Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#41
Supero super
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Waiting for next update
Like Reply
#43
Siva garu Superb storytelling, very gripping. There are some spelling mistakes and names getting mixed up. Just wanted to point out that thing. Otherwise your style of writing is excellent, good plot, going to be great read. Not many people visiting this thread otherwise will be great hit. Think most are not aware of this section.
Like Reply
#44
ఎపిసోడ్ 13


సుజిత్ లండన్ నుంచి ఇండియాకి వచ్చి నంద గ్రూప్ గెస్ట్ హౌస్ లో దిగిన వెంటనే అక్కడికి వచ్చి పరిచయం చేసుకుంది రియా.

*****************

ఆస్ట్రేలియా తన ఆఫీసులో ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి "హలో అగస్త్య! నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను." అంటూ సంతోషంగా అన్నాడు రఘురామ్.

"ప్రణవ్ సార్ మీకు కాల్ చేయమని చెప్పారు నాతో ఏమైనా పని పడిందా?" అని అడిగాడు అగస్త్య.

"ఎస్! ఇండియాలో నందా గ్రూప్ పేరు ఎప్పుడైనా విన్నావా?" అని అడిగాడు రఘురామ్.

"హ..! విని చాలా కాలమైంది ఇప్పుడు ఇండియాలో ఆ పేరు వినిపించడం లేదు విషయం ఏమిటో చెప్పండి?" అన్నాడు అగస్త్య.

"ఇండియాలో ఆ గ్రూప్ కి ఉన్న ఆస్తులలో నేను కూడా ఒక పాట్నర్! ఇప్పుడు అక్కడ ఉన్న ఆస్తులు మొత్తం సేల్ చేయడానికి నిర్ణయించుకున్నాము.'

'మా అందరి తరపున ఒక మనిషిని అక్కడకు పంపిచాము నీ మనుషులు ఎప్పుడూ అతని ఫాలో అవుతూ ఉండాలి అక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయం నాకు తెలియాలి." అన్నాడు రఘురామ్.

"సార్! ఇలాంటి చిన్నచిన్న పనులు నేను చేయను  ఆ మనిషిని చంపేయమంటారా చెప్పండి ఐదు నిమిషాల్లో వర్క్ ఫినిష్ చేసి మీకు కాల్ చేస్తాను, నా రేంజ్ ఏమిటో ప్రణవ్ సర్ చెప్పే ఉంటారు." అన్నాడు అగస్త్య.

"ఎస్ ఎస్! నీ గురించి మొత్తం చెప్పాడు ఇది చిన్న పని కాదు చాలా పెద్ద పని, నీకు పేమెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.'

'నువ్వు ఓకే అంటే! అడ్వాన్స్ తో పాటు డీటెయిల్స్ కూడా ఇప్పుడే పంపిస్తాను." అని చెప్పాడు రఘురామ్.

"ఓకే సర్! పెద్ద వర్క్ అంటున్నారు కదా పంపించండి ఈరోజు నుంచే నా నెట్వర్క్ మొత్తం ఆ మనిషి మీద ఉంటుంది ప్రతి విషయం మీకు ఇన్ఫామ్ చేస్తాను." అన్నాడు అగస్త్య.

"ఓకే థాంక్యూ!" అంటూ ఫోన్ పెట్టేసి మేనేజర్ ని పిలిచి "ఈ ఎకౌంట్ నెంబర్ కి ఫైవ్ క్రోర్స్ ట్రాన్స్ఫర్ చేయండి." అని చెప్పి సుజిత్ డీటెయిల్స్ ఆగస్త్య కి పంపించాడు రఘురామ్.

*******************

ఉదయం నంద గ్రూప్ గెస్ట్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న సుజిత్ దగ్గరకు వచ్చి "హాయ్ సార్! నా పేరు రాజాన్  మీతో నిన్న ఫోన్ లో మాట్లాడింది నేనే!" అంటూ పరిచయం చేసుకున్నాడు రాజన్.

"హో..  వెల్కమ్ వెల్కమ్!' అంటూ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి "డాడ్ మీతో అన్ని విషయాలు మాట్లాడారు అనుకుంటా! మనం ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాము." అన్నాడు సుజిత్.

"మీ ప్రాపర్టీ లిస్ట్ మొత్తం ఇస్తే ముందుగా అక్కడికి నా మనుషుల్ని పంపిస్తాను మీరు వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది." అన్నాడు రాజన్.

"థాంక్యూ!' అంటూ రియా తీసుకొచ్చిన జ్యూస్ తాగుతూ "తన పేరు రియా! నా పర్సనల్ అసిస్టెంట్! నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు వస్తుంది తనకి కూడా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా చూడండి.'

'అలాగే! ఇక్కడ ఉన్న  ప్రాపర్టీస్ సేల్ చేయాలి అనుకుంటున్నాము మంచి కన్సల్టెన్సీ ఎవరైనా ఉంటే చెప్పండి మన దెబ్బకి అతను కూడా సెటిలైపోతాడు." అంటు నవ్వుతూ అన్నాడు సుజిత్.

"ఒక వ్యక్తి తెలుసు! అతని పేరు అరుల్! పెద్దపెద్ద విఐపి లకి ప్రాపర్టీ డీల్స్ సెట్ చేస్తూ ఉంటాడు, మీరు ఓకే అంటే ఈవినింగ్ ఇక్కడికి రమ్మని చెబుతాను.'

'నాకు బాగా తెలిసిన మనిషి ఎంత పెద్ద ప్రాపర్టీ అయిన సింగిల్ సిట్టింగ్ లో సెట్ చేస్తాడు." అన్నాడు రాజన్.

"గుడ్! నేను లంచ్ కి సెంట్రల్ మినిస్టర్ వరదరాజులు గారి ఇంటికి వెళుతున్నాను వచ్చిన తర్వాత అరుల్ ని మీట్ అవుతాను." అన్నాడు సుజిత్.

"ఓకే సర్! పొలిటికల్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా అవసరమైతే కాల్ చేయండి." అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజన్.

********************

రియాతో కలిసి లంచ్ కి ఇంటికి వచ్చిన సుజిత్ చూసి సంతోషంగా పట్టుకుని "నిన్ను చూస్తుంటే మీ నాన్నని చూసినట్టే ఉంది రా.. నువ్వు పుట్టకముందే లండన్ వెళ్లిపోయాడేమో నిన్ను చూడడం కుదరలేదు.'

'పోనీలే! బిజినెస్ పని మీద అయినా ఇండియాకి వచ్చావు." అంటూ డైనింగ్ హాల్ కి తీసుకెళ్లి భోజనం  వడ్డీస్తూ

"ఇండియాలో ఉన్న నంద గ్రూప్ ప్రాపర్టీ వాల్యూస్ బాగా పెరిగాయి కదా మీ షేర్ ఎంతో ముందే డిసైడ్ చేసుకోండి." అన్నాడు వరదరాజులు.

"ఓకే అంకుల్! ఏదైనా ప్రాబ్లం అయితే మీరు ఉన్నారు కదా!" అంటూ నవ్వుతూ అన్నాడు సుజిత్.

"అవును! 12 సంవత్సరాలుగా ఇక్కడ బిజినెస్ గురించి పట్టించుకోవడం కూడా మానేశారు అక్కడ అంత బిజీ అయిపోయారా?" డౌట్ గా అడిగాడు వరదరాజులు.

ఆ మాటకి స్మైలిస్తూ "అన్ని విషయాలు సెట్ చేయడానికి నేను వచ్చాను అంకుల్! ఇకనుంచి ఇండియాలో కూడా బిజినెస్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది." అన్నాడు సుజిత్.

"ఓకే! ప్రాపర్టీస్ కూడా అమ్ముతారు అని తెలిసింది నేను ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటున్నాను ఆ గుర్ గామ్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ సెట్ చేస్తే మీకు ఉపయోగపడతాను." అన్నాడు వరదరాజులు.

"ఓకే అంకుల్!వన్ వీక్ లో స్టార్ట్ చేస్తాము ఫస్ట్ ప్రయారిటీ మీదే!" అన్నాడు సుజిత్.

"ఆ మాట అన్నావు చాలు! నీకు ఇండియాలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో అవసరం ఉన్న నాకు ఒక్క ఫోన్ కొట్టు చాలు వెంటనే పని అయిపోతుంది." అన్నాడు వరదరాజులు.

"థాంక్స్ అంకుల్! మరి నేను వెళ్లొస్తాను మ్యాగ్జిమం టెన్ డేస్ లో అన్ని సెట్ చేసి కాల్ చేస్తాను." అంటూ రియాతో కలిసి వెళ్లిపోయాడు సుజిత్.

*****************

సాయంత్రం గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి "సార్! నేను చెప్పాను కదా ఇతనే అరుల్! ఢిల్లీ సరౌండింగ్ లో ఏ పెద్ద డీల్ జరిగిన ఇతని ద్వారానే జరుగుతుంది అతనికి పరిచయం లేని వీఐపీ అంటూ లేడు." అని పరిచయం చేశాడు రాజాన్.

"హాయ్ అరుల్! ప్లీజ్ సిట్ డౌన్! రాజన్ దగ్గర మా కంపెనీ సేల్ చేయబోయే ప్రాపర్టీస్ లిస్ట్ మొత్తం ఉంది.

'ఆ లిస్టులో చిన్న ప్రాపర్టీ ప్రాపర్టీ వ్యాల్యూ మినిమం థౌసండ్ క్రోర్స్ పైనే ఉంటుంది నీ దగ్గర అంత పెద్ద పార్టీలు ఉన్నారా?" అని అడిగాడు సుజిత్.

"మీరు ఓకే అంటే వన్ వీక్ లో బయ్యర్స్ ని మీ ముందు క్యూలో ఉంచుతాను మీ కంపెనీ ప్రాపర్టీస్ అంటే మార్కెట్లో హాట్ కేకు లాగా వెళ్ళిపోతాయి." అన్నాడు అరుల్.

"ఓకే! నేను రేపటి నుంచి ప్రాపర్టీస్ విసిటింగ్ కి రాజన్ తో కలిసి వెళుతున్నాను నువ్వు ఈ వన్ వీక్ లో బయర్స్ ని రెడీ చేసుకో ఈ డీల్స్ తో అందరి లైఫ్ సెటిల్ అయిపోవాలి." అంటూ స్మైల్ ఇచ్చాడు సుజిత్.

"ఓకే సార్! ప్రాపర్టీ వాల్యూ లో 2% నా కమిషన్ రిజిస్ట్రేషన్ కి ముందే  పే చేయాలి డబ్బుల విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాను." అన్నాడు అరుల్.

"నో ప్రాబ్లం! నువ్వు ఎలా అంటే అలా చేద్దాము, కానీ వర్క్ మాత్రం స్పీడ్ గా అవ్వాలి టూ మంత్స్ లో కంప్లీట్ చేసుకుని లండన్ వెళ్లిపోవాలి." అన్నాడు సుజిత్.

"నో ప్రాబ్లం సార్! వర్క్ స్పీడ్ గా కంప్లీట్ అవుతుంది." అంటూ ఫైల్ తీసుకుని  వెళ్ళిపోయాడు అరుల్.

"రాజన్! మీరు కూడా వెళ్లొచ్చు మార్నింగ్ మనం ప్రాపర్టీస్ విజిటింగ్  కి బయలుదేరుదాము ఈరోజు నాకు కొంచెం రెస్ట్ కావాలి." అంటూ రియా వైపు చూసి స్మైల్ ఇచ్చాడు సుజిత్.

"ఓకే సార్! మార్నింగ్  రెడీగా ఉండండి." అంటూ రియా వైపు అనుమానంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజన్.

***********************

కోర్ట్ లో తన ఛాంబర్ లో ఉన్న హిర్వాణి దగ్గరికి వచ్చి "నమస్తే సార్!" అన్నాడు మిచల్.

"హ... మిచల్ వచ్చావా? నీకోసమే చూస్తున్నాను ఫోను కూడా కలవడం లేదు ఏంటి?" డౌట్ గా అడిగాడు హిర్వాణి.

"ఆ జైలర్ గాడి ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి మేము చూసుకోకుండా లోపలికి వెళ్ళాము ఆ వీడియోలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేదాకా కొంచెం జాగ్రత్తగా ఉందామని మూడు రోజులుగా ఎవరం బయటికి రాలేదు.'

'వీడియో నిన్న సాయంత్రం నా చేతికి వచ్చింది  దాంట్లో ఉన్న కుర్రోళ్ళని వెనక్కి పంపించేసి కొత్త వాళ్ళ రప్పించాను ఇంతకీ నేను ఇచ్చిన స్ట్రోక్ కి ఏదైనా రిజల్ట్ ఉందా?" డౌట్ గా అడిగాడు మిచల్.

"నో రెస్పాన్స్! ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఇవ్వాలి, పనోడిని భయపెడితే సరిపోదు అసలైన వాళ్లకి భయం ఏమిటో చూపించు సెక్యూరిటీ ఆఫీసర్లు సంగతి నేను చూసుకుంటాను." అన్నాడు హిర్వాణి.

"ఓకే సార్! ఆ జైలర్ గాడి చెల్లి రోజు ఛానల్ ఆఫీస్ దగ్గరికి వెళుతుందని మా వాళ్ళు చెప్పారు అక్కడ స్పాట్ పెడతాను." అన్నాడు మిచల్.

"నాకు తెలిసి అది కూడా సరిపోదు వాడి కూతురు చిన్నపిల్ల కదా కొంచెం సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఆలోచించు." అన్నాడు హిర్వాణి.

"మా క్రిమినల్స్ కన్నా మీ లాయర్లకే ఎక్కువ ఐడియాలు వస్తుంటాయి." అంటు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిచల్.

అక్కడి నుంచి వెళుతున్న మిచల్ వైపు చూసి 'నువ్వు క్రిమినల్ అవ్వకముందే నేను క్రిమినల్ లాయర్ ని రా...!' అని మనసులో అనుకున్నాడు హిర్వాణి.

కోర్టు దగ్గర నుంచి తన మనుషులతో కలిసి ట్రూ ఛానల్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ స్కూటీ మీద వస్తున్న నీలమ్ ని చూసి తన మనుషుల వైపు తిరిగి

"ఒరేయ్! నలుగురు వెళ్లి దానిని స్కూటీ మీద నుంచి కింద పడేసి ఆ స్కూటీని తగలబెట్టండి. ఇద్దరు జరిగేది మొత్తం వీడియో తీయండి దాని అన్నకి వదినకి పంపుదాము." అంటు నవ్వుతూ అన్నాడు మిచల్.

"సరే బాయ్!" అంటూ నీలమ్ స్కూటీకి ఎదురుగా వెళ్లారు నలుగురు.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#45
ఎపిసోడ్ 14


రాజన్, మినిస్టర్ వరదరాజులు, ల్యాండ్ డీల్ చేసే అరుల్ లని మీట్ అయ్యాడు సుజిత్.

ట్రూ ఛానల్ ఆఫీస్ దగ్గరకు వస్తున్న నీలమ్ ని చూసి తన మనుషులని ఎటాక్ చేయమని పంపించాడు మిచల్.

*********************

స్కూటీ మీద వస్తూ ఎదురుగా ఉన్న మనుషుల్ని చూసి బండి స్లో చేసి మొబైల్ తీసి న్యూస్ ఛానల్ గ్రూప్ లో, ఫ్యామిలీ గ్రూప్ లో లొకేషన్  షేర్ చేసి హెల్ప్ అని మెసేజ్ పెట్టింది నీలమ్.

దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న మొబైల్ లాక్కుని "ఏంటి! సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేస్తున్నావా? దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు." అంటు నవ్వుతూ అన్నాడు మిచల్ మనిషి.

ఎదురుగా ఉన్న నలుగురి వైపు అనుమానంగా చూస్తూ "ఎవరు మీరు? మీ గురించి నేనేమైనా న్యూస్ టెలికాస్ట్ చేసానా?" డౌట్ గా అడిగింది నీలమ్.

"మేము ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వము." అంటూ బైక్ కీస్ తీసుకుని "మీ ఇంటి దగ్గర అంత చికాకు జరిగినా ధైర్యంగా ఆఫీస్ కి బానే వచ్చావు, ఆ జైలు నుంచి రిలీజ్ అయినోడి మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి?" అన్నాడు నలుగురిలో ఒకడు.

"ఓహో! మీరు అభిర్ ఫ్యాన్స్ ఆ...!" అంటూ వీడియో తీస్తున్న వాడి వైపు చూసి "కెమెరా నా వైపు తిప్పు నేను మాట్లాడింది మిమ్మల్ని పంపించిన వాడు వినాలి కదా!'

'అయినా! భయపడుతుంది నేను కాదు మీరు! అందుకే మూసుగులు వేసుకొని వచ్చారు." అంటూ వెటకారంగా చూస్తూ అంది నీలమ్.

ఆ మాట విని కోపంతో ముసుగు తియ్యబోతున్న తన మనిషి దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని కిందకు లాగి నీలమ్ వైపు చూస్తూ

"మీడియా అని పొగర? మీ ఫ్యామిలీకి ఇదే లాస్ట్ వార్నింగ్! ఆ అభిర్ కి హెల్ప్ చేయడం గురించి మర్చిపోండి లేకపోతే ఇంకా వార్నింగ్ ఇవ్వడం ఉండదు.'

'మీ అన్నయ్య జైలర్ కదా వెళ్లి మిచల్ గ్యాంగ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారని చెప్పు అతనికి నా గురించి బాగా తెలుసు!" అంటూ

స్కూటీ స్టార్ట్ చేసి ట్యాంక్ లో అగ్గిపుల్ల వేసి ముందుకు వదిలి తన మనుషులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిచల్.

అంతలో వీడియో తీస్తూ పరిగెత్తుకుంటూ నీలమ్ దగ్గరికి వచ్చి "బానే ఉన్నావు కదా!" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న మిచల్ గ్యాంగ్ వైపు చూసి

"ఎవరు వాళ్ళు? మూసుగులు వేసుకొని వచ్చి బెదిరిస్తున్నారు." డౌట్ గా అడిగాడు ఆఫీస్ కొలీగ్.

"ఆ విషయం గురించి చెబుతాలే కానీ ముందు కాలిపోతున్న నా బండిని వీడియో తీయండి." అంది నీలమ్.

శంకర్ తో కలిసి కారులో స్పీడ్ అక్కడికి వచ్చి  కాలిపోతున్న బండి వైపు చూస్తూ నీలమ్ దగ్గరకు వచ్చి "ఎవరు చేసింది?" అంటూ కోపంగా అడిగాడు సందీప్.

"మిచల్ గ్యాంగ్! నీకు బాగా తెలుసు అంట కదా! అభిర్ కి హెల్ప్ చేయకూడదు అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు." అని చెప్పింది నీలమ్.

"ఈ కేసులో మిచల్ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయిందా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ

"సరే! నువ్వు ఆఫీస్ కి వేళ్ళు ఈ విషయం గురించి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వకు నేను చూసుకుంటాను." అన్నాడు సందీప్.

"ఓకే అన్నయ్య!" అంటూ అక్కడికి వచ్చిన తన కొలీగ్స్ తో కలిసి ఆఫీస్ కి వెళ్ళింది నీలమ్.

అభిర్ తో కలిసి హడావుడిగా అక్కడికి వచ్చి జరిగింది చూసి శ్రీకర్ కి కాల్ చేసి చెప్పాడు శక్తిదాస్.

"ఓకే! అక్కడే ఉండండి నేను వస్తున్నాను." అంటూ ఫోన్ పెట్టేసాడు శ్రీకర్.

అభిర్ వైపు చూసి "నీకు మిచల్ ఎవరో తెలుసా?" అని అడిగాడు సందీప్.

"ఆ పేరు ఎప్పుడు నేను వినలేదు అసలు ఇంతకీ అతను ఎవరు? ఈ పని చేసింది అతనేనా?" డౌట్ గా అడిగాడు అభిర్.

"ఎస్!" అంటూ అక్కడికి వస్తున్న శ్రీకర్ ని చూసి "అబీర్ కేసులో మిచల్ గ్యాంగ్ ఎంటర్ అయింది. ఇంటి దగ్గర ఎటాక్ చేసింది కూడా వాళ్లే! ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు." అన్నాడు సందీప్.

"అవునా?" అంటూ తనతో పాటు వచ్చిన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ని చూపించి "ఏసీపి దయ!  ఈ కేసులో తనని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను." అంటూ ఆఫీస్ లోపలికి వెళ్తున్న అభిర్ ని చూపించి "అతనే రిలీజ్ అయిన మనిషి!" అని చెప్పాడు శ్రీకర్.

న్యూస్ ఛానల్ ఆఫీస్ లోపలికి వెళుతున్న అబీర్ వైపు చూస్తూ "అసలు ఎవరు అతను? మిచల్ లాంటి ఒక మాఫియా లీడర్ ఎంటర్ అయ్యేంత అతని దగ్గర ఏముంది?'

'ఆ గ్యాంగ్ చిన్నచిన్న పనులు ఒప్పుకోరు అమౌంట్ కూడా భారీగానే తీసుకుంటారు అంత పెద్ద తలకాయలు ఈ కేసు వెనకాల ఎవరు ఉన్నారు?" అంటూ అనుమానంగా అడిగాడు దయ.

"ఈ కేసు వెనకాల ఎవరు ఉన్నారో ఇప్పటివరకు మేము కనిపెట్టలేకపోయాము, ఈ కేసును డీల్ చేస్తుంది మాత్రం క్రిమినల్ లాయర్ హిరణ్య!'

'టుడేస్ లో ఈ కేసు హియరింగ్ ఉంది అందుకనే అంత కంగారు పడుతున్నారు ఎలాగైనా అబీర్ ని జైల్ లోనే ఉంచడానికి ట్రై చేస్తున్నారు." అన్నాడు శ్రీకర్.

"మిచల్ గ్యాంగ్ సుపారీ తీసుకుని మనుషుల్ని లేపేస్తారు కానీ ఇలా బెదిరించరు." అన్నాడు దయ.

"ఒకవేళ అదే నిజమైతే డైరెక్ట్ గా అభిర్ మీద ఎటాక్ చేసి చంపేయచ్చు కదా! ఎందుకు భయపెట్టి జైలుకు పంపించాలని చూస్తున్నారు." డౌట్ గా అడిగాడు సందీప్.

"సుపారీ ఇచ్చిన పార్టీ అతన్ని చంపకుండా భయపెట్టమని మాత్రమే చెప్పి ఉంటుంది. మీ సిస్టర్ తో కంప్లైంట్ ఇప్పిస్తే ఆ గ్యాంగ్ ని పట్టుకోడానికి ఆఫీసర్స్ ని పంపిస్తాను." అన్నాడు దయ.

"నో! ఈ కేసులో నుంచి అభిర్ బయటికి వచ్చేవరకు ఏమి జరిగిన ఎలాంటి కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు దీనిని సాకుగా చూపించి కేసును పెండింగ్ లో ఉంచి మాఫియా తో లింక్ పెట్టి  బెయిల్ క్యాన్సిల్ చేయాలని చూస్తున్నారు." అన్నాడు సందీప్.

"ఓకే మీ ఇష్టం! కానీ ఆ గ్యాంగ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు కోసం ఏమైనా చేస్తారు." అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు దయ.

శక్తిదాస్  వైపు చూసి "మీరు అభిర్ ని తీసుకుని ఇంటికి వెళ్ళండి నేను ఒక్కసారి లాయర్ హిరణ్యని మీట్ అవ్వాలి." అన్నాడు శ్రీకర్.

"ఓకే సార్!" అంటూ అభిర్ కోసం ఆఫీసు లోపలికి వెళ్లారు ఇద్దరు.

"మిస్టర్ శ్రీకర్! మురళి జోషి భార్యాపిల్లలు మన దగ్గర ఉన్న విషయం హిరణ్యకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు వాళ్ల ప్రాణాలకు చాలా ప్రమాదం!" అన్నాడు సందీప్.

"ఓకే!" అంటూ కార్ లో స్పీడ్ గా వెళ్ళాడు శ్రీకర్.

ఛానల్ ఆఫీస్ లో తన ఛాంబర్ లో ఉన్న నీలమ్ దగ్గరికి వెళ్లి "నువ్వు బానే ఉన్నావు కదా!" అని అడిగాడు అభిర్.

"ఐ యాం ఓకే! కానీ చాలా బాధగా ఉంది. నా ఆఫీస్ లో మొత్తం 60 మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వర్క్ లో హెల్ప్ చేశాను.'

'అందరూ నా ఫ్రెండ్స్ అనుకున్నాను కాని గ్రూప్ లో హెల్ప్ అని మెసేజ్ పెడితే ముగ్గురు మాత్రమే వచ్చారు మిగతా వాళ్ళ లైట్ తీసుకున్నారు." అంటూ డల్ గా చెప్పింది నీలమ్.

"ఒక్కటే గుర్తుంచుకో! డబ్బు ఉందని, తెలివి ఉందని, పదవి ఉందని స్నేహం చేయకూడదు మనల్ని ఆపదలో కూడా ఆదుకునే వాడితోనే స్నేహం చేయాలి." అన్నాడు అభిర్.

"కరెక్ట్! ఇప్పుడే నాకు నిజమైన స్నేహితులు ఎవరో తెలిసింది." అంటూ స్మైల్ ఇచ్చింది నీలమ్.

"నేను కాలేజ్ దగ్గరికి రోషినిని తీసుకు వస్తాను అప్పటివరకు ఇక్కడే ఉండు అందరం కలిసి ఇంటికి వెళదాము." అని చెప్పి అక్కడకు వచ్చిన కుమార్ వాళ్లతో పాటు కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు అభిర్.

******************

కోర్టు దగ్గర తన ఛాంబర్ లో ఉన్న హిరణ్య దగ్గరికి వెళ్లి "హాయ్ సర్! ఐ యాం శ్రీకర్ సిబిఐ! అభిర్ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది నేనే!" అని పరిచయం చేసుకున్నాడు శ్రీకర్.

"హ.. తెలుసు! మిమ్మల్ని కలిసే టైమ్ ఇంకా రాలేదు అందుకే మీకు ఇంకా ఫోన్ రాలేదు." అంటూ పొగరుగా చెప్పాడు  హిరణ్య.

"మిమ్మల్ని కలిసే టైమ్ నాకు వచ్చింది అందుకే వచ్చాను." అంటూ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శ్రీకర్.

"నా ఛాంబర్ కి వచ్చి నా ముందు కూర్చుని ఇలా మాట్లాడుతున్న ఫస్ట్ ఆఫీసర్ మీరే! నా గురించి మీకు సరిగ్గా తెలియదు అనుకుంటా!" అంటూ పొగరుగా అన్నాడు హిరణ్య.

"మీ గురించి డీటెయిల్ గా తర్వాత తెలుసుకుంటాను, కాని నాకు ఒక విషయం గురించి డీటెయిల్ గా చెప్పాలి.'

'12 సంవత్సరాల క్రితం మురళి జోషితో పాటు మరొక వ్యక్తి చనిపోయాడు ఆ విషయం బయట ప్రపంచానికి కూడా తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేశారు.'

'ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కూడా నేను తెలుసుకున్నాను ఆ విషయం గురించి పర్సనల్ గా మాట్లాడడానికి వచ్చాను." అంటూ హిరణ్య కళ్ళలో కంగారు చూస్తూ చెప్పాడు శ్రీకర్.

"ఆరోజు మురళి జోషి ఒక్కడే చనిపోయాడు అతన్ని అభిర్ చంపేడు ఆ విషయం మురళీ జోషి భార్య కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఆ ప్లేస్లో ఇంకెవరో చనిపోలేదు." అంటూ కంగారుగా అన్నాడు హిరణ్య.

"అంటే! ఈ కేసు ఫైల్ చేసింది మిమ్మల్ని లాయర్ గా అపాయింట్మెంట్ చేసుకుంది మురళి జోషి భార్య అంటారు." డౌట్ గా అడిగాడు శ్రీకర్.

"ఎస్! ఈ కేస్ ఫైల్ చేసింది  నన్ను లాయర్ గా అపాయింట్ చేసుకుంది మురళి జోషి భార్య!" అన్నాడు హిరణ్య.

"గుడ్! ఈ కేసులో ఇంకెవరి ఇన్వాల్వ్మెంట్ లేదు అంటున్నారు అంతేకదా!" అన్నాడు శ్రీకర్.

"ఎస్!" అన్నాడు హిరణ్య.

"ఓకే థాంక్యూ!" అంటూ అక్కడి నుంచి వెళుతూ వెనక్కి తిరిగి "అసలు! అబీర్ ఎవరో తెలుసా? ముందు అతని గురించి పూర్తిగా తెలుసుకోండి." అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు శ్రీకర్.
[+] 9 users Like SivaSai's post
Like Reply
#46
Siva garu superb your story writing is excellent, it runs very fast without ever getting boring. Always maintaining the excitement. Congrats.
Like Reply
#47
ఎపిసోడ్ 15


నీలమ్ ని  ఆఫీసులోనే ఉండమని చెప్పి రోషిని తీసుకురావడానికి కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు అభిర్.

కోర్టులో ఉన్న హిరణ్య దగ్గరికి వెళ్లి ముందు అభిర్ గురించి తెలుసుకోమని చెప్పాడు శ్రీకర్.

******************

శ్రీకర్ చెప్పిన మాటకి ఆలోచనలో పడి హడావిడిగా వెనకాలే కారు దగ్గరికి వెళ్లి "ఆఫీసర్! మీరు నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?" అంటూ లేని నవ్వుని తెచ్చుకుంటూ అడిగాడు హిరణ్య.

ఆ మాటకి కార్ డోర్ తీసి వెనక్కి తిరిగి "గ్రేట్ క్రిమినల్ లాయర్ హిరణ్యగారిని ఇప్పటివరకు ఎవరు భయపెట్టలేకపోవచ్చు!'

'కానీ మిమ్మల్ని మీ వెనకాల ఉన్న వాళ్ళని భయపెట్టడానికి ఒకడు సిద్ధమవుతున్నాడు అది మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది." అంటూ కార్డ్స్ స్టార్ట్ చేసుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు శ్రీకర్.

అంతలో అక్కడికి వచ్చి "సార్! నెక్స్ట్ కేసు మనదే!" అని చెప్పాడు జూనియర్.

"ఈరోజు ఏ కేసుకి నేను హాజరవ్వడం లేదు మీరు చూసుకోండి." అంటూ టెన్షన్ గా ఆఫీసు రూమ్ లోకి వెళ్లి కూర్చుని ఆలోచిస్తూ

"ఈ ఆఫీసర్ ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి వార్నింగ్ ఎందుకు ఇస్తున్నాడు కచ్చితంగా ఏదో ఉంది." అంటూ కేసు ఫైల్ తీసి చూస్తూ

"అసలు! అభిర్ ఎవరో తెలియకుండనే డబ్బు వస్తుంది కదా అని ఒప్పుకున్నాను బానే ఉంది. కానీ అతను బయటికి వచ్చిన తర్వాత చంపమని చెప్పడానికి ముకుల్ గారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు.'

'ఆరోజు గోకుల్ ని, మురళి జోషి ని చంపింది కూడా అభిర్ కాదు మరి అతనికి ముకుల్ గారికి మధ్య ఉన్నది ఏమిటి? నేను ఈ విషయాలు ఏమి తెలుసుకోకుండా డబ్బు కోసం అనవసరంగా ఈ కేసులోకి ఎంటర్ అయ్యానా!'

అంటూ చెమటలు తుడుచుకుంటూ "అభిర్ ఎవరో ముందు తెలుసుకోవాలి." అనుకుంటూ ఫోన్ తీసి వణుకుతున్న చేతులు చూసుకుని "నేను ఏంటి ఇంత భయపడుతున్నాను." అంటూ టెన్షన్ గా కాంటాక్ట్స్ లో నెంబర్స్ వెతుకుతూ

"హమ్మయ్య! దొరికింది." అనుకుని ఫోన్ చేసి రింగ్ అవడంతో "వీడేంటి లిఫ్ట్ చేయడం లేదు." అంటూ కంగారుగా చూస్తూ ఉన్నాడు హిరణ్య.

కాసేపటికి ఫోన్ లిఫ్ట్ చేసి "ఎవరు మాట్లాడేది?" అంటూ గంభీరమైన గొంతుతో అడిగాడు అటు వైపు వ్యక్తి.

"మిస్టర్ జనార్దన్! నేను క్రిమినల్ లాయర్ హిరణ్య ని మాట్లాడుతున్నాను." అని చెప్పాడు హిరణ్య.

"హలో లాయర్ గారు బాగున్నారా? మీతో మాట్లాడి చాలా కాలం అయింది కదా గొంతు గుర్తుపట్టలేదు, అవును నా నెంబర్ మీ దగ్గర ఇంకా ఉందా?" డౌట్ గా అడిగాడు జనార్ధన్.

ఆ మాట విని ఊపిరి పీల్చుకుని "నాకు ఒక్కసారి టచ్ లోకి వస్తే జీవితకాలం గుర్తించుకుంటాను ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు?" అని అడిగాడు హిరణ్య.

"ముకుల్ నంద గారి పుణ్యమా అని బానే ఉన్నాను మాల్దీవులు లో రెండు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఈ మధ్య వరకు బిజినెస్ బానే ఉంది  ఇండియా దెబ్బతో బిజినెస్ పూర్తిగా పడిపోయింది." అన్నాడు జనార్ధన్.

"ఓకే! ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మీకు కాల్ చేశాను, 12 సంవత్సరాల క్రితం ముకుల్ గారు చెప్పారని మీరు నాకు ఒక కుర్రాడిని చూపించారు అతని వివరాలు కావాలి." అని అడిగాడు హిరణ్య.

"ఆ విషయం గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు?" అంటూ హుషారుగా మాట్లాడేవాడు కాస్తా డల్ గా అడిగాడు జనార్దన్.

"ఆ కుర్రాడు బెయిల్ మీద బయటికి వచ్చాడు కేసు మళ్ళీ రీఓపెన్ అయింది సిబిఐ కి హ్యాండ్ అవుర్ చేశారు.'

'NIA  ఆఫీసర్ మర్డర్ కేస్ కాబట్టి నన్ను కూడా ఎంక్వయిరీకి  పిలవచ్చు అందుకే ఆ కుర్రాడి డీటెయిల్స్ తెలుసుకుంటే మంచిది కదా అని మీకు కాల్ చేశాను." అన్నాడు హిరణ్య.

"అవునా? ఈ విషయం ముకుల్ గారికి తెలుసా?" డౌట్ గా అడిగాడు జనార్ధన్.

"హా.. తెలుసు!  ఆ కుర్రాడిని భయపెట్టడానికి ఒక గ్యాంగ్ కి సుపారీ ఇచ్చారు వాడిని చంపేయమని చెబితే నా మాట వినడంలేదు.'

'అసలు! ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? నాకు పేరు కూడా తెలియదు ఈమధ్య అతని పేరు అభిర్ అని తెలిసింది." అంటూ చిరాకుగా అడిగాడు హిరణ్య.

"అభిర్ కోసం ఎవరైనా వచ్చారా?" అనుమానంగా అడిగాడు జనార్ధన్.

"ఆ కుర్రాడు జైల్లో ఉన్నాడని బయటకి తెలిస్తేనే కదా ఎవరైనా రావడానికి, ఇప్పటివరకు ఏ న్యూస్ ఛానల్ లో రాకుండా చూసుకున్నాను.'

'కానీ ఈ కేసు మనం ఓడిపోతే మాత్రం అన్ని చానల్స్ లో స్టోరీలుగా వేస్తారు, ఇంతకీ ఆ కుర్రాడు గురించి మీరు నాకు ఒక్క ముక్క కూడా చెప్పలేదు."  అన్నాడు హిరణ్య.

"నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను." అంటూ ఫోన్ పెట్టేసాడు జనార్ధన్.

ఫోన్ కట్ అవడంతో ఆశ్చర్యంగా చూస్తూ "ఇంతకీ అభిర్ ఎవరు? కొంపతీసి గోకుల్ కి పుట్టిన కొడుకు కాదు కదా! ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేయడం లేదు కదా!" అనుకున్నాడు హిరణ్య.

*******************

కోర్టు నుంచి బయటకు వచ్చి శ్రీకర్ తో కలిసి కారులో వెళుతూ నీలమ్ తో ఫోన్లో మాట్లాడి

"అభిర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది." అని చెప్పి ఫోన్ పెట్టేసి 

శ్రీకర్ వైపు చూస్తూ "మీరు హిరణ్యని మీట్ అయినట్లు ఉన్నారు ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్పారా ఏంటి? ఈరోజు ఏ కేసుకి హాజరు అవ్వలేదు. " డౌట్ గా అడిగింది వసుంధర.

"ఈ కేస్ ఫైల్ స్టడీ చేసిన తర్వాత అసలు అభిర్ ఎవరో హిరణ్యకి అయ్యినా తెలుసా లేదా అని డౌట్ వచ్చి కొంచెం బెదరగొడదామని వెళ్లి గాలిలో బాణం వేశాను.'

