Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బెస్ట్ కపుల్ (Nov 20)
#21
Abbabaa superbbb
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Excellent update bro
Like Reply
#23
(26-10-2024, 10:06 PM)3sivaram Wrote: ఇంకా తన ఫ్రస్ట్రేషన్ పోక జుట్టు పీక్కుంటున్నాడు.

ఇషా డోర్ దగ్గర నిలబడి చేతులు కట్టుకొని ఉంది, "జుట్టు పీక్కుంటే.....  హ్యాండ్ సమ్....  గా ఉండవు" అని చెప్పింది.

కదా అందుకే టీవీల్లోనూ, సోషియల్ మీడియాలోనూ జుట్టునును పెంచే ప్రాడక్ట్స్ ఎక్కువైపోయాయి....

ఇషా తో చెడుగుడు ఆడించేస్తున్నావు బ్రో, ఈ కథ ఎక్కడినుంచి ఎక్కడికెళ్తుందో...ప్రస్తుతం ఆకాష్ ఎక్కడున్నాడు, అలాగే పిన్ని పల్లవి, ఇషా ఫాదరూ...వున్నారా 'గతం" లోనే పంపించేసిందా....కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#24
సూపర్ story bro
Like Reply
#25
GOOD UPDATE
Like Reply
#26
intresting ga undi andi keep it up

[Image: Screenshot-2024-10-29-at-12-09-57-PM.png]
[+] 3 users Like nalininaidu's post
Like Reply
#27
ఇది అన్ని కధ లాల కాకుండా కొత్త గా ఉంది
Like Reply
#28
అప్డేట్ చాల బాగుంది
Like Reply
#29
5. ప్రేమ  -  భూతం






... గతం ...

ఇషా "ఈ ఫైల్ చూడు.....  ఇందులో కార్ బాంబ్ చేసిన ఐటమ్స్ అన్ని ఫారెన్ కి సంబంధించినవి.....  అలాగే ఈ కార్ బ్యాంబ్ తయారు చేసిన వాళ్ళను పట్టుకున్నాం కాని ఎవరూ చెబితే చేశారు అనేది మాత్రం తెలియలేదు.....  ఇవి నా శత్రువుల లిస్టు.....  ఇందులో నీ శత్రువుల లిస్టు.....  చూసుకొని కామన్ గా ఉన్న వాళ్ళను గుర్తు పడితే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయిస్తాను.....  " అని చెప్పింది.

విష్ణువర్ధన్, ఇషానే అపురూపంగా చూస్తూ  ఉన్నాడు. ఆమె నల్లని కురులు గాలికి ఎగురుతూ ఉంటే, వయ్యారంగా తన చెవి దగ్గర తన సున్నితమైన చేతితో వెనక్కి అనుకోవడం, మధ్య మధ్యలో ఆమె ఎర్రని పెదవులు కదలడం, మృదువైన ఆమె గొంతు వింటూ తెల్లని ఆమె చెంపలు చూస్తూ మైమరచిపోతూ "నువ్వు చాలా అందంగా ఉన్నావ్" అన్నాడు.

ఇషా పైకి లేచి ఆ ఫైల్ తీసుకొని విష్ణువర్ధన్ నెత్తి మీద కొట్టి కోపంగా చూస్తూ ఉంది.

విష్ణువర్ధన్ తల మీద రుద్దుకుంటూ "కోపంలో కూడా ఇంకా అందంగా ఉన్నావ్.....  " అన్నాడు.

ఇషా పళ్ళు కొరుక్కుంటూ చూసి పెద్దగా "రమాదేవి.....  " అని అరిచింది.

పెద్దగా, రమాదేవి "మేడం.....  " అనుకుంటూ వచ్చింది.

ఇషా "డాక్టర్ ని పిలిపించు.....  మిస్టర్ విష్ణువర్దన్ కి తలకి ఎదో అయింది.....  పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు.....  పిచ్చిపిచ్చిగా చూస్తున్నాడు.....  "

విష్ణువర్దన్ కోప్పడకుండా నవ్వేసి "నీ హ్యూమర్ నాకు బాగా నచ్చుతుంది" అని పైకి లేచి ఆ ఫైల్ తీసుకొని వెళ్ళిపోయాడు.

ఇషా సీరియస్ గా చూస్తూ, రమాదేవి వైపు తిరిగి "ఏంటి? చూస్తున్నావ్.....  డాక్టర్ ని పిలిపించు.....  " అని అరిచి అక్కడ నుండి వెళ్ళిపోయింది.

రమాదేవి, ఇషాని ఫాలో అవుతూ "అవసరం ఉండదు మేడం.....  సర్ కి ఏం కాలేదు.....  "

ఇషా తినేసేడట్టు కోపంగా చూస్తూ ఉంది.

రమాదేవి "సర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు"

ఇషా ఎదో జోక్ విన్నట్టు చూసి "అయితే.....  " అంది.

రమాదేవి ఆశ్చర్యంగా చూస్తూ "విష్ణువర్దన్ సర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు"

ఇషా ఎదో జోక్ విన్నట్టు నవ్వుతుంది. 

రమాదేవి తనని చూసి నవ్వుతుంది అని ఇబ్బంది పడి "మేడం" అంది.

ఇషా ఇంకా నవ్వుతూ రమాదేవి భుజం మీద చేయి వేసి ఇంకా నవ్వుతూనే ఉంది.

రమాదేవి ఇబ్బంది కాస్తా ఇషా మీద కోపంగా మారిపోయింది, కాని జీతమిచ్చే యజమాని కావడంతో ఏం చేయలేక పోయింది.

ఇషా నవ్వు చూసి అప్పుడే కాలేజ్ నుండి వచ్చిన ఏడుగురు అమ్మాయిలు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. 

ఇషా అందరిని చూస్తూ "భూతాలు ఉన్నాయని నమ్ముతారా...!"  అని అడిగింది, అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇషా సీరియస్ గా అడుగుతుంది అని అర్ధం చేసుకొని "అవునూ...!" అంటూ తల నిలువుగా ఊపారు. 

ఇషా "మరి మీలో ఎంతమంది భూతాలను చూశారు...!" అని అడిగింది.

అందరూ వింతగా చూసి తల అడ్డంగా ఊపారు.

ఇషా అందరిని చూస్తూ "ప్రేమ కూడా అంతే...   అందరూ ప్రేమ ఉందని నమ్ముతారు కాని ఎవరూ చూడరు...   ప్రేమ కూడా భూతం లాంటిది...   అదొక మాయ అంతే...   " అంది.

అందరూ ఇబ్బందిగా చూస్తూ ఉన్నారు, ఇషా నవ్వుతూ గది నుండి బయటకు వెళ్ళబోయింది.

ఇంతలో విష్ణువర్ధన్ ఎదో భూతం బొమ్మ మాస్క్ వేసుకొని వచ్చి ఇషా ఎదురుగా కనపడ్డాడు. ఇషాకి భయం వేసి ఒక్క సారిగా "ఆహ్...!" అని అరిచి రమాదేవి వెనకకు వెళ్లి దాక్కుంది. 

ఆమె చేతులు వణుకుతూ ఒళ్లంతా చల్లగా చమటలు పట్టేశాయి, విష్ణువర్ధన్ మాస్క్ తీసి నవ్వుతూ ఉన్నాడు. 

ఇషా కళ్ళు తెరిచి విష్ణువర్దన్ చేతిలో మాస్క్ చూసి జరిగింది అంతా అర్ధం చేసుకొని, రమాదేవి వెనక నుండి బయటకు వచ్చి కోపంగా వచ్చి బూతులు తిడుతూ విష్ణువర్ధన్ ని కొడుతుంది. 

రమాదేవితో పాటు ఆ ఏడురుగు అమ్మాయిలు వింతగా చూస్తూ ఉండగా... ఇషా జుట్టు మెక్ అప్ అంతా ఆమె కేర్ ఫుల్ గా ఏర్పాటు చేసుకున్న కవర్ అంతా పోయి అసలైన ఇషా విష్ణువర్దన్ తో గొడవ పడుతుంది.

విష్ణువర్దన్ ఇషాని గట్టిగా హత్తుకొని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టేశాడు. ఇషా చేతులు చిన్నగా విష్ణువర్దన్ మెడ చుట్టూ చేరుకొని గట్టిగా బంధించాయి. ఇద్దరూ కొంత సేపు అలా ముద్దులో మునిగి తేలారు.

కొద్ది సేపటి తర్వాత ఇషా ఈ లోకంలోకి వచ్చి విష్ణువర్దన్ ని చూసి అతన్ని తోసేసి మొహం దాచుకొని సిగ్గుగా పరిగెత్తుకొని బయటకు వెళ్ళిపోయింది.

అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.  మంజరి "సర్ కి మేడం అంటే బాగా ఇష్టం" అని మురిసి పోతుంది.

సోని "అవునూ"

భువన "వీళ్ళ జంట బాగుటుంది"

సుహానా "సర్, తనకి ప్రేమ అంటే ఏంటో చూపిస్తారు"

సనా "హుమ్మ్"

గుడియా "ప్రేమ....  అయితే ఓకే....  కానీ భూతాన్ని చూపిస్తే....." అంది.

ఆరాధ్య "యెహే...." అని చేయి చూపి అక్కడ నుండి వెళ్లి పోయింది.

అందరూ గుడియా వైపు అదోలా చూసి వెళ్ళిపోయారు.





...ప్రస్తుతం...

ఇషా వంట గదిలో వంట చేస్తూ ఉంది, దామిని మొహం నిండా దుప్పటి కప్పుకొని భూతంలా తయారయి వంట గదిలోకి వచ్చింది. ఆమె వెనకే విష్ణు కూడా గోడ పక్కనే దాక్కొని ఉన్నాడు. ఇషా ఎదురుగా ఉన్న స్టీల్ ప్లేట్ లో వెనక జరుగుతుంది అంతా చూస్తూ ఉంది. 

పొయ్యి కట్టేసి తను కూడా సిద్దంగా ఉంది. దామని వెనకగా వచ్చి "బావ్" అని అరిచింది.

ఇషా షాక్ అయినట్టు వెనక్కి తిరిగి తెల్లని దుప్పటిలో ఉన్న దామిని చూసి భయపడ్డట్టు పెద్దగా అరిచి బయటకు పరిగెత్తింది.

దామిని పెద్దగా అరుస్తూ "అమ్మ భయపడింది" అంటూ ఎగురుగుతుంది.

బయట అప్పటికే సిద్దంగా ఉన్న విష్ణు అమాంతం ఇషాని పట్టుకొని తన కౌగిలిలోకి తీసుకున్నాడు.

దామిని వంట గదిలో నవ్వుకుంటూ ఎగురుగుతూ ఉంటే, విష్ణు, ఇషా మొహం నిండా ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. ఇషా కూడా విష్ణు కౌగిలిలో ఉన్నా అతన్ని తోసేస్తున్నట్టు నటిస్తుంది.

విష్ణు ఆత్రంగా ఇషాని తన కౌగిలిలో బంధించి ముద్దులు పెట్టేస్తూ ఉన్నాడు.

ఇంతలో దామిని బయటకు రావడంతో విష్ణు మరియు ఇషా ఇద్దరూ వేరు పడ్డారు.

దామిని "నాన్నా చూశావా! అమ్మ నిజంగానే భూతం అనుకోని భయం వేసి చమటలు పట్టేశాయి" అని వేలు చూపిస్తూ నవ్వుతూ ఉంది.

విష్ణు తన కూతురు దామినిని ఎత్తుకొని ఇషాని నవ్వుతూ చూస్తున్నాడు.

ఇషా దొంగ కోపంతో తండ్రి కూతుళ్ళను చూస్తూ అలిగినట్టు తిరిగి వంట గదిలోకి వెళ్ళింది.

తండ్రి కూతుళ్ళు ఇద్దరూ రాత్రి నిద్ర పోయే వరకు కూడా నవ్వుకుంటూనే ఉన్నారు.

ఇషా నిద్ర పోవడం కోసం రెడీ అవుతూ కిటికీ నుండి దుప్పటి పక్కకు జరిపి బయటకు చూసింది. ఆ చీకటిలో తన ఇంటి ఎదురుగా ఒక బ్లాక్ కలర్ కార్ పార్క్ చేసి ఉంది.

అది అక్కడ ఎంత సేపు ఉందొ తెలియదు, కాని అందులో మనుషులు ఉన్నట్టుగా అనిపిస్తుంది.

అది చూడగానే, ఇషా శ్వాస వేగం పెరిగిపోయింది, పిడికిలి బిగించి కోపంగా ఆ కారును చూస్తూ ఉంది.

వెనక్కి తిరిగి చూడగా తనకు సోఫా కనపడింది, దాని కింద గన్ గుర్తు వచ్చింది.

తిరిగి కిటికీ నుండి కార్ ని, కారు లో ఉన్న మనుషులను చూస్తూ ఉంది. విష్ణు వెనక నుండి వచ్చి ఇషా భుజం మీద చేయి వేశాడు.

ఇషా భయ పడి "హ్" అని శబ్దం చేసి వెనక ఉన్న విష్ణుని చూసి హాగ్ చేసుకుంది. విష్ణు తనని భయపెట్టాలని కాదు మాములుగా వేశాడు.

విష్ణు, ఇషాని హత్తుకున్నాడు. ఇషా కూడా విష్ణుని భయం భయంగా తన రెండూ చేతులను అతని చుట్టూ లాక్ చేసినట్టు వేసి మరి హాగ్ చేసుకుంది.

ఈ సారి ఇషా మరియు విష్ణు ఇద్దరూ కిటికీ నుండి బయటకు చూడగా ఆ కారు అక్కడ లేదు, అక్కడ నుండి వెళ్లి పోయింది.














[+] 11 users Like 3sivaram's post
Like Reply
#30
Nice update
Like Reply
#31
Nice update
Like Reply
#32
[Image: giphy-gif-cid-6c09b952txw94kynxsx76fqkxc...-giphy.gif]
[+] 4 users Like 3sivaram's post
Like Reply
#33
E story ki ending ela istaro chudali...ba suspense thriller la vundhii...
Like Reply
#34
6. ఫోటోస్


...గతం...

ఏడుగురు అమ్మాయిలు కాలేజ్ నుండి వచ్చారు.

రమాదేవి "ఫ్....." అని గాలి వదలి పిచ్చి చూపులు చూస్తుంది.


సనా "ఏమయింది?"

సోనియా "ఏమయింది రమాదేవి గారు...."

గుడియా "గాలి"

భువన "గాలి అంటే.... "

సుహాన "దయ్యం"

మంజరి దేవుడుని తలుచుకుని దండం పెట్టుకుంటుంది.

ఆరాధ్య "హేయ్ ఆపండి.... మేడం ఏమయింది?"

రమాదేవి చెప్పడం మొదలు పెట్టింది...



రమాదేవి "మేడం.....  "

ఇషా "హుమ్మ్.....  "

రమాదేవి "విష్ణువర్దన్ సర్ ఫోటో పంపారు"

ఇషా "ఏం ఫోటో.....  "

రమాదేవి "ఇదిగోండి.....  మేడం.....  "

విష్ణువర్ధన్ జిమ్ లో చొక్కా విప్పి తన సిక్స్ ప్యాక్ ఫోటో తీసి పంపాడు. ఇషా ఆ ఫోటోని ఎదో దడుచుకున్నట్టు చూసి మళ్ళి దగ్గర నుండి చూస్తూ ఉంది.

ఇషా ఆ ఫోటోని చూస్తూ ఉండి పోయింది. ఆమె మొహం చిన్నగా నవ్వుతో విచ్చుకుంది.

రమాదేవి, అయిదు నిముషాలు ఆగి "మేడం.....  " అంటూ నాలుగు అయిదు సార్లు పిలిస్తే గాని పలకలేదు.

ఇషా "హుమ్మ్.....   చెప్పూ.....  "

రమాదేవి "ఇంకా వేరే ఫోటోస్ కూడా పంపారు మేడం.....  "

ఇషా "ఎక్సపోజింగ్ గా ఉన్నాయా..... "

ఇషా "అవునూ మేడం..... "

ఇషా "వద్దు అలాంటివి చూపించకు.....  "

రమాదేవి "మేడం.....  అదీ.....  "

ఇషా "వద్దు అని చెప్పాను కదా.....   "

రమాదేవి "ఇవీ..... "

ఇషా "వద్దు అని చెబుతున్నాను కదా.....   "

విష్ణువర్ధన్ "అవి నావి కాదు.....   "

ఇషా "హ్యాండ్ సమ్ గా లేని వాళ్ళను నా విల్లాలోనికి తీసుకొని రాకూ రమాదేవి.....   " అంటూ వెళ్లిపోబోయింది.

విష్ణువర్ధన్ "ఓయ్.....   తిక్కల్.....   "

ఇషా కళ్ళు పెద్దవి చేసుకొని కోపంగా వెనక్కి తిరిగి చూసింది.

విష్ణువర్ధన్, రమాదేవి చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని ఇషా చేతిలో పెట్టి "ఆ పెద్ద కళ్ళు వేసుకొని నన్ను భయపెట్టడం మానేసి వీటిని చూడు.....   "

ఇషా పళ్ళు నూరుతూ ఆ ఫైల్ ఓపెన్ చేసింది, అందులో తన ఫియాన్సి మిస్టర్ ఆకాష్ మరియు తన చెల్లెలు సంజనల రొమాంటిక్ ఫోటోస్ ఉన్నాయి.

అవి మాట్లాడుకోవడం నుండి మొదలయి, రెస్టారెంట్ లో కలిసి భోజనం చేయడం, పబ్ లు, పిక్నిక్ లు, ఆఖరికి హోటల్ లో నైట్ స్టే లు, పార్క్ లో పబ్లిక్ గా పెట్టుకున్న కిస్ లు, హాగ్ లు అన్ని ఉన్నాయి.

ఇషా వాటిని ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్ లేకుండా చూస్తూ ఉంది.

విష్ణువర్ధన్ "ఆకాష్ తో పెళ్లి క్యాన్సిల్ చేసేసేయ్.....   " అన్నాడు.

ఇషా, విష్ణువర్ధన్ తనకు అలా ఆర్డర్ వేయడం చూసి కళ్ళు ఎగరేసి "హుమ్మ్ క్యాన్సిల్ చేసేసి.....   "

విష్ణువర్ధన్ "నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అంటూ నవ్వుతున్నాడు. అతని నవ్వు ఆ చెవి నుండి ఈ చెవి వరకు పెద్దగా నవ్వుకుంటున్నాడు.

ఇషా మనసులో " 'మనం పెళ్లి చేసుకుందాం' కాదు, ఎదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు 'నేను ఉన్నా కదా, పెళ్లి చేసుకుంటా' అంట " అనుకుంది.

విష్ణువర్ధన్ "మా పేరెంట్స్ కి చెబితే చాలా సంతోషిస్తారు, పైగా మీ అమ్మ కూడా చిన్నపుడు నిన్ను నాకు అప్పగించింది.....   గుర్తు ఉంది కదా.....   "

ఇషా "రమాదేవి వైపు చూసి 'ఆకాష్ పేరెంట్స్ కి కాల్ చెయ్' " అంది.

రమాదేవి సంతోషంగా కాల్ చేస్తుంది. విష్ణువర్దన్ కూడా తను అనుకున్నది జరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నాడు.

ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇషా ఫోన్ అందుకొని ఆకాష్ పేరెంట్స్ తో కుశల ప్రశ్నలు అడిగింది.

ఇషా చాలా స్వీట్ గా "ఆంటీ.....  " అని పిలుస్తూ ఉంటే, విష్ణువర్దన్ కి ఇంకా ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేయలేదు అని కోపంగా ఉంది. 

అసలు ఆ ఫోన్ అందుకొని తనే "పెళ్లి క్యాన్సిల్" అని అరవాలని ఉంది.

ఆకాష్ వాళ్ళ మదర్ "ఇంకా ఆంటీ ఏంటి అమ్మా.....  అత్తయ్య అని పిలువు.....  "

ఇషా సిగ్గు పడుతూ "అదీ.....  అదీ.....  "

ఆకాష్ వాళ్ళ మదర్ "పెళ్లి అయితే కాని పిలవనంటావు.....  అంతేగా.....  " అంది.

ఇషా చిన్నగా నవ్వింది.

ఆకాష్ వాళ్ళ మదర్ "పిచ్చి పిల్లా.....  మీ నాన్నని వచ్చి సంబంధం మాట్లాడమను.....   ఈ నెల ఆఖరిలో పెళ్లి సెట్ చేసేద్దాం.....  "

ఇషా "ఆంటీ.....  అదీ.....  వారంలో మంచి ముహూర్తం ఉంది" అంది.

విష్ణువర్దన్ కి పిచ్చి పట్టినట్టు అయి "మంచి ముహూర్తం.....   దేనికి మంచి ముహూర్తం.....  "

ఇషా విష్ణువర్దన్ వైపు నవ్వుతూ చూసింది. ఫోన్ లో నవ్వు మాత్రమే వినపడడంతో ఆకాష్ వాళ్ళ మదర్ నవ్వుతూ "మీ నాన్నని రమ్మను.....  రెండూ రోజుల్లో నిశ్చితార్దం పెట్టించేస్తాను" అంది.

ఇషా "అలాగే ఆంటీ.....  " అని ఫోన్ కట్టేసింది.

విష్ణువర్దన్ మరియు రమాదేవి ఇద్దరూ ఇషాని పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నారు.

కాని ఇషా మాత్రం పాట పాడుకుంటూ వెళ్ళిపోయింది.

విష్ణువర్దన్ దిగులుగా బయటకు వెళ్లి కారు లో ఇంటికి వెళ్ళిపోయాడు.


మంజరి "అదేంటి?"

రమాదేవి "ఏమోనమ్మా....  ఎప్పుడూ ఏం ఆలోచిస్తుందో? అస్సలు అర్ధం కాదు..... " అనుకుంటూ ఉంది.





....ప్రస్తుతం....

విష్ణు "హలో బ్లాక్ మేర్సిడాస్.... లోపల మనుషులు ఉన్నారు....  లెఫ్ట్ వైపు వస్తుంది.... " అంటూ ఇషా వైపు చూశాడు.

ఇషా "సౌత్.... "

విష్ణు "యాహ్....  సౌత్....  సౌత్....  హమ్....  హమ్....  "

విష్ణు ఫోన్ కట్టేశాడు.

విష్ణు "ఫైవ్ మినిట్స్" అంటూ ఇషాని హత్తుకున్నాడు.

అయిదు నిముషాల తర్వాత ఫోన్ కాల్

ఫోన్ "సర్ వాళ్లను పట్టుకున్నాం....  కాని నిజం చెప్పడం లేదు....  హెడ్ క్వార్టర్స్ కి పంపిస్తున్నాం....  మీకు ఫోటోస్ పంపిస్తాను" అన్నాడు.

విష్ణు ఫోన్ లో మాటలు వింటూ "మ్మ్.....  మ్మ్.....  మ్మ్.....  " అంటూ మొహం నార్మల్ గా పెట్టడం కోసం ప్రయత్నిస్తున్నాడు.

ఇషా తన ముందుకు నడిచి వచ్చి విష్ణు మొహం చూస్తూ అతని హావభావాలు చదివే ప్రయత్నం చేసింది.

విష్ణు కాల్ కట్ చేసి దీర్గంగా శ్వాస పీల్చి వదిలి ఇషా తో "సివిలియన్స్" అన్నాడు.

ఇషా అప్పటి వరకు ఊపిరి బిగపట్టినట్టు ఉండి "హమ్మయ్యా" అంటూ గాలి వదిలి వెనక్కి సోఫాలో కూలబడింది.

విష్ణు ఆమె పక్కనే కూర్చొని ఆమె భుజం పై చిన్నగా తడుతూ ఆమె టెన్షన్ పోగొట్టే ప్రయత్నం చేశాడు.

ఇషా మెల్లగా విష్ణు భుజం మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది.

విష్ణు చిన్నగా "స్స్.....  స్స్.....  స్స్.....  " అంటూ సౌండ్ చేశాడు.

ఇషా తల పైకెత్తి విష్ణుని చూసింది.

విష్ణు "రేపు మార్నింగ్ ఊరు వెళ్తున్నాను...."

ఇషా "హుమ్మ్.... చెప్పావు కదా..."

విష్ణు "అదీ... చాలా రోజులు అయింది కదా...."

ఇషా "వారంలో వస్తా అన్నావ్ కదా.... ఇంకా ఎక్కువ పడుతుందా..."

విష్ణు తల రుద్దుకుంటూ "అదీ.....  అదీ.....  "

ఇషా "తినడం కోసం ఏమయినా చేసి పెట్టేదా.... "

విష్ణు "హుమ్మ్" అంటూ తల ఊపాడు.

ఇషా పైకి లేచి "ఇక్కడే ఉండు" అంటూ కిచెన్ లోకి వెళ్ళింది.

విష్ణు తల రుద్దుకుంటూ పైకి లేచి కిచెన్ లోకి వచ్చాడు.

కిచెన్ లో ఇషా తన చీరని బొడ్డు కిందకు అని తన విశాల మైన నడుమును ఎక్సపోజ్ చేస్తూ తన చీర కొంగుని బొడ్లో దోపి అవతల వైపు నిలబడి ఉంది.

విష్ణు ఇషాని చూడగానే మనసు పారేసుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఆమె నడుము మీద రెండు చేతులు వేసి జాకెట్ వెనక కనిపిస్తున్న ఆమె వీపు మీద ముద్దులు పెడుతూ మెడ వంపుల్లో తన మొహాన్ని దాచి ఉంచాడు.

ఇషా వణికిపోతూ "ఏం తింటావ్.....?" అని అడిగింది.

విష్ణు "నిన్ను తింటాను"

ఇషా సిగ్గు పడుతూ "బెడ్ రూమ్ " అంది.

విష్ణు అమాంతం ఇషాని రెండూ చేతుల్లోకి ఎత్తుకొని కిచెన్ నుండి బెడ్ రూమ్ వైపుకి నడిచాడు.













[+] 12 users Like 3sivaram's post
Like Reply
#35
Nice update
Like Reply
#36
Me range ki intha chinna update entandiiii.... Super vundhiii
Like Reply
#37
Good update
Like Reply
#38
clps
Nice suspense story. Keep it up.
Like Reply
#39
NICE UPDATE
Like Reply
#40
ఇవ్వాళ అప్డేట్ ఇద్దాం అనుకున్నా కాని కుదరలేదు. రేపు ఇస్తాను.
[+] 2 users Like 3sivaram's post
Like Reply




Users browsing this thread: