08-01-2026, 01:30 PM
Excellent update
|
పాణిగ్రహణం
|
|
08-01-2026, 01:30 PM
Excellent update
08-01-2026, 03:04 PM
Slow Poison..Makes you to want more.
08-01-2026, 03:24 PM
Please Read ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం another interesting story from Shiva Sai Garu in Non-Erotic stories section.
09-01-2026, 09:40 AM
Part - 33
విక్రమ్ చాలా సీరియస్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ స్పీడ్ కి అవిని కి చాలా భయమేస్తుంది. విక్రమ్ గారు కొంచెం స్లోగా వెళ్ళారా అని చెబుతోంది.
అవినీ ఫేస్ చూసి తన భయపడుతుంది అని అర్థమై కోపాన్ని కంట్రోల్ చేసుకుని కొంచెం స్లోగా వెళ్తాడు. పార్కింగ్ ఏరియాలో కారు పార్క్ చేసి కారు దిగుతారు. కం అని చెప్పి లోపలకి తీసుకువెళ్తాడు గాని ఏమీ మాట్లాడడు. విక్రమ్ ఫేస్ చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు అని.. అవని విక్రమ్ చేతి మీద వణుకుతూనే చెయ్యి వేసి నేను ఫ్రెండ్ అనుకుంటున్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను. మీరు అలాగా కోపంగా ఉంటే నాకు భయమేస్తుంది అని బాధగా చెబుతుంది. దానికి విక్రమ్ అవని వైపు చూసి లేదు నువ్వు నిజంగా నన్ను ఫ్రెండ్ అనుకోవడం లేదు. ఫ్రెండ్ అని అనుకుని ఉంటుంటే ఏమి జరిగిందో నాకు చెప్పే దానివి. కానీ నువ్వు చెప్పడం లేదు అని అడుగుతాడు. నేను ఆడపిల్లని. నా ఆత్మ అభిమానాన్ని వదులుకొని ఇంతకు మించి చెప్పలేను. అర్థం చేసుకోండి అని చెబుతుంది.. తలవంచుకుని మాట్లాడుతున్న కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతు విక్రమ్ చేతుల మీద పడతాయి. ఆ కన్నీళ్లు చూడగానే విక్రమ్ గుండె తరుక్కుపోతుంది. నీకు నేను బెస్టి ని ఓకేనా అని కన్నీళ్లు తుడుస్తాడు. థాంక్యూ థాంక్యూ అని చెప్పి సైలెంట్ అవుతుంది. విక్రమ్ మాత్రం చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు చెప్పలేని పరిస్థితి వచ్చింది అంటే అక్కడ ఇంకా ఏదో జరిగింది. అది ఏంటో నేను తెలుసుకుంటాను అప్పుడు చెబుతాను ఒక్కొక్కళ్ళు పని అని అనుకుని.. వెంటనే భరత్ కి మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ కి ఓకే అని రిప్లై వస్తుంది. ఇంతలో అక్కడికి శ్రీ కూడా వస్తాడు. శ్రీ కి అవిని నీ అప్పచెప్పి జాగ్రత్త అని చెప్పి... తనకు టైం అవుతుంది అని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. విక్రమ్ కనుమరుగయ్యే వరకు అవని చూస్తూనే ఉంటుంది. శ్రీ అవిని దగ్గరకు వచ్చి వెళదామా సిస్టర్ అంటే... ఆ పదండి అన్నయ్య అని చెప్పి ముందుకు అడుగులు వేస్తుంది కానీ...అడుగులు చాలా భారంగా పడుతూఉంటాయి. ఫ్లైట్ ఎక్కిన విక్రమ్ మనసు మాత్రం కుదురుగా ఉండదు. చాలా డిస్టర్బ్డ్ గా అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే అంతవరకు నాకు ప్రశాంతత ఉండదు అని కళ్ళు మూసుకుంటాడు. హైదరాబాద్ వచ్చేదాకా ఆలోచనలకి అంతమనేదే ఉండదు. శ్రీ అవని కారులో వెళుతున్నారన్నమాట కానీ అవని మాట్లాడకుండా సైలెంట్ గానే కూర్చుంటుంది. శ్రీ కూడా అవని నీ ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఫ్లాట్ దగ్గరికి వచ్చిన సరే అవనిలో చలనం ఉండదు. ఇంకా శ్రీ నే కదిపి మనం వచ్చేసాము అని చెబితే చూసుకోలేదు అన్నయ్య అని చెప్పి కారు దిగుతుంది. శ్రీ కార్ పార్క్ చేసి అవని వైపు చూసి ఏంటి అవని ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగితే ఏమీ లేదు అన్నయ్య అని చెబుతోంది. చూడు అవని నువ్వు సొంత చెల్లెలు లాంటి దానివే. లాంటిదానివి ఏంటి నా చెల్లివే. నీకు ఎలాంటి కష్టం వచ్చినా, బాధ వచ్చిన ఎప్పుడూ ఈ అన్నయ్య నీతోనే ఉంటాడు. నీ మనసులో బాధ నాకైనా చెప్పుకుని భారం దించుకోవాలని అనిపిస్తే ఎలాంటి టైం అయినా సరే నాకు చెప్పు నేను నీకోసం ఎప్పుడూ ఉంటాను అని చెబుతాడు. అలాంటి అవసరం వస్తే తప్పకుండా చెపుతాను అన్నయ్య అని చెప్పి గుడ్ నైట్ అని చెప్పి ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది. నీ మనసులో బాధైనా, మాటైనా చెప్పకుంటే నువ్వు ఎందుకు అవని అవుతావు అనుకుని తను ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు. హైదరాబాదులో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతోనే విక్రమ్ భరత్ కి మెసేజ్ చేస్తాడు. ఎంతవరకు వచ్చింది అని... అయిపోయింది బావ నువ్వు రావడమే ఆలస్యం అని తిరిగి మెసేజ్ చేస్తాడు. ఓకే నేను డైరెక్ట్ గా మన గెస్ట్ హౌస్ కి వచ్చేస్తున్నాను అని చెప్పి మెసేజ్ చేస్తాడు. విక్రమ్ గెస్ట్ హౌస్ కి వెళ్ళేటప్పటికి వినయ్ కూడా ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ అంటే బావ ఏదో కంగారుగా ఉన్నాడని చెప్పి నేను కూడా తోడు వచ్చాను అని చెబుతాడు. సరే అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే లేదన్నయ్య నేను ఉంటాను ప్లీజ్ అని బ్రతిమాలుతాడు. సరే ఇక్కడ జరిగింది ఏది కూడా నువ్వు బయట పెట్టకు అని చెప్పి లోపలికి వెళతారు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి ని కాళ్లు చేతులు కట్టేసి కొడుతూ ఉంటారు. అతనికి ఒళ్ళు అంతా రక్తం వస్తూ ఉంటుంది. ఏమైనా నోరు విప్పాడా అంటే ఇంకా ఏమీ చెప్పలేదు బావ అంటే సరే అయితే అని చెప్పి దగ్గరికి వెళ్లి చిటికె వేస్తాడు. ఆ చిటికెలో సౌండ్ కి ఆ వ్యక్తి తల పైకెత్తి విక్రమ్ ని చూస్తాడు. అంతే పైప్రాణాలు పైనే పోతాయి. ఏంటి నన్ను చూసి షాక్ అయ్యావా అని అడిగితే...విక్రమ్ గారు మీరైనా నన్ను సేవ్ చేయండి. వీళ్ళు ఎందుకో తీసుకొచ్చి నన్ను కొడుతున్నారు. నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెబుతాడు. అవునా నీకు ఏమీ అర్థం కావడం లేదా....అందుకేనా ఆ ఇంటి ముందు వాచ్మెన్ డ్యూటీ తీసుకున్నావు అని అడుగుతాడు. ఆ మాటలకి ఉదయ్ నీళ్లు నములుతూ ఉంటే నాకు అన్నీ తెలుసు. మర్యాదగా నీ అంతటి నువ్వు నిజాలు చెప్పావు అనుకో ప్రాణాలైనా నిలబడతాయి. లేదు అనుకో నేను పెట్టే హింసలు తట్టుకోలేక చావే నయం అనుకుంటావు అని చెబుతాడు. ఆ మాటలకి ఉదయ్ గుటకలు వేస్తూ విక్రమ్ వంక చూస్తూ ఉంటాడు. ఉదయ్ లో కనిపిస్తున్న భయం చూసి విక్రమ్ కన్నింగ్ గా నవ్వుతూ ఇప్పుడు నిజం చెప్పరా అని అడుగుతాడు. ఏమి నిజం సార్ అని మళ్ళీ అదే అమాయకంగా అడిగితే నువ్వు ఇలా అడిగితే చెప్పవు..... నా చేతి దెబ్బ తింటే గాని నీ నోటి నుండి నిజాలు బయటికి రావు అని చెప్పి గట్టిగా చెంప పైన కొడతాడు. ఆ దెబ్బకి ముల్లోకాలు అన్ని కనపడతాయి లోపల ఉన్న జ్ఞాననేత్రం ఊడి చేతిలో పడుతుంది ఇప్పుడైనా చెబుతావా అని అడుగుతాడు. అయినా ఉదయ్ ఏమీ తెలియనట్టుగా నాకు ఏమీ తెలియదు సార్ మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అని అంటే ఇంకా విక్రమ్ కి ఓపిక అంతా పోయి ఒక చాక్ తీసుకుని వచ్చి ఉదయ్ ముందు కూర్చుంటాడు. విక్రమ్ ఏం చేయబోతున్నాడో భరత్ కి అర్థం అవుతుంది. ఉదయ్ వంక జాలిగా చూసి నీ మీద జాలితో ఇప్పుడు దాకా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకుండా అడిగాము కానీ... ఇప్పుడు విక్రమ్ ఇచ్చే పనిష్మెంట్తో నరకం కనబడుతుంది అని చెబుతాడు. వినయ్ ఆశ్చర్యంగా భరత్ వంక చూస్తూ ఏంటి బావ నువ్వు అనేది ఇప్పటిదాకా ఇచ్చింది పనిష్మెంట్ కాదా అని అడిగితే.... మీ అన్నయ్య దృష్టిలో కాదు. అందుకే నిన్ను ఇంటికి వెళ్ళిపోమన్నాము అంటే... లేదు బావ నేను ఉంటాను ఆ టార్చర్ ఏమిటో నేను చూస్తాను అని ఆనందం ఆత్రం తో కలిపి చెబుతాడు. మీ అన్నదమ్ములు ఇద్దరికీ ఇదేమి శాడిజం రా అని విక్రమ్ వైపు తల తిప్పుతాడు. విక్రమ్ మాత్రం కూల్ గా ఉదయ్ వైపు చూస్తూ నేను ఏ విషయం గురించి అడుగుతున్నాను నీకు తెలియదంటావా అంతే కదా అని అంటాడు. ఉదయ్ భయంగా అవును అని తలపుతాడు. సరే అయితే నేను చేసే పనితో నేను దీని గురించి అడుగుతున్నాను నీకు బాగా తెలుస్తుంది అని చెప్పి... తనే కుడిచేయిని తన చేతిలోకి తీసుకుని చాకుతో చిటికెన వేలిని చెక్కుతూ ఉంటాడు. ఆ నొప్పికి తట్టుకోలేక గట్టిగట్టుగా అరుస్తూ ఉంటాడు. రక్తం కూడా బొట్టు బొట్లుగా కారుతూ ఉంటుంది. అది చూసి వినయ్ భయంతో భరత్ చెయ్యి పట్టుకుని ఏంటి బావ అన్నయ్య అంత కూల్ గా ఏదో పేషనేట్గా చేసినట్టు చేస్తున్నాడు. దానికి భరత్ నవ్వుతూ అటు చూడు అని చెప్తాడు.విక్రమ్ మాత్రం ఏమి పట్టించుకోకుండా తను మెల్లిగా చెక్కుకుంటూ ఉంటాడు. ఉదయ్ ఇంకా బాధ తట్టుకోలేక ప్లీజ్ సార్ మీకు ఏం నిజం కావాలో చెప్పండి నేను చెప్పేస్తాను అని గోల పెడుతూ ఉంటాడు. దానికి విక్రమ్ నవ్వుతూ ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. మా పెళ్ళి రోజున ఏం జరిగింది అని సూటిగా ఉదయ్ వైపు చూసి అడుగుతాడు. అంతే ఆ మాటలకి ఉదయ్ గుండెజారి కడుపులోకి వస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాక మీ పెళ్లి రోజున ఏం జరుగుతుంది సర్.... మీకు శిల్పకి పెళ్లయింది. శిల్ప మీ ఇంటికి వచ్చింది అంతే కదా అని అంటాడు. అవునా అని చెప్పి ఇంకొక వేలు తీసుకుని మళ్ళీ చెక్కడం మొదలు పెడతాడు. ప్లీజ్ సర్ మీరు అలా చేయకండి నాకు చాలా భయమేస్తుంది అంటే.... అవునా అంత భయం వేస్తే మళ్లీ నాకు అబద్ధం ఎందుకు చెబుతున్నట్టు అని అడుగుతాడు. దానితో ఉదయ్ కి అర్థం అయిపోతుంది. విక్రమ్ కి అంతా తెలిసిపోయింది అని. నేను నిజం చెబితే నన్ను వదిలేస్తారా సార్ అని అడుగుతాడు. అది నీ పెర్ఫార్మన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏ ఒక్క విషయం కూడ దాయకుండా చెప్పు. ఎందుకంటే నేను నీ ఒక్కడు మీదే ఆధారపడి ఉండును. నా వేలో నేను చాలామంది దగ్గరనుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను. అందులో నువ్వు ఏదైనా దాచావని తెలిసిన, తప్పుడుగా చెప్పావని తెలిసినా.. చేతివేళ్లతో పాటు కాళ్లు వేళ్ళు కూడా తీసేస్తాను అని చాలా స్మూత్ గా బేస్ వాయిస్ తో చెబుతాడు. దానికి వినయ్ భారత్ తో ఏంటి బావ అన్నయ్య అంత సింపుల్ గా చెబుతున్నాడు అంటే... మీ అన్నయ్య ఇంట్లో వాళ్లతో మాత్రమే స్మూత్ గా ఉంటాడు బయట తన శత్రువులకి యముడే అని చెబుతాడు. ఉదయ్ ఏమి చెబుతాడు...
09-01-2026, 09:42 AM
(This post was last modified: 09-01-2026, 09:42 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 34
ఉదయ్ భయంగా విక్రమ్ వైపు చూస్తూ నాకు ఓపిక చాలా తక్కువ. నువ్వు నిజం చెబితే నీకే మంచిది. ఇంతకు మించి అయితే నేను అడగను అని తన సెక్యూరిటీ కి సైగ చేస్తాడు.
ఎస్ బాస్ అనుకుంటూ అతను ఒక రాడ్ తీస్తాడు. అది చూడగానే ఉదయ్ భయంతో ఏమి చేయొద్దు నేను చెప్పేస్తాను అని ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెడతాడు. మన వెర్షన్ లో... విక్రమ్ మ్యాచ్ వచ్చినప్పుడు ధనుంజయ్ అది అవిని కి కుదరచాలి అని అనుకుంటాడు. కానీ కూతురుతో మాట్లాడేది చాలా తక్కువ కాబట్టి... భార్గవిని పిలిచి అవనికి ఒక సంబంధం వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్నీ అవిని కి చూపించు. అవినికి నచ్చితే ఈ సంబంధం ముందుకు వెళదాము. వాళ్ల ఆచారం ప్రకారం పెళ్లి అయ్యేంతవరకు అబ్బాయి, అమ్మాయి ఒకరిని ఒకరు చూసుకోకూడదు.అందుకే అబ్బాయి ఫోటో మనకి పంపలేదు. కానీ అబ్బాయి డీటెయిల్స్ కావాలి నువ్వు చూడాలి అనుకుంటే... ఈ డీటెయిల్స్ లో ఉన్న లింక్ ఓపెన్ చేసావు అంటే అబ్బాయి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అని అని చెప్పి వెళ్ళిపోతాడు. అబ్బాయి డీటెయిల్స్ చూసి భార్గవికి చాలా అసూయగా అనిపిస్తుంది. ఇంత మంచి సంబంధం అవని కి కుదర్చడమా... అది ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. ఈ సంబంధం నా కూతురికే కుదుర్చుతాను. నా కూతురు మహారాణి లాగా ఉండాలి అనుకుంటూ ఆ డీటెయిల్స్ అన్నీ శిల్ప కు చూపిస్తుంది. శిల్ప డీటెయిల్స్ చూస్తూ మామ్ నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నేను మోడల్ అవ్వాలనుకుంటున్నాను. నాకు ఫ్యాషన్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెబుతోంది. భార్గవి శిల్ప నెత్తి మీద ఒకటి మొట్టి పిచ్చి మొహమా ఇంత మంచి సంబంధం వస్తే వాళ్ల కింద వీళ్ళకింద వర్క్ చేస్తానంటావ్ ఏంటి... ఇతన్ని పెళ్లి చేసుకుంటే ఫ్యాషన్ ఫీల్డ్ నీ చేతిలో ఉంటుంది. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయగలవు అని చెబుతుంది. ఏమిటి మా నువ్వు చెప్పేది అంటే అవును ఈ సంబంధం ఎలాంటిది అనుకుంటున్నా వో విక్రమ్ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ చెబుతుంది అది విన్న వెంటనే...శిల్పా కళ్ళు నోరు వదిలేసి అంత మంచి సంబంధం ఆ అవిని కి కాకుండా... నాకంటే డాడీ ఒప్పుకుంటారా అని అడుగుతుంది. అవన్నీ నీకెందుకు నేను చూసుకుంటాను కదా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిపో అని చెప్పి... ఆ డీటెయిల్స్ అన్ని శిల్ప కి ఇచ్చి వెళ్లిపోతుంది. విక్రమ్ ఫోటో లేక పోవడం వలన లింక్ ఓపెన్ చేసి చూస్తుంది. అది బిజినెస్ కి సంబంధించినది. అందులో విక్రమ్ అవార్డు తీసుకునేటప్పుడు, బిజినెస్ మీటింగ్స్ లో ఉన్న పిక్స్ ఉంటాయి. విక్రమ్ పిక్చర్స్ చుసిన శిల్ప మెస్మరైజ్ అవుతుంది. ఏంత అందంగా ఉన్నాడు. ఇలాంటి వాడిని అవనికి ఎలా వదిలేస్తాను. ఎప్పటికీ నా వాడే అని ఊహాలోకంలో తేలిపోతు ఉంటుంది. ఇదేమో తెలియని అవని కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంట్లో పని అంతా చేసి తన రూమ్ కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది భార్గవి ఆర్డర్. ధనుంజయ్ ముందుకు ఎప్పుడు రావడానికి వీల్లేదు అని చాలా స్ట్రిక్ట్ గా చెబుతుంది. దానికి కారణం ధనంజయ్ అని చెబుతుంది. రూమ్ లో కి వెళ్లి చదువుకుంటున్న అవిని దగ్గరికి భార్గవి వస్తుంది. భార్గవిని చూసి అవని ఏదన్నా అవసరం ఉందా పిన్ని అని అడుగుతుంది. నీకు ఒక సంబంధం వచ్చింది దాని గురించి మాట్లాడదామని వచ్చాను అని అక్కడ కూర్చుంటుంది. కానీ మీ నాన్న గారి కి ఆ సంబంధం శిల్ప కి చేయాలి అనుకుంటున్నారు. కానీ నువ్వు ఉండగా శిల్ప కి చేస్తే బాగోదు కదా అందుకే రేపు అందరి ముందు అడుగుతారు. అప్పుడు నాకు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పు. ఇది కూడా మీ నాన్నగారు చెప్పమన్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళుతున్న భార్గవి వంక చాలా బాధగా చూస్తుంది. ఎందుకు నాన్న మీకు అంత ద్వేషం కోపం అని బాధపడుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సత్యవతి గారు అవనినీ అడుగుతారు. నువ్వు అబ్బాయి డీటెయిల్స్ చూసావా... నీకు అంత ఓకేనా అని అడుగుతారు. దానికి తండ్రి వైపు చూస్తుంది. ఆయన కూతురు వైపు చూస్తారు. రాత్రి భార్గవి చెప్పిన మాటలు గుర్తు వచ్చి నాకు అపుడే పెళ్లి చేసుకోవాలిని లేదు నాన్నమ్మ అని చెప్పి తల దించుకుంటుంది. దానికి సత్యవతి గారు అవని గెడ్డం పట్టుకుని చాలా మంచి సంబంధం కాదనుకోకమ్మ అని నచ్చ చెబుతూ ఉంటారు. ధనుంజయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా కూతురు వైపే చూస్తూ ఉంటారు. అవని మనసులో నాన్నగారికి నాకు ఈ సంబంధం చేయడం ఇష్టం లేదు.అందుకే మాట్లాడటం లేదు అనుకుని... లేదు నాన్నమ్మ నేను ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకొను. నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతుంది. పెద్దవాళ్ళు ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతారు. ధనుంజయ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. భార్గవి ఇదే మంచి సమయం అనుకొని ఏమండి నేనొక మాట చెప్తాను వింటారా అని అడుగుతుంది. ఏమిటి అన్నట్టుగా చూస్తారు. ఈ సంబంధం శిల్ప కి కుదిర్చితే ఎలా ఉంటుంది అని అడుగుతుంది. ఆ మాటకి సత్యవతి గారు ఏమి మాట్లాడుతువు నువ్వు. అవని కి పెళ్లి కాకుండా శిల్ప కి ఎలా చేస్తాము అని గట్టిగ అడుగుతారు. దానికి భార్గవి... క్షమించండి అత్తయ్య నా ఉద్దేశం అది కాదు. ఇంత మంచి సంబంధం వదులుకోవడం ఇష్టం లేక అంటున్నాను. వాళ్లకి ముందే విషయం అంతా చెబుతాము. అంత ఒప్పుకుంటే ముందుకు వెళదాము అని...ఒకసారి శిల్ప తో మాట్లాడదామా అని ధనుంజయ్ వంక చూస్తుంది. ధనుంజయ్ కూడా ఆలోచిస్తూ సరే శిల్ప ని పిలిచి అడుగు అని చెబుతాడు. శిల్ప ని కిందకి రమ్మని చెబుతుంది. అందరిముందు శిల్ప ని నీకు ఒక మ్యాచ్ వచ్చింది. నీకు చేద్దామనుకుంటున్నాము నీకు ఇష్టమేనా అని అడుగుతుంది. మీ ఇష్టమే నా ఇష్టం అని చెబుతుంది. అబ్బాయి డీటెయిల్స్ ఏమీ తెలుసుకోవా. అని అడిగేతే నాకు మీరే ముఖ్యం నాన్న. మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అని చెప్పు రూమ్ లోకి వెళ్ళిపోతుంది. శిల్ప తనకి ఇచ్చిన రెస్పెక్ట్ కి ధనుంజయ్ పొంగిపోతాడు. అవని అలా ఎందుకు లేదు అని బాధపడతాడు. ధనుంజయ్, భార్గవి విక్రమ్ ఫ్యామిలీని కలుస్తారు. విక్రమ్ ఫ్యామిలీతో మాట్లాడుతున్న ధనుంజయ్ ఇంపార్టెంట్ కాల్ రావడంతో ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్లి మాట్లాడుతూఉంటాడు. ఇదే మంచి సమయం అనుకుని భార్గవి మాకు ఒక్కర్తే కూతురు. తనకి మీ సంబంధం బాగా నచ్చింది. మేము ఎంత చెబితే అంత మా అమ్మాయికి. మీరు ఎప్పుడు వస్తానంటే అప్పుడు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాము అని చెబుతుంది. దానికి ఇంట్లో వాళ్ళందరూ అమ్మాయికి చాలా పద్ధతిలు తెలుసు అనుకుంటా అని సంతోష పడి మంచి రోజు చూసుకుని వస్తాము అని చెబుతారు. సరే అయితేనండి మేము బయలుదేరుతాము అని భర్త వచ్చేటప్పటికి లేచి ఉంచుంటుంది. ధనుంజయ్ ఫోన్ మాట్లాడు వచ్చేటప్పటికి ఇక్కడ పెళ్ళి మాటలన్నీ అయిపోతాయి. అన్ని విషయాలు చెప్పవా భార్గవి అంటే చెప్పాను అండి అమ్మాయి గురించి అని చెబుతుంది. సరే అని చెప్పి మేము బయలుదేరుతామండి. ఏ విషయమో మీరు చెప్పండి అని చెప్పి శిల్ప డీటెయిల్స్ ఫోటో ఇచ్చి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత శిల్ప ఫోటో చూసి అమ్మాయి బాగుంది కదా అని అనుకుంటారు. మంచిరోజు చూసుకొని ధనుంజయ్ ఇంటికి ఆడవాళ్ళందరూ పెళ్లి చూపులకు వెళ్తారు. పెళ్లిచూపుల్లో శిల్ప అందరికీ బాగా నచ్చుతుంది. విక్రమ్ పక్కన సరైన జోడి అని అనుకుంటారు. శిల్ప కూడా అంతే పద్ధతిగా, వినయంగా వాళ్ళ ముందు కూర్చుంటుంది. ధనుంజయ్ భార్గవిని పిలిచి అవిని ఎక్కడ అని అడుగుతాడు. దానికి నేను అవిని తో ఎంతో చెప్పాను అండి... ఈరోజు చెల్లికి పెళ్ళి చూపులు ఉన్నాయి ఇంట్లో ఉండు అని. నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళిపోయిందండి అని బాధగా చెబుతుంది. ధనుంజయ్ కూడా బాధపడుతూ సరేలే ఏం చేస్తాము,ముందు ఈ కార్యక్రమం చూడు... అని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. భార్గవి కన్నింగ్ గా నవ్వుతూ నాకు తెలుసు మీకు ఎలా చెబితే లొంగుతారో అని వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటుంది. భార్గవి తన అన్నయ్య, వదిన అయినా సునీల్,బిందుని పరిచయం చేస్తుంది. అత్తగారు, మావయ్య గారు అయినా సత్యవతి, శేషగిరి కూడా పరిచయం చేస్తుంది. అందరూ నమస్కారం చేసి కూర్చుంటారు. సత్యవతిగారు విక్రమ్ ఫ్యామిలీని చూసి.... కుటుంబం చాలా బాగుంది. అవని ఆ ఫ్యామిలీలోనికి వెళితే చాలా సుఖపడుతుంది. కానీ ఎందుకు అవని వద్దు అంది. దీని వెనకాల ఏదైనా ఈ భార్యా భర్తల హస్తము ఉందా అని కొడుకు కోడలువైపు అనుమానంగా చూస్తుంది. రెండు కుటుంబాల వారికి అన్నీ ఆమోదమై పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటారు. విక్రమ్ ఫ్యామిలీ ఆచారం ప్రకారం ఇంటి కోడలు కి అన్ని అత్తగారు చేతుల మీదే జరుగుతాయి. పెళ్లి వాళ్ళు వెళ్లిన కాసేపటికి అవని ఇంటికి వస్తుంది. ధనుంజయ్ కోపంగా అవిని తో ఈరోజు శిల్పకి పెళ్లి చూపులు అని తెలుసు కదా... నువ్వు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్లావు అని కోపంగా అరుస్తాడు. దానికి అవని ఒక సారి తండ్రి వైపు చూసి తలదించుకుని తన రూమ్ లోనికి వెళ్ళిపోతుంది. సమాధానం చెప్పని కూతురి వైపు అసహనంగా చూస్తాడు. కానీ సత్యవతికి ఎందుకో అనుమానం వచ్చి అవిని వెనకాలే రూమ్ లోనికి వెళ్లి ఏమైంది బంగారం అని అడిగితే... నానమ్మ అని పట్టుకుని ఏడుస్తుంది. అవినీ ఏమని చెబుతుంది.... కథ కొనసాగుతుంది....
09-01-2026, 03:48 PM
Great going...
09-01-2026, 04:59 PM
Excellent update
09-01-2026, 06:39 PM
Tjondhar ga update peyttu bro
09-01-2026, 07:02 PM
09-01-2026, 09:19 PM
09-01-2026, 11:43 PM
(This post was last modified: 09-01-2026, 11:49 PM by ash.enigma. Edited 2 times in total. Edited 2 times in total.)
Bhayya.. idi non-erotic section ki move chesaru!
inka romance kaani.. inka edi undada!!?? Story kekaputtistunnav.. ❤️❤️ But ekkado china aasha.. avini tho china romance.. chinna china achika buchikalu.. etc etc!! Maaku konni aashalu untay kada bro
10-01-2026, 12:57 AM
సెక్షన్ ఏదైనా స్టోరీ మాత్రం అదుర్స్... ఎక్కడ ఉన్నా చదువుతారు... నేను ఫస్ట్ స్టోరీ కనబడక కంగారు పడ్డాను.. గూగుల్ లోకి వెళ్ళి వెతికితే దొరికింది
10-01-2026, 03:28 AM
Super daily 3 update s evara bro
10-01-2026, 04:11 AM
10-01-2026, 07:30 AM
Excellent
10-01-2026, 07:31 AM
Super twist's in story
10-01-2026, 02:39 PM
Sarit gaaru, rachayita gaariki meeru non-erotic lo pettaarani teliyaka next episode upload cheyalekapoyaremo! Sex Stories forum lone vunchandi, please!!
|
|
« Next Oldest | Next Newest »
|