'ఆ బాణం కరెక్ట్ గా వెళ్లి తగిలింది హిరణ్య ఈ కేసు డబ్బు కోసం మాత్రమే ఒప్పుకున్నాడు అభిర్ ఎవరో అసలు ఈ కేసులో తనని ఎందుకు ఇన్వాల్వ్ చేశారో  తెలియదు అనుకుంటా అందుకునే కాస్త కంగారు పడ్డాడు నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్ అయింది." అన్నాడు శ్రీకర్.

"అంటే! ఈ కేసు వెనకాల చాలా పెద్ద వాళ్ళ హస్తం ఉంది అందుకే డీటెయిల్స్ కూడా అడగకుండా డబ్బు కోసం ఒప్పుకుని ఉంటాడు, ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాము?" డౌట్ గా అడిగింది వసుంధర.

"NIA చీఫ్ ఆనంద్ మిలింద్ గారు ఈవినింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు కలవడానికి వెళుతున్నాము మురళి జోషి చనిపోయే ముందు ఏ కేసులో వర్క్ చేశాడో తెలుసుకోవాలి.'

'అప్పుడే ఈ కేసులో అభిర్ ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, ఎవరు ఇన్వాల్వ్ చేసారు, అసలు అబీర్ ఎవరో అనే విషయం కూడా మనకి తెలుస్తుంది." అన్నాడు శ్రీకర్.

గుడ్ స్టెప్! ఈ కేసులో మనకి ఒక మంచి లీడ్ దొరుకుతుంది. " అంది వసుంధర.

"అంతేకాదు! మురళి జోషి భార్య చెప్పినట్లు తన భర్తను చంపిన వ్యక్తిని ఎవరో ఐదుగురు వచ్చి చంపేశారు అని చెప్పింది.'

'ఈ కేసులో ఆ విషయమే లేదు అక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరు అతన్ని చంపింది ఎవరో కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను." అన్నాడు శ్రీకర్.

*********************

రాజన్, రియాతో కలిసి ఫ్యాక్టరీలు చూడడానికి వెళ్లి అక్కడ ఉన్న మేనేజర్స్ తో మాట్లాడి  దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ చూస్తూ

"రాజన్! మీ సెక్యూరిటీ వాళ్లు ముందుగా ఇక్కడికి వచ్చారు కదా! ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా? మన కంపెనీలకు ఎగనిస్ట్ గా ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు సుజిత్.

"నో ప్రాబ్లం సార్! మాకైతే ఎటువంటి త్రెడ్ కనిపించలేదు,
మీ నాన్నగారు చెప్పినట్లు ఇక్కడ ప్రాబ్లం కూడా ఏమి లేదు అంత సవ్యంగానే ఉంది.'

'ఒక విధంగా చెప్పాలంటే మా సెక్యూరిటీ ఏజెన్సీకి మీరు డబ్బులు ఇవ్వడం కూడా వేస్ట్!" అంటు నవ్వుతూ అన్నాడు రాజన్.

ఆ మాటకి స్మైల్ ఇస్తూ "ఒక్క నిమిషం ఇక్కడే వెయిట్ చేయండి ఇప్పుడే వస్తాను." అంటు దూరంగా వెళ్లి అర్ణ కి కాల్ చేసాడు సుజిత్.

ఫోన్ లిఫ్ట్ చేసి "హాయ్ సుజిత్! హౌ ఆర్ యు? ప్రాపర్టీస్ విసిటింగ్ లో ఉన్నావా?" అని అడిగింది వర్ణ.

"ఎస్! ఈరోజు మూడు ఫ్యాక్టరీలు విజిట్ చేశాను, కొన్ని ప్రాపర్టీస్ విజిట్ చేశాను మనం అనుకున్నట్లు ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు అంతా ప్రశాంతంగానే ఉంది.'

'మీ తాతగారు ఎందుకు వీటి గురించి పట్టించుకోవడం లేదో నాకైతే అర్థం కావడంలేదు." అన్నాడు సుజిత్.

"అవునా?" అంటూ కాసేపు ఆలోచించి "ఏదైనా ఒక ప్రాపర్టీ ఇమీడియట్ గా సెల్ కి పెట్టు అప్పుడు ప్రాబ్లం ఏదైనా ఉంటే బయటకి వస్తుంది." అని చెప్పింది అర్ణ.

"ఓకే! గూర్ గామ్ లో ఉన్న ప్రాపర్టీ సెంటర్ మినిస్టర్ వరదరాజులు గారు అడిగారు నువ్వు ఓకే అంటే మాట్లాడుతాను." అన్నాడు సుజిత్.

"ఓకే క్యారీ ఆన్! కొంచెం తక్కువైనా పర్లేదు ఫస్ట్ ఒక ప్రాపర్టీ మనం సేల్ చేయాలి ఆ పనిలో ఉండు." అని చెప్పింది అర్ణ.

"ఓకే బాయ్!' అంటూ సంతోషంగా ఫోన్ పెట్టేసాడు సుజిత్.

"ఇండియాలో అంతా బానే ఉంటే మరి తాతగారు ఎందుకు భయపడుతున్నారు అక్కడికి వెళ్ళకూడదు అని ఎందుకు చెబుతున్నారు.'

'ఒకవేళ ఆ జైల్లో ఉన్న వాడి వల్ల ప్రాబ్లం ఏమైనా ఉందా?" అనుకుని హిరణ్యకి కాల్ చేసింది అర్ణ.

ఫోన్ లిఫ్ట్ చేసి "నమస్తే మేడం! కేసు హియరింగ్ కి ఇంకా టుడేస్ ఉంది." అన్నాడు హిరణ్య.

"ఆ విషయం నాకు తెలుసు! ఆ జైల్లో ఉన్న మనిషి గురించి ఏదైనా తెలిసిందా?" అని అడిగింది అర్ణ.

"నో మేడం! ఈ కేసు చాలా పెద్ద ఇష్యూ అయ్యేలాగా ఉంది సిబిఐ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు లాయర్ అని చూడకుండా నన్ను కూడా ఎంక్వయిరీ చేయడానికి ఈరోజు ఒక ఆఫీసర్ వచ్చాడు.'

'మీరేమీ అనుకోకపోతే ఒక విషయం చెప్తాను నాకు తెలిసి వాడు మీ నాన్నగారి రెండో ఫ్యామిలీకి పుట్టిన వాడు అనుకుంటా!'

'ఆస్తిలో వాటా ఇవ్వవలసి వస్తుంది అని తనని మీ తాతగారు చంపించలేక జైల్ లోనే ఉంచమంటున్నారు అనుకుంటున్నాను." అన్నాడు హిరణ్య.

"అవునా? శత్రు శేషం అయిన ఉండొచ్చు కానీ ఇటువంటి బంధాలు ఉండకూడదు అవసరమైతే అమౌంట్ నేను ఇస్తాను వాడిని వాడికి హెల్ప్ చేసే వాళ్ళందరినీ లేపేయమని మిచల్ కి చెప్పండి.'

'ఇండియాలో మన వర్క్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇటువంటి టైమ్ లో ఇలాంటి చిల్లర టెన్షన్స్ ఉండకూడదు." అంది అర్ణ.

"ఓకే మేడం! ఇప్పుడే మిచల్ కి కాల్ చేస్తాను." అంటూ సంతోషంగా ఫోన్ పెట్టేసాడు హిర్వాణి.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#48
ఎపిసోడ్ 16


శ్రీకర్ చెప్పిన దానికి అయోమయంలో పడి అభిర్ ఎవరో తెలుసుకోవడం కోసం జనార్ధన్ కి కాల్ చేశాడు హిరణ్య.

ఇండియాలో ప్రాపర్టీ విషయము ఎటువంటి ప్రాబ్లం లేదు అని సుజిత్ చెప్పడంతో హిరణ్యకి ఫోన్ చేసి అభిర్ ని తనకి హెల్ప్ చేసే వాళ్ళని చంపించేయమని చెప్పింది వర్ణ.

వసుంధర తో కలిసి NIA చీఫ్ ఆనంద్ మిలింద్ ని కలవడానికి బయలుదేరాడు శ్రీకర్.

*******************

NIA ఆఫీసులో తన చాంబర్ లో ఉన్న ఆనంద్ దగ్గరికి వెళ్లి "జైహింద్ సార్! ఐ యాం శ్రీకర్ సిబిఐ! వారు వసుంధర అడ్వకేట్!'

'ఒక కేసు విషయమై మిమ్మల్ని మీట్ అవ్వడానికి వన్ వీక్ నుంచి ట్రై చేస్తున్నాను ఈరోజుకి కుదిరింది." అంటూ వినయంగా చెప్పాడు శశ్రీకర్.

"ప్లీజ్ సిట్ డౌన్! మా దగ్గర నుంచి సిబిఐ కి ఏ కేసు ట్రాన్స్ఫర్ అవ్వలేదే!" డౌట్ గా అడిగాడు ఆనంద్.

"నో సార్! 12 ఇయర్స్ బ్యాక్ మీ ఆఫీసర్ మురళి జోషి మర్డర్ కేస్ ఉంది కదా! అది రీ ఓపెన్ చేసి సిబిఐకి ప్రిఫర్ చేశారు దాని గురించి మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి." అన్నాడు శ్రీకర్.

"ఓకే! చెప్పండి మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలి?" అని అడిగాడు ఆనంద్.

"ఆ కేసులో ముద్దాయిగా అరెస్టు అయిన అభిర్ గురించి మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా?" అని అడిగాడు శ్రీకర్.

"వన్ మినిట్!" అంటూ కంప్యూటర్లో చూస్తూ "అతని గురించి మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఈ మర్డర్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు ఏదో పర్సనల్ ఇష్యూస్ అనుకుంటా!" అన్నాడు ఆనంద్.

"కానీ సార్! తీహార్ జైల్లో ఉన్న కరుడుగట్టిన నేరస్తుల్ని అండమాన్ కి పంపించాలని ఒక ప్రపోజల్ పెట్టారు కదా! మరి ఆ లిస్టులో అభిర్ పేరు ఎందుకు యాడ్ చేశారు?" డౌట్ గా అడిగింది వసుంధర.

"అవునా?" అంటూ అనుమానంగా చూస్తూ బెల్ కొట్టి "సత్య ప్రసాద్ ని లోపలికి రమ్మను." అని చెప్పాడు ఆనంద్.

కాసేపటికి లోపలికి వచ్చి "జైహింద్ సార్!" అన్నాడు సత్యప్రసాద్.

లిస్ట్ చూపించి "దీంట్లో 160 నెంబర్ లో ఉన్న అభిర్ అనే ఖైదీ ఎవరు? తనని కూడా అండమాన్ జైలుకి పంపించాలి అని ఎందుకు ప్రిఫర్ చేశారు?'

'అతని మీద మురళి మర్డర్ కేస్ కాకుండా ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా?" అంటూ సీరియస్ గా చూస్తూ అడిగాడు ఆనంద్.

ఆ మాటకి నీళ్లు నమూలుతు "మన ఆఫీసర్ ని చంపిన కేసులో అరెస్టు అయ్యాడు కదా అని లిస్టులో యాడ్ చేశాము." అంటూ కంగారుగా చెప్పాడు సత్యప్రసాద్.

"ఈ కేస్ ఫైల్లో ముద్దాయి పేరు అభిర్ అని లేదు, కానీ ఆ అబ్బాయి పేరు మీకు ఎలా తెలిసింది?" డౌట్ గా చూస్తూ అడిగాడు శ్రీకర్.

ఆనంద్ వైపు చూసి "సార్! మేము లిస్ట్ రెడీ చేసినప్పుడు అతని పేరు మెన్షన్ చేయలేదు, కాని ఇంకా ప్రాబ్లం పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అని జైల్ కి లెటర్ సెండ్ చేశాము.'

 'సబ్ జైలర్ నితీష్ ఆ పేరు యాడ్ చేసి పంపించారు మన ఆఫీసర్ ని చంపిన కేసులో ఉన్నాడు కదా అని మేము కూడా ఓకే అన్నాము." అంటూ నెమ్మదిగా చెప్పాడు సత్యప్రసాద్.

"స్టుపిడ్స్! ముందు లిస్టులో అతని పేరు డిలీట్ చేసి ఫ్రెష్ లిస్ట్ కోర్టుకి సబ్మిట్ చేయండి." అంటూ సీరియస్ గా చెప్పాడు ఆనంద్.

"సార్! ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి మురళి జోషి చనిపోయే ముందు ఏ కేసులో ఇన్వాల్వ్ అయ్యోడో చెప్పగలరా?" అని అడిగాడు శ్రీకర్.

"మా డిపార్ట్మెంట్ గురించి నీకు తెలియని ఏముంది సపరేట్ గా ఒక కేసు అంటూ ఏమీ ఉండదు." అంటూ కంప్యూటర్లో చూస్తూ

'మురళి చనిపోయే ముందు అసలు ఏ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదు త్రీ మంత్స్ గా సిక్ లీవ్ లో ఉన్నాడు." అని చెప్పాడు ఆనంద్.

"ఓకే సర్ థాంక్యూ!" అంటూ వసుంధర తో కలిసి అక్కడి నుంచి బయటికి వచ్చి కారులో వెళుతు

"మురళీ జోషి భార్య గీత చెప్పిన దానిబట్టి అతను కేసు నిమిత్తం బయటకు వెళ్లి మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చాడు అని చెప్పింది.'

'కానీ డిపార్ట్మెంట్లో అతను సిక్ లివ్ లో ఉన్నట్లు ఉంది అంటే అనఫిషియల్ గా ఏదో చేసాడు." అన్నాడు శ్రీకర్.

"ఈ కేసులో మనం ఇంకా ముందుకు వెళ్లడానికి 12 సంవత్సరాల అయిపోయింది అప్పుడు అతనితో పాటు ఉన్నది ఎవరో కూడా మనకి తెలియదు.'

'అసలు ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ చనిపోయారు ఇంకా దీని గురించి ఏదైనా చెప్పాలి అంటే అభిర్ నోరు విప్పితేనే మనకి తెలుస్తుంది." అంది వసుంధర.

"ఎస్! అతను నోరు విప్పాలి అంటే ఈ కేసు నుంచి బయటికి రావాలి అప్పుడే మాట్లాడుతాడు." అన్నాడు శ్రీకర్.

**********************

ఉదయం ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో నిద్ర మత్తులో నుంచి లేచి చూసి "ముకుల్ గారు ఫోన్ చేస్తున్నారేంటి!" అంటూ కంగారుగా లిఫ్ట్ చేసి "గుడ్ మార్నింగ్ సార్!" అన్నాడు హిరణ్య.

"ఆ కుర్రాడి గురించి డీటెయిల్స్ అడగకూడదని ఈ కేసు ఒప్పుకునే ముందే మీకు చెప్పాను కదా! మళ్లీ జనార్ధన్ కి ఎందుకు ఫోన్ చేశావు?" అంటూ కోపంగా అడిగాడు ముకుల్.

"సారీ సార్! మీరు చెప్పింది అంతా ఓకే కానీ ఈ కేసు ఇప్పుడు సిబిఐ ఎంక్వయిరీలో ఉంది ఆ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి మురళి జోషి తో పాటు మరొక వ్యక్తి చనిపోయాడు అతను గురించి మీకు తెలుసా అని అడిగాడు.'

'నేను కవర్ చేస్తూ మీకు ఎవరో  రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అటువంటిదేమీ లేదు అని చెప్పాను వెళుతూ వెళుతూ అభిర్ గురించి ముందు తెలుసుకోండి అన్నాడు.'

'ఈ కేసులో వాళ్ళకి ఏదైనా లీడ్ దొరికిందేమోనని ఆ అబ్బాయి గురించి తెలుసుకోవడానికి జనార్ధన్ కి కాల్ చేశాను అంతే తప్పితే నాకు వేరే ఇంట్రెస్ట్ ఏమీ లేదు." అన్నాడు హిరణ్య.

"అవునా? అక్కడ మరొక వ్యక్తి చనిపోయాడు అన్న విషయం ఆ సిబిఐ ఆఫీసర్ కి ఎలా తెలిసింది ఈ విషయం తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరైనా బతికి ఉన్నారా?" డౌట్ గా అడిగాడు ముకుల్.

"నాకు తెలిసి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరూ లేరు సార్! కానీ ఈ మేటర్ బయటికి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు." అంటూ టెన్షన్ గా చెప్పాడు హిరణ్య.

"ఈ కేసు ఎలాగైనా మీరు గెలవాలి అభిర్ జైల్లోనే ఉండాలి దానికోసం ఎంత ఖర్చు అయిన పర్వాలేదు ప్రతి ఒక్కరి నిజాయితీకి ఒక రేటు ఉంటుంది." అన్నాడు ముకుల్.

"సార్! నేను ఒకటి చెప్తాను అభిర్ జైల్లోనే ఉంచాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అతనికి వెనక ముందు ఎవరూ లేరు లేపేస్తే సరిపోతుంది కదా! మీరు ఊ.. అంటే ఇప్పుడే మిచల్ కి కాల్ చేస్తాను." అన్నాడు హిరణ్య.

"అభిర్ జైల్లో ఉన్న విషయం బయట ప్రపంచానికి తెలుసా! పోనీ ఈ కేస్ గురించైనా, అతను బెయిల్ మీద బయటకు వచ్చిన విషయమైనా బయట ప్రపంచానికి తెలుసా!" అని అడిగాడు ముకుల్.

"నో సార్! ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా పడ్డాము చాలా ఖర్చు కూడ చేశాము." అన్నాడు హిరణ్య.

"మరి అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరని నీకు ఎలా తెలుసు! నేను చెప్పినట్లు మాత్రమే చెయ్!'

'నా మనవరాలు మాట విని రాంగ్ స్టెప్ వెయ్యకు ఆఫీసర్ సంగతి నేను చూసుకుంటాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముకుల్.

"అంటే నా గెస్సింగ్ కరెక్ట్! అభిర్ కచ్చితంగా నంద వారసుడు." అనుకుని టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఫోన్ తీసి మిచల్ కి కాల్ చేసాడు హిరణ్య.

ఫోన్ లిఫ్ట్ చేసి "లాయర్ గారు  చెప్పండి? ఇంత పొద్దున్నే ఫోన్ చేశారు." డౌట్ గా అడిగాడు మిచల్.

"12 సంవత్సరాల క్రితం ఈ కేసు కు సంబంధించిన వాళ్ళ లిస్ట్ ఇచ్చి చంపమని చెప్పాను కదా! దాంట్లో ఎవరైనా మిగిలారా? అందరూ చచ్చారా!" అంటూ అనుమానంగా అడిగాడు హిరణ్య.

"మీరు ఇచ్చిన లిస్టు ప్రకారం అందరూ చచ్చారు ఆఖరికి ఆ మురళి జోషి భార్యను సెక్యూరిటీ అధికారి స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చి ఇంటికి వెళుతుండగా చంపేసాను." అన్నాడు మిచల్.

