Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 36
అడవిలో సహదేవుడితో పాటు వెళుతూ తన దగ్గర ఉన్న అభీర్ భుజం మీద ఉండే సింబల్ బయటకు తీసి చూపించాడు శివమణి.
ఆ సింబల్ ని బయటకు తీయడంతోనే ఆకాశం నుంచి వేగంగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడానికి సిద్ధమయ్యింది సింబా.
*************************
తమ మీదకి భయంకరంగా అరుస్తూ ఆకాశం నుంచి వస్తున్న భారీ పక్షిని చూసి భయంతో కళ్ళు మూసుకున్నారు సర్పరాజ్ వాళ్ళు.
అంతలో "సింబా ఆగు!" అని అరుపు వినిపించడంతో పక్షి అరుపు ఆగడం చూసి నెమ్మదిగా కళ్ళు తెరిచి "మనకు ఎవరో హెల్ప్ చేయడానికి వచ్చారు." అని ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు గోకుల్.
ఎదురుగా ఏడు అడుగుల ఎత్తు కండలు తిరిగిన భుజాలు చూడడానికి సూపర్ మెన్ లాగా ఉన్న వ్యక్తిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అందరూ.
ఆ వ్యక్తిని చూడగానే దగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చుని తలవంచి "వందనాలు నాయకుడా?" అని చెప్పాడు సహదేవుడు.
ఆ మాట విని దగ్గరికి వస్తూ "హాయ్ సార్! మీరేనా వీళ్ళ నాయకుడు శంభు దొర!" అని అడిగాడు సర్పరాజ్.
"అవును!" అని అక్కడ ఉన్న వారి వైపు చూస్తూ "మీరందరూ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు?" అని శివమణి చేతిలో ఉన్న పచ్చబొట్టు బొమ్మ చూసి "అది మీకు ఎక్కడ దొరికింది?" అని అనుమానంగా చూస్తూ అడిగాడు శంభు.
ఆ మాట విని సంతోషంగా ముందుకు వెళ్లి "ఈ పచ్చ బొట్టు గురించి మీకు తెలుసా? ఇది చేతి మీద ఉన్న మనిషిని మీరు ఎప్పుడైనా చూసారా?" అని ఆత్రుతగా అడిగాడు శివమణి.
శివమణి చేతిలో ఉన్న జంతు తోలు తీసుకుని చూస్తూ "ఈ గుర్తు ఒంటి మీద ఉన్న మనిషి ఇక్కడ ఉంటాడు అని మీకు ఎవరు చెప్పారు?" అని అడిగాడు శంభు.
"మేము చరిత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము, ఆ ప్రయత్నంలో బామ్రఘడ్ అడవి ప్రాంతంలో ఉన్న గుహలలో ఇవి కనపడ్డాయి, దుర్మార్గుల చేతికి వెళ్లకుండా వీటిని కాపాడి దాంట్లో ఉన్న చరిత్ర తెలుసుకుని ఆ గుర్తు ఉన్న వ్యక్తికి అప్పగించడానికి వచ్చాము." అని చెప్పాడు శివమణి.
ఆ మాటకి చిన్నగా నవ్వి "వీటిని చూసి ఏ చరిత్ర తెలుసుకున్నారు?" అని అడిగాడు శంభు.
"మాకు దొరికిన వాటి ఉన్నదానిని బట్టి చత్రపతి శివాజీ మహారాజ్ దళంలో పనిచేసిన జారువా తెగకు చెందిన అభిర్ సేన గురించి తెలుసుకున్నాము, ఆ నాయకుడి వంశనికి చెందిన వారికి ఇవ్వడానికి వీటిని తీసుకువచ్చాము, వారు ఇక్కడే జీవిస్తున్నారని మాకు తెలిసింది." అని చెప్పాడు సర్ఫరాజ్.
"ఈ పత్రాలలో చరిత్ర అదేవిధంగా రాసి ఉందా?" అని అడిగాడు శంభు.
"అంటే! కచ్చితంగా అలా అని రాసి లేదు, దాంట్లో ఉన్న భాష మాకు సరిగ్గా అర్థం కాలేదు మాకు తెలిసినంతవరకు చదివి అర్థం చేసుకున్నాము." అని చెప్పాడు శివమణి.
"ఆదికాకుండా శంభు దొర! ఈ జారువ తెగకు చెందిన వారు కొంతమంది అండమాన్ దీవులలో ఉంటున్నారు వాళ్లు మనుషులతో కలవకుండా అక్కడికి వచ్చిన వారిని చంపేస్తున్నారు నేను ఈ దేశ నాయకులలో ఒకడిని అందుకే ఆ విషయం కూడా చెబుదామని వచ్చాము." అని చెప్పాడు అభిజిత్.
"జారువా తేగా వారి దగ్గరికి ఆశతో వెళితే మరణం తప్పదు, మీరు కూడా ఇక్కడికి ఏదైనా ఆశతో వస్తే, ఆ తెగ వారికి కనిపించక ముందే వెళ్లిపోండి." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని "అంటే! ఆ తెగ వారు ఇక్కడ జీవిస్తున్నారు కదా!" అని ఆత్రుతగా అడిగాడు గోకుల్.
"అవును! మీ దగ్గర ఉన్న వస్తువులు నాకు ఇవ్వండి నేను వాళ్లకి అందజేస్తాను ఇక మీరు ఇక నుంచి వెళ్లొచ్చు!" అని చెప్పాడు శంభు.
ఆ మాట విని కంగారు పడి "మేము వారిని ఒకసారి కలిసి వారి చరిత్రను బయట ప్రపంచానికి తెలిసేలాగా చేయాలి అనుకుంటున్నాము." అని చెప్పాడు సర్ఫరాజ్.
"కొన్ని సత్యాలు మరుగున ఉంటేనే అందరికీ మంచిది." అని చెప్పాడు శంభు.
"మీరు చెప్పింది కూడా నిజమే! కానీ చత్రపతి శివాజీ గారికి సహాయం చేసినా వారి వంశం వారిని చూడాలని చాలా ఆశతో వచ్చాము." అని చెప్పాడు గోకుల్.
"మీకు తెలిసిన విషయం తప్పు, అభీర్ సేన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారికీ సహాయం చేసే అంతటివారు కాదు, శివాజీ గారు ధర్మం వైపు నిలబడ్డారు, వారితో పాటు ఉన్నారు కాబట్టి అభిర్ సేన కి అంత శక్తి వచ్చింది." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని శంభు వైపు చూస్తూ "మీరు ఆ సేనకు సంబంధించిన వారసులని నాకు అర్థమైంది. మాకు మీ గురించి తెలుసుకోవాలని ఉంది." అని అడిగాడు శివమణి.
ఆ మాటకు ఆగి దూరంగా ఉన్న కొండల వైపు చూసి ఆలోచిస్తూ "రేపు ఉదయం మా యువరాజుకి పట్టాభిషేకం మమ్మల్ని ఎవరు ఏది అడిగినా సరే తప్పకుండా తీరుస్తాము, మీరు మంచికి వచ్చారో, చెడుకి వచ్చారో నాకు తెలీదు ఇది దైవ నిర్ణయం అనుకుంటాను నాతో పాటు రండి." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని సంతోషంగా శంభు వెనకాల వెళుతూ, శివమణి వైపు చూసి "మనం మంచి టైమ్ లో వచ్చాము." అని స్లో గా చెప్పాడు గోకుల్.
ముందు నడుస్తూ "మీరు చెప్పింది నిజమే! ఇక్కడికి మీరు వచ్చిన ముహూర్తం చాలా బాగుంది లేకపోతే ఈ సమయానికి మా సహదేవుడి చేతిలో చనిపోయేవారు." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని "ఏంటి? సహదేవుడి చేతిలో చనిపోయే వాళ్ళమా? ఆ కుర్రాడు మా ఐదుగురిని చంపేయగలడా?" అని వెటకారంగా అడిగాడు జాకి.
ఆ మాటకి తల వెనక్కి తిప్పి జాకీ వైపు చూస్తూ "మనిషిని చూసి ఎప్పుడూ అంచనా వేయకూడదు, కాశీ పట్టణానికి భైరవుడు ఎలాగో, మా బైరా ప్రాంతానికి సహదేవుడు అలాగా తనను దాటి పక్క అడవిలో జంతువు కూడా ఇక్కడకు రాలేదు, తన అనుమతి లేనిదే ఇక్కడ నుంచి ఎవరు బయటకి కూడా వెళ్ళలేరు. " అని సీరియస్ గా చెప్పాడు శంభు.
ఆ మాటకి శంభు వైపు భయంగా చూస్తూ గుటకలు మింగాడు జాకీ.
అంతలో హడావుడిగా పరిగెత్తుకుంటూ శంభు దగ్గరకు వచ్చి "నాయక! పక్కా అడవిలో నుంచి రెండు సింహాలు ఇడకు వచ్చి మన జంతువుల్ని వేటాడుతున్నాయి." అని ఆయాస పడుతూ చెప్పాడు గూడెం లో ఉండే మనిషి.
ఆ మాట విని సహదేవుడు వైపు చూసి "వెళ్లి వాటి సంగతి చూడు నేను కూడా వస్తాను." అని చెప్పాడు శంభు.
"సరే నాయక!" అని చెప్పి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు సహదేవుడు.
"ఏంటి? ఇప్పుడు ఆ రెండు సింహాలతో సహదేవుడు ఫైటింగ్ చేస్తాడా?" అని డౌట్ గా అడిగాడు గోకుల్.
"మీ దృష్టిలో అవి క్రూర మృగాలు, మా దృష్టిలో నోరులేని ముగా జీవాలు, నోరు ఉన్న మనిషే తప్పు దారిలో వెళుతున్నాడు, అవి వెళ్లడంలో తప్పులేదు కదా, వాటిని మంచిదారిలోకి తీసుకువస్తాము అంతేకానీ దండించాము పదండి మనం కూడా వెళదాము." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని "ఏంటి? ఇప్పుడు మనం ఆ సింహాల దగ్గరికి వెళ్లాలా?" అని కంగారుగా అడిగాడు అభిజిత్.
"మనం ఇప్పుడు ఆయన వెనకాల వెళ్ళకపోతే, ఇక్కడ ఉన్న ఏ పులికో ఆహారం అవుతాము పదండి." అని చెప్పాడు శివమణి.
"కరెక్ట్ ఈ అడవిలో నుంచి మనం ప్రాణాలతో బయటకు వెళ్లాలంటే వీళ్ళతో పాటే ఉండాలి." అని శంభు వెనకాలే వెళ్లాడు గోకుల్.
అక్కడి నుంచి వేగంగా పరిగెత్తిన సహదేవుడు వైపు చూసి 'జింక పిల్లలాగా పరిగెత్తాడు, మచ్చిక చేసుకున్న పులి కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఆ సింహంతో వీడు ఏం చేస్తాడు.' అని మనసులో అనుకున్నాడు జాకి.
రెండు సింహాలు అక్కడ ఉన్న జింకల గుంపు వెనకాల పరిగెత్తడం చూసి వేగంగా వెళ్లి వాటి ముందు నుంచుని కోపంగా చూస్తూ వింత శబ్దం చేశాడు సహదేవుడు.
పరిగెడుతున్న జింకలు ఆగి సహదేవుడు వెనకాల నుంచుని సింహం కాలు కింద ఉన్న జింక పిల్లని చూస్తూ ఉన్నాయి.
సహదేవుడు వైపు చూసి కోపంగా గర్జిస్తూ కాలి కింద ఉన్న జింకపిల్లని నోటితో పట్టుకోబోయింది ఒక సింహం.
అక్కడికి వస్తూ జరిగేది చూసి "అయ్యో పాపం! జింక పిల్ల చచ్చిపోయింది." అని అన్నాడు గోకుల్.
ఆ మాట పూర్తయ్యే లోపు వేగంగా వెళ్లి సింహం కాలి కింద ఉన్న జింకపిల్లని తీసుకుని పరిగెత్తడు సహదేవుడు.
అది చూసి "వార్ని..సింహం పంజా కింద ఉన్న జింక పిల్లని కాపాడువాడు, అంటే వీడు మామూలువాడు కాదు." అని చెప్పాడు జాకి.
సహదేవుడు వైపు రెండు సింహాలు కోపంతో పరిగెట్టడం చూసి నోటితో ఒక భయంకరమైన శబ్దన్ని చేసాడు శంభు.
ఆ శబ్దం విని ఒళ్ళు జలదరించి చెవులు గట్టిగా మూసుకున్నారు గోకుల్ వాళ్ళు.
ఆ శబ్దం రావడంతో పరిగెడుతున్న సింహాలు రెండు ఆగి వెనక్కి తిరిగి శంభు వైపు పరిగెత్తుకుంటూ వచ్చాయి.
భయంకరంగా వస్తున్న రెండు సింహాలను చూసి శంభు వెనక్కి వెళ్లి దాక్కుని గోకుల్ వైపు చూసి
"ఒరేయ్! నీ సరదా మన దూల తీర్చేస్తుంది రా.. ఎప్పుడు ఏ జంతువుకి ఆహారం అవుతామో కూడా అర్థం కావడం లేదు." అని చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు అభిజిత్.
