18-09-2024, 12:27 PM
(This post was last modified: 18-09-2024, 01:42 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-09-2024, 06:58 PM)Sushma2000 Wrote: Nice ending..me stories lo tho manchiga movies teeyochu..try chestunara movies ki
తిరిగి వస్తా అని చెప్పి యుద్దానికి వెళ్ళిన భర్త కోసం యాభై సంవత్సరాలు అతని ఫోటో చూస్తూ ఎదురు చూసి చనిపోయిన భార్య..
తర్వాత జన్మలో...
తన చెల్లి కోసం వచ్చిన పెళ్లి చూపుల ఫోటోలలో అతని ఫోటోని చూసి కన్నీరు కారుస్తుంది. తన తల్లిదండ్రులకి ఫారెన్ వెళ్ళను, ఇతన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేస్తుంది.
పెళ్లి చూపులలో...
అతను గుర్తు పట్టడు, ఆమె గుర్తు పడుతుంది.
ఏ మగాడితో సారిగా మాట్లాడని తన చెల్లెలు/కూతురు అతని వెంట డేట్ కి తిరగడం చూసి ఆశ్చర్యపోతారు. అతనికి కూడా ఆమెతో ఇలా ఎలా కలిసిపోయా అని ఆశ్చర్య పోతాడు.
అతని ఇష్టాలు అన్ని ఆమెకు తెలుసు.... అతనికి ఎలా అనేది అర్ధం కాదు.
ముందు జన్మలో మొండిగా మోరటిగా ఉన్న తనని మెల్లగా వంచి.... సిగ్గుపడే అమ్మాయిలా మార్చి అందరిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు అతనితో సమయం గడుపుతూ ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తుంది. అతనికి ఆమె నచ్చింది కాని ఆమె ఉత్సాహం చూస్తే కొంచెం అదురుబెదురుగా ఉంటుంది.
ఎలా ఉంది కాన్సెప్ట్....
తీస్తావా సినిమా.....