Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
అత్త కూడా అమ్మ లాంటిదే
రచన: L. V. జయ
"అమ్మా, " నొప్పి భరించలేక అరిచింది లత. లతకి తొమ్మిది నెలలు నిండాయి. ఈ రోజో, రేపో డెలివరీ అన్నటుగా వుంది.
కూతురి అరుపు విన్న సౌభాగ్యమ్మ, మంచం మీద నుండి లేచి, కర్ర సాయంతో నడుస్తూ,
"జానకీ, మీ వదిన పిలుస్తోంది. చూడు ఒకసారి. " అంటూ కోడల్ని పిలిచారు. "ఆ అత్తా. వస్తున్నాను" అని వంటని మధ్యలోనే ఆపి, పరిగెత్తుకుంటూ వెళ్ళింది జానకి. జానకి, సౌభాగ్యమ్మ అన్న కూతురు. లత, జానకి ఒకే వయసు వాళ్ళు. చిన్నప్పటి నుండి స్నేహితులు.
"ఏమయ్యింది లతా? నొప్పులు వస్తున్నాయా?" అని అడిగింది జానకి, లతని.
"అవును. భరించలేకపోతున్నాను. " అంది లత.
"జానకీ, తొందరగా వెళ్లి, రిక్షా ని పిలువు. హాస్పటిల్ కి తీసుకుని వెళ్ళాలి ఇంక. " అన్నారు సౌభాగ్యమ్మ జానకి తో. రిక్షా ని పిలిచి, లతని రిక్షా ఎక్కించి, తానూ ఎక్కి కూర్చుంది జానకి.
సౌభాగ్యమ్మగారు జానకి తో, "జానకీ, లత తో నువ్వు ముందు వెళ్ళు. నేను వెనకాలే ఎవరినైనా పంపిస్తాను. లత ని జాగ్రత్తగా చూస్కో" అని చెప్పి, లత తో "లతా, జాగ్రత్త అమ్మా. దేవుడికి దణ్ణం పెట్టుకుని బయలుదేరు. పండంటి బిడ్డ తో రా" అని దీవించి పంపారు.
జానకి కి భయంగా వుంది. 'సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. అత్త బయటకి రాలేదు. ఇప్పుడు ఈ భాద్యత నాది. ఎలాగో ఏమిటో. దేవుడా, నీ మీదే వేస్తున్నాను ఈ భారమంతా ' అని మనసులోనే దేవుడికి దణ్ణం పెట్టుకుంది.
లత కి నొప్పులు ఎక్కువ అయ్యాయి. లత భాదని చూస్తూ, తట్టుకోలేక, "తొందరగా పోనియ్యి బాబూ హాస్పటిల్ కి. " అని కంగారు పెట్టింది జానకి రిక్షా లాగుతున్న అతన్ని.
హాస్పిటల్ కి చేరాక, నర్స్ వచ్చి చూసి "ఇంక డెలివరీ టైం దగ్గరపడింది" అని డెలివరీ రూమ్ కి తీసుకు వెళ్ళింది లత ని. వెనకనే వెళ్ళింది జానకి. ఇద్దరినీ ఒక చోట కూర్చోమని చెప్పి, అక్కడ వున్న నర్స్ తో, "తొందరగా బెడ్ రెడీ చెయ్యి. నేను ఇప్పుడే డాక్టర్ గారికి చెప్పి వస్తాను" అని చెప్పి వెళ్ళింది.
బెడ్ రెడీ చేసిన నర్స్, లత, జానకి మొహాల్లోని భయం చూసి, "డాక్టర్ గారు వేరే పేషెంట్ ని చూస్తున్నారు. ఇంక వచ్చేస్తారు, భయపడకండి" అని చెప్పి బయటకి వెళ్ళింది.
జానకి ని పట్టుకుని కూర్చుంది లత. నొప్పులు ఎక్కువ అయ్యి, లత కూర్చోలేకపోవడం చూసి, "డాక్టర్, నర్స్" అంటూ అరిచి పిలిచింది జానకి. ఎవరూ రాలేదు. బయటకి వచ్చి వెతికింది చూసింది ఎవరైనా కనపడతారేమో అని.
ఈలోగానే, "అమ్మా" అంటూ లత అరుపు వినపడి, పరిగెత్తుకుంటూ లోపలకి వచ్చి చూసింది జానకి. అప్పటికే ప్రసవం అయిపొయింది లత కి. ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో, రెండు చేతులతో బిడ్డని పట్టుకుంది జానకి. లత కళ్ళు తేలవేసింది. భయపడిపోయింది జానకి. "డాక్టర్, నర్స్, తొందరగా రండి. " అంటూ గట్టిగా అరిచింది జానకి.
కొంత సేపటికి వచ్చారు డాక్టర్, నర్సులు. "డాక్టర్, మా లత కళ్ళు తెరవటం లేదు. " అని ఏడుస్తూ చెప్పింది డాక్టర్ కి.
"ఏం పర్వాలేదు. భయపడద్దు. నేను చూస్తాను" అని జానకి కి చెప్పి, తల్లి ని, బిడ్డ ని చెక్ చేసారు డాక్టర్. "పాప, జ్వరం తో పుట్టింది. తగ్గిపోతుంది. పర్వాలేదు. తల్లి కొంచెం సేపట్లో లేస్తారు. భయపడద్దు" అని చెప్పి వెళ్లారు డాక్టర్.
కొంతసేపటి తరువాత కళ్ళు తెరిచి, కూతుర్ని దగ్గరికి తీసుకుంది లత. అందంగా, ముద్దుగా వున్న తన కూతుర్ని చూసి మురిసిపోయింది. అమ్మతనాన్ని మొదటి సారిగా అనుభవిస్తూ, ఆనందంతో కంట తడి పెట్టుకుంది లత. ఇదంతా చూస్తూ, జానకి చాలా మురిసిపోయింది.
నర్సులు వచ్చి అప్పటి వరకు జరిగిందంతా చెప్పారు లత కి. కృతజ్ఞతతో కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి లత కి. "ఒక దేవుతలా కనిపిస్తున్నావు జానకి నువ్వు నాకు" అంది జానకి చూస్తూ.
"మేము వచ్చేంత వరకు బిడ్డని చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు. మీకు ఎంత మంది పిల్లలు?" అని అడిగారు నర్సులు జానకి ని. ఇంకా ఎవరూ లేరని చెప్పడం తో ఆశ్చర్యపోయారు.
లత తన బిడ్డని చూసి నవ్వుతూ, " అత్త చేతిలో పుట్టేసావే నువ్వు. అత్తది చాలా మంచి మనసు. అత్త కూడా నీకు అమ్మా లాంటిదే. సరేనా" అని పాప నుదిటి మీద ముద్దు పెట్టింది.
జానకి కూడా చాలా సంతోషంగా బిడ్డని ఎత్తుకుని " నా బంగారు తల్లి" అంటూ మురిసిపోయింది.
***సమాప్తం***
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
శ్వేతపత్రం
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన
-పి. చంద్రశేఖర అజాద్
నిరంజన్ ముఖం సీరియస్‌గా వుంది. ఎదురుగా కూతురు రంజిత ఉంది. ఆమె తండ్రినే చూస్తోంది. అప్పటి దాకా ఆలోచిస్తున్న అతను రంజిత కళ్లల్లోకి సూటిగా చూస్తూ… ‘‘శ్రీరామ్‌ని నువ్వు ప్రేమించావన్నావు. మేం కలిసి బతకాలనుకుంటున్నాం అన్నావు. అతని గురించి నీకెంత వరకు తెలుసు అన్నాను. మేం డేటింగ్ చేశాము అన్నావు. మా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి తెలుసు అన్నావు. డేటింగ్‌తో పాటు సహజీవనం చేశావా? అని నిన్ను అడగలేదు. ఎందుకో తెలుసా?’’ రంజిత మాట్లాడకుండా చూస్తోంది.
‘‘చిన్నప్పటి నుంచి నీకు స్వేచ్ఛనిచ్చాను. నువ్వు అడిగింది ఏదీ కాదనలేదు. నా కూతురికి ఓ మంచి మిత్రుడిగా ఉండాలనుకున్నాను. కొన్ని విషయాల మీద నా అభిప్రాయాలు చెప్పాను తప్ప నా భావాలను ఎప్పుడూ నీ మీద రుద్దలేదు. ఎవరి జీవితాలను వారు దిద్దుకోవాలి. మనం అవసరం అనుకున్నప్పుడు ఓ సలహా ఇవ్వాలి. అంతేగాని ఎదుటివారి అభిరు చులను, అనుభవాలను, అవగాహనను తక్కువగా చూడకూడదు. మనం అంగీకరించినా, అంగీకరించక• పోయినా వారిని గౌరవించాలి అని నమ్మే నేను ఎప్పుడన్నా ఇలానే చేయమని నిన్ను శాసించానా?’’ అన్నాడు.
రంజితకు తన బాల్యం, యవ్వనం గుర్తు వచ్చింది.
ఠాగూర్ని చదివింది. శరత్ చంద్రుడ్ని చదివింది. అలాంటి స్త్రీ పాత్రలను ఊహించుకుంది. మైదానాల్లోకి పరుగులు తీసుకుంటూ పోయి, అక్కడి చెట్లు తలలూపి ఆహ్వానిస్తుంటే, తను వాటిని ఎక్కేది. కొమ్మల మధ్యకు చేరిపోయేది. చల్లటి గాలిని, ఆకాశంలో తేలిపోతున్న మబ్బుల్ని పలకరిస్తూ ఎందాకా మీ పయనం? మీ ఇల్లు ఎక్కడ? మీది ఏ దేశం? ఎప్పుడు వర్షిస్తారు? ఎప్పుడు తేలిపోతారు. కొన్ని నెలలూ, సంవత్సరాలు మీరు ఎందుకురారు? మీకు పిల్లలు ఉంటారా? మళ్లీ మళ్ళీ మీరు పుడుతుంటారా? పువ్వుల్లా కొన్ని గంటలు, కొన్ని రోజులు మాత్రమే అలరించి అంతరిస్తుంటారా?
ఇవే ప్రశ్నలు నిరంజన్‌ని అడుగుతుంటే హాయిగా నవ్వేవాడు.
‘‘తల్లీ… నేను కూడా చిన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడిని. గాలిలో, నీడలో, వానలో, చలిలో, ఎండలో మొత్తంగా ప్రకృతిలో నాకు స్త్రీ మూర్తులే కనిపిస్తున్నారు. నేను మగవాడిని అయినందుకా? ఆడపిల్లలు కూడా అంతేనా? ప్రకృతిలో పురుషుడ్ని చూసుకుంటారా? వెన్నెల్లో ఆడుకునే మగపిల్లల్ని ఊహించుకుంటారా అనిపించేది.’’
‘‘మీరు ఏ ఆడపిల్లలనూ ఈ ప్రశ్నలు అడగలేదా?’’
‘‘లేదు. బిడియం. అది జయించటానికి చాలా సంవత్సరాలు, దశాబ్దాలు పట్టాయి. ఎవరి ప్రశ్నలకు వారు సమాధానాలు వెతుక్కోవడంలో ఆనందం ఉంటుంది రంజితా!’’
అదో ఫేజ్. తర్వాత రంజని చదివే పుస్తకాలు మారాయి. చదువుల కోసం అమ్మానాన్నలకు దూరంగా రకరకాల నగరాలు వెళ్లింది. అప్పటి వరకూ ఉన్న తన భావాలు వేగంగా మారుతూ వచ్చాయి.
‘‘నువ్వు సైలెంట్‌గా ఉంటే కాదు. మాట్లాడు’’ అన్నాడు నిరంజన్.
ఉలిక్కిపడింది.
‘‘లేదు’’ అంది.
‘‘శ్రీరామ్తోనీ పెళ్లిని నేను కాదన లేదు. మీ అమ్మకు అసంతృప్తి ఉన్నా నీ సంతోషాన్ని కాదనటం ఎందుకని సరిపెట్టుకుంది. మీ పెళ్లి జరిగి ఎన్ని నెలలు అయింది. ఇప్పుడు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు?’’
‘‘శ్రీరామ్‌తో నేను కొన్ని విషయాల్లో డిఫర్ అవుతున్నాను.’’
‘‘నాతో, మీ అమ్మతో నూరుశాతం ఏకీభవిస్తు న్నావా? అందుకని మాతో కూడా విడిపోదలుచు కున్నావా? అమ్మానాన్నల బంధాన్ని తెంచేసు కుంటున్నావా?’’
నిశ్శబ్దం.
‘‘అవున్లే. ఆడపిల్లలకు పెళ్లి అయ్యేంత వరకు మాత్రమే కదా పుట్టింటితో అనుబంధం. ఆ రోజు నిన్ను అడిగాను. శ్రీరామ్ గురించి నీకు ఎంత వరకు తెలుసు అన్నాను. ఇద్దరికీ ఒకరి గురించి ఇంకొకరికి తెలుసు అన్నావు. ఇదేనా తెలియటం. నువ్వు కూడా వయసు తాలూకు మోహానికి లోనయ్యావా?’’
‘‘నాన్నా… నేను పొరపాటుపడ్డాను అని తెలిసి నప్పుడు ఆ బంధాన్ని కొనసాగించాలా?’’
‘‘అవసరం లేదు. నువ్వు పొరపాటు అనుకున్నది పొరపాటేనా! అనేది కూడా తెలియాలి.
ఇంకా ఈ విషయం గురించి నేను మాట్లాడను. మేం కూడా పొరపాటు పడ్డాం. మా అమ్మాయితో మేం పరిమితులకు మించి ప్రవర్తించాం. అది కేవలం ఆదర్శం అనుకున్నాం. ఇప్పటి నుండి నీ జీవితం నీది. నీ నిర్ణయాలు నీవి. మనం లా ప్రకారంగా విడిపోకపోవచ్చు. బంధం పరంగా విడిపోతున్నాం. చివరిసారిగా చెబుతున్నాను. నీకు మేం జన్మనిచ్చాం. కొంతవరకు నీ బాగోగులు చూశాం. ఇప్పుడు నువ్వు సర్వస్వతంత్రురాలివి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకు సంతోషం ఇవ్వాలి. అప్పుడు ఈ ప్రపంచాని పట్టించుకోనవసరం లేదు.’’
రంజిత తండ్రికేసి కొద్ది క్షణాలు చూసి అతని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు అతని భార్య వసుంధర అతని దగ్గరకు వచ్చింది.
‘‘మొదటి నుంచి మనం ఇలా ఉంటే బాగుండేదా?’’ అంది మెల్లగా.
‘‘ప్రతి అయిదు సంవత్సరాలకూ కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి వసూ… ప్రతి పదానికి, ప్రతి ఆచారానికీ, పద్ధతికీ అర్థాలు మారుతున్నాయి. ఇవన్నీ వ్యక్తులకు చెందినవి. వారి పరిణతిని బట్టి నిర్ణయాలు ఉంటాయి. అవి వారి బతుకుల్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పటి వరకు రంజిత మన కూతురు. ఇప్పుడు అలాంటి తరంలో ప్రయోగం చేస్తున్న ఓ అమ్మాయి’’ అన్నాడు.
* * *
సరిత రంజితను కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఆహ్వానించింది.
‘‘ఏంటోయ్… సూట్ కేసుతో వచ్చేశావు. డివోర్స్ అయ్యేంత వరకు కూడా శ్రీరామ్‌తో కలిసి ఉండలేక పోయావా’’ అంది.
‘‘అవి రావటానికి సమయం పడుతుంది. అయినా ఓసారి మనం కాదనుకున్నాక అయిదు నిమిషాలు కూడా అయిదు యుగాల్లా అనిపిస్తాయి.’’
‘‘అవును రంజితా! అయినా అత్తవారింటికి కాకపోతే అమ్మ వారింటికి దారి ఉంది కదా! అందు లోనూ మీ నాన్న పోగ్రెసివ్ కదా!’’
‘‘ఛాదస్తంలోనా! ఎంత బాగా కబుర్లు చెప్పే వారయినా ఆడవాళ్ల విషయంలో ఇలానే వుంటారు. శ్రీరామ్‌ని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అన్నారు. ప్రేమ చచ్చేంత వరకూ ఉండాలని వారు అనుకుంటారు. ప్రేమ వేరు. డిఫరెన్సెస్ వేరు అనుకోరు. అయినా నేను ఎవరి మీదా ఆధారపడి బతకటం లేదు కదా!’’
‘‘అవును. మగవాళ్లలోనే కాదు. ఆడవారిలోనూ ఇలాంటి వారున్నారు. ఇప్పుడు మనం అలాంటి ఓ మహిళను కలుస్తున్నాం. ఆమె పేరు శ్వేతాదేవి. వయసు తొంభై సంవత్సరాలు. మాకు దూరపు బంధువు.’’
‘‘అవసరమా వారిని కలవటం?’’
‘‘నాకూ ఇంట్లో సమస్యలు ఉన్నాయి రంజితా. మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. మా అమ్మ ఓసారి ‘ఆమెని కలువు. తర్వాత నువ్వు విడిగా ఉంటావో, ఏం చేస్తావో నీ ఇష్టం అంది’. ఆమె గురించి వినటం తప్ప నేను ఇంత వరకు కలవలేదు. క్లాసులు వాళ్లే కాదు. మనమూ తీసుకోవాలి’’ అంది సరిత.
* * *
ఇద్దరూ శ్వేతాదేవిని కలిశారు. రంజితకు ఆమెను చూడగానే టైటానిక్ సినిమా హీరోయిన్ గుర్తు వచ్చింది. సినిమా ప్రారంభంలో, ముగింపులో అత్యంత వృద్ధురాలిగా కనిపిస్తుంది. ఆమె ముఖంలో అన్నీ ముడతలుంటాయి. అయినా ఓ అందం. అక్కడ నుండి దర్శకుడు ప్రేక్షకుల చేతిని అందుకుని ఓ మహాస్వప్న లోకంలోకి తీసుకు వెళ్తాడు. అప్పుడు యవ్వనంలో ఉన్న కథానాయికను పరిచయం చేస్తాడు.
శ్వేతాదేవి ముఖంలో అలాంటి ముడతలు లేవు. ఆమె దేహచ్ఛాయను చూసి ఆ పేరు పెట్టారా అనిపించింది. ఆమెలో అలనాటి నటీమణులు వైజయంతిమాల, నర్గీస్, పద్మిని, సావిత్రి ఇంకా ఎందరెందరో కనిపిస్తున్నారు. ఆమె కంఠస్వరంలో లతా మంగేష్కర్ వినిపించింది.
రంజిత రవివర్మ బొమ్మలను చిన్నప్పుడు చూసింది. అప్పటి భావోద్వేగాలు గుర్తులేవు. ఆ బొమ్మల్లో ఏదో దివ్యత్వం ఉంది. అర్థం కాకపోయినా! ఆమె ఇంటిని చూశారు. గోడల మీద చిత్రాలు చూస్తుంటే నాలుగయిదు తరాల చరిత్రను చూస్తున్నట్లు ఉంది. ఎంత వద్దనుకున్నా రంజితకు ఒకప్పటి బ్రిటిష్ యువరాణి ‘డయానా’ గుర్తు వచ్చింది.
ఆమెతో పాటు పెద్ద కుటుంబం ఉంటుందను కున్నారు. ఓ సహాయకురాలు ఉంది. తను ఒంటరిగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అంటే ఈమె వెనుకాల ఏదో కథ ఉంది. సరిత అమ్మ ఇక్కడికి పంపటం వెనుక ఈ విషాదాన్ని చూస్తే నీకు కొన్ని విషయాలు అర్థం అవుతాయి అనుకునుంటుంది.
ఇంటి ముందు అందమైన తోట ఉంది. ముగ్గురూ నడుస్తున్నారు. అక్కడ ఎన్నెన్నో రకాల పూలమొక్కలు. అప్పుడే వికశిస్తున్నవి, రాలిపోతున్నవి. రాలి పోయినవి. రంగులు మారుతున్న ఆకులు. మొక్కలు, చెట్లు రాలిన వాటిని చూసి కన్నీరు పెడుతున్నాయా అనిపిస్తోంది. అక్కడున్న కుర్చీల్లో కూర్చొన్నారు.
‘‘మీరు ఒంటరిగా ఉంటున్నారు. ఇది మీకు…’’ అంటుంటే,
‘‘నేనే కాదు. మనుషులందరూ ఒంటరిగానే వస్తారు. ఒక్కోసారి కవలలు, ఇంకొంతమంది. ఒకరి తర్వాత ఒకరు వస్తారు. అలాగే ముందుగానో, వెనకాలో అందరూ వెళ్లిపోతారు. ఇది సహజం. సమూహంలో ఉన్నా ఒంటరితనంలో మనుషుల మనసులు వుంటాయి.’’
‘‘ఇది మనుషుల జీవితంలో విషాదం అంటారా?’’
‘‘ఎందుకు అనాలి! మొదట్లో ఓ స్త్రీ-ఓ పురుషుడు, ప్రకృతి మాత్రమేగా. అసలు ప్రకృతి ఉన్నంత కాలం ఎవరయినా ఒంటరివారెలా అవుతారు. బతకటం ఓ కళ. కలిసి బతకటం, ఒంటరిగా ఉండటమూ అంతే. అందుకే అనేక మంది పది మందితో ఉన్నా, ఒక్కరే ఉన్నా విషాదంతో ఉంటారు. అయినా నన్ను చూడటానికి నాలుగు తరాల వారు వస్తుంటారు. మీ గురించి చెప్పండి’’ అంది శ్వేతాదేవి.
ఇద్దరూ తమ భర్తలతో గల విభేదాల గురించి చెప్పారు. అప్పుడు నవ్వింది. ‘‘ఎందుకు నవ్వు తున్నారు’’ అన్నారిద్దరు.
‘‘ఇవన్నీ ఇప్పుడు మీ ఇద్దరే అనుభవిస్తున్నారా?’’
‘‘నిన్నటి తరాలు వేరు బామ్మగారూ… వారు బానిసలుగా బతికారు. రాజీ పడి బతికారు. వారు స్వేచ్ఛ గురించి ఆలోచించలేదు. అలా పుట్టి, ఏ మాత్రం గుర్తింపు లేకుండా, ఏ మాత్రం స్వతంత్రత లేకుండా కాలగర్భంలో కలిసిపోయారు.’’
‘‘స్వేచ్ఛ అంటే ఏమిటి?’’ అందామె సూటిగా.
‘‘మీరు రాజీపడటం లేదా? మీరు ఎవరికీ బానిసలు కాదా? ప్రేమ గురించి మీ అభిప్రాయాలు ఏమిటి? మీ చిన్న అనుభవంతో మీరు పరిపూర్ణత సాధించాం అనుకుంటున్నారా?’’ అని ఆగింది.
‘‘ఏ సంఘర్షణా లేకపోతే అది కుటుంబం ఎలా అవుతుంది? మనుషులంతా ఒకే రకంగా ఉండరు. ఒకే రకంగా ఆలోచించరు. పాతతరం వారిని బానిసలు అంటున్నారు. స్వేచ్ఛ, బానిసత్వాలకు కూడా లెక్కలున్నాయి. అప్పట్లో కుటుంబాల కోసం వారు రాజీపడకపోతే ఈ సమాజం ఇలా ఉండేదా? మీరు కేవలం పురుష అహంకారం గురించే మాట్లాడ తారా? అహంకారం స్త్రీలలో లేదా? మీరు కుటుం బాన్ని, మీరు పని చేస్తున్న సంస్థలని విడిగా ఎందుకు చూస్తున్నారు. కేవలం స్త్రీలు మాత్రమే యజమానులుగా ఉన్నా ఇవే పరిస్థితులు’’ అంది.
సహాయకురాలు జ్యూస్‌లు తీసుకుని వచ్చింది.
శ్వేతాదేవి అమ్మా నాన్నల గురించి, తన అన్న దమ్ముల గురించి, అక్కా చెల్లెళ్ల గురించి, అత్తవారింటి గురించి, తర్వాత తరాల గురించి చెప్పింది. నేను చిన్న చిన్న విషయాలకు ఇలా ఆలోచించుకుంటూ బయటకు పోవాలనుకుంటే ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవాలి. ఎంతమందితో సహ జీవనం చేయాలో అంటూ నవ్వింది.
‘‘అంటే అసలు ఏ పోరాటాలు వద్దు అంటారు. ఈ రోజుల్లో అది కుదురుతుందా?’’ అంది సరిత.
‘‘నేను వద్దు అనటం లేదు. గత కాలం వారు ఏ పోరాటాలూ చేయకుండానే ఇన్ని ఆలోచనలు వచ్చాయా? ఇన్ని మార్పులు వచ్చాయా? పోరాటాలు కుటుంబాల్లోనేనా? వ్యక్తుల మధ్యనేనా? చివరికి ప్రకృతితో మనం అనుభూతి చెందుతూనే మనకు తగిన రీతిలో మార్చుకుంటున్నాం. వద్దన్నా ఏ పోరాటం ఆగదు తల్లులూ… నేను నచ్చనివారు చాలా మందున్నారు. నా కుటుంబంలో అనేక రకాల వారున్నారు. అందరికీ ఒకటే చెబుతాను. మీ పోరాటాలు మీవి మాత్రం కాదు. పక్కవారితో ముడిపడుంటాయి. ఇప్పుడు మీ ఇద్దరూ మీ భర్తలతో విడిపోవాలనుకుంటున్నారు. మంచిదే. సర్దుకుపోయే దారులు మూసుకుపోతే ఎవరూ కలిసి ఉండరు. చివరిగా ఓ విషయం చెబుతాను. ప్రపంచమంతా అంగీకరించేది అంటూ ఏదీ వుండదు. మీకు తృప్తి కలిగించే నిర్ణయాలు తీసుకోండి.’’
* * *
సరిత, రంజితలు గదిలో వున్నారు.
‘‘ప్రేమంటే ఏమిటి? స్వేచ్ఛ అంటే ఏమిటి? ఇవన్నీ ఎందుకు?’’ అంది సరిత.
‘‘అన్వేషిద్దాం.’’ ‘‘ఒంటరిగానా? సామాజికం గానా? కుటుంబ పరంగానా?’’
‘‘ఆలోచిద్దాం. శ్వేతాదేవి గారు చెప్పారు కదా. ఇక్కడ కంప్లీట్ మాన్లూ, ఉమన్లూ ఉండరని. అదే నిజం అనిపిస్తోంది. ఇప్పుడు అమ్మా నాన్నలను చూడాలి. తర్వాత శ్రీరామ్ దగ్గరకు వెళ్తాను. మనసు విప్పి మాట్లాడతాను.’’
‘మీటూ’ అంటూ, ‘మా వారితో మరోసారి శ్వేతాదేవి గారిని కలుస్తాను’ అంది సరిత.
-----జాగృతి వారపత్రికలో కథ
•
Posts: 61
Threads: 0
Likes Received: 23 in 17 posts
Likes Given: 35
Joined: May 2019
Reputation:
2
Bro.. Vasantotsavam update pettu bro..
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
that thread author has to approve my request
else it will be intrusion, I dont want to do that
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
సుజన ధైర్యం
రచన: నీరజ హరి ప్రభల
“అమ్మా! నా కాలేజి బస్సుకు టైమవుతోంది. బాక్స్ రెడీనా!” అడిగింది సుజన తన తల్లిని.
“ ఇదిగో బాక్స్. వచ్చి తీసుకో. ఈ పాలు త్రాగి వెళ్లు” వంటింట్లో నుంచి పెద్దగా కేకేసింది వైదేహి.
“సరే!” అని వంటింట్లోకి వెళ్లి పాలుత్రాగి బాక్స్ ని తీసుకుని హడావిడిగా బస్సు కోసం పరిగెత్తింది సుజన.
తనువెళ్లినవైపే చూస్తూండిపోయిన వైదేహికి కూతురి గురించిన ఆలోచనలు చుట్టుముట్టాయి.
చిన్నప్పటి నుంచి సుజన చాలా ఉత్సాహంగా గెంతులువేస్తూ ఎంతో సంతోషంగా ఉండేది. తను ఎక్కడ ఉంటే అక్కడ సందడి నెలకొనేది. గలగలలాడే సుజన కబుర్లు వింటుంటే తనకు, తన భర్త ఆనంద్ కు చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఒక్కగానొక్క కూతురు సుజనని కంటికి రెప్పలాగా చూసుకుంటూ, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు వైదేహి దంపతులు.
సుజన చక్కగా పెరుగుతూ తన ముద్దు ముచ్చట్లు, ఆటపాటలతో అందరినీ చక్కగా అలరించేది. పెద్ద కంపెనీలో ఇంజనీరుగా పనిచేసే ఆనంద్ తనకు పెద్దలిచ్చిన ఇంట్లో భార్య వైదేహి, కూతురు సుజనతో చాలా సంతోషంగా ఉంటున్నారు. చిన్నదైన కుటుంబం, చింతలేని కుటుంబం అని వైదేహి మనసులో ఎప్పుడూ అనుకుని సంతోషపడుతూ ఉండేది. కాలక్రమేణా సుజన చక్కగా పెరుగుతూ కాలేజీలో చేరింది. చక్కగా చదువుతూ ఉండే సుజన అంటే తోటి విద్యార్థులకు, టీచర్లకు చాలా ఇష్టం. కాలేజీలో ఆటపాటలు, వక్తృత్వం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో సుజనే ముందంజలో ఉండి ప్రధమ బహుమతులను గెల్చుకునేది.
వారాంతంలో సుజనని తీసుకుని సినిమాలు, రెస్టారెంట్ లలో హాయిగా గడిపి ఇంటికి వచ్చేవాళ్లు ఆనంద్ దంపతులు. కాలం సాఫీగా గడిచిపోతోంది. సుజన పదవ తరగతి చదువుతుండగా ఒక సంఘటన జరిగింది. ఒక రోజు సుజన కాలేజీ నుంచి ఇంటికి వచ్చి ఏడుస్తూ తల్లిని హత్తుకుంది. వైదేహి ఏం జరిగిందో అని చాలా భయపడిపోయి కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని అనునయించింది.
సుజన కాసేపు స్ధిమితపడ్డాక “అమ్మా ! ఈరోజు క్లాసులో మా వెంకట్ మాస్టారు చాలా వెకిలిగా ప్రవర్తించారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. తన క్లాసు అయిపోతుండగానే “సుజనా ! నిన్నటి పాఠంలో నీకు ఏదో సందేహం ఉందన్నావు కదా! క్లాసు అయిపోయినాక ఉండు. నీకు సమాధానాలు చెపుతాను “ అన్నారు క్లాసులో అందరిముందూ.
నాకు చాలా ఆశ్చర్యం వేసి లేచి నుంచుని “నేను అడగలేదు మాస్టారు. నాకే సందేహాలు లేవు” అన్నాను.
“అప్పుడే నీవు మర్చిపోతే ఎలా ? గుర్తుపెట్టుకోవాలి.” అన్నారు ఆయన.
క్లాసు అవగానే నేను, నా స్నేహితురాలు నందిని కలిసి బయటికి వెళ్లబోతుండగా ఆయన నందినితో “నందినీ! నీవు వెళ్లి పో! సుజనకి పాఠంలో ఏవో సందేహాలున్నాయంది. అవి చెపుతాను” అనగానే నందిని వెళ్లిపోయింది.
మాస్టారు నా దగ్గరికి వచ్చి నా మీద చెయ్యి వేసి నా భుజాలు గట్టిగా పట్టుకున్నారు. నాకు చాలా భయం వేసి ఆయన్ని గట్టిగా విదిలించుకొని లాగి ఆయన చెంప ఛెళ్లుమనిపించి బయటికి పరుగులు తీశాను. నేనలా చేస్తానని ఆయన ఊహించి ఉండరు. ఆయన నన్ను వెంబడించారు. నేను వేగంగా పరిగెత్తి బయటికి రాగా, అదృష్టవశాత్తూ సమీపంలోనే మా కాలేజీ బస్సు ఉంది. ఆయాసపడుతూ అందులోకి ఎక్కి కూర్చొని ఇంటికి వచ్చాను. నేనింక ఆ కాలేజీకు వెళ్లనమ్మా!. ఆయన్ని చూస్తే నాకు చాలా భయం వేస్తోంది”. అంది వెక్కివెక్కి ఏడుస్తూ సుజన.
కూతురి పరిస్ధితి వైదేహికి అర్ధమైంది. తమ కాలంలో ఉపాధ్యాయులు ఎంత చక్కగా విలువలతో కూడిన విద్యని బోధిస్తూ, నీతి - నిజాయితీలను బోధిస్తూ తమకు పాఠాలను చెప్పేవారు. చక్కటి క్రమశిక్షణను నేర్పి తండ్రి లాగా భయభక్తులను అలవాటు చేసేవారు.
“గురుర్బ్రహ్మః, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ” అని ప్రతిరోజూ విద్యార్థులందరిచేత ప్రార్ధన చేయించి క్లాసు మొదలుపెట్టేవారు. గురుపూజోత్సవం రోజున మేము ఇప్పటికీ ఆ గురువులను కలుసుకుని పాదాభివందనం చేసొస్తాము.ఇప్పటికీ వాళ్లు పితృ వాత్సల్యంతో మమ్మల్ని ఆదరిస్తున్నారే!. సుజనకి ఇదేంటి ఈ విపత్కర పరిస్థితి? కలికాలం కాకపోతేను? అనుకుంది మనసులో వైదేహి.
ముందు తను అననుయంగా కూతురికి ధైర్యం చెప్పి ఆమెని ఓదార్చాలని నిర్ణయించుకుంది.
“చూడు సుజనా! ముందు నీవు ఏడుపాపి నేను చెప్పేది శ్రధ్ధగా విను. ” అని తన పైట చెంగుతో కూతురి కళ్లు తుడిచింది.
“ సుజనా! మనం ఏడిస్తే చూసి సంతోషించేవాళ్లే ఎక్కువ ఈ సమాజంలో. మా కాలం వేరు. మీ కాలం వేరు. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి. మా కాలంలో ఆడపిలలకు బేలతనం, అమాయకత్వం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీరు అలాకాదు. ఎప్పుడూ ధైర్యం నీ వెన్నంటే ఉండాలి. కడదాకా నీవు మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఎవరినీ నమ్మకూడదు. నీ జాగ్రత్తలో నీవుండాలి. ఆయనొక చీడపురుగు అనుకుని జరిగింది మర్చిపో. ఇలాంటి చీడపురుగులు ప్రతిచోటా మనకు తారసపడుతూనే ఉంటారు.
ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారనుకొని భ్రమపడద్దు. మనల్ని మనమే రక్షించుకోవాలి. ధైర్యమే నీ ఆయుధం. నీవు ధైర్యంగా ప్రతిఘటించి ఆయన చెంప ఛెళ్లుమనిపించి తగిన బుధ్ధి చెప్పావు. నాన్న రాగానే ఆయనకు చెప్పి మనం మంచి నిర్ణయం తీసుకుందాము. మనం రేపు ఆ కాలేజీకు వెళ్లి హెడ్మాస్టారుకు జరిగింది చెప్పి ఆ మాస్టార్ని ఉద్యోగం లోంచి తీసేయమని హెచ్చరిద్దాము.
దీనికి మిగిలిన పిల్లలు, వాళ్ల తల్లి తండ్రుల మద్దత్తుని కూడ గట్టుకుందాము. భవిష్యత్తులో ఇంక ఏ మాస్టార్లు నీచంగా ప్రవర్తించకుండా మనం బుధ్ధి చెపుదాం. నీవు నీ గదిలోకి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకో. నేను వేడివేడిగా పాలు తీసుకొస్తా. త్రాగి హాయిగా పడుకో. ఏదీ గుర్తుచేసుకోవద్దు.” అని కూతురికి ముద్దిచ్చింది వైదేహి.
సుజన తన గదిలోకి వెళ్లింది. కాసేపటికి వైదేహి తెచ్చిన వేడిపాలను త్రాగి పడుకుంది సుజన.
తర్వాత ఎప్పటిలానే ఆఫీసునుంచి వచ్చిన భర్తకు వేడిగా కాఫీ ఇచ్చి ఆయన కాసేపు సేద తీరాక సుజనకు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది వైదేహి. అంతా విన్న ఆనంద్ కోపోద్రిక్తుడై “నేను ఇప్పుడే వెళ్లి వాడి పని చెపుతాను. వాడింటి అడ్రసు తెలుసుకోవడం కష్టమేంకాదు. హెడ్మాస్టారు నడిగితే చెబుతారు. వాడికి జీవితంలో బుద్ది వచ్చేట్టు చేస్తాను “ అంటూ ఇంతెత్తున ఆవేశంగా లేచాడు.
“ముందు మీరు కోపాన్ని నిగ్రహించుకుని శాంతంగా ఉండండి. కోపం కాదు ఇప్పుడు కావలసింది ఆలోచన. ముందు మీరు సుజన వద్దకెళ్లి తనకు ధైర్యం చెప్పి అనునయించండి. రేపు మనం కాలేజీకు వెళ్లి హెడ్మాస్టారిని కలిసి ఆ నీచుడి విషయాన్ని చెప్పి వాడి ఉద్యోగం పీకేయమని హెచ్చరిద్దాం. అందుకు అవసరమైతే మనం మిగిలిన విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల మద్దతు తీసుకుందాం “ అంది వైదేహి.
“సరే!” అని ఆనంద్ సుజన గదిలోకి వెళ్లాడు. అప్పుడే నిద్రలేచిన సుజన తండ్రిని చూసి హత్తుకుని బావురుమంది. ఆనంద్ కూతురి కన్నీళ్లను తుడిచి “ చూడు సుజనా! నీకేం కాలేదు. ఇకముందు కూడా ఏంకాదు. ధైర్యంగా ఉండు. ఆ నీచుడి చెంప ఛెళ్లుమనిపించి మంచి పని చేశావు. ఎప్పుడూ మేమంతా నీకు అండగా ఉంటాం. అమ్మ నీకు అంతా చెప్పే ఉంటుంది కదా! మనం రేపే మీ కాలేజీకు వెళ్లి ఆ నీచుడికి తగిన గుణపాఠం చెబుదాం” అన్నాడు ఆనంద్.
“కమాన్ బేబీ! ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్లి వచ్చేదారిలో మంచి రెస్టారెంట్ కెళ్లొద్దాం. పది నిమిషాలలో రెడీ అవ్వాలి. ఏదీ నవ్వు” అని అన్నతండ్రి మాటలకు జతకలుపుతూ కిలకిలా నవ్వింది సుజన.
కాసేపటికి ముగ్గురూ సరదాగా సినిమా చూసి, మంచి రెస్టారెంట్ లో విందు చేసి ఇంటికొచ్చి విశ్రమించారు.
మరునాడు ఆనంద్ దంపతులు సుజనతో వాళ్ల కాలేజీకు వెళ్లారు. అక్కడి హెడ్మాస్టరి ఆఫీసుకు కు వెళ్లి నిన్న జరిగిందంతా వివరించి ఆ మాస్టర్ ని పిలవమన్నాడు ఆనంద్. ఆయన వెంకట్ మాస్టర్ ని పిలిచాడు. వెంకట్ వీళ్లను చూడగానే భయంతో వణికిపోయాడు. కోపం పట్టలేక పోయిన ఆనంద్ ఆ నీచుడి చెంప ఛెళ్లుమనిపించాడు. హెడ్మాస్టారు ఆనంద్ ని వారించి కూర్చోబెట్టి సముదాయించాడు.
హెడ్మాస్టారు వెంకట్ ని నిలదీశారు. జరిగింది ఒప్పుకుని క్షమించమని హెడ్మాస్టారు కాళ్లు పట్టుకున్నాడు. ఆనంద్ కాళ్లు పట్టుకుని “నాకు భార్యా, పిల్లలు ఉన్నారు. ఈ విషయం ఎక్కడా చెప్పద్దు. నేనీ రోజే నా ఉద్యోగానికి రాజీనామా చేసి వేరే ఊరికెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ నా భార్యాబిడ్డలతో బ్రతుకుతాను. ఇంకెప్పుడూ ఎవరితోను అమర్యాదగా ప్రవర్తించను. దయచేసి సెక్యూరిటీ ఆఫీసర్లు, కేసులు పెట్టద్దు. నా బ్రతుకు రోడ్డు పాలవుతుంది. నన్ను క్షమించండి. సుజనా! నన్ను క్షమించమ్మా “ అన్నాడు వెంకట్.
వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ కాగితాన్ని హెడ్మాస్టారుకి అందించాడు వెంకట్. వెంకట్ భార్యాబిడ్డలను దృష్టిలో ఉంచుకుని దయార్ధ హృదయులై పెద్దమనసుతో అతడిని క్షమించి వదిలేశారు ఆనంద్ దంపతులు.
ముఖాన నెత్తురు చుక్క లేనట్లుగా తల వంచుకుని వెంకట్ వెళ్లిపోయాడు.
హెడ్మాస్టారు ఆనంద్ దంపతులకు క్షమాపణ చెప్పారు. “జరిగింది నాకు చాలా బాధగా ఉంది. ఇకమీదట పిల్లలకు ఏం జరుగకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. అమ్మా! సుజనా! నీవు ఇదేమీ మనసులో పెట్టుకోకుండా హాయిగా చదువుకో. మంచి మార్కులు తెచ్చుకుని మన కాలేజ్ ఫస్టు రావాలి. సరేనా!” అన్నారు హెడ్మాస్టారు.
ఆయన వద్ద శెలవు తీసుకుని ఆనంద్ దంపతులు, సుజన తమ ఇంటికి వచ్చారు. అన్నట్లుగానే వెంకట్ తన భార్యాబిడ్డలతో వేరే ఊరు వెళ్లి అక్కడ మరో కాలేజీలో బుధ్ధిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు.
కాలం గడిచిపోతోంది. సుజన కష్టపడి చదివి మంచి మార్కులతో పాసయి కాలేజ్ ఫస్ట్. వచ్చింది. ఆనంద్ దంపతుల ఆనందానికి అవధులు లేవు. హెడ్మాస్టారు తమ కాలేజీలో అభినందన సభని ఏర్పాటు చేసి సుజనని ఘనంగా అభినందించారు.
సుజన కాలేజీలో చేరి చక్కగా చదువుకుంటూ స్కాలర్షిప్ ని కూడా తెచ్చుకుంటోంది. సుజనని చూసి ఆనంద్ దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఏదో చప్పుడైతే కూతురి గురించిన ఆలోచనలనుంచి తెప్పరిల్లి మరలా మిగిలిన పనిలో పడింది వైదేహి.
సమాప్తం.
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
తిక్క తీరిందా.. తింగరోడా!
నల్లబాటిరాఘవేంద్రరావు
భలేభలేరావు ఆ టౌన్లో రోడ్డుమీద పరుగు పెడుతున్నాడు. పరుగు పెట్టలేక అతనికి ఆయాసం వస్తుంది. దారిలో కనిపించిన తన మిత్రుడు అప్పారావుని సైకిల్ అడగాలని ఆపుచేసి కాళ్లు పట్టుకోవడానికి అహం అడ్డువచ్చి చేతులు పట్టుకొని బ్రతిమలాడినప్పటికీ అతను సైకిల్ ఇవ్వకపోగా అతని దగ్గర సైకిల్ బలవంతంగా లాక్కొని చాలా వేగంగా తొక్కుతున్నాడు భలేభలేరావు.
రిక్షాలో వెళుతున్న ఆ అమ్మాయిని రక్షించాలి. ఆమెతో పాటు ఆమె కట్టుకున్న బంగారపురంగు శారీని కూడా రక్షించాలి. జరగబోయే ప్రమాదం తప్పించాలి. ప్రతి సంవత్సరం ఆ టౌన్లో ఉన్న "సాహసం సేయరా డింభకా" అనే స్వచ్ఛంద సేవాసంస్థ సాహసాలు ప్రదర్శించిన యువకులకు 'సాహసయువత' అవార్డుతో పాటు లక్ష రూపాయలు బహుమతి ఇస్తుంటారు. అదిగో అది పట్టేయాలని భలేభలేరావు ప్రయత్నం అన్నమాట. రెండు సంవత్సరాల నుండి అదీ అతని తపన.
ఆ టౌన్లో చాలామందికి అతని గురించి తెలుసు కనుక భలేభలేరావు రోడ్డుమీద ఎన్ని సాహస ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా వాళ్లెవరూ అంతగా పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఎవరు తనను పట్టించుకోకపోయినా తను మాత్రం వాళ్ళందరినీ పట్టించుకుంటూనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆరు నెలల క్రితం వాటర్ ట్యాంకు పైకి ఎక్కేసిన అబ్బాయి క్రిందకు దూకేయకుండా రక్షించాలని జేబులో ఉన్న బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకుని గబగబా 500 మెట్లు ఉన్న వాటర్ ట్యాంకు చాలా కష్టపడి, ప్రయాసపడి ఎక్కాడు. తీరా పైకి ఎక్కాక అతను వాటర్ ట్యాంకు రిపేరు చేస్తున్న అబ్బాయి అని తెలుసుకుని నీరసపడిపోయాడు.
'''అయ్యో నీకేం కష్టాలు లేవా? దూకడానికి ప్రయత్నించడం లేదా? కిందపడి చావాలని నిర్ణయించుకో లేదా? అట్టాకాదు కానీ.. గతంలో సమస్యలు ఏమైనా ఉన్నాయేమో గుర్తుకు తెచ్చుకుని కొంచెం ప్రయత్నించవయ్యా బాబు." అంటూ క్రిందకు వంగి ఆ అబ్బాయి కాళ్లు పట్టుకుని బ్రతిమలాడి అడిగేశాడు.
'అసలు వీడు ఎవడ్రా బాబు.' అన్నట్టు పిచ్చివాడిని చూసినట్టు చూశాడు ఆ ట్యాంకు రిపేరు చేసే అబ్బాయి భలేభలేరావు వైపు.
"ఇదిగో అబ్బాయి నువ్వెవరో నాకు తెలియదు తెలియవలసిన అవసరం కూడా లేదు. అలాగే నేనెవరో నీకు తెలియదు నీకు తెలియవలసిన అవసరం కూడా నీకు అసలు లేదు. ఏతావాతా.. కత్తిపీట కందదుంప.. కరివేపాకు కాకరకాయ.. ఈ చెత్తాచెదారం మాటలు మనకెందుకు కానీ నేను చెప్పినట్టు ఇప్పుడు నువ్వు చేశావ్ అనుకో ఫిఫ్టీ ఫిఫ్టీ" అన్నాడు భలేభలేరావు.
''ఇదేదో బాగుందండి. ఎవరైనా మిమ్మల్ని చితకగొడితే అందులోనూ కూడా నాకు ఫిఫ్టీ ఫిఫ్టీయా?'' ఓ తలతిక్క ఫోజుతో అడిగాడు ఆ అబ్బాయి
''ఈ శుభసమయంలో కామెడీ వద్దు గానీ ఇదిగో నిజంగా చావవద్దు కానీ నువ్వు పైనుంచి దూకేస్తున్నట్టు నటించు. నేను నిన్ను రక్షిస్తానన్నమాట. అవార్డు రివార్డు ఇద్దరం చెరి సగం.''\n\n
''అదా విషయం. కూసంత అర్థమైందండి ఇప్పుడు.\n\nఈ టౌన్లో అందరూ విచిత్రంగా చెప్పుకునేది మీ గురించే అన్నమాట. ఒకవేళ మీ ప్రయత్నం మిస్ అయి నేను కిందపడి రెండు కాళ్లు విరిగిపోతే అప్పుడు మీది ఒక కాలు నేను ఇరగగొట్టవచ్చా? ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు కదా." గుర్రం ఇకిలించినట్టు ఇకిలిస్తూ అడిగాడు ఆ అబ్బాయి.
''అదెలా కుదురుద్ది. ఇదిగో నా మీద నమ్మకం లేకపోతే ముందు బయనాగా ఈ ఐదు రూపాయలు ఉంచు. నేను చెప్పినట్టు చెయ్యి.'' బ్రతిమలాడాడు భలేభలేరావు ఆ అబ్బాయిని.
ఆ అబ్బాయి ఒప్పుకోకపోవడంతో కోపం వచ్చి ఆ అబ్బాయి వీపు మీద రెండు పెసరట్లు వేసి పరిగెత్తుకొని వాటర్ ట్యాంకు మెట్లు క్రిందకు దిగుతూ దిగుతూ కాలు జారిపడ్డాడు. రెండు కుట్లు పడ్డాయి.
గతం గతః
మూడు నెలల క్రితం ఒక పాత పెంకుటిల్లుకి నిప్పు అంటుకుంటే అందులో ఉన్న వాళ్ళని రక్షించి బయటకు తీసుకురావాలని జనం అందరూ చూస్తుండగా ధైర్యసాహసాలతో లోపలకు ప్రవేశించాడు. కాలిపోతున్న గదులు అన్ని తిరిగి తిరిగి చూశాడు. ఎవరైనా తన సాహస కార్యక్రమం బయటనుండి సెల్ కెమెరాలో వీడియో తీస్తున్నారేమోనని దాన్ని పేపరు వార్తల్లో, టీవీలో ఉపయోగించుకోవచ్చునని కిటికీలోంచి తొంగి తొంగి చూశాడు. అబ్బేఅబ్బే ఆ ప్రయత్నం ఆవకాయ బద్ద అంత కూడా జరగడం లేదని గ్రహించాడు భలేభలేరావు.
అది పక్కన పెడితే అసలు బూడిదగుమ్మడికాయలో బూడిద లేనట్లు, దానిమ్మపండులో నిమ్మకాయ లేనట్లు, వెంకటేశ్వరుడిలో ఈశ్వరుడు లేనట్లు ఆ ఇంట్లో మనుషులే కాదు పిచ్చుకలు, బల్లులు, తేళ్లు, జెర్రులు కూడా లేవు. అందులో ఎవరూ కాపురం ఉండడం లేదని తెలుసుకుని ఒళ్ళంతా కాల్చుకొని బయటకు వచ్చాడు. ఎవరు కూడా అయ్యోపాపం అని అనలేదు కానీ పకపక, కిలకిల, గలగల నవ్వుకుంటూ వెళ్లిపోయారు తనను చూసి. హాస్పిటల్ ఖర్చు ఆరువేలుతో ఆ కథ పరిసమాప్తం అయింది.
ఈ గతం కూడా గతః
అయితే ఈరోజు ఈసారి మాత్రం తను చేసేది రాంగ్ ప్రయత్నం కాదు అని భలేభలేరావు నిశ్చయించుకుని తన ముందు తనకు కొంచెం దూరంలో రిక్షా ద్వారా జరగబోయే అతిపెద్ద ప్రమాదం, భయంకరమైన పెను ప్రమాదాన్నించి అందులో ప్రయాణిస్తున్న యువతిని రక్షించి రేపటి వార్తల్లో తను సాహస యువకుడిగా గుర్తింపు పొందెయ్యాలనేది భలేభలేరావు ప్రస్తుత సాహసప్రయత్నం.
సరే అప్రస్తుతంలో నుండి ప్రస్తుతంలోకి వచ్చేసాం కదా. ఇక ఇప్పుడు కథ మొదలవుతుంది అన్నమాట.
ఈరోజు ఐదు నిమిషాల ముందు ఆ టౌన్లో పాన్ షాప్ దగ్గర భలేభలేరావు నిలబడినప్పుడు.. ఎర్రచీర కట్టుకున్న ఆ అందమైన అమ్మాయి రిక్షాలో కూర్చుని వెళ్లడం చూశాడు భలేభలేరావు. కానీ ఆమె కట్టుకున్న చీర పైటచెంగు రిక్షా పక్కకు పడిపోయి రిక్షా చక్రంలో చుట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు పాపం ఆ అందమైన అమ్మాయి గుర్తించడం లేదు అన్న విషయం గుర్తించాడు భలేభలేరావు.
ఆ టౌన్ నిండా ఆటోలు బోల్డన్ని. ఆటోలో వెళ్లవచ్చు కదా ఆ అందమైన అమ్మాయి. ఈ రిక్షాలో వెళ్లడం దేనికి అని అతను ఏ మాత్రం అనుకోలేదు.. భలేభలే చౌక బేరం.. అనుకుంటూ క్రిందకు జారుతున్న తన ప్యాంటు గబగబా పైకి లాక్కొని జరగబోయే ప్రమాదం ఊహించి భలేభలేరావు కంగారుపడి ఆమెను రక్షించాలని రిక్షా వెనుక చాలాదూరం పరుగు పెట్టి ఇక పరుగుపెట్టలేక దారిలో తన మిత్రుడు అప్పారావు దగ్గర సైకిల్ బ్రతిమలాడి లాక్కొని ఇప్పుడు ఆ రిక్షాను సమీపించడానికి సైకిల్ వేగంగా తొక్కుతున్నాడన్నమాట. అయినా అందుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ రిక్షావాలా చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు.
''అమ్మో.. ఆ అందమైన అమ్మాయి ఎర్రచీర పైటచెంగు రిక్షాచక్రంలో అలా అలా గుండ్రంగా చుట్టుకుపోతే.. ఆమె క్రిందకు పడిపోతే.. ఇలా ఎన్నిచోట్ల జరగలేదు. ఆ తర్వాత ఆమె మీద రిక్షా పడిపోతే.. ఆ రిక్షా వెనుక వేగంగా వస్తున్న మోటార్ సైకిలిస్ట్‌లు వీళ్ళ మీద పడిపోతే.. ఆ వెనక మహావేగంగా వస్తున్న సిటీబస్సు వీళ్ళ అందరి మీదనుండి వెళ్ళిపోతే అమ్మో.. వామ్మో.. ఐబాబోయ్.. ప్రళయ భయంకర బీభత్సం! జరగబోయే ఆ జుగుప్సాకరకరకరమైన ప్రమాదం తను ఆపగలిగితే చాలు తన జన్మ ధన్యం.'' అనుకుంటున్నాడు మనసులో భలేభలేరావు. అందుకనే కసికసిగా తను సైకిల్ తొక్కుతున్నాడు ఆ రిక్షాను ఆపాలని.
ఎలాగైతేనే తన గుర్రం గెలిచింది. రిక్షా కన్నా తన సైకిల్ ముందుకు వెళ్ళింది. వెంటనే భలేభలేరావు సైకిల్ క్రిందకి దిగి దాన్ని రోడ్డు పక్కకు తోసేసి చేతులు అడ్డుపెట్టి రిక్షాను ఆపుచేశాడు. పరుగున రిక్షా దగ్గరగా సమీపించి అతి కష్టం మీద చక్రంలో పడడానికి సిద్ధంగా ఉన్న ఆ అందమైన అమ్మాయి ఎర్రచీర పైటచెంగును ఒడిసి పట్టుకొని రిక్షాలో కూర్చున్న ఆమె వైపు విజయగర్వంతో చూస్తూ.. ''మేడం ప్రమాదం తప్పింది. మీరు ఏ మాత్రం భయపడకండి. ఈ భలేభలేరావు మీకు అండగా ఉన్నాడు. ఇదిగో మీ ఎర్రచీర పైటచెంగు చక్రంలో పడకుండా తప్పించాను'' అంటూ ఆమెకు అందించాడు.
అప్పటికే బిలబిలమంటూ వందలాది జనం, వాహనాలు తిరునాళ్లతీర్థంలా ఆ చుట్టూ మూగిపోయాయి.
భలేభలేరావు మహా ఆనందంగా ప్రజలు అందరి వైపు తిరిగి గాలిలో చెయ్యి పైకి ఎత్తి సాహస యువకుడిగా విజయచిహ్నం చూపించాడు అందరికీ.
మరుక్షణం.. ఆ అమ్మాయి రిక్షా నుండి వేగంగా క్రిందకు దిగి భలేభలేరావు చెంపలు పగులకొట్టింది. అతని రెండు చెంపలు ఎర్రగా కమిలిపోయాయి.
సెల్ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది ఆ అమ్మాయి.
దగ్గరలో ఉన్న ఆ టౌన్ అధ్యక్షురాలు ఆండాళమ్మ గారు గబగబా మరో 10 మందితో అక్కడ ప్రవేశించింది.
"ఒక అందమైన అమ్మాయి ఎర్రచీర, ఒక పరాయి మగవాడు పట్టుకుని లాగడమా? హిస్సి.. ఇది సెక్యూరిటీ అధికారి స్టేషన్లోనూ, కోర్టులోనూ తేల్చుకోవలసిన సమస్య కాదు. ఈ క్షణమే ఇదే జనం ముందు దీని రిజల్ట్ తేలిపోవాలి." అనుకుని వచ్చిన మహిళామణులు అందరూ కలిసి భలేభలేరావు భరతం పట్టేసారు.
"అది కాదు మేడం గారు.. రిక్షా చక్రంలో ఆ అమ్మాయి ఎర్రచీర... " అంటూ తన సాహస ప్రయత్నం చెప్పడానికి ఆవగింజంత అవకాశం కూడా లేకుండా పోయింది భలేభలేరావుకు. చుట్టూ చూశాడు. ఒకటి కాదు రెండు కాదు వందలాది సెల్ కెమెరాలు తననే గురిపెట్టి చూస్తున్నాయి... భలే మంచి చౌకబేరము అన్నట్టుగా. కలలో కూడా పగవాడికి కూడా ఇటువంటి అవమాన భారం జరగకూడదు దేవుడా అనుకుంటూ క్లోజప్ ఫోటో కోసం అడిగిన వాళ్లకు కూడా అవకాశం ఇచ్చాడు భలేభలేరావు.. తప్పించుకోలేని తప్పని పరిస్థితులలో.
ఆ అమ్మాయి తనకోసం వచ్చిన మహిళామణులందరికీ అభినందనలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి
హగ్ చేసుకుని, ముద్దాడింది. ఆమె కోసం వచ్చిన మహిళామణులు కళకళ తళతళ మిలమిల మెరిసిపోతూ గుంపుగా వెళ్లిపోయారు
ఆ అమ్మాయి మళ్ళీ రిక్షా ఎక్కి యధావిధిగా తన పైటచెంగును రిక్షాచక్రంలో పడేటట్టుగా అలా అలా జారవదిలింది. రిక్షా రివ్వున ముందుకు దూసుకుపోయింది.
భలేభలేరావుని తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు పళ్ళు ఎదుటివారికి కనపడకుండా తమలో తామే నవ్వేసుకుంటూ.. కనీసం అతడిని పైకి లెగదీసే ప్రయత్నం కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారు.
''మోటార్ బండి మీద కూర్చున్నప్పుడు అలా పైటచెంగు గాలిలో ఎగిరేలా వదిలేయడం.. రిక్షాలో ప్రయాణిస్తున్నప్పుడు పైటచెంగు రిక్షాచక్రంలో పడేటట్టుగా అలా అలా జారవదలడం.. అందమైన కొందరు అమ్మాయిలకు ఇప్పుడు అదో ట్రెండు, ఫ్యాషన్!...
అనవసరంగా ఆ మేడం గారి చేత చెంపలు వాయగొట్టించుకున్నాడు గురుడు.'' అంటూ ఒకరు.
''మొత్తానికి ఈ శతాబ్దంలో గొప్ప అత్యద్భుత హాస్య సంఘటన ఇదే అనుకుంటాను గురు." అనుకుంటూ మరొకరు.
''రేపటి యూట్యూబ్ షార్ట్‌కి భలే ఐటమ్ దొరికింది.'' అనుకుంటూ ఇంకొకరు.
అలా అలా వెకిలిగా నవ్వుకుంటూ వెళ్తున్న జనం మాటలు భలేభలేరావు రెండు చెవి కర్ణభేరీలలో.. భేరీనాట్యం చేస్తున్నాయి.
**
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
మతిమరుపు మాధవయ్య - అన్నీ మర్చిపోతేనే అదృష్టం
**రచన: వస కన్న (Vasa Kanna)**
**పరిచయం:**
మాధవయ్య అనే ఒక మధ్యతరగతి వ్యక్తికి ఉన్న ఒకే ఒక వీక్నెస్ 'మతిమరుపు'. అది ఏ రేంజ్లో ఉంటుందంటే, తను స్నానం చేసి వచ్చాక కూడా "నేను స్నానం చేశానా లేదా?" అని డౌట్ వచ్చి, తల తడి చూసుకుని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఒకసారి అయితే తన పాత స్నేహితుడు కనిపిస్తే, పేరు గుర్తురాక "నువ్వు ఎవరివో నాకు గుర్తులేదు కానీ, ఆరోజు నువ్వు తిన్న ఐస్‌క్రీమ్ డబ్బులు నేనే కట్టాను కదా!" అని అడిగాడు. ఇలాంటి మతిమరుపు వల్ల మాధవయ్య జీవితం చాలా గందరగోళంగా ఉండేది. కానీ, ఆ వింత అలవాటే అతన్ని కోటీశ్వరుడిని చేస్తుందని ఎవరూ ఊహించలేదు.
### **సీన్ 1: ఇంటర్వ్యూలో వింత మలుపు**
మాధవయ్య చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు ఒక మల్టీనేషనల్ కంపెనీలో అకౌంటెంట్ ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. కరెక్ట్‌గా ఆఫీస్ టైమ్‌కి బయల్దేరాడు కానీ, మధ్యలో బస్సు దిగగానే అసలు ఏ కంపెనీకి వెళ్లాలో, ఆ అడ్రస్ ఏంటో మర్చిపోయాడు. తన చేతిలో ఉన్న ఫైల్ చూసుకుందాం అంటే, అది ఇంట్లోనే మర్చిపోయి వచ్చాడు.
దిక్కుతోచక దారిలో ఉన్న ఒక పెద్దాయనను అడిగాడు, "అయ్యా! ఇక్కడ ఒక పెద్దాయన ఇంటర్వ్యూ చేస్తా అన్నారు, అది ఎక్కడో మీకు తెలుసా?" అని. ఆ పెద్దాయన నవ్వి, "రా బాబు, నేను అక్కడికే వెళ్తున్నాను" అని తన లగ్జరీ కార్లో ఎక్కించుకున్నాడు. ఆఫీస్ వెళ్ళాక తెలిసింది, ఆయన ఆ కంపెనీ ఓనర్ అని! ఇంటర్వ్యూలో మాధవయ్యని ఒక ప్రశ్న అడిగారు—"నీ బలహీనత ఏంటి?". మాధవయ్య నిజాయితీగా, "సార్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో కూడా మర్చిపోతాను, కానీ ఏ పని చేసినా చాలా పద్ధతిగా చేస్తాను" అన్నాడు. ఆ ఓనర్ ముచ్చటపడి, "నీకు అబద్ధం ఆడటం అసలు రాదు, నీలాంటి వాడే మాకు కావాలి" అని వెంటనే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేశాడు.
### **సీన్ 2: పాస్వర్డ్ సెక్యూరిటీ - హ్యాకర్లకే చుక్కలు!**
ఉద్యోగంలో చేరాక మాధవయ్య తన కంప్యూటర్ పాస్‌వర్డ్‌ని రోజుకోసారి మారుస్తుండేవాడు. మార్చిన మరుక్షణమే మర్చిపోయేవాడు. ఒకసారి కంపెనీ మీద పెద్ద సైబర్ దాడి జరిగింది. ప్రొఫెషనల్ హ్యాకర్లు కంపెనీ సర్వర్లన్నీ హ్యాక్ చేశారు కానీ, మాధవయ్య సిస్టమ్ దగ్గర ఆగిపోయారు. వాడు పెట్టిన పాస్వర్డ్ ఏంటో వాడికే తెలియదు, ఇక హ్యాకర్లకి ఎలా తెలుస్తుంది?
"వరుసగా మూడు సార్లు తప్పు పాస్వర్డ్ కొట్టడం వల్ల" సిస్టమ్ లాక్ అయిపోయి, అందులో ఉన్న కోట్లాది రూపాయల 'గోప్యమైన డేటా' హ్యాకర్ల చేతికి చిక్కకుండా సేఫ్ అయిపోయింది. ఆ కంపెనీకి జరగాల్సిన 100 కోట్ల నష్టం తప్పింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ షాక్ అయ్యి, "నీ సెక్యూరిటీ ఐడియా అద్భుతం!" అని మాధవయ్యకి 25 లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించారు. మాధవయ్య మాత్రం మనసులో "పాస్వర్డ్ ఏంటో గుర్తురాక నేను పడ్డ తిప్పలు నాకు తెలుసు" అని నవ్వుకున్నాడు.
### **సీన్ 3: పెళ్లి రోజు - అపార్థం నుంచి అదృష్టం వైపు!**
జనవరి 29.. మాధవయ్య పెళ్లి రోజు. భార్య పార్వతి ఉదయం నుంచి రకరకాల హింట్స్ ఇస్తోంది. "ఈరోజు నా కోరిక తీరుస్తారా?" అని అడిగితే, మాధవయ్య మర్చిపోయి "రేపు చేద్దాంలే" అన్నాడు. పార్వతి కోపంతో ఊగిపోయింది. ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు, ఏ గిఫ్ట్ కొనాలో గుర్తురాక ఒక లాటరీ షాప్ ముందు ఆగాడు. ఎవరో చెబితే ఒక టికెట్ కొని, దాన్ని ఒక పూల బొకేలో పెట్టి భార్యకి ఇచ్చాడు.
ఆ మరుసటి రోజు ఉదయం టీవీలో వార్తలు వస్తున్నాయి. మాధవయ్య కొన్న లాటరీ టికెట్‌కి ఏకంగా 10 కోట్ల రూపాయల బంపర్ ప్రైజ్ తగిలింది! పార్వతి ఆనందంతో గెంతుతూ, "మీకు నా మీద ఎంత ప్రేమో! పెళ్లి రోజుకి ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు!" అని మురిసిపోయింది. మాధవయ్యకి అప్పుడు గుర్తుకొచ్చింది—అసలు ఆరోజు తన పెళ్లి రోజని! ఆ ఒక్క మతిమరుపు అతన్ని రాత్రికి రాత్రే ఊహించని ధనవంతుడిని చేసింది.
### **సీన్ 4: స్థలాల కొనుగోలు - పొరపాటులో లాభం!**
ఒకసారి మాధవయ్య ఒక ఇంటి స్థలం కొందామని వెళ్లి, అడ్రస్ మర్చిపోయి ఊరి చివరన ఉన్న ఒక బీడు భూమికి అడ్వాన్స్ ఇచ్చేశాడు. అందరూ "అక్కడ నీళ్లు రావు, అడవి అది, ఎందుకు కొన్నావు?" అని వెక్కిరించారు. కానీ సరిగ్గా రెండు నెలల తర్వాత, గవర్నమెంట్ ఆ బీడు భూమి మధ్యలోనే ఒక పెద్ద నేషనల్ హైవే మరియు ఎయిర్పోర్ట్ కడతామని ప్రకటించింది. ఆ భూమి రేటు రాత్రికి రాత్రే వంద రెట్లు పెరిగింది!
**ముగింపు:**
ఈరోజు మాధవయ్య ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యానికి అధిపతి. ఇప్పుడు వాడు ఏది మర్చిపోయినా, అది ఒక కొత్త వ్యాపారానికి దారి తీస్తోంది. జనం ఇప్పుడు మతిమరుపుని ఒక లోపంగా చూడటం మానేశారు. "మాధవయ్యలా అన్నీ మర్చిపోతేనే అదృష్టం తలుపు తడుతుంది" అని అందరూ అనుకుంటున్నారు.
**నీతి:** కొన్నిసార్లు మన బలహీనతలే మన విజయానికి పునాదులు వేస్తాయి, అయితే ఆ మతిమరుపులో కూడా ఒక స్వచ్ఛమైన మనసు ఉండాలి!
---
**ముగిసింది.
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
సుజన ధైర్యం
రచన: నీరజ హరి ప్రభల
“అమ్మా! నా కాలేజి బస్సుకు టైమవుతోంది. బాక్స్ రెడీనా!” అడిగింది సుజన తన తల్లిని.
“ ఇదిగో బాక్స్. వచ్చి తీసుకో. ఈ పాలు త్రాగి వెళ్లు” వంటింట్లో నుంచి పెద్దగా కేకేసింది వైదేహి.
“సరే!” అని వంటింట్లోకి వెళ్లి పాలుత్రాగి బాక్స్ ని తీసుకుని హడావిడిగా బస్సు కోసం పరిగెత్తింది సుజన.
తనువెళ్లినవైపే చూస్తూండిపోయిన వైదేహికి కూతురి గురించిన ఆలోచనలు చుట్టుముట్టాయి.
చిన్నప్పటి నుంచి సుజన చాలా ఉత్సాహంగా గెంతులువేస్తూ ఎంతో సంతోషంగా ఉండేది. తను ఎక్కడ ఉంటే అక్కడ సందడి నెలకొనేది. గలగలలాడే సుజన కబుర్లు వింటుంటే తనకు, తన భర్త ఆనంద్ కు చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఒక్కగానొక్క కూతురు సుజనని కంటికి రెప్పలాగా చూసుకుంటూ, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు వైదేహి దంపతులు.
సుజన చక్కగా పెరుగుతూ తన ముద్దు ముచ్చట్లు, ఆటపాటలతో అందరినీ చక్కగా అలరించేది. పెద్ద కంపెనీలో ఇంజనీరుగా పనిచేసే ఆనంద్ తనకు పెద్దలిచ్చిన ఇంట్లో భార్య వైదేహి, కూతురు సుజనతో చాలా సంతోషంగా ఉంటున్నారు. చిన్నదైన కుటుంబం, చింతలేని కుటుంబం అని వైదేహి మనసులో ఎప్పుడూ అనుకుని సంతోషపడుతూ ఉండేది. కాలక్రమేణా సుజన చక్కగా పెరుగుతూ కాలేజీలో చేరింది. చక్కగా చదువుతూ ఉండే సుజన అంటే తోటి విద్యార్థులకు, టీచర్లకు చాలా ఇష్టం. కాలేజీలో ఆటపాటలు, వక్తృత్వం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో సుజనే ముందంజలో ఉండి ప్రధమ బహుమతులను గెల్చుకునేది.
వారాంతంలో సుజనని తీసుకుని సినిమాలు, రెస్టారెంట్ లలో హాయిగా గడిపి ఇంటికి వచ్చేవాళ్లు ఆనంద్ దంపతులు. కాలం సాఫీగా గడిచిపోతోంది. సుజన పదవ తరగతి చదువుతుండగా ఒక సంఘటన జరిగింది. ఒక రోజు సుజన కాలేజీ నుంచి ఇంటికి వచ్చి ఏడుస్తూ తల్లిని హత్తుకుంది. వైదేహి ఏం జరిగిందో అని చాలా భయపడిపోయి కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని అనునయించింది.
సుజన కాసేపు స్ధిమితపడ్డాక “అమ్మా ! ఈరోజు క్లాసులో మా వెంకట్ మాస్టారు చాలా వెకిలిగా ప్రవర్తించారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. తన క్లాసు అయిపోతుండగానే “సుజనా ! నిన్నటి పాఠంలో నీకు ఏదో సందేహం ఉందన్నావు కదా! క్లాసు అయిపోయినాక ఉండు. నీకు సమాధానాలు చెపుతాను “ అన్నారు క్లాసులో అందరిముందూ.
నాకు చాలా ఆశ్చర్యం వేసి లేచి నుంచుని “నేను అడగలేదు మాస్టారు. నాకే సందేహాలు లేవు” అన్నాను.
“అప్పుడే నీవు మర్చిపోతే ఎలా ? గుర్తుపెట్టుకోవాలి.” అన్నారు ఆయన.
క్లాసు అవగానే నేను, నా స్నేహితురాలు నందిని కలిసి బయటికి వెళ్లబోతుండగా ఆయన నందినితో “నందినీ! నీవు వెళ్లి పో! సుజనకి పాఠంలో ఏవో సందేహాలున్నాయంది. అవి చెపుతాను” అనగానే నందిని వెళ్లిపోయింది.
మాస్టారు నా దగ్గరికి వచ్చి నా మీద చెయ్యి వేసి నా భుజాలు గట్టిగా పట్టుకున్నారు. నాకు చాలా భయం వేసి ఆయన్ని గట్టిగా విదిలించుకొని లాగి ఆయన చెంప ఛెళ్లుమనిపించి బయటికి పరుగులు తీశాను. నేనలా చేస్తానని ఆయన ఊహించి ఉండరు. ఆయన నన్ను వెంబడించారు. నేను వేగంగా పరిగెత్తి బయటికి రాగా, అదృష్టవశాత్తూ సమీపంలోనే మా కాలేజీ బస్సు ఉంది. ఆయాసపడుతూ అందులోకి ఎక్కి కూర్చొని ఇంటికి వచ్చాను. నేనింక ఆ కాలేజీకు వెళ్లనమ్మా!. ఆయన్ని చూస్తే నాకు చాలా భయం వేస్తోంది”. అంది వెక్కివెక్కి ఏడుస్తూ సుజన.
కూతురి పరిస్ధితి వైదేహికి అర్ధమైంది. తమ కాలంలో ఉపాధ్యాయులు ఎంత చక్కగా విలువలతో కూడిన విద్యని బోధిస్తూ, నీతి - నిజాయితీలను బోధిస్తూ తమకు పాఠాలను చెప్పేవారు. చక్కటి క్రమశిక్షణను నేర్పి తండ్రి లాగా భయభక్తులను అలవాటు చేసేవారు.
“గురుర్బ్రహ్మః, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ” అని ప్రతిరోజూ విద్యార్థులందరిచేత ప్రార్ధన చేయించి క్లాసు మొదలుపెట్టేవారు. గురుపూజోత్సవం రోజున మేము ఇప్పటికీ ఆ గురువులను కలుసుకుని పాదాభివందనం చేసొస్తాము.ఇప్పటికీ వాళ్లు పితృ వాత్సల్యంతో మమ్మల్ని ఆదరిస్తున్నారే!. సుజనకి ఇదేంటి ఈ విపత్కర పరిస్థితి? కలికాలం కాకపోతేను? అనుకుంది మనసులో వైదేహి.
ముందు తను అననుయంగా కూతురికి ధైర్యం చెప్పి ఆమెని ఓదార్చాలని నిర్ణయించుకుంది.
“చూడు సుజనా! ముందు నీవు ఏడుపాపి నేను చెప్పేది శ్రధ్ధగా విను. ” అని తన పైట చెంగుతో కూతురి కళ్లు తుడిచింది.
“ సుజనా! మనం ఏడిస్తే చూసి సంతోషించేవాళ్లే ఎక్కువ ఈ సమాజంలో. మా కాలం వేరు. మీ కాలం వేరు. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి. మా కాలంలో ఆడపిలలకు బేలతనం, అమాయకత్వం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీరు అలాకాదు. ఎప్పుడూ ధైర్యం నీ వెన్నంటే ఉండాలి. కడదాకా నీవు మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఎవరినీ నమ్మకూడదు. నీ జాగ్రత్తలో నీవుండాలి. ఆయనొక చీడపురుగు అనుకుని జరిగింది మర్చిపో. ఇలాంటి చీడపురుగులు ప్రతిచోటా మనకు తారసపడుతూనే ఉంటారు.
ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారనుకొని భ్రమపడద్దు. మనల్ని మనమే రక్షించుకోవాలి. ధైర్యమే నీ ఆయుధం. నీవు ధైర్యంగా ప్రతిఘటించి ఆయన చెంప ఛెళ్లుమనిపించి తగిన బుధ్ధి చెప్పావు. నాన్న రాగానే ఆయనకు చెప్పి మనం మంచి నిర్ణయం తీసుకుందాము. మనం రేపు ఆ కాలేజీకు వెళ్లి హెడ్మాస్టారుకు జరిగింది చెప్పి ఆ మాస్టార్ని ఉద్యోగం లోంచి తీసేయమని హెచ్చరిద్దాము.
దీనికి మిగిలిన పిల్లలు, వాళ్ల తల్లి తండ్రుల మద్దత్తుని కూడ గట్టుకుందాము. భవిష్యత్తులో ఇంక ఏ మాస్టార్లు నీచంగా ప్రవర్తించకుండా మనం బుధ్ధి చెపుదాం. నీవు నీ గదిలోకి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకో. నేను వేడివేడిగా పాలు తీసుకొస్తా. త్రాగి హాయిగా పడుకో. ఏదీ గుర్తుచేసుకోవద్దు.” అని కూతురికి ముద్దిచ్చింది వైదేహి.
సుజన తన గదిలోకి వెళ్లింది. కాసేపటికి వైదేహి తెచ్చిన వేడిపాలను త్రాగి పడుకుంది సుజన.
తర్వాత ఎప్పటిలానే ఆఫీసునుంచి వచ్చిన భర్తకు వేడిగా కాఫీ ఇచ్చి ఆయన కాసేపు సేద తీరాక సుజనకు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది వైదేహి. అంతా విన్న ఆనంద్ కోపోద్రిక్తుడై “నేను ఇప్పుడే వెళ్లి వాడి పని చెపుతాను. వాడింటి అడ్రసు తెలుసుకోవడం కష్టమేంకాదు. హెడ్మాస్టారు నడిగితే చెబుతారు. వాడికి జీవితంలో బుద్ది వచ్చేట్టు చేస్తాను “ అంటూ ఇంతెత్తున ఆవేశంగా లేచాడు.
“ముందు మీరు కోపాన్ని నిగ్రహించుకుని శాంతంగా ఉండండి. కోపం కాదు ఇప్పుడు కావలసింది ఆలోచన. ముందు మీరు సుజన వద్దకెళ్లి తనకు ధైర్యం చెప్పి అనునయించండి. రేపు మనం కాలేజీకు వెళ్లి హెడ్మాస్టారిని కలిసి ఆ నీచుడి విషయాన్ని చెప్పి వాడి ఉద్యోగం పీకేయమని హెచ్చరిద్దాం. అందుకు అవసరమైతే మనం మిగిలిన విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల మద్దతు తీసుకుందాం “ అంది వైదేహి.
“సరే!” అని ఆనంద్ సుజన గదిలోకి వెళ్లాడు. అప్పుడే నిద్రలేచిన సుజన తండ్రిని చూసి హత్తుకుని బావురుమంది. ఆనంద్ కూతురి కన్నీళ్లను తుడిచి “ చూడు సుజనా! నీకేం కాలేదు. ఇకముందు కూడా ఏంకాదు. ధైర్యంగా ఉండు. ఆ నీచుడి చెంప ఛెళ్లుమనిపించి మంచి పని చేశావు. ఎప్పుడూ మేమంతా నీకు అండగా ఉంటాం. అమ్మ నీకు అంతా చెప్పే ఉంటుంది కదా! మనం రేపే మీ కాలేజీకు వెళ్లి ఆ నీచుడికి తగిన గుణపాఠం చెబుదాం” అన్నాడు ఆనంద్.
“కమాన్ బేబీ! ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్లి వచ్చేదారిలో మంచి రెస్టారెంట్ కెళ్లొద్దాం. పది నిమిషాలలో రెడీ అవ్వాలి. ఏదీ నవ్వు” అని అన్నతండ్రి మాటలకు జతకలుపుతూ కిలకిలా నవ్వింది సుజన.
కాసేపటికి ముగ్గురూ సరదాగా సినిమా చూసి, మంచి రెస్టారెంట్ లో విందు చేసి ఇంటికొచ్చి విశ్రమించారు.
మరునాడు ఆనంద్ దంపతులు సుజనతో వాళ్ల కాలేజీకు వెళ్లారు. అక్కడి హెడ్మాస్టరి ఆఫీసుకు కు వెళ్లి నిన్న జరిగిందంతా వివరించి ఆ మాస్టర్ ని పిలవమన్నాడు ఆనంద్. ఆయన వెంకట్ మాస్టర్ ని పిలిచాడు. వెంకట్ వీళ్లను చూడగానే భయంతో వణికిపోయాడు. కోపం పట్టలేక పోయిన ఆనంద్ ఆ నీచుడి చెంప ఛెళ్లుమనిపించాడు. హెడ్మాస్టారు ఆనంద్ ని వారించి కూర్చోబెట్టి సముదాయించాడు.
హెడ్మాస్టారు వెంకట్ ని నిలదీశారు. జరిగింది ఒప్పుకుని క్షమించమని హెడ్మాస్టారు కాళ్లు పట్టుకున్నాడు. ఆనంద్ కాళ్లు పట్టుకుని “నాకు భార్యా, పిల్లలు ఉన్నారు. ఈ విషయం ఎక్కడా చెప్పద్దు. నేనీ రోజే నా ఉద్యోగానికి రాజీనామా చేసి వేరే ఊరికెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ నా భార్యాబిడ్డలతో బ్రతుకుతాను. ఇంకెప్పుడూ ఎవరితోను అమర్యాదగా ప్రవర్తించను. దయచేసి సెక్యూరిటీ ఆఫీసర్లు, కేసులు పెట్టద్దు. నా బ్రతుకు రోడ్డు పాలవుతుంది. నన్ను క్షమించండి. సుజనా! నన్ను క్షమించమ్మా “ అన్నాడు వెంకట్.
వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ కాగితాన్ని హెడ్మాస్టారుకి అందించాడు వెంకట్. వెంకట్ భార్యాబిడ్డలను దృష్టిలో ఉంచుకుని దయార్ధ హృదయులై పెద్దమనసుతో అతడిని క్షమించి వదిలేశారు ఆనంద్ దంపతులు.
ముఖాన నెత్తురు చుక్క లేనట్లుగా తల వంచుకుని వెంకట్ వెళ్లిపోయాడు.
హెడ్మాస్టారు ఆనంద్ దంపతులకు క్షమాపణ చెప్పారు. “జరిగింది నాకు చాలా బాధగా ఉంది. ఇకమీదట పిల్లలకు ఏం జరుగకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. అమ్మా! సుజనా! నీవు ఇదేమీ మనసులో పెట్టుకోకుండా హాయిగా చదువుకో. మంచి మార్కులు తెచ్చుకుని మన కాలేజ్ ఫస్టు రావాలి. సరేనా!” అన్నారు హెడ్మాస్టారు.
ఆయన వద్ద శెలవు తీసుకుని ఆనంద్ దంపతులు, సుజన తమ ఇంటికి వచ్చారు. అన్నట్లుగానే వెంకట్ తన భార్యాబిడ్డలతో వేరే ఊరు వెళ్లి అక్కడ మరో కాలేజీలో బుధ్ధిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు.
కాలం గడిచిపోతోంది. సుజన కష్టపడి చదివి మంచి మార్కులతో పాసయి కాలేజ్ ఫస్ట్. వచ్చింది. ఆనంద్ దంపతుల ఆనందానికి అవధులు లేవు. హెడ్మాస్టారు తమ కాలేజీలో అభినందన సభని ఏర్పాటు చేసి సుజనని ఘనంగా అభినందించారు.
సుజన కాలేజీలో చేరి చక్కగా చదువుకుంటూ స్కాలర్షిప్ ని కూడా తెచ్చుకుంటోంది. సుజనని చూసి ఆనంద్ దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఏదో చప్పుడైతే కూతురి గురించిన ఆలోచనలనుంచి తెప్పరిల్లి మరలా మిగిలిన పనిలో పడింది వైదేహి.
సమాప్తం.
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
తిరప్తి
![[Image: acb93b_1e70adeee97748efac2319a80b1d12b6~mv2.jpg]](https://static.wixstatic.com/media/acb93b_1e70adeee97748efac2319a80b1d12b6~mv2.jpg/v1/fill/w_925,h_505,al_c,q_85,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/acb93b_1e70adeee97748efac2319a80b1d12b6~mv2.jpg)
రచన: ఎం. కె. కుమార్
సాయంత్రం ఐదు గంటలు. తిరుపతి రైల్వే స్టేషన్లో రైలు ఆగింది. బోగీ నుండి దిగిన రఘురామ్ పాదాలు ఆ నేల మీద పడగానే, శరీరం మొత్తం ఒక తెలియని విద్యుత్ ప్రవహించినట్లయింది.
ముప్పై ఐదు సంవత్సరాలు... సరిగ్గా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి సొంత గడ్డ మీద కాలు మోపుతున్నాడు.
అమెరికాలోని డాలస్ నగరంలో గడిపిన యాంత్రిక జీవితం, ఏసీ గదుల చల్లదనం, వీకెండ్ పార్టీల హడావిడి ఏదీ ఇప్పుడు అతని మనసులో లేదు. కేవలం ఒకే ఒక ఆలోచన…
"నా ఊరు... నా తిరుపతి."
స్టేషన్ బయటకు వచ్చాడు. ఒకప్పుడు ఇక్కడ కనిపించే నిదానమైన వాతావరణం లేదు. ఆటోల రణగొణధ్వనులు, మైకుల్లో అనౌన్స్మెంట్లు, జనసందోహం.
ఏదో జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా అనిపించింది రఘురామ్‌కి. ఒక టాక్సీని పిలిచాడు.
"సార్, ఎక్కడికి వెళ్ళాలి?" డ్రైవర్ అడిగాడు.
"ఊరంతా..." అన్నాడు రఘురామ్ చిన్నగా నవ్వుతూ.
డ్రైవర్ అర్థం కానట్లు చూశాడు.
"సరే, ముందు గాంధీ రోడ్ వైపు పోనీ..." అని చెప్పాడు.
కారు కదులుతుంటే, రఘురామ్ మనసు కాలంలో వెనక్కి ప్రయాణించడం మొదలుపెట్టింది. అద్దం లోంచి బయటకి చూస్తున్నాడు కానీ, అతని కళ్ళకు కనిపిస్తున్నది వేరు.
కారు టౌన్ క్లబ్ మీదుగా వెళ్తుంటే, రఘురామ్ కళ్ళు ఆత్రంగా వెదికాయి. ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అక్కడ ఠీవిగా నిలబడి ఉంది.
రఘురామ్ గుండెలో ఒక సన్నని ముల్లు గుచ్చుకున్నట్లయింది.
అది రామకృష్ణ థియేటర్.
అది కేవలం ఒక థియేటర్ కాదు, అదొక దేవాలయం. రఘురామ్ కళ్ళు చెమ్మగిల్లాయి.
శంకరాభరణం సినిమా విడుదలైన రోజు గుర్తొచ్చింది.
అదొక పండగ. ఆ హాల్లో ఎస్.పి.బాలు గొంతు నుండి "శంకరా... నాదశరీరాపరా..." అని పాట వస్తుంటే, రోమాలు నిక్కబొడుచుకునేవి.
జనం ఊపిరి బిగబట్టి వినేవారు. సినిమా అయిపోయాక కూడా ఆ మత్తులో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిన రోజులు అవి.
ఇప్పుడు? ఆ సంగీతం లేదు, ఆ కళ లేదు. అక్కడ నివసించే వారికి తెలుసా, తాము నిలబడ్డ నేల మీద ఒకప్పుడు ఒక అద్భుతమైన కళాఖండం ప్రదర్శించబడిందని?
కాస్త ముందుకు వెళ్తే ఐ.ఏస్.మహల్. ఒకప్పుడు ఇంగ్లీషు సినిమాలు చూడాలంటే తిరుపతి కుర్రాళ్ళకి అదొక స్వర్గధామం.
బాండ్ సినిమాలు, కౌబాయ్ సినిమాలు అక్కడ చూసి, కాలర్ ఎగరేసుకుని తిరిగిన రోజులు.
ఇప్పుడు ఆ మహల్ మూగబోయింది. రంగు వెలిసిపోయి, ఏకాకిగా నిలబడి, గతం తాలూకు వైభవాన్ని తలచుకుని రోదిస్తున్న వృద్ధురాలిలా ఉంది.
మరింత ముందుకు వెళ్తే, అప్పట్లో తక్కువ స్థలంలోనే ఒక ఆర్కిటెక్చర్ అద్భుతంలా కట్టిన శ్రీనివాస మహల్.
ఆ మెట్లు, ఆ బాల్కనీ డిజైన్ చూసి ముచ్చటపడేవారు.
కానీ నేడు? అక్కడొక పెద్ద 'సౌత్ ఇండియా షాపింగ్ మాల్' వెలిసింది. కళాస్వప్నాలు కాల్సిన చోట, ఇప్పుడు పట్టుచీరల వ్యాపారం నడుస్తోంది.
ఆప్యాయతల స్థానంలో అమ్మకాల వ్యవహారాలు చేరాయి. టికెట్ కోసం క్యూలో నిలబడ్డ స్నేహం, ఇప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గర నిలబడ్డ సహనంగా మారిపోయింది.
కారు వెస్ట్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ వైపు మలుపు తిరిగింది. రఘురామ్ చిన్నప్పుడు ఆ ఏరియా వైపు రావాలంటేనే భయపడేవాడు.
అదొక 'భూత్ బంగాళా'లా ఉండేది. పాతకాలపు రాతి కట్టడం, చుట్టూ భయం గొలిపే చెట్లు. కానీ ఇప్పుడు అక్కడ కార్పొరేట్ లుక్ వచ్చింది.
భయం పోయింది కానీ, ఆ గంభీరత్వం కూడా పోయింది.
రఘురామ్ డ్రైవర్ ని ఆపి, నడవడం మొదలుపెట్టాడు. పర్సాల వీధి లోకి అడుగుపెట్టాడు.
అక్కడ అడుగువేయగానే అతని నాసికాపుటాలకు ఏదో వాసన తగలాలి: అగరుబత్తుల వాసన, పసుపు కుంకుమల వాసన.
కానీ ఇప్పుడు డ్రైనేజీ వాసన, వాహనాల పొగ వాసన. ఒకప్పుడు ఈ వీధిలో యాత్రీకుల జోరు తిరునాళ్ళను తలపించేది.
ప్రతి ఇంటి అరుగు మీద అమ్మమ్మలు కూర్చుని కాశీదారాలు (నల్ల దారాలు) అల్లేవారు. అది కేవలం దారం కాదు, భక్తితో ముడివేసిన నమ్మకం.
ప్రతి ఇల్లు ఒక చిన్నపాటి కుటీర పరిశ్రమలా ఉండేది. దారాలు అల్లుతూనే, ఊరి సంగతులు, మంచి చెడ్డలు మాట్లాడుకునేవారు.
ఆ అమ్మమ్మల ముడతలు పడ్డ చేతుల్లో ఎంత ప్రేమ ఉండేది! ఇప్పుడు అరుగులు లేవు, గ్రిల్స్ పెట్టిన గేట్లు మూసుకుని ఉన్నాయి. మనుషులు లోపల ఉన్నారు, కానీ మనసులు ఎక్కడున్నాయో?
నడుచుకుంటూ గాలి వీధి వైపు వచ్చాడు. అక్కడ ఒకప్పుడు వినిపించే సంగీతం వేరు. ఉదయాన్నే ఆడవాళ్లు ఇత్తడి బిందెలు చంకన పెట్టుకుని, నీళ్ల కోసం వెళ్తుంటే వచ్చే ఆ 'గలగల' శబ్దం..
అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలంత శ్రావ్యంగా ఉండేది. ఆ బిందెల శబ్దం, పట్టీల శబ్దం, పరస్పరం పలకరించుకునే నవ్వుల శబ్దం... అదొక సామూహిక జీవన రాగం.
రఘురామ్‌కి దాహం వేసింది. చుట్టూ చూశాడు. ఎక్కడా చేదబావులు కనిపించలేదు.
చిన్నప్పుడు దాహం వేస్తే, ఏ ఇంటి ముందర ఆగి, బావిలో చేద వేసి, గలగలా నీళ్లు తోడుకుని, దోసిలి నిండా తాగుతుంటే... ఆ అమృతంలాంటి నీటి రుచి ఇంకా నాలుక మీద గుర్తుంది.
ఆ బావులను ఎప్పుడో బోర్లు మింగేశాయి. పోనీ బోర్లు ఉన్నాయా అంటే... ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు దాహం తీర్చిన ఆ ఇనుప బోర్లు కూడా కనుమరుగైపోయాయి.
ఇప్పుడు దాహం వేస్తే జేబులో డబ్బులుండాలి, షాపులో ప్లాస్టిక్ బాటిల్ కొనాలి. గంగమ్మ తల్లి కూడా వ్యాపార వస్తువు అయిపోయింది.
నడుస్తుంటే మహావీర్ టాకీసు గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ 'శ్రీదేవి కాంప్లెక్స్' నిలబడి ఉంది.
సినిమా ఇంటర్వెల్లో బయటకు వచ్చి, పక్కనే ఉన్న బండి మీద జాలీ ఐస్ కొనుక్కుని తినడం... ఆ చల్లదనం, ఆ తీపి... ఇప్పుడు ఏ బ్రాండెడ్ ఐస్ క్రీమ్‌లోనూ దొరకదు.
సాయంత్రం అయితే చాలు రోస్ మిల్క్ కోసం స్నేహితులతో పోటీ పడేవాళ్ళు. ఆ రంగు, ఆ సువాసన... అదొక ఎమోషన్.
ఊరు చివరన ఉండే ఊర్వశి హోటల్. అక్కడ దొరికే దోశ, సాంబార్ రుచి... అమృతంతో సమానం. ఇప్పుడు ఆ హోటల్ లేదు, ఆ రుచి లేదు. అంతా ఫాస్ట్ ఫుడ్ మయం. నిలబడి తినే తొందర, పరిగెత్తే జీవితం.
రఘురామ్ కాళ్ళు బరువుగా కదులుతున్నాయి. మనసులో ఒకటే ఆవేదన. తన బాల్యాన్ని వెతుక్కుంటూ ఎస్వీ హైకాలేజ్ ఉన్న వైపు వెళ్ళాడు.
లక్షలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిన సరస్వతీ ఆలయం అది. కానీ అక్కడ... శూన్యం. కాలేజ్ లేదు. పిల్లల అల్లరి లేదు, మాస్టర్ల పాఠాలు లేవు.
"నిక్కరు సెక్యూరిటీ ఆఫీసర్" అని భయపెట్టే డ్రిల్ మాస్టర్, చేతిలో బెత్తం పట్టుకుని తిరిగే హెడ్ మాస్టర్... ఎక్కడికి పోయారు? ఆ బెంచీల మీద పేర్లు చెక్కుకున్న జ్ఞాపకాలు ఏమైపోయాయి?
వేలాడుతూ బడికెళ్ళిన ఒంటెద్దు బండ్లు లేవు. అప్పట్లో కాలేజ్ కి వెళ్లడమే ఒక సాహస యాత్ర.
రిక్షాల చప్పుడు, చిత్తానూరు పంచమికి వెళ్లే గుఱ్ఱపు బండ్ల టకటకలు... అన్నీ నిశ్శబ్దమైపోయాయి.
రఘురామ్‌కి సంక్రాంతి రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు ఊరంతా ముగ్గులతో నిండిపోయేది.
సన్నాయి రాగాలు గాలిలో తేలియాడేవి. వీధి వీధిన గొబ్బెమ్మలు కనువిందు చేసేవి. ఇప్పుడు అపార్ట్మెంట్ కారిడార్లలో స్టిక్కర్ ముగ్గులు.
గొబ్బెమ్మలు కరువు. మట్టి వాసన తెలియని తరానికి గొబ్బెమ్మల గొప్పతనం ఏం తెలుస్తుంది?
గంగ జాతర వస్తే చాలు... గంగ వేషాలకు కూర్చే దండకాయల హడావిడి ఉండేది. పూల వేషాలు చూస్తుంటే కళ్ళు మిరుమిట్లు గొలిపేవి.
తప్పేట పలకల మోత గుండెను తాకేది. పులి వేషాలు వేసే పొగరుబోతులు వీధుల్లో తిరుగుతుంటే, పిల్లలు భయంతోనూ, ఆశ్చర్యంతోనూ చూసేవారు.
ఇప్పుడు ఆ వేషాలు తగ్గాయి, ఆ ఆవేశం తగ్గింది. అంతా డీజే పాటల హోరు. సంప్రదాయం డిజిటల్ తెర వెనుక దాక్కుంది.
వీధి చివర, ఒకప్పుడు సోది చెబుతాననే సోదక్క కూర్చునేది. ఆమె మాటల్లో ఏదో నమ్మకం ఉండేది.
వేకువ జామున "బుడుబుడుక్కు... బుడుబుడుక్కు" అంటూ శబ్దం చేస్తూ లేపే బుడబుడక్కలోడు లేడు.
వాళ్ళంతా ఏమైపోయారు? ఈ నగర నాగరికత వాళ్ళను ఏ మూలకు నెట్టేసింది? కొర్లగుంట చివరిలో విజయా టెంట్ లేదు, పద్మావతి పురం వద్ద మరో టెంట్ లేదు.
పాత తిరుమల బస్ స్టాండ్ వద్ద ఇండియా కాఫీ షాప్‌లో కూర్చుని, గంటల తరబడి లోకాభిరామాయణం మాట్లాడిన రోజులు... ఆ కాఫీ సువాసనలో కలిసిపోయాయి.
ఇసుక వీధిలో ఇసుక లేదు, కర్నాల వీధి కురచైపోయింది. కొత్తగా కనిపించే కొత్తిండ్లు లేవు, అన్నీ ఒకేలా ఉన్న అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్మెంట్లు.
నరకమవుతున్న నగరం
రఘురామ్ గోవిందరాజస్వామి గుడి వైపు నడిచాడు. చిన్నప్పుడు తలెత్తి చూస్తే ఆకాశాన్ని తాకుతున్నట్టుండే ఆ గాలిగోపురం...
ఇప్పుడు చుట్టూ పెరిగిన బహుళ అంతస్తుల భవనాల మధ్య ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్టు, చిన్నగా అయిపోయినట్టు అనిపించింది. ఊరంతా ఎవరెస్టులా నిలిచిన గోపురం... ఇప్పుడు కనబడనంత చిన్నదైపోయింది.
ఉల్లిపట్టెడ... ఒకప్పుడు ఊరికి దూరంగా, ప్రశాంతంగా విసిరేసినట్టుండేది. ఇప్పుడు అది కూడా సిటీ ట్రాఫిక్‌లో ఒక భాగం. ముక్కు టెంపోలు, మూతి బస్సులు... ఆ విచిత్రమైన వాహనాలు ఇప్పుడు లేవు. అంతా హైటెక్ కార్లు, బైకులు.
"ఎదరా... మేలా..." అంటూ పిల్లలు గోలీలాటలు ఆడే దృశ్యం కోసం రఘురామ్ కళ్ళు వెతికాయి.
కానీ ఒక్క పిల్లాడు కూడా వీధిలో లేడు. అందరూ నాలుగు గోడల మధ్య, సెల్ ఫోన్ల వెలుగులో బందీలు. బొంగరాలై తిరిగిన బాల్యం లేదు. పిల్లల అల్లరి లేని వీధులు శ్మశానాల్లా ఉన్నాయి.
ఊరు మారిపోయింది. తిరుపతి నగరమైంది... కానీ నెమ్మదిగా నరకమైపోతోందా? పెరిగిపోయిన ఊరు ప్లై ఓవర్ల మయం. ఆకాశం ఎత్తుండే భవనాలు వెలిశాయి. కానీ తరిగిపోతున్న మానవతా విలువలను ఎవరు గమనిస్తున్నారు?
ఒకప్పటి ఊరు "అమ్మ"లా ఆదరించేది. ఎవరు వచ్చినా గుండెలకు హత్తుకునేది. కానీ ఇప్పుడు ఊరు "అనాథ"ను చేసేస్తోంది. పక్క ఇంట్లో ఎవరున్నారో తెలియని స్థితి.
రఘురామ్ గుండె బరువెక్కింది. కోనేటి కట్ట మీద కూర్చున్నాడు. కళ్ళ ముందు నీళ్లు మసకబారుతున్నాయి.
"నా తిరుపతి నాకు కావాలి... నా చిన్ననాటి స్నేహితులు, ఆ స్వచ్ఛమైన గాలి, ఆ మనుషులు... అంతా ఎక్కడికి పోయారు?" అని మనసులోనే రోదించాడు.
"ఏమయ్యా... కొత్తగా వచ్చావా? అలా చూస్తున్నావ్?" అని ఒక గొంతు వినిపించింది.
రఘురామ్ తలతిప్పి చూశాడు. ఒక వృద్ధుడు. చేతిలో సంచి, ముఖం మీద చిరునవ్వు, నుదిటిన నామం.
"నేను ఇక్కడే పుట్టాను... కానీ ఇప్పుడు పరాయివాడిలా ఉన్నాను," అన్నాడు రఘురామ్ నిరాశగా.
ఆ వృద్ధుడు నవ్వాడు. ఆ నవ్వులో ఏదో పరిచయం.
"రఘూ... నువ్వేనా?" ఆశ్చర్యంగా అడిగాడు ఆ వృద్ధుడు.
రఘురామ్ నిశితంగా చూశాడు. ఆ కళ్ళు... ఆ నవ్వు...
"శీను గాడివా?" రఘురామ్ గొంతులో వణుకు.
అంతే. ఇద్దరూ చిన్నపిల్లల్లా కౌగిలించుకున్నారు. ముప్పై ఏళ్ల దూరం ఆ ఒక్క కౌగిలింతలో కరిగిపోయింది.
శీను చేతులు రఘు భుజాల మీద ఆసరాలా నిలిచాయి.
"ఊరు మారిపోయిందని బాధపడుతున్నావా రఘూ?" శీను అడిగాడు, రఘు కళ్ళలోని ఆవేదనను చదివినట్టు.
"అవును శీను. రాముడి గుడి తేరు లాగినప్పుడు కాలేజ్‌కు సెలవు వచ్చేది కదా... ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు తేరు ఉంది, కానీ ఆ ఉత్సాహం లేదు. ఇడియాప్పం లేదు, ఉప్పు బస్తాలు తిరిగి అమ్మేవారు లేరు... నా ఊరు తప్పిపోయింది శీను," అన్నాడు రఘురామ్.
శీను చిరునవ్వుతో రఘు చేతిని పట్టుకుని, గోవిందరాజస్వామి గోపురం వైపు చూపించాడు.
"నిజమే రఘూ. రాళ్లు మారాయి, రంగులు మారాయి. ప్లై ఓవర్లు వచ్చాయి, చెట్లు పోయాయి. కానీ... ఇక్కడ చూడు..." అంటూ తన గుండె మీద చేయి వేసుకున్నాడు.
"తిరుపతి ప్రాణం భవనాల్లో లేదు రఘూ. అది ఇంకా ఇక్కడి మనుషుల గుండెల్లోనే ఉంది. నువ్వు చూసే కోణం మార్చు. ఆకాశహర్మ్యాల వెనుక దాక్కున్న వెంకన్న ఇంకా అలాగే ఉన్నాడు. మనిషి వేషధారణ మారింది కానీ, పిలుపులో ఆర్తి మారలేదు."
శీను, రఘుని తీసుకుని దగ్గర్లోని ఒక చిన్న టీ కొట్టుకు తీసుకెళ్లాడు. అక్కడ నలుగురు స్నేహితులు చేరారు. పాత జోకులు, చిన్ననాటి జ్ఞాపకాలు,
'నిక్కరు సెక్యూరిటీ ఆఫీసర్' మాస్టర్ గురించి వెటకారాలు... అరగంటలో రఘురామ్ ముఖంలో మళ్ళీ పాత వెలుగు వచ్చింది.
అప్పుడు అర్థమైంది రఘురామ్‌కి.
కనిపించే భవనాలు, రోడ్లు మాయమవ్వచ్చు. కానీ, కనిపించే స్నేహితుల చిరునవ్వులో వెతుక్కుంటే... ఆనాటి మా ఊరు టక్కున జ్ఞాపకమై మెరుస్తోంది.
ఆ అపార్ట్మెంట్ వెనుక రామకృష్ణ థియేటర్ జ్ఞాపకం ఇంకా బ్రతికే ఉంది.
ఆ షాపింగ్ మాల్ వెనుక శ్రీనివాస మహల్ దర్పం స్నేహితుల మాటల్లో ఇంకా వినిపిస్తోంది.
రఘురామ్ లేచి, తిరుమల కొండల వైపు చూశాడు.
ఊరు మారిపోవచ్చు. నాగరికత అనే ముసుగులో నరకంలా అనిపించవచ్చు. కానీ, ఎక్కడో ఒక మూల, ఒక స్నేహితుడి పలకరింపులో, ఒక గుడి గంట శబ్దంలో, ఇంకా మిగిలి ఉన్న ఆ మానవత్వంలో...
మన తిరుపతి ఎప్పటికీ ఒక భూతల స్వర్గమే.
ఆ సాయంత్రం, రఘురామ్ మళ్ళీ తన ఊరిని ప్రేమించడం మొదలుపెట్టాడు. అది అమ్మ లాంటి ఊరు. అమ్మ ముసలిదైపోవచ్చు, రూపురేఖలు మారిపోవచ్చు... కానీ అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు కదా.
సమాప్తం
•
|