Posts: 186
Threads: 7
Likes Received: 3,334 in 136 posts
Likes Given: 822
Joined: Feb 2025
Reputation:
405
(08-03-2025, 03:34 PM)nareN 2 Wrote:
[b]నా బ్రెయిన్ కూడా సగమే పనిచేస్తోంది.. ఒక్క ఐదు నిముషాలు ఆలస్యం ఐతే గోవా వెళ్లిపోయేవాణ్ణి..
[/b]నేను అస్త్ర సన్యాసం చేసేసా.. నో మోర్ గెస్సింగ్..
కిట్టుతో పాటు నేను ప్రేమలో మునగడమే..
హ హ హ... మునగండి బ్రో. హాయిగా ప్రేమలో ముందండి. ఊహల్లో ఎంజాయ్ చేయండి.
•
Posts: 99
Threads: 0
Likes Received: 35 in 34 posts
Likes Given: 21
Joined: Dec 2022
Reputation:
1
Posts: 425
Threads: 0
Likes Received: 371 in 308 posts
Likes Given: 1,470
Joined: Oct 2024
Reputation:
8
Posts: 432
Threads: 0
Likes Received: 462 in 320 posts
Likes Given: 4,420
Joined: Jul 2022
Reputation:
22
Nice it's just like slow poison
But this is harmless,
Posts: 186
Threads: 7
Likes Received: 3,334 in 136 posts
Likes Given: 822
Joined: Feb 2025
Reputation:
405
Episode - 12
రాత్రి స్పందనని దింపేసి తన ఇంటికి చేరేసరికి ఒంటిగంట అయింది. ఫ్రెష్ అయ్యి వచ్చి ఒక బాక్సర్ వేసుకుని బెడ్ ఎక్కాడు కిట్టు. ఫోన్ తీసి చూసేసరికి సమీర నుండి మెసేజెస్ ఉన్నాయి. తన రోజు బాగా జరిగింది అని. మీటింగ్స్ బాగా అయ్యాయి అని. డిన్నర్ చేసి రూమ్ కి వచ్చాను. పడుకుంటున్నాను అని మెసేజెస్ పెట్టింది.
అవి చదివిన కిట్టుకి చిరునవ్వు వచ్చింది. సమీర కొంచం ట్రై చేస్తోంది అనుకున్నాడు. తాను కూడా రిప్లై ఇచ్చాడు. తమ గద్వాల్ ట్రిప్ బాగా జరిగింది అని చెప్పాడు. సమీర కూడా వచ్చి ఉంటే బాగుండేది అని చెప్పాడు. సమీర నిద్రపోయి ఉంటుంది అనుకుని ఇంక ఆపేశాడు. అదే సమయానికి స్పందన నుంచి మెసేజ్ వచ్చింది.
స్పందన: ఓయ్ హీరో. ఇంకా నిద్రపోలేదా?
కిట్టు: లేదు హీరోయిన్ చెల్లి. ఇప్పుడే స్నానం చేసొచ్చాను.
స్పందన: దుర్మార్గుడా. నిన్ను హీరోని చేస్తే నన్ను సైడ్ క్యారెక్టర్ ని చేస్తావా?
కిట్టు: మరి నేను హీరో అంటే హీరోయిన్ మీ అక్క కదా. అప్పుడు నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా. మరి.
స్పందన కోపం స్మైలీలు పెట్టింది. కిట్టు నవ్వే స్మైలీలు పెట్టాడు.
స్పందన: సరే. ఎంతైనా మా అక్క కదా. అందుకే నిన్ను ఏమి అనట్లేదు. కానీ ఎప్పటికైనా ఈ స్పందన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వదు. నేను ఎప్పుడు హీరోయినే.
కిట్టు: అవును. నీ హీరోకి నువ్వే కదా హీరోయిన్.
స్పందన: నా హీరో నా? ఓహ్ వాడా.. వాడిని నేను హీరో అవుతాడేమో అనుకున్నాను కానీ అవ్వడు. వాడు సినిమాలో హీరోయిన్ ని పెళ్లి చూపులకి చూసెళ్లిపోయే బిస్కెట్ బాబులు ఉంటారు చూడు. అలా అనమాట.
కిట్టు: వామ్మో. అంత తీసిపారేశావేంటి?
స్పందన: మనకి సెట్ అవ్వడు
కిట్టు: హ్మ్మ్. నువ్వు షూర్ ఆ?
స్పందన: రోజురోజుకి క్లారిటీ పెరుగుతోంది. అలాంటివాడు నాకు సెట్ అవ్వడు. కమిట్ అయ్యి ఇద్దరమూ ఇబ్బంది పడేకంటే ఇదే నయం కదా.
కిట్టు: అది నిజమే అనుకో. లేదంటే అందరికి ఇబ్బంది.
స్పందన: అవును. అందుకే, రేపు వాడికి చెప్పేద్దాము అనుకుంటున్నాను.
కిట్టు: ఏమని చెప్తావు? సారీ, పర్సనల్ అనుకో. ఏదో కుతూహలం తో అడిగాను.
స్పందన: మన మధ్య పర్సనల్ ఏమున్నాయి లే. తక్కువ సమయంలో ఇన్ని విషయాలు షేర్ చేసుకోవడం మాములు విషయం కాదు. మనది లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ లే. నువ్వు ఫిక్స్ అయిపో.
కిట్టు: అంతే అంటావా. సరే. ఫిక్స్. ఇప్పుడు చెప్పు. ఏమని చెప్తావు?
స్పందన: మనకి సెట్ అవ్వదు. కాబట్టి రిలేషన్షిప్ వద్దు. కేవలం ఫ్రెండ్స్ గా ఉండిపోదాము అని చెప్తా.
కిట్టు నుంచి ఒక రెండు నిమిషాలు ఏమి మెసేజ్ రాలేదు.
స్పందన: ఉన్నావా?
కిట్టు: ఉన్నాను.
స్పందన: ఏమైంది. అలా చెప్పద్దు అంటావా వాడికి?
కిట్టు: ఎలా చెప్పాలో నీ ఇష్టం. కానీ ఈ ఫ్రెండ్స్ గా ఉంటాను ఇలా చెప్పడం తేలిక. చేయడం చాలా కష్టం
స్పందన: అంటే?
కిట్టు: బ్రేకప్ అయ్యాక కూడా ఫ్రెండ్స్ గా ఉండాలి అంటే ఇద్దరికీ అంతే మెచూరిటీ ఉండాలి. మీ ఇద్దరికీ అది ఉందా? అది చుస్కో. ఇద్దరిలో ఒకరికి లేకపోయినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. నీకు క్లారిటీ ఉంది. ఆ అబ్బాయి నువ్వు చెప్పినదానికి కన్విన్స్ అవ్వలేదు అనుకో, ట్రై చేస్తూ ఉంటాడు. నువ్వేమో వద్దు అంటూ ఉంటావు. దాని వాళ్ళ కొన్నాళ్ళకి ఎలా అవుతుంది అంటే నువ్వు వాడిని లూప్ లైన్ లో పెట్టినట్టు అనిపిస్తుంది. అప్పుడు కొంతమంది వొయిలెంట్ గా రియాక్ట్ అవుతారు. అదేదో కష్టం అనిపించినా బ్రేకప్ అని కట్ చేసేసుకుంటే, ఇప్పుడు నొప్పి అనిపించినా ఫ్యూచర్ లో ఇబ్బంది రాదు.
స్పందన (ఓకే రెండు నిమిషాలు ఆగి): నీ పాయింట్ నాకు అర్థం అయింది. హర్ట్ చేయకుండా చెప్పమంటున్నావు.
కిట్టు: ఇలాంటి వాటిలో హర్ట్ చెయ్యకుండా ఉండటం కష్టం. హర్ట్ చేస్తాము. కాకపోతే ఎంత తక్కువ హర్ట్ చేస్తాము, వాళ్ళకి మనకి ఫ్యూచర్ లో ఇబ్బంది రాకుండా ఎలా ఈజీగా అయ్యే లాగా చేస్తాము అనేదాంట్లో మన మెచూరిటీ ఉంటుంది. నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి. అయినా వాడు తేడాగా రియాక్ట్ అయితే అది నీ తప్పు కాదు. వాడి ఖర్మ.
స్పందన: అర్థం అయింది. థాంక్యూ కిట్టు.
కిట్టు: ఏం పర్లేదు.
స్పందన: నువ్వు ములగ చెట్టు ఎక్కాను అంటే ఒకటి చెప్తాను. నువ్వు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు.
కిట్టు: ములగ చెట్టు ఎక్కద్దు అంటే ఎలా? నేను ఉడేదే అక్కడ కదా.
స్పందన (నవ్వుతు): జాగ్రత్త పడితే నడ్డి విరుగుతుంది.
కిట్టు: ఆల్రెడీ నడ్డి విరిగింది కదా. ఒకటి కాదు రెండు సార్లు బ్రేకప్ అయింది. అందుకే మూసుకుని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను.
స్పందన పకపకా నవ్వింది.
స్పందన: అంటే ఈ తెలివి అంత బ్రేకప్స్ వల్ల వచ్చింది అంటావు.
కిట్టు: తెలివి ముందే ఉంది. బ్రేకప్స్ వల్ల అనుభవం వచ్చింది. తెలివి అనుభవం కలిస్తే వచ్చేది విజ్ఞత. అది ఉన్నవాడు ఎప్పుడు బానే బతికేస్తాడు.
స్పందన: ఆహా ఏమి చెప్తిరి ఏమి చెప్తిరి
కిట్టు సిగ్గుపడుతున్నట్టు స్మైలీ పెట్టాడు.
స్పందన: లేదు. సీరియస్ గా. నేను బాగా ఇంప్రెస్స్ అయ్యాను. ఇంకో పది మార్కులు వెయ్యచ్చు.
కిట్టు: నాకు ఇంకా మార్కులు వేస్తూనే ఉంటావా తల్లి.
స్పందన: జీవితాంతం వేస్తూనే ఉంటాను.
కిట్టు: నాకేనా. నీకు వీడు కాకపోయినా ఎప్పుడోకప్పుడు హీరో వస్తాడు. వాడికి వేద్దువుగాని మార్కులు. నాకెందుకు.
స్పందన: హ హ. నీకు మా అక్క వేస్తుంది అంటావా?
కిట్టు: నాకు మీ అక్క వేస్తుందేమో నాకు తెలీదు. నీకే తెలియాలి.
స్పందన: అది వెయ్యదు. అది ఉన్నదాంతో సద్దుకుపోతుంది.
కిట్టు: ఏయ్ అంటే నాతో తప్పక సద్దుకుంటుంది అనుకుంటున్నావా?
స్పందన: నేను అనలేదు బాబు. నన్ను ఇన్వొల్వె చేయకండి. కానీ నేను మాత్రం నీకు మార్కులువేస్తూనే ఉంటాను ప్రతి విషయంలో.
కిట్టు (నవ్వుతు): ఓకే. మంచి మార్కులు వస్తే గిఫ్ట్ ఎమన్నా ఇస్తారా టీచర్?
స్పందన: నేను నే బెస్టుఫ్రెండ్ గా ఉండటమే నీ లైఫ్ లో అతిపెద్ద గిఫ్ట్. ఇంకేమి కావలి?
కిట్టు: అబ్బా. ఇగో బట్టిన అడ్డగాడిద అని ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పింది నీ గురించే
ఇద్దరు ఒక అయిదు నిమిషాల పాటు నవ్వుకున్నారు.
స్పందన: సరే కిట్టు. నాకు నిద్రొస్తోంది. అక్క ఏమన్నా మెసేజ్ చేసిందా?
కిట్టు: చేసింది. తనకి ఇందాక రిప్లై ఇస్తుంటే నువ్వు చేశావు.
స్పందన: అయ్యో. డిస్టర్బ్ చేసానా?
కిట్టు: లేదు లేదు. తను నిద్రపోయింది అప్పటికే. పాపం హెక్టిక్ ట్రిప్ కదా.
స్పందన: అవును. ఉన్నట్టుండి వెళ్లాల్సొచ్చింది.
కిట్టు (కొంటెగా) : అయినా మీ అక్క మాట్లాడుతుంటే నీకు రిప్లై ఎందుకు ఇస్తాను? ఇగ్నోర్ చేసేద్దును కదా
స్పందన: ఓరి దుర్మార్గుడా. సరే. అక్క కదా. ఏమి అనలేను. నన్ను ఇగ్నోర్ చేసిన అక్కకే కదా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. సో క్షమించేస్తాను.
కిట్టు: సంతోషం.
స్పందన: గుడ్నైట్ కిట్టు.
కిట్టు: రెండురోజులలో కలుద్దాము. వెళ్లి బట్టలు తెచ్చుకోవాలి కదా.
స్పందన: అవును. టేక్ కేర్. బై.
కిట్టు: గుడ్నైట్.
కిట్టు ఫోన్ పక్కన పడేసి అలా లైట్ ఆఫ్ చేసి నిద్రపోయాడు. పడుకునే ముందు ఒక
సరి సమీరతో చాట్ చదువుకున్నాడు. చిన్నగా నవ్వుకుని ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాడు.
*****
ఢిల్లీ లో హోటల్ రూమ్ లో సమీర తన లాప్టాప్ లో కిట్టు స్పందనల మధ్య చాట్ అంత చదివింది. వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నది, కిట్టు స్పందనకి ఇచ్చిన సలహా, తన గురించి వాళ్ళు మాట్లాడింది అన్ని చదివి చిన్నగా నవ్వుకుంది. ఉన్నట్టుండి తనకి చాలా గిల్టీ గా అనిపించింది. తన చెల్లి మెసేజెస్ తను చదవడం ఏంటి ఛండాలంగా అనుకుంది. వెంటనే వాట్సాప్ లోంచి లాగౌట్ అయిపోయింది. కిట్టుకోసం ఢిల్లీ లో ఏదన్నా గిఫ్ట్ కొనాలి అనుకుంది.
ఇంతలో మరల తన మనసులో ఉన్న భయం గుర్తుకొచ్చింది. కిట్టుకి తన ప్రాబ్లెమ్ తెలిస్తే ఇలానే ఉంటాడా? స్పందనకి తన ప్రాబ్లెమ్ గురించి చెప్తే ఏమంటుంది. తన తల్లి సరోజ ఏమంటుంది. లోకం ఏమంటుంది. అసలు తన ప్రాబ్లెమ్ ఎవ్వరికైనా ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలి. తను కిట్టుకి అన్యాయం చేస్తున్నానా? ఇలా ఎన్నో ఆలోచనలు తన మనసులో కలవరం రేపుతున్నాయి.
ఏదైతే అది అవుతుంది అనుకుని ఇక పడుకుంది.
ఇంకా ఉంది
The following 49 users Like JustRandom's post:49 users Like JustRandom's post
• 3sivaram, aarya, ABC24, akak187, Akhil2544, Babu143, Babu_07, coolguy, DasuLucky, Energyking, Eswar99, gora, gotlost69, Gundugadu, Hellogoogle, Iron man 0206, jackroy63, kaibeen, King1969, lhb2019, Mahesh12, Mahesh12345, Manoj1, meeabhimaani, Mohana69, murali1978, nareN 2, Nivas348, Pk babu, prash426, qazplm656, Raaj.gt, Raj1998, Ramvar, Ranjith62, Rathnakar, Rklanka, Sachin@10, sheenastevens, shekhadu, shiva9, Sunny73, TheCaptain1983, Uday, Uppi9848, utkrusta, vaddadi2007, wraith, yekalavyass
Posts: 171
Threads: 0
Likes Received: 136 in 107 posts
Likes Given: 275
Joined: Jul 2024
Reputation:
2
As usual Nice, bagundhi...
Posts: 4,118
Threads: 9
Likes Received: 2,586 in 2,041 posts
Likes Given: 9,481
Joined: Sep 2019
Reputation:
23
Posts: 950
Threads: 0
Likes Received: 724 in 594 posts
Likes Given: 270
Joined: Sep 2021
Reputation:
8
Nice update andi. Aslu em problem andi sameera ki?
Posts: 10,582
Threads: 0
Likes Received: 6,128 in 5,029 posts
Likes Given: 5,782
Joined: Nov 2018
Reputation:
52
Posts: 1,968
Threads: 4
Likes Received: 3,085 in 1,408 posts
Likes Given: 4,102
Joined: Nov 2018
Reputation:
61
మొదటగా కిట్టూ పాత్రను బాగా మలిచారు. మాటల్లో, చేతల్లో చాలా పెద్దరికం (అనొచ్చా, చాలా మంది పెద్దలు గాడి తప్పి ప్రవర్తిస్తున్నారు ఈ మధ్య) బాలెన్స్ గా, హుందా గా ప్రవర్తిస్తున్నాడు. బ్రేక్ అప్ గురిచి మీరిచ్చిన విశ్లేషన కూడా బావుంది, ఈ మధ్య కాలం రిలేషన్ల కు అర్థమే మారిపోతోంది. సమీర కున్న ప్రాబ్లం ఏంటో, కొంపదీసి ప్రిజిడిటీనా, భయమా లేక నా ఊహకు అందడం లేదు. కధనం బావుంది బ్రో.
: :ఉదయ్
Posts: 4,074
Threads: 0
Likes Received: 2,794 in 2,174 posts
Likes Given: 776
Joined: May 2021
Reputation:
30
Posts: 162
Threads: 0
Likes Received: 162 in 113 posts
Likes Given: 10,692
Joined: Nov 2018
Reputation:
13
chaalaa antae chaalaa baagundhi bro, mothaaniki jodaavula swaaree kabothunnattundhi, waiting for further, thank you
Posts: 479
Threads: 0
Likes Received: 635 in 362 posts
Likes Given: 1,415
Joined: May 2019
Reputation:
17
సమీర ప్రాబ్లం బ్రేకప్పా లేక పిల్లలు పుట్టకపోడమా!
Posts: 496
Threads: 1
Likes Received: 345 in 221 posts
Likes Given: 1,048
Joined: Jan 2023
Reputation:
3
Posts: 506
Threads: 1
Likes Received: 384 in 229 posts
Likes Given: 221
Joined: Aug 2023
Reputation:
12
Posts: 871
Threads: 2
Likes Received: 819 in 573 posts
Likes Given: 831
Joined: Dec 2020
Reputation:
17
excellent narration bro... chala bagundi... kudirithe koncham peddaga or thondaraga ivandi
Posts: 506
Threads: 0
Likes Received: 475 in 361 posts
Likes Given: 4,796
Joined: Aug 2022
Reputation:
10
Posts: 5,330
Threads: 0
Likes Received: 4,433 in 3,324 posts
Likes Given: 16,843
Joined: Apr 2022
Reputation:
76
Posts: 432
Threads: 0
Likes Received: 462 in 320 posts
Likes Given: 4,420
Joined: Jul 2022
Reputation:
22
Nice update Brother,
Sameera reading the conversation, very interesting and a good thinking it's superb.
Posts: 504
Threads: 0
Likes Received: 286 in 226 posts
Likes Given: 10
Joined: May 2023
Reputation:
3
Sameera problem enti sir.... Excellent update
|