"మరి థ్రిల్లింగ్ అంటే ఇలాగే ఉంటుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ విషయాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి." అని నవ్వుతూ చెప్పాడు గోకుల్.
రెండు సింహాలు మీదకి వస్తున్న బెదరకుండా వాటి కళ్ళలోకి చూస్తూ ధైర్యంగా నుంచున్న శంభు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు శివమణి.
అంతలో ఆకాశంలో అరుపు వినపడడంతో తల పైకెత్తి చూసి "మళ్లీ సింబా ఇక్కడికి వస్తున్నాడు ఏంటి?" అని అడిగాడు సర్పరాజ్.
ఆకాశంలోకి చూస్తూ "ఆ సింబా కాళ్లతో ఒక కుర్రాడిని తీసుకువస్తుంది." అని ఆశ్చర్యంగా చెప్పాడు శివమణి.
సింబా కాళ్ళని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఆకాశంలో వేగంగా వచ్చి శంభు ముందు దిగి మీదకి వస్తున్న సింహాల వైపు పరుగెత్తి ఎత్తిన పంజాని తన చేత్తో పట్టుకుని రెండు సింహాలను దూరంగా గిరాటు వేశాడు ఆ కుర్రాడు.
ఆ కుర్రాడి వైపు చూస్తూ బుజం మీద తను వెతుకుతున్న పచ్చబొట్టు కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తూ "అభీర్!" అని మనసులో అనుకున్నాడు శివమణి.
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
inka fast ga kadultundi story!! :)
•
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
No update today?
Got used to your regular updates!!
•
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 37
అడవిలో శంభు దొర మీదకి వస్తున్న సింహాలను ఒక కుర్రాడు ఎదిరిస్తూ ఉండగా తన చేతి మీద ఉన్న పచ్చబొట్టుని చూసి అభీర్ అని మనసులో అనుకున్నాడు శివమణి.
********************
రెండు సింహాలు ఎత్తిన పంజాలను పట్టుకుని పక్కకు తోసి వాటి వైపు కోపంగా కళ్ళు ఎర్ర చేసి గట్టిగా అరిచాడు ఆ కుర్రాడు.
రెండు సింహంలు కోపంతో ఉన్న ఆ కుర్రాడి కళ్ళ వైపు చూసి గర్జించడం ఆపి వెనకడుగు వేసి నిలబడి చూస్తూ ఉండిపోయాయి.
అంతలో అక్కడ ఉన్న దుప్పులు, జింకల గుంపు సింహాల మీదికి వెళ్లడంతో వచ్చిన దారివైపు వేగంగా పరిగెత్తాయి.
అది చూసి "ఏంటి? సింహాలను దుప్పులు జింకలు కలిపి తరుముతున్నాయా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అభిజిత్.
"మా క్రిష్ణని చూస్తే, పిల్లి కూడా పులి అవుతుంది. పులి కూడా పిల్లి అవుతుంది." అని గొప్పగా చెప్పాడు సహదేవుడు.
ఆ మాటకి కృష్ణ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఎవరతను శంభు దొర!" అని అడిగాడు గోకుల్.
"వీళ్ళకి కాబోయే నాయకుడు అభీర్!" అని చెప్పాడు శివమణి.
"ఏంటి అతను అభీర్ ఆ.. మరి క్రిష్ణ అని పిలుస్తున్నారు?" అని డౌట్ గా అడిగాడు జాకి.
"అతని భుజం మీద పచ్చబొట్టు చూడండి. అతనే అభీర్!" అని చెప్పాడు శివమణి.
"అవును! ఆయన చెప్పింది నిజమే! వాడు నా బిడ్డ క్రిష్ణ కాబోయే నాయకుడు, మా జాతికి రక్షకుడు." అని చెప్పాడు శంభు.
"అంటే! రేపు యువరాజుగా చైర్ లో కూర్చోబోయేది అతనేనా?" అని అడిగాడు గోకుల్.
"మేము అడిగిన పచ్చబొట్టు గల మనిషి కూడా అతనే కాదు, ఆ మనిషికి దివ్య శక్తులు ఉంటాయని తెలిసింది నిజమేనా దొర!" అని అడిగాడు శివమణి.
"మీరు చెప్పిన మాట మేము కూడా వినడమే తప్పితే ఇప్పటివరకు చూడలేదు, ఏం జరుగుతుందో చూడడానికి మా జాతి మొత్తం ఎదురుచూస్తుంది." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని అయోమయంగా చూస్తూ, "శంభు దొర! మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు." అని చెప్పాడు సర్పరాజ్.
"మీకు మా గురించి అన్ని విషయాలు చెబుతాను అని మాట ఇచ్చాను తప్పకుండా చెబుతాను మా గూడెనికి వెళ్లి మాట్లాడుకుందాము." అని చెప్పి తన దగ్గరికి వస్తున్న క్రిష్ణాన్ని చూసి "బిడ్డ! నీకు ఎలా తెలిసింది ఆకాశంలో నుంచి ఊడి పడ్డావు." అని అడిగాడు శంభు.
"సింబా చెప్పాడు నాయనా!" అని పక్కన ఉన్న గోకుల్ వాళ్ళ వైపు చూసి "వీళ్లంతా ఎవరు?" అని అడిగాడు క్రిష్ణ.
"రేపు జరగబోయే కార్యక్రమానికి వచ్చిన అతిదులు మన గూడానికి తోలుకు పోతున్న!" అని చెప్పాడు శంభు.
"అవునా!" అని శివమణి వాళ్ళ వైపు చూసి "మా గురించి తెలుసుకోవడానికి వచ్చారని అర్థం అయింది. పూర్తిగా తెలుసుకోండి. కానీ తర్వాత మనసు మలినం చేసుకోకండి మీకే ప్రమాదం." అని చెప్పి అక్కడకు వచ్చిన సింబా తో కలిసి వేగంగా వెళ్ళిపోయాడు క్రిష్ణ.
ఆ మాట విని "అంటే! వీళ్ల దగ్గర మనసు మలినం అయ్యే అన్ని విచిత్రాలు ఉన్నాయా?" అని మనసులో అనుకున్నడు సర్పరాజ్.
సింబతో కలిసి వెళుతున్న క్రిష్ణ వైపు చూస్తున్న గోకుల్ వాళ్ళను చూసి "ఇంకా వెళదామా?" అని అడిగాడు శంభు.
"సరే!" అని వెనకాలే నడుస్తూ ఉన్నారు గోకుల్ వాళ్ళు
కాసేపటికి కొండా మీద ఉన్న వాళ్ళ గూడెం దగ్గరికి తీసుకువెళ్లి "ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి మీకు ఆహారం పంపిస్తాను తిన్న తర్వాత మాట్లాడుకుందాం." అని చెప్పాడు శంభు.
"సరే!" అని చెట్టు కింద ఉన్న నులక మంచాల మీద కూర్చుని శివమణి వైపు చూసి "ఏంటి? వీళ్ళ దగ్గర నుంచి వస్తువులు తీసుకుందామని వచ్చామా? కనీసం ఇక్కడి నుంచి జింక పిల్లని కూడా పట్టుకు వెళ్ళలేము." అని చెప్పాడు జాకి.
"ఎస్! వెరీ పవర్ ఫుల్ పర్సన్స్! ఇక్కడ నుంచి దేన్నైనా తీసుకువెళ్లడం ఇంపాజిబుల్!" అని చెప్పాడు సర్ఫరాజ్.
"మీరు తీసుకువెళ్లడం గురించి ఆలోచిస్తున్నారు, అసలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేవా అని నేను ఆలోచిస్తున్నాను." అని చెప్పాడు అభిజిత్.
"మీరు ఇప్పుటీ వరకు ఇక్కడ చూసిన విచిత్రాలు ఎక్కడైనా చూశారా? " అని అడిగాడు శివమణి.
"ఇది కరెక్ట్ పాయింట్! ఇక్కడ పవర్ ఫుల్ అయింది ఏదీ లేకపోతే వీళ్లకు అంత శక్తి ఉండదు, నాకు కావాల్సింది కూడా అదే ఎంత బలవంతుడైన శాసించగలిగే శక్తి, అది వీళ్ళ దగ్గర ఎక్కడో కచ్చితంగా ఉంది." అని చెప్పాడు గోకుల్.
"మీరు చెబుతుంది కరక్టే కానీ, ఆ పచ్చబొట్టు ఉన్న వ్యక్తికి, కొన్ని నాచురల్ పవర్స్ ఉంటాయని అన్నారు, కానీ ఆ విషయం శంభు దొర కూడా తెలీదు ఏం జరుగుతుందో చూడాలి అంటున్నాడు అదే నాకు అర్థం కాలేదు." అని డౌట్ గా అన్నాడు సర్ఫరాజ్.
"మనం ఇక్కడికి కరెక్ట్ టైం లో వచ్చాము, వాళ్లే అన్ని విషయాలు మనకి చెబుతారు, వీళ్ళు ఇంకా పాత పద్ధతుల్లోనే ఉన్నారు మాట ఇచ్చారు అంటే తప్పక చేస్తారు అది కూడా మనకి అదృష్టమే, ఏం చెబుతాడో విందాము." అని నవ్వుతూ చెప్పాడు శివమణి.
అంతలో అక్కడికి వస్తున్న శంభు దొరని చూసి "సైలెంట్ గా ఉండండి." అని చెప్పాడు అభిజిత్.
అక్కడికి వచ్చి "రండి మా గూడెం ప్రజల్ని చూపిస్తాను ఇక్కడ విశేషాలు కూడా తెలుసుకుందరు గాని, అలాగే మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో అడగండి." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని వెనకాలే నడుచుకుంటూ వెళుతూ అక్కడ ఉన్న జనాలని చూస్తూ, "శంభు దొర! మీ అబ్బాయి క్రిష్ణ చేతి మీద ఉన్న పచ్చబొట్టు వల్ల వచ్చే అతీత శక్తుల గురించి మేము కూడా తెలుసుకోవాలి అన్నావు అంటే ఆ విషయాలు మీకు కూడా తెలియదా?" అని డౌట్ గా అడిగాడు శివమణి.
అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరకు తీసుకువెళ్లి నమస్కరించి, "మేము జారువ తెగకు సంబంధించిన ఒక శాఖకు సంబంధించిన వాళ్ళము, మా జాతి ద్వాపర యుగం నుంచి ఉంది అని మా పెద్దలు చెబుతూ ఉండేవారు.
మా పూర్వీకులు పుట్టిన గడ్డ ఇది, ఇక్కడి నుంచి మా తెగకు సంబంధించిన వారు కొంతమంది విడిపోయి వేరు వేరు ప్రదేశాలకి వెళ్లిపోయారు మా శాఖకు సంబంధించిన వారు మాత్రమే ఇక్కడ ఉన్నారు.
మేము కొలిచే అమ్మవారి దయవల్ల ఒకరోజు మా దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్ములవారు వచ్చి, మేము ధర్మ పరిరక్షణ కోసం పుట్టాము అని కలికాలంలో కూడా మా జాతి నిలిచి ఉంటుంది అని వరం ఇచ్చారు,
అంతే కాదు ధర్మన్ని ర్రక్షించడానికి మా జాతిని కాపాడడానికి భుజం మీద మీరు చూపించిన పచ్చబొట్టుతో ఒక మనిషి జన్మిస్తూ ఉంటాడని, అతను ధర్మం కోసం పోరాడుతాడని,
అలా పుట్టిన బిడ్డకు గోవు లాంటి మనసు ఉన్న మీ జాతికి నాయకుడు అవుతాడు కాబట్టి గోవుల మందను కలిగిన వాడు కాబట్టి అతనికి 14 సంవత్సరాలు దాటిన తర్వాత అభీర్ అని నామకరణం చేయండి అమ్మవారి శక్తి అతనికి అండగా ఉంటుంది అని శ్రీకృష్ణ వారు సెలవిచ్చారు.
శ్రీకృష్ణుల వారి ఆశీస్సులు వల్ల పచ్చబొట్టు ఉన్న బిడ్డ మా తెగలో మూడుసార్లు పుట్టాడు ,మొదటి సారి ధర్మం కోసం కురుక్షేత్రంలో పాల్గొన్నారు మా పూర్వీకులు,
రెండోసారి ధర్మం వైపు నిలబడ్డ శివాజీ మహారాజ్ గారి వెనక ఉన్నారు మా పూర్వీకులు. మళ్లీ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత నా బిడ్డ క్రిష్ణ పుట్టేడు, ఇప్పుడు ధర్మం కోసం ఏ యుద్ధం చేయవలసి వస్తుందో అర్థం కాలేదు." అని చెప్పాడు శంభు.
"మరి మీరు ఇక్కడ ఉంటే, మీ చరిత్ర ఆధారాలు మాకు బామ్రఘడ్ లో దొరికాయి ఏంటి? మీరు అక్కడికి వలస వెళ్లారా?" అని అనుమానంగా అడిగాడు సర్ఫరాజ్.
"అమ్మవారి ఆజ్ఞ మీద మా పూర్వీకులు అక్కడికి వెళ్లారు శివాజీ మహారాజ్ గారి మరణం తర్వాత మళ్లీ మా ప్రదేశానికి వచ్చేశారు." అని చెప్పాడు శంభు.
"మరి ఆ పచ్చబొట్టు ఉన్న వ్యక్తికి ఎటువంటి శక్తులు ఉంటాయి." అని అడిగాడు గోకుల్.
"ఆ పచ్చబొట్టు ఉన్న వ్యక్తికి అమ్మవారి దయతో అతీతమైన శక్తులు ఉంటాయి అని మేము వినడమే కానీ ఇప్పటివరకు చూసినవాళ్లు ఎవరూ లేరు ఇప్పుడు నా బిడ్డకు 14 సంవత్సరాలు రేపటితో నిండుతాయి అతనికి వచ్చే శక్తి ఏమిటా, ధర్మం కోసం ఎక్కడికి వెళ్లి మేము పోరాడవలసి వస్తుందా అని అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము." అని చెప్పాడు శంభు.
అమ్మవారి ముందు కనిపిస్తున్న తాళపత్ర గ్రంధాలు చూసి "అవి ఏమిటి? చాలా పురాతన గ్రంథాలు లాగా ఉన్నాయి." అని డౌట్ గా అడిగాడు శివమణి.
"అవి నాలుగు వేదాల సారాంశం! మా పూర్వీకుల నుంచి వస్తున్నాయి ఆ పచ్చబొట్టు ఉన్న వ్యక్తి 14 సంవత్సరాల నిండిన తర్వాత అమ్మవారి దయతో వేదాలు పటిస్తాడని చెబుతూ ఉంటారు నా బిడ్డ చదువుతుంటే చూడాలని చాలా ఆశగా ఉన్నాను." అని చెప్పాడు శంభు.
"నేను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను మీరు ఏమీ అనుకోరు కదా!' అని అనుమానంగా చూస్తూ అడిగాడు శివమణి.
"మీరు ఏమి అడగాలి అనుకుంటున్నారో సంకోచించకుండా అడగండి మీకు మా గురించి అన్ని విషయాలు చెబుతాను అని మాటిచ్చాను." అని చెప్పాడు శంభు.
"మీ దగ్గర దైవీకమైన వస్తువులు కొన్ని ఉన్నాయని వాటికి మీరు రక్షణగా ఉంటారని,చత్రపతి శివాజీ మహారాజ్ గారి చంద్రహాస్ కూడా మీ దగ్గరికి వచ్చిందని మాకు తెలిసింది అది నిజమేనా!" అని అడిగాడు శివమణి.
ఆ మాటకు నవ్వి "ఈ విషయం గురించి నేను కూడా విన్నాను కానీ ఇప్పటివరకు నాకు ఒక దైవీకమైన వస్తువు ఎక్కడ కనపడలేదు, మీకు ఒక విషయం చెప్పనా మా వాళ్ళ స్వచ్ఛమైన మనసే మా దగ్గర ఉంది." అని చెప్పాడు శంభు.
"మీకు అభ్యంతరం లేకపోతే రేపు మీ అబ్బాయికి అభీర్ అనే నామకరణం జరగడం మేము కూడా చూడాలి అనుకుంటున్నాము." అని అడిగాడు గోకుల్.
ఆ మాటకి అక్కడ ఉన్న గుడిసె చూపించి "ఇక్కడ మీరు నిశ్చింతగా ఉండొచ్చు, మేము కూడా మీలాంటి వాళ్ళమే కాకపోతే, మేము ప్రకృతి ఒడిలో ఉంటున్నాము, మీరు దానికి దూరంగా ఉంటున్నారు." అని చెప్పాడు శంభు.
ఆ మాటకి నవ్వుతూ అక్కడ ఉన్న గుడిసెలోకి వెళ్లారు అందరూ.
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 38
జారువ జాతి వాళ్లు ఉండే గూడానికి వెళ్లి శంభు ద్వారా అభిర్ సేన గురించి అన్ని విషయాలు తెలుసుకుని, క్రిష్ణ కి జరగబోయే నామకరణం చూసి వెళతామని అడిగాడు గోకుల్.
*****************°
ఆ మాట విని వాళ్ళు ఉండడానికి ఒక గుడిసె చూపించి అన్ని ఏర్పాట్లు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శంభు.
గుడిసెలో గడ్డి తో చేసిన పరుపులు మీద పడుకున్న గోకుల్ ని చూసి "ఒరేయ్! నువ్వు ఇలా ఉండడం నేను చూడలేకపోతున్నాను, నాకు తెలిసి ఇక్కడ ఏమీ లేదు మనకు ఏమీ దొరకదు ప్రశాంతంగా ఇంటికి పోదాము." అని చెప్పాడు అభిజిత్.
"సార్! కంగారు పడకండి శంభు దొర చెప్పింది మొత్తం విన్నారు కదా, ఆ పచ్చబొట్టుతో మళ్లీ చాలా కాలం తర్వాత క్రిష్ణ పుట్టాడు, రేపు అతనికి రాబోయే శక్తులు ఏమిటో మనతోపాటు వాళ్లకి కూడా తెలియదు అసలు అవి ఎక్కడినుంచి వస్తున్నాయో తెలుసుకుందాము." అని చెప్పాడు శివమణి.
"అవును! క్రిష్ణకి నిజంగా శక్తులు వచ్చాయి అంటే ఇక్కడ ఏదో ఉన్నట్లు, లేక పోతే మనం ఇక్కడి నుంచి బయలుదేరి పోదాము." అని చెప్పాడు గోకుల్.
కిటికి లోనుంచి చూస్తూ, "ఒక్కసారి అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం చూడండి చీకటిలో కూడా ఎలా మెరిసి పోతుందో, ఆ విగ్రహం కింద కచ్చితంగా ఏదో ఉంది. " అని చెప్పాడు సర్పరాజ్.
అక్కడికి వచ్చి చూస్తూ "అంటే! మనం వెతుకుతున్న ఆ వస్తువులు ఆ విగ్రహం కింద ఉన్నాయని మీ అనుమానమా?" అని అడిగాడు గోకుల్.
"ఆ వస్తువులు ఉన్నాయో లేదో తెలియదు కానీ, మొత్తానికి ఆ విగ్రహం దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది అనిపిస్తుంది." అని చెప్పాడు సర్పరాజ్.
"సరే! అసలు ఇక్కడ ఏముందో రేపు తెలిసిపోతుంది కదా! ప్రశాంతంగా పడుకోండి." అని చెప్పాడు అభిజిత్.
****************
ఉదయం గట్టి గట్టిగా మాటలు వినపడడంతో ఉలిక్కిపడి లేచి బయటకు చూసి అభిజిత్ వాళ్ళని లేపి "అన్న! ఇక్కడ మనం ఎంతోమంది లేరు అనుకున్నాం చాలామంది ఉన్నారు చూడు." అని చెప్పాడు జాకి.
"అవునా?" అని లేచి అక్కడ ఉన్న జనాన్ని చూసి బయటకి వస్తున్న గోకుల్ వాళ్ల దగ్గరికి వచ్చి, "దొర! కాసేపటిలో కార్యక్రమం మొదలవుతుంది. మీరు స్నానాలు చేయడానికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళండి." అని చూపించాడు సహాదేవుడు.
"సరే!" అని చెరువు దగ్గరికి వెళ్లి స్నానం చేస్తూ, "ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అనేది అర్థం కావడం లేదు." అని చెప్పాడు శివమణి.
అంతలో చెట్టు మీద ఉంగరం పట్టుకున్న కోతి కనిపించడంతో, "జాకీ! ఆ కోతి దగ్గర ఉన్న ఉంగరం ఏదో విధంగా తీసుకో, అది నాకు కావాలి." అని చెప్పాడు అభిజిత్.
"సరే అన్న!" అని చెప్పి చెట్టు మీద ఉన్న కోతి దగ్గరకంటూ వెళ్లి "ఆ ఉంగరం వేయవే నీకు వేరే ఉంగరం ఇస్తాను." అని అడిగాడు జాకి.
ఆ మాటకి ఎక్కిరించి దూరంగా ఉన్నా గుట్ట మీదకి వెళ్ళింది ఆ కోతి.
అది చూసి "ఇది మాటలతో వినదు." అని అక్కడ ఉన్న రాళ్లు తీసుకుని దాని మీద గిరాటు వేశాడు జాకీ.
రాళ్లు మీదకు రావడంతో కొంచెం వెనక్కి వెళ్లి, కొండమీద నుంచి ఒక పెద్ద బండరాయి దొర్లించింది ఆ కోతి.
అది చూసి "వామ్మో! ఇది మామూలు కోతి కాదు." అని వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు జాకీ.
కొండమీద నుంచి దొర్లుకుంటూ వస్తున్నారు రాళ్లు, వెనక్కి పరిగెడుతున్న జాకిని చూసి నవ్వుతూ ఉన్నారు చెరువులో ఉన్న గోకుల్ వాళ్ళు.
అంతలో దొర్లుకుంటూ వస్తున్న రాళ్లు అక్కడ ఉన్న పెద్ద బండరాయికి తగిలి ముక్కలు అవడంతో, మెరుస్తూ ఉండడం చూసి అనుమానం వచ్చి చెరువులో నుంచి పైకి వెళ్లి వాటిని చేత్తో పట్టుకుని సూర్యకిరణాలు తగిలేటట్లు పెట్టి గోకుల్ వైపు చూసి "సార్! ఈ స్టోన్ లో ఏదో ప్రత్యేకత ఉంది." అని చెప్పాడు సర్పరాజ్.
ఆ మాట విని హడావుడిగా చెరువులో నుంచి బయటకు వచ్చి సర్పరాజ్ చేతిలో ఉన్న పగిలిన రాళ్లు తీసుకుని చూస్తూ "అవును! చాలా డిఫరెంట్ గా ఉన్నాయి వీటిని ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేయించాలి అప్పుడే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది." అని చెప్పాడు గోకుల్.
అంతలో అక్కడికి వస్తున్న సహదేవుడిని చూసి" టాపిక్ మార్చండి." అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని సైలెంట్ అయ్యి సహదేవుడి వైపు చూసి నవ్వుతూ, "ఏంటి? ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా?" అని అడిగాడు గోకుల్.
"అవును! తొందరగా రండి మిమ్మల్ని తీసుకురమ్మని శంభో దొర పంపించాడు." అని చెప్పాడు సహదేవుడు.
"సరే! నువ్వు వెళ్ళు ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాము." అని చెప్పి అక్కడ దొరికిన రాళ్లు తీసుకుని రూమ్ దగ్గరికి వెళ్లి క్లాత్ లో చుట్టి బ్యాగులో పెట్టాడు సర్ఫరాజ్.
రూమ్‌లో హడావుడిగా రెడీ అయ్యి తన బ్యాగ్ లో ఉన్న బుక్ తీసి ఓపెన్ చేసి చూస్తూ, అభిజిత్ వాళ్ళని పిలిచి "సార్! ఈ మ్యాప్ చూడండి దేవతలు సృష్టించిన నగరం అని చెప్పాను కదా అది ఈ స్థలమే!" అని చెప్పాడు శివమణి.
"సరే! ఈ ప్లేస్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఏముంటుంది?" అని అడిగాడు గోకుల్.
"ఈ కొండమీద 9 ప్రదేశాలు ఉంటాయి, అవి నవగ్రహాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి, మనం వెళ్లే లోపు ఆ ప్లేస్ ల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి." అని చెప్పాడు శివమణి.
"నవగ్రహాలు ఆధీనంలో ఉంటే, మనకి తిరుగు ఉండదు, అలా నవగ్రహాలను ఆధీనంలో పెట్టుకోబట్టే రావణాసురుడు అంతటి వీరుడు అయ్యాడు, అతను స్త్రీలోలుడు అవడం వల్ల నాశనమయ్యాడు లేకపోతే, ఈ విశ్వాన్ని జయించిన మహారాజు అయ్యేవాడు." అని చెప్పాడు సర్ఫరాజ్.
ఆ మాట విని మనసులో ఆశ మొదలై "నవగ్రహాలు ఆధీనంలో ఉండడానికి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి ఏదిఏమైనా అది నాకు కావాలి." అని చెప్పాడు గోకుల్.
"ముందు జరిగే కార్యక్రమం చుస్తే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనకి కూడా ఒక ఐడియా వస్తుంది. దాని బట్టి ఏం చేయాలో ప్లాన్ చేద్దాం." అని చెప్పాడు అభిజిత్.
"సరే!" అని రెడీ అయ్యి కార్యక్రమం జరుగుతున్న ప్లేస్ దగ్గరికి వెళ్లారు అందరు.
అక్కడికి గోకుల్ వాళ్ళు రావడం చూసి చెట్టు కింద ఏర్పాటు చేసిన ప్లేస్ చూపించి "దొర! ఇక్కడ కూర్చోండి ఇప్పుడే నా బిడ్డకు అమ్మవారి పాదాల నుంచి వచ్చే గంగతో స్నానం చేయిస్తున్నారు తరువాత కార్యక్రమం మొదలవుతుంది." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని సర్పరాజ్ తో కలిసి శంభు వెనకాలే వెళ్లి, అమ్మవారి పాదాల దగ్గర నుంచి నీళ్లు రావడం ఆశ్చర్యంగా చూస్తూ "మనం చూసినప్పుడు అక్కడ వాటర్ ఏమీ లేదు కదా!" అని డౌట్ గా అడిగాడు శివమణి.
"ఆ మత అనుగ్రహంతో పుట్టిన బిడ్డకి 14 సంవత్సరాల నిండిన తర్వాత నామకరణం రోజున అమ్మ పాదాల దగ్గర గంగ వస్తుందని మా పూర్వీకులు రాసిన గ్రంథాలలో ఉంది. అదే విధంగా ఇప్పుడు జరుగుతుంది. అంతా అమ్మ మహిమ!" అని చెప్పాడు శంభు.
"అవునా?" అని అమ్మవారి పాదాలు దగ్గర నీళ్లు వస్తున్న ప్లేస్ ని చూస్తూ, సర్పరాజ్ దగ్గరకు వెళ్లి "నీళ్లు వచ్చే ప్లేస్ ని బాగా గమనించండి?" అని చెప్పాడు శివమణి.
"ఎస్! పాదాల దగ్గర ఏవో ఐదు రంగు రాళ్లు ఉన్నాయి." అని చూస్తూ చెప్పాడు సర్పరాజ్.
"ఎస్! వాటిని పంచరత్నాలు అంటారు." అని చెప్పాడు శివమణి.
ఆ మాట విని శంభు దొర దగ్గరికి వెళ్లి, కెమెరా చూపించి "మేము ఫోటోలు తీసుకోవచ్చా!" అని అడిగాడు సర్పరాజ్.
"మీరు ఏమీ అనుకోకండి దొర! ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని చిత్రీకరించడం నిషేధం! మీకు మాటిచ్చాను కాబట్టి చూడడానికి అనుమతించాను కానీ దీనికి అనుమతించలేను." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని దగ్గరికి వస్తూ "మీకు ఇష్టం లేకుండా మేము ఏ పని చేయము." అని కెమెరాని వెనక్కి తోసి "అమ్మవారి పాదాల దగ్గర రంగులు రంగులుగా ఉన్నాయి ఏమిటి?" అని అడిగాడు శివమణి.
"మా పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి, శ్రీకృష్ణుల వారు తమ ఆత్మ శక్తితో వాటిని సృష్టించి అమ్మవారి పాదాల దగ్గర ప్రతిష్టించారని చెబుతూ ఉంటారు, ప్రతి పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు పడగానే అవి ప్రకాసిస్తాయి. ఆ వెలుగు ఈ కొండంతా వస్తుంది." అని చెప్పాడు శంభు.
"అవునా?" అని వాటి వైపు ఆశ్చర్యంగా చూస్తూ గోకుల్ వాళ్ళ దగ్గరికి వచ్చి, "రాత్రి మనం అమ్మవారి విగ్రహం మెరిసిపోతుంది అనుకున్నము కదా దానికి కారణం తెలిసింది." అని దూరం నుంచి అమ్మవారి పాదాల వైపు చూపించడు శివమణి.
తను చెప్పింది విని పాదాల వైపు చూస్తూ "అక్కడ ఏముంది." అని అడిగాడు గోకుల్.
"శ్రీకృష్ణుల వారు తమ ఆత్మ శక్తితో సృష్టించినా పంచరత్నాలను అక్కడ ప్రతిష్టించారు అంట!" అని చెప్పాడు సర్పరాజ్.
"అలా అయితే! అవి నాకు కావాలి." అని ఆశగా చూస్తూ అడిగాడు గోకుల్.
ఆ మాటవిని "ఒరేయ్! సైలెంట్ గా మాట్లాడు, ఎవరైనా విన్నారు అంటే మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాము." అని భయంగా చెప్పాడు అభిజిత్.
అంతలో అక్కడకు వచ్చి "సార్! ఒక్కసారి అటువైపు చూడండి." అని చెప్పాడు శివమణి.
అమ్మవారి పాదాల ముందు కూర్చున్న క్రిష్ణ గుండెల మీద అమ్మవారి కత్తిని కుంకంలో ముంచి అభీర్ అని రాశాడు శంభు.
అలా రాయగానే అక్కడ ఉన్న కొండలలో నుంచి రంగు రంగుల గాలి అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చి అభీర్ శరీరంలోకి వెళ్లడం ఆశ్చర్య చూస్తూ ఉండిపోయారు అందరూ.
అక్కడ జరిగేది ఆశ్చర్యంగా చూస్తూ "వాట్ ఏ మేరకీల్!" అని చెప్పాడు గోకుల్.
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 271
Threads: 0
Likes Received: 194 in 133 posts
Likes Given: 1,186
Joined: Mar 2022
Reputation:
5
superb bro
lets wait and see how abhir knows their cunning ideas
•
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
kallaki kattinattuga raastunnaru. Wonderful!!
•
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 39
శంభు దొర తీసుకు వెళ్లిన గూడెంలో చెరువులో స్నానం చేస్తూ అక్కడ ఉన్నా రాళ్ళను చూసి వీటికి ఏదో ప్రత్యేకత ఉంది అని వాటిని జాగ్రత్త చేసి, అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాల గురించి తెలుసుకుని వాటిని ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాడు గోకుల్.
**************
శివమణి చూపించడంతో కొండల్లో నుంచి రంగు రంగులుగా శక్తి వచ్చి అమ్మవారి పాదాల దగ్గరకు చేరి అక్కడి నుంచి అభీర్ శరీరంలోకి ప్రవేశించడం ఆశ్చర్యంగా చూస్తూ "అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది." ఆని కళ్ళు ఆర్పకుండా చూస్తూ అడిగాడు గోకుల్.
"అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలు పంచభూతాల శక్తిని తీసుకుని అభీర్ శరీరంలోకి పంపించాయి." అని చెప్పాడు శివమణి.
"ఆ శక్తీ అభిర్ శరీరంలోకి వెళ్ళింది కదా, ఇప్పుడు అతనికి ఎటువంటి పవర్ వస్తుంది?" అని డౌట్ గా అడిగాడు అభిజిత్.
"ఆ విషయం మనం కళ్ళతో చూస్తేనే కాని చెప్పలేము సార్!" అని చెప్పాడు శివమణి.
"అటువైపు చూడండి మరొక శక్తి అతనిలోకి వస్తుంది ఈసారి మనకి రాళ్లు కనిపించిన కొండల దగ్గర నుంచి వస్తుంది." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు సర్పరాజ్.
ఆ మాటకి కొండల వైపు చూస్తూ "ఎస్! అవే నవగ్రహాల కొండలు." అని చెప్పాడు శివమణి.
"మరి అక్కడ 7 కొండలు మాత్రమే కనబడుతున్నాయి మరి మిగిలిన రెండు ఎక్కడ ఉన్నాయి." అని అనుమానంగా చూస్తూ అడిగాడు గోకుల్.
ఆ మాటకి మ్యాపులో చూస్తూ "సార్" మనం స్నానం చేసిన చెరువు చంద్రుడికి సంబంధించింది. అందులో ముత్యాలు ఉంటాయి, అందుకే దాంట్లో స్నానం చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతతా వచ్చింది. దాని పక్కన ఉన్న చెరువు పగడాల చెరువు." అని చెప్పాడు శివమణి.
"అంటే! మిగతా ఏడుకొండలలో మామూలు రాళ్లు కాదు నాచురల్ జేమ్స్ ఉంటాయి." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు అభిజిత్.
"ఎస్ సార్! శంభు దొర, అభీర్ మెడలో వేస్తున్న పచ్చ చూడండి ఎలా మెరిసిపోతుందో, అటువంటిది మనకి ఎక్కడ దొరకదు." అని ఆశగా చూస్తూ చెప్పాడు సర్పరాజ్.
"ఈ ప్లేస్ ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి." అని ఆశగా చూస్తూ చెప్పాడు అభిజిత్.
"ఈ తెగ వాళ్ళు ఇక్కడ ఉండగా మీ ఊహలలో కూడా ఈ ప్లేస్ ని ముట్టుకోలేరు." అని చెప్పాడు శివమణి.
"ప్రపంచంలో ఉన్న సంపద మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉంది దీనికోసం ఏమైనా చేయొచ్చు!" అని చెప్పాడు జాకి.
"ఈ ప్లేస్ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ రావచ్చు!" అని చెప్పాడు అభిజిత్.
అభీర్ మేడలో గొలుసుని వేసి, అక్కడ నుంచి గోకుల్ వాళ్ళ దగ్గరికి వచ్చి "దొర! ఇప్పుడు నా బిడ్డ వేదం చదువుతాడు నా చిరకాల వాంఛ తీరపోతుంది." అని సంతోషంగా చెప్పాడు శంభు.
ఆ మాటకి నవ్వుతూ "చాలా సంతోషం! ఇప్పుడు అభీర్ మెడలో ఒక పచ్చ రాయిని వేశావు కదా అది ఎక్కడి నుంచి సంపాదించావు? చాలా అందంగా ఉంది." అని అడిగాడు అభిజిత్.
"ఆ పచ్చ, దొర! కనిపించే దేవత కొండలో నుంచి తీసుకుని వచ్చాము, అది మెడలో ఉంటే దక్షిణామూర్తి అనుగ్రహంతో నా బిడ్డ జ్ఞానం సంపాదించగలుగుతాడు." అని చెప్పి అక్కడి నుంచి అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లి పాదాలకి నమస్కరించి అక్కడ ఉన్న వేదాలు తీసి అభీర్ చేతికి ఇచ్చాడు శంభు.
అది చూసి "అసలు! వేదాలు అంటే ఏమిటి? దాంట్లో ఏం రాసి ఉంటుంది? దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా?" అని అడిగాడు గోకుల్.
"సార్! వేదాలని ఎవరు రచించలేదు దేవతలు మనుషులకు ఇచ్చిన బహుమతిగా చెబుతూ ఉంటారు, మన జీవన విధానం సంస్కృతి, జ్ఞానం వాటి ద్వారా లభిస్తుంది.
భారతదేశంని వేద భూమి అంటారు, 500 బిసి కి ముందు యూరోపియన్స్ మన మీద దండయాత్ర చేయకముందు, మన విద్యా విధానం చాలా మెరుగుగా ఉండేది.
మన సంస్కృతిని మన విద్యా విధానాన్ని చాలా దేశాల వారు అనుసరించేవారు, ఇప్పుడు కొత్త కొత్తగా కనిపెడుతున్నవి అన్ని వేద కాలంలో ఆల్రెడీ మన భారతదేశంలో ఉన్నవే, ఆ వేదాలను చదవడం అందరికీ సాధ్యం కాదు చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది." అని చెప్పాడు సర్పరాజ్.
ఆ మాట విని "నువ్వు చెప్పింది నాకు కొంచెం కూడా అర్థం కాలేదు." అని చెప్పాడు గోకుల్.
"సర్! మీకు అర్థమయ్యేటట్లు మన లాంగ్వేజ్ లో చెప్తాను వేదాలు నాలుగు ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం
అథర్వవేదం వీటిలో ఏముంటుంది అంటే, విద్య, వైద్యం యుద్ధం, కళలు,శాస్త్రాలు,పూజలు గురించి వివరంగా ఉంటుంది." అని చెప్పాడు శివమణి.
"ఓకే! ఇప్పుడు కొంచెం అర్థమైంది అయ్యినా ఇప్పటివరకు అడవిలో పెరిగిన వాడు అవి ఎలా చదవగలడు?" అని డౌట్ గా అడిగాడు గోకుల్.
"అతనికి ఇప్పుడు వచ్చిన శక్తి అదే సార్!" అని అమ్మవారి ముందు వేదం చదువుతున్న అభీర్ ని చూసి చెప్పాడు శివమణి.
"ఏంటి? ఇది చదివే శక్తి వస్తుందని మనం ఇప్పటివరకు ఎదురుచూస్తూ ఉన్నామా?" అని వెటకారంగా అడిగాడు అభిజిత్.
"సరే! పదండి వెళ్లి కూర్చుందాం, అయిన తర్వాత ఆ కొండల దగ్గరికి వెళ్లి ఒకసారి మొత్తం చూసి బయలుదేరుదాము." అని చెప్పాడు గోకుల్.
వేదం చదువుతున్న అభీర్ ని సంతోషంగా చూస్తున్న శంభు దగ్గరికి వెళ్లి "దొర! నామకరణం చేసిన తర్వాత ఏవో శక్తులు వస్తాయని అనుకున్నాము కదా మరి ఏమి రాలేదేమిటి?" అని అనుమానంగా అడిగాడు శివమణి.
"జ్ఞానం కన్నా గొప్ప శక్తి ఏముంది? నా బిడ్డకు అది వచ్చింది చాలు!" అని సంతోషంగా చెప్పాడు శంభు.
"అవునవును మీరు కరెక్ట్ గా చెప్పారు." అని సహదేవుడు చేతిలో ఉన్న జింక పిల్లను చూసి "దానికి ఏమైంది?" అని అడిగాడు శివమణి.
"నిన్న సింహం పంజా తగిలింది కదా దొర! అప్పట్నుంచి దీనికి బాలేదు ఇంకా కాసేపట్లో ప్రాణం పోతుంది అందుకనే అమ్మ వారి దగ్గరికి తీసుకు వచ్చాను." అని చెప్పాడు సహదేవుడు.
అంతలో అభీర్ వేదం చదవడం విని అడవిలో ఉన్న రకరకాల పక్షులు, జంతువులు అక్కడకి రావడం ఆశ్చర్యంగా చూస్తూ "వీటికీ ఏమీ అర్థం అవుతుందని ఇక్కడికి వచ్చాయి?" అని అడిగాడు గోకుల్.
"అవి వేదం వింటూ వచ్చాయి అని నేను అనుకోవడం లేదు ఆ జింక పిల్ల చనిపోయింది కదా అందుకు వచ్చాయి అనుకుంటున్నాను." అని చెప్పాడు సర్ఫరాజ్.
అభీర్ వేదం చదవడం పూర్తవడంతో దగ్గరకు వెళ్లి జింక పిల్లని చేతిలో పెట్టి "నువ్వు కాపాడిన బుజ్జి చనిపోతుంది." అని బాధగా చెప్పాడు సహదేవుడు.
జింక పిల్లని చేతిలోకి తీసుకునే అమ్మవారికి వైపు చూసి నమస్కరించి ఆకాశంలోకి చూపిస్తూ కళ్ళు మూసుకుని చదువుతూ ఉన్నాడు అభీర్.
కాసేపటికి చేతుల్లోంచి కిందకు దూకి చెంగుచెంగున ఎగురుతూ దాని తల్లి దగ్గరికి వెళ్ళింది జింకపిల్ల.
అది చూసి జంతువులతో పాటు అక్కడ ఉన్న గూడెం ప్రజలందరూ సంతోషంతో గట్టిగా అరుస్తూ ఉండడంతో అది విని "ఏమైంది? అందరూ ఒక్కసారిగా అంత గట్టిగా అరుస్తున్నారు?" అని అనుమానంగా శివమణి దగ్గరికి వస్తూ అడిగాడు అభిజిత్.
"సార్! ఇక్కడ ఒక మిరాకిల్ జరిగింది చనిపోతుందనుకున్న జింక పిల్లని అభీర్ తన శక్తితో బతికించాడు." అని చూపించాడు శివమణి.
అక్కడికి వస్తు "అవునా?"అని ఎగురుతున్న జింక పిల్లని చూసి "నువ్వు చెప్పినట్లే అతనికి పవర్ వచ్చింది. నాకు తెలిసి ఆ శక్తి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాల వల్ల వచ్చింది." అని చెప్పాడు గోకుల్.
అక్కడ ఉన్న వారితో ఆనందంలో ఉన్న శంభు దొర దగ్గరికి వెళ్లి "దొర! మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంక మేము బయలుదేరిదారి అనుకుంటున్నాము." అని చెప్పాడు శివమణి.
"మా గూడానికి అతిథులుగా వచ్చినందుకు చాలా సంతోషం దొర!' అని అమ్మవారి పక్కన ఉన్న గిన్నెలో నుంచి కొన్ని రాళ్లు తీసి అందరికీ ఇచ్చి "ఇది మీ దగ్గర ఉంచుకోండి మంచి జరుగుతుంది." అని చెప్పాడు శంభు.
ఆ రాయిని చేత్తో పట్టుకుని అభీర్, శంభు వైపు చూస్తూ "మీ ఆచారాలు, మీ మనస్తత్వాలు నాకు చాలా బాగా నచ్చాయి త్వరలో మళ్ళీ ఇక్కడికి వస్తాను.
మీలాంటి మంచి మనుషులు ఇక్కడే ఉండి పోకూడదు ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళని కూడా మీ విధంగా మార్చాలి." అని చెప్పాడు అభీజిత్.
"నేను కూడా అదే అనుకుంటున్నాను దొర! రోజులు మారిపోతున్నాయి కానీ మా పిల్లలు మాలాగే అడవిలో ఉండి ఈ జీవన విధానానికి అలవాటు పడి వెనక పడిపోతున్నారు అనిపిస్తుంది.
అది కాకుండా ఇటువంటి పవిత్రమైన ప్రదేశాలను కాపాడడానికి ఇదివరకు రోజుల్లో రాజులు ఉండేవారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాజులే, ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు.
అందుకే మాలో కొంతమందిని ఇక్కడి నుంచి పంపించి ఆ జీవ విధానానికి అలవాటు చేసి మా జాతిని, ఈ ప్రదేశాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నాను." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని దగ్గరికి వస్తూ "మీ ఆలోచన చాలా బాగుంది దొర! తప్పకుండా మేము కూడా హెల్ప్ చేస్తాము, అప్పుడు ఇక్కడ ఉన్న ప్రశాంతత మాకు కూడా దొరుకుతుందేమో!" అని నవ్వుతూ చెప్పాడు గోకుల్.
"సరే దొర! మేము ఇంకా బయలుదేరుతాము త్వరలో మళ్లీ వచ్చి మీకు మంచి విషయం చెబుతాము." అని చెప్పాడు శివమణి.
"నా బిడ్డను ఆశీర్వదించినందుకు వందనాలు!" అని చెప్పాడు శంభు.
ఆ మాటకి నవ్వి అక్కడ నుంచి బయలుదేరారు గోకుల్ వాళ్ళు.
అక్కడినుంచి అందరూ వెళ్లడంతో శంభు దగ్గరికి వచ్చి "అయ్యా! వాళ్లని మరి ఎక్కువగా నమ్మకు ఏదో ఆశించే ఇక్కడికి వచ్చారు అనిపిస్తుంది." అని చెప్పాడు అభీర్.
"బిడ్డ! వాళ్లు మన వస్తువులు ఇవ్వడానికి వచ్చారు అంతేకానీ ఏమీ ఆశించి ఎక్కడికి రాలేదు. మనం ఈ అడవిలో ఉండిపోవడం వల్ల ప్రతి ఒక్కరి మీద అనుమానంతో బతుకుతున్నాము మనలో కొంతమంది పిల్లలు వాళ్లతో కలిసి చదువుకుంటే ఇటువంటి అపోహలు అనర్ధాలు ఉండవు ప్రశాంతంగా జీవిస్తాము." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని ఆలోచిస్తూ 'అయ్యా చెబితే నిజమే! నేను జంతువుల మనసు అర్థం చేసుకుంటున్నాను కానీ మనుషుల మనసు అర్థం చేసుకోలేకపోతున్నాను ఏమిటి?' అనుకున్నాడు అభీర్.
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 40
మనం ఈ అడవిలో ఉండి అలా వెనకబడిపోయాము వాళ్లతో పాటు కలిసి ఉంటే సాటి మనుషుల్ని అర్థం చేసుకునేవాళ్ళము అని చెప్పాడు శంభు.
ఆ మాట విని జంతువుల మనసు అర్థం చేసుకుంటున్నను కానీ మనుషుల మనసు అర్థం చేసుకోలేకపోతున్నాను ఏంటి అనుకున్నాడు అభిర్.
********************
బేరా అడవి దాటి గొర్వర్ అడవి ప్రాంతంలోకి వెళ్లి అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్న కార్ లో గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకున్నారు గోకుల్ వాళ్ళు
కార్ దిగి డ్రైవర్ కి డబ్బులు ఇస్తూ "మా కోసం వెయిట్ చేసినందుకు చాలా థాంక్స్! అని చెప్పి "అవును! మేము అడవి లోపలికి వెళ్ళగానే సిగ్నల్ ఇచ్చావు, నువ్వు కూడా అభీర్ సేన లో మనిషివేనా?" అని అడిగాడు శివమణి.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి? అతను మనం అడవిలోకి వెళ్లిన తర్వాత సిగ్నల్ ఇచ్చాడా?" అని డౌట్ గా అడిగాడు అభిజిత్.
"అవును సార్! మనం లోపలికి వెళ్లగానే పక్షిలాగా అరచి ఎవరికో సిగ్నల్ ఇచ్చాడు. నేను అప్పుడే కనిపెట్టాను." అని చెప్పాడు శివమణి.
"సారు! మేము జారువా తెగకు సంబంధించిన వాళ్ళము కాదు, వాళ్ళని అంతం చేయాలని చూసే వాళ్ళము, మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారో అర్థమైంది మీరు ఒప్పుకుంటే మా నాయకుడిని ఇక్కడకు తీసుకు వస్తాను." అని చెప్పాడు డ్రైవర్.
ఆ మాట విని "తీసుకురా..!" అని చెప్పడానికి వస్తున్న గోకుల్ ని ఆపి "మేము ఆ తెగ మంచి కోరుకునే వాళ్ళమే కానీ చెడు కోరుకునే వాళ్ళం కాదు, నువ్వు మళ్ళీ మా కంటికి కనిపించకు ఇక్కడ నుంచి వేళ్ళు!" అని కోపంగా చెప్పాడు శివమణి.
ఆ మాట విని అక్కడ ఉన్న అందరి వైపు సీరియస్ గా చూస్తూ వెళ్లిపోయాడు డ్రైవర్.
శివమణి దగ్గరికి వచ్చి "అతన్ని అలా పంపించేసారు ఎందుకు? మనకు ఉపయోగపడేవాడేమో కదా!" అని అడిగాడు గోకుల్.
"సార్! ఆ తెగ వాళ్ళని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, వాళ్ల పూర్వీకుల గూడచారులుగా పనిచేశారు ఆ విషయం మర్చిపోయారా? వాళ్ళు మనకన్నా చాలా తెలివిగా ఆలోచిస్తారు." అని చెప్పాడు శివుమణి.
"అంటే! ఆ డ్రైవర్ కూడా జారువా తెగకు చెందిన వాడే అంటావా?" అని డౌట్ గా అడిగాడు అభిజిత్.
"మనకి చెప్పాలి అనుకుంటే అడవిలోకి వెళ్ళేటప్పుడే అభీర్ సేన గురించి చెప్పేవాడు, ఇప్పుడు చెబుతున్నాడు అంటే మనం ఎందుకు వచ్చామో తెలుసుకోవడానికి, కచ్చితంగా అతను ఆ తెగకు చెందినవాడే!" అని చెప్పాడు శివమణి.
"కరెక్టే! నోరు జారితే, మనం అనుకున్నది చేజారిపోయేది." అని కళ్ళు పెద్దవి చేసుకుని చెప్పేడు గోకుల్.
"మనం చేయాలనుకున్న పని మనసులోనే ఉండాలి, మాట చాలా జాగ్రత్తగా రావాలి, ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలతో ఉండము, వాళ్ళ బలం ధైర్యం చూశారు కదా!" అని చెప్పాడు శివమణి.
"కరెక్ట్ సార్! ఆ అభీర్ మనల్ని నమ్మలేదు, అతని కళ్ళు మన వైపు అనుమానంగా చూస్తూనే ఉన్నాయి నేను బాగా గమనించాను." అని చెప్పాడు సర్పరాజ్.
"అభీర్ కి శక్తి ఉంది మనం అక్కడకి ఎంటర్ అయినప్పుడు అతన్ని అక్కడ లేకుండా మనం చేయగలగాలి, అప్పుడే ఆ ప్లేస్ మనకు చేతికి వస్తుంది." అని చెప్పాడు శివమణి.
దీనిని బట్టి మనం పక్కగా ఆలోచించి స్టెప్ వెయ్యాలి, ఆషా మాషిగా ఎంటర్ అవ్వకూడదు. " అని చెప్పాడు అభిజిత్.
"మనం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎవరి హెల్ప్ తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్లలో జారువ తెగ వాళ్ళు ఎవరో మామూలు వాళ్ళు ఎవరో కూడా కనిపెట్టలేము ప్లాన్ మొత్తం అప్సెట్ అవుతుంది." అని చెప్పాడు గోకుల్.
"సార్ కరెక్ట్ గా చెప్పారు." అని అన్నాడు సర్పరాజ్.
"సరే! వెళ్ళగానే శంభు దొర ఇచ్చిన రాళ్ళని ల్యాబ్ కి పంపించి వాటి సంగతి ఏమిటో తెలుసుకుని తరువాత ఏం ప్లాన్ చేయాలో ఆలోచిద్దాము." అని చెప్పాడు అభిజిత్.
అంతలో లోపలకి వచ్చి "బాయ్! కార్ రెడీగా ఉంది బయలుదేరుదామా?" అని అడిగాడు జాక్.
"సరే!" అని అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరారు అందరు.
*****************
ఆరు నెలల తర్వాత లండన్ లో తన ఆఫీసులో మీటింగ్‌లో ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి "ఫైవ్ మినిట్స్! మీరు కంటిన్యూ చేయండి." అని బయటికి వచ్చి లిఫ్ట్ చేసి "అభిజిత్! హౌ ఆర్ యు?" అని చెప్పాడు గోకుల్.
"హాయ్ గోకుల్! గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను, ఇప్పుడే మన శివమణి స్టోన్స్ కంప్లీట్ రిపోర్ట్ తీసుకుని వచ్చాడు దాంట్లో ఏముందో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు." అని చెప్పాడు అభిజిత్.
"అవునా? దాంట్లో ఏముందో తొందరగా చెప్పు!" అని ఆత్రుతగా అడిగాడు గోకుల్.
"శంభు దొర మనకి ఇచ్చిన స్టోన్ క్వాలిటీ నీకు వరల్డ్ లో ఎక్కడ దొరకదు, ఈ విషయాలన్నీ ఫోన్లో చెప్పేవి కావు నువ్వు ఇండియా వస్తే మనం వివరంగా మాట్లాడుకుందాము అంతేకాదు నా దగ్గర ఒక మంచి ప్లాన్ కూడా రెడీగా ఉంది." అని చెప్పాడు అభిజిత్.
"సరే! ఈసారి నాతోపాటు డాడ్ కూడా వస్తున్నారు, ఇలాంటి విషయాలు డీల్ చేయడంలో ఆయన దిట్ట,, బెల్జియం దగ్గర ఒక తెగనే లేకుండా చేయగలిగారు." అని చెప్పాడు గోకుల్.
"అవునా? అయితే మరి ఇంకేంటి! అంకుల్ తో కలిసి త్వరగా వచ్చేయ్, ఇది మన హ్యాండ్ ఓవర్ అయ్యితే మన జీవితాలే మారిపోతాయి." అని చెప్పాడు అభిజిత్.
"ఓకే! మార్నింగ్ స్టార్ట్ అవుతాము బాయ్!" అని ఫోన్ పెట్టేసి ముకుల్ ఉన్న ఛాంబర్ లోకి వెళ్ళాడు గోకుల్.
సంతోషంగా ఉన్న కొడుకుని చూసి "ఏంటి? ఇండియా నుంచి ఫోన్ వచ్చిందా?" అని అడిగాడు ముకుల్.
"ఎస్ డాడ్! మీరు ఎలా కనిపెట్టారు?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గోకుల్.
"నువ్వు ఇండియా వెళ్లి వచ్చిన తర్వాత ఉన్న సంతోషం మళ్ళీ నీ మొహం లో కనపడింది. ఏంటి విషయం?" అని అడిగాడు ముకుల్.
"మనం రేపు ఇండియా బయల్దేరి వెళ్లాలి, మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తాను, ఈ దెబ్బతో నంద గ్రూప్ దశ తిరిగిపోతుంది వరల్డ్ బ్యాంక్ కి ఉన్న మన క్రెడిట్స్ కూడా తీరిపోతాయి, కానీ కొంచెం డేర్ చేయాలి." అని చెప్పాడు గోకుల్.
ఆ మాటకి నవ్వుతూ "మన రక్తంలో ఉందే ధైర్యంగా అడుగు ముందుకు వేయడం, సరే ప్రయాణానికి ఏర్పాట్లు చేయ్ మనతోపాటు అర్ణ కూడా వస్తుంది." అని చెప్పాడు ముకుల్.
"ఓకే డాడ్!" అని అక్కడ నుంచి వెళ్లిపోయాడు గోకుల్.
*******************
రెండు రోజుల తర్వాత ఇండియా వచ్చిన ముకుల్ వాళ్ళని రిసీవ్ చేసుకుని, శివమణి ఇంటి దగ్గరికి తీసుకువెళ్లాడు అభిజిత్.
ఇంటి ముందు కార్లు ఆగడంతో బయటికి వచ్చి రిసీవ్ చేసుకుంటున్న శివమణిని దగ్గరికి వెళ్లి "ఆయన గోకుల్ గారి ఫాదర్ ముకుల్ గారు." అని పరిచయం చేశాడు సర్ఫరాజ్.
"నమస్తే సార్! మీ గురించి చాలా విన్నాను, లోపలికి రండి." అని వినయంగా తీసుకువెళ్లాడు శివమణి.
లోపలికి వెళ్లి తల్లితో పాటు ఉన్న మిత్ర వైపు చూసి "నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా అమ్మాయిని తీసుకు వస్తాను అని చెప్పా కదా, అందుకే నీతో ఆడుకోవడానికి మా అర్ణని తీసుకువచ్చాను." అని చెప్పాడు గోకుల్.
ఆ మాట విని నవ్వుతూ అర్ణని దగ్గరికి తీసుకుని మిత్ర తో పాటు లోపలికి తీసుకువెళ్ళింది శివమణి భార్య.
గోకుల్ వాళ్ళందరిని తన రూమ్ లోకి తీసుకువెళ్లి శంభు ఇచ్చిన రాళ్లు బాక్స్ లో నుంచి బయటపెట్టి,
"ఈ స్టోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిందాని కన్నా చాలా పవర్ఫుల్ అండ్ ప్యూర్ నేచురల్ ఇది భూమిలో పుట్టింది కూడా కాదు చరిత్రలో ఆ నగరాన్ని దేవతలు సృష్టించారు అని ఉంది కదా, ఆ నగరంతో పాటు వీటిని కూడా సృష్టించారేమో అనిపిస్తుంది." అని చెప్పాడు శివమణి.
స్టోన్స్ మీద లేజర్ లైట్ వేసి ముకుల్ కి చూపిస్తూ "సార్! ఈ క్వాలిటీ వరల్డ్ లో ఎక్కడ దొరకదు దీనిని మనం సొంతం చేసుకోగలిగితే తరువాత ఏం జరుగుతుందో మీకు చెప్పనా అవసరం లేదనుకుంటా!" అని చెప్పాడు సర్పరాజ్.
"గోకుల్ గారు మనం అనుకున్న కండిషన్ ప్రకారం నాకు ఆ పంచరత్నాలు కావాలి, అక్కడ ఉన్న మిగతాది ఏదైనా సరే మీరే తీసుకోండి నాకు అవసరం లేదు." అని చెప్పాడు శివమణి.
ఆ మాటకి "అది కాదు శివమణి గారు!" అని మాట్లాడు బోతున్న అభిజిత్ చేయి పట్టుకుని, "దీని గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలుగా శ్రమ పడింది వారు, ఆయనకు ఏది కావాలి అంటే అది తీసుకొనిఇవ్వండి మిగతా అదే మనం తీసుకుందాము." అని నవ్వుతూ చెప్పాడు ముకుల్.
ఆ మాట విని "థాంక్యూ సార్!" అని సంతోషంగా అన్నాడు శివమణి.
"సరే! మనం ఆ ఏరియా మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటో చెప్పండి?" అని అడిగాడు ముకుల్.
"సార్! మీరు ఏ ప్లాన్ అయినా వేయండి. మనం ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని వేరే ప్లేస్ కి పంపించగలిగితేనే దానిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోగలము లేకపోతే అక్కడి నుంచి ఒక్క రాయి కూడా మనం తీసుకురాలేము." అని చెప్పాడు శివమణి.
"శివమణి గారు! మీరు ప్రతి దానికి భయపడుతున్నారు, నా దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండు ఉన్నాయి." అని చెప్పాడు.
"ఫస్ట్! నీ ప్లాన్ ఏ ఏమిటో చెప్పు?" అని అడిగాడు గోకుల్.
లాప్టాప్ ఓపెన్ చేసి వీడియో కాల్ చేసి మీకు కనిపిస్తున్న అతని పేరు కాలేశ్వరమంద! బీహార్‌లో అందరూ అతన్ని ముద్దుగా 'మంద' అని పిలుస్తారు, ఫస్ట్ ఈ వెపన్ ని అక్కడ ప్రయోగించబోతున్నాను." అని చెప్పాడు అభిజిత్.
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 271
Threads: 0
Likes Received: 194 in 133 posts
Likes Given: 1,186
Joined: Mar 2022
Reputation:
5
•
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
Sooper nadipistunnsv story ni
•
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 41
గోకుల్ తో పాటు ముకుల్ కూడా ఇండియా రావడంతో శివమణి కలిసి అక్కడ దొరికిన స్టోన్స్ గురించి తెలుసుకుని ఆ ఏరియా హ్యాండ్ అవుర్ చేసుకోవడానికి ప్లాన్ ఉందని కాలేశ్వరమంద గురించి చెప్పాడు అభిజిత్.
**********************
వీడియో కాల్ లో ఫోటో చూపిస్తూ "అతని పేరు కాలేశ్వరమంద! మనిషి రూపంలో ఉన్న మృగం, వీడి దగ్గర ఉన్న మనుషుల్ని చూస్తే మనకే భయమేస్తుంది. వాళ్ల దగ్గర న్యూ టెక్నాలజీ వెపన్స్ కూడా ఉంటాయి." అని చెప్పాడు అభిజిత్.
"ఈ ప్రొఫెషనల్ కిల్లర్ ని మనం అక్కడికి పంపిస్తున్నాము కదా! ఒకవేళ వీడు ఆ తెగ వాళ్ళకి పట్టుబడి మన పేరు చెబితే మన ప్లాన్ మొత్తం పాడవుతుంది." అని డౌట్ గా చెప్పాడు సర్పరాజ్.
"మనం వీడితో డైరెక్ట్ గా మాట్లాడ్డం కుదరదు, డార్క్ వెబ్ లో కాంట్రాక్ట్ ఇచ్చి, చెప్పిన ఎకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడమే మనం ఎవరో కూడా అతనికి తెలియదు, అయినా వీడికి గ్యాంగ్ ని కొట్టడం ఆ తెగ వాళ్ళ వల్ల అవ్వదు." అని చెప్పాడు అభిజిత్.
"ఈ మధ్యకాలంలో ఆ తెగ వాళ్ళ దగ్గరకు వెళ్ళింది మనమే, ఇప్పుడు ఈ ఎటాక్ జరిగింది అంటే కచ్చితంగా వాళ్లకి మన మీద డౌట్ వస్తుంది." అని చెప్పాడు శివమణి.
" అతను చెప్పింది కూడా నిజమే! అందుకే ఈ ఎటాక్ జరుగుతుంది అని మన మనిషితో వాళ్లకి ఇన్ఫర్మేషన్ పంపించండి. అప్పుడు మంద గెలిస్తే మనం ఆ ప్లేస్ కి ఎంటర్ అవుతాము, ఒకవేళ మంద చస్తే ఆ తెగ వాళ్ళకి దగ్గరవుతాము దేనినైనా మనకి అనుకూలంగా ఉపయోగించుకోవాలి." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని "అబ్బా.. అంకుల్! మీ బుర్రే బుర్ర, పక్క బిజినెస్ మాన్ అనిపించారు, ఇప్పుడే మంద గ్యాంగ్ కి కాంట్రాక్ట్ ఇచ్చి, శంభు దొర దగ్గరికి జాకిని పంపిస్తాను." అని చెప్పాడు అభిజిత్.
"సరే!" అని గోకుల్ వైపు చూసి "ఈ లోపు ఇక్కడ గవర్నమెంట్ మొత్తం మన గ్రిప్ లో ఉండేటట్లు చూడు." అని చెప్పాడు ముకుల్.
"ఓకే డాడ్! నేను ఆ పనిలో ఉంటాను." అని చెప్పాడు గోకుల్.
"అలాగే! ఆ అడవి ప్రాంతం ఉన్న మ్యాప్ నాకు ఒకసారి చూపించండి." అని అడిగాడు ముకుల్.
టేబుల్ మీద మ్యాప్ పెట్టి చూపిస్తూ "సార్! ఈ ఫారెస్ట్ ఏరియా ఇండియా బోర్డర్ లో ఉంటుంది. అంటూ వైపు వెళితే పాకిస్తాన్ లోకి ఎంటర్ అవుతాము, అక్కడ నుంచి టెర్రరిస్టు ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి కూడా భయపడతారు, అందుకే గవర్మెంట్ ఈ ప్లేస్ ని డెవలప్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు." అని చెప్పాడు శివమణి.
ఆ మాట విని మ్యాప్ వైపు చూస్తూ "మనకి మంచి పాయింట్ దొరికింది." అని అభిజిత్ వైపు చూసి NIA లో మన మాట వినే ఆఫీసర్ ని చూడు, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటో నేను చెబుతాను." అని చెప్పాడు ముకుల్.
"ఓకే అంకుల్! నా రికమండేషన్ తో జాబ్ లో జాయిన్ అయిన జోషి అని ఒక ఆఫీసర్ ఉన్నాడు మీరు ఎప్పుడు అంటే అప్పుడు పిలిపిస్తాను." అని చెప్పాడు అభిజిత్.
"ఆ ఆఫీసర్ ని వెంటనే పిలిపించు మనతో పాటు వాళ్లు కూడా ఆ ప్లేస్ కి రావాలి." అని చెప్పాడు ముకుల్.
"సరే అంకుల్! ఈరోజు రమ్మని చెప్తాను." అని చెప్పాడు అభిజిత్.
శివమణి వైపు చూసి "మేము ఇంకా బయలుదేరుతాము ఈ వర్క్ ఫినిష్ అయ్యేంతవరకు డాడ్ నేను నేను ఇండియాలోనే ఉండడానికి ఫిక్స్ అయ్యాము." అని చెప్పి ముకుల్ తో కలిసి బయటికి వచ్చాడు గోకుల్.
అక్కడ నుంచి కార్ లో వెళుతూ "అంకుల్! ఆ పంచరత్నాల మీద మన గోకుల్ ఆశపడ్డాడు మీరు శివమణికి అనవసరంగా మాటిచ్చారు." అని చెప్పాడు అభిజిత్.
అది విని నవ్వుతూ "నేను మాట మాత్రమే ఇచ్చాను పంచరత్నాలు ఇవ్వలేదు కదా! మన పని అయ్యేవరకు ఎవరి మనసు బాధ పెట్టకూడదు." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని నవ్వి "మీ స్టేటజి అర్థం చేసుకోవడం ఎవరివల్లా కాదు." అని డ్రైవింగ్ చేస్తున్న జాకి వైపు చూసి "నువ్వు రేపు గొర్వర్ బయలుదేరు." అని చెప్పాడు అభిజిత్.
"సరే భయ్యా! వాళ్ళని కలిసి ఎవరు అటాక్ చేస్తున్నారని చెప్పను." అని అడిగాడు జాకీ.
"ఆ పచ్చబొట్టు ఉన్న వ్యక్తి మళ్ళీ ధర్మ యుద్ధం చేయడానికి పుట్టాడు అని వాళ్ళు అనుకుంటున్నారు, కాబట్టి మొగలుల వారసుడు ఈ దేశం మీదకి దండయాత్రకు వస్తున్నడు మొదటగా మీ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడానికి చూస్తున్నారు అని ఒక చిన్న కథ చెప్పు!" అని చెప్పాడు సర్పరాజ్.
"గుడ్! ఆ మాట విన్న తర్వాత ధైర్యం ఉంటే పోరాడుతారు భయపడితే అక్కడ నుంచి పారిపోతారు." అని చెప్పాడు ముకుల్.
***************
రెండు రోజుల తర్వాత బేర అడివిలోకి వెళ్లి సహదేవుడిని కలిసి విషయం చెప్పాడు జాకి.
ఆ మాట విని "సరే దొర! నేను ఈ విషయం మా శంభూ దొరకి చెబుతాను మీరు వెళ్ళండి." అని హడావుడిగా గూడెంలోకి వెళ్లి విషయం చెప్పాడు సహదేవుడు.
అది విని "అయ్యా! నాకెందుకో మొన్న ఉత్సవాలకి వచ్చిన వాళ్ళ మీదే అనుమానంగా ఉంది." అని చెప్పాడు అభీర్.
"మనం కల్మషం లేని జంతువు మనసు అర్థం చేసుకోగలము గాని, గడియకి ఒక విధంగా ఆలోచించే మనిషి మనసు అర్థం చేసుకోలేము, అలా అని ఎవరి మీద నింద వేయకూడదు, మనం ఈ అడవిలోనే జీవిస్తూ బయట ప్రపంచం తెలియకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది." అని చెప్పాడు శంభు.
"సరే అయ్యా! ముందు ఈ ఆపద నుంచి మనం బయటపడ్డ తర్వాత నా దగ్గర ఒక ఉపయోగం ఉంది దానిని అమలు చేస్తాను." అని చెప్పాడు అభీర్.
"బిడ్డ! ఇది ఆపద కాదు నువ్వు పచ్చబొట్టుతో పుట్టినప్పుడే ధర్మం కోసం, మన జాతి కోసం, ఆ దైవం మనకి ఇచ్చిన ఈ భూమికోసం పోరాడవలసి వస్తుంది అని నాకు తెలుసు!"
అని చెప్పి
సహదేవుడు వైపు చూసి "మన వాళ్ళందరినీ సిద్ధం చెయ్ ఈ భూమి మీద అడుగుపెట్టిన వాడు వెనక్కి వెళ్ళకూడదు." అని కోపంగా చూస్తూ చెప్పాడు శంభు.
"సరే దొర!" అని ఆకాశం వైపు చూసి వింత శబ్దం చేస్తూ గట్టిగా అరిచాడు సహదేవుడు.
**********************
రెండు రోజుల తర్వాత తన గ్యాంగ్ తో గొర్వర్ అడవి దగ్గరికి చేరుకునే వర్క్ స్టార్ట్ చేశాము అని డార్క్ వెబ్ లో ఆబిజిత్ కి మెసేజ్ పెట్టాడు కాలేశ్వరమంద.
ఆ మెసేజ్ చూసి జైపూర్ ఫైవ్ స్టార్ హోటల్ లో తన రూమ్ లో శివమణితో మాట్లాడుతున్న ముకుల్ దగ్గరికి వెళ్లి "అంకుల్! వర్క్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి రేపు సాయంత్రానికి కంప్లీట్ అవుతుంది." అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని తల పైకెత్తి చూసి "అంత తొందర పడకు వాళ్ల గురించి ఇప్పుడే శివమణి దగ్గర వివరాలు తెలుసుకుంటున్నాను, ఆ ప్లేస్ ని హ్యాండోవర్ చేసుకోవడం మనం అనుకున్నంత ఈజీ కాదు, మన మనుషుల్ని కొంతమందిని తీసుకుని అక్కడికి వెళదాం రెడీ అవ్వండి." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని "ఎందుకు డాడ్? మందకి మనం కూడా హెల్ప్ వెళదామా?" అని డౌట్ గా అడిగాడు గోకుల్.
"అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరికి హెల్ప్ చేయాలో ఆలోచిద్దాము, త్వరగా పదండి ఆ ఆఫీసర్ మురళి జోషి కూడా వచ్చాడా?" అని అడిగాడు ముకుల్.
"ఎస్ అంకుల్! మురళి జోషి పాటు తన అసిస్టెంట్ జనార్ధన్ కూడా వచ్చాడు వాళ్ళని కూడా మనతో పాటు తీసుకువెళదామా?" అని అడిగాడు అభిజిత్.
"అవును! తర్వాత జరగబోయే కార్యక్రమానికి వాళ్లే ముఖ్య పాత్రధారులు అవుతారు." అని చెప్పి శివమణితో కలిసి రూమ్ లో నుంచి కార్ దగ్గరికి వెళ్ళాడు ముకుల్.
*********************
మరుసటి రోజు ఉదయం గొర్వర్ దగ్గర గెస్ట్ హౌస్ లో ఉన్న ముకుల్ వాళ్ళ దగ్గరికి వచ్చి "సార్! కెమెరా ఫిక్స్ చేసిన డ్రోన్స్ బేరా అడవి పైకి పంపించాము అక్కడ ఏం జరుగుతుందో మనం లైవ్ లో చూడొచ్చు!" అని చెప్పాడు మురళి జోషి.
లాప్టాప్ లో వీడియో చూపిస్తూ "సార్! మంద గ్యాంగ్ లోపలికి వెళ్లారు కానీ ఇప్పటివరకు వాళ్లకి ఆ తెగ వాళ్ళు ఎవరు కనిపించలేదు కాసేపటిలో ఆ కొండ దగ్గరికి చేరుకుంటారు." అని చెప్పాడు జనార్ధన్.
"ఓకే!" అని శివమణి వాళ్లతో కలిసి వీడియో చూస్తూ ఉన్నాడు ముకుల్.
*****************
బేరా అడివిలో నుంచి కొండ దగ్గరికి చేరుకుని తన మనుషుల వైపు చూసి, "ఒరేయ్ పైడి! ఒక్కడు కూడా కనిపించడం లేదేమిటి? అసలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదా?" అని చికాకు అడిగాడు మంద.
"అన్న! ఇక్కడ ఉండే వాళ్ళందరూ కొండ జాతి వాళ్ళు, చెట్టు పుట్టలలో కూడా కనపడకుండా దాక్కుంటారు, మనల్ని చూసి భయపడి పారిపోయినట్లు ఉన్నారు." అని వెకిలిగా నవ్వుతూ చెప్పాడు పైడి.
అంతలో తన తలకి రాయి తగలడంతో "ఎవడ్రా కొట్టింది?" అని తల పైకెత్తి చెట్టు మీద వెక్కిరిస్తున్న కోతి కనిపించడంతో గన్ తీసి గాల్లోకి షూట్ చేసి దాని వెనకాలే పరిగెత్తాడు మంద.
వీడియోలో జరిగేది చూస్తూ "కోతులు ఎంటర్ అయ్యాయి అంటే ఆ తెగ వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేయడం మొదలుపెట్టారు." అని చెప్పాడు శివమణి.
"నాకు తెలిసి శంభు వాళ్ళు ఇప్పుడు మంద గ్యాంగ్ మీద అటాక్ చేస్తారు." అని చెప్పాడు సర్పరాజ్.
ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూసి "ఆ తెగ వాళ్ళ అటాక్ స్టేటజి తెలుసుకోవడానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను." అని చెప్పాడు ముకుల్.
"అంకుల్! మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం!" అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు. అభిజిత్.
Posts: 439
Threads: 9
Likes Received: 3,693 in 389 posts
Likes Given: 1,063
Joined: Aug 2024
Reputation:
374
ఎపిసోడ్ 42
మురళీ జోషి వాళ్ళు డ్రోన్ కెమెరాస్ పంపించి అడవిలో జరిగేది చూసే విధంగా ఏర్పాటు చేయడంతో, వీడియో చూస్తూ కోతులు ట్రాప్ చేస్తున్నాయి ఆ తెగ వాళ్ళు మంద గ్యాంగ్ మీద అటాక్ చేస్తారు అని సర్పరాజ్ చెప్పడంతో నేను వాళ్ళ ఎటాక్ స్టేటాజీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నాను అని చెప్పాడు ముకుల్.
***********************
గెస్ట్ హౌస్ రూమ్ లో వీడియోలో చూస్తూ "కోతి ట్రాప్ చేసి వీళ్ళని తీసుకువెళ్లింది ఇంకా ఎవరు రాలేదేంటి!" అని అన్నాడు అభిజిత్.
అంతలో రెండు పెద్ద పులులు గంభీరంగా నడుచుకుంటూ రావడం చూసి "అదిగో! మనకి పులి పిల్లలు ఎంట్రీ ఇచ్చాయి వీళ్ళకి డైరెక్ట్ గా పెద్దపులులే ఎంట్రీ ఇస్తున్నాయి." అని చూస్తూ చెప్పాడు గోకుల్.
రెండు పెద్ద పులులు రావడం చూసి "ఒరేయ్ పైడి! వాటిని కాల్చి అవతల పారేయండి." అని చెప్పాడు మంద.
"సరే అన్న!" అని తన మనుషుల్ని పిలిచి బేరల్ గన్ తీసుకుని లోడ్ చేసి పెద్దపులలా వైపు గురి పెట్టి "షూట్ చేయండి రా.." అని చెప్పాడు పైడి.
అంతలో అక్కడికి వచ్చి గన్ ముందు నుంచుని దాని గొట్టంలో కన్ను పెట్టి చూస్తూ "దొర! దీంట్లో గోళీ ఉంటుందా?" అని అడిగాడు సహదేవుడు.
వీడియోలో చూస్తూ "ఆ కుర్ర నా కొడుకు వచ్చేసాడు, మంద గ్యాంగ్ వీడిని దాటుకుని వెళితే సగం గెలిచినట్లే!" అని చెప్పాడు జాకి.
"ఏంటి సార్! వాడిని అంతలా మెచ్చుకుంటున్నారు? గన్ సౌండ్ కి భయపడి పోయేటట్లు ఉన్నాడు." అని నవ్వుతూ చెప్పాడు జనార్ధన్.
గన్ ముందు నుంచున్న సహదేవుడిని చూసి "ఎవడ్రా నువ్వు? బుల్లెట్ తగిలితే పిట్టల ఎగిరిపోతావు, కొండమీద నుంచి వస్తున్నావా? మిగతా వాళ్లు కూడా అక్కడే ఉన్నారా?" అని కోపంగా చూస్తూ అడిగాడు పైడి.
"ఆ కొండ మీద ఎవరు లేరులే కానీ దొర! ఇంతకీ మీరు ఇక్కడకు ఎందుకు వచ్చినారు? కొంపతీసి పెద్దపులిని వేటాడడానికా?" అని అడిగాడు సహదేవుడు.
ఆ మాట విని అక్కడికి వస్తూ "కాదు మీ గూడెం దొరని వేటాడడానికి!" అని సహదేవుడు తల మీద గన్ పెట్టి చెప్పాడు మంద.
"అవునా?" ఏంటి మా నాయకుడిని వేటాడేది నువ్వేనా?" అని నవ్వుతూ ఉన్నాడు సహదేవుడు.
నవ్వుతున్న సహదేవుడి వైపు కోపంగా చూస్తూ చేతిలో ఉన్న గన్ వెనక్కి తిప్పి కొట్టడానికి మీదకి వెళ్ళాడు మంద గ్యాంగ్‌లో ఒకడు.
అంతలో వేగంగా అక్కడికి వచ్చి సహదేవుడు మీదకి వచ్చిన వాడిని రెండు కాళ్ళతో పట్టుకుని దూరంగా ఉన్న కొండమీదకు తీసుకు వెళ్లిపోయింది సింబా.
అది చూసి "ఒరేయ్ కుమారు! ఆ పక్షిని షూట్ చేయండిరా..!" అని గట్టిగా అరిచాడు పైడి.
"సరే బాస్!" అని షూట్ చేయడానికి గన్ పైకి ఎత్తిన కుమార్ ని చూసి చేతిలో ఉన్న కర్ర నేలకి అదిమి పెట్టి పైకి ఎగిరి కాలుతో పీక మీద ఒక తన్ను తన్నాడు సహదేవుడు.
ఆ దెబ్బకి రెండు కళ్ళు తేలేసి కిందపడి కదలకుండా ఉండిపోయాడు కుమార్.
వీడియోలో అది చూసి ఒక్కసారి షాక్ అయ్యి "సార్! మీరు చెప్పింది నిజమే! వీడు మామూలు వాడు కాదు, వాడి మీద నాలుగు రేట్లు ఉన్న వాడిని ఒక్క దెబ్బతో కింద పడేసాడు." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు మురళి జోషి.
తన మనిషి కింద పడిపోవడం చూసి దగ్గరకు వెళ్లి తల ఊపి చూసి "అన్న! మాన కుమార్ చచ్చిపోయాడు." అని కంగారుగా చూస్తూ చెప్పాడు పైడి.
ఆ మాటకి సహదేవుడి వైపు కోపంగా చూస్తూ "ఒరేయ్ ఈ కుర్ర నా కొడుకుని రెండుగా చీల్చి చెట్లుకి కట్టండి." అని ఆవేశంగా చెప్పాడు మంద.
ఆ మాట విని కోపంగా గాండ్రిస్తూ వస్తున్న రెండు పెద్ద పూలులను చూసి "ఆగండి." అని చెప్పి ఆకాశం వైపు చూసి వింత శబ్దంతో గట్టిగా అరిచాడు సహదేవుడు.
ఆ సౌండ్ ఆగే లోపల దూరం నుంచి 4 బళ్ళాలు వచ్చి అక్కడ ఉన్న మంద మనుషుల గుండెల్లో దిగాయి.
చచ్చిన వాళ్ళ దగ్గరకు వెళ్లి కాలితో తంతు మంద వైపు చూసి "లోపలికి వెళ్లాలని చూస్తే మీకు కూడా ఇదే గతి పడుతుంది. మర్యాదగా వెనక్కి వెళ్లిపోండి." అని వార్నింగ్ ఇచ్చాడు సహదేవుడు.
"మీరేం తెగ వాళ్ళు రా..! పిరికినా కొడుకుల్లాగా ఎక్కడో దాక్కుని బళ్ళాలు విసురుతున్నారు దమ్ముంటే ముందుకి రమ్మని మీ వాళ్ళతో చెప్పు!" అని రెచ్చగొడుతూ చెప్పాడు మంద.
"మా సైన్యం బయటికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్లలేరు." అని చెప్పాడు సహదేవుడు.
వీడియోలో చూస్తూ "ఏంటి సార్ వీడు, వాళ్ల దగ్గర ఉన్న గన్ అంత లేడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు జనార్ధన్.
"ఆ తెగవారు శివాజీ మహారాజ్ గారి తో పాటు యుద్ధం చేసిన వీరుల వారసులు! ఆ మాత్రం ధైర్యం ఉంటుంది." అని చెప్పాడు ముకుల్.
"డాడ్! మంద కూడా వాడిని బానే రెచ్చగొడుతున్నాడు, కోపంతోనైనా అందరూ బయటికి వస్తారు అనుకుంటున్నాను." అని చెప్పాడు గోకుల్.
అంతలో అక్కడికి నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని వీడియో లో చూసి "సార్! అతనే అభీర్! ఆ తెగకి కాబోయే నాయకుడు." అని చెప్పాడు శివమణి.
"అవునా? యుద్ధానికి నాయకుడే ముందు వస్తున్నాడేమిటి?" అని డౌట్ గా అడిగాడు ముకుల్.
"సార్! అది వీరుల లక్షణం! తను ముందుండి సైన్యానికి ధైర్యం నింపుతాడు, అవసరమైతే తన వాళ్లకోసం ప్రాణం కూడా ఇస్తాడు." అని చెప్పాడు శివమణి.
"గ్రేట్! నువ్వు చెప్పింది నిజమే, అభీర్ ఇక్కడ ఉండగా మనం లోపలికి ఎంటర్ అవ్వలేము, ముందు వీడిని ఇక్కడి నుంచి ఎలా పంపించాలో ఆలోచించాలి." అని చెప్పాడు ముకుల్.
రెండు పులుల మీద చేతులు వేసుకుని నడుచుకుంటూ వస్తున్న అభీర్ ని చూపించి "చూశావా దొర! మా నాయకుడి బిడ్డ ఎలా ఉన్నాడో, మీకు దమ్ముంటే మా అభీర్ కళ్ళల్లో బేరుకు తెప్పించండి చాలు మీరు గెలిచినట్లే!" అని గొప్పగా చెప్పాడు సహదేవుడు.
"ఏంటి? వీడిని చూసి మేము భయపడాలా?" అని గన్ తీసి షూట్ చేశాడు పైడి.
వేగంగా తన మీదకి వస్తున్న బుల్లెట్ ని చూసి పక్కకి తప్పుకొని చేతిలో ఉన్న కత్తిని బలంగా విసిరాడు అభీర్.
వేగంగా వస్తున్న కత్తిని చూసి తప్పుకునే లోపు పైడి తలలో దిగి రెండు ముక్కలుగా చీల్చింది.
అది చూసి "తమ్ముడు!" అని గట్టిగా అరుస్తూ "ఒరేయ్! వాడిని చంపేయండి రా.!" అని తన మనుషులకి చెప్పాడు మంద.
గ్యాంగ్ లో ఉన్న మనుషులు గన్స్ పైకి తీసేలోపు చెట్ల మీద నుంచి కొండల మీద నుంచి దూకి బల్లెలతో పొడిచి చంపుతు ఉన్నారు అభీర్ సైన్యం.
తన మనుషులు దారుణంగా చనిపోవడం చూసి వెనుకడుగు వేసి భయంగా చూస్తూ ఉండిపోయాడు మంద.
జరిగేదంతా వీడియోలు చూస్తూ "ఏంటి? అందరూ అభీర్ వయసులో ఉన్న కుర్రవాళ్లే ఉన్నారు, అక్కడ పెద్ద వాళ్ళు ఎవరు లేరా?" అని అనుమానంగా అడిగాడు ముకుల్.
"సార్! వాళ్ళ తెగ ఆచారం ప్రకారం 14 సంవత్సరాలు దాటిన వాళ్ళు ముందుగా యుద్ధానికి వెళతారు." అని చెప్పాడు శివమణి.
"14 సంవత్సరాల ఉన్నవాళ్లే ఇలా ఉన్నారు అంటే, పెద్ద వాళ్ళు ఇంకెలా ఉంటారు." అని టెన్షన్ గా చూస్తూ అడిగాడు మురళి జోషి.
భయంతో వెనుక అడుగులు వేస్తున్న మంద ముందుకు వెళ్లి "మిమ్మల్ని ఎవరు పంపించారు?" అని అడిగాడు శంభు.
వీడియోలో శంభుని చూసి "సార్! అతనే ప్రస్తుతం ఆ తెగ నాయకుడు, అభీర్ తండ్రి శంభు దొర!" అని చెప్పాడు సర్పరాజ్.
వీడియోలో శంభుని చూస్తూ "మనిషి మంచి దిట్టంగా మిలట్రి కమాండోలాగా ఉన్నాడు, వీళ్ళతో డైరెక్ట్ ఫైట్ చేయడం చాలా కష్టం!" అని చెప్పాడు జనార్ధన్.
"ఎస్! వీళ్ళకి చావు అంటే భయం లేదు, డైరెక్ట్ ఫైట్ చేస్తే ఓడిపోవడం ఖాయం!" అని చెప్పాడు ముకుల్.
"అంకుల్! అలా అయితే నా ప్లాన్ బి కూడా వేస్ట్!" అని చెప్పాడు అభిజిత్.
"ప్లాన్ బి నా దగ్గర ఉంది. దానిని అమలు చేద్దాం కంగారు పడకు!" అని నవ్వుతూ చెప్పాడు ముకుల్.
"మా డాడీ వాళ్ళ స్టేటజి చూసి నవ్వారు అంటే, మనం పని ఈజీగా అయిపోతుంది." అని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు గోకుల్.
"సార్! ఇప్పుడు ఆ మంద మన పేరు చెబుతాడేమో!" అని డౌట్ గా అడిగాడు శివమణి.
"అసలు! వాడికి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరో కూడా తెలియదు మన పేరు ఎలా చెబుతాడు, మీరేం కంగారు పడకండి." అని చెప్పాడు అభిజిత్.
భయంతో వెనక్కి వెళుతూ శంభుని షూట్ చేయడానికి గన్ పైకి ఎత్తడు మంద.
తమ ఎదురుగా ఉన్న గన్ ని చేత్తో పట్టుకుని "దొర! వీటిల్లో ఉన్న గోళీలు మమ్మల్ని ఏమి చేయలేవు, నిన్ను ఎవరు పంపించారో చెప్పు ప్రాణాలతో వదులుతాను." అని అడిగాడు శంభు.
"మీ స్థలం మీద పరదేశి వాళ్ళ కళ్ళు పడింది నన్ను చంపిన మీరు తప్పించుకోలేరు వాళ్ళు కచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వస్తారు." అని భయంగా చూస్తూ చెప్పాడు మంద.
"మా పూర్వీకులు శివాజీ మహారాజ్ గారితో కలిసి ఎడతెరిపి లేకుండా 25 సంవత్సరాలు యుద్ధాలు చేశారు ఆ రక్తమే మాలో కూడా ఉంది." అని కసిగా చూస్తూ తన చేతిలో ఉన్న కత్తితో మంద తల నరికి
తన మనుషుల వైపు చూసి "మొండెం, తల వేరువేరుగా మన గూడానికి వచ్చే దారిలో చెట్టుకి వేలాడు తీయండి. దీనిని చూసి మనతో కయ్యానికి ఎవరైనా సరే భయపడాలి." అని చెప్పాడు శంభు.
మంద చనిపోవడంతో అక్కడికి వచ్చి, తన దగ్గర ఉన్న ఫోను కాగితాలు తీసుకుని తన మనుషుల వైపు చూసి "చనిపోయిన వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మొత్తం తీసుకుని వాళ్ళ శరీరాలను ఇక్కడే తగలబెట్టండి ఆనమాలు కూడా దొరకకూడదు." అని చెప్పాడు అభీర్.
"సరే!" నాయకుడా అని చెప్పి చనిపోయిన వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు, గన్స్ తీసుకుని శరీరాలను నూనె పోసి తగలబెడుతు ఉన్నారు అభీర్ సైన్యం.
వీడియోలో చూస్తూ "అభీర్ చాలా తెలివైనవాడు." అని చెప్పాడు ముకుల్.
Posts: 3,475
Threads: 163
Likes Received: 10,964 in 2,210 posts
Likes Given: 7,219
Joined: Nov 2018
Reputation:
760
కథ రసకందాయంలో పడింది.
బాగుంది శివసాయి గారు.
•
Posts: 4,561
Threads: 9
Likes Received: 2,892 in 2,220 posts
Likes Given: 10,676
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
24-01-2026, 03:40 PM
(This post was last modified: 24-01-2026, 03:41 PM by ash.enigma. Edited 1 time in total. Edited 1 time in total.)
(24-01-2026, 08:28 AM)k3vv3 Wrote: కథ రసకందాయంలో పడింది.
బాగుంది శివసాయి గారు.
Abhir Mukul tho revenge ani cheppinappude .. padindi.
inka flash back aipothe.. inka appudu climax iraga iraga anukuntunna!!
But the way SivaSai garu.. every small detail ni.. ekkada atu itu pokunda .. tight ga raastunnaru. Hat's off to that!!
•
Posts: 1,150
Threads: 2
Likes Received: 622 in 442 posts
Likes Given: 1,308
Joined: May 2019
Reputation:
7
•
|