"అవునా? నువ్వు చంపింది మురళి జోషి భార్యను కాదు నేను సెట్ చేసిన డమ్మీ భార్యని అంటే వాడి భార్య పిల్లలు ఇంక బతికే ఉన్నారు.'

'వాళ్ల ద్వారానే ఆఫీసర్ కి విషయం తెలిసి ఉంటుంది నాకు తెలిసి రేపు కోర్టు దగ్గరికి వాళ్ళు కచ్చితంగా వస్తారు." అంటూ కంగారుగా అన్నాడు హిరణ్య.

"టెన్షన్ పడకండి సార్! నా మనుషులు లాయర్ ని ఆఫీసర్ ని ఫాలో చేస్తూన్నారు ఆ లాయర్ ఇంటిదగ్గర ఎవరో కొత్తగా ముగ్గురు ఆడవాళ్లు వచ్చారని తెలిసింది వాళ్లే మురళీ జోషి ఫ్యామిలీ అనుకుంటా!" అన్నాడు మిచల్.

"అయితే! వాళ్లు రేపు కోర్టుకి రాకూడదు ఏం చేస్తావో ఎంతమందిని పంపుతావో నాకు తెలీదు ఈరోజు వర్క్ కంప్లీట్ అయిపోవాలి.'

'ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి మిస్టేక్ చేసామని పెద్దాయనకి తెలిసిందో మనం ఉండము." అన్నాడు హిరణ్య.

"నో ప్రాబ్లెమ్ సార్! అక్కడికి నా మనుషులని కాకుండా వేరే బ్యాచ్ ని పంపుతాను." అన్నాడు మిచల్.

"ఓకే! చాలా జాగ్రత్తగా చేయాలి ఎక్కడ ఈ కేసు మాట బయటికి రాకూడదు వాళ్లు వేరే ప్రాబ్లంలో చనిపోయినట్లు ఉండాలి సిబిఐ వాళ్ళకి కూడా అనుమానం రాకూడదు." అన్నాడు హిరణ్య.

"ఓకే సార్! నేను చూసుకుంటాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు మిచల్.
[+] 8 users Like SivaSai's post
Like Reply
#49
 ఎపిసోడ్ 17





ముకుల్ నంద చెప్పడంతో మిచల్ కి ఫోన్ చేసి మాట్లాడి మురళి జోషి భార్య వాళ్ళు బతికే ఉన్నారని తెలుసుకుని ఎలాగైనా చంపేయమని చెప్పాడు హిరణ్య.

******************

ఉదయం గెస్ట్ హౌస్ నుంచి వరదరాజులకి ఫోన్ చేసి "గుడ్ మార్నింగ్ అంకుల్! మీరు అడిగిన ప్రాపర్టీ గురించి ఒకసారి మాట్లాడుకుని ఫైనల్ చేసుకుందాము." అన్నాడు సుజిత్.

"ఓకే ఓకే! కానీ పేమెంట్ మొత్తం వైట్ లో ఇవ్వలేను ముందే చెబుతున్నాను." అంటూ నవ్వాడు వరదరాజులు.

"మాకు కావాల్సింది కూడా అదే అంకుల్! ఎప్పుడు మీట్ అవుదామో చెప్పండి." నవ్వుతూ అన్నాడు సుజిత్.

"నేను కొంచెం పార్టీ పని మీద బయటకు వచ్చాను 2 డేస్ లో వస్తాను రాగానే ఫిగర్ ఫైనల్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకుందాము." అన్నాడు వరదరాజులు.

"ఓకే అంకుల్ బాయ్!" అంటూ ఫోన్ పెట్టేసి అర్ణ కి కాల్ చేసి

"నువ్వు చెప్పినట్లే ఒక ప్రాపర్టీ సెల్ కి పెడుతున్నాను ఎందుకైనా మంచిది ఒక్కసారి తాత గారితో మాట్లాడు." అన్నాడు సుజిత్.

"ఈరోజే మాట్లాడుతాను." అంటూ ఫోన్ పెట్టేసి ముకుల్ నంద దగ్గరికి వెళ్ళింది అర్ణ.

తన దగ్గరికి వసున్న అర్ణ ని చూసి "హాయ్ బేబీ! మన నార్వే ప్రాజెక్టు గురించి నీతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాను అంతలో నువ్వే వచ్చావు." అంటూ ఫైల్స్ చూస్తూ అన్నాడు ముకుల్.

"తాతయ్య! ఇండియాలో ఒక ప్రాపర్టీ సేల్ కి పెట్టి మనకి అక్కడ ప్రాబ్లమ్ ఏమీ లేదు అని మీకు చూపించాలి అనుకుంటున్నాను." అంది అర్ణ.

"సరే నీ ఇష్టం! ట్రై చెయ్! అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటో నీకు కూడా అర్థం అవుతుంది." అన్నాడు ముకుల్.

"ప్రాబ్లం ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను  ఇన్నాళ్లు మీరు ఒక్కరే కానీ ఇప్పుడు మీకు తోడుగా చాలామంది ఉన్నాము ఇంక మీరు దేని గురించి దిగులు పడకండి." అంది అర్ణ.

"నేను దిగులు పడడం లేదు రాబోయే సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్నాను." అన్నాడు ముకుల్.

"ఆ అభిర్ గురించే కదా మీ ఆలోచన? కనుసైగ చేస్తే సాల్వ్ అయ్యే సమస్య గురించి అంతగా ఆలోచించడం ఎందుకు?" అనుమానంగా చూస్తూ అడిగింది అర్ణ.

"అభిర్ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు! ప్రాపర్టీ సేల్ కి పెడుతున్నాను అని చెప్పావు కదా ఆ పనిలోనే ఉండు ఏదైనా సమస్య ఎదురైతే నాకు చెప్పకుండా డిసిషన్ తీసుకోకండి.'

'నార్వె ప్రాజెక్టు గురించి మళ్లీ మాట్లాడుకుందాము ఇప్పుడు మూడ్ బాలేదు." అంటూ లోపలకి వెళ్లిపోయాడు ముకుల్.

లోపలికి వెళుతున్న ముకుల్ వైపు చూస్తూ "అభిర్ పేరు వినగానే తాతయ్య డిప్రెషన్ లోకి వెళుతున్నారు అసలు అతను ఎవరు?'

'అభిర్ వల్ల తాతయ్యకి ఉన్న సమస్య ఏమిటో తెలుసుకోవాలి." అంటూ కార్లో ఆఫీసుకి బయలుదేరి ఫోన్ తీసి కాల్ చేసి

"హాయ్ మిథున్!  హౌ ఆర్ యు?" అంది అర్ణ.

"హాయ్! ఐయామ్ ఆల్వేస్ ఫైన్! సుజిత్ ఇండియా వచ్చాడు కదా రిజల్ట్ ఎలా ఉంది?" అని అడిగాడు మిథున్.

"నైస్! రిజల్ట్ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి ఇప్పుడే మూవ్ అవుతున్నాడు, నీకు ఫోన్ చేసిన విషయం ఏమిటంటే నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి!" అంది అర్ణ.

"ప్లీజ్ టెల్ మీ? ఫ్రెండ్స్ దగ్గర రిక్వెస్ట్ ఉండదు ఆర్డర్ వేయడమే!" నవ్వుతూ అన్నాడు మిథున్.

"నాకు ఇండియాలో ఒక డిటెక్టివ్ కావాలి! ఎలా ఉండాలి అంటే ఎవరు అంచనా వేయలేని దానిని కరెక్ట్ గా అంచనా వేయాలి.'

'ఎవరు తెలుసుకోలేని విషయాన్ని కనిపెట్టగలగాలి అవసరమైతే చంపాలి లేదా చచ్చిపోవాలి." అని చెప్పింది అర్ణ.

"అబ్బో.. చాలా క్వాలిటీస్ ఉండాలి!'

"సరే! నీకు ఒక నెంబర్ సెండ్ చేస్తున్నాను పేరు మిత్ర! సంవత్సరం క్రితం వరకు IB లో ఇన్ఫార్మర్ గా వర్క్ చేసింది.'

'డిపార్ట్మెంట్ వాళ్ళతో చిన్న క్లాష్ వల్ల బయటకు వచ్చేసింది నీకు కావలసిన క్వాలిటీస్ మొత్తం తన దగ్గర ఉన్నాయి కాల్ చేసి నా పేరు చెప్పు చాలు మాట్లాడుతుంది.'

'కాకపోతే తనకి కొంచెం ఇగో ఎక్కువ జాగ్రత్తగా డీల్ చెయ్!" అన్నాడు మిథున్.

"థాంక్యూ! ఈ విషయం ఇక్కడే మర్చిపో ఇంటి వరకు తీసుకువెళ్ళకు మళ్ళి లాయర్ విషయం లాగా తాతయ్యకు తెలిసిపోతుంది." అంది అర్ణ.

"సారీ! ఆ విషయం గురించి నీకు ఎక్స్ప్లేషన్  ఇవ్వాలి అనుకున్నాను కానీ... చెప్పలేకపోయిను." అన్నాడు మిథున్.

"నో ప్రాబ్లం! తాతయ్యకు తెలియడం నాకు మంచిదే అయింది కానీ ఈ విషయం అలా కాదు, నెంబర్ సెండ్ చెయ్!" అంటూ ఫోన్ కట్ చేసి వచ్చిన మెసేజ్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేసి

"హాయ్ మిత్ర! ఐ యాం అర్ణ నంద ఫ్రమ్ లండన్! నీ నెంబర్ మిథున్ ఇచ్చాడు." అని చెప్పింది అర్ణ.

"టెల్ మీ మేడం! మిథున్ సార్ మెసేజ్ పెట్టారు వర్క్ ఏమిటో చెప్పండి?" అంది మిత్ర.

"నీకు ఒక కేసు డీటెయిల్స్ సెండ్ చేశాను అతని పేరు అభిర్! ఇప్పటివరకు అతని గురించి ఎవరు తెలుసుకోలేక పోయారు నాకు అతని ఫుల్ డీటెయిల్స్ కావాలి.'

'అంతే కాదు అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా! ఉంటే ఎక్కడ ఉన్నారో కూడా తెలియాలి.'

'ఈ విషయం చాలా సీక్రెట్ గా జరగాలి మన మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అవ్వకూడదు చేయగలవా?" అని అడిగింది అర్ణ.

"ఎస్ మేడం! మీరు పంపించిన ఫైల్ చూస్తున్నాను12 సంవత్సరాల క్రితం కేసు కొంచెం స్ట్రగుల్ ఎక్కువగా ఉంటుంది.'

'అవసరమైతే కొంతమందికి డబ్బులు ఇవ్వవలసి ఉంటుంది. కొంతమందిని నా స్టైల్ లో అడగాల్సి ఉంటుంది." అంది మిత్ర.

"నో ప్రాబ్లం! ఎంత కావాలి ఏ అకౌంట్ కి పంపించాలి డీటెయిల్స్ సెండ్ చెయ్! వర్క్ ఈ రోజే మొదలవ్వాలి." అని చెప్పి ఫోన్ పెట్టేసింది అర్ణ.

ఫోన్ జేబులో పెట్టుకుంటూ ఫైల్ చూస్తూ "నాకు సరిపడ కేసు దొరికింది. అభిర్ వస్తున్నాను రెడీగా ఉండు." అంది మిత్ర.

********************

ఉదయం వసుంధర ఇంటి దగ్గరికి వచ్చి "మేడం! రేపు అబీర్ కేసు హియరింగ్ కాబట్టి ఈరోజు అందరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏసిపి దయా టీమ్ ఇంటికి సెక్యూరిటీగా ఉంటారు.'

'ఎవరు ఒంటరిగా బయటకు వెళ్ళకండి వాళ్లు ఈ కేసుని ఆపడానికి ఎంతకైనా తెగిస్తారు." అంటూ ఇంట్లో నుంచి వస్తున్న అభిర్ ని చూసి

"రేపటితో నీకు ఫ్రీడం వస్తుంది." అంటూ సంతోషంగా చూస్తూ చెప్పాడు శ్రీకర్.

"నో సార్! బాధ్యత పెరుగుతుంది." అన్నాడు అభిర్.

"నేను మనిషి మొహం చూసి మాట విని అతని గురించి ఒక అంచనాకి రాగలను, కానీ నీ విషయంలో నా కాల్కులేషన్ కరెక్ట్ గా పని చేయడం లేదు." అంటూ అభిర్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు శ్రీకర్.

"మీరు చెప్పింది తప్పు! ఎదుటి మనిషి మనసులో ఉన్నది ఎప్పుడు మొహం మీద కనిపించదు మాటలో వినిపించదు అలా మీరు తెలుసుకున్నారు అంటే ఆ మనిషి బలహీనంగా ఉన్నట్టు!" అన్నాడు అభిర్.

"ఎస్! నువ్వు చెప్పింది కరెక్టే! నేరం చేసిన వాడు కచ్చితంగా బలహీన పడతాడు మాకు కనిపించే వాళ్ళందరూ వాళ్ళే కదా!" అంటు నవ్వుతూ అన్నాడు దయ.

"అంతేకాదు సార్! నేరం చేయాలి అనుకున్న వాళ్లు కూడా బలహీన పడతారు." అంటూ అక్కడ ఉన్న ఇద్దరి ఆఫీసర్స్ ముందుకు వెళ్లి నిలబడి కళ్ళలోకి సూటిగా చూస్తూ

"మీరు చెయ్యాలి అనుకున్న పని నేను ఉండగా చేయలేరు." అంటూ సీరియస్ గా చూస్తూ చెప్పాడు  అభిర్.

కంగారు పడుతున్న ఇద్దరీ ఆఫీసర్స్ వైపు చూసి "సురేష్, కమల్ వాట్ హప్పెండ్! అభిర్ అన్న మాటికి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు?" అనుమానంగా చూస్తూ అడిగాడు దయ.

భయంతో చెమటలు తుడుచుకుంటూ "సారీ సర్! మిచల్ గ్యాంగ్ మా ఇద్దరి పిల్లలల్ని కిడ్నాప్ చేశారు.'

'కోర్ట్ లో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మురళి జోషి ఫ్యామిలీని చంపకపోతే పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు." అంటూ ఏడుస్తూ చెప్పాడు సురేష్.

"ఓ మై గాడ్! మురళి జోషి ఫ్యామిలీ మన దగ్గర ఉన్న విషయం వాళ్ళకి తెలిసింది అంటే వాళ్ల మనుషులు మనల్ని ఫాలో చేస్తున్నారు." అంటూ కంగారుగా అన్నాడు శ్రీకర్.

"మీకు ఫోన్ చేసిన నెంబర్ ఇవ్వండి వెంటనే ట్రేస్ చేసి పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకుందాము." అన్నాడు దయ.

"ట్రై చేసాంము సార్! సిగ్నల్ ఒకసారి నేపాల్ చూపిస్తే ఒక్కసారి కాశ్మీర్ చూపిస్తుంది." అంటూ కంగారుగా అన్నాడు కమల్.

"మాకు సహాయం చేయడానికి వచ్చిన వారు ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకోలేను మీ దగ్గర మీ పిల్లల ఫోటోలు  ఉన్నాయా?" అని అడిగాడు అభిర్.

"ఎస్!" అంటూ మొబైల్లో ఉన్న పిల్లల ఫొటోస్ చూపించారు ఇద్దరు.

మొబైల్ లో ఫోటోలు చూస్తూ ఆహారం తింటున్న పక్షుల వైపు చూసి వింత శబ్దం చేసాడు అభిర్.

ఆ సౌండ్ విని ఎగురుకుంటూ వచ్చి అభిర్ చేతి మీద వాలేయ్ నాలుగు పక్షులు.

ఆ పక్షులకి మొబైల్లో ఉన్న ఫోటో లు చూపించి మరొక రకమైన శబ్దం చేశాడు అభిర్.

ఆ శబ్దం విన్న వెంటనే గాల్లో ఎగురుకుంటూ వేగంగా వెళ్ళిపోయాయి నాలుగు పక్షులు.

దయ, శ్రీకర్ వైపు చూసి "ఆ పక్షులు తిరిగి వచ్చి ఈ ఫోటోలో ఉన్న పిల్లల దగ్గరకి మనల్ని తీసుకువెళతాయి." అన్నాడు అభిర్.

"రియల్లీ వండర్ఫుల్! ఇది నిజంగా జరుగుతుందా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు దయ.

"మనసులో కల్మషం లేకుండా మంచి పని కోసం అడిగితే ఏ ప్రాణి అయినా మనకు సహాయం చేస్తుంది." అన్నాడు అభిర్.

"అంకుల్ చెప్పారు అంటే కచ్చితంగా జరుగుతుంది." అంటు నవ్వుతూ చెప్పింది రోషిని.

కాసేపటికి గాల్లో ఎగురుకుంటూ వచ్చి తన చేతి మీద వాలిన రెండు పక్షుల వైపు చూసి "వీటి వెనకాల వెళ్ళండి పిల్లలు ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకువెళతాయి." అన్నాడు అభిర్.

"ఓకే!" అంటూ స్టాప్ వైపు చూసి "కమన్ లెట్స్ గో!" అంటూ గాల్లో వెళుతున్న పక్షులు వెనకాలే వెళ్లాడు దయ.
[+] 7 users Like SivaSai's post
Like Reply
#50
ఎపిసోడ్ 18


అభి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మిత్ర అనే డిటెక్టివ్ ని అపాయింట్ చేసింది అర్ణ.

కిడ్నాపైన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ పిల్లల్ని కనిపెట్టడానికి అభిర్ చెప్పినట్లు పక్షులు వెనకాల బయలుదేరాడు దయ.

********************

పిల్లల కోసం పక్షులు వెనకాల స్టాఫ్ తో కలిసి దయ వెళ్లడంతో వసుంధర వైపు చూసి

"మేడం! మనం మురళి జోషి ఫ్యామిలీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వేరే ప్లేస్ లో సేఫ్ ఉంచాలి." అన్నాడు శ్రీకర్.

"కరెక్టే! కానీ టైమ్ లో వీళ్ళని ఇక్కడి నుంచి పంపించడం అంత సేఫ్ కాదు." అంది నీలమ్.

"ఈ ఒక్కరోజు వీళ్లని సేఫ్ గా ఉంచితే చాలు రేపు కోర్టులో సాక్ష్యం చెప్పిన తర్వాత వీళ్ళ ఒంటి మీద చెయ్యి వేయడానికి కూడా భయపడతారు." అంది వసుంధర.

టెన్షన్ పడుతున్న గీత సుమతిల దగ్గరకు వెళ్లి

"మీ దగ్గరికి ఎవరైనా రావాలి అంటే నన్ను దాటి రావాలి కంగారు పడకండి." అంటూ పక్షుల వైపు చూసి చప్పట్లు కొట్టి "ఈ ఇంటి చుట్టుపక్కలకి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఇంకా మనకి తెలిసిపోతుంది." అన్నాడు అభిర్.

"అవునా? ఎలా తెలుస్తుంది?" డౌట్ గా అడిగింది నీలమ్.

ఎగురుతున్న పక్షులను చూపించి "ఇవే మనకి సెక్యూరిటీగా ఉంటాయి కొత్త వ్యక్తులు ఎవరైనా మన ఇంటి వైపు రావాలని చూస్తే వెంటనే వచ్చి నాకు చెప్తాయి." అన్నాడు అభిర్.

ఆ మాటకి ఎగురుతున్న పక్షుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు వాటితో మాట్లాడుతున్నావా? నిజంగా ఈ పక్షులు మనకి హెల్ప్ చేస్తాయా?" అనుమానంగా అడిగింది నీలమ్.

"అవును! మనకి మాట్లాడుకోవడానికి భాష ఉన్నట్లే ప్రతి జంతువుకి ఒక భాష ఉంటుంది దానిని మనం అర్థం చేసుకోవాలి, ఆ పక్షులు నాతోనే కాదు మీతో కూడా మాట్లాడుతున్నాయి వాటికి ఆహారం పెట్టినందుకు కృతజ్ఞతగా మనకి హెల్ప్ చేస్తున్నాయి." అన్నాడు అభిర్.

పక్షుల వైపు చూస్తూ దాస్ దగ్గరికి వచ్చి "సార్! మనం కూడా అభిర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఇన్ ఫార్మర్స్ కి డబ్బులు ఇచ్చే పని ఉండదు." అటు సంతోషంగా చూస్తూ చెప్పాడు కుమార్.

ఆ మాటకి కుమార్ ని కింద నుంచి పైకి చూస్తూ "నువ్వు ఏ రోజైనా ఎంగిలి చేత్తో కాకినైనా కొట్టావా?" అని అడిగాడు దాస్.

"ఏమో సర్ గుర్తులేదు." అన్నాడు కుమార్.

"మరి నీకు ఏ పక్షి హెల్ప్ చేస్తుంది నోరు మూసుకుని మాట్లాడకుండా అక్కడ జరుగుతుంది చూడు." కోపంగా చూస్తూ అన్నాడు దాస్.

'మీరు పిల్లికి బిచ్చం కూడా పెట్టారు పైగా నన్ను అంటున్నారు.' అంటూ మనసులో అనుకుంటూ దూరంగా వెళ్ళాడు కుమార్.

"అభిర్! అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?  నాతో కూడా చెప్పకూడదా?" అని అడిగింది వసుంధర.

"నాకు పునర్జన్మ ఇచ్చిన కన్నతల్లి లాంటివారు, నా బాధ మీతో కాకుండా ఎవరితో చెప్పుకోగలను తప్పకుండా చెప్తాను కానీ దానికి కొంత సమయం ఉంది."  అన్నాడు అభిర్.

అంతలో ఒక పక్షి అక్కడకి వచ్చి అరవడం చూసి "అభిర్! ఎవరైనా ఇక్కడికి వస్తున్నారా?" అంటూ కంగారుగా అడిగాడు శ్రీకర్.

పక్షి వైపు చూసి "దయ సార్ వాళ్ళు పిల్లల్ని తీసుకుని వస్తున్నారు." అంటూ సంతోషంగా చెప్పాడు అభిర్.

"అవునా?" అంటూ ఇంటి బయటకు వెళ్లి చూసి "దయ వాళ్ళు వెళ్లిన కారు వస్తుంది." అంటూ సంతోషంగా చూస్తూ అన్నాడు శ్రీకర్.

అక్కడికి వచ్చి కారులో నుంచి దిగి అభిర్ దగ్గరకు వచ్చి "యువర్ రియల్లీ గ్రేట్! పిల్లల్ని ఉన్న ప్లేస్ ఎవరు కనిపెట్టలేరు, కానీ ఈ పక్షులు మమ్మల్ని ఈజీగా అక్కడకు తీసుకువెళ్లేయ్! పిల్లల్ని సేవ్ చేసాము ఆ గ్యాంగ్ లో కొంతమందిని అరెస్టు చేసాము ఈరోజు నువ్వు రెండు ప్రాణాలు కాపాడేవు." సంతోషంగా చూస్తూ చెప్పాడు దయ.

"కాదు సార్! ఆరు ప్రాణాలు కాపాడాడు మా పిల్లలు లేకపోతే మేము ఉండే వాళ్ళమే కాదు." అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు సురేష్.

అభిర్ చేతులు పట్టుకుని "థాంక్యూ బ్రదర్! నీ రుణం ఎప్పటికీ తీర్చుకొలేము." అన్నాడు కమల్.

"ఈ విషయంలో నేను చేసింది ఏమీ లేదు మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడింది థాంక్స్ చెప్పాలి అనుకుంటే మనకి హెల్ప్ చేసిన ఆ పక్షులకి చెప్పండి." అన్నాడు అభిర్.

"అంకుల్! ఈ పక్షులు నాతో కూడా మాట్లాడతాయా?" క్యూట్ గా అడిగింది రోషిని.

"ఆ పక్షులు నీతోరోజు మాట్లాడుతున్నాయి ఇప్పుడు కూడా హాయ్ చెప్తున్నాయి." అంటూ ఎత్తుకుని పక్షుల దగ్గరికి తీసుకువెళ్లాడు అభిర్.

"ఇటువంటి పిల్లాడికి అన్యాయం చేయాలనుకున్న వాళ్ళు బాగుపడరు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు." అంది గీత.

వసుంధర దగ్గరికి వచ్చి "మేడం! నాకు ఒక చిన్న డౌట్ పక్షులతో ఇంత చేయగలిగినవాడు జైల్లో ఉన్నట్లు తన మనుషులకి చెప్పలేడు అంటారా!" అంటూ దూరంగా ఉన్న అభిర్ వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు శ్రీకర్.

"నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది." అంది వసుంధర.

"అంటే! అభిర్ ఇన్ని సంవత్సరాలుగా తన వాళ్లని కలవకూడదు అనుకున్నాడా? లేక తనకోసం వస్తే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని ఆగిపోయాడా?"  అనుమానంగా అన్నాడు శ్రీకర్.

"నాకు తెలిసి సెకండ్ పాయింట్ కరెక్ట్! తనకోసం వచ్చి ఎవరు ప్రమాదంలో పడకూడదు అని ఆలోచించి ఉంటాడు." అంది నీలమ్.

'ఈ కేస్ లో నుంచి అభిర్ బయటికి వచ్చిన తన మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది.' అని మనసులో అనుకున్నడు శ్రీకర్.

*******************

అదే టైంలో తన ఇంటి దగ్గర అభిర్ కేస్ ఫైల్ చూస్తూ తన అసిస్టెంట్ వైపు చూసి "ఒరేయ్ చాక్లెట్! మనకి కేసు ఇచ్చిన పార్టీకి అమౌంట్ వేయమని మెసేజ్ పెట్టాలి సుమారు ఎంత అవసరమవుతుంది." డౌట్ గా చూస్తూ అడిగింది మిత్ర.

"అక్క! అవసరం అంటే చాలా ఉంది రెంట్ కట్టాలి కిరాణా షాప్, పాలవాడు, కరెంట్ బిల్లు!" అంటు లిస్ట్ చెప్పడం మొదలు పెట్టాడు చాక్లెట్.

"అబ్బా...ఆపరా బాబు! ఎంత అవసరమో చెప్పు ఆ లిస్ట్ వింటుంటే బీపీ పెరిగిపోతుంది." కోపంగా చూస్తూ అంది మిత్ర.

"నీ ఇగో హర్ట్ అయిందని డిపార్ట్మెంట్ వాళ్లతో గొడవ పెట్టుకున్నావు సంవత్సరం నుంచి చేతిలోకి పైసా రాలేదు  అప్పులు కాకుండా ఇంకేమి ఉంటాయి." విసుగ్గా అన్నాడు చాక్లెట్.

"సరే! ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు మనకి లండన్ పార్టీ తగిలింది ఈ కేస్ సాల్వ్ చేస్తే డబ్బుకి ఇబ్బంది ఉండదు పెద్ద పెద్ద వాళ్ళ కేసులు చాలా వస్తూ ఉంటాయి." అంటూ సంతోషంగా చెప్పింది మిత్ర.

"అవునా?" అంటూ మొబైల్ తీసుకుని మెసేజ్ టైప్ చేస్తూ "అక్క! టూ లాక్స్ పంపించమని నీ ఎకౌంట్ నెంబర్ కూడా సెండ్ చేశాను." అని చెప్పాడు చాక్లెట్.

"ఒరేయ్! వర్క్ స్టార్ట్ చేయకుండానే 2 లాక్స్ అడిగితే ఇస్తారో లేదో!" అంటూ ఫోన్ తీసుకుని మెసేజ్ చూసి
చాక్లెట్ వైపు కోపంగా చూస్తూ "టూ లాక్స్ పక్కన 'పి' లెటర్ ఏంటిరా దరిద్రుడా... సరిగ్గా టైప్ చేయడం కూడా రాదా!' అంటూ డిప్ప మీద ఒకటి పీకింది మిత్ర.

"సారీ అక్క! కొంచెం పెద్ద అమౌంట్ కదా కంగారులో టైప్ అయిపోయింది." అంటూ తల సమురుకుంటూ అన్నాడు చాక్లెట్.

"అర్ణ మేడమ్ దగ్గర నా ఇమేజ్ మొత్తం పోతుంది. మెసేజ్ పెట్టడం కూడా రాదు డిటెక్టివ్ అయిపోయిందా అనుకుంటుంది." అంటు చికాకు పడుతూ అంది మిత్ర.

అంతలో మెసేజ్ సౌండ్ రావడంతో ఫోన్ చూస్తూ "అక్క! నో ప్రాబ్లం ఎకౌంట్లో అమౌంట్ పడినట్టు ఉంది." అంటూ సంతోషంగా చూస్తూ చెప్పాడు చాక్లెట్

"ఓకే! మన బ్యాలెన్స్ పోను కరెక్ట్ గా రెండు లక్షలు వేసిందో లేదో చూడు ఈ డబ్బుఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి." అంది మిత్ర.

"మన అకౌంట్లో 11 రూపాయలు ఉండాలి." అంటూ మెసేజ్ చూస్తూ "అక్క! ఇక చాలా సున్నాలు ఉన్నాయి అర్థం కావడం లేదు." అంటూ అయోమయంగా పేస్ పెట్టి అన్నాడు చాక్లెట్.

"అవునా?" అంటూ మొబైల్ తీసుకుని చూసి "ఏంట్రా  ఆవిడా రెండు కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది." అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది మిత్ర.

"అక్క! లండన్ పార్టీ అన్నావు కదా! టూ లాక్స్ పక్కన 'పి' అని ఉంటే పౌండ్స్ అనుకుని టూ లాక్స్ పౌండ్స్ ట్రాన్స్ఫర్ చేసారు." అంటూ ఆనందంగా చెప్పాడు చాక్లెట్.

"అంటే! మనం ఒప్పుకున్న కేసు అంత పెద్దదా? నిజంగా ఆ అభిర్ మన పాలిటి దేవుడు అతని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి." అంటూ సంతోషంగా అంది మిత్ర.

************************

సాయంత్రం తన ఆఫీసులో ఉన్న హిరణ్య ఫోన్ రింగ్ అవడం చూసి "మిచల్ కాల్ చేస్తున్నాడు పని అయిపోయిందనుకుంటా!" అంటూ సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి "వర్క్ కంప్లీట్ అయిపోయిందా?" అంటూ ఆత్రుతగా అడిగాడు హిరణ్య.

"నో సార్! ప్లాన్ ఫెయిల్ అయింది నా మనుషుల్ని సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు, ఆ లాయర్ ఇంటి దగ్గర టైట్ సెక్యూరిటీ వాళ్లని మనం ఇప్పుడు ఏమి చేయలేము ఏదైనా ఉంటే కోర్టు దగ్గర చూసుకోవడమే!" అన్నాడు మిచల్.

"అవునా!" అంటూ కాసేపు ఆలోచించి "రేపు కోర్టు దగ్గర ఎటువంటి చిరాకు జరిగిన కేసు వాళ్ళకి ఫేవర్ అయిపోతుంది ఏం జరుగుతుందో చూద్దాము నేను చెప్పే వరకు సైలెంట్ గా ఉండు." అన్నాడు హిరణ్య.

"ఓకే సార్! మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను." అంటూ ఫోన్ పెట్టేసాడు మిచల్.

"ఈ విషయం ముకుల్ గారితో చెప్పడమే కరెక్ట్!" అనుకుని ఫోన్ తీసి కాల్ చేసాడు హిరణ్య.

ఫోన్ లిఫ్ట్ చేసి "ఏమైంది?" అంటూ టెన్షన్ గా అడిగాడు ముకుల్.

"సారీ సార్! మనం ఈ కేసు ఓడిపోబోతున్నాము మురళి జోషి భార్యా పిల్లలు బతికే ఉన్నారు రేపు కోర్టులో మర్డర్ చేసింది అభిర్ కాదని ఆవిడ కచ్చితంగా చెబుతుంది." అంటూ డల్ గా చెప్పాడు హిరణ్య.

ఆ మాట విని ఫోన్ కట్ చేసాడు ముకుల్ నంద.
[+] 10 users Like SivaSai's post
Like Reply
#51
కథ ఆసక్తికరంగా సాగుతోంది

వీలైతే రోజుకో అప్డేట్ మిత్రమా!
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#52
Interesting and Gripping Story. Looking forward for more updates. Thanks Shiva garu for regular updates.
Like Reply
#53
Thanks for All Comments 



Next Update In Few Minutes 
Like Reply
#54
 ఎపిసోడ్ 19


ఫోన్లో లాయర్ హిరణ్య చెప్పిన మాట విని ఏమి మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు ముకుల్.

************************

లండన్ తన ఇంట్లో హిరణ్యతో ఫోన్ మాట్లాడి ఆలోచిస్తూ టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఫోన్ తీసి జనార్ధన్ కి కాల్ చేశాడు ముకుల్ నంద.

ఫోన్ లిఫ్ట్ చేసి "అయ్యా చెప్పండి?" అంటూ వినయంగా అడిగాడు జనార్ధన్.

"నువ్వు వెంటనే బయలుదేరి ఢిల్లీ వేళ్ళు ఆ మురళీ జోషి గాడి పెళ్ళాం చచ్చింది అనుకున్నాను కానీ బతికే ఉంది రేపు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వస్తుంది. అక్కడ దాని నోటి వెంట నా కొడుకు పేరు రాకూడదు అంటే నువ్వు దానికి కనపడి ఒక్కసారి గతం గుర్తు చేయాలి." అని చెప్పాడు ముకుల్.

"సరే అయ్యా! కానీ అభిర్ నన్ను చూస్తే...!" అంటూ భయంగా అడిగాడు జనార్ధన్.

"కోర్టు దగ్గర నీతో పాటు నా మనుషులు కూడా ఉంటారు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చేసిన పాపం చాలు మళ్లీ ఎందుకు చేయడం అనుకున్నాను కానీ చేయక తప్పేటట్లు లేదు." అన్నాడు ముకుల్ నంద.

"సరే అయ్యా! మీరు ఉండగా నాకు భయం ఎందుకు! అయ్యినా వాడు 12 సంవత్సరాలుగా జైలు కూడా తిని అన్ని మర్చిపోయి ఉంటాడు, మీరు ఏమి కంగారు పడకండి అవసరం అయితే వాడిని కూడా లేపేసి నేను తిరిగి వెళ్ళిపోతాను." అంటూ సంతోషంగా చెప్పాడు జనార్ధన్.

"సరే! అక్కడ బిజినెస్ సరిగ్గా లేదన్నావు కదా! ఈ పని అయిన తర్వాత మైసూర్ లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ నీ పేరు మీద రాస్తాను." అని చెప్పాడు ముకుల్.

"మీ మనసు వెన్న అయ్యగారు! ఇప్పుడే ఇండియా బయలుదేరుతున్నాను." అంటూ సంతోషంగా చెప్పాడు జనార్ధన్.

"సరే! అక్కడికి వెళ్ళగానే మిచల్ కి కాల్ చెయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు మూకుల్ నంద.

************************

ఢిల్లీ తన ఎకౌంట్లో రెండు కోట్లు పడ్డాయి ఆనందంతో కాసేపు చాక్లెట్ తో కలిసి డాన్స్ చేసి

"ఒరేయ్ నేను ఈ కేస్ స్టడీ చేస్తూ ఉంటాను, నువ్వు వెళ్లి మనం ఇవ్వాల్సిన వాళ్లందరికీ డబ్బులు ఇచ్చి మనకి కావలసినవి అన్ని తీసుకొనిరా!" అని చెప్పింది మిత్ర.

"సరే అక్క! ముందు ఆ మార్వాడి మోహన డబ్బులు కొట్టి మన బండి తీసుకు వస్తాను." అంటూ బుర్రగోకుంటూ  "అక్క! నాకు బట్టలు తీసుకుంటాను అన్నావు." నెమ్మదిగా అడిగాడు చాక్లెట్.

"హ...! ముందు వెళ్లి నేను చెప్పిన పని చేసుకోరా! ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత బట్టలు, గిట్టలు చూద్దాము, లేకపోతే డబ్బులు వెనక్కి వెయ్యమన్నారు అంటే మన ఇద్దరి కిడ్నీలు అమ్మి ఇవ్వాలి." అంటు కోపంగా చూస్తూ చెప్పింది మిత్ర.

"కరెక్ట్ అక్క! ముందు మన దేవుడి గురించి తెలుసుకో!" అంటూ అక్కడి నుంచి పరిగెత్తాడు చాక్లెట్.

కేసు ఫైల్ చూస్తూ 'అభిర్ ని కావాలని దీంట్లో ఇరికించారని ఈజీగా తెలిసిపోతుంది. కానీ 12 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు అంటే ఈ కేసు వెనకాల ఏదో ఉంది.' అనుకుంటూ పేజీలు తిరగవేస్తూ

'అసలు పేరు కూడా తెలియకుండా ఎఫ్ఐఆర్ రాసిన దరిద్రుడు ఎవడు? ఈ కేసు వాదించే వెధవ ఎవడు? " అంటు చూస్తూ

"లాయర్ హిరణ్య! వీడొక వేస్ట్ ఫెలో గాడు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది నిరంజన్ వీడు చచ్చి చాలా కాలం అయింది కదా!'

'ఈ 12 సంవత్సరాల్లో అభిర్ తరపున వాదించడానికి ఒక్క లాయర్ కూడా ముందుకు రాలేదా! చాలా విచిత్రంగా ఉందే తనని కలుసుకోవడానికి కూడా జైలుకు ఎవరూ రాలేదు." అంటూ ఆలోచిస్తూ ఉంది మిత్ర.

అంతలో అక్కడకు వస్తూ "అక్క మనం ఇవ్వాల్సిన బాకీలు మొత్తం క్లియర్! అందరిని ఫోన్ పే తో కొట్టాను, ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర మార్వాడి లేడు వాడి అసిస్టెంట్ ఉన్నాడు డబ్బులు ఇచ్చి బండి కూడా తీసుకొచ్చేసాను." అంటూ సంతోషంగా తాళాలు చూపించాడు చాక్లెట్.

ఆ మాటకి చాక్లెట్ వైపు సంతోషంగా చూస్తూ "ఇప్పుడేమన్నావురా...మార్వాడి అసిస్టెంట్ ఉన్నాడా?" అంటూ ఆలోచిస్తూ

"ఎస్సై! నిరంజన్ అసిస్టెంట్ ఎవడో ఒకడు ఉంటాడు కదా వాడిని పట్టుకుంటే అసలు అభిర్ ని ఎక్కడినుంచి తీసుకువచ్చారు ఎందుకు ఈ కేసులో ఇరికించారో తెలిసిపోతుంది." అంటూ సంతోషంగా అంది మిత్ర.

"అక్క! అలాగే చచ్చిపోయిన మురళి జోషి కూడా ఆఫీస్ రే కదా! తన అసిస్టెంట్ కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా! వాడిని కూడా పట్టుకుంటే అసలు మేటర్ బయటికి వస్తుంది." అంటూ కళ్ళు ఎగరేస్తూ చెప్పాడు చాక్లెట్.

"కరెక్టే రా! అసలు ఇంతకీ మనకి కేసు ఇచ్చిన పార్టీ అభిర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటుంది?" అంటూ చాక్లెట్ వైపు చూసి అనుమానంగా అడిగింది మిత్ర.

"ఆ విషయం గురించి మనకెందుకు అక్క! ఆ ఇద్దరి ఆఫీసర్ లా అసిస్టెంట్లు గురించి ముందు తెలుసుకుందాము." అన్నాడు చాక్లెట్.

"ఓకే! అభిర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన నోయిడా స్టేషన్ కి వెళ్దాము పద! అక్కడ రైటర్ ముఖేష్ ఉంటాడు కదా వాడికి డబ్బులు కొడితే ఏదైనా చేస్తాడు." అంటూ చాక్లెట్ తో కలిసి బయలుదేరింది మిత్ర.

కాసేపటికి స్టేషన్ దగ్గరకు వచ్చి "ఒరేయ్ చాక్లెట్! నేను ఆ బేకరిలో ఉంటాను నువ్వు వెళ్లి రైటర్ ని తీసుకురా!" అని చెప్పింది మిత్ర.

"ఓకే అక్క!" అంటూ హుషారుగా స్టేషన్ లోపలకి వెళ్లి  "నమస్తే ముఖేష్ సార్! మీకోసం అక్క బేకరీ దగ్గర వెయిట్ చేస్తుంది డబ్బులు వచ్చే పని తగిలిందంట వెంటనే రమ్మంది." అని చెప్పాడు చాక్లెట్.

"అవునా?" అంటూ చాక్లెట్ ని కింద నుంచి పైకి చూస్తూ "అసలు!  నీకు చాక్లెట్ అనే పేరు ఎవరు పెట్టారు రా..!" డౌట్ గా అడిగాడు ముఖేష్.

"మా అమ్మ కడుపులో నేను ఉన్నప్పుడు మా నాన్నని రోజు చాక్లెట్ అడిగేదంట! అందుకే అందరు నన్ను  చాక్లెట్ చాక్లెట్ అని పిలుస్తూ ఉండడం వల్ల అలా అలవాటైపోయింది." అంటూ నవ్వుతూ చెప్పాడు చాక్లెట్.

"అవునా? నీ అసలు పేరు ఏంట్రా?" అని అడిగాడు ముఖేష్.

"ఆ...! నా అసలు పేరు బిస్కెట్! మీరు తొందరగా వస్తే అక్క మాట్లాడుతుంది లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు." అంటూ సీరియస్ గా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళాడు చాక్లెట్.

"సరే ఆగు వస్తున్న!" అంటూ హడావుడిగా బేకరీ దగ్గరికి వచ్చి సమోసా తింటూ మిత్ర వైపు చూసి "ఏంటి విషయం?" అంటూ చుట్టూ చూస్తూ నెమ్మదిగా అడిగాడు ముఖేష్.

"ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి 12 సంవత్సరాల క్రితం మేటర్ నీవల్ల అవుతుందా?" అని అడిగింది మిత్ర.

"నా గురించి తెలుసు కదా! కానీ అమౌంట్ కరెక్ట్ గా ఇవ్వాలి వాయిదాల పద్ధతిలో మాత్రం కుదరదు." ఆనాడు ముఖేష్.

"నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఫోన్ పే పట్టు! ఏమాత్రం లేటు ఉండదు." అంటూ కేసు నెంబర్ చూపించి

"ఈ ఎఫ్ ఐ ఆర్ చేసిన ఎస్సై నిరంజన్ కి బాగా క్లోజ్ గా ఉండే ఆఫీసర్స్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి." అంటూ పేపర్ ఇచ్చింది మిత్ర.

"ఓకే!" అంటూ పేపర్ తీసుకుని జేబులో పెట్టుకుని  "మార్నింగ్ వచ్చి డీటెయిల్స్ తీసుకువెళ్లు! వెళ్లేటప్పుడు నా బిల్లు కూడా కట్టు!" అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు ముఖేష్.

బేకరీ లో నుంచి వెళ్ళిపోతున్న ముఖేష్ వైపు అసహ్యంగా చూస్తూ "ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రూపాయి బిళ్ళ ఇవ్వను." అంటూ కౌంటర్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి

"మా బిల్లు కూడా ముకేశ్ సార్ అకౌంట్లో రాసుకో!" అని చెప్పి చాక్లెట్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిత్ర.

బండి మీద వెళుతూ "అక్క! NIA ఆఫీస్ కి వెళదామా? సచ్చినోడు అసిస్టెంట్ గురించి తెలుసుకోవాలి కదా!" అని అడిగాడు చాక్లెట్.

"ఒరేయ్! NIA అంటే సెక్యూరిటీ ఆఫీసర్లు లాగా కాదు వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మనల్ని కూడా టెర్రరిస్టులు అని చెప్పి షూట్ చేస్తారు, ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ రానివ్వు  తర్వాత దాని సంగతి చూద్దాము." అంటూ ఎదురుగా షాపింగ్ మాల్ కనిపించడంతో "ఫస్ట్ నీకు బట్టలు కొందాము." అంటూ కాంప్లెక్స్ లోకి తీసుకు వెళ్లింది మిత్ర.

"సరే!" అంటూ బండి దిగుతూ "అక్క! నా కిడ్నీ మాత్రం ఇవ్వను." అన్నాడు చాక్లెట్.

ఆ మాటకి నవ్వుతూ "సరే పద! అవసరమైతే నాది ఇస్తానులే!" అంటూ లోపలికి తీసుకెళ్లింది మిత్ర.

*****************

మరుసటి రోజు ఉదయం వసుంధర ఇంటి దగ్గర నుంచి అభిర్, గీత లని కార్లో ఎక్కించుకొని ఫుల్ సెక్యూరిటీతో కోర్టుకి బయలుదేరడానికి రెడీ అయ్యాడు శ్రీకర్.

అంతలో అక్కడికి వస్తూ శ్రీకర్ వైపు చూసి "కోర్టుకు వెళ్లే దారిలో  సివిల్ డ్రెస్ లో మా ఆఫీసర్స్ ఉన్నారు ఎటువంటి ప్రాబ్లం ఉండదు." అని చెప్పి ఫోన్ లైన్ లో ఉన్న  ఆఫీసర్స్ తో మాట్లాడుతూ

"ఎవరి మీద అయినా అనుమానం వస్తే వెంటనే కస్టడీలోకి తీసుకోండి." అని చెప్పాడు దయ.

"ఓకే సర్!  రూట్ అంత క్లియర్ గా ఉంది." అని చెప్పాడు సురేష్.

"సార్! నేను కోర్టు దగ్గర రెడీగా ఉన్నాను ఇక్కడ కూడా అంత ప్రశాంతంగానే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు." అని చెప్పాడు కమల్.

"ఓకే గుడ్! అంటూ శ్రీకర్ వైపు చూసి "స్టార్ట్ అవుదామా?" అని చెప్పి వసుంధర వైపు చూసి "మేడం మీరు కూడా స్టార్ట్ అవ్వండి." అని చెప్పాడు దయ.

"ఓకే!" అంటూ తన కార్ లో సుమతి నీలమ్ లని ఎక్కించుకొని స్టార్ట్ అయింది వసుంధర.

రెండు కార్ల వెనక వెళుతూ కోర్టు దగ్గరికి రావడంతో అభిర్, గీత లు కారు దిగిన వెంటనే లోపలికి తీసుకువెళ్లి కోర్ట్ హాల్ లో కూర్చోబెట్టడు దయ.

టెన్షన్ గా ఉన్న గీత దగ్గరకు వచ్చి "అమ్మ! కంగారు పడకు  మనం కోర్టు లోపలికి వచ్చేసాము ఇక్కడికి ఎవరు రాలేరు." అని చెప్పింది సుమతి.

అక్కడికి వస్తు అభిర్ వైపు చూసి "నువ్వు వెళ్లి అటువైపు కూర్చో ఇక్కడ కూర్చోకూడదు." అని చెప్పి గీత వైపు చూసి "మీరు ఇక్కడే కూర్చోండి ఎవరు పిలిచినా బయటకు వెళ్ళకండి." అని చెప్పింది వసుంధర.

"ఓకే మేడం!" అంటూ కూతురి వైపు చూసి "వాటర్!" అంది గీత.

"ఓకే!" అంటూ గబగబా బయటికి వెళ్ళింది సుమతి.

ఒంటరిగా కూర్చున్న గీత దగ్గరికి వచ్చి "నమస్తే మేడం! బాగున్నారా?" అంటూ నవ్వుతూ అడిగాడు జనార్ధన్.

తల పైకెత్తి జనార్ధన్ వైపు భయంగా చూస్తూ ఉండిపోయింది గీత.
[+] 8 users Like SivaSai's post
Like Reply
#55
 ఎపిసోడ్ 20


కోర్ట్ హాల్ లో వాటర్ బాటిల్ కోసం సుమతి బయటికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న గీత దగ్గరికి వచ్చి నమస్తే మేడం  అని అడిగిన జనార్ధన్ వైపు భయంగా చూస్తూ ఉండిపోయింది గీత.

*******************

కోర్ట్ హాల్ లో తన వైపు భయంగా చూస్తున్న గీత వైపు చూసి "కంగారు పడకండి బయటకు వెళ్లిన మీ అమ్మాయి క్షేమంగానే ఉంటుంది. మీరు ఈ కోర్టులో నోరు తెరవనంత వరకు." అంటూ అక్కడి నుంచి వెళుతూ వెనక్కి తిరిగి

"పాత విషయాలు మీరు పూర్తిగా మర్చిపోయారు అనుకుంటున్నాను." అంటూ నవ్వుతూ అక్కడ నుంచి బయటకు వెళ్ళాడు జనార్ధన్.

దూరంగా ఉన్న అభిర్ వైపు చూస్తూ టెన్షన్ గా ఆలోచిస్తున్న గీత భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి తల పక్కకు తిప్పి కంగారు "ఎవరు?" అంది.

స్మైల్ ఇస్తూ "నేనే ఆంటీ! ఏమైంది? అంత టెన్షన్ గా ఉన్నారు అందరం ఇక్కడే ఉన్నాము కదా!" అంటూ చుట్టూ చూస్తూ "సుమతి ఎక్కడ?" డౌట్ గా అడిగింది నీలమ్.

"వాటర్ బాటిల్ కోసం బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు ఒక్కసారి చూసి వస్తావా అమ్మ? ఎందుకో నాకు కంగారుగా ఉంది." అంటూ వణుకుతున్న గొంతుతో చెప్పిన గీత.

"మీరు రిలాక్స్ గా ఉండండి నేను వెళ్లి సుమతి ఎక్కడ ఉందో చూస్తాను." అంటూ బయటికి వెళుతూ అక్కడ బెంచ్ మీద ఉన్న తన అసిస్టెంట్ వైపు చూసి "రాజు! ఆవిడ దగ్గరికి ఎవరైనా వచ్చారా?" డౌట్ గా అడిగింది నీలమ్.

"మేడం! ఒక వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళాడు అప్పట్నుంచి ఆవిడ టెన్షన్ గా ఉంది." అంటూ మొబైల్ లో ఫోటో చూపించాడు రాజు.

"అవునా?" అంటూ గీత వైపు చూసి ఆలోచిస్తూ "ఆ ఫోటో నాకు సెండ్ చెయ్ ఆ మనిషి మళ్ళీ వస్తే వెంటనే నాకు కాల్ చెయ్!" అంటూ హడావిడిగా సుమతి కోసం బయటికి వెళ్ళింది నీలమ్.

********************

కోర్టు హల్ నుంచి బయటికి వస్తూ ఫోన్ తీసి కాల్ చేసి "మిచల్! లోపల మురళి జోషి పెళ్లానికి వార్నింగ్ ఇవ్వడం అయ్యింది దాని కూతురు వాటర్ బాటిల్ కోసం క్యాంటీన్ దగ్గరికి వచ్చింది నేను కూడా అక్కడికే అక్కడే ఉన్నాను త్వరగా నీ మనుషుల్ని పంపించు అది మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు." అని చెప్పాడు జనార్ధన్.

"సరే! నా మనుషులు ఇద్దరు మీ దగ్గరికి వస్తున్నారు ఆ అమ్మాయిని చూపించి మీరు అక్కడి నుంచి లోపలకి వెళ్లిపోండి మిగతా విషయం మా వాళ్ళు చూసుకుంటారు." అని చెప్పాడు మిచల్.

"ఓకే!" అంటూ ఫోన్ కట్ చేసి క్యాంటీన్ దగ్గర ఉన్న సుమతి వైపు చూస్తూ ఉన్నాడు జనార్ధన్.

అంతలో చాక్లెట్ కలిసి బైక్ మీద అక్కడికి వచ్చి పార్క్ చేసి కోర్టు లోపలికి వెళుతూ "ఒరేయ్! ఈరోజు మన దేవుడిని డైరెక్ట్ గా చూద్దాము." అని చెప్పింది మిత్ర.

"సరే అక్క!" అంటూ వెనకాలే వెళుతూ క్యాంటీన్ వైపు చూసి "అక్క! రైటర్ ముఖేష్ ఇక్కడే ఉన్నాడు మన కోసమే వచ్చాడేమో!" డౌట్ గా అన్నాడు చాక్లెట్.

"అవునా? మనం ఎక్కడికి వస్తున్నట్టు చెప్పలేదు కదా!" అంటూ డౌట్ గా వెనక్కి తిరిగి క్యాంటీన్ దగ్గర సమోసా తింటున్నా ముకేశ్ ని చూసి

"అబ్బా.. ఎప్పుడు కనిపించినా సమోసా తింటూనే ఉంటాడు వీడి పెళ్ళాం ఇంటి దగ్గర ఏమి వండి పెట్టదు అనుకుంటా!" అంటూ చికాకుగా చూస్తూ క్యాంటీన్ వైపు వెళ్ళింది మిత్ర.

కోర్ట్ హాల్లో నుంచి హడావిడిగా బయటకు వచ్చి క్యాంటీన్ దగ్గర ఉన్న సుమతిని చూసి దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ "వాటర్ బాటిల్ కోసం వచ్చావా?" అని అడిగింది నీలమ్.

భుజం మీద చెయ్యి వేసిన నీలమ్ వైపు చూసి "హ...! అమ్మ వాటర్ అంటే వచ్చాను ఇక్కడ చాలా బిజీగా ఉంది." అంటూ బాటిల్ తీసుకుని డబ్బులు ఇస్తూ చెప్పింది సుమతి.

"ఓకే! నువ్వు సింగిల్ గా బయటికి రాకూడదు ఏదైనా అవసరమైతే నాతో చెప్పు!" అంటూ దూరంగా ఉన్న జనార్దన్ దగ్గరికి ఇద్దరు మనుషులు రావడం చూస్తూ చెప్పింది నీలమ్.

తన దగ్గరికి వచ్చిన మిచల్ మనుషుల వైపు చూసి క్యాంటీన్ వైపు చూపించి "ఆ వైట్ కలర్ టీ షర్ట్ అమ్మాయిని మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సింది." అని చెప్పాడు జనార్ధన్.

"ఓకే సర్! మీరు లోపలికి వెళ్ళండి ఇంక మేము చూసుకుంటాము." అంటూ క్యాంటీన్ వైపు వెళ్లారు మిచల్ మనుషులు ఇద్దరు.

జనార్ధన్ కోర్టు లోపలికి వెళ్లడం క్యాంటీన్ వైపు అతనితో మాట్లాడిన ఇద్దరు రావడం చూసి సుమతి చెయ్యి పట్టుకుని "మనం ఇటు వైపు నుంచి వెళదాము పద!" అంటూ స్పీడ్ గా అక్కడినుంచి తీసుకువెళ్ళింది  నీలమ్.

క్యాంటీన్ దగ్గరికి వచ్చి లోపల చూస్తూ ముఖేష్ తో మాట్లాడుతు వైట్ కలర్ టీ షర్ట్ లో ఉన్న మిత్రని చూసి దగ్గరకు వెళ్లి
"మీ అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు వసుంధర మేడం మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు." అని చెప్పాడు అక్కడకు వచ్చిన ఇద్దరిలో ఒకడు.

ఆ మాటకి తల తిప్పి చూస్తూ "మీరు మాట్లాడేది నాతోనే కదా! నేను మీకు బాగా తెలుసా?" అంటూ వెటకారంగా అడిగింది మిత్ర.

వెంటనే పక్కనున్న రెండో వాడు మిత్ర వీపు మీద కత్తి పెట్టి "నువ్వు ఎవరో మాకు బాగా తెలుసు! మర్యాదగా నోరు మూసుకుని మాతో పాటు రా..!" అంటూ నెమ్మదిగా చెప్పాడు.

"ఓకే! ఓకే కూల్! కూల్!" అంటూ వెనక్కి తిరిగి ఇద్దరి కళ్ళల్లోకి చూస్తూ "ప్లీజ్ నన్ను వదిలి పెట్టండి. మీకు పుణ్యం ఉంటుంది." అంటూ భయంగా చూస్తూ ఫేస్ ఫీలింగ్స్ మార్చి నవ్వుతూ

"ఒరేయ్! ఈ కత్తులుకి, బ్లేడులకి భయపడే రకం కాదురా నేను! మీ చేతిలో ఏకే 47 ఉంటే అప్పుడు ఆలోచిస్తాను." అంటూ కత్తి పట్టుకున్న వాడికి రెండు కాళ్ళ మధ్యలో మోకాలితో ఒక్క తన్ను తన్నింది మిత్ర.

"అబ్బా... చచ్చేనురా దేవుడా!' అంటూ కిందపడి గిలగిల కొట్టుకున్నాడు వచ్చిన వాళ్ళలో ఒకడు.

అక్కడినుంచి పారిపోతున్న రెండో వాడిని చూసి "చాక్లెట్ వాడిని పట్టుకోరా..!" అంటూ గట్టిగా అరిచింది మిత్ర.

ఆ అరుపు విని పరిగెడుతున్న వాడి మీదకి దూకి రెండు కాళ్ళు పట్టుకుని కింద పడేసి "అక్క తొందరగా రా..! వీడు దున్నపోతులాగ ఉన్నాడు." అంటూ గట్టిగా పట్టుకున్నాడు  చాక్లెట్.

గిలగిలా కొట్టుకుంటున్న వాడిని పైకి లేపి ముఖేష్ చేతికి ఇచ్చి పరుగెత్తుకుంటూ వెళ్లి రెండవ వాడి మీద కాలు పెట్టి "చాక్లెట్ వాడిని వదిలేయరా..!" అంటూ జుట్టు పట్టుకుని పైకి లేపి

"మీరు నా దగ్గరికి చాలా లేటుగా వచ్చారూ రా..! మా అమ్మ కళ్ళు తిరిగి పడి పైకి పోయి 12 ఏళ్లు అవుతుంది.  ఎవర్రా మీరు..? మిమ్మల్ని ఎవరు పంపించారు? అంటూ కోపంగా చూస్తూ అడిగి ఇద్దరు సైలెంట్ గా ఉండడంతో

ముఖేష్ వైపు తిరిగి "ఇద్దరిని స్టేషన్ కి తీసుకువెళ్లి ఫుల్ గా బిర్యాని పెట్టి కొడుతూనే ఉండాలి నేను వచ్చి నీ దగ్గర పేపర్స్ తీసుకుని వీళ్ళ దగ్గర నిజం తెలుసుకుంటాను." అంటూ చాక్లెట్ వైపు చూసి "ముఖేష్ కి 10000 ఫోన్ పే చెయ్!" అని చెప్పింది మిత్ర.

"ఓకే అక్క!" అంటూ ఫోన్ తీసి ముఖేష్ కి అమౌంట్ పంపించాడు చాక్లెట్.

ఫోన్ కి వచ్చిన మెసేజ్ సంతోషంగా చూస్తూ తనతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్స్ ని పిలిచి "వీళ్ళిద్దరిని జీపులో ఎక్కించండి బిరియాని పెట్టించి స్టేషన్ కి తీసుకువెళదాము." అన్నాడు ముఖేష్.

"ఓకే సార్!" అంటూ ఇద్దరి చేతిలో వెనక్కి పెట్టి పట్టుకుని జీప్ దగ్గరికి తీసుకెళ్లారు కానిస్టేబుల్స్.

దూరం నుంచి ఇద్దరిని  కొడుతున్న మిత్రని చూసి స్మైల్ ఇస్తూ మనసులో థాంక్స్ చెప్పి సుమతీ తో కలిసి లోపలికి వెళ్లి అసిస్టెంట్ రాజు అని పిలిచి

"గీతా మేడం దగ్గరికి వెళ్లి ఒక్కసారి ఇటు వైపు చూడమను నువ్వు ఆవిడతో మాట్లాడుతున్న విషయం ఆ బ్లాక్ షర్ట్ వాడికి తెలియకూడదు." అంటూ కోర్టు హాల్లో ఉన్న జనార్దన్ ని చూపించింది నీలమ్.

"ఓకే మేడం!" అంటు కోర్టు హాల్ లోపలికి వెళ్లి గీత పక్కన కూర్చుని పేపర్ చూస్తూ "మేడం ఒకసారి తల లెఫ్ట్ కి తిప్పండి." అని చెప్పాడు రాజు.

ఆ మాట విని తల తిప్పి నీలమ్ తో పాటు ఉన్న సుమతిని చూసి ఊపిరి పీల్చుకుంది గీత.

అక్కడ నుంచే సైగ చేసి సుమతి భుజం మీద చెయ్యి వేసి 'నేను ఉన్నాను మీరు కంగారు పడకండి.' అంటూ బొటనవేలు చూపించింది నీలమ్.

చాక్లెట్ తో కలిసి కోర్టు హాల్లోకి వచ్చి అభిర్ ని చూపించి "ఒరేయ్! అతనే మనకి డబ్బులు ఇచ్చిన దేవుడు!" అని చెప్పింది మిత్ర.

"అవునా?" అంటూ అభిర్ వైపు చూసి "అక్క! ఇంత పెద్ద కేసులో ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడేంటి?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు చాక్లెట్.

"మనిషి ప్రశాంతంగానే ఉన్నాడు రా..! కానీ అతని కళ్ళలో కసి, మనసులో ఉక్రోషం, కడుపులో బాధ అన్ని నాకు అతని మొహం లోనే కనిపిస్తున్నాయి." అంటూ చూస్తూ చెప్పింది మిత్ర.

"అవునా? నీకు అతని మొహంలో అన్ని వేరియేషన్స్ కనిపిస్తున్నాయా?" డౌట్ గా అడిగాడు చాక్లెట్.

ఎస్! అంటూ కోర్టు హాల్లోకి వసున్న హిరణ్యని చూసి  "చాక్లెట్! లోపలికి వస్తున్న ఆ లాయర్  మొహం చూడు ఏమనిపిస్తుంది?" అని అడిగింది మిత్ర.

కళ్ళజోడు సరిచేసుకుంటూ లోపలికి వస్తున్న హిరణ్యని చూసి "అక్క! వీడు చిన్న పిల్లల నోట్లో లాలీపాప్ లాక్కునే వెధవ లాగా ఉన్నాడు." అంటూ అసహ్యంగా చూస్తూ చెప్పాడు చాక్లెట్.

"కరెక్ట్ గా చెప్పావు!" అంటు నవ్వుతూ ఫ్రంట్ బెంచ్ లో ఉన్న గీతా దగ్గరికి వస్తున్న వసుంధరని చూసి 'అభిర్ కేసు టేకప్ చేసింది ఈవిడే కదా!' అనుకుంది మిత్ర.

గీత దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి "మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిన విషయం జడ్జి గారు ముందు ధైర్యంగా చెప్పండి." అంటూ వెళ్లి తన చైర్ లో కూర్చుంది వసుంధర.

అంతలో కోర్టు హాల్లోకి జడ్జిగారు రావడం చూసి అందరూ లెగిసి నుంచోవడంతో నెమ్మదిగా సుమతితో పాటు లోపలికి వచ్చి మిత్ర పక్కన కూర్చుని స్మైల్ ఇచ్చి

"హాయ్! ఐ యాం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ నీలమ్!" అంటూ పరిచయం చేసుకుంది.

"హాయ్! ఐయామ్ డిటెక్టివ్ మిత్ర! వాడు నా అసిస్టెంట్ చాక్లెట్!" అంటూ స్మైల్ ఇచ్చింది మిత్ర.
[+] 10 users Like SivaSai's post
Like Reply
#56
nice update
[+] 1 user Likes vikas123's post
Like Reply
#57
ధన్యవాదములు శివ మిత్రమా,

కోరిక మన్నించినందుకు
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#58
Thanks Shiva garu. Good and Interesting Story. Your narration of story is great.
Like Reply
#59
ఎపిసోడ్ 21


కోర్టు లోపల జడ్జిగారు రావడంతో అందరూ నుంచోడం చూసి సుమతితో పాటు లోపలికి వచ్చి మిత్రని పరిచయం చేసుకుంది నీలమ్.

**********************

కోర్టులో కొన్ని కేసులు తర్వాత కేసు నెంబర్ 326/2012 అని పిలవగానే బోన్ లోకి వచ్చి నిలబడ్డాడు అభిర్.

జడ్జి గారి ముందుకు వెళ్లి పేపర్స్ సబ్మిట్ చేసి "యువనానర్! అబీర్ మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని నిరూపించడానికి మా దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన పేపర్స్ మొత్తం మీకు సబ్మిట్ చేసాను.

ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిబిఐ ఆఫీసర్ శ్రీకర్ గారిని ఒకసారి పిలిపించవలసిందిగా కోరుతున్నాను." అంటూ వినయంగా అడిగింది వసుంధర.

"ఓకే గ్రాంటెడ్!" అని చెప్పాడు జడ్జ్.

జడ్జ్ గారి ముందుకి వచ్చి నిలబడిన శ్రీకర్ వైపు చూస్తూ "మీరు ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ చేశారు కదా! మీకు తెలిసిన విషయాలు ఒకసారి జడ్జి గారు ముందు చెబుతారా?" అని అడిగింది వసుంధర.

"ఎస్!" అంటూ జడ్జి వైపు చూసి నమస్కరించి

"ఈ కేసు చాలా మిస్టరీగా ఉంది సార్! ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరు చనిపోయారు ఎంక్వయిరీ చేయడానికి మాకు ఎటువంటి దారి దొరకలేదు, కానీ మురళి జోషి భార్య పిల్లలు దూరంగా వెళ్లి బతుకుతున్నారని తెలిసి వెళ్లి వాళ్ళని కలిసి వివరాలు అడిగాము.

మురళీ జోషి గారి భార్య చెప్పిన మాటలు విని మేము కూడా షాక్ అయ్యాము, అసలు ఆవిడకి ఆయన భర్త కేసు కోర్టులో నడుస్తున్న విషయమే తెలియదు.

తన భర్తని చంపిన వ్యక్తి అభిర్ అని సెక్యూరిటీ ఆఫీసర్లకి స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఆ రోజే అక్కడి నుంచి పిల్లల్ని కాపాడుకోవడానికి పారిపోయాను అని చెప్పారు. దీనిని బట్టి ఈ కేసులో అభిర్ ని కావాలని ఇరికించారు అని అర్థమైంది.

అంతే కాదు సర్!  అబీర్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలు తారుమారు చేయడానికి రెండుసార్లు దాడి జరిగింది సెక్యూరిటీగా ఉన్న సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు.

అన్ని అవరోధాలు దాటుకుని  సాక్షులను కోర్టుకి జాగ్రత్తగా తీసుకువచ్చాము మాకు ఇంకా కొంత సమయం ఇస్తే ఈ కేసులో అసలైన నేరస్తులని పట్టుకొని కోర్టులో ప్రవేశపెడతాము." అని చెప్పాడు శ్రీకర్.

జడ్జి గారికి ముందుకు వచ్చి "యువనానర్! సిబిఐ ఆఫీసర్ శ్రీకర్ గారు చెప్పినట్లు అభిర్ మీద దాడి జరిగినట్లు ఎక్కడ కేస్ ఫైల్ అవలేదు అయ్యినా సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టేముందు నోటీస్ ఇష్యూ చేయాలి అటువంటిదేమీ లేకుండా ఎలా విచారిస్తాము?" అని అడిగాడు హిరణ్య.

"యువనానర్! సాక్షులు బయట ఉంటే వారి ప్రాణాలకి చాలా ప్రమాదం అందుకే ఎటువంటి నోటీసు ఇష్యూ చేయకుండా వాళ్ళని కోర్టుకి తీసుకువచ్చాము." అంటూ బెంచ్ మీద కూర్చున్న గీతని చూపించి 

"ఈ కేస్ ని 12 సంవత్సరాలుగా బెంచ్ మీదకి రాకుండా చేసిన వాళ్ళకి మిగతా విషయాలు చేయడం అంత పెద్ద పనేమీ కాదు." అని చెప్పింది వసుంధర.

"యువనానర్! వసుంధర గారు ఇది సినిమా అనుకుంటున్నారేమో సాక్షుల్ని ప్రశ్నించడానికి నాకు సమయం కావాలి." అని అడిగాడు హిరణ్య.

"మిస్టర్ హిరణ్య! మీరు చెప్పింది కరెక్టే! ఇది సినిమా కాదు మరి 12 సంవత్సరాలు ఈ కేస్ బెంచ్ మీదకి రాకుండా ఎలా ఉంది.
అసలు ఈ కేసులో అభిర్ దోషి అని రుజువు కాకుండా 12 సంవత్సరాలు శిక్ష ఎందుకు అనుభవించవలసి వచ్చింది సాక్షులని ఈరోజే క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి. ఇట్స్ మై ఆర్డర్!" అంటూ సీరియస్ గా చెప్పాడు జడ్జ్.

ఆ మాటకి కంగారుపడి "ఓకే యువనానర్ !" అంటూ వెళ్లి తన చైర్ లో కూర్చున్నాడు హిరణ్య.

గీత, వైఫ్ ఆఫ్ మురళీ జోషి అని పిలుపు విని జడ్జిగారు ముందుకి వచ్చి కుర్చీలో కూర్చుంది గీత.

తన ముందు ఉన్న గీత వైపు చూసి "మీరు ఎవరికి భయపడాల్సిన పనిలేదు ధైర్యంగా మీరు తెలిసింది మీరు చూసింది చెప్పండి." అని చెప్పాడు జడ్జ్.

"ఓకే సార్!" అంటూ నమస్కారం చేసి దూరంగా ఉన్న జనార్ధన్ వైపు భయంగా చూస్తూ ఉంది గీత.

"గీత గారు మీ భర్త  మురళి జోషి గారిని చంపిన వ్యక్తిని మీరు చూశారా?" అని అడిగింది వసుంధర.

"నేను చూశాను." అంటూ బాధగా చెప్పింది గీత.

"సరే! ఆ మనిషిని మీరు ఇప్పుడు చూసినా గుర్తుపట్టగలరా?" అని అడిగింది వసుంధర.

"కచ్చితంగా గుర్తుపడతాను ఆ మనిషిని ఎప్పటికీ మర్చిపోలేను." అంటూ కోపంగా చెప్పింది గీత.

"మంచిది." అంటూ ఎదురుగా ఉన్న అభిర్ వైపు చూపిస్తూ "మీ భర్తను చంపింది ఆ మనిషి యనా సరిగ్గా చూసి చెప్పండి." అని అడిగింది వసుంధర.

ఆ మాట విని తల ఎత్తి ఎదురుగా ఉన్న అభిర్ వైపు చూస్తూ "నా భర్తను చంపింది అతను కాదు ఆ మనిషి నాకు బాగా గుర్తున్నాడు." అని చెప్పింది గీత.

"మీ భర్తను చంపింది అభిర్ అని మీరు సెక్యూరిటీ అధికారి స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చారా?" అని అడిగింది వసుంధర.

"నా భర్తను చంపడం చూసి భయపడిన పిల్లల్ని తీసుకుని పరిపోయాను నేను సెక్యూరిటీ అధికారి స్టేషన్ దగ్గరికి వెళ్ళలేదు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు." అంటూ

శ్రీకర్ వైపు చూసి "ఆ ఆఫీసర్ గారు వచ్చి చెప్పే వరకు  కోర్టులో కేసు నడుస్తున్న విషయం కూడా నాకు తెలీదు." అని చెప్పింది గీత.

"మీ భర్తను చంపిన వ్యక్తి మీకు తెలుసా?" అని అడిగాడు జడ్జి.

ఆ మాట విని గీతా ఏం చెబుతుందని టెన్షన్ గా చూస్తూ ఉన్నారు జనార్దన్, హిరణ్యలు.

"నా భర్తను చంపిన వ్యక్తిని నేను చూశాను కానీ అతను ఎవరో నాకు తెలియదు చూడడం అదే మొదటిసారి!" అని చెప్పింది గీత.

ఆ మాట విని ఊపిరి పీల్చుకున్నారు హిరణ్య జనార్ధన్ లు.

"ఓకే!" అంటూ హిరణ్య వైపు చూసి "మీరేమైనా అడగాలనుకుంటే అడగండి." అని చెప్పాడు జడ్జ్.

గీత దగ్గరికి వచ్చి "మీ భర్తను చంపిన వ్యక్తి గురించి మీకు తెలీదు అని చెప్తున్నారు ఆ మనిషి అభిర్ అయి ఉండొచ్చు కదా! అతను 12 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు ఒక్కసారి బాగా చూసి చెప్పండి." అని అడిగాడు హిరణ్య.

"నా భర్తను చంపిన వ్యక్తికి సుమారు 40 సంవత్సరాలు ఉంటాయి అతని మొహం నాకు బాగా గుర్తుంది." అంటు కోపంగా చూస్తూ చెప్పింది గీత.

"సరే! మీ భర్తను మీ కళ్ళముందే అంత దారుణంగా చంపితే వాళ్ల మీద కేసు కూడా పెట్టకుండా మీరు పిల్లల్ని తీసుకుని ఎందుకు పారిపోయారు?" అని అడిగాడు హిరణ్య.

"నేను ఒక హౌస్ వైఫ్ నాకు నా భర్త, పిల్లలే నా ప్రపంచం  అటువంటిది నా కళ్ళముందే నా భర్త దారుణంగా చంపడం చూసి భయపడి పిల్లలకి ఏమీ అవ్వకూడదు అని అక్కడి నుంచి దూరంగా పారిపోయాను.

కానీ ఒక అమాయకుడికి  అన్యాయంగా శిక్ష పడుతుంది అని తెలిసి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను." అని చెప్పింది గీత.

"యువనానర్! ఎవరో ఈవిడని భయపెట్టి ఇలా చెప్పిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది." అంటూ వెళ్లి తన చైర్ లో కూర్చున్నాడు హిరణ్య.

ఆ మాటకి నవ్వుతూ మరొక పేపర్ తీసి ఇస్తూ "యువనానర్! అసలు ఈ కేసు ఫైల్ చేసింది ఎవరు హిరణ్య గారికి అప్ప చెప్పింది ఎవరో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు.

లాస్ట్ టైం వారిని అడిగితే NIA ఆఫీసర్ కదా అని పోరాడుతున్నాను అని చెప్పారు, అసలు ఆ డిపార్ట్మెంట్ వాళ్లే ఈ కేసు గురించి పట్టించుకోవడం లేదు మురళి జోషి మర్డర్ ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల జరిగింది అని వాళ్ళు అనుకుంటున్నారు.

అండమాన్ కి పంపించే లిస్టులో అభిర్ పేరు తప్పుగా యాడ్ చేశామని రిమూవ్ చేసి మళ్లీ కోర్టుకి సబ్మిట్ చేశారు మరి అసలు ఈ కేసుని వెనక ఉండి నడిపిస్తుంది ఎవరో మన లాయర్ గారు చెప్పాలి." అంటూ నవ్వుతూ హిరణ్య వైపు చూసి అడిగింది వసుంధర.

"నా దగ్గరికి వచ్చిన కేసు ఎలాంటిదైనా చివరి వరకు పోరాడమే నాకు తెలుసు అందుకే దీనిని ఎవరు ఫాలోఅప్ చేయకపోయినా నేను చూసుకుంటున్నాను చనిపోయిన  ఆఫీసర్ కి న్యాయం జరగాలి అన్నదే నా ఉద్దేశం!" అని చెప్పాడు హిరణ్య.

"ఇరుపక్షల వాదనలో వినడం అయ్యింది. ఈ కేసు పూర్వపురాలు పరిశీలించి త్వరగా మురళి జోషి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన అతని భార్య గీత హంతకుడు  అభిర్ కాదని చెప్పడంతో అతన్ని నిర్దోషిగా విడుదల చేయడం అవుతుంది.

ఈ కేసు ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తిచేసి అసలైన నేరస్తుల్ని కోర్ట్ లో ప్రవేశపెట్టాల్సిందిగా సిబిఐ వారికి తెలియజేయడమైనది." అంటూ తీర్పు ఇచ్చాడు జడ్జ్.

తీర్పు విని స్పీడ్ గా బయటికి వెళుతున్న జనార్ధన్ వెనకాలే వెళ్ళిపోయాడు హిరణ్య.

అభిర్ దగ్గరికి వచ్చి సంతోషంగా చూస్తూ "ఈ కేసు నుంచి బయటపడ్డావు ఇక ప్రశాంతంగా ఉండు." అని చెప్పింది వసుంధర.

"థాంక్స్ మేడం! మీ ఋణం కచ్చితంగా ఈ జన్మలోనే తీర్చుకుంటాను." అని చెప్పాడు అభిర్.

సంతోషంతో చప్పట్లు కొడుతున్న నీలమ్, సుమతి వైపు చూసి "అతను మీకు తెలుసా?" డౌట్ గా అడిగింది మిత్ర.

"అభిర్ నా ఫ్రెండ్! ఈ కేసు వాదించింది మా వదిన! సాక్ష్యం చెప్పింది సుమతి వాళ్ళ మదర్!" అంటూ సంతోషంగా చూస్తూ చెప్పింది నీలమ్.

'అవునా? కరెక్ట్ పర్సన్స్ ని పరిచయం చేసుకున్నాను.' అని మనసులో అనుకుంది మిత్ర.

"అక్క! నీ టీ షర్టు సుమతి అక్క టీ షర్టు సేమ్ ఉన్నాయి చూసావా?" అని చూస్తూ చెప్పాడు చాక్లెట్.

ఆ మాట విని "మీ అసిస్టెంట్ లేట్ గా కనిపెట్టిన కరెక్ట్ గా చెప్పాడు, ఇందాక నువ్వు కొట్టిన వాళ్ళు సుమతిని కిడ్నాప్ చేయడానికి వచ్చారు, ఇద్దరు సేమ్ టీ షర్ట్స్ వల్ల తను అనుకుని నీ దగ్గరికి వచ్చి తన్నులు తిన్నారు ఎనీ హౌ  తనని కాపాడినందుకు థాంక్స్!" అని చెప్పింది నీలమ్.

"నో ప్రాబ్లం! ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయ్యాము కదా! నువ్వు జర్నలిస్ట్ నేను డిటెక్టివ్ ఇద్దరికీ ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది టైం వచ్చినప్పుడు నాకు హెల్ప్  చెయ్!" అని చెప్పింది మిత్ర.

"కన్ఫామ్ గా చేస్తాను." అని వసుంధర తో పాటు వస్తున్న అభిర్ ని చూసి మిత్ర కి బాయ్ చెప్పి సుమతితో కలిసి  వెళ్ళింది నీలమ్.

అభిర్ వెనకాలే చాక్లెట్ ని తీసుకుని వెళ్ళింది మిత్ర

కోర్టు దగ్గర నుంచి  హిరణ్యతో కలిసి కారులో వెళుతూ ముఖేష్ కి కాల్ చేశాడు జనార్ధన్.
[+] 8 users Like SivaSai's post
Like Reply
#60
ఎపిసోడ్ 22


కోర్టు అభిర్ మీద ఉన్న కేసు క్లోజ్ అవ్వడంతో సంతోషంగా వసుంధర తో కలిసి బయటికి వచ్చారు అందరు.

***********************

కోర్ట్ దగ్గర నుంచి హిరణ్యతో కలిసి కారులో వెళుతూ ముకూల్ నందకి కాల్ చేశాడు జనార్ధన్.

లండన్ తన రూమ్ లో ఫోన్ రింగ్ అవడంతో చూసి 'జనార్ధన్ కాల్ చేస్తున్నాడు కోర్టులో ఏం జరిగిందో!' అనుకుంటు టెన్షన్ గా ఫోన్ లిఫ్ట్ చేసి

"జనార్ధన్ ఏమైంది?" అని కంగారుగా అడిగాడు ముకుల్ నంద.

"అయ్యా! ఆ మురళి జోషి భార్య పెదబాబు గారి గురించి కోర్టులో నోరు విప్పలేదు, కానీ చంపింది అభిర్ కాదు అని సాక్ష్యం చెప్పింది. కోర్టు అభిర్ మీద ఉన్న కేసు కొట్టేసింది." అని నెమ్మదిగా చెప్పాడు జనార్ధన్.

"ఆ మాట విని ఊపిరి పీల్చుకుని లాయర్ నీ పక్కనే ఉన్నాడా?" అని అడిగాడు ముకుల్.

"అవునయ్యా! ఇదిగో మాట్లాడుతున్నారు." అని స్పీకర్ ఆన్ చేసి హిరణ్య కి ఫోన్ ఇచ్చాడు జనార్ధన్.

ఫోన్ తీసుకుని "సారీ సార్! లాస్ట్ మూమెంట్లో మురళి జోషి భార్య వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆరోజు ఆవిడని మిచల్ చంపేశాడు అనుకున్నాను, కానీ అతను చంపింది మనం ఏర్పాటు చేసిన డమ్మీ భార్యని!" అని చెప్పాడు హిరణ్య.

"సరే! ఈ కేస్ పూర్తిగా క్లోజ్ చేసారా? ఫర్ దర్ గా మళ్ళి ఇన్వెస్టిగేషన్ ఉంటుందా?" డౌట్ గా అడిగాడు ముఖేష్.

"ఈ కేస్ కంప్లీట్ గా క్లోజ్ అవ్వలేదు సార్! ఎంక్వయిరీ చేయమని సిబిఐ వాళ్ళకి కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. అభిర్ బయటికి వచ్చేసాడు కదా అని ఆ మురళి జోషి భార్యకి ధైర్యం వస్తే ఖచ్చితంగా గోకుల్ గారి గురించి సిబిఐ వాళ్ళకి చెబుతుంది." అని చెప్పాడు హిరణ్య.

"ఈ కేసు గురించి తెలిసిన మురళీ జోషి భార్య బతికి ఉండడానికి వీల్లేదు." అని చెప్పాడు ముకుల్.

"ఓకే సర్! ఇప్పుడే మిచల్ కి ఆర్డర్స్ పంపిస్తాను." అన్నాడు హిరణ్య.

ఆ మాట విని హిరణ్య చేతిలో ఫోన్ లాక్కొని "అయ్యా! మరి అభిర్ కి కూడా తెలుసు కదా!" అని కంగారుగా అడిగాడు జనార్ధన్.

"అభిర్ కి కూడా తెలుసు కానీ వాడు నోరు విప్పడు ఆ విషయం నాకు బాగా తెలుసు! ముందు దాని సంగతి చూడండి తర్వాత వాడిని ఏం చేయాలో ఆలోచిద్దాము." అని సీరియస్ గా చెప్పి ఫోన్ పెట్టేసాడు ముకుల్.

రూమ్ బయట నుంచి ముకుల్  మాట్లాడుతుంది మొత్తం విని "తాతగారు ఏదో విషయం నా దగ్గర దాస్తున్నారు." అనుకుంది అర్ణ.

************************

అదే సమయంలో కోర్టు నుంచి బయటికి వచ్చి క్యాంటీన్లో కాఫీ తాగుతూ అభిర్ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి "కంగ్రాట్స్! కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్ హ్యాపీగా ఉండు." అని చెప్పి గీత వైపు చూస్తూ

మీరు అభిర్ ని కాపాడారు కానీ అసలు హంతకుడిని కూడా కాపాడుతున్నారు మీరు నిజం నిర్భయంగా చెబితే మీ భర్త ఆత్మకు శాంతి లభిస్తుంది." అని చెప్పాడు శ్రీకర్.

"సారీ సర్! నేను మళ్ళీ ఈ గొడవలలో తల దూర్చి నా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చాలి అనుకోవడం లేదు ఒక అమాయకుడికి శిక్ష పడకుండా చేశాను ఆ తృప్తి నాకు చాలు!" అని చెప్పింది గీత.

"మీరేమీ టెన్షన్ పడకండి ఆంటీ! సుమతీకి మా ఛానల్ లో జాబ్ కన్ఫర్మ్ చేయించాను మీరు కూడా హ్యాపీగా ఇంకా ఇక్కడే ఉండండి ప్రణతి కూడా ఇక్కడే చదువుకుంటుంది." అని చెప్పింది నీలమ్.

క్యాంటీన్ దగ్గరికి వస్తూ వసుంధర వైపు చూసి "మేడం వీళ్ళందరూ ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు త్వరగా ఇంటికి తీసుకువెళదాము." అని చెప్పాడు దయ.

"ఓకే" ఓకే!" అంటూ అభిర్ వాళ్ళ వైపు చూస్తూ "లెట్స్ గో  ఇంటికి వెళ్లి ప్రశాంతంగా మాట్లాడుకుందాము, దయ గారు చెప్పింది కూడా కరెక్టే! ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అటు వైపు పార్టీ ఓడిపోయాము అన్న కసితో ఉంటారు." అని చెప్పింది వసుంధర.

బిల్ పే చేసి కార్ తీసుకువచ్చి అభిర్, గీత, సుమతీలను తీసుకొని ఇంటికి బయలుదేరింది నీలమ్.

దయ వైపు చూస్తూ "వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు కూడా వెళ్లిపోండి కేసు క్లోజ్ అయింది కాబట్టి మాక్సిమం ప్రాబ్లం ఉండదు." అని చెప్పాడు శ్రీకర్.

"ఓకే బాయ్ సార్! ఈవినింగ్ మీట్ అవుదాము." అని చెప్పి నీలమ్ వాళ్ల కారు వెనకాలే సెక్యూరిటీగా వెళ్ళాడు దయ.

క్యాంటీన్లో పక్క టేబుల్ దగ్గర చాక్లెట్ తో కలిసి కాఫీ తాగుతూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మొత్తం విని నీలమ్ కారు వెనకలే బైక్ వేసుకుని వెళుతూ

"ఒరేయ్ చాక్లెట్!  రూట్ బాగా గుర్తుంచుకో ఆ జర్నలిస్టుతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి అప్పుడే అభిర్ కి దగ్గరవుతాము." అని చెప్పింది మిత్ర.

"ఓకే అక్క! ఈ రూట్ లో నేను చాలాసార్లు వచ్చాను." అని చూస్తూ చెప్పాడు చాక్లెట్.

**************************

కార్ లో  పక్కనే ఉన్న జనార్ధన్ వైపు చూస్తూ "కోర్టులో ఆవిడ గోకుల్ గారి పేరు చెప్పలేదు కాబట్టి మూకుల్ గారు ప్రశాంతంగా ఉన్నారు లేకపోతే నా పని అవుట్! ఎలాగైనా దాని అడ్డు తొలగించాలి." అని డ్రైవర్ వైపు చూసి "సిటీ అవుట్స్ కట్స్ లో ఉన్న ఈగల్ బార్ కి వెళ్ళు!" అని చెప్పి మిచల్ కి కాల్ చేశాడు హిరణ్య.

ఫోన్ లిఫ్ట్ చేసి "లాయర్ గారు చెప్పండి." అన్నాడు మిచల్.

"నువ్వు అర్జెంట్గా సిటీ ఔట్స్ కట్స్ లో ఉన్న ఈగల్ బార్ దగ్గరికి రా.. నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము." అని చెప్పాడు హిరణ్య.

"ఓకే సార్! 15 మినిట్స్ లో వస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు మిచల్.

జనార్ధన్ తో కలిసి బార్ లోకి వెళ్లి  డ్రింక్ ఆర్డర్ చెప్పి వాటర్ తాగుతూ "ఇంతకీ ముకుల్ సార్ కి ఆ అభిర్ కి మధ్య గొడవ ఏమిటి మీకైనా తెలుసా?" డౌట్ గా అడిగాడు హిరణ్య.

ఆ మాటకి హిరణ్య వైపు కంగారుగా చూస్తూ 'డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏ విషయం దాచకూడదు అంటారు కానీ వీడి దగ్గర ఏ విషయం కూడా చెప్పకూడదు పెద్ద వెధవ!' అని మనసులో అనుకుని

"నాకు కూడా ఆ విషయం గురించి ఏమీ తెలియదు అయ్యగారు చెప్పారు నేను చేస్తున్నాను ఏదైనా చెబితే లాయర్ కాబట్టి మీకే చెప్పాలి." అన్నాడు జనార్ధన్.

ఆ మాటకి నవ్వుతూ "నాకు చెబుతారా! ముకుల్ గారు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఆయన చెప్పాలనుకున్నది చెబుతారు ఆయన వినాలి అనుకున్నది మాత్రమే వింటారు, డబ్బు, పరిచయాలు కోసం ఈ కేసు గురించి ఒక్క ముక్క తెలియకపోయినా ఒప్పుకున్నాను." అంటూ వెయిటర్ డ్రింక్ తీసుకురావడంతో తీసుకుని సిప్ చేస్తూ చెప్పాడు హిరణ్య.

"మా అయ్యగారి వల్ల మీరు కూడా బానే బాగుపడ్డట్లు ఉన్నారు కదా! మళ్లీ వివరాలు ఎందుకు అలాగే కంటిన్యూ అవ్వండి అదే మంచిది." అని చెపుతూ బార్ లోపలికి వస్తున్న మిచల్ వైపు చూసి చెయ్యి పైకి ఎత్తాడు జనార్ధన్.

ఇద్దరూ ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటూ వెయిటర్ వైపు చూసి "టు పెగ్స్ విస్కీ!" అని ఆర్డర్ చెప్పి హిరణ్య వైపు చూస్తూ "చెప్పండి అర్జెంటుగా రమ్మన్నారు?"  అని అడిగాడు మిచల్.

"అసలు నీ మనుషులు ఆ మురళి జోషి కూతుర్ని ఎందుకు పట్టుకోలేకపోయారు?" డౌట్ గా అడిగాడు జనార్ధన్.

"కోర్టు క్యాంటీన్ లో గొడవ జరిగేసరికి నా మనుషులు ఇద్దరిని సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకెళ్లారు, లాయర్ గారు కోర్టు దగ్గర ఎక్కువ హడావిడి చేయొద్దు అన్నారు అందుకే నేను తక్కువ మనుషులే పంపించాను." అన్నాడు మిచల్.

"సరే! జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఆ మురళి జోషి భార్య బతికి ఉండడానికి వీల్లేదు పైనుంచి పెద్దాయన ఆర్డర్! అది ఎలా చావాలి అంటే మర్డర్ అని ఎవరికి అనుమానం రాకూడదు అంత జాగ్రత్తగా పని అయిపోవాలి లేట్ కూడా చేయకూడదు." అన్నాడు హిరణ్య.

వెయిటర్ తీసుకువచ్చిన మందు తాగుతూ "వాళ్ళు కేసు గెలిచిన సంబరాలలో ఉంటారు కదా కచ్చితంగా బయటికి వస్తారు, అందరూ తిరిగి ఇంటికి వెళతారు కానీ మురళి జోషి పెళ్ళం మాత్రం తిరిగి ఇంటికి వెళ్ళదు, ఒకవేళ తిరిగి వెళితే మళ్ళీ నా మొహం మీకు చూపించను." అన్నాడు మిచల్.

"హ.. నువ్వు చేయగలవు మిచల్! నీ మీద ఆ నమ్మకం ఉంది కాబట్టే ఏ పనైనా నీకే అప్పచెపుతున్నాను, కానీ ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదు." అన్నాడు హిరణ్య.

"ఈసారి మీ ప్లాన్ కాదు నా ప్లాన్ ప్రకారం వెళ్తాను చూస్తూ ఉండండి త్వరలోనే మీకు కబురు అందుతుంది." అంటూ గడగడ రెండు పెగ్గులు తాగి అక్కడ నుంచి వెళ్లిపోయాడు మిచల్.

************************

అభిర్ ఉండే వసుంధర ఇంటిని చూసి అక్కడ నుంచి ముఖేష్ ని కలవడానికి స్టేషన్ కి బయలుదేరి సాయంత్రానికి చేరుకొని బేకరీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది మిత్ర.

స్టేషన్ లోపలికి వెళ్లి ముఖేష్ కి కనిపించడు చాక్లెట్.

డస్క్ లో ఉన్న పేపర్స్ తీసుకుని పక్కనే ఉన్న ఆఫీసర్ వైపు చూసి "నేను వెళ్లి టీ తాగి వస్తాను." అంటూ చాక్లెట్ వెనకాలే బేకరీ దగ్గరికి వచ్చాడు ముఖేష్.

చాక్లెట్ తో పాటు వచ్చిన ముఖేష్ ని చూసి "ఆ ఇద్దరు ఏమంటున్నారు? ఎవరి మనుషులో తెలిసిందా?" అని అడిగింది మిత్ర.

ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుంటూ సమోసా ఆర్డర్ చెప్పి "ఆ ఇద్దరు మిచల్ గ్యాంగ్ మనుషులు బీహార్ నుంచి వచ్చారు, నీ మీద ఎందుకు ఎటాక్ చేశారో తెలియలేదు.
వాళ్ళని అడుగుదాము అనుకునే లోపు డి ఎస్ పి గారు ఫోన్ చేసి వదిలి పెట్టమన్నారు తప్పలేదు." అంటూ పేపర్స్ ఇస్తూ "నువ్వు అడిగిన డీటెయిల్స్!" అని చెప్పాడు ముకేశ్.

పేపర్స్ తీసుకుంటూ "మిచల్ గ్యాంగ్ మనుషుల?" అని ఆలోచిస్తూ పేపర్స్ చూసి 'నిరంజన్ అసిస్టెంట్ పాఠక్! ఇప్పుడు వీడు వున్నాడో పోయాడో తెలుసుకోవాలి.' అనుకుంది మిత్ర.
[+] 11 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: