Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Oh! .. inka next day avaledu kada!!
My bad.. time isn't going fast!!??
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Waiting for next
Like Reply
Part - 43


అవిని కి ఆగకుండా ఎక్కళ్ళు వస్తువుంటాయి. ఏంటి సడన్గా ఇలాగా..  వాటర్ తాగి కొంచెం స్థిమిత పడి హమ్మయ్య అనుకుంటుంది.

విక్రమ్ గారు ఎలా ఉన్నారో ? ఫోన్ చేస్తే... వద్దులే పక్కన శిల్ప ఉంటుంది  కదా...  అలా అనుకోగానే  మనసు అంత చాలా భారంగా  మారిపోతుంది.

విక్రమ్ గారు శిల్పనే భార్య అనుకుంటున్నారా... నాకు పెట్టిన రింగ్ అండ్ నల్ల పూసలు ఇవ్వాల్లేదు కదా..
అవి ఏవి అని శిల్ప ని అడగలేదా అనుకుంటూ..

అయ్యిన నా పిచ్చి గాని ఆ ధనుంజయ్ ఫ్యామిలీ తిమ్మిని బమ్మిని చేసి అయినా సరే శిల్ప ని ఆయనకి భార్యని చేసేస్తారు.

ఇంక నా జీవితం ఇంతే నా అని దిగులుగా కూర్చుంటుంది.
మరి నువ్వు ఎందుకు నిజం చెప్పలేదు అని తన అంతరాత్మ ప్రశ్నిస్తుంది.

చెబితే నమ్ముతారా...నువ్వు చెబితేనే కదా నమ్ముతారో నమ్మరో  అనేది తెలిసేది. ఏమి చెప్పకుండా నీలో నువ్వే మదనపడితే అర్థం ఏముంటుంది...

ఇప్పటికే వాళ్ళిద్దరూ లైఫ్ స్టార్ట్ చేసేసి ఉంటారు కదా... చెప్పడం వల్ల విక్రమ్ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు..
నాకు దగ్గరవుతారా...శిల్ప ని దూరం చేసుకోగలుగుతారా... అని ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది.

దేనికి తన దగ్గర సమాధానం ఉండదు . ఆలోచించి ఆలోచిస్తూనే పడుకుండిపోతుంది. సూర్యుడు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పిన సరే నిద్రమత్తు వదలదు. మంచి డీప్ స్లీప్ లో ఉన్నగా ఫోన్ రింగ్ అవుతుంది.

  ఈ టైం లో ఎవరు ఫోన్ అనుకోని లిఫ్ట్ చేసి మత్తుగా హలో అంటుంది. నేను శ్రీ ని మాట్లాడుతున్నాను అనగానే.. చెప్పండి అన్నయ్య.

తొందరగా హాస్పిటల్ కి రా...విక్రమ్ కి యాక్సిడెంట్ అయ్యింది అని కంగారుగా చెబుతాడు.  అంతే నిద్ర మత్తు అంత ఎగిరిపోయి ఏం మాట్లాడుతున్నారన్నయ్య మీరు అని ఏడుపు గొంతుతో అడుగుతుంది.

నేను నిజమే చెబుతున్నాను హాస్పిటల్ అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తున్నాను అర్జెంటుగా రా ని ఫోన్ పెట్టేస్తాడు. అవని స్పీడ్ గా నేహా దగ్గరికి వెళ్లి సీనియర్,  సీనియర్ అంటూ  కంగారుగా పిలుస్తుంది.

ఏమైంది అవని... నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అనగానే... తొందరగా పదండి సీనియర్.
హాస్పిటల్ కి వెళ్లాలి ఏడుస్తూ బయటకు పరుగు పెడుతుంది.
ఆగు అవని వస్తున్నాను అని నేహా ఫ్లాట్ లాక్ చేసి అవని వెనకాల పరుగు పెడుతుంది.

అవని పిచ్చిదానిలా రోడ్డు మీదకి వచ్చి పరుగు పెడుతూ ఉంటుంది. నేహా స్పీడ్ గా వచ్చి నీకేమైనా పిచ్చా అని పట్టుకుని... ఏ హాస్పిటల్  అని అడుగుతుంది.

వెంటనే ఫోన్ తీసుకొని శ్రీ పంపిన లొకేషన్ చూపిస్తుంది. అటుగా వెళుతున్న ఆటో ని ఆపి ఇద్దరు ఎక్కుతారు. ఏమైంది అని నేహా ఎన్ని సార్లు అడిగిన అవని ఏమి మాట్లాడదు.

నేహా కూడ సైలెంట్ అయ్యిపోతుంది. అరగంట లో హాస్పిటల్ కి చేరతారు. ఆటో ఆగగానే అవని స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోతుంది.

ఏమైంది అవనికి. నాకు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకుంటూ పే చేసి లోపలికి వెళ్ళుతుంది. నేహా లోపలికి వెళ్ళేటప్పటికి అవని శ్రీ చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది.
శ్రీ గారు ఇక్కడ ఉన్నారు ఏమిటి.. విక్రమ్ గారు ఎక్కడ అని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్లుతుంది. అవని ఏడుస్తూ ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య. ఆక్సిడెంట్ ఎప్పుడు అయ్యింది అనగానే..

రాత్రి చెల్లమ్మ అని చాలా దీనంగా చెబుతాడు. రాత్రి అయ్యితే ఇప్పుడు దాక నాకు ఎందుకు చెప్పలేదు అని అరుస్తుంది.

నేహా అవని వైపు వింతగా చూస్తూ దీనికిమైనా పిచ్చా...
అతనికి ఆక్సిడెంట్ అయ్యితే దీనికి ఎందుకు చెప్పాలి అని అయోమయంగా జరిగేదాన్ని చూస్తుంది.

రాత్రి విక్రమ్ వైఫ్ తో వచ్చాడు. ఇద్దరికీ ఏదో గొడవ జరిగింది. విక్రమ్ కోపంగా బయటకు వెళ్ళాడు. ఇలా అయ్యింది అని చెప్పగానే శిల్ప ఇక్కడే ఉందా అని టెన్షన్ పడుతుంది.

ఆ అమ్మాయి ఏది అని తడబడుతు అడుగుతుంది. హ్మ్ ఆ అమ్మాయి కుంచెం తిక్కలిది అనుకుంటా భర్త కి ఇలా ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది.

హైదరాబాద్ నుంచి బామ్మగారు ఒకేటే ఫోన్లు. అప్పుడు అనుమానంగా చుట్టూ చూస్తూ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవ్వరు లేరు ఏమిటీ  అన్నయ్య అని అడుగుతుంది.

బామ్మగారికి. సెంటిమెంట్స్ ఎక్కువ కదా. విక్రమ్ కి ఇలా అవ్వగానే పూజ జరిపిస్తున్నారు. అందరూ అక్కడే ఉండాలి అంట.
పెళ్లి అయ్యాక  విక్రమ్ తన వైఫ్ కి రింగ్ పెట్టాడు అంట.అది చాలా పవర్ఫుల్.  విక్రమ్ భార్య తన రింగ్ ఉన్న చేతితో విక్రమ్ కుడి చేతిలో చెయ్యి వేసి గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోమని చెప్పారు.

ఆ విషయం తెలిసినప్పుడు నుంచి ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. నాకు ఏమి చేయాలో తెలియక నీకు కాల్ చేసాను. చాలా టెన్షన్ గా ఉంది ఏమి జరు.. అంటూ ఉండగానే రూమ్ ఎక్కడ అన్నయ్య అని అడుగుతుంది.

అక్కడ అని చూపించాగానే పరుగున వెళుతుంది. వెనక నేహా కూడ వెళుతు ఉంటే నువ్వు ఎక్కడికి అని చెయ్యి పట్టుకొని ఆపుతాడు.

సీరియస్గా  ఒక్క లుక్ ఇస్తుంది. సారీ మిస్. మీరు కూర్చోండి అని సీట్ ఆఫర్ చేస్తాడు. అస్సలు ఇక్కడ ఏమి జరుగుతుంది.
కూల్ నేహా. అంత లోకకల్యాణమే జరుగుతుంది. అదే అవని కళ్యాణం అంటాడు. చేతులు రెండు కట్టుకుని అర్ధం కాలేదు అంటుంది.

పైనుంచి కిందకి ఒకసారి చూసి అవని కి పెళ్లి అయ్యింది అని తెలుసు కదా మరి ఆమె భర్త ఎవ్వరు అని అడుగుతాడు.

నాకు తెలీయదు అని చెబుతుంది. మీది నిజంగా మట్టిబుర్రే. ఒక పెళ్లి అయ్యిన అమ్మాయి ఎవరి కోసం పరుగు పెడుతుంది అనగానే.. భర్త కోసం అని అంటే విక్రమ్ గారు అవని భర్త అని ఆశ్చర్యంగా  అడుగుతుంది.

అమ్మయ్య ఇప్పటికైనా అర్థం అయ్యినందుకు థాంక్స్.. ఇప్పుడైనా కూర్చుంటారా అని కూర్చుంటాడు. ఎందుకు మీరు ఫ్లాట్ తీసుకున్నారు. అవని దగ్గరికి వచ్చి మాట్లాడొచ్చు కదా...

అవని గురించి అన్ని తెలుసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా... నిన్న ఏం న్యూస్ ఛానల్ చూడలేదా మీరిద్దరూ అని అడుగుతాడు.

అవిని కి టివి చూసే ఇంట్రెస్ట్ ఉండదు. నాకు వర్క్ ఉండి బయటకు వెళ్లాను అందుకే ఏమీ చూడలేదు అని న్యూస్ ఏంటి అని అడుగుతుంది.

చెప్పడం ఎందుకు చూపిస్తాను అని ఛానల్ ఓపెన్ చేసి ఇస్తాడు. అంతా చూసి ఏమిటి ఇంత జరిగిందా అని ఆశ్చర్య పోతుంది.

ఇప్పుడు అవిని యే చెప్పాలి అన్నది మా విక్రమ్ ప్లాన్. అందుకే ఇంత డ్రామా అంటాడు.  విక్రమ్ గారికి నిజంగానే ఏమీ అవ్వలేదా అని చాలా ఆనందంగా అడుగుతుంది.

పాపం కదా అవని అనగానే.. అవని ఎందుకు పాపం,  ఇంత ఫైట్ చేసిన మా విక్రమ్ ని పాపం అనుకోవాలి . పెళ్ళాం కోసం ఇంత నమ్మకంతో ఫైట్ చేస్తారా అంటాడు.

అది నిజమే. విక్రమ్ గారు అడవిని ఏలే సింహం అయితే ఇది తాబేలు కన్నా దారుణం. విక్రమ్ గారు ఆడే ఆటలో ఇది ఎలా బకరా అవుతుందో అని మనసులో అనుకుంటూ..
అవని మీద మనసులోనే జాలిని చూపిస్తుంది.

శ్రీ చూపించిన రూములోకి అవిని పరిగెత్తుకుంటూ వెళుతుంది. రూమ్ డోర్ ఓపెన్ చేయ గానే విక్రమ్ కి ఫుల్ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టేసి ఉంచుతారు.

బి. పి. , హార్ట్ బీట్ అన్ని చాలా స్లో గా ఉంటాయి. అవిని ఏడుస్తూ విక్రమ్ దగ్గరికి వెళ్లి మీరు ఆరోజు పెట్టినప్పుడు నుంచి నేను అసలే తీయలేదు కదా..

చేతికున్న గ్లౌస్ తీసేసి శ్రీ చెప్పినట్టుగా తన చేతిని విక్రమ్ కుడి చేతులో పెట్టి గట్టిగా పట్టుకుంటుంది. నేను పక్కనే ఉన్నాను. నా చేతిని మీ చేతితో కలిపి పట్టుకున్నాను వినిపిస్తుందా అంటూ ఏడుస్తూ అడుగుతుంది.

విక్రమ్ అవని చేతిని గట్టిగా పట్టుకుంటాడు.  సంతోషంగా తలపైకి ఎత్తి చూస్తుంది. బీపీ హార్ట్ బీట్ అన్ని నార్మల్ గా వస్తూ ఉంటాయి.

డాక్టర్ డాక్టర్ అని పిలుస్తుంది. వెంటనే ఒక డాక్టర్ వచ్చి ఏమైంది మేడం అని అడగగానే... విక్రమ్ గారు కదులుతున్నారు చెక్ చేయండి అని చెబుతుంది.

డాక్టర్ చెక్ చేసి వావ్ వాట్ ఏ మిరాకిల్. వదిలేసుకున్న విక్రమ్ గారిలో చలనం వచ్చింది. ఏం చేశారు మేడం మీరు అనగానే..

అవని సంతోషంతో నేనేమీ చేయలేదు డాక్టర్. చేయ పట్టుకుని కూర్చున్నాను అంతే అని అమాయకంగా చెబుతుంది.

మీరు అలాగే పట్టుకొని కూర్చోండి. కొంచెం సేపటిలో ఆయనకి మేలుకువ రావచ్చు.  నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను.  ఏదైనా అవసరమైతే పిలవండి అని బయటికి వెళ్లి శ్రీ కి ఓకే అని థంబ్ ఫింగర్ చూపిస్తాడు.

డాక్టర్ బయటికి వెళుతూ మీరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం అని చెప్పి మరి వెళ్తాడు.

అవని విక్రమ్ చేయని గట్టిగా పట్టుకుని ఇంకొక చేతితో నుదురు మీద పెట్టి విక్రమ్ గారు నా మాటలు మీకు వినిపిస్తున్నాయా... నేను చెప్పేది నిజమని మీరు నమ్ముతారా అని అడుగుతుంది.

మీరు తాళి కట్టింది నాకే. శిల్ప కి కాదు. ఆరోజు ఉంగరం పెట్టింది కూడా నాకే. అందుకే ఆ చేతితో మిమ్మల్ని పట్టుకోగానే మీలో ఆ వైబ్రేషన్స్ వచ్చాయి అని అమాయకముగా,ఎమోషనల్ గా చెబుతుంది.

ఆ ధనుంజయ్ ఫ్యామిలీ చేసిన మోసం వలన నేను అజ్ఞాతంలోకి  రావాల్సి వచ్చింది. కానీ మీకు దూరంగా వస్తుంటే నా ప్రాణం పోయినట్టే ఉంది.

మిమ్మల్ని ఇక్కడ చూడగానే నేను ఎంత సంతోష పడ్డానో నాకే తెలుసు . మీ పక్కనే శిల్ప ని ఊహించుకోలేకపోయాను.

కానీ ఏ హక్కుతో మీ ముందుకు రావాలో అర్థం కాలేదు. జరిగింది చెపితే మీరు అర్థం చేసుకోకుండా మోసం చేశాను అంటే నేను తట్టుకోలేను.

నాకంటే ఎక్కువగా ప్రేమించేది మిమల్నే . రెండు రోజులకే నా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు.

మీకు ఏమన్నా అయితే అంతకముందే నా ప్రాణం నా నుండి దూరంగా వెళ్లిపోతుంది ఇది నిజం విక్రమ్ గారు అని ఆ చేతిని నుదుటిపైన పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది.
[+] 11 users Like SivaSai's post
Like Reply
Part - 44


అవని ఏడుస్తూ విక్రమ్ చేతిని నుదుటిని అంటించుకుంటుంది. విక్రమ్ కి చాలా కష్టంగా ఉంటుంది. నిన్ను ఎటు వెళ్ళనివ్వకుండా లాక్ చేసేయాలి అనుకుని కళ్ళు మెల్లిగా కదూపుతూ ఉంటాడు.

అవని చూడడం లేదు అని చేతిని ఇంక కుంచెం కదుపుతాడు. అవని కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తోంది.
డాక్టర్  డాక్టర్  అని అరుస్తూ ఉంటుంది.

బయట ఉన్న డాక్టర్ తల కొట్టుకుని, కంగారుగా లోపలికి వచ్చి ఏమైంది మేడం అని అడుగుతాడు. డాక్టర్ చూడండి విక్రమ్ గారు కళ్ళు కదుపుతున్నారు.

మీ మాటలు కి బాగా రెస్పాండ్ అవ్వుతున్నారు. అలాగే ట్రై చేయండి అని బయటికి వచ్చి శ్రీ పక్కన కూర్చొని మరి ఇంత అమయికురాలు  ఏమిటీ రా...

ఇలా ఉంటే వాడు బాగా అడేసుకుంటాడు రా పాపం రా అని జాలిగా అంటాడు. అంటే మీరు డాక్టర్ కాదా అని నేహా అడిగితే...

డాక్టర్ కోట్  వేసుకున్న వాళ్ళు అంత డాక్టర్స్ ఆ ఏమిటి అంటూ శ్రీ వైపు చూసి నీ మేడం కూడ ఆ బాపతే నా అని అడుగుతాడు.

నీకు దండం రా స్వామి కాసేపు నోరు మూసుకో అని నేహా కి ఒక తింగరి స్మైల్ ఇస్తాడు.  నేహా వాళ్ళిద్దర్నీ చూసి తల విదల్చుకుని సైలెంట్ గా కూర్చుంటుంది.

అవని విక్రమ్ ఫేస్ దగ్గరగా వచ్చి నా మాట వినిపిస్తుందా అని క్రాక్ వాయిస్ తో అడుగుతుంది.

విక్రమ్ కనురెప్పలు ఆటుఇటు కదుపుతూ స్లో వాయిస్ తో ఎవరు అని అడుగుతూ చేతిని గట్టిగ పట్టుకుంటాడు.

ఏమని చెప్పాలో తెలియక నేను అండి అని ఏడుస్తూ చెబుతుంది. నేను అంటే అని ముక్కలుముక్కలుగా అడుగుతాడు.

మీ భార్య ని అని చెప్పి మనసులో మాత్రం పేరు చెప్పకపోవడమే బేటర్. తరువాత కష్టం అవుతుంది అనుకుంటూ నుదురు మీద వేసిన చేతిని చెంప మీద కి తీసుకు వస్తుంది.

విక్రమ్ మనసులో నీ చావు తెలివి తేటలు నాకు తెలుసు. భార్య అంటే శిల్ప అనుకుంటాను. తరువాత నువ్వు వెళ్లిపోవచ్చు నీ ఆలోచిస్తున్నావు కదా... ఇక్కడ ఉన్నది విక్రమ్.

నీ అంతట నువ్వే అన్ని చెప్పుతావు చూస్తా ఉండు అనుకుని .. నా భార్యవా...మగతగా అడుగుతాడు. అవునండి అని చెబుతోంది.

కొంచెం దగ్గరికి రా  అని చెయ్యి పట్టుకుని లాగుతాడు. అబ్బా. ఈ మనిషికి దెబ్బలు తగిలినా సరే ఎక్కడి నుంచి ఇంత బలం వస్తుంది అనుకుంటు ఇంకా దగ్గరికి వెళుతుంది.

ఒకరి ఊపిరి ఒకరికి తగిలే అంత దగ్గరగా ఉంటారు. అవని మాత్రం టెన్షన్ గా విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ కి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.

నా భార్యామణివే కదా అని ముద్దు ముద్దుగా అడుగుతాడు. అవును అండి అనగానే ఒక ముద్దు పెట్టు అని అడుగుతాడు.

ఏమిటి ముద్ద అని  నోరు వదిలేస్తుంది. ఎంతసేపటికి అవని లో స్పందన రాదు.  ఓ నా భార్యవి కాదా కలవరింతలుగా అడుగుతూ ఉంటాడు.

బిపి,,పల్స్ రేట్ మళ్లీ డౌన్ అవుతూ ఉంటాయి. అవి చూడగానే అవిని కంగారుగా డాక్టర్ అని మళ్ళీ అరుస్తూ ఉంటుంది.

మళ్ళీ ఏం జరిగిందో ఏంటో అని డాక్టర్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. ఏమైంది మేడమ్ అని అడగగానే బీపీ డౌన్ అవుతుంది చూడండి అని కంగారుగా చెబుతుంది.

వెంటనే విక్రమ్ ని చెక్ చేస్తూ ఆయన ఎందుకో డిసప్పాయింట్ అవుతున్నారు. మీరు ఏమైనా రాంగ్ గా మాట్లాడారా...మోటివేషన్ ఇవ్వలేదా అని అడుగుతాడు.

దానికి అవిని ఏమని చెప్పాలో తెలియక అది అని నసుగుతు ఉంటుంది. చూడండి మేడం, విక్రమ్ బ్రతకాలి అనుకుంటే మోటివేట్ చేయండి. 

ఇంతకు మించి ఏమీ లేదు అని చెప్పి... బయటకు వెళ్ళిపోయి చైర్ లో కూర్చుని వీళ్ళిద్దరిని కలపడం ఏమో కానీ.. మనకు తెలియని డాక్టర్ వృత్తిలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది రా అని శ్రీ తో అంటూ ఉంటాడు.

నేహా కాఫీ తీసుకొచ్చి ఇచ్చి తాగుతూ ఉండండి అని చెప్తుంది థాంక్యూ మిస్ అనగానే..  ఇంతకీ ఎంతవరకు వచ్చింది ఆ డ్రామా అని అడుగుతుంది.

ఇంకా దారిలోనే ఉంది. మీ ఫ్రెండ్ మరి తాబేలు అనుకుంటా ... అనగానే నవ్వుతూ అది అందరిలాంటి అమ్మాయి కాదు అని చెబుతుంది.

అర్థమైంది అందుకే మా విక్రమ్ పట్టువదలని విక్రమార్కుడు లాగా ప్రయత్నిస్తూఉన్నాడు అని చెబుతాడు.  శ్రీ మధ్యలో కూర్చొని నేను ఒకడిని ఉన్నా...

మీరిద్దరూ గుర్తిస్తున్నారా అని అడుగుతాడు.  ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా.. అసలే తల పగిలిపోతుంది. ముందు కాఫీ తాగినవ్వు అని చెప్పి సైలెంట్ గా కాఫీ తాగుతూ ఉంటాడు.

అవిని కి ఏం చేయాలో తెలియక విక్రమ్ దగ్గరగా వెళ్లి నేను మీ భార్యనే నండి. మీ చేతులతో మీరు తాళి కట్టిన మీ ఇల్లాలిని. నన్ను నమ్మండి అని చెప్పి నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది.

పల్స్ రేటు కొంచెం నార్మల్ అవుతూఉంటుంది. హమ్మయ్య అనుకుని విక్రమ్ గారు మీరు తొందరగానే బాగుఅయిపోతారు  అని చాలా సంతోషంగా చెబుతుంది.

భార్య ఎప్పుడూ నుదుటిపైన కాదు పెట్టాల్సింది ముద్దు అని మగతగా చెబుతూ ఉంటాడు. మరి ఎక్కడ పెట్టాలి అండి అని అమాయకంగా అడుగుతూ ఉంటే..

దేవుడా దీనికి అన్ని నేర్పించేటప్పటికి నా పని అయిపోతుంది అనుకుని లిప్స్ పైన పెట్టాలి భార్యామణి అని చెబుతాడు.

ఏంటి లిప్స్ పైన అని ఆశ్చర్య పోతుంది. ఇలాగే వదిలేస్తే మళ్లీ ఊహల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి పల్స్ రేట్ మళ్ళీ డౌన్ చేస్తాడు. అది పడిపోతూ ఉంటుంటే లేదు లేదు ఇస్తాను అని చెప్పి లిప్స్ పైన అంటి అంటక పెదాలను ఉంచుతుంది.

ఇంతకు మించి అవిని ముందుకు వెళ్లలేదని అర్థం అయ్యే విక్రమే గట్టిగా కిస్ చేస్తాడు. అవిని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ పైకి లెగవాలని చూస్తూ ఉంటే.. రెండు చేతులతో బంధించి తన పైకి గట్టిగా లాక్కుంటాడు  ???.

అవిని కి ఊపిరి ఆడడం లేదు అనిపించినప్పుడు వదిలి కళ్ళు తెరుస్తాడు. విక్రమ్ అమాయకంగా ముఖం పెట్టి అరే అవని గారు మీరేంటి ఇక్కడ...

నా భార్య ఏది... ఇప్పుడే కదా కిస్ చేసింది.  ఎక్కడికి వెళ్ళింది.  అయినా నా భార్య ఉండాల్సిన ప్లేస్ లో మీరు ఉన్నారు ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.

అవిని కి ఏం చెప్పాలో తెలియక దుఃఖం పొంగిపొర్లిపోతూ ఉంటుంది.  ఏడుపు నీ ఉగ్గ బట్టుకొని విక్రమ్ వైపు బేలగా చూస్తూ ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది.

అవని ఏడుపును చూస్తూ ఉంటే విక్రమ్ కి కూడా చాలా కష్టంగా ఉంటుంది.  కానీ ఇప్పుడు తను తగ్గితే అవని నోటి నుంచి నిజాలు రావు అని చెప్పండి అవని గారు అంటూ బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు.

అవని వెంటనే విక్రమ్ చాతి పైన చెయ్యి వేసి రుద్దుతూ మీరు ఆవేశపడకండి అంటూ కంగారుపడుతూ ఉంటుంది.. నేను అడిగిన దానికి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు అని...

ఉంగరం చూసి అదేంటి ఇది నా భార్య కి నేను పెట్టిన ఉంగరం కదా... మీ దగ్గరికి ఎలా వచ్చింది మెడలో ని నల్లపూసలు చైన్ కూడా పైకి లాగి ఇది కూడా నేను నా భార్యకి వేసింది మీ మెడలోకి ఎలా వచ్చింది అడుగుతాడు.

అవిని పొద్దుటి నుంచి పడుతున్న కంగారులో నల్లపూసలు లోపలికి వేసుకోవడం మర్చిపోతుంది.  అది ఇప్పుడు విక్రమ్ కళ్ళల్లో పడుతుంది.

ఏం చెప్పాలో తెలియక అవిని టెన్షన్ పడుతూ ఉంటే ఇక విక్రమ్ లాభం లేదు అని పల్స్ రేట్ మళ్లీ డౌన్ చేస్తూ బ్రీతింగ్ ఇబ్బందిగా తీసుకుంటూ ఉంటాడు.

నిజం మాత్రమే చెప్పు అవని అని చాలా కష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. అవని ఇక నిజం చెప్పక తప్పదు అని కన్నీళ్ళతో విక్రమ్ వైపు చూస్తూ మీరు తాళి కట్టింది నాకే అని తడబడుతూ చెబుతుంది.

వాట్ ఏమంటున్నావ్ అవని నీకు నేను తాళి కడితే నా భార్య గా అక్కడ ఉన్నది ఎవరు.. పెళ్లి అయినప్పటి నుంచి నాతోనే ఉంది కదా...మధ్యలో ఎలా మారుతారు అని ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు.

అవని ఇంకా జరిగిందంతా చెప్పక తప్పదు అని వాళ్ల పెళ్లి రోజు నుంచి శోభనం రోజు వరకు జరిగిందంతా చెప్పి తలదించుకుంటుంది.

ఇందులో నీ తప్పు ఏముంది అని తలదించుకుంటున్నావు అవని అని తన చేతికున్న ఆ మిషన్స్,  ఛాతి  పైన ఉన్న మిషన్స్ అన్ని తీసేస్తూ ఉంటాడు.

అయ్యయ్యో మీరు ఇవన్నీ ఇలా తీసేస్తున్నారేంటి.అసలు మీకు దెబ్బలు తగిలాయి. ఆ పల్స్ కూడా పడిపోతూ ఉంది.  ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే ఎలాగా అని కంగారు పడుతుంది.

నీ నోటితో నిజాలు చెప్పించడానికి నేను ఆడిన నాటకం ఇదంతా అని చెబుతాడు. అంటే అని అయోమయంగా అడుగుతూ... మీకు ఇవన్నీ ముందే తెలుసా ఆనందం, భయం అన్ని రకాల ఎమోషన్స్ కలిపిన ఎక్స్ప్రెషన్స్తో అడుగుతుంది.

వెంటనే సంతోషంతో విక్రమ్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. విక్రమ్ కూడా అవని చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు. 

ఇద్దరూ ఎంతసేపు అలా ఉన్నారో వాళ్లకే తెలియదు ఒకళ్ళది తన దగ్గరికి తన బంధం చేరుతుందో లేదో తెలియని భయం.

మరి ఒకరిది తన బంధం తన దగ్గరికి వచ్చింది అన్న ఆనందం. అవిని వెంటనే ఉలిక్కిపడి దూరం జరిగి క్షమించండి అని తలదించుకుంటుంది.

ఎందుకు అని అడుగుతాడు. మీకు ఈ నిజం ఎప్పుడూ తెలిసింది అంటే...  శిల్పతో లైఫ్ స్టార్ట్ చేశాక, చేయకముందా అని అడుగుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది.

అవని మానసిక పరిస్థితి అర్థం అయ్యి విక్రమ్ చాలా ఓపికగా అవని వైపు చూస్తూ.. చూపులు వేలుతో అవని గెడ్డాన్ని పైకి లేపి నువ్వు ఏమనుకుంటున్నావు అని కళ్ళల్లో కళ్ళు పెట్టే సూటిగా అడుగుతాడు.
[+] 10 users Like SivaSai's post
Like Reply
Part - 45


అవిని కి ఏం సమాధానం చెప్పాలో తెలియక భయంతో కళ్ళు రెపరెపలాడిస్తూ ఉంటుంది. చెప్పు అవని నిన్నే అడుగుతున్నాను.

అది... అది... శోభనం రాత్రి అనుకుంటున్నా అని చెప్పి కళ్ళు వాల్చేస్తుంది. హ్మ్ పరవాలేదు బానే అర్థమైంది కదా...

మరి ఎప్పుడు తెలిసింది అని ఎందుకు అడిగావు అని సూటిగా అడుగుతాడు. మీ మీద అనుమానం కాదు ఆ కుటుంబం మీద లేని నమ్మకం.

క్షమించు అని ఎందుకు అడిగావు మళ్ళీ ప్రశ్న ఇస్తాడు. మీరు కనపడగానే నిజం చెప్పనందుకు. నా కోసమే వచ్చారు అనుకోలేదు.

అవని చెబుతుంది అన్న మాటేగాని కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుఉన్నాయి. హుష్.. ఎందుకు ఏడుస్తున్నావు. మీరు వస్తారు అని నా నమ్మకం నిజం అయ్యినందుకు.

నువ్వు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు రాకుండా ఎలా ఉంటాను అంటూ దగ్గరికి తీసుకుంటాడు.
విక్రమ్ గుండెల మీద తల వాల్చి ఇది అంత నిజమే కదా..
నేను ఏమి కల కనడం లేదు కదా అని గట్టిగ పట్టుకుంటుంది.

హ్మ్  నీ అనుమానం తీరాలి అంటే ఒక పని చేయాలి భార్యమణి. ఏమిటా ఆ పని అంటూ ఇంక గట్టిగ పట్టుకుటుంది.

తన కోసం ఎంత ఎలా ఎదురు చూస్తూ ఉందొ ఆ పట్టులోనే విక్రమ్ కి అర్ధం అవుతుంది. అవని నుదరు మీద కిస్ చేసి ఇందాక కిస్ సరిగ్గా ఇవ్వలేదు.

ఇప్పుడు ఫీల్ అవ్వుతు ఇవ్వు. అప్పుడు అర్ధం అవుతుంది కల కాదు అని చెబుతూ ఇంక తనలోనికి లాక్కు ఉంటాడు. ఆ మాటలకూ అవని సిగ్గులమొగ్గ అవుతుంది.

కాసేపు భర్త సహచర్యంలో  గడిపి తల ఎత్తి మరి మన ఇంట్లో నన్ను ఒప్పుకుంటారా అని భయంగా అడుగుతుంది. నువ్వే అంటున్నావుగా మన ఇల్లు అని. ఇంక డౌట్ ఎందుకు.

ఈవెనింగ్ హైదరాబాద్ వెళ్లుతున్నాము. రేపు మార్నింగ్ 10కి నీ ఆఫీషీయల్  గృహప్రవేశం అని చెబుతాడు. ఇంకొక విషయం అనగానే... చెప్పు అన్నట్టు చూస్తాడు.

పెళ్లి విషయం మాట్లాడుకుంటున్నప్పుడు రెండు కుటుంబాలు మధ్యన కట్న కానుకల విషయాలు వచ్చి ఉండొచ్చు. కానీ నేను ఒక అనాధ ని.  నా వైపు నుంచి ఎటువంటి లాంచనాలు ఉండవు. ఉండబోవు.

నన్ను నా లాగానే స్వీకరించాలి అని చెబుతూ విక్రమ్ కళ్లలోకి చూస్తుంది. అవని మనసు ఎంత గాయపడింది అన్నది విక్రమ్ కి అర్థమయింది.

అవని మాటలు వింటూ ముందుకు పడిన కురులను చెవి వెనక్కి పెడుతూ  ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నా యా అడుగుతాడు నేను సీరియస్ గానే చెబుతున్నాను అని చెబుతోంది.

మన పెళ్ళికి ముందు ఎలాంటి మాటలు జరిగాయో నాకు అనవసరం. పెళ్లి తర్వాత మనం ఏమిటి అన్నదే ముఖ్యం.
నీ భర్త  గురించి నువ్వు ఏమనుకుంటున్నావు.

ఒకరు ఇచ్చే కట్న కానుకులు మీద ఆధారపడి ఉన్నాడు అనుకున్నావా అని అడుగుతాడు.  నా ఉద్దేశ్యం అది కాదు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థంకావడం లేదు అంటూ చేతులు పిసికుతూఉంటుంది.

అవని నీ తన గుండెలికి హత్తుకుని నువ్వు ఏమి టెన్షన్ పడకు అర్థమయిందా చాలా మృదువుగా చెబుతాడు.

హ్మ్ కానీ ఆ ఫ్యామిలీ ఊరుకుంటుందా..  అందరి దృష్టిలో మీకు శిల్పకే కదా పెళ్లి జరిగింది  అంటూ విక్రమ్ ని ఇంకా కరుచుకుపోయి అడుగుతుంది .

అవని భయం అర్థం అయినా విక్రమ్ ఫోన్ ఓపెన్ చేసి నిన్న జరిగిన న్యూస్ అంతా చూపిస్తాడు. న్యూస్ చూడగానే అవని ఆనందపడుతుంది.తర్వాత తన తల్లిని కూడా చంపేశారు అని తెలుసుకుని చాలా బాధపడుతుంది.

నీ కంటిలో ఇంకా ఈ కన్నీరు ఎప్పుడూ రాకూడదు. నీకోసం మన కుటుంబం మొత్తం ఎదురుచూస్తూఉంది. ఇంకా అత్తయ్య, మావయ్య అయితే  తన కూతురు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తీసుకు వస్తానా అని గంటకొకసారి ఫోన్ చేస్తూనే అన్నారు.

ఇంకా ఏడుపు ప్రోగ్రాం అయిపోతే మనం హైదరాబాద్ బయలుదేరవచ్చు అని వాతావరణాన్ని తేలికచేస్తాడు.
అవని నవ్వుతూ సరే వెంటనే బయలుదేరాదామని.. అయ్యో  మా సీనియర్ కి చెప్పాలి.   ఇందాక నుంచి బయటే వెయిట్ చేస్తుంది అని కంగారుపడుతుంది.

నువ్వు ఏమి టెన్షన్ పడక్కర్లేదు తనతో పాటు శ్రీ,రాజ్ ఉన్నారు అని చెబుతాడు. శ్రీ అన్నయ్య అయితే నాకు తెలుసు మరి రాజ్ ఎవరు అని అడుగుతుంది.

ఇందాకటి నుంచి డాక్టర్ డాక్టర్  అని పిలుస్తున్నావు కదా.. అతడే అని చెబుతాడు. అంటే అతను డాక్టర్ కాదా... ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అని అడుగుతుంది.

ప్రస్తుతానికైతే ఇంతమందే అయినా  నిన్ను మాయ చేసి నీతో నిజం చెప్పించడానికి నేను ఒక్కడినే చాలు. కానీ నీ ఎమోషన్ కూడా బయటకు తీసుకు రావాలని ఇంత డ్రామా ఆడింది అని చెబుతాడు.

వెళదామా ఈ హాస్పిటల్ లో ఉండాలి అంటే చిరాకు వచ్చేస్తుంది అని బెడ్ నుంచి లెగుస్తాడు. సరే అని చెప్పి అవిని కూడా లెగుస్తుంది.

అవని భుజం చుట్టూ చెయ్యవేసి రూమ్ లో నుంచి బయటికి వస్తాడు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే అక్కడ ఉన్న ముగ్గురికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది.

నేహా మాత్రం సింహం చేతిలో కుందేలు పిల్లలాగా ఉంది కదా అని అడుగుతుంది. ఆ మాటకి శ్రీ, రాజ్ ఇద్దరూ కూడా నేహా వైపు ఒక చూపు చూసి మళ్ళీ విక్రమ్ వైపు చూస్తారు.

ఇప్పుడు నేను ఏమన్నానని మీ ఇద్దరి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. మేము లోపల అనుకున్నాము  నువ్వు పైకి అన్నావు అందుకే చూశాము.

విక్రమ్ వీళ్లు దగ్గరికి వచ్చి ఏంటి మీ ముగ్గురు గుసగుసలు. ఇంకా వెళదామా అనగానే... మేమెప్పుడో రెడీ అని శ్రీ,రాజ్ ఇద్దరు చెబుతారు.

అవని వెళ్లి నేహా ని గట్టిగ హాగ్ చేసుకుని థాంక్యూ సీనియర్. ఆ రోజు మీరు ఆదుకోపోయి ఉంటే నేను ఏమి అయ్యిపోయిదాన్ని అనగానే... నీది మంచి మనసు కాబట్టే అంత మంచే జరిగింది.

నేను చేసింది ఏమి లేదు అని చెప్పి విక్రమ్ నీ చూస్తూ అవని చాలా కష్టాలు పడింది. చదువు కోసం పార్ట్ టైమ్ జాబ్ చేసింది. చాలా సార్లు పస్తులు కూడ ఉంది.

మాకు తెలిస్తే కోప్పడుతాము అని వర్క్ ఉంది అని లైబ్రరీ కి వెళ్లిపోయేది. వయస్సు కి మించి కష్టపడింది. మీ వల్ల తనకి అన్ని సంతోషాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను.

వాళ్లిద్దరి స్నేహం చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అలాగే అవని పడిన కష్టాలు కూడ చాలా భాదగా అనిపిస్తాయి.

విక్రమ్ అవని చేతిని గట్టిగ పట్టుకొని ఇంక తన లైఫ్ లో ఎటువంటి కష్టాలు రావు. ఇది నా ప్రామిస్ అని నువ్వు మాతో పాటు హైదరాబాద్ రా...

వన్ వీక్ తరువాత వర్క్ లో జాయిన్ అవ్వచ్చు అని అవని తో హైదరాబాద్ ప్రయాణం మొదలుపెడతాడు.
హైదరాబాద్ చేరాక గెస్ట్ హౌస్ కి చేరతారు.

గెస్ట్ హౌస్ కి వెళ్ళాక అందరూ ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ కి వెళ్ళిపోతారు.

అవని నేహా తో వెళుతు ఉంటే విక్రమ్ చెయ్యి పట్టుకుని రూమ్ లోనికి  తీసుకువెళ్లి డోర్ లాక్ చేస్తాడు.

ఏమిటీ మీరు చేసింది. నేహా ఏమి అనుకుంటుంది అని విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ ఇంటెన్షన్ చూపులు తట్టుకోలేక కళ్ళు కిందకి వాల్చేస్తోంది.

దగ్గరగా వచ్చి అవని నీ వెనక నుండి హత్తుకుని ఇప్పుడు చెప్పు ఏదో చెబుతున్నావు అని అడుగుతాడు.

పాపకి ఇంకేం మాటలు వస్తాయి. బాబు గారు హత్తుకుంటే. అందులో మొదటిసారి భార్య అనే హక్కుతో ఆమె. భర్త అనే అధికారంతో అతను ఉన్నారు. 

మౌనాన్ని ఆశ్రయించిన అవని తనకు తెలియకుండానే తన తలని వెనక్కి వాడ్చి విక్రమ్ హృదయం పైన పెడుతుంది.

ఈ స్థానం ఎప్పటికీ నాదే. నాకు ప్రశాంతత దొరికే స్థానం కూడా అదే అని తనకే తెలియని ఒక అలోకేకమైన ఆనందంతో కన్నులు మూసుకుంటుంది.

దేవేరి మనసు అర్థమయిన విక్రమ్ చిన్న చిరునవ్వుతో ఇంకా గట్టిగా చుట్టుకుని... ఎప్పటికీ నా హృదయ సామ్రాజ్య దేవి నీవే.

ఇది మన పాణిగ్రహణం సమయంలోను మాట ఇచ్చాను ఇప్పుడు మాట ఇస్తున్నాను అని అవిని చెవిలో చెబుతూ తన పెదాలతో భార్య చెవిపై రాస్తూ ఉంటాడు.

ఆ రాపిడికి తట్టుకోలేక విక్రమ్ చేతులను గట్టిగా పట్టుకుని ప్లీజ్ అండి అని... చాలా కష్టంగా ఉంది అని చెబుతూ బుగ్గల్లో మందారాలను పూయిస్తుంది.

ఓయ్ నువ్వలా సిగ్గుపడితే ఇక్కడ నాకు చాలా కష్టంగా ఉంది. మన సృష్టి కార్యానికి ఇంకొంచెం టైం ఉంది.

రేపు మన ఇంటికి వెళ్లిన తర్వాత.. పెద్దలు సమక్షంలో అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత..  అప్పుడు నా దేవేరి ని పూర్తిగా నా సొంతం చేసుకుంటాను అని ఇంకా దగ్గరికి లాక్కుంటూ చెబుతాడు.

ఆ మాటలకి వెంటనే విక్రం వైపుకు తిరిగే గట్టిగా కోగలించుకుంటుంది. సంతోషంతో తన కళ్ళనుండి ఆనంద భాష్పాలు కారుతూ ఉంటాయి.

అవిని ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఇప్పుడు ఇవి ఎందుకు వస్తున్నాయని తుడుస్తాడు. ఇది బాధతో వచ్చినవి కాదు.  ఆనందంతో వచ్చినవి.

నా జీవితంలో కూడా సంతోషమానేది ఉంటుంది అని ఇప్పటిదాకా తెలియలేదు. నా కోసం నా మనిషి  అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు అని...నాకోసం ఒక కుటుంబం ఏర్పడుతుందని ఊహించలేదు.

మీకు తెలియదండి నేను పడిన ఇబ్బంది ఊహ తెలిసినప్పటి నుంచి పస్తులు ఉన్నాను. గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను కదా వాళ్లు ఒక పూట పెట్టే భోజనం తోనే రోజు మొత్తం ఉండేదాన్ని.

వయసుకు వచ్చిన తర్వాత ఇంటిలోను,బయట కూడా నన్ను నేను రక్షించుకోవడానికి చాలా కష్టపడి వలసివచ్చేది .

సరిగ్గా నిద్రపోయే దాన్ని కాదు.  చిన్నా అలికేడైనా సరే భయంతో లెగిసి కూర్చునేదాన్ని.ఆ సమయంలో నేనున్నాను అని ధైర్యం చెప్పే మనిషి నా పక్కన ఉంటే బాగుండును అని అనిపించేది.

నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని నాకు ఒక రూల్ పాస్ చేశారు. అమ్మ అవసరమైన సమయంలో కూడా ఒంటరిగానే ఉన్నాను.  నాన్న ధైర్యం చెప్పే సమయం లో కూడా ఒంటరిగానే ఉన్నాను.

కానీ ఈరోజు నా కోసం నా కుటుంబం ఉంది. ఆ భరోసానే ఎంతో ధైర్యంగా ఉంది. ఇది ఎప్పటికీ నాకు ఇలాగే ఉంటుంది కదా అని గద్గద స్వరంతో అడుగుతూ విక్రమ్ ని కరుచుకుపోతుంది.

అవని బాధలు వింటుంటే విక్రమ్ కి మనసు మెలిపడుతుంది. అవని ఇన్ని కష్టాలు పడడానికి కారణమైన వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది.
[+] 14 users Like SivaSai's post
Like Reply
Superb
Like Reply
Part - 46


   

విక్రమ్ అవని నీ గట్టిగా కొగిలించుకుని ఇది అంత నిజమే. ఇంక నీ అనుమానం తీరాలి అంటే  నిన్ను ఒక పని చేయమన్నాను. అది అర్జెంటుగా చేసేయ్.

అప్పుడు నీ అనుమానం తీరుపోతుంది. నేను కూడ ఫుల్ కుష్ అయ్యిపోతాను. ఏమి అంటావు అని ఐ బ్లింక్ చేస్తాడు.

బాబోయ్ మీ మాటలు వింటుంటే ఇన్ని రోజులు చూసింది మిమ్మల్నేనా  అనిపిస్తుంది అంటూ సిగ్గుతో  మెలికలు తిరుగుతూంది.

అవని సిగ్గు చూసి విక్రమ్ అందంగా  నవ్వేస్తాడు. ఆ రాత్రి ఒకరికొకరు దూరంగా ఉంటూ దగ్గరై చేతులు పెనవిసుకొని ఒకే మంచం మీద పడుకుంటారు.

ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యినందుకు ఇద్దరు చాలా ప్రశాంతంగా పడుకుంటారు. ఉదయం అలారం సౌండ్ కి విక్రమ్ కి మెలకువ వస్తుంది.

మత్తుగా కళ్ళు తెరుస్తూఉంటాడు. ఎప్పుడు ఒకరిఒకరు దగ్గరగా వచ్చి పడుకున్నారో తెలియదు. అవని విక్రమ్ హృదయం పై పడుకుంటే... అవని చుట్టూ చేతలు బిగించి పడుకుంటాడు.

అలా చూసుకోగానే  విక్రమ్ పెదువుల పై నవ్వు వచ్చి చేరుతుంది. ఈ రోజు బాగుంది. పెళ్ళి అయ్యిన ఇన్ని రోజులకి నా పెళ్ళాం తో ఇలా పడుకున్నాను.

ప్రతిరోజు ఇలాంటి రోజే రావాలి. ఉంటుంది కూడ అనుకుంటూ అవని నుదిటి పైన ముద్దు పెట్టుకుని గుడ్ మార్నింగ్ భార్యమణి ?అని చెబుతాడు.

అవని ఇంక దగ్గరికి అంటూ జరిగి గుడ్ మార్నింగ్ అని చెబుతోంది. గుడ్ మార్నింగ్ చెప్పి ఎవరూ పడుకోరు. లెగిస్తే మనం బయలుదేరొచ్చు అని చెబుతాడు.

హ్మ్  గుడ్ మార్నింగ్ అంటూ మళ్ళీ హగ్ చేసుకుంటుంది. ఓయ్ ఏంటి ఈ నిద్ర అని అడుగుతాడు.నిద్రలోనైతేనే కదా మీరు నాకు ఇంత దగ్గరగా ఉంటారు కాసేపు పడుకోండి అని కళ్ళు మూసుకుంటుంది.

ఇంకేం అనిపిస్తుంది దగ్గరికి లాక్కుంటూ అడుగుతాడు. రోజు ఇలాగే పట్టుకుని పడుకుంటారు.రోజు మార్నింగ్ నాకు గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేస్తారు.

అవునా ఇలా కూడా ముద్దు పెడతానేమో లిప్స్ పైన ఒక పెక్ ఇస్తాడు. అంతే  నిద్రమత్తు వదిలి ఉలిక్కిపడి లెగుస్తుంది.

హే ఏమైంది అంత అలా కంగారు పడుతున్నావ్ అంటే.. ఏమీ లేదు అని మంచం దిగబోతుంది. చేయి పట్టుకుని లాగుతాడు. మళ్ళీ వెళ్ళీ విక్రం మీద పడుతుంది.

అవినీ కళ్ళల్లో చూస్తూ ఏంటి రోజు ఇలాగే కలలోకి వచ్చే వాడిన అని అడుగుతాడు.ఇలాగే ముద్దు పెట్టుకునే వాడిన అని మళ్ళీ కిస్ చేస్తాడు.

ప్లీజ్ అంటే వదలండి రెడీ అవ్వాలి కదా అనే సిగ్గుతో కళ్ళు వాల్చేచేస్తుంది . ఇప్పుడు నేను ఏమన్నానని నువ్వు అంతలా సిగ్గుపడుతున్నావు.

నేనేం చేసే వాడిని అని అడుగుతున్నాను అది కూడా తప్పేనా అని చిరుకోపంగా అడుగుతాడు. మీకు అన్నీ తెలిసి అడిగితే నేనేమీ చెప్పగలను అంటే....

నీ నోటితో వింటే నాకు బాగుంటుంది కదా చెప్పు ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలతూ ఉంటాడు.

నేను ఇంటిలో నుంచి వచ్చేసిన తర్వాత నుంచి ప్రతి రోజు ఇదే కల గుడ్ మార్నింగ్ చెబుతుంది. ఇది కల అనుకున్నాను కానీ అది నిజమై నా ముందుకు వచ్చింది అని అర్థమైంది అని చెబుతుంది.

ఇప్పటినుండి నీకు అలాంటి కలలతో అవసరం లేదు. ప్రతిరోజు అదే శుభోదయం అవుతుంది మై డియర్ భార్యామణి అని చెప్పి...తొందరగా ఫ్రెష్ అవ్వు. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వదులుతాడు.

అవని ఫ్రెష్ అయ్యి సింపుల్ గా ఉండే చీర కట్టుకొని ధైర్యంగా తన భర్త వేసిన నల్లపూసలు బయటకు వేసుకుని నుదుటన కుంకుమ పెట్టుకుని రెడీ అవుతుంది.  మెడ. మాత్రం బోసిగా అనిపించి బాధగా చూసుకుంటుంది.

విక్రమ్ కూడా రెడీ అయి,అయిపోయిందా అవని అంటూ అవిని వెనకాల నుంచి అద్దంలో చూస్తాడు. తనని తాను అద్దంలో చూసుకుంటున్న ఈ లోకంలో లేని అవినినీ కదుపుతూ  ఏమైంది అని అడుగుతాడు.

ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. అవని ముఖం చాలా బాధగా కనిపిస్తుంది.  తన వైపుకు తిప్పుకొని ఏమైందిరా అని అడుగుతాడు.

దానికి అవని కళ్ళనీళ్ళతో అందరూ బలవంతంగా నేను ఇవ్వను అన్న నా మెడలో నుంచి తాళిని తీసేసుకున్నారు.
తాళి కోసం వాళ్లతో గొడవ పడుతున్నాను అని ఆ ఉదయ్ గాడు నా చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించాడు.

ఆ నిమిషం నన్ను నేను కాపాడుకోవడానికి వేరే గత్యంతరం లేక తాళిని ఇవ్వాల్సి వచ్చింది.  దాని బదులు వాళ్ళు నా ప్రాణం తీసుకున్న నాకు ఆ రోజు అంత బాధ అనిపించేది కాదు.

కానీ ఆడదానికి ఎంతో విలువైన మానం, తాళిని లాక్కొవాలని చూసారు  అని ఏడుస్తూ ఉంటే... ఉష్
నీకు ఎన్నిసార్లు చెప్పాను.

ప్రతిదానికి ఏడవద్దు.నేను పక్కనుండగా కూడా నువ్వు ఏడిస్తే మన ప్రేమకి అర్థం ఏముంటుంది చెప్పు. నీ మెడలోకి ఆ తాళి కూడా వచ్చి చేరుతుంది.

మన పెళ్లి రోజున నువ్వెవరో మనవాళ్ళకి తెలియకుండా నేను తాళి కట్టాను. అందరి సమక్షంలో నువ్వెవరో తెలిసే గర్వంగా నీ మెడలో  తాళి నీ వేస్తాను సరేనా అని చెప్పి కళ్ళు తుడిచి కిందకి తీసుకు వెళ్తాడు.

కింద శ్రీ, రాజ్, నేహా రెడీగా ఉంటారు. వెళదామా అనగానే  మేమెప్పుడో రెడీ.  మీ ఇద్దరి కోసం వెయిటింగ్ పదండి అని చెప్పి అందరూ బయలుదేరుతారు.

ధనుంజయ్ వాళ్ళమ్మ గారి దగ్గరికి వెళ్లి అమ్మ రెడీ అయ్యారా,తొందరగా వెళదాం. ఈ పాటికి అవని వాళ్ళు వచ్చేసి ఉంటారు అని కంగారు పెడుతూ ఉంటాడు.

శేషగిరి గారు కొడుకు వైపు చూసి నువ్వు రావడం అవసరమా అడుగుతారు. దానికి అదేంటి నాన్న అలాగంటారు..  నా కూతురు దగ్గరికి వెళ్లకూడదా అని బాధగా మాట్లాడుతాడు.

ఏ ముఖం పెట్టుకుని వెళతావు రా నువ్వు... అన్ని నిజాలు తెలుసాయి కాబట్టి నా కూతురు నా కూతురు అంటున్నావు . అదే తెలియక పోయి ఉంటే ఏం చేసేవాడివి.

అదే మాయలో ఉంటే  దాని గొంతు కోసేవాడివి కదా అని అడుగుతారు. నాన్న అని బాధగాచూస్తాడు. నేను నిజమే కదరా మాట్లాడుతుంది.  ఇప్పుడు అదే ప్రశ్న నా మనవరాలు అడిగితే ఏం సమాధానం చెబుతావు అని అడుగుతారు.

ఆ ప్రశ్నకు సమాధానం లేక మౌనాన్ని ఆశ్రయిస్తాడు. మాకే నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావే..ఇంకా ఆ చిట్టి తల్లి కళ్ళల్లోకి చూసి నువ్వు ఏమి సమాధానం చెప్పగలవు రా.. అందుకే వద్దు అంటున్నాము సదా సత్యవతి అని భార్య వైపు తిరుగుతారు.

వెళుతున్న తల్లిదండ్రుల్ని ఆపి మీరు అన్న ప్రతి మాట నిజమే నాన్న. ఇలాగే దూరంగా ఇంకా ఎప్పటికీ పూడ్చలేని అగాధమే అవుతుంది.

నా కూతురు నన్ను అసహ్యించుకున్న పర్వాలేదు. నేను నా కూతురికి దగ్గరగానే ఉంటాను. తిడుతుందా.. తిట్టని. అసహ్యించుకుంటుందా...అసహ్యించుకొని.

ఇన్నాళ్లు నా కూతురికి నాకే తెలియకుండా ఇచ్చిన బాధని నేను తెలిసి తీసుకుంటాను పదండి అని ముందుకే కదులుతాడు.

భార్యాభర్తలిద్దరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని కొడుకు వెనకాల వెళ్లి కారులో కూర్చుంటారు. అవిని నీ ఎప్పుడెప్పుడు చూడాలా అని ధనుంజయ్ కార్ జై సింహ మాన్షన్ వైపు పరుగులు పెడుతుంది.

మాన్షన్ మొత్తం కొత్తజంట కోసం ఎదురు చూస్తూ పువ్వులతో అందంగా అలంకరించి, రంగురంగుల ముగ్గులతో ముస్తాబయి  ఆ ఇంటి మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంది.

ధనుంజయ్ వాళ్లు కూడా వచ్చే ఎదురు చూస్తూ ఉంటారు. విక్రమ్ కారు మాన్షన్ లోనికి ఎంటర్ అవుతుంది. ఆడపడుచు గా నివి హారతి పళ్ళెంతో రెడీగా ఉంటుంది.

కారు ఆగగానే అందరూ దిగుతారు కానీ అవని మాత్రం దిగదు చాలా టెన్షన్ గా నేర్వోస్ ఫీల్ అవుతూ ఉంటుంది.

అవిని ఫీలింగ్స్ ఏంటో అర్థం అయినా విక్రమ్ అవని వైపుకు వచ్చి కార్ డోర్ తీసి చెయ్యి ఇస్తాడు.

అవిని భయంగా విక్రమ్ వైపు చూస్తుంది. నేనున్నాను అన్నట్టుగా కళ్ళు ఆర్పుతాడు. ఆ భరోసాతో ధైర్యంగా విక్రమ్ చేతిలో చేయి వేసి  కారు దిగుతుంది.

అవిని కారు దిగి విక్రమ్ తో నడుస్తూన్న దారంతా మెత్తని పువ్వుల బాట పరుచుకుని ఉంటుంది. వాళ్ళిద్దరి పైన పూల వర్షం కురుస్తూ ఉంటుంది.

అదంతా ఆశ్చర్యంగా చూస్తూ విక్రమ్ వైపు చూస్తుంది. ఏంటి అన్నట్టుగా కళ్ళు ఎగరేస్తాడు. ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపి విక్రంతో పాటు కలిసి అడుగులు వేస్తుంది.

గుమ్మం దగ్గరికి రాగానే ఆగండి అన్న పిలుపు గంభీరంగా వినిపిస్తుంది. ఆ పిలుపుకి అవని భయపడి విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది.

ఇందిరా గారు అక్కడికి వచ్చి నివి వైపు చూసి ఇప్పుడైనా మీ అన్న, వదినని ఒకరి పేర్లు ఒకళ్ళు చెప్పుకుని లోపలికి రమ్మని చెప్పు అని చెబుతూ అవని వైపు చూస్తారు.

అవని ఇంకా టెన్షన్తో చూస్తూ ఉంటే...మాధవి అక్కడికి వచ్చి అమ్మ అప్పుడే నా కూతుర్ని భయపెట్టదు అని చెప్పి నువ్వు చెప్పరా తల్లి నీకు నేనున్నాను కదా..

అమ్మే కాదు, అన్నయ్య, నాన్న కూడా ఉన్నారు అని భరత్ రమేష్ కూడా అక్కడికి వస్తారు. అవని ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఎందుకంత అలా ఆశ్చర్యపోతున్నావు.

మేము ఎప్పుడో డిసైడ్ అయిపోయాము. నువ్వు రాగానే నీకు ఎటువంటి అభ్యంతరము లేదు అనుకుంటే.. నా కూతురుగా దత్తత తీసుకోవాలని.

అందుకు అమ్మ కూడా ఒప్పుకుంది అని.. ముందు పేర్లు చెప్పుకొని లోపలికి రండి.తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని కంగారు పెడతారు.

అబ్బా నేను ఎంత సేపు హారతి పళ్లెం పట్టుకుని నుంచోవాలి. తొందరగా పేర్లు చెప్పి రండి వదిన. పొద్దున్నుంచి ఫుడ్ కూడా పెట్టకుండా నీకోసమే వెయిటింగ్. ఆకలేసేస్తుంది అని.
.
విక్రమ్ నవ్వుతూ విక్రమ్ అనే నేను నా భార్య అవనితో కలిసి ఇంటికి వచ్చాను. లోపలికి రానిస్తావా చెల్లెమ్మ అని కొంచెం డ్రామాటిక్గా చెబుతాడు.

అందరూ ఓ అని అరుస్తూ ఇప్పుడు నువ్వు చెప్పు అని అవిని వైపు తిరుగుతారు.

అవని సిగ్గుపడుతూ అవని అనే నేను నా భర్త అయినా విక్రమ్ జై సింహ గారి తో కలిసి వచ్చాను. మమ్మలిని లోపలికి రానివ్వండి ఆడపడుచు గారు అని చెబుతుంది.

నివి రియాక్షన్ ఏమిటి...

కథ కొనసాగుతుంది....
[+] 15 users Like SivaSai's post
Like Reply
Only one word... కెవ్వుకేక
Like Reply
ఎంతో హృద్యంగా రాశారు.
Like Reply
Super narration
Like Reply
Part -47


అవని మాటలకి అందరూ ఓ అని అరుస్తారు.  వావ్ సూపర్ వదిన నువ్వు కూడా మా పార్టీ అయితే..  మనం రచ్చ రంభోల చేసేయొచ్చు అంటూ ఉంటే..  ఇందిరాగారు ముందు వాళ్ళిద్దర్నీ లోపలికి రానివ్వండి  తరువాత అన్ని ముచ్చట్లు అని చెప్పి కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అని చెబుతారు.

అవిని సంతోషంగా భర్త చెయ్యి పట్టుకుని కుడికాలు లోపలికి పెట్టి వస్తుంది. నవ్వుతున్న అవని మొఖం చూసిన ధనుంజయ్..  ఈ నవ్వు ఏ రోజు కూడా ఇప్పటివరకు నేను చూడలేదు.

అంటే.. నా కూతురు నుంచి నాకు తెలియకుండా నేను లాగేసుకున్నానా అని చూస్తూ ఉంటారు.

అవని ఇందిరాగారి దగ్గరికి వెళ్లి కాళ్లకు నమస్కారం చేసి నన్ను క్షమించండి అమ్మమ్మ అని తలదించుకుంటుంది.

క్షమించవలసిన అంత పెద్ద తప్పు నువ్వు ఏం చేశావు తల్లి. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ రోజు నువ్వు అలా చేయవలసి వచ్చింది.

నీకు పెళ్లి పైన ఉన్న విశ్వాసం,  నా మనవడి పైన ఉన్న నమ్మకమే నిన్ను మళ్ళీ  రప్పించింది. నీ నమ్మకమే నా మనవడు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది.  అదే తాలిబంధం.  పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు అని దీవిస్తారు.

అత్త మామగారు దగ్గరికి వెళ్లి కాళ్ళకి నమస్కరించి నామీద మీకు ఎటువంటి కోపం లేదా అత్తయ్య గారు అని అడుగుతుంది.

కోపం ఎందుకే పిచ్చితల్లి.  నా కొడుకు మీద నమ్మకంతో నువ్వు ఫైట్ చేసావు. ఎవరి దిష్టికళ్ళో పడి కొన్ని దుష్ట గ్రహాలు ఇంటిలోకి వచ్చి తిష్టవేశాయి.

మహాలక్ష్మి లాంటి నువ్వు వచ్చేవేళ అయ్యింది కాబట్టే నా కొడకు ఆ దుష్ట గ్రహాలు అన్నింటిని బయటకి తరిమేసాడు.

ఇప్పటినుంచి నేను నీకు అత్తనే కాదు అమ్మని కూడా అని చెబుతుంది.  వెంటనే మాధవి అక్కడికి వచ్చి వదినమ్మ ఆగమ్మా.. తల్లిని ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పి... దగ్గరికి తీసుకుంటుంది.

అవని మాధవి రమేష్ గారికి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది వెంటనే రమేష్ గారు నా కూతురికి ఎప్పుడూ మా ఆశీర్వాదాలు ఉంటాయి అలాగే నీకు తోడుగా కూడా నీకు తోడబుట్టిన అన్నయ్య ఉన్నాడు అని చెబుతుండగానే...

భరత్ వచ్చి నన్ను నేను పరిచయం చేసుకుంటానులే అని చూడు సిస్టర్ బావ ఏదైనా ఇబ్బంది పెడితే..వెంటనే ఒక  సైగ చేయి చాలు.

విక్రమ్ వైపు చూస్తూ  వెంటనే నిన్ను నేను తెచ్చేసుకుంటాను అని చెబుతాడు.   విక్రమ్ అదే మాట మీద వుండు బావ ఫ్యూచర్లో నువ్వు నాకు దొరుకుతావు కదా అని చెబుతాడు.

వెంటనే బావో నీకు దండం పెడతాను. నీకు అనుకూలంగా మార్చుకున్న అయినా సరే నన్ను ఇరికించేస్తావు అని దండం పెడతారు అందరూ వాళ్లని అలా చూసి నవ్వుకుంటారు.

సత్యవతి శేషగిరి కూడా వచ్చి అవిని నీ పట్టుకుని ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి. మీ అమ్మ చేసుకున్న పుణ్యమే నిన్ను ఈరోజు ఇలాంటి కుటుంబంలోనికి తీసుకుని వచ్చింది.

బంగారం లాంటి భర్త, కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే కుటుంబం వచ్చింది ఇప్పటినుండి అయినా నీ కష్టాలన్నీ గట్టెక్కిపోవాలి తల్లి అని అవని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటారు.

ఎలా ఉన్నారు నానమ్మ అంటూ కన్నీళ్ళతో అడుగుతుంది మేం బాగున్నాం తల్లి అని చెబుతారు.

ఇందిరాగారు పూజకి టైం అయిపోతుంది పదండి అని విక్రమ్ అవని నీ పూజలో కూర్చోబెడతారు. కోడలువైపు తిరిగి వెళ్లి సూత్రాలు తీసుకురా అని చెబుతారు.

అలాగే అత్తయ్య అని సూత్రాలు తెచ్చి అక్కడ పూజలో పెడతారు. ఆ సూత్రాలకు కూడా పూజ చేసి విక్రమ్ చేత అవిని మెడలో కట్టిస్తారు.

అవి చూడగానే అవని ఆనందం తట్టుకోలేక  ఏడ్చేస్తుంది.
విక్రమ్ అవిని భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని ప్రతిదానికి ఏడుపేనా అని అడుగుతూ కన్నీళ్లు తుడుస్తాడు.

ఇది బాధతో వచ్చినవి కాదండి.  ఆనందంతో వచ్చినవి. ఇది నా హక్కు. ఇన్ని రోజులకి నా చెంత చేరేటప్పటికీ  సంతోషము ఆపుకోలేకపోతున్నాను అని విక్రమ్ చెయ్యి పట్టుకుని నుదుటి పైన పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది.

అవిని నీ అలా చూడగానే అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది.  ఎన్ని కష్టాలు పడిందో  అని బాధ పడతారు.

ఇందిరా గారే ముందుగా తేరుకొని లలిత వైపు తిరిగి ఈరోజు నుంచి మూడో రోజున అవని మెడలో తాళి మార్చాలి. ఆరోజు మళ్లీ వ్రతం చేపించి కార్యానికి ముహూర్తం పెట్టించు.

ఈ మూడు రోజులు అవనినీ నివి గదిలో ఉంచండి అని చెబుతారు. ఆ మాటలకి అవిని సిగ్గుపడితే విక్రమ్ ఇంకా మూడు రోజులా అన్నట్టు చూస్తాడు.

శ్రీ, రాజ్ విక్రమ్ చెరో ప్రక్కన చేరి ఏంటి బావ మూడు రోజులకే బెంగ పెట్టేసుకుంటున్నావు. ఆ కార్యం ఏదో అయిపోతే ఇంక మా చెల్లి కొంగు పట్టుకుని తిరుగుతావు ఏమో అని వేళాకోలం ఆడుతూఉంటారు.

వాళ్ళిద్దరిని సూటిగా చూస్తూ పట్టుకుని తిరిగితే తప్పేంటి...  పెళ్లి కానీ బ్రహ్మచారులు మీకేం తెలుస్తుందిరా పెళ్ళైనోడి బాధ.

ముందు నీ పిల్లని నువ్వు లైన్లో పెట్టుకో.  నీకు ఒక నెలరోజులే టైం ఇస్తున్నాను. ఈ లోపు నేహాతో ఓకే చెప్పించి నా ముందుకు రావాలి అని అల్టిమేట్ జారీ చేస్తాడు.

ఆ మాటలకి రాజ్ నవ్వితే...  శ్రీ బిక్కమొహం వేసుకుని బావ ఇది అన్యాయం. ఇది ఏమైనా ప్రాజెక్టు అనుకుంటున్నావా...   డెడ్ లైన్ ఇస్తున్నావు అని అంటాడు.

ఏ పనికైనా సరే డెడ్లైన్ పెట్టుకోవాల్సిందే... లేకపోతే పనులన్నీ చేద్దాం చూద్దాం అని మందుకొడిగా వెళ్తాయి. ముందు నీ పిల్లని నువ్వు సెట్ చేసుకో అని చెబుతాడు.

ఇంతకీ నా పిల్ల ఎక్కడ ఉంది అనుకుంటూ చూస్తూ ఉంటాడు.  నేహా అక్కడ అవని నివితో మాట్లాడుతూ ఉంటుంది.

నవ్వుతూ మాట్లాడుతున్న నేహా వైపు చూసి అబ్బ నా పిల్ల అందరితో బానే కలిసిపోతుంది.  బెంగళూరు వెళ్ళగానే లైన్లో పెట్టాల్సిందే... ఫోన్ చూసే వంకతో నేహ కి సైట్ కొడుతూ ఉంటాడు.

ధనుంజయ్ కి అక్కడ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందరి సంతోషాలు మధ్యన తను ఒంటరిగా ఉన్నాను అనిపిస్తుంది.

అవని ఒప్పుకుంటే కానీ విక్రం మాట్లాడాడు ఇక కళ్యాణ్ రమేష్ గారు అయితే మొక్కుబడిగా మాట్లాడుతున్నారు కానీ ఆప్యాయంగా ఆ మాటలు లేవు.

లలితగారు పెళ్లయిన కొత్తలో అన్నయ్యగారు అని ఎంత అభిమానంగా మాట్లాడేవారు కానీ..  ఇప్పుడు ఒక మనిషిగా కూడా నన్ను చూడడం లేదు. ఇదంతా నా చేజేతులారా చేసుకున్నదే కదా..

ముందు నా కూతురు తోనే మాట్లాడాలి అని అవిని దగ్గరికి వెళతారు కానీ...  అవిని పట్టించుకోకుండా నివి, నేహాతో మాట్లాడుతూ ఉంటుంది.

ఏం జరుగుతుందో అని అందరూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు.విక్రమ్ మాత్రం ఫోన్ చూస్తూ ఉంటాడు.

ధనుంజయ కూతురు వైపే చూస్తూ అమ్మ అవని అని పిలుస్తాడు. ఆ పిలుపుకి అవని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.

ఎన్నో సంవత్సరాల నుంచి అంత ప్రేమగా పిలిస్తే వినాలి అనుకుంది.  ఇప్పుడు ఆ మనుషుల మీద విరిక్తి వచ్చాక పిలుస్తుంటే ఇంకా ఎలా స్పందించగలుగుతుంది.

పలకడం లేదు అనుకుని మళ్ళీ పిలుస్తారు. గట్టిగా శ్వాస తీసుకుని వదిలి చెప్పండి సార్ అంటుంది.

సార్ అన్న పిలుపుకి ధనుంజయ్ బాధగా చూస్తూ తండ్రిని పట్టుకుని సార్  ఏంటిమ్మ అనగానే... విరక్తిగా నవ్వుతూ తండ్రా ఎవరికి అని అడుగుతుంది.

ఆ మాటలకే ధనుంజయ్ మనసు కకావికలం అయిపోతూ ఉంటుంది. కూతురి గాయం అర్థం అయ్యే... నీకు కాదా అని అడుగుతాడు..

ఎలా అవుతారు.  ఒక పనిమనిషి కి ఇంటి ఓనర్ ఎప్పుడు సారే గాని తండ్రి అవ్వరు కదా అని సూటిగా అడుగుతుంది.

నిన్ను ఎప్పుడూ నేను అలా చూడలేదు అవిని అని బాధగా అంటారు. చూడలేదా ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు ఆ మాట.
ఏ రోజు మీరు నన్ను కూతురుగా చూశారు??  ఏరోజైనా మీరు నాతో మాట్లాడారా...  పోనీ  రోజు నేను ఏమి తింటున్నానో...ఏం చదువుతున్నానో అని ఆయన ఎప్పుడైనా తెలుసుకున్నారా అని అడుగుతుంది.

అయినా నా పిచ్చి గానీ నేను తినే తిండి మీరు డిసైడ్ చేసి పెట్టేదే కదా ఇంకా మీరు కనుక్కోవడానికి ఏముంది అంతే కదా సార్ అని అంటుంది.

ఆ మాటలకే ధనుంజయ్ గుండెల్లో గునపాలు దిగుతూ ఉంటాయి.  కూతురు వైపు కన్నీళ్ళతో చూస్తూ ఉంటాడు.

ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోతాడు. కొడుకు బాధ చూడలేని సత్యవతి గారు ముందుకు వచ్చి అమ్మ అవని మీ నాన్నకి తెలియకుండా ఇదంతా జరిగిపోయింది.

మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం తల్లి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అంతా మంచే జరిగింది కదా... జరిగినవన్నీ మర్చిపోయి మీ నాన్నను క్షమించు తల్లి అని అడుగుతారు.

కారుతున్న కన్నీళ్లు కూడా తుడుచుకోకుండా ఎంత ఈజీగా చెప్పేస్తున్నావు నానమ్మ. జరిగింది మర్చిపోమని. అనుభవించింది నేను కదా ఆ బాధ కూడా నాకే ఉంటుంది కదా....

అప్పుడు నాకు ఐదేళ్లు అనుకుంట.. బాగా ఆకలి వేసి  నాన్న దగ్గరికి వెళ్లి ఆకలేస్తుంది నాన్న, ఇక్కడ నొప్పి వస్తుంది నాన్న అని పొట్ట మీద చెయ్యి పెట్టుకుని చూపిస్తే..

ఆ గ్లాసులో ఉన్న నీళ్లు తాగి వెళ్లి పడుకో. నొప్పి అదే తగ్గిపోతుంది అని తన ముద్దుల కూతురిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించారు.

తనకు తినిపించేకైనా మిగిలింది పెడతారేమో అని నిలబడితే... కోపంగా ఎందుకు ఇలా ఎదురుకుండా దిష్టిబొమ్మలాగా నిలబడతావు అని చిరాకు పడ్డారు.

ఆ ఇంటిలో నాకు చిన్నప్పటి నుండి సెపరేట్ గది కదా...
నొప్పితో విలవిలాడుతూ మోకాళ్లు పొట్టలోకి పెట్టుకొని ఏడుస్తూ ఉంటే....

ఈయన మాత్రం తన ముద్దుల భార్య, కూతురుతో గదిలో ముద్దు ముచ్చట్లు ఆడుతున్నాడు అలాంటి వాడు నాకు తండ్రా అని అడుగుతుంది.

ఆ మాటలకి, అవని బాధకి ఎవరు ఏమీ మాట్లాడలేక పోతారు.  ఆ వయసులో ఉన్న చిన్నపిల్లల బాధ ఏంటో కళ్ళ ముందు కనపడుతుంది.

విక్రమ్ చేతిలో ఫోను నలిగిపోతూ ఉంటుంది.
ధనుంజయ్ కి ఆ రోజు జరిగిన విషయం గుర్తువస్తుంది. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్గవి ఎదురొచ్చి మంచినీళ్లు కాఫీ ఇస్తుంది.

అవనికి నేను చెబుతుంటే వినడం లేదు ఈరోజు చాలా ఎక్కువ కేక్స్, చిప్స్ తినేసింది హాట్ వాటర్ తాగమంటే తాగను అని ఇంకా కావాలి అని పేచి పెడుతుంది మీరైనా చెప్పండి అని అమాయకంగా చెబుతుంది.

శిల్ప  ఏమీ తినకుండా ఎదురుచూస్తోంది.మీరు తినిపిస్తేనే తింటాను అని సాయంత్రం నుంచి మీ కోసమే ఎదురు చూస్తుంది అని.. శిల్పకి మీరంటే ఎంత ఇష్టమో అంటుంది.

అవని ప్రవర్తనకి బాధపడుతూ శిల్ప ని చూసి మురిసిపోతూ శిల్పని ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. ఏరా బంగారం తినలేదా అని తినిపిస్తూ ఉంటారు.

అప్పుడే అవని అక్కడకు వచ్చి అడగడం.  తను కోప్పడడం అన్ని గుర్తుకు వస్తాయి.  తన కోపం కూడా అవని అలా జంక్ తిన్నది అనేగాని వేరే ఉద్దేశం కాదు కానీ అక్కడ జరిగింది మాత్రం వేరే...

ధనుంజయ్ ఏమని సమాధానం చెబుతాడు...
[+] 11 users Like SivaSai's post
Like Reply
Part -48


ధనంజయ్ కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఉంటుంది.  ఇప్పుడు తను నిజం చెప్పిన సరే అవని నమ్మదు అని మాత్రం తనకు అర్థం అవుతుంది.

అది నిజమే కదా....ఆరోజు తన కళ్ళ ముందే అవని బాధపడింది కానీ ఆ బాధను తన అర్థం చేసుకోకుండా మాట్లాడాడు .

భార్గవి మాటలను గుడ్డిగా నమ్మి అవిని నీ దారిలో పెట్టాలి అనుకుని దూరం చేసుకున్నాడు.

కూతురు చేతులు  పట్టుకొని ఆ రోజు నిజంగా అలా అని నాకు తెలియదమ్మా...నువ్వు జంక్ ఎక్కువ తింటున్నావ్ అని చెబితే కోప్పడ్డాను కానీ...ఆకలితో ఉన్నావని అనుకోలేదు అని చెబుతాడు.

అవని అతని చేతిలో నుంచి తన చేతులు తీసేసుకుని అవునా... నేను మీ ఇంటిలో పడిన ఇబ్బంది మీకు తెలియదా అని అడుగుతుంది. తెలియదు అన్నట్టుగా తలువుతాడు.

ఒక్క విషయం సూటిగా అడుగుతాను సమాధానం చెప్పండి.  శిల్ప మీ ఇంటిలో ఎలా ఉంది ఏంటి అన్నది మీకు తెలుసా అని అడుగుతుంది. తెలుసు అన్నట్టుగా తలువుతాడు.

మరి నేను ఎలా ఉన్నానో మీకు ఎందుకు తెలియలేదు దీనికి మాత్రం సమాధానం చెప్పండి సార్ అని అడుగుతుంది.  ఏమని సమాధానం చెబుతాడు.

సమాధానం లేని ప్రశ్న ఎదురయ్యింది. భార్గవిని గుడ్డిగా నమ్మినందుకు ఈరోజు కూతురు ముందు దోషిగా నిలబడ్డాడు.

నిజంగా నాకు తెలియదు అవని.  తెలిస్తే నేను ఎందుకు నీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాను అని బాధపడతాడు. దానికి విరక్తిగా ధనుంజయ వైపు చూసి వాళ్ళ నాన్నమ్మతో మొదటిసారి ఆడపిల్లకి తల్లి అవసరమైనప్పుడు ఈ దంపతులిద్దరూ ఏం చేశారో అడుగు  నానమ్మ అని అంటుంది.

సత్యవతి గారు అనుమానంగా ధనుంజయ్ వైపు చూస్తారు. ఆ విషయం ఏంటో అర్థం కాక ధనుంజయ్ ప్రశ్నార్థకంగా కూతురు వైపు చూస్తాడు.

ఈ విషయం కూడా మీకు తెలియదని ఇప్పుడు నేను అనుకోవాలా అని... నొప్పి అని ఏడుస్తూ ఉంటే ప్రతిదానికి ఏడుపేనా మేము బయటికి కి వెళుతున్నాము.

ఏదైనా అవసరం ఉంటే పనిమనిషిని అడుగు అని  వెళ్లిపోయారు.  అప్పుడు మన ఇంటిలో పని చేస్తున్న మంగే నన్ను తల్లిలాగా చూసుకుంది.

ఆ ఐదు రోజులు నాతోనే ఉండిపోయింది. ఈయన గారి భార్య పాచిపోయిన అన్నం పెడితే... ఆ టైంలో అలాంటి భోజనం మంచిది కాదు అని ఎవరు చూడకుండా మంగే తీసుకొచ్చి పెట్టేది.

మరి శిల్పకి తల్లి అవసరం అయిన టైంలో మీరిద్దరూ ఎలా చూసుకున్నారు అని అడుగుతుంది. ధనుంజయ్ కా రోజు గుర్తొస్తుంది.

శిల్పకి ఐదు రోజులు సపరేట్గా కూర్చోబెట్టి జాగ్రత్తగా హెల్ది ఫుడ్ పెట్టి ఫంక్షన్ గ్రాండ్గా చేయడం. ఆ ఫంక్షన్ లో ఎక్కడా కూడా అవని కనిపించకపోవడం.

ఇప్పుడైనా గుర్తొచ్చిందా లేదా ఇది కూడా మీకు తెలియకుండానే శిల్పని అంత జాగ్రత్తగా చూసుకున్నారా అని అడుగుతుంది.

ఆ రోజు నేను లేను అన్న ఆలోచన కూడా మీకు రాలేదు కదా అని అంటుంది.  ఆరోజు ధనుంజయ్ భార్గవిని అడిగితే అవని అలిగి పడుకుంది.

ఎంత బ్రతిమాలుతున్నా సరే రెడీ అవ్వడం లేదు.  లోపల లాక్ చేసుకుంది అని చెబుతుంది. మీరు వెళ్లి పిలవండి అని చెబుతుంది.

ధనుంజయ్ అవని గది దగ్గరకు వచ్చి అవని అవని అని పిలుస్తాడు. ఎంత పిలిచినా సరే ఆ తలుపు తెరుచుకోదు. ఇంతలో సునీల్ వచ్చి బావ కింద అందరూ వెయిట్ చేస్తున్నారు రండి అని చెప్పి తీసుకు వెళ్ళిపోతాడు.

లేదు అవని. ఆ రోజు నేను వచ్చి నిన్ను పిలిచాను.  నీ గది ముందే చాలాసేపు నిలబడి తలుపు కొట్టాను అంటే.. నా గదిని లాక్ చేసి మీరే తలుపు కొట్టారా... అసలు నేను ఆరోజు నా గదిలో ఉంటేనే కదా మీరు తలుపు కొడితే నేను పలకడానికి అంటుంది.

సత్యవతి గారు కూడా ఆ నిమిషం మౌనంగానే ఉండిపోతారు. నీకు తెలుసా అమ్మ అవని ఎక్కడుందో అని అడిగితే...

ఆ రోజు నువ్వు చెబితేనే కదా నీ భార్య  పిల్లని స్టోర్ రూమ్ లో పెట్టి తాళం వేసింది కదరా...ఇంకా ఏమని నువ్వు నన్ను అడుగుతున్నావు అని అడుగుతారు.

అంతే ఆ మాటలకి ధనుంజయ్ తడబడుతూ వెనక్కి తూలపడుతాడు. అయినా ఎవరూ కూడా ముందుకి ఒక అడుగు వేసి ధనుంజయని పట్టుకోరు.

నేనెందుకు అమ్మ నా కూతుర్ని గదిలో పెట్టి తాళం వేయమంటాను  అని బాధగా అడిగితే...  ఏమోరా  ఆ విషయము మీ భార్యాభర్తలిద్దరికీ తెలియాలి అని ముభావంగా చెబుతారు.

నిజంగా నాకు ఇవేమీ తెలియదు నన్ను నమ్ము అవని అని కన్నీళ్ళతో అడుగుతాడు.  అసలు మీకు ఏ విషయం తెలుసు అని ఒప్పుకుంటారు.

ఇన్ని సంవత్సరాలుగా నేను ఆ ఇంటిలో నరకం అనుభవిస్తుంటే ఒక్కటి కూడా మీకు తెలియదు అంటే నమ్మేటట్టుగా ఉందా...

ఆఖరికి నీ భార్య సంతోషం కోసం నీ మేనల్లుడికి నన్ను అప్పజెప్పడానికి  కూడా సిద్ధపడ్డావు కదా అది కూడా నీకు తెలియదా అని కళ్ళు మూసుకుని గట్టిగా అరుస్తుంది.

సత్యవతి గారు అవని నీ గట్టిగా పట్టుకుని ఏమంటున్నావ్ తల్లి అంటే...అవును నానమ్మ నేను చెప్పేది అంతా నిజమే.

మీరు అప్పటికి ఇంకా ఊర్లోనే ఉంటున్నారు కదా.. నేను టెన్త్ లో ఉండగానే ఆ ఉదయ్ గాడు నా మీద కన్ను వేశాడు.

వాడి నుంచి తప్పించుకోవడానికి నిద్రలేని రాత్రులే గడిపాను. ఆరోజు సాయంత్రం నేను చదువుకుంటూ ఉంటే ఈ పెద్ద మనిషి నా దగ్గరికి కోపంగా వచ్చి. నీకు ఎన్నిసార్లు చెబుతున్న బుద్ధిరాదా...

ఎందుకు మా మాటకి నువ్వు ప్రతిదీ ఎదురు చెబుతావు.. ఉదయ్ అడిగింది కూడా నీ మంచి కోసమే కదా వాడు అడిగినట్టు చేస్తే తప్పేంటి అని కోపంగా అరిచారు.

ఆ మాటలు వినగానే చాలా భయం వేసింది. ఏడుపు తన్నుకు వచ్చింది.  కానీ ఎవరికి చెప్పుకోను. కన్న తండ్రి నన్ను తార్చడానికి సిద్ధపడ్డాడు అని అర్థమవుతూ ఉంటే నా బాధ వర్ణనాతీతం నానమ్మ .

ఆ రోజు రాత్రి వీళ్ళందరూ సినిమాకు వెళుతూ ఉదయ్ ని, నన్ను వదిలేశారు. వెళుతూ ఉదయ్ అడిగింది చెయ్యి అని చెప్పి కోపంగా అరిచి వెళ్ళిపోయారు.

అప్పటికి ఏడుస్తూ నేను వస్తాను నాన్న. నాకు ఇంట్లో ఉండాలంటే భయంగా ఉంది అని అంటే... నువ్వు భయపడి పోవడానికి ఇక్కడ ఎవరూ రాక్షసులు లేరు అని వాళ్లంతా సినిమాకి వెళ్ళిపోయారు.

మొత్తం నాలుగు గంటలు వాడి నుండి తప్పించుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలు... ఆఖరికి నా ప్రాణాలు తీసుకోవడం కూడా సిద్ధపడ్డాను అని మణికట్టు మీద ఉన్న మచ్చని చూపిస్తుంది.

సత్యవతి గారుఅక్కడ చెయ్యి వేసి నిమురుతూ ఉంటే.. ఏడుస్తూ ఆ రోజు వాడిని చాలా బ్రతిమాలాను నానమ్మ. నా జోలికి రావద్దు అని కాళ్లు కూడా పట్టుకున్నాను.

కానీ వాడికి వాళ్ల మామ సపోర్టు ఉంది కదా.. అందుకే రెచ్చిపోయాడు. ఇక ఏ దారి లేక కిచెన్లోనికి వెళ్లి చాక్ తీసుకున్నాను.

  దగ్గరికి వస్తే పొడి చేస్తాను అని బెదిరించాను. దానికి వాడు వంకరగా నవ్వుతూ నన్ను పొడిస్తే మా మామ నిన్ను బ్రతకనిస్తాడు అనుకుంటున్నావా...

నిన్ను నాలుగు పీకే అయినా సరే, నీ రక్తం కళ్ళ చూసైనా సరే నిన్ను నా దగ్గరికి పంపిస్తాడు అని చాలా అసహ్యంగా మాట్లాడాడు.

వాడి మాటలు వినగానే అది నిజమే కదా..  నేను ప్రాణాలతో ఉంటేనే ఈ తిప్పలన్నీ అని.. నా మణికట్టు దగ్గర నేనే కోసేసుకున్నాను.

నేను అలా చేస్తానని వాడు ఊహించలేదు వాడు భయంతో బయటికి వెళ్లిపోయాడు. వాడు అక్కడ నిండి వెళ్లిన తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు.

నేను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ లో ఉన్నాను. నా పక్కన నువ్వు ఉన్నావు.  నిన్ను చూడగానే నాకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది.

వెంటనే నిన్ను కౌగిలించుకుని గట్టిగా ఏడ్చేసాను. నన్ను మీతో పాటు తీసుకెళ్లి పోండి నేను ఇక్కడ ఉండను అని మిమ్మల్ని భయపడుతూ గట్టిగా పట్టుకున్నాను గుర్తుందా నానమ్మ అని అడుగుతుంది.

గుర్తుంది తల్లి అంటారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు గానీ అప్పటినుండి మీరు ఇక్కడే ఉండిపోయారు.

మీరు ఉంటున్నప్పుడు నుండి ఆ ఉదయ్  దౌర్జన్యాలు తగ్గాయే గాని ఈ భార్యాభర్తల అరాచకాలు ఏమైనా తగ్గాయా నానమ్మ అని అడుగుతుంది.

ఆ మాటలకే సత్యవతి గారు మౌనంగా ఉండిపోతారు. ఇప్పుడు చెప్పండి ఈ విషయాలు ఏమీ మీ అబ్బాయికి తెలియదా...

ఆయనకు తెలియకుండానే నన్ను బలి చేయడానికి సిద్ధపడ్డారా అని ఏడుస్తుంది.

లలిత గారు వెంటనే వచ్చి అవిని నీ గట్టిగా కౌగిలించుకుంటారు. మాధవి,  నివి కూడా వచ్చి అవని చుట్టూ చేతులు వేసి పట్టుకుంటారు.

ఆ నిమిషం ధనుంజయ్ మాత్రం మాట రాని బొమ్మ అయిపోతాడు. ఇప్పుడు తను నిజం చెప్పిన సరే ఇక్కడ ఎవరూ నమ్మరు అని పూర్తిగా అర్థం అయిపోయింది.

అంత బాగా భార్గవి తన కళ్ళకి పొరలు కట్టేసింది. ధనుంజయ్ మోకాళ్ళ మీద కింద కూర్చుని ఏడుస్తూ నిజంగా ఉదయ్ అలా చేసాడని నాకు తెలియదు.

నువ్వు ఒక సబ్జెక్టులో వీక్ గా ఉన్నావు ప్రాక్టీస్ చేపిస్తాను అంటే మాట వినడం లేదు.  ట్యూషన్ కి పంపిస్తాను అన్నా వద్దు అంటున్నావు అని చెప్పారు.

అది నిన్ను ప్రాక్టీస్ చేయమన్నాను గాని..వాడు నీతో అలా తప్పుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అని ఊహించలేదు. మేము ఆరోజు బయట నుంచి వచ్చేటప్పటికి రక్తపు మడుగులో ఉన్న నిన్ను చూసి నా ప్రాణం అక్కడే పోయినట్టు అనిపించింది..

ఈ నా రెండు చేతులతోనే నిన్ను ఎత్తుకొని వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాను.  నువ్వు మొండిగా మారిపోయావు అనుకుని..

అమ్మ వాళ్ళు ఉంటే అయినా నువ్వు అందరితో కలిసి పోతావు అని అమ్మని నేనే ఒప్పించి ఇక్కడ ఉంచాను.

నా కూతుర్ని నేనే పరాయి వాడు పక్కకి ఎలా పంపిస్తాను అవని అని తన చేతుల్లో ముఖాన్ని దాచుకుని ఏడుస్తాడు.

అక్కడున్న అందరికీ ఇద్దరి బాధ అర్థమవుతుంది.  ఇద్దరూ భార్గవి చేతిలో మోసపోయిన వారే..

ఒకళ్ళు భార్య చెప్పిందే నిజం అనుకుని కూతురికి దూరమైతే...  ఇంకొకరు  సవితి తల్లి చేష్టలకి తండ్రి మీదే విరక్తి తెచ్చుకున్న వాళ్లు.

తండ్రి కూతుళ్ళ పయనం ఎటువైపు....

కథ కొనసాగుతుంది...
[+] 15 users Like SivaSai's post
Like Reply
Heart touching
Like Reply
Manasuni kariginchela undi
Like Reply
Ivvala weekend off aa bhayya?
Like Reply
(17-01-2026, 07:17 PM)ash.enigma Wrote: Ivvala weekend off aa bhayya?

Noooo


Just Ippude Login Ayyanu


E Night Update Istanuu
Like Reply
Part - 49


ధనుంజయ్ ఏడుపు ను చూసి అందరికీ బాధ అనిపించిన అవని పడిన కష్టాలు గుర్తు వచ్చి అందరూ సైలెంట్ అయిపోతారు.

అవని మాత్రం ఆ ఏడుపు కి కొంచెం కూడా చలించదు. శేషగిరి గారికి మనసుఒప్పక కొడుకు దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి ఏంట్రా ఇది అని బాధగా అడుగుతారు.

తండ్రిని కౌగిలించుకుని నిజంగా నాన్న నాకు ఇవన్నీ తెలియదు.  వాళ్ళు నాకు చెప్పింది ఒకటి. జరిగింది ఒకటి. నిజంగా తప్పంతా నాదే.

నేను ప్రతి రోజు అవిని తో మాట్లాడుతూ తను ఇబ్బంది ఏంటో తెలుసుకోవాల్సింది. మొండిగా తయారైంది ఎవరి మాట వినడం లేదు. నాతో మాట్లాడటం కూడా ఇష్టపడడం లేదు అంటే నిజమే అనుకున్నాను...

కానీ ఏ రోజు కూడా అవిని దగ్గర కూర్చుని ఏమిటి నీ సమస్య అనే మృదువుగా మాట్లాడలేదు. నా కూతురు నా కోసం ఎదురు చూస్తున్నప్పుడల్లా భార్గవి ఏదో ఒకటి చెప్పేది.  అదే నిజమనుకుని కోప్పడేవాడిని.

అవిని అన్నది నిజమే కదా నాన్న. శిల్పతో మాట్లాడినట్టుగా ఏ రోజు నేను అవిని తో మాట్లాడలేదు.

శిల్పకి ఏం కావాలి అన్న ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నాను. కానీ అవని విషయం వచ్చేటప్పటికి ఎందుకు భార్గవి మాటలు విన్నానో నాకే అర్థం కావడం లేదు.

శిల్ప కాలేజ్ కి పేరెంట్స్ మీటింగ్ కూడా వెళ్లే వాడిని. ఒక్కసారి కూడా అవనితో వెళ్ళలేదు. మరి అలాంటప్పుడు నా కూతురు నన్ను ఎలా నమ్ముతుంది.

ఆఖరికి నా కూతురు ఏమి చదువుతుందో... ఎలాంటి బట్ట కడుతుందో కూడా నేను పట్టించుకోలేకపోయాను. శిల్ప ప్రతి పని దగ్గర ఉండి జాగ్రత్తగా చేశాను.

అవని  విషయంలో చేయలేకపోయాను. అవని తో వెళ్ళాలి అనుకున్నప్పుడుల్లా ఏదో ఒక ఆటంకం కలిగించేవారు.

అవని పనినీ  భార్గవి కి అప్పగించి వెళ్ళేవాడిని. రాగానే అడిగేవాడిని. ఆఖరికి కాలేజీ డీటెయిల్స్ కూడ నాకు ఫేక్ చూపించారు.

అవే నిజం అనుకున్నాను. నాతో మాట్లాడకపోయినా బాగానే చదువుకుంటుంది అనుకున్నాను కానీ అసలు అవని చదివే కాలేజే వేరే అని నేను తెలుసుకునేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది.

ఈ ఇంటి సంబంధం కూడా నేను అవిని కోసమే తెచ్చాను. ఇంతమంది మధ్యలో ఉంటే అయినా ఆ మొండితనం వదిలి సంతోషంగా ఉంటుందని ఆలోచించాను.

కానీ అవని అందరు ముందు కూడా వద్దు అని చెప్పే లాగా చేశారు. అది కూడా నేనే చేశాను అన్నట్టుగా ఆ రాక్షసి చేసింది.

నేను నిజమే చెబుతున్నాను నాన్న నాకు తెలియకుండానే ఇన్ని ఘోరాలు జరిగిపోయాయి నాన్న  అని బోరున ఏడుస్తాడు. కానీ అవని ఆ ఏడుపుకి కొంచెం కూడా చెలించదు అలానే చూస్తూ ఉంటుంది.

విక్రమ్ మాత్రం అవిని నే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎలాంటి స్టెప్ తీసుకుంటుందా అని చూస్తూ ఉంటాడు. అవని ఏ నిర్ణయం తీసుకున్న తను సపోర్ట్ గా నిలబడాలి అని ఫిక్స్ అయిపోతాడు.

అలాగే భార్గవి టీం మొత్తానికి కూడా ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలో కూడా డిసైడ్ అయిపోతాడు.

అవని ధనుంజయ్ ముందుకు వచ్చి నిలబడి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్ అని అడుగుతుంది. తనకు ఏమి తెలియదనిచెప్పిన సరే అవని సార్ అని పిలుస్తూ ఉంటే...

ధనుంజయ్ మనసు బాధతో విలవిల్లాడుతుంది.  కష్టంగానే చెప్పు అని అంటాడు. మీరు చాలా పెద్ద బిజినెస్ మాన్ కదా చాలా మందితో చాలా రకాల డీల్స్ చేసి ఉంటారు కదా అని అడుగుతుంది.

అవును అని సమాధానం చెబుతాడు. మీరు వాళ్లతో డీల్ చేసేటప్పుడు వాళ్లు జెన్యూన్ అవునో కాదో కూడా వాళ్ళు మాటలు బట్టి మీకు అర్థమవుతుంది కదా అని మళ్ళీ ప్రశ్నిస్తుంది.

అవని ఏమి అడగబోతుందో చూచాయిగా  అర్థమవుతూ ఉంటే....  అనుమానంగా అవును అని సమాధానం చెబుతాడు.

మరి మీ ఇంటిలో జరిగేది మీకు ఎలా తెలియకుండా ఉంది. మీ ఇంటిలో ఉన్న ఆ ఐదుగురు మీతో జెన్యూన్ గా మాట్లాడుతున్నారు లేదో కూడా మీకు అర్థం కాలేదు అంటే నమ్మమంటారా...

పోనీ మీ భార్యని పక్కన పెడదాము. మీ బావమరిది ఫ్యామిలీ మాటలు కూడా మీకు జెన్యూన్ గానే అనిపించాయా... ఆ ఉదయ్ చెప్పిన మాటలు కూడా మీకు జెన్యూన్ గానే ఉన్నాయా అని ఎటువంటి భావం లేకుండా అడుగుతుంది .
 
ఏమని సమాధానం చెప్పగలడు.  అవని అడిగేది ప్రతీది నిజమే కదా...  అంత బిజినెస్ రన్ చేసే తను ఇంటిలో భార్య చేసిన మోసాన్ని కనిపెట్టలేకపోయాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య ప్రతిరూపమైన కూతురు బాధపడుతూ ఉంటే తెలుసుకోలేకపోయాడు. బాధ అన్నది చిన్న మాటేమో.. నరకం అంతకన్నా పెద్ద మాట ఏదైనా ఉంటే ఆ మాట అనుకోవాలి ఏమో అనుకుంటూ చూస్తూ ఉంటాడు.

ఏంటి సార్ నేను అడిగింది నిజమే కదా అని..ఇప్పుడు చెప్పండి నానమ్మ జరిగిందేదో జరిగిపోయింది అని అంటున్నారు కదా..ఈయనకి తెలియకుండానే ఇన్ని జరిగినాయి అంటే నమ్మేటట్టు ఉందా అని అడుగుతుంది.

సత్యవతి గారు కూడా ఏమి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతారు. జరిగిన విషయంలో కొడుకు తప్పు లేకపోయినా.. ఏమీ తెలుసుకోకుండా ఉండడం మాత్రం వాడిది చాలా పెద్ద తప్పే.

అందుకు శిక్ష కూడా అనుభవించాలి అని పెద్ద వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు.

విక్రమ్ గారితో నేను ఉన్నది రెండు రోజులే.  అప్పుడు కూడా నా రూపం ఆయనకు తెలియదు.  కానీ శోభనం రోజు రాత్రి నేను కాదు అని ఆయన గుర్తుపట్టారు.

అలాంటిది  ఆ ఇంటిలో ఇన్ని ఘోరాలు జరుగుతున్న ఆయనకి తెలియదు అంటే ఎలా నమ్మమంటారు మీరే చెప్పండి నానమ్మ అని అడుగుతున్నా మనవరాలు ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక బాధగా కళ్ళు మూసుకుంటారు.

నా భర్తకి నా మీద ఉన్న ప్రేమతో నమ్మకంతో నన్ను కనిపెట్టి...  ఆ ఇంట జరిగిన అన్యాయాలు అన్ని బయట పెడితే గాని ఈయనకి తెలియదంట.

ఇప్పుడు ఈయన ఇంత కపట ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో తెలుసా నానమ్మ ... తన ముద్దుల భార్యని, గారాల కూతురిని కాపాడుకోవడానికి.

నా భర్త అన్ని నిజాలు బయటపెట్టేటప్పటికీ ఏమి చేయాలో తెలియక ఎలా కాపాడుకోవాలో తెలియక ఇలా ముసలి కన్నీరు కారుస్తున్నారు.

ఆ మసలకన్నీరుతో నన్ను కరిగించి నాతోనే వాళ్లని విడిపించండి అని చెప్పించడానికి ఈయన ప్రయత్నం అంతా...

మీ అబ్బాయికి నా తల్లిని చంపినందుకు కూడా బాధ లేదు. ఆయన భార్య జైల్లో మగ్గిపోతున్నందుకు బాధంతా. వాళ్లని విడిపించడానికి ఒక కొత్త పన్నాగం అంతే అని కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతుంది. 

ఆ మాటలు విన్న ధనుంజయ్ ముఖంలో నెత్తురు చుక్క ఉండదు. తన కూతురి దృష్టిలో తను ఎంత దిగజారిపోయాడో అర్థమవుతూఉంటుంది.

అవిని మనసు ఎంత విరిగిపోయిందో, వీళ్ళ విషయంలో ఎంత బండబారిపోయిందో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవుతూ ఉంటుంది.

ధనుంజయ్ ప్రత్యక్షంగా ఆ ఘోరాలు చేయకపోయినా పరోక్షంగా కారణమయ్యాడు అని... అందరూ అవని వైపే నిలబడతారు.

ధనుంజయ్ గట్టిగా చెప్పలేకపోతున్నాడు అందరికన్నా ఎక్కువ తన భార్య రజతయే అని... అవని అంటే ప్రాణం అని...

ఎలా చెప్పగలడు.. చెప్పిన నమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారు.. ఆఖరికి తనకన్నా తల్లిదండ్రులు కూడా నమ్మలేని పరిస్థితులు  వచ్చాయి.

ఏమి చేస్తే తన కూతురు తనని నమ్ముతుంది అని ఆలోచిస్తున్నాడు.

ఒక నిర్ణయానికి వచ్చిన వాడై,  అవని ముందుకు వెళ్లి నీ బాధ నాకు అర్థం అవుతుంది నీ మానసిక క్షోభకి కారణం నేనే.

ఈ విషయంలో నేను ఎవరిని నిందించలేను. ఎందుకంటే గుడ్డిగా చెప్పుడు మాటలు విన్నందుకు శిక్ష కూడా నేనే అనుభవించాలి.

నీకు నాపై నమ్మకం కలిగి నన్ను నాన్న అని పిలిచిన రోజునే మళ్లీ నీ ముందుకు వస్తాను. అప్పటివరకు నీ కళ్ళ ముందుకి నేను రాను.

ఒకవేళ నా ప్రాణం పోయేలోపుల  నువ్వు నన్ను క్షమించగలిగితే అంతకన్నా అదృష్టం నాకు ఇంకొకటి ఉండదు.

ఒకవేళ క్షమించ లేకపోయినా సరే నా తలకొరివి మాత్రం నువ్వే పెట్టు ఆ నిమిషం వెళ్లి మీ అమ్మ కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణలు అడుగుతాను.

ఇందిరాగారి దగ్గరకు వెళ్లి చేతులెత్తి జోడించి నావల్ల చాలా పెద్ద తప్పే జరిగింది.  ఇన్ని ఘోరాలు జరుగుతున్నా సరే కళ్ళు మూసుకుని ఉండిపోయాను.

నావల్ల జరిగిన తప్పుకి మీకు కోపం ఉంటే నాకు ఎటువంటి శిక్ష అయినా సరే వేయండి. మీ సంస్కారం నాకు తెలుసు.

ఒక తండ్రిగా చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నాను.  అంతేగాని మిమ్మల్ని తక్కువ చేసి మాత్రం కాదు.

అవని జాగ్రత్త. ఇన్ని రోజులు అది ఎటువంటి ప్రేమకి నోచుకోలేదు. ఒక తండ్రిగా నేను పూర్తిగా ఫెయిల్ అయిపోయాను.

మీ అమ్మాయి అవనినీ దత్తత తీసుకుంటాను అని చెప్పారు.  దానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరము లేదు.

ఎందుకంటే అవి ఆపడానికి కూడా నాకు ఎటువంటి అర్హత లేదు. మమ్మల్ని క్షమించండి.  అవని ఇంటికి వచ్చేటప్పుడు ఒక అనాధగానే వస్తాను అని చెప్పింది కదా...

నిజంగానే తను ఒక అనాధ ఎందుకంటే నేను బ్రతికి ఉన్న చచ్చిన వాడితో సమానం కాబట్టి.  ఇంకా మాటలు రాక ఏడుపు స్వరంతో వెళ్లి వస్తాను.

నా కూతురు క్షమించిన రోజున తప్పకుండా పుట్టింటి లాంఛనాలతో ఈ గుమ్మం తొక్కుతాను అని వాళ్ళ అమ్మ గారి వైపు చూసి వెళదామా అమ్మ అని అడుగుతాడు.

కొడుకు బాధ చూడలేక మనవరాలిని ఇంకొకసారి అడుగుతారు.  మీ నాన్నని క్షమించవచ్చు కదా తల్లి వాడి బాధ చూడలేకపోతున్నాము అని...

మీ అబ్బాయిని ఏ విషయంలో అయినా క్షమించగలను గాని.. ఆ ఉదయ్ కి సంబంధించిన విషయంలో నా జీవితంలో క్షమించలేను.

ఒక్క ఆడదానిగా నువ్వే ఆలోచించు నాన్నమ్మ. ఆరోజు ఏదైనా జరిగి ఉండి ఉంటే  ఈరోజు నీ ముందు నేను ఉండే దాన్నా అని అడుగుతుంది.

సత్యవతి గారిలో మౌనం. నీ మౌనమే సమాధానం చెప్పింది కదా అని అవని నమస్కారం చేస్తుంది.

ఆ నమస్కారానికి అర్థం తెలిసిన ధనుంజయ్ ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోతాడు.

వెళుతున్న వాళ్ళని కన్నీళ్ళతో చూస్తూ ఉంటుంది.

అవిని నీ ఎలా చూసిన విక్రమ్ నిర్ణయం ఏమిటి...
[+] 11 users Like SivaSai's post
Like Reply
Part - 50


వెళుతున్న ముగ్గురిని కన్నీళ్ళతో చూస్తూ ఉంటుంది. విక్రమ్ అవిని దగ్గరకి వచ్చి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు. మౌనంగా విక్రమ్ వైపు చూస్తుంది.

పదా కాసేపు రెస్ట్ తీసుకుందువు గాని నివి రూమ్ కి తీసుకువెళ్తాడు. వెళుతున్న వాళ్ళిద్దర్నీ కుటుంబ సభ్యులందరూ మౌనంగా చూస్తూ ఉంటారు.

ఇందిరా గారు వెంటనే కోడలతో ముందు అవనికి దిష్టి తీసి తినడానికి ఏమైనా పెట్టు. ఇప్పటినుండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవని బాధపడకుండా చూసుకోండి.

తన మనసుకి చాలా పెద్ద గాయమే అయింది. ఆ గాయానికి ముందు నా మనవడే అనుకో.. కానీ కుటుంబం విషయంలో తను ఎటువంటి ప్రేమకి నోచుకోలేదు అన్ని ప్రేమలు మనమే అందించాలి అని చెబుతారు .

మూడో రోజున అవిని తాళి మార్చే సమయం లోనే మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నామని మాధవి చెబుతుంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మాధవి.

మీ దంపతులు ఇద్దరికీ అంగీకారం అయితే నాకు సమ్మతమే అని చెబుతారు.  దానికి మాధవి సంతోషంగా మా ఇద్దరికీ అంగీకారమే అమ్మ మేము దత్తత తీసుకుంటాము అని సంతోషంగా చెబుతుంది.

గదిలోకి వెళ్ళిన తర్వాత అవనినీ మంచం మీద కూర్చోబెట్టి గట్టిగా హగ్ చేసుకుంటాడు. విక్రమ్ నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని మౌనంగా ఉండిపోతుంది.

కొంచెం సేపటికి  కుదుటపడుతుంది అనుకున్నాక విక్రమ్ దూరం జరిపి  ఏడ్చి ఉబ్బి ఉన్న కళ్ళ పైన ముద్దు పెట్టుకుని ఇప్పటినుండి నీ కళ్ళల్లో ఎటువంటి బాధ కనపడకూడదు.

ఈరోజు నుండి నీకు కొత్త జీవితం మొదలయ్యింది. ఆ కొత్త జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించు. ఇదే మన కుటుంబం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అర్థమవుతుందా అని మా మార్థవంగా చెబుతాడు.

మీకు నా పైన కోపం లేదా అని అడుగుతుంది. నీపైన ఎందుకో అని తిరిగి ప్రశ్నిస్తాడు. నేను వచ్చిన కుటుంబం ఎలాంటిదో అందరికీ తెలుసు.

బంధం కలుపుకున్న కుటుంబం వలన గౌరవం పెరగాలని ఎవరైనా చూస్తారు. కానీ నాతో బంధం ఏర్పడడం వలన మీకు గౌరవం దక్కలేదు కదా ... బాధగా లేదా అని అడుగుతుంది.

విక్రమ అవిని పక్కన కూర్చుని అవని చేతిని తన చేతిలోకి తీసుకుని... నువ్వు అనుకునే గౌరవం గురించి ఆలోచించే వాడిని అయితే వాళ్లందరి గుట్టు బయట పెట్టే వాడిని కాదు.

నాకు నువ్వు ముఖ్యం అనుకున్నాను ఈ బంధం ముఖ్యం అనుకున్నాను కాబట్టే అన్ని కుట్రలను ఛేదించి నిన్ను నా సొంతం చేసుకుంటున్నాను.

ఇప్పుడే చెబుతున్నాను.. నువ్వు ఇంకా ఆలోచనలో నుంచి పూర్తిగా బయటికి వచ్చేయాలి. మన శోభనం రోజు కల్లా ఫ్రెష్ గులాబీ లాగా రెడీ అయ్యి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి.

అప్పుడు కూడా నువ్వు ఇలాగే బాధపడుతూ కూర్చుంటే... ఎవరూ లేని దీవికి నిన్ను ఎత్తుకుపోయి సంవత్సరం పాటు అదే పనిలో ఉంటాను.

మళ్ళీ పిల్లలు పుట్టాకే ఇంటికి తీసుకు వస్తాను అని కొంటెగా చెబుతాడు. ఆ మాటలకి అవిని సిగ్గుపడుతూ... మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయను అని విక్రమ్ గుండెల పైన వాలిపోతుంది.

విక్రమ్ అవిని చుట్టూ చేతులు వేసి గట్టిగా బంధించి అందంగా నవ్వేస్తాడు. ఆ నవ్వును చూసి మీ నవ్వు చాలా బాగుంటుంది అండి అని చెబుతోంది.

నా పెదవుల పైన నవ్వు ఇలాగే ఉండాలి అంటే.. నువ్వు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడూ నువ్వు నవ్వుతూ ఉండాలి.

నీ నవ్వును చూస్తే ఆటోమేటిక్గా నా పెదవుల పైన నువ్వు వస్తుంది అని అవని పెదాలు పట్టుకుని లాగుతాడు. స్ అనే సౌండ్ చేస్తూ కళ్ళని కిందకి వాల్చేస్తోంది.

తలుపు శబ్దం వినిపించి విక్రమ్ వెళ్లి తలుపు తీస్తాడు. అక్కడ లలిత గారు నిలబడి కనిపిస్తారు.  రా అమ్మ అని పక్కకి తప్పుకుంటాడు.

అవని ఏం చేస్తుంది విక్రమ్ అంటూ లోపలికి వస్తారు. అత్తగారిని చూసి అవిని లేచి నిలబడుతుంది.  పర్వాలేదు కూర్చో తల్లి అని చెప్పి దిష్టి తీసి ఇప్పుడే వస్తాను అని కిచెన్ లోకి వెళ్లి ఇద్దరికీ ఫుడ్ తీసుకుని వస్తారు .

ఇద్దరు భోంచేసి ఇక్కడే రెస్ట్ తీసుకోండి కానీ అడ్వాన్స్ అవ్వద్దు.  నీ భర్త నీ పక్కన ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు అన్న నమ్మకంతో ఇద్దర్ని ఒకే చోట ఉంచుతున్నాను అని నవ్వుకుంటూ వెళ్లిపోతారు.

అత్తగారు మాటలకే అవని బుగ్గలు సిగ్గుతో చెర్రీ పళ్ళను మురిపిస్తూ ఉంటాయి. అవిని సిగ్గుని చూసి విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతూ ఉంటే మన ఆకలి తీరదు.

చాలా ఆకలిగా ఉంది రా అని చెప్పి కూర్చోబెట్టి తినిపిస్తాడు.  తింటున్న అవని విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది.

అవని చూపులకి విక్రమ్ నీ మొగుడు అందగాడని అందరికీ తెలుసు. నన్ను తినడం మానేసి అని అన్నం తిను అని చెబుతాడు.

నా మొగుడు అందగాడని అందరికీ తెలుసు కానీ నాకే సొంతం కదా అందుకే చూసుకుంటున్నాను. మీకేమన్నా ఇబ్బందా అని గడుసుగా అడుగుతుంది.

అబ్బో అంటూ భోజనం పూర్తి చేస్తాడు. కాసేపు పడుకో. మీరు ఉంటారా అంటే.. ఇక్కడే ఉంటాను. రా అని చెప్పి విక్రమ్ పడుకుంటాడు. అవని రాగానే గుండెల మీదకి చేర్చుకుని జో కొడుతూ ఉంటాడు.

ఇలాంటి రోజు తన జీవితంలోకి వస్తుంది అన్న ఆలోచన లేని అవని ఈ సంతోషాన్ని పదిలంగా దాచుకోవాలి అని విక్రమ్ షర్ట్ ని తన గుప్పిటన గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంటుంది.

అవని మనసు ఏమిటో అర్థం అయినా విక్రమ్ ఇంకా దగ్గరగా లాక్కుని నుదుటిని ముద్దు పెట్టుకుని పడుకుంటాడు.

ఒకసారి మనం గది బయటకు వెళదాము.
అందరు భోజనాలు అయిన తర్వాత నేహా ఇంకా నేను బెంగళూరు వెళ్ళిపోతాను అని చెబుతోంది. దానికి శ్రీ కంగారుపడుతూ నా పిల్ల అప్పుడే వెళ్ళిపోతే ఎలా...

నేను అసలే చాలా ప్లాన్స్ వేసుకుంటున్నాను. ఇలా వెళ్ళిపోతాను అంటే ఎలా కుదురుతుంది. ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటే...

మాధవి గారు అదేంటి నేహ వెళ్ళిపోతాను అంటున్నావు.. ఎల్లుండా దత్తత ప్రోగ్రామ్ ఉంది. అలాగే తాళి మార్చే పని ఉంది. నీ స్నేహితురాలికి ఇన్ని రోజులు అండగా నిలబడ్డావు.

మరి నిజమైన సంతోషం వచ్చినప్పుడు నువ్వు ఉండాలి కదా అని చెబుతారు. మాధవి గారి మాట కాదనలేక నేహా సరే అని చెబుతోంది.

హమ్మయ్య నా పిల్ల ఇక్కడే ఉంటుంది ఈ రెండు రోజులు అనుకుని ప్రశాంతంగా భోంచేస్తూ ఉంటాడు.

ధనుంజయ్ ఇంటికి వెళ్లిన తర్వాత ఎవరితోను మాట్లాడకుండా ఆఫీసు రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటాడు.

కొడుకుని అలా చూసినా ఆ దంపతులిద్దరూ కూడా మౌనంగా గదిలోకి వెళ్ళిపోతారు. ధనుంజయ్ రజిత ఫోటో ఎదురుగుండా నిలబడి ఉండిపోతాడు.

ఈరోజు నా కూతురు నన్ను ఎలాంటి ప్రశ్న వేసిందో తెలుసా... నీ చావు గురించి కూడా నాకు బాధ లేదు అంట.. నిన్ను చంపి వాళ్ళు ఇరుక్కున్నారు అని నేను బాధపడుతున్నాను అంట..

వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి అని మొసలి కన్నీరు కారుస్తున్నానుఅని ఖరాఖండిగా చెప్పేసింది.

నా కన్నీళ్లు కూడా నాటకం అనుకుంటుంది. అవని మనసుని అంత దారుణంగా నేను విరిచేసానా  అని రజిత ఫోటోని తడుముతూ అడుగుతూఉంటాడు.

ఆ ఫోటో మాత్రం అందంగా నవ్వుతూ ఉంటుంది కానీ తనని వెక్కిరించినట్టుగానే కనిపిస్తుంది. అది నిజమే కదా అని చెబుతున్నట్టుగా అనిపిస్తుంది.

రజిత ఫోటోని గట్టిగా పట్టుకుని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.  అవని మన ప్రేమకు ప్రతిరూపం. అవిని నీ జాగ్రత్తగా చూసుకుంటుంది అన్న  నమ్మకంతోనే భార్గవిని నా జీవితంలోనికి రానిచ్చాను.

కానీ నా తల్లిదండ్రులు కూతురి దృష్టిలో నేను ఒక దుర్మార్గుడు లాగా మిగిలిపోయే స్థితికి వస్తానని అనుకోలేదు.

కాసేపు అలాగా ఫోటోని పట్టుకుని ఒక నిర్ణయం తీసుకొని... ఫోటోకి ముద్దు పెట్టుకుని చిన్న నవ్వుతో గది బయటికి వస్తాడు.

తల్లిదండ్రులు గదిలోకి వెళ్లి తనకి చేయాలనుకున్న పని మొత్తం చెబుతాడు. అది విని ముందు ఆశ్చర్యపడిన.. అన్ని ఆలోచించుకునే చేస్తున్నావా ధనుంజయ్ అని అడుగుతారు. అవును అని సమాధానం చెబుతాడు.

ఒక్కసారి నీ నిర్ణయం గురించి  వియ్యంకులవారితో కూడా మాట్లాడు సలహా ఇస్తారు. తప్పకుండా అమ్మ అని చెప్పి... అవని గదిలోకి వెళ్లి అక్కడే పడుకుంటారు.

సూర్యుడు గుడ్ మార్నింగ్ చెప్పాకిముందే లేచి అవని గది బయటికి వస్తుంది. అప్పుడే లలిత, మాధవి కూడ వస్తారు.

అరె అప్పుడే లేచావు ఏందుకు... కొంచెం సేపు పడుకోపోయావా.... నాకు తొందరగా లేచే అలవాటు అత్తయ్య అని చెప్పే లలిత గారితో కలిసి పూజ చేస్తుంది.

కిచెన్ లోకి తీసుకెళ్లి.. ఫస్ట్ ఏదైనా స్వీట్ చెయ్యి అవిని అని  చెబుతారు. సరే అని చక్కెర పొంగలి చేసి దేవుడికి నైవేద్యం పెడుతుంది.

టిఫిన్స్ నేను ప్రిపేర్ చేస్తాను అత్తయ్య అని చెప్పి కిచెన్ లోకి వెళ్లి పెసరట్టు, ఉప్మా,అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి చేస్తుంది.

అందరూ రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. కళ్యణ్ గారు భార్య వైపు చూసి ఏమిటోయ్ ఈ రోజు స్మెల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి.

కోడలు ప్రిపేర్ చేసింది అని చెబుతారు. అందరికీ ముందుగా చక్ర పొంగలి బాల్స్ లో వేసి పెట్టి టిఫిన్ వడ్డిస్తారు.

అందరూ టేస్ట్ చూసి చాలా బాగుంది అని చెబుతారు. విక్రమ్ మాత్రం సైలెంట్ గా తింటూ ఉంటే నువ్వుఏమి చెప్పవే అని అడుగుతారు. 

దానికి శ్రీ  మీకంటే ఇదే ఫస్ట్టైమ్. మేము పది రోజుల నుంచి తింటూనే ఉన్నాము. వీడు ఏమి చెప్పకుండానే ఏ టైం లో ఎలా తింటాడో అలా ప్రిపేర్ చేసి పంపించేది.

వీళ్ళు మాట్లాడుకునేది తక్కువ. కానీ అర్థం చేసుకుంది ఎక్కువ.

ఆ మాటలకు అవిని ఇబ్బందిగా చూస్తే విక్రమ్ డిప్ప మీద ఒకటి పీకి మూసుకుని తిని బే అంటాడు.

కథ కొనసాగుతుంది....
[+] 12 users Like SivaSai's post
Like Reply
lovely updates bro
[+] 1 user Likes shekhadu's post
Like Reply
Wow super
Like Reply




Users browsing this thread: