ఉదయం 8 గంటలు.
దట్టమైన నల్లమల అడవి మధ్యలో ఉన్న చిన్న సెక్యూరిటీ అధికారి చెక్ పోస్ట్. మూడు రోజులు నుండి జోరుగా వర్షాలు. తొందరగా షిఫ్ట్ హ్యాండోవర్ చేయాలి అని అక్కడ నైట్ షిఫ్ట్ చేసిన కానిస్టేబుల్స్ లక్ష్మి, సరళ, సెక్యూరిటీ రంగయ్య కోసం ఎదురు చూస్తున్నారు.
లక్ష్మి : ఏంటో ఈ వర్షాలు, రాత్రి మొత్తం ఒకటే ఉరుములు. నిద్ర కూడా పట్టి చావలేదు....
సరళ : నాకు మాత్రం ప్రశాంతంగా నిద్ర పట్టింది..
లక్ష్మి : నీకు ఇంకా పెళ్లి కాలేదు...మొగుడు పక్కలో లేకపోతె నిద్ర పట్టడం చాల కష్టం.. అది నీకు పెళ్లి అయ్యాక తెలుస్తుందిలే..
సరళ : అదేంటి లక్ష్మి, ఎప్పుడు మొగుడుతో గొడవలు పడతావ్...మల్లి మొగుడు లేకపోతె నిద్ర పట్టదు అంటావ్ ?
లక్ష్మి : నీకు పెళ్లి అయ్యాక అర్ధం అవుతుంది అని చెప్పా కదా...ఈ రంగయ్య ఎక్కడ చచ్చాడో ? ఇప్పటికే అరగంట లేట్ ఐంది....
సరళ : వస్తాడులే...వర్షంలో ఎక్కడో ఆగి ఉంటాడు.. ఏంటి అంత తొందర ?
లక్ష్మి : మన స్టేషన్ కి కొత్త ఆఫీసర్ ఈరోజే వస్తున్నాడు.. అయన వచ్చే సరికి స్టేషన్ క్లీన్ చేయాలి...
సరళ : అవును కదా...మర్చిపోయాను....
బయట బండి చప్పుడు విని లక్ష్మి, సరళ ఇద్దరు బయటకి చూసారు...రైన్ కోట్ వేసుకొని బండి ఆపి లోపలి వచ్చాడు రంగయ్య..
లక్ష్మి : (చిరాకుగ)ఏంటి సర్ ఇంత లేట్ ? మల్లి స్టేషన్కి వెళ్లి క్లీన్ చేసి ఇంటికి కూడా వెళ్ళాలి...
రంగయ్య : వర్షాలకు రోడ్ మొత్తం బురదతో నిండిపోయింది...వాతావరణం హెచ్చరిక వచ్చింది...తుఫాను ఇంకా పెద్దది అవుతుంది అంట ఈరోజు నుండి...
సరళ : సరిపోయింది...మనం త్వరగా వెళ్ళాలి పద లక్ష్మి...సర్ ఇదిగోండి చెక్ పోస్ట్ తాళం...
సరళ తాళం రంగయ్య కి ఇచ్చి, బయటకు అడుగులు వేసింది...స్కూటీ స్టార్ చేసి లక్ష్మిని వెనక కూర్చోమని సైగ చేసే లోపే, డాం అని పెద్ద బాంబు పేలిన సౌండ్...వీళ్ళకి ఒక పది అడుగుల దూరంలో చెట్టు మీద పిడుగు పడింది...ఒక్కదెబ్బకి ఎవరో నరికినట్టు చెట్టు మొత్తం రోడ్డుకి అడ్డం పడింది...సరళ షాక్లో అలాగే ఉండిపోయింది...లక్ష్మి చెక్ పోస్ట్ రూమ్ లోకి పరుగులు తీసింది...ఒక్క క్షణంలో తేరుకొని, సరళ కూడా లోపలి పరిగెత్తింది...
లక్ష్మి : ఆమ్మో...ఆమ్మో....ఒక్క నిమిషం అటు ఇటు అయుంటే ఆ చెట్టు మన మీద పడేది...
సరళ : జస్ట్ మిస్...నా ఫోటోకి దండ పడేది...
లక్ష్మి : ఏం పనికిమాలిన సెక్యూరిటీ అధికారి ఉద్యోగమో...ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది...
రంగయ్య : దెబ్బలు ఏమైనా తగిలాయా ?
సరళ : లేదు సర్...తృటిలో తప్పింది...
రంగయ్య : ఈరోజే ఇలా అవ్వాలా ? చ...ఆఫీసర్ గారు వచ్చే టైం కూడా ఐంది...
సరళ : అయన వచ్చే టైంకి ఎవరు స్టేషన్లో ఉండకపోతే బాగోదు ఏమో ?
లక్ష్మి : ఏం చేయలేము...రోడ్డుకి అడ్డంగా చెట్టు పడి ఉంది...అది తీసేదాకా రాకపోకలు లేవు...
రంగయ్య : ముందు అడవిలోకి ఎవరిని రానివ్వొద్దు అని అడవి బయట చెక్ పోస్ట్ వాళ్ళకి సమాచారం ఇవ్వండి...
లక్ష్మి ఫోన్ చూసింది కానీ సిగ్నల్ లేదు...సరళ ఫోన్లో కూడా సిగ్నల్ లేదు...మాములు రోజుల్లోనే ఇక్కడ సిగ్నల్ కష్టం.. ఇప్పుడు అసలే భారీ వర్షాలు...
లక్ష్మి : మా ఫోన్ల్లో సింగల్ లేదు సర్...ఆ వాకీ టాకీ చుడండి...అయినా రెండు రోజుల నుండి ఒక్క కార్ కానీ బండి కానీ ఇటు వైపు రాలేదు...ఈ వర్షంలో ఎవరు వస్తారు సర్...
రంగయ్య వాకి టాకీలో వేరే చెక్ పోస్టుని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాడు...
రంగయ్య : హలో హలో...చెక్ పోస్ట్ 1 కం ఇన్...చెక్ పోస్ట్ 1 కం ఇన్....
మల్లేష్ : చెక్ పోస్ట్ 1...చెప్పండి....
రంగయ్య : రెండో చెక్ పోస్టు దగ్గర ఒక్క చెట్టు దారికి అడ్డం పడింది...కింద నుండి ఏమైనా వాహనాలు వస్తే తిరిగి పంపండి....అలాగే కింద ఎవరైనా పని వాళ్ళు ఉంటె పైకి పంపించండి చెట్టు తీయడానికి....
మల్లేష్ : సరే సర్...పంపిస్తాను...రాత్రి తర్వాత ఒక్క కార్ కూడా పైకి వెళ్ళలేదు సర్..
రంగయ్య ఒక్కసారి ఉలిక్కిపడి...వెంటనే చెక్ పోస్ట్ లో ఉన్న వాహనాల పుస్తకం చూసాడు...లాస్ట్ బండి రెండు రోజుల క్రితం అని బండి నెంబర్ రాసి ఉంది...
రంగయ్య : మల్లేషు...నీ చెక్ పోస్ట్ పుస్తకంలో పైకి వచ్చిన ఆఖరి బండి నెంబర్ చూసి చెప్పు...
మల్లేష్ : ఒక్క నిమిషం సర్...
మల్లేష్ పుస్తకం తెరిచి,
మల్లేష్ : AP 12 MF 9999 సర్...
రంగయ్య పైన ఉన్న పుస్తకం చూసాడు...ఆ నెంబర్ లేదు...
రంగయ్య : ఎప్పుడు వచ్చింది ఆ బండి ?
మల్లేష్ : నిన్న రాత్రి 7:20 కి సర్...దేనికి ?
రంగయ్య : ఏమి లేదు...ఇంక వేరే బండ్లు పైకి రానివ్వకు....ఓవర్...
రంగయ్య వాకి టాకీ పక్కన పెట్టి, లక్ష్మి, సరళ వైపు కోపంగా చూసాడు...
రంగయ్య : నిద్ర మొహల్లారా... రాత్రి ఒక కార్ పైకి వచ్చింది...పుస్తకంలో నోట్ ఎందుకు చేయలేదు ?
లక్ష్మి : ఎలాంటి బండి రాలేదు సర్...నేను లేచే ఉన్నాను...
సరళ : అవును సర్...ఎలాంటి బండి పైకి రాలేదు...ఒకవేళ ఎవరిపైన వచ్చి ఉంటె హార్న్ కొట్టే వాళ్ళు కాదా...చెక్ పోస్ట్ లేపకుండా ఎలా వెళ్తారు ?
రంగయ్య : మరి బండి ఏమైంది ? మధ్యలో మాయం అయ్యిందా ? చలికి బాగా గుర్రు పెట్టి నిద్ర పోయి ఉంటారు...వాళ్ళే చెక్ పోస్ట్ తాడుతో పైకి లేపి వెళ్లి ఉంటారు...
సరళ : లేదు సర్...అసలు బండి చప్పుడు రాలేదు...మా మాట నమ్మండి...
రంగయ్య : అయితే ఇప్పుడు అడవిలోకి వెళ్లి వెతుకుతావా ? అయినా నేను వచ్చిన దారిలో ఎక్కడా కార్ ఆగిలేదు...అంటే పైకి వచ్చినట్టే కదా ?
లక్ష్మి : సారీ సర్...పొరపాటు ఐంది...ఇప్పుడేం చేద్దాం ?
రంగయ్య : బుక్లో ఎంట్రీ చేయండి బండి నెంబర్... కింద నుండి పైకి రావడానికి గంట పడుతుంది...రాత్రి 8:20 కి AP 12 MF 9999 అని రాసి పెట్టండి...బండి నెంబర్ చుస్తే ఎదో పెద్ద డబ్బున్న వాళ్ళు అనుకుంట...
లక్ష్మి రంగయ్య చెప్పినట్టు పుస్తకంలో బండి నెంబర్ ఎంట్రీ చేసింది...
సరళ : ఏం ఇబ్బంది అవ్వదుగా సర్ ?
రంగయ్య : బండి రాత్రి చెక్ పోస్ట్ దాటి వెళ్ళిందిగా...ఈ పోస్ట్ దాటాక ఏమైతే మనకి ఎందుకు...అందరు ఇదే మాట మీద ఉండండి...
లక్ష్మి, సరళ : సరే సర్...
ఒక పది నిముషాలు గడిచాయి...వర్షం ఏ మాత్రం తగ్గేలా లేదు...రంగయ్య రేడియో ట్యూన్ చేస్తూ సిగ్నల్ కోసం చూస్తున్నాడు...ఇంతలో వాకి టాకీ మోగింది...
మల్లేష్ : చెక్ పోస్ట్ 2 కం ఇన్...కం ఇన్...
రంగయ్య : చెప్పు మల్లేష్....
మల్లేష్ : సర్...ఆఫీసర్ గారు ఇప్పుడే అడవిలోకి జీప్ వేసుకొని వస్తున్నారు...పని వాళ్ళు కింద ఉంటె వాళ్ళని కూడా అదే జీప్లో తీసుకొని బయలుదేరారు....
రంగయ్య : సరే మల్లేష్...ఓవర్...
రంగయ్య, లక్ష్మి, సరళ, కుర్చీల్లో నుండి లేచి యూనిఫామ్ సరి చేసుకున్నారు....
సరళ : అంత పెద్ద ఆఫీసర్ని అడవిలోకి ఎందుకు ట్రాస్ఫర్ చేసారో ?
లక్ష్మి : అదే కదా.. ఎన్ని స్కామ్లు చేసి దొరికి ఉంటాడో ?
లక్ష్మి, సరళ నవ్వుకున్నారు...
రంగయ్య : ట్రాన్స్ఫర్ చేసేది స్కామ్లు చేసి దొరికితే కాదు...స్ట్రిక్ట్ గా ఉండే ఆఫీసర్స్ నే ట్రాన్స్ఫర్ చేస్తారు...అందుకే నాకు టెన్షన్...
సరళ : మీకు దేనికి సర్ టెన్షన్ ?
రంగయ్య : స్కామ్లు చేసే వాడు అయితే ఎదో ఒకల మెప్పించొచ్చు....వచ్చే వాడు స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే ? అనవసరమైన విషయాల్లో తలలు దూరుస్తాడు...అసలే నేను రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నాను...
సరళ : ఓ...మీరు అలా వచ్చారా ?
లక్ష్మి : మీరు మరీను...అంత పెద్ద ఆఫీసర్ ఇక్కడేం చేస్తాడు...మహా అయితే రెండు నెలలు ఉండి వెళ్ళిపోతాడు...ఈ అడవిలో ఎవడు ఉంటాడు సర్...
సరళ : అదే కదా...ఇక్కడే పుట్టి పెరిగిన మనకే ఈ అడవిలో ఉండాలి అంటే భయం...ఎక్కడో సిటీ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ బతక లేరు సర్..టెన్షన్ పడకండి...
రంగయ్య : వచ్చే వాడి గురించి మీకు తెలీదు...వాడి పాత పోస్టులో ఎవరో రాజకీయ నాయకుడి తో గొడవ పెట్టుకున్నాడు...అందుకే ట్రాన్స్ఫర్ చేసారు...
సరళ : అవునా...ఏం గొడవ ?
రంగయ్య : అది నాకు తెలీదు...ఇక్కడికి వచ్చి ఎంత పెంట చేస్తాడో...
వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే జీప్ వచ్చి ఆగింది...పని వాళ్ళు కిందకి దిగేసారు కానీ ఆఫీసర్ దిగలేదు...రంగయ్య, సరళ, లక్ష్మి ముగ్గురు రూమ్ నుండి బయటకి వచ్చి చూస్తున్నారు...అప్పుడే ఒక గొడుగు జీప్ డోర్ నుండి ఓపెన్ ఐంది...ఆఫీసర్ కారులో నుండి దిగాడు కానీ గొడుకు కింద మొహం కనిపించడం లేదు...సిగరెట్టు పొగ మాత్రం గొడుగు కింద నుండి బయటకి వస్తుంది...అప్పుడే ఆఫీసర్ గంభీరమైన కంఠంతో
ఆఫీసర్ : ఎంత సేపు పడుతుంది క్లియర్ చేయడానికి ?
పనివాడు : ఒక మూడు నాలుగు గంటలు అవుతుంది అయ్యా...
ఆఫీసర్ : సరే...మొదలు పెట్టండి...
పనివాడు : మీ పేరు ఏంటి అయ్యా...?
ఆఫీసర్ : ...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)

.