Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Chala super gaaundhi kada.. excellent Sivasai garu.. waiting for next episodes.
[+] 1 user Likes masalakiss's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Excellent update
Like Reply
Chakkaga raastunnaru
Like Reply
Super writing
Like Reply
Part - 51


శ్రీ తల రుద్దుకుంటూ నేను అన్నది తప్ప ఏంటి బావ. నువ్వు బెంగళూరు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నువ్వు ఎలా అయితే ఊహించి చెప్పేవాడువో అవని అలాగే స్టెప్పు వేసేది. అవునా కాదా అని అడుగుతాడు.

ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు. సైలెంట్ గా బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేసేసి అమ్మ వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే చూసుకో. నేను ఆఫీస్ కి వెళ్ళాలి అని చెబుతాడు.

ఈ రెండు రోజులు ఇంటిలోనే ఉండొచ్చు కదా విక్రమ్ అనగానే..  లేదు మమ్మీ   పెళ్లి ముందు నుంచి ఇప్పుడు దాకా సరిగ్గా ఆఫీస్ కి  వెళ్ళింది లేదు.

మొత్తం వర్క్ అంతా బావ మీదే వదిలేశాను. జస్ట్ వెళ్లి అన్ని చెక్ చేసి ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను అని అని చెప్పి అవని వైపు వెళ్ళనా అన్నట్టు చూస్తాడు.

అవిని తలదించుకునే తల ఊపుతుంది. శ్రీ నేను చెప్పానా అన్నట్టు చూపిస్తాడు. కళ్యాణి గారు నవ్వుతూ శ్రీ నీకు కూడా పెళ్లిడు వచ్చేసింది.

ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు. ఇంకా ఆలస్యం చేసావు అనుకో.... అమ్మాయి దొరకడం కష్టం అని ఆటపట్టిస్తారు.

దానికి రాజ్ మీరంతా కంగారు పడాల్సిన అవసరం లేదు అంకుల్ వాడు ఆల్రెడీ సెట్ చేసేసుకున్నాడుగా అని చెబుతూఉంటే శ్రీ గట్టిగా కాలు తొక్కుతాడు.

అబ్బా ఎందుకురా నా కాలు తొక్కుతావు. నేను చెప్పింది అబద్దమా ఏంటి.. విక్రమ్ నీకు కూడా తెలుసు కదా అమ్మాయి అని శ్రీని అడ్డంగా బుక్ చేసేస్తాడు. 

విక్రమ్ నవ్వుతూ మనకి తెలిస్తే ఏమి లాభం. అమ్మాయి కి చెప్పమను. లేకపోతే  సింగల్ గా మిగిలిపోతాడు. అప్పుడు మనం మెడలో వేసుకోవడానికి ఒక శాలువ వెంట తిరగడానికి ఒక కుక్కని గిఫ్ట్ గా ఇవ్వాలి అంతేనా శ్రీ.

బావ అని రాగం తీస్తాడు.ఏదో ఇందాక ఏదో వెటకారాలు ఆడినట్టున్నావు బామ్మర్ది... ఊరికనే బావ.  ఏదో జోక్ చేద్దామని అనుకున్నాను.

అసలు ఇంకా పట్టాలెక్కని నా ప్రేమకి...బుల్డోజర్ లాగా నువ్వు బ్రేక్ వెయ్యకు. నువ్వు ఆఫీసుకెళ్లి వర్క్ చూసుకో. నేను ఇంటి దగ్గర లేడీస్స్ కి ఏమి కావాలో  చూసుకుంటాను అని అక్కడ ఉంది మెల్లిగా జారుకుంటాడు.

వెళుతున్న శ్రీ ని చూసి అందరూ నవ్వుకుంటారు విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు నేహా, శ్రీ దగ్గరికి వచ్చి పిలుస్తుంది.

నేహా పిలుపు వినగానే శ్రీ గాలిలో తేలుతూ ఉంటాడు. సార్ మిమ్మల్నే పిలుస్తున్నాను అని మళ్ళీ పిలుస్తుంది.
చెప్పు నేహా అని గాలిలో తేలేవాడు నేల మీదకు నిలబడి అడుగుతాడు.

మీరు ఫ్రీ అయిన తర్వాత నన్ను షాపింగ్ తీసుకువెళ్తారా... రేపు అవిని, విక్రమ్ సార్ కి బట్టలు పెడదాం అనుకుంటున్నాను.

ఇక్కడ ఇబ్బందిగా ఉంది. మీకు పర్వాలేదు అనుకుంటే తీసుకువెళ్తారా ప్లీజ్ సార్ అని చాలా క్యూట్ క్యూట్ గా అడుగుతుంది.

తన పిల్లతో బయటకు వెళ్లే అవకాశం వస్తే శ్రీ మాత్రం ఎందుకు వదులుకుంటాడు. తప్పకుండా తీసుకువెళ్తాను పని ఏమైనా ఉంటే రాజ్ కి  చెప్తాను అని చెప్పి రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని ఫుల్లుగా సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటాడు.

రాజ్ లోపలే ఉన్న విషయం చూసుకోడు. రాజు వచ్చే ఏంట్రా నీలా నువ్వే ?తెగ డాన్స్ చేసేసుకుంటున్నావంటే... అబ్బా నువ్వు లోపలే ఉన్నావా అంటే...

ఎవరున్నారో లేదో కూడా చూసుకోలేనంత హ్యాపీ మూడ్లో ఉన్నావా అని అడుగుతాడు. అవునురా.. నా పిల్ల నన్ను షాపింగ్ కి తీసుకెళ్లమని అందుకే ఈ ఆనందం అని చెబుతాడు...
[+] 10 users Like SivaSai's post
Like Reply
Part - 52


శ్రీ,  రాజ్ వైపు తిరిగి నా పిల్ల నన్ను షాపింగ్ కి తీసుకువెళ్లమంది. అందుకే ఈ సంతోషం. అయినా లవర్ లేని సింగిల్ ఫేస్ గాడివి. నీకేం తెలుస్తుంది రా ఇలాంటి ఆనందాలు అంటే..

అబ్బో ఇంకా నువ్వు ప్రపోజ్ చేయలేదు. తను ఒప్పుకోలేదు.. అప్పుడే లవర్ అని ఫిక్స్ అయిపోయావా అని అడుగుతాడు.

ఫిక్స్ అవ్వడం ఏంటి ఫిక్స్.... తనే నా ఫ్యూచర్ లో నా పిల్లలకు కాబోయే తల్లి అని చెబుతాడు. చాలా సెకలు ఉన్నాయి రా నీ దగ్గర.

ముందు వెళ్ళు లేకపోతే నేహా ఎవరితో అయినా షాపింగ్ కి వెళ్ళిపోయిందనుకో మళ్ళీ దేవదాసు లాగా గదిలోకి వచ్చి పడతావు అని బయటికి తోస్తాడు.

నీకు కుళ్ళు రా అని అనుకుంటు నేహా దగ్గరికి వెళతాడు. రెడీనా వెళదామా అని అడుగుతాడు.  పదండి సార్ అని చెప్పి నేహా కూడా బయటకి  వస్తుంది.

కార్ ఎక్కిన తర్వాత ఎక్కడికి తీసుకు వెళ్ళమంటావు అని అడుగుతాడు. నాకు ఇక్కడ మాల్స్ పెద్ద ఐడియా లేదు సార్. మీకు తెలిసిన చోటికి తీసుకు వెళ్ళండి అని చెబుతుంది.

అదేంటి నువ్వు ఇక్కడే కదా చదువుకున్నావు అని అడిగితే..  నేను ఎప్పుడూ పెద్ద మాల్స్ కి వెళ్లలేదు అందులో డిజైన్ వేర్ షాప్స్ అంటే అసలు వెళ్ళలేదు.

ఇప్పుడు అవని విక్రమ్ సార్ వైఫ్ కదా.. వాళ్లకు తగ్గట్టుగానే తీసుకోవాలి కదా అని చెబుతోంది. ఆ మాటలకి నేహా వైపు చూస్తూ విక్రమ్ ఎప్పుడు అలాంటి తారతమ్యాలు చూడడు అని చెబితే...

ఆయన చూడరు కానీ... అవిని కి పుట్టిల్లు అంటే ప్రస్తుతం నేనే కదా... రేపు దత్తత అయిన తర్వాత మాధవి ఆంటీ కూతురు అవుతుంది.  అప్పటి వరకు నేనే చూసుకోవాలి కదా సార్ అని చెబుతోంది.

ఆ మాటలకి శ్రీ ఇంప్రెస్ అవుతూ ప్రేమలో ఒక మెట్టు పైకి ఎక్కుతాడు. అయితే ఒక పని చేద్దాం అని అంటాడు.  ఏం పని సార్ అనగానే...

నేను కూడా ఏమైనా గిఫ్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో మనిద్దరం కలిసి మన బడ్జెట్లో బట్టలు తీసుకుందాం. ఇద్దరం కలిసి పెట్టేద్దాం ఏమంటావు అని అడుగుతాడు.

మీ ఐడియా బాగానే ఉంది గాని సర్. మనిద్దరం కలిసి పెడితే బాగుంటుందా అని అడుగుతుంది.  ఎందుకు బాగోదు.

చేసే పని మంచిదైతే చాలు అందరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అంటాడు.

చెప్పండి సార్ అనగానే.. మాటకు ముందు సార్,మాట తర్వాత ఒకసారి సార్ అనొద్దు ప్లీజ్. ఆఫీసులో అంటే అది వేరు.

ఇలా బయట కూడా అంటే నేనేదో లెక్చరర్ నువ్వు స్టూడెంట్ అన్న ఫీలింగ్ వస్తుంది. లెక్చరర్ పోస్టుకి నేను చాలా దూరం అని చెబుతాడు.

సరే సార్ ట్రై చేస్తాను అని చెబుతుంది. మళ్లీ సార్ అంటున్నావు అని రాగం తీస్తాడు. మరి ఏమని పిలవమంటారు అని అడుగుతుంది.

గుడ్ క్యూస్షన్ అందరూ శ్రీ అని పిలుస్తారు కాబట్టి నువ్వు శ్రీ అని పిలువు.  ఏదైనా నిక్ నేమ్ పెట్టి పిలుస్తా అన్న నాకు ఏమీ ఇబ్బంది లేదు అని ఇండైరెక్టుగా నువ్వంటే నాకు ఇష్టం అని చెబుతూనే ఉంటాడు .

అయ్యో మిమ్మల్ని నిక్ నేమ్ పెట్టి పిలిచే అంతా చనువు, చొరవ మనిద్దరి మధ్యన లేదు కదా...శ్రీ గారు అని పిలుస్తాను సరేనా అని అంటుంది.

సరేలే అలా కానీ ప్రస్తుతానికి అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు.
తనకు తెలిసిన ఒక డిజైనర్ బోటిక్ కి తీసుకువెళ్తాడు.. వెళ్లడానికి ముందే ఆ బోటిక్ వాళ్ళకి మెసేజ్ చేస్తాడు. ఏదైనా సరే బిలో 5000 అని మాత్రమే చెప్పమని.

ఆ బోటిక్ ని చూడగానే నేహ కి భయం వేస్తుంది. ఇది చాలా కాస్ట్లీ అనుకుంటా అని అడుగుతుంది. లేదు పైకి చూడడానికి అలా ఉంటుంది గాని అన్ని రీజనబుల్ ప్రైస్ సే.

నేనున్నాను కదా అని లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళగానే మేనేజర్ వచ్చి విష్ చేసి తీసుకువెళ్లి కూర్చోబెడతాడు.

ఆ సారీస్ అన్ని చూస్తుంటే చాలా కాస్ట్లీ గా కనిపిస్తూ ఉంటాయి. ప్రైస్ మాత్రం అన్ని బిలో 5000 చెబుతూ ఉంటారు.

ఏంటి శ్రీ గారు ప్రైస్ ఇంత తక్కువ చెబుతున్నారు అంటే... చెప్పాను కదా పైన మాత్రమే పొష్ గా ఉంటుంది లోపల అంతా కాస్ట్ తక్కువే అని.

నీకు నచ్చినవి సెలెక్ట్ చేస్తూ ఉండు. విక్రమ్ కి నేను చూస్తాను అని జెంట్స్ వేర్ వైపు వెళ్తాడు. విక్రమ్ డ్రెస్ సెలెక్ట్ చేసి వస్తూ ఉంటే శ్రీ కి ఒక చీర బాగా నచ్చుతుంది.

ఆ చీర కూడా ప్యాక్ చేపిస్తాడు. నేహా కూడా షాపింగ్ అయిపోయిందని చెప్పగానే అన్నింటికీ కలిపి బిల్ చేయిపిస్తాడు.

సార్ నా షేర్ అనగానే.. ఇందులో 50% అంతే కదా అని చెప్పి అమౌంట్ చూపిస్తాడు ఓకే అని అది ట్రాన్స్ఫర్ చేస్తుంది.

కారులో కూర్చోగానే నేహా ఇది నీ కోసం నేను తీసుకున్నది ప్లీజ్ తీసుకోవా అని ఇస్తాడు.  దానికి ఇబ్బంది పడుతూ ఎందుకు శ్రీగారు అని అడుగుతుంది.

అవినినీ చూసిన తర్వాత ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటారా అనుకున్నాను. కానీ నిన్ను చూసిన తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు అని అనిపిస్తుంది.

ఇది నా తృప్తి కోసం నీకు ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్. ప్లీజ్ తీసుకో అని ఇస్తాడు. అంత అలా చెబుతుంటే కాదు అనలేక థాంక్యూ సార్ అని చెప్పి తీసుకుంటుంది.

ఈ గిఫ్ట్ మాత్రం ఇప్పుడు ఓపెన్ చేయవద్దు. నీకు నేను ఎప్పుడైనా బాగా గుర్తుకొచ్చినప్పుడు,  నన్ను మిస్ అవుతున్నాను అని ఫీల్ కలిగినప్పుడు ఓపెన్ చెయ్యి.

ఆ టైంలో కట్టుకుని మాత్రం నాకు కనపడు అని చెబుతాడు. శ్రీ అన్న మాటలకి మనసులో నేనెందుకు మిస్ అవుతాను. ఏం మాట్లాడుతున్నారు  శ్రీ గారు అన్నట్టు..ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది.

ఆ ఎక్స్ప్రెషన్ చూసిన శ్రీ కి నేహ ఏమనుకుంటుందో అర్థమయ్యి.. ఎలా చెబితే నా పిల్లకి అర్థమవుతుంది.  ఉఫ్ అనుకుని కార్ స్టార్ట్ చేస్తాడు.

ధనుంజయ్ జైలుకు వెళ్లి భార్గవిని కలుస్తాడు. భర్తని చూడగానే ఆనందంతో నాకోసం వచ్చారా అని అడుగుతుంది.

భార్గవిని ఒక్కసారి అసహ్యంగా చూసి మొఖం పక్కకు తిప్పుకొని నీతో పది నిమిషాలు మాట్లాడాలి అని చెబుతాడు.

భర్త అసహ్యాన్ని చూసి మనసుకు కష్టంగా అనిపించినా ఏదో విధంగా భర్త మనసు మార్చి ఈ జైలు నుంచి బయటపడాలి అని అనుకుంటుంది.

చెప్పండి అని ముసలి కన్నీరు కారుస్తూ అడుగుతుంది. ఈ పేపర్స్ మీద నీ సైన్ కావాలి అని పేపర్స్ ముందుకి జరుపుతాడు.

ఏం పేపర్స్ ఇవి అని అడుగుతుంది. చూడు అని చెబుతాడు . ఆ పేపర్స్ లోని మేటర్ చదవగానే ఇది అబద్దం అని గట్టిగా అరుస్తుంది.

ష్.. గట్టిగా అరవకు ఇదేమి నీ ఇల్లు కాదు. నా ఇంటిలో నాకు తెలియకుండానే ఒక్క అరుపు నువ్వు అరవకుండానే అన్ని ఘోరాలు చేసిందానివి ఒక సైన్ చేయడానికి ఎందుకు అలా అరుస్తున్నావు అని విసుగ్గా అంటాడు.

ఇందులో ఏమి రాసిందో మీకు అర్థం అవుతుందా అని ఏడుస్తూ అడుగుతుంది.  ఈసారి ముసలి కన్నీరు బదులు రక్త కన్నీరు వస్తూ ఉంటుంది.

దగ్గరుండి నేనే రాయిపించింది నాకు తెలియదా అని వెటకారంగా అంటాడు. ఎందుకండీ మీకు నా పైన ఇంత కోపం. నేను మీ విషయంలో ఎటువంటి అన్యాయం చేయలేదు కదా..మీతో నేను ఎంతో ప్రేమగా ఉన్నాను కదా అని ధనుంజయ్ చెయ్యి పట్టుకుని అడుగుతుంది.

భార్గవి చెయ్యి తగలగానే గొంగళి పురుగు పడినట్టుగా అసహ్యించుకుని విదిలించుకుంటాడు. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఏమంటున్నావ్? నువ్వు.. నాకు ఎటువంటి అన్యాయం చేయలేదా నా భార్య ని చంపి ఆ స్థానంలోకి నువ్వు వచ్చావు. అది నాకు అన్యాయం చేయడం కాదా...
నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురి చేత నన్ను అసహ్యించుకునేటట్టు చేసావ్ అది అన్యాయం కాదా...

స్వర్గం లాగా ఉండే నా ఇల్లు ని నరకం చేసి ఆ నరకాన్ని స్వర్గము అని నాకు చూపించావు అది అన్యాయం కాదా అని కోపంగా అరుస్తాడు.

భార్గవి కూడా అంతే కోపంతో అవును రజితను నేనే చంపాను. కానీ మీ విషయంలో ఎప్పుడూ నేను మోసం చేయలేదు. రజిత కన్నా ఎక్కువ ప్రేమనే చూపించాను.

శిల్ప మీకు కూతురి ప్రేమను పంచింది అలాంటి మా ఇద్దరినీ కాదని ఎప్పుడో చచ్చిపోయిన రజితని, మీరు వద్దు అనుకున్న అవనినే కావాలి అనుకుంటున్నారు.

మేమేం అయిపోవాలి  అని ఏడుస్తూ ఉంటుంది. మీరు ఏమైపోతారో అన్నది మీ ఇష్టం కానీ.. ఈ పేపర్ల మీద సైన్ చేస్తే నా ఇంటికి నేను వెళ్ళాలి అంటాడు. నా ఇంటికి పట్టిన దరిద్రం ఈరోజుతో వదిలిపోయిందని శుద్ధి చేపించాలి అని చెబుతాడు.

మాట్లాడితే నా ఇల్లు నా ఇల్లు అంటున్నారు.అది నా ఇల్లు కూడా ... ఇన్ని రోజులు నా భర్త నా కూతురుతో కలిసి ఉన్న ఇల్లు అని భయం కలిసిన బాధతో అంటుంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ అది నీ ఇల్లు కాదు. అది కేవలం రజిత ధనుంజయ్ నివాసం. అవని హక్కు. కొన్ని సంవత్సరాలు దయ్యాలు సంచారం చేసినంత మాత్రాన.. అది నా దేవత తిరిగిన ఇల్లు కాకుండాపోదు.

నాకు చాలా పనులు ఉన్నాయి తొందరగా సైన్ చేస్తే నేను వెళ్ళిపోతాను అని చెబుతాడు. ఈ మేటర్ చదివిన ఏ ఆడదైనా సంతకం చేయగలుగుతుందా బాధగా అడుగుతుంది.

నువ్వు అన్నది నిజమే..ఆడవాళ్లు అయితే సంతకం చేయలేరు కానీ మీరు కామపిశాచులు కదా...  సంతకం చేయగలుగుతారు.  నీ దారిలోనే కదా నీ కూతురు కూడా నడుస్తుంది అని అసహ్యంగా తిడతాడు.

శిల్ప మీకు కూడా కూతురే నండి ఎందుకు అంత దారుణంగా మాట్లాడుతున్నారు అనగానే....  అవిని కూడా నా కూతురే కదా...

ఇన్ని సంవత్సరాలు అవిని విషయంలో ప్రవర్తించగా లేనిది ఇప్పుడు నీ కూతురిని ఒక మాట అనడంలో తప్పు లేదులే...

సంతకం చెయ్యి ఎంత సేపు నేను ఇక్కడ నిలబడాలి. నాకు నీ మొఖం చూస్తుంటేనే విసుగ్గా ఉంది.

ఆ మాటలకి భార్గవికి కోపం వచ్చి చెయ్యకపోతే....

ధనుంజయ్ రియాక్షన్ ఏమిటి....

కథ కొనసాగుతుంది...
[+] 13 users Like SivaSai's post
Like Reply
Inkoka cute love story start ayindi ?
Like Reply
Excellent update
Like Reply
Wow story manchi pattumeda vundi
Like Reply
Part - 53


భార్గవి కోపంగా సంతకం చేయకపోతే అని అడుగుతుంది దానికి ధనుంజయ్ నాకు తెలిసే నువ్వు ఇలాగే చెబుతావు అని.

అందితే  జుట్టు అందకపోతే కాళ్లు అనే రకానివి. సంతకం చెయ్యకపోతే ఏం జరుగుతుందో కూడా చెబుతాను విను.

నీ ముద్దుల కూతురు కూడా ఇదే జైల్లో ఊచలు లెక్కపెడుతుంది.  దాని మొహం అయితే నేను చూడను కానీ ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా...

నా కూతురికి కొలత వేసి మరీ పాచిపోయిన అన్నం పెట్టే దానివి కదా..  అలాగే ఇక్కడ జైల్లో వారం ముందు నుంచి పాచిపోయిన ఫుడ్ ప్లేట్ నిండా పెడతాను.

అసలే నీ కూతురే ఆకలికి తట్టుకోలేదేమో అది తినలేక వదలలేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. నువ్వు ఆ ఉదయ్ గాడితో కలిసి ఎలాంటి దరిద్రపు పని నా కూతురు మీద చేయాలి అనుకున్నావో...

అంతకన్నా నీచంగా నీ కూతురు మీద ఇక్కడే జైల్లో చేపిస్తాను. రోజుకో ఒక ఎయిడ్స్ పేషెంట్ ని నీ కూతురు గదిలోకి పంపిస్తాను.

అంతటితో ఆగుతాను అనుకుంటున్నావా..అది మొత్తం నీకు లైవ్ టెలికాస్ట్ పెట్టేస్తాను అని మనసులో కష్టంగా ఉన్నా సరే పైకి చాలా కోపంగా చెబుతాడు.

ఆ మాటలు వింటున్న భార్గవి ఆపండి అని గట్టిగా అరుస్తూ చెవులు మూసుకుంటుంది. ఎందుకు ఆపాలి భార్గవి.

అవని చిన్నప్పుడు నుంచి నువ్వు ఎన్నో పాపాలు చేశావు. ఏ రోజైనా నీకు నువ్వు ఆపేద్దాం అని అనుకున్నావా... ఈరోజు ఆపేయండి అని చెబుతున్నావు.

నాకు కొంచెం మానవత్వం ఉంది.  అందుకనే నువ్వు ఈ పేపర్ల మీద సంతకం చేసేసావు అనుకో నేను అలాంటి నీచమైన పనులు ఏది చేయను.

ఆ పేపర్స్ ని చూస్తూ ఇది అన్యాయంఅండి. నేను అవని విషయంలో చేసింది తప్పే అని ఒప్పుకుంటాను. కావాలిఅంటే   అవని కాళ్లు పట్టుకుని అయినా క్షమాపణలు అడుగుతాను కానీ...

ఇంత భయంకరమైన శిక్ష నాకు వేయొద్దు. నేను తలెత్తుకుని తిరగలేను. రేపు మేము బయటకు వచ్చాక శిల్ప పరిస్థితి ఏమిటి అన్నది ఒక్క నిమిషం ఆలోచించండి అని ఏడుస్తుంది.

శిల్ప పరిస్థితి గురించి నువ్వు ఏమి టెన్షన్ పడకు. అది ఆల్రెడీ అడ్డదారుల్లోనే వెళుతుంది. అది ఎలాగైనా బతుకుతుంది. నిన్ను  పోషిస్తుంది.

ఇందులో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు అన్నీ నీ బుద్ధిలే కదా... సైన్ చెయ్ అని కోపంగా  అరుస్తాడు.

భార్గవి ఆ పేపర్లు తీసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం చదువుతూ ఏడుస్తూ ఉంటుంది. అందులో ఉన్న సారాంశం ఏమిటంటే...

నేను ధనుంజయ్ గారిని ట్రాప్ చేసి ఆయన కీప్ గా ఆయన లైఫ్ లోకి వెళ్లాను. అలా పుట్టిన కూతురే శిల్ప. ఆయన ఆస్తిలో గాని, వారసత్వంలో గాని ఎందులో కూడా... నాకుగాని, శిల్ప కి గాని ఎటువంటి హక్కులు లేవు.

నన్ను ఆయన ఉంచుకున్నందుకు... మా ఇద్దరికీ అన్ని విధాల అనుకూలమైన సదుపాయాలు కల్పించారు. అలాగే 100 కోట్ల ప్రాపర్టీని కూడా అప్పజెప్పారు.

ధనంజయ్ గారి ఆస్తికి, వారసత్వానికి ఏకైక వారసురాలు అవని మాత్రమే. మాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు.

మేము పూర్తి స్పృహలో ఉండే పూర్తి అంగీకారంతో సంతకాలు చేస్తున్నాము అని ఉంటుంది.

అది చదివి ఏడుస్తూ..  నన్ను నేనే మీ ఉంపుడుకత్తే అని ఎలా ఒప్పుకోమంటారు. కావాలి అంటే మీ రెండో భార్య రెండో కూతురు అని ప్రపంచానికి చెప్పండి.

అంతేగాని ఇంత నీచమైన నింద నా మీద వేయొద్దు అని ఏడుస్తుంది. ఆ మాటలకి ధనుంజయ్ విరక్తిగా నవ్వుతూ నీ వరకు వచ్చేటప్పటికి రెండో భార్యగా ఉన్న సరే పరవాలేదు అని ఏడుస్తున్నావు.

మరి అవని ఏం చేసిందని..అంత నరకం చూపించావు. నా కూతురుగా ఎక్కడ తెలియనివ్వకుండా చేశావు. నాకు ఒకే పెళ్లి అయింది.

అది కూడా నీతోనే అన్నట్టుగా చూపించావు.  అప్పుడు తెలియలేదా నువ్వు నాకు రెండో భార్యవి అని. అప్పుడు అనిపించలేదా శిల్పనాకు రెండో కూతురు అని.

టైమ్ చూసుకుంటూ నాకు టైం అవుతుంది.  సంతకం చేయి. ఈసారి మాత్రం ఇంకొకసారి చెప్పను. నేను అన్నా పని మాత్రమే చేస్తాను అని సీరియస్గా చెబుతాడు. 

భార్గవికి ఇంకొక దారి లేక కూతురిని రక్షించుకోవడానికి అని సంతకం చేయడానికి ఒప్పుకుంటుంది. సంతకం చేస్తాను కానీ.. నాకు ఒక సహాయం చేస్తారా అని అడుగుతుంది.

అది నేను చేయగలిగింది అయితే ఆలోచిస్తాను అని అంటాడు. మా ఇద్దరినీ జైలు నుంచి విడిపించండి. రజిత చావుతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పండి. బయటకు వచ్చాక మా బతుకులేమో మేము బతుకుతాము అని అంటుంది.

నీ చావు తెలివితేటలు నా దగ్గర చూపించకు. ఒకప్పటి ధనుంజయ్ ని అయితే నీ మాటలు నమ్మేవాడనేమో కానీ.. ఇప్పుడు నేను వేరు.

మిమ్మల్ని నేను విడిపించిన,మీతో నేను మాట్లాడిన నా కూతురు  నాపై వేసిన నిందలే నిజమవుతాయి. నీ కన్నా ఎక్కువ ప్రేమించింది రజితనే.

అసలు నేను నిన్ను ప్రేమించిందే లేదు.  ఎందుకంటే మనసులో గుడి కట్టేది ఒక్క దేవతకి మాత్రమే.  ఆ దేవత నా రజిత.

నా దేవత కూతుర్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావు.  ఎప్పటికైనా ఆడపిల్లకి తల్లి అవసరం ఉంటుంది అని నిన్ను పెళ్లి చేసుకున్నాను.

నిజంగానే నా కూతురికి తల్లి ప్రేమ చూపిస్తున్నావు అని అనుకుని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక కష్టంగా నైనా జాలితో దగ్గరికి తీసుకున్నాను అంతేగాని నీ మీద ప్రేమ కాదు.

ఆ జాలి వల్ల పుట్టిన కూతురే శిల్ప. మరి అలాంటప్పుడు శిల్ప పైన నాకెందుకు అంత ప్రేమ ఉంటుంది. నా పంచప్రాణాలు నా కూతురు అవని మాత్రమే అని ఖరాఖండిగా చెప్పేస్తాడు.

ఆ మాటలు వింటుంటే  భార్గవికి ఈసారి నిజంగా చచ్చిపోవాలి అన్నంత విరక్తి వస్తుంది. ఇంకా చేసి నేను ఏం సాధించాను అని మొదటిసారి ఆలోచన వస్తుంది.

ఈ పేపర్ల మీద సంతకం చేస్తే నా భర్తకి నేనే ఉంపుడుకత్తే ని అని ఒప్పుకోవాల్సి వస్తుంది.  సంతకం చేయకపోతే శిల్ప జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు.

ఆఖరికి మమ్మల్ని విడిపించడానికి కూడా సిద్ధంగా లేరు ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. భర్త వైపు చూస్తూ కనీసం మా అన్నయ్య ఫ్యామిలీ నైనా వదిలేసారా అని అడుగుతుంది.

మీ అన్నయ్య కూడా నీతోపాటే ఇక్కడే చెక్కభజన చేస్తున్నాడు.  ఆ ఉదయ్ గాడు ఎప్పుడు హాస్పిటల్ నుంచి బయటికి వస్తాడో వాడికే తెలియదు.

ఆ మాటలు వినగానే బయట నుంచి సహాయం చేసే వాళ్ళు కూడా మాకు ఎవరూ లేరా అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఏంటి తెగ ఆలోచిస్తున్నావు... ఏమి చేసి ఈ కేసు నుంచి బయటపడాలి అన్న లేకపోతే ఈ పేపర్ల మీద సంతకం చేయకుండా ఉండాలనా...

నీకు ఎటువంటి ఆప్షను లేదు. నేను చెప్పినట్టు చేయడం తప్ప. సంతకం చేయకుండా ఉండాలంటే ఒకటే మార్గం అంటాడు.

ఏమిటండి అని చాలా ఆశగా అడుగుతుంది. నీ కూతురి జీవితాన్ని పణంగా పెట్టడమే అని అంటాడు.

ఎందుకండి మీరు ఇంత కఠినంగా మారిపోయారు. శిల్ప అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీరు అలా చేయలేరు. నాకు తెలుసు మీ గురుంచి.

నన్ను భయపెట్టడానికి అంటున్నారు అంతే కదా అని మొదటసారి నిజమైన భయముతో అడుగుతుంది.

హ.. హ..అని నవ్వుతూ... నేను నిన్ను భయపెట్టడమా ఇది అసలు జరిగే పనేనా... పిశాచాల్ని, భూతాల్ని భయపెట్టే అంత శక్తి నాకు ఉందా...

ఏదో మేము మామూలు మానవ మాత్రము అంతే... ఇలాంటి జోకులు వెయ్యాలి అనుకున్నప్పుడు ముందుగా నన్ను ప్రిపేర్ చేయి భార్గవి. అసలు నవ్వలేక చచ్చిపోతున్నాను అనుకో అంటాడు.

ఇంకా భార్గవికి పూర్తిగా అర్థం అయిపోతుంది ఇంక ఏమి చెప్పినా ఏమి చేసినా ధనుంజయ్ వినడు కరగడు అని.. నేను వీటిల మీద సంతకం చేస్తే శిల్ప ని ఏమీ చేయరు కదా అని అడుగుతుంది.

నేను నీలాంటి పిశాచిని అనుకుంటున్నావా... మనిషిని. మాటంటే మాటే అంటాడు. ఇక తప్పక సంతకం చేసే మరి మాకు అందినట్టుగా రాసిన 100 కోట్లు మాటేంటి అని అడుగుతుంది.

ఇప్పుడు కూడా నువ్వు డబ్బు గురించే ఆలోచిస్తున్నావు.  అంతేకానీ ఈ జైల్లో నేను మారి వస్తాను. అప్పుడు మమ్మల్ని చేరనిస్తారా అని అడగడం లేదు.

ఇన్ని సంవత్సరాలు నా కొంపలో తేరగా పడి తిన్నారు కదా... నా ఆస్తితో పాటు హోదా కూడా అనుభవించారు కదా అది 100 కోట్లు కన్నా ఎక్కువే ఉంటుంది.

ఈ లెక్కన చూస్తే నువ్వే నాకు తిరిగి కట్టాల్సి ఉంటుంది. నేనే మానవతా దృక్పథంతో ఆలోచించి...నీపై జాలి చూపించి వదిలేస్తున్నాను అని అక్కడనుండి వెళ్ళిపోతాడు.

ఈసారి శిల్ప దగ్గరికి వెళ్తాడు. శిల్పా ధనుంజయ్ ని చూడగానే డాడీ అంటూ ఏడుస్తుంది.  దూరంగా నిలబడు అని గట్టిగా చెబుతాడు.

ఆ మాటలో వచ్చిన సీరియస్ కి ఆశ్చర్యపోతు డాడీ అని స్లోగా ఉంటుంది.  ఎవరే నీకు డాడీ. మీ అమ్మ చెప్పి ఉంటుంది కదా నీకు.

నాకు ఒక్కతే కూతురు అని.  మరి నా కూతురు తప్ప బయట వాళ్ళు నన్ను డాడీ అని పిలిస్తే ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు అని కోపంగా అడుగుతాడు. 

ఆ మాటలకి శిల్పకి నోటి మాట రాకుండా ఏడ్చే ఏడుపును కూడా ఆపేసి మరి చూస్తూ ఉంటుంది. ఏమంటున్నారు డాడీ మీరు నేను మీ కూతుర్ని కాదా అని అడుగుతుంది.

ఆ మాట నేను అనడం కాదు మీ అమ్మే చెప్పింది అయినా ఇప్పుడు నాకు నీతో మాట్లాడే అంత టైము లేదు.  ఇంట్రెస్ట్ అంతకన్నా  లేదు.

ఈ పేపర్ల మీద మీ అమ్మ సంతకం చేసింది. నువ్వు కూడా సంతకం చేస్తే నేను వెళ్ళాలి అని చెబుతాడు.

ఏం పేపర్లు  అవి. బెయిల్ పేపర్స్ అని అంటూ ఆత్రంగా అందుకుంటుంది.

చూడు నీకే తెలుస్తుంది అని ఇస్తాడు. ఆ పేపర్లో తీసుకొని చదివి నో అని గట్టిగా అరుస్తుంది.
[+] 9 users Like SivaSai's post
Like Reply
Part - 54


శిల్ప ఆ పేపర్లు చూసి నో అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు తెగ అరుస్తున్నావు.  మీ అమ్మ కూడా ముందు అలాగే అరిచింది.

కానీ బెనిఫిట్స్ చూశాక మీ అమ్మ కామ్ గా సైన్ చేసేసింది కదా.. నువ్వు అలాగే చేసేయ్. నేను వెళ్ళాలి అంటాడు. మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు డాడీ.

మీరు మమ్మీని పెళ్లి చేసుకున్నాక నేను పుట్టాను గాని..మీ కీప్ గా మమ్మీ ఉండి నేను పుట్టలేదు కదా అంటుంది. మీ మమ్మీ యే ఒప్పుకుంది.

ఇంక నీతో వాదన కూడా అనవసరం. మనీ కూడా తీసేసుకుంది.  సో అగ్రిమెంట్ మీద సైన్ చేసేయ్ శిల్పా అని చెబుతాడు.

మనీ తీసుకుంటే మాత్రం నా స్టేటస్ తిరిగి వస్తుందా. ధనుంజయ్ కూతురు అన్న స్టేటస్ నాకు కావాలి. అది నాకు మాత్రమే కావాలి.

ఇన్ని రోజులు అందరికీ నేను ధనుంజయ్ కూతుర్ని అని తెలుసు. ఇప్పుడు ఇలాగ సెటప్ కూతుర్ని అని తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుంది  అని ఏడుస్తుంది.

నీది కూడా మీ అమ్మ బుద్ధి లాంటిదే..ఇప్పుడు కూడా అవనితో పాటు నేను మీ కూతుర్నే కదా... ఇద్దరిని సమానంగా చూడాలి కదా అనడం లేదు.

నేను ఒక్కదాన్నే మీ కూతుర్ని అని మాట్లాడుతున్నావు. నీకు కావాల్సింది మనీ..అలాగే ఒక మంచి మోడల్ అవ్వాలని.

అవన్నీ నీకు అరేంజ్ చేస్తున్నప్పుడు ఇంకా ఈ స్టేటస్ గొడవ నీకెందుకు. నిజంగా నువ్వు నా కూతురు అనే స్టేటస్ కోరుకొని ఉండి ఉంటే.. ఇలా అడ్డదారిలో వెళ్లే దానివా..

తప్పుడు పనులు చేసి వచ్చి మళ్ళీ విక్రమ్ భార్యగా ఉండాలి అనుకున్నావు. ఏ ధైర్యంతో నువ్వు ఆ పని చేశావు.

స్టేటస్ అంటే డబ్బు, హోదా కాదు. తండ్రి పరువు గౌరవం కాపాడడం.  అవి అవని మాత్రమే చేయగలిగింది. తాళి కట్టిన వాడు ఎవరైనా సరే మరొకరిని  తాకడానికి ఇష్టపడలేదు.

నువ్వు దిగజారి పోయావు కాబట్టే...ఆరోజు ఉదయ్ మీ అక్క మీద సోరి.... నా కూతురు అవని మీద అంత అఘాయిత్యం చేస్తున్నా సరే.. నవ్వుతూ చూసావు కానీ ఇది తప్పు అని చెప్పలేకపోయావు.

స్టేటస్ అంటే తన తాళిని భద్రంగా కాపాడుకోవడం.. అంతేగాని పక్కన వాళ్ళ తాళిని దొంగలించి వేసుకుని తిరగడం కాదు.

అయినా నీకెందుకు నేను నీతులు చెబుతున్నాను. మీ అమ్మ దగ్గర బుద్ధి ఉంటే నీకు వచ్చేది.  ఏరోజైనా నువ్వు, అవని అక్క చెల్లెలు లాగా ఉండి ఉంటే...

ఈరోజు నీ జీవితం కూడా అవినిలాగా సంతోషంగా ఉండేది.  చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత. సంతకం చేయి శిల్ప.

అస్తమాను నేను అడగలేను అని విసుగ్గా అంటాడు. లేదు డాడీ నేను చేయను అంటే... సరే మీ అమ్మకి చెప్పిందే నీకు చెబుతున్నాను విను.

నువ్వు సంతకం చేయలేదు అనుకో... అవనికి మీ అమ్మ రోజు కొలత ప్రకారం పాచిపోయిన అన్నం పెట్టేది కదా... అలాగే నీకు వారం ముందు నుంచి పాచిపోయిన భోజనం ప్లేట్ నిండా పెట్టి దగ్గరుండి తినిపించే ఏర్పాట్లు చేస్తాను.

నువ్వు అసలే చాలా కాస్టలీ గా ఉండే ఫుడ్ తినే దానివి కదా.. ఆకలికి ఉండలేవు.ఒకసారి అలాంటి ఫుడ్ ఊహించుకో...

స్మెల్ వచ్చే ఫుడ్ మీద ఈగలు,దోమలు, పురుగులు కచ్చితంగా వాలుతాయి.  అవి వాలిన సరే నువ్వు అలాంటి పుట్టే తినాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకో శిల్ప అని అంటాడు.

ఒక్కసారి ఆ ఫుడ్ ఊహించుకోగానే... నో అనే అరుస్తూ భయంగా వణికిపోతూ ఉంటుంది. శిల్ప ని అలా చూస్తూ ఉంటే ధనుంజయ్ కి కూడా చాలా కష్టంగా ఉంటుంది.

ఎందుకంటే వాళ్ళు చీట్ చేసిన సరే కూతురు అనే ప్రేమ ధనుంజయ్ కి ఉంటుంది కదా... ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉండకపోతే శిల్ప ఇంకా ఎప్పటికీ మారదు.

ఎలాగో జీవితాన్ని నాశనం చేసుకుంది. మారితేనైనా బయటికి వచ్చాక మనిషిలాగ ఉంటుంది. అప్పుడు కూతురుగా దగ్గరికి తీసుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు.

భార్గవిని మాత్రం క్షమించకూడదని ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు. ప్లీజ్ డాడీ నా వల్ల కాదు అని ఏడుస్తుంది. ఏదైనా నేను నిర్ణయమే శిల్ప.

ఇప్పుడే సంతకం చేసావు అనుకో నీ ఫుడ్ బాగుంటుంది. లేదు అనుకో ఇలాంటి ఫుడే వస్తుంది.అప్పుడైనా సరే నువ్వు సంతకం చేయాల్సింది.

శిల్పా ఆలోచిస్తూ ఉంటుంది. మమ్మీ సంతకం చేసింది అంటే.. ఏదో ప్లాన్లో ఉండే ఉంటుంది. సో ఇప్పుడు నేను సంతకం చేసి డాడీ ముందు మంచిగా ఉంటే... ఏదో ఒక దారి దొరుకుతుంది అని కన్నీళ్లు తుడుచుకుని సంతకం చేస్తోంది.

సంతకం చేసి పేపర్స్ ధనుంజయ్ కి ఇస్తూ నాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. చెప్పు అని అంటాడు. ఒకసారి నేను మమ్మీ తో మాట్లాడాలి. పర్మిషన్ ఇప్పిస్తారా అని అడుగుతుంది.

సరే అని చెప్పి ఆ పేపర్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు.  ఇదంతా కూడా లైవ్ లో చూస్తున్న విక్రమ్ ఫేస్ మీద ఒక ఈవిల్ స్మైల్ వస్తుంది.

పర్వాలేదు ధనుంజయ్. నీలో కూడా మానవత్వం మిగిలింది. నీ కూతురిని ఎలా దగ్గరికి చేర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావు.

జైలర్ తో తన చేయవలసిన పని మొత్తం చెబుతాడు. ఓకే సార్ అని నెక్స్ట్ డే ఏం చేయాలో ఆ పని మీద ఉంటాడు.

జై సింహం మాన్షన్ లో హడావిడి మొదలవుతుంది. సూర్యుడు రాకముందే అందరూ లేచి పనులు మొదలుపెడతారు.

ఇల్లంతా పచ్చి పూలతో డెకరేట్ చేస్తారు. మెయిన్ గేట్ దగ్గర నుంచి సింహ ద్వారం దాకా రకరకాల పువ్వులతో అలంకరణ చేస్తారు.

అన్ని రకాల పువ్వులు ఒకే చోట ఉండేటప్పటికి గమ్మత్తైన పూల వాసన వస్తుంది. మాధవి, లలిత అవనినీ కుందనపు బొమ్మలాగా అలంకరిస్తారు.

పూర్తిగా అలంకరించిన తర్వాత మాధవి అవని నుదుటిని ముద్దు పెట్టుకుని... వదిన నా కూతురు చూడు ఎంత అందంగా ఉందో..

నా దిష్టే తగిలేటట్టు ఉంది అని కళ్ళ కాటుక తీసి చెవి వెనకాల పెట్టి మెటికలు విరుస్తుంది.  రజిత ఉండగా కూతురు జీవితంలో జరిగింది ఒకటే పుట్టినరోజు.

ఆరోజు అవనిలో ఉన్న సంతోషం మళ్ళీ ఇన్నాళ్లకు వస్తుంది. ఆనందం  చూడడం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని తల్లిదండ్రులను కంగారు పెట్టి ముందుగానే తీసుకుని వెళ్ళిపోతాడు..

కూతురి వైభాగాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. నా దగ్గర లేని సంతోషం అత్తారింట్లో అయిన దొరుకుతుంది.

ఈరోజు నుంచి నా బిడ్డ పరాయి వాళ్ళ బిడ్డ అయిపోతుంది కదా అన్న బాధ ఒక వైపు,నేను చేసుకున్న పాపమే ఇది అని మరొకవైపు ఆలోచిస్తూ లోపలికి వెళ్తాడు .

లోపల ఎటు చూసినా కూతురి వైభోగమే కనపడుతూ ఉంటుంది. ధనుంజయ్ వచ్చిన అతిథుల్లో ఒక్కడిలాగా ఒకచోట కూర్చుని ఉంటాడు.

సత్యవతి, శేషగిరి గారు మాత్రం వెళ్లి ఇందిరా గారిని కలిసి అక్కడ పనుల్లో సహాయం చేస్తూ ఉంటారు.

జైలర్ శిల్ప దగ్గరికి వచ్చి ఉచల  మీద లాటితో కొడతాడు. భయంగా జైలర్ ని చూస్తూ ఏంటి సార్ అని అడుగుతుంది. మీ అమ్మని కలవాలి అన్నవంట కదా పద అని అంటాడు .

హమ్మయ్య... అమ్మని కలిస్తే అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా తెలుస్తుంది. నేను బయటకి ఎలా వెళ్లాలో అప్పుడు ఆలోచిస్తాను.

ఎలాగో క్యాష్ తీసుకుంది కదా ఆ క్యాష్ తో బయటికి వెళ్లేలాగా ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ జైలర్ వెనకాల  వెళుతుంది.

శిల్ప ని ఒక గదిలోకి తీసుకువెళ్లి ఇక్కడే మీ అమ్మ ఉంది వెళ్ళు అని చెప్పి గదిలోకి పంపించి బయట నుండి లాక్ చేస్తాడు.

బయట నుండి లాక్ వేయగానే శిల్ప భయంతో వణికిపోతూ అమ్మ అని నుతిలో నుంచి వచ్చినట్టుగా పిలుస్తూ ఉంటుంది.

ఆ రూమ్ మొత్తం చీకటిగా ఉంటుంది. ఎవరూలేని చోట అది కొత్త ప్లేస్ లో అలా చీకటిలో ఉండేటప్పటికీ... పైప్రాణాలు పైకే పోతూ ఉంటాయి.

ఈసారి ఏడుస్తూ అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటుంది. నేనిక్కడే ఉన్నాను అన్న మాట వినిపించగానే.. ఆ మాట వినిపిస్తున్న వైపు తడుముకుంటూ వెళ్తుంది.

దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరో మనిషి తగులుతున్నట్టుగా అనిపించి తడుముతో ఉంటే అది భార్గవి అని అర్థం అవుతుంది.

భార్గవిని కలిసి చాలా రోజులు అయినట్టుగా అనిపిస్తుంది. వెంటనే గట్టిగా కౌగిలించుకుని అమ్మ అని బేర్ మంటుంది.

ఊరుకో శిల్పా ఎందుకు ఏడుస్తున్నావు. ఇప్పుడు ఏమైందని చెప్పు అని కన్నీళ్లు తుడుస్తుంది. ఇంకా ఏమి అవ్వాలి మమ్మీ.

మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేసాము.  ఇప్పుడు ఎక్కడున్నాము. అంత నీ చేతకానితనం వల్ల కాదా అని అరుస్తుంది.

మన పని అయిన వెంటనే చంపేసియ్ మమ్మీ అంటే అది ఇంకా కుళ్ళి కుళ్ళి ఏడవాలి. నా వైభోగం చూసి ఏడుస్తుంటే నువ్వు ఆనందించాలి అన్నావు.

ఇప్పుడు చూడు మన వైభోగం ఎంత బాగుందో అని ఏడుస్తుంది. శిల్ప సైలెంట్ గా ఉండు. ఇదేమి మన గది కాదు.

ఇక్కడ ఎలాంటి కెమెరాలు ఉన్నాయో..ఇద్దరం ఇరుక్కుంటాము.ఇప్పటికే ప్రాబ్లం లో ఉన్నాము.

నువ్వు నన్ను కలవాలి అన్నావంట. ఏ విషయం గురించి శిల్పా అని అడుగుతుంది. అది అని చెబుతూ ఉంటూఉంటే.. వాళ్లకి ఒక వాయిస్ వినపడుతోంది.

ఇద్దరూ కాసేపు సైలెంట్ గా ఉండి... మీ ముందు కనిపిస్తున్న స్క్రీన్ ని చూస్తూ ఉండండి అని స్క్రీన్ ఆన్ అవుతుంది.

ఇద్దరికీ నుంచూనే ఓపిక లేక అక్కడే నేలమీద కూర్చుని ఏమై ఉంటుందా అని చూస్తూ ఉంటారు.

రకరకాల పువ్వులతో అలంకరణలో ఉన్న మెయిన్ గేట్ కనపడుతుంది. శిల్పా ఆ గేటు ఏమిటో గుర్తుపట్టలేక పోతుంది కానీ భార్గవి గుర్తు పడుతుంది.

  అలా చూడగానే భార్గవి టెన్షన్తో కంగారుగా చెమటలు తుడుచుకుంటుంది. ఏమైంది మమ్మీ అంటే కాసేపు సైలెంట్ గా ఉండు అని విసుక్కుని మళ్ళీ స్క్రీన్ చూస్తూ ఉంటుంది.

దారంతా కూడా పువ్వులతో పరిచి ఉంటుంది. సింహద్వారం దగ్గరికి వెళ్లేటప్పటికీ శిల్ప కూడా గుర్తుపట్టి మమ్మీ ఇది జైసింహ మాన్షన్ కదా అని అడుగుతుంది.

అవును అని తలపుతుంది. ఏం జరుగుతుంది మమ్మీ అంటే అదే చూస్తున్నాను అని స్క్రీన్ మీద నుంచి చూపు మరలచకుండా చెబుతుంది.

లోపల చూడగానే ఇద్దరు ఒక్కసారిగా నో, ఆ... అని నోటికి ఎలాంటి సౌండ్స్ వస్తుంటే అలా అరుస్తూ ఉంటారు.

ఇద్దరూ ఏమి చూశారు..

కథ కొనసాగుతుంది...
[+] 14 users Like SivaSai's post
Like Reply
manchi pattu meeda nadustundi story.
chala baaga raastunaru siva garu
Like Reply
Excellent update
Like Reply
Eagerly waiting for next
[+] 2 users Like rajusatya16's post
Like Reply
Ivvala leda bro update?
Regular updates alavatu ayya!!
Like Reply
Part - 55


ఇద్దరి బాధ వర్ణనాతీతం. అక్కడ దృశ్యం చూస్తూ ఉంటుంటే కడుపు రగిలిపోతుంది. ఇద్దరూ మల్లి స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారు.

అక్కడ అవని కుందనపు బొమ్మలాగా రెడీ అయి ఉంటుంది. నిండుగా పట్టు చీర కట్టి,  వంటి నిండా నగలు, మెడలో పచ్చని పసుపు తాడు,తల నిండా పువ్వులతో ఎలా అయితే ఉండకూడదు అని భార్గవి ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసిందో ఇప్పుడు అలాగే కనిపిస్తూ ఉంటే తట్టుకోలేక పోతుంది.

నేను ఇంకా చూడలేను ఈ చండాల్లాన్ని అని అనుకుంటూ భార్గవి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లడానికి చూస్తుంది. కానీ ఆ తలుపులు ఎంత ప్రయత్నించినా రావు.

అలాగే  గది మొత్తం కూడా స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి. ఎటు చూస్తున్న సరే అవని వైభోగమే కనపడుతూ ఉంటుంది. 

అవి చూడకూడదు అని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. వెంటనే ఒక వాయిస్ వినపడుతుంది.  ఇద్దరూ కళ్ళు పెద్దవి చేసి స్క్రీన్ చూస్తూ ఉండండి.

లేదు అంటే కళ్ళల్లో కారం పెట్టైనా సరే తెరిపిస్తాను అన్నమాట వినపడుతుంది. అది ఎవరిదో అర్థమయ్యే విక్రమ్ అని ఇద్దరు పెదవులు కలవరిస్తాయి.

ఇంక ఏ దారి లేక ఇద్దరూ అక్కడే కూర్చుని చూస్తూ ఉంటారు.  అవని నీ మాధవి, లలిత ఇద్దరు తీసుకొని వస్తూ ఉంటారు.

విక్రం కూడా అవని చీరకి మ్యాచ్ అయ్యే విధంగా శార్వాణి వేసుకొని ఉంటాడు.

ఇంట్లో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనపడుతూ ఉంటుంది. విక్రమ్ అవనీల్ని దంపతులుగా పూజ ముందు కూర్చోబెట్టి వ్రతం చేపిస్తూ ఉంటారు.

వ్రతం పూర్తయిన తర్వాత తాళినీ మార్పించి విక్రమ్ చేత వేయించుతారు. అవని ముఖంలో కనపడుతున్న సంతోషాన్ని చూస్తూ ఉంటే భార్గవికి నిలువెల్లా తగలబడిపోతుంది ఫీలింగ్ వస్తూ ఉంటుంది.

శిల్పకైతే దుఃఖం ఆగనంటూ బయటకి పొంగిపొర్లతూ ఉంటుంది. ఇది నాది,  ఇది నా స్థానం అని పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ ఉంటుంది.  

వ్రతం పూర్తయిన తర్వాత దంపతులగా పెద్ద వాళ్లందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. నేహా శ్రీ తో కలిసి ఇద్దరికి బట్టలు పెడుతుంది.

ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేహా అంటే.. పుట్టింటి తరుపున ఇస్తున్న చిన్న గిఫ్ట్ అవని. విక్రమ్ వైపు తిరిగి సార్ మా ఫ్రెండ్ చాలా అమాయకురాలు.

తెల్లని వన్ని పాలు అనుకునే పిచ్చి మాలోకం. తప్పు చేస్తే మందలించండి.  సరైన దారిలో పెట్టండి కానీ ఆ చేతులు మాత్రం ఎప్పుడూ వదలకండి.

అది ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటుంది ఆ ఊపిరిని అలాగే నిలబెట్టండి సార్ అని చెబుతోంది. ధనుంజయ్ కి ఆ మాటలు వింటుంటే ప్రాణం మెలిపెట్టినట్టుగా ఉంటుంది.

నా కూతురు అప్పగింతలు నేను చెప్పాలి కానీ ఒక స్నేహితురాలుగా నేహా చెబుతోంది. నేను మాత్రం ఒక బయటవాడి గా నిలబడాల్సి వచ్చింది.

విక్రమ్ నేహాతో ఈ చేయి ఎప్పటికీ విడిచి పెట్టేది లేదు. తప్పు చేసిన, ఒప్పు చేసిన నాతోనే ఉంటుంది.  నీ ఫ్రెండ్ పిచ్చి మాలోకం కాదు...

అతిమంచితనం.  త్యాగాలు ఎక్కువ చేసేస్తుంది. ఆ త్యాగాలు అన్నిటికీ కూడా నేను పులిస్టాప్ పెడతాను. నువ్వు అసలు టెన్షన్ పడకు అని చెబుతాడు.

అది నిజమేనా సార్ అని అవని భుజాన్ని తన భుజంతో కొడుతుంది. శ్రీ చొక్క పట్టుకుని వెనక్కి లాగి ఏంట్రా ఇద్దరూ కలిసి బట్టలు పెట్టారు.

అంతా ఓకేనా అంటే..  అంత లేదు రా మామ.  ఎలాంటి హింట్స్ ఇస్తున్నా సరే నా పిల్ల బల్బ్ వెలగడం లేదు. బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకుంటుంది అంతే అని చెబుతాడు.

వీళ్ళిద్దరూ చదివింది ఒకే కాలేజ్ కదా అంత తొందరగా బల్బులు వెలగవు కానీ.. కొంచెం స్పీడ్ అప్ పెంచుకోవాలి అని చెప్పి వదులుతాడు.

పూజారి గారు మాధవిని పిలిచి దత్తత ముహూర్తం దగ్గర పడింది తల్లి. మీ దంపతులు కూడా వచ్చి కూర్చుంటే ఆ పూజ కూడా పూర్తి చేపిస్తాను అని చెబుతారు.

దత్తత పూజ అనగానే భార్గవి శిల్పా ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ధనుంజయ్ మాత్రం తన ప్రాణం తన నుండి వేరు పడిపోతున్న బాధని అనుభవిస్తూ గుండెపైన చేయి వేసుకుంటాడు.

సత్యవతి గారు బాధగా కొడుకుని చూసి అవిని వైపు చూస్తారు. అవని వద్దు అంటే దత్తత ఎలాగైనా ఆపేస్తారు. అందుకనే వద్దు అంటుందేమో అన్న చిన్న ఆశతో మనవరాలు వైఫై చూస్తూ ఉంటారు.   

అవని మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. మాధవి, రమేష్  దంపతులతో కూర్చుని పూజ చేస్తూ ఉంటుంది.

ఇక సత్యవతి గారి ఆగలేక విక్రమ్ తో బాబు ఈ దత్తత అవసరమంటావా.. అక్కడ నా కొడుకుని చూడు విలువల్లాడిపోతున్నాడు కూతురు దూరమైపోతుంది అన్న బాధతో అని చెబుతారు.

విక్రమ్ ధనుంజయ్ వైపు చూస్తాడు. ఇటు అవిని వైపు చూస్తాడు. అవని మొఖంలో కనబడుతున్న సంతోషాన్ని చూపిస్తూ ఎప్పుడైనా అవని ఆ ఇంట్లో....ఆ సంతోషంలో ఒక పర్సంటేజ్ అయినా ఉందా మామ్మ గారు అని అడుగుతాడు.

అవిని మొఖంలో కనబడుతున్న సంతోషాన్ని చూసి సత్యవతి గారు కూడా ఏమీ మాట్లాడలేక పోతారు. ఇప్పుడు కూడా దత్తత ఆపేయమంటారా ?

ఆపేసి అవినికి మళ్ళీ ఆ బాధనే చూపించమంటారా అని సూటిగా అడుగుతాడు.

బాబు అని బాధగా పిలుస్తారు.  నేను అన్నది నిజమే కదా మామ్మగారు మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి మారాడో లేదో నాకు తెలియదు కానీ...

అవినికి అసలు నమ్మకం లేదు.  నమ్మకం లేని మనుషుల మధ్య మళ్లీ నా భార్యని ఉంచలేను. నేను రాకముందు తన జీవితం ఎలాగ ఉన్నా...

నేను వచ్చిన తర్వాత నా భార్య జీవితంలో సంతోషాలు మాత్రమే ఉండాలి.  జీవితాంతం సరిపడే బాధలన్నీ తన పెళ్లికి ముందే అనుభవించేసింది .

ఇక ముందు ముందు ఎవరి వల్ల కూడా అవి అనుభవించడానికి వీల్లేదు అని స్క్రీన్ వైపు కూడా తిరిగి చెబుతూ ఉంటాడు.

ఆ మాటల్లో వచ్చిన వేడికి భార్గవి ఒంటిలో నుంచి చెమటలు బయటికి వస్తాయి.  ఆ మాటలు వాళ్ళిద్దర్నీ ఉద్దేశించి చెప్పినట్టుగానే అనిపిస్తాయి.      

ఇక్కడ సత్యవతి గారు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తారు. దత్తత ప్రోగ్రాం కూడా పూర్తయిపోతుంది.

రమేష్ అవని చుట్టూ చేతులు వేసి ఇదిగో అల్లుడు నా బంగారాన్ని నీ చేతుల్లో పెట్టాను.  పొరపాటున కూడా నా ఇంటి యువరాణి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాకూడదు .

ఇది రిక్వెస్ట్ అనుకున్నా పరవాలేదు.. వార్నింగ్  అనుకున్నా పరవాలేదు అల్లుడు అని చెబుతారు.

కళ్యాణ్ వచ్చి మరొక వైపు నుంచి అవిని చుట్టూ చేతులు వేసి నీ ఇంటి యువరాణి మా ఇంటి మహారాణి బావ.

కళ్ళల్లో నుంచి కన్నీళ్లే కాదు కలత కూడా రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటాము. ఇది జై సింహ ఫ్యామిలీ తరఫునుంచి నీకు ఇస్తున్న వాగ్దానం అని మాట ఇస్తారు. 

దూరం నుంచి చూస్తున్న ధనంజయకి ఆ మాటకే చాలా తృప్తిగా అనిపిస్తుంది.

నా కూతుర్ని నేను దగ్గరుండి అప్పగింతలు చెయ్యకపోయినా జాగ్రత్తగా చూసుకునే అత్తింటి వారి వచ్చారు..

ఈ పెళ్లితో నా కూతురికి ఒక చక్కటి విలువలు కలిగిన పుట్టిల్లు కూడా దొరికింది. దంపతులిద్దర్నీ కూర్చోబెట్టి ఒకే ఆకులో ఇద్దరికీ భోజనం వడ్డిస్తారు. 

ముందు స్వీట్ ఇద్దరినీ ఒకరికొకరు తినిపించుకోమని చెబుతారు. నివి అక్కడకి వచ్చి పెద్ద వాళ్ళందరూ పక్కకు తప్పకుంటే  మేము హ్యాండిల్ చేస్తామని...

పెద్దవాళ్ళు అందరికీ అక్కడ కూర్చునేలా కుర్చీలు వేసి కూర్చోబెట్టి ఒక్కొక్కటి నివి, నేహా వడ్డిస్తూ ఉంటారు.

ప్రతి ఐటమ్ ఇద్దరూ తినిపించుకోవాలని గొడవ చేసి మరి తినిపించుకునేటట్టు చేస్తూ ఉంటారు. అవని సిగ్గుపడుతూ విక్రమ్ కి తినిపిస్తూ ఉంటుంది.

విక్రమ్ అవినికి తినిపిస్తూ.. చెవులో ఫీల్ ఫ్రీ అండ్ ఎంజాయ్ దిస్ మూమెంట్ అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు.

ఇదంతా చూస్తున్న ధనుంజయ్ కి మాత్రం కడుపు నిండిపోతూ ఉంటుంది.  అక్కడ  భార్గవి,శిల్పాకి మాత్రం కడుపులో యాసిడ్ పోసినంతగా మండిపోతు ఉంటుంది.

సత్యవతి గారు ధనుంజయ్ దగ్గరికి వచ్చి ఇంకా వెళదామా అంటే.. ఉండమ్మా ఆఖరి నిమిషం దాకా ఉండి చూసి నా కూతురి ఇంటి భోజనం తిని వెళదాము అని చెబుతాడు.

నీకు బాధగా లేదురా అంటే...బాధ ఎందుకమ్మా సంతోషంగా ఉంది.  తండ్రిగా నేను ఇవ్వలేనిది భర్తగా విక్రమ్ ఇచ్చాడు.

నిజంగా నేను ఒక అసమర్థుడైన తండ్రినే కదమ్మా. కూతురిని నేను ప్రేమించాను,  నా భార్య అంటే నాకు ప్రాణం అని అనుకున్నాను కానీ...

నా కూతురి కష్టాన్ని నేను చూడలేకపోయాను.  కానీ విక్రమ్ ఒక్క రెండు రోజులకే పరిస్థితి ఏంటి అని అంచనా వేసి భార్య దుఃఖాన్ని పూర్తిగా తీసివేశాడు.

ఇలాంటి అల్లుడు కాకడపెట్టి వెతికిన దొరకడేమో కదా.. ఏదో ఒక రోజు నా అల్లుడే నన్ను నా కూతురి దగ్గరికి చేరుస్తాడు అన్న నమ్మకం ఉందమ్మా అని కూతుర్ని అల్లుడి చూస్తూ ఉంటాడు.

అది జరగాలని నేను ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది సత్యవతి గారు కూడా మనసులో దండం పెట్టుకుంటారు.

అతిథులు అందరి భోజనాలు అయ్యే వెళుతున్నప్పుడు అందరికి సంతోషంగా వీడ్కోలు చెబుతారు.

ధనుంజయ్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి చేతులు ఎత్తి నమస్కరించి మీ సంస్కారానికి ఏమిచ్చినా తక్కువే...
ఒక్క నమస్కారం చేయడం తప్ప.. నేను ఏమీ చేయలేను. వీలైతే నన్ను క్షమించండి అని చెప్పి వెళదామా అమ్మ అని తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళిపోతాడు.

వెళుతున్న ధనుంజయ్ ని చూసి కళ్యాణ్ గారు కూడా లోపలికి వెళ్ళిపోతారు. విక్రమ్ పెళ్లి తర్వాత ఇన్ని రోజులకి ఆ ఇంటిలో మళ్లీ సంతోషాలు వెనక్కి తిరిగి వచ్చాయి.

అవిని నీ రెస్ట్ తీసుకుందాగాని పదా అని మాధవి గదిలోకి తీసుకువెళ్లి చీర, నగలు మార్చి లైట్ వెయిట్ సారీ ఇచ్చి కట్టుకోమని చెబుతుంది.

అందరూ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత విక్రమ్ స్క్రీన్ వైపు తిరిగి ఎలాగుంది భార్గవి నా గిఫ్ట్ అని అడుగుతాడు.
[+] 9 users Like SivaSai's post
Like Reply
Part - 56


ఎలా ఉంది భార్గవి నా గిఫ్ట్ అని పొగరుగా అడుగుతాడు. దానికి విక్రమ్ అని గట్టిగా అరుస్తుంది. ష్... అరవకు నాకు సౌండ్ ఎలర్జీ...

బంగారంలాంటి నా పెళ్ళాన్ని టార్చర్ చేసి నా నుంచి దూరం చేయాలి అనుకుంటావా..ఎవరెవరుతో తిరిగిన నీ కూతురుని నాకు అంటగట్టాలి అనుకుంటావా...

నీకు ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఆడుకోవాలి అనుకుంటావు... నా ఇంటిలో పనిమనిషి గా ఉన్నాన్ని రోజుల్లోనైనా నీ కూతురు రియలైజ్ అవుతుంది అనుకున్నాను.

పనిమనిషి నుంచి ఓనర్ అవ్వడానికి ప్రయత్నాలే చేసింది గాని రియాలిటీలోకి రాలేదు.

రియాలిటీ లోకి వచ్చి తన తప్పు తెలుసుకుని ఉండుంటే ఎట్లీస్ట్ మనిషిగా నైనా బయట ఉండేది.  ఇప్పటికీ కూడా ఇది నా ప్లేస్ అని అరుస్తుంది అంటే మీలో మార్పు వస్తది అన్న నమ్మకం నాకు లేదు.

నీలో మార్పు వచ్చేదాకా మీరు అక్కడే చెక్కభజన చేసుకోవాల్సిందే అని వెటకారంగా అంటాడు. దానికి భార్గవి కోపంగా ఊగిపోతుంది.

  నేను బయటికి రావాలి... నీ పెళ్ళాన్ని మళ్ళీ మునిపటి స్థితికి తీసుకు రాకపోతే నా పేరు భార్గవి ఏ కాదు..

అబ్బఅబ్బా.... ఏమి పగటి కలలు కంటున్నావు...    నేను పక్కన ఉండగా కూడా... నా భార్యకి ఆ స్థితి వస్తుంది అనుకుంటున్నావా..

పెళ్లికి ముందు అంటే అందరూ ఉండి కూడా ఏకాకిలా  బతికింది.  ఇప్పుడు అత్తింటి  బలంతో పాటు పుట్టింటిబలం కూడా ఉంది.

ఏమిటి అన్నట్టుగా చూస్తుంది. ఇంకా నీ కన్నింగ్ బుర్రకి అర్థం కాలేదా అని... ఈ రోజు దత్తత కార్యక్రమం జరిగింది కదా అంటే ...

నా భార్యకి పుట్టిల్లు ఉన్నట్టే కదా... తల్లి తండ్రి తో పాటు ఒక అన్న కూడా ఉన్నాడు. ఇంక నీ భర్తగాని  భర్త కూడా రియలైజ్ అయ్యాడు.

అవని వద్దు వద్దు అని దూరంగా గెంటేసిన సరే... బంక లాగా వచ్చి అంటుకుని ఉంటాడు. 

ఇప్పుడు చెప్పమ్మా నా గిఫ్ట్ ఎలా ఉంది అని అడుగుతాడు. భార్గవి పళ్ళు నూరుకుంటూ చూస్తూ.. ఇల్లు అలకగానే పండగ కాదు విక్రమ్.

నా భర్తకి అన్ని నిజాలు తెలిసి తట్టుకోలేక ఏదో ఇప్పుడు అలా బిహేవ్ చేస్తున్నారు కానీ... ఒక్క వారం రోజుల్లో చూడు...

నా భర్త ఏదో ఒక విధంగా నన్ను బయటికి తీసుకుని వెళ్తారు.  అప్పుడు మళ్లీ నేనేంటో మీ భార్యాభర్తలిద్దరికీ చూపిస్తాను అని పొగరుగా మాట్లాడుతుంది.

దీనినే చింత చచ్చిన పులుపు చావలేదు అని అంటారు. నీకు ఒక  షాకింగ్ న్యూస్ చెప్పనా... నీ భర్త కానీ భర్త ఆస్తి మొత్తం ఎప్పుడో  అవని పేరు మీద రాసేసాడు.

ఇంక మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఏం చేస్తాడు చెప్పు. ఊరు తీసుకెళ్ళి అక్కడ కూలి పనులకు పంపించాలి మిమ్మల్ని లేదు అంటే...

ఇక్కడ ఎవరింట్లో అయినా సర్వెంట్ డ్యూటీ ఇప్పించాలి. అసలే మీరు సుకుమారులు కదా..  బయటకు వచ్చి ఆ పనులు చేయలేరు ఏమో...

జైల్లో అయితే కాస్త ఫుడ్ అయినా దొరుకుతుంది కదా చాలా ఎగతాళిగా మాట్లాడుతాడు.  

ఆ మాటలకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి.  తల పట్టుకుని ఏం చెబుతున్నావ్. మొత్తం అవిని పేరు మీద రాసేసారా...

అలా ఎలా కుదురుతుంది. ఆస్తిలో సగం వాటా నా కూతురికి కూడా ఉంది కదా.. నేను వెంటనే కోర్టులో కేసు వేస్తాను.

ఎలా నా కూతురికి ఇవ్వకుండా ఉంటారో చూస్తాను కోపంలో పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ ఉంటుంది.  శిల్ప మాత్రమే బిగుసుకుపోయి అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా పిచ్చి చూపులు చూస్తూ    ఉంటుంది.

ఆ మాటలకు విక్రమ్ గట్టిగా నవ్వుతూ అయ్యో పిచ్చి భార్గవి..  మీ ఆయన అంత పకడ్బందీగా నీతో సంతకాలు తీసుకున్న తర్వాత కూడా నీ కూతురికి ఆస్తిలో వాటా వస్తుంది అనుకుంటున్నావా...

చిల్లి గవ్వ కూడా రాకుండాఉండే విధంగా డాక్యుమెంట్స్ తయారు చేయించి మీ ఇద్దరు చేత సంతకాలు తీసుకున్నాడు. అయినా నీకు 100 కోట్లు అప్పజెప్పాడు కదా..  ఇంకేంటి నొప్పి.

ఎక్కువగా అరిచే గోల చేసావే అనుకో.. ఆ వంద కోట్లు కూడా ఉష్ కాకి అయిపోతాయి. ప్రశాంతంగా జైల్లో చిప్ప కూడు తింటూ...

చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తూ.. కృష్ణా, రామా అనుకుంటూ..కూతిరి జీవితం ఎలా ఒక గాడిన పెట్టాలని ఆలోచిస్తూ గడిపేసేయ్.

అసలే ఈరోజు మాకు తొలిరేయి. బోళ్ళు పనుంది అబ్బా నాకు అని సిగ్గుపడుతూ ఫోన్ కట్ చేస్తాడు.     వెంటనే స్క్రీన్స్ అన్ని ఆఫ్ అయ్యిపోతాయి.

భార్గవికి ఒక నిమిషం మాట్లాడాలో, ఏం జరుగుతుందో అర్థం కాక  పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. మమ్మీ అని శిల్పా కదుపుతుంది.

హ... ఏంటి అని కూతురు వైపు చూస్తుంది. మనిద్దరం ఇంకా ఇలా జైల్లోనే మగ్గి పోవాల్సిందే నా...  ఇంత చేసింది నువ్వు ఆస్తిని అనుభవించాలి, నేను మోడల్ గా ఎదగాలి అని...  కానీ ఇద్దరం ఇక్కడ కూర్చుని మన భవిష్యత్తు ఏమిటా ఆలోచిస్తున్నాము.

మనిద్దరం ఇక్కడే ఉండిపోతే నేను టాప్ మోడల్ గా ఎప్పటికి ఎదుగుతాను మమ్మీ అని ఇంకా భవిష్యత్తు మీద ఆశ చావక అడుగుతుంది.

కూతురి అమాయకత్వానికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక భార్గవి తల పట్టుకుంటుంది. మాట్లాడవేంటి మమ్మీ అని.. నాకు ఒక ఐడియా వచ్చింది అని తల్లి వైపు మెరిసే కళ్ళతో చేస్తుంది.

ఏమిటి అని నీరసంగా చూస్తుంది. నీకు డాడీ వందకోట్లు ప్రాపర్టీ ఇచ్చారు కదా..  అందులో కొంత అమౌంట్ తో మనం బెయిల్ అరేంజ్ చేసుకుని బయటికి వెళ్లి పోదాము.

వెళ్ళిన తర్వాత డాడీ ని ఎలాగోలా  కన్విన్స్ చేసి నువ్వు ఆ ఇంట్లో ఉండు. నేను మోడల్ గా ట్రై చేస్తాను ఎలా ఉంది నా ఐడియా అని అడుగుతుంది.

నీ ఐడియా వినడానికి బాగానే ఉంది కానీ మన దగ్గర అంత డబ్బు ఉండాలి కదా అని అంటుంది.  అలా అంటావేంటి..

డాడీ నీకు ఇచ్చారు కదా అంటే.. అవి పేపర్ల వరకే నా చేతికి ఏమీ ఇవ్వలేదు. వాటి గురించి అడిగితే ఇన్ని సంవత్సరాలు మనం అనుభవించిన లగ్జరీ లైఫ్ ఆ 100 కోట్లు కన్నా ఎక్కువే అని చెప్పారు అని తల పట్టుకుంటుంది.

లేదు లేదు నువ్వు అబద్దం చెబుతున్నావు మమ్మీ. డాడీ నాకు చాలా క్లియర్ గా చెప్పారు. ఆ ప్రాపర్టీ మొత్తం నీకు హ్యాండ్ అవర్ చేశాను.మొత్తం అంతా నీ దగ్గరే ఉంది ఉన్నారు.

ఆఖరికి నీకు కూతురికి ఇవ్వడానికి కూడా మనసుప్పడం లేదా.  ఈ జైలు నుంచి మనం బయటకు వెళ్లడం కన్నా నీకు డబ్బే ఎక్కువైపోయిందా మమ్మీ అని ఏడుస్తుంది.

అయ్యో శిల్పా నేను నిజమే చెబుతున్నాను. మీ డాడీ ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. ఆ పేపర్స్ మీద సంతకం చేయకపోతే నీ లైఫ్ నాశనం చేస్తాను చెప్పారు అని బాధగా ఉంటుంది.

నాశనం చేయడం అంటే మోడల్గా ఎదగనివ్వకపోవడం అని అయోమయంగా అడుగుతుంది.

భార్గవి విసుగ్గా మోడల్గా ఎదగకకపోతే లైఫ్ లేదు అనుకుంటున్నావా..  అంతకన్నా నీచమైన పని చేస్తాను అన్నారు అంటే.. క్లియర్ గా చెప్పు మమ్మీ అని అడుగుతుంది.

నీకు ఎలా చెప్పను శిల్ప.. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని తెరిచి నీ రూమ్ లోకి ప్రతిరోజు ఒక ఎయిడ్స్ పేషెంట్ ని పంపిస్తాను అన్నారు అని కళ్ళు తెరుస్తుంది.

ఆ మాటలకి శిల్పా షాక్ కొట్టిన కాకి లాగా బిరుసుకుపోయి భార్గవి వైపు చూసి ఏమంటున్నావు మమ్మీ అని వణికే స్వరం తో అడుగుతుంది.

నేను నిజమే చెబుతున్నాను శిల్ప. మీ నాన్నగారు అన్నా మాటలు తట్టుకోలేకే నేను సంతకం చేశాను. అంతేగాని ప్రాపర్టీ ఏమీ మనకు ఇవ్వలేదు అని చెబుతుంది.

నువ్వు అబద్ధం చెబుతున్నావు మమ్మీ.  డాడీ అంతా నీచమైన వర్డ్స్ యూస్ చేయరు నాకు తెలుసు అని అంటుంది.

నేను నిన్నటి వరకు అలాగే అనుకున్నాను కానీ ఆయన మాట్లాడిన ప్రతి మాట నాకు నరకం లాగా ఉంది. నన్ను భార్య కాదన్నారు. నిన్ను కూతురు కాదన్నారు. అవని ఒక్కతే కూతురు అన్నారు అని బాధగా శిల్ప వైపు చూస్తూ ఉంటుంది.

ధనుంజయ్ అన్న మాటలను కూడా శిల్ప గుర్తు చేసుకుంటుంది. భార్గవి వైపు చూసి నిన్ను ఒక మాట అడుగుతాను నిజం చెబుతావా సూటిగా అడుగుతుంది.

అడుగు శిల్ప అనగానే...నిజంగా డాడీ నా రూమ్ లోకి అలాంటి పేషెంట్స్ ని పంపిస్తాను అన్నారా అని అడుగుతుంది.  నేను నిజమే చెబుతున్నాను శిల్పా అని చెయ్యి పట్టుకుని బాధగా ఉంటుంది.

ఎందుకు మమ్మీ అన్ని అబద్ధాలు చెబుతున్నావు.  డాడీ నాతో కూడా చెప్పారు అవని ఒక్కతే నా కూతురు. అప్పుడు ఎంత బాధ పడ్డారో నేను చూసాను.

మనం అవని విషయంలో చేసిన తప్పుకి డాడీ బాధపడ్డారు గాని.. నా విషయంలో అంతా బాడ్ వర్డ్స్ అయితే మాట్లాడరు.

నువ్వే కావాలని చెబుతున్నావు.  ఎందుకు మమ్మీ..  కూతురు కన్నా నీకు డబ్బే ఇంపార్టెంట్ అయిపోయిందా..
అవునులే ఆ డబ్బు కోసమే డాడీని చీట్ చేసావు.

ఇంక నన్ను చీట్ చేయడానికి ఏముందలే అని భార్గవి చేయు విదిల్చుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లి డోర్ నాక్ చేస్తుంది.

ఆ మాటలు వినగానే భార్గవి బిరుసుకుపోయి కూతురు వైపు చూస్తూ ఏమంటున్నావు నువ్వు అని తడబడుతూ అడుగుతుంది.

నేను నిజమే కదా చెబుతున్నాను.డాడీ మనల్ని ఏమీ చీట్ చేయరు. ఆయన మాటంటే మాట మీద నిలబడతారు.

నీకు 100 కోట్లు ఇచ్చిన సరే ఆ డబ్బులు నాకు ఇవ్వడానికి నీకు మనసు రావడం లేదు.ఏం చేసుకుంటావు మమ్మీ ఐ హేట్ యు అని ఏడుస్తుంది.

నిజంగా నాకు ఇవ్వలేదు శిల్పా అని బాధగా ఉంటుంది.. ప్లీజ్ మమ్మీ ఇంకా అబద్ధాలు చెప్పొద్దు నేను వినలేను అని అంటూ ఉండగానే డోర్స్ ఓపెన్ అవుతాయి.

శిల్పా ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా తనకి కేటాయించిన రూమ్ లోనికి వెళ్ళిపోతుంది.
వెళుతున్న కూతురు వైపే చూస్తూ నిలబడిపోతుంది. ఇంకా నువ్వు కూడా వెళ్లొచ్చు అని జైలర్ వచ్చి చెబుతాడు.

భార్గవి గమ్యం ఎటువైపు...

కథ కొనసాగుతుంది...
[+] 12 users Like SivaSai's post
Like Reply
Superb update
Like Reply
wonderful update
Like Reply
Chala baga rastunnaru
Like Reply




Users browsing this thread: Ak0408, Jola, 2 Guest(s)