23-12-2024, 04:05 PM
Hi Sajal Garu,
Welcome back
Welcome back
బానిస 3.O
|
23-12-2024, 04:05 PM
Hi Sajal Garu,
Welcome back
24-12-2024, 02:57 PM
Simple story.good going
29-01-2025, 06:03 PM
bro update plze. Story last update ki chalaa gap vachindi.. jara chudandi plzee
By d way writing adbutam. Twist adirindi. Evaru evariki baanisa avutaara ani telusukovaali ani kutoohalam ekkuvaga undi. i like such concepts. Waiting for next update..
01-02-2025, 03:07 PM
simply in your style,,,,,,,,,,,, rock solid opening episodes. thank you.
ENJOY THE LIFE AS IT COMES
![]() SJ IRK OBG BPST YJ-DD
04-02-2025, 01:58 PM
(10-12-2024, 09:54 PM)Pallaki Wrote: Ep-03 Update please
05-02-2025, 11:08 AM
మాస్టారూ మళ్ళీ మీ రాజ్యానికి వెల్కమ్..
ఎదో మీ పాత కథ ట్రెండింగ్ అవుతోంది అనుకుని వదిలేసా ఇన్నిరోజులు.. లాస్ట్ టైం వేరే ఎక్కడో మంచి కధలు రాస్తా అక్కడ ఫాలో అవ్వండి అన్నారు.. మళ్ళీ ఆ డీటెయిల్స్ ఇస్తే.. అక్కడ కూడా మిమ్మల్ని ఫాలో అవుతాం..
11-02-2025, 09:20 PM
Sajal saheb plz continue this story and update
10-04-2025, 08:34 PM
SAJAL bhayya
mee kathalaki nenu baanisa ayyaa!! BANISA 3.0 update tondaraga raayavaa ![]() సైట్ నడుపుతున్న సరిత్ గారికి ధన్యవాదాలు చెబుదాం
కష్టపడి కథలు రాస్తున్న రచయితలకి కామెంట్ రాసి మెచ్చుకుందాం.
(All pics and videos posted by me are copied from this site only
Please inform me to remove if you don't like them)
10-04-2025, 10:07 PM
![]() సైట్ నడుపుతున్న సరిత్ గారికి ధన్యవాదాలు చెబుదాం
కష్టపడి కథలు రాస్తున్న రచయితలకి కామెంట్ రాసి మెచ్చుకుందాం.
(All pics and videos posted by me are copied from this site only
Please inform me to remove if you don't like them)
14-04-2025, 06:20 AM
Good kani episode 1 and 3 undi episode 2 missing bro
15-04-2025, 09:48 PM
Plz. Update sir
16-04-2025, 01:20 PM
Congratulations on 10000 ratings bro
![]() సైట్ నడుపుతున్న సరిత్ గారికి ధన్యవాదాలు చెబుదాం
కష్టపడి కథలు రాస్తున్న రచయితలకి కామెంట్ రాసి మెచ్చుకుందాం.
(All pics and videos posted by me are copied from this site only
Please inform me to remove if you don't like them)
27-05-2025, 09:08 AM
Ep-03
అక్కా లెగు ఈ టాబ్లెట్ వేసుకోని పడుకో అంటే లేచి వేసుకుంది. సాయంత్రానికి ప్రియ తేరుకున్నా మంచం మాత్రం దిగలేదు. రాత్రికి అర్జున్ వచ్చాడు. గుణ ఇడ్లీ చేతికిస్తే తిని మళ్ళీ పడుకుంది, అర్జున్ వచ్చి మంచం మీద పక్కన కూర్చుంటే మెలకుండా ఉంది.
అర్జున్ : డాక్టర్ దెగ్గరికి వెళదాం రేపు
ప్రియ : పర్లేదు రేపటికి తగ్గిపోతుంది
అర్జున్ : రేపు వేరే పని మీద ఊరు వెళుతున్నాను, ఓ రెండు రోజులు పట్టచ్చు
ప్రియ : అలాగే
అర్జున్ : నేనొచ్చేలోపు పారిపోతావా అని నవ్వాడు, అర్ధం కానట్టు చూసింది ప్రియ. పక్కనోళ్ల ఫోన్లు వింటే ఇలాగే అవుతుంది. భయపడకు నేనంత చెడ్డోడిని కాదు, వచ్చాక చెప్తాలే నా కధ.. పడుకో అని తల మీద చెయ్యి పెట్టి లేచి వెళ్ళిపోయాడు.
చెప్పినట్టుగానే రెండు రోజుల్లో వచ్చేసాడు అర్జున్. ప్రియ ఏమైంది ఎందుకిదంతా అని అడగలేదు, అర్జున్ ఏమి చెప్పలేదు. కానీ అర్జున్ తొ ఇంతకు ముందున్నంత చనువుతొ అయితే ఉండట్లేదు ప్రియ. పొద్దున్నే లేచి వంట పని చేసి కాలేజీకి వెళ్ళిపోతుంది, సాయంత్రం ఇంటికి వచ్చి ఒక అరగంట కూర్చుంటుంది, ఆటో నడుపుతున్న గుణ ఇంటికి వచ్చే లోపు అన్నం కూరా వండేస్తుంది. గుణ ఆటోతొ ఇంటికి రాగానే అక్కడి నుంచి రాత్రి వరకు తను నడుపుతుంది. పని అయిపోగానే వచ్చి తినేసి పడుకుంటుంది.
గుణ ఇదంతా గమనించినా, మొన్నటి వరకు సరదాగా ఉన్న అక్క ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తుందో అర్ధంకాలేదు. అదే అడిగాడు..
గుణ : అక్కా.. నా వల్ల మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా, నేను వెళ్ళిపోనా
ప్రియ : ఏమైందిరా నీకు ?
గుణ : మొన్న జ్వరం వచ్చిన దెగ్గర నుంచి నువ్వు నువ్వులా లేవు, ఏమైంది అక్కా.
మాట్లాడుతుండగానే అర్జున్ కూడా లోపలికి వచ్చి ప్రియ ఎదురు కూర్చున్నాడు.
అర్జున్ : చెప్పు ప్రియా ఏమైంది ? నవ్వాడు మెల్లగా
గుణ : చెప్పక్కా
ప్రియ చాలాసేపు సూటిగా అర్జున్ కళ్ళలోకి చూస్తుంటే గుణ కదిపాడు.
గుణ : అక్కా
ప్రియ : గుణా టిఫిన్ కావాలి
ఆ మాట వినగానే గుణ లేచి టిఫిన్ తీసుకురావడానికి బైటికి వెళ్ళిపోయాడు. మిగిలింది అర్జున్ మరియు ప్రియ మాత్రమే
ప్రియ : ఇప్పుడు చెప్పు బాసూ.. ఎవరు నువ్వు.. నువ్వు చెప్పే నిజం బట్టే నేను నిర్ణయం తీసుకుంటాను.
అర్జున్ : ఎక్కడి నుంచి చెప్పాలో తెలీదు, నాకు మూడేళ్లు అనుకుంట. తన పేరు వసంత, నన్ను రోడ్డు మీద నుంచి ఎత్తుకున్నప్పుడు తనకింకా పెళ్లి కాలేదు. పెద్దింటి పిల్ల అయినా ఎందుకు నన్ను చేరతీసిందో నాకూ ఆమెకి ఇద్దరికీ తెలీదు, కానీ నన్ను ఎత్తుకుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను వదల్లేదు. నన్ను పెంచింది, చదువు చెప్పించింది, నన్ను ప్రేమించింది, కృతజ్ఞతగా ఆమె మీద కలిగిన ప్రేమకి నన్ను నేను వసంతకి పూర్తిగా అంకితం చేసుకున్నాను.
ఆపేసాడు అర్జున్
ప్రియ : తరువాత ?
అర్జున్ : ఆరోజు తనకి పెళ్లి అయిపోయింది. కాపురానికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. వసంత లేని చోట ఉండలేనని అర్ధమైంది, తెల్లారి ఆ ఊరి నుంచి, ఆ జిల్లా నుంచి, ఆ రాష్ట్రం నుంచి, కుదిరితే దేశం నుంచి కూడా పారిపోవాలని అనిపించింది. తెల్లారగానే వెళ్ళిపోదామని ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని వేచిచూస్తున్నా..
ఐదు గంటలకి అనుకుంటా తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే తలుపు తీసాను. నా ఎదురుగా వసంత.. ఆమె కళ్లలో నీళ్లు.. తనని చూడగానే ఏడ్చేసాను. ఇద్దరం చాలాసేపు ఏడ్చుకున్నాం.
వసంత : నాకో మాటివ్వు
అర్జున్ : హ్మ్మ్
వసంత : నువ్వు జీవితాంతం నాతోనే ఉండాలి, ఎప్పుడు నా పక్కనే ఉండాలి. ఉంటావా అని చెయ్యి చాపింది.
కళ్ళు తుడుచుకుని నవ్వుతూనే చేతిలో చెయ్యేసి మాటిస్తూ తల ఊపి, గట్టిగా కౌగిలించేసుకున్నాడు.
ఆరోజు నుంచి మూడు నెలల క్రిందటి వరకు నేనామె చెయ్యి వదిలింది లేదు, ఆమె బంధాల్లో బాధ్యతల్లో అన్నిటిలో భాగమైయ్యాను. ఆమె నన్ను పెళ్లి చేసుకోమని, తన నుంచి విడిపోమని ఎప్పుడూ అడగలేదు, నాకా ఆలోచన కూడా లేదు. వసంత కడుపుతొ ఉన్నప్పుడు, తన పిల్లల్ని పెంచేటప్పుడు.. అన్నింట్లో వసంతకి తోడుగా ఉన్నాను. వసంతతోనే నా జీవితం అనుకున్నాను.. చచ్చేదాక ఆమె చెయ్యి వదలనని నాకు తెలుసు.. కానీ..
ఇంతలో గుణ వచ్చేసాడు, అక్కా టిఫిన్ తెచ్చా అని కిచెన్లోకి వెళ్లి పెట్టుకొస్తే తినేసింది. అర్జున్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు.
వసుధ ఫోన్ చేసింది. తనని తీసుకుని బైటికి వెళ్ళాడు. రాత్రి వరకు రాలేదు ఇద్దరు. ప్రియ రెండు సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు. రాత్రి పదకొండు తరువాత వచ్చారు.
ప్రియ : ఎక్కడికి వెళ్లారు
అర్జున్ : ఆమె తాగడానికి వెళ్ళింది
ప్రియ : ఇదేం బుద్ది.. రోజూ తాగుతుంది. పైన ఇంట్లో వదిలి వచ్చావా
అర్జున్ : హ్మ్మ్.. నేనేం తినలేదు
ప్రియ : స్నానం చెయ్యి, వడ్డిస్తాను అంటే లోపలికి నడిచాడు వెనకాలే వచ్చింది ప్రియ
అర్జున్ : గుణ పడుకున్నాడా
ప్రియ : హా.. ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాడు వాడు, చాలా సాయం చేస్తున్నాడు.
అర్జున్ షర్ట్ విప్పితే తనే తీసుకుని కొక్కానికి తగిలించింది. స్నానం చేసాక అన్నం పెడితే తినేసాడు. చల్ల గాలి కోసం పైకి వెళ్తే అర్జున్ వెనకాలే వెళ్ళింది.
ప్రియ : ఆ తరువాత ఏమైంది ?
అర్జున్ : వసంత వైవాహిక జీవితంలో అసలు ప్రశాంతత లేదు, తన భర్త.. వాడు అస్సలు మంచి వాడు కాదు. చాలా ఏళ్ళు వాడి వల్ల రాత్రిళ్ళు నిద్ర రాకపోతే నా ఒళ్ళో పడుకుని నిద్రపోయేది. చివరికి వాడి చేతిలోనే వసంత చనిపోయింది. మొన్న చంపడానికి వెళ్ళింది వాడినే.. ఆరోజు నేను ఫోన్లో మాట్లాడింది వసంత తండ్రితొ
ప్రియ : మరి ఆమె పిల్లలు ?
అర్జున్ : ఆయనే చూసుకుంటాడు
ప్రియ : మరి తరువాత ?
అర్జున్ : వసంత చనిపోయేముందు నా దెగ్గర ఒక మాట తీసుకుంది. వసంత నాన్న రెండో భార్య కూతురే ఈ వసుధ.. వసుధ తనని ఎప్పుడు అక్కలా చూడకపోయినా వసంతకి చెల్లెలు అంటే ఇష్టం. ఇద్దరు ఒక ఇంట్లో ఉండకపోవడం వల్ల వాళ్ళు దెగ్గరయ్యే అవకాశం లేకపోయింది. తన చెల్లెలిని ప్రేమగా చూడమని చెప్పాడు వాళ్ళ నాన్న, చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం పెంచుకుంది.
ప్రియ : వసంత నిన్ను అడిగిన మాట ఏంటి ?
అర్జున్ : వసంత నాతో జీవితాంతం ఉండాలనుకుంది కానీ అది జరగలేదు, అందుకే కష్టాల్లో ఉన్న తన చెల్లెలి దెగ్గర ఉండి తనలోనే వసంతని చూసుకోమంది. అందుకే ఈ ఊరు వచ్చాను, ఈ డ్రైవర్ వేషం వేసాను. మధ్యలో మీరు కలిశారు. ప్రియా..
అర్జున్ కళ్ళలోకి చూసింది ప్రియ. అర్జున్ కళ్లలో ఏదో అలజడి.
అర్జున్ : నువ్వు నాకు దెగ్గర అవ్వడం నాకు ఇష్టం లేదు, నాకు కష్టంగా ఉంది.
ప్రియ : వెళ్లిపోనా
అర్జున్ : మీ కష్టాలు కొంచెం తీరేవరకు ఉండండి, ఇప్పుడు మీరు కూడా నాకు కావాలి. ప్రేమగా ఉండకు అని చెపుతున్నా
ప్రియ : నన్ను ప్రేమిస్తావేమోనని భయంగా ఉందా
అర్జున్ ఏం మాట్లాడకుండా కిందకి వెళ్ళిపోతుంటే మళ్ళీ కదిలించింది.
ప్రియ : నీ అస్సలు పేరేంటి ?
"అభిరామ్" చెప్పేసి కిందకి వెళ్ళిపోయాడు.
27-05-2025, 09:26 AM
nice update
27-05-2025, 01:32 PM
super update
27-05-2025, 04:36 PM
Thank you for your update
27-05-2025, 05:03 PM
Good update
27-05-2025, 09:07 PM
చాలా రోజుల తర్వాత మంచి అప్డేట్ తో ప్రారంభించారు
చాలా చాలా బాగుంది సార్ |
« Next Oldest | Next Newest »
|