Thread Rating:
  • 5 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"వి-కా"
#1
ఇంకో కథ. ఒకటే భాగం. చిన్న ఆలోచన, చిన్న కథ. ఎలా ఉందో చెప్పండి.
[+] 1 user Likes earthman's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
క్యాబ్ కదిలింది.

హాయ్

హాయ్

ఫస్ట్ టైం

ఔను

ఎలా ఉంది బయట?

కొత్తగా ఉంది

భయం లేదా?

ఉంది. మా ఫ్రెండ్స్ లేకుండా ఒక్కడినే ఉండటం ఇదే ఫస్ట్ టైం

డోంట్ వర్రీ... ఏం కాదు

బయట ఎలా ఉంటుంది

బాగుంటుంది

మీకు అన్ని తెలుసు అనుకుంట

తెలుసు... ఎన్నో రోజుల నించి బయట ఉన్నా కదా... అన్నీ చూసాను

అన్నీ అంటే?

అన్నీ

గతుకుల రోడ్ మీద పోతున్న క్యాబ్ కుదుపులకి గురైంది.

ఇద్దరూ ఒకరికొకరు తగిలారు.

సారీ

నో ప్రాబ్లం... నాకు ఇది మామూలే

అంటే

ఈ రోడ్ నాకు కొత్త కాదు... మనం వెళ్ళే చోటు నాకు కొత్త కాదు... నేను చూసేది కొత్త కాదు

అంటే ఇలా ఇంతకు ముందు కూడా జరిగిందా

ఏది?

ఈ రోడ్ ప్రయాణం

యస్... ఎన్నో సార్లు. ఈ రోడ్ మీద నా ప్రయాణం ఇప్పటిది కాదు

నాకు కొత్తగా ఉంది

ఔను... ఇప్పుడే కదా మొదటిసారి బయటకి వచ్చింది

ఔను

నెమ్మదిగా నీకు కూడా అన్నీ అలవాటౌతాయి

మనం వెళ్ళేది ఎక్కడికి

చెప్పను

ఎందుకు

కాసేపట్లో చూడబోతున్నావు కదా... సస్పెన్స్ ఎంజాయ్ చెయ్యి

ఎవరు ఉంటారు అక్కడ

ఎవరో ఉంటారు... భయపడకు ఏమీ కాదు

మీకున్న ధైర్యం నాకు లేదు

ఇది ధైర్యం కాదు అనుభవం. కొన్ని రోజులు పోతే నువ్వు కూడా నాలానే ఉంటావు

మీరు ఒక్కరే ఉన్నారేంటి... మీతో ఎవరూ లేరు?

ఒక్కోసారి ఇంతే, ఒక్కదాన్నే ఉంటాను. ఒక్కోసారి ఫ్రెండ్స్ అందరం ఉంటాం

నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారా అయితే?

మనం వెళ్ళే చోట నీకు కొత్త ఫ్రెండ్స్ ఉంటారు. కాకపోతే ఇలా కలిసి వెళ్లడం ఉండదు. వెళ్ళే చోట లోపలికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడో బయటకి వచ్చేది

మీరు కూడా బయటకి ఎక్కువ రారా అయితే?

మేము వస్తాం. చాలా సార్లు వస్తాం

అదెలా?

అదంతే. మమ్మల్ని బయటకి తీసుకొస్తారు. ఎప్పుడూ వస్తునే ఉంటాం. ఒక్కోసారి ఒక్కదాన్నే. ఒక్కోసారి ఫ్రెండ్స్. కాని బయటకి అయితే వస్తాం

ఎందుకని మమ్మల్ని బయటకి తీసుకురారు

అదంతే. మాకున్న స్వేచ్ఛ మీకు ఉండదు. మాతో పని ఎక్కువ ఉంటుంది, అందుకే

మళ్ళీ గతుకులు.

మళ్ళీ తగిలారు. దగ్గరికి వచ్చారు.

మీ దగ్గర ఏదో వాసన వస్తోంది

ఔను

ఎప్పుడూ పరిచయం లేదు ఈ వాసన

ఔనా

ఔను

బాగుందా

బాగుంది

మళ్ళీ పీలుస్తావా



ఆహ్

ఎలా ఉంది

బాగుంది. ఏదో ఇదిగా ఉంది

అలానే ఉంటుంది. ఈ వాసన ఎప్పుడూ ఇలానే ఉంటుంది

పోదా

కొంచెం ఉంటుంది. కొంత మందికి ఇష్టం ఇలా వాసన చూడటం

ఔనా

ఔను

మరి నా వాసన

చూడరు

ఏం

అదంతే. మేం స్పెషల్

ఎందుకని

ఎన్ని అడుగుతావు

నాకు తెలీదు ఇవి, అందుకే అడుగుతున్నా. మీలా ఇప్పటిదాకా ఎవరితోను కలిసి ఉండలేదు

ఔను. మేము వేరు, మీరు వేరు

ఎందుకలా?

అలానే ఉంటుంది

అదే ఎందుకని

అలా ఉంటేనే బాగుంటుంది. అందుకని

మళ్ళీ కుదుపు.

మళ్ళీ తగిలారు.

సారీ

లే. పాడు పిల్లాడా. మంచిగా మాట్లాడుతుంటే ఇలా పైన పడతావా

కుదుపు వచ్చింది కదా

మనసులో పైన పడాలి అనుకుంటూ కుదుపు రాగానే పడతావా... అమ్మా

కుదుపు వస్తే నేనేం చెయ్యను

ఇందాకేమో వాసన అన్నావు... ఇప్పుడేమో పైన పడుతున్నావు

మీరే కదా వాసన చూస్తావా అన్నారు

నేను అంటే... వద్దు అనాలి... చూస్తాను అనకూడదు

ఇక అనను

వాసన చూస్తావా

వద్దు

ఏమీ అనుకోనులే

వద్దు, మళ్ళీ తిడతారు

తిట్టను. చూస్తావా



అబ్బ ఆశ, ఛాన్స్ లేదు. పో

క్యాబ్ స్లో అయింది.

ఓకే. బై

ఎందుకు

వచ్చేసాం. మళ్ళీ కలిసేదాకా నన్ను గుర్తుపెట్టుకోడానికి ఇంకోసారి వాసన చూడు

ఆహ్

ఇక చాల్లే, లే. బై

బై

మీ పేరు

వి

నా పేరు...

నీ పేరు కా... నాకు తెలుసు. చెప్పా కాదు నాకు చాలా తెలుసు

****************
"తెచ్చావా?"

"తెచ్చా. బ్యాగ్లో ఉంది తీసుకో. నాకు నిద్ర వస్తోంది, పడుకుంటా"

"ఒకటి తెమ్మన్నా. రెండు ఉన్నాయేంటి?"

"ఒకటి నాదిలే. తేడా తెలీదా నీకు?"

"నీదెందుకు అలా పెట్టుకోవడం"

"ఒక్కోసారి అవసరం ఉంటుందిలే"

"పక్కపక్కనే పెట్టావు?"

"మనం ఒకే ఇంట్లో ఉన్నట్టు, నీ అండర్ వేర్, నా ప్యాంటి ఒకే బ్యాగ్లో ఉన్నాయి. కలిసుంటే మాత్రం అవేమన్నా మాట్లాడుకుంటాయా ఏంటి, కాని"

మేం మాట్లాకుంటామో, ఇంకేవన్నా చేసుకుంటామో మాకు తెలుసు... అనుకుంటూ నవ్వుకున్నారు వి అనే విక్టోరియా, కా అనే కాల్విన్ .
[+] 8 users Like earthman's post
Like Reply
#3
(05-01-2025, 05:55 PM) pid=\5846934' Wrote:"మనం ఒకే ఇంట్లో ఉన్నట్టు, నీ అండర్ వేర్, నా ప్యాంటి ఒకే బ్యాగ్లో ఉన్నాయి. వి అనే విక్టోరియా, కా అనే కాల్విన్ .

ప్యాంటీల బ్రాండ్లు కూడా తెలుసా బాసు, నాకు తెలిసింది ఒకటే బ్రాండు జాకీ...చదువుతూ నేనేమోమో అనుకున్నా....
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#4
(05-01-2025, 07:23 PM)Uday Wrote: ప్యాంటీల బ్రాండ్లు కూడా తెలుసా బాసు, నాకు తెలిసింది ఒకటే బ్రాండు జాకీ...చదువుతూ నేనేమోమో అనుకున్నా....

ప్యాంటిలో కారేది అందరికీ కావాలి కానీ... ఇంత కష్టపడి రాసి ఎవరూ రిప్లై ఇవ్వకపోతే నా కళ్ళ నించి కారే కన్నీరు గురించి ఎవరికీ పట్టదు. Sad

నువ్వొక్కడివే ఏది రాసినా నీ భావాలని అక్షర రూపంలో చెప్తావు. Thank you.

[+] 1 user Likes earthman's post
Like Reply
#5
super bro
Like Reply
#6
Nice fun
Like Reply
#7
(Yesterday, 09:11 AM)earthman Wrote: ప్యాంటిలో కారేది అందరికీ కావాలి కానీ... ఇంత కష్టపడి రాసి ఎవరూ రిప్లై ఇవ్వకపోతే నా కళ్ళ నించి కారే కన్నీరు గురించి ఎవరికీ పట్టదు. Sad

నువ్వొక్కడివే ఏది రాసినా నీ భావాలని అక్షర రూపంలో చెప్తావు. Thank you.


వ్యూస్ చూడండి, చాలా మందికి కావలసింది ఇందులో దొరకలేదు కాబోలు లేదా కథే ఎక్కలేదేమో...కళాపోషణ బొత్తిగా లేదండి జనాలకు.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#8
(Yesterday, 12:51 PM)Uday Wrote: వ్యూస్ చూడండి, చాలా మందికి కావలసింది ఇందులో దొరకలేదు కాబోలు లేదా కథే ఎక్కలేదేమో...కళాపోషణ బొత్తిగా లేదండి జనాలకు.

తెలుసు. కాని వ్యూస్ ఇదేంటి అని క్లిక్ చెయ్యడం వల్ల కూడా వస్తాయి కదా. లైక్స్ ఓకే. ఇక రిప్లైస్ అంటే చదివారు, ఏదో నచ్చింది అని.

నా గోల ఒకటే. దాదాపు తప్పులు లేకుండా నిజంగా కష్టపడి తెలుగులో రాస్తే స్పందన రాకపోతే ఎలా అని. నేను పడే తెలుగు టైపింగ్ కష్టానికయినా స్పందన రావాలి అని.

ఎన్నో పెద్ద కథలు ఉన్నాయి, ఎంతో మంది తెలుగులో రాస్తూనే ఉండుంటారు, వాళ్లకి ఇది మామూలేమో. నాకైతే దుంప తెగుతుంది, అందుకే నా గోల టైపింగ్ గోల.

అలానే, పాత రోజుల్లో కథలు చదివేవాళ్ళు ఫలానా అని చెప్పగలిగేలా ఉండేది. ఇప్పుడలా కాదు. వ్యూస్ పరంగా చెప్పలేం. అమెరికాలో సైంటిస్ట్ దగ్గర నించి అమలాపురంలో శనక్కాయల వ్యాపారి వరకూ ఎవరైనా చూడగలరు. అనుకున్న స్పందన రాకపోవడానికి ఇదొక కారణం.

ఎంత ప్రాప్తమో అంతే అనుకుని సరిపెట్టుకుంటే, ఇంకో కథ రాసే ఉత్సాహం ఎలా వస్తుంది. నాకు ఇది కావాలి, ఆర్ట్స్ దగ్గర ఇది ఉంటుంది. కొన్ని సార్లు ఉధృతి ఉంటుంది.. కొన్ని సార్లు స్తబ్దత ఉంటుంది.

యథా స్పందనా... తథా రచయిత.

అట్టి స్పందనని మాకొసుగుతున్న నీ వంటి పాఠకుల కోసమే రాసేది. నీ వంటి పాఠకులు లెక్కకు మిక్కిలి ఉన్న ఎడల మా నించి వచ్చు కథాప్రవాహమునకు అడ్డుకట్ట వేయిట ఎవరి తరమూ కాదు.
[+] 3 users Like earthman's post
Like Reply
#9
(Yesterday, 01:21 PM)earthman Wrote: అట్టి స్పందనని మాకొసుగుతున్న నీ వంటి పాఠకుల కోసమే రాసేది. నీ వంటి పాఠకులు లెక్కకు మిక్కిలి ఉన్న ఎడల మా నించి వచ్చు కథాప్రవాహమునకు అడ్డుకట్ట వేయిట ఎవరి తరమూ కాదు.

ధన్యవాదాలు earthman గారు...నమో నమః Namaskar
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#10
Nice one
Like Reply
#11
బాగుంది కథనం. పిట్ట కథలు అని ఒక త్రెడ్ స్టార్ట్ చేసి అందులో రాయండి...ఇవన్నీ.

ఇలాంటివి కూడా వుండాలి ఈ సైట్ కి.
Like Reply




Users browsing this thread: 2 Guest(s)