28-12-2025, 06:30 AM
కథాయణం
|
కథాయణం
|
|
28-12-2025, 06:44 AM
కథలోంచి క్లైమాక్స్ పుడుతుందా? క్లైమాక్స్ పుట్టాక కథ పుడుతుందా? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం
కొందరు రచయితలు ముందుగా క్లయిమాక్స్ రాసుకుంటారట, అలా చేస్తే పరిస్థితి వేరుగా ఉంటుందిట. క్లైమాక్స్ రాసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? చాలా మంది కథ రాస్తున్నామంటారు. నేనైతే క్లైమాక్స్ రాస్తున్నాను అంటా. క్లైమాక్సే కథ. క్లైమాక్స్ రాసేసుకుంటే మిగతా అంతా ఈజీ అని అంటాను. డెస్టినేషన్ ఏంటో తెలిస్తే పని ఈజీ. డెస్టినేషన్ తెలియకపోతే చాలా టైమ్ తీసుకుంటుంది. క్లైమాక్స్ ఎప్పుడూ పెద్ద పే ఆఫ్ అవుతుంది. ప్రతి ఒక్క ట్విస్ట్‌ని ప్రతి 15 నిమిషాలకు రివీల్ చేస్తూ వెళ్లడం ఒక రకమైన స్క్రీన్‌ప్లే. అన్నిటినీ ముడి వేసి చివరగా రివీల్ చేయడం మరొక స్క్రీన్‌ప్లే. కొన్ని కథలకు ఇలాంటి స్క్రీన్ ప్లే మెయిన్ అవుతుంది. కథ ఏమిటో ముందే చెప్పినప్పుడు , కచ్చితంగా స్క్రీన్ ప్లే టైట్ గా ఉండాలి. ''కథంటేనే నా దృష్టిలో క్లైమాక్స్. క్లైమాక్స్ లేనిదే కథ లేదు. అందుకే ముందు క్లైమాక్స్ రాసుకుని కథ రాసుకుంటాను. గమ్యం తెలుసుకుంటే, దానికి తగ్గట్టు కథను రాసుకోవచ్చు. అంతం తెలియకపోతే ఎక్కువ సమయాన్ని దాని మీద పెట్టాల్సి వస్తుంది''
28-12-2025, 07:08 AM
చిట్కాలతో మంచి కథలు రాలవు. అంతమాత్రాన నాకు తెలిసినవీ, నేను పాటించేవీ నాలుగు కిటుకులు
పదుగురితో పంచుకుంటే పోయేదేమీ లేదు. అందువల్ల ఈ వ్యాసాలు మీతో పంచుకుంటున్నాను. ఇవి ప్రధానంగా కథా రచనలో అవలంబించే పద్ధతులు విపులీకరించే వ్యాసాలు. కాబట్టి వీటిలో కొన్ని కథల ప్రస్తావన, వాటికి సంబంధించిన తెర వెనక విశేషాలు తరచూ కనిపిస్తుంటాయి. ఇది కథలు ‘ఇలాగే రాయాలి’ అంటూ రుద్దే ప్రయాస కాదు; ‘ఇలాగూ రాయొచ్చు’ అని చెప్పే ప్రయత్నం. ఇందులో వివరించే కిటుకులేవీ నేను కనిపెట్టి నవి కావు; అందరూ పాటించేవి మాత్రమే. అందువల్ల వాటి మీద నాకు అంతో ఇంతో అవగాహనుంది. అన్ని చింతలకీ ఇవే మంత్రా లన్న అజ్ఞానం మాత్రం లేదు. వీటిలో కొన్ని నేను రాసే తరహా genre కథలకి మాత్రమే వర్తించే విషయాలు. మరి కొన్ని అన్ని రకాల కథలకీ పనికొచ్చే సంగతులు. వీటిలో కొన్నైనా మీకెవరికన్నా ఉపయోగపడితే సంతోషమే.
28-12-2025, 07:18 AM
1. ఎత్తుగడ
సాధారణ ఎత్తు గడ: పెద్ద శబద్ధంతో వేగంగా వచ్చి ఆగింది సెక్యూరిటీ అధికారి జీప్. అందులోంచి దిగి బూట్లు టకటకలాడించుకుంటూ వడివడిగా లోపలికెళ్లాడు ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, గుమ్మంలో నిలబడున్న సెంట్రీ సెల్యూట్‌ని స్వీకరించినట్లు తలపంకిస్తూ . అతన్ని చూడగానే రైటర్‌తో హస్కు కొట్టటం ఆపేసి చటుక్కున లేచి అటెన్ష న్‌లో నిలబడి సెల్యూట్ చేశాడు హెడ్ కానిస్టేబుల్ సుబ్రావ్. అతని తొట్రు పాటు గమనించి లోలోపలే నవ్వుకుంటూ, పైకి మాత్రం ముఖం నిండా గంభీరత నింపుకుంటూ హుందాగా నడుస్తూ వెళ్లి తన సీట్‌లో ఆసీనుడయ్యాడు ప్రతాప్. అప్పుడే డెస్క్‌మీద ఫోన్ మోగింది. ప్రతాప్ సైగ చెయ్యగానే అందుకుని అవతలి వాళ్లు చెప్పిన విషయం విని పెట్టేశాడు సుబ్రావ్. ఏమిటన్నట్లు చూస్తున్న ప్రతాప్‌తో చెప్పాడు. “సైదా పేట ఎమ్మెల్యేగారింటి నుండి సార్” “ఏమిటి సంగతి? మళ్లీ వాళ్లావిడ పెంపుడు పిల్లి తప్పిపోయిందా?”, చిరాగ్గా ప్రశ్నించాడు ప్రతాప్. “లేదు సార్. ఈ సారి వాళ్లబ్బాయి. రాత్రి నుండీ కనబడటం లేదట” మెరుగైన ఎత్తు గడ: మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. లోపల గొళ్లెం వేసినట్లే ఉంది. ఐనా వాడు అదృశ్యమైపోయాడు! ఎలా సాధ్యం? అరగంటగా తలబద్దలు కొట్టుకుని ఆలోచిస్తున్నా అంతుపట్టటం లేదు ఇన్స్‌పెక్టర్ ప్రతాప్‌కి.
28-12-2025, 07:51 AM
పై ప్రారంభ వాక్యం చదవగానే పాఠకుల్లో కలిగే స్పందన:
ఎవడు వాడు? ఎందుకు మాయమైపోయాడు? ఎలా మాయమైపోయాడు? ఎక్కడికి పోయాడు? కుతూహలంతో కథ చదివే వాళ్ల కళ్లు తర్వాతి అక్షరాల మీదకి పరుగులు తీస్తాయి. ఇక్కడ మూడే లైన్లలో కథలో ఉన్న సమస్య చెప్పేశాం. దాన్ని ఇన్స్‌పెక్టర్ ఎలా అధిగమిస్తాడనే కుతూహలం కలిగించగలిగాం. ఇలా ఆదిలోనే పాఠకుల్లో ప్రశ్నలు రేకెత్తించగలిగితే ఆ ఎత్తుగడ ఫలించినట్లే. ఐతే అన్నిసార్లూ ఉత్సుకత కలిగించే వాక్యాలతో కథ మొదలు పెట్టటం సాధ్యపడదు. వర్ణనలతో మొదలు పెట్టి తీరాల్సిన సందర్భాలూ తటస్థ పడతాయి. ఏ వాతావరణ నివేదికలైతే నీరసంగా ఉంటాయని భావిస్తానో వాటితోనే ‘శిక్ష’ మొదలు పెట్టాల్సొచ్చింది. ఆ నీరసం వదిలించటానికి ప్రాస మీద ఆధారపడ్డాను. ఇలాంటప్పుడు రచయిత తప్పనిసరిగా గుర్తుంచుకుకోవాల్సిన విషయం ఒకటుంది: మొదటి పేరా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. కథలో మొదటి పేరా మరీ పెద్ద గా ఉందంటే, రచయిత కథని సెటప్ చెయ్యటానికి (పాత్రల పరిచయం, పరిసరాల వర్ణన, మొ.) మరీ ఎక్కువ సమయం తీసుకుంటున్నారని అర్ధం. అది ఆదిలోనే విసుగెత్తించే ప్రమాదముంది. అందువల్ల రచయిత ఎప్పుడూ కథలో మొట్ట మొదటి పేరాగ్రాఫ్ మూడు లేదా నాలుగు లైన్ల కి మించకుండా జాగ్రత్తపడితే మంచిది. అంతకన్నా చిన్నగా ఉంటే మరీ మంచిది (ఈ వ్యాసమూ అలాగే మొదలయింది, గమనించండి) మొత్తమ్మీద, ఎత్తుగడ అనేది వీలైనంత క్లుప్తంగా ఉండి తర్వాత జరగబోయే కథపై ఉత్సుకత కలిగించటం అతి ముఖ్యం. అనుభవజ్ఞు లైన పాఠకులు ఆరంభం చదవగానే ఆ కథ మంచీ చెడుల్ని అంచనా వేయగలుగుతారు. పాఠకులని తొలి రెండు మూడు పేరాగ్రా ఫుల్లో ఆకట్టుకోలేని ఎత్తుగడతో కూడిన కథ చేరేది చెత్తబుట్టలోకే. ఇది వర్ధమాన రచయితలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం. ‘నాగరికథ’ అనే కథ కేవలం దాని ప్రారంభ వాక్యాల మూలానే ఎడిటర్ దృష్టిని ఆకర్షించింది. అవేంటో చూద్దాం:
28-12-2025, 08:15 AM
“మీ దగ్గరో టైమ్‌మెషీన్ ఉంది. దాన్లో మీరు కాలంలో డెభ్బయ్యేళ్లు వెనక్కెళ్లి మీ తాతగారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ఆయన్ని చంపేశారనుకుందాం. అప్పటికింకా ఆయనకి పెళ్లవలేదు కాబట్టి మీ నాన్నగారు పుట్టే
అవకాశం లేదు. అంటే మీరు పుట్టే అవకాశమూ లేదన్నమాట. అప్పుడు మీరు కాలంలో వెనక్కెళ్లి మీ తాతగారిని చంపేసే అవకాశమూ లేదు. అంటే మీ తాతగారు బతికే ఉంటారు, మీ నాన్నగారూ ఉంటారు, మీరూ ఉంటారు. అప్పుడు మీరు కాలప్రయాణం చేసి మీ తాతగార్ని చంపేసే అవకాశమూ ఉంది. అంటే ….” పై ఎత్తుగడ కథంతా పూర్తయ్యాక జతచేయబడింది. కథలో ఈ వాక్యాలు అమరటం కోసం ఏకంగా ఒక క్లాస్‌రూమ్ సన్నివేశాన్నే కల్పించాల్సొచ్చింది. ఆ సన్నివేశం కృతకంగా కనిపించకుండా ఉండటానికి దాన్ని ప్రధాన పాత్ర పరిచయం కోసం కూడా వాడుకోవాల్సొచ్చింది. అందుకోసం అప్పటికే పూర్తయిన కథలో అక్కడక్కడా మార్పులు చేయాల్సొచ్చింది. ఆ ప్రయాస వృధా పోలేదనేదానికి ‘నాగరికథ’ తెచ్చుకున్న గుర్తింపే రుజువు. ఆ అనుభవం అనుకోండి, మరోటనుకోండి …. కథలన్నిటికీ ప్రారంభవాక్యాలు చిట్ట చివర్లో రాయటం అలవాటుగా మారింది. ఇలా చెయ్యటం వల్ల ఓ ఉపయోగం కూడా ఉంది: ఆకట్టుకునే ఎత్తుగడ కోసం ఆలోచిస్తూ కూర్చుని కథ ఎన్నటికీ మొదలెట్ట లేకపోయే ప్రమాదం తప్పిపోతుంది. మొత్తం కథ పూర్తయ్యాక దానికి తగ్గ ఎత్తుగడ ఆలోచించటం ఒక పద్ధతి. మీకు ఎలా కుదిరితే అలా చేయండి. ఎత్తుగడపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇదంతా చదివాక మీలో కొందరు ‘ఆఁ సింగినాదం. చప్పగా మొదలై తర్వాత పుంజుకున్న గొప్ప కథలెన్ని లేవు’ అనొచ్చు. అదీ నిజమే. మీరూ అలా ప్రయత్నించొచ్చు, ఆపేవారెవరూ లేరు. మీ పేరు కొడవటిగంటి, ఓల్గా , మల్లాది లేదా యండమూరి (ఇక్కడ మన రచయితల పేర్లు ఉండాలి : కామరావు , మన్మధ మూర్తి, మ్యాంగో శిల్ప , లక్ష్మీ, ప్యాషనేట్ మ్యాన్ 45 , etc , ) అయ్యుంటే ఆరంభం అదిరిపోయిందా లేదా అనేదానితో పనిలేకుండా అందరూ కథ ఆసక్తిగా చదువుతారు. లేకపోతే అవతల పడేస్తారు. మనకంటూ ఓ గుర్తింపొచ్చాక, మొదలు ఎలా ఉన్నా మనకున్న పేరు కథ ఆసాంతమూ చదివించగలదనే నమ్మకమొచ్చాక ఏం చేసినా చెల్లుతుంది. అప్పటిదాకా, తిప్పలు తప్పవు. అదండీ ఈ భాగం కథాయణం. గుర్తుంచుకోండి – ఎత్తుగడ బలహీనంగా ఉన్న కథ పురిట్లోనే చిత్తౌతుంది. పాఠకుల దృష్టిని ఆకట్టుకోటానికి ఎత్తుగడ కన్నా ముఖ్యమైనది మరొకటుంది. దాని గురించి వచ్చే భాగంలో ముచ్చటించుకుందాం. |
|
« Next Oldest | Next Newest »
|