23-12-2024, 06:53 PM
Superb, good start
REVENGE
|
29-12-2024, 12:09 AM
Episode - 002
బోరింగ్ పంపు దెగ్గరికి వెళ్లి అక్కడే ఇత్తడి బకెట్లో నీళ్లు పట్టుకుని చెంబుతో నీళ్లు నడినెత్తి మీద పోసుకోగానే బూడిద మెల్లగా కిందకి జారింది, బాగా రుద్ది పోసుకుని అవే బట్టలు వేసుకుని ఎండకి నిలబడ్డాడు. అయినా కనురెప్పలు, ఒంటి మీద వెంట్రుకలు, గుండు అవతారం చూస్తే కొంచెం వింతగానే ఉన్నాడు. ఎవరో మనుషులు వచ్చి వెళ్తుండడం చూసి చివరనున్న వేప చెట్టు కింద కూర్చుని చూస్తున్నాడు. కాటికాపరి కోసం వెతుకుతుంటే ఒక ముసలాయన వచ్చి నేనే అన్నాడు. అందరూ మాట్లాడి వెళ్లిపోయిన తరువాత శివని చూసి దెగ్గరికి వచ్చి శివ అవతారం చూసి పక్కన కూర్చున్నాడు. "నా పేరు మొగులేసు, మరి నీ పేరు ?" శివ : శివ మొగులేసు : ఏ ఊరు మీది సమాధానం రాలేదు మొగులేసు : మీ అమ్మా నాన్నా ఎక్కడా అని అడిగిన వెంటనే చెయ్యి ఎత్తి కాలిపోయిన బూడిద వైపు చూపించాడు. ఇక్కడ నేను కాకుండా వాళ్ళని కాల్చింది ఎవరు అని అడిగితే శివ సమాధానం చెప్పలేదు.మీ వాళ్ళు ఎవరు లేరా అని అడిగితే శివ దెగ్గర నుంచి మళ్ళీ మౌనం, సమాధానం రాలేదు. సరే.. పని చెపుతా చేస్తావా అని అడిగితే లేచి నిలబడ్డాడు. అదిగో అక్కడ కట్టెలు కనిపిస్తున్నాయా వాటిని అక్కడ పేర్చు అని లేచి గుడిసెలోకి వెళ్ళిపోయాడు. పని మధ్యలో భోజనం మొగులేసు వండితే మజ్జిగ నీళ్లు పచ్చిమిరపకాయతో అన్నం తిన్నాడు. వారం దాటింది.. ఒకరోజు ఎవరో ఒకతను వచ్చి "మొగులేసు, నీకు పని పడింది" అని కేకేస్తే బైటికి వచ్చాడు మొగులేసు. వచ్చిన వాడితో మాట్లాడిన తరువాత శివ వైపు చూసాడు. మొగులేసు : శివుడు.. కాపరివవుతావా అని నవ్వితే లేచి నిలబడ్డాడు శివ. శివ ముందు మోకాళ్ళ ముందు కూర్చున్నాడు మొగులేసు, శివ కళ్ళ కింద పెద్దగా కాటుక పెట్టాడు, శివుడు.. ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, గుర్తుపెట్టుకో అని చేతికి కడియం తొడిగి తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కర్ర ఒకటి శివ చేతిలో పెట్టాడు. మొగులేసు : కంబలి లోపలుంది, నీకు అవసరమైనప్పుడు వాడుదువు. ఇంకోటి ఈ ఊరు అస్సలు మంచిది కాదు, స్మశానం దాటి బైటికి పోవద్దు.. శివ మౌనంగానే మొగులేసు చెప్పేవన్ని వింటున్నాడు. వచ్చిన నాలుగు రోజుల్లోనే మొగులేసుకి అర్ధమైంది శివ మితభాషి అని.. అందులోనూ అమ్మా నాన్న తన పక్కన లేని బాధ శివ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒంటి మీద కాలిన మచ్చలు, కనురెప్పలతో పాటు చర్మం మీద వెంట్రుకలు కాలినట్టు కనిపించడంతొ చిన్నగా మాటల్లో పెట్టి అడిగితే శివ జరిగింది చెప్పాడు. ఇప్పుడున్న శివ మానసిక పరిస్థితుల్లో బైటికి పంపించడం మంచిది కాదని అర్ధమయ్యి తన కోసం ఎవరైనా వస్తారేమోనని వారం రోజులు ఎదురు చూసాడు కాని ఎవ్వరు రాలేదు. ఈ రోజు కాపరివవుతావా అని అడిగితే దానికి శివ ఒప్పుకోవడం అంతా లయకారుడి లీల అనుకుని శివని దెగ్గరికి తీసుకున్నాడు. ఇవ్వాళ మొదటిసారి శివ ఒకరిని పద్ధతి ప్రకారంగా దహనం చేసాడు, అందరూ వెళ్ళిపోయాక శవాన్ని కాల్చుతుంటే మొగులేసుకి అర్ధమైంది, ఇన్ని రోజులు తనని గమనిస్తున్నాడని, మొగులేసు ఎలా శవాన్ని కాలుస్తాడో అదే పద్దతిలో చేసుకుపోతున్నాడు. కొన్ని రోజుల్లోనే శివకి నిప్పు అన్నా వేడి అన్నా మంట అన్నా ఇష్టమని తెలుసుకున్నాడు. స్మశానంలో ఎప్పుడు మంట మండినా శివ ఆ మంటకి దెగ్గరగా వెళ్లి నిలుచునేవాడు, కళ్ళు మూసుకునేవాడు. శివ చర్మం ఆ మంటలకి గట్టిపడుతూనే నల్లపడేది, ఎన్నిమార్లు చెప్పినా వినేవాడు కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడైనా భయపడినా ఎప్పుడైనా కోపం వచ్చినా శివోహం అని అరిచేవాడు, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అలా అరిచేవాడు శివ. ఐదేళ్ళు గడిచిపోయాయి, ఒక్కసారి కూడా శివని స్మశానం దాటి బైటికి పోనివ్వలేదు మొగులేసు. ఎప్పుడైనా కావాలంటే తనతో పాటు తీసుకెళ్ళేవాడు అంతే.. మొగులేసు మంచాన పడి ఇప్పటికి ఎనిమిది నెలలు, ఈ ఐదేళ్ళలో ఇంతవరకు శివ అబద్ధం చెప్పడం కానీ ఏదైనా పని చేస్తాను అని ఒప్పుకున్న తరువాత మాట తప్పడం కానీ మొగులేసు చూడలేదు. మొగులేసు : శివుడు.. ఇలారా అని పిలిస్తే వచ్చాడు, చూడు శివా.. నా చావు నాకు తెలుస్తుంది, ఇక నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఈ ఊరి నుంచి వెళ్ళిపో.. మొగులేసు ఎందుకు వెళ్ళిపోమంటున్నాడో అర్ధంకాకపోయినా ఊరి గురించి కొంత వరకు మాటల్లో తెలుసు, వేరే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు విన్నాడు. ఈ ఐదేళ్లలో ప్రతీ వారం రోజులకి రెండు శవాలు వస్తూనే ఉన్నాయి, అందులో చాలా మంది వయసులో ఉన్న ఆడోళ్లు, పచ్చ రంగు బట్టలు వేసుకున్న నక్సలేట్లు, కుర్రోళ్లు ఉండేవారు. మొగులేసు మాటలు విన్నాక ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తూ నీ కాయం కాల్చి వెళ్ళిపోతాను అని మాత్రమే అన్నాడు. శివతో మాట్లాడిన మూడవ రోజు తెల్లారి మొగులేసు చనిపోయాడు, శివ కళ్ళలో బాధ లేదు. దహనం చేసేటప్పుడు తన కంబలి, కర్ర, ఇన్నేళ్లు మొగులేసు శివ కోసం దాచిన డబ్బులు, తన వస్తువులు అన్నీ మొగులేసుతో పాటే కాల్చేశాడు. దహన కార్యక్రమం అయిపోయాక నడుముకి గంటలు కట్టుకుని కాలే బూడిద చేత్తో తీసుకుని ఇంకో చేతిలో తన కర్రతో నిప్పుల్లో అడుగు పెట్టాడు, అటు ఇటు చూస్తూ కాసేపు ఎగిరి కాళ్ళతో బూడిదని గాల్లోకి తంతూ చివరగా బూడిదని నుదిటన పూసుకుని బైటికి వచ్చేసాడు. అన్న మాట ప్రకారం ఇక అక్కడ ఉండకూడదని నడుముకి కట్టిన గంటలు తీసి స్నానం చేసి బట్టలు వేసుకుని ఒక్క చేతికర్రని మాత్రం చేతిలోకి తీసుకుని బైటికి నడిచాడు. దారెమ్మట నడుస్తూ వెళుతుంటే శివ మొహం తెలిసిన వాళ్ళు కొంతమంది చూసారు. శివ ఎవ్వరిని పట్టించుకోలేదు, కనీసం బస్సు కోసం కూడా ఎదురు చూడలేదు, చేతిలో డబ్బులు లేవు, మొగులేసు దెగ్గర ఉన్న డబ్బులు అన్నీ కాల్చేశాడు, తన కాళ్ళకి చెప్పులు కూడా లేవు, తన అమ్మా నాన్న చనిపోయిన రోజు నుంచి ఇప్పటివరకు చెప్పులు వాడలేదు శివ. అరికాళ్ళ మీద చేతిలో కర్రతో వేగంగా నడుచుకుంటూ వెళుతుంటే ఓ ముగ్గురు చెట్టు కింద మాట్లాడుకుంటూ ఉన్నారు, అవతల పక్క రోడ్డు వైపున చిన్న బడ్డీ కొట్టు ఉంది, అక్కడ ఇంకో నలుగురు మాట్లాడుకుంటున్నారు, అటు పక్కనున్న వాళ్ళు మఫ్టీ పుల్లసులని ఇటు పక్కన ఉన్న వాళ్ళు నక్సలేట్లని తెలియని శివ మాత్రం వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు. సరైన టైమింగులో పుల్లేసులు దాచిన తమ తుపాకులు తీసి రోడ్డు దాటి వచ్చేసారు, అదే సమయానికి మధ్యలో శివ రావడం, నక్సలేట్లు రెప్ప పాటులో తేరుకుని శివని పక్కకి లాగి శివకి గన్ పెట్టడం ఒకసారే జరిగాయి. "మర్యాదగా వెళ్లిపోండి, లేదంటే వీడిని కాల్చేస్తాము" ~నక్సలేట్ "కాల్చేయి.. నా కొడకల్లారా ఇవ్వాళ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, మర్యాదగా లొంగిపోండి.. లేదంటే చచ్చిపోతారు" ~పుల్లాసు "అయితే కాల్చుకుందాం" ~నక్సలేట్ శివ ఒక్క క్షణం ఆగినట్టే ఆగి ఇదేమి పట్టించుకోకుండా అక్కడినుండి అడుగు ముందుకు వేసాడు, నక్సలేట్ తో పాటు పుల్లాసులు కూడా ఆశ్చర్యపోవడం, ఆ వెంటనే ఒక పుల్లాసు వాడు కాల్చడంతో ఒక నక్సలేట్ అక్కడికక్కడే చనిపోయాడు, అది చుసిన మిగతా ఇద్దరు తుపాకులు పక్కకి పడేసి చేతులు పైకి ఎత్తి లొంగిపోయారు. వాళ్ళని అదుపులోకి తీసుకోవడం ఆ వెంటనే చెట్టు చాటునున్న జీపు రావడం వాళ్ళని అందులో ఎక్కించడం జరిగిపోయాయి. "సర్ వాడిని ఏం చేద్దాం" "వింతగా ఉన్నాడు, వాడిని కూడా ఎక్కించు" "సార్ వాడు కాటికాపరి, స్మశానంలో చూసాను" "ఎక్కించండి.. విట్నెస్ సంతకం తీసుకుని మాట్లాడి పంపేద్దాం" అనగానే ఒకడు వెళ్లి శివని ఆపాడు, శివ ఆగలేదు.. నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు, జీపులో ఉన్న పై అధికారి అహం దెబ్బతింది, శివ వైపు తుపాకీ గురిపెట్టి కాల్చాడు అయినా శివ నడక ఆగలేదు. "రేయి వాడిని ఎక్కించండ్రా" అని అరిచేసరికి ఇంకో ఇద్దరు జీపు దిగి శివని బలవంతంగా ఆపి జీపు ఎక్కించారు. జీపు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నచ్చితే Rate, Like & Comment
29-12-2024, 02:34 AM
Wooow excellent story
29-12-2024, 04:54 AM
adiripoindi sir update
29-12-2024, 05:31 AM
Keka update
29-12-2024, 06:59 AM
Shiva charcter name me అరణ్య 2 lo subbu koduku shiva ani vrasaru thanu ethanu same ha
Sherlock holmes
![]()
29-12-2024, 09:39 AM
Maastaru deenikante బానిస story ey bagundi adi rayochuga.
30-12-2024, 02:58 AM
Very intensive. Continue....
30-12-2024, 06:53 AM
As usual ga me story adhurss
30-12-2024, 11:47 AM
Interesting
30-12-2024, 10:05 PM
(29-12-2024, 12:09 AM)Pallaki Wrote: Episode - 002 Excellent
02-01-2025, 08:48 AM
Super story
02-01-2025, 11:40 AM
(30-12-2024, 10:05 PM)Kamas Wrote: Excellent మొత్తం కథను కోట్ చేసే మీ మొడ్డలకు ఒక సలాం...మీకు నచ్చిన ఒకట్రెండు వాక్యాలను కోట్ చేస్తే చాలదా లేకపోతే మీరు అర్థం చేసుకున్న సినాప్సిస్ రాసి మెచ్చుకోండి ... ప్లీజ్, నా విన్నపం ఆపై మీ ఇష్టం...
:
![]() ![]()
02-01-2025, 07:20 PM
Welcome back sajjal bro
02-01-2025, 11:18 PM
Nice update
06-01-2025, 08:28 AM
Nice update
06-01-2025, 03:48 PM
Nice start and explanation
19-04-2025, 04:52 AM
Bro update please
19-04-2025, 06:29 AM
Bagundi next rayandi
|
« Next Oldest | Next Newest »
|