Poll: అమలిన శృంగార కథలు
You do not have permission to vote in this poll.
కావాలి
100.00%
1 100.00%
వద్దు
0%
0 0%
Total 1 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 1 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అమలిన శృంగార కథలు - శ్రీమతి డైరీ
#1
ఇక్కడ కొన్ని సెక్స్ సంఘటణలు లేని శ్రుంగార కథలు పొందు పరుద్దామని అనుకుంటున్నాను.

మీకు ఆసక్తి ఉందా లేదా తెలుసుకుని మొదలుపెడతాను.

కావాలా / వద్దా చెప్పగలరు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
(04-11-2025, 06:36 PM)k3vv3 Wrote: ఇక్కడ కొన్ని సెక్స్ సంఘటణలు లేని శ్రుంగార కథలు పొందు పరుద్దామని అనుకుంటున్నాను.

మీకు ఆసక్తి ఉందా లేదా తెలుసుకుని మొదలుపెడతాను.

కావాలా / వద్దా చెప్పగలరు.

Kavali ane kada bro andaru anedi platform kuda adhe
[+] 1 user Likes satishmolleti's post
Like Reply
#3
కావాలని చెప్పిన వారు ఒక్కరు, వద్దన్న వారు ఎవరూ లేరు.


రేపు మొదటి కథ (చీకటి) ఇస్తాను.

మీ మీ అభిప్రాయాలు చదివిన తరువాత తెలుపగలరని మనవి Namaskar
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#4
చీకటి - గంటి రమాదేవి .
[Image: C.jpg]
ముందు మెల్లగా మొదలైంది. .....

'టక్. టక్.. తేజా! తేజా!'

నిశ్శబ్దం!..

'ఠాక్.. . ఠాక్.. ఈ సారి గట్టిగా!

' తేజా! తలుపు తెరు..'

నిశ్శబ్దం...

'తేజా!తలుపు తెరువు నాయనా!..' ఇప్పుడు గొంతు మారింది. తలుపు మీది శబ్దం దరువు మారింది. 'ధబ్..ధబ్.. ధబ్..'

'తమ్ముడూ! తలుపు తెరవరా! అన్నం నీళ్ళు లేకుండా ఎన్నాళ్ళురా!'

ఆ గదిలో...చీకటిలో.. వెలుగు ప్రసరించదు. శబ్ద౦ వినపడదు.

చీకటి అనిర్వచనీయమైన సుఖం. శాశ్వత శాంతి. వెలుతురు అక్కడ నిషిద్దం!

కళ్ళు తెరిచాడు తేజ. చీకటి నల్లని కన్ను .. కళ్ళ ముందు.... కను రెప్పలు భారంగా మూత పడ్డాయి. కన్ను తెరిచినా, కన్ను మూసినా ఒకటే! తేజ శ్వాస భారంగా ఆడుతోంది. , నెమ్మదిగా కొట్టుకునే గడియారంలా. అది ఒకప్పుడు కమ్మరి కొలిమిలో ఊదిన నిప్పు రవ్వ. దాని మీద చీకటి సుత్తి. అదే జీవ శక్తి. .....ఇప్పుడు... క్రమంగా బలహీన మవుతోంది.

తేజ బయటి శబ్దాలు లీలగా వినపడుతున్నాయి. తల తిప్పి చూసాడు.

ఒక వెలుగు రేఖ కత్తిలా, తళ తళ మెరుస్తూ!!

ఛీ.ఛీ. వెలుతురు చీకటిని హత్య చెయ్యాలని చూస్తున్నది.. .

తలలో జోరీగల గుంపులు తిరుగుతున్నాయి.

'తేజ టెన్త్ లో రాంక్ హోల్డర్. ఇంటర్ లో మంచి మార్కులు సంపాదించాడు. ఎంసెట్ లో రాంక్ వంద లోపే! అక్కడే ఏదో మాయదారి రోగం పట్టుకుంది. అంతా మా ఖర్మ.!' తల్లి తల్లడిల్లుతూ అన్న మాటలు. ఈ గదిలోకి వచ్చిన తర్వాత, ఈ చీకటితో మమేకం అయిన తర్వాత, తల్లి మాటలు తేజను ఏ మాత్రం కదిలి0చలేదు. తల్లి ప్రేమ ఉందా? ఉంటె! నిజంగా వుంటే, వీణ గురించి హేళనగా, వ్యంగంగా మాట్లాడుతుందా? తల్లి ప్రేమ లేదు. చిన్నప్పటి నుంచి పెంచినది కాబట్టి 'అనుబంధం' మాత్రమే వుంది. పిల్లల మీద పెద్దలకు, 'వాత్సల్యం' అనే ఒక మెరుపు దారం మాత్రమే వుంటుంది. అది అభేధ్యమైన లోహ నిగళ౦ కాదు..

అనుబంధం ప్రేమ కాదు!.

వాత్స్యలం ప్రేమ కాదు!.

వీణ ను కాలేజీ లో చేరే వరకు చూడలేదు. చూడగానే.. విద్యుత్ ప్రవాహపు చరుపు చెళ్ళు మంది. షాక్ ఆఫ్ ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్! అంతలోనే.. షాక్ పోయి నిర్మల నిర్వాణ ప్రశాంతత. పూర్ణ చంద్రుని కాంతిలో వికసించిన కలువను చూసినట్టు అనిపించింది. మలయ పర్వతాల మీదనుంచి వచ్చిన తుషార శీతల పవనంలా అనిపించింది. కాంతి నిండిన మనోహరమైన కన్నులలో మనసుని శాసించే చల్ల దానాలు ఎన్నో!

'ప్రేమ, దోమా కాదు. అది కామ. ఈ వయసులో అందరికీ వచ్చే రోగం వీడికి వచ్చింది. పట్టాభి రామ్ దగ్గరికి తీసుకు వెళితే, ఆయన వీడి కళ్ళు తెరిపిస్తాడు.' తండ్రి కర్ణ కఠోరమైన స్వరం...

'ఆ. ఇదంతా ఈ వయసులో వచ్చే జబ్బు. దీనికి మందు లేదు. అన్నీ వైరస్ లాగానే అది కూడా 'స్వయం నాశనం' చెందుతుంది. ఈ వైరస్ కొన్ని వారాలో, నెలలో, మరీ ఉధృతమైన రోగమైతే కొన్ని సంవత్సరాలు వుంటుంది. అంతే.. . జీవన క్రమంలో ఇదో దశ.. ఫేజ్ .. 'నువ్వు లేక నేను జీవించ లేను' అన్న వాళ్ళలో దాదాపు వంద శాతం మంది ఇంకా బతికే వున్నారు ఆ 'నువ్వు' లేక పోయినా!

తలుపు బయట మాటలు. ఎవరో ఆ మహానుభావుడు. ఇంత టేలెంట్ ఇక్కడే వుంటే ఇంకా పట్టాభి రామ్ ఎందుకు?

క్రమంగా తలుపు బయట ఇతర గొంతుకుల శబ్దం బలహీన మైంది. కొత్త 'వింత' అయి పోయింది. గొంతులు, ఆ తాలూకు మనుషులు రావడం తగ్గాయి.

ఇంటి వాళ్లే! రోజుకు కనీసం మూడు సార్లు తలుపు కొడతారు. ఇవాళ అక్క వచ్చింది. ఆమెకు విసుగు వచ్చే వరకు ఇలా 'ద్వార బంధ రోదన' వు౦టుంది. తర్వాత, అదీ ఆగి పోతుంది...ఏదీ శాశ్వతం కాదు.

నిత్యమైన, స్వచ్ఛమైన చీకటి ఒక్కటే మిగిలి వుంటుంది.

వెలుతురు మోసం! దగా!. ఇదే నిజమని నమ్మిస్తుంది! స్వల్ప కాలానికి సంతోషాన్ని ఇస్తుంది.

వీణ ను చూస్తానని అమ్మ చెప్పింది. తేజ కళ్ళల్లో వెలుతురు! మోసకారి వెలుతురు!

నమ్మాడు. వీణ ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఆ సందుల్లో కారు వెళ్ళ లేక పోయింది. పెద్ద రోడ్డు దగ్గర దిగి సందులోకి వెళ్ళారు.

చిన్న పెంకుటిల్లు. ఒకటే తలుపు. ఇంటినీ, వీధినీ విడ దీస్తూ చిన్న అరుగు. వీణ తలుపు దగ్గరే వుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తోందో? వీణ చూడగానే రక్తంలో, నరాలలో, మెదడులో, గుండెలో, మనసులో అనిర్వచనీయమైన ఆనందం! నల్లటి వత్తైన జుట్టు మెరుపు చుక్క లాటి ఆమె మోహం పై కప్పు కుంది. అప్పుడు తెలియలేదు అది విషాదపు తొలి మెట్టు అని.

లోపలికి ఆహ్వానించింది...

లోపల రెండు కర్ర కుర్చీలు, ఒక ప్లాస్టిక్ కుర్చీ. పాత కాలపు టీ పాయ్... శబ్దం చేస్తూ ఫేన్ తిరుగుతూ వుంది.

స్టీల్ గ్లాస్ లో మంచి నీళ్ళు తీసుకు వచ్చి ఇచ్చింది వీణ. అమ్మ నీళ్ళు తాగ లేదు. నడుము వంగిన ఒక ముసలాయన వచ్చాడు. 'మా నాన్న.' అంది వీణ. లోపలనుంచి అంత కన్న వంగిన ఒక ముసిలావిడ వచ్చింది... ఆవిడ చేతిలో టీ కప్పులు. 'మా అమ్మ' అంది ఆవిడను చూపిస్తూ. తీక్షణమైన కాంతి వేడిలో పచ్చటి మొక్కలు ఎండి పోతాయి. అలాగే, లేమి అనే వేడికి వయసు, అందం, లాలిత్యం ఇగిరి పోయాయి. వయసు కన్న ముందే ముదిమి వచ్చింది.

అసహనంగా కూచుని వుంది అమ్మ...టీ తాగలేదు. ఎలాగో చిరాకు బయటకు కనపడకుండా నిగ్రహంతో నిర్వహించ గలిగింది. కారులో కూర్చున్న తర్వాత అంది. 'బాగుంది.. బాబూ.. చాలా బాగుంది.' అంది. ఆ మాటల్లో వ్యంగం స్పష్టంగా అర్థమైంది తేజ కు.ఆ రాత్రి నిద్ర పట్ట లేదు. బోలెడంత సిలబస్... చదవాల్సింది చాలా వుంది... రాత్రి హాలులో మాటలు వినపడ్డాయి.

'చూసావా పిల్లని.''ఆఁ.. అయ్యిందీ ఆ భోగం.'పిల్ల బాగుందా?''బాగుంటే చాలా? అదొక్కటేనా? పాత బొళ్ళ కొంప.. అలాగా జనం వుండే బస్తీ. పిల్ల పేరే చిత్రం గా వుంది. వీణ ట. వీణ. మరీ జాణ లా వుంది. మన వెంగళప్ప ని బుట్టలో పడేసింది. గొప్ప ఇంటి కోడలవాలని పేరాశ..'శూలాల్లాటి వెటకారపు మాటలు...'మర్యాదలు?'

'ఆఁ.. ముందు పంపు నీళ్ళు...తర్వాత టీ చూరు నీళ్ళు.''అయితే మన వాడికి జీవితాంత నిరీక్షణ.. వీణ కోసం.'పెద్ద పెట్టున నవ్వులు. 'అంతు లేని నిరీక్షణ. ఇక వీణ, ముసలి, గూని తండ్రీ, చిరుగు చీర తల్లీ, పొగ మంచు లాటి జ్ఞాపకాలే!'

మరొక్క సారి నవ్వులు. జంతువును చంపేటప్పుడు హైనా మృగాలు నవ్వే నవ్వులు. మర్నాడు వీణ కాలేజీ కి రాలేదు. మరో రెండో రోజులూ అదే పరిస్థితి.

నాలుగు రోజుల తర్వాత తేజ వెళ్ళాడు .......రాత్రికి రాత్రి ఎక్కడకో వెళ్లి పోయారుట.మరునాడు కాలీజీ కి ఉత్తరం రాసింది వీణ.'చీకటికి వెలుతురుతో స్నేహం కుదరదు. మన స్నేహం నాకు, మా తల్లి తండ్రులకు, అంధకారం మిగిల్చింది. లేడి పిల్ల, తన తోటిదే కదా అని పులి పిల్ల తో స్నేహం చెయ్య కూడదు. అది ప్రకృతి విరుద్ధం. అందరినీ కలిపేది చీకటి. మళ్ళీ మన కలయిక వుంటే..... అక్కడే.' తేజ కి అర్థం అయ్యింది ఏమై వుంటుందో! దుర్మార్గులు తల్లి తండ్రులు...వీణను బతక నిస్తారా! ఎప్పటికైనా వీణ బ్రతుకు ప్రశ్నార్థకమే !చీకటి అంటే తిరోగ మనమనీ, తిరోగామ వైఖరి అని, వాదించే వాడు తేజ. ' చీకటి అంటే తిమిరం, ఈ 'తి' అనే అక్షరం తో మొదలయ్యే పదాలన్నీ ఈ వైఖరినే సూచిస్తాయని నేను అనుకుంటాను. తిరిపెం (భిక్షాటన), తిట్టు (దుర్భాష), తిక్క (మూర్ఖత్వం), తీట (దురద ), తీపు (సన్నని నొప్పి) ఇలా ఎన్నో.' ఇప్పుడు.. అది మారి పోయింది. చీకట్లు లోకానికి అందానిస్తాయి. చీకటి తన నల్లని చుక్కని నిండు జాబిల్లి మీద కూడా పెట్టింది. చందమామ అందం దానితో ద్విగుణీకృత చీకటిలో సౌందర్యం వుంది. చిరు నవ్వుల పాపాయి పాల బుగ్గల మీద చుక్క బొట్టు, కంటి
పాప, కను బొమ్మలు, మబ్బులు, కాళీయ మర్దనుడూ, కలువలు, చీకటీ అన్నీ నలుపే! నల్లని రంగు బొల్లి రోగాన్ని దరి చేరనీయదు. తీయని గొంతుల కోకిలలు, తళ తళ మెరుపులా నెమలి ఈకలు, తుమ్మెదలు నల్లనివే. నలుపు, చీకటి లేక పొతే మనుషులే లేరు.
మనిషి లేని భూమి కరిగించిన సీసం పొంగే ఎడారే! మిణుగురు పురుగులూ, నల్లటి మేఘాల్లో తటిల్లతలూ, నక్షత్రాల కాంతి, చంద్ర కాంతి అందాలు, చీకటి లేక పొతే ఉండగలవా? ఈ గదిలో, ఈ నిబీడాంధకారంలో నల్లటి మబ్బులు కవోష్ణ జలరాసులను కురుపించాయి.
ఉప్పు సముద్రం చేరని వాన నీరు. ఇంకెందుకు.. ఇదీ 'ఉప్ప'నేగా.. 'చీకట్లు నల్లని కాంతులతో భూమి మీద అడుగు పెట్టాయి. నిశ అనే స్త్రీ భుజాల మీద ఎక్కి, శిరస్సు మీద నిలబడి, నక్షత్రాలనే స్త్రీల చెక్కిళ్ళను స్పృశించి, ఆకాశం లోకి పాకి, చంద్రుని తాకి, కొండలలో దూకి, మెల్లగా భూమి మీద ప్రవేశించింది చీకటి. చీకట్లు లోకానికి అందాన్ని చేకూరుస్తాయి.

చంద్రముఖి ముఖం మీద కస్తూరి బొట్టు పెట్టాయి. నల్లని వంకీల జుట్టు కలిగిన స్త్రీ కనుబోమ్మలనే విల్లు బాణాన్ని తొడిగాయి. కలువ వంటి కను రెప్పల మీద వాలాయి. లేడి కన్నుల వంటి కన్నులు కలిగిన స్త్రీ బంగారు చెక్కిలి మీద అగరు చుక్కని పెట్టాయి. వెండికొండ మీద మన్నులాగా కనిపించాయి. చంద్రుడనే పొలంలో జింక లా తిరిగాయి...' ఏవో పద్యాలు, అర్థాలు, తెరలు తెరలు గా, పీచులు గా పీచులుగా, చెట్ల ఆకుల నీడలో నాట్యం చేసే చీకటి రేఖల్లా సుళ్ళు తిరుగుతూ తన లో కలుసుకుంటున్నాయి. చివరిలో ..'కానుగు చెట్ల నీడల్లో ఒక స్వప్త్న శయ్య మీద ఈ మహాంధకారంలో హాయిగా శాశ్వతంగా నిద్ర పోవడంలో మనస్సు శాంతి పొందింది.' 'ఎన్నో నాళ్ళ క్రితం నా కోసమే రాసావా .. నాకు చల్లని కానుగ చెట్ల నీడల్లో సేద తీరాలని వుంది. ఇక నిరీక్షించే ఓపిక లేదు. వీణ లేని బతుకు నాకొద్దు. నేను పిచ్చి వాడిననీ, లోక శత్రువుననీ అననీ! ఈ వస్తు మాయ ప్రపంచంలో నాకు చోటు లేదు. .. ఇప్పుడు హాయి గా వుంది. ప్రశాంతంగా వుంది. చుట్టూ చీకటి దట్టంగా అలుముకుంటూ వుంది. భూమ్యాకర్షణ శక్తి అనే అవరోధం లేదు. శరీరం, మనసు తేలిక పడుతూ వుంది. లోకమా.. నన్ను క్షమించు. నన్ను అనుసరించకు. నా లా చీకటిని ప్రేమించకు.. చీకటిలో కలవాలని అనుకోకు.' భళ్ళున తలుపులు బద్దలయ్యాయి.


'బాబూ! ఇలా అయి పోయావేమిట్రా?.. ఇలా అవుతుందని అనుకోలేదే?' తేజ శరీరాన్ని ఒడి లో తీసుకుని ఏడుస్తూ వుంది తల్లి. 'తమ్ముడూ ? ఎవత్తిరా ఆ రాక్షసి? నీ ప్రాణాలు తీస్తోంది.' అక్క అక్కసుతో తిడుతూ వుంది. ఆ తిట్లు తేజకి కోపం తెప్పించ లేదు. 'తేజా! డబ్బు తో అన్నీ కొన గలననుకున్నాను. అది తప్పని తెలిసింది.' మనసులో అనుకుంటూ తేజ దగ్గరగా వచ్చాడు తండ్రి. ఆయన కాలు తగిలి సీసా దొర్లుకుంటూ దూరంగా వెళ్లి పోయింది. దూరంగా వెళ్లి పోయింది. వెళ్లి...పోయింది.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#5
వంశీమోహనం - నాగమంజరి గుమ్మా
[Image: V.jpg]

"మోహనా" గుసగుసగా పిలిచాడు వంశీ. "ఊఁ" పలికింది మోహన "ఇటు చూడు" కాటుక దిద్దిన వాల్చిన కనురెప్పలు పైకెత్తి సిగ్గుగా చూసింది మోహన. "అందాల వదనమ్ము అలివేణి అధరమ్ము నల్లని కనుదోయి నాకుముద్దు" ఆ మూడింటికి మూడు ముద్దులు అంటూ మోహన ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని సున్నితంగా చుంబించాడు వంశీ. "నునుపైన చెక్కిళ్ళు నువ్వు పూ నాసిక చిట్టి చుబుకముల చేతు ముద్దు" మళ్ళీ మరో మూడు ముద్దులు ఉహు నాలుగు… "లెక్క తప్పారే" "చెక్కిళ్ళు రెండు కదా" "శ్రీకారమును బోలు చెవులు రెండింటికి ముంగుర్ల కిత్తును మరొక మూడు" "ఊఁ" "కంఠ సీమ కొక్కటి కటి సీమ కొక్కటి కరములు పదములు కాచె నాల్గు" "కనుల కనిపించు అందాల కాంచినాను ముద్దు ముద్దుగా మురిపాల ముద్దులిస్తి భాను గాంచని పరువాల బయలు పరచు సఖియ దాసుడౌదు నిజము జన్మవరకు" కురులను తప్పించి మెడ వెనుక ముద్దు పెట్టాడు. మోహన అరచేతులు తన చేతులతో పట్టుకొని కనులపై ఉంచుకున్నాడు వంశీ. వంశీ ఒక్కొక్క చేష్ట ఒక్కో మెట్టుగా పరవశింపజేయగా అదిరే తన అధరాలతో వంశీ పెదవులు అందుకుంది. తేనెలూరే అధరాలు అందగానే అరచేతులు విడిచి చిక్కిన నడుమును చేత చిక్కించుకున్నాడు. "వదలరా బాబూ… ఒక్కడివే కూర్చుని నిద్రపోతున్నావని జిలేబి నోటికి పెట్టి నిద్రలేపుదామనుకుంటే నన్ను నీ దగ్గరకు లాక్కుంటావేం?" నెత్తి మీద తట్టాడు వంశీ స్నేహితుడు విశ్వం. గబుక్కున కళ్ళు తెరిచి విశ్వాన్ని వదిలేసాడు వంశీ. "మామూలుగా లేపొచ్చు కదరా… జిలేబి నోటికి ఇస్తే మోహనే అనుకున్నాను" సర్దుకుంటూ చెప్పాడు వంశీ. "సర్లే.. సంగీతం మాష్టారి అమ్మాయికి, సాహిత్యం చదువుకున్న నీ మోహనకి, రాత్రంతా పద్యాలు చెప్తూ కూర్చుంటావా ఏమిటి? ఇక్కడే వదిలేస్తే నీ బుర్రలో యతులు, ప్రాసలు, గణాలు తిరుగుతాయి కానీ అలా ఊరు చూసి వద్దాం పద. పల్లెటూరు చాలా బాగుంటుందట. నేను సాయంత్రం వెళ్లిపోతాను." బలవంతంగా వంశీని బయలుదేరదీసాడు విశ్వం. 
******** 
మోహనను తొలిసారి నన్నయ విశ్వవిద్యాలయం లో ఒక కార్యక్రమంలో పత్ర సమర్పణకు వెళ్ళినపుడు చూసాడు వంశీ. అప్పుడు తను "నన్నయ నుండి నేటి వరకు పద్యం ప్రయాణం" అనే అంశంపై పత్రసమర్పణ కోసం వచ్చాడు. మోహన "శ్రీనాధుని కవిత్వంలో సీసపద్యం" అనే అంశంపై పత్రసమర్పణ చేసింది. మోహన తర్వాత పేరు తనది. కానీ మోహన రూపమే తప్ప, ఆమె చెప్పినదేదీ తలకు లెక్కలేదు వంశీకి. తన పత్ర సమర్పణ ఎలా చేసాడో కూడా జ్ఞాపకం లేదు. అందరివి అయ్యేవరకు అక్కడే కూర్చుని శ్రద్ధగా వింటూ, అవసరమైన విషయాలు రాసుకుంటోంది మోహన. కార్యక్రమంలో చివరి వ్యక్తి మాట్లాడడం పూర్తి కాగానే, లేచి తనవైపుకు రావడం గమనించి ఆశ్చర్యపోయాడు వంశీ. "నమస్తే అండీ, నా పేరు మోహన. ఇందాక మీరు 'నన్నయ నుంచి నేటివరకు…' పత్ర సమర్పణ చేసారు కదా, నేను మొదటి రెండు నిమిషాల విషయం సరిగా వినలేదు. మీ దగ్గర మరొక ప్రతి ఉందా? ఉంటే ఇవ్వగలరా?" పత్ర సమర్పణ అవగానే అది అక్కడి వారికి ఇచ్చేస్తారు… అందుకే మోహన "మరొక ప్రతి ఉందా?" అని అడిగింది. "అలా బయటకు వెళదాం రండి" అని చెప్పి, దారి తీసాడు వంశీ. బయట చెట్టు కింద ఉన్న బెంచీ వైపు వెళ్లి కూర్చున్నారు "నా పేరు వంశీ. నా దగ్గర వేరొక ప్రతి ఇక్కడ లేదు. నేను రాసిన విషయం ప్రతి ఒక్క అక్షరం నాకు గుర్తుంది. మీరు ఎక్కడ నుండి మొదలు పెట్టేరో చెప్పండి, నేను ఆ ముందరి ఖాళీ పూర్తిచేస్తాను" అన్నాడు వంశీ. మోహన తను రాసింది చూపించింది. ముందు వినలేకపోయిన అంశాలను వివరించాడు వంశీ. ఆకుపచ్చని లంగా జాకెట్టు, మిరపపండు రంగు వోణి, చెవులకు లోలాకులు, పొడుగాటి జడ.. మోహన… పేరుకు తగ్గట్టు మోహనంగా ఉంది. యధాలాపంగా అడిగినట్లు సాయంత్రం ఏ రైలుకు వెళ్తోందో కనుక్కున్నాడు. తాను వెళ్లే రైలే. కానీ బోగీలు వేరు. ఏదైతే ఏం? స్టేషన్ వరకు కలిసే వెళ్లారు. 'చదువు ఆంధ్రా విశ్వవిద్యాలయం లో ఎం. ఏ తెలుగు మొదటి సంవత్సరం. విశాఖపట్నం పక్కనే ఉన్న పల్లెటూరులో నివాసం. తండ్రి సంగీత విద్వాంసుడు. అందుకే కూతురి పేరు మోహన. తండ్రి కీర్తనలు పాడటమే కాకుండా భావగీతాలు కూడా రచిస్తారు. ఆసక్తి గల కొద్దిమంది పిల్లలకు, పెద్దలకు ఇంట్లోనే తరగతులు నిర్వహిస్తూ ఉంటారు.' అదీ ఆ సాయంత్రం రైలు వచ్చేలోపల మోహన నుంచి సేకరించిన వివరాలు. వంశీ ప్రభుత్వ కళాశాల లో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు పద్యాలు, కథలు లాంటి సాహిత్య ప్రక్రియలు కూడా చేయడం, అవి పత్రికలకు పంపితే అచ్చుకావడం కూడా జరిగింది. మోహన రూపం, చదువు, కుటుంబ నేపధ్యం బాగా నచ్చాయి వంశీకి. ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రులకు మోహన విషయం చెప్పాడు. వాళ్ళు కూడా మరేమీ ఆలోచించకుండా వెంటనే మోహన తల్లిదండ్రులను సంప్రదించడం ఇరువర్గాలకు అంగీకారం కుదరడంతో నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడం జరిగిపోయాయి. మోహన చదువు అయ్యేవరకు పెళ్లి వద్దని వంశీ చెప్పడంతో ఆగేరు. అప్పుడప్పుడు కళాశాల గ్రంథాలయంలో కలుస్తూ ఉంటారు మోహన, వంశీ. లేదా వంశీ వాళ్ళింటికి మోహన, మోహన ఇంటికి వంశీ వచ్చిపోతూ ఉంటారు. అభిప్రాయాలు తెలుసుకోకుండా, అపరిచితుల్లా పెళ్లి చేసుకోవడం నచ్చలేదు వంశీకి. అందుకే పెద్దలచే కుదర్చబడిన ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెద్దవారి అనుమతి తోనే సినిమాలకు, షికార్లకు వెళ్లేవారు. మొత్తానికి మోహన చదువుకు ఆటంకం లేకుండా మంచి మార్కులతో పాసయింది. ఆ నెలలోనే పెళ్లి ముహూర్తం కుదిరింది. మోహన అందం ఎంత కవ్విస్తున్నా, మనసును అదుపులో పెట్టుకొని, ఆ రోజు కోసమే ఎదురు చూసాడు వంశీ. ముందు రోజు రాత్రి ఏడు గంటలకు వంశీ మోహనులకు పెళ్లి అయ్యింది. ఈ రాత్రికే శుభకార్యం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి అటు ఇటు తిరిగి అలసిపోయిన కొత్త జంట భోజనాలయ్యాక ఎవరింట్లో వారు హాయిగా సాయంత్రం వరకు నిద్రపోయారు. ఇంతలో పెళ్లికి వచ్చిన స్నేహితుడు విశ్వం వచ్చి వంశీని నిద్రలేపేసాడు. అనుకున్న సమయానికి పెద్దలందరూ చేరి, మోహన, వంశీలతో పూబంతులాట ఆడించారు. కొన్ని నాణాలు వంశీ చేతిలో పోసి, గుప్పెట నిండా తియ్యమని అవి సరి సంఖ్యలో ఉన్నాయో, బేసి సంఖ్యలో ఉన్నాయో మోహనతో చెప్పించారు. మోహన కొంగులో పువ్వులు, ద్రాక్షపళ్ళు పోసి, మోహన దోసిటిలో తీసుకున్నది పండో పువ్వో వంశీతో చెప్పించారు. ఇంకా ఏవో అనేక ఆటలు ఆడించి, దంపతులకు తాంబూలాలిప్పించి, వారిలో బెరుకు పోగొట్టి, గదిలో పాలు, పళ్ళు పెట్టి బయటకు వచ్చి తలుపేశారు. తనుకూడా లోపల గడియ పెట్టి, మోహన వైపు చూసాడు వంశీ. పాలకడలిలో నుంచి వచ్చిన లక్ష్మీదేవి లా ఉంది మోహన. తెల్లని చీరలో మెరిసిపోతోంది. మెడలో పచ్చగా తాళిబొట్టు, నల్లపూసలు, ఒక హారం. చెవులకు లోలాకులు, చేతులకు పెళ్లిగాజులు, తలనిండా పూలు. పెళ్లిలో వేసిన నగలు, అలంకారాలు లేవు. నిత్యం పలకరించుకునేవారే అయినా ఎందుకో మూగబోతున్నట్లుగా ఉంది. చల్లని వాతావరణం వేడెక్కిస్తోంది వంశీని. "మోహనా" పిలిచాడు వంశీ. "ఊఁ" ఆ పలకడంలో తానాశించిన మాధుర్యమో, నిత్యమూ వినే స్వరమో లేదు… సంకోచం, బిడియం కనబడుతున్నాయి. తొలిరేయి సిగ్గు అనుకున్నాడు. మోహన చేతిని తనచేతిలోకి తీసుకున్నాడు. ఎన్నోసార్లు సినిమాకి వెళ్ళినపుడు, గ్రంథాలయంలో మాట్లాడుకునేటపుడు కూడా అలా మోహన చేయి తన చేతిలోకి తీసుకునేవాడు వంశీ. కానీ ఇప్పుడు మోహన చేయి కంపిస్తోంది. అంత శీతల వాతావరణం లో కూడా చిరు చెమటలు పట్టాయి మోహన నుదుటిపైన. "మోహనా, కూర్చో.. ఇదిగో పాలు తాగు" గోరువెచ్చని పాలు మోహన నోటికి అందించాడు. కొంచెం తాగి పక్కన పెట్టేసింది మోహన. "మోహనా! ఏమైనా ఇబ్బందిగా ఉందా? మీ అమ్మగారిని పిలవనా?" అడిగాడు వంశీ. తల అడ్డంగా ఊపింది. "మరి? తలనొప్పిగా ఉందా?" "ఉహూ… భయంగా ఉంది" చెప్పింది మోహన. ఆశ్చర్యపోయాడు వంశీ. "నా దగ్గర భయంగా ఉందా?" "ఉహు.." "రెండేళ్ల నుంచి కలిసి తిరుగుతున్నాం కదా… ఇప్పుడెందుకు భయం?" "ఏమో" "సరే! పడుకుంటావా?" "ఊఁ" "నిన్ను ముట్టుకోవచ్చా? దానికి కూడా భయమేస్తుందా?" గుసగుసగా అడిగాడు వంశీ. తల వంచుకునే తలూపింది మోహన. దగ్గరగా పొదువుకున్నట్లు పట్టుకొని మంచం దగ్గరకు తీసుకువచ్చి, ఒక్క ఉదుటన నడుం కింద ఒక చేయి పెట్టి, పైకి లేపి మంచంపై పడుకోపెట్టేసాడు. ఎగిరిపడి గుండెల మీద చేయి వేసుకుంది మోహన. నవ్వేసాడు వంశీ. "పిచ్చీ … పడుకో" అన్నాడు. పక్కనే పడుకుని ముంగురులు సవరించాడు. పెదవులపై మీటాడు. పెదవులు వణుకుతున్నాయి. గోరింటతో ఎర్రగా పండిన వేళ్ళను ముద్దాడాడు. ఎటువంటి స్పందనా కనిపించలేదు మోహనలో. వంశీవైపు తిరిగి కళ్ళుమూసుకుని ఉంది. లేచి పారాణి పాదాల వైపు చూసాడు. పచ్చగా పసుపు రాసిన పాదాలు, అంచులకు పారాణి పైన సన్నని పట్టీలు, ఆపై పూల అంచు గల తెల్లని చీర… తమకం ఆపుకోలేక పాదాలపై ముద్దు పెట్టాడు. పాదాలు వెనక్కు తీసుకుంది మోహన… చిన్నగా నిట్టూర్చి, మళ్ళీ మోహన పక్కన మేను వాల్చాడు. నడుంపై చేయివేసి దగ్గరకు లాక్కుని హత్తుకుని పడుకున్నాడు. అడ్డుచెప్పలేదు మోహన. మర్నాడు అందరూ కలిసి విశాఖపట్నం వెళ్లిపోయారు. అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నారు. ఆ రాత్రి కూడా అలాగే గడిచిపోయింది. మూడవనాడు మళ్ళీ అందరూ యానాళ్లకు మోహన పుట్టింటికి వచ్చారు. సాయంత్రం ఏదో పని ఉందని మోహన, వంశీ ఇద్దరూ విశాఖపట్నం వచ్చారు. హఠాత్తుగా మబ్బులు పట్టి వేసవికాల వర్షం మొదలైంది. వంశీ కుటుంబం అంతా పల్లె లోనూ, వీరిద్దరూ ఇక్కడ ఉండిపోయారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి, వర్షం కారణంగా రాలేకపోతున్నామని, వారందరినీ మర్నాడు ఉదయం రమ్మని, కంగారు పడవద్దని, ఇంటికి చేరుకున్నామని చెప్పాడు వంశీ. వరండాలో వర్షాన్ని చూస్తూ కూర్చున్నాడు వంశీ. మోహన వంటింట్లోకి వెళ్లింది. వంశీ వెనకాలే వచ్చి, నడుంపట్టుకుని, ఒక చేత్తో నోరు మూసి, గోడకి అదిమిపెట్టాడు. మోహన తోసేయబోతూ ఉంటే, తన పాదాలతో మోహన పాదాలు నొక్కిపెట్టాడు. ఆధారాలు అందుకోబోతూ ఉండగా ఎలాగో చేయి తప్పించి వంశీని ఒక్క ఉదుటన తోసేసింది. స్టౌ అరుగు మీద ఉన్న నీళ్ల గిన్నె కిందపడి పెద్దగా చప్పుడయ్యింది. "ఏమిటయ్యింది మోహనా?" అంటూ లోపలికి వచ్చాడు వంశీ. "అబ్బే ఏమి లేదు. చేయి తగిలి గిన్నె కిందపడింది. అంది మోహన. తెప్పరిల్లి, ఇంకా ఆలస్యం చేయకూడదని, ఊహలు నిజమయ్యే ప్రమాదం ఉందని గ్రహించింది మోహన. గబగబా బజ్జీలు వేసి వేడిగా తీసుకువచ్చి వంశీకి అందించింది. "పాటలు వింటూ, బజ్జీలు తింటూ, వర్షాన్ని చూస్తుంటే బావుంది కదూ" అన్నాడు వంశీ. వర్షం వలన తొందరగా చీకటైపోయినట్లు అనిపించింది. లోపలకి వెళ్లి, వంట చేసి వంశీని పిలిచింది మోహన. వంశీ, మోహన కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. వంట చాలా బాగా చేసింది మోహన. కాసేపు మళ్ళీ వర్షాన్ని చూస్తూ కూర్చున్నారు. దాదాపు నాలుగు గంటలు కురిసింది.. ఇప్పుడు జల్లుగా మారింది. ఏవేవో మాటలు… మధ్యలో మౌనాలు… బాగా తిన్నాడేమో వంశీకి ఆవలింతలు వస్తున్నాయి. లేచి గదిలోకి నడిచాడు. పక్కపై వాలబోతుంటే మోహన స్నానాల గది వైపు చూపించింది. "ఇప్పుడా" అన్నాడు వంశీ… "తప్పదు" అంది మోహన. తువ్వాలు భుజంపై వేసి, స్నానాలగదిలోకి నెట్టింది. "బట్టలు బయటే పెట్టాను. వచ్చి కట్టుకోండి" అని చెప్పి, గదిలో గబగబా సర్ది, వేరే గదిలోని స్నానాల గదిలోకి స్నానానికి వెళ్ళింది మోహన. స్నానం చేసి వచ్చి గదిలో చూసి ఆశ్చర్యపోయాడు వంశీ. మంచంపై తెల్ల దుప్పటి. పక్కనే బల్లమీద తమలపాకు చిలకలు, పళ్ళు, పాలు… "అబ్బో!" అనుకున్నాడు. ఇంతలో మోహన తెల్లచీరలో వచ్చింది. "ఏయ్ ఏమిటిది?" అన్నాడు ఉత్సుకతగా…. "భయం పోయిందా?" "ఊఁ, కానీ భయం కాదు… అప్పుడు అందరిలో సిగ్గు… అలా చెప్తే మీరు వదలరు. అందుకే భయం అన్నాను" "అమ్మదొంగా" "ఊఁ" అరచేతులతో ముఖం కప్పుకుంది మోహన. "నాకు వేడిగా ఉంది" అన్నాడు వంశీ. "అదేంటి ఏసీ ఇంకా చాలలేదా?" గబుక్కున చేతులు ముఖం మీద నుండి తీస్తూ అడిగింది మోహన. "గదిలో వేడి కాదు, గుండెల్లో వేడి" మోహన చేయి పట్టుకుని, తన గుండెల మీద ఉంచుకొని చెప్పాడు. ఇద్దరూ కలిసి మంచంవైపు నడిచారు. పాలు పంచుకున్నారు. పండు కొరికి ఇచ్చాడు వంశీ. తానో ముక్క కొరికింది మోహన. తమలపాకు చిలక చిటికెన వేలితో అందించింది. నగుమోము చూడ ముద్దౌ మగనికి తమలపు చిలుకలు మడువగ ముద్దౌ సొగసులు పరువగ ముద్దౌ మగటిమి చూడ తొలిరేయి మగువకు ముద్దౌ గుసగుసగా వంశీ చెవిలో చెప్పింది మోహన.. "అమ్మో గడుసు పిల్లా… నన్నే మించిపోయావే" అలాగే మోము పట్టుకుని పెదవులు అందుకున్నాడు. తమకపు టధరాలు ఒక్కటయ్యాయి. వంశీ వేళ్ళు మోహన జుట్టు కుదుళ్లను పట్టుకున్నాయి… మోహన గోళ్లు వంశీ వీపుపై నెలవంకలు చిత్రించాయి. వంశీ లాల్చీ, మోహన చీర ఎలా వేరుపడ్డాయో తెలీదు. వంశీ మోహన అధరాలు వదలి నుదురు, నాసిక, చెక్కిళ్ళు ఇలా వరుసగా ముద్రలు వేస్తూ వస్తున్నాడు. పరువాలు బిగుసుకుంటున్నాయి. మోహన తనువు సుమధనువు అయ్యింది. వంశీ వేళ్ళు మోహన నడుం పై నాట్యం చేసాయి. మోహన కళ్ళు అరమోడ్పులయ్యాయి. నాభిలో మాణిక్యాన్ని నాలుకతో అందుకున్నాడు వంశీ. ఒళ్ళంతా వయ్యారి కోట అయ్యింది. మరి కొంచెం కిందకి జరిగాడు వంశీ… మోహన గొంతులో కలకూజితాలకు బయటి నుంచి కోకిల బదులుగా కూసింది. వంశీ శిఖరాగ్రాలకు, పాతాళానికి ఒకేసారి ముప్పేట దాడి జరిపాడు. కాసేపటికి ముందు వెనుకలుగా ఇద్దరినీ విజయం వరించింది. పానుపుకు వసంతాభిషేకం జరిగింది. రాత్రి వానకి తడిసిన మొక్కలు ఉదయాన్నే తాజాగా సుమబాలల నందిస్తే, తుమ్మెదలు మోహనరాగంలో వంశీరవాన్ని ఆలపిస్తూ పదే పదే తేనెలు గ్రోలుతూ పూల చుట్టూ తిరుగుతున్నాయి. ****
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#6
చిలిపి మాలతి - అమ్జద్
[Image: image-2025-11-29-144808485.png]
అది చలి రాత్రి. శరీరం లో చలి చొఛ్చుక పోతూండగ వెచ్చదనం కోసం దుప్పట్లో జొరబడ్డాను. శ్రీమతి ఎదమరచి నిద్ర పోతోంది. చదువుతూ నిద్రపోయే అమె అలవాటును గుర్తు చేసుకొంటూ బెడ్ ల్యాంప్ ఆర్పేశాను. పడక గదిలో కొన్నిక్షణాల వరకు చిమ్మ చీకటి, కండ్ల కెదురుగా ఏది కానరాకుండా. ఆ తర్వాత చుట్టు ప్రక్కల దేదీప్యంగా వెలుగుతూన్న స్ట్రీట్ ఫ్లోరోసెంట్ విద్యుత్తు దీపాల వెలుగు ప్రాకుకొంటూ అద్దల కిటికిల్లోంచి దూరిపోతాయి. అవి కిటికి తెరలను తొలగించుకొంటూ కాంతిపుంజాలు మా గది లోని నాలుగు గోడల మధ్యకు వచ్చి బంధించబడ్డాయి. ఫలితంగా గదిలో ఉన్న ఒక్కొక్క వస్తువును తేలికగా చూడగలుగుతున్నాను. శ్రీమతి గాఢ నిద్రలో ఉంది తన అందమైన మొహంతో.అమె మొహం పై చిందర వందరగా పడి ఉన్న ఉంగరాల ముంగరులు. నుదురు పై పెట్టుకొన్న నక్షత్రం ఆకారం లో ఉన్న స్టిక్కరు. అది వెలుగుతూంది తెలుగు వెలుగులా!
ఎద సంపద పిచ్చెక్కించేది గానే ఉంటుంది. పెండ్లై సంవత్సరం కావస్తూన్న మొదటి రాత్రి లాగే ఉంటుంది. మాలతి తన శరీర ఆరోగ్యం గురించి బాగా శ్రద్ద తీసుకొంటుంది. నడుం పిడికెడే! తీసుకునే భోజనం లో క్రొవ్వు పదార్ధాల శాతం బాగా స్టడీ చేసి కాని మరీ గొంతులోకి దింపుకోదు!
ఆ మధ్య 'నీ బొడ్డు చూస్తే పట్ట పగలు కూడా నాకు పిచ్చెక్కుతుంది!?' అని అంటే ఆ రోజు నుంచే నాకు బొడ్డు కనిపించకుండా చీర పైట తో కప్పేసుకొని, ఆది వారాలతో సహా పండుగ రోజులలో ఇంట్లో ఉంటే నా నుంచి తప్పుకొంటు తిరిగేది! ఒంటరిగా దొరికేది కాదు. పొద్దస్తమానం అమ్మ దగ్గరే ఉంటుండేది. ఆమేకు లేని పోని సేవలు చేసుకొంటూ. నా శ్రీమతి మా అమ్మ తలలో నాలికైంది. నేనేమో నా నాలికలోంచి శృంగార రసాన్ని జార విడుచుకొంటు కాలు కాలిన పిల్లిలా...నేను తగిన సమయం కోసం ఇంట్లో తిరుగుతూంటే తనేమో నన్ను తన దారిలొ అడ్డు వచ్చిన నల్ల పిల్లి లాగా చూసేది! అమ్మ ఓ కంట మా ఇద్దరి వ్యవహారాన్ని కనిపెట్టిన చిరు నవ్వులతో తన మొహాన్ని కొంగులో దాచుకునేది.
తెల్లారితే పండుగ కదా పండుగ అడ్వాన్స్ గా కనీసం ఓ గట్టి ముద్దు కుడా పెట్టు కోనివ్వ లేదు. 'రాత్ ఖతం...బాత్ ఖతం' కానీ నన్ను చూపులతో, వయ్యారాలు వలక బోస్తూ, కులుకుతూ నడుస్తూ వెనుకకు తిరిగి విశాలమైన తన కండ్ల తో బాపు బొమ్మలా తన కంటి కొనుకుల్లోచి నన్ను కవ్విస్తూ, గల గల నవ్వుతూ ఈ గదిలో నుంచి హాలు లోకి, అక్కణుంచి పెరట్లోకి మళ్లీ పక్కింటి బామ్మతో తన కోకిల లాంటి కంఠ స్వరం తో ఆమే బాగోగులను అడిగి నా చెవుల్లో తన మధుర కంఠవాణి నా గూబకు మాత్రం
ముద్దుల వర్షం కురిపించేది. నేను మాత్రం అప్పుడే అర విచ్చుకున్న ఆమె లేత గులాబి పెదవుల రేకులను చుంబించాలని తహ తహ లాడి …చివరికి...సొమ్మసిల్లి , ఆమే అమ్మగారు ఏదో సందర్భం లో ఇచ్చిన వెండి చెంబు లోనుంచి పచ్చి నీళ్లే తాగాను!
"మనకు పెండ్లి అయిందిగా. మూడు ముళ్ళేసాను. మంగళ సూత్రం కట్టాను. శోభనం కూడా అయింది. మరింకెందుకీ దూరం? వచ్చి నా గుండేలకు హత్తుకో రాదు. మంచి సమయముంది, సరైన సందర్భం కూడ ఉంది. పైగా సంక్రాంతి పండుగ కూడా ఉంది." అని అన్నాను ఆమెకు దగ్గరగా వెళ్లుతూ.
"మీరు చెప్పినదంతా కరక్టే! మీరు నా గుండేలోనే ఉన్నారుగా. దూరంగా ఏక్కడ ఉన్నారు?" లాగి ఓ లాజిక్ బాణం వదిలింది నా పై.
చిన్నప్పట్నుంచి మాలతిని నేను చూస్తున్నాను. ఆమె నన్ను చూస్తున్నది. అలా ఒకరినొకరం చూసుకొంటూనే పెండ్లి ఈడు కొచ్చేసాం. ముసి ముసి నవ్వులతో పాటు దొంగ చూపులో ఓర చూపులో మరింకేలాంటో చూపులతోనో ప్రేమలో ప డ్డట్లై పోయాం!
“లంగా జాకెట్ లో బాపు గారి బొమ్మవి, సిల్క్ చీరె లో రవి వర్మ గారి మాట్లాడే వర్ణ చిత్రానివి. శల్వార్-కమీజ్ లో హూస్సెన్ గారి చిలిపి కులిచెవి!" రెండు చేతులు జోడించి, ‘మరేమి చెప్పకండి ఇలాగే బాగున్నాను’ అని అంది మాలతి సైగలతో.
"ఏం సిగ్గుపడుతున్నావా?"
"కాదు...గర్వ పడుతున్నాను. ఇంకే విధంగానైన పొగుడుతారేమోనని....?" ఆగి పోయింది సందేహం పడుతూ మాలతి.
"అసలు విషయానికి ఇంకా రానిదే...అల వంకలు తిరిగి పోతావెందుకు? “ నాలో చిలిపి కృష్ణుడు పిల్లనగ్రోవి ఊదాడు.
“మీ మాటల మర్మం నాకు తెలియనిది కాదు షో గ్గాడా!" అంటు కిల కిల నవ్వింది ముత్యాల పండ్ల వరుసల వెనుక తమలపాకు కాడలాంటి నాలుకను కనిపించి కనపడకుండా ఆడిస్తూ.
నేనేమి చెప్పబోతున్నానో అప్పుడే పసి గట్టి పర్షియన్ లాంటి తన ముక్కును ఎగురేస్తూ , "మీకిష్టమైన మల్లె మొగ్గల మాల తురుంకోవడానికి వేళా అయింది!" అని అంది నాటక ఫక్కిలో మాలతి.
“ ‘నీకు' అని అనలేవ!"
"అది మన పెండ్లి తోనే చెల్లై పోయింది." అంటు నేను చెప్పబోయే విషయాన్ని వినకుండానే తుర్రున ఇంట్లోకి పారిపోయింది, నవ్వుకొంటు.
‘అంతంత మాత్రం బట్టలేసుకుంటే అజంతా శిల్పం లా ఉంటావని, అచ్చాదన లేకుండా ఉంటే ఖజరాహు బొమ్మ లాగుంటావని చెప్పే చాన్స్ ఇవ్వకుండానే, అర్ధమై పొయినట్లు!
***
అమ్మ పూజ గదిలోనుంచి వంట గదిలో కొచ్చేవరకు మాలతిని వెంటాడొచ్చు!? సిం హం లేడి పై లఘాహించినట్లు.
రాత్రి శృంగారం సరే. అదే ఉదయం ఎందుకు కాకూడదు?
దేవుడు నా ప్లాన్ ను నేరవేర్చాడు. వంటగదిని ఆనుకునే ఉన్న గది మా బెడ్ రూం.
మంచి నీళ్ల కోసమని వంటగదిలో ఉన్న ఫ్రీజ్ తెరచి గాజు సీసా లోనుంచి గ్గ్లాసులో నీళ్లు పోసుకొంటున్న తరుణంలో, వెనుక నుంచి కాళ్ల సవ్వడి లేకుండా అమాంతంగా మాలతిని కరచి పట్టుకున్నాను. అమె 'అమ్మా..'అని నోరు తెరవక ముందే ఓ చేత్తో ఆమె నోరు మూసి, 'నా దప్పిక తీర్చందే నీ దప్పిక నెలా తీర్చుకోనిస్తాను?' అంటూ రెండు చేతుల్లో బంధించి గప్ చిప్ గా మా బెడ్ రూం లోకి ఎత్తుకొని పోయాను మాలతిని.
"ఎంతకైనా తెగినోళ్ళు మీరూ!" అంటూ చిరునవ్వుల మధ్య మెలికలు తిరగ సాగింది మాలతి.
*****
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#7
అనూఢ (శృంగార కథ) - చెన్నూరి సుదర్శన్
[Image: image-2025-12-13-144842720.png]
 
 
ఈమధ్య హారతి ఉదరభాగంలో దినం, దినం మార్పు కనబడుతోంది. బ్రా హుక్స్ పట్టడం లేదు. జాకెట్లు తమ నిస్సహాయతను వ్యక్త పరుస్తున్నాయి. కడుపు మీదకు కట్టుకున్న చీర కనికరం లేకుండా నాభి కిందికి జారిపోతుంది.
అనుభవజ్ఞురాలైన ఆశమ్మ ఓరోజు హారతిని నిలదీసింది.
“నీ అనుమానం నిజమే..” అని చాలా కూల్‍గా సమాధానమిచ్చింది హారతి.
ఆకాశం దద్దరిల్లేలా అరుస్తూ.. తారాజువ్వలా హారతి పైకి ఎగిసింది ఆమె మారు తల్లి ఆశమ్మ. ఆమె విశ్వరూపం చూడడం అదే మొదటిసారి.
“అవును నిజమే.. ఏంచెయ్యమంటావ్..? నేనేమైనా మొల్లినా? నాకు పెళ్ళి అయితేనే గదా..చెల్లికి పెళ్లి అయ్యేది. నాకు పెళ్ళి గాకుండా అడ్డుకుంటున్నావ్. నేనూ చీమూ నెత్తురు ఉన్న మనిషినే.. ఉప్పూ, కారం తింటున్నా.. నాకూ కోర్కెలుండవా?” అంటూ తొలి సారిగా ఆశమ్మ మీదకు ఎదురు దాడికి దిగింది హారతి. “ఎప్పుడైనా మాసుఖం గూర్చి ఆలోచించావా? ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళి పోతే అనాధనై పోతానేమోనని వక్రంగా ఆలోచిస్తునావు. మమ్మల్ని డబ్బు సృష్టించే యంత్రాలుగా చూస్తున్నావే గాని ఆత్మీయతలు, అనురాగాలు పంచుతున్నావా? మా అమ్మా, నాన్న ఉంటే మాకీ దుర్గతి పట్టేది కాదు” అంటూ వాపోయింది. “ఇలాగే నాస్నేహితురాలు ఒకరు సరియైన వయసులో పెళ్ళిగాక, కోర్కెలను అదుపులో పెట్టుకోలేక పిచ్చిదై పోయి చచ్చిపోయింది. నా కలాంటి చావు రాకుండా ఉండాలని ఈనిర్ణయం తీసు కున్నాను” అంటూ వివర్ణమైన ముఖంతో హారతి అలా ఫైరయ్యే సరికి ఆశమ్మ నిర్ఘాంత పోయింది.
“కాని యిదేం పద్ధతే..! పెళ్ళీ, పెటాకులు లేకుండా కడుపు తెచ్చు కోవడం.. మేము వీధిలో తలెత్తుకొని తిరగాలా వద్దా ఎంత అప్రతిష్ట? హవ్వ.. హవ్వ..” అంటూ ఆశమ్మ నోరు బాదుకో సాగింది.
“పెళ్ళి కాలేదని ఎవరన్నారు?” తల ఎగరేసింది హారతి. మెడలోని మంగళ సూత్రాన్ని తీసి చూపించింది. ఆశమ్మ అవాక్కయ్యింది.
***
‘తలనిండ పూదండ దాల్చిన రాణీ.. మొలకా నవ్వులతోడ. మురిపించబోకే..’ అనే దాశరథి గీతాన్ని అలనాటి మధుర గాయకుడు ఘంటసాల ఆలపించినట్లు నగు మోముతో ముందర నిల్చున్న మధుకర్ ను చూడగానే హారతి మనసాగలేదు. ఒక్క ఉదుటున వెళ్ళి అమాంతంగా కౌగిలించుకుంది.
“ఏయ్.. మెల్లిగా. నీ దూకుడుకు కాస్తా కళ్ళెం వేయి. నువ్వసలే ఒఠ్ఠి మనిషివి గూడా గాదు.. మన మధ్య బిడ్డ నలిగి పోడూ..!” అంటూ సున్నితంగా హెచ్చరించాడు మధుకర్.
చిరునవ్వుతోనే సమాధానమిచ్చింది హారతి.
హారతి తల లోని మల్లె పూలు మధుకర్ మతి పోగోడుతున్నాయి. పూల పరిమళాలను ఆస్వాదిస్తూ.. సుతారముగా హారతిని అలుముకుని.. రతీ మన్మధుల ప్రణయ ప్రాంగణానికి తీసుకెళ్ళాడు.
మధుకర్ కు మనసారా మనసిచ్చుకొంది. తనువిచ్చుకొని తల్లిని గావాలనే తాపత్రయాన్ని మధుకర్ వివాహ బంధం అడ్డు పడింది. కాని నేడు సంఘం కట్టుబాట్ల సంకెళ్ళను తునాతునకలు జేశాననే విజయ గర్వంతో.. ఆమె మధుకర్ బాహు బంధాలలో శిథిలమై పోవాలని తపన పడుతూ.. సిగ్గు మొగ్గయ్యింది.
కలువల రాయుని కాంతి కిరణాల వలను విసిరాడు మధుకర్. ఆపాదమస్తకం అలుముకున్న వలలో కిల, కిలా నవ్వుతూ ‘నీకు గాక మరెవ్వరికీ తనువు’ అన్నట్లు నెలరేడు కన్ను సోకిన కలువపూవులా విచ్చుకుంది అర్చన. మధుకర్ ప్రదర్శించే నైపుణ్యాన్ని మత్తు కళ్ళతో గమనిస్తూ.. అతని చేయి తన ఎదపై పడగానే.. దిగ్గున కళ్ళు తెరిచింది హారతి.
ఎదురుగా ఆశమ్మ.
“హారతీ.. కడుపులో ఏమైనా నొప్పిగా ఉందా? మెలికలు తిరిగి పోతున్నావు” అంటూ ఆందోళనగా అడుగింది.
“లేదమ్మా..” అంటూ హారతి లేచి కూర్చొని మంచినీళ్ళడిగింది.
‘ఇదంతా కలనా..!’ అని మనసులో మదనపడుతూ.. ఆశమ్మ తెచ్చిచ్చిన మంచినీళ్ళు త్రాగి తిరిగి బెడ్ పై నిస్తేజంగా వాలి పోయింది.
***
హారతికి పురిటి నొప్పులు ఆరంభమయ్యాయి. తన కోరికపై ’సురక్షిత సంతాన సాఫల్య కేంద్రం’ లో చేర్చింది ఆశమ్మ.
హారతిని స్ట్రెచర్‍పై పడుకోబెట్టి ప్రసూతిశాలకు తీసుకు వెళ్తుంటే.. “అమ్మా.. ఆడదానికి ప్రసవం ఒక పునర్జన్మ. నీకు తెలియంది కాదు. నేను జన్మ ఎత్తినా ఎత్తక పోయినా దయచేసి ఆపీసు పని మీద వెళ్ళిన చెల్లాయి అమెరికా నుండి రాగానే తప్పకుండా పెళ్ళి చేయమ్మా.. నీకు దండం పెడ్తాను” అంటూ రెండు చేతులా మొక్కింది. ఆశమ్మ నివ్వెరపోయింది....
ప్రసూతిహాల్లో ఎట్టి పరిస్తితులలోనూ తనకు సిజేరియన్ చేయొద్దని, ఎంత బాధనైనా తాను భరిస్తానని పదే, పదే డాక్టరమ్మను వేడుకోసాగింది హారతి. సిజేరియన్‍తో మాతృత్వ పరిపక్వత సంపదను ఆస్వాదించలేనని ఆమె తపన.
బయట వరండాలో ఆశమ్మ భగవన్నామ స్మరణలో లీనమవుదామని ప్రయత్నిస్తూ విఫలమౌతుంది. ఆమెకు హారతి అభ్యర్థన పదే, పదే గుర్తుకు రాసాగింది.
ఇంతలో దూరంగా హారతి సహ ఉపాధ్యాయుడు మధుకర్ తన సతీమణితో రావడం కాస్త ధైర్యం తెచ్చుకుంది ఆశమ్మ. అంత హారతికి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తూ.. ఆశమ్మ ప్రక్కనే కూర్చున్నారు.
మాటల సందర్భంలో “అర్చన తన భర్త గూర్చి పూర్తి వివరాలు చెప్పడం లేదు. మీకేమైనా తెలుసా? సార్” అంటూ ఆశమ్మ ఆరా తీసింది.
మధుకర్ దంపతులు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆశమ్మ అతి దీనంగా ముఖం పెట్టింది.
“హారతికి పెళ్ళే కాలేదు అలాంటిది.. భర్త గూర్చి ఏం చెప్పను?” మధుకర్ అలా అనేసరికి ఆశమ్మ కంగుతింది.
“అదేంటి సార్... తనకు పెళ్ళయ్యింది. హారతి మెళ్ళో మంగళ సూత్రం గూడా ఉంది. భర్త దుబాయికి వెళ్ళాడని, తన ప్రసవ సమయానికి తప్పకుండా వస్తాడని హారతి చెబుతోంది”
మధుకర్ దంపతులు చిరు నవ్వులతో ఒకరినొకరు చూసుకుంటుంటే ఆశమ్మ బిత్తర బోయింది.
మధుకర్ తన భార్యను చూపిస్తూ.. “ఈవిడగారు గర్భం ధరించిన ప్రతీ సారీ గర్భస్రావమయ్యేది. ఇదే నర్సింగ్ హోంకు తీసుకు వచ్చే వాన్ని. డాక్టరమ్మ పరీక్షలన్నీ నిర్వహించి ఇప్పటికే అదృష్ట వశాత్తు పెను ముప్పు తప్పిందని.. ఆపరేషన్ జేసి గర్భాశయం తొలగించింది. మాకిక సంతాన యోగమే లేదా అని చాలా నిరాశకు లోనయ్యాం.
ఆసమయంలో అర్చన తనను పెళ్ళి చేసుకొమ్మని వేడుకొంది. నేను సున్నితంగా తిరస్కరించాను” అంటూ తన భార్య వంక చూశాడు. ఆమె ఆశ్చర్యంగా మధుకర్ ను చూడసాగింది.. తనకీ విషయం తెలియదన్నట్లు.
కాసేపు నోట మాట రాక మౌనం వహించాడు మధుకర్. ఆశమ్మ గుండె వేగంగా కొట్టుకో సాగింది.
“ఈవిడ తన దీనావస్థను, నిస్సహాయతను తలుచుకుంటూ రోజూ రోదించేది. డాక్టరమ్మ అద్దె గర్భం గూర్చి సలహా యిచ్చింది.
పరిస్థితులనర్థం జేసుకున్న హారతి కనీసం ఈసహాయమన్నా చేయనివ్వండి నాకు తృప్తి అయినా మిగులుతుందని ఏడ్చింది. పెళ్ళి గావాల్సిన దానివి.. కుమారివి.. వద్దంటూ డాక్టరమ్మ, నాభార్య, నేను ఎంతగానో వారించాం. కాని అర్చన మొండిగా తన పంతం నెగ్గించుకుంది.
ఒప్పందం ప్రకారం యీ విషయాన్ని అతి రహస్యంగా దాచాం. మంగళసూత్రం చూపిస్తూ మిమ్మల్ని మభ్య బెట్టింది గాని ఆమె అవివాహిత. నిజంగా అర్చన మాపాలిటి దేవత. ఏమిచ్చినా ఆమె రుణం తీర్చుకోలేము” మధుకర్ కంటి ఆదేశాలతో ఇద్దరు కలిసి ఆశమ్మ పాదాలకు మొక్కారు.
ఇంతలో హడావుడిగా డోర్ తెర్చుకొని బయటికి వచ్చిన నర్స్. “హారతికి అబ్బాయి పుట్టాడు” అంటూ తీపి కబురు తెచ్చింది.
ఆనందంగా అందరూ లోనికి పరుగులు తీశారు.
“అయాం సారీ మధుకర్.. హారతి ఈజ్ నో మోర్.. ఆమె వద్దని వేడుకున్నా.. ఆపరేషన్ చేయాక తప్పింది కాదు. నా శాయశక్తులా ప్రయత్నించాను” అంటూ బాబును తెచ్చి మధుకర్ దంపతుల చేతుల్లో పెట్టింది.
ఆశమ్మ హృదయం బద్దలైంది.. ఆమె కళ్ళు కన్నీటి జలపాతాలయ్యాయి. *
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#8
కథ ముగిసింది - Raja Mohan Ivaturi
[Image: k.jpg]

దిలీప్ తన ఊరికి వస్తున్నానని ఉత్తరం వ్రాసాడు. ఆ ఉత్తరం చదువుతూ కసిగా పళ్ళు కొరుక్కుంది సుందరి. "ఇప్పుడెందుకు వస్తున్నాడు? అసలు ఇంకా నాతో ఇతనికి ఏమిటి పని?" అనుకుంది.
ఎర్రబడిన ముఖంతో రకరకాల మనోభావాలతో రగిలిపోతున్న సుందరిని చూసి "ఏమే నీ మిత్రుడు ఈసారి ఏంరాసాడు?" అని అడిగింది సీమ. ప్రసార మాధ్యమాలతో వ్యాపారం చే సే సుందరి స్వంత సంస్థ లో ఉన్నత సలహాదారు మాత్రమే కాక సుందరి చిన్ననాటి స్నేహితురాలు కూడా కావటం వలన సీమ కి ఆఫీస్ తో పాటు కాక సుందరి తాలూకు వ్యక్తిగత విషయాలూ తెలుసు.
దిలీప్ రెండు రోజులకొకసారి ఇమెయిల్ లో స్కాన్ చేసిన ఉత్తరం పంపిస్తాడు. అతనికి ఇప్పటికీ ఉత్తరాలు రాసే అలవాటు ఉండటం వలన ముందు ఉత్తరం స్వహస్తాలతో రాసి ఆ ఉత్తరాలని స్కాన్ చేసి పంపిస్తాడు. ఆ ఉత్తరాలలో వాళ్లిద్దరూ ఇక్కడ కలిసి ఉన్నప్పటి జీవితంలోని జ్ఞాపకాలు తలుచుకోవడం తప్ప మరేమీ ఉండేది కాదనీ అతను దూరదేశాలకి వెళ్ళాక సుందరిలో అసహనం మరింత పెరిగిందనీ ఈ ఉత్తరాల వలన ఆమె బాధ ఇంకొంచెంపెరగటం తప్ప ఆమెకి ఏమీ స్వాంతన చేకూరటం లేదని ఆమెకెంతో సన్నిహితమైన సీమ కి తెలుసు.
సీమ ప్రశ్నకి సమాధానంగా "వాడు ఇక్కడికి వస్తాడట" అని కసిగా అంది సుందరి.
"నిజమా? అది మంచి విషయమే కదా?" అంది సీమ.
సుందరి తన తల కొట్టుకుంది. "ఎందుకు ఇతను నన్ను హింసిస్తున్నాడు?" అని మనసులోనే అనుకుంటుంటే "ఎందుకే అంత కోపం? అతను వస్తే ముఖం మీదే అన్నీ మాట్లాడుకోవచ్చు కదా?" అంది సీమ.
"నా నెత్తి. అతనితో ముఖాముఖీ కొత్తగా మాట్లాడుకునేదేముంది? ఇన్నేళ్లు ఇక్కడే ఉన్నాడు కదా? ఏడాది క్రితమే కదా వెళ్ళింది?" అరిచినట్టు చెప్పింది సుందరి.
"అదీ నిజమే" నిట్టూర్చింది సీమ. సుందరి మానసిక పరిస్థితి చూసి మౌనంగా ఉన్న సీమతో మళ్ళీ సుందరే అంది "వచ్చినప్పుడు నా ఇంట్లోనే ఉంటాడట" అంది.
సుందరి తో ఇంత వరకూ జరిగిన అనుభవాలతో సీమ ఎక్కువ మాటాడకుండా "అలాగా?" అని ఊరుకుంది.
"అతని సొంతిల్లు అనుకున్నాడా? ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి?" అని మళ్ళీ పళ్ళు కొరికింది సుందరి.
సీమ అవున్నిజమే అన్నట్టు హు అని నిట్టూర్చి అక్కడనుంచి తన సీట్ దగ్గరికి వెళ్ళింది.
దిలీప్, సుందరి, సీమ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. సుందరి ఎదురింట్లోనే ఉండే దిలీప్ తండ్రి బొగ్గు గనులలో పనిచేసే ఒక దిగువ మధ్య తరగతికి చెందిన వాడయితే సుందరి వాళ్ళ నాన్న ఆర్థికంగా ఒకటి రెండు మెట్లు పైన ఉండేవాడు. ఆ అంతరం పట్టించుకోకుండా పెద్ద వారిద్దరూ స్నేహంగా ఉండటంతో సుందరి దిలీప్ ల మధ్య కూడా స్నేహం పెరిగింది. తండ్రితో పాటు బొగ్గు గనులలో సాయం చేస్తూ చదువుకుంటున్న దిలీప్ స్వతహాగా చాలా భావుకుడు.
వాడి చదువు వాడు చదివేసుకునేవాడు గానీ మామూలు వ్యవహారాలకి సంబంధించిన అంశాలలో సుందరి సాయం లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేకపోయేవాడు. ఎప్పుడు మొదలయ్యిందో గుర్తు లేదు గానీ తనకి తెలిసినంత వరకూ దిలీప్ ఒక్క సారి కూడా కనీసం ప్రయత్నం కూడా చెయ్యకుండా తన వ్యవహారాలన్నీ సుందరికి వదిలేసే వాడు. చిన్నప్పుడే వాడి చదువులో భాగంగా బడిలో ఎన్నో రకాల లావాదేవీలు తమ చేత చేయమని టీచర్లు చెప్పినపుడు వాడికి ఏంచెయ్యాలో తెలిసేది కాదు. బాంకుకి వెళ్లి ఒక చలాన్ కట్టి రమ్మని గురువుగారు అడిగితే అందరూ చకచకా చేసుకు వచ్చేసేవారు. వీడు మాత్రం సుందరి దగ్గరికి వచ్చేవాడు. సుందరి కూడా వాడి వయసు లోనే ఉన్నా పెద్ద ఆరిందాలా వాడిని తీసుకెళ్లి వాడిచేత ఒక్కొక్క పనీ చిలక్కి చెప్పినట్టు చెప్పి చేయించి ఆ చీటీని గురువుగారికి ఇప్పించేది. తపాలా కార్యాలయానికి వెళ్లి రకరకాల తపాలా బిల్లలకి డబ్బులిచ్చి సరైన చిల్లరతో రావటం ఒక పరీక్షయితే వాడికి ఎంత డబ్బులివ్వాలి ఎంత చిల్లర తెచ్చుకోవాలి లెక్కలు తెలిసినా ఆ పని చేసుకురావటం మాత్రం తెలిసేది కాదు. మళ్ళీ మామూలే. "సుందరీ! ఇదేదో చేసి పెట్టు" అని తనువచ్చేవరకూ ఆమె ఇంటి అరుగు మీద కూర్చునే వాడు. "సుందరీ. ఈరోజు గురువుగారు రకరకాల పప్పులు తెచ్చుకురమ్మన్నారు. నాకు కూడా నువ్వే తెచ్చేయ్" అనేవాడు. వాడు చెప్పాడు కనుక తన ఇంట్లోంచి రకరకాల పప్పులు వాడికోసం కూడా పొట్లాలు కట్టి ఇస్తే వాడు గురువుగారికి తన వంతుగా చూపించేవాడు. మెల్లిగా ఇంటర్మీడియట్ పరీక్ష కి కావలసిన అప్లికేషన్ నింపటం అతనికి కావలసిన సర్టిఫికెట్లు వగైరా సద్దుకుని అతని చేత సబ్మిట్ చేయించటం ఆ తర్వాత ఇంకా ఇంకా పెద్ద పనులలో కూడా సుందరే వాడి బాధ్యత తీసుకోవటం జరిగిపోయాయి.
అలా అని వాడు తెలివి తక్కువ వాడేమీ కాదు. చదువులో ఎప్పుడూ మొదట ఉండే వాడు. ఎవ్వడికైనా సాయం చేసేవాడు. డబ్బు కి సంబంధించని విషయాలలో వాడు అందరికీ సహాయం చేసేవాడు. పెద్ద చదువుల్లో వర్క్ షాప్ అనీ వేరే ప్రాక్టికల్స్ లోనూ వాడు తన క్లాసుమేట్ లందరికీ సాయం చేసేవాడు. చెక్కలని కోసి కుర్చీగానో బల్లగానో చేసే లాంటి పనులు వాడు అందరికంటే ముందే పూర్తి చేసి మరో ఇద్దరు ముగ్గురికి చేసి పెట్టేవాడు. తండ్రితో పాటు వృత్తి పనులు చేసిన అనుభవం వాడికి బాగా పనికొచ్చేది. అందుకు ప్రతిఫలంగా కొందరు ఏమయినా ఇచ్చే ప్రయత్నం చేస్తే తీసుకునేవాడు కాదు. "నాకు కూలీ ఇవ్వకండిరా." అనేవాడు. సాయం చేసే ఆ గుణం కూడా వాడితోనే పెరిగి వాడి సమర్ధత పెరిగినకొద్దీ ఇంకా ఇంకా సహాయం చేస్తూనే వుండే వాడు. ఇవన్నీ ఎలా చేసినా తనకి సాయం కావాలంటే మాత్రం దిలీప్ చేరేది సుందరి దగ్గరికే.
వారిద్దరి స్వచ్ఛమైన స్నేహం వారితో పాటే పెరిగి ఇంకా ఇంకా గాఢంగా మారి ప్రతితోజూ దిలీప్ సుందరిని చూడకుండా రోజు గడిపేవాడే కాదు.
చదువు పూర్తయ్యి దిలీప్ కి ఒకేసారి అయిదు చోట్ల ఉద్యోగాలు వస్తే అందరూ ఆరోజులలో కథలుగా చెప్పుకున్నారు. బెంగుళూరులో పనిచేయవలసిన ఉద్యోగం అన్నివిధాలా ఆకర్షణీయంగా ఉన్నా దిలీప్ విశాఖలోనే తన తండ్రి ఉద్యోగం లో చేరిపోయాడు. సుందరి దగ్గరికి వచ్చి తన నిర్ణయాన్ని చెప్తూ "సుందరీ! నా చదువు కథ ముగిసింది. ఇక ఉద్యోగంతో కొత్త జీవితం" అన్నాడు.
సంభాషణ కొనసాగిస్తూ "నేనే ఆయన ఉద్యోగంలో చేరితే తప్ప నాన్న ఆ ఉద్యోగం మానరు. ఆ బొగ్గుల మధ్య పని చేసి చేసి ఆయన ఆరోగ్యం పాడయిపోతోంది. నే ఉద్యోగంలో చేరితే తప్ప నాకెక్కడా ఉద్యోగం రావటం లేదని ఆయనకి చెప్పాను సుందరీ" అన్నాడు. విశాఖలో ఆ ఉద్యోగం అంత డబ్బు సంపాదించగలిగేది కాదు. పైగా దేశవాళీ సంస్థ కావటం వలన ఆ సంస్థ నుంచి విదేశాలలో పని చేసే అవకాశం రానే రాదు. ఇంత దిక్కుమాలిన నిర్ణయం ఎందుకు తీసుకున్నావురా అని వాడి స్నేహితులు వాడిని మందలిస్తే "ఇక్కడయితే మనందరం కలిసి ఉంటాం కదురా" అని నవ్వేసాడు. అతను చెప్పిన రెండు కారణాలూ అతని నిర్ణయానికి కారణం కాదని సుందరి కి తెలుసు. అతను సుందరిని వదిలి ఎక్కడికో వెళ్లి బతకలేడు.
మరి ఆ తర్వాత దూర ప్రదేశాలకి (ఒక్కడే) వెళ్లిపోవాలని ఇంత సులువుగా నిర్ణయం తీసుకుని ఎలా వెళ్లిపోయాడో ఇప్పటికీ ఆమెకి అర్ధం కాలేదు. కరెంటు బిల్ ఎలా కట్టాలో తెలియని ఈ మనిషి ఎక్కడికో పోయి స్వతంత్రం గా బతకగలడా? అనుకున్న సుందరికి అదొక పెద్ద షాక్.
***
సుందరి ఇంకా ఆలోచనలలో ఉండగా సీమ తన హ్యాండ్ బాగ్ తో వచ్చి "నేనిక ఇంటికి వెళ్తాను" అంది.
"వెళ్ళిపోతున్నావా? దిలీప్ కి పెంకుటిల్లు సిద్ధం చెయ్యమని బహదూర్ కి చెప్పావా?" అని అడిగింది సుందరి.
సీమ నిర్ఘాంతపోయి "నువ్వేదో కోపంగా ఉన్నావు కదా అతన్ని ఇంకెక్కడో ఉండమంటావేమో అనుకున్నా" అంది.
"నా మొహం. ఆ విషయం అతను వచ్చాక తేల్చుకుంటాం. వచ్చిన వెంటనే ఎక్కడ ఏడుస్తాడు?" అంది సుందరి బింకంగా.
"నువ్వు నాకు అర్ధం కావే తల్లీ" అంటూ బంగాళా వెనక పెంకుటింటిని సిద్ధం చెయ్యమని ఆ ఇంటి కాపలాదారు బహదూర్ కి ఫోన్ లో చెప్పటానికి మళ్ళీ లోపలికి వెళ్ళింది సీమ.
దిలీప్ జీవితంలో చిన్నప్పటి నుంచి సుఖం గానీ శాంతి గానీ ఎప్పుడూ లేవు. అతను కాలేజ్ కి వచ్చే ముందర ఇంటి పక్కన తోటలో పుల్లలేరి నీళ్లు కాస్తాడు. తర్వాత గంజి వార్చి వారానికి రెండు సార్లు బట్టలు ఉతికి చుట్టుపక్కల కాలనీలలో పాలు సరఫరా చేసి అప్పుడు కాలేజ్ కి వస్తాడు. ప్రతిరోజూ ఆలస్యంగా వస్తే మాస్టారు గవర్రాజు గారి శిక్షాస్మృతి ప్రకారం మోకాళ్ళ మీద మొదటి క్లాసంతా కూర్చోవటం అతనికి అలవాటే. వాడు శుభ్రమైన బట్టలేసుకుని తలకి నూనె రాసుకుని రావటం లేదని మంచి అలవాట్లు నేర్చుకోవటం లేదని బెన్హర్ టీచర్ రోజూ వాడి చేతులు కాయలు కాసేలా బెత్తంతో కొట్టేవారు. ఎన్ని జరిగినా వాడి కంట్లోంచి ఒక్క చుక్క వచ్చేది కాదు. వాడి స్నేహితుడు బలరాం ఒకసారి "నీకు నెప్పి ఉండదేమిటిరా?" అని అడిగితే "నేను చేస్తున్నది తప్పే కదురా!తప్పు చేసినపుడు శిక్ష అనుభవించేస్తే ఎంతో తెరిపిగా ఉంటుంది" అన్నాడు. "సాయంత్రం కూర్చుని ఓ నాలుగు మంచి పాటలు పాడేసుకుంటే కథ మారిపోతుంది" అంటాడు.
వాడికి పాటంటే ప్రాణం. ఇంట్లో రేడియో కూడా ఉండక రోడ్డు పక్కన ఎక్కడ పాటలు వినపడితే అక్కడ నుంచుని వింటూ నచ్చిన పాటల సాహిత్యం రాసుకునేవాడు. కాలేజ్ లంచ్ టైం లో సుందరీ సీమా బలరాం దిలీప్ కొంత దూరం నడుస్తుండేవారు. మొదట్లో వీడి వ్యవహారం తెలియక వాడు తమతోనే ఉన్నాడనుకుని వాడితో మాట్లాడుతూ కొంత దూరం నడిచాక వాడు మాయమయ్యాడని గ్రహించి గతుక్కుమన్నారు. అక్కడా అక్కడా వెతుక్కుంటూ వెనక్కి వచ్చి చెన్నకేసు హోటల్ దగ్గర నోరు వెళ్ళబెట్టుకుని బాలు గారి ఒక మంచి పాట వింటూ ఏదో లోకంలో ఉన్న దిలీప్ ని చూసి హమ్మయ్య వీడెక్కడా తప్పిపోలేదు అని ముందు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత పాటలకోసం లోకాన్ని మరిచిపోయే వాడి పాటల పిచ్చికి మురిపంగా భళ్ళుమని నవ్వుకున్నారు. "నువ్వే సైకిల్ మీద పోతున్నపుడో పాత వినిపిస్తే పడిపోతావు రా" అని వేళాకోళం చేసేవారు. ఎప్పుడైనా క్లాస్ టీచర్ రాకపోతే దిలీప్ ని బల్లెక్కించి ఒక్కొక్కడూ వాళ్లకి ఇష్టమైన పాటని అడిగి పాడించుకునేవారు.
రోజూ గవర్రాజు మాస్టారి దగ్గర ఆలస్యంగా వచ్చినందుకూ బెన్హర్ టీచర్ దగ్గర సరైన బట్టలు వేసుకోవనందుకూ దెబ్బలు తింటూనే పెరుగుతున్న దిలీప్ మీద చివరికి కంప్లైంట్ వెళ్ళింది. ఇక తప్పదని వాడి తల్లి కాలేజ్ కి వచ్చింది. ఇద్దరూ టీచరులూ ఒకేచోట ఉండగా వారి దగ్గరికి వచ్చి "అయ్యా! ఈ వయసుకి వాడిని కూలి పనిలో పెట్టి మరిన్ని కాసులు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్న మేము వాడి మంచి కోసం పళ్ళబిగువున చదివిస్తున్నాం. కానీ వాడికి నూనెలూ పౌడర్లూ కూడా కొనాలంటే మేమంత డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితిలో లేము బాబూ!" అని ఏడిచింది. ఆవిడ చెప్పిన మాటలు విని గవర్రాజు గారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగి "వాడికి క్రమశిక్షణ తప్పుతోందని బాధతో వాడిని శిక్షిస్తున్నాను గానీ ఇప్పుడు నా తప్పు తెలిసిందమ్మా. వాడికి అభిమానం చాలా ఎక్కువ. శిక్ష అనుభవించేవాడు తప్ప ఎప్పుడూ నాకు ఆలస్యానికి కారణం చెప్పలేదు. పేదరికం అన్నింటికన్నా పెద్ద రోగం. ఈరోజు నుంచి మెదటి పాఠం నేనే కొంచెం ఆలస్యంగా మొదలెడతాను. ఏరా పిల్లలూ మీరేమంటారు?" అన్నాడు. పిల్లలంతా బల్లల మీద చరుస్తూ "తప్పకుండా మాస్టారూ" అన్నారు. దిలీప్ అంటే ఇష్టం లేనిదెవరికి?
బెన్హర్ టీచర్ ఆరోజే వాడికి రెండు జతల బట్టలు కుట్టించుకోమని డబ్బులిచ్చి అప్పటినుంచి వాడి తల్లికి ప్రతి రెండు నెలలకీ ఒక కొబ్బరినూనె సీసా ఒక పౌడర్ డబ్బా ఇచ్చేవారు. దిలీప్ కి ఈ విషయం చెప్పద్దని వట్టు పెట్టించుకుని పంపించారు. ఎందుకంటే దిలీప్ ఎవరిదగ్గరా సహాయం తీసుకోవటానికి ఇష్టపడే వాడు కాదు. కేవలం సుందరి మాత్రమే అతనికి స్పెషల్ కనుక అన్ని సాయాలూ ఎంతో హక్కుగా తీసుకునేవాడు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#9
ఎప్పుడూ చిరునవ్వు చెదరని దిలీప్ జీవితంలో తుఫాను రేగింది. రాత్రి మాములుగా పడుకున్న తల్లి పొద్దున్న లేవలేదు. ఆ రోజు దిలీప్ సుందరి దగ్గరికి వచ్చి "సుందరీ!కథ ముగిసింది. అమ్మ ఇంక లేదు" అంటూ మరో మాట లేకుండా ఎప్పుడూ లేనిది ఆమె వళ్ళో పడుకుండిపోయాడు. ఏంజరిగిందో అప్పటికి తెలియని సుందరి విషయం అడగాలనుకున్నా ఒక్కమాట కూడా చెప్పకుండా దిగులుగా శూన్యంలోకి చూస్తూ తన వడిలో పడుకున్న అతని పరిస్థితి చూసి తను కూడా మౌనంగా ఉండిపోయింది. చెయ్యవలసిన కార్యక్రమాలెన్నో ఉండగా వీడేమయిపోయాడో తెలియని స్నేహితులు వెతుక్కుంటూ సుందరి ఇంటికి వచ్చి విషయం చెప్తే గానీ సుందరికి అతని తల్లి మరణించిందని తెలియదు. వాడి స్నేహితులందరూ వచ్చి ఎన్ని రకరకాలుగా వాడిని ఓదార్చి అంత్యక్రియలని రమ్మంటున్నా దిలీప్ తన వడిలో నుంచి లేవలేదు. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అతనికి ఎంతో దగ్గర స్నేహితుడైన స్ఫూర్తి ఓర్పు నశించి "సుందరీ! వాడికి జరిగిన నష్టం పూడ్చలేనిది. కానీ ఇప్పుడు చెయ్యవలసినది చెయ్యాలి. వాడే చెయ్యాలి. వాడిని ఎలాగోలా తీసుకురా' అని చెప్పి వెళ్లి పోయాడు. నిరాశగా మౌనంగా దిగులుగా తన వళ్ళో పడుకున్న అతనికి ఏమాత్రం భంగం కలగకుండా సుందరి ఎంతో ఓర్పుతో అలాగే కూర్చుంది. దిలీప్ కి దుఃఖం ఉంది కానీ బైటికి రావటం లేదు. అతను ఏడవాలి. ఏడుస్తాడు అని ఆమె అలాగే వేచి ఉంది. మూడు భారమైన గంటల తర్వాత అతను మనసారా ఏడ్చాడు. ఆమె వడిలో కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. అతని ఏడుపు ఆపేవరకూ అతని తల నిమురుతూ ఆమె ఉండిపోయింది. సుందరి అమ్మా నాన్నా చూసి కూడా పరిస్థితి అర్ధం చేసుకుని లోపలికి వెళ్లిపోయారు. వారి మధ్య ఉన్న అనుబంధం తాలూకు తీవ్రత మొదటి సారి అందరూ గ్రహించిన రోజు అది. సుందరి సాంగత్యంతోనే ఎన్నో రోజుల తర్వాత అతను మళ్ళీ మామూలు మనిషయ్యాడు "కథ ఇంకా ఉంది" అని విచారంగా నవ్వేవాడు.
మళ్ళీ అతనికి ఎప్పుడూ తోడుగా ఉండే సంగీతంలో ఉపశమనం తీసుకోసాగాడు. వాడి పాటలు విని వాడి స్నేహితుడు సుబ్బారావు తండ్రి అతనికి ఒక వేణువు కొని ఇస్తే ఎంతో ఉత్సాహంతో సుందరి ఇంటి మేడమీద ఇద్దరూ సాధన చేసి వేణువు ఊడటం నేర్చుకున్నారు. సుందరి తండ్రి ఇంకా కొంతమంది పెద్దలు సంగీతమంటే ఇంత ఇష్టం ఉంటే నేర్చుకోవచ్చు కదా అంటే నవ్వేసి "నేను త్వరగా ఉద్యోగం చేసి సంపాదించాలండి. నాన్నని చూసుకోవాలి" అనే వాడు. అందరి దగ్గరా ఎన్నో పాటలు పాడినా ప్రతిరోజూ తన ఇంటికి వచ్చినపుడు తన దగ్గర మాత్రమే శ్రావ్యమైన వేణుగానం వినిపించేవాడు. ఆ మేడమీదే ఎన్నో మధురమైన సాయంత్రాలలో అతనివేణుగానానికి తన గాత్రం జోడించి ఇద్దరూ ఆ సంగీతంలో మైమరచిపోయేవారు. ఇద్దరూ రేడియో లో ఎన్నో దేశాల పాటలు ఏవి బావున్నా విని ఆస్వాదించేవారు. ఆ పాటలనే తన గానంతో మళ్ళీ సృష్టించి మధురమైన అనుభూతులు పొందే వారు. వేణువు విషయంలో దిలీప్ గీసుకున్న పరిధులు అందరికీ తెలుసు కనుక మొదట్లో వాడిని వేణువు వాయించమని అడిగిన వాళ్ళు కూడా తర్వాత అడగటం మానేసి వాడి పాటలు మాత్రమే అడిగి వింటుండేవారు. వేణువు మాత్రం సుందరి కోసమే. విదేశాలకి వెళ్తూ అతను ఆ వేణువు సుందరి కిచ్చి వెళ్ళిపోయాడు.
తన తో ఇంత సన్నిహితంగా ఉన్నవాడు తనకి చెప్పవలసిన ఆ ఒక్క ముక్కా ఎందుకు చెప్పలేదు? అహంకారమా? భయమా? ఆ మాట కొస్తే ఎప్పుడైనా నాతో ఒక్క మాట కృతజ్ఞతగా అన్నాడా? ప్రతి పనినీ నేనేదో స్వంతమనిషిలా నాకప్పజెప్పి వెళ్లిపోయేవాడు. ఒక్కసారి కూడా నువ్వు నా తోడుగా లేకపోతే నేనేమయిపోయేవాడిననే విషయం వప్పుకున్నాడా? పైగా నీతో నాకేంటి పని అని ఎక్కడికో ఒక్కడూ వెళ్ళిపోతాడా? అక్కడ తన పనులు ఎలా చేసుకుంటున్నాడట ? తనే చేసుకునే టట్టయితే ఇంతవరకూ చేసుకోగలిగీ నన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నట్టేగా ? అసలు తన గురించి ఏమిటా అలుసు?
సమస్య మొదవటానికి ముందు దిలీప్ ఇంటికి రాయటం తగ్గించేసాడు. వచ్చినా పాటలు పాడేవాడు కాదు. నాన్న ఆరోగ్యం బాలేదు. ఏదో ఒకటి చెయ్యాలి అనేవాడు.
"దీనికింత ఆలోచన ఎందుకు? మంచి క్లినిక్ లో చేర్పిద్దాం. నా మనుషులకి చెప్తే అంతా ఏర్పాటు చేసేస్తారు." అంది సుందరి.
దిలీప్ తల అడ్డంగా ఊపుతూ "అదొక్కటే సమస్య కాదు సుందరీ! ఆయన్ని దగ్గరుండి ఎవరు చూస్తారు? నాకు కుదరదు" అన్నాడు.
ఎప్పుడూ తనకి విషయాలు వదిలేసి నిశ్చింతగా ఉండే మనిషి ఇలా మాట్లాడుతున్నాడేమిటి అని అనుమానం కూడా లేకుండా "దాందేముంది ? మంచి నర్సు ని పెడదాం. నేను చూసుకుంటానుగా " అంది.
"అవును" అని తనలోనే గొణుక్కున్నాడు. తర్వాత కూ కూడా ఏదో ధ్యాసలో ఉన్నాడు. కాసేపు అలాగే కూర్చుని "వస్తాను" అని అతను వెళ్ళిపోతే ఆమె ఆశ్చర్యపోయింది. అతనికి ప్రాణమైన సంగీతం గురించి కనీసం చర్చించుకోకుండా అతను వెళ్ళిపోవటం అదే మొదటిసారి. తర్వాత కొన్నాళ్ళు అతను రానేలేదు. ఆమె కూడా తన కంపెనీ పనులలో కొంచెం పని ఒత్తిడి పెరగటం వలన అంత గా పట్టించుకోలేదు. దిలీప్ ఏం చేసినా దిలీప్ తన మనిషేనని ఖచ్చితమైన నమ్మకం.
అతను ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నాడని స్నేహితులు చూచాయగా చెప్పినపుడు సుందరి నమ్మలేదు. అతని వ్యవహారంలో ఒక్కటి కూడా తన సహాయం లేకుండా చేసుకోలేని వాడు తనని తీసుకునైనా వెళ్ళాలి లేదా అసలు వెళ్ళకూడదు అని నమ్మకంగా అనుకుంది. అలా అనే అందరితో ధీమాగా "అతను ఎట్టి పరిస్థితులలోనూ నేను లేకుండా వెళ్ళడు" అని చెప్పింది. ఒక్క రాత్రి ప్రయాణం లో చేరుకోగలిగే బెంగుళూరుకి వెళ్ళటానికే ఇష్టపడని వాడు దూర ప్రదేశాలకి ఎందుకు వెళ్లాలనుకుంటాడు?పైగా నాతొ చెప్పకుండా అంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడా?
కానీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ దిలీప్ తాను దూరప్రదేశానికి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించాడు. అతను ఎలా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియకపోయినా అతను ఖఛ్చితంగా సుందరి తో బంధాన్ని స్పష్టంగా నిర్థారించి ఆమెని తనతో తీసుకుపోతాడని అందరూ సీమతో సహా అనుకున్నారు. పైగా అతని మాటల్లో అతను సుందరి తో ఏవో ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాడని కూడా తెలిసాక అతను చెప్పబోయేది ఏమిటో అందరూ ఊహించుకున్నారు.
సుందరిని కలవగానే తన శైలిలోనే "సుందరీ. దురదృష్టవశాత్తూ ఇక్కడ నా కథ ముగిసింది. నేను దూరప్రదేశానికి వెళ్తున్నాను. కానీ అక్కడ అంతా మన మంచికే అవుతుందని నమ్మకంతో ఉన్నాను" అన్నాడు. అతను తర్వాత చెప్పబోయే విషయం కోసం ఎంతో ఆసక్తిగా సుందరి ఎదురు చూస్తుంటే దిలీప్ తన వేణువు ఆమెకి ఇచ్చాడు.
"బహుశా అక్కడ నాకు వేణువు ఊదటం కుదరకపోవచ్చు. ఇది నా ప్రాణం సుందరీ. నీకు తప్ప ఇంకెవరికీ ఇవ్వలేను" అన్నాడు. అప్పుడు సుందరికి మొదటి సారి అనుమానం వచ్చింది. తాను అతనితో వెళ్లిపోతుందనుకుంటుంటే అతను నాకు అప్పగింతలు చేస్తున్నదేమిటి? అనుకుంది. అయినా ఏదో నమ్మకం. ఆశ.
"ఇంకో విషయం సుందరీ. నాకు మరో దారి లేకపోవటం తో నాన్న ని ఓల్డేజ్ హోమ్ లో చేర్పించక తప్పదు. నువ్వు వెంటనే ఆయన్ని మంచి చోట చేర్పించెయ్యాలి. మనకి వారమే టైముంది" అన్నాడు.
బహుశా తన తండ్రి అక్కడ చేరి కొంచెం సెటిల్ అయ్యేవరకూ తనని ఇక్కడ ఉండమంటున్నాడేమో. అక్కడికి వెళ్లి కొన్నిరోజుల్లో ఇక్కడ అతని తండ్రి తాలూకు విషయంతో పాటు అన్ని వ్యవహారాలూ సద్దుమణిగాక తనని తీసుకువెళ్తానని చెప్తాడేమో అని సుందరి ఆశిస్తుంటే దిలీప్ అతని ఖాతాలన్నటినీ కూడా నిర్వహించమని అందుకు కావలసిన వివరాలూ హక్కుల తాలూకు పత్రాలు ఆమెకి ఇచ్చేసాడు.
ఇదంతా ఎలా చేసాడంటే చిన్నప్పుడు తనకి బళ్ళో పనులు ఎలా అప్పగించేవాడో అంత సులువుగా అంతే హక్కుతో అప్పగించేసాడు. తనని రమ్మని గానీ అక్కడికి వెళ్ళాక తను కూడా రావటానికి ఏర్పాటు చేస్తానని గానీ అనలేదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఆమె, ఆమె తో పాటు ఎందరో స్నేహితులు ఆశిస్తున్నట్టుగా ఎప్పటినుంచో చెప్తాడని ఎదురు చూసే ఆ ఒక్క మాట కూడా చెప్పకుండా అతను వెళ్ళిపోయాడు.
అతను అల్లా వెళ్ళిపోవటం వలన కలిగిన షాక్ కన్నా తనని వెర్రి దాన్ని చేసి ఇష్టం వచ్చినట్టు తన నుంచి మానసికంగా వ్యావహారికంగా కావలసిన సాయం తీసేసుకుని ఇప్పుడు తనని ఫూల్ ని చేసి అందరిముందూ అవమానం చేసాడని ఆమె ఎంతో కుమిలిపోయింది. మానవత్వంతో అతని తండ్రిని ఓల్డేజ్ హోమ్ లో చేర్పించింది. అతను ఏవేవో ఖాతాలు తెరిచి స్వచ్చంద సేవలకు కేటాయించిన వాటితో పాటు అన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చి వాటంతట అవే నడిచేలా ఏర్పాటు చేసింది. అతను చేసిన గాయం మాత్రం ఆమె మనసులో ఉండిపోయింది.
సీమ కి ఆమె అంటే ఎంతో సానుభూతి ఉంది. కానీ తనే సుందరి స్థానంలో ఉంటే "పద అక్కడికి ఇద్దరం వెళదాం." అని తనే మొదటి అడుగు వేసి విషయాన్ని తేల్చేసేది అనుకుంది సీమ. కానీ సుందరి తో ఆ విషయం చర్చించే సమయం కాదనుకుని ఊరుకుంటోంది.
ఎవరి అవసరమూ లేదన్నట్టు వెళ్ళిపోయిన వాడు ఏమీ జరగనట్టు ఇమెయిల్ లో పెద్ద పెద్ద ఉత్తరాలు వ్రాస్తాడు. వాటిలో కూడా పనికొచ్చే విషయం ఒక్కటి కూడా ఉండదు. అతను అక్కడ చేస్తున్న పని గురించి గానీ అక్కడ ఉన్న అవకాశాలు లాంటి విషయాలు ఏమీ ఉండవు. అతను వంద మంది వికలాంగులకు ఎలా సహాయం చేసాడో ఉంటుంది. అతను భారతదేశంలో ఆర్ధిక కారణాల వలనో మరే కారణం వల్లనో వెనక పడిన వారికి ఎలా తర్ఫీదు ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాడో చెప్తాడు. కొత్తగా వస్తున్న సంగీత ఒరవళ్ల గురించి వ్రాస్తాడు. ఇవన్నీ ఇక్కడ కూడా చేసేవాడు.సుందరీ దిలీప్ ఇద్దరూ మాట్లాడుకుని ఎన్నో మంచి పనులు చేశారు.
కానీ దూరంగా వెళ్లిన తర్వాత కూడా తమ జీవితాలకి సంబందించిన అసలు విషయం ఎందుకు ప్రస్తావించడు? అని సుందరి రగిలిపోతూ ఉండేది.
తమ బంధానికి తలిదండ్రులు కూడా అడ్డు చెప్పరని స్పష్టంగా తెలిసినపుడు నాకు విషయం చెప్పటానికి అతనికి ఏమిటి అడ్డు? ఒక ఆడదానిగా మొదటి అడుగు తను ఎలా వేస్తుంది? అక్కడ ఒంటరిగా ఉండి, ప్రతిరోజూ నన్ను చూడకుండా నన్నెంత కోల్పోతున్నాడో ఒక్కసారి కూడా చెప్పలేదు. అసలు తన రోజువారీ పనులు ఎలా నడుపుకుంటున్నాడో వ్రాయడు. "ఇంకెవరో" చేస్తున్నారా అని అనుమానం కూడా సుందరికి ఉంది. ఇదంతా కాక అతను వెళ్లేముందు అందరి ముందూ తను తల దించుకునేలా చేసిన అవమానం తలుచుకుంటే అతన్ని ముక్కలు ముక్కలు గా నరికేయాలనిపిస్తుంది. "ఇంతకింతా ప్రతీకారం తీర్చుకోవాలి." అనుకుంటుంటుంది సుందరి.
***
దిలీప్ ఈరోజు వస్తున్నానని రాసాడు గానీ వస్తున్నది ఏవిమానంలోనో తెలియదు కనుక ఎవరూ విమానాశ్రయానికి వెళ్ళలేదు. అందువల్ల సుందరి అసహనం ఇంకా ఎక్కువయింది. సుందరి మనోభావాలని గమనిస్తూనే ఉన్న సీమ కావాలనే అతని మాట ఎత్తకుండా కంపెనీ విషయాలని అవసరానికి మించి చర్చిస్తూ సుందరి ఆ వ్యవహారాలలో అసలు విషయం మరిచిపోయేలా ఈ ప్రక్రియలోనే తను వేళకి భోజనం చేసేలా నిద్రపోయేలా చూసుకుంది. మధ్యాహ్నం వేళకి దిలీప్ సుందరి పని చేసుకునే గదికే వచ్చేసాడు.
కొంచెం సన్నబడి ప్రయాణం బడలికతో అలసటగా వచ్చిన అతన్ని చూడగానే ఎంత వద్దనుకున్నా ఒక్క క్షణం తన మనసులో కలిగిన చిత్రమైన స్పందనని బలవంతంగా అణుచుకుంటూ "ఓహ్ వచ్చేసావా! ఈరొజేనా నువ్వు రావలసింది?" అంది సుందరి చాలా నిర్లిప్తంగా కనపడాలని ప్రయత్నిస్తూ.
దిలీప్ తన వెలిగిపోతున్న ముఖంతో సుందరి వైపు చూస్తూ "అవును సుందరీ. అక్కడ నా కథ ముగిసింది. ఇంకా అక్కడ ఉండటం వలన ఏమీ ప్రయోజనం లేదు. అయినా నేను ఉత్తరం వ్రాసాను కదా! ముందు మన ఇంటికెళ్లాను. బహదూర్ నువ్విక్కడున్నావని చెప్తే అలాగే వచ్చేసాను " అన్నాడు.
"అయినా ఇమెయిల్ లో కూడా చేత్తో వ్రాసిన ఉత్తరాలు పెట్టి పంపించటమేమిటి ఈరోజుల్లో కూడా? మేమెప్పుడో మానేసాం" అతని ఉత్తరాలేమంత ముఖ్యమైన వేమీ కాదు అని ధ్వనించేలా అంది సుందరి. ఎలాగోలా అతన్ని హర్ట్ చెయ్యాలనే కోరిక అణుచుకోలేకపోతోంది.
దిలీప్ ఎప్పటిలాగే నవ్వేసి "నాకెందుకో ఉత్తరాలే వ్రాయాలనిపించింది. కానీ ఇది కంప్యూటర్ యుగం కదా అందుకని ఆ ఉత్తరాలనే ఇమెయిల్ లో పెట్టి పంపించాను" అన్నాడు.
అతనితో మరేమీ మాట్లాడకుండా నిరాసక్తంగా తన పని లో మునిగిన సుందరి తో "సుందరీ. నేనిక్కడ నెల రోజులు ఉంటాను. మనింట్లోనే ఉంటాను. కొన్ని నెలలు నేను మరిచిపోయిన "పాటు జీవితం గడపాలనుంది." అన్నాడు దిలీప్.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#10
"ఇప్పుడు నీ లొల్లాయి పదాలెవడు వింటాడు?" అని అతన్ని గాయపరచాలని అనబోయిన సుందరి ఒక్క క్షణం ఆగి "ఏదైనా పోటీలో పాడతావా?" అని అడిగింది.
"అబ్బే అటువంటిదేమీ వద్దు" అన్నాడు దిలీప్.
"సంగీతకారుల మధ్య ఒక టీవీ ఛానెల్ లో పోటీ జరుగుతోంది. ఆ పోటీలో నువ్వు పాల్గొనేటట్టయితే మేము వాడుకునే మ్యూజిక్ రూమ్ ఆ పోటీ రోజుల్లో కేటాయిస్తాను. అక్కడ వీడియో ఎదురుగా అన్ని పరికరాలతో పాటు పాట పాడే ఏర్పాట్లుంటాయి" అంది. అతనికి సంగీతం మీద ఉండే ప్రేమ గుర్తొచ్చాక ఆమె మనసులో ఒక ఆలోచన రూపు దిద్దుకుంటోంది.
దిలీప్ సిగ్గుతో తల వంచుకుని "పోటీలవీ ఎందుకులెద్దూ.సరదాగా కొన్ని పాటలు నీతో పాటు పాడుకుంటాను. మనం సాయంత్రాలు హాయిగా అప్పటిలాగా పాడుకుందాం." అన్నాడు.
సుందరి వెంటనే "అదేమిటి? నువ్వెంత బాగా పాడేవాడివో మాకందరికీ తెలుసు కదా! నీ గానం మేమే కాకుండా అందరూ వినాలి. నీ కో గుర్తింపు రావాలి" అంది.
దిలీప్ ఇంకా తల దించుకునే "ఇప్పుడివన్నీ అవసరమా అనిపిస్తోంది సుందరీ. ఈకాసిని రోజుల్లో ఎక్కడెక్కడో ఏంతిరుగుతాం ?" అన్నాడు.
"ఎక్కడికీ తిరగాల్సిన అవసరం లేదు. చెప్పానుగా. నువ్వు మా స్టూడియో నుంచే పాడచ్చు. ప్రస్తుత పరిస్థితులలో పోటీదారులు ఎక్కడినుంచయినా పోటీలో పాల్గొనటానికి నిర్వాహకులు ఇలాంటి ఏర్పాటు చేశారు. నేను చూసుకుంటానుగా" అంది సుందరి ఉత్సాహంగా.
ఎప్పటిలాగే ఆమె కి అన్నీ వదిలేసే దిలీప్ "సరే. అదంతా నువ్వు చూసుకుంటావు కదా. పద ఇంటికి వెళదాం" అన్నాడు.
"నిన్ను మా డ్రైవర్ దింపేస్తాడులే. నాకింకా ఇక్కడ పనుంది పైగా నీ పోటీకి కూడా ఏర్పాట్లు చెయ్యాలి కదా!" అంది సుందరి.
సుందరి అన్నిపనులూ చూసుకుని ఇంటికి వచ్చి తన ఇంట్లోకి వెళ్లకుండా దిలీప్ కి ఏర్పాటు చేసిన అవుట్ హౌస్ వైపు వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి ఇంట్లో దిలీప్ మరొక అమ్మాయితో కూర్చుని ఆ అమ్మాయి తన టాబ్ లో చూసి చెప్తుంటే తను పాడాలనుకునే పాటలకి సాహిత్యం వ్రాసుకుంటున్నాడు.
సుందరిని చూడగానే "పని అయిపోయిందా ? బాగా అలసిపోయినట్టున్నావ్? నేను పల్లవితో పాటు సాధన చేస్తున్నాను"
"ఎవరీవిడ ?" అంది సుందరి దిలీప్ ప్రశ్న కి సమాధానం చెప్పకుండా.
"ఈ అమ్మాయి అక్కడ నాతో పని చేసింది. ఇక్కడ కూడా కొన్ని పనులకి తను సహాయంగా ఉంటుందని తీసుకొచ్చాను" అన్నాడు దిలీప్.
"నేనుండగా నీకు వేరే వాళ్ళ సహాయాలెందుకు ?" అంది సుందరి కటువుగా.
దిలీప్ కొంచెం ఇబ్బందిగా "అది నిజమే గానీ ఇవి నువ్వు చేసేవి కాదు. కొన్ని పనులు తనేచెయ్యాలి సుందరీ. అప్పుడే రోజులో మిగతా టైమంతా మనం వేరే వత్తిడి లేకుండా గడపచ్చు" అన్నాడు.
"ఏమిటో ఆ పనులు?" అని వ్యంగ్యంగా అడుగుతుంటే పల్లవి కల్పించుకుని "ఉద్యోగపరంగా నేను చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయండీ. ఇక్కడికి వచ్చినా ఆ పనులు నేను చేసి పెడతాననే ఖచ్చితమైన ఒప్పందంతోనే ఆయన ఆ ప్రదేశం వదిలి ఇక్కడికి రాగలిగారు" అంది.
తమ సంభాషణలో పరాయి వాళ్ళు కలగజేసుకోవటం పైగా దిలీప్ తన సొత్తు అన్నట్టు అతని తరపున వాళ్ళు సమాధానాలు చెప్పటం చూసి కోపం అణుచుకోలేక సుందరి వడివడిగా వెళ్ళిపోయింది.
నిజం చెప్పాలంటే పల్లవి చూడటానికి కోతికి కొంచెం తక్కువగా ఉంది. ఆవిడ గొంతు దూరంనుంచి వింటే అమితాబ్ మాట్లాడుతున్నాడేమో అనుకుంటాం. ఇది ఇతనికెక్కడ దొరికింది? అది మాత్రమే చేయగలిగిన.... నాకు చెప్పలేనంత రహస్యమైన పనులేమిటి? సెలవులో వచ్చినవాడికి పనేమిటి? పోనీ అతని ఉద్యోగానికి సంబంధించిన పనులైనా అవేమిటో చెప్పకుండా నాదగ్గర కూడా దాచాలా? అని పళ్ళు కొరుక్కుంది.
ఒక గంట తర్వాత కోపం తగ్గి మళ్ళీ అవుట్ హౌస్ వెళ్తే ముందు గదిలో ఎవరూ లేరు. దిలీప్ పడకగది తలుపు మూసి ఉంది. లోపల కూడా ఏమీ శబ్దాలు వినపడటం లేదు. అప్పుడే కొంచెం కోపం తగ్గిన సుందరికి ఇదంతా చూసి మళ్ళీ వళ్లంతా భగభగా మండిపోయింది. తలుపులు బాది వాళ్ళని బైటికి పిలవాలనుకుంటుంటే పల్లవి తలుపులు తెరిచి బైటికొచ్చింది.
బైటే తాటకిలా నుంచున్న సుందరి ని చూసి "అరే సుందరిగారూ! ఎంతసేపయ్యింది వచ్చి?" అంది పల్లవి.
"మీరు ఒక ముఖ్యమైన పనిలో బాగా లీనమై ఉన్న 10 నిముషాల క్రిందట" వెటకారంగా అని "ఏంజరుగుతోంది లోపల?" అని అడిగింది సుందరి.
"అది దిలీప్ ఇక్కడ ఉన్నంత కాలం చెయ్యవలసిన పని. ఇప్పుడే పూర్తి చేసానండీ. రోజూ ఇలాంటివి ఒకటి రెండు ఉంటాయి" అంది పల్లవి.
"తలుపులు వేసుకునే చేయాలా ?" అని మళ్ళీ వ్యంగ్యంగా అంది సుందరి.
పల్లవి ఏమీ ఆశ్చర్యపోకుండా "అవునండీ. కానీ మరీ అంత రహస్యం కాదండీ. అందుకే ఇంటి తలుపులు తెరిచే ఉంచాం" అంది.
పల్లవి ఎంత వినయంగా చెప్పినా కొంచెం వెటకారంగా ధ్వనించిన ఆ మాటకి మరింత వళ్ళుమండిన సుందరి సరైన సమాధానం వెతుక్కుని చెప్పేలోపల దిలీప్ బైటికి వచ్చాడు. చాలా అలసటగా కనిపిస్తున్న దిలీప్ "సుందరీ వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. ఒక మంచి పాట సాధన చేస్తున్నాను. నీకు గుర్తుందా ? నీ పుట్టినరోజున నేను కొంచెం మన సంగీత ఛాయలని చేర్చి కూర్చిన ఆఫ్రికన్ పాట. ఇప్పుడు నువ్వొకసారి విని బావుందని చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది" అన్నాడు.
అలసటగా ఉన్న అతని ముఖం చూడగానే తన అనుమానం ఇంకా పెరిగి కోపంగా చూస్తున్న సుందరి తో "సుందరీ! నువ్వు లేకుండా దూరంగా ఇన్నాళ్ల పోరాటం తర్వాత నేను సెలవు తీసుకుని వచ్చాను. నాకెంతో ఇష్టమైన జీవితం గడిపి కొన్ని మంచి జ్ఞాపకాలు సృష్టించుకుందామనే ఇక్కడికి వచ్చాను. కలవవలసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నా ఎక్కడికీ వెళ్లదలచుకోలేదు. ఈ నెల రోజులూ నువ్వు ఉద్యోగం పక్కన పెట్టి నాతోనే ఉండు" అన్నాడు దిలీప్.
ఏమాత్రం నాటకీయత లేకుండా నిజాయితీగా చెప్పిన అతని మాటలు వినగానే సుందరి కోపం చల్లారిపోయి "అల్లాగే" అంది. కానీ "తన దగ్గరే ఉండు" అని నన్ను ఆదేశించినట్టే చెప్తాడు గానీ ప్రేమగా అభ్యర్దించడేమిటి? నేనేదో అతని బానిసలాగా?" అని మనసులో బాధ పడింది. ఇతను నాకెప్పటికీ అర్ధం కాడు. అనుకుంది.
***
దిలీప్ పాటల సాధన ప్రారంభమయ్యింది. సుందరి కేవలం అతని పోటీకి కావలసిన ఏర్పాట్ల కోసం తప్ప మరే కారణం కోసమూ అతన్ని వదిలి వెళ్ళలేదు. కానీ ఆమె హృదయం కలుక్కుమనేలా పల్లవి దిలీప్ గదిలో తలుపులు వేసుకోవటం మాత్రం ఎంత సద్దుకుందామన్నా భరించలేక పోయింది. ఆ పని లేనప్పుడంతా ఆ రూమ్ కి తాళం వేసి ఉంచటం మరింత అవమానకరంగా అనిపించింది. కానీ ఖచ్చితమైన నిర్దారణ కి రాకుండా ఒక ప్రశ్నగా మిగిలిపోయిన తమ అనుబంధం అతన్ని నిలదీసి అడిగే హక్కు ఇవ్వకుండా ఆమెని ఆపుతుంటే సుందరి తన మనసులో రగిలిపోతూనే ఉంది.
ఆమె అంతర్మథనం గమనిస్తున్న సీమ ఒకే ఒక్కసారి "నువ్వు ఒక్క సారి అతన్ని లాలించి విషయమేమిటని అడగచ్చుకదా" అంది. అప్పటికే ఉక్రోషంతో రగిలిపోతున్న సుందరి సీమ చెంప బద్దలయ్యేలా చాచి కొట్టింది.
"నీక్కూడా నేనే ఒక బుద్ధిలేని మనిషిలా కనిపిస్తున్నానా? ఒక్కరికి కూడా అతని ప్రవర్తన ఎంత అసహ్యంగా ఉందొ అని అనిపించటం లేదా!" అని అరిచింది.
సీమ మరి మాట్లాడలేదు. నిజానికి దిలీప్ ప్రవర్తన చాలా అన్యాయంగా ఉంది. అయినా అతన్ని చిన్నప్పటినుంచి ఎరిగి ఉండటం వలన సీమ కి ఇంకా కొంచెం సానుభూతి ఉంది. పేద కుటుంబం లోంచి పెరిగి ఎప్పుడూ బెరుకుగా ఉండే దిలీప్ ధైర్యంగా తన మనసు చెప్పలేకపోతున్నా ప్రతీ పనిలోనూ ఆమె తన ప్రాణం అన్నట్టు ప్రవర్తించే దిలీప్ ని ఇంకొంచెం మెత్తగా లాలించి విషయం అర్ధం చేసుకోవాలని సీమ అభిప్రాయం.
ఈ మానసిక సంఘర్షణలతోనే దిలీప్ పాటల పోటీ ప్రారంభమయ్యింది.
దిలీప్ అక్కడ అమర్చిన పరికరాల సహాయంతో తన వంతు వచ్చినపుడు పాడుతుంటే ముగ్గురు న్యాయ నిర్ణేతలు వీడియో ద్వారా అతని పాట విన్నారు. సుందరి తమ స్నేహితులు కొంత మందిని వినటానికి పిలిచింది. వారంతా న్యాయ నిర్ణేతలకి కనపడకుండా తెరవెనక కూర్చున్నారు. పాట పూర్తి కాగానే ఫలితాలు స్టూడియో లో ఉన్న తెరమీద ప్రత్యక్షమవుతాయి. "మీ పాట అద్భుతం" అని ఒక్కరూ "అసలు పాట కన్నా కూడా మీ పాటే బావుంది" అని ఇంకొకరూ పోటీలు పడి దిలీప్ ని మెచ్చుకున్నారు. దిలీప్ కి ఒక్కొక్క కి నిర్ణేత నుంచి పది కి పది మార్కులు వచ్చాయని ప్రకటించగానే అంతవరకూ నిశ్శబ్దంగా అక్కడ కూర్చున్న శ్రోతలు గదంతా మారుమోగిపోయేలా చప్పట్లు చరిచారు.
నూటికి నూరు మార్కులు వచ్చిన బడి పిల్లాడిలా దిలీప్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. సుందరి చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కి "ముగ్గురూ పది మార్కులేశారంటే తర్వాత రౌండ్ కి వెళ్ళిపోతానా సుందరీ ?" అన్నాడు అమాయకంగా.
"అందులో అనుమానమేముంది?" అంది సుందరి.
ఒక చిన్న పిల్లాడికి బహుమతి వచ్చినట్టు పొంగిపోయిన దిలీప్ ఇనుమడించిన ఉత్సాహంతో సాధన కొనసాగించాడు. అతను సుందరితో పాటు పాట సాధన చేస్తున్నా పాడుతున్నా అతని ముఖంలో ఒక చెప్పలేని వెలుగుని సుందరి చూస్తూనే ఉంది. పాత రోజులు జ్ఞాపకమొచ్చేలా దిలీప్ ఎన్నో సాయంత్రాలు తన మధురమైన పాటలతో వేణు గానంతో అలరించాడు.
"ఈ వెలుగు అతనికి ఉద్యోగం వచ్చినపుడు గానీ విదేశాలకి వెళ్తున్నపుడు గానీ లేనే లేదు" అంది సుందరి పక్కనే ఉన్న సీమతో.
గంటగంటకీ మారిపోతున్న సుందరి ఆకారవికారాలతో తికమకపడుతున్న సీమ తన చెంప క్షేమం కోసం మరేం మాటాడకుండా తలాడించి ఊరుకుంది.
దిలీప్ కి ప్రతి పోటీలోనూ పదికి పది మార్కులు వచ్చి పోటీలో ముందుకు సాగుతున్నాడు.
ఎంత సాధన చేసినా తను ఎంత బాగా పాడినా మొదటి ప్రయత్నంలోనే ఇంత గొప్ప విజయాలతో ఎలా ముందంజ వేస్తున్నానని దిలీప్ కూడా ఆశ్చర్యపోతుంటే సుందరి అతని భుజం మీద కొట్టి "దిలీప్ ఒక విషయం గమనించావా? ఈ పోటీ ఫైనల్ నీ పుట్టినరోజునే జరుగుతోంది" అంది.
దిలీప్ "ఓహ్. నిజమే. నేను గమనించలేదు" అన్నాడు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#11
"ఆ రోజు నీకొక ప్రత్యేకమైన రోజు కావాలి. నాక్కూడా. " అంది సుందరి.
ఆమె పక్కనే ఉన్న సీమ ఆ మాటలు విని ఆశ్చర్యంతో ఒక్క సారి తలెత్తి సుందరి వైపు చూసింది.
"ఎంత విశాల హృదయం దీనిది? మనసులో ఇంత సంఘర్షణ ఉన్నా దిలీప్ సంతోషం కోసమే తాపత్రయ పడుతోంది. దిలీప్ చాలా అదృష్టవంతుడు. కానీ ఇంకా ఆలస్యం చేస్తే అతను అన్నీ కోల్పోతాడు" అనుకుంది.
ఆ పోటీ పూర్తి కాగానే తనే చొరవ తీసుకుని ఈ సమస్యని ఒక కొలిక్కి తీసుకురావాలి అనుకుంది సీమ.
పోటీ ఫైనల్ కి దిలీప్ స్నేహితులందరూ వచ్చారు. వాళ్ళ ఇళ్ళకి దిలీప్ వెళ్లకపోయినా వారంతా వేరేవిధంగా అతన్ని కలుసుకుంటూనే ఉన్నారు.
క్లిష్టమైన ఈ పోటీ కి మరింత శ్రద్దగా ప్రాక్టీస్ చేసిన దిలీప్ తన వంతు రాగానే పాటమొదలు పెట్టాడు. హఠాత్తుగా అతని ముందున్న మైక్ పని చేయటం మానేసింది. అతని పాట వినపడకపోవటం వలన న్యాయ నిర్ణేతలు ఏదో అంటున్నారు కానీ దిలీప్ కి వినబడటం లేదు. ఆ పరిస్థితిలో ఏంచెయ్యాలో అర్ధంగాక దిలీప్ సుందరి వైపు చూసి ఆమె తన స్టూడియో ఉద్యోగుల్ని పిలిచి ఏదో ఒక పరిష్కారం చేస్తుందని నమ్మకంగా చూస్తూ పాట కొనసాగించాడు. అతను తన పాట ఆపి నిర్ణేతల అనుమతితో మైక్ సరి చేసుకోవచ్చేమో గానీ వారు చెప్తున్న మాటలు కూడా వినపడక పోవటంతో అతనికి అలా చేయచ్చో లేదో కూడా తెలియదు. ఇలాగే పాడుతూ పోతే పోటీ ఏమవుతుందో అనే ఆదుర్దాతోనే అతను పాట కొనసాగిస్తుంటే సుందరి అక్కడే తన కుర్చీలో కూర్చుని నింపాదిగా చూస్తోంది. మిగతా వారు నిశ్శబ్దంగా ఉండాలి కనుక వాళ్ళు కూడా కదలకుండా ఆమె ఏదోఒకటి చేస్తుందని ఉత్కంఠ గా ఆమె వైపు చూస్తున్నారు తప్ప ఆమెతో మాటాడలేకపోయారు. దిలీప్ పాట అలాగే పూర్తయిపోయింది.
అంతవరకూ పని చేయని పరికరాలు అప్పుడు పనిచేయటంతో హఠాత్తుగా న్యాయ నిర్ణేతల మాటలు వినిపించాయి. "మీరు ఈ అంశం వరకూ అద్భుతంగా పాడాక ఈ ఆఖరి అంశంలో మీనుంచి మేమెంతో ఆశించాము. కానీ మీ పాట ఒక్క ముక్క కూడా మాకు వినిపించలేదు. మీ పరికరాలు సరిగా లేవని కొంత సమయం తీసుకుని సరి చేసుకోమని మేము చెప్తున్నా మీరు పాట ఆపకుండా కొనసాగించారు. క్షమించండి దిలీప్ గారూ! పోటీ నిబంధనల ప్రకారం మీకు సున్నా కంటే ఎక్కువ మార్కులు ఇవ్వలేము" అన్నాడు ముగ్గురిలో ముఖ్యమైన న్యాయ నిర్ణేత.
అంతవరకూ పనిచేయని పరికరాలు అతని పాట పూర్తి కాగానే ఎలా పనిచేసాయో అని సీమా మిగతా స్నేహితులూ ఆశ్చర్యంగా చూస్తుంటే సుందరి ముఖంలో అప్పుడు నెమ్మదిగా వికసించిన వికృతమైన చిరునవ్వు వారికి కనిపించింది.
"జన్మ దిన శుభాకాంక్షలు దిలీప్" అని పగలబడి నవ్వింది సుందరి.
ఎప్పుడూ చూడని ఆమె ముఖ కవళికలని నిర్ఘాంతపోయి చూస్తున్న దిలీప్ తో "పాటంటే నీకు ప్రాణమనీ అందులోనే నువ్వు అనిర్వచనీయమైన ఆనందం పొందుతావనీ నాకు తెలుసు. పోటీ మీద నీకు లేని ఆసక్తి ని నేనే కలిగించి ఇంత వరకూ వచ్చాక నీలాంటి వాడికి ఏం జరగాలో అదే చేసాను. ఇంతకాలం నాకు కలిగించిన క్షోభకి ఇది జవాబు. ఇక ఆనందంగా వెళ్ళు దిలీప్. నీకు నా శాశ్వతమైన వీడ్కోలు" అని సుందరి కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయింది.
ఆమె మాటలు విని అక్కడ ఉన్న శ్రోతలతో పాటు దిలీప్ నిశ్చేష్టుడయ్యాడు
"సుందరీ. నీకు నామీద కోపం రావటానికి ఎన్నో విలువైన కారణాలు ఉన్నాయని అర్ధమయ్యింది. కానీ అందుకోసం కొన్ని రోజుల ప్రణాళిక వేసుకుని ఎన్నో రకాల ఏర్పాట్లతో ఈరోజు నా మనసు గాయం చేసేటంత కక్ష కలిగేలా నేను నీకు ఏం అపకారం చేసానా అని నేను చాలా బాధపడుతున్నాను. ఏమైనా తప్పు నావైపే ఉన్నపుడు వీలైతే నన్ను క్షమించు" అని చెప్పి అతను కూడా స్టూడియో నుంచి నెమ్మదిగా నడిచాడు.
సీమతో పాటు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఒక్కసారిగా ఎన్నో ఏళ్ల వయసు వచ్చినట్టు కుంగిపోయిన దిలీప్ బలహీనంగా నడుస్తుంటే వెళ్తుంటే అతని జబ్బని పట్టుకుని అతని వెనకే నిశ్శబ్దంగా నడిచిన పల్లవిని ఎవరూ గమనించలేదు.
ప్రతీకారం తీర్చుకున్న విజయ గర్వంతో ఇంటికి వచ్చిన సుందరి ఇంట్లో అడుగు పెడుతూ అనుకోకుండా చూస్తే అవుట్ హౌస్ లో దీపాలు కనపడలేదు. దిలీప్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడని అర్ధం అయ్యింది. అనుకున్నట్టు ప్రతీకారం తీర్చుకున్నాననే సంతృప్తి తో ఉన్న ఆమెకి దిలీప్ అలా సులువుగా వెళ్ళిపోవటం నచ్చలేదు. "ఇక్కడ కూడా ఇంకాస్త దులిపేసి ఉంటె పూర్తిగా తిక్క కుదిరేది కదా! ఇప్పుడు కూడా అతనికి పొగరే అన్న మాట. అవునులే ఆ పల్లవి ఉందిగా అది చూసుకుంటుంది వాడిని" అని కోపంగా అనుకుంది.
ఎన్నో ఏళ్ల క్షోభ మొత్తం ఉపశమనం కలిగాక ఆమె నెమ్మదిగా దిలీప్ గురించి మర్చిపోయి తన దైనందిన చర్యలో మునిగిపోయింది. దిలీప్ స్నేహితులు ఎప్పటిలాగే సుందరిని కలుస్తున్నారు గానీ ఇంతకు ముందులా దిలీప్ ప్రస్తావన ఆమె ముందు తీసుకురావటం లేదు. రెండు రోజులలో ఆమె దాదాపు దిలీప్ ని మరిచిపోయి ఏదో బరువు తీరిపోయినట్టు సంతోషంగా ఉన్నపుడు ఆమె ఊహించని విధంగా సీమ తో పాటు పల్లవి సుందరి దగ్గరికి వచ్చింది.
పల్లవి కనబడగానే పాత కోపాలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. అయినా దిలీప్ ఎంత ఏడుస్తున్నాడో తెలుస్తుందేమో అని మనసులో కసిగా అనుకుని "ఏమిటిలా వచ్చావు? తలుపులు మూసుకుని పని చేసుకోవటానికి ఏమయినా గదులు కావాలా ?" అని వెటకారంగా అంది సుందరి.
పల్లవి కోపం తెచ్చుకోకుండా చిన్న నవ్వు నవ్వి "అతనికి ఏమి అవసరమో ఆ ఏర్పాట్లు ముందుగానే చేశామండీ. పోటీ ఆఖరు రోజున వెళ్ళిపోవటం కూడా మేము ముందుగా అనుకున్నదే" అంది.
"ఆంటే మీరిద్దరూ వేరే పనులు కూడా పెట్టుకుని మధ్యలో కొన్నాళ్ళకి నన్ను వాడుకున్నారా?" అని అరిచింది సుందరి.
పల్లవి తన సహనం కోల్పోకుండా రెండు పెట్టెలు ఆమె ముందు పెట్టి "వీటిని దిలీప్ మీకిమ్మన్నాడు" అంది.
తన ఆవేశం పట్టించుకోకుండా పెట్టేలిస్తుందేమిటని ఆశ్చర్యంగా చూస్తుంటే "మీ ఇద్దరి దృక్పధంలో ఎన్ని తేడాలున్నా ఇద్దరికీ సమానంగా ఇష్టమైనది సంగీతం. అందుకే మీకోసం సేకరించిన ఈ సంపదంతా దిలీప్ మీకిమ్మన్నాడు. మిమ్మల్ని కలవకుండా ఇచ్చి వెళ్లిపోదామనుకున్నాను కానీ సీమ అడిగే ప్రతి ప్రశ్నకీ వివరాలు ఇవ్వలేకపోవటం వలన నేను మీ దగ్గరికి రాక తప్పలేదు" అంది పల్లవి.
ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న సుందరి తేరుకునే లోపల "ఇక వస్తానండి"అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది.
సుందరి కోపంతో సీమవైపు తిరిగి "మా ఇద్దరి మధ్య ఏమిష్టాలు ఉన్నాయో ఏమి లేవో కూడా ఆ మహానుభావుడు ఈవిడ గారికి చెప్పేసాడన్న మాట. నన్నిలా బజారులో పెట్టి ఏం సాధిద్దామనుకున్నాడు ? " అంది.
సీమ మొదటి సారి ఆమె వంక అసహ్యంగా చూసి "ఇద్దరి మధ్య ఎంతో సన్నిహితంగా తేల్చుకోవాల్సిన విషయానికి ఎవరెవరినో పిలిచి వాళ్ళందరి ముందూ అతన్ని అవమానించే ప్రయత్నంలో మీ మధ్య సన్నిహితమైన విషయాలన్నీ బైట పెట్టుకున్నది నువ్వా అతనా?" అంది.
"ఏమన్నావ్?" అని ఆగ్రహంతో వణికిపోతున్న సుందరితో "నన్ను తిట్టటం, నన్ను ఉద్యోగం లోంచి తీసెయ్యటం తర్వాత చేసుకోవచ్చు గానీ అతని ఆఖరి దశలో చూడాలనుకుంటే నీకింకా అతి కొంచెం సమయం ఉంది" అంది.
పిడుగు పడినట్టు వినపడిన ఆ మాటలతో నిశ్చేష్టురాలయిన సుందరి మీద ఏమాత్రం జాలి చూపించకుండా "నీకంతా చెప్పలేను గానీ ఓపికుంటే ఏ కాస్తా విను. పల్లవి అతని వైద్యం కోసం నియమించబడిన మనిషి. అతను దూరప్రదేశమని చెప్పి వెళ్ళినది సిద్దవైద్యం కోసం కేరళకి. విదేశాలకి కాదు. ఆమెని ఇక్కడికి తెచ్చుకున్నది కూడా నీతో గడిపే ఆ కాసిని రోజులూ తన ఊపిరి నిలుపుకోవటానికే. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు కనుక అతని ఆఖరి దశ కొంచెం త్వరగానే వచ్చేసింది. నే చెప్పేది అర్ధమవుతోందనుకుంటా" అంది.
ఏమాత్రం హెచ్చరిక లేకుండా పిడుగు లాంటి నిజం వింటున్న సుందరితో "ఒక మనిషికి మానసికంగా పూర్తిగా దాసోహం కావటం కన్నా గొప్పగా ప్రేమని ప్రకటించే పద్దతి ఇంకొకటి నీకు తెలుసా సుందరీ? మోకాళ్ళ మీద కూర్చుని ఒక గులాబీ పువ్వు ఇచ్చి చవకబారుగా ఐ లవ్ యు అంటేనే ప్రేమా? తల్లి చనిపోతే అతనికి స్వాంతన నీ దగ్గరే కావాలి. తన చివరి రోజులు సంతోషంగా గడపాలనుకుంటే అతనికి గుర్తొచ్చింది నువ్వు. ఇన్ని రోజులు కేరళలో తన పనులు తాను ఏర్పాటు చేసుకోగలిగిన వాడు నీ దగ్గర మాత్రం అన్నీ నీకే వదిలేయటంలో అతను చూపించిన దగ్గరితనం నీకు తెలియలేదా? ఆ మూడు ముక్కల చవకబారు మాటల కోసం ఎదురు చూస్తూ ఆ మాట చెప్పలేదని అతని మీద పగ పెంచుకున్నావు. ఎంతో సున్నితమైన దశలో అతని తోడుగా ఉండవలసినది అతనిని పని కట్టుకుని గాయపరిచావు. ఎప్పుడైనా తన స్వంతమంటూ ఉంటె అది నువ్వే అనే నమ్మకం ఎప్పుడైతే పోయిందో దానితోపాటే అతనికి బతకాలనే కోరికా నశించింది. ఇంకొన్ని రోజులు నడవాల్సిన వైద్యం ఆగిపోయింది. ఇప్పుడు అతని జీవితం గంటల్లో ఉంది సుందరీ" అంది సీమ.
సుందరి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటే అతికష్టం మీద గొంతు పెకల్చుకుని "మనం ఎక్కడికి వెళ్ళాలి?" అంది.
....
వాళ్ళు వెళ్తున్న దారిలోనే సుందరి తన సిబ్బందికి ఫోన్ ఎన్నో సూచనలు ఇస్తూనే ఉంది.
వాళ్ళు ఆస్పత్రికి వెళ్ళేటప్పటికి వందలమంది అతని గది బైట నిల్చున్నారు. లోపల కూడా చాలా మంది ఉన్నారు. ఎప్పుడెప్పుడో అతనినుంచి సాయం పొందినవారితో పాటు అతని చిన్న నాటి స్నేహితులందరూ అక్కడే ఉన్నారు. తనే అందరికంటే ఆఖరు!
"ఇంత వరకూ తన లాంటి రోగులకు తన అనుభవంతో వారికి అనుకూలమైన సలహాలిస్తూ వారికి మానసికంగా కొంచెం తెరిపినిస్తూ గడుపుతున్నతను రోగం విషమించటం వలనఇప్పుడే వాలిపోయాడు. ఇంక నిముషాలలోనే ఉందట" అని ఎవరో అంటున్నారు.
సుందరి కన్నీళ్లతో వింటుండగా ఆమె సూచనలు తీసుకుని అక్కడ కి వచ్చిన ఆమె బృందం తమ వాయిద్యాలు తీసుకున్నారు. ఆమె సూచించిన విధంగా అనుపత్రి అనుమతితో వాళ్ళు దిలీప్ పాడిన పాటలనే మళ్ళీ వాయిద్యాల సహకారంతో వినిపిస్తున్నారు. అతనికి ఎంతో ఇష్టమైన దేశ దేశాల పాటలు ముఖ్యంగా బెంగాల్, ఆఫ్రికా, అరబిక్ సంగీతాలు కూడా మంద్రంగా వినిపిస్తున్నారు.
కళ్ళు మూసుకుని భారంగా ఊపిరి తీస్తున్న దిలీప్ కి ఇదంతా వినపడుతోందో లేదో సుందరికి తెలియటం లేదు. తన ఆర్ధిక పరిస్థితుల వలన సంగీతం పైన ప్రేమని మనసులోనే దాచుకుని కేవలం సుందరికి తప్ప చెప్పుకోని అతని అభిరుచులన్నిటికీ సరితూగేలా సేకరించిన సంగీతాన్ని అతనికి ఎలా అయినా వినిపించాలని ఆదుర్దా గా ఉన్న సుందరి అక్కడే ఉన్న పల్లవి వైపు దీనంగా చూస్తుంటే అర్ధం చేసుకున్న పల్లవి దిలీప్ చెవి వరకూ వెళ్లి నెమ్మదిగా ఏదో చెప్పింది. సుందరి అన్న మాట విని కాబోలు దిలీప్ భారంగా కళ్ళు తెరిచాడు. తన ఎదురుగా సుందరి ని బరువుగా మూసుకుపోతున్న కళ్ళతో చూసాడు. అనుకోకుండా ఆమె ని చూడగానే లోతుగా నీరసంగా సగం మూసుకుని ఉన్న అతని కళ్ళలో ఒక చిన్న మెరుపు లీలగా కనిపించింది. ముఖం లో మరేభావాలు తెలియకపోయినా గదిలో మంద్రంగా వినిపిస్తున్న సంగీతం అతను వింటున్నట్టు అనిపించింది. ఏమీ మాట్లాడలేని నిస్సహాయతతో పల్లవి వైపు తిరిగి చిన్నగా పెదవులు కదిపాడు. అంచెలంచెలుగా పోతున్న ఆఖరు ఊపిరితో శబ్దం బైటికి రాకుండా అతను చెప్పదలచిన విషయం సుందరికి మాత్రమే తెలిసింది.
"కథ ముగిసింది"
ఈసారి పూర్తిగా ముగిసిపోయింది.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#12
శ్రీమతి డైరీ - పి.వి.వి.లక్ష్మీ కుమారి
[Image: S.jpg]
"ఏమిటో పొద్దు పొడవక మునుపే నిద్ర లేవాలి, ఇంటి పని చూసుకుంటూనే ,పిల్లల్ని కాలేజ్ కి తయారు చేసి పంపించాలి . ఈయన్ని ఆఫీస్ కు పంపించాలి తరువాత ఇంట్లో పని చూసుకోవాలి.

ఇహ నాకు తీరిక ఎక్కడుంటుంది " అనుకుంటూనే తనని తానే ఓదార్చుకుంటూ,మనోధైర్యం నింపుకుంటూ రోజులాగే తన పనుల్లో నిమగ్నమైయింది రోహిణి. సహనానికి తానే మారుపేరు అనేలా. కాలం వేగంగా గుడుస్తూనే ఉంది, తన పని తాను చేసుకు పోవాలన్నట్లుగా. తను ఎంతగా అంటే ఒక్కోసారి భోజనం కూడా చేయలేనంతగా. అలా మంచంపైన ఒక్క క్షణం నడుము వాల్చింది.

తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది రోహిణి. పిల్లల పిలుపుతో మేలుక్కొంది. మళ్ళీ దైనందిన జీవితం మామూలేగా పిల్లలతో హోమ్ వర్కు చేయించి, పిల్లలకు భోజనం తినిపించి, వాళ్ళను నిద్ర బుచ్చి ,తను స్నానానికి వెళ్ళింది. తాను వచ్చేసరికి మల్లెపూల పరిమళంతో తన భర్త ఎదుట నిలిచాడు. అలసిన శరీరం. మానశికంగా సిద్దంగా లేదు. అయినా తన మనసు ఎరిగి ప్రేమగా లాలనగా దగ్గరకు తీసే మనస్తత్వం తన భర్తలో లేదు .

అది తెలిసి తన నుండి ఏమీ ఆశించదు రొహిణి. కనీసం తిన్నావా !లేదా !అని కూడా అడగడు. ఆదివారం పూటైనా నాకు ఇష్టం వచ్చినట్టుగా ఐనా ఉండనివ్వరు . కానీ ఇలా తన అవసరానికి తను తన శరీరం తనకి రోజు ఇస్తూనే ఉండాలి . ఇదేనేమో స్త్రీకి వరము, శాపము రెండూనూ. అద్దం ముందు గొనుకుంటున్న భార్యని " ఏమిటో అలా అద్దానికే చెప్పుకుంటున్నావు కాస్త నాకు చెప్పొచ్చు కదా విషయం ఏమిటో " అంటూ తనని హత్తుకుని తన మురిపెం కానిచ్చాడు...

ఏదొ తన శరీర తాపం తగ్గించుకునే ప్రయత్నంలో మాత్రమే. ఇది దాంపత్యంలో ని సుఖం కాదని తెలిసి కూడా. ఈయన మంచివారు కాదని కాదు కానీ నా మనసేరిగిన వాడు ఐతే కాదు. ఐనా ఏంచేస్తాము !అనుకుంటూ తన మనసుకి తానే సర్దిచెప్పుకుంది రోహిణి.

*****

ఇంకా తెల్లవారక ముందే ఫోన్ రింగ్ కావటంతో నిద్ర లేచింది . "హలో" అంది రోహిణి "అమ్మకి బాగోలేదు "అంటూ తన చెల్లి మాటలకు మనసులోని దుఃఖం తన్నుకు వస్తున్నా పంటి బిగువున అదిమేస్తూ "ఇదిగో ఇప్పుడే వస్తున్నా" అంటూ ఫోన్ పెట్టేసి

"ఏవండి నేను మా అమ్మ వారింటికి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకుని రేపటికి ఉండి ఎలుండి వచ్చేస్తాను మీరు జాగ్రత్త " అంటూ హడావిడిగా ఊరికి బయల్దేరి వెళ్ళింది రోహిణి. ఆరోజు అంతా వెలితిగా అనిపించింది భార్య లేక రోహిణి భర్తకు. పెళ్లయిన ఎనిమిది సంవత్సరాలు . తనని పిల్లల్ని వదిలి పెద్దగా ఎక్కడికి వెళ్లలేదు. తను దూరం గా ఉన్న రోజు కూడా లేదు. నేడు తను దూరంగా ఉన్నదన్న ఊసే మనసును కలచి వేస్తుందనుకుంటూ భార్య ఆలోచనలో పడ్డాడు.

రోహిణి తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఏలోటు అనిపించలేదు. చాలా బాగా చూసుకుంటుంది. కానీ రోజు అద్దం ముందు తనలో తానే ఏదో మాట్లాడుకుంటుంది.అదేమిటో అనుకుంటూ , పక్కనే ఉన్న డెస్కు తెరవగానే రోహిణి డైరీ కనిపించింది.సదరు రోహిణి భర్తకు. తెరిచి చదవకూడదు అనే ఆలోచనే వదిలేసి , ఆత్రంగా లోపలి అక్షరాలు వెంట చూపులను పరుగు తీయించాడు.

"నా భర్త చాలా మంచివాడు., కానీ !నేను అనుకున్న జీవితానికి తగ్గినట్టుగా ఉండరు. సరదాగా బయటికి తీసుకు వెళ్లడం, కబుర్లు చెప్పుకోవడం చెయ్యలేరు. ముఖ్యంగా నాకు పెళ్లికి ముందున్న కోరిక కూడా నెరవేరలేదు పెద్ద పెద్ద కోరికలు ఏమీ కావు అవి సగటు స్త్రీ కి ఉండే చిన్న చిన్న సరదాలు మాత్రమే దాంపత్యంలో ఆస్వాదించాలనుకునే కొన్ని మధుర క్షణాలు "ఐ మిస్ మై లైఫ్ "రోహిణి రాసుకుంది.

అదేంటి అని ఆతృతగా చదవ సాగాడు వారం మొత్తం నావాళ్ళకు తగ్గట్టుగానే అన్నీబాగా చేసిపెడతాను కదా! కనీసం ఆదివారంనాడు అయినా నాకు ఇష్టం వచ్చినట్టుగా గడిపితే ఎంత బాగుండునో కదా.? పెళ్లికి ముందు ఎంతగా ఉహించుకున్నానో దాంపత్య జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటూ.....కానీ.......???.

పగలంతా పనితో అలసిన శరీరం ఉదయం కాస్త బద్దకం లేవాలని ఉన్నా సహకరించని శరీరం అటువంటి సమయంలో నాకు ఇష్టమైన బ్రు కాఫీతో మావారు నా ఎదుట నిల్చుంటే ఎంత బాగుంటుందో! అనుకునే పసి మనస్థత్వం నాది" చదువుతున్న భర్త మనసులో దాగిన మానవత్వంను తట్టి లేపింది రొహిణి డైరీలోని అక్షరం. తన చిన్న చిన్న కోరికలను తీరని నిరాశతో రాసుకున్న అక్షరాలను అతను చదివాక. ఛా !నేను మరీ ఇలా ఉన్నానా?

నిజమే రోహిణీ అన్నట్టుగా తాను పక్కనుండి వడ్డిస్తుంటే నువ్వు తిన్నావా! అని ఏరోజు అడగలేదు. బయటికేద్దామండి అని తాను అడిగినప్పుడల్లా, డబ్బులిచ్చి "నువ్వు వెళ్ళు" అనే వాడినే గాని దగ్గరుండి ఎప్పుడూ తీసుకెళ్లిందిలేదు. అనుకుంటూ తనలో తాను చాలా మధన పడ్డాడు. రోహిణి వచ్చాక తాను అనుకున్నట్టుగా ఆదివారం శ్రీమతికి ధైనందన జీవితంలోని బిజీకి సెలవు ఇచ్చి తను అనుకున్నట్టుగా మారి , తనను సంతోషంగా ఉంచేలా చూడాలి అనుకున్నాడు సదరు భర్త. రోహిణి రాగానే "మీ అమ్మగార్కి ఎలా ఉంది " అని అడిగిన తన భర్తకి "బాగానే వుందండి" కాకపోతే షుగర్ ఎక్కువైంది. మా చెల్లి గురించే తన బెంగ ఆంతా. మీకు తెలిసిందే కదా! తాను కాస్త నలుపుగా ఉంటాది కదా! మొన్న వచ్చిన సంబంధం కూడా కుదరలేదని అమ్మ బాగా దిగులు పెట్టేసుకుందండీ .

డాక్టర్ గారు చూసి మందులు రాసిచ్చారు. మళ్ళీ నాలుగు రోజుల్లో వస్తానని చెప్పి వచ్చాను" అని కన్నీటిని ఆపుకుంటూ చెప్పింది రోహిణి. సరేలే బాధ పడకు ! మీ చెల్లికి సంబంధం నేను చూస్తాను " అని ఓదార్పుగా మాట్లాడిన తన భర్త వైపు చూసి అలాగేనండి అంటూ కనులను తుడుచుకుంటూ ఇంటిపనిలో నిమగ్నమయింది రోహిణి. మరునాడు ఉదయం తాను డైరీలో రాసుకున్నట్టుగానే తనకు ఇష్టమైన బ్రు కాఫీతో తన ముందు నిలుచున్న భర్తను చూస్తూ ఇది కలా !నిజమా !అనుకుంటూ భర్త ఇచ్చిన కాఫీ తాగుతూ అలా చూస్తూ వుండి పోయింది

రోహిణి. త్వరగా రెఢీ అయితే !అలా బయటికి వెలుద్దాము. కాస్త నీకు రిలీఫ్ గా ఉంటుందేమో అన్న భర్త మాటలకు ఈ లోకంలోని వచ్చింది. కాఫీ కమ్మదనం నుండి బలవంతంగా బయటకు వస్తూ ఏమిటీ ఈయన మావారేనా! ఏమిటీ కొత్తమార్పు నేను ఊరికి వెళ్ళాక నా డైరీ ఏమైనా చదివారా? అనుకుంటూ ఏమిటండి ఈ రోజు ఏమైనా స్పెషల్ ఉందా! అని అడిగింది రోహిణి. ఆమె మాటకు అవును స్పెషల్ ఉంది.

ఇకనుంచి ఆదివారం పూటైనా మా శ్రీమతికి సెలవు ఇద్దాము అని ఓ నిర్ణయానికి వచ్చానోయ్ శ్రీమతి అదే స్పెషల్, అంటూ నవ్వుతూ రోహిణి ని గట్టిగా వాటేసుకుని నన్ను క్షమించు రోహిణి నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు ఈ క్షణం నుండి నీ సంతోషమే నా సంతోషం అంటూ మాట ఇస్తున్న తన భర్త వైపు చూస్తూ మురిసిపోయింది రోహిణీ. తన చిన్న చిన్న కోర్కెలు తీరుతునందుకు తనని తన భర్త అర్ధం చేసుకునందుకు రోహిణి చాలా సంతోషించింది. దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే ఇరువురి మనసులు కలవాలి అనుకున్న తన మాట నెరవేరింది. కొత్త జీవితానికి శ్రీకారం దిద్దిన తన డైరీని మనసులో తలచుకుంది రోహిణి.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: