Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - Completed
#41
హ్మ్...హ్మ్...కొత్త కాన్సెప్ట్...ఇంటరెస్టింగా వుంది
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Intersting,yandamurini minchipoyaruga
[+] 2 users Like Paty@123's post
Like Reply
#43
(12-02-2025, 02:39 PM)Rishithejabsj Wrote: Bro story chala bagundhi... Keep going

Thanks Bro.. sex lekunna story ni aadaristunnaru..

(12-02-2025, 04:05 PM)Nani666 Wrote: Nice story andi.. continue

Malli malli Thanks andi..

(12-02-2025, 04:43 PM)shekhadu Wrote: Artham avtundi bro
but mi lanti writers xossipy ki kavali bro

Dhanyavadalu Mitrama.. naa kadhalu chadivevallu kontamandi unnanduku santosham..

(12-02-2025, 06:16 PM)Rupaspaul Wrote: Super

Thanx Ji..

(12-02-2025, 06:31 PM)Uday Wrote: హ్మ్...హ్మ్...కొత్త కాన్సెప్ట్...ఇంటరెస్టింగా వుంది

Adendi Bro Inta chinna Comment pettav.. Shivaram Bro kooda Okka image to vadilesadu..

eppudu kadhani analyze chestoo pedatav comment.. 

Writers ki manchi tonic adi..

(12-02-2025, 06:59 PM)Paty@123 Wrote: Intersting,yandamurini minchipoyaruga

Enduku Bro.. malli evaraina vachhi munaga chettu ekkinchav.. update lu ivvatledani tittadaniki.. edit chesey bro.. edit chesey..
Like Reply
#44
సాయంత్రం..

సాయి చెప్పిన ఐడియా గురించి ఆలోచించడం మొదలు పెట్టా.. చిన్న పిల్లల సంగతి సరే.. పెద్ద వాళ్లంటే.. పడుకుని సంపాదించేది ఉండగా కష్టపడమంటే కష్టపడతారా..

మళ్ళీ నేనే నెగటివ్ గా ఆలోచించడం ఎందుకు.. ఈ బ్రతుకు వద్దనుకున్న వాళ్ళే ముందుకు వస్తారు.. వెయ్యి కాకపొతే వందమంది.. వంద కాకపొతే పదిమంది..

అత్త ఫ్రీ గా ఉన్న టైం చూసి విషయం చెప్పా..

ఈ బిజినెస్ లు మనతో అయ్యే పనేనా అంది..

ట్రై చేస్తేనే కదా అత్త తెలిసేది అన్నా..

సరే ఎం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు.. అంది అత్త..

ఈ సంవత్సరం కాలేజీ మానేద్దాం అనుకుంటున్నా..

అదేంటే..

వచ్చే మూడు నెలలు ఎన్ని బుకింగ్స్ చేస్తావో చెయ్యి అత్త.. నేను ఇరవై లక్షలు ఆరెంజ్ చేస్తా అని చెప్పా సాయి కి..

ఒసేయ్ నీకేమైనా పిచ్చా.. ఇంతమంది ఉన్నాం.. నువ్వు ఆలోచించేది అందరి కోసం.. అందరి కోసం నువ్వొక్కదానివి నలిగిపోవక్కర్లేదు..

అందర్నీ పిలుస్తా ఆగు అని అందరికి కబురు పెట్టింది..

ఒక ఇద్దరు మాత్రం కస్టమర్స్ తో ఉన్నారు.. మిగిలిన అందరు పది నిముషాల్లో హాల్ లోకి చేరారు..

అత్త చెప్పడం మొదలు పెట్టింది..

మన జీవితాల్ని మార్చుకోవడానికి వర్ష ఒక ప్లాన్ చెప్తా అంటోంది.. అందరూ వినండి..

అత్త చెప్తుందేమో అనుకుంటే నన్ను ముందుకు తోసింది.. గొంతు సవరించుకొని..

మీకు తెలుసు నేను కూడా అత్త దారిలోనే మనలాంటి వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా..

ఇప్పుడు దాన్ని ఇంకా ముందుకు తీసుకు వెళ్ళడానికి నాకు ఇంకో దారి కనపడింది.. అదే మనం ఇప్పటి వరకు దాచుకున్న డబ్బులతో కొన్ని నిత్యావసర సరుకులు తయారు చేసి దగ్గర్లో ఉన్న షాప్ లకి అమ్మడం..

ఇలా చేస్తే.. మన మీద మనకి నమ్మకం పెరిగి డబ్బుల కోసం వొళ్ళు అమ్ముకోవక్కర్లేదు.. నాతొ పాటు మీరు ఎంత మంది ముందుకు వచ్చినా సరే..

ఎవరు చెయ్యగలిగే పని..వాళ్ళు చేద్దాం.. దాని కోసం ఇంకా నేర్చుకోవాలంటే నేర్చుకుందాం.. మీరేమంటారు అని వాళ్ళకేసి చూసా..

వర్షా అని పిలిచింది షీలా అక్క..

ఏంటక్కా..

ఇక్కడ మన బ్రతుకులు ఇలాగె ఉండిపోవడానికి మన అవసరాల కంటే రాజకీయ అవసరాలు సినిమా వాళ్ళ అవసరాలు వాళ్ళ పనులు అవ్వకొట్టుకోవాలని చూసే బిసినేస్మాన్ ల అవసరాలే ఎక్కువ..

మనం మారాలన్న వాళ్ళు వదలరు.. ఇదొక ఊబి.. ఆ విషయం నీకు తెలియంది కాదు..ఇందులోంచి మనల్ని ఎవరూ బయటకి లాగరు.. ఎందుకంటే దానికోసం ప్రయత్నిస్తే వాళ్ళు కూడా ఇదే ఊబిలో చిక్కుకుపోతారు కనక..

నిజమే అక్క.. కానీ మనకోసం కాకపోయినా రేపటి పిల్లలకోసం ఐన మనం రిస్క్ చెయ్యాలి..అన్నా..

ఈలోపు అత్త వచ్చి.. ఒసేయ్ షీలా.. వయసున్నOత సేపేనే ఎవడైనా మనకేసి చూసేది.. చర్మం ముడతలు పడ్డాక.. మన గాలి కూడా తగలనివ్వరు.. మనవి ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాల.. వయసైపోయాక పెన్షన్ రావడానికి.. రేపటి గురించి కూడా ఆలోచించు.. అంటూ కరెక్ట్ పాయింట్ ముందు పెట్టింది..

ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ.. అత్తతో.. నువ్వెలా అంటే అలా అంటూ.. చేతులు కలిపారు..

అత్త నన్ను చూసి నవ్వుతూ.. సరే సరే ఇంకో ముఖ్యమైన విషయం.. ఈరోజు నుంచి మన సంపాదనలో సగం మన బిజినెస్ కోసం దాచాలి..అంది..

దానికీ అందరూ ఓకే చెప్పి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు..

ఈ విషయం వెంటనే సాయి కి చెప్పాలనిపించింది.. అయ్యో నెంబర్ కూడా తీసుకోలేదే..

……………………..

వర్ష కి చెప్పడం ఐతే చెప్పేశా కానీ ఎక్కడనుంచి మొదలు పెట్టాలో అర్ధం కావట్లేదు.. బ్యాంకుల చుట్టూ తిరగాలి.. ప్రింట్స్ తీయించాలి.. ముందు ఒక 4 ట్రిప్పులు కొడితే తప్ప పని అవ్వదని క్యాబ్ ఆన్ చేశా..



రాత్రి..


9 అయ్యింది.. వర్ష తో మాట్లాడాలనిపించింది..

కార్ అటు పోనిచ్చా.. నాకోసమే ఎదురు చూస్తున్నట్టు బాల్కనీ లో నుంచుని ఉంది.. నా కార్ చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి..

ఓయ్ ముందు నీ నెంబర్ చెప్పు అంది ఆయాసపడుతూ..

నంబర్స్ ఇచ్చి పుచ్చుకున్నాక.. వర్ష నాతొ బయటకి వస్తావా అన్నా..

ఒక్క క్షణం నా కళ్ళలోకి చూసి.. ఉండు డ్రెస్ చేంజ్ చేసుకు వస్తా అని వెళ్లి 10 నిముషాల్లో.. గ్రీన్ కలర్ చుడిదార్ లో మెరిసిపోతూ కార్ డోర్ ఓపెన్ చేసుకుని నా పక్కన కూర్చుంది..

1st  టైం డ్రైవింగ్ లో లేకుండా.. టెన్షన్ లో లేకుండా.. తనని చూస్తున్న ప్రశాంతంగా..

ఊగుతున్న చెవి బుట్టలు.. నవ్వే కన్నులు.. జుట్టుని సరిచేస్తున్న వేళ్ళు.. అవును చిన్నప్పుడు కూడా ఇంతే క్యూట్ గా ఉండేది రాణి..

రాణి అని పిలిచా..

సీరియస్ గా మొహం పెట్టి.. నీకెన్ని సార్లు చెప్పాలిరా.. ఆ రాణి లేదు.. రాదు.. వర్ష.. కాల్ మీ వర్ష..

ఒకే ఓకే.. వర్ష కూల్ అన్నా..

ఎక్కడికెళ్దాం అంది..

DLF ఫుడ్ స్ట్రీట్ కి పోదాం అన్నా..

లేదు.. సిటీ కి దూరం గా పోదాం.. లైట్ పొల్యూషన్ లేని చోటుకి అంది..

సరే అని కార్ అటే తిప్పా..

బయలు దేరినప్పటి నుంచి FM లో ఎదో ఒక ఛానల్ మారుస్తూనే ఉంది.. తనకి మ్యూజిక్ అంటే ఇష్టం లా ఉంది.. లేదా ఎవరితో మాట్లాడ్డం ఇష్టం లేదా..

ట్రాఫిక్ దాటి వస్తూ తిన్నావా అన్నా.. హ తినేసా అంది..

అప్పుడేనా.. అంటే..

నైట్ డ్యూటీ లు బాబు.. 7 కి తినేస్తాం..కస్టమర్ వచ్చేటప్పటికి తిన్నది అరిగిపోవాలి కూడా..

నా చెవి కోసుకొని అవతలికి విసిరెయ్యాలి అనిపించింది..వినలేకపోతున్న..

నాకు ఆకలేస్తోంది.. కంపెనీ ఇస్తావా..

అదేం క్వశ్చన్.. నిన్ను తినొద్దు అంటానా... ఆ హోటల్ దగ్గర ఆపు అంది..

కార్ దిగుతూ వర్ష నీకు వంట వచ్చా అన్నా..

నవ్వుతోంది..

వర్ష - ఎం తినాలని ఉందేంటి..

నేను - ఎదో ఒకటి ఆర్డర్ ఇద్దాం.. ఆకలి దంచేస్తోంది అన్నా.. తర్వాత వెలిగింది.. తాను వండితే నేను ఎం తినాలనుకుంటున్నా అని అడిగింది అని..

నేను - ఉప్మా..

వర్ష - ఉప్మా నా..

నేను - అవును నాకు చాల ఇష్టం..

వర్ష - అది అందరికీ నచ్చదు కదా..

నేను - చెయ్యడం రాని వాళ్ళు చేస్తే నాకూ నచ్చదు.. ఏదైనా వండేలా వండాలి..

వర్ష - అబ్బో..

ఈలోపు ఫోన్ రింగ్ ఐతే చూసా.. చెల్లి..

నేను మాట్లాడుతుంటే చూస్తోంది.. మాట్లాడతావా అని సైగ చేశా.. వద్దంది..

ఈలోపు ఫుడ్ వస్తే తింటా అని చెప్పి ఫోన్ కట్ చేసి..తన ప్లేట్ లో కూడా కొంచెం వడ్డించి..

మాట్లాడి ఉండాల్సింది కదా తను కూడా హ్యాపీ గా ఫీల్ అయ్యేది అన్నా..

వర్ష - తనకి గుర్తు ఉంటానా.. బా చిన్న పిల్ల కదా అప్పటికి..

నేను - మన చిన్నప్పటి విషయాలు నీకు గుర్తున్నాయా..

వర్ష - కొన్ని కొన్ని ఉన్నాయ్.. ఓ రోజు మా అమ్మ ఊరు వెళ్లిందని జడ వేయించుకోవడానికి మీ ఇంటికి వస్తే.. నువ్వు నా రిబ్బన్స్ పీకేశావ్ రెండు సార్లు.. అప్పుడు మీ అమ్మ నిన్ను కొట్టడం గుర్తుంది..

ఇంకోసారి నాకంటే మార్కులు తక్కువ వచ్చాయని మీ నాన్న..

నేను - చాలు ఇంక ఆపేయ్..

వర్ష - మనం బయట మడత మంచాల మీద పడుకుని నక్షత్రాలు చూసే వాళ్ళం గుర్తుందా..

నేను - గుర్తుంది..

వర్ష - నాకు అలా ఈరోజు ఆరుబయట నక్షత్రాలు చూస్తూ పడుకోవాలని ఉంది..

ఎక్కువ ఆలోచించలేదు.. తినటం పూర్తవ్వగానే పద వెళ్దాం అంటూ..మ్యాప్స్ ఓపెన్ చేసి..

పక్కనే ఉన్న పల్లెటూరికి పోనిచ్చా..

రాత్రి 10 .30  దాటింది.. అప్పటికే ఊరు నిద్రపోతోంది.. ఊరు బయట రేణుక ఎల్లమ్మ టెంపుల్ కనపడింది.. కాంపౌండ్ లోపల అంతా సిమెంట్ చేసి ఉంది..

కార్ పక్కన పార్క్ చేసి.. లోపలికి వెళ్ళాం.. పక్కనే చెరువు నుంచి వస్తున్న చల్ల గాలి.. ఇంకో వైపు వర్ష ని తాకి నావైపు వస్తున్న పిల్ల గాలి..

చలి ప్రేమ రెండూ ఒకేసారి పుడుతున్నాయి..

కార్ లో ఒక దుప్పటి పెట్ట.. చలేస్తే కప్పుకోవడానికి.. అది తెచ్చి వర్ష కి ఇచ్ఛా..

అది కింద పరిచి దాని మీద పడుకొని పైకి చూస్తూ నువ్వు కూడా పడుకో అంది..

తన పక్కన నేను..

మొహమాటంగానే పడుకున్న.. తనకి తగలకుండా..

అవి నీకు గుర్తున్నాయా అంటూ ఏవో నక్షతాలని చూపెడుతోంది.. తన వేలు దాటి నా చూపు పొవట్లేదు..

తన పక్కన పడుకున్న అన్నా ఫీలింగే నన్ను ఊపిరి కూడా తీసుకోనివ్వట్లేదు.. ఆయాసం తో లేచి కూర్చున్న..

ఏమైంది అంది తను కూడా లేచి కూర్చుంటూ..

ఎం లేదు నువ్వు పడుకో.. నేను కూర్చుంటా అన్నా..

అలాగా అంటూ చెయ్యి మడిచి అర చేతిలో తల పెట్టుకొని నేను కూర్చున్న వైపు తిరిగి విష్ణు మూర్తి లా పడుకుని నన్నే చూస్తోంది..

నన్ను ఏడిపించడానికి భూమి మీదకి వచ్చిన రతీ దేవి లా ఉంది.. వెంటనే నేను చెరువు వైపు తిరిగి.. రోజూ ఇలాగె ఉంటె ఎంత బావుంటుందో కదా అన్నా..

హహ్హహ్హ అంటూ నవ్వుతోంది.. వెనక్కి తిరిగి చూస్తే తన కళ్లల్లో చిన్న కన్నీటి పొర..

ఎం చేద్దాం ఈ నైట్.. ఇక్కడే ఉందామా.. నిన్ను దింపెయ్యనా అన్నా..

అదేంటి నైట్ అంతా ఉందాం అన్నా కదా అంది.. సరే అంటూ లేచి గోడ దాకా వెళ్లి నిద్రపోతున్న ఊరిని, అలసిపోకుండా చిన్న చిన్న అలలు చేస్తున్న చెరువుని చూస్తున్న..

ఏంటి నేను మాట్లాడుతుంటే అలా వచ్చేసావ్ అంటూ నా పక్కన వచ్చి నుంచుంది..

ఈ వూరు చాల బావుంది కదా.. మనం బిజినెస్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి మనం కూడా ఇక్కడే సెటిల్ అవుదామా అన్నా..

వర్ష - అవును సాయి చెప్పడం మర్చిపోయా.. మావాళ్లు ఓకే అన్నారు.. రేపే నిన్ను వాళ్ళకి పరిచయం చేస్తా.. ఎవరు దేనికి సూట్ అవుతారో నువ్వే ఫిల్టర్ చెయ్యి..

నేను - ఒక నెల కొంచెం వేరే వేరే కంపెనీస్ లో ట్రైనింగ్ కూడా ఇప్పిద్దాం.. లోన్ కోసం ఎక్స్పీరియన్స్ యూస్ అవుతుంది..

వర్ష - గుడ్ ఐడియా.. రేపటి నుంచే పని మొదలు పెట్టాలి.. అంటూ సైలెంట్ గా తానూ గోడ మీద రెండు చేతులు ఒక అర చేతి మీద ఇంకో అర చేయి అంచి దాని మీద గెడ్డం పెట్టుకొని ఆ నీళ్ళకేసి చూస్తూ ఉండిపోయింది..

వర్ష వర్ష అంటూ కదిపితే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది.. పద అమ్మ వారికీ దణ్ణం పెట్టుకొని వద్దాం అని దణ్ణం పెట్టుకుంటుంటే.. నా నుదుటిన కుంకుమ పెట్టిన స్పర్శ కి కళ్ళు తెరిచా..

బొట్టు పెట్టి నా కళ్ళలోకి చూస్తూ నవ్వుతోంది..

తనకి గతం లేకపోతె ఎంత బావుండేదో కదా అనిపించింది...అది కూడా తనకోసం..

నాకు ఒకసారి దగ్గరై ఒకసారి దూరం అవుతోంది.. నేను తనకి ఒక క్యాబ్ డ్రైవర్ లా కాకుండా ఒక క్లాస్మెట్ గా పరిచయం అయ్యుంటే.. తన నవ్వు అలాగే ఉండి ఉండేదిగా..

ఈసారి నేను వెళ్లి పడుకున్నా..తను వచ్చి నా పక్కన కూర్చుంటూ ఏంటి సాయి ఎప్పుడూ మాట్లాడాలి మాట్లాడాలి అంటూ ఉండేవాడివి.. ఇప్పుడు ఇంత సైలెంట్ అయిపోయావ్ అంటూ బుంగమూతి పెట్టుకుంది..

మళ్ళీ మామూలు అయ్యి.. లేకపోతె  చిన్నప్పటి విషయాలు చెప్పు అంటే మీ అమ్మ కొట్టింది నాన్న కొట్టాడు అంటే కోపం రాదా అన్నా.. లేని కోపం నటిస్తూ..

నిజమే కదా అంటూ మళ్ళీ నవ్వుతోంది..

గుడ్ నైట్ పడుకో అంటూ తన వైపు వీపు చేసి అటు తిరిగి పడుకున్నా..

అబ్బో కోపమే అంటూ తానూ నా పక్కన పడుకుంది..

అప్పటికే లేట్ అయిందేమో నిద్ర పట్టేసింది.. మధ్యరాత్రి మెలకువ వస్తే తన వైపు ఎప్పుడు తిరిగానో గుర్తు లేదు..

అంత దగ్గరగా తన లేలేత మొహాన్ని చూస్తూ ఊపిరి భారమై.. మళ్ళీ లేచి కూర్చున్న.. తను అంత దగ్గరగా ఉంటె ఊపిరి ఆడట్లేదు..

కార్ దగ్గరకి వెళ్లి నీళ్లు తాగి.. బయట నుంచి తనని చూస్తూ మళ్ళీ తన దగ్గరకి వేళ్ళ లేక.. కార్లోనే పడుకుండి పోయా..



పొద్దున్న..


వేస్ట్ ఫెలో.. నన్ను అక్కడ వదిలేసి ఇలా కార్ లో వచ్చి పడుకుంటావా..

సాయి - అది కాదు వర్షా.. నీ పక్కన పడుకుంటే నిద్ర పట్టట్లేదు.. ఊపిరి వేగం పెరిగిపోతోంది.. దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు..

ఐతే మాత్రం నన్నూ లేపితే మొన్నటిలా వెనక పడుకునే దాన్ని కదా.. అంటూ కోపంగా వెనక ఎక్కి కూర్చున్న..

మండిపోతోంది.. వాడితో వస్తే ఇలా వదిలేస్తాడా అని..

వాడ్ని నమ్మి బిజినెస్ చేస్తే అది కూడా ఇలాగె వదిలేస్తాడా మధ్యలో.. పీక పిసికి చంపెయ్యాలి అన్నంత కోపం వస్తోంది..

వాడు కార్ స్టార్ట్ చెయ్యకుండా వెనక ఎక్కి నా పక్కన కూర్చున్నాడు..

ఇక్కడికి ఎందుకు వచ్చావ్.. నన్ను ఇంటి దగ్గర దింపేయ్ కాలేజీ కి వెళ్ళాలి అన్నా..

నేను కూడా వెళ్ళాలి అన్నాడు..

అయ్యో తమరికి నా పక్కన కూర్చుంటే ఊపిరి ఆడదు కదా.. పోతావేమో.. ఆ పాపం నాకెందుకు.. వెళ్ళు వెళ్లి ముందు కూర్చో అన్నా..

వర్ష.. నీ ఊపిరి నాకు అందిస్తావా అన్నాడు.. నాకేం అర్ధం కాలేదు..అన్నట్టు చూసా..

మెల్లిగా నా మెడ మీంచి చేతిని పోనిచ్చి భుజం మీద వేస్తూ.. తన వైపు లాక్కుంటూ.. తన పెదాలని నా వైపు తీసుకొస్తూ కన్నులు తెరిచి నా కళ్ళను చూస్తూ పెదాల మీద ముద్దు పెట్టాడు..

తన వేడి ఊపిరి తగులుతోంది..

ప్రేమగా పెట్టిన ముద్దు.. నేను కూడా తన తలని నా చేతులతో బంధిస్తూ.. తనకి ఊపిరులూదా..

To be Continued..
Like Reply
#45
Superrrr update
Like Reply
#46
Nice update
Like Reply
#47
good narration bro
Like Reply
#48
Wow excellent andi..
Like Reply
#49
Super broo konchm konchm dose penchuthunnaru...
[+] 1 user Likes Rishithejabsj's post
Like Reply
#50
clps Nice story fantastic updates happy
Like Reply
#51
Nice update
Like Reply
#52
(12-02-2025, 11:11 PM)Sushma2000 Wrote: Superrrr update

(12-02-2025, 11:48 PM)BR0304 Wrote: Nice update

(13-02-2025, 03:53 AM)shekhadu Wrote: good narration bro

(13-02-2025, 07:43 AM)Nani666 Wrote: Wow excellent andi..

(13-02-2025, 08:18 AM)Rishithejabsj Wrote: Super broo konchm konchm dose penchuthunnaru...

(13-02-2025, 11:31 AM)saleem8026 Wrote: clps Nice story fantastic updates happy

(13-02-2025, 11:35 AM)Saikarthik Wrote: Nice update

Dhanyavadalu Mitrulaaraa..
Like Reply
#53
Modatlo ee kadhaki

C/O రత్తమ్మ కంపెనీ ani pedadam anukunnanu..

kaani లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ani pettesta...

ippudu లవ్ ఎట్ ఫస్ట్ సైట్ peruto kotta kadha rayalani undi..

em cheddam.. ee kadhaki ide unchana C/O రత్తమ్మ కంపెనీ ani marcheyanaa..
Like Reply
#54
Good update
Like Reply
#55
ప్రేమగా పెట్టిన ముద్దు.. నేను కూడా తన తలని నా చేతులతో బంధిస్తూ.. తనకి ఊపిరులూదా..

నీ గుండె ఏంట్రా అంత గట్టిగా కొట్టుకుంటోంది.. డోస్ ఎక్కువైతే నిజంగా పోయేలా ఉన్నావ్.. సరే పోదాం పద అన్న..

ఇద్దరం ముందు సీట్స్ లో కూర్చోగానే కార్ సిటీ వైపు పరుగులు తీసింది..


మధ్యాహ్నం..

ఇద్దరం తెలిసిన ఫ్రెండ్ దగ్గర లాప్టాప్ తీసుకొని.. ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి ఇంకొంచెం స్టడీ చేసి.. సమ్మరైజ్ చెయ్యడం మొదలు పెట్టాం.. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, పికెల్స్, పౌడర్లు, మసాలాస్, స్నాక్స్, వాషింగ్ ప్రొడక్ట్స్, హౌస్ క్లీనింగ్ ప్రొడక్ట్స్, గ్రోసరీ, సోప్స్, రెడీ మిక్స్ టిఫిన్స్ ఇలా 10 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని ఫైనల్ చేసాం..

మళ్ళీ ఒక్కొక్కటి మెషినరీ అండ్ రా మెటీరియల్ , మాన్పవర్   వైస్ చూసుకుంటూ ROI చూసుకుంటూ ఫైనల్ చేసే సరికి 7 దాటిపోయింది..

ఓవరాల్ బడ్జెట్ విత్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సూపర్ మార్కెట్ చైన్ తో కలిపి చూసుకుంటే 5 క్రోర్స్ దాటిపోయింది..

లోన్ వచ్చిన కూడా ఎంత లేదన్న మనల్ని 30  టు 40 పెర్సెంట్ పెట్టమంటారు.. అంటే మినిమం 2 క్రోర్స్ మనం ఆరెంజ్ చేసుకోవాలి..

సరే ఫండ్ రైసింగ్ కూడా ఇప్పుడే చేసేద్దాం.. అని సాయి అంటే సరే అని.. మా డీటెయిల్స్ ఎంటర్ చేసి.. మా కాన్సెప్ట్ పెట్టి త్రీ మంత్స్ లో 2 క్రోర్స్ టార్గెట్ అడిగాం..

అనుకున్న పని మొదలు పెట్టినందుకు చాల హ్యాపీ గా ఫీల్ అయ్యాం..

ఈలోపు అత్త కాల్ చేసింది.. నైట్ బుకింగ్ ఉందని..

సాయి కి చెప్పా వెళ్లాలని.. వాడి చూపుల్లో విసుగు కోపం చిరాకు అన్ని కనపడుతున్నాయి..

కానీ వాడికి అర్ధం కాదు కదా.. ఇదొక నెట్వర్క్.. ఒకళ్ళతో ఒకళ్ళకి అవసరాలు.. అనుకున్నంత ఈజీ గా బయట పడలేం..

నా స్కూటీ మీదే.. ఇంటికి వచ్చాం.. రేపు మా వాళ్లతో మాట్లాడదాం.. ఎవరెవరు ఎం చేయగలరో.. ట్రైనింగ్స్ ఇప్పిద్దాం అన్నావ్ కదా..

క్రౌడ్ ఫండింగ్ కూడా రావడం స్టార్ట్ అయ్యాక లోన్స్ కి అప్లై చేద్దాం.. విత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అన్న..

వాడేం మాట్లాడట్లేదు.. కనీసం బాయ్ కూడా చెప్పట్లేదు..

ఇక నేనే వాడిని దగ్గరకు తీసుకొని నుదిటి మీద ముద్దు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసా..

.................
రెండు నెలల 25 రోజుల తర్వాత..

మేము రైజ్ చేసిన క్రౌడ్ ఫండింగ్ సక్సెస్ అని చెప్పలేం.. ఫెయిల్ అని చెప్పలేం.. 34 లక్షలు వచ్చాయి.. మా దగ్గర ఒక 27 లక్షలు.. మొత్తం 61 లక్షలు..

ఈలోపు మేము అనుకున్నట్టు ఫర్మ్ రిజిస్టర్ చెయ్యడం.. మావాళ్లను రకరకాల చోట్ల ఉద్యోగాల్లో చేర్పించడం చేసాం..

ఇది వరకే సాయి అనుకున్నట్టు సిటీ కి దగ్గర ఉన్న ఆ పల్లెటూల్లోనే వేర్హౌస్ రెంట్ కి తీసుకున్నాం..

ఇక అత్త కూడా ఒకేసారి కాకుండా ఒక్కొక్కళ్ళని బిజినెస్ మనిపిస్తూ వాళ్ళని అక్కడే సెటిల్ అవ్వమని పంపడం మొదలు పెట్టింది.. ఒకప్పుడు 28 మంది దాకా ఉన్న మేము ఇప్పుడు 12 మంది అయ్యాము..

వచ్చే బుకింగ్స్ కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం అలా మా మీద ప్రెషర్ రాకుండా మేము బయట పడేలా చేసింది అత్త..

ఇక ఒక్కొక్కళ్ళను తీసుకొని బ్యాంక్స్ చుట్టూ తిరగాలి లోన్స్ కోసం..

మళ్ళీ మా అదృష్టమో.. దురదృష్టమో.. 6 ప్రాజెక్ట్స్ అప్ప్రోవ్ అయ్యాయి.. మిగిలిన వాటికీ ఇంకా టైం పడుతోంది..

మా దగ్గర ఉన్న డబ్బులతో స్టార్ట్ చేద్దాం అంటే నెక్స్ట్ సూపర్ మార్కెట్స్ పెట్టడం కష్టం..

ఈలోపు గత మూడు నెలలుగా మాతో ట్రావెల్ చేస్తున్న మా క్లాస్మేట్స్ కూడా ఫండ్ రైసింగ్ ప్రోగ్రాం ని కాలేజీ లో కూడా కండక్ట్ చేసి దగ్గర దగ్గర 8 లక్షలు  కలెక్ట్ చేసి ఇచ్చారు..

ఏదైతే అదయ్యిందని మళ్ళీ అదే రేణుక ఎల్లమ్మ గుళ్లో పూజ చేసి మా బిజినెస్ స్టార్ట్ చేసాం.. అదే "లోకల్" బ్రాండ్..

ఒక మంచి పనికి జనాలు ముందుకు వస్తుంటే అప్పుడు సాయి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.. అడిగి చూడొచ్చు కదా అన్న మాట..

మళ్ళీ అత్త కి చెప్పా.. అత్త పెద్ద పార్టీలు ఉంటె చెప్పు ఒక్క నెల మాత్రం అని.. అత్త జాలి పడిందో బాధ పడిందో తెలీదు కానీ.. మళ్ళీ పెద్ద పెద్ద బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి..

కానీ ఈసారి వాళ్ళకి సుఖమే కాదు.. నా అవసరం కూడా అడిగా.. కొంత మంది అర్ధం చేసుకున్నారు.. కొంత మంది అబద్ధం అనాన్రు.. ఏమైతేనేం ఇంకో 12 లక్షలు వచ్చాయి..

ఆ డబ్బుతో మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసాం… మాక్సిమం మా దగ్గర పనిచేసేవాళ్లంతా ట్రాన్సజెండెర్ / హిజ్రా లే..

ట్రాన్స్పోర్టింగ్ అండ్ సేల్స్, మార్కెట్ మైన్టైనన్స్ మా వాళ్ళకి అప్ప చెప్పాము.. చదువుకున్న వాళ్ళు అకౌంట్స్ సెక్షన్..

సిటీ లో బా క్రౌడ్ ఉండే ప్లేసెస్ లో త్రీ సూపర్ మర్కెట్స్ ఓపెన్ చేసి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడం మొదలుపెట్టాం.. అక్కడ దొరికే ప్రతీ వస్తువు మేము తయారు చేసేదే లేదా నాన్ బ్రాండెడ్ ఐటమ్స్.. లోకల్ ఫార్మర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్లు ని ఎంకరేజ్ చేసేలా..

మా ఫ్రెండ్స్ ద్వారా మా బిజినెస్ ప్రమోషన్ ఇంకా ఫాస్ట్ గా జనాల్లోకి వెళ్ళింది.. ఎన్నో డెలివరీ అప్స్ వాళ్ళంతట వాళ్లే మా ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి చేర్చడానికి మాతో అగ్రిమెంట్ చేసుకున్నారు...

అత్త సాయి నేను మావాళ్లు అందరూ హ్యాపీ..

...........

కరెక్ట్ గా మా సూపర్ మార్కెట్ చైన్ ఓపెన్ చేసి 1 ఇయర్ అయ్యింది.. ఈ 1 ఇయర్ లో మా జీవితాల్లో మారనిది ఏదైనా ఉంది అంటే అది సాయి నుదిటిన నేనిచ్చే ముద్దు ఒక్కటే.. ప్రతీ రోజు సాయంత్రం మేము విడిపోయే ముందు.. ఒక్క ముద్దు..

ఈరోజు మా కంపెనీ ఆనివెర్సరీ.. ఈ 1  ఇయర్ లో మా లోకల్ బ్రాండ్ పేరు మీద ఇంకో పది రకాల ప్రొడక్ట్స్ లాంచ్ చేసాం. 20 సూపర్ మార్కెట్ బ్రాంచెస్ పెట్టాం..  దగ్గర దగ్గర 630 మందికి పని దొరికింది.. ఈ ప్రాజెక్ట్ వల్ల.. సాయి వల్ల..

సాయంతం..

ఈరోజు ఆనివెర్సరీ కి మావయ్య వాళ్ళని చెల్లిని అందరాని పిలిచా.. వాళ్ళు కూడా హ్యాపీ చిన్న వయసులోనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇంత బిజినెస్ చేస్తున్నందుకు..

వాళ్ళకి వర్ష ని చూపించా.. రాణి ని చూపిస్తే గతం మాట్లాడుకోవాల్సి వస్తుందేమో అని..

మా క్లోజ్నెస్ చూసి వాళ్ళకి ఎదో అర్ధం అయ్యింది అనుకుంటూనే.. నైట్ బస్సు ఎక్కడానికి బయలుదేరారు..

వాళ్ళని దింపి మళ్ళీ పార్టీ కి వచ్చా..

వర్ష కి ఈరోజు ప్రొపోజ్ చెయ్యాలి అని 1 ఇయర్ ముందే అనుకున్నా..

కొంచెం సందడి తగ్గాక.. అచ్చు తనలాగే ఉన్న ఒక రోజ్.. అదే రోజ్ కలర్ లో ఇంకో బాక్స్ తీసుకొని తన దగ్గరకి వెళ్ళా..

ఇన్ని చూసిన తర్వాత ఏముంది.. నవ్వుతూ ఏంట్రా ప్రొపోజ్ చేస్తున్నావా అంది..

అవునంటూ మోకాళ్ళ మీద కూర్చొని రోజ్ ఇచ్చి.. ఎడమచేతిలో బాక్స్ ని కుడి చేత్తో ఓపెన్ చేస్తూ..ఒక కీ తన చేతికి ఇచ్ఛా..

వర్ష - ఏంట్రా ఇది.

నేను - అప్పుడు చెప్పా కదా.. ఆ వూళ్ళో చెరువు పక్కన మనకోసం ఒక ఇల్లు కొన్న.. 1000 గజాలు.. మనకోసం..

వర్ష - మన కోసం కాదు.. సెల్ఫిష్ వి రా నువ్వు. నీకోసం కొన్నావ్..

నేను - అదేంటి..

వర్ష - మరి మన కోసం ఐతే ముందు నాకు చూపించవా.. నువ్వు సర్ప్రైస్ ఇవ్వాలి.. నేను అవ్వాలి.. అప్పుడు నువ్వు హ్యాపీ.. అంటే నీ హ్యాపీనెస్ కోసం చేసినట్టే కదా..

నేను - సర్లే పనికి మాలిన లోజిక్స్ తక్కువేం లేదు.. నైట్ వెళ్దామా..

వర్ష - హే.. ఎప్పుడు పడితే అప్పుడేనా.. మంచిరోజు చూసి గృహప్రవేశం చేసుకుందాం..

అందరూ మమ్మల్నే చూస్తున్నారన్న సంగతి అప్పటికి గాని గమనించలేదు మేము..

రత్తమ్మ అత్తకి మిగిలిన వాళ్ళకి వెళ్లొస్తాం అని చెప్పి తనని దింపడానికి వెళ్ళా..

వెళ్తూ వెళ్తూ సంవత్సరం నుంచి మాకు అలవాటైన నుదిటి ముద్దు కాకుండా పెదాల మీద ముద్దిచ్చి సిగ్గు పడుతూ వెళ్ళిపోయింది వర్ష...

ఇంటికొచ్చి పడుకుంటే నిద్దర రాదే... ఇల్లు.. పెళ్లి.. పిల్లలు.. కలలు.. నిజాలు..

పొద్దున్న...

వరసపెట్టి కాల్స్ వస్తున్నాయ్..ఇంత పొద్దున్నే ఎవరా అని చూస్తే ఏడుస్తూ రత్తమ్మ అత్త..

వర్ష సూసైడ్ అట్టెంప్ట్ చేసిందని.. అర్జెంటు గా హాస్పిటల్ కి రమ్మని...

To be Continued.
Like Reply
#56
ఐ లైక్ సాడ్ ఎండింగ్స్....

ఎవరో ఒకరిని చంపేసేయ్...

జస్ట్ డూ ఇట్....


devil2
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#57
Super
Like Reply
#58
Sadistt writerrr...happy ending ivvochu ga
Like Reply
#59
Story bagundi hero heroine love track bagundi business bagundi
Antha baney undi ga mari enduku bro idi ah enduku antunna
Like Reply
#60
Anti sudden ga??? Ado undi super ga rastunaru andi
Like Reply




Users browsing this thread: