12-01-2026, 09:48 PM
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
Konchem E Story Ni Kuda Support Cheyandi Friends
Konchem E Story Ni Kuda Support Cheyandi Friends
|
పాణిగ్రహణం
|
|
12-01-2026, 09:48 PM
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
Konchem E Story Ni Kuda Support Cheyandi Friends
13-01-2026, 05:17 AM
Shivaji vamsham story' kadha prathi lipi lo vundhi bro
13-01-2026, 10:08 AM
Suspense eppudu vidutunda ani waiting bro!!!
13-01-2026, 02:07 PM
Update kosam waiting bro update please bro
13-01-2026, 05:07 PM
Part - 39
లలిత వెటకారానికి ఒళ్ళు మండుతున్న ఏమి మాట్లాడలేని పొజిషన్.. పైకి నవ్వుతూ అత్తయ్య గారు ఈరోజు ఎవరో గెస్ట్ అన్నారు ఎవరు అని అడుగుతుంది.
దానికి లలిత తెలీదమ్మా అబ్బాయి చాల ఇంపార్టెంట్ వ్యక్తి అని మాత్రమే చెప్పాడు. అయినా నీకెందుకు ఆ విషయాలు అని అడిగితే... ఇంపార్టెంట్ గెస్ట్ అన్నారు కదా.. నేను కూడా నీట్ గా రెడీ అవుదామని చెబుతుంది. దానికి మాధవి నవ్వుతూ నువ్వు ఎలా రెడీ అయిన ముసుగు తీయకూడదు కదా శిల్ప. అప్పుడే నిన్ను ఇంటి కోడలు ఎవ్వరికే పరిచయం చేయలేము. కాబట్టి నువ్వు ఎలా రెడీ అయిన ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి... ఎక్కువ ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకో సరేనా అని చెప్పి... వదినా ఈ చికెన్ ఫ్రై సంగతి చూడు అని చెబుతుంది. వదిన మరదలు వంక పళ్ళు నూరుకుంటూ చూసి... ఒక్కసారి విక్రమ్ తో నా లైఫ్ స్టార్ట్ అవ్వని అప్పుడు చెబుతాను ఒక్కొక్కళ్ళ పని. ఈ మాధవిని ముందు ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని మనసులో కుతంత్రాలు రచించుకుంటూ పైకి నవ్వుతూ అలాగే పిన్ని గారు అనే సాగదీస్తూ పని చేసుకుంటూ ఉంటుంది. దీనికి ఒళ్ళంతా గోరోజనమే కదా వదినా అని సైగ చేస్తుంది. అవునవును ఈరోజు ఏదో మంచి మూవీ ఉంది అంటున్నాడు అప్పుడు తెలుస్తుంది. దీని గోరోజనం అని వదిన మరదలు ఇద్దరు గుసగుసగా మాట్లాడుకుంటారు. వాళ్లు గుసగుసలు ఏమీ అర్థం కాక ఒకసారి ముసలి దాని వైపు నుంచి నరుక్కు వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ... అత్తయ్య గారు మామ్మగారికి జ్యూస్ పట్టుకెళ్ళి ఇవ్వనా అని అడుగుతుంది. దానికి లలిత గారు పైనుంచి కిందకి చూస్తూ ఏంటో... ఈరోజు నువ్వు మరీ అతిగా మర్యాదలు చేస్తున్నట్టు కనిపిస్తుంది అని అడుగుతారు. దానికి శిల్ప నవ్వుతూ అలాంటిదేమీ లేదు అత్తయ్య గారు... రోజు రోజుకి పనులు నేర్చుకుంటున్నాను కదా... అందుకే మర్యాదలు కూడా జాగ్రత్తగా చేద్దామని... తీసుకు వెళ్ళమంటారా అని అమాయకంగా అడుగుతుంది. నువ్వు పట్టుకెళ్తానంటే వద్దంటానా వెళ్ళు వెళ్ళు అని పంపిస్తారు. జ్యూస్ తీసుకుని ఇందిరా గారి దగ్గరికి వెళ్లి మా మామ్మగారు అని పిలుస్తుంది. రామాయణం చదువుతున్న ఇందిరా గారు శిల్ప వైపు చూసి ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు అనుకుని రామ్మ అని నవ్వుతారు. మీరు టిఫిన్ చేసి చాలాసేపు అయింది కదా జ్యూస్ తాగండి అని ఇస్తుంది. ఇది ఎందుకు నన్ను ఈ రోజు ఇలా కాక పడుతుంది. సరే చెప్తాను అనుకొని...అమ్మ కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఆ ఆయిల్ తో మసాజ్ చెయ్ తల్లి అని చెబుతారు. దానికి శిల్ప నేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నీకు సేవలు చేయడం అంటే ఇష్టం ఉండదు కదా...సర్లే వెళ్ళమ్మ నేను విక్రమ్ కి చెప్తే ఎవరైనా పురమాయిస్తాడు అని బాధగా మాట్లాడుతారు. దానికి శిల్ప అయ్యో ఈమాత్రం దానికి విక్రమ్ గారు దాకా ఎందుకు.. నేను నొక్కుతాను మామ్మగారు అని చెప్పి పడుకుంటారా రాస్తాను అని అడుగుతుంది. సరే అమ్మ అని చెప్పి పడుకుని కాళ్లు శిల్ప ఓళ్లో పెడతారు. శిల్ప ఇంకా ఏమీ చేయలేక ఆయిల్ రాస్తూ కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. ఒక గంట నొక్కించుకున్న తర్వాత చాల్లే ఇప్పటికి..కాళ్ళు నొప్పులు తగ్గినట్టు ఉన్నాయి. మళ్లీ అనిపిస్తే నీకు చెప్తాను తల్లి నేను కాసేపు పడుకుంటాను అని చెప్పి బయటికి పంపించేస్తుంది. ఛ.. ఎంతసేపు నొక్కినా బాగా చేశావన్న మాట మాత్రం ఈ ముసలిది అనడం లేదు. ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ కిచెన్‌లోకి వెళుతుంది. లలిత గారు శిల్ప వైపు కోపంగా చూసి ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు. ఇక్కడ పని తప్పించుకోవడానికి వేషాలు వేస్తున్నావా... గెస్ట్ వస్తున్నారు. పనుంది అని చెప్పాను కదా అని అరుస్తారు. దానికి శిల్ప మామ్మగారికి కాళ్లు నొక్కుతూ కూర్చున్నాను. అందుకే లేట్ అయింది. అయినా సర్వెంట్స్ ఉన్నారు కదా అత్తయ్య గారు అంటే.. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుర్రలోకి ఎక్కదా... వంట పని ఎప్పుడు ఇంటి ఇల్లాలే చేయాలి అని ఎన్నిసార్లు అత్తయ్య గారు చెప్పి ఉంటారు. విసుగ్గా ఏంటి వదిన.. అసలు ఈ అమ్మాయికి ఏమీ అర్థం కాదు. వీళ్ళ అమ్మ అసలు ఎలా పెంచింది. పెళ్లిచూపులు అప్పుడు మాత్రం మా అమ్మాయికి అన్ని పనులు వచ్చు అని వాయిగొడతారు. ఇప్పుడు చూస్తే మనం చెప్పిన పనిని చేయదు. తన సొంతంగానూ రాదు. అబద్ధాలు చెప్పి, మోసం చేసి మన ఇంటికి పంపించారు. ఛి ఛి... మన నివి చూడు అన్ని పనులు ఎంత బాగా చక్కబెడుతుంది అని రుసరసలాడుతూ ఉంటారు.. ఆ మాటలకే చాలా బాధ అనిపిస్తుంది. ఉక్రోషముతో మేమేమీ మోసం చేయలేదు అత్తయ్య గారు అని అంటుంది. అవునా నిజంగా మోసం చేయలేదా అని శిల్ప వైపు తిరిగి సూటిగా అడుగుతారు. ఆ మాటకి తడబడుతూ మేమేం మోసం చేసాము చెప్పండి అని అడుగుతుంది. ( ఇంకా వీళ్ళు చేసింది ఎవరికైనా తెలియదు అన్న భ్రమలో ఉన్నారు తల్లి కూతుర్లు ) నీ మాట తడబాటిలోనే తెలుస్తుంది శిల్ప మీరు మోసం చేశారో లేదో అన్నది. ఇప్పుడైనా నీతో మాట్లాడే అంత టైం మాకు లేదు అని చెప్పి వంటలో బిజీ అయిపోతారు. శిల్ప ఆ నిమిషానికి హమ్మయ్య అనుకుని మోసం చేసాము అంటున్నారు. కొంపతీసి పెళ్లికూతురు మారిందన్న విషయం తెలిసిపోయిందా ఏమిటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది . విక్రమ్ స్టడీ రూమ్ నుంచి కిందకు వచ్చి అమ్మ లంచ్ ప్రిపేర్ అయిపోయిందా నా ఫ్రెండ్ వచ్చే టైం అయింది అని చెబుతాడు. అయిపోయింది నాన్న నీ ఫ్రెండ్ రావడమే లేటు అని చెబుతారు శిల్ప ను కూడా రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి రమ్మని పంపిస్తారు. విక్రమ్ ఫోన్ కి మెసేజ్ వస్తుంది గెస్ట్ వచ్చాడు లోపలికి తీసుకు వస్తున్నాము అని.. ఓకే అని వెయిట్ చేస్తూ ఉంటాడు. సెక్యూరిటీ లోపలికి తీసుకువచ్చి వెళ్ళిపోతారు. విక్రమ ఆ గెస్ట్ కి ఎదురుగా వెళ్లి హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి తీసుకొచ్చి సోఫాలో కూర్చో పెడతాడు. హాయ్ సార్ మీరు మరీ ఇలా ఎదురొచ్చి రిసీవ్ చేసుకుంటూ ఉంటే చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. మీలాంటి గొప్ప వాళ్ళు మాలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయడమే ఎక్కువ... అదే కాకుండా దగ్గరుండి మరీ రిసీవ్ చేసుకుంటున్నారు అని చాలా అత్యుత్సాహం ని చూపిస్తాడు. దానికి విక్రమ్ నవ్వుతూ ఇందులో ఏముంది.. మేమే ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేసినప్పుడు, గెస్ట్ ని అంతే సాదరంగా రిసీవ్ చేసుకోవాలి కదా అని కూర్చోండి అని చెబుతాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు. పేరుపేరునా అందరిని పరిచయం చేస్తాడు. పెద్ద వారైనా ఇందిరాగారి కాళ్ళకి నమస్కారం చేసి కూర్చుంటాడు. విక్రమ్ నివి కి సైగ చేస్తాడు. ఎక్స్‌క్యూజ్‌మీ అని నివి శిల్ప దగ్గరికి వెళ్లి శిల్ప అని పిలుస్తుంది. శిల్ప నివి వైపు చూస్తూ వదిన అని పిలవాలి కదా.. శిల్ప అంటావేంటి అని కొంచెం కోపంగానే అడుగుతుంది. మీ దోషం పోయేదాకా అలా వరుసలు పెట్టి పిలువకూడదు కానీ.. గెస్ట్ వచ్చారు నిన్నే పరిచయం చేయాలంట రమ్మంటున్నారు అని చెబుతోంది. దానికే శిల్ప గర్వంగా నివి వైపు చూసి మూసుగువేసుకొని నివి వెనకాలే వెళుతుంది. శిల్ప హాల్ లోకి వచ్చి విక్రమ్ వైపు వెళ్లబోతుంది. వెంటనే లలిత గారు శిల్పా ఇటు రా అని పిలుస్తారు.. ఆ పేరుకి గెస్ట్ అనుకోకుండా శిల్ప వైపు చూస్తాడు. విక్రమ్ మాత్రం గెస్ట్ వైపే చూస్తూ ఉంటాడు. శిల్ప వెళ్లి లలిత పక్కన నిలబడుతుంది. అక్కడ కూర్చోవడానికి కూడా ఎగస్ట్రా ఇంకొక చైర్ కూడా ఉండదు. లలిత గారు గెస్ట్ వైపు తిరిగి తిను మాకు కావలసిన అమ్మాయి శిల్ప అని పరిచయం చేస్తారు. ఆ మాటకి శిల్ప చిరాకుగా లలిత గారిని చూస్తూ.. గెస్ట్ వైపు తిరిగి న.. మ...స్కా..రం అంటూ మాట నోటులోనే ఆగిపోతుంది. విక్రమ్ కన్నింగ్ నవ్వుకుంటూ డాడ్. ఇతని పేరు క్రిష్. మోడలింగ్ ఏజెన్సీ ఉంది ఫర్దర్ గా మన ప్రోడక్ట్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వీళ్లతోనే చేపిద్దాం అనుకుంటున్నాను అని చెబుతూ.. శిల్ప వైపు చూడమని సైగ చేస్తాడు. కళ్యాణ్,రమేష్ వారగా శిల్ప వైపు చూస్తారు. అప్పటికే శిల్ప వణుకుతూ ఉంటుంది. ఓహో ఇదేనా సినిమా అంటే అనుకొని అలాగే విక్రమ్. ఒకసారి వాళ్ళ కోడ్స్ తో వచ్చి కంపెనీలో కలవమని చెప్పు ఫైనల్ చేద్దాము అని చెబుతారు. మాధవి శిల్ప వైపు తిరిగి గెస్ట్ వచ్చి ఇంతసేపు అయింది కదా.. వెళ్లి జ్యూస్ తీసుకురా అని చెప్పి పంపిస్తారు. వెళుతున్న శిల్ప వైపే క్రిష్ చూస్తూ ఉంటాడు. ఏమైంది క్రిష్ అమ్మాయి వైపే అలా చూస్తున్నావు అని మాధవి అడిగితే... ఏమీ లేదు అంటీ.. ఈ పేరు విన్నట్టుంటే చూస్తున్నాను. అలాగే అవుట్ లుక్ చూస్తూ ఉంటే ఎక్కడో చూశాను అన్న ఫీలింగ్ వస్తుంది అంతే అని చెబుతాడు. అవునా తను మాకు కావలసిన వాళ్ళ అమ్మాయి. కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని చెబుతారు. దానికి మరి మూసుగు ఎందుకు వేసుకుంది అని అడిగితే.. ఫేస్ మీద కొద్దిగా ఎలర్జీ వచ్చింది అది ఎవరికి కనపడకుండా ఉండడానికి అలా వేసుకుంది అంతే అని చెబుతారు. అవునా అని వస్తున్న శిల్ప వైపే చూస్తూ ఉంటాడు. శిల్పకు అప్పటికే చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది. క్రిష్ నన్ను గుర్తుపట్టాడు అంటే.. ఇంక అంతే సంగతులు అనుకుంటూ ట్రై లో ఉన్న జ్యూస్ తో క్రిష్ కి ఎదురుగుండా నిలబడుతుంది.
13-01-2026, 05:14 PM
(This post was last modified: 13-01-2026, 05:15 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 40
శిల్ప జ్యూస్ తీసుకువచ్చి క్రిష్ ముందు నిలబడుతుంది. చేతులు వణుకుతూ ఉంటాయి. మాట్లాడితే ఎక్కడ తన గొంతు గుర్తుపడతాడు ఏమో అని సైలెంట్ గా ఇస్తుంది.
క్రిష్ అనుమానం గా చూస్తూ గ్లాస్ తీసుకోవడానికి చెయ్యి ముందుకు పెడతాడు. తొందరగా తీసుకుంటే వెళ్ళిపోవాలి అని శిల్ప ఒక పాదం ఎత్తుతుంది. క్రిష్ బ్యాక్ సైడ్ కి ఉన్నా స్టాండ్ ఫ్యాన్ ఆన్ అవుతుంది. ఆ ఫ్యాన్ గాలి శిల్ప ఫేస్ కి తగేలేలాగా సెట్ చేస్తారు. వినయ్ ఫ్యాన్ దగ్గర ఉండి శిల్ప ఫేస్ కి తగేలేలాగా చేస్తాడు. అంతే శిల్ప ఫేస్ మీద ఉన్నా ముసుగు ఎగిరిపోతుంది. చెయ్యి ముందుకు పెట్టిన క్రిష్ శిల్ప ఫేస్ చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యంగా శిల్పా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. దానికి శిల్పా టెన్షన్‌గా క్రిష్ వైపు విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. విక్రమ్ మాత్రం సూటిగా శిల్ప వైపే చూస్తూ ఉంటాడు. ఏం చెప్పాలో తెలియక చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. నిన్నే శిల్పా అడిగేది ఇక్కడున్నావు ఏంటి అని చెయ్యి పట్టుకుని కదుపుతాడు. లలిత వెంటనే నీకు శిల్ప తెలుసా బాబు అని అడుగుతుంది. నాకెందుకు తెలియదు ఆంటీ. తనకి మోడలింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కదా..అప్పటి నుంచి నాతో టచ్ లోనే ఉంది. రీసెంట్ గానే సెలెక్ట్ కూడా అయ్యింది. నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ కూడా ఉంది. ఏం శిల్పా చెప్పలేదా అని అడుగుతూ...నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటే సమాధానం చెప్పవేంటి అని మళ్ళీ అడుగుతాడు. దాంతో శిల్ప మనస్సులో అయిపోయింది ఈరోజు తో నా జీవితం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ధనుంజయ్ ఫ్యామిలీ కూడా లోపలికి ఎంటర్ అవుతారు. భార్గవి వెంటనే శిల్ప దగ్గరికి వెళ్లి అమ్మ శిల్ప అని పిలుస్తుంది. శిల్ప ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఫ్యామిలీ మొత్తం కనపడుతుంది. ఇక అరిపాదాల నుంచి నడి నెత్తి వరకు చెమట కారిపోతూ ఉంటుంది. మామ్ నువ్వేంటి ఇప్పుడు ఎక్కడ అని తడబడుతూ అడుగుతుంది. అదేంటి శిల్ప అలా తడబడుతున్నావు.. నువ్వు ముసుగు కూడా తీసేసావు. మీ అత్తయ్య గారు మన ఫ్యామిలీ మొత్తాన్ని లంచ్ కి ఇన్వైట్ చేశారు అందుకే వచ్చాము అని చెబుతారు. క్రిష్ ఎవరో అన్నది శిల్పకి తప్ప ధనుంజయ్ ఫ్యామిలీకి తెలియదు. అందుకే భార్గవి తన ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. సెలక్షన్స్ ఎప్పుడు జరిగాయి క్రిష్ అని లలిత అడుగుతుంది దానికి క్రిష్ చెప్పిన డేట్ వినగానే అంటే ఆరోజు మా విక్రమ్ పెళ్లి కదా అంతేనా అన్నయ్యగారు అని ధనుంజయ్ తిరిగి అడుగుతుంది. అవునమ్మా కానీ మీరు ఏమి అడుగుతున్నారు దేని గురించి అన్నది నాకేమీ అర్థం కావడం లేదు అని అయోమయంగా చెబుతారు. అప్పుడే కంగారు పడతారు ఎందుకు అన్నయ్యగారు కూర్చోండి అని.. ఈ అబ్బాయికి మీ శిల్ప బాగా తెలుసు అంట అని నొక్కి చెబుతుంది. ఆ మాట తీరికి ధనుంజయ్ కి ఇబ్బందిగా అనిపిస్తుంది. భార్గవి కోపంగా ఏంటండీ వదినగారు మీరు మాట్లాడే విధానం అంటే... ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు భార్గవి కూర్చోండి చెబుతాం కదా అని... ధనుంజయ్ వైపు తిరిగి మీ చిన్నమ్మాయికి మోడలింగ్ అంటే ఇష్టం ఆ విషయం మీకు తెలుసా అని అడుగుతారు. దానికి ధనుంజయ్ ఆశ్చర్యపోతూ భార్గవి వైపు చూస్తాడు. భార్గవి తడబడుతూ ఇదంతా అబద్ధం మా అమ్మాయి కాలేజ్, ఇల్లు తప్ప బయట ప్రపంచమే తెలియదు అని బొకాయిస్తుంది. క్రిష్ కి మాత్రం అంతా గందరగోళంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కానీ... సంథింగ్ ఫిషీ అని సైలెంట్ గా జరిగేది చూస్తూ ఉంటాడు. అంత కోపం వద్దు భార్గవి అని టీవీ ఆన్ చేస్తారు. అప్పటికే రికార్డ్ అయిన వీడియో కనెక్ట్ చేసి ఉంచుతారు. అది కరెక్ట్ గా విక్రమ్ పెళ్లి రోజు డేట్. అక్కడ శిల్ప థైస్ వరకు ఉన్న ఒక స్లీవ్ లెస్ డీప్ నెక్ ఫ్రాక్ వేసుకునే ఉంటుంది. అది చూడగానే ధనుంజయ్ అసహ్యంగా ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు. ఇక్కడ విక్రమ్ ఫ్యామిలీ లో ఉన్న జెంట్స్ కూడా తల పక్కకి తిప్పుకుంటారు. శిల్పా క్రిష్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. అలాగే క్రిష్ ఫ్రెండ్ తో కూడా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. సెలక్షన్స్ అయిపోయిన తర్వాత శిల్ప డ్రింక్ చేస్తూ క్రిష్ ఫ్రెండ్ తో రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అది చూడగానే ధనుంజయ్ కి తట్టుకోలేనంత కోపం వచ్చి స్పీడ్ గా లెగిసి శిల్ప చెంప మీద గట్టిగా కొడతాడు. ఆ ఫోర్స్ కి శిల్పా నేలని ముద్దాడుతుంది. వెంటనే భార్గవి ఏంటండీ మీరు అని వెళ్లి శిల్పని గట్టిగా పట్టుకుని బేబీ బేబీ అని పిలుస్తూ ఉంటుంది.. మామ్ అని భార్గవిని గట్టిగా హగ్ చేసుకుని భయంగా అందరినీ చూస్తూ ఉంటుంది. వెంటనే కళ్యాణ్ ధనుంజయ్ ముందుకు వెళ్లి ఇప్పుడు శిల్ప ని కొట్టడం కాదు. ఆరోజు పెళ్లి కదా.. అక్కడ శిల్ప లేదు అంటే..పెళ్లి పీటల మీద ఉన్నది ఎవరు? ధనుంజయ్ గారు అని సూటిగా అడుగుతాడు. అంతే ఆ మాటకి భార్గవి గుండెల్లో విమానాలే దూసుకు వెళుతూ ఉంటాయి. ధనుంజయ్ భార్గవి వైపు చూసి జబ్బ పట్టుకుని పైకి లేపి నిజం చెప్పు భార్గవి. ఆరోజు పెళ్లి పీటల మీద కూర్చుంది ఎవరు? అని భార్గవిని కూడా రెండు పీకుతాడు. భార్గవి రెండు చెంపలపై రెండు చేతుల్ని పెట్టుకుని అందరి వంక భయంగా చూస్తూ... అత్తగారు అయితే సేవ్ చేస్తారేమో అని ఆవిడ వైపు అడుగులు వేయబోతుంది. వెంటనే సత్యవతి గారు నువ్వు అక్కడే ఆగు. నిజం చెబితే నీకు నీ కూతురికి మంచిది. లేకపోతే నాలుగు పీకు అయిన నిజాలు చెప్పించాల్సి వస్తుంది. ఎలాగు నిజం చెప్పక తప్పదు. దెబ్బలైనా తప్పించుకుంటే మీకే మంచిది అని కటువుగా మాట్లాడుతారు. ఇంక తప్పించుకునే దారి లేదని అర్థమయ్యి అవని అని చెప్పి తలదించుకుంటుంది. ధనుంజయ్ కోపం, ఆశ్చర్యంతో ఆరోజు అవని పెళ్లికొప్పుకోలేదని చెప్పావు కదా.. మరి ఎలాగా పీటల మీద కూర్చుంది అని గట్టిగా అడుగుతాడు. ఏం చెప్పాలో తెలియక అది అది అని నాన్చుతూ ఉంటుంది. నా సహనాన్ని పరీక్షించవద్దు భార్గవి నిజం చెప్పు అని గట్టిగా అరుస్తారు. నేనే బ్రతిమాలి కూర్చోబెట్టాను అండి ఇంటి పరువు పోకూడదు అని అమాయకంగా చెబుతుంది. మరి అలాంటప్పుడు తాళిపడిన అవని యే కదా విక్రమ్ భార్య గా ఉండాలి కానీ.. ఆ స్థానంలోకి శిల్ప ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అని ఇంకొక రౌండ్ వేస్తారు. ప్లీజ్ అండి కొట్టకండి. అందరి ముందు అని అడిగితే... నువ్వు చేసిన పనికి అందరిలోనూ నా ఇంటి పరువు పోలేదా అని అసహ్యంగా చూస్తాడు. అప్పటికి భార్గవి ఏమి చెప్పకుండా తలదించుకునే ఉంటుంది. వెంటనే ఇంకొక వీడియో ఆన్ అవుతుంది. ఉదయ్ పెళ్ళిలో జరిగింది మొత్తం చెబుతూ ఉన్న వీడియో. అది చూడగానే భార్గవి, శిల్ప భయంతో వణుకుపోతూ ఒకళ్ళని ఒకళ్ళు గట్టిగా పట్టుకుంటారు. ఇది అంతా అబద్ధం అవిని నీ నేను ఏమి చేయలేదు అని భయంగా చెబుతూ ఉంటుంది. అప్పుడే బిందు లోపలికి వస్తూ ఎందుకు భార్గవి అబద్ధం చెబుతున్నావు. ఆరోజు నేను ఉదయ్ కూడా అక్కడే ఉన్నాము కదా.. మనము ఈ ఫొటోస్ చూపించి భయపెట్టలేదా అని ఫొటోస్ ధనుంజయ్ చేతికి ఇస్తుంది. ఆ ఫొటోస్ లో అవని ఉదయతో చాలా క్లోజ్ గా ఉన్నట్టు ఉండి చాలా అసహ్యంగా ఉంటాయి. భార్గవి వైపు కోపంగా చూస్తూ తప్పు చేసింది నీ కూతురైతే... అవిని మీద ఎందుకింత పెద్ద నింద మోపావు. నీకు అసలు మనసు ఎలా వచ్చింది అని కోపం తట్టుకోలేక నడుముకు ఉన్న బెల్టు తీసి మరీ కొడతాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక ప్లీజ్ అండి కొట్టొద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. కొట్టడం కాదే నిన్ను చంపేయాలి. నాకు నా కూతురు మధ్యన ఇంత దూరం తీసుకో వస్తావా అని అక్కడున్న సోఫాలో కూర్చుని బాధపడతారు. ఇప్పుడు బాధపడడం వల్ల ఉపయోగం ఏముంది ధనుంజయ్ అని శేషగిరి గారు అంటారు. నాన్న అని బాధగా అనగానే... నాన్ననే మాట్లాడుతున్నాను. ఏ రోజైనా అవిని కీ దగ్గరగా ఉన్నావా... నీ పెళ్ళాం ఏది చెబితే అది గంగిరెద్దులాగా తల ఊపావు. అంతేగాని అవని దగ్గర కూర్చుని ఏం కావాలి, ఏంటి అని మాట్లాడావా... శిల్పతో ఉన్నట్టుగా అవిని తో ఏ రోజు అయినా ఉన్నావా ధనుంజయ్ అని కోపంతో అడుగుతారు. ప్లీజ్ నాన్న ఇంకా నన్ను మీరు చంపకండి అని బాధపడతాడు. దానికి శేషగిరి గారు విరక్తిగా నవ్వుతూ ఇప్పుడేమిట్రా ఎప్పుడైతే నీ కూతురుకి చాలీచాలని భోజనం పెట్టావో, నీ ఇంటిలోనే నీ కూతురికి రక్షణ లేదో, ఆరోజే ఒక తండ్రిగా చచ్చిపోయావు. ఇదిగో నీ కూతురు వెళ్లే ముందు రాసిన ఉత్తరం అని చెప్పి ధనుంజయ చేతిలో పెడతారు. అవని రాసిన అక్షరాలు వెంట ధనుంజయ్ కళ్ళు పరుగుపెడుతూ ఉంటాయి. తాతయ్య నేను ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇన్ని రోజులు నేనంటే ఇష్టం లేకపోయినా ఏదో భరిస్తున్నారు అనుకున్నాను. కానీ ఈ భార్యాభర్తలు ఇద్దరికీ శిల్ప జీవితం బాగుంటే చాలు. దానికోసం నా జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకడుగు వేయరు అని ఈ రోజే అర్థమయింది. ఇక్కడ ఉంటే శాశ్వతంగా నన్ను నేను కోల్పోవాల్సి వస్తుంది. దానికి కన్న ఒక అనాధగా బ్రతకడమే మంచిది. ఎలాగో అనాధగానే ఉన్నాను కాబట్టి.. అనాధనే అవుతాను సెలవు అని రాసి ఉంటుంది. ఆ ఉత్తరం కూడా చాలా స్పీడ్ గా రాసినట్టుగా కన్నీళ్లు పడినట్టుగా ఉంటుంది. ఆ ఉత్తరం చదివిన ధనుంజయ్ ఒక రకమైన షాక్ లో ఉండిపోతాడు.
13-01-2026, 05:18 PM
(This post was last modified: 13-01-2026, 05:18 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 41
ఆ ఉత్తరం చదివిన ధనుంజయ్ చాలాసేపటి వరకు మనిషి కాలేకపోతాడు. తనంతట తానుగా రియలైజ్ అవ్వాలని ఎవరు కదపకుండా చూస్తూ ఉంటారు.
ఎంతసేపైనా ధనుంజయ్ ఆ ఉత్తరాన్ని పదే పదే చదువుతూఉంటాడు. సత్యవతి గారికి మనసు వొప్పక ధనుంజయ్ భుజం మీద చేయి వేసి కదుపుతారు. మనలోకంలోకి వచ్చిన ధనుంజయ్ సత్యవతి గారి నడుం చుట్టూ చేతులు వేసి అమ్మా అని బోరున ఏడుస్తాడు. ఇప్పుడు ఏడవడం వల్ల ఉపయోగమేముంది ధనుంజయ్ అని ఊరుకో పెడతారు. నాకు తెలియకుండా చాలా పెద్ద తప్పు జరిగి పోయింది. అవని జీవితంలో నన్ను క్షమిస్తుందా అని అడుగుతాడు. శిల్ప వైపు తిరిగి నువ్వు ఎలాగో చెడిపోయావు కదా రాక్షసి. అవని జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేయాలనిచూసావు అని కోపంగా అడుగుతారు. జరిగిందంతా చూసాక ఇంకా శిల్ప కూడా తన రియాలిటీ లోకి వచ్చేస్తుంది. ఏంటి డాడీ మీరు నా మీద కోప్పడుతున్నారు. మీరు అవని మీద ఫోకస్ పెట్టకపోతే అది నాదా తప్పు. నాకా అవకాశం ఉంది నేను యూస్ చేసుకున్నాను అని పొగరుగా చెబుతుంది. శిల్ప మాట తిరుకి ధనుంజయ్ చాలా ఆశ్చర్యపోతాడు. ఎప్పుడూ తన ముందు అణిగి మణిగి,పద్ధతిగా మాట్లాడే శిల్ప నా అని. ఇన్ని రోజులు నా ముందు నటించావా అని అడుగుతాడు. నటించాల్సిన అవసరం నాకేముంది నాకు కావాల్సిన దాన్ని కోసం ఒక స్టెప్ తగ్గి ఉన్నాను అంతే. దానికోసం అవిని నీ యూస్ చేసుకున్నాను అంతే కదా మామ్ అని భార్గవి వైపు తిరుగుతుంది. అప్పటికే భార్గవికి ఒళ్లంతా చెమటలు పట్టేసి కూతురు వైపు దీనంగా చూస్తుంది. దీనికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇన్నాళ్లు జాగ్రత్తగా చేసుకువచ్చినదంతా ఒక రోజుతో నాశనంచేసేసింది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ఏమి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా.. ఎప్పుడు డాడీ ముందు పద్ధతిగా ఉండేదానివి. ఒక్క నీ మోడలింగ్ ఫీల్డ్ మీద ఉన్నా ఇంటరెస్ట్ తో ఆ రోజు బయటికి వెళ్లావు. నాకు ముందే తెలిస్తే వెళ్లనివ్వను అని చెప్పకుండా వెళ్ళావు. అది ఒక్కటే నీ తప్పు. అంతేగాని నువ్వు అవని నీ ఎప్పుడూ తక్కువ చేసే బిహేవ్ చేయలేదు కదా.. ఎందుకు ఇప్పుడు అవని నీ ఎక్కువ చేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు అని ఇంకా కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ధనుంజయ్ కి చిరాకు వచ్చి ఇంకా ఆపు భార్గవి నీ నాటకాలు. ఇంత జరిగినా సరే నీ కూతుర్ని వెనకేసుకొచ్చి అవని నీ తప్పు పట్టడానికి చూస్తున్నావు. ఏంటి డాడీ ఇందాకటి నుంచి చూస్తున్నాను నేనేం తప్పు చేశాను అని మాట్లాడుతున్నారు. అయినా తప్పంతా మీరు చేసే నన్ను అంటారేంటి అని కోపంగా అరుస్తుంది. నేనేం తప్పు చేశాను అని ఆశ్చర్యంగా అడుగుతాడు. మీరేమీ తప్పు చేయలేదా అని అంతే సీరియస్ గా అడుగుతుంది. నేనేం తప్పు చేయలేదు అని చెబుతాడు. అవునా ... మన ఇంట్లో అవని బెడ్ రూమ్ ఎలా ఉంటుంది.. నా బెడ్ రూమ్ ఎలా ఉంటుంది. అవని ఎలాంటి ఫుడ్డు తింటుంది... నేను ఎలాంటి ఫుడ్డు తింటాను. అవని ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటుంది.. నేను ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటాను. అట్లీస్ట్ అవని నీ ఏ ఫంక్షన్ కైనా మీరు తీసుకు వెళ్లారా.. పోనీ ఎవరికైనా మీకు అవిని అనే ఇంకొక కూతురు ఉంది అన్న విషయం తెలుసా అని చాలా పొగరు గా అడుగుతుంది. ఆ మాటలకి ధనుంజయ్ బిగుసుకుపోయి ఏమి చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉండిపోతాడు. ఏంటి డాడీ నేను అడిగిన దానికి మీ దగ్గర సమాధానం లేదు కదా... ఇప్పుడు అర్థమైంది కదా ఎవరు అవిని విషయంలో తప్పు చేశారో.. తప్పంతా మీరు చేసి నన్నంటారేంటి... ధనుంజయ్ విరక్తిగా అవును నిజంగానే నేను తప్పు చేశాను. మీ అమ్మ మాటలే ఎప్పుడూ వింటూ అవే నిజాలనుకుని నా కూతురికి దూరమైపోయాను. కానీ మీరిద్దరూ మేక తోలు కప్పుకున్న తోడేళ్లు అని తెలుసుకోలేకపోయాను. ఎందుకు భార్గవి ఇలా చేశావు నీకు ఏం తక్కువగా జరిగిందా ఆ ఇంట్లో అని బాధగా అడుగుతాడు. ఆ ఇంట్లో భార్గవికి ఏం తక్కువైందో నేను చెబుతాను కదా ధనంజయ్ గారు అని విక్రమ్ వాయిస్ వినపడుతుంది. ఇంకొక వీడియో ఆన్ చేస్తాడు. అది ఉదయ్ హాస్పిటల్లో ఎడ్మిట్ చేసిన తర్వాత భార్గవి ని సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు.. సునీల్ దంపతులకి భార్గవ్ కి మధ్యన జరిగిన గొడవ కి సంబంధించిన వీడియో. భార్గవి క్వార్టర్స్ లోకి వెళ్లగానే అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తూన్నావు భార్గవి అని సునీల్ కోపంగా అడుగుతాడు. నువ్వు చేసింది ఏమిటి ఉదయ్ హాస్పిటల్ లో ఉన్నాడు. డబ్బులు కావాలనే కదా నాకు చెప్పావు. అయినా నేను కూడా హాస్పిటల్ నుంచే కదా వచ్చాను. మరి మీ బావ ముందు ఎందుకు అలా మాట్లాడావు అని కోపంగా అడుగుతుంది. నేను నిజమే కదా చెప్పాను అని చాలా కేర్లెస్ గా మాట్లాడుతాడు. నువ్వు మాట్లాడే విధానం అసలు బాగోలేదు. నాకు కోపం తెప్పించకు అని అరుస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు రజితని చంపినట్టుగా మమ్మల్ని చంపుతావా అని రెచ్చగొడతాడు. ఆ మాటలకి భార్గవి వంకరగా నవ్వుతూ నీకు ఇంకా రజిత చావు గుర్తుందా...గుర్తుండి కూడా నాతో పెట్టుకుంటున్నావా అని అడుగుతుంది. అన్ని గుర్తున్నాయి. మమ్మల్ని బావ నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తుంటే.. నాకెందుకు అని ఊరుకున్నావు కదా..అప్పుడే అర్థమైంది నీ అవసరం తీరిపోతే మమ్మల్ని కూడా అలాగే చేస్తావని. అన్నీ తెలిసి కూడా నాతో పెట్టుకున్నావు అంటే మిమ్మల్ని ఏం చేయాలి అని అంటుంది. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఏమన్నా చేస్తే ముందు బావ దగ్గరికి వెళ్లి రజిత ని నువ్వే మెట్లు పైనుంచి తోసేసావని చెబుతాను. తర్వాత అవని నీ ప్రేమగా చూసుకుంటున్న వంకతో బావ జీవితంలోకి ఎలా వెళ్లావో కూడా అర్థమయ్యే విధంగా చెబుతాను. రజిత మీద ఉన్న కోపంతో అవిని నీ ఎలా పని మనిషిని చేసావో కూడా అన్ని వివరంగా చెబుతాను అని అనగానే... భార్గవి గట్టిగా నవ్వుతూ నువ్వు చెబితే మాత్రం మా ఆయన నమ్ముతాడని అనుకుంటున్నావా... ఆయన్ని ఎక్కడ నొక్కాలో కూడా నాకు బాగా తెలుసు. మగవాడికి ఆడదాని అవసరం ఉన్నంతవరకు ఆడదాని చేతిలో కీలుబొమ్మే. రెండే రెండు రోజుల్లో మీ బావే వచ్చి నన్ను తీసుకువెళ్తాడు అని పొగరుగా చెప్పి వెళ్లి మంచం మీద పడుకుంటుంది. వీడియో చూడగానే భార్గవి టెన్షన్‌తో బిగిసిపోతుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ధనుంజయ్ మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటాడు బెల్ట్ తో ఇంకొక రౌండ్ భార్గవిని వేసి ఎందుకు రజితని చంపావు అని రక్తం వచ్చేలాగా కొడుతూ ఉంటాడు. శిల్ప కూడా ఆ దెబ్బలు చూసి స్తంభం చాటుకి వెళ్లి దాక్కుంటుంది. భార్గవి ఆ దెబ్బలని తట్టుకోలేక నేనే చంపాను అయితే ఏంటి అని గట్టిగా అరుస్తుంది. ధనుంజయ్ కొట్టడం ఆపి ఎందుకు చేసావు అని అరుస్తాడు. రజిత మీద ఉన్న అసుయతో చేశాను. ఎప్పుడు ఊరు వచ్చిన కారులోనే వచ్చేది. అందరికీ అన్ని రకాలు తీసుకోవచ్చేది.అవన్నీ చూడగానే నాకు సొంతం చేసుకోవాలి అనిపించింది. అనుకోని అవకాశంగా అవని పుట్టినరోజు వచ్చింది. మా అమ్మ, అన్నయ్య సలహాతోనే రజితని మెట్ల పైనుంచి తోసేసాను.. అసలు అవిని నీ కూడా తోసేద్దాం అనుకున్నాను కానీ... అది లేకపోతే నీ జీవితంలోకి రావడం కష్టమని దాన్ని ప్రాణాలతో ఉంచాను. అనుకున్నట్టుగానే నీ జీవితంలోకి వచ్చాను. కానీ ఎక్కడా కూడా అవని నీ కూతురుగా చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే నీకే అవని రావడం ఇష్టం లేదు అని చిన్నప్పటి నుంచి నూరు పోసి దాన్ని గదిలో నుంచి బయటికి రానివ్వలేదు.. ఎక్కడికి వెళ్లినా ధనుంజయ్ కి ఒక్కతే కూతురు అది శిల్ప అని మాత్రమే తెలిసేలాగా చేశాను. చిన్నప్పటినుండి అవని నీ ఒక నార్మల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలో చదువుకునేటట్టుగా చేశాను. ఎక్కడ కూడా ఒక తండ్రిగా మీ సంతకం కానీ, మీ పేరు గాని లేకుండా అనాధ కింద క్రియేట్ చేశాను.నీ కింగ్డమ్ కి మొత్తానికి ఏకైక వారసురాలు శిల్ప అని జనం అనుకునే లాగా చేశాను. ఆఖరికి ఈ పెళ్లి విషయంలో కూడా శిల్పకి విక్రమ్ తో పెళ్లి చేయాలని మీ కోరిక. పెద్ద వాళ్ళు ముందు కావాలని అడుగుతారు. ఇష్టం లేదని చెప్పమన్నారు అని చెప్పాను. అందుకే అవని ఆ రోజు అలా చెప్పింది. ఈ శిల్ప చేసిన తింగరి పని వల్ల ఆ తాళి అవని మెడలో పడింది. శోభనం రోజు రాత్రి అవని నీ మేమే బెదిరించాము. ఆరోజు కూడా అదంతా మీరే చేయమన్నట్టుగా చేశాను. అందుకే అవిని కీ మీ మీద పూర్తిగా విరక్తి వచ్చేసింది. ఎప్పటికైనా ఎదురు తిరుగుతుందేమో అన్న అనుమానం తోనే ఉదయ్ తో అవిని జీవితం నాశనం చేయాలి అనుకున్నాను. అది తప్పించుకుని పారిపోయింది. ఎలాగో పారిపోయింది కదా అని బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది అన్నట్టుగా క్రియేట్ చేశాను. ఆ ఉదయ్ గాడు సరిగ్గా ప్లాన్ చేయక దొరికిపోయాడు. అవిని కోసం మీరు తాపత్రయపడడం నాకు అస్సలు నచ్చలేదు. ఏదైనా చేయాలి అనుకునే లోపు నా ప్లాన్లు అన్ని రివర్స్ అయిపోయినాయి అని ఆవేశంలో తనకు తెలియకుండానే అన్ని నిజాలు చెప్పేస్తుంది. భార్గవి చెబుతున్న నిజాలు వింటున్న అందరికీ అసహ్యం జుగుప్సా కలుగుతాయి. భార్గవి లో ఒక సైకో కనపడుతుంది. ఒంటిపైనున్న రక్తం తుడుచుకుంటూ అక్కడున్న సోఫాలో కూర్చుని ఇప్పుడు మీరు వెళ్లి అవినికి నిజాలు చెబితే మాత్రం మిమ్మల్ని నమ్ముతుంది అనుకుంటున్నారా అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు.
13-01-2026, 05:26 PM
Part - 42
మీరు ఇప్పుడు అవిని దగ్గరకెళ్ళి ఇవన్నీ నిజాలు. నాకు తెలియకుండా జరిగిపోయినాయి.నన్ను క్షమించు అనగానే నమ్మేసి మీ వెనకాల వస్తుందనుకుంటున్నారా అని చాలా కృయల్ గా నవ్వుతుంది.
అంటే ఏంటి నీ ఉద్దేశం అని ధనుంజయ్ అనుమానంగా అడుగుతాడు. నా ఉద్దేశం ఏమిటంటే.. మీరు వెళ్లి కాళ్ల పట్టుకుని బ్రతిమాలిన సరే అవని మీతో రాదు. అంతలాగ మీ మీద విరక్తి,అసహ్యం వచ్చేసాయి. ఇప్పుడు మీరు వెళ్లి అడిగినా సరే శిల్ప కోసమే ఇంకొక నాటకం అనుకుంటుంది తప్ప.. నిజంగా మీరు తన కోసమే వచ్చారు అని మాత్రం అనుకోదు. బయట జనాలందరికీ కూడా పెళ్లి జరిగింది శిల్పతోనే అని తెలుసు కాబట్టి.. శిల్పతో కాంప్రమైజ్ అయ్యి కాపురం చేసుకోమనండి. కాదు, లేదు అని అవనినీ తీసుకువచ్చి విక్రమ్ కి భార్యను చెయ్యాలి అనుకుంటే... జనం ఛీ అంటారు. చెల్లి మొగుడితో అక్క కులుకుతుంది అంటారు. ఆ రోజు అవని శిల్పను అన్నమాట అవని విషయంలోనే అవుతుంది. తాళి లేకుండా ఒక మగాడి గదిలోకి వెళ్లిన ఆడదాన్ని ఏమంటారు అని అడిగింది. ఇప్పుడు అది తాళిపడిన సరే... చెల్లెలి మొగుడు గదిలోకి వెళ్లింది అని అవని గురించి అందరూ నీచంగా మాట్లాడుకుంటారు. నీ కూతురు గురించి జనం అందరూ అంత గొప్పగా మాట్లాడుకోవాలి అనుకుంటే.. ఎక్కడ ఉన్న వెతికి తీసుకువచ్చి జై సింహా ఇంటి కోడలుగా చెయ్యి. కాదు, కాదు . నా అల్లుడికి ఉంపుడుకత్తే ని చెయ్యి అని అసహ్యంగా మాట్లాడుతుంది. ఇంకా ఆపు అని విక్రమ్ గట్టిగా అరుస్తాడు. విక్రమ్ ఫేస్ చూసిన అందరికీ చాలా భయం వేస్తుంది. కోపంతో ముఖమంతా ఎర్రగా కందిపోతుంది. పిడికిలి బిగించి ఉండడం మీద నరాలన్నీ ఉబ్బిపోయి ఉంటాయి. నువ్వు ఏం మాట్లాడినా ఇక్కడ వింటూ కూర్చుంటారు అనుకుంటున్నావా అని అక్కడ సింగిల్ సీటర్ చైర్ లో కూర్చుని కాలు మీద కాలేసుకుని ఒక చేతిని సోఫా పైన పెట్టి , మరొక చేతి ఇండెక్స్ ఫింగర్ తో సోఫా హ్యాండిల్ ని కొడుతూ ఉంటాడు. విక్రమ్ వాయిస్ లో ఉన్న బేస్ కి అప్పుడు వరకు అడ్డు అదుపు లేకుండా వాగుతున్న నోటికి జిప్పు వేసి, తనకు తెలియకుండానే లెగిసి నిలబడుతుంది. ఏంటి ఇప్పుడు చెప్పు అవిని గురించి ఏంటో తప్పుడు కూతలు కుస్తున్నావు. అవిని యే నా భార్య అని నాకు ఎప్పుడో తెలుసు. ఇన్ని రోజులు ఆగింది నీ నోటితో నిజాలు చెప్పించాలి అని ఇంకా అంటూ... ధనుంజయ్ వైపు చూసి ఇలాంటి పెద్దమనిషి కళ్ళు తెరవాలని... లోకం దృష్టిలో శిల్ప నా భార్య అని చెబుతున్నావు కదా.. ఏ లోకం దృష్టిలో అని టీవీ ఆన్ చేస్తాడు. ఇప్పుడు దాకా భార్గవి మాట్లాడిన ప్రతి మాట కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. అలాగే న్యూస్ మళ్లీ రిపీటెడ్ గా వేస్తూనే ఉన్నారు. లోపల ఒక గదిలో సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.వాళ్ళు కూడా బయటకు వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు. అవన్నీ అలా చూడగానే భార్గవి నో అని గట్టిగా అరుస్తూ.. ఇదంతా అబద్ధం. నేను ఒక్కదాన్నే ధనుంజయ్ భార్యని. శిల్ప ఒక్కతే ధనుంజయ్ కూతురు అని పిచ్చి పట్టిన దానిలాగా గట్టిగ అరుస్తూ ఉంటుంది. విక్రమ్ సెక్యూరిటీ ఆఫీసర్లు వైపు తిరిగి నా పెళ్లి విషయంలో తన చేసిన చీటింగ్ మీద కేసు పెడుతున్నాను. ఈ తల్లి కూతుర్నిద్దరినీ అరెస్ట్ చేయండి. నా భార్య ని బెదిరించి మానసికంగా హింసించి నా నుంచి దూరం చేసి ఎక్కడికో పారిపోయేటట్టుగా చేసినందుకు కూడా కేసు ఫైల్ చేయండి. మిగిలిన విషయాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని ధనుంజయ్ వైపు చూస్తాడు. ధనుంజయ్ ఒక్క నిమిషం భార్గవి వైపు చూసి సెక్యూరిటీ ఆఫీసర్లు వైపు తిరిగి నా భార్యను హత్య చేసినందుకు ఈ భార్గవిని, తనకి సహాయం చేసినందుకు వాళ్ళ అన్నయ్య మీద కేస్ పెడుతున్నాను. తీసుకువెళ్లండి అని కళ్ళు మూసుకుంటాడు. భార్గవి స్పీడ్ గా ధనుంజయ్ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని...ఏవండీ నేను తెలియక ఏదో తప్పు చేశాను కానీ... పెళ్లయిన దగ్గర నుంచి మీ విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉన్నాను.. మీతో నేను ఎంత ప్రేమగా ఉన్నాను. పెద్దవాళ్ళని ఎంత మర్యాదగా చూసుకున్నాను. ఎక్కడా కూడా మీ గౌరవానికి భంగం రానివ్వలేదు. అత్తయ్య గారు, మావయ్య గారు మీరైనా చెప్పండి అని సత్యవతి గారి దగ్గర కూడా వెళ్లి చేతులు పట్టుకుని బ్రతిమాలుతుంది. ఆరోజు అవిని కూడా మిమ్మల్ని ఇలాగే బ్రతిమాలి ఉంటుంది కదా భార్గవి అని అడుగుతారు. కానీ మీరందరూ ఏం చేశారు... ఆ ఉదయ్ గాడితో నా మనవరాలు జీవితం నాశనం చేయించాలి అనుకున్నావు. నువ్వు ఆడదానివే కదా..నీకు ఒక కూతురు ఉంది కదా.. మరి అవిని కూడా అలాంటి ఆడపిల్ల అని తెలియలేదా లేకపోతే నీ కూతురు ఎలాగు చెడు తిరుగుళ్ళు తిరుగుతుంది కాబట్టి అవిని కూడా అలాగే అనుకున్నావా అని కోపంగా అడుగుతారు. శిల్పకి ఆ మాటలకి చాలా కోపం వస్తుంది. నానమ్మ అని అరుస్తుంది. ఛీ నోరు ముయ్. ఎవరే నీకు నానమ్మ. వావివరసలు తెలియకుండా పెరిగావు. అక్క మొగుడిని కోరుకున్నావు. ఎంత నీచమో తెలుసా అది. అక్క మొగుడు అంటే తండ్రితో సమానం. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా మీ తల్లి కూతుళ్ళకి అని కోప్పడతారు. లోకంలో ఎంతమంది అక్క మొగుడ్ని పెళ్లి చేసుకోవడం లేదు. అలాఅని వాళ్లందరికీ వావివరుసలు లేనట్టా అని తిక్కవాగుడు వాగుతుంది. అక్క మొగుణ్ణి పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లి చేసుకోకుండా అక్క స్థానంలోకి వెళ్ళాలి అని ఏ ఆడది కోరుకోదు. అక్కడ పరిస్థితులను బట్టి...అక్క లేకపోతే పిల్లల కోసమో, వాళ్లకున్న కారణాలతో మెడలో తాళి పడిన తర్వాతే అక్క మొగుడిని తన భర్తని చేసుకున్నారు. అంతేగాని నీలాగా బరి తగ్గించలేదు. నా పిచ్చి గానీ మీ అమ్మ దగ్గర లేని సంస్కారం నీకు ఎక్కడి నుంచి వస్తుంది. సెక్యూరిటీ ఆఫీసర్లు వైపు తిరిగి అర్జెంటుగా బయటకు తీసుకువెళ్ళిపోండి. వీళ్ళని చూస్తుంటే కంపరం గా ఉంది. భార్గవికై పూర్తిగా అర్థం అయిపోయింది. ఇంక తను ఏమి చేసినా మళ్లీ ఆ ఇంట్లో తన స్థానం తనకి రాదు అని. సెక్యూరిటీ ఆఫీసర్లు భార్గవి, శిల్ప దగ్గరకు వచ్చి మీరు మర్యాదగా మాతో పాటు వస్తే బాగుంటుంది. లేదు అంటే మా పద్ధతిలో మేము తీసుకువెళ్లాల్సి వస్తుంది. మీరు పూర్తి ఆధారాలతో దొరికిపోయారు. అది కూడా మీరు పూర్తి స్పృహలో ఉండి మీ అంతట మీరు చెప్పిన నిజాలే కాబట్టి.. మాకు సహకరించండి అని చాలా పొలైట్ గా చెప్పినట్టుగా వార్నింగ్ ఇస్తారు. భార్గవి వెళుతూ విక్రమ్ వైపుకు తిరిగి ఇక్కడితో అంతా అయిపోయింది అనుకుంటున్నారేమో... నేను పగబడితే ఎలా ఉంటుందో అవిని జీవితం చూసి తెలుసుకోండి. ముందు ముందు ఇంకా నరకం చూపిస్తాను అని ఆవేశంగా మాట్లాడుతుంది. ఆ మాటలు వింటున్న విక్రమ్ గట్టిగా నవ్వుతూ ఇంత జరిగినా విక్రమ్ అంటే ఏంటో నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. నిజంగా నీ మీద జాలి వేస్తుంది భార్గవి. అవిని వెనకాల అప్పుడు ఎవరూ లేకపోవచ్చు కానీ.. ఇప్పుడు అవిని ముందు నేను ఉన్నాను. వెనకాల నా కుటుంబం మొత్తం ఉంది. అవని నీ తాకాలి అంటే ఈ సింహాన్ని దాటి వెళ్లాలి. నీకు అంత ధైర్యం ఉందా అని కన్నెర్ర చేస్తాడు. విక్రమ్ కోపాన్ని చూసి భార్గవి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది.ధనంజయ్ కి మాత్రం తల తీసేసినట్టు ఉంటుంది. నిజమే కదా.. విక్రమ్ పూనుకున్న తర్వాతే నిజ నిజాలు అన్నీ బయటకు వచ్చాయి. ఈ కుటుంబం మొత్తం అవినీ కోసం ఎదురు చూస్తుంది. తండ్రిగా నేనేమి చేశాను. 22 ఏళ్లు నా ఎదురుగుండా పెరిగిన నా కూతురు గురించి నేను తెలుసుకోలేకపోయాను. బయట వ్యక్తి వచ్చి చెప్పేవరుకు గుడ్డివాడిగా ఉన్నాను అంటే.. నేను ఎంత ఫెయిల్యూర్ ఫాదర్నో అర్థం అవుతుంది అని కుమిలిపోతూ ఉంటాడు. భార్గవి, శిల్ప ని సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకువెళ్లిన తర్వాత క్రిష్ కూడా వెళ్ళిపోతాడు. ధనుంజయ్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి నావల్ల చాలా పెద్ద తప్పే జరిగి..మీ కుటుంబం కూడా ఇబ్బంది పడింది. నన్ను క్షమించండి. నా కూతురు ఎక్కడ ఉన్నా సరే నేను వెతికి తీసుకు వస్తాను. మా మీద కోపాన్ని అవిని మీద చూపించవద్దు. అది నిజంగానే అమాయకురాలు అని బాధగా మాట్లాడతాడు. ఎవరిమీదో కోపాన్ని మా ఇంటి మహాలక్ష్మి మీద మేము చూపించం ధనుంజయ్ అని ఇందిరా గారు గట్టిగా చెబుతారు. మాకు ఎప్పుడైతే నిజం తెలిసిందో అప్పుడే అవనినీ మేము కోడలుగా అంగీకరించాము. అందుకే దోషం పేరు చెప్పి శిల్ప ని మేము ఎవరికీ పరిచయం చేయలేదు . అవని ఎప్పుడైతే ఇంటికి వస్తుందో ఆరోజు అందరికీ పరిచయం చేస్తాము అని గంభీరంగా చెబుతారు. ఆ మాటలకి ధనుంజయ్ సంతోషంగా తప్పకుండా అత్తయ్య గారు అవిని ఎక్కడ ఉన్న వెతికి తీసుకు వస్తాను అని చెబుతాడు. దానికి ఇందిరా గారు ఇంకా మీ కూతురు ఎక్కడ ఉందో నువ్వు తెలుసుకునే దగ్గరే ఉన్నావు కానీ... మా విక్రమ్ తన భార్య ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు. తనని కలిసే వచ్చాడు అని చెబుతారు. నిజమా అల్లుడుగారు అని ఆనందంతో అడుగుతాడు. విక్రమ్ తనకుడి అరచేతిని ముందుకు పెట్టి ఆపండి.. నేను మీకు అల్లుడిని కాదు..ఎప్పుడైతే నా భార్య మిమ్మల్ని తండ్రిగా అంగీకరిస్తుందో ఆరోజు మీరు నన్ను అల్లుడుగారు అని పిలవండి. అప్పుడు దాకా మనం ఓన్లీ తెలిసిన వాళ్ళము మాత్రమే అని నొక్కి చెప్పి... నానమ్మ నేను ఈవెనింగ్ ఫ్లైట్ కి వెళుతున్నాను అని చెబుతాడు. మంచిది ఎల్లుండి ఉదయం పదింటికల్లా అమ్మాయి గృహప్రవేశం చేయాలి అని చెబుతారు. తప్పకుండా అని రూమ్ లోకి వెళ్ళిపోతాడు. రూమ్ కి వెళుతున్న విక్రమ్ మనసులో నువ్వు కోరుకున్నట్టుగానే నీ భర్త అందరి తప్పులకి శిక్ష వేసి నీకోసం వస్తున్నాడు. నాకు ఏం సమాధానం చెబుతావో చూస్తాను అని కన్నింగ్ గా నవ్వుకుంటూ రూమ్ కి వెళ్ళిపోతాడు.. అక్కడ అవనికి ఆగకుండా పులమారుతూ ఉంటుంది. ఇప్పుడు అవని పరిస్థితి ఏమిటి.... కథ కొనసాగుతుంది...
13-01-2026, 05:28 PM
(This post was last modified: 14-01-2026, 12:44 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
.
13-01-2026, 05:59 PM
(This post was last modified: 13-01-2026, 07:17 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
42భాగం రెండు సార్లు పోస్టు చేసారు.
బహుశ 43వ భాగం ఆఖరిది అయి ఉండాలి! అనుకున్నాను, కానీ ఇంకా చాలా కథ ఉన్నట్లుంది రెండో మలుపేమో! మంచి కథను ఇస్తున్నారు ఇక్కడి మితృలకు, అభినందనలు
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం (https://xossipy.com/thread-71346.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
13-01-2026, 06:40 PM
Edo .. yenakatiki serial ni .. correct place lo aapesinattu.. melika pettaru!!
4 episodes gukka tippukokunda chadivi.. inka waiting ante .. kaadu mahaprabho.. maa valla kaadu!!
14-01-2026, 12:43 AM
14-01-2026, 05:37 AM
Superb
14-01-2026, 07:56 AM
14-01-2026, 09:07 AM
14-01-2026, 11:22 AM
Inka chala unai lopala dacham (Siva Sai gari inner voice)
14-01-2026, 12:04 PM
14-01-2026, 06:08 PM
వేచి చూస్తున్నాను సోదరా
14-01-2026, 08:37 PM
ఇంకా220 episodes evali kadha bro
|
|
« Next Oldest | Next Newest »
|