Posts: 319
Threads: 8
Likes Received: 2,507 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
277
01-01-2026, 09:04 PM
(This post was last modified: 01-01-2026, 09:05 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 21
మీరెవరో నాకు తెలియదు కదా అవిని గురించి ఎలా చెబుతాను అని లెక్చరర్ అడుగుతారు. నేను అవిని ఫాదర్ని అని ఇబ్బందిగా చెబుతారు.
వాట్ అని అడుగుతుంది. అవును మేడమ్ అంటే మీకు అవని ఉందన్న విషయం ఇప్పటివరకు తెలియదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది.
ఇంచుమించు అలాంటిదే మేడం అని... అవిని గురించి చెబుతారా అని అడుగుతాడు. ఏమని చెప్పమంటారు సర్..
బంగారం అవని పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఫీజులు తనే కట్టుకునేది. ఎవరో తెలిసిన వాళ్ళు ఇంట్లో షెల్టర్ ఇచ్చారు. అక్కడే ఉంటున్నాను అని చెప్పేది.
తన దగ్గర మనీ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ క్యాంటీన్లో భోజనం చేసేది . మనీ సరిపోవడం లేదు అంటే ఆ టాప్ దగ్గరికి వెళ్లి వాటర్ తాగేది అని చాలా బాధగా చెబుతారు.
ఆ మాటలకి ధనుంజయ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. నేను ఇన్ని కోట్లు సంపాదించి ఇంత పరపతి సంపాదించిన నా కూతురు ఆకలికి అల్లాడిపోయిందా అని బాధతో విలవిలలాడుతాడు.
అవిని మెరిట్ స్టూడెంట్ కదా! స్కాలర్షిప్ కూడా వచ్చేది. స్కాలర్షిప్ మీదే చదువు కంటిన్యూ చేస్తూ తను చేసే పార్ట్ టైం జాబ్ మీద వచ్చే మనీతో మిగిలిన అవసరాలు చూసుకునేది.
ఒక్కొక్కసారి ఏదైనా ఎగ్జామ్స్ ఫీజు కట్టాల్సి వస్తే తనకి కష్టం అయ్యేది. అప్పుడు వాటర్ తోనే ఉండేది. నేను లంచ్ తెచ్చేస్తాను అన్నా సరే ఒప్పుకునేది కాదు.
ఒకసారి గట్టిగానే అడిగాను. ఫుడ్ తినటానికి ఏంటి నీకు ఇబ్బంది అని దానికి చిన్న నవ్వుతో ఇది ఒకరోజు ప్రాబ్లం కాదు కదా మేడం.
నేను నా కాళ్ళ మీద నిలబడే వరకు ఉంటుంది. ఈరోజు మీరు పెట్టారు అని రేపు ఇంకొకల కోసం నేను ఎదురు చూడలేను కదా నన్ను ఇలాగే ఉండనివ్వండి మేడం అని చెప్పింది.
అంతా ఆత్మ అభిమానం గల పిల్ల అని గర్వంగా చెబుతారు. ఆ లెక్చరర్ మాటలకి ధనుంజయ్ కి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాకుండా అయిపోతుంది.
నేను కళ్ళున్న గుడ్డివాడిని అయిపోయాను. ఎప్పుడూ అవని కనిపించకపోతే రూమ్ లో చదువుకుంటుంది అని అనుకున్నాను కానీ... నాకు ఇంత దూరం అయిపోతుందని అనుకోలేదు.
ఇంత జరుగుతున్న నాన్నగాని అమ్మగాని నాకు ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. భార్గవి ఫీజులు కడుతున్నాను అని చెప్పింది.
ఎవరికి కడుతుంది. నాకెందుకు అలా అబద్దం చెప్పింది అని ఆలోచిస్తూ థాంక్యూ మేడం మీకు ఎప్పుడు ఏం హెల్ప్ కావాల్సి వచ్చినా నాకు కాల్ చేయండి అని విసిటింగ్ కార్డు ఇస్తాడు.
మళ్ళీ వెంటనే ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి చెక్ ఇస్తాడు..ఈ కాలేజ్ డెవలప్మెంట్ కి అలాగే చదువు కోసం ఇబ్బంది పడుతున్న పూర్ స్టూడెంట్స్ కి కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేయండి.
ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. అది ఏ టైం అయినా సరే వెంటనే నాకు కాల్ చేయండి. స్టూడెంట్స్ ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవాలి అనుకుంటే నా కంపెనీకి పంపించండి.
ప్రిన్సిపల్ ఆ చెక్ చూసి ఇంత అమౌంట్ అని ఆశ్చర్యంగా అడుగుతారు. నా కూతుర్ని ఇన్ని రోజులు మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.
ఎంత ఇచ్చిన తక్కువే సార్ అని నమస్కారం చేసి బయటికి చాలా భారంగా అడుగులు వేస్తాడు. కారు దగ్గరికి వచ్చి డ్రైవర్ ని కూడా వెళ్ళిపోమని కారు తీసుకుని ఎటు వెళ్తున్నాడో తెలియకుండా అలా ఒంటరిగా ప్రయాణం సాగిస్తాడు.
చాలా దూరం వెళ్ళాక ఒక లోన్లీ ప్లేస్ లో కార్ ఆపి కళ్ళు మూసుకుంటాడు. ఆ కనురెప్పల వెనకాల రజిత కన్నీటి రూపం కనబడుతుంది.
ఇదేనా మీరు మన కూతురిని చూసుకునే విధానం. మీకు అది ఇష్టం లేకపోతే ఏ అనాధ శరణాలయంలో పెట్టిన గుప్పెడు మెతుకులు తినేది కదా అని అడుగుతుంది.
వెంటనే రజిత అని గట్టిగా అరుస్తూ కళ్ళు తెరుస్తాడు. రజిత చెప్పింది అంతే నిజమే కదా! అనాధ శరణాలయంలో ఉన్న కడుపుకింత తిండి తినేది.
ఎన్ని కోట్ల కి అధిపతి అయిన తండ్రి ఉన్న సరే నా కూతురు ఆకలికి అలమట్టించింది. నా ఎదురుగుండా నా కూతురు ఆకలితో అలమటిస్తూ ఉంటే...
నేను పంచభక్ష పరమాన్నాలు తిన్నాను ఇన్నాళ్లు అని చాలా బాధగా మూసుకుని ఎక్కెక్కి ఏడుస్తాడు. చాలాసేపు అలా ఉన్నా తర్వాత ధనుంజయ్ కి ఫోన్ వస్తుంది.
కళ్ళు తుడుచుకుని ఎవరు అని చూస్తే ఆఫీస్ నుంచి వస్తూ ఉంటుంది. ఫోన్ ఎత్తి గంభీరంగా చెప్పండి అనగానే...
సార్ ఈవినింగ్ మీటింగ్ ఉంది అని చెబుతారు. ఈరోజు ఏం ప్రోగ్రామ్స్ ఉన్న క్యాన్సిల్ చేసేయండి. నాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదు. అలాగే ఈరోజు అసలు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
ఇంకా నేను అవిని గురించి చాలా తెలుసుకోవాలి. ఆరోజు ఉదయ్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఎంతో తెలుసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి కారు ఇంటికి పోనిస్తాడు.
భార్గవిని పిలిచి శిల్ప సంసారం బాగుండాలి అని గుడిలో పూజలు చేయి నేను నీతో ఒద్దును గాని కొంచెం అలసటగా ఉంది.
సాయంత్రం అభిషేకం చేయించు అని చెప్పి బలవంతంగా భార్గవిని గుడికి పంపిస్తాడు. భార్గవి కి తోడుగా భార్గవి అన్నయ్య, వదినని కూడా పంపించేస్తాడు.
ఉదయ్ చెప్పిన రోజున ఉన్న ముగ్గురు సర్వెంట్స్ ని పిలిచి ఆ రోజు ఏం జరిగింది అని గట్టిగా అడుగుతాడు.
సార్ అని ముగ్గురు నీళ్ల నమ్ముతూ ఉంటే నాకు నిజం మాత్రమే చెప్పండి మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇది నా కూతురు జీవితానికి సంబంధించింది అని బ్రతిమాలినట్టుగా అడుగుతాడు.
ఆ మాటకి సత్యవతి, శేషగిరి గారు మౌనంగా ఉంటారు. సర్వెంట్స్ ముగ్గురు ఆశ్చర్యంగా ధనుంజయ్ వంక చూస్తారు.
ఎందుకు మీరు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అంటే..
ఫస్ట్ టైం మీరు అవనమ్మ గురించి అడుగుతున్నారు. పైగా కూతురు అంటే ఆశ్చర్యం వేసింది అని భయంగా చెబుతారు.
ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది... అవిని నా కూతురే కదా! అని అనుమానంగా వాళ్ళ వంక చూస్తూ మీరు ఎందుకు అంతా ఆశ్చర్యంగా అడుగుతున్నారు అని సర్వెంట్స్ ని అడుగుతాడు.
వాళ్లు భయంగా చూస్తూ ఉంటే పరవాలేదు చెప్పండి ఇక్కడ ఎవరూ లేరు అంటే.. భార్గవమ్మ గారు ఎక్కడ అవని పాపని మీ కూతురు అని చెప్పడానికి వీలు లేదు అని మాకు అందరికీ గట్టిగా చెప్పారు అని చెబుతారు ..
ఆ మాటకి ధనుంజయ్ ప్రాణం లేని బొమ్మలాగా ఉండిపోతాడు. తన తల్లి వంక చూస్తాడు.
తల్లిదండ్రులు ఇద్దరు మౌనంగా చాలా కష్టంగా ఏడుపును ఆపుకుంటూ కనిపిస్తారు. వెంటనే తనకి తాను సర్దుకుని ఆరోజు ఏం జరిగింది అది మాత్రం ఎక్కడా మిస్ చేయకుండా చెప్పండి అని రిక్వెస్టింగ్ గా అడుగుతాడు.
ఆ ఉదయ్ బాబు అసలు మంచివాడు కాదు. ఎప్పుడూ అవని అమ్మ వెనకాల పడుతూనే ఉంటాడు. చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ అమ్మాయి గారిని తాకాలని ప్రయత్నించేవాడు.
ఎప్పటికప్పుడు అమ్మాయిగారు తప్పించుకుంటూ ఉండేవారు. తన బాధ ఇది అని చెప్పుకోవడానికి కన్నతల్లి లేదు కదా బాబు.
పెద్దవాళ్ళకే చెబితే వాళ్ళు ఇంకా బాధపడతారని లోలోపలే ఏడ్చేది. తండ్రిగా మీరు చేర తీయలేదు ఇంకా ఎవరికి చెప్పుకుంటారు బాబు గారు అని సర్వెంట్స్ లో ఉన్న ఒక పెద్ద ఆవిడ కళ్ళు ఒత్తుకుంటుంది
ఆ రోజైతే ఉదయ్ బాబు ఇంకా రెచ్చిపోయాడు. మీరెవరు ఇంట్లో లేరు అవని పాప ఎందుకు బాధ పడుతుందో మాకు తెలియదు.
గదిలోనే ఉన్నారు. ఆరోజు జరిగింది కళ్ళకు కట్టినట్టుగా చెబుతూ ఉంటుంది.
అవని రూమ్ ముందు నుంచిని ఉదయ్ వెళ్లి తలుపు కొడతాడు. ఎంత కొట్టినా అవని తలుపు తీయదు. ఏ అవని మర్యాదగా తలుపు తీస్తావా లేదా తలుపు పగలగొట్టమంటావా అని గట్టిగా అరుస్తాడు.
ఇంట్లో ఎవరూ లేరా ఏమిటి వీడు ఇలా అరుస్తున్నాడు అని ఇంకా టెన్షన్ తో గదిలో ఒక మూలకు వెళ్లిపోయి కూర్చుంటుంది.
బయట ఉన్న ఉదయ్ కి చెర్రెత్తుకువచ్చి తన దగ్గర ఉన్న డూప్లికేట్ కి తో డోర్ తీరుస్తాడు. అవని ఎక్కడున్నావ్ మర్యాదగా బయటికి రా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు.
నోటి మీద చెయ్యి వేసుకుని ఊపిరి బిగబట్టి బిక్కుబిక్కు మంటూ ఒక మూల కూర్చుని ఉంటుంది. చుట్టూ చూసుకుంటూ అవిని దగ్గర వచ్చి ఏంటి అవిని...
నువ్వు నా నుంచి తప్పించుకుందామనేనా నీకు అంత సీను ఉంది అనుకుంటున్నావా...
ఇక్కడ మనదే రాజ్యం. నీ మాట వినేవాళ్ళు కానీ నీ ఏడుపును పట్టించుకునే వాళ్ళు గాని ఎవరూ లేరు.
ఎప్పటి నుంచో నీ మీద నాకు కోరుక ఉంది. నిన్ను ఒక్కసారే వాడుకుని వదిలేస్తాను అని అనుకున్నావా...
నీకు ఎప్పుడు సుఖం కావలసి వచ్చిన నేను వస్తాను అని నోటితో చెప్పలేని మాటలు చాలా అసభ్యంగా మాట్లాడతాడు.
దానికి అవిని కి కోపం వచ్చి లాగిపెట్టి ఒకటి పీకుతుంది. ఏమిటే నువ్వు నన్ను కొట్టే దానివయ్యవా అని చెప్పి తలను తీసుకెళ్లి గోడకేసి కొడతాడు.
నొప్పితో అమ్మ అనే అరుస్తుంది. నీకు అమ్మే లేదు కదా అమ్మా అని అరుస్తావెందుకు పోనీ నాన్న అని అరుస్తావా అసలు మీ నాన్నకి నువ్వు అవసరం లేదు కదా అని అవిని మనసు గాయపడేలాగా మాట్లాడుతాడు.
ఇంకా మీదకి వస్తూ ఉంటే ఇంకా ఏం చేయాలో తెలియక అక్కడ తన చేతికి దొరికిన ఫ్లవర్ వస్ ని తీసుకొని గట్టిగా కొట్టి చిన్న బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది.
ఒక పేపర్ లో ఏదో గబగబా రాసి వెంటనే పట్టుకెళ్ళి వాళ్ళ నానమ్మరూంలో పెట్టేసి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది.
ఇది బాబు జరిగింది అని ఆ పెద్దావిడ చెబుతుంది. ఆ మాటలు విన్న ధనుంజయ్ ప్రాణం లేని బొమ్మ అవుతాడు.
ఎప్పుడైతే పనివాళ్ళు చెప్పడం మొదలుపెట్టారో అప్పుడే శేషగిరి గారు విక్రమ్ కి ఫోన్లో అంతా వినిపిస్తూ ఉంటారు.
ఆ మాటలు విన్న విక్రమ్ నరసింహ అవతారమే ఎత్తుతాడు. కోపంతో కళ్ళు ఎర్రబడిపోతాయి.
తన కోపాన్ని ఎలా చూపించాలో తెలియక తన పిడికిలి బిగించి గ్లాస్ టేబుల్ ని గట్టిగా కొడతాడు.
అది బళ్ళున పగిలి చెల్లాచెదురుగా పడుతుంది.
The following 15 users Like SivaSai's post:15 users Like SivaSai's post
• aarya, Arjun0410, ash.enigma, bsln1, Chchandu, coolguy, Gurrala Rakesh, karan986, Nivas348, Pardhu7_secret, Sachin@10, shekhadu, Sunny73, The Prince, yekalavyass
Posts: 319
Threads: 8
Likes Received: 2,507 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
277
01-01-2026, 09:06 PM
(This post was last modified: 01-01-2026, 09:14 PM by SivaSai. Edited 2 times in total. Edited 2 times in total.)
Part- 22
ధనుంజయ్ ప్రాణం లేని బొమ్మలాగా నిలబడి పోతూ మాట కష్టంగా కూడతీసుకొని మరి... అవని భోజనం అని అడుగుతాడు.
దానికి సర్వెంట్స్ ఆశ్చర్యంగా ధనుంజయ వంక చూస్తూ మీరే కదా సార్ ఏదో ఒక పూట తినాలి అని గట్టిగా చెప్పారు అని అంటారు.
నేనెప్పుడూ చెప్పాను అని ఆశ్చర్యంగా అడిగితే.. అవినిపాప ఇంటర్ అయిన తర్వాత ఒక రోజు మీరే కదా అన్నారు అని గుర్తు చేస్తారు.
నేను ఎప్పుడూ అలా చెప్పాను అని ధనుంజయ్ అనుకుంటూ ఆలోచిస్తాడు. ఒకరోజు భార్గవి తన దగ్గరకు వచ్చి అవని సరిగ్గా ఫుడ్ తినడం లేదు. ప్రోటీన్ ఫుడ్ తీసుకోమని నేను గట్టిగా చెబుతున్న నా మాట వినడం లేదు. మీరైనా చెప్పండి అని బ్రతిమాలినట్టుగా చెబుతుంది.
అప్పుడు ధనుంజయ్ ఏదైనా ఒక పూట ఖచ్చితంగా తినాలి అని చెబుతాడు. ఆ మాటలు అందరూ వింటారు.
కానీ భార్గవి ధాన్ని వేరే విధంగా కన్వే చేస్తుంది. నా కూతురికి నా నోటితోనే ఒక పూట తిను అనేటట్టుగా చెప్పించారా అని కుమిలిపోతాడు.
ఇంకా అనుమానంగా బ్రేక్ ఫాస్ట్ అయినా పూర్తిగా తింటుందా అంటే... సర్వెంట్స్ లో ఉన్న పెద్ద ఆవిడ కళ్ళు ఒత్తుకుంటూ ఎక్కడ సార్..
ఇడ్లీ అయితే రెండు ఇడ్లీలు మాత్రమే తినాలి. అదే దోస లాంటివైతే ఒక దోస మాత్రమే తినాలి. రైస్ ఐటమ్ లాగా చేస్తే అది కూడా కొలత ప్రకారమే తినాలి అని చెబుతుంది.
ఇవన్నీ కూడా నేనే చెప్పాను అన్నట్టుగా ఉందా అని అడుగుతాడు.అవును అని తల ఊపుతారు. భగవంతుడా అసలు ఏం జరుగుతుంది అని కళ్ళు మూసుకుని సర్వెంట్స్ ని వెళ్ళమని చేతితో సైగ చేస్తాడు.
ఇదంతా ఫోన్లో విన్న విక్రమ్ అవిని ని తలుచుకుని చాలా బాధపడతాడు. ఎంత ఐశ్వర్యం ఉన్న ఇంట్లో పుట్టిన నువ్వు ఇంత ఆకలికి అలమటించి పోయావా..
నీ బాధ షేర్ చేసుకోవడానికి కూడా ఇంట్లో ఎవరూ లేకుండా అయిపోయారా.. అందుకేనా మన పెళ్లి రోజు నువ్వు నాకు చెప్పాలి అనుకున్న చెప్పలేకపోయావు అని కళ్ళు మూసుకుంటాడు.
ఒక ఐదు నిమిషాలు ఆగి కోపంతో కళ్ళు తెరిచి ఆ ఉదయ్ గాడు ఎక్కడున్నా సరే వాడికి నేను చుక్కలు కాదు నరకం స్పెల్లింగ్ రాయిస్తాను.
ముందు నాతో ఎవరి పెళ్లి జరిగిందా అనే ఆ ధనుంజయ్ తెలుసుకొనేటట్టు చేస్తాను. నీ కూతురు నిన్ను యాక్సెప్ట్ చేస్తేనే నిన్ను నేను రిలేషన్ తో పిలుస్తాను లేకపోతే ఎప్పటికీ నిన్ను ధనుంజయ అని మాత్రమే పిలుస్తాను మిస్టర్ అనుకుంటాడు.
వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఇందిరా గారితో ఈ విషయాలన్నీ చెబుతాడు. భగవంతుడు ఆడపిల్లగా పుట్టినందుకు ఇన్ని కష్టాలు పడిందా ...
తొందరగా తీసుకొచ్చేయ్ విక్రమ్ మనం చాలా జాగ్రత్తగా చూసుకుందాము అని చెబుతారు. నేను ఎలాగు తీసుకొస్తాను కానీ.. ఆ శిల్పకు కూడా ఏదో ఒక పూట మాత్రమే పెట్టండి నాన్నమ్మ.
ఆకలి బాధ కూడా తనకి తెలియాలి కదా! తన బాధ వాళ్ల అమ్మ కి అర్థం అవ్వాలి కదా అని ఫోన్ పెట్టేస్తాడు.
ధనుంజయ్ వాళ్ళ అమ్మ వంక చూస్తూ నేను నిజంగా అవిని నీ నేను ఒక పూట మాత్రమే తినాలి అని చెప్పలేదు అమ్మ అని ఎక్స్ప్లనేషన్ ఇవ్వబోతుంటే..
వద్దురా ఇంక నువ్వు చెప్పకు. విని తట్టుకునే శక్తి మాకు లేదు. ఆరోజు మా అందరి ముందే అన్నావు కదరా ఇంకా ఏం చెబుతున్నావ్ నువ్వు.
బయటైనా భోం చెయ్యి మని మేము డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోలేదు రా నా మనవరాలు. నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను తాతయ్య ఆ మనీతో నేను నా అవసరాలు చూసుకోగలను. మీరు ఇబ్బంది పడకండి అని చెప్పేది.
మాకు తెలిసినంతవరకు తన ఇబ్బంది మాత్రమే పడింది అనుకున్నాము. కానీ నీ భార్య మేనల్లుడు అఘాయిత్యం చేసిన సరే వాడిని నమ్మవు గాని నా మనవరాలు నమ్మలేదు నువ్వు.
ఇప్పటికైనా అర్థమైందా నా మనవరాలు ఏ బాయ్ ఫ్రెండ్ తోనే వెళ్లిపోలేదు అని కొడుకు వంక చిత్కారంగా చూస్తారు.
నాన్న అని చాలా బాధగా పిలుస్తాడు. వద్దురా నువ్వు అలా పిలవకు. అలా పిలుస్తుంటే నా మీద నాకే కంపరంగా ఉంది.
చిన్న భార్య మోజులో పడి పెద్ద భార్య కూతుర్ని నెగ్లెట్ చేశావు. నేను చెబుతున్నాను విను ఎక్కడ కూడా నువ్వు అవని కి తండ్రివని మాత్రం చెప్పుకోకు.
అలా చెప్పకుంటే నువ్వు రజిత కి అన్యాయం చేసినట్టే. పద సత్య అని రూంలోకి వెళుతూ వియ్యంకుల వారు మనకు ఒక మాట చెప్పారు.
పెళ్లిలో ఏదో దోషం జరిగింది అని.. ఆ దోషం కూడా నువ్వే స్వయంగా తెలుసుకో..నీ ముద్దుల భార్య సహాయం లేకుండా అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతారు.
ఆస్తమాను తల్లిదండ్రులు ఇద్దరూ ముద్దుల భార్య అని భార్గవి గురించి చెప్పి, రజిత అని చెబుతుంటే వేరు చేసినట్టుగా ఉంటుంది.
ఆ మాటలకి ధనుంజయ్ కి చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజమే కదా అవని విషయంలో అదే చేశాను కదా భగవంతుడ నేను చేసిన దానికి ప్రాయశ్చిత్తం ఉందా!
నాన్న అన్నట్టు నేనే అవిని కి తండ్రి ని అని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఇదంతా చేసిన భార్గవిని మాత్రం క్షమించలేను.
అవని నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటానని అని మాయమాటలు చెప్పే కథ నా జీవితంలోకి వచ్చింది.
అయినా భార్గవిని అనుకోవడంలో తప్పేముంది తప్పంతా నా దగ్గరే ఉంది నేనే నా కూతుర్ని పట్టించుకోకపోతే...
సవతి తల్లి ఎలా పట్టించుకుంటుంది. ముందు ఇంట్లో నుంచి భార్గవి అన్నయ్యని, వదిన ని బయటకు గెంటాలి.
నా కూతురు మీద చెయ్యి వేసినా ఉదయ్ గాడిని మక్కేలు ఇరగదీయాలి. వాడి నోటితోనే నిజం చెప్పేస్తాను.
నీ కాళ్లు పట్టుకుని క్షమించు అని అడిగినా... నా కన్నీళ్ళతో నీ పాదాలకి అభిషేకం చేసిన నా తప్పుకి ప్రాయశ్చిత్తం ఉండదేమో అనుకుంటూ..
అవని గదికి వెళ్లి చూస్తాడు. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. ఆ మంచం కూడా నాశరకం మంచమే. షెల్ఫ్ ఓపెన్ చేసి బట్టలు చూస్తాడు
అవి చూస్తుంటేనే అర్థం అయిపోతున్నాయి. అవిని తన డబ్బులతోనే కొనుక్కుంది అని. రూమ్ డోర్ క్లోజ్ చేసి అడుగులు పడుతున్నాయా అన్నట్టుగా భారంగా నడుస్తూ ముందుకు వెళతాడు.
ఈసారి శిల్ప గదిలోకి వెళ్లి చూస్తాడు. శిల్ప గది అంతా చాలా లగ్జరీయర్స్ గా ఉంటుంది . బయటికి రావాల్సిన అవసరం లేకుండా అన్ని వసతులు అక్కడే ఉన్నాయి.
బట్టలు షెల్ఫ్ ఓపెన్ చేసి చూస్తాడు. అవిని దగ్గర ఉన్నా డ్రెస్సులు మొత్తం కాస్ట్ కలిపిన శిల్పది ఒక డ్రెస్ కూడా రాదు .
శిల్ప రూమ్ నుంచి అలాగే ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంటాడు. అక్కడ నవ్వుతూ ఉన్న రజిత ఫోటో కనిపిస్తుంది.
ఎప్పుడు ఏ పని మొదలు పెడుతున్న రజిత ఫోటోకి కిస్ చేసి గాని మొదలుపెట్టాడు. అలాంటిది మొదటిసారి రజిత ఫోటో వైపు సూటిగా చూడలేకపోతున్నాడు .
రజిత ఫోటో వైపు చూస్తుంటే నా కూతుర్ని ఇంత క్షోభ పెడుతున్నావా అది పుట్టకే కదా నీకు ఇంత కలిసి వచ్చింది అని అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది.
ఆ బాధ తట్టుకోలేక రజిత ఫోటో దగ్గరే కుప్పకూలిపోతాడు. నన్ను క్షమించు రజిత నాకు తెలియకుండా చాలా పెద్ద తప్పే జరిగిపోయింది.
తప్పు అనడం కన్నా సరిదిద్దుకోలేని మహా పాపం జరిగింది. దీనికి కొంతలో కొంతైనా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని వెంటనే లాయర్ కి ఫోన్ చేస్తాడు.
నేను చెప్పినట్టుగా వీలునామా ప్రిపేర్ చేయించండి అని మొత్తం చెబుతాడు. లాయర్ కూడా ఆశ్చర్యంగా సార్ మిమ్మల్ని ఒకటి అడగనా అని ఇబ్బందిగా మాట్లాడుతాడు.
అడగండి లాయర్ అనగానే.. మీకు ఇద్దరమ్మాయిలా అని అడుగుతాడు. విరక్తిగా నవ్వుకుంటూ అవును లాయర్.
భార్గవి నా రెండో భార్య. రజిత నా మొదటి భార్య. రజిత కూతురే అవని. రజిత చనిపోయిన తర్వాతే భార్గవి నా రెండో భార్య గా నా ఇంట్లోకి వచ్చింది.
ఈసారి జరిగే కంపెనీ యానివర్సరీలో ఈ విషయం చాలా క్లియర్ గా అనౌన్స్మెంట్ జరగాలి. అలాగే ఫ్యామిలీ ఫొటోస్ మొత్తం రావాలి. ఆ విషయాలన్నీ చూడండి అని చెబుతాడు. ఓకే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు.
అప్పుడు ధనుంజయ్ కి కొద్దిగా రిలీఫ్ గా అనిపిస్తుంది. ఆఫీస్ రూమ్ నుంచి బయటికి వచ్చేటప్పటికి భార్గవి గుడి నుంచి వస్తుంది.
భార్గవి తో పాటు వాళ్ళ అన్నయ్య, వదిన కూడా ఉంటారు ధనుంజయ్ రమేష్ వంక చూస్తూ ఉంటాడు. ఉదయ్ అఘాయిత్యం చేసిన రోజు అవని మీద నిందలు వేస్తూ కొడుకుని హత్తుకుంటున్నా దృశ్యం కనబడుతుంది.
అంటే ఈ పాపంలో వీళ్ళిద్దరికీ కూడా వాటా ఉంది. భార్గవికి ఎంత వాటా ఉందో తెలుసుకోవాలి అని సీరియస్ గా చూస్తాడు .
ఏంటి బావగారు అలా చూస్తున్నారు అని రమేష్ అడిగితే మీరు ఇంకా ఎన్నాళ్ళు మా ఇంట్లో ఉంటారా అని చూస్తున్నాను అని చెబుతాడు.
ఆ మాటలకి ముగ్గురు షాక్ అవుతారు. ఏంటండీ అన్నయ్యతో అలా మాట్లాడుతున్నారు అంటే.. నేనేమి తప్పు మాట్లాడాను భార్గవి.
ఎవరైనా చెల్లింట్లో ఇన్ని రోజులు ఉంటారా! ఏదో ఉదయ్ చిన్నప్పుడు చుట్టం చూపుగా వచ్చారు. అప్పుడు నుంచి ఇక్కడే తిష్ట వేసుకుని ఉన్నారు.
రమేష్ ఆ మాటలకు ఎంతో బాధపడిపోతూ మేము ఏమీ కావాలనే ఉండలేదు బావగారు. చెల్లికి తోడుగా ఉందామని వచ్చాము.
ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతోంది కదా అని ఉండిపోయాము.. అంతేగాని మాకు ఇల్లు లేదా ఆస్తులు లేవా అని అంటాడు.
నేను అదే చెబుతున్నాను రమేష్. ఇప్పుడు మీ చెల్లికి ఎటువంటి బాధ్యతలు లేవు. ఖాళీ అయిపోయింది కదా!
ఇంక మీ చెల్లికి తోడు ఉండాల్సిన అవసరం ఏముంది. మీ ఇల్లు ఆస్తులు ఎన్ని రోజులను వదిలేసుకుని ఇక్కడ ఉంటారు అందుకనే రేపొద్దున్నే బయలుదేరి మీ ఊరు వెళ్లిపోండి సరేనా ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి అని చెప్తాడు.
ఆ మాటలకి ముగ్గురు బొమ్మలు లాగా నిలబడిపోతారు. ముందుగా తేరుకున్న భార్గవి వదిన ఏంటి భార్గవి మీ ఆయన అలా అంటున్నాడు.
ఇన్ని రోజుల మేమెక్కడున్నందుకు మేము ఎంత నష్టపోయి ఉంటామో దానికి ప్రతిఫలము ఇదా అని అడుగుతుంది.
దానికి భార్గవి సమాధానం ఏమిటి ??
కథ కొనసాగుతుంది ....
ప్లీజ్ గివ్ మీ రేటింగ్స్
The following 26 users Like SivaSai's post:26 users Like SivaSai's post
• aarya, ABC24, Arjun0410, ash.enigma, Bhavabhuthi, bsln1, Chchandu, coolguy, gora, Gurrala Rakesh, Jola, k3vv3, karan986, KAVI9, Koolguy2024, Luckky123@, Nivas348, Pardhu7_secret, Raju1987, Sachin@10, shekhadu, Sunny73, swapnika, The Prince, vikas123, yekalavyass
Posts: 2
Threads: 0
Likes Received: 2 in 2 posts
Likes Given: 1
Joined: Dec 2023
Reputation:
0
Great going daily update please
Posts: 4,458
Threads: 9
Likes Received: 2,832 in 2,177 posts
Likes Given: 10,441
Joined: Sep 2019
Reputation:
30
•
Posts: 430
Threads: 0
Likes Received: 174 in 153 posts
Likes Given: 20
Joined: Dec 2018
Reputation:
0
•
Posts: 40
Threads: 0
Likes Received: 11 in 10 posts
Likes Given: 3
Joined: Jun 2019
Reputation:
2
(01-01-2026, 09:06 PM)SivaSai Wrote: Part- 22

Excellent story.. waiting for next update..please continue
•
Posts: 4
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 7
Joined: Sep 2021
Reputation:
0
02-01-2026, 01:14 PM
(This post was last modified: 03-01-2026, 08:08 AM by ramanasv. Edited 2 times in total. Edited 2 times in total.)
[quote pid='6111934' dateline='1767329421']
Excellent story .. please continue
[/quote]
•
Posts: 430
Threads: 0
Likes Received: 174 in 153 posts
Likes Given: 20
Joined: Dec 2018
Reputation:
0
Nice going very interesting
•
Posts: 319
Threads: 8
Likes Received: 2,507 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
277
Part - 23
బిందు మాటలకి భార్గవి వదిన నువ్వు కంగారు పడకు ఏం చేయాలి నేను ఆలోచిస్తాను.
మీరిక్కడే ఉంటారు అని చెబుతుంది. అలాగే జరగాలి భార్గవి లేకపోతే మేము మొత్తం అంతా మీ ఆయనకి చెప్పేస్తాను.
ఏంటి వదిన నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అంటే.. పరిస్థితులు మారుతున్నప్పుడు ఏదైనా చేయాలి కదా!
ఇన్ని సంవత్సరాలు నుంచి ఇలా లగ్జరీకి అలవాటు పడిపోయిన వాళ్ళము. ఊరు వెళ్లి ఏం చేస్తాము. ఊర్లో అందరూ మమ్మల్ని చూసి నవ్వరా అని అడుగుతుంది.
వదిన అంతవరకు పరిస్థితి రాదు. మీరు టెన్షన్ పడకండి అని రూమ్ లోకి వెళుతు ఆఖరికి వదిన నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేసే స్టేజ్ కి వెళ్లావు అంటే..
కట్ చేయాల్సిందే. నువ్వు ఏం చెప్పినా ఆయన నమ్మకుండా ఉండెలా చేయడం నాకు ఏమీ పెద్ద పని కాదు.
తండ్రి కూతుర్ల నే ఎవరికి ఎవరు కాకుండా చేసిన దాని. ఆఫ్ట్రాల్ నువ్వు ఎంత?? ఉదయ్ తో నా పని అవ్వని.
ముగ్గురిని బయటకు పంపుతాను అని వంకరగా నవ్వుకుంటూ రూమ్ లోకి వెళుతుంది. రూమ్ లోకి వెళ్ళగానే అమాయకంగా మొఖం పెట్టి భర్తతో ఏమండి ఉన్నపలంగా అన్నయ్య వాళ్ళును వెళ్లిపోమంటే ఎలాగా..
అక్కడికి వెళ్లి ఇబ్బంది పడతారు కదా అని అడుగుతుంది. ఇందులో ఇబ్బంది ఏముంది భార్గవి. ఎవరు పడితే వాళ్ళు ఉండడానికి మన ఇల్లు ఏమన్నా సత్రమా??
ఇది నువ్వు మేనేజ్ చేసుకోవాల్సిన విషయం. నువ్వు కరెక్ట్ గా మేనేజ్ చేసుకుని ఉంటే నాకు ఇబ్బంది వచ్చేది కాదు కదా అని చిరాగ్గా అని నన్ను డిస్టర్బ్ చేయకు అని కళ్ళు మూసుకుని పడుకుంటాడు.
ఏం మాట్లాడాలో అర్థం కాక రేపు తెల్లారిన తర్వాత చూద్దాం ఏం చేయాలో అన్నది అనుకుని తను కూడా పడుకుంటుంది.
బెంగళూరు...
విక్రమ్ మనసు మనసులో ఉండదు. వెంటనే అవిని దగ్గరికి వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని ఎప్పటికీ నీకు తోడుగా నేనున్నాను.
నువ్వు అనాధవి కాదు బంగారం అని చెప్పాలి అనిపిస్తుంది. కానీ రాత్రివేళ అవిని ఫ్లాట్ కి వెళితే బాగోదు అని అలాగే కూర్చుంటాడు.
లోపలకు వచ్చిన శ్రీ విక్రమ్ ని చూస్తాడు. విక్రమ్ చాలా కోపంగా కనిపిస్తాడు. చేతి నుంచి బ్లడ్ కారుతు ఉంటుంది.
శ్రీ కంగారు గా బావ ఏమైంది చెయి అంతల బ్లడ్ కారిపోతుంది అని పక్కన చూస్తాడు. అక్కడ గ్లాస్ అంతా పగిలిపోయి చెల్లాచెదురు గా కనపడుతుంది.
ఎంతో కోపం వస్తే గాని విక్రమ్ అలచేయుడు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని చేతిని అంత క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసి కట్టు కడతాడు .
విక్రమ్ లో ఎటువంటి చలనము ఉండదు. ఏమైందిరా అని శ్రీ, విక్రమ్ భుజం మీద చేయి వేస్తే..
అవిని ఎన్ని కష్టాలు పడింది రా.. ఏమైంది బావ అనగానే ఫోన్లో విన్నది అంతా చెబుతాడు.
ఆ మాటలకి శ్రీ కూడా చాలా బాధపడుతూ నిజంగా అవిని కి ఇంత ఓర్పు ఏంట్రా..
భూదేవి పేరు పెట్టుకున్నందుకు అవిని కి కూడ ఆ ఓర్పు వచ్చేసి నట్టు ఉంది. దానికి విక్రమ్ అవిని లో ఉన్న సహనాన్ని తగ్గించి.. తనకోసం తను ఫైట్ చేసుకునే విధంగా నేను మార్చుతాను.
తన హక్కుల్ని సంపాదించే విధంగా నేను ట్రైన్ చేస్తాను అని అంటాడు. దానికి శ్రీ ఎలా చేస్తావు బావ.
నువ్వేమో ఆఫీస్ లో ఉంటావు. అవని కాలేజ్లో ఉంటది. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మనకు కనిపిస్తుంది.
అప్పుడు ఏదో హాయ్ అంటే హాయ్ టిఫిన్ ఇదిగోండి, డిన్నర్ ఇదిగోండి ఇవి తప్ప ఇంకేముంది మాటలు.
అవినీ సైలెంట్ గా ఉంటే ఏంటి.. మనం తనతో ఫ్రెండ్షిప్ ని ముందుకు తీసుకు వెళదాం. నా స్నేహం తో నే తనని మోటివేట్ చేస్తాను.
ఓకే బావ ఇంకా పడుకో అని చెప్పి రూమ్ లోకి పంపిస్తాడు. రూమ్ లోనికి వచ్చిన విక్రమ్ కి ఎంత సేపు ఉన్నా నిద్ర పట్టదు.
కళ్ళు మూసుకుని పడుకున్న అవిని ఇబ్బందులే కళ్ళు ముందు మెదులుతాయి ఆ ఉదయ్ నుంచి తప్పించుకోవడానికి అవిని పెట్టిన పరుగులు కనబడుతాయి.
నీ కన్నీళ్లు కి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టను. ఆ ఉదయ్ కి వాడి కి సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ నేను ఇచ్చే పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది.
వెంటనే రిషి కి ఫోన్ చేసి బిందు, సునీల్ ( లాస్ట్ ఎపిసోడ్లో రమేష్ అని రాసాను) గురించి చెప్పి వాళ్ల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి.
అలాగే అవని మదర్ రజిత గారి మరణం గురించి కూడా నాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. వాటి గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెబుతాడు.
ఓకే సార్ అని రిషి ఫోన్ పెట్టేస్తాడు. నా అనుమానాలు కనుక నిజమైతే అత్తగాని అత్తా నీకు ఉంటది చూడు సినిమా. ధనుంజయ్ నుంచే ఎవరూ నిన్ను కాపాడలేరు.
ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు అవిని నీ చూడాలని వెయిట్ చేస్తూ ఉంటాడు.
హైదరాబాద్...
జై సింహ మాన్షన్..
ఇందిరా గారు విక్రమ్ చెప్పిన విషయాలన్నీ కుటుంబ సభ్యులందరికీ చెబుతారు. అందరికీ చాలా బాధగా ఉంటుంది.
మాధవి ఆ మాటలకు ఏడుస్తూ అమ్మ భగవంతుడు నాకు ఎలాగో కూతురునివ్వలేదు. అవిని వచ్చిన తర్వాత నా కూతురుగా దత్తత తీసుకుంటాను.
ఏమంటారు అని భర్త వంక చూస్తుంది. దానికి రమేష్ నవ్వుతూ నీ మాట నేను ఎందుకు కాదంటాను మాధవి.
అవిని లాంటి బంగారం మనకు కూతురు అవుతుంది అంటే కాదంటానా అలాగే చేద్దాం. ముందు ఇంట్లో ఉన్న దయ్యం సంగతి చూడండి.
మగాడు అయ్యుంటే ఈపాటికి తుక్కురెగొట్టే వాళ్ళం ఆడపిల్ల అయిపోయింది అందుకే మీకు అప్పగిస్తున్న మీ స్టైల్ ఇంకా మార్చాలి అంటారు.
చూస్తూ ఉండండి నా కూతురు ని ఇన్ని కష్టాలు పెట్టిన వీళ్ళు మాత్రం సుఖంగా ఉండనిస్తానా??
రేపటి నుండి సినిమా ఇంకా రసవత్తరంగా మార్చుతాము ఏం వదిన అని లలిత వంక చూస్తుంది. లలిత అంతే కదా నా కోడల్ని ఏడిపించిన వాళ్ళ నేను మాత్రం ఎందుకు ప్రశాంతంగా ఉంచుతాను.
ఇప్పటిదాకా మోసం చేశారు అని అది తెలుసుకోవాలని ఇలా చిన్న పనిష్మెంట్ ఇచ్చాను. కానీ వాళ్ళు చేసింది మహాపాపం.
దానికి ఇలాంటి పనిష్మెంట్ ఎలా సరిపోతుంది. వదిన డోసు పెంచాల్సిందే అని నివేదిత వైపు చూసి..
నివి నువ్వు మాత్రం శిల్పతో ఫ్రెండ్షిప్ మైంటైన్ చెయ్. తన కష్టాలు అన్ని నీకు చెప్పుకునే విధంగా నమ్మించు. శిల్ప నోటి వెంట పెళ్లి రోజు ఏం జరిగిందో కూడా చెప్పించు.
అలాగే అమ్మ మనం ఆడే ఆటలో అసలు ఏం జరుగుతుంది తెలియకుండా శిల్ప ను ఉక్కిరి బిక్కిరి చేస్తాను.
సరే చాలా లేట్ అయింది ఇంక పెళ్లి అందరూ పడుకోండి అని చెప్పి.. ఎవరి రూమ్ కి వాళ్ళుని పంపిస్తారు.
అవిని నీ తలచుకోగానే ఆవిడ కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అవని నీ చూద్దామా అని విక్రమ్ కి కాల్ చేస్తారు.
ఈ టైంలో నానమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి అని... ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నానమ్మ అనగానే.. విక్కీ రేపు ఒకసారి అవిని నీ వీడియో కాల్ లో చూపించరా..
అమ్మాయిని చూడాలనిపిస్తుంది అని చెబుతుంది. ఎందుకు నానమ్మ అంటే.. ఏమో నువ్వు చెప్పిన కాడినుంచి మనసు పదే పదే లాగుతుంది.
రేపు ఒకసారి చూపించు విక్కి అంటారు. సరే నాన్నమ్మ నీకు పొద్దుటే ముగ్గేసేటప్పుడు వీడియో కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు.
అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ సూర్యుడు ఉదయిస్తాడు. విక్రమ్ జాగింగ్ కి వెళ్లి వచ్చేటప్పటికి సేమ్ అలాగే రెండు గుమ్మాలు కలిసేటట్టుగా ముగ్గు పెడుతూ ఉంటుంది..
వీడియో కాల్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ అవిని నీ చూపిస్తూ ఉంటాడు. ఏంటండీ అవని గారు నిన్నటిలాగే ఈరోజు కూడా రెండు గుమ్మాలు కలిపేస్తున్నారు ఏంటి?
మీకు కలపడం అంటే అంత ఇష్టమా అని అడుగుతాడు. దానికి అవిని అలాంటిదేమీ లేదు విక్రమ్ గారు.
నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. మా ఫ్లాట్ వరకు అంటే చిన్న బుగ్గ వస్తుంది మీరు ఎలాగా ముగ్గు పెట్టుకోలేరు కదా అందుకే మీకు బాగుంటది నాకు బాగుంటది అన్నట్టుగా ముగ్గు పెడుతున్నాను అని చెబుతోంది
ముగ్గు పెడితే నాకు బాగుంటుందని నేను చెప్పలేదు కదా అని అడుగుతాడు. మీకు బాగుంటుందని చెప్పలేదండి గుమ్మానికి పెడితే ఇల్లు అందంగా ఉంటుంది.
అందుకని పెడుతున్నాను సరేనా.. మీరు ఫ్రెష్ అయ్యి వస్తే కాఫీ పంపిస్తాను అని చెబుతోంది. దానికి విక్రమ్ మీ శాలరీ ఎంత అండి అని అడుగుతాడు.
ఎందుకండీ అని అడుగుతుంది. మీరు రోజు మాకు కాఫీ టిఫిన్ అన్ని పంపిస్తున్నారు. ఇద్దరు మనుషులకి ఎక్స్ట్రా ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఖర్చు కదా అని అడుగుతాడు .
దానికి అవని కోపంగా ఇద్దరు మనుషులు భోజనాని కి నా దగ్గర మనీ ఉన్నాయి లేండి అంటుంది. మీ దగ్గర లేవు అని చెప్పడం లేదండి.
మాకు ఇబ్బందిగా ఉంటుంది కదా! రోజు ఇలా ఫ్రీగా తినాలి అంటే.. ఒక పని చేద్దాం అండి మీ చేతి వంట చాలా బాగుంది అని ఆపి అవని ఫేస్ చూస్తాడు.
ఆ మాటకే పొంగిపోతు ఉంటుంది. నువ్వు మరీ అల్ప సంతోషి లాగా ఉన్నావు అనుకుని..
ఇక్కడ ఉన్నన్ని రోజులు నీ చేతి వంట తినాలి అని నాకు ఉంది. ఇలా ఫ్రీగా తినాలి అంటే ఇబ్బందిగా ఉంది. అందుకే ఒక అండర్స్టాండింగ్ కి వద్దాం అంటాడు.
ఏంటది అని అడుగుతుంది. మా ఫుడ్డు కి అయ్యే మనీ ఎంత పే చేస్తామండి. అప్పుడు మాకు ఇబ్బంది ఉండదు. ఏదైనా ఫ్రీగా తినగలుగుతాము లేదు అంటే కష్టం సుమా అంటాడు.
దానికే కోపంగా అంటే ఇప్పుడు నన్ను వంట మనిషిని చేశారా అంటే... నేను మా ఫుడ్ కి మాత్రమే ఇస్తాను అన్నాను
.
మిమ్మల్ని వంట మనిషి అనలేదండి అర్థం చేసుకోవాలి. మీరు జాబ్ చేస్తున్నారు. మీ ఫ్రెండు జాబ్ చేస్తున్నారు.
మీ ఇద్దరు షేర్ చేసుకోవాలంటే కష్టం కదా! నీకంటే మీ హస్బెండ్ దూరంగా ఉన్నారు కాబట్టి ఖర్చులు పెద్దగా కనపడేకపోవచ్చు.
ఆ అమ్మాయికి ఫ్యామిలీ పంపించాలని ఏవో ఒకటి ఉంటాయి కదా ఆలోచించండి అని విక్రమ్ చెబుతాడు. పైగా మీ చేతి వంట మా అమ్మ చేతి వంట లాగా ఉంటుంది. ఫ్రీగా అయితే మేము తినలేమండీ అని సెంటిమెంట్ గా చెబుతాడు.
The following 12 users Like SivaSai's post:12 users Like SivaSai's post
• aarya, Arjun0410, ash.enigma, Chchandu, coolguy, gora, Gurrala Rakesh, Nivas348, Pardhu7_secret, Sachin@10, Sunny73, yekalavyass
Posts: 319
Threads: 8
Likes Received: 2,507 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
277
Part - 24
విక్రమ్ చెప్పిన దానికి అవిని ఆలోచనలో పడుతుంది. ఒకరోజు రెండు రోజులంటే సీనియర్ ఏమీ అనుకోకపోవచ్చు.
రోజు అంటే తనకి డౌట్ వస్తుంది కదా! సరే అయితే అని చెప్తుంది. విక్రమ్ చొరవ గా అయితే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అని చేయి ముందుకు పెడతాడు.
ఓకే అని చెయ్యి ఇస్తూ విక్రమ్ చేయి వంక చూస్తుంది. అవిని చూపు అర్థమయి వెంటనే వీడియో కాల్ ని కట్ చేస్తాడు.
వీడేంటి ఇలా ఫోన్ కట్ చేశాడు అనుకుని.. ఏమోలే అక్కడ సిచువేషన్ ఏంటో మనకి తెలియదు కదా అవి అవని ని చూసి బంగారం లాగా ఉంది పిల్ల అనుకొని ఇంట్లో వాళ్ళు మురిసిపోతూ ఉంటారు.
శిల్ప కి ఆరోజు నుంచి కొత్త డ్యూటీ ఇస్తారు. మీ పెళ్ళెప్పుడు జరిగిన దోషం పోవడానికి మేము పెద్ద పూజారి గారిని అడిగాము.
అమ్మాయితో ఉపవాసాలు చేయించి పూజలు చేపించండి అని చెప్పారు. పొద్దున్న ఒకటే నువ్వు టిఫిన్ తినాలి అమ్మ అని రెండు ఇడ్లీలు మాత్రమే పెడతారు.
అత్తయ్య మరీ ఇంత తక్కువ తింటే కష్టమేమో అంటే.. నీ సంసారం బాగుండాలంటే తప్పదు తల్లి అని చెప్పి సర్వెంట్స్ ని కూడా తగ్గించేసి.. మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు దాకా మీరు లీవ్ లో ఉండండి అని పంపించేస్తారు.
శిల్పకి అప్పటి నుండి ఇంటి పని, వంట పని గార్డెనింగ్ కూడా చేపిస్తూ ఉంటారు. ఆ గార్డెనింగ్ పనికి శిల్ప చేతులు రఫ్ గా అయిపోతాయి.
శిల్ప చేతులు ఉదుకుంటూ అక్కడ స్పూన్ ఇక్కడ పెట్టేదాన్ని కాదు. మంచినీళ్లు కావాలని నాకు సర్వెంట్ తెచ్చి ఇచ్చేవారు.
అలాంటిదే వీళ్ళు దోషం తొక్క తోలు అంటూ నా చేత అడ్డమైన చాకిరి చేపిస్తున్నారు. మా అమ్మకి ఫోన్ చేసి ఏమైనా హెల్ప్ చేస్తదేమో అడగాలి.
ఈ పని అంతా అయిన తర్వాత అమ్మకి ఫోన్ చేయాలి అనుకుంటూ ఉసురుమంటూ చేస్తుంది . పొద్దుట ఎప్పుడో రెండు ఇడ్లీలు పెట్టి గార్డెనింగ్ చేయమని పంపించారు.
ఇది అయ్యాకైనా రెస్ట్ ఇస్తారా లేదా అనుకుంటూ ఫినిష్ చేస్తుంది.. ఆ పని అయ్యేటప్పటికి ఉదయం 10:30 అవుతుంది.
హమ్మయ్య అనుకుంటూ చేతులు కడుక్కుని లోపలికి వచ్చేటప్పటికి అమ్మ శిల్ప గార్డెనింగ్ అయిపోయిందా తల్లి అనే ప్రేమగా మాట్లాడుతారు.
అమ్మో వీళ్ళు ఏంటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు అనుకొని అయిపోయింది అత్తయ్య గారు అని చెబుతుంది.
సరే అమ్మ వెళ్లి కొంచెం వంట కూడా మొదలు పెట్టు అని మళ్ళీ ఒక చాటభారంత లిస్టు ఇస్తారు. అత్తయ్య గారు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వస్తున్నారా అని అడుగుతుంది.
లేదమ్మా ఎందుకు అడుగుతున్నావ్ అంటే మరీ ఇన్ని వంటలు చెబుతుంటేనో అంటే.. అందులో ఏముంది అమ్మ ఇంట్లో పదిమంది ఉంటాము.
ఒక్కొక్కళ్ళు ఒక ఐటమ్ చెప్తూ ఉంటారు. చేయాలి కదా తల్లి ఇంటికోడలు అన్నాక ఇవన్నీ తప్పదు నేను కూడా ఇవన్నీ చేసిన దాన్ని.
వెళ్లి చేసేయ్ అమ్మ బంగారం అని చెప్పి కిచెన్ లోకి పంపిస్తారు. ఏమీ చేయలేక ఉసురుమంటూ కిచెన్ లోకి వెళుతుంది.
బెంగళూరు...
విక్రమ్ ఫ్రెండ్స్ అని చెయ్యి ముందుకు చాపగానే ఆ చేతకున్న కట్టు చూసి కంగారుపడుతుంది.
ఏమైంది మీ చేతికి ఇంత పెద్ద దెబ్బ తగిలింది అంటూనే చేతివంక చూస్తూ కళ్ళల్లో నుంచి నీళ్లు కార్చేస్తూ ఉంటుంది.
చెయ్యి పట్టుకోవాలా వద్ద అని చెయ్యి ముందుకి వెనక్కి చేయి చాపుతూ ఉంటుంది. అవిని ఏం చేస్తుందని చూస్తూ.. ఏమీ లేదు చిన్న దెబ్బ తగిలింది అని అంటాడు.
అది చిన్న దెబ్బ ఏంటి అంత పెద్ద కట్టు ఉంటే మీకు అసలు భయం తెలియడం లేదు అని కన్నీళ్ళతో అడుగుతూ ఉంటుంది.
అవిని విక్రమ్ చేయి పట్టుకోలేకపోతూ ఉంటుంది అది చూసిన విక్రమ్ కోపంతో ఏం చేస్తామండి ఒంటరిగా ఉన్నాము.
దెబ్బ తగిలిన పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు. నొప్పి ఉందనుకోండి కానీ అడ్జస్ట్ అవ్వాలి కదా అంటూ అవిని నే అబ్సర్వ్ చేస్తూ ఉంటాడు.
ఇక ఆవని ఆగలేక చెయ్ పట్టుకొని ఇంత పెద్ద దెబ్బ తగిలితే నాకు ఒక్క మాట కూడా మీరు చెప్పలేదు కదా అని గబగబా విక్రమ్ ఫ్లాట్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఒక పక్క ఏడుస్తూనే కట్టు విప్పి, చూసి ఇంత పెద్ద దెబ్బ తగిలితే చిన్న దెబ్బ అంటారు ఏంటండీ మీరు.
అసలు మీరు ఏమైనా చిన్న పిల్లోడా ఇలా దెబ్బలు తగిలించుకోవడానికి అని ఏడుస్తూనే ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేస్తుంది.
ఏంటంటే అవిని గారు నాకు తగిలితే మీరు ఎందుకు ఏడుస్తున్నారు. మనిద్దరికీ పరిచయమై ని వారం కూడా అవ్వలేదు కదా అని సూటిగా అడుగుతాడు.
దానికి అవిని తత్తరపడుతూ అంటే మనం ఫ్రెండ్స్ కదా! ఫ్రెండ్ కి దెబ్బ తగిలితే ఎవరికైనా ఏడుపు వస్తుంది కదా అని చెబుతుంది.
ఓ నిజంగానా మీలాంటి ఫ్రెండ్ ఉండడం మాత్రం చాలా లక్కీ అండి అని చెబుతాడు. మీరు మాత్రం చేతిని కదపకండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తన ఫ్లాట్ కి వెళ్లి టిఫిన్ రెడీ చేసి కాఫీ తీసుకుని వస్తుంది..
ఈ లోపు విక్రమ్ ఫ్రెష్ అయి వస్తాడు. శ్రీ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. అవని ఏం టిఫిన్ తీసుకొస్తుందా అని..
అవని టిఫిన్ తీసుకుని స్పీడ్ గా లోపలకి వచ్చేస్తుంది. శ్రీ ఆశ్చర్యంగా చూస్తాడు . ఏంటి ఈ రోజు డోర్ నాక్ చేయకుండానే డైరెక్ట్ గా వచ్చేస్తుంది అని.
అవిని ఈరోజు ఏం టిఫిన్ తీసుకొచ్చావు అని ప్లేట్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఇడ్లీ, కొబ్బరి చట్నీ,షుగర్, నెయ్యి, కరివేపాకు పొడి ఉంటాయి.
అది చూసి విక్రమ్ ఇడ్లీనా అని మొహం చిట్లిస్తాడు. మీరు ఈరోజు ఇడ్లీ తినాలి. వెరైటీస్ తినటానికి చెయ్యి ఎలా ఉందో చూసారా అని గట్టిగా అడుగుతుంది.
చేతికి దెబ్బ తగిలితే ఇడ్లీ మాత్రమే ఎందుకు. అది జ్వరం వచ్చిన పేషెంట్స్ కి అని గట్టిగానే అంటాడు. జ్వరమైతేనే అలా తినాలా ఆ చేయి చూశారా ఏదైనా పడనవి తింటే ఇంకా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది.
ఇంకా చెయ్యి తగ్గేదాకా లైట్ ఫుడ్ డే పెడతాను అని చెప్పి కరాకండిగా ప్లేట్లోఇడ్లీ పెట్టి విక్రమ్ కి, శ్రీ కి ఇస్తుంది.
శ్రీ నవ్వుకుంటు ఇద్దరిని చూస్తూ ఉంటాడు. కానీ అవి పట్టించుకునే పోసిషన్ లో ఉండదు. తినండి అని చెబుతుంది.
విక్రమ్ కి ఒక చిలిపి ఆలోచన వచ్చి శ్రీ కి సైగ చేస్తాడు అక్కడి నుండి వెళ్ళిపొమ్మని. ఇడ్లీ తుంచలేక ఇబ్బంది పడుతున్నట్టుగా యాక్ట్ చేస్తాడు.
తినకుండా ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. నాకు వద్దండి అని చెప్పి ప్లేట్ ఇచ్చేస్తాడు. అదే ఏమైంది ఆకలిగా ఉన్నారు కదా తినండి అంటే ఎలా తింటాం అండి చెయ్యి అంతా నొప్పిగా ఉంది తినలేక పోతున్నాను.
శ్రీ ఫోన్ వస్తున్నట్టు ఆక్ట్ చేస్తూ హలో అవునా ఇప్పుడే నేను వర్క్ చెక్ చేస్తాను అని చెప్పి తను టిఫిన్ ప్లేట్ తీసుకుని రూమ్ లోకి వెళ్లి డోర్ వేసేసుకుంటాడు.
విక్రమ్ అవిని తో పరవాలేదు నేను వాడి ఫ్రీ అయ్యాక తినిపించమని చెబుతాను అని అంటాడు. సరే అని శ్రీ కోసం చూస్తూ ఉంటుంది.
అమ్మని దీని బుర్ర ఇలా పని చేస్తుందా అనుకుని..
వీడు కాల్ ఎప్పటికి అవుతుందో ఏంటో.. ఆఫీస్ కాల్ అంటే ఎలా లేదన్న రెండు గంటలు పట్టేస్తది అనుకుంటా...
ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు బాగా ఆకలి వేస్తుంది అని చాలా దీనంగా ఫేస్ పెడతాడు. విక్రమ్ ని ఆలా చూసిన అవిని కి మనసప్పగా సరే ఈరోజు నేను తినిపిస్తా లేండి అని ఇడ్లీ తినిపిస్తూ ఉంటుంది.
విక్రమ్ మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పైకి మాత్రం సాడ్ గా ఫేస్ పెట్టి మీకు చాలా ట్రబుల్ ఇస్తున్నానండి అంటాడు.
అయ్యో ఇందులో ట్రబుల్ ఏమి ఉందండి. ఒక ఫ్రెండ్ గా నేను చేస్తున్నాను అంతే అని చెబుతుంది. కానీ తనిఖీ చాలా హ్యాపీగా ఉంటుంది.
విక్రమ్ కి అంత దగ్గరగా ఉండడం. అలా అని పైకి తన ఎమోషన్స్ ఏమీ చెప్పలేదు కదా కామ్ గా తినిపించి మూతి అంతా నీటుగా తుడిచి సరేనండి నేను మీకు లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను అవి మాత్రమే తినండి ఈరోజు అని అన్ని ఫ్లాట్ కి వెళుతుంది.
నేహా అవిని నీ చూసి ఎవరికి అవిని బ్రేక్ఫాస్ట్ పట్టుకొని వెళ్ళావు అంటే.. అదే మన ఎదురుగుండా ఉన్న శ్రీ అన్నయ్య వాళ్ళకి అని చెబుతుంది.
వాళ్ళకెందుకు నువ్వు అంత స్పెషల్ గా చేస్తున్నావు అని అడుగుతుంది. అదేమీ లేదు ఇద్దరూ బ్యాచిలర్స్ పైగా చెల్లి అని పిలిచాడు.
రిక్వెస్ట్ చేశారు వాళ్లకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇమ్మని దానికి అమౌంట్ అది ఇచ్చేస్తామని చెప్పారు అని చెబుతుంది.
దానికి నేహా అవిని నీ చూస్తూ నీకు అలా చేసి పెడితే నువ్వు హ్యాపీ నా అని అడుగుతుంది. చాలా అని సంతోషంగా చెప్తుంది.
ఓకే నీకు ఎలా నచ్చితే అలా చేయి కానీ ఎవరి వల్ల మాత్రం హర్ట్ అయ్యే పరిస్థితిని తెచ్చుకోకు. ఇప్పటికే చాలా సఫర్ అయ్యావు అని చెబుతుంది.
ఇవన్నీ సీసీలో చూసిన విక్రమ్ సీనియర్ ఎవరో గాని చాలా మంచి అమ్మాయి లాగానే ఉంది. ఎప్పటికీ అవిని కి దగ్గరగానే ఉంచాలి. అనుకుంటూ శ్రీ ని చూస్తాడు.
ఏంటి బావ నన్ను అలా చూస్తున్నావ్ అంటే... నీకు పెళ్లి చేసేదామని అని అంటాడు. బావ ముందు నీ లైఫ్ సెట్ అవ్వని తర్వాత నా పెళ్లి సంగతులు చూద్దాము అనే శ్రీ అనగానే..
ఆరు నెలల్లోపు మొత్తం సెట్ చేసేస్తాను. ఇప్పటినుండి చూస్తేనే కదా నీకు అమ్మాయి దొరుకుతుంది అని అంటాడు.
నిన్ను చూస్తే నాకు ఏదో డౌట్ కొడుతుంది. కొంపతీసి నన్ను ఎవరికైనా బుక్ చేసేస్తున్నావా అని అడుగుతాడు. అవును ఆల్రెడీ బుక్ చేసేసాను అని చెప్పి సీసీ లో నుంచి నేహా ని చూపిస్తాడు.
శ్రీ సమాధానమేమిటి??
కథ కొనసాగుతుంది...
ప్లీజ్ గివ్ మీ రేటింగ్స్
The following 23 users Like SivaSai's post:23 users Like SivaSai's post
• ABC24, Arjun0410, ash.enigma, Babu143, Bhavabhuthi, coolguy, gora, Gurrala Rakesh, Jola, k3vv3, Luckky123@, Mohana69, Nivas348, Pardhu7_secret, Raju1987, Sachin@10, shekhadu, Sunny73, swapnika, tallboy70016, The Prince, vikas123, yekalavyass
Posts: 4,458
Threads: 9
Likes Received: 2,832 in 2,177 posts
Likes Given: 10,441
Joined: Sep 2019
Reputation:
30
•
Posts: 40
Threads: 0
Likes Received: 11 in 10 posts
Likes Given: 3
Joined: Jun 2019
Reputation:
2
(03-01-2026, 06:58 AM)SivaSai Wrote: Part - 24

Excellent update.. waiting for next update. thanks a ton for writing a super story.. i never read this kind of feel good story
•
Posts: 1,099
Threads: 3
Likes Received: 307 in 266 posts
Likes Given: 88
Joined: Nov 2018
Reputation:
8
•
Posts: 263
Threads: 0
Likes Received: 193 in 132 posts
Likes Given: 1,128
Joined: Mar 2022
Reputation:
5
good going bro
nice story
•
Posts: 430
Threads: 0
Likes Received: 174 in 153 posts
Likes Given: 20
Joined: Dec 2018
Reputation:
0
•
Posts: 89
Threads: 0
Likes Received: 43 in 34 posts
Likes Given: 132
Joined: May 2019
Reputation:
1
•
Posts: 628
Threads: 1
Likes Received: 272 in 206 posts
Likes Given: 517
Joined: Dec 2022
Reputation:
2
Happy new year..nice update
•
Posts: 319
Threads: 8
Likes Received: 2,507 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
277
Part - 25
విక్రమ్ మాటలకు శ్రీ ఏంటి అని గట్టిగా అరుస్తాడు. ఏరా అమ్మాయి చాలా బాగుంది కదా అంటే బావ నేను ఇంకా పెళ్లి గురించి ఏమీ ఆలోచించలేదు అని చెబుతాడు.
ఇంక నువ్వు ఏమన్నా కాలేజ్ స్టూడెంట్వి అనుకుంటున్నావా.. సీట్ కిందకి 30 వచ్చింది ఇంక పెళ్లి చేసుకోకుండా ఏమి చేస్తావు..
అమ్మాయి కూడా మన కంపెనీలోనే జాబ్ చేస్తుంది. సో అబ్జర్వ్ చేయి. మనిద్దరం ఎవరో తనకు తెలియదు. నీకు ఓకే అయితే అప్పుడు మేమిద్దరం కలిసి మీ పెద్ద వాళ్లతో మాట్లాడి నీకు పెళ్లి చేసేస్తాను అని చెబుతాడు.
అంటే ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయిపోయావు బావ అమ్మాయిని నాకు అంట కడదాం అని అంటే.. ఏ నీకు డౌటా అని అడుగుతాడు.
సరే ఏం చేస్తాము బావ నీ కోరిక తీర్చాలి కదా! ఈరోజు నుంచి నాకు ఫోకస్ అంతా ఆ అమ్మాయి మీద పెడతాను. ఇంకా ఆఫీసుకు వెళదామా అంటే సరే పదాఅని నవ్వుకుంటూ ఇద్దరు వెళ్లిపోతారు.
అవిని టిఫిన్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. రేపు మేమ్ ని అడిగి లీవ్ తీసుకుని గుడికి వెళ్ళాలి. విక్రమ్ పేరు మీద పూజ చేయించి ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడు గాని నాకు ప్రశాంతంగా ఉండదు.
కాలేజ్ కి వెళ్లగానే ముందు ప్రిన్సిపల్ మేమ్ తో మాట్లాడాలి అనుకుని తను కాలేజ్ కి బయలుదేరుతుంది.
హైదరాబాద్...
భార్గవి ధనుంజయ్ కి ఏం చెప్పి ఆపాల అని ఆలోచిస్తూ ఉంటుంది. ఉదయ్ కి చెప్పిన పని ఎంతవరకు వచ్చింది. ఆ పని లైన్ లోకి వస్తే ఆ బాధలో కొన్ని రోజులు ఉండి అన్నయ్య సంగతి మర్చిపోతారు.
తర్వాత సంగతి తర్వాత ఆలోచించొచ్చు అనుకుంటూ ఉదయ్ కి మెసేజ్ చేస్తుంది. పని ఎంతవరకు వచ్చింది అని...
వెయిట్ అత్తయ్య ఒక అరగంటలో అయిపోతుంది అని చెప్పి మెసేజ్ చేస్తాడు. ఓకే అని అరగంట ఎప్పుడు అవుతుందా అని గడియారం వంక చూస్తూ టిఫిన్స్ రెడీ చేస్తూ ఉంటుంది.
మా అత్తగారు ఆర్డర్ ఏమోగానీ రోజు టిఫిన్ రెడీ చేయాలంటే చస్తున్నాను. మళ్లీ రోజుకు ఒక వెరైటీ చేయాలంట.
అప్పటికప్పుడు ఆర్డర్ వేస్తున్నారు. ఏదన్నా అందము అంటే మేము ఊరు వెళ్ళిపోతాము అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
శిల్ప అత్తగారు వాళ్ళు ఏదో ఒక పనిమీద ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. శిల్ప కాపురం ఒక్కసారి సెట్ అవ్వని అప్పుడు చెబుతాను ఒక్కొక్కళ్ళ పని .
ఒక దరిద్రాన్ని ఎలాగొ వదిలించుకున్నాను. ఇంకా ఈ రెండు దరిద్రాల్ని వదిలించుకోవడం ఎంతసేపు ముందు ఉదయ్ తో నా పని అవుతే ఇలా ముగ్గురిని ఇంట్లో నుంచి నేనే గెంటేస్తాను.
నేనేం చెప్పినా మా ఆయన నమ్ముతారు నా మాట మీద ఆయనకు అంత నమ్మకం అని గర్వంగా అనుకుంటూ టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది.
అరగంట అయ్యేలోపు సార్ కొరియర్ అని కొరియర్ బాయ్ వచ్చి కవరిస్తాడు. అది సునీల్ తీసుకోబోతుంటే లేదు సార్ ఇది ధనుంజయ్ సార్ పేరు మీద వచ్చింది.
ఆయనే సైన్ చేసి తీసుకోవాలి అని చెబుతాడు. సరే అని బావ అని పిలిచి నీకేదో కొరియర్ వచ్చిందని చెబుతాడు. ధనుంజయ్ నాకు కొరియర్ అనుకుంటు వచ్చే సైన్ చేసి కవర్ తీసుకుంటాడు.
భార్గవి కిచెన్ లో నుంచి చూస్తూ ఉంటుంది. ధనుంజయ కవర్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడా అని... ధనుంజయ్ కవర్ పట్టుకుని చూస్తూ ఎవరు పంపారు నాకు ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు అనుకుంటూ కవర్ ఓపెన్ చేస్తాడు.
హమ్మయ్య కవర్ ఓపెన్ చేసారు ఇప్పుడు చూడాలి అసలు సినిమా అనుకుంటూ సైలెంట్ గా టిఫిన్స్ అన్ని టేబుల్ మీద సర్దుతూ...
అత్తయ్య గారు టిఫిన్ రెడీ అండి అని చెబుతుంది. ఇప్పుడే ముసలి వాళ్లు కూడా బయటకు వస్తారు కదాఅవి చూసి అప్పుడు ఇంకా అవని నీ అసహ్యించుకుంటారు అని మనసులో కోయ డాన్స్ వేస్తూ... ఏమీ తెలియనట్టుగా సర్దుతూ ఉంటుంది.
ధనుంజయ్ కవర్ ఓపెన్ చేసి ఫొటోస్ చూస్తాడు. ఆ ఫొటోస్ చూడగానే ధనుంజయ్ కి కోపంతో కళ్ళు ఎర్రబడతాయి.
ధనుంజయ్ ని అలా చూసినా సత్యవతి గారు ఏమైందిరా అనుకుంటూ దగ్గరికి వెళ్తారు. ఆ ఫొటోస్ అన్నీ సత్యవతికి చూపిస్తాడు.
అవి చూసిన సత్యవతికి కోపంగా ఎవరు రా ఇలా చేసింది అని అడిగితే... ఏమీ తెలియనట్టుగా వచ్చి ఏమైంది అత్తయ్య గారు అనే ఫొటోస్ చూసి అయ్యో అవిని ఇలాంటి పని ఎలా చేశావు.
నువ్వు నిజంగానే బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయావా అని బాధని నటిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఆ ఫొటోస్ చాలా అసహ్యంగా ఉంటాయి.
అవని ఎవరో అబ్బాయితో క్లోజ్ గా ఉన్నట్టు ఉంటుంది. ఆ ఫొటోస్ లో ఉన్నా అబ్బాయి అంతగా నచ్చితే మేమే దగ్గర ఉండి పెళ్లి చేసేవాళ్ళం కదా!
ఎందుకు ఇలాంటి పని చేశావు అని బాధగా మాట్లాడుతూ ఉంటుంది. సత్యవతి భార్గవి వంక చూస్తూ ఈ ఫొటోస్ మనకు అసలు ఎవరు పంపించారు.
ఫ్రమ్ అడ్రస్ ఏమైనా ఉందా ధనుంజయ్ అని అడుగుతుంది. లేదమ్మా అని తలుపుతాడు.
అయినా అవిని వెళ్లిపోయినప్పుడు ఆ పర్టికులర్ గా అవని ఫొటోస్ పంపించాల్సిన అవసరం ఎవరికీ వచ్చింది భార్గవి అని అడుగుతుంది.
నాకేం తెలుసు అత్తయ్య అలా అడిగితే నేనేం చెప్పగలను అని కంగారుపడుతుంది. మనసులో అమ్మో ఈవిడ ఏమిటీ నన్ను ఇలా అడుగుతుంది.
ధనుంజయ్ సునీల్ వంక చూస్తూ ఉదయ్ ఎక్కడ అని అడుగుతాడు. ఇప్పుడు ఉదయ్ తో ఏం పని బావ అంటే ముందు వాడు ఎక్కడున్నాడో చెప్పు అని గట్టిగానే అడుగుతారు.
ఉదయ్ బయటకు వెళ్ళాడు. ఇంకా రాలేదు అంటే ఇంత పొద్దుటే బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది.
అంటే జాగింగ్ కి వెళ్ళినట్టు ఉన్నాడు బావ అని నీళ్లు నములుతూ ఉంటాడు. వాడికి అలాంటి మంచి లక్షణాలు కూడా ఉన్నాయా ఆ అంటూ ఉండగానే ఉదయ్ విజిల్ వేసుకుంటూ లోపలికి వస్తాడు.
ఉదయ్ డ్రెస్ చూసి మీ ఓడి జాగింగ్ కి వెళ్ళలేదు. షికారికి వెళ్ళాడు అని సత్యవతి గారు వెటకారంగా అంటారు.
ఏమైంది అత్తయ్య అందరూ హాల్లోనే ఉన్నారు. అందరి మోకాలు ఏంటి అంత సాడ్ గా ఉన్నాయి. అవని గురించి ఆలోచిస్తున్నారా అని నోరు జారుతాడు.
మేము అవిని గురించే ఆలోచిస్తున్నామని నీకు ఎలా తెలిసింది అని శేషగిరి గారు అనగానే.. అంటే ప్రస్తుతం మన ఇంట్లో లేనిది అవని యే కదా అందుకని అలా అడిగాను అని తడబడుతూ భార్గవి వంక చూస్తాడు.
భార్గవి పళ్ళు నూరుతూ కామ్ గా ఉండలేవా అని సైగ చేస్తుంది. ఇక్కడ అవని యే కాదు. శిల్ప కూడా లేదు కదా అని మళ్ళీ శేషగిరి గారు అనగానే...
ఈ ముసలోడు ఒకడు ఏదో ఒకటి అడుగుతానే ఉంటాడు. అనుకుని శిల్ప అంటే వాళ్ళ అత్తవారింట్లో ఉంది.
అవని ఏమో ఎక్కడికి ఎవరితో వెళ్ళిపోయిందో మనకి తెలియదు కదా అందుకనే అంటున్నాను అని చెబుతాడు.
అదేంటి ఆరోజు తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయిందని నువ్వే చెప్పావు కదా! అబ్బాయిని నువ్వు చూడలేదా అని మళ్ళీ అడుగుతారు.
ఈ ముసలోడికి వచ్చిన డౌట్స్ సిబిఐ వాళ్ళకు కూడా రావేమో అనుకుని.. ఆ అబ్బాయిని నేను సరిగ్గా చూడలేదు తాతగారు. మాస్క్ పెట్టుకుని వచ్చాడు అని చెబుతాడు.
అవునా అని ఈ ఫొటోస్ సంగతి ఏమంటావు అంటే.. ఈ అబ్బాయి తోనే అవని వెళ్ళిపోయింది అంటాడు.
అదేంటి ఆరోజు అబ్బాయిని చూడలేదు అన్నావు ఈ అబ్బాయి అనే నీకెలా తెలిసింది అని అడిగితే...
అంటే హైట్ కలరు అలాగే ఉంది అందుకని ఈ అబ్బాయి అనుకున్నాను అంటూ వాళ్ల అత్త వంక చూస్తాడు. అప్పటికే భార్గవి కొట్టేలా చూస్తూ ఉంటుంది.
ధనుంజయ లేచి నిలబడుతూ ఓ అవునా అవని ఈ అబ్బాయితో వెళ్ళిపోయింది అది నీకు కన్ఫామ్ గా తెలుసు అంతే కదా అని సూటిగా అడుగుతారు.
అవును మావయ్య అని అమాయకంగా చెబుతాడు. భార్గవ్ కి ఏదో అనుమానం వస్తూ ఉంటుంది. ఏదో తేడా జరుగుతుంది ఉదయ్ ఇరుక్కుపోయాడా ఏంటి అని భయంగా భర్త వంక చూస్తుంది.
ధనుంజయ్ బెల్ట్ తీసుకుని ఉదయ్ ని పిచ్చకొట్టుడు కొడతారు. నిజం చెప్పు అని దానికి ఉదయ్ ఏడుస్తూ నేను నిజమే చెబుతున్నాను మావయ్య అంటే...
ఇప్పుడు కూడా అబద్ధాలే చెబుతున్నావు అని మళ్ళీ నాలుగు పీకుతారు. బిందు అడ్డు వచ్చి ఏంటి అన్నయ్యగారు...
మీ అమ్మాయి తప్పు చేస్తే నా కొడుకుని కొడుతున్నారు అని లేనిపోని బింకాన్ని చూపిస్తూ అంటుంది. బిందు నువ్వు మర్యాదగా అడ్డు తప్పుకో లేదా ఆడదానివి అని కూడా చూడకుండా నీకు దెబ్బలు పడతాయి అని గట్టిగా అరుస్తారు.
ఆ మాట తీరికి ఉలిక్కిపడి పక్కకి తప్పుకుని భర్తని ముందుకు తోస్తుంది. బిందు అడిగిన దాంట్లో తప్పేముంది బావగారు..
ఆ ఫొటోస్ చూస్తుంటే అర్థం కావడం లేదు అవిని చేసిన పని. నా కొడుకు ఏం తప్పు చేశాడని కొడుతున్నారు అంటే...
అవునా నీ కొడుకు ఏం చేశాడో నీకు తెలియాలి అంతే కదా! అని సెక్యూరిటీ కి ఫోన్ చేసి ఇప్పుడు వెళ్లినా కొరియర్ బాయ్ ని లోపలికి తీసుకు రమ్మని చెబుతాడు.
అంతే నలుగురికి చెమటలు కారిపోతూ ఉంటాయి.ఆ కొరియర్ బాయ్ కి కూడా అప్పటికి బాగా దెబ్బలు తగిలి ఉంటాయి.
వాడిని లోపలికి తీసుకువచ్చి పడగానే ఇప్పుడు నువ్వు నిజం చెప్పరా ఈ ఫొటోస్ నీ చేతికి ఎలా వచ్చాయి అంటే కొరియర్ ఆఫీస్ నుంచి తెచ్చానండి అని భయంగా చెబుతాడు.
ఇప్పుడు కూడా అదే చెబుతున్నావని వాడిని గట్టిగా నాలుగు పీకి నేను ఇప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేస్తున్నాను. వాళ్లు వచ్చారు అంటే గనక నీ మీద దొంగతనం చేసావని కేసు కూడా పెట్టి మక్కలి ఇరగదాన్ని ఇస్తాను.
నిజం చెప్పు అని గట్టిగా అరుస్తారు. ఆ వాయిస్ కి భయపడి నిజం చెబుతాను అని ఉదయ్ వంక చూస్తాడు.
చెప్పకు అని సైగ చేస్తాడు. నువ్వు వాడి వంక కాదు. ఇటు చూడు.. నిజం మాత్రమే చెప్పు అని బెల్ట్ తో ఇంకొక రెండు తగిలిస్తారు.
అప్పుడు ఆ కొరియర్ బాయ్ చెప్పినా నిజం విని కోపంతో ఉదయ్ వంక చూస్తారు.
కొరియర్ బాయ్ ఏం చెప్పాడు??
The following 12 users Like SivaSai's post:12 users Like SivaSai's post
• Arjun0410, ash.enigma, Bhavabhuthi, gora, Gurrala Rakesh, Nivas348, Raju1987, Sachin@10, Sunny73, swapnika, The Prince, yekalavyass
Posts: 319
Threads: 8
Likes Received: 2,507 in 269 posts
Likes Given: 1,041
Joined: Aug 2024
Reputation:
277
Part - 26
ధనుంజయ్ కొట్టిన దెబ్బలకి కొరియర్ బాయ్ నిజం చెప్పేస్తాడు. ఇదంతా చేపించింది ఉదయ్ అని భయంగా చెబుతాడు.
ఆది విన్న వెంటనే ధనుంజయ్ కోపంగా ఉదయ్ వంక చూస్తాడు. లేదు మావయ్య అతను చెప్పింది అంతా అబద్ధం అంటే...
మరి ఏది నిజం చెప్పు అని రెండు తగిలిస్తారు. వాళ్ళ అత్తయ్య వంక చూస్తాడు. సేవ్ చెయ్యి అని...భార్గవి ముందుకు వచ్చి ఎందుకండి వాడిని అలా కొడతారు.
వాడికి ఏమి అవసరం... మన అమ్మాయి మీద నిందలు వేస్తే మనం ఇంటి పరువు పోతుందని వాడికి మాత్రం తెలీదా అని ముసలి కన్నీరు కారుస్తుంది.
వెనకాల సునీల్ నుంచోని అవును బావగారు మీ ఇంటి పరువు పోతే మా పరువు పోయినట్టు కాదా నా కొడుకు ఎందుకు చేస్తాడు అని లేనిపోని ధైర్యం తెచ్చుకుని మాట్లాడుతాడు.
అవునా నీ కొడుకుది ఏమీ తప్పు లేదు అంటావు అంతే కదా సునీల్ అని... కమిషనర్ కి ఫోన్ చేస్తాడు. మా ఇంటికి ఒక దొంవచ్చాడు.
మాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. కానీ ఇంట్లో నుంచి విలువైన వస్తువులు కాజేశాడు అవి ఎక్కడ పెట్టాడో తెలియడం లేదు మీరు.
వచ్చి అరెస్టు చేసి వాళ్ళ పేరెంట్స్ ని కూడా లైవ్ టెలికాస్ట్ చూపించండి అని చెబుతాడు. ఆ కొరియర్ బాయ్ కి చెమటలు పట్టేసి నేను నిజం చెబుతున్నాను సార్. ఇదంతా చేపించింది ఉదయనే..
నేను ఉదయ్ ఫ్రెండ్స్. కావాలంటే నా ఫోన్లో ఫిక్స్ చూడండి అని చూపిస్తాడు. ఇంకా భార్గవికి అర్థం అయిపోతుంది ఉదయ్ దొరికిపోయాడు అని..
ఇదే మంచి సమయం అన్నయ్య, వదిన పంపించేయడానికి లేకపోతే నన్నే బ్లాక్ మెయిల్ చేస్తుందా అని ఉదయ్ ని లాగ పెట్టి ఒకటి పడుతుంది.
బిందు కోపంగా భార్గవి అని అరుస్తోంది. మాట్లాడకు వదిన నా కూతురు మీద ఇంత నింద వేస్తాడా నీ కొడుకు. అది అసలే అమాయకురాలు.
ఎక్కడుందో ఏంటో.. అవని బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోతే నీకేంటి రా బాధ ఇలాంటి ఫోటోలు క్రియేట్ చేసావ్ అని అరుస్తుంది అ.
అత్తయ్య నువ్వేనా ఇలా మాట్లాడేది అని ఆశ్చర్యంగా అడుగుతాడు. నేనేరా మాట్లాడేది నా కుటుంబ పరువు కన్నా ఏది ఎక్కువ కాదు.
ఎందుకు చేసావు ఇలాంటి పని.. ఫోటోలు ఇవేనా ఇంకా ఉన్నాయా ఇంకెవరికైనా పంపించావా అని తను కూడా కొడుతుంది.
బిందుకు కోపం వచ్చి భార్గవి ఇంకొక దెబ్బ నా కొడుకు మీద ఇంకో దెబ్బ పడిన ఏం చేస్తానో నాకే తెలియదు అని అరుస్తుంది.
ఇంకా ఏం చేయాలి వదిన. ఇన్నాళ్లు నా పుట్టింటి వాళ్ళు ఏదో అక్కడ కష్టపడుతున్నారు కదా అని ఉండనిస్తే నా ఇంటి పరువు తీయాలని చూస్తారా..
తక్షణమే మీరు ఇంట్లోంచి బయటికి నడవండి అని బిందు చేయ పట్టుకుంటుంది. ధనుంజయ్ భార్గవి వంక చూస్తూ ఆగు భార్గవి అప్పుడే అయిపోలేదు కదా..
ఈ పని వీడే చేశాడా... వీడితో ఎవరైనా చేయించారా అన్నది కూడా తెలియాలి కదా అనగానే భార్గవికి చెమటలు పట్టేస్తాయి.
ఈ ప్రాబ్లం ఇక్కడితో సాల్వ్ చేయాలి అంటే ఇంకా పెరుగుతుంది ఏంటి అనుకుని... ఇంకా ఏమి తెలియాలి అండి..
ఇలాంటి పని చేయమని ఎవరైనా చెబుతారా అని అంటుంది. అది నేను తెలుసుకుంటాను. నువ్వు టెన్షన్ పడకు అని....
చూడు ఉదయ్ సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేలోపు నువ్వు నిజం చెబితే సరే. లేదంటే నీతో పాటు నీ తల్లిదండ్రులు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది.
ఉదయ్ భార్గవి వంక చూస్తాడు. భార్గవి చెప్పద్దు అని సైగ చేస్తుంది. నేనే కావాలని చేశాను అని తలదించుకుంటాడు. ఎందుకు అని గట్టిగా అరుస్తాడు.
నేను అవిని నీ ప్రేమించాను. నన్ను కాదని వేరే వాడితో వెళ్ళిపోయింది అన్న కోపంతో ఇలా క్రియేట్ చేశాను అని చెబుతాడు.
దానికి హమ్మయ్య అని భార్గవి అనుకుంటుంది. ధనుంజయ్ లాగిపెట్టి ఒకటి పీకి నువ్వు ఏది చెప్పినా నమ్మడానికి నేను ఏమన్నా వెర్రి వాడు లాగా కనిపిస్తున్నానా..
అవని నిన్ను కొట్టి వెళ్ళిపోయిన రోజున ఏం జరిగింది అది కూడా కక్కు అని బెల్ట్ తో రెండు పీకుతాడు. ప్లీజ్ మావయ్య మీరు అలా కొట్టకండి. ఆ దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను అంటే...
నా కూతురు మీద నిందలు వేస్తే మాత్రం నేను ఎలా భరిస్తాను అనుకుంటున్నావు రా... నువ్వు నిజం మాత్రమే చెప్పు.
అప్పుడే ప్రాణాలతో బయట పడతావు. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నీతో ఇంకా ఎవరు చేతులు కలిపారు అని అడుగుతాడు.
భార్గవికి చెమటలు ఫుల్లుగా కారిపోతూ ఉంటాయి. ఏంటి సడన్గా ఈయనకి అవిని మీద ఇంత ప్రేమ పొంగి కొచ్చింది. నేను ఏది చెబితే అదే నమ్మేవారు కదా...
ఈరోజు ఎందుకు నన్ను పక్కన పెట్టి మరీ వాడిని చితక్క కొడుతున్నారు అని భర్త వంక చూస్తుంది. ఆరోజు నా కూతుర్ని ఏం చేసావో చెప్పమంటే ఆలా సైలెంట్ గా ఉంటావేంటి అని సునీల్ని నాలుగు పీకుతాడు.
ఎందుకు బావ నన్ను కొడుతున్నావు అని అడుగుతాడు. నిన్ను కొడితే ఆయన నీ కొడుకు నోరు విప్పుతాడేమో అని.. ఇంక వాడు రిప్లై ఇవ్వ లేదు అనుకో ఆ దెబ్బలు నీ పెళ్ళానికి కూడా పడతాయి.
ఎందుకంటే ఆ రోజు మేము ఇంటికి వచ్చేటప్పటికి మీ ముగ్గురు మాత్రమే ఉన్నారు. కాబట్టి నిజం చెప్పండి అని సునీల్ ని ఇంకా నాలుగు పీకి బిందువైపు చూస్తాడు.
బిందుకి టెన్షన్తో ఓరి దేవుడా వాళ్ళంటే మగవాళ్ళు నాలుగు కొట్టిన తట్టుకున్నారు. నేను ఎక్కడ తట్టుకోగలను..
నిజం చెబితే ప్రాణాలు తీసేస్తారు.చెప్పకపోయినా ఈ దెబ్బలతో ప్రాణాలు తోడేస్తున్నాడు ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి లాగా ఉంది మా పరిస్థితి.
నిజం చెప్పేయడమే బెటర్ అనుకుని బిందు ముందుకు వచ్చి అన్నయ్య గారు నేను నిజం చెబుతాను. దయచేసి వాళ్ళిద్దర్నీ కొట్టకండి అని బ్రతిమాలుతుంది.
సరే అయితే చెప్పు అంటే.. అవని ని పెళ్లి చేసుకోమని అడగడానికని వెళ్ళాడు. అవిని కి ఇష్టం లేక వెళ్ళిపోయింది అని చెబుతోంది.
ఇప్పటికి మీరు నిజం రాస్తున్నారు అని చెప్పి సునీల్ ని రెండు పీకుతాడు. ప్లీజ్ బావ కొట్టకు తట్టుకోలేకపోతున్నాను అని..
ఉదయ్ ఆరోజు అవని తో మాట్లాడి భయపెట్టి పెళ్లికి ఒప్పించాలి అనుకున్నాడు. అందుకే కొంచెం బలాత్కారం చేస్తున్నట్టుగా యాక్ట్ చేశాడు కానీ..
అవని భయపడి వెళ్ళిపోయింది అని చెబుతారు. మరి బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయిందని ఎందుకు చెప్పారు అని కోపంగా అడుగుతాడు.
అంటే... ఎలాగో అవని వెళ్ళిపోయింది కదా అని మమ్మల్ని మేము సేవ్ చేసుకోవడానికి అలా చెప్పాము అని సునీల్ తలదించుకుంటాడు.
మీ స్వార్థం కోసం నా కూతురు మీద నిందలు వేస్తారా అని ముగ్గురిని కొడతాడు. సెక్యూరిటీని పిలిచి వీళ్ళ ముగ్గురికి పని అప్పజెప్పండి.
ఒకడు ని గార్డెనింగ్ చేస్తూ ఉండాలి. ఇంకొకరు ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి అలాగే..ఉదయ్ వాచ్మెన్ కింద ఉండాలి.
ఇంట్లోకి మాత్రం రావడానికి వీల్లేదు. ముగ్గురు సర్వెంట్ కోటర్స్ లోనే ఉండాలి అర్థమైందా భార్గవి అని గట్టిగా అరుస్తారు.
అలాగే నండి మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి... వాళ్ళ ముగ్గురిని సర్వెంట్ క్వార్టర్స్ కి పంపిస్తుంది.
బెంగళూరు....
అవని కాలేజ్ కి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి పర్మిషన్ అడుగుతుంది. రేపు నేను కాలేజ్ కి రాను మేం నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్తుంది.
ఏదైనా ఇంపార్టెంట్టా అవని అని అడిగితే.. చిన్న పని ఉంది మేమ్. ప్లీజ్ లీవ్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇట్స్ ఓకే అని లీవ్ ఇస్తారు.
థాంక్యూ మేం అని చెప్పి ఆరోజు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి విక్రమ్ కోసం చూస్తూ ఉంటుంది.
విక్రమ్ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. చెయ్యి ఎలా ఉందో ఏంటో.. పెయిన్ వస్తుందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.
నైట్ విక్రమ్ ఆఫీస్ నుంచి వచ్చేదాకా బయటికి లోపలికి, బయటికి తిరుగుతూనే ఉంటుంది. ఆఫీస్ నుంచి వచ్చిన విక్రమ్ ని చూసి స్పీడ్ గా ఎదురు వెళ్లి ఎందుకు ఈ రోజు మీకు ఇంత లేట్ అయింది అని అడుగుతుంది.
ఏమైంది అవని గారు అంత కంగారు పడుతున్నారు. ఏదైనా ప్రాబ్లమా అని ఏమీ తెలియనట్టుగానే అడుగుతాడు.
అలా ఏమీ లేదు జస్ట్ క్యాజువల్ గా అడిగాను అంతే అని. మీ చేయి ఎలా ఉంది.. నొప్పి తగ్గిందా అని అడుగుతుంది. పర్వాలేదు అని చెబుతాడు.
ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా అని అడుగుతుంది. ఎందుకు అడుగుతున్నారు అవిని అని అడిగితే.. అంటే మార్నింగ్ పెయిన్గా అండి బ్రేక్ఫాస్ట్ చేయలేక పోయారు కదా!
లంచ్ ఎలా చేశారు ఏంటి అని అడుగుతున్నాను అంతే అని చెబుతుంది. దానికి విక్రమ్ ఫేస్ డల్ గా పెట్టి ఏం చెప్తాం లేండి..
పెయిన్ గా ఉంది కదా స్పూన్ పట్టుకోలేకపోయాను ఇంకా లంచ్ చేయలేదు అని చెబుతాడు. ఆ మాటకే అవనికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
మీరు ఫ్రెష్ అవ్వండి నేను డిన్నర్ తీసుకువస్తాను అని చెప్పి విక్రమ్ పిలుస్తున్న వినిపించుకోకుండా గబగబా ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది.
విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ నీ మనసులో నా మీద ప్రేమ ఉంది నాకు ఏదైనా అవ్వితే తట్టుకోలేక పోతున్నావు కానీ నిజం ఇది అని మాత్రం చెబుతుల్లేదు.
నీకు దూరంగా ఉండడం మాత్రం చాలా కష్టంగా ఉంది అవని. అనుకుంటూ వెళ్లి ఫ్రెష్ అవుతాడు. ఈ లోపు శేషగిరి గారి నుంచి ఫోన్ వస్తుంది.
లిఫ్ట్ చేసి చెప్పండి తాతగారు అంటే.. జరిగింది మొత్తం చెబుతారు. గుడ్ ధనుంజయ గారికి కొంచమైనా నిజం తెలిసింది అని ఫోన్ పెట్టేసి అవని కోసం చూస్తూ ఉంటాడు.
ఈ లోపు అవినీ డిన్నర్ తీసుకుని అక్కడికి వస్తుంది. ప్లేట్ లో ఫుడ్ పెట్టి తినండి అని ఇస్తుంది. ఎలా తినేది.. పెయిన్ ఉంది కదా అని చేయి చూపిస్తాడు.
సరే నేను తినిపిస్తాను అని చెప్పి కలిపి తినిపిస్తుంది. విక్రమ్ నవ్వుకుంటూ అవిని తినిపిస్తుంటే ఫుల్ గా తినేస్తాడు.
అవని గారు మిమ్మలి ని ఒక్క విషయం అడగనా అని అంటాడు అడగండి అంటే.. మీకు నాకు మధ్యన ఏం రిలేషన్ ఉందని దెబ్బ తగిలిందని మీరు తినిపిస్తున్నారు అని అడుగుతాడు
దానికి అవని సమాధానం ఏమిటి??
కథ కొనసాగుతుంది..
The following 22 users Like SivaSai's post:22 users Like SivaSai's post
• ABC24, Arjun0410, ash.enigma, Babu143, Bhavabhuthi, coolguy, gora, Gurrala Rakesh, Jola, k3vv3, Luckky123@, Manmadhsbanam143, Mohana69, Nivas348, Pardhu7_secret, Raju1987, Sachin@10, Sun217, Sunny73, swapnika, The Prince, yekalavyass
Posts: 33
Threads: 0
Likes Received: 11 in 7 posts
Likes Given: 18
Joined: May 2021
Reputation:
0
కథ చాలా బాగుంది... రొమాంటిక్ లవ్ స్టోరీ... చదువుతుంటే మంచి ఫీల్ వస్తోంది... రచయితకు ఒక వందనం... కథనానికి వందకు వంద మార్కులు
|