16-02-2025, 01:00 AM
ఇంకో కొత్త కథ. ట్రెండింగ్ టాపిక్. మూడు, నాలుగు భాగాల్లో అయిపోతుంది. మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
"AI"
|
16-02-2025, 01:00 AM
ఇంకో కొత్త కథ. ట్రెండింగ్ టాపిక్. మూడు, నాలుగు భాగాల్లో అయిపోతుంది. మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
16-02-2025, 01:04 AM
"ఎంత సేపు కొట్టాలి బెల్, పడుకున్నావా?"... లోపలికొస్తూ అంది కావ్య.
"బెల్ సౌండ్ వినిపించలేదు"... బదులిచ్చాడు దీపక్. "బెల్ సౌండ్ వినిపించనంతగా ఏం చేస్తున్నావు?" "పని చేసుకుంటూ ఏదో వింటున్నా" "పనా. ఇంట్లో చేసే పని కాదు కదా నీది"... కూర్చుంటూ అంది. "ఆలోచిస్తూ, నోట్ చేసుకుంటూ, కాలిక్యులేషన్స్ వేసుకుంటున్నా" "సరే. నీ కోసం ఒకటి తెచ్చా. ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం" "ఏం తెచ్చావ్?" "గిఫ్ట్" "గిఫ్ట్ తెచ్చావా!" "ఔను. నా మొగుడు పడే కష్టాన్ని చూడలేక ఒక గిఫ్ట్ తెచ్చా" "ఏం గిఫ్ట్?" "టెక్నాలజీ గిఫ్ట్" "అంటే?" "అంటే అంటే ఏం చెప్పేది. టెక్నాలజీ గిఫ్ట్. అంతే" "నాకెందుకు టెక్నాలజీ. నా పని అది కాదు కదా. నాకు అవి అర్ధం కావు. నీకు తెలుసు కదా"... చిన్నబుచ్చుకున్నాడు. "అబ్బా. ఇందులో అర్ధం చేసుకుకోవడానికి ఏం లేదు. చాలా ఈజీ. కోడ్ ఏమీ ఉండదు"... దీపక్ పక్కన కూర్చుంటూ బుగ్గ మీద ముద్దు పెడుతూ అంది. నవ్వాడు దీపక్. "కొత్తగా వచ్చింది. నీకు హెల్ప్ అవుతుంది అని కాస్ట్ ఎక్కువైనా తెచ్చా" "నా పని కోసం క్యాల్క్యులేటర్ చాలు. టెక్నాలజీ ఎందుకు?"... అర్ధం కాక అడిగాడు. "నీ మొహం. నీ జాబ్ కోసం కాదు ఇది. నువ్వు కథలు రాస్తావు కదా, ఆ పని దగ్గర హెల్ప్ అవుతుంది"... నవ్వుతూ అంది కావ్య. "అర్ధం కాలేదు కావ్యా"... అన్నాడు. "టెక్నాలజీ గురించి ఏమీ తెలియని మొగుడినిచ్చావేంటి దేవుడా!"... పైకి చూస్తూ అంది కావ్య. "నేను చదువుకున్నది కామర్స్, చేసేది బ్యాంక్ జాబ్. మీ వాళ్లకి తెలిసే వచ్చారు, నువ్వు కూడా తెలిసే చేసుకున్నావు కదా"... మళ్ళీ చిన్నబుచ్చుకున్నాడు. "జోక్ మొగుడుగారు. జోక్. మీ దగ్గర ఏముందో, మీరు నాకు ఏమివ్వగలరో, నన్ను ఎన్నెన్ని కలల్లోకి తీసుకుకెళ్లగలరో నాకు తెలీదా"... దీపక్ని కౌగిలించుకుంటూ అంది కావ్య. నవ్వాడు దీపక్. "ఇంతకీ తెచ్చిన గిఫ్ట్ ఏంటి?" ప్యాకెట్ వైపు చూస్తూ అడిగాడు. "నీ కథలకి హెల్ప్ అవుతుంది"... తెచ్చిన ప్యాకెట్ వైపు వెళ్లి, ప్యాకెట్ చేతుల్లోకి తీసుకుని అంది కావ్య. "అంటే?" "సాఫ్ట్ వేర్ వచ్చింది కొత్తది. తెచ్చాను." "ఎందుకు ఇది?" "నువ్వు కథలు రాస్తావు కదా. మొత్తం టైప్ చేస్తూ ఉంటావు కదా. టైప్ చేసాక వేళ్ళు నెప్పి అంటావు కదా" "అవును" "ఆ నెప్పిని నీకు దూరం చేస్తుంది ఈ సాఫ్ట్ వేర్" "సాఫ్ట్ వేర్ నెప్పిని ఎలా దూరం చేస్తుంది. అదేమీ బామ్ కాదు కదా. వేళ్ళకి రాసుకుంటే నెప్పి పోవడానికి"... నవ్వుతూ అన్నాడు. "సందు దొరికితే చాలు మా సాఫ్ట్ వేర్ వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటావు నువ్వు"... బుంగమూతి పెట్టింది. "అవును మరి సాఫ్ట్ వేర్ అన్నీ చెయ్యలేదు కదా. నెప్పిని తగ్గించలేదు కదా. ఆకలి తీర్చలేదు కదా" "నీ ఆకలి సాఫ్ట్ వేర్ తీర్చకపోయినా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్య తీరుస్తోంది కదా"... ప్యాకెట్ తీసుకుని దీపక్ పక్కకొచ్చి మళ్ళీ బుగ్గ మీద ముద్దిచ్చింది కావ్య. సిగ్గుపడ్డాడు దీపక్. "నువ్వెక్కడి మొగుడివిరా నాయనా. పెళ్ళాం ముద్దు పెడితేనే సిగ్గుపడుతున్నావు. దేవుడా ఏంటిది!"... మళ్ళీ పైకి చూస్తూ అంది. నవ్వాడు దీపక్. "పెళ్ళాం ముద్దు పెడితే సిగ్గు. మళ్ళీ కథలు రాస్తావు!" "కథలు వేరు. ఊరికే రాసాను. అయినా రాసింది రెండే కదా. ఒకటే నచ్చింది. ఇంకోటి ఎక్కువమంది చదవలేదు" "నా మొగుడు ఇంత కష్టపడి రాస్తుంటే నచ్చలేదా. నెప్పిని కూడా లెక్కచేయకుండా రాస్తుంటే నచ్చనివాళ్లని"... కోపంగా మొహం పెట్టింది. "నెప్పొచ్చేలా రాయమని ఎవరూ అడగలేదు కదా. నేనే రాస్తున్నాను" "అయితే ఎందుకు అలా రాయడం?" "ఎలా పడితే అలా రాయచ్చు కాని చదివేవాళ్ళకి బాగోదు. తప్పులు లేకుండా, ఒత్తులు, పొల్లులు సరిగా రాస్తే చదివేవాళ్ళకి బాగుంటుంది, అందుకు" "అందుకే తెచ్చాను ఇది. నీకు ఆ బాధ పోగొట్టడానికి" "ఎలా పోతుంది?" "ఈ సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేస్తే, అది యాక్టివేట్ అయ్యాక, నువ్వు జస్ట్ మాట్లాడుతూ ఉంటే అది రికార్డ్ చేసి మాటలుగా విడగొట్టి టెక్స్ట్ కింద మార్చి, లైన్స్ లాగా ఇస్తుంది. ఆ టెక్స్ట్ సరిచేస్తే చాలు. వేళ్ళకి నెప్పి ఉండదు. ఎక్కువ టైం పట్టదు. ఆ వేళ్ళతో, ఆ టైంతో ఏదైనా చెయ్యచ్చు"... అంటూ దీపక్ వేళ్ళు పట్టుకుని బెడ్రూం లోకి తీసుకెళ్ళింది కావ్య. "ఏం సాఫ్ట్ వేర్ ఇది?" ...కావ్యతో నడుస్తూ వెనక్కి తిరిగి ప్యాకెట్ వైపు చూస్తూ అడిగాడు. "ఏ ఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్"
16-02-2025, 06:19 AM
Superb start
16-02-2025, 07:15 AM
AI theme to sex Story..
Keka Bro.. update kosam eduru choostam
16-02-2025, 08:14 AM
దీపక్ సిగ్గు పడడం, చిన్నబుచ్చుకోవడం బావుంది (ఛీ... నీ సిగ్గు తగలెయ్య
![]()
:
![]() ![]()
17-02-2025, 07:34 AM
Nice start bro
17-02-2025, 12:41 PM
GOOD UPDATE
|
« Next Oldest | Next Newest »
|