Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
#41
super
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Superb story..love track bagundi.. please continue..
Like Reply
#43
Super story
Like Reply
#44
Superb baaboe supro super
Like Reply
#45
Super Story
Like Reply
#46
Sivasai bro.. soooperooo sooper raastunnav.
sarigga cheppalante.. iragadeesesav story ni ippati varaku.

nee next episode ela undabotundi ani excitement bhale undi.
Like Reply
#47
Part - 17


  నాన్న అని మళ్ళీ పిలుస్తాడు. చెప్పు అని ముభవంగా అంటారు. ప్లీజ్ నాన్న మీరు ఆలా మాట్లాడికండి. చాలా బాధగా ఉంది.

ఇంత వయసు వచ్చిన నీకే ఇలా ఉంటే.. మరి అవని పరిస్థితి ఏమిటి అని గట్టిగ అడుగుతారు. నేను ఎప్పుడు సెపరేట్ గా చూడలేదు. అన్నీ ఇచ్చాను అనుకున్నాను.

  నీ మాటలో ఉన్న కాన్ఫిడెన్స్ చెబుతుంది నువ్వు చెప్పింది ఎంత నిజమో. సరే గాని ఎందుకు ఫోన్ చేసావు అని అడుగుతారు.

   ప్లీజ్ నాన్న మీరు వచ్చేయండి.  అదే ఎందుకు అని అడుగుతున్నాను. మమ్మల్ని కూడా తల్లిదండ్రులు కాదు అని చెబితే వినమంటావా అని అడుగుతారు.

నేను ఎందుకు అలా చెబుతాను నాన్న అని బాధగా అడుగుతాడు.  మరి అవని విషయంలో ఏం జరిగింది మరి అంటే... మౌనమే సమాధానం అవుతుంది.

  సరే ఉంటాను అని శేషగిరి గారు అనగానే...  ప్లీజ్ నాన్న రండి.  మీ కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాము అని అంటాడు.

  సరే మేము వస్తాము  అవిని ఎక్కడుందో వెతికి వెనక్కి తీసుకొస్తావా అని సూటిగా అడుగుతారు.  అవని నా కూతురే కదా నాన్న తీసుకొస్తాను.

అవిని తనికి నచ్చిన వాడితో వెళ్ళిపోయింది కదా! ఆ వ్యక్తిని కూడా తీసుకువచ్చి ఇద్దరికి మళ్ళీ గ్రాండ్ గా పెళ్లి చేస్తాను అని చెబుతాడు.

   అవని నచ్చిన వాడితో వెళ్ళిపోయింది అని నీకు ఎవరు చెప్పారు అని గట్టిగా అడుగుతారు.  ఆరోజు ఇంటిలో అంత  గొడవ జరిగింది కదా! 

  ఉదయ్ చెప్పాడు కదా అంటే.. ఉదయ్ ఎవరు అని అడుగుతారు. భార్గవి కి మేనల్లుడు అనగానే.... మరి అవని ఎవరు అని అడుగుతారు.  నా కూతురు అని చెబుతాడు.

మేనల్లుడు మీద ఉన్న నమ్మకం కూతురు మీద లేదా అని గట్టిగా అడుగుతారు.  నీ మేనల్లుడు మీద నీకు నమ్మకం ఉండొచ్చు గాని.. నా మనవరాలు మీద నాకు చాలా నమ్మకం ఉంది .

   సరే నీ మాట ప్రకారం మేము అక్కడకు వస్తాము.  కాకపోతే నాదొక కండిషన్ అంటారు.  చెప్పండి అనగానే మీ ఇంటిలో ఎవరికీ తెలియకుండా అవని గురించి ఎంక్వయిరీ చేపించు.

   నీ భార్య కూడా తెలియడానికి వీల్లేదు అలాగే మేము చెప్పింది మాత్రమే మీరు ఇంట్లో చేసేటట్టు అయితేనే మేము వస్తాము లేకపోతే మేము ఇక్కడ మీరు అక్కడ ఉండండి.

మా గౌరవం తగ్గించుకోవాలని మాకు లేదు అని కరాకండిగా చెప్పేస్తారు. దానికి ధనుంజయ్ లేదు నాన్న మీరు చెప్పినట్టే చేస్తాను.

  ముందే చెబుతున్నాను మా గౌరవానికి ఎటువంటి ఇబ్బంది కలిగిన మీ ఇంటి నుంచి మేము బయటకు వచ్చేస్తాము అని గంభీరంగా చెబుతారు.

  మీ ఇల్లు అని అంటారు ఏంటి నాన్న అది మన ఇల్లు.  నా మనవరాలు గురించి నువ్వు పూర్తి నిజాలు తెలుసుకునేంతవరకు అది మీ ఇల్లే అవుతుంది ధనుంజయ్ అని గట్టిగానే చెబుతారు.

  అలాగే అవని రజిత కూతురు మా మనవరాలు అవుతుంది కానీ.. నీ కూతురు అవ్వదు అని చెబుతారు..

  నాన్న మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు.  అవిని గురించి పూర్తిగా ఎంక్వయిరీ చేపిస్తాను.  భార్గవికి కూడా చెప్పను.

   అలాగే మీరు, అమ్మా ఎలా చెబితే అలాగే ఇంట్లో అందరం నడుచుకుంటాము అని చెప్పి.  బ్రతిమాలి ఒప్పిస్తాడు.

   సరే అయితే మేము మధ్యాహ్నం నుంచి బయలుదేరుతామని ఫోన్ పెట్టేసి భార్య వంక చూస్తారు. సత్యవతి గారు మౌనంగానే ఉంటారు.. ఏమైందే అలాగా ఉన్నావు అంటే...

  భార్గవి మన ముందు మంచిగా ఉంటూ ఇంత విషం కక్కుతుంది అని అనుకోలేదు అని బాధపడుతుంది.. ఏమి చేస్తాము మనకి తెలియకుండా జరిగిపోయింది  కదా ఇప్పుడు నుండి చూద్దాము అని చెప్పి రెడీ అవ్వు బయలుదేరాలి అని చెప్తారు.


బెంగళూరు....

అవని పొద్దుటే లేచి ఫ్రెష్ అయ్యి ముగ్గు వేయడానికని ఫ్లాట్ బయటకు వస్తుంది.  అప్పటికే విక్రమ్ జాగింగ్ కి వెళ్ళిపోతాడు.  రెండు ఫ్లాట్లకి సరిపడే విధంగా ఒకటే ముగ్గు వేస్తుంది.

ముగ్గుని చూసుకుని పర్ఫెక్ట్ అనుకుంటూ చూస్తుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ అని ఒక వాయిస్ వెనకనుండి వినపడుతుంది.

  ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ విక్రమ్ అంటాడు సీరియస్గా విక్రమ్ చూస్తూ ఉంటాడు. అవిని తడబడుతూ ముగ్గు వేసాను అని చెబుతుంది.

  విక్రమ ముగ్గు  ఒకసారి చూసి మీ ఫ్లాట్ ముందు వేసుకుంటే సరే.. మా ఫ్లాట్ కూడా కలిపి వేసేసారు ఎందుకు అని అడుగుతాడు.

  అంటే..  ఈరోజు నేను పెద్ద ముగ్గు వేసాను అది అలా అలా మీ ఫ్లాట్ వరకు వచ్చేసింది అని చెప్పి లోపలికి వెళ్లడానికి అడుగులు వేస్తుంది.

   విక్రమ్ వెంటనే ఎక్స్క్యూజ్మీ అనే పిలుస్తాడు  చెప్పండి అంటే..  మీ పేరు అని అడుగుతాడు.

  అవని అని చెబుతుంది  ముందు వెనక ఏమీ లేదా అని అడిగితే.. నేను ఒక అనాధని అని చెబుతోంది.

ఆ మాటకి విక్రమ్ పిడికిలి బిగిస్తాడు.   ఓ అవునా కానీ మిమ్మల్ని చూస్తే పెళ్లైన వాళ్ళ లాగా కనిపిస్తున్నారు అని అడుగుతాడు.

గబగబా మెడ చెక్ చేసుకుంటుంది.  నల్లపూసలు ఏమైనా బయటకు వచ్చేసినాయి అని..  దానికి విక్రం నేను ఆడవాళ్లు తప్పుగా చూడను.

నీ నుదుటను ఉన్న కుంకం చూసి అడుగుతున్నాను అంటాడు.  దానికి అవని మీరు తప్పుగా చూస్తారని నేను అనలేదండి అని తలదించుకుంటుంది

చెప్పండి మీరు అనాధ అంటున్నారు. చూస్తే పెళ్లి అయిన వాళ్ళ లాగా ఉన్నారు అని మళ్ళీ రెట్టిస్తాడు.
.
దానికి అవని పెళ్ళికి ముందు నేను ఒక అనాధని పెళ్లయిన తర్వాత మా వారు వర్క్ చాలా సీక్రెట్ గా చేయాలి.

అందుకనే ఆ డీటెయిల్స్ ఏమి బయటికి చెప్పనండి అని చెప్పి స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోతుంది   పర్వాలేదు బాగానే కవర్ చేస్తున్నావ్ అనుకుంటూ..  లోపలికి వెళ్ళిపోతాడు.

   అవని లోపలికి వెళ్లి ఎత్తిన బాటిల్ దించకుండా వాటర్ తాగేసి... నేను ఆయన డీటెయిల్స్ కనుక్కోవాలి అనుకుంటే.. నా డీటెయిల్స్ అన్నీ ఈయనకి చెబుతున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవని అని తనకు తానే సర్థి చెప్పుకుంటుంది.

ఈలోపు నేహా లేచి వచ్చి ఏంటి అవని ఇంత పొద్దున్నే ఫ్రెష్ అయ్యావు ఈరోజు అని అడుగుతుంది. అలాగేమీ లేదు కాలేజ్ టైం అవుతుంది కదా అని చెప్పి గబగబ టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది.

   కరుణ ప్రిపేర్ చేస్తది కదా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటే ప.. ర్వాలేదు ఖాళీగా ఉన్న బోర్ కొడుతుంది.

కరుణ వస్తే మిగిలిన పని చేస్తుంది అని చెప్పి ఈ రోజు కూడా టిఫిన్ అన్ని ఎక్కువ చేస్తుంది  మళ్లీ అన్నీ ఒక బౌల్లో సర్థి వెళ్లి విక్రమ్ ఫ్లాట్ డోర్ నాకు చేస్తుంది.

ఈసారి విక్రమే డోర్ తీస్తాడు.  అబ్బా ఈయన  వచ్చారు. ఏం చెప్పాలి అనుకుంటూ టిఫిన్ అని ఆ బౌల్స్ అందిస్తుంది.

ఎందుకు మిస్ మీరు మా కోసం ఇలాగ ఫుడ్ రెడీ చేసేస్తున్నారు అంటే...  మీరిద్దరూ బ్యాచిలర్స్ అనుకుంటా.. 

కుక్ ని కూడా పెట్టుకున్నట్లేరు అందుకనే చేసి ఇచ్చాను.  అపార్ట్మెంట్లో ఉన్న బ్యాచులర్స్ అందరికీ మీరే వండిస్తున్నారా అని పైనుంచి కిందకి చూస్తూ అడుగుతాడు.

  దానికి అవని ఉక్రోషంగా ఎందుకు చేస్తాను అని అడుగుతుంది. మరి మాకు ఎందుకు చేసి ఇచ్చారు అని అడుగుతాడు.

  దానికి అవిని తడబడుతూ ఈ ఫ్లాట్లో ఉన్న అన్నయ్య నిన్న వచ్చి సిస్టర్ లాగా ఉన్నావు పాలు పొంగించండి అని అడిగారు.

అందుకే అన్నయ్య ఆకలితో ఉంటే బాగోదు కదా అని  అన్నయ్యతో పాటు మీరు ఉన్నారు కదా అని ఇద్దరికీ చేసి తెచ్చాను అని ప్లేట్ చేతిలో పెట్టేసి గబగబా లోపలికి వెళ్ళిపోతుంది.

కోయి కోయి ఎన్ని రోజులు చెప్తావో ఈ కహానీలు నేను వింటాను అనుకుంటూ...  టిఫిన్స్ పుచ్చుకొని లోపలికి వెళ్తాడు

  ఎవరు బావ అని శ్రీ వస్తే... ఇంకెవరు మీ చెల్లె అనే టిఫిన్స్ అక్కడ పెడతాడు. నిజం చెప్పేయొచ్చు కదా బావ నీ కోసమే వచ్చాను అని అంటే... నేను చెప్పను.

   తనంతట తానే చెప్పాలి ఏం జరిగిందో అన్నది అవి. అవని తోనే చెప్పిస్తాను.  నేను రెడీ అయి వస్తాను అని వాష్ రూమ్ లోకి వెళ్తాడు

  ఏం టిఫిన్ పంపించిందా అని ఓపెన్ చేసి చూస్తాడు. పెసరట్టు, ఉప్మా ఇడ్లీ, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి విత్ సాంబార్ తో ఉంటుంది.

  అబ్బా  ఇన్ని టిఫిన్సా!!  మా బావ మాత్రం మచ్చేసుకుని పుట్టాడు.  అవిని వచ్చిన తర్వాత మాత్రం ఎక్స్ట్రా వర్కౌట్స్ చేయాల్సిందే.

   లేకపోతే బాగా లావు అయిపోతాడు అనుకుంటూ తొందరగా రా బావ... ఆకలి దంచేస్తుంది.

వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి అని కంగారు పెడుతూ ఉంటాడు.  వస్తున్నాను అని చెప్పి  వచ్చి కూర్చుంటాడు.

   ఎందుకు బావ అవని ఇన్ని వెరైటీస్ చేసింది అంటే... నేను ఏమి తింటానో   కరెక్ట్ గా తెలియదు కదా! హెల్తీ డైట్ అంటనేమో అని ఇవి చేసింది.

చెక్ చేసుకుంటూ వెరైటీస్ మార్చుతూ ఉంటది చూస్తూ ఉండు అని చెబుతాడు.  అవని,  నేహా రెడి అయ్యి బయటకు వస్తారు.

నేహా ఆఫీస్ కి స్టార్ట్ అవుతుంది.  అవని కాలేజ్ కి వెళ్లడానికి అని బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంటుంది. అవిని నుంచున్న బస్టాప్ వైపు నుంచే విక్రమ్,  శ్రీ వెళ్తూ ఉంటారు

   విక్రమ్ కార్ బస్ స్టాప్ దగ్గర ఆపి అవిని నీ చూస్తాడు అవని వీళ్ళని పట్టించుకోకుండా టైం అయిపోతుంది అని బస్సు వైపు చూస్తూ ఉంటుంది ఇంకా రాలేదేంటి అని...


  విక్రమ్ హలో అవని గారు అని పిలుస్తాడు.  ఎవరా అని చూస్తే అక్కడ విక్రమ్ కనిపిస్తాడు.

   నన్ను తెగ ఫాలో అవుతున్నారు. ఇది అనుకోకుండా జరుగుతుందా లేదా కావాలనే చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది..

  అవిని గారు మిమ్మల్ని పిలుస్తున్నాం ఎక్కడ ఆలోచిస్తున్నారు అని మళ్లీ గట్టిగా అడుగుతాడు.

    చెప్పండి అనగానే ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే...  కాలేజ్ కి వెళ్ళాలి కదా కాలేజ్ బస్సు ఇంకా రాలేదని చూస్తున్నాను అని చెప్తుంది.

  మీ కాలేజ్ ఎక్కడ అని అడిగితే టు స్ట్రీట్ స్ అవుట్ సైడ్ ఉంటుంది అని చెబుతుంది.. మేము అటు సైడ్ వెళ్తున్నాము రండి డ్రాప్ చేస్తాము అంటే...

  పర్వాలేదు సార్ అంటుంది. నేనేమీ మీకు ఊరికే లిఫ్ట్ ఇవ్వడం లేదు.  మాకు మంచి ఫుడ్ పెడుతున్నారు మాకు తెలిసిన అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇస్తున్నాము అంతే అని క్యాజువల్ గా చెప్తాడు.

  ఆ మాటలకి అవిని కి కోపం వచ్చి అంటే నేను ఫుడ్ పెట్టాను కాబట్టి మీరు నాకు లిఫ్ట్ ఇస్తున్నారా అని అడుగుతుంది.

నేను అలా ఏమీ అనలేదే అంటాడు విక్రమ్. మరి మీరు అన్నదానికి అర్థం ఏంటండి అని ఇంకా   కోపంగా అడుగుతుంది.

  కారులో కూర్చుని మీకు కావాల్సిన అర్ధాలు తీసుకోండి. వచ్చి ఎక్కండి అందరూ ఇక్కడ మనల్ని చూస్తున్నారు అని సీరియస్గా అంటాడు. అవని చుట్టూ చూస్తుంది. అక్కడున్న ఇద్దరు, ముగ్గురు వాళ్ళ వంకే చూస్తుంటే ఇబ్బందిగా అనిపించి వెళ్లి కార్ ఎక్కుతుంది.

   కార్లో శ్రీ ని చూసే హాయ్ అన్నయ్య అంటుంది. హాయ్ అమ్మ అనగానే.. అన్నయ్య మీ పేరు నాకు తెలియదు అనగానే..  శ్రీ అని చెప్తాడు.

విక్రమ్ మరి నన్ను అడగరా అంటే..  నాకు తెలుసు అని  ఫ్లో లో అనేస్తుంది . ఎలా తెలుసు అని అడుగుతాడు.
Like Reply
#48
Part - 18


  విక్రమ్ అడిగిన దానికి అవిని తడబడుతూ  మిమ్మల్ని ఎవరో పిలిస్తే విన్నాను అని చెబుతోంది.

  ఓ.. అవునా...  ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరే అని అంటాడు.  ఎందుకండి మీకు ఇన్ని క్యూస్షన్స్ వస్తాయి. ఏదో ఒకటి చెప్పాను కదా అని విండోలో నుంచి బయటికి చూస్తుంది.

  విక్రమ్ శ్రీ కి సైగ చేస్తాడు. శ్రీ అవని ని చూస్తూ అవని అని పిలుస్తాడు.

చెప్పండి అన్నయ్య అంటే..  నువ్వు ఎందుకు రైట్ హ్యాండ్ కి గ్లౌజెస్ చేసుకుంటున్నావు అని అడుగుతాడు .

  అబ్బా వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకటి ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు. అది నా రైట్ హ్యాండ్ కి రాష్ వచ్చింది.

   డాక్టర్ సజెస్ట్ చేశారు. ఎండ, వేడి,  డస్ట్ ఏమి తగలకుండా ఉండాలి కొన్ని రోజులు అని.. అందుకే యూస్ చేస్తున్నాను అని చెబుతోంది.

అవునా ఒకసారి మమ్మల్ని చూడనీ.. విక్రమ్ కి కొన్ని స్కిన్ ఎలర్జీకి ట్రీట్మెంట్ చేయగలడు. ఒకసారి చూపించు అవని అంటే...

  కంగారుపడుతూ,పర్వాలేదు అన్నయ్య నేను లేడీ డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. అంతగా అవసరమైతే అప్పుడు విక్రమ్ గారి హెల్ప్ తీసుకుంటాను అని చెబుతోంది.

సరే మరి నీ ఇష్టం అని అనగానే... అన్నయ్య మా కాలేజ్ వచ్చింది ఆపండి అని చెప్పి.. కార్ దిగి జాగ్రత్తగా ఆఫీస్ కి వెళ్ళండి అన్నయ్య అని చెబుతూ విక్రమ్ ని చూస్తోంది.

అవని చూస్తుందని అర్థం అయినా..  విక్రం చూసి చూడనట్టుగా  కార్ స్టార్ట్ చేస్తాడు.

శ్రీ విక్రమ్ తో అవని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. ఎలా బయటపెట్టిస్తావురా అంటే... ప్రతి దానికి ఒక దారి ఉంటుంది ముందు నేను అవిని తో క్లోజ్ అవ్వని.

అసలు మా పెళ్లి మీద తను ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ వేస్తాను అని చెప్పి కార్ ని ఆఫీస్ ముందు ఆపుతాడు.

మెయిన్ బ్రాంచ్ నుంచి విక్రమ్ ఇక్కడికి వచ్చాడు అని ఆఫీస్ మొత్తం చాలా సిన్సియర్ గా  వర్క్ చేస్తూ ఉంటుంది.

హైదరాబాద్..

సత్యవతి, శేషగిరి గారు ధనుంజయ్ ఇంటికి చేరుకుంటారు. భార్గవి ఎదురు వెళ్లి రండి అత్తయ్య,  మావయ్య గారు.

మీరు లేక ఇల్లంతా బోసిపోయినట్టు ఉంది.  మాకు ఏమీ తోయడం లేదు అని చాలా ప్రేమగా మాట్లాడుతుంది.

ఒకప్పటి సత్యవతి, శేషుగిరి గారు అయితే భార్గవి మాటలు నమ్మి చాలా మురిసిపోయేవారు.  కానీ ఇప్పుడు భార్గవి నిజస్వరూపం తెలిసిన తర్వాత ఆ మాటలు చాలా వేగుటూగా  ఉన్నాయి.

ధనుంజయ్ కూడా రండి నాన్న అని సంతోషంగా ఎదురు వెళతాడు. మేము కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని కొడుకు మొహం కూడా చూడకుండా గదిలోకి వెళ్ళిపోతారు.

తండ్రి ఆలా ప్రవర్తించినందుకు ధనుంజయ్ కి చాలా బాధగా అనిపిస్తుంది. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత నాన్నతో ఒకసారి మాట్లాడాలి అనుకొని...

భార్గవి నేను ఆఫీస్ కి వెళుతున్నాను.  పెద్దవాళ్ళు ఇద్దరు బాధపడే విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు. జాగ్రత్త అని చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.

ఈ ముసలి వాళ్ళిద్దరూ అవని విషయంలో చాలా ఫీల్ అయినట్టు ఉన్నారు. శిల్ప లైఫ్ సెట్ అయ్యే వరకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఏమి చేస్తే వీళ్ళకి అవిని మీద కోపం వస్తుంది అని ఆలోచిస్తుంది. ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది అని క్రియేట్ చేసాం కదా! కొన్ని ఫొటోస్ అలా సెట్ చేస్తే సరిపోతుంది అని కుతంత్రాలు ప్లాన్ చేస్తుంది.

ఉదయ్ ని పిలిచి ఏం చేయాలో చెబుతుంది. అత్తా అలా చేస్తే దొరికిపోతామేమో అంటే...

ఇక్కడ ఎవరికీ అంత బుర్రలు లేవు.  మనం చెప్పే దానికి కొంచెం ముసలి కన్నీరు ఆడ్ చేస్తే సరిపోతుంది. ముందు నేను చెప్పిన పని చెయ్ అని ఉదయ్ కి కొంచెం క్యాష్ ఇచ్చి పంపిస్తుంది.

జై సింహ మాన్షన్...

శిల్ప కి ఒళ్లంతా పులిసిపోతూ ఉంటుంది. ఉదయమే నాలుగింటికి లేపుతారు.  రాత్రి పదింటి దాకా ఏదో ఒక పని చెబుతూనే ఉంటారు.

ఏదైనా అందాము అంటే.. దోషం ఉంది ఆరు నెలలు దాకా ముసుగు తీయకూడదు అంటారు.  ఈ చీరలు మోయలేక పోతున్నాను. నా ఫేసు చూపించలేకపోతున్నాను.

నా బ్యూటీ కేర్ తీసుకుని ఎన్ని రోజులు అయిపోయింది. ఈ ఆరు నెలలు పూర్తయ్యే లోపల నా స్కిన్ గ్లో తగ్గిపోతుంది. అప్పుడు విక్రమ్ ఎలా నాకు అట్రాక్ట్ అవుతాడు.

విక్రమ్ నా కంట్రోల్లో లేకపోతే నేను అనుకున్న పనులు ఎలా చేయగలను అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది.

విక్రమ్ పొద్దుటే అవిని వేసిన ముగ్గు  పిక్ పంపిస్తాడు. అది చూసిన ఆడవాళ్లు  అవని పని ప్రతీది చాలా పర్ఫెక్ట్ గా ఉంది.

తెలివిగా రెండు ఫ్లాట్లకు కలిపి ఒకటే ముగ్గు వేసింది. విక్రం విషయంలో తనకు తెలియకుండానే కేర్ తీసుకుంటుంది.
ఇలాగే ఉంటే ఎలాగైనా సరే విక్రమ్ తీసుకువచ్చేస్తాడు.

రేపు శిల్ప తో ఈ ముగ్గు పెట్టించాలి అని అప్పటికప్పుడు లేడీస్ ఫిక్స్ అయిపోతారు.
శిల్ప కి తన బ్యూటీ పై ఫోకస్ తగ్గి వంటపై ఫోకస్ ఎక్కువ అవుతుంది. ఎలా చేసిన పేర్లు పెడుతూనే ఉంటారు.   కొత్త కొత్తవి నేర్చుకుంటూనే ఉంటుంది కుక్ సహాయంతో.

ఈ కూరలో ఉప్పు ఎక్కువైంది, ఆ కూరలో కారం తక్కువైంది,నూనె ఇలాగా వేసేది.  మీ అమ్మ ఏమీ నేర్పించలేదా అని విసుక్కుంటూనే ఉంటారు .

శిల్పకి చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. పుట్టింట్లో తనని అమ్మ గాని, నాన్న గాని ఎప్పుడూ ఒక మాట అని ఎరగరు.

ఏది అడిగినా క్షణాల్లో తన కళ్ళ ముందు ఉండేది. ఆకలి అన్న మాటకు అర్థమే తెలిసేది కాదు.

   కానీ ఇక్కడ అందరికన్నా ముందు లేగాలి. అన్ని పనులు చేయాలి.  అందరూ తిన్న తర్వాతే తినాలి.
ఏమైనా అందాము అంటే...ఇంటి పద్ధతి, కోడలు ఫాలో అవ్వాలి అని గట్టిగా చెబుతున్నారు.

విక్రమ్ ఫోటో చూసి నేను టెంప్ట్ అవ్వకపోయి ఉంటే నాకు ఈ తిప్పలు ఉండేవి కాదు కదా!
నేను విక్రమ్ ని చూసిన విషయం కూడా వీళ్ళకి తెలియదు. తెలిస్తే అమ్మో ఇంకా ఏమైనా ఉందా! 

మా పద్ధతిని మంట కలిపావు అని ఇంకా ఎలాంటి పనులు
చెబుతారో, ఎలాంటి పూజలు చేపిస్తారో అని టెన్షన్ పడుతుంది.

ఒకసారి అమ్మతో మాట్లాడి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకాలి ఇలా చేయడం నావల్ల అవడం లేదు అనుకంటూ భార్గవ్ కి ఫోన్ చేస్తుంది.
శిల్పా నెంబర్ చూసి భార్గవి లిఫ్ట్ చేసి చెప్పు బేబీ ఎలా ఉన్నావు అంటే.... అస్సలు బాగోలేదు మామ్.
మార్నింగ్ ఫోర్ కి లేపుతున్నారు నైట్ 10 దాకా వర్క్ వర్క్ అని చేపిస్తూనే ఉన్నారు. అందరూ తినేదాకా నేనేమీ తినకూడదు.

చాలా కష్టంగా ఉంది మమ్మీ ఏదో ఒకటి చెయ్యి అని చెబుతూ ఉండగానే గ్లాసు నేలకి తగిలి గట్టి శబ్దం వస్తుంది.

భార్గవి ఉలిక్కిపడి కిందకి చూసి బేబీ నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి కిందకి పరిగెత్తుకుని వెళుతుంది.

కింద సత్యవతి గారు చాలా కోపంగా ఉంటారు. ఏమైంది అత్తయ్య అలాగా ఉన్నారు. ఏమైనా కావాలా అంటే...

పర్వాలేదు ఇప్పటికైనా  గుర్తొచ్చాము. మేము వచ్చి ఇంతసేపు అయింది పెద్దవాళ్లే షుగరు, బీపీ లాంటి కంప్లైంట్లు ఉన్నాయి.

  వేళ్ళకి ఇంత ఫుడ్ ప్రిపేర్ చేసి ఇద్దాము అని ఏమైనా నీకు ఉందా అని గట్టిగా అరుస్తుంది. అదేంట అత్తయ్య మీరు ఏమీ తినలేదా కుక్ ఏం చేస్తున్నాడు  సర్వెంట్స్ ఏం చేస్తున్నారు అని కోపంగా సర్వెంట్స్ వైపు చూస్తుంది.

అంటే ఇంటి కోడలు ఉండగా మేము సర్వెంట్స్ పెట్టింది తినాలా...  నా మనవరాలు ఉన్నప్పుడు అన్నీ నా మనవరాలు జాగ్రత్తగా చూసుకునేది .

ఇప్పుడు నా మనవరాలు లేకపోయేటప్పటికి ముసలి వాళ్ళమని మీకు అడ్డుగా ఉన్నామని పట్టించుకోవడం లేదు.  పదండి మనం మన ఊరు వెళ్ళిపోదామని భర్త చేయి పట్టుకుంటుంది.

అప్పుడే లోపలికి వస్తున్న ధనుంజయ్ అదంతా చూసి ఏమైందమ్మా అని కంగారుగా అడుగుతాడు. ఏమని చెప్పమంటావు ధనుంజయ్... 

మేము వచ్చినప్పుడు నుండి ఇప్పుడు దాకా మాకు ఒక టీ నీళ్లు గాని, టిఫిన్ గాని పెట్టిన వాళ్ళు లేరు.

నా మనవరాలు ఉన్నన్ని రోజులు మేము ఒక్క పూట కూడా ఆకలితో లేము.కానీ ఈ రోజు మేము ఇలా ఆకలితో అలమటించవలసి వస్తుంది .

దీని కోసమే నా మమ్మల్ని రమ్మంది. మేము లేకపోతే తోయడం లేదు అని చెప్పి పిలిపించారు అని కోపంగా అడుగుతారు.
ధనుంజయ్ కోపంగా భార్గవి వంక చూస్తూ నీకు నేను ఏమి చెప్పాను. ఎందుకు పెద్దవాళ్ళని ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని భార్య మీద కోప్పడి..

అమ్మ   ఇప్పుడే నేను కుక్ తో చెప్పి ఫుడ్డు అరేంజ్ చేస్తాను అని కంగారుగా కిచెన్ లోకి వెళ్లబోతాడు.

ఆగు ధనుంజయ్ ఎవరో వండితే తినాల్సిన అవసరం మాకు లేదు. ఇంటికోడలుగా భార్గవి చేస్తుందా లేదా కనుక్కో.
లేదంటావా మా దారిన మేము వెళ్ళిపోతాము అని  కోపంగా చెబుతారు.
భార్గవి కోపంగా అదేంటి అత్తయ్య గారు ఇన్ని రోజులు కుక్ వండితేనే కదా తిన్నారు.  ఇప్పుడు కొత్తగా నేను వండడం ఏంటి అని అడుగుతుంది.

సత్యవతిగారు వెటకారంగా ఏంటి ఇన్ని రోజులు కుక్ వండాడా అని చెప్పి కుక్ ని పిలుస్తారు.
ఇన్ని రోజులు ఎవరు వండారు అని కుక్ ని అడిగితే అది అని నాంచుతూ ఉంటాడు.  పరవాలేదు చెప్పు ఇక్కడ నీకేం భయం లేదు అని అడుగుతారు.

అవిని అమ్మాయి గారే వండేవారు.  మీకు ఎందుకమ్మా ఈ పని అంటే..  నేను కొంచెం తినాలి కదా అందుకనే వంట చేస్తున్నానని చెప్పేవారు అని తలదించుకుంటారు.
ఆ మాటలు విన్న ధనుంజయ్ షాక్ అవుతాడు.
తను తినాలి అంటే వంట చేయడమేమిటి అని సత్యవతి గారిని అడుగుతాడు.

    సత్యవతి గారు సమాధానం ఏమిటి??
   కథ కొనసాగుతుంది...

ప్లీజ్ గివ్ మీ రేటింగ్ అండ్ కామెంట్స్
థాంక్యూ...
Like Reply
#49
nice update
Like Reply
#50
Super story excellent
Like Reply
#51
super updates bro
please continue like this
Like Reply
#52
Excellent update
Like Reply
#53
Sooner raastunnaru Sivasai garu.
Like Reply
#54
Good going love story.. please continue
Like Reply
#55
Part - 19


     ధనుంజయ్ అడిగిన దానికి సత్యవతి గారు ఏంట్రా ఏమీ తెలియనట్టు మమ్మల్ని అడుగుతున్నవు అని అంటారు.

  నేను నిజంగానే అడుగుతున్నాను అమ్మ అవని భోంచేయాలి అంటే పనిచేయడం ఏంటి..  ఇంట్లో ఇంతమంది సర్వెంట్స్ ఉండగా అవని పని చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది అని అడిగితే...

   అది మమ్మల్ని అడుగుతావేంటి నీ ముద్దుల భార్యని అడుగు. నువ్వు చెప్పావని తనే మాకు అందరికీ చెప్పింది అని భార్గవి వంక చూస్తారు.

  భార్గవికి టెన్షన్ తో చెమటలు పడతాయి.  బాబొయ్ ఈవిడ ఏంటి ఇలా ఇరికించేసింది.  ఇప్పుడు నేను ఈయనకి ఏమని చెప్పాలి అన్ని టెన్షన్ పడుతూ ఉంటుంది.

   చెప్పు భార్గవి ఏం చెప్పావు నువ్వు అని గట్టిగా అడుగుతాడు. నేనేమీ చెప్పలేదండి అని నాంచుతుంది . దానికి సత్యవతి గారు అదేంటి భార్గవి అలా అంటావు.

   ఈ ఇంట్లో ఉండాలి అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి.  కచ్చితంగా వంట మాత్రం చేయాలి.  ఒకరోజు గార్డెనింగ్, ఒక రోజు ఇంటి పని అని ఏదో ఒకటి చేస్తేనే నువ్వు ఇంట్లో ఉంటావు అని మీ నాన్నగారు చెప్పమన్నారు అని చెప్పావు కదా అని గట్టిగా అడుగుతారు.  పాపం అవన్నీ చిన్నపిల్ల ఎన్నిసార్లు చేయి కాల్చుకుందో  అని బాధగా అంటారు

ధనుంజయ్ కి కోపంతో కళ్ళు ఎర్రబడతాయి. నిజం చెప్పు భార్గవి అని గట్టిగా అరుస్తారు.  దానికి భార్గవి చెమటలు తుడుచుకుంటూ అంటే... పనులు వస్తాయని అలా చెప్పాను అంతేనండి.

    శిల్ప కు ఎందుకు చెప్పలేదు నువ్వు అని అడుగుతారు. దానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ ఉంటది.

  ధనుంజయ్ తల్లిదండ్రులు వంక చూస్తాడు.  వాళ్ళు చూసిన అసహ్యకరమైన చూపుకి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాక తలదించుకుని లోపలికి వెళ్ళిపోతాడు.

  లోపలికి వెళుతూ భార్గవిని చూస్తే ఈరోజు నుంచి వంట నువ్వే చేయాలి.  నువ్వు కాక ఎవరితోనైనా చేయించినట్టు నాకు తెలిస్తే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు.

సత్యవతి గారు భార్గవి వంక కోపంగా చూస్తూ వెళ్లి వంట చేయ్యి మాకు చాలా ఆకలిగా ఉంది పదండి అని చెప్పి భర్త చెయ్యి పుచ్చుకొని గదిలోకి వెళ్ళిపోతుంది.

గదిలోకి వెళ్ళిన ధనుంజయ్ బట్టలతోనే షవర్ కింద నుంచోని అసలు ఏం జరుగుతుంది నాకు తెలియకుండా..

అవని విషయంలో చాలా జరిగింది.  అవిని నాకు రజిత ఇచ్చిన ప్రేమ గుర్తు.  తెలియకుండానే అవని విషయంలో చాలా నిర్లక్ష్యం చేశాను అనుకుని...

గబగబా ఫ్రెష్ అయ్యి తండ్రి రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ నాక్ చేస్తాడు. అప్పుడే భార్గవి స్నాక్స్ టీపుచ్చుకొని అక్కడికి వస్తుంది.

నేను తీసుకెళ్తాను లోపలికి..  వెళ్లి నైట్ డిన్నర్ పని చూడు అని చెప్పి విసుగ్గా ప్లేట్స్ తీసుకుని లోపలికి వెళ్తాడు.

లోపలికి వెళ్లి డోర్ లాక్ చేస్తాడు.  ధనుంజయ్ ని చూసిన సరే ఏమీ మాట్లాడకుండా తల పక్కకు తిప్పుకుంటారు.

ప్లీజ్ నాన్న మీరు అలా చేయకండి చాలా కష్టంగా ఉంది అంటే..  నువ్వు అవని విషయం  లో ఇదే కదా చేసావు.

ఇంత వయసు వచ్చిన నీకే బాధగా ఉంటే చిన్నప్పటి నుంచి నీ ప్రేమ కోసం చూసినా అవిని కి ఎంత బాధగా ఉంటది రా! అని తల పక్కకు తిప్పుకుంటారు.

  ధనుంజయ్ సిగ్గుతో తలదించుకుంటాడు.  నేను ఏది కావాలని చేయలేదు.

అవిని నీ చూడగానే రజిత గుర్తొచ్చి బాధ వచ్చేది. ఆ బాధతోనే అవిని  నీ దగ్గరికి తీసుకోలేదు కానీ అవని అంటే నాకు చాలా ఇష్టం నాన్న అని చెబుతాడు.

   చేతల్లో లేని నీ బోడి ఇష్టం ఎవరికి కావాలి రా!  అలా అనుకుంటే నీకు భార్గవి ని చూసినప్పుడు కూడా ఇది రజిత స్థానం కదా అని..   భార్గవి కూడా దూరంగా ఉండాలి కదా!

మరి ఎలాగా శిల్ప కన్నారు అని సూటిగా అడుగుతారు. నాన్న అని అహం దెబ్బతిన్నట్టుగా చూస్తాడు .

నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా ధనుంజయ్ గంభీరంగా అడుగుతారు.  మీరు అందరూ చేసిన తప్పులకి బలైపోయింది మాత్రం నా మనవరాలు.

ఇంక మీరు దయచేయండి అక్కడ మీ ముద్దుల భార్య ఎదురు చూస్తూ ఉంటాది అని వెటకారంగా అంటారు.

ప్లీజ్ నాన్న మీతో మాట్లాడాలని వచ్చాను. నన్ను కొంచెం మాట్లాడనిస్తారా అని రిక్వెస్ట్ చేస్తాడు. మాకైతే నీతో మాట్లాడడం అసలు ఇష్టం లేదు.

ఏదో మాట్లాడాలి అంటున్నావు కదా తొందరగా మాట్లాడు బయటికి వెళ్ళు అని చాలా కరాకండిగా చెప్పేస్తారు.

ఎందుకు నాన్న మీరు అంత రేష్ గా మాట్లాడుతున్నారు అని బాధగా అడిగితే.. మనమేదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది అంటారు అదే కర్మఫలం. 

మనం చేసిన దానికి భగవంతుడైనా ప్రార్థిస్తే క్షమిస్తాడేమో గాని కర్మ మాత్రం క్షమించదు అంటారు. నువ్వు చేసిన పనులు నీకే తిరుగు వస్తున్నాయి.

కన్నవాళ్ళ నుంచి నిరసన వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా అని..  ఇంతకీ విషయం ఏంటో చెప్పు నిన్ను ఇంతసేపు ఎదురుగుండా చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది అని అసహ్యంగా మాట్లాడుతారు.

తన చేసిన తప్పు తనకి ఎదురుగుండా కనబడుతుంటే బాధగా కళ్ళు మూసుకొని.  నేను అవని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెబుతాడు.

  మంచిది వెళ్ళు అంటారు.  ప్లీజ్ నాన్న  నేను చెప్పేది పూర్తిగా అవలేదు  ఇబ్బందిగా తండ్రిని చూస్తూ అవిని చదివిన కాలేజ్ ఎక్కడ చెప్పండి నాన్న అంటే..

ఆశ్చర్యంగా అంటే నీకు నీ కూతురు ఏం చదివిందో తెలియదు అనుకున్నాను కానీ... ఎక్కడ చదివిందో కూడా తెలియదా అని ఏం తండ్రి వి రా బాబు నువ్వు అని అవిని చదివిన కాలేజ్ పేరు చెప్పి, తను చేసిన కోర్స్ గురించి కూడా చెప్పి  ఇంకా వెళతావా నువ్వు  అని తెలుపు వంక చూపిస్తారు.

ధనుంజయ్ చాలా బాధగా బయటకు వచ్చి గార్డెన్ లో కూర్చుంటాడు. పిల్లలు ఇద్దరి చిన్నప్పుడు విషయాలు అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.

అవని ఫస్ట్ బర్త్ డే తర్వాత తను అసలు సెలబ్రేట్ చేయడమే గుర్తులేదు. ఆరోజు రాగానే ఎప్పుడు భార్గవి రజిత అక్క చనిపోయిన రోజు అని గుర్తు చేయడం. తన ఆ బాధలో ఉండిపోవడం.

శిల్ప బర్త్డే మాత్రం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం. అవని బిక్కు బిక్కు మంటూ చూడడం. ఎక్కువగా తన రూమ్ లో ఉండిపోవడం గుర్తు వచ్చి బాధగా కళ్ళు మూసుకుంటాడు.

మూసిన కనురెప్పల నుంచి కన్నీళ్లు జారుతూ ఉంటాయి. నాకు తెలియకుండానే అవని విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను.

రేపు కాలేజీకి వెళ్లి కనుక్కోవాలి.  అసలు నిజంగా అవిని కి బాయ్ఫ్రెండ్ ఉన్నాడా లేక అవిని విషయంలో ఏమైనా జరిగిందా..  ఎవరైనా కావాలని చేసి ఉన్నారు అని తెలిస్తే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాలు తోడేస్తాను అని నుదురు రుద్దుకుంటాడు.

భార్గవి వచ్చి ఏవండీ వంట అయిపోయింది బోంచేతురు గాని రండి.  అత్తయ్య, మావయ్య కూడా వెయిట్ చేస్తున్నారు అంటే..  మీరు చేసేయండి నాకు ఆకలిగా లేదు అని చెబుతాడు.

రండి సాయంత్రం నుంచి కూడా మీరు ఏమి తినలేదు కదా అంటే..  ప్లీజ్ భార్గవి నన్ను విసిగించకుండా వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు.

ఈయన ఇంకా అదే మూడులో ఉన్నట్టున్నారు. మనకు ఎందుకులే అనుకుని, అలాగే అని చెప్పి వెళ్లి పెద్దవాళ్ల ఇద్దరికీ  వడ్డించి వాళ్ళు భోంచేసిన తర్వాత భార్గవి కూడా భోజనం చేస్తుంది.

ధనుంజయ్ గార్డెన్ లో ఎంతసేపు కూర్చున్నాడు అతనికి తెలియదు.

బెంగళూరు...

కాలేజ్ నుంచి వచ్చిన అవని హాల్లో కూర్చుని పొద్దున జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది అమ్మో విక్రమ్ గారి తో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి.

  ఆయన విషయాలు అడుగుదామంటే నా విషయాలు వన్ బై వన్ అడుగుతున్నారు. ఇలాగా ఉంటే ఎప్పుడూ నేనే చెప్పేసేటట్టు ఉన్నాను.

విక్రమ్ గారికి దూరంగా ఉండటమే దీనికి బెటర్ సొల్యూషన్ అనుకుంటుంది.

నేను అసలు వాళ్ళ ఫ్లాట్ వైఫై చూడను నా పని ఏదో నేను చూసుకుని కామ్ గా ఉంటే సరిపోతుంది. అప్పుడు వాళ్లు నన్ను డిస్టర్బ్ చేయరు.

కానీ ఎలా విక్రమ్ గారి గురించి తెలుసుకోవడం అంతా బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఇలాంటి చిన్న ఫ్లాట్లో ఎందుకు ఉంటున్నట్టు...

ఒకవేళ ఉన్నారే అనుకో తనతో పాటు భార్య కూడా రావాలి కదా అనుకుంటుంది.

భార్య అని శిల్ప ని గుర్తు చేసుకోగానే అవని మనసంతా ఏదో చేదు తిన్నట్టుగా ఫీల్ అవుతుంది.  తనకు తానే మళ్లీ సర్ది చెప్పుకొని..

నా వరకు మాత్రమే విక్రమ్ నా భర్త కానీ... ఆయన దృష్టిలో శిల్ప ఆయన భార్య. ఎంత విచిత్రంగా ఉందో మా బంధం అనుకుని విరక్తిగా నవ్వుకుని కిచెన్లోకి వెళ్లి టీ పెట్టుకుని తాగుతుంది.

అప్పుడు  మైండ్ కొంచెం ఫ్రెష్ గా అనిపించి రిలాక్స్ అవుతుంది. కాసేపు వెళ్లి పడుకుని సాయంత్రం ఆరు అవుతుందిగా లేచి వస్తుంది.

ఫ్రెషయ్య దీపారాధన చేసి కిచెన్ లోకి వెళుతుంది.  ఏం కుక్ చేయాలా అని ఆలోచిస్తుంది.

అవని కి తెలియకుండానే మళ్ళీ విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.  సాయంత్రం  ఏం తింటారు.

మధ్యాహ్నం లంచ్ చేసి ఉంటారా లేదా?  చేయకపోతే చాలా ఆకలిగా ఉంటారు అనుకొని..  కంగారుపడుతూ రేపటి నుండి లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేయాలి.

ఇప్పుడు ఆకలితో ఉండి ఉండొచ్చు కదా అనుకుని జీరా రైస్, చపాతీ, గుత్తి వంకాయ కూర, పెరుగు చట్నీ, కీర, క్యారెట్ స్లైస్ కట్ చేసి బట్టర్ మిల్క్ కూడా చేసేసి రెడీ చేస్తుంది .

విక్రమ్ ఫ్లాట్ వంక చూస్తూ వీళ్ళు ఇంకా రాలేదేంటి అని మాటిమాటికి లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది.


ఇదంతా సీసీలో చూస్తున్న విక్రమ్ కోర మీసాలు కింద ఉన్న పెదవులపై సన్నటి చిరునవ్వు వస్తుంది. అది చూసిన శ్రీ ఏంటి బావ నీలో నువ్వు తెగ నవ్వుకుంటున్నావు అంటే..

నీ చెల్లి చేసే ఫీట్లు చూసి నవ్వురాక ఇంకేం వస్తుంది అంటాడు.  ఏం చేసింది అని అనుమానంగా అడిగితే...

మనం ఇంకా రాలేదు అని లోపలికి బయటికి కాలు గాలిన పిల్లి లాగా తిరుగుతుంది అని నవ్వుతాడు.

నీకెలా తెలుసు బావ అంటే.. చెప్పాను కదా నాకు అవిని గురించి తెలిసినప్పుడే తన చుట్టూ నా మనుషులని పెట్టేసాను అని...

తనకు తెలియకుండానే వాళ్ళు ఫ్లాట్లో కూడా కెమెరా పెట్టాను. ఇప్పుడు మనం వెళ్లే దాకా అలాగే తిరుగుతా ఉంటుంది. పదా వెళదాము అని చెప్పి బయలుదేరుతారు.

విక్రమ్ని ఫ్లాట్ దగ్గర చూడగానే అవని ఫేసులో సంతోషం విరబూస్తుంది. అది అంతా విక్రమ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు.

మనసులో నా పైన ఇంత ప్రేమ ఉంచుకొని కూడా నాకు దూరంగా వచ్చేసావు కదా!  చెప్తా నీ పని అనుకుని ఫోను వస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ చెప్పు శిల్పా అంటాడు.

ఆ మాట వినగానే అవని మొహం డల్ అయిపోతుంది.
[+] 15 users Like SivaSai's post
Like Reply
#56
Part - 20


విక్రమ్ శిల్పతో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా ఆక్ట్ చేస్తూ అవని ఫేస్ చూస్తాడు. అవిని ఫేస్ అప్పుడే డల్ గా అయిపోయి కళ్ళల్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి.

గబగబా లోపలికి వెళ్ళిపోయి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంటుంది. నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను.

విక్రమ్ గారు చేసిన దాంట్లో తప్పు ఏముంది. విక్రమ్ గారు కరెక్ట్ గానే ఉన్నారు నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని తనకు తాను సర్ది చెప్పుకొని వాళ్లకి ప్రిపేర్ చేసిన డిన్నర్ అంతా బౌల్స్ లో సర్థి విక్రమ్ ఫ్లాట్ ముందు నుంచుంటుంది.

కాలింగ్ బెల్ కొట్టాలా వద్దా అని సంశయిస్తూ ఉంటుంది.
ఇదంతా సీసీ లో చూస్తున్న విక్రమ్ ఏం చేస్తుందా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు.

దీర్ఘంగా బ్రీతింగ్ తీసుకుని కాలింగ్ బెల్ కొడుతుంది. ఈసారి శ్రీ వచ్చి డోర్ తీస్తాడు. హాయ్ అవని అనగానే.. అన్నయ్య డిన్నర్ ఇదిగోండి అని సైలెంట్ గా చేతికి ఇస్తుంది.

ఏంటి అవని నీ ఫేస్ అంత డల్ గా ఉంది అంటే.. ఏమీ లేదు అన్నయ్య కాలేజ్లో కొంచెం టైడ్ అయ్యాను అంతే గుడ్ నైట్ చెప్పి స్పీడ్ గా వెళ్ళిపోతుంది .

బాధగా వెళుతున్న అవని వంక చూసి లోపలికి వచ్చి ఏమైంది అవిని కి అలా ఉంది అని శ్రీ అడుగుతాడు.

తనలోని ఫీలింగ్స్ బయటకు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది.

అర్థం కాలేదని శ్రీ అడిగితే ఇందాక క్యారిడార్ లో జరిగిన విషయం చెబుతాడు.

ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు విక్రమ్ అని అడుగుతాడు. ఒక్కసారె డోస్ పెంచితే  పాప గిలగిలా కొట్టుకుంటుంది.

మెల్లిగా స్టెప్ వైస్ పెంచాలి అంటూ డిన్నర్ ఏం పంపించిందా అని చూసి నవ్వుకుంటాడు.

బావాఎందుకు ఆ నవ్వు అంటే మన లంచ్ ఏం చేసామా అని డౌట్ తో ఇన్ని ఐటమ్స్ పంపించింది అని చెబుతాడు.

మీ ఇద్దరిని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది బావ. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోరు కానీ ఒకరి మనసులో ఏముందో ఇంకొకరికి ఈజీగా అర్థమయిపోతుంది.

మీరిద్దరూ ఒక చోటికి చేరాక మాత్రం బెస్ట్ కపుల్ అవుతారు బావ అని రా బావ మంచి ఆకలి మీద ఉన్నాను మా చెల్లి వెరైటీస్ పంపించింది.

నీ సంగతి ఏమోగానీ ఇక్కడ నుండి వెళ్లే లోపు మాత్రం నేను బాగా వెయిట్ పెరుగుతాను. అని అంటాడు.
రేపటి నుంచి నాతో పాటు జాగింగ్ కి రా అని చెబుతాడు. వద్ద బాబు నావల్ల కాదు అంత పొద్దున్నే లేవడం అని చెప్పి ఫుడ్ ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు.

అవిని తన ఫ్లాట్లోకి వచ్చాక హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. సీనియర్ వర్క్ చేసేది విక్రమ్ గారి కంపెనీలోనే కదా! మరి విక్రమ్ గారిని గుర్తుపట్టలేదా అని డౌట్ వచ్చి చెమటలు పడతాయి.

ఈ విషయం ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుని నేహా కోసం చూస్తూ ఉంటుంది. నేహా బాగా అలసిపోయి వస్తుంది.
రాగానే హాల్లో ఉన్న అవిని కి హాయ్ చెప్పి ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్ లోకి వెళుతుంది. ఫ్రెష్ అయ్యి డిన్నర్ దగ్గరికి రాగానే ఏంటి అవని 2 డేస్ నుంచి వెరైటీస్ చేస్తున్నావు ఏంటి స్పెషల్ అని అడుగుతుంది.

అవిని తడబడుతూ అలా ఏమీ లేదు నాకు కుకింగ్ అంటే ఇష్టం అందుకే వెరైటీస్ ట్రై చేస్తున్నాను అని చెప్తుంది.

నీ చేతి వంట సూపర్ గా ఉంటుంది . నీ చేతి వంట తింటూ బ్రతికేయొచ్చు తెలుసా అని నేహా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

సీనియర్ మిమ్మల్ని నేను ఒక విషయం అడగనా అని ఇబ్బందిగా చూస్తుంది నా దగ్గర నీకు పర్మిషన్ ఎందుకు నువ్వు అడుగు నేను చెబుతాను.

రేపు లంచ్ కి మాత్రం ఇంకొక వెరైటీ చేయవా ప్లీజ్ అంటుంది.తప్పకుండా సీనియర్ అని..

మీ కంపెనీ సీఈఓ ఎలా ఉంటారు అని అడుగుతుంది. నేహా తినేది అల్లా అవని వంక చూస్తూ ఇప్పుడు మా సీఈవో సంగతి నీకెందుకు అవని అని అడుగుతుంది.

జస్ట్ ఊరికినే తెలుసుకుందామని అంతే అని మీకు ఇబ్బంది అయితే మాత్రం చెప్పవద్దు  డిన్నర్ ఫినిష్ చేయండి సీనియర్ అని ప్లేట్లో కెలుకుతూ ఉంటుంది.

ఇందులో ఇబ్బంది ఏముంటుంది మేము మా సీఈఓ సార్ ని ఎప్పుడు చూడలేదు. సార్ ప్రస్తుతం ఇక్కడ  బ్రాంచ్ దగ్గరే ఉన్నారు.

సార్ కి పర్సనల్ లిఫ్ట్ ఉంది. ఆయన క్యాబిన్ దాకా ఎవరూ వెళ్ళరు.

మేము శ్రీ సార్ ని చూసింది కూడా తక్కువే. నాకైతే ఆయన ఫేస్ కూడా సరిగ్గా గుర్తులేదు అని చెబుతోంది.
ఆ మాటలకు అవిని కొంచెం రిలాక్స్ అయ్యి  డిన్నర్ ఫినిష్ చేస్తుంది.

హైదరాబాద్...

ధనుంజయ్ బ్రేక్ ఫాస్ట్ కూడా చేయకుండా ఆఫీసుకు బయలుదేరుతాడు. భార్గవి వచ్చి టిఫిన్ చేయండి అన్ని రెడీ చేసేసాను అని చెబుతుంది.

నాకు కొంచెం బయట పని ఉంది నేను వెళ్ళాలి అని స్పీడ్ గా బయటికి వచ్చేస్తాడు.

డైరెక్ట్ గా అవని చదివిన కాలేజ్ కి వెళ్తాడు. ఇంకా కాలేజ్ టైం కి ఆఫెన్ అవర్ ఉంటుంది. ప్రిన్సిపల్ రూమ్ ముందు కూర్చుని ప్రిన్సిపల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.

ఒక్కొక్కరు కాలేజీలోకి వస్తూ ఉంటారు. ఆ కాలేజ్ చూసిన ధనుంజయ్ కి మనసు చాలా బాధగా రోదిస్తూ ఉంటుంది.
ఇలాంటి చోట అవని  చదివింది.

శిల్ప చదివిన కాలేజ్ ని గుర్తు చేసుకుంటాడు. ఆవని దృష్టిలో నేను ఎంత పడిపోయి ఉంటాను అని తన మీద తనకే కోపం వస్తుంది.

ధనుంజయ్ ని చూసిన ప్యూన్ వచ్చి సార్ ఇక్కడ ఏం చేస్తున్నారు ఎవరి కోసం వచ్చారు అనే అడుగుతాడు.

ప్రిన్సిపల్ ని కలవాలి అని చెబుతాడు. ప్రిన్సిపల్ సార్ రావడానికి ఇంకొక హాఫెన్ అవర్ పడుతుంది సార్.

మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వచ్చారా అని మళ్ళీ అడుగుతాడు.

ఇలాంటి విషయాలు అయితే ప్యూన్ లకి బాగా తెలుస్తాయి అని అవని గురించి కనుక్కుందామని వచ్చాను అని చెబుతాడు.

అవని అంటే ఏ సెక్షన్ సార్ అని మళ్ళీ అడుగుతారు. అవిని చదివిన బ్రాంచ్ గురించి చెబుతాడు.

ఓ అమ్మాయా.. చాలా మంచిది సార్. చాలా బాగా చదువుతుంది. సోషల్ ఆక్టివిటీస్ లో బాగా పాటిస్పేట్ చేస్తుంది సార్.

కానీ తను ఒక అనాధ కదా సార్. పార్ట్ టైం జాబ్ చేస్తూ.. చదువుకుంటుంది. పూర్ స్టూడెంట్స్ కి ఎవరికైనా ఫీజులు అవసరం అయితే తను బాగా హెల్ప్ చేస్తుంది సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు.

అనాధ అన్నమాట దగ్గరే ధనుంజయ్ షాక్ లోకి వెళ్లిపోతాడు. అవని అనాధ ఏమిటి? ఇలాంటి కాలేజీలో చదవడం ఏంటి??

భార్గవి నాకు చెప్పినది ఏమిటి?? అని బాధగా కళ్ళు మూసుకుంటాడు.

మళ్లీ ప్యూన్ వచ్చి సార్ మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు రండి అని లోపలికి తీసుకువెళ్తాడు.

ధనుంజయ్ లోపలికి వెళ్లే ప్రిన్సిపల్ సార్ ని విష్ చేస్తాడు ప్రిన్సిపల్ కూడా తిరిగి విష్ చేసి చెప్పండి సార్ ఏ పని మీద వచ్చారు అని అడిగితే...

అవిని గురించి తెలుసుకోవాలని వచ్చాను అని ఇబ్బందిగా చెబుతాడు.

అవని గురించి ఏం తెలుసుకోవాలి ఇంతకీ మీరు ఎవరు అని అడుగుతారు.

ధనుంజయ్ కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇప్పటికే అవిని విషయంలో నేను చాలా అన్యాయం చేశాను అని ఊపిరిబిగుబట్టి నేను అవిని ఫాదర్ని అని చెబుతాడు.

ప్రిన్సిపల్ ఆశ్చర్యంగా అవని కి ఫాదర్ ఉన్నారా అని అడుగుతాడు.

ఇన్ని రోజులు  మీరు అవని ని కలవలేదా ఈరోజు అవిని ఉంది అని తెలిసిందా అని అనుమానంగా అడుగుతారు.

ఏం చెప్పాలో తెలియక ధనుంజయ్ మౌనంగా ఉండిపోతాడు.

మీరు చాలా లక్కీ సార్ అవిని లాంటి బంగారు తల్లి నీ కన్నందుకు. నాకే ఎన్నోసార్లు అనిపించేది ఇలాంటి కూతురు నాకు ఉంటే ఎంత బాగుండునా అని..

ఒకసారి నేనే అడిగాను  దత్తత తీసుకుంటాను మా ఇంటికి వచ్చేస్తావా అని.. ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది.

కాలేజీలో జాయిన్ అయినప్పుడే రిక్వెస్ట్ చేసింది నాకు పార్ట్ టైం జాబ్ కావాలి సార్ అని..

అవిని టాలెంట్ చూసి నేను మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఇప్పించాను. కానీ అవిని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకోమని మాత్రమే చెప్పింది.

ఒక రకంగా తన టాలెంట్ తోనే తెచ్చుకుంది జాబ్. ధనుంజయ్ ఇబ్బందిగా ప్రిన్సిపల్ వంక చూస్తూ నేను ఒక్కసారి అవని అడ్మిషన్ ఫామ్ చూడొచ్చా ఎవరి జాయిన్ చేశారు ఇక్కడ అని అడుగుతాడు.

అవని ప్రీవియస్ మార్క్స్ లిస్ట్ తో వచ్చి నన్ను కలిసింది.
అవిని అడ్మిషన్ ఫార్మ్స్ చూపిస్తూ చెబుతారు. గార్డియన్ గా  ఎవరితోనైనా సైన్ చేపిస్తావా అమ్మ అని అడిగితే ఒక పెద్దాయన తీసుకువచ్చింది.

ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు అనగానే..  శేషగిరి అని డౌట్ గా అడుగుతారు.

అదే అనుకుంటా ఒకసారి ఫామ్స్ లో చూస్తే తెలుస్తుంది అని  అన్ని ఫామ్ చూపిస్తూ అందులో చూపిస్తారు.

ఆ ఫామ్ చూసిన ధనుంజయ్ కి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి.  ఎక్కడ తన పేరు లేదు. అలాగే అవిని కి ఇంటి పేరు కూడా లేదు.

అవిని ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే... అవిని చాలా తక్కువ మందితోనే మాట్లాడుతుంది .

ఒక ఇద్దరు అమ్మాయిలు తన క్లాస్మేట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే ఒక సీనియర్ తో బాగా మాట్లాడేది.

అంతకు మించి తనకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఒక విషయం అడగొచ్చా అని ప్రిన్సిపాల్ గారు అంటారు.

చెప్పండి సార్ అనగానే అవిని నీ చూసి చాలా రోజులైంది ఒకసారి రమ్మని చెప్తారా  కళ్ళల్లోనే మెదులుతుంది  అనగానే ధనుంజయ్ ని ఎవరో లాగిపెట్టి కొట్టిన ఫీలింగ్ వస్తుంది.

అక్కడ ఉండలేక స్పీడ్ గా బయటకు వచ్చేస్తాడు. అవని ఏ క్లాసులో కూర్చుందో అక్కడ వెళ్లి నిలబడి చూస్తూ ఉంటాడు.

అప్పుడే ఆ క్లాస్ నుంచి లేడీ లెక్చరర్ బయటకు వస్తూ ఉంటారు.  ఎక్స్క్యూజ్మీర్ సార్ మీరు ఎవరు? ఇక్కడ ఉన్నారు అని అడిగితే...

ధనుంజయ్ కి ఏమని చెప్పాలో అర్థం కాక అది నేను అని ఇబ్బందిగా చెబుతూ ఉంటాడు.

ఇందులో ప్యూన్ అక్కడికి వచ్చి సార్ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా..

మేడం ఈసార్ మీ డియరెస్ట్ స్టూడెంట్ అవని కోసమని వచ్చారు. అని చెప్పి వెళ్ళిపోతాడు.

అవిని కోసమా అని ఆశ్చర్యంగా చూస్తుంది.  అవిని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అని ధనుంజయ్ అడుగుతాడు.

ఎవరు మీరు? మీకు నేను అవిని విషయాలు ఏమి చెప్పాలి అని అడుగుతారు.

దానికి ధనుంజయ సమాధానం ఏమిటి??
కథ కొనసాగుతుంది...

ప్లీజ్ గివ్ మీ రేటింగ్స్ 
Like Reply
#57
ee talent enti bro?
idantha sadivithe.. bhargavi paristhithi ento ani.. tega kutoohalanga undi!!
Like Reply
#58
Excellent update
Like Reply
#59
One of the best stories in this forum
Like Reply
#60
Wish you all happy new year 2026
Like Reply




Users browsing this thread: 1 Guest(s)