Yesterday, 03:40 AM
Waiting for your update
|
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
|
|
Yesterday, 03:40 AM
Waiting for your update
Yesterday, 05:16 AM
Prathi lipi lo vundhi story abhir vamsham story
Yesterday, 08:56 AM
Yesterday, 08:57 AM
story bagundi bro
please continue with regular updates and posts.
Yesterday, 05:38 PM
ఎపిసోడ్ 23
ముఖేష్ ఇచ్చిన పేపర్స్ తీసుకుని చూస్తూ 'నిరంజన్ అసిస్టెంట్ పాఠక్! ముందు వీడు ఉన్నాడో పోయాడో తెలుసుకోవాలి.' అనుకుంది మిత్ర.
************************* కోర్టు కేసు జరిగే సమయంలో, రాజన్ తో కలసి ఉత్తరప్రదేశ్ లో ల్యాండ్ ప్రాపర్టీ చూస్తూ ఉన్న సుజిత్ దగ్గరికి వచ్చి "సార్! సెంట్రల్ మినిస్టర్ వరదరాజులు గారు కాల్ చేస్తున్నారు." అని ఫోన్ ఇచ్చింది రియా. ఫోన్ తీసుకుంటూ రియా వైపు చూసి స్మైల్ ఇచ్చి "థాంక్యూ!" అని ఫోన్ లిఫ్ట్ చేసి "హాయ్ అంకుల్! హౌ ఆర్ యు? ఎలా జరిగింది పార్టీ మీటింగ్!" అని అడిగాడు సుజిత్. "ఫైన్! ఫైన్ సుజిత్! మనం ప్రాపర్టీ విషయం మాట్లాడుకుందాము అనుకున్నాము కదా ఈరోజు కలుద్దామా?" అని అడిగాడు వరదరాజులు. "అంకుల్! నేను అవుట్ ఆఫ్ లో ఉన్నాను, మార్నింగ్ మీ ఇంటి దగ్గర ఉంటాను బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తూ డీల్ కూడా కంప్లీట్ చేద్దాము." అని నవ్వుతూ చెప్పాడు సుజిత్. "షూర్! నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు వరదరాజులు. ఫోన్ రియాకి ఇస్తూ రాజన్ వైపు చూసి "గూర్ గామ్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ సేల్ విషయం రేపు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాను మాక్సిమం డీల్ కంప్లీట్ అవుతుంది." అని చెప్పాడు సుజిత్. అంతలో అక్కడికి వస్తు "గుడ్ మార్నింగ్ సార్! మీరు ఓకే అంటే ఈ ల్యాండ్ డీల్ కూడా పెట్టుకుందాము బయ్యర్ రెడీగా ఉన్నాడు." అని చెప్పాడు అరుల్. "వెయిట్! వెయిట్ ఫస్ట్ ఒక డీల్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చూద్దాము." అని చెప్పాడు సుజిత్. "ఓకే సార్! మీ ఇష్టం, నా దగ్గర బయ్యర్స్ రెడీగా ఉన్నారు మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు మీ ముందు కూర్చో పెడతాను." అని చెప్పాడు అరుల్. అక్కడి నుంచి కారు దగ్గరికి వస్తూ "కచ్చితంగా నీ బయ్యర్స్ తో డీల్ కి కూర్చుందాము కాకపోతే కాస్త టైముంది." అని చెప్పి కార్ ఎక్కడు సుజిత్. "ఓకే సార్ నో ప్రాబ్లెమ్! మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరుల్. కారులో అక్కడి నుంచి వెళుతూ బ్యాక్ సీట్లో ఉన్న సుజిత్ వైపు చూసి "సార్! ఆ మినిస్టర్ ప్రాపర్టీని చాలా చీప్ గా కొట్టేయాలని చూస్తాడు జాగ్రత్తగా మాట్లాడండి అతని గురించి నాకు బాగా తెలుసు!" అని చెప్పాడు రాజన్. "మనకి ఆ మినిస్టర్ తో ముందు ముందు చాలా పని ఉంది తీసుకొని ఉపయోగపడతాడు." అని చెప్పాడు సుజిత్. "ఓకే సార్ మీ ఇష్టం!" అని చెప్పాడు రాజాన్. ************************ మరుసటి రోజు ఉదయం చాక్లెట్ తో కలిసి సెక్యూరిటీ అధికారి హెడ్ క్వార్టర్స్ లో ఎకౌంట్ సెక్షన్ దగ్గరికి వెళ్లి "ఆ పాఠక్ చరిత్ర మొత్తం ఇక్కడే ఉంటుంది. ఆ సెక్షన్ లో ఉన్న ఆఫీసర్ ని లైన్ లో పెడితే మనకు వెంటనే డీటెయిల్స్ దొరుకుతాయి." అని చూస్తూ చెప్పింది మిత్ర. "అక్క వన్ మినిట్!" అని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్ ముందు నుంచి వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి మిత్ర వైపు చూసి "అతని పేరు శుక్ల!" అని చెప్పాడు చాక్లెట్. "ఈ శుక్ల సర్ ఎప్పుడు బయటకి వస్తారో!" అనుకుంటూ ఉండగా చైర్ లోనుంచి లెగిసి సిగరెట్ ప్యాకెట్ తీసుకొని బయటికి వెళ్లడం చూసి "దొరికాడు రా.. పద! అని చాక్లెట్ తో కలిసి వెనకాల వెళ్ళింది మిత్ర. బయటికి వచ్చి క్యాంటీన్ దగ్గరికి వెళ్లి సిగరెట్ తాగుతూ ఫోన్ మాట్లాడుతూ "సాయంత్రానికి ఏదో విధంగా అడ్జస్ట్ చేస్తాను నువ్వు మాత్రం ఆఫీస్ దగ్గరికి రాకు ప్లీజ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు శుక్ల. ఆ మాట విని వేరే టేబుల్ దగ్గర కూర్చుని చాక్లెట్ ని దగ్గరికి పిలిచి "గురుడికి డబ్బులు అవసరం అనుకుంటా మనం తీర్చేద్దాము వెళ్లి నా దగ్గరికి తీసుకురా!" అని చెప్పింది మిత్ర. "సరే అక్క!" అని సిగరెట్ తాగుతున్న శుక్ల దగ్గరికి వెళ్లి నవ్వుతూ చూస్తూ "నమస్తే సార్, చాక్లెట్!" అన్నాడు. "నాకు ఇపుడు ఏ చాక్లెట్ వద్దు బాబు వెళ్ళు!" విసుగ్గా అన్నాడు శుక్ల. "సార్! నా పేరు చాక్లెట్! నేను చాక్లెట్లు అమ్మే వాడిని కాదు." అని చెప్పాడు చాక్లేట్. ఆ మాట విని "హో.. నీ పేరే చాక్లెట్ ఆ..!" అని నవ్వుతూ "బలే సిల్లిగా ఉంది ఏంటి చెప్పు?" అని అడిగాడు శుక్ల. "నాకు తెలిసి మీకు ఇప్పుడు డబ్బులు బాగా అవసరం అనుకుంటా!" అని నెమ్మదిగా అన్నాడు చాక్లెట్. "ఏ నువ్వు ఇస్తావా?" అని వెటకారంగా చూస్తూ అడిగాడు శుక్ల. "నేను ఇవ్వను సార్! మీకు ఇవ్వడానికి లక్ష్మీదేవి అక్కడ రెడీగా కూర్చుని ఉంది. మీరు వెళ్లి ఎదురుగా కూర్చుంటే చాలు, ఏటీఎం కూడా అవసరం ఉండదు విత్ డ్రా చేసుకుని వెళ్లిపోవడమే!" అని దూరంగా ఉన్న మిత్రని చూపించాడు చాక్లెట్. ఆ మాటకి ఆశ్చర్యంగా చూసి మిత్ర ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్లి ఎదురుగా కూర్చుని "నా నుంచి మీరు ఏదో ఆశించే వచ్చి ఉంటారు, నావల్ల డిపార్ట్మెంట్లో మీకు చిన్న పని కూడా అవ్వదు." అని చెప్పాడు శుక్ల. "నేను ఒక డిటెక్టివ్ ని ఎవరి దగ్గరికి వెళితే ఏ పని అవుతుందో నాకు బాగా తెలుసు! మీకు అమౌంట్ ఎంత అవసరమో చెప్పండి. మిమ్మల్ని టెన్షన్ పెట్టే వాళ్ళ నుంచి ఫోన్ రాదు." అని చెప్పింది మిత్ర. "నాకు అర్జెంటుగా రెండు లక్షలు కావాలి! కానీ నేను చేసే అంత పెద్ద సహాయం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు." డౌట్ గా చూస్తూ అడిగాడు శుక్ల. "మీరు చేసేది అంత పెద్ద హెల్ప్ ఏమి కాదు చిన్న హెల్ప్ ఏ కానీ మీకు అంత డబ్బు ఎందుకు అవసరమో ముందు అది చెప్పండి." అని అడిగింది మిత్ర. "మా అమ్మాయికి మంచి కాలేజీలో సీటు వచ్చింది అర్జెంటుగా రెండు లక్షలు కడితేనే జాయిన్ చేసుకుంటారు లేకపోతే సీటు క్యాన్సిల్ అవుతుంది. నా దగ్గర అంత డబ్బు లేదు ఫార్మాలిటీస్ తీసుకునే అలవాటు లేదు అలాగని చూస్తు నా కూతురుని బాధ పెట్టాలి అనిపించడం లేదు ఏం చేయాలో తెలియక టెన్షన్ గా ఉన్నాను." అని చెప్పాడు శుక్ల. "ఓకే సార్! మీరు అడిగిన రెండు లక్షలు ఇప్పుడే ఇస్తాను." అని స్లీప్ ఇచ్చి "ఇతను 12 సంవత్సరాల క్రితం నో యిడా స్టేషన్లో కానిస్టేబుల్ గా చేశాడు, ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేస్తున్నాడో మీకు మాత్రమే తెలుస్తుంది నాకు ఆ డీటెయిల్స్ కావాలి." అని చెప్పింది మిత్ర. స్లిప్పు తీసుకుని చూసి కాసేపు ఆలోచించి "ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి." అని లోపలికి వెళ్లి కాసేపటికి బయటకు వచ్చి "అతను బీహార్ దగ్గర రుద్రపూర్ అనే ఊర్లో ఎస్సైగా చేస్తున్నడు." అని చెప్పాడు శుక్ల. "థాంక్యూ! హ్యాపీగా వెళ్లి మీ పాపని కాలేజీలో జాయిన్ చేయండి." అని చెప్పి చాక్లెట్ వైపు చూసి "సార్ కి స్వీట్ ప్యాకెట్ ఇవ్వరా..!" అని చెప్పింది మిత్ర. "ఓకే అక్క!" అని శుక్ల చేతిలో స్వీట్ ప్యాకెట్ పెట్టి ఇంకో చేతిలో ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసుకుని "ఇంకా మీకు ఇది అవసరం లేదు సార్!" అని చెప్పాడు చాక్లెట్. "థాంక్యూ సో మచ్! ఇంత చిన్న పనికి అంత పెద్ద అమౌంట్ ఇవ్వనవసరం లేదు కాని...!" డౌట్ గా చూసాడు శుక్లా. "నేను ఇచ్చిన డబ్బు మీరు చేసిన పనికి కాదు మీ అమ్మాయి చదువుకి!" అని బైక్ స్టార్ట్ చేసుకుని చాక్లెట్ తో అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిత్ర. ఆ మాట విని అక్కడి నుంచి వెళుతున్న మిత్ర వాళ్ళ వైపు సంతోషంగా చూసి ఫోన్ తీసి కూతురికి ఫోన్ చేశాడు శుక్ల. ************************ అదే సమయంలో తన మనుషుల వైపు చూసి "ఒరేయ్ రఫీ, చంటి! మీరిద్దరూ ఏం చేస్తారంటే, ఈ జూ పాంప్లెట్స్ ని కాలేజ్ నుంచి వెళుతున్న లాయర్ వసుంధర కూతురికి, ఆఫీసులో ఉన్న ఆ జర్నలిస్టు దగ్గరకి వెళ్లేటట్లు చేయండి." అని చెప్పాడు మిచల్. "సరే బాయ్!" అని పాంప్లెట్లు తీసుకుని చూసి "బాయ్! జూలో కొత్త జంతువులు వచ్చాయని ఉంది మనం కూడా వెళ్లి చూద్దామా?" అని అడిగాడు చంటి. ఆ మాటకి కోపంగా చూస్తూ "నోరు మూసుకొని ముందు నేను చెప్పిన పని చేసి రండి." అని చెప్పాడు మిచల్. "సరే బాయ్!" అని పాంప్లెట్స్ తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్లారు ఇద్దరు. మిచల్ వైపు చూస్తూ "జూ పంప్లేట్స్ వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించావు?" డౌట్ గా అడిగాడు జనార్ధన్. "ఈరోజు శనివారం ఆ పాంప్లెట్స్ చూసి కచ్చితంగా టెంప్ట్ అయ్యి ఫ్యామిలీ మొత్తం సాయంత్రం జూకి వస్తారు అక్కడే నా ప్లాన్ వర్క్ అవుట్ చేస్తాను." అని చెప్పాడు మిచల్. ఆ మాట విని "ఏంటి లోపల ఉన్న పెద్దపులిని బయటకు వదులుతావా ఏంటి?" నవ్వుతూ అడిగాడు జనార్ధన్. "ఏం జరుగుతుందో సాయంత్రం చూడండి." అన్నాడు మిచల్. ************************ మిచల్ మనుషులు పాంప్లెట్స్ రోషిని దగ్గరికి నీలమ్ దగ్గరికి వెళ్ళేటట్లు చేయడంతో కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి తల్లి దగ్గరికి వెళ్లి "మమ్మీ జూలోకి కొత్త కొత్త జంతువులు వచ్చాయంట! మళ్ళి టు డేస్ లో వెళ్ళిపోతాయంట! మనం వెళ్లి చూసి వద్దాము." అని అడిగింది రోషిని. అక్కడికి వస్తూ "అవును వదిన నేను కూడా విన్నాను ఈరోజు శనివారం అందరికీ హాఫ్ డే సరదాగా సాయంత్రం వెళదాము, గీత ఆంటీ వాళ్ళు, అభిర్ కూడా ఈ మూడ్ నుంచి డైవర్ట్ అవుతారు." అని చెప్పింది నీలమ్. "సరే!" అని ఫోన్ తీసి రోషినికి ఇచ్చి "మీ డాడీ కి నువ్వే కాల్ చేసి త్వరగా ఇంటికి రమ్మను, ముద్దుల కూతురు చెబితేనే వస్తారు." అని నవ్వుతూ అంది వసుంధర. "ఓకే!" అని సంతోషంగా ఫోన్ తీసుకుని సందీప్ కి కాల్ చేయడానికి నీలమ్ దగ్గరికి వచ్చింది రోషిని.
Yesterday, 05:40 PM
ఎపిసోడ్ 24
మిచల్ తెలివిగా పంపించిన పాంప్లెట్స్ చూసి జూకి వెళదామని డిసైడ్ అయ్యారు వసుంధర వాళ్ళు.
******************** శుక్ల దగ్గర నుంచి చాక్లెట్ తో కలిసి బైక్ మీద ఇంటికి వెళుతూ "పాఠక్ ఎక్కడ ఉన్నాడో తెలిసింది ఇంక వాడి ఫోన్ నెంబర్ సంపాదిస్తే అభిర్ గురించి మనకి కొంచెం డీటెయిల్స్ తెలుస్తాయి." అని చెప్పింది మిత్ర. "అవును అక్క!" అని ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి "జర్నలిస్ట్ అక్క చెప్పు బండి మీద ఉన్నాను." అని సంతోషంగా అన్నాడు చాక్లెట్. "ఒరేయ్ చాక్లెట్! మేమందరం జూకి వెళుతున్నాము సరదాగా మీ అక్క తో కలిసి నువ్వు కూడా రా..! ఇంతకీ మిత్ర ఫోన్ కలవడం లేదు ఎక్కడ ఉంది?" అని అడిగింది నీలమ్. "అక్క బైక్ డ్రైవింగ్ లో ఉంది అందుకని ఫోన్ సైలెంట్ లో పెట్టింది అనుకుంటా! మేమిద్దరం కచ్చితంగా వచ్చేస్తాము." సంతోషంగా చెప్పాడు చాక్లెట్. "సరే!త్వరగా బయలుదేరండి." అని చెప్పి ఫోన్ పెట్టేసింది నీలమ్. బైక్ డ్రైవ్ చేస్తూ "ఎవర్రా? అంత సంతోషంగా మాట్లాడుతున్నావు." డౌట్ గా అడిగింది మిత్ర. "అక్క! అభిర్ అన్న ఫ్రెండ్, జర్నలిస్ట్ అక్క! అందరూ కలిసి జూకి వెళ్తున్నారంట మనల్ని కూడా రమ్మని కాల్ చేసింది." అని చెప్పాడు చాక్లెట్. "అవునా? మనల్ని బానే గుర్తు పెట్టుకుంది రా..! సరే పద ఇటు నుంచి డైరెక్ట్ జూకి వెళదాము, వాళ్లతో పరిచయం మనకు చాలా అవసరం." అని రూట్ మార్చింది మిత్ర. ********************** అదే సమయంలో తన అడ్డాలో ఫోన్లో మాట్లాడి జనార్ధన్ వైపు చూసి "నా ప్లాన్ సక్సెస్ అయింది ఆ లాయర్ ఫ్యామిలీతో సహా జూకి వస్తున్నారు." అని సంతోషంగా నవ్వుతూ చెప్పాడు మిచల్. "సూపర్! ఇంతకీ జూ దగ్గర నీ ప్లాన్ ఏమిటి?" డౌట్ గా అడిగాడు జనార్ధన్. "పద వెళుతు మాట్లాడుకుందాము." అని తన మనుషుల వైపు చూసి "ఒరేయ్ చంటి జూకి వెళదాము బయల్దేరండి." అని చెప్పాడు మిచల్. "సరే భయ్యా!" అని సంతోషంగా మిగతా వాళ్లతో కలిసి వెళుతూ "కొత్త కొత్త జంతువులు వచ్చాయంట!" అని సంబరపడ్డాడు చంటి. "ఓ.. సంతోషా పడిపోకు భయ్యా జూలో ఏదో మర్డర్ ప్లాన్ చేశాడు దానికోసం వెళుతున్నాము." అని చెప్పాడు రఫీ. "అవునా? జూలో మర్డర్ ప్లాన్ ఏమిటిరా..!" అని టెన్షన్ గా చూస్తూ 'ఏదైనా తేడా జరిగితే జంతువుల చేతిలో మనం మర్డర్ అయిపోతాము.' అని అనుకుంటూ జీప్ ఎక్కడు చంటి. కార్ లో జనార్ధన్ తో కలిసి వెళుతూ, "జూలో కొంతమంది స్టాప్ తో మాట్లాడాను లోపల రెండు పెద్ద పులులు మంచి కోపం మీద ఉన్నాయంట!' ఆ మురళీ జోషి పెళ్ళాం వాటి దగ్గరికి వెళ్ళగానే దానిని బయటకు వదులుతాడు." అని చెప్పాడు మిచల్. "ఆ పెద్దపులి కరెక్ట్ గా మురళీ జోషి పెళ్ళాం మీద పడి తినడానికి వాటి చెవులో నువ్వు ఏమైనా చెప్పావ ఏంటి?" అని డౌట్ గా అడిగాడు జనార్ధన్ డ్రైవింగ్ చేస్తూ కారు బాక్స్ లో నుంచి బ్లడ్ ప్యాకెట్ తీసి చూపించి "ఆ టైంలో దానిమీద ఇది పోసాము అంటే చాలు, ఆ రెండు పెద్ద పుల్లు కరెక్ట్ గా వచ్చి దానిని పట్టుకుంటాయి, చావు వాటి ఖాతాలోకి వెళ్ళిపోతుంది." అని క్రూరంగా చూస్తూ అన్నాడు మిచల్. "ఓరి నీ ఐడియా!" అని టెన్షన్ గా చూస్తూ "ఏదైనా తేడా జరిగితే ఆ పెద్ద పులలా దెబ్బకి అందరూ చస్తారు." అని కంగారుగా చెప్పాడు జనార్ధన్. "టెన్షన్ పడకు అన్న! జూ స్టాఫ్ అక్కడ రెడీ గానే ఉంటారు వాళ్లకి ఇవన్నీ మామూలే!" అని చెప్పాడు మిచల్. "ఒకవేళ ఆ ప్లాన్ మిస్ అయితే!" డౌట్ గా అడిగాడు జనార్ధన్. "నా దగ్గర ప్లాన్ బి ఉంది అది చెప్పను నువ్వు భయపడతావు అక్కడికి వెళ్ళిన తర్వాత చేసి చూపిస్తాను, నిన్ను ప్రాణాలతో మీ దేశానికి పంపుతాను లే కంగారు పడకు." అని నవ్వుతూ అన్నాడు మిచల్. "మంచిది." అని చెప్పి'ఆ లాయర్ అనుమానం రాకుండా చంపమంటే వీడు మరీ క్రూరంగా తయారయ్యాడు.' అని సీట్లో సర్దుకుంటూ కూర్చుంటూ మిచల్ వైపు చూసి అనుకున్నాడు జనార్ధన్. *********************** ఆదే సమయంలో ఇంటి దగ్గర రెడీ అవుతూ "ఆ జూ సూపర్డెంట్ నా ఫ్రెండ్ వస్తున్నామని కాల్ చేశాను, జూకి కొత్త జంతువులు వచ్చి చాలా కాలం అయింది అయినా మేము ఏ పాంప్లెట్లు కొట్టించలేదు అని చెబుతున్నాడు, మరి వీళ్ళకి పాంప్లెట్లు ఎలా వచ్చాయి?" అని డౌట్ గా అడిగాడు సందీప్. "నాకు మాత్రం ఏం తెలుసు! ఇప్పుడు మీరు ప్రోగ్రాం క్యాన్సిల్ అని చెబితే మీ అమ్మాయిని ఊరుకో పెట్టడం నావల్ల కాదు." అని రెండు చేతులు పైకి ఎత్తింది వసుంధర. "లాయర్ గారికి వల్లే కాకపోతే కష్టం వెళదాములే!" అని నవ్వుతూ అన్నాడు సందీప్. గెస్ట్ హౌస్ లో ఉన్న సుమతి వాళ్ళ దగ్గరికి వచ్చి "అందరూ రెడీ అయ్యారా? త్వరగా పదండి వెళదాము." అని అభిర్ వైపు చూసి "నీకు జంతువులు అంటే చాలా ఇష్టం కదా! అక్కడ చాలా ఉంటాయి వాడితో నువ్వు ఎంత సేపు కావాలి అంటే అంతసేపు మాట్లాడుకోవచ్చు!" అని నవ్వుతూ చెప్పింది నీలమ్. "ఆ జూ ఆ జంతువుల ఇల్లు కాదు, నాలానే అవి కూడా జైల్లో ఉన్నాయి అక్కడ అవి సంతోషంగా ఉండవు బాధగా ఉంటాయి మనం వాటిని ఓదార్చాలి అంతేకానీ చూసి నవ్వుకోకూడదు." అని చెప్పాడు అభిర్. "నువ్వు చెప్పింది కూడా కరెక్టే! కానీ జంతువులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అడవిలో ఉండడం కన్నా జూలో ఉండడమే సేఫ్!" అని చెప్పింది నీలమ్. "నిజమే! ఇక్కడ మనిషే బతకలేకపోతున్నాడు ఇంకా జంతువులేం బతుకుతాయి." అంది గీత. "అభిర్! ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నింటిలోంచి బయటికి వచ్చావు కదా, పాత విషయాలన్నీ మర్చిపోయి కాస్త ఫ్రీగా ఉండు, నీకు దేంట్లో టాలెంట్ ఉందో దాంతో న్యూ లైఫ్ స్టార్ట్ చెయ్!" అని చెప్పింది నీలమ్. "సరే! అని స్మైల్ ఇచ్చి "ఇంక బయలుదేరుదామా?" అని అడిగాడు అభిర్. "అబ్బో... నీకు నవ్వడం కూడా వచ్చా!" అని ఇంట్లో నుంచి బయటకు వస్తున్న రోషిని వాళ్ళని చూసి కార్ ఎక్కి స్టార్ట్ చేసింది నీలమ్. కాసేపటికి రెండు కార్లలో జూ దగ్గరికి వెళ్లి అక్కడ వెయిట్ చేస్తున్న మిత్రని చూసి "హాయ్!" అని చెప్పింది సుమతి. కారులో నుంచి దిగుతూ మిత్ర వైపు డౌట్ గా చూసి "ఎవరి ఈ అమ్మాయి?" అని అడిగింది వసుంధర. "తన పేరు మిత్ర నా ఫ్రెండ్! డిటెక్టివ్ గా చేస్తుంది వాడి పేరు చాక్లెట్ తన అసిస్టెంట్!" అని పరిచయం చేసింది నీలమ్. "హాయ్ నీ పేరు భలే ఉంది చాక్లెట్! నేను రోజు తింటాను." అని చెప్పింది రోషిని. ఆ మాటకి నవ్వుతూ అందరూ కలిసి జూన్ లోపలకి వెళ్లారు. సందీప్ ని చూసి దగ్గరికి వచ్చి "హాయ్!" అని షేక్ హ్యాండ్ ఇచ్చి "నేను సూపర్డెంట్ గా వచ్చిన దగ్గర్నుంచి పిల్లల్ని తీసుకురమ్మని చెబుతున్నాను నీకు ఇప్పటికి కుదిరింది." అని వసుంధర వైపు చూసి "నమస్తే మేడం! నా పేరు రుషి!" అని పరిచయం చేసుకున్నాడు. "నమస్తే అండి." అని మర్యాదగా పలకరించి రోషిని, ప్రణీత లతో కలిసి లోపలికి వెళ్ళింది వసుంధర. ఋషికి నీలమ్ ని చూపిస్తూ "తను నా సిస్టర్ వాళ్ళ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్!" అని పరిచయం చేశాడు సందీప్. "ఓకే! పదండి మీతో పాటు మా సెక్యూరిటీ గార్డు వస్తాడు." అని చెప్పి పక్కకు తిరిగి "మస్తాన్! సార్ వాళ్లకి దగ్గర ఉండి అన్ని చూపించండి." అని చెప్పాడు రుషి. "ఓకే సార్!" అని సందీప్ వాళ్ళతో పాటు వెనకాలే వెళ్ళాడు మస్తాన్. జూలో దూరం నుంచి అభిర్ వాళ్లు రావడం చూసి "పెద్దపులికి ఆహారం అవ్వడానికి గొర్రెలు వచ్చేయ్!" అని మనసులో నవ్వుకున్నాడు మిచల్. అక్కడ ఉన్న జంతువుల్ని చూపిస్తూ "మేడం! ఈ జూకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడికి రోజు ఒక పెద్ద గరుడ పక్షి వస్తుంది ఇక్కడ ఉన్న జంతువులని చూసి మళ్లీ వెళ్ళిపోతుంది." అని చెప్పాడు మస్తాన్. "నిజమా? చాలా ఆశ్చర్యంగా ఉంది." అంది వసుంధర. "ఈరోజు అది వచ్చే టైం అయింది మేడం! అంత పెద్ద పక్షిని మీరు ఎప్పుడు చూసి ఉండరు, అలాంటి పక్షి మన దేశంలో ఏ జూలో కూడా లేదు." అని చెప్పాడు మస్తాన్. "ఇప్పుడు వస్తే బాగుండు సరదాగా అందరం చూడొచ్చు!" అన్నాడు చాక్లెట్. "ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్లి పోతుందో ఎవ్వరికి తెలియదు, ఇక్కడ జంతువులు ఆ పక్షిని ఒకరోజు చూడకపోతే ఆహారం కూడా ముట్టుకోవు." అని చెప్పాడు మస్తాన్. "చాలా విచిత్రంగా ఉంది. ఈ న్యూస్ కచ్చితంగా కాలమ్స్ లో రాస్తాను." అని చెప్పింది నీలమ్. ఆ మాట విని అక్కడ ఉన్న జంతువుల వైపు చూస్తూ "ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది.?" అని అడిగాడు అభిర్. "ఈ జంతువులని వేరువేరు జూలలో, సంరక్షణ కేంద్రాలలో ఉండేవి సార్! ఈమధ్య ఈ పెద్ద జూ కి పంపించారు." అని అక్కడ ఉన్న జంతువులు మొత్తం గట్టిగా అరవడం చూసి "ఈ రోజు అన్ని ఇలా ఎందుకు అరుస్తున్నాయో అర్థం కావడం లేదు." అని అయోమయంగా చూస్తూ అన్నాడు మస్తాన్. అంతలో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న ఏనుగులు చూసి "మస్తాన్! ఆ ఏనుగుని కట్టలేదా ఏంటి? మనవైపే పరిగెత్తుకుంటూ వస్తుంది." అని కంగారుగా అన్నాడు సందీప్. "లేదు సార్! ఇక్కడ జంతువులన్నీ కట్టేసి ఉంటాయి." అని అక్కడికి గట్టిగా అరుస్తూ వేగంగా వస్తున్న ఏనుగు ని చూసి కంగారుగా వెళ్లి సైరన్ ఆన్ చేసి సెక్యూరిటీ ని అలెర్ట్ చేసాడు మస్తాన్. దూరంగా నుంచుని పక్కనే ఉన్న మిచల్ వైపు చూసి "ఏంటయ్యా? నువ్వు పెద్దపులి అన్నావు, అక్కడ ఏనుగు వస్తుంది." అని అనుమానంగా అడిగాడు జనార్ధన్. "మన మనిషి అనుమానం రాకుండా ఫస్టు ఏనుగుని వదిలి ఉంటాడు." అని చూస్తూ చెప్పాడు మిచల్. సెక్యూరిటీ వాళ్ళని తొండంతో లేపి గిరాటు వేస్తూ మీదకి వస్తున్న ఏనుగుని చూసి భయంతో ఒక పక్కకి వెళ్లారు అందరూ. "అభిర్ అక్కడే నుంచుని చూస్తున్నాడు." అని కంగారుగా చెప్పింది మిత్ర. "అవునా?" అని పక్కకి తిరిగి "అభిర్ నువ్వు కూడా ఇక్కడికి వచ్చాయ్!" అని గట్టిగా అరిచింది నీలమ్. దూరం నుంచిని రఫీ వైపు చూసి బ్లడ్ గీత మీద పోయమని సైగ చేసి, జూలో ఉన్న తన మనిషి వైపు చూసి పెద్దపులిని వదలమని సైగ చేశాడు మిచల్.
Yesterday, 05:44 PM
ఎపిసోడ్ 25
జూలో ఏనుగు అభిర్ వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసి బ్లడ్ ప్యాకెట్ కొట్టమని రఫీకి, పెద్దపులిని వదలమని జూలో మనిషికి సైగ చేశాడు మిచల్.
********************** జూలో పరిగెత్తుకుంటూ వస్తున్న ఏనుగులు చూసి "సార్! దానికి మదం ఎక్కినట్లుంది. అందుకునే ఈ జంతువులు అన్ని అరుస్తున్నాయి, మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం పదండి." అని కంగారుగా చెప్పాడు మస్తాన్. సెక్యూరిటీ వాళ్ళని తొండంతో గిరాటు వేయడం చూసి భయపడుతున్న సందీప్ వాళ్ళ వైపు తిరిగి "అక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి." అని చెప్పి ఏనుగు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అభిర్. ఏనుగు వైపు పరిగెడుతున్న అభిర్ ని చూసి "బాబు! దాని దగ్గరికి వెళ్ళకు ఆ ఏనుగుకి మదం ఎక్కింది." అని గట్టిగా అరిచాడు మస్తాన్. కింద పడ్డ సెక్యూరిటీ గార్డ్ వైపు కోపంగా చూస్తూ తొక్కడడానికి మీదకి వెళుతున్న ఏనుగు వైపు చూసి "ఆగు ఎందుకు గొడవ చేస్తున్నావు?" అని గట్టిగా అరిచాడు అభిర్. సెక్యూరిటీ గార్డ్ ని తొక్కడం ఆపి తన దగ్గరికి వస్తున్న అభిర్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ ఏనుగు. ఆ ఏనుగు దగ్గరకు వెళ్లి సమురుతు "ప్రశాంతంగా ఉండు." అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళ వైపు చూసి "దీనికి తినడానికి ఏమైనా తీసుకురండి." అని చెప్పాడు అభిర్. ప్రశాంతంగా ఉన్న ఏనుగు వైపు, దానిని నిదానంగా సమురుతున్న అభిర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఓకే సార్!" అని పరుగున వెళ్లాడు సెక్యూరిటీ గార్డ్. ఏనుగుని సముడుతూ వెనక్కి తిరిగి నీలమ్ వాళ్ళ వైపు చూసి "భయపడకండి ఇక్కడికి రండి. ఇది ఏమీ చెయ్యదు చాలా మంచిది." అని నవ్వుతూ చెప్పాడు అభిర్. అప్పటివరకు భయంకరంగా అరిచినా ఏనుగు అభిర్ చేయ్యి తగలగానే ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యంగా చూస్తూ పక్కకు తిరిగి సందీప్ వైపు చూసి "సార్! ఆ బాబు ఎవరు?" అని అనుమానంగా అడిగాడు మస్తాన్. "జంతువుల మనసు అర్థం చేసుకునే మనిషి!" అని నవ్వుతూ ముందుకు వెళ్ళింది నీలమ్. సెక్యూరిటీ గార్డ్ తీసుకువచ్చిన ఫుడ్ ఏనుగు కి పెడుతూ వసుంధర చేతిలో ఉన్న రోషిని వైపు చూసి నవ్వుతూ చేతికి ఇచ్చి "దాని నోట్లో పెట్టు!" అని చెప్పాడు అభిర్. ఆ మాట విని భయంగా చూస్తూ "వద్దులే అభిర్! జాగ్రత్తగా కావాలి." అని కంగారుగా అంది వసుంధర. "మేడం! ఈ జంతువులు కూడా మనలాంటివే, వీటికీ మాటరాదు కానీ మనసు ఉంటుంది." అని ఏనుగు వైపు చూసి "అందరికీ క్షమాపణ చెప్పు నిన్ను చూసి భయపడిపోయారు." అని చెప్పాడు అభిర్. ఆ మాట విని తొండం ఎత్తి చిన్నగా అరిచింది ఆ ఏనుగు. అది చూసి "హై భలే భలే..! ఆ ఏనుగు అభిర్ అన్న మాట వింటుంది." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు చాక్లెట్. "ఏ జంతువు అయినా ప్రేమతో చెబితే ఎవరి మాటైనా వింటుంది అందరూ దానికి ఫుడ్ పెట్టండి." అని చెప్పాడు అభిర్. అంతలో అక్కడికి మత్తు ఇంజక్షన్స్ తీసుకుని హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రశాంతంగా ఉన్న ఏనుగు వైపు చూసి "ఓ మై గాడ్! నేను చాలా కంగారు పడిపోయాను." అని చెప్పాడు రుషి. "సార్! ఆ బాబు, ఏనుగుని ఒక్క మాటతో ఆపారు." అని అభిర్ వైపు చూపించాడు మస్తాన్. "అవునా?" అని అభిర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఈ ఏనుగుకి కోపం వస్తే ఇక్కడ మావాటి వాళ్ళ మాట కూడా వినదు, నీ మాట విని ఇంత ప్రశాంతంగా ఎలా ఉంది?" అని అడిగాడు రుషి. "ఇకనుంచి ఈ ఏనుగుకి కోపం రాదు, ప్రశాంతంగా ఉంటుంది." అని ఏనుగు వైపు చూసి "అవును కదా!" అని అడిగాడు అభిర్. ఆ మాటకి తల ఊపుతూ ఉంది ఆ ఏనుగు. "రియల్లీ గ్రేట్! ఏ జంతువు కూడా తనని పెంచిన వాళ్ళతో తప్పితే ఎవరితో ఇంత స్నేహంగా ఉండదు." అని చెప్పాడు రుషి. దూరంనుంచి జరిగేది చూస్తూ మిచల్ వైపు తిరిగి "నువ్వేమో ఏదో చెప్పావు, ఆ అభిర్ గాడు అక్కడ మనకి సర్కస్ చూపిస్తున్నాడు. ఈసారైనా నీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా? మళ్ళీ ఫెయిల్ అవుతుందా?" అని అడిగాడు జనార్ధన్. "నా ప్లాన్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు." అని కోపంగా జూలో ఉన్న తను మనిషి వైపు చూస్తూ 'వదులు!' అని సైగ చేశాడు మిచల్. దూరంగా నుంచి మిచల్ చేసినా సైగ చూసి రెండు పెద్ద పులులు ఉన్న బోన్ పైకి ఎక్కి డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న గోడదూకి వేరే వైపుకి వెళ్ళిపోయాడు జూలో మనిషి. అది చూసి నవ్వుతూ జనార్ధన్ వైపు చూసి "పద ఆ బోన్ పైకి వెళదాము, ఒకవేళ ఆ పెద్ద పులులు ఇటువైపు వచ్చిన మనం అందము." అని చెప్పి పైకి ఎక్కి దూరంగా ఉన్న తన మనుషుల వైపు చూసి వాళ్ళని కూడా పైకి ఎక్కమని సైగ చేశాడు మిచల్. "ఒరేయ్! బాస్ మనల్ని కూడా పైకి ఎక్కమని సైగ చేశారు, అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది త్వరగ పదండి." అని కంగారుగా చెప్పాడు చంటి. ఆ మాట విని హడావుడిగా అక్కడ ఉన్న బోన్ పైకి చెట్ల పైకి ఎక్కారు మిచల్ మనుషులు. బోను పైకి ఎక్కి మిచెల్ వైపు చూసి "రఫీ గాడు ఇంకా ఆ మురళి గాడి పెళ్ళాం మీద రక్తం ప్యాకెట్ కొట్టడం ఏంటి?" అని ఆత్రుతగా అడిగాడు జనార్ధన్. "అంత తొందర ఎందుకు? అప్పుడే కాదు, రెండు పులులు బోనులో నుంచి బయటకు వచ్చి వాటి గాండ్రింపు సౌండ్ వాడికి వినపడిన తర్వాత ఆ ప్యాకెట్ ఆ అమ్మాయి మీద కొడతాడు." అని చూస్తూ ఉన్నాడు మిచల్. కాసేపటికి బోన్ లో ఉన్న రెండు పెద్ద పులులు బయటకు వచ్చి భయంకరంగా గాండ్రిస్తూ ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లేయ్. ఆ అరుపు ఉలిక్కిపడ్డ వసుంధర వాళ్ళ వైపు చూసి "కంగారు పడకండి మేడం! అక్కడ ఉండే బోన్ లో రెండు పెద్ద పులులని పెట్టాము వాటికి కూడా అంతే చాలా కోపం ఎక్కువ!" అని చెప్పాడు మస్తాన్. "అవునా?" అని సౌండ్ వచ్చిన వైపు చూసి పరుగెత్తుకుంటూ వస్తున్న రెండు పెద్దపులను చూసి బిగిసుకుపోయింది మిత్ర. బిగుసుకుపోయి భయంగా చూస్తున్నా మిత్ర వైపు చూసి "ఏమైంది అక్క? అటువైపే చూస్తున్నావు." అని చూసి "బాబోయ్ పులులు! మన వైపే వస్తున్నాయి." అని గట్టిగా అరుస్తూ ప్యాంటు తడుపుకున్నాడు చాక్లెట్. ఆ అరుపు విని వెనక్కి తిరిగి భయంగా చూస్తూ "ఓ మై గాడ్! ఇవి బయటికి ఎలా వచ్చాయి?" అని తన దగ్గర ఉన్న మత్తు ఇంజక్షన్స్ తో షూట్ చేస్తూ ఉన్నాడు రుషి. రెండు పెద్ద పులులను చూసి భయంతో బిగిసుకుపోయి చూస్తూ ఉన్నారు నీలమ్, సుమతి వాళ్ళందరూ. అంతలో దూరం నుంచి బ్లడ్ ప్యాకెట్ ని గీత వైపుకి గురి చూసి విసిరి అక్కడి నుంచి పరిగెత్తాడు రఫీ. పులిని చూసి కంగారులో రోషిని ఎత్తుకొని పక్కకు జరిగిన వసుంధర తలకు తగిలింది ఆ బ్లడ్ ప్యాకెట్. వసుంధర, రోషిని మీద బ్లడ్ పడడం చూసి "ఎవరో కావాలని బ్లడ్ పోశారు." అని గట్టిగా అరిచింది నీలమ్. రక్తం వాసన రావడంతో అటువైపు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాయి రెండు పెద్ద పులులు. ఒంటి మీద ఉన్న రక్తం చూసుకుని "త్వరగా అందరూ ఇక్కడి నుంచి పారిపోండి. ఆ పులులు రక్తం వాసన చూసి మన వైపే వస్తున్నాయి." అని భయంగా చూస్తూ గట్టిగ అరిచింది వసుంధర. రుషి షూట్ చేస్తున్న మత్తు ఇంజక్షన్స్ తప్పించుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరింది ఒక పెద్ద పులి. అరుపులు విని ఏనుగుని గొలుసుతో కడుతు గాలిలో ఉన్న పెద్ద పులి వైపు, ఎదురుగా రక్తంతో తడిసిన వసుంధరని చూసి పరుగెత్తుకుంటూ వస్తూ 'రాజు! ఆగు నన్ను కాపాడిన అమ్మ!" అని గట్టిగా అరిచాడు అభిర్. అరుపు విని గాలిలో ఉన్న పెద్ద పులి తల తిప్పి చూసి పంజా వెనక్కి తీసుకుని కిందపడి లెగిసి అభిర్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వెనకాల పరిగెత్తుకుంటూ వస్తునన్న ఇంకొక పెద్ద పులిని చూసి "షేర్!" అని గట్టిగా అరిచాడు అభిర్. ఆ అరుపు విని ఆ పెద్ద పులి కూడా తల తిప్పి చూసి అభిర్ వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పెద్దపులి తన మీదకి దూకుతుంది అనుకుని రోషినిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకొని అరుస్తున్న వసుంధర దగ్గరికి వెళ్లి "వదిన ఏమి అవ్వలేదు ఒక్కసారి కళ్ళు తెరిచి అభిర్ వైపు చూడు." అని ఏడుస్తూ చెప్పింది నీలమ్. ఆ మాట విని కళ్ళు తెరిచి భయంగా చూస్తూ అభిర్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళుతున్న పెద్ద పులులను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది వసుంధర. సందీప్ దగ్గరికి వచ్చి కంగారుగా చూస్తూ "అసలు ఎవరతను? ఆ పులులను పేర్లు పెట్టి పిలుస్తున్నాడు." అని అనుమానంగా అడిగాడు రుషి. "అభిర్ గురించి మాకు కూడా తెలియదు." అని చెప్పాడు సందీప్. వేగంగా అభిర్ దగ్గరికి వెళ్లి కింద పడేసి నాకుతు ఉన్నాయి రెండు పెద్ద పులులు. అది చూసి "ఆ రెండు టైగర్స్ అభిర్ అంకుల్ ఫ్రెండ్స్ అనుకుంట!" అని మొహాన ఉన్న బ్లడ్ తుడుచుకుంటూ చెప్పింది రోషిని. ఫాంట్ తడుపుకున్న చాక్లెట్ ని గట్టిగా పట్టుకుని "ఒరేయ్! ఈ అభిర్ కొంపతీసి టార్జానా ఏంటి?" అని భయంగా చూస్తూ అడిగింది మిత్ర. వణుకుతూ "చూస్తుంటే అలాగే ఉంది అక్క! నాకు ఇంకా ఒకటి ఆగలేదు." అని చిటికెన వేలు చూపిస్తూ ఏడుస్తూ అన్నాడు చాక్లెట్. "అసలు! అభిర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ జంతువులు తనని ప్రేమగా ఎందుకు చూస్తున్నాయి? వాటి పేర్లు అభిర్ కి ఎలా తెలుసు?" అని ఆశ్చర్యంగా చూస్తూ అంది నీలమ్. అంతలో గట్టిగా అరుస్తూ వేగంగా ఎగురుతూ నీలమ్ వాళ్ళ ముందు వాలింది భారీ గరుడ పక్షి. తమ ముందు వాలిన పక్షి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అందరూ. పెద్ద పులుల మీద పడుకుని పక్షిని చూసి "సింబా!" అని గట్టిగా అరిచాడు అభిర్. ఆ మాట విని వేగంగా అభిర్ దగ్గరకు వెళ్ళింది గరుడ పక్షి. అది చూసి "ఈ జంతువులకి ఆ బాబుకి కచ్చితంగా ఏదో సంబంధం ఉంది." అని చెప్పాడు మస్తాన్. బోన్ పైనుంచి జరిగేదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు మిచల్, జనార్ధన్ లు.
Yesterday, 05:45 PM
ఎపిసోడ్ 26
జూలో ఎటాక్ చేయడానికి వచ్చిన పెద్దపులులు, అక్కడికి వచ్చిన గరుడ పక్షి అభిర్ దగ్గరకి వెళ్లడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అందరూ. ********************** జూలో జరిగేది ఆశ్చర్యంగా చూస్తూ "ఈ అభిర్ గాడు నా ప్లాన్ మొత్తం పాడు చేసాడు, అసలు ఆ జంతువులు వీడి మాట ఎందుకు వింటున్నాయి?" అని డౌట్ గా అన్నాడు మిచల్. "ఆ విషయం గురించి తర్వాత తెలుసుకోవచ్చు, ముందు నీ ప్లాన్ బి సంగతి చూడు, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అంటే ముకుల్ గారి ప్లాన్ సి లో మనిద్దరం ఉంటాము." అని కంగారుగా చెప్పాడు జనార్ధన్. "ఈ జూలో 14 హైనాలు ఉన్నాయి, అవి గుంపుగా ఉంటే పెద్ద పులిని కూడా చంపేస్తాయి, వాటికి మనిషి రక్తం అంటే చాలా ఇష్టం!" అని ఫోన్ తీసి కాల్ చేసి "ఓపెన్ చెయ్!" అని చెప్పాడు మిచల్. "ఓకే సార్!" అని చెప్పి హైనాలు ఉన్న బోన్ ఓపెన్ చేసాడు ఆ వ్యక్తి. తన దగ్గరికి వచ్చిన గరుడ పక్షి వైపు ప్రేమగా చూస్తూ "నా కోసం వెతుకుతూ వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటున్నావా?" అని అడిగాడు అభిర్. ఆ మాట విని అభిర్ ని రెండు రెక్కలతో గట్టిగా హత్తుకుని గాల్లోకి ఎగిరి ఆనందంగా చక్కర్లు కొడుతూ ఉంది గరుడ పక్షి. అంతలో హైనాల అరుపు వినిపించి రాజు, షేర్ లు గట్టిగా గర్జించాయి. పెద్ద పులుల అరుపు విని "వాటికి మళ్లీ ఏమైంది?" అని అనుమానంగా చూస్తూ అన్నాడు మస్తాన్. జూలో ఉన్న జంతువులు మొత్తం అరుస్తూ ఉండడం చూసి "మళ్లీ ఎక్కడో బోన్ తెరుచుకుంది ఏవో జంతువులు బయటికి వస్తున్నాయి, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు." అని అనుమానంగా చూస్తూ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని ఎలర్ట్ చేశాడు రుషి. హడావిడిగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి "సార్! హైనాలా బోను తెరుచుకుంది అవి మొత్తం బయటికి వచ్చాయి." అని కంగారుగా చెప్పాడు ఒక సెక్యూరిటీగా గార్డ్. "అవునా?" అని భయంగా సందీప్ వాళ్ళ వైపు చూసి "లోపల హైనాలు చాలా ఉన్నాయి, అవి బయటకు వచ్చాయంటే ఆపడం ఎవరి వల్ల కాదు మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము పదండి." అని కంగారుగా చెప్పాడు రుషి. పెద్దపులులు రెండు అరుస్తూ ఉండడం చూసి అనుమానం వచ్చి "మన వాళ్ళ దగ్గరికి ఏ జంతువు రాకూడదు." అని రాజు, షేర్ లా వైపు చూసి చెప్పి, పరిగెత్తుకుంటూ వసుంధర వాళ్ళ దగ్గరికి వచ్చాడు అభిర్. పరుగెత్తుకుంటూ వస్తున్న అభిర్ వైపు చూసి "హైనాలు తప్పించుకున్నాయంట!" అని కంగారుగా చెప్పింది నీలమ్. ఆ మాట విని వసుంధర, రోషిని మీద ఉన్న రక్తం చూసి "ఎవరో క్రూరమృగాలకి మిమ్మల్ని ఆహారంగా వేయాలని చూస్తున్నారు. నేను ఉండగా అది జరగదు." అని ఆకాశం వైపు చూసి సింబా అని గట్టిగా అరిచాడు అభిర్. ఆ మాట విని గాలిలో వేగంగా వస్తూ తన కాళ్లతో ఒక కర్ర తీసుకువచ్చి అభిర్ కి ఇచ్చాడు సింబా. అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న హైనాలని చూసి భయంతో బిగిసుకుపోయారు అందరు. తన చేతిలో ఉన్న కర్రను గాలిలో తిప్పుతూ వింతగా శబ్దాలు చేస్తూ, ఎదురుగా వచ్చి ఎర్రటికళ్ళతో కసిగా చూస్తున్న హైనాల కళ్ళలోకి చూస్తూ ముందుకు వెళ్లాడు అభిర్. కర్రని గిరగిరా తిప్పుతూ ముందుకు వెళుతున్న అభిర్ ని చూసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయని హైనాలా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు రుషి. కసిగా చూస్తూ ముందుకు దూకినా ఒక హైనా మీదకి రావడంతో కర్రతో గట్టిగా దెబ్బ కొట్టి కింద పడ్డ దాని మీద కాలు పెట్టి కోపంగా ఎదురుగా ఉన్న మిగతా హైనాలా వైపు చూసాడు అభిర్. అభిర్ వైపు చూసి ఎత్తిన తోకలు కిందకు దింపి వెనక్కి పరిగెత్తి బోన్ లోకి వెళ్లాయి హైనాలు. అభిర్ తన కాలు తీయడంతో అక్కడ ఉన్న హైనా కూడా బోన్ వైపు పరుగు తీసింది. బోన్ మీద నుంచి అభిర్ వైపు చూస్తూ "అసలు ఎవరు వీడు? ఇదంతా వీడికి ఎలా సాధ్యమైంది." అని ఆశర్యంగా చూస్తూ ఉన్నాడు మిచల్. అంతలో దూరంగా బోను మీద ఉన్న మిచల్ ని చూసి "అభిర్! మేడం వాళ్ళ మీద బ్లడ్ ప్యాకెట్ కొట్టింది వాళ్లే!" అని గట్టిగా అరిచింది మిత్ర. ఆ మాటకి వెనక్కి తిరిగి బోన్ మీద నుంచున్న వాళ్ళవైపు కోపంగా చూస్తూ "షేర్!" అని పిలిచి మిచల్ వాళ్ల వైపు వెళ్ళాడు అభిర్. రెండు పెద్ద పులులు, మరొక పెద్దపులి లాగా అభిర్ తమ వైపే రావడం చూసి కంగారులో జనార్ధన్ ని తోసేసి అక్కడినుంచి వెనక్కి వెళ్లి గోడదుకి పారిపోయాడు మిచల్. కింద పడ్డ జనార్ధనని చూసి వేగంగా వెళ్లి నోటితో పట్టుకుని అభిర్ దగ్గరికి తీసుకువచ్చాడు షేర్. పెద్దపులి నోట్లో భయంతో వణికిపోతున్న జనార్ధన్ ని చూసి అబీర్ వైపు చూస్తూ "బాబు అతన్ని కాపాడు." అని చెప్పాడు మస్తాన్. "నా తల్లి లాంటి వారిని చంపాలని చూసినవాడు బతకడం నాకు ఇష్టం లేదు." అని కోపంగా చెప్పాడు అభిర్. ఆ మాట అభిర్ అనటంతోనే పరుగెత్తుకుంటూ వెళ్లి షేర్ నోట్లో ఉన్న జనార్ధన్ తలని నోటితో పీకి అవతల పరేసి కోపంతో చెవుల దద్దరిల్లిపోయినట్లు గర్జించాడు రాజు. జనార్దన్ చావడం చూసి మనసులో సంతోష పడి కన్నీళ్లు తుడుచుకుంది గీత. రెండు పెద్దపులులను బోన్లోకి పంపించి "త్వరలోనే మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళతాను." అని చెప్పి ఆకాశం వైపు చూసి "సింబా! యుద్ధం మొదలైంది అభిర్ రంగంలోకి దిగాడు అని మనవాళ్ళకి చెప్పు!" అన్నాడు అభిర్. ఆ మాట విని గట్టిగా శబ్దం చేసుకుంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు సింబా. తమ దగ్గరికి వస్తున్న అభిర్ ని చూసి అడగడానికి అందరూ రెడీ అవ్వడంతో ముందుకు వచ్చి "ఇంటికి వెళదామా? చీకటి పడుతుంది." అని అడిగింది వసుంధర. ఆ మాట విని వసుంధర వైపు ఆశ్చర్యంగా చూస్తూ బయటికి వెళ్లే రూట్లో నడిచారు అందరు. అభిర్ దగ్గరకు వచ్చి "థాంక్యూ సో మచ్! నీవల్ల ఈరోజు జూలో ఈ ఎటువంటి ప్రమాదం జరగలేదు." అని చెప్పాడు రుషి. "ఆ రెండు బోన్ గేట్లు ఎలా తెరుచుకున్నాయో తెలుసుకుని వాళ్ళని ఇక్కడనుంచి పంపించండి. జంతువులన్నిటినీ జాగ్రత్తగా చూసుకోండి. త్వరలోనే నాతో పాటు తీసుకువెళతాను." అని చెప్పి అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్ళాడు అభిర్. ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు రుషి. అభిర్ వెనకాలే వెళుతూ "జంతువులన్నిటిని తనతో పాటు తీసుకువెళతాడా! ఇంతకీ ఈ టార్జాన్ గారు ఎక్కడి నుంచి వచ్చారో!" అని మనసులో అనుకుంది మిత్ర. పక్కనే నడుస్తూ "అక్క! వెళ్లేటప్పుడు ప్యాంటు కొనుక్కోవాలి చలి పెడుతుంది." అన్నాడు చాక్లెట్. "సరే రా..! నువ్వే ధైర్యవంతుడివి నీకు కింద నుంచి అదైనా వచ్చింది. నాకు నోట్లో నుంచి మాటే రాలేదు." అని చెప్పి నీలమ్ దగ్గరకు వెళ్లి "రేపు ఇంటికి వచ్చి కలుస్తాను బాయ్!" అని చెప్పింది మిత్ర. "ఓకే! అనవసరంగా నిన్ను ఇక్కడికి పిలిచి ప్రమాదంలో ఇరికించాను సారీ!" అని చెప్పింది నీలమ్. "ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లేకపోతే ఇటువంటి గొప్ప సిచువేషన్ మిస్ అయిపోయే దానిని!" అని చెప్పింది మిత్ర. "అక్క! అసలు ఇంతకీ అభిర్ అన్న ఎవరు? ఆ జంతువులు అతని మాట ఎందుకు విన్నాయి?" అని అనుమానంగా అడిగాడు చాక్లెట్. "ఆ విషయం అభిర్ నోట్లో నుంచి ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నము, నాకు తెలియగానే ఫస్ట్ నీతోనే చెబుతాను." అని నవ్వుతూ చెప్పింది నీలమ్. "సరే!" అని కార్లో ఉన్న సుమతి వాళ్ళ వైపు చూసి బాయ్ చెప్పి బైక్ మీద చాక్లెట్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళింది మిత్ర. అక్కడి నుంచి కార్ లో ఇంటికి వెళుతూ డ్రైవ్ చేస్తూ వసుంధర వైపు చూసి "అభిర్ ని అలా ఎలా చేసావు అని అందరు అడుగుదాము అనుకున్నారు, కానీ ఇంతలో నువ్వు అడగకుండా ఆపేసావు ఎందుకు?" అని డౌట్ గా అడిగాడు సందీప్. "అభిర్ నన్ను తల్లి లాగా చూస్తున్నాడు, తను ఎవరో తన గతం ఏమిటో చెప్పాలి అనిపించినప్పుడు తప్పకుండా చెబుతాడు అప్పటివరకు ఎవరు అడగకండి." అని చెప్పింది వసుంధర. "ఓకే!" అని చిన్న స్మైల్ ఇచ్చాడు సందీప్. కాసేపటికి ఇంటికి వెళ్లడంతో సీరియస్ గా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు అభిర్. ************************ ఉదయం ఇంటి ముందు ఆటో ఆగడం చూసి గబగబా వెళ్లి బ్యాగ్ తీసుకుని "బామ్మ గారు! వస్తున్నానని ఒక ఫోన్ చేస్తే స్టేషన్ కి కార్ వేసుకుని ఎవరో ఒకరు వచ్చేవాళ్ళం కదా!" అని అడిగింది నీలమ్. "నా గురించి ఎవరు శ్రమ పడకూడదు." అని ఆటో వాడికి డబ్బులు ఇచ్చి ఇంట్లోకి వెళ్ళింది బామ్మ. బ్యాగ్ తీసుకుని వెళుతున్న నీలమ్ వైపు చూసి "ఎవరు ఆవిడా?" అని అడిగింది సుమతి. "మా వదిన వాళ్ళ నాయనమ్మ! మహారాష్ట్రలో ఉంటుంది ఫుల్ స్టిట్, చాదస్తం కూడా కొంచెం ఎక్కువే!" అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది నీలమ్. కాసేపటికి బయటకు వచ్చి పక్షులకు ఆహారం వేస్తున్న అభిర్ వైపు చూసి ఎవరు బాబునువ్వు? నీ పేరు ఏమిటి? " అని అడిగింది బామ్మ. అక్కడికి వస్తు "బామ్మ! అతని పేరు అభిర్! నాకు తెలిసిన మనిషే ఇక్కడే ఉంటున్నాడు." అని చెప్పింది వసుంధర. "అభిర్ అంటే గోవుల మంద కలవాడు అని అర్థం!" అని దగ్గరికి వెళ్లి చేతి మీద ఉన్న పచ్చబొట్టు చూసి "నీ అసలు పేరేమిటి?" అని అడిగింది బామ్మా. కాఫీ తాగుతూ అక్కడికి వచ్చి "బామ్మ! అతని అసలు పేరే అభిర్!" అని నవ్వుతూ చెప్పింది నీలమ్. "అభిర్ భుజం మీద ఉన్న ఈ పచ్చబొట్టు గురించి నేను కథలుగా విన్నాను," ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సైన్యంలో చరిత్రకు తెలియని ఒక దళం ఉంది అదే అభిర్ దళం వాళ్ల నాయకుడికి మాత్రమే ఈ పచ్చబొట్టు ఉంటుంది. శివాజీ మహారాజ్ గారి మరణం తర్వాత ఈ దళం కనుమరుగైపోయిందని చెబుతూ ఉంటారు నువ్వు ఆ వంశానికి చెందిన వాడివా? ఆ దళానికి నాయకుడువా? " అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది బామ్మ. ఆ మాట విని పక్షులకు ఆహారం వేస్తూ "అవును బామ్మగారు!" అని చెప్పాడు అభిర్. ఆ మాట విని షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు అందరూ.
Yesterday, 06:12 PM
ఇదేదో కథను మలుపు తిప్పే సంఘటణలా ఉంది!
క్రమం తప్పకుండా అప్డేట్లు ఇస్తే నీ అభిమానులు ప్రొత్శహిస్తారు శివసాయి బ్రో
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం (https://xossipy.com/thread-71346.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Yesterday, 06:35 PM
nice update
Yesterday, 06:43 PM
(Yesterday, 05:45 PM)SivaSai Wrote:
Yesterday, 07:52 PM
????? idhi real story na Guruji
Yesterday, 09:26 PM
wow nice updates bro
4 hours ago
(22-12-2025, 08:00 AM)SivaSai Wrote: ఎపిసోడ్ 2 |
|
« Next Oldest | Next Newest »
|