Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#21
Excellent update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Super update
Like Reply
#23
ఇంట్రెస్టింగ్
Like Reply
#24
Introduction adiripoyindi
Like Reply
#25
Super story. hollywood range loo undi.. chala gripping gaa rasthunnaru.. keep it up.. waiting for next update
Like Reply
#26
ప్రతి లిపి
లో
వేదం

ఇదే కదా...
Like Reply
#27
(22-12-2025, 08:00 AM)SivaSai Wrote: ఎపిసోడ్ 2


డ్యూటీలో జాయిన్ అయ్యినా వెంటనే టెర్రరిస్ట్ ఎటాక్ నుంచి తనని కాపాడిన భీరాజ్ ఫైల్ చూసి, తన భార్య వసుందరికి ఫోన్ చేసి కోర్టులో ఒక పిటిషన్ వేయామని చెప్పాడు సందీప్ రావు.

*********************

లండన్ వెస్ట్ పార్క్ దగ్గర ఉన్న నంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీసులో డైరెక్టర్స్ తో మాట్లాడుతూ "ఇప్పటి వరుకు16 దేశాలలో మన కంపెనీ ముద్రవేశము'

'ఈ సంవత్సరం తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ నార్వే లో కూడా అడుగు పెడుతున్నాము అని చెప్పడానికి సంతోషిస్తున్నాను." అన్నాడు ముకుల్ నంద.

"చైర్మన్ గారు! మీ మాటకు అడ్డు వస్తునందుకు క్షమించాలి, మన కంపెనీ పుట్టిన ఇండియాలో మాత్రం డవలేప్ మెంట్ లేకుండా అక్కడే ఆగిపోయము.'

'ప్రతి సంవత్సరం అక్కడ ఉన్న మన బిజినెస్ నుంచి  వందల కోట్ల నష్టం వస్తుంది. ఇప్పుడు మీ మనవలు మనవరాళ్లు కూడా బిజినెస్ లోకి వచ్చారు కదా!'

'వాళ్లకి ఇండియా లో ఉన్న  బిజినెస్ అప్పచెప్పండి లేకపోతే మన కంపెనీ పుట్టిన చోట కనుమరుగైపోతుంది." అన్నాడు ఒక డైరెక్టర్.

"ఆ విషయం నువ్వు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మీరంతా ఈ కంపెనీలో జాబ్ హోల్డర్స్ గా జాయిన్ అయ్యి డైరెక్టర్స్ గా మారారు ఆ విషయం మర్చిపోకండి." అంటూ కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు ముకుల్ నంద.

ఇంటిదగ్గర ఆలోచిస్తూ కూర్చున్నా  ముకుల్ దగ్గరకు వచ్చి "సార్! మన కంపెనీ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడికి వస్తున్నారు.'

'మన కంపెనీకి సంబంధించిన వారందరికీ ఇన్విటేషన్స్  పంపించాము ఇంకా ఎవరికైనా పంపించాలి అంటే చెప్పండి." అన్నాడు పిఎ.

"కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయ్ తర్వాత మాట్లాడదాము." అంటూ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి "హలో హిర్వాణి! హౌ అర్ యు? నీకు ఇన్విటేషన్ అందిందా?" అని అడిగాడు ముకుల్ నంద.

"సార్! మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి కాల్ చేశాను, 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ కేసు ఫైల్ కోర్టు బెంచ్ మీదకి వచ్చింది." అన్నాడు హిర్వాణి.

"అవునా? ఎంత ఖర్చు అయ్యినా పర్వాలేదు ఆ కేస్ ఓపెన్ అవ్వకూడదు." అంటూ కంగారుగా అన్నాడు ముకుల్.

"సారీ సార్! ఇన్ని సంవత్సరాలు కేస్ ఓపెన్ అవ్వకుండా అతన్ని జైలు నుంచి బయటకు రానివ్వకుండా మేనేజ్ చేయగలిగాను.'

'కానీ ఇప్పుడు ఆ కేస్ డీల్ చేస్తుంది వసుంధర! తనని డబ్బుతో కొనలేము కోర్టులోనే ఎదుర్కోవాలి, అయ్యినా ఈ కేసులో ఆవిడతో గెలవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు హిర్వాణి.

ఫోన్ పక్కన పెట్టి "అభిర్ బయట అడుగు పెడితే!" అంటూ భయంగా చూస్తూ గుండె పట్టుకొని కింద పడిపోయాడు ముకుల్ నంద.

"సార్!" అంటూ కంగారుగా  దగ్గరికి వచ్చి హాస్పిటల్ కి తీసుకు వెళుతూ ఫోన్ చేసి "మేడం! మీ తాతయ్య గారికి హార్ట్ ఎటాక్ వచ్చింది హాస్పిటల్ కి తీసుకువెళ్లను మీరు త్వరగా రావాలి." అని చెప్పాడు పిఏ.

"అవునా? నేను వెంటనే బయలుదేరుతున్నాను." అంటూ కంగారుగా చెప్పింది  ముకుల్ మనవరాలు అర్ణ.

*******************

ఢిల్లీ వసుందర తో కలిసి ఇంటి దగ్గరికి వచ్చి హాల్లో ఉన్న సందీప్ రావుని చూసి "హాయ్ బ్రదర్! హౌ ఆర్ యు? నీ మీద ఎటాక్ జరిగిందని తెలిసింది.'

"ఫుల్ డీటెయిల్స్ ఇస్తే 30 మినిట్స్ ప్రోగ్రాం చేసి టెలికాస్ట్ చేస్తాను, అసలే ఈ మధ్య సరైన హాట్ న్యూస్ ఏమి దొరకలేదు." అంటూ నవ్వుతూ అడిగింది నీలమ్.

"అవునా? ఎంత ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ అయితే మాత్రం  మీ అన్నయ్యనే టీవీలో చూపించి ట్రోల్ చేస్తావా?'

'అయ్యినా వీకెండ్ తప్పితే మిగతా రోజుల్లో మా ఇంటికి రాకూడదు అనుకుంటున్నావా ఏంటి?" అనుమానంగా అడిగింది వసుందర.

"హో..! అలాంటిదేమీ లేదు వదినా! వీకెండ్ అయితే రోషిని  ఇంటి దగ్గరే ఉంటుంది. నేను కాసేపు స్పెండ్ చేయొచ్చు, మామూలు రోజుల్లో నువ్వు కోర్టుకు వెళతావు అన్నయ్య డ్యూటీ కి వెళ్తాడు.'

'నేను ఇక్కడ ఉన్న ఒకటే నా రూమ్ లో ఉన్న ఒకటే కదా!" అంటూ లోపలి నుంచి వస్తున్న రోషనిని చూసి "హాయ్! నీకోసమే వచ్చాను." అంటూ చాక్లెట్స్ ఇచ్చి ముద్దులాడుతూ ఉంది నీలమ్.

"హాయ్ ఆంటీ!" అంటూ చాక్లెట్లు తీసుకుని "ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చింది." అంటూ రూమ్ లో ఉన్న కుక్క పిల్లని చూపించి

"దీని పేరు టామీ! మా ఇంట్లోనే ఉంటుంది నేను ఆడుకోవడానికి డాడీ తీసుకువచ్చారు." అంటూ సంతోషంగా చెప్పింది రోషిని.

"హో.. క్యూట్ గా ఉంది." అంటూ సమరుతు చెప్పింది నీలమ్.

ఫైల్స్ టేబుల్ మీద పెడుతూ "సందీప్! నువ్వు చెప్పినట్లు జైల్లో ఉన్న  వ్యక్తి కేస్ రిఓపెన్ చేయాలని పిటిషన్ వేశాను.
ట్విస్ట్ ఏమిటంటే!'

'నేను పిటిషన్ వేసిన గంటలో తీహార్ జైల్లో ఉన్న కరుడుగట్టిన నేరస్తులని అండమాన్ జైలు కి షిఫ్ట్ చేయాలి ఇక్కడ ఉండడం ప్రమాదం అని చెప్పి NIA వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ లిస్టులో అభిర్ పేరు కూడా ఉంది." అని చెప్పింది వసుందర.

"అవునా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ "అసలు అభిర్ నేరం చేసినట్లే రుజువు అవ్వలేదు, అలాంటిది కరుడుగట్టిన నేరస్తుడు ఎలా అవుతాడు? అతని వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది." అంటూ అనుమానంగా అన్నాడు సందీప్ రావు.

కుక్కపిల్లతో ఆడుతూ "అసలు అభిర్ కేస్ ఇన్ని సంవత్సరాలు ఫాలోఅప్ చేసిన లాయర్ ఎవరు?" డౌట్ గా అడిగింది నీలమ్.

"ఈ కేసులో ఆపోజిట్ లాయర్ మితిల్ హిర్వాణి! తన ఇన్ఫ్లెన్స్ తోనే ఇన్ని సంవత్సరాలుగా ఈ కేసుని బెంచ్ మీదకి కూడా రాకుండా చేశాడు.'

'16 సంవత్సరాల పిల్లాడిని 18 సంవత్సరాలు నిండాయని కోర్టుని నమ్మించి తీహార్ జైలుకి పంపించాడు." అని చెప్పింది వసుందర.

"లాయర్ హిర్వాణి! తను ఏ కేస్ టేకప్ చేసినా క్రోర్స్ లో ఛార్జ్ చేస్తాడు ఎటువంటి కేసు అయిన తారుమారు చేయగల సత్తా ఉన్నవాడు.'

'నాకు తెలిసి ఈ అండమాన్ జైలుకి పంపించే ప్రపోజల్ కూడా అతనే తీసుకువచ్చి ఉంటాడు  ఎటువంటి వారినైనా డబ్బుతో పడేస్తాడు." అని చెప్పింది నీలమ్.

"అభిర్ జైలుకి వచ్చినప్పుడు వయస్సు 16 సంవత్సరాలు ఆ వయసు పిల్లవాడిని  అన్ని కోట్లు ఖర్చుపెట్టి బయటకు రానివ్వకుండా 12 సంవత్సరాలు జైల్లోనే ఉంచి అతని జీవితం పాడు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది." అన్నాడు సందీప్ రావు.

"ఓకే! నాకు మంచి న్యూస్ దొరికినట్లు ఉంది ఒకసారి అభిర్ తో మాట్లాడాలి." అంది నీలమ్.

"మనం వేసిన పిటిషన్ రెండు రోజుల్లో బెంచ్ మీదకి వస్తుంది నేను కూడా ఒకసారి అభిర్ తో మాట్లాడాలి." అంది వసుందర.

"ఓకే! మీ ఇద్దరికి నేను స్పెషల్ పర్మిషన్ ఇప్పిస్తాను రేపు జైలుకు వచ్చి అభిర్ తో మాట్లాడండి." అన్నాడు సందీప్ రావు.

*******************

లండన్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఐసియు లో ఉన్న ముకుల్ నంద ని చూసి పక్కనే ఉన్న పిఏ వైపు చూస్తూ "తాతగారు దేని గురించైనా ఆలోచించి టెన్షన్ పడ్డారా?" డౌట్ గా అడిగింది అర్ణ.

"మేడం! 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ గురించి, నార్వేలో కంపెనీ స్టార్ట్ చేయడం గురించి డైరెక్టర్ తో మీటింగ్ జరిగింది అక్కడ ఇండియాలో ఉన్న బిజినెస్ గురించి డిస్కషన్ జరిగింది అప్పుడే  బాగా టెన్షన్ పడ్డారు." అన్నాడు పిఏ.

"మనకి ఇండియాలో ఉన్న కంపెనీల ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి." అని అడిగింది అర్ణ.

"మేడం! ఆ డీటెయిల్స్ మొత్తం సార్ చాలా సీక్రెట్ గా ఉంచుతారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కూడా ఆ కంపెనీల డీటెయిల్స్ తెలుసుకోనివ్వరు అక్కడకి వెళ్లనివ్వరు.'

"సార్ స్వయంగా చూసుకుంటారు ఇప్పుడు మీరు అడిగారని తెలిస్తే ఆయన ఇంకా టెన్షన్ పడతారు." అన్నాడు పిఏ.

"ఓకే! మా ఫ్యామిలీ మెంబర్స్ లండన్ ఎప్పుడు వస్తున్నారు?" అని అడిగింది అర్ణ.

"టుడేస్ లో అందరూ ఇక్కడే ఉంటారు మేడం! ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి." అన్నాడు పిఏ.

"ఓకే! మీటింగ్లో ఇండియా కంపెనీస్ గురించి మాట్లాడిన డైరెక్టర్ ఎవరు?" డౌట్ గా అడిగింది అర్ణ.

"ప్రతాప్ మిశ్రా గారు మేడం!" అని చెప్పాడు పిఏ.

"ఓకే! తాత గారు స్పృహలోకి వస్తే వెంటనే నాకు కాల్ చెయ్!" అంటూ ఫోన్ తీసి కాల్ చేసి "హాయ్ అంకుల్! హౌ ఆర్ యు?" అని అడిగింది అర్ణ.

"హాయ్ బేబీ ఫైన్! ఇప్పుడే హాస్పిటల్ కి బయలుదేరుతున్నాను నువ్వు అక్కడే ఉన్నావా?" అని అడిగాడు ప్రతాప్ మిశ్రా

"ఎస్ అంకుల్! మీరు ఇంటి దగ్గర ఉండండి నేనే మీ దగ్గరికి వస్తున్నాను కొంచెం మాట్లాడే పని ఉంది." అంటూ ఫోన్ కట్ చెసి కార్ లో స్పీడ్ గా వెళ్ళింది అర్ణ.

కాసేపటికి ఇంటి లోపలికి వస్తున్న అర్ణని చూసి "హాయ్ బేబీ! ఏంటి పర్సనల్ మీట్ అవ్వాలి అన్నావు? ఎనీ ఇంపార్టెంట్ మేటర్!" డౌట్ గా అడిగాడు ప్రతాప్ మిశ్రా.

"ఇండియాలో ఉన్న మన కంపెనీస్ డీటెయిల్స్ నాకు కావాలి, వాటిని తాతగారు ఎవరికి తెలియకుండా ఎందుకు సీక్రెట్ గా ఉంచుతున్నారో తెలుసుకోవాలి." అంది అర్ణ.

"నంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆస్తిలో థర్టీ పర్సెంట్ ఇండియాలోనే ఉంది. అక్కడ కంపెనీస్ వల్ల వచ్చే నష్టం మన లాభాలను కూడా దెబ్బతిస్తుంది.'

'మనం అక్కడ ఉన్న కంపెనీస్ క్లోజ్ చేసి ఆస్తులు అమ్మినా చాలు మన కంపెనీ షేర్ వాల్యూ మూడు రెట్లు అవుతుంది.'

'ఈ విషయం ఎప్పుడూ మాట్లాడిన తాతగారు టెన్షన్ గా మీటింగ్ నుంచి వెళ్ళిపోతారు అసలు మన కంపెనీ పుట్టింది ఇండియాలో కానీ అక్కడ జీవం లేకుండా అయిపోతుంది. మీలో ఎవరైనా దీని గురించి ఇంట్రెస్ట్ చూపిస్తే అందరం లాభపడతాము." అన్నాడు ప్రతాప్ మిశ్రా.

"ఓకే అంకుల్! టు డేస్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వస్తున్నారు, ఈ విషయం గురించి తాత గారితో నేను మాట్లాడుతాను.'

'ఇప్పటివరకు నేను హ్యాండిల్ చేసినా ప్రతి విషయంలో సక్సెస్ అయ్యాను." అంటూ స్మైల్ ఇస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయింది అర్ణ.

అక్కడి నుంచి అర్ణ కారు వెళ్లడంతోనే ఫోన్ తీసి కాల్ చేసి "నమస్తే రాజన్! తొందరలోనే నంద వారసులు ఇండియాలో అడుగుపెట్టబోతున్నారు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.

"అవునా? వెల్కమ్ చెప్పడానికి మా అబీర్ సైన్యం సిద్ధంగా ఉంటుంది." అంటూ గంభీరమైన గొంతుతో చెప్పాడు రాజన్.
Copied from Pratilipi
Like Reply
#28
అక్కడ అందరికీ చదవడానికి అవకాశం లేదు.

కొనసాగించు మిత్రమా!

ఇక్కడకు పాఠకులు ఎక్కువమంది రారు. నిరుత్సాహ పడవద్దు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#29
అక్కడ 102 భాగాల్లో కేవలం 4 అందరికీ అందుబాటులో ఉన్నాయి.

తరువాత ఓ నాలుగు భాగాలు ఫోన్లో చదువవచ్చు

మిగిలిన వాటి కోసం డబ్బు కాట్టాలి మిత్రమా!

మన, తెలుగు వాళ్ళకు, డబ్బు కట్టే అలవాటు లేదు.

అందుకే మితృడు ఇస్తున్న కథను పూర్తివెయ్యనిస్తే బాగుంటుంది.

ఆలోచించండి, ఎవరిపైనన్నా వ్యాఖ్యలు చెసే ముందు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#30
శివ సాయి గారికి ఓ సూచన

ఇటువంటి కథలు ఇస్తున్నపుడు అసలు రచయిత పేరుతో ఇస్తే సముచితంగా ఉంటుంది.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#31
ఎపిసోడ్ 7


ఇంటికి వచ్చిన హిర్వాణి తో "ఈ కేస్ ఇంపాక్ట్ అర్థమయింది. రేపు అభిర్ రిలీజ్ అవుతాడు." అని చెప్పింది వసుధర.

మిథున్ నుంచి మెసేజ్ రావడంతో డిన్నర్ కి వెళ్లి వీడియో కాల్ లో అర్ణ ని చూసాడు హిర్వాణి.

*********************

వీడియో కాల్ లో అర్ణని చూస్తూ "మేడమ్! మీరు నా నుంచి ఏమి వినాలి అనుకుంటున్నారో అడగండి." అంటూ వినయంగా చెప్పాడు హిర్వాణి.

"మా తాత గారికి మీకు ఉన్న డీల్ ఏమిటో నేను తెలుసుకోవాలి ఏమీ లేదు అని మాత్రం చెప్పకండి. ఎవ్రీ ఇయర్ మీ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది.'

'ఇండియాలో మా తాతగారు ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయ్యారా? అక్కడికి వస్తే అరెస్టు అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా?" డౌట్ గా అడిగింది అర్ణ.

"మేడం! తాతయ్య గారి మీద కేసు ఉంటే ఇన్ని రోజులు  ఉండనిస్తానా ఎప్పుడో క్లోజ్ చేయించేవాడిని అలాంటిదేమీ లేదు." అన్నాడు హిర్వాణి.

"మరి ఇండియా లో మాకు ఉన్న ఇష్యూ ఏమిటి? లాయర్లకి, గ్యాంగ్ స్టార్స్ కి పేమెంట్ ఎందుకు చేస్తున్నారు? నాకు క్లారిటీ కావాలి త్వరలో ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్  క్లోజ్ చేయాలి, ఆ డిల్స్ మొత్తం మీ చేతుల మీదే జరగాలి అనుకుంటున్నాను." అంది అర్ణ.

"థాంక్యూ మేడం! ఈ విషయం గురించి ఎక్కడ నోరు విప్పనని మీ తాత గారికి మాటిచ్చాను, కానీ మీరు ఆ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అది కాకుండా మిథున్ సార్ ముందు నన్ను కూర్చో పెట్టారు కాబట్టి చెబుతున్నాను.'

'12 సంవత్సరాల క్రితం ఒకరోజు మీ తాతగారు నాకు ఫోన్ చేసి NIA ఆఫీసర్ మురళి జోషి మర్డర్ జరిగింది ఆ కేస్ లో ఒక వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి జైలుకి పంపించాలి.'

'అతను జైల్లో ఉన్న విషయం బయట ప్రపంచానికి తెలియకూడదు అతను జీవితం జైల్లోనే ముగిసిపోవాలి ఈ డీల్ చేయడం నీవల్ల అవుతుందా అని అడిగారు.'

'నేను మీ తాత గారితో డీల్ చేసుకొని అభిర్ అనే పదహారేళ్ల పిల్లాడిని ఆ కేసులో ఇన్వాల్వ్ చేశాను, బాల నేరస్తుడు కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత బయటికి వస్తాడు.'

అందుకే అతనికి 18 సంవత్సరాలు అని సర్టిఫికెట్ సృష్టించి తీహార్ జైల్ కి పంపించి ఈ కేస్ బెంచ్ మీదకి కూడా రాకుండా చేసి 12 సంవత్సరాలుగా అతన్ని లోపలే ఉంచగలిగాను.'

'ఈ కేస్ గురించి కానీ, అభిర్ జైల్లో ఉన్న విషయం గురించి గానీ బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం మిచల్ అనే గ్యాంగ్ స్టర్ కి పేమెంట్ ఇచ్చి ఈ కేస్ గురించి తెలిసిన వాళ్లందర్నీ చంపించేసాము.'

'కానీ ఈ కేసు మళ్లీ రి ఓపెన్ అయ్యి సిబిఐకి అప్పగించారు అభిర్ బెయిల్ మీద బయటకి వస్తున్నాడు." అని చెప్పాడు హిర్వాణి.

"ఓకే! ఆ అభిర్ ఎవరు? 16 సంవత్సరాలు ఉన్న ఒక పిల్లడికి భయపడి మా తాతగారు ఇంత చేయాల్సిన అవసరం ఏముంది?" డౌట్ గా అడిగింది వర్ణ.

"నిజం చెప్పాలంటే నాకు కూడా తెలియదు మేడమ్! అభిర్ కోసం ఇప్పటివరకు ఎవరు రాలేదు, సెక్యూరిటీ అధికారి ఎంక్వైరీలో కూడా అతను నోరు తెరిచి ఏ విషయం  మాట్లాడలేదు.'

'ఇప్పుడు బెయిల్ కూడా ఒక లాయర్ చొరవతో వస్తుంది అతనికి ఆ లాయర్ కి కూడా ఎటువంటి సంబంధం లేదు." అని చెప్పాడు హిర్వాణి.

"అవునా? చాలా విచిత్రంగా ఉంది. మా నాన్నగారు గోకుల్ నంద గారు ఎలా చనిపోయారో ఎవరు చంపారో మీకు తెలుసా?" అని అడిగింది అర్ణ.

"ఆరోజు మురళి జోషి చనిపోయిన ప్లేస్ లోనే మీ నాన్నగారి బాడీ కూడా ఉంది. ఆయన్ని చాలా దారుణంగా నరికి చంపారు ఒంటి మీద 72 కత్తిపోట్లు ఉన్నాయి.'

ఈ విషయం బయటికి రాకుండా మేనేజ్ చేయమని మీ తాతగారు చెప్పారు అందుకని ఆయన యాక్సిడెంట్లో చనిపోయినట్లు సృష్టించాము.'

'నాకు తెలిసి ఆ ఇద్దరిని కచ్చితంగా ఐదు ఆరుగురు కలిసి చంపి ఉంటారు ఒక్క మనిషి వల్ల అలా చంపడం సాధ్యం కాదు.'

'ఈ కేస్ మొత్తాన్ని కంప్లీట్ గా డైవర్ట్ చేయడం వల్ల నిజమైన హంతకులు ఎవరు అనేది మీ తాత గారికి ఆ దేవుడికి మాత్రమే తెలియాలి. " అన్నాడు హిర్వాణి.


"మన మీటింగ్ విషయం తాత గారికి తెలియాల్సిన అవసరం లేదు, ఈ కేస్ విషయం లో మా తాతగారు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి.'

'టైమ్ వచ్చినప్పుడు నేను ఎంటర్ అవుతాను, ఈ లోపు అభిర్ గురించి ఏ విషయం తెలిసినా నాకు ఇన్ఫామ్ చేయండి.'

'మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మిథున్ ని అడగండి చాలు అయిపోతుంది." అంటూ కాల్ కట్ చేసింది అర్ణ.

లాప్టాప్ క్లోజ్ చేసి దూరంగా ఉన్న మిథున్ వైపు చూసి "సార్! మేడం కాల్ నుంచి వెళ్ళిపోయారు." అన్నాడు హిర్వాణి.

"ఓకే!" అంటూ అక్కడికి వస్తూ "మీరు మాట్లాడిన అర్ణ నంద గ్రూప్ కి వారసురాలు మాత్రమే కాదు ఆ కంపెనీకి కాబోయే చైర్మన్!'

'తన తెలివికి నేను కూడా సరెండర్ అయిపోయాను జాగ్రత్తగా వాడుకోండి మీ ఫ్యూచర్ బ్రైట్నెస్ తగ్గదు." అన్నాడు మిథున్.

"ఓకే సార్! డిన్నర్ కు పిలిచి మంచి ట్రేట్ ఇవ్వడమే కాకుండా మంచి డీల్ కూడా ఇచ్చారు." అంటూ స్మైల్ ఇచ్చాడు హిర్వాణి.

"ఓకే! మళ్లీ కలుసుకుందాము వెళ్లేటప్పుడు ఆ వైన్ బాటిల్ తీసుకువెళ్లండి మీరు ఇష్టంగా తాగడం చూశాను." అన్నాడు మిథున్.

"థాంక్యూ సార్!" అంటూ కార్ లో ఇంటికి వెళుతూ ఫోన్ చేసి "నమస్తే సార్! ఆబీర్ కి బెయిల్ వచ్చింది. మిచల్ రెండు రోజుల్లో ఢిల్లీకి వస్తున్నాడు వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతాడు." అన్నాడు హిర్వాణి.

"అవునా? లాయర్ వసుంధర తో డీల్ కుదరలేదా?" అని అడిగాడు ముకుల్.

"నో సార్! ఆవిడకి డబ్బు ఎక్కువైతే మాయరోగం వస్తుందంట!" అన్నాడు హిర్వాణి.

"ఈ కేసు వెనకాల నేను ఉన్న విషయం ఎప్పటికీ బయటకు రాకూడదు వస్తే మిచల్ కి మరో 100 కోట్ల ట్రాన్స్ఫర్ చేస్తాను." అంటూ ఫోన్ పెట్టేసాడు ముకూల్ నంద.

కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ "పెద్ద వాళ్ళతో డీలింగ్ అంటే డబ్బుతో పాటు డేంజర్ కూడా వెనకాలే ఉంటుంది. అసలు ఆ అభిర్ గాడితో ఈ ముసలోడికి ప్రాబ్లం ఏమిటో  ఇప్పటివరకు అర్థం కాలేదు." అనుకుంటూ ఇంటి దగ్గర దిగాడు హిర్వాణి.

******************

ఉదయం జైలుకి వచ్చి బెయిల్ పేపర్స్ సబ్మిట్ చేసి అభిర్ ని రిలీజ్ చేయించి తీసుకువెళ్లడానికి ప్రిపేర్ అయ్యారు వసుంధర, నీలమ్ లు.

అక్కడికి తన ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి వచ్చి "గుడ్ మార్నింగ్ లాయర్ గారు! ఐ యాం శ్రీకర్ సీబీఐ! ఈ కేస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి అపాయింట్ అయ్యాను.'

'వీళ్లిద్దరు నా అసిస్టెంట్స్ శక్తిదాస్, కుమార్ ఈ కేస్ కంప్లీట్ అయ్యేంతవరకు అబీర్ తో పాటు ఉంటారు." అంటూ పేపర్స్ ఇచ్చాడు శ్రీకర్.

"అభిర్ మా ఇంటి దగ్గర ఉన్న ఫామ్ హౌస్ లోనే ఉంటాడు వీళ్లు కూడా అతనితోపాటు అక్కడే ఉండొచ్చు తొందరలోనే  ఈ కేసు కంప్లీట్ అవుతుంది." అని చెప్పింది వసుంధర.

"మీకు మా కోపరేషన్ తప్పకుండా ఉంటుంది అలాగే ఆబిర్ కోపరేషన్ కూడా ఉంటే ఈ కేసు ఇంకా స్పీడ్ గా క్లోజ్ చెయ్యొచ్చు!" అంటూ బయటికి వస్తున్న అభిర్ వైపు చూసి

"ఈరోజు నుంచి నీతో పాటు ఈ ఇద్దరు ఆఫీసర్స్ ఉంటారు, నువ్వు వీళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావని తెలిస్తే వెంటనే నీ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది.'

'అలాగే! మీడియా ముందు గాని సోషల్ మీడియాలో గాని ఈ కేసు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు." అని చెప్పాడు శ్రీకర్.

"ఓకే సార్!" అంటూ తనతో పాటు ఉండే ఇద్దరి ఆఫీసర్స్ ని చూసి, ఎదురుగా ఉన్న వసుంధర వైపు చూస్తూ స్మైల్ ఇచ్చి నమస్కారం చేశాడు అభిర్.

కవర్ తీసి టేబుల్ మీద పెడుతూ "అభిర్! నువ్వు జైలుకి వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న వస్తువులు." అని ఇచ్చాడు సందీప్ రావు.

కవర్ తీసుకుని జేబులో పెట్టుకొని శంకర్ వైపు చూసి "బాబాయ్! వెళుతున్నాను మళ్లీ ఇక్కడికి రాను, మొక్కలని జాగ్రత్తగా చూసుకో!" అని చెప్పాడు అభిర్.

"సరే! రోజు నీళ్లు పోస్తాను జాగ్రత్తగా వెళ్ళిరా! రోజు వచ్చి కలుస్తూ ఉంటాను." అంటూ సంతోషంగా చెప్పాడు శంకర్.

కాసేపటికి ఇంటి దగ్గరికి చేరుకుని అవుట్ హౌస్ చూపిస్తూ  "అభిర్! ఈరోజు నుంచి కేస్ కంప్లీట్ అయ్యేవరకు ఈ ఇంటిలోనే ఉండాలి తరువాత నీ ఇష్టం!" అని చెప్పింది వసుంధర.

"ఓకే మేడం!" అంటూ ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లి కళ్ళు మూసుకుని "చాలా ప్రశాంతంగా ఉంది." అని చెప్పాడు అభిర్.

"శక్తి దాస్, కుమార్! మీకోసం ఇక్కడే సపరేట్ గా రూమ్ ఉంది ఏది అవసరమైన నాకు చెప్పండి." అంది వసుంధర.

"ఓకే మేడం! మీరు ఈ కేస్ డీల్ చేశారు అంటే న్యాయం అబీర్ వైపు ఉందని అర్థం అయింది. మా డ్యూటీ ప్రకారం మేము ఇక్కడ ఉంటాము మా వల్ల ఎవరికి డిస్టబెన్స్ ఉండదు." అని చెప్పాడు శక్తిదాస్.

"సారీ అబీర్! నీ డాక్యుమెంటరీని టీవీలో టెలికాస్ట్ చేయలేకపోయాను కానీ ఎప్పటికైనా నీ స్టోరీ మొత్తం ఒక సీరియల్ లాగా తీసి అందరికీ చూపిస్తాను." అంటు నవ్వుతూ చెప్పింది  నీలమ్.

అక్కడికి వచ్చి "హాయ్ అంకుల్!" అంటూ కృష్ణుడి బొమ్మ అభిర్ చేతిలో పెట్టి "వెల్కమ్ టు మై హోమ్! ఇది నా ఫ్రెండ్ పేరు టామీ అది కూడా మీకు హాయ్ చెబుతుంది." అంది రోషిని.

కృష్ణుడి బొమ్మ తీసుకొని రోషిని తల మీద చేయి వేసి "మీ అమ్మాయికి కూడా మీలాగా మంచి మనసు ఉంది మూగజీవిని తను ఫ్రెండ్ గా చేసుకుంది." అంటూ సంతోషంగా చూస్తూ చెప్పాడు అభిర్.
[+] 4 users Like SivaSai's post
Like Reply
#32
ఎపిసోడ్ 8


హిర్వాణి తో వీడియో కాల్ లో మాట్లాడి డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయో ప్రాబ్లం ఏమిటో వివరాలు తెలుసుకుంది అర్ణ.

జైలు నుంచి వసుంధర ఇంటి దగ్గర అవుట్ హౌస్ కి వచ్చాడు అభిర్.

*****************

లండన్ వేరే వేరే దేశాలలో ఉంటూ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి వచ్చిన ఫ్యామిలీ మెంబెర్స్ ని రిసీవ్ చేసుకుని ఒక ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకు వెళ్ళింది వర్ణ.

"మనం మీ ఇంటికి వెళ్లకుండా ఫామ్ హౌస్ దగ్గరికి ఎందుకు వచ్చాము? నాన్నగారు ఇక్కడ ఉన్నారా ఏంటి?" డౌట్ గా అడిగాడు ముకుల్ నంద రెండో కొడుకు ప్రవీణ్ నంద.

"నో! తాతగారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రాత్రి ఇంటికి వచ్చారు." అని చెప్పింది అర్ణ.

"అవునా? నాన్నగారు హాస్పిటల్ లో ఉన్న విషయం మాకు ఎందుకు చెప్పలేదు?" డౌట్ గా అడిగింది పెద్ద కూతురు ఝాన్సీ.

"అలా అయితే మనం ఇక్కడికి ఎందుకు ఇంటికి వెళ్లి నాన్నగారిని చూద్దాం పదండి." అంది రెండో కూతురు నళిని.

"అర్ణ మనతో ఏదో మాట్లాడాలి అనుకుంటుంది అందుకునే ఇక్కడికి తీసుకు వచ్చింది అందరూ కాసేపు ప్రశాంతంగా ఉండండి." అన్నాడు రెండో కొడుకు సుభాష్ నంద.

"ఎస్! మీరందరూ ప్రశాంతంగా ఉంటే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి, తాతగారు అందరకి ఆస్తులు పంచబోతున్నారు." అని చెప్పింది అర్ణ.

"అవునా? అయితే ఇందులో ప్రాబ్లమ్ ఏముంది ఉన్నది మొత్తం 5 వాటాలు అని ఎప్పటినుంచో అనుకునేదే కదా!" అన్నాడు ప్రవీణ్.

"నేను వాటాల గురించి మాట్లాడడానికి మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాలేదు,12 సంవత్సరాల క్రితం ఇండియాలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి తీసుకువచ్చాను." అంది అర్ణ.

"నో! ఇండియా బిజినెస్ లు మొత్తం గోకుల్, నాన్నగారు చూసుకునేవారు  అన్నయ్య యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత నాన్నగారు లండన్ వచ్చేసారు.'

'నేను ఒకసారి అడిగితే ఆ విషయం గురించి ఇంకెప్పుడు మాట్లాడకు నీకు ఇచ్చిన బిజినెస్ లు నువ్వు జాగ్రత్తగా చూసుకో అన్నారు అందుకే నేను ఆ టాపిక్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు." అన్నాడు సుభాష్.

"ఎస్! అన్నయ్య చనిపోయిన తర్వాత నేను వెళ్లి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అని అడిగాను అప్పుడు నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు అప్పటినుంచి నేను ఇండియా విషయం మర్చిపోయాను." అంది ఝాన్సీ.

"నాకు అసలు ఇండియా సంగతే తెలీదు ఒకసారి బిజినెస్ ట్రిప్ నిమిత్తం వెళుతున్నాను అంటే నాన్నగారు వద్దు అన్నారు ఆగిపోయాను అప్పట్నుంచి ఇండియా తో ఒక డీల్ కూడా చేసుకోలేదు." అన్నాడు ప్రవీణ్.

"నాకు తెలిసి ఇండియాలో అన్నయ్య, నాన్నగారు ఏదో ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశారు అందుకే ఆయన వెళ్లడం లేదు ఎవర్ని వెళ్లడం లేదు.'

'ఒక్కసారి అడిగితే ఇండియాలో ఉన్న బిజినెస్ లు నేను మాత్రమే చూసుకుంటాను అని చెప్పారు, ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు అందుకే ఆ రోజు నుంచి సైలెంట్ గా ఉండిపోయాను." అంది నళిని.

"ఇండియాలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ నంద గ్రూప్ కంపెనీలు మాక్సిమం మూత పడిపోయాయి అని నాకు ఈమధ్య తెలిసింది దాని గురించి అందరితో ఒకసారి మాట్లాడదాము అనుకున్నాను ఇంతలో ఆ టాపిక్ నువ్వే తీసుకొచ్చావు." అన్నాడు ప్రవీణ్ కొడుకు విష్ణు.

సైలెంట్ గా కూర్చున్న సుభాష్ కొడుకు ప్రమోద్ వైపు చూసి "నీకు ఏమైనా ఐడియా ఉందా?" అని అడిగింది అర్ణ.

"నో ఐడియా! 30 మినిట్స్ లో ఫుట్ బాల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీటింగ్ త్వరగా అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను." అన్నాడు ప్రమోద్.

"ఆశ, మోహిత్ మీరిద్దరు నంద వారసులు కాకపోయినా ఆస్తిలో వాటలు వస్తున్నాయి మీకు ఏమైనా ఐడియా ఉందా?" అంటూ వేటకారంగా చూస్తూ అంది అర్ణ.

"నాన్నగారు! కూతుర్ని కొడుకుల్ని సమానంగా చూశారు నువ్వు వారసులు కాదు అంటూ గుర్తు చేయాల్సిన అవసరం లేదు." అంటూ కోపంగా అంది ఝాన్సీ.

"సారీ అత్తయ్య! నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఇండియాలో మన ప్రాపర్టీ వ్యాల్యూ 2 లాక్స్ కోర్స్ మన ఆస్తిలో 20% అక్కడే ఉంది. కానీ ఆ ఆస్తిని పక్కన పెట్టి మిగతా దాన్ని మనకి పంచడానికి రెడీ అవుతున్నారు." అంది అర్ణ.

"అవునా? ఒకవేళ అక్కడ నంద వారసుడు ఎవరైనా ఉన్నారా?" డౌట్ గా అడిగాడు నళిని భర్త రాజేష్.

"ఇండియాలో ఉన్న ఆస్తి కూడా అందరికీ సమానంగా పంచి పెట్టమని నాన్న గారిని అడుగుదాము." అంది నళిని.

"ఆ మాట తాత గారిని అడిగే ధైర్యం ఎవరికైనా ఉందా?" అంటూ అందరి వైపు చూసింది అర్ణ.

"నో! అంత ధైర్యం ఇక్కడ ఎవరు చేయలేరు." అన్నాడు విష్ణు.

"ఎస్! అందుకే మన అందరి తరపున అక్కడికి ఒకరిని పంపడానికి డిసైడ్ అయ్యాను, దానికి మీ అందరి సహకారం కూడా ఉంటే నా పని ఈజీ అవుతుంది." అంది అర్ణ.

"నాన్నగారు ఇండియాలో ఉన్న బిజినెస్, ప్రాపర్టీస్ గురించి అలా ఎందుకు ఉన్నారో మనం తెలుసుకోకుండా ప్రొసీడ్ అయితే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందేమో ఆలోచించండి." అన్నాడు సుభాష్.

"నేను ఆ విషయం కూడా ఆలోచించను అందుకే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవ్వరు ఇండియాలోకి ఎంటర్ అవ్వరు ప్రాబ్లం ఏమిటో తెలుసుకోవడానికి ఒక ట్రైల్ వేస్తున్నాను సక్సెస్ అయితే ఆస్తి పంచుకుంటాము లేకపోతే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో ఆలోచిస్తాము." అంది అర్ణ.

"గుడ్! నా ఓటు అక్కకే నేను ఈ మెంటల్ టెంక్షన్ పెట్టుకోలేను." అన్నాడు ప్రమోద్.

"ఓకే! మనలో నువ్వే సమర్ధురాలవి చిన్నప్పుడు నుంచి నాన్నగారి దగ్గరే ఉంటున్నావు ఒకవేళ ఏదైనా ఇష్యూ అయినా సర్ది చెప్పగలవు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి నీ వెనకాల మేము ఉంటాము." అంది నళిని.

"మా అందరి ఓటు కూడా నీకే ఏం చేయాలో నువ్వే డిసైడ్ చెయ్!" అన్నాడు ప్రవీణ్.

"ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత తాతగారు ఏమీ చెబుతారో చూసి ఇండియాకి ప్రతాప్ మిశ్ర కొడుకు సుజిత్ ని పంపిస్తాను అంత ఓకే అనుకుంటే నంద వారసులుగా మనం ఎంటర్ అవుదాము." అని చెప్పింది అర్ణ.

"ఓకే! గుడ్ ఐడియా!" అన్నారు అందరు.

"సరే! త్వరగా ఫ్రెష్ అయ్యి ఇంటికి వచ్చేయండి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది." అంటూ మహేష్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అర్ణ.

అక్కడినుంచి అర్ణ వెళ్లడంతోనే లోపలి నుంచి వస్తూ "అర్ణ చెప్పిన మాట విని అందరు గంగిరెద్దుల్లాగా తలలు ఊపారు అసలు విషయం ఏమిటో ఆలోచించరా?" అని అడిగాడు ఝాన్సీ భర్త రఘురామ్.

"ఈ విషయంలో మనం ఆలోచించి ఏమీ చేయగలం బావ! ఎప్పుడు ఇండియా పేరు ఎత్తిన నాన్నగారు తాసు పాములాగా లెగుస్తున్నారు ఆ బాధ ఏదో దానినే పడనివ్వు ఆస్తి వచ్చిన తర్వాత హ్యాపీగా పంచుకుందాము." అన్నాడు ప్రవీణ్.

"నేను కంపెనీలో ఉన్న ఒక డైరెక్టర్ తో మాట్లాడాను అసలు ఇండియాలో ప్రాబ్లం అంటూ ఏమీ లేదు తన ముద్దుల కొడుకు గోకుల్ అక్కడ చనిపోయాడని బాధలో దానిని పక్కన పెట్టారు.'

'మనం అందరం కలిసి ఆస్తిని అర్ణ చేతిలో పెట్టాము అంటే దాంట్లో సగం కూడా మన చేతికి రాదు మీరందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకునే లేపు అది పది డిసిషన్ లు తీసుకుంటుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో మనం కూడా తెలుసుకోవాలి." అన్నాడు రఘురామ్.

"ఎస్! మావయ్య చెప్పింది కరెక్ట్!" అన్నాడు విష్ణు.

"సరే! నీకు ఇండియాలో పరిచయాలు ఎక్కువ కదా! అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండు. ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాము." అన్నాడు సుభాష్.

"ఓకే! ఈరోజు నుంచి నా కన్ను ఒకటి ఇండియా మీద ఉంటుంది." అంటూ స్మైల్ ఇచ్చాడు రఘురామ్.

**********************

50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అవ్వడంతో వచ్చిన అతిధులందరు వెళ్లిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి

"ఈ ఆస్తి ఐదు వాటాలు కాదు  నా అల్లుళ్ళు కోడళ్లు, మనమలు, మనవరాళ్ల సహా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీద ఆస్తులు రాయించను నాకు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు." అని చెప్పి అందరికీ డాక్యుమెంట్స్ ఇస్తూ

"మీ అందరిలో ఒకటే ఆలోచన అది ఇండియా కి సంబంధించిన ఆస్తుల గురించి అని నాకు తెలుసు! కానీ ఆ ఆస్తులు గురించి మీరు మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి.'

'అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది దానిని నేనే పేస్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో నా మాట కాదని మీరు ఇండియాలో అడుగు పెట్టకండి తరువాత మనం చాలా నష్టపోవాల్సి ఉంటుంది." అని చెప్పాడు ముకుల్ నంద.

"మావయ్య గారు! నేను ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి ఇండియాలో ఉన్న ప్రాబ్లం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సాల్వ్ చేయలేమా?" డౌట్ గా చూస్తూ అడిగాడు రఘురామ్.

"తాతయ్య! ఆ ప్రాబ్లం గురించి ఒక్కసారి కూడా మాకు చెప్పలేదు అంటే మేము సాల్వ్ చేయలేము అని మీకు అనిపిస్తుందా?" అన్నాడు విష్ణు.

"నాన్నగారు! ఇండియాలో ఉన్న ఆస్తి మీకు ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే చెప్పండి మేము ఇంకా దాని గురించి మాట్లాడము." అంది నళిని.

"ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ ఎవరికీ ఇచ్చే ఉద్దేశం లేదు అవి కూడా మీకే చెందుతాయి, కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు బాలేదు త్వరలోనే అన్ని సర్దుకుంటాయి  అప్పటివరకు వెయిట్ చెయ్యండి.'

'అక్కడ ఉన్న ప్రాబ్లం గురించి మీకు చెప్పిన అర్థం కాదు దానిని ఎలాగైనా సాల్వ్ చేయాలని ప్రయత్నిస్తారు  ఇప్పటికే ఒక కొడుకుని పోగొట్టుకుని బాధలో ఉన్నాను.'

'ఇంకా ఆ విషయంలో ఎవరిని పోగొట్టుకోలేను దాని గురించి మర్చిపోయి హ్యాపీగా ఉండండి సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే చెబుతాను." అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు ముకుల్ నంద.
[+] 7 users Like SivaSai's post
Like Reply
#33
very interesting story
Like Reply
#34
very nice story.. keep continue
Like Reply
#35
ఎపిసోడ్ 9


లండన్ కి వచ్చిన తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఇండియా విషయం చెప్పి సుజిత్ ని పంపించడానికి అందర్నీ ఒప్పించింది అర్ణ.

"ఇండియా మీద అర్ణ మీద ఒక కన్ను వేసి ఉంచుతాను." అని చెప్పాడు రఘురామ్.

*******************

ఉదయం నిద్ర లేచి రూమ్ లో అభిర్ కనపడకపోవడంతో కంగారుగా సందీప్ దగ్గరకు వెళ్లి "సార్! రూమ్ లో అభిర్ లేడు." అంటూ టెంక్షన్ గా చూస్తూ చెప్పాడు శక్తి దాస్.

"అవునా? చెప్పకుండా బయటకు వెళ్లొద్దని మరీ మరీ చెప్పాను అతని దగ్గర ఫోన్ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళాడో చూడండి అతనికి ఏదైనా జరిగితే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి." అన్నాడు సందీప్.

"అన్నయ్య! పాప, కుక్క పిల్లా కూడా కనబడడం లేదు." అటు కంగారుగా అంది నీలమ్.

"ఒకవేళ రోషిని తీసుకుని అభిర్ బయటకి వెళ్ళాడా?"  అంటూ కంగారుగా బయటికి వచ్చింది వసుంధర.

అంతలో మంత్రలు వినపడడంతో అటువైపుగా వెళ్లి కృష్ణుడు విగ్రహం ముందు రోషినితో కలిసి కూర్చోని పూజ చేస్తున్న అభిర్ ని చూసి ఊపిరి పీల్చుకుని "ఇక్కడే ఉన్నారు ఎవరు కంగారు పడకండి." అన్నాడు సందీప్.

అభిర్ చదువుతున్న మంత్రాలు విని "చాలా స్పష్టంగా చదువుతున్నాడు." అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అంది వసుంధర.

"సార్" ఈ మంత్రాలు ఎక్కడ విన్నట్లు లేదు చాలా కొత్తగా ఉన్నాయి." డౌట్ గా చూస్తూ అడిగాడు శక్తి దాస్.

"అభిర్ చదువుతున్నవి మంత్రాలు కాదు వేదం!" అంటూ దగ్గరకు వెళ్లి రోషిని తల మీద చేయి వేసి నవ్వుతూ చూసాడు సదీప్ రావు.

"అభిర్ కి వేదం కూడా వచ్చా అంటే అతను బ్రాహ్మణుడా!" అంది వసుంధర.

"వేదాలు బ్రాహ్మణులు మాత్రమే కాదు ఎవరైనా చదవచ్చు ఇంత స్పష్టంగా మా తాతగారు చదివేవారు." అంటూ చెట్ల మీద ఉన్న పక్షులను చూసి

"అంటూ చూడండి వేదం వింటూ పక్షులు కూడా కదలకుండా ఉన్నాయి." అని చూపించాడు సందీప్ రావు.

"అభిర్ దగ్గర చాలా టాలెంట్లు ఉన్నాయి అసలు ఇతను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం కావడం లేదు." అంది నీలమ్.

"అబీర్ నోరు తెరిస్తేనే కానీ మనకి ఏ విషయం తెలియదు, మనం లంచ్ తర్వాత  మురళి జోషి భార్య దగ్గరికి వెళదాము.'

'ఈలోపు నువ్వు అబీర్ ని బయటికి తీసుకువెళ్లి అతనికి కావలసిన బట్టలు తీసుకో!" అని చెప్పింది వసుంధర.

అక్కడికి వస్తున్న అభిర్ వైపు చూసి "చాలా చక్కగా చదువుతున్నావు వేదం ఎక్కడ నేర్చుకున్నావు?" అని అడిగింది నీలమ్.

"మా నాన్నగారు నేర్పించారు." అంటూ చెట్ల మీద ఉన్న పక్షులని చూసి "మనం ఒకసారి బయటికి వెళ్లి వాటికి ఆహారం తీసుకురావాలి." అన్నాడు అభిర్.

"నీకు పక్షులంటే చాలా ఇష్టం అనుకుంటా?" అని అడిగింది వసుంధర.

"నాకు కల్మషం లేని మనసు ఉన్న ఏ జీవి అయ్యినా ఇష్టమే మేడం!" అంటూ లోపలకి వెళ్ళాడు అభిర్.

లోపలికి వెళుతున్న అభిర్ ని చూసి "డిఫరెంట్ పర్సన్! ఇలాంటి వాళ్లు రేర్ గా ఉంటారు ఇంత కష్టం తనకి రాకుండా ఉండాల్సింది." అంది వసుంధర.

ఆ మాట విని వెనక్కి తిరిగి "దేవుడు మనకి కష్టం ఇచ్చాడు అంటే అది తట్టుకునే శక్తి మనలో ఉందని అర్థం!" అన్నాడు అభిర్.

"ట్రిపికల్ మైండ్! అతనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం!" అంటూ నీలమ్ కి కార్డ్ ఇచ్చి "అభిర్ కి ఏం కావాలంటే అవి తీసుకో!" అన్నాడు సందీప్.

"అవసరం లేదు సార్! నా దగ్గర ఉన్న వస్తువుని అమ్మేస్తాను." అంటూ పాకెట్ లోనుంచి స్టోన్ ఉన్న లాకెట్ ని బయటికి తీశాడు అభిర్.

"బాబు అబీర్! ఆ రాయిని ఎవరు తీసుకోరు ఆ సంచిలో బంగారపు ఉంగరాలు ఉన్నాయి కదా వాటిని తీసుకుంటారు." అన్నాడు శక్తి దాస్.

"ఈ ఆరు బంగారపు ఉంగరాలు అమ్మేవి కాదు ఇవి చేరవలసిన చోటు వేరే ఉంది." అంటూ రోషిని చేతికి ఇచ్చి  "నీ బొమ్మలు తో కలిపి వీటిని కూడా ఆడుకో!" అన్నాడు అభిర్.

"థాంక్యూ అంకుల్!" అంటూ కవర్ పట్టుకుని ఇంట్లోకి ఊరికింది రోషిని.

డ్రెస్ ఇస్తూ "ఇవి అన్నయ్య బట్టలు వేసుకో! మనం బయటికి వెళ్తున్నాము కదా కొత్తవి తీసుకుందాము." అంది నీలమ్.

బట్టలు తీసుకుంటూ "మీరు నాకు చేసిన సహాయానికి తప్పకుండా రుణం తీర్చుకుంటాను." అన్నాడు అభిర్.

కారులో శక్తి దాస్, కుమార్ తో పాటు అభిర్ తీసుకుని వెళ్ళుతు "ఆ స్టోన్ నీ దగ్గరే ఉంచుకో దానిని ఎవరు కోనరు నా దగ్గర డబ్బులు ఉన్నాయి." నవ్వుతూ అంది నీలమ్.

"ఈ రాయి విలువ తెలిసిన వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు మీకు తెలిసిన షాపు దగ్గరికి వెళ్ళండి." అన్నాడు అభిర్.

"సరే నీ ఇష్టం!" అంటూ డైమండ్ జ్యువెలరీ దగ్గర కారు ఆపి "ఈ షాప్ ఢిల్లీలోనే పెద్దది ఇతను వదిన క్లైంట్ కూడా మనల్ని మోసం చేయకుండా కరెక్ట్ గా చెబుతాడు." అంది నీలమ్.

"సరే మేడమ్! మీ ఇష్టం!" అంటూ స్టోన్ నీలమ్ చేతిలో పెట్టాడు అభిర్.

"నన్ను పేరు పెట్టి పిలువు మేడం అంటే నేను ఏదో పెద్దదానిలాగా ఫీల్ అయిపోతున్నాను, నాకు కూడా సేమ్ నీ ఏజ్ 28 ఇయర్స్!" అంటూ నవ్వుతూ షాపులోకి వెళ్ళింది నీలమ్.

వెనకాల వెళుతూ "మేడం! మీరు కూడా ఏంటి ఆ రాయిని ఎవరు కొంటారు కనీసం దాంట్లో మెరుపు కూడా లేదు." అన్నాడు కుమార్.

"నాకు కూడా తెలుసు! కానీ అభిర్ ఆశ ని ఎందుకు చంపడం ఒక్కసారి అడిగి అతని ముందే చెప్పిస్తే అర్థమవుతుంది కదా!" అంటూ లోపలికి వెళ్లి షాప్ ఓనర్ వైపు చూసి

"సెట్ జి అచ్చ హై! మేము కొనడానికి రాలేదు ఒక వస్తువుని అమ్మడానికి వచ్చాము." అంటు నవ్వుతూ స్టోన్ ని టేబుల్ మీద పెట్టింది నీలమ్.

"నమస్తే మేడమ్! మీరు ఎందుకు వచ్చినా సరే వెల్కమ్ పలుకుతాము లేకపోతే మా షాపుని మీరు టీవీలో చూపించరు కదా!" అంటు స్టోన్ తీసుకుని చూస్తూ

"మేడం! దీని చుట్టూ ఉన్న లాకెట్ బంగారం కాదు ఈ స్టోన్ వ్యాల్యూ ఎంత ఉంటుందో ఇప్పుడే చెబుతాను." అంటు లోపలికి వెళ్ళాడు షాపు ఓనర్.

అభిర్ పక్కకి వెళ్లి కూర్చుని డిస్ప్లేలో వస్తువులు చూపిస్తూ "వజ్రాలు అంటే అవి చూడు ఎలా మెరుస్తున్నాయో!" అన్నాడు శక్తీ దాస్.

"అవునా?" అంటూ చూస్తూ "అటువంటి రాళ్లు నీ దగ్గర ఉన్నాయా?" అని అడిగాడు అభిర్.

"నాకు అంత సీన్ లేదు పేరుకే పెద్ద ఆఫీసర్ ని నెలాఖరు వచ్చింది అంటే జేబులో చిల్లిగవ్వ ఉండదు." అంటూ డల్ గా చెప్పాడు శక్తి దాస్.

లోపలి నుంచి వస్తూ స్టోన్ ని ఒక ప్లేట్లో పెట్టి "మేడం ఈ స్టోన్ ఎక్కడ కొన్నారు? ఎంతకి కొన్నారు?" అని అడిగాడు షాప్ ఓనర్.

"ఆ స్టోన్  నా ఫ్రెండ్ ది!" అంటూ అభిర్ ని చూపించి "తనకి వాళ్ళ నాన్నగారు ఇచ్చారంట! పర్వాలేదు ఉన్న విషయం చెప్పండి ప్రాబ్లం లేదు." అంది నీలమ్.

"నా ఉద్దేశం అది కాదు వసుంధర మేడం మాకు చాలా హెల్ప్ చేశారు మీ దగ్గర తీసుకున్న వస్తువులో మాకు లాభం అవసరం లేదు.'

'ఈ స్టోన్ కి వ్యాల్యూ కట్టడం చాలా కష్టం! ప్రెసెంట్ 50 లాక్స్ క్యాష్ ఇస్తాను, అమ్మిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తాను, కానీ ఈ స్టోన్ కి బిల్లు ఉండదు కనుక మీ ఫ్రెండ్ తో ఒక లెటర్ ఇప్పించాలి." అన్నాడు షాపు ఓనర్.

"ఓకే!" అంటూ అభిర్ వైపు ఆశ్చర్యంగా చూసింది నీలమ్.

షాపు ఓనర్ చెప్పింది విని డ్రింక్ తాగుతూ పోలమారి దగ్గుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు కుమార్, దాసులు.

"వన్ మినిట్! వదినకి ఒక మాట చెప్పి అమౌంట్ తీసుకుంటాను." అని చెప్పి కాల్ చేసి వసుంధర కి విషయం చెప్పింది  నీలమ్.

"అవునా? నిజంగా అంత వాల్యూ ఉందా? కేసు ఫైల్ లో అరెస్టు చేసినప్పుడు అభిర్ మెడలో ఉంది అని రాశారు, అంటే ఆ స్టోన్ తనదే ఫార్ధార్ గా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు." అని చెప్పింది వసుంధర.

"ఓకే!" అంటూ పేపర్ మీద మేటర్ రాసి అభిర్ తో సంతకం పెట్టించి షాప్ ఓనర్ కి ఇచ్చి క్యాష్ తీసుకుని "వెళదామా? దానిని అమ్మిన తర్వాత మిగతా క్యాష్ ఇస్తారు." అని చెప్పింది నీలమ్.

"సరే!" అంటూ వెళ్లి కార్ లో కూర్చున్నాడు అభిర్.

మాల్ కి వెళ్లి బట్టలు కొంటూ "అభిర్! అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ కేసులో ఎలా ఇరుక్కున్నావు? నీకు చెప్పాలి అనిపిస్తేనే లేకపోతే ఇంకా ఎప్పుడు అడగను." అంది నీలమ్.

"సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతాను, కానీ నేను మీకు హాని చేసే వాడిని మాత్రం కాదు! మధ్యాహ్నం మీతో పాటు నేను కూడా మురళి జోషి భార్య దగ్గరికి వస్తాను." అన్నాడు అభిర్.

"మేడమ్! అభిర్ అక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది ఒప్పుకోకండి." అంటూ స్లోగా చెప్పాడు శక్తి దాస్.

"ఓకే!" అంటూ అభిర్ వైపు చూసి "వదినని అడిగి చెప్తాను మనతో పాటు ఈ కేస్ ఎంక్వయిరీ చేసే ఆఫీసర్ గారు కూడా వస్తారు ఆయన కూడా ఒప్పుకోవాలి కదా!" అంది నీలమ్.

"సరే! రోషినికి కూడా బట్టలు తీసుకోండి." అని చెప్పి బట్టలు తీసుకుని పక్షులకు వేసే ఆహారం తీసుకుని ఇంటి దగ్గరికి వచ్చాడు అభిర్.

ఇంటికి వస్తున్న నీలమ్ వైపు చూసి "నీకోసమే వెయిట్ చేస్తున్నాము శ్రీకర్ కూడా వచ్చాడు నువ్వు రెడీ అయితే వెళదాము." అంది వసుంధర.

"వదిన మనతో పాటు ఆ ఇంటికి అభిర్ కూడా వస్తానని అడిగాడు తీసుకువెళదామా?" అని అడిగింది నీలమ్.

"నో ప్రాబ్లం మేడమ్! తీసుకురండి అభిర్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే కొన్ని నిజాలు కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంది." అన్నాడు శ్రీకర్.

"ఓకే!" అంటూ అభిర్ తో కలిసి మురళి జోషి ఇంటి దగ్గరికి బయలుదేరారు అందరు.
[+] 7 users Like SivaSai's post
Like Reply
#36
ఎపిసోడ్ 10

తన దగ్గర ఉన్న స్టోన్ అమ్మి డబ్బులతో పక్షులకు ఆహారం తీసుకుని ఇంటికి వచ్చి మురళి జోషి ఇంటికి నేను కూడా వస్తాను అని అభిర్ అడగడంతో ఓకే అన్నాడు శ్రీకర్.

******************

లండన్ ఫంక్షన్ కంప్లీట్ అవడంతో బయలుదేరూతు "గ్రాండ్ పా! నువ్వు దేని గురించి టెన్షన్ పెట్టుకోకు, నీ మాట కాదని ఇక్కడ ఏమి జరగదు నువ్వు ఏం చెప్పినా చేయడానికి మేము రెడీగా ఉంటాము." అన్నాడు విష్ణు.

"నాకు తెలుసు! నా వారసులు అంతటి సమర్థులే! సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను మిమ్మల్ని ఎప్పటికీ హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నాను ఉంచుతాను.'

'ఏమి ఆలోచించకుండా సంతోషంగా వెళ్లి రండి మీ చేతుల్లో నంద గ్రూప్ స్థిరంగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది." అన్నాడు ముకుల్ నంద.

ఫ్యామిలీ మెంబర్స్ ని ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేసి "ఈరోజే సుజిత్ ఇండియా బయలుదేరుతున్నాడు ఎప్పటికప్పుడు మీకు అన్ని విషయాలు చెబుతూ ఉంటాను.'

'తొందరపడి మీరెవరు ఇండియా విషయాలలో ఎంటర్ అవ్వకండి ఏదైనా డౌటు ఉంటే నేను క్లారిఫై చేస్తాను." అని చెప్పింది అర్ణ.

"ఓకే!" అంటూ బాయ్ చెప్పి ఎవరీ ఫ్లైట్ వైపు వాళ్ళు వెళ్ళిపోయారు.

మహేష్ తో కలిసి ప్రతాప్ మిశ్రా ఇంటి దగ్గరకు వచ్చి "అంకుల్! మీకు చెప్పినట్లే ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను." అంటూ సుజిత్ వైపు చూసి

"ఈవెనింగ్ ఫ్లైట్ కి ఇండియా బయలుదేరు నువ్వు ఏం చేసినా సరే నాకు చెప్పకుండా చేయకూడదు, ప్రాపర్టీ సేల్ విషయంలో నీదే ఫైనల్ డెసిషన్!'

'తాతగారిని ఒప్పించే పని నేను చూసుకుంటాను ఇండియా వెళ్ళగానే లాయర్ హిర్వాణి ని మీట్ అవ్వు!" అంటూ పేపర్స్ ఇచ్చింది అర్ణ.

"ఓకే డన్!" అంటూ సంతోషంగా పేపర్స్ తీసుకున్నాడు సుజిత్.

"ఒకవేళ అక్కడ నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నా ఫ్రెండ్ మిథున్ ని మీట్ అవ్వు!" అంటూ కార్డ్ ఇచ్చాడు మహేష్.

"ఓకే షూర్!" అంటూ కార్డ్ తీసుకుని "మీరు ఇండియా వచ్చే అవసరం లేకుండానే అంత క్లియర్ చేసుకుని వస్తాను." అన్నాడు సుజిత్.

"బెస్ట్ ఆఫ్ లక్!" అంటూ మహేష్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అర్ణ.

సుజిత్ వైపు సంతోషంగా చూస్తూ "మనం అనుకున్నది సాధించాము ఇంక జరగాల్సింది చూడాలి, నువ్వు ఇండియా వెళ్ళగానే రాజన్ కి ఫోన్ చెయ్!'

'అక్కడ జరిగేది ఏదీ కూడా ముకుల్ నందకి తెలియకుండా చూసుకో త్వరలోనే నందా గ్రూప్ కి పోటీగా మిశ్రా గ్రూప్ మార్కెట్లోకి రావాలి." అంటూ కసిగా అన్నాడు ప్రతాప్ మిశ్ర.

*********************

ఢిల్లీ హోటల్లో రూమ్లో వెయిట్ చేస్తూ హిర్వాణి కి కాల్ చేశాడు మిచల్.

ఫోన్ లిఫ్ట్ చేసి "హలో! నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను రూమ్ దగ్గరకి వచ్చేసావా?" అని అడిగాడు హిర్వాణి.

"రూమ్ లో నుంచి మాట్లాడుతున్నా సార్! నా మనుషులందరూ నోయిడా లో ఉన్నారు మీరు డీటెయిల్స్ చెప్పడం ఆలస్యం ఎంటర్ అవుతారు." అన్నాడు మిచల్

"ఓకే ఫైవ్ మినిట్స్!" అంటూ ఫోన్ పెట్టేసి హోటల్ రూమ్ కి వెళ్లి ఫోటో చూపిస్తూ "ఇతని పేరు అభిర్! రెండు రోజుల క్రితం జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.'

"మీరు టార్గెట్ చేయాల్సింది ఇతననే! ఈ ఫోటోలో వున్న వాళ్ళు అతనికి షెల్టర్ ఇచ్చిన ఫ్యామిలి! ఈ ఇద్దరు అతనికి సెక్యూరిటీ గా ఉండే ఆఫీసర్స్!" అంటూ ఫోటోలు చూపిస్తూ  డీటెయిల్స్ చెబుతూ  ముకుల్ నందకి కాల్ చేసి

"సార్! మిచల్ వచ్చాడు అందరి ఫోటోలు డీటెయిల్స్ ఇచ్చాను ఇప్పుడు మీరు ఏం చేయమంటే అది చేయడానికి రెడీగా ఉన్నాడు." అని చెప్పాడు హిర్వాణి.

"మిచల్! నువ్వు ఏమీ చేస్తావో నాకు తెలియదు అభిర్ కి, అతనికి షెల్టర్ ఇచ్చిన ఫ్యామిలీకి భయమంటే ఏమిటో చూపించాలి.'

'ఆ భయం ఎలా ఉండాలి అంటే అభిర్ బయట ఉండడం కన్నా జైల్లో ఉండడమే బెటర్ అనిపించాలి." అన్నాడు ముకుల్.

"సార్! టైమ్ వేస్ట్ ఎందుకు మీరు ఇంకొక 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే అందర్నీ లేపేసి వెళ్ళిపోతాను మళ్లీ ఈ ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా ఉంటుంది." అంటూ సింపుల్ గా చెప్పాడు మిచల్.

"సార్! మిచల్ చెప్పింది కరెక్ట్! నేను కూడా ఒక కేసు గురించి రెండోసారి ఆలోచించడం ఇదే ఫస్ట్ టైమ్! మళ్లీ మనకి ఈ ఆలోచన లేకుండా ఉంటుంది." అన్నాడు హిర్వాణి.

"మిచల్! నీతోపాటే ఎంతమంది వచ్చారు." అని అడిగాడు ముకుల్ నంద.

"హిర్వాణి సార్ చాలా క్రిటికల్ కేస్ అన్నారు అందుకే 50 మంది దాకా వచ్చాము కానీ ఇక్కడ పొజిషన్ చూస్తుంటే ఒక పదిమంది సరిపోతారు అనిపిస్తుంది." అన్నాడు మిచల్.

"ఫస్ట్! అభిర్ ని భయపెట్టడానికి ట్రై చెయ్! అతను భయపడ్డాడు అని నీకు అనిపిస్తే అప్పుడు చెప్పు చంపడానికి 100 కోట్లు కాదు ఐదు వందల కోట్లు ఇస్తాను.'

'లాయర్ చెప్పినట్లు నీ టార్గెట్ అభిర్ కాదు ఆ ఫ్యామిలీ అప్పుడే అతను భయపడతాడు." అంటూ ఫోన్ పెట్టేసాడు ముకుల్ నంద.

"ఈ డబ్బున్న వాళ్ళకి ఎవరిని చూసినా భయమే! ఫస్ట్ భయపెట్టడానికి ట్రై చెయ్ కుదరకపోతే చంపేయ్! నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే హామీ నాది!'

'ఫస్ట్ టైమ్ ఒక ఆడదాని చేతిలో ఓడిపోయాను." అంటూ కోపంగా అన్నాడు హిర్వాణి.

"ఓకే సార్!" అంటూ ఫోటోలు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు మిచల్.

"ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను ఎట్టి పరిస్థితుల్లో నా పేరు గానీ ముకుల్ గారి పేరు గాని బయటకి రాకూడదు." అని చెప్పాడు హిర్వాణి.

"నా గురించి మీకు తెలియదా?" అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు మిచల్.

*********************

మురళి జోషి భార్య అడ్రస్ కి వెళుతూ "నీలమ్! నువ్వు కరెక్ట్ గానే తెలుసుకున్నావా? ఇటువంటి ఏరియాలో ఆవిడ ఉంటుందంటావా? చాలా మాస్ ఏరియా లాగా ఉంది." డౌట్ గా చూస్తూ అడిగింది వసుంధర.

"నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్!" అంటూ ఒక ఇంటి దగ్గర ఆగి "ఈ అడ్రస్ ఉన్న ఇల్లు ఇదే!" అని చెప్పింది నీలమ్.

ఇంటిని చూస్తూ "ఒక NIA ఆఫీసర్ భార్య ఇటువంటి పరిస్థితుల్లో ఉందా? చూస్తుంటే చాలా బాధగా ఉంది." అంటూ కుమార్ వైపు చూసి "లోపల ఎవరైనా ఉన్నారేమో చూడు." అన్నాడు శ్రీకర్.

"ఓకే సార్!" అంటూ డోర్ కొడుతూ "లోపల ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు కుమార్.

డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వాళ్లకు వైపు కంగారుగా చూస్తూ "అమ్మ! ఎవరో ఆఫీసర్స్ వచ్చినట్లు ఉన్నారు." అంటూ భయంగా లోపలికి వెళ్ళిపోయింది మురళి జోషి కూతురు.

"అవునా?" అంటూ హడావుడిగా బయటకు వచ్చి చూసి "ఎవరు మీరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు?" కంగారుపడుతూ అడిగింది మురళి జోషి భార్య.

"మీరు ఆఫీసర్ మురళి జోషి భార్య గీత గారు కదా! నా పేరు వసుంధర లాయర్! మీతో కొంచెం మాట్లాడాలి." అంది వసుంధర.

"నాకు మురళి జోషి ఎవరో తెలియదు." అంటూ డోర్స్ క్లోజ్ చేసింది గీత.

"మేడమ్! మీ భర్తను చంపిన వ్యక్తి కూడా మాతో పాటు ఉన్నాడు మీకు అతని మీద కోపం లేదా? అతనికి శిక్ష పడాలని మీరు అనుకోవడం లేదా?" అంటూ గట్టిగా అరిచాడు శ్రీకర్.

ఆ మాటకి కంగారు శ్రీకర్ వైపు చూసి "నువ్వు చేస్తుంది ఏమిటి?" కోపంగా చూస్తూ అడిగింది వసుంధర.

"మేడం! కొన్ని నిజాలు బయటికి రావాలి అంటే ఎమోషన్ ని టచ్ చేయ్యాక తప్పదు ప్లీజ్ వెయిట్!" అన్నాడు శ్రీకర్.

కాసేపాటకి డోర్ ఓపెన్ చేసి "నా భర్తను చంపిన నేరస్తుని పట్టుకోడానికి మీకు 12 సంవత్సరాలు పట్టిందా? ఎక్కడ ఉన్నాడు?" అంటూ కోపంగా అడిగింది గీత.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "ఆ రోజే అతనిని అరెస్టు చేశారు అప్పటినుంచి జైల్లోనే ఉన్నాడు మీరు వచ్చి ఒక్క సాక్ష్యం చెబితే చాలు జీవితాంతం జైల్లోనే ఉంటాడు." అంటూ అబీర్ ని చూపించాడు శ్రీకర్.

"అవునా?" అంటూ అభిర్ వైపు చూసి "ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు నా భర్త చంపిన మనిషిని నా కళ్ళారా చూశాను ఎప్పటికీ మర్చిపోను." అంటూ ఏడుస్తూ చెప్పింది గీత.

"మీరు చెప్పింది నిజమేనా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ "మరి మీ భర్తను చంపిన కేసులో 12 సంవత్సరాలుగా అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు హంతకుడు ఎవరో మీకు తెలుసా?" అని అడిగింది వసుంధర.

ఇంటి లోపలికి తీసుకువెళ్లి "నా భర్తను చంపిన మనిషిని చూడడం అదే మొదటిసారి కానీ అతని ఫేస్ ని ఎప్పటికీ మర్చిపోను అసలు ఈ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు." అంది గీత.

"మరి అబీర్ హత్య చేశాడు అని మీరు కన్ఫామ్ చేసినట్లు స్టేట్మెంట్లో ఉంది." డౌట్ గా అడిగాడు శ్రీకర్.

"నా భర్తను చంపిన కేసు కోర్టులో ఉన్న విషయం కూడా నాకు తెలియదు ఆరోజు నా ఇద్దరు పిల్లల్ని కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయాను." అని చెప్పింది గీత.

"ఓ మై గాడ్! ఈ కేసు మొత్తం ఫ్రాడ్! ఆ ఫైల్ లో ఉన్న ప్రతి విషయం అబద్ధమే! అన్యాయంగా ఈ కేసులో అభిర్ ని బలి పశువుని చేశారు." అంటూ కోపంగా అంది వసుంధర.

గీత వైపు చూస్తూ "మేడం! మీ భర్తని ఎందుకు చంపారో తెలుసా?" అని అడిగాడు శ్రీకర్.

"నాకు ఆ విషయాలు ఏమీ తెలియదు కానీ ఆయన చనిపోవడానికి ముందు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎలాగైనా దీన్ని సరి చేయాలి అంటూ బాధపడుతూ ఉండేవారు కానీ ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు." అంటూ బాధపడుతూ అంది గీత.

"మీరు మాతో పాటు వచ్చి కోర్ట్ లో జరిగిన విషయం చెప్పి ఒక అమాయకుడిని ఈ కేసు నుంచి రక్షించండి అన్యాయంగా 12 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాడు." అని చెప్పింది వసుంధర.

సైలెంట్ గా ఉన్న గీత వైపు చూసి "మీ ఫ్యామిలీని సేఫ్ గా ఉంచే బాధ్యత మాది." అన్నాడు శ్రీకర్.

"అసలు మేము ఇక్కడ ఉన్నట్లు మీకు ఎలా తెలిసింది?" అంటూ అనుమానంగా చూస్తూ అడిగింది గీత.


Rate " ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
[+] 9 users Like SivaSai's post
Like Reply
#37
Update please
Like Reply
#38
(31-12-2025, 02:37 PM)Reddy 211993 Wrote: Update please

already ichanu ga bro
Like Reply
#39
ఎపిసోడ్ 11


లండన్ నుంచి పేపర్స్ తీసుకుని ఇండియాకి బయలుదేరాడు సుజిత్.

ఢిల్లీ లో హీర్వాణిని కలిసి అభిర్ డీటెయిల్స్ తీసుకుని ముకుల్ నంద తో మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరాడు మిచల్.

పాట్నలో ఉన్న మురళి జోషి భార్య మర్డర్ చేసింది అబీర్ కాదని చెప్పడంతో "ఆ విషయం కోర్టులో చెప్పమని అడిగింది." వసుంధర.

********************

వసుంధర, శ్రీకర్ వైపు చూసి "మేము పాట్నలో ఉన్నట్లు మీకు ఎలా తెలిసింది?" డౌట్ గా అడిగింది గీత.

"ఆ విషయం నేను చెప్తాను సుమతి మీ అమ్మాయె కదా!" అని అడిగింది నీలమ్.

ఇంటి లోపలికి వస్తూ "నా పేరే సుమతి! ఇంతకీ మీరందరూ ఎవరు?" అంటూ అనుమానంగా చూస్తూ అడిగింది సుమతి.

"మీ అమ్మాయి సుమతి ట్రూ ఛానల్ లో జర్నలిస్ట్ పోస్ట్ కోసం అప్లై చేసింది అప్లికేషన్ హెడ్ ఆఫీస్ లో ఉన్న నా దగ్గరికి వచ్చింది.'

'డాటర్ ఆఫ్ ఖాళీగా ఉండడంతో మెయిల్ పంపించాను తన రిప్లై లో మురళి జోషి గారి డీటెయిల్స్ మీ డీటెయిల్స్ రాసింది.'

'నేను ఆల్రెడీ ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను అందుకే వెంటనే నాకు అర్థమై మీ అడ్రస్ తెలుసుకున్నాను." అని చెప్పింది నీలమ్.

సుమతి వైపు కోపంగా చూస్తూ "మీ నాన్నగారి పేరు ఎక్కడ వాడకూడదని చెప్పానా? ఇప్పుడు చూసావా మళ్లీ మనం ప్రమాదంలో పడబోతున్నాము." అంటూ వసుంధర వైపు చూసి

"నేను ఇప్పటివరకు చాలా కోల్పోయాను మళ్లీ ఇప్పుడు నా బిడ్డల్ని కూడా కోల్పోవాలి అనుకోవడం లేదు. ఆ అబ్బాయి జీవితం అన్యాయమవుతుంది అని అర్థమైంది.'

'కానీ ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను నాకు నా కుటుంబమే ముఖ్యం! నా భర్తను చంపిన వాళ్ళు చాలా పెద్ద వాళ్లని నాకు తెలుసు!'

 'వాళ్ళని ఎదిరించి మీరు కూడా మమ్మల్ని కాపాడలేరు ఇంక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈరోజే ఇక్కడి నుంచి ఎవరి కంటికి కనిపించనంత దూరం వెళ్ళిపోతాము." అంటూ ఇద్దరి కూతుర్లని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ చెప్పింది గీత.

"డాడ్ ని చంపిన వాళ్ళకి భయపడి ఇంకా ఎన్నాళ్లు దాక్కుకుంటాము మేమిద్దరం జీవితాంతం ఇలా భయపడుతూ ఉండాల్సిందేనా?" అంటూ కోపంగా అడిగింది సుమతి.

"అంటే! మీ భర్తని చంపింది ఎవరో మీకు తెలుసు! కానీ వాళ్లకి భయపడి మీరు చెప్పడం లేదు కదూ?" డౌట్ గా అడిగాడు శ్రీకర్.

ఆ మాట విని తల్లి వైపు చూస్తూ "నిజంగా డాడ్ ని చంపిన వాళ్ళు ఎవరో నీకు తెలుసా?" అంటూ అనుమానంగా అడిగింది సుమతి.

"నాకు తెలుసు! కానీ ఆ విషయం బయటికి చెప్పిన ఇప్పుడు ఉపయోగం లేదు ఎందుకంటే అతను కూడా ఆరోజే నా కళ్ళ ముందు చనిపోయాడు.'

'నేను అక్కడే ఉంటే ఈ గొడవలో నా పిల్లల జీవితం ఎక్కడ నాశనమవుతుందోనని భయపడి దూరంగా పారిపోయాను కానీ అమాయకుడైన ఆ అబ్బాయిని కాపాడడానికి కోర్టులో సాక్ష్యం చెబుతాను.'

'కానీ వాళ్ళు వెంటనే నన్ను చంపేస్తారు అప్పుడు నా పిల్లలకి దిక్కు ఎవరు నేను లేకుండా ఇద్దరు ఎలా బతుకుతారు?" అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది గీత.

ఆ మాట విని  గీత దగ్గరకు వచ్చి "అమ్మ! మీ భర్త చావుకి మీ బాధకి కారణం అయింది నేను కాదని మీకు తెలిసింది  నాకు అది చాలు, మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనవసరం లేదు." అంటూ

జేబులో నుంచి పాకెట్ తీసి సుమతి చేతిలో పెట్టి "దీంట్లో 30 లక్షలు ఉన్నాయి నన్ను మీ కొడుకుగా భావించి ఇవి తీసుకోండి. వీటితో మీ బాధ తీరిపోతుంది అని నేను చెప్పలేను.'

'కానీ ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి ప్రశాంతంగా ఉండండి ఈ కేసులో నుంచి నేను ఎలాగైనా బయటికి వస్తాను." అన్నాడు అభిర్.

"అభిర్! నువ్వేం చేస్తున్నావు ఆవిడ సాక్ష్యం చెప్పకపోతే నువ్వు ఈ కేసులో నుంచి ఎప్పటికి బయటికి రాలేవు." అంటూ కంగారుగా చెప్పింది వసుంధర.

"మేడం! కోర్టులో సాక్ష్యం ఎప్పుడు చెప్పాలో చెప్పండి చాలు! ఆ టైమ్ కి మా అమ్మగారిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించి నా అన్నను ఈ కేస్ నుంచి బయటకు తీసుకొస్తాను." అంది సుమతి.

"అవును సార్! నాకు దేవుడు ఇచ్చిన కొడుకుని  కాపాడుకుంటాను నా ప్రాణం పోయినా పర్వాలేదు నా బిడ్డల్ని ఆ బాబు చూసుకుంటాడు అనే నమ్మకం నాకు కలిగింది." అంటూ సుమతి చేతిలో డబ్బులు తీసుకుని అభిర్ చేతిలో పెట్టింది గీత.

శ్రీకర్ వైపు చూసి "సార్! వీళ్లు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు మనతోపాటు తీసుకువెళ్లి పోదాము." అన్నాడు అభిర్.

"నో ప్రాబ్లం! మనం వచ్చిన విషయం ఎవరికీ తెలియదు." అన్నాడు శ్రీకర్.

"మీరు చెప్పింది నిజమే! కానీ వీళ్లు ఇక్కడ ఉంటున్న విషయం వాళ్లకి కచ్చితంగా తెలిసే ఉంటుంది మనం కలిసి వెళ్ళమని తెలిస్తే వెంటనే వీళ్ళ ప్రాణాలు పోతాయి." అన్నాడు అబీర్.

"అంటే! ఈ కేసు వెనకాల ఉన్న వాళ్ళ గురించి నీకు కూడా తెలుసు కదా! మరి వాళ్ల గురించి మా దగ్గర ఎందుకు నోరు తెరవడం లేదు." డౌట్ గా అడిగాడు శ్రీకర్.

"నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతాను మీ మనస్సాక్షి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి. మీరు వీళ్ళని కాపాడడానికి ప్రయత్నించి అసలైన నేరస్తులకి శిక్షపడేలాగా చేయాలి అనుకుంటున్నారు.'

'కానీ ఒకరోజు మీకు సడన్గా ఫోన్ వచ్చింది మీ భార్య పిల్లలు వాళ్ళ చేతిలో ఉన్నారు వీళ్ళని వదిలేసి వెళితేనే కానీ వాళ్ళు ప్రాణాలతో ఉండరు అప్పుడు మీరేం చేస్తారు? మీ భార్య పిల్లలు వదులుకుంటారా? వీళ్ళని వదిలేస్తారా?" అని అడిగాడు అభిర్.

"సారీ! ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను." అన్నాడు శ్రీకర్.

"ఈ ప్రశ్నకి ఇక్కడ ఉన్న మీరు ఎవరు సమాధానం చెప్పలేరు అందుకే వాళ్ళ గురించి నేను కూడా మీకు చెప్పలేదు." అన్నాడు అభిర్.

"అలా అయితే! ఎప్పటికీ వాళ్ళని మనం ఏమి చేయలేమా? ఇలా బాధని దిగమించుకుని జీవితాంతం బతకడమేనా!" అంటూ కోపంగా అడిగింది సుమతి.

"కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలం చెబుతుంది మీ గుండెల్లో ఉన్న బాధ తీరే రోజు తప్పకుండా వస్తుంది." అంటూ కారు దగ్గరికి వెళ్ళిపోయాడు అభిర్.

శ్రీకర్ వైపు చూసి "మనం ఈ కేసులో నుంచి ఆబీర్ ని ముందు బయటికి తీసుకువద్దాము తర్వాత వేరే విషయాల గురించి ఆలోచిద్దాము." అని చెప్పింది వసుంధర.

"ఓకే!" అంటూ గీత వాళ్ళ వైపు చూసి "మేడం! మీరు త్వరగా బయలుదేరండి ఢిల్లీ వెళ్ళిపోదాము." అన్నాడు శ్రీకర్.

కారు దగ్గరికి వచ్చి భర్తకి కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పి "కాసేపట్లో ఢిల్లీ స్టార్ట్ అవుతున్నాము." అని చెప్పింది వసుంధర.

"ఓకే కేర్ ఫుల్! అక్కడ జైలర్ నా ఫ్రెండ్! ఏదైనా అవసరమైతే కాల్ చెయ్!" అని చెప్పాడు సందీప్ రావు.

"సరే! పాప కాలేజ్ నుంచి వచ్చే టైమ్ కి ఇంటికి వెళ్ళండి." అంటూ ఫోన్ పెట్టేసి అభిర్ ఉన్న కార్లో ముగ్గురిని ఎక్కించి అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరింది వసుంధర.

********************

ఢిల్లీ తన మనుషులతో కలిసి సందీప్ రావు ఇంటి దగ్గరికి వచ్చి ఎవరు కనిపించకపోవడంతో గార్డెన్లో పనిచేస్తున్న మనిషిని పిలిచి "అందరూ ఎక్కడికి వెళ్లారు?" అని అడిగాడు మిచల్.

"డ్యూటీ కి వెళ్లారు సాయంత్రానికి కానీ రారు మీరు ఎవరో చెప్పండి వచ్చిన తర్వాత చెప్తాను." అన్నాడు వర్కర్.

"నువ్వు ఇక్కడ ఎంత కాలంగా పని చేస్తున్నావు?" అని అడిగాడు మిచల్.

"నేను పది సంవత్సరాలుగా వీరి దగ్గరే పని చేస్తున్నారు  పర్వాలేదు చెప్పండి ఒకవేళ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే నాకు ఇవ్వండి నేను ఇస్తాను." అన్నాడు వర్కర్.

"అవునా?" అంటూ తన మనుషులు వైపు చూసి "వీడిని చావు దెబ్బలు కొట్టండి కానీ చంపకండి మనమంటే వాళ్ళకి భయం రావాలి." అంటూ కోపంగా చూస్తూ చెప్పాడు మిచల్.

ఆ మాట విని వర్కర్ ని రక్తం వచ్చేటట్లు కొట్టి కింద పడేసారు మిచల్ మనుషులు.

"నన్ను చంపకండి పిల్లలు కలవాడిని!" అంటూ దండం పెడుతున్న వర్కర్ దగ్గరికి వెళ్లి

"మీ మేడంతో, సార్ తో చెప్పు! ఆ అభిర్ గాడు బయట ఉన్నంతకాలం ఇదే జరుగుతుంది." అంటూ అరుస్తూ మీదకి వస్తున్న టమిని చూసి

కాలితో గట్టిగా తన్ని "చచ్చింది కుక్క లేకపోతే ఆరుస్తు నా మీదికి వస్తుందా?" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిచల్.

**************

సాయంత్రానికి ఇంటికి చేరుకొని ఒంటినిండా బ్యాండేజ్స్ తో ఉన్న వర్కర్ ని, టింకు ముందు కూర్చుని ఏడుస్తున్న రోషిని ని చూసి కంగారుగా లోపలికి వెళ్లి భర్త వైపు చూస్తూ "ఏమైంది?" అంటూ అనుమానంగా అడిగింది వసుంధర.

"ఈ కేసు నుంచి తప్పుకొని అభిర్ ని మళ్లీ జైలుకి పంపించకపోతే ఇదే రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.'

'సెక్యూరిటీ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాను సిసి ఫుటేజ్ తీసుకువెళ్లారు ఎవరో తెలుసుకుంటామని చెప్పారు." అన్నాడు సదీప్ రావు.

"మేడం! టమి చనిపోయింది తీసుకువెళ్తానంటే పాప వద్దు అని ఏడుస్తుంది మీరైనా చెప్పండి."  అన్నాడు శంకర్.

అభిర్ దగ్గరికి వచ్చి "అంకుల్! టమి చనిపోయింది అంటున్నారు కాదు దానికి జ్వరం తగిలి నిద్ర పోతుంది మనం హాస్పిటల్ కి తీసుకువెళదాము త్వరగా రండి." అంటూ ఏడుస్తూ అడిగింది రోషిని.

అక్కడికి వచ్చి "మేడం! మీరు టెన్షన్ పడకండి ఇక్కడ కూడా సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను సిసి ఫుటేజ్ చూసి వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను." అంటూ వర్కర్ వైపు చూసి

"ఇక్కడకు వచ్చిన వాళ్ళని ఎప్పుడైనా చూసావా?" అని అడిగాడు శ్రీకర్.

"లేదు సార్! నాకు తెలిసి వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు భాష కూడా వేరే విధంగా ఉంది." అన్నాడు వర్కర్.

ఏడుస్తున్న రోషిని తల మీద చెయ్యి వేసి "ఏడవకు టమికి ఏమి అవ్వదు." అంటూ శంకర్ చేతిలో ఉన్న కుక్క పిల్లని తీసుకుని రెండు చేతులతో ఆకాశం వైపు చూపిస్తూ కళ్ళు మూసుకున్నాడు అభిర్.

కాసేపాటకి అభిర్ చేతిలో నుంచి కిందకి దూకి రోషిని వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న టమిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అందరూ.

"హై...! టమికి జ్వరం తగ్గిపోయింది." అంటూ సంతోషంగా ఎగురుతూ ఉంది రోషిని
[+] 7 users Like SivaSai's post
Like Reply
#40
ఎపిసోడ్ 12


పాట్నాలో ఉన్న మురళీ జోషి భార్య కూతుర్లలతో కలిసి ఇంటికి వచ్చి చనిపోయిన టమిని తన రెండు చేతుల్లోకి తీసుకుని కళ్ళు మూసుకుని ఆకాశం వైపు చూపించి బతికించాడు అబీర్.

*********************

రోషిని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతున్న టామీని  ఆశ్చర్యంగా చూస్తూ " చనిపోయిన టామీ మళ్ళీ ఎలా బ్రతికింది?" అంటు అభిర్ వైపు విచిత్రంగా చూసింది నీలమ్

మాట్లాడకుండా సైలెంట్ గా ఇంటిలోకి వెళుతున్న అభిర్ ని చూసి "జైల్లో ఉన్నపుడు నేను కూడా అతని దగ్గర ఒక మీరకల్ గమనించాను.'

'నన్ను చంపడానికి వచ్చిన టెర్రరిస్టుల్ని కంటి చూపుతో కదలకుండా చేయగలిగాడు అతని దగ్గర ఏదో శక్తి ఉంది." అని చెప్పాడు సందీప్ రావు.

"చాలా విచిత్రంగా ఉంది ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అసలు ఇతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు?" డౌట్ గా చూస్తూ అన్నాడు శ్రీకర్.

"ఇంత శక్తి ఉండి కూడా జైల్ నుండీ వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది." అంటూ అనుమానంగా చూస్తూ అంది వసుంధర.

ఇంట్లోకి వెళుతున్న అబీర్ దగ్గరికి సంతోషంగా వెళ్లి "ఆ రోజు నా కూతురు సుమతిని బతికించింది కూడా నువ్వే కదూ" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది గీత.

"అవును!" అని చెప్పాడు అభిర్.

"అంటే! మా డాడ్ నీకు తెలుసు కదా! మరి ఆయన్ని ఎందుకు కాపాడలేదు?" అంటూ ఏడుస్తూ అడిగింది సుమతి.

"అతను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు అలాంటి వాళ్ళని నేను కాపాడలేను." అన్నాడు అభిర్.

"మరి ఏ పాపము చేయని మేము కూడా శిక్ష అనుభవిస్తున్నాము కదా!"  అంటూ ఆవేశంగా అడిగింది సుమతి.

"తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు మనకి కూడా వర్తిస్తాయి, వాళ్ల వల్ల వచ్చిన సుఖన్ని, సంతోషాన్ని అనుభవించినప్పుడు బాధ కూడా అనుభవించాలి." అన్నాడు అభిర్.

"మా డాడ్ చేసిన తప్పు ఏమిటి?" అని ఏడుస్తూ అడిగింది మురళి జోషి చిన్న కూతురు ప్రణతి.

"ఆ తప్పు మీరు తెలుసుకోకుండా ఉంటేనే మీ జీవితం సుఖంగా ఉంటుంది." అంటూ ఇంటిలోకి వెళ్ళిపోయాడు అభిర్.

'మురళి జోషి చనిపోయే ముందు ఏ కేసులో వర్క్ చేశాడో తెలుసుకుంటే అభిర్ ఎవరో తెలుస్తుంది.' అని మనసులో అనుకున్నాడ శ్రీకర్.

"మనల్ని భయపెట్టడానికి చూస్తున్నారు అంటే ఈ కేసు మనం గెలవబోతున్నాము, అభిర్ నిరపరాధి అని తీర్పు వచ్చేవరకు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి." అంది వసుంధర.

********************

లండన్ ఆఫీసు ఛాంబర్ లో ఉన్న అర్ణ దగ్గరికి సీరియస్ గా వస్తు "ఇండియా గురించి నిన్ను పట్టించుకోవద్దని చెప్పాను కదా! సుజిత్ ని ఎందుకు పంపించావు?" అంటూ కోపంగా చూస్తూ అడిగాడు ముకుల్ నంద.

"తాతయ్య! నిన్ను టెన్షన్ పెట్టిన వాడిని ప్రశాంతంగా ఉంచడం నాకు ఇష్టం లేదు అది ప్రశాంత్ మిశ్రా అయ్యినా! ఇండియాలో నిన్ను ఇబ్బంది పెట్టేవాడైనా సరే!" అంటూ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది అర్ణ.

"బేబీ! సింహం స్థానంలోకి రావడానికి కాపుకాసి అవకాశం వచ్చినప్పుడు దెబ్బ కొట్టడానికి గుంటనక్క రెడీగా ఉంటుంది. అలాంటివాడు ప్రతాప్ మిశ్ర! వాడిని మూర్ఖంగా నమ్మకు." అని చెప్పాడు ముకుల్ నంద.

"తాతయ్య! ఎన్ని పన్నాగలు పన్నీనా సింహం స్థానంలోకి గుంట నక్క రాలేదు కదా! ఒక్క పంజా దెబ్బ తగిలితే అడ్రస్ లేకుండా పోతుంది.'

"అలాగే! నంద గ్రూప్ ని టచ్ చేయాలని ఎవరు చూసినా వాళ్ళకి అదే గతి పడుతుంది నేను మీ మనవరాలే నన్ను తక్కువ అంచనా వేయకండి." అంది అర్ణ.

"నీ గురించి నీ పట్టుదల గురించి నాకు బాగా తెలుసు! నిన్ను చూస్తుంటే మీ నాన్నే గుర్తుకు వస్తాడు అందుకే నిన్ను ఇండియా విషయంలో ఎంటర్ చేయడం నాకు ఇష్టం లేదు." అన్నాడు ముకుల్ నంద.

"ఇండియాలో డాడ్ ని చంపేశారని 12 సంవత్సరాల తర్వాత కూడా మీరు వాళ్ళకి భయపడుతున్నారా? ఆయన చంపిన వాళ్ళని మీరు అంత తేలిగ్గా ఎందుకు వదిలేసారు? అసలు చంపింది ఎవరు?" అంటూ అనుమానంగా అడిగింది అర్ణ.

"ఆ విషయాలన్నీ నీకు తెలియాల్సిన టైమ్ లో కచ్చితంగా చెబుతాను ఈ లోపు నేను చేయవలసింది చేస్తాను. ఇండియాలో మనం ఎప్పుడూ అడుగు పెడతామ అని చాలా కళ్ళు ఎదురు చూస్తుఉంటాయి.'

'సుజిత్ ని మన బిజినెస్ వ్యవహారాలు మాత్రమే చూడమను ఇంక ఏ విషయంలోను ఎంటర్ అవ్వకూడదని చెప్పు!" అంటూ అక్కడి నుంచి వెళుతూ వెనక్కి తిరిగి

"నువ్వు లాయర్ హిరణ్యతో మాట్లాడిన విషయం కూడా నాకు తెలుసు అందుకే చెబుతున్నాను." అంటూ వెళ్ళిపోయాడు ముకుల్ నంద.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "సుజిత్ విషయం తెలిసింది అంటే ఓకే! కానీ నేను లాయర్ తో మాట్లాడిన విషయం తాతయ్యకి ఎలా తెలిసింది?" అంటూ

ఆలోచిస్తూ హిరణ్య కి కాల్ చేసి "నేను లండన్ నుంచి అర్ణ మాట్లాడుతున్నాను మన మధ్య మీటింగ్ అయిన విషయం తాతయ్య గారికి ఎలా తెలిసింది?" అని అడిగింది అర్ణ.

"మేడం! మిథున్ సార్ మీకు ఇప్పుడు ఫ్రెండ్ ఏమో! వాళ్ళ తాతగారు మీ తాత గారు ఎప్పటినుంచో ఫ్రెండ్స్! ముకుల్ గారు ఒక గీత గీసారు అంటే మిథున్ సార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు దానిని దాటరు.'

'ఆది కాకుండా మీ ఫ్యామిలీ ఇండియాలో బిజినెస్ ఆపడం వల్ల ఎక్కువ లాభం పొందింది మిథున్ సార్ ఫ్యామిలీ ఇంకా ఎవరు చెప్పారో మీకు చెప్పనవసరం లేదనుకుంటా!" అంటు నవ్వుతూ అన్నాడు హిరణ్య.

"ఓకే ఇట్స్ ఆల్ రైట్! ప్రాబ్లం లేదు తాత గారికి నేను అర్థమయ్యేటట్లు చెప్పాను ఇంక ఇండియా విషయంలో నేను ఎంటర్ అయ్యానాని ఆయనకు అర్థమైంది.'

'కాబట్టి ఇకనుంచి  డైరెక్ట్ గానే మాట్లాడుతాను ఆ జైల్లో ఉన్నవాడి మేటర్ ఏమైంది?" అని అడిగింది అర్ణ.

"మేడం! అతనికి బెయిల్ వచ్చింది బయట ఉన్నాడు వాడిని భయపెట్టడానికి మిచల్ గ్యాంగ్ కి మీ తాతగారు సుపారీ ఇచ్చారు కచ్చితంగా భయపడి మళ్లీ జైల్లోకి వెళ్ళిపోతాడు." అన్నాడు హిరణ్య.

"అవునా? ఈ విషయం గురించి అంతగా ఆలోచించాలా? వాడిని వాడికి హెల్ప్ చేసిన వాళ్ళని ఈ భూమి మీదే లేకుండా చేయమనండి.'

'ఇండియాలో మా తాత గారిని టెన్షన్ పెట్టే వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు." అని చెప్పింది అర్ణ.

"మేడం!  మీ తాతగారు అలా ఎందుకు చెప్పారో కొంచెం ఆలోచించండి. భయపెట్టడానికి ట్రై చేస్తున్నాము కుదరకపోతే నెక్స్ట్ చేసేది అదే! ఇంతకీ మీ మనిషి ఇండియా ఎప్పుడు వస్తున్నాడు?" అని అడిగాడు హిరణ్య.

"ఈరోజు ఈవినింగ్ కి ఇండియాలో ల్యాండ్ అవుతాడు  ఇక నుంచి నేను చేయవలసిన పని మొదలవుతుంది." అంటూ ఫోన్ పెట్టేసింది అర్ణ.

*********************

లండన్ నుంచి ఇండియాకి వచ్చి డిల్లీ లో ఉన్న నంద గ్రూప్ గెస్ట్ హౌస్ కి వెళుతూ ఫోన్ చేసి "డాడ్! నేను ఇండియాలో అడుగు పెట్టాను అర్ణ చెప్పినట్టు ఫస్ట్ లాయర్ ని మీట్ అవ్వనా? లేక రాజన్ ని మీట్ అవ్వనా?" అని అడిగాడు సుజిత్.

"ఇండియాలో ఉన్న నంద గ్రూప్ ఇండస్ట్రీస్ మీద ఆస్తులు మీద మొదటగా మనకి గ్రిప్ రావాలి తరువాత లాయర్ తో పని అప్పటి వరకు అవసరం లేదు.'

'ఫస్ట్ రాజన్ కి కాల్ చేసి మీట్ అవ్వు! అలాగే అక్కడ వరదరాజులు అని నా పాత ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇప్పుడు సెంటర్ మినిస్టర్!'

'నువ్వు ఇండియాకు వస్తున్నవని చెప్పాను అతన్ని కూడా ఒక్కసారి వెళ్లి మీట్ అవ్వు మనకు ఉపయోగపడతాడు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.

"ఓకే డాడ్! గెస్ట్ హౌస్ కి వెళ్ళిన తర్వాత ఇద్దరికీ కాల్ చేసి మాట్లాడుతాను." అని చెప్పి ఫోన్ పెట్టేసి అర్ణకి కాల్ చేసాడు సుజిత్.

ఫోన్ లిఫ్ట్ చేసి "ఇండియాలో ల్యాండ్ అయ్యావా?" అని అడిగింది అర్ణ.

"యా జస్ట్! ఇప్పుడే ల్యాండ్ అయ్యాను గెస్ట్ హౌస్ కి వెళుతున్నాను." అన్నాడు సుజిత్.

"ఓకే! నువ్వు బిజినెస్ విషయాలు మాత్రమే చూసుకో లాయర్ ని కలవాల్సిన అవసరం లేదు అవసరమైనప్పుడు నేనే చెబుతాను." అంది అర్ణ.

"ఓకే! నువ్వు ఎలా చెప్తే అలాగా! రేపటి నుంచి మన ఫ్యాక్టరీలు మొత్తం విజిట్ చేస్తాను ఒక్కొక్కటి లైన్ లో పెడతాను." అని చెప్పాడు సుజిత్.

"ఓకే గుడ్!" అంటూ ఫోన్ పెట్టేసింది అర్ణ.

గెస్ట్ హౌస్ కి వెళ్లి రిలాక్స్ అయ్యి మందు తాగుతు రాజన్ కి కాల్ చేసి "హలో! నేను ప్రతాప్ మిశ్రా గారి అబ్బాయి సుజిత్! ఇండియాకి వచ్చాను మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వాలి." అన్నాడు సుజిత్.

"నాన్నగారు చెప్పారు ఆల్రెడీ మీరు దిగిన గెస్ట్ హౌస్ చుట్టూ నా మనుషులు సెక్యూరిటీగా ఉన్నారు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి మార్నింగ్ అక్కడ ఉంటాను." అన్నాడు రాజన్.

"అవునా? చాలా ఫాస్ట్ గా ఉన్నారే! ఓకే బాయ్ మార్నింగ్ కలుద్దాము." అంటూ ఫోన్ పెట్టేసి ప్రాపర్టీస్ ఫైల్ చూస్తూ

"ఈ ముసలోడు ఇక్కడ ఇన్ని ఆస్తులు వదిలేసి లండన్ ఎందుకు వచ్చినట్లు!" అనుకుంటూ  వరదరాజులకి కాల్ చేసి

"హాయ్ అంకుల్! ఐ యాం సుజిత్ మిశ్ర! మిమ్మల్ని ఒక్కసారి మీట్ అవ్వాలి అనుకుంటున్నాను." అన్నాడు సుజిత్.

"హ..! ప్రతాప్ మిశ్రా కొడుకువి కదా! లండన్ నుంచి  వచ్చేసావా? రేపు ఇంటికి లంచ్ కి వచ్చాయ్ కలుద్దాము." అని చెప్పాడు వరదరాజులు.

"ఓకే అంకుల్ థాంక్యూ!" అంటూ ఫోన్ పెట్టేసాడు సుజిత్.

అంతలో అక్కడికి వచ్చి "హాయ్ సర్! మై నేమ్ ఇస్ రియా! మీ పర్సనల్ అసిస్టెంట్! మీరు ఇండియాలో ఉన్నంతకాలం మీతోనే ఉంటాను." అంటూ స్మైల్ ఇస్తూ  స్టైల్ గా చెప్పింది రియా.

"ఓకే!" అంటూ కళ్ళు ఆర్పకుండా రియా వైపు చూస్తూ "ఇండియాలో పర్సనల్ అసిస్టెంట్లు ఇంత అందంగా ఉంటారా?" నవ్వుతూ అన్నాడు సుజిత్.

"థాంక్యూ సర్! లండన్ నుంచి బాస్ వస్తున్నారంటే ఇంక ఎంత పెద్దవారో అనుకున్నాను, ఒక యంగ్ బాస్ వస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు." అంటూ సిగ్గుపడుతూ చెప్పింది రియా.

సిగ్గు పడుతున్న రియాని చూసి "ప్లీజ్ సీట్! నా పర్సనల్ అసిస్టెంట్ గా మిస్ ఇండియా ఉంటుందని నేను కూడ ఎక్స్పెక్ట్ చేయలేదు." అంటూ మాటలు కలిపాడు సుజిత్.
[+] 10 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)