Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
#21
Fantastic story 
Great narration
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Part - 11


     ఇందిరాగారి రూమ్ లో కూర్చున్నాక అందరూ విక్రమ్ ఏం చెబుతాడు అని చూస్తున్నారు.. విక్రమ్ అందరి వంకా చూసి రిషి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా చెబుతాడు.

   దానికి అందరూ ఆశ్చర్యపోతారు.  అలా ఎలా చేస్తారు అని.  దానికి ఇందిరాగారు ఆలోచిస్తూ..మనతో ప్రతిసారి భార్గవినే మాట్లాడింది.  ఎట్టి పరిస్థితుల్లోనే అవని గురించి తెలియకూడదు అని అంటారు.

   విక్రమ్ వంక  చూస్తూ నీ పెళ్లి అవిని తొనే జరిగిందని ఎలా నమ్ముతున్నావు  అని అడుగుతారు.  వినయ్, భరత్ కి కూడా సేమ్ డౌట్ తో ఉండడం వల్ల విక్రమ్ వంక చూస్తారు.

    విక్రం దీర్ఘంగా నెట్టూర్జి,  ఒకసారి కళ్ళు మూసుకుంటాడు.  మూసిన  రెప్పల వెనకాల ముసుగులో ఉన్న అవని రూపం,  తన స్పర్శ, ఏదో చెప్పాలని ప్రయత్నించడం అన్నీ గుర్తుకు వస్తాయి.

   విక్రమ్ కళ్ళు తెరిచి అందరి వంకా చూస్తాడు.  అవని స్టడీ సర్టిఫికెట్స్ చూపిస్తాడు.

   బర్త్ మార్క్ ఐడెంటిఫై దగ్గర కుడి చేతి మణికట్టు దగ్గర ఉన్న పుట్టుమచ్చ గురించి ఉంటుంది.  ఆ రోజు విక్రమ్ చెప్పింది అందరూ గుర్తు చేసుకుంటారు.

   ఇప్పుడు ఏం చేద్దాం అమ్మ అని మాధవి అడుగుతుంది. ఇందిరాగారు విక్రమ్ వంక  చూస్తూ నీ మనసులో ఏముంది విక్రమ్.  నీ నిర్ణయం ఏదైనా సరే మేము అంగీకరిస్తాము గౌరవిస్తాము అంటారు.

   దానికి విక్రమ్ వాళ్ళ గ్రానీ నీ చూస్తూ నేను ఈ పెళ్లిని అంగీకరిస్తున్నాను.  నాకు అర్థమైనంత వరకు అవని కూడా ఈ పెళ్లిని అంగీకరించింది.

   ఎలాగైనా అవని నీ నేను తీసుకు వస్తాను.  ఈలోపు ఇక్కడ తల్లి కూతుర్లు చేసిన డ్రామా కూడా బయట పెట్టాలి
అంటారు.

   దానికి లలిత గారు ఊగిపోతూ చెప్పు విక్రమ్ ఏం చేద్దాం అంటారు.  కళ్యాణ్ గారు భార్యని పట్టుకుని నువ్వు శాంతించు బంగారం అని సముదాయిస్తాడు. 

.విక్రమ్ వాళ్ల గ్రానీ వంక చూస్తూ... గ్రానీ మీరు ధనుంజయ్ అంకుల్ కి ఫోన్ చేసి ఈ శనివారం పూజ ఉందని ఇన్వైట్ చేయండి.

   అందరి ముందు పిల్లలు టాపిక్ తీయండి.అప్పుడు మనకు ఇంకా క్లారిటీ వస్తుంది అని చెబుతాడు.  ఈ ఐడియా బాగుంది అదే ఇంప్లిమెంట్ చేద్దామని ఫ్యామిలీ అంతా ఫిక్స్ అయ్యారు.

   అయ్యో భార్గవి ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి?  అల్లుడు చేతిలో పడ్డావు.  అక్కడ ఉన్నది సింహం అని తెలియక, కొప్పిగొంతులు వేశావు. బొప్పి కట్టించుకోవడానికి రెడీగా ఉండు ??

   అన్నయ్య అని నీవి పిలుస్తుంది.  చెప్పు నీవి అనగానే.. వదిన ఎలా ఉంటుంది అని అడుగుతుంది.

   అవిని డీటెయిల్స్ అన్ని ఆ కవర్ లోనే ఉన్నాయి. ఫోటో కూడా ఉంది చూడు అంటాడు.  నువ్వు చూసావా?ఎలా ఉంది అని అడిగితే..నేను చూడలేదు అంటాడు.

   ఎందుకు అని అడిగితే... దానికి విక్రమ్ నవ్వి నేను డైరెక్ట్ గానే చూస్తాను.  తను ఎలా ఉన్నా సరే విక్రమ్ భార్యనే అని చెబుతాడు.

    నువ్వు ఎలా గుర్తు పడతావని మాధవి అడుగుతుంది. సింపుల్ అత్తా,  ఇంత తెలుసుకున్నా వాడిని తనని గుర్తుపట్టలేనా అని రూమ్ కి వెళ్ళిపోతాడు.

    అందరూ అవని ఎలా ఉంటుందని ఆత్రుత ఫోటో చూస్తారు.  అవిని ఫోటో చూసి అందరూ అలా ఫ్రీజ్ అయిపోతారు.

    విక్రమ్ కి తగ్గ జోడి అనుకుంటారు.  గులాబీ, చందనం కలిసిన రంగు, కళ్ళు కూడా మాట్లాడగలవా అనిపించే పెద్ద పెద్ద కళ్ళు,  చక్కటి రూపం, నడుము కింద వరకు జడ. అందానికి అసూయ పుట్టేటట్టు ఉంది.

  అందరూ ఫిక్స్ అయిపోతారు.   అవిని నే విక్రమ్ కి తగ్గ జోడి అని.  శిల్ప ని ఒక ఆట ఆడుకోవాలి అని లేడీస్ అందరూ గట్టిగా ఫిక్స్ అయిపోతారు.

   వినయ్ స్పీడుగా పరిగెత్తుకుంటూ వెళ్లి విక్రమ్ డోర్ భాదేస్తాడు.  తలుపు తెరిచే ఉంది అంటాడు. లోపలికి వచ్చే అన్నయ్య అని హగ్ చేసుకుంటాడు.

   ఏమైంది ఇంత సంతోషంగా ఉన్నావని విక్రమ్ అడిగితే, వదిన చాలా బాగుంది.   బాపు బొమ్మలా, ముద్దమందారంలా   ఉంది.

  మేమందరం ఫిక్స్ అయిపోయాము.  తానే మిస్సెస్ అవినీ విక్రమ్ అని. తొందరగా తీసుకొచ్చాయని ఎమోషనల్ అవుతాడు.

   అన్ని సెట్ చేసి మీ వదిన తీసుకు వస్తాను అని తమ్ముడిని హగ్ చేసుకుంటాడు.

   ఇవేమీ తెలియని రెండు పక్షులు ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు.   ఒక పక్షైన శిల్ప అత్తగారి ఆర్డర్ తో వంట పనిలో బిజీగా ఉంది.  మరి రెండో పక్షి ఎవరు ??

      ట్రైన్ బెంగళూరులో ఆగింది.  అందులో నుండి స్కార్ఫ్ కట్టుకుని,  మాస్క్ పెట్టుకుని ఒక అమ్మాయి దిగింది. దిగి బెదురుగా చుట్టూ చూస్తుంది.

  హాయ్ డార్లింగ్ అన్న వాయిస్ వినిపించింది.  వినిపిస్తున్న వైపు చూసే సీనియర్ అని వచ్చిన అమ్మాయిని హాగ్ చేసుకుంటుంది..

   ఆ సీనియర్ ఏంటి డార్లింగ్ ఈ ప్యాక్ అవడం ఏంటి అని అడిగితే...  అవన్నీ తర్వాత చెబుతాను. ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని భయంగా చెబుతుంది.

    సరే పద అని తన ఫ్లాట్ కి తీసుకు వెళుతుంది.  ఫ్రెష్ అయ్యి వచ్చినా తన డార్లింగ్ కి కాఫీ ఇస్తుంది ఆ సీనియర్.

   అది తాగి కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు చెప్పు ఏమైంది??  అంత సడన్గా వస్తున్నానని కాల్ చేసావ్ అంటే...   సీనియర్ ని పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది.

  ఆ సీనియర్ కి ఏమీ అర్థం కాదు.  కానీ తను చాలా బాధగా ఉంది అని అర్థమై బాధ తీరేంతవరకు ఆగి...

    ఏమైంది రా అని లాలనగా అడుగుతుంది. జరిగింది మొత్తం చెబుతుంది.  సీనియర్ కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది.

   ఎలా ఇంత భారాన్ని మోస్తున్నావు అంటే... మౌనమే సమాధానం అవుతుంది.  నువ్వు ఇంత మెతకగా ఉన్నావు కాబట్టి వాళ్ళ ఆటలు అలా ఉన్నాయి.

   సరే కొంచెం సేపు రెస్ట్ తీసుకో... నేను ఫుడ్ ఆర్డర్ పెడతాను.  తర్వాత ఏమి చేయాలో ఆలోచిద్దాం అని చెబుతుంది. సరే అని రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది.

    ఎవరు  ఆ సీనియర్??
[+] 15 users Like SivaSai's post
Like Reply
#23
Part - 12


  బెంగళూరు...

   ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు డార్లింగ్ అని సీనియర్ అడుగుతుంది.  ప్రస్తుతం ఏదైనా జాబ్ చూసుకోవాలి.  నా మైండ్ రిలాక్స్ అవుతుంది పనిలో పడితే అని చెబుతుంది.

    అయితే మా ఆఫీసులో ఏమైనా వేకెన్సీ ఉందేమో కనుక్కుంటాను.  వద్దు సీనియర్ నేను అసలు కార్పొరేట్ ఫీల్డ్ వైపు రాను.

  ఏదైనా కిండర్ గార్డెన్స్ కాలేజ్లో జాయిన్ అవుతాను అని చెబుతుంది.  దానికి సీనియర్ అది నీ స్టడీస్ కు తగ్గ జాబ్ అవ్వదు.

   పైగా శాలరీ కూడా తక్కువ ఉంటుంది అనగానే... నో ప్రాబ్లం సీనియర్.  నేను ఒక్కదాన్నే కదా!  నాకు అలా చాలు అని...

    పీజీ కూడా చూసుకుంటానని చెబుతుంది.  దానికి సీనియర్ ఈ ఫ్లాట్లో ఉండేది నేను ఒక్కదాన్నే.  నువ్వు ఇక్కడే ఉండు.

   నాకు ఏమీ ప్రాబ్లం లేదని చెబుతుంది.   వద్దు సీనియర్ ఒకళ్ళ మీద ఆధారపడటం నాకు ఇష్టం లేదు అని చెబుతోంది.

    నువ్వు ఏమి ఫ్రీగా ఉండద్దు.  పీజీకి పే చేసేది నాకు ఇవ్వు సరిపోతుందని చెప్పి కన్విన్స్ చేస్తుంది..  సరే సీనియర్ అనగానే....

   రేపు  కాలేజ్స్ వెళ్లి చెక్ చేద్దాం అని చెప్పి ముందు ఫుడ్ తిని పడుకొ అని ప్లేట్ ఇస్తుంది.  థాంక్యూ సీనియర్ ఈ టైంలో నాకు ఇంత  హెల్ప్ చేస్తున్నందుకని ఎమోషనల్ అవుతుంది.

   చూడు డార్లింగ్ ప్రతిదానికి ఎమోషన్ అవ్వడం మాను. అదే నీ వీక్నెస్ అవుతుంది.   అదే నీ వీక్నెస్ అవుతుంది. ముందు తిను అని చిరు కోపంగా చెబుతుంది.

  హైదరాబాద్....

  జైసింహ మాన్షన్..

    విక్రమ్ చెప్పిన ఐడియా ని ఇందిరాగారు వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు.  భార్గవి కి ఫోన్ చేసి శనివారం ఇంట్లో పూజ ఉంది అందరూ తప్పకుండా రావాలి. మీ అన్నయ్య ఫ్యామిలీని కూడా తీసుకురండి అని చెబుతుంది.

  సరే అని ఫోన్ పెట్టేసి సత్యవతి గారికి చెబుతుంది. ఉదయ్ ఎలా ఉన్నాడని అడుగుతారు. రెస్ట్  తీసుకుంటున్నాడు అత్తయ్య అని చెబుతుంది.

     విక్రమ్ రిషి కాల్ చేసి అవిని ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా కలెక్ట్ చేయమని చెబుతాడు.  శిల్ప డిన్నర్ ప్రిపేర్ చేసి రూమ్ లోకి వెళ్ళిపోతుంది.

   ఈరోజు నైట్ ఎలాగైనా విక్రమ్ తో మాట్లాడాలి నైట్ అందరూ పడుకున్న తర్వాత కలవాలి అని భార్గవ్ కి ఫోన్ చేస్తుంది.

   చెప్పు బేబీ ఈ టైంలో ఫోన్ చేసావంటే.... విక్రమ్ రూమ్ ఎక్కడ ఉంటుంది నీకు ఏమైనా ఐడియా ఉందా అని అడుగుతుంది.

   దేనికి బేబీ అంటే.... విక్రమ్ తో మాట్లాడాలి అమ్మ అంటుంది.  ఎందుకు బేబీ అని మళ్ళీ అడుగుతుంది...

   ఇంటి పద్ధతులు అంటూ నాతోనే కుక్ చేపిస్తున్నారు. ఫుడ్ మాత్రం రూమ్ లోనికి పంపుతున్నారు.

  విక్రమ్ ని లైన్ లో పెట్టుకుంటే...అప్పుడు అందర్నీ కంట్రోల్ లో పెట్టుకోవచ్చు మామ్ అంటుంది. నీ ఐడియా బానే ఉంది.

  ఒక్కసారే ఫోర్స్ ఇవ్వకు మెల్లిమెల్లిగా ట్యూన్ చేయని... విక్రమ్ రూమ్ ఎక్కడో చెబుతుంది.

   కానీ తల్లి కూతుర్లకు తెలియని విషయం ఈ విషయాలను విక్రమ్ వింటున్నాడు అని... ఎప్పుడైతే శిల్ప మీద అనుమానం వచ్చిందో అప్పుడే శిల్ప రూమ్ లో ఒక మైక్రోఫోన్ పెట్టిస్తాడు.

   ఆ మాటలు విన్న విక్రమ్ నన్నే లైన్ లో పెట్టుకోవాలని బాగా ప్లాన్ చేస్తున్నావ్.  నాతో ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను.

   విక్రమ్ తో ఎందుకు పెట్టుకున్నాను అని నీ చెంపలను నీ చేతులతోనే కొట్టించి...  నిజం చెప్పిస్తాను  అని అనుకుంటాడు.

  డిన్నర్ ఫినిష్ చేసాక ఎవరు రూంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. నైట్ 12:00కి అందరూ పడుకుంటారు అని ఫిక్స్ అయ్యి భార్గవి చెప్పిన గుర్తులను బట్టి విక్రమ్ డోర్ నాక్ చేస్తుంది.

  ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయడు . ఈసారి ఇంకొంచెం గట్టిగా కొడుతుంది. అంతే మాన్షన్ మొత్తం లైట్లతో వెలిగిపోతుంది.

  శిల్ప కు టెన్షన్ స్టార్ట్ అవుతుంది.  లలిత, మాధవి రూమ్ లో నుంచి బయటకు వచ్చి శిల్ప ని చూస్తారు.

   ఏమైంది శిల్పా ఇక్కడ ఉన్నావ్ అని అడుగుతారు.  శిల్ప కంగారు పడుతూ కొత్త ప్లేస్ కదా అత్తయ్య గారు నిద్ర పట్టక బయటకు వచ్చాను అని చెబుతోంది.

  చీకటిలో వినయ్ రూమ్ ముందు ఉంటే ఏమైందని అడిగాం అంతే అని చెప్పి..  వెళ్లి పడుకో శిల్పా మళ్ళీ ఉదయం 4:00కే లేవాలని చెప్పి వెళ్ళిపోతారు.


   ఇది వినయ్ రూమా?  అమ్మ కరెక్ట్ గా చెప్పలేదా లేక నేను సరిగ్గా వినలేదా అనుకుంటూ రూమ్ కి వెళ్ళిపోతుంది.

   ఇది అంతా చీకట్లో నుంచి చూస్తున్న విక్రమ్ నన్ను కలవడం అంత సులువు కాదు శిల్ప.  ఈ రాత్రికి నీకు బ్యాడ్ డ్రీమ్స్ పెళ్ళాం కానీ పెళ్ళాం అనుకుంటూ వెళ్లి పడుకుంటాడు.

  ఉదయం నాలుగు అవ్వగానే శిల్ప ని లేపడం అన్ని శుభ్రం చేయించడం మొదలు పెడతారు.  ఈరోజు రెస్ట్ కూడా తీసుకొని ఇవ్వకుండా కిచెన్ లోకి పంపిస్తారు.

   కొందరికి ప్రోటీన్ షేక్ అని, కొందరికి కాఫీ, మరికొందరికి టీ అని తర్వాత టిఫిన్స్ అని ఊపిరి సలుపనివ్వరు. అన్ని ప్రిపేర్ చేసే ఫ్రెష్ అయి వస్తానని రూమ్ లోకి వెళుతుంది.

ఛీ ఛీ నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది.  ఏదో అనుకుంటే,  ఇంకేంటో జరుగుతుంది.  ఇలా అనుకుంటే పర్మినెంట్గా దాన్నే ఉంచేసేదాన్ని.

   బయట ఈ ఫ్యామిలీకి ఉన్న  పేరు చూసి లగ్జరీగా ఉండొచ్చు అనుకున్నాను.  కానీ పని మనిషికి ఎక్కువ ఇంటి మనిషికి తక్కువ అన్నట్టు ఉంది నా పరిస్థితి అని తిట్టుకుంటూ...  భార్గవ్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది.

   దానికి భార్గవి నువ్వు టెన్షన్ పడకు.  రేపు పూజ ఉందని చెప్పారు. మేము వస్తాము కదా ఏదో ఒకటి చేసి నిన్ను ఇక్కడ తీసుకు వస్తాను అని చెబుతుంది.

    విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళాక రిషి నుంచి కాలు వస్తుంది. చెప్పు రిషి అనగానే.....  శిల్ప గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు.

    అది అంతా విని కోపంతో దవడలు బిగుసుకుంటాయి. కళ్ళు ఎర్రబడతాయి.  అవిని గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు.

   రేపు ఈవినింగ్ కల్లా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.  భరత్ విక్రమ్ క్యాబిన్లోనికి వస్తాడు.  విక్రమ్ అలా చూసి ఏమైంది బావ అనగానే శిల్ప గురించి చెప్తాడు.

  అదంతా విని వీళ్ళు చాలా డేంజర్ గా ఉన్నారు. ధనుంజయ్ అంకుల్  అసలు ఎలా తెలుసుకోకుండా ఉన్నారు అని అంటాడు.

   దానికి విక్రమ్ ,  భార్గవి యాక్టింగ్ అంత బాగా ఉంటుంది. భార్గవి ని నమ్మి అంకుల్ ఫోకస్ మొత్తం బిజినెస్ మీద పెట్టారు.

  రేపు అసలు గేమ్ స్టార్ట్ చేద్దాం వెళ్లి వర్క్ చేసుకొ అని చెప్పి సిస్టంలో తల దూర్చుతాడు.  ఎంత వర్క్ లో పడిన అవిని చేతి స్పర్శ గుర్తుకు వచ్చి చాలా డిస్టర్బ్ అవుతాడు.

   నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు.  నీ రూపం తెలియకపోయినా నీ స్పర్శ చెబుతుంది ??నువ్వు నా దానివి అని.

  నీకోసం కేవలం నీకోసం నిన్ను కలవడానికి నేను వెయిట్ చేస్తున్నాను. నువ్వు నాకోసం వెయిట్ చేస్తున్నావా లేక అని ఇంకా ఆలోచించలేక పోతాడు.

  బెంగళూరు...

   సీనియర్, డార్లింగ్ కలిసి నియర్ బై ఉన్న కాలేజ్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఒక కాలేజ్లో ప్రిన్సిపాల్ ని కలుస్తారు.

    ప్రిన్సిపల్ ఆ అమ్మాయికి క్వాలిఫికేషన్ చూసి ఇక్కడ నువ్వు జాబ్ చేయగలవా అని అడుగుతే తప్పకుండా అని చెబుతోంది.

  ఓకే అని ఫామ్ ఇస్తారు.  ఫామ్ ఫిల్ చేసి ప్రిన్సిపాల్ కి ఇస్తుంది.  Name చూస్తూ మిస్ అవని అని పిలుస్తుంది.

   చెప్పండి అనగానే... మీరు అనాధ అని అడుగుతుంది. అవును మేమ్ అని చెబుతుంది.

.. ఓకే అవని మండే నుంచి కాలేజ్ కి రండి. ప్రెసెంట్ అయితే మీకు 15000 ఇస్తాను. మీ స్కిల్స్ చూశాక శాలరీ తో పాటు ప్రమోషన్ కూడా ఇస్తాను అని చెబుతోంది.

   థాంక్యూ మేమ్ అని చెప్పి బయటకు వస్తుంది.  సీనియర్ అవని వంక చూస్తూ ఇప్పుడు హ్యాపీనా అని అడిగితే... చాలా హ్యాపీ సీనియర్.

  నా లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అంత మంచే జరగాలి అని వాళ్ళ అమ్మ గారిని తలుచుకుంటుంది. నీకేంటి బంగారం అంతా బాగుంటుంది.. చూడు నిన్ను అర్థం చేసుకొని నేను నిన్నుగా కోరుకునే వ్యక్తి కూడా నీ లైఫ్ లోకి వస్తాడు చూస్తూ ఉండు అంటుంది.

   ప్లీజ్ సీనియర్ నా లైఫ్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. ఆ టాపిక్స్ ఏమీ వద్దు అని చెప్పి ఫ్లాట్ కి తీసుకు వెళుతుంది. ఆరోజు అందరికీ ఇంక నార్మల్గానే గడిచిపోతుంది.

   జై సింహ మాన్షన్....

   శనివారం ఉదయం పూజ జరిపిస్తారు.  లలిత కళ్యాణ్ దంపతులు కూర్చుని పూజ చేస్తారు. భార్గవికి మాత్రం మనసులో విక్రమ్ శిల్పతో చేపిస్తే బాగుంటుందనుకుంటుంది.

పూజ పూర్తయిన తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి కూర్చుంటారు. మగవాళ్ళు బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే..  పెద్దవాళ్లు లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటారు.

   అదంతా చూసి భార్గవి ఇదే మంచి టైం శిల్పని తీసుకెళ్తాను అని అడగడం అనుకుని పెద్దమ్మ గారు అని పిలుస్తుంది.  ఏంటి భార్గవి అని అడిగితే..

  శిల్ప ని కొన్ని రోజులు ఇంటికి తీసుకెళ్తాము అని ఇందిరాగారిని అడుగుతుంది.  దానికి ఇందిరా గారు నవ్వుతూ నీ బెంగ అర్థమవుతుంది.

   ఎప్పుడు కూతురిని వదిలి ఉండలేదనుకుంట... ఏదైనా ఒక్కతే కూతురు కదా!  ఆ మాత్రం ఉంటుందిలే కానీ..

శిల్ప ని  6 నెలలు ఎవరికి కనపడకూడదు కదా అని చెప్పాము కదా అని గంభీరంగా అంటారు.

   ఒక్క తే కూతురు ఏంటి అని సత్యవతి గారు అంటూ కొడుకు, కోడలు వంక చూస్తారు  ధనుంజయ్ గారు కూడా అయోమయంగా చూస్తారు.

   భార్గవి గుటుకలు మింగితూ ఈవిడేంటి ఇలా మాట్లాడారు. శిల్ప లైఫ్ సెటిల్ అయ్యాక తెలిసిన ఏదో ఒక స్టోరీ చెప్పే దాన్ని..

  ఇప్పుడు ఏదో ఒకటి కవర్ చేయాలి లేకపోతే..  చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందనుకుంటుంది. శిల్ప టెన్షన్ తో చేతులు పిసుకుంటూ ఉంటుంది.

ఇప్పుడు భార్గవి పరిస్థితి ఏమిటి?
తల్లి కూతుళ్ళకి  విక్రం ఎలా చెక్ పెడతాడు??
కథ కొనసాగుతుంది...
[+] 14 users Like SivaSai's post
Like Reply
#24
మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ లాగా కనిపిస్తోంది... మంచి ఫీల్ వస్తోంది
Like Reply
#25
Excellent update
Like Reply
#26
Superb
Like Reply
#27
Writer gaaru meeku private message pedadam ante block ai undi, okasari aa block testhe message chestha andi
Like Reply
#28
 Part - 13


    సత్యవతి గారు ధనుంజయ్ ఏం చెబుతాడా అని చూస్తారు.   కానీ ధనుంజయ్ సైలెంట్ గా ఉంటాడు. సత్యవతికి శేషగిరి గారికి కోపం వచ్చే అమ్మా ఇందిరాగారు మేము ఇంకా బయలుదేరుతాము.

    పని ఉంది అని చెప్పి బయటికి వచ్చేస్తారు. క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లి పోతారు.  ధనుంజయ్ భార్గవి ని చూస్తూ ఇంక మాకు సెలవిప్పించండి అత్తయ్య గారిని ఇందిరాగారికి చెప్పి,, భార్గవి ని   తీసుకొని బయటకు వస్తాడు.

భార్గవి తో నువ్వు మీ అన్నయ్య వాళ్లతో కలిసి వెళ్ళు. నాకు పని ఉంది అని చెప్పి భార్గవి వైపు చూడకుండా బయటికి వెళ్ళిపోతాడు.

    భార్గవి అబ్బా ఇప్పుడు ఏంటి ఇలా జరిగింది.  ఇంటికి వెళ్ళాక నేను ఎలా కవర్ చేయాలి, ముందు ఈయన ని కూల్ చేస్తే మిగిలినవన్నీ ఎలాగైనా చెక్కబట్టొచ్చు అనుకుని వాళ్ళ అన్నయ్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది.

   ధనుంజయ్ అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళుతూనే ఉంటాడు. ఇందిరాగారి మాటలే చెవిలో వినపడుతూ ఉంటాయి మీకు ఒక్కతే అమ్మాయి కదా అన్న మాట.

     ఆ మాట తనకి గుండెల్లో సూదులు గుచ్చుతున్నంత పెయిన్ వస్తుంది.కారు ఒక నిర్మాణస్యమైన ప్రదేశంలో ఆపి కళ్ళు మూసుకుంటాడు.

   మూసిన రెప్పల వెనక  అవని నీ ఎత్తుకొని ఉన్న రజిత రూపం కనిపిస్తుంది..  ఆ రూపం చూస్తూనే తెలియకుండానే నిద్రపోతాడు.

  రజిత కన్నీళ్ళతో నా కూతురికి  ఇంత అన్యాయం చేస్తారా మీరు అని అడుగుతుంది. ఉలిక్కిపడి లెగుస్తాడు.

   ఏంటి ఇలాగ వచ్చింది అసలు.  అవని ఎక్కడికి వెళ్ళింది ముందు అది కనుక్కోవాలి. కాలేజీలో ఎంక్వయిరీ చేపించాలి.

   నిజంగా బాయ్ ఫ్రెండ్ తో వెళ్తే తీసుకువచ్చి ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను అనుకుని... చీకటి పడుతుంటే ఇంటికి వెళతాడు.

  లోపలికి వెళ్ళేటప్పటికి సత్యవతి శేషగిరి గారు లగేజ్ ప్యాక్ చేసుకొని  బయటకు వస్తూ ఉంటారు. ఎక్కడికి నాన్న వెళుతున్నారు అంటే ఊరికి వెళ్ళిపోతున్నాము శాశ్వతంగా.

   ఇంక ఇక్కడికి రాము అని చెబుతారు. ఇప్పుడు ఏమైంది నాన్న! ఎవరైనా ఏమైనా అన్నారా అంటే నువ్వు చేసింది చాలు.

   కొన్ని రోజుల పోతే నాకు తల్లిదండ్రులు లేరని కూడా చెప్పగలవు ఆ మాట నువ్వు అంటున్నప్పుడు మేము వినడం కన్నా దూరంగా ఉండటమే బెటర్ అని వెళ్ళిపోతున్నాము అని చెప్పి బయలుదేరుతారు.

  ప్లీజ్ నాన్న ఆగండి నేను ఎప్పుడూ అలా చెప్పలేదు అని గిల్టీగా తలదించుకుంటాడు. నువ్వు నీ భార్య చెప్పకుండానే వాళ్ళకి ఒక్కతే కూతురు అన్నట్టుగా తెలిసిందా ధనుంజయ్ అని సూటిగా అడుగుతారు .

   నిజంగా నేనేమీ చెప్పలేదు నాన్న. నాకు ఇద్దరు కూతుళ్లు సమానమే అంటే... నిజంగానా అని శేషగిరి గారు అడుగుతారు.

  సరే అయితే నిన్ను రెండు క్వశ్చన్స్ అడుగుతాను సమాధానం చెబుతావా ధనంజయ్ అంటారు.

   అడగండి నాన్న అంటే..  శిల్ప ఏం చదువుకుంది అని అడుగుతారు. ఫ్యాషన్ టెక్నాలజీ అని  చెబుతాడు.   మరి అవని అని అడిగితే...  ధనుంజయ్ ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోతాడు.

   దానికి శేషగిరి గారు విరక్తిగా నవ్వుతూ అసలు అవని సర్టిఫికెట్స్ లో ఒక పేరెంటుగా నీ పేరు ఉందా లేదా అదైనా నీకు తెలుసా అని అడుగుతారు.

   అదేంటి నాన్న అలా అంటారు నా పేరు కాక ఇంకా ఎవరిది ఉంటది అంటే.... ఎప్పుడైనా అవిని తో పేరెంట్స్ మీటింగ్ వచ్చి ఉంటే తెలిసేది ఎవరి పేరు ఉందో అని చెప్పి బాధపడతారు.

    శిల్పకి టైం ఇచ్చినట్టుగా అవని కి ఏ రోజైనా ఇచ్చావా నువ్వు...  కన్న తండ్రిగా నీకే నీ కూతురు లేనప్పుడు, బయట సమాజానానికి ఎక్కడినుంచి ఉంటుంది అని చెప్పి మేము వెళ్తాము.

        నీకు అవిని ఎలా లేదో మాకు నా కొడుకు కూడా అలాగే లేడు అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతారు.

.ధనుంజయ్ కోపంగా లోపలికి వెళ్లి భార్గవి అని పిలుస్తాడు.  అమ్మో ఇప్పుడు ఎలా ఆపాలి అనుకుంటూ ఏవండీ అని పిలుస్తుంది.

   నాకు ఒక్క దానికి మాత్రమే సమాధానం చెప్పు ఇందిరా గారు ఒక్కతే కూతురు అంటున్నారు.  నువ్వు అలాగే చెప్పావా అంటే..  అది అని నాన్చుతుంది.

   నువ్వు నాన్చొద్దు... నాకు నిజం మాత్రమే కావాలి అంటే..
అవని పెళ్లి చేసుకోను అంది కదండీ..  శిల్ప కి మనం కుదురించాం కదా!

   పెద్దమ్మాయికి చేయకుండా చిన్నమ్మాయికి అంటే తప్పుగా అనుకుంటారేమో అని.. ఒక్క అమ్మాయే అన్నట్టుగా  చెప్పాను.

   పెళ్లయిన తర్వాత నెమ్మదిగా చెప్పొచ్చు అని స్లో గా చెబుతుంది.  అంత అవసరం ఏమొచ్చింది నీకు భార్గవి.  ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం చేసే వాళ్ళము.


    ఇప్పుడు వియ్యంకులు ముందు నన్ను తలదించుకునే లాగా చేసావు అని చెప్పి చిరాకుగా విసుక్కుని లోపలికి వెళ్ళిపోతాడు.

   అమ్మా ఇప్పటికైతే ఒక గండం గడిచింది.  మెల్లగా కూల్ చేయొచ్చు అనుకొని..  భార్గవి కిచెన్లోనికి వెళుతుంది.
డిన్నర్ ప్రిపేర్ చేయడానికి.

   జై సింహ మాన్షన్ 

    శిల్ప కి పని చెప్పి కిచెన్ లోకి పంపిస్తారు.  వెరైటీస్ అన్ని ఆర్డర్ వేసి కుక్ హెల్ప్ తో నువ్వే వంట చేయాలి అని చెప్పి పంపిస్తారు.

   నా జీవితం మొత్తం ఈ వంటింటికే అయిపోయేటట్టు ఉంది అని విసుకుంటూ కిచెన్ లోకి వెళుతుంది. శిల్ప వెళ్ళిన తర్వాత విక్కీ నువ్వు అన్నదే నిజం భార్గవి మొత్తం నడిపింది.

  మిగిలిన వాళ్ళకి ఈ విషయాలు ఏమీ తెలియదు ఇప్పుడు ఏం చేద్దాం విక్కీ అని ఇందిరా గారు అడుగుతారు.

   గ్రానీ మీరు ఇంట్లో తన పని చూడండి.  బయట వర్క్ నేను చూసుకుంటాను.

ధనుంజయ్ అంకుల్ కి తన చేసిన మిస్టేక్ ఏంటో ముందు తెలియాలి.  నాకు ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ధనుంజయ అంకుల్ పేరెంట్స్ బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయారు.

  అంటే ఈ పాపం తో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా అవని గురించి కూడా నాకు నైట్ కల్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది.
దాన్ని బట్టి ఏం చేయాలి అన్నది ప్లాన్ చేస్తాను అని చెప్పి రూమ్ కి వెళ్ళిపోతాడు.

   మాధవి,  లలితకి శిల్ప మీద పిచ్చ కోపం వస్తూ ఉంటుంది. వెంటనే కిచెన్ లోకి వెళ్లి ఏం చేస్తున్నావు, అలా చేయి, ఇలా చేయి అని చెప్పి చుక్కలు చూపిస్తారు.

   గట్టిగా మాట్లాడలేదు అలా అని పనిచేయకుండా తప్పించుకోలేదు ఓరి భగవంతుడా అనుకుంటూ... వంట చేస్తూ ఉంటుంది.

  వంట పూర్తయి ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంటే ఇందిరాగారు పిలుస్తారు.  చెప్పండి అమ్మమ్మ అని మర్యాదగా అడుగుతుంది.

   కాళ్లు బాగా నొప్పులుగా ఉన్నాయి కొబ్బరి నూనె తీసుకువచ్చి కాళ్ళకి మర్దన చేసి నొక్కు అని ఆర్డర్ వేస్తారు.  నేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది.

  నీకేగా నేను చెప్పింది అంటారు.  ఇక ఏమీ చేయలేక ఆయిల్ తీసుకొచ్చి కాళ్ళకి రాస్తావుంటే కాళ్ళ శిల్ప ఒడిలో పెడతారు.

   ఏమీ చేయలేక ఇంకా కాళ్లు పట్టి ఫ్రెష్ అయి వస్తాను అమ్మమ్మగారు అని చెప్పి రూమ్ కి వెళ్లి...

  నా లైఫ్ నేను ఎలా ఎంజాయ్ చేసేదాన్ని. ఏది కోరుకుంటే అది నా ముందు ఉండేది.  కానీ ఇప్పుడు నా పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయింది.

  దీనికి అంతటికీ కారణం అమ్మే అని చెప్పి భార్గవ్ మీద పిచ్చి చిందులు తొక్కుతూ ఉంటుంది.

  విక్రమ్ సిస్టం లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు.  తన వేళ్ళు కీబోర్డ్ మీద చకచకా కదులుతూ ఉంటాయి.  కళ్ళు జింకను వేటాడే చిరుత పులిలా  షార్ప్ గా స్క్రీన్ ని చూస్తూ ఉంటుంది.

ఫోన్ వైబ్రేట్ అవుతుంటే ఫోన్ వైపు చూస్తాడు.  అది రిషి కాల్.. వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు రిషి అంటే....

.సర్ అవనీ గారి ఆచూకీ తెలిసింది అంటాడు. ఎక్కడ ఉంది అంటే.. బెంగళూరు అని చెప్తాడు.

  అక్కడికి ఎలా వెళ్ళింది.ఎవరితో ఉంది.అంటే.....

ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాక డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్లారు.  ఎవరు గుర్తుపట్టకుండా ఉండే విధంగా మాస్క్, స్కార్స్ తో ఫుల్ గా కవర్ చేసుకున్నారు.

  బెంగళూరులో దిగిన తర్వాత కూడా అవనీ గారు అవి ఏమీ ఓపెన్ చేయలేదు.  వాళ్ల సీనియర్ తో కలిసి ఒక ఫ్లాట్లో ఉంటుంది.

  ప్రస్తుతానికైతే ఒక ప్రీ కాలేజ్లో టీచర్గా చెబుతున్నారు  సార్ అని చెబుతాడు. వాట్ టీచర్ గానా అంటే...అవును సార్ అని కాలేజ్ నేమ్ ప్లేస్ అడ్రస్ అన్ని ఫార్వర్డ్ చేస్తాడు.

    సీనియర్ అని చెప్పావు తనేమి చేస్తుంది అంటే.. ఆ అమ్మాయి పేరు నేహా. V J S గ్రూప్స్ లోనే తన జాబ్ చేస్తుంది .

  ఓకే థాంక్యూ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్.. డిన్నర్ టైంలో అందరికీ ఇన్ఫర్మ్ చేస్తాడు.  అవని బెంగళూరులో ఉంది.

  నేను వన్ వీక్ బెంగళూరు వెళ్తాను.  తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం అని చెప్పి వాళ్ళు గ్రానీ వంక చూస్తాడు.

. నువ్వు వెళ్ళు నాన్న ఇక్కడ సంగతులు మేము చెక్క పెడతాం కదా! జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి విక్కీ అని చెబుతారు .

.సూర్ గ్రాని  అని అందరికీ గుడ్ నైట్ చెప్పి రూమ్ కి వెళ్ళిపోతాడు.  మంచం మీద పడుకుని అవిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

అవని ఈ టుడేస్ బాగా ఎంజాయ్ చెయ్. నేను అక్కడికి వచ్చాక నీతోనే చెప్పేస్తాను.  నిజమంతా అనుకుంటూ.. అవి ని  తలుచుకుంటూనే పడుకుంటాడు.

బెంగళూరు

.నేహా,  అవిని సాయంత్రం పార్కుకి వెళ్తారు.  ఒక బెంచ్ మీద కూర్చుని ఎదురుగుండా ఉన్న పిల్లల్ని చూస్తూ ఉంటుంది.

  పిల్లలు పేరెంట్స్ తో కలిసి ఆడడం చూస్తుంది.  అవిని కి చిన్నప్పటి రోజులు గుర్తు వస్తాయి.

.ధనుంజాయ్ ఆఫీస్ నుంచి రాగానే చుసిన అవని నాన్న అని వెళ్ళితే..  ఒకసారి చూసి శిల్ప దగ్గరికి వెళ్లి ముద్దు చేస్తారు.

  అవని కిచెన్ లో కి వెళ్లి వాటర్ తెచ్చి ఇస్తుంది. అవి తీసుకొని సైలెంట్ గా తాగుతారు గాని..  అవని తో ఏమి మాట్లాడారు.

    ధనుంజాయ్ అక్కడ నుండి వెళ్ళిపోయాక భార్గవి వచ్చి మీ నాన్న కి నువ్వు అంటే అస్సలు ఇష్టం లేదు. తప్పక భరిస్తున్నారు.

   నువ్వు కూతురు వి అని చెప్పికోవడం కూడ ఇష్టం లేకే నిన్ను ఎక్కడకి తీసుకువెళ్లరు. ఫార్మాలిటీకి మాత్రమే నిన్ను రమ్మని నాతో అడిగిస్తారు అని.  అ చిన్న మనుసు ని విరచేస్తుంది.
అవని బాధగా అక్కడ నుండి రూమ్ కి వెళ్లి ఎక్కికి ఏడిస్తుంది. అ రోజు నుండి ధనుంజయ్ కి ఎదురుపడదు. అవి గుర్తువచ్చి అవని కళ్ళు వర్షిస్తాయి.

  ఎందుకు నాన్న నేను అంటే మీకు ఇష్టం లేదు. నేను ఏమి తప్పు చేశాను అని బాధపడుతూంది.
[+] 11 users Like SivaSai's post
Like Reply
#29
 Part - 14


నేహా  అవిని పక్కన కూర్చుని ఎందుకు అవని అంత బాధ పడుతున్నావో అని అడుగుతుంది.  ఏమీ లేదు సీనియర్ అమ్మ లేకపోతే ఒక ఆడపిల్ల లైఫ్ చాలా కష్టం కదా అని అంటుంది.

  ప్రతి దానికి ఎక్కువ ఆలోచించొద్దు. అవని కొత్తగా లైఫ్ స్టార్ట్ చేశావు.  నీకు అన్నీ మంచి రోజులు వస్తాయి. చీకటి పడుతుంది పద  ఫ్లాట్ కి వెళదామని తీసుకొస్తుంది.

    పడుకున్నా అవని చేతి కి ఉన్న ఉంగరాన్ని చూస్తూ మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఉంటారు కదా!  నేనెవరో మీకు తెలియకపోవచ్చు బట్ నా లైఫ్ లోకి మాత్రం ఇంకా ఎవరిని రానివ్వను.

  మీతో ఉన్న ఒక్కరోజు నాకు చాలు.  మీ చేతి స్పర్శ మాటలు నాకు చాలా భరోసాని ఇచ్చాయి.  శిల్ప చాలా అదృష్టవంతురాలు. మీలాంటి వ్యక్తితో ఉంటున్నందుకు అని భారంగా కళ్ళు మూసుకుంటుంది. 
సండే ఉదయం ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. ఎవరా అని నేహా తలుపు తెరిస్తే అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది.

   ఎవరు నువ్వు అని అడిగితే నా పేరు కరుణ అండి. ఏమైనా పని ఉంటదేమో అని వచ్చాను అని చెబుతోంది. ఉన్నది మేమిద్దరమే మాకు పనిమనిషి అవసరం లేదు అని నేహా తలుపు వేస్తుంటే ...

  అమ్మగారు మీరు జీతం ఎంత ఇచ్చిన పర్వాలేదండి. ఇంటి పని,  వంట పని అన్ని చేస్తాను. నా భర్తకి ట్రీట్మెంట్ చేయించాలి అని దీనంగా చెబుతుంది.

   ఆ మాటలు విన్న అవని పోనీలే  సీనియర్ తన భర్తకి ట్రీట్మెంట్ అంటుంది కదా మనం అడ్జస్ట్ అవుదాం అని అంటుంది.

ఈ అతి మంచితనమే నీకు వద్దు ఆవని. ఆ అమ్మాయి చెప్పింది అంతే నిజమే అని ఎలా అనుకుంటావు అంటుంది.

   వెంటనే కరుణ ప్లీజ్ అమ్మ నా పని చూడండి మీకు నమ్మకం కలిగితే కంటిన్యూ చేయండి.  లేకపోతే తీసివేద్దురు అని బ్రతిమాలుతుంది..

  అవిని కూడా నేహా వంక ప్లీజ్ అని చూస్తుంది.  సరే నీ ఇష్టం అవిని అని చెప్పి లోపలికి రమ్మని అమ్మాయికి పని అంతా చెబుతుంది.

జై సింహా మాన్షన్

విక్రమ్ ఇందిరా గారి దగ్గరికి వచ్చి గ్రానీ నేనొకసారి అవని వాళ్ళ తాతగారు వాళ్ళని కలిసి వస్తాను అని చెప్పి బయలుదేరుతాడు.

..మూడు గంటల ప్రయాణం తర్వాత విక్రమ్ భువనగిరి చేరుకుంటాడు. శేషగిరి గారు ఉన్న ఇంటికి వెళ్లి తలుపు కొడతాడు. ఎవరు అని చూసిన సత్యవతి గారికి ఎదురుగా ఉన్న విక్రమ్ కనిపిస్తాడు.

   నువ్వేంటి బాబు ఇక్కడ అని లోపలికి పిలుస్తారు. లోపలికి వచ్చిన విక్రమ్ కి ఎదురుగుండా రజిత గారి ఫోటో కనిపిస్తుంది.

ఫోటోనే చూస్తున్న  వి క్రమ్ తో ఏమైంది బాబు అలా చూస్తున్నావు అంటే  ..  ఫోటోలో ఉన్నది ఎవరు అమ్మమ్మ గారు అని అడుగుతారు.

ఏమి చెప్పాలో తెలీక సత్యవతి గారు ఇబ్బంది పడుతుంటే..  పర్లేదు చెప్పండి నాకు కొన్ని విషయాలు తెలిసాయి అంటాడు.

  ఇంకా దాయడం వల్ల లాభం లేదు అనుకుని ధనుంజయ్ మొదటి భార్య రజిత అని చెబుతారు. మీ నుంచి నాకు కొన్ని విషయాలు తెలియాలి అమ్మమ్మ గారు అంటే దేని గురించి అని అడుగుతారు.

మీరు ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు అని సూటిగా అడుగుతాడు. దానికి సత్యవతి గారు విరక్తిగా నవ్వుతూ కొన్ని బంధాలు దూరంగా ఉంటేనే మంచిది బాబు అంటారు.

నేను అవిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని డైరెక్ట్ గా చెప్తాడు. శేషగిరి గారు ఆశ్చర్యంగా నీకు అవని ఎలా తెలుసు అని అడిగితే...

   అవి నేను తర్వాత చెబుతాను. ముందు మీరు చెప్పండి అవని గురించి అంటాడు. ఒక నిర్ణయానికి వచ్చిన శేషగిరి గారు అవిని  చిన్నప్పుడు నుండి జరిగిన అన్ని చెబుతారు.

  పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకున్న విషయం తెలిసి విక్రమ్ కి చాలా బాధ అనిపిస్తుంది.  ఎట్ దట్ సేమ్ టైం చాలా ప్రౌడ్ గా కూడా అనిపిస్తుంది.
ఇప్పుడు చెప్పు బాబు,  నీకు అవని గురించి ఏం తెలుసు అంటే..  నేను పెళ్లి చేసుకుంది అవని నే  అని ఒక బాంబు వేస్తాడు.  ఏమంటున్నావ్ నువ్వు అని  ఆశ్చర్యంగా అడుగుతారు.

  మీ పెద్ద వాళ్ళు పెళ్లి చూపుల్లో చూస్తుంది శిల్పని.  పెళ్లికూతురని చేసింది కూడా శిల్పనే కదా అంటే...

  పెళ్లి పీటలపై కూర్చుంది మాత్రం అవని నే తాతగారు అని నమ్మకంగా చెబుతాడు . అది ఎలా సాధ్యం పెళ్లికూతురుని చేశాక ముసుగు వేసింది నేనే కదా అని సత్యవతి గారు అంటారు.

   అవి నాకు తెలియదు. నేను తాళి కట్టింది మాత్రం అవనీకే అని చెబుతాడు.  అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెబుతున్నాను అని అనుమానంగా అడుగుతారు.

విక్రమ్ నేను ఇప్పుడు వరకు అవని నీ చూడలేదు కానీ నాకు  అర్థమయింది అవని కే నేను తాళి కట్టాను అని. మీకు అన్ని విషయాలు నేను క్లారిటీగా ఇప్పుడు చెప్పలేను. సమయం వచ్చినప్పుడు అవే తెలుస్తాయి నన్ను నమ్మండి అంటాడు.

  మీ ఫ్యామిలీ ఎందుకు ఒక్కతే  కూతురు అని చెప్పింది అన్నది కూడా  నాకు ఇప్పుడు అనవసరం.

  మీరు కోపరేట్ చేస్తే అవని నీ వెనక్కి తీసుకొస్తాను. మీ అబ్బాయి కి కూడా తన చేసిన తప్పును తెలియజేస్తాను అంటారు.

వెంటనే శేషగిరి గారు తన పర్సు లో నుంచి అవని రాసిన ఉత్తరం తీసి విక్రమ్ చేతికి ఇస్తారు. అవని ఏ బాయ్ ఫ్రెండ్ తోనే వెళ్లలేదు బాబు. ఈ ఉత్తరం రాసి మా రూమ్ లో పెట్టి వెళ్ళిపోయింది అని చెబుతారు.

లెటర్ చదివిన విక్రమ్ కి పూర్తిగా అర్థం అవుతుంది. ఉత్తరం మీద ఉన్న కన్నీళ్లు మరకలను చూస్తేనే అవని ఎంత బాధ పడుతూ రాసిందో అన్నది అర్థమైన విక్రమ్ కి భార్గవ్ని ఎదురుగుండా నుంచో పెట్టి షూట్ చేయాలని అంత కోపం వస్తుంది.

వెంటనే అవిని దగ్గరికి వెళ్లి నేనున్నాను నీకు అని గట్టిగా కౌగిలించుకుని చెప్పాలని అనిపిస్తుంది. తన కోపం పెద్దవాళ్లు చూస్తే బాగుండదని గట్టిగా కళ్ళు మూసుకుని ఒక ఐదు నిమిషాలు కూర్చుంటాడు.

తాతగారు మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా అంటే చెప్పు బాబు అని అడుగుతారు.  మీరు ఇంటికి తిరిగి వెళ్ళండి అంటే..  లేదు నాయనా అక్కడికి ఇప్పుడు మేము వెళితే భార్గవి  కి ఇంకా లోకువైపోతాము.

మీరు కంగారు పడకండి తాతగారు భార్గవి నోటితోనే మిమ్మల్ని వెనక్కి రమ్మనేటట్టు చేస్తాను. మీరు అక్కడికి వెళ్లాక ప్రతి నిమిషం   మీ అబ్బాయికి తను చేసిన తప్పేంటో ఎత్తు చూపుతూ ఉండండి.

నేను ఆవని ఈలోపు వెనక్కి తీసుకు వస్తాను అని చెబుతాడు.  అవిని ఎక్కడుందో నీకు తెలుసా అంటే తెలుసు.  వస్తాను తాతగారు అని చెప్పి బయటకు వస్తాడు.

  అవిని గురించి తెలుసుకున్న కొలది అవిని మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది. నువ్వు చాలా సెన్సిటివ్ గా ఉన్నావు. నీ చుట్టూ కంచిగా నేను మారతాను.

నీలో ఉన్న అతి మంచితనాన్ని తీసి ఫైట్ చేసే విధంగా నిన్ను తీర్చుదిద్దుతాను కదా అనుకుంటూ ఇంటికి చేరుతాడు.
డైరెక్ట్ గా వాళ్ళ గ్రానీ దగ్గరికి వెళ్లి చేయాల్సిన పని చెప్పి సాయంత్రం నేను బెంగళూరు వెళుతున్నాను అని చెప్తాడు.

శిల్ప కి  ఇంటి పని,  వంట పనితో విక్రమ్ గురించి ఆలోచించే అంత టైం కూడా ఉండదు.  రాత్రి అయ్యేటప్పటికి బాగా అలసిపోయి దుప్పటి ముసుగేసుకుని పడుకుంటుంది.
ఇక విక్రమ్ ఎక్కడికి వెళుతున్నాడు ఎలా తెలుస్తుంది.

ఆరోజు రాత్రికి విక్రమ్ బెంగుళూరు చేరుకుంటాడు. విక్రమ్ ఫ్రెండ్స్ శ్రీ వచ్చి రిసీవ్ చేసుకుని గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్తాడు.

ఇప్పుడు చెప్పు బావా చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పావు ఏమిటది అని అడుగుతే... తన పెళ్లిలో జరిగినది చెబుతాడు దానికి షాక్ తో నీలుక్కుపోతాడు. 

రేయ్ శ్రీ అని గట్టిగా పిలుస్తాడు.  శ్రీ వెంటనే వాటర్ నెత్తిపై నుంచి పోసుకుని  ఏంటి బావ ఇంత షాక్ ఇచ్చావు అంటే....  విన్న నీకే ఇలా ఉంటే మరి నా పరిస్థితి ఏంటి అంటాడు.

   ఇప్పుడు ఏం చేద్దాం బావ అని శ్రీ అడుగుతాడు. రేపు మార్నింగ్ అవని ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాలి. తనని చూడాలి, ఫాలో అవ్వాలి ఫస్ట్ స్టెప్ అయితే ఇదే అంటాడు.

బావా నాకు ఒక డౌటు అడగనా అంటే...  అడుగు అని విక్రమ్ అంటాడు. నువ్వు అవని ని చూశాక అవినీ కన్న శిల్పే అందంగా ఉంది అనుకుంటే...  నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు అంటే....  డెఫినిట్గా అవిని నే అని సమాధానం చెబుతాడు.

ఎందుకు అవనినే సెలెక్ట్ చేసుకుంటావు. నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయింది కదా అంటే.... చీట్ చేయలేదు. నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోయింది.

తన పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది గనుకనే నేను వచ్చాను. లేకపోతే  నాలో ఉన్న మరో విక్రమ్ ని చూపించే వాడిని అంటాడు.

అది నిజమేలే బావ  రెస్ట్ తీసుకో రేపు మార్నింగ్ ఏ లేగాలి కదా అని చెప్పి ఇంకా రూమ్ లోకి వెళ్లి పడుకుంటాడు.
 
మంచం మీద పడుకున్న విక్రమ్ అవిని నీ తలుచుకుంటూ గుడ్ నైట్ అవని. ఈరోజుకి డీప్ స్లీప్ వెయ్ రేపటి నుంచి ఎలాగ నీకు నిద్ర కష్టమే కదా!

అవని తలుపులతోనే విక్రమ్ నిద్రపోతాడు. అవని పడుకోగానే ఎందుకో చాలా అలజడిగా అనిపిస్తుంది. ఏంటి ఇలా అనిపిస్తుంది ఎప్పుడూ లేని విధంగా ఉంది.

    విక్రమ్ గారు నా పక్కన ఉన్న ఆ ఒక్క రోజు  ఈ ఫీల్ అనిపించింది. మళ్లీ ఈరోజు అలానే అనిపిస్తుంది. అంటే దాని అర్థం విక్రమ్ గారు నా చుట్టుపక్కలే ఉన్నారా అనుకుంటూ ఉలుక్కబడి లెగుస్తుంది.

విక్రమ్ గారి ఎదురుపడితే నేను ఎలా ఫేస్ చేయాలి. నన్ను చీట్ చేసావు అంటే నేను ఏం సమాధానం చెప్పగలను అని ఆలోచిస్తుంది.

బుద్ధి మాత్రం అయ్యో అవినీ నువ్వు ఎలా ఉంటావో తెలియదు కదా! ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అనగానే మనసు ఒసే పిచ్చి మొద్దు చేతికి ఉన్న ఉంగరం సరిపోతుంది కదా గుర్తుపట్టడానికి అంటుంది.

వెంటనే బుద్ధి చేతి కి ఉన్న ఉంగరం తీసేయ్ అంటుంది. మనసు వద్దు, తియ్యొద్దు.  ఆరోజు విక్రమ్ గారు చాలా ఎమోషనల్ గా చెప్పారు నీకు అని ఆపుతోంది.
ఉంగరం చూస్తే ఎలా అని బుద్ధి అడిగితే, కవర్ చేయడమే అని మనసు చెబుతుంది  .  వెంటనే బుద్ధి మాయమైపోతుంది.  మనసు లోపలికి వెళ్ళిపోతుంది.

అవును చేతికున్న ఉంగరం కనపడకుండా, మెడలో ఉన్న నల్లపూసలు కనపడకుండా కవర్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటు హ్యాపీగా పడుకుంటుంది.

విక్రమ్ తనని గుర్తుపట్టడు అని ధీమాతో ఉన్న అవిని కి విక్రమ్ ఎదురుపడితే పరిస్థితి ఏమిటి??
కథ కొనసాగుతుంది... 
[+] 16 users Like SivaSai's post
Like Reply
#30
Excellent update
Like Reply
#31
Chala super gaa undi andi story.. excellent.. please continue
Like Reply
#32
https://xossipy.com/thread-71787.html



Everyone Read Another My Story
Like Reply
#33
Part - 15


ఎవరికోసం ఆగనంటూ సూర్యుడు లేలేత  కిరణాలతో అందరికీ గుడ్ మార్నింగ్ చెబుతాడు. విక్రమ్ తొందరగా రెడీఅయ్యి  శ్రీ ని తీసుకొని అవిని ఫ్లాట్ ముందుకి వెళతాడు.

అవని రెడీ అయి బయటకు వస్తుంది. నేహా చూసి ఏంటి అవని  కాలర్ నెక్ వేసావు చేతికి గ్లౌజ్ వేసుకున్నావు అంటే...

ఇక్కడికి క్లైమేట్ కొంచెం చలిగా ఉండి నా స్కిన్ డ్రై అవుతుంది అందుకని... ఇలా కవర్ చేసుకున్నాను. కాలేజ్ కి టైం అవుతుంది బాయ్ సీనియర్ అని చెప్పి బయటకు వస్తుంది.

విక్రమ్ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ చూసుకునే చిన్నగా నవ్వుకుంటాడు. ఏమైంది విక్కీ అలా నవ్వుతున్నావు అంటే... నీ చెల్లి వేసే వేషాలు చూసి అని చెబుతాడు.
మా చెల్లి ఏం చేసింది రా అంటే... చూడు వస్తుంది కదా అంటాడు. అవిని వాళ్ళు ఉండే అపార్ట్మెంట్స్ దగ్గర రోడ్డుకి ఇరువైపులా పూల మొక్కలు ఉంటాయి.

ఉదయం ఇంకా 7:30 అవడం వలన ఎండ కూడా ఎక్కువగా లేదు. క్లైమేట్ చాలా ప్లజంట్ గా ఉంది.
అవని లిఫ్ట్ దిగి ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా అలజడిగా అనిపిస్తుంది.
ఏంటి ఇలా అనిపిస్తుంది రాత్రి కూడా ఇలాగే అనిపించింది. ఏం జరుగుతుంది నా చుట్టూ అని...  తన హృదయం మీద చేయి వేసుకొని చుట్టూ చూస్తుంది.

విక్రమ అవిని నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు.  అవిని ఫేసు సరిగ్గా కనిపించదు కానీ... తన చేసే ప్రతి చర్య కనబడుతూ ఉంటుంది.
అవిని తన హృదయం మీద చెయ్యి పెట్టుకోగానే విక్రమ్ పెదవులపై నవ్వొస్తుంది. నువ్వు కూడా నాలాగనే ఫీల్ అవుతున్నావు అవని.

వివాహ బంధానికి ఉన్న బలం అంటే ఇదేనేమో.. పాణిగ్రహణం అయిన చేతిని వదిలేయడం అంత సులువు కాదు కదా అనుకుంటూ తన అరచేతిని చూసుకుంటాడు.

  అవిని బస్ స్టాప్ వైపుకు నడుస్తూ ఉండగా  విక్రమ్ కి అవిని కి మధ్య ఉన్న దూరం తగ్గుతూ ఉంటుంది. విక్రమ్ కి చాలా ఆత్రుతగా ఉంటుంది అవిని నీ  చూడాలి అని.
అవని హృదయం చాలా గట్టిగా కొట్టుకుంటుంది.టెన్షన్ పెరుగుతూ ఉంటుంది.చల్లని గాలి రివ్వున వేస్తూ ఉంటుంది.
ఆ చల్లదనాన్ని ఆస్వాదించే పరిస్థితిలో అవని లేదు. డిస్టర్బ్ మైండ్ గా నడుస్తూ ఉంటుంది.ఎదురుగుండా వచ్చే బైక్ ని చూసుకోకుండా వస్తూ ఉంటుంది .
బైక్ అతను కూడా రోడ్డు ఖాళీగా ఉంది కదా అని స్పీడ్ గా వస్తూ...  అవిని  చూసి హలో మిస్ అంటూ సడన్ గా పక్క నుంచి వెళతాడు.
అవిని సారీ భయ్యా అని చెబుతూ కాల్ స్లిప్ అయి పడుతుంది. కింద పడిపోయాను అని గట్టిగా ఫిక్స్ ఫిక్సయి కళ్ళు మూసేస్తుంది.

రోడ్డు ఏంటి నా నడుముని ఇంత గట్టిగా పట్టుకుంది .
దెబ్బ తగలలేదు ఏంటా అని కళ్ళు తెరిచి చూస్తే...

    తన నడుము ఒక చేతిలో ఒదిగిపోయి కనిపిస్తుంది. ఎవర్రా నడుమును పట్టుకుంది అని పైకి చూస్తుంది.

   పట్టుకున్న వ్యక్తి మొఖము కనిపించదు.  కానీ అవని గుండె మాత్రం 100 స్పీడోమీటర్ దాటేసింది. ఏంటి నా గుండె ఇంత గట్టిగా కొట్టుకుంటుంది అని ఆలోచిస్తూ ఇంకా అదే పొజిషన్లో ఉంటుంది.

   పట్టుకున్న వ్యక్తికి కూడా అవని మొఖం కనిపించదు. అవని కాలు స్లిప్ అయ్యి పడిపోతున్న టైంలో గాలికి చున్నీ తన మొఖం పైన పడుతుంది.
రోడ్డు పక్కన ఉన్న పూల మొక్కల నుండి పువ్వులు గాలికి ఎగురుతూ వీళ్ళిద్దరి మీద పడతాయి.
ఆ వ్యక్తి అవినీ ముఖం పైన ఉన్న చున్నీ  ని మెల్లిగా తీస్తూ ఉంటాడు. మొదటి విశాలమైన నుదురు కనిపిస్తుంది.
కనీ కనపడకుండా పాపిట్లో పెట్టిన కుంకుమ కనిపిస్తుంది. ఆ వ్యక్తి పెదవులపై చిన్నటి చిరునవ్వు వచ్చి చేరుతుంది.
చున్నీ ని ఇంకా కిందకి తీయగానే విల్లు వంచి నట్టుగా విశాలమైన కనుబొమ్మలు.
కనుబొమ్మల మధ్యన ఎర్రటి స్టిక్కర్, చక్కెర కింద కుంకుమ పెట్టి ఉంటుంది. చున్నీ ఇంకా కొంచెం కిందకి లాగుతాడు.
చున్నీ కిందకి వస్తున్న తరుణంలో అవని కళ్ళు మూసుకుని తెరుస్తుంది. మౌనంగానే ఊసులు చెప్పవచ్చు అన్నట్టుగా ఉన్న పెద్ద పెద్ద కళ్ళు, ఆ కళ్ళకి అందంగా తీర్చిదిద్దిన కాటుక.
అవని కళ్ళు  పెద్దగా అయిపోయాయి ఆ వ్యక్తిని  చూసి,కన్ను అర్పకుండా చూస్తూ ఉంటుంది. చున్ని ఇంకా కొంచెం కిందకి లాగగానే కోటేరు లాంటి ముక్కు, జున్ను ముక్కలాగా ఉన్న బుగ్గలు.

ఇంకా కిందకి చూడగానే  పై పెదవి సన్నగా, కింద పెదవి గండు చీమ కుట్టినట్టుగా బొద్దుగా  గులాబీ రంగులో ఉండి తేనెలూరుతూ ఉన్నాయి.
ఇద్దరు గుండెలు ???చాలా గట్టిగా కొట్టుకుంటున్నాయి.

అవని కి ఆ వ్యక్తిని చూసినందుకు ఆశ్చర్యంగా, భయ్యమో, సంతోషమో తెలియని విధంగా పెదాలు అదురుతున్నాయి.
ఆ వ్యక్తి అవని  నీ సరిగ్గా  నిలబెట్టి హలో మీస్ బానే ఉన్నారా అని అడుగుతూ ఫుల్గా స్కానింగ్ చేస్తాడు.

   కాలర్ నెక్ డ్రెస్ తో చేతులకి గ్లౌజ్ వేసుకొని ఎక్కడ స్కిన్ షో చేయకుండా ఉంటుంది. అవని ఇంకా షాక్ లో బిగుసుకుపోయి   ఉంటుంది. హలో మిస్ అని కళ్ళ ముందు చిటుకలు వేస్తాడు.

తేరుకొని నేను బానే ఉన్నాను సార్ అని తడబడుతూ చెప్పి థాంక్యూ అని గబగబా ముందుకు వెళ్ళిపోతుంది.
బస్ కోసం కూడా వెయిట్ చేయకుండా ఆటోలో వెళ్లిపోతుంది.
ఆ వ్యక్తికి వెనకనుంచి వచ్చి ఒక అతను చెయ్యి వేసి కుదుపుతాడు. ఏమైంది బావ అలానే చూస్తూ ఉన్నావు అమ్మాయిని అంటే తను ఎవరో తెలుసా అని అడుగుతాడు.
ఎవరు అని అడిగితే ఇంకెవరు మీ చెల్లె అని చెబుతాడు. అంటే అవని నా అంటే అవును అంటాడు.
మరి నువ్వు ఎందుకు ఆపలేదు అని అడుగుతాడు. ఆపి ఏం చేయాలి.  నేనెవరో తెలీదు అన్నట్టుగా వెళ్ళిపోతుంది కదా అంటూ అవని వెళ్ళిన వైపు చూస్తాడు.

తను అవని అని నీకు ఎలా తెలిసింది బావ అంటే.. అవిని ఇక్కడ ఉంది అని తెలిసినప్పుడే నా మనుషుల్ని తన చుట్టూ పెట్టేశాను.
అవని ఈచ్ అండ్ ఎవరీ మూమెంట్ నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఏ డ్రెస్ లో బయటికి వస్తుందో కూడా నాకు తెలుసు అని చెబుతాడు.

   నేను వేసిన నల్లపూసలు,పెట్టిన రింగు తెలియకుండా ఉండాలని గ్లోవ్స్ అండ్ ఓవర్ నెక్ మోడల్ వేసుకుని బయటకు వచ్చింది అని చెబుతాడు .
అవిని పిక్ ముందే చూసావా అని అడిగితే...  లేదు ఇదే డైరెక్ట్ గా చూడడం అని చెప్తాడు. మరి ఎలా గుర్తుపట్టావు బావ అంటే పెళ్లి చేసుకో అన్ని అవే తెలుస్తాయని చెప్పి నవ్వుతూ కారు దగ్గరికి వెళ్ళిపోతాడు.

విక్రమ్ ఫోన్ కి కొన్ని పిక్స్ వస్తాయి అవి ఏంటా అని ఓపెన్ చేసి చూసిన విక్రమ్ కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది థాంక్యూ శ్రీ అంటాడు.

ఎలా వచ్చాయి బావ ఫొటోస్ అంటే మా ఫస్ట్ మీటింగ్ ని చాలా మెమొరబుల్ గా చేశావు శ్రీ అని హగ్ చేసుకుంటాడు.
నెక్స్ట్ స్టెప్ ఏంటి బావ అని అడిగితే.. మనం డైరెక్ట్ గా ఇంకా ఆఫీస్ కి వెళ్లడమే.  ఈ స్ట్రోక్ చాలు ఈరోజు మీ చెల్లికి అని చెప్పి కార్న్ రోడ్ల పైన పరిగెత్తిస్తాడు.

అవని ఆటోలో కూర్చోగానే బ్యాగ్ లో ఉన్న  వాటర్ బాటిల్ తీసుకొని ఖాళీ చేసేస్తుంది. నేను చూసింది విక్రమ్ గారు నేనా... ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారు .

ఏదైనా ఆఫీస్ వర్క్ మీద వచ్చి ఇటు వచ్చారా అని ఆలోచిస్తుంది.అంతే అయ్యుంటుందిలే.... నేను అని విక్రమ్ గారికి  తెలియదు కదా!

  ఎవరో అమ్మాయి పడిపోతుంటే హెల్ప్ చేశారు అని అనుకుంటారు అనుకుని కొంచెం రిలాక్స్ అవుతుంది. వెంటనే తనని తాను చెక్ చేసుకుంటుంది హమ్మయ్య అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి.

. రింగు కనిపించలేదు. నల్లపూసలు కనపడలేదు థాంక్యూ గాడ్ అనుకోని కాలేజ్ దగ్గర ఆటో దిగుతుంది.
కాలేజ్ లోపలికి వెళ్లి ప్రిన్సిపల్ కలిసి ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తుంది.

గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ అని నవ్వుతూ చెబుతుంది. స్టూడెంట్స్ అందరూ కొత్త టీచర్ ని చూసి ఆనందంతో గుడ్ మార్నింగ్ మిస్ అని చెబుతారు.

మిస్ అన్న పదం వినగానే విక్రమ్ పిలిచినట్టుగా అనిపించి ఉలుక్కబడి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఎవరూ ఉండరు అమ్మయ్య స్టూడెంట్స్ ఏనా నన్ను పిలిచింది అనుకుని గుడ్ మార్నింగ్ అని మళ్ళీ చెప్పి అందర్నీ పరిచయం చేసుకుంటుంది.


విక్రమ్ ఆఫీసులోకి ఎంటర్ అవ్వగానే అందరూ పిన్ డ్రాప్ సైలెంట్. ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉంటాడో బిజినెస్ విషయంలో అంత సీరియస్ గా ఉంటాడు.

ఆఫీసులో వర్క్ చేస్తూ ఉండగా ఫ్యామిలీ నుంచి గ్రూప్ కాల్ వస్తుంది. కాల్ చూసి నవ్వుతూ ఆన్ చేసి ఏంటి అందరూ గ్రూప్ లోకి వచ్చారు అని అడుగుతాడు.

నీ ఫోన్ కోసమే వెయిటింగ్ నువ్వు ఎలాగ చేయడం లేదని మేమే చేసాము అని వినయ్ అంటాడు . వర్క్ లో ఉన్నానని చేయలేదు అంటాడు.

వర్క్ తర్వాత బావ. ఇదే ఇంపార్టెంట్ మా చెల్లి ఎలా ఉంది బావ. నిన్ను చూడగానే ఎలా రియాక్ట్ అయింది అని భరత్ అడుగుతాడు.
ఆ మాటలకి అవని ఎక్స్ప్రెషన్స్ గుర్తొచ్చి నవ్వుకుంటాడు.
ఏంటి బావ నీలో నువ్వు నవ్వుకుంటున్న మాకు చెప్తే మేము నవ్వుతాము కదా అంటే...

అవి మీకు చెప్పేవి కాదులే పిక్ పెడతాను చూడండి అని చెప్పి శ్రీ తీసిన ఫోటోలు నుంచి డీసెంట్ గా ఉన్న టు పిక్స్ పెడతాడు.

అవి చూసిన ఫ్యామిలీ అంతా ఈడు జోడు భలే ఉన్నారు కదా అనుకుంటారు. ఇందిరా గారు అవని పేస్ ని జూమ్ చేసి చూస్తారు.
పాపిట్లో కని కనపడకుండా పెట్టిన సింధూరని చూసి నవ్వుకుంటారు. నా మనవడి అంచనా ఎప్పుడూ తప్పు కాదు. భగవంతుడి మీ ఇద్దరికీ రాసిపెట్టి ఉంచాడు అని మనసులోనే ఆ స్వామికి దండం పెట్టుకుంటారు.
ఎందుకు అత్తయ్య గారు అవనిపేస్ ని జూమ్ చేసి చూస్తున్నారని లలిత అడుగుతుంది.
ఇందిరా గారి సమాధానం ఏమిటి??
విక్రమ్ అవని లవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది ??❤️❤️
[+] 13 users Like SivaSai's post
Like Reply
#34
 Part - 16


కిందర్ గార్డెన్ కాలేజ్స్ మాక్సిమం త్రీ కి అయిపోతుంది. అవిని ఫ్లాట్ కి వచ్చి రిలాక్స్ అవుతుంది. ఫస్ట్ డే చాలా బాగా జరిగింది అనుకుంటూ...మార్నింగ్ విక్రమ్ ఎదురొచ్చింది గుర్తొస్తుంది.

నా లైఫ్ ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేశాను. మొదటి రోజే మీరు నాకు ఎదురొచ్చారు. నాకు అంత మంచే జరుగుతుంది . మళ్లీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో... అనుకుంటూ కిచెన్లోకి వెళ్లి టీ పెట్టుకుంటుంది.

సాయంత్రం అవిని కి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటే డోర్ తీసి చూస్తుంది. ఆపోజిట్ ఫ్లాట్ డెకరేట్ చేసి ఉంటుంది. ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు అనుకుని నిలబడి చూస్తుంది.

ఎక్స్క్యూజ్మీ మిస్ అని ఒక వ్యక్తి వచ్చి పిలుస్తాడు. చెప్పండి అనగానే.. మేము మీ ఆపోజిట్ ఫ్లాట్లోకి వచ్చాము.
పాలు పొంగించడానికి లేడీస్ ఎవరూ లేరు. మీరు నా సిస్టర్ లాగా అనిపిస్తున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే పాలు పొంగిస్తారా ప్లీజ్ అని  రిక్వెస్టింగ్ గా అడుగుతాడు.

   అవిని తటపాయిస్తుంది వెళ్లాలా వద్దా అని.. అతన్ని చూస్తే చాలా రిక్వెస్టింగ్ గా చూస్తూ ఉంటాడు. పాలు పొంగించడమే కదా! వెళ్లి వస్తే సరిపోతుంది అనుకుని..

  ఒక్క ఫైవ్ మినిట్స్ అండి.  నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని తల స్నానం చేసి వస్తుంది. బ్యాచిలర్స్ అంటున్నారు అన్నీ ఉన్నాయా లేవా అనుకుని పాలు, బియ్యం, బెల్లం,  ఇలాచి, జీడిపప్పు, కొబ్బరికాయ, పువ్వులు అన్నీ ఒక పళ్లెంలో  సర్ది తీసుకు వెళుతుంది.

గుమ్మం దగ్గరకు వెళ్లి కాలింగ్ బెల్ కొడుతుంది. ఆ వ్యక్తి వచ్చి రామ్మా లోపలికి అంటే... ఇవి మీ దగ్గర ఉన్నాయో లేవో తెలియక తీసుకువచ్చాను అని మొహమాటంగా చెబుతుంది.
ఎందుకమ్మా అంత మొహమాటపడుతున్నావు ఇది నీ ఇల్లే అనుకో అని లోపలికి దారి చూపిస్తాడు.

   లోపలికి రాబోతున్న అవిని నీ ఒక్క నిమిషం ఆగమ్మా అని గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి లోపలికి రా తల్లి అని చెబుతాడు.

గుమ్మం ముందు కొబ్బరికాయ కొట్టి ఆవని కుడికాలు పెట్టి లోపలికి వెళుతుంది. దేవుడి మందిరం అంతా శుభ్రంగా తుడిచి దీపం వెలిగిస్తుంది.
అవని ఆ వ్యక్తికి హారతి ఇచ్చి మీకు అన్ని శుభాలే అన్నయ్య అంత మంచే జరుగుతుంది అంటే....

  మేము వచ్చిన పని కూడా సక్సెస్ అవ్వాలి అని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుని పాలు పొంగించుమని చెబుతాడు.
అవని స్టవ్ దగ్గరికి వెళ్లి పసుపు రాసి బొట్టు పెట్టి పాలు పొంగిస్తుంది. పాలు పొంగిన తర్వాత, బియ్యం వేసి వండి బెల్లం,  జీడిపప్పు, నెయ్యి వేసి పాయసం తయారు చేస్తుంది.

నైవేద్యం చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి ఆ వ్యక్తికి ఒక కప్పులో పెట్టి ఇస్తుంది.  థాంక్స్ అమ్మ అని...

ఆ రూంలో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తనకు కూడా ఇవ్వు చెల్లెమ్మ.

నేనా అనే ఇబ్బందిగా చూస్తే... పర్వాలేదు అమ్మ, నా ఫ్రెండు లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఇబ్బంది పడాల్సిన పనిలేదు.

   వర్క్ బిజీ లో ఉన్నాడు.  ప్లీజ్ నువ్వు ఇచ్చిరా తల్లి అని చెప్పి నేను మిగిలిన పని చూసుకోవాలి రెండో బౌల్ లో ఉన్న పాయసాన్ని అవిని చేతికి ఇచ్చి పంపిస్తాడు.

అవని మెల్లిగా గది ముందుకు వెళ్లి డోర్ నాక్ చేస్తుంది. రండి అని గంభీరంగా లోపల నుంచి వాయిస్ వినిపిస్తుంది.
అమ్మో వాయిస్ ఏంటి ఇంత సీరియస్ గా ఉంది అనుకుంటూ మెల్లిగా లోపలికి వస్తుంది.

లోపల ఉన్న వ్యక్తి కిటికీ వైపు తిరిగి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అవిని నడుస్తూ ఉంటే కాలు కి ఉన్న పట్టీల శబ్దం ఆ వ్యక్తి చెవికి చేరుతుంది.
అయినా వ్యక్తి వెనక్కి తిరగకుండా ఎవరు అని అంటాడు. అవిని కి ఏం చెప్పాలో అర్థం కాదు.
మిమ్మల్ని అడిగేది ఎవ్వరూ అని మళ్ళీ గట్టిగా అడిగితే... నేను ఎదురింట్లో ఉంటాను.

   పాలు పొంగించాను మీ ఫ్లాట్లో...  పాయసం అని బౌల్ ముందుకి పెడుతుంది.చెయ్యి వణుకుతూ ఉంది. ఆ వ్యక్తి అవిని వైపు తిరిగి బౌల్ అందుకుంటాడు.

ఓ థాంక్ యు మిస్ అని బౌల్ తీసుకొని టెస్ట్ చేస్తాడు. గుడ్ పాయసం బాగుంది. మీరు కుక్ బాగా చేస్తారు అనుకుంట అని అవని పేస్ వంక చూస్తాడు.
అవని షివర్ అవుతూ ఉంటుంది. ఫుల్ గా చెమటలు పడతాయి.
ఏమైంది మిస్ మీకు ఆలా ఉన్నారు. ఆర్ యు ok అని అడుగుతాడు. తల బొంగరం లాగా తిప్పితూ.. ఆ ఓకే అని చెప్పి గబగబా  బయటకు వస్తుంది.
అవని వెళ్ళాక బయట ఉన్న వ్యక్తి లోపలికి వచ్చి ఏంటి బావ అవని అంత కంగారుగా వెళుతుంది అంటే...
నన్ను చూసి టెన్షన్ పడుతుంది. 

   నాకు తను తెలియదు అని చాలా గట్టి ఫీలింగ్ లో ఉంది. నేనెవరో తనకి తెలియదు అన్నట్టుగా  ఉండడానికి చాలా ప్రయత్నిస్తుంది. తన టెన్షన్ నే బయట పెట్టేస్తుంది చూస్తా ఉండు.

ఏ మాటక మాట బావ అవని  పాయసం చాలా బాగా చేసింది.  మనకి డైలీ ఫుడ్ కూడా అవని చేసి పంపిస్తుంది చూస్తా ఉండు అని విక్రమ్ అంటాడు.  అది ఎలాగా అంటే.. ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తాడు.

ఏం ప్లాన్ చేసావ్ బావ అంటే..  వెయిట్ అని చెప్పి వర్క్ లో బిజీ అయిపోతాడు.

అవిని ఫ్లాట్లోకి వచ్చిన తర్వాత కాలుగాని పిల్లి లాగా అటు ఇటు టెన్షన్ గా తిరుగుతూ ఉంటుంది. విక్రమ్ గారు ఏంటి ఇక్కడ? అది ఇలాంటి చిన్న ప్లాట్ లో ఉంటున్నారు.

ఏం జరిగింది? ఎలా తెలుసుకోవాలి?
ఏదైనా అడుగుదామంటే నీకు ఎలా తెలుసు... నువ్వు ఎవరివి అని అడుగుతారు. 

నేనెవరో విక్రమ్ గారికి తెలియదు కదా! మెల్లిమెల్లిగా పరిచయం చేసుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి.
నైట్ కి ఏం తింటారో..  అసలు వంట మనిషిని కూడా పెట్టుకోలేదు.

  ఆయన ఫ్రెండ్ బ్యాచిలర్ లాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ కిచెన్ లోకి వెళుతుంది.
చపాతి పిండి కలిపి పాలక్ పన్నీరు రెడీ చేస్తుంది. స్నేహ కూడా అప్పుడే ఆఫీసు నుంచి వస్తుంది. ఏంటి అవని కిచెన్లో నుంచి మంచి గుమగుమలు వస్తున్నాయి.
ఎప్పుడు లేనిది నువ్వు మంచి హుషారుగా కిచెన్ లోకి వచ్చావు అని అడుగుతుంది.

దానికి తడబడుతూ కాలేజ్ నుంచి తొందరగా వచ్చేస్తాను కదా! ఏమి తోచడం లేదు. అందుకే డిన్నర్ రెడీ చేస్తున్నాను.

నువ్వు ఫ్రెష్ అయ్యి రా! ఈ లోపు చపాతీ చేస్తాను అని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది.

విక్రమ్ కి అతని ఫ్రెండ్ కూడా డిన్నర్ ప్రిపేర్ చేసి బట్టర్ మిల్క్ కూడా చేసి ఒక బాటిల్ లో పోస్తుంది. ఇప్పుడు ఇవి ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తుంది.

ఏదోటి చెబుదాం లే అనుకొని...హాట్ ప్యాక్ లో పెట్టుకుని వెళ్లి విక్రమ్ ఫ్లాట్ కాలింగ్ బెల్ కొడుతుంది.

కాలింగ్ బెల్ సౌండ్ కి ఎవరు వచ్చుంటారు అని శ్రీ అంటే... ఇంకెవరూ మీ చెల్లి, కావలిస్తే  చూడు అని అంటాడు.

డోర్ తీసిన శ్రీ ఆశ్చర్యంగా అవని వంక చూస్తాడు. ఏంటమ్మా అనగానే... అది మీరిద్దరే ఉన్నారు కదా!

  డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నారో లేదో అని డిన్నర్ తీసుకువచ్చాను.   తీసుకోండి అన్నయ్య అని చెప్పి ,
డిన్నర్ బౌల్స్ పెట్టిన ప్లేట్ శ్రీ చేతికి ఇస్తుంది.

థాంక్స్ అమ్మ. మా వాడు అసలే ఆకలికే ఆగలేడు అని ఆ ప్లేట్ తీసుకుంటాడు.

లోపలికి వచ్చిన శ్రీ  విక్రమ్ తో నీకెలా తెలుసు రా  అంటే... ఒక నవ్వు నవ్వుతాడు.

జై సింహ మాన్షన్..

లలిత భార్గవి కి కాల్ చేసి ఏమి చేస్తున్నారు వదిన అని పిలుస్తారు . లలిత ఫోన్ కి భార్గవి పొంగిపోతు చెప్పండి వదిన గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది.

మీరు చేసిన పనికి ఎలా ఉంటాము అని మనసులో అనుకుంటూ బానే ఉన్నాము.
అత్తయ్య గారు మీ అత్తయ్య గారితో మాట్లాడతానన్నారు ఫోన్ ఇస్తారా అని భార్గవి ఒడిలో బాంబు పెడుతుంది.
దానికి భార్గవి తడబడుతూ అత్తయ్య గారు ఊరు వెళ్లారు అని చెబుతూంది.
ఎప్పడు వస్తారు మా అత్తగారు  అర్జెంటు గా మాట్లాడిలి అంటున్నారు. నెంబర్ ఇవ్వండి కాల్ చేస్తాను అనగానే...
భార్గవి కి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు.

   దేని గురుంచి మాట్లాడాలి అనుకుంటున్నారు. అవని గురుంచి అయ్యితే నా ప్లాన్ అంత తెలిసిపోతుంది.

నా ముందు మాట్లాడేలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
లలిత హలో ఉన్నారా అని గట్టిగా పిలిస్తుంది. అక్కడ సిగ్నల్స్ ఉండవు. రేపు వచ్చేస్తారు.

రాగానే నేను కాల్ చేపిస్తాను అని ఫోన్ పెట్టేసి తల పట్టుకుంది.
ధనుంజయ్ ఆఫీస్ నుంచి రాగానే ఎలాగ లాగ ఒప్పించ్చి అత్తయ్య గారిని వెనక్కి తీసుకురావాలి అనుకుంటుంది.

ఆఫీస్ నుంచి రాగానే కాఫీ పట్టుకుని వెళ్లి ఇచ్చి ఏవండీ అత్తయ్య గారి ని రమ్మని చెప్పండి అని అంటుంది.

ఎలా చెప్పమంటావు.. అవిని విషయం లో నువ్వు చేసిందానికి అమ్మానాన్న చాలా బాధపడుతున్నారు. నన్ను కూడా తప్పుగా అనుకున్నారని విసుగ్గా అంటాడు.
దానికి భార్గవి బాధగా పేస్ పెట్టి ఈ సంబంధం తప్పిపోకూడదని అలా చెప్పాను గాని.. అవని అంటే నాకు ప్రేమ లేదా అని అడుగుతుంది.
మీరు మావయ్య గారికి ఫోన్ చేసి  రమ్మని చెప్పండి. పెద్దవాళ్ళు లేకపోతే ఇల్లు బోసిపోయినట్టు ఉంది. నాకు ఏమీ తోచడం లేదు అని చాలా బాధగా చెబుతుంది.

భార్గవి నటన నిజమే అని నమ్మిన ధనుంజయ్ వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాడు.
కొడుకు దగ్గర నుంచి వస్తున్న ఫోన్ చూసి నవ్వుకుని ఫోన్ లిఫ్ట్ చేసి మౌనంగా ఉంటారు.

ధనుంజయ్ ఫోన్ లో ఏం మాట్లాడుతాడు?
దానికి వాళ్ళ నాన్నగారి సమాధానం ఏమిటి??
కథ కొనసాగుతుంది....
Like Reply
#35
nice update
Like Reply
#36
Super story andi.. vikram and avani laa madya manchi feel good romance vasthundani aachistinnam.. even sex lekhapoyina ee story bagaa enjoy chesthunnanu ippati varaku..good and excellent story.. please continue

Thanks for continuous updates andi
Like Reply
#37
super stories
Like Reply
#38
Excellent update
Like Reply
#39
Great writing... Keep going... Excellent story concept...
Like Reply
#40
(29-12-2025, 09:04 AM)masalakiss Wrote: Super story andi.. vikram and avani laa madya manchi feel good romance vasthundani aachistinnam.. even sex lekhapoyina ee story bagaa enjoy chesthunnanu ippati varaku..good and excellent story.. please continue

Thanks for continuous updates andi

Suspense,Thrillers and Emotions madyalo love, Romance Untundi 

vati kosam Wait Cheyali
[+] 1 user Likes SivaSai's post
Like Reply




Users browsing this thread: Ak0408, Jola, 3 Guest(s)