Posts: 205
Threads: 8
Likes Received: 1,361 in 159 posts
Likes Given: 1,039
Joined: Aug 2024
Reputation:
141
21-12-2025, 09:10 PM
(This post was last modified: 22-12-2025, 03:04 PM by SivaSai. Edited 4 times in total. Edited 4 times in total.)
తీహార్ జైల్ ఖైదీలని సెల్ లో నుంచి బయటికి వదులుతూ ఈరోజు కొత్త జైలర్ గారు వస్తున్నారు త్వరగా రెడీ అయ్యి గ్రౌండ్లో వరసగా నుంచోండి.'
'సార్ ముందు ఎవరైనా పిచ్చిపిచ్చి వేషాలు వేశారు అంటే పది రోజులు చీకటి గదిలో ఉంటారు." అంటూ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు సెంట్రిలు.
గ్రౌండ్ లోకి వచ్చి వరుసలో నిలబడుతూ లోపల నుంచి వస్తున్న టెర్రరిస్ట్ ఖైదీలను చూసి "వీళ్ళని బయటికి పంపించారు ఎందుకురా బాబు! ఈరోజు ఏదో గొడవ జరుగుతుంది." అంటూ భయం గా చూస్తూ ఉన్నారు మిగతా ఖైదీలు.
"ఎవరినైనా వదులుతారు కానీ ఆ 13 నెంబర్ రూమ్ లో ఉన్నవాడిని మాత్రం వదలరు ఆరు సంవత్సరాల క్రితం ఒక్కసారి వదిలేరు నలుగురిని చంపేశాడు." అని చెప్పాడు అక్కడ ఉన్న ఒక ఖైదీ.
"అవునా? వాడి పేరేమిటి?" అని అడిగాడు మరొక ఖైదీ.
"నేను పది సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను వాడి పేరు కాదు కదా మొహం కూడా చూడలేదు ఆ నలుగురిని చంపిన రోజు మాత్రం ఒక్కసారి మొహం చూసాను అది కూడా సరిగ్గా గుర్తులేదు." అన్నాడు మరొక ఖైదీ.
ఖైదీల లిస్టు ఉన్న బుక్ పట్టుకుని 13వ నెంబర్ బారికాడ్ దగ్గరికి వెళ్లి "నెంబర్ 402 కొత్త జైలర్ గారు వస్తున్నారు బయటికి వస్తావా? అని అడిగాడు సెంట్రి శంకర్ పటేల్.
"నాకోసం వస్తున్నాడా?" అంటూ గంభీర మైన గొంతు తో అడిగాడు ఆ ఖైదీ.
"నీ ఒక్కడి కోసం కాదు అందరికోసం జైలర్ గారు కదా గౌరవం ఇవ్వాలి." అన్నాడు శంకర్.
"నా కోసం మాత్రమే ఎవరైనా వచ్చిన రోజు పిలువు బయటికి వస్తాను." అంటూ దగ్గరికి వచ్చి "ఈరోజు మొక్కలకి నీళ్లు పోసారా?" అని అడిగాడు 402
"హా..! పోసారు నువ్వు పాతిపెట్టిన మొక్కలకి పళ్ళు కూడా కాస్తున్నాయి." అన్నాడు శంకర్.
"అవునా? ఆ పళ్ళు ఇంటికి తీసుకువెళ్లి నీ పిల్లలకి ఇవ్వు!" అన్నాడు 402
"సరే!" అంటు లోపల కి చూసి "అక్కడ చీమలు ఉన్నాయి మనిషిని పంపించిన క్లీన్ చేస్తాడు." అని అడిగాడు శంకర్.
"ఆ చీమలకి ఆహారం నేనే పెట్టాను అందుకే అక్కడ ఉన్నాయి." అంటూ లోపలికి వెళ్ళిపోయాడు 402
"చీమకి కూడా హాని చేయని వాడివి జైలుకు ఎందుకు వచ్చావు? మీ వాళ్లంటూ ఎవరూ లేరా? ఇన్ని సంవత్సరాల్లో నిన్ను చూడడానికి ఒక్కరు కూడా రాలేదు." అంటూ అనుమానంగా అడిగాడు శంకర్.
ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాడు 402.
అంతలో కొత్త జైలర్ గారు వచ్చారు అని చెప్పడంతో హడావిడిగా అక్కడ నుంచి వెళ్లి లోపలికి వస్తున్న ఆఫీసర్ని చూసి సెల్యూట్ చేసి
"నమస్తే సార్! నా పేరు శంకర్! ఇక్కడ ఉన్న అందరిలో నేనే సీనియర్ 14 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను." అన్నాడు శంకర్.
"అవునా? ఖైదీలతో పాటు మీకు కూడా 14 సంవత్సరాల శిక్ష వేసినట్లు ఉన్నారు." అంటు నవ్వుతూ అడిగాడు జైలర్ సందీప్ రావు.
ఆ మాటకి నవ్వుతూ "సర్! ఖైదీల అందరూ బయటే ఉన్నారు మీరు ఒక్కసారి చుస్తే లోపలికి పంపిస్తాము, కొంతమంది టెర్రరిస్టులు కూడా ఉన్నారు వాళ్ళు ఎక్కువ సేపు బయట ఉండడం మంచిది కాదు." అన్నాడు సబ్ జైలర్ నితీష్.
"ఓకే!" అంటూ లోపలికి వెళ్లి గన్ ఆఫీస్ రూమ్ లో పెట్టి వరుసలో ఉన్న ఖైదీలను చూడడానికి వెళ్ళాడు సందీప్ రావు.
"సార్! ఆ చివర లైన్ కి వెళ్ళినప్పుడు మాత్రం దూరంగా ఉండండి వాళ్ళు టెర్రరిస్టులు ఏదైనా చేయడానికి వెనుకాడరు." అని చెప్పాడు నితీష్.
"మనం అలాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి కదా!" అంటూ స్లోగా చూస్తూ వెళ్లాడు సందీప్ రావు.
చివర లైన్లో ఉన్న టెర్రరిస్టులు ఒకరికి ఒకరు సైగ చేసుకుని పాతిపెట్టిన గాజు ముక్కలు బయటకు తీసి ఒక్కసారి ముందుకు దూకి సందీప్ రావుని పట్టుకుని సెంట్రీల వైపు చూసి
"మర్యాదగా తలుపులు తెరవండి లేకపోతే వచ్చిన రోజే వీడు చస్తాడు." అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఒక టెర్రరిస్ట్.
అక్కడికి వస్తు "షకీర్! మర్యాదగా సార్ ని వదిలిపెట్టు తలుపులు తెరిచిన మీరు పారిపోలేరు కాల్చి చంపేస్తారు." అంటూ బెదిరించాడు శంకర్.
"బయటికి వెళ్లిన తర్వాత ఈ ఎలా తప్పించుకోవాలో మాకు తెలుసుగాని ముందు వెళ్లి తలుపులు ఓపెన్ చెయ్!" అంటూ కోపంగా చెప్పాడు మరొక టెర్రరిస్ట్.
టెర్రరిస్టులు అందరూ కలిసి అక్కడ ఉన్న వారిని బెదిరిస్తూ సందీప్ రావుని డోర్ దగ్గరికి తీసుకు వెళ్లడం చూసి పరుగున వెళ్లి 13వ నెంబర్ తాళం ఓపెన్ చేసి
"ప్లీజ్! మా సార్ ని కాపాడు ఆయనకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అంతేకాదు ఆయనకి మొక్కలు, జంతువులు అంటే ప్రాణం!" అని చెప్పాడు శంకర్.
ఆ మాటకి తల ఎత్తి పైకి చూసి బయటకు వచ్చి తన చేతిలో ఉన్న కంచాన్ని గోడకి కొడుతూ సౌండ్ చేస్తూ టెర్రరిస్టుల దగ్గరికి వెళ్లి
"ఒరేయ్! సార్ ని వదిలిపెట్టి మీ సెల్ లోకి వెళ్ళండి." అంటూ ఎర్రటి కళ్ళతో కోపంగా చూస్తూ చెప్పాడు 402.
ఆ మాట విని వెనక్కి తిరిగి చూసి "ఎవడ్రా నువ్వు? బతకాలని లేదా? కావాలంటే మాతో పాటు నువ్వు కూడా బయటికి రా!" అని చెప్పాడు ఒక టెర్రరిస్ట్.
అంతలో అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ "402 బయటికి వచ్చాడు ఈరోజు కచ్చితంగా ఎవరో ఒకడు చస్తాడు." అంటూ భయంగా చూస్తూ అన్నారు ఖైదీలు.
"నేను ఖచ్చితంగా బయటకి వెళ్తాను ఇలా మాత్రం కాదు." అంటూ ఆఫీసర్ ని పట్టుకున్న షాకీర్ ని ఎత్తి గిరాటు వేసి సందీప్ రావుని తన వెనకాలకి పంపించి
"మీరు బానే ఉన్నారు కదా! నా వెనకాలే ఉండండి." అంటూ మీదికి వస్తున్న ఇద్దరు టెర్రరిస్టులని గొంతులో వేళ్ళతో పొడిచి, మరో ఇద్దరి కళ్ళలోకి చూస్తూ "అక్కడే ఆగండి." అంటూ గట్టిగా అరిచాడు 402.
కిందపడి గిలగిల కొట్టుకుంటున్న ఇద్దరిని, తన కంటి చూపుతోనే ఇద్దరినీ ఆపిన 402 వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు సందీప్ రావు.
అంతలో మిగతా సెంట్రీ లతో కలిసి పవర్ స్టిక్స్ పట్టుకుని వచ్చి టెర్రరిస్టులని చుట్టుముట్టి "మర్యాదగాల లోపలికి వెళ్ళండి." అంటూ కోపంగా చూస్తూ చెప్పాడు శంకర్.
402 వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు టెర్రరిస్టులు.
సందీప్ రావు దగ్గరికి వచ్చి "సార్! మీకేమి కాలేదు కదా!" అంటూ కంగారుగా చూస్తూ మిగతా ఖైదీల వైపు చూసి "అందరూ లోపలికి వెళ్ళండి." అంటూ గట్టిగా అరిచాడు నితీష్.
"నొ ప్రాబ్లెమ్!" అంటూ 402 కళ్ళతో ఆపిన ఇద్దరు టెర్రరిస్టులు బొమ్మలు లాగా కదలకుండా ఉండడం చూసి "ఆ ఇద్దరికి ఏమైంది? అలా స్టక్ అయిపోయారు." అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సందీప్ రావు.
తను పాతిపెట్టిన మొక్క దగ్గరికి వెళ్లి పళ్ళు కోసి సందీప్ రావు ఇచ్చి "మీ పిల్లలకి ఇవ్వండి. ఆ ఇద్దరు నేను చెప్పే వరకు కదలరు." అంటూ ఇద్దరి దగ్గరికి వెళ్లి "రూమ్ లోకి వెళ్ళండి." అని చెప్పాడు 402.
అక్కడి నుంచి వెళ్ళిపోతున్న 402 వైపు ఆశ్చర్యంగా చూస్తూ "నన్ను కాపాడినందుకు థాంక్స్! నీ పేరేమిటి?" అని అడిగాడు సందీప్ రావు.
ఆ మాటకి నవ్వుతూ ఏమి మాట్లాడకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు 402.
"సార్! అతని పేరు 402 గానే అందరికీ తెలుసు! అసలు పేరు ఏంటో ఫైల్ లో కూడా లేదు." అన్నాడు నితీష్.
"అవునా? అతని ఫైల్ నా రూమ్ కి తీసుకురండి." అంటూ లోపలికి వెళ్ళాడు సందీప్ రావు.
ఫైల్ తీసుకుని ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి టేబుల్ మీద పెడుతూ "అతని గురించి తెలుసుకోవడానికి ఫైల్ అడిగిన మొదటి ఆఫీసర్ మీరే సార్!'
'18 సంవత్సరాల నిండాయి అని శిక్ష వేసి ఈ జైలుకి పంపించరు కానీ అతను ఇక్కడికి వచ్చినప్పుడు 16 సంవత్సరాలు మాత్రమే! '
'ఈ జైలుకు వచ్చి 12 సంవత్సరాలు అయింది అతని కోసం ఒక్కరు కూడా రాలేదు. ఎవరితోనో పెద్దగా మాట్లాడు." అని చెప్పాడు శంకర్.
"అవునా?" అంటూ ఫైల్ చూస్తూ "ఆరు సంవత్సరాల క్రితం నలుగురు ఖైదీలు ఎందుకు చంపాడు? " డౌట్ గా అడిగాడు సందీప్ రావు.
"ఈ జైలుకి వచ్చినప్పుడు ఐదు మొక్కలు పాతిపెట్టాడు వాటికి రోజు నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచేవాడు, నలుగురు ఖైదీలు ఏడిపించడానికి ఒక మొక్క కొమ్మలు విరిచి చికాకు చేశారు.'
'ఆ కోపంతో ఎవరు ఆపినా సరే ఆగకుండా నలుగురిని చంపేసాడు అప్పటినుంచి సపరేట్ సెల్లో ఉంచుతున్నాము. ఇప్పుడు మీకు ఇచ్చిన పళ్ళు ఆ చెట్లకు కాసినవే!" అని చెప్పాడు శంకర్.
"అవునా?" అంటూ ఫైల్ చూసి "చనిపోయిన వ్యక్తులు ఉంగరాలు ఇతని దగ్గర దొరికాయని అరెస్టు చేశారు, కానీ చంపినట్లు ఎటువంటి ఎవిడెన్స్ లేదు.'
అంటూ అనుమానంగా ఫైల్ కంప్లీట్ గా చూసి "కనీసం అతని ఊరు పేరు కూడా లేదు ఎవరో కావాలని బయటకు రానివ్వకుండా ఉండడం కోసం ఇలా చేశారు." అంటూ
సెల్ దగ్గరికి వెళ్లి "నీ గురించి డీటెయిల్స్ ఏమి ఫైల్ లో లేవు నీ పేరేమిటి?" అని అడిగాడు సందీప్ రావు.
అక్కడికి వస్తు "బాబు! సార్ నీకు హెల్ప్ చేస్తారు బెయిల్ తీసుకుని బయటికి వెళ్లొచ్చు!" అన్నాడు శంకర్ పటేల్.
"నా పేరు అభిర్! మీరు నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే ఒక గుప్పెడు పంచదార ఇప్పించండి." అన్నాడు అభిర్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "పంచదార ఎందుకు?" డౌట్ గా అడిగాడు సందీప్ రావు.
"అక్కడ కనిపిస్తున్న చీమలకి వేయడానికి సార్!" అన్నాడు శంకర్.
"అవునా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఆఫీసు రూమ్ లోకి వెళ్లి ఫోన్ చేసి "వసుంధర కోర్ట్ లో ఒక పిటిషన్ వేయాలి." అన్నాడు సందీప్ రావు.
************
'అబీర్ 14 సంవత్సరాలుగా జైల్లో ఎందుకు ఉన్నాడు?'
'తన దగ్గర దొరికిన 6 ఉంగరాలు ఎవరివి? వాళ్లని అభిర్ ఎందుకు చంపాల్సి వచ్చింది.'
'ఎదుటి మనిషిని కళ్ళతో ఆపగలిగే శక్తి అభిర్ కి ఎలా వచ్చింది?'
'అతని కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?'
'అభిర్ ని జైల్లో పెట్టించి బయటకు రాకుండా చేసింది ఎవరు?'
'ఎవరు చదవని ఎవరికి తెలియని ఈ వేదం ఏమిటో తెలుసుకుందాము.'
**************
The following 17 users Like SivaSai's post:17 users Like SivaSai's post
• ABC24, Bhavabhuthi, Chamak, gora, Gurrala Rakesh, k3vv3, Madhu, Naga67, Nani666, na_manasantaa_preme, Nivas348, Raaj.gt, Sachin@10, Saikarthik, tshekhar69, utkrusta, vikas123
Posts: 4,382
Threads: 9
Likes Received: 2,802 in 2,158 posts
Likes Given: 10,232
Joined: Sep 2019
Reputation:
30
•
Posts: 1,235
Threads: 0
Likes Received: 849 in 648 posts
Likes Given: 923
Joined: Nov 2018
Reputation:
13
•
Posts: 441
Threads: 0
Likes Received: 484 in 327 posts
Likes Given: 4,566
Joined: Jul 2022
Reputation:
23
అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు సాయి గారు...
Thank you...
•
Posts: 205
Threads: 8
Likes Received: 1,361 in 159 posts
Likes Given: 1,039
Joined: Aug 2024
Reputation:
141
ఎపిసోడ్ 2
డ్యూటీలో జాయిన్ అయ్యినా వెంటనే టెర్రరిస్ట్ ఎటాక్ నుంచి తనని కాపాడిన భీరాజ్ ఫైల్ చూసి, తన భార్య వసుందరికి ఫోన్ చేసి కోర్టులో ఒక పిటిషన్ వేయామని చెప్పాడు సందీప్ రావు.
*********************
లండన్ వెస్ట్ పార్క్ దగ్గర ఉన్న నంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీసులో డైరెక్టర్స్ తో మాట్లాడుతూ "ఇప్పటి వరుకు16 దేశాలలో మన కంపెనీ ముద్రవేశము'
'ఈ సంవత్సరం తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ నార్వే లో కూడా అడుగు పెడుతున్నాము అని చెప్పడానికి సంతోషిస్తున్నాను." అన్నాడు ముకుల్ నంద.
"చైర్మన్ గారు! మీ మాటకు అడ్డు వస్తునందుకు క్షమించాలి, మన కంపెనీ పుట్టిన ఇండియాలో మాత్రం డవలేప్ మెంట్ లేకుండా అక్కడే ఆగిపోయము.'
'ప్రతి సంవత్సరం అక్కడ ఉన్న మన బిజినెస్ నుంచి వందల కోట్ల నష్టం వస్తుంది. ఇప్పుడు మీ మనవలు మనవరాళ్లు కూడా బిజినెస్ లోకి వచ్చారు కదా!'
'వాళ్లకి ఇండియా లో ఉన్న బిజినెస్ అప్పచెప్పండి లేకపోతే మన కంపెనీ పుట్టిన చోట కనుమరుగైపోతుంది." అన్నాడు ఒక డైరెక్టర్.
"ఆ విషయం నువ్వు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మీరంతా ఈ కంపెనీలో జాబ్ హోల్డర్స్ గా జాయిన్ అయ్యి డైరెక్టర్స్ గా మారారు ఆ విషయం మర్చిపోకండి." అంటూ కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు ముకుల్ నంద.
ఇంటిదగ్గర ఆలోచిస్తూ కూర్చున్నా ముకుల్ దగ్గరకు వచ్చి "సార్! మన కంపెనీ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడికి వస్తున్నారు.'
'మన కంపెనీకి సంబంధించిన వారందరికీ ఇన్విటేషన్స్ పంపించాము ఇంకా ఎవరికైనా పంపించాలి అంటే చెప్పండి." అన్నాడు పిఎ.
"కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయ్ తర్వాత మాట్లాడదాము." అంటూ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి "హలో హిర్వాణి! హౌ అర్ యు? నీకు ఇన్విటేషన్ అందిందా?" అని అడిగాడు ముకుల్ నంద.
"సార్! మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి కాల్ చేశాను, 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ కేసు ఫైల్ కోర్టు బెంచ్ మీదకి వచ్చింది." అన్నాడు హిర్వాణి.
"అవునా? ఎంత ఖర్చు అయ్యినా పర్వాలేదు ఆ కేస్ ఓపెన్ అవ్వకూడదు." అంటూ కంగారుగా అన్నాడు ముకుల్.
"సారీ సార్! ఇన్ని సంవత్సరాలు కేస్ ఓపెన్ అవ్వకుండా అతన్ని జైలు నుంచి బయటకు రానివ్వకుండా మేనేజ్ చేయగలిగాను.'
'కానీ ఇప్పుడు ఆ కేస్ డీల్ చేస్తుంది వసుంధర! తనని డబ్బుతో కొనలేము కోర్టులోనే ఎదుర్కోవాలి, అయ్యినా ఈ కేసులో ఆవిడతో గెలవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు హిర్వాణి.
ఫోన్ పక్కన పెట్టి "అభిర్ బయట అడుగు పెడితే!" అంటూ భయంగా చూస్తూ గుండె పట్టుకొని కింద పడిపోయాడు ముకుల్ నంద.
"సార్!" అంటూ కంగారుగా దగ్గరికి వచ్చి హాస్పిటల్ కి తీసుకు వెళుతూ ఫోన్ చేసి "మేడం! మీ తాతయ్య గారికి హార్ట్ ఎటాక్ వచ్చింది హాస్పిటల్ కి తీసుకువెళ్లను మీరు త్వరగా రావాలి." అని చెప్పాడు పిఏ.
"అవునా? నేను వెంటనే బయలుదేరుతున్నాను." అంటూ కంగారుగా చెప్పింది ముకుల్ మనవరాలు అర్ణ.
*******************
ఢిల్లీ వసుందర తో కలిసి ఇంటి దగ్గరికి వచ్చి హాల్లో ఉన్న సందీప్ రావుని చూసి "హాయ్ బ్రదర్! హౌ ఆర్ యు? నీ మీద ఎటాక్ జరిగిందని తెలిసింది.'
"ఫుల్ డీటెయిల్స్ ఇస్తే 30 మినిట్స్ ప్రోగ్రాం చేసి టెలికాస్ట్ చేస్తాను, అసలే ఈ మధ్య సరైన హాట్ న్యూస్ ఏమి దొరకలేదు." అంటూ నవ్వుతూ అడిగింది నీలమ్.
"అవునా? ఎంత ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ అయితే మాత్రం మీ అన్నయ్యనే టీవీలో చూపించి ట్రోల్ చేస్తావా?'
'అయ్యినా వీకెండ్ తప్పితే మిగతా రోజుల్లో మా ఇంటికి రాకూడదు అనుకుంటున్నావా ఏంటి?" అనుమానంగా అడిగింది వసుందర.
"హో..! అలాంటిదేమీ లేదు వదినా! వీకెండ్ అయితే రోషిని ఇంటి దగ్గరే ఉంటుంది. నేను కాసేపు స్పెండ్ చేయొచ్చు, మామూలు రోజుల్లో నువ్వు కోర్టుకు వెళతావు అన్నయ్య డ్యూటీ కి వెళ్తాడు.'
'నేను ఇక్కడ ఉన్న ఒకటే నా రూమ్ లో ఉన్న ఒకటే కదా!" అంటూ లోపలి నుంచి వస్తున్న రోషనిని చూసి "హాయ్! నీకోసమే వచ్చాను." అంటూ చాక్లెట్స్ ఇచ్చి ముద్దులాడుతూ ఉంది నీలమ్.
"హాయ్ ఆంటీ!" అంటూ చాక్లెట్లు తీసుకుని "ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చింది." అంటూ రూమ్ లో ఉన్న కుక్క పిల్లని చూపించి
"దీని పేరు టామీ! మా ఇంట్లోనే ఉంటుంది నేను ఆడుకోవడానికి డాడీ తీసుకువచ్చారు." అంటూ సంతోషంగా చెప్పింది రోషిని.
"హో.. క్యూట్ గా ఉంది." అంటూ సమరుతు చెప్పింది నీలమ్.
ఫైల్స్ టేబుల్ మీద పెడుతూ "సందీప్! నువ్వు చెప్పినట్లు జైల్లో ఉన్న వ్యక్తి కేస్ రిఓపెన్ చేయాలని పిటిషన్ వేశాను.
ట్విస్ట్ ఏమిటంటే!'
'నేను పిటిషన్ వేసిన గంటలో తీహార్ జైల్లో ఉన్న కరుడుగట్టిన నేరస్తులని అండమాన్ జైలు కి షిఫ్ట్ చేయాలి ఇక్కడ ఉండడం ప్రమాదం అని చెప్పి NIA వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ లిస్టులో అభిర్ పేరు కూడా ఉంది." అని చెప్పింది వసుందర.
"అవునా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ "అసలు అభిర్ నేరం చేసినట్లే రుజువు అవ్వలేదు, అలాంటిది కరుడుగట్టిన నేరస్తుడు ఎలా అవుతాడు? అతని వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది." అంటూ అనుమానంగా అన్నాడు సందీప్ రావు.
కుక్కపిల్లతో ఆడుతూ "అసలు అభిర్ కేస్ ఇన్ని సంవత్సరాలు ఫాలోఅప్ చేసిన లాయర్ ఎవరు?" డౌట్ గా అడిగింది నీలమ్.
"ఈ కేసులో ఆపోజిట్ లాయర్ మితిల్ హిర్వాణి! తన ఇన్ఫ్లెన్స్ తోనే ఇన్ని సంవత్సరాలుగా ఈ కేసుని బెంచ్ మీదకి కూడా రాకుండా చేశాడు.'
'16 సంవత్సరాల పిల్లాడిని 18 సంవత్సరాలు నిండాయని కోర్టుని నమ్మించి తీహార్ జైలుకి పంపించాడు." అని చెప్పింది వసుందర.
"లాయర్ హిర్వాణి! తను ఏ కేస్ టేకప్ చేసినా క్రోర్స్ లో ఛార్జ్ చేస్తాడు ఎటువంటి కేసు అయిన తారుమారు చేయగల సత్తా ఉన్నవాడు.'
'నాకు తెలిసి ఈ అండమాన్ జైలుకి పంపించే ప్రపోజల్ కూడా అతనే తీసుకువచ్చి ఉంటాడు ఎటువంటి వారినైనా డబ్బుతో పడేస్తాడు." అని చెప్పింది నీలమ్.
"అభిర్ జైలుకి వచ్చినప్పుడు వయస్సు 16 సంవత్సరాలు ఆ వయసు పిల్లవాడిని అన్ని కోట్లు ఖర్చుపెట్టి బయటకు రానివ్వకుండా 12 సంవత్సరాలు జైల్లోనే ఉంచి అతని జీవితం పాడు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది." అన్నాడు సందీప్ రావు.
"ఓకే! నాకు మంచి న్యూస్ దొరికినట్లు ఉంది ఒకసారి అభిర్ తో మాట్లాడాలి." అంది నీలమ్.
"మనం వేసిన పిటిషన్ రెండు రోజుల్లో బెంచ్ మీదకి వస్తుంది నేను కూడా ఒకసారి అభిర్ తో మాట్లాడాలి." అంది వసుందర.
"ఓకే! మీ ఇద్దరికి నేను స్పెషల్ పర్మిషన్ ఇప్పిస్తాను రేపు జైలుకు వచ్చి అభిర్ తో మాట్లాడండి." అన్నాడు సందీప్ రావు.
*******************
లండన్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఐసియు లో ఉన్న ముకుల్ నంద ని చూసి పక్కనే ఉన్న పిఏ వైపు చూస్తూ "తాతగారు దేని గురించైనా ఆలోచించి టెన్షన్ పడ్డారా?" డౌట్ గా అడిగింది అర్ణ.
"మేడం! 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ గురించి, నార్వేలో కంపెనీ స్టార్ట్ చేయడం గురించి డైరెక్టర్ తో మీటింగ్ జరిగింది అక్కడ ఇండియాలో ఉన్న బిజినెస్ గురించి డిస్కషన్ జరిగింది అప్పుడే బాగా టెన్షన్ పడ్డారు." అన్నాడు పిఏ.
"మనకి ఇండియాలో ఉన్న కంపెనీల ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి." అని అడిగింది అర్ణ.
"మేడం! ఆ డీటెయిల్స్ మొత్తం సార్ చాలా సీక్రెట్ గా ఉంచుతారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కూడా ఆ కంపెనీల డీటెయిల్స్ తెలుసుకోనివ్వరు అక్కడకి వెళ్లనివ్వరు.'
"సార్ స్వయంగా చూసుకుంటారు ఇప్పుడు మీరు అడిగారని తెలిస్తే ఆయన ఇంకా టెన్షన్ పడతారు." అన్నాడు పిఏ.
"ఓకే! మా ఫ్యామిలీ మెంబర్స్ లండన్ ఎప్పుడు వస్తున్నారు?" అని అడిగింది అర్ణ.
"టుడేస్ లో అందరూ ఇక్కడే ఉంటారు మేడం! ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి." అన్నాడు పిఏ.
"ఓకే! మీటింగ్లో ఇండియా కంపెనీస్ గురించి మాట్లాడిన డైరెక్టర్ ఎవరు?" డౌట్ గా అడిగింది అర్ణ.
"ప్రతాప్ మిశ్రా గారు మేడం!" అని చెప్పాడు పిఏ.
"ఓకే! తాత గారు స్పృహలోకి వస్తే వెంటనే నాకు కాల్ చెయ్!" అంటూ ఫోన్ తీసి కాల్ చేసి "హాయ్ అంకుల్! హౌ ఆర్ యు?" అని అడిగింది అర్ణ.
"హాయ్ బేబీ ఫైన్! ఇప్పుడే హాస్పిటల్ కి బయలుదేరుతున్నాను నువ్వు అక్కడే ఉన్నావా?" అని అడిగాడు ప్రతాప్ మిశ్రా
"ఎస్ అంకుల్! మీరు ఇంటి దగ్గర ఉండండి నేనే మీ దగ్గరికి వస్తున్నాను కొంచెం మాట్లాడే పని ఉంది." అంటూ ఫోన్ కట్ చెసి కార్ లో స్పీడ్ గా వెళ్ళింది అర్ణ.
కాసేపటికి ఇంటి లోపలికి వస్తున్న అర్ణని చూసి "హాయ్ బేబీ! ఏంటి పర్సనల్ మీట్ అవ్వాలి అన్నావు? ఎనీ ఇంపార్టెంట్ మేటర్!" డౌట్ గా అడిగాడు ప్రతాప్ మిశ్రా.
"ఇండియాలో ఉన్న మన కంపెనీస్ డీటెయిల్స్ నాకు కావాలి, వాటిని తాతగారు ఎవరికి తెలియకుండా ఎందుకు సీక్రెట్ గా ఉంచుతున్నారో తెలుసుకోవాలి." అంది అర్ణ.
"నంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆస్తిలో థర్టీ పర్సెంట్ ఇండియాలోనే ఉంది. అక్కడ కంపెనీస్ వల్ల వచ్చే నష్టం మన లాభాలను కూడా దెబ్బతిస్తుంది.'
'మనం అక్కడ ఉన్న కంపెనీస్ క్లోజ్ చేసి ఆస్తులు అమ్మినా చాలు మన కంపెనీ షేర్ వాల్యూ మూడు రెట్లు అవుతుంది.'
'ఈ విషయం ఎప్పుడూ మాట్లాడిన తాతగారు టెన్షన్ గా మీటింగ్ నుంచి వెళ్ళిపోతారు అసలు మన కంపెనీ పుట్టింది ఇండియాలో కానీ అక్కడ జీవం లేకుండా అయిపోతుంది. మీలో ఎవరైనా దీని గురించి ఇంట్రెస్ట్ చూపిస్తే అందరం లాభపడతాము." అన్నాడు ప్రతాప్ మిశ్రా.
"ఓకే అంకుల్! టు డేస్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వస్తున్నారు, ఈ విషయం గురించి తాత గారితో నేను మాట్లాడుతాను.'
'ఇప్పటివరకు నేను హ్యాండిల్ చేసినా ప్రతి విషయంలో సక్సెస్ అయ్యాను." అంటూ స్మైల్ ఇస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయింది అర్ణ.
అక్కడి నుంచి అర్ణ కారు వెళ్లడంతోనే ఫోన్ తీసి కాల్ చేసి "నమస్తే రాజన్! తొందరలోనే నంద వారసులు ఇండియాలో అడుగుపెట్టబోతున్నారు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.
"అవునా? వెల్కమ్ చెప్పడానికి మా అబీర్ సైన్యం సిద్ధంగా ఉంటుంది." అంటూ గంభీరమైన గొంతుతో చెప్పాడు రాజన్.
The following 15 users Like SivaSai's post:15 users Like SivaSai's post
• aarya, ABC24, Bhavabhuthi, coolguy, gora, Gurrala Rakesh, Iron man 0206, k3vv3, Madhu, Naga67, Nani666, na_manasantaa_preme, Nivas348, pula_rangadu1972, Sachin@10
Posts: 5,492
Threads: 0
Likes Received: 4,612 in 3,432 posts
Likes Given: 17,152
Joined: Apr 2022
Reputation:
76
Posts: 4,382
Threads: 9
Likes Received: 2,802 in 2,158 posts
Likes Given: 10,232
Joined: Sep 2019
Reputation:
30
•
Posts: 1,183
Threads: 0
Likes Received: 915 in 724 posts
Likes Given: 693
Joined: Sep 2021
Reputation:
9
Nice story andi.. baagundi andi
•
Posts: 1,235
Threads: 0
Likes Received: 849 in 648 posts
Likes Given: 923
Joined: Nov 2018
Reputation:
13
•
Posts: 119
Threads: 0
Likes Received: 54 in 44 posts
Likes Given: 57
Joined: Jun 2019
Reputation:
0
Good plot.eagerly waiting for next update
•
Posts: 205
Threads: 8
Likes Received: 1,361 in 159 posts
Likes Given: 1,039
Joined: Aug 2024
Reputation:
141
22-12-2025, 10:38 PM
(This post was last modified: 23-12-2025, 11:12 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
ఎపిసోడ్ 3
వసుందర, నీలమ్ అడగడంతో "స్పెషల్ పర్మిషన్ ఇప్పిస్తాను వచ్చి అభిర్ తో మాట్లాడండి." అని చెప్పాడు సందీప్ రావు.
"టుడేస్ లో ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు తాతయ్యతో ఇండియాలో ఉన్న కంపెనీల గురించి మాట్లాడుతాను." అని ప్రతాప్ మిశ్రా కి చెప్పింది వర్ణ.
రాజన్ కి ఫోన్ చేసి "నంద వారసులు ఇండియాలో అడుగు పెట్టబోతున్నారు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.
***************************
ఉదయం జైలుకి వచ్చి "శంకర్ గారు! అభిర్ ని కలవడానికి లాయర్ గారు వస్తున్నారు రెడీ అవ్వమని చెప్పండి." అన్నాడు సందీప్.
"ఓకే సార్!" అంటూ సంతోషంగా తాళాలు తీసుకువెళ్లి సెల్ ఓపెన్ చేస్తు "బాబు అభిర్! నిన్ను కలవడానికి ఈరోజు లాయర్ గారు వస్తున్నారు.'
'ఆవిడ ఎవరో కాదు సార్ గారి భార్య! చాలా పెద్ద లాయర్! అన్ని విషయాలు జాగ్రత్తగా మాట్లాడు తప్పకుండా నిన్ను బయటికి తీసుకువెళ్తారు." అన్నాడు శంకర్.
"అవునా?" అంటూ బయటికి వచ్చి స్నానం చేసి మొక్కలకు నీళ్లు పోసి సూర్య నమస్కారాలు చేసుకుని లాయర్ ని కలవడానికి ఒక రూమ్ లో వెయిట్ చేస్తూ సందీప్ రావు వైపు చూసి
"మీ పాపకి నేను ఇచ్చిన పళ్ళు ఇచ్చారా?" అని అడిగాడు అభిర్.
"సారీ అబీర్! ఆ పళ్ళు ఇంటికి తీసుకు వెళుతుంటే ఒక ముసలావిడ కనిపించి ఆకలి అని అడిగింది ఇచ్చేసాను." అన్నాడు సందీప్.
"చాలా మంచి పని చేశారు." అంటూ రూమ్ లోకి వస్తున్నా నీలమ్, వసుంధరలను చూసి నమస్కారం చేసి "నాకోసం ఇక్కడకి వచ్చినందుకు చాలా సంతోషం!" అన్నాడు అభిర్.
ఎదురుగా కూర్చుంటూ "ఏంటి! జైలు ఫుడ్ తిన్న తర్వాత కూడా నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావా?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీలమ్.
"మీకు జైల్లో పెట్టే ఫుడ్ గురించి ఎవరో తప్పు చెప్పారు ఇక్కడ అంతా బానే ఉంటుంది." అన్నాడు అభిర్.
"అభిర్! నిన్ను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను కరెక్ట్ గా సమాధానం చెప్పాలి అప్పుడే నీకు హెల్ప్ చేయగలను." అంది వసుంధర.
"సరే! ముందు నేను అడిగినదానికి సమాధానం చెప్పండి. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మిగతా విషయాలు మాట్లాడుతాను." అన్నాడు అభిర్.
"ఓకే టెల్ మీ?" అంది వసుంధర.
"ఇంట్రెస్టింగ్! లాయర్ కి పరీక్ష పెడుతున్న ముద్దాయి!" అంటూ ఏమీ అడుగుతాడా అని ఆసక్తిగా చూస్తూ ఉంది నీలమ్.
"మీ దగ్గర ఒక్క గ్లాస్ నీళ్లు ఉన్నాయి, మీ ముందు నీరు లేక ఎండిపోతున్న మొక్క, దాహంతో మీ వైపే ఆశగా చూస్తున్న ఒక జంతువు, ఆ గ్లాసు నీళ్ల కోసం లక్ష రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఒక మనిషి!'
'మీ చేతిలో ఉన్న గ్లాస్ నీళ్ళని ఎవరికీ ఇస్తారు? మీ మనసులో ఉన్న మాట బయటకు చెప్పండి. అంతేగాని కోర్టులో చెప్పే మాటలు నాతో చెప్పకండి." అన్నాడు అభిర్.
"ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం చాలా కష్టం! ఇంక నయం నన్ను అడగలేదు." అంటూ మనసులో అనుకుంది నీలమ్.
అభిర్ వైపు చూసి నువ్వుతు "జైల్లో ఉన్న 12 సంవత్సరాల్లో జీవితాన్ని చదివినట్లు ఉన్నావు, నేను డబ్బుకి ఆశపడి ఈ కేసు ని మధ్యలో వదిలేసి వెళ్లిపోను నా కూతురు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను." అంది వసుంధర.
"సరే! మీరు ఏమి అడగాలనుకుంటున్నారో అడగండి." అన్నాడు అభిర్.
"నువ్వు నిజంగానే ఎవరైనా చంపి జైలు కి వచ్చావా?" అనుమానంగా చూస్తూ అడిగింది వసుంధర.
"నేను ఎవర్ని చంపలేదు." అన్నాడు అభిర్.
"అవునా? మరి జైల్లో ఒక మొక్కని నరికినందుకే నలుగురిని చంపావు అని చెప్పారు?" డౌట్ గా అడిగింది వసుంధర.
నీలమ్ వైపు చూసి "ఈ అమ్మాయిని మీ కూతురు లాగా చూసుకుంటున్నారు కాదు!" అని అడిగాడు అభిర్.
"అవును! తను నా భర్త చెల్లెలు నా కూతురితో సమానం!" అంది వసుంధర.
"తన మీద ఎవరైనా చెయ్యి వేస్తే మీరు ఊరుకుంటారా ఒక లాయర్ అని కూడా ఆలోచించకుండా షూట్ చేసి చంపేస్తారు కదా!" అని అడిగాడు అభిర్.
"ఎస్! కన్ఫామ్ గా అంతే చేస్తాను." అంటూ కోపంగా చూస్తూ చెప్పింది వసుంధర.
"నేను కూడా అదే చేశాను ఆ మొక్కని ప్రాణంగా పెంచుకున్నాను అందుకే కోపం వచ్చింది చంపేశాను." అన్నాడు అభిర్.
"ఏంటి! నువ్వు పెంచిన మొక్కని నరికేశారు అని అన్యాయంగా నలుగురిని చంపేశావా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీలమ్.
టేబుల్ మీద ప్లేట్లో ఉన్న బిస్కెట్స్ తీసుకుని జేబులో పెట్టుకుంటూ "ఆ నలుగురు ఎనిమిది సంవత్సరాల పాప జీవితం నాశనం చేసి ఇక్కడికి వచ్చారు.'
'పది రోజులలో బెయిల్ వచ్చిందన్న సంతోషంలో మొక్క ప్రాణం కూడా తీయాలని చూసారు, అటువంటి వాళ్ళని చంపడం అన్యాయం ఎలా అవుతుంది." అని అడిగాడు అభిర్.
"అవునా?" అంటూ అక్కడ ఉన్న శంకర్ వైపు చూసింది నీలమ్.
"ఎస్ మేడం! ఆ అమ్మాయి చనిపోయింది కేసులో సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందుకు రాలేదు అందుకే నలుగురికి బెయిల్ వచ్చింది." అన్నాడు శంకర్.
"నువ్వు చేసింది కరెక్ట్! వాళ్ళని చంపడం అన్యాయం కాదు." అంటూ బిస్కెట్స్ ఉన్న ప్లేట్ అభిర్ వైపు జరిపి
"నీకు బిస్కెట్స్ అంటే ఇష్టమా? కావాలి అంటే ఇంకా తీసుకో!" అంది నీలమ్.
"మేడం! అభిర్ జేబులో పెట్టుకున్న బిస్కెట్స్ అతను తినడానికి కాదు చీమలకి, పక్షులకు పెడతాడు. రోజు తనకి పెట్టే అన్నంలో సగం వాటికే పెడుతూ ఉంటాడు." అని చెప్పాడు శంకర్.
"అవునా?" అంటూ అభిర్ వైపు చూస్తూ 'ఇంట్రెస్టింగ్ పర్సన్!' అని మనసులో అనుకుంది నీలమ్.
"కేసు ఫైల్ లో నీ ఊరు గురించి కానీ, నీ వాళ్ల గురించి గానీ డీటెయిల్స్ రాయలేదు నీకు ఎవరూ లేరా? ఇన్ని సంవత్సరాలుగా బయటకు రాకుండా ఎందుకు చేశారో? ఎవరు చేశారో తెలుసా?" డౌట్ గా అడిగింది వసుందర.
"నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు నేను బయటకు రాకుండా ఉండే అవసరం ఎవరికీ ఉందో నాకు కూడా తెలియదు." అన్నాడు అభిర్.
"అవునా నీకు నీ తల్లిదండ్రులు తప్పితే ఇంకా ఎవరూ లేరా?" అనుమానంగా అడిగింది నీలమ్.
"చాలామంది ఉండేవారు కానీ ఇప్పుడు ఉన్నారో లేరో ఉంటే ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో కూడా తెలియదు." అన్నాడు అభిర్.
"అంటే! ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇక్కడ ఉన్న విషయం కూడా మీ వాళ్ళుకి తెలియకుండా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు.'
'నువ్వు బయటికి రాకుండా ఉండడం ఎవరికో చాలా అవసరం నిన్ను నేను బయటకి తీసుకు వస్తాను." అంది వసుందర.
ఆబీర్ వైపు చూసి "పర్మిషన్ ఇస్తే మీ గురించి ఒక స్టోరీ చేసి టీవీలో టెలికాస్ట్ చేస్తాను, మీరు రిలీజ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.'
'ఒకవేళ మీకోసం ఎవరైనా ఎదురు చూసే వాళ్ళు ఉంటే ఇక్కడ ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది." అంది నీలమ్.
"సరే మీ ఇష్టం!" అంటూ వసుంధర ఇచ్చిన పేపర్స్ మీద సంతకాలు పెట్టి, చెట్టుకు ఉన్న పళ్ళు కోసుకు వచ్చి
"నేను మీకు ఇవ్వగలిగిన ఫీజు ఇవి మాత్రమే! మీ పాపకు ఇవ్వండి." అని ఇచ్చాడు అభిర్.
"థాంక్స్! అంటూ పళ్ళు తీసుకుని "తొందరలోనే మళ్లీ కలుసుకుందాము ఇక్కడ మాత్రం కాదు." అంటు నవ్వుతూ బయటికి వెళ్ళింది వసుంధర.
అక్కడి నుంచి వెళుతున్న అభిర్ వైపు చూసి "మీరు అయితే ఆ గ్లాస్ నీళ్లు ఎవరికి ఇస్తారు?" అని అడిగింది నీలమ్.
"నేను బయటికి వచ్చిన తర్వాత ఆ ప్రశ్నకి మీకు సమాధానం దొరుకుతుంది." అంటూ స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్లిపోయాడు అభిర్.
"ఓకే! వెయిట్ చేస్తాను." అంటూ అక్కడి నుంచి వెళుతూ నితీష్, శంకర్ వైపు చూసి "మీరిద్దరూ అయితే ఏం చేస్తారు?" అని అడిగింది నీలమ్.
"ఒక గ్లాస్ వాటర్ కి లక్ష రూపాయలు వస్తున్నాయంటే ఎలా వదులుతాను మేడం!" అంటూ నవ్వుతూ అన్నాడు నితీష్.
"కరెక్టే! మరి మీరు ఏం చేస్తారు." అంటూ శంకర్ వైపు చూసింది నీలమ్.
బుర్ర గోకుంటూ "ఏమో మేడం! నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు." అంటూ అయోమయంగా చూస్తూ అన్నాడు శంకర్.
"అన్నయ్య! నీ ఆన్సర్ ఏంటి?" అంది నీలమ్.
"అటువంటి కష్టమైన ప్రశ్నలకి లాయర్లు మాత్రమే కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలరు." అంటూ వసుంధర వైపు చూశాడు సందీప్.
"జైల్లో ఖైదీలతో పాటు ఉండి ఉండి నువ్వు కూడా పెద్ద దొంగ అయిపోయావు." అంటూ నవ్వుతూ వసుంధర వైపు చూసింది నీలమ్.
"అభిర్ అ ప్రశ్న న్యాయవ్యవస్థని అడిగాడు, అన్యాయంగా ఎండిపోతు, న్యాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న నాకు నీరు పోసి బతికిస్తారా! లేక డబ్బు కోసం అమ్ముడు పోతారా! అని అడిగాడు." అంది వసుంధర.
"అవునా! ఈ క్వశ్చన్ లో అంత అర్థం ఉందా? ఏదైనా నువ్వు జీనియస్ వదిన!" అంది నీలమ్.
అభిర్ కేసు ఫైల్ చూస్తూ "ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన ఎస్ఐ, తనని అరెస్టు చేసిన ఆఫీసర్స్ ఎవరు బతికి లేరు అందరిని చంపేశారు. తన తరపున వాదించడానికి ఏ లాయర్ కూడా ముందుకు రాలేదు." అని చెప్పింది వసుధర.
"అసలు ఎవరిని చంపినందుకు అబీర్ మీద కేసు ఫైల్ చేశారు?" డౌట్ గా అడిగింది నీలమ్.
"NIA ఆఫీసర్ మురళి జోషిని చంపినందుకు అభిర్ ని అరెస్టు చేశారు అందుకే తీవ్రవాది అనిముద్ర వేశారు." అని చెప్పింది వసుంధర.
"ఓ మై గాట్! NIA ఆఫీసార్ నా..?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీలమ్.
"వసుంధర! నిజంగా అభిర్ ఆ హత్య చేశాడంటవా?" డౌట్ గా అడిగాడు సందీప్.
ఫైల్ చూస్తూ "అభిర్ ఆ హత్య చేయలేదని నాకు నమ్మకం ఉంది కోర్టులో నేను నిరూపిస్తాను." అంది వసుధర.
"బెస్ట్ ఆఫ్ లక్ వదిన! నాకు అదే అనిపిస్తుంది మీడియా తరఫున నేను నీకు హెల్ప్ చేస్తాను." అంది నీలమ్.
Posts: 205
Threads: 8
Likes Received: 1,361 in 159 posts
Likes Given: 1,039
Joined: Aug 2024
Reputation:
141
22-12-2025, 10:46 PM
(This post was last modified: 23-12-2025, 11:12 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
ఎపిసోడ్ 4
జైల్లో ఉన్న అభిర్ ని కలిసి మాట్లాడి కేసు ఫైల్ చూసి "తనని ఎలాగైనా బయటికి తీసుకు వస్తాను." అంది వసుంధర.
********************
లండన్ హాస్పిటల్లో స్పృహలోకి వచ్చిన ముకుల్ దగ్గరికి వెళ్లి "హాయ్ తాతయ్య! హౌ ఆర్ యు?" అంటూ స్మైల్ ఇచ్చింది వర్ణ.
"ఫైన్ బేబీ!" అంటూ లెగిసి కూర్చుంటూ "బాగా టెన్షన్ పడినట్లు ఉన్నావు? మీరందరూ ఉండగా నాకు ఏమీ అవ్వదు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోదాము." నవ్వుతూ అన్నాడు ముకుల్.
జ్యూస్ ఇస్తూ "తాతయ్య! నువ్వు దేని గురించో బాగా టెన్షన్ పడుతున్నట్లు ఉన్నావు, ఆ విషయం ఏమిటో నాతో చెప్పకూడదా?" అనుమానంగా చూస్తూ అడిగింది వర్ణ.
"బిజినెస్ అంటేనే టెన్షన్స్! ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే నాలాంటి ముసలి గుండె ఇంక పనికిరాదు ఈ కంపెనీని యువ రక్తంతో నింపాలి అనుకుంటున్నాను.'
'నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారసులందరికీ బాధ్యతలు అప్పచెప్పి రిటైట్మెంట్ ఇచ్చేసి మునిమనవాలుతో కాలక్షేపం చెయ్యాలి అనుకుంటున్నాను, ఎలా ఉంది నా ఐడియా?" అంటూ స్మైల్ ఇచ్చాడు ముకుల్.
"గుడ్ ఐడియా! మీ మాటకి ఎదురు చెప్పే వారంటూ ఎవరూ లేరు, మీ ఆస్తులు తో పాటు మీ బాధ, టెన్షన్స్ కూడా అందరకి సమానంగా పంచండి తీసుకోవడానికి రెడీగా ఉన్నాము." అంది వర్ణ.
"నా వారసులకి సంతోషం మాత్రమే ఇస్తాను బాధ, కష్టం నాతోనే పోవాలి అనుకుంటున్నాను." అన్నాడు ముకుల్.
"తాతయ్య! వారసులు అంటే ఆస్తి మాత్రమే పంచుకునే వాళ్ళు కాదు బాధ కష్టం కూడా పంచుకోవాలి, నేను పంచుకోవడానికి రెడీగా ఉన్నాను.'
'నంద గ్రూప్ చైర్మన్ ద గ్రేట్ ముకుల్ గారి ఫేసులో సంతోషం ఒక్కటే ఉండేలాగా చేయాలి అనుకుంటున్నాను." అంది వర్ణ.
ఆ మాటకి సీరియస్ గా చూస్తూ "ఇండియాలో ఉన్న మన కంపెనీస్ గురించి నీతో ఎవరైనా మాట్లాడారా?" డౌట్ గా అడిగాడు ముకుల్.
"నో! నేనే డైరెక్టర్స్ తో మాట్లాడాను కానీ ఎవరు దాని గురించి తెలీదు అని చెప్తున్నారు, మన కంపెనీ పుట్టిన ఇండియాకి మీరు 12 సంవత్సరాలుగా ఎందుకు వెళ్లడం లేదు?'
'అక్కడ ఉన్న మన ఆస్తుల గురించి మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు?" అంటూ భయపడుతున్న ముకుల్ కళ్ళలోకి చూస్తూ అడిగింది వర్ణ.
"ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తాడు, దానికి శిక్ష అనుభవిస్తాడు పశ్చాత్తాప పడతాడు, కానీ నేను చేసిన తప్పుకు పశ్చాత్తాపం లేదనుకుంటా!'
'మీ నాన్నని దూరం చేసుకున్నాను, ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను ఈ పరిస్థితి నా వారసులు ఎవరికి రాకూడదని నిర్ణయించుకున్నాను అందుకే ఇండియాకి దూరంగా ఉన్నాను." అన్నాడు ముకుల్.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "అంటే! డాడ్ ఆక్సిడెంట్ లో చనిపోలేదా?" డౌట్ గా చూస్తూ అడిగింది వర్ణ.
"మీ డాడ్ గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో దానిని అలాగే ఉండనివ్వు! నేను, మీ నాన్న కలిసి చేసిన పాపం మీ ఎవ్వరికి అంటకూడదు ఇంకా ఈ టాపిక్ మళ్లీ మనం మధ్యలో రాకూడదు.'
'మీ బాబాయిలు, అత్తయ్యలు వస్తున్నారు మన కంపెనీ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ లోనే ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇస్తాను మీరందరూ హ్యాపీగా ఉండాలి." అన్నాడు ముకుల్.
"ఓకే తాతయ్య! మీ మాట నేను కాదనను రెస్ట్ తీసుకోండి. నేను ఆఫీస్ కి వెళ్లి ఈవినింగ్ వచ్చి ఇంటికి తీసుకు వెళ్తాను." అంటూ అక్కడ నుంచి బయటకు వచ్చి
కారులో వెళుతూ ఫోన్ చేసి "అంకుల్! నేను అడిగిన డీటెయిల్స్ సంపాదించారా?" అని అడిగింది వర్ణ.
"ఎస్! ఫైల్ మొత్తం నా దగ్గరే ఉంది వస్తే నీకు క్లియర్ గా చెప్తాను." అన్నాడు ప్రతాప్ మిశ్రా.
"ఓకే!టెన్ మినిట్స్ లో అక్కడ ఉంటాను." అంటూ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది వర్ణ.
ఇంటి లోపలికి వస్తున్న వర్ణని చూసి "వెల్కం బేబీ!" అంటూ ఫైల్ టేబుల్ మీద పెట్టి "వీడు నా కొడుకు సుజిత్ మిశ్ర తెలుసు కదా!" అని అడిగాడు ప్రతాప్ మిశ్ర.
"ఎస్ అంకుల్! హాయ్ సుజిత్!" అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ
"తాత గారి దగ్గర ఇండియా టాపిక్ తీసుకువచ్చాను ,కానీ ఆయన కంప్లీట్ గా అవాయిడ్ చేశారు, ఆయనను టెన్షన్ పెట్టడం ఇష్టం లేక నేను కూడా స్టాప్ చేశాను." అంటూ ఫైల్ తీసుకుని చూస్తూ
"ఓ మై గాడ్! ఇండియాలో ఉన్న మన కంపెనీ ప్రాపర్టీ వ్యాల్యూ 2 లాక్స్ క్రోర్స్!" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అంది వర్ణ.
"ఎస్! ఆ ఎస్టిమేషన్ టూ ఇయర్స్ బ్యాక్ వేసింది ఇప్పుడు ఇంకా వేల్యూ పెరిగే ఉంటుంది." అన్నాడు సుజిత్.
"ఇండియా కి సంబంధించిన అకౌంట్ మొత్తం చెక్ చేస్తుంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ మేటర్ కనిపించింది. అంటూ పేపర్స్ చూపిస్తూ
"మీ తాతగారు లండన్ వచ్చిన దగ్గరనుంచి ఇండియా లో హిర్వాణి అనే లాయర్ కి ఎవ్రీ ఇయర్ 30 క్రోర్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది.'
'అంతేకాదు! లండన్ కి వచ్చిన వెంటనే 'మిచల్' అనే వ్యక్తికి 100 కోర్స్ ట్రాన్స్ఫర్ చేయించారు, రీసెంట్ గా కూడా 100 క్రోర్స్ ట్రాన్స్ఫర్ అయింది." అంటూ పేపర్స్ చూపించడు ప్రతాప్ మిశ్ర.
"ఓకే!" అంటూ తన మొబైల్ లో చూస్తూ "హిర్వాణి! మోస్ట్ పాపులర్ లాయర్! ఎటువంటి కేసునైన డీల్ చేయగలడు, అలాగే మిచల్ ఇండియాలో ఒక పెద్ద గ్యాంగ్ స్టర్! అసలు వీళ్ళతో తాతగారికి పని ఏముంది?" డౌటుగా అంది వర్ణ.
"నాకు కూడా తెలియదు వీళ్లని మనం ఫోన్లో కాంటాక్ట్ అయ్యితే మీ తాత గారికి వెంటనే తెలిసిపోతుంది. డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడితేనే అసలు విషయం తెలుస్తుంది." అన్నాడు ప్రతాప్ మిశ్ర.
"ఓకే! ఫంక్షన్ అయిన తరువాత ఇండియాలో ఉన్న మన ప్రాపర్టీస్ కి సుజిత్ ని గార్డెన్ గా ఉంచడానికి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ప్రపోజల్ పెట్టబోతున్నాను." అంది వర్ణ.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "బేబీ! నీ డిసిషన్ ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుంది." అంటూ సంతోషంగా కొడుకు వైపు చూస్తూ చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
"థాంక్యూ అంకుల్! ఈ విషయం తాత గారికి తెలియకూడదు." అంటూ ఫైల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వర్ణ.
"సుజిత్!" అంటూ గట్టిగా కౌగిలించుకుని "ఇండియాలో ఉన్న ప్రాపర్టీ వ్యాల్యూ నాలుగు లక్షల కోట్లు! ఆ ముసలాడి పర్మిషన్ లేనిదే వారసులు ఎవ్వరు ఇండియాలో అడుగు కూడా పెట్టరు.'
'కచ్చితంగా అక్కడ ఉన్న ప్రాపర్టీ మొత్తం అమ్మి క్యాష్ చేయమని చెప్తారు, నువ్వు గార్డియన్ గా అక్కడికి వెళితే మన ఫెయిత్ మారిపోతుంది." అంటూ ఆనందంగా అన్నాడు ప్రతాప్ మిశ్రా.
"డాడ్! నాకు ఒక చిన్న డౌట్! ఇన్ని సంవత్సరాలుగా ముకుల్ గారు అక్కడ ప్రాపర్టీని క్యాష్ ఎందుకు చేయలేకపోయారు?" అని అడిగాడు కూసుల్.
"నాకు తెలిసి ఇండియాలో ఒక పెద్ద లాయర్ ని పెట్టుకున్నాడు అంటే! ఈ ముసలోడు ఏదో కేసులో ఇరుక్కుని ఉంటాడు అందుకునే భయపడి వెళ్లడం లేదు.'
'ఎప్పటికైనా ఈ ప్రాపర్టీ కోసం ఇండియా వెళ్ళేది మనమే అని నాకు తెలుసు! అందుకే రాజన్ అని ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ ని లైన్ లో పెట్టి ఉంచాను.'
'నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మిచల్ ని కూడా లైన్లో పెట్టు అప్పుడు ఇంక మన మాటకి తిరుగు ఉండదు." అంటూ సంతోషంగా చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
గ్లాసులో మందు పోసి తండ్రికి ఇస్తూ "చీర్స్ డాడ్! అడ్వాన్స్ గా పార్టీ చేసుకుందాము." అంటూ నవ్వుతూ అన్నాడు కూసుల్.
*********************
కార్ లో ఇంటికి వచ్చి ఫోన్ చేసి "హలో మహేష్! ఇండియాలో ఉన్న మన ప్రాపర్టీ వ్యాల్యూ 2 లాక్స్ క్రోర్స్! ఇప్పుడే డీటెయిల్స్ మొత్తం తీసుకున్నాను అక్కడికి పంపడానికి ఒక బకరాని కూడా రెడీ చేశాను." అని చెప్పింది అర్ణ.
"అవునా? అక్కడికి ఎవరినో పంపడం ఎందుకు నేనే వెళ్తాను." అన్నాడు మహేష్.
"ఒరేయ్ అన్నయ్య! మనిషి పెరిగావు కానీ బుర్ర పెరగలేదు, నీకు ఊహ తెలిసిన తర్వాత తాతగారు భయపడడం చూశావా? లేక డిసిషన్ తీసుకోవడానికి వెనకడుగు వేయడం చూసావా?" అని అడిగింది అర్ణ.
"నో! నెవర్! ఎవరికి భయపడరు ఎటువంటి డిసిషన్ అయినా డేర్ గా తీసుకుంటారు." అన్నాడు మహేష్.
"ఎస్! ఇండియా పేరు చెప్పగానే తాతగారి కళ్ళలో భయము, బేరుకు చూశాను అక్కడ ఎవరికో ఆయన భయపడుతున్నారు.'
'విషయం క్లారిటీ లేకుండా మనం వెళ్లి ప్రాబ్లం ఫేస్ చేయడం ఎందుకు! ఒకవేళ అక్కడ సిచువేషన్ సీరియస్ అనుకో ఆ సుజిత్ గాడు పోతాడు కంపెనీలో ఒక డైరెక్టర్ తగ్గుతాడు మన షేర్ కూడా పెరుగుతుంది.'
'ఇండియా వెళ్లి ఎలా హ్యాండిల్ చేయాలో మనకి క్లారిటీ వస్తుంది. ఒకవేళ అక్కడ అంతా సేఫ్ అనిపిస్తే మనం ఎంటర్ అయ్యి నెక్స్ట్ మినిట్ ససుజిత్ గాడిని లెఫ్ట్ లెగ్ తో తంతే వచ్చి లండన్ లో పడతాడు." అంటూ నవ్వుతూ చెప్పింది అర్ణ.
"గుడ్ ఐడియా! నీ బుర్రలో సగమైన నాకు వచ్చి ఉంటే ఈ టైమ్ కి ఒక రేంజ్ లో ఉండేవాడిని, సరేగాని ఈ విషయం బాబాయిలకి అత్తయ్యకి తెలిసిందో వాళ్లు కూడా ఎంటర్ అవుతారు." అన్నాడు మహేష్.
"నిజంగా అన్ని తెలివితేటలే ఉంటే ఇప్పటికే ఎంటర్ అయ్యేవారు, వాళ్ళు తెలివితేటల వల్ల ఈ రేంజ్ లో లేరు అదృష్టం వల్ల ఈ రేంజ్ లో ఉన్నారు.'
'ఆ గొర్రెల మందని ఎలా మేనేజ్ చెయ్యాలో నాకు బాగా తెలుసు! లండన్ కి రాగానే తాతయ్య దగ్గరికి వెళ్లి కాళ్ళకి దండం పెట్టి ఎలా ఉన్నారో అడుగు నెక్స్ట్ ఈ టాపిక్ ఎక్కడ డిస్కస్ చేయకు." అని చెప్పింది అర్ణ.
"ఓకే డన్! మార్నింగ్ ఫ్లైట్ కి వదిన, నేను, పిల్లలు అక్కడే ఉంటాము." అన్నాడు మహేష్.
"ఓకే! అంటూ ఫోన్ పెట్టేసి "ఇండియా వెళ్ళకూడదు హిర్వాణి, మిచల్ తో మాట్లాడాలి ఈ విషయం తాతయ్యకి తెలియకూడదు ఎలా!" అంటూ ఆలోచిస్తూ ఉంది అర్ణ.
Posts: 1,235
Threads: 0
Likes Received: 849 in 648 posts
Likes Given: 923
Joined: Nov 2018
Reputation:
13
•
Posts: 205
Threads: 8
Likes Received: 1,361 in 159 posts
Likes Given: 1,039
Joined: Aug 2024
Reputation:
141
ఎపిసోడ్ 5
ప్రతాప్ మిశ్రని కలిసి ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ డీటెయిల్స్ తెలుసుకొని తన అన్న మహేష్ కి ఫోన్ చేసి ప్లాన్ గురించి చెప్పి త్వరగా లండన్ రమ్మని చెప్పింది వర్ణ.
*******************
ఢిల్లీ అభిర్ మీద ఒక డాక్యుమెంటరీ రెడీ చేసి టెలికాస్ట్ చేయడానికి ఎడిటర్ దగ్గరికి తీసుకు వెళ్ళింది నీలమ్.
డాక్యుమెంట్ చూసి "చాలా బాగుంది కానీ ఈ విషయం గురించి మనం చైర్మన్ గారితో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే టెలికాస్ట్ చేయగలము." అని చెప్పాడు ఎడిటర్.
"అవునా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ "ఇప్పటివరకు ఏ ప్రోగ్రాం టెలికాస్ట్ చేయడానికి పర్మిషన్ కోసం చైర్మన్ గారి దగ్గరికి వెళ్లింది లేదు." డౌట్ గా అడిగింది నీలమ్.
"కరెక్ట్! కానీ దీని విషయంలో తప్పకుండా మనం మాట్లాడాలి ఎందుకంటే, ఈ కేస్ డీల్ చేసే ఆపోజిట్ లాయర్ అలాంటివాడు." అంటూ నీలమ్ తో కలిసి చైర్మన్ రూమ్ లోకి వెళ్లి డాక్యుమెంటరీ గురించి చెప్పాడు ఎడిటర్.
"నో! ఈ డాక్యుమెంటరీ టెలికాస్ట్ చేయడానికి నేను పర్మిషన్ ఇవ్వను అంత రిస్క్ తీసుకోలేను." అన్నాడు చైర్మన్.
"అంటే సార్! మీరు భయపడుతున్నారా?" అని అడిగింది నీలమ్.
"నిజం చెప్పాలంటే ఎస్! ఈ కేస్ మీ కజిన్ వసుంధర గారు డీల్ చేస్తున్నారని నాకు తెలుసు! ఆ జైల్లో ఉన్న మనిషి రిలీజ్ అయితే నో ప్రాబ్లం!'
'ఒకవేళ ఫెయిల్ అయితే ఆ హిర్వాణి నా ఛానల్ మీద ఒక్క పిటిషన్ వేసాడు అంటే తరువాత నా ఆస్తులు కూడా సరిపోవు, మోస్ట్ డేంజరస్ క్రిమినల్ లాయర్! అనాఫ్ దీని గురించి ఇంక మాట్లాడడానికి ఏమీ లేదు." అన్నాడు చైర్మన్.
"ఓకే సర్ థాంక్యూ! మీరు ఒక చిన్న పని చేయండి అర్జెంట్ గా మన ఛానల్ పేరు ట్రూ న్యూస్ అని తీసి వేరే పేరు పెట్టండి." అంటూ కోపంగా అంది నీలమ్.
ఆ మాటకి నవ్వుతూ "నీ ఆవేశం నాకు అర్థం అయింది ఈ కేసులో నువ్వు ఒక లాజిక్ మర్చిపోయావు, హిర్వాణి టేకప్ చేసే కేసు ఏదైనా సరే ఛార్జ్ క్రోస్ లో ఉంటుంది.'
'ఈ కేస్ 12 సంవత్సరాలుగా తన ఇన్ఫ్లెన్స్ లో తొక్కి పట్టి ఉంచాడు అంటే ఎన్ని కోట్లు ఛార్జ్ చేసి ఉంటాడు. అంత అమౌంట్ ఇచ్చిన వ్యక్తి మామూలు వాడు అయ్యి ఉంటాడా?'
'అసలు అభిర్ ని బయటికి రానివ్వకుండా ఎందుకు చేస్తున్నారో వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటో నీ ఇన్వెస్టిగేషన్ బ్రెయిన్ ఉపయోగించి అసలు విషయలు తెలుసుకో అప్పుడు ఆ హిర్వాణి కాదు కదా వాడి బాబు వచ్చినా సరే నా ఛానెల్ లో డాక్యుమెంటరీ ఏం కర్మ డైలీ ఎపిసోడ్ లాగా టెలికాస్ట్ చేస్తాను." అన్నాడు చైర్మన్.
ఆ మాటలకి ఆలోచనలో పడి "కరెక్ట్ పాయింట్! థాంక్యూ సార్!" అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది నీలమ్.
*********************
ఉదయం కోర్టులో "కేసు నెంబర్ 326/ 2012 అని పిలవగానే పేపర్స్ సబ్మిట్ చేసి "యువనానర్! ఒక నేరస్తుడు తప్పించుకున్న పర్వాలేదు గాని ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అని మన న్యాయ శాస్త్రం చెబుతుంది.'
'కానీ ఈ కేసులో ఎటువంటి శిక్ష పడకుండా కేస్ కోర్టు బెంచ్ మీదకి కూడా రాకుండా 12 సంవత్సరాలుగా అభిర్ జీవితం జైలులో గడిచిపోయింది.'
'అది కూడా 16 సంవత్సరాలకు వయసు ఉన్న ఒక పిల్లాడికి 18 సంవత్సరాలు అని తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి మరి జైలుకు పంపించారు.'
'అసలు ఈ కేసులో చనిపోయిన మురళి జోషి అనే వ్యక్తిని అబీర్ చంపేడు అనాడానికి ఐవిట్నెస్ లేదు, ఒక సస్పెక్ట్ గా మాత్రమే అరెస్టు చేసి జైల్లో ఉంచారు.'
'అంతేకాదు యువనానర్ ఈ కేసులో అభిర్ ని అరెస్టు చేసినా ఆఫీసర్స్, అభిర్ వయసు నిర్ధారణ చేసి సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్, అంతెందుకు ఈ కేస్ కోర్టుకు వచ్చినప్పుడు అభిర్ కి కస్టడీ విధించిన జడ్జిగారితో సహా అనుమానస్పదంగా చనిపోయారు.'
'మరొక విచిత్రమైన విషయం ఏమిటి అంటే! ఈ కేస్ నేను టేకప్ చేస్తున్నాను అన్న విషయం తెలియగానే NIA ఆఫీసర్స్ కి తీహార్ జైల్లో ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారని సడన్ గా గుర్తుకు వచ్చింది.'
'ఈ కేసులో ముద్దాయి అని అభిర్ ని ఇంకా కోర్టు నిర్ణయించలేదు కానీ అండమాన్ జైలుకు పంపించే ప్రమాదకరమైన వ్యక్తుల లిస్టులో అతని పేరు కూడా ఉంది.'
'దీనిని బట్టి మనకి ఏమీ తెలుస్తుంది అంటే ఈ కేస్ వెనకాల చాలా పెద్ద మనుషుల హస్తాలు ఉన్నాయి, మురళి జోషి ని నిజంగా చెప్పు చంపిన వ్యక్తులను తప్పించడానికి నా క్లైంట్ అయిన అబీర్ ని బలి పశువును చేసారు.'
'అందుకే వెంటనే తనని బెయిల్ మీద రిలీజ్ చేసి ఈ కేస్ ని నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు నిజాలు బయటకు తీసుకురావాలని కోరుతున్నాను." అని చెప్పింది వసుంధర.
"యువనానర్ అభిర్ ఒక ప్రమాదకరమైన వ్యక్తి 18 సంవత్సరాల వయసులోనే NIA ఆఫీసర్ని చంపేశాడు అలాగే జైల్లో ఆరు సంవత్సరాల క్రితం నలుగురు ఖైదీలను కూడా అతి దారుణంగా చంపాడు.'
'ఈ కేస్ రీ ఇన్వెస్టిగేషన్ చేయడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అభిర్ బెయిల్ మీద బయటకి వస్తే మాత్రం చాలా ప్రమాదం." అని చెప్పాడు హిర్వాణి.
"అభిర్ జైల్లో నలుగురిని చంపినట్లు ఎటువంటి కేసు ఫైల్ అవ్వలేదు అంటే అధికారులకు కూడా తెలియని విషయం మీకు తెలిసింది.'
'అది కాకుండా అతనికి ఈ కేసు ముందు నేర చరిత్ర ఉన్నట్లు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అసలు అతని డీటెయిల్స్ ఏమి FIR లో లేవు అంటే ఈ కేస్ ని తప్పుదారి పట్టించడానికి సెక్యూరిటీ ఆఫీసర్లు ఒక అనాధ వ్యక్తి ని తీసుకువచ్చి అరెస్టు చేశారా?" అని అడిగింది వసుంధర.
"ఎస్! నేను చెప్పేది కూడా అదే, అసలు అతను ఎవరో కూడా తెలియదు మన దేశం వాడో కూడా తెలియదు సెక్యూరిటీ అధికారి ఇన్వెస్టిగేషన్ లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.'
'అటువంటి వ్యక్తిని బయటకు పంపిస్తే చాలా ప్రమాదం ఈ కేసు పూర్తయ్య వరకు అతను జైల్లోనే ఉండాలి." అన్నాడు హిర్వాణి.
"మర్డర్ చేసిన వ్యక్తికి పడే శిక్ష 14 సంవత్సరాలు ఈ కేసులో ముద్దాయి అని తేలకుండానే 12 సంవత్సరాల శిక్ష అనుభవించాడు, మీ లెక్క ప్రకారం అతనికి 30 సంవత్సరాలు సగం జీవితం జైల్లోనే గడిచిపోయింది.'
'ఈ కేసు విచారణ మొదలై 12 సంవత్సరాలు అవుతుంది ఎప్పటికీ పూర్తవుతుందో మీకు కూడా తెలియదు, ఒకవేళ పూర్తయిన తర్వాత అతను నిర్దోషి అని తేలితే జైల్లోనే గడిచిపోయిన అతని జీవితానికి ఎవరు సమాధానం చెబుతారు." అని అడిగింది వసుందర.
"ఒక NIA ఆఫీసర్ మర్డర్ కేసు కాబట్టి ఈ కేస్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగిస్తున్నాను, అలాగే అభిర్ కి బెయిల్ మంజూరు చేస్తున్నాము కానీ ఈ కేసు పూర్తయ్యే వరకు అతను ఢిల్లీ వదిలి వెళ్ళడానికి వీల్లేదు.'
'అంతేకాదు అభిర్ ఇద్దరు ఆఫీసర్స్ సంరక్షణలో ఉండాలి వెంటనే వాళ్ళని అపాయింట్ చేయాలని సిబిఐ వారిని ఆదేశిస్తున్నాను." అంటూ తీర్పు ఇచ్చాడు జడ్జ్.
ఆ తీర్పు విని ఊపిరి పీల్చుకుని "థాంక్యూ యువనానర్!"అంటూ సంతోషంగా పేపర్స్ తీసుకుని బయటికి వెళ్లింది వసుంధర.
తన అసిస్టెంట్లతో కలిసి బయటికి వస్తూ వసుంధర వైపు చూసి "మనం ఒకసారి మీట్ అవ్వాలి ప్లేస్ మీ ఛాయిస్ ఇది రిక్వెస్ట్ అనుకోండి." అన్నాడు హిర్వాణి.
"ఓకే! ఈవింగ్ మీట్ అవుదాము వెల్కమ్ టు మై హోమ్!" అంటూ స్మైల్ ఇచ్చింది వసుంధర.
"థాంక్యూ!" అంటూ తన అసిస్టెంట్ తో కలిసి కార్ లో వెళ్ళిపోయాడు హిర్వాణి.
అక్కడికి వస్తూ "కంగ్రాట్స్ వదిన! నీ ఆర్గుమెంట్స్ వింటుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. నీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్!'
'ఈ కేసులో ఒక ఇంపార్టెంట్ క్లూ సంపాదించాను." అంటూ పేపర్ చూపిస్తూ "మురళి జోషి ఫ్యామిలీ ఇంటి అడ్రస్!" అంటూ నవ్వుతూ చెప్పింది నీలమ్.
"ఓకే! రేపు అభిర్ రిలీజ్ అయిన తర్వాత అక్కడికి వెళదాము, ఈవినింగ్ హిర్వాణి తో మన ఇంటి దగ్గర చిన్న మీటింగ్ ఉంది. ఈ కేసు వెనకాల ఎవరు ఉన్నారో తెలుస్తుంది అనుకుంటున్నాను." అని చెప్పింది వసుంధర.
"ఓకే! నీతో పాటు మీటింగ్లో నేను కూడా జాయిన్ అవుతాను ఈ కేసు నాకు కూడా ఒక ఛాలెంజ్ విసిరింది." అంది నీలమ్.
*********************
సాయంత్రం జైల్లో ఉన్న అభిర్ దగ్గరికి వచ్చి సంతోషంగా చూస్తూ "బాబు గుడ్ న్యూస్! నీకు బెయిల్ వచ్చింది రేపు ఉదయం ఇక్కడి నుంచి బయటకు అడుగుపెడతావు." అంటూ నవ్వుతూ చెప్పాడు శంకర్.
అక్కడికి వస్తు "కానీ కోర్టు ఒక కండిషన్ పెట్టింది. నువ్వు ఢిల్లీ దాటి బయటికి వెళ్ళకూడదు, నీతో పాటు ఇద్దరు ఆఫీసర్స్ ఉంటారు.'
'నీ ప్రవర్తన మీద ఎటువంటి అనుమానం వచ్చినా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ జైలు కి వస్తావు, అప్పుడు ఈ కేస్ క్లోజ్ అయ్యే వరకు లోపల ఉంటావు." అని చెప్పాడు సందీప్ రావు.
"సార్! నేను 12 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడిపాను, విధి నాకు విధించిన శిక్ష పూర్తయింది. ఇన్ని సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్న వాళ్ళు తప్పకుండా తిరిగి బయటకి వస్తారు.'
'తప్పు చేసిన వారు కర్మ ఫలితం అనుభవించే సమయం వస్తుంది దానిని ఎవరు ఆపలేరు." అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు అభిర్.
ఆ మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ "శంకర్ నీకేమైనా అర్థమైందా?" డౌట్ గా చూస్తూ అడిగాడు సందీప్.
"సార్! నాకు 12 సంవత్సరాలు అనే మాట తప్పితే వేరేది ఏమీ అర్థం కాలేదు." అంటూ అయోమయంగా చూస్తూ చెప్పాడు శంకర్.
ఆ మాటకి నవ్వుతూ "సరే! అతని మాటలు మనకి ఎప్పుడూ అర్థం కావులే గాని, అభిర్ బయటికి వెళ్లి పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త జీవితంలోకి అడుగు పెట్టి సంతోషంగా ఉండాలి." అన్నాడు సందీప్ రావు.
Posts: 205
Threads: 8
Likes Received: 1,361 in 159 posts
Likes Given: 1,039
Joined: Aug 2024
Reputation:
141
ఎపిసోడ్ 6
అభిర్ కి బెయిల్ రావడంతో వసుంధర దగ్గరికి వచ్చి "ఒక్కసారి మనం మీట్ అవ్వాలి." అని అడిగాడు హిర్వాణి.
అభిర్ కి బెయిల్ వచ్చిన విషయం చెప్పి "జైల్ నుంచి బయటికి వెళ్లి పాత విషయం మర్చిపోయి నవ్వు సంతోషంగా ఉండాలి." అన్నాడు సందీప్ రావు.
***********************
సాయంత్రం ఇంటి దగ్గరికి వచ్చిన హిర్వాణి ని చూసి "వెల్కమ్ సార్!" అంటూ తనతో పాటు లోపలకి తీసుకువెళ్లాడు సందీప్ రావు.
"నమస్తే జైలర్ గారు! మనం పేపర్స్ తో మాట్లాడుకోవడమే కానీ డైరెక్ట్ గా కలుస్తామాని ఎక్స్పెక్ట్ చేయలేదు." అంటూ అసిస్టెంట్ వైపు చూసి "కారు దగ్గర వెయిట్ చేయ్!" అని చెప్పి లోపలికి వచ్చాడు హిర్వాణి.
ఆ మాటకి నవ్వుతూ "మీరు కూడా మరొక లాయర్ ని ఇంటి దగ్గర కలవడానికి వెళతారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు." అన్నాడు సందీప్ రావు.
"ఎస్!" అంటూ హాల్లోకి వచ్చి కూర్చుని చుట్టూ చూస్తూ "ఒక జైలర్, ఒక హై ప్రొఫైల్ లాయర్ ఇల్లు చాలా సింపుల్ గా ఉంది." అంటు
ఎదురుగా నీలమ్, రోషినిలను చూస్తూ "ఎదిగిన అమ్మాయి, ఎదుగుతున్న అమ్మాయి ఉన్నారు ఇంక మీరు సంపాదించడం మొదలుపెట్టాలి." అన్నాడు హిర్వాణి.
హాల్లోకి వస్తూ "తిండి ఎక్కువైతే రోగం వస్తుంది అలాగే డబ్బు ఎక్కువైతే మాయ రోగం వస్తుంది. అందుకే మేము ప్రతి దాంట్లో లిమిట్ గా ఉంటాము." అంటూ స్మైల్ ఇచ్చింది వసుంధర.
"మీరు కోర్టులోనే కాదు ఇంటి దగ్గర కూడా చాలా స్ట్రాంగ్ గా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు." అంటు నవ్వుతూ అన్నాడు హిర్వాణి.
నీలమ్ తీసుకువచ్చిన కాఫీ ఆఫర్ చేసి "విషయం ఏమిటో చెప్పండి?" అంది వసుంధర.
"మేటర్ చాలా సింపుల్! అభిర్ బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి దానికి ప్రతిఫలంగా మీకేం కావాలో చెప్పండి. ఇది నేను మీకు ఇచ్చే ఆఫర్!'
'ఒకవేళ అతను బయటికి వచ్చిన బెయిల్ ఎలా క్యాన్సిల్ చేయించాలో నాకు బాగా తెలుసు!" అంటూ కాఫీ తాగుతూ వంకరగా చూస్తూ చెప్పాడు హిర్వాణి.
"నాకు మీరు ఇచ్చే ఆఫర్ ఎవరి ద్వారా వస్తుందో తెలుసుకోవాలని ఉంది." అంటూ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది వసుంధర.
"ఆ విషయం తెలుసుకోవాలి అనుకున్న వాళ్లు ఎవరూ ఈ భూమి మీద లేరు, ఆ విషయం మీరు కూడా కోర్టులో చెప్పారు మర్చిపోయారా!" అన్నాడు హిర్వాణి.
"అంటే! అభిర్ ని కావాలని ఈ కేసులో ఇరికించి బయటకు రాకుండా చేస్తున్నారు, ఎందుకు? డబ్బు కోసమా లేక పగ తెలుసుకోవచ్చా!" అని అడిగింది వసుంధర.
"నిజం చెప్పాలి అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటో ఎందుకో అనేది నాకు కూడా తెలియదు, నా క్లైంట్ చెప్పింది నేను చేస్తున్నాను లాయర్ వృత్తి అంటే అదే కదా!" అన్నాడు హిర్వాణి.
"మీరు చెప్పింది కరెక్టే! న్యాయంలో కూడా రెండు రకాలు ఉంటాయి క్లెయింట్ డబ్బులు ఇస్తున్నాడు కదా అని మానవత్వం మర్చిపోలేము కదా!" అంది వసుంధర.
"ఈ 12 సంవత్సరాలలో ఈ కేసు ఫైల్ ముట్టుకోవడానికి ఒక్క లాయర్ కూడా రాలేదు మీరు చెప్పినా మానవత్వం ఉన్న లాయర్ ఒక్కరు కూడా లేరు అంటారా?"
'బాగా ఆలోచించండి ఈ కేస్ ఇంపాక్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో!" అన్నాడు హిర్వాణి.
"ఓకే! అర్థమైంది మీరు నాకు ఇచ్చే ఆఫర్ ఏంటి?" అని అడిగింది వసుంధర.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ 'వదిన భయపడిందా ఏంటి? ' అంటూ మనసులో అనుకుంది నీలమ్.
"గుడ్! చాలా స్పీడ్ గా లైన్ లోకి వస్తున్నారు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?" అని అడిగాడు హిర్వాణి.
"నా ఎక్స్పెక్టేషన్ మీరు రీచ్ అవడం కష్టం!" అంది వసుంధర.
"హ హ..!" అంటు నవ్వుతూ "మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మహా అయితే ఇంకొక 30 సంవత్సరాలలో పది కోట్లు సంపాదిస్తారు దానికి పది రెట్లు ఇప్పిస్తాను వన్ టైమ్ లైఫ్ సెటిల్మెంట్!" అన్నాడు హిర్వాణి.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు సందీప్, నీలంమ్ లు.
"ఓకే! ఈ కేసు ఇంపాక్ట్ ఎంతో ఉందో నాకు బాగా అర్థమైంది ఇంక మీరు బయలుదేరవచ్చు, రేపు ఉదయం అభిర్ జైల్ నుంచి బయటికి వస్తున్నాడు." అంది వసుంధర.
"ఆల్ ద బెస్ట్! ఈ కేసు ఇంపాక్ట్ పేస్ చేయడానికి మీరు కూడా రెడీగా ఉండండి." అంటూ సీరియస్ గా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హిర్వాణి.
వసుంధర దగ్గరకు వస్తూ "ఏంటిది! ఒక మనిషిని జైల్ నుంచి బయటకు రానివ్వకుండా చేయడానికి 100 కోట్ల! అసలు అభిర్ ఎవరు?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సందీప్ రావు.
"వదిన! ఆ ఆఫర్ వింటే ఎవరైనా టెంప్ట్ అవుతారు అసలు ఈ కేస్ వెనకాల ఏం జరిగిందో ఎవరు ఉన్నారో అర్థం కావడం లేదు." అంటూ అయోమయంగా చూస్తూ అంది నీలమ్.
"జైల్లో మనం అబీర్ ని కలిసినప్పుడు అతను అడిగిన ప్రశ్న మనకి ఎదురైంది అంటే! ఇదంతా ఎవరు చేస్తున్నారో అతనికి కి కచ్చితంగా తెలుసు!'
'ఈ కేసు వెనకాల ఏదో పెద్ద పెద్ద మిస్టరీ ఉంది. ఆబీర్ బయటికి వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి." అంది వసుంధర.
"నాకు తెలిసి అబీర్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయడానికైనా వెనకడరు." కంగారుగా అన్నాడు సందీప్ రావు.
"అభిర్ బయటకు రాకుండా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే! అతను బయటికి వస్తే వీళ్ళు ఏమి చేయలేరు అని అర్ధం!" అంటూ స్మైల్ ఇచ్చింది వసుంధర.
"ఎస్ వదిన! కరెక్ట్ గా గెస్ చేసావ్! అభిర్ బయటికి వస్తే ఏమి చేయలేము అని ఈ కేసు వెనకాల ఉన్న వాళ్ళకి బాగా తెలుసు!" అంది నీలమ్.
*********************
కారులో వెళుతూ కోపంగా ఫోన్ తీసి కాల్ చేసి "మిచల్! నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది రంగంలోకి దిగడానికి రెడీగా ఉండు, నా లైఫ్ లో ఒక్క కేసు గురించి రెండోసారి ఆలోచిస్తున్నాను." అంటూ ఆవేశంగా అన్నాడు హిర్వాణి.
"ఓకే సార్! టుడేస్ లో వచ్చి మీకు కలుస్తాను, వర్క్ ఫినిష్ చేసుకుని నెక్స్ట్ 2 డేస్ లో వెళ్ళిపోతాను." అన్నాడు మిచల్.
"ఓకే!" అంటూ ఫోన్ పెట్టేసి మెసేజ్ చూసి "మిథున్ సార్ నుంచి మెసేజ్ వచ్చింది ఏమిటి?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ
ఫోన్ చేసి "హాయ్ సార్! మీ దగ్గర నుంచి మెసేజ్ రావడం చూసి ఫస్ట్ టైమ్ చాలా ఎగజైట్ గా ఫీలయ్యాను ప్లీజ్ టెల్ మీ?" అంటూ ఆనందంగా అడిగాడు హిర్వాణి.
"ద గ్రేట్ క్రిమినల్ లాయర్ హిర్వాణి గారు థాంక్యూ ఫర్ ద కాల్! మనం ఒక్కసారి మీట్ అవ్వాలి అనుకుంటున్నాను." అన్నాడు మిథున్.
"ఓకే సార్! ఎక్కడికి రావాలో చెప్పండి ఇప్పుడే స్టార్ట్ అవుతాను." అంటూ ఆత్రుతగా అడిగాడు హిర్వాణి.
"నేను నైట్ డిన్నర్ కి ఢిల్లీ లో ఉంటాను, ఎగ్జాట్లీ 9:30కి మీ ఇంటి ముందు కారు ఉంటుంది రెడీగా ఉండండి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాము." అన్నాడు మిథున్.
"ఓకే సార్ థాంక్యూ! నా లైఫ్ లో ఒక్కసారైనా మిమ్మల్ని మీట్ అవుతానా లేదా అనుకున్నాను, కానీ డైరెక్ట్ గా డిన్నర్ లోనే మీట్ అవుతున్నాను ఐ యాం సో హ్యాపీ!" అన్నాడు హిర్వాణి.
"ఓకే బాయ్!" అంటూ ఫోన్ పెట్టేసి "అర్ణ లైన్ లోనే ఉన్నావు కదా! డిన్నర్ కి వస్తున్నాడు మాట్లాడి నీకు క్లారిటీ ఇస్తాను." అన్నాడు మిథున్.
"ఓకే థాంక్యూ! లండన్ కి వచ్చినప్పుడు కాల్ చెయ్ మీట్ అవుదాము." అంటూ ఫోన్ పెట్టేసింది అర్ణ.
********************
రాత్రి టైం 9:15 అవడంతో సూట్ వేసుకుని రెడీ అయ్యి కారు కోసం వెయిట్ చేస్తూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు హిర్వాణి.
"ఏంటి! ఎవరైనా వస్తున్నారా? ఈ టైమ్ లో రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారు." డౌట్ గా అడిగింది భార్య.
"నో నో! ఇండియన్ బిగ్ షాట్ మిథున్ గారు డిన్నర్ కి ఇన్వైట్ చేశారు కారు కోసం వెయిట్ చేస్తున్నాను." అన్నాడు హిర్వాణి.
"అవునా?" అంటూ సంతోషంగా చూస్తూ "మాటల మధ్యలో మా తమ్ముడు విషయం మాట్లాడండి." అంది భార్య.
"నాకు ఐడియా ఉంది." అంటూ ఇంటి ముందు కారు ఆగడం చూసి హడావిడిగా వెళ్ళాడు హిర్వాణి.
తన ఇంటిదగ్గర 20వ అంతస్తులో ఉన్న పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ అక్కడికి వస్తున్న హిర్వాణి చూసి
"వెల్కమ్ టు వకీల్ సాబ్! నాకు డిన్నర్ ముందు స్విమ్మింగ్ చేయడం ఇష్టం! అందుకే ఇక్కడ ఫుల్ పెట్టించుకున్నాను." అంటూ బయటికి వచ్చి డ్రెస్ వేసుకొని
డ్రింక్ ఆఫర్ చేసి "ఇది ఈజిప్ట్ తవ్వకాల్లో బయటపడిన ఓల్డ్ వైన్ దీనిని తీసుకురావడం కోసం స్పెషల్ ఫ్లైట్ పంపించాను టేస్ట్ చేయండి." అన్నాడు మిథున్.
"థాంక్యూ సార్!" అంటూ తీసుకుని చీర్స్ చెప్పాడు హిర్వాణి.
"మిస్టర్ హిర్వాణి! మనం ఒక డీల్ చేసుకుందాము మీ బావమరిదికి బొంబాయి పోర్ట్ కాంట్రాక్ట్ ఓకే చేస్తాను, కానీ మీరు ఒక మనిషితో మనసు విప్పి మాట్లాడాలి.'
'అది కూడా మీకు లాభమే! ఎందుకంటే మీరు నేను లాభం లేకుండా ఏమి చేయ్యము కదా!" అంటూ నవ్వాడు మిథున్.
"సార్! మీరు అడగకుండానే వరాలు ఇస్తున్నారు ఎవరితో మాట్లాడాలో చెప్పండి." అన్నాడు హిర్వాణి.
వీడియో కాల్ చేస్తూ "మీరు మాట్లాడిన విషయం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి." అంటూ లాప్ టాప్ హిర్వాణి వైపు తిప్పాడు మిథున్.
వీడియో కాల్ లో ఉన్న అర్ణ వైపు చూసి "హాయ్ మేడం! మీరు ముకుల్ నంద గారి గ్రాండ్ డాటర్ కదూ!" అనుమానంగా చూస్తూ అడిగాడు హిర్వాణి.
"ఎస్! మీ మనసులో ఉన్న మాట మీ గొంతు లోనుంచి వినాలి అనుకుంటున్నాను మాట్లాడుకుందామా?" అని అడిగింది అర్ణ.
Posts: 1,235
Threads: 0
Likes Received: 849 in 648 posts
Likes Given: 923
Joined: Nov 2018
Reputation:
13
•
Posts: 1,235
Threads: 0
Likes Received: 849 in 648 posts
Likes Given: 923
Joined: Nov 2018
Reputation:
13
Please change the story in to thriller blog.
•
Posts: 536
Threads: 0
Likes Received: 241 in 183 posts
Likes Given: 1,213
Joined: May 2019
Reputation:
8
Nice story
అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి
•
Posts: 1,235
Threads: 0
Likes Received: 849 in 648 posts
Likes Given: 923
Joined: Nov 2018
Reputation:
13
•
Posts: 5,492
Threads: 0
Likes Received: 4,612 in 3,432 posts
Likes Given: 17,152
Joined: Apr 2022
Reputation:
76
•
|