిపించింది. అలాంటిది ఏం లేదు, నువ్వు చెప్పగలవు అని మనసులో ఒక మాట వినపడుతూ ఉంది. నేను కూర్చోవటం ఇష్టం లేక అలానే నిలబడి ఉన్నాను. మెల్లగా తల పైకి లేపి అమర్ వైపు చూసాను. అతను కూడా నేనేం చెప్తానా అని చూస్తూ ఉన్నాడు.
"అమర్ ఇద్దరికీ సెట్ అవ్వదు, ఇద్దరం విడిపోవటమే కరెక్ట్" అన్నాను మెల్లగా
ఆ మాట చెప్పాకా నాకు ఇక అతని కళ్ళలోకి చూడాలి అనిపించలేదు. తల పక్కకి తిప్పుకుని అక్కడ నుండి బయటకు వచ్చేసాను. కింద ఉంటే మళ్ళీ నా మనసు మారుతుందేమోనని పైన టెర్రస్ మీదకి వెళ్లి అక్కడే కూర్చున్నాను.
మరుసటి రోజు నా బట్టలు మొత్తం తీసుకొని ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి వెళ్ళాను. అప్పటి వరకు పనికి వెళ్ళమన్నా ఇబ్బంది పడే అమర్ మళ్ళీ నా కోసం రావటం మొదలుపెట్టాడు. మెసేజ్ చేస్తూ, కాల్ చేస్తూనే ఉన్నాడు కానీ నేనే పూర్తిగా పట్టించుకోవటం మానేసాను. మారేవాడు అయితే ఒక్క ఛాన్స్ ఇవ్వు మారతాను అనేవాడు. కనీసం అతని నోటి నుండి కూడా ఆ మాట రాలేదు.
ఉంటున్న సిటీ, ఇళ్ళు, తిరిగిన ప్లేసెస్ అన్నీ అప్పుడప్పుడు అమర్ ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. వీలైనంత త్వరగా ఈ ఊరు వదిలేసి వెళ్తే బాగుండు అనిపించింది. నేను అనుకున్నట్టే ముంబై లోని ఒక పెద్ద కంపెనీ నుండి జాబ్ ఆఫర్ వచ్చింది. అదే నా జీవితాన్ని కొత్తగా మార్చుకునే అవకాశం ఇచ్చింది అనుకున్నాను.