08-12-2024, 07:24 PM
Welcome back sir
బానిస 3.O
|
08-12-2024, 08:46 PM
Ep-01
మియాపూర్ బస్టాండులో బస్సు దిగి చీకటిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అర్జున్, దారిలో వెళుతుంటే ఎదురుగా ఆటో దెగ్గర గొడవ అవుతుంది. ఇద్దరున్నారు అమ్మాయి చెయ్యి పట్టుకుని అటు ఇటు లాగుతుంటే దెగ్గరికి వెళ్లి చూసాడు. ఆ అమ్మాయి ఒంటి మీద ఖాఖీ చొక్కా చూడగానే ఆటో డ్రైవర్ అని అర్ధమైంది. వెంటనే ఆ ఇద్దరి ఆకతాయిల చొక్కాలు పట్టుకుని పక్కకి లాగాడు. వాళ్ళని పక్కకి లాగగానే అమ్మాయి వెంటనే ఆటో ఎక్కి స్టార్ట్ చేసింది, అర్జున్ ఆటోలో కూర్చోగానే ముందుకు పోనించి ఒక రెండు కిలోమీటర్ల తరువాత ఆపింది. వెనక్కి తిరిగి థాంక్స్ అంది మెల్లగా అర్జున్ : అర్ధరాత్రి పన్నెండు అవుతుంది, తప్పు వాళ్ళది కాదు నీది. "అలా అంటారేంటి, అయినా ఇవన్నీ నాకు అలవాటేలేండి. ఎక్కడికి వెళ్ళాలి" అర్జున్ : చందానగర్ "నేను అక్కడికే" అని ఆటో సౌండు మొదలయింది అర్జున్ : పార్ట్ టైమా ? "అవును పగలు కాలేజీ, సాయంత్రం నుంచి ఇది" అర్జున్ : అనాధవా ? "కాదు బాసూ.. ఇంటర్మీడియట్లో ఒకడిని ప్రేమించి వాడిని నమ్మి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారంతో లేచిపోయి హైదరాబాద్ వచ్చా" అర్జున్ : వాడు హ్యాండ్ ఇచ్చాడా ? "అవును, అప్పటి నుంచి ఇదిగో బతుకు ఇలా ఈదుతున్నా.. పగలు డిగ్రీ సాయంత్రం ఆటో" అర్జున్ : ఇంటికి వెళ్లిపోవచ్చుగా "నేను లేచిపోయి వచ్చేటప్పుడు చూసుకోకుండా డబ్బు మొత్తం తెచ్చేసా, అందులో మా నానమ్మ ఆపరేషన్ డబ్బులు కూడా ఉన్నాయి, మా నానమ్మ చనిపోయింది. క్షమించమని అడగడానికి వెళ్ళా, ఎవ్వరు నా మొహం కూడా చూడలేదు" అర్జున్ : మరి నిన్ను మోసం చేసినోడు ? "ఏమో వాడిని వెతుకుతూ కూర్చుంటే నేనెలా బతికేది, అయినా మోసం చేసిన వాడు దొరికిపోతే వాడు మోసగాడు ఎందుకవుతాడు" అర్జున్ : అవునులే "నీ కధేంటి బాసూ" అర్జున్ : కార్ డ్రైవర్ని, డ్యూటీ అయిపోయింది. హాస్టల్ కి వెళ్తున్నా "అస్సలు ఎక్కడా" అర్జున్ : అసలు లేదు, ఉసలు లేదు అంతా నాదే.. అనాధని "ఓహ్.. ఎవరిదెగ్గర పనిచేస్తావేంటి ?" అర్జున్ : పర్మినెంట్ చెయ్యను టెంపరరీ మాత్రమే "ఎందుకలా ?" అర్జున్ : పర్మినెంట్ అయితే చాకిరీ, కారు తుడవాలి, కారు మైంటైన్ చెయ్యాలి, వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి, కాళీగా ఉంచకుండా చుట్టాల దెగ్గరికి కూడా పంపుతారు, వీటన్నిటిలో మళ్ళీ నమ్మకంగా ఉంటాం అని నిరూపించాలి. అదే టెంపరరీ అనుకో టైంకి వెళ్ళామా కారు నడిపామా టైం అయిపోగానే డ్యూటీ దిగి డబ్బు తీసుకున్నామా, పైగా ఇందులో డబ్బులు ఎక్కువ, లాంగ్ ట్రిప్పులు కొడితే ఇంకా ఎక్కువ వస్తాయి "చాలా తెలివి ఉంది బాసూ నీకు" అర్జున్ : ఇక్కడే.. ఇక్కడ ఆపేయి అని ఆటో దిగి ఎంతా అని అడిగాడు "ఏమి వద్దులే, నువ్వు చేసిన సాయానికి కృతజ్ఞత అనుకో" అర్జున్ : ఏంటి ముప్పై రూపాయలకా అని నవ్వాడు "బాసూ.. పన్నెండు దాటింది. కనీసం మూడు వందలు తీసుకుంటారు తెలుసా ?" అర్జున్ సరే సరే అని వెళ్లిపోతుంటే "బాసూ నీ పేరేంటి ?" అని అడిగింది అమ్మాయి. "అర్జున్" అన్నాడు. "ఓహ్.. హీరో పేరే" అని నవ్వింది. అర్జున్ వెనక్కి తిరిగి "నీ పేరేంటి" అని అడిగితే "ప్రియా" అని సమాధానం ఇచ్చింది. అర్జున్ : నీది హీరోయిన్ పేరేలే.. జాగ్రత్త అని హాస్టల్ లోపలికి వెళ్ళిపోయాడు. ****************************** తెల్లారింది. అర్జున్ లేచి స్నానం చేసి రెడీ అయ్యి ప్లేటుతో కిందకి వచ్చి ఎండిపోయిన ఇడ్లీలు నాలుగు తిని బైటికి వచ్చాడు. పక్క వీధిలో ఉన్న టీ కొట్టు దెగ్గర రాత్రి అమ్మాయి ప్రియ కనిపించింది. చూడగానే నవ్వింది. పని అలవాటు అయిన పిల్ల కదా చుడిధార్లో కండ పట్టి బాగుంది, రాత్రి సరిగ్గా కనిపించలేదు కానీ పొడుగు జుట్టు. అందంగా ఉంది నోరు తెరిస్తేనే కొంచెం మాస్ లేదంటే చాలా పాష్ అమ్మాయిలా డీసెంట్గా ఉంది. ప్రియ : హాయి బాసూ అంది టీ తాగుతూ అర్జున్ : కాలేజీకా ? ప్రియ : అవును jntu అర్జున్ : టీ తాగేసి డ్రైవింగ్ ఆఫీస్ వైపు నడిచాడు. నమస్తే అన్నా.. రాత్రి డబ్బులు ఇవ్వలేదు. "ఇవ్వాళ ఇస్తా తమ్ముడు, కలిపి ఇచ్చేస్తాలే, కొండాపూర్లో పికప్ డ్రాప్ ఉంది, సాయంత్రం వరకు మేడం తోనే ఉండాలి. అర్జున్ : సరే.. అని కారు తాళాలు తీసుకున్నాడు. మీటర్ ఫోటో కొట్టి కారు స్టార్ట్ చేసి రోడ్డు ఎక్కుతుంటే ప్రియ బస్టాప్లో నిల్చుని ఉంది, చూసి దెగ్గరికి వెళ్లి రమ్మని సైగ చేస్తే దెగ్గరికి వచ్చింది. అర్జున్ : ఎక్కు ప్రియ : పర్లేదు బస్సులో వెళతా అర్జున్ : ఎక్కు అటే వెళుతున్నా అంటే నవ్వి కార్ ఎక్కి కూర్చుంది ప్రియ : కారు చాలా బాగుంది, ఎవరిది అర్జున్ : డ్రైవింగ్ కన్సల్టెన్సి వాళ్ళది, ఒక్కోసారి వాళ్ళ దెగ్గరే కార్లు ఉంటాయి, ఒక్కోసారి కారు మనం వేసుకెళ్లాల్సి వస్తుంది. ముచ్చట్లు పెట్టుకుంటూ ప్రియని కాలేజీ దెగ్గర వదిలేసి పెట్టిన లొకేషన్ దెగ్గరికి చేరుకున్నాడు. నవోదయ గార్డెన్ అన్న పేరు చూసి లోపలికి వెళితే సెక్యూరిటీ ఆపాడు, పికప్ కోసం అని చెపితే ఫోన్ యాప్లో అప్డేట్ చేసి లోపల ఇన్ఫార్మ్ చేసి దారి వదిలారు. పేరుకు తగ్గట్టే చుట్టు చెట్లు, మధ్యలో పెద్ద గార్డెన్ దాని మధ్యలో పెద్ద ఫౌంటైన్, ఒక పక్క స్పోర్ట్స్ క్లబ్ ఇంకో పక్క లైబ్రరీ ఇంకో పక్క మార్ట్.. ఒక ఊరే ఉన్నట్టుగా అనిపించింది. బ్లాక్ F 506 వైపు పోనించి కార్ పక్కకి ఆపి కాల్ చేశాను. అర్జున్ : హలో వసుధ గారా అండి "హా ఎవరు" అర్జున్ : డ్రైవర్ని మేడం కిందే ఉన్నాను "పది నిమిషాలు, వస్తున్నా" అని పెట్టేసింది. పక్కనే ఇంకో డ్రైవర్ యూనిఫామ్లో కారు తుడుచుకుంటున్నాడు, పర్మినెంట్ డ్రైవర్లకి ఇది కూడా ఉండాలి.. "ఎంత ఇస్తున్నారు అన్నా జీతం" అని అడిగితే "ఇరవై ఐదు" అన్నాడు. అర్జున్ : ఆడి ఎలక్ట్రానిక్ నడుపుతున్నావ్ ఇరవై ఐదేనా ? "ఏ కారు అయినా అంతే, కాకపోతే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయిలే.. ఇక్కడ అంతా నమ్మకంతోనే పని.. నమ్మకంగా ఉంటే బాగా స్థిరపడొచ్చు" అర్జున్ : అవునులే.. ఎంత అన్న ఒక్క ఫ్లాట్ ఇక్కడా ? "రెంట్ అయితే డెబ్భై ఐదు వేల నుంచి మొదలు, అదే కొనాలని అనుకుంటే మూడు కోట్ల నుంచి మొదలు" అబ్బో అనుకున్నాను. మాట్లాడుతుంటే నలభై పైన వయసు బడిన ఆవిడ బైటికి వచ్చింది, చీర అంత స్టైలుగా కట్టచ్చు అని ఈమెని చూసాక తెలిసింది, ఆమె నడక లోనే తెలుస్తుంది ఎంత డబ్బుందో ఈమెకి అనుకున్నాను. నన్ను చూసి "నువ్వేనా" అని చెయ్యి ఎత్తితే అవునని వెళ్లి కార్ డోర్ తెరిచాను, లోపల కూర్చుంది. కార్ ఎక్కి "ఎక్కడికి వెళ్ళాలి మేడం" అని అడిగితే "జూబ్లీహిల్స్" అంది. వసుధ : నీ పేరు అర్జున్ : అర్జున్ మేడం వసుధ : చిన్న వయసే.. నిన్న ఒకడిని పంపించారు మీ వాళ్ళు, చిరాకు వచ్చేసింది. వాడు వాడి వాలకం. ఇర్రిటేటింగ్ కాండిడేట్ నేనేమి మాట్లాడలేదు వసుధ : ఎంత వరకు చదువుకున్నావ్ అర్జున్ : ఇంటర్ మేడం వసుధ : ఇంతకముందు ఎప్పుడు రాలేదు, కొత్తగా వచ్చావా అర్జున్ : లేదు మేడం, ఎక్కువగా అవుట్ స్టేషన్ వెళ్తాను వసుధ : ఓకే.. కూకట్పల్లిలో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని తీసుకుని వెళదాం. అర్జున్ : అలాగే మేడం కూకట్పల్లిలో ఇంకో ఇద్దరు ఎక్కారు, రెండున్నర గంటలకి జూబ్లీహిల్స్ లో వాళ్ళని దించి చెట్టు నీడ ఒకటి చూసుకుని కార్ పార్క్ చేసి మూవీరూల్స్ లో కొత్త సినిమా వస్తే డౌన్లోడ్ చేసి చూసాను, మధ్యాహ్ననికి భోజనానికి పిలిచింది తనే మళ్ళీ ఫోన్ చేసి. లోపల పనిమనిషి బైటికి ప్లేట్ తెచ్చిస్తే గుమ్మం దెగ్గరే వేరే డ్రైవర్లతో పాటు నిలుచుని తినేసి కాసేపు నిద్రపోయాను. ఫోన్ రింగ్ అయితే కాని మెలుకువ రాలేదు, "అర్జున్ కార్ తీసుకురా" అన్న ఆమె గొంతు వినగానే లేచి మొహం కడుక్కుని గేట్ ముందు ఆపితే వచ్చి కారు ఎక్కరు. ముగ్గురి మాటలు వింటుంటే తాగినట్టే ఉన్నారు. రమ్మీ ఆడారేమో దాని గురించే సొల్లంతా, ఆ ఇద్దరినీ దించేసి తిరిగి కొండాపూర్ వెళుతుంటే మాట్లాడింది. వసుధ : నువ్వు తాగుతావా అర్జున్ : లేదండీ వసుధ : గుట్కా లాంటివి ? అర్జున్ : లేవు వసుధ : మరేం అలవాట్లు ఉన్నాయి ? అర్జున్ : చాక్లేట్, కాఫీ అడిక్ట్ మేడం అంటే నవ్వింది వసుధ : ఎక్కువగా మాట్లాడవా అర్జున్ : అవసరాన్ని బట్టీ మాట్లాడతాను వసుధ : కాసేపు పడుకుంటాను వచ్చాక లేపు అని కళ్ళు మూసుకుంది. అద్దంలో ఆమెని చూసాను, ఏసీలో ఉన్నా ఎందుకో ఆమె మొహంలో చెమట, కళ్ళు మూసుకుందే కానీ నిద్రపోలేదు, ఆమె మొహంలో నవ్వు లేదు. ఈ డబ్బున్నోళ్లంతా ఇంతేనేమో కారు మళ్ళీ నవోదయ గార్డెన్లో ఆపాను, ఎందుకో ఆమెని పిలవాలని అనిపించలేదు అందుకే షడన్ బ్రేక్ కొట్టాను, లేచింది. వసుధ : వచ్చేసామా అర్జున్ : అవునండి అని ఆమె వైపున డోర్ తెరిచాను. ఆమె చేతిలో ఉన్న పర్సు అర్జున్ చేతికి ఇచ్చి "అందులో నీకు ఎంత రావాలో తీసుకో, అలానే నీ డిన్నర్ కి కూడా తీసుకో, నా కంప్లిమెంట్" అనగానే అర్జున్ తన డబ్బు తీసుకుని పర్సు ఇచ్చేసాడు, వసుధ లోపలికి వెళ్ళిపోయింది. అర్జున్ వెళ్ళిపోయాడు. వసుధ తన ఫ్లాట్ లోపలికి వెళ్లి లైట్ వేసుకోకుండా ఒక్కటే కళ్ళు మూసుకుని కూర్చుంది. ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తి "హలో" అంది. "ఈరోజు కూడా తాగావా ?" వసుధ : నా ఇష్టం తాగుతా "హ్హాహ్హాహ్హా.. నాకు అదే కావలి, నువ్వు పూర్తిగా దిగజారిపోవాలి" వసుధ : యు చీటర్.. నా ఆస్తి, నా ఆనందం, నా పిల్లలు, నా నుంచి సర్వం లాగేసుకున్నావ్. నువ్వు అనుభవిస్తావ్, నా కాళ్ళ మీద పడి వేడుకుంటావ్.. ఐ విల్ మేక్ యు బెగ్ ఫర్ మర్సీ అండ్ ఐ వోంట్ లీవ్ యు.. వసుధ కంట్లో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అలానే కుర్చీకి ఆనుకుని కళ్ళు మూసుకుంది. తరువాతి రోజు ఇవ్వాళ టీ బండి దెగ్గర ప్రియ కనిపించలేదు, వేరే లాంగ్ డ్రైవ్ వస్తే ఆ పని మీద వెళ్ళిపోయాను. ఇంకో రోజు గడిచిపోయింది మరుసటి రోజు వసుధ ఫోన్లో : మీకు మళ్ళీ చెపుతున్నాను, ఇంకోసారి వేస్ట్ ఫెలోస్ ని నా దెగ్గరికి పంపించారంటే నేనిక మీకు కాల్ చెయ్యను, మొన్న పంపించిన ఆ అబ్బాయి పేరేంటి.. ఆ అర్జున్.. తనని పంపించండి.. ఓహ్.. లేడా.. సరే నేను వేరే వాళ్లకి ఫోన్ చేస్తాను.. ఏంటి... అవసరం లేదు.. అని ఫోన్ విసురుగా పెట్టేసింది. పావుగంటలో మళ్ళీ ఫోన్ మోగితే ఎత్తి "చెప్పండి" అంది. "అర్జున్ వస్తున్నాడా.. ఓకే.. పంపించండి" అని పెట్టేసింది.
08-12-2024, 08:47 PM
Thanks for the warm wishes
Thankyou All నచ్చితే Like Rate & Comment
08-12-2024, 09:10 PM
excellent
08-12-2024, 09:22 PM
Nice start
08-12-2024, 09:30 PM
(08-12-2024, 08:46 PM)Pallaki Wrote: Ep-01
08-12-2024, 09:32 PM
Nice update
08-12-2024, 10:20 PM
Welcome back brother.
We missed you. Thank you for coming back.
08-12-2024, 10:24 PM
ఎవరు ఎవరికి బానిస?? చూద్దాం..
కొత్త కథతో మళ్ళీ మమ్మల్ని అలరిస్తారని ఆశిస్తున్నాం సోదరా!!!
-- Mr Perfect
08-12-2024, 11:09 PM
Nice start
09-12-2024, 12:08 AM
Try angle story na
09-12-2024, 12:16 AM
09-12-2024, 12:38 AM
ఆరంభం చాలా బాగుంది సార్
09-12-2024, 05:35 AM
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
09-12-2024, 06:27 AM
bagudni
09-12-2024, 08:13 AM
Good start
09-12-2024, 08:52 AM
Nice story
09-12-2024, 09:56 AM
Mi welcome ni DJ PEYTTI THEEN MAR steps tho cheypdham anukunna guru kaani money leyvu. andhukeyheartly welcome one of the greatest writer.
09-12-2024, 11:49 AM
Excellent update
09-12-2024, 12:29 PM
Nice starting andi
|
« Next Oldest | Next Newest